Activities calendar

12 August 2015

22:06 - August 12, 2015

కష్టాల కడలిలో ఉన్న రాష్ట్రాన్ని మరింత అయోమయంలోకి నెడుతున్నారు. అప్పుడు ప్రత్యేకహోదా అని కబుర్లు చెప్పి... ఇప్పుడు అబ్బెబ్బె అంటున్నారు. స్వర్ణాంధ్ర చేస్తామని ప్రగల్బాలు పలికి.. ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారు. ప్రత్యేకహోదా కలేనా..? కోట్లాది ఆంధ్రా ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎక్కడ..?. కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఒడ్డున పడేదెలా...?? ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:58 - August 12, 2015

హైదరాబాద్: తమ ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను రూపొందిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. పరిశ్రమలకు భూమి సమస్య అనేది లేదన్నారు. ఇప్పటి వరకూ 36 సంస్థలకు పది నుంచి 12 రోజుల్లోనే అనుమతులు ఇచ్చినట్టు కేసీఆర్‌ చెప్పారు..

 

21:56 - August 12, 2015

హైదరాబాద్: 'ప్రత్యేక హోదాపై ఏం జరుగుతోందో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది' అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో మాట్లాడుతూనే ఉన్నానని.. కేంద్రమంత్రులతోనూ టచ్‌లో ఉంటున్నట్లు చెప్పారు. ఆగష్టు 15 తర్వాత ఢిల్లీకి రావాలని ప్రధాని పిలిచారని...అన్ని సమస్యలపై అక్కడే చర్చిద్దామని అన్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రమే పరిష్కరించాలని చెప్పారు. ఏపీకి న్యాయం జరిగేవరకూ రాజీపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం...
పెండింగ్‌లో అనేక సమస్యలు.. 
''కేంద్రం వద్ద అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికి 8 సార్లు ప్రధానిని కలిశా. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జైట్లీ, అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడాను. సమస్యలపై ఆగష్టు 15 తర్వాత మాట్లాడదామని మోడీ అన్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపమనగానే ఆనాడు ఆర్డినెన్స్ తెచ్చారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని బీజేపీ నిలదీసింది. ప్రత్యేకహోదాపై ఆనాడు పార్లమెంట్‌లో హామి ఇచ్చి కేబినెట్‌లో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే సమస్య ముదిరిపోయింది''.
ప్రత్యేక హోదా అంటే ఏమిటి? కేంద్రం బాధ్యత ఏంటి,?
''జరిగిన అన్యాయాన్ని కేంద్రం సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? కేంద్రం బాధ్యత ఏంటి,?ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరిస్తా. ఏపీకి న్యాయం జరిగే వరకూ రాజీపడను. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చకండి. ప్రత్యేక హోదా సున్నితమైన సమస్య వివాదాలు సృష్టించవద్దు. విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది. మీడియాలో రాజకీయ కాలుష్యం పెరిగిపోయింది. సమస్యలపై కూర్చొని మాట్లాడుకుందామంటే తెలంగాణ సర్కారు వినలేదు''. అని చంద్రబాబు అన్నారు.

 

21:51 - August 12, 2015

హైదరాబాద్: నోటీసుకు... నోటీసు... యాక్షన్‌కు... రియాక్షన్‌. చర్యకు... ప్రతిచర్య... కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న... తెలుగురాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు రాష్ట్రాల నేతలు సై అంటే సై అంటున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకవైపు తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసులో... ఇలా దూకుడు పెంచిందో లేదో..? మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఐడీ స్పీడ్ పెంచింది. ఏసీబీ లోకేశ్‌ బాబు డ్రైవర్‌ కొండల్ రెడ్డికి తెలంగాణ నోటీసులిస్తే... ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ కేటీఆర్‌ డ్రైవర్ సత్యనారాయణ, గన్‌మెన్‌ జానకీరామ్‌లకు నోటీసులు ఇచ్చింది. జెరూసలేం మత్తయ్యను బెదిరించిన కేసులో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఎస్ డబ్ల్యూ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఈనెల 14న విజయవాడలో సీఐడీ ముందు హాజరు కావాలని జానకిరాం, సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. ఇక లోకేష్ డ్రైవర్‌కు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది.

నీటి ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళికలు: కేసీఆర్

హైదరాబాద్: నీటి ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తాజ్ కృష్ణలో నిర్వహించిన సీఐఐ సదస్సులో కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. రానున్న రెండు, మూడు ఏళ్లల్లో మంచి ఫలితానిస్తాయని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి అయితే వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందన్నారు.

మంత్రి కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్లకు ఎపి సీఐడీ నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మెన్ జానకీరాం, డ్రైవర్ కు ఎపి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఐఎస్ డబ్ల్యూ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఈనెల 14న విజయవాడలో సీఐడీ ముందు హాజరు కావాలని జానకిరాం, సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు.

 

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..

ఆదిలాబాద్ : జిల్లాలోని బెజ్జూరు, దహేగాం మండలాల్లో భారీ వర్షం కురిసింది. కుప్నేపల్లి వాగు పొంగిపొర్లింది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

20:41 - August 12, 2015

హైదరాబాద్: నీలా మాధబ్‌ దర్శకత్వం వహించిన కునాల్‌ కపూర్‌, రాధికా ఆప్టే, సౌరభ్‌ షుకల్‌, గుల్షన్‌గ్రోవర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కౌన్ కిత్ నే పానీ మే' చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం ట్రైటర్ విడుదలైంది. ఒక గ్రామాన్ని అమ్మకానికి పెట్టే కథాంశంతో ఆద్యంతం వినోదభరితంగా రూపొందిన 'కౌన్‌ కిత్‌నే పానీ మే' చిత్ర ట్రైలర్‌ ఎంతో బాగుందని బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. నీలా మాధబ్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో కునాల్‌ కపూర్‌, రాధికా ఆప్టే, సౌరభ్‌ షుకల్‌, గుల్షన్‌గ్రోవర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 'గ్రామాన్ని అమ్మడమనే విషయాన్ని కడుపుబ్బ నవ్వించే రీతిలో రూపొందిన ఈచిత్రం ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది' అని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌, హృతిక్‌రోషన్‌ ట్వీట్‌ పెట్టారు. 'ఇదొక వైవిధ్యమైన కథతో రూపొందిన చిత్రం. నటనకు మంచి అవకాశమున్న ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది' అని హీరోయిన్‌ రాధిక ఆప్టే అన్నారు.

 

అరకు ఎంపీ గీతకు సీబీఐ కోర్టు నోటీసులు

విశాఖ: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. 19న గీత తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేసి రుణం పొందినట్లు గీతపై ఆరోపణలున్నాయి. 

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సైనా విజయం

జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. చియాంగ్ గాన్ యీపై 21-13, 21-9 తేడాతో సైనా గెలుపొందింది.

 

20:10 - August 12, 2015

హైదరాబాద్: ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిణిగా పివిపి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.10గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'సైజ్‌ జీరో' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి లోగోను యూనిట్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ...'డిఫరెంట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌, ఆడియోను త్వరలోనే విడుదల చేస్తాం. వెయిట్‌ లాస్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు 20కేజీల బరువు పెరిగారు. అలాగే ఈ చిత్రం కోసం హీరో ఆర్య క్లిష్టతరమైన సైక్లింగ్‌ విన్యాసాల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది' అని తెలిపారు. అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నిర్వాషా, ఆర్ట్‌ : ఆనంద్‌సాయి, కథ, స్క్రీన్‌ప్లే : కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : సందీప్‌ గుణ్ణం, నిర్మాత : ప్రసాద్‌ వి.పొట్లూరి, దర్శకత్వం : ప్రకాష్‌ కోవెల మూడి.

20:00 - August 12, 2015

హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని అఖిల్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ,'ఆగస్ట్‌ 11 నుండి 23 వరకు ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని సంఘీ ఫారెస్ట్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సెట్‌లో ఫైట్‌మాస్టర్‌ రవివర్మ ఆధ్వర్యంలో చిత్రీకరించే క్లయిమాక్స్‌తో మూడు పాటలు మినహా షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటల్లో ఆగస్ట్‌ 30 నుండి సెప్టెంబర్‌ 12 వరకు యూరప్‌లో రెండు పాటల్ని, సెప్టెంబర్‌ 18 నుండి 23 వరకు జరిపే షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో నిర్మించే భారీ సెట్‌లో చివరి పాటను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ఆగస్ట్‌ 29వ తేదీన అక్కినేని నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 20న భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించనున్నాం. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్‌ లెవెల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 'ఆగస్ట్‌ 12న (నేడు) నా బర్త్‌డే. ఇంత పెద్ద బేనర్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్‌ని పరిచయం చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో నటించే అవకాశాన్ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఫీలవుతున్నాను. ఈ ఛాన్స్‌ ఇచ్చిన దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత నితిన్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి నా కెరీర్‌కు పెద్ద ప్లస్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను' అని హీరోయిన్‌ సయేషా అన్నారు. 'ఈ చిత్రంలో అఖిల్‌ ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. ఈ చిత్రకథను వినాయక్‌గారు అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మా బ్యానర్‌కి ఇదొక ప్రెస్టేజియస్‌ ఫిలిమ్‌ అవుతుంది. బిజినెస్‌పరంగా ట్రేడ్‌వర్గాల్లో ఇప్పటికే మంచి క్రేజ్‌ సొంతం చేసుకుందీ చిత్రం' అని సమర్పకురాలు నిఖితారెడ్డి తెలిపారు.

 

19:54 - August 12, 2015

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం ఉదయం ముంబైలో బైక్‌పై వెళ్తున్న ఆయన హఠాత్తుగా అదుపు తప్పి పడిపోయారు. గాయాలు కావడంతో హిరానీని ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. 'స్వల్ప గాయాలు మినహా ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని' లీలావతి వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాస్పిటల్‌కి వచ్చి రాజ్‌కుమార్‌ హిరానీని పరామర్శించారు. 'మున్నాభారు ఎం.బి.బి.ఎస్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు హిరానీ
దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

మళ్లీ పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతంలోని పూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. భద్రతా దళాలు కాల్పులను తిప్పికొట్టాయి. ప్రస్తుతం కాల్పులు జరుగుతన్నాయి.

మధ్యప్రదేశ్ లో వికటించిన మధ్యాహ్నా భోజనం..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని కుంద్వాలో మధ్యాహ్నా భోజనం వికటించింది. దీనితో 52 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. 

19:37 - August 12, 2015

తెలంగాణలో గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. వీరు సమ్మెకు దిగి 43 రోజులు దాటినా, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపడం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిర్వహించిన చలో హైదరాబాద్ విజయవంతమైంది. ఈ అంశంపై టెన్ టివిలో నిర్వహించిన చర్చా వేదికలో ఆర్. సుధా భాస్కర్ (సీఐటీయూ జాతీయ కార్యదర్శి), సోలిపేట రామచంద్రారెడ్డి (మాజీ ఎంపీ), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

19:34 - August 12, 2015

గాలె : శ్రీలంకతో ..గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలిరోజు ఆట ముగిసేసమయానికే టీమిండియా పటిష్టమైన స్థితికి చేరుకొంది. టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన టీమిండియా ప్రత్యర్థిని 183 పరుగులకే కుప్పకూల్చింది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ల మ్యాజిక్ లో శ్రీలంక గల్లంతయ్యింది. సమాధానంగా టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్లకు 128 పరుగులు చేసి..భారీ స్కోరుకు పునాది వేసుకొంది. ఓపెనర్ రాహుల్ 7, వన్ డౌన్ రోహిత్ శర్మ 9 పరుగుల స్కోర్లకు ఔటైనా ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కొహ్లీ బాధ్యతయుతంగా బ్యాటింగ్‌ చేసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ధావన్‌ టెస్టుల్లో 3వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

19:33 - August 12, 2015

గాలె : టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...శ్రీలంక గడ్డపై అదరగొట్టాడు. విదేశీ పిచ్ లపై జరిగే టెస్టుల్లో రాణించలేడన్న అపవాదుకు తెరదించాడు. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజుఆటలోనే...అశ్విన్ స్పిన్ మ్యాజిక్ లో శ్రీలంక కొట్టుకుపోయింది. విమర్శకుల నోటికి..తన స్పిన్ మ్యాజిక్ తోనే సమాధానం చెప్పాడు.

భారత్ అంటే స్పిన్నర్లకు చిరునామా..
క్రికెట్ ప్రపంచంలో.. భారత్ అంటే ఒకప్పుడు స్పిన్నర్లకు చిరునామా. జాసూ పటేల్, ఇరాపల్లి ప్రసన్న, శ్రీనివాస వెంకట్రాఘవన్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హర్భజన్ సింగ్ లాంటి ఎందరో మేటి ఆఫ్ స్పిన్ బౌలర్లను అందించిన ఘనత మనదేశానికే ఉంది. అయితే...అది అందమైన గతం మాత్రమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భూతద్దం పెట్టి వెదికినా....ఒకరిద్దరు మాత్రమే నాణ్యమైన స్పిన్నర్లు కనిపిస్తారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది...క్యారమ్ బాల్ బౌలర్ కమ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే.

ఏకైక స్పిన్నర్..
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ ఐదు రోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్..ఫార్మాట్ ఏదైనా సరే...నిలకడగా రాణించే ఏకైక స్పిన్నర్ అశ్విన్ మాత్రమే. విదేశీ గడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ ల్లో రాణించే సత్తా అశ్విన్ కు ఏమాత్రం లేదన్న విమర్శలకు ప్రస్తుత శ్రీలంక టూర్ తొలిటెస్ట్ తొలిరోజు ఆటలోనే తనదైన స్టయిల్లో ఆరు వికెట్లతో సమాధానం చెప్పాడు. స్పిన్ బౌలర్ల అడ్డా గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలిటెస్ట్..తొలిరోజు పిచ్ పైనే అశ్విన్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 46 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి వారెవ్వా..అనిపించుకొన్నాడు. పిచ్ కు తగ్గట్టుగా బౌలింగ్ లో వైవిద్యం ప్రదర్శిస్తూ...శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు.

స్పిన్ తో సమాధానం..
2011లో విండీస్ తో జరిగిన సిరీస్ ద్వారా...న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా టెస్ట్ లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. స్వదేశీ పిచ్ లపైన జరిగిన పలు సిరీస్ ల్లో స్టార్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ప్రస్తుత గాల్ టెస్ట్ కు ముందు వరకూ 24 మ్యాచ్ లు ఆడిన అశ్విన్..మొత్తం 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పదిసార్లు, ఒకటెస్ట్ లో 10 వికెట్లు రెండుసార్లు పడగొట్టాడు. ప్రస్తుత గాల్ టెస్ట్ అశ్విన్ కెరియర్ లో 26వ మ్యాచ్ కాగా...47 ఇన్నింగ్స్ లో 130 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. ఒక ఇన్నింగ్స్ లో ఐదుకు పైగా వికెట్లు పడగొట్టడం అశ్విన్ కెరియర్ లో ఇది 11వ సారి. మొత్తం మీద..అశ్విన్ ఓ విదేశీ సిరీస్ తొలిటెస్ట్ లోనే ఆరు వికెట్లు పడగొట్టి విమర్శకుల నోటికి తన స్పిన్ మ్యాజిక్ తోనే సమాధానం చెప్పాడు.

19:28 - August 12, 2015

గాలె : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఆట తొలిరోజునే భారత బౌలర్లు అదరగొట్టారు.మ్యాజిక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌... రవిచంద్రన్‌ అశ్విన్ ధాటికి లంక బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. రెండు సెషన్లలోపే శ్రీలంక జట్టును ఆలౌట్‌ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. భారత ఆఫ్‌ స్పిన్నర్‌...రవిచంద్రన్‌ అశ్విన్ మ్యాజిక్‌ చేయడంతో లంక జట్టు 183 పరుగులకే కుప్పకూలింది. కేవలం రెండు సెషన్లలోనే శ్రీలంక జట్టును ఆలౌట్‌ చేసి ఆట తొలిరోజునే మ్యాచ్‌పై పట్టు బిగించారు.

టాస్ ఓడిన భారత్..
గాలే ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట ఫీల్డింగ్‌కు దిగిన భారత జట్టుకు బౌలర్లు శుభారంభాన్నిచ్చారు. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కొహ్లీ గేమ్‌ ప్లాన్‌ వర్కౌటైంది. టీమిండియా స్పీడ్‌ స్టర్‌ వరుణ్ ఆరోన్‌, ఇషాంత్‌ శర్మ లంక ఓపెనర్లు కౌషల్‌సిల్వా, కరుణరత్నేలను వెంటవెంటనే ఔట్‌ చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాతి నుండి మ్యాజిక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌... రవిచంద్రన్‌ అశ్విన్ షో మొదలైంది.

కట్టడి చేసిన అశ్విన్..
పర్‌ఫక్ట్ లైన్‌ అండ్‌ లెంగ్త్ తో బౌలింగ్‌ చేసిన అశ్విన్‌...ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. బౌలింగ్‌ చేసిన తొలి ఓవర్‌లోనే లంక వెటరన్‌ కుమార సంగక్కరను బోల్తా కొట్టించాడు. అశ్విన్ ధాటికి ఆ తర్వాత వచ్చిన లంక బ్యాట్స్‌మెన్‌ సైతం క్యూ కట్టారు.వరుసగా తిరిమాన్నే,ముబారక్‌, ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపి సత్తా చాటాడు. మరో ఎండ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌మిశ్రా సైతం వికెట్లు సాధించడంతో...శ్రీలంక జట్టు రెండు సెషన్లలోపే ఆలౌటైంది. 49.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. లోయర్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌, దినేష్‌ చాందిమల్‌ పోరాడి హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఆరు వికెట్లు పడగొట్టగా, అమిత్‌ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. 

భయంతోనే అరెస్టు చేశారు - మధు..

శ్రీకాకుళం : పాలాకి పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వ దుర్మార్గ చర్యలను బట్టబయలు చేస్తాననే భయంతోనే తనను అరెస్టు చేశారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. బూర్జ పీఎస్ నుండి ఆయన విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వేలాది ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిన చంద్రబాబు పోరాడుతున్న వారిపై అక్రమకేసులు బనాయిస్తోందని విమర్శించారు. పవర్ ప్లాంట్ కోసం భూములను లాక్కోవాలని చూస్తే పొలాకి రైతులకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. 

విజయవాడకు రాజధాని కల – చంద్రబాబు..

విజయవాడ : నగరానికి రాజధాని కల వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మనవల్ల కాకపోతే కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని, విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రిని ఎనిమిదిసార్లు కలవడం జరిగిందన్నారు. 

కాంగ్రెస్ గుడ్డిగా వ్యవహరిస్తోంది - హరీష్..

హైదరాబాద్ : ప్రభుత్వ నిర్ణయాలను కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు జరగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని, కాంట్రాక్టర్ల కోసం కాంగ్రెస్ ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. నేతలు మంచి సూచనలిస్తే సమర్థిస్తామని, తోటపల్లి రిజర్వాయర్ పై కాంగ్రెస్ నిరసనలు కాదన్నారు. 

రాహుల్ విజ్ఞానం లేని మేధావి - జైట్లీ..

ఢిల్లీ : రాహుల్ విజ్ఞానం లేని మేధావి అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో లలిత్ మోడీపై లైట్ బ్లూ ఓనటీసు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. లైట్ బ్లూ నోటీస్ దేశీయ ఎయిర్ పోర్టులకే వర్తిస్తుందని, అప్పటికే మోడీ లండన్ వెళ్లారని తెలిపారు. ఫెమా కింద అరెస్టు చేసే అవకాశం కూడా లేదని, లలిత్ పై యూపీఏ ఫెమా కేసు మాత్రమే పెట్టిందన్నారు. లలిత్ మోడీ వల్ల సుష్మా కూతురికి ఎలాంటి ఆర్థిక లాభం జరుగలేదని చెప్పుకొచ్చారు.

మధు విడుదల..

శ్రీకాకుళం: : ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు విడుదల చేశారు. బూర్జా పోలీస్ స్టేషన్ నుండి ఆయన విడుదల అయ్యారు.

18:35 - August 12, 2015

గుంటూరు : మొన్నటివరకూ హాయిగా ఆ ప్రాంతంలో తిరిగిన రాజధాని ప్రజలకు షాక్ ఇస్తోంది సీఎం గెస్ట్ హౌజ్ ... కరకట్ట సమీపంలో ఇక సాధారణ ప్రజలు తిరగలేనివిధంగా సెక్యూరిటీకి ప్లాన్ చేస్తున్నారు అధికారులు.. ఈ ప్రాంతంలో కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల కాన్వాయ్‌లు మాత్రమే వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొన్నటి దాకా భూములు, భూములంటూ హడావిడి చేసిన ప్రభుత్వం... ఇప్పుడు సీఎం cm గెస్ట్ హౌజ్ పేరుతో జనాలకు చుక్కలు చూపిస్తోంది.


సీఎం అతిధి గృహంకోసం ఉండవల్లి కృష్ణా నది కరకట్ట సమీపంలోని లింగమనేని ఎస్టేట్ భవనాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. నివాసం కోసం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సీతానగరం నుండి లింగాయ పాలెం వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతోంది. ఈ రోడ్డు కోసం కరకట్టను ఆనుకుని ఉన్న కొన్ని భూములను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 

పొలాల్లోకూడా పోలీస్ పికెటింగ్‌కు ప్రణాళికలు. 
సీఎం గెస్ట్ హౌజ్ నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికే ఇంటిలిజెన్స్ అధికారులు, గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.. ఇక్కడ భారీ భద్రతకోసం కసరత్తు చేస్తున్నారు.. నదికి అవతలివైపుకూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతున్నారు.

మరొక చెక్ పోస్టు..
ఈ మార్గంలో భారీగా ఆంక్షల విధింపుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి సియం అతిథి గృహానికి అక్కడి నుంచి లింగాయపాలెం సీడ్ క్యాపిటల్ పనులు పర్యవేక్షించడానికి ఈ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంత్రులు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు ఈ దారిలోనే సీడ్ క్యాపిటల్ కు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కరకట్ట రహదారిని ఇకనుంచి కేవలం ప్రభుత్వ ప్రముఖులు ప్రత్యేక వ్యక్తుల కాన్వాయ్ లు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం సీతానగరం దగ్గర ఓ పోలీస్ చెక్ పోస్ట్, వెంకటపాలెం మంతెన సత్యనారాయణ భవనాల సమీపంలో మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

అధికారులు చేస్తున్న హంగామాపై విమర్శలు..
విజయవాడ నుంచి వచ్చే వాహనాలను సీతానగరం చెక్ పోస్ట్ దగ్గర, రాజధాని నుండి విజయవాడకు వచ్చే వాహనాలను వెంకటపాలెం చెక్ పోస్ట్ దగ్గర తనీఖీలు చేస్తారు. అలాగే ఉండవల్లి గ్రామానికి, సియం గెస్ట్ హౌస్ కు మధ్య పొలాల్లోకూడా పోలీస్ పికెటింగ్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం ఇలా భారీ భద్రత జానడుమ సియం చంద్రబాబు వారంలో మూడు, నాలుగు రోజులు ఇక్కడ ఉండబోతున్నారు. సియం గెస్ట్ హౌస్ భద్రతకోసం అధికారులు చేస్తున్న హంగామాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఈ భద్రతతో మొన్నటివరకూ హాయిగా ఈ మార్గంలో తిరిగిన ప్రజలు ఇప్పుడు అటువైపే చూడలేని పరిస్థితి ఏర్పడింది.. కరకట్టను జాఆనుకుని ఉన్న పల్లెవాసులకు ఇదే ముఖ్య రహదారిగా ఉంది.. ఈ ఆంక్షలతో చుట్టూ 20 కిలోమీటర్లు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాల్సివస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సియం గెస్ట్ కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దంటున్నారు సిపియం రాజధాని సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు. ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకోవాలని ఈ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.. గెస్ట్ హౌజ్ పేరు చెప్పి తమను 20కిలోమీటర్లు తిరిగి ఇల్లు చేరేలా చేయడం సరికాదని సూచిస్తున్నారు.

నోటీసులిచ్చేందుకు ఏపీ సీఐడీ సిద్ధం ?

హైదరాబాద్ : జెరూసలెం మత్తయ్యను బెదిరించిన కేసులో నోటీసులు జారీ చేసుందుకు ఏపీ సీఐడీ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్లకు సీఐడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

18:25 - August 12, 2015

కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమైవుతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. హక్కును కాదనుకుని.. అడుక్కునే దీనమైన స్థితికి టీడీపీ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే.. ప్రత్యేకహోదా అడగడంలేదని అన్నారు. అసలు దేవురించాల్సిన అవసరం ఏంటీ ? హక్కును పోగొట్టుకొనే విధంగా ఎందుకు తెస్తున్నారు ? ఇందుకు బాబు పరిష్మన్ ఇచ్చారా ? ఏంటీ జరుగుతోందని రామచంద్రయ్య ప్రశ్నించారు. 

18:22 - August 12, 2015

శ్రీకాకుళం : ప్రజలతో మాట్లాడేందుకు వెళ్తుంటే ఉలిక్కిపడ్డారు..! గుట్టు రట్టవుతుందేమోనని ఆందోళన చెందారు..! మరోసారి ప్రజా ఉద్యమ ఎగిసి పడుతుందేమోనని కంగారు పడ్డారు..! చడీ చప్పుడు కాకుండా.. మాటువేసి మరీ అరెస్టు చేశారు..! శ్రీకాకుళం జిల్లా పొలాకిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేసిన పోలీసులు మారుమూల ప్రాంతంలో నిర్బంధించారు. ఈ చర్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పొలాకిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధును అరెస్టు చేశారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మారుమూల ప్రాంతంలోని బుర్జ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి స్టేషన్‌లోనే మధును నిర్బంధించిన పోలీసులు.. కనీసం సెల్‌ ఫోన్‌ కూడా ఇవ్వలేదు. వంద మందికిపైగా పోలీసులతో పహారా ఏర్పాటు చేసి, మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. ఈ చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన నేతను అరెస్టు చేయడమేంటని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. పొలాకి విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ బండారం బయట పడుతుందనే మధును అరెస్టు చేశారని వామపక్ష, ప్రజాతంత్రవాదులు విమర్శించారు. ఈ చర్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలాకి, పాలకొండ, ఎచ్చెర్ల, చిలకపాలెం, బుర్జ తదితర ప్రాంతాల్లో వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. అయితే.. బుర్జ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టిన నేతలను, కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్టుచేశారు.

నిరసన కార్యక్రమాలు..
మధు అరెస్టుకు నిరసనగా ఆముదాల వలస, విజయనగరం ప్రాంతాల్లో సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యేనంటూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేదల భూములను బడాబాబులకు దోచి పెడుతున్న ప్రభుత్వం.. దాన్ని ప్రశ్నించే వారిని అరెస్టులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. మధు అరెస్టు అప్రజాస్వామికమంటూ విజయవాడ, విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. లక్షల ఎకరాలు దౌర్జన్యంగా లాక్కుంటున్న ప్రభుత్వం.. అడిగితే నిర్బంధం ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, పొలాకిలో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమం ఎగిసిపడుతుందని హెచ్చరించారు.

నకిలీపాస్ పుస్తకాల స్కాం...ఇద్దరి వీఆర్ వోల అరెస్టు

అనంతపురం: నకిలీపాస్ పుస్తకాల కుంభకోణంలో బత్తలపల్లి, సంగాల వీఆర్ వోలు బాలపెద్దన్న, గోపాల్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి 26 నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీకాకుళం జిల్లా బూర్జ పీఎస్ లో పి.మధుకు వైద్య పరీక్షలు

శ్రీకాకుళం: జిల్లాలోని బూర్జ పీఎస్ లో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ముగిసిన తొలిరోజు ఆట..

గాలె టెస్టు: శ్రీలంక, భారత్ ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసింది. శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ క దిగిన భారత్.. తొలి ఇన్నింగ్ లో రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటింగ్: కరుణరత్నె(09), కౌశల్ సిల్వా(05), తిరుమణ్నె(13), సంగక్కర(05), మాథ్యూస్ (64), ముబారక్(0), చండిమాల్(59), దమ్మిక ప్రసాద్(0), హెరాత్(23), కౌశల్(0), ప్రదీప్(0).
భారత బ్యాటింగ్: రాహుల్ (07), రోహిత్ శర్మ(09), ధావన్ (53), విరాట్ కోహ్లీ (45).

లోక్ సభలో మోడీపై రాహుల్ ఫైర్..

ఢిల్లీ : లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. గాంధీ మూడు విషయాలు చెప్పారని చెడు చూడకు..చెడు వినకు..చెడు మాట్లాడవద్దని పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ నిజం వినకు..నిజం మాట్లాడకు..నిజం చూడకు అని మోడీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. లలిత్ మోడీకి రహస్యంగా ఎందుకు సహాయం చేశారని నిలదీశారు. 

ఉత్తర కొరియా ఉప ప్రధానికి మరణదండన..?

హైదరాబాద్: ఉత్తర కొరియా ఉప ప్రధాని చోయ్ యాంగ్ గోన్ కు మరణ శిక్ష విధించి చంపేసినట్లు సమాచారం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ యున్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాడని బోయ్ యాంగ్ ను చంపేశారని దక్షిణ కొరియా యోన్హావ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 

కరువు మండలాలను ప్రకటించాలి: రైతు సంఘం

హైదరాబాద్: తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు గవర్నర్ నరసింహన్ ను నేతలు కలిశారు. రుణమాఫీ అమలు చేసి తక్షణమే రుణాలు ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

17:26 - August 12, 2015

ఢిల్లీ : హైకోర్టు విభజనను సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అడ్వకేట్ జేఏసీ, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధి బృందం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. కేంద్ర, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో ఢిల్లీకి వచ్చిన ప్రతినిధి బృందం రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. హైకోర్టు విభజన అవశ్యకతను రాజ్ నాథ్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 14 నెలలు అయ్యిందని, ఇంతవరకు ఏపీ, తెలంగాణకు వేర్వేరు హైకోర్టు లేవన్నారు. దీనివల్ల కేసులకు సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని టిజేఏసీ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. సొలిసటల్ జనరల్ లేదా అటార్నీ జనరల్ సమీక్ష జరపడం ద్వారా ఒక న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఒకవేళ కాకపోతే పునర్ వ్యవస్థీకరణ చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. శాంతిని పెంపొందించే విధంగా తాము కృషి చేస్తున్నామని, ఈ విషయంలో కాలతీతం చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని రాజ్ నాథ్ కు చెప్పడం జరిగిందన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని కోదండరాం తెలిపారు. 

ఆస్పత్రిలో కరెంట్ కట్..ముగ్గురు శిశువుల మృతి

హైదరాబాద్: ఆస్పత్రిలో కరెంటు పోవడంతో ఆగ్రాలోని ఎస్ ఎన్ మెడికల్ కళాశాలలో ముగ్గురు శిశువులు మృతి చెందారు. ఈఘటనపై ఆగ్రహించిన ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ హిమాన్షు యాదవ్, పెడియాట్రిక్ డిపార్టు మెంట్ హెడక్ రాజేశ్వర్ దయాల్ లను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేగాక, కళాశాల ప్రిన్సిపల్ ఏకే అగర్వాల్ ను తొలగించి, ఆ స్థానంలో ఎస్ కే గార్గ్ ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులు విచారణ జరిపి...

17:17 - August 12, 2015

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనగా ఉందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. జిల్లాలోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రైతుల సమస్యలపై కిసాన్ మజ్దూర్ సంఘ్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈసమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగ భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో వేయి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. కేసీఆర్ పరిపాలనపై అవగాహన లేదన్నారు. అనంతరం నేతలు ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. 

17:12 - August 12, 2015

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్ సభలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ జరుగుతున్న తీరూ చూస్తుంటే టెన్నిస్ కోర్టులాగా అనిపిస్తోందన్నారు. అధికారపక్షం..విపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుంటే తాము బాల్ లాగా అటూ ఇటూ చూడడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు చూస్తే తెలంగాణ బడీ అమ్మ..మరోవైపు తెలంగాణ ఇచ్చిన చోటీ అమ్మ..ఈ ఇద్దరి మధ్య తాము నిలబడ్డామన్నారు. కేంద్ర మంత్రి సుష్మాను చూస్తుంటే ఒక గౌరవం ఏర్పడుతుందని, ఆమెను చూసిన తరువాత నమస్కారం పెడుతామన్నారు. ఆమె తప్పు చేశారంటే కష్టంగా ఉందన్నారు. లలిత్ మోడీ నేరస్థుడయితే కఠినంగా శిక్షించాలని ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఆగస్టు 15 తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ: సీఎం కేసీఆర్

హైదరాబాద్: టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఆగస్టు 15 తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారమే పదవుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అర్హులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. తొలి విడతలో మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలను ఎంపిక చేయనున్నారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామజ్యోతి పథకాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. 

 

 

17:01 - August 12, 2015

హైదరాబాద్ : తమ సమస్యలు తీర్చాలని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తుండడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో బుధవారం చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈసందర్భంగా సీఐటీయూ నేత సాయిబాబా టెన్ టివితో మాట్లాడారు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తారని, పర్మినెంట్ చేస్తారని, కనీస వేతనాలు ఇస్తారని కార్మికులు ఆశించారని తెలిపారు. కానీ ఆశలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు సబబు కాదన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం పారిపోతోందాన్నరు. 

16:35 - August 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిటిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి విమర్శలు గుప్పించారు. కార్మికులు చేస్తున్న సమ్మెపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు. సీఎంగా అయ్యాక ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల సమస్యలు నెరవేర్చకపోతే వచ్చే అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. 

16:33 - August 12, 2015

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదాపై వెంటనే తేలుస్తారా ? లేదా అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, రాయలకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్ తదితర విషయాలపై వెంటనే స్పందించాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జైట్లీ ఏమని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆంధ్రులను అవమానించే రీతిలో వ్యవహరించకూడదని, ప్రత్యేక హోదా, రాష్ట్ర హక్కులను రేపటిలోగా తేర్చాలని హెచ్చరించారు. లేనిపక్షంలో పార్టీలు, నేతలు ఏమన్నారో ఆధారాలతో సహా రాష్ట్రంలోని 1121 పీఎస్ లలో ప్రజల భాగస్వామ్యంతో కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుందన్నారు. 

16:23 - August 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రామ జ్యోతి పథకంపై చర్చిస్తున్నారు. పథకంపై టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు. గ్రామజ్యోతి పథకంపై చర్చ జరగుతోంది. నామినెటెడ్ పదవులపై సమావేశంలో చర్చించనున్నారు.

8గంటలకుపైగా పీఎస్ లో మధు..

శ్రీకాకుళం : ఏపీ సీపీఎం కార్యదర్శి మధు ఎనిమిది గంటలకుపైగా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. 

లోకేష్ డ్రైవర్ కు ఏసీబీ నోటీసులు..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 160 సీఆర్పీపీసీ కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

జవాన్లపై మిలిటెంట్ల దాడి..

జమ్మూ కాశ్మీర్ : షోపైన్ జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను గాయపడినట్లు సమాచారం. 

కొనసాగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్ లు పాల్గొన్నారు. గ్రామజ్యోతి పథకంపై చర్చ జరగుతోంది. 

16:02 - August 12, 2015

బీహార్ : రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. జేడీయూ (నితీష్ కుమార్), ఆర్జేడీ (లాలూ ప్రసాద్ యాదవ్), కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కలిసి పోటీ చేయనున్నట్లు సీఎం నితీష్ కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. ఆగస్టు 30న పాట్నాలో బీహార్ స్వాభిమాన్ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్ఎస్ఎస్ లకు బుద్ధి చెబుతాం - లాలూ..
ఎన్నికల్లో మతతత్వ శక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు బుద్ధి చెబుతామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గుప్పించిన హామీల్లో బీజేపీ ఏ ఒక్క కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల ఎదుట వారిని నిలదీస్తామని, మహా కూటిమిని ఎవరూ విడగొట్టలేరని స్పష్టం చేశారు. తమ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఇక సాగవన్నారు. ఇటీవలే నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోడీ తమను అవమానపరిచారని, ఇందుకు త్వరలో జరిగే సభలో సమాధానం చెబుతామన్నారు. 

త్వరలో ఏడువేల కానిస్టేబుల్ పోస్టులు - చినరాజప్ప...

విజయవాడ : ఏడు వేల కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ హోం మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. హోంగార్డుల జీతాలు రూ.9వేలు ఇస్తామని, విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. 

పి.మధు అరెస్టును ఖండించిన రాఘవులు..

హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధును అరెస్టును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఖండించారు. పాలాకిలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రభావిత రైతులు, ప్రజలతో మాట్లాడటానికి వెళ్లడం తప్పా అని ఆయన నిలదీశారు. పి.మధుతో పాటు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

15:41 - August 12, 2015

ఢిల్లీ : న్యాయం కావాలని కాంగ్రెస్ పేర్కొంటోందని కానీ తాను న్యాయం అడుగుతున్నానని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. లలిత్ మోడీ గేట్ స్కాంపై లోక్ సభ దద్దరిల్లింది. సుష్మాపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసింది. తనపై వచ్చిన ఆరోపణకు సమాధానం చెబుతానని మంత్రి సుష్మా స్పీకర్ ను కోరారు. దీనితో సుష్మా మాట్లాడేందుకు స్పీకర్ సుమిత్రా మహజన్ అనుమతినిచ్చారు. కానీ కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. గందరగోళం మధ్యే సుష్మా సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రసంగంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆమె మాటల్లోనే..

సభను అడ్డుకోవలన్నదే కాంగ్రెస్ లక్ష్యం..
''సభను అడ్డుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. న్యాయం అడగాలని కాంగ్రెస్ అంటోంది. కానీ తాను న్యాయం అడుగుతున్నాను. తనపై ఆరోపణలు చేసి మాట్లాడే అవకాశం ఇవ్వరా ? పూర్తిగా మాట్లాడే అవకాశం కల్పించాలి. నేను ఇప్పటికీ చెబుతున్నాను. ఎలాంటి తప్పు చేయలేదు. ఒక భారత మహిళకు సాయం చేశాను. 17 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. ఈమెపై ఎలాంటి కేసులు లేవు. ఆపరేషన్ చేయడం వల్ల ఆమెకు ప్రమాదం తప్పే అవకాశం ఉంది. ఇది నేరమై అయితే నేను నేరమే చేశాను. లలిత్ మోడీ దస్తా వేజులను పరిశీలించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నియమ నిబంధనల ప్రకారమే దస్తావేజులను ఇవ్వడం జరిగిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. తన కుటుంబసభ్యులపై ఆరోపణలు వస్తున్నాయి. పాస్ పోర్టు వ్యవహారంలో తన భర్త పాత్ర లేదు. అందులో 11 మంది న్యాయవాదులున్నారు. ఇక్కడ తన కుమార్తె జూనియర్ న్యాయవాది. ఎక్కడైనా జూ.న్యాయవాదికి డబ్బులు ఇస్తారా ? తన భర్త..తన కుమార్తె ఒక్కపైసా కూడా తీసుకోలేదు.

రహస్యంగా ఏమీ చేయలేదు..
సుష్మా క్రిమినల్ యాక్ట్ చేశారని బయట రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు. కానీ తాను రహస్యంగా ఎమీ చేయలేదు.
తనకు ఖర్గే అనేక ప్రశ్నలు సంధించారు. దానికంటే ముందు తాను పేర్కొంటున్న అంశాలపై సమాధానం చెప్పాలి. గతంలో ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి, సీనియర్ న్యాయవాది నళిని ఆదాయం పన్ను శాఖ తరపున కేసులు వాదిస్తున్న వ్యవహారంపై గందరగోళం చెలరేగింది.ఖత్రోచి పారిపోవడానికి ఎవరు సహాయం చేశారు ? అర్జున్ సింగ్ ఆటోబయోగ్రఫీలో అనేక విషయాలున్నాయి. 15వేల మంది మరణానికి కారణం అండర్ సన్. అండర్ సన్ ను దాటించింది కాంగ్రెస్ నాయకత్వం. క్విడ్ ప్రోకో ప్రకారమే యాండర్సన్ ను దేశం దాటించారు.

నళినీ చిదంబరం మాటేమిటి ? 
గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం సతీమణి నళినీ చిదంబరం ఐటీ శాఖ తరపున వకల్తా ఫైల్ చేశారు. సభలో ఈ విషయాన్ని అన్నాడీఎంకే ప్రస్తావిస్తే నాకు తెలియదని చిదంబరం దాటవేశారు. శారదా స్కాంలో నిందితుల తరపున చిదంబరం భార్య వాదించారు. నళినీ చిదంబరం కోటి రూపాయలు తీసుకున్నారు. చాటుమాటు కార్యక్రమాలు కాంగ్రెస్ అలవాటు. 

సోనియాను రాహుల్ కొన్ని ప్రశ్నలు అడగాలి..
రాహుల్ కొన్ని నెలల వరకు సెలవులపై వెళుతుంటారు. ఈసారి వెళితే ఏకాంతంగా ఉండి తన కుటుంబ చరిత్ర రాహుల్ చదవాలి. అనంతరం అండర్సన్ ను రాజీవ్ ఎందుకు విడుదల చేశారు ? ఖత్రోచి వ్యవహారంలో ఎంత డబ్బు తిన్నాం ? క్విడ్ ప్రోకో ఎందుకు చేయాల్సి వచ్చిందో సోనియా గాంధీని రాహుల్ అడగాలి. ఈ గందరగోళం మధ్యే తనకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు' అని సుష్మా పేర్కొన్నారు. 

లోక్ సభను కుదిపేసిన లలిత్ మోడీ అంశం...

ఢిల్లీ: లలిత్ మోడీ అంశం లోక్ సభను కుదిపేసింది. సుష్మా రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందే అని విపక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గందరగోళం మధ్యే సుష్మా ప్రసంగిస్తున్నారు.

 

183 పరుగులకు శ్రీలంక ఆలౌట్

గాలె టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. అశ్విన్.. 46 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశారు. అమిత్ మిశ్రా.. 2, ఇషాంత్, వరుణ్ ఆరోన్ లకు చెరో వికెట్లు పడ్డాయి. 

బీహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్

పాట్నా: బీహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. జేడీయూ...100, ఆర్జేడీ... 100, కాంగ్రెస్.. 40 స్థానాల్లో పోటీ చేయున్నాయి. 

15:00 - August 12, 2015

ఢిల్లీ : రంజాన్‌, బోనాలు పండుగలు ప్రశాంతంగా జరిగాయి. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్ల చేయటంతో...ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. కాని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సిటీ పోలీసులను టెన్షన్ పెడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

హైదరాబాద్‌ పైనే గురి..
పంద్రాగష్టుకు ఉగ్రవాదులు తెగపడే అవకాశముందని ఐబి హెచ్చరికలు జారీ అయ్యాయి. పంజాబ్‌ ఘటన, ఉదంపూర్ ఉదంతంతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువయ్యాయి. దీంతో ఆగష్టు 15న బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు ఐబీ ప్రకటించింది. టెర్రరిస్టులు టార్గెట్‌ చేసిన ప్రాంతాల్లో గుజరాత్ మొదటి స్థానంలో, ముంబై రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో హైదరాబాదే ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట ఎన్‌కౌంటర్ నుంచి యాకుబ్ మెమెన్ ఉరి వరకు జరిగిన ఘటనలతో హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు చెప్పుతున్నాయి.

టెర్రరిస్టులకు హైదరాబాదే షెల్టర్ జోన్‌!
గతంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే దొరికాయి. మక్బూల్ లాంటి కరుడు గట్టిన తీవ్రవాదులు చార్మినార్ వద్ద యాపిల్స్ అమ్ముకునే వాడు. ఢిల్లీ పోలీసులు వచ్చి అరెస్టు చేసినంత వరకు మన పోలీసులు గుర్తించలేదు. ఉగ్రవాదులకు హైదరాబాద్ షెల్టర్ జోన్‌గా మారిందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. సూర్యపేట ఎన్ కౌంటర్ తర్వాత ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్‌ ఉన్నట్లు ఆధారాలూ.. ఉన్నాయి.

ఎయిర్‌పోర్టు సందర్శకులకు అనుమతి నిరాకరణ..
పాకిస్థాన్ నుంచి 200 మంది తీవ్రవాదులు ఇండియాలో చోరబడ్డారని సోషల్‌ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆత్మాహుతి దాడులకు పాల్పడి...భారీగా విధ్వంసానికి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఐబీ హెచ్చరికలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు సందర్శకులకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 20 వరకు నిషేదాజ్ఞలు విధించారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ఎప్పుడూ లేనంతగా భద్రతను పటిష్టం చేశారు.

14:58 - August 12, 2015

హిందూ వివాహం చట్టం సెక్షన్ 13 ప్రకారం విడాకులు తీసుకుంటున్నారు. దీనికి ఆధారాలు చూపెట్టాలి. అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. అందులో శారీరక..మానసికం కూర్రత్వం. ఒకటి. భార్య పట్ల భర్త..భర్త పట్ల భార్య ఎలాంటి క్రూరత్వం చేస్తున్నారో పరిగణిస్తారు. ఇందులో అనేక రకాలైన హింసలుంటాయి. శారీరక..మానసిక..క్రూరత్వంపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే పలు న్యాయపరమైన సందేహాలను పార్వతి నివృత్తి చేశారు.

లండన్ లో లలిత్ ఇంటి నిర్మాణానికి వసుంధర మద్దతు: ఖర్గే

లోక్ సభ: రాజస్తాన్ సీఎం వసుంధరరాజే వివాదంపై సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రస్తావించారు. లండన్ లో లలిత్ ఇంటి నిర్మాణానికి వసుంధర మద్దతు ఇచ్చారని ఆరోపించారు.

సభలో ఆందోళనలకు ప్రధాని మోడీయే కారణం: ఖర్గే

లోక్ సభ: సభలో ఆందోళనలకు ప్రధాని మోడీయే కారణమని విపక్ష నేత మల్లిఖార్జునఖర్గే ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానిదే అని ఖర్గే అన్నారు. చర్చ సమయంలో ప్రధాని సభలో లేకపోతే ఏం లాభమని అసహనం వ్యక్తం చేశారు.

సుష్మ స్వరాజ్ రాజీనామా చేయాలి: ఖర్గే

లోక్ సభ: లలిత్ మోడీ ఆర్థిక నేరస్తుడని.. ఆర్థిక నేరస్థుడికి సుష్మా సాయం చేశారా లేదా చెప్పాలన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ.. సుష్మ స్వరాజ్ రాజీనామా చేయాలని మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. లలిత్ మోడీపై మొత్తం 16 కేసులున్నాయని తెలిపారు. లలిత్ బెయిల్ పై ఎందుకు ఆప్పీల్ చేయలేదని ప్రశ్నించారు. లలిత్ వివాదంలో కేంద్రం మౌనం వెనక మతలబేంటని నిలదీశారు. లలిత్ మోడీ వివాదంపై ప్రధాని కళ్లు, ముక్కు, చెవులు మూసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానిని సభకు పిలవాలన్నారు. 

ఈ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ లేదు: కడియం

హైదరాబాద్: ఈ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ లేదని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 182 మోడల్ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 192 బాలికల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన 102 హాస్టల్ భవనాలను గ్రామజ్యోతి వారోత్సవాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 

14:28 - August 12, 2015

హైదరాబాద్ : భారతదేశంలోనే నంబర్‌ వన్‌ ఆన్‌లైన్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌గా టుటోరియల్స్‌ పాయింట్‌ డాట్‌ కమ్‌ నిలిచింది. ఈ వెబ్‌సైట్‌లో లభించే కొన్ని టుటోరియల్స్‌ను ఏ రిజిస్ట్రేషన్‌ లేకుండానే ఉచితంగా పొందవచ్చు. టుటోరియల్స్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించామని, అదే తమ వెబ్‌సైట్‌ ప్రత్యేకత అని నిర్వాహకులు చెప్పారు. కోటికిపైగా యూజర్స్ తో ఒక్కరోజులోనే 6లక్షల క్లిక్స్ ను ఈ ఆన్‌లైన్‌ ఫ్రీ సైట్‌ సొంతమని చెప్పారు. ఈ ఉచిత టుటోరియల్ తో పాటే వెబ్‌ప్రాక్టీస్‌ చేయడానికి 80 ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజస్‌తో కూడిన కోడింగ్‌ గ్రౌండ్‌ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆన్‌లైన్‌ లైబ్రరీని స్థాపించాలనేదే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

14:24 - August 12, 2015

విజయవాడ : కళ్ళు తెరిచి లోకం కూడా చూడలేదు. అమ్మపాలు కూడా తాగలేదు. ఆడపిల్ల పుట్టిందనో లేక ఇతరత్రా కారణాలో తెలియదు గానీ... విజయవాడ గొల్లపూడి మసీదు సెంటర్‌లోని కాల్వలో చిన్నారి శవమై తేలింది. శానిటరీ సిబ్బంది కాల్వను శుభ్రం చేస్తుండగా... చిన్నారి మృతందేహం కనిపించింది. పుట్టి ఒక్కరోజు కూడా గడవకుండానే... కన్నపేగు తడి ఆరకుండా కాల్వలో ఉన్న చిన్నారిని చూసి స్థానికులు కలత చెందారు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు విచారణ జరుపుతున్నారు.

14:22 - August 12, 2015

హైదరాబాద్ : రెండు రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని సింగరేణి కాలరీస్‌..కాకతీయ ఓపెన్‌కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నాలుగువేల ఐదువందల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఒక్కొరోజుకు కోటి రూపాయల నష్టం ఏర్పడుతోంది. అలాగే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
నిజామాబాద్ లో..
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

14:20 - August 12, 2015

హైదరాబాద్ : ఎర్రబెల్లి వర్సెస్‌ కడియం వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎర్రబెల్లి వ్యాఖ్యలకు కడియం మరోసారి తనదైన శైలిలో సవాల్‌ విసిరారు. తన అవినీతి అక్రమాలలో ఏఒక్కటి నిజమని టీడీపీ నేత ఎర్రబెల్లిదయాకర్‌రావు నిరూపించినా రాజకీయల నుంచి తప్పుకుంటానని కడియం అన్నారు.

14:18 - August 12, 2015

ఢిల్లీ : కుంభకోణాలపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నా ఛైర్మన్‌ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ఎంపీ సీతారాం ఏచూరి. విలువైన సభా సమయం వృధా అవుతున్నా చర్చకు అనుమతించకపోవటం సరికాదన్నారు. లోక్‌సభలో చర్చకు సిద్ధమేనని ప్రకటించినప్పుడు అదే సంప్రదాయాన్ని రాజ్యసభలో కూడా అమలు చేస్తే చర్చ జరిగేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.

14:16 - August 12, 2015

ఢిల్లీ : తనను టార్గెట్ చేస్తూ ఆందోళన చేస్తున్న విపక్షాలపై సుష్మా స్వరాజ్‌ ఫైరయ్యారు. ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని చెప్పినా విపక్షాలు పట్టించుకోకుండా అనవసర ఆందోళన చేస్తున్నాయని, ముందుగా విపక్ష సభ్యులు భాషను సవరించుకోవాలని ఆమె మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత ఖర్గే, రాజస్ధాన్‌ సీఎం వసుంధర రాజే పేరు ప్రస్తావించటంతో సభలో గందరగోళం చెలరేగింది. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్ సూచించటంతో విపక్ష సభ్యులు ఆందోళన నిర్వహించారు. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 2.30 వరకు సభను వాయిదా వేశారు.

14:14 - August 12, 2015

ఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ప్రధాని మోడీ టార్గెట్‌గా లోక్‌సభలో ఖర్గే ప్రశ్నాస్త్రాలు సంధించారు. మానవత్వంతో సహాయం చేశామని చెప్తున్న విదేశాంగ మంత్రి లలిత్‌ మోడీని ఇండియా రమ్మని ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. కోట్లు కొల్లగొట్టిన లలిత్‌ మోదీకి చట్టాన్ని ఉల్లంఘించి సాయం చేయటం నేరమేనన్న ఖర్గే బాధ్యత వహించి సుష్మా స్వరాజ్‌ రాజీనామా చేయాలని మండిపడ్డారు. లలిత్ మోడీకి వ్యతిరేకంగా గత ఆర్థిక మంత్రి ఇంగ్లండ్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారని, అలాంటి నేరస్తుడికి సుష్మా ఎలా సహాయం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో ఉన్న సుష్మా మోడీకి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదని, అంశంపై లోతుగా విశ్లేషించాల్సినవసరం ఉందని ఖర్గే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

13:46 - August 12, 2015

బెంగళూరు : రోడ్డు..ఒక్కసారిగా అందరిలోనూ కలకలం. రోడ్డుపై ఓ భారీ 'అనకొండ' దర్శనమిచ్చింది. అనకొండ నోటిలో ఓ మనిషి చేయి కూడా ఉంది. దీనిని చూసిన అక్కడి జనం కొంత భయపడ్డారు. తీరా విషయం తెలిసిన తరువాత ఔరా అని అనుకున్నారు. ఏంటా విషయం అనుకుంటున్నారా ? అయితే చదవండి మీకే తెలుస్తుంది.
ఓ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. బాగు చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు మాత్రం స్పందించలేదు. ఈ సమస్యపై ఓ స్వచ్చంద సంస్థ దృష్టి పడింది. అధికారుల కళ్లు తెరిపించాలని అనుకుంది. అనుకున్నట్లుగానే నమ్మా బెంగళూరు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నడి రోడ్డుపై డ్రైనేజీ లోంచి అనకొండ మనిషిని మింగేస్తున్నట్టుగా ఓ ఫొటో పెట్టారు. 3డి పెయింటింగ్ వేసిన బొమ్మ.. కొత్త టెక్నాలజీలో వేయడం వల్ల నిజంగానే ఓ అనకొండ డ్రైనేజీలోంచి వచ్చి మనిషిని మింగేస్తున్నట్టు అనిపిస్తుంది. వారు అనుకున్నట్టుగానే అధికారుల దృష్టి అటు వైపు పడినా గాని పని మాత్రం జరగలేదు. అయితే దీన్ని ఏర్పాటు చేయించిన మాత్రం పని జరుగుతుందన్న ఆశతో ఉంది. గతంలో కూడా రోడ్లపై గుంతలున్నాయంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాగే ఓ పెయింటర్ రోడ్డు మీద ఉన్న గుంత నుంచి మొసలి వస్తున్నట్టు బొమ్మను పెట్టి అందరి దృష్టి మరలేటట్టు చేసాడు. దీంతో అధికారులు ఆ రోడ్డును బాగు చేశారు. మరి వీరి సమస్యను అధికారులు పట్టించుకుంటారని ఆశిద్దాం.

ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష...

హైదరాబాద్: ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం, ఎస్సారెస్సీ నిజాంసాగర్ ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి అంశంపై చర్చ జరుగుతోంది.

13:38 - August 12, 2015

గాలె : 1993లో తొలి సిరీస్ నెగ్గిన నాటి శ్రీలంక గడ్డ నుంచి సిరీస్ తో భారత్‌లో అడుగు పెట్టాలని కలకంటునే ఉన్నారు. ప్రతిసారీ ఎన్నో ఆశలతో లంకకు వెళ్లడం ఉత్త చేతులతో రావడం సరిపోయింది. ఈసారి టెస్ట్‌ కెప్టెన్సీ విరాట్‌ కోహ్లీ కుర్ర జట్టుతో లంకలో అడుగుపెట్టాడు. సిరీస్‌తో తిరిగొస్తానంటున్నాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ గాలెలో జరగనుంది. రెండో టెస్టు అనంతరం సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ప్రాధాన్యత సంతరించుకుంది. లంకలో ఆడిన ఆరు సిరీస్‌ల్లో భారత్ ఒక్కటే గెలిచింది.
మరోవైపు శ్రీలంక ఆడిన తన చివరి మూడు మ్యాచుల్లో రెండు టెస్టుల్లో ఓడిపోయింది. అంతేకాకుండా ఇది కుమార సంగక్కరకు చివరి సిరీస్‌ కావడంతో ఎలాగైనా నెగ్గి ఆయనకు విజయంతో వీడ్కోలు పలకాలని లంక ఆటగాళ్లు భావిస్తున్నారు. ఐదుగురు బైలర్లతో ఆడితే పుజారాకు స్థానం కష్టమే అని రవిశాస్త్రి కుండబద్దలు కొట్టడంతో ఓపెనర్లుగా లోకేష్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, వన్‌డౌన్‌లో రోహిత్‌ శర్మ, నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లి స్థానాలు భర్తీ అయ్యాయి.
భారత జట్టు : శిఖర్‌ ధావన్‌, లోకేష్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఆజింక్య రహానే, వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌, అమిత్ మిశ్రా, వరుణ్‌ ఆరోన్‌, ఇషాంత్‌ శర్మ.
శ్రీలంక జట్టు : కరుణరత్నే, కుశాల్‌ సిల్వ, సంగక్కర, తిరుమనే, ఏంజెలో మాథ్యూస్‌, దినేష్‌ చండిమాల్‌, జెహాన్‌ ముబారక్‌, రంగన హెరాత్‌, దమ్మిక ప్రసాద్‌, నువాన్‌ ప్రదీప్‌, తరిందు కుశాల్‌.

2 నెలల్లో 8 లక్షల కొత్త రేషన్‌కార్డులు : పరిటాల

అనంతపురం : రెండు నెలల్లో ఎనిమిది లక్షల కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బుధవారం అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలకతీతంగా దీపం కనెన్షన్లు మంజూరు చేస్తామని ఆమె అన్నారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

నైతిక బాధ్యత వహిస్తూ సుష్మా రాజీనామా చేయాలి : ఖర్గే...

ఢిల్లీ: లిత్ మోదీ ఆర్థిక నేరస్థుడు లలిత్ మోదీ రూ.460 కోట్లు కొల్లగొట్టి పరారయ్యాడని. అలాంటి ఆర్థిక నేరస్థుడికి సహకరించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ సుష్మా రాజీనామా చేయాలని మల్లిఖర్జున ఖర్గే లోక్ సభలో లలిత్ గేట్ పై స్పీకర్ చర్చకు అనుమతించారు. ఈచర్చలో ఖర్గే మాట్లాడుతూ....లలిత్ మోదీ పై మొత్తం 16 కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరస్థుడికి సుష్మ సాయం చేశారా? లేదా?. లలిత్ మోదీపై బ్లూకార్నర్ నోటీజులు జారీ అయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడిన లలిత్ మోదీపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు. మానవత్వంతో సాయం చేయాలంటే చట్టం ఉల్లంఘించాలా? ఎవరికీ తెలియకుండా సాయం చేయాల్సిన అవసరం ఏమిటి?

లంక టాప్ ఆర్డర్ టపటపా..

భారత్ - శ్రీలంకల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు విజృంభించారు. ఆదిలోనే ఐదు వికెట్లు తీసి లంక నడ్డి విరిచారు. టీమిండియా బౌలర్ల ప్రతాపానికి లంక 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.  ఈ నేపథ్యంలో మాథ్యూస్ 45, దినేష్ చందిమాల్ 25 ఆదుకున్నారు. 

ప్రైమ్ టెక్ సొల్యూషన్స్ ఎండీ అరెస్ట్

హైదరాబాద్: హిమాయత్ నగర్ లోని  ప్రైమ్ టెక్ సొల్యూషన్స్ పై నారాయణ గూడ పోలీసులు దాడులు చేసి ఎండీ సతీష్ ను అరెస్టు చేశారు. మెడికల్ సీట్లు, బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ప్రైమ్ టెక్ సొల్యూషన్స్ సంస్థ ఎండీ సతీష్ ను అరెస్టు చేశారు.

ప్రి క్వార్టర్స్ కు చేరిన గుత్తా జ్వా, అశ్వినిల జోడి

జకార్తా : మన భారత జట్టు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని జోడి వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఉమెన్స్‌ ప్రి క్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో చెన్‌-జంగ్‌ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌కు ప్రణయ్‌ చేరగా, మెన్స్‌ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కశ్యప్‌లు ఓటమి పాలయ్యారు.

విప్ చింతమనేనికి తప్పిన ప్రమాదం...

ప.గో : పెదవేగి మండలం దిబ్బగూడెంలో పోలవ రం కుడికాల్వ పనులు పరిశీలిస్తుండగా కొబ్బరిచెట్టు విరిగి పడింది. పక్కకు జరగడంతో ప్రభాకర్‌కు ప్రమాదం తప్పింది. ప్రభాకర్‌ గన్‌మెన్‌, పీఏలకు గాయాలయ్యాయి. 

13:10 - August 12, 2015

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో లలిత్ గేట్ వివాదం చర్చకు స్పీకర్ సుమిత్రామహాజన్ అనుమతించారు. ఈ అంశంపై చర్చకు రెండున్నర గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరపున మల్ఖిఖార్జున ఖర్గే చర్చను ప్రారంభించారు. విపక్షాలు ఎంత ఆందోళనలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విపక్షాల ఆందోళనకు ప్రధాని సమాధానం చెప్పాలిందే. టివి, రేడియోల్లో మాట్లాడడం కాదని... విపక్షాలకు ప్రధాని సమధానం చెప్పాలన్నారు. మేం లోక్ సభలో ఆందోళన చేస్తోంది స్వప్రయోజనాల కోసం కాదు... ప్రజాసంక్షేమం కేసమే.. సభా సమయం వృద్ధా అవుతోందన్న గగ్గోలు పెడుతున్న వారు సమాధానం చెప్పాలి. లలిత్ మోదీకి మానవత్వంతో సహాయం చేశానని తప్పుకుంటున్నారని ఆరోపించారు.

విజయవాడలో పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందిలేదు: విద్యాసాగర్రావు

హైదరాబాద్ : విజయవాడలో పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందిలేదని.. బదిలీలపై 16 వేల మంది ఉద్యోగులు రావాల్సి ఉంటుందని ఎపీ ఎన్టీవో నేత విద్యాసాగర్ తెలిపారు. బదిలీలపై మంత్రులు, కలెక్టర్లతో మాట్లాడామని... మా పిల్లలకు స్థానికతపై మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ పై సీపీఎం అభ్యంతరం

విశాఖ: ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ పై సీపీఎం అభ్యంతరం చెపుతోంది. ప్రభుత్వానికి, యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరించే వ్యక్తులతో ప్రజాభిప్రాయ సేకరణ సరికాదని సీపీఎం నేతలు వాదిస్తున్నారు.

విద్యాశాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్ష...

విజయవాడ : రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. టీచర్ల రేషనలైజేషన్‌, బయోమెట్రిక్‌ విధానం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు.

12:43 - August 12, 2015

నిండు నూరేళ్లు జీవించమని దీవిస్తుంటారు పెద్దలు. అలాగే జీవించాలని ఆశపడుతుంటాడు ప్రతీ మనిషి. అయితే.. అందరికీ సాధ్యం కాదు ఆ మైలురాయిని చేరడం..! వివిధ కారణాలతో నూటికి తొంభై మందికిపైగా తొంభై దరిదాపుల్లోనే జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తుంటారు. కానీ.. కొందరుంటారు. బతుకు బండిని వందేళ్లకు పైబడి అవలీలగా లాగేస్తారు..! ఆ కొందరిని మాత్రమే వరించే ఈ అదృష్టం వెనకున్న కారణాలు ఎవరికీ తెలీదు. తాజాగా.. దాన్ని ఛేదించిందో పరిశోధన.

వంద... ఇది అన్నింటా ప్రత్యేకమే..!

వంద... ఇది అన్నింటా ప్రత్యేకమే..! కొట్టినవారిది హవా..వంద రోజుల ఆడిన సినిమాదే హంగామా...మరి, మనిషి వయస్సు వందేళ్లు దాటితే..? అదో అద్భుతం. కానీ.. ఈ అద్భుతం అందరి జీవితాల్లోనూ చోటు చేసుకోదు. క్రికెట్లో మాదిరిగా.. కొందరు హాఫ్ సెంచరీ లోపే మైదానం వీడిపోతుంటే.. ఆ తర్వాత సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరుతుంటారు నూటికి 95 మంది. ఇక ఏ కొద్ది మంది మాత్రమో.. అనారోగ్యం అడ్డంకుల్ని దాటుకుంటూ, వృద్ధాప్యం అవరోధాల్ని ఛేదిస్తూ దిగ్విజయంగా వందేళ్ల మైలురాయిని చేరుకుంటారు.

వందేళ్లు దాటిని తర్వాత కూడా వారి ఇన్నింగ్స్‌....

ఇక మరికొందరు ఉంటారు. వందేళ్లు దాటిని తర్వాత కూడా వారి ఇన్నింగ్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. నూటా ఐదు, నూట పది.. అంటూ జీవితం నడుస్తూనే ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వయసులోనూ వారి పని వారే చేసుకునే వారు కూడా ఉంటారు. ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంటుంది ఈ అంశం. కానీ.. ఈ అద్భుతం వెనకున్న కారణాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. అయితే.. తాజాగా దీనికి గల కారణాలను కనిపెట్టిందో అధ్యయనం.

ఈ అంశంపై శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు...

టోక్యోలోని కెయో యూనివర్సిటీ స్కూల్‌ ఆప్‌ మెడిసిన్‌, న్యూక్యాజిల్‌ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఏజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించారు. చాలాకాలం పాటు పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు.. శతాధిక జీవనానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించారు.

మానవ కణాల్లో ఉంటే టెలోమేర్లు పొడవుగా ఉండడం....

మానవ కణాల్లో ఉంటే టెలోమేర్లు పొడవుగా ఉండడం, అలాగే.. ఇన్‌ ఫ్లమేషన్ స్థాయి గణనీయంగా తగ్గి ఉండడం వల్లే వందేళ్ల జీవనం సాధ్యమవుతోందని తేల్చారు. టెలోమేర్లు పొడవుగా ఉన్న వారిలో వృద్ధాప్య ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని, ఇతరులతో పోలిస్తే.. వీరు ఎక్కువ కాలం పాటు వ్యాధులకు దూరంగా ఉంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. వందేళ్లు, అంతకు పైబడిన వారిపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇతరులతో పోలిస్తే.. వీరిలో టెలోమేర్లు పొడవు ఎక్కువగా ఉండడం, ఇన్‌ ఫ్లమేషన్‌ స్థాయి తక్కువగా ఉండడాన్ని గమనించారు. వయసు పెరిగే కొద్ది అందరిలోనూ ఇన్‌ ఫ్లమేషన్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇది తక్కువగా ఉన్నవారు దీర్ఘకాలం జీవిస్తారని తేల్చారు శాస్త్రవేత్తలు.

బారాషాహిద్ దర్గాలో మంత్రి పల్లె ప్రత్యేక పూజలు

నెల్లూరు: నగరంలోని బారాషాహీద్‌ దర్గాలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నెల్లూరు మేయరు అబ్దుల్‌ అజీజ్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం షాదీమంజిల్‌ను మంత్రి పరిశీలించారు. షాదీ మంజిల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి పల్లె హామీ ఇచ్చారు.

12:29 - August 12, 2015

న్యూఢిల్లీ : లలిత్ మోడీ అంశం లోక్ సభలో దుమారం రేగింది. విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ మొదలైన వెంటనే లలిత్ గేట్ లో సుష్మా వ్యవహారంపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత చర్చకు అనుమతినిస్తానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యులకు తెలియజేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబడటంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. లలిత్‌గేట్‌పై ఎలాంటి చర్చకైనా సిద్ధమని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు.

ప్రధాని లేకుండా చర్చకు ఒప్పుకోం : ఖర్గే...

అయితే ప్రధాని లేకుండా చర్చకు ఒప్పుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై ప్రధాని తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో రగడ నెలకొంది. అంతే కాకుండా స్పీకర్ పోడియం చుట్టిముట్టి ఆందోళన చేయడంతో సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

మంత్రాలయంలో ఇన్ఫోసిస్ నారాయణ..

మంత్రాలయం: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తునివలే ఆయన జనరల్ క్యూలైన్‌లో వెళ్లి రాఘవేంద్రస్వామి మూల విగ్రహానికి పూజలు చేశారు. మంత్రాలయం వచ్చిన ఆయనకు బుధవారం ఉదయం శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ వైష్ణవమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ఆందోళన

హైదరాబాద్‌: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బుధవారం పెన్షనర్లు ఆందోళన నిర్వహించారు. తమకు బకాయిపడ్డ పెన్షన్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

రాజమండ్రిలో దారుణం

తూ.గో : రాజమండ్రిలో దారుణం జరిగింది. మోకానిక్ శంకర్ పై రిటైర్డ్ హోం గార్డు పెట్రోల్ పోసి నిప్పటించాడు. మెకానిక్ పరిస్థితి విషహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్న 12.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. లలిత్ మోడీ అంశంపై చర్చకు పట్టిన విపక్షాలు... ప్రధాని లేకుండా చర్చిచంమని స్పష్టం చేశాయి. దీంతో స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాలు ఆందోళన చేపట్టాయింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

2గంటల వరకు రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో లలిత్ మోదా అంశం పై గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. 

అక్రమ ఆయుధాలు పట్టుకున్న పోలీసులు...

అనంతపురం: జిల్లాలో అక్రమ ఆయుధాలను పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి నుంచి తుపాకులు తీసుకువెళుతున్న నలుగురిని అరెస్టు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు అనుచరులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మృతి చెందిన నకిలీ నక్సలైట్‌ తమ్మగోపాల్‌ అల్లుడు తుపాకులు అమ్మినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి సెక్యూరిటీ గార్డు గుండె పోటుతో మృతి

ఖమ్మం: కొత్తగూడెంలో ఆగస్టు 15 పరేడ్ రిహార్సల్స్ చేస్తూ సింగరేణి సెక్యూరిటీ గార్డు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు.

ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయడం కుదరదు : స్పీకర్

ఢిల్లీ: వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనపై స్పందించిన స్పీకర్ సభా సంప్రదాయాలు, నిబంధనల ప్రకారం చర్చ చేపడతామని వివరించారు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించడం సంప్రదాయమని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సజావుగా సాగనీయాలనీ, ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయడం కుదరదని వెల్లడించారు.

11:55 - August 12, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలాయి. మరోపక్క ర్యాంకులు పొందిన విద్యార్ధులకు సీట్లు రాలేదు. విద్యార్ధులు అనేక కాలేజీలను ఆప్షన్‌గా పెట్టుకున్నప్పటికీ.. సీట్లు ఎందుకు కేటాయించలేదు. అసలు కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఏం జరిగింది ? విద్యార్ధులకు ఇంత అన్యాయం జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? టాప్‌ కాలేజీల్లో విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించకుండా... స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలనుకోవడం వెనుక ఉన్న మర్మమేంటి ?
టాప్‌ ర్యాంకర్లకు కూడా సీట్లు రాని వైనం...
తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ మొత్తం వివాదాస్పదంగా మారింది. కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయినా... టాప్‌ ర్యాంకర్లకు సీట్లు రాకపోవడం విచిత్రంగా మారింది. దాదాపు నాలుగు వేల మంది విద్యార్ధులకు అసలు ఏ కాలేజీల్లోనూ సీటు రాని పరిస్థితి నెలకొంది.
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లు ...
ఒకపక్క ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. విద్యార్ధులు టాప్‌ కాలేజీలను ఆప్షన్‌గా పెట్టుకున్నప్పటికీ... వారికి సీటు దక్కలేదు. టాప్‌ ర్యాంకులు వచ్చిన విద్యార్ధులకు సైతం సీట్లు రాకపోవడంతో... ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కౌన్సెలింగ్‌ అధికారులు కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై... సీట్లు భర్తీ కాకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆప్షన్లు పెట్టుకున్నా సీట్లు ఎందుకు కేటాయించలేదు ?...
అసలు సమస్య ఏంటి ? విద్యార్ధులు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ... సీట్లు ఎందుకు కేటాయించలేదు ? మరోపక్క కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసి.. తరగతులు కూడా మొదలవుతున్నాయి. మరి సీట్లు రాని విద్యార్ధుల పరిస్థితి ఏంటి ? వీరికి మరో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారా ? ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్ధులకు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా... మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు చేసుకోండని ప్రభుత్వం చెప్పడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌన్సెలింగ్‌ అధికారులే కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై సీట్లు భర్తీ కాకుండా చేసి... ఇప్పుడు అమ్ముకునేందుకు కుట్రపన్నారని విద్యార్ధి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
సమగ్ర విచారణ జరిపించాలి...
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహించిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

11:52 - August 12, 2015

నిజామాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

11:50 - August 12, 2015

హైదరాబాద్ : హైకోర్టు విభజనపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్‌ జేఏసీ, బీజేపీ లీగల్‌సెల్‌ ప్రతినిధి బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ర్ట విభజన జరిగి 14 నెలలు దాటుతున్నా.. ఏపీ, తెలంగాణకు వేర్వేరు హైకోర్టులు లేకపోవడం వల్ల కేసులకు సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రాజ్‌నాథ్‌కు వివరించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో టీ- అడ్వొకేట్‌ జేఏసీ, బీజేపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి బృందం నార్త్‌బ్లాక్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యింది. హైకోర్టు విభజన అవశ్యకతను మంత్రి దత్తాత్రేయ, కోదండరాం, న్యాయవాదులు వివరించారు.

11:49 - August 12, 2015

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు వ్యవహారంలో కేంద్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుల వివాదం ఉత్పన్నమైందని అభిప్రాయపడింది. సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ సమస్య తలెత్తేదికాదని పేర్కొంది. సమస్య శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి స్పష్టం చేసింది. సమాచారం అందించడానికి బాధ్యులైన అధికారిని తదుపరి విచారణకు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కేంద్రప్రభుత్వం తరఫు సహాయ సోలిసిటర్ జనరల్‌ బి.నారాయణరెడ్డిని ఆదేశించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజనకు చెందిన మార్గదర్శకాలు, తుదిజాబితాను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు ఉద్యోగులు పిటిషన్‌ దాఖలు చేశారు. సింగిల్ జడ్జీ వద్ద నుంచి ఈ వ్యాజ్యాలన్నీ ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.

11:43 - August 12, 2015

ఢిల్లీ : టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ కు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. మూడు రోజుల్లోగా సీబీఐ అధికారుల ముందు ఆయన లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ మారన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేబుళ్ల కేసులో మారన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

సానియా సోదరి ఆనం వివాహం...

హైదరాబాద్ : టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఓ వైపు క్రీడా శాఖ.. రాజీవ్‌ ఖేల్‌#రత్న పురస్కారానికి సానియా పేరును అవార్డుల కమిటీకి సిరఫాసు చేసింది. మరోవైపు సానియా చెల్లెలు ఆనం మీర్జా పెళ్లి ఖరారైంది. హైదరాబాద్#కు చెందిన వ్యాపారవేత్త అక్బర్‌ రషీద్‌తో... సెప్టెంబర్‌ 16న ఆనం మీర్జా నిఖా జరగనుంది. దీంతో సానియా ఇంటి పెళ్లి సందడి నెలకొంది. వధువు ఆనం మీర్జా షాపింగ్‌ కోసం ఇప్పటికే ముంబై వెళ్లింది. ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా, అబూ సందీప్‌...

పవర్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు: సీపీఎం నేత నర్శింగరావు

విశాఖ : తాము పవర్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, కాలుష్యం నియంత్రణ, రైతుల ఉపాధికి హామీ ఇవ్వకుండా పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. 

దయానిధి మారన్ కు సుప్రీంలో ఊరట

ఢిల్లీ :దయానిధి మారన్ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మారన్ అరెస్టు పై సెప్టెంబర్ 14 వరకు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. కోర్టులో లొంగిపోవాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

ప్రధాని లేకుండా చర్చకు కాంగ్రెస్ ఒప్పుకోదు :ఖర్గే

ఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని.. నిజానిజాలు ప్రజలకు కూడా తెలియాలని వెంకయ్యనాయుడు తెలిపారు. దీనికి స్పందించిన కాంగ్రెస్ నేత ప్రధాని లేకుండా చర్చకు కాంగ్రెస్ ఒప్పుకోదని,ప్రధాని సభలో లేకుండా సభ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు.

వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : రెండో రోజు వివిధ శాఖలపై సీఎం రివ్యూ నిర్వహించారు. పరిశ్రమలు, జలవనరులు, విద్య, రాజధాని, ప్రత్యేక హోదా పై మంత్రులు, ఎంపీలు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని.. నిజానిజాలు ప్రజలకు కూడా తెలియాలని వెంకయ్యనాయుడు తెలిపారు. 

లోక్ సభలో గందరగోళం

ఢిల్లీ : లోక్ సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభ స్పీకర్ సుమీత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టు ముట్టి ఆందోళ చేపట్టారు. దీంతో సభలో గందరగోళం మధ్య సభ కొనసాగుతోంది.

లలిత్ గేట్ వివాదంపై చర్చకు సిద్ధం: సుష్మా

ఢిల్లీ: లలిత్ గేట్ వివాదంపై చర్చకు సిద్ధం అని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఎంత మంది మాట్లాడాలన్నా, ఎంత సమయం కావాలన్నా సమయం ఇవ్వండని... తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పీకర్ కు సుష్మా తెలిపారు. 

ప్రారంభమైన ఉభయ సభలు...

హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభ స్పీకర్ సుమీత్రా మహాజన్ తిరస్కరించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్షాలు ఆందోళన చేపట్టారు.

ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు. 43 రోజుల నుండి గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

10:58 - August 12, 2015

హైదరాబాద్ : త్రిశూల వ్యూహం. బాహుబలి సినిమాలో ప్రత్యర్ధిని చిత్తు చేయడానికి హీరోలు వాడే వ్యూహం. ఇప్పుడు బిజెపి కాంగ్రెస్‌పై త్రిశూల వ్యూహాన్నే అమలు చేస్తోంది. ఎదురుదాడి చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. చాప కింద నీరులా చుట్టుముట్టి నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బిజెపి అవినీతిపై చర్చ అధికార ప్రతిపక్ష పార్టీల ఆధిపత్యపోరుగా చిత్రీకరించడంలో సక్సెస్‌ అయిన కమలనాథులు.. అందులో గెలుపుకు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది.

అవినీతి ఆరోపణల ఉచ్చులో బిజెపి.....

లలిత్‌మోదీ గేట్‌, వ్యాపం కుంభకోణం అవినీతి ఆరోపణల పద్యవ్యూహంలో చిక్కుకున్న బిజెపి.. ఆ వ్యూహాన్ని చీల్చుకుని బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌పై ఎదురుదాడికి ప్రయత్నించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయటంతో.. రోడ్డెక్కిన సోనియా, రాహుల్‌ తమ పోరును మరింత రక్తి కట్టించారు. దీంతో కమలనాథులు తమ బుర్రలకు పదును పెట్టారు. దేశ ఆర్ధికాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఇలా మొదటి అస్త్రం ప్రయోగించారు.

20, 30 మంది ఎంపీలు....

బంపర్‌ మెజారిటీ ఉన్న తమను కేవలం 20, 30 మంది ఎంపీలు అడ్డుకుంటున్నారని.. ఇది అప్రజాస్వామికం అంటూ మరో అస్త్రం వేశారు. కాంగ్రెస్‌ సభ్యుల ప్రవర్తన అనైతికమంటూ స్వయంగా స్పీకర్‌తోనే అనిపించారు. సభ జరగకపోతే ఎలా అంటూ ప్రతిపక్షాల్లోనే చీలిక తెచ్చేసి.. ములాయంతో ఇలా అనిపించేశారు.

వర్షాకాల సమావేశాల్లోనే 500 కోట్లు వేస్ట్‌?.....

ఇక సభ జరగకపోతే ఎన్ని కోట్లు వృథా అవుతున్నాయో అంటూ లెక్కలతో సహా మీడియాలో ప్రచారం మొదలెట్టారు. ఇప్పటికే 500 కోట్లు వేస్టయిపోయాయంటూ ఆవేదనను బయటపెట్టించారు.

సభకు హాజరుకావాలంటూ 15 వేల లేఖలు......

పారిశ్రామికవేత్తలతో సహా 15 వేల మంది పైనే ఎంపీలకు బహిరంగలేఖాస్త్రాన్ని సంధిస్తున్నారు. సభకు హాజరుకాకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని.. ప్రజల సమస్యలు పట్టించుకోవాలంటూ ఆ లేఖలో ఉండే మ్యాటర్‌తో.. కాంగ్రెస్‌పై నేరుగానే విమర్శలను గుప్పిస్తున్నారు.

బిజెపి నేతలు కాస్త సక్సెస్‌....

ఇలా అన్ని రకాలుగా కాంగ్రెస్‌ తప్పు చేస్తుందనిపించే వాతావరణాన్ని సృష్టించడంతో బిజెపి నేతలు కాస్త సక్సెస్‌ అయినట్లే కనిపిస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ మొండిగానే ముందుకెళుతోంది. లోలోపల డిఫెన్స్‌లో పడ్డ కాంగ్రెస్‌.. కమలవ్యూహానికి రేపో మాపో లొంగిపోయేటట్లు కనపడుతోంది.

10:52 - August 12, 2015

హైదరాబాద్ : తరలింపు ప్రక్రియమార్గం సులభం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. వికేంద్రీకృత పాలనా... విధానం ద్వారా... శాఖ కార్యాలయాల ఏర్పాటుకు సర్కార్ స్కెచ్ గీస్తోంది. విజయవాడకు కార్యాలయాల ఒత్తిడి తగ్గించడంతో పాటు... పాలనను రాష్ట్ర నలుమూలల ప్రజల వద్దనే పాలన జరపవచ్చనీ సర్కార్ యోచిస్తోంది.
తరలింపు ప్రక్రియను వేగవంతం.....
రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా అవసరాల అనుగుణంగా అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట కాకుండా రాష్ట్రమంతటా విస్తరింపజేయాలని భావిస్తోంది. జవహర్‌రెడ్డి కమిటీ నివేదిక అధారంగా ఈ వికేంద్రీకృత తరలింపు ప్రకియను షురూ చేయనున్నట్లు సచివాలయంలో వినిపిస్తోంది.
తరలింపు ప్రక్రియ కష్టంతో కూడుకున్నది....
దాదాపు 25 వేల మంది ఉద్యోగులు.. శాఖాధిపతుల తరలింపు ప్రక్రియ కష్టంతో కూడుకున్నది. దీంతో ఒక్కసారిగా శాఖ కార్యాలయాలన్నీ తరలించాలంటే రాజధాని ప్రాంతం విజయవాడలో మౌళిక సదుపాయల ఏర్పాటు కత్తిమీద సామే అని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో శాఖ కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం మేలైన నిర్ణయమని సర్కార్ యోచిస్తోంది.
ఐటీ విభాగాన్ని విశాఖలో.....
జవహర్‌రెడ్డి కమిటీ సూచన మేరకు ప్రస్తుతం ఐటీ విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పశుసంవర్ధక, మత్సశాఖ కార్యాలయాలను కాకినాడలోను, అగ్రికల్చర్ డిపార్టిమెంట్‌ను గుంటూరులో, దేవాదాయ శాఖ కార్యాలయాలను తిరుపతిలో, పరిశ్రమల కార్యాలయాలను కర్నూలు లేదా కడపకు తరలించాలనే యోచనలో సర్కార్ ఉంది. ఇలా మిగిలిన శాఖలన్నింటిని కూడా తమ అవసరాలకు అనుగుణంగా అన్ని జిల్లాలోకార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక తరలింపు ప్రక్రియకు అటంకంగా ఉన్న స్థానికతపై కూడా త్వరగా తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఏపీ సీఎస్ కేంద్రానికి లేఖ రాయనున్నారు.
తరలింపుపై సీమవాసులు అయిష్టంగా...
ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయల తరలింపుపై సీమవాసులు అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది. విజయవాడకు కార్యాలయాల తరలిస్తే.. రవాణా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచే పాలన సాగించాలనే అభిప్రాయాన్ని సీమవాసులు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అందరి అమోదంతో వికేంద్రీకృత తరలింపు ప్రక్రియ వైపు చూస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో 15 రోజులలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

10:38 - August 12, 2015

ఢిల్లీ : విశాఖ నుంచి ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ నుంచి రిమోట్‌ద్వారా పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక గజపతిరాజు, సుజనాచౌదరి, దత్తాత్రేయ, ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. విశాఖ రైల్వేజోన్‌పై సమాలోచనలు చేస్తునట్టు వెంకయ్యనాయుడు చెప్పారు.

కారు- స్కార్పియో : ఇద్దరి మృతి...

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూలు మండలం నెల్లికొండ వద్ద కారు- స్కార్పియో వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి

కరీంనగర్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పెద్దంపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త వినోద్‌కుమార్‌గా గుర్తింపు. ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నా కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

చంద్రబాబు ఇంటికి తెలంగాణ ఏసీబీ అధికారులు...

హైదరాబాద్ : ఓటుకునోటు కేసులో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించాలని చంద్రబాబు ఇంటికి, టిడిపికార్యాలయానికి వెళ్లి ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చారు.

 

10:27 - August 12, 2015

హైదరాబాద్ : ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి, ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు.ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అధికారిక డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ముఖ్యమైన నింధితులు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో ఇలా క్రింది స్థాయి వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడగలరు.

వారంలో టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ : పాపిరెడ్డి

హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు ఐసెట్-2015 కౌన్సెలింగ్ ప్రక్రియను వారంలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్లు పొందిన ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల జాబితాలు తమకు అందాల్సి ఉందని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంబీఏ, ఏంసీఏ కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వడానికి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

ఓనం ఉత్సవాలకు నాలుగు ప్రత్యేక రైళ్లు...

సికింద్రాబాద్‌ : ఓనం ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్‌-కొచువేలి, నాందేడ్‌-కొచువేలి మధ్య... మొత్తం 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-కొచువేలి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌ 07115) సికింద్రాబాద్‌ నుంచి 26న సాయంత్రం 4.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11గంటలకు కొచువేలి చేరుతుంది. కొచువేలి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07116) కొచువేలి నుంచి 28న రాత్రి 10గంటలకు బయల్దేరి, 29న ఉదయం 4.45గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

జగ్గయ్య పేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు...

కృష్ణా : జగ్గయ్యపేటలోని శాంతినగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. శాంతినగర్ లో నివాసం ఉంటున్నఆర్టీసీ మెకానిక్ శ్రీనివాసరావు ఇంటిలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లగా ఆయన కుటుంబసభ్యులు పొరిగింట్లో నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో దొంగలుపడి 80 గ్రాముల బంగారం, వెండి, ఓ షిప్ట్ కారును దోచుకెళ్లారు. ఉదయం లేచి చూడగా చోరీ జరిగిన విషయం గమనించి జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

హైదరాబాద్ : శ్రీలంకలోని గాలెఇంటర్నేషనల్ స్టేడియంలో కాసేపట్లో భారత్ - శ్రీలంక మధ్య తొలి టెస్టు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న మ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్టుల సిరీస్ కు విరాట్ కొహ్లి నేతృత్వం వహిస్తున్నాడు. రెండో టెస్టు అనంతరం శ్రీలంక ఆటగాడు సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ కు వీడోలు చెప్పనుడడంతో ఈ సిరీస్ కు అంత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

ఏపీ, తెలంగాణ ఎక్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్సరెన్స్‌ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఎంపీలు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షల మేర విశాఖ- న్యూఢిల్లీ రైలు ప్రారంభిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విభజన జరిగినందువల్ల రెండు రైళ్లు ఏర్పాటు చేశామన్నారు.

తీహార్ జైలులో ఖైదీ హత్య

ఢిల్లీ : తీహార్ జైలులో ఖైదీ హత్యకు గురయ్యాడు. జైల్లోని నలుగురు ఖైదీలపై హత్యా ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం

ఆదిలాబాద్ : జిల్లాలో పలు చోట్ల వర్ష కురిసింది. కొమురంభీం ప్రాజెక్టు నిండంతో అధికారులు ఒక గేటు ఎత్తివేసి నీటి కిందకు వదలుతున్నారు. మరో వైపు సింగరేణి ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పోలీసుల తీరుపై మండి పడ్డ మధు

శ్రీకాకుళం :జిల్లాలోని పొలాకి థర్మల్ ప్రాజెక్టు పర్యటనకు బయలు దేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకుని బూర్జా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి స్థానిక ఎస్సై మధును స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. కాగా అకారణంగా తనను ఎందుకు అరెస్టు చేశారంటూ పోలీసుల తీరుపై మధు మండి పడ్డారు. తమ నేతను అరెస్టు చేయడం పై సీపీఎం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నాస్తికోద్యమ నేత లవణం కు తీవ్ర అస్వస్థత

విజయవాడ : నాస్తికోద్యమ నేత లవణం(86) కు తీవ్ర అస్వస్థత గురయ్యి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో లవణం బాధపడుతున్నారు. లవణం పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

సీపీఎం నేత మధు అరెస్టు

శ్రీకాకుళం : జిల్లాలోని పొలాకి థర్మల్ ప్రాజెక్టు పర్యటనకు బయలు దేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకుని బూర్జా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి స్థానిక ఎస్సై మధును స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. కాగా అకారణంగా తమ నేతను అరెస్టు చేయడం పై సీపీఎం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రధానితో భేటీ కానున్న సీఎం మమతా బెనర్జీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. సమావేశం సందర్భంగా వరదలతో నష్టపోయిన రాష్ర్టానికి సహాయం అందించాల్సిందిగా కోరనున్నట్లు సమాచారం.

చిప్పకుర్తిలో కుంగిన ప్రభుత్వ పాఠశాల భవనం...

కరీంనగర్: రామడుగు మండలం చిప్పకుర్తిలో ఓ ప్రభుత్వ పాఠశాల భవనం కుంగింది. భవనం కుంగడంతో పైకప్పు పెచ్చులూడి పడింది. పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

నేడు హైదరాబాద్ - అజ్మీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రద్దు...

హైదరాబాద్ : ఎల్‌టీటీ ముంబై-వారణాసి కామయాని ఎక్స్‌ప్రెస్‌, రాజేంద్రనగర్‌ (పాట్నా)-ఎల్‌టీటీ ముంబై జనతా ఎక్స్‌ప్రెస్‌లు ఈనెల 4వ తేదీన పట్టాలు తప్పిన ఘటన కారణంగా... ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌-అజ్మీర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌ 12720), అజ్మీర్‌-హైదరాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12719)లతో పాటు మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి.

ఆకతాయిలకు స్థానికుల దేహశుద్ధి

నెల్లూరు : నగరంలోని పప్పులవీధిలో నలుగురు ఆకతాయిలకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నవాబుపేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 3 కిలోల బంగారాన్ని షూలో పెట్టుకుని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

08:40 - August 12, 2015

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రత్యేక నిధులు మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఇస్తారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ ఒకటే ఎట్లా అవుతాయి? గ్రామాల్లో వెలుగులు నింపే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గ్రామాల్లో జ్యోతి ఎలా వెలిగిస్తారు? అని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రంలో దిహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. కొత్తగా ఏపీకి ఇచ్చేది ఏమిటి ? గతంలో చట్టంలో చెప్పినదానికి, పార్లమెంటులో చెప్పినదానికే దిక్కులేదు.. ఇక ముందు ఇస్తామని చెప్తున్న దానికి అర్థం లేదు. రాజ్యాంగంలో ప్రత్యేక హోదా అనే అంశం లేదని చెప్తున్నారు. అవసరాన్ని బట్టి భారత రాజ్యాంగాన్నిసవరించుకుంటున్నాము కదా.. అలా ఎందుకు చేయడం లేదు? ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్తున్నారు కదా అదే అంశాన్ని చట్టంలో ఎందుకు పేర్కొనడం లేదు? ప్రత్యేక హోదా వుంటే 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. ఇదే అంశాన్ని ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చేవారు చట్టం చేయండి. చట్టరీత్యా రావాల్సిన హక్కును ఏపీ ప్రజలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా?
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిచంచాలి....
గ్రామాల్లో వెలుగులు నింపే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గ్రామాల్లో జ్యోతి ఎలా వెలిగిస్తారు? పంచాయతీ కార్మికుల పై సీఎం కేసీఆర్ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? పంచాయతీ కార్మికులకు దేశంలో ఎక్కడా ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజం? కార్మికులు చేస్తున్న సమ్మెలు దిక్కుమాలినవి అవుతాయా? అని ప్రశ్నించారు. ఈ అంశాలపై పూర్తి విశ్లేషణ చూడాలంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి...

08:40 - August 12, 2015

అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రత్యేక హోదా కు చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయనటం ఎంత వరకు సమంజసం? ప్రత్యేక హోదా పై బిజెపి తప్పుకునే విధంగా ప్రవర్తిస్తోందా? ప్రత్యేక హోదాకు మించి 10 శాతం నిధులు కేటాయిస్తామని జైట్లీ చెప్తున్నారు ఎందుకు? ప్రత్యేక హోదా పై వైసీపీ ఢిల్లీలో ధర్నా చేస్తూ బిజెపిని కాని ప్రధాని మోడీని కానీ డిమాండ్ చేయకపోవడం వెనుక రాజకీ కారణాలు ఏమిటి? చంద్రబాబుకు ప్రత్యేక హోదా, ప్రజల గురించి ఆలోచించే తీరిక లేదా? ప్రత్యేక హోదా పై సీఎం అఖిలపక్షాన్ని ఎందుకు సమావేశ పరచడం లేదు? నిర్బంధ నీతిని చంద్రబాబు ప్రదర్శిస్తున్నాడా? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో టిడిపి నేత సాంబశివరావు, సీపీఎం నేత వి.శ్రీనివాసరావు, వైసీపీ నేత మండలి హన్మంతరావు, కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్, బిజెవైఎం నేత విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. మరి మీరు కూడా ఆచర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్

జమ్మూ కాశ్మీర్ :ఫూంచ్ సెక్టార్ పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. గత రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ సైన్యం కాల్పులను భారత జవాన్లు తిప్పి కొట్టారు.

విశాఖలో విధ్వంసం సృష్టించిన మావోయిస్టులు...

విశాఖ: జీకే వీధి మండలం జెర్రెలలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ఏపీఎండీసీకి చెందిన ఉద్యోగుల ఇళ్లే లక్ష్యంగా దాడి చేసి మూడు ఇళ్లను ధ్వంసం చేశారు.

కోస్తాంధ్రకు వర్ష సూచన

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల వర్షాలుకురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో వైపు ఉత్తర తెలంగాణ లోనూ అక్కడక్కడ వర్షాలు కురవచ్చని తెలియజేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో 18 మందికి జైలు శిక్ష

హైదరాబాద్ :డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 18 మందికి జైలు శిక్ష, 2వేల వరకు జరిమానా విధిస్తూ ఎర్రమంజిల్‌ 4వ మెట్రోపాలిటన్‌ మెజిసే్ట్రట్‌ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నిందితుల్లో ఒకరికి 10 రోజులు, ఇద్దరికి ఏడు రోజులు, ఒకరికి ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజులు, ఇంకొకరికి మూడు రోజులు, ఏడుగురికి రెండు రోజులు, ఐదుగురికి ఒక రోజు జైలు శిక్ష విధించింది. ఈ నెల 4, 5, 7 తేదీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 130 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ద్విచక్రవాహనదారులు 100 మంది, మూడు చక్రాల వాహనదారులు నలుగురు, నాలుగు చక్రాల వాహనదారులు 24 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో సీపీఎం నేత మధు అరెస్ట్...

శ్రీకాకుళం: జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆముదాలవలసలో మదుని అరెస్టు చేసి బూర్జా పీఎస్ తరలించారు.

07:05 - August 12, 2015

మేడ్చల్ : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుల కన్నీళ్లు తుడవాలని ధర్మాసనాలు చెబుతుంటే హైదరాబాద్‌ శివార్లలో ఓ పోలీసు బాధితురాలిపైనే కన్నేశాడు..నీ భర్త మిస్సయితే నేనున్నానంటూ ఆమెను వేధించాడు..ఫోన్లు చేసి కలవాలంటూ హెచ్చరించాడు..సీన్‌ కట్‌చేస్తే...చివరకు అరెస్టై కటకటాలపాలయ్యాడు. కానీ..ఆ బాధిత మహిళ మాత్రం...పోకిరి వేశాలు వేసిన ఎస్సైని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
ఎస్సై వేధింపులతో కృంగిపోయిన ఇల్లాలు..
కలిస్తే చాలు అందంగా ఉన్నావంటాడు...కలవకపోతే ఫోన్ చేసి రమ్మంటాడు...కేసు చూడాలంటే నువ్వు రావాలంటాడు.. మొగుడిని వెతకమంటే ఎక్కడ కలుద్దామంటాడు..హైదరాబాద్‌ శివార్లలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వేధింపులు.. తన భర్త కోసం ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆ ఇల్లాలిని వేధించడం మొదలుపెట్టాడు.. ఇదేమంటే కేసు విషయంలో సీరియస్‌గా తీసుకోవాలా వద్దా అంటూ బెదిరింపులు...
భర్త కన్పించడం లేదంటూ పోలీసు స్టేషన్ కు....
మేడ్చల్‌కు చెందిన ఓ ఇల్లాలు తన భర్త కన్పించడం లేదంటూ పోలీసు స్టేషన్ వెళ్లింది..భర్త ఫోటో తీసుకెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ను కలిసింది.. విషయం చెప్పి కన్నీరుమున్నీరయింది... కానీ ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మాత్రం ఆ ఇల్లాలిపై కన్నేసి ఆమెను కేసు అడ్డంపెట్టుకుని వేధించడం మొదలుపెట్టాడు.. నిత్యం ఫోన్లు చేస్తూ అక్కడ ..లేదంటే ఇక్కడ..ఇలా ఎక్కడో ఒక చోట కలుద్దామంటూ వెంటాడుతున్నాడు.. తాను చెప్పిన చోటుకు వచ్చి కలువకపోతే నీ భర్త కేసులో నిన్నే ఇరికిస్తానంటూ హెచ్చరికలు చేశాడు..దీంతో బాధలు భరించలేక ఆ ఇల్లాలు సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేసింది..దీంతో ఏసీపీ అశోక్‌కుమార్‌కు రెఫర్ చేయడంతో వెంటనే ఎస్ఐ సతీష్‌ను కంట్రోల్‌రూంకు అటాచ్ చేశారు.
రిమాండ్‌కు తరలించిన పోలీసు ఉన్నతాధికారులు.....
అయితే తనను వేధించిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ఎందుకు కాపాడుతున్నారని..వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. దాంతో ఎస్సై సతీష్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
కలకలం రేపుతున్న పోలీసుల తీరు...
ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఇదే స్టేషన్‌లో దొరికిపోయాడు. అసలు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పోకిరీ వేశాలు వేస్తుండడంతో...తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన వారే వక్రబుద్దిని ప్రదర్శిస్తూ..ఇలా పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

06:59 - August 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీ-జాక్‌ పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్ కోదండరాం దారేటు అనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన టీజాక్ పాత్ర ఇప్పుడు నామ మాత్రం కావడంతో...జాక్ కొత్త వేదికను ఏర్పాటు చేస్తుందనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి.
గ్రామ స్థాయి వరకు కమిటీలు.....
తెలంగాణ ఉద్యమంలో గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించిన టీజాక్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత...... జాక్ కార్యక్రమాలను పెద్దగా నిర్వహించడం లేదు. దీనికి తోడు జాక్ నేతలు తలోదారి చూసుకోవడంతో... గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి అక్కడ అయోమయంగా మారింది.
రెండు వర్గాలుగా టీ-జాక్...
టీ-జాక్‌లో ముందు నుంచి కుమ్ములాటలు ఉన్నా.....ఇప్పుడు రెండు వర్గాలుగా ఏర్పడింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా జాక్‌లో ఇబ్బందికరంగా మారుతోంది. టీజాక్ సమావేశాల్లో కూడా ఏకాభిప్రాయానికి నేతలు రావడం లేదు.
సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ.....
ఈ పరిస్థితుల్లో టీ-జాక్ చైర్మన్ గా ఉన్న కోదండరాం రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ కూడా ఉండటంతో.....పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారుతారా....... ఉద్యమ నేతగా ప్రజా సంఘాల మద్దతు కూడగడుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితితో ఉద్యమంలో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో....ఆ పార్టీకి ధీటుగా మరో పార్టీని ఏర్పాటు చేయాలని కొంత మంది కోదండరాంపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఉన్న టీజాక్ కార్యవర్గాలను పునరుద్ధరించి..... ప్రజా సమస్యలపై గళం విప్పితే.. గులాబీ పార్టీని ధీటుగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.
కోదండరాం తీరు కూడా....
ఇటీవలి కాలంలో కోదండరాం వ్యవహరిస్తున్న తీరు కూడా..... చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఇప్పటి వరకు తాత్సారం జరిగినా....రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉంటే..... నిలదీసేందుకు వెనుకాడేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో..... పదవీ విరమణ తర్వాత....కోదండరాం క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా మారుతారా లేక ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలను నిర్మిస్తారా అనేది వేచి చూడాలి. 

06:53 - August 12, 2015

విజయవాడ : ప్రత్యేక హోదాపై బిజెపి పిల్లి మొగ్గలకు నిజంగా సాంకేతిక అంశాలే కారణమా.. రాజకీయం చేయట్లేదన్న కమలనాథుల మాటల్లో నిజమెంత.. ఇంతకూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? స్పెషల్ స్టోరీ...
ఏపీలో ప్రత్యేక పోరు...ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రత్యేక హోదా నినాదం హోరెత్తిపోతోంది.. ముని కోటి ఆత్మహత్య తర్వాత ఈ అంశం మళ్లీ ఊపందుకుంది.. ప్రతిపక్ష పార్టీలన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి.. టిడిపి, బిజెపి లపై సమరశంఖం పూరిస్తున్నాయి.. అటు బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది.. ఇందుకోసం కారణాలు వెతుకుతోంది.. ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని సాకులు చూపిస్తోంది.. ప్రత్యేక ప్యాకేజీకి డబ్బులు లేవంటున్నారు కమలనాథులు..
11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా .....
ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది.. తమకూ ఈ హోదా ఇవ్వాలంటూ బీహార్, ఒడిషాలాంటి రాష్ట్రాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. విభజనకు ముందు ఏపీకి జరిగిన నష్టాన్ని వేరే కోణంలో చూడాలని వెంకయ్య నాయుడు పార్లమెంటులో సూచించారు.. ఇప్పుడుమాత్రం బీహార్లో ఎన్నికలున్నాయని... అందుకే ప్రధాని మోడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కమలనాథులు సెలవిస్తున్నారు.. మరోవైపు నరేంద్ర మోడీ బీహార్ కు 50 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తామని చేసిన ప్రకటన మర్చిపోకూడదు.. ఏపీ కి ప్రత్యేక హోదా ప్రకటించాక బీహార్ కు హామీ ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకునారన్న సంకేతం వెళ్తుందనేవారు ఉన్నారు...
కర్నాటకలో 28 సీట్లకు 17స్థానాల్లో గెలుపు.......
మోడీ, అమిత్ షా ద్వయం.. మొన్నటి ఎన్నికల్లో విన్నింగ్ టీం గా అధికారంలోకి వచ్చారు.. అయితే దక్షిణాదిలో ఒక్క కర్నాటకలో మినహాయిస్తే.. మిగతా చోట్ల అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు.. కర్నాటకలో 28 సీట్లకు 17 సీట్లు గెలుచుకున్నారు కమలనాథులు.. అదే ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో 1, తమిళనాడులో ఒక్క స్థానంలోమాత్రమే విజయం సాధించారు.. దీంతో ఆపరేషన్ సౌత్ పై దృష్టి పెట్టారు బీజేపీ నేతలు..
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు......
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇక్కడ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.. తమిళనాడులో ఇప్పటికే అన్నాడిఎంకేతో బిజెపి మంతనాలు జరుపుతోంది.. జీఎస్ టీ బిల్లుకు అన్నాడీఎంకె మద్దతిస్తామని ప్రకటించింది.. ఆ రాష్ట్ర సీఎం జయలలిత.. ప్రధాని మోడీతో మోడీ పోయస్ గార్డెన్ లో సమావేశమయ్యారు కూడా... మొన్న ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో దాదాపు ఆరున్నర కోట్లు జనాభా ఉన్న తమిళనాడుకు 12 నగరాలను ఎంపిక చేసింది మోడీ సర్కార్... అదే 9 కోట్ల వరకు జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కింది 5 స్మార్ట్ సిటీలే... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఏం లాభమనే ప్రశ్న బిజెపిలో తలెత్తుతోంది... అలాగే గతంలో ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి సరికాదంటూ జయలలిత లేఖ రాసిన అంశాన్ని కొందరు లేవనెత్తుతున్నారు.
వచ్చే రెండేళ్లలో కర్ణాటకలో ఎన్నికలు.......
ఇక కర్నాటకకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ కూడా ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రశ్నించారు.. కర్నాటకలో వచ్చే రెండేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు బిజెపి వ్యూహం పన్నుతోంది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలనుబట్టి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బిజెపి పరిశీలించోచ్చన్న వాదన కూడా టీడీపీ నేతల్లో వినిపిస్తోంది... రాజకీయంగా మోడీ తలుచుకుంటే ప్రత్యేక హోదాపై నిర్ణయం సులవైనదే.. కానీ ఏపీ ప్రజల హక్కు కంటే సొంత రాజకీయ ప్రయోజనాలకే బిజెపి పెద్ద పీట వేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈలోగా ప్రత్యేక పోరాటం ఉద్యమంగా మారితే బీజేపీకి ఏమోగానీ టీడీపీకిమాత్రం తిప్పలు తప్పవు.

06:49 - August 12, 2015

హైదరాబాద్ : వామపక్షాల బంద్‌తో ఒత్తిడి పెరిగింది. ప్రజాసంఘాల ఆందోళనతో మొద్దునిద్ర వీడింది. మేల్కొన్నారో..లేక...యాక్టింగ్ చేశారో....గానీ కేంద్రంతో చర్చలు జరిపారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకుండా...మళ్లీ సస్పెన్స్‌లోకి నెట్టారు. ప్రత్యేక హోదానో...ప్యాకేజీనో తేల్చకుండానే ఏపీ బాటపట్టారు. ఒకవిధంగా చూస్తే...ప్రత్యేక హోదాకు మంగళం పాడినట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కలిరింగ్ ఇస్తోన్న ఏపీ సర్కార్....
ప్రత్యేక హోదాపై సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు ఏపీ ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో చర్చిస్తామని చెప్పిన నేతలు... చెప్పినట్లుగానే ఏపీ టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు... కట్టకట్టుకొని ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంతో సమాలోచనలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా, సెక్షన్ 8, 9, 10పై చర్చ....
కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజనాథ్‌సింగ్‌ను ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, సెక్షన్8, 9,10 అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, సీఎం రమేష్, బీజేపీ ఎంపీ హరిబాబు హాజరయ్యారు. ఐతే ఈ సమావేశంలో నేతలు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా ప్రత్యేక హోదా తప్ప...ఇంకేమైనా కోరండనే విధంగా వ్యవహరించింది. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చుతామన్న విషయం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాటల్లో స్పష్టమవుతోంది.
ఏపీకి భారీ ప్యాకేజీ వస్తుంది-సుజనా.....
అటు ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు కూడా...ఇచ్చిందే వరప్రసాదమనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రకటనతో చాలా ఖుషీగా ఉన్నట్లు వారే స్పష్టం చేశారు. ఏపీకి భారీ ప్యాకేజీ వస్తుందని సుజనా చౌదరి అన్నారు.
ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదు - జేసీ
ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదని...కాని కేంద్రం మాత్రం అంతకన్నా ఎక్కువే రాష్ట్రానికి మేలు చేస్తుందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదా పదం కాకుండా....కేంద్రం అంతకు మించి ఎక్కువ ప్యాకేజీని ఇస్తుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఐతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుత్నాయి. ఇరువురూ కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శిస్తున్నాయి.

06:46 - August 12, 2015

తెలంగాణలో గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. వీరు సమ్మెకు దిగి 40 రోజులు దాటినా, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపడం లేదు. దీంతో ఇవాళ హైదరాబాద్ తరలివస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఈ అంశాలపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీపతిరావు పాల్గొన్నారు. ఆ చర్చనుమీరుచూడాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:42 - August 12, 2015

గ్రామ స్వరాజ్యం మహాత్మాగాంధీ స్వప్నం. గ్రామ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఏ మాత్రం సందేహం లేదు. గ్రామాలు బాగుంటే నే దేశం బాగుంటుంది. అయితే గ్రామాలన్నా, గ్రామస్వరాజ్యమన్న మన ప్రభుత్వాలకు చిన్నచూపు. స్థానిక సంస్థలంటే నిర్లక్ష్యం. గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసుకోవడంలో వున్న శ్రద్ధ వాటి బాగోగుల మీద వుండదు. ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క రోజైనా గ్రామ పంచాయితీల యోగ క్షేమాల గురించి ఆలోచించి వుంటే ఇవాళ గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒక్క రోజా, రెండు రోజులా 40 రోజులుగా తెలంగాణలోని గ్రామపంచాయితీ సిబ్బంది మొత్తం సమ్మె చేస్తున్నారు. వీరు కోరుతున్నదల్లా ఒక్కటే ఇతరులకు మాదిరిగానే తమకూ ఒక నిర్ణీత వేతన విధానం అమలు చేయాలని. తాము, తమ కుటుంబ సభ్యులు బతకడానికి అవసరమైన రీతిలో కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.వేతనాలు చూస్తే ఆశ్చర్యమే కాదు విస్మయమూ....
గ్రామ పంచాయితీ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు చూస్తే ఆశ్చర్యమే కాదు విస్మయమూ కలుగుతుంది. రెండు వందలు, మూడు వందలు, అయిదు వందలు గ్రామ పంచాయితీలలో చాలామందికి దక్కుతున్న జీతాలు ఇవే. ముచ్చటగా మూడు వేల రూపాయలైనా అందుకునేవారి సంఖ్య చాలాచాలా స్వల్పం. ఇంత తక్కువ జీతాలు గ్రామ పంచాయితీలలో సాగుతున్న వెట్టి చాకిరీకి నిదర్శనం కాదా?
కనీస వేతన చట్టం రూపొందించి....
ప్రతి ఉద్యోగికీ, కార్మికుడికి కనీస వేతన చట్టం రూపొందించి, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాలది. కానీ, ఆ ప్రభుత్వాలే తమ సంస్థల్లోనే వెట్టి చాకిరీ చేయిస్తుంటే ఇక ఈ దేశ ప్రజలకు దిక్కెవరు? గ్రామ పంచాయితీ ఉద్యోగులు వెట్టిచాకిరీలో మగ్గడానికి కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే. గ్రామ పంచాయితీలకు సక్రమంగా నిధులివ్వడం లేదు. వాటి పరిపుష్టికి తోడ్పడం లేదు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీలకు బదలాయించాల్సిన 29 అంశాలను వాటికి బదలాయించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయితీలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయితీలు వసూలు చేసే పన్నుల్లో 30శాతానికి మించి జీతాలివ్వొద్దంటూ ఆంక్షలు పెడుతున్నాయి. దీంతో ఆదాయం బాగా వున్న పంచాయితీల్లో సైతం సిబ్బందికి వారి శ్రమకు తగ్గట్టు జీతాలు ఇచ్చుకోలేని స్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వదనీ.....
వాస్తవ పరిస్థితులు ఇంత ఘోరంగా వుంటే, గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వదనీ, పంచాయితీల ఆదాయంలోంచే జీతాలిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. నాటి సకల జనుల సమ్మెలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, గ్రామాలకు కొత్త కళ వస్తుందని, తమ జీవితాలు మారతాయని ఆశించారు. గ్రామ పంచాయితీల తలరాతలు మార్చేందుకు క్రుషి చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వుంది. కానీ అందుకు పూనుకోకుండా, గ్రామ పంచాయితీలకు అధికారాలు బదలాయించకుండా, వాటి ఆర్థిక పరిపుష్టికి ప్రయత్నించకుండా, జీతాలు పెంచేది లేదంటూ భీష్మించుకోవడంలో అర్ధం వుంటుందా? ఆదాయాలు, లాభాలు దండిగా వస్తే జీతాలిచ్చుకోండి. లేదంటే వెట్టి చాకిరీ చేయించుకోండి అన్నదే కేసీఆర్ మాటల ఆంతర్యమా? ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆయన ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? తొలి ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటలు వినడానికేనా తెలంగాణ సాధించుకున్నది. 

ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ నూతన సీఈవోగా సంజయ్ జలోనా

హైదరాబాద్ : ప్రముఖ సంస్థ లార్సెన్ అండ్ టౌబ్రో(ఎల్ అండ్ టీ) ఐటీ విభాగానికి నూతన అధిపతిగా సంజయ్ జలోనా నియమితులయ్యారు. అమెరికాలోని న్యూజెర్సీ ఎల్ అండ్ టీ కార్యాలయం నుంచి సంజయ్ తన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సంజయ్ ఇన్ఫోసిస్ లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హైటెక్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇంజనీర్ సర్వీసెస్ కు గ్లోబల్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సైపై నిర్భయ కేసు...

హైదరాబాద్ : సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై...ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎస్సై సతీష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్టు చేశారు. ఎస్సై సతీష్ గత కొంత కాలంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు, మహిళ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.  

Don't Miss