Activities calendar

02 August 2015

కత్తులతో పరస్పర దాడి..ఇద్దరి మృతి

ఆదిలాబాద్: బెల్లంపల్లి మండలం సుబ్బారావుపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఇరువురు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు సాంబయ్య, గణపతిగా గుర్తించారు. 

22:06 - August 2, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 225 సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగు రోజులపాటు మంచినీరు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే వివిధ సెంటర్లలో కల్చరల్ డిపార్టు మెంట్ ఆధ్వర్వంలో కళారూపాల వేదికలు ఏర్పాటు చేశామని వివరించారు.

 

వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

గుంటూరు: కొల్లూరు మండలం బ్రాహ్మణకోడూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

21:51 - August 2, 2015

కళాతపస్వి కె.విశ్వనాథ్ తో నిర్వహించిన ''ప్లెయిన్ స్పీక్ విత్ రవి తెలకపల్లి'' కార్యక్రమంలో సినీ నిర్మాణంలో తన అనుభవాలను వివరించారు. ఆయన దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు సంబంధించిన విశేషాలను ప్రస్తావించారు. సినీ పరిశ్రమకు చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:40 - August 2, 2015

'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల శివతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈసందర్భంగా శ్రీమంతుడు చిత్ర విశేషాలను శివ తెలిపారు. అలాగే గతంలో తీసిన మర్చి లాంటి చిత్రాల అనుభవాలను వివరించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:36 - August 2, 2015

ముంబై: ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాజీరావ్ మస్తానీ'. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 42 లక్షల మంది వీక్షించారు. ట్రైలర్‌కు ఇంతటి భారీ స్పందన రావడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ తెలిపింది.

21:33 - August 2, 2015

ఢిల్లీ: బుల్లెట్ ప్రూఫ్‌ కిట్‌... ప్రత్యర్థుల నుంచి రక్షణ కల్పించే ఈ ఎక్విప్‌మెంట్‌... మనదేశం నుంచే ప్రపంచానికంతటికీ ఎగుమతి అవుతుంది. ఐతే మన పోలీసులు, సైనికులకు మాత్రం అందని ద్రాక్షే. ఓవైపు తీవ్రవాదులు అధునాతన ఆయుధాలతో తెగబడుతుంటే... లక్ష రూపాయల ఖరీదైన రక్షణ పరికరాలు కొనుగోలు చేయలేక... అంతకంటే విలువైన జీవితాలనే బలిచేస్తున్నారు.                                                                   
ముష్కర మూక బుల్లెట్లకు బల్జీత్‌సింగ్ బలి
ఇటీవల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వారిని ప్రతిఘటింటిన ఎస్ పి బల్జీత్‌సింగ్‌... కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముష్కర మూక బుల్లెట్లకు బలయ్యాడు. ఆ సమయంలో బల్జీత్‌సింగ్ హెల్మెట్, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి వుంటే... ప్రాణాపాయం తప్పి వుండేది. అందుకే ఇపుడది చర్చనీయాంశమైంది.
కొందరు పోలీసుల వద్దే హెల్మెట్లు
టెర్రరిస్టులతో పోరాడే సమయంలో.. కొందరు పోలీసులు హెల్మెట్స్ ధరించారు. వారివద్ద సెల్ఫ్‌ లోడింగ్ రైఫిల్స్‌ వున్నాయి. ప్రత్యర్థులు ఉపయోగించిన ఎకె-47కు ఇవి ఎంతమాత్రం సరితూగవు. పోలీసులు టెర్రరిస్టులకు అత్యంత సమీపానికి వెళ్లి గ్రెనేడ్స్ విసిరి... అవి పేలక ముందే... బతుకు జీవుడా అంటూ పరిగెత్తాల్సిన దుస్థితి. కాసేపటికి ప్రత్యేక బలగాలు వచ్చినా... వారి వద్ద కూడా ఎలాంటి రక్షక కవచములు లేవు.
బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్ల ఊసేలేదు
పార్లమెంట్‌ దాడి, ముంబై అటాక్స్‌, తాజాగా పంజాబ్‌ దాడులు. తీవ్రవాదులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ... ప్రమాదకర ఆయుధాలు వినియోగించారు. పోలీసుల పరిస్థితి మాత్రం... ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వుంది. తీవ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఏ కొందరో మాత్రమే హెల్మెట్స్‌ వాడారు. బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్స్‌ ఊసేలేదు. ఇక దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.
రక్షణ లేకుండానే ప్రత్యర్థులతో పోరాటం
క్రికెట్ ఆడేటపుడు బంతి తగలకుండా హెల్మెట్లు ఎలా రక్షిస్తాయో... ఎకె-47లాంటి ప్రమాదకర గన్‌ల నుంచి వచ్చే బుల్లెట్లనూ అంతేస్థాయిలో నిలువరిస్తాయి. పోలీసులే కాదు ఇండియన్ ఆర్మీ సైతం వీటి వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలున్నాయి. వందేళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇప్పుడు 2015. ఇప్పటికీ సరైన రక్షణ లేకుండానే పోలీసులు ప్రత్యర్థులతో పోరాడాల్సిన దుస్థితి. ఆలోచిస్తే సులభమైన పరిష్కార మార్గాలు బోలెడుంటాయి. ఐతే ఆ దిశగా పోలీసు శాఖ ఆలోచనలు మాత్రం వుండవు.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల తయారీ
దేహానికి రక్షణ కల్పించే... అత్యంత నమ్మకమైన టెక్నాలజీ భారత్‌ సొంతం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల తయారీకి మనదేశం పెట్టింది పేరు. దాదాపు 100 దేశాల్లో 230 భద్రతా దళాలకు ఇక్కడి నుంచే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, హెల్మెట్లు ఎగుమతి అవుతున్నాయి. వినియోగదారుల్లో బ్రిటీష్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ ఆర్మీ, పోలీస్‌ బలగాలు వున్నాయి. కాన్పూర్‌లో వున్న ఎంకెయూ భారత్‌లోనే అతిపెద్ద తయారీ సంస్థ. అల్లర్ల నుంచి రక్షణ పొందే ఎక్యుప్‌మెంట్ తీసుకునేందుకు పోలీసులు ఆసక్తి చుపుతుంటారని... ఎంకెయూ ఛైర్మన్ మనోజ్‌ గుప్తా వెల్లడించారు. టెర్రరిస్ట్ దాడుల నుంచి రక్షణ పొందే వస్తువులు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.
50వేల బుల్లెట్ ప్రూఫ్ కిట్లు అవసరం 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోలీసులకు కనీసం 50వేల బుల్లెట్ ప్రూఫ్ కిట్లు అవసరముందని ఓ సర్వే చెబుతోంది. ఐతే పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు అందని పరిస్థితి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేక లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఎప్పుడో కానీ జరగని ఉగ్రదాడులు, ఎక్విప్‌మెంట్‌ ధర కారణంగా... కొనుగోలు అంశంపై నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. ముంబై దాడుల సమయంలో హేమంత్ కర్కరే బుల్లెట్ ప్రూప్ జాకెట్ ధరించినా... అది నాశిరకం కావటంతో... శత్రువుల తూటాలకు నేలకొరగాల్సి వచ్చింది. రాబోయే ఉపద్రవాలను ముందే ఊహించి... తగిన రక్షణ చర్యల తీసుకోవటంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే క్షేత్రస్థాయి పోలీసులే చెబుతున్నారు.
భారీగా ఎం.కె.యు.లాంటి పరిశ్రమలు
మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా... కేంద్రప్రభుత్వం.. ఎంకెయూ లాంటి పరిశ్రమలు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి ద్వారా ఉత్పత్తి అయిన జాకెట్ ప్రూఫ్‌ కిట్‌లను... ప్రపంచానికంతటికీ ఎగుమతి చేయాలని లెక్కలేసుకుంటోంది. ఐతే దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతిలో... లెక్కకు మిక్కిలి బలవుతోన్న భద్రతా దళాలకు... ఆ ఎక్యుప్‌మెంట్ అందించాలన్న ఆలోచన మాత్రం చేయదు.

 

21:07 - August 2, 2015

వరంగల్‌: తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గీసుకొండలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి భగ్నం చేశారు. కార్మికులపై జులుం ప్రదర్శించారు. పోలీసుల లాఠిచార్జ్ లో గడల రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్‌ కాలును పోలీసులు బూటు కాలుతో తొక్కి దాడి చేశారు. పోలీసుల లాఠీచార్జ్ దాడిలో గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిని సీఐటీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్‌ను పరామర్శించారు. 

20:57 - August 2, 2015

కరీంనగర్: గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ మంచి పరిజ్ఞానంతో ఉందని ఎకనామిక్స్ స్పెషలిస్టు కలింగారెడ్డి అన్నారు. కరీంనగర్‌లో కరీంనగర్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పోలీస్ అకాడమీ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రూప్స్ కు సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఉద్యోగం సాధించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చదవాల్సిన పద్ధతిని ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకు వివరించారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగపడిందంటున్నారు అభ్యర్థులు. సదస్సులో పాల్గొన్న తర్వాత తాము ఖచ్చితంగా గ్రూప్స్ లో విజయం సాధిస్తామనే నమ్మకం వచ్చిందని చెబుతున్నారు.

 

20:54 - August 2, 2015

గుంటూరు: తెలంగాణతోపాటు ఎపిలోనూ బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అమ్మవారి బోనాలు సంబరాలు ఘనంగా జరిగాయి. సత్తెనపల్లి శ్రీనీలంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి పీఠము నందు శ్రీ అమ్మవారిని పలు రకాల పండ్లు, కూరగాయాలతో అలంకరించారు. దీంతో...అమ్మవారు శ్రీశాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారు జామునుంచే పొంగళి, అంబలి కలిగిన బోనాలను భక్తులు పట్టణ వీధులలో ఊరేగించారు. అనంతరం అమ్మవారికి సమర్పించారు. దీంతో...ఉదయం నుంచి వీధులన్నీ శోభాయమానంగా మారాయి. ప్రతిఏటా ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించడం వల్ల అమ్మవారు తమను చల్లగా చూస్తారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

 

20:05 - August 2, 2015

'ఫ్రెండ్ షిప్ డే' పురస్కరించుకుని దర్శకులు తేజ, ఆర్ పి.పట్నాయక్ తో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూల నిర్వహించింది. ఈ సందర్భంగా వారు అనేక సినిమాలు, పాటలు, మ్యూజిక్ సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి పలు వివరించారు. సినీ నిర్మాణంలో వచ్చే ఇబ్బందులు, తమ అనుభవాలను చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

బోరుబావిలో పడిన బాలుడి మృతి

నల్గొండ: పెదవూర మండలం పులిచర్లలో విషాదం నెలకొంది. బోరు బావిలో పడిన శివ అనే బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. 

19:00 - August 2, 2015

నల్గొండ: టీప్రభుత్వంపై నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ సర్కార్‌కు ఒక లక్ష్యం, క్రమశిక్షణ లేవని.. అందుకే రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని నల్లగొండ సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు సచివాలయం, చాతి ఆస్పత్రి తరలించాలని హడావుడి చేసి, ఇప్పుడేమో ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం హడావుడి చేస్తోందని మండిపడ్డారు. రాష్ర్టంలో చాలా చోట్ల నిధుల్లేక పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు.

 

18:56 - August 2, 2015

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై మరో కేంద్రమంత్రి సీతారామన్ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పామన్నారు. అయితే మొన్న కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాదని.. బీహార్‌కు సంబంధించినదని వ్యాఖ్యానించారు. ఎపికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని సీతారామన్....విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు.

 

మాట మార్చిన కేంద్రమంత్రి

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై మరో కేంద్రమంత్రి సీతారామన్ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పామన్నారు. అయితే మొన్న కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాదని.. బీహార్‌కు సంబంధించినదని వ్యాఖ్యానించారు. 

కూలిన హెలికాఫ్టర్...పైలట్ మృతి

మాస్కో: రష్యాలో ఓ ఫైటర్ హెలికాఫ్టర్ కూలిపోయింది. మాస్కో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఎంఐ-28 హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడంతో... పైలెట్ కంట్రోల్ కోల్పోయాడు. ఈ సమయంలో హెలికాఫ్టర్ లో ఇద్దరు పైలెట్లున్నారు. ఈ ఘటనలో ఓ పైలెట్ చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. 

18:44 - August 2, 2015

మాస్కో: రష్యాలో ఓ ఫైటర్ హెలికాఫ్టర్ కూలిపోయింది. మాస్కో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఎంఐ-28 హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడంతో... పైలెట్ కంట్రోల్ కోల్పోయాడు. ఈ సమయంలో హెలికాఫ్టర్ లో ఇద్దరు పైలెట్లున్నారు. ఈ ఘటనలో ఓ పైలెట్ చనిపోగా.. మరొకరు గాయపడ్డారు.

 

బోరువావి నుండి బాలుడి వెలికితీత

నల్గొండ: పెదవూర మండలం పులిచర్లలోని బోరువావిలో పడిన బాలుడిని వెలికితీశారు. శివ అనే రెండున్నర ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. బోరుబావిలో నుండి అధికారులు బాలున్ని బయటికి తీశారు. బాలుడు అపస్మారకస్థితిలో ఉన్నాడు. 108 వాహనంలో అతన్ని నాగార్జున సాగర్ లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

17:47 - August 2, 2015

హైదరాబాద్: విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటాతో.. రిషితేశ్వరి కేసు విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రిషితేశ్వరి ఘటనపై వారు చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై ప్రాథమిక నివేదికను మంత్రి గంటాకు అందజేశారు. విచారణ కమిటీకి మరో వారం రోజుల గడువు పొడిగించినట్లు గంటా తెలిపారు. యూనివర్సిటీకి సెలవులు ఉండటంతో విచారణ కోసం కమిటీ మరో వారం రోజులు గడువు అడిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విచారణ గురించి కమిటీ సభ్యులు వివరించినట్లు చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీల కొరత ఉందని, అందువల్లే ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు.

 

17:37 - August 2, 2015

శ్రీకాకుళం: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ నేత కృల్లి కృపారాణి ఫైర్‌ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించకుంటే చంద్రబాబు తమ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని కిల్లి కృపారాణి విమర్శించారు. ఈమేరకు ఆమె శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు.

 

17:30 - August 2, 2015

కర్నూలు: ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్‌ చేశారు. ఈవిషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ర్టంలో అభివద్ధి వికేంద్రీకరణ జరగాలని... అందుకోసం ఈ నెలలో సీపీఎం ఉద్యమం చేపడుతుందని తెలిపారు.

 

డిఆర్ డివో కు కలాం పేరు నామకరణం చేయాలి...

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్ డివో)కు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. డిఆర్ డివో కు కలాం పేరు పెట్టడం వల్ల భావితరాలకు స్ఫూర్తి కలుగుతుందని లేఖలో ప్రధానిని కోరారు. 

16:58 - August 2, 2015

ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు బీభత్స సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో జనం అతలాకుతం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. గుజరాత్, పశ్చిమబెంగాల్, అస్సాం, జార్ఘండ్‌, ఒడిస్సా, మణిపూర్‌ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకే పరిమితమవుతున్నారు. వరద బాధిత రాష్ర్టాల్లో ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఉత్తరాది అతలాకుతలం
ఉత్తరాదిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొమన్ తుపాన్ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, మణిపూర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి చాండేల్‌ జిల్లాలో 20 మంది సజీవ సమాధి అయ్యారు. అటు పశ్చిమబెంగాల్‌లోనూ కుండపోతగా కురిసిన వర్షాలకు వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద తాకిడికి మిడ్నాపూర్‌ 60నెంబర్‌ జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అటు కోల్‌కతాలోని పలు కాలనీల్లో మోకాల్లోతు నీరు ప్రవహిస్తోంది. ప్రజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వాహనాలు సైతం వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది బాధితులు నిరాశ్రయులయ్యారు.
కుండపోతగా వర్షాలు
కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ్‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. కుండపోత వర్షాలకు గుజరాత్‌లో ఇప్పటివరకు 53 మంది చనిపోగా..మణిపూర్‌లో 25 మంది మృత్యువాత పడ్డారు. అటు హిమాచల్‌ ప్రదేల్‌లోనూ కొండచరియలు విరిగిపడి అనేకమంది మృత్యువాత పడ్డారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లాలో భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ మహిళ మృతిచెందింది. 39 గ్రామాలు నీటమునగడంతో...దాదాపు 8వేల మంది గ్రామస్తులకు పునరావాస కేంద్రాలకు తరలించారు.
భారీ వర్షాలు.. బీభత్సం
ఇక దక్షిణమిజోరంలో భారీ వర్షాలకు చింప్టూతుయ్‌ నది పొంగిపొరలడంతో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. అటు ఒడిస్సాలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలు కుండపోత వర్షాల ధాటికి ప్రభావితం అయ్యాయి. కించూర్‌, జార్జ్‌పూంచ్‌, బాలాసోర్‌, మాదేవ్‌గంజ్‌, బాంకూర్‌ జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గుజరాత్‌లో సబర్మతి నది ఉగ్రరూపం దాల్చడంతో..బనసకాంత , సురేంద్రనగర్ జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లను రంగంలోకి దింపింది.

 

16:48 - August 2, 2015

హైదరాబాద్‌: మహానగరంలో మోడ్రన్‌ మార్కెట్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. నగరంలో నిత్యావసరాలు అందించే మోండా మార్కెట్‌, గుడిమల్కాపూర్. మాదన్నపేట్‌ వంటి పెద్ద మార్కెట్లతో పాటు, నగరంలో కూర‌గాయ‌ల మార్కెట్లు కేవ‌లం 30లోపు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇటీవల నగరంలో మోండా మార్కెట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..నగరంలో కొత్త మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు.
గ్రేటర్‌లో 150 మార్కెట్లకు గ్రీన్‌సిగ్నల్..
ప్రతి 10వేల మందికి ఒక మార్కెట్‌ ఉండాలన్న సీఎం ఆదేశాల మేరకు గ్రేటర్‌లో 150 ఆధునిక మార్కెట్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ గతంలోనే కసరత్తు మొదలుపెట్టింది. మొదటి విడతలో 50 మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ..25 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఒక్కో మార్కెట్‌ను 50 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పనులను పది ప్యాకేజీలుగా విభజించారు. సర్కిళ్లవారీగా 400 చదరపు గజాల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ ఆదేశించారు.
నగరవాసుల కష్టాలు తీరనున్నాయి...
ఈస్ట్ జోన్ ప‌రిధిలో రామాంత‌పూర్‌, హ‌బ్సిగూడ‌, మ‌న్సూరాబాద్‌, భూపేష్‌గుప్తాన‌గ‌ర్‌, క్రాంతిన‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్ హుడా కాంప్లెక్స్, వ‌న‌స్థలీపురం, గ‌డ్డిఅన్నారం, హ‌య‌త్‌న‌గ‌ర్‌ల‌లో మార్కెట్లను నిర్మించనున్నారు. ఇక సెంట్రల్‌జోన్ ప‌రిధిలో ఇసామియా బ‌జార్‌, విజ‌య‌న‌గ‌ర్‌కాల‌నీ, లంగ‌ర్‌హౌస్ ట్యాంక్‌, ఎంజె మార్కెట్‌ రోడ్‌, పుత్లీబౌలివార్డు ఆఫీస్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్‌, ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట, స‌న‌త్‌న‌గ‌ర్‌, సాయిరావున‌గ‌ర్ బ‌స్తీ, సౌత్‌జోన్ ప‌రిధిలో న‌ల్గొండ క్రాస్‌రోడ్‌, చార్మినార్‌, సైఫాబాద్‌, శాంతిన‌గ‌ర్‌, ర‌క్షాపురం, మిదాని బ‌స్టాప్‌, బార్కస్‌, జుమ్మెరాత్ బ‌జార్‌, రాజేంద్రనగర్‌, నార్త్ జోన్ ప‌రిధిలో చింత‌ల్‌, సూరారం, కుత్బుల్లాపూర్‌, సుభాష్‌న‌గ‌ర్‌, ఈస్ట్ మారేడ్‌ప‌ల్లి, సీతాఫ‌ల్‌మండిల‌లో నిర్మిస్తారు. వెస్ట్ జోన్ ప‌రిధిలో కొండాపూర్‌, రాయ‌దుర్గ్, బ‌యోడైవ‌ర్‌సిటీ ఎదురుగా, ఖాజాగూడ‌, గ‌చ్చిబౌలి, మ‌దీనాగూడ‌, ఆర్సీపురం, ప‌టాన్‌చెరు, కూక‌ట్‌ప‌ల్లి, ప్రశాంత్‌నగర్‌, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మార్వో ఆఫీస్‌ల వ‌ద్ద మోడ్రన్‌ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 మోడ్రన్‌ మార్కెట్లను నిర్మించి అందుబాటులోకి తెస్తే..నగరవాసుల కష్టాలు తీరనున్నాయి.

 

16:35 - August 2, 2015

హైదరాబాద్: పార్లమెంటులో ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి చేసింది కాదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో టీడీపీ పోరాటం చేసి..సాధించి తీరుతుందన్నారు. గతంలో పోలవరం ముంపు మండలాల విలీనం విషయంలో టీడీపీ మాట నెగ్గించుకుందని తెలిపారు.

 

16:31 - August 2, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్‌ బోనాల జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్‌ వెంట నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డి.శ్రీనివాస్, కే.కేశవరావులు ఉన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ప్రొ.కోదండరాం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు విరివిగా కురిసి... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

 

15:58 - August 2, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలతో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్‌ వెంట నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డి.శ్రీనివాస్, కే.కేశవరావులు ఉన్నారు.

 

 

15:52 - August 2, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు భవిష్యవాణి, రంగం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించే బోనాల పండుగను టీసర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. బోనాలకు సంబంధంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

15:44 - August 2, 2015

హైదరాబాద్: నగరంలోని గాంధీఆస్పత్రిలో కిడ్నాప్ కు గురైన చిన్నారి క్షేమంగా ఉంది. కర్నూలు జిల్లాలో చిన్నారి కావ్య(9) ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి చిలకలగూడ పోలీసులు పాపను రక్షించారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులతో పాటు.. చిన్నారిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నిన్న ఉదయం పాపను కిడ్నాప్ చేసిన నిందితులను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా చిన్నారిని రక్షించారు.

 

 

 

 

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం...

హైదరాబాద్: నగరంలోని గాంధీఆస్పత్రిలో కిడ్నాప్ కు గురైన చిన్నారి క్షేమంగా ఉంది. కర్నూలు జిల్లాలో చిన్నారి కావ్య(9) లభ్యమయింది. ఇద్దరు కిడ్నాపర్లను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి కావ్య నిన్న గాంధీ ఆస్పత్రిలో కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే.

 

షారుఖ్ పై నిషేదం ఎత్తివేత

ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ పై ఉన్న నిషేదాన్ని ముంబై క్రికెట్ అసొసియేషన్ ఎత్తివేసింది. ముంబై వాంఖడే స్టేడియంలోకి ప్రవేశానికి షారుఖ్ ఖాన్ పై ఉన్న నిషేధాన్ని ఎంసీఐ ఎత్తివేసింది. 2012 ఐపిఎల్ సందర్భంగా ఎంసీఐ సిబ్బందితో వివాదం వల్ల షారుఖ్ పై నిషేదం విధించారు.

 

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు - రాఘవులు..

కర్నూలు : ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

టిడిపిలోకి డొక్కా..?

గుంటూరు : జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈనెల 15వ తేదీన పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. 

ప్రభుత్వం చేతిలో రిషితేశ్వరి నివేదిక..

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థుల అరాచకాలు, ర్యాగింగ్ ను సహించలేక బలవన్మరణానికి పాల్పడిన రిషితేశ్వరి మృతిపై కేసు విచారణ కమిటీ ప్రాథమిక నివేదికను మంత్రి గంటా శ్రీనివాస రావుకు అందచేసింది. 

జవహార్ నగర్ లో సీపీఐ ర్యాలీ..

రంగారెడ్డి : జిల్లాలోని శామీర్ పేట మండలం జవహార్ నగర్ లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పేదల ఇళ్లు కూల్చేస్తారనే సమాచారంతో సీపీఐ నిరసన ర్యాలీ చేపట్టింది. 

13:21 - August 2, 2015

గుంటూరు : ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై బీజేపీపై పోరాడితే నష్టపోతామని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లో విరమించేది లేదని, విపక్షాలు అనవసరంగా ఆవేశపడుతున్నాయన్నారు. బిజెపీతో పోరాటంతో చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షాలు కలిసి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. 

13:17 - August 2, 2015

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు జరుపలేదని సీపీఎం ఏపీ ప్రధాన కార్యదర్శి మధు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరి సరిగా లేదని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ప్రత్యేక హోదాపై మధు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్నే రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరిట ప్రజలను నమ్మించే ప్రయత్నం జరగుతోందని విమర్శించారు. కడపలో ఉక్కుకర్మాగారం నిర్మిస్తామని, రైల్వే జోన్, విద్యా సంస్థలు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. ఈ సమస్యలపై సీపీఎం ఆందోళన జరుపుతుందన్నారు. కుప్పం ఆర్థిక పరిస్థితి చూస్తే విమానాశ్రయం అవసరం లేదన్నారు. 

13:14 - August 2, 2015

ఢిల్లీ : నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసును సీబీఐతో విచారణ జరిపించారన్నారు కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఆయన ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రిషితేశ్వరి కేసు కులాలు, ప్రాంతాల మధ్య ఘర్షణగా మారకముందే.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుపై ఏపీ సీఎంకు లేఖ రాస్తానని హోంమంత్రి చెప్పినట్టు రాపోలు తెలిపారు.

12:32 - August 2, 2015

సాహిత్యం సామాజిక చైతన్యానికి వేదికవుతుంది. సామాజిక మార్పు కోసం ఎందరో సృజనకారులు తమ కలాలకు పదును పెడుతున్నారు. అలాంటి వారిలో డా.దేవరాజు మహారాజు ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా నిబద్దతతో కవిత్వం కథలు సాహితీ విమర్శలు, పాపులర్ సైన్స్ రచనలు చేస్తున్న ప్రముఖ రచయిత డా.దేవరాజ్ మహారాజుతో 10 టి.వి ప్రతినిధి, ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి ముఖాముఖి. ఈ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

జంతర్ మంతర్ వద్ద మాజీ సైనిక ఉద్యోగుల ధర్నా..

ఢిల్లీ : ఒన్ ర్యాంకు వన్ పెన్షన్ గురించి మాజీ సైనిక ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 

అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తదితరులున్నారు.

 

మహంకాళీ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు. 

భార్య పాతదైతే వదిలేస్తామా - వీహెచ్..

హైదరాబాద్ : శిథిలావస్థకు చేరితే చార్మినార్ ను అయినా కూల్చేస్తామన్న డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వీహెచ్ తనదైన శైలిలో స్పందించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చారిత్రక సంపద భవిష్యత్ తరాలకై కాపాడడం కర్తవ్యవమని, మరమ్మత్తులు చేయించాలే కానీ కూల్చరాదని వీహెచ్ సూచించారు. 

11:17 - August 2, 2015

హైదరాబాద్ : ఆషాడ జాతరగా పేరొందిన ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు మహా హారతి ఇచ్చిన తరువాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. రెండు రోజుల అంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర జరుగుతోంది. కానీ ప్రతి ఏటా ఎదురయ్యే సమస్యలు ఈసారి కూడా పునరావృతమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నారు..వెళుతున్నారు..తమను పట్టించుకోవడం లేదని విసుక్కుంటున్నారు. రెండు గంటలుగా క్యూ లైన్ లో నిలబడినా దర్శనం కలుగలేదని భక్తులు పేర్కొన్నారు.
ఎలాంటి ఇబ్బందులు లేవు - రసమయి..
బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నట్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రెండు లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, లైన్ లో కొద్దిగా సమయం పడుతోందన్నారు. వీఐపీలు దర్శించుకొనే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామన్నారు.
వర్షాలు కురవాలి - గీతారెడ్డి..
ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురవాలని తాను అమ్మవారిని కోరుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి తెలిపారు. 

రాజ్ నాథ్ తో ఎంపీ రాపోలు భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కాంగ్రెస్ ఎంపీ రాపోలు భేటీ అయ్యారు. నాగార్జున వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాపోలు కోరనున్నారు. 

10:57 - August 2, 2015

విశాఖపట్టణం : నలభై ఏళ్ల నాటి ఇందిరా జూలాజికల్ పార్కు తరలించడంపై ప్రజలు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. జూ ఎక్కడికి తరలించవద్దని నినాదాలు చేశారు. ఇతర చోటికి తరలించడం రాజ్యాంగం ప్రకారం నేరమని సీపీఎం నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో క్లబ్ ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందని, ప్రైవేటు కంపెనీలకు ధారదాత్తం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అసలు జూను ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని, వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవగాహన లేదని మంత్రి గంటా వ్యాఖ్యానిస్తున్నారని, ఎలాంటి అవాహన ఉందో ఆయే చెప్పాలన్నారు. కాలుష్యంలో విశాఖ ప్రథమ స్థానంలో ఉందని, వెంటనే ఈ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

మరోసారి పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోంది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. ఆర్ఎస్ పురా సెక్టార్ వద్ద కాట్ రంకా సైనిక శిబిరాలపై కాల్పులు జరిపింది. 

రూ.20కే కిలో ఉల్లిపాయలు..

అనంతపురం : ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైతు బజార్ లో రూ.20కే కిలో ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ఉల్లి ధర పెరగడంతో రూ.20కే ఉల్లిపాయలను విక్రయిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సునీత తెలిపారు. 

కరెంట్ షాక్ తో ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడు మృతి..

అనంతపురం : జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పంటపొలాల్లో విద్యుదాఘాతంతో జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు ఆనంద్ (30) మృతి చెందారు. 

09:48 - August 2, 2015

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహజంగానే ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని..పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళుతారని ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు. అలాగే బంగారు తెలంగాణ అనే నినాదం కొత్త స్వప్నాన్ని ఆచరిస్తోంది. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, విశ్వనగరంగా హైదరాబాద్ ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల ఎదుట కొత్త చిత్రపటం ఆవిష్కృతమౌతోంది. మరి ప్రజల ఆశలకనుగుణంగా పాలన ఎలా ఉంది ? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా నమూనాను తయారు చేసుకోవాలి ? ఎలాంటి పంథాను అనుసరించాలి ? అసమానతలు లేని అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి ? అనే అంశంపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విశ్లేషించారు. ఆ విశేషాలు వీడియోలో చూడండి.

శెట్టిపల్లి సిండికేట్ బ్యాంకులో చోరీకి యత్నం..

తిరుపతి : శెట్టిపల్లి సిండికేట్ బ్యాంకులో దుండగులు చోరికి యత్నించారు. షట్టర్ ధ్వంసం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. 

09:19 - August 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన లష్కర్ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నాలుగు గంటలకు తొలి బోనం, సాక సమర్పణతో జాతర మొదలైంది. ఉదయం నుండే భారీగా భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 12 లక్షల మంది భక్తులు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా మహంకాళి దర్శనానికి క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ క్యూ లైన్ లో చాలా సేపు నిలబడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 

గోదావరిఖనిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

కరీంనగర్ : గోదావరిఖనిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. బ్యాంకాక్ నుండి వచ్చిన దంపతుల నుండి కేజీన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అమ్మవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు, లక్ష్మణ్...

హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు దర్శించుకున్నారు. 

విశాఖలో సీపీఐ బస్సు యాత్ర..

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ బస్సు యాత్ర నిర్వహిస్తోంది. నేడు బస్సు యాత్ర విశాఖపట్టణంలో జరుగనుంది. 

నేడు తెలకపల్లి లక్ష్మమ్మ సంస్మరణ సభ..

కర్నూలు : నేడు తెలకపల్లి లక్ష్మమ్మ సంస్మరణ సభ జరుగనుంది. రావూరీ గార్డెన్స్ లో ఉదయం పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు పాల్గొననున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, ఎమ్మెల్సీ గేయానంద్ లు హాజరు కానున్నారు.

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..

కర్నూలు : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. 

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..

కర్నూలు : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్..19 మందిపై కేసులు..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లో శనివారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిది కార్లు, 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

తిరుమలలో భక్తుల పెరిగిన రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు నాలుగు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

07:12 - August 2, 2015

విజయవాడ : ప్రత్యేక హోదాపై ఆశలు సజీవంగా నిలిపే యత్నం.. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు అధినేత తలంటు.. ప్రభుత్వ పథకాల అమలుపై దిశా నిర్దేశం.. ఇదీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సాగిన తీరు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు అనూహ్య షాక్‌నిచ్చాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు నిర్వహించిన సర్వే నివేదికలు శాసనసభ్యులను కంగు తినేలా చేశాయి. సర్వే ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులనూ ప్రకటించిన చంద్రబాబు.. అలసత్వంగా వ్యవహరిస్తున్న వారికి సీరియస్‌ క్లాసు తీసుకున్నారు. పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
ప్రతి నెలా సర్వే..
సంక్షేమం, సేవలు, అభివృద్ధిపై ఇక ప్రతి నెలా సర్వే నిర్వహిస్తామని, వాటిని క్రోడీకరించి విశ్లేషణ చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జగన్‌ దీక్ష చేయనున్న అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రాభివృద్ధిని సహించలేని విపక్షనేత జగన్మోహనరెడ్డి.. ప్రభుత్వంపైనా, టీడీపీపైనా అక్కసు వెళ్లగక్కుతున్నాడని సమావేశం ఆక్షేపించింది.
మీ భూమి మీ ఇంటికి పథకం..
భూ సమస్యల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశమూ సమావేశం చర్చించింది. ఈనెల 8 నుంచి మీ భూమి మీ ఇంటికి పథకం ద్వారా రైతుల్లో భరోసా నింపాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. యూనివర్శిటీల్లో ర్యాగింగ్‌తో పాటు వర్శిటీ ఆవరణల్లో కుల సంఘాల కార్యాలయాల ఏర్పాటు, సమావేశాల నిర్వహణ అంశాలూ చర్చకు వచ్చాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. వర్శిటీల్లో అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని సూచించారు.

06:46 - August 2, 2015

హైదరాబాద్ : ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదన్నకేంద్ర మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇతర రాష్ట్రాల డిమాండ్లతో ఆంధ్ర ప్రదేశ్‌ను పోల్చరాదన్నారు. విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అసమగ్ర విభజన చేసి యూపీఏ సర్కారు ఏపీని నష్టాల్లోకి నెట్టిందన్నారు. అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి చేరే వరకూ కేంద్రం తమకు సహకరించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు కొత్త విజన్‌ - 2050..
2050 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్నామన్న చంద్రబాబు.. రాహుల్‌ రైతు యాత్రను ఎద్దేవా చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, గోదావరి పుష్కర భక్తుల మృతికి టీడీపీ సమావేశం సంతాపం ప్రకటించింది. 

06:45 - August 2, 2015

హైదరాబాద్ : ఉస్మానియా ధర్మాసుపత్రి చారిత్రక నిర్మాణాన్ని కాపాడేందుకు మేధావి లోకం గళమెత్తింది. శతాబ్ద కాలంగా హైదరాబాద్‌ కేంద్రంగా పేదల సంజీవనిలా ప్రాణాలు నిలబెడుతున్న ఉస్మానియా ధర్మాసుపత్రిని కాపాడాలని మేధావులు, ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు ముందుకొచ్చాయి. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా మారుతున్నాయని మేధావులు రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం సేవ్ ఉస్మానియా నినాదంతో మేధావులు, రాజకీయ,ప్రజా సంఘాలను ఒకే వేదికపై నిలిపింది.
1866లో ప్రారంభం..
సరిగ్గా వారం క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ ఉస్మానియాలో పర్యటించారు. ఆసుపత్రి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని వెంటనే కూల్చి దాని స్థానంలో టవర్ల నిర్మాణం చేస్తామని ఘనంగా ప్రకటించారు. వెంటనే వారం రోజుల్లోగా ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలోని రోగుల్ని తరలించి కూల్చివేత కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. మూసీనది తీరంలో 1866లో రెండుఅంతస్తుల భవనంలో ఈ దవాఖాన ప్రారంభమైంది. అనంతరం 1925 లో ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీలతో పాటు ఈ జనరల్‌ ఆసుపత్రి అభివృద్ధి చేస్తూ నూతన భవనాన్ని నిర్మించారు. పేదలకు ఉచిత వైద్యం అందించే దవాఖానాగా స్వతంత్రానికి ముందు, అనంతరం కూడా ఈ వైద్యశాలకు పేరుంది. ఇదిలా ఉంటే తెలంగాణ తొలి సీఎంగా అంతకన్నా మించి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియా ధర్మాసుపత్రి చరిత్ర మొత్తం కేసీఆర్‌కు తెలియని విషయం కాదు.

కానీ కేసీఆర్‌ గతంలో చెస్ట్‌ ఆసుపత్రి, ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో వివాదాస్పదం చేసినట్లుగానే జనరల్‌ ఆసుపత్రి విషయంలోనూ కొత్త వివాదాలకు తావిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలపై సామాన్యులతో సహా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
గుర్తింపు తెచ్చిన నిర్మాణాలు..
హైదరాబాద్‌కి చార్మినార్‌ చారిత్రక గుర్తింపు తెచ్చినట్టుగానే హైకోర్టు, ఓయు ఆర్ట్స్‌కాలేజీ, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ లాంటివి కూడా గుర్తింపు తెచ్చాయి‌. హైదరాబాద్‌ సాంస్కృతిక లక్షణాలకి ఇవి ప్రతి రూపాలు. వీటిని కూల్చాలని ఎలా భావిస్తారని విద్యావంతులు, మేధావులు, రాజకీయ పక్షాలు గళమెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేసీఆర్‌ నిర్ణయాన్ని తోసిపుచ్చాయి. చారిత్రక వారసత్వ సంపదగా నిలిచిన ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి కట్టడాన్ని రక్షించాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. చారిత్రక కట్టడాన్ని వదలి మిగతా ప్రాంతంలో కొత్త నిర్మాణాలను చేపట్టాలని సలహానిచ్చాయి.
నిర్మాణం కూల్చవద్దన్న కాంగ్రెస్..
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సైతం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. ఈ మేరకు ఉస్మానియా ఆసుపత్రి 10 ఎకరాల ఖాళీ స్థలంలో గత ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని పీసీసీ నేత భటివిక్రమార్క అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో హెరిటేజ్‌ నిర్మాణాన్ని కూల్చడానికి వీల్లేదని కాంగ్రెస్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. 

06:43 - August 2, 2015

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజాక్ మరో సారి అంతే కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారనే విమర్శల నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టనుంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంబించిన రాబోయే రోజుల్లో ఇక ప్రజల పక్షాన నిలిచేందుకు రెడీ అవుతోంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పటి వరకు సయోధ్యగా వ్యవహరించిన జాక్ ఇక సర్కారు నిర్ణయాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రజాపక్షం వహించాలనే నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ఆకాంక్షల సాధన కోసం కేసీఆర్ సర్కారుతో ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అంటోంది. తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నుంచి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
భవిష్యత్ కార్యాచరణ..
వివిధ జిల్లాలు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి వచ్చిన సూచనలతో టీజాక్ తన వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన సంపూర్ణంగా జరుగలేదనే అభిప్రాయాన్ని సమావేశంలో అన్ని సంఘాలు వ్యక్తం చేశాయి. ప్రధానంగా హైకోర్టు విభజన కాకపోవడంతో సమస్యలు జఠిలం అవుతున్నాయని అభిప్రాయపడింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల విషయంలో కూడా ఇంకా స్పష్టత రాకపోవడం రాష్ట్ర వికాసానికి అవరోధాలు సృష్టిస్తోందనే భావిస్తోంది. విభజన తర్వాత టీజాక్ వ్యవహరిస్తున్న తీరుపై సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది జాక్ . విభజన ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈ నెల 6వ తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ రూపొందించనుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రిని ఏర్పాటు చేసి విభజన ప్రక్రియను త్వరగాపూర్తి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్ణయాలపై పెద్దగా స్పందించకపోయినా భవిష్యత్తులో అలా ఉండేది లేదని స్పష్టం చేశారు.
3న ఉస్మానియా సందర్శన..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై త్వరలో సాగునీటి రంగ నిపుణులతో సమావేశం కావాలని టీజాక్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విభజన విషయంలోనూ కమల్ నాథన్ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనెల 3న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించాలని తీర్మానించింది. మొత్తానికి ఇక ముందు సరికొత్త జేఏసీని జనం చూస్తారన్న భావన వ్యక్తమవుతోంది. 

06:41 - August 2, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంతో తెలంగాణలో టీడీపీని ఇరుకు పెట్టామనే ధీమా గులాబీ నేతల్లో కనిపించింది. సరిగ్గా ఈ వ్యవహారం వెలుగు చేసిన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ పై పెద్దగా చర్చకు రాలేదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం గులాబీ పార్టీని కూడా ఇరుకున పెట్టే అవకాశాలున్నాయనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ట్యాపింగ్‌ ఎటు వైపు దారి తీస్తుందో అని అనుమానాలు..
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుతోనే తాము ఫోన్‌ ట్యాపింగ్‌ కాకుండా సెల్‌ఫోన్‌ ద్వారానే ఆధారాలు సేకరించామని టీఎస్‌ సర్కారు వాదిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ విభాగాన్ని ఏర్పాటు చేసి ట్యాపింగ్‌ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఇంకా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారం కూడా కోర్టు కెక్కడంతో సర్వీస్‌ ప్రొవైడర్లు తమ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టులకు సమర్పిస్తున్నారు. కాల్‌ డేటా సహా ఇతర అంశాలన్నీ హైకోర్టుకు కూడా వెళ్లనున్నాయి. ఈ పరిస్థితులు ఎటు వైపు దారి తీస్తాయో అన్న అనుమానాలు అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారి తీసే ప్రమాదం..
ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా ? లేదా ? అనేది ఇప్పటికీ స్పష్టంగా తేలకపోయినా గులాబీ నేతల్లో మాత్రం ఆందోళన మొదలైంది. కాల్‌డేటాతో టీడీపీ నేతలతో ఎంత మంది టీఆర్ఎస్‌ శాసన సభ్యులు టచ్‌లో ఉన్నారన్న సంఖ్య తేటతెల్లం కానుంది. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందనే అనుమానాలు నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 30 మంది శాసన సభ్యులతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారనే ప్రాథమిక ఆధారాలు కూడా అధికార పార్టీకి అందినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల బండారం బయటపడితే, అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పటి గులాబీ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ట్యాపింగ్‌ వ్యవహారంపై తర్జన భర్జన పడుతున్న టీఆర్‌ఎస్‌ ఈ ఇష్యూని ఎలా డీల్‌ చేస్తుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది.  

06:40 - August 2, 2015

హైదరాబాద్ : ఏపి సిఎం చంద్రబాబు చేయించిన స‌ర్వే ఫలితాలు ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్ళు ప‌రిగెత్తిస్తున్నాయి. ఎక్కడ అధినేత చేత చీవాట్లు తినాల్సి వస్తుందేమోననే టెన్షన్ నేత‌ల‌కు ప‌ట్టుకుంది. ప్రభుత్వ పధ‌కాల‌పై, ఎమ్మెల్యేల ప‌నితీరు పై చంద్రబాబు చేయించిన స‌ర్వే ఇప్పుడు హ‌ట్ టాపిక్‌ గా మారింది. ఈ స‌ర్వేలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఎమ్మెల్యేల ప‌నితీరుపై చేయించిన సర్వే సైతం ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి వ‌చ్చి సంవ‌త్సర కాలం పూర్తయింది. ఈ సంవ‌త్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాల‌ను ప్రారంభించింది చంద్రబాబు సర్కారు. అయితే ఆ సంక్షేమ కార్యక్రమాల అమ‌లు తీరు ఎలా ఉంది అనే దానిపై ఇటివ‌ల కాలంలో చంద్రబాబు స‌ర్వే చేయించుకున్నారు. ఆ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వెల్లడ‌య్యాయి. ముఖ్యంగా పెన్షన్ ప‌ధ‌కంపై చేయించిన స‌ర్వేలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 76శాతం మంది ప్రజ‌లు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజాపంపిణి వ్యవ‌స్థపై జ‌రిగిన స‌ర్వేలో 79 శాతం మంది ప్రజ‌లు సంతృప్తి వ్యక్తం చేశారు. జ‌న్మభూమి కార్యక్రమంపై 38శాతం మంది ప్రజ‌లు ఓకే చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న రైతు రుణ‌మాఫీపై కేవ‌లం 28.65 శాతం మంది ప్రజ‌లు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు స‌ర్వేలో వెల్లడ‌యింది.
ఇసుక విధానంపై ..
ఇసుక విధానంపై కేవ‌లం 25.48 శాతం ప్రజ‌లు బాగుంద‌ని స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌ర్వేలో తెలిసింది. ఎన్టీఆర్ వైద్యసేవపై రాష్ట్రవ్యాప్తంగా 38.38శాతం ప్రజ‌లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ పై 27శాతం సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పనిలో పనిగా ఎమ్మెల్యేల ప‌నితీరుపై కూడా బాబు స‌ర్వే చేయించారు. ప్రజాప్రతినిధుల ప‌నితీరుపై కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. ఈ స‌ర్వేలో ఎమ్మెల్యేల ప‌నితీరు కేవ‌లం 33 శాతం మంది ఎమ్మెల్యేల ప‌నితీరు మాత్రమే బాగుంద‌ని స‌ర్వేలో వెల్లడ‌యింది.
మ‌రొక ఆరు నెల‌ల్లో మ‌రో స‌ర్వే..
విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో బాబు ఎమ్మెల్యేల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రభుత్వ ప‌థకాల‌కు కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తున్నా ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళలేక‌పోతున్నార‌ని బాబు అన్నట్లు తెలిసింది. ఇక‌నైనా ఎమ్మెల్యేలు ప‌నితీరు మార్చుకోవాల‌ని బాబు సూచించినట్లు సమాచారం. మ‌రొక ఆరు నెల‌ల్లో మ‌రో స‌ర్వే నిర్వహిస్తామ‌ని, అప్పటికి ప‌నితీరు మెరుగు ప‌రుచుకోక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల విష‌యంలో పున‌రాలోంచించుకోవాల్సి వ‌స్తుంద‌ని సున్నితంగా బాబు హెచ్చరించారు.
మంత్రుల ప‌నితీరుపై కూడా బాబు స‌ర్వే..
ఇక మొద‌టిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి హిందుపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ ప‌నితీరు మెరుగ్గా ఉంద‌ని స‌ర్వేలో వెల్లడ‌యిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే మంత్రుల ప‌నితీరుపై కూడా బాబు స‌ర్వేచేయించారు.90శాతం మంత్రులు ఇంకా త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు సాధించ‌లేద‌ని వారి ప‌నితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంద‌ని స‌ర్వే రిపోర్టులో తేలింది. మంత్రులు కూడా ప‌నితీరు మెరుగుప‌రుచుకోక‌పోతే ఉద్వాస‌న త‌ప్పద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ స‌ర్వే రిపోర్టుల‌ని ఎమ్మెల్యేలంద‌రికి పార్టీ కార్యాల‌యం వారికి చేర‌వేసింది. చంద్రబాబు చేయిస్తున్న స‌ర్వేల రూపురేఖ‌ల్ని కూడా కొంత‌మంది అధికారులు తారుమారు చేస్తున్నట్లు స‌మాచారం. చంద్రబాబుకి అత్యంత స‌న్నిహితంగా ఉండే ఒక ప్రత్యేక అధికారి స‌ర్వే రిపోర్టుల‌ని ఆల్ ఇజ్ వెల్ అనే భ్రమ క‌ల్పిస్తున్నట్లు స‌మాచారం.

06:39 - August 2, 2015

హైదరాబాద్ : పోతురాజు.. ఓ ప్రత్యేకత. బోనాల జాతరలో మహాద్భుత ఘట్టం. ఉత్సవ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు. వారు కొరడా చేతబూని ఊరేగింపులో చేసే హంగామా ఓ స్పెషల్ అట్రాక్షన్. ఎక్కడ బోనాలు జరిగినా పోతురాజులు ఉండాల్సిందే. ఏడుగురు అమ్మవార్లకు ఏకైక తమ్ముడిగా భక్తులు పిలుచుకునే పోతురాజుపై కథనం. గ్రామదేవతల సోదరుడిగా పూజలు అందుకునే పోతురాజు తరతరాల నుంచి పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్తులకు రక్షకుడిగా కొలవబడుతున్నాడు. అందుకే పాడు ఊరికి మంచపుకోడు అని భక్తుల నోట ప్రసిద్ధికెక్కాడు. స్పుర ద్రూపిగా.. బలిశాలిగా ఒంటిపై పసుపు.. నుదుటిపై కుంకుమ.. చిన్న ఎర్రని ధోతీ.. కాలికి గజ్జెలు కలిగి డప్పు వాయిద్యానికి అనుగుణంగా చిందులేసే పోతురాజు.. అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో భక్త సమూహంలో లయబద్ధంగా నర్తిస్తాడు.
పోతురాజుకు చరిత్ర..
వేపాకులను నడుముకు చుట్టుకుని కొరడాతో బాదుకొంటూ అమ్మవారి పూనకములో ఉండి భవిష్యవాణి వినిపించే భక్తురాలిని వీధుల వెంబడి వేలాది మంది ప్రజల సమూహంలో ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు పోతురాజు. పురాణాల నుంచి వస్తున్న ఈ ఆచారంలో విశిష్టత కలిగిన పోతురాజుకు ఘనమైన చరిత్ర ఉందని ముందు తరాల వారు చెప్తుంటారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ముత్యాలమ్మ, మహాంకాళి, ఆంకాళమ్మ, పోలేరమ్మలకు పోతురాజు ఒక్కేడే సోదరుడు. ఏడుగురు అక్కచెల్లెల్లకు తోడునీడగా ఉండటమే కాకుండా వారికి సేవలు చేస్తూ ఉండేవాడంట పోతురాజు. చరిత్రలో కథలు ఎలా ఉన్నా.. అమ్మవార్లకు బోనాలు సమర్పించినపుడు పోతురాజును కూడా ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక అప్పటి నుంచి ఉత్సవాలు జరిగే ప్రతిసారి ఆయా దేవస్థాన కమిటీలు పోతురాజును ఆహ్వానం పలుకుతారు.
నియమనిష్టలతో పూజలు..
అయితే.. వందలాది మంది పోతురాజులు బోనాల జాతరలో కనిపించినా వంశపారంపర్య పోతురాజులు మాత్రం కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉంటారు. పోతురాజుగా వ్యవహరించే వ్యక్తి ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాడు. బోనాలు ప్రారంభానికి ముందు తొమ్మిది రోజుల నుంచే ఎంతో నియమనిష్టలతో ఉంటాడు. తెల్లవారు జామున లేవడం, ఉపవాస దీక్షలు చేపట్టడం దినచర్యగా మారుతుంది. అంతేకాదు.. మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక కసరత్తును పోతురాజు ఆరంభిస్తాడు. ప్రధాన పోతురాజులకు తోడు ప్రతి ఆలయం పరిధిలో పది నుంచి 20 మంది పోతురాజులు విన్యాసాలు చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పోతురాజు అందుకే.. బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. 

06:28 - August 2, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తెల్లవారుజామునుండే బారులు తీరారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది.                                                                       
రెండు రోజుల పాటు బోనాలు..
సంప్రదాయబద్దంగా రెండు రోజులపాటు బోనాల సమర్పణ నిర్వహించే శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఆదివారం ఉదయం 4 గంటలకు తొలి బోనం, సాక సమర్పణతో జాతర మొదలవుతుంది. లష్కర్ బోనాల్లో ఉజ్జయినీ ఆలయంతోపాటు సికింద్రాబాద్‌లోని వివిధ వీధుల్లో ఉన్న వందకు పైగా ఆలయాల్లో సమాంతరంగా బోనాలు సమర్పణ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. బోనాల జాతరకు సికింద్రాబాద్ వీధులన్నీ విద్యుద్దీపాలంకరణతో సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో జరిగే బోనాలకు రాష్ట్రంనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయంలో దేవాదాయశాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో బోనాల జాతర విజయవంతానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 

06:16 - August 2, 2015

హైదరాబాద్ : శత్రువుల నుండి దేశాన్ని రక్షించాల్సిన ఓ జవాన్ కామాంధుడి అవతారం ఎత్తాడు. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు ఆ జవాన్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. కానీ ఆ జవాన్ ను ఆర్మీ అధికారులు దాచినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి పది గంటల సమయంలో ఆర్కేపురంలో నివాసం ఉంటున్న ఓ బాలిక మెడికల్ షాప్ లో మందులు కొనుక్కొనే నిమిత్తం వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ జవాన్ బాలికను ప్రశ్నించాడు. నిషిద్ధ ప్రాంతమని..ఐడీ కార్డు ఉందా అంటూ దబాయించాడు. తన దగ్గర లేదని బాలిక చెప్పడంతో నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు. అనంతరం అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. బాలిక ప్రతిఘటించడంతో జవాన్ ముష్టిఘాతాలు కురిపించాడు. కడుపులో..ముఖంపై ఇష్టమొచ్చినట్లుగా పిడిగుద్దులు కురిపించాడు. బాధ భరించలేని బాలిక కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆ జవాన్ బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జవాన్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర జవాన్లు అక్కడకు చేరుకుని స్థానికులపై దాడికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు స్థానికులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. బాలికను వెంటపట్టుకుని తిరుమలగిరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అత్యాచారయత్నానికి పాల్పడిన ఆ జవాన్ ను ఇతర ఆర్మీ అధికారులు కాపాడినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ, కోస్తాకు వర్ష సూచన..

హైదరాబాద్ : బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శనివారం పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగానే ప్రయాణిస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశా నుండి కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు కోస్తా, తెలంగాణల్లో పలు చోట్ల రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. 

బాలికపై ఆర్మీ జవాన్ అత్యాచారయత్నం..

హైదరాబాద్ : తిరుమలగిరిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఆర్మీ జవాన్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు జవాన్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కానీ జవాన్ ను ఆర్మీ అధికారులు అజ్ఞాతంలోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ప్రొ.కబడ్డీ లీగ్ లో నేడు..

పుణెరి పల్టాన్ జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఢీకొననుంది. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పట్నా పైరేట్స్ జట్టుతో బెంగాల్ వారియర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 9గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది.

ఉజ్జయని మహంకాళి బోనాలు ప్రారంభం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. 

Don't Miss