Activities calendar

01 August 2015

సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాజీనామా

ఢిల్లీ: సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ అనూప్ సురేంద్రనాథ్ రాజీనామా చేశారు. యాకుబ్ మెమన్ ఉరికి నిరసనగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 

దంపతుల ఆత్మహత్యాయత్నం..భర్త మృతి

హైదరాబాద్: భరత్ నగర్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎంఎంటిఎస్ రైలు కింద పడి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. 

22:07 - August 1, 2015

ఓ తప్పిపోయిన అమ్మాయి. ఆమెకు మూగ, చెవుడు. దారితప్పి దేశ సరిహద్దునే దాటిపోయింది. ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు... ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. ఇదేదో విన్న, చూసిన కథలా వుందికదా. అదే... సల్మాన్‌ ఖాన్‌ భజరంగి భాయిజాన్‌. ఐతే ఆ సినిమాను పోలిన యథార్థ గాథ ఇది. అదేదో మీరే చూడండి.
అచ్చంగా భజరంగి భాయిజాన్‌ లాంటి కథే
అచ్చంగా భజరంగి భాయిజాన్‌ లాంటి కథే. కానీ సినిమా కాదు. ఐతే చిన్న మార్పు. సినిమాలో తప్పిపోయిన అమ్మాయిది పాకిస్థాన్‌ కాగా... ఆ చిన్నారిని గమ్యానికి చేర్చే హీరోది ఇండియా. యదార్థగాథలో తప్పిపోయిన అమ్మాయిది ఇండియా. ఆమెను గమ్యానికి చేర్చేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్‌ కు చెందిన వారు.
15 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత
15 ఏళ్ల క్రితం గీత అనే అమ్మాయి... కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయి... ఓ ట్రైన్‌లో లాహోర్‌ వెళ్లింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అమ్మాయిని స్థానిక పోలీసులు ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. మూగ, చెవిటి అయిన గీత... ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. ఒక అనాథాశ్రమం నుంచి మరో అనాథాశ్రమం... ఇలా ఎన్నో మారింది. చివరకు 2012లో ఈదీ పౌండేషన్‌లో ఆశ్రయం పొందుతోంది.
గీత అసలు పేరు కాదు
గీత అనేది అసలు పేరు కాదు. ఈది పౌండేషనే ఆ పేరు పెట్టింది. ఇపుడు ఆమె వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య వుంటాయి. పొట్టిగా వుండటం వల్ల మరీ చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది. అప్పుడప్పుడు హిందీలో రాస్తుంటుంది. తనకు ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెల్లు వున్నట్లు సైగల ద్వారా చెబుతుంది. తల్లిదండ్రులతో పాటు ఇంట్లో నుంచి బయల్దేరి... తప్పిపోయినట్లు సైగలు చేస్తుందని ఈది పౌండేషన్ సభ్యులు చెబుతున్నారు.
హిందూ అమ్మాయిగా భావిస్తోన్న ఈదిపౌండేషన్
గీత బాగా నడుస్తుంది. తరచుగా గుడికి వెళ్తుంది. ఎప్పుడూ కొంగు తలపై వేసుకుంటుంది. దీన్నిబట్టి ఈమె గ్రామీణ ప్రాంతానికి చెందిన హిందూ అమ్మాయిగా... ఈది పౌండేషన్‌ భావిస్తోంది. గీత ప్రస్తుతం ఈదీ పౌండేషన్‌ స్థాపకులు అబ్దుల్ సత్తార్ ఈది భార్య బిల్కీ ఈది వద్ద ఉంటోంది. అల్లా దయ వల్ల గీత తొందరగా వారి కుటుంబం దగ్గరకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు బిల్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్‌లో భారత్‌ రానున్న అన్సార్‌ బుర్నే
పాకిస్థాన్‌ మాజీ మానవ హక్కుల శాఖ మంత్రి అన్సార్‌ బుర్నే... గీతను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆయన గీత ఫొటోలు, వీడియోలు తీసుకొని భారత్ వచ్చినా... బంధువుల్ని గుర్తించలేక పోయారు. ఐతే ఇటీవల విడుదలైన భజరంగీ భాయిజాన్ సినిమా మళ్లీ కొత్త ఆశలు రేపిందని చెప్పారు. సెప్టెంబర్‌లో మరోసారి భారత్ వెళ్తానని... అప్పటికి ఎలాగైనా గీత కుటుంబ సభ్యులను కనుగొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి భజరంగీ భాయిజాన్‌ సినిమాలో కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ అనేక ట్విస్టుల తర్వాత తప్పిపోయిన మున్నీని ఎలాగోలా కుటుంబ సభ్యుల దరికి చేరుస్తాడు. మరి గీతను... వారి తల్లిదండ్రుల వద్దకు ఎవరు? ఎప్పుడు చేరుస్తారో వేచి చూడాల్సిందే.

22:00 - August 1, 2015

హైదరాబాద్: తుంగభద్ర నీటి యాజమాన్య బోర్డు సమావేశం తొలిసారి హైదరాబాద్లో జరిగింది. ఏపీకి రావాల్సిన నీటిపై సమావేశంలో సంతృప్తి వ్యక్తమైంది. అలాగే తుంగభధ్ర నుంచి ఏపీకి నీరిచ్చే హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్ లను ఆధునీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకయ్యే ఖర్చును కర్ణాటక, ఎపి సర్కార్లు భరించేందుకు అంగీకరించాయి. ఈ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టే ఈ పనుల నివేదికకోసం రెండు కన్సల్టెన్సీలను నియమించారు. అయితే తుంగభద్ర నీటి విషయంలో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్.. బోర్డుకు వివరించారు. తెలంగాణలోని రాజోలిబండ డైవర్షన్ స్కీంను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఒక అంగీకారానికివస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ భేటీలో బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తాతోపాటు... కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ ఈఎన్ సీలు పాల్గొన్నారు.

 

21:56 - August 1, 2015

విజయవాడ: పత్రికా రంగంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా.. తనదైన శైలితో అప్రతిహాతంగా ప్రజాశక్తి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రజాశక్తి 35వ వార్షికోత్సం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా "వర్తమాన పరిస్ధితులు - మీడియా" అనే అంశంపై సభకు ముఖ్యఅతిథిగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌కరత్‌ హాజరయ్యారు. ప్రజాశక్తి ఎడిటర్‌ పాటూరు రామయ్య అధ్యక్షత వహించగా.. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ కృష్ణయ్య, మాజీ ఎడిటర్‌ తెలకపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

 

 

21:53 - August 1, 2015

హైదరాబాద్: సికిందరాబాద్ ఉజ్జయినీ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. బాబుకు స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. తాను 20ఏళ్లుగా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నానని తెలిపారు చంద్రబాబు.. ప్రజలంతా బాగుండాలని.. వర్షాలు సకాలంలో కురవాలని కోరుకున్నానని చెప్పారు.

 

రైతు ఆత్మహత్యలకు నిలయంగా మారిన తెలంగాణ: మురళీధర్ రావు

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలకు తెలంగాణ నిలయంగా మారిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. తెలుగు రాష్ట్రాలలో జాతీయవాద రాజకీయాలు...బలపడితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జాతీయ పార్టీల మద్దతు లేకపోతే మరో 50 ఏళ్లయినా.. తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు. 

జీహెచ్ ఎంసీలో పలువురు అధికారుల బదిలీ..

హైదరాబాద్: జీహెచ్ ఎంసీలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ షఫీయుల్లా బదిలీ అయ్యారు. సర్కిల్-5 డిప్యూటీ కమిషనర్ గా యాదగిరిరావు, వెస్టు జోన్ జోనల్ కమిషనర్ గా గంగాధర్ రెడ్డిలు నియమితులయ్యారు. 

20:29 - August 1, 2015

భారతదేశంలో 'తోలుపరిశ్రమ అభివృద్ధి.. దళితులు' అనే అంశంపై 'జీవన చరిత విశ్లేషణ' కార్యక్రమంలో ప్రొ.కంటె ఐలయ్య మాట్లాడారు. ఆ .. వివరాలను ఆయన మాటాల్లోనే చూద్దాం... 'తోలుపనివాళ్లు ఆదిమ సైంటిస్టులు. ఆర్యులు భారతదేశానికి రాకముందే.. భారతదేశంలో తోలు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు తోలుమీద రాత రాసే ప్రక్రియ ఉండేది. పశువులు చర్మంతో తయారు చేసిన తోలు బ్యాగ్ లో నూనే నిల్వవుంచే వారు. తోలు బ్యాగ్ లో పోసిన నీరు చల్లగా ఉండేవి. తోలు పరిశ్రమను అభివృద్ధి చేసినవారు... అంటరానివారుగా ట్రీట్ చేయబడ్డారు. వారిని దేవునికి పనికి రాని వారిగా తయారు చేశారు. వైదికవాదంలో శివుడు, ఇతర దేవుళ్లు తోల్లనే శరీరానికి చుట్టుకున్నారు. దేవుడు మంత్రాన్ని ప్రేమిస్తాడు.. కానీ సైన్స్ ను ప్రేమించడు.. అనే నినాదాన్ని సృష్టించారు. దళితులు 5 వేల సంవత్సరాలుగా అంటరానితనం, అవమానాలను ఎదుర్కొంటున్నారు. తోలు పరిశ్రమను అభివృద్ధి చేసినవారిని తక్కువ వారుగా చేశారు. నీచులుగా చిత్రీకరించారు. దీంతో సైన్స్ కు అడ్డుకట్ట పడింది'. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట నరసింహ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. 

నేటి అర్ధరాత్రి టర్కీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్: ఎపి సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఇవాళా అర్ధరాత్రి టర్కీ వెళ్లనున్నారు. ఈనెల 7న తిరిగి హైదరాబాద్ రానున్నారు.

 

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఎపి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారికి బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

పోలీసులు-స్థానికుల మధ్య ఘర్షణ

మహబూబ్ నగర్ : ఇసుక తరలింపు విషయంలో పోలీసులకూ.. స్థానికులకూ మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అజారుద్దీన్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిన్న ముంబైలో అతని అరెస్టు చేసినట్లు సమాచారం.

ప్రత్యేకహోదా సాధించేవరకూ పోరు ఆగదు: అచ్చెన్నాయుడు..

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా సాధించేవరకూ పోరాటం ఆగదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాపై ఎవరి అభిప్రాయాలు వారివని తెలిపారు. 

రాజీవ్ ఖేల్ రత్నకు సానియా పేరు ప్రతిపాదన..

ఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియామీర్జా పేరును ప్రతిపాదన చేశారు. కేంద్రక్రీడాశాఖ సానియా పేరును ప్రతిపాదించింది. అవార్డుల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

 

డీజీపీలతో ముగిసిన కేంద్రహోంశాఖ కార్యదర్శి భేటీ

ఢిల్లీ: డీజీపీలతో కేంద్రమహోంశాఖ కార్యదర్శి భేటీ ముగిసింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాల్లో భద్రతపై హోంశాఖ సమీక్షించింది.

 

18:58 - August 1, 2015

అనంతపురం: జిల్లా పెనుకొండలో విషాదం చోటు చేసుకుంది. మంగాపురం గ్రామంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు... అనుమానించటంతో ఉరివేసుకొని చనిపోయింది. భవానీభాయి అనే విద్యార్థిని పెనుకొండలో పదోతరగతి చదువుతోంది. ఆరురోజుల క్రితం స్కూలుకెళ్లిన భవానీ ఇంటికి రాలేదు. దీంతో కుంటుంబ సభ్యులు పెనుకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు...ఓ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా...భవానీ ఆచూకీ తెలిసింది. మాయమాటలు చెప్పి అతను కిడ్నాప్ చేశాడని అమ్మాయి ఆరోపించటంతో....పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తిరిగి ఇంటికొచ్చిన అమ్మాయిని గ్రామస్తులు, కుటుంబసభ్యులు సూటిపోటి మాటలతో వేధించారు. అవమానంతో భవానీ...ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 

18:55 - August 1, 2015

కృష్ణా: విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో 9వతరగతి బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానిక ఇమాన్యుయెల్‌ పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న వేముల సాయిరూప అనే బాలిక చినిపోయింది. రూమ్‌లో ఆమె మృతదేహాన్ని తోటి బాలబాలికలు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే ఎలా చనిపోయిందనే విషయం తెలియటం లేదు. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

18:51 - August 1, 2015

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా....2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు..మార్టీనా హింగిస్‌ తో జంటగా వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సాధించడం ద్వారా సానియా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయస్థాయిలో ఏడాదికాలం నిలకడగా రాణించిన క్రీడాకారుల పేర్లను మాత్రమే..రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.

 

18:27 - August 1, 2015

హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో తొలగించిన ఉద్యోగుల సమస్యపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. వారిని తిరిగి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన చర్చల్లో కేంద్రం చేతులెత్తేయడం.. విద్యుత్‌ ఉద్యోగులు జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన చేయడంతో.. ఏపీ నేడు ఈ లేఖ రాసింది. 

18:18 - August 1, 2015

అమెరికా: ఆ పిల్లవాడు ఆడదామనుకున్నాడు. చేతులు సహకరించలేదు. ఎగిరి గంతులేయాలనుకున్నాడు. పాదం ముందుకుపడలేదు. ఏ పని సరిగ్గా చేయలేక కుమిలిపోయాడు. కానీ ఇప్పుడా చిన్నారికి అలాంటి బాధల్లేవు. ఆడతాడు. పాడతాడు. గంతులేస్తాడు. ఎందుకంటే ఆధునిక వైద్యచికిత్స ఆ చిన్నారికి మరో జన్మ ప్రసాదించింది. ఇంతకీ ఎవరా బాలుడు.? ఏంటా ఆపరేషన్.?                                                                               
బాలునికి రెండు చేతులను అమర్చిన డాక్టర్లు
ఈ ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా వైద్యులు ఎనిమిదేళ్ల ఓ చిన్నారికి మరో జన్మ ప్రసాదించారు. అనివార్య పరిస్థితుల్లో తొలగించిన చేతుల స్థానే.. సరికొత్త చేతులను అతికించారు. వైద్య చరిత్రలో ఓ అరుదైన విజయం నమోదు చేశారు.
చేతులను దానం చేసే దాత ఎవరు.?
అమెరికా మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జియాన్‌ హార్వే కాళ్లు చేతులకు కొంతకాలం క్రితం ఇన్‌ఫెక్షన్‌ సోకింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆ చిన్నారి రెండు చేతులు, ఒక పాదాన్ని తొలగించారు. మూత్రపిండాల మార్పిడి కూడా జరిగింది. అప్పటి నుంచి జియాన్ తన చేతులను చూసి బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఎవరైనా దాత దొరికితే చేతులను మార్పిడి చేస్తామన్న డాక్టర్ల మాట జియాన్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపేది. అయితే చేతులను దానం చేసే దాత ఎవరు..తన కలర్‌కు, శరీరానికి సరిగ్గా సరిపోయే చేతులు ఎక్కడున్నాయి...తన సోదరి చేతులే తన చేతులవుతాయని జియాన్ ఊహించలేదు.
జియాన్ సోదరి నుంచి చేతుల సేకరణ
జియాన్ సిస్టర్‌ నుంచి సేకరించిన చేతులను కొన్ని నెలల పాటు భద్రపరిచారు వైద్యులు. ఆపరేషన్‌కు సిద్దమవుతున్న డాక్టర్లు ముందుగా మృతదేహాలపై ప్రాక్టీస్ చేశారు. తర్వాత జియాన్‌కు రెండు చేతులు ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా అమర్చి విజయం సాధించారు. డాక్టర్ ఎల్‌.స్కాట్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్ర చికిత్స కోసం పది గంటల పాటు శ్రమించి విజయం సాధించింది. దీంతో చిన్నారితో పాటు తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 2011లో ఓ పెద్దమనిషికి చేసిన చేతుల మార్పిడి చికత్స అనుభవంతో ఈ సాహసానికి శ్రీకారం చుట్టామన్నారు డాక్టర్లు. 1998లో ప్రపంచంలో మొదటి ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ ఫ్రాన్స్ లో జరిగిందన్న వైద్యులు...ప్రతి ఏడాది 100 మందికి అవయవాల మార్పిడి జరుగుతోందన్నారు.
కోలుకుంటున్న జియాన్
ఇక ఆపరేషన్‌తో కొత్త చేతులు అమర్చుకున్న జియాన్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. స్కూల్‌లో స్నేహితులతో సరదాగా చేతులు కలుపుతున్నాడు. కొంతకాలం తర్వాత జియాన్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.

 

17:59 - August 1, 2015

హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రొ.కె.కోదండరాం డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల విభజన జరిగింది.. కానీ ఉద్యోగుల విభజన జరగలేదని తెలిపారు. పది శాఖలలో ఇంకా సమచార సేకరణ కూడా పూర్తి కాలేదని వాపోయారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఈనెల 6న ధర్నాలు, దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు విభజన చేయడంలో కూడా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. 

17:54 - August 1, 2015

మెదక్: జిల్లా సంగారెడ్డిలో అధిక ఫీజులు తగ్గించాలంటూ బీసీ సంఘం నేత హరిబాబు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చైతన్య స్కూల్‌ దగ్గర ఆందోళనకు దిగిన హరిబాబు.. కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయనను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈఘటనతో సంగారెడ్డి చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

17:43 - August 1, 2015

హైదరాబాద్: 'గబ్బర్‌సింగ్‌' సాధించిన హిట్ తో గబ్బర్ సింగ్-2పై ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో గబ్బర్ సింగ్ సీక్వెల్‌ మూవీ టైటిల్‌పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న ఈ మూవీకి సర్దార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇన్ని రోజులూ ఈ మూవీ టైటిల్‌ గబ్బర్‌సింగ్‌-2 అంటూ ప్రచారం జరిగింది. ఐతే తాజాగా టైటిల్‌పై నిర్మాత శతర్‌ మరార్ క్లారిటీ ఇచ్చారు. పనిలోపనిగా సర్దార్‌ ఫస్ట్‌లుక్‌నూ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'పవర్' ఫేమ్‌ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పూణేలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జులై 29 నుంచి శరవేగంగా జరుగుతోంది. ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఏకధాటిగా షూటింగ్ జరిపి వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఈ సినిమాలో మరాఠీ నటుడు శదర్‌ కేల్కర్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్‌గా అనీషా ఆంబ్రోస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక సర్దార్‌ ఫస్ట్‌లుక్‌కు... సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్లలో విశేష స్పందన వస్తోంది.

 

 

17:39 - August 1, 2015

వరంగల్: జిల్లా డీఈఓ చంద్రమోహన్‌ను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల బదిలీలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ ఉన్నందున.. వరంగల్ హెడ్ క్వార్టర్ దాటి ఇతర ప్రాంతాలకు వెల్లరాదని సూచించింది. జాయింట్ ఎడ్యుకేషన్ అధికారిని ఇంఛార్జీ డీఈవో గా నియమించనున్నారు.

వరంగల్ డీఈఓ చంద్రమోహన్‌ సస్పెండ్‌

వరంగల్: జిల్లా డీఈఓ చంద్రమోహన్‌ను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల బదిలీలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

17:30 - August 1, 2015

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూలే పరిస్థితి వస్తే.. చార్మినార్ నైనా పడగొడతామని చెప్పారు. వరంగల్ లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను ఆయన సమర్థించారు. శిథిలానికి చేరుకుంటే.. కూల్చడం సబబే అన్నారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేసి.. దాని స్థానంలో కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే భవనాలను కూల్చివేసి.. వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించడం సరైనదేనని అభిప్రాయపడ్డారు. అయితే చార్మినార్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి డిప్యూటీ సీఎం అలీ వ్యాఖ్యలపై టీసర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు..

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూలే పరిస్థితి వస్తే.. చార్మినార్ నైనా పడగొడతామని చెప్పారు. వరంగల్ లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను ఆయన సమర్థించారు. శిథిలానికి చేరుకుంటే.. కూల్చడం సబబే అన్నారు.

 

16:58 - August 1, 2015

హైదరాబాద్: 'ఎపి అభివృద్ధే మా లక్ష్యం' అని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించామని మంత్రి గంటా తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణంపై అందరి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు.. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.

 

16:54 - August 1, 2015

హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయింది. కాని అనేకమంది విద్యార్ధులకు సీట్లు దక్కకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ లెక్క ప్రకారం తమ పిల్లలకు సీటు ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు. దీంతో మాసాబ్‌ట్యాంక్‌ సాంకేతిక విద్యాభవన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. స్పాట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చంటూ అధికారులు నచ్చచెప్పే యత్నం చేశారు.

తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి..

హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయింది. కాని అనేకమంది విద్యార్ధులకు సీట్లు దక్కకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ లెక్క ప్రకారం తమ పిల్లలకు సీటు ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు. దీంతో మాసాబ్‌ట్యాంక్‌ సాంకేతిక విద్యాభవన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. స్పాట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చంటూ అధికారులు నచ్చచెప్పే యత్నం చేశారు.

16:49 - August 1, 2015

ఢిల్లీ: గత యుపిఎ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదమనే కొత్తపదాన్ని తెరపైకి తెచ్చిందన్న... హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ ఖండించారు. టెర్రరిజం అనేది దేశానికి అత్యంత ప్రమాదకరమని... ఐతే దానికి హిందూ, ముస్లీం ఉగ్రవాదం అనే పేరు పెట్టకుండా... అణచివేతకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచటంలో ఎన్డీఏ సర్కారూ పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. పార్లమెంటులో ఇష్యూల నుంచి సభను పక్కదారి పట్టించటానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సహా ఎందరో కాంగ్రెస్ నేతలు... టెర్రరిజం, అసాంఘిక శక్తుల చేతిలో బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. 

16:44 - August 1, 2015

ముంబై: సమాజ్‌వాదీ పార్టీ నేత మహమ్మద్ ఫరూఖ్‌ ఘోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మహారాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడుగా వున్న ఫరూక్... యాకూబ్ మెమన్ భార్యను... రాజ్యసభ సభ్యురాలిగా పంపాలని కోరుతూ... పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. యాకూబ్‌ మెమన్‌ను కోర్టు శిక్షించింది. ఐతే ఆయన భార్య, కూతురు అమాయకులని... భార్యకు రాజ్యసభ సభ్యురాలిగా పార్టీ తరపున ఎంపిక చేస్తే... మైనారిటీలకు మంచి మెసేజ్‌ పంపినట్లు అవుతుందని సూచించారు. 

16:38 - August 1, 2015

గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన విషయంలో ప్రిన్సిపాల్‌తో పాటు హాస్టల్‌ వార్డెన్‌లు గుంటూరు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ ముందు హాజరయ్యారు. గతంలో ఈ ఘటనకు సంబంధించి నోటీసులు ఇప్పటికే అందాయి. కాగా ఘటన వివరాలను న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. 7వ తేదీన జరిగిన ఘటనపై లిఖిత పూర్వక వివరణను అందజేయాలన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరై బయటకు వచ్చిన అనంతరం ప్రిన్సిపాల్‌ బాబూరావు, వార్డెన్‌ స్వరూపారాణిలు మీడియాకు వివరాలు తెలిపారు. కళాశాలలో ర్యాగింగే లేదని బుకాయించారు. తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

 

 

16:33 - August 1, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చొద్దని టీ.కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, వీ.హనుమంతరావులు ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడారు. చారిత్రాత్మక ఆసుపత్రిని కూల్చకుండా...ఆసుపత్రిలో 10 ఎకరాల ఖాళీ స్థలం ఉందని అందులో కొత్త ఆసుపత్రిని నిర్మించవచ్చని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియాను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్షలకు దిగుతామని రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ హెచ్చరించారు.

 

 

బాలికలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఆదిలాబాద్: గిరిజన బాలికలను విక్రయిస్తున్న ముఠాను ఉట్నూర్ ప్రాంత గిరిజనులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఈ ముఠా బాలికలను దారితప్పిస్తోంది. 8 నెలలుగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

 

15:38 - August 1, 2015

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఫోన్‌ట్యాపింగ్‌ విషయంలో టీఆర్‌ఎస్ నేతలు అడ్డంగా దొరికిపోయారని రావుల ధ్వజమెత్తారు. గతంలో ఫోన్‌ట్యాపింగ్‌ చేయలేదని టీఆర్ఎస్‌ నేతలు బుకాయించారని చెప్పారు. ఇప్పుడు ట్యాపింగ్ చేయమని సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖరాసినట్లు హైకోర్టులో ఒప్పుకున్నారని విమర్శించారు.

 

 

'ఉస్మానియా' కూల్చివేతకు వ్యతిరేకం..

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను త్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నిపుణుల కమిటీ సూచన మేరకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి కూల్చివేత వెనకాల..రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

 

'ఉస్మానియా'ను కూల్చితే అడ్డుకుంటాం..

హైదరాబాద్: ప్రభుత్వం...ఉస్మానియా ఆస్పత్రిని కూల్చితే అడ్డుకుంటామని టీకాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. టీకాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్, వి.హనుమంతరావులు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి.. పరిశీలించారు. ఆస్పత్రి భవనం కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

 

15:06 - August 1, 2015

హైదరాబాద్‌: నగరంలో కల్తీ కల్లు దుకాణాలను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్‌ నేత వీ.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతామని చెప్పిన కేసీఆర్‌.. కల్తీ కల్లును ప్రోత్సహించవద్దని సూచించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిచినా సామాన్య ప్రజలకు ఏమీ లాభం చేకూరడం లేదని.. కాంట్రాక్టర్ల జేబులు మాత్రమే నిండుతున్నాయని వీహెచ్‌ అన్నారు. 

15:03 - August 1, 2015

హైదరాబాద్: తొలగించిన మున్సిపల్‌ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఇందిరాపార్క్ నుంచి సచివాలయ ముట్టడికి బయల్దేరిన మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైటాయించారు. పలువురు నేతలు, కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

14:57 - August 1, 2015

విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితి అని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామని చంద్రబాబు అన్నారు. అసమగ్రంగా విభజన చేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి వచ్చే వరకు సహకరించాలని కోరారు.

 

ప్రజలను తప్పుదారిపట్టిస్తున్న బిజెపి-టిడిపి:మధు

గుంటూరు: బిజెపి, టిడిపిలు ప్రత్యేకహోదాపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. బిజెపి రాష్ట్ర విభజనకు తోడ్పడిందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. 

14:49 - August 1, 2015

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం.. పార్లమెంట్‌ సాక్షిగా మాటతప్పిందని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించాల్సిన బాధ్యత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై ఉందని అన్నారు. ప్రత్యేకహోదా కేటాయించకుంటే రాష్ట్రంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నెహ్రూ హెచ్చరించారు.

 

14:40 - August 1, 2015

తమిళానాడు : 'అత్యాచారం' ప్రస్తుతం భారత దేశాన్ని కుదిపేస్తున్న  పెను భూతం. అయితే ఇదే అంశాన్ని ఆకతాయి తనంతో వాడుకోవాలని చూసి చివాట్లు తిందో అమ్మాయి. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తమిళనాడులోని 'ఇ-రోడ్' కు చెందిన ఓ యువతి హైడ్రామాకు తెరతీసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హాస్టల్ లో ఉంటున్న ఆ యువతి,  తనను ఇద్దరు యువకులు తన రూమ్ లో  రేప్ చేశారంటూ హల్ చల్ చేసింది. తాళ్లతో కుర్చీలో కట్టబడి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్టల్ నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన శరవనం పట్టి పోలీసులు, హాస్టల్ కు చేరుకుని యువతిని విచారించారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన ఫ్యామిలీ పరువుపోతుందని, కేసు నమోదు చేస్తే సూసైడ్ చేసుకుంటానని యువతి హెచ్చరించింది. దీంతో పేరెంట్స్ ఆమెను  తమ ఇంటికి తీసుకుపోయారు. ఈ ఘటన జూలై 28వ తేదీ 11 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. అయితే,  కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు హాస్టల్ లో విచారించారు. చివరకి ఆ యువతి ఇంటికి చేరకుని వివరాలు చెప్పాలని పోలీసులు కోరారు. మొదట, తనకు ఏమీ గుర్తులేదని సదరు యువతి చెప్పింది. కేసు తీవ్రత దృష్ట్యా సహకరించాలని పోలీసులు కోరడంతో అసలు విషయం బయటపెట్టింది. 14 ఏళ్ల వయసు నుంచీ తాను ఓ యువకుడ్ని ప్రేమిస్తున్నాని, కులాలు వేరని తమ తల్లిదండ్రులు అతనితో వివాహానికి అంగీకరించకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని తాపీగా చెప్పుకొచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, సదరు 22ఏళ్ల యువకుడ్ని కూడా విచారించి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, కఠిన చర్యలు తీసుకుంటామని యువతితో పాటు తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు.  

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: కల్వకుర్తి ఎమ్మెల్యే...

మహబూబ్ నగర్ :రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కల్వకుర్తిలోవంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు విడతల రుణమాఫీ రైతుల వడ్డీకే సరిపోవడం లేదని తెలిపారు. తెలంగాణలో మొత్తం 1022 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

బీసీ సంఘం నేత సిరిబాబు ఆత్మహత్యాయత్నం..

మెదక్:జిల్లాలోని సంగారెడ్డి ప్రైవేటు స్కూల్‌ ఎదుట బీసీ సంఘం నేత సిరిబాబు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్వల్పంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని సిరిబాబు డిమాండ్‌ చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చితే పోరే: కాంగ్రెస్...

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ నేతలు మల్లుభట్టి విక్రమార్క, దానం, వీహెచ్‌ హెచ్చరించారు.  శనివారం ఉస్మానియా ఆస్పత్రికి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేస్తామనడం బాధాకరమని అన్నారు. టెక్నికల్‌ కమిటీ సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉస్మానియా పక్కనే ఉన్న 10 ఎకరాల ఖాళీ స్థలంలో సకల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించవచ్చని వారు సూచించారు.

కారు-బైక్ ఢీ:ఇద్దరు మృతి

కర్నూలు : డోన్ మండలం ఓబులాపురం మిట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు రేగలగుంట్ల వాసులైన సురేందర్(23), సూర్యశేఖర్(16) గా తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు...

రంగారెడ్డి : అప్పుల బాధతో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్(38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన నాలుగు ఎకరాల పొలంలో ఈ ఏడాది మొక్కజొన్న పంట వేశాడు. అయితే, వర్షాలు సరిగా లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. కాగా, రైతు శుక్రవారం బ్యాంకు వెళ్లి క్రాప్ లోన్ ఇవ్వాలని కోరగా, ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మాకు ఇంకా అందలేదని..లోన్ కావాలంటే పాత బకాయి వడ్డీ చెల్లించాలని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పారు.

13:23 - August 1, 2015

నేపాల్‌ : కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాలయాల పరిసరాల్లోని పలు గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 36 మంది చనిపోయారు. ఒక్క కస్కి జిల్లాలోనే 32 మంది చనిపోయారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. కస్కి, మ్యాగ్ది, బాగ్‌లంగ్‌ జిల్లాలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

13:21 - August 1, 2015

పశ్చిమ బెంగాల్ : కొమన్ తుపాన్ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలో 133.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి కోల్‌కతాలోని పలు కాలనీల్లో మోకాల్లోతు నీరు ప్రవహిస్తోంది. ప్రజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హౌరా నుంచి పలు రైళ్లు రద్దుకాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బిర్‌భుమ్‌లో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు సైతం వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 39 మంది చనిపోయారు. లక్షలాది మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 

13:18 - August 1, 2015

విజయవాడ : ప్రత్యేక హోదాపై కేంద్రం, ఏపీ రాష్ట్రంపై విమర్శలు వస్తుండడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బెజవాడలో శనివారం టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. అసమగ్రంగా విభజన చేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేసిన చంద్రబాబు.. అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి వచ్చే వరకు సహకరించాలని కోరారు. విభజన కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదని, విభజన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యసభలో బీజేపీ నేతలు గట్టిగా ఫైట్ చేశారని బాబు పేర్కొన్నారు. 

పాక్ దౌత్య కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన

ఢిల్లీ: పంజాబ్ ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ పాక్ దౌత్య కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

13:11 - August 1, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి విస్పష్టంగా ప్రకటన చేయడంతో విపక్షాలు కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ నిప్పులు చెరిగారు. ఏపీకి టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై మోడీకి..చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చేతకాకపోతే కాంగ్రెస్‌, వామపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదాపై బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేసింది:శైలజానాథ్

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై బాబు మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చేతగాకపోతే మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విభజన సమయంలో సోనియా ఇంటి ఎదుట ధర్నా చేయాలన్న టీడీపీనేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మోదీ ఇంటి ముందుకు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రాణాలు పోయినా సరే అడ్డుకుంటాం:మధు...

గుంటూరు: గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని మధు హెచ్చరించారు.

'ర్యాగింగ్‌పై రిషితేశ్వరి పేరెంట్స్ నాకు ఫిర్యాదు చేయలేదు'

గుంటూరు:నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్‌పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపాల్‌ బాబూరావు చెప్పారు. కాలేజీలో ర్యాగింగ్‌ తన దృష్టికి రాలేదని బాబూరావు పేర్కొన్నారు. జిల్లా లీగల్‌సెల్‌ అథారిటీ ముందు ప్రిన్సిపాల్‌ ఈ మేరకు చెప్పారు. దీంతో రిషితేశ్వరి కేసు విచారణను ఈ నెల 7వతేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా లీగల్‌సెల్‌ అథారిటీ ప్రకటించింది.

 

12:37 - August 1, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ మాట మారుస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ విమర్శించారు. గుంటూరులో 'ప్రజాసామ్యం - కార్పొరేట్ రాజకీయాలు' అంశంపై సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరైన కరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాజీ ప్రధాని పార్లమెంట్ లో మన్మోహన్ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, విభజన సమయంలో బీజేపీ కూడా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చడం తగదని, ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు కూడా మద్దతిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇచ్చిన హామీలను ఎలా నేరవేరుస్తారో వేచి చూడాలని కరత్ పేర్కొన్నారు. 

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎస్ సమీక్ష...

హైదరాబాద్ : యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాలన్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. 

మెమన్ భార్యను ఎంపిని చేయండి:ఎస్పీ

న్యూఢిల్లీ :జులై 30న ఉరితీయబడ్డ యాకుబ్ మెమెన్ భార్యను రాజ్యసభ సభ్యురాలిని చేయండని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు ఎస్పీ మహ్మద్ ఫరూఖ్ గోషి లేఖ రాశారు. ఆ లేఖలో మెమెన్ భార్య, కూతురు అమాయకులు అని గోషి తెలిపారు. ఎల్లప్పుడూ పేద ప్రజలు, ముస్లింల గురించి ఆలోచించే ములాయంజీ ఈ విషయం పట్ల ములాయం మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. 

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: ఎమ్మెల్యే లక్ష్మణ్...

హైదరాబాద్:ఇందిరా పార్క్ వద్ద బిజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...

నెల్లూరు:వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. విజయవాడ డిపోకు చెందిన బస్సు కావలికి వస్తుండగా బిట్రగుంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

55 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించిన ఆర్టీసీ

హైదరాబాద్: ఆర్టీసీ బస్ భవన్ లో పనిచేస్తున్న 55 మంది ఔట్ సోర్సింగ్, ఎంట్రీ ఆపరేటర్లను యాజమాన్యం తొలగించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికంగా ఉన్న సిబ్బందిని తొలగించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ చర్య అన్యాయం అంటూ ఔట్ సోర్సింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి కూల్చడాన్ని సీపీఎంవ్యతిరేకిస్తోంది:తమ్మినేని

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూల్చడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నిపుణుల కమిటీ సూచన మేరకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కుట్రదాగి ఉందని ఆరోపించారు. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండి పడ్డారు.

12:16 - August 1, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదాపై కేంద్రం వైఖరి స్పష్టంగా అర్థమైందని, ఈ విషయం సీఎం చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజలు తెలివి లేదని, వారిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారన్నారు. దీక్ష చేస్తే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని వైసీపీనుద్ధేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్థిక సహాయం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇందులో బాబు కొంత సక్సెస్ అవుతున్నారని జేసీ తనదైన శైలిలో పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కుదరదని మోదీ సర్కారు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. మోదీ సర్కారు వస్తుంది.. ప్రత్యేక హోదా ఇస్తుంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అని ఆశించిన ఆంధ్రా ఓటరును.. ఈ ప్రకటన ద్వారా కేంద్రం ఉస్సురనిపించింది. శుక్రవారం లోక్‌సభలో బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఆ రాష్ట్ర ఎంపీలు లేవనెత్తిన చర్చకు సమాధానంగా ఆయనీ ప్రకటన చేశారు.

ప్రత్యేకహోదా రాదని బాబుకు ముందే తెలుసు: ఎంపి జేసీ...

విజయవాడ: ఏపీకి ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు తెలుసని...అందుకే ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై పవన్‌ పోరాడాలి అందుకు తాము మద్దతిస్తామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు, అది నిన్నటితో ఈ విషయం తేటతెల్లమైందని జేసీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అందరూ అడుగుతున్నారు, కానీ బీజేపీ దున్నపోతుపై వర్షం పడ్డట్టు వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఇంగితజ్ఞానం నేటి పాలకులకు లేదు అని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై సీపీఐ బస్సు యాత్ర

శ్రీకాకుళం:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ శ్రీకాకుళం నుంచి సీపీఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సుయాత్రలో శివాజీ, చలసాని, సీపీఐ నేతలు పాల్గొన్నారు. రాజధాని నగరం కూడా లేని ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని నేతలు డిమాండు చేశారు.

సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు...

హైదరాబాద్:సరిహద్దు ప్రాంతంలో గత ఐదు రోజులుగా 6వ సారి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో తాజా ఈ రోజు అక్నూర్ సెక్టార్ పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.

భారీగా జిలిటెన్ స్టిక్స్ పట్టివేత

కరీంనగర్:జిల్లాలోని భీమదేవరపల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 480 జిలిటెన్ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్...

హైదరాబాద్:గుజరాత్ లోని మణినగర్ లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. మణినగర్ లోని తన స్నేహితుడితో కలిసి ఒక హోటల్ కు వెళ్లింది. అనంతరం ఆమె స్నేహితుడు, మరో నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి హోటల్ కు పిలిపించాడు. వారంతా కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగాల్ లో వర్షాలకు 39 మంది మృతి:సీఎం మమతా బెనర్జీ....

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 39 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వందలాది ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను మమత శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... వేలాది మంది నిరాశ్రయులయ్యారని.. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. జూన్, జులై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే (60 శాతం)అధికంగా వర్షపాతం నమోదు కావడంతో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు.

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలి: ప్రకాశ్ కరత్...

గుంటూరు: ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ డిమాండ్ చేశారు. 'ప్రజాస్వామ్యం- కార్పొరేట్ రాజకీయాలు' పై గుంటూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధాన ఉపన్యాసకుడుగా కరత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై వాగ్ధానాలు గుప్పించిన బిజెపి ఇప్పుడెందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి ఇంద్రజిత్ ప్రకటించడం సరికాదన్నారు.

11:36 - August 1, 2015

గుంటూరు : మోడీ సర్కార్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ విమర్శలు గుర్పించారు. గుంటూరులో 'ప్రజాసామ్యం - కార్పొరేట్ రాజకీయాలు' అంశంపై సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో కరత్ పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలు, కార్మిక వర్గంపై దాడి చేస్తోందన్నారు. గతంలో ఉన్నటువంటి రక్షణ చర్యలను.. పథకాలను నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ విధానాలు ఎండగట్టేందుకు ప్రచారాన్ని చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మికులు, వివిధ రంగాల్లో ఉన్న వారు దుష్పలితాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరపై ఎన్నికల్లో హామీలు గుప్పించిందని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలు, స్వామి నాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేమని మోడీ సర్కార్ పేర్కొంటోందన్నారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై అనేక వాగ్ధానాలు ఇచ్చిన బీజేపీ మాట ఎందుకు మారుస్తుందో చెప్పాలని కరత్ సూటిగా ప్రశ్నించారు.

తాత్కాలిక కార్యాలయాల గుర్తింపుకు కమిటి పర్యటన

గుంటూరు: కాసేపట్లో అమరావతిలో తాత్కాలిక కార్యాలయాల గుర్తింపు జవహర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పర్యటించనుంది. కార్యాలయాల తరలింపునకు అందుబాటులో ఉన్న భవనాలను కమిటీ పరిశీలించనుంది.

రిషితేశ్వరి కేసులో లీగల్ సెల్ ముందు ప్రినిపాల్, వార్డెన్...

గుంటూరు:రిషితేశ్వరి కేసులో జిల్లా లీగల్ సెల్ అథారిటీ న్యాయమూర్తి ఎదుట ప్రిన్సిపాల్ బాబూరావు, హస్టల్ వార్డెన్ స్వరూపారాణి హాజరయ్యారు.

11:16 - August 1, 2015

విజయవాడ : టిడిపి విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఎ-1 కన్వేషన్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రాజమండ్రి పుష్కరల్లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నేతలను ఉద్ధేశించి ప్రసంగించారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, కానీ తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గోదావరి నదిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కష్టాలు గట్టెక్కుతాయన్నారు. విభజన తరువాత ఎన్నో ఇబ్బందులు నెలకొన్నాయని, రాజధాని లేకపోవడం..ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులున్నాయన్నారు. 16వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా అని తెలిపారు. ఏపీ ప్రజలకు ప్రభుత్వం అనేక హామీలిచ్చిందని అందులో భాగంగా రైతులకు 25వేల కోట్ల రూపాయల మాఫీ చేయడం జరిగిందన్నారు. దీనివల్ల రైతుల ఆత్మహత్యలు ఆగాయని చెప్పుకొచ్చారు. సంక్రాంతి కానుకగా పేదలకు బహుమతులు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు తోఫా లాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.

నకిలీ బంగారు డాలర్ల విక్రయించిన వ్యక్తి అరెస్ట్....

కడప: నకిలీ బంగారు డాలర్ల విక్రయం కేసులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని కడప సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు రాజాంపేట బైపాస్‌రోడ్డులో పద్మావతి నగర్ క్రాస్ రోడ్డు వద్ద సలాట్ శంకర్ బోయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.5.20 లక్షల స్వాధీనం చేసుకున్నారు.

ఘనంగా ప్రజాశక్తి 35వ వార్షికోత్సవ వేడుకలు...

విజయవాడ:ప్రజాశక్తి 35వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు బెంజిసర్కిల్లోని వేదిక ఫంక్షన్ హాల్ లో 'వర్తమాన పరిస్థితులు-మీడియా' సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పీపుల్స్ డెమోక్రసి సంపాదకుడు ప్రకాశ్ కరత్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకవర్గ ఛైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, నవతెలంగాణ సంపాదకుడు ఎస్.వీరయ్య, విశాలంధ్ర, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు రాఘవాచారి, తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్ వి.కృష్ణయ్య పాల్గొననున్నారు.

దేశ అంతర్గత భద్రతపై కేంద్రం హోంశాఖ సమీక్షా సమవేశం ప్రారంభం...

ఢిల్లీ :దేశ అంతర్గత భద్రతపై కేంద్రం హోంశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. ఐఎస్ ఐఎస్, ఉగ్రవాద శక్తులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించి, ఉగ్రవాదం పై తీసుకుంటున్న చర్యలను కేంద్రం తెలుసుకోనున్నట్లు సమాచారం. ఉగ్రవాద హెచ్చరికలు, ఆగస్టు 15 నేపథ్యంలో అత్యవసర భేటీ అయ్యింది.

'తొక్కిసలాట' ఘటన బాధ కలిగిస్తోంది: చంద్రబాబుది

విజయవాడ:రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొలిరోజే చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తోందని సీఎం చంద్రబాబు మరోసారి విచారం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ... గోదావరి పుష్కరాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేశామని ఆ సమయంలో 27 మంది చనిపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని సీఎం సూచించారు. గోదావరిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే చాలా కష్టాలు తీరతాయని, ప్రస్తుత విస్తృత స్థాయి సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. 

నాగార్జున యూనివర్సిటీ వీసీగా సింహాద్రి?

గుంటూరు: స్టూడెంట్ రిషితేశ్వరి మృతి తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ప్రక్షాళన మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ కేసులో విచారణ పూర్తికావడంతో  కమిటీ ఛైర్మన్ బాలసుబ్రమణ్యం వారంలోగా ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇదిలావుండగా నాగార్జున యూనివర్సిటీ వ్యవహారంపై శుక్రవారం క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పుడున్న ఇన్‌ఛార్జ్ వీసీ స్థానంలో కొత్తగా ఎవరైతే బాగుంటుంది అన్నదానిపై మంత్రులు తమతమ అభిప్రాయాలను చెప్పినట్టు తెలుస్తోంది.గతంలో ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన వైసీ సింహాద్రి ఐతే బెటరని మెజార్టీ మంత్రులు అన్నట్లు సమాచారం.

10:36 - August 1, 2015

కమల్ తనయ హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా 'శ్రీమంతుడు'లో మహేష్ బాబుతో జత కట్టింది.  ఈ చిత్రంలో తను నటించడానికి గల కారణాలను ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా చెప్పుకొచ్చిది.  ''నేను చేసిన చారుశీల పాత్ర చాలా బలమైందే కాక సున్నితమైంది. నా కెరీర్‌లో ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నా. పాత్రలు రిపీట్‌ కాకుండా చూసుకుంటున్నా. ఒకవేళ నా వద్దకు అలాంటి పాత్రలు వస్తున్నా సారీ. ఇదివరకే ఈ తరహా పాత్ర చేశాను. ఇది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించట్లేదు అని చెబుతున్నా. కేరక్టర్‌లో ఏదో ఓ విశేషం ఉంటేనే ఒప్పుకుంటున్నా. అలాగే ఇప్పటివరకూ నేను చేసిన అన్ని పాత్రల కంటే ‘శ్రీమంతుడు’లో నేను చేసిన చారుశీల పాత్ర చాలా భిన్నమైంది. స్ట్రాంగ్‌, ఇండిపెండెంట్‌, ఇంటలిజెంట్‌ గాళ్‌. అదే సమయంలో సెన్సిబుల్‌ కూడా. కొరటాల శివ చాలా సెన్సిబుల్‌ డైరెక్టర్‌. అందుకేనేమో నా కేరక్టర్‌ను సెన్సిబుల్‌గా తీర్చిదిద్దారు. మహేశ్‌తో చెయ్యాలని ఎప్పట్నించో అనుకుంటున్నా. ఇదివరకు ఓ ఐటమ్‌ సాంగ్‌ చేశాను. నేను చూసిన చక్కని ప్రవర్తన కలిగిన నటుల్లో ఆయన ఒకరు. పనిలో ఎంత డిసిప్లిన్‌గా ఉంటారో, చుట్టూ ఉన్నవాళ్లను అంత సౌకర్యంగా ఉంచుతారు. బాగా నవ్విస్తారు’’ అని తెలిపారు. కాగా ఈ చిత్రం 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ కోరతాం:ఎంపి కొనకళ్ల...

ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం కొనసాగిస్తున్నామని ఎంపీ కొనకళ్ల చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే దానికి సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని ఎంపీ కొనకళ్ల వివరించారు.

ఉగ్రవాదుల చెరలోనే తెలుగువారు...

హైదరాబాద్:ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అల్ షామ్(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం నలుగురు భారతీయులను అపహరించారు. నలుగురిలో కర్ణాటకు చెందిన ఇద్దరిని ఉగ్రవాదులు నిన్న రాత్రి విడుదల చేశారు. మరో ఇద్దరు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు. వీరిద్దరూ ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. గోపీకృష్ణ, బలరాం విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బలరాంది తెలంగాణ కాగా, గోపీకృష్ణది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. తెలుగు వారిని విడిపించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

చారుశీల చాలా స్ట్రాంగ్...

శ్రీమంతుడు’ చిత్రంలో తను చేసిన చారుశీల పాత్ర చాలా బలమైందే కాక సున్నితమైందని శ్రుతి హాసన్‌ చెప్పారు. మహేశ్‌ సరసన ఆమె నటించిన ఈ చిత్రం 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. శ్రుతి మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నా. పాత్రలు రిపీట్‌ కాకుండా చూసుకుంటున్నా. ఒకవేళ నా వద్దకు అలాంటి పాత్రలు వస్తున్నా ‘సారీ. ఇదివరకే ఈ తరహా పాత్ర చేశాను.

టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

విజయవాడ: టీడీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో నిన్న కేబినెట్ భేటీని నిర్వహించిన ఏసీ సీఎం నారా చంద్రబాబునాయుడు, నేడు టీడీపీ అధినేత హోదాలో పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి భేటీ నిర్వహిస్తున్నారు. నగరంలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలు హాజరుకానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.  

నేపాల్ లో కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

హైదరాబాద్: నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు ఆచూకీ తెలియని మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కస్కి జిల్లా పోలీసులు అధికారులు తెలిపారు.

10:14 - August 1, 2015

హైదరాబాద్ : నగరంలో చిన్నారుల కిడ్నాప్ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కాచిగూడలో ఓ చిన్నారి అపహరణ కు గురైన ఘటన మరిచిపోక ముందే ప్రముఖంగా పేరొందిన గాంధీ ఆసుపత్రిలో 9 నెలల చిన్నారి అదృశ్యమైంది. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కు అపహరించిన వారిని పట్టుకోవడానికి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయారు. అపహరించిన వారి కోసం సిసిటివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
రేణుక థైరాయిడ్ వ్యాధితో బాధ పడుతోందని, చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి రావడం జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. తిరిగి రేపు రావాలని చెప్పడంతో అంతదూరం వెళ్లి మళ్లి తిరిగి రావాలంటే కష్టమౌతుందని భావించి ఇక్కడే ఉన్నామని తెలిపింది. ఈ తరుణంలో ఓ మహిళ పరిచయం చేసుకుందని, తనకు వైద్యులందరూ తెలుసని చెప్పడం జరిగిందన్నారు. రాత్రి వేళ ఆసుపత్రి పక్కనే ఉన్న షెడ్డులో పడుకోవడం జరిగిందని, మధ్యలో లేచే సరికి రేణుక బిడ్డ కావ్య (9) లేదని తెలిపింది. వెంటనే పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేదని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తన బిడ్డను క్షేమంగా తీసుకరావాలంటూ వేడుకున్నారు. 

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య...

అనంతపురం: పెనుకొండ మండలం మంగాపురంలో పదో తరగతి విద్యార్థిని భావన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో మంగాపురం గ్రామంలో విషాదం రాజుకుంది. విద్యార్థిని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి....

నెల్లూరు: కావలి ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో సాధారణ ప్రసవం జరుగుతుందంటూ వైద్యులు కాలయాపన చేశారు. చివరికి సాధారణ ప్రసవం జరగకపోవడంతో నర్సులు శస్త్ర చికిత్స చేయడంతో గర్భంలో శిశువు మృతి చెందింది. విషయాన్ని గమనించిన బంధువులు నర్సులను నిలదీయడంతో వారు తిట్లదండకం అందుకున్నారు. నర్సుల తీరుపై ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.

ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి డాక్టర్ శైలబాలను తొలగింపు....

గుంటూరు: వైద్యకళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి డాక్టర్ శైలబాలను వైద్య ఆరోగ్య శాఖ అర్థాంతరం తప్పించింది. కొత్త ప్రిన్సిపాల్ గా డాక్టర్ డి.ఎస్. రాజునాయుడును నియమించారు. ఇటీవల కాలేజీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎన్ ఆర్ఐ ఫోటోలు పెట్టడం పై శైలబాల అభ్యంతరం తెలిపారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని పై ఎన్ ఆర్ ఐలు ఒత్తి తెచ్చి శైలబాలను బాధ్యతలనుంచి తప్పించారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

20 కార్లను ధ్వంసం చేసిన ఆకతాయిలు

హైదరాబాద్: సరూర్నగర్ లోని కోదండరాంనగర్ లో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన 20 కార్లను ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో కార్ల యజమానులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

కార్మికుల సమ్మెతో నిలిచిన నీటి సరఫరా

మహబూబ్ నగర్: రామన్ పాడు ప్రాజెక్టు పరిధిలో పని చేస్తున్న 77 మంది కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో అచ్చంపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని 130 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నారు.

08:32 - August 1, 2015

హైదరాబాద్ : క్వాలిటీ మద్యం అందుబాటులో ఉండాలి. ప్రజల ఆరోగ్యం బాగుండాలి అలాగే ఉపాదికూడా పెరగాలి.. మందుతో కిక్కేకాదు.. ఇవన్నీ రావాలని భావిస్తోంది తెలంగాణ సర్కారు.. కొత్త ఎక్సైజ్ పాలసీని సరికొత్తగా తయారుచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై మంత్రి పద్మారావు, ఎక్సైజ్ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. శాఖాపరంగా తయారుచేసిన ప్రతిపాదనను సీఎం ముందుంచారు పద్మారావు. అయితే కల్లు కాంపౌండ్ల నిర్ణయంపై అనేక విమర్శలొచ్చాయని ఆదాయంకన్నా సామాన్యుల రక్షణకే ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని మంత్రికి సీఎం సూచించినట్లు సమాచారం.
గుడుంబావల్ల జరిగే అనర్ధాలపై చర్చ..
గ్రామాల్లో గుడుంబాతో జరుగుతున్న అనర్థాలపై రివ్యూలో చర్చించారు. ఈ మద్యంతో వితంతువులుగా మారుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా మద్యం, గుడుంబా వల్ల పేదల కుటుంబాల్లో సుఖం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆల్కహాల్ ను అరికట్టే మార్గాలని పరిశీలించాని అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న అక్రమ మద్యంపై నిఘా పెంచాలని సూచించారు.
తాగి గొడవలు చేయకుండా చర్యలు..
అటు హైదరాబాద్‌కు వస్తున్న ప్రముఖుల మర్యాదకు లోటు రావొద్దన్నారు కేసీఆర్. పారిశ్రామికవేత్తలు, దేశవిదేశీ ప్రముఖులకు స్టార్ హోటళ్లలో విదేశీ మద్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. అందరినీ దృష్టిలోపెట్టుకొని భాగ్య నగరంలో అనుసరించాల్సిన పద్దతులపై ప్రత్యేక వ్యూహం తయారుచేయాలని ఆదేశించారు. నగరానికి మంచి పేరుందని బజార్లలో తాగి గొడవలు జరకుండా చర్యలు చేపట్టాలన్నారు కేసీఆర్.
16వేల జనాభాకు ఒక మద్యం షాపు..
మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో 16వేల జనాభాకు ఒక మద్యం షాపు విధానం అమల్లో ఉంది.. ఏపీలో 11వేలమందికి ఒక మద్యం దుకాణం ఉండగా తమిళనాడులో పదివేలమందికి ఒక షాపుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం పైకి ఎన్ని మాటలు చెబుతున్నా మద్యం ప్రధాన ఆదాయమార్గం కావడంతో షాపులు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. పదివేలమందికి ఒక దుకాణం విధానంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఆదాయం టార్గెట్ దాదాపు 12వేల 227కోట్లుగా తెలుస్తోంది. న్యూ పాలసీ అమలు చేస్తే ప్రస్తుతమున్న 2వేల 2వందల 16 షాపులకు అదనంగా మరో 9వందల దుకాణాలు ఏర్పాటయ్యే అవకాశముంది.
చెరువుల చుట్టూ ఈత చెట్లు..
కల్లుపై కూడా అధికారులతో చర్చించారు టీ సీఎం. తెలంగాణ ప్రజలకు మంచి కల్లు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువుల చుట్టూ ఈత చెట్లు పెంచాలని చెప్పారు. వచ్చే ఏడాది దాదాపు 5కోట్ల ఈత మొక్కలు నాటాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎఫ్ఓ లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని రాష్ట్రంలో కల్తీ కల్లు లేకుండా చేయాలని ఆదేశించారు. తెలంగాణలో వినియోగమయ్యే మద్యం అంతా ఇక్కడే తయారయ్యేలా డిస్టలరీస్ ఏర్పాటుచేయాలని సూచించారు సీఎం. అప్పుడు రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. మద్యం ద్వారా ఒక్క ఆదాయమేకాదు ఉపాధిపైకూడా దృష్టిపెట్టింది సర్కారు. ప్రభుత్వ ఔట్ లెట్ల ద్వారా తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. వచ్చే అక్టోబరులోగా కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది టీ సర్కారు.

ఉగ్రదాడిలో భద్రతాధికారుల మృతి..

లిబియా : ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భద్రతాధికారులు మృతి చెందారు. బెంగజీ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

గాంధీలో చిన్నారి కిడ్నాప్..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో 9నెలల చిన్నారి కావ్య కిడ్నాప్ కు గురైంది. గుర్తు తెలియని మహిళ చిన్నారిని అపహరించింది. చిలకలగూడ పీఎస్ లో కావ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సిసి టివి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

08:21 - August 1, 2015

రంగారెడ్డి : వివాహం చేసుకున్న వ్యక్తి తనను మంచిగా చూడాలని..తన పిల్లలను బాగా చదివించుకోవాలని..పిల్లలను ఉన్నతస్థానంలో చూడాలని ఆ మహిళల కలలు కన్నది. కానీ ఒక్కో కల తన ఎదుటే కల్లమౌతుంటే ఆ మహిళ తట్టుకోలేకపోయింది. భర్త నరకం చూపిస్తుంటే తాను అనుకున్నది తీరదని భావించింది. దీనితో ఇద్దరు పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా సుల్తానాబాద్ కు చెందిన వినోద, నరేందర్ రెడ్డి దంపతులు రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున వినోద తన ఇద్దరు పిల్లలైన జ్యోతి (12), విఘ్ణేష్ (5)లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం వినోద కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వినోద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన భర్త నరకం చూపించాడని, కుటుంబ బాగోగులు పట్టించు కోలేదని సూసైడ్ నోట్ లో పేర్కొంది. గత కొంతకాలంగా నరేందర్ కనిపించకుండా పోయాడని, దీనితో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని లేఖలో రాసింది. పిల్లలను పెద్ద చదువులు చదివిద్దామని అనుకున్నానని, ఏవీ నెరవేరలేదని కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో వినోద పేర్కొంది. పరారీలో ఉన్న నరేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

08:07 - August 1, 2015

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం చెందడంతో దేశం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది తమ ఆవేదనను తెలియచేశారు. కేంద్రం ఏకంగా ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఐరాస సమితి కూడా కలాం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు సంతాపం తెలియచేశారు. కానీ ఓ సీఎం మాత్రం ఎంజాయ్ చేశారు. ఒక బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న తరుణ్ గోగోయ్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈనెల 29న నాగౌన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో గొగోయ్ స్టెప్పులేశారు. అంతేగాక ఓ హెలికాప్టర్ లో గోల్ఫ్ కోర్స్ మైదానంలో దిగి సరదాగా గోల్ఫ్, స్నూకర్ ఆడారు. కలాం మృతి చెందినా తనకేమి పట్టనట్టు ఇలా సంతోషంలో మునిగి తేలడంపై ఆయన సమర్థించుకుంటారా ? లేదా ? అన్నది చూడాలి. 

07:56 - August 1, 2015

ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రాల సామాజిక, ఆర్థిక, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అందచేస్తున్న వివిధ పథకాలను ఈ ఆర్థిక సంవత్సరం నిలిపివేశామని లోక్ సభలో కేంద్రం పేర్కొంది. గత 14 నెలలుగా ప్రత్యేక హోదా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న ఏపీ రాష్ట్ర ప్రజలపై కేంద్రం నీళ్లు చల్లింది. కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని లోక్ సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం హోం శాఖ నేతృత్వంలో శుక్రవారం ఐదు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), సూర్యప్రకాష్ (టిడిపి), నారదాసు లక్ష్మణ రావు (టీఆర్ఎస్), మల్లు రవి (కాంగ్రెస్), విష్ణువర్ధన్ రెడ్డి (బీజేవైఎం), మధు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

గ్రూప్స్ పై నేడు అవగాహన సదస్సు..

హైదరాబాద్ : గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న నిరుద్యోగులకు కొత్త సిలబస్ పై శనివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డ్రీమ్స్ ఇనిస్టిట్యూట్ నిర్వామకుడు రఫీ పేర్కొన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న రమణ్ సింగ్..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్, పుదుచ్చేరి గవర్నర్ జనరల్ ఎ.కే.సింగ్ దర్శించుకున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..కాలి నడక వచ్చే వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. 

07:47 - August 1, 2015

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మిల్క్ బ్యూటి తమన్న ఐటం సాంగ్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. రివెంజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం దేవిశ్రీ ప్రసాద్ ఒక సూపర్ కిక్‌‌‌ఫుల్ సాంగ్ కంపోజ్ చేసి ఉంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ పాటలో తమన్నా అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారని టాక్. ఈ ఐటెమ్‌‌‌‌‌ సాంగ్‌‌‌లో తమన్నా మెరవడం ఖాయమనీ ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని జూనియర్ ఎన్టీయార్ డిసైడ్ అయ్యారనీ, అందుకే ఆలోగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న కసితో ఉన్నాడట సుకుమార్. మరి ఎన్టీఆర్ తో తమన్నా ఐటం సాంగ్ ఉంటుందా ? తమన్నా ఎలాంటి స్టెప్పులేసిందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. 

07:40 - August 1, 2015

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి' విజయవంతంగా దూసుకెళుతోంది. పలు భాషల్లో విడుదల ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా మరో రెండు రికార్డుల దూరంలో ఉంది. హిందీ వెర్షన్ లో విడుదల ఈ చిత్రం చరిత్ర సృష్టించబోతోంది. 100 కోట్ల మార్క్ ను అందుకోనున్న ఫస్ట్ సౌత్ మూవీగా రికార్డుల కెక్కనుంది. ఈ సినిమా తొలి మూడు వారాలకు 95 కోట్ల రూపాయలకుపైగానే వసూలు చేసినట్టు బాలీవుడ్ టాక్. రేపోమాపో 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమంటూ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ వెర్షన్స్ కలిపి బాహుబలి 500 కోట్ల మార్కును తాకే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో మాత్రమే విడుదలైంది. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ వివిధ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారని టాక్.

బంజారాహిల్స్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో శుక్రవారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ రైసింగ్ నిర్వహిస్తున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

రంగారెడ్డి : గచ్చిబౌలిలో కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. వినోద, జ్యోతి (12), విఘ్ణేష్ (5) మృతులుగా గుర్తించారు. 

07:19 - August 1, 2015

ప్రకాశం : జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. తక్షణమే ఆయనను ఒంగోలులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కారు ముందుభాగం పాక్షికంగా ధ్వంసమైంది. కారులో ఎమ్మెల్యేతో పాటు ప్రయాణిస్తున్న కొండపి మార్కెట్‌ యార్డ్ ఛైర్మన్‌, గన్‌మెన్‌, డ్రైవర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. 

07:17 - August 1, 2015

ఆస్ట్రేలియా టెస్ట్‌ ఓపెనర్‌ క్రిస్‌ రోజర్స్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌ ఆరంభించిన నాటి నుండి ఒక్క ఇన్నింగ్స్ లో డకౌట్‌ అవ్వని రోజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. లేటు వయసులో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజర్ లెజండరీ క్రికెటర్లను సైతం వెనక్కు నెట్టి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. 37 ఏళ్ల వయసులో ఏ క్రికెటర్‌ అయినా రిటైర్మెంట్‌ గురించే ఆలోచిస్తుంటాడు. కానీ 35 ఏళ్ల లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజర్స్...అవకాశం వచ్చినప్పుడల్లా సత్తా చాటుకుంటూనే ఉన్నాడు. రిటైర్మెంట్‌ వయసులోనూ సంచలనాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రోజర్స్, టెస్ట్‌ ఓపెనర్‌గా ఆస్ట్రేలియా జట్టులో బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
రెండో స్థానంలో జిమ్ బర్క్..
వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్‌ సెంచరీలు నమోదు చేసి ప్రపంచరికార్డ్ నెలకొల్పిన రోజర్స్ సాంప్రదాయ టెస్టుల్లో ఇప్పటివరకూ డకౌట్‌ కానీ బ్యాట్స్ మెన్‌గా చరిత్రను తిరగరాశాడు. టెస్ట్‌ క్రికెటర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసినప్పటి నుండి రోజర్స్ ఒక్కసారి కూడా డకౌట్‌ అవ్వని ఏకైక బ్యాట్స్ మెన్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకూ 23 టెస్టులాడిన రోజర్స్ ప్రతీ ఇన్నింగ్స్ లోనూ పరుగులు సాధించాడు. 45 ఇన్నింగ్స్ ల్లో ప్రత్యర్ధి జట్ల బౌలర్లు రోజర్స్ ను డకౌట్‌ చేయడం విఫలమయ్యారు. ఈ లిస్టులో ఇప్పటివరకూ టాప్‌ ప్లేస్‌లో ఉన్న మాజీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్‌ జిమ్‌ బర్క్ ను రోజర్స్ అధిగమించాడు. జిమ్‌ బర్క్ వరుసగా 44 ఇన్నింగ్స్ లతో రెండో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియాకే చెందిన రెగ్గీ డఫ్‌ 40 ఇన్నింగ్స్ లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.
రికార్డులు బద్ధలవుతాయా ?
ఇదే అరుదైన జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్ మెన్‌ బ్రిజేష్‌ పటేల్‌ కూడా ఉన్నాడు. వరుసగా 38 ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌ అవ్వకుండా రికార్డ్‌ నెలకొల్పిన బ్రిజేష్‌ పటేల్‌....ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. 37 ఏళ్ల క్రిస్‌ రోజర్స్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడో చెప్పలేం కానీ... ఈ డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌ నమోదు చేసిన అరుదైన రికార్డులు ఇప్పుడప్పుడే బద్దలయ్యేవి కావనడంలో ఎటువంటి సందేహం లేదు.

07:11 - August 1, 2015

టీమిండియా ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అర్జున అవార్డు స్వీకరించాడు. కేంద్ర క్రీడా మంత్రి శర్వానంద సోనోవాల్ చేతుల మీదుగా ఢిల్లీలో ఈ పురస్కారం అందుకొన్నాడు. మహాభారతంలోని అర్జునుడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని...అర్జునిడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డు అందుకోడం గర్వకారణమని అశ్విన్ చెప్పాడు. రానున్న కాలంలో క్రీడామంత్రి చేతులమీదుగా మరిన్ని పురస్కారాలు అందుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

07:08 - August 1, 2015

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్ పూర్తయింది. అనేక ఆటుపోట్ల నడుమ ప్రశాంతంగా ముగిసింది. పలు సార్లు వాయిదాపడ్డ వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇంజినీరింగ్ ఫార్మసి కోర్సుల తుదివిడత వెబ్‌కౌన్సిలింగ్‌లో భాగంగా ఇవాళ సీట్లు కేటాయించనున్నారు. అలాగే కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే సీట్ల కేటాయింపునకు సమయం ఎక్కువ పడుతోందని ప్రవేశాల క్యాంపు అధికారులు చెబుతున్నారు. ప్రాసెసింగ్‌కు చాలా సమయం పడుతున్నందునా ఉదయమే సీట్లు కేటాయిస్తామంటున్నారు.
తుదివిడతలో 44,642 సీట్లు..
తుదివిడతలో 40 వేల 961మంది విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేశారని అధికారులు తెలిపారు. మొత్తం కౌన్సెలింగ్‌లో విద్యార్థులందరూ కలిపి 15 లక్షల 5 వేల 332 ఆప్షన్లు నమోదు చేయగా, అత్యల్పంగా ఒక ఆప్షన్‌ను నమోదు చేశారని తెలిపారు. తొలివిడతో 53 వేల 367 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని, అందులో 41 వేల 661 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్ సిస్టం ద్వారా వివరాలు నమోదు చేశారు. తొలివిడతలో సీట్లు కేటాయించిన వారిలో 11 వేల 686 మంది ఎస్‌ఆర్‌ఎస్‌ ద్వారా నమోదు చేయలేదు. తొలివిడతలో సీట్లు కేటాయించకపోవడంతో 32 వేల 966 సీట్లు మిగిలిపోయాయి. దీంతో తుదివిడతలో కేటాయించేందుకు మొత్తం 44 వేల 642 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఆగస్టు 1న క్లాసులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనుకున్న సమయానికి క్లాసులు ప్రారంభం కానుండటంతో అటు విద్యార్థులు, ఇటు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏమ్లానాయక్ లో దారుణం..

నల్గొండ : మేళ్ల చెరువు (మం), ఏమ్లానాయక్ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై సొంత మరిది అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా ఈ ఆకృత్యం కొనసాగింది. ఇందుకు భర్త కూడా సహకరించాడు. గ్రామస్తుల సమాచారంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలతో బాబు భేటీ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.

 

06:58 - August 1, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కుదరదని మోదీ సర్కారు తేల్చి చెప్పేసింది. సాక్షాత్తూ కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. మోదీ సర్కారు వస్తుంది.. ప్రత్యేక హోదా ఇస్తుంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అని ఆశించిన ఆంధ్రా ఓటరును.. ఈ ప్రకటన ద్వారా కేంద్రం ఉస్సురనిపించింది. శుక్రవారం లోక్‌సభలో బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఆ రాష్ట్ర ఎంపీలు లేవనెత్తిన చర్చకు సమాధానంగా ఆయనీ ప్రకటన చేశారు.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలూ లేవన్న ఇందర్‌జిత్‌సింగ్‌, ప్రస్తుతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలు మాత్రమే తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రాజస్థాన్‌ కోరిందని, దాన్ని ఆమోదించే అవకాశం ఉందని అన్నారు. అయితే.. ఇప్పటికే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామన్నారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన.. ఏపీ ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో వారు హడావుడిగా ప్రజాగ్రహాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తెలుగుదేశం పార్టీపై పెరిగిన ఒత్తిళ్లు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని.. కేంద్రం విస్పష్టంగా ప్రకటించడంతో పాలక తెలుగుదేశం పార్టీపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇప్పటికే విపక్షాలు ఈ అంశంపై టిడిపి సర్కారు ఉదాశీన వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్‌రెడ్డి కూడా ఇదే అంశంపై ఢిల్లీలో దీక్షకు సిద్ధమవుతున్నారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ సాధించేవరకూ పోరాటం ఆపేది లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు.
సీపీఐ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర..
అటు రాష్ట్రానికి చెందిన వామపక్షాలు కూడా కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 1 నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నాయి. పదో తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే.. అన్ని పక్షాలను కలుపుకొని 11న బంద్‌ పాటించాలని నిర్ణయించాయి. విపక్షాల ఒత్తిళ్లు పెరగడంతో.. తెలుగుదేశం నాయకులు తక్షణమే రంగంలోకి దిగారు. ప్రజాగ్రహాన్ని శాంతింప చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. హోదా సాధనపై వెనక్కి తగ్గబోమని ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీహార్‌ ఎన్నికల వ్యూహంలో భాగంగానే కేంద్రం ఈ ప్రకటన చేసి ఉంటుందని వివరణలిస్తున్నారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమిని ఇరుకున పెట్టింది.

06:56 - August 1, 2015

గుంటూరు : రిషితేశ్వరిఆత్మహత్యపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తైంది. మాజీ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ మూడు రోజుల పాటు విచారణ జరిపింది. అయితే విద్యార్థులకు సెలవులిచ్చి విచారణ జరపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని..రిషితేశ్వరి తల్లిదండ్రులు సీఎం చంద్రబాబును కోరారు. రిషితేశ్వరి మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని ఎఎన్‌యూలో అడుగుపెట్టిన రోజే ప్రకటించిన కమిటీ వాస్తవానికి చేసిందేమీ లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదే క్రమంలో ప్రిన్సిపల్ బాబూరావును కూడా అరెస్టు చేసి విచారించాలని, మరికొందరు విద్యార్థులు కూడా ఆమె మృతికి కారకులన్న విద్యార్థి సంఘాల డిమాండ్లను ఈ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందన్న చర్చ సాగింది. కానీ ఇవేమీ జరగలేదు. విచారణ కమిటీ వేసింది రిషితేశ్వరి ఆత్మహత్యపై అయినప్పటికీ, యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు కమిటీ ఆసక్తి కనబరిచింది. అయితే విద్యార్థులకు సెలవులిచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకోని కమిటీ నివేదికను ఏమనిస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
సీల్డ్ కవర్లో ఇంఛార్జ్‌ వీసీకి ప్రొఫెసర్ల కమిటీ నివేదిక..
ఇప్పటికే యూనివర్సిటీ నియమించిన ప్రొఫెసర్ల కమిటీ సీల్డ్ కవర్లో తమ నివేదికను ఇన్‌ఛార్జ్ వీసీకి అందజేసింది. దానిని కూడా ప్రభుత్వానికి అప్పగించాలని యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల నివేదికలో ఏముంది..? ప్రభుత్వ కమిటీ ఇవ్వబోయే నివేదికలో ఏముంటుంది..? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ రెండు నివేదికలు బహిర్గతమైతే తప్ప రిషితేశ్వరి మృతికి దారి తీసిన కారణాలు తేటతెల్లమయ్యే అవకాశం లేదు.
సీఎంకు రిషితేశ్వరి తల్లిదండ్రుల విజ్ఞప్తి..
మరోవైపు తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన నిందితులందరికి కఠిన శిక్షలు పడేలా చూడాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిశారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని సీఎం తమకు హామీ ఇచ్చారని రిషితేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు.
ఎస్ఎఫ్ఐ పోరుబాట..
రిషితేశ్వరీ మృతికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ అటు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు విజయవాడలో పోరుబాట పట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతనెలకొంది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్సిపల్ బాబూరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పది లక్షల ఆర్థిక సహాయం..
ఇంకోవైపు రిషితేశ్వరీ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు . వారి రిమాండ్‌ కాలాన్ని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. శనివారం గుంటూరు జిల్లా లీగల్ సెల్ అథారిటీ న్యాయమూర్తి ఎదుట ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ బాబూరావు హాజరుకానున్నారు. మరోవైపు రిషితేశ్వరి తల్లిదండ్రులకు 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. రాజమండ్రిలో 500 గజాల స్థలం ఇవ్వాలని తీర్మానించింది. విచారణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది.

06:39 - August 1, 2015

హైదరాబాద్ : మీరు నగర రోడ్లపై బైక్‌తో వెళుతున్నారా ? అదీ.. హెల్మెట్ లేకుండా రోడ్డుపై రయ్‌.. రయ్‌ మంటూ దూసుకెళుతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే ఇక నుంచి.. మీ జేబుకు భారీ చిల్లులు పడుతాయి. హెల్మెట్ ధరించాలనే నిబంధనలను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మరో వైపు హెల్మెట్‌ వాడకంపై వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆగస్టు 1 నుంచి ఏపీలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా వాడాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎవరికీ మినహాయింపు లేదని, బైకులు నడిపే వారంతా హెల్మెట్‌ ధరించాలని సూచిస్తోంది. హెల్మెట్‌ లేకుండా, సీటు బెల్ట్‌ పెట్టుకోకుండా ద్విచక్ర వాహనం నడిపితే.. దాదాపు 2వేల రూపాలయ వరకు ఫైన్‌ విధించనున్నారు.
రూ. 500 నుంచి 2000 వేలకు విక్రయం..
శిరస్త్రాణం లేకుండా రోడ్లపైకి వస్తే వాహనదారులకు జరిమానాతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సీజ్‌ చేయనున్నారు అధికారులు. హెల్మెట్‌ వాడకం తప్పనిసరి చేయడంతో వాటి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వ్యాపారులు నిబంధనలు పాటించకుండా సాధారణ రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వాహనదారులు హెల్మెట్లు కొంటున్నారు. ఒక్కో హెల్మెట్‌ను 500 నుంచి 2000 వేల రూపాయల అమ్ముతున్నారు. కొన్నిచోట్ల ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్‌లను రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు.
వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన..
మరోవైపు హెల్మెట్‌ వాడకంపై అధికారులు ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోయారు. అసలు హెల్మెట్‌ వాడకం నిబంధనను అమలు చేస్తారో.. రద్దు చేస్తారో లేదో అని వాహనాదారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటు హెల్మెట్‌ వాడకంపై వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తలకు రక్షణగా భావించే వారి సంఖ్య కంటే.. ఇది అనవసర భారంగా అనుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. హెల్మెట్‌ పెట్టుకుంటే.. హారన్‌ సౌండ్‌ సరిగా వినిపించదని సీనియర్‌ సిటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. హెల్మెట్‌ ధరించడం వల్ల మహిళల గోలుసు చోరీలు పెరుగుతాయని మరికొందరు భావిస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించడంతో పాటు, ద్విచక్ర వాహనాదారులకు భద్రత కల్పించడమే హెల్మెట్‌ వాడకం ముఖ్య ఉద్దేశమంటున్నారు అధికారులు. హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ.. గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అవి పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. ఇప్పుడు ఈ విధానం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందన్నది కోటి డాలర్ల ప్రశ్నగా మారింది.

06:35 - August 1, 2015

హైదరాబాద్ : పేదోడికి పెద్ద రోగం వస్తే నేనున్నానంటూ ఆదుకుంటుంది సీఎం రిలీఫ్‌ ఫండ్‌. ఏ ఆదెరువూ లేని వారికి ఇదో పెద్ద అవకాశం, ఆపన్న హస్తం. అయితే.. నిరుపేదల సంక్షేమానికి ఎప్పుడో కొరివి పెట్టిన ప్రభుత్వాలు. ఇప్పుడు ఇలాంటి అవకాశాలను సైతం దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం నిర్భాగ్యుల పాలిట శాపంగా మారుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ క్రెడిట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తాయి. సర్కారు ఒక్కసారి ఎల్ వోసీ ఇచ్చిందంటే నగదు గ్యారంటీగా వస్తుందనే ధీమాతో హాస్పిటల్స్ దీని కింద చేరిన రోగులకు పూర్తి స్థాయి సేవలు అందిస్తాయి. ఇందులో ఎక్కువగా కార్పోరేట్ ఆస్పత్రుల్లో చేరిన వారు ప్రాణాంతక వ్యాధులు, గుండె జబ్బులు, ఉపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎల్‌ఓసికి మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రద్దుకు సీఎం ఆదేశం..
మరోవైపు ఎల్‌ఓసి విధానాన్ని ఆసారా చేసుకుని పలు కార్పోరేట్ ఆస్పత్రులు అవినీతికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికంటే అధికంగా ఎస్టిమేట్లు వేసి డబ్బులు గుంజుతున్న విషయం సీఎం కార్యాలయం దృష్టికి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏ ఏ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎంత వరకు పేషంట్ భరిస్తారు అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎల్ఓసిని మంజూరు చేస్తారు. కానీ ఇటివల కొన్ని కేసుల్లో అడిగిందే తడవుగా...ఎల్ఓసిలు ఇబ్బడి ముబ్బడిగా జారీ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాటు బిల్లులో భారీగా కోతలు విధిస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయం పేద రోగుల పాలిట మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా మారనుంది.
ఎల్‌ఓసి పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా బిల్లులు వేసి దండుకుంటుండగా.. కొందరు మంత్రుల అంతరంగీకులు కిందిస్ధాయి సిబ్బంది చేతివాటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీటితో పాటు పలువురు మంత్రులు, లేదా ఎమ్మెల్యేలపై ఉన్న నమ్మకంతో వెనుక ముందు చూడకుంగా ఎల్‌ఓసీలు మంజూరు చేస్తుంటారు అధికారులు. ఈ నమ్మకమే కొందరికి కాసులవర్షం కురిపిస్తోంది. ఇది గమనించిన సిఎంవో ఉన్నతాధికారులు...గురువారం సాయంత్రమే ఎల్ ఓ సి విధానాన్ని నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొన్నిరోజులుగా జారీ చేసిన ఎల్ఓసిలపై పునర్‌ విచారణ చేపట్టాలని అంతర్గతంగా శాఖాధితిపతులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పేద రోగులకు ఆపద్భాంధువుగా నిలిచే ఎల్‌ఓసి రద్దు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  

06:33 - August 1, 2015

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజన తీర్పును మళ్లీ సమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. పునర్విభజన చట్టానికి విరుద్దంగా ఈ తీర్పు ఉందని పిటిషన్లో తెలిపింది.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదావేసింది. అప్పటి తీర్పులో రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయరాదని పేర్కొంది. హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం, భవనం చూపాలని, దాని ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు కేంద్రం సమకూర్చాలని ధర్మాసనం తీర్పు చెప్పింది. శాశ్వత ప్రాతిపదికన ఏపీ హైకోర్టు ఏర్పాటుకు సమయం పట్టినా.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని తీర్పు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికీ వ్యతిరేకమని వాదించింది. పునర్వ్యవస్థీకరణ చట్టం శాశ్వత ప్రాతిపదికన అన్న పదం వాడలేదని వివరించింది.
ఆగస్టు 14కు వాయిదా..
ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి, ఎపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. ఏపీకి శాశ్వత ప్రతిపాదికన హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిధుల కేటాయింపుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. మే ఒకటో తేదీన వెలువరించిన ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వానికి బదులుగా ఏపీ ప్రభుత్వం అని పేర్కొనడాన్ని సవరించాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

06:31 - August 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సమరం మొదలైంది. అధికార పక్షం నిర్ణయాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది. డిజైన్‌ మార్పుతో జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు రంగంలోకి దిగింది. మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో శంకరపల్లి మండలం మహాలింగపురం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు పనులు పరిశీలించారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయ‌క‌లు. ఇప్పటికే చేవెళ్ళ రిజ‌ర్వాయ‌ర్‌కు సంబంధించి సుమారు 12 వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారని.. డిజైన్ మార్పుతో ప్రజాధ‌నం దుర్వినియోగమవుతోందని మండిపడుతున్నారు. డిజైన్ మార్పుతో జాతీయ హోదా ద‌క్కకుండా పోయో ప్రమాదం ఉందని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు కొత్త డిజైన్‌ నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించడంపై కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరుగుతోంది.
ఉద్యమం తప్పదన్న నేతలు..
శంక‌రపల్లి వ‌ద్ద ఇప్పటికే 123 మీటర్ల లోతైన బావి, 1.6 కిలోమీటర్ల పొడవైన సొరంగం పూర్తి చేసుకుని రెండు కిలోమీటర్ల లక్ష్యానికి చేరువవుతోంది. డిజైన్ మారిస్తే రంగా రెడ్డి జిల్లాకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు ఎలా ఇస్తారని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆరోపిస్తున్నారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను సాకుగా చూపి రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను పణంగా పెడితే సహించబోమంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

06:29 - August 1, 2015

కృష్ణా : ఒంగోలు ట్రిపుల్ ఐటికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదించింది. కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కరువు జిల్లాలో ఉపాధి పని దినాలను పెంచారు. ప్రాధాన్యత రిత్యా పెండింగ్‌ ప్రాజెక్టులను తర్వగా పూర్తి చేయాలని, బహిరంగ మార్కెట్‌లో ఉల్లి రేటును తగ్గించాలని నిర్ణయించారు. ఇటు రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షల పరిహారంతో పాటు.. రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 8 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒంగోలు ట్రిపుల్‌ ఐటికి కలాం పేరు మీద నామకరణం చేయాలని... ఆయన జ్ఞాపకార్థం నాగార్జున వర్శిటీలో ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..

 • కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కరాలు.
 • ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం. ఇందుకు 5,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
 • అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఒక్కో ఇంటికి 2 లక్షల 75 వేలు ఖర్చు పెట్టాలని, సొంత స్థలాలున్నవారికి 50 వేల ఇళ్లు నిర్మాణం.
 • నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షల పరిహారంతో పాటు.. రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం.
 • ర్యాగింగ్‌ అన్ని కాలేజీల్లో బ్యాన్‌ చేయాలని నిర్ణయం. యూనివర్శిటీల్లో రాజకీయ కార్యకలాపాలకు తావు ఉండకూడదని, బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు, ఐడీ కార్డ్స్ విధానం.
 • 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్ మెంట్‌ ఉండదు. రెండో పీజీ చేసే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్‌ వర్తించదు.
 • ప్రాధాన్యత క్రమంలో హంద్రీనీవా, గాలేరు నగరి, గుండ్లకమ్మ, పట్టిసీమ, పోలవరం కుడికాలువ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులను పూర్తి చేయాలి.
 • ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్‌-1ను ప్రారంభం.
 • 2018లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి.
 • కరువు జిల్లాల్లో వలసల నివారణకు ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులు పెంపు.
 • అనంతపురం జిల్లాలో 20 వేల ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సాహం.
 • ఉల్లి ధరను 20 రూపాయలకు మించి అమ్మకుండా చర్యలు. రోజుకు 220 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతి చేసుకోవాలని నిర్ణయం.
 • అన్ని శాఖలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు.. లక్ష ట్యాబ్‌ల కొనుగోలుకు నిర్ణయం.
 • ఆగస్టు 10 నుంచి మీ భూమి- మీ ఇంటికి కార్యక్రమం.

ఏపీలో భూముల మార్కెట్ ధరల పెంపు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి భూముల మార్కెట్ ధరలు పెరుగనున్నాయి. మార్కెట్ ధర పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగనున్నాయి. 

నేటి నుండి మున్సిపల్ కార్మిక జేఏసీ రిలే దీక్షలు..

హైదరాబాద్ : నేడు ఇందిరాపార్కు వద్ద మున్సిపల్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగనున్నాయి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొననున్నాయి.

 

కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం..

మహబూబ్ నగర్ : కొత్తకోట (మం) పాలెం వద్ద లారీ - డీసీఎంలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

నేడు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : ఇంజినీరింగ్ చివరి దశ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పది గంటలకు ప్రకటించాల్సి సీట్ల కేటాయింపు వివరాలను శనివారం ఉదయం ప్రకటించనున్నారు. ఈమేరకు ప్రవేశాల క్యాంపు అధికారి పేర్కొన్నారు. 

Don't Miss