Activities calendar

03 August 2015

జీఎంఆర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి భారీ శబ్ధాలు...

తూ.గో: వేమనగిరిలోని జీఎంఆర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి భారీ శబ్ధాలు వెలువడుతున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 

సెజ్ బాధిత రైతులతో జీఎంఆర్ చర్చలు

కాకినాడ: సెజ్ బాధిత రైతులతో కలెక్టరేట్ జేసీ ఆధ్వర్యంలో జీఎంఆర్ యాజమాన్యం చర్చలు జరిపింది. గతంలో అమ్మేసిన భూములకు అదనంగా రూ.2 లక్షలు... అవార్డు పాసైన భూములకు రూ. 9 లక్షలు ఇచ్చేందుకు సంస్థ యాజమాన్యం అంగీకరించింది. అయితే జీఎంఆర్ ప్రతిపాదనను రైతులు అంగీకరించలేదు. కోర్టుకు వెళ్తామని సెజ్ పోరాట సమితి ప్రకటించింది.

 

21:57 - August 3, 2015

ఢిల్లీ: లోక్‌సభ్‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కన్నెర్ర చేశారు. సభకు అంతరాయం కలిగిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని పార్లమెంట్‌ చరిత్రలో బ్లాక్‌డేగా సోనియాగాంధీ అభివర్ణించారు. మోడి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా సభను బాయ్‌కాట్‌ చేయాలని ప్రతిపక్షపార్టీలు నిర్ణయించాయి. లలిత్‌గేట్‌కు సంబంధించి సుష్మాస్వరాజ్, వసుంధరాలు రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.
సభ సజావుగా సాగడం లేదు...
వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా సభ సజావుగా సాగడం లేదు. లలిత్‌మోది అంశంలో సహకరించిన మంత్రులను తొలగించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే చర్చకు సహకరిస్తామని, అంతవరకు సభ సజావుగా జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి.
దద్దరిల్లుతోన్న లోక్‌సభ
లలిత్‌గేట్‌, వ్యాపం స్కాం అంశాలతో లోక్‌సభ దద్దరిల్లుతోంది. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. తీవ్ర గందరగోళం మధ్యనే స్పీకర్‌ సభలో ప్రశ్నోత్తరాలను చేపడుతున్నారు. ప్లకార్డులు పట్టుకోవడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమని, తమ స్థానాల్లో కూర్చోవాలంటూ స్పీకర్‌ ప్రతిపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు ఏమాత్రం శాంతించడం లేదు. దీంతో 25 మంది కాంగ్రెస్‌ సభ్యులను ఐదురోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రకటించారు.
చరిత్రలో బ్లాక్‌డే
తమ పార్టీ ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. మరోవైపు స్పీకర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభను 5 రోజుల పాటు బైకాట్ చేయాలని ఆప్‌, టిఎంసి నిర్ణయించాయి.
రాజ్యసభలోనూ సేమ్‌ సీన్
రాజ్యసభలోనూ సేమ్‌ సీన్ రిపీట్‌ అయింది. లలిత్‌ మోదీ వీసా కోసం తాను బ్రిటన్ సర్కారుకు ఎలాంటి సిఫార్సులు చేయలేదని... విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సభ్యుల గందరగోళం మధ్య ప్రకటించారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు.
సుష్మా ప్రకటనపై విపక్షాలు అభ్యంతరం
సుష్మా ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండా, డిప్యూటి ఛైర్మన్‌ అనుమతి లేకుండా ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా సుష్మా ఎలా మాట్లాడతారని అధికారపార్టీని నిలదీశాయి. తాము ఎలాంటి రూల్స్ అతిక్రమించలేదని, రెండు వారాలుగా సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ విపక్షాలపై మండిపడ్డారు.
ఫలితమివ్వని అఖిలపక్షం
పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. తాజాగా ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమావేశం ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. మోది ప్రభుత్వం మాత్రం మంత్రులను తొలగించే ప్రసక్తే లేదని చెబుతోంది.

 

21:48 - August 3, 2015

ఢిల్లీ: 2013లో యుపిఎ సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు విషయంలో... మోదీ సర్కారు వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రతిపాదించిన సవరణలు... వెనక్కు తోసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
భూసేకరణ బిల్లులో సవరణలకు నిర్ణయం
త్వరితగతిన అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు రావాలంటే... యుపిఎ సర్కారు తెచ్చిన భూ సేకరణ చట్టంలో... సవరణలు చేయాలని... ప్రస్తుతం ఎన్డీఏ సర్కారు నిర్ణయించింది. భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు... ముఖ్యమైన అంశాల్లో సవరణలు ప్రతిపాదించారు. డిఫెన్స్, ఇండస్ట్రియల్ కారిడార్‌ సహా ఐదు కేటగిరీలకు ఇందులో మినహాయింపు ఇచ్చారు.
రాజ్యసభలో వీగిపోయిన సవరణల బిల్లు
సవరణలతో కూడిన భూ సేకరణ బిల్లు... మార్చి నెలలోనే లోక్‌సభ ఆమోదం పొందింది. ఐతే రాజ్యసభలో మాత్రం వీగిపోయింది. ఐతే బిల్లు విషయంలో మొండిగా ముందుకే వెళ్లాలని భావించిన సర్కారు... ప్రత్యేక ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఐతే ఆర్డినెన్స్‌లు శాస్వత పరిష్కారం కాదు. పార్లమెంట్‌ ద్వారా చట్టబద్దత అత్యవసరం. ఇక బిల్లుపై ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ కీలక ప్రకటన చేశారు. ఈ నెలలోనే బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందని... అమలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తామని ప్రకటించారు.
ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు
లలిత్ గేట్‌, వ్యాపంకుంభకోణంలో... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి రాజీనామాల కోసం.. ప్రతిపక్షాలు పట్టుబడుతూ... పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుండటంతో... అధికార పార్టీ వ్యూహాత్మకంగా ల్యాండ్ బిల్లు తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సవరణలు లేకుండా తెచ్చి... ప్రతిపక్షాలను సంతృప్తి పరిచేందుకు అధికార పక్షం ప్లాన్‌చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

 

21:43 - August 3, 2015

వివాదాలే అయన నినాదాలు... వివాదాలే ఆయన వ్యూహాలు... వివాదాలే ఆయన అస్త్రాలు..వివాదాలే ఎజెండాలు.. మొన్న చెస్టు ఆస్పత్రి... నిన్న ఓయూ భూములు... ఇప్పుడు ఉస్మానియా కట్టడాలు...వరుస వివాదాలన్ని అంతిమంగా ఎటూ తేలవు. ఏ వ్యూహంతో సీఎం కదులుతున్నాడు.. ఎందుకీ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు...ఈరోజు వైడ్ యాగింల్ ప్రత్యేక కథనం. ఆ... వివరాలను వీడియోలో చూద్దాం...


 

గృహనిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: గృహనిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూముల క్రమబద్ధీకరణ ద్వాఆరా వచ్చిన డబ్బులను పేదల గృహ నిర్మాణాలకు ఉపయోగిస్తామని చెప్పారు.

 

ఎపిలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల వేతనాలు పెంపు

హైదరాబాద్: ఎపిలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. పదేళ్ల సీనియారిటీ ఉన్న అధ్యాపకులకు రూ.75 వేలు, ఐదు నుంచి పదేళ్ల మధ్య సీనియారిటీ ఉన్నవారికి రూ.65 వేలు, ఐదేళ్ల కంటే తక్కువ సీనియారిటీ ఉన్నవారికి రూ. 60 వేలకు పెంచారు. ఇతర టీచర్లు, మెంటర్ల జీతాలు 33 శాతం పెంచారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు.

20:56 - August 3, 2015

అలసిన శరీరానికి చక్కటి నిద్ర అవసరం. చక్కటి నిద్రకు సౌకర్యవంతమైన బెడ్, బెడ్ కవర్స్ అంతే అవసరం. అలాంటి బెడ్ కవర్స్ ను మీకు పరిచయం చేస్తోంది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:54 - August 3, 2015

దేశ అభివృద్ధి, సమాజ మనుగడ, జీవిత స్థితిగతులు, నాణ్యతా ప్రమాణాలను అక్కడి ప్రజల విద్యార్హతలు నిర్ణయిస్తాయి. మానవ అభివృద్ధి సూచికలోనూ విద్యది ప్రధాన పాత్ర. మరి అంతటి ప్రాధాన్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంటోందా? అందరికీ చదువుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉంటున్నాయా? ముఖ్యంగా ఆడపిల్లల చదువుల కోసం చేయూతనందించే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతోందా?
చదువుల వెలుగులు నింపుతున్న సంస్థ
ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సహకరించని స్థితిలో మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. కుటుంబ భారాన్ని మోసేందుకు పనికి వెళ్తున్నారు. కనీస వసతులు కరువైన సందర్భంలో అత్తెసరు మార్కులతో చక్కబెట్టుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఒక దారి చూపుతూ ఎంతో మంది జీవితాలలో చదువుల వెలుగులు నింపుతున్న సంస్థ కథనంతో ఇవాళ్టి స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
ఉన్నత చదువులే చక్కటి భవిష్యత్ కు మార్గం
ఉన్నత చదువులే చక్కటి భవిష్యత్ కు మార్గం అని నమ్మిన సంస్థ ఎంతో మంది విద్యార్థులకు చదువుకోవటానికి అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. వారికి ఉన్నత లక్ష్యాలను చేరువ చేస్తోంది. పోటీ ప్రపంచంలో గెలుపు మార్గాన్ని వారికి చేరువ చేస్తోంది. బంగారు భవిష్యత్ ను వారికందిస్తున్న శ్రీ పోతుకూరి సోమసుందర శాస్త్రి ట్రస్ట్ సేవలు మరెంతో మంది విద్యార్థులకు చేరాలని మానవి ఆశిస్తోంది.


 

20:46 - August 3, 2015

హైదరాబాద్: కృష్ణా రివర్ బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో ఖరీఫ్ కు నీరు ఇవ్వలేమని వర్కింగ్ కమిటీ తేల్చి చెప్పింది. జలాశయాల్లో నీరు తాగడానికే చాలదని బోర్డు నిర్ధారించింది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించింది. ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు తాగునీటికి వాడుకోవాలని సూచించింది. కాగా 45 ఏళ్లలో శ్రీశైలానికి చుక్క నీరు రాకపోవడం ఇదే తొలిసారి.

 

ముగిసిన కృష్ణా రివర్ బోర్డు వర్కింగ్ కమిటీ భేటీ..

హైదరాబాద్: కృష్ణా రివర్ బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో ఖరీఫ్ కు నీరు ఇవ్వలేమని వర్కింగ్ కమిటీ తేల్చి చెప్పింది. జలాశయాల్లో నీరు తాగడానికే చాలదని బోర్డు నిర్ధారించింది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించింది. ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు తాగునీటికి వాడుకోవాలని సూచించింది. కాగా 45 ఏళ్లలో శ్రీశైలానికి చుక్క నీరు రాకపోవడం ఇదే తొలిసారి.

20:32 - August 3, 2015

తమిళనాడు: యూనిలివర్ సంస్థ కొడైకెనాల్ లో సృష్టిస్తున్న కాలుష్యానికి నిరసనగా ఓ పాట ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది.. తమిళనాడుకు చెందిన సోషియా పాడిన ఈ ర్యాప్ పాట విశేష అదరణ పొందుతోంది.. మూడురోజుల్లోనే దాదాపు ఏడున్నరలక్షలమంది ఈ వీడియో చూశారు.. నీక్కీ మినజ్ రెస్క్యూ పాటకు పేరడీగా ఈ పాట చేసింది సోషియా... ఈ వీడియో చూసిన నిక్కీ వావ్ అంటూ ట్వీట్ చేశారు.. కొడైకెనాల్లో కంపెనీల వ్యర్థాలతో పరిసరాలు, పొలాలన్నీ కలుషితమైపోతున్నాయని... సోషల్ రెస్పాన్సిబులిటీకింద ఆయా సంస్థలే క్లీన్ చేయాలని ఈ ర్యాప్ సింగర్ పాటలో కోరారు.

20:27 - August 3, 2015

ఢిల్లీ: రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావాల్సిందేనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టిసీమ సమయానికి అవుతుందో లేదో తెలియదన్నారు. వాతావరణం అనుకూలిస్తేనే పట్టిసీమ నుంచి నీళ్లొస్తాయని చెప్పారు. పట్టిసీమొస్తే అంతా అయిపోతుందనుకోవద్దని పేర్కొన్నారు.

 

20:23 - August 3, 2015

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచన కేంద్రానికి లేదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు చల్లాయని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు.

20:09 - August 3, 2015

హైదరాబాద్‌: లక్డీకాపూల్‌లోని సింగరేణిభవన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం తెలియలేదు. అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బందిని ప్రమాదం బారిన పడకుండా తప్పించారు.

 

20:07 - August 3, 2015

అనంతపురం: ప్రజలు కేంద్రంతో పోరాటం చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని మాజీ మంత్రి టీ.జీ వెంకటేష్‌ అన్నారు. బీజేపీతో కయ్యం పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని సెలవిచ్చారు. కేంద్రంతో పోరాటం చేసి.. ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీల కోసం ప్రజలు ఉద్యమించాలని కోరారు. పోరాటాల ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు.

 

20:02 - August 3, 2015

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. విశాఖలోని ఏయూ వైవిఎస్ మూర్తి ఆటోరియంలో ర్యాగింగ్ వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గంటా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ర్యాగింగ్ పై సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే ఉన్నత విద్యకు అవకాశాలు ఉండవని హెచ్చరించారు. రిషితేశ్వరి ఘటన తర్వాత ప్రభుత్వం ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. త్వరలోనే అన్ని విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

 

19:57 - August 3, 2015

పశ్చిమగోదావరి: ఏపీలో అధికార పార్టీ నాయకుల నిర్వాహకం ఓ వికలాంగుడి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. గతంలో వచ్చిన పెన్షన్‌ను రద్దు చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దోరసానిపాడు గ్రామానికి చెందిన నాగరాజు.. పుట్టుకతోనే వికలాంగుడు. 10వ తరగతి వరకు చదువుకున్న నాగరాజు.. గ్రామంలోనే సైకిల్‌ రిపేరింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. అయితే 100 శాతం వికలాండుగైన నాగరాజుకు కాంగ్రెస్‌ హయాంలో 500 రూపాయల పింఛన్ ఇచ్చే వారు. అయితే గత ఎన్నికల్లో నాగరాజు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక టీడీపీ నాయకులు నాగరాజుకు పెన్షన్‌ రద్దు చేశారు. దీంతో ఖంగుతిన్న నాగరాజు అధికారుల చుట్టు ఎన్నో సార్లు తిరిగాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు, రాజకీయ నాయకుల తీరుతో విసుగుపోయిన నాగరాజు ద్వారకా తిరుమల బస్టాండులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార పార్టీ నాయకుల తీరువల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

 

19:50 - August 3, 2015

హైదరాబాద్: లిబియాలో ఇద్దరు భారతీయులను కిడ్నాప్‌ చేసిన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు వారిని ఇంకా విడిచిపెట్టలేదు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపికృష్ణ రాక కోసం హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని వారంతా కోరుకుంటున్నారు. ఆరు రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడంతో గోపికృష్ణ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గోపికృష్ణను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది. 

19:45 - August 3, 2015

అనంతపురం: ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్సై యువరాజ్ తోపాటు ముగ్గురు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాల్ రాజ్ అనే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కనేకల్ మండలం ఆదిగారిపల్లె వద్ద చోటుచేసుకుంది. 

స్పీకర్ కోడెల కాన్వాయ్ లో ప్రమాదం

అనంతపురం: ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్సై యువరాజ్ తోపాటు ముగ్గురు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. వీరిలో బాల్ రాజ్ అనే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కనేకల్ మండలం ఆదిగారిపల్లె వద్ద చోటుచేసుకుంది. 

19:22 - August 3, 2015

ఢిల్లీ: భారత ప్రభుత్వం, నాగా తిరుగుబాటుదారుల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఎన్ ఎస్ సీఎన్(ఐఎం)-కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఐజాక్ మొయువా, భారత ప్రతినిధుల సంతకాలు చేశారు. ఎన్ ఎస్ సీఎన్(ఐఎం)తో సుదీర్ఘకాలంపాటు భారత ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో నాగా తిరుగుబాటుదారులతో చార్రితక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నాగాలాండ్ లో ఆరు దశాబ్ధాలుగా కొనసాగుత్ను రాజకీయ అనిశ్చితిని తొలగించే ప్రయత్నం ప్రారంభమైందన్నారు. నాగాలాండ్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు.

 

మా చిత్తశుద్ధిని ప్రశ్నించొద్దు..

ఢిల్లీ: లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేకహోదాపై మాట్లాడుకున్నాం.. కానీ కాంగ్రెస్ ఎంపీలు సభను అడ్డుకున్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. 'ప్రత్యేకహోదాపై మా చిత్తశుద్ధిని ప్రశ్నించవద్దు' అని అన్నారు.

 

ఎన్ ఎస్ సీఎన్(ఐఎం)-కేంద్రం మధ్య శాంతి ఒప్పందం...

ఢిల్లీ: ఎన్ ఎస్ సీఎన్(ఐఎం)-కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వం, నాగా తిరుగుబాటుదారుల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఐజాక్ మొయువా, భారత ప్రతినిధుల సంతకాలు చేశారు. ఎన్ ఎస్ సీఎన్(ఐఎం)తో సుదీర్ఘకాలంపాటు భారత ప్రభుత్వం చర్చలు జరిపింది.

 

ఉద్యోగ బదిలీల జీవోను సవరిస్తాం:యనమల

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీల జీవోను సవరిస్తామని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన ఎపి ఉద్యోగులకు త్వరలో పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించాక హెచ్ ఆర్ ఎపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తొలి త్రైమాసికం ముగిసే సరికి రూ.3 వేల కోట్ల లోటు ఉందన్నారు.

 

17:50 - August 3, 2015

హైదరాబాద్: రోజులు గడిచిపోయాయి.. నెలలు గడిచిపోతున్నాయి. కాని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు తెరపడలేదు. జీహెచ్‌ఎంసీలో పరిష్కారం చూపించి.. జిల్లాలవారికి మాత్రం ప్రభుత్వం మొండిచేయి చూపించింది. పట్టు వీడకుండా సమ్మెలో కొనసాగుతున్న మున్సిపల్‌కార్మికులు ఛలో హైదరాబాద్‌కు సిద్ధమయ్యారు. 9 జిల్లాల నుంచి రేపు హైదరాబాద్‌కు కార్మికులు తరలిరానున్నారు. ప్రభుత్వాన్ని తమ వేతనాల విషయమై నిలదీయనున్నారు. 

17:48 - August 3, 2015

హైదరాబాద్: ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు వేగం పెంచారు. ఇప్పటికే ఒకసారి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణపై సమీక్ష జరిపిన మంత్రి.. నేడు వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రెండు నెలల్లో భూసేకరణ మొత్తం పూర్తి చేయాలని.. ఇందుకు ఆటంకంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి హరీష్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

17:45 - August 3, 2015

హైదరాబాద్: అవినీతి జరిగిందనే పేరుతో మొత్తం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఆపేయడం సరి కాదని టిపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పులు జరిగిన చోట చర్యలు తీసుకోవాల్సిందేనని.. కాని లక్షలాది మంది అర్హులకు కూడా చెల్లింపులు నిలిపివేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. దీనికి నిరసనగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు తమ పార్టీ పిలుపు ఇచ్చిందని తెలియచేశారు.

17:41 - August 3, 2015

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులతో తెలంగాణ జెఎసి నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారంతా భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. వైద్య సేవలు మెరుగుపర్చాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ఆస్పత్రికి సమీపంలోనే కొత్త భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని డాక్లర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ కట్టడాన్ని సంరక్షించాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి తరలింపు నేపథ్యంలో తెలంగాణ జెఎసి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత విషయంలో లోతుగా అధ్యయనం చేస్తామని డాక్టర్లుకు చెప్పారు. 3 రోజుల్లో మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తామన్నారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే జెఎసి ఒక నిర్ణయం తీసుకుంటుందని కోదండరాం స్పష్టం చేశారు.
డాక్టర్ల మధ్య గందరగోళం
ఉస్మానియా వైద్యులతో తెలంగాణ జెఎసి నాయకులు భేటీ అయ్యి.. అభిప్రాయాలు తెలుసుకుంటుండగా.. సమావేశంలో డాక్టర్ల మధ్య కొంత గందరగోళం నెలకొంది. ఆస్పత్రి విశిష్టితను జేఏసీ నాయకులకు డాక్టర్లు వివరిస్తుండగా.. వారిలో వారికే స్పష్టత లేక గందరగోళం నెలకొంది. దీంతో అక్కడున్న జేఏసీ నాయకులు డాక్టర్లను సముదాయించారు.

 

17:35 - August 3, 2015

పశ్చిమగోదావరి: విద్యుత్‌ షాక్‌ తో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారి గూడెంలో చోటు చేసుకుంది. శెట్టివారి గూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు పొలం వద్ద విద్యుత్‌ మరమ్మతులు చేసేందుకు ముగ్గురు కూలీలు వెళ్లారు. ఈ క్రమంలో పనిచేస్తుండగా.. విద్యుత్‌ షాక్‌ రావడంతో కోటేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భూమి యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

 

17:30 - August 3, 2015

ఢిల్లీ: ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్ టిఐఐ)చీఫ్‌గా... గజేంద్ర చౌహాన్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ... విద్యార్థులు చేస్తోన్న ఆందోళన ఉద్ధృతమైంది. ఇన్నాళ్లు వర్సిటీలోనే నిరసన తెలిపిన విద్యార్థులు... ఆందోళన సెగలను ఢిల్లీకి తీసుకెళ్లారు. జంతర్ మంతర్ వద్ద సుమారు 80 మంది నిరసనకు దిగారు. ఎఫ్ టిఐఐ చీఫ్‌గా గజేంద్రను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వీరికి కాంగ్రెస్ ఎంపీ రాజ్‌ బబ్బర్ సంఘీభావం తెలిపారు.

 

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ ఓ...

ఖమ్మం: రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ బోనకల్లు మండలం లక్ష్మీపురం వీఆర్‌వో అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. వన్‌బీలో పేరు చేర్చడానికి రైతు వీఆర్‌వో వెంకన్నకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. దీనికి వీఆర్‌వో రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దిక్కుతోచని స్థితిలో రైతు ఏసీబీ ని ఆశ్రయించాడు. దీనిపై ఎక్వైరీ చేసిన అధికారులు వలపన్ని వీఆర్‌వోను పట్టుకున్నారు. 

పట్టిసీమ తో సీమకు నీళ్లొస్తాయన్న నమ్మకం లేదు:జేసీ

హైదరాబాద్:కృష్ణా నదిపై ఎగువన కట్టిన ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీవ్రనష్టం జరుగుతోందని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నీటి కేటాయింపుల్లో మార్పులు చేయాలని సీఎంను కోరతామని ఆయన చెప్పారు. సీమకు నీళ్లు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా నదిలోకి నీళ్లొస్తాయని, సీమకు నీళ్లొస్తాయన్న నమ్మకం లేదని జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు

17:15 - August 3, 2015

ఢిల్లీ: లలిత్‌ మోది అంశంలో కేంద్ర మంత్రి సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు లోక్‌సభలో పట్టుబట్టాయి. మంత్రి రాజీనామా తర్వాతే చర్చ జరపాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతవరకు సభ సజావుగా జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్లకార్డులతో నిరసన చేస్తున్న సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవల్సిందిగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న కారణంతో స్పీకర్ కాంగ్రెస్‌కు చెందిన 27 మంది సభ్యులను ఐదురోజుల పాటు సస్పెండ్‌ చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

17:12 - August 3, 2015

ఢిల్లీ: కళంకిత మంత్రుల వ్యవహారం లోక్‌సభలో హీట్‌ పెంచింది. అఖిలపక్ష సమావేశం విఫలమైన కాసేపటికే సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయారు. మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. అంతే పట్టుమీదున్న అధికారపక్షం కూడా దూకుడుగా వ్యవహరించింది. వెల్‌లోకి వెళ్లిన 27 మంది సభ్యులను సస్పెన్షన్‌కు రికమెండ్‌ చేసింది. వారందరినీ ఐదు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.

 

ఏపీలో 7న బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాల జేఏసీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు:సోనియా

హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను రాజీనామా చేయాలని సభలో ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అభివర్ణించారు. ఎంపీలను సస్పెండ్ చేసిన 5 రోజులూ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.

సింగరేణి భవన్ లో అగ్రిప్రమాదం

హైదరాబాద్: లక్డీకపూల్ లోని సింగరేణి భవన్ లో అగ్రిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

16:56 - August 3, 2015

ఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా అవసరమని పరకాల ప్రభాకర్ అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎపికి నష్టాలు పూడుస్తామని చెప్పి రాష్ట్ర విభజన చేశారని చెప్పారు. ఎపికి రాజధాని, కోర్టు, సచివాలయం, సంస్థలు లేవని.. రాష్ట్రం ఆర్థికలోటులో ఉందని వాపోయారు. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో బయటికి వచ్చామని తెలిపారు. కట్టుబట్టలతో బయటికి వెళ్లామని చెప్పారు. కేంద్రం ఎపికి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. తూచా తప్పకుండా అమలు చేస్తారనే హామీలు అమలు చేస్తారనే విశ్వాసం, నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు.

 

ఓం ప్రకాష్ చౌతాలాకు సుప్రీం కోర్టులో భంగపాటు...

హైదరాబాద్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు సుప్రీం కోర్టులో మరోసారి భంగపాటు ఎదురైంది. 2000 నాటి ఉపాధ్యాయ నియామకం స్కాంలో ఆయనతోపాటు కుమారుడు, మరో ముగ్గురికి 2013 జనవరి 16న ట్రయల్ కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. మే 5న ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. దీంతో నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 80 ఏళ్ళ చౌతాలా దీనిపై సుప్రీం కోర్టులో మరోసారి అపీల్ చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. చౌతాలా కుమారుడైన 54 ఏళ్ళ అజయ్ సింగ్ చౌతాలాతో పాటు ఇతర నిందితుల పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది.

'శేషాచలం' ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్: శేసాచలం ఎదురుకాల్పుల ఘటనపై విచారణను 3 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ముగ్గురు సాక్షులను తిరిగి విచారించాలని సిట్ అధికారులను ఆదేశించింది. శేఖర్, ఇలంగోవెల్, బాలచందర్ ఇళ్ల వద్దనే సాక్ష్యాలను సేకరించాలని ఆదేశించింది. సాక్ష్యాలను సేకరించే సమయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి అని పేర్కొంది. న్యాయవాదుల సమక్షంలో ఈ ప్రక్రియను కొనసాగించాలని న్యాయం తెలిపింది.

16:45 - August 3, 2015

విజయవాడ: ఆ బుడతకు మాటలు కూడా సరిగారావు.. బుడి బుడి నడకలు నేర్చుకొని ఇంకా రెండేళ్లయినా కాలేదు. అయితే.. చేత విల్లు పట్టిందంటే మాత్రం.. చిచ్చర పిడుగే. అటువైపు ఎంతటి సీనియర్లున్నా ఓటమిని అంగీకరించాల్సిందే. పసిప్రాయంలోనే రికార్డుల మోత మోగిస్తోన్న శివానిపై స్పెషల్ స్టోరీ...
ఆర్చరీలో దూసుకుపోతున్న శివాని
మూడేళ్ల వయసులోనే చిచ్చర పిడుగులా ఆర్చరీలో దూసుకుపోతోంది శివాని.. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న ఈ చిన్నారి.. వింటి నారిని సంధించి బాణం వదిలితే చాలు లక్ష్యం ఎలాంటిదైనా తల వంచి తీరుతుంది. బెజవాడ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ బుల్లి క్రీడాకారిణి... తనకంటే పెద్దవారితోనూ పోటీపడి ఎన్నో విజయాలు సాధించింది.. తండ్రి చెరుకూరి సత్యనారాయణ ప్రోత్సాహంతో ఆర్చరీలో మరింత రాటుతేలింది ఈ గడుగ్గాయి... బుడిబుడి అడుగులువేసే వయసులోనే విల్లు చేపట్టి రికార్డుల మోత మోగిస్తోంది.
ఆర్చరీలో శిక్షణ
శివాని సోదరుడు చెరుకూరి లెనిన్ కూడా ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.. దురదృష్టవశాత్తూ అతను చనిపోవడంతో సత్యనారాయణ దంపతులు కుమిలిపోయారు. తమ అకాడమీ ఏమైపోతుందోనని దిగులు చెందారు. చివరికి సరోగసీద్వారా మరోపాపకు జన్మనిచ్చారు. పాప రెండు నెలల వయసున్నప్పటినుంచే స్ట్రెచ్ అవుట్స్ చేయిస్తూ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆర్చరీలో శిక్షణ ఇచ్చారు.
విసుగులేకుండా ప్రాక్టీస్
తొలిసారిగా 14 నెలల వయసులోనే ఆర్చరీ పోటీల్లో పాల్గొంది ఈ గడుగ్గాయి. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలవరకూ.. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటలవరకూ ప్రాక్టీస్ చేస్తోంది.. మిగిలిన సమయంలో స్కూల్‌కు వెళుతోంది.. పాపకోసం ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా పోలెండ్ నుంచి తక్కువ బరువు ఉండే అర్చరీ కిట్ తెప్పించారు. ఏదైనా ఒక్కసారి వింటే చాలు.. వెంటనే ఆచరణలో పెట్టేస్తుందీ బుజ్జాయి... ఏమాత్రం విసుగులేకుండా ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తోందంటున్నారు కోచ్‌లు..
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
చిన్న వయసులోనే ఈ పాప లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.. ఈ చిచ్చరపిడుగుపై డిస్నీ ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించింది.. ప్రపంచవ్యాప్తంగా 350కి పైగా మీడియా సంస్థలు శివాని ప్రతిభను గురించి శ్లాఘించాయి. ప్రతి 3 నెలలకు 3 మీటర్ల దూరం చొప్పున పెంచుకుంటూ.. ఆర్చరీలో నిపుణత సాధిస్తోంది శివాని. 2020 ఒలంపిక్స్ సబ్ జూనియర్ విభాగంలో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం తర్ఫీదు పొందుతోంది.

 

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం

హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభీత్సం కొనసాగుతోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతూ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. అగ్ని మాపక సిబ్బంది రోజుల తరబడి శ్రమించినా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. నింగికి ఎగిసిపడుతున్న నిప్పులు, మేఘాలనుపొగ కమ్మేస్తోంది.

 

16:39 - August 3, 2015

ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆల్‌ పార్టీ మీటింగ్ ముగిసింది. సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అధికార పార్టీ నుంచి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ గైర్హాజరయ్యారు. సమావేశంలో అధికార, విపక్షాల మధ్య సయోద్య మాత్రం కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుష్మాస్వరాజ్, వసుంధరరాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ రాజీనామాలు చేయాల్సిందేనని కాంగ్రెస్, వామపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఐతే అధికారపక్షం ఇందుకు అంగీకరించలేదు. వారు ఎలాంటి తప్పు చేయలేదని వాదించారు. లలిత్‌గేట్‌, వ్యాపం కుంభకోణంపై... ప్రధాని వివరణ ఇస్తారని చెప్పగా... ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ముందు కళంకితులు రిజైన్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఎలాంటి పురోగతి లేకుండానే ఆల్‌పార్టీ మీటింగ్ ముగిసిపోయింది.

 

'పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి'

ఖమ్మం:పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ డిమాండ్ చేసింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ఖమ్మం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్పులను వెంటనే విడుదల చేయాలన్నారు. దీంతో పాటుగా గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఏ ను ప్రభుత్వం  పూర్తిగా విస్మరింస్తోదని  విమర్శించారు.

 

16:36 - August 3, 2015

ఢిల్లీ: రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటనపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. డిప్యూటి ఛైర్మన్‌ అనుమతి లేకుండా ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా సుష్మా ఎలా మాట్లాడతారని కాంగ్రెస్‌ సభ్యుడు మధుసూదన్ మిస్త్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్‌ రూల్‌ ప్రకారమే మాట్లాడారని, రెండు వారాలుగా సభకు విపక్షాలు అంతరాయం కల్పిస్తున్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మండిపడ్డారు.

 

16:23 - August 3, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలు హాజరయ్యారు. ఏసీబీ వేధిస్తోందని ఉదయ్‌సింహ మెమో దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

 

కొడైకెనాల్‌లో యూనిలీవర్ కాలుష్యానికి నిరసనగా పాట

హైదరాబాద్: యూనిలివర్ సంస్థ కొడైకెనాల్ లో సృష్టిస్తున్న కాలుష్యానికి నిరసనగా ఓ పాట ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది.. తమిళనాడుకుచెందిన సోషియా పాడిన ఈ ర్యాప్ పాట విశేష అదరణ పొందుతోంది.. మూడురోజుల్లోనే దాదాపు ఏడున్నరలక్షలమంది ఈ వీడియో చూశారు.. నీక్కీ మినజ్ రెస్క్యూ పాటకు పేరడీగా ఈ పాట చేసింది సోషియా... ఈ వీడియో చూసిన నిక్కీ వావ్ అంటూ ట్వీట్ చేశారు.. కొడైకెనాల్లో కంపెనీల వ్యర్థాలతో పరిసరాలు, పొలాలన్నీ కలుషితమైపోతున్నాయని... సోషల్ రెస్పాన్సిబులిటీకింద ఆయా సంస్థలే క్లీన్ చేయాలని పాటలో కోరారు ఈ ర్యాప్ సింగర్..

16:12 - August 3, 2015

హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్‌ బోనాల వేడుకలో పోతురాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేశారు.

జీహెచ్‌ఎంసీ ఆఫీసులో మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రధాన కార్యాలయంలోకి మీడియా వాహనాలను అనుమతించవద్దని కమిషనర్ సోమేష్‌కుమార్  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మీడియా వాహనాలను విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

15:45 - August 3, 2015

హైదరాబాద్: మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా కీలకంగా భావించే రంగం కార్యక్రమం ఉత్కంఠగా సాగింది. మాతంగి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరెందుకని ప్రశ్నించింది. నలుగురికీ అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే.. దోచుకునేటోళ్లు తయారయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటి వాళ్లను శిక్షించేదీ.. ప్రజలను కాపాడేదీ తానేనని చెప్పింది. తన దగ్గరికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి భారంగానీ, భయాలుగానీ లేకుండా కాపాడుకుంటానని, ఆ బాధ్యత తనదేనని భక్తులకు భరోసా ఇచ్చింది.

 

15:42 - August 3, 2015

లిబియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ధ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగువారి పరిస్ధితిపై ఎలాంటి సమాచారం లేదు. లిబియాలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ, తెలంగాణలో హైదరాబాద్‌కు చెందిన బలరాంలతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరిని బంధించిన ఐదు రోజుల క్రితం బంధించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని విడిచిపెట్టినా, గోపికృష్ణ, బలరాం ఇంకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నట్లు సమాచారం. బాధితుల కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించేందుకు కృషి చేయాల్సిందిగా అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాజీ సైనికుడు...

మహబూబ్‌నగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట మాజీ సైనికుడొకరు కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. అబ్రహం లింకన్ అనే మాజీ సైనికుడు చేసిన ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని దక్కకుండా స్థానికులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 

లోక్ సభ రేపటికి వాయిదా

హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న ఎంపీల పేర్లు చదివిన స్పీకర్, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. దీంతో, ఆందోళన చేస్తుంటే, సస్పెండ్ చేస్తామని బెదిరించడం సరికాదని పలువురు విపక్షనేతలు స్పీకర్ కు సూచించారు.

15:31 - August 3, 2015

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌ కేసర్‌ గ్రామపంచాయితీ ముందు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్‌కేసర్‌ గ్రామపంచాయితీకి చెందిన నరసింహారావు అనే ఉద్యోగి గ్రామ పంచాయితీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్యోగిని స్టేషన్‌కు తరలించారు.

 

రాజ్యసభ రేపటికి వాయిదా...

న్యూఢిల్లీ: వ్యాపం కుంభ కోణం, సుష్మా వ్యవహారంపై విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడింది. అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింథియా రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. సభలో ఆందోళన కొనసాగుతుండటంతో సభను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. 

15:29 - August 3, 2015

హైదరాబాద్: ఆరోగ్య శ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ నిరసనలు మరింత ఉధృతం చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాడ్ చేశారు. తమను ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు.

 

రెండు నెలల్లో భూసేకరణను పూర్తి చేయాలి:మంత్రి షరీష్ రావు..

హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రెండు నెలల్లో భూసేకరణను పూర్తి చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ అన్నారు. జిల్లా స్థాయిలో భూసేకరణ కమిటీలను ఏర్పాటు చేయాలని. భూ పట్టాదారులూ, వారసుల సమక్షంలో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని హరీష్ రావు స్పష్టం చేశారు.

లోక్ సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనలు..

హైదరాబాద్: లోక్ సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు విరమించాలని స్పీకర్ కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు గౌరవమైన స్థానం ఉందని...నేపథ్యం ప్రజాస్వామ్యంలో చర్చలకే విలువ ఉందని...చర్చలు జరిగిన తర్వాత అవసరమైతే విచారణ చేపడతామని లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆరోపణలు వచ్చిన మంత్రులు రాజీనామా చేస్తేనే చర్చకు అనువైన వాతావరణం ఉంటుందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పనిలేదు: ఇన్ ట్యాక్స్ ప్రతినిధులు..

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాల్సిన పని లేదని ఇన్ ట్యాక్ ప్రతినిధులు తెలిపారు. వారు ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి దుస్థితికి నిర్వహణా లోపమే కారణమని తెలిపారు. ఆస్పత్రి కూల్చడం కంటే తక్కువ ఖర్చుతో నిర్వహణను మెరుగుపరచడమే ఉత్తమం అని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి కంటే పురాతన భవనాలు... ఇంకా కొనసాగుతున్నాయని ఇన్ ట్యాక్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామ తెలిపారు.

11 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కపడ: జిల్లాలోని గాలివీడులో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 23 ఎర్రచందనం దుంగలు, ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గోల్కొండలోనే పంద్రాగస్టు వేడుకలు

హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ వేడుకల నిర్వహణ పై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15వ తేదీన 10 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని, వేడుకల్తో తెలంగాణ కళారూపాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. 

'తన సీఎం పదవికి అడ్డొస్తాడేమోనన్న భయంతోనే బాలయ్యకు తొలి ర్యాంకు'

అనంతపురం:హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎమ్మెల్యేల పనితీరు విషయలో మొదటి ర్యాంక్ ఇవ్వడంపై అనంతపురం జిల్లాకు చెందిన సీపీఎం కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శలు చేశారు. బాలయ్యకు తొలి ర్యాంకు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో నివసిస్తున్న ఆయనకు మొదటి ర్యాంకా? అని ప్రశ్నించారు. ఈ ర్యాంకులన్నీ బోగస్సేనని, తన సీఎం పదవికి అడ్డొస్తాడేమోనన్న భయంతోనే బాలయ్యకు తొలి ర్యాంకు ఇచ్చారని ఆరోపించారు. డబ్బులు లేవంటూనే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.1600 కోట్ల ఎలా ఖర్చు చేసిందని అడిగారు. 

విద్యుత్ షాక్ తో లైన్ మెన్ మృతి..

పశ్చిమగోదావరి:చింతలపూడి మండలం శెట్టివారిగూడెం దగ్గర విద్యుత్ లైన్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లైన్ పనులు చేస్తున్న ఓ వ్యక్తికి విద్యుత్‌షాక్‌ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

రేడియోలో మనకీ బాత్... పార్లమెంట్ లో మౌనమా!

న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. మనసులో మాట రేడియోలో చెప్పే ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మౌనవ్రతం పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణం నిందితులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. సుష్మా రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. ఆమె రాజీనామా చేసే వరకు పార్లమెంట్‌ను నడవనివ్వబోమని తేల్చి చెప్పాయి. అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలతో సోనియాగాంధీ సమావేశమయ్యారు.

మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసిన తల్లి...

నిజామాబాద్: వర్ని మండలం చందూర్ లో కుమారుడు మద్యానికి బానిసై వేధింపులకు గరి చేస్తుండడంతో... తట్టుకోలేని తల్లి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

విజయవాడలో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన...

విజయవాడ:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు , రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నాకు దిగారు. 10 వ పీఆర్‌సీ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగుల కనీస వేతనానికి సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నటీ లీవు సౌకర్యం కల్పించాలని, డీఏ, హెల్త్‌కార్డులు, బస్‌పాస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

వాయిదా అనంతరం ఉభయసభలు ప్రారంభం

ఢిల్లీ: వాయిదా అనంతరం ఉభయసభలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుష్మా పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న కేంద్రం

ఢిల్లీ: మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ సజావుగా సాగే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కేంద్రం కోరింది. కళంకిత మంత్రులు రాజీనమా చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. మంత్రులు తప్పు చేయలేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు. మంత్రులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. 

పేదల ఇళ్ల కోసం ఈనెల 5న టీ.టీడీపీ ధర్నా...

హైదరాబాద్: ప్రభుత్వం పథకంతో చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ ఈనెల 5న దీక్ష చేపడుతున్నామని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణలోని విపక్ష పార్టీల ఫ్లోర్‌లీడర్లకు ఎర్రబెల్లి లేఖ రాశారు. తాము చేపడుతున్న దీక్షకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని ఎర్రబెల్లి తన లేఖలో కోరారు. గతంలో మంజూరైన ఇళ్ల బిల్లులు చెల్లించనందున పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.

ఏఎన్ యూ వద్ద వైసీపీ ఆందోళన...

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ముందు జిల్లా వైఎస్సాసీపీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై నిజనిర్ధారణ కోసం వైసీపీ నాయకులు ఈ రోజు యూనివర్సిటీ కి వచ్చారు. అయితే పోలీసులు వారిని వర్సిటీ లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ సందర్శన కోసం ఆదివారమే అనుమతి తీసుకున్నామని నేతలు తెలిపారు. అయినా పోలీసుల తీరు మారకపోవడంతో వారు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు దిగివచ్చారు. యూనివర్సిటీ లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ధర్నా విరమించారు.  

అమీర్ ఖాన్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'పీకే' సినిమాలో పోలీసులను ఉద్దేశించి అమీర్ ఖాన్ 'తుల్లా' అనే పదాన్ని ఉపయోగించాడని ఆరోపిస్తూ, ఉల్లాన్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పోలీసులపై తుల్లా అనే పదాన్ని వాడారని... దీంతో, ఆయనపై కేసు నమోదు చేశారని ఉల్లాన్ గుర్తు చేశారు. కేజ్రీవాల్ పై కేసు నమోదైనప్పుడు, అమీర్ ఖాన్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. ఆధారాల కోసం పీకే సినిమా డీవీడీని కూడా పోలీసులకు అందజేశారు.

ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్షం భేటీ

ఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరపున రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జు ఖర్గే, గులాంనబీ ఆజాద్ తో పాటు జేడీయూ నేత శరద్ యాదవ్ , ఎన్సీపీ నేత శరద్ పవార్, బీఎస్పీ నేత మిశ్రా, టిడి నుండి తోట నరసింహం, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.

13:41 - August 3, 2015

వరంగల్ :వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో ఘోరం జరిగింది. కేర్‌ ఫార్మసీ కాలేజీలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయాడు. విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  వివరాల్లోకి వెళితే...గత ఆరు నెలలుగా తనను ప్రేమిచాలని ఓ విద్యార్థి సహవిద్యార్థి నిని  వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ అంశాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కసి పెంచుకున్న ప్రమోన్మాది గొంతునులి చంపేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న విద్యార్థులు ప్రమోన్మాది నుండి యువతిని రక్షించారు. యువతికి ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి స్పష్టం కనపడుతోందని స్థానికు లు ఆరోపిస్తున్నారు.

13:36 - August 3, 2015

హైదరాబాద్:పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఉత్తర కోల్‌కతాలోని తలా ట్యాంక్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని నిర్వీర్యం చేశారు. బాంబు పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర్యయారు. 

13:34 - August 3, 2015

నెల్లూరు: జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ బాధితులు రాస్తారోకోకు దిగారు. నెల్లూరు జిల్లా బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోకు సీపీఎం తో పాటు కాంగ్రెస్‌, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేశాయి. 

13:33 - August 3, 2015

ఆదిలాబాద్: మీ కిడ్నీలో రాళ్లున్నాయా..అయితే మా దగ్గరకు రండి ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండానే తొలగిస్తాం అనే ప్రకటనలు సాధారణమే. అయితే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్స లేకుండానే ఏ లేజర్‌ ట్రీట్ మెంట్ ద్వారానో కిడ్నీలో రాళ్లను తొలగిస్తారు. టెక్నాలజీ యుగంలో ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు కిడ్నీలో రాళ్లు తొలగిస్తానంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాడు. ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే కిడ్నీలో రాళ్లను నోటితో తొలగిస్తానంటూ వేలకు వేలు దండుకుంటున్నాడు. 
ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా..
ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. అతను చేస్తోంది కూడా ఆపరేషనేనట.. ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా..ఈ కిడ్నీ బాబా నోటితో కొరికి కిడ్నీలో రాళ్లు విరిచేస్తున్నాడట.. గిరిజనుల అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని ఇలాంటి కేటుగాళ్లు గ్రామాళ్లో రెచ్చిపోతున్నారు. గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దెండేపల్లి మండలం గూడెం గోదావరి తీర ప్రాంతంలో ఈ కిడ్నీ బాబా కిడ్నీలో రాళ్లు తీస్తానంటూ బాధితులను బురిడీ కొట్టిస్తున్నాడు. ఏవో మంత్రాలను పఠిస్తూ ఇలా నడుము కొరుకుతూ కిడ్నీలో రాళ్లు తీసేస్తున్నానని నమ్మిస్తున్నాడు. ఈ తతంగాన్ని టెన్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా చిత్రీకరించింది.
ఈ పూజలతో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని...
​ఇదేంటని పూజారిని ప్రశ్నిస్తే ఈ పూజలతో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని, తన తాత ముత్తాతల కాలం నుంచి ఈ పూజలు నిర్వహిస్తున్నామని తాపీగా సమాధానమిస్తున్నాడు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామాల్లో ఇలాంటి దోపిడీ కార్యక్రమాలను అరికట్టి మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:29 - August 3, 2015

హైదరాబాద్: లలిత్‌ మోదీ వీసా కోసం తాను బ్రిటన్ సర్కారుకు ఎలాంటి సిఫార్సులు చేయలేదని... విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ డిమాండ్‌పై మంత్రి ఈ మేరకు రాజ్యసభలో స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. విపక్షాలు కోరుతున్న అన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు వెల్లడించారు. ఐతే ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభాపతి పోడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు చేయటంతో... సభను వాయిదా వేశారు. 

మోహన్ బాబుకు పద్మశ్రీ యథాతథం: సుప్రీం..

ఢిల్లీ: పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని సినీనటుడు మోహన్‌బాబుపై రేగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తాజాగా సుప్రీంకోర్టు ప్రకటించింది. మోహన్ బాబు నటించిన దేనికైనా రెడీ సినిమాలో పద్మశ్రీ అవార్డును సినిమా టైటిల్స్‌లో వేసుకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నిర్మాత తన ప్రమేయం లేకుండానే టైటిల్స్‌లో పద్మశ్రీని ఉపయోగించారని ఆయన వివరణ ఇచ్చారు.

మురికి కాలువలో పసికందు..

మహబూబ్ నగర్: గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును సోమవారం మురికికాలువలో వదిలివెళ్లారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో గాంధీనగర్ కాలనీ సిల్వర్ జూబ్లీ క్లబ్ సమీపంలోని వీరేష్ ఇంటిముందు చోటుచేసుకుంది. పాప ఏడుపు గుర్తించిన వీరేష్ భార్య పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించింది. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పతికి తరలించారు.

మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడించిన మహిళలు

మహబూబ్ నగర్: జడ్చర్లలో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారులకు తాగునీటి సమస్యపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట మహిళల ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

అక్రమంగా నిల్వ ఉంచిన 102 ఉల్లి పట్టివేత..

హైదరాబాద్:విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 102 టన్నుల ఉల్లిగడ్డలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉల్లిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాకు బెయిల్

న్యూఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాకు బెయిల్ మంజూరైంది. గుప్తాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు ప్రకటించింది. పుష్ప్ స్టీల్స్ అండ్ మైనింగ్ డైరెక్టర్ అతుల్ జైన్‌కు కూడా బెయిల్ మంజూరైంది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 26కు కోర్టు వాయిదా వేసింది. 

12:31 - August 3, 2015

గుంటూరు : జిల్లా వినుకొండలో గవర్నమెంట్‌ ఆసుపత్రి ఆవరణలో ఉన్న అక్రమకట్టడాలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. ముందుగా నోటీసులు జారీ చేయడంతో మున్సిపల్‌ అధికారులు సాఫీగా ఆక్రమణలను తొలగించారు. ఆసుపత్రి ఆవరణలో ప్రధానంగా కొందరు ఇళ్లు, దుకాణాలతో ఆక్రమణలకు పాల్పడ్డారు. 

12:30 - August 3, 2015

ఢిల్లీ : చిన్న వయసులోనే తప్పిపోయి పాకిస్థాన్ చేరిన యువతి కథనంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు.. సతీసమేతంగా వెళ్లి ఆమెను కలుసుకోవాలని పాక్‌లో భారత రాయబారి రాఘవన్‌ను ఆదేశించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో సుష్మ ట్వీట్ చేశారు. ఆమె వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా:రామకృష్ణ

తూ.గో:ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ర్టాన్ని పట్టించుకోవటం లేద ని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ వివరించారు.

12:29 - August 3, 2015

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద ఎంన్ఎండీసీ గనులపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు గనులపై దాడి చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అర్థరాత్రి 2 గంటల వరకు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఎన్ఎండీసీ డ్రిల్ మిషన్, ఇతర సామాగ్రిని మావోయిస్టులు తగులబెట్టారు. ఈ దాడిలో సుమారు రూ.50కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రత పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

రాజధాని నిర్మాణంతో వ్యాపారాలు చేస్తున్న సీఎం:పి.మధు...

అనంతపురం: హంద్రీ-నీవా నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఉరవకొండలో రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధాని నిర్మాణంతో వ్యాపారాలూ చేస్తూ... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలైన ఎస్పీవై రెడ్డి, పుల్లారెడ్డిలకు రూ.2.150 కోట్ల విద్యుత్ రాయితీలు కల్పించిన ప్రభుత్వం మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడేందుకు ఇష్టపడటం లేదని విమర్శించారు.

12:23 - August 3, 2015

ఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే లలిత్ మోడీ, వ్యాపం కుంభకోణం అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వీటిపై చర్చించాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళన నడుమే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

 

12:23 - August 3, 2015

ఢిల్లీ : తనపై వచ్చిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే లలిత్‌మోడీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సుష్మాస్వరాజ్ వివరణనిచ్చారు. తాను చర్చకు సిద్ధమని చెప్పినా విపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమని స్పష్టం చేశారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. వెల్‌లోకి ప్రవేశించి పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

12:21 - August 3, 2015

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. సభలో అనుసరించాల్సిన విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు పట్టుబడుతుండగా.. రాజీనామాల ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. మిగిలిన సమావేశాలు సక్రమంగా జరిగేందుకు సర్కార్‌ ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

 

12:21 - August 3, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొన్ని అంశాలపై మాట ఇవ్వాలని..అలాగే స్పష్టతనివ్వాలని ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంపై ఆమె స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ తో కవిత, జితేందర్ రెడ్డి మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని అలాగే హైకోర్టు విభజనను కూడా తేల్చాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కవిత డిమాండ్‌ చేశారు. కేవలం అఖిల పక్ష సమావేశానికి పిలిచినంత మాత్రాన లాభం లేదని కవిత అన్నారు. 

ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లకు హైకోర్టులో ఊరట...

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లకు హైకోర్టులో కొంతమేరకు ఊరట లభించింది. ఈ ఇద్దరి విషయంలో బెయిల్‌ షరతులను హైకోర్టు సడలించింది. ప్రతి రోజూ కాకుండా సోమ, గురు, శుక్రవారాల్లోనే ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో వీరితో పాటు రేవంత్ రెడ్డి, అతని కారు డ్రైవర్, ఇతర వ్యక్తులు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు.

గుర్తింపు కార్డు వుంటే ఏఎన్ యూలోకి అనుమతి

గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియా సహా విద్యార్థులను గేటు బయటే నిలువరిస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. వర్శిటీలోకి ప్రవేశం పై అధికారులు, పోలీసుల మధ్యభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

విషాహారం తిన్న 12 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్‌ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉభయసభలు మ.2గంటల వరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వ్యాపం, లలిత్ గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.

​నాటు బాంబు పేలి బాలుడు మృతి...

హైదరాబాద్:కోల్‌కతాలోని తలా ట్యాంక్ ఏరియాలో నాటు బాంబు పేలి ఓ బాలుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలని మరో రెండు నాటు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఘటనాస్థలిలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఎవరికివారే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: స్వర్ణలత

సికింద్రాబాద్:ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా ఆలయంలో ఈరోజు రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. దుష్టులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని స్వర్ణలత చెప్పారు. ఎవరికివారే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఆలయానికి కేటాయించిన నిధులు కూడా మింగేస్తున్నారని స్వర్ణలత పలికారు. నాయకులు స్వార్థపరులుగా మారితే మంచి ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. పాపాలు పెరుగుతుంటే వర్షాలు ఎలా కురుస్తాయి? అని ఆమె పలికారు. నాయకుల్లో సేవాభావం పెరగాలని ఆమె సూచించింది. తనను నమ్మిన భక్తులకు అండగా ఉంటానని ఆమె తెలిపారు.

ఓటుకు నోటు కేసు విచారణ 14కు వాయిదా...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు తనను బెదిరించారంటూ ఉదయసింహ, న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కాగా ఈనెల 14న మరోసారి విచారణకు హాజరుకావాలని రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో సమాచారం అసంపూర్తిగా ఉందని, మరింత సమాచారం జోడించాల్సి ఉందని అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.

బంజారాహిల్స్ పీఎస్ నుంచి నిందితుడు పరారీ

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ నుంచి నిందితుడు పరారయ్యాడు. చీటింగ్ కేసులో నజీర్ అనే వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అప్రమత్తమైన పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

భూములు వెనక్కి ఇవ్వాలంటూ నిర్వాసితుల ఆందోళన

నెల్లూరు:కోట మండలం కొత్తపట్నం దగ్గర తోళ్ల పరిశ్రమకు కేటాయించిన భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండు చేస్తూ నిర్వాసితులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆందోళన అనంతరం నిర్వాసితులు తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందించారు. తమ భూములు ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.

లోక్ సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

ఢిల్లీ: లోక్ సభలో వ్యాపం స్కామ్, లలిత్ వ్యవహారం పై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు.

లలిత్ మోదీ కోసం నేను సిఫార్సు చేయలేదు: సుష్మాస్వరాజ్

ఢిల్లీ: నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని...లలిత్ మోదీ కోసం నేను సిఫార్సు చేయలేదు సుష్మాస్వరాజ్ తెలిపారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని రాజ్యసభలో తెలిపారు. సుష్మా ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ వాయిదా పడింది...

లోక్ సభలో గందరగోళం...

హైదరాబాద్: లోక్ సభలో గందరగోళం కొనసాగుతోంది. వ్యాపంస్కాం, లలిత్ వ్యహారం పై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

తెలుగు గంగ కాల్వ పనులను పరిశీలించిన మంత్రినారాయణ

నెల్లూరు:నాయుడుపేట నెలబెల్లి దగ్గర తెలుగు గంగ కాల్వ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి నారాయణ పరిశీలించారు. కాల్వ నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. 

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత పై హైకోర్టులో పిల్

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత నిర్ణయంపై హైకోర్టు లో పిల్ దాఖలయ్యింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ రహదారిని దిగ్భంధించిన అగ్రిగోల్డ్ బాధితులు...

నెల్లూరు: బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిని అగ్రిగోల్డ్ బాధితులు దిగ్భంధించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ర్యాగింగ్ కు పాల్పడితేజీవిత ఖైదే..! :గంటా...

హైదరాబాద్:ర్యాగింగ్ కు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టానికి సవరణ చేస్తామని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ... విద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి సంబంధించి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నామని గంటా ప్రకటించారు.  

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 25 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి.

అర్థరాత్రి హైస్కూల్ రికార్డులు తగలబెట్టిన దుండగులు..

గుంటూరు: చుండూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తలు రికార్డులు తగలబెట్టారు.

10:22 - August 3, 2015

హైదరాబాద్ : నిమ్స్ వైద్యులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. సోమవారం విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. నియామకాలు, పదోన్నతుల్లో ఎయిమ్స్ తరహా నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వైద్యులు టెన్ టివితో మాట్లాడారు. ఇందులో నాలుగంచెల వ్యవస్థగా ఉంటుందని, సమూలంగా మార్పు చేయాలంటే ఓ చర్చ జరగాలన్నారు. చిన్న ప్రమోషన్ కోసం దశాబ్దకాలం పాటు వేచి చూడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టే విధంగా చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. నియామకాలు, ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై చాలాసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తాము 72 గంటల పాటు సమయం ఇవ్వడం జరిగిందని, ఒకవేళ ఆ సమయంలో చేయకపోతే ప్రతి రోజు ఇలాగే ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలో జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తప్పిన ప్రమాదం...

హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లక్ష్యంగా నిన్నఆ దేశ వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఒకరు మెరుపు దాడికి దిగాడు. కారుతో వేగంగా దూసుకువచ్చిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్, నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. పాక్ పట్టణం ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్ కు తిరిగివస్తున్న క్రమంలో షరీఫ్ పై ఈ దాడి జరిగింది. నకిలీ నెంబర్ ప్లేట్ కలిగిన కారుతో వేగంగా దూసుకువచ్చిన రెహ్మాన్ తొలుత షరీఫ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేశాడు.

పోర్న్‌సైట్ల నిషేధంపై 'వర్మ' ఆందోళన...

ముంబై పోర్న్‌సైట్లపై కేంద్రం అధికారిక నిషేధించడాన్ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విమర్శించారు. ఇది తిరోగామి చర్య అంటూ వరుస ట్వీట్లు చేశారు. లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేన్నైనా నిషేధిస్తే అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏరూపంలోనైనా హరిస్తే అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుంది.

10:17 - August 3, 2015

విజయనగరం : మరో జూట్ మిల్లు లాకౌట్ వార్తల్లోకెక్కింది. గుంటూరు జిల్లాలోని భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న లక్ష్మీ శ్రీనివాస్ జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించారు. దీనితో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విధులకు హాజరు కావడానికి వచ్చిన కార్మికులకు ప్రధాన ద్వారం తాళం వేసి ఉండడం..లాకౌట్ ప్రకటించినట్లు నోటీసు ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పరిశ్రమను తెరవాలని నినదించారు. ఉదయం నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో ఉన్న సీఈవోను నిర్భందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మిల్లులోకి ప్రవేశించి కార్మికులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 1200 మంది రోడ్డున పడ్డారని తెలిపారు. గత కొన్ని రోజులుగా రెండు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆందోళన చేయడం జరుగుతోందని కార్మిక నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూట్ మిల్లును లాకౌట్ ప్రకటించారని తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. రహదారిపై ఆందోళన చేస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు యాజమాన్యం, కార్మికులతో చర్చిస్తున్నారు. 

మహిళపై దొంగబాబా అత్యాచారయత్నం...

రంగారెడ్డి:బంట్వారం మండలం తొర్మామిడిలో ఓ మహిళపై దొంగబాబా అత్యాచారయత్నం చేశాడు.దీంతో దొంగబాబాపై గ్రామస్థులు దాడి చేసి ఆయన్ను చితకబాదారు.

ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన.. అరెస్టు...

హైదరాబాద్:తెలంగాణలో పదో రోజు కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్యోగులు భైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

నేడు మరోసారి అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుండటంతో సభను సజావుగా జరిపే అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈమేరకు ఇవాళ మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమావేశాలను సజావుగా జరిపేందుకు సహకరించాలని విపక్షాలను కోరనుంది. కాగా, లలిత్ మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంపై విపక్షాలు చర్చకు లేవనెత్తుతుండగా, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జరుగుతోన్న అవినీతిపై బీజేపీ ఆ పార్టీపై ఎదురు దాడికి దిగుతోంది. పార్లమెంట్‌లో వాయిదాల పర్వానికి మీరంటే మీరని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు పార్టీ అధినేత్రి సోనియా దిశానిర్దేశం చేయనున్నారు. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. 

మెదక్ జిల్లాలో ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం...

హైదరాబాద్: మెదక్ జిల్లాలో ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లాలోని సదాశివపేట మండలానికి చెందిన మద్దికుంట, తంగేడుపల్లి ఎంపీటీసీలు అపహరణకు గురయ్యారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాపైన ఎంపీటీసీల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలోనే ఎంపీటీసీలు కిడ్నాప్ నకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉంది:స్పీకర్ కోడెల

అనంతపురం: ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరంలేదని.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. రాయలసీమకు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు నీరందిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమలో కరువు పోవాలంటే నీళ్లు ఒక్కటే మార్గం అని కోడేల పేర్కొన్నారు.

ఆంధ్రాలో తీవ్ర వర్షాభావం

హైదరాబాద్:ఆంధ్రరాష్ట్రంలో తీవ్ర వర్షాభావం పరిస్థితులు నెలకొంది. జులైలో కనీస వర్షపాతం247.9మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి వుండగా 2275.మి.మీ వర్షపాతం నమోదయ్యింది. 138 మండలాల్లో మాత్రమే 19శాతం అదనంగా వర్షం పడగా, 332మండలాల్లోల వర్షపాతం లోటు ఏర్పడింది. రాష్ట్రంలో 35శాతం విస్తీర్ణంలో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. ఒక వేళ వ్యవసాయ పనులు ప్రారంభం అయిన చోట వర్షం జాడలేక మొక్కలు ఎండిపోతున్నాయి.

బొబ్బిలిజూట్ మిల్ ఎదుట ఉద్రిక్తత

విజయనగరం:లాకౌట్ ఎత్తేయాలని కోరుతూ లక్ష్మీ శ్రీనివాస జూట్‌మిల్ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్రమంగా లాకౌట్ విధించడాన్ని నిరసిస్తూ.. విజయనగరం జిల్లా బొబ్బిలి లోని లక్ష్మీ శ్రీనివాస మిల్లు ఎదుట ఆదివారం తెల్లవారుజాము నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

పెన్షన్‌ రావడం లేదని ఓ వికలాంగుడు ఆత్మహత్య

ప.గో:ద్వారకాతిరుమల బస్టాండులో పెన్షన్‌ రావడం లేదనే మనస్థాపంతో ఓ వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ద్వారక తిరుమలలో కలకలం రేపింది. వికలాంగుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

ఓ బాలికతో అరబ్‌షేక్‌ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్:పాతబస్తీలో ఓ బాలికతో అరబ్‌షేక్‌ వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డబ్బులిచ్చి పేద ముస్లిమ్‌ బాలికలను వృద్ధ అరబ్‌షేక్‌లు పెళ్లాడి తీసుకువెళుతున్న ఉదంతాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఓ అరబ్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరబ్‌షేక్‌తో వివాహం విషయంలో బ్రోకర్లు ఎవరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిమ్స్ లో బోధనా సిబ్బంది విధుల బహిష్కరణ..

హైదరాబాద్ : నిమ్స్ లో బోధనా సిబ్బంది విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. నియామకాలు, పదోన్నతుల్లో ఎయిమ్స్ తరహా నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. 

రెయిన్ బజార్ లో దారుణం..

హైదరాబాద్ : పాతబస్తీలోని రెయిన్ బజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఒమెన్ కు చెందిన షేక్ మహ్మద్ బాలికను వివాహం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు బాలికకు విముక్తి కల్పించారు.

09:09 - August 3, 2015

చిత్తూరు : జిల్లాలో మళ్లీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తరచూ పంట పొలాలపై దాడులు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని రామకుప్పం, వి.కోట మండలాల్లో పంట పొలాలపై దాడి చేయడంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాము కష్టపడి పండించుకున్న పంటలు కళ్లెదుటే నాశనమౌతున్నా ఏం చేయలేకపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఏనుగుల దాడిలో వరి, టమాట, బీన్స్ పంటలు ధ్వంసమయ్యాయి.
తమిళనాడు అటవీ ప్రాంతం నుండి ఏనుగులు వస్తున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం లేకపోవడం..ఏదైనా ఏనుగు తప్పిపోవడం వల్ల ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

ఉల్లి ధరపై హరీష్ రావు సమీక్ష..

హైదరాబాద్ : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ఘాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. కిలో రూ.20కే విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

వర్షాలతో వెస్ట్ బెంగాల్ అతాలకుతలం..

పశ్చిమ బెంగాల్ : భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. భారీగా వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక జనజీవనం స్తంభించింది.

 

సీనియర్ కేబినెట్ మంత్రులతో మోడీ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీనియర్ కేబినెట్ మంత్రులతో భేటీ కానున్నారు. పార్లమెంట్ హౌస్ లో ఉదయం 10.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది.

08:51 - August 3, 2015

చైనా : దోమల నుండి రక్షించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ చైనా దేశం మాత్రం ఏకంగా దోమల ఫ్యాక్టరీనే పెట్టబోతుందంట. ఏంటీ దోమల వల్ల ఎన్నో రోగాలు వస్తుంటాయి. అలాంటి ఫ్యాక్టరీ పెట్టి దోమలను ఉత్పత్తి చేయడమా ?అని ఆశ్చర్యపోతున్నారా !. కానీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
చైనాలో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది. దీనిని అరికట్టాలని పలు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఉత్తర చైనాలోని గాంగ్ జౌ ప్రాంతంలో దోమల ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలో దోమను స్టెరిలైజేషన్ పద్ధతిలో పుట్టిస్తారు. కొన్ని లక్షల దోమలను ఉత్పత్తి చేసి బయటకు వదులుతారు. ఈ స్టెరిలైజ్డ్ దోమలు డెంగీకి కారణమయ్యే దోమలను చంపేస్తాయి. అంటే ముల్లును ముల్లుతోనే తీయడమన్నమాట. మరి డెంగ్యూ వ్యాధి నమమౌతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సోమవారం శ్రీవారిని దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు..సర్వదర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. 

సావన్ నెల..మొదటి సోమవారం..

ఉత్తర్ ప్రదేశ్ : 'సావన్‌' నెలలో మొదటి సోమవారం రోజున శివుడికి ప్రవిత్ర గంగా జలంతో అభిషేకం చేయడానికి శివభక్తులు హరిద్వార్‌లో ఉన్న పుణ్యకేత్రానికి భారీగా తరలివచ్చారు.

24 ఎర్రచందనం దుంగల స్వాధీనం..

నెల్లూరు : అనంతసాగరం మండలం మల్లంకొండ అటవీప్రాంతంలో పోలీసులు గాలింపులు చేపట్టారు. 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

దంతెవాడలో మావోయిస్టుల దుశ్చర్య..

చత్తీస్ గఢ్ : ఎన్ఎండీసీకి చెందిన షావెల్ మిషన్ తో సహా 8యంత్రాలను మావోయిస్టులు తగులబెట్టారు. దీనితో కోట్లలో నష్టం జరిగింది. 

07:57 - August 3, 2015

ప్రత్యేక హోదా..ఎవరిని కదిలించినా దానపైనే చర్చలు. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మాత్రం పూర్తిగా వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హోదా తప్పక వస్తుందన్న పాత పాటనే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు పాడుతుండగా అవకాశాలు మృగ్యమని అధికారులు తేల్చిచెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ప్రత్యేక హోదా హుళక్కేనని స్పష్టమవుతోంది. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం... ఏకంగా జైల్లో ఊచలు లెక్కిస్తోన్న వ్యక్తిని మహాత్ముడంటూ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. గౌతమబుద్ధుడు, మదర్ థెరిస్సా, స్వామి వివేకానంద, గురునానక్, కబీర్, మీరాబాయి, శంకరాచార్య లాంటి మహనీయుల సరసన ఆశారామ్, రాందేవ్‌బాబాల ఫోటోలను చేర్చింది వసుంధరా రాజే ప్రభుత్వం. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ), ఆచారి (బీజేపీ), పట్టాభిరామ్ (టీడీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

నగరంలో రేపు నీటి సరఫరా బంద్..

హైదరాబాద్ : కృష్ణా ఫేజ్ -2 పంపింగ్ కేంద్రాల మరమ్మత్తుల కారణంగా నగరంలో మంగళవారం నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాను బంద్ చేయనున్నారు. 

బొబ్బిలిలో జూట్ మిల్లు లాకౌట్..

విజయనగరం : జిల్లా బొబ్బిలిలోని లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు యాజమాన్యం లౌకౌట్ ప్రకటించింది. దీనితో కార్మికులు ఆందోళన దిగారు. విజయనగరం - రాయగడ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

07:25 - August 3, 2015

రాజస్థాన్ : గౌతమ బుద్ధుడు..ప్రపంచాన్ని మార్చిన మహానీయుడు..వర్ధమాన మహావీరుడు.. అహింసను ప్రబోధించిన యోధుడు..మదర్ థెరిస్సా..ఎందరో అభాగ్యులకు మాతృమూర్తి..స్వామి వివేకానంద..నేటి యువతరానికి మార్గదర్శి..వీళ్లంతా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహాత్ములు. మార్గాలు వేరైనా మతాలు వేరైనా యవత్భారతాన్ని ఏకతాటిపై నడిపించారు. భావి తరాలకు స్ఫూర్తిప్రదాతలయ్యారు. అలాంటి మహనీయుల సరసన అత్యాచారం కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని చేర్చితే..? వినడానికే చిర్రెత్తుకొస్తోంది. అలాంటిది రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం... ఏకంగా జైల్లో ఊచలు లెక్కిస్తోన్న వ్యక్తిని మహాత్ముడంటూ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది.
జైల్లో ఉన్న వ్యక్తి మహాత్ముడా ?
గౌతమబుద్ధుడు, మదర్ థెరిస్సా, స్వామి వివేకానంద, గురునానక్, కబీర్, మీరాబాయి, శంకరాచార్య లాంటి మహనీయుల సరసన ఆశారామ్, రాందేవ్‌బాబాల ఫోటోలను చేర్చింది వసుంధరా రాజే ప్రభుత్వం. అప్పటి వరకు టీచర్ చెబుతున్న పేర్లను వల్లె వేస్తూ వచ్చిన పిల్లలందరూ ఆశారాం పేరు రాగానే ఠక్కున ఆగిపోయారు. తమలాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్రయత్నం చేసి, జైల్లో ఉన్న వ్యక్తి ఎలా మహాత్ముడు అవుతాడని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ పాఠాలు చెప్పే మాస్టార్లు, పుస్తకాలను ముద్రించిన పబ్లిషర్లకు మాత్రం ఇసుమంతైనా సందేహం కలగడం లేదు.
సర్వత్రా ఆగ్రహావేశాలు..
అత్యాచార ఆరోపణలతో... జైలు జీవితం గడుపుతోన్న వ్యక్తి ఫొటోను... రాజస్థాన్ పాఠ్యపుస్తకాల్లో ముద్రించడం వివాదాస్పదంగా మారింది. ఆశారాంను మహాత్ముడిగా అభివర్ణిస్తూ... ఆయన చిత్రపటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహోన్నతుల సరసన రేప్ కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నీళ్లు నములుతున్న పబ్లిషర్స్..
మరోవైపు ఇలాంటి పాఠ్యాంశం ఒకటుందని, తమకు తెలియదని రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. అటు పుస్తకాలను ముద్రించిన "గురుకుల్ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్" సైతం నీళ్లు నములుతోంది. తాము పుస్తకాలు తయారు చేసిన సమయానికి ఆశారామ్‌పై ఎలాంటి కేసులు లేవని వాదిస్తోంది. తదుపరి ముద్రణలో సవరించుకుంటామని చేతులు దులుపుకుంటోంది. విద్య కాషాయికరణ కోసం కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలకు రాజస్థాన్ ఘటన సజీవ సాక్ష్యం. భావి భారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో చెడును మంచిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వేచి చూడాలి. 

07:21 - August 3, 2015

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే సగం రోజులు వృథాగా గడిసిపోయాయి. ఒకపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పట్టుబడుతుండగా.. రాజీనామాల ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. మిగిలిన సమావేశాలు సక్రమంగా జరిగేందుకు సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అధికార, విపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు దాదాపు సగానికి పైగా వృధా అయ్యాయి. దీంతో మిగిలిన కొన్ని రోజులైనా సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది.
నేడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం..
ఇక లలిత్‌మోడీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉన్న నేతలు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. తమ వ్యూహాన్ని రూపొందించేందుకు సోనియా అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్‌, వసుంధరా రాజే, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ల రాజీనామాల విషయంలో అధికార, విపక్షాలు తమ పట్టును కొనసాగిస్తున్న సమయంలోనే అఖిలపక్ష భేటీకి ముందు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించడం విశేషం.
చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం..
ఒకపక్క రాజీనామాలు లేకుంటే చర్చల ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు పట్టుబడుతుండగా.. మరోపక్క బీజేపీ మాత్రం రాజీనామాల ప్రసక్తే లేదంటోంది. లలిత్‌మోడీ వ్యవహారంపై సుష్మా సభలోనే ప్రకటన చేస్తారని.. దానిపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇక వ్యాపం కుంభకోణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారమని చేతులు దులుపుకుంటోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశంలో కూడా రాజీనామాలపై ఏం చర్య తీసుకున్నారన్న అంశంపైనే చర్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అంటున్నారు. మరి ఈ అఖిలపక్ష సమావేశంలోనైనా మిగిలిన రోజుల సభ కార్యక్రమాల నిర్వహణపై ఏకాభిప్రాయానికి వస్తారా.. ? లేదా అనేది వేచి చూడాలి.

07:17 - August 3, 2015

హైదరాబాద్ : నగరంలో ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్ అని అందరికీ తెలుసు. ఇక దేశ రాజధాని ఢిల్లీ, వ్యాపార కేంద్రం ముంబై అంటారా షరా మామూలే. పొరుగున బెంగళూరు, చెన్నై రాష్ట్రాల్లోనూ చక్రబంధమే. కానీ నింగికి నిచ్చెన వేస్తున్న కాలంలో అంతరిక్షంలోనూ ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదట. అవును నిజం. అంగారకుడిపై యమ ట్రాఫిక్ జామ్‌ అయ్యిందని సైంటిస్టులు గగ్గోలు పెడుతున్నారు. మానవుడు తెలియని గురించి తెలుసుకోవడం కోసం పరుగులు పెడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు ఖండంతరాలు దాటి.. అంతరిక్షం వైపు దూసుకెళుతున్నారు. ఓవైపు భూమిపై లెక్కలేనన్ని పరిశోధనలు చేస్తూనే గ్రహాంతరాలపై అన్వేషణలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయా గ్రహాల పరిణామాల మొదలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలను మానవాళికి, భవిష్యత్తు తరాలకు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అంగారకుడిపై అనేక పరిశోధనలు చేస్తున్న దేశాలు ఎప్పటికప్పుడు అంతరిక్ష నౌకలను పంపిస్తున్నాయి.
నాసా హెచ్చరికలు..
ఈ విస్తృత పరిశోధనల్లో భాగంగా గతేడాది పంపిన అంతరిక్ష నౌకలతో అంగారక గ్రహంపై ట్రాఫిక్ జామ్‌ అయ్యే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. గత ఏడాది మార్స్‌ ఆర్బిటర్ మిషన్‌తో పాటు మరో అంతరిక్ష నౌకను అంగారక గ్రహంపైకి పంపించింది. దీంతో మార్స్ పైకి చేరిన అంతరిక్ష నౌకల సంఖ్య ఐదుకు చేరింది. మార్స్ అట్మాస్పియర్ అండ్ వాలటైల్ ఎవాల్యూయేషన్, భారత్ మామ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ ఎక్స్ ప్రెస్ లతో పాటు నాసా మరో రెండు అంతరిక్ష నౌకలను మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పర్యవేక్షించనున్న నాసా..
గతంలో పోల్చుకుంటే ఇంత పెద్దన అంతరిక్ష నౌకలు మార్స్ పైన ఉన్న దాఖలాలు లేవని నాసా పేర్కొన్నది. అంతరిక్ష నౌకలు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ట్రాఫిక్‌ను నాసా పర్యవేక్షించే చర్యలు చేపట్టింది. అంతరిక్ష నౌకలు ఒకదానికొకటి చేరువయ్యే సమయంలో సంబంధిత ప్రాజెక్టుల బృందాలను హెచ్చరించి, వారి విన్యాసాలను సమన్వయపరుస్తారని నాసా శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గతంలో అంతరిక్ష నౌకలు ఢీ కొట్టుకోకుండా ఒడిస్సీ, ఎంఆర్‌వో నావిగేషన్ బృందాల మధ్య సమన్వయం జరిపారని కాలిఫోర్నియా నాసా ప్రతినిధి రాబర్ట్ షాట్‌వెల్‌ తెలిపారు.

నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది.

నేడు ఢిల్లీలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల నిరసన..

ఢిల్లీ : నేడు ఢిల్లీలో పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

07:04 - August 3, 2015

యూనివర్సిటీలు గాడి తప్పుతున్నాయా? క్రమశిక్షణ లోపిస్తోందా? యూనివర్సిటీ విద్యార్థులు విషవలయంలో చిక్కుకుంటున్నారా? వివిధ యూనివర్సిటీలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి భయమే కలుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అసలు యూనివర్సిటీలలో ఏం జరుగుతోంది? యూనివర్సిటీలలో క్రమశిక్షణ పాదుకొల్పాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఏపీ ఎస్‌ఎఫ్‌ఐ నేత లక్ష్మణ్‌ మాట్లాడారు.

07:01 - August 3, 2015

హైదరాబాద్ : డప్పుల మోతలు... కేరింతలు. ఆడబిడ్డల ఆటాపాటలు... అన్నాచెల్లెళ్ల అనుబంధాలు. ఆ పై భక్తి భావం. వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ. తరాలు మారినా చరిత్రలో భాగమై.. కట్టుబాట్లు చెక్కుచెదరక అనాదిగా... గిరిజనులతో పాటే సమాజంలో అంతర్భాగమైన ఈ సంప్రదాయ మహోత్సవం. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో... హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఆదివాసీల పండగ... ఆడపడుచుల పండగ... అంబరాన్నంటే పండగ... యుగాలు మారినా... తరాలు మారినా... హైటెక్ యుగంలోనూ చెక్కుచెదరని గిరిజనుల బతుకమ్మ. అందుకే తీజ్ పేరు వింటేనే గిరిపుత్రులు పులకరించిపోతారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన పండగను చేసుకునేందుకు సంబరపడిపోతారు.
వర్షాకాలంలో ప్రారంభం..
ప్రతి గిరిజన తండా పచ్చని ప్రకృతిలా మారి ఆకుపచ్చ రంగు పులుముకుంటుంది. పెళ్లికాని ఆడపిల్లలు పెద్ద ఎత్తున జరుపుకునే ఈ తీజ్‌ పండుగతో తండాలు కళకళలాడుతాయి. తండా పెద్దలు, తల్లిదండ్రులు కన్నెపిల్లలకు ఆశీర్వదిస్తే.. సోదరులు వచ్చే ఏడాదికి తమను వీడిపోతుందని పైకి ఉబికి వచ్చే కన్నీళ్లను అదుముకుని.. ఇదే వీడ్కోలు అంటూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తారు. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ తీజ్‌ ఉత్సవాలను ప్రారంభిస్తారు.
ఆఖరి రోజు ప్రత్యేకం..
పెళ్లికాని యువతులు తీజ్ వేడుకల మొదటి రోజు గోధుమలు తెచ్చి ఎరువులతో కూడిన మట్టి బుట్టల్లో విత్తుతారు. అలా విత్తన నాటి నుంచి అత్యంత పవిత్రంగా కేవలం ఆకు కూరలే తింటూ పూజలు నిర్వహిస్తారు. అలా తొమ్మిది రోజుల పాటు నీరు పోసి పూజలు చేసిన అనంతరం బతుకమ్మలా నిమజ్జనం చేస్తారు. అయితే ఆఖరిరోజు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. చివరి రోజు బంధుమిత్రులంతా ఒకచోట చేరి పండుగ సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
కూకట్ పల్లిలో ముగింపు వేడుకలు..
గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ తీజ్ ముగింపు వేడుకలు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి గిరిజన యువతులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి తీజ్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళల గిరిజన సాంప్రదాయ నృత్యాలు.. డప్పుల మోతలు.. యువకుల కేరింతలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది.
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు..
తీజ్ ఉత్సవాలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా విచ్చేశారు. గిరిజనులందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన హక్కులను కేసీఆర్‌ ప్రభుత్వం కాలరాస్తోందని తమ్మినేని విమర్శించారు. పాలకులు తమ సమస్యలను గుర్తించడం లేదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్ అన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణంపోసే బంజారాల సమస్యలు నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగానే మారింది. ఈ తీజ్‌ పండుగ సందర్భంగానైనా తొలి తెలంగాణ ప్రభుత్వంలో పది శాతం రిజర్వేషన్‌ అమలు, గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిద్దాం.

06:57 - August 3, 2015

కృష్ణా : నూతన రాజధాని నిర్మాణానికి ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్, సీడ్ క్యాపిటల్‌ ప్లాన్ రావడంతో, మొదటి దశ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2018 నాటికి సీడ్ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది. అందుకు కావాల్సిన నిర్మాణ పనులకు సంబంధించి కసరత్తులు కూడా మొదలు పెట్టింది. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాజధానికి అవసరమయ్యే సామాగ్రిని జల రవాణా ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
వ్యయంతో పాటు సమయంతో కూడుకున్న పని..
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సీడ్ క్యాపిటల్ ప్రతిపాదిత ప్రాంతం వరకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రి చాలా వరకు విజయవాడ, గుంటూరుపైన ఉన్న ప్రాంతాల నుంచే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి వీటిని తరలించాలంటే వ్యయంతో పాటు సమయంతో కూడుకున్న పని. అలాగే రాజధాని ప్రాంతంలో భారీ వాహనాలు తిరిగేంత రహదారులు కూడా అందుబాటులో లేవు. దీంతో...తక్కువ వ్యయంతో సులభంగా జలరవాణా ద్వారా అత్యధిక భాగం సామాగ్రిని తరలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
జల రవాణా అయితేనే సులభం...?
రాజధానికి అవసరం అయ్యే ఎక్కువ భాగం సామాగ్రి కృష్ణా నది ప్రాంతంలోనే ఉండడంతో, కృష్ణా నదిలో జలరవాణా ద్వారా ఆ సామాగ్రిని తరలిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కాల్వలపై సర్వేలు కూడా పూర్తి చేసింది. నల్లగొండ జిల్లా-విజయవాడల మధ్య ఈ జల రవాణా చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తోంది. సీడ్ క్యాపిటల్ నిర్మాణం కూడా కృష్ణా నది ఒడ్డున ఏర్పాటవుతండటంతో జల రవాణా అయితేనే సులభంగా ఉంటుందనేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.
కొన్ని ఆటంకాలు..
అయితే కృష్ణానది జల రవాణాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. కృష్ణానదిలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు పడవలకు అడ్డుకునే అవకాశముంది. సాధారణంగా వెయ్యి టన్నుల సరుకుతో పడవలు నడవాలంటే కాలవలో 8 అడుగుల లోతు వరకు నీరుండాలి. అలాంటి ప్రాంతాల్లో ఇసుక దిబ్బలను తొలగిస్తేనే కృష్ణానదిలో జలరవాణా ద్వారా రాజధాని సామాగ్రిని తరలించవచ్చు.

06:36 - August 3, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆయన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన అన్నింటికీ... కేబినేట్‌ సబ్‌ కమిటీనే ఆధారం అంటారు. అవును నిజం..! తెలంగాణ సర్కారులో మంత్రివర్గ ఉపసంఘాల జోరు కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం మొదలు... నూతన విధానాల రూపకల్పన వరకు... కేబినేట్ సబ్‌-కమిటీలనే కేసీఆర్ నమ్ముకుంటున్నారు. తాజాగా ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య శాఖపై కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు తెలంగాణ సీఎం.
ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదికలు..
తెలంగాణ ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలకమైన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అధికారికంగా 14 క్యాబినేట్‌ సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ సర్కారులో మంత్రివర్గ ఉపసంఘాల జోరు కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది.
2014 నవంబర్ 17న మొదలు..
2014 నవంబర్‌ 17న మొదలైన మంత్రివర్గ ఉప సంఘాల పరంపర నేటికీ కొనసాగుతోంది. ఇదే రోజు సీఎం కేసీఆర్.. రైతు రుణమాఫీ, మిషన్‌ కాకతీయపై రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పోటీ పరీక్షల విధానం, సిలబస్‌ మార్పు, వయో పరిమితి పెంపు తదితర అంశాలను చర్చించేందుకు డిప్యూటీ సీఎం కడియం అధ్యక్షతన మరో కమిటీ వేశారు. ఇక పెండింగ్ ప్రాజెక్టుల పనులు, సర్వశిక్ష అభియాన్లపై మరో మంత్రుల కమిటీ పనిచేస్తున్నాయి.
తాజాగా మున్సిపల్ సమ్మెలపైనా కమిటీలు..
ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ కోసం ఓ క్యాబినేట్‌ కమిటీ, గోదావరి పుష్కరాలు, ఆర్టీసీతో పాటు తాజాగా మున్సిపల్‌ సమ్మెలపైనా కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఇపుడు మరో సబ్‌ కమిటీని నియమించారు సీఎం కేసీఆర్. వాణిజ్య పన్నుల అంశాలపై అధ్యయనానికి మంత్రి తలసాని అధ్యక్షతన మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. పన్నుల ఎగవేతను అరికట్టడంతో పాటు పన్నులు కట్టకుండా ఆదాయాన్ని రాబట్టడంపై ఈ మంత్రుల కమిటీ పనిచేస్తుంది. 
14 సబ్ కమిటీలు..
కీలకమైన పలు అంశాలపై పూర్తిస్థాయిలో కూలంకుశంగా అధ్యయనం చేస్తున్న కమిటీలు.. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, గత ప్రభుత్వాల అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఆయా శాఖ మంత్రుల సలహాలు, అధికారుల సూచనలకే పరిమితం కాకుండా ఈ కమిటీలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మంత్రివర్గ ఉపసంఘాలు ప్రభుత్వాల్లో సర్వసాధారణమైనా.. కేవలం ఏడాది పాలనలో 14 సబ్‌ కమిటీలను నియమించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

06:34 - August 3, 2015

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పట్టిసీమ. పట్టిసీమ ప్రాజెక్టు పనుల్లో అడుగడుగునా అక్రమాలు. నాణ్యతా ప్రమాణాలు పట్టని కాంట్రాక్టర్లు.. నాసిరకం పనులతో పనికానిచ్చేస్తూ.. కోట్లు రూపాయలను దోచుకుంటున్నారు. అవినీతి బాగోతం తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్మనడం లేదు. పైగా కాంట్రాక్టర్ల అక్రమాలకు అనుమతి ఇచ్చారా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఏ విపక్ష పార్టీలు చెప్తోంది కాదు.. ప్రజా సంఘాలు అసలే కాదు. అక్షరాల మేధావులు, నిపుణులు బయటపెట్టింది.
విపక్షాల పోరుబాట..
పట్టిసీమ ప్రజాప్రయోజనాలు పక్కనపెడితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోని విపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, నిపుణులు, మేధావుల్లోను పలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కారు తీరును ఎండగడుతూ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. మిత్రపక్షం కూడా పట్టిసీమ లిఫ్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఆగస్టు 15న తొలిదశ ప్రారంభం..
ఆగష్టు 15న పట్టిసీమ ప్రాజెక్టు తొలిదశ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అయితే ఈ హడావుడి నేపథ్యంలో సాగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కనీస స్థాయిలో కూడా కనిపించడం లేదు. త్వరితగతిన పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలకులు, అధికారులు అసలు విషయాన్ని గాలికొదిలేశారు. దీంతో ప్రస్తుతం సాగుతున్న పనులు అత్యంత నాసిరకమని స్పష్టంగా తెలుస్తోంది. సరైన పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా కాలువ పనులు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జేబుల్లోకి వెళుతున్న కోట్ల రూపాయలు..
పట్టిసీమ ప్రాజెక్టు పనుల్లో కొందరు అధికార పార్టీ నేతలు.. మట్టి మాఫియా రూపంలో సొమ్ము చేసుకుంటూ చెలరేగిపోతున్నారు. పోలవరం కుడికాలువ ద్వారా నీటిని తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తమకనుకూలంగా మలుచుకుంటున్నారు. కాలువ మట్టిని. ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలిస్తూ నాయకులు వేల కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపేసుకుంటున్నారు. టెన్‌ టీవీ అడిగిన ప్రశ్నలకు అక్కడున్న సిబ్బంది బుకాయిస్తున్నారు.
వంతెనల స్థానంలో పైపుల నిర్మాణం..
ఇప్పటికే పోలవరం కుడికాలువ పనుల్లో భాగంగా పలుచోట్ల వంతెనల నిర్మాణం పనులు సాగుతోంది. మరికొన్ని చోట్లు అక్విడెక్ట్‌ల నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ఇపుడు వంతెనల స్థానంలో పైపులను ఏర్పాటు చేస్తోంది. వంతెనలను వదిలి పైపుల నిర్మాణం అంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేయడమే అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఏపీ సర్కారు స్పందించి.. పట్టిసీమ ప్రయోజనాలను కాపాడాలని, లేకుంటే వేల కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పరమై.. ప్రాజెక్టు అసలు నాణ్యతా ప్రమాణాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

06:31 - August 3, 2015

నల్గొండ : క్షణ క్షణం ఉత్కంఠ. కన్నవారిలో ఆందోళన. తమ గారాల పట్టి సజీవంగా తిరిగి రావాలని దేవుళ్లను వేడుకుంటూనే... నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూశారు. మూడు గంటల పాటు నిరంతరాయంగా పోరాటం చేసిన సహాయక సిబ్బంది బోరుబావి నుంచి పిల్లాడిని సజీవంగా బయటికి తీశారు. తమ ప్రార్థన దైవం ఆలకించిందని తల్లిదండ్రులు సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.                                                                    
అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదన్న మృతుడి బంధువులు..
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు శివ వ్యవసాయ భూమిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. కొడుకు బోరుబావిలో పడిపోయాడని తెలియగానే నందిత, నర్సింహులు దంపతులు హతశులయ్యారు. బాలుడిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు జేసీబీల సాయంతో తవ్వకాలు చేపట్టి 20 అడుగుల లోతులో చిక్కుకున్న శివను వెలికి తీశారు. వెంటనే అంబులెన్స్ లో బాలుడిని నాగార్జున సాగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శివ చనిపోయాడు. దీంతో శివ తల్లిదండ్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే బాలుడు చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. 

06:29 - August 3, 2015

హైదరాబాద్ : హోంమంత్రి నాయినికి ఉద్వాసన తప్పదా..? త్వరలోనే కేబినెట్ నుంచి బయటకు వెళ్లనున్నారా..? అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. అల్లుడు శ్రీను వ్యవహారంతో... మామకు షాక్ తప్పదంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల వరకు కూడా... మంత్రివర్గంలో నాయిని ఉండకపోవచ్చనే... ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. సాక్షాత్తూ హోం మినిస్టర్... అల్లుడు శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీనివాస్ రెడ్డిపై అనేక ఆరోపణలు..
పోలీసు వాహనాల కొనుగోళ్లలోనూ శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మామ మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్న సెటిల్ మెంట్ల వ్యవహారం ఇప్పుడు నాయిని మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పరిస్థితి గ్రేటర్ లో అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో అధికార పార్టీ నేతలు ఇలా వ్యవహారించడం పార్టీని మరింత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో హోంమంత్రిని వీలైనంత త్వరలో ఆ శాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకుంటుంది.
కేసీఆర్ సీరియస్ ?
ఇటీవల కేబినెట్‌లో మార్పులు-చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలో... నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సెటిల్‌మెంట్ల వ్యవహారం రోజురోజుకు వివాదంగా మారుతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ రెడ్డి సెటిల్‌మెంట్లపై ఆరా తీయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారట. అంతేకాకుండా నాయిని నర్సింహారెడ్డిని మందలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలా..? లేదా..? అనే విషయంలో... కేసీఆర్‌ తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. మినిస్టర్ పోస్టు నుంచి తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకే అధినేత మొగ్గు చూపుతున్నారని తెలంగాణ భవన్‌ వర్గాలు అంటున్నాయి. మరి అల్లుడి శ్రీను వ్యవహారం నుంచి మామ నర్సింహారెడ్డి ఎలా భయపడతారో చూడాలి.

06:27 - August 3, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఏపీని ఉద్దేశించి కాదని టీడీపీ వాదిస్తుంటే...ప్రజల నమ్మకాన్ని రెండు పార్టీలు వమ్ము చేశాయని మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి. స్పెషల్ స్టేటస్ సాధించే వరకు పోరాటం ఆగదని వామపక్షాలు స్పష్టం చేశాయి. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధించుకోవడంలో విఫలమైందని టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
బాబు పోరాటం చేయాలన్న సీపీఎం..
ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు డిమాండ్‌ చేశారు. ఈవిషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరి సరిగా లేదని సీపీఎం ఏపీ ప్రధాన కార్యదర్శి మధు అన్నారు. స్పెషల్ స్టేటస్ సాధనపై చంద్రబాబు కేంద్రంతో రాజీ ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు.
సీపీఐ ఉద్యమబాట..
మరోవైపు ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఉద్యమబాట పట్టింది. ఏపీకి స్పెషల్ స్టేటస్‌తో పాటు ఉత్తరాంధ్ర, రాయాలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం బస్సుయాత్రను ప్రారంభించింది. విశాఖకు చేరుకున్న బస్సు యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రప్రభుత్వం దిగిరాగకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
చట్టం హామీలను నెరవేరుస్తామన్న సీతారామన్..
ఏపీకి స్పెషల్ స్టేటస్ సాధించకుంటే చంద్రబాబు తమ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్‌ నాయకురాలు కిల్లి కృపారాణి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అయితే మొన్న కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని సీతారామన్....విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు.
బీజేపీతో పోరాటం వద్దన్న ప్రత్తిపాటి..
ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లో విరమించేది లేదని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. విపక్షాలు అనవసరంగా ఆవేశపడుతున్నాయన్న ఆయన బీజేపీతో పోరాటంతో చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనన్నారు. విభజన సమయంలో ఏమాత్రం ఏకతాటిపైకి రాని రాజకీయ పార్టీలు...ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నాయి. మరి నిప్పు, ఉప్పులా ఉన్న టీడీపీ, వైసీపీ భుజం భుజం కలిపి...మిగతా పార్టీలతోనూ జతకట్టి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడతాయా...లేదంటే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి దేనికదే పోరు సాగిస్తాయా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. 

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ..

ఢిల్లీ : అఖిలపక్ష భేటీకంటే ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో జరిగే ఆ సమావేశంలో అఖిలపక్ష భేటీలో, పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరును, మోడీ గేట్, వ్యాపమ్ లపై ప్రభుత్వంపై దాడి వ్యూహాన్ని నిర్ణయిస్తారు. 

నేడు అఖిలపక్ష భేటీ..

ఢిల్లీ : పార్లమెంట్ లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం మరో అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేటి భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించినట్లు మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. 

నేటి నుండి భారత్ - బంగ్లా అధికారుల చర్చలు..

ఢిల్లీ : భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య భూ బదలాయింపు ఒప్పందం అమల్లోకి వచ్చి నేపథ్యంలో పలు అంశాలపై సరిహద్దు భద్రతా దళాల అధికారులు సోమవారం నుండి చర్చలు జరుపనున్నారు. 

నేడు రంగం..

హైదరాబాద్ : లష్కర్ ఉత్సవాల్లో ప్రముఖమైన ఘట్టం రంగం. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ మాతం స్వర్ణలత సోమవారం ఉదయం ఈ రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తుంది.

 

నేడు ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు.

 

బలహీనపడిన వాయుగుండం..

హైదరాబాద్ : బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Don't Miss