Activities calendar

15 August 2015

22:41 - August 15, 2015

హైదరాబాద్  : హైదరాబాదీ బ్యాట్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. వరల్డ్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ లో తన ప్రత్యర్థి, ఇండోనేషియా క్రీడాకారిణి వరల్డ్ 29 ర్యాంకర్ లిందావెని ఫనెత్రి పై  21-17, 21-17 తేడాతో ఘన విజయం సాధించింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ రసవత్తర పోరులో సైనా పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. కాగా గతంలో వీరివురు నాలుగు సార్లు తలపడగా సైనా మూడు సార్లు ఫనెత్రిని మట్టి కరిపించింది.  ఇక ఫైనల్ లో  స్పెయిన్ క్రీడాకారిని డిఫెండింగ్ ఛాంపియన్ కరోలినా మారిన్ తో సైనా తలపడనుంది. ఊపుమీదున్న సైనా నెహ్వాల్ ఫైనల్ లో గెలిస్తే చరిత్ర సృష్టించినట్లువుతుంది.

21:49 - August 15, 2015

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్... రెండో సినిమా సిద్ధమవుతోంది. కంచె టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్, ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన పోరాటం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 2 న విడుదల కానుంది.

21:46 - August 15, 2015

జమ్ముకాశ్మీర్‌ : స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌ సంబరాల్లో మునిగి తేలుతుంటే పాకిస్తాన్‌ మాత్రం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్‌ పూంచ్‌ సరిహద్దులో పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈరోజు ఒక్కరోజే పాకిస్తాన్‌ మూడు సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది.

21:40 - August 15, 2015

ఢిల్లీ: 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దులో ఆర్మీ బీటింగ్‌ రిట్రేట్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ బీటింగ్‌ రిట్రేట్‌కు ముందు పంజాబీ కళాకారులు సాంస్కృతికి కార్యక్రమాలతో అలరించారు. పద్మవ్యూహాన్ని తలపించేలా కత్తి యుద్దం, పంజాబీ సాంప్రదాయ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. సరిహద్దులో బీటింగ్‌ రిట్రేట్‌ విన్యాసాలు చూసేందుకు ఇరుదేశాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. భారత్‌ మాతాకీ జై, హిందుస్తాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు మిన్నంటాయి. వాఘా సరిహద్దులో మేళ తాళాలు వాయిద్యాలతో పండగ వాతావరణం కనిపించింది.

 

పాక్ సైన్యం కాల్పులు.. నలుగురు పౌరుల మృతి

జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నేడు పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం మూడు సార్లు కాల్పులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. 

సోమవారం జరుగనున్న ఎపి కేబినెట్ భేటీ వాయిదా

హైదరాబాద్: ఎపి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఎల్లుండి కర్నూలులో సీఎం పర్యటించనున్నారు. దీంతో సోమవారం జరుగనున్న ఎపి కేబినెట్ వాయిదా పడింది.

 

21:23 - August 15, 2015

సామాజిక, ఆర్థిక పరంగా స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని వక్తలు తెలిపారు. 69 వ స్వాంతంత్ర్య దినోవత్సవం సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు, ప్రొ.విశ్వేశ్వరరావు, ప్రజ్ఞ భారతి చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, దిహన్స్ ఇండియా ఎడిటర్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ పాల్గొని, మాట్లాడారు. దేశంలో రాజకీయ స్వాంతంత్ర్యం వచ్చింది..కానీ సామాజిక పరంగా సామానత్వం రాలేదని వక్తలు అభిప్రాయపడ్డారు. పేదలు మరింత పేదలు అవుతున్నారు.. ధనికులు మరింత ధనికులవుతున్నారని వాపోయారు. ఈ పరిణామం దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులుగా క్రిమినల్స్, గుండాలు, అవినీతి పరులు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభల్లో ప్రజా సమస్యలపై చర్చించే వారు కరువయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికీ అన్ ఎంప్లాయ్ మెంట్ ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లేదన్నారు. ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డతోపాటు విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని.. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆధిపత్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు. వక్తలు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాష్ట్రపతి భవన్ లో 'ఎట్ హోం'...

ఢిల్లీ: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ప్రధాని మన్మోన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు హాజరయ్యారు. 

పాక్ సరిహద్దులో పంద్రాగస్టు వేడుకలు..

హైదరాబాద్: పంజాబ్ లోని అట్టారి వద్ద వాఘా సరిహద్దులో సరిహద్దు భద్రత బలగాలు స్వాతంత్య్రదినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. కానీ సంప్రదాయం ప్రకారం.. పాకిస్థాన్, భారత్ లు మిఠాయిలు పంచుకునే కార్యక్రమాన్ని మాత్రం నిర్వహించ లేదు. 

న్యూజెర్సీలో ఇండియా డే పరేడ్...

హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ పట్టణంలో ఇండియా డే పరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. సుమారు 38 వేల మంది పరేడ్ లో పాల్గొన్నారు. 

18:55 - August 15, 2015

నెల్లూరు: జిల్లాలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి చోటుచేసుకుంది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో.. మంత్రి నారాయణ జెండా ఆవిష్కరిస్తుండగా.. దారం తెగిపడి జెండా కిందపడబోయింది. పక్కనే ఉన్న ఎస్పీ వెంటనే జాతీయ జెండాను ఒడిసిపట్టుకున్నారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు. ఈఘటనపై మంత్రి నారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చ నీయాంశమైంది.

 

18:52 - August 15, 2015

చిత్తూరు: జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఎంపిడివో కార్యాలయంలో జెండా ఆవిష్కరించేందుకు వచ్చారు ఎంపిపి గంజి మాధవయ్య..తీరా జెండా ఎగురవేసే సమయానికి జాతీయ పతాకం మొరాయించింది.. జెండా పైనే చిక్కుకుపోయింది. జెండా కర్రను పదేపదే కదిలించడంతో... త్రివర్ణపతాకం కిందపడిపోయింది.. ఆ తర్వాత సరిచేసి తిరిగి కట్టి జెండా ఎగురవేశారు.

 

18:48 - August 15, 2015

విశాఖ: సర్వాంగసుందరంగా ముస్తాబైన విశాఖ ఆర్కే బీచ్‌లో 69వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు జెండావిష్కరణ చేశారు. విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య పోలీసులు, సైనికుల కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది.
అంకిత భావంతో పనిచేస్తాం
కార్యక్రమంలో భాగంగా పోలీసు విభాగానికి చెందిన పలువురికి చంద్రబాబు అవార్డులు బహుకరించారు. అనంతరం రాష్ర్ట ప్రజలనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని, ఇతర రాష్ర్టాలతో పోటీగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం కూడా సాయం చేయాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వరకు అంకిత భావంతో పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తికాక ముందే నదుల అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో.. పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.
సాగరతీర రహదారి కొత్త శోభ
స్వాతంత్య్రదినోత్సవాల సందర్భంగా.. సాగరతీర రహదారి కొత్త శోభ సంతరించుకుంది. సామాన్య ప్రజలందరూ స్వాతంత్య్ర వేడుకలను వీక్షించేలా భారీ ఏర్పాట్లు చేశారు. వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకలను వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వీక్షించారు. ప్రదర్శనలో వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన శకటాలు అబ్బురపర్చాయి. ముఖ్యంగా స్మార్ట్‌ సిటీ శకటం అందర్నీ ఆకట్టుకుంది. సాగర తీరాన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గిరిజన నృత్యాలు
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గిరిజన నృత్యాలు ఆద్యంతం అలరించాయి. విజన్‌ అమరావతి పేరుతో నిర్వహించిన విద్యార్థుల ప్రదర్శన ఆలోచింపజేసింది.

 

18:42 - August 15, 2015

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, చీఫ్ జస్టిస్ భోస్లే, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. కాగా గవర్నర్ తేనీటి విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. 

రాజ్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, చీఫ్ జస్టిస్ భోస్లే, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. కాగా గవర్నర్ తేనీటి విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. 

పాక్ సైన్యం కాల్పులు.. ముగ్గురు పౌరుల మృతి

జమ్మూకాశ్మీర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇవాళ పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం మూడు సార్లు కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. 

18:29 - August 15, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గోల్కొండ కోటలో జరిగిన రెండవ స్వాతంత్ర్య దినోత్సవాలు అంబరాన్నంటాయి. గోల్కొండ కోటలోని రాణిమహల్‌ వేదికగా జరిగిన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర వైభవానికి గోల్కొండకోట నిలువెత్తు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. రెండవసారి స్వాంతంత్ర్య దినోత్సవాలు గోల్కొండ కోటలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సంక్షేమరంగంలో తెలంగాణ నంబర్‌వన్
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధించామన్నారు. సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో 28 వేల కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో తెలిపారు. రుణమాఫీ కింద రైతులకు 2 విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించామన్నారు. ధరల స్థిరీకరణకు రూ.400 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇంటింటికీ నీళ్లు అందించేందుకు ఉద్దేశించిన 'జలహారం' కల సాకారం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో తాగునీటి కోసం ఉత్తర, దక్షిణ భాగాల్లో 30 టీఎంసీల సామర్థ్యంతో 2 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. సమైక్య పాలనలో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
రూ.25వేల కోట్లతో గ్రామాల అభివృద్ధి
ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామ జ్యోతిలో భాగంగా రూ.25వేల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య పనుల కోసం ప్రతి గ్రామానికి రిక్షాలు అందిస్తామన్నారు. రాష్ట్రాభివృధ్ధిని చూసి ప్రపంచ ఆర్థిక వేదిక ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని సీఎం తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పతాకావిష్కరణకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. డప్పువాయిద్యాలు, నృత్యాలు, పేర్ని శివతాండవం, భక్తిగీతాలు ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

 

18:15 - August 15, 2015

నిజామాబాద్ : ఆవగింజలని అందరూ.. కూరల్లో తాళింపుకోసమే వాడతారు. కానీ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. ఆవగింజలని అక్షరాలుగా మార్చుకున్నాడు. ఆవగింజలపై దేశభక్తి గీతాలు, దేవతల అష్టోత్తరాలు మొదలైనవి రాస్తూ అబ్బుర పరుస్తున్నాడు. సృజన ఉండాలే కానీ.. కళాకారుడికి ఏ వస్తువైనా అందమైన కాన్వాసేనని చాటి చెబుతున్నాడీ యువకుడు.
ఆవగింజలతో అద్భుతాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మెట్ట వినోదాచారి.... ఆవగింజలతో అద్భుతాలు చేస్తున్నాడు. అతిచిన్న సైజున్న ఆవగింజపై ఓపిగ్గా అక్షరాలు రాసి అబ్బురపరుస్తున్నాడు. ఇటీవలే 165 ఆవగింజలపై దేశభక్తి గీతాన్ని రాసి స్థానికులను విస్మయానికి గురిచేశాడు.
ఆవగింజలతో కేసీఆర్ చిత్రం తయారీ
ఆవగింజలతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రాన్నికూడా తయారుచేశాడు..చారి. కేసీఆర్ విద్యార్థిగాఉన్నప్పుడు ఆయన పాడిన పద్యాన్నికూడా ఆవగింజలపై లిఖించాడు.. ఇవేకాదు.. అయ్యప్పస్వామి అష్టోత్తరాలు.. నూట పది అగ్గిపుల్లలపై దేవీ అష్టోత్తర శతనామావళి రచించాడు.. తన విశిష్ట లక్షణంతో స్థానికంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తెలుగు బుక్‌ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు సంపాదించాడు. చదువుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా తన మేధాశక్తికి, ప్రతిభకు పదును పెడుతున్నాడు ఈ యువకుడు.
చిన్నవయసు నుంచే
చిన్నవయసు నుంచే తనలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు వినోదాచారి. ఇప్పుడు డిగ్రీ చదువుతూనే తన నైపుణ్యానికి పదును పెడుతూ ఔరా అనిపిస్తున్నాడు.. ప్రతిభకు పదును పెడితే.. సాధించలేనిది ఏదీ ఉండదని వినోదాచారి నిరూపిస్తున్నాడు.

 

18:06 - August 15, 2015

జకార్తా: భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ తొలిసారిగా చేరి..రజత పతకం ఖాయం చేసుకొంది. ఇండోనేషియా అన్ సీడెడ్ ప్లేయర్ లిండా వేణి పానేత్రీపై సైనా వరుస గేమ్ ల విజయం సాధించింది. ఆదివారం జరిగే టైటిల్ సమరంలో ప్రపంచ నెంబర్ వన్, ప్రస్తుత చాంపియన్ కారోలిన్ మారిన్ తో పోటీపడుతుంది. ప్రస్తుత టోర్నీలో సైనా 2వ సీడ్ గా టైటిల్ వేటకు దిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మెడల్ రేస్ లో సైనా మాత్రమే మిగిలింది. సింధు, జ్వాలా, కశ్యప్, శ్రీకాంత్, ప్రణయ్..అందరూ ఇంతకుముందే పరాజయం పొందారు.

 

18:00 - August 15, 2015

ఆదిలాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో..ఆదిలాబాద్ జిల్లాలో యూరియాకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరగా చేసుకున్న కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో రైతులు వారి కుటుంబ సభ్యులతోపాటు తెల్లవారుజాము నుంచే యూరియా గోదాములకు బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా..అధికారులు, పాలకులు స్పందించి వెంటనే తమకు యూరియా బస్తాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

 

17:54 - August 15, 2015

వరంగల్: స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోరుతూ..భూమి కోసం, భుక్తి కోసం బానిస బంధాల విముక్తి కోసం తిరగబడ్డ పోరుగడ్డ అది. దొరల గుండెల్లో ఫిరంగులై పేలిన యోధులకు పురుడు పోసిన పుణ్య భూమి అది. 'నీ భాంచెన్ కాల్మొక్తా' అంటూ చేతులు జోడించి బంధూకులు, బరిసెలు పట్టి రణ నినాదం చేసిన వీరుల చరిత్ర అది. తాడిత, పీడిత జనం కోసం జరిగిన సమరంలో రాక్షస రజాకార్లు మరు భూమిగా మార్చిన జలియన్ వాలాబాగ్. నైజాంల చీకటి రాజ్యానికి సజీవ సాక్ష్యంపై టెన్‌టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ సాయుధపోరాట అమరుల స్మారకార్థం పరకాలలో ఓ నిర్మాణం రూపొందించారు. అక్కడి నిర్మాణం...తెలంగాణ సాయుధ పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమాయక ప్రజల్ని తుపాకీతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు అని చెప్పడానికి సజీవ సాక్ష్యమే ఆ నిర్మాణం.
తెలంగాణ సాయుధ పోరాటం
హైదరాబాద్ సంస్థాన విమోచనం కోసం 1946-48ల మధ్య కాలంలో ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. అపుడు ఈ ప్రాంతాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలిస్తుండేవాడు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు తమ హక్కులను పొందేందుకు సాయుధ పోరాటమే మార్గమైంది. ఈ పోరాటానికి కేంద్రంగా వరంగల్, అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్న పరకాల పట్టణాలు అగ్రగామిగా నిలిచాయి.
పరకాల పట్టణ కేంద్రంగా పోరాటం ఉగ్రరూపం
పరకాల పట్టణ కేంద్రంగా తెలంగాణ సాయుధపోరాటం ఉగ్రరూపం దాల్చింది. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఇక్కడి ప్రజలు ముందుకు కదిలారు. సెప్టెంబర్ 2, 1947న పరకాలలో జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతినబూని వేలాది మంది ప్రజలు జాతీయ జెండాలు చేతబూని ముందుకు కదిలారు. అప్పటికి దాదాపు 4వేల మంది ప్రజలు పరకాల పట్టణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి మిలిటరీ పోలీసులు, రజాకార్ల మూకలు మాటువేసి ఉన్నారు. అప్పటి పరకాల తాలుకా తహసీల్దార్ విష్ణేశ్వరరావు ఆజ్ఞ వేస్తే కాల్పులు జరిపేందుకు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ జియావుల్లా ఖాన్ సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎవరి మాట విననంతా ఉద్రేకంతో, ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదిలారు. దీంతో ఒక్కసారిగా సాయుధ పోలీసు బలగాలు ఉన్న లారీ ముందుకు దూసుకొచ్చింది. కాల్పులు జరపాల్సిందిగా తహసీల్దార్ ఆదేశించడంతో..వెంటనే కాల్పులు మొదలయ్యాయి. మూడురంగుల జెండా పట్టుకుని ముందువరసలో నడుస్తున్న శ్రీశైలం అనే యువకుడిపై తుటాల వర్షం కురిసింది. అక్కడికక్కడే శ్రీశైలం మరణించాడు. ఓ వైపు పోలీసుల కాల్పులు మరో వైపు రజాకార్ల పాశవిక హత్యాకాండతో కొద్ది సేపట్లోనే ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది. అధికారికంగా మొత్తం 15 మంది చనిపోయారు. అనధికారికంగా మరో 25 మంది చనిపోయారని సమాచారం. అంతేకాదు..వందలాది మందికి గాయాలుకాగా..వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
పరకాల పట్టణ కేంద్రంగా సాయుధపోరాటం
అనాటి ఘటనలకు సజీవ సాక్ష్యమే ఈ అమరధామం శిల్పాలు నిలుస్తాయి. పరకాల ప్రజల పోరాటం కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. ఇక్కడి ప్రాంత ప్రజల స్వేచ్చా స్వతంత్ర్యాలు కోరుతూ అసువులు బాసిన వారి చరిత్ర కనుమరగయే ప్రమాదం ఉండడంతో..ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు అప్పటి కేంద్ర హోంశాఖ సహయ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు సెప్టెంబర్‌ 17, 2003లో అమరుల త్యాగాల గుర్తుగా ఈ అమరధామాన్ని నిర్మించారు.
పరకాల అమరధామం
పరకాల ప్రజలు వీరోచిత పోరాటానికి సజీవ సాక్షంగా నిలిచింది పరకాల అమరధామం. అయితే వారి త్యాగాలు, పోరాటాలు ఫలించిన వైనానికి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. నిజానికి అందరూ అనుకుంటున్నట్లగా తెలంగాణ ప్రాంతానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్ర్యం రాలేదు. సెప్టెంబర్‌ 17న నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్ర్యం లభించింది.

 

17:33 - August 15, 2015

హైదరాబాద్: వికలాంగులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆకాంక్షించారు. వికాలాంగుల సహాయార్థం ఆదిత్యమెహతా ఫౌండేషన్, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌, బీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో లోకేష్ పాల్గొన్నారు. దేశంలో 2 కోట్ల 60 వేల మంది వికలాంగుల కోసం ఆదిత్యా మెహతా చేస్తున్న కృషి అభినందనీయమని లోకేష్‌ కొనియాడారు. ఆయన కృషికి ఎన్టీఆర్‌ ట్రస్టు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

సైనా సంచలనం..

జకార్త : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సైనా సంచలనం సృష్టించింది. ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. ఇండోనేషియా ప్లేయర్ పానేత్రిపై 21-17, 21-17తో గెలుపొందింది. ఫైనల్ లో నెంబర్ వన్ క్రీడాకారిణి మారనితో సైనా ఢీకొననుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో సైనా పరాజయం చెందితే రజత పతకం గెలువనుంది.

17:16 - August 15, 2015

హైదరాబాద్: అసమానతలకు వ్యతిరేకంగా పోరాడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తమ్మినేని వీరభద్రం జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత 'స్వాతంత్ర్యం సామాజిక న్యాయం' అంశంపై సెమినార్ జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. అసమానతలకు వ్యతిరేకంగా, అట్టడుగు వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వామపక్ష, సామాజిక, అభ్యుదయ, శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంతకముందు ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడారు. సమాజంలో కొన్ని వర్గాలకే స్వాతంత్ర్యం వచ్చిందని, అట్టడుగు వర్గాల వారికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదని ఐలయ్య అన్నారు. ఈ వేడుకల్లో వివిధ సంఘాల నేతలు, మేధావులు, సీపీఎం నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

17:08 - August 15, 2015

ఢిల్లీ: 69 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో దేశప్రజల నుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంపై సిపిఎం పెదవి విరిచింది. మోడీ స్పీచ్‌లో స్లోగన్స్‌ తప్ప ఏమి లేవని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రతిరోజు సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. టీమ్‌ ఇండియా అంటూ మోడీ కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడ రెండు ఇండియాలున్నాయని, అందులో ప్రధాని టీం ఇండియా కార్పోరేట్లేనని, మెజారిటీ ప్రజల ఇండియా మరోటి ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రధాని ప్రస్తావనే లేదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 శాతం ఆత్మహత్యలు పెరిగాయని ఏచూరి తెలిపారు.

 

కాసేపట్లో బీటింగ్ రీట్రిట్ ప్రారంభం..

వాఘా : సరిహద్దులో బీటింగ్ రీట్రిట్ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

17:01 - August 15, 2015

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పూర్తైతే సాగునీటి సమస్య తీరుతుందని ఎపి సీఎం చెప్పారు. పట్టిసీమ వద్ద చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ వద్ద పనుల పురోగతిని స్వయంగా ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలంటూ అధికారుల్ని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఉభయ గోదావరి జిల్లాలకు నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఏటా సగటున 3 వేల గోదావరి నీరు సముద్రంలోకి పోతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి డెల్టాకు, ఉభయగోదావరి జిల్లాలకు నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. నాడు రెండు పంటలకు నీరందించిన ఘనత ఎన్ టిఆర్ దే అని తెలిపారు. ఎంత కరవు వచ్చినా.. పంటలు ఎండిపోకుండా నీరు ఇచ్చామని పేర్కొన్నారు. ఎపిని కరవు రహిత రాష్ట్రం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. 

16:48 - August 15, 2015

హైదరాబాద్ : ఏపీలో పరిశ్రమలకు ప్రత్యేకంగా ఎలాంటి రాయితీలూ ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. విభజన చట్టంలోని హామీల మేరకు డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ ఇచ్చామని.. ఇకపై పరిశ్రమల కోసమంటూ.. కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి ప్రత్యేక నిధులూ రావని స్పష్టం చేసింది. ఈమేరకు.. వైసీపీ అధినేత జగన్‌కు, కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు లేఖలో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ఏపీకి మొండిచేయి చూపిన కేంద్రం.. ఇప్పుడు పారిశ్రామికాభివృద్ధికీ ప్రత్యేక ప్యాకేజీలు ఏవీ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈమేరకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో.. వాణిజ్య, పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రెటరీ ఆశిశ్‌ దత్తా స్పష్టం చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటునందించాలంటూ.. గతంలో ప్రధాని సహా.. పలువురు కేంద్ర మంత్రులకు జగన్‌ లేఖలు రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి ఆశిష్ ద‌త్తా.. ఏపికి ప్ర‌త్యేక హోదా లేనందున.. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల అభివ్రుద్దికి ప్ర‌త్యేక నిధులు కేటాయించ‌లేమ‌ని తెగేసి చెప్పారు.

విభజన చట్టం మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ..
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని రాష్ట్రానికి ఇచ్చామని, ఇకపై ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీకి కేంద్ర నిధులు అందుతాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈలేఖను మీడియాకు విడుదల చేసిన వైసీపీ నేతలు.. కేంద్రం తన వైఖరిని విస్పష్టంగ ప్రకటించినా.. టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు.

హోదాతో పాటు పరిశ్రమలకు రాయితీలూ హుళక్కే..
మెత్తానికి కేంద్రం లేఖ‌తో ప్రత్యేక హోదాయే కాదు.. రాష్ట్రంలో ప‌రిశ్ర‌ల‌కూ రాయితీలు రావ‌ని తేలిపోయింది. ఈనేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా.. పోరును మరింత ఉధృతం చేయాలని వైసీపీ భావిస్తోంది. 

16:44 - August 15, 2015

విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ఎపి సీఎం చంద్రబాబు ప్రకటించారు. పట్టిసీమ వద్ద చంద్రబాబు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ వద్ద పనుల పురోగతిని స్వయంగా బాబు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలంటూ అధికారుల్ని సీఎం ఆదేశించారు.

 

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నేడు పూంఛ్ సెక్టార్ లో మూడుసార్లు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పౌరులకు గాయాలయ్యాయి. 

2018 కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం - చంద్రబాబు..

పశ్చిమగోదావరి : 2018 కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎ చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇన్నేళ్ల స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇంకా సమస్యలున్నాయని, రాష్ట్ర విభజన అనంతరం కష్టాలు మరింత పెరిగాయని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు మన గొట్టారని ఆరోపించారు.

16:36 - August 15, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు రోజుకోమలుపు తిరుగుతుంది. తాజాగా ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. కొందరు ఎపీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు 2, 3 రోజుల్లో తెలంగాణ ఎసిబి నోటీసులు జారీ చేయనుంది. కొందరు ఎపీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలు జెరూసలెం మత్తయ్య, జిమ్మిబాబులకు ఆశ్రయం ఇచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తెలంగాణ ఎసిబి అధికారులు వారికి నోటీసులు జారీ చేయనున్నారు. ఇటీవలే ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఎసిబి లోకేష్ బాబు కారు డ్రైవర్ నోటీసులు జారీ చేసింది. దానికి ప్రతిగా జెరూ సలెం మత్తయ్యను బెదిరించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్ మెన్, కారు డ్రైవర్లకు ఎపి ప్రభుత్వ ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది ఎపి పోలీసు అధికారులు, రాజకీయనేతలకు టిఎసిబి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇదిలావుంటే ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సండ్రతోపాటు జిమ్మిబాబుకు గతంలో తెలంగాణ ఎసిబి నోటీసులు జారీ చేసింది. అయితే సండ్ర ఎసిబి కోర్టుకు హాజరయ్యారు. కానీ జిమ్మిబాబు కాలేదు. 

ఈవ్ టీజర్ల దాడిలో జవాన్ మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : మీరట్ లో ఈవ్ టీజర్లు దాడి చేయడంతో ఓ జవాన్ మృతి చెందాడు. ఓ యువతిని వేధిస్తుండాన్ని ఆపిన జవాన్ పై ఈవ్ టీజర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. 

బీహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి - నితీష్..

బీహార్ : కేంద్రం రాష్ట్రానికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. 

15:58 - August 15, 2015

జకార్తా: గాల్ టెస్ట్ లో సీన్ రివర్స్ అయ్యింది. మొదటి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. స్వాతంత్ర్యదినోత్సవం రోజునే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఘోరపరాజయం ఎదురయ్యింది. 176 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక కొహ్లీ ఆర్మీ చతికిలబడింది. శ్రీలంక స్పిన్ ద్వయం రంగన్ హెరాత్, కౌశల్ ధాటికి కుప్పకూలిపోయింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ కొహ్లీ 3, రోహిత్ శర్మ 4, ఓపెనర్లు రాహుల్ 5, శిఖర్ ధావన్ 28 పరుగుల స్కోర్లకే వరుస కట్టారు. సిరీస్ లోని రెండోటెస్ట్ ఆగస్టు 20 నుంచి కొలంబో సారా ఓవల్ గ్రౌండ్స్ లో ప్రారంభమవుతుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంతో ఉంది.

యూపీలో పేలుడు..ఇద్దరు చిన్నారుల మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలోని ఝాన్సీలో సైనిక శిక్షణ కేంద్రం వద్ద మధ్యాహ్నాం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. 

ఓటుకు నోటు కేసులో నయా ట్విస్ట్..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్ చేసుకుంది. కొందరు ఏపీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు రెండు, మూడు రోజుల్లో టీఎస్ ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. మత్తయ్య, జిమ్మిబాబులకు కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ఆశ్రయం ఇచ్చినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. 

పట్టిసీమను జాతికి అంకింతం చేసిన బాబు..

పశ్చిమగోదావరి : పట్టిసీమ ఎత్తిపోతలను సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. శిలాపలకాన్ని బాబు ఆవిష్కరించారు. పట్టిసీమ పనుల ప్రగతిపై అధికారులతో బాబు సమీక్ష నిర్వహించారు

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి - కేసీఆర్..

హైదరాబాద్ : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కు అవసరమైన నిధులు సమకూర్చినట్లు తెలిపారు. చెత్త సేకరణ కోసం వాహనాల కొనుగోలుకు రూ.100 కోట్లు, ఆటో ట్రాలీ మోడల్ కు సీఎం ఆమోదం తెలిపారు. నగరంలో 2500 ట్రాలీలు, 1500 ట్రై సైకిళ్లను కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రత, పచ్చదనానికి గుర్తుగా ఆకుపచ్చ రంగులో వాహనాలు ఉండనున్నాయి. 

రాజేంద్రనగర్ శ్మశాన వాటిక స్థలంపై ఘర్షణ..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో శ్మశానవాటిక స్థలం విషయంలో ఘర్షణ చెలరేగింది. శ్మశానవాటిక స్థలం ఇవ్వాలని స్థానికులతో రజియా బేగం ఘర్షణకు దిగింది. అడ్డుకున్న పోలీసులపై రజియా బేగం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. 

రూ.5లక్షల విలువైన ఎర్రచందనం దుంగల స్వాధీనం..

అనంతపురం :పెనుగొండ వద్ద జరిపిన తనీఖీల్లో బొలోరెలో తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్ మెంట్లు నిండి మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 8గంటల సమంయ పడుతోంది. 

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళల నిరసన..

విజయవాడ : జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ మహిళా సమాఖ్య నిరసన వ్యక్తం చేపట్టింది. మహిళలపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేసింది. 

కేంద్రం లేఖను మీడియాకు విడుదల..

హైదరాబాద్ : కేంద్ర వాణిజ్య శాఖ నుండి వచ్చిన లేఖను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతానికి చేయాల్సిన సాయం చేశామని లేఖలో పేర్కొన్నారు. హోదా లేనందున ప్రోత్సాహకాలు లేవని వాణిజ్య శాఖ తేల్చేసిందని, ప్రత్యేక హోదా ప్రణాళిక సంఘం పరిధిలో ఉందని లేఖలో వివరించినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపీలు నోరు మెదపడం లేదని, ప్రత్యేక హోదా పోరాటంలో టిడిపి తమతో కలిసివస్తుందా అని ప్రశ్నించారు. 

సనత్ నగర్ లో 25 కార్ల అద్దాల ధ్వంసం..

హైదరాబాద్ : సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోటి కాలనీలో 25 కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మళ్లీ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : బాలకోట్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈకాల్పులు మధ్యాహ్నాం 12గంటల నుండి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

చెత్తగా ఆడాం - కోహ్లీ..

గాలే : లంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో తాము చెత్తగా ఆడామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. లంక జట్టు బాగా ఆడిందని పేర్కొన్నారు. మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. 

'హోదా' వస్తేనే రాష్ట్రం అభివృద్ధి - బాలకృష్ణ..

అనంతపురం : ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలోని ఎంజీఎం ప్రభుత్వ పాఠశాల మైదానంలో బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

లంక విజయం..

గాలే : మొదటి టెస్టు మ్యాచ్ లో లంక విజయం సాధించింది. 63 పరుగుల తేడాతో భారత్ ను చిత్తు చేసింది. హెరాత్ లంక విజయంలో హెరాత్ కీలక పాత్ర పోషించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. 

చెత్తగా ఆడాం - కోహ్లీ..
 లంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో తాము చెత్తగా ఆడామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. లంక జట్టు బాగా ఆడిందని పేర్కొన్నారు. మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. 

13:43 - August 15, 2015

తూ.గో : జాతీయరాష్ట్ర పండగలు వచ్చినా...స్వాగతం పలకడంలో కడియపు లంకలోని పల్ల నర్సరీప్లాంట్ రూటు సెపరేటుగా ఉంటుంది. సరికొత్తగా మెుక్కలతో ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతుంటారు. స్వాగతం పలికే విధానంలోనూ ఎంతో అర్థం ఉంటుంది. ఇవాళా కూడా 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెుక్కలతో దేశంపై తమకున్న భక్తిభావాన్ని ప్రదర్శించారు. ఎంతో అద్భుతంగా రూపొందించిన ఈ సీనరి ఆహుతులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని తెలిపేలా తెల్లపావురాన్ని గాలిలో ఎగురవేసినట్లు పూలతో అద్భుతంగా రూపొందించారు.

 

13:40 - August 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా విపక్ష పార్టీలపై కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

13:39 - August 15, 2015

హైదరాబాద్ : వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో స్వతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. జగన్‌తోపాటు బొత్స సత్యనారాయణ, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.

13:37 - August 15, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆపార్టీ సీనియర్ నేత, రాష్ట్ర హోమంత్రి, నేత నాయిని నర్సింహారెడ్డి జెండా ఆవిష్కరించారు. నాయినితోపాటు డిప్యూటీసీఎం మహమూద్ అలీ, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

13:33 - August 15, 2015

హైదరాబాద్: స్వరానికి దొరికిన వరం ఆయన. గాలితో రాగాలు పలికించి, రాయిని సైతం కరిగించే సంగీత జ్ఞానం ఆయన సొంతం. ఇళయరాజా పాట వింటే ఆ లయరాజు కూడా పరవశించిపోతాడంతే.. స్వరకల్పనలో దివ్యత్వం చూపించిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. తమిళుడైనా ప్రతి భారతీయుడూ గర్వంగా మా సంగీత దర్శకుడు అని చెప్పుకునేంత గొప్ప సంగీత దర్శకుడు ఈ లయ రాజా. ఈయన పేరుపై వెలిసిన అనధికార వెబ్‌సైట్లకు చెక్‌ పెట్టేందుకు.. ఇళయరాజా కొత్త యూట్యూబ్‌ చానల్‌ను చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు.

వేల పాటలు ఇళయరాజా సంగీతంలో ప్రాణం...

ఒకటా రెండా.. వేల పాటలు ఇళయరాజా సంగీతంలో ప్రాణం పోసుకున్నాయి. కొన్ని పాటలు ఆయన కోసమే పుట్టాయా.. అన్నంతగా మైమరపించాయి. ఇళయారాజా.. సంగీతంలోనే జ్ఞాని. ఈయన స్వరాలు మ్యూజిక్‌ ప్రియుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. ఇళయరాజా బాణీలకు పులకించని రాగంలేదు. ఆ రాగాలకు తరించని గీతం లేదు.. ఆ గీతాల్ని విని పరవశించని హృదయమే లేదు.

www.ilayarajalive.com పేరుతో యూట్యూబ్ చానెల్‌....

ఎన్నో ఆణిముత్యాల్లాంటి సాంగ్స్‌కు సంగీతం అందించిన ఇళయరాజా పేరుపై దేశంలో ఎవరిపేరుపై లేనన్నీ వెబ్‌సైట్లు వెలిశాయి. అనధికారికంగా ఉన్న వెబ్‌సైట్లు ఇళయరాజా పేరును ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నాయట. దీంతో వీటన్నింటికి చెక్‌ పెట్టాలని నిర్ణయించిన ఇళయరాజా.. తనే ఓ చానెల్ ప్రారంభిస్తే మంచిదనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చెన్నైలో www.ilayarajalive.com పేరుతో నూతనంగా ఓ యూట్యూబ్ చానెల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇదే తన అధికారిక యూట్యూబ్ చానెల్ అని స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ తాను అందించిన సినీ, ప్రైవేట్ ఆల్బమ్స్‌ సంగీతం మొత్తాన్ని నేటి తరానికి య్యూటూబ్ చానెల్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. కొన్ని సినీ గీతాలను నాటి దర్శకులు తెరకెక్కించిన తీరుకు భిన్నంగా నేటి తరం వారు ఆయా పాటలకు ఎటువంటి దృశ్యాలను తెరకెక్కిస్తారనే దానిపై పోటీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఔత్సాహికులు ఇందులో పాల్గొనవచ్చని, గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతి ప్రదానం చేస్తామని ఇళయరాజా చెప్పారు. సంగీత ప్రియులు ఎవరైనా ఇళయరాజా పాటలను వినాలకుంటే.. ఇప్పట్నుంచి www.ilayarajalive.com యూట్యూబ్ చానెల్‌ ద్వారా ఆఫిషియల్‌గా విని.. ఆనందించవచ్చు. 

విద్యార్థులకు లోన్లు - కేజ్రీవాల్..

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు లోన్ లు ఇస్తుందని, ఉద్యోగం వచ్చిన తరువాతే విద్యార్థులు డబ్బులు ఇవ్వవచ్చని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.

భారత్ 102/9...

గాలే : భారత్ ఓటమి అంచుల్లో చిక్కుకుంది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 102 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. మిశ్రా 6, అరోన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో హెరాత్ ఏడు వికెట్లు తీయగా కౌశాల్ రెండు వికెట్లు తీశాడు. 

అమెరికాలో నల్గొండ వాసి మృతి..

నల్గొండ : జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఎంఎస్ చదివేందుకు అభిషేక్ అమెరికాకు వెళ్లాడు. 

స్వీట్లు పంచుకున్న జవాన్లు..

వెస్ట్ బెంగాల్ : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిల్ గురి ప్రాంతంలో ఇండో - బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. 

ప్రత్యేక హోదాపై జగన్ లేఖకు కేంద్రం స్పందన...

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రాసిన లేఖకు కేంద్రం స్పందించింది. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల నుండి జగన్ కు లేఖ రాసింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపికి న్యాయం చేస్తామని లేఖలో పేర్కొంది. 

12:22 - August 15, 2015

గాలే : టీమిండియా గెలుస్తుందని ఆశించిన అభిమానుల ఆశలు ఆవిరవుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. ఇషాంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు ఔటయ్యారు. నాలుగో రోజు లంక స్పిన్నర్లు విజృంభించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), రోహిత్ శర్మ (4), శిఖర్ ధావన్ (28), నైట్ వాచ్ మన్ ఇషాంత్ శర్మ (10) పరుగులు చేసి వెనుదిరిగారు. కేవలం 78 పరుగులకే 7వికెట్లు కోల్పోయింది. టెస్ట్ గెలవాలంటే ఇంకా 98 పరుగులు చేయాలి. లంక బౌలర్లలో హేరత్ 5వికెట్లు, కుషాల్ 2 వికెట్లు పడగొట్టారు.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 183, రెండో ఇన్నింగ్స్ లో 367 పరుగులు చేసింది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 375 రెండో ఇన్నింగ్స్ లో 36 ఓవర్లకు 78 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.

ట్విట్టర్ లో తాజ్ మహల్..

ఉత్తర్ ప్రదేశ్ : తాజ్ మహల్ ట్విట్టర్ లో చేరింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజ్ మహల్ ట్విట్టర్ ను ప్రారంభించారు. 

12:11 - August 15, 2015

వాకింగ్ కారు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అది కూడా ఓ బ్యాగులో పెట్టుకోవడమా ? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా ? కానీ నిజం చేశాడో ఇంజినీర్. ఇక్కడ ఇంజినీర్లు కాదు. జపాన్ దేశానికి చెందిన ఇంజినీర్ కునియాకో ఈ 'వాక్ కారు'ను తయారు చేశాడు. బ్యాగులో ఈ కారును పెట్టుకుని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కారును కిందకు దింపి దానిపై నిలబడితే చాలు. రయ్యిమంటూ దూసుకెళుతుంది. ఏ రూట్లో వెళ్లాలని అనుకుంటున్నారో తీసుకెళుతుంది. మీ గమ్యస్థానానికి వెళ్లిన అనంతరం ఎంచక్కా కారును బ్యాగులో పెట్టేసుకోవచ్చు. 12 కి.మీటర్ల వేగంతో ఈ కారు దూసుకెళుతుంది. కారు బరువు సుమారు మూడు కిలోలు ఉంటుంది. లిథియమ్ అనే బ్యాటరీతో కారు నడుస్తుందంట. ఈ వాక్ కారు త్వరలోనే మార్కెట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ధర 800 యూఎస్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా..

కుల, మత విధ్వేషాలను పక్కన పెట్టండి - వెంకయ్య..

నెల్లూరు : కుల, మత విధ్వేషాలను పక్కన పెట్టి అందరం కలిసి ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టులో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

విజయవాడలో జాతీయ జెండాకు అవమానం...

విజయవాడ : జాతీయ జెండాకు అవమానం జరిగింది. వన్ టౌన్ సెంటర్ వద్ద జాతీయ జెండాతో పాటు కాంగ్రెస్ జెండాను నేతలు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. 

11:55 - August 15, 2015

కాలిఫోర్నియా : రిజర్వాయర్ లో ఉండే నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? దేశంలో..ప్రపంచంలో ఉండే రిజర్వాయర్ లో ఉన్న నీరు ఆవిరై పోవడం వల్ల ఎన్నో లక్షల గ్యాలన్ల నీరు వృధాగా పోతోంది. ఇందుకు లాస్ ఏంజెల్స్ అధికారులు ఈ సమస్యకు చెక్ పెట్టారు. ఇందుకు 'షేడ్ బాల్స్ తయారు చేశారు. ఈ నల్లరంగు బాల్స్ లను రిజర్వాయర్ లో వేయడం వల్ల నీరు ఆవిరై పోదంట. నాణ్యమైన 9 కోట్ల 60 లక్షల షేడ్ బాల్స్ ను రిజర్వాయర్ లో వేశారు. 30 కోట్ల గ్యాలన్ల మంచినీరు ఆవిరైపోకుండా చూసేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటున్నారని సమాచారం. తిరిగి ఉపయోగించుకొనేందుకు వీలుగా ఈ బాల్స్ ను రూపొందించారు. అయ్యే బాల్స్ కదా..అందులో రసాయనాలు ఉంటాయి అనే అనుమానం కూడా లేదంట. ఎలాంటి రసాయాలను ఉపయోగించకుండా ఈ 'షేడ్ బాల్స్' ను తయారు చేశారు. ఒకవేళ కొన్ని బాల్స్ పేలిపోయినా.. నీటి నాణ్యత దెబ్బతినదు. 
నల్లరంగు ప్లాస్టిక్ బాల్స్ సూర్యకిరణాలను తిప్పికొడతాయని, 175 ఎకరాల రిజర్వాయర్ లో షేడ్ బాల్స్ తిరుగుతూ నీరు ఆవిరి కాకుండా కాపాడతాయని నమ్ముతున్నారంట. ఇందుకోసం 25వేల కోట్ల 50 లక్షల డాలర్లను ఖర్చు చేశారు. ఒక్కో బాల్ తయారీకి 0. 36 డాలర్లు అయిందంట. ఇదండి సంగతి...

11:48 - August 15, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధికారులు పాల్గొన్నారు.

11:46 - August 15, 2015

హైదరాబాద్ : యూఏపీ పాలనలో దేశంల సంక్షోభంలోకి వెళ్లిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ర్టాలతో పోటీగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం సాయం చేయాల్సిన అవసరముందన్నారు. 

ఇండియా 65/6..

గాలే : భారత బ్యాట్స్ మెన్స్ ను లంక బౌలర్లు కట్టడి చేశారు. మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 65 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 

11:43 - August 15, 2015

హైదరాబాద్ : దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానమని... మన లక్ష్యం టీమిండియా అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. 125 కోట్ల మంది టీంగా పనిచేస్తే ఏదైనా సాధ్యమన్నారు. దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు.

మన లక్ష్యం టీమిండియా అని పిలుపునిచ్చిన ప్రధాని...

జన్‌ధన్‌ యోజన పథకానికి ఊహించిన దానికి భిన్నంగా వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపారు ప్రధాని మోదీ. జనవరి 26 నాటికి ప్రతి ఒక్కరికీ ఖాతాలు తెరవాలని బ్యాంకులను ఆదేశించామన్నారు. ఇది భారత పేదలు సాధించిన విజయంగా అభివర్ణించారు.

అవినీతిపరులు కూడా అవినీతిని అరికట్టడం ఎలా....

అవినీతిపరులు కూడా అవినీతిని అరికట్టడం ఎలా అని ఉపన్యాసాలు ఇస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. అవినీతి చెదపురుగులను తరిమికొట్టాలంటే కోటి ప్రయత్నాలు చేయాలన్నారు. గ్యాస్ రాయితీ తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్యాస్ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న నిర్ణయంతో దళారుల దుకాణాలు మూతపడ్డాయని..ఏటా 15 వేల కోట్లు ఆదా అవుతున్నాయన్నారు. అవినీతి నిర్మూలనలో ఇది గొప్ప ముందడుగన్నారు. బొగ్గు, స్పెక్ట్రం ఏదైనా వేలం వేయాలన్నదే మా లక్ష్యమన్నారు మోడీ.

త్వరలోనే భారత సైనికులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం-మోదీ....

భారత సైనికులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకాన్ని చేపట్టేందుకు సంకల్పించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీనిపై చర్చలు సాగుతున్నాయన్నారు. తుది దశలో చర్చలు సాగుతున్నాయని... త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎర్రకోట సాక్షిగా.. 125 కోట్ల మంది ప్రజల సాక్షిగా.. ఈ వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు.  

నివాసంలో జెండా ఆవిష్కరణ చేసిన రాజ్ నాథ్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవవందనం స్వీకరించారు. 

11:37 - August 15, 2015

హైదరాబాద్ : 'చక్ దే ఇండియా రైడ్' ను ప్రిన్స్ మహేష్ బాబు ప్రారంభించారు. గచ్చిబౌలిలో హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నటుడు జగపతి బాబు కూడా పాల్గొన్నారు. సైకిల్ తొక్కండి..లేకపోతే లావైపోతారంటూ ప్రిన్స్ పేర్కొంటున్నారు. పది కిలోమీటర్లు..50 కిలోమీటర్లు..రెండు విభాగాలుగా సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. పది కిలోమీటర్ల రైడ్ లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువత తరలివచ్చింది. 'శ్రీమంతుడు' చిత్రంలో ప్రిన్స్ మహేష్ సైకిల్ ను తొక్కిన సంగతి తెలిసిందే. 

భారత్ ను కట్టడి చేస్తున్న లంక..

గాలే : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ వికెట్లు కోల్పోతోంది. కోహ్లీ, ధావన్ లు విఫలం చెందారు. రెండో ఇన్నింగ్స్ లో 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రహానే 8, సాహా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

11:21 - August 15, 2015

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఏది చేసినా సంచలనమే. ఆయన నటించే సినిమాపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. ఆ సినిమాకు సంబంధించిన న్యూ లుక్ ఎప్పుడొస్తుందా ? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 'పవన్' నటిస్తున్న 'సర్ధార్' ఫస్ట్ లుక్ విడుదలైంది. 'గబ్బర్ సింగ్' కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' చిత్రంలో మాదిరిగానే ఇందులోనూ పవన్ మెడలో ఎర్రటి టవల్, రెండు చేతుల్లో గన్ లు, షర్ట్ గుండీలు వదిలేసి మాస్ పొలీస్ ఆఫీసర్ గా లుక్ ఇచ్చాడు. ఈ లుక్ చూసిన పవర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కే.ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'సర్దార్ గబ్బర్ సింగ్' ను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. 

బీహార్ లో బాంబు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు..

బీహార్ : సెంట్ జోసఫ్ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసరడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈఘటన నవడ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

భారత్ 34/3..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయింది. రాహుల్ (5), ఇషాంత్ శర్మ (10), రోహిత్ శర్మ (4) వికెట్లను కోల్పోయింది. ధావన్ 17, కోహ్లీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దేశ ప్రతిష్టను పెంచాలి - చంద్రబాబు..

విశాఖపట్టణం : ఆర్కే బీచ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ బెటాలియన్ల నుండి సీఎం చంద్రబాబు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. బానిసత్వం నుండి విముక్తి పొందిన రోజని, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. దేశ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత తమపై ఉందని, అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు నిదర్శనంగా విశాఖలో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

10:18 - August 15, 2015

హైదరాబాద్: సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రైతురుణ మాఫీ చెల్లించాం. 4800 కోట్లు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. 380 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే మార్చి నాటికి రైతులకు ఉదయం పూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తాం. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట. గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిజేశారు. అంతకముందు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో సీఎం పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు. 

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం - సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట అని అభివర్ణించారు. నీటి పారుదల, విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం దూసుకపోతోందన్నారు. వచ్చే మార్చి నుండి వ్యవసాయానికి ఉదయం పూట 9గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రూ.480 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందని, మైక్రో ఇరిగేషన్ కు రూ.402 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

కోల్ కతాలో జెండాను ఆవిష్కరించిన మమత బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

జాతీయ జెండాను ఆవిష్కరించిన సోనియా..

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

10:06 - August 15, 2015

'అనుష్క'...టాలీవుడ్ లో తనదైన నటనశైలిని ప్రదర్శిస్తూ ముందుకెళుతోంది. ఇటీవలే విడుదలైన 'బాహుబలి'లో ఆమె వైవిధ్యమైన పాత్రలో నటించింది. తాజాగా 'సైజ్ జీరో' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో 'అనుష్క'ను చూసి అభిమానులు షాక్ అయ్యారంట. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా భారీ స్థూలకాయంతో ఈ ముద్దుగుమ్మ కనిపించింది. గడిచిన సినిమాల్లో స్లిమ్‌గా కనిపించిన 'అనుష్క' ఊహించని విధంగా ఇలా కనిపించడంతో వీరాభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యోగా బ్యూటీ.. రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు టాక్. ఓ రోల్ కోసం 20 కేజీలు పెరిగిందని, మరో క్యారెక్టర్‌లో నార్మల్‌గానే కనిపిస్తోందని టాలీవుడ్ టాక్. ఇక అనుష్క పక్కన తమిళ నటుడు 'ఆర్య' నటిస్తున్నాడు. పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. మరి 'అనుష్క' పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు..చర్యలను ఆయన విశ్లేషిస్తున్నారు.

ఇండియా 23/1...

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఆటను ఆరంభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. ధావన్ 13, శర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

నెల్లూరులో జాతీయ జెండాకు అవమానం

నెల్లూరు : పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో మంత్రి నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా ఊడి కిందపడిపోయింది. మంత్రి నారాయణ అధికరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా విశాఖ తీరంలో రెపరెపలాడింది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఆర్కే బీచ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కేబినెట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.  

అసంఘటిత రంగ కార్మికులకు కొత్త గుర్తింపు కార్డులు: మోదీ

హైదరాబాద్: అసంఘటిక కార్మికులకు కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వటం ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జాతినుద్దేశించ ప్రసంగించారు. కార్మికులకు అందాల్సిన అన్ని సౌకర్యాలను ఈ గుర్తింపు కార్డుతో లభిస్తాయన్నారు. గ్యాస్ రాయితీ తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

వరంగల్ జిల్లాల్లో స్వైన్ ప్లూ కలకలం..

వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌పీహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపిన ప్రకారం... పట్టణంలో నె హ్రూనగర్‌కు చెందిన మహిళ(41) అస్వస్థతో వారంరోజుల క్రితం హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రి లో చేరగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూగా నిర్థారించారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన కమిషనర్ సోమేష్

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో కమిషనర్‌ సోమేష్‌ జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. నగర అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ కార్మికుల కృషి చాల గొప్పదని ఆయన తెలిపారు.

రాజకీయ పార్టీలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: రాష్ట్రపతి

హైదరాబాద్ : దేశంలోని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. 69వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి దేశ ప్రలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు....పదేళ్లు దేశ ఆర్థిక ప్రగతి ప్రసంశనీయంగా ఉందని అన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ సరిహద్దు సమస్య పరిష్కారమైందని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని ప్రణబ్‌ విమర్శించారు. ఇటీవల కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాది నవీద్‌ను పట్టుకున్న పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గోల్కొండ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...

హైదరాబాద్: గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్రక గోల్కొండ కోటలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసివేశారు. పాస్‌లు ఉన్న వాహనాలను గోల్కొండ కోట వరకు అనుమతిస్తున్నారు. వాహనాలు నిలపడానికి అధికారులు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

07:58 - August 15, 2015

హైదరాబాద్: భిన్నత్వంలో ఏకత్వమే భారత్ శక్తిఅ ని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటలో 69వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జాతినుద్దేశించి తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. '125 కోట్ల భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహా పురుషుల త్యాగఫలమే స్వతంత్ర భారతతం, భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ శక్తి అని కొనియాడారు. దేశ ఐక్యతకు దెబ్బతగిలితే, కలలు కూడా చెదిరి పోతాయి. మతమౌఢ్యానికి ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఉండకూడదు. దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నిత్యనూతన సంకల్పంతో దేశం ఈ స్థాయికి చేరింది. పేదరికాన్ని పారద్రోలడం, పేదరికంపై పోరాడడమే మన టీమిండియా లక్ష్యం. భారత కీర్తిని ప్రపపంచంలో చాటిచెప్పాలని యుతవను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుతున్నాను. ఈ ఏడాదిగా టీమిండియా అంతా కలిసి స్వప్నాలను సాకారం చేసుకోవడానికి ధృడసంకల్పంతో ముందుకు సాగుతోంది. 50 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచాం. మళ్లీ రిపబ్లిక్ డే లోపు బ్యాంకు ఖాతాల లక్ష్యాన్ని చేరుకుంటాం. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేశాక దాంట్లో 30 వేల కోట్లు డిపాజిట్ అయ్యాయి. భారత పేదలు తమ గొప్పతనాన్ని చూపించారు. నేను వారికిసలామ్ చేస్తున్నా... ఈ బ్యాంక్ ఖాతాలతో దేశంలో పెద్ద మార్పు రాబోతోంది'. అని తెలిపారు.

జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: 69వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అంతక ముందు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బిజెపి నేత అమిత్ షా, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

కాసేపట్లో ఎర్రకోటలో త్రివర్ణ పతాకావిష్కరణ

హైదరాబాద్: 69వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి.. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు...

హైటెక్‌ సిటీలో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్‌

హైదరాబాద్ : సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్రీడం వాక్‌ నిర్వహించారు. షీ టీమ్స్‌ కృషి వలన రాత్రి సమయాల్లో మహిలు రోడ్లపై తిరిగే స్వేచ్చ లభించిందని... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాటి చెప్పారు. మాదాపూర్‌ హైటెక్‌ సిటీ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్‌ డీసీపీ రమ్య హాజరయ్యారు. నగరంలోని యువతులు షీటీమ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ప్రతి మహిళా స్వేచ్చగా జీవించాలనే నినాదంతో కొనసాగిన ఈ కార్యక్రమం... హైటెక్‌ సిటీ నుంచి హెచ్ఐ సిసివరకు నిర్వహించారు.

 

వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లో : బాలయ్య

హైదరాబాద్ : వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లో ఉంటానన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురం మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం పట్టణాన్ని దేశంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాలకు తాగునీరు అందిస్తానన్నారు. తన వందవ చిత్రం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితమవుతానని బాలకృష్ణ చెప్పారు. 

స్వచ్ఛందంగా సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

హైదరాబాద్ : మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అయినా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్‌ కార్మికులే వెనక్కి తగ్గారు. స్థానిక ఇబ్బందులు, పలువురి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు స్వస్తి పలికి విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. దీంతో గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు నేటి నుంచి విధులకు హాజరవుతున్నారు. 

విశాఖలో ఇన్స్ పెక్టర్ అనుమానాస్పద మృతి

విశాఖ : నగరంలోని హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ దీప్‌ గౌరవ్ శుక్రవారం అనుమానాస్పద మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్నఫోర్త్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులతో పోలీసులు విచారించగా ఆరోగ్య సమస్యలతో చనిపోయాడని తెలిపారు.

06:57 - August 15, 2015

హైదరాబాద్ : సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్రీడం వాక్‌ నిర్వహించారు. షీ టీమ్స్‌ కృషి వలన రాత్రి సమయాల్లో మహిలు రోడ్లపై తిరిగే స్వేచ్చ లభించిందని... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాటి చెప్పారు. మాదాపూర్‌ హైటెక్‌ సిటీ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్‌ డీసీపీ రమ్య హాజరయ్యారు. నగరంలోని యువతులు షీటీమ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ప్రతి మహిళా స్వేచ్చగా జీవించాలనే నినాదంతో కొనసాగిన ఈ కార్యక్రమం... హైటెక్‌ సిటీ నుంచి హెచ్ఐ సిసివరకు నిర్వహించారు. 

06:55 - August 15, 2015

హైదరాబాద్ : రెస్పెక్ట్‌ ఫ్రీడం- రెస్పెక్ట్‌ విమెన్‌ అనే నినాదంతో విశాఖలో మహిళలు రాత్రి వేళ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీడం వాక్‌ చేశారు. మేరా భారత్‌ మహాన్‌ నినాదాలతో హోరెత్తించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలను గౌరవించాలని వారంతా కోరారు. సిరిపురం జంక్షన్‌ నుంచి భగత్‌సింగ్‌ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. 

06:53 - August 15, 2015

హైదరాబాద్ : ప్రపంచానికి సత్యాగ్రహ పోరాటాన్ని అందించిన జాతిపిత మహాత్ముడికి గుడి కట్టేశారు ఆ గ్రామస్తులు. నిత్య పూజలతో మహాత్ముడిని కొలుస్తున్నారు నల్గొండ జిల్లావాసులు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి.... నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తి లో ఈ గుడి కట్టారు. ఇతర దేవాలయాల మాదిరిగానే ఇక్కడ మహాత్ముడికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ హైవే పక్కనే.. దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో.. వాస్తుశిల్పుల పర్యవేక్షణలో ఈ గుడిని నిర్మించారు. 2012, అక్టోబర్ రెండున వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మహాత్మాగాంధీ గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరగగా... 2014 సెప్టెంబర్‌ 15న మహాత్ముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.
మహాత్మాగాంధీ ట్రస్ట్ ను స్థాపించిన టీచర్లు...
దశాబ్దం కిందట ఇక్కడి స్కూల్‌ టీచర్లు మహాత్మాగాంధీ ట్రస్ట్ ని స్థాపించారు. అహింసా సిద్దాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహాత్ముడికి గుడి కట్టాలనే ఆలోచనతోనే ముందుకొచ్చామని మహాత్మాగాంధీ ట్రస్ట్ తెలిపింది. ప్రధాన గుడి మొదటి అంతస్థులోని గర్బగుడిలో.. గాంధీ మహాత్ముడు ధ్యాన ముద్రలో ఆశీనుడై ఉన్నట్లు దర్శమిస్తుంటాడు. గర్బగుడి వెలుపల ఉన్న.. ధర్మచక్రం దర్శిస్తే పుణ్యం కలుగుతుందని ఇక్కడివారి నమ్మకం. ఆలయం కింది అంతస్తులో ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడికి వచ్చినవారు కాసేపు ఇక్కడి ప్రశాంత వాతావరణంలో ద్యానం చేస్తే మనస్సు శాంతన కలుగుతుందని ఇక్కడివారు చెబుతున్నారు.అంతేకాదు ఈ ఆలయానికి మరో ప్రత్యకత ఉంది. దేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల మట్టిని సేకరించి పెట్టెలలో భద్రపరిచారు. ఈ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారు మహాత్ముడి పేరిట అనేక సేవా కార్యక్రమాలు సైతం కొనసాగిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

06:50 - August 15, 2015

హైదరాబాద్ : మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అయినా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్‌ కార్మికులే వెనక్కి తగ్గారు. స్థానిక ఇబ్బందులు, పలువురి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు స్వస్తి పలికి విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. దీంతో గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు నేటి నుంచి విధులకు హాజరవుతున్నారు.
మొండి వైఖరి కొనసాగిస్తున్న సర్కార్...
మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై తెలంగాణ సర్కార్‌ మొండి వైఖరి కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్మికుల డిమాండ్లపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయినా కూడా ప్రజల ఇబ్బందుల దృష్టిలో పెట్టుకున్న మున్సిపల్‌ కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రజల సూచనలు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారుల విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. దీంతో గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు.
రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నా.....
రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదన్నారు. ఆగస్టు 15,.. స్థానికంగా వ్యాపిస్తున్న వ్యాధులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నామన్నారు. ఇకనుంచి ఇతర రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విధుల్లో పాల్గొంటూనే నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారు.
ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలి....
ఇప్పటికైనా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య తారతమ్యాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక వ్యతిరేక ధోరణి వీడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే సమ్మె చేస్తేనే పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందా ? అనేది సందేహంగా మారింది. 

06:47 - August 15, 2015

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి,.. భారతరత్న దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం పేరుతో చెన్నైలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఏంజల్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో కలాం స్మారకార్ధం దేశంలోనే అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని చెన్నైలో తయారుచేశారు. ప్రఖ్యాత ఆర్చరీ కళాకారుడు హుస్సైనీ.. 15 రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. బీసెంట్‌ నగర్‌లోని కళాక్షేత్రం సమీపంలో కలాం విగ్రహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 24 అడుగుల ఎత్తైన మిస్సైల్‌తో పాటు.. కలాం విగ్రహాన్ని 5.5 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఆయన వెనుక పీఎస్‌ ఎల్వీ రాకెట్‌ నమూనాతో పాటు ఒక చేతిలో మైక్‌ పట్టుకుని.. మరో చేతితో విద్యార్ధులకు ఆశీస్సులు అందించే విధంగా విగ్రహాన్ని రూపొందించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. అందరికీ అందుబాటులో ఉండేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని నిర్వాహకుడు చెబుతున్నారు. 

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త .. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజెల్‌ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోలు ధరను ఒకరూపాయి 27 పైసలు, డీజిల్‌ ధరలను ఒక రూపాయి పదిహేడు పైసలు తగ్గింది. దీంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించినట్లైంది.  

00:00 - August 15, 2015

ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

 

- TEAM 10TV

Don't Miss