Activities calendar

10 August 2015

విశాఖలో స్వైన్ ఫ్లూ కలకలం..

విశాఖ: నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. చికిత్స పొందుతూ 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. మహిళకు స్వైన్ ఫ్లూ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి స్వస్థలం అరిలోవగా గుర్తించారు.

 

21:41 - August 10, 2015

తమిళనాడు: మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్‌ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అనధికార టెలిఫోన్ ఎక్చేంజ్‌ కేసులో మారన్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను మద్రాస్‌ హైకోర్టు రద్దు చేసింది. మూడు రోజుల్లో సిబిఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. డిఎంకె నేత మారన్‌ సిబిఐ విచారణ సహకరించడం లేదని కోర్టు పేర్కొంది.

21:38 - August 10, 2015

ట్రిపోలి : లిబియాలో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న భారతీయ అధ్యాపకుల కిడ్నాప్‌ హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికీ ఇద్దరు తెలుగు అధ్యాపకుల జాడ తెలియడం లేదు. బలరాం, గోపికృష్ణ విడుదల కోసం వారి కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమవాళ్లను చెర నుంచి విడిపించాలంటూ... బాధితుల బంధువులు ఢిల్లీ పెద్దలను కలిశారు. ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తులు చేశారు.

 

21:33 - August 10, 2015

నల్గొండ: ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈమేరకు సిపిఎం చేపట్టిన బస్సుయాత్ర.. తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ బస్సుయాత్ర.. ఇవాళ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల జీవనస్థితి రోజురోజుకు దిగజారుతున్నా.. వారి అభివృద్ధికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు జరగడం లేదన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని తమ్మినేని పేర్కొన్నారు. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

 

విజిలెన్స్ అధికారుల అదుపులో అభిషేకం టిక్కెట్ల దళారీ...

తిరుమల: అభిషేకం టిక్కెట్ల దళారిని విజెలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇప్పిస్తానంటూ... చెన్నైకి చెందిన భక్తుల నుంచి దళారి రూ.80 వేలు తీసుకున్నాడు. టిక్కెట్లు ఇప్పించకపోవడంతో బాధితులు.. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దళారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

జైకిసాన్ అభియాన్ ర్యాలీకి ప్రొ.కోదండరాం మద్దతు

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన జైకిసాన్ అభియాన్ ర్యాలీకి టీజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం మద్దతు తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యల సంఖ్య పెరగడం విచారకరమన్నారు. రైతు ఆత్మహత్యలను సీఎం కేసీఆర్ గుర్తించాలని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కార్పొరేట్ శక్తులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు.

విజయవాడలో సీఎస్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు

కృష్ణా: విజయవాడలో సీఎస్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

మునికోటి కుటుంబానికి పరిహారం పెంపు..

తిరుపతి: ఎపి ప్రభుత్వం.. తిరుపతిలో ఆత్మహుతికి పాల్పడ్డ మునికోటి కుటుంబానికి పరిహారం పెంచింది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.

 

ప్రత్యేకహోదా కోసం పారాడుతాం: ఎంపీ మురళీమోహన్

ఢిల్లీ: ప్రత్యేకహోదా కోసం పారాడుతామని టిడిపి ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేకప్యాకేజీ తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎన్ డిఎ నుంచి బయటికి వస్తే..ఏమీ జరగదని స్పష్టం చేశారు. 

ఎపి విభజన పాపం కాంగ్రెస్ దే: ఎంపీ కొనకళ్ల

హైదరాబాద్: ఎపి రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీదే అని టిడిపి ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ఉనికి కోసమే కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. ప్రపంచంలో ఎవరిపై లేనన్ని కేసులు జగన్ పై ఉన్నాయని తెలిపారు. జగన్ కు టిడిపిని విమర్శించే అర్హత లేదన్నారు.

 

19:47 - August 10, 2015

మహబూబ్‌నగర్‌: షాద్‌నగర్‌లో స్తిరాస్తి వ్యాపారంతో బ్రాహ్మిణులను మోసం చేసిన.. వేదగాయత్రి అగ్రహారం వెంచర్‌ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూర్‌ మండలం, వెంకమ్మగూడ గ్రామ సమీపంలో ప్రభాకర్‌శర్మ అనే వ్యక్తి.. బ్రాహ్మిణులకు మాత్రమే నంటూ... వేదగాయత్రి అగ్రహారం వెంచర్‌ను 2011లో ప్రారంభించాడు. ఇందులో గోశాల, వేదపాఠశాల, గాయత్రి జ్ఞానపీఠం, కల్యాణమండపం, ఆస్పత్రి వంటి సౌకర్యాలు ఉంటాయని.. భారీగా ప్రచారం చేశాడు. దీంతో మన రాష్ట్రంలోనే బ్రాహ్మిణులే కాకుండా.. దేశ విదేశాల్లోని బ్రాహ్మిణులు పెద్ద సంఖ్యలో ప్లాట్లను కొనుగోలు చేశాడు. 36 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ వెంచర్‌లో 200 గజాల్లో 440 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. దీని ద్వారా యజమాని 25కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

19:32 - August 10, 2015

చిత్తూరు: తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మునికోటి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి మునికోటి నివాళులు అర్పించేందుకు... జెండాలకు అతీతంగా రాజకీయ పార్టీల నేతలు కలిసొచ్చారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
పలువురి సంతాపం...
ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన మునికోటికి అధికార, విపక్ష పార్టీలు సంతాపం తెలిపాయి. చెన్నై నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్న మునికోటి మృతదేహానికి కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, వైసీపీతో పాటు టిడిపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. మునికోటి త్యాగాన్ని వృథా కానీయమని.. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అందరూ కలిసి పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మునికోటి మరణంతోనైనా ప్రధాని మోడీ కళ్లు తెరిచి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చిరంజీవి డిమాండ్ చేశారు.

 

19:23 - August 10, 2015

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన పేలుడులో 15మందికి పైగా ప్రయాణీకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటనాస్ధలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

 

లాల్ దర్వాజ బోనాల రంగం ఉత్సవం ప్రారంభం..

హైదరాబాద్: లాల్ దర్వాజ బోనాల రంగం ఉత్సవం ప్రారంభమయింది. అనురాధ భవిష్యవాణి వినిపించారు. ప్రతి భక్తుడు సాక సమర్పించాలన్నారు.

 

ఆఫ్ఘాన్-తజకిస్థాన్ సరిహద్దులో భూకంపం.

ఆఫ్ఘాన్: ఆఫ్ఘాన్-తజకిస్థాన్ సరిహద్దుప్రాంతంలో భూకంప సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైంది. భూమికి 211 కిమీ లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృతమైంది. 

19:02 - August 10, 2015

ఖమ్మం: సల్మాన్‌ఖాన్‌ సినిమా భజరంగీ భాయిజాన్‌ తరహాలో.. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై అలమటిస్తోన్న యువతి గీత గుర్తుందిగా..! భారత్‌కు చెందిన ఈ అమ్మాయి తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉంటే.. భద్రతాదళాలు కరాచీలోని ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. గీత గురించి మీడియాలో ప్రచారం జరగ్గానే.. అమ్మాయి తమ బిడ్డ అంటే.. తమ బిడ్డ అంటూ.. పోటీ పెరిగిపోయింది. ఈ జాబితాలోకి ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబమూ చేరింది. ఇంతకీ గీత ఎవరి బిడ్డ..?
భారత భూభాగంలో తప్పిపోయిన గీత
గీత...! ఈ అమ్మాయి.. చిన్న వయసులో భారత్ భూబాగంలో తప్పిపోయింది. భజరంగీ భాయిజాన్‌ సినిమాలో పుట్టు మూగ, చెవిటి బాలిక.. భారత్‌కు చేరగా.. వాస్తవ జీవితంలో భారత్‌కు చెందిన గీత పాకిస్థాన్‌కు చేరింది. ఇంటి ఆచూకీ చెప్పలేక పోయిన గీతను పాక్‌ రేంజర్లు ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. మాట రాక.. ఎదుటివారు అడిగేది వినపడక ఎక్కడి నుంచి వచ్చిందో.. పేరేమిటో చెప్పలేక ఇన్నేళ్లు అయినవారికి దూరమైందీ గీత.
గీత రాక కోసం ఎదురుచూపులు..
గీత మౌనవేదనను అర్ధం చేసుకున్న స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ఫైజల్‌.. బాలిక తల్లిదండ్రుల కోసం భారత్‌లో ఆరా తీస్తూనే ఉన్నాడు. భజరంగీ సినిమా గుర్తింపు పొందడంతో.. వారూ ఇప్పుడు అదేతరహా ప్రయత్నాలు మొదులు పెట్టారు. ఇరు దేశాల కేంద్ర మంత్రులు కూడా గీత అంశంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. భారత్‌కు తీసుకొస్తామని ఇటీవలనే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గీత రాక కోసం కొన్ని కుటుంబాలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నాయి.
తమ బిడ్డంటే అంటున్న ఖమ్మం జిల్లావాసులు...
గీత తమ బిడ్డంటే తమ బిడ్డని... మూడు నాలుగు కుటుంబాలు ప్రకటించేశారు. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. గీతను తమ కూతురని చెబుతూ మీడియా ముందుకొచ్చారు. జిల్లాలోని జూలూరుపాడు మండలం నర్సాపురానికి చెందిన జజ్జర నర్సయ్య, గోపమ్మ దంపతులు గీత తమ కుమార్తేనని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇటీవల టీవీలు, పత్రికలు, సోషల్‌ మీడియాలో గీత వార్తలు విస్తృతంగా ప్రచారమవుతుడంతో.. వాటిని ఈ దంపతులు చూశారు. 2006లో జనవరిలో 27న ఏసు సువార్త సభలకు వెళ్లినప్పుడు.. తప్పిపోయిన తమ చిన్న కూతురే ఈ గీత అని నమ్మకంగా చెబుతున్నారు.
గీత తమ బిడ్డేనంటూ ముందుకొస్తున్న పలువురు దంపతులు..
ఇటీవల టీవీలు, వార్తపత్రికల్లో ప్రచారమైన గీత ఫోటోతో తమ అమ్మాయి పోలికలు కూడా సరిపోయాయని కృష్ణయ్య దంపతులు చెబుతున్నారు. అవసరమైతే..తమకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేయవచ్చని అంటున్నారు. మొత్తానికి గీత తమ బిడ్డేనంటూ చాలామంది ముందుకొస్తున్నారు. ఆమె భారత్‌కు తిరిగి వచ్చేలోగా మరెన్ని కుటుంబాలు ఇలా బయటికి వస్తాయో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో గీత అసలు తల్లిదండ్రుల ఆచూకీని వీలైనంత త్వరగా ప్రభుత్వాలు తేల్చాలి. లేకుంటే... గీత భారత్‌కు తిరిగొచ్చాక.. అయిన వారి చెంత కాకుండా.. అనాథలా ఏ హాస్టల్‌లోనూ జీవించాల్సి వస్తుంది.

 

18:53 - August 10, 2015

ఢిల్లీ : ఉత్తర భారతంలో ఇవాళా సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. శ్రీనగర్, ఢిల్లీ, పంజాబ్ లలో స్వల్పంగా భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్, ఇస్లామాబాద్, కజకిస్తాన్, ఉత్తర అప్ఘనిస్తాన్ లో కూడా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇళ్ల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు.

 

18:47 - August 10, 2015

అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ మేధావుల సంఘం చేపట్టిన బస్సు యాత్ర అనంతపురం జిల్లా హిందూపురం చేరింది. విశాఖ నుంచి మొదలైన ఈ యాత్రలో మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్... సీపీఐ అనంత జిల్లా కార్యదర్శి జగదీశ్‌తోపాటు... వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఊరుకోమని సభ్యులు హెచ్చరించారు.

 

18:41 - August 10, 2015

ప.గో: జిల్లాలో బీఈడీ పరీక్షల పేరుతో ఓ దళారి మోసానికి పాల్పడ్డాడు. బీఈడీ పరీక్షలు రాయిస్తానంటూ.. నిరుద్యగులను ఏలూరుకు తీసుకొచ్చాడు. హాల్ టిక్కెట్లు.. తెస్తానని చెప్పి దళారి పరారయ్యాడు. దీంతో పశ్చిమబెంగాల్ కు చెందిన 70 మంది బాధితులు ఎస్పిని ఆశ్రయించారు. ఒక్కొక్కరు.. రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం రూ. 42 లక్షల నుంచి రూ. 43 లక్షల వరకు దళారికి ముట్టినట్లు తెలుస్తోంది. త్రిటౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు పరారీలో ఉన్న దళారి కోసం వేట ప్రారంభించారు. అయితే దళారి ఏలూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.

 

బీఈడీ పరీక్షలు రాయిస్తానంటూ దళారి మోసం..

ప.గో: జిల్లాలో బీఈడీ పరీక్షల పేరుతో ఓ దళారి మోసానికి పాల్పడ్డాడు. బీఈడీ పరీక్షలు రాయిస్తానంటూ..నిరుద్యగులను తీసుకొచ్చాడు. ఏలూరు వచ్చాక దళారీ పరార్ అయ్యాడు. దీంతో పశ్చిమబెంగాల్ కు చెందిన 70 మంది బాధితులు ఎస్పిని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దళారి కోసం వేట ప్రారంభించారు.

 

18:17 - August 10, 2015

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కార్మిక సంఘాల జేఏసీ మండిపడింది. కార్మికులపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో భాగంగా.. ఈనెల 11న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. అలాగే ఈనెల 12న చలో హైదరాబాద్, 13న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సదస్సులు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు ప్రకటించారు.

 

18:12 - August 10, 2015

చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన మునికోటికి అధికార, విపక్ష పార్టీలు సంతాపం తెలిపాయి. చెన్నై నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్న మునికోటి మృతదేహానికి కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, వైసీపీతో పాటు టిడిపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. మునికోటి త్యాగాన్ని వృథా కానీయమని.. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అందరూ కలిసి పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మునికోటి మరణంతోనైనా ప్రధాని మోడీ కళ్లు తెరిచి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చిరంజీవి డిమాండ్ చేశారు.

 

17:50 - August 10, 2015

విశాఖ: తొలి స్వదేశీ తయారీ స్మార్ట్ ఫోన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో ఆవిష్కరించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. మేకిన్ ఆంధ్రప్రదేశ్‌, మేకిన్ ఇండియాకు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన జియామీ సంస్థ.. భారత్‌లో సెల్‌ఫోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి స్మార్ట్ ఫోన్‌ను రూపొందించింది.

 

 

17:46 - August 10, 2015

ఖమ్మం: జిల్లాలోని మణుగూరు ప్రధాని రహదారిపై మున్సిపల్‌ కార్మికులు చెత్త బుట్టలతో బోనాలు ఎత్తుకుని నిరసన తెలిపారు. తాము 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారంతా డిమాండ్‌ చేశారు. 

17:44 - August 10, 2015

ఖమ్మం: డిగ్రీ విద్యార్థిని మౌనిక మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ ఐ, టిఎస్ ఎఫ్, ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. విద్యార్థిని మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా నేతలు డిమాండ్‌ చేశారు. మౌనిక కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు.

 

17:41 - August 10, 2015

ఆదిలాబాద్: జిల్లాలోని సిర్పూర్‌ నియోజకవర్గంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా 30 గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. కౌటాల, కాగజ్‌నగర్ , బెజ్జూరు మండలాల్లో సుమారు వెయ్యి మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు జిల్లా వైద్యాధికారుల తీరుపై ప్రజలు భగ్గుమంటున్నారు. వైద్య సాయం అందించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

 

17:39 - August 10, 2015

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని ప్రభుత్వ బధిర పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది. ప్రమాదం సమయంలో 42 మంది విద్యార్థులు ఉన్నారు. కాని వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అధికారులు ఈవిషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్ధులకు సౌకర్యార్థం మరో భవనం నూతనంగా నిర్మించారు. కాని దానిని వాడకపోవడం పలు అనుమానాలకు తావ్విస్తోంది. నూతన భవనం సిద్ధంగా ఉన్నా విద్యార్ధులను ఆ భవనం లోనికి తరలించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

17:34 - August 10, 2015

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మునికోటి ఆత్మార్పణ చేసుకోవటం పట్ల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్ ఏపీ ప్రజల హక్కని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. 

17:31 - August 10, 2015

సందర్భానికి తగినట్లుగా రెడీ అవటంలో మహిళలెప్పుడూ ప్రత్యేకమే. వారి కోసం డిజైనర్స్ ఎప్పటికప్పుడు ఎన్నో వెరైటీస్ ను అందుబాటులో తెస్తున్నారు. అలాంటి డిజైనర్స్ లో ఒకరు తనూజ. తన ఆసక్తి, అభిరుచిలను సమ్మిళితం చేసి టెర్రకోట జ్యువెల్లరీని తయారుచేసి చూపించేందుకు ఇవాళ్టి సొగసులో సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..
 

17:29 - August 10, 2015

పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు, వ్యాపార రంగంలోనూ సత్తా చాటుకుంటున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనతో తమదైన ప్రత్యకతను సాధించుకుంటున్నారు. పర్యావరణ హితంగా, పోషకాహార మిళితంగా సరికొత్త ప్రాడెక్ట్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళా వ్యాపార వేత్త అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం...
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం. లాభనష్టాల సమ్మిళితం. అటువంటి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వాటన్నింటికీ సిద్ధపడాల్సిందే. నష్టాలు వీడి, లాభాలబాట పట్టేందుకు ఎంత కాలమైనా ఓపికగా ఎదురుచూడాల్సిందే. అలాంటి ఆత్మస్థయిర్యంతోనే అడుగు వేస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజ్న. నలుగురు వేసిన అడుగులతో కదం కదిపితే, ఆ నలుగురిలో ఒక్కరవుతారు.
మానవి అభినందన..
ఎవరూ వెళ్లని గమ్యానికి బాటలు వేస్తే, పదిమందిలో ప్రత్యేకంగా నిలబడతారు. ఆ నలుగురిలో ప్రత్యేకంగా నిలబడటమే కాదు, సామాజిక బాధ్యతతో, పర్యవారణ హితంతో, ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజ్నకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.

గీత అంశంపై స్పందించిన సల్లూ భాయ్..

ముంబై : దేశం కాని దేశంలో దశాబ్ధ కాలంగా మౌనవేదన అనుభవిస్తున్న గీత విషయంపై బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. గీత విషయంలో తగిన విధంగా సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇరు ప్రాంతాలు ఈ విషయంలో స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సల్మాన్ తెలిపారు. 

ఏయూ పరిధిలో పరీక్షలు వాయిదా..

విశాఖపట్టణం : మంగళవారం రాష్ట్ర బంద్ సందర్భంగా ఏయూ పరిధిలో డిగ్రీ, బీఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

దయానిధి మారన్ కు ఎదురు దెబ్బ..

చెన్నై : మద్రాస్ హైకోర్టులో దయానిధి మారన్ కు ఎదురు దెబ్బ తగలింది. ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. మూడు రోజుల్లో సీబీఐ ఎదుట హాజరు కావాలని మారన్ కు జస్టిస్ ఎస్.వైద్యనాథన్ ఆదేశాలు జారీ చేశారు. అనధికార టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో మారన్ ముందస్తు బెయిల్ కోరారు. 

మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు - ఏచూరి..

ఢిల్లీ : మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న రైతు సంఘ ఆందోళనకు ఏచూరి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగు రైతు కుటుంబాలను ఏచూరి పరామర్శించారు. అనంతరం ఏచూరి మాట్లాడారు. ప్రేమ విఫలమైనందునే రైతులు చనిపోతున్నారన్న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు పాలకుల ఆలోచనకు అద్దం పడుతోందని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ను మౌనముని అన్న మోడీ కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలిపారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 134 పాయింట్లు నష్టపోయి 28,101 పాయింట్ల వద్ద ముగిసింది. 39 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 8,525 వద్ద ముగిసింది. 

టి.నూతన మద్యం పాలసీని వ్యతిరేకించిన సీపీఎం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆమోదించిన నూతన మద్యం పాలసీని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. గుడుంబాను అరికట్టే సాకుతో ప్రభుత్వమే చీప్ లిక్కర్ ను పల్లె పల్లెకు విస్తరించేందుకు యత్నిస్తోందని, రాజకీయ పార్టీలు, మహిళలు, యువజన సంఘాలతో చర్చించి నూతన మద్యం పాలసీని రూపొందించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూచించారు. 

16:42 - August 10, 2015

ఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఎపికి ప్రత్యేకహోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం.. పాటుపడాలని సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సెల్ ఎపి రాష్ట్ర అధ్యక్షులు... వేదుగుల నాగార్జున మాట్లాడుతూ. ఇది బృహత్తర కార్యక్రమం అన్నారు. ఎపి కాపాడాలనే ఉద్ధేశం, స్వయం ప్రతిపత్తి అవసరమని భావించే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పారు. ఎపికి రాజధాని లేదు, ఎయిర్ పోర్టు లేదని వాపోయారు. ఎపి అభివృద్ధికి ప్రత్యేకహోదా తప్పనిసరి కావాలన్నారు. ఓటు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి... కేంద్రం కాలుపట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు రాజీపడి ప్రత్యేకహోదాను అడ్డుకుంటున్నారని మండిపట్డారు. ప్రత్యేకహోదా సాధించే వరకు వైసిపి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

 

16:33 - August 10, 2015

ఢిల్లీ: హస్తినలో పోలీసులు వైసిపి అధినేత జగన్ ను అరెస్టు చేశారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... జంతర్ మంతర్ వద్ద వైసిపి దీక్ష చేపట్టింది. దీక్ష అనంతరం తమ సమస్యలను విన్నవించుకోవడానికి జగన్ తోపాటు ఆ పార్టీ కార్యకర్తలు పార్లమెంట్ మార్చ్ కు వెళ్తున్నారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు జగన్ ను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

 

కాంగ్రెస్ పై జవదేకర్ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలు..పార్టీలు లేవని, కాంగ్రెస్ ముందే నిర్ణయం తీసుకుని సభలో గలాభా చేస్తోందన్నారు. కేవలం జీఎస్టీ బిల్లు చర్చకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందన్నారు. 

టీఎంసీ..యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ.

పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, రాజ్ గంజ్ యూనివర్సీటీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

ఇక నుండి అన్నీ ఏపీ నుండే..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సీఎస్ క్యాంపుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఎక్కువ రోజులు సీఎస్ విజయవాడలోనే గడపాలని, ప్రభుత్వ శాఖల కార్యదర్శులంతా వీలైనంత త్వరగా ఏపీకి మకాం మార్చాలని ప్రభుత్వం సూచించింది. 17వ తేదీన జరిగే కేబినెట్ భేటీ కూడా విజయవాడలో జరపాలని..అంతేగాకుండా కేబినెట్ సమావేశాలు..ఉన్నత స్థాయి సమీక్షలన్నీ ఏపీలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

16:16 - August 10, 2015

దళిత జీవిత కథనాలను కథలుగా ఆవిష్కరిస్తూ కలం బలం చూపిస్తున్న కథా రచయిత్రి డా.వినోదిని. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ మరోపక్క దళితుల జీవన చిత్రాలను సహజత్వం ఉట్టిపడే కథలుగా శిల్పీకరిస్తున్న రచయిత్రి ఆమె. తరతరాలుగా దళితులపై జరిగిన, జరుగుతున్న చారిత్రక విద్రోహాలకు అక్షరరూపం కల్పించి, ధిక్కార స్వరాలు వినిపించి, కథలుగా శిల్పీకరించిన కథనశిల్పి డా .వినోదిని. ఆమె కథాసాహిత్యం... సృజనాత్మక ప్రతిభను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. 

16:16 - August 10, 2015

ఢిల్లీ: వివాదాస్పద అయోద్య రామ్‌లల్లా ఆలయానికి సంబంధించి... సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. టెంపుల్ రిపేరింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ పైకప్పు మరమ్మతు, సౌకర్యాల కల్పనకు అనుమతి ఇచ్చింది. ఫైజాబాద్‌ కలెక్టర్‌, ఇద్దరు ఇండిపెండెంట్ అబ్జర్వర్ల ఆధ్వర్యంలో... పనులు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. రామ జన్మభూమి ప్రాంతానికి వచ్చే భక్తులకు... సౌకర్యాలు కల్పించే విషయంపై... కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాల అభిప్రాయాలను ఇదివరకే సుప్రీం కోర్టు కోరింది. వారి వాదనలు విన్నాక... తాజా తీర్పు వెలువరించింది.

 

16:14 - August 10, 2015

సామాజిక దురన్యాయాలను ఖండిస్తూ మూఢనమ్మకాలను నిరసిస్తూ, ప్రజా చైతన్య రచనలను ఆవిష్కరిస్తున్న కవి, గేయ రచయిత వల్లంపట్ల నాగేశ్వరావ్. గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం కోసం కలం కదిలిస్తున్న ప్రజా వాగ్గేయకారుడతను. ఈ నాటి జనం పాటలో ప్రముఖ గేయ రచయిత గాయకుడు, వల్లంపట్ల నాగేశ్వరావ్ కథనం.

జగన్ అరెస్టు..

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ను హస్తిన పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది. అనంతరం పార్లమెంట్ కు జగన్, వైసీపీ శ్రేణులు ప్రదర్శగా బయలుదేరారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి జగన్, ఇతర నేతలను అరెస్టు చేశారు.

16:05 - August 10, 2015

సాహిత్యం సమాజాన్ని సమూలంగా మార్చేస్తుందా? మార్చేయక పోవచ్చు కాని మార్పును తీసుకరావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రజలను ఆలోచింపజేసేది. అనుభూతికి గురి చేసేది. ప్రజల్లో భావావేశాలు రగిలించేది సాహిత్యమంటే అందులో అతిశయోక్తిలేదు. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో ఉన్నారు. వారిలో తెలుగు కథాసాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తొలితరం కథా రచయిత... బుచ్చిబాబు.
బుచ్చిబాబు ఈ పేరు వినగానే ..మనకు చివరకు మిగిలేది నవల చప్పున గుర్తొస్తుంది. మనోవైజ్ఞానిక నవలగా అది తెలుగునాట ఎంతో పేరుగడించింది. మనిషి అంతరంగ ప్రపంచాన్ని అన్వేషించి, అచేతన స్థితిలోని మానసిక భావనలను అద్భుతమైన కథలుగా అల్లిన గొప్ప రచయిత బుచ్చిబాబు. ఆయన శతజయంతోత్సవాల సందర్భంగా ఆ కథన శిల్పిపై ప్రత్యేక కథనం..

మునుకోటి అంతిమయాత్ర ఆరంభం..

చిత్తూరు : తిరుపతిలో మునుకోటి అంతియ యాత్ర ఆరంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో మునుకోటి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

16:01 - August 10, 2015

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని వైసిపి అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంతా జగన్ మాట్లాడారు. రాష్ట్ర విభజన చేయొద్దని మొత్తుకోని చెప్పామని తెలిపారు. 60 శాతం ప్రజలు విభజనను వ్యతిరేకించినా... నిరంకుశవైఖరితో రాష్ట్ర విభజన చేశారని మండిపడ్డారు. బిజెపి, టిడిపిలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. బిజెపి, చంద్రబాబు విభజన బిల్లుకు మద్దతు ఇచ్చారు కాబట్టి... లోక్ సభలో బిల్లు ఆమోదం పొంది... రాజ్యసభకు వెళ్లిందని గుర్తు చేశారు. విభజనపై చర్చ అనంతరం రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చారని చెప్పారు. నాడు సీమాంధ్రకు ప్రత్యేకహోదా కల్పిస్తామని... ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి... అప్పటి ప్రధాని మన్మోహ,న్ సింగ్ లోక్ సభలో చెప్పారని గుర్తు చేశారు. అయితే ఐదు సంవత్సరాలు పరిపోదని పది సంవత్సరాలు ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి.. వాగ్ధానం చేశారన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి తాము అధికారంలోకి వస్తే... ప్రత్యేకహోదా ఇస్తమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక... తాను ఇచ్చిన మాటను నేడు అమలు చేయకుండా.. గౌరవించకపోతే... ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు.
నాడు ప్రత్యేకహోదాపై మాట్లాడని రాహుల్...
నాడు ప్రత్యేకహోదాపై పార్లమెంట్ లో ఏ ఒక్కరోజు మాట్లాడని రాహుల్ గాంధీ ..ఇప్పుడు ప్రత్యేకహోదా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ ఎపిని అడ్డగోలుగా విభజన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి తాము అధికారంలోకి వస్తే.. ఐదు ఏళ్లకాదు.. పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి... ప్రస్తుతం ప్యత్యేకహోదా ఇవ్వడం లేదని.. మిగతా రాష్ట్రాలూ అడుగుతున్నాయనడం ఎంతవరకు సబబన్నారు. ప్రత్యేకహోదాకు...14 ఫైనాన్స్ కమిషన్ కు ఎలాంటి సం బంధం లేదనన్నారు. నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కు ప్రత్యేకఇచ్చే అధికారం ఉందని.. దానికి చైర్మన్ గా ప్రధాని ఉన్నారని.. అలాంటప్పుడు ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి వచ్చే కష్టం మేమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టాలు ఏమిటని ప్రశ్నించారు.
ఎపికి పత్యేకహోదా వల్ల లాభాలు
ఎపికి పత్యేకహోదా ఇవ్వడంతో ప్రధానంగా రెండు లాభాలున్నాయి. ఒకటి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో 90 శాతం.. గ్రాంట్లు రూపంలో వస్తాయిని.. మిగిలిన 10 శాతం నిధులు మాత్రం లోన్ రూపంలో వస్తాయని... లోన్ గా తీసుకున్న పది శాతం నిధులనే కేంద్రానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్నారు. పరిశ్రమలు పెట్టడం కోసం..ప్రోత్సకాలు ఇస్తారని చెప్పారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు అభిస్తాయిని వెల్లడించారు. ఇన్ టాక్స్ కట్టనవసరం లేదని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

 

ఉత్తర భారతంలో స్వల్ప భూ ప్రకంపనాలు..

ఢిల్లీ : ఉత్తర భారతంలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. శ్రీనగర్, ఢిల్లీ, పంజాబ్ లలో స్వల్పంగా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్, ఇస్లామాబాద్, కజకిస్తాన్, ఉత్తర అప్ఘనిస్తాన్ లో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. 

లోయలో లారీ..ఏడుగురు మృతి..

తమిళనాడు : తురైవూర్ ప్రాంతానికి చెందిన కొంతమందితో వెళుతున్న లారీ ప్రమాదానికి గురైంది. లోయలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 

మునికోటి కుటుంబాన్ని పరామర్శించిన బొజ్జల..

చిత్తూరు : తిరుపతిలో మృతి చెందిన మునుకోటి కుటుంబాన్ని మంత్రి బొజ్జల పరామార్శించారు. మునుకోటి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని బొజ్జల పేర్కొన్నారు.

మోడీ మౌనం వీడాలి - చిరంజీవి..

చిత్తూరు : కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి చెందిన తరువాతనైనా ప్రధాన మంత్రి మోడీ మౌనం వీడాలని కాంగ్రెస్ నేత చిరంజీవి పేర్కొన్నారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మునుకోటి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. 

పార్లమెంట్ కు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ నిర్వహించిన ధర్నా ముగిసింది. అనంతరం పార్లమెంట్ కు ప్రదర్శనగా పార్టీ అధ్యక్షుడు జగన్, వైసీపీ నేతలు బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

28న ఏపీ బంద్ - వైసీపీ..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 28న బంద్ కు పిలుపునిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ధర్నా ముగిసింది. ఈ ధర్నాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు చేశారు. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ ప్రతిపాదన చేస్తే పదేళ్లు కావాలని అన్న వెంకయ్య నాయుడు ఏమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రం విభజనకు మూల కారకుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. విభజనకు అనుకూలంగా ఓటేసిన చంద్రబాబు పలు కేసుల్లో ఇరుక్కున్నాడని, కేంద్రం కాళ్లు మొక్కుతున్న ఆయన ఇక ఏ హోదా తేగలడని విమర్శించారు.

15:38 - August 10, 2015

ప్రముఖ సినీ నటి 'ఆసిన్' తొందరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహమాడనున్నారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ఆసీన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటి నుండి కొత్త సినిమా ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోవడం లేదన్నారు. పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని ఆసీన్ పేర్కొంది.
దక్షిణాదిన మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ పై మోజుతో సౌత్ కు బైబై చెప్పింది అసిన్. అక్కడ 'గజనీ' హిట్ అయినా కానీ అమ్మడికి మంచి అవకాశాలు లేవు. దీంతో మళ్లీ సౌత్ వైపుకు చూసినా కానీ ఆమెకు ఇక్కడ ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. దీంతో ఖాళీగా ఉన్న ముద్దుగుమ్మ ప్రస్తుతం 'ఆల్ ఈజ్ వెల్' సినిమా చేస్తోంది. త్వరలోనే ఈసినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. 

15:36 - August 10, 2015

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరును ఖండిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలోని జంతమంతర్ వద్ద వైసీపీ నిర్వహిస్తున్న ధర్నాలో ఏచూరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంగీకరించిన బీజేపీ.... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాటమార్చిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని తాము పట్టుబట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బీజేపీ తమతో స్వరం కలిపిందని.. ఇప్పుడు మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించేవరకు కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. 

తిరుపతిలో సీపీఐ ధర్నా..

చిత్తూరు : మునికోటి మృతిపై సీపీఐ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. రహదారిపై సీపీఐ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మునుకోటి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

లోక్ సభ మంగళవారానికి వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేస్తుండడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు.

 

శ్రీలంక టెస్టుకు మురళీ విజయ్ దూరం..

ఢిల్లీ : శ్రీలంకతో గాలే వేదికగా బుధవారం నుండి ప్రారంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత ఓపెనర్ మురళీ విజయ్ ఆడడం లేదని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. 

 

వైసీపీ ధర్నాకు ఏచూరి సంఘీభావం..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ నిర్వహిస్తున్న ధర్నాలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఏచూరి మాట్లాడారు. ప్రత్యేక హోదా అంగీకరించిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మాటమార్చిందని, విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని తాము పట్టుబట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బీజేపీ మాతో స్వరం కలిపిందని, ఇప్పుడు మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ తీరును ఖండిస్తున్నట్లు ఏచూరి పేర్కొన్నారు.

చర్చిల్ అమోమావ్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..

పనాజీ : లూయిర్ బెర్గర్ కేసులో గోవా మాజీ మంత్రి చర్చిల్ అమోమావ్ ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. 

తిరుపతికి చేరిన మునుకోటి మృతదేహం..

చిత్తూరు : కాంగ్రెస్ కార్యకర్త మనుకోటి మృతదేహం తిరుపతికి చేరుకుంది. కొద్దిసేపట్లో అంత్యక్రియలు జరుగనున్నాయి. 

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య..

ఛత్తీస్ గఢ్ : నారాయణ్ పూర్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగించే యంత్రాలు, వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. 

తమిళనాడు జాలర్లను విడుదల చేయనున్న లంక..

శ్రీలంక : తమిళనాడు రాష్ట్రానికి చెందిన 40 మంది జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేయనుంది. వీరిని విడుదల చేయాలని శ్రీలంకలోని రెండు న్యాయస్థానాలు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనితో రామేశ్వరానికి చెందిన 14 మంది, నాగపట్టణం, కరైకాల్ కు చెందిన 26 మంది విడుదల కానున్నారు. 

వెంకయ్య ను కలిసిన గోపికృష్ణ, బలరాం ఫ్యామిలీ..

ఢిల్లీ : లిబియాలో ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు వారు గోపికృష్ణ, బలరాం క కుటుంబసభ్యులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలిశారు. ఉగ్రవాదుల చెర నుండి తమ వారిని విడుదల చేయించాలని కోరారు. 

వ్యక్తిగత పోర్నోగ్రఫిపై నిషేధం లేదన్న కేంద్రం..

ఢిల్లీ : వ్యక్తిగత పోర్నోగ్రఫీ చూసుకొనే విషయంలో ఎలాంటి నిషేధం విధించడం లేదని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ధర్మాసనానికి తెలిపింది. ఇటీవల అశ్లీల వెబ్ సైట్ లను ప్రభుత్వం నిషేధించడంపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. సోమవారం విచారణ జరిగింది. వ్యక్తిగతంగా పొర్నోగ్రఫి చూసే విషయంలో ఓ వ్యక్తి హక్కుకు ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. పిల్లలకు సంబంధించిన వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సి ఉంటుందని, ప్రజల పడక గదుల్లోకి ప్రభుత్వం ప్రవేశించబోదని స్పష్టం చేశారు. 

స్వదేశీ స్మార్ట్ ఫోన్..

విశాఖపట్టణం : దేశంలో తయారైన తొలి స్మార్ట్ ఫోన్ ను విశాఖలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రికార్డు సమయంలో ఫోన్ ఉత్పత్తిని షియామీ సంస్థ తీసుకొచ్చింది. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి సంస్థ షియామీ అని బాబు పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో ఎంతో ముందున్నామని, 2025 నాటికి అన్ని ఉత్పత్తి రంగాల్లో దేశం అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. 

13:54 - August 10, 2015

హైదరాబాద్ : బీహార్‌ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా... నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపుతూ... హామీల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. బీహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు... అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పనిలో పనిగా కుల రాజకీయాలూ ఊపందుకున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో... జేడీయు, ఆర్జేడీలకు షాక్‌ ఇస్తూ... అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించుకున్న బీజేపీ... అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గయలో పరివర్తన్ యాత్ర పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ... నితీష్‌కుమార్‌, లాలూ ప్రసాద్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్‌గా అభివర్ణించారు. ఆటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగంపై మండి పడ్డ నితీష్ కుమార్...

ప్రధాని ప్రసంగంపై.. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. బీహార్ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకే... ఇంతవరకూ అతీగతీలేదని ఎద్దేవా చేశారు. తన DNAలోనే ఏదో తేడా వుందంటూ చేసిన వ్యాఖ్యలపై... ఇప్పటి వరకూ క్షమాపణ చెప్పలేదని... ఇది బీహార్ ప్రజల మనసు గాయపరిచిందన్నారు.

ఆర్జీడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్ ఫైర్....

మోదీ వ్యాఖ్యలపై ఆర్జీడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్ ఫైరయ్యారు. ప్రధాని మానసిక పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు. వ్యాపం, లలిత్‌గేట్‌ ఆరోపణలపై సమాధానం చెప్పలేక.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ వెళ్లేందుకే భయపడుతున్నారని విమర్శించారు.

చాపకింద నీరులా విస్తరించిన కులరాజకీయాలు..

బీహార్‌లో చాపకింద నీరులా విస్తరించిన కులరాజకీయాలూ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. ఓబీసీల ఓటుబ్యాంకు కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ కసరత్తు చేస్తుండగా... దాన్ని లాక్కోడానికి బీజేపీ ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది. మైనారిటీ, దళిత ఓటర్లకూ గాలెం వేసేందుకు పార్టీలూ పావులు కదుపుతున్నాయి. మొత్తానికి ప్రచార పర్వం ఆసక్తి రేపుతోంది. 

కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి - వెంకయ్య..

ఢిల్లీ : సభ సజావుగా జరిగేందుకు తాను ప్రయత్నిస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని, ఎన్నో బిల్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు.

13:49 - August 10, 2015

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే 3 వారాలు గడచిపోయాయి. మిగిలింది 4 రోజులే. ఇవాళ సైతం ఉభయ సభల్లో అవే నిరసనలు, అవే ప్లకార్డులు, అదే వాయిదా పర్వం. ఐదురోజుల బహిష్కరణ వేటుకు గురైన 25 మంది కాంగ్రెస్ ఎంపీలు నేడు లోక్‌సభకు వచ్చి... మరోమారు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక సభను సజావుగా నిర్వహించేందుకు... సమాజ్‌వాదీ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ సూచనతో... స్పీకర్ సుమిత్రా మహాజన్‌ మరోసారి ప్రతిపక్ష సభ్యులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ సహా మిగిలిన విపక్ష సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, సమాజ్‌ వాదీ పార్టీ నుంచి ములాయం సింగ్ యాదవ్ వెళ్లారు. ఈ సందర్భంగా ములాయం కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మీరు మరింత ఆందోళన చేయండి ఐతే సభకు రావాల్సిందేనని చెప్పారు. అలాగైతేనే ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ, ఆమ్‌ఆద్మీ ఇతర విపక్ష సభ్యులు మీ వెంట వుంటారని హెచ్చరించినట్లు సమాచారం.

మునికోటి ఆత్మహత్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు..

హైదరాబాద్ : మునికోటి ఆత్మహత్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు నమోదైంది. కోటి ఆత్మహత్యకు టిడిపి, బీజేపీలే కారణమని, ఆ పార్టీలపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని ఏపీ విద్యార్థి జేఏసీ ఆశ్రయించింది. 

13:46 - August 10, 2015

హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెగకుండా కురుస్తున్న sవర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇది తెలియని కొందరు బుద్దిని సమీపంలోని వాగును దాటేందుకు ప్రయత్నించారు. మధ్యలో ఉండగానే వరద పోటెత్తింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులంతా చెట్లెక్కారు. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి బాధితులను కాపాడారు.

13:44 - August 10, 2015

హైదరాబాద్ : లిబియా ఐఎస్ ఐఎస్ ఉగ్రచెరలో ఉన్న తెలుగు ప్రొఫెసర్ల విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బలరాం, గోపికృష్ణ విడుదల కోసం వారి కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వారు క్షేమంగా తిరిగి వచ్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి మొర పెట్టుకునేందుకు బలరాం, గోపికృష్ణ కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్తున్నారు.

గుండె లోతుల్లోంచి ఉబికివస్తున్న కన్నీళ్లు..

జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భర్త రాక కోసం భార్య ఎదురుచూపులు.. లిబియాలోని ISIS ఉగ్రవాదుల చెరలో తెలుగు ప్రొఫెసర్లు 12 రోజుల నుంచి బందీలుగా ఉన్నారు. బలరాం, గోపికృష్ణ విడుదల కోసం వారి కటుంబ సభ్యలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్నపానీయాలు మాని వారి రాక కోసం నిరీక్షిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల్లో అంతకంతకూ ఆందోళన పెరుగుతూనే ఉంది.

భారత విదేశాంగ శాఖ చేస్తున్న కృషి....

తెలుగు అధ్యాపకుల విడుదల కోసం భారత విదేశాంగ శాఖ చేస్తున్న కృషి ఫలించడం లేదు. లిబియాలోని భారత్‌ ఎంబసీ అధికారులతో సుష్మస్వరాజ్‌ సంప్రదింపులు జరుపుతున్నా.. ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో తెలుగు ప్రొఫెసర్ల కుటుంబాల్లో ఆందోళన కొనసాగుతోంది. తమ బాధను చెప్పుకునేందుకు బలరాం, గోపికృష్ణ కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోడీకి తమ గోడును వెళ్లబోసుకోనున్నారు. 

13:38 - August 10, 2015

ఆదిలాబాద్ : మన్యంలో అమ్మాయిలు అన్యాయమైపోతున్నారు. వారి అమాయకత్వం, పేదరికం ఆసరా చేసుకుని కొన్ని ముఠాలు అడవిబిడ్డలను అంగడి సరుకు చేస్తున్నాయి. పెళ్లి పేరు చెప్పి వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్నేళ్లుగా ఈ తంతు గుట్టుగా సాగిపోతోంది.

అడవి తల్లి ఒడిలో కళ్లు తెరిచిన ఆడపిల్లలు....

అడవి తల్లి ఒడిలో కళ్లు తెరిచిన ఆడపిల్లలు వారు. అన్నెం పున్నెం ఎరుగని అమాయక గిరిజనులు వారు. అడవుల్లో మృగాలు ఉన్నాయని తెలుసుకున్న వారు.. గిరిజన గూడెల్లోనూ గోముఖ వ్యాఘ్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. వారి నుంచే తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని ఊహించలేకపోతున్నారు. యువతుల బతుకులను బలిపీఠం ఎక్కిస్తున్నారు. వారి ధనదాహానికి అమ్మాయిల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. ప్రాణం ఉన్న జీవశ్చవాలుగా మార్చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ మన్యంలో అమ్మాయిల విక్రయాలు .....

గిరిజన తండాల్లో తల్లి దండ్రులకు డబ్బు ఆశ చూపి..పెళ్లి చేస్తామని నమ్మించి ఇతర రాష్ట్రాలకు అమ్మాయిలను విక్రయిస్తున్నారు. ఉట్నూర్ మండలం సాలెవాడకు చెందిన 17 ఏళ్ల మారాఠ లలితను 8 నెలల క్రితం ఓ ముఠా రాజస్థాన్‌ తీసుకెళ్లి అక్కడ ఓ వ్యక్తికి విక్రయించింది. భీం రావ్‌, హర్‌సింగ్‌, జంగ్‌ అనే ముగ్గురు వ్యక్తులు లలితను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజస్థాన్‌లో ఉన్న బాధితురాలికి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపడతామంటున్నారు.

8 నెలల తర్వాత రాజస్థాన్‌లో....

లలిత అదృశ్యమైన 8 నెలల తర్వాత రాజస్థాన్‌లో ఉన్నట్లు ఆమె ఫోన్ చేసేవరకు..తమకు తెలియలేదని సోదరుడు వాపోతున్నాడు. ఆ విషయం తెలిశాకే భీంరావ్‌, జంగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెబుతున్నాడు. రాజస్థాన్‌లో ఉన్న తన చెల్లెలును క్షేమంగా ఇంటికి తీసుకురావాలని పోలీసులను వేడుకుంటున్నాడు. గిరిజన తండాల్లో కాసుల కోసం అడవి బిడ్డలను విక్రయిస్తున్న ముఠాలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. రాజస్థాన్‌లో ఉన్న లలితను వెంటనే తీసుకురావాలని కోరుతున్నారు. 

బాహ్య ప్రపంచానికి దూరంగా గిరిజన గ్రామాలు...

ఆదిలాబాద్ జిల్లా గిరిజన గూడాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియడం లేదు. కనీసం వారి జనాభాపై కూడా ప్రభుత్వానికి పూర్తి స్పష్టత లేదు. గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఓ గిరిజన గూడెంలో ఎంత మంది ప్రజలు ఉన్నారు... వారిలో పిల్లలు ఎంత మంది, పెద్దలు ఎంత మంది, మహిళలు ఎంత మంది అనేది అధికారికంగా లెక్కలు లేవన్న విషయం విస్తూగొల్పుతోంది. ఈ గిరిజన గ్రామాల్లో ఒక్కొక్క గ్రామపంచాయతీ కింద 5 నుంచి 6 కుగ్రామాలు ఉండండంతో...ఆదివాసీలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వారి బతుకేదో వారు బతికేస్తున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా గిరిజన గ్రామాలు....

గిరిజనుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకున్న ముఠాలు...ఇక్కడి అమ్మాయిలను రహస్యంగా రాత్రికి రాత్రి పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. రాజస్తాన్ లాంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటంతో... యువతులను తరలించి అక్కడి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నట్లు సమాచారం.

గిరిజనులకు డబ్బు ఆశ చూపుతున్న ముఠాలు ....

మంచి సంబంధాలు చూపిస్తామని తల్లిదండ్రులను నమ్మించడంతో.. నిరక్షరాస్యత, పేదరికంతో మగ్గుతున్న వారు ఎక్కడైనా తమ బిడ్డ క్షేమంగా ఉంటుందని గుడ్డిగా వారి మాటలు విశ్వసిస్తున్నారు. కానీ ఒక్కసారి అమ్మాయిలను తరలించాక వారి పరిస్థితి ఏంటో బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. గిరిజన గ్రామాల్లో ఏదో మూల ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నా ఎక్కడా కేసులు నమోదు కాకపోవడం అక్రమార్కులకు కలిసొస్తుంది.

యువతులకు పెళ్లి చేస్తామని నమ్మబలుకుతున్న ముఠాలు....

గిరిజన గూడాల్లో అమ్మాయిల అదృశ్యం మిస్టరీగా మారుతోంది. గతేడాది నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ఉట్నూరు మండలం నర్సాపూర్‌కు చెందిన నైతం లక్ష్మి అనే గోండు మహిళ మే 16న అదృశ్యమైంది.ఉట్నూరు మండంలం ఉమ్రికి చెందిన కొముర రమత... జూన్ 18, 2014 నుంచి కనిపించకుండా పోయింది. గతేడాది జూన్‌ 6న బేల మండలానికి చెందిన 15 ఏళ్ల బాలిక గుడిమేట సోను అదృశ్యమైంది. ఇప్పటివరకు ఈ అమ్మాయిలు ఎమయ్యారో.. ఎక్కడ ఉన్నారో అంతుచిక్కకుండా ఉంది.

మిస్టరీగా మారుతున్న అమ్మాయిల అదృశ్యం....

ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి గిరిజన గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని మహిళా సంఘాలు, మానవ హక్కుల నేతలు కోరుతున్నారు. అదే సమయంలో అమ్మాయిల అదృశ్యంపై నిగ్గు తేల్చి అక్రమార్కుల పని పట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

13:27 - August 10, 2015

న్యూఢిల్లీ : అంతరిక్ష పరిశోధనలతో దూసుకుపోతున్న నాసా ఓ అద్బుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలో వాక్ చేయించడానికి రెడీ అయింది. సుమారు ఆరు గంటల పాటు వాక్ చేయనున్నారు. ఎక్స్పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ఫ్లైట్ ఇంజనీర్ మైకెల్ లు సోమవారం రాత్రి 7.44 నుంచి స్పేస్ వాక్ చేయనున్నారు. ప్రపంచం మొత్తం వీక్షించడానికి ఈ వాక్ ను లైవ్ టెలికాస్ట్ చేయనుంది. మొత్తంగా ఇది 188వ స్పేస్ వాక్. అయితే గెన్నడీ ఇప్పటికే 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఇక అత్యధిక కాలం పాటు ఐఎస్ ఎస్ లో గడిపిన వ్యోమగామిగా పడల్కా ఇప్పటికే రికార్డు నెలకొల్పారు.

13:27 - August 10, 2015

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీడీపీ మెడలు వంచి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు.

13:25 - August 10, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు నాటకాలాడుతున్నాయని వైసీపీ అధినేత జగన్‌ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ జంతరమంతర్‌ వద్ద జగన్‌ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, టిడిపి ప్రత్యేక హోదా అన్ని పార్టీలూ నాటకాలు ఆడుతున్నాయని మండి పడ్డారు. 

13:23 - August 10, 2015

ఢిల్లీ : లలిత్‌ గేట్‌ ఆరోపణలపై సుష్మాస్వరాజ్‌ వివరణ ఇచ్చేంతవరకూ... పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు సహకరించేది లేదని... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఆయన సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... లలిత్‌ మోదీ, సుష్మా స్వరాజ్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే... ప్రధాని నరేంద్రమోదీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సజావుగా సాగాలన్న స్పీకర్ విజ్ఞప్తిని అంగీకరిస్తున్నామన్న రాహుల్‌... అంతకంటే ముందే తమ డిమాండ్లపై స్పందించాలని సూచించారు. 

ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాటం - రాహుల్..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు మృతి చెందారని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. 

13:19 - August 10, 2015

తిరుపతి : ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతోంది. విపక్షపార్టీల ఆధ్వర్యంలో....తిరుపతిలో బంద్‌ కొనసాగుతోంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు నగర రహదారులపై నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ప్రత్యేకహోదాపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై విపక్షపార్టీల నేతలు మండిపడ్డారు. హోదాపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్లే ఓ కాంగ్రెస్‌ కార్యకర్త బలయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇప్పటికైనా..ప్రత్యేకహోదా కల్పిచాలన్నారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

దిక్కుమాలిన సమ్మెలు అనడం విడ్డూరం - తమ్మినేని..

నల్గొండ : సమ్మెలు, ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు దిక్కుమాలిన సమ్మెలు అనడం విడ్డూరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కోదాడకు సీపీఎం బస్సు యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ లు ఇస్తామన్న కేసీఆర్ ఇచ్చిన హామీను మరిచిపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకంటే కూడా చాలా ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీలు అత్యంత పేదరికంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలను మభ్యపెట్టేందుకు ఇఫ్తార్ విందులతో హడావుడి చేశారని విమర్శించారు.

ఛత్తీస్ గఢ్ లో ఏడుగురు మావవోయిస్టుల అరెస్టు..

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లా బైరాన్ ఘడ్ అటవీ ప్రాంతంలో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

బాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహిస్తున్న ధర్నాలో ఆమె పాల్గొని ప్రసంగించరు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు అవే వస్తాయని, పరిశ్రమల కోసం చంద్రబాబు విదేశాలకు తిరగాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలను భక్షించే వ్యక్తి సీఎంగా ఉన్నారని, చంద్రబాబు సీఎంగా ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే మోడీ, చంద్రబాబులను ప్రశ్నించాలని సూచించారు. 

సుష్మా వివరణనివ్వాల్సిందే - రాహుల్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సుష్మా, లలిత్ మోడీ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆరోపించారు. అంతవరకు సభకు సహకరించేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. 

టి. ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదాపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : టి.ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే తామే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. 

12:56 - August 10, 2015

హైదరాబాద్ : వడోదరలో విధ్వంసం సృష్టిస్తామని తీవ్రవాదులు హెచ్చరికలు చేసిన నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లను జల్లెడ పడుతున్నారు. జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

12:54 - August 10, 2015

విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన ముని కోటి ఆత్మకు శాంతి చేకూరాలని విజయవాడలో యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్ధులతో ఈ ర్యాలీ సాగింది. దారిపొడవునా ప్రత్యేక హోదా నినాదాలతో విద్యార్ధులు హోరెత్తించారు. ర్యాలీలో యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ పాల్గొన్నారు.

12:52 - August 10, 2015

చెన్నై : ప్రత్యేక హోదా ఆకాంక్షతో ప్రజలెవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ నేత చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చెన్నై కీల్పాక్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో.. మునికోటి భౌతిక కాయానికి నివాళులు అర్పించాక.. అక్కడే చికిత్స పొందుతున్న మరో కాంగ్రెస్‌ కార్యకర్త శేషాద్రిని వారు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అగ్రనాయకత్వం.. ప్రత్యేక హోదా ఆకాంక్షకు మద్దతుగా ఉన్న నేపథ్యంలో.. ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

 

12:50 - August 10, 2015

ఢిల్లీ : పార్లమెంట్‌లో సేమ్‌ సీన్‌ రిపీటైంది. లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఐదురోజుల సస్పెన్షన్‌ అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు నేడు సభకు హాజరయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్‌, వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. వ్యాపం కుంభకోణంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. రాజ్యసభలోనూ అదే జరిగింది. ప్రభుత్వాన్ని మాట్లాడనీయకుండా చేసి.. ప్రతిపక్షాలు ఎలా మాట్లాడతాయంటూ అరుణ్‌జైట్లీ మండిపడ్డారు.

12:29 - August 10, 2015

చిత్తూరు : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో 16వ స్నాతకోత్సవాన్ని అడ్డుకునేందుకు ఏపీ స్టూడెంట్ జేఏసీ యత్నించింది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

అయోధ్యలో మరమ్మత్తులు చేపట్టేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : అయోధ్య వివాదాస్పద స్థలంలో మరమ్మత్తులు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. సౌకర్యాలు కల్పించేందుకు అత్యున్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మీ భూమి మీ ఇంటికి వెబ్ సైట్ ప్రారంభం..

విశాఖపట్టణం : 'మీ భూమి మీ ఇంటికి' నేరుగా అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్టణంలో మీ భూమి మీ ఇంటికి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హాయాంలో మన భూమి మనకు కాకుండా చేశారని, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు చేసేటప్పుడు రీ సర్వే చేయాల్సినవసరం లేదని తెలిపారు. ఆధార్ ఐడీ వల్ల ఒకే వ్యక్తి రెండు చోట్ల లాభం పొందే అవకాశం లేదన్నారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బాబు తెలిపారు. 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో మధ్యాహ్నాం 12గంటల వరకు స్పీకర్ సుమిత్రా మహజన్ వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభ 12.30గంటల వరకు వాయిదా పడింది. 

రాజ్యసభ మధ్యాహ్నాం 2గంటలకు వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో మధ్యాహ్నాం 12గంటల వరకు డిప్యూటి ఛైర్మన్ కురియన్ వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తరువాత సభలో పరిస్థితి మార్పు రాకపోవడంతో సభ రెండు గంటల వరకు వాయిదా పడింది.

 

పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

తిరుపతి : పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు అడ్డుకొనే యత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేశారు.

 

రైతు ఆత్మహత్యలను ప్రభుత్వాలు నివారించాలి - కోదండరాం..

ఢిల్లీ : రైతు ఆత్మహత్యలను ప్రభుత్వాలు నివారించాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. సోమవారం జంతర్ మంతర్ వద్ద జై కిసాన్ అభియాన్ నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. పంట నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వాలని, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. యువతకి ఉపాధి కల్పించేలా ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు. 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో అడుగు పెట్టారు. లలిత్ మోడీ, సుష్మా అంశంపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. స్పీకర్ ఎంతచెప్పిన పరిస్థితిలో మార్పు రాకపోయేసరికి సభను మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్ర మహాజన్ వెల్లడించారు.

మునికోటి మృతదేహాం తిరుపతికి తరలింపు..

చెన్నై : కాంగ్రెస్ కార్యకర్త మనుకోటి మృతదేహాన్ని తిరుపతికి తీసుకొస్తున్నారు. మృతదేహం వెంట ఏపి పిసిసి చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఉన్నారు. 

11:31 - August 10, 2015

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో మళ్లీ అదే తీరు పునరావృతమైంది. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఇతర విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. డిప్యూటి స్పీకర్ కురియన్ పలు మార్లు చేసిన సూచనలు ఫలించలేదు. అంతకుముందు బీహార్ గవర్నర్ నియామకంపై జేడీయూ రాజ్యసభ లో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ దశలో కాంగ్రెస్, అధికార పక్షం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో స్పీకర్ సభ్యుడు త్యాగీకి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. దీనికి మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. త్యాగీకి ఎలాంటి అనుమతినిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభలను కావాలనే అడ్డుకొంటోందని జైట్లీ దుయ్యబట్టారు. విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పొడియం వద్ద ఆందోళన చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. దీనితో సభను మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. 

లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు..

ఢిల్లీ : ఐదు రోజుల పాటు సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో అడుగు పెట్టారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. 

తొక్కిసలాట మృతులకు లోక్ సభ సంతాపం..

ఢిల్లీ : జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందడంపై లోక్ సభ సంతాపం తెలియచేసింది. సోమవారం పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. 

ప్రారంభమైన వైసీపీ ధర్నా..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ నిర్వహిస్తున్న ధర్నా ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ఈ ధర్నాలో వైసీపీ అధ్యక్షుడు జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మధ్యాహ్నాం మూడు గంటలకు వరకు వైసీపీ ధర్నా నిర్వహించనుంది. అనంతరం నేతలు పార్లమెంట్ వరకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నారు. 

మునికోటి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

చెన్నై : కేంఎసీ ఆసుపత్రిలో కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతదేహానిక పోస్టుమార్టం పూర్తయ్యింది. నేడు మధ్యాహ్నాం తిరుపతిలో కోటి అంత్యక్రియలు జరుగనున్నాయి. 

జూ.సివిల్ జడ్జి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్వ్యూల వరకు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. వాదనలను సెప్టెంబర్ 16కు వాయిదా వాసింది. పదోన్నతుల ద్వారా వచ్చే ఎనిమిది జిల్లా జడ్జీ పోస్టులకు అనుమతినిచ్చింది. 

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం.

ఢిల్లీ : లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ఆర్జేడీ వాయిదా తీర్మానం ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటపై ఈ తీర్మానం ఇచ్చింది. బీహార్ గవర్నర్ నియామకంపై జేడీయూ రాజ్యసభ లో వాయిదా తీర్మానం ఇచ్చింది. 

బీహార్ కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం..

ఢిల్లీ : బీహార్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.

జార్ఖండ్ తొక్కిసలాటపై ఆర్జేడీ వాయిదా తీర్మానం..

ఢిల్లీ : లోక్ సభలో ఆర్జేడీ వాయిదా తీర్మానం ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటపై ఈ తీర్మానం ఇచ్చింది.

మోడీ అధ్యక్షతనలో కొనసాగుతున్న సమావేశం..

ఢిల్లీ : పార్లమెంట్ హౌస్ లో ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు అరుణ్ జైట్లీ,న రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

10:36 - August 10, 2015

బాలీవుడ్ లో ఇటీవలే వచ్చిన 'బ్రదర్' సినిమా మంచి విజయానే నమోదు చేసుకుంది. ఈ సినిమా హాలీవుడ్ లో తెరకెక్కిన 'వారియర్' కు రీమెక్. బ్రదర్ సినిమాను చూసిన 'రాంచరణ్ తేజ' మనన్సు పారేసుకున్నట్లు టాక్. ఈ సినిమాను తెలుగులో రీమెక్ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'చరణ్' సోదరుడిగా 'రానా'ను నటింప చేయనున్నారనే టాక్. తమిళ భాషలో కూడా ఈ సినిమాను రూపొందించనన్నారట. అక్కడ 'సూర్య', 'కార్తీ'లు నటిస్తున్నారని తెలుస్తోంది. మరి తెలుగులో 'బ్రదర్' సినిమా రీమెక్ చేస్తున్నారా ? అందులో 'చరణ్', 'రానా'లు నటిస్తారా ? లేదా అనేది తెలయాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

10:30 - August 10, 2015

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్సీ సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభంలోకి దూసుకెళ్లాయి. 

10:29 - August 10, 2015

టాలీవుడ్ లో అగ్రహీరోలతో నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఏడ్చిందా ? ఏమైంది ? ఏమి కష్టం వచ్చింది ? లేక ఏమైనా జరిగిందా ? ఆ సినిమా షూటింగ్ లో కన్నీరు పెట్టింది అనుకుంటున్నారా ? కాదండి. నిజంగానే ఏడ్చిదంట ? ఎందుకు ? ఏమిటీ ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ లండన్ చేస్తున్నారు. రకుల్ మీద ఓ కారు షీన్ చేయాల్సి ఉంది. అంతా ఒకే చేసేశారు. కారుకే ఓ కెమెరా పెట్టి యాక్షన్ అని అనేశారు. వెంటనే రకుల్ కారు స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్లిపోయింది. కానీ డైరెక్టర్ చెప్పిన యూ టర్న్ ప్రాంతాన్ని రకుల్ మర్చిపోయింది. దీనితో వెనక్కి వెళ్లలేక..ముందుకెళ్లలేక పోయింది. చేతిలో సెల్ ఫోన్ లేదు. వాకీ టాకీ పనిచేయలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక వెక్కివెక్కి ఏడుస్తూ కూర్చొంది. అదే సమయంలో ఓ యువకుడు వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. వెళ్లాల్సిన దారి చెప్పాడు. అనంతరం ఆ యువకుడు చూపించిన దారిలో వెళ్లి సినిమా యూనిట్ వద్దకు చేరుకుంది. ఇదండి సంగతి.

10:27 - August 10, 2015

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి అండగా నిలిచాడు. మహారాష్ట్రలోని బీద్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసిన నానా పటేకర్‌ బాధిత కుటుంబాలను కలుసుకున్నాడు. ప్రభుత్వాలెన్ని మారినా నేతలు, రైతుల తలరాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు నానా పటేకర్‌.

మద్యాన్ని నిషేధించాలంటూ డీఎంకే ఆందోళన..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. 

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం రఘువర్ దాస్..

జార్ఖండ్ : రాష్ట్రంలోని దియోగఢ్ లో దుర్గామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.  

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టిడిపి ఎంపీల నోటీసు...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకరుకు నోటీసు ఇచ్చారు. ఏపీ విభజన చట్టాన్ని సవరించాలని ఎంపీలు కోరుతూ దీనిపై లోక్‌సభలో చర్చించాలని నోటీసు ఇచ్చారు. గత కొంత కాలంగా ప్రత్యేక హోదా విషయంపై విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం జాప్యం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఈ అంశంపై ఆందోళనను ముమ్మరం చేయనున్నారు

తిరుపతి కొనసాగుతున్న బంద్..

చిత్తూరు : తిరుపతిలో బంద్ కొనసాగుతోంది. మునికోటి మృతికి నిరసనగా కాంగ్రెస్ బంద్ పాటిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికోటి చికిత్స పొందుతూ చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

చెన్నైకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చెన్నైకి బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతదేహాన్ని తిరుపతికి తీసుకరానున్నారు. ప్రత్యేక హోదా కోరుతూ మునికోటి ఆత్మహథ్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఇతర నేతలు చెన్నైకి బయలుదేరిన వారిలో ఉన్నారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభంలోకి దూసుకెళ్లాయి. 

తొక్కిసలాటపై జార్ఖండ్ సీఎం విచారం..

జార్ఖండ్ : రాష్ట్రంలోని దియోగఢ్ లో దుర్గామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రఘవర్ దాస్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. 

విశాఖకు బయలుదేరిన సీఎం బాబు..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. 

జార్ఖండ్ తొక్కిసలాటపై మోడీ ట్వీట్స్..

ఢిల్లీ : జార్ఖండ్ లో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఘటపై తాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు మోడీ ట్వీట్స్ చేశారు. దుర్గామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మందికి పైగా మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. 

వడోదర రైల్వే స్టేషన్ లో భద్రత కట్టుదిట్టం..

మధ్యప్రదేశ్ : వడోదర రైల్వే స్టేషన్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం రాత్రి బాంబు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

నేడు రాష్ట్రపతిని కలువనున్న బీజేపీ ప్రతినిధి బృందం..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బీజేపీ సీనియర్ ప్రతినిధుల బృందం నేడు మధ్యాహ్నాం 2గంటలకు కలువనుంది.

 

09:33 - August 10, 2015

హైదరాబాద్ : జార్ఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. దేవ్‌ఘర్‌ దుర్గామాత ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. సావన్‌ సోమవార్‌ సంధర్భంగా దుర్గామాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి 12మంది మృతి చెందింది. 20మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో 5గురి పరిస్ధితి విషమంగా ఉంది. 

09:30 - August 10, 2015

విశాఖ : మేకిన్ ఏపీ తొలి మొబైల్‌ను సోమవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. మేకిన్ ఇండియా మేకిన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తయారైన తొలి షియామీ ఫోన్‌ను ముఖ్యమంత్రి విపణిలోకి విడుదల చేయనున్నారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ప్లాంటు నెలకొల్పింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి సంస్థలకు చెందిన మొబైల్‌ ఫోన్లను తయారు చేస్తోంది. ఆయా ఫోన్ల డిజైన్లు సంబంధిత దేశాల్లో రూపొందినా కూర్పు అంతా ఫాక్స్‌కాన్ చూస్తుంది. ప్రస్తుతం శ్రీసిటీలో తొలిప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన ఫాక్స్‌కాన్.. త్వరలోనే ప్లాంటు విస్తీర్ణం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళిక రూపొందించుకుంటోంది. ఫాక్స్‌కాన్ సంస్థ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షియామీ ఉత్పత్తులను తయారుచేస్తోంది. శామ్‌సంగ్, ఆపిల్ తరువాత స్మార్ట్‌ఫోన్ విపణిలో ఈ కంపెనీ మూడోస్థానంలో ఉంది. డిసెంబరు 2014 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన సాంకేతిక స్టార్టప్‌గా షియామీ నిలిచింది. దీని విలువ 46 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత షియామీ ఎంఐగా పేరు మార్చుకుంది. సీఎం చంద్రబాబు చైనా పర్యటన సందర్భంగా షియామీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో తమ తొలి దేశీయ మొబైల్‌ను విడుదల చేస్తామని.. ఈ కార్యక్రమంలో షియామీ విస్తరణపై కీలక ప్రకటన చేస్తామని హామీనిచ్చింది. 

ఢిల్లీలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్ ధర్నా

హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఇవాళ వైసీపీ ధర్నా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు చేరుకున్నాయి. 10 గంటలకు ధర్నా ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు వరకు కొనసాగనుంది. 

09:28 - August 10, 2015

తిరుపతి : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని తిరుపతిలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. నేతలు కార్యకర్తలు, రహదారులపై నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై వామపక్ష నేతలు మండిపడ్డారు. ఏపీకీ ప్రత్యేకహోదా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వంలోఉన్న టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రాకుంటే ప్రజాఆందోళనలు మరింత ఉధృత చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

09:27 - August 10, 2015

చిత్తూరు :ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి అంత్యక్రియలు నేటి సాయంత్రం తిరుపతిలో జరగనున్నాయి. మునికోటి మృతికి సంతాపంగా తిరుపతి బంద్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఇవాళ మునికోటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులందరూ హాజరుకానున్నారు. పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి, చిరంజీవి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రమూర్తి వంటి సీనియర్లు మునికోటి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. 

ఆగివున్న లారీని ఢీ కొన్న బైక్ :ఇద్దరి మృతి

ప.గో: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మీతి చెందారు. ఆగి వున్న లారీనీ బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

 

08:23 - August 10, 2015

హైదరాబాద్ : అభివృద్ధి ని చూసి ఓర్వలేక దిక్కుమాలిని సంఘాలు...దిక్కుమాలిన సమ్మెలు అనడం సీఎం స్థాయిలో మాట్లాడటం సమంజసమా? ఈ వ్యాఖ్యలు కేసీఆర్ అహంకారానికి నిదర్శనం...కార్మికులు జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వం పై లేదా? గ్రామ పంచాయతీ ఆదాయాన్ని బట్టి కార్మికుల వేతనాలు ఉంటాయా? కార్మికులు, కార్మిక సంఘాల పట్ల రాజ్యాంగ విర్ధుంగా సీఎం మాట్లాడవచ్చా? ఏపీకి ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ చెప్పులో కాలు పెట్టిందా? ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అందర్నీ కలుపుకుని పోయి పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం లేదా? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చ జరిగింది. ఈ చర్చలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిడిపి నేత బి.శ్రీరాములు, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

08:20 - August 10, 2015

హైదరాబాద్: ప్రజా సమీకరణ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ .కె. నాగేశ్వర్ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై పై ప్రస్తుతం స్పందించే పరిస్థితిలో లేనిపవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై పవన్ ను నియంత్రిస్తున్న శక్తులు ఏవి? ప్రత్యేక హోదా పై వైసీపీ నేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని కేంద్ర మంత్రి సృజనా చౌదరి మాత్రమే ఎందుకు చెప్తున్నారు? ప్రజలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదు. ప్రజా సమీకరణ ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. మరింత విశ్లేషణాత్మక వివరణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

యాదగిరిగుట్ట పుష్కరిణిలో మునిగి ఒకరి మృతి...

నల్గొండ : యాదగిరిగుట్ట పుష్కరిణిలో మునిగి ఓ భక్తుడు మరణించిన సంఘటన జరిగింది. హైదరాబాద్‌ ఉప్పుగూడకు చెందిన రాజు (28) పుష్కరిణిలో మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు.

లారీకి తగిలిన విద్యుత్‌ తీగలు : కూలీ మృతి

విశాఖ : రోలుగుంట దగ్గర లారీకి విద్యుత్‌ తీగలు తగిలి కూలీ మృతి చెందారు. ఈ సంఘటనలో డ్రైవరుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన డ్రైవరును ఆసుపత్రికి తరలించారు.

నేటి నుంచి అభినయ జాతీయ నాటకోత్సవాలు...

హైదరాబాద్ : రవీంద్రభారతిలో సోమవారం నుంచి నాలుగు రోజుల అభినయ జాతీయ నాటకోత్సవాలు-2015 నిర్వహించనున్నట్లు అభినయ శ్రీనివాస్ తెలిపారు. 10న సా:6 గంటలకు ప్రారంభోత్సవం తో పాటు కన్నీటి కథ తెలుగు నాటక ప్రదర్శన ఉంటుందని, 11న సాయంత్రంఘాశిరాం కోత్వాల్ కన్నడ నాటకం, 12న మూన్ ఫూల్ ఆంగ్ల నాటకం, 13న నోగ్‌బన్ సౌర మణిపూరి నాటకం ప్రదర్శనలు ఉంటాయని , ప్రవేశం ఉచితంగా కల్పించినట్లు శ్రీనివాస్ తెలిపారు.

నేటి నుంచి 'మీ ఇంటికి మీ భూమి'

హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి మీ ఇంటికి..మీ భూమి కార్యక్రమం ప్రారంభం కానుంది. విశాఖ‌ట్నం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ‌డు లాంఛనంగా ప్రారంభించ‌నున్నారు. 

 

ఢిల్లీలో జగన్ ఏపీ ప్రత్యేక హోదా పోరు

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేడు వైసీపీ అధినేత జగన్‌ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేయనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకహోదా పై గతంలో అనేక సార్లు విన్నవించినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదని.. అందువల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నేతలు తెలిపారు. కేవలం ధర్నానే కాకుండా ఢిల్లీలోని పార్లమెంట్‌ వరకూ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.

ఢిల్లీలో జగన్ ఏపీ ప్రత్యేక హోదా పోరు

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేడు వైసీపీ అధినేత జగన్‌ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేయనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకహోదా పై గతంలో అనేక సార్లు విన్నవించినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదని.. అందువల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నేతలు తెలిపారు. కేవలం ధర్నానే కాకుండా ఢిల్లీలోని పార్లమెంట్‌ వరకూ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.

కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు : 10మందికిగాయాలు..

విజయవాడ : గొల్లపూడి దగ్గర నల్గొండ జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు కాల్వలోకి దూసుకెళ్లిన సంఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

దియోగఢ్ లో దుర్గామాత ఆలయం వద్ద తొక్కిసలాట :11 మంది మృతి

హైదరాబాద్ :జార్ఖండ్ లో దియోగఢ్  లో దుర్గామాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

త్వరలో 1500 జనరిక్ మెడికల్ షాపులు : మంత్రి కామినేని

గుంటూరు : రాష్ట్రంలో త్వరలో 1500 జనరిక్‌ మెడికల్‌షాపులు ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. పాతగుంటూరు బాలాజీనగర్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియామకాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

ఇసుక లారీ బోల్తా: ఏడుగురు కూలీలు మృతి

హైదరాబాద్: తిరుచ్చి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి చెందగా మరో15 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం సంభవించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్10లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్10లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ టాపింగ్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో 9వ తేదీ నుంచి 15 తేదీ వరకు రోడ్డు నెం.9/10 జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, జహీరానగర్ జంక్షన్ రోడ్డు వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్ భవన్ జంక్షన్ వైపు నుంచి, ఫిలింనగర్, బీవీపీ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్డు నెం.2, 12, 14 నుంచి వెళ్లాల్సి ఉంటుందన్నారు.

06:52 - August 10, 2015

హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురుచూసిన చేనేత దినోత్సవం రానే వచ్చింది. మొన్న ఏడో తేదీన స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. కానీ, ప్రధాని నుంచి చేనేత కార్మికులను ఉత్సాహ పరిచే ప్రకటనేదీ రాలేదు. నిజానికి మన దేశ చరిత్రలో ఆగస్టు 7కి చాలా ప్రాధాన్యత వుంది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలలో 1905 ఆగస్టు 7 ఓ మరుపురాని ఘట్టం. అదే రోజు కోల్ కతా విదేశీ వస్త్రాలు దహనం చేసి, జాతీయోద్యమానికి ఒక ఊపు తెచ్చారు. నిజానికి బ్రిటీష్ వారు మనదేశంలో ప్రవేశించింది తమ వస్త్రాలు అమ్ముకోవడానికే. అలా వచ్చిన తెల్లదొరలు మన చేనేత రంగాన్ని సర్వనాశనం చేశారు. అందుకే ఆనాటి జాతీయోద్యమ నాయకులు విదేశీ వస్త్ర దహనం లాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ, స్వాతంత్ర్యానంతరం జాతీయోద్యమ స్పూర్తి లోపించింది. చేనేత రంగానికి రక్షణలు కరువయ్యాయి. మన దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి చూపిస్తున్న చేనేతరంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2000 సంవత్సరం ఈ ధోరణి మరింత విశ్వరూపం దాల్చింది. వాజ్ పేయి సారధ్యంలోని ఆనాటి ఏన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేనేత రంగాన్ని చావు దెబ్బతీశాయి. చేనేత కార్మికులు వినియోగించే నూలు మీద, పవర్ లూమ్ మగ్గాలకు మాదిరిగానే టాక్స్ లు వడ్డించడంతో చేనేత రంగానికి పెనుశాపంగా మారింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో చేనేత రంగ సంక్షోభం, కార్మికుల ఆత్మహత్యలు ప్రధాన ప్రచారాంశాలుగా మారాయి. చేనేత పరిరక్షణకు సకల చర్యలు తీసుకుంటామంటూ వాగ్ధానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట నిలుపుకోలేదు. వాజ్ పేయి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఒకరకంగా దెబ్బతిస్తే, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మరోరకంగా దెబ్బకొట్టింది. ఫలితం చేనేత రంగంలో సంక్షోభం ముదిరింది. ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. దు:ఖం పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ విభాగాల్లో చేనేత వస్త్రాల వాడకం పెంచుతామంటూ ఇచ్చిన ఉపన్యాసాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. రోజంతా కష్టపడ్డా చేనేత కార్మికులకు నూటా పాతిక రూపాయలకు మించి గిట్టుబాటుకాని దుస్థితి. ఈ కొద్దిపాటి సంపాదనతో పిల్లలను చదివించలేక, పోషకాహారం అందించలేక నానా అవస్థపడుతున్నారు. ఇల్లు గడవని స్థితిలో అప్పులు చేయాల్సి వస్తోంది. వీరికి ప్రయివేట్ అప్పులే దిక్కు. బ్యాంక్ రుణాలు లభించేది అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు లక్షల మంది చేనేత కార్మికులుంటే, కేవలం పాతిక వేలమందికి మాత్రమే బ్యాంక్ అప్పులు లభిస్తున్నాయి. ఈ పాతిక వేల మందికి 125 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే అయినా, ప్రయివేట్ అప్పులు చేసిన మూడున్నర లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరం. చేనేత రంగానికి రక్షణలు కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యల మీద ప్రభుత్వాలు ద్రుష్టి సారించాలి. భారతదేశంలో తొలిసారిగా చేనేత దినోత్సవం నిర్వహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఈ బాధ్యత మరింత ఎక్కువగా వుంది. మనదేశంలో చేనేత కార్మికుల నైపుణ్యాలను ఎవరూ వంకపెట్టలేరు. చేనేత వస్త్రాలు ధరించేందుకు చాలా మంది ముచ్చటపడతారు. విదేశాల్లో సైతం మన చేనేత ఆదరణ వుంది. అమెరికా దేశ పౌరులు కూడా మన చేనేత వస్త్రాల మీద మక్కువ చూపిస్తారు. చేనేతకు మార్కెట్ దండిగానే వున్నప్పటికీ, ఆ రంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే శాపమై వెక్కిరిస్తున్నాయి. చౌకధరలకు ముడిపదార్ధాలు సరఫరా చేయడం, వివిధ రకాల టాక్స్ ల్లో మినహాయింపులివ్వడం, మార్కెటింగ్ సౌకర్యాలు విస్త్రుత పర్చడం లాంటి చర్యలు చేనేతకు చేయూతనిస్తాయని ఆ రంగం నిపుణులు చెబుతున్న మాటలను ప్రభుత్వాలు పరిగణలోనికి తీసుకోవాలి. 

06:49 - August 10, 2015

హైదరాబాద్ :మొన్న ఆగస్టు 7న మనదేశంలో తొలిసారిగా చేనేత దినోత్సవం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. సాక్షాత్తు దేశ ప్రధాని చేనేత రంగం గురించి మాట్లాడడం ఒక ఆశాజనక పరిణామం. అయితే, చేనేత కార్మికుల కష్టాలు తొలగాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? అసలు చేనేత సంక్షోభానికి కారణం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో చేనేత కార్మిక నేత నాగేశ్వరరావుగారు విజయవాడ స్టూడియో నుండి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో వినాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:46 - August 10, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల మృతులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఏలూరులో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, ఖమ్మం జిల్లాకు చెందిన మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఏలూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య....

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలవరం మండలం రామయ్యపేటకు చెందిన శివకృష్ణ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతని సోదరుడు మహేష్ సీఆర్ రెడ్డి కాలేజీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదవుతున్నాడు. ఈ క్రమంలో మృతుడు శివకృష్ణ తన తమ్ముడి హాస్టల్‌కు వెళ్లాడు. సోదరుడు మహేష్‌ గదిలో లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్‌ తిరిగి వచ్చే సరికి శివకృష్ణ ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. అప్పటికే శివకృష్ణ మరణించటంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హాస్టల్‌ సిబ్బంది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి....

అటు ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థినిని ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చిన ఓ యువకుడు తన సెల్ స్విచాఫ్ చేసుకుని, కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రుగొండ మండలం దుబ్బ తండాకు చెందిన భూక్య మౌనిక ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదివేది. అయితే మౌనిక ఆరోగ్యం అకస్మాత్తుగా చెడిపోయిందంటూ ఓ యువకుడు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. మౌనిక తల్లిదండ్రులకు కూడా ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. పరిస్థితి విషమించి మౌనిక చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిపిన యువకుడు అనంతరం సెల్ ఫోన్‌ స్విచాఫ్ చేసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

06:42 - August 10, 2015

హైదరాబాద్:  భాగ్యనగరం మళ్లీ బోనమెత్తింది. వీధులన్నీ భక్తి గీతాలతో మార్మోగాయి. ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. పోతరాజుల నృత్యాలు... శివసత్తుల పూనకాలు...నగరంలో సందడి చేశాయి. హైదరాబాద్‌లో బోనాలు వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లాజెల్లా...అంతా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇక నేడు రంగం ద్వారా అమ్మవారు భవిష్యవాణి వినిపించనున్నారు.                                                                              

నగర వీధులన్నీ బోనాలతో సందడిగా....

జంట నగరాల్లో లాల్‌దర్వాజ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగర వీధులన్నీ బోనాలతో సందడిగా మారాయి. రంగురంగుల పూలు, విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయాలు...కొత్త శోభను సంతరించకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న-మాదన్న ఆలయాలతో పాటు ఇతర ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. లక్షలాదిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు.

మంత్రి తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు ....

లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో హెంమంత్రి నాయినీ నరసింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పత్యేక పూజలు చేశారు. ఇక కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ ఆలయంలో ఎంపీ కవిత...అమ్మవారికి బోనాలు సమర్పించారు. లాలాపేటలోని అమ్మవారి ఆలయంలో మంత్రి పద్మారావు మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటల పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాని నేతలు అమ్మవారిని కోరుకున్నారు.

అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు...

భక్తలకు ఎలాంటి ఇబ్బందులు పడుకుండా...ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాల నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

06:40 - August 10, 2015

మహబూబ్ నగర్ : టీడీపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మరో రగడ మొదలైంది. ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో బహిరంగ సవాళ్లు విసురుకున్న పాలమూరు నేతలు.. తాజాగా మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.

నిన్నటివరకు ప్రాజెక్టుల విషయంలో యుద్ధం ...

వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాలో నిన్న మొన్నటివరకు సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన నాటినుంచి టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య దుమారం రేగుతోంది. ఇరు పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు కయ్యానికి కాలుదువ్వారు... బహిరంగ చర్చకు సిద్ధమంటూ పరస్పర ప్రకటనలు చేసి రాజకీయ దుమారం రేపారు.

తాజాగా తెరపైకి మరో కొత్త అంశం....

ఆ సీన్‌ కట్‌ చేస్తే తాజాగా.. మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతల విషయం ఇప్పుడు వివాదస్పదమవుతోంది. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సొంత నియోజకవర్గానికి పరిమితమైన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం జిల్లా రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలను టార్గెట్‌ చేసుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. లక్ష్మారెడ్డి వైద్యుడిగా ఎక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు ? ఎక్కడ ప్రాక్టీస్‌ చేశారో తెలపాలన్నారు. లక్ష్మారెడ్డి వ్యవహారశైలి ఎంబీబీఎస్‌కు తక్కువ.. ఆర్‌ఎంపీకి ఎక్కువ అన్న చందంగా ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. లక్ష్మారెడ్డికి చిత్తశుద్ది ఉంటే తన విద్యార్హతలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

రేవంత్‌రెడ్డిపై అధికార పార్టీ నేతలు ఫైర్‌ .....

నియోజకవర్గానికే పరిమితమైన రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. పోయిన పరువును కాపాడుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతున్నారన్నారు. తన విద్యార్హతలు తప్పని రుజువు చేస్తే రాజకీయాలను నుంచి తప్పుకుంటానని.. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్‌రెడ్డి అందుకు సిద్దమా అని మంత్రి లక్ష్మారెడ్డి సవాల్‌ విసిరారు. ఏది ఏమైనా పాలమూరు జిల్లా నేతల సవాళ్లు-ప్రతిసవాళ్లతో రాజకీయం మరోసారి వేడెక్కింది. 

06:37 - August 10, 2015

విశాఖ : మంత్రుల సాక్షిగా.. బాక్సైట్‌ రగడ మొదలైంది. ఏజెన్సీలో బాక్సెట్‌ తవ్వకాలను ఉపసంహరించుకోవాలని.. గిరిజన హక్కులను కాపాడాలని ఓ మహిళా ఎమ్మెల్యే ఏపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులను కాదని బాక్సైట్‌ జోలికి వస్తే.. తమ సంప్రదాయ ఆయుధాలతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించింది.                                                                            

బాక్సైట్ నిక్షేపాల కోసమే గిరిజనులపై ప్రేమ....

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి టీడీపీ సర్కార్‌పై ఫైరయ్యారు. ఏజెన్సీలో బాక్సైట్‌ జోలికి వస్తే సహించేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం గిరిజనులపై ప్రేమతో ఏదీ చేయడం లేదని.. బాక్సైట్ నిక్షేపాల కోసమే గిరిజనులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బాకైట్ తవ్వకాలు జరుపుతామని చెప్పినప్పుడు చాలా బాధేసిందనన్నారు ఈశ్వరి. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల ద్వారా బాకైట్ తవ్వుతామంటున్నారు. బాక్సైట్ తవ్వి రాజధానిని కట్టుకుంటామంటే చూస్తూ ఎవ్వరూ ఊరుకోరని.. బాక్సైట్ జోలికివస్తే తమ సంప్రదాయ ఆయుధాలతో దాడి చేసేందుకు కూడా వెనకాడమని ఈశ్వరి హెచ్చరించారు.

స్పందించిన మంత్రులు గంటా, యనమల....

అయితే దీనిపై జిల్లా మంత్రులు యనమల, గంటా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం అలోచిస్తుందని ఈ.. సమయంలో అపోహలకు పాల్పడం సరికాదన్నారు యనమల. గిడ్డి ఈశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని గంటా విమర్శించారు. బాక్సైట్ తవ్వాలంటే దానిపై ముందుగా చర్చ జరగాలన్నారు. గిరిజనులు అభివృద్ధి కోసమే బాక్సెట్ తవ్వేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు గంటా. మొత్తానికి బాక్సైట్‌ చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. ఆదివాసీల అభిప్రాయాలు తీసుకుంటారా? లేక సొంతంగా సర్కార్‌ ముందుకు వెళ్తుందో చూడాలి. 

06:34 - August 10, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై సలహా సంఘం సభ్యులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ ఉచితంగా అందించిందని.. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునేందుకు జపాన్‌ ఆసక్తిగా ఉందని సీఎం తెలిపారు. ఇక చైనా, మలేషియా కంపెనీలు కూడా రాజధానిలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయన్నారు.

మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ క్యాపిటల్‌, క్యాపిటల్‌ సిటీ, క్యాపిటల్‌ రీజియన్లపై సమగ్ర అధ్యయనం....

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ క్యాపిటల్‌, క్యాపిటల్‌ సిటీ, క్యాపిటల్‌ రీజియన్‌లపై సమగ్ర అధ్యయనం చేయాలని రాజధాని సలహా సంఘం సభ్యులు, అధికారులకు చంద్రబాబు సూచించారు. నవ్యాంధ్ర రాజధాని ఇతర దేశాలకు నమూనాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజధానిలో రీఎనర్జీ స్మార్ట్‌ గ్రిడ్‌, విశాలమైన రహదారులు, డ్రెయిన్లు, పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధిలో ప్రపంచస్థాయి విధానాలను అనుసరించాలన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా నదిముఖ ద్వారాలను తీర్చిదిద్దాలన్నారు. రాజధాని నిర్మాణంలో స్థానిక వనరులను, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు తయారు చేయాలని బాబు ఆదేశించారు.

ఏడేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఇస్తాంబుల్‌....

ఇక ఈ సమావేశంలో తన టర్కీ పర్యటన వివరాలను అధికారులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు కోట్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్‌ ఏడేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని బాబు తెలిపారు. అదేవిధంగా రాజధాని నిర్మాణ విషయంలో ప్రధాని మోదీ కూడా సలహాలు, సూచనలిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రష్యాలోని తజకిస్తాన్‌, తుర్కుమినిస్థాన్‌ రాజధానులను పరిశీలించాలని మోదీ ఇచ్చిన సలహాను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

అక్టోబర్‌ 22 తర్వాత నిర్మాణ పనులు వేగవంతం ....

అక్టోబర్‌ 22న కొత్త రాజధానికి శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు వేగవంతమవుతాయని చంద్రబాబు తెలిపారు. రెండు ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ల మధ్య పోర్ట్‌ బేస్‌డ్‌ కేపిటల్‌లో అమరావతిని అభివృద్ధి చేయనున్నామన్నారు. మరోపక్క జపాన్‌ పర్యటనలో ప్రధాని, మంత్రులు, అధికారులతో పాటు.. జైకా, నెడో, మెటి ప్రతినిధులు ఇచ్చిన అభిప్రాయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

కొత్త రాజధానిలో గ్రీన్‌ కవర్‌....

ఇక కొత్త రాజధానిలో గ్రీన్‌ కవర్‌, కాలుష్య రహిత వ్యవస్థల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని చంద్రబాబు సలహా సంఘం సభ్యులను కోరారు. ఆర్ధిక కార్యకలాపాలకు అమరావతి నెలవు కావాలని.. రాజధాని నిర్మాణంలో గొప్ప ప్రణాళిక ఉండాలన్నారు. విద్య, వైద్యం, ప్రజారవాణా ఏ విధంగా ఉండాలో తన ఆలోచనలను ముఖ్యమంత్రి పంచుకున్నారు. రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు కావాలి.. రుణం ఎంత మేరకు, ఏ విధంగా సేకరించాలనే అంశాలపై కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. 

06:31 - August 10, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి మీ ఇంటికి..మీ భూమి కార్యక్రమం ప్రారంభం కానుంది. విశాఖ‌ట్నం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ‌డు లాంఛనంగా ప్రారంభించ‌నున్నారు. ప్రజ‌ల‌కు వారి భూముల యాజ‌మాన్య హ‌క్కుల‌కు భ‌రోసా క‌ల్పించ‌డంతో పాటు భూమి వివ‌రాల న‌మోదులో జ‌రిగిన త‌ప్పులు స‌రిద్దిడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.                                                                                     

ఆగస్టు 10 నుంచి 31 వరకు మీ ఇంటికి మీ భూమి ....

ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మీ భూమి వెబ్ పోర్టల్ లో భూముల వివరాలు నమోదు చేయడంలో కొన్ని తప్పులు దొర్లాయి. వీటిని స‌రిదిద్దాలంటూ ప్రజ‌లు, రైతుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థన‌లు వ‌చ్చాయి. దీంతో త‌ప్పుల‌ను స‌వ‌రించేందుకు మీ ఇంటికి-మీభూమి కార్యక్రమాన్ని ఆగస్టు 10 నుంచి 31 వరకు శ్రీకారం చుడుతోంది ఏపీ స‌ర్కారు. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు తప్పులు సరిదిద్దేందుకు అన్ని గ్రామ పంచాయితీలలో గ్రామ స‌భ‌లు నిర్వహిస్తారు. అంతేకాదు ప్రజ‌ల‌కు వారి భూముల యాజ‌మాన్య హ‌క్కుల‌కు భ‌రోసా క‌ల్పిస్తారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా శంక‌రంలో మీ ఇంటికి మీ భూమి ప్రారంభం...

మీ ఇంటికి ...మీ భూమి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ‌డు విశాఖ‌ప‌ట్నం జిల్లా , శంక‌రం గ్రామంలో సోమవారం నుంచి ప్రారంభిస్తారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు కొనసాగుతుంది. త‌ప్పులు స‌రిదిద్దడానికి, స‌వ‌ర‌ణ‌ల కోసం గ్రామ సభలు జరిగే తేదీకి రెండు రోజుల ముందుగానే గ్రామ ప్రజలకు తెలియ‌జేస్తారు. అన్ని రెవెన్యూ రికార్డులను గ్రామ ప్రజలకు అందబాటులో ఉంచుతారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ చేసి వెబ్ ల్యాండ్ కు అనుసంధానం చేస్తారు. రైతులకు సంబంధించిన భూమి వివరాలలో ఏమైనా సవరణలు ఉన్నట్లైతే అభ్యంతర దరఖాస్తుని వారి నుంచి తీసుకుని నెల రోజుల్లో పరిష్కారిస్తారు.

ఇంఛార్జులుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు....

గ్రామ సభలను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ఇంఛార్జులుగా నియమించింది ఏపి స‌ర్కారు. ప్రతి గ్రామంలో ఉన్న దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములను గుర్తించి వాటిని ప్రత్యేక క్యాటగిరీగా వర్గీకరించే ప్రక్రియ‌కు సైతం శ్రీ‌కారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, మౌళిక వసతుల అభివృధ్ది కోసం ప్రతి జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయునున్నందున‌, ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో పొందుపరచ‌నున్నారు.

మీ ఇంటికి -మీభూమి కార్యక్రమంపై విస్తృత ప్రచారం....

మీ ఇంటికి -మీభూమి కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్ ఆఫీసులు ,అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం క‌ల్పించారు. గ్రామాలలో వచ్చిన అభ్యర్ధనలు,సవరణలను రోజూ వారీగా నివేదికను విధిగా సి.సి.ఎల్.ఏతో పాటు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో స‌మ‌ర్థవంగా ప‌ని చేసిన రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహ‌కాలు ఇస్తామ‌ని ప్రభుత్వం ప్రక‌టించింది.

06:26 - August 10, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేడు వైసీపీ అధినేత జగన్‌ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేయనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకహోదా పై గతంలో అనేక సార్లు విన్నవించినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదని.. అందువల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నేతలు తెలిపారు. కేవలం ధర్నానే కాకుండా ఢిల్లీలోని పార్లమెంట్‌ వరకూ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.

ధర్నా అనంత‌రం పార్లమెంట్ వ‌ర‌కు మార్చ్......

ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై వైఎస్ఆర్‌సీపీ ఢిల్లీ వేదిక‌గా పోరాటం చేసేందుకు సిద్ధం అయింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేత‌లు, పార్టీ కార్యక‌ర్తల‌తో క‌ల‌సి పార్టీ అధినేత జగన్‌ నేడు జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగనున్నారు. ఇందుకోసం రెండు రైళ్లలో కార్యకర్తలను నేతలను ఢిల్లీకి త‌ర‌లించారు. ధ‌ర్నా అనంత‌రం పార్లమెంట్ వ‌ర‌కు మార్చ్ నిర్వహిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.

కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక‌ హోదా అవసరం లేద‌ని....

పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక‌ హోదా అవసరం లేద‌ని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏపీలోని అన్ని ప‌క్షాలు ప్రత్యేక‌ హోదా కోసం ఉద్యమ‌బాట ప‌ట్టాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిప‌క్షంగా వున్న వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనుస‌రిస్తున్న వైఖ‌రిని జాతీయ స్థాయిలో ఎండ‌గ‌ట్టాల‌నీ వైస్సార్‌సీపీ నేత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ పార్టీల మ‌ద్దతు కూడగ‌ట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

ధర్నాతో కేంద్రం దిగివస్తుందా?

మ‌రోవైపు ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని నిల‌దీయ‌డానికి అధికార టీడీపీతో పాటు, ప్రతిప‌క్ష వైఎస్సార్‌సీపీ కూడా భ‌య‌ప‌డుతోంద‌ని విమ‌ర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా ద్వారా స‌మాధానం చెప్పాల‌ని వైఎస్సార్‌సీపీ నేత‌లు భావిస్తున్నారు. జ‌గ‌న్ చేస్తున్న ధర్నాతో కేంద్రం దిగివస్తుందా? జాతీయ పార్టీలు జ‌గ‌న్ ధర్నాకి మ‌ద్దతు ఇస్తారా? అనేది వేచి చూడాలి. 

06:21 - August 10, 2015

హైదరాబాద్ : మునికోటి మృతిపట్ల అన్ని రాజకీయ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. మునికోటి మృతికి సంతాపంగా నేడు తిరుపతి బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు విపక్షాలు ప్రకటించాయి.

చెన్నైలో తుదిశ్వాస విడిచిన మునికోటి....

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఆత్మహత్యా యత్నం చేసి.. చెన్నైలో తుదిశ్వాస విడిచిన మునికోటి మృతిపట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఏపిపీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో ఫోన్లో మాట్లాడిన సోనియా, రాహుల్....మునికోటి నేపథ్యం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేడు అంత్యక్రియలు....

నేడు మునికోటి మృతదేహం తిరుపతికి తరలించనున్నారు. మునికోటికి నివాళులు అర్పించేందుకు భారీ అంతిమయాత్ర నిర్వహించే అవకాశముంది. తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియల్లో కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవితో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు. మునికోటి మృతికి సంతాపంగా నేడు తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ప్రజలు స్వచ్చందంగా బంద్‌ పాటించాలని ఆ పార్టీ నేతలు కోరారు. రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు పలు పార్టీలు , ప్రజా సంఘాలు ప్రకటించాయి.

పలు పార్టీల సంతాపం...

మునికోటి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్వేగాలు, భావోద్వేగాలకు లోనుకావద్దని హితవు పలికారు. ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. మరోవైపు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మునికోటి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి మృతిపట్ల సీపీఎం కార్యదర్శి పి.మధు సంతాపం వ్యక్తం చేశారు. బలిదానాల కన్నా పోరాటాలకే ప్రాధాన్యతనివ్వాలని యువతకు సూచించారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైరయ్యారు. ఉద్యమం కోసం విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.

కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ...

మునికోటి ఆత్మకు శాంతి కలగాలని తిరుపతిలో వామపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించాయి. మునికోటిది ఆత్మహత్య కాదు...హత్యేనని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. మునికోటి మృతిలో మొదటి మద్దాయి కేంద్రమైతే....రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు. మునికోటి ఆత్మహత్య పట్ల ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అనేక ప్రజాసంఘాలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో నెటిజన్లు నివాళి అర్పించారు. 

Don't Miss