Activities calendar

20 August 2015

22:35 - August 20, 2015

ఈ మధ్య లీకు వీరులు ఎక్కువైపోయారు. ప్రతీ సినిమాను ముందే కొంత భాగాన్ని లీక్ చేయడం హల్ చల్ సృష్టించడం చేస్తున్నారు. నిన్నటికి నిన్న పులి సినిమా కొంత భాగాన్ని లీక్ చేశారు. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అత్తారింటికిదారేది ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ చేశారు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి బయటపడింది. లేదంటే నిర్మాత నష్టాల్లో కూరుకుపోయేవాడే. ఇక భాహుబలిలో యుద్దం సీన్ భాగాన్ని రిలీజ్ కు ముందే లీక్ చేశారు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమా ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఓ ఆకతాయి సెల్ ఫోన్ బంధించాడు. ఇంకేముందు తీశాక ఊరుకుంటాడా.. యూట్యూబ్ లోనూ అప్లోడ్ చేశాడు. అయితే ఇది షూటింగ్ కు సంబంధించిన వీడియో కావడంతో చిత్ర వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే పబ్లిసిటీ కోసం వీడియోలను లీక్ చేసేవాళ్లు కొందరుంటే.. నిజంగా విడుదలకు ముందే కొంత భాగం లీక్ అవడంతో నష్ట పోతున్న సినిమాలు ఉన్నాయి. అయితే పైరసీతో పాటు ఈ లీక్ వీడియోలు సినిమాలకు పెను ప్రమాదంగా మారాయి. వీటిని అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న సినిమా వర్గాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. 
Watch Leaked Video @ https://www.youtube.com/watch?v=lpGzVolSuXs

21:31 - August 20, 2015

హైదరాబాద్ : ఇండియన్ బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించింది. జకార్తాలో ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్ గా నిలవడం ద్వారా...సైనా ఈ ఘనత సొంతం చేసుకొంది. ఆల్ ఇంగ్లండ్ కమ్ ప్రపంచ చాంపియన్ మారిన్ మాత్రం రెండోర్యాంక్ కు పడిపోయింది. 2015 ఏప్రిల్ 2న తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన సైనా..ఆ తర్వాత..స్పెయిన్ ప్లేయర్ కారోలిన్ మారిన్ కు తన టాప్ ర్యాంక్ ను కోల్పోవాల్సి వచ్చింది. మహిళల డబుల్స్ లో భారతజోడీ గుత్తా జ్వాలా- అశ్వినీ తమ కెరియర్ లోనే అత్యుత్తమంగా ప్రపంచ 10వ ర్యాంక్ సాధించారు. పురుషుల సింగిల్స్ లో కిదాంబీ శ్రీకాంత్ తన 4వ ర్యాంక్ ను నిలుపుకోగా... పారుపల్లి కశ్యప్ మూడుస్థానాలు మెరుగుపరచుకొన్నాడు.

21:28 - August 20, 2015

హైదరాబాద్ : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రాపర్టీ ధరలను తగ్గించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సూచించారు. దేశ వ్యాప్తంగా అమ్మకానికి నోచుకోకుండా పడివున్న ఫ్లాట్ల ధరలను తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బిల్డర్లు వాటిని అలాగే పట్టుకుని కూర్చునేకన్నా ధరలను తగ్గించడం ద్వారా ప్రజల్లో ఫ్లాట్లు కొనేలా ఆసక్తి కలిగించాలన్నారు. అప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చినట్టవుతుందని రాజన్‌ తెలిపారు. అలాగే బ్యాంకులు కూడా హోమ్‌ లోన్‌ ప్రక్రియను సరళతరం చేయాలని అభిప్రాయపడ్డారు.

 

భూసేకరణకు రంగం సిద్ధం..

హైదరాబాద్ : ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. భూసమీకరణ ప్రక్రియను 26 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. సర్వే నెంబర్ల వారీగా భూసేకరణ నోటిఫికేషన్లు ప్రభుత్వం జారీ చేయనుంది. భూసేకరణపై అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం ముందడుగు వేయడం గమనార్హం. ప్రతిపక్షాలు రాజకీయ పబ్బం గడుపుకునేందుకే భూసేకరణను వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రులు వాదిస్తున్నారు.

గద్వాలలో రెండో రైల్వే గేట్ మొరాయింపు

మహబూబ్‌నగర్: జిల్లాలోని గద్వాలలో రెండో రైల్వే గేట్ మొరాయించింది. 40 నిమిషాల పాటు గేటు తెరుచుకోకుండా అధికారులను తిప్పలు పెట్టించింది. గేట్ తెరుచుకోకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

21:11 - August 20, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూముల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వెటకారపు మాటలు కట్టిపెట్టి..రైతులకు మేలు తలపెట్టాలని మంత్రులకు పవన్ చురకలు వేస్తే...అనవసర రాద్దాంతం చేయొద్దని మంత్రులు బదులిచ్చారు. మంచి సూచనలైతే స్వీకరిస్తామన్న మంత్రులు...అభివృద్దిని అడ్డుకోవద్దని వ్యాఖ్యానించారు.

మంత్రుల వెటకారపు వ్యాఖ్యలను తప్పుపట్టిన పవన్...
రాజధాని భూసేకరణపై తాను చేసిన వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. భూములు లేకుండా.. కట్టడానికి రాజధాని త్రిశంకుస్వర్గం కాదని యనమల చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు. ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే... అది త్రిశంకు స్వర్గమా.. లేక రెగ్యులర్ స్వర్గమా అనేది తరువాత ఆలోచించుకోవచ్చున్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్ లో ఇచ్చిన కొండలు, గుట్టలున్న భూములే కానీ పంట భూములు కావని చెప్పారు. తాను ఎంతో బాధ్యతగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే విజ్ఞతతో పనిచేయడం మానేసి వెటకారంగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు పవన్.

జనసేన అధినేత ట్వీట్‌పై మంత్రుల కౌంటర్....

జనసేన అధినేత తాజా ట్వీట్‌పై మంత్రులు కౌంటరిచ్చారు. మూడు వేల ఎకరాల కోసం రాద్దాంతం ఎందుకని రావెల కిషోర్ బాబు ప్రశ్నించారు.

మంత్రులెవరూ వెటకారంగా మాట్లాడలేదు-పత్తిపాటి.....

పవన్ ట్వీట్లపై మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు పవన్ ఎంతో కృషి చేశారన్న పుల్లారావు...మంత్రులెవరూ పవన్‌ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడలేదని చెప్పారు. మొత్తానికి జనసేన, తెలుగుదేశం మధ్య రగులుతున్న మాటల యద్ధం చివరికి ఎలా బద్దలవుతుందోనని ఇరు పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: పాస్ పోర్టు దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ ఎఎస్సై సహా నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారు నగరం విడిచి వెళ్లరాదని కమిషనర్ ఆదేశించారు.

రేపు భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

గుంటూరు : రేపట్టి నుంచి రాజధాని కోసం భూ సేకరణ చేస్తామని మంత్రినారాయణ ప్రకటించారు. భూ సేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఉండవల్లి సిఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రేపు విజయవాడ సీఆర్డీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టనున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో చోరీ

హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో చోరీ జరిగింది. ఓ వ్యక్తికి చెందిన లాకర్ నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

కర్నూలు జిల్లాలో ఇద్దరు అనుమానితుల అరెస్ట్...

కర్నూలు : ఆళ్లగడ్డ మండలం అహోబిలం దుర్గమ్మ గుడ్డి వద్ద ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.

నల్గొండ ఎంజీ యూనివర్శిటీలో ఉద్రిక్తత

నల్గొండ : జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజినీరింగ్‌ కాలేజిలో మౌలికవసతులు కల్పించాలని మూడు రోజులుగా గత మూడు రోజుల నుంచి విద్యార్థులు దీక్షకు దిగారు. దీక్ష విరమించాలని పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థులు పట్టించుకోలేదు. దీంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

20:39 - August 20, 2015

హైదరాబాద్ : బీహర్ ఎన్నికల్లో లాలూ నితీష్ ల కొత్త స్నేహం ఫలిస్తుందా? ప్యాకేజీ పాలిట్రిక్స్ మోదీని గట్కెస్తాయా? బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా?బీహార్ ఈక్వేషన్స్ దేశానికి కొత్తదారి చూపనున్నాయా? బీహార్ వార్ పీల్డ్ పై నేటి వైడాంగిల్. మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

జైలులో నిర్భయ నిందితుడిపై దాడి...

న్యూఢిల్లీ: తీహార్ జైలులో నిర్భయ అత్యాచార ఘటనలో నిందితుడు వినయ్‌శర్మపై దాడి జరిగింది. ఈ దాడిలో నిందితుడు వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏసీబీ వలలో అబ్కారీ శాఖ సీఐ

కరీంనగర్ : మంధని అబ్కారీ శాఖసీఐ శామ్యూల్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గురువారం గీత కార్మికుల నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

ఖమ్మం : కొత్తగూడెం త్రిఎంక్లైయిన్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బైకులు ఢీకొన్నాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

19:46 - August 20, 2015

బాహుబలి హిట్ తో ఆనందంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సినిమా 'దాదా' శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఏంటీ నమ్మట్లేదా..? బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకుని కొన్ని రోజులే అవుతోంది. మరోవైపు బాహుబలి -2 సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో 'దాదా' షూటింగ్ ఎప్పుడు జరిగింది.? ఎందుకు ఇంత సైలెంట్ గా విడుదల చేస్తున్నారనే డౌట్ మీకు వచ్చి ఉంటే ఇది చదవండి... ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'ఏక్ నిరంజన్' సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'దాదా' అనే టైటిల్ ఖరారు చేశారు. అదిగో ఈ సినిమా శుక్రవారం అనగా రేపు థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇదే సినిమా మన తెలుగు ఛానెల్స్ లో చాలా సార్లు ప్లే అయ్యింది. మళ్లీ ఎవరు చూస్తారనేగా మీ డౌట్. అయితే ఈ డౌట్ మాత్రం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఈ సినిమా ఇతర భాషల్లో విడుదల కాబోతోంది. కాబట్టి తప్పకుండా చూస్తారని నిర్మాతలు నమ్ముతున్నారు. కొసమెరుపు ఏంటంటే బాహుబలితో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ ను 'ఏక్ నిరంజన్' నిర్మాతలు ఈవిధంగా ఉపయోగించుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

19:39 - August 20, 2015

విశాఖ : ర్యాగింగ్‌ నిరోదానికి ఆంధ్రా యూనివర్సిటీ నడుం బిగించింది. ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోంది. ర్యాగింగ్ భూతం జడలు విప్పకుండా వివిధ కమిటీలను నియమించింది. త్వరలోనే వర్సిటీని ర్యాగింగ్‌ ఫ్రీ క్యాంపస్‌గా తీర్చిదిద్దడానికి వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మచ్చలేని వర్శిటీలా...

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మచ్చలేని వర్సిటీలా తీర్చిదిద్దేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రిషితేశ్వరి మృతితో ర్యాగింగ్‌ అంటేనే భయపడే విధంగా వివిధ కమిటీలేశారు. వాటి ద్వారా విద్యార్థుల ప్రవర్తనపై నిఘా పెంచారు.

ఏయు వీసీ, రెక్టార్......

బోధన, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఐదు కమిటీలను నియమించారు. ఇందులో ఏయు వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్ అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ సైతం ఈ కమిటీ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. కళాశాల బయట విద్యార్థుల వ్యవహరాలపై పర్యవేక్షణతో పాటు నిఘా పెట్టేందుకు సెక్యూరిటీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తిన వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఈ కమిటీలు పనిచేస్తాయి.

పోలీసు, న్యాయ, శాఖలతో విద్యార్థులకు ప్రత్యేక సదస్సులు....

ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పోలీసు, న్యాయ నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ర్యాగింగ్ నిరోదానికి ఏయులో 24 గంటలు అదుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0891 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏయు వర్సీటి అనుబంధ కశాలకు కూడా ఈ నెంబరే పనిచేస్తుంది. కొత్తగా నియమించిన కమిటీల ద్వారా...వర్సిటీ హస్టల్స్‌లో తనిఖీలు చేపట్టి నాన్‌బోర్డర్స్‌ను పంపించేశారు.విద్యాశాఖ మంత్రి గంటా అదేశాల మేరకు అన్ని విభాగాల్లో సిసి కెమెరాలు ఎర్పాటు చేసేందుకు వర్సిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పలు చోట్లు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో అన్ని చోట్ల బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తామని వర్సీటీ అధికారులు చెబుతున్నారు.

19:26 - August 20, 2015

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్ బృందం గురువారం తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదిని సచివాలయంలో కలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తెలంగాణ హోంశాఖ వద్ద ఉన్న కాల్ డేటాను భద్రపరచాలని విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిట్ బృందం హో కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారుల రాకను నిరసిస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన త్రివేది న్యాయస్థానం పై గౌరవం ఉందని ... చట్టపరంగా ముందుకు వెళ్లామన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలను అవసరమైనపుడు కోర్టుకు అందిస్తామని స్పష్టం చేశారు.

19:23 - August 20, 2015

హైదరాబాద్ : ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. ఎంచక్కా ఇంటి నుంచే కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం గురువారం విద్యాలక్ష్మీ ( www.vidyalakshmi.co.in)  పేరుతో ఓ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది.
 
కేంద్ర ఆర్థిక శాఖ, ఉన్నత విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ, భారతీయ బ్యాంకుల సంఘం ఆధ్వర్యంలో పని చేసే విద్యాలక్ష్మీ వెబ్ పోర్టల్ తో. ఎస్‌బిఐ, బివోఐ, ఐడిబిఐ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకులు అనుసంధానమయ్యాయి. 22 రకాల విద్యా రుణాలు అందించేందుకు 13 బ్యాంకులు ఇందులో నమోదు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు ఒక్క దరఖాస్తుతో పలు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందే వీలుంది. లోన్ స్టేటస్‌ను కూడా వారు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. విద్యా రుణానికి సంబంధించిన సమస్త సమాచారం, దరఖాస్తు ఫారాలను వెబ్ సైట్‌లో పొందుపరిచారు.
 
విద్యార్థులు సింగిల్ విండో విధానం ద్వారా ఎడ్యుకేషన్ లోన్‌తో పాటు ఉపరకార వేతనాలు కూడా విద్యాలక్ష్మీ వెబ్ పోర్టల్ నుంచి పొందే అవకాశముంది. దేశ వ్యాప్తంగా బ్యాంకులు, విద్యార్థులను ఓ వేదికపైకి తీసుసురావడంతో పాటు వారి ఉన్నత విద్యకు ఈ వెబ్ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

స్మితసబర్వాల్ కు టీ.సర్కార్ న్యాయ సహాయం...

హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం జాతీయ పత్రిక ఔట్ లుక్ ప్రచురించిన కథనంపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అంశంలో ఔట్ లుక్ పత్రికపై న్యాయపోరాటం చేసేందుకు స్మిత సబర్వాల్ కు న్యాయ సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 15 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

18:31 - August 20, 2015

హైదరాబాద్ : కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై ఏపి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రత్యేకహోదా అంశంపై పూటకో నేత మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, ఇంకా కొత్తగా ప్రత్యేక ప్యాకేజీలు తెస్తామంటూ నేతలు ప్రగల్బాలు పలుకుతుండడం దుర్మార్గం అన్నారు. ఓటుకు నోటు కేసులో రెండు రాష్ట్రాల సిఎంలకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా సీబీఐ విచారణకు అంగీకరించాలన్నారు.

18:25 - August 20, 2015

హైదరాబాద్ : హిందూ ముస్లిం భాయీ భాయి అన్నారు. మైనార్టీలకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తామంటూ హామీల మీద హామీలిచ్చారు.. ఇప్పుడు వారి నోటికాడి ముద్దను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.. మతాన్ని సాకుగా చూపి.. రెండు ముస్లిం కుటుంబాలకు షాపులు కేటాయించకుండా చుక్కలు చూపిస్తున్నారు.. తెలంగాణ తిరుపతిగా భాసిల్లుతోన్న యాదాద్రిలో ముస్లింల ఆవేదనపై స్పెషల్ స్టోరీ..

రోడ్డునపడ్డ రెండు ముస్లిం కుటుంబాలు.....

యాదగిరి గుట్టలో ఆలయ అధికారుల నిర్ణయం రెండు మైనార్టీ కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఇక్కడ ఎన్నో కుటుంబాలు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.. ఇందులో ముస్లింలు కూడాఉన్నారు.. వీరంతా అన్నదమ్ముల్లా కలసిమెలిసి జీవిస్తున్నారు.. ఇప్పుడు ఆలయ అభివృద్ధి పనులు... దేవాదాయ శాఖ చట్టాలు వీరి మధ్య అంతరానికి అంకురం వేస్తున్నాయి.

దుకాణాలు కోల్పోయిన 60మంది....

వందల కోట్లతో దేవాలయాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం.. ఇందులోభాగంగా రోడ్డువిస్తరణ పనులు చేపట్టారు.. ఈ పనుల్లో దాదాపు 60మంది తమ దుకాణాలు కోల్పోయారు.. వీరిలో 58మందికి కొత్త కాంప్లెక్స్‌లలో షాప్‌లు కేటాయించారు అధికారులు.. అయితే మతం ఆధారంగా ఓ రెండు కుటుంబాలను మాత్రం పక్కన పెట్టేశారు.

ముప్పైఏళ్లుగా గుట్టలో దుకాణాలు నడుపుతున్న ముస్లింలు....

ముప్పైఏళ్లుగా ఈ దుకాణాలపై ఆధారపడి బతుకుతున్న మైనారిటీ కుటుంబాలు అధికారుల నిర్ణయంతో జీవన భృతిని కోల్పోయాయి.. తమ తండ్రుల తరం నుంచి ఇక్కడి భక్తులకు తాము సేవలు అందిస్తున్నామని.. ఇప్పుడు మతం పేరిట తమను ఎందుకు వేరుగా చూస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు..

దేవాలయ యాక్ట్ ప్రకారం అనుమతి ఇవ్వలేమంటున్న అధికారులు.....

అయితే అధికారులు మాత్రం హిందూ దేవాలయ యాక్ట్ ప్రకారం ఇతర మతస్తులకు షాప్‌లు కేటాయించలేమని చెబుతున్నారు.. దీంతో ఈ కుటుంబాలు తమ ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లబోసుకుంటున్నాయి.. ఫేస్ బుక్, వాట్సప్ లో తమ బాధను షేర్ చేస్తున్నారు ఈ కుటుంబసభ్యులు.. హిందూ, ముస్లీం భాయీ భాయీ అంటూనే తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు..

మైనారిటీ కుటుంబాలు మరింత ఇబ్బందులు పడే అకాశం...

టీటీడీ నిబంధనలన్నీ గుట్టలోనూ అమలు చేస్తే మైనారిటీ కుటుంబాలు మరింత ఇబ్బందులు పడే అవకాశముందని వారు ఆవేదన చెందుతున్నారు. తామిక్కడ నివసించే పరిస్థితిని కోల్పోతామని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు దుకాణాలు కేటాయించాలని ముస్లిం కుటుంబాలు కోరుతున్నాయి..

18:20 - August 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ కిస్మత్‌ పూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కిస్మత్‌ పూర్‌ గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న స్వామిగౌడ్‌ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి ఒక లైబ్రరీ, డంపింగ్‌ యార్డు, దేవాలయం ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని స్వామి గౌడ్‌ హామీ ఇచ్చారు. 

ర్యాగింగ్ పై కఠిన చర్యలు :గవర్నర్

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కొద్దిసేపటి కిందట గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలకు ఆదేశించినట్టు అనంతరం మీడియాకు తెలిపారు. అంతేగాక ఇరు రాష్ట్రాల మంత్రులకు కూడా సూచించినట్టు చెప్పారు. ర్యాగింగ్ ను ఎక్కడా అనుమతించమని, త్వరలో ర్యాగింగ్ పై మంత్రులతో సమావేశం నిర్వహిస్తానని గవర్నర్ చెప్పారు.

టీఎస్ హోంశాఖ కార్యదర్శి ఛాంబర్ లో ఏపీ పోలీసులు

హైదరాబాద్ : తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి నోటీసులు అందించేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. హోంశాఖ కార్యదర్శి త్రివేది ఛాంబర్ లో ఏపీ పోలీసులు వేచి చూస్తున్నారు. త్రివేది వేరే మీటింగ్ లో ఉన్నట్లు సమాచారం.

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం

విశాఖ : జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోకపోతే శిక్ష తప్పదని మావోయిస్టులు పేర్కొన్నారు. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లు ముద్రించారు. పోలీసులకు సమాచారం అందడంతో పోస్టర్లు అంటించిన వ్యక్తుల కోసం దర్యప్తు ప్రారంభించారు.

కాల్పుల ఘటనాస్థలిని పరిశీలించిన సీపీ..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ కాల్పుల ఘటనాస్థలిని సీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అలాగే కాల్పుల్లో గాయపడిన ధర్మేంద్రను ఆయన పరామార్శించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నామన్నారు. ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వాడు కాగా ఇద్దరు గుల్బర్గా ప్రాంతానికి చెందిన వారని సీపీ తెలిపారు. దోపిడి కోసం నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. 

 

రాజ్ నాథ్ ను కలిసిన గవర్నర్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. ఇరు రాష్ట్రాల పరిస్థితులు, వివాదాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

హురియత్ నేతల విడుదల..

జమ్మూ : హురియత్ నేతలను గృహ నిర్భందం నుండి పోలీసులు విడుదల చేశారు. హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాల నేతలైన సయ్యద్ ఆలీ సాహ్ గిలానీ, ఉమర్ ఫరూఖ్, మౌల్వి అబ్బాస్ అన్సారీలతో పాటు జేకేఎల్ ఎఫ్ నేత యాసిన్ మాలిక్ ని సైతం ఉదయం గృహ నిర్భందం చేశారు. గిలానీ మినహా మిగిలన వారందరినీ విడుదల చేశారు. 

శర్మ హాఫ్ సెంచరీ..భారత్ 302/5..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. శర్మ 63, సాహా 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అవసరమైన భూమి కోసమే భూ సేకరణ చట్టం - ప్రత్తిపాటి..

హైదరాబాద్ : ఏపీ రాజధానికి అవసరమైన భూమి కోసం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలు అందిన 24గంటల్లో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐదు రోజుల అనంతరం తుళ్లూరు మండలంలో భూ సేకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

టి.సచివాలయంలో ఏపీ సిట్ పోలీసులు..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి ఏపీ సిట్ పోలీసులు చేరుకున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో టి.హోం సెక్రటరీకి ఏపీ  సిట్ పోలీసులు నోటీసులు అందచేశారు.

16:38 - August 20, 2015

అనంతపురం : కరువు జిల్లా అనంతపురంలో రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోరంట్ల మండలం పుడిగుండ్లపల్లి గ్రామంలో అప్పులు బాధ భరించలేక వృద్ధ దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. నంజిరెడ్డి, అతని భార్య నంజమ్మ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు... వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అప్పటికే భర్త నంజిరెడ్డి చనిపోయారు. భార్య నంజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో...హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతిచెందింది. 

గాజులపాడులో ఉద్రిక్తత..

మెదక్ : కవిటి (మం) గాజులపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రుణమాఫీ జాబితా ప్రకటన కార్యక్రమం రసాభాసాగా మారింది. గ్రామంలో రెండు ముఠాల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు రువ్వుకోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. ఇతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

16:30 - August 20, 2015

విజయవాడ  : తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏపీ సర్కార్ జోర్ పెంచింది. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు గురువారం మధ్యాహ్నం సిట్‌ అధికారులు హైదరాబాద్‌ బయలుదేరారు.

పవన్ ట్వీట్స్ కు మంత్రి రావెల స్పందన..

హైదరాబాద్ : ఏపీ రాజధాని భూ సేకరణపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ కు మంత్రి రావెల స్పందించారు. అభివృద్ధికి అడ్డు తగలవద్దని సూచించారు. రాజధాని విషయంలో పవన్ సలహాలు, సూచనలు పరిశీలిస్తామన్నారు. 21వ శతాబ్దపు రాజధానిని నిర్మాణం చేస్తామని మంత్రి రావెల పేర్కొన్నారు. ఇప్పటి వరకు 33 వేల ఎకరాల భూమిని సేకరించామని ఎక్కడైనా స్వచ్చందంగా 33వేల ఎకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో అనేక పథకాలకు, ప్రాజెక్టులకూ భూ సేకరణ జరిగిందని, మూడు వేల ఎకరాలకే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మిగతా భూమి కోసం భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు.

తెలంగాణ హోం శాఖ కార్యదర్శికి నోటీసులు ?

హైదరాబాద్ :  ఓటుకు నోటుకు కేసులో ఏపీ ఏసీబీ సర్కార్ జోరు పెంచింది. తెలంగాణ హోం శాఖ కార్యదర్శికి నోటీసులు అందచేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ నుండి హైదరాబాద్ కు సిట్ బృందం బయలుదేరినట్లు సమాచారం. 

రాహుల్ అవుట్..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. సెంచరీతో దూసుకెళుతున్న రాహుల్ పెవిలియన్ చేరాడు. శర్మ 32, బిన్ని 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

మంత్రి యనమల వ్యాఖ్యలపై పవన్ ట్వీట్స్..

హైదరాబాద్ : ఏపీ మంత్రి యనమల వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో బాధ్యతతో రైతుల సమస్యలు ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లానని ట్వీట్స్ చేశారు. విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఇచ్చినవి కొండలని, బహుళ పంటలు పండే పొలాలు కాదని తెలిపారు. ఈ విషయం మంత్రి యనమలకు తెలీదనకుంటానన్నారు. హైదరాబాద్ కొండల్లో, విశాఖ కొంల్లో గాని తనకు స్టూడియోలు లేవన్నారు.

భారీ దోపిడి యత్నం అడ్డుకున్నాం - వెస్ట్ జోన్ డీసీపీ..

హైదరాబాద్ : రోడ్ నెంబర్ 36లో దొంగలు వచ్చారన్న సమాచారంతో వెంబడించామని వెస్ట్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. భారీ దోపిడి యత్నాన్ని అడ్డుకోగలిగామని, కాల్పుల్లో కార్మికుడికు గాయాలయ్యాయన్నారు. పట్టుకొనే ప్రయత్నంలో తమపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. 

జూబ్లిహిల్స్ 36 నీరూస్ వద్ద కాల్పులు..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ 36 వద్దనున్న నీరూస్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది దొంగలను వెంబడించారు. వెంటనే దొంగలు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు దొంగలు షహీన్ మీర్జా, అబ్దుల్ సత్తార్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఎల్ అండ్ టి కార్మికుడు ధర్మేంద్రకు గాయాలయ్యాయి.

 

ఇందిరాపార్కు వద్ద టి.అర్చకుల ధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు దగ్గర తెలంగాణ అర్చకులు నిర్వహిస్తున్న ధర్నాలో ప్రొ.కోదండరాం పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా వేతాలను చెల్లించాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు.

 

ప్రాణాలు అడ్డుపెట్టైనా ప్రాణహితను సాధిస్తాం - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : ప్రాణాలు అడ్డుపెట్టైనా ప్రాణహితను సాధిస్తామని టిటిడిపి ఎఎమ్మెల్యే- ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీక్షకు టిటిడిపి ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. మెనిఫెస్టోలో ప్రాణహితకు పోరాడతానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. 

భారత్ 229/3..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ కోహ్లీ (78) వికెట్ కోల్పోయింది. రాహుల్ 107, శర్మ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. 

గోవా బీజేపీ సీఎం పర్సేకర్ బావమరిది అరెస్టు..

గోవా : సీఎం పర్సేకర్ బావమరిది దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలో స్థలం కేటాయింపునకు దిలీప్ ముడుపులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో లబ్దిదారుడి నుండి రూ. లక్ష తీసుకుంటుండగా దిలీప్ ఏసీబీకి చిక్కాడు. 

ఎర్రవల్లి గ్రామ జ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్..

మెదక్ : ఎర్రవల్లి గ్రామ జ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గ్రామాలాభివృద్దికి కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఎర్రవల్లిలో ఇళ్లు బాగా లేవన్నారు. గ్రామాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని, ఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతింటికి రక్షిత నీరు అందిస్తానని, ఎర్రవల్లిలో పేదలకు రెండు వందల గృహాలను నిర్మిస్తామన్నారు. 

కేసీఆర్ దించే వరకు నిద్రపోను - రేవంత్..

మహబూబ్ నగర్ : కేసీఆర్ కుర్చీ దించేవరకు నిద్రపోనని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అయిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులను నిర్భందించినంత మాత్రాన టీడీపీని బెదిరించలేరన్నారు. 

హోదా విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది - నిర్మలా సీతారామన్..

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గురువారం గాజువాకలో కంటైనర్‌ ప్రైజ్‌ స్టేషన్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. 

15:03 - August 20, 2015

హైదరాబాద్ : ప్రకృతి పరంగా మహిళల్లో చోటుచేసుకునే రుతు స్రావ ప్రక్రియలో ఒక్కో వయస్సు వారికి ఒక్కో సమస్య బాధిస్తుంటుంది. మరి ఈ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలున్నాయో ఇవాళ్టి మానవి 'హెల్త్ కేర్' లో డాక్టర్ నర్మద సలహాలు సూచనలు తెలియజేశారు. మరి మీరు కూడా తెలసుకోవాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:02 - August 20, 2015

సంస్కృతి, సంప్రదాయాల పేరుతో సమాజంలో మహిళలను అణగదొక్కే పరిస్థితి ఎన్నో శతాబ్దాల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ స్థితి నుండి ఆడపిల్లలను బయటకు తీసుకొచ్చి స్వశక్తితో ఎదిగేందుకు కావలసిన పరిస్థితులను కల్పించేందుకు మొదలైన సంస్థ కస్తూర్భా గాంధీ స్మారక కేంద్రం.

స్వశక్తితో వారి కాళ్ళపై వారు నిలబడేందుకు...

ఆపదలో ఉన్న ఆడపిల్లలను చేరదీసి, వారికి విద్యాబుద్ధులు చెప్పించటమే కాదు స్వశక్తితో వారి కాళ్ళపై వారు నిలబడేందుకు ఆపన్న హస్తం అందిస్తోంది. వారి పరిపూర్ణ జీవితానికి కావలసిన అన్ని బాధ్యతలను నెరవేస్తోంది. జీవితాంతం వారికి తోడుగా నిలుస్తోంది.

80 ఏళ్లు గడిచిపోయినా....

మహిళల అభ్యున్నతి కోసం ఏర్పడిన కస్తూర్భా గాంధీ స్మారక కేంద్రం 80 ఏళ్లు గడిచిపోయినా ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు. చేరుకునే పరిస్థితులు కూడా కనిపించట్లేవు. ఈ నేపథ్యంలో కనీస అవసరాలైన విద్యా, వైద్యం ఇప్పటికీ స్త్రీలందరికీ అందుబాటులోకి రాలేదని గుర్తించాల్సిన తరుణం మన ముందుంది. ఇకనైనా పాలకులు కళ్ళు తెరవాలి, సమాజంలో సగభాగమైన మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి. మహిళల సాధికారత కోసం, వారి అభ్యున్నతి కోసం చిత్త శుద్ధిగా కృషి చేయాలని మానవి కోరుకుంటోంది.

అనుష్క ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

హీరోయిన్ గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అనుష్క. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నప్పటికీ 10టీవీ ప్రేక్షకులకోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. రుద్రమదేవి సినిమా గురించి అడిగనప్పుడు ఒక హిస్టారిక్ సినిమా చేయడం కోసం పడ్డ కష్టాన్ని ఆనందంగా వివరించింది. బాహుబలి, రుద్రమ దేవి సీక్వెల్స్ ఒకేసారి వస్తే ఏ సినిమాలో నటిస్తారన్న ప్రశ్నకు అనుష్క చాలా తెలివిగా సమాదానం చెప్పింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ మరియు బాహుబలి-2 కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాల్ని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో చూడగలరు.
 

14:39 - August 20, 2015

హైదరాబాద్: తనను ఏపీ అసెంబ్లీకి రానివ్వడం లేదని.. తన నియోజకవర్గంలోని మండలాలను ఏపీలో కలిపారంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎమ్మెల్యే తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న బంద్...

పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఎం చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.. చింతూరు, కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బంద్ కొనసాగుతోంది.. అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి.. 

14:34 - August 20, 2015

హైదరాబాద్ : కోటిలో సైకో వీరంగం సృష్టించాడు.. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, పాదచారులపై ఇనుపరాడ్‌తో దాడిచేశాడు.. ఈ ఘటనలో అయిదుగురు గాయపడగా ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది.. వీరందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.... నిందితునికోసం గాలించిన పోలీసులు చివరికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. 

14:32 - August 20, 2015

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఉన్న నీరూస్ షోరూమ్ ఆవరణలో ఓ అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తొలుత భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. తర్వాత తేరుకుని అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడింది అంతరాష్ట్ర దోపిడీ ముఠా సభ్యుడు కావొచ్చని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తితో పాటు ఉన్న మరో ఇద్దరు పరారయ్యారు. నీరూస్ షోరూమ్‌లో దోపిడీకి యత్నించే క్రమంలోనే ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.  గత ఐదు రోజుల క్రితం గుల్బర్గాకు చెందిన 6గురు సభ్యుల ముఠా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరి లో ఇద్దరు దొరకగా మరో నలుగురి కోసం పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. బ్యాంకు దోపిడీలకు పాల్పడేందుకు వీరు వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే వ్యక్తికి మోచేతి వద్ద బుల్లెట్ దిగింది. అతన్ని వెంటనే గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దోపిడీ దొంగలు షహీన్ మీర్జా, అబ్దుల్ సత్తార్ ల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని వాటిని ఎక్కడి నుండి సమకూర్చుకున్నారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

జూపల్లి గుండాగిరి చేస్తున్నారు..

హైదరాబాద్ : మంత్రి జూపల్లి కృష్ణారావు గుండాగిరీ చేస్తున్నారని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. జూపల్లి కర్నాటక సరిహద్దు వద్ద డ్రామాలు ఆపి, ఢిల్లీ వెళ్లి అక్రమ ప్రాజెక్టులను ఆపించాలని ఎర్రబెల్లి హితవు పలికారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

ఖమ్మంలో ఐద్వా బస్సు యాత్ర..

ఖమ్మం : ప్రభుత్వం మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా బస్సు యాత్రను ప్రారంభించింది. చీప్‌ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని మహిళా నేతల పిలుపునిచ్చారు. ఐద్వా బస్సు యాత్రకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మద్దతు తెలిపారు.

సీఎం కేసీఆర్ సభలో పాము..

మెదక్ : జిల్లాలోని ఎర్రవల్లిలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభలో ఓ పాము కలకలం సృష్టించింది. సభా ప్రాగణంలోకి పాము రాగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పామును పట్టుకునేందుకు యత్నించారు. 

యూపీలో దళిత బాలికపై దారుణం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో దళిత బాలికపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. అత్యాచారం చేసిన అనంతరం అతి దారుణంగా హత్య చేశారు. ఆమె కళ్లు, ఇతర భాగాలను విడదీశారు. ఈ ఘటన హర్దోయి గ్రామంలో చోటు చేసుకుంది. 13 సంవత్సరాల బాలిక తన తండ్రికి మందులు తీసుకరావడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె శరీరభాగాలు బుధవారం దొరికాయని, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

14:07 - August 20, 2015

న్యూయార్క్ : ప్రపంచంలో టెక్నాలజీ దూసుకపోతోంది. రోజుకో కొత్త కొత్త సాఫ్ట్ వేర్ లు ప్రవేశిస్తున్నాయి. న్యూస్ సైట్ల రద్దీపై పర్సాడాట్ లీ అనే సంస్థ అధ్యయనం చేసింది. అందులో గూగుల్ ను ఫేస్ బుక్ అధిగమించినట్లు తేలింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసిన లింక్ లు ఇంటర్ నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ తెలిపింది. ఇక మీడియా సైట్లకు సంబంధించి 43 శాతం రద్దీ ఫేస్ బుక్ వేదికగా నడుస్తోందని, గూగుల్ 35 శాతానికి పరిమితమైందని పర్సాడాట్ లీ పేర్కొంది. ట్రాఫిక్ రేసులో ఫేస్ బుక్ ను గూగుల్ ను అధిగమించడం ఇదే తొలిసారి కాదు. గత అక్టోబర్ నెలలోనే ఫేస్ బుక్ స్వల్ప ఆధిక్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ 36వ నెంబర్ నీరూస్ దగ్గర గురువారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ ఆగంతకుడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆగంతకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కర్నాటక దోపిడి గ్యాంగ్ సభ్యుడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

టెక్నాలజీ సాయంతో నేరాలు అదుపు - డీజీపీ రాముడు..

గుంటూరు : టెక్నాలజీ సాయంతో నేరాలను అదుపు చేస్తున్నామని ఏపీ డీజీపీ రాముడు పేర్కొన్నారు. రాజధాని భవనాలకు టెక్నాలజీని జోడించాలని ప్రభుత్వానికి సూచించడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖలో 14వేల ఉద్యోగాల ఖాళీలున్నాయని, హైదరాబాద్ లోని అప్పాలో శిక్షణ ఇవ్వాలంటే సమస్యలున్నాయని పేర్కొన్నారు. దశల వారీగానే పోలీసు సిబ్బందిని భర్తీ చేస్తామని డీజీపీ రాముడు పేర్కొన్నారు. 

13:50 - August 20, 2015

నెల్లూరు: ర్యాగింగ్ భూతానికి మరో విద్యా కుసుమం రాలింది. మొన్న గుంటూరు... నిన్న కడప... ఇప్పుడు నెల్లూరు... ప్రాంతాలు వేరైనా కారణం మాత్రం ఒక్కటే. ర్యాగింగ్ కోరల్లో అమాయక అమ్మాయిలు సమిధలవుతున్నారు. గుంటూరు, కడప ఘటనలు మరవక ముందే... నెల్లూరులో మరో దారుణం జరిగింది. రాపూరు మండలం పెనుబర్తికి చెందిన రవళి అనే విద్యార్థిని గూడూరులోని డిఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో రవళి తను ఉంటున్న హాస్టల్‌లో ప్యాన్‌కు ఉరేసకుని ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణం వల్లే ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు రవళి మృతిపై ఎస్ ఎఫ్ఐ, ఎబివిపితోపాటు పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గూడురులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, విద్యార్థిసంఘాల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థిసంఘ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. 

భారత్ 152/2..

కొలంబో : శ్రీలంకతో ఆడుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన అనంతరం భారత్ ఓపెనర్ రాహుల్, కోహ్లీ జాగ్రత్తగా ఆడుతున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. రాహుల్ (70), కోహ్లీ (69) క్రీజులో ఉన్నారు.

13:40 - August 20, 2015

ఈ రోజు ప్రపంచ 'దోమల' దినం. కొన్ని సంవత్సరాల క్రితం సర్ 'రోనాల్డ్ రాస్' అనే బ్రిటీష్ ఆర్మీ డాక్టర్ మలేరియా దోమ కాటు వల్ల వస్తుందని కనుక్కొన్నాడు. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాధి దోమల ద్వారా ప్రబలుతున్నట్లు తొలిసారిగా మన హైద్రాబాద్ లోనే గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పాడు. 1897 ఆగస్టు 20న ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి మానవులకు వస్తుందని సర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్ లో కనుగొన్నారు. ఆ రోజు ఆయన చేసిన గుర్తుకు గాను ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (డబ్ల్యూహెచ్వో) ఈరోజున ప్రపంచ దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ దోమల దినం సందర్భంగా ఢిల్లీలో ఉత్తర ఢిల్లీ మేయర్‌ రవీందర్‌ గుప్తా ఓ సరికొత్త ఆప్‌ను ప్రారంభించారు. 'ట్రాక్‌ ద బైట్‌' అనే ఈ ఆప్‌ దోమల వ్యాప్తితో పాటు అవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో సూచిస్తుందంట. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్బంగా దోమల నివారణ చర్యలు చేపట్టాలి.. అప్పుడే మనకు ఆరోగ్యం.. దోమలకు వినాశకరం..

13:39 - August 20, 2015

విశాఖ: దేశంలో నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజురోజుకూ స్త్రీలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ లా.. విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖలోని దామోదరం సంజీవయ్య లా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే కాలేజీలో చదువుతున్న యుపికి చెందిన రితేష్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని.. సెక్షన్ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆమెను కేజిహెచ్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

13:31 - August 20, 2015

చెన్నై : కోలీవుడ్ హీరో 'విజయ్' హీరోగా ఫాంటసీ అడ్వెంచర్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'పులి' చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇటీవలే ఈ సినిమా ఆడియోకు బాగా స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. 114 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ను యూ ట్యూబ్ లో చిత్ర యూనిట్ ఉంచింది. ఈ చిత్రంలో అలనాటి నటి 'శ్రీదేవి' రాణి పాత్ర పోషించింది. ఎస్.కె.స్టూడియో పతాకంపై పి.టి. సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన హన్సిక, శృతిహాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. పులికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'పులి' గాండ్రిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

'ముద్దు' తాట తీస్తానన్న రోజా..

చిత్తూరు : ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు తీరు మార్చుకోకపోతే తాట తీస్తానని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. అసెంబ్లీలో, బయట తాను ప్రభుత్వంపై పోరాడుతున్నానని, సర్కారు తనను టార్గెట్‌ చేసిందని రోజా ఆరోపించారు.

మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం..

విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లిలో మూడున్నరేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పవర్ స్టార్ కు పాలాభిషేకం..

గుంటూరు : మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్‌ సెంటరులో పవన్‌ కల్యాణ్‌ ఫోటోకు రైతులు, జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం జనసేన కార్యకర్తలు రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహిళలకు చీరలను పంపిణీ చేసిన రఘువీరా..

అనంతపురం : రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దేశంలో మనం శాస్త్రసాంకేతిక ఫలాలు పొందుతున్నామంటే రాజీవ్‌ చలవేనని ఆయన తెలిపారు. 

సీపీఎం రాజయ్య పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేయడంపై ఎమ్మెల్యే సున్నం రాజయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఏడు మండలాల విలీనంపై డీలిమిటేషన్‌ యాక్ట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని రాజయ్య కోరారు. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ను దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. 

13:13 - August 20, 2015

గుంటూరు: జనసేనానికి తుళ్లూరు జనం నీరాజనం పలుకుతున్నారు. రాజధాని ప్రాంతంలో... భూ సేకరణ వద్దన్న పవన్ ప్లెక్సీలకు పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. రైతులకు అండగా నిలిచినందుకు బేతపూడి, పెనుమాక, ఉండవల్లిలో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తమకోసం పోరాడుతున్న కళ్యాణ్‌ను దైవంతో కొలుస్తున్నారు. మా దేవుడు నువ్వేనయ్యా... మాకోసం వచ్చామయ్యా అంటూ అభిమానులు హల్‌చల్ చేస్తున్నారు. 

13:07 - August 20, 2015

అమెరికా : కూతురుని నిర్లక్ష్యం చేస్తున్న ఓ భర్తకు బుద్ధి చెప్పాలని ఓ తల్లి తన ముగ్గురు కుమారులను కడతేర్చింది. అమెరికలోని ఓహియో నగరానికి చెందిన జోసెఫ్, బ్రిట్నీ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కానీ కొడుకులపైనే జోసెఫ్ ప్రేమ చూపిస్తున్నాడని, కూతురుని పట్టించుకోవడం మానేశాడని బ్రిట్నీ భావించింది. ఆవేశంలో కన్నతీపిని కూడా మరిచిన బ్రిట్నీ కొడుకులను చంపేయాలని పథకం రచించింది. తొలుత పెద్ద కుమారుడిని హత్య చేసింది. ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు భర్త జోసెఫ్ తో కలిసి పోలీసులకు బ్రిట్నీ ఫిర్యాదు చేసింది. ఈ కేసు కొలిక్కి రాక ముందే మరో ఇద్దరిని కూడా విగత జీవులుగా మార్చేసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు బ్రిట్నీపైనే అనుమానమొచ్చింది. ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో చివరకు నేరం ఒప్పుకుంది.

'లా' స్టూడెంట్ పై అత్యాచారం..

విశాఖపట్టణం : ఓ లా విద్యార్థినిపై సీనియర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. త్రీ టౌన్ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. యూపీకి చెందిన రితేష్ సింగ్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

13:00 - August 20, 2015

విజయవాడ: మతోన్మాదులకు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన..."మలాలా" జీవిత చరిత్ర తెలుగు పుస్తకరూపంలో వెలువడనుంది. విజయవాడ సిద్ధార్థ మహిళా కాలేజీలో... ఐద్వా ఆధ్వర్యంలో "నేను మలాలా" పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మలాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని... ఐద్వా నేతలు ఆకాంక్షించారు. చిన్నవయసులోనే ఎన్నో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మలాలా గురించి తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పుస్తక అనువాద కర్త సత్యరంజన్ చెప్పారు.

 

12:54 - August 20, 2015

అమెరికా : పెంపుడు జంతువులంటే కొంతమందికి ఇష్టం. వాటిని చాలా మంది పెంచుకుంటూ ప్రేమగా చూసుకుంటుంటారు. వారికి ఏమన్నా అయితే చలించిపోతారు. కొంతమంది పెంచుకున్న జంతువుల ప్రాణాలు పోతే ఏకంగా సమాధిలే కట్టిస్తుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లికి అనారోగ్యం వస్తే ఏకంగా రూ.19 లక్షలు ఖర్చు చేశారు. అవును నిజం.
అమెరికాలో ఉన్న గాన్సియర్ దంపతులు ఓ పిల్లి (ఒకీ) పెంచుకుంటున్నారు. కానీ ఆ పిల్లికి మూత్ర పిండాల వ్యాధి వచ్చింది. ఆ పిల్లిని బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇతర పిల్లిని నుండి ఓ కిడ్నీని తీసుకరావాల్సి ఉంటుందని, దానికి ఏకంగా రూ.19 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారంట. కానీ వారి దగ్గర అంత డబ్బు లేదు. అయితేనేం అనుకుని ఇల్లు కట్టుకోవాలని కూడబెట్టిన డబ్బును పిల్లి వైద్యం కోసం ఖర్చు చేసేశారు. కానీ విషాదం ఏంటంటే లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేసినా ఈ ఒకీ రెండు, మూడేళ్లకు మించి బతకదట.

12:54 - August 20, 2015

పశ్చిమగోదావరి: దేశంలోనే ఎపిని నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేస్తామని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసమే నిట్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాకు ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేక పరిస్థితలున్నాయని చెప్పారు. ఎపికి చేయూతనివ్సాలిన అవసరం ఉందన్నారు. 60 సంవత్సరాలుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లేకుండా ఎపిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కాంగ్రెస్.. ఎపిని అన్యాయంగా విభజించిందని విమర్శించారు. ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్ లో చట్టం కూడా రూపొందించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి విస్మరించారని చెప్పారు.
మోడీపై ప్రశంసల వర్షం
మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ దేశ ప్రతిష్టను పెంచారని చెప్పారు. ప్రపంచదేశాల్లో దేశ ఖ్యాతిని పెంచారని అన్నారు. కేంద్రం ఒకే సంవత్సరంలో లక్ష టాయిలెట్స్ నిర్మించారని పేర్కొన్నారు. ఎపిలో ఉండే టాయిలెట్స్ నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో దేశ ప్రతిష్టను పెంచుతున్నారని వివరించారు. రాజధాని కోసం ప్రధాని రూ. 500 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈనెల 25 న మోడీని కలుస్తున్నానని పేర్కొన్నారు.

12:51 - August 20, 2015

హైదరాబాద్: తల్లి గర్భంలో అవమానం.. అమ్మ ఒడిలో అవమానం... బయట బడిలో అవమానం..పని చేసే చోట అవమానం..కుడి, ఎడమల అవమానం. చివరకు అమ్మాయిగా పుట్టడమే అవమానం. అంతలా అవమానపడుతున్నారు తెలుగింటి ఆడబిడ్డలు. ఏ రంగంలో ముందున్నా లేకున్నా మహిళలను అవమానించడంలో మాత్రం తెలుగు రాష్ర్టాలు దేశంలోనే అగ్రజుల పాత్రను పోషిస్తున్నాయి. నమ్మినా..నమ్మకున్నా ఇది సిగ్గుపడే నిజం. జాతీయ నేరాల నమోదు సంస్థ తేల్చిన నగ్నసత్యం.
అమ్మాయిలను టీజ్‌ చేయడం ఆనవాయితీగా మారింది
అమ్మాయిలను టీజ్‌ చేయడం ఆనవాయితీగా మారింది. ఎక్కడపడితే అక్కడ అవమానించడం అలవాటైపోయింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం మనవాళ్ల జీవితంలో భాగమైపోయింది. ఇవన్నీ ఏ మహిళాసంఘాలో చేస్తున్న విమర్శలు కావు. మహిళాపక్షపాతులు చేస్తున్న ఆరోపణలు అంతకన్నా కావు. జాతీయ నేరాల సంస్థ ఎన్ సిఆర్ బి వెల్లడించిన వివరాలు.
మహిళలకు అవమానాలు
మహిళలపై నేరాల విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క అడుగు వెనక్కి ఉన్నా అమ్మాయిలను అవమానించడంలో మాత్రం తెలుగు రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయి. ఇందులోను ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ కంటే రెండాకులు ఎక్కువగానే చదివి అగ్రస్థానంలో ఉంది. ఇంటా బయటా, బహిరంగ ప్రదేశాల్లో..పని చేసే చోట తెలుగింటి మహిళలు అవమానాల పాలవుతున్నారు.
ఇంటర్నెట్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాల్లో టాప్‌లో తెలుగురాష్ట్రాలు
మరో ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది ఎన్ సిఆర్ బి ఇంటర్నెట్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాల్లోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకదాని వెనుక ఒకటి ముందువరుసలో నిలిచాయి. మిగతా నేరాల సంఖ్యను ఎంతోకొంత అదుపుచేయగలిగిన తెలుగు రాష్ట్రాలు మహిళలపై జరుగుతున్న నేరాలను మాత్రం అదుపుచేయలేకపోయాయన్నది ఎన్ సిఆర్ బి నివేదిక సారాంశం.
అత్యాచారాల్లో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానం
మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించడంలోనే కాదు మిగతా నేరాల్లోను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరే రాష్ట్రాలతో పోటీపడ్డాయి. మహిళలపై అత్యాచారాల విషయంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఆ తరువాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. మహిళలను మోసగించడంలో రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి రెండు స్థానాల్లో ఉంటే తెలంగాణ, ఏపీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లైంగిక వేధింపుల విషయంలో మహారాష్ర్టది టాప్‌ అయితే ఏపీ, తెలంగాణ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2014లో 5 వేల 150 మహిళా హత్యలు చేసి ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంటే 1308 హత్యలతో తెలంగాణ 12వ స్థానంలో, 1175 హత్యలతో ఏపీ 13వ స్థానంలో ఉన్నాయి.
మహిళలకు అవమానాలు తప్పడం లేదు
చట్టాలకు చట్టాలు కుప్పలు కుప్పలుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల మహిళలకు అవమానాలు తప్పడం లేదు. అమ్మగానో..చెల్లిగానో..భార్యగానో..కూతురిగానో అవమానభారంతో కుంగిపోతోంది. మహిళలపై నేరాలు అదుపుకాకపోగా అంతకంతకూ పెరగడం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోంది.

 

భారత్ 108/2, కోహ్లీ హాఫ్ సెంచరీ..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. 

12:32 - August 20, 2015

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా గట్టు స్కూళ్లపై విద్యార్థులు రాసిన లేఖలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తమ పాఠశాలల్లో విద్యార్థులున్నా టీచర్లు రావడం లేదంటూ విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈసందర్భంగా విద్యాశాఖ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ కోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు సూటిగా ప్రశ్నించింది. డీఈవోపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొనగా అసలు డీఈవోను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించింది. ఈవిషయాలపై టెన్ టివితో న్యాయవాది మాట్లాడారు. విద్యార్థుల రాసిన లేఖలను పూర్తిగా పరిశీలించిన తరువాత న్యాయస్థానం చలించిపోయిందన్నారు. అందుకే సుమోటోగా కేసుగా తీసుకోవడం జరిగిందన్నారు. నివేదిక అనుకూలంగా ఉందని, డీఈవోపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ ప్రశ్నించారని తెలిపారు. ఎందుకు సస్పెండ్ చేయలేదో తెలుపాలని, మీ పిల్లలను స్కూల్లో చదివిస్తారా అంటూ ప్రశ్నించారని తెలిపారు. ఎలంటి చర్యలు తీసుకోకపోతే అధికారుల పిల్లలను ఆ స్కూళ్లో చేరిపించాలని ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ హెచ్చరించారని, ప్రైవేటు స్కూళ్లో ఎక్కడా అడ్మిషన్ దొరకని విధంగా తాము ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారని న్యాయవాది పేర్కొన్నారు. 

కేంద్ర సహకారంతో ముందుకెళుతాం - బాబు..

తాడేపల్లిగూడెం : ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారంతో ముందుకెళుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెంలో నిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. పార్లమెంట్ తలుపులు మూసి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజనతో ఏపీ చాలా నష్టపోయిందన్నారు. వెంకయ్య ఢిల్లీలో ఉన్నంతకాలం ఏపీకి అన్యాయం జరుగనివ్వరని తెలిపారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారని బాబు తెలిపారు. 

12:13 - August 20, 2015

రికార్డు కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా ఆల్టైమ్ రికార్డులు సృష్టించిన బాహుబలిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు జక్కన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సినిమా రెండోభాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేలా పలు అంశాలను జోడించాలని ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే.. బాహుబలి-2లో ఈసారి పలు విశేషాలు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరవీర భయంకర  పోరాట యోధులుగా పేరొందిన డబ్లూ.డబ్లూ.ఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టెయిన్మెంట్) స్టార్లతో ప్రభాస్ తలపడేలా పలు సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెజ్లింగ్ గేమ్లో సూపర్స్టార్లు బ్రాక్ లెస్నర్, జాన్సీనాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీత ఆదరణ ఉంది. వీరిని సినిమాలో నటించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వారు ఉంటే.. సినిమాకు అంతర్జాతీయ ప్రచారం సులువుగా దొరుకుతుందన్నది జక్కన్న ఆలోచనగా చెబుతున్నారు. అయితే సినిమా మొదటి భాగంలో కాలకేయ స్థానంలో ట్రాయ్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడిని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఈ వార్తలు ఎంత వరకు కార్యరూపం దాలుస్తాయన్నది వేచి చూడాలి మరి! 

12:12 - August 20, 2015

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సర కాలంలో ఏమి ఇచ్చామో చూడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అవి తెలిస్తే విమర్శలు చేసే వారు మాట్లాడరని తెలిపారు. ఎట్లాంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని వెంకయ్య పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు కాంగ్రెస్..విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనదైన శైలిలో ఆయన ప్రసంగం చేశారు. పార్లమెంట్ తలుపులు వేసి అందర్నీ నోరు మూయించి విభజన చేశారని, రాజ్యసభలో అడ్డుకోవడానికి నిలబడి పట్టుబట్టడంతో ఏపీకి ఇవైనా వచ్చాయన్నారు. కానీ విపక్షం అంతా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ నుండి విశాఖకు ఏపీ ఎక్స్ ప్రెస్ తీసుకొచ్చామన్నారు.
ఏపీ ప్రగతిని అడ్డుకోవద్దు..
ఏపీ ప్రగతిని అడ్డుకోవద్దని వెంకయ్య సూచించారు. ఏపి ప్రగతిని అడ్డుకోవద్దని, నూటికి నూరు పాళ్లు అయ్యే విధంగా చేస్తామన్నారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతోందని, ఇతర రాష్ట్రాల వాళ్లు హోదా కావాలంటున్నారని, దీనిపై చర్చ జరుగుతోందన్నారు. చర్చలు పూర్తయిన తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపెట్టే విధంగా చూస్తామని హామీనిచ్చారు.
భారత్ వైపు చూస్తున్న ప్రపంచం..
ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏజెండా మార్చారన్నారు. అభివృద్ధి కావాలి. వేగవంతమైన అభివృద్ధి కావాలని మోడీ ఆకాక్షింస్తున్నారు. దేశంలో సంపద పెంచేందుకు కృషి చేస్తున్నారని, అందరూ పంచాలని అంటున్నారని తెలిపారు. కానీ పంచితే పంచె మాత్రం మిగులుతుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ను జరుగనీయకుండా, అభివృద్ధికి ఆంటకం కలుగ చేస్తున్న వారిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. ఎక్కడకు వెళ్లినా జనం అంతా మోడీ అని కొనియాడుతున్నారని, ప్రపంచ దేశాల నేతలు మోడీని కొనియాడుతున్నారని తెలిపారు. భూమి లేకుండా ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. పేదలకు మాటలు..ధనికులకు మూటలు ఇచ్చారని కాంగ్రెస్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
వారసత్వ రాజకీయాలు కాదు..జవసత్వం కావాలి..
తాను కిందటి స్థాయి నుండి వచ్చానుని, వారసత్వ రాజకీయాల నుండి రాలేదన్నారు. వారసత్వ రాజకీయలు కాదు జవసత్వం కావాలని పిలుపునిచ్చారు. అదే పార్టీలో ఉన్నానని, అదే పార్టీలో ఛస్తానన్నారు. ఏ చొక్క వేసుకోవాలో తెలియని వారు విమర్శిస్తారా ? అని ప్రశ్నించారు. ఆంధ్రా, తెలంగాణ అయినా ఒక్కటేనని, ఏ ఎండాక ఆ గొడుగు పెట్టే నైతిక హక్కు లేదన్నారు. 

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ముందంజ..

రాజస్తాన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 129 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, కాంగ్రెస్ 25 సీట్లు గెలుచుకోగా స్వంతంత్ర్య అభ్యర్థులు 21 సీట్లలలో విజయం సాధించారు. 

పార్లమెంట్ లో రాజీవ్ కు ఘన నివాళి..

ఢిల్లీ : పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నేతలు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లు ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. 

భారత్ 79/2..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. మురళీ విజయ్ (0), రహానే (4) పెవిలియన్ చేరారు. రాహుల్ 34, కోహ్లీ 36 క్రీజులో ఉన్నారు. 

ఏపీకి అన్యాయం జరుగనివ్వం - వెంకయ్య..

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్లాంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు కాంగ్రెస్..విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనదైనశైలిలో ఆయన ప్రసంగం చేశారు. సంవత్సర కాలంలో ఏపీకి ఇచ్చామో చూస్తే విమర్శలు చేసే వారు మాట్లాడలేరని, అంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నుండి విశాఖకు ఏపీ ఎక్స్ ప్రెస్ తీసుకొచ్చామన్నారు.
ఏపీ ప్రగతిని అడ్డుకోవద్దు..

11:41 - August 20, 2015

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు దగ్గర సోదాలు జరిపిన పోలీసులు ఈ దుంగలను గుర్తించారు. వీటి విలువ దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

 

11:38 - August 20, 2015

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి అక్రమంగా తరలిస్తోన్న 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో గోల్డ్ బిస్కట్లను అమర్చి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయాడో వ్యక్తి. మలేషియా నుంచి వచ్చన ప్రయాణికుడు వివిధ పరికరాల్లో దాదాపు 350 గ్రాముల స్వర్ణాన్ని దాచాడు. తనిఖీలు చేస్తున్న అధికారులకు అతనిపై సందేహం వచ్చింది. వెంటనే వాటిని విప్పి అసలు గుట్టు తెలుసుకున్నారు. నిందితుడు తమిళనాడువాసిగా గుర్తించిన అధికారులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రత్యేక హోదా కావాలి - సీపీఐ..

అనంతపురం : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, రాయలసీమలో కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. కరువు, ప్రత్యేక హోదాపై 22, 23వ తేదీల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

శంకుస్థాపన చేయడం తన అదృష్టం - స్మతి ఇరానీ..

పశ్చిమగోదావరి : జాతీయ విద్యా సంస్థలకు శంకుస్థాపన చేయడం తన అదృష్టమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ కలల సాకారానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. తిరుపతి ఐఐటికి రూ.700 కోట్లు, తాడేపల్లి గూడెం నిట్ కు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. అలాగే ఐఐఎం విశాఖకు రూ.680 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఏపి పారిశ్రామిక వేత్తలకు నెలవని, ఎంతో మంది ఇక్కడి నుండే వచ్చారన్నారు. ప్రతి స్కూల్లో విద్యార్థినులకు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు స్మృతి విజ్ఞప్తి చేశారు.

తాడేపల్లిలో డిగ్రీ కళాశాల లేదు - మంత్రి మాణిక్యాలరావు..

పశ్చిమగోదావరి :- తాడేపల్లి గూడెంలో ప్రభుత్వ డిగ్రి కళాశాల లేదని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల సమస్యల వలయంగా మారిందని పేర్కొన్నారు. విమానాశ్రయ భూముల్లో 50 ఎకరాలను ఆటోనగర్ కు కేటాయించాలని, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు సీఎం చొరవ చూపాలని కోరారు. 

ఎఫ్ఐపిఐసి సమ్మిట్ లో ప్రసగించిన రాష్ట్రపతి..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎఫ్ఐపిఐసి సమ్మిట్ లో ప్రసంగించారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

 

మరో విద్యార్థిని ఆత్మహత్య..

నెల్లూరు : గూడూరు డీఆర్డబ్ల్యూ డిగ్రీ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని రవళి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న రవళి రావూరు మండలం పెనుబర్తి నివాసి. 

10:58 - August 20, 2015

గుంటూరు: అదొక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారం. రౌడీలు, గూండాలు షరా మామూలుగా ఎంటరైపోయారు. వారితోపాటు కత్తులు, కర్రలు కూడా వచ్చేశాయి. ఇల్లు కూల్చేశారు. టెంట్‌ వేసేశారు. పెద్దలు, పిల్లలు.. ఆఖరికి పశువులను కూడా ఉండనివ్వలేదు. అక్కడే ఉంటే చంపేస్తామన్నారు. ఉదయం మొదలైన ఈ తంతు.. సాయంత్రానికి జరిగిన బలవంతపు రిజిస్ట్రేషన్‌తో ముగిసింది. నిజమో కాదో తెలియదు కాని.. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఎపిసోడ్‌ వెనుక ఓ పెద్దమనిషి ఉన్నారని చెబుతున్నారు. ఎవరా పెద్దమనిషి? బాధితులు చెప్పేది నిజమేనా?
పట్టపగలే గూండాల దాడి
గుంటూరు టౌన్‌. పట్టపగలే గూండాలు దాడి చేశారు. ఆ స్థలంలో ఉన్న ఇల్లును కూల్చేశారు. విరిగిపడ్డ గోడల కింద దూడలు కూడా చచ్చిపోయాయి. చంటిపిల్లలని కూడా చూడకుండా అందరినీ బయటికి నెట్టేశారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా దక్కని రక్షణ
బిక్కచచ్చిపోయిన వారు రక్షణ కోసం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు పెట్టారు. కాని అక్కడ పోలీసులు 'మీకు దెబ్బలు తగిలాయా.. రక్తమేమైనా కారిందా.. అయితే కేసు.. లేదంటే అది సివిల్‌.. వెళ్లిపోండి' అని లాజిక్కులు మాట్లాడారు. అక్కడి నుంచి డీఎస్పీ దగ్గరకు పోయినా.. లాభం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. ఈ స్థలం తమదేనని.. అయితే దీన్ని కొంటామని అడ్వాన్స్ ఇచ్చి.. మిగతాది సెటిల్‌ చేయకుండా.. ఇప్పుడిలా బలవంతంగా దాడి చేసి కబ్జా చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
ల్యాండ్‌ వ్యవహారంలో కోడెల కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మి
ఇంతకీ ఇదంతా చేయిస్తున్నదెవరు? ఈ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో కొనటానికి ముందుకొచ్చిన వ్యక్తి ఎవరు? వారి మాటల్లోనే వినండి. స్వయంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మి ఈ ల్యాండ్‌ వ్యవహారంలో ఉన్నారు. ఆమె, ఆమెతో పాటు మచ్చా శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరు మీదే ఈ భూమి రిజిస్ట్రేషన్‌ బలవంతంగా చేయించారని బాధితులు చెబుతున్నారు.
కోడెల డైరెక్షన్‌లోనే..
వివాదంలో పడ్డ భూమిని చీప్‌గా కొట్టేయడానికి డబ్బున్న రాజకీయ పెద్దలు ఎంటరవడం మామూలే. అయితే ఇక్కడ కొనడానికి బదులు వివాదాన్ని వాడుకుని భూమిని కబ్జా చేసేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మచ్చా శ్రీనివాస్‌ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. అతను మాత్రం ఇదంతా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు డైరెక్షన్‌లోనే జరుగుతుందని చెప్పాడని బాధితులంటున్నారు.
బాధితులకు రక్షణ కల్పించని చట్టం
మచ్చా శ్రీనివాస్‌ కేవలం ల్యాండ్‌ కొనుగోలుకే కోడెల కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మిని ఇన్‌వాల్వ్ చేశారా.. లేక కోడెల కుటుంబం డైరెక్షన్‌లోనే ఇదంతా నడిపించారా అనేది నిజమో కాదో తెలియదు. కాని మొత్తం వ్యవహారంలో చట్టం మాత్రం పని చేయలేదని మాత్రం స్పష్టంగా కనపడుతోంది. స్వయంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కలగచేసుకుని తమకు న్యాయం చేయాలని.. చట్టప్రకారం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

 

జమ్మూలో హురియత్ నేతల గృహ నిర్భందం..

జమ్మూ : హురియత్ నేతలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హురియత్ నేతలు మిర్వాజ్, గిలానీలను గృహ నిర్భందంలో ఉంచినట్లు తెలుస్తోంది. 

ఏపీ రాష్ట్రాన్ని విద్యా హబ్ గా మార్చుతాం - గంటా..

పశ్చిమగోదావరి : రాష్ట్రాన్ని విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలో నిట్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. బడ్జెట్ లో విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించామన్నారు. ఏపీలో రాగ్యింగ్ అనేది లేకుండా చేస్తామని హామీనిచ్చారు. విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. 

త్యాగజీవి రాజీవ్ - ఉత్తమ్..

హైదరాబాద్ : దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగజీవి రాజీవ్ అని టిపిసిసి చీప్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఐటీలో రాజీవ్ వేసి పునాదులతోనే నేడు లక్షలాది మందికి ఉపాధి దొరికిందని జానారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నదే రాజీవ్ కల అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశాన్ని సాంకేతికంగా రాజీవ్ ముందుకు తీసుళ్లారని దానం నాగేందర్ తెలిపారు. 

10:31 - August 20, 2015

మహబూబ్ నగర్ : టిటిడిపి ఎమ్మెల్యే, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి ప్రారంభం చేయనున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవమే ఇందుకు కారణం. గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించనున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం రాలేదని రేవంత్ పేర్కొంటూ భారీగా అనుచరులతో ర్యాలీగా యార్డుకు బయలుదేరారు. ముందే పసిగట్టిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దీనితో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. అనంతరం రేవంత్ ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఆగ్రహంలో ఉన్న రేవంత్ అనుచరులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనితో కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్తితులు తలెత్తాయి.

10:30 - August 20, 2015

ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎపి ప్రభుత్వం అడగడం ఆహ్వానించదగినదే అని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక, ఆర్థిక కారణాలు ప్రత్యేక ప్యాకేజీని నిర్ణయించవని...రాజకీయాలే ప్రత్యేకప్యాకేజీలను నిర్ణయిస్తాయన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..                                                                
ఎపికి ఇతర రాష్ట్రాలతో పోలిక లేదు...
'కేంద్రం బీహార్ కు రూ. లక్షా 25 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఎపికి రూ.లక్షా 50 వేల కోట్ల ప్యాకేజీని ఎపి సర్కార్ అడుగుతుందని సమచారం. స్పెషల్ స్టేటస్ ను అడుగనుంది. ఎపి అభివృద్ధి కావడానికి రూ. లక్షా 65 వేల నుంచి 70 వేల కోట్లు అవసరం ఉంటుంది. రఘురాం కమిషన్ దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఎపిని కూడా చేర్చింది. ఎపికి ఇతర రాష్ట్రాలకు పోలికలేదు. ఎపికి పత్యేకసాయం లేకుండా ఎపి విభజన సాధ్యం కాదు. హామీలు లేకపోతే విభజన లేదు.
ప్రభుత్వమే గుడుంబాను అమ్మడం సరికాదు...
గుడుంబాను నిషేధించాల్సింది పోయి... ప్రభుత్వమే గుడుంబాను అమ్మడం సమాజానికి మంచింది కాదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిషేధించాలన్నారు. తెలంగాణలో మద్యపానం విధానం అమలు చేయడం భావ్యం కాదు. అనైతిక చర్యలను నిషేధించాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హైదరాబాద్ లోనే అసెంబ్లీ సమావేశాలు - కోడెల..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు.

10:16 - August 20, 2015

కడప : విద్యార్థినిలు మనిషా, నందినిల ఆత్మహత్య ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగారి కాలేజీ కావడంతో నిందితులను వదిలేసి ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారు. కడపలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు జగదీశ్, ఓబులేసు, సుబ్బారెడ్డి, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కడప సెంట్రల్ జైలుకు పంపారు. మంత్రి నారాయణ కాలేజీకావడంతో పోలీసులు ఇలా చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నిట్ కు బాబు శంకుస్థాపన..

పశ్చిమగోదావరి : తాడేపల్లి గూడెంలో నిట్ కు బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీలు పాల్గొన్నారు

తాడేపల్లి గూడెంకు చేరుకున్న సీఎం బాబు, కేంద్ర మంత్రులు..

వెస్ట్ గోదావరి : తాడేపల్లి గూడెంకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు చేరుకున్నారు.

పోలీసుల అదుపులో రేవంత్ రెడ్డి..

మహబూబ్ నగర్ : టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి జూపల్లిని అడ్డుకుంటారనే భావించి పోలీసులు మందుస్తుగా రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

శుక్రవారం భూ సేకరణ ఉత్తర్వుల విడుదల ?

హైదరాబాద్ : శుక్రవారం భూ సేకరణ ఉత్తర్వుల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 3850 ఎకరాల భూ సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో భూ సేకరణ చేయనున్నారు. ఉండవల్లిలో 900 ఎకరాలు, పెనుమాకలో 530 ఎకరాలు, నిడమర్రులో 670, నవులూరులో 592, కురగళ్లులో 190, తుళ్లూరు మండల పరిధిలో మరో 700 ఎకరాలకు భూ సేకరణ చేయనున్నారు. భూ సేకరణ ఉత్తర్వులను విడివిడిగా ప్రభుత్వం జారీ చేయనుంది.

'వానపూజ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి'

హైదరాబాద్ : వానపూజ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. పూజలు చేయాలన్న ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, మత్రాలకు చింతకాయలు రాలవని నేర్చుకొంటే చాలని హితవు పలికారు. శాస్త్రవేత్తలు వానల్ని కురిపిస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, కురవనున్న మేఘాలను నెట్టేసే పద్ధతి కూడా వారికి తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని, శాస్త్రాన్ని విధిగా అనుసరించాలని సూచించారు. 

భారత జట్టులో రెండు మార్పులు..

కొలంబో : కాసేపట్లో శ్రీలంక, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది. ధావన్ కు బదులుగా మురళీ విజయ్, హర్భజన్ స్థానంలో బిన్నీకి చోటు కల్పించారు. 

ఇద్దరు స్మగ్లర్లతో పోలీసుల బేరసారాలు ?

తిరుపతి : రేణిగుంటలో ఇద్దరు స్మగ్లర్లతో పోలీసులు బేరసారాలు సాగించినట్లు తెలుస్తోంది. ఇద్దరు స్మగ్లర్లను నెల రోజుల పాటు నిర్భందించి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. 

వనస్థలిపురంలో ఉద్యోగాల పేరిట మోసం

హైదరాబాద్ : వనస్థలిపురంలో ఉద్యోగాల పేరిట నవీస్, రామ్మోహన్ లు మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తామంటూ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారు. వీరు విద్యార్థి నేతలని తెలుస్తోంది. నవీన్, రామ్మోహన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సెప్టెంబర్ 1 నుండి విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ పాలన..

హైదరాబాద్ : సెప్టెంబర్ 1 నుండి విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ పాలన సాగనుంది. హైదరాబాద్ నుండి 554 మంది ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడకు రానున్నారు. 

నేటితో రాజధాని భూ సమీకరణ గడువు ముగింపు..

విజయవాడ : నేటితో రాజధాని భూ సమీకరణ గడువు ముగియనుంది. సీఆర్డీఏ భూ సేకరణ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమౌతోంది. సీఎం ఆదేశాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. మరో 3,852 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందని సీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. 

రాజీవ్ జయంతి సందర్భంగా ర్యాలీలు..

హైదరాబాద్ : రాజీవ్ జయంతి సందర్భంగా నగరంలో కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించనుంది. జేమ్స్ స్ట్రీట్, ఆబిడ్స్ ట్యాంక్ బండ్, నిజాం కాలేజీ నుండి సోమాజీ గూడ వరకు ర్యాలీ నిర్వహించనుంది. 

మహళలపై నేరాల్లో తెలుగు రాష్ట్రాల పోటీ..

హైదరాబాద్ : మహళలపై నేరాల్లో తెలుగు రాష్ట్రాల పోటీ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయని ఎన్సీఆర్టీ 2014 నివేదిక పేర్కొంది. మోసం, సైబర్ నేరాల్లో అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది.

 

09:30 - August 20, 2015

తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. టీసర్కార్ మద్యపాన విధానాన్ని అమలు చేయడం సరికాదన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, బిజెపి నేత.. ఆచారి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్, బిజెపి నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మద్యం తయారీ, కొనుగోలు కంపెనీల లాభాల కోసమే ప్రభుత్వం చీఫ్ లిక్కర్ ప్రమోట్ చేస్తుందని నేతలు ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం..

తిరుపతి: చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లె పొలాల్లో దాచిన 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.కోటి ఉంటుందని అంచనా.

 

09:11 - August 20, 2015

ఆరోగ్య సేవలు అందించడంలో ఆషా వర్కర్లది కీలక పాత్ర. మనదేశంలో కుటుంబ నియంత్రణ , వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం సక్సెస్ కావడం వెనక ఆషా వర్కర్ల క్రుషి వుంది. గర్భిణీల, శిశువుల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలోనూ వీరి పాత్ర వుంది. అలాంటి ఆషా వర్కర్లు ఇప్పుడు ఇల్లు గడవని స్థితిలో అవస్థపడుతున్నారు.
2005లో ఆషా వర్కర్ల నియామకం
ఆషా వర్కర్లను 2005లో నియమించారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆషా వర్కర్ వుండాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఆషా వర్కర్లున్నారు. తెలంగాణలో పాతిక వేల మందిదాకా వుంటారు. గర్భిణీలకూ, చంటి పిల్లల తల్లలుకు, చిన్నారులకు ఆరోగ్య సేవలందించడం వీరి బాధ్యత. మన దేశంలో ఆస్పత్రికి వెళ్లి పురుడు పోసుకునేవారి సంఖ్య చాలా తక్కువ. ఇళ్లల్లోనే పురుడు పోసుకోవడం వల్ల, అత్యవసర వైద్య సాయం అందక అనేకమంది చనిపోతున్న దేశం మనది. మరోవైపు వాంతులు, విరోచనాలు, కామెర్లు లాంటి వ్యాధులతో నిత్యం అనేకమంది పసిపిల్లలు చనిపోతున్న తీరు హ్రుదయవిదారకం.
గర్భిణీ, పసిపిల్లల మరణాలను నిరోధించేందుకు ఆశా వర్కర్ల వ్యవస్థ
మన దేశంలో గర్భిణీ మరణాలను, పసిపిల్లల మరణాలను నిరోధించాలన్న లక్ష్యంతో ఏర్పాటైందే ఆశా వర్కర్ల వ్యవస్థ. గత పదేళ్ల కాలంలో ఆషా వర్కర్లు సాగించిన క్రుషి, సాధించిన ప్రగతి అనేకమంది ప్రశంసలను అందుకుంటోంది. మారుమూల పల్లెలు, మురికివాడల్లో సైతం ఆషా వర్కర్లు ఆరోగ్యకర విధానాల గురించి సాగిస్తున్న ప్రచారం విశేష ఫలితాలనిస్తోంది. వీరు చేస్తున్న క్రుషి ఫలితంగా ఆస్పత్రిలో పురుడుపోసుకోవడం సురక్షితమన్న బలమైన భావన మారుమూల వాడల్లో సైతం నాటుకుపోయిం ది. పుట్టిన ప్రతి శిశువుకి టీకాలు వేయించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. గర్భిణీల, శిశు జననాల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదుచేస్తూ మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడంలో తమ వంతు పా త్ర పోషిస్తున్నారు. పేరుకు వీరిది పార్ట్ టైమ్ ఉద్యోగమే అయినా ఫుల్ టైమ్ పని చేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఇళ్లు ఇళ్లు తిరుగుతున్న ఆషా వర్కర్లు మనదేశంలో ఎందరో వున్నారు. ఫ్యామ్లీ ప్లానింగ్ ఆపరేషన్లు, వ్యాధి నిరోధక టీకాలు లాంటి కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధేశించే టార్గెట్లను పూర్తి చేయడానికి వీరు నిరంతరం శ్రమించాల్సి వస్తోంది.
నిర్ధిష్టమైన వేతనం లేదు
మారుమూల పల్లెల్లో, నిరక్షరాస్యుల్లో వైద్య ఆరోగ్య స్ప్రుహను పెంపొందిస్తూ, మాతా శిశు సంరక్షణలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఆషా వర్కర్ల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కానీ దురదృష్టవశాత్తు వేతనాలు, పారితోషకాల విషయంలో ఆషా వర్కర్లకు సముచిత ప్రాధాన్యత లభించడం లేదు. ఈ స్కీమ్ ప్రారంభమై దశాబ్ధం దాటినా ఇప్పటికీ వీరికి నిర్ధిష్టమైన వేతనం లేదు. వీరు తీసుకొచ్చే కేసులను బట్టి పారితోషకం ఇస్తున్నారు. చాలామంది ఆషా వర్కర్లు నెలకు అయిదారు వందల రూపాయల పారితోషకంతోనే సంత్రుప్తి పడాల్సి వస్తోంది. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలందిస్తున్న తమకు కనీస వేతన చట్టం అమలు చేయాలన్న వీరి అభ్యర్ధన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.

 

నేటి నుంచి భారత్ - శ్రీలంక రెండో టెస్టు

కొలొంబో: నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సోనీ సిక్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సంగక్కరకు ఇదే చివరి మ్యాచ్.   

నేడు జుక్కల్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

నిజామాబాద్ : జుక్కల్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

 

నేడు జగిత్యాల నియోజకవర్గంలో ఎంపి కవిత పర్యటన

కరీంనగర్: నేడు జగిత్యాల నియోజకవర్గంలో ఎంపి కవిత పర్యటించనున్నారు. 'మనపల్లె-మనఎంపీ' కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసున్నారు.  

నేడు తాడేపల్లిగూడెంలో నిట్ కు శంకుస్థాపన

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో నేడు నిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎపి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడు, సుజనాచౌదరిలు హాజరు కానున్నారు.  

08:10 - August 20, 2015

పశ్చిమగోదావరి: జిల్లాలో నిట్‌ ఏర్పాటు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. అటు ఏలూరు, ఇటు తాడేపల్లిగూడెం మధ్య ఊగిసలాడిన వ్యవహారం చివరకు ఢిల్లీ పెద్దల జోక్యంతో గూడెం వైపు మొగ్గుచూపింది. దీంతో మంత్రి మాణిక్యాలరావు పంతం నెరవేరింది. ఈనెల 20న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది.
మారిపోయిన పరిణామాలు
అయితే ఇంత కాలం నిట్‌ ఏలూరుకే దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. దీనికోసం ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో సహా పలువురు టీడీపీ నేతలు చాలా ప్రయత్నం చేశారు. వీరికి చంద్రబాబు నుంచి మద్దతు కూడా లభించినట్లు తెలిసింది. దీంతో ఏలూరుకు నిట్‌ వస్తుందని టీడీపీ నేతలు ఎంతోగానో కలలు కన్నారు. కానీ.. చివరకు ఏం జరిగిందో తెలియదు... పరిణామాలన్నీమారిపోయాయి. చివరకు తాడేపల్లిగూడెంకు నిట్‌ మళ్లింది.
అసంతృప్తిలో టీడీపీ నేతలు
తెలుగు తమ్ముళ్లు ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి వరకు పోరాడినా తమ ప్రాంతానికి నిట్‌ దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో తమ నేతల సహకారంతో.. మంత్రి మాణిక్యాలరావు నిట్‌ను దక్కించుకున్నారని భావిస్తున్నారు. సమయం చిక్కితే బీజేపీ నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని తెలుగు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.
ఆరోపణలను కొట్టిపారేస్తున్న బీజేపీ
మరోపక్క బీజేపీ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తమ మధ్య కొందరు అపోహలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాల మూలంగానే నిట్‌ విషయంలో సమస్య ఏర్పడిందని మంత్రి మాణిక్యాలరావు అంటున్నారు. తామంతా ఐక్యంగానే ముందుకు సాగుతున్నామంటున్నారు.

 

08:03 - August 20, 2015

ఢిల్లీ: హస్తినలో విద్యుత్‌ అక్రమాలు బయటపడ్డాయి. మూడు ప్రైవేటు విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల నిర్వాకం వల్ల వినియోగదారులపై 8 వేల కోట్ల భారం పడిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. ఆ మూడు కంపెనీల నుంచి డబ్బు వసూల్‌ చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాగ్‌ నివేదికలో వెలుగు చూసిన అక్రమాలు
ఢిల్లీలో మూడు ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ కంపెనీల అక్రమాలు కాగ్‌ నివేదికలో వెలుగు చూశాయి. 2012లో వినియోగ దారుల నుండి తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి రిలయన్స్, టాటాకు చెందిన మూడు ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ కంపెనీలు డిస్కమ్స్ దాదాపు 8వేల కోట్లు ఎక్కువ చేసి చూపించినట్లు కాగ్‌ తన 212 పేజీల నివేదికలో పేర్కొంది. టాటా, రిలయన్స్ గ్రూపులకు చెందిన ఈ కంపెనీల చర్యల వల్ల అధికబిల్లుల రూపంలో ప్రజలపై భారం పడిందని, ఈ పరిస్థితి విద్యుత్‌ టారిఫ్‌లు పెరిగేందుకు దారితీసిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. తమ వాస్తవిక రెవిన్యూలను తెలియచేయకుండా అయ్యే ఖర్చును మాత్రం గోల్‌మాల్‌ చేసి అధికంగా చేసి చూపించాయని కాగ్‌ తెలిపింది.
కాగ్‌ రిపోర్ట్ తో ఆప్‌కు అతిపెద్ద విజయం
కాంగ్రెస్‌ హయాంలో జరిగిన విద్యుత్‌ అక్రమాలపై పోరాడిన ఆప్‌కు కాగ్‌ రిపోర్ట్‌ తో పెద్ద విజయాన్ని సాధించింది. గత ఏడాది కేజ్రీవాల్‌ 49 రోజుల పాలనలో ప్రయివేట్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను కాగ్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. కాగ్‌ పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.
కాగ్‌ రిపోర్ట్ పై స్పందించిన విపక్షాలు
కాగ్‌ రిపోర్ట్ పై విపక్షాలు స్పందించాయి. కాగ్‌ రిపోర్టుపై సిబిఐ విచారణ జరపాలని కాంగ్రెస్‌, బిజెపిలు డిమాండ్‌ చేశాయి. రిలయన్స్, టాటాకు చెందిన మూడు ప్రైవేటు విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు షీలా దీక్షిత్‌ ప్రభుత్వంతో, ఢిల్లీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ తో కుమ్మక్కై అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని సిపిఎం విమర్శించింది. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే ఈ 8వేల కోట్ల రూపాయిలను ఆ మూడు ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల నుండి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ప్రజలపై మోపిన అధిక చార్జీలను తగ్గించాలని కోరింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ ఒప్పందం
అనిల్‌ అంబాని రిలయన్స్ గ్రూప్‌ కు సంబంధించిన బిఆర్‌పిఎల్‌, బివైపిఎల్‌ కంపెనీలతో పాటు టాటా పవర్‌ కంపెనీలు షీలా దీక్షిత్‌ ప్రభుత్వం, డిఇఆర్‌సితో విద్యుత్‌ పంపిణీ ఒప్పందం కుదుర్చుకుంది. 2011లో టెండర్లను పిలవకుండానే ఈ మూడు కంపెనీలతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ ఒప్పందం కుదుర్చుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆ కంపెనీలకు అధిక ధర చెల్లించి అక్రమాలకు పాల్పడింది. చైనా మీటర్లను కొనుగోలు చేసిన డిస్కమ్స్ వాటిని వినియోగదారులకు రెట్టింపు ధరలకు అమ్మాయి.

 

07:56 - August 20, 2015

ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని..వారికి కనీస వేతనం నిర్ణయించాలని తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్ నేత పి. జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆషా వర్కర్లు పోరుబాట పడుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆషా వర్కర్లు ఎదుర్కొంటున్న సమ్యలేమిటి? వీరు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వీరి డిమాండ్స్ ఏమిటి? ఇదే అంశంపై జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

నేటి నుంచి యాషెస్ ఐదో టెస్టు

హైదరాబాద్: నేటి నుంచి యాషెస్ ఐదో టెస్టు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రసారం కానుంది. క్లార్క్, రోజర్స్ కు ఇది చివరి ఆట. 

రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి

ప్రకాశం: పెద్దారవీడు మండలం చాట్లమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, బైకు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

07:37 - August 20, 2015

చెన్నై: ప్రధాని మోది సిఎం జయలలితను కలుసుకోవడం అక్రమ సంబంధం లాంటిదని కాంగ్రెస్‌ నేత ఇళంగోవన్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు అట్టుడుకుతోంది. ఇళంగోవన్‌పై అన్నాడిఎంకే ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇళంగోవన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోది కొద్దిరోజుల క్రితం చెన్నయ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితను ఆమె నివాసంలో మోది కలుసుకున్నారు. అయితే వీరి కలయికను తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌ ఇళంగోవన్‌ అక్రమ సంబంధంతో పోల్చడం వివాదాస్పదంగా మారింది.
తమిళనాడులో ఆందోళనలు 
జయలలితపై ఇళంగోవన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అన్నాడిఎంకే కార్యకర్తలు గత రెండురోజులుగా తమిళనాట ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇళంగోవన్‌పై కేసులు నమోదు చేయడమే కాకుండా భౌతిక దాడులకు కూడా సిద్ధమయ్యారు. ఆగ్రహంతో ఇళంగోవన్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన బిజెపి
మరోవైపు బిజెపి కూడా కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది. దేశ ప్రధానిని, మహిళా ముఖ్యమంత్రిని కించపరచేలా ఎలా వ్యాఖ్యానిస్తారని నిలదీసింది. ఇళంగోవన్‌ను పార్టీ నుంచి తొలగించాలని సోనియా గాంధీకి బిజెపి లేఖ రాసింది.
జర్నలిస్టుపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి
తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఇళంగోవన్ సర్దిపుచ్చుకునేందుకు యత్నించారు. మీడియా సమావేశంలో ఓ టీవీ రిపోర్టర్‌కు ఇళంగోవన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. జర్నలిస్టుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి యత్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. అన్నాడిఎంకే ఇళంగోవన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తుండగా...కాంగ్రెస్‌ తమ నేతను సమర్థించే పనిలో పడింది.

 

07:24 - August 20, 2015

హైదరాబాద్: బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మోడీ ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఏపీ సర్కారు కంగుతిన్నది. మరో వైపు ఏపీ సర్కారు విభజన సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై ఇప్పటికే ఏపీలో నిరసనలు మొదలయ్యాయి. ఇదే అంశంపై కేంద్రంతో చర్చించాలనుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.
ప్రత్యేక పాకేజీతో పాటు ప్రత్యేక హోదా
ఇదిలా ఉంటే ప్రత్యేక పాకేజీతో పాటు ప్రత్యేక హోదా సైతం కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామంటూ ఆర్థిక మంత్రి యనమల స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ దొంగహామీ చేసి కేవలం ప్యాకేజీ మాత్రమే విభజన చట్టంలో పెట్టారని యనమల గుర్తుచేశారు.
రెవెన్యూలోటు 14 వేల కోట్లు
మరోవైపు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏటా 25 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరగా దానిపై ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఎలాంట స్పందన లేదు. ఒక వైపు రెవెన్యూ లోటు 14 వేల కోట్లుగా కాగ్ ఖరారు చేసినప్పటికీ దానిని కేంద్రం భర్తీ చేస్తుందా లేదా అనే స్పష్టత కూడా కరువయ్యింది.
మోడీతో చంద్రబాబు భేటీ తర్వాతే నిధులపై స్పష్టత
ఏపీ పరిస్థితిని వివరిస్తూ ప్రత్యేక నిధులతో పాటు సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు సమకూర్చాలని కేంద్రానికి గతంలో ఒక నివేదిక సమర్పించారు. వీటన్నింటిపై ప్రధాని మోడీతో భేటీ అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

07:11 - August 20, 2015

హైదరాబాద్: వారు నిలువనీడ కోల్పోయే వాళ్లు.. వాళ్లకు నివాసాలెందుకు..? వారు మునిగిపోయేవాళ్లు.. వాళ్లకు విద్యా ఫలాలెందుకు..? జలసమాధి అయ్యేవారికి ఆస్పత్రులతో పనేంటి..? సర్వం కోల్పోయేవాళ్లకు సౌకర్యాలతో అవసరమేంటి..? ఇదీ.. విలీన మండలాల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. పోలవరం ప్రాజెక్టు ఆ గ్రామాలను ఇంకా ముంచెత్తనేలేదు.. ప్రభుత్వం మాత్రం వారి బతుకులను నిర్ధాక్షిణ్యంగా ముంచేస్తోంది..!
270 గ్రామాల పడావు...
ఎక్కడైనా ఒక ఇల్లు పడావు పడుతుంది.. ఇక బంగ్లా పడావుపడుతుంది. అదికూడా అందులో ఎవరూ నివాసం లేకుంటేనే... కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక ఇల్లు కాదు, ఒక ఊరు కాదు, ఏకంగా 6 మండలాలు, సుమారు 270 గ్రామాలు పడావుపడిపోయాయి. ఇక్కడ మాత్రం ఎవరూ నివాసం లేకకాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక. పాలకులకు మానవత్వం లేక. సర్కారు నిర్వాకం ఫలితంగా ఇక్కడ నివసిస్తున్న లక్షకుపైగా గిరిజనం బతుకులు కళ్లముందే శిథిలమైపోతున్నాయి.
కనీస సౌకర్యాలు కరువు
కేంద్రాన్ని ఒప్పించి మరీ సాధించుకున్నారు..! పక్కరాష్ట్రంతో పోరాడి మరీ కలిపేసుకున్నారు..! అయితే.. ఏరికోరి తెచ్చుకున్న ఆ ఆరు మండలాలను పెంచడానికి కాదు, ముంచడానికే అన్నట్టు వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో ఏనాడో అభివృద్ధిని నిలిపేసిన పాలకులు.. ఇప్పుడు అడవి బిడ్డలకు కనీస సౌకర్యాలు కూడా అందకుండా చేస్తున్నారు.
అత్యధిక మలేరియా కేసులు
దేశంలోనే అత్యధిక మలేరియా కేసులు విలీనమండలాల్లోని తులసిపాక, ఏడుగుర్రాళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదవుతున్నాయి. దీంతో.. వీటిని అధికారులు రెడ్ మార్క్ తో గుర్తించారు. ప్రతిఏడాదీ 150కి తగ్గకుండా మలేరియా కేసులు నమోదవుతున్న ఈ ప్రాంతాల్లో.. ఈ సారి ఇప్పటికే 9 శాతం కేసులు అదనంగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. కనీసం మందుబిళ్లలు కూడా సరఫరా చేయట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదువు అవకాశాలు మృగ్యం
ఇక ఇక్కడి గిరిజనులకు అందుతున్న చదువు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిది. ఆరు విలీన మండలాల్లో.. ప్రధానంగా చింతూరు, వీ.ఆర్‌.పురం, కూనవరం, నెల్లిపాక మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ అన్ని రకాల విద్యాసంస్థల్లో కలిపి సుమారు పాతిక వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ.. ఏ ఒక్క పాఠశాలలోనూ సరిగా ఉపాధ్యాయులు లేరు. ఈ ప్రాంతాలు ఏపీలో విలీనం కావడంతో.. 85 శాతం మంది ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. ఈ మండలాల్లో చదువు అవకాశాలు మరింత మృగ్యమయ్యాయి.
మౌళిక సదుపాయాల్లేవు..
ఇక పాఠశాలల్లో సురక్షిత మంచినీరు, మరుగుదొడ్లు మచ్చుకు కూడా కనిపించవు. మునిగిపోయే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించలేమంటూ ప్రభుత్వం తెగేసి చెప్పడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇక జూనియర్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ స్కాలర్‌ షిప్స్‌ సమకూర్చాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకూ కనీసం ఒక్క స్కాలర్ షిప్ దరఖాస్తు ప్రక్రియకూడా పూర్తికాలేదంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
విలీన మండలాల్లో మధు పర్యటన
విలీన మండలాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సాగించిన పర్యటనలో ఎన్నో నిజాలు వెలుగు చూశాయి.స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మధు దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనుల ఆవేదనకు స్పందించిన మధు.. మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న విలీన మండలాల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెతచ్చరించారు.

 

 

నేడు గుంటూరు జిల్లాలో డీజీపీ పర్యటన

గుంటూరు: నేడు జిల్లాలో డీజీపీ రాముడు పర్యటించనున్నారు. గుంటూరులో నూతనంగా నిర్మించిన సీసీఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 

నేడు రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద యార్లగడ్డ నిరసన దీక్ష

తూర్పుగోదావరి: నేడు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss