Activities calendar

04 August 2015

నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత..

శంషాబాద్: ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టుకున్నారు. తనిఖీలకు భయపడి ప్రయాణికులు బంగారాన్ని బాత్ రూంలోనే వదిలి వెళ్లారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

22:02 - August 4, 2015

ఢిల్లీ: సభలో నిరసనలు. సభ వెలుపలా నిరసనలే. ఐతే ఈ సెగలను ఏమాత్రం పట్టించుకోకుండా... లోక్‌సభ సజావుగా సాగిపోయింది. ఏపీ ప్రత్యేక హోదా, తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల అదనపు నిధులు, ఎస్ సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభ మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే బుధవారానికి వాయిదా పడిపోయింది.
ఉభయసభల్లో మిశ్రమ పరిస్థితులు
మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభల్లో మిశ్రమ పరిస్థితులు కనిపించాయి. రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగగా... లోక్‌సభ రెండు వారాల తర్వాత... 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌ తర్వాత... చిన్నపాటి నిరసనలు మినహా సజావుగా సాగిపోయింది.
ప్రత్యేక హోదా ప్రస్తావన
ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీలు... ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని, అసెంబ్లీ, సెక్రటేరియట్... ఎలాంటి కనీస వసతులు లేకుండా... లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఏపీకి స్పెషల్ స్టేటష్‌ కల్పించాల్సిందేనని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సైతం ఇదే విషయంపై పట్టుపట్టారు. టీడీపీకి మంత్రిపదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ సభ్యుడు అవంతి శ్రీనివాస్‌ తేల్చిచెప్పారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రత్యేక హైకోర్టు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సైతం ఇదే వాణి వినిపించారు. వీలైనంత త్వరగా హైకోర్టు విభజన జరపాలని కోరారు. ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తే... హైదరాబాద్‌లో బిల్డింగ్ ఇవ్వటానికి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేసేందుకు... కేంద్రప్రభుత్వం సిద్ధంగా వుందని... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అంశాన్ని ఆర్ధిక శాఖ పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు.
వాయిదాల పర్వం
రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభమవగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. సభాపతి పోడియం వద్దకు దూసుకెళ్లి... సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారు. దీంతో ఐదు నిమిషాలకే సభ వాయిదా పడిపోయింది. ఇలా రెండు సార్లు వాయిదా తర్వాత సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో సభాపతి బుధవారానికి సభను వాయిదా వేశారు.

 

21:50 - August 4, 2015

హైదరాబాద్: ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై సీసీఎస్ దూకుడు పెంచింది. ఐదుగురిని విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మరోసారి విచారణకు పిలిచి కీలక నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్మిత భర్త ఐపిఎస్ అకుల్ సభర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు కొసాగిస్తున్నారు. సీఆర్పీసీ 41ఎ ప్రకారం ఔట్‌లుక్‌ ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం హైదరాబాద్ రెసిడెంట్‌ ఎడిటర్ మాధవి, మ్యాగజైన్‌ ఎడిటర్-ఇన్-చీఫ్ కృష్ణ ప్రసాద్, కార్టూనిస్టు సాహిల్ బాటియా, అవుట్ లుక్ ప్రెసిడెంట్ ఇంద్రానిల్ సహా పలువురు సీసీఎస్ పోలీసుల ఎదుట తమ న్యాయవాదితో కలిసి హాజరయ్యారు.

 

21:47 - August 4, 2015

ఢిల్లీ: లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు చెరలోని తెలుగువారి జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని ఉగ్రవాదులు విచిడిపెట్టి.. తెలుగు వారిని మాత్రం విడుదల చేయకపోడంతో.. భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికి వరకూ కూడా ఉగ్రవాదులు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. మరింత కలత చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా... ఐఎస్‌ఐఎస్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బలరామ్‌ కిషన్‌, గోపీకృష్ణ కుటుంబసభ్యులు బాధపడుతున్నారు. అయితే ఉగ్రవాదుల చెరలోని తెలుగువారు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

 

21:44 - August 4, 2015

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ అధికారిక మెయిల్‌ ఐడీ పని చేయటం లేదు. కారణం దాని పాస్‌వర్డ్ ను అధికారులు మర్చిపోవటమే. దీంతో అనేక ముఖ్యమైన, కాన్ఫిడెన్షియల్‌ డాక్యుమెంట్స్ ను సైతం సీఎంకు అందని పరిస్ధితి ఏర్పడింది. నీతి అయోగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌ కూడా కేంద్రం ఇదే మెయిల్‌కు పంపింది. సమస్యను చెప్పినా.. మరో మెయిల్‌ ఐడీకి పంపడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఈ మెయిల్‌ను ఓపెన్‌ చేయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

 

21:40 - August 4, 2015

హైదరాబాద్: ముఖం పుస్తకం అదే ఫేస్‌బుక్‌లో పేజీలు తిరగేసి.. పెళ్లిపుస్తకం మొదలెట్టింది. కొన్ని పేజీలు తిరిగాయో లేదో ఇంతలోనే ఆ పుస్తకం చిరిగిపోయింది. జంటగా ఉంటానన్న ప్రేమపక్షి ఎగిరిపోయింది. కన్నవాళ్లను కాదనుకుని ప్రేమకే పెద్దపీట వేసిన ఆ అమ్మాయిని ఆ ప్రేమే మోసం చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన శరన్ అనే అమ్మాయి ఫేస్‌బుక్ ప్రేమికుడి ఆటకు బలి అయింది. ఫేస్‌బుక్‌ ప్రేమ ఆ అమ్మాయి జీవితాన్ని చిధ్రం చేసింది.
ప్రేమకు దారి తీసిన ఫేస్‌బుక్ పరిచయం
ఆర్మూర్‌కు చెందిన ధనుంజయ్ ఈమెకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. 2014 నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది..కానీ చీటింగ్ చేస్తాడని ఈ అమ్మాయి ఊహించలేదు. సౌదీఅరెబియాలో ఉంటున్న ధనుంజయ్ ఈ ఏడాది మార్చిన ఇండియాకు వస్తున్నానని ఈమెను పెళ్లాడతానని చెప్పాడు. చెప్పినట్టు పెళ్లి కూడా చేసుకున్నాడు.
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో సంసారం
సీన్‌కట్ చేస్తే...హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో కాపురం కూడా పెట్టారు. మోజు తీరిన ధనుంజయ్‌ ఆ అమ్మాయికి చెప్పకుండానే అబార్షన్‌ కూడా చేయించేశాడు. ఆ తర్వాత గాయబ్‌ అయిపోయాడు.
పారిపోయిన భర్త ధనుంజయ్
కృష్ణానగర్ నుంచి చెప్పాపెట్టకుండా ధనుంజయ్ తన సొంత గ్రామం ఆర్మూర్‌కు చేరుకున్నాడు. భర్తను వెతుక్కుంటూ వెళ్లిన శరన్ జరిగిన విషయాన్ని ఆర్మూర్ సీఐ రాంరెడ్డికి వివరించింది. కాని ఆ సీఐ సమస్యను పట్టించుకోకుండా తన పట్ల దురుసుగా వ్యవహరించాడని...శరన్ ఆరోపిస్తోంది.
ఐద్వాను ఆశ్రయించిన శరన్‌
చివరికు తనకు జరిగిన అన్యాయంపై ఐద్వా మహిళా సంఘాన్ని ఆశ్రయించింది శరన్‌. పోలీసులు స్పందించి..శరన్‌కు న్యాయం చేయాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయపోరాటానికి దిగిన శరన్‌ పోలీసులు స్పందించాలని డిమాండ్‌ చేస్తోంది.

 

 

ఆస్తికోసం తల్లిపై కొడుకు హత్యాయత్నం..

హైదరాబాద్: శంషాబాద్ మండలం లాలాగూడలో దారుణం జరిగింది. ఆస్తికోసం తల్లిపై కొడుకు అత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్తికోసం తల్లి శంకరమ్మను ఆమె కొడుకు కత్తితో పొడిచాడు. శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 

బస్సప్ప మృతిపై ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక వెల్లడి..

హైదరాబాద్: మారేడ్ పల్లి పిఎస్ పై దాడి కేసులో బస్సప్ప మృతిపై ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. బస్సప్ప గొంతులో ఆహారం ఇరకడంతో శ్వాస ఆడక చనిపోయినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. 

తెలుగు టైటాన్స్ - జైపూర్ పాంథర్స్ ప్రొ కబడ్డీ మ్యాచ్ డ్రా

హైదరాబాద్: తెలుగు టైటాన్స్, జైపూర్ పాంథర్స్ మధ్య జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్ డ్రా అయింది. హైదరాబాద్ లోని గచ్చిబోలి స్టేడియంలో ప్రొ కబడ్డీ మ్యాచ్ జరిగింది. 

ఈనెల 7 నుంచి తెలంగాణ వాటర్ గ్రిడ్ కు టెండర్ల స్వీకరణ

హైదరాబాద్: గ్రామీణ నీటిపారుదల శాఖ ఈనెల 7 నుంచి తెలంగాణ వాటర్ గ్రిడ్ కు టెండర్లు స్వీకరించనున్నారు. 11 రోజుల పాటు టెంటర్లను స్వీకరించనున్నారు. 

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. యూనివర్సిటీల నూతన చట్టం, ఉస్మానియా ఆస్పత్రి తరలింపు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ కొనసాగుతోంది. 

ప్రారంభమైన ప్రొ కబడ్డీ తొలి మ్యాచ్

హైదరాబాద్: నగరలోని గచ్చిబోలి స్టేడియంలో ప్రొకబడ్డీ తొలి మ్యాచ్ ప్రారంభం అయింది. జైపూర్ పాంథర్స్ తో తెలుగు టైటాన్స్ తలపడుతోంది. ఆఫ్ టైమ్ కు తెలుగు టైటాన్ 20 పాయింట్లు, జైపూర్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించాయి. మ్యాచ్ హోరాహోరిగా సాగుతోంది. రాత్రి 9 గంటలకు యూ ముంబాతో దబాంగ్ ఢిల్లీ తలపడనుంది. అల్లు అర్జున్, సచిన్, అభిషక్, ఐశ్వర్యారాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 

20:08 - August 4, 2015

హైదరాబాద్: మాస్టర్ సచిన్ టెండుల్కర్ హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రచారకార్యక్రమంలో సందడి సందడి చేశాడు. ఇనార్బిట్ మాల్ లోని స్మాష్ జోన్ ను ప్రారంభించాడు. సచిన్ ను చూడటానికి అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రోకబడ్డీలీగ్ హైదరాబాద్ అంచె పోటీల్లో ...మాస్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటాడు.

 

20:03 - August 4, 2015

చిత్తూరు: తిరుమలలో లడ్డూ కౌంటర్లు నిర్విరామంగా పనిచేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్టు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో బ్యాంకర్లతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. కౌంటర్లు పూర్తి స్థాయిలో పని చేయక పోవడంతో భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుంచి అన్ని కౌంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాపేపట్లో ప్రొ కబడ్డీ తొలి మ్యాచ్ ప్రారంభం

హైదరాబాద్:  నగరలోని గచ్చిబోలి స్టేడియంలో కాపేపట్లో ప్రొ కబడ్డీ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. జైపూర్ పాంథర్స్ తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు యూ ముంబాతో దబాంగ్ ఢిల్లీ తలపడనుంది. అల్లు అర్జున్, సచిన్, అభిషక్, ఐశ్వర్యారాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

19:48 - August 4, 2015

హైదరాబాద్: యూనివర్శిటీల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై గవర్నర్‌కు నివేదించినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గవర్నర్‌తో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు భేటీ అయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. వివాదాలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని గంటా శ్రీనివాస్‌రావు తెలిపారు. 

19:39 - August 4, 2015

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటించారు. కొత్తమాజేరులో వరుస మరణాలపై జగన్‌ ఘాటుగా స్పందించారు. కొన్ని నెలలుగా 18 మంది చనిపోయినా.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. జగన్‌ ఆరోగ్యశాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ ఇక్కడకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రత గుర్తించి తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఇంతమంది మరణించేవారు కాదని అన్నారు. 

19:08 - August 4, 2015

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవుల కంటే... రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ ఎంపీ శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో... సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని... పరిశ్రమలు, విద్యాసంస్థలు తెలంగాణకే పోయాయని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

18:44 - August 4, 2015

గుంటూరు: విద్యార్థిని రిషితేశ్వరి డైరీ వివరాలు మీడియాకు లీక్ అయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ రామకృష్ణపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. రిషితేశ్వరి డైరీ వివరాలు బయటకిపొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఆధీనంలో ఉన్న డైరీ వివరాలు మీడియాకు లీక్‌ చేయడంపై మండిపడ్డారు. వివరణ ఇవ్వాలంటూ డీఎస్పీని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే నాగార్జున వర్సిటీలో రేపటి నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయి. ఈనేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితిలు తలెత్తే అవకాశం ఉందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

రిషితేశ్వరి డైరీ వివరాలు మీడియాకు లీక్..

గుంటూరు: విద్యార్థిని రిషితేశ్వరి డైరీ వివరాలు మీడియాకు లీక్ అయ్యాయి. పోలీసుల ఆధీనంలో ఉన్న రిషితేశ్వరి డైరీ వివరాలను మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ మీడియాకు లీక్ చేయడంపై పోలీస్ ఉన్నతాధికారులు అతనిపై సీరియస్ అయ్యారు. డైరీ వివరాలను మీడియాకు లీక్ చేయడంపై వివరణ ఇవ్వలంటూ ఉన్నతాధికారులు డీఎస్పీని ఆదేశించించారు. నాగార్జున వర్సిటీలో రేపటి నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయి. ఈనేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితిలు... తలెత్తే అవకాశం ఉందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

18:08 - August 4, 2015

జోగిని వ్యవస్థను రద్దు చేయాలని వక్తలు తెలిపారు. బోనాలు...రంగం.. జోగిని వ్యవస్థ.. అనే అంశంపై టెన్ టివి మానవి వేదిక చర్చా కార్యక్రమంలో రచయిత్రి, పరిశోధకురాలు గోగు శ్యామల, జోగిని వ్యవస్థ వ్యతిరేకపోరాట సంఘటన్ కన్వీనర్.. గ్రేస్ నిర్మల పాల్గొని, మాట్లాడారు. బోనాల పండుగలో రంగం అనేది భవిష్యవాణి. స్త్రీలు భవిష్యవాణి చెప్పడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో ఒక మతం చేసే క్రతువు బోనాలు అని తెలిపారు. బోనాలు.. వ్యవసాయక పండుగ అని చెప్పారు. జోగిని వ్యవస్థ హిందూమతంలో భాగంగా నడుస్తోందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల సంస్కృతిపై దాడి చేయడమే జోగిని వ్యవస్థ అని తెలిపారు. జోగిని వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అందుకు చట్టంలో మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను అటాచ్ మెంట్ చేయాలని పేర్కొన్నారు. మనిషిని మనిషిగా చూడాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:56 - August 4, 2015

హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్ధితులపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్ధితులు.. ప్రస్తుత వ్యవసాయంపై సీఎం అధికారులను వివరాలు అడిగారు. కరువు పరిస్ధితులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై కసరత్తు చేయాలని సీఎం కోరారు.

 

గవర్నర్ నరసింహన్ ను కలవనున్న సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : మరి కాసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, యూనివర్సిటీ చట్టాలకు సంబంధించి గవర్నర్‌తో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

17:52 - August 4, 2015

ఢిల్లీ: బీజేపీ అప్రజాస్వామిక పాలనను గ్రామగ్రామాన వివరిస్తామని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అవినీతి మంత్రులను సస్పెండ్‌ చేయాలని కోరితే సభ నుంచి 25 మంది కాంగ్రెస్‌ సభ్యులనే సస్పెండ్‌ చేశారని... ఇది ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డే అని వీహెచ్‌ అన్నారు. కళంకిత మంత్రులను తొలగించేవరకు తమ పోరు ఆగదని అన్నారు. 

హస్తినకు బయలు దేరనున్న గరవ్నర్

హైదరాబాద్ : ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న గవర్నర్ తెలుగు రాష్ట్రాలో ఉన్న తాజా పరస్థితులను కేంద్రం పెద్దలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.

స్వాష్ గేమ్ జోను ప్రారంభించిన సచిన్...

హైదరాబాద్ : ఇన్ ఆర్బిట్ మాల్ లో స్వాష్ గేమ్ జోను సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని... హైదరాబాద్ వస్తే బిర్యాని తప్పకుండా తింటా అని తెలిపారు.

గవర్నర్ తో ముగిసిన గంటా భేటీ...

హైదరాబాద్ : ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి గంటా, గవర్నర్‌తో సమావేశమయ్యారు. పదో షెడ్యూల్‌లోని సంస్థలైన అంబేద్కర్ యూనివర్సిటీ, జవహార్‌ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలకు సంబంధించి ఏపీలో ఉన్న సెంటర్లకు అడ్మిషన్లు నిలిపివేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసికెళ్లారు. ఆయా సెంటర్లలో ఉద్యోగుల జీతాలను కూడా నిలిపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గంటా ఫిర్యాదు చేశారు.

17:12 - August 4, 2015

హైదరాబాద్: బాలీవుడ్‌లో బజరంగీ భాయిజాన్‌ భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంటే..మరోవైపు అటు టాలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ బాహుబలి కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది. విడుదల అయిన నాలుగు వారాల్లో ఇప్పటివరకు 500 కోట్ల బెంచ్‌ మార్క్ ను దాటి కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది.
బాలీవుడ్‌లో 100 కోట్ల కలెక్షన్స్
ఎస్ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం..ప్రభాస్‌, రానా నటనకు టాలీవుడ్‌ అభిమానులే కాదు..బాలీవుడ్‌ అభిమానులు కూడా జీ హుజూర్‌ అంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 2వేల థియేటర్లలో ఆడుతున్న బాహుబలి వసూళ్ల పరంగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఒక్క బాలీవుడ్‌లోనే ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తెలుగులో ప్రధానంగా రూపొంది..హిందీ, తమిళంలో డబ్బింగ్‌ అయిన ఒక చిత్రం బాలీవుడ్‌లో 100 కోట్ల మార్క్‌ను బాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. అంతకు ముందు...రోబో తమిళ చిత్రం హిందీలోకి డబ్‌ అయి బాలీవుడ్‌లో 23 కోట్లను వసూలు చేసింది. ఈ తర్వాత 100 కోట్ల మార్క్ ను సొంతం చేసుకున్న ఏకైక చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టిస్తోంది.
500 కోట్ల క్లబ్‌లో చేరిన బాహుబలి
ఈ విషయాలన్నీ ఎవరో చెప్పినవి కాదు..ఏకంగా ఫొర్బ్ మ్యాగజీన్‌...తన పత్రికలో బాహుబలి విశేషాలను పేర్కొంది. మూడు భాషల్లో విడుదలై..500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన ఏకైక చిత్రంగా బాహుబలి తన ప్రత్యేకతను చాటుకుంది. అంతకు ముందు 2013లో యశ్‌రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ధూమ్‌-3, పీకే చిత్రాల తర్వాత 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టించింది. అదీ కేవలం విడుదలైన నాలుగువారాల్లోనే. నెలరోజుల్లోనే 500 కోట్లు దాటితో..రానున్న రోజుల్లో బాహుబలి మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.

 

17:05 - August 4, 2015

నెల్లూరు: ర్యాగింగ్‌ భూతాన్ని తరిమికొట్టాలన్న నినాదంతో నెల్లూరులో విద్యార్థులు మాక్‌ ర్యాగింగ్‌ నిర్వహించారు. అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలకు ఎలా గుణపాఠం చెప్పాలో విద్యార్థినులు చేసి చూపించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్‌ భూతం దిష్టిబొమ్మను దహనం చేశారు. 

17:00 - August 4, 2015

హైదరాబాద్: లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. తన భార్యాపిల్లలను చూడగానే లక్ష్మీకాంత్‌ బోరున విలపించారు. భారత ప్రభుత్వం కృషి వల్లే లక్ష్మీకాంత్‌ను ప్రాణాలతో చూడగలిగామని అతని భార్య ప్రతిభా, తల్లి సావిత్రమ్మ తెలిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు సైతం క్షేమంగా రావాలని ఆకాంక్షించారు.

 

ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం:అశోక్ బాబు...

హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఉద్యోగుల బదిలీల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదిస్తామన్నారు. ఆగస్టులో బదిలీల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారన్నారు. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, తహసీల్ధార్ వనజాక్షి అంశంపై విచారణ కమిటీ అన్ని విషయాలను తేలుస్తుందన్నారు.

16:54 - August 4, 2015

ఢిల్లీ: లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యంలో గొంతునొక్కడమేనని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన నేతలను గతంలో సస్పెండ్‌ చేశారని.. ప్రస్తుతం మోడీ సర్కార్‌ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 

డిండి ప్రాజెక్టు పై మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష...

హైదరాబాద్: డిండి ప్రాజెక్టుపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో జరిపిన ఈ సమావేశానికి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. 

గవర్నర్ తో ఏపీ మంత్రి గంటా భేటీ

హైదరాబాద్: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్ది సేపటి క్రితం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో యూనివర్శిటీల్లో ప్రవేశాల అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈఅంశం పై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే..

16:51 - August 4, 2015

హైదరాబాద్: 25 మంది కాంగ్రెస్ ఎంపీలను 5రోజుల పాటు సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎంపీలు పోరాడుతుంటే...బీజేపీ మాత్రం వారిని సస్పెండ్‌ చేసి పెద్ద తప్పు చేసిందన్నారు. వారికి మద్దతుగా తాము కూడా కేంద్రంపై పోరాడుతామని రఘువీరా అన్నారు. 

హిందుస్థాన్ కీ బాత్ వినండి మోదీజీ: రాహుల్....

ఢిల్లీ:మన్ కీ బాత్ దేశ ప్రజలకు చెప్పడం కాకుండా దేశ ప్రజల మన్ కీ బాత్ వినాలని రాహుల్ గాంధీ ప్రధానికి సూచించారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనలు వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల రాజీనామాలు కోరుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని, నూరు కోట్ల భారతావని అని స్పష్టం చేశారు. వ్యాపం కుభకోణంలో ఆ రాష్ట్ర ప్రజలు సమిధలయ్యారని, సుష్మాస్వరాజ్ చట్టాలు ఉల్లంఘించారని, వసుంధర రాజేకు, లలిత్ మోదీకి సంబంధాలు ఉన్నాయని అందుకే రాజీనామాలు కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

గాంధీ భవన్ ఎదుట ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం....

హైదరాబాద్: పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా.. గాంధీభవన్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.... బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం తగదన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతాయని, దీన్ని తట్టుకోలేని బీజేపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభను నడపాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు.

నాలుగేళ్ల చిన్నారిని కడతేర్చిన కర్కశతల్లి...

వరంగల్ : చిట్యాల మండలం అంకుశాపూర్‌లో 15 రోజుల క్రితం నందిని(4) అనే చిన్నారి అదృశ్యమైంది. అయితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాలో శవమై కనిపించింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే చిన్నారిని కన్నతల్లే చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నందిని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు....

ముంబై : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. 115 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 28,072 వద్ద ముగియగా, నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 8,517 వద్ద ముగిసింది. మంగళవారం ఉదయం స్టాక్‌మార్కెట్లు 100 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 30 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ప్రారంభమయ్యాయి. 

16:41 - August 4, 2015

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు... ప్రత్యేకంగా హైకోర్టులు ఏర్పాటు చేయటానికి.. కేంద్రప్రభుత్వం సిద్ధంగా వుందని... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందని చెప్పారు. సున్నితమైన ఈ అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వెంకయ్యనాయుడు తెలిపారు. 

వర్షాభావ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష....

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆగస్టు మొదటి వారం వచ్చినా... నేటికీ రాష్ట్రంలో ఆశాజనకంగా వర్షాలు కురవలేదు. దీంతో ప్రధాన సాగునీటి వనరుల్లో నీటి సామార్ధ్యం పెరగలేదు. అంతేగాక రోజురోజుకూ ఎండల తీవ్రత అధికమవుతుండడంతో చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా బిక్కి పోతోంది. తొలకరి ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే కొన్ని జిల్లాల్లో రైతులు ఆయా పంటలు సాగుచేశారు. ప్రస్తుతం ఆ పంటల పరిస్థతి ఆగమ్య గోచరంగా తయారైంది.

సెక్రటేరియట్ దగ్గర ఓ మహిళ ఆత్మహత్నం

హైదరాబాద్:సెక్రటేరియట్ దగ్గర ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్చన అనే మహిళ ఆయా వ్యాపారాలు చేసింది. అయితే వీటిలో నష్టాలు రావడంతో ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో సాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కాగా... మంగళవారం ముఖ్యమంత్రిని కలిసేందుకు సెక్రటేరియట్ వద్దకు చేరుకోగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన పోలీసు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

భారత్ లో అమ్మాయిగా పుట్టకూడదని కోరుకుంటా : మహిళా ఐఏఎస్ అధికారి ఆవేదన...

హైదరాబాద్ : భారత్ లో అమ్మాయిగా పుట్టకూడదని ప్రార్థించడం మినహా ఏమీ చేయలేకపోతున్నా అని ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్ స్టేటస్ గా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైంగిక వేధింపులకు గురైన ఆ ఐఏఎస్ అధికారి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. రిజుబాఫ్నా మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోనీలో ట్రైనీ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పని చేసే సంతోష్ చోబే అనే వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపుతూ రుజుని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ: భజరంగ్ మిల్ కార్మికులు...

గుంటూరు: ప్రశ్నించడం కోసమే వచ్చానన్న పవన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని గుంటూరు భజరంగ్‌మిల్‌ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ గత రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాల్సిన మిల్లు యాజమాన్యం ఆస్తులు అమ్ముకునే ఆలోచనలో పడిందని, స్పందించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఇందిరా పార్క్ వద్దకుచేరిన మున్సిపల్ కార్మికుల ప్రదర్శన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు సుందరయ్య పార్క్ నుండి భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వీరి ప్రదర్శన ఇందిరా పార్క్ వద్దకు చేరుకుంది.

సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలి:రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఈ అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి సీఎం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో వివరించారు. 

13:07 - August 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేశాయి. వీరిని పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీఎం డౌన్..డౌన్ అనే నినాదాలు మిన్నంటాయి. ఇంటర్‌, డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 4న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌ను వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలో మౌలిక సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్‌, స్కాలర్‌షిఫ్‌లను విడుదల చేయాలని కోరారు. 

13:01 - August 4, 2015

ఢిల్లీ : ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేపట్టారు. వెంటనే విభజన చేయాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. దీనిపై లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. కేంద్రం కావాలనే తాత్సారం చేస్తోందని, విభజించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నారు. హైకోర్టు బిల్డింగ్ హైదరాబాద్ లో ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఎంపీ వినోద్ సభకు తెలిపారు. వెంటనే హైకోర్టును విభజించాలని కోరారు.
తెలంగాణకు ప్రత్యేక హై కోర్టు అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. న్యాయశాఖ సమీక్షిస్తోందని, రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు విడి విడిగా హైకోర్టులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని వెంకయ్య స్పష్టం చేశారు. 

ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలి:అంవంతిశ్రీనివాస్

హైదరాబాద్: ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పదించి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదన్నారు. బడ్జెట్ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని విభజన చట్టంలో ఉందన్నారు. టిడిపి ఎంపీలకు పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

విజయవాడ లో ఆర్టీసీ కాలనీలో భారీ చోరీ

విజయవాడ: నగరంలో పడమట ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో చొరబడిన దుండగులు రూ.50లక్షల విలువైన బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12:54 - August 4, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై లోక్ సభలో వైసీపీ తీర్మానం ప్రవేశ పెట్టింది. కానీ ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహజన్ తిరస్కరించారు. దీనితో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. చివరకు స్పీకర్ అనుమతితో వైసీపీ ఎంపీలు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని, బీజేపీ మెనిఫెస్టో లో కూడా ఈ అంశాన్ని పేర్కొనడం జరిగిందని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలు క్షమించరని, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయని సభ దృష్టికి తెలిపారు. ప్రధాని హోదాలో మన్మోహన్ హామీనిచ్చారని గుర్తు చేశారు. వెంటనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని, యూపీఏ హామీనిచ్చిందని సభకు తెలిపారు. విభజన తరువాత ప్రముఖ సంస్థలన్నీ తెలంగాణలో ఉన్నాయన్నారు. ఈ విషయంపై తొలుతే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం చెప్పారని స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. 

తుళ్లూరు క్రీడా కార్యాలయం సీపీఎం ఆందోళన....

గుంటూరు: తుళ్లూరు క్రీడాకార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టింది. అసైన్డ్ భూయజమానులకూ పరిహారం చెల్లించాలని నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావుతో పాలు పలువురిని అరెస్టు చేశారు.

12:46 - August 4, 2015

ముంబై : కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ద్రవ్యపరపతిపై ఆర్బీఐ సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటు 7.25 శాతం, రివర్స్ రేపోరేటు 6.25 శాతం, నగదు నిల్వ 4.5 శాతం ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగించింది.

 

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలు క్షమించరు:ఎంపి మేకపాటి...

ఢిల్లీ:ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏపీ ప్రజలు క్షమించరని ఎంపీ మేకపాటి అన్నారు. లోక్‌సభలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మేకపాటి ప్రస్థావించారు. ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఏపీని ప్రత్యేకంగా చూడాలని ఆయన కోరారు.

12:42 - August 4, 2015

ఢిల్లీ : పార్టీకి సంబంధించిన 25 మంది ఎంపీలను వేటు వేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ..సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహజన్ వేటు వేశారు. ఐదు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు రోడ్డెక్కారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ఎంపీలు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మన్మోహన్, సోనియా, రాహుల్ ప్రభుత్వ తీరుపై విరుచకపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని సోనియా పేర్కొన్నారు. పార్లమెంట్ సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదని ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తమ డిమాండ్లు అంగీకరించే వరకు ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని రాహుల్ పేర్కొన్నారు. ప్రధానికి ప్రజల సమస్యలు తెలుసుకొనే సమయం దొరకడం లేదని, సుష్మా చట్టాన్ని ఉల్లంఘించారని నిప్పులు చెరిగారు. 

'29మంది హైకోర్టు జడ్జిలో 25 మంది సీమాంధ్ర వారే'

ఢిల్లీ:తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై టీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లోక్ సభలో తనదైన రీతిలో గళమెత్తారు. తెలంగాణతో పాటు ఏపీకి ఉమ్మడిగా కొనసాగుతున్న హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే, వారిలో 25 మంది సీమాంధ్రకు చెందినవారేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు లేని నేపథ్యంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరిగితే తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తుల సమక్షంలో తమకు న్యాయం జరుగుతుందని జితేందర్ రెడ్డి వాదించారు.  

సచివాలయం ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాలు..

హైదరాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి విద్యారంగ సంసరక్షణ, అభివృద్ధి కోరుతూ ఆందోళన చేపట్టారు. వందలాది మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫుట్ బాల్ మ్యాచ్ పై దుండగులు కాల్పులు:ఐదుగురు మృతి

హైదరాబాద్:ఎల్‌సాల్విడర్‌లో కాల్పులు కలకలం రేపాయి. సాన్‌ సాల్విడర్‌ నగరానికి ఉత్తరాన ఉన్న ఓ మైదానంలో ఫుట్‌బాల్‌ టోర్రమెంట్‌ సందర్భంగా కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వారంతో ఒక ఫుట్బాల్‌ టీం సభ్యులు. రెండు ముఠాల మధ్య నెలకొన్న భూ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత ఆప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పుల్లో గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

12:19 - August 4, 2015

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు న్యాయం చేస్తామని లోక్ సభ సాక్షిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రారంభమైన లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మధ్యలో రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. ఉభయ రాష్ట్రాలకు ఎక్కడా అన్యాయం చేయమని స్పష్టం చేశారు. అంతేగాకుండా తెలంగాణ హైకోర్టు విషయంలో సంబంధిత మంత్రితో మాట్లాడడం జరిగిందని, దీనిపై మంత్రి నిర్ణయం తీసుకుంటారని రాజ్ నాథ్ పేర్కొన్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై మంత్రి రాజ్ నాథ్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

జగన్.. ఏపీకి ధృతరాష్రుడు, ప్రాజెక్టుల పాటిల సైంధవుడు:పల్లె

విజయవాడ:వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ను ధృతరాష్ట్రుడిగానే కాక సైంధవుడిగానూ అభివర్ణించారు. స్థాయి మరచి మాట్లాడుతున్న జగన్ కు సీఎం నారా చంద్రబాబునాయుడిని విమర్శించే అర్హత లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నోరు విప్పకుండా జగన్ రాష్ట్రానికి ధృతరాష్ట్రుడిగా వ్వవహరిస్తున్నారని ఆరోపించారు. సాగు నీటి ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్న జగన్, ప్రాజెక్టుల పాలిట సైంధవుడిగా మారిపోయారని పల్లె దుమ్మెత్తిపోశారు.

 

లోక్ సభలో ప్రత్యేక హోదా పై వైసీపీ వాయిదా తీర్మానం....

ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైసీపీ లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించనుంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని సభలో డిమాండ్ చేయాలని సమావేశం తీర్మానించింది. మరికాసేపట్లో వాయిదా తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఆ పార్టీ ఎంపీలు అందజేయనున్నారు.

5రోజుల పాటు సమావేశాలను బహిష్కరించిన సీపీఎం

ఢిల్లీ:ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని సీపీఎం ఎంపి కరుణాకరన్ డిమాండ్ చేశారు. 5రోజుల పాటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించిన కరుణాకరన్ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది: రాజ్ నాథ్ సింగ్...

ఢిల్లీ: ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన అంశాలపై ఈ రోజు లోక్ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని, తప్పకుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు మాత్రం రాజ్ నాథ్ తిరస్కరించారు. దాంతో ఇవ్వాళ ఏపీ ప్రత్యేక హోదాపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అంతకుముందే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. 

లోక్ సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

ఢిల్లీ: విపక్షాల ఆందోళన మధ్య లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. 

వనజాక్షికి అండగా ఉంటా:నందమూరి హరికృష్ణ

హైదరాబాద్:కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు. ఆమెను వచ్చిన బెదిరింపు లేఖను ఆయన మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. వనజాక్షి పోరాటానికి అండగా ఉంటామని, ఆమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు.

రెండేళ్ల చిన్నారిపై కుక్క మంద దాడి....

మహబూబ్ నగర్: అయిజ గ్రామంలో రెండేళ్ల చిన్నారిపై కుక్కల మంద దాడి చేసింది. చిన్నారిపై 8 కుక్కలు దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై కుక్కల దాడి ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల బెడదను వెంటనే అరికట్టాలని ప్రజలు డిమాండు చేశారు.

ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారు: రాహుల్ గాంధీ...

ఢిల్లీ:ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా పార్లమెంట్ ఆవరణ లో గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ...సభ నడవటం ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.

11:29 - August 4, 2015

హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులు ఆకలి పోరాటం నిర్వహిస్తూనే ఉన్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై మున్సిపల్ జేఏసీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమైంది. ఈ రోజు చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. దీనితో 9 జిల్లాల నుండి పారిశుధ్య కార్మికులు నగరానికి తరలివస్తున్నారు. కానీ పోలీసులు వీరిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని సుందరయ్య పార్కు వద్ద నుండి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే మంత్రి ఈటెలతో జేఏసీ చర్చలు జరిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు స్పందించకపోతే హైదరాబాద్ వదిలి పెట్టి వెళ్లమని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులు టెన్ టివితో మాట్లాడారు. ఏడు కార్మిక సంఘాలు నోటీసు ఇవ్వడం జరిగిందని, నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. రంజాన్...బొనాల పండుగ ఉద్ధేశ్యంతో కొద్ది మంది వేతనాలు పెంచారని, సమ్మె చేస్తున్న 9 జిల్లాల కార్మికుల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

బషీర్ బాగ్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతల ఆందోళన

హైదరాబాద్: పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా బషీర్ బాగ్ చౌరస్తాలో టి.కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి...

మెదక్: జిల్లాలోని శివ్వంపేట మండలం చిన్నగొట్టిముళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో వీఆర్‌వో కిషన్‌రావు మృతి చెందారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చేగుంట మండలం నార్సింగిలో కిషన్‌రావు వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. మెదక్ జిల్లా వీఆర్‌వోల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కిషన్‌రావు ఉన్నారు. 

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత నిర్ణయం పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూలివేత నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్పతి భవనం కూల్చివేతకు సంబంధించిన జీవో లేదా ఉత్తర్వులుంటే సమర్పించాలని పిటిషనర్ ను ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.

కీలక వడ్డీరేట్లు యధాతథం

ఢిల్లీ: కీలక వడ్డీ రేట్లు యధాతథం అని ఆర్బీఐ ప్రకటించింది. నేడు ద్రవ్య పరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రెపోరేటు 7.24 శాతం, రివర్స్ రెపో 6.25 శాతం, సీఆర్ ఆర్ 4శాతం గా నిర్ణయించింది.

11:15 - August 4, 2015

హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహజన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలంతా నల్ల రిబ్బన్లు కట్టుకుని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మధ్యాహ్నాం బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగనుంది.
రాజ్యసభలో..
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టింది. స్పీకర్ పోడియం వద్ద సభ్యులు నినాదాలు చేశారు. సభ్యులు కూర్చొవాలని డిప్యూటి ఛైర్మన్ కురియన్ పలుమార్లు సూచనలు చేశారు. కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లోక్ సభలో..
లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వైసీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. 

బప్పన్న కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పద్మారావు...

సికింద్రాబాద్: మారేడుపల్లి పోలీసుస్టేషను పరిధిలోని గాంధీ నగర్‌లో బన్నప్ప కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి పద్మారావు పరామర్శించారు. బన్నప్ప కుటుంబానికి న్యాయం చేయాలని లేదంటే మృతదేహంతో ధర్నా చేస్తామని బన్నప్ప బంధువులు మంత్రి పద్మారావుతో అన్నారు. బన్నప్ప మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి గాంధీ ఆసుపత్రి నుంచి స్వగ్రహానికి తరలించారు. గాంధీనగర్‌లో పోలీసులను మోహరించారు. 

 

లోక్ సభలో గందరగోళం

ఢిల్లీ: లోక్ సభలో గందరగోళం నెలకొంది.అవినీతి మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. మరో వైపు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షను నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు ధర్నా చేపట్టారు.

రాజ్యసభ మ.12గంటల వరకు వాయిదా

ఢిల్లీ: ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

ప్రారంభమైన ఉభయసభలు

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. రెండు సభల్లోనూ అవినీతి మంత్రులను తొలగించాలని విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ ఎంపీల సస్పెన్ష ను కూడా వ్యతిరేకిస్తూ విపక్షాలు నినాదాలు చేస్తున్నారు.

సాంకేతిక లోపంతో నిలిచిన కృష్ణా ఎక్స్ ప్రెస్

హైదరాబాద్:అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. స్టేషన్‌కు సమీపంలోకి రాగానే ఇంజన్ ఫెయిల్ కావడంతో.. డ్రైవర్ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం కాజిపేట నుంచి ప్రత్యేక ఇంజన్ తెప్పించి ఎక్స్‌ప్రెస్‌కు జతచేసే ప్రయత్నంలో రైల్వే అధికారులు ఉన్నారు.

 

బస్తర్ జిల్లాలో రైలు పట్టాలను తొలగించిన మావోయిస్టులు

హైదరాబాద్: ఛత్తీగఢ్ లో బస్తర్ జిల్లా కాకలూరు వద్ద రైలు పట్టాలను మావోయిస్టులు తొలగించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సస్పెన్షకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీల నిరసన....

ఢిల్లీ:27 మంది ఎపీల సస్పెన్షన్ కు నిరసగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టిది. ఈ ధర్నా కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఆజాద్ లు పాల్గొన్నారు.

అండమాన్, బెలూచిస్థాన్ లలో భూకంపం...

హైదరాబాద్ :భారత్, పాకిస్థాన్ లలోని రెండు ప్రాంతాల్లో నేటి ఉదయం భూకంపం సంభవించింది. భారత్ భూభాగం పరిధిలోని అండమాన్, నికోబార్ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ఇక పాకిస్థాన్ భూభాగంలోని బెలూచిస్తాన్ లోనూ నేటి ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. 

ప్రారంభమైన మున్సిపల్ కార్మికుల ప్రదర్శన

హైదరాబాద్: సుందరయ్య పార్క్ నుంచి మున్సిపల్ కార్మికుల ప్రదర్శన ప్రారంభం అయ్యింది. ఈ ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.

వరంగల్ లో ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్‌

హైదరాబాద్: వరంగల్‌లో మొదటిసారిగా సూపర్‌ఫాస్ట్ ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్‌ను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రారంభించారు. 4జీ సేవలను సొంతం చేసుకోవడానికి వినియోగదారులను ఆహ్వానిస్తున్నట్లు ఎయిర్‌టెల్ నిర్వాహకులు తెలిపారు. కాంప్లమెంటరీగా 3జీ ధరలోనే 4జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగ దశలో భాగం వినియోగదారులను ప్రోత్సహించడంతోపాటు వారి అనుభవాలను తెలుసుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం కాదు..నిఘానే:మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఢిల్లీ:అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మోదీ సర్కారు నష్టనివారణ చర్యలకు దిగింది. పోర్న్ వెబ్ సైట్లకు అడ్డుకట్ట వేస్తే అది వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని గల్లంతు చేస్తుందని శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు హెచ్చరించిన మీదట, అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించడం తమ ఉద్దేశం కాదని, వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నది తమ అభిమతమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. 

ఖాళీ బిందెలతో మంత్రి నారాయణను అడ్డుకున్న మహిళలు..

నెల్లూరు:సొంత జిల్లాలో మంత్రి నారాయణకు చుక్కెదురైంది. తెలుగు గంగ కాలువ నిర్మాణ పనుల పరిశీలకు వెళ్లిన నారాయణను నీటి బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. పక్కనే స్వర్ణముఖి నది ఉన్నా తాగు నీటి సమస్య తీరలేదని నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు అడ్డుతొలగేది లేదని స్పష్టం చేశారు. జిల్లా అధికారులతో నారాయణ ఫోన్‌లో మాట్లాలో హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.

10:20 - August 4, 2015

హైదరాబాద్ : పోలీసుల విచారణకు తీసుకొచ్చి అనుమానాస్పదంగా మృతి చెందిన బన్నప్ప మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం పూర్తయ్యింది. బన్నప్ప కుటుంబసభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు. న్యాయం చేస్తానని వారికి హామీనిచ్చారు. మరోవైపు మారేడ్ పల్లి పీఎస్ ఎస్ఐ లు రవి, మధులను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ మెంట్ చేశారు.
ఆదివారం రోజు జరిగిన బోనాల ఉత్సవాల్లో గాంధీనగర్‌కు చెందిన రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తనపై కొందరు దాడి చేశారని శ్రీనివాస్ అనే హోంగార్డ్ మారేడ్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి మారేడ్ పల్లి పోలీసులు స్థానికులను అరెస్టులు చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బన్నప్ప అనే వ్యక్తిని కూడా విచారించారు. ఐతే విచారణ అనంతరం.... సోమవారం మధ్యాహ్నం బన్నప్ప మరణించాడు. విచారణ పేరుతో పోలీసులు దాడి చేయడం వల్లే బన్నప్ప మరణించాడని కాలనీ వాసులు ఆగ్రహించారు. రాత్రి 8గంటలకు అతడి మృతదేహాన్ని స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవటంతో కోపోద్రిక్తులై కాలనీ వాసులు మూకుమ్మడిగా మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. దాదాపు 200మంది కర్రలు, రాళ్లతో విరుచుకుపడి అడ్డు వచ్చిన పోలీసులను తీవ్రంగా గాయపరిచి స్టేషన్ కు నిప్పు పెట్టారు.

16 మంది మందుబాబులకు సామాజిక శిక్ష

హైదరాబాద్:పీకల దాకా మద్యం తాగిన మందుబాబులకు ఎర్రమంజిల్‌కోర్టు సామాజిక శిక్ష విధించింది. హైదరాబాద్‌ నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రిలో చెత్తను తొలగించాలని కోర్టు వేసిన శిక్షను మందుబాబులు అమలు చేశారు. ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తను మందుబాబులు తొలగించారు.

ఉగ్రవాదుల చెరలోనే తెలుగువారు..

హైదరాబాద్:లిబియాలో ఐఎస్ ఉగ్రవాదుల చెరకు చిక్కిన తెలుగు ప్రొఫెసర్లకు ఇంకా ఉపశమనం లభించలేదు. ఆరు రోజుల క్రితం హైదరాబాదుకు చెందిన బలరాం, గోపీకృష్ణ సహా కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల పాటు తమ వద్ద ఉంచుకున్న కన్నడ ప్రొఫెసర్లు విజయ్ కుమార్, లక్ష్మీకాంత్ లను ఉగ్రవాదులు వదిలిపెట్టారు. మూడు రోజుల క్రితం ఐఎస్ చెర వీడిన వీరిద్దరూ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. మరికాసేపట్లో వారు అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రం కర్ణాటకకు బయలుదేరనున్నారు.

ర్యాంప్ పై కేకపుట్టించిన సానియామీర్జా....

ముంబై: టెన్నిస్ గ్రౌండ్ లోనే కాదు.. ర్యాంప్ పైనా ఇరగదీస్తోంది సానియా మిర్జా.. ఈ మధ్య కాలంలో టైం దొరికితే చాలా ర్యాంప్ పై మెరిసిపోతోంది.. తాజాగా ముంబైలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీలో తళుక్కుమంది.ర్యాంప్ వాక్ లో మెరసి అదరహో అన్పించింది ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా . ఇటు ఆటలో ఇరగదీసి, క్యాట్ వాక్ లో కేక పెట్టిస్తోంది. 

డీమ్యాట్ అకౌంట్ లోకి శ్రీవారు

తిరుపతి:ఆదాయంలో, భక్తుల దర్శనాల సంఖ్యతో రికార్డులు సృష్టించిన తిరుమల వెంకన్న... మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వామివారి పేరుమీద డీమ్యాట్‌ అకౌంట్‌ను టీటీడీ ఓపెన్‌ చేసింది. తిరుమల శ్రీవారి పేరిట స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 1601010000384828 నెంబర్‌తో డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సీడీఎస్‌ఎల్‌ ఎండీ సీఎస్‌ రెడ్డి ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ అకౌంట్‌ ద్వారా శ్రీవారు స్టాక్‌ మార్కెట్‌లో వాటాదారు కాబోతున్నారు. ఇకపై శ్రీవారి పేరు మీద షేర్లు ఉండబోతున్నాయి.

10:02 - August 4, 2015

రాఘవ లారెన్స్..పలు వుడ్ లలో తనదైన శైలిలో నటిస్తూ..డ్యాన్స్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడు లారెన్స్ దాతృత్వం కూడా చేస్తుంటాడు. ఇటీల భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతి చెందిన సంగతి తెలిసిందు. ఆయన పేరిట పేదలను ఆదుకోవాలని ఈ నటుడు నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళంతో పేదలను నిరుపేదలను ఆదుకోనున్నట్లు ప్రకటించాడు. రాఘవేంద్ర ప్రొడక్షన్స పై స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటిస్తున్న రెండు కొత్త ప్రాజెక్టును లారెన్స్ చెన్నైలో ప్రారంభించారు. మొట్టశి, కెట్టశివ, నాగ అనే రెండు చిత్రాలను వేందర్ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. మొట్టశివ కెట్టశివ చిత్రానికి రెమ్యునరేషన్ గా అందుకున్న కోటి అడ్వాన్స్ ను కలాం పేరిట పేదలకు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వంద మంది నిజాయితీ గల యువతీ యువకులను ఎంపిక చేసి తలా లక్ష చొప్పున కేటాయించి, వారి ద్వారా పేదలకు సాయం అందించేలా ఓ ప్రణాళిక రూపొందించినట్లు లారెన్స్ చెప్పారు.

రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం....

హైదరాబాద్:తప్పుచేసిన తనతో కుటుంబ సభ్యులు మాట్లాడంలేదని..మనస్తాపానికి గురైన ఖైదీ బాత్‌రూంలోని ట్యూబ్‌లైట్‌ను పగలగొట్టి దానితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్‌జైల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. జుట్టిగ యోహాన్ అత్యాచారం కేసులో జూన్16 నుంచి సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అప్పటినుంచి అతన్ని చూడడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరు జైలుకు రాకపోవడంతో పాటు.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మాట్లాడక పోవడంతో.. మనస్తాపానికి గురైన యోహాన్ ఈ రోజు ఉదయం స్నానానికని బాత్‌రూంకు వెళ్లి..

రోడ్డు ప్రమాంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్...

రంగారెడ్డి: జిల్లాలోని హయత్‌నగర్ మండలం కొహెడ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి మరోలారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఉమేశ్, క్లీనర్ సతీశ్ ఇరుక్కుపోయారు. ఔటర్ రింగ్‌రోడ్డు సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

నేడు నగరానికి రానున్న సచిన్,అభిషేక్, ఐశ్వర్య..!

హైదరాబాద్:భారత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ నేడు హైదరాబాదుకు రానున్నాడు. ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా భాగ్యనగరికి వస్తున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ లో నేడు హైదరాబాదులోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లకు వీరు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. 

ఎంఎస్ వో ఆఫీసులో ఎమ్మెల్యే కోటం రెడ్డి వీరంగం...

నెల్లూరు: వార్తల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ యాక్ట్‌ ఎంఎస్‌వో ఆఫీసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేశారు. యాక్ట్‌ ఎంఎస్‌వో సిబ్బందిని ఎమ్మెల్యే దుర్భాషలాడారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 4గంటలు..ప్రవేశ దర్శనానికి 2గంటలు..కాలి నడకన వచ్చే భక్తులకు 3గంటల సమయం పడుతోంది. 

అండమాన్..బెలుచిస్తాన్ లో భూకంపం..

ఢిల్లీ : అండమాన్..బెలూచిస్తాన్ లో భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. బెలుచిస్తాన్ లో సంభవించిన భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. 

09:18 - August 4, 2015

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన తహశీల్దార్ వనజాక్షి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది.
ముసూనూరు తహశీల్దార్ గా వనజాక్షి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారంటూ తనిఖీలకు వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతర ఉద్యోగులు దీనిని తీవ్రంగా ఖండించారు. వనజాక్షికి న్యాయం చేయాలంటూ పోరాటం చేపట్టారు. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వనజాక్షి, చింతమనేనితో మాట్లాడారు. ఇందులో వనజాక్షిదే తప్పని బాబు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వివాదం సద్దుమణిగింది. వనజాక్షికి బెదిరింపులు లేఖలు ఎటువైపుకు దారి తీస్తాయో చూడాలి. 

09:10 - August 4, 2015

మహారాష్ట్ర : థానేలో భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నౌపాడ ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంతోమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది గాయపడ్డారని సమాచారం. మొత్తం భవంతిలో ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం తడిసిపోయింది. పురాతన భవనం కావడంతో కుప్పకూలిందని సమాచారం. 1960 సంవత్సరాల్లో నిర్మించిన భవనాల్లో నివాసం ఉండవద్దంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. 

09:04 - August 4, 2015

అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ చెల్లిగా సోనాక్షి సిన్హా ? అని ఆశ్చర్యపోతున్నారా. ఇదంతా ఓ సినిమా కోసం. దావూద్ ఏడో చెల్లి హసీనా పార్కర్. ఈమె పాత్రలో సోనాక్షి నటించబోతోంది. హసినా జీవిత కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అపూర్వ లఖియా. దావూద్‌ చెల్లి పాత్రను పోషించడానికి ఎవరైతే బాగుంటుందా? అని అపూర్వ లఖియా తీవ్రంగా ఆలోచించి చివరకు సోనాక్షిని ఓకే చేశాడట. హసీనా పార్కర్‌ మేనల్లుడు పాత్రను సమీర్‌ అంతులే పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎ.ఆర్‌. మురుగదారు అకీర అనే రచయితగా కన్పించనున్నాడు.
దావూద్‌ ఇబ్రహీంకు మొత్తం 12 మంది చెల్లెళ్లు. హసీనా పార్కర్‌ ఏడో చెల్లి. ఈమె భర్తను దావూద్‌ వ్యతిరేక వర్గం వారు 1991లో హత్య చేస్తారు. దీంతో హత్య చేసిన వారందరనీ దావూద్‌ చంపించేశాడు. అప్పటి నుంచి తన చెల్లి హసీనాను ముంబాయిలో నాగపడ అనే ప్రాంతానికి మార్చేస్తాడు. అక్కడ ఆమె రాణిగా వెలుగొందుతూ ఉండేది. అక్కడే అనేక రకాలైన దందాలు చేసేదని ఆరోపణలు ఉండేవి. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో వెండితెరపై చూడాలి. 

తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ..

కృష్ణా : ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ అందింది. ముసునూరు నుండి బదిలీపై వెళ్లిపోవాలని లేకుంటే కుటుంబం మొత్తాన్ని చంపుతామని లేఖలో హెచ్చరికలు చేశారు. దీనితో ముసునూరు పీఎస్ లో వనజాక్షి ఫిర్యాదు చేసింది.  

అఖ్నూర్ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. 

08:29 - August 4, 2015

శిథిలావస్థలో ఉన్నవి ఏవైనా వాటిని కూలుస్తారా అని ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నించారు. వాటిని కాపాడాలని ఆయన సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేస్తామన్న టి.సర్కార్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా రివర్ బోర్డు..మున్సిపల్ కార్మికుల సమ్మె..పార్లమెంట్ సమావేశాలు..తదితర అంశాలపై టెన్ టివి లో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లో..

''ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ ఖాళీ చేసిన తరువాత ఏం చేస్తారు ? శిథిలావస్థ అంటేనే హెరిటేజ్ బిల్డింగ్. స్వీడన్ లో వారసత్వ సంపదను కాపాడుకోనేందుకు చట్టాలు తీసుకొచ్చారు. కూల్చుకుంటే పోతే చార్మినార్, గొల్కోండ లు ఎక్కడుంటాయి. మెట్రో రైలు నిర్మాణంలో పురాతన భవనాలు ఉన్నాయని రూటు మార్చింది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిందని ఉపన్యాసాలు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న చార్మినార్ కూల్చరు కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు పట్టించుకోలేదు. కోటిలింగాలు..అమరావతి..కాళేశ్వరం, ద్రాక్షారామం పట్టించుకున్నారా అని ఆనాడు ప్రశ్నించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాటలు మారుస్తున్నారు. ఇది ఏ రాజకీయమైన దౌర్బల్యం అవుతుందో చెప్పాలి. టూరిజం అభివృద్ధి చెందుతుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా శిథిలావస్థలో ఉంటే కూలుస్తారా ? వారసత్వ సంపదను కాపాడాలని చట్టాలున్నాయి. ఇటీవల సచివాలయం తరలింపు..ఉస్మానియా భూముల తీసుకుంటాం..ఇలా ఎన్నో విషయాలు చెబుతున్నారు. మళ్లీ వెనక్కి వెళుతున్నారు. ఎప్పుడు ఏం చేస్తారో ? ఏమంటారో తెలియడం లేదు. విధానాల్లో ఎందుకు గందరగోళం. పారిశుధ్య కార్మికుల సమ్మెపై ఎందుకు స్పందించడం లేదు. 8వేల జీతం ఇచ్చే వాడు జీతం పెంచాలంటే ఎందుకు స్పందించడం లేదు'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్యం..పార్లమెంట్ సమావేశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. 

త్రిపురలో పెట్రోల్ బంక్ వద్ద రద్దీ..

త్రిపుర : పెట్రోల్ లో సంక్షోభం ఏర్పడడంతో పెట్రోల్ బంక్ ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. 

08:13 - August 4, 2015

మహారాష్ట్ర : రాష్ట్రంలో భవనాలు కుప్పకూలుతూనే ఉన్నాయి. ఇందులో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవలే థానేలోని థాకూర్లీలోని మాతృఛాయ పేరుతో ఉన్న భవనం కుప్పకూలిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. థానేలో మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందం రంగంలోకిల దిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 గురి మృతదేహాలను బయటకు తీశారు. చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఈ పురాతన భవనం 50 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. 

08:00 - August 4, 2015

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ఇంకా రగులుతూనే ఉంది. బీజేపీ, టీడీపీ పార్టీలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలంటూ విపక్షాలు ఆందోళన బాట పడుతున్నాయి. పార్లమెంట్ లో ఎంపీల సస్పెండ్...జీఎస్టీ బిల్లు తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీరాములు (టిడిపి), రఘునందన్ రావు (బీజేపీ), ద్రోణం రాజు శ్రీనివాసరావు (కాంగ్రెస్), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:59 - August 4, 2015

ఢిల్లీ : ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు చెందిన శుభమ్‌ జగ్లాన్‌ మరో టైటిల్‌ సాధించాడు. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో నిర్వహించిన ఐజెజీఏ వరల్డ్ స్టార్స్ ఆఫ్‌ జూనియర్‌ గోల్ఫ్ ఈవెంట్‌లో 10 ఏళ్ల శుభమ్‌ జగ్లావ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 9-10 ఏళ్ల వయస్సు విభాగంలో ఫైనల్‌లో మూడు రౌండ్లలో మొత్తం 106 పాయింట్లతో శుభమ్‌ జగ్లాన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే గత ఆదివారం నాడు కాలిఫోర్నియాలో నిర్వహించిన జూనియర్‌ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లోనూ శుభమ్‌ జగ్లాన్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. కాగా, ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో రెండు టైటిల్స్ సాధించిన శుభమ్‌ జగ్లాన్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. తక్కువ వయస్సులోనే ఈ ఘనత సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. కాగా, శుభమ్‌ జగ్లన్‌ది హార్యానాలోని ఇస్రానా గ్రామం. శుభమ్‌ తండ్రి పాల వ్యాపారి.

సెంట్రల్ యూనివర్సిటీలో ఘర్షణ..

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ లో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఫేస్ బుక్ లో పోస్టింగ్ వ్యవహారాంలో వివాదం చెలరేగింది. పలువురికి గాయాలయ్యాయి.

 

స్వదేశానికి చేరుకున్న శుభమ్ జగ్లాన్..

ఢిల్లీ : శుభమ్ జగ్లాన్ స్వదేశానికి చేరుకున్నాడు. ఇతనికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు చెందిన శుభమ్‌ జగ్లాన్‌ మరో టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. 

థానేలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

ముంబై : థానేలో కుప్పకూలిన భవంతి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 8మంది మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. 

07:38 - August 4, 2015

హైదరాబాద్ : దేశ విదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్న ఇండియన్ ప్రో కబడ్డీలీగ్ షో...మన హైదరాబాద్ నగరానికి వచ్చింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నుండి నాలుగు రోజులపాటు హైదరాబాద్ లెగ్ పోటీలు జరుగనున్నాయి. హోమ్ టీమ్ తెలుగు టైటాన్స్ కు డూ ఆర్ డై గా మారాయి. తొలి రోజు పోటీల్లో పింక్ పాంథర్స్ తో బెంగాల్ వారియర్స్, ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో బెంగళూరు బుల్స్ ఢీ కొంటాయి.
ఆగస్టు 4-7 వరకు పోటీలు..
2015 ప్రోకబడ్డీలీగ్ షోకి...మన హైదరాబాద్ నగరం తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. ఆగస్టు 4 నుంచి 7 వరకూ జరిగే హైదరాబాద్ లెగ్ పోటీలు ఆతిథ్య తెలుగు టైటాన్స్ కు కీలకంగా మారాయి. హైదరాబాద్ అంచె పోటీల తొలిరోజున డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తో బెంగాల్ వారియర్స్ ఢీ కొంటుంది. ఇక..రాత్రి 9గంటలకు ప్రారంభమయ్యే రెండో పోటీలో...లీగ్ టేబుల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచిన తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్లలో తెలుగు టైటాన్స్ ఐదు విజయాలు సాధించి 26 పాయింట్లతో ..యూ ముంబై తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్ సైతం 7 రౌండ్లలో ఐదువిజయాలే సాధించినా..25 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ కంటే ఒక్క పాయింట్ తో మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో..రెండుజట్లకూ ఈ పోటీ డూ ఆర్ డై గా మారింది. ముంబై, కోల్ కతా, జైపూర్, పాట్నా అంచె పోటీల్లో భాగంగా ఇప్పటి వరకూ ఆడిన ఏడు రౌండ్లలో తెలుగు టైటాన్స్...ఢిల్లీ దబాంగ్స్, పూణేరీ పల్టాన్, బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్ పై నెగ్గి యూముంబా, బెంగళూరు బుల్స్ జట్ల చేతిలో పరాజయాలు చవిచూసింది.
అత్యంత ప్రమాదకరంగా బెంగళూరు బుల్స్..
రైడింగ్ లో కెప్టెన్ రాహుల్ చౌదరి, దీపిక్ నివాస్ హుడా, సుకేశ్ హెగ్డే, బ్లాకింగ్ లో సందీప్, రాజగురుల పైనే టైటాన్స్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బెంగళూరు బుల్స్ చేతిలో..21-35 పాయింట్ల భారీతేడాతో ఓడిన టైటాన్స్ ప్రతీకారంతో రగిలిపోతోంది. హోంఎడ్వాంటేజ్ తో..హైదరాబాద్ అంచె పోటీలో బెంగళూరు పనిపట్టాలన్న పట్టుదలతో తెలుగు టైటాన్స్ సమరానికి సిద్ధమయ్యింది. మరోవైపు..ఆల్ రౌండర్ మంజీత్ చిల్లార్ నాయకత్వంలోని బెంగళూరు బుల్స్ జట్టులో సూపర్ రైడర్ అజయ్ ఠాకూర్ ప్రధాన అస్త్రంగా ఉన్నారు. బ్లాకింగ్ లోనూ బెంగళూరు బుల్స్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. తెలుగు టైటాన్స్ రైడింగ్ కు, బెంగళూరు బుల్స్ బ్లాకింగ్ కు మధ్య జరిగే ఈ పోటీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు టైటాన్స్ చెలరేగుతుందా ?
ప్రొ.కబడ్డీ తొలిసీజన్ లో బెంగళూరు బుల్స్ మూడోస్థానంలో నిలిస్తే తెలుగు టైటాన్స్ 5వ స్థానం మాత్రమే దక్కించుకోగలిగింది. మరీ ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో స్థానం బలంతో తెలుగు టైటాన్స్ చెలరేగిపోయి..బదులు తీర్చుకొంటుందా?..లేక బెంగళూరు బుల్స్ మరోసారి ప్రత్యర్థిని కుమ్మేసి ..లీగ్ టేబుల్ రెండోస్థానంలో పాగా వేస్తుందా? తెలుసుకోవాలంటే...హైదరాబాద్ అంచె ప్రోకబడ్డీ పోటీలు చూసి తీరాల్సిందే.
హైదరాబాద్ షెడ్యూల్..
 

తేదీ      ఢీ కొననున్న జట్లు  సమయం
ఆగస్టు 4  తెలుగు టైటాన్స్ x జయపుర పింక్ పాంథర్స్ 8 గంటలు.
ఆగస్టు 4  ముంబా x దబాంగ్ ఢిల్లీ 9 గంటలు.
ఆగస్టు 5 తెలుగు టైటాన్స్ x బెంగాల్ వారియర్స్ 8 గంటలు.
ఆగస్టు 6 బెంగాల్ వారియర్స్ x బెంగళూరు బుల్స్ 8 గంటలు.
ఆగస్టు 6 తెలుగు టైటాన్స్ పాట్నా పైరేట్స్ 9 గంటలు.
ఆగస్టు 7 జయపుర పింక్ పాంథర్స్ x యు ముంబా 8 గంటలు.
ఆగస్టు 7 తెలుగు టైటాన్స్ x పుణెరి పల్టన్ 9 గంటలు.

అల్లు అర్జున్ జాతీయ గీతాలపన..
మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు హీరో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. తొలి మ్యాచ్ కు ముందు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఇంతకుముందు వివిధ నగరాల్లో అమితాబ్ బచ్చన్, సౌరభ్ గంగూలి లాంటి ప్రముఖులు ఇలా జాతీయ గీతాన్ని పాడారు. 

బీఈడీ వార్షిక పరీక్షలు వాయిదా..

మహబూబ్ నగర్ : పాలమూరు వర్సిటీలో 7 నుండి జరగాల్సిన బీఈడీ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఓయూ పీజీ కౌన్సెలింగ్ ఉండడంతో 17 నుండి 31 వరకు బీఈడీ పరీక్షలు నిర్వహించనున్నారు.

మున్సిపల్ కార్మికులను అడ్డుకున్న ఖాకీలు..

వరంగల్ : చలో హైదరాబాద్ కు వెళుతున్న మున్సిపల్ కార్మికులను కాజీపేట రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకున్నారు. 

నేటి నుండి నగరంలో ప్రొ.కబడ్డీ పోటీలు..

హైదరాబాద్ : నేటి నుండి నగరంలో ప్రొ.కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ లో జైపూర్ తో తెలుగు టైటానస్ తలపడనుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీ నటుడు అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ రానున్నారు. 

ఆర్టీసీ బస్సు - కంటైనర్ ఢీ..

అనంతపురం : కదిరి మండలం పట్నం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. 

07:04 - August 4, 2015

తెలంగాణలో మున్సిపల్ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్ లో కార్మికుల జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించి, సమ్మెను విరమింపచేసిన ప్రభుత్వం తెలంగాణలోని ఇతర ప్రాంతాల సమస్యను పరిష్కరించలేదు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికులు పోరుడుతూనే వున్నారు. తమకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ తెలంగాణలో సమ్మె మొదలుపెట్టి నెల రోజులైంది. వీరి సమస్యలను సావధానంగా విని, పరిష్కారం చూపాల్సిన తెలంగాణ ప్రభుత్వం అందుకు చొరవ చూపకపోవడంతో నగర ప్రజలు అవస్థపడాల్సి వస్తోంది.
45వేల మంది పారిశుధ్య కార్మికులు..
తెలంగాణలో దాదాపు 45వేల మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని 65 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్ల లో పనిచేస్తున్న కార్మికులు ఆయా పట్టణాలను, నగరాలను పరిశుభ్రంగా వుంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా కలిసి రోజుకి 10వేల 800 టన్నుల చెత్తను ఎత్తిపోస్తున్నారు. 17 వేల 600 కిలోమీటర్ల పొడవైన రోడ్లను శుభ్రం చేస్తున్నారు. తొమ్మిది వేల మూడు వందల కిలోమీటర్ల పొడవున్న మురికి కాల్వలను అనునిత్యం శుభ్రం చేస్తున్నారు. ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చెమటోడిస్తే తప్ప, ఇంత మురికిని శుభ్రం చేయలేరు. ఇంతగా కష్టపడుతున్నా వీరికి ఇస్తున్న జీతాలు నామమాత్రం.
మానవీయంగా స్పందించాలి..
పారిశుద్ధ్య కార్మికుల్లో సగం మందికి పైగా కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. వీరి ఉద్యోగాలకు భద్రత లేదు. ప్రాణాలకు రక్షణ లేదు. అతి భయంకర వ్యర్ధ పదార్థాలను ఎత్తిపోస్తున్న వీరి ఆరోగ్యాలకు పూచీపడేవారు లేరు. చాలామంది కార్మికులు ఈఎస్ఐ సౌకర్యానికి కూడా నోచుకోని దుస్థితి. నెలనెలా జీతాలు రావు. మూడు నాలుగు నెలలకోసారి జీతాలిస్తారు. దీంతో వడ్డీలకు అప్పు తెచ్చుకుని సంసారాలు నెట్టుకురావాల్సిన పరిస్థితి. తమ కష్టాలు, బాధల గురించి అనేకసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల విషయంలో మానవీయంగా స్పందించాలని పలువురు సూచిస్తున్నారు.

07:01 - August 4, 2015

నెల రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ మున్సిపల్‌ కార్మికులు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు పరిష్కారం లభించకపోవడానికి కారణం ఏమిటి? అసలు మున్సిపల్‌ కార్మికులు కోరుతున్నదేమిటి? ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమిటి? కార్మికులు సమ్మె విరమించాలంటే ప్రభుత్వం తక్షణం తీర్చాల్సిన కోరికలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్ యూనియన్‌ నేత పాలడుగు భాస్కర్‌గారు మాట్లాడారు.

06:59 - August 4, 2015

ఢిల్లీ : కొమెన్‌ భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లు వదిలి... పునరావాస కేంద్రాలకే పరిమితమవుతున్నారు. వరదలతో గుజరాత్ గజగజలాడుతోంది. భారీ వర్షాలతో బెంగాల్ బెంబేలెత్తిపోతోంది. ఒడిశా, మణిపూర్‌ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, హిమాచారల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేసిన కొమెన్ తుపాన్‌ ప్రభావం దాదాపు కోటి మందిపై కనిపిస్తోంది.
180 మంది మృతి..
పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో అనేక మంది నిరాశ్రయులుగా మారిపోయారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు సుమారు 180 మంది మృతి చెందారు. అత్యధికంగా గుజరాత్‌లో 71 మంది, పశ్చిమబెంగాల్‌లోనే 69 మంది మృత్యువాతపడ్డారు. మణిపూర్‌లో వరదల ప్రభావంతో 20 మంది మరణించారు. బెంగాల్‌లో పలు చోట్ల రోడ్లు, వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయయిలయ్యారు. లక్షల హెక్టార్లలో పంటలు ధ్వసంమయ్యాయి. అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద తీవ్రతపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారుల్ని ఆదేశించారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌... బెంగాల్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం తరపున సాయం అందిస్తామన్నారు.
ఒడిషాలో..
ఒడిషాలోనూ జలప్రళయం భయాందోళన కలిగిస్తోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో రాజ్‌నాథ్ మాట్లాడారు. వర్షాల పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు మహానదికి పోటెత్తుతున్న వరద నీటిని విడిచిపెట్టడానికి 12 గేట్లను పైకెత్తారు. చక్పితో పాటు మరో రెండు ప్రధాన నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనం భయాందోళన చెందుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు ఇళ్లు, డాబాలపైకి చేరుకున్నారు.
మణిపూర్ లో..
మణిపూర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మయన్మార్ సరిహద్దులో రవాణా సంబంధాలు తెగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లోనూ అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. కశ్మీర్‌లో వరదలు భయాందోళన సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జవాన్లను రంగంలోకి దింపింది. 

06:57 - August 4, 2015

ఢిల్లీ : తుపాకులు విడిచారు. చేతులు కలిపారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడారు. 1948 నుంచి నాగాలు చేస్తున్న ఆందోళనకు ఫుల్‌స్టాప్ పడింది. కేంద్ర ప్రభుత్వం, నాగా తిరుగుబాటుదారుల మధ్య సోమవారం చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (IM)తో భారత ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలప్రదమయ్యాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఎన్ఎస్ సిఎన్ జనరల్ సెక్రటరీ మొయివా, భారత ప్రభుత్వాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
18 నెలల్లో ఒప్పందం అమలు..
నాగా రాజకీయ అనిశ్చితికి తెరవేయడం భారత ప్రజాస్వామ్య పరిణితికి సూచికగా అభివర్ణించారు ప్రధాని మోడీ. ఈ చారిత్రక ఒప్పందంలో నాగా ప్రజల కృషి ఎనలేనిదన్నారు. రాబోయే 18 నెలల్లో ఈ ఒప్పందం అమలు అవుతుందని మోదీ హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్నామని, అందుకే ఈ చారిత్రక ఒప్పందం మరింత అర్ధవంతమైందని అన్నారు మొయివా. పీవీ నరసింహారావు హయాంలోనే... తిరుగుబాటుదారులతో చర్చలు జరపాలన్న నిర్ణయం జరిగిందన్నారు. నాగాలకు తగిన గౌరవం ఇవ్వాలన్న వాజ్‌పేయ్ నిర్ణయాన్ని అప్పట్లో స్వాగతించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
కాల్పుల విరమణ..
ఎన్ఎస్ సిఎన్ రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించింది. బ్రిటీష్ పాలకుల కారణంగానే నాగా ప్రజలు ఇన్నాళ్లు దేశానికి దూరంగా ఉన్నారని, అలాంటి తప్పులు తాము చేయమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈశాన్యరాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

06:53 - August 4, 2015

వరంగల్ : ఓరుగల్లులో తెలుగు తమ్ముళ్లు ఇంటిపోరు రచ్చకెక్కింది. ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వరంగల్‌ నగరంలో నిర్వహించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయి విస్తృ త సమావేశం రసాభాసగా మారింది. టి.టిడిపిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వికలాంగుల విభాగం రాష్ట్ర నేత కంప వినోద్‌కుమార్‌ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు.
రామ్ గార్డెన్ లో విస్తృతస్థాయి సమావేశం..
రామ్‌ గార్డెన్‌లో టిడిపి నేతలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లాలోని నేతలందరితో పాటు గిరిజనుడు, వికలాంగుల విభాగం రాష్ట్రనేత కంప వినోద్‌కుమార్‌ హాజరయ్యారు. సభ సజావుగా జరుగుతున్న సమయంలో.. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని వినోద్‌కుమార్‌ కోరారు. అయితే దీనికి ఎర్రబెల్లి వారించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదనలు జరిగి సభలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఎర్రబెల్లి అనుచరులు వినోద్‌ను సమావేశం నుంచి బయటకు పంపేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లిపై వినోద్‌కుమార్‌ విరుచుకుపడ్డారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఎర్రబెల్లి ఎదగనివ్వడం లేదని వినోద్‌ ఆరోపించారు.
అధిష్టానం పరిష్కరిస్తుందా ? 
ఇదిలా ఉంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు వినోద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి ప్రకటించారు. అయితే ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వినోద్.. ఎర్రబెల్లిపై మున్సిపల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏదిఏమైనా క్రమశిక్షణ పార్టీగా చెప్పుకునే టిడిపిలో నేతల మధ్య అంతర్గత వ్యవహారం ఒక్కసారిగా భగ్గుమంది. మరి ఈ పరిణామాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

06:51 - August 4, 2015

వరంగల్ : ఉప ఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టిన కాంగ్రెస్... సత్తా చాటి టీఆర్ఎస్‌కు ఝలక్ ఇవ్వాలని ఆశపడుతోంది. ఒకవైపు క్యాడర్‌లో జోష్ నింపుతూనే... మరోవైపు ఓరుగల్లు జనం నాడీ తెల్సుకునే పనిలో పడింది తెలంగాణ పీసీసీ. అభ్యర్థి, పార్టీ బలాబలాలు, ప్రభుత్వ పాలనపై... ప్రజలేమనుకుంటున్నారో తెల్సుకునేందకు సర్వేల వ‌రంగ‌ల్ ఉపపోరుకు చాలామంది టీ-కాంగ్రెస్ నేత‌లు పోటీ ప‌డుతున్నారు. వీరిలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ రాష్ట్రమంత్రి విజయ రామారావులతో పాటు మరో నలుగురు పేర్లతో కూడిన జాబితా ఇప్పటికే హైకమాండ్‌కు చేరింది. అయితే వీరిలో రాజయ్యను కాకుండా... దామోదర రాజనరసింహ, సర్వే సత్యనారాయలను బరిలోకి దించే విషయాన్ని హస్తిన పెద్దన పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ పేరును కూడా వరంగల్ లీడర్లు తెరపైకి తెస్తున్నారు. దీంతో ఎవరైతే గెలుస్తారో తెల్సుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు హస్తం లీడర్లు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఏమనుకుంటారో..? ఈ సర్వేలతో తెలుసుకోవాలని భావిస్తోంది టీ-పీసీసీ.
ఆగస్టు 5-14 వరకు వినూత్న కార్యక్రమాలు..
వరంగల్ ఏ చిన్న అవకాశం కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు హస్తం లీడర్లు. క్యాడర్‌ను సమాయాత్తం చేసేపనిలో పడ్డారు. ఆగస్టు 5 నుంచి 14 వ‌ర‌కు వరంగల్ లోక్‌స‌భ ప‌రిధిలోని అన్ని మండ‌ల కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్‌ ఏడాది పాల‌న‌ వైపల్యాలు తమకు ఎన్నికల్లో కలిసొస్తాయనే ధీమాతో ఉన్నారు. ఓరుగల్లు పోరులో కారుకు ఝలక్ ఇవ్వాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరి ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్ ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

06:30 - August 4, 2015

హైదరాబాద్ : టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద శిక్షణా తరగతులకు రంగం సిద్ధమవుతోంది. ఎన్టియార్ హయాం నుంచీ గండిపేట వేదికగా ఎన్నో శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు కూడా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేశారు. కాని అవి కొన్ని రోజులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈసారి వాటిని తలదన్నేలా భారీ శిక్షణా కార్యక్రమానికి టీడీపీ ప్లాన్ చేసింది. గ్రామ, మండల స్థాయిలో నిరంతంర ప్రజల మధ్య ఉండేలా...పార్టీ కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రజా సర్వే ఫలితాలపై ఏపీ సర్కార్ అసంతృప్తి..
ఏపీలో నిర్వహించిన ప్రజాసర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది. వచ్చే నెల నుంచి టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద శిక్షణా తరగతులను.. నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఏడాది పాటు గ్రూపుల వారీగా సుమారు 40 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అధినేత నిర్ణయించారు.
సెప్టెంబర్‌ ఒకటి నుంచి శిక్షణా తరగతులు..
ఇప్పటికే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు నాలుగు కేంద్రాలను గుర్తించారు. రాష్ట్రంలో అరకు, మదనపల్లి, మేదరమెట్ల, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలకు అనువైనవిగా భావిస్తున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఒక్కో బ్యాచ్‌కు వంద మంది చొప్పున నాలుగు కేంద్రాల్లో 400ల మందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా నాలుగు కేంద్రాల్లో వారానికి మూడు గ్రూపులకు అవగాహన సదస్సులు ఉంటాయి. ఇలా ఏడాది పాటు శిక్షణ కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పాల్గొంటారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యం..
ప్రభుత్వ పథకాలను సరైన ప్రచారం రాకపోవటంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఫించన్లను ఐదు రెట్లు పెంచినా, రుణమాఫీకి 30 వేల కోట్లు రూపాయలకు వెచ్చించినా రావాల్సిన పేరు రాలేదనే భావనలో ఉంది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమేగాక, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. వీటితో పాటు టీడీపీ చరిత్ర, ఎన్టీయార్ హవా, చంద్రబాబు పాలన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై నేతల్లో అవగాహన కల్పించనుంది.
నెల 16, 17, 18 సీనియర్లకు అవగాహన సదస్సు..
కార్యకర్తలకు, నేతలకు శిక్షణ ఇచ్చేందుకు....టీడీపీ ఇప్పటికే 50 మంది సీనియర్లను ఎంపిక చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఎన్టీఆర్‌ భవన్‌లో వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. వీరితో పాటు వృత్తి నిపుణులను కూడా శిక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్నారు.

06:28 - August 4, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఏడాది పాలనపై ఇప్పటికే కాలు దవ్వుతున్న కాంగ్రెస్...దానిని మరింత ఉధృతం చేస్తోంది. ఇప్పటికే రైతు సమస్యలపై రోడ్డెక్కిన హస్తం పార్టీ.. ప్రభుత్వం తీసుకుంటున్న వివాదస్పద నిర్ణయాలనూ ఎండగడుతూ వస్తోంది. ప్రధానంగా హౌసింగ్ స్కీంను అస్త్రంగా మార్చుకుంటోంది. పేదల ఇళ్లే లక్ష్యంగా రోడ్డెక్కబోతోంది. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని డిసైడైంది.
కాంగ్రెస్ హ‌యాంలో 18,74,635 ఇళ్ల నిర్మాణం..
రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు కాంగ్రెస్ హ‌యాంలో 18 లక్షల 74 వేల 635 ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింద‌ని కాంగ్రెస్ చెబుతుంది. దీంతో పాటు 9లక్షల 19వేల 561 ఇళ్ళు మంజూరై ప్రారంభానికి రెఢీగా ఉన్నాయంటున్నారు. 4 లక్షల 97 వేల 247 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణలో ఉన్నాయని చెబుతోంది. కాని టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్‌లో అక్రమాలు జరిగాయని బూచీగా చూపేడుతూ..పెండింగ్ బకాయిలని నిలిపివేసిందని ఆరోపిస్తోంది. దీనిద్వారా పేదలకు అన్యాయం జరుగుతుందని హస్తం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ప్రభుత్వం తీరును ఎండగడుతామంటున్నారు. ఇప్పటికే పేదలకు డబుల్ బెడ్ రూమ్‌ హామీలపై ప్రభుత్వం తీరును ఎండగడుతున్న కాంగ్రెస్..ఇదిరమ్మ ఇళ్ల బకాయిలను అస్త్రంగా చేసుకొని గులాబీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది. మరీ ఇది ఎంత వరకు వర్క్‌అవుట్ అవుతందో చూడాలి.

06:27 - August 4, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపించేందుకు మున్సిపల్‌ కార్మికులు సిద్ధమయ్యారు. నెల రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్నా.. అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు.. నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. నెల రోజులుగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం కనీసంగానైనా స్పందించకపోవడం కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.
కార్మికులను విస్మరించిన ప్రభుత్వం..
వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. తెలంగాణలోని మున్సిపల్‌ కార్మికులు గత నెల 6వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే.. పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ.. అవి విఫలం కావడంతో, కార్మికులు సమ్మె కొనసాగించారు. అయితే.. జులై 16వ తేదీన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నా, కేవలం జీహెచ్‌ఎంసీ కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచింది. జిల్లాల్లో సమ్మె చేస్తున్న 17 వేల మంది కార్మికులను విస్మరించడంతో.. సమ్మె కొనసాగుతూనే ఉంది.
13 వందల మందిని తొలగించిన జీహెచ్ఎంసీ..
ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీలోనూ ప్రభుత్వం కార్మికుల మధ్య చిచ్చుపెట్టింది. సమ్మె విరమించలేదంటూ దాదాపు 13 వందల మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో.. ప్రభుత్వ వ్యవహారశైలిపై మండిపడుతున్న కార్మిక సంఘాలు.. చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని, జీహెచ్‌ఎంసీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చేపడుతున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే.. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

06:25 - August 4, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో ఖరీఫ్‌లో సాగుకు నీరివ్వలేమని కృష్ణా రివర్‌ బోర్డు స్పష్టం చేసింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శ్రీశైలం,నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో నీటిమట్టం భారీగా తగ్గిపోవడంతో ఖరీఫ్‌ సాగుకు నీరు లేని పరిస్థితి నెలకొంది. కృష్ణా జలాల వినియోగంపై చర్చించేందుకు ఢిల్లీలో సమావేశమైన కృష్ణా యాజమాన్య బోర్డు.. ఖరీఫ్‌ సాగుకు నీరు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇక ఈ సమావేశంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై అధికారులు ప్రధానంగా చర్చించారు.
ఖరీఫ్‌ సాగుకు నీళ్లివ్వలేమన్న అధికారులు..
శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 802 అడుగులకు,.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం 510 అడుగులకు చేరడంతో బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజికి చేరడంతో ఇరు రాష్ట్రాలు కేవలం తాగునీటి కోసం మాత్రమే కృష్ణా జలాలను వినియోగించుకోవాలని బోర్డు ఆదేశించింది. ప్రాజెక్టుల్లో నీళ్లు లేనందున ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల చేయలేమని బోర్డు స్పష్టం చేసింది.
గతేడాది కంటే తగ్గిన నీటి నిల్వలు..
ఇక ఈ ప్రాజెక్టుల్లో గతేడాది కంటే నీటినిల్వలు తగ్గిపోవడంతో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని బోర్డు ఆదేశించింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేసే అంశం కూడా సమావేశంలో చర్చించారు. అయితే శ్రీశైలంలో ఇన్‌ఫ్లో పెరిగితేనే ఇది సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణా ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో పెరిగితే అప్పటి పరిస్థితిని బట్టి మరోసారి సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు.
దారుణంగా రైతుల పరిస్థితి..
తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకున్న నిర్ణయంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోతుండగా.. ఇక సాగుకు నీరు విడుదల చేయమని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నీళ్లు విడుదల చేస్తారని ఎంతగానో ఆశపడ్డ తమకు నిరాశే ఎదురైందని రైతులంటున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప మా కష్టాలు తీరేటట్లు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

06:23 - August 4, 2015

హైదరాబాద్ : సమయం : సోమవారం రాత్రి 8 గంటలు..మారేడ్ పల్లి పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయి దాడికి పాల్పడ్డారు. సుమారు 200 మంది గాంధీనగర్ వాసులు మూకుమ్మడిగా దాడి చేశారు. స్టేషన్‌లోకి చొరబడి ఫర్మిచర్‌కు నిప్పుపెట్టారు. మూడు బైక్‌లు, ఒక కారు, విలువైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. అంతటితో ఆగకుండా విధుల్లో పోలీసులపై దాడి చేశారు. వీరి దాడిలో ఎస్‌ఐ సహా ముగ్గురు కాస్టేబుల్‌లకు గాయాలయ్యాయి.
బోనాల ఉత్సవాల్లో గాంధీనగర్‌లో ఘర్షణ..
ఆదివారం రోజు జరిగిన బోనాల ఉత్సవాల్లో గాంధీనగర్‌కు చెందిన రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తనపై కొందరు దాడి చేశారని శ్రీనివాస్ అనే హోంగార్డ్ మారేడ్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి మారేడ్ పల్లి పోలీసులు స్థానికులను అరెస్టులు చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బన్నయ్య అనే వ్యక్తిని కూడా విచారించారు. ఐతే విచారణ అనంతరం.... సోమవారం మధ్యాహ్నం బన్నప్ప మరణించాడు. విచారణ పేరుతో పోలీసులు దాడి చేయడం వల్లే బన్నప్ప మరణించాడని కాలనీ వాసులు ఆగ్రహించారు. రాత్రి 8గంటలకు అతడి మృతదేహాన్ని స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవటంతో కోపోద్రిక్తులై కాలనీ వాసులు మూకుమ్మడిగా మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. దాదాపు 200మంది కర్రలు, రాళ్లతో విరుచుకుపడి... అడ్డు వచ్చిన పోలీసులను తీవ్రంగా గాయపరిచి స్టేషన్ కు నిప్పు పెట్టారు.
ఘటనా సమయంలో ఆరుగురు పోలీసులు..
స్టేషన్‌లోని సిబ్బంది మొత్తం బోనాల బందోబస్తులో ఉండటంతో...ఠాణాలో లో కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. ఒకే సారి 200 మంది దాడిచేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి స్టేషన్ దగ్గర మోహరించారు. ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్టేషన్ ఆవరణలో సాయుధ బలగాలు, పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.
విచారణ చేపడుతాం - సిపి..
ఘటన పై విచారణ చేపడుతామని సిపి మహేందర్ రెడ్డి చెప్పారు. రెండు ఘటనలను పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడిలో గాయపడిన పోలీసులకు ఆసుపత్రిలో మొరుగైన చికిత్స అందిస్తున్నామని... వాళ్ల పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. మృతి చెందిన బన్నప్ప మృతేహాన్ని ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
పోలీసులు అదుపులో కాలనీ వాసులు..
పీఎస్‌పై దాడిచేసిన పలువురు గాంధీనగర్ కాలనీ వాసులను, బన్నప్ప కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు ఘటనల పై విచారణ చేసి...దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఐతే నగరంలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

ఉదయ్ సింహా పిటిషన్ విచారణ వచ్చే అవకాశం..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేధిస్తోందన్న ఉదయ్ సింహా పిటిషన్ పై నేడు విచారణ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత నిర్ణయంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. 

తెలంగాణ వ్యాప్తంగా టి.కాంగ్రెస్ నిరసనలు..

ఢిల్లీ : లోక్ సభ నుండి కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా టి.కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది.

 

ఎర్రబెల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

వరంగల్ : టిడిపి నేత ఎర్రబెల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టిడిపి వికలాంగ విభాగం నేత వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తనపై ఎర్రబెల్లి దాడి చేయించాడని వినోద్ ఫిర్యాదు చేశారు. 

బోనాల సందర్భంగా గొడవ జరిగింది - నార్త్ జోన్ డీసీపీ..

సికింద్రాబాద్ : బోనాల సందర్భంగా బస్తీలో గొడవ జరిగిందని బసప్పతో పాటు మరికొందరిని విచారించి వదిలేయడం జరిగిందని నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరినీ కొట్టలేదన్నారు.

 

మారేడ్ పల్లి పీఎస్ పై స్థానికుల దాడి..

సికింద్రాబాద్ : మారేడ్ పల్లి పీఎస్ పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషలోని అద్దాలు..ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాంధీనగర్ బస్తీలో జరిగిన ఘర్షణ విషయంలో బసప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అనంతరం బసప్ప అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. 

ఠాణేలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం..

ముంబై : ఠాణేలో మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఐదుగురిని శిథిలాల కింద నుండి స్థానికులు కాపాడారు.

 

Don't Miss