Activities calendar

13 August 2015

భూసేకరణ చట్టాన్ని అమలు చేయొద్దు: పవన్

హైదరాబాద్: ఎపి రాజధాని నిర్మాణానికి కావాల్సిన మిగతా భూమికి భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని హీరో, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భూసేకరణ సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించి.. ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

శంషాబాద్ బృందావన్ కాలనీలో విషాదం...

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ బృందావన్ కాలనీలో విషాదం నెలకొంది. ఈనెల 6న కిడ్నాపైన శివలీల(15) హత్య గావించబడింది. నల్గొండ జిల్లా ఆత్మకూరు శివారులో ఆమె మృతదేహం లభ్యమైంది.

 

21:52 - August 13, 2015

చెన్నై: విక్రమ్ మూవీ 10ఎన్రదుకుల్ల ఫస్ట్ లుక్‌ను చెన్నైలో విడుదల చేశారు. 'ఐ' తర్వాత విక్రమ్ నటిస్తున్న మూవీ ఇదే. విక్రమ్ సరసన హీరోయిన్లుగా సమంత, ఛార్మి నటిస్తున్నారు. జాకిష్రాఫ్, పసుపతి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. విజయ్‌ మిల్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ పతాకంపై..దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్, సమంత, దర్శకుడు విజయ్ మిల్టన్ పాల్గొన్నారు. ఈ మూవీలో 9 నిమిషాల నిడివిగల పాట ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాటే మూవీకి హైలైట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో విక్రమ్ బుర్ర మీసాలతో కొత్త గెటప్‌లో కనిపించాడు.

 

21:49 - August 13, 2015

హైదరాబాద్: ఏపీ ఇంటర్‌బోర్డు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు ఖాతాలను తెలంగాణ ఇంటర్‌బోర్డు స్తంభింపజేయటంపై... ఏపీ ఇంటర్‌బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేసేనాటికి అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని...అలాగే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్‌బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

21:44 - August 13, 2015

ఢిల్లీ: లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ , అరుణ్‌జైట్లీ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలకు ఆ పార్టీ నేత చిదంబరం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ లేవనెత్తిన అంశాలపై సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ జవాబివ్వలేదని పేర్కొన్నారు. లలిత్‌మోది పాస్‌పోర్టు కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. మోది అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఖత్రోచి విడుదల వాజ్‌పేయి హయాంలోనే జరిగిందని, ఆ సమయంలో అరుణ్‌ జైట్లీ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. బోఫార్స్‌ కుంభకోణంపై మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై సుష్మా చేసిన ఆరోపణలు షాక్‌కు గురిచేశాయని, బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌కు కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిందన్నారు. తాను చేసిన తప్పుడు ఆరోపణలపై సుష్మా స్వరాజ్‌ కాంగ్రెస్‌కు క్షమాపణ చెప్పాలని చిదంబరం డిమాండ్‌ చేశారు.

 

21:40 - August 13, 2015

విజయవాడ: పట్టిసీమపై పట్టిన పట్టు వీడమన్నారు చంద్రబాబు. ఆరు నూరైనా అనుకున్న సమయానికే ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 15న ఎట్టి పరిస్ధితుల్లోనూ పట్టిసీమను అట్టహాసంగా ఆరంభిస్తామన్నారు. ఆగస్టు 15 రానే వచ్చింది. మరో రెండు రోజులు ఉండగానే ఏపీ సర్కార్‌ చేతులెత్తేసింది. ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేయలేమని చెప్పేసింది. వర్షాల వలన పనులు ఆలస్యమయ్యాయని అయినా ఆ రోజు పట్టిసీమను జాతికి అంకితం చేస్తామని బాబు చెప్పారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. 

21:30 - August 13, 2015

హైదరాబాద్ : మీకు బంపర్ ఆఫర్ అనే మెసేజీలు, మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయా..? అయితే వాటిని నమ్మకండి. రోజురోజుకు హైదరాబాద్ సైబర్ క్రైం కు కేరాఫ్ ఆడ్రస్ గా మారుతోంది. దీంతో నగరంలో రోజురోజుకు సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డు, ఈమెయిల్ హాకింగ్‌లతోపాటు అకౌంట్ టెకోవర్, యూకే, యూఎస్ జాబ్స్ లాంటి మెయిల్ అడ్వర్టైజ్ మెంట్ లాంటి సైబర్ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి వీటిని అరికట్టడానికి పోలీసులు కొన్ని మార్గదర్శకాలు జారీచేసినా సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు.
పెరిగిపోతున్న నేరాలు
వేగంగా విస్తరిస్తున్న ఐటీ వినియోగంతో నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్ పోలీసుస్టేషన్లలో రోజుకు 5నుంచి 8 ఫిర్యాదులు అందుతున్నాయి... ఇందులోక్రెడిట్ కార్డులు, ఈమెయిల్ హాకింగ్, అకౌంట్ టెకోవర్ లాంటి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చంటున్నారు..
నకిలీ క్రెడిట్ కార్డులు
సైబర్ నేరగాళ్లు తెలివిమీరిపోయారు. నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేసి షాపింగ్ మాళ్లు, పెట్రోల్ బంకుల్లో వాడుతున్నారు.. అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లు, మెసేజ్‌లు, ఈమెయిల్ అలర్టును చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.. అలాగే ఈమెయిల్ హాకింగ్, అకౌంట్ టేకోవర్లో కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఙప్తి చేస్తున్నారు.. మీకు లక్కీ డ్రా తగిలిందంటూ వచ్చే మెయిళ్లు, ఫోన్ కాల్స్‌ను పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.. అలాగే ఇటువంటి మెయిళ్లలో యూజర్ నేమ్, పాస్ వర్డ్, ఫోన్ నెంబర్లను ఎంటర్ చేయొద్దంటున్నారు.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే మీ సమాచారం అంతా సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశం ఉందని ఖాఖీలు హెచ్చరిస్తున్నారు. 
పేపర్లలోని ప్రకటనలు నమ్మొద్దు
అటు మీకు లాటరీ తగిలిందంటూ.. బ్యాంక్‌నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వచ్చే కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. 92 నెంబర్‌తో మొదలయ్యే కాల్స్‌ను రిసీవ్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.. అలాగే పేపర్లలో వచ్చే ప్రకటనలుకూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉద్యోగాలపేరుతో మోసాలు
యుకె, యుఎస్ లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసంచేసే సైబర్ నేరగాళ్లసంఖ్యకూడా పెరిగిపోతున్నాయి... ఇందులో నేరగాళ్లు నిరుద్యోగులనే టార్గెట్ చేసుకుంటారు.. వారికి ఈ మెయిల్ పంపుతారు.. ఎమ్ ఎన్ సి కంపెనీల్లో ఉద్యోగాలున్నాయని నమ్మిస్తారు.. కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరతారు.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని నమ్మిస్తారు.. డబ్బు తీసుకున్నతర్వాత మళ్లీ రెస్పాన్స్ ఇవ్వరు.. ఈ సైబర్ నేరాళ్లో ఎక్కువగా నైజీరియన్ల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.. ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిఘా వ్యవస్థ బలోపేతం  
సైబర్ నేరాల నిందితులను పట్టుకోవాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా మరింత బలోపేతం చేయాలి.. దేశరక్షణకు సంబంధించి సరికొత్త సైబర్ యుద్ధతంత్ర వ్యూహాలను రచించాలి.. అప్పుడే దేశానికి, దేశపౌరులకు సంపూర్ణ భద్రత లభిస్తుంది.

 

21:17 - August 13, 2015

హైదరాబాద్: టీ.సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షీ-టీమ్స్ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మ‌హిళ‌ల భ‌ద్రత కోసం ప్రత్యేక టీ-బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ను సేఫ్‌ అండ్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆ స్పెష‌ల్ స‌ర్వీసులు ఎలా ఉన్నాయి? ఎలాంటి సాంకేతిక ప‌రిజ్ఞానంతో షీ-బస్సులు నడుస్తున్నాయో ఓ లుక్‌ ఏద్దాం?
దారుణాలు వర్ణనాతీతం
ఆడపిల్లలు.. బయటకు అడుగు పెట్టాలంటే.. భయం. ఆఫీసులు.. సినిమాహాళ్లు.. బస్టాపులు.. ఇలా చోటైదైనా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు ఆగడం లేదు. రోజుకో చోటు అమానుషం. ఇక నగరంలో.. శివార్లలో దారుణాలు వర్ణనాతీతం.
వినూత్న ప్రయోగానికి శ్రీకారం
మహిళలపై నిత్యం జరుగుతున్న దాడులు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీనిని అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది షీ-టీమ్. మహిళల భద్రతే ధ్యేయంగా ఏర్పాటై ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలతో దూసుకుపోతున్న ఈ షీ-టీమ్.. ఇపుడు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
స్పెష‌ల్ షీ-బస్సు స‌ర్వీసులు
హైదరాబాద్‌ను సేఫ్‌ అండ్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు దేశంలోనే తొలిసారిగా స్పెష‌ల్ షీ-బస్సు స‌ర్వీసులను ప్రవేశపెట్టింది. జూన్ 29న షీ-టీమ్ మరియు సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రారంభించాయి. సీపీ సీవీ.ఆనంద్ నేతృత్వంలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్, ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్‌ మరియు షీ-టీమ్‌ పర్యవేక్షణలో నడిచే ఈ షీ-బస్సులను.. ప్రయోగాత్మకంగా మహిళా ఉద్యోగినుల భద్రత కోసం ఐటీ కారిడార్లో ఏర్పాటు చేశారు.
ఐటీ కారిడార్లో రెండు షీ-బ‌స్సులు
ప్రస్తుతం ఐటీ కారిడార్లో రెండు షీ-బ‌స్సులను ప్రవేశపెట్టిన పోలీసు ఉన్నతాధికారులు.. రోజుకు 17 ట్రిప్పులు నడుపుతున్నారు. మొదటి బ‌స్సు ఉదయం 8 గంటలకు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి బయల్దేరి.. ఇమేజ్ హాస్పిటల్, మైహోం, సైబర్‌టవర్స్, సైబర్‌పెరల్, మైండ్‌స్పేస్ జంక్షన్, ఇనార్భిట్ మాల్ వరకు నడుస్తుంది. ఇలాగే సాయంత్రం 4 గంటలకు ఇదే రూట్‌లో తిరిగి వస్తుంది. చివ‌రి ట్రిప్పు రాత్రి 11 ముగుస్తుంది. ఇక రెండో బ‌స్సు ఉదయం 8 గంటలకు హైటెక్‌సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ వద్ద ప్రారంభమై సైబర్‌టవర్స్, శిల్పారామం, వైట్‌ఫీల్డ్స్, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్, గచ్చిబౌలి, ఇంద్రానగర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఇన్ఫోసిస్, విప్రో సర్కిల్, క్యూసిటీకి చేరుకుంటుంది. ఇదే విధంగా సాయంత్రం 4 గంటలకు క్యూసిటీ నుంచి బయల్దేరి హైటెక్‌సిటీ ఎంఎంటిఎస్ కు రాత్రి 10 గంటలకు చేరుకునే చివరి ట్రిప్పుతో ముగుస్తుంది. షీ-బస్సుల ఏర్పాటుపై మహిళలు, ఐటీ ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సరికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానంతో
పూర్తిగా సరికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానంతో నడిచే ఈ షీ-బస్సులో ఒక డ్రైవ‌ర్‌తో పాటు ఒక లేడీ అటెండెంట్ ఉంటారు. లేడీ అటెండెంట్ ముఖ్యంగా బ‌స్‌లో జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు మ‌హిళా ప్రయాణికుల‌కు త‌గిన సేవ‌ల‌ను అందిస్తుంటారు. ఇక రీచ్ సేఫ్ అనే వాట్సప్ యాప్‌తో స‌హా జీపీఎస్ టెక్నోల‌జీతో బ‌స్సు క‌ద‌లిక‌ల‌ను సైతం తెలుకోవ‌చ్చు. ఐటీ కారిడార్‌లో 100కు పైచిలుకు ఐటీ పార్కులు, ఐటీ కంపెనీలు ఉన్నందున ఈ కారీడార్‌లో తొలుత షీ-బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు సైబ‌రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రట‌రీ భ‌ర‌ణికుమార్ తెలిపారు.
ప్రయాణం ఎంతో సౌకర్యం
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక షీ-బస్సులో ప్రయాణం ఎంతో సౌకర్యం, సురక్షితంగా ఉందని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు వీలైనంత ఎక్కువ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 

పట్టిసీమ ప్రారంభోత్సవం వాయిదా...

హైదరాబాద్: పట్టిసీమ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈమేరకు ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే ఆగస్టు 15 కి ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని టిడిపి ప్రభుత్వం చెప్పింది. వర్షాల వలన పనులు ఆలస్యమయ్యాయని చంద్రబాబు తెలిపారు. 

'ఓటుకు నోటు'లో కీలక పరిణామం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల అసెంబ్లీ ప్రసంగాలను ఎసిబి అధికారులు ఎసిబి కోర్టుకు సమర్పించారు. సెబాస్టియన్, ఉదయ్ సింహాల టీవీ ఇంటర్వ్యూలనూ...అధికారులు కోర్టుకు సమర్పించారు. స్వర నిర్ధారణ కోసం ఎఫ్ ఎస్ ఎల్ కు పంపాలని ఎసిబి కోరింది.

 

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం: సున్నం రాజయ్య

హైదరాబాద్: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్ కు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ధన్యావాదాలు తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే కార్మికులు 44 రోజుల సమ్మెను విరమిస్తున్నారని తెలిపారు. అయితే రెండు నెలల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

 

కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి సానూభూతి ఉంది: కేటీఆర్

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానూభూతిలో ఉందనిమంత్రి కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించేందుకు 30 శాతం నిధులే కేటాయించేవని... కానీ తాము వచ్చాక వాటిని 50 శాతానికి పెంచామని.. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు అర్థం చేసుకోవాలని సూచించారు.

 

హైదరాబాద్ పై పెత్తనాన్ని సహించం.. హరీష్ రావు

మెదక్: హైదరాబాద్ పై పెత్తనాన్ని సహించమని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. ఈమేరకు మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపిలో పాలన చేతకాక ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 

20:32 - August 13, 2015

ఉపాధ్యాయ సంఘాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సర్వోత్తమ్ రెడ్డి, టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

20:20 - August 13, 2015

ఢిల్లీ: ఉత్తరాధిలో వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. లూథియానాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. ఉత్తరాఖండ్‌లో నది దాటేందుకు జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. అటు ఉజ్జయినిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఉప్పొంగుతున్న వాగులు వంకలు
భారీ వర్షాలకు ఉత్తరాధిలో నదులతో పాటు.. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో వరదలతో జనం నిత్యనరకం అనుభవిస్తున్నారు. నది ఉప్పొంగి రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండటంతో.. ప్రయాణికులు ప్రాణాలకు తెగించి దాన్ని దాటి వెళుతున్నారు. ద్విచక్రవాహనాలు నీటిలో పడిపోతున్నా అతి కష్టం మీద అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు నీట మునిగాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి.. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద గుప్పిట్లో నుర్‌పుర్‌ కయానా
అటు పంజాబ్‌- లూధియానాలోని నుర్‌పుర్‌ కయానా గ్రామం వరద గుప్పిట్లో చిక్కుకుంది. రాకపోకలు నిలిచిపోవడంతో.. ఇక గ్రామస్తులే రంగంలోని దిగి వరదకు అడ్డుకట్ట వేశారు. ఇసుక బస్తాలు నింపి భూమి కోతను నిలువరించారు. గ్రామంలో చేపట్టిన వరద నివారణ చర్యలను జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు.

 

20:16 - August 13, 2015

హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు దూకుడు పెంచారా..? కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయారా..? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్రానికి వివరించిన బాబు.. ఇక నాన్చుడు ధోరణికి పుల్‌స్టాప్‌ పెట్టకపోతే పుట్టి మునిగేట్టుందని చెప్పినట్టు సమాచారం...
మునికోటి ఆత్మహత్యతో మరింత రాజుకున్న ప్రత్యేక పోరాటం
ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక పోరాటం.. మునికోటి ఆత్మహత్యతో మరింత రాజుకుంది. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ అనుసరిస్తున్న తీరుపై అన్నివైపుల నుంచీ విమర్శల దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నడూ లేని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇప్పటికి వరకు కేంద్రంతో సఖ్యతా ధోరణి ప్రదర్శిస్తూ వచ్చిన బాబు.. ఇక మీదట గట్టిగానే వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల ముందు తలెత్తుకోలేక పోతున్నామని, ప్రత్యేక హోదా ఇస్తారో లేదో ఖచ్చితంగా తేల్చాలని, దాన్ని బట్టి తన ప్లాన్ నేను సిద్ధం చేసుకుంటానని బీజేపీ నేతలకు చెప్పినట్టు సమాచారం.
బాబు హెచ్చరికలతో బీజేపీలో కదలిక
బాబు హెచ్చరికల నేపథ్యంలో బీజేపీలో కదలిక వచ్చిందనే ప్రచారం సాగుతోంది. అయితే.. ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని, కానీ, అంతకు మించి ప్రయోజనం కలిగేలా మంచి ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చీఫ్ అమిత్ షా బాబుతో అన్నట్లు చెబుతున్నారు. అసలు, దేశంలోనే ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ను రద్దు చేసే యోచనలో మోడీ ఉన్నారని అమిత్ షా బాబుతో చెప్పినట్టు సమాచారం. అలాగని ఏపీకి అన్యాయం చేయబోమని, తెలుగు ప్రజలు సంతృప్తి చెందేలా.. టీడీపీ, బీజేపీని మెచ్చుకునేలా ప్యాకేజీ ఉంటుందని అమిత్‌ షా హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వల్ల ఒరిగిందేమీ లేదని, ఓటు బ్యాంకు పరంగా చూసినా ఎన్డీఏ కు ఉత్తరాంచల్ మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదనే చర్చ బీజేపీలో నడుస్తోందంటున్నారు.
ఆగస్టు మూడో వారంలో క్లారిటీ
ఈ నేపథ్యంలో.. ఆగస్టు మూడో వారంలో ఏపీకి సాయంపై క్లారిటీ వచ్చే అవకాశముందని చంద్రబాబు సహచరులతో అన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ.. హోదా కాకుండా ప్యాకేజీ అయితే తమతో చర్చించి, సంతృప్తి కలిగేలా ప్రకటించాలని సుజనాచౌదరి ద్వారా అరుణ్ జైట్లీకి రాయబారం పంపింనట్టు సమాచారం. అది కూడా ప్రత్యేక హోదాను మరిపించేలా ఉండాలని, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ముందుగా రైల్వే జోన్ ప్రకటన చేస్తామని అరుణ్ జైట్లీ చెప్పినా... ప్రజల దృష్టి ప్రత్యేక హోదాపైనే ఉందని బాబు స్పష్టం చేసినట్టు సమాచారం.
హోదాను మించిన ప్యాకేజీ ఉండాలనుకుంటున్న సర్కార్
హోదా కాకపోయినా.. హోదాను మైమరించేలా ప్యాకేజీ ఉండాలనుకుంటున్న ఏపీ సర్కార్.. ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలతో పాటు మూడు అంశాలు కచ్చితంగా ఉండాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ఆకర్షణీయ రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతోందని సమాచారం. అదేవిధంగా పదేళ్లు లేదా ఐదేళ్ల పాటు ఏపీకి ఇచ్చే కేంద్ర పథకాలు, విదేశీ రుణాల్లో తొంభై శాతం గ్రాంటుగా ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఈ ప్యాకేజిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
కానీ.. ఈ విషయంలో పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని తెలుస్తోంది. కేంద్రం కొత్తగా వస్తు, సేవల పన్ను తేవాలని అనుకొంటోంది. ఇది ఆచరణలోకి వస్తే దేశమంతటా ఒకే పన్ను విధానం అమలై, గతంలోని పన్ను రాయితీలన్నీ రద్దవుతాయి. అదే జరిగితే.. దేశమంతటా ఒకే విధానం ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేకంగా పన్ను రాయితీ ఎలా ఇవ్వగలుగుతామని కేంద్రం ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్న బీజేపీ.. కీలక హామీలన్ని ఒకే సారి నేరవేరిస్తే బాబుకు మైలేజే వస్తుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. 2019 ఎన్నికల్లోపు ఒక్కో హామీని నెరవేరుస్తూ మైలేజ్ పెంచుకోవాలని కమలం నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. తాజాగా బాబు అండ్ టీం నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రం నిర్ణయాల్లో వేగం పెరిగే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.

 

20:00 - August 13, 2015

త్రినాధ్ దర్శకత్వంలో అవికా గోర్, రాజ్ తరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ''సినిమా చూపిస్త మావ''. మామగా రావు రమేష్ డిఫరెంట్ గెటప్ తో నటిస్తున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో అవికా గోర్, రాజ్ తరుణ్ జంట క్రేజ్ తెచ్చుకుంది. వీరు నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈనేపథ్యంలో నటి అవికా గోర్, దర్శకుడు త్రినాధ్ లతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. సినిమా వివరాలను తెలిపారు. వారి అనుభవాలను పంచుకున్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

19:42 - August 13, 2015

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని అక్రమాలే జరిగాయని ఎపి సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎపి రాష్ట్ర విభజన, వివిధ పార్టీల పనితీరుపై విజయవాడలో సీఎం విధాన పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కుంభకోణాల వల్ల దేశం అప్రతిష్టపాలైందన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు. 2009లో అతి తక్కువ ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

 

కాంగ్రెస్ హయాంలో అన్ని అక్రమాలే: చంద్రబాబు

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని అక్రమాలే జరిగాయని ఎపి సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎపి రాష్ట్ర విభజన, వివిధ పార్టీల పనితీరుపై విజయవాడలో సీఎం విధాన పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కుంభకోణాల వల్ల దేశం అప్రతిష్టపాలైందన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు.

 

19:30 - August 13, 2015

హైదరాబాద్: మున్సిపల్, పంచాయతీ కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణలో పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లపై కేటీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. రేమండ్ పీటర్ 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి తెలిపారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని మంత్రి కోరారు. చర్చలు సఫలమైన సందర్భంగా రెండు నెలలపాటు సమ్మె విరమణకు యూనియన్లు అంగీకరించాయి.


 

కార్మికులతో మంత్రి కేటీఆర్ చర్చలు సఫలం...

హైదరాబాద్: మున్సిపల్, పంచాయతీ కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణలో పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లపై కేటీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. రేమండ్ పీటర్ 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. చర్చలు సఫలమైన సందర్భంగా రెండు నెలలపాటు సమ్మె విరమణకు యూనియన్లు అంగీకరించాయి.

18:57 - August 13, 2015

హైదరాబాద్: ఎట్టకేలకు సమ్మెలో ఉన్న కార్మికులను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మిక సంఘాలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశానికి సున్నం రాజయ్యతో పాటు పలు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

 

ప్రజాప్రతిఘటన ముందు ఎంతటివారైనా బలాదూర్..

విజయనగరం: భోగాపురం ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా చినకౌలువాడలో నిర్వహించిన సదస్సుకు సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరయ్యారు. కేసులు, అరెస్టులకు భయపడితే... భూములను వదులుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రతిఘటన ముందు ఎంతటివారైనా బలాదూరే అని తేల్చి చెప్పారు. భోగాపురం భూముల జోలికి వస్తే.. చంద్రబాబును సున్నం బొట్లు తప్పవని హెచ్చరించారు. 

ఎసిబికి చిక్కిన డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి

మెదక్: నర్సాపూర్ లో రూ.10 వేలు లంచం తీసుకుంటూ... డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి వీరశం ఎసిబికి చిక్కాడు.

 

లిబియాలో తెలుగు ప్రొఫెసర్లు క్షేమం...

ఢిల్లీ: లిబియాలో కిడ్నాప్ గురైన తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని టిడిపి నేత రామ్మోహన్ నాయుడు తెలిపారు. లిబియాలో భారత్ కు చెందిన కీలక వ్యక్తి ద్వారా.. తెలుగు వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. లిబియాలో భారత దౌత్యాధికారులు లేకపోవడం వల్ల ప్రొఫెసర్ల విడుదలలో జాప్యమవుతోందని వెల్లడించారు.

 

18:12 - August 13, 2015

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని టిడిపి అధికార ప్రతినిధి జూపూడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని సీఎం చంద్రబాబు ఇదివరకే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అంశంపై విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో మొదట్లో లోక్ సత్తా, సిపిఐ పార్టీలకు స్పష్టత లేకున్నా.. చివరకు రాష్ట్రాన్ని విభజించాలని చెప్పాయన్నారు. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్.. టిడిపిపై చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జగన్, కేసీఆర్ ల నోటి నుంచి వచ్చే మాటలు జయప్రకాశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జయప్రకాశ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపి, బిజెపిల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఉందని.. బిజెపితో తెగదెంపులు చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు.

 

గోవా మాజీ మంత్రి అలెమావోకు జ్యుడిషియల్ కస్టడీ..

గోవా : మాజీ మంత్రి చర్చిల్ అలెమావోకు ఏడు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. లూయిస్ బర్గర్ అవినీతి కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలెమావో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి.

ఏపీ ఇంటర్ బోర్డు పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

హైదరాబాద్ : ఏపీ ఇంటర్ బోర్డు పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలను టీఎస్ ఇంటర్ బోర్డు స్తంభించచేయడంపై ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే నాటికి ఉన్న మొత్తాన్ని అలాగే ఉండేట్లు చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.

మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలతో కేటీఆర్ చర్చలు..

హైదరాబాద్ : మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చర్చలు ప్రారంభించారు. 

17:34 - August 13, 2015

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 375 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ధావన్, కోహ్లీలు శతకాలతో రెచ్చిపోయారు. ఓవర్ నైట్ స్కోరు 128/2 తో రెండో రోజు భారత్ ఆట ఆరంభించింది. ఓపెనర్ ధావన్ తనదైన శైలిలో ఆడాడు. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని బాల్ ను బౌండరీలకు తరలించాడు. శర్మ (9) కొద్ది సేపు మాత్రమే క్రీజులో నిలుచున్నాడు. అనంతరం వచ్చిన కోహ్లీ మెల్లి మెల్లిగా స్కోరును పరుగెత్తించాడు. వీరిని విడదీద్దామని అనుకున్న శ్రీలంక బౌలర్ల ప్రయత్నాలు విఫలం చెందాయి. ఈ దశలో ధావన్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ తనదైన శైలిలో ఆడాడు. 191 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. భారత జట్టు స్కోరు 255 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ (103) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రహానే ఎమీ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. ధావన్ కు సాహా జతకలిశాడు. సాహా లంక బౌలర్లను చీల్చిచెండాడే ప్రయత్నం చేశాడు. మంచి ఊపు మీదున్న ధావన్ (134) ను ప్రదీప్ అవుట్ చేశాడు. దీనితో 257 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయినట్లైంది. అనంతరం అర్ధ సెంచరీ సాధించిన సాహా (60) కూడా పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అశ్విన్ (7), హర్భజన్ సింగ్ (14), మిశ్రా (40), శర్మ (3), అరోన్ (4) పరుగులు మాత్రమే చేశారు. శ్రీలంక బౌలర్లలో కౌశాల్ ఐదు, ప్రదీప్ మూడు, ప్రసాద్, మాథ్యూస్ చెరో వికెట్ తీశారు. భారత్ మొత్తం 191 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ : 183 ఆలౌట్. మాథ్యూస్ (64), దినేష్ చందిమాల్ (59). 
భారత్ బౌలింగ్ : 
అశ్విన్ 46/6, మిశ్రా 20/2, శర్మ 30/1, అరోన్ 68/1
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 375 ఆలౌట్. ధావన్ (134), కోహ్లీ (103), సాహా (60)
శ్రీలంక బౌలింగ్ : కౌశాల్ 134/5, ప్రదీప్ 98/3, ప్రసాద్ 54/1, మాథ్యూస్ 12/1.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 2/2..

గాలె : మొదటి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. భారత్ 375 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం ఆటను ఆరంభించిన లంకకు ఆదిలోనే గట్టి షాక్ ఎదురైంది. కరుణారత్నే, కుశాల్ సిల్వాలు పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరిగారు. వీరిని అశ్విన్, మిశ్రాలు అవుట్ చేశారు. 

17:26 - August 13, 2015

హైదరాబాద్: తెలుగు తేజం పీవీ సింధు... 2015 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ చేరి ..పతకానికి మరింత చేరువయ్యింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో.... చైనా సూపర్ స్టార్, 3వ సీడ్ లీ ఝూరీ పై మూడుగేమ్ ల విజయంతో క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. తొలిగేమ్ ను 21-17తో నెగ్గిన సింధు...రెండోగేమ్ ను 14-21తో చేజార్చుకొన్నా..ఆఖరిగేమ్ ప్రారంభం నుంచే దూకుడుపెంచింది. ఐదుపాయింట్ల ఆధిక్యత కొనసాగించింది.చివరకు 21-17తో గేమ్, 2-1తో మ్యాచ్ నెగ్గి...క్వార్టర్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది. గతంలో 2013, 2014 ప్రపంచ టోర్నీల్లో సైతం సింధు..క్వార్టర్ ఫైనల్స్ చేరడమే కాదు..కాంస్య పతకాలు నెగ్గిన ఒకే ఒక్క భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

 

17:22 - August 13, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన 'కోడ్ ఫర్ ఏపీ' కార్యక్రమంలో సీఎం పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగులంతా సహకరిస్తే.. రానున్న ఐదేళ్లలో ఏపీ నెంబర్‌ వన్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ఇన్‌క్యుబేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

 

17:15 - August 13, 2015

ఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ నీడలో విద్యాసంస్థలను కాషాయీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థుల సమస్యలపై రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌ పదవికి మెరిట్‌ ఆధారంగా నియామకం చేపట్టలేదని రాష్ట్రపతికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌గా కేంద్రం గజేంద్ర చౌహాన్‌ ను నియమించడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గజేంద్ర చౌహాన్‌ నియామకం ద్వారా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోను కాషాయీకరణకు కేంద్రం తెర లేపిందని రాహుల్‌ విమర్శించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందని రాహుల్ పేర్కొన్నారు.

 

17:12 - August 13, 2015

ఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు పాస్‌ కాకపోవడంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. జిఎస్‌టి బిల్లుతో దేశానికి ఆర్థికంగా ఎంతో లాభదాయకమని జైట్లీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాజనీతిని ప్రదర్శించిందని జైట్లీ ధ్వజమెత్తారు. అకారణంగా లోక్‌సభ కార్యక్రమాలను కాంగ్రెస్‌ అడ్డుకుందని విమర్శించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై దేశం చాలా ఆగ్రహంతో ఉందన్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే పార్లమెంట్‌ సమావేశాలు ముగియడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

నిజామాబాద్ జిల్లాలో నలుగురు విద్యార్థుల అదృశ్యం..

నిజామాబాద్ : జిల్లాలో నలుగురు ఇంటర్ విద్యార్థుల అదృశ్యం కలకలం సృష్టించింది. బొధన్ లో ముగ్గురు మద్నూరులో ఒకరు మిస్సింగ్ అయ్యారు. దీనితో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల జాడ తెలుసుకోవడానికి పోలీసులు గాలింపులు చేపట్టారు. 

ఖమ్మం సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష..

ఖమ్మం : జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని, జిల్లాలో 13 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందన్నారు. ప్రస్తుతం ఐదు, ఆరు లక్షల ఎకరాల్లోనే సాగవుతోందని, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రూ.1800 కోట్లతో పనులు చేపట్టిన పెద్దగా సాగునీరు అందించలేరని పేర్కొన్నారు. ఖమ్మం, ఇల్లెందు, వైరా, మధిరలకు సాగునీటిపై అధ్యయనం చేయాలని, సాగునీటి సౌకర్యం లేని మండలాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు. 

అవయవదానం చేసిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి - మోహన్ బాబు..

హైదరాబాద్ : అవయవదానం చేసే కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అవయవదానం చేసిన వారిని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. దానం చేసిన కుటుంబంలోని పిల్లలకు ఐదో తరగతి నుండి ఇంజినీరింగ్ వరకు ఉచితంగా విద్యనందిస్తానని హామీనిచ్చారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు.

 

17:03 - August 13, 2015

మెదక్: సంగారెడ్డి మండలం కంది సబ్‌జైలుకు చెందిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. సంగారెడ్డి కోర్టుకు తీసుకువస్తుండగా నలుగురూ పారిపోయారు. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంగారెడ్డికి,  కందికి 5 కి.మీ దూరం ఉంది. పోలీసులు కనీస భద్రత లేకుండా ఖైదీలను తరలిస్తున్నారు. దీంతో ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఖైదీలు పరారైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంవటే పరారీలో ఉన్న నలుగురు ఖైదీలు మహారాష్ట్రలో పలు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు చోరీలకు ప్రయత్నించారు.

  

 

 

కేటీఆర్ గన్ మెన్లపై కేసు నమోదు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మెన్లగా పనిచేసిన శ్రీనివాస్, ఓదేలుపై విశాఖలో కేసు నమోదైంది. 2013లో ఒడిశా వ్యాపారిని బెదిరించారంటూ విశాఖ టూటూన్ పీఎస్ లో కేసు నమోదైంది. గన్ మెన్లకు సమన్లు జారీ చేసేందుకు కరీంనగర్ జిల్లాకు విశాఖఫట్టణం సీఐ మీర్ అహ్మద్ చేరుకున్నారు. 

ఉప్పల్ అదుపుతప్పిన లారీ..వృద్ధురాలి మృతి..

ఉప్పల్ : ఓ లారీ అదుపుతప్పి వృద్ధురాలిపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడనే మృతి చెందింది. 

16:54 - August 13, 2015

శ్రీకాకుళం: అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలోనే పొలాకిలో పర్యటించి బాధిత రైతులకు అండగా ఉంటామని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో పొలాకి థర్మల్ పవర్‌ప్లాంట్ వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి వామపక్షాలతో పాటు వైసీపీ, కాంగ్రెస్‌, పలు ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా టెన్ టివితో మధు ప్రత్యేకంగా మాట్లాడారు. భూసేకరణ ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల వద్ద బలవంతంగా భూములు లాక్కో డానికి టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకనే పలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, పొలాకిలో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని అధికారపక్షం మినహా అన్ని పార్టీలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. సోంపేటలో జరిగిన పోరాటం వృధాగా పోలేదని, ఒక రకంగా విజయవంతమైందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోరాటాలు రాష్ట్ర వ్యాపితంగా రైతాంగాన్ని ఉత్సాహపరిచాయని పేర్కొన్నారు. కాకరపల్లిలో, పొలాకిలో జరుగుతున్న పోరాటాలు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ రంగం నుండి డబ్బులు ఆశించి వాళ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ భూములు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తోందని, ఇది ఎక్కువ రోజులు సాగదన్నారు. రైతులు, ప్రజలు, సాధారణమైన ప్రజానీకం వ్యతిరేకంగా ఉందన్నారు. 

భారత్ 371/9..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. శర్మ 1, అరోన్ 4 పరుగులతో ఆడుతున్నారు. 

జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ర్యాగింగ్ చేశారన్న అనుమానంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 

16:46 - August 13, 2015

హైదరాబాద్: దేవాలయాల్లో పని చేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి పీఆర్ సీ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జీవో విడుదల కానున్నది. మొత్తం 370 ఆలయాల్లో 2630 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరి జీతాల చెల్లింపులకు ప్రభుత్వానికి రూ. 15 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే 10వ పీఆర్ సీని అమలు చేయాలని గత కొంతకాలంగా ఆలయాల్లో పని చేస్తున్న సిబ్బంది... ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీందో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆలయాల్లో పని చేసే సిబ్బందికి పీఆర్ సీ అమలు చేస్తూ... వాటికి సంబంధించిన ఫైల్ పై సీఎం సంతకం చేశారు. త్వరగా ఉత్తర్వులను జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశంచారు.

 

జగన్ ఆస్తుల కేసులో రూ.7.85 కోట్ల ఈడీ జప్తు..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అనంతపురం జిల్లాలోని పెన్నా గ్రూపునకు చెందిన 231 ఎకరాల భూమిని తాత్కాలిక ప్రాతిపదికన ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్ లోని ఓ హోటల్ నూ పాక్షికంగా అటాచ్ చేసింది. జగన్ కంపెనీలో రూ.68 కోట్లను పెన్నా ప్రతాప్ రెడ్డి పెట్టుబడులు పెట్టారు. 

16:34 - August 13, 2015

నెల్లూరు: శ్రీహరి కోటలోని షార్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. జీఎస్ ఎల్వీ ప్రయోగానికి సంబంధించిన ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు షార్ ఉద్యోగులకు గాయాలయ్యాయి.

 

పార్లమెంట్ లో ప్రతిపక్షాల తీరు అభ్యంతకరం - జైట్లీ..

ఢిల్లీ : పార్లమెంట్ లో ప్రతిపక్షాల తీరు అభ్యంతకరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అకారణంగా ప్రతిపక్షం సభను అడ్డుకుందని, ప్రధాన పార్టీ అధినేత్రి వెల్ లోకి రావడం విచారకరమన్నారు. సభను అడ్డుకుని కాంగ్రెస్ ఏం సాధించిందో తెలియదన్నారు. సమస్యలుంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోగలగమని, రాజ్యసభలో 91 శాతం, లోక్ సభలో 54 శాతం సమయం వృదా అయ్యిందన్నారు. పార్లమెంట్ ఉభయసభల నిర్వాహణకు రూ.34 కోట్లు ఖర్చు అయ్యిందని జైట్లీ తెలిపారు. 

300 కిలోల గంజాయి స్వాధీనం..

తూర్పుగోదావరి : కోటనందూరు (మం) ఇండూగుపల్లిలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా నిల్వ ఉంచిన 300 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. 

ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు - శ్రీధర్ బాబు..

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్లను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ మొదలు పెట్టిన 32 ప్రాజెక్టులూ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాయాంలో ప్రాజెక్టులకు తట్టమట్టి వేయలేదన్న మంత్రి హరీష్ రావు ఆరోపలణపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. మూడు నియోజకవర్గాలకు సాగునీరందించే తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేస్తామని పేర్కొంటున్నారని, ఈ రద్దును అడ్డుకుంటామన్నారు. 

స్వల్పలాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : గురువారం స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో ముగిసింది. 37 పాయింట్ల లాభంతో 27,550 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 6 పాయింట్ల లాభంతో 8,356 వద్ద నిఫ్టీ ముగిసింది. 

16:11 - August 13, 2015

గాల్ టెస్ట్ : టీమిండియా సెంచరీల మోత మోగించింది. ధావన్, కోహ్లీ..మూడో వికెట్ కు 227 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో...శిఖర్ ధావన్ టెస్ట్ క్రికెట్లో నాలుగో సెంచరీ సాధించగా...కెప్టెన్ కొహ్లీ 11వ శతకం సాధించి అవుటయ్యాడు. కొహ్లీ మొత్తం 191 బాల్స్ ఎదుర్కొని..11 బౌండ్రీలతో సెంచరీ సాధించాడు. అయితే..ఈ ఇద్దరి భారీభాగస్వామ్యానికి..శ్రీలంక యువస్పిన్నర్ కౌశల్ తెరదించాడు. 103 పరుగుల స్కోరుకు కొహ్లీని, ఆ తర్వాత వచ్చిన అజంక్యా రహానే డకౌట్ గా పెవీలియన్ దారి పట్టించాడు.

 

దేవాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి గుడ్ న్యూస్..

హైదరాబాద్ : దేవాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలని టి.సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు సీఎం కేసీఆర్ ఫైల్ పై సంతకం చేశారు. త్వరలో జీవో విడుదల కానుంది. 370 ఆలయాల్లో 2630 మందికి లబ్ధి కానుంది. 

భారత్ 341/7..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. సాహా 39, మిశ్రా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాహుల్ (7), ధావన్ (134), శర్మ (9), కోహ్లీ (103), రహానే (0), అశ్విన్ (7), హర్బజన్ సింగ్ (14) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కౌశాల్ మూడు, ప్రదీప్ రెండు, ప్రసాద్, మాథ్యూస్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 

గ్రామాలను దత్తత తీసుకొనేందుకు ముందుకు రావాలి - బాబు...

కృష్ణా : మూడు పంచాయతీ పరిధిలో ఎనిమిది గ్రామాలను మిత్సుబిసి, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్స్ లు దత్తత తీసుకున్నాయి. గ్రామాలను దత్తత తీసుకొనేందుకు అందరూ ముందుకు రావాలని అప్పుడే స్మార్ట్ ఏపీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డు కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

సిద్ధిపేటకు బీసీ స్టడీ సర్కిల్..

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేటకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. భవిష్యత్ లో సిద్ధిపేట జిల్లా అయ్యే అవకాశం ఉన్నందున స్టడీ సర్కిల్ ను మంజూరు చేసింది. 

కానిస్టేబుల్ రంగరాజు అరెస్టు..

హైదరాబాద్ : కానిస్టేబుల్ రంగరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల ఆశ చూపి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రంగరాజుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ..

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్ లో ఎస్ఎంఎస్ విభాగంలో కోకోవెన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి..మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ ఫైనల్ జ్వాలా..అశ్విని జోడి..

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ ఫైనల్ కు జ్వాలా..అశ్విని జోడి చేరుకుంది. ఎనిమిదో సీడ్ జపనీస్ జోడిపై 21-15, 18-21, 21-19 తేడాతో విజయం సాధించింది. 

సంగంబండ రిజర్వాయర్ ను సందర్శించిన టిటిడిపి బృందం..

మహబూబ్ నగర్ : మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్ ను టిటిడిపి బృందం సందర్శించింది. పాలమూరు ఎత్తిపోతలకు టిడిపి వ్యతిరేకం కాదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్త చేయాలని కోరుతున్నట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎగువన కర్నాటక ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులపైనా కేసీఆర్ దృష్టి సారించాలని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది - వెంకయ్య...

ఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గెలుపును చూసి సహించలేకే కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తోందని, పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో ఎన్డీయే ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియచేశామన్నారు. 

15:32 - August 13, 2015

కోటి ఆశలతో, ఉన్నత లక్ష్యాలతో కాలేజీలలో చేరిన విద్యార్థులు భయం భయంగా అడుగులేస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో ఎవరు ఎలా కాటేస్తారో అని కలవర పడుతున్నారు. సీనియర్స్ ను ఎదుర్కోలేక, ఉన్నత చదువులను వదులుకోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. సున్నిత మనస్కులైతే జీవితాలనే అంతం చేసుకుంటున్న స్థితి నెలకొంది. ఎందుకిలా? కాలేజీలలో ఏం జరుగుతోంది? విద్యార్థుల ఆశలను మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇదే అంశంతో ఇవాళ్టి ఫోకస్ మీ ముందుకు వచ్చింది.
సీనియర్స్ తో నెగ్గుకురావటం మరో సవాల్
ఉన్నత లక్ష్యానికి చేరువయ్యేందుకు పడరాని పాట్లు పడి కోరుకున్న కాలేజీలో సీటు సాధించటం ఒక ఎత్తైతే కాలేజీలో సీనియర్స్ తో నెగ్గుకురావటం మరో సవాల్ గా పరిణమిస్తోంది. కలల సాకారానికి బీజం పడాల్సినచోట ర్యాగింగ్‌ భూతం బెంబేలెత్తిస్తోంది. సీనియర్‌, జూనియర్ల మధ్య చెలిమి పేరుతో సరదాగా సాగే ఈ ఆట వికృతచేష్టలకు దారితీస్తోంది. వికసించాల్సిన విద్యాకుసుమాల్ని వికృత రూపం ఛిదిమేస్తోంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తోంది.
ర్యాగింగ్ భూతం అంతం కావాలి
అడుగడుగునా ఆంక్షల మధ్య పెరుగుతున్న ఆడపిల్లలకు ఉన్నత విద్యకు చేరుకునే అవకాశాలు తక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఎంతో పోరాడి చదువుల బాట పట్టి, ఉన్నత లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్న చదువుల తల్లులను ర్యాగింగ్ భూతం భయపెడుతోంది. ఎంతో మంది విద్యార్థులను బలి తీసుకుంటున్న ఈ ర్యాగింగ్ భూతం అంతం కావాలని మానవి కోరుకుంటోంది.

స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బాబు..

విజయవాడ : స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్మార్ట్ విలేజ్ లు, రాజధాని నిర్మాణంలో జపాన్ సహకారం అవసరమన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దడం స్మార్ట్ విలేజ్ లక్ష్యాలన్నారు. అమరావతిని ఉత్తమోత్తమ నగరంగా నిర్మిస్తామని, ఏపీలో మైక్రో ఫైనాన్స్ సంస్థలకు మంచి రికార్డు లేదని తెలిపారు. 80 లక్షల కుటుంబాలకు డ్వాక్రా ద్వారా సహాయం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణంలో పాల్గొనాలని సీఐఐ అధికారులను ఆహ్వానించారు. 

యాచారంలో నకిలీ పాస్ పుస్తకాల దందా..

రంగారెడ్డి : యాచారంలో నకిలీ పాస్ పుస్తకాల దందా బట్టబయలైంది. 14 ఎకరాల ప్రైవేటు భూమికి పాస్ పుస్తకాలను ముఠా సృష్టించింది. బ్యాంకులో తనఖా పెట్టి లోన్ కు ప్రయత్నం చేసింది. తహశీల్దార్ ఫిర్యాదుతో ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు.

15:02 - August 13, 2015

ఢిల్లీ: రాజ్యసభలోనూ కీలక బిల్లులు ఆమోదం పొందకుండానే సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లలిత్‌ మోదీ, వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. ప్రతిపక్షాల నిరసనలతో జీఎస్‌టీ బిల్లు సహా, పలు ముఖ్యమైన బిల్లులన్నీ రాజ్యసభ ఆమోదం పొందలేదు.

 

 

14:54 - August 13, 2015

హైదరాబాద్: స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు కావొస్తున్నా.. దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాలమూరు జిల్లా పెబ్బేరు మండలంలోని పాతపల్లిలో దళితులు, అగ్రవర్ణ కులాల మధ్య స్మశాన వాటిక విషయంలో తలెత్తిన గొడవ వివాదంగా మారింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారుల బృందం పాతపల్లికి బయల్దేరింది. రెండు నెలల క్రితం దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరావు ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్‌ల బృందం బాధితులను పరామర్శించనుంది.

 

14:51 - August 13, 2015

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తున్న పథకాల తీరు.. కొత్త సీసాలో పాత సార మాదిరిగా ఉందని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. గతేడాది 'మనఊరు - మన ప్రణాళికా' కోసం 14 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రకటించి 20 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇప్పుడు కొత్తగా వేల కోట్లతో గ్రామజ్యోతి అంటున్నారని.. రెండు పథకాలకు ఉన్న తేడా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

14:48 - August 13, 2015

కృష్ణా: ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సీఐఐ సహకారం అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగుమతులు, దిగుమతుల కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరవురహితంగా చేస్తామని ప్రకటించారు.  

ఇండియా 302/6..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ధావన్ (134) వెనుదిరగగా కోహ్లీ (103) రన్ల వద్ద అవుట్ అయ్యాడు. సాహా 24, హర్భజన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

'హీరో' సైకిల్ స్థాపకుడు కన్నుమూత..

లుధియాన : 'హీరో' సైకిల్ వ్యవస్థాపకుడు ప్రకాష్ ముంజల్ (87) కన్నుమూశారు. గురువారం లుధియానలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని వెల్లడించారు. ముంజల్ కు ఒక కుమారుడు, నలుగురు కూతుర్లున్నారు.

బతుకమ్మకుంట గుడిసెల కూల్చివేత..

హైదరాబాద్ : అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అడ్డుకున్న సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ వైఖరిని చూస్తుంటే ఎమర్జెన్సి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకొంటోందని కానీ దేశం క్షేమంగా ఉండాలని బీజేపీ కోరుకొంటోందని వ్యాఖ్యానించారు.

ఎన్డీయే ఎంపీల మార్చ్..

ఢిల్లీ : సేవ్ డెమోక్రసీ అంటూ ఎన్డీయే ఎంపీలు మార్చ్ నిర్వహించారు. విజయ్ చౌక నుండి ప్రారంభమైన ఈ మార్చ్ రాష్ట్రపతి భవన్ కు వరకు కొనసాగనుంది. 

రహానే డకౌట్..

గాలె : శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కౌశల్ వేసిన బంతికి రహానే (0) ఎల్బీగా వెనుదిరిగాడు. 

కోహ్లీ అవుట్..

గాలె : భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసి ఊపు మీదున్న కోహ్లీ అవుటయ్యాడు. కౌశల్ వేసిన 74వ ఓవర్ లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారు - షబ్బీర్..

హైదరాబాద్ : గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో వాగ్ధానం ఇస్తూ వాటిని గొలికొదిలేస్తున్నారని, మెట్రో పనులను గాలికొదిలేశారని ఆరోపించారు.

 

బీజేపీ కార్యకర్తల సమావేశం రసాభాస..

మహబూబ్ నగర్ : జిల్లాలో బీజేపీ నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. కిషణ్ రెడ్డితో నాగర్ కర్నూలు బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సమావేశం గురించి సమాచారం ఇవ్వలేదని నాగం, యెన్నం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. సమాచారం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు నాగం, యెన్నంలు సమావేశానికి హాజరు కాలేదు.

 

ప్రపంచ బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫైనల్ లో సైనా..

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్ క్వార్టర్స్ ఫైనల్ లో సైనా నెహ్వాల్ ప్రవేశించింది. జపాన్ క్రీడాకారిణి టకాహషీపై 21-18, 21-14 తేడాతో సైనా గెలుపొందింది. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రూ.50 లక్షలు..

హైదరాబాద్ : గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వాహణ కోసం రూ.50 లక్షలను టి.సర్కార్ విడుదల చేసింది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ వాలా నిర్మాణం కోసం రూ.7 కోట్లను విడుదల చేసింది.

 

ర్యాగింగ్ పై సమీక్షలు - చిన్నరాజప్ప..

నెల్లూరు : ర్యాగింగ్ పై ప్రతి వారం కాలేజీల్లో సమీక్షలు నిర్వహిస్తామని హోం మంత్రి చిన్నరాజప్ప పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను 90 శాతం నివారించామని, మనీస్కీమ్ కేసుకు సంబంధించి బాధితులను ఆదుకుంటామని, 2018 నాటికి విజయవాడకు పోలీసు యంత్రాగాన్ని తరలిస్తామన్నారు.

 

13:35 - August 13, 2015

హైదరాబాద్ : సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసు పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆమె సంరక్షణ కోసం తీసుకున్న చర్యలపై ధర్మాసనం ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చే 5లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీని ఖర్చులకు అందేలా చూడాలని ఆదేశించింది. ఇక పద్మారావు నగర్‌లోని ఫ్లాట్‌ అద్దెను ప్రత్యూష బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని, ఆమె సంరక్షణ కోసం తన తరపున ఏమిస్తారో తండ్రితో మాట్లాడాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

 

13:33 - August 13, 2015

హైదరాబాద్ : తమిళనాడులో మద్యనిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ డీఎండీకే అధినేత విజయకాంత్‌ నిరాహార దీక్ష చేస్తున్నారు. మద్యపానం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ విజయకాంత్ ఫైరవుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే వరకు తన దీక్ష విరమించేది లేదని విజయకాంత్‌ చెబుతున్నారు.

13:31 - August 13, 2015

హైదరాబాద్ :సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే టార్గెట్‌గా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. అవినీతికి ఓ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్న లలిత్‌ మోదీ అవినీతి సొమ్ముకు రారాజుగా చెలామణీ అవుతున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాని మోదీ వీటన్నింటికి బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

13:29 - August 13, 2015

హైదరాబాద్ : విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల చివరి రోజు కూడా విపక్షాల ఆందోళనతో సభ హోరెత్తింది. లలిత్‌మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో..కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ ప్రకటించి... పార్లమెంట్‌ బయట ఆందోళనకు దిగారు. ఇతర పార్టీలు కాంగ్రెస్‌ ఆందోళనకు మద్దతు పలికాయి. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు ఎన్డీఏ సభ్యులు ర్యాలీ చేపట్టారు. విపక్షాల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. 

కోహ్లీ శతకం..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ శతకం పూర్తి చేశాడు. 189 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 103 రన్లు చేశాడు. అంతకు ముందే ధావన్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధావన్ 119, కోహ్లీ 103 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 255పరుగులు చేసింది. 

మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘాలతో కేటీఆర్ చర్చలు..

హైదరాబాద్ : మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘ నేతలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరుపనున్నారు. 

విజయవాడలో పోలీసుల తనిఖీలు..

విజయవాడ: ఆగస్టు 15న సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గుడివాడ రైల్వేస్టేషన్ లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

 

శ్రీనగర్ లో కాంగ్రెస్ ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఘర్షణ..

రంగారెడ్డి : హయత్ నగర్ లోని ఇనాంగూడలోని నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఘర్షణ చెలరేగింది. తెలంగాణ, బీహార్ విద్యార్థులు కొట్టుకున్నారు. వీరిలో 15 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న చిదంబరం..

ఢిల్లీ : మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సాయంత్రం 4.30గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం లోక్ సభలో లలిత్ మోడీ అంశంపై కేంద్ర మంత్రి సుష్మా మాట్లాడిన సంగతి తెలిసిందే. అందులో పి.చిదంబరంపై సుష్మా పలు ఆరోపణలు చేశారు. 

టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు వైఫల్యం - యాష్కి..

ఢిల్లీ : విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పార్లమెంట్ లో లేవనెత్తడంతో టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు విఫలం చెందారని మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. కాంగ్రెస్ కు తక్కువ మంది ఎంపీలున్నా పోరాడి తెలంగాణ సాధించామని, తెలంగాణ రాష్ట్ర సమస్యలపై పోరాడడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. 

హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ..

హైదరాబాద్ : హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ జరిగింది. ప్రత్యూష సంరక్షణ కోసం తీసుకున్న చర్యలపై కోర్టు ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షలను ప్రత్యూష పేరిట ఎఫ్ డీ చేయాలని..ఎఫ్ డీ వడ్డీని ప్రత్యూష ఖర్చులకు అందేలా చూడాలని..పద్మారావునగర్ ళోని ప్లాట్ అద్దెను ప్రత్యూష ఖాతాలో వేయాలని, ఆమె సంరక్షణ కోసం ఏమిస్తారో తండ్రితో మాట్లాడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

12:47 - August 13, 2015

టాలీవుడ్ బొద్దుగుమ్మ 'అనుష్క' నటిస్తున్న 'సైజ్ జోరో' చిత్రానికి సంబంధించిన లోగో విడుదలైంది. అనుష్కకు జోడిగా ఆర్య నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎటువంటి హడావుడి..ఆర్భాటం లేకుండా చిత్రం షూటింగ్ చేసుకొంటోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అనుష్క డిఫరెంట్ లుక్ లో కనిపించే 'సైజ్ జోరో'కు 'సన్నజాజి నడుము' అనేది ట్యాగ్ లైన్ పెట్టారు. ముందే లావుగా ఉన్న 'అనుష్క' ఈచిత్రం కోసం సన్నబడిందంట. ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన పాటలను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి పేర్కొన్నారు. మరి ఈ 'సైజ్ జీరో' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? లేదా ? అనేది చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. 

తాజ్ మహల్ హోటల్ లో అఖిలపక్ష నేతల సమావేశం..

హైదరాబాద్ : నారాయణగూడలోని తాజ్ మహల్ లో హోటల్ లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై నేతలు చర్చిస్తున్నారు. 

మోడీ మాట తప్పారు - రాహుల్..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మరోసారి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ఆయన చేతికి నల్లబట్ట కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని తీసుకరాలేదని, మోడీ అన్ని విషయాల్లో మాట తప్పారన్నారు. ఆర్థిక నేరగాడైన లలిత్ మోడీని కాపాడుతున్నారని రాహుల్ ఆరోపించారు. 

12:42 - August 13, 2015

ఢిల్లీ : ఎన్డీఏ ర్యాలీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌ బయట కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాపం కుంభకోణంలో ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. 48 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ కేసులో నిజాల నిగ్గుతేల్చి న్యాయం జరిగేలా చూడలన్నారు. లోక్‌సభలో వాకౌట్‌ ప్రకటించిన కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంట్‌ వెలుపల నిరసన చేపట్టారు.  

12:40 - August 13, 2015

విజయవాడ : కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం నుంచే పరిపాలన ప్రారంభమైందని మంత్రి దేవినేని అన్నారు. సీఎం సహా మంత్రులందరూ విజయవాడలో సమావేశమై పాలన వ్యవహారాలపై సమీక్షిస్తున్నారని చెప్పారు. సీఎం కార్యాలయం పూర్తికానప్పటికీ.. బస్సులోనే ఉండి సీఎం చంద్రబాబు నెలరోజులుగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. 

12:39 - August 13, 2015

హైదరాబాద్ : విశాఖలో స్వాతంత్ర్య వేడుకల కోసం ఇవాళ్టీతో ఏర్పాట్లన్ని పూర్తికానున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సాగర తీరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనుండటం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, ఆలోచనలను తెలిపేలా శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు.  

12:37 - August 13, 2015

హైదరాబాద్ : జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్‌లోని ఓ ప్రార్ధనమందిరం వద్ద గ్రనేడ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 9మంది మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్ధలికి చేరుకున్న భద్రతా బలగాలు పరిస్ధితిని సమీక్షిస్తున్నాయి. పేలని మరో గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే పాక్‌ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు. సరిహద్దు గ్రామాలపై బుల్లెట్లతో విరుచుకుపడుతున్నారు. పాక్‌ ఆగడాలతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చినరాజప్పను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు..

నెల్లూరు : సీఐడీ ఆఫీసును గురువారం బీజేపీ నేతలు ముట్టడించారు. ఏపీ హోం మంత్రి చిన రాజప్ప కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఐడీ విచారణ వేగవంతంగా జరిగేలా చూస్తామని చిన రాజప్ప హామీనిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని, ఆర్థిక మోసాలకు పాల్పడిన మరో 25 సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. 

12:36 - August 13, 2015

హైదరాబాద్ : టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో మనిషి పనులను సులువు చేసుకునేందుకు రోబోల వాడకం పెరుగుతూ పోతోంది. ఈక్రమంలో పనిలో సహాయపడాల్సిన రోబో మనిషికి ప్రమాదంగా మారుతోంది. ప్రాణం లేని రోబో అత్యంత విలువైన మనిషి ప్రాణాలను తీసేసిన ఘటన గుర్గావ్ లోని మారుతీ సుజుకీ ప్లాంట్ లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెలితే.. కార్లు తయారు చేసే రోబో అక్కడ పనిచేసే కార్మికున్ని పొట్టన బెట్టుకుంది. తయారీ క్రమంలో పనిచేస్తున్న కార్మికున్ని ఒక వస్తువుగా భావించిన రోబో కార్మికుడి ప్రాణాలు తీసేసింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడి కార్మికులంతా హతాశులయ్యారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని యాజమాన్యం తెలియజేసింది. 

 

12:34 - August 13, 2015

జకార్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారిణీ పీవీ సి:దు సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ లో చైనా సూపర్ స్టార్, 3వ సీడ్ లీ ఝూరీ పై మూడుగేమ్ ల విజయంతో క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది .

 

12:33 - August 13, 2015

మహారాష్ట్ర : పంకజాముండే..ఈమె మహారాష్ట్ర రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రి. రూ.230 కోట్ల విలువైన టెండర్ల కుంభకోణంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈమెపై తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె వేసుకున్న చెప్పులను ఓ వ్యక్తి మోయడంతో వివాదం చెలరేగింది. దీనితో విపక్షాలు ఆమె తీరుపై భగ్గుమంటున్నాయి. ముండేది అహంకారపూరిత ధోరణి అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని పర్భని జిల్లా సోన్ సేట్ ప్రాంతంలో పంకజాముండే పర్యటించారు. కొద్దిగా బురదమయంగా ఉండడంతో ఆమె చెప్పులను విడిచిపెట్టింది. అక్కడనే ఉన్న ఓ వ్యక్తి చెప్పులను తీసుకుని ఆమెను అనుసరించాడు. ఇదంతా మీడియాకు చిక్కింది. దీనిపై మంత్రి పంకజాముండే స్పందించారు. రోడ్డు బురదమయం కావడంతో చెప్పులు విడిచి పెట్టడం జరిగిందని, నా చెప్పులు వేరొకరు పట్టుకొచ్చారన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదని, వ్యక్తిగతంగా తాను నియమించుకున్న ఉద్యోగి అంటూ సెలవిచ్చారు. పనిలోపనిగా మీడియాపై కస్సుబుస్సులాడారు.

 

12:31 - August 13, 2015

హైదరాబాద్ : సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు బాంబ ఏ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆరువారాల పాటు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్పత్తులను మరోసారి పరీక్షలకు పంపాలని ఆదేశించింది.

12:31 - August 13, 2015

హైదరాబాద్ : సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు బాంబ ఏ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆరువారాల పాటు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్పత్తులను మరోసారి పరీక్షలకు పంపాలని ఆదేశించింది.

లంచ్ విరామానికి భారత్ 227/2..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ధావన్ 110, కోహ్లీ 86 పరుగులతో ఆడుతున్నారు. 

గాంధీ విగ్రహం ఎదుట విపక్ష ఎంపీల నిరసన..

ఢిల్లీ : వ్యాపం స్కాంను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. 

కాసేపట్లో పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటన..

మహబూబ్ నగర్ : పెబ్బేరు (మం) పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటించనుంది. రెండు నెలల క్రితం దళితులపై దాడి నేపథ్యంలో ఈ పర్యటన జరుగనుంది. ఈ సందర్భంగా బాధితులను బృందం పరామర్శించనుంది.

 

ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో సింధు..

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో చైనా స్టార్ లీఝురీకి సింధు షాక్ ఇచ్చింది. ఈ విజయంతో సింధు మూడోసారి క్వార్టర్స్ ఫైనల్లో ప్రవేశించినట్లైంది. 

మ్యాగీపై నిషేధం ఎత్తివేసిన బాంబే హైకోర్టు..

బాంబే : మహారాష్ట్ర ప్రభుత్వం మ్యాగీపై విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. మ్యాగీ నూడిల్స్ నమూనాలను మరోసారి పరిశీలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాచ్ లో ఐదేసి శాంపిల్స్ ను మూడు ల్యాబ్ లకు పంపి పరీక్షలు నిర్వహించాలని, ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచనలు చేసింది. 

ధావన్ సెంచరీ..ఇండియా 205/2

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లీ కూడా సెంచరీ దిశగా ముందుకెళుతున్నాడు. టీమిండియా 2 రెండు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ధావన్ 102, కోహ్లీ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 183 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే

సీఐఐ ప్రతినిధులతో బాబు..

విజయవాడ : హైదరాబాద్ లో సీఐఐ సమావేశం ప్రారంభమైంది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న సీఎం బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. సీఐఐతో తనకు 19 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సీఐఐ సహకారం అవసరమన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా చేస్తామన్నారు. 

11:18 - August 13, 2015

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11గంటలకు సభ ప్రారంభంకాగానే స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విపక్ష సభ్యులు ఆందోళలను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు.
అంతకంటే ముందు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యింది. పార్లమెంటరీ సమావేశాల పొడిగింపుపై చర్చించేందుకు భేటీ అయినా సమావేశాల ఏర్పాటుపై నిర్ణయం వాయిదా పడింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. లేనిపక్షంలో మధ్యాహ్నాం రెండు గంటలతో ముగియనున్నట్లు తెలుస్తోంది. 

ఆటో బోల్తా : మహిళ మృతి

నల్లగొండ : కూలీలతో వెళుతున్న ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో మహిళ మృతిచెందింది. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం కప్రాయిపల్లి వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కార్మికుడి ప్రాణాలు తీసిన రోబో...

హర్యానా : గుర్గావ్ ప్రాంతంలోని నూతన పారిశ్రామికవాడ మనేసర్ లో ఓ కార్మికుడు రోబో కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎస్కేహెచ్ మెటల్స్ కంపెనీలో రామ్జీ లాల్ (24) అనే వ్యక్తి లోడర్ గా పనిచేస్తున్నాడు. లాల్ వెల్డింగ్ యూనిట్ లో విధుల్లో ఉన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్ లో 63 మంది వరకు కార్మికులు, 39 రోబోలు విధి నిర్వహణలో ఉన్నట్టు తెలిసింది. కాగా, లాల్ ప్రాణాలు హరించిన రోబో పని మెటల్ షీట్లను పైకెత్తి వెల్డింగ్ చేయడమే. అయితే, ఓ షీట్ నిర్దేశిత స్థానం నుంచి పక్కకు జరగడంతో దాన్ని సరిచేసేందుకు లాల్ యత్నించాడు.

తిరుమలలో నిలిచిన లడ్డూ ప్రసాదం జారీ ప్రక్రియ

తిరుపతి : తిరుమల శ్రీవారి కొండపై లడ్డూ ప్రసాదం జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా బార్‌ కోడింగ్‌ విధానం పనిచేయడం లేదు. ఈ కారణంగా క్యూలైన్లలో ఉన్న లడ్డూ టికెట్ల కౌంటర్‌లో కూపన్ల జారీని నిలిపివేశారు. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంకన్న దర్శనం అనంతరం మళ్లీ ప్రసాదం టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉండాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరించే విషయంలో టీటీడీ అధికారులు చొరవ చూపించడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్న రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి భవన్ కు ఎఫ్ టిఐఐ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నాం 1.30 గంటలకు వెళ్లనున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రవేశ పెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

చిట్టీల పేరిట మోసం..

రంగారెడ్డి : శంషాబాద్ లోని ఆర్బీనగర్ లో చిట్టీల పేరిట మోసం చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. సుమారు రూ.4కోట్లతో వ్యాపారి శ్యాంసుందర్ పరారు కావడంతో బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

మధ్యాహ్నాం ఎన్డీయే ఎంపీల మార్చ్..

ఢిల్లీ : గురువారం మధ్యాహ్నాం 12.30గంటలకు ఎన్డీయే ఎంపీలు మార్చ్ నిర్వహించనున్నారు. 'సేవ్ డెమోక్రసీ' పేరిట విజయ్ చౌక్ నుండి రాష్ట్రపతి నిలయం వరకు ఈ మార్చ్ నిర్వహించనున్నారు.

కోహ్లీ హాఫ్ సెంచరీ..భారత్ 150/2..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో రోజు ఆట ప్రారంభించింది. కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేశాడు. ధావన్ 66 పరుగులు చేశాడు. రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 150 పరుగులు చేసింది.

10:38 - August 13, 2015

మహేష్‌బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం ఇటీవల వరల్డ్‌వైడ్‌గా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఈ సమావేశానికి ప్రిన్స్ 'మహేష్ బాబు' హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
హీరోయిన్ శృతి హాసన్, జగపతి బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు పాల్గొన్నారు. 'సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం. కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల నుండి యూనానిమస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అప్పట్లో నేను నటించిన 'శుభలగం' సినిమా వర్షాకాలంలో విడుదలైనా ప్రేక్షకులు ఎలా సూపర్‌హిట్‌ చేశారో ఈ సినిమాని అంతకంటే పెద్ద హిట్‌ చేశారు' అని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు నటి శృతి హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. మహేష్‌బాబుతో కలిసి తొలిసారి వర్క్‌ చేశానని, మహేష్‌ వండర్‌ఫుల్‌ యాక్టర్‌ అని కొనియాడారు. సినిమా ఫస్ట్‌ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు సాగుతోందని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. మా బ్యానర్‌లో వచ్చిన తొలిచిత్రం ఘనవిజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) అన్నారు.

రాధే మాకు ముందస్తు బెయిల్..

ముంబై : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాదేమా ముంబై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఉదయం 11గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

10:26 - August 13, 2015

ముంబై : వెండితెరపై ఎవర్‌గ్రీన్ గ్లామర్ క్వీన్ శ్రీదేవి. తరాలు మారినా తరగని అందం. చెక్కుచెదరని సొగసుకు కేరాఫ్ అడ్రెస్ శ్రీదేవి. 30ఏళ్లపాటు వెండితెరను ఏలిన శ్రీదేవికి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అదే క్రేజ్. శ్రీదేవి అందానికే కాదు.. ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ చూసి ఇప్పటి టాప్ హీరోయిన్స్ సైతం షాక్ తింటున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సూపర్‌హిట్ అయ్యేసరికి శ్రీదేవి డేట్స్ కోసం బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా సినిమాలు ఆఫర్స్‌తో ముంచాయి. కానీ శ్రీదేవి మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. శ్రీదేవి ప్రస్తుతం తమిళ చిత్రం 'పులి'లో మహారాణిగా నటిస్తోంది.
తెలుగు చిత్రాలు..
'పదహారేళ్ళ వయసు', 'బుర్రిపాలెం బుల్లోడు', 'కార్తీక దీపం', 'వేటగాడు', 'చుట్టాలొస్తున్నారు జాగ్రత్త', 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు', 'సర్దార్‌ పాపారాయుడు', 'గజదొంగ', 'మోసగాడు', 'ఆకలి రాజ్యం', 'గడసరి అత్త సొగసరి కోడలు', 'గురుశిష్యులు', 'కొండవీటి సింహం', 'ప్రేమాభిషేకం', 'రాణి కాసుల రంగమ్మ', 'ఇల్లాలు', 'సత్యం శివం', 'త్రిశూలం', 'అనురాగ దేవత', 'బొబ్బిలి పులి', 'జస్టీస్‌ చౌదరి', 'కలవారి సంసారం', 'కృష్ణార్జునులు', 'కృష్ణవతారం', 'వయ్యాల భామలు వగలమారి భర్తలు', 'అడవి సింహాలు', 'కిరాయి కోటిగాడు', 'ముందడుగు', 'రామరాజ్యంలో భీమరాజు', 'రాముడు కాదు కృష్ణుడు', 'శ్రీరంగనీతులు', 'ఊరంతా సంక్రాంతి', 'తేనే మనసులు' 'కంచు కాగడ', 'పచ్చని కాపురం', 'వజ్రాయుధం', 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు', 'జయం మనదే', 'ఆఖరి పోరాటం', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'క్షణక్షణం', 'గోవిందా గోవిందా'. విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి, ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవి ఇకపై కూడా మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం..

10:24 - August 13, 2015

హైదరాబాద్ : స్వచ్ఛ్ హైదరాబాద్... గ్రీన్ సిటీ... క్లీన్ సిటీ... విశ్వనగరంగా అభివృద్ధి... అంటూ కోట్లు ఖర్చు పెడుతున్నారు... అటు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా చీపురుపట్టి చెత్త ఊడ్చారు.. అయినా భాగ్యనగరం చెత్తమయంగానే ఉందని తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వ సర్వే.. కనీసం టాప్ హండ్రెడ్‌లో కూడా చోటులేదని స్పష్టం చేసింది.
17 పాయింట్లతో దేశంలో అగ్రస్థానం....
తెలంగాణ రాజధాని హైదరాబాద్ జీవ వైవిధ్య నగరంగా 17 పాయింట్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.. జాతీయ స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ సిటిగా అనేక అవార్డులు పొందింది.. ఇప్పుడు మాత్రం డర్టీ సిటీగా మారిపోయింది... ఆదాయంపైనే ఫోకస్ పెట్టిన  జీహెచ్ ఎంసీ అధికారులు క్లీనింగ్‌ను గాలికొదిలేశారు.. దీంతో కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ భారత్‌ ర్యాంకింగ్‌లో 275వ స్థానం సాధించి చెత్త సిటీల సరసన చేరింది...
దేశంలోని 476 నగరాల్లో సర్వే....
దేశంలోని 476 నగరాల్లో ప్రజాజీవనం, అక్కడి మౌలిక సౌకర్యాలు, పారిశుధ్యంపై తాజాగా కేంద్రం కొందరు అధికారులతో స్టడీ చేయించింది..

ఇందులో భాగ్య నగరానికి 275 ర్యాంకింగ్ రాగా... మిగతా నగరాలు చోటుకూడా దక్కించుకోలేకపోయాయి.. టాప్ టెన్ లో మైసూర్, తిరుచునాప‌ల్లి, ముంబాయి, హ‌స‌న్, కొచ్చి, తిరువ‌నంత‌పురం, బెంగళూరు, పశ్చిమబెంగాల్‌లోని అలిశాహ‌ర్, సిక్కిం రాజ‌ధాని గ్యాంగ్‌టక్ బెస్ట్ సీటీలుగా గుర్తింపుపోందాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ రాజధాని కనీసం టాప్ 100లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది..
స్వచ్ఛ్ హైదరాబాద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రులు....
తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఎక్కువగా హైదరాబాద్‌పైనే దృష్టిపెట్టారు.. సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచాతామ‌ని....... విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని... పాత‌బ‌స్తీని ఇస్తాంబుల్ గా మార్చుతామని ప్రకటించారు.. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.. న‌గ‌రాన్ని 400విభాగాలుగా విభ‌చించి ...... ఉన్నతాధికారులు నోడల్ ఆఫీసర్లుగా... మంత్రులు, ఎమ్మెల్యేలుకూడా ఇందులో పాల్గొన్నారు.. సికింద్రాబాద్ పార్శీగుట్ట ఇంచార్జీగా ఉండిమరీ స్వయంగా చెత్త ఎత్తారు కేసీఆర్.. అయినా ఎలాంటి ఫలితంలేదని తేల్చిచెప్పింది కేంద్ర సర్వే..
గ్రేటర్లో రోజుకు 3వేల 800 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి....
ప్రతిరోజూ గ్రేటర్లో 3వేల 800మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.. ఈ చెత్త సేకరణ, తరలింపుకు 28వేల మంది కార్మికులు రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. స్వచ్ఛ్ హైదరాబాద్ లోభాగంగా 5వేల మెట్రిక్ టన్నుల చెత్తను బయటకు పంపామని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.. మరోవైపు ఇదంతా ప్రచారం ఆర్భాటమేనని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. ప్రణాళకాబద్దంగా వ్యవహరిస్తేనే సిటీ క్లీన్ అవుతుందని సూచిస్తున్నారు..
వీధి దీపాలు, రోడ్లు, పారిశుధ్య నిర్వహణ
అటు జీహెచ్ ఎసీ తన పనులు వదిలేసి ఇతర పనులతో టైంపాస్ చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.. ప్రధానంగా వీధి దీపాలు, రోడ్లు, పారిశుధ్య నిర్వహణతోపాటు.. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ప్రస్తుతం నిఘా కెమెరాలు, సబ్సిడీ వాహనాలు, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, 5రూపాయలకు భోజనం, సాగర్ ప్రక్షాళణలాంటి పనుల్లో కీలకపాత్ర పోషిస్తోందని జనాలు విమర్శిస్తున్నారు..
అవసరమైన యంత్రంగా పటిష్టంగా ఉండాలి...
నగరం స్వచ్ఛంగా ఉండాలంటే అందుకు అవసరమైన యంత్రంగా పటిష్టంగా ఉండాలి... కార్మికులు, వారి పనిముట్లు, చెత్తను తరలించే వాహనాలు అన్నీ సక్రమంగా ఉండాలి... అలాగే నేతలు, అధికారుల్లో చిత్తశుద్దిగా వ్యవహరించాలి.. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములుగా చేసినప్పుడే భాగ్య నగరం బెస్ట్ సిటీగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది..

ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో జరుగుతున్న ఈ సమావేశానికి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, రామ్ విలాస్ పాశ్వాన్, ఇతరులు హాజరయ్యారు. 

రాదేమాపై నటి ఫిర్యాదు..

ముంబై : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాదేమాపై నటి డాలీ బింద్రా పోలీసులకు మలాడ్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. తనను రాదేమా బెదిరించిందని ఫిర్యాదులో ఆరోపించింది.

భారత్ 134/2...

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ధావన్ 56, కోహ్లీ 48 క్రీజులో ఉన్నారు. 

బీచ్ రోడ్డులో పంద్రాగష్టు వేడుకల రిహార్సల్స్..

విశాఖపట్టణం : బీచ్ రోడ్డులో పంద్రాగష్టు వేడుకల రిహారల్స్ నిర్వహిస్తున్నారు. పోలీసు బెటాలియన్లు, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సంస్థలకు చెందిన సభ్యులు కవాతు నిర్వహించారు. శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రాముడు వెల్లడించారు.

 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..

ముంబై : గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 230 పాయంట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 60 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. 

ప్రారంభమైన సిసిపిఎ సమావేశం..

ఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతనలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్, ముక్తార్ అబ్బాస్, నజ్మా హెప్తులా, ప్రకాష్ జవదేకర్ లు హాజరయ్యారు. 

ఢిల్లీ - యూపీ సరిహద్దులో విస్తృత తనిఖీలు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ - ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న సందర్భంగా పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనితో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

యువతిపై తండ్రి కొడుకుల అత్యాచారం..

రంగారెడ్డి : బషీరాబాద్ (మం) టాకీతండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై తండ్రి కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. అత్యాచారానికి పాల్పడిన తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. 

సాంకేతిక లోపంతో నిలిచిన పినాకినీ ఎక్స్ ప్రెస్

ప్రకాశం: విజయవాడ నుండి చెన్నై వెళ్తోన్న పినాకినీ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కరవది స్టేసన్ లో రైలు నిలిచిపోయింది. అధికారులు సాంకేతిక లోపాని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ప్రకాశం : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్

జమ్మూ కశ్మీర్ : మరోసారి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీలో కృష్ణా ఘాట్, భీమ్బర్గలి, ఫల్లన్ వాలా, షోపియాన్ సెక్టార్లలో పాక్ కాల్పులకు తెగబడింది.

పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ ఏడాది కూడా గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం గోల్కొండ కోట వద్ద ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పారా మిలిటరీ దళాలు రిహార్సల్స్ చేశాయి. పాఠశాలల విద్యార్థులు కూడా రిహార్సల్స్ లో పాల్గొన్నారు. వీఐపీలు రానుండడంతో ఈ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కిందటి పర్యాయం కొన్ని లోపాలు చోటుచేసుకున్న దరిమిలా, తెలంగాణ సర్కారు ఈమారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.  

08:35 - August 13, 2015

హైదరాబాద్: లోక్ సభలో సుష్మాస్వరాజ్ పై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి ప్రత్యారోపణలు చేయడం దారుణం అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పై సుష్మా చేసిన ఆరోపణలు నిజమే.. కానీ? స్కాం ఇండియా బదులు స్కిల్ ఇండియా తెస్తామన్న బిజెపి సుష్మా స్టిల్ ఫుల్ గా లలిత్ మోదీకి సహకరించారు. నేరస్థుని పక్షాన నిలబడిన సుష్మా ఎందుకు రాజీనామా చేయడంలేదు? లలిత్ మోడీ కి సుష్మా కుటుంబ సభ్యులు సహకరించారా లేదా? సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సంస్కారాన్ని కోరారో అదే సంస్కారాన్ని అధికారంలోకి వచ్చాక ఎందుకు ప్రదర్శించడంలేదు? నోటుకు ఓటు కేసు లో చట్టబద్ధతపై అనుమానాలు కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని నాగేశ్వర్ తెలిపారు. ఈ అంశాలపై మరింత విశ్లేషణాత్మకమైన వివరణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ప్రకాశం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య..

ప్రకాశం : ఆర్థిక సమస్యలతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. మండలంలోని నల్లగుంట్ల గ్రామానికి చెందిన రైతు శోమానాయక్ (40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుమార్తె పెళ్లి కోసం తెలిసిన వారి దగ్గర కొంత మేరకు అప్పులు చేశాడు. గత ఏడాది పంట దిగుబడి సరిగా లేక పోవడంతో అప్పులు పెరిగాయి. బకాయిలు ఎలా చెల్లించాలో అని తీవ్ర మనోవేదనకు గురై గురువారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఆదిలాబాద్ జిల్లాలో పొంగిన వాగులు...

ఆదిలాబాద్ :సిర్పూరు డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో బెజ్జూరు మండలంలోని కుక్కడ, కుష్ణపెల్లి, రేచిని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగులవాయి గ్రామ చెరువుకు గండి పడి పొలాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పంద్రాగస్టు వేడుకలకు తీరం వెంబడి భద్రత...

విశాఖ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖ తీరం వెంబడి సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీలు చేయడంతోపాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ గన్ మన్ కు నోటీసులు...

హైదరాబాద్ : ఒడిశా వ్యాపారిపై దౌర్జన్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ మన్ కు పెందుర్తి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ గన్ మన్ మధుసూదన్ రెడ్డితో పాటు మరో వ్యక్తికి కూడా నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

 

ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు..

అనంతపురం : తాడిపత్రి మండల కేంద్రంలో ఓ ఏటీఎం కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని యల్లనూరు రోడ్డులో గల ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు రెండు మిషన్‌లు పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 

ఓయూ మాజీ అధ్యాపకుడికి జాతీయ అవార్డు...

హైదరాబాద్ : ప్రముఖ పర్యావరణ వేత్త, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ కే.పురుషోత్తంరెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. క్యాపిటల్‌ ఫౌండేషన్‌ జస్టిస్‌ కుల్దీప్‌సింగ్‌ నేషనల్‌ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. పర్యారవరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. ఈనెల 21న జరుగనున్న కార్యక్రమంలో ఛత్తీస్‌ఘడ్‌ సీఎం రమణ్‌సింగ్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకుంటారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయనను ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఈ. సురేష్‌కుమార్‌, ఇతర అధ్యాపకులు అభినందించారు.

ఊటీని తలపించేలా సీడ్ క్యాపిటల్

గుంటూరు: వేసవి వచ్చిందంటే మండుటెండ.. 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఉష్ణోగ్రత.. ఇంట్లో ఉన్నా, బయటికి వచ్చినా చెమట కక్కే ఉక్కపోతతో వాతావరణం రాజధాని ప్రాంతంలో బయపెడుతుంటుంది. అమరావతి రాజధాని ప్రణాళికలు రూపొందించే క్రమంలో క్షేత్ర పర్యటనకు వచ్చిన సింగపూర్‌ దేశ ప్రతినిధులు కూడా ఈ వాతావరణాన్ని చూశారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ముఖ్యంగా సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణ ప్రాంతంలో చల్లని వాతావరణం ఉండేలా చూసేందుకు ప్రణాళికను రూపొందించి ఇచ్చారు. 

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా:35 మందికి గాయాలు...

నిజామాబాద్ : హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కామారెడ్డి మండలం అడ్లూరు దగ్గర బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిని ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. 

వివాదంలో మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే...

హైదరాబాద్: మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన చెప్పులను సిబ్బందితో మోయించడం మీడియాలో కనిపించింది. రాష్ట్రంలో కరవుతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో... పర్భని జిల్లా సోన్ పేట్ వచ్చిన పంకజ బురదతో కూడిన రోడ్డుపై నడిచేందుకు వీలుగా తన స్లిప్పర్స్ ను విడిచారు. ఆమె సిబ్బందిలోని ఓ వ్యక్తి ఆ చెప్పులను చేతబట్టుకు రావడం మీడియా కెమెరాలకు చిక్కింది. ఈ క్లిప్పింగ్ వార్తా చానళ్లలో విశేషంగా ప్రసారమైంది. ఇకేముందీ... విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్టయింది. ఆమెది అహంకారపూరిత ధోరణి అంటూ కాంగ్రెస్ విమర్శించింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం....

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

07:01 - August 13, 2015

హైదరాబాద్ : లలిత్‌ గేట్‌ అంశంపై లోకసభ దద్దరిల్లింది. కాంగ్రెస్‌- బిజెపిలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ రక్తి కట్టింది. లలిత్‌ మోదిలో విషయంలో సుష్మ చట్టాన్ని ఉల్లంఘించారని, ఆమె రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ తనపై చేసిన ఆరోపణలపై సుష్మస్వరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖత్రోచి నుంచి బోఫార్స్‌ వరకు కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలను ఎండగట్టారు.

ఎట్టకేలకు లలిత్ గేట్ వివాదంపై లోక్‌సభలోచర్చకు ....

ఎట్టకేలకు లలిత్ గేట్ వివాదంపై లోక్‌సభలోచర్చకు మోది సర్కార్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌ లేవనెత్తిన ఆరోపణలపై విపక్షాల నినాదాల మధ్య సుష్మా స్వరాజ్‌ ధీటైన సమాధానమిచ్చారు. అధికారంలో ఉండగా తప్పుల మీద తప్పులు చేసింది కాంగ్రెస్ నాయకులే తప్ప.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఖత్రోచీ నుంచి బోఫోర్స్ వరకు కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ సుష్మా స్వరాజ్ ప్రస్తావించారు. 15 వేల మంది మరణానికి కారణమైన ఆండర్సన్ను దేశం నుంచి దాటించింది కాంగ్రెస్ నాయకత్వం కాదా అని సుష్మా నిలదీశారు. క్విడ్ ప్రో కో ప్రకారమే ఆండర్సన్ను దేశం దాటించారని ఆరోపించారు.

17 ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు సహాయం చేయడం తప్పా....

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ ఆయన భార్య నళినీ చిదంబరాన్ని తమ న్యాయవాదిగా నియమించుకోవడం తప్పుకాదా అని సుష్మా కాంగ్రెస్‌ను నిలదీశారు. లలిత్ మోదీ పాస్‌పోర్టు విషయంలో తన భర్త న్యాయవాదిగా వ్యవహరించలేదన్నారు. తన కూతురు 9వ నెంబరు జూనియర్ అని, ఆ నెంబరులో ఉండే న్యాయవాదికి డబ్బులెవరిస్తారని సుష్మా ప్రశ్నించారు. 17 ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు సహాయం చేయడం తప్పా అన్నారు. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు.

లలిత్‌గేట్‌ అంశంపై 7 ప్రశ్నలను సంధిస్తూ...

చర్చలో భాగంగా అంతకు ముందు కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లలిత్‌గేట్‌ అంశంపై 7 ప్రశ్నలను సంధిస్తూ వీటికి ప్రధాని మోది సమాధానం చెప్పాలన్నారు. సుష్మా స్వరాజ్ వ్యక్తిగతంగా లలిత్ మోదీకి సాయం చేశారని, అతని భార్యను కాపాడటం కోసం మోదీకి ఎలా సాయం చేస్తారని ఖర్గే ప్రశ్నలు సంధించారు. చట్టాన్ని ధిక్కరించిన సుష్మా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఖర్గే స్పష్టం చేశారు. వసుంధర రాజే గురించి ఖర్గే లోక్‌సభలో ప్రస్తావించినప్పుడు సభలో లేని వారి గురించి ప్రస్తావించొద్దని స్పీకర్ సూచించారు. రాజస్థాన్‌ మద్దతుతోనే లలిత్‌ మోది మిలియనీర్‌ అయ్యాడని ఖర్గే ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని మౌనం వీడి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సోనియా ఉగ్రరూపం ....

లోక్‌సభలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఉగ్రరూపం చూపించారు. ఖర్గే మాట్లాడుతుండగా బిజెపి ఎంపి సతీష్‌ గౌతం బ్లాక్‌ మనీ అంశాన్ని ప్రస్తావిస్తూ సోనియాగాంధీని పదే పదే టార్గెట్‌ చేశారు. దీంతో మండిపడ్డ సోనియా స్పీకర్‌ పోడియాన్నిచుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ విపక్షాలు హంగామా చేశాయి. జిఎస్‌టి బిల్లుపై చర్చ జరగకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. కార్పేరేట్ల సర్కార్‌ను సాగనివ్వమంటూ నినాదాలు చేశారు. విపక్షాల గందరగోళం మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. ఈ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు పాస్‌ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

మొండిగా వ్యవహరించిన కేంద్రం ప్రతిపక్షాల ఆందోళనతో.....

లలిత్‌గేట్‌ అంశంపై వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మొండిగా వ్యవహరించిన కేంద్రం ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చింది. కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై ఎట్టకేలకు చర్చకు స్పీకర్ సుమిత్ర మహాజన్ అంగీకరించారు.

06:57 - August 13, 2015

హైదరాబాద్ : సినిమాల్లో హీరోలు కార్లతో చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. కార్లను బోల్తా కొట్టించడం, వీలైతే ఒంటి చేత్తో కార్లను మట్టికరిపించడం లాంటి ఫీట్లు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇక కదులుతున్న కార్లమీదకు జంప్‌ చేయడం, ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా తప్పించుకోవడం లాంటివి ఎన్నో ఛేజింగ్‌ సీన్లలో చూసే ఉంటాం. కానీ ఇలాంటి ఫీట్లు నిజజీవితంలో ఊహకు కూడా అందవు. ఎందుకంటే కదులుతున్న కారుకు ఎదురెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే. కానీ ఇలాంటి చెలగాటానికి ఒక వ్యక్తి సై అంటూ ఎదురెళ్లాడు. సినీఫక్కీలో జరిగిన సంఘటనేంటో ఇప్పుడు చూద్దాం.
నవీ ముంబాయిలో....
ఈ సంఘటన నవీ ముంబాయిలో చోటుచేసుకుంది. ఇదేదో మామూలు యాక్సిడెంట్‌ కాదు. కారు వైపర్‌ను పట్టుకుని వేలాడుతున్న ఈ వ్యక్తి తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా కారుకి ఎదురెళ్లాడు. అచ్చం సినిమాల్లో లాగే.. జరిగిన ఈ ఘటన నవీ ముంబాయిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనలో ఓ కారు డ్రైవర్ అతడి కారుపై మరో వ్యక్తి వేలాడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాదాపు 300 మీటర్లు నడిపాడు.
ఓ కారు డ్రైవర్, ఓ బస్సు డ్రైవర్తో గొడవ....
అసలు విషయానికి వస్తే నవీ ముంబయిలో ఓ కారు డ్రైవర్, ఓ బస్సు డ్రైవర్తో గొడవపడ్డాడు. అంతేకాదు చేయి చేసుకున్నాడు కూడా. ఆ వెంటనే పారిపోయేందుకు కారు డ్రైవర్ ప్రయత్నం చేస్తుండగా బస్సు డ్రైవర్ వెళ్లి ఏకంగా కారు ముందు భాగంపై దూకాడు. అయినా, అతడు కారు వేగంతో ముందుకు పోనివ్వడంతో బస్సు డ్రైవర్ కిందపడకుండా కారు వైపర్ సహాయంతో ఆగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరకు కారు 300 మీటర్లు దూసుకెళ్లి ఆగింది. కారు నడిపిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

06:53 - August 13, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్ గులాబీమయమైంది. కేసీఆర్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం జరిగింది. ఆగస్టు 17న చేపట్టే గ్రామ జ్యోతి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ప్రతిఒక్కరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
గుడ్డిగా ఏ నిర్ణయాలు తీసుకోం-హరీశ్ రావు....
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుడ్డిగా ఏ నిర్ణయాలు తీసుకోదని మంత్రి హరీష్‌రావు అన్నారు. మేనిఫెస్టోలో పెట్టక పోయినా... పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు హరీశ్‌ రావు.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ నిర్ణయం....
ఇక త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని గులాబీబాస్‌ నిర్ణయించారు. రిజర్వేషన్ల ప్రకారమే పదవులను కేటాయించాలని... ఆయన స్పష్టం చేశారు. అర్హులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు. తొలివిడతలో మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గ్రామజ్యోతి పథకాన్ని నేతలు సీరియస్‌గా తీసుకోవాలని నేతలకు సూచించారు కల్వకుంట్ల. తెలంగాణలో స్మార్ట్‌ సిటీల సంఖ్యను పెంచుకోవాలన్నారు. రాష్ట్రంలో మరిన్ని సిటీలను గుర్తించి... స్మార్ట్ సిటీలకు అభివృద్ధి చేసుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

06:51 - August 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ... వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు సీఎం కేసిఆర్‌. హైదరాబాద్ తాజ్ కృష్ణలో సీఐఐ నేషనల్‌ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం.. పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు కేసిఆర్ సమాధానం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ...

తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ... పారిశ్రామిక వేత్తలను పెద్ద ఎత్తున ఆహ్వానించిందని.... దీనిలో భాగంగానే ప్రభుత్వం పలు కంపెనీల నుండి దరఖాస్తులు స్వీకరించిందన్నారు సీఎం కేసిఆర్. ఎలాంటి అవినీతికి తావు లేకుండా మెదటి విడతలో టిఎస్ ఐపాస్‌లో తొలివిడతలో 11 రోజుల్లో 17 కంపెనీలకు ....రెండో విడతలో 12 రోజుల్లో 19 కంపెనీలకు అనుమతిచ్చామని సిఎం కేసిఆర్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ...వీటిని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్ ఇండస్ట్రీయల్ పాలసీ కంటే తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీ బాగుందన్నారు సిఎం కేసీఆర్. ఐటి రంగానికి , టౌన్ షిఫ్‌ల నిర్మాణానికి స్ధలాలు కేటాయిస్తామని .... ఇంక్యూబేషన్ సెంటర్లను త్వరలో నెలకొల్పనున్నట్టు పారిశ్రామిక వేత్తలకు సీఎం వివరించారు. శాటిలైట్ , గేటేడ్ వే కమ్యూనిటీల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్టు కేసిఆర్ వెల్లడించారు.

పుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్తు.....

తెలంగాణలో పుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ...తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని సిఎం కేసిఆర్ చెప్పారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర ప్రణాళికను రూపొందించామని ..రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందన్నారు సిఎం. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెదటి స్థానంలో నిలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ కొరత సమస్యతో ఉండేదని ...రాను రాను విద్యుత్ కొరత సమస్యను అధిగమించిందన్నారు సీఎం కేసీఆర్ .

ప్రధాన కూడళ్లలో మల్టిలెవల్ ఫ్లై ఓవర్లు.....

హైదరాబాద్ నగరంలో ట్రాఫిస్ సమస్య తీవ్రంగా ఉందని ...దీన్ని అదిగమించాల్సిన అవసరం ఉందన్నారు కేసిఆర్ . ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రధాన కూడళ్లలో మల్టిలెవల్ ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వీటికి అనుమతులు మంజూరు చేసినట్టు సిఎం తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేని డల్లాస్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో భారీపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు..టిఎస్.ఛీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తో పాటు సిఐఐ అధ్యక్షలు సుమిత్ మంజూదేర్ ... సిఐఐ ప్రతినిధులు ...పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

06:47 - August 13, 2015

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదా వ్యవహారం రోజురోజుకూ పెద్దదవుతుండటం సీఎం చంద్రబాబు తలనొప్పిగా మారింది. ఓ వైపు విపక్షాల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ప్రత్యేక హోదా కారణంతో రాష్ట్ర బంద్ జరిగింది. ఈ వరుస పరిణామాలు చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. దీంతో ప్రత్యేక హోదాపై ప్రజల ఆగ్రహావేశాలు తగ్గించే పనిలో భాగంగా మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
స్పందించిన చంద్రబాబు...
ఏపీకి ప్రత్యేక హోదా పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. కేంద్రంలోని పలువురు ప్రముఖులతో మాట్లాడానని చెప్పారు. మరో వైపు ఇక కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోలేకపోతే.. అసలుకే మోసం వస్తుందని చంద్రబాబు గ్రహించారని సమాచారం.
బాబే స్వయంగా రంగంలోకి...
ఇక ఎంపీలతో పనికాదని గ్రహించి బాబే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కేంద్రంలోని అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడుతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. హోదా విషయంలో ఇంకా నాన్చడం రెండు పార్టీలకూ మంచిది కాదని చంద్రబాబు గట్టిగానే చెప్పినట్లు సమాచారం. మరో వైపు కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సాంకేతిక కారణాలు అడ్డంగా ఉన్నాయని చంద్రబాబుకు గతంలోనే తేల్చి చెప్పింది. దీంతో ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక ప్యాకేజీ రూపంలోనైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు, మూడు రోజుల్లో సరైన నిర్ణయం ......
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రెండు, మూడు రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబుకు హామీ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15 తర్వాత ఢిల్లీకి వస్తే, సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారని చంద్రబాబు తెలిపారు.
ప్రత్యేక ప్యాకేజీలను విభజన చట్టంలో పెట్టలేదని...
మరోవైపు మన్మోహన్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను విభజన చట్టంలో పెట్టలేదని... అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామంటూ బీజేపీ ఇంత కాలం చెబుతూ వచ్చింది. అలాగే ప్రత్యేక హోదా తుట్టెను కదిలిస్తే మరిన్ని రాష్ట్రాలు ఏపీ తరహాలో డిమాండ్‌ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో నాన్చివేత ధోరణినే తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ప్రత్యేకహోదాపై ప్రజల్లో భావోద్వేగాలు ......
మరోవైపు ఏపీలో రోజు రోజుకీ ప్రత్యేకహోదాపై ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. ఈ ఆ్రగహావేశాలను తగ్గించడానికి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చే పనిలోపడింది టీడీపీ. హోదా కాకపోతే మరో రూపంలో కేంద్రం సాయం వస్తుందని ఆ పార్టీ ఎంపీలు కోరస్‌ అందుకున్నారు.
ప్రత్యేక హోదా తరహాలోనే ప్యాకేజీ అయినా....
ప్రత్యేక హోదా తరహాలోనే ప్యాకేజీ అయిన మోడీ సర్కారు ప్రకటిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత దొరకట్లేదు. ఇప్పటికే ప్రత్యేక హోదా హామీని తుంగలోతొక్కిన మోడీ సర్కారు కనీసం ప్యాకేజీ విషయంలోనైనా ఏపీకి కరుణ చూపిస్తుందా అనే సందేహాలు అన్ని వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి.    

06:43 - August 13, 2015

హైదరాబాద్ : ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తెలంగాణ రాష్ట్రంలో వున్నదో లేదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రభుత్వం కాలేజీలకు బకాయిలు చెల్లించకపోవడంతో అవి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో పై చదువులకు వెళ్లేవారు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తీవ్ర మానసిక వేదన అనుభవించాల్సి వస్తోంది.
తెలంగాణ ఆవిర్భవించి 14 నెలలు అయ్యింది....
తెలంగాణ రాష్ట్రం అవతరించి 14 నెలలైంది. కానీ విభిన్న వర్గాలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యకూ ఇంతవరకూ ఖచ్చితమైన, స్పష్టమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించలేదు. ప్రతి విషయంలోనూ గందరగోళమే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. కాలం కరిగిపోతోంది తప్ప నికర ఫలితాలు లభించడం లేదు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కు అత్యంత కీలమైన విద్యారంగంలోనూ ఈ దురావస్థ తప్పడం లేదు. కేజీ టు పీజీ, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇలా ఏ విషయంలోనూ అస్పష్టత, గందరగోళమే రాజ్యమేలుతోంది.
ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ పదే పదే.....
తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ పదే పదే గొప్పగా చెబుతున్నారు. మిగులు బడ్జెట్ వుందంటూ మురిసిపోతున్నారు. కానీ, పిల్లల ఫీజు బకాయిలు చెల్లించడానికి చేతులు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రీ ఎంబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2013 ..14 విద్యా సంవత్సరం నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఆ ఏడాదికి సంబంధించిన 370 కోట్ల రూపాయిల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇక గత విద్యా సంవత్సరంలో నయా పైసా చెల్లించలేదు. నిరుడు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విలువ 2500 కోట్ల రూపాయల దాకా వుంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకూ అప్లికేషన్ లే స్వీకరించలేదు. పుష్కరాల హడావిడిలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం మరుగునపడిపోయింది. అప్లికేషన్ లు ఎప్పుడు స్వీకరిస్తారో తెలియదు.
విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా.....
ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ చదువు ముగించిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులతో కరాఖండిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా, పోటీ పరీక్షలు రాయాలన్నా, ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నా కుదరడం లేదు. పాస్ సర్టిఫెకెట్లు సమర్పించనిదే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. పై చదువులకు ప్రవేశం లభించలేదు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలియంది కాదు. విద్యార్థుల అవస్థలు తెలిసి కూడా ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిల విషయంలో నిర్లప్తత ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పై చదువులకు, ఇంటర్వ్యూలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి.  

06:40 - August 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వీటిని చెల్లించకపోవడానికి విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథం లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమానికి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ హాజరయ్యారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss