Activities calendar

16 August 2015

21:54 - August 16, 2015

వరంగల్: జిల్లాలో కంతనపల్లిని ఖతం చేస్తే..కేసీఆర్ పాలనకు రైతులు చరమ గీతం పాడుతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణలోని ప్రాజెక్టుల డిజైన్లను మారిస్తే..కేసీఆర్ ప్రభుత్వాన్నే మార్చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను మారిస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు డిజైన్ల మార్పు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వామపక్షనేతలు హెచ్చరించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో.. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై జరిగిన సదస్సులో వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను వారీ సందర్భంగా ఎండగట్టారు.
కంతనపల్లి ఎందుకు మారుస్తున్నారు ? - తమ్మినేని..
జిల్లాలో నిర్మిస్తున్న కంతనపల్లి ప్రాజెక్టు డిజైన్‌ను ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదని...అసలు డిజైన్‌ మార్పుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి కారణం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రాజెక్టు అంటే నాటి వైఎస్ నుంచి నేటి కేసీఆర్ వరకు డబ్బులు సంపాదించే ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. కమిషన్లు, కాంట్రాక్టర్లు అనే దృష్టితోనే ప్రాజెక్టుల వ్యవహారం నడుస్తోందన్నారు. కంతనపల్లిని కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తే వరంగల్ జిల్లాలో మరో రైతు పోరాటానికి రెడీ అవుతామని తమ్మినేని అన్నారు. కంతనపల్లి డిజైన్‌ మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కంతనపల్లిని విస్మరిస్తే మరో రైతు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కంతనపల్లిని ఖతం చేస్తే..కేసీఆర్ పాలనకు రైతులు చరమ గీతం పాడతారని హెచ్చరించారు. ప్రాజెక్టులు ధనార్జన వనరులుగా మారాయని విమర్శించారు. పాలకులకు కమిషన్లు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి జలవిధానంపై అవగాహన లేదన్నారు. కంతనపల్లి డిజైన్ మార్పులో ప్రభుత్వం దగ్గర కారణమే లేదని చెప్పారు.
కేసీఆర్ పాలనే దిక్కుమాలింది..
వామపక్షాల పోరాటాలను దిక్కులేనివి అంటున్న కేసీఆర్ పాలనే దిక్కుమాలిందని తమ్మినేని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టులు.. దిక్కులేని వాళ్లకు దిక్కులు చూపించే చుక్కలని అన్నారు. దిక్కుమాలిన పాలనతో కేసీఆర్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల పోరాటాలను దిక్కులేనివంటున్న కేసీఆర్ పాలనే దిక్కుమాలిందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిపై గొంతెత్తిన మోడీ తన సొంత మంత్రి సుష్మాస్వరాజ్ అక్రమాలపై పెదవి విప్పడం లేదని, లలిత్ మోదీ, సుష్మా స్వరాజ్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. పెట్టుబడిదారులకు మోదీ పాలన రెడ్ కార్పెట్‌లా మారిందన్నారు. దేశంలో మనుధర్మ శాస్త్ర ఎజెండాగా పని చేస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
కంతనపల్లి మాత్రమే ప్రత్యామ్నాయం: చాడ
ఎస్సారెస్పీ కాల్వలు...కాంట్రాక్టర్లు, పాలక పక్ష కార్యకర్తలకు కమిషన్ల వరంగా మారాయని, వీటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేవాదులకు ఏడున్నర వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీరివ్వలేని దుస్థితి నెలకొందన్నారు. దేవాదులకు ప్రాణాం పోయాలంటే కంతనపల్లి మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. 14 నెలల పాలన గడిచినా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల ప్రాధాన్యత, ప్రాముఖ్యత, జల విధానం లేదని అన్నారు. బావులు, బోర్ల మీద ఆధారపడ్డ రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, కంతనపల్లి కడితేనే దేవాదుల ద్వారా రైతుల బతుకులు బాగుపడుతాయన్నారు. ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు..బతుకు తెలంగాణ అని స్పష్టం చేశారు.

 

21:20 - August 16, 2015

ఢిల్లీ: సరిహద్దులో కాల్పులకు ఎవరు పాల్పడుతున్నారనే విషయం తెలుసుకునేందుకు... సమర్థ వ్యవస్థ అవసరమని... పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సం రోజున... సరిహద్దులో పాకిస్థాన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్... పాకిస్థాన్‌ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు సమన్లు అందజేసింది. అనంతరం బాసిత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమై వివరణ ఇచ్చారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. జూలై నుంచి ఇప్పటివరకూ... భారత సరిహద్దు నుంచే.. 70సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించారని బాసిత్ వెల్లడించారు. 

21:13 - August 16, 2015

ఆదిలాబాద్: కుటుంబాల్లో నిత్యం కలహాలు. ఇరుపొరుగుతో తగాదాలు. ఊరు ఊరంతా మత్తులో జోగేది. అడిగేవాడు లేడు. అడ్డుకునే వాడు అసలే లేడు. విసిగి... విసిగి..వేసారిపోయారు. మార్పుతేవాలని నిర్ణయించుకున్నారు. ఎవరో ఏదో చేస్తారని ఆశించకుండా...ఊరంతా ఏకమయ్యారు. మద్యం మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టారు.
మద్యానికి బానిసైన మాటేగాం గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం. ఇదో చిన్న పల్లెటూరు. ఈ ఊర్లో 300ల కుటుంబాలు నివసిస్తున్నాయి. కొంత కాలంగా ఆ పల్లెలో లో మనశ్శాంతి కరువైంది. తాగుబోతులతో నిత్యం ఏదో ఓ సమస్య వేధించేది. ఊరు చిన్నదైనా..మద్యం మాత్రం ఏరులై పారేది. కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేసేవారు. గ్రామంలోని వారంతా మద్యానికి బానిసయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా సారా తాగేవారు. దీంతో వారి కుంటుంబాల్లో నిత్యం కలహాలు వచ్చేవి. అంతేకాకుండా...రోడ్లపైన న్యూసెన్స్ చేసేవారు.
సారా శాశ్వత నిషేధం
మాటేగాంను చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య వేధిస్తోంది. దీంతో గ్రామంలోని యువకులు, ఉపాధ్యాయులు....సారాను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించారు. అందుకు ఆగష్టు 15...స్వాతంత్ర్య దినోత్సవం రోజే శ్రీకారం చుట్టారు. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని గ్రామసభ తీర్మానించింది.
కేసులు పెడతామని గ్రామ పెద్దల హెచ్చరిక
గ్రామంలో ఎవరైనా మద్యం సేవిస్తే...అమ్మించినా కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామపెద్దలు స్పష్టం చేశారు. మద్యం తాగి న్యూసెన్స్‌ చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. అంతేగాక గ్రామంలోని గోడలపై ఎక్సైజ్‌ పోలీసులు ఫోన్ నంబర్లు రాసి...ఏ సమస్య వచ్చిన వారికి సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
స్థానిక మహిళలు హర్షం
మద్యాన్ని శాశ్వతగా నిషేధించి...మాటేగాం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. మద్య నిషేధంతో...స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మహమ్మారితోనే తమ కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయని..ఇకపై హ్యాపీగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

 

21:06 - August 16, 2015

వరంగల్: దేవాదుల ప్రాజెక్టుకు ప్రాణం పోయాలంటే...కంతనపల్లి మాత్రమే ప్రత్యామ్నాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వరగంల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 14 నెలలపాటు పాలన గడిచినా... కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రాజెక్టుల ప్రాధాన్యత, ప్రాముఖ్యత, జల విధానం లేదని చాడా విమర్శించారు. కంతనపల్లి కడితేనే రైతులు బాగుపడతారని ఆయన అన్నారు. 

20:53 - August 16, 2015

వరంగల్: ప్రాజెక్టుల డిజైన్లు మారిస్తే.. సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. వరంగల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కంతనపల్లిని తీసేస్తే కేసీఆర్ కుర్చీని కూల్చడం ఖాయమన్నారు. 'కమ్యూనిస్టులు దిక్కులేనివాళ్లు' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టులు దిక్కులేని వారు కాదని.... ఏ దిక్కు లేని వారికి దిక్కు చూపించేవారని.. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిదని హితవుపలికారు. కమ్యూనిస్టులు పేదలకు దిక్సూచి లాంటి వాళ్లు అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వాగ్ధాలేవి అమలు కావడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అన్ని దిక్కుమాలిన పనులు చేసుకుంటూ.. కమ్యూనిస్టులను దిక్కుమాలినవారు అనడం విడ్దూరంగా ఉందన్నారు. ఇకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని విపరీతంగా పొంచిపోషిస్తుందని ఆరోపించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం విమర్శించారు.

 

 

20:35 - August 16, 2015

ఢిల్లీ: కుక్క తోక వంకర అన్నట్లుగా.. పాకిస్థాన్‌ వ్యవహార శైలి మారటం లేదు. సరిహద్దులో కాల్పుల ఘటనపై ఓ వైపు... ఆదేశ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు.. భారత్‌ సమన్లు జారీ చేసింది. ఐనప్పటికీ మరోసారి పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘించింది. రాజౌరీలోని మంజకోట్ సెక్టార్‌లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

 

20:23 - August 16, 2015

జకార్తా: ఇండోనేషియాలో విమాన ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 54 మంది మృతి చెందారు. ఇవాళ అదృశ్యమైన ఓ విమానం కుప్పకూలింది. పపువా సమీపంలోని ఒక్తాబే వద్ద ఓ కొండపై విమాన శకాలను గుర్తించారు. విమాన ప్రమాదంలో 49 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారు.

 

గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం...

జకార్తా: ఇండోనేషియాలో గల్లంతయిన విమానం ఆచూకీ లభ్యమయింది. పపువా సమీపంలోని ఒక్తాబె జిల్లాలో విమానం శకలాలను గుర్తించారు. అధికారులు స్థానికులకు సమాచారం అందించారు. 

20:00 - August 16, 2015

విశాఖ: నగరంలోని సముద్ర తీరంలో స్వచ్ఛ తీరం కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన ఆర్కే బీచ్‌తో పాటు మరో ఐదు ప్రాంతాల్లో స్వచ్ఛ తీరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. 20మంది స్వచ్ఛ్ భారత్ అంబాసిడర్లతో పాటు పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న చెత్తాచెదారలను తొలగించారు. స్వచ్ఛ్ భారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్ధలు, ప్రజల భాగస్వామ్యంతోనే... ఇది విజయవంతమవుతుందని అన్నారు.

 

19:56 - August 16, 2015

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందో లేదో చెప్పలేం గాని...ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ హరిబాబును మంత్రి గంటా కలిశారు. ఈ నెల 20న తాడేపల్లి గూడెంలో నిట్ ప్రారంభోత్సవానికి హరిబాబును ఆయన ఆహ్వానించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్న...కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతోందని చెప్పారు.

 

19:48 - August 16, 2015

ఆదిలాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో..ఆదిలాబాద్ జిల్లాలో యూరియాకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరగా చేసుకున్న కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో రైతులు వారి కుటుంబ సభ్యులతోపాటు తెల్లవారుజాము నుంచే యూరియా గోదాములకు బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా..అధికారులు, పాలకులు స్పందించి వెంటనే తమకు యూరియా బస్తాలు సరఫర చేయాలని రైతులు కోరుతున్నారు.

 

19:36 - August 16, 2015

కరీంనగర్: తెలంగాణలో డెంగ్యూ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ లో డెంగ్యూ వ్యాధితో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలువాల ఆనంద్‌ అనే యువకుడు గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షల్లో యువకుడికి డెంగ్యూ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో డెంగ్యూ మహమ్మారి పట్ల జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలయ్యంది.

బాసర ట్రిపుల్ ఐటీల్లో కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థత

ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీల్లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.

 

నల్గొండ జిల్లా ఎర్రారంలో ఉద్రిక్తత

నల్గొండ: డిండి మండలం ఎర్రారంలో ఉద్రిక్తత నెలకొంది. భూతగాదాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

 

భర్త ఆత్మహత్య..భార్య ఆత్మహత్యాయత్నం...

నల్లగొండ: భువనరిగిలో విషాదం నెలకొంది. ఆర్టిసి ఉద్యోగి పూర్ణచందర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతి చెందడంతో కిరోసిన్ తాగి ఆయన భార్య చందన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనలకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

19:04 - August 16, 2015

జకార్తా: ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. పపువా దగ్గర రాడార్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 54 మంది ప్రయాణికులున్నారు. విమానం జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

18:43 - August 16, 2015

గుంటూరు: దేశంలోని కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు అందరూ మద్దతు తెలపాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ కోరారు. సెప్టెంబర్ 2న జరగబోయే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరులోని సిపియం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపియం పార్టీ అనుబంధ సంస్థలు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ తదితరుల పాల్గొన్నారు.

 

18:40 - August 16, 2015

హైదరాబాద్‌: నగరంలోని నల్సార్‌ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, చాన్సలర్‌ బోస్లేతో సహా పలువురు హాజరయ్యారు. డిగ్రీలు పూర్తి చేసిన 197 మందికి అధికారులు న్యాయశాస్త్ర పట్టాలు అందజేశారు. 

18:37 - August 16, 2015

హైదరాబాద్ : ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు.. సైలెంటయిపోయాడనే అపవాదును మోస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఈ మధ్య ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాల్ని చెబుతూ వస్తున్నారు. తాను ప్రచారం చేసిన బీజేపీ, టీడీపీ పార్టీల విధానాలపై చాలా సున్నితంగా స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ అంశంపై పవన్‌కల్యాణ్ మరోసారి స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు సుముఖంగాలేని రైతులపై భూసేకరణ చట్టాని ప్రయోగించవద్దు' అంటూ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సంవత్సరంలో రెండు కంటే ఎక్కువ పంటలు పండే భూములను ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై బలవంతంగా చట్టాలను ప్రయోగింవద్దు అంటూ ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అయితే సోషల్ వెబ్ సైట్లలో పవన్ పై సైటైరిక్ పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.  ట్విట్టర్ లో భాగానే పోస్టు పెట్టాడు కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే.. ఈ జనసేనాని చెప్పిన మాటకు కట్టుబడి ప్రశ్నిస్తాడా..? చేసిన ట్వీటుకు నిలబడి పోట్లాడతాడా అని సోషల్ మీడియాలో సెటైర్లతో కూడిన విమర్శలు వినిస్తున్నాయి. మరి ఈయన ఏం చేస్తాడో కొద్ది రోజుల్లో తేలిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. 

 

18:32 - August 16, 2015

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పరిధిలోని గుబ్బల మంగమ్మగుడి సమీపం వద్ద విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి ఆరుగురు మృతి చెందారు. గుబ్బల మంగమ్మగుడి సమీపంలోని కొండవాగులోకి ఎనిమిది మంది స్నానానికి వెళ్లారు. కొండవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో... ఎనిమిది మంది గల్లంతయారు. వీరిలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. వాగులో పడి కొట్టుకుపోతున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతి చెందిన ఆరుగురి మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మృతులంతా విజయవాడకు చెందిన మాధవి, కళ్యాణి, సరస్వతి, దీపక్‌పాయి, రోహిత్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికులు రక్షించిన మరో ఇద్దరిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వలివెల వాసులుగా గుర్తించారు. కొండవాగులో పడి ఆరుగురు మృతి చెందారన్న వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు వాగు వద్దకు చేరుకొని భోరున విలపిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే కావడం విశేషం. ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వాగులో పడి మృతి చెందారని స్థానికులు చెప్తున్నారు.

 

16:59 - August 16, 2015

హైదరాబాద్‌: ఎపి, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. తిరుమలలో భారీవర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
హైదరాబాద్‌లో
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌, అమీర్‌పేట్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, లక్డీకపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, ఉప్పల్‌లో భారీ వర్షాలు కురిశాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మదీనాగూడ, చందానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ఎక్కిడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రంగారెడ్డిలో
రంగారెడ్డి జిల్లా అల్వాల్‌లోనూ వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వానలు పడుతుంటడంతో... జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
భద్రాచలంలో
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం 35 అడుగులకు చేరింది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, పొంగిపోర్లుతున్న వాగులు వంకలతో గోదావరి పరుగులు తీస్తోంది. నిన్నటి వరకు 23 అడుగుల మేర ఉన్న ప్రవాహం 35 అడుగులకు చేరింది. మరోవైపు తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో.. ఆ నీరు కూడా నదిలోకి చేరుతోంది. దీంతో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరే అవకాశముంది.
పాల్వంచలో..
ఖమ్మం జిల్లా పాల్వంచలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి... పలు కాలనీల్లోని ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో పడ్డాయి. జయమ్మకాలనీ, వనమా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో... విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమలలో
అల్పపీడన ద్రోణి ప్రభావంతో... తిరుమలలో భారీవర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆలయం ముందు, వసతి గృహాల వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. మరోవైపు వీకెండ్ కావడంతో... తిరుమలలో రద్దీ భారీగా ఉంది. సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. దీనికి తోడు వర్షంతో భక్తులు అవస్థలు పడుతున్నారు.

 

16:38 - August 16, 2015

పాట్నా : సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడంటూ ఓ వ్యక్తిని ఓ మహిళ చితక్కొట్టింది. పంజాబ్ లోని మోగాలో అందరూ చూస్తుండగా ఓ దళిత యువకుడిపై మహిళ కర్రతో దాడి చేసింది. ఉగ్రరూపం దాల్చిన సదరు మహిళ యువకుడి కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగింది. ఇదిలా ఉండగా మరోవైపు బాధితుడి బంధువుల వాదన మరోలా ఉంది. వారు మహిళ తీరును తప్పుబడుతున్నారు. దళితులమైన తమపై భూ వివాదం కారణంగానే కక్షగట్టి దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సదరు మహిళ యొక్క కక్ష సాదింపు చర్యను నిరసిస్తూ, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు స్థానిక ఎస్పీని ఆశ్రయించారు. న్యాయ విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణ నిజమైందేనా..? లేక యువకుడి బంధువులు ఆరోపిస్తున్నట్లు ఆ మహిళ పాత కక్షలతో దాడిచేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా మహిళ ఆ యువకుడిని కొడుతుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి మొబైల్ లో వీడియో తీశాడు. ఈ వీడియో 'యువకుడిని చితక్కొట్టిన మహిళ' అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. 

15:50 - August 16, 2015

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని పంజాబ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడిలో ఆ..రాష్ట్ర హోంమంత్రి సుజాఖాన్ జాదా సహా 10 మంది మృతి చెందారు. పంజాబ్ లోని హోంమంత్రి కార్యాలయంపై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో హోంమంత్రి సుజాఖాన్ జాదా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో సహా 10 మంది మృతి చెందారు. 

పాక్ లో బాంబు పేలుడు...

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో బాంబు పేలుడు సంభవించింది. పంజాబ్ లోని హోంమంత్రి కార్యాలయంపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో హోంమంత్రి సుజాఖాన్ జాదా సహా 10 మంది మృతి చెందారు. 

ఇండోనేషియా విమానం ఆచూకీ గల్లంతు..

జకార్తా: ఇండోనేషియా విమానం ఆచూకీ గల్లంతయింది. పపువా గగనతలంలో విమానం గల్లంతయింది. విమానంలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. 

15:11 - August 16, 2015

హైదరాబాద్: దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందటే... అది ఆంధ్రప్రదేశేనని మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర విభజనకు కారకులైన వారు కూడా కపటనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

 

15:01 - August 16, 2015

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం గుబ్బాలలో విషాదం చోటుచేసుకుంది. మంగమ్మగుడి సమీపంలోని కొండవాగులో పడి ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు గుడివాడుకు చెందిన వారిగా గుర్తించారు.

వాగులో పడి ఐదుగురి మృతి

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం గుబ్బాలలో విషాదం చోటుచేసుకుంది. మంగమ్మగుడి సమీపంలోని కొండవాగులో పడి ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతులు గుడివాడుకు చెందిన వారిగా గుర్తించారు.

 

14:52 - August 16, 2015

జకార్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి ఓటమిపాలయ్యింది. తుదిపోరులో డిపెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారణి కరోలినాతో హోరా హోరిగా జరిగిన ఫైనల్స్ లో సైనా పోరాడి ఓడిపోయింది. సైనా రన్నరప్ గా నిలిచింది. వరుస సెట్లు కోల్పోయి సైనా పసిడి పతకం చేజార్చుకుంది. మొదటి సెట్ ఆరంభంలో ఆదిపత్యం కనబర్చిన సైనా ఆ.. తర్వాత వెనుకబడింది. అయితే రెండో సెట్లో పుంజుకుని ముందజలో ఉన్న సైనా చివర్లో చేసిన పొరపాట్లతో ఓడిపోయింది. కాగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు చేరుకున్న సైనా రజతంతో సరిపెట్టుకుంది.

సైనాకు గోల్డ్ మిస్..

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ సైనా నెహ్వాల్ రన్నరప్ గా నిలిచింది. డిపెండింగ్ ఛాంపియన్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారణి కరోలినాతో హోరా హోరిగా జరిగిన ఫైనల్స్ లో సైనా వరుస సెట్లు కోల్పోయి పసిడి పతకం చేజార్చుకుంది. మొదటి సెట్ ఆరంభంలో ఆదిపత్యం కనబర్చిన సైనా ఆ తర్వాత వెనుకబడింది. అయితే రెండో సెట్లో పుంజుకుని ముందజలో ఉన్న సైనా చివర్లో చేసిన పొరపాట్లతో ఓటమిపాలయ్యింది. కాగా భారత బ్యాట్మింటన్ చరిత్రలో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు చేరుకున్న సైనా రజతంతో సరిపెట్టుకుంది. 

13:39 - August 16, 2015

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుమ్మల అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి... రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పోతినేని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించే నాయకుల వైఖరిని నిరసించాలని ఆయన పిలుపునిచ్చారు. తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ను కోరుతామన్నారు. 

13:34 - August 16, 2015

అమెరికా : ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాలసుందర్‌ అమెరికాలో దుర్మరణం చెందాడు. టెక్సాస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందాడు. దీంతో చీరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలసుందర్ మృతిపట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

 

13:32 - August 16, 2015

మెదక్ : తెలంగాణ సీఎం సొంత గ్రామం... ఇరిగేషన్ మినిస్టర్‌ సొంత నియోజక వర్గం... అయినా మామా అల్లుళ్లకు తిప్పలు తప్పడం లేదు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు సొంత నియోజకవర్గం సిద్ధిపేటలోనే... చేదు అనుభవం ఎదురైంది. నిన్న చింతమడక గ్రామంలో... హరీశ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. హరీశ్ రావు గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. చింతమడకను మండల కేంద్రం చేయాలంటూ డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ మా ఊరికి రావలె అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా చింతమడకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. 

మొదటి సెట్ ఓడిన సైనా..

జకార్త : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. కరోలినా మారిన్ పై భారత షెట్లర్ సైనా నెహ్వాల్ తల పడుతోంది. తొలి సెట్ లో 21-16 తేడాతో సైనా ఓడిపోయింది. 

13:23 - August 16, 2015

వరంగల్ : ప్రేమిస్తున్నా..తనను ప్రేమించాలంటూ ఓ గిరిజన యువతిపై ఓ ప్రేమోన్మాదానికి దారుణానికి ఒడిగట్టాడు. గొంతు కోయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈఘటన ఏటూరు నాగారంలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నా అంటూ బుట్టాయి గ్రామంలో నివాసం ఉండే గిరిజన యువతిని ఓ యువకుడు వేధించసాగాడు. కానీ ఆ యువతిని అతని ప్రేమను తిరస్కరించింది. దీనికి ఆగ్రహించిన యువకుడు ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొట్టే ప్రయత్నాలు చేశాడు. అయినా తన దారికి రాకపోవడంతో యువకుడు ఆదివారం బుట్టాయిగ్రామ అటవీ ప్రాంతానికి గిరిజన యువతిని తీసుకెళ్లాడు. అనంతరం గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ గిరిజన యువతి కేకలు వేసుకుంటూ గ్రామంలోకి పరుగెత్తింది. స్థానిక ప్రజలు వెంటనే ఆమెను ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన యువకుడి కోసం గాలిస్తున్నారు. 

13:15 - August 16, 2015

గుంటూరు : వానలతో పాటు చేపల వర్షాలు కూడా కురుస్తున్నాయి. జిల్లాలోని ఉయ్యూరిపాలెంలో వర్షంతో పాటు చేపలు పడ్డాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం పొలాలకు వెళ్లిన వారికి చేపలు కనబడ్డాయి. వర్షంతో పాటు చేపలు పడ్డాయని భావించారు. ఈ వార్త దావానంల పాకడంతో చేపలు తీసుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ చేపలు దాదాపు రెండు, మూడు కిలోల బరువున్నాయి. భారీ సుడిగాలులకు నీటితో పాటు చేపలు కూడా ఆకాశంలోకి వెళ్లి.. వర్షంతోపాటు పడి ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలోని గోళ్లమూడిలో కూడా చేపల వర్షం కురిసిన విషయం తెలిసిందే.

జమ్మూలో ఎన్ పీపీ నేతల నిరసన ప్రదర్శన..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ ఎన్ పీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే కాల్పులు ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల పాక్ కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో సాధారణ పౌరులతో పాటు జవాన్లు కూడా మృతి చెందుతున్నారు.
ఆదివారం బాల్ కోట్ ప్రాంతంలో పాక్ జరిపిన కాల్పుల్లో 5గురు సాధారణ పౌరులు మృతి చెందారు. 

కందాల పోర్టులో పోలీసుల తనిఖీలు..

గుజరాత్ : కందాల పోర్టులో అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని స్థానిక జాలర్ల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఘనంగా నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం..

హైదరాబాద్ : నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ఛాన్సలర్ బోస్లే తదితరులు హాజరయ్యారు.

 

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..

అమెరికా : ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన తాటికొండ బాల సురేంద్ర (25) అమెరికాలో మృతి చెందాడు. టెక్సాస్ కు గత నెల 22న స్నేహితులతో వెళ్లిన సురేంద్ర ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి మృతి చెందాడు. 

12:52 - August 16, 2015

శ్రమ నుండి పుట్టిన పాటను తెలంగాణా రచయితలు ప్రజాచైతన్య కేతనంగా ఎగరేస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ధ్వంసం కావడం చూసి చలించి జ్వలించి ఎందరో గేయ రచయితలు అద్భుతమైన పాటలు రాస్తున్నారు. అలాంటి వారిలో అంబటి వెంకన్న ఒకరు. వస్తు వైవిధ్యంతో అంబటి వెంకన్న ప్రజా చైతన్య గేయాలు రాస్తున్నారు. 

12:48 - August 16, 2015

మనువు రాజ్యాంగం కూలటం మీ దురదృష్టమైతే మా అంబేద్కర్ రాజ్యాంగం కూర్చటం మా అదృష్టం అంటూ బలమైన భావజాలంతో కవిత్వాన్ని దళిత కవి నేతల ప్రతాప్ కుమార్ వినిపిస్తున్నారు. ఆయన రాసిన 'అన్నంగిన్నె' కవితాసంపుటి తెలుగు సాహిత్యంలో కొత్త భావ ప్రకంపనలు రేకెత్తించింది. ఉదయాలన్నీ ఇప్పుడు భూపాల రాగాలతో కాదు భీమ్ పాల రాగాలతో పల్లవించాలంటున్న నేతల ప్రతాప్ కుమార్ పరిచయ కథనం.

12:44 - August 16, 2015

సాహిత్యం ప్రజల హృదయాలను కదిలిస్తుంది..కరిగిస్తుంది. భావోద్వేగాలను రగిలిస్తుంది. ప్రజా సమూహాలను చైతన్య ప్రవాహాలుగా మార్చేస్తుంది. మనిషి మంచి మనిషిగా మార్చేది సాహిత్యమే. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న చైతన్య మూర్తులైన సృజనకారులెందరో ఉన్నారు. గ్లోబలైజేషన్ అన్నది చాపకిందనీరులా అంతటా ప్రవహిస్తోంది. ఈనేపథ్యంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మార్కెట్ సంబంధాలుగా మారిపోతున్నాయి. అయితే పల్లె ప్రజల హృదయాల్లో మాత్రం ఇంకా మానవీయకోణాలతడులు తళుక్కుమంటున్నాయి. ఇదే విషయాన్ని వస్తువుగా తీసుకుని మార్కెట్ కథల సంపుటిని వెలువరించారు డా.ఎ.రవీంద్ర. దళిత బహుజన జనజీవితాల అనుబంధాలను ఆర్ధ్రమైన కథలుగా మలిచారు రవీంద్ర. ఆయన కథల వస్తు శిల్ప వైశిష్ట్యాలను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. 

టి.సర్కార్ కు చేతులు రావడం లేదు - జితేందర్ రెడ్డి..

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకొనేందుకు టి.సర్కార్ కు చేతులు రావడం లేదని కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, రైతులు రుణాలు రాక వడ్డీ వ్యాపారుల వలలలో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యానికి హాని చేయని మద్యం ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

తిలక్ నగర్ నాలాలో కొట్టుకపోయిన యువతి..

హైదరాబాద్ : తిలక్ నగర్ వద్ద నాలాలో ఓ యువతి కొట్టుకపోయింది. అంబర్ పేట వద్ద మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 

మైలార్ దేవుపల్లిలో దారి దోపిడి..

హైదరాబాద్ : మైలార్ దేవుల పల్లిలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి రూ.14 లక్షలను ఎత్తుకెళ్లారు.

 

హైకోర్టు కోసం పార్లమెంట్ లో నిలదీస్తాం - జితేందర్ రెడ్డి...

హైదరాబాద్ : హైకోర్టు విభజన కోసం పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులపై కేంద్రాన్ని టిడిపి నిలదీయాలని సూచించారు. 

కడప జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాస..

కడప : జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాస చోటు చేసుకుంది. సమావేశం తీర్మానం లేకుండా చేపట్టిన పనులపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

12:24 - August 16, 2015

హైదరాబాద్ : తన స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుంటానని హీరో మహేష్ బాబు తెలిపారు. తాజ్ మహల్ హోటల్ లో 'శ్రీమంతుడు' సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. తాను నటించిన 'శ్రీమంతుడు' మంచి విజయం సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు నటించిన జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, శృతి హాసన్ ఎంతో సహకరించారని, దేవీశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు.  ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
''ఆగస్టు 7 తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఈ చిత్రాన్ని చూసి యువత ఎంతో స్పూర్తి పొంది గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం గర్వంగా ఉంది. తమకు వస్తున్న ప్రశంసలు అద్భుతంగా అనిపిస్తున్నాయి. బెస్ట్ సినిమా చేశావని అందరూ ప్రశంసిస్తుంటే ఆ అనుభూతిని మరిచిపోలేను. 15 ఏళ్ల కెరియర్ లో తన ఫెర్మామెన్స్ వైవిధ్యంగా ఉండాలని ప్రయత్నించానని, కానీ చిత్రంలో తన పాత్ర బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ సక్సెస్ ను తాము ఎవరూ ఊహించలేదు. ఒక మంచి సినిమా తీసేటప్పుడు డబ్బులు విషయం ఆలోచించవద్దు. తన కెరియర్ లో హోం వర్క్ చేయలేదు. తమ స్వగ్రామమైన బుర్రిపాలెం దత్తత తీసుకోవాలని గల్లా జయదేవ్ పేర్కొనడం జరిగింది దత్తత విషయంలో రెండు, మూడు నెలల్లో క్లారిటీ వస్తుంది. సినిమా షూటింగ్ చేసే సమయంలో చేస్తే పబ్లిషిటీ కోసం చేశారమోనని అంటారనే భావన తనలో ఉంది. తాను త్వరలో నటించబోయే 'బ్రహ్మోత్సవం' సినిమాపై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నా. హర్ష ఎలా ఉంటాడో ఆలోచించి సినిమా తీయడం జరిగింది. ఇక్కడ మహేష్ గురించి తీయలేదు''. ఈ విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాతలు, ఇతర నటులు పాల్గొన్నారు. 

తాజ్ కృష్ణాలో శ్రీమంతుడు సక్సెస్ మీట్..

హైదరాబాద్ : కెరీర్ లో ఉత్తమ చిత్రం అంటూ ప్రశంసలు వస్తున్నాయని, చాలా ఆనందంగా ఉందని నటుడు మహేష్ బాబు పేర్కొన్నారు. తాజ్ కృష్ణా హోటల్ లో శ్రీమంతుడు సక్సెస్ మీట్ నిర్వహించారు. 

పశ్చిమబెంగాల్ లో నకిలీ మద్యం..ఐదుగురి మృతి..

పశ్చిమ బెంగాల్ : రాధాబల్లాపూర్ లో నకిలీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. 

పాక్ కాల్పుల బాధితులను పరామర్శించిన నిర్మల్ సింగ్..

జమ్మూ కాశ్మీర్ : బాల్ కోట్ ప్రాంతంలో పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర డిప్యూటి సీఎం నిర్మల్ సింగ్ పరామర్శించారు. 

వైసీపీకి గుడ్ బై చెప్పిన నల్లపురెడ్డి..

హైదరాబాద్ : జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని, వ్యక్తిగత కారణాలతోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ను సీఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. 

తూర్పుపాలంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లీక్..

రాజమండ్రి : మల్కిపురం (మం) తూర్పుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లీకైంది. ఓఎన్జీసీ అధికారులు అదుపు చేస్తున్నారు. 

మంగమ్మగుడి వాగులో పడి ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : బట్టాయగూడెం (మం) గుబ్బాలలో విషాదం నెలకొంది. మంగమ్మగుడి సమీపంలోని వాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడ (మం) అప్పన్నగూడెం వాసులుగా గుర్తించారు. 

11:10 - August 16, 2015

'తాజ్ మహల్' ట్విట్టర్ లో వచ్చేసింది. తాజ్‌మహల్‌ ఖాతా తెరవడమేంటని ఆశ్యర్యపోతున్నారా! అవునండీ.. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్‌మహల్‌ ట్విట్టర్‌లో చేరింది. 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ 17వ శతాబ్దికి చెందిన చరిత్రాత్మక తాజ్ మహల్ పేరున అధికారికంగా ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించారు. ట్విట్టర్ లో తాజ్ మహల్ కు సంబంధించిన సమగ్ర సమాచారం, తాజ్ చరిత్ర, ఒక్కో పిల్లర్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, టూరిస్ట్ లకు అవసరమైన సమాచారం ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. టూరిజం శాఖ ఈ ట్విట్టర్ అకౌంట్ కు రూపకల్పన చేసింది. ఆగ్రాలోని తాజ్ మహల్ .. ప్రపంచంలోని అరుదైన అద్భుతాలలో ఒకటి... ప్రపంచంలోని సెవెన్ వండర్స్ లో చాలా ఏళ్లపాటు స్థానం పొందింది. ఈ చరిత్రాత్మక కట్టడం వివరాలు తెలుసుకోవడం వల్ల ప్రపంచంలో మరింత మంది ఈ కట్టడాన్ని చూసే అవకాశం ఉంది. ట్విట్టర్ అకౌంట్ ప్రారంభమైన గంటలోనే 2 వేలమందిని ఆకట్టుకుంది. అంతేకాదండోయ.. ట్విట్టర్‌లో చేరిన మొట్టమొదటి చారిత్రాత్మక స్మారక కట్టడంగా రికార్డు సాధించింది. 'నన్ను సందర్శించిన వారు ఫాలో అవ్వండి. ఎవరైతే నన్ను సందర్శించలేదో వారూ ఫాలో అవ్వండి' అంటూ మొదటి ట్వీట్‌ చేసింది.

గ్రామాలను ఖాళీ చేస్తున్న బాల్ కోట్ ప్రజలు..

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దులోని బాల్ కోట్ ప్రాంతంలో పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. దీనితో ప్రాణాలను రక్షించుకోవడానికి గ్రామాలను వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు పాక్ జరిపిన కాల్పుల్లో 6గురు సాధారణ పౌరులు మృథి చెందగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం..

ఖమ్మం : భద్రాచలంలో నీటి మట్టం పెరుగుతోంది. శనివారం రాత్రి 29 అడుగులున్న నీటి మట్టం ఆదివారం ఉదయం 25 అడుగులకు చేరుకుంది.

 

80 కిలోల గంజాయి స్వాధీనం..

తూర్పుగోదావరి : జిల్లాలోని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ శివారులో 16వ జాతీయ రహదారిపై పోలీసులు జరిపిన తనిఖీల్లో 80 కిలోల గంజాయి బయటపడింది. దీనికి సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

10:48 - August 16, 2015

జకార్త : ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ కు...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తహతహలాడుతోంది. జకార్తాలోని సుకర్నో ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2015 ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఈరోజు జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ సమరంలో...ప్రస్తుత చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ కు ...రెండోర్యాంక్ సైనా సవాల్ విసురుతోంది.

పోరాడిన మారిన్..
తొలిసెమీఫైనల్లో దక్షిణ కొరియా ప్లేయర్ సుంగ్ జీ హూన్ ను అధిగమించడానికి మారిన్..మూడుగేమ్ ల పాటు పోరాడాల్సి వచ్చింది. మారిన్ 21-17, 15-21, 21-16తో నెగ్గి..వరుసగా రెండోసారి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొంది. గతేడాది జరిగిన ప్రపంచకప్ లో మారిన్ విశ్వవిజేతగా నిలిచి సంచలనమే సృష్టించింది. 2015 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లో సైనాను ఓడించిన మారిన్...ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్లో సైతం పోటీపడబోతోంది.

మొదటిసారి ఫైనల్ చేరిన సైనా..
ఇక...భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ రెండోర్యాంకర్ సైనా నెహ్వాల్ కు మాత్రం..ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో..క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించిన సైనా..ప్రస్తుత టోర్నీలో మాత్రం పట్టుదలతో ఆడింది. రెండోసీడ్ గా స్థాయికి తగ్గట్టుగా రాణించింది. క్వార్టర్ ఫైనల్లో చైనా స్టార్ ప్లేయర్ వాంగ్ఈ హాన్ ను మూడుగేమ్ ల్లో ఓడించడం ద్వారా..సైనా తానేమిటో నిరూపించుకొంది. ఇక...ఫైనల్లో చోటు కోసం జరిగిన తొలిసెమీఫైనల్లో సైనాకు పోటీనే లేకుండా పోయింది. ఇండోనీషియా సీడెడ్ ప్లేయర్ లిండావేణి పానేత్రీని 21-17, 21-17తో సైనా చిత్తు చేసింది. ప్రపంచ 29వ ర్యాంకర్ పానేత్రి భారీషాట్లతో దూకుడుగా ఆడినా...సైనా తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి...కెరియర్ లో తొలిసారిగా ఫైనల్లో చోటు సంపాదించింది.

అభిమానుల్లో ఉత్కంఠ..
ఫైనల్స్ చేరడం ద్వారా ఇప్పటికే...రజత పతకం ఖాయం చేసుకొన్న సైనా...ఒకవేళ టైటిల్ నెగ్గితే సరికొత్త చరిత్రే సృష్టించిన భారత ప్లేయర్ గా రికార్డుల్లో చేరుతుంది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో మారిన్ చేతిలో ఎదురైన ఓటమికి...ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో బదులుతీర్చుకొనే అవకాశం సైనాకు చిక్కింది. ఈ సూపర్ సండే ఫైనల్లో సైనా ఏం చేస్తున్నదే అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

10:44 - August 16, 2015

హైదరాబాద్ : విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసిన ట్రాన్స్ కో వాటికి రక్షణ కల్పించడంలో విఫలమైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా వేలాడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే ఓ బాలుడు మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. అయినా చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఐదేళ్ల బాలుడు మృత్యువాత..
హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా రక్షణ లేని ట్రాన్స్‌పార్మర్లే కనిపిస్తున్నాయి. హైవోల్టేజీ ఉన్న వైర్లు నేలకు తాకుతూ ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. స్వచ్చభారత్‌ కార్యక్రమం సమయంలో జగద్గరిగుట్టలో స్థానికులు ట్రాన్స్ ఫార్మర్‌కు ఫెన్సింగ్‌ వేయాలని అధికారులను కోరారు. అయితే అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం 5 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ట్రాన్స్ ఫార్మర్‌ సమీపంలోకి వెళ్లి విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇటువంటి ఘటనలు ఇక్కడే కాదు నగరంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. ట్రాన్స్ ఫార్మర్‌ పక్క నుంచి వెళ్లాలంటేనే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రమాదకరంగా 500 ట్రాన్స్ ఫార్మర్లు..
సుమారు 5 వందలకుపైగా ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. మరో 3 వందల ట్రాన్స్ ఫార్మర్లు నిత్యం నిప్పురవ్వలు వెదజల్లుతూ ప్రమాదాలను రారమ్మంటున్నాయి. నివాస ప్రాంతాలు, మార్కెట్లు, వాణిజ్య సంస్థలకు సమీపంలోని వీటికి ఎటువంటి రక్షణ లేకుండా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి సంబంధించిన వైర్లు నేలను తాకుతున్నాయి. రద్దీ ప్రాంతాలు కావడంతో ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌, మాదాపూర్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో రక్షణ లేని ట్రాన్స్ ఫార్మర్ల సంఖ్య అధికంగా ఉంది.

తగులుతున్న షాక్ లు..
నగరంలో కొత్తగా నిర్మించే ట్రాన్స్ ఫార్మర్ల దిమ్మలను 5 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. రెండు, మూడేళ్ల క్రితం నిర్మించినవి కేవలం రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరాకు ఏర్పాటుచేసే బాక్సులు సిమ్మెంటు దిమ్మకు బిగుస్తున్నారు. ఈ బాక్సులకు ఉండే మూతలు కేవలం రెండు మూడు నెలలకే పాడైపోతున్నాయి. దీనితో మూత లేకుండా విద్యుత్‌ వైర్లు ఉన్న బాక్సులు దర్శనమిస్తున్నాయి. హైవోల్టేజీ ఉన్న వైర్లు బయటకు కనిపించడంతో కొద్దిపాటి వర్షం కురిసినా విద్యుత్‌ షాక్‌ తగులుతోంది. పొరపాటున ఈ ప్రాంతంలో ఏ విద్యుత్‌ స్థంభాన్ని పట్టుకున్నా విద్యుత్‌ షాక్‌ తలుగుతోంది.
అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణగా ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

10:38 - August 16, 2015

ఖమ్మం : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం వరకు 23 అడుగులు మేర ఉన్న నీటి ప్రవాహం 35 అడుగులకు చేరుకుంది. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఈ నీరు కూడా గోదావరిలోకి చేరుతోంది. దీనివల్ల నీటి మట్టం 40 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పాల్వంచలో..
పాల్వంచలో కూడా భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జయమ్మ కాలనీ, వనమా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 

రంగారెడ్డి..
జిల్లాలోని అల్వాల్ లో భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు జలమయమం కావడంతో అక్కడకక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 

 

10:28 - August 16, 2015

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో పాక్‌ బలగాలు తెగబడుతూనే ఉన్నాయి. కాశ్మీర్‌లోని పాక్ సైన్యం విచక్షిణా రహితంగా కాల్పులు జరుపుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. సుమారు 30 గ్రామాలపై మోర్టార్ షెల్‌లతో దాడులకు తెగబడింది. పాక్ ఆర్మీ దాడుల్లో బాలాకోట్‌లో ఆరుగురు పౌరులు చనిపోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గతరాత్రి నుంచి పాక్‌ సైన్యం దాడులు చేస్తుండటంతో....స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

10:24 - August 16, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ఓ పట్టాన కొలిక్కి రావట్లేదు. ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారో అర్థంకాని పరిస్థితి. తాజాగా.. ఏ4 నిందితుడు మత్తయ్యకు సహకరించిన వారిపై తెలంగాణ ఏసీబీ దృష్టి పెట్టినట్టు సమాచారం. రేవంత్‌ వీడియో టేపులు బయటకు వచ్చినా.. హైదరాబాద్ లోనే ఉన్న మత్తయ్య.. చంద్రబాబు ఆడియో టేపులు బయటకు రాగానే విజయవాడకు వెళ్లాడు. తనకు కేసీఆర్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని సత్యనారాయణ పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. పోలీసులు కేసునమోదు చేసి, కేసును సీఐడీకి అప్పగించారు.

రెండు రోజుల్లో నోటీసులు ?
తాజాగా.. ఈ విషయంపై దృష్టి పెట్టిన ఏసీబీ.. మత్తయ్యను కొందరు ప్రలోభపెట్టి విజయవాడకు తీసుకెళ్లినట్లు సాక్ష్యాధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మత్తయ్యకు సహకరించిన ఐదుగురు ఇంటలిజెన్స్ పోలీసులకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు, జిమ్మిబాబును విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. కానీ.. జిమ్మిబాబు విచారణకు రాలేదు. ఈ విషయంలోనూ జిమ్మిబాబుకు సహకరించిన నలుగురు టీడీపీ కార్యకర్తలకు రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు ఏసీబీ అధికారులు లీకులు ఇచ్చారు.

నోటీసుల వార్..
అయితే.. తెలంగాణ ఏసీబీ అడుగు ముందుకు వేసిన ప్రతిసారీ దూకుడు పెంచుతోంది సీఐడీ. నారా లోకేష్ డ్రైవర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వగానే.. కేటీఆర్ డ్రైవర్, బాడీగార్డులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సీఐడీ. ఇదే క్రమంలో... పోలీసులకు ఏసీబీ నోటీసులు ఇస్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటిలిజెన్స్ అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి.. రెండు ప్రభుత్వాల మధ్య నోటీసుల వార్‌ నడుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు రాజకీయనాయకులకే పరిమితమైన నోటీసులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసుల మెడకూ వేలాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

10:18 - August 16, 2015

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ డుమ్మా కొట్టారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌ కొంత నొచ్చుకున్నట్లుగా కనిపించారు. ముఖ్యమంత్రులు రాకున్నా.. తానున్నాను కదా అంటూ.. మీడియాను కవర్‌ చేశారు.

ఆహ్లాదంగా విందు..
రాజ్ భవన్ వేదికగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందు ఆహ్లదకరంగా కొనసాగింది. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, చీఫ్ జస్టిస్ దిలిప్ బీ బోంస్లే తో, మండలి చైర్మన్ స్వామీ గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, లక్షారెడ్డి తదితరులు హజరయ్యారు. సీఎల్ పీ నేత జానా రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ మంత్రులు గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, బీజేఎల్పీ నేతలు లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు విందులో పాల్గోన్నారు. విందుకు హాజరయిన వారిలో ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరించారు గవర్నర్ దంపతులు. జస్టిస్ బోంస్లే, కేంద్ర మంత్రి సుజనాలను గవర్నర్ ప్రత్యేకంగా పక్కకు తీసుకపోయి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలతోనూ కాసేపు నరసింహన్ మాట కలిపారు.

చర్చనీయాంశమై సీఎంల గైర్హాజర్..
అయితే గవర్నర్ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. పట్టి సీమ ప్రాజెక్టును జాతికి అంకింతం చేసే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు బీజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ఇటు తెలంగాణ సీఎం కూడా ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. వారి గైర్హజర్ పట్ల నరసిహంన్ కాస్త నొచ్చుకున్నారు. వారు రాకున్నా.. తానున్నానుగా అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చిన్నప్పుడు తన మనవడు తనపై అలిగి...ఓ ఫంక్షన్ కు రాలేదని గుర్తు చేసారు. అయితే ఇప్పుడు సీఎంలు రాకపోవడాఇకి గల కారణాలు తనకు తెలియదన్నారు. ఇద్దరు సీఎంలకు తాను ఆమోదయోగ్యుడేనన్నారు. హైద్రాబాద్ లో ఉండే చివరి రోజు వరకు తాను ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మొత్తంగా గవర్నర్ తేనిటి విందు వేదికగా రాజకీయాలకు అతీతంగా నేతలు కలిసిపోయారు. పరస్పరం యోగక్షేమాలు విచారించుకుంటూ.. కలియతిరుగుతూ పండుగ వాతావరణాన్ని తలపింపజేసారు. 

09:50 - August 16, 2015

తెలంగాణ గ్రామాలను బంగారు గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'గ్రామ జ్యోతి' పథకానికి శ్రీకారం చుడుతోంది. గంగదేవిపల్లి వేదికగా ఆరంభం కాబోతున్న ఈ పథకం నిజంగా తెలంగాణ పల్లెలను పసిడి సీమలుగా మార్చగలుగుతుందా ? గతంలో గ్రామాభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలకు భిన్నంగా ఉంటుందా ? బంగారు గ్రామాల తెలంగాణకు బాటలు వేస్తుందా ? గ్రామ జ్యోతి ఆశయం ఫలించాలంటే ఆచరణ ఎలా ఉండాలి ? తెలంగాణ పల్లెల్లో వెలుగుల్ని విరజిమ్ముతుందా ? ప్రభుత్వం ఇస్తామంటున్న రూ. 25వేల కోట్ల రూపాయల నిధుల ఎక్కడి నుండి వస్తాయి ? ఈ అంశాలపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.

09:29 - August 16, 2015

వరంగల్ : పల్లె ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు గురిపెట్టారు. గ్రామాల నుంచి గుడుంబా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఊరూ వాడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండాలను గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో గుడుంబా నివారణ కోసం సాగుతున్న పోరాటంపై ప్రత్యేక కథనం..

అనేక సదస్సులు..
ఒకప్పుడు వరంగల్‌ జిల్లాలో గుడుంబా గుప్పుమనేది. ప్రతి పల్లెలో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా జరిగేవి. తండాలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ సబ్‌డివిజన్‌లో లంబాడీ తండాలు సారా మత్తులో జోగుతూ.. పచ్చని సంసారాలను నాశనం చేసుకున్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన ఇంటి పెద్ద.. గుడుంబాకు బానిసై మృత్యువాత పడ్డారు. దీంతో అనేక తండాల్లోని మహిళలు వితంతువులుగా మారారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గుడుంబా తయారీ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడతున్నారు. స్వచ్చంద సంఘాలు, యువజన, మహిళా సంఘాల సహకారంతో తండావాసుల్లో గుడుంబా నుంచి దూరంగా ఉండేందుకు అనేక సదస్సులు నిర్వహిస్తున్నారు.

గుడుంబారహితంగా మారిన 38 తండాలు...
తండాల్లోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోంది. స్వచ్చంద సంస్థలు, యువజన, మహిళాసంఘాలతో కలిసి పోలీసులు నిర్వహించిన సదస్సులతో.. గుడుంబా వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. దీంతో మహబూబాబాద్‌ డివిజన్‌లోని 38 గ్రామాలు గుడుంబారహిత గ్రామాలుగా మారిపోయాయి. పోలీసుల నిరంతర పర్యవేక్షణతో.. అసలు ఆ తండాల్లో గుడుంబా వాసనలే లేకుండా పోయాయి. మరోపక్క ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి గుడుంబా తీసుకువచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనేక తండాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మార్పుతో పోలీసుల్లో ఉత్సాహం పెరిగింది. గుడుంబారహిత గ్రామాల స్ఫూర్తితో మిగతా తండాల్లోనూ గుడుంబా తయారీ, విక్రయాలను నిలిపివేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వచ్చంద సంస్థలు, యువజన, మహిళా సంఘాలతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. గుడుంబా వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి..
ఇప్పటికే గుడుంబాకు బానిసై రోడ్డున పడ్డామని అనేక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందితే గుడుంబాకు దూరంగా ఉంటామని వారు అంటున్నారు. గుడుంబా రక్కసి నుంచి తండావాసులను రక్షించేందుకు కంకణం కట్టుకున్న పోలీసులు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

09:15 - August 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాలు లేకపోవడంతో..ప్రైవేట్‌ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..
భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరైనా రోగాల బారిన పడి మంచమెక్కుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన రోగులకు..సరైన వైద్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవడంతో...అప్పు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నెలరోజుల్లో విషజ్వరాలతో 8 మంది మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రమే అంటూ కొట్టిపారేస్తున్న వైద్యులు..
ఇక నిజామాబాద్‌ జిల్లాలోనూ డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. విషజ్వరాల అదుపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన వైద్యాధికారులు.. డెంగ్యూ కేసులు నామమాత్రమే అంటూ తేలికగా కొట్టిపారేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

గ్రామాల్లో విలయతాండవం చేస్తున్న డెంగ్యూ.
.
నిజామాబాద్‌, డిచ్‌పల్లి, సిరికొండ, సదాశివనగర్‌, కామారెడ్డి, దోమకొండ, బోధన్‌, బాన్సువాడ, నిజాంసాగర్‌, బీర్కూర్‌ తదితర గ్రామాల్లో డెంగ్యూ విలయ తాండవం చేస్తోంది. మేలో 10 మందికి... జులైలో 30 మందికి డెంగ్యూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. జిల్లా కేంద్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణంపై భయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.

ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం..
ఇక ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్‌ జిల్లా కూడా విష జ్వరాలతో వణికిపోతుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. పారిశుద్ధ్యం కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు..ఆ దిశగా ప్రయత్నించడం లేదంటున్నారు. కేవలం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


రోగులను దోచుకుంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు..
సందంట్లో సడేమియా అన్న చందంగా..ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిందే తడవుగా అవసరం లేని టెస్టులన్నీ పేదల జేబుకు చిల్లుపెడుతున్నాయి. డెంగీ టెస్టులో నెగిటివ్‌ వచ్చినా రక్తంలో ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పడిపోయాయని భయపెడుతూ డబ్బులు దండుకుంటున్నాయి. 2015 జనవరి నుంచి జూన్‌ వరకు 75 కేసులు రాగా..అందులో 8 డెంగీ పాజిటివ్‌ కేసులుగా గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. అనేకమంది విష జ్వరాలను గుర్తించలేక మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు మొద్దు నిద్ర వీడి.. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

వైసీపీ నేత కేజే కుమార్ అరెస్టు..

చిత్తూరు : నగరిలో వైసీపీ నేత కేజే కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. పుత్తూరు పీఎస్ కు తరలించారు. మున్సిపల్ కమిషనర్ బాలాజీపై దాడిపై కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత భద్రతా దళాలు ఈ కాల్పులను తిప్పి కొడుతున్నాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. 

08:05 - August 16, 2015

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స చేస్తున్న వైద్యులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని ఇళయరాజ కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.
జూన్ 2, 1943లో ఇళయరాజ జన్మించారు. భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి). వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి.

భద్రాచలంలో భారీ వర్షం..

ఖమ్మం : భద్రాచలంలో భారీ వర్షం కురుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి 34.5 అడుగులు..పేరూరు వద్ద 35 అడుగులకు చేరుకుంది. చీకుపల్లి వద్ద కాజువేపై నీరు ప్రవహిస్తుండడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

తిరుమలలో భారీ వర్షం..

చిత్తూరు : తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీనితో వర్షానికి క్యూ లైన్ లోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

టి. అటవీ శాఖాధికారులకు నేడు వాహనాల అందజేత..

హైదరాబాద్ : టి. అటవీ శాఖాధికారులకు నేడు వాహనాల అందజేయనున్నారు. ఆదివారం తెలంగాణ ఫారెస్టు అకాడమీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు అధికారికంగా ఈ వాహనాలను అటవీ శాఖ సిబ్బందికి అందించనున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లు నిండిపోయి రెండు కి.మీ మేర భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 12గంటలు..కాలినడకన భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. 

పాక్ కాల్పులు..5 గురి మృతి..

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఫైరింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

07:43 - August 16, 2015

విశాఖపట్టణం : మేము మంచి స్నేహతులమని హీరోయిన్స్ కాజల్, తమన్నాలు పేర్కొన్నారు. విశాఖపట్టణంలో వారు సందడి చేశారు. ప్రముఖ కంపెనీ ఖజానా జ్యువల్లరీ షాప్ ను వారు ప్రారంభించారు. కాజల్, తమన్నాలు వస్తున్నారన్న తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనితో ఖజానా షాపు ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠిఛార్జి చేశారు. 'బాహుబలి 2' చిత్రాన్ని విజయవంతం చేయాలని కాజల్, తమన్నా ప్రేక్షకులను కోరారు. 

07:38 - August 16, 2015

ముంబై : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు పెట్టుకోవాలని..ఆయన స్పూర్తిని అందరూ కొనసాగించాలని ఆ యువకుడు అనుకున్నాడు. అందరికీ తెలియచెప్పాలని భావించాడు. స్వాతంత్ర్యం దినోత్సవం రోజున ఓ వినూత్న కార్యక్రమం చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఏకంగా 22 అంతస్తులు ఎక్కి రికార్డు సృష్టించాడు. శర్మ అనే యువకుడు ఆగస్టు 15వ తేదీన గుర్ గావ్ లోని 22 అంతస్తుల భవనం ఎక్కేందుకు సిద్ధపడ్డాడు. భారీగా పోగైన జనసందోహం..డప్పుల హోరు నడుమ శర్మ భవనం ఎక్కాడు. భవంతిపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. కలాం స్పూర్తితోనే తాను భవానాన్ని సులభంగా ఎక్కినట్లు శర్మ పేర్కొన్నాడు. కలాం స్పూర్తితో ఈనాటి యువతరం ముందుకు కదలాలని ఆకాక్షించాడు. శర్మను గుర్ గావ్ స్థానికులు అభినందించారు. 

07:27 - August 16, 2015

చిత్తూరు : టిటిడిలో వేళ్లూనుకుపోయిన అవినీతని నిర్మూలించేందుకు ఈఓ డి. సాంబశివరావు నడుం బిగించారు. దీర్ఘకాలంగా ఒకే దగ్గర పని చేస్తున్న అవినీతి ఉద్యోగులను గుర్తించి వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. నిజాయితీకి మారు పేరైన సీనియర్ ఐఏయస్ అధికారి అయిన సాంబశివరావు తనదైన శైలిలో టిటిడిలోని మొత్తం డిపార్టుమెంటులను ప్రక్షాళన చేస్తున్నారు. టిటిడి ఈఓగా ...భాద్యతలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ టిటిడి ప్రక్షాలనపైనే ప్రధానంగా దృష్టిసారించారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్ర రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణలను మాత్రు శాఖలకు సాగనంపారు. కాస్త ఆలస్యం అయినా వారి స్థానంలో నిజాయితీ అధికారులగా పేరున్నవారిని డిప్యుటేషన్ ద్వారా నియమించారు. అంతేకాదు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు డిఫ్యూటీ ఈఓలను కూడా బదిలీ చేసారు. అదేవిధంగా పలువురు ఏఈఓలను కూడా స్థాన చలనం కలిగించారు.

పలువురు ఏఈవోలకు స్ధానచలనం..
ఇక కళ్యాణకట్టలో ఎప్పటి నుండో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు ఈఓ తీసుకున్న చర్యలు అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుకున్నాయి. చేయి తడిపితే గానీ గుండు కొట్టమని భక్తులతో నిత్యం గొడవ పడే క్షురకులు ఇపుడు ఎలాంటి డిమాండ్‌ లేకుండా భక్తుల తలనీలాలను తీస్తున్నారు. వైకుంటం క్యూకాంప్లెక్సులో భక్తులను అడ్డదారిలో దర్శనానికి పంపించి లక్షలు దండుకునేందుకు అలవాటు పడ్డ సుమారు 25మంది సిబ్బందిపై కూడా తాజాగా బదిలీ వేటు వేసారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతావిభాగంలో కూడా ప్రక్షాలనకు ఈఓ ఆదేశించారు. అక్రమాలకు అలవాటుపడ్డ వారిని గుర్తించి సాగనంపాలని సంబదిత అధికారులను ఆదేశించారు. అంతేకాదు..భక్తులకు వసతి, స్వామివారి దర్శనం విషయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. తిరుమలలోని వివిధ కౌంటర్లలో ఎలాంటి సిఫార్సు లేకుండా భక్తులకు గదులు కేటాయించడం, రద్దీ అధికంగా ఉన్న రోజు వచ్చిన భక్తులకు అదే రోజు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకొచ్చారు. టిటిడి ఈవో తీసుకుంటున్న చర్యలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం, వసతి విషయాల్లో సంతృప్తి చెంది సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. 

ఇళయరాజుకు అస్వస్థత..

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇళయరాజుకు అస్వస్థత..

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

06:40 - August 16, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన నేటి నుంచి ప్రారంభమైంది. రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. 17వ తేదీన ఆయన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్థానిక భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు నలభై ఎనిమిది వేల మందికి పైగా భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారు. సభ నాటికి ఈ సంఖ్య యాభై వేలకు చేరవచ్చునని భావిస్తున్నారు. ఓపెన్ ఎయిర్ స్టేడియం కావడంతో సందర్శకులు 43 డిగ్రీల ఎండతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేడియాన్ని కూల్‌గా చేసేందుకు ఒక రోజు ముందుగానే అత్యాధునిక ఏసీలు ఉంచి, వాటిని ఆన్ చేయనున్నారు.

06:37 - August 16, 2015

హైదరాబాద్ : మద్యం అమ్మకాలపై సమరశంఖం పూరించేందుకు ఐద్వా సిద్ధమవుతోంది. విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలను నియంత్రించాలని.. మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న జాతా 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఈనెల 28న హైదరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రను హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో ప్రొఫెసర్‌ శాంతిసిన్హా, ఐద్వా సీనియర్‌ నేత మల్లు స్వరాజ్యం ప్రారంభించనున్నారు. 12 రోజల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో ఐద్వా నేతలు, కళాకారులు పాల్గొననున్నారు. ఈ జాతాలో మద్యం వలన కలిగే అనర్ధాలు,.. మహిళలపై హింసపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కళాకారులు పాటలు, నాటికల రూపంలో వివరించనున్నారు.

ప్రభుత్వం విధానాల వల్ల పేదల బతుకులు ఛిద్రం..
తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించనున్న నూతన మద్యం పాలసీతో పేదల బతుకులు ఛిద్రం అయ్యేదిగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. సామాన్యుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా.. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం దారుణమంటున్నారు.

ఇందిరాపార్కు వద్ద ముగింపు సభ..
24 గంటలు మద్యం షాపులు తెరిచే ఉంచుటకు ప్రభుత్వం లైసెన్స్‌లు ఇవ్వడమంటే.. మహిళలపై దాడులను ప్రేరేపించడమేనని ఐద్వా సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 18న వరంగల్‌లో. 19, 20 తేదీల్లో ఖమ్మం జిల్లాలో... 21, 22 తేదీల్లో నల్లగొండజిల్లాలో... 23, 24 తేదీల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో.. 25న నిజామాబాద్‌ జిల్లాలో.. 26న ఆదిలాబాద్‌ జిల్లాలో.. 27న కరీంనగర్‌ జిల్లాలో కొనసాగనుంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర.. 28వ తేదీన హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభతో బస్సు జాతా ముగియనుంది. 

06:34 - August 16, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ డేంజర్ సైరన్ మోగిస్తోంది.. వేగంగా విజృంభిస్తూ జనాలను టెన్షన్ పెడుతోంది.. గత ఏడాదితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.. ఏపీలో ఇప్పటికే 1089మంది డెంగ్యూబారిన పడ్డారు. నిత్యం పదుల సంఖ్యలో ఈ వ్యాధి అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో డెంగ్యూ ప్రభావం పెరుగుతూనే ఉంది. తెలంగాణతో పోలిస్తే ఇక్కడే జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1085 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.. చిత్తూరు జిల్లాలో ఏకంగా 589మందికి డెంగ్యూ సోకింది.. 155 కేసులతో కడప జిల్లా రెండో ప్లేస్‌లో కడప ఉంది.. అనంతపురం జిల్లాలో 147 కేసులతో మూడో స్థానంలో ఉంది.. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే దాదాపు 11వందలమంది ఈ జ్వరాలబారిన పడ్డారు.. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువ ప్రభావం చూపుతోంది.

సీజన్ ప్రారంభంలో 11వందలమందికి సోకిన జబ్బు..
అటు తెలంగాణలో ఇప్పటివరకూ 259మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఈ జ్వరాల బాధితుల్లో ఖమ్మం జిల్లా టాప్‌లో ఉంది.. జనవరి నుంచి ఇప్పటి వరకూ 75 పాజిటివ్ కేసులను అక్కడ గుర్తించారు.. ఆ తర్వాత నిజామాబాద్ లో 64 కేసులు నమోదయ్యాయి.. హైదరాబాద్ లో కూడా ఈ జబ్బు వేగంగా వ్యాపిస్తోంది.. నీరు నిల్వ ఉంచొద్దని సూచిస్తున్నారు.

ఎడిస్ దోమతో వ్యాపిస్తున్న డెంగ్యూ..
ఎడిస్ దోమ కారణంగా ప్రజల్లో డెంగ్యూ వ్యాపిస్తోంది. మామూలు జ్వరం లక్షణాలే కనిపించినా.. నాలుగు రోజులు నిర్లక్ష్యం చేస్తే.. డెంగ్యూ రక్తంలోని ప్లేట్‌లెట్‌ల సంఖ్యను క్రమంగా తగ్గించి పారేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న మనిషిలో మామూలుగా 1.5 మిలియన్ల నుంచి 4.5 మిలియన్ల ప్లేట్ లెట్లు ఉంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఈ సంఖ్య లక్ష వరకూ తగ్గిపోతుంది. ఈ సంఖ్య పదివేలకంటే తగ్గినప్పుడు మాత్రమే కొత్తవి ఇవ్వాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పదివేల ప్లేట్‌లెట్లకు 12నుంచి 15వేల రూపాయలవరకూ వసూలు చేస్తున్నారు. ఈ డబ్బుకోసం అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్‌లెట్‌లను రోగికి ఎక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి. రోగి ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కోసారి ఐదు నుంచి 10 ప్యాకెట్లు ఎక్కించి డబ్బులు గుంజేస్తున్నారు అదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, అనంతపురం జిల్లాలో ఈతరహా దోపిడీ ఎక్కువగా ఉంది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.. రోగులకు సరైన చికిత్స అందిస్తున్నామంటున్నారు.

గణనీయంగా తగ్గే రోగ నిరోధక శక్తి..
ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల్లోనూ డెంగ్యూ కారణంగా ఎవరూ చనిపోయిన దాఖలాలు లేవు. అయితే.. ఈ జ్వరం వచ్చిన వ్యక్తి బాగా నీరసించి పోవడం.. రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఇతరత్రా వ్యాధులు తేలిగ్గా సోకుతున్నాయి. ఇలాంటివారి మరణాలు డెంగ్యూ జాబితాలోకి రావడం లేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాల్లో డెంగ్యూ పరిస్థితిని గుర్తించిన కేంద్ర వైద్య అధికారులు పదిహేను రోజులక్రితం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు.. మరోవైపు డెంగ్యూను సకాలంలో గుర్తిస్తే త్వరగా నయం చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

06:30 - August 16, 2015

మెదక్‌ : జిల్లా పటాన్‌చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రభాకర్‌రెడ్డి, రుక్మిణి అనే దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని.. మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలైన ప్రభాకర్‌రెడ్డి దంపతులను ఆస్పత్రికి తరలించారు. 

06:29 - August 16, 2015

హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలు చేపట్టిన కొత్త సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా.. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన తాజా ప్రాజెక్టుపై.. కేంద్రం నుంచి తక్షణ స్పందనను కోరాలని టీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన సాగునీటి విషయంలో కఠినవైఖరిని అవలంబించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కర్ణాటక సర్కారు ప్రతిపాదిస్తోన్న కొత్త ప్రాజెక్టులపై కేంద్రం వద్దే తేల్చుకోవాలని భావిస్తోంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా గిరిజాపుర వద్ద.. భీమా, కృష్ణానదుల సంగమస్థలికి మూడు కిలోమీటర్ల ఎగువన.. ఒక బ్యారేజీని నిర్మించాలని అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఏర్పాటైన నిజనిర్ధారణ కమిటీ.. ఫోటో ఆధారాలను సేకరించి.. ప్రభుత్వానికి సమర్పించింది.
రాయచూర్‌ పవర్‌ ప్రాజెక్టుకు నీటి సరఫరా కోసం..
గిరిజాపుర వద్ద 1170 మీటర్ల పొడవు, 194 గేట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు నిజనిర్ధారణ కమిటీ గుర్తించింది. రాయచూరు జిల్లాలోని థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు నీటి సరఫరా కోసం ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు నిజనిర్ధారణలో తేలింది. రెండు సంవత్సరాల్లోపు ఈ బ్యారేజీని పూర్తిచేయాలని భావిస్తోన్న కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. జూలై 28న బెంగళూరుకు చెందిన రఘు ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు.. కాంట్రాక్టును అప్పగించింది. ఈ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టిందంటూ.. దానికి సంబంధించిన ఫోటోలను నిజనిర్ధారణ కమిటీ తీసుకు వచ్చింది. ఈ బ్యారేజీలో సుమారు 2 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ బ్యారేజీ పూర్తయితే.. నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్టుకు రావలసిన లీన్‌ వాటర్‌ ఫ్లో పూర్తిగా ఆగిపోతుందని తెలంగాణ అధికారులు అంచనా వేశారు.
నిజనిర్ధారణ నివేదికపై హరీశ్‌రావు సమీక్ష..
నిజనిర్ధారణ కమిటీ నివేదికను సమీక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కర్ణాటక ప్రాజెక్టు గురించి కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగరరావు, ఇతర న్యాయనిపుణులను సంప్రదించి.. ఫిర్యాదును పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ఈ అంశాన్ని సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు రావాల్సిందిగా మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఫోన్‌లో కోరారు. 

06:24 - August 16, 2015

హైదరాబాద్ : వారం రోజుల పాటు విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించిన ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ చేరుకున్నారు. నేడు సెలవుదినం కావడంతో విశ్రాంతి తీసుకోనున్నారు. కాగా రేపటినుంచి సీఎం కర్నూలులో పర్యటించనున్నారు. అనంతరం 18, 19 తేదీల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 

నేడే ప్రపంచ బ్యాడ్మింటెన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్..

జకార్త : నేడు ప్రపంచ బ్యాడ్మింటెన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పైనల్స్ లో డిఫెడింగ్ ఛాంపియన్ కరోలినా మారీన్ తో సైనా ఢీకొననుంది. 

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : ఒడిశా నుండి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల్లో కదలికలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

నేటి నుండి యూఏఈలో ప్రధాని పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నుండి యూఏఈలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. 

Don't Miss