Activities calendar

11 August 2015

మందుల దుకాణంపై అధికారుల దాడి...

హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో ఓ మందుల దుకాణంపై ఔషధ నియంత్రణ అధికారులు దాడులు చేశారు. మందుల దుకాణంలో వైద్యుల శ్యాంపిల్స్ ను పట్టుకున్నారు. దుకాణంలో రూ. 2లక్షల విలువైన ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

22:00 - August 11, 2015

ఒక పక్క అవతార పురుషుడుగా పూజలందుకుంటూ.. మరో పక్క అశ్లీలపురుషుడుగా తిరస్కారాలను ఎదుర్కొంటూ.. ఆయన ఈ మధ్య వార్తల్లో సికారు చేస్తున్నారు. చివరకు అత్యాచారం కేసులో జైలుకు కూడా వెళ్లాల్సివచ్చింది. కటకటాల ఊసులు లెక్కపెడుతూ కూడా... సాక్షులు హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు. దాని వల్ల ఆయన ప్రాభవానికి ఏమీ కొరత రాలేదు. ఆరోపణల మాటేమో కాని ఆయన ఇప్పుడు మహాత్ముడిగా పాఠ్యపుస్తకాల్లో కూడా చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు బాబా వేల కోట్ల ఆస్తులు సంపాదించాడనే లెక్కలు విస్తుగొలుపుతున్నాయి. ఇంతకీ అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా..మహాత్ముడిగా కీర్తిశిఖరాలు అధిరోహించడానికి కారణాలేంటీ... ? వేల కోట్లు ఎలా వెనకేసుకున్నాడు...? ఈ దేశంలో బాబాలు, స్వామీజీలు ఎలాం రాజ్యమేలుతున్నారు...?? ఈ రోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... ఆ వివరాలను వీడియోలోచూద్దాం..

 

21:44 - August 11, 2015

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో నెలకొల్పే యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం రూ. 16, 070 కోట్ల చెక్కును ఆర్ ఈసీ చైర్మన్ రాజీవ్ శర్మ.. సీఎం కేసీఆర్ కు అందజేశారు. 

21:41 - August 11, 2015

ఢిల్లీ: అధికారపక్షం పంతం నెగ్గించుకుంది. రాజ్యసభలో జీఎస్ టీ బిల్లు ప్రవేశపెట్టింది. విపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా... ప్లకార్డులు ప్రదర్శించినా... నినాదాలు చేసినా... ఇవేమీ పట్టించుకోకుండా... బిల్లును సభముందుకు తీసుకొచ్చింది. ఇక ఉభయ సభల్లోనూ యథావిధిగా వాయిదాల పర్వం కొనసాగింది.
ఆసక్తికరంగా సమావేశాలు
మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్‌ నిరసనలు కొనసాగాయి. పలు డిమాండ్లపై మిగిలిన విపక్షాలు ఆందోళనకు దిగటంతో... వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభలో ఎట్టకేలకూ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్-జీఎస్ టీ బిల్లును అధికార పక్షం ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యనే... ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు తీసుకొచ్చే క్రమంలో అధికార పార్టీ నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అడ్డగోలుగా బిల్లు తెస్తే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
జీఎస్ టీ బిల్లుపై వామపక్షాల అసంతృప్తి
వామపక్షాలు సైతం జీఎస్ టీ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. బిల్లుపై అనేక అనుమానాలు వున్నాయని... వాటికి సమాదానం చెప్పకుండా... అసలు చర్చ లేకుండానే బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా అభివర్ణించాయి. అధికార పక్షం మాత్రం జీఎస్ టీ బిల్లును ఆహా ఓహో అంటోంది. ఇది వినియోగదారులకు ఎంతో లాభదాయకమైనదిగా చెబుతోంది. అన్ని పార్టీలు మద్దతు ఇస్తోంటే.. కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని విమర్శించింది.
ఐపీఎల్‌ అవినీతిపై లోక్‌సభలో చర్చకు విపక్షాల పట్టు
లోక్‌సభలో ఐపీఎల్‌ అవినీతిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఐపీఎల్ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని అధికార పక్షం చెబుతున్నా... విపక్షాలు పట్టు వీడలేదు. పైగా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయటం పట్ల... స్పీకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి లోక్‌సభ వర్షాకాల సమావేశాలకు 2 రోజులే మిగిలుండగా... అవీ నిరసనలతోనే ముగిసే సూచనలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

 

మేడ్చల్ ఎస్సై సతీష్ అరెస్టు...

రంగారెడ్డి: మేడ్చల్ ఎస్సై సతీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో ఎస్సై సతీష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఎస్సై సతీష్ పై నిర్భయ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం సీపీ సతీష్ ను బదిలీ చేశారు. ఆరోపణలు రుజువుకావడంతో పోలీసులు సతీష్ ను అరెస్టు చేశారు.

 

విశాఖ-కిరందోల్ రైలు మార్గంలో విరిగిపడిన కొండచరియలు

విశాఖపట్నం: విశాఖ-కిరందోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రైల్వే విద్యుత్ లైన్ ధ్వంసమైంది. దీంతో అధికారలు పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. అరకు ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది.

 

ప్రత్యేకహోదా రాకపోతే 4 తరాలకు నష్టం...

కడప: ఎపి రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోతే... మూడు లేదా నాలుగు తరాల వారు నష్టపోతారని సీ.రామచంద్రయ్య అన్నారు. ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున పదేళ్లకు రూ.1.50 లక్షల కోట్లు పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. చంద్రబాబు ఎందుకు కుక్కిన పేనులా ఉన్నారని మండిపడ్డారు. 

యాదాద్రి పవర్ పవర్ ప్లాంట్ కోసం రూ. 16, 070 కోట్ల చెక్...

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో నెలకొల్పే యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం రూ. 16, 070 కోట్ల చెక్కును ఆర్ ఈసీ చైర్మన్ రాజీవ్ శర్మ.. సీఎం కేసీఆర్ కు అందజేశారు.

 

పోలీస్ ఉన్నతాధికారులతో ఎపి డిజిపి సమావేశం

హైదరాబాద్: పోలీస్ ఉన్నతాధికారులతో ఎపి డిజిపి రాముడు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎస్సీ, ఎస్టీ కేసులపై అధికారులతో సమీక్షిస్తున్నారు.

 

డీసీఎం ఢీకొని.. విద్యార్థిని మృతి

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇంటర్ విద్యార్థినులపైకి ఓ డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో గౌతం కాలేజీలో చదువుతున్న మమత అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. 

20:38 - August 11, 2015

కృష్ణా: విజయవాడ నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు 'విజయవాడ విజన్' పేరుతో త్వరలో ప్రణాళిక రూపొందిస్తామని ఎంపీ కేశినేని నాని అన్నారు. మలేషియా ప్రతినిధుల బృందంతో కేశినేని నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రతన్ టాటా ఆహ్వానం మేరకు మలేషియా ప్రధాని.. పమెండో సంస్థ ప్రతినిధులను ఏపీకి పంపారని కేశినేని నాని తెలిపారు.

 

20:30 - August 11, 2015

ముంబై: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తీస్తాతో పాటు ఆమె భర్తకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే సిబిఐ విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంధ సంస్థ ద్వారా సమీకరించిన డబ్బులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. 

20:27 - August 11, 2015

ఢిల్లీ: జీఎస్ టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన విధానంపై... సీపీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లుపై అనేక సందేహాలున్నాయని... వాటికి సమాదానాలు చెప్పకుండానే.. బిల్లును ఎలా పాస్‌ చేయించుకుంటారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కీలకమైన బిల్లులపై సాదారణంగా సభలో చర్చ జరగటం ఆనవాయితీ అని... ఆ తర్వాత బిల్లును ప్రవేశపెడతారని గుర్తు చేశారు. జీఎస్ టీ బిల్లు విషయంలో సంప్రదాయలు పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

20:19 - August 11, 2015

వరంగల్: తెలంగాణలో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం స్పందించి అక్రమాలపై విచారణ చేసేందుకు సభా సంఘాన్ని నియమించింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో కమిటీ వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా టెన్ టివితో రమేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికి సిద్ధం చేస్తామని రమేష్‌ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా విడిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

 

20:13 - August 11, 2015

హైదరాబాద్: ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కనీసం కన్నెత్తిచూడటం లేదు. ఇప్పటికే 37 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాని ఫలితం లేదు. ఐనా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. కనీసం వేతనం సాధించేవరకు విశ్రమించేది లేదని తేల్చిచెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్లను ముట్టడించారు. ఎర్రజెండాల అండతో ఆందోళనను ఉధృతం చేశారు.
కార్మికులంతా సమ్మెలోనే
దాదాపు 40 రోజులవుతోంది. కార్మికులంతా సమ్మెలోనే ఉన్నారు. కాని సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో....కార్మికులు కదం తొక్కారు. కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కార్మిక సంఘాలు పికెటింగ్‌ పిలుపునిచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు.
హైదరాబాద్‌
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ దగ్గర అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కార్మికుల ధర్నాకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులను, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేతలు ఖండించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని సూచించారు.
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఇరువురి మధ్య తోపులాట జరిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో కొందరికి గాయాలయ్యాయి. 
ఖమ్మం
ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను మట్టడించారు. అటు మణుగూరులోనూ కార్మికులు ఆందోళన చేశారు. పురపాలక సంఘం ఎదుట భారీ ధర్నాను నిర్వహించారు.
కరీంనగర్‌
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో... కళాభారతి నుంచి కలెక్టరేట్‌ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో... ఇరువురి మధ్య తోపులాట జరిగింది.
నల్లగొండ
నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందోళనను అడ్డుకొని...పలువురిని అరెస్టు చేశారు. ఇక ఆరోగ్యశ్రీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్నా..కనీసం పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు.
ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు
కార్మిక సంఘాల ఆందోళనను పోలీసులు..అణచివేసే ప్రయత్నం చేశారు. కాని కార్మికులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఆందోళన కొనసాగించారు. ఎక్కడిక్కడ అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వేతనాన్ని అమలు చేసేవరకు...తమ ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరించాయి.

 

20:07 - August 11, 2015

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఎపి పునర్విభజన చట్టం తీసుకొచ్చిన సమయంలో... అప్పటి యుపిఎ సర్కారు ఆర్భాటంగా ఇచ్చిన హామీలను.. బిల్లులో మాత్రం పొందుపరచలేదని చెప్పారు. అవే ఇప్పుడు సమస్యగా మారాయని గుర్తు చేశారు. ఐనప్పటికీ విభజనతో నష్టపోయిన ఏపీకి ఏడాది కాలంగా... ఆర్థిక పరంగా చేయూత ఇస్తున్నామన్నారు. రెవన్యూ లోటు భర్తీ, కొత్త ప్రాజెక్టులు కేటాయింపుపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధి కేంద్రం అజెండాలో వుంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో వుందని అరుణ్‌జైట్లీ వెల్లడించారు.

 

19:59 - August 11, 2015

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు... కేంద్రంతో చర్చలు జరిపారు. కేంద్రమంత్రులు రాజనాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీతో సుజనాచౌదరి, హరిబాబు, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్, మురళీమోహన్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, సెక్షన్ 8, 9ను అమలుపై చర్చించారు. అంతేగాక తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రులను కోరారు. ప్రత్యేక హోదా హామీ కంటే ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఎపీ ఎంపీలు స్పష్టం చేశారు.

 

 

 

కాఫీ తాగితే.. చక్కెర వ్యాధి సోకదు

హైదరాబాద్: కాఫీ ప్రియులైనంత మాత్రాన చక్కెరవ్యాధి సోకదని డెన్మార్క్ విశ్వ విద్యాలయం శోధనా ఫలితం తెలిపింది. 93 శాతం మందిపై సుధీర్ఘంగా శోధించారు. స్థూలకాయం, చక్కెర వ్యాధి సమస్యలకు జన్యువులే మూలమని తేల్చారు. కాఫీ తాగని వారికీ చెక్కర వ్యాధి, ఊబకాయం సోకిందని తెలిపారు. మధుమేహులు ఎక్కువ సార్లు కాఫీ తాగడం మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచించారు.

 

19:12 - August 11, 2015

ఢిల్లీ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

19:02 - August 11, 2015

విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో.. క్రమంగా పాలనా వ్యవహారాలు స్వరాష్ట్రం నుంచే కొనసాగించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు విజయవాడ నుంచి పాలన సాగించనున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాలు, రైతు, డ్వాక్రా రుణమాఫీ, కొత్త పరిశ్రమలకు నీటి సరఫరా అంశంపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారని పరకాల చెప్పారు.

 

'సుప్రీం' ఆదేశాలు పట్టని తెలంగాణ జైళ్లశాఖ

హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ జైళ్లశాఖ భేఖాతరు చేస్తోంది. ఖైదీలను కలవాలంటే ఆధార్ తప్పదంటూ పీఠముడి వేస్తుంది. భద్రత రీత్యా ఆధార్ తప్పదని అధికారులు అంటున్నారు.

 

తీస్తా సెతల్వాద్ కు ఊరట...

ముంబై: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. తీస్తా దంపతులకు బాంబే హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని వారిని ఆదేశించింది. అయితే తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్ లను సీబీఐ కస్టడీకి బాంబే హైకోర్టు అనుమతించలేదు.

 

17:49 - August 11, 2015

హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరిన తరువాత పైలెట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ను గుర్తించారు. వెంటనే విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దించారు. విమానంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, చింతమనేని, మోదుగుల, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు, ఐవైఆర్ కృష్ణారావు ఉన్నారు. 

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరిన తరువాత పైలెట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ను గుర్తించారు. వెంటనే విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దించారు. విమానంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, చింతమనేని, మోదుగుల, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు, ఐవైఆర్ కృష్ణారావు ఉన్నారు.

17:44 - August 11, 2015

వరంగల్‌: స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. గ్రామాల్లో ఇంకా దళితులపై వివక్షతలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్‌ జిల్లా జనగామ డివిజన్‌లో దళిత కుటుంబాలకు అవమానం జరిగింది. లింగాపురం మండలం జీడికల్‌ గ్రామంలో.. వర్షాల కోసం గ్రామస్తులంతా దేవతలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే దళితులు కూడా నీళ్లు తీసుకురావడంతో.. అగ్రవర్ణాల వారు... అడ్డుకొని అవమాన పర్చారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో... కేసు నమోదైంది. తమను అవమానించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. దళితులు జనగామ చౌరస్తాలో ఆందోళనకు దిగారు.

 

17:40 - August 11, 2015

పాట్నా: బీహార్‌ ప్రజలకు శ్రమించే తత్వం ఉందని, అదే తన డిఎన్‌ఏలోను ఉంటుందని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు. మోడీకేదైనా అనుమానముంటే బీహార్‌ ప్రజలు తమ డిఎన్‌ఏ టెస్టు రిపోర్టులను ప్రధానికి పంపుతామని ఎద్దేవా చేశారు. ఉన్నత పదవిలో ఉన్న ప్రధాని దిగజారి మాట్లాడడం సబబు కాదన్నారు. నితీష్‌ డిఎన్‌ఏలో ఏదో లోపం ఉందంటూ మోడీ వ్యాఖ్యలు చేశారు. రేపు జాయింట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నట్టు నితీష్‌ తెలిపారు. ఇందులో ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్, కాంగ్రెస్‌ ప్రతినిధి కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.

 

17:34 - August 11, 2015

విజయవాడ: బిజెపి, టిడిపి ప్రభుత్వాలపై ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. లేదంటే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులపై కేసులు పెడుతామని హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాడు రాష్ట్ర విభజనకు వైసీపీ అధినేత జగన్‌ కూడా మద్దతు ఇచ్చారని రఘువీరారెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఏపీ బంద్‌కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

17:17 - August 11, 2015

మహబూబ్‌నగర్: జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులు... మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కార్మికులు గేట్లను తోసుకొని లోనికి వెళ్లారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

17:11 - August 11, 2015

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన మునికోటి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ డిమాండ్ చేశారు. ఈమేరకు మునికోటి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. తొలుత మునికోటి మృతి పట్ల సంతాపం తెలిపిన ఆయన.. అనంతరం వారి కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. 14వ ఆర్థిక సంఘానికి.. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి అధికారం లేదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబులు కలిసి రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

 

 

16:59 - August 11, 2015

ఢిల్లీ: తనను చంపుతామని ఢిల్లీ పోలీసులు బెదిరించారని, చెంప దెబ్బ కొట్టారని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌లో గూండాయిజం నడుస్తోందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఢిల్లీ పోలీసులు తనను రాత్రి పదిన్నరకు అక్రమంగా అరెస్ట్ చేశారని యోగేంద్ర యాదవ్‌ ధ్వజమెత్తారు. ఈ దేశంలో రైతులు తమ భుజంపై నాగలిని మోసే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేపట్టే హక్కును కూడా హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

16:52 - August 11, 2015

ఢిల్లీ: నరేంద్రమోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 26 శాతం రైతు ఆత్మహత్యలు పెరిగాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆలిండియా కిసాన్ సభ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మద్దతుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి ప్రకాశ్‌ కరత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కరత్.. బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించి పంటకు 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

16:46 - August 11, 2015

ఢిల్లీ: చెన్నై హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న దయానిధి మారన్‌.. సుప్రీం మెట్లెక్కారు. బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. మారన్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఎయిర్‌సెల్‌ లైసెన్సుల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మారన్‌ మరో రెండ్రోజుల్లో సీబీఐకి లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

16:40 - August 11, 2015

మహిళలను చూసే దృక్కోణం మారాలని వక్తలు అన్నారు. సమాజం.. మహిళలు.. చిన్నచూపు అనే అంశంపై మానవి నిర్వహించిన చర్చ వేదిక కార్యక్రమంలో సామాజిక కార్యకర్తల దేవీ, పిఓడబ్ల్యు నేత ఝాన్సీ పాల్గొని, మాట్లాడారు. మహిళలను వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా గుర్తించాలని కోరారు. మహిళలను వస్తువుగా చూసే భావజాలంలో మార్పు రావాలన్నారు. మహిళల వస్త్రధారణను వ్యాఖ్యానించటం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటమే అవుతుందని పేర్కొన్నారు. స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యాఖ్యానాలు చేయరాదని హితవు పలికారు. మహిళను అగౌరవ పరిచే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. మహిళల అందచందాల గురించి వ్యాఖ్యానించే తీరు మారాలని పేర్కొన్నారు.
ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలి..
ప్రజలలో ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలని ఆకాంక్షించారు. సినిమాలలో అశ్లీలతను పూర్తిగా నిరోధించాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఎదుర్కొవటానికి మహిళలంతా ఐక్యంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
జెండర్ సెన్సిటివిటీని పెంచాలి...
జెండర్ సెన్సిటివిటీని పెంచాలన్నారు. జెండర్ సెన్సిటివిటీని పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. జెండర్ సెన్సిటివిటీపై అన్ని రంగాల్లో, అన్ని స్థాయిలలో అవగాహన పెంచాలని వక్తలు పేర్కొన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జమ్మూకాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్..

జమ్మూకాశ్మీర్: పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. భద్రతా దళాలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. 

15:45 - August 11, 2015

ఢిల్లీ: ఆధార్ ఆప్షన్ మాత్రమేనని.. ఖచ్చితం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ, గ్యాస్ రాయితీలకు ఆధార్ తప్పనిసరి చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరికాదని అత్యున్నత ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ తప్పనిసరికాదన్న విషయాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయాలని తెలిపింది. ఆధార్‌లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని సూచించింది.

ప్రభుత్వ సంక్షేమపథకాలకు ఆధార్ తప్పని సరికాదు-సుప్రీంకోర్టు

ఢిల్లీ: ఆధార్ ఆప్షన్ మాత్రమేనని.. ఖచ్చితం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ, గ్యాస్ రాయితీలకు ఆధార్ తప్పనిసరి చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరికాదని అత్యున్నత ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ తప్పనిసరికాదన్న విషయాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయాలని తెలిపింది. ఆధార్‌లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని సూచించింది.

 

15:41 - August 11, 2015

ఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్యనే... గూడ్స్ అండ్ సర్వీస్‌ టాక్స్ (జీఎస్ టీ) బిల్లును ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఐతే కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలాయి. బిల్లుకు వ్యతేరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఉపసభాపతి సభను రేపటికి వాయిదా వేశారు.

 

15:35 - August 11, 2015

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా....2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ పురస్కారం కోసం స్క్వాష్‌ స్టార్‌ దీపకా పల్లికల్‌, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్లు వికాస్‌ గౌడ, సీమా పూనియా,భారత హాకీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబీ శ్రీకాంత్‌ల పేర్లు ప్రకటించినా..అవార్డు కమిటీ సభ్యులు మాత్రం సానియా పేరునే ఖరారు చేశారు. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు..మార్టీనా హింగిస్‌ తో జంటగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సాధించడం ద్వారా సానియా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టెన్నిస్‌ క్రీడాకారిణిగా సానియా అరుదైన రికార్డు నమోదు చేసింది. సానియా ఇప్పటికే అర్జున అవార్డుతో పాటు పద్శ శ్రీ పురసార్కాన్ని సైతం అందుకున్న సంగతి తెలిసిందే. సానియాకు ఖేల్ రత్నపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సానియాకు రాజీవ్ ఖేల్ రత్న..!

ఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఇవ్వనున్నారు. క్రీడాశాఖ సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది. 

ఉద్యోగులంతా రాజధాని నుంచి విధులు నిర్వహించాలి: పరకాల

విజయవాడ: ఉద్యోగులంతా రాజధాని నుంచి విధులు నిర్వహించాలని కోరుతున్నామని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో చర్చించామని పరకాల తెలిపారు. ఆదాయాలూ, ఖర్చులపై సమగ్రంగా చర్చించామని పేర్కొన్నారు. 

14:49 - August 11, 2015

ఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజలకు తమకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, 20 మంది గొడవ చేస్తే ఆగుతామా.. అంటూ మండిపడ్డారు. 'వీరిపై మీరు యాక్షన్‌ తీసుకోవాల్సిందేనంటూ' వెంకయ్యనాయుడు స్పీకర్‌కు సూచించారు.

 

14:45 - August 11, 2015

రంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన కార్మికులను, లెప్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది.

 

14:43 - August 11, 2015

హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు హైదరాబాద్‌ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 38 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారణుమని లెఫ్ట్ నేతలు మండిపడ్డారు.

 

14:39 - August 11, 2015

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అగ్రిగోల్డ్ బాధితులకు రెండు, మూడు నెలల్లో నగదును చెల్లిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ కమిటీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను త్వరలో వేలం వేస్తామని విచారణ కమిటీ ఛైర్మన్‌ నరసింహమూర్తి చెప్పారు. అగ్రిగోల్డ్ కు ఏడువేల కోట్లకుపైగా ఆస్తులున్నాయి, డిపాజిటర్లు సంయమనం పాటిస్తే రెండు మూడు నెలల్లో అన్ని చెల్లింపులు చేస్తామని చెప్పారు. బాధితులు సంయమనం పాటించాలని ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు కుటుంబరావు అన్నారు.

 

రాజ్యసభ రేపటికి వాయిదా..

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం బీఎస్ టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లును వ్యతిరేకిస్తూ.. రాజ్యసభలో కాంగ్రెస్ అందోళన చేపట్టింది. స్పీకర్ ఎంత చెప్పిన వినకుండా కొనసాగించారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

సూర్యాపేటలో ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం ప్రారంభం...

నల్లగొండ : జిల్లాలోని సూర్యాపేటలో ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం నూతన భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ మాత్రమేనని ఉద్ఘాటించారు. రబీలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు. వచ్చే మార్చికి 2,500 మెగావాట్ల సౌరవిద్యుత్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 2018 నాటికి దేశంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.

సుందర్ పిచాయ్ కు శుభాకాంక్షలు తెలిపిన సత్యనాదేళ్ల

హైదరాబాద్ : గూగుల్ సీఈవోగ నియమితులైన సుందర్ పిచాయ్‌కు ఐటీ దిగ్గజ కంపెని ‘మైక్రోసాఫ్ట్’ సీఈవో సత్య నాదెళ్ల, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ స్కెమిట్ శుభాకాంక్షలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగ కొనసాగుతున్న సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవోగ నియమితులైన సుందర్ పిచాయ్, ఇద్దరు కూడా భారతీయులు కావటం గర్వకారణం.

ప్రత్యేక హోదాపై కేంద్రం మాట నిలబెట్టుకోవాలి: టీజీ

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంగళవారం జరిగిన బంద్ తోనైనా కేంద్రం కళ్లు తెరవాలన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం జాప్యం చేస్తే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని, కేంద్రం వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలన్నారు. అంతేగాక రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

విశాఖలో అసెంబ్లీ నిర్వహణకు అవకాశాల పరిశీలన...

విశాఖ : అసెంబ్లీ శీతాకాల సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించాలని స్పీకర్ ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే పితాని సత్తనారాయణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఆదేశాల మేరకు సమావేశాల నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పితాని నేతృత్వంలో ని అధికారులు కమిటీ నగరంలో ఉన్న అవకాశాలను పరిశీలించింది. గీతం సహా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న అవకాశాలనుపరిశీలించినట్లు పితాని తెలిపారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇదే విషయాన్ని స్పీకర్ కు నివేదిస్తామని పితాని స్పష్టం చేశారు.

రైతు ఆత్మహత్యలపై కేంద్రం స్పందించాలి: కరత్

ఢిల్లీ : రైతు ఆత్మహత్యలపై కేంద్రం వెంటనే స్పందించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ డిమాండ్ చేశారు. ఆలిండియా కిసాన్ సభ ధర్నాకు కరత్ సంఘీభావం తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నాం: మంత్రి రావెల

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి రావెల కిశోర్ బాబు వెల్లడించారు. ప్రధాని మోదీ పై మాకు నమ్మకం ఉందని, రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ కు ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదన్నారు.

రేపటి నుండి విశాఖ - ఢిల్లీ ఎక్స్ ప్రారంభం...

ఢిల్లీ : రేపు విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభంకాబోతోంది. ఢిల్లీ రైల్‌భవన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్‌ప్రభు కేంద్రమంత్రులు ఆశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ప్రారంభించబోతున్నారు. విశాఖలో రేపు 7.45కి జెండా ఊపి ఎంపీ హరిబాబు ప్రారంభిస్తున్నారు. కాగా, ఢిల్లీ-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్పుచేసినట్లు తెలిసింది.

రైలుకింద పడి బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి మృతి

కరీంనగర్ : రామగుండం రైల్వేస్టేషన్‌లో రైలుకింద పడి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి సురేష్‌ మృతి చెందారు. సురేష్ తన స్వగ్రామమైన ఏలూరుకు వెళ్లుతుండగా ప్రమాదవ శాత్తు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. మృతుడు ఎంటీపీఎస్ లోని బిఏస్ఎన్ఎల్‌ల్లో పనిచేస్తున్నాడు

ఒంగోలు కలెక్టరేట్ ముట్టడికి యత్నం.. నేతల అరెస్ట్..

ఒంగోలు : ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రామేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్‌, ఏపీడబ్ల్యూజే సుబ్బారావు ఒంగోల్ కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.  చలసాని శ్రీనివాస్‌తో పాటు వారి కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రా హోదా సాధన కోసం జిల్లా మొత్తం బంద్ వాతావరణం కనిపిస్తోంది.

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..

విజయవాడ : తాజాగా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే డబ్బుతో అగ్రిగోల్డ్ ఖాతాదారులకి సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఆర్థిక నేరాల అధ్యయనకమిటీ చైర్మన్ కె.నర్సింహమూర్తి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించిన నివేదికను సీఎంకు అందజేసినట్లు తెలిపారు. క్యాష్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన లేక అగ్రిగోల్డ్‌ దివాలాతీసిందని, 3 నెలల్లో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తామని, ముందుగా 5300 మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ దర్శకుడు 'హిరానీ' కి గాయాలు..

ముంబై : బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ(52) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలవడంతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. హిరానీ దవడకు, గడ్డంకు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. ఈ గాయాలకు చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తామని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదంలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్లో ఒకరి నుంచి కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకుని హిరానీ రైడ్ కు వెళ్లారు. రోడ్డుపై తక్కువ వేగంతో వెళుతున్నప్పటికీ బైక్ అదుపు చేయలేక ఆయన కిందపడ్డట్టు తెలిసింది. 

12:41 - August 11, 2015

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జెడీశీలం ప్రత్యేకహోదాపై గళం విప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జెడీశీలం తిరుపతి మునికోటి ఆత్మహత్యను ప్రస్తావించారు. విభజన చట్టాన్ని సరిగా అమలు చేయాలని.. ప్రధాని, ఆర్ధికమంత్రి స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌, వీహెచ్‌లు కూడా జెడీశీలానికి మద్దతు పలికారు.

చట్ట సభల్లో చర్చల ద్వారానే పరిష్కారం:స్పీకర్

ఢిల్లీ : లోక్ సభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తం చేశారు. సభలో స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యుల ఆందోళనపై స్పందించిన స్పీకర్, సభలో పరిణామాలతో దేశానికి చెడు సందేశం వెళుతోందని, చట్ట సభల్లో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. 40, 50 మంది సభ్యులు 450 మంది సభ్యుల హక్కులు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. అయితే చట్టసభల్లో ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. 

12:15 - August 11, 2015

హైదరాబాద్ : గ్రామజ్యోతి పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి మంగళవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రణాళికాయుతంగా పనులు జరగడం లేదని... గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయిందని.. సమస్యలను చూసి భయపడకుండా... సమస్యలపై యుద్ధం ప్రకటించాలని సూచించారు. సర్పంచ్, ప్రజల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కోసం ప్లానింగ్ జరగాలన్నారు. ఊళ్లలో చెత్తలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని... గ్రామజ్యోతి పథకంలో గ్రామాలు వెలగాలని స్పష్టం చేశారు.మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న జిల్లాస్థాయి అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన బిజెపి

ఢిల్లీ : తమ పార్టీ ఎంపిలకు బిజెపి విప్ జారీ చేసింది. ముఖ్యమైన బిల్లులపై సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున నేడు, రేపు తప్పనిసరిగా పార్లమెంట్ కు హాజరు కావాలని సభ్యులకు బిజెపి విప్ జారీ చేసింది.

11:43 - August 11, 2015

విజయవాడ ప్రత్యేక హోదా కోసం లెఫ్ట్‌, కాంగ్రెస్‌, వైసీపీ చేపట్టిన బంద్ ఏపీలో ఉధృతంగా సాగుతోంది. విజయవాడలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛదంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో......
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేకహోదా బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ డిపోల్లో బస్సులన్నీ నిలిచిపోయాయి. విద్యాసంస్ధలు, వాణిజ్యసంస్థలు మూసివేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, వైసీపీ శ్రేణులు బంద్‌ను నిర్వహిస్తున్నాయి.
విశాఖలో ఏపీ బంద్‌ ఉద్రిక్తం....
విశాఖపట్నంలో బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బంద్‌ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి తరలించారు.
అనంతపురం జిల్లాలో జోరుగా నడుస్తోంది. బంద్ ప్రభావం వ్యాపార,రవాణా రంగాలపై తీవ్రంగా వుంది. జిల్లాలోని 12 డిపోల్లోనూ ఆర్టీసీబస్సులు నిలిచిపోయాయి. ఈ బంద్‌లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థిసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జరిగిన భీభత్సాన్ని దృష్టిలో వుంచుకుని, గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు.
కడప జిల్లాలో....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లాలో ఉదయం తెల్లవారుజాము నుంచే బంద్ నిర్వహిస్తున్నారు. సిపిఐ చేస్తున్న బంద్ కు మద్దతుగా కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. కడప ఆర్టీసీ బస్‌ డిపో నుంచి బస్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. 

11:38 - August 11, 2015

హైదరాబాద్ : ఉగ్రవాది నవీద్‌ను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించాలని ఎన్‌ఐఎ కోర్టు ఆదేశించింది. పంజాబ్‌ ఘటనలోనూ, కాశ్మీర్‌ సరిహద్దుల్లోని కాల్పుల ఘటనలోనూ నవీద్‌ పాత్రను భద్రతాదళాలు విచారిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలకు నవీద్‌ను తీసుకెళ్లి.. కూంబింగ్‌ నిర్వహించిన భద్రతాదళాలు.. మరిన్ని రోజులపాటు విచారణకు అవకాశమివ్వాలని కోరడంతో.. ఎన్‌ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది.

తెలంగాణ లో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి:కిషన్ రెడ్డి

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని బిజెపి నేత కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో బిజెపి నేతల బృందం పర్యటించింది. డిచ్ పల్లి తీవ్ర కరువుతో అల్లాడుతన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

11:33 - August 11, 2015

ముంబై : తన దీర్ఘకాల స్నేహితుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే విరుచుకుపడ్డారు. యాకూబ్ మెమన్ ఉరితీత విషయంలో సల్మాన్ వైఖరిపై కోపగించుకున్న ఆయన 'బుర్ర లేనోడు' అని వ్యాఖ్యానించారు. "సల్మాన్ ఖాన్ కు బుర్రలేదు. ఆయన తండ్రి ఓ గౌరవించదగ్గ వ్యక్తి. సల్మాన్ రోజూ పేపర్ చదవడు. ఆయనకు చట్టం గురించి తెలియదు. అందువల్లే యాకూబ్ కు అనుకూలంగా ట్వీట్ చేశాడు. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రశ్నించవచ్చా?" అని రాజ్ ట్వీట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో శిక్షపడ్డ తరువాత తాను సల్మాన్ ఇంటికి వెళ్లడాన్ని రాజ్ సమర్థించుకున్నారు. తమ కుటుంబం సల్మాన్ కుటుంబం చాలా కాలం నుంచి సన్నిహింతంగా ఉన్నాయని అందువల్లే తాను పరామర్శకు వెళ్లానని స్పష్టం చేశారు. కాగా, యాకూబ్ ఉరితీత తరువాత "నేనీ వ్యాఖ్య చేసేందుకు మూడు రోజులు ఆలోచించా. భయపడ్డా కూడా. పారిపోయిన యాకూబ్ సోదరుడిని ఉరితీయాలి. ఓ అమాయకుడి చంపడం మానవత్వాన్ని చంపడమే" అని ట్వీట్ చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. 

11:31 - August 11, 2015

చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థకు సీఈవోగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) ఎంపికయ్యారు. తమిళనాడులోని చెన్నై నగరంలో 1972లో జన్మించిన సుందర్ ఐఐటీ-ఖరగ్‌పూర్ నుంచి డిగ్రీ సంపాదించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాలు పొందారు సుందర్. అనంతరం 2004లో గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ ప్రస్తుతం సీఈవో స్థాయికి చేరుకున్నారు. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు సీయీవోగా బాధ్యతలు స్వీకరించునున్న సుందర్ పిచాయ్‌ని మైక్రోసాఫ్ట్ సీయీవో సత్య నాదెళ్ల, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరలు అభినందించారు.

ములాయం సింగ్ చొరవను ప్రశంసించిన మోదీ...

ఢిల్లీ : కొంత మంది పార్లమెంట్ ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ను స్తంభింపచేయటం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ అంశంలో ములాయం సింగ్ చొరవను ప్రధాని ప్రశంసించారు.

 

జీఎస్ టీ బిల్లును అడ్డుకునేందుకే :వెంకయ్యనాయుడు

ఢిల్లీ: లోక్ సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. లలిత్ మోదీ వ్యవహారుంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుపట్టింది. ఈ పద్ధతి మంచిది కాదని వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ తీరు అప్రస్వామికం అని.. జీఎస్ టీ బిల్లును అడ్డుకునేందుకే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయని వెంకయ్య తెలిపారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన దయానిధి మారన్

ఢిల్లీ: ముందస్తు బెయిల్ పిటిషన్ పై మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనధికార టిఎలిఫోన్ ఎక్ఛేంజ్ కేసులో మారన్ కు నిన్న మద్రాస్ హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా 3 రోజుల్లో సీబీఐ ఎదుట లొంగిపోవాలని మారన్ మంద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా సమ్మెలో ఇస్త్రో ఉద్యోగులు...

హైదరాబాద్ : ఇస్రో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేపట్టారు. తమకు రావల్సిన 10 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంలేదని, ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన అలవెన్సులు కూడా ఇవ్వడంలేదన్న కారణాలతో నిరసన తెలుపుతున్నారు. అంతేగాక జీతాలు పెంచమని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ స్పందించలేదని చెప్పారు. అయితే ఈ సమ్మెవల్ల ఈ నెల 28న జీఎస్ఎల్ వీ ప్రయోగం ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. 

'ప్రత్యేక హోదా' పైచర్చకు వైసీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ :ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టీడీపీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు నోటీసు ఇచ్చింది. తాజాగా నేడు అదే అంశంపై చర్చకు అనుమతించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఓ వైపు ‘హోదా’ కోసం సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్ కొనసాగుతోంది. టీడీపి, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. మరోవైపు డిల్లీలో నిన్న వైసీీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నాకు దిగారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

రైలు పట్టాల పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

విజయనగరం: పట్టణంలోని ఎత్తు బ్రిడ్జిసమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ అయి బస్సు రైలు పట్టాల పైకి దూసుకెళ్లింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టలపై ఇరుక్కుపోయిన బస్సులను తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వంట గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 40 లక్షల ప్రమాద బీమా.. మీకు తెలుసా!

హైదరాబాద్ : ప్రమాదవశాత్తూ వంట గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 40 లక్షల ప్రమాద బీమా వినియోగదారుడికి ఉంటుంది. సిలిండర్ పేలి, బతికి బయటపడ్డా కూడా రూ. 30 లక్షల వరకూ ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ విషయం గ్యాస్ వినియోగదారుల్లో ఎంతమందికి తెలుసు? ఏదైనా ప్రమాదం జరిగితే చమురు కంపెనీలు బాధితులకు బీమా సొమ్ములను ఎన్నిసార్లు ఇచ్చాయి? అసలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు, ఆ వినియోగదారులు, అతని కుటుంబం బీమాకు అర్హులైపోతారు. ఈ విషయం గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కూడా అత్యధికులకు తెలియదు. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది?

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కామినేని తనిఖీలు..

నెల్లూరు :గవర్నమెంట మెడికల్ కాలేజిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మిక తనికి చేసిన ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. వైద్యుల పనితీరుపై ఆయన అసంతృంప్తి వ్యక్తం చేశారు. పలు రికార్డులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. వైద్య సిబంధి పని తీరు మార్చుకోని రోగులకు సరైనా వైద్యం అందించాలని ఆయన హెచ్చరించారు.

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ: బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు.

 

జమ్మూకశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉగ్రవాది నవీద్...

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉగ్రవాది నవీద్ ఉన్నారు. ఉగ్రవాది నవీద్ కు 14 రోజుల పోలీస్ కస్టడీకి ఎన్ ఐఏ కోర్టు అనుమతించింది.

ఆర్టీసీ బస్సు బోల్తా :ముగ్గురికి గాయాలు

చిత్తూరు :రేణిగుంట మండలం కరకంబాడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ధన్ బాద్ లో పట్టాలు తప్పిన రెండు రైళ్లు

మధ్యప్రదేశ్ : ధన్ బాద్ లో సోమవారం అర్థరాత్రి రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. ధన్ బాద్ - గయా రైలు పట్టాలు తప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంబాన్ని ఢీ కొట్టడంతో మరో మూడు స్తంబాలు ఒరిగిపోయాయి. అనంతరం అదేప్రాంతంలో వస్తున్న రాంచి-పట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

'రైతు ఆత్మహత్యల సంఖ్యలను తారుమారు చేస్తున్న ప్రభుత్వాలు'

హైదరాబాద్ : 'రైతు ఆత్మహత్యల సంఖ్యలను ప్రభుత్వాలు తారు మారు చేస్తున్నాయని ప్రముఖ పాత్రికేయుడు పి.సాయినాథ్ విమర్శించారు. 1995 నుంచి పోలిస్తే రైతు ఆత్మహత్యల సంఖ్యను 2014లో ప్రభుత్వాలు కోత పెట్టాయి. 2013 లో 11,771 మంది ఆత్మహత్యకు పాల్పడగా 2014 లో 5650కు లెక్క కుదించారని ఆరోపించారు. నమోదు ప్రక్రియ కొలబద్దను ప్రభుత్వం మార్చటమే తక్కువకు కారణమని తెలిపారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను కుదించటంలో 'ఇతరుల ' పట్టిక 28 శాతం పెరిగిందన్నారు. 12 రాష్ట్రాల్లో ఆత్మహత్యల చిట్టాలో రైతు సంక్క్ష్మీ 'సున్న' అని స్పష్టం చేశారు.

ఆంధ్ర లో చుట్టుముట్టిన నీటి ఎద్దడి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి చుట్టుముట్టింది. నైరుతి రుతుపవనాలు సహా అన్నీ బలహీనం కావడంతో నాలుగో వంతు గ్రామాల్లో వేసవి నుంచీ నీటి ఎద్దడి కొనసాగుతోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో 2567 గ్రామాల్లో నీటి కటకట నెలకొంది. అనంతపురం జిల్లాలో 63 మండలాలకు గాను 21 మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉంది.

మూడో రౌండ్ లోకి పీవీ సింధు

జకార్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మూడో రౌండ్‌లోకి భారత క్రీడాకారిణి పీవీ సింధు ప్రవేశించింది. రెండో రౌండ్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి జార్స్ ఫెల్ట్‌పై సింధు విజయం సాధించింది. డెన్మార్క్ క్రీడాకారిణిపై 11-21, 21-17, 21-16 తేడాతో గెలుపొందింది. ఇక మూడో రౌండ్‌లో చైనీస్ క్రీడాకారిణి లీ జూరీతో సింధు తలపడనుంది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతోన్నాయి.

హక్కుల కార్యకర్త యోగేందర్ పై పోలీసుల దీష్టీకం

ఢిల్లీ : హక్కుల కార్యకర్త యోగేందర్ పై పోలీసుల దీష్టీకం ప్రదర్శించారు. జంతర్ మంతర్ వద్ద రైతుసంఘాల ధర్నా నుంచి యేగేందర్ యాదవ్ ను లాక్కెళ్లిన పోలీసులు రాత్రంతా పార్లమెంట్ వీధిలోని పీస్ లో ఉంచి చితక బాదారు.

విజయవాడ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

విజయవాడ : పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై వాహనాలను సీపీఐ రాష్ట్ర నేత రామకృష్ణ, పీసీసీ చీఫ్ రఘువీరా, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

రత్నీపురా సెక్టార్‌లో ఎదురు కాల్పులు...

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లా రత్నీపురా సెక్టార్‌లో మంగళవారం ఉదయం నుంచి సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రత్నీపురా సెక్టార్‌లో ఉన్న అడవుల్లో ఉగ్రవాదులు తల దాచుకున్నారన్న సమాచారంతో సైన్యం అక్కడికి చేరుకుని వారి కోసం గాలిస్తోంది. ఓ ఉగ్రవాదిని సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...

09:41 - August 11, 2015

న్యూ ఢిల్లీ : వివాదాస్పద గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ జీఎస్ టీ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశ్ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ఎంతగానో అభ్యంతరం చెప్తున్నప్పటికీ కేంద్రం మాత్రం GSTకు ఆమోద ముద్ర వేయించుకునే దిశగా ముందుకు కదులుతోంది. ఇది ఇలా ఉంటే జీఎస్ టీ బిల్లుకు కనుక ఆమోద ముద్ర పడితే సినిమా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

09:39 - August 11, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా పై మాట్లాడే హక్కు టిడిపి, సీపీఎంకి మాత్రమే ఉందా? ప్రత్యేక హోదా పై వైసీపీకి చిత్త శుద్ధి ఎంత వుంది? ఏపీలో ఉనికి కోసమే వైసీపీ, కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతున్నాయా? వైసీపీ బిజెపి వైపు మొగ్గు చూపుతోందా? టిడిపి ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, టిడిపి నేత సూర్యప్రకాశ్ , బిజెపి నేత ఆర్డీ విల్సన్, వైసీపీ నేత నల్లా సూర్యప్రకాశ్, కాంగ్రెస్ నేత ద్రోణం రాజు సత్యనారయణ పాల్గొన్నారు. ఆచర్చను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

09:38 - August 11, 2015

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇంటి నుంచి బయలుదేరిని కొద్దిసేపటికే ఈ దారుణం జరిగింది. రాజు గతంలో దేవరకద్ర సర్పంచ్‌గాను పని చేశారు. హత్యకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదాలే కారణమని తెలుస్తోంది.

09:36 - August 11, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్‌, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. విజయవాడలో లెఫ్ట్‌, వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్నారు.

గుంటూరులో : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వామపక్షాలు, కాంగ్రెస్‌, వైసీపీ చేపట్టిన బంద్‌ గుంటూరు కొనసాగుతోంది. తెల్జవారుజాము నుంచే లెఫ్ట్‌ నేతలు రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు.

ప్రకాశం జిల్లాలో : ఒంగోలులో ఆందోళనకారులు బస్సు డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కందుకూరు, కనిగిరి, మార్కాపురం డిపోల నుంచి బస్సులు బయటకు రావడం లేదు. కొన్ని చోట్ల బస్సులను పాక్షికంగా నడుపుతున్నారు. అద్దంకి బస్టాండ్‌ వద్ద కేంద్రం దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు.

కడప జిల్లాలో :ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే బంద్ నిర్వహిస్తున్నారు. సిపిఐ చేస్తున్న బంద్ కు మద్దతుగా కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. కడప ఆర్టీసీ బస్‌ డిపో నుంచి బస్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. 

అన్నా హజారేకు బెదిరింపు లేఖ

ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్, సిసోడియాకు ఇస్తున్న మద్దతు ఉపహరించుకోవాలని హెచ్చరిస్తూ సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారేకు ఓ బెదరింపు లేఖ వచ్చింది. ఈ లేఖ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ లేఖ పై పూణే పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.

డెంగ్యూ నివారణకు ఏర్పాట్లు చేశాం : మంత్రి లక్ష్మారెడ్డి...

హైదరాబాద్ : డెంగ్యూపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష జరిపారు. డెంగ్యూ ప్రబలకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఏజెన్సీలో కూడా డెంగ్యూ, మలేరియా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో డెంగ్యూ నిర్ధారణకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

రాజీవ్ గాంధీ విగ్రహం పక్కనే మునికోటి విగ్రహం

తిరుపతి :మునికోటి మరణంతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని చిరంజీవి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ వెనక్కి తగ్గేది లేదు అని ఆయన చెప్పారు. మునికోటి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడారని ఆయన చెప్పారు. మునికోటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చిరంజీవి కోరారు. తిరుపతిలో రాజీవ్‌గాంధీ విగ్రహం పక్కన మునికోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీసీపీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా సాధించి మునికోటికి అంకితమిస్తామని ఆయన అన్నారు.

08:35 - August 11, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యంలో నేడు బంద్ జరుగుతోంది. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి వనరులు సమకూరుతాయి? రాజకీయ పార్టీలు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నాయి? ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగానికి సంబంధించిందా? ప్రత్యేక హోదా పొందాలంటే ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ప్రత్యేక హోదా పై ఏపీ సర్కార్ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడంలేదు... అంతే కాదు దీనిపై ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా తీర్మానం పెట్టమని అడగలేదు ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలిపితే రాష్ట్రానికి నిధులు వస్తాయా? ఇలాంటి అంశాలపై 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దిహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణాత్మకమైన వివరణ మీరూ చూడాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

నేడు రాజ్యసభకు జీఎస్ టీ బిల్లు...

న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. గత మే నెలలో జీఎస్టీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం విదితమే. అయితే జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు నిబంధనల మేరకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

వీఆర్వోపై బానాపూర్ గ్రామస్తులు దాడి

మెదక్ : భూతగాదా విషయంలో వీఆర్వోపై బానాపూర్ గ్రామస్తులు దాడి చేశారు, భూతగాదాల వల్ల గ్రామస్థులంతా కలిసి అతనిని తీవ్రంగ గాయపరిచారు. తీవ్రమైన గాయాలతో అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

పాల ఉత్పత్తి కేంద్రంలో పేలుడు: ఇద్దరికి గాయాలు...

కరీంనగర్ : జమ్మికుంట శివారు పాల ఉత్పత్తి కేంద్రంలో ఫిల్టర్ శుద్ధి చేస్తుండగా అమ్మోనియం గ్యాస్ లీకై పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మెకానిక్‌లకు గాయాలయ్యాయి. చికిత్సకోసం వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తిరుమల అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు...

తిరుమల :బాలాజీనగర్ అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. గతంలోకూడా ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని అకతాయిలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం..!

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరకోస్తా తీరాల మీదుగా పయనిస్తోంది. మరింత బలపడి బుధవారం అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

రైలు నిలయం వద్ద టిప్పర్ ఢీకొన్ని విద్యార్థిని మృతి

సికింద్రాబాద్: రైలు నిలయం వద్ద టిప్పర్ ఢీకొన్ని బిఎస్సీ విద్యార్థిని స్వప్న మృతి చెందింది. స్వప్న ఎన్ సీసీ క్యాడెట్ ఆగస్టు 15 వేడుకల రిహార్సల్స్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో సికింద్రాబాద్ వద్ద బారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

07:06 - August 11, 2015

మహారాష్ట్ర : పదిలక్షల ఇన్సూరెన్స్‌ కోసం కన్న కొడుకునే చంపేసిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. పూణెకి చెందిన చైతన్య బల్‌పాండే పుట్టుకతోనే పాక్షికంగా వికలాంగుడు. దీంతో బాలుడి తండ్రి అతని పేరు మీద రూ. 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు గాను బాలుడి తల్లి రాఖీ గత వారం తన ప్రియుడు సుమిత్‌ మోరేతో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
కొడుకు మరణాన్ని ప్రమాదంగా చిత్రించే యత్నం....
బాలుడి పోస్ట్‌మార్టం రిపోర్టులో బ్యాట్‌తో కొట్టి, చిత్ర హింసలకు గురిచేసినట్లు తేలింది. కన్న కొడుకు మరణాన్ని ప్రమాదవశాత్తూ సంభవించిందిగా చిత్రీకరించేందుకు రాఖీ ప్రయత్నించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇన్సూరెన్స్ కోసమే రాఖీ తన కుమారుడిని చంపేసి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు.
మృతుడి తల్లిదండ్రులు విడిపోయారు.....
మృతుడు చైతన్య బల్‌పాండే తల్లిదండ్రులు విడాకులు తీసుకోగా, చైతన్య తల్లి రాఖీ వద్ద ఉంటున్నాడు. రాఖీ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇన్సూరెన్స్‌ డబ్బు కోసమే తన కొడుకును చంపేసిందని చైతన్య తండ్రి తరుణ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో బాలుడు చైతన్యను కాపాడేందుకు చుట్టుప్రక్కల వారు ప్రయత్నిస్తే వారిపై కూడా కిడ్నాప్‌ కేసు పేరిట బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని వివిధ కోణాల్లో చేపడుతున్నామని తెలిపారు.

07:03 - August 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగినప్పటికీ.. తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్‌పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. మరోపక్క అధిగ ఉష్ణోగ్రతలతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్‌ కోతలు విధించే పరిస్థితి ఏర్పడుతోంది.
వర్షా భావంతో....
వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో మళ్లీ విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయి. రోజుకు సరిపడా 6500 మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక సాగుకు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తే ఈ వినియోగం 11 వేల మెగావాట్లకు చేరుతుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. మరోపక్క ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటిపోతుండడంతో.. జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో విద్యుత్‌ సరఫరా అగమ్యగోచరంగా మారింది.
జులైలో జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా.......
వర్షాలు పుష్కలంగా కురిస్తే జులైలోనే జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు నాటికి వెయ్యి మెగావాట్ల జల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. వచ్చే మార్చి వరకు 4,144 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందనుకున్నారు. ఆశించిన మేర జలవిద్యుత్‌ ఉత్పత్తి జరిగితే.. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ.. మిగులు విద్యుత్‌ ఉంటుందనే భావనతోనే ప్రభుత్వం నిరంతర విద్యుత్‌పై ధీమా వ్యక్తం చేసింది. అదే తరుణంలో వేసవిలో విద్యుత్‌ కోతలను అధిగమించామని.. మున్ముందు అధిగమిస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోవడం.. జల విద్యుత్‌ ఉత్పత్తి కాకపోవడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి.
విద్యుత్‌ సరఫరా కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు......
మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. విద్యుత్‌ను తీసుకువచ్చేందుకు లైన్లు లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. ఆ పనులు ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ సాగు విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంది. మరోపక్క ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండడంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ 11 వేల మెగావాట్లకు తాకే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా విద్యుత్‌ తీసుకువస్తున్నప్పటికీ.. మరో 2500 మెగావాట్ల విద్యుత్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌......
ఇక ఈ లోటును భర్తీ చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. విద్యుత్‌ కొనుగోలుకు ఇతర రాష్ట్రాలు అంగీకరిస్తున్నప్పటికీ.. లైన్లు లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం రంగం సిద్ధమైనప్పటికీ.. నార్త్‌ నుంచి సౌత్‌కు సరఫరా చేసే కారిడార్‌ సిద్ధంగా లేకపోవడం కూడా పెద్ద సమస్యగా తయారైంది. మరోపక్క కృష్ణపట్నం, హిందుజా నుంచి విద్యుత్‌ వస్తుందని భావించినప్పటికీ.. ఆ అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు విపరీతమైన విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్యలన్నీ గట్టెక్కాలంటే వరుణుడు కరుణించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. 

07:00 - August 11, 2015

హైదరాబాద్ : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్‌ కార్డులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. విదేశాల్లో అమలవుతున్న స్మార్ట్‌కార్డ్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ప్రయోగాత్మకంగా చేపట్టి తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని భావిస్తున్నారు.
ప్రయాణికులు స్మార్ట్‌ కార్డు కొనుగోలు చేయాలి.....
ఈ విధానంలో ప్రయాణికులు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌కార్డు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బస్సులలో ప్రయాణించేందుకు ఈ కార్డులను రీచార్జ్‌ చేసుకోవాలి. బస్సులో ఎక్కగానే ప్రయాణికులు.. ఈ కార్డులను స్వైప్‌ చేయాలి. దీంతో బస్సులలో ఇక కండక్టర్‌ అవసరం ఉండదు... డ్రైవర్‌లపై కూడా ఎలాంటి భారం పడదు. అయితే... హైదరాబాద్‌లాంటి నగరంలో ఈ విధానం ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. విదేశాల్లో విశాలమైన రోడ్లు, సమయానికి బస్సులు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎలాంటి కొత్త విధానం ప్రవేశపెట్టినా సక్సెస్‌ అవుతుంది. కానీ.. మన వద్ద సరైన రోడ్లు ఉండవు.. బస్సులలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తుంటారు. ఇన్ని సమస్యల మధ్య ప్రయాణికులు స్మార్ట్‌ కార్డు స్వైప్‌ చేయడం సాధ్యమేనా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక బస్సులలో రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో కార్డు స్వైప్‌ చేయకుండానే ప్రయాణికులు దిగిపోతే పరిస్థితి ఏంటి ? ఇలా చేయడం వల్ల ఆర్టీసీకి నష్టం రాదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బస్సు పాస్‌ హోల్డర్లకు నష్టం.......
ఇక నగరంలో ప్రయాణికులు నెలకోసారి బస్సు పాస్‌ తీసుకుంటే ఎన్నిసార్లయినా బస్సు ఎక్కవచ్చు.. దిగవచ్చు. కానీ.. స్మార్ట్‌కార్డు వల్ల బస్సు ఎక్కిన ప్రతిసారీ స్వైప్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన ప్రతిసారి చార్జీ పడుతుంది. దీంతో బస్సుపాస్‌ హోల్డర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల ఈ విధానానికి ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ......
ఇక ఈ విధానాన్ని అమలు చేస్తే.. బస్సులలో సిబ్బంది తనిఖీలు చేయాలంటే ప్రత్యేక శిక్షణ అందించాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీలో 90 శాతం మంది పదో తరగతి విద్యార్హత ఉన్నవారే ఎక్కువ. ఇలాంటివారు ఈ టెక్నాలజీని ఎంతవరకు నేర్చుకుంటారనేది సందేహంగా మారింది. మరోపక్క ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి క్రమక్రమంగా బస్సుపాస్‌లను తగ్గించే కుట్ర జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టిమ్స్‌ ద్వారా డ్రైవర్లపై అధిక భారం మోపుతున్న అధికారులు.. ఇకపై సిటీబస్సుల్లో స్మార్ట్‌కార్డుల విధానాన్ని తీసుకువచ్చి కండక్టర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

06:53 - August 11, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండు చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ను జయప్రదం చేసేందుకు పార్టీలకతీతంగా అన్నివర్గాలు సన్నద్ధమయ్యాయి. వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఫార్వర్డుబ్లాక్‌, ఆర్‌ఎస్‌పీ, ఇతర ప్రజాసంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. స్వచ్ఛందంగా బంద్‌ పాటించేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందుకొచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు, లారీ యజమానుల సంఘం బంద్‌కు సంఘీభావం తెలిపాయి. బంద్‌ సందర్భంగా విధులు బహిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అన్ని పరీక్షలను ఈ నెల 18వ తేదీకి వాయిదా ...
బంద్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర బంద్‌ జయప్రదాన్ని కోరుతూ యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బిజెపి, టిడిపి పై మండి పడుతున్న ప్రజలు...
రాష్ట్ర విభజన అంశాల అమల్లో బీజేపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, రాష్ట్రంలో దానికి తందానా అంటూ టీడీపీ మోసగిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రధాన ఆదాయ వనురున్న హైదరాబాద్‌ తెలంగాణా రాష్ట్రానికి చెందడంతో ఏపీకి ఏర్పడనున్న రెవిన్యూలోటును కేంద్రం భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది. అలాగే అభివృద్ధిలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం, రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపుతో పాటు ఐదు సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత 14 నెలల్లో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదు.
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు రోజుకో రకంగా....
వెనుకబడ్డ జిల్లాల ఆర్థికాభివృద్ధికి రూ.24,350 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేవలం రూ.350 కోట్లు విదిల్చింది. రూ.18వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించింది. రూ.15,400 కోట్ల లోటు బడ్జెట్‌ భర్తీకి కూడా కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇలా ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు రోజుకో రకంగా మాట్లాడడం, ఇచ్చే అవకాశం లేదని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గురుకొండ ఎంపీటీసీ సభ్యుడి దారుణ హత్య

మహబూబ్ నగర్ : దేవరకద్రలో గురుకొండ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. గురుకొండ ఎంపీటీసీ అరుణాచంలం రాజు పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందారు.

కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఐ ఆందోళన

కాకినాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఐ ఆందోళన చేపట్టింది. ఆర్టీసి డిపోల నుండి బస్సులు బయటికి రాకుండా టైర్లకు నిప్పు పెట్టి సీపీఐ శ్రేణులు అడ్డుకుంటున్నారు.

నేడు ఏపీ బంద్ కు సీపీఐ పిలుపు

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కాల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ బంద్ కు సీపీఐ పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు సీపీఎం, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు, విద్యార్థి సంఘం ఎస్ ఎఫ్ఐ మద్దతు తెలిపాయి.

అనంతపురంలో కొనసాగుతున్న బంద్....

అనంత: జిల్లా బంద్ కు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సానియా కారుకు చలానా

హైదరాబాద్‌టెన్నిస్‌ స్టార్‌ , తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా కారుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ. 200 చలానా విధించారు. సానియాకు చెందిన టొయోటో ఫార్చ్యూనర్‌ (టీఎస్‌ 09 ఈజి 1) సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో పార్కింగ్‌ ప్రదేశంలో ఉంది. అదే దారిలో వెళుతున్న ఎస్‌ఐ రాఘవరావు కారు నెంబర్‌ ప్లేట్‌ నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఫొటో తీసి చలానా విధించారు. చలానాలో కారు సానియా మీర్జా పేరు మీద ఉన్నట్టు తేలింది.

Don't Miss