Activities calendar

05 August 2015

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణ పూర్తి:సుబ్రమణ్యం

గుంటూరు:రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధిం ప్రిన్సిపాల్ బాబూరావును సుబ్రమణ్యం కమిటీ విచారించింది. దీంతో రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణ పూర్తయ్యిందని..రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సుబ్రమణ్యం తెలిపారు.

రెండు రైసు మిల్లులను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు..

తూ.గో:శంఖవరంలోని వెంకటసత్య గురుదత్త రైస్‌మిల్లులో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో భారీగా రేషన్‌ బియ్యాన్ని పట్టుకుని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జయలక్ష్మి రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 3.82 కోట్ల విలువైన ధాన్యం పట్టుకున్నారు. ఈ రెండు రైస్‌ మిల్లులను విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

ప్రోకబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ ఘన విజయం

హైదరాబాద్: ప్రోకబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ ఘన విజయం సాధాంచింది. 44-28 తేడాతో కోల్ కతా పై తెలుగు టైటాన్స్ గెలుపొందింది.

17 నుంచి 'గ్రామజ్యోతి' కార్యక్రమం : సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఈనెల 17 నుంచి గ్రామజ్యోతి కార్యక్రమం అన్ని గ్రామాల్లో విధిగా గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాల జనాభాను అనుసరించి నిధులు కేటాయించాలని, ఏ గ్రామానికీ, ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయో ప్రజలకు తెలియజేయాలి అని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షను నిర్వహించారు. గ్రామజ్యోతి కార్యక్రమం విధివిధానాల ముసాయిదాను సీఎం పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

'శ్రీమంతుడు' టిక్కెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

విశాఖ: శ్రీమంతుడు సినిమా బెనిఫిట్ షో టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ఇద్దరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 800 టికెట్లు రూ.12 వేలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సీఎస్ తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

హైదరాబాద్: ఏపీకి ఉద్యోగుల తలరింపు పై సీఎస్ కృష్ణారావుతో ఉద్యోగ సంఘాల చర్లు ముగిశాయి. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ...సచివాలయం మొత్తాన్ని ఒకేసారి తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన తర్వాతే తరలింపు ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎస్ తెలిపినట్లు పేర్కొన్నారు.. మరో 2,3 సమావేశాల తర్వాత ఉద్యోగుల తరలింపు, రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని సీఎస్ చెప్పారు. పిల్లల స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని సీఎస్ ను కోరినట్లు తెలిపారు.

 

గోపన్ పల్లి వద్ద నూనె మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: తాండూరు మండలం గోపన్ పల్లి సమీపంలోని నూనె మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. నూనె మిల్లు నుంచి భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా దానం నాగేందర్

హైదరాబాద్ : తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యవర్గం నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఎన్నికయ్యారు. అసోసియేషన్‌ వార్షిక కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రెండేళ్ల కోసం 19మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు, ఐదుగురు సలహామండలి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్యాట్‌ ఉపాధ్యక్షులుగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రకాశ్‌, మర్రి ఆదిత్యరెడ్డి, కార్తీకరెడ్డి ఉన్నారు. గ్రామీణప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే క్యాట్‌ లక్ష్యమని అధ్యక్షుడు దానం నాగేందర్‌ అన్నారు.

20:04 - August 5, 2015

హైదరాబాద్‌ : మహా నగరంలోని పేద, మధ్య తరగతి వారికి శుభవార్త. నగరంలో పెళ్లిళ్లు, పార్టీలు, మీటింగ్‌లకు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇకనుంచి మీకు ఆ చింత అక్కర్లేదు. లక్షలకు లక్షలు ధారపోయాల్సిన పని అంతకంటే లేదు. అతి తక్కువ ఖర్చుకే అదిరిపోయేలా పార్టీలు, పెళ్లిళ్లు చేసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ప్లాన్‌ చేస్తోంది. ఎలాగంటారా..? అయితే ఇటో లుక్కెయండి.

మల్టీలెవల్‌ ఫంక్షన్‌ హాల్స్‌ .....

మహానగరంలో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని.. సరికొత్త పథకానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ.. పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, మీటింగ్‌లకు స్థలాలు సరిపోక ఇబ్బందలుపడిన ప్రజల కోసం.. మల్టీలెవల్‌ ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది.

50 ఫంక్షన్‌హాల్స్‌ నిర్మాణం.....

నగరం మొత్తంలో దాదాపు 50 ఫంక్షన్‌ హాల్స్‌ను నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది బల్దియా. తొలి విడుతగా 31 నిర్మించాలని స్కెచ్‌ గీశార్‌ గ్రేటర్‌ అధికారులు. సర్కిల్‌కు రెండు చొప్పున మొదటి దశలోనే ప్లాన్‌ చేస్తున్నారు. వీటి నిర్మాణానికి దాదాపు 90 కోట్ల రూపాయలను కూడా వెచ్చించనుంది జీహెచ్‌ఎంసీ. ఈనెల 10లోపే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పోవాలని టార్గెట్‌టా పెట్టుకున్నారు అధికారులు. ఆ వెంటనే పనులు కూడా ప్రారంభించాలని తహతహలాడుతున్నారు.

ఇప్పటికీ రోడ్లపైనే శుభకార్యాలు....

ఇప్పటి వరకు పేద, మధ్య తరగతి ప్రజలు... చిన్నపాటి ఫంక్షన్‌ హాల్‌ నిర్వహించుకోవాలంటే... వేలాది రూపాయలు హాల్‌ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పలువురు రోడ్లపైనే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో... తీవ్రంగా ట్రాఫిక్‌ జాం అవుతోంది. దీంతో పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఈ బృహత్తర నిర్ణయాన్ని తీసుకున్నామని జీహెచ్‌ఎంసీ కమిషన్‌ చెబుతున్నారు. ఈ బహుళ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ చేశామంటున్నారు. 2వేల చదరపు గజాల స్థలంలో.. ఒక సెల్లార్‌తోపాటు జీప్లస్‌వన్‌గా నిర్మించనున్నారు. సెల్లార్‌లో పార్కింగ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫంక్షన్స్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లో సమావేశ మందిరం, సెకండ్‌ ఫ్లోర్‌లో భోజనశాల ఉండేలా డిజైన్‌ చేశారు.

ఒక్కోదానికి రూ.2 నుంచి 3కోట్ల ఖర్చు....

ఒక్కో ఫంక్షన్‌ హాల్‌కు 2 నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ఇవి మొత్తం కూడా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో... పేదలు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనుకున్న సమయానికి టెండర్లు ఖరారయి, పనులు ప్రారంభమైతే.. సామాన్యుల శుభకార్యాల కష్టాలు గట్టెక్కుతాయి. ఇది ఏమేరకు సక్సెస్‌ అవుతుందనేది.. జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుకు నిదర్శనం కాబోతుంది. 

20:01 - August 5, 2015

హైదరాబాద్‌ : నగరంలో ఎన్నో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. ఇదే తడువుగా.. ఇష్టం వచ్చినట్లు భూమి సేకరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో భూ సేకరణకు కొత్త చట్టాలు వచ్చినా... అధికారులు ఇంకా పాత చట్టాల ప్రకారమే ధరలు నిర్ణయిస్తుండడంతో... తీవ్ర గందరగోళం నెలకొంది. మొత్తంగా నగరంలోని భూసేకరణలో పెద్ద గోల్‌మాల్‌ జరగుతోందని అంతా ఆరోపిస్తున్నారు.

రెట్టింపు ధర ఇవ్వాలంటున్న కొత్తచట్టం....

2013లో కేంద్రం తీసుకొచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం.. మార్కెట్‌ ధర కంటే రెట్టింపు ధర చెల్లించాలి. అధికారులు వేగం పెంచినప్పుడు మాత్రం.. భూ యజమానులను ఇబ్బందులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. దీంతో కొత్త చట్టాల ప్రకారమే తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు బాధితులు.

అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి : మెట్రోఎండీ

అయితే మెట్రో కోసం సేకరించే భూములు విషయంలో.. నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు మెట్రో అధికారులు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టప్రకారమే పరిహారం ఇస్తున్నామని అంటున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా... ప్రత్యక్షంగా తమ దృష్టికి తీసుకురావాలంటున్నారు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి. ముఖ్యంగా మెట్రోప్రాజెక్ట్‌కు ఇంకా భూములను సేకరిస్తూనే ఉన్నారు. దీంతో అనేక చోట్ల రోడ్డు విస్తరణ కావడంలేదు. ఈ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

 

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ జేఈ శ్రీనివాసరావు..

విజయనగరం: బొబ్బిలిలో ఒక అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్‌ జేఈ శ్రీనివారావు ఏసీబీకి చిక్కారు. నివాసరావు పై గతంలోనే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు పకడ్బందీగా మాటువేసి శ్రీనివాసరావును పట్టుకున్నారు.

తెలంగాణ పోలీసుల్లో 90 శాతం మంది ఏపీవారే:టీజేఏసీ

హైదరాబాద్ : రాష్ట్రం విడిపోయి 14 నెలలు గడుస్తున్నా తెలంగాణ ఉద్యోగుల సమస్యలు తీరలేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ వాపోయింది. ఏపీ ఉద్యోగులు తమ ప్రాంతానికి వెళతామంటున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టి.ఉద్యోగ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల్లో 90 శాతం మంది ఆంధ్రావారే ఉన్నారని, వారిని త్వరగా ఏపీకి బదిలీ చేయాలని కోరారు. ఏ ప్రాంతం ఉద్యోగులు ఆప్రాంతంలోనే పనిచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టి.ఉద్యోగ జేఏసీ నేతలు కోరారు. అంతేకాకుండా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేయాలన్నారు.

బ్లాక్ లో శ్రీమంతుడు టిక్కెట్లు...

విశాఖ: బ్లాక్‌లో శ్రీమంతుడు సినిమా టిక్కెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీఐపీ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రీమంతుడు టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని 800 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. టిక్కెట్లతో పాటు రూ. 12,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

దీక్ష విరమించిన టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి

వరంగల్: టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో చేపట్టిన దీక్షను ఎల్ రమణ నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై అసెంబ్లీలో లేవదీస్తానని తెలిపారు. తెలంగాణ లో 9 లక్షల ఇళ్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలన డిమాండ్ చేశారు. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండి పడ్డారు.

ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎస్ కృష్ణారావు భేటీ..

హైదరాబాద్: ఏపీ రాజధానికి కార్యాలయాల తరలింపు పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ ఆర్ అలవెన్స్ ను 30శాతం పెంచాలని సీఎస్ తో మెరపెట్టుకుంటున్నారు. కాసేపటి క్రితం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు భేటీ అయ్యారు. అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల పిల్లలకు లోకల్‌ స్టేటస్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం..

భవిష్యత్‌లో ఏపీకి అర్థిక తోడ్పాటు అందింస్తాం: అరుణ్ జైట్లీ...

ఢిల్లీ : విభజన వల్ల ఏపీ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దేశం గర్వించదగ్గ నగరం హైదరాబాద్‌ అని ఆయన కితాబిచ్చారు. హైదరాబాద్‌ లేకపోవడంతో ఏపీకి ఆదాయం పడిపోయిందని జైట్లీ విశ్లేషించారు. ఏపీకి తొలి ఏడాది వీలైనంత సాయం అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఏపీకి అర్థిక తోడ్పాటు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా అనేది తమ అంజెండాలో ఉందని జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు.

12 రోజుల క్రితమే భారత్ లో అడుగుపెట్టా....

హైదరాబాద్: ప్రాణాలతో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ 12 రోజుల క్రితమే భారత్ లో అడుగుపెట్టాని తెలిపాడు. ప్రాథమిక విచారణలో ఉస్మాన్ ను జైష్ ఈమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడుగా పోలీసులు తెలిపారు. ఉస్మాన్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత భారత బలగాలు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించాయి. వాటికి సమాధానంగా, కేవలం ఇద్దరం మాత్రమే భారత్ లో అడుగుపెట్టామని ఉస్మాన్ తెలిపాడు. అమర్ నాథ్ యాత్రలో రక్తపాతం సృష్టించడమే తమ లక్ష్యమని... వీలైనంత ఎక్కువ మందిని చంపడమే తమ టార్గెట్ అని చెప్పాడు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన మరో ముష్కరుడి పేరు మొమిన్ అని వెల్లడించాడు.

ఉత్తర కశ్మీర్ లో బాంబుపేలడు:ఒకరి మృతి

హైదరాబాద్: ఉత్తర కశ్మీరులోని గండేర్ బల్ లో బాంబు పేలుడు సంభవించింది. స్థానిక బాబా సలీనా గ్రామంలో ముగ్గురు పిల్లలు ఒక విచిత్రమైన ఆటవస్తువుతో ఆడుకుంటుండగా అది పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కాల్పులు

హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కరాచీలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక నేషనల్ స్టేడియంకు అతను కారులో వెళుతుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్రమ్ క్షేమంగా బయటపడ్డారు.

రైతులెవరూ అధైర్య పడొద్దు - మంత్రి దేవినేని ఉమా

హైదరాబాద్: రైతులెవరూ అధైర్య పడొద్దని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యామ్నాయ ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న నీటితో పంటలను కాపాడతామన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటిని పంపిణీ చేస్తామన్నారు. 

17:33 - August 5, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి మృణాళిని విమర్శనాస్త్రాలు సంధించారు. పదేళ్ల పాలనలో పేదలకు 41 లక్షల ఇళ్లు నిర్మించామని గొప్పలు చెప్పుకుందని.. ఇందులో 14 లక్షల 40 వేల ఇళ్లు ఎక్కడ నిర్మించారో తెలియడం లేదన్నారు. బినామి పేర్ల మీద అసలు నిర్మాణాలే చేపట్టకుండా కోట్ల రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కొత్తగా సీఎం చంద్రబాబు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. 

17:31 - August 5, 2015

నల్లగొండ : జిల్లాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పత్తి ఎదగకపోవడం, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో అప్పాజిపేటకు చెందిన నాగం వెంకటరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగం వెంకటరెడ్డికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. బాధిత రైతు కుటుంబాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సీపీఎం, రైతు సంఘం నేతలు పరామర్శించారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. బాధితు రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 

17:29 - August 5, 2015

హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కాపువీధిలోని జయంతి జ్యూవెల్లర్స్‌లోకి చొరబడి యజమానిని తుపాకులతో బెదిరించారు.అనంతరం 40లక్షల విలువైన నగలను లూటీ చేసారు. ఈ దోపిడీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్స్ అరెస్టు

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. లాటరీలో గెలిచారంటూ... దాదాపు లక్ష మందికి వీరు సెల్‌ఫోన్‌లలో ఎస్ఎంఎస్‌లు పంపుతూ అమాయకులను వారు దోచుకుంటున్నారు. దీనిపై నిఘా వేసిన పోలీసులు ఈ వ్యవహరాలకు పాల్పడుతోంది నైజీరియన్ ముఠాగా గుర్తించారు. అనంతరం వీరిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.5లక్షల నగదు, 5 ల్యాప్‌ట్యాప్‌లు, 10 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

మహబూబ్‌నగర్ : జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లింగాలలోగల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రాము అనే విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా... విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి కారణాలను తెలుసుకుంటున్నారు.

సునీత మరణం వెనుకా ర్యాగింగ్ భూతమే...

గుంటూరు : జిల్లాలోని మలినేని ఇంజనీరింగ్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సునీత మరణం వెనుకా ర్యాగింగ్ భూతమే కారణమని తెలుస్తోంది. అయితే, సునీతను ఎవరూ ర్యాగింగ్ చేయలేదు. కానీ.. కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ వ్యవహారాలను ఎలాగైనా ఆపించాలన్న ఉద్దేశంతో, దాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సునీతను పిలిచి తీవ్రంగా మందలించడంతో, మనస్తాపానికి గురైన ఆమె కళాశాల ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకినట్టు తెలుస్తోంది. కళాశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఏసీబీ వలలో తుళ్లూరు సర్వేయర్

తుళ్లూరు: రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు సర్వేయర్ వరప్రసాద్ ఏసీబీకి చిక్కాడు. గతంలో కూడా వరప్రసాద్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మాటువేసి వరప్రసాద్‌ను పట్టుకున్నారు. అతనిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

16:51 - August 5, 2015

హైదరాబాద్ : లిబియా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తెలుగువారు క్షేమంగా బయటపడ్డారు. వారం క్రితం బలరాం,గోపికృష్ణలను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. బాధితులిద్దరూ క్షేమంగా ఉన్నట్లు లిబియాలోని భారత ఎంబసీ అధికారులు ధృవీకరించారు. తెలుగువారు క్షేమంగా విడుదల అవ్వటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

16:48 - August 5, 2015

అనంతపురం : హిందూపురంలో కానిస్టేబుల్‌పై ఓ మొబైల్ షాప్ యాజమాని దాడికి పాల్పడ్డాడు. సెల్‌ఫోన్‌ రిపేర్‌ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో..అది ఘర్షణకు దారితీసింది. పెనుకొండ రోడ్డులోని దేశాయ్‌ సెల్‌ వరల్డ్‌ షాపులో రూరల్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శివ మొబైల్‌ కొన్నాడు. ఫోన్‌లో సమస్య రావడంతో అదే షాపులో రిపేర్‌ చేయాలని ఇచ్చాడు. అయితే రెండు రోజులైనా ఫోన్‌ ఇవ్వకపోవడంతో షాప్‌ యాజమానిని కానిస్టేబుల్‌ నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 

16:47 - August 5, 2015

ఢిల్లీ : 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బ్లాక్ డేగా అభివర్ణించిన సోనియాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ధ్వజమెత్తారు. తలుపులు మూసి... కెమెరాలు ఆపి విభజన చేసినప్పుడు బ్లాక్ డే కాదా? అని సోనియాను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో సోనియా పెడబొబ్బలు పెట్టడంలో అర్థం లేదన్నారు. పార్లమెంట్‌ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. 

16:44 - August 5, 2015

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. సాగునీటి అవసరాల కోసం తక్షణమే నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని... నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా, గుంటూరు డెల్టా కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతులను అన్ని విధలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఆర్మీ ట్రక్కు బీభత్సం

సికింద్రాబాద్ : బోయిన్‌పల్లిలో ఆర్మీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ట్రక్కు ఇతర వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మూడు బైకులు ధ్వసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని ఆసుపత్రికి తరలించారు. సుచిత్ర వైపు నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి ద్విచక్ర వాహానాలపైకి దూసుకుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

16:40 - August 5, 2015

తూర్పు గోదావరి : జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో 40 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ మధ్యాహ్నం భారీ ఈదురుగాలులకు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో నిప్పులు చెలరేగాయి. దీంతో మంటలు క్షణాల్లో పూరిళ్లకు వ్యాపించాయి. స్థానికులంతా వ్యవసాయ పనులకు వెళ్లడంతో మంటలు సకాలంలో ఆర్పలేకపోయారు. సర్వం కోల్పోయిన బాధితులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.  

'రైతులు ఇబ్బంది పడుతుంటే...చంద్రబాబు విహార యాత్రలా!'

హైదరాబాద్ : రైతులు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు విహారయాత్రలు చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారథి విమర్శించారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో కూరకుపోయిందని చెబుతూ, తాను మాత్రం సింగపూర్, మలేషియాలు తిరుగుతూ బోలెడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని పేరుతో నాటకాలాడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దిగువకు నీటిని విడుదల చేయాలని  కర్ణాటక సీఎంకు త్వరలో జగన్ లేఖ రాస్తారని పార్థసారథి చెప్పారు.

పసికందును ఎత్తుకెళ్లేందుకు యత్నించిన మహిళ

కరీంనగర్ : గోదావరిఖనికి చెందిన ప్రాంతీయ ఆసుపత్రిలో ఓ పసికందును ఎత్తుకెళ్లేందుకు మహిళ యత్నించింది. తల్లిని ఏమరపరిచిన నిందితురాలు శిశువును ఎత్తుకెళుతుండగా ఆసుపత్రి సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. దీంతో తడబడిన ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటపడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఘట్‌కేసర్‌ వద్ద కారు బీభత్సం : ముగ్గురికి తీవ్ర గాయాలు...

రంగారెడ్డి : ఘట్‌కేసర్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను ఢీకొంది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా

ఢిల్లీ : లోక్ సభ నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయంటూ ఈ సీనియర్ నటుడు ట్వీట్ చేశారు. మిత్రులు సభ నుంచి సస్పెండ్ అయ్యారన్న వార్త దురదృష్టకరమని పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పాతికమంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం తెలిసిందే. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. 

ఒకే శాఖ పరిధిలోకి రెసిడెన్షియల్ పాఠశాలలు: కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో ఇక ఒకేశాఖ పరిధిలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కే.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి పది చొప్పున గురుకుల పాఠశాలలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కేజీ నుంచి కాకుండా నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు.

మావోయిస్టు మాజీ దళ కమాండర్ మృతి

ఆదిలాబాద్ : జైనూర్ గ్రామానికి చెందిన మాజీ దళ కమాండర్ గూడెం మహేష్ అలియాస్ హన్మంతరావు అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ఆయన 1995 నుంచి 2001 వరకూ మంగి గెరిల్లా దళంలో కమాండర్‌గా పనిచేశారు. 2001లో ప్రభుత్వానికి లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం హఠాత్తుగా మృతిచెందారు.

16:06 - August 5, 2015

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఓటర్‌ కార్డు- ఆధార్‌ అనుసందానం ప్రక్రియను బల్దియా వేగవంతం చేసింది. ఇందుకు ఆగష్టు 8న డెడ్‌లైన్ ప్రకటించారు జీహెచ్ ఎంసీ కమిషనర్‌. గ్రేటర్‌లో ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆయన ఓటర్లను కోరారు.

హైదరాబాద్‌లో మొత్తం 73 ల‌క్షల 69 వేల ఓట‌ర్లు....
హైదరాబాద్ న‌గ‌రంలో మొత్తం 73 ల‌క్షల 69 వేల ఓట‌ర్లు ఉన్నారు. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఓటింగ్ 55 శాతానికి మించడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్ చెయ్యాలని తుదిగడువు విధించింది. ఆగష్టు 8వ తేదీని చివరి రోజుగా డెడ్‌లైన్ ప్రకటించడంతో గ్రేటర్‌ అధికారులు ఆధార్‌ అనుసంధానాన్ని వేగవంతం చేశారు.

ఇదే చివరి అవకాశం-సోమేష్‌కుమార్‌....

మంగళవారం జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్ సోమేష్‌కుమార్‌.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈనెల 8వ తేదీలోపు అర్హులైన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని సోమేష్‌కుమార్‌ కోరారు. రేషన్ షాపులతో పాటు అన్ని ప్రతి పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేకంగా ఆధార్ అనుసంధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్, ఫోన్ ద్వారా ఓటర్‌ కార్డు ఆధార్‌తో అనుసంధానం.....

ఇక గ్రేటర్‌ పరిధిలో ఆన్‌లైన్, ఫోన్ ద్వారా, ఎన్నికల అధికారుల ద్వారా తమ ఓటర్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు లేని కారణంగా ఎవ్వరి ఓట్లనూ తోలగించబోమని సోమేష్‌కుమార్‌ తెలిపారు. బోగస్ ఓట్లను నివారించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు.

 

16:02 - August 5, 2015

హైదరాబాద్ : ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈయనపై మనీలాండరింగ్ సహా పలు అవినీతి ఆరోపణలు వున్నాయి. ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా... హాజరైంది లేదు. ప్రాణహాని నెపంతో 2010లో లలిత్‌ మోదీ దేశం విడిచి... లండన్ చేరుకున్నారు. వీసా విషయంలో బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారని... కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి... సుష్మా స్వరాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా రెకమండ్ చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని కోరుతూ పార్లమెంటులో నిరసన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే... ముంబై కోర్టు లలిత్‌మోదీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

15:59 - August 5, 2015

హైదరాబాద్ : ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. వచ్చే నాలుగేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేసే దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటు సీఎం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విటర్లలో ఎకౌంట్లు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, సీఎం సమీక్షలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. కాని ఈ మధ్య ఆయనకు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది.

అధికారిక ఐడీ cm@telangana.gov.in

సీఎం కేసీఆర్ అధికారిక ఈమెయిల్ ఐడీ ఓపెన్ కావటం లేదు. సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్‌ సీఎం@తెలంగాణ.గవ్.ఇన్ ను వినియోగిస్తున్నారు. ఆయనగానీ, పేషీ సిబ్బందికానీ ఈ మెయిల్‌ను యాక్సెస్ చేస్తుంటారు. కేంద్ర పెద్దలతో సంప్రదింపులతో పటు అన్ని అధికారిక కార్యకలాపాలను ఈ మెయిల్‌ ద్వారానే నిర్వహిస్తుంటారు. ఐతే సీఎం అధికారికంగా వినియోగిస్తున్న మెయిల్ ఐడీ యాక్సెస్ కావటం లేదు. సీఎం క్యాంప్ ఆఫీసు సిబ్బంది పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో మెయిల్ ఓపెన్ కావడం లేదు.

నీతి ఆయోగ్ నివేదికను మెయిల్ చేసిన కేంద్రం....

దీంతో కేంద్రం నుంచి వస్తున్న కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లను తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ చేయలేకపోతుంది. ఈ మధ్య నీతి ఆయోగ్ కు సంబంధించి కేంద్రం...కేసీఆర్‌కు ఓ నివేదిక పంపింది. పలు నీతి ఆయోగ్‌ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాలేకపోవటంతో ఆయన లేకుండానే నివేదిక రెడీ అయింది. దానిపై కేసీఆర్ అభిప్రాయాన్ని తెలుసుకోవటంతో పాటు ఆమోదాన్ని తీసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం పేషీకి సమాచారమిచ్చి...నివేదికను మెయిల్ చేశారు.

మరో ఐడీకి పంపటం కుదరదని స్పష్టం చేసిన కేంద్రం...

కేంద్ర నివేదికను చూసేందుకు.... సిబ్బంది ఎన్ని సార్లు ప్రయత్నించినా మొయిల్ ఓపెన్ కాలేదు. చివరికి చేసేందేమిలేక.... మరో మెయిల్ ఐడీకి నీతి ఆయెగ్ నివేదికను పంపాలని కేంద్రాన్ని సంప్రదించారు. కాని కాన్ఫిడెన్షియల్ నివేదికను మరో మెయిల్ ఐడీకి పంపడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. అధికారిక మొయిల్‌కే నివేదిక పంపినందున...తామేం చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో మొరాయించిన కేసీఆర్ మొయిల్‌ను ఓపెన్ చేసేందుకు సిబ్బంది తంటాలు పడుతున్నారు.

15:55 - August 5, 2015

హైదరాబాద్: తెలంగాణా లో ఇంజనీరింగ్ కాలేజీల క్లాసులయితే ప్రారంభమయ్యాయి కానీ గండాలు మాత్రం తొలగలేదు. ఇప్పటికే రెండు దఫాల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ ఇంకా వేలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెకెండ్ కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత కూడా ఎందరో విద్యార్ధులు సీట్లు రాక సాంకేతిక విద్యామండలి వద్ద పడిగాపులు కాస్తున్నారు. పిల్లల కౌన్సెలింగ్‌ కష్టాలు చూడలేని తల్లితండ్రులు న్యాయం చేయాలని గళమెత్తుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల వల్లనే సీట్లు కోల్పోవల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే టీఎస్‌ విద్యాశాఖమంత్రి కడియంతో, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ భేటీ అయ్యారు. థర్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు చర్చ జరిగినట్లు సమాచారం
స్లైడింగ్ విధానం వైపు టీఎస్‌ సర్కార్‌ మొగ్గు....
ధర్డ్ కౌన్సెలింగ్‌ అంటూ నిర్వహిస్తే అది స్పాట్ కౌన్సెలింగ్‌ అయి ఉండాలని, అప్పుడు సీట్లు పొందలేని విద్యార్ధులకు న్యాయం చేసినట్లు అవుతుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పాట్ కౌన్సెలింగ్‌ వల్ల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది కనుక స్లైండింగ్‌ విధానాన్ని అనుసరించాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. అప్పుడు స్లైడింగ్‌ విధానంతో సీట్లు భర్తీ అయ్యి విద్యార్ధుల భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా లేకుండా పోతుంది. సీట్లు రాని విద్యార్ధులకు మేలు చేయాలనే టీఎస్‌ సర్కార్ సంకల్పం అభినందనీయమే కానీ ఆరంభంలో ఉన్న శ్రద్ధ కడవరకు అమలయ్యేలా చూడాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

లిబియాలో కిడ్నాపైన తెలుగు వారు విడుదల

హైదరాబాద్: ఏడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలరాం, గోపీకృష్ణ ను విడుదల చేసినట్లు లిబియాలోని భారత అంబసి అధికారులు నిర్ధారించారు. తెలుగు వారు సురక్షితంగా విడుదలవడం సంతోషకరం అని టిడిపి అధికార ప్రతినిధి కంభం పాటి రామ్మోహన్ రావు తెలిపారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు సాయంత్రంలోగా స్వదేశానికి వస్తారని తెలిపారు. కిడ్నాప్ చేయడతానికిగల కారణాలు తెలియరాలే...

ఎల్బీనగర్ లో పట్టపగలు దొంగల బీభత్సం...

హైదరాబాద్ : ఎల్బీనగర్ సౌతెండ్ పార్క్‌లో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు వస్తువులను చిందరవందర చేసి మహిళను కత్తితో బెదిరించారు. అనంతరం నగదు, నగలు అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. దొంగల కోసం గాలిస్తున్నారు.

నెల్లూరులో సినీఫక్కీలో భారీ దోపిడీ

నెల్లూరు : నగరంలో ఈ ఉదయం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు ఆయుధాలతో వచ్చి భారీ దోపిడీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని కాపు వీధిలో ఉన్న జయంతి జ్యూయలర్స్ దుకాణంలోకి తుపాకులు ధరించిన దుండగులు జొరబడ్డారు. షాపు యజమానిని తాళ్లతో కట్టేసి మూడు కిలోల బంగారు నగలు రూ. 50 లక్షల నగదును లూటీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దోపిడీ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. షాపు యజమాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు నగరం నుంచి బయటకు వెళ్లే దారులపై సోదాలు నిర్వహిస్తున్నారు.

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం:మంత్రి పత్తిపాటి

హైదరాబాద్: ఏపీలో సాధారణం కంటే 8% తక్కువ వర్షపాతం నమోదయ్యిందని.. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 345 మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందనీ, 325 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యిందని వివరించారు. 24.14 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేశారని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 3.81 లక్షల హెక్టార్లలో తక్కువగా రైతులు సాగు చేశారని వివరించారు.

మలినేని ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలో ఒట్టిచెరుకూరు మండలంలోని మలినేని ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న సునీత అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాలేజీ భవనంపై నుంచి పడిన సునీత తీవ్రగాయాలపాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుంటే ప్రాణాలు విడిచింది. సునీత ప్రకాశం జిల్లా చందలూరు గ్రామానికి చెందిన విద్యార్థిని. కాగా, సునీత ఆత్మహత్యకు ప్రయత్నించిందా? లేక భవనంపై నుంచి పడిపోవడానికి వేరేమైనా కారణాలున్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. 

 

కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదు:జీవన్ రెడ్డి...

కరీంనగర్ : సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరీంనగర్‌ పట్టణాన్ని లండన్‌, న్యూయార్క్‌లా మారుస్తామన్న మాటలు ఏమై పోయాయన్నారు. అలాగే లోయర్‌ మానేరు డ్యాంను బృందావనంలా అభివృద్ధి చేస్తామన్నారని, అది కూడా అతీ గతీ లేకుండా పోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊసే లేకుండా పోయిందని, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

లలిత్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్

హైదరాబాద్: ఐపీయల్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన లలిత్ మోదీకి ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నాన్‌బెయిల్ వారెంటును జారీ చేసింది. ఐపీయల్‌లో లలిత్ మోదీ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ ద్వారా అతనికి గతంలోనే సమన్లు జారీ చేశామని ఈడీ లాయర్ తెలిపారు. దానికి ఇంత వరకు మోదీ నుంచి సమాధానం రాకపోడంతో జూలై 3వతేదిన ప్రత్యేక న్యాయస్థానం ద్వారా కోర్టుకు హాజరు కావాలని మరొకసారి సమన్లు జారీ చేశామని అయినా లలిత్ మోదీ హాజరు కాలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ తెలిపారు.

ఫోర్బ్స్ టాప్ లిస్టులో బాలీవుడ్ నటులు..

హైదరాబాద్ : సినిమా నటుల్లో ఎక్కువ మొత్తం తీసుకుంటున్న వారితో ఫోర్బ్స్ మొదటిసారిగా ఓ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హాలీవుడ్ నుండి బాలీవుడ్ నటుల వరకు ఉన్నారు. టాప్ టెన్‌లో ముగ్గురు బాలీవుడ్ నటులు చోటు దక్కించుకోవడం విశేషం. 7వ స్థానాన్ని అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లు పంచుకోగా సల్మాన్ ఖాన్ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వరుసగా 18, 30 స్థానాల్లో నిలిచారు. మొదటి స్థానంలో రాబర్ట డౌనే జూనియన్ నిలవగా, రెండో స్థానంలో జాకీ చాన్ నిలవడం గమనార్హం. టామ్ క్రూజ్ ఆరో స్థానంలో ఉన్నాడు.

సీఎంలను ప్రధానియే ఎన్నుకుంటే సరిపోతుంది:జేసీ

ఢిల్లీ: సభలో ప్రతిపక్షం మాటను అధికార పక్షం వినే పరిస్థితి లేదన్నారు. సీఎంలను ప్రధానియే ఎన్నుకుంటే సరిపోతుందని...ఏపీకి ప్రత్యేక హోదా పై ఎంపి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల మంద్రి ఆంధ్రులు డిమాండ్ చేసినా... ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందకు ప్రధాని సిద్ధంగా లేరని ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో సహా అందరూ కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్ నడుస్తున్న తీరుపైనా జేసీ అసహనం వ్యక్తం చేశారు.

14:47 - August 5, 2015

హైదరాబాద్:పెళ్లి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. హిందూ వివాహ చట్టంలో అసలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి చట్టాలు వున్నాయి? విడాకులు ఇవ్వాలంటే ఏఏ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇలాంటి అంశాలను 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి సమాచారం కావాలంటే ఈ వీడిమోను క్లిక్ చేయండి.

సెప్టెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు:ఈటెల

కరీంనగర్ : సెప్టెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించన్నుట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న పార్టీలు తమ గుర్తింపు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినందునే నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని, విచారణ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

త్వరలో అన్ని జిల్లాల్లో ఆప్కో షోరూంలు: మంత్రి కొల్లు

హైదరాబాద్: త్వరలో అన్ని జిల్లాల్లో ఆప్కో మెగా షోరూంలు ప్రారంభిస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలను ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికాదని కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో 9 మంది టెర్రరిస్టులు:హై అలర్ట్

ఢిల్లీ:హస్తినలో టెర్రరిస్టుల దాడి జరగొచ్చంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ హైఅలర్ట్ ప్రకటించింది. కనీసం తొమ్మిది మంది టెర్రరిస్టులు ఢిల్లీలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలను భగ్నం చేసేందుకు కుట్ర రచించారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 

ఉగ్రవాదిని పట్టుకున్న భద్రతా దళాలు..

జమ్మూ కాశ్మీర్ : ఉదంపూర్ లో ఓ ఉగ్రవాదిని సజీవంగా భద్రతా దళాలు పట్టుకున్నాయి. బుధవారం జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

13:07 - August 5, 2015

గుంటూరు : గుంటూరు ఏఎన్ యూలో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు విద్యార్థుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందని సుబ్రమణ్యం తెలిపారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని స్పష్టం చేశారు. అర్బన్ ఎస్పీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఉప కులపతి, రిజిష్టార్ తో కమిటీ సమావేశమైంది.

విచారణ జరుపుతున్నాం - ఎస్పీ త్రిపాఠి..
సంఘటన తరువాత విచారణ ప్రారంభమైందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పేర్కొన్నారు. పది రోజుల అనంతరం ప్రారంభమైన వర్సిటీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఫిజికల్ ఎవిడన్స్, యూనివర్సిటీ, టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థులతో మాట్లాడడం జరిగిందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. మీడియాలో ఇతర వాటిలో కొన్ని వార్తలు వచ్చాయని, ఏ సాక్ష్యమున్నా, ఎలాంటి సమాచారం ఉన్న పంపించాలని సూచించారు. దాని ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. రిషితేశ్వరి డైరీని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. విద్యార్థిని పోస్టుమార్టం నివేదికను కోర్టుకు అందచేయడం జరుగుతుందని త్రిపాఠి తెలిపారు. 

శ్రీనగర్ లో ఒప్పంద టీచర్ల ధర్నా..

జమ్మూ కాశ్మీర్ : ఒప్పంద అధ్యాపకులు శ్రీనగర్ లో కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. 

12:55 - August 5, 2015

ఢిల్లీ : హైకోర్టు విభజించాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదంటూ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం రాజకీయంతో ముడి పడి ఉందని, ఏపీ సీఎం చంద్రబాబు పాలనకు అడ్డు వస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనితో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, విభజన చట్టం ప్రకారం ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ ప్రభుత్వమేనన్నారు. ఎంపీ కవిత వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు, కోర్టులో ఉన్న అంశంపై మాట్లాడలేనన్నారు. కోర్టు తీర్పుకు లోబడి కేంద్ర ముందుకెళుతుందని తెలిపారు.

రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తాం - వెంకయ్య..
ఈ తరుణంలో కేంద్ర మంత్రి వెంకయ్య టీఆర్ఎస్ ఎంపీలను సముదాయించే ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తామని, హైకోర్టు విభజనలో కేంద్ర స్పష్టతతో ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు. హైకోర్టు విభజనకు కసరత్తు జరుగుతోందని తెలిపారు.

కొత్త అంశాలు ఏవీ లేవు - జితేందర్ రెడ్డి..
అంతకుముందు న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చెప్పిన దానిలో ఎలాంటి కొత్త అంశాలు లేవని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే హైదరాబాద్ లోనే వసతులు కల్పిస్తామని ఇంతకు ముందే చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్రం తలుచుకుంటే రాత్రికి రాత్రే హైకోర్టుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని, ఇదేం పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. 

12:38 - August 5, 2015

హైదరాబాద్ : తమ పార్టీకి చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడ పట్ల టి.కాంగ్రెస్ భగ్గుమంది. మంగళవారం పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన నేతలు నేడు ఏకంగా టి.అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టింది. ఎంపీలపై సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అనుమతి లేదంటూ మార్షల్స్ పేర్కొనడంతో మాజీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఇదంతా చేస్తున్నారని, తాము శాంతియుతంగా అసెంబ్లీ వద్ద ధర్నా చేస్తే అనుమతి లేదని పేర్కొన్నారని తెలిపారు. ఇక్కడ బైఠాయిస్తే ట్రాఫిక్ వదిలిపెట్టారని, ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎంపీలు అంజన్ కుమార్, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అనంతరం ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

12:33 - August 5, 2015

          బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'బజరంగీ భాయీజాన్‌'. ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. ఈ సినిమాను హరీష్‌ శంకర్‌ తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ను ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడన్న వార్తలు వినపడుతున్నాయి. హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన రాక్‌లైన్‌ వెంకటేష్‌తో కలసి దిల్‌రాజ్‌ నిర్మించనున్నాడని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. దీని కోసమే ఈ మధ్య పవన్‌ కళ్యాణ్‌ 'బజరంగీ భాయీజాన్‌' చిత్రాన్ని స్వయంగా చూశాడట. 'దబాంగ్‌'ను తెలుగులో 'గబ్బర్‌సింగ్‌' పేరుతో రీమేక్‌ చేసి అద్భుతమైన హిట్‌ ఇచ్చిన హరీష్‌ 'బజరంగీ భాయీజాన్‌' కూడా రీమేక్‌ చేయనున్నాడట. ఇదే జరిగితే పవన్‌ జాబితాలో మరొక హిట్‌ ఉంటుందనే చెప్పాలి.

12:32 - August 5, 2015

ఢిల్లీ : 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ పై ఓ వైపు అగ్ర నేతలు ధర్నాలు..నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహజన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తేయాలంటూ యూత్‌కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వాటర్‌ కెనాన్లు ఉపయోగించి కార్యకర్తలను చెదరగొట్టారు. ఓ దశలో పోలీసులు లాఠీలు ఝులిపించారు. 

12:29 - August 5, 2015

ఢిల్లీ : 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ..ఆపార్టీ ఎంపీలంతా పార్లమెంట్‌ ఎదుట రెండో రోజు ధర్నా కొనసాగిస్తున్నారు. ఎంపీలపై వేసిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాండ్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని పార్లమెంట్‌లో సాక్షిగా ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహజన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

హైకోర్టు తెలంగాణకే చెందుతుంది - సదానందగౌడ..

ఢిల్లీ : ప్రస్తుతం హైకోర్టు తెలంగాణకే చెందుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు కల్పించాలని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ ప్రభుత్వమేనన్నారు. 

సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో మార్పు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో మార్పు చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ లోకి ఐదు కొత్త ల్యాండ్ క్రూజర్స్ వాహనాలు రానున్నాయి. ఒక్కో వాహనం ఖరీదు రూ.91 లక్షలు కానుంది.

 

కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేని..

విజయవాడ : కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతామని మంత్రి దేవినేని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు నీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, కృష్ణా బేసిన్ లో 45 నుండి 54 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. 262 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈనెల 15 నాటికి ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీటిని తరలిస్తామన్నారు. 

రాజ్యసభ 2గంటల వరకు వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. వాయిదా అనంతరం 12గంటలకు ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీనితో సభ 2గంటల వరకు వాయిదా పడింది. 

లోక్ సభ స్పీకర్ నివాసం వద్ద ఉద్రిక్తత..

ఢిల్లీ : లోక సభ స్పీకర్ సుమిత్ర మహజన్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. స్పీకర్ నివాసంలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని వాటర్ కెనాన్ లను ప్రయోగించి కార్యకర్తలను అరెస్టు చేశారు. 

గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

తిరుపతి : గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపించారు.

 

మంత్రి యనమల సమీక్ష..

హైదరాబాద్ : షుగర్, టెక్స్ టైల్స్ పరిశ్రమలపై మంత్రి యనమల సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పత్తిపాటి, అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. 

అసెంబ్లీ ఎదుట టి.కాంగ్రెస్ ధర్నా..

హైదరాబాద్ : ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద టి.కాంగ్రెస్ ధర్నాకు యత్నించింది. నేతలను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనితో ఎంపీలు గుత్తా, మాజీ ఎంపీలు పొన్నం, వివేక్, అంజన్, బలరాం నాయక్, షెట్కర్ ల బైఠాయించారు. అనంతరం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

10 తేదీలోపు ప్రభుత్వానికి నివేదిక - సుబ్రమణ్యం..

గుంటూరు : విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై ఈనెల 10లోపు ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని విచారణ కమిటీ కన్వీనర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. బుధవారం ఆర్కిటెక్చర్ విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటామని, కొంతమంది విద్యార్థులు తమ వద్దనున్న సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపించారని సుబ్రమణ్యం పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కలిసి వస్తే కేంద్రం దిగి వస్తుంది - శివాజీ..

పశ్చిమగోదావరి : జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే కేంద్రం దిగి వస్తుందని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

నగరంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..

హైదరాబాద్ : నగరంలో ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

11:25 - August 5, 2015

జమ్మూ కాశ్మీర్ : పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతునే ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లపై విరుచుకపడుతున్నారు. కాల్పులు చేస్తుండడంతో పలువురు జవాన్లు వీరమరణం పొందుతున్నారు. తాజాగా సన్ రులి వద్ద బీఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్య్యాఇ. జవాన్లు జరిపిన ప్రతికాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అంతేగాక ఓ మహిళ కు కూడా తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు ఫూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణకు పాక్ తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే.  గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. 

రైలు ప్రమాదంపై ట్విట్టర్ లో సంతాపం తెలిపిన చౌహాన్..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో జరిగిన రైలు దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. 

బోయిన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి వద్ద ఆర్మీ వాహనం మూడు ద్విచక్రవాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

 

వరంగల్ లో ఎర్రబెల్లి దీక్ష..

వరంగల్ : జిల్లా హన్మకొండలో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి బుధవారం ఉదయం దీక్ష చేపట్టారు. గృహ నిర్మాణ లబ్దిదారులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టారు. 

రాజ్యసభ ప్రారంభమైంది..వాయిదా పడింది..

ఢిల్లీ : ఉభయ సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. రైలు ప్రమాద ఘటనపై రాజ్యసభ సంతాపం తెలిపింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. డిప్యూటి చైర్మన్ పలుమార్లు సూచనలు చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను మధ్యాహ్నాం 12.00గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ ప్రకటించారు. 

పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా..

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రెండో రోజు నిరసనను కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలో నల్లబ్యాండు కట్టుకుని రాహుల్ నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సీనియర్ ఎంపీలు, ఇతరులున్నారు.

10:35 - August 5, 2015

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల్లో ఉల్లి ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. దీనితో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.20కే ఉల్లి విక్రయాలను ఆరంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. రూ.20కే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం కొత్తపేట రైతు మార్కెట్ లో మంత్రి హరీష్ రావు ఉల్లి విక్రయాలను ప్రారంభించారు. ఉల్లి కొనుగోలు చేయడానికి ప్రజలు బారులు తీరారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించిన అనంతరం ఉల్లిని విక్రయించనున్నారు. ప్రతి రోజు రూ.20కే రెండు కిలోల ఉల్లిగడ్డలను ఇవ్వనున్నారు. 

10:30 - August 5, 2015

గుంటూరు : విద్యార్థిని రిషితేశ్వరీ మృతితో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే రిషితేశ్వరీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాగింగ్ కారణంగానే ఆమె మృతి చెందిందని, ప్రిన్స్ పాల్ ఇందుకు ప్రధాన కారణమని వాదనలు వినిపించాయి. అంతేగాక ఆమె రాసుకున్న డైరీ బహిర్గతం కావడంతో సంచనాలు చోటు చేసుకున్నాయి. దీనితో వర్సిటీలో పలు పరిణామాలు చోటు చేసుకోవడంతో పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

ప్రశాంత వాతావరణం..
పది రోజుల సెలవుల అనంతరం బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, ప్రైవేటు సెక్యూర్టీ, వర్సిటీ సిబ్బంది విద్యార్థులను తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతినిస్తున్నారు. అంతేగాక వర్సిటీలో పలుమార్పులు చేశారు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. చెట్లు, పిచ్చిమొక్కలు తొలగించారు. మరోవైపు రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం నియమించిన బాల సుబ్రమణ్యం కమిటీ కాసేపట్లో వర్సిటీకి చేరుకోనుంది. ఆర్కిటెక్చర్ విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఆప్ నేత ధర్మబాబు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వాతావరణం మాములుగానే ఉంది - ఏఏస్పీ..
ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో వాతావరణం మాములుగానే ఉందని జిల్లా ఏఏస్పీ భాస్కర్ బాబు పేర్కొన్నారు. వర్సిటీ దగ్గర భద్రతను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గతంలో చిన్న చిన్న సంఘటనలు జరిగాయని, యూనివర్సిటీ సలహాలు..సూచనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. బయటి నుండి వచ్చే వక్తుల వివరాలు తెలిసిన తరువాతే వర్సిటీలోకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. సూసైడ్ నోట్ బహిరంగ పర్చలేదని, అమ్మాయి రాసుకున్న నోట్ ల ఆధారంగా అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 

ఉల్లి విక్రయాలను ప్రారంభించిన హరీష్..

హైదరాబాద్ : ఉల్లి ధర భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కిలో రూ.20కే విక్రయించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తపేట మార్కెట్ లో మంత్రి హరీష్ రావు ఉల్లి విక్రయాలను ప్రారంభించింది. 

ఇద్దరు జవాన్ల మృతి..

జమ్మూ కాశ్మీర్ : ఉదమ్ పూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. 

నేడు వర్సిటీకి రానున్న బాల సుబ్రమణ్యం కమిటీ..

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీకి బాల సుబ్రమణ్యం నేతృత్వంలోని విచారణ కమిటీ వర్సిటీకి చేరుకోనుంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కమిటీ సమావేశం కానుంది. 

 

సెప్టెంబర్ వరకు వర్షపాతం తక్కువే..

హైదరాబాద్ : సెప్టెంబర్ వరకు వర్షపాతం తక్కువేనని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఎల్ నినో బలపడుతున్నందున దక్షిణాదిన తీవ్ర వర్షాభావం నెలకొంటోందని, దీనివల్ల పైర్లకు దెబ్బ..ద్రవ్యోల్బణం పెరుగుదలకు..ఆహార ధాన్యాలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని అంచనా.

ఉల్లిని కబళిస్తోన్న దళారులు..

విజయవాడ : ఉల్లిని దళారులు కబళిస్తున్నారు. తాడేపల్లి గూడెం వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కర్నూలు రైతుల నుండి స్వాధీనం చేసుకుని ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వానికి దొరకకుండా చేయాలన్నదే వ్యాపారుల కుట్రగా తెలుస్తోంది. ఎగుమతికి అనుమతినిచ్చిన ప్రభుత్వమూ కుట్రలో భాగస్వామియే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి గడప దాటింది. కృతిమ కొరతతో కిలో ఉల్లి రూ.60కి చేరవచ్చని అంచనా.

ఏపీలో ప్రారంభమైన మెడికల్ కౌన్సిలింగ్..

విజయవాడ : ఏపీలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ కొనసాగుతోంది. 11 ప్రభుత్వం, 11 ప్రైవేటు వైద్య కళాశాల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ జరుగుతోంది. 741 ఏంబీబీఎస్, 258 బీడీఎస్ సీట్ల భర్తీ జరుగనుంది. ఒకటి నుండి వెయ్యి ర్యాంకుల వరకు నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. 

యోగా దినోత్సవ మొత్తం ఖర్చు రూ.32 కోట్లు..

ఢిల్లీ : ఇటీవలే భారత ప్రభుత్వం నిర్వహించిన యోగా దినోత్సవ ఖర్చు మొత్తం రూ.32 కోట్లు అని తేలింది. కేవలం చాపల ఖర్చు రూ.92.5 లక్షలు. ''యోగీశ్వరులు ఎవరి చాప వాళ్లు తెచ్చుకుంటే..మోడీ ఇంట్లో లైవ్ టీవీ పెట్టి ఉంటే రూ.33 కోట్లు మిగిలేది కదా మహాశయా'' అని సామాన్యుడు సోషల్ నెట్ వర్క్ లో సణుగుతున్నాడు.

09:28 - August 5, 2015

విజయవాడ : ఏపీలో తొలి విడత మెడికల్ కౌన్సిలింగ్‌ ప్రక్రియ మొదలైంది. మొదట ఓపెన్ కేటగిరిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా, ఈ నెల 8 నుంచి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రవర్సిటీ, ఎస్వీయూ, స్విమ్స్, సిద్ధార్థ కళాశాలతో పాటు పలు డెంటల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. కాలేజీలు, సీట్ల వివరాలను ఇప్పటికే హెల్త్ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు అధికారులు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,375 మెడికల్, 450 డెంటల్ సీట్లు, ఎస్వీయూ పరిధిలో 1,050 మెడికల్ 225 డెంటల్ సీట్లు, సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఎంబీబీఎస్‌లో 341, బీడీఎస్‌లో 102 అన్‌రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. ఇవి కాక తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలో 127 సీట్లకు యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. 

09:25 - August 5, 2015

ఢిల్లీ : రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయని మధ్యప్రదేశ్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఓపీ సింగ్‌ తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలు నదిలో పడడంతో..రెస్క్యూ ఆపరేషన్స్ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.                                                                                  

ఎంత మంది చనిపోయారో తెలియదు - రిజుజు..
మధ్య ప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులకు రక్షించడానికి ఎన్డీఆర్‌ బలగాలు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజుజు అన్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు ? ఎంతమందికి గాయాలయ్యాయి అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. క్షతగాత్రులందరికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

హెల్ప్ లైన్ నెంబర్లు..
రైలు ప్రమాద ఘటనపై రెండు హెల్ప్ లైన్‌ నెంబర్లను రైల్వేశాఖ ప్రకటించింది. అందులో ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్‌ కాగా...మరొకటి రైల్వే హెల్ప్ లైన్‌ నెంబర్‌ అని రైల్వే కమర్షియల్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆర్‌కే రావత్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెంబర్‌ 0542250 3814, అలాగే రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 05422509805 62733 అని తెలిపారు. ఈ నెంబర్లకు ఎవరైనా ఫోన్‌చేసి ప్రమాద ఘటన వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

12 మంది మృతి - రైల్వే పీఆర్వో..
మధ్యప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందారని రైల్వే పీఆర్‌వో అనిల్‌ సక్సేనా ప్రకటించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ఇస్తుందని ప్రకటించారు. అలాగే తీవ్రగాయాలైన వారికి 50వేలు, స్పల్పగాయాలైన వారికి 25వేలు పరిహారం అందిస్తామన్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని..క్షతగాత్రులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ తెలిపారు. 

09:22 - August 5, 2015

మధ్యప్రదేశ్‌ : కుదావా రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి రెండు రైళ్లు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతిచెందగా, 25మందికి గాయాలయ్యాయి. ముంబయి నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ ప్రెస్‌కు చెందిన 6బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే పాట్నా- ముంబయి మధ్య ప్రయాణిస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ సమాచార లోపం కారణంగా ఇదే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఇంజన్‌తో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద స్థలం ఖిర్కియా - భిరంగి రైల్వేస్టేషన్ల మధ్య రాత్రి 11.45 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొదట మాచక్‌నది వంతెనపై దుర్ఘటన జరిగినట్లు తొలుత వార్తలొచ్చినప్పటికీ, వంతెన కంటే ముందున్న కల్వర్టుపై ప్రమాదం జరిగిందని తెలిసింది. పట్టాలపై భారీగా నిలిచిన నీరే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. నదిలో పడిపోయిన సుమారు 300 మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ప్రమాదం వార్త తెలుసుకున్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. 25మంది వైద్యులు, సహాయ సిబ్బందితో బయల్దేరిన ప్రత్యేక రైలు కూడా పట్టాలపై భారీగా నీరు నిలవడంతో మధ్యలోనే నిలిచిపోయింది. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా భారీగా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను హర్ధాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉదమ్ పూర్ జిల్లాలోని సమ్రోలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. 

జవాన్లపై కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై గుర్తు తెలియని దుండగుడు కాల్పలు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ నుండి జవాన్లు వెళుతున్నారు. ఉదమ్ పూర్ లోని సమ్రోలి లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రైళ్ల ప్రమాదంపై కేసీఆర్ విచారం..

హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వెలుబుచ్చారు.

రైలు మృతులకు ఎక్స్ గ్రేషియా..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన బాధితులకు రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు..క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. 

రైలు దుర్ఘటనకు అదే కారణం..

మధ్యప్రదేశ్ : రైళ్ల ప్రమాదానికి రైల్వే శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిన ముంచెత్తిన వర్షం నేపథ్యంలో పోటెత్తిన వరద నీరే ఈ ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ప్రకటించింది. కల్వర్టు కింద మట్టికొటుకపోయిందని, దుర్ఘటనకు అదే కారణమని రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. 

08:32 - August 5, 2015

హైకోర్టు విభజనలో కేంద్రం అసమర్థత..తాత్సారం కనిపిస్తోందని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. హైకోర్టు విభజన..ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్ ఆందోళన..టిడిపిలో అవినీతి..తహశీల్దార్ కు బెదిరింపు లేఖ..తదితర అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..

హైకోర్టు విభజన..
''హైకోర్టును రెండుగా విభించరు. ఏపీకి హైకోర్టును కేటాయించాలి. కార్యా నిర్వాహక వర్గం, చట్టసభలూ రెండుగా విడిపోయాయి. న్యాయవ్యవస్థ కూడా విడిపోవాలి. కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని స్వయంగా కేసీఆర్ గతంలో వెల్లడించారు. ఆ శక్తులు ఏంటో తెలియదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రెండు ప్రతిపాదనలు ఏపీ అంగీకరించలేదు. ఏపీ భూ భాగంలో ఏర్పాటు కావాలి. ప్రధానమైన స్థానం ఎక్కడ ? ఇది ముందు తేల్చాలి. దీనికి కావాల్సిన భూమి అందించాలి. ఇందుకు కేంద్రం నిధులు అందించాలి. ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలున్నాయి. రాష్ట్ర భవనాలు తరలిస్తామని, ఇందుకు ఒక కమిటీ కూడా వేశారు. హైకోర్టును రెండుగా చేయాలని ఏపీ న్యాయవాదులు సైతం కోరుతున్నారు. అమరావతిలో పెడుతారా ? తాత్కాలికంగా ఎక్కడైనా పెట్టి అనంతరం మార్చుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు పార్లమెంట్ కు ఉంటే అమలు చేసే బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఇందులో కేంద్రం అసమర్థత..తాత్సారం కనిపిస్తోంది.

ఇందిరమ్మ బిల్లులపై కాంగ్రెస్ ఆందోళన..
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియానే, కాంగ్రెస్సే కదా గెలుస్తామని అనుకున్నారు. కానీ ఓడిపోయారు. ఇందులో సీఐడీ విచారణకు ఆదేశించారు. రిపోర్టు వచ్చింది. కానీ నివేదికను బయటపెట్టలేదు. కాంగ్రెస్ వాళ్లు ఒకవేళ ఉంటే నివేదికను ఎందుకు బయటపెట్టరు ? గతంలో మద్యం కుంభకోణంపై వచ్చిన నివేదికను బయటపెట్టడం లేదు. ఎందుకు చేయరంటే ఆన్సర్ ఉండవు. అవినీతి పరులు అన్ని పార్టీల్లో ఉంటున్నారు. అధికార పార్టీల్లో ఉన్న వాళ్లు లేకపోతే ఎందుకు భయం ? ఇళ్లుకు 40వేలు ఇచ్చారు. కొంతమంది స్వంత డబ్బులు..అప్పులు తెచ్చి కట్టుకున్నారు. ముందు పథకం లోపభూయిష్టం ఉంది. న్యాయంగా కట్టిన వారికి బిల్లులు చెల్లిస్తే బాగుంటుంది కదా.

టిడిపి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోతోంది ?
బీజేపీలో, టిడిపిలో రెండు గ్రూపులున్నాయి. కలువవద్దంటూ ఒక గ్రూపు. ఉంటే అభివృద్ధి జరుగదు. బయటకు వెళ్లి టిడిపి పోరాడే పరిస్థితులున్నాయా ? కేంద్రం సహకరిస్తుందా ? ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్ లో బీజేపీ ఉంది. అవినీతి బాగా పెరిగిందని బీజేపీ నేత పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఉంది ఎన్డీయే. ఇందులో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అవినీతి ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యంగా ఉంటారు ? సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ లు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఎత్తుగడైనా ఉందా ? ఈ ఎత్తుగడలు జనాలకు తెలియాలి.

ముసునూరు తహశీల్దార్ కు బెదిరింపు లేఖ..
ఇసుక రీచ్ లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ వాళ్లు నడిపారు. ప్రస్తుతం టిడిపి నడుపుతోంది. అధికారులను బెదిరించకూడదు..మాఫియాను అరికట్టకట్టాలనే చంద్రబాబు ఎమ్మెల్యేనే సమర్థించారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఉద్యోగ సంఘాల నేతలు లీడర్లు అవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. ఆ అధికారికి హెచ్చరిక లేఖ రాయడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు. అధికారి తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు''. అని నాగేశ్వర్ తెలిపారు.

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్ర్భాంతి..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మృతి చెందిన వారికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

07:57 - August 5, 2015

సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు వెంటనే పెంచాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరారు. బుధవారం సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డైడ్ లైన్ వేధించారు. గత 30 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. విపక్షాలు కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), కమలాకర్ రావు (కాంగ్రెస్), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు) అభిప్రాయాలు తెలిపారు. 

కడపలో మంత్రి మృణాళిని పర్యటన..

కడప : జిల్లాలో నేడు మంత్రి మృణాళిని పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

నేడు ప్రాజెక్టు పనుల తీరుపై ఏపీ సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : నేడు పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై అధికారులతో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

నేటి నుండి వికలాంగుల సహకార సంస్థ రిలే దీక్షలు..

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణలో వికలాంగుల సహకార సంస్థ ఉద్యోగులు రిలే దీక్షలు చేయనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నేటి నుండి ఉల్లి విక్రయాలు..

హైదరాబాద్ : నేటి నుండి ప్రభుత్వం ఉల్లి విక్రయాలు జరుపనుంది. 80 కేంద్రాల్లో రూ.20కే ఉల్లి గడ్డలను విక్రయించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే హైదరాబాద్ లో రెవెన్యూ డివిజన్ లోని 40 కేంద్రాల్లోని రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు చేపట్టనున్నారు.

వరంగల్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా..

వరంగల్ : ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు మహా ధర్నా జరగనుంది. 

సాయంత్రం ఉద్యోగులతో ఏపీ సీఎస్ భేటీ..

హైదరాబాద్ : సాయంత్రం ఆరు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు సమావేశం కానున్నారు. నూతన రాజధానికి ఉద్యోగుల తరలింపుపై ఉద్యోగులతో చర్చ చేపట్టనున్నారు. 

రైలు ప్రమాద హెల్ప్ లైన్ నంబర్లు..

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రైలు దుర్ఘటనకు సంబంధించి పశ్చిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది. భోపాల్ 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా - హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజిన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన సంగతి తెలిసిందే.
భోపాల్ 0755 4001609... హర్దా 09752460088... బీనా 07580 222052....ఇటార్సి 07572 241920..

మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం..

గుంటూరు : మంగళగిరి బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

కాచిగూడ నుండి తిరుపతికి నేడు ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీ కారణంగా కాచిగూడ నుండి తిరుపతికి బుధవారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళశారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

విదర్భ నుండి అల్పపీడన ద్రోణి..

హైదరాబాద్ : విదర్భ నుండి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి మంగళవారం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాలో ఒకట్రెండు చోట్ల..రాయలసీమ, తెలంగాణల్లో అక్కడక్కడ వర్షాలు కురవొచ్చని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

రైలు ప్రమాదంలో 20 మంది మృతి..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో రెండు రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిన ఘటనలో ఇప్పటిదాక 20 మంది మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు.

07:19 - August 5, 2015

ఢిల్లీ : దేశం కాని దేశంలో దశాబ్ధ కాలంగా మౌనవేదన అనుభవిస్తున్న గీతకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్నాళ్ల క్రితమో అయినవారికి దూరమైన ఆమెను తనవారి వద్దకు చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఊరేమిటో.. పేరేమిటో చెప్పలేక సైగల ద్వారానే కాలం గడుపుతున్న ఆమె బతుకుల్లో కొత్త వెలుగులు నింపేందుకు భారత్‌ సర్కార్‌ యత్నిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ సినిమా 'బజరంగీ బాయీజాన్‌' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇతివృత్తం నిజంగా జరిగితే ఎలా ఉంటుంది. అదే పాకిస్తాన్‌లో మౌనవేదన అనుభవిస్తున్న గీత కథ. అయితే సినిమాలో పుట్టు మూగ, చెవిటి బాలిక భారత్‌కు చేరగా.. వాస్తవంలో భారత్‌కు చెందిన బాలిక పాకిస్తాన్‌కు చేరింది.

గీత తల్లిదండ్రుల కోసం ఆరా..
చిన్నవయసులో భారత్‌ భూబాగం నుంచి పొరపాటున పాక్‌ సరిహద్దులోకి వెళ్లి.. జాడ మరిచిన గీతను పాక్‌ రేంజర్లు ఓ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. మాటరాక.. ఎదుటి వారు అడిగేది వినపడక ఎక్కడి నుంచి వచ్చిందో.. పేరేమిటో చెప్పలేక ఇన్నేళ్లు అయినవారికి దూరమై గుడుపుతోంది గీత. అయితే భారతదేశం మ్యాప్‌ చూస్తే ఆమె ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తోంది. ఆమె మౌనవేదనను అర్ధం చేసుకున్న స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ఫైజల్‌.. బాలిక తల్లిదండ్రుల కోసం భారత్‌లో ఆరా తీస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే తాజాగా.. సల్మాన్‌ఖాన్‌ సినిమా ఇదే ఇతివృత్తంతో రావడంతో స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

స్పందించిన సుష్మా..
ఇక గీత వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. గీతను వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామన్నారు. వెంటనే గీతను కలిసి మాట్లాడాలని పాక్‌లో భారత్‌ హైకమిషనర్‌ను ఆమె ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హైకమిషనర్‌ రాఘవన్‌ సతీసమేతంగా వెళ్లి ఆమెను కలిశారు.

సంతోషంలో గీత..
ఇన్నేళ్ల తర్వాత తన గురించి భారత్‌ నుంచి అధికారులు రావడంతో గీత ముఖంలో సంతోషం కనిపిస్తోంది. గీతను చేరదీసిన స్వచ్చంద సంస్థ నిర్వాహకులకు హైకమిషనర్‌ కృతజ్ఞతలు తెలిపారు. గీతకు సంబంధించిన వివరాలు సేకరించి అధికారులు.. గీతను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామంటున్నారు. ఎన్నాళ్ల నుంచో అయినవారికి దూరంగా.. దేశం కాని దేశంలో బతుకుతున్న గీత.. కన్నవాళ్ల వద్దకు త్వరలోనే చేరుతుందని ఆశిద్దాం. 

07:16 - August 5, 2015

ఢిల్లీ : పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గేటట్లు కనిపిస్తోంది. సస్పెన్షన్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మరోపక్క కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు స్పీకర్‌, కాంగ్రెస్‌ మధ్య బీజేడీ, ఎస్పీ, టీఎంసీలు దౌత్యం నిర్వహిస్తున్నాయి. దీంతో సస్పెన్షన్‌ ఎత్తివేత అంశంపై స్పీకర్‌ నేడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

25 మంది సస్పెన్షన్..
లలిత్‌మోడీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ పట్టుబట్టడం.. రాజీనామాల ప్రసక్తే లేదని ప్రభుత్వం చెప్పడంతో.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చలు కొనసాగకుండానే వాయిదా పడుతున్నాయి. ఇక మిగిలిన రోజులైనా సమావేశాలు సక్రమంగా జరిగేందుకు బీజేపీ వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగా సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై ఐదు రోజులపాటు సస్పెన్షన్‌ వేటు వేసింది.

కాంగ్రెస్‌కు అండగా నిలిచిన విపక్షాలు..
ఇక కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌ వ్యవహారాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. పార్లమెంట్‌ ఆవరణలో సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వీరికి టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, బీజేడీ, వామపక్ష పార్టీలు బాసటగా నిలిచాయి. అదేవిధంగా బీజేపీ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.

సస్పెన్షన్‌పై నేడు స్పీకర్‌ నిర్ణయం ?..
మరోపక్క ఎంపీలపై సస్పెన్షన్‌ తొలగించే విధంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ మధ్య విపక్షాలు రాయబారం నడుపుతున్నాయి. వారిపై సస్పెన్షన్‌ తొలగించాలని కోరాయి. అయితే ఈ వ్యవహారంపై స్పీకర్‌ నేడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్‌, విపక్షాల కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. 

07:12 - August 5, 2015

స్మార్ట్ సిటీలు ఇప్పుడు భారత ప్రభుత్వం ఇస్తున్న సుందర నినాదమిది. మన దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 6 నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేశారు. అయితే, ఈ స్మార్ట్ సిటీలు ఎలా వుండబోతున్నాయి? వీటి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం వుంది? అసలు ఈ స్మార్ట్ సిటీల నిర్మాణం ఎవరి కోసం? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నేత ఆంజనేయులు విశ్లేషించారు. 

07:04 - August 5, 2015

విశాఖ, కాకినాడ, తిరుపతి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలుగా అవతరించబోతున్న నగరాలు. అయితే, ఈ స్మార్ట్ సిటీలు ఎలా వుండబోతున్నాయి? స్మార్ట్ సిటీ ఈ పదం వింటుంటేనే ముచ్చటేస్తోంది. తాము తయారు చేయబోతున్న వంద స్మార్ట్ సిటీల గురించి కేంద్ర ప్రభుత్వం చాలా ఆశలు రేకెత్తిస్తోంది. విశాలమైన సుందరమైన రోడ్లు, మనోహరమైన పార్కులు, పరిశుభ్రమైన పరిసరాలు, చూడచక్కని బిల్డింగ్ లు, ప్రతి ఇంటికీ గ్యాస్ పైపులు, నిరాటంకంగా విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన శుద్ధమైన మంచినీటి సరఫరా, నేరస్తుల కదలికలను గుర్తించే అలారం వ్యవస్థ లాంటి ఎన్నెన్నో ఆకర్షణీయ నినాదాలు ఇందులో ఇమిడి వున్నాయి. మన దేశంలో దాదాపు 32 శాతం మంది పట్టణాలలో నివసిస్తున్నారనీ, మరో పదేళ్లలో పట్టణ జనాభా 36శాతం దాటుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. అందుకు తగ్గట్టు స్మార్ట్ సిటీ నిర్మాణం చేయాలన్నది కేంద్రం వ్యూహం.

శరవేగంగా నగర జనాభా..
నిజమే పట్టణ, నగర జనాభా శరవేగంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా సదుపాయాలు, సౌకర్యాలు పెరగడం లేదు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ విస్తరించక, ఇరుకు ఇరుకు రోడ్ల మీద తిరగలేక, సొంత వాహనాలకు ఇంధన ఖర్చులు భరించలేక మధ్యతరగతి తల్లడిల్లుతోంది. పారిశుద్ధ్యం, కాలుష్యం లాంటి సమస్యలూ సగటు మనిషిని వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికి పలు పట్టణాలలోని అనేక కాలనీలు మూడు నాలుగు రోజులకొకసారి మంచినీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితిలో వున్నాయి. ఈగలు, దోమలు, పందుల స్వైర విహారం అనేక పట్టణాలకు నిత్య శాపంగా మారింది. పట్టణ, నగర ప్రజలు ఇలాంటి సమస్యల నుంచి తక్షణం ఉపశమనం కోరుకుంటున్నారు. అయితే పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలిగే స్థితిలో ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు లేవన్నది భయంకర వాస్తవం. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం, ఉన్న కొద్ది పాటి నిధులు వక్రమార్గం పట్టడం లాంటి సమస్యలు పట్టణాల దుస్థితికి కారణం. అయితే ఈ సమస్యల మీద మన ప్రభుత్వాలు ద్రుష్టి సారించే ప్రయత్నాలు చేయడం లేదు. స్మార్ట్ సిటీల పేరుతో పట్టణ వ్యవస్థను కంపెనీల చేతిలో పెడతారేమోనన్న ఆందోళనలూ లేకపోలేదు. అంటే స్మార్ట్ సిటీలలో ప్రజలు ఎన్నుకున్న పౌర పాలన స్థానంలో కంపెనీల పాలన వస్తుందన్న భయాలను కొట్టిపారేయడానికి వీల్లేదు.

యూజర్ ఛార్జీల భారం..
స్మార్ట్ సిటీలు నిర్మాణం పేరుతో అల్పాదాయ వర్గాల వారిని అక్కడి నుంచి తరిమి వేస్తారన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ సిటీలలో నివసించేవారి మీద యూజర్ చార్జీల భారం తప్పదన్న సంకేతాలూ వస్తున్నాయి. దేన్నైనా డబ్బులు ధారపోసి కొనుక్కునే స్థోమత వున్నవారికి మాత్రమే స్మార్ట్ సిటీలలో ప్రవేశం లభిస్తుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ప్రజలు కోరుకుంటున్న స్మార్ట్ సిటీలకీ, ప్రభుత్వం నిర్మించదల్చుకుంటున్న స్మార్ట్ సిటీలకూ ఎంత తేడా వుండబోతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇంకెన్నాళ్లో పట్టకపోవచ్చు. 

06:59 - August 5, 2015

హైదరాబాద్ : ప్రొ-కబడ్డీ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్ - జైపూర్‌ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్‌ టై అయ్యింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్ల సాధించాయి. దీంతో రిఫరీలు మ్యాచ్‌ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్థభాగంలో 20-12 తేడాతో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్థభాగంలో తమ జోరును కొనసాగించలేక పోయింది. జైపూర్ ఆటగాళ్లు తమ దాడిని ఉధృతం చేయడంతో రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మ్యాచ్ చివరి సెకన్ వరకు ఉత్కంఠ నెలకొన్నా ఏ జట్టు విజయాన్ని సాధించలేకపోయింది. సొంత గడ్డపై ఆడినా.. హైదరాబాద్‌ జట్టు గెలవలేకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

06:41 - August 5, 2015

హైదరాబాద్ : పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లుంది.. ఉస్మానియా రోగుల పరిస్థితి. ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలతో.. ముందూ వెనుక చూడకుండా.. రోగుల తరలింపు చేపట్టారు సిబ్బంది. తీరా అక్కడికి వెళ్లిన రోగులు.. వసతులు చూసి పెదవి విరుస్తున్నారు. తమను పట్టించుకునే వారికోసం వెయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరిని ఇక్కడికి తరలించి వారం రోజులు అవుతున్నా.. ఇంకా వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు.
 

కింగ్ కోఠి ఆసుపత్రి..
గతవారం ఉస్మానియా ఆస్పత్రి నుంచి కింగ్‌కోఠీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపబడిన రోగులు. ఉస్మానియా ఇన్‌పేషెంట్‌ విభాగంలో ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన 24 మంది రోగులకు.. కింగ్‌కోఠీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పదిమంది మహిళలు, పదిమంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. అయితే అక్కడున్నంతగా ఇక్కడ వైద్యం లేకపోవడంతో... చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు రోగులు.

ఆర్థిక స్థోమత సరిపోక ఆవేదన..
ఉస్మానియా కంటే.. కింగ్‌కోఠీలో వాతావరణం అనుకూలంగా ఉన్నా.. వసతులు సరిగా లేవని అంటున్నారు. రోగులకు అందించే భోజనంలో పౌషకాలు ఉండడం లేదని అంటున్నారు. అంతేకాకుండా రోగి బంధువులకు కూడా ఇక్కడ భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. అసలే పేదలమైన తాము.. హైదరాబాద్‌లో బయటకొనుక్కునే స్థోమత లేదని ఆవేదన చెందుతున్నారు.

అందుబాటులేని సినియర్‌ వైద్యులు..
ఉస్మానియా ఆస్పత్రిలో రోగులను పరిశీలించేందుకు రోజుకు మూడుసార్లు వైద్యులు వచ్చేవారు. ప్రస్తుతం కింగ్‌కోఠీ ఆస్పత్రిలో రోజుక ఒక్కసారి మాత్రమే వస్తున్నారని వాపోతున్నారు. ఇక ఎమర్జెన్సీ సందర్భాల్లో.. సీనియర్‌ వైద్యులు ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ఇక ఆపరేషన్‌ రోగుల పరిస్థితి దయనీయంగా ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ తమ బాధలపై వెంటనే స్పందించాలని రోగులు కోరుతున్నారు.

06:39 - August 5, 2015

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మూడు రోజులు హస్తినలోనే ఉండనున్న గవర్నర్‌.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి వివరించనున్నారు. అదేవిధంగా ఉద్యోగులు, హైకోర్టు విభజన అంశాలతో పాటు 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న ఢిల్లీ వెళ్లనున్నారు. గవర్నర్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై నివేదిక అందజేస్తున్నారు. అయితే తాజా పర్యటనలో ఏయే అంశాలపై నివేదిక అందిస్తారనేది ఆసక్తిగా మారింది.

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌..
తాజాగా గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో కలిశారు. తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. యూనివర్సిటీలో పాలన గాడిన పడాలంటే కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని గవర్నర్‌ దృష్టికి కేసీఆర్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా గవర్నర్‌ దృష్టి తీసుకెళ్లారని సమాచారం. అదేవిధంగా సెప్టెంబర్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు కేసీఆర్‌ తెలిపారు.

హైకోర్టు విభజన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వినతి..
ఇక గవర్నర్‌ ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో.. హైకోర్టు విభజన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని నరసింహన్‌ను కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఉద్యోగుల విభజనను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రాణహిత-చేవెళ్లకు కేంద్రం సహకారం అందించేలా చూడాలని గవర్నర్‌ను కేసీఆర్‌ కోరారు.

పరిష్కారం లభిస్తుందా ? 
రాష్ట్ర విభజన జరిగిన ఏడాది పూర్తయినా రాష్ట్రంలో అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల పాలకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. మరోపక్క గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా.. సమస్యలు యధావిధిగానే కొనసాగుతున్నాయి. మరి ఈసారి పర్యటనతోనైనా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందో ? లేదో.. వేచి చూడాలి. 

06:35 - August 5, 2015

హైదరాబాద్ : దొందు దొందే. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు. పంతం వీడరు. కూర్చొని మాట్లాడరు. ఇరు రాష్ట్రాల విద్యాశాఖల మధ్య వైరం కొనసాగుతోంది. పదో షెడ్యూల్‌పై పంచాయతీ డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ....ఫిర్యాదుల మీదు ఫిర్యాదులకు దిగుతున్నారు. తాజాగా తెలంగాణ తీరుపై ఏపీ మంత్రి గంటా మళ్లీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎంసెంట్. ఇపుడు పదో షెడ్యూల్‌. తెలుగురాష్ట్రాల్లో విద్యారంగంపై వివాదాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్‌లోని యూనివర్సిటీలపై ఆధిపత్యం కోసం ఇరురాష్ట్రాల విద్యాశాఖలు ఘర్షణకు దిగుతున్నాయి. గవర్నర్‌తో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

పదో షెడ్యూల్‌ పరిధిలో 107 విద్యాసంస్థలు..
పదో షెడ్యూల్ కింద మొత్తం 107 విద్యాసంస్థలున్నాయి. ఐతే హైద్రాబాద్‌లో ఉన్న పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోనే అసలు పంచాయతీ నెలకొంది. ఈ యూనివర్సిటీల ప్రవేశాల విషయంలో ఇరు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి. తమకే పూర్తి అధికారాలు ఉంటాయని ఎవరికి వారు వాదిస్తున్నారు.

నాన్‌లోకల్‌ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు..
హైకోర్టు ఆదేశాల మేరకు...హైద్రాబాద్‌లోని విద్యాసంస్థలపై పూర్తి అధికారాలు తమకే ఉంటాయని టీ సర్కార్ స్పష్టం వాదిస్తోంది. ఆయా యూనివర్సిటీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు నాన్‌లోకల్‌ కిందే సీట్లను కేటాయిస్తామని తేల్చిచెప్పింది.

టీసర్కార్‌ తీరుపై ఏపీ అభ్యంతరాలు..
తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ విద్యాశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా..రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. యూనివర్సిటీ ప్రవేశాల్లో తెలంగాణ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పదో షెడ్యూల్‌లోని విద్యాసంస్థల్లోనే పదేళ్ల వరకు...ఏపీకి వాటా ఇవ్వాలని కోరినట్లు గంటా చెప్పారు.

విద్యావేత్తల ఆగ్రహం..
టీసర్కార్ ఏకపక్ష నిర్ణయాలతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణా ప్రభుత్వం ఈవిధమైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే వేలాది మంది విద్యార్ధులు నష్టపోతారని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడతానికి గవర్నర్‌ కోరినట్లు గంటా తెలిపారు. ఇరు రాష్ట్రాల తీరుపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల ఆధిపత్యాల పోరులో విద్యార్థులు నష్టపోతున్నారని వాపోతున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి...ప్రవేశాలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

06:32 - August 5, 2015

హైదరాబాద్ : సచివాలయంలో వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై అధికారులను ఆరాతీశారు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయరంగానికి పూర్వవైభవం తేవాలని కేసీఆర్ కోరారు.                                                                                 

విత్తన భాండాగారంగా మార్చాలి-కేసీఆర్..
వ్యవసాయ రంగం అభివృద్ధిపై అధికారులకు టీఎస్ సీఎం దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అభివృద్ధిలో ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ కీలకపాత్ర పోషించాలని ఆయన అన్నారు. రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించే విధంగా సరైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చేందుకు రైతులను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

రైతులు ఆధునిక టెక్నాలజీని వాడాలి-కేసీఆర్..
లాభసాటి వ్యవసాయం కోసం ఆధునిక పద్దతులు, టెక్నాలజీని ఉపయోగించాలని కేసీఆర్ రైతులకు సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను సమకూర్చుకోలేని స్థితిలో ఉన్నామని...ఆ దుస్థితి నుంచి బయట పడాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని రైతులకు పిలుపు నిచ్చారు. 

త్వరలో ఖాళీల భర్తీ..
వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం, మంచి వర్షపాత పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. పరిస్థితులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారు.

06:14 - August 5, 2015

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో రెండు ఘోర రైళ్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై నుండి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 10 బోగీలు మాచాక్ నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన సుమారు 300 మంది ప్రయాణీకులను స్థానికులు కాపాడారు. ఖిర్కియా - భిరంగి రైల్వే స్టేషన్ మధ్య రాత్రి 11.45 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పాట్నా - ముంబాయి మధ్య జనతా ఎక్స్ ప్రెస్ సమాచార లోపం కారణంగా కొన్ని నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని పట్టాలు తప్పింది. దీనిలో ఇంజిన్ తో సహా ఐదు బోగీలు నదిలో పడిపోయాయి. కామయాని ఎక్స్ ప్రెస్ ముంబై నుండి వారణాసి వెళుతోంది. జనతా ఎక్స్ ప్రెస్ జబల్ పూర్ నుండి ముంబై వెళుతోంది.
పట్టాలపై భారీ నీరు..
పట్టాలపై భారీగా నిలిచిన నీరే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలను బయటకు తీశారు. భారీ సంఖ్యలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. దీనితో సహాయక చర్యలకు మరో మూడు రైళ్లలో సిబ్బంది, వైద్యులు ప్రమాదస్థలికి బయలుదేరారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిబ్బందిని ఘటనాస్థలికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.
సహాయక చర్యలు చేపడుతున్నాం..
మాచక్ నదిలో బోగీలు పడిపోయిన ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. చీకటి, భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి బయలుదేరారు. వెంటనే ప్రమాదస్థలికి వెళ్లాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లు నిలిపివేత..
రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ముంబై, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వెళ్లాల్సిన పలు రైళ్లు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్ - కోటా మీదుగా దారి మళ్లించారు. 

నేటితో జూరాల ప్రాజెక్టుకు 20 ఏండ్లు..

హైదరాబాద్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ)కు బుధవారంతో 20 ఏండ్లు నిండాయి. 1996 ఆగస్టు 5వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 

ఆరోగ్య శ్రీ చర్చలు రేపటికి వాయిదా..

హైదరాబాద్: అవుట్ సోర్సింగ్ పరిధిలోని వారిని ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, టీఏ వర్తింప చేయాలని కోరుతూ సమ్మె బాట పట్టిన ఉద్యోగులతో మంగళవారం జాయింట్ లేబర్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో ఆరోగ్య శ్రీ ట్రస్టు ఈవో చర్చలు జరిపారు. గురువారం మరోసారి చర్చలు జరుపుతాని పేర్కొన్నారు. 

నేడు ఢిల్లీలో నిరసన తెలుపున్న టి.ఉద్యోగ జేఏసీ నాయకులు..

ఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉమ్మడి సంస్థల విభజనపై నాన్చుడు ధోరణిపై కేంద్ర ప్రభుత్వం వద్ద నిరసన తెలిపేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు సిద్ధమయ్యారు. ఈమేరకు వారు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. 

ఘటనాస్థలానికి బయలుదేరిన సురేష్ ప్రభు..

ఢిల్లీ : రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదాల ఘటనాస్థలికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు బయలుదేరారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

మధ్యప్రదేశ్ లో ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లు నిలిపివేత..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ముంబై, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వెళ్లాల్సిన పలు రైళ్లు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్ - కోటా మీదుగా దారి మళ్లించారు. 

మధ్యప్రదేశ్ లో రెండు ఘోర రైలు ప్రమాదాలు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు సంభవించాయి. హర్దా జిల్లాలో కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి మాచక్ నదిలో పడిపోయాయి. కామయాని ఎక్స్ ప్రెస్ కు చెందిన 10 బోగీలు, జనాతా ఎక్స్ ప్రెస్ కు చెందిన 5 బోగీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. కామయాని ఎక్స్ ప్రెస్ ముంబై నుండి వారణాసి వెళుతోంది. జనతా ఎక్స్ ప్రెస్ జబల్ పూర్ నుండి ముంబై వెళుతోంది. హర్దాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని కుదువా సమీపంలోని ఖిర్కియా-భిరంగి రైల్వే స్టేషన్ వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Don't Miss