Activities calendar

21 August 2015

21:26 - August 21, 2015

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా..విభజన పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కొన్ని విభాగాల్లో వివాదాలు తారాస్థాయికి చేరి ఉద్యోగుల మధ్య చిచ్చును రేపుతున్నాయి. తాజాగా ఏపీపీఎస్సీ..టీఎస్ పీఎస్సీ ఉద్యోగుల మధ్య రచ్చ..పోలీసు ఠాణా దాకా చేరింది.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మధ్య మరో వివాదం.....

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. టీఎస్ పీఎస్సీ కార్యాలయంలోకి..ఏపీపీఎస్సీ ఉద్యోగులు దౌర్జన్యంగా వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం టీఎస్ పీఎస్సీ కార్యాలయంలోకి ఏపీపీఎస్సీ ఉద్యోగులు వెళ్లి ముఖ్యమైన పత్రాలను తీసుకెళ్లారంటూ..టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగులకు వ్యతిరేకంగా కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగులు తమ కార్యాలయాన్ని వెంటనే ఇక్కడనుంచి తరలించాలని తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కార్యాలయంలో వాతావరణం వేడెక్కింది.

అనుమతి లేకుండా ఎలా వస్తారు..టీ ఉద్యోగులు......

వచ్చే నెలలో ఏఈఈ ఉద్యోగ భర్తీకి సంబంధించిన రహస్య ఫైళ్లను ఏపీ ఉద్యోగులు తీసుకెళ్లారంటూ టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా కాన్ఫిడెన్షియల్ ఛాంబర్ లోకి ఎలా వెళ్తారని టీఎస్ పీఎస్సీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం జరిగిన ఘటనపై టీఎస్‌పీఎస్‌సి సెక్రటరీ పార్వతీ సుబ్రమణ్యం బేగంబజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

టీఎస్ పీఎస్సీ ఆఫీసులోకి వెళ్లలేదంటోన్న ఏపీ ఉద్యోగులు...

మరోవైపు ఏపీ ఉద్యోగులు తాము టీఎస్ పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లలేదని చెప్తున్నారు. అలా వెళ్లాల్సిన అవసరం తమకు లేదని..టీఎస్ పీఎస్సీ ఉద్యోగులే తమను బలవంతంగా ఇక్కడనుంచి పంపించేందుకు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విచారణలో నిజాలు బయటికి వస్తాయని అంటున్నారు.  

తెలుగు టైటాన్స్ ఓటమి

హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ సెమీస్ లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలయ్యింది. బెంగుళూరు బుల్స్ చేతిలో 39-38 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ పరాజయం పొందింది.

ఏపీలో పలువురు అధికారుల బదిలీలు

విజయవాడ : శ్రీకాకళం డీఎఫ్ఓగా శాంతి స్వరూప్, కాకినాడ డీఎఫ్ ఓగా ఎన్.శ్రీనివాసరావు, చిత్తూరు డీఎఫ్ ఓగా కె.వెంకటస్వామి, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ క్యూరేటర్ గా వై.శ్రీనివాసరెడ్డి, విశాఖ జూపార్క్ క్యూరేటర్ గా జి. విజయ్ కుమార్, విశాఖ సామాజిక అటవీ అధికారిగా సి.హెచ్. సూర్యనారాయణ, కర్నూలు సామాజిక అటవీ అధికారిగా ఆర్.యశోదాబాయి, సీఆర్డీఏ లో పార్కుల డైరెక్టర్ గా శ్రీనివాసులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

'విమ్స్ డైరెక్టర్ ను వెంటనే అరెస్టు చేయాలి'

విశాఖ : విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది నిరుద్యోగలు నుంచి డైరెక్టర్ డబ్బులు వసూలు చేశారని 4వ పట్టణ పీఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. డైరెక్టర్ ను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష

ఆదిలాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరివ్వాలని నిర్ణయించారు. వచ్చే జూన్ లోగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.

భారత్ -పాక్ భద్రతాదారుల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ : త్వరలో జరగనున్న భారత్ -పాక్ జాతీయ భద్రతాదారుల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో చర్చించాలన్న పాక్ ప్రతిపాదనను నిరసిస్తూ చర్చలను రద్దు చేసుకునే ఆలోచనలో భారత్ ఉన్నట్లు సమాచారం. పాక్ కొత్త షరతులు ఆమోదయోగ్యం కావని భారత్ స్పష్ట చేసినట్లు తెలుస్తోంది.

15 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు : మంత్రి ఉమా

హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో 86 టీఎంసీల నీటి కొరత కారణంగా కృష్ణా డెల్టాకు నీరివ్వలేకపోయామని నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. వర్షాల ద్వారా వచ్చే నీటిని పోలవరం కుడి కాలువలోకి మళ్లించి రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఉమ తెలపారు. 15 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తామని  దేవినేని ఉమ అన్నారు.

అసోంలో భారీ వరదలు:ముగ్గురి మృతి

హైదరాబాద్ : అసోంలో వరదలు ముచెత్తుతున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా 1000 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జగన్ అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌ : వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ట్రయల్స్‌ త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తూ శుక్రవారం కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లపై ట్రయల్స్‌ వెంటనే ప్రారంభించాలని.. ఇటీవల హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిందని,... ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు... వాళ్లకు సంబంధించిన కేసులు ఉంటే వాటిపై ట్రయల్స్‌ వెంటనే ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సీబీఐ పేర్కొంటూ ఆ ఆదేశాల ప్రతిని మెమోతో పాటు జత చేసి సీబీఐ కోర్టుకు అందజేశారు.

ములాయం సింగ్ కు సమన్లు...

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ కు సమన్లు జారీ అయ్యాయి. అత్యాచారంపై ములాయం చేసిన వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి.

19:25 - August 21, 2015

హైదరాబాద్ : ఒకవైపు రైతుల ఆగ్రహం.. మరోవైపు ప్రతిపక్షాల ఆందోళనలు.. ఇంకోవైపు జనసేనాని హెచ్చరికలు..వీటికితోడు భూసేకరణతో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అన్నీ చుట్టుమట్టడంతో చంద్రబాబు సర్కార్‌ పునరాలోచనలో పడింది. భూసేకరణకు వెళ్లి చిక్కులు తెచ్చుకోవడం కంటే.. భూసమీకరణ కొనసాగించడమే బెటరని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తుళ్లూరు ప్రాంతంలోని కొన్ని ఎకరాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌తోనే ఆగిపోవాలనుకుంటోంది. భూసమీకరణకు ముందుకు రాని రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

19:07 - August 21, 2015

చిత్తూరు : తిరుపతిలోని టీటీడీకి చెందిన ఎస్వీ సంగీత కళాశాల తెలుగు లెక్చరర్‌.. విద్యార్థినులపై చేయి చేసుకుంది. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘం నేతలపై విరుచుకుపడింది. దీంతో అక్కడున్నవారంతా లెక్చరర్‌ తీరుకు అవాక్కయ్యారు. సంగీత కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భాగ్యరేఖ పనితీరుపై మొదటినుంచి ఫిర్యాదులున్నాయి. నిత్యం విద్యార్థినుల చేత పనులు చేయిస్తూ... తిడుతుండేదని విద్యార్థినులు చెబుతున్నారు. ఆమె తీరుకు నిరసనగా ఆందోళనకు దిగడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన భాగ్యరేఖ విద్యార్థినులపై కూడా చేయి చేసుకుంది. 

19:05 - August 21, 2015

హైదరాబాద్ : రైతుల ఆందోళనలు కళ్లకు కనిపించలేదు..! అన్నదాతల ఆవేదనతో మనసు కరగలేదు..! విపక్షాల సూచనలు చెవికెక్కలేదు..! బలవంతంగా భూ సేకరణ చేస్తామంటూ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌.. అన్నంతపనీ చేసింది. తొలివిడతగా పది గ్రామాల్లో భూములు సేకరించబోతున్నట్లు.. నోటిఫికేషన్‌ జారీచేసింది.

మరో వైపు మిత్రపక్షాలు, విపక్షాలు నిరసనలు.....

ఓ వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. మరో వైపు మిత్రపక్షాలు, విపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నాయి.. అయినా, ఇవేవీ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. భూ సేకరణ నోటిఫికేషన్‌ను జారీచేసింది. మొత్తం 29 గ్రామాల పరిధిలో 3 వేల 892 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా వశం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. మొదట విడతగా 10 గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

భూసేకరణ చట్టం ప్రయోగం...

తుళ్లూరు మండల కేంద్రంతోపాటు, అనంతవరం, బోయపాలెం, పిచ్చుకలపాలెం, అబ్బురాజుపాలెం, నేలపాడు, శాకమూరు, దొండపాడు, ఐనవోలు గ్రామాలపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించబోతున్నట్టు కలెక్టర్‌ కాంతిలాల్ ఉత్తర్వులిచ్చారు. ఈ చర్యపై అఖిలపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిన అన్నదాతలు.. రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేప్టటారు. ప్రభుత్వ తీరును నిరసించిన రైతులు.. రాజధానికి ఎన్ని వేల ఎకరాలు కావాలంటూ నిలదీశారు.

కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే....

రైతుల భూములు తీసుకుని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బలవంతంగా భూములు సేకరిస్తే సహించేది లేదని హెచ్చరించాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం మరోలా వాదిస్తోంది. 33 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఇంకా భూమి అవసరం ఉందని చెబుతోంది. దాన్ని సేకరించేందుకు భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడం తప్ప మరో మార్గం లేదని చెబుతోంది.

ప్రభుత్వం నిర్ణయంపై భగ్గుమన్న విపక్షాలు...

శుక్రవారం పది గ్రామాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం.. శనివారం మరో 19 గ్రామాల్లో భూములు సేకరించేందుకు ఉత్తర్వులు జారీచేయబోతోంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. బలవంతంగా భూములు సేకరించడం సరికాదంటున్న రైతులు.. ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

19:02 - August 21, 2015

కథలోకి వెళ్తే 2009 లో వచ్చిన కిక్ సినిమాకి సీక్వల్ గానే ఈ కిక్ 2 కూడా మొదలౌతుంది. కిక్ పార్ట్ 1 లో చివరాకరన పోలీస్ ఆఫీసర్ అయిపోయిన కిక్ తర్వాత ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు. అక్కడే రాబిన్ హుడ్ అనే కొడుకుని కుడా కంటారు.కానీ తండ్రిలాగే రాబిన్ కి కుడా కొంచం తలతిక్క. తండ్రి కిక్ కోసం పాకులాడితే కొడుకు కంఫర్ట్ అనే పిచ్చి తో ఇతరులకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు.ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న తన ఆస్తిని ఎవరో కబ్జా చేసారు అని తెలుసుకుని ఆస్తిని తిరిగి దక్కించుకోవాలని ఇండియా వస్తాడు. అక్కడే తనకు చైత్ర అనే అమ్మాయి పరిచయం అయ్యి తనను ప్రేమలో దింపడానికి ప్రయత్నిస్తుంది. తీరా రాబిన్ కుడా ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టే సమయానికి... కావాలని చైత్ర కిడ్నాప్ అయినట్లు నటించి బీహార్ లో ఉన్న తన గ్రామానికి వెళ్ళిపోతుంది. ఈ హటాత్ పరిణామానికి నివ్వెరపోయిన రాబిన్ తనను వెతుక్కుంటూ బీహార్ కి వెళ్తాడు.అసలు చైత్ర ఎందుకు అలా నటించింది, బిహార్ వెళ్ళిన రాబిన్ కి తెలిసిన అసలు నిజం ఏంటి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

ఒక సినిమా హిట్ కావాలన్నా, బాగుంది అని పేరు రావాలన్న, మంచి సినిమా అని ప్రేక్షకులు మేచ్చుకోవలన్నా..ఆ సినిమా ప్రేక్షకుడి హృదయానికి కనెక్ట్ అవ్వాలి. ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలంటే సన్నివేశాల్లో జీవం ఉండాలి. సన్నివేశాల్లో జీవం ఉండాలంటే కథలో దమ్ము ఉండాలి. దమ్ము ఉండాలంటే ఆ కథ సహజత్వానికి దగ్గర గా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. ఎంత పెద్ద దర్శకుడు అయినా బోలెడు ఖర్చు పెట్టినా ఆయాసం అవమానం తప్ప దమ్మిడీ ఆదాయం కుడా ఉండదు. ఇదే సూత్రం ఇప్పుడు కిక్ 2 చిత్రానికి కూడా వర్తిస్తుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. బహుశా రవితేజాకి గాని దర్శకుడు సురేందర్ రెడ్డికి గాని ఇలాంటి ఫ్లాప్ ఇంతవరకు రాలేదనే చెప్పాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఇదేం సినిమారోయ్ బాబోయ్ అని ఒకడంటే ఈ సురేందర్ రెడ్డికి ఏమైందిరా నాయనా అని మరోకడనడం ఇక్కడ విశేషం. ప్రేక్షకులు ఇలా ఫీలవడానికి కారణం ఈ సినిమాలో సీరియస్ విషయాలను చాలా కామెడీగా... సిల్లీ విషయాలను చాలా సీరియస్ గా చెప్పడమే. అసలు కంటిన్యుటి చూసుకోకుండా ఒక పాత్ర దారితో రెండు మూడు క్యారెక్టర్లు వేయించిన ఘనత దర్శకుడు సురేందర్ రెడ్డికే దక్కుతుంది. అంతే కాకుండా చిన్న బడ్డీ కొట్టు కూడా లేకుండా నాలుగు ఇళ్ళు కూడా లేని ఓ కుగ్రామంలో కె.ఎఫ్.సి చికెన్లు, విదేశీ బ్రాండ్ వస్తువులు లభించేలా దర్శకుడు తీసిన సన్నివేశాలు నభూతో న భవిష్యత్తు. అసలు సినిమాలో హీరోతో సహా ఏ పాత్రనీ సరిగ్గా డిజైన్ చేయలేదు. ఏ సన్నివేశంలో జీవం లేదు. ఒట్టి నస, తలకాయనొప్పి తప్ప.. కథ, కథనం, పాత్రలకు గమ్యం, ఇవేమీ లేని ఈ సినిమాని కాస్త ఆసక్తిగా మొదలెట్టినా ఆ తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందీ అని ప్రేక్షకుడు ఎదురు చూడడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలానే రవితేజ ఎనర్జిటిక్ చేసినా తన రూపంతో కాస్త భయపెట్టాడనే చెప్పచ్చు. బక్క చిక్కిపోయి మొహం పీక్కుపోయి ఏ మాత్రం కళ లేని రవితేజ ఆహార్యం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన అందంతో అలానే తన నటనతో మరొక్కసారి మెప్పించింది. సినిమాలో ఏదన్న కాస్త రిలీఫ్ అంటే అది రకుల్ మాత్రమే. ఇక బ్రహ్మానందం రవితేజ కామెడి కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు తప్ప మిగిలినదంతా రొటీన్. ఇక టెక్నికల్ అంశాల్లోకి వస్తే ఎస్.ఎస్.తమన్ సంగీతం యాజిటీస్. కొత్తగా ఏమిలేదు. అలాగే కథతో పాటు వక్కంతం వంశి అందించిన మాటలు పేలకపోగా తుస్సుమన్నాయి. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాల బాగుంది. అలాగే కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలు మాత్రం అధ్బుతం. ఏమాత్రం ఖర్చుకి వెనుకాడకుండా చాల క్వాలిటీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ పేలవమైన కథా కథనాలతో క్వాలిటీ అంతా గంగలో కలిసిపోయింది. పాపం కళ్యాణ్ రామ్.

మైనస్ పాయింట్స్ : దర్శకత్వం, కథ, కథనం, మాటలు, రవితేజ ఆహార్యం

ప్లస్ పాయింట్స్ : రకుల్ ప్రీత్ సింగ్, సినిమాటో గ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్

టెన్ టివి రేటింగ్ : 1/5

18:58 - August 21, 2015

హైదరాబాద్ : రాజధాని రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకే.. టీడీపీ భూసేకరణ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు చెప్పారు. టీడీపీ నిరంకుశత్వంగా వ్యవరిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని రాజకీయ పక్షాలతో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అభివృద్ధికి సీపీఎం ఎప్పటికీ వ్యతిరేకం కాదని మధు స్పష్టం చేశారు.

18:56 - August 21, 2015

విజయవాడ : ఒకరిద్దరు అడ్డుపడినా రాజధాని నిర్మాణం ఆగే ప్రశ్నే లేదన్నారు మంత్రి రావెల కిశోర్‌బాబు. 5కోట్ల మంది ప్రజల అభివృద్ధి ముఖ్యమా..ఐదుగురి అభివృద్ధి ముఖ్యమా అనేది ఆందోళణ చేసేవాళ్లే నిర్ణయించుకోవాలని రావెల సూచించారు. ఏపీ అభివృద్ధి అనే రైలు బండి ఎంతమంది అడ్డొచ్చినా...వారిని పక్కకు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తుందన్నారు. 

18:55 - August 21, 2015

హైదరాబాద్ : సినీహీరో పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రజలకు న్యాయం చేయాలని అడుగుతున్నారని.. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే.. రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు.

టీ-హబ్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేటీఆర్

హైదరాబాద్ : వచ్చే 7న టీ -హబ్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీ-హబ్ పై గవర్నర్ ఆసక్తి కనబరిచారని, టీ-హబ్ భాగస్వాములతో చర్చిస్తామని గవర్నర్ అన్నట్లు కేటీఆర్ తెలిపారు.

మల్లాపూర్ లో ఎస్ వోటీ పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : మల్లాపూర్ లో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వీరి తనిఖీల్లో 400 ఎల్రక్టిక్ డిటోనేటర్లు, 550 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

ఐఓసీ ఎసరు పెట్టిన కేంద్రం....

ఢిల్లీ : ఐఓసీకి కేంద్ర ఎసరు పెట్టింది. ఐఓసీ 10శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం చేసింది. అమ్మకానికి సోమవారం ముహూర్తం పెట్టింది.

ఎర్రవెల్లిలో అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు : కేసీఆర్

మెదక్ : ఎర్రవెల్లిలో అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామసభ లో పాల్గొన్న ఆయన గ్రామంలో వారంలోగా ఐ క్యాంప్ పెడతామని స్పష్టం చేశారు.

ఏపీలో ఉద్యోగులందరికి ట్యాబ్ లు : మంత్రి పల్లె

హైదరాబాద్ : ఏపీలోని సమాచారశాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రి పల్లె.రఘునాథరెడ్డి ల్యాప్‌టాప్‌లు‌, ట్యాబ్‌లు అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పించడం కోసమే పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని  పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. పాలనలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పల్లె. రఘునాథరెడ్డి వివరించారు.

ఉద్యోగాల్లో అవకతవకలపై హైకోర్టును ఆశ్రయించిన అధికారులు...

హైదరాబాద్ : ఉద్యోగాల్లో అవకతవకలపై డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు సహా 25 మంది అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు శాఖ సహా తెలుగు రాష్ట్రాల్ ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ చే దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది.

బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసు

హైదరాబాద్ : ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును జస్టిస్ లోధా కమిటీ సస్పెండ్ చేయడంపై బీసీసీఐకి మద్రాస్ హైకోర్ట్ నోటీసు జారీ చేసింది. త్వరలో సమాధానాన్ని తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ విచారణలో భాగమయ్యేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ ను కూడా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఐపీఎల్ నుంచి తమ జట్టును సస్పెండ్ చేస్తూ గత నెలలో లోథా కమిటీ ఇచ్చిన ఆదేశంపై స్టే ఇవ్వాలంటూ చెన్నై జట్టు యజమాని పిటిషన్ లో కోరారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివజ్ఞానంల ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపింది.  

17:45 - August 21, 2015

నెల్లూరు: చంద్రపడియ గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులో ఆందోళనకు దిగారు. న్యూట్రా స్పెషాలిటీ ఫార్మా కంపెనీ వల్ల.. తమ తీవ్ర ఆరోగ్యం పాడవుతుందని నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పొల్యూషన్‌తో ప్రాణాలు పోతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని.. ప్రశ్నించినందుకు చంద్రపడియ గ్రామస్తులకు... రేషన్‌ను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీపై దాడిచేస్తే.. గ్రామంలోని ప్రజలను చితకబాదారని వాపోయారు. వెంటనే కలెక్టర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

17:43 - August 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీఎస్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సి అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించేలా తన వంతు కృషి చేస్తానని డీఎస్‌ అన్నారు. 

17:40 - August 21, 2015

హైదరాబాద్ : కాశ్మీర్‌ లోయలో ఐఎస్‌ఐఎస్‌, పాక్‌ జెండాలు మళ్లీ దర్శనమిచ్చాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ముసుగేసుకున్న యువకులు ఈ జెండాలను ప్రదర్శించారు. నోహతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం భారత్‌- పాక్‌ చర్చల నేపథ్యంలో కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

17:39 - August 21, 2015

హైదరాబాద్ : బీహార్‌లో బిజెపికి ఒకసారి అవకాశమివ్వాలన్న అమిత్‌షా వ్యాఖ్యలపై ఆర్జేడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. దేశంలో బిజెపికి అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు. ప్రధాని బ్లాక్ మనీని ఇంతవరకు తెప్పించలేక పోయారని గుర్తు చేశారు. పైగా బీహార్‌ను అవమానించిన వారికి అవకాశం ఎలా ఇస్తారని లాలూ ప్రశ్నించారు. అభివృద్ధిపై బిజెపికి ఎలాంటి శ్రద్ధ లేదని తన అభివృద్ధి కోసమే అమిత్‌ షా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 

17:37 - August 21, 2015

ఢిల్లీ : ఆగస్టు 15న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద... మాజీ సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై... బదిలీ వేటు పడింది. సుమారు 35 మంది పోలీసులన్ని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌పర్ చేశారు. వన్‌ ర్యాంక్ వన్‌ పెన్షన్‌ కోసం... మాజీ సైనికులు రిలే దీక్ష చేస్తుండగా... పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య మాటామాటా పెరిగి, తోపులాట జరిగింది. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ముసలివాళ్లని కూడా చూడకుంగా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మాజీ సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:35 - August 21, 2015

హైదరాబాద్ : తనకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తిరస్కరించారు. ఏడెనిమిది సార్లు తనను చంపేస్తామని ఆగంతకుల నుంచి బెదిరింపులు వచ్చాయని, అయితే తాను ఈ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు దేశానికి, సమాజానికి సేవ చేస్తూనే ఉంటానని హజారే తెలిపారు. దేశ సేవలో తన ప్రాణం పోతే అంతకన్నా అదృష్టం ఇంకేమి లేదన్నారు. ఇపుడున్న సెక్యూరిటినే తొలగించాలని తాను ప్రభుత్వానికి నాలుగుసార్లు ఉత్తరం రాశానని అన్నా పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది తన ప్రాణాలను కాపాడలేవని, ఇందిర, రాజీవ్‌ ప్రాణాలను కాపాడగలిగాయా అంటూ ప్రశ్నించారు. 

17:33 - August 21, 2015

హైదరాబాద్ : అప్పుడు తప్పు చేశారు. అడుగడుగునా మారణహోమం సృష్టించారు. తీరా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. క్షమించండి కామ్రేడ్స్ అంటూ... తల దించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మార్క్సిస్టులు... చెప్పిందే నిజమైంది. మమతా-మావోయిస్టుల దోస్తీపై అనుమానాలు పటాపంచలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా... వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

మమతకు మద్దతు పెద్ద తప్పే...

చంపేసి పొరపాటు చేశాం... మమతకు మద్దతు పెద్ద తప్పే... సీపీఎం కార్యకర్తల్ని పొట్టనపెట్టుకోవడం అన్యాయమే... ఇదీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆత్మపరిశీలన. పశ్చిమబెంగాల్‌లో మార్క్సిస్టు కార్యకర్తలపై జరిపిన మారణహోమంపై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. లాల్‌గఢ్‌లో ఉద్యమ సమయంలో అనేక పొరపాట్లు చేశామని మావోయిస్టులు అంగీకరించారు. పార్టీ తూర్పు విభాగ కేంద్ర కమిటీ రూపొందించిన ఆరు పేజీల సమీక్షా నివేదికలో ఈ మేరకు తెలిపారు. తృణమూల్ మాయమాటలు నమ్మి... నిర్దాక్షిణ్యంగా సీపీఎం నేతలను చంపేశామని, వాళ్ల మృతదేహాలను పాతిపెట్టామని మావోయిస్టులు అంగీకరించారు.

టీఎంసీ ప్రభుత్వం వస్తే తమకు లాభం చేకూరుతుందని...

బెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని పాలన పోయి... టీఎంసీ ప్రభుత్వం వస్తే తమకు లాభం చేకూరుతుందని భావించాం. జంగల్‌మహల్‌లో సంయుక్త భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటుదని... జైళ్ల నుంచి రాజకీయ ఖైదీలను విడుదల చేస్తుందని గుడ్డిగా నమ్మామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. చివరకు 2011లో కిషన్‌జీని కోల్పోయామని తెలిపింది.

కిషన్‌జీని చంపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని...

కిషన్‌జీని చంపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని... తృణమూల్‌ ప్రభుత్వం భావించిందని, పైగా అభివృద్ధి హామీలను విస్మరించిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సలీం విమర్శించారు. నాటి రహస్యాలను మావోయిస్టులు... నేడు వెల్లడిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మావోయిస్టులకు మమతా బెనర్జీ నిజస్వరూపం బయటపడిందన్నారు వామపక్ష నేతలు.

మావోయిస్టు పార్టీపై టీఎంసీ నేతలు నిప్పులు.....

అటు మావోయిస్టు పార్టీపై టీఎంసీ నేతలు నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో... ప్రజా మద్దతు కోల్పోయిన మావోయిస్టులు... తప్పుడు ప్రచారం చేస్తున్నారని తృణమూల్‌ ఎంపీ సుబేందు అన్నారు.

పట్టు కోసం మావోయిస్టులు మళ్లీ ప్రయత్నం.....

జంగల్‌ మహల్‌ ప్రాంతంలో... పట్టు కోసం మావోయిస్టులు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అక్కడ అమరుల దినోత్సవాన్ని కూడా నిర్వహించినట్లు వార్తలొచ్చాయి. దీంతో బెంగాల్‌లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. 

17:29 - August 21, 2015

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. నరేంద్రమోదీ నిజంగా ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని అనుకుంటే.. నిమిషాల మీద వచ్చేస్తుందని తెలిపారు. వెంకయ్య నాయుడు ఇక్కడకు వచ్చి కోతలు కోస్తున్నాడు తప్ప ప్రధాని దగ్గర ఆయన పప్పులు ఉడకవని తేల్చేశారు.

17:25 - August 21, 2015

ఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు జరగకుండా చేసింది బీజేపీయేనని.. ఆ నిందను ప్రతిపక్షాలు, వాపక్షాలపై మోపడం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవుల అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సమావేశాల్లో దేశంలోని పలు అంశాలపై కమ్యూనిస్టు నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, మోడీ వ్యతిరేక విధానాలు, బీహార్‌ ఎన్నికలు, వ్యవసాయ-కార్మిక రంగాల్లో కేంద్రం అవలంబిస్తున్న తీరుపై చర్చిస్తున్నట్టు.. రాఘవులు చెప్పారు.

17:19 - August 21, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాలోని పెంబర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. జనగాం మండలంలోని పెంబర్తి గ్రామంలో పర్యటించిన కడియం శ్రీహరి ఆ గ్రామంలో చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని, విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డీఎస్సీ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం కడియం అన్నారు. 

17:16 - August 21, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టొద్దంటూ.. కాంగ్రెస్‌ మహిళా విభాగం గర్జించింది. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. ఆ పార్టీ మహిళానేతలు నినాదాలు చేశారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన తమ నిరసన వ్యక్తం చేశారు. మద్యం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో.. మహిళలను బలిపశువులను చెయొద్దని వేడుకున్నారు. తెలంగాణలో మద్యాన్ని అరికట్టేందుకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.

17:14 - August 21, 2015

హైదరాబాద్ : ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించి వాహనాన్ని నిలపడమే కాకుండా పోలీసులతో వాగ్వివాదానికి దిగిన యువతిపై నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నగర ట్రాఫిక్‌ పోలీసులకు అందించిన బాడీ వార్న్‌ కెమెరాలో యువతి వ్యవహరించిన తీరు... వాగ్వివాదం మొత్తం రికార్డు అయ్యింది. ఐశ్వర్య అనే యువతి తెలుగు అకాడమీ సమీపంలో నో పార్కింగ్‌ ఏరియాలో వాహనాన్ని నిలిపింది. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆ వాహనాన్ని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు వచ్చిన ఐశ్వర్య ఎస్‌ఐపై దూకుడుగా వ్యవహరించింది. రికార్డు అయిన విజువల్స్‌ ఆధారంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మోడల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత

నల్గొండ : జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మోడల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్: తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైల్వే ఉద్యోగాల పేరుతో కొందరు అభ్యర్థుల నుంచి ఓ వ్యక్తి రూ.30 లక్షలకుపైగా వసూలు చేసి పరారయ్యాడు. దీని పై బాధితులు తుకారంగేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రెహమాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసుల అదుపులో లా విద్యార్థిని రేప్ కేసులో నిందితుడు...

విశాఖ : లా వర్సిటీ విద్యార్థిని రేప్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ విద్యాసాగర్ తెలిపారు. నిన్న లక్నోకు చెందిన నలుగురు విద్యార్థినులు తమ ఫ్రెండ్‌ రిషప్ సింగ్‌ను పార్టీకి పిలిచారు. రూమ్‌లో నలుగురు విద్యార్థినులు మద్యం తాగి నిద్రలోకి జారుకున్నారు. నలుగురిలోని ఒక విద్యార్థినిపై రిషఫ్ సింగ్ అత్యాచారం చేశాడు. అతడిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఆర్ డీఏ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : సీఆర్ డీఏ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని భూ సేకరణ పై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఉగ్రవాది నవేద్ కు సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు

జమ్మూ కశ్మీర్ : ఉధంపూర్ దాడి ఘటనలో ఉగ్రవాది నవేద్ కు సహకరించినందుకు ట్రక్కు డ్రైవర్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

తలసాని పిరికి పంద : షబ్బీర్ అలీ

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిరికిపంద అని మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. ఒక పార్టీపై గెలిచి ఇంకో పార్టీలో మంత్రిగా కొనసాగడం తలసానికే చెల్లిందని ఆయన ఎద్దేవాచేశారు. చట్టాలను ఉల్లంఘించిన తలసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తలసానికి దమ్ముంటే రాజనామా చేసి ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి భజన చెయ్యవని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాయని షబ్బీర్‌ అలీ తెలిపారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 27,366 వద్ద ముగియగా, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 8,300 వద్ద ముగిసింది.రెండేళ్ల కనిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ 29 పైసలు కోల్పోయింది. రూపాయి మారకం విలువ 65.83కు చేరింది.

టీఎస్ పీఎస్సీలో కీలక ఫైళ్లు మాయం

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీలో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. నకిలీ తాళంతో తెరిచి దొంగతనానికి పాల్పడినట్లు టీఎస్ పీఎస్సీ అధికారులు బేగం పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రా ఉద్యోగులే ఫైళ్లను ఎత్తుకు పోయారని టీఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది: పి.మధు

ఢిల్లీ: ఏపీలో టిడిపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను లాక్కుంటోందని మండి పడ్డారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోడం లేదని, నారాయణ కళాశాలలో ఆత్మహత్యలపై ఆందోలనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ తీరుపై అఖిలపోఆలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. వామపక్షాలు అభివృద్ధిని కాంక్షిస్తాయి తప్ప అడ్డుకోవన్నారు.

ఆరున్నరేళ్ల కనిష్టానికి ముడి చమురు!

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరల పతనం కొనసాగింది. చైనాలో ఉత్పత్తి రంగం గణాంకాలు దిగజారాయన్న విశ్లేషణలతో 1986 తరువాత అతిపెద్ద వారాంతపు పతనం దిశగా క్రూడాయిల్ ధరలు సాగాయి. దాదాపు 29 సంవత్సరాల తరువాత క్రూడాయిల్ ధరలు వరుసగా 8వ వారంలోనూ పతనమయ్యాయి. శుక్రవారం నాటి సెషన్లో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 59 సెంట్లు తగ్గి 40.73 డాలర్లకు (అక్టోబర్ లో డెలివరీ) చేరింది. ఇది ఆరున్నరేళ్ల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర వరుసగా ఏడవ వారంలోనూ పతనమవుతూ బ్యారల్ కు 46.06 డాలర్లకు చేరింది.

14:58 - August 21, 2015

గుంటూరు : రాజధాని నిర్మాణం కోసం విషయంలో... విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనను తప్పుపట్టారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, రైతులతో పాటు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. పాలన సక్రమంగా సాగాలంటే రాజధాని కట్టక తప్పదంటున్న 'టెన్ టివి' నారాయణ తెలిపారు.

14:56 - August 21, 2015

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతం గుంటురు జిల్లాలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని డిమాండ్ చేస్తూ.. మంగళగిరిలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. భూముల ధరలను తగ్గించేందుకు కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 

14:54 - August 21, 2015

హైదరాబాద్ : ఒకప్పుడు టీనేజ్ పిల్లలకే పరిమితమైన హాఫ్ సారీస్ ఇప్పుడు మధ్య వయస్సు వనితలకు కూడా ఫేవరేట్ గా మారింది. అలాంటి హాఫ్ సారీస్ లేటెస్ట్ కలెక్షన్ ను సొగసు దిల్ షుక్ నగర్ లో ఉన్న అర్హమ్ క్రియేషన్స్ మన ముందుకు తెచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:51 - August 21, 2015

హైదరాబాద్ : పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా తేడా లేకుండా ఒత్తిడి ఎదుర్కొంటున్నారనటంలో సందేహం లేదు. ఒక స్థాయి వరకు మంచి ఫలితాలను చూపించే ఒత్తిడి, ప్రమాదకర స్థాయిలోకి వెళ్తే మాత్రం డిప్రెషన్ కు దారితీయటం అటు నుంచి ఆత్మహత్యకు దారితీసే పరిస్థితికొస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి 'నిర్భయ' కార్యక్రమంలో ప్రముఖ సైక్రియాటిస్టు పూర్ణిమా నాగరాజు తెలిపారు. మరి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:48 - August 21, 2015

హైదరాబాద్: జాతీయ నేరాల నమోదు సంస్థ తాజా నివేదిక తెలుగు రాష్ట్రాలలో మహిళల భద్రతకు సవాల్ విసురుతోంది. అనేక విషయాలలో ముందున్నామని చెప్పుకునే మనం మహిళలను అగౌరవంగా చూసే విషయంలోనూ ముందే ఉన్నామని మరో సారి రుజువయ్యింది.

స్త్రీ, పురుష సమానత్వం కోసం...

ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల వివక్షను తొలగించి స్త్రీ, పురుష సమానత్వం కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రచార కర్తగా బాలివుడ్ నటుడిని ఎంపిక చేసింది.

సంస్థాగత ఉద్యోగులకు సమానంగా సౌకర్యాలు...

ఇంటి పని వారి కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలను అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. వారికి సంస్థాగత ఉద్యోగులకు సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు విధానాలలో మార్పులు తేనుంది.

మరో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసున్న సైనా నెహ్వాల్...

బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ మరో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరిన మొదటి ప్లేయర్ గా ప్రత్యేకత చాటింది.

పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

నల్గొండ : బీబీనగర్‌ మండలం వెంకిర్యాలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కన్న తల్లిదండ్రులే పొదల్లో వదిలేసి వెళ్లారు. శిశువును గుర్తించిన స్థానికి వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు.

సినీ డ్రిస్టిబ్యూటర్ కారును దొంగలించిన డ్రైవర్

హైదరాబాద్ : నగరంలో గుంటూరుకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్‌ వాసుదేవరావరావు కారు, రూ 20 లక్షలు చోరీకి గురయ్యాయి. డ్రైవర్ సాయి డబ్బు, కారుతో సహా ఉడాయించాడు. ఈమేరకు వాసుదేవరావరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వచ్చే నెలాఖరులోగా గుంటూరుకు వ్యవసాయ శాఖ : ప్రతిపాటి

గుంటూరు : వచ్చే నెలాఖరులోగా తన పరిధిలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలన్నిటినీ గుంటూరుకు తరలించనున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో కొద్దిసేపటి క్రితం ఆయన మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వచ్చే నెలాఖరు నుంచి తన శాఖ గుంటూరు నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.  

14:23 - August 21, 2015

          రుద్రమదేవి సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. మొదట ఈ సినిమా మార్చి 24 విడుదల అవుతుందన్నారు. ఆ తర్వాత జూన్ 26కు మార్చారు. ఇక ఈ సారి పక్కా అంటూ సెప్టెంబర్ 4వ తేదీని ప్రకటించేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ తేదీన సినిమా రిలీజ్ ఉంటుందని పోస్టర్లపై తేదీ కూడా వేశారు. ఇక ఈ తేదీ పక్కా రిలీజ్ అవుతుందని ప్రేక్షకుడు భావించాడు.  ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉంన్నట్లు సమాచారం. సెన్సార్ వ్యవహారాల్లో ఇబ్బందులుండటం, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావలసి ఉండటంతో సెప్టెంబర్ 18వ తేదీకి ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై దర్శకుడు గుణషేఖర్ కూడా సైలెంట్ గా ఉండటం కొసమెరుపు. ఎంతగానో ఎదురు చూస్తున్న 'రుద్రమదేవి' వాయిదా పడుతుందో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందో వేచి చూద్దాం. 

కారును ఢీ కొట్టి ఆయిల్ ట్యాంకర్ : ముగ్గురి మృతి

చిత్తూరు : బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

14:05 - August 21, 2015

            ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ఎప్పటికీ గుర్తుండిపోతోంది.షాజహాన్ తన ప్రేయసి ముంతాజ్ జ్ఞాపకార్థం ఆనాడు తాజ్ మహల్ నిర్మించాడు. నేడు ఓ ప్రేమికుడు మరో తాజ్ మహల్ కడుతున్నాడు. అతనేం షాజహాన్ లాగా మహారాజు కాదు.. ఉత్తరప్రదేశ్ కసేర్ కలాన్ అనే గ్రామంలో నివసించే 80 ఏళ్ల ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. అతనే ఫైజుల్ ఖాద్రి. ఇతను తన యవ్వనంలో ముల్లి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 60 ఏళ్ల తర్వాత ఆమె గొంతు క్యాన్సర్ తో మరణించింది. తమ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ను నిర్మించాలని సంకల్పించాడు. 

            అయితే ఇతను తాజ్ మహల్ నిర్మించడానికి చాలా కష్టాలు పడ్డాడు. తన భార్య నగలను, తనకున్న భూమిని కూడా అమ్మేశాడు. 11 లక్షల రూపాలయతో కొంత నిర్మాణాన్ని చేశాడు. అయితే తాజ్ మహల్ కట్టడానికి అతని ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయం ఆనోటా.. ఈ నోటా బయటికి పొక్కింది. ఇకేముందు మనసున్న మహరాజులు ముందుకు వచ్చారు. తాజ్ మహల్ నిర్మించేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఇతనికి ఆర్థిక సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. మరికొద్ది రోజులో తన ప్రేయసి పేరుతో 'మినీ తాజ్ మహల్' పూర్తికాబోతున్నందుకు ఈ 80ఏళ్ల నవ యువకుడు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. 

అన్నాహజారే కు 'జడ్' కేటగిరి భద్రత

ముంబై : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేకు పది రోజుల వ్యవధిలో రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. తాజాగా ఇవాళ హజారేకు బెదిరింపు లేఖ వచ్చింది. అన్నాను చంపేస్తామని పేర్కొన్నారు. లాతూర్ జిల్లా నుంచి వన్ మహాడియే పంచాల్ పేరుతో బెదిరింపు లేఖ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్నాకు ‘జడ్’ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఆగస్టు 7న వచ్చిన లేఖలో నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే అన్నాకు పడుతుందని హెచ్చరించిన విషయం విదితమే.

14:01 - August 21, 2015

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాట్లాడడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ కేంద్రకమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఇప్పుడు మౌనం వహిస్తుందన్నారు. ఈ హామీని ఎన్నికల స్టంట్ గా ఉపయోగించుకుందని విమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా కోసం ఎవరు ఆందోళనలు చేసినా మద్దతు ఇస్తామని చెప్పారు. ఎపికి ప్రత్యేహోదా కోసం వైసిపి చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

 

కార్మిక శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : కార్మికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా అమలులో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో బీమా పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. కార్మికులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పెంపొందించాలని సీఎం సూచించారు. డ్రైవర్ల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు వివరాలు సేకరించాలన్నారు. కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

13:54 - August 21, 2015

విజయవాడ: ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో ఆందోళనలు ఉధృతమైయ్యాయి. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టాయి. సిపిఎం ఆద్వర్యంలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు, రైతులు కూరగాయలతో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

13:51 - August 21, 2015

మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిని బంగారు వల్లిగా మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలో పర్యటించిన కేసీఆర్.. గ్రామం మొత్తం కలియదిరిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రమదానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాకతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ప్రకటించారు. గ్రామజ్యోతి పథకం కింద నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

 

13:48 - August 21, 2015

హైదరాబాద్: ఉద్యోగుల స్థానికతపై ఏపీ సర్కార్ వేగంగా ముందుకెళ్తోంది. ఉద్యోగస్తుల పిల్లల చదువులపై... వివరాల సేకరించే పనిలో పడింది. ఇప్పటికే ఉద్యోగుల అభిప్రాయాల్ని ఏపీ ప్రభుత్వం సేకరించింది. అలాగే రాజధాని ప్రాంతానికి వెళ్లడానికి... వారికి ఇష్టం ఉందో..? లేదో..? అన్న అంశాలపై కూడా ఆరా తీస్తోంది. 

13:45 - August 21, 2015

హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఫయాజ్, అబ్దుల్ ఖాదర్, షమీమ్‌లను అరెస్టు చేసి వారి నుంచి 2 తుపాకులు, 2 నాటు తుపాకులు, 9 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన దొంగల ముఠాగా గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఓ మొబైల్ సంస్థ మేనేజర్‌ను కిడ్నాప్ చేయడానికి దొంగలు ప్లాన్ చేశారన్నారు. అయితే ముందస్తు సమాచారంతో దోపిడీ దొంగలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారని చెప్పారు. నిందితులను పట్టుకున్న జూబ్లీహిల్స్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని మహేందర్‌రెడ్డి అభినందించారు.జూబ్లీహిల్స్ కాల్పుల ఘటన... నిందితుల అరెస్టు

 

13:42 - August 21, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డీఎస్ ను నియమిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు డీఎస్.. ఈ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ మంత్రి హోదాలో అంతరాష్ట్ర వ్యవహారాలను డీఎస్ పర్యవేక్షించనున్నారు. 

13:41 - August 21, 2015

అనంతపురం: రేప్‌ కేసులో అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ... నిందితుడు మస్తాన్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధితురాలికి 3 లక్షల 50 వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2013లో గుంతకల్లులో ఓ బాలికపై మస్తాన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పలు వాదనల విన్న అనంతరం... న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.   

రేప్‌ కేసు నిందితుడు మస్తాన్‌కు జీవిత ఖైదు

అనంతపురం: రేప్‌ కేసులో అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ... నిందితుడు మస్తాన్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధితురాలికి 3 లక్షల 50 వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

13:00 - August 21, 2015

నల్గొండ: కాసంత ఆకుపచ్చగా కనిపిస్తే చాలు అప్పటి వరకు పని ఒత్తిడితో బరువుగా ఉన్న మనసు.. మస్తిష్కం కాస్త కుదుటపడుతుంది. అదే ప్రకృతి సౌందర్యం పరుచుకున్నట్టుగా కనిపిస్తే ఇంకేముందు గువ్వలా ఎగిరి గుట్టపై వాలాలనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి అందానికి ప్రతీక దేవరచర్లలోని మునిస్వామి గుట్ట. ఒక్కసారి చూస్తే చాలు ఏడాదికి సరిపడంతా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ గంగ దరికి శివలింగమే తరలివచ్చిందో లేక శివలింగం దరికి గంగే ఉరికి వచ్చిందో తెలియదుగాని.. ఇక్కడో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
శివలింగంపై నుంచి గంగ జాలువారుతున్న దృశ్యం
పురాతన శివ లింగంపై నుంచి గంగ జాలువారుతున్న ఈ కమనీయ దృశ్యం మరెక్కడో కాదు నల్లగొండ జిల్లాలోని దేవరచర్ల దట్టమైన అడవుల్లో కొలువైంది. గిరిజనులు భక్తితో పూజించుకునే మునిస్వామి గుట్ట ఇది. కాంక్రీట్‌ జంగిల్‌కు దూరంగా ఓ మారుమూల పల్లె.. పెద్దగా ఎవరికీ తెలియని ఊరు..ప్రశాంత పల్లె వాతావరణం..గిరిజనుల ఆత్మీయ ఆతిథ్యం మధ్య ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసిపట్టుకున్నట్టు ఉంటుంది దేవరచర్ల గ్రామం.
దేవరచర్ల తండా
దేవర కొండ నుంచి దేవరచర్ల 40 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డుకు ఆనుకునే ఉంటుంది దేవరచర్ల తండా. వాహనాల రాకపోకలు ఇక్కడి వరకే. ఆ తరువాత అంతా కాలినడకనే సుమారు ఐదు కిలోమీటర్లు వెళ్తే మునిస్వామి గుట్టకు చేరుకుంటారు. పైకి నిర్మానుష్యంగా, గుబురుగా కనిపించే ఈ మునుస్వామి గుట్టల్లో ఎన్నో అద్భుతాలున్నాయి. దారి పొడవునా ప్రకృతి సౌందర్యం తాండవిస్తుంది.
ఆద్యంతం ఆహ్లాదకరంగా
చుట్టూ దట్టమైన వృక్షజాలం, చిన్న చిన్న సెలయేళ్లు.. దాహం తీర్చుకునేందుకు స్వచ్ఛమైన నీటిగుంటలు..ఒక్కటేమిటి ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది... మునిస్వామి గుట్టయాత్ర. ఈ గుట్టకు చేరుకోవాలంటే ముందు రెండు గుట్టలు దాటాల్సిందే. మధ్యలో గిరిజనులు ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న గుళ్లు మనకు కనిపిస్తాయి. నడవలేని వారిని గిరిజనులు ఎత్తుకొని తీసుకెళ్తుంటారు.

 

12:52 - August 21, 2015

తిరుపతి: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. న్యాయాన్ని బతికించాల్సిన ఖాకీలే అన్యాయం చేస్తున్నారు. తిరుపతిలో పోలీసులు లంచావతారం ఎత్తారు. ఎర్రచందన దొంగల ముఠాకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. కేసులు పెడతామంటూ లక్షలు వసూలు చేశారు. ఈ ముఠాలో వడమాలపేట ఎస్సై రాజశేఖర్ రెడ్డి సహా కానిస్టేబుల్స్ ఉన్నారు. దీంతో సమాచారం తెల్సుకున్న రాయలసీమ ఐజీ విచారణకు ఆదేశించారు. 342, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ: సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎపి, తెలంగాణ కేంద్రకమిటీ సభ్యులు బివి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికలు, అక్టోబర్ లో జరుగనున్న ప్లీనరీపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.  

12:31 - August 21, 2015

శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తో జోరుమీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 10టీవీతో తన సక్సెస్ ను షేర్ చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలే కాదు.. మెసేజ్ ఓరియెంట్ సినిమాలు కూడా సక్సెస్ చేయగలిగినందుకు మహేష్ హ్యాపీగా ఫీలయ్యారు. ఓ మంచి మెసేజీని కమర్షియల్ గా చెప్పగలగడం అంటే ఆ క్రెడిట్ కొరటాల శివగారికే దక్కుతుందన్నారు. అయితే ఇలాంటి కథను ఎంపిక చేసుకోడంపై మహేష్ గట్స్ కు హాట్సాప్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటే ఇప్పుడు భయంగా అనిపిస్తుందని జోక్ చేశారు. అయితే కథలో ఉన్న బ్యూటీతోనే శ్రీమంతుడు హిట్ అయ్యిందని అన్నారు. శ్రుతి హసన్ గురించి మాట్లాడుతూ కెరీర్ లోనే తను బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా చేస్తున్నప్పుడే బుర్రిపాలెం దత్తత తీసుకోవాలనుకున్నాని కానీ పబ్లిసిటీకోసం చేస్తున్నాడంటరని వాయిదా వేశానన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్, రిలీజింగ్ సమయంలో ఆయన ఫీలింగ్స్, తను చేయబోయే అప్ కమింగ్ మూవీస్ గురించి ఒక్కొక్కటి చాలా చక్కగా వివరించారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. 

టీ.ప్రభుత్వ సలహాదారుగా డీ.శ్రీనివాస్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డీ.శ్రీనివాస్ ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం

ఢిల్లీ: పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ అమ్మకాలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ ను నిషేధించాలని సూచించింది. 

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడి సముద్రపు బీచ్‌ లో పడి తనువు చాలించాడు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన రవితేజరెడ్డి ఈనెల 4న అమెరికా మెస్సోరి రాష్ట్రం కెన్సాస్‌ సిటీ ఎంస్ సీఎస్ చదివేందుకు వెళ్లాడు. అయితే 16వ తేదిన ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన అతను నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందాడు.

12:10 - August 21, 2015

హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడి సముద్రపు బీచ్‌ లో పడి తనువు చాలించాడు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన రవితేజరెడ్డి ఈనెల 4న అమెరికా మెస్సోరి రాష్ట్రం కెన్సాస్‌ సిటీ ఎంస్ సీఎస్ చదివేందుకు వెళ్లాడు. అయితే 16వ తేదిన ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన అతను నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందాడు. అమెరికా నుంచి రవితేజ మృతదేహాన్ని ఉప్పల్‌ సూర్యానగర్‌ కాలనీలోని సొంత ఇంటికి తెల్లవారుజామున తీసుకొచ్చారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

12:06 - August 21, 2015

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తూ మరో ఇద్దరు ప్రయాణికులు దొరికిపోయారు. టైగర్ ఎయిర్‌వేస్ విమానంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన దంపతులను తనిఖీలు చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు. వీరివద్ద ఏకంగా 625గ్రాముల బంగారం బయటపడింది. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

11:57 - August 21, 2015

ఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. కృష్ణా నదీ జలాల పంపిణీ మళ్లీ చేపట్టాలని... టీ-సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ తరపున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. మరోవైపు తెలంగాణ వాదనలపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంద్యార్జున్ మహారాష్ట్ర తరపున వాదనలు వినిపించారు. 

సుప్రీంకోర్టులో కృష్ణాజలాల పేచీ

ఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. కృష్ణా నదీ జలాల పంపిణీ మళ్లీ చేపట్టాలని... టీ-సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు తెలంగాణ వాదనలపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

మోడీ అన్నింటా వైఫల్యం: కరత్..

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అన్నింటా వైఫల్యం చెందారని పీపుల్స్ డెమోక్రసీ తాజా సంచిక సంపాదకీయంలో ఆ పత్రిక సంపాదకుడు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాల్లో సరిపోలని లెక్కలున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సమస్య నిర్వహణ లోపం ఉందన్నారు. జన్ ధన్ యోజన పథకం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. రూ. 17 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో పైసా లేదని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ఉంది అన్నారు. కేంద్రమంత్రులు కుంభోణాల్లో మునిగితేలుతున్నారని పేర్కొన్నారు.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

ముంబై: స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతోంది. నిన్న 324 పాయింట్లు నష్టపోయిన సూచీ.. ఇవాళ ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది. 

11:30 - August 21, 2015

ముంబై: స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతోంది. నిన్న 324 పాయింట్లు నష్టపోయిన సూచీ.. ఇవాళ ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో సూచీ.. 27వేల 2వందలకు చేరుకుంది. అటు నిఫ్టి 120 పాయింట్లు పతనమై.. 8వేల 250 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్ల కౌంటర్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిఫ్టీలో ఎస్ బ్యాంక్, ఎయిర్ టెల్, వేదాంత, టాటా మోటార్స్, గెయిల్ 3 నుంచి 5శాతం వరకు క్షీణించాయి.

11:23 - August 21, 2015

కడప: అల్పపీడన ద్రోణితో కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బద్వేలు, కమలాపురం, వల్లూరు తదితర మండలాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పంటలు నీటమునిగాయి. బద్వేలు ఆర్టీసీ డిపోలోకి వర్షపు నీరు చేరడంతో టికెట్లు తడిసిపోయాయి. నీటిని బయటకు పంపేందుకు అధికారులు.. ఏర్పాట్లు చేశారు.

11:15 - August 21, 2015

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రెండు కేసుల్లో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ హోం కార్యదర్శి రాజీవ్‌ త్రివేదికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందజేయడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోటీసులు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లిన ఏపీ పోలీసులు.. రాజీవ్‌ త్రివేది ఛాంబర్‌ ఎదుట సుమారు రెండు గంటలపాటు వేచి చూశారు. ఆ తర్వాత నోటీసులు అందుకున్న రాజీవ్‌ త్రివేది.. చట్టం ప్రకారం నడుచుకుంటామని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఇంతలోనే విషయం తెలుసుకున్న పలువురు తెలంగాణ ఉద్యోగులు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ అక్కడికి చేరుకుని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటీసులతో తెలంగాణ అధికారులను బెదిరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మీద కక్షగట్టిన చంద్రబాబు.. అనైతికంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన ఏపీ పోలీసులు.. నోటీసులు అందించి హడావిడిగా వెళ్లిపోయారు. మొత్తానికి.. రెండు ప్రభుత్వాల మధ్య సాగుతున్న నోటీస్‌ వార్‌.. పొలిటికల్‌ హీట్‌ పెంచుతూ పోతోంది.

 

11:05 - August 21, 2015

గుంటూరు: రాజధాని నిర్మాణం కోసం తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే వెలువరించిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా తుళ్లూరు మండల పరిధిలోని 5గ్రామాల్లో 11ఎకరాల 4 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి బలవంతపు భూసేకరణతో అన్నదాతల పొట్టకొట్టనుంది. దీంతో ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. కాసేపట్లో సిఆర్ డిఎ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

10:59 - August 21, 2015

ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను గవర్నర్ పరిష్కరించలేడని ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజ్యాంగబద్ధమైన, సాంకేతికపరమైన అంశాలుంటే గవర్నర్ పరిష్కరిస్తారని తెలిపారు. నాగేశ్వర్ తెలిపిన మరిన్ని వివరాలను ఆయన మాట్లోనే చూద్దాం....
గవర్నర్ ను విలన్ గా చూపిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజనకు ముందు.. తర్వాత గవర్నర్ ను విలన్ గా చేశారు. గవర్నర్ తమకు అనుకూలంగా ఉండాలని ఎపి ప్రభుత్వం కోరుకుంటుంది. రాజకీయాలకనుగుణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను కేంద్ర పరిష్కారం చేయాల్సివుంది.కానీ ప్రేక్షపాత్ర వహిస్తుంది.
స్కూల్ లెవల్ లో డిటెన్షన్ విధానం సరికాదు..
స్కూల్ లెవల్ లో డిటెన్షన్ విధానం సరికాదు. సామాజిక, ఆర్థిక స్థితిగతుల వల్ల పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఈ విధానంతో పిల్లలు విద్యకు దూరమయ్యే అవకాశముంది. బాలకార్మికులుగా తయారవుతారు. పేదల ఇళ్లలో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. ఇంటి వద్ద పిల్లలకు చదువుకునే వాతారణమే ఉండదు. పిల్లలను శిక్షించడం సరికాదు... ప్రోత్సహించాలి. ఈ పేరుతో వారిని విద్యకు దూరం చేయకూడదు. లోపం ఎక్కడుందో గుర్తించాలి.. చదువుకునే పరిస్థితిలు కల్పించాలి.. వారి వారి కెపాసిటీ గుర్తించి చదువు చెప్పాలి... నిరుత్సాహపరచడం సరికాదు.. పరిస్థితులు మారడం వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.. తప్ప.. పరీక్షల వల్ల కాదు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రక్షకులే భక్షణావతారం..

తిరుపతి: రక్షకభటులు భక్షణావతారమెత్తారు. ఎర్రచందనం రవాణా చేస్తున్నారంటూ పలువురి వద్ద వసూళ్లకు పాల్పడ్డారు. కేసులు పెడతామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ముఠాలో వడమాలపేట ఎస్సై రాజశేఖర్ రెడ్డి సహా కానిస్టేబుళ్లు ఉన్నారు. రాయలసీమ ఐజీ విచారణకు ఆదేశించారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన దంపతుల 625 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

09:49 - August 21, 2015

వాషింగ్టన్: అమెరికాలో మరోమారు పేలుళ్ల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని ఓ హైస్కూల్ వద్ద పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 

09:47 - August 21, 2015

దేస్ పూర్: అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోక్రాజర్‌ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలకు నదులతో పాటు.. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలన్నీ జలమయం కాగా.. వరదలతో జనం నిత్యనరకం అనుభవిస్తున్నారు. నది ఉప్పొంగి రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండటంతో.. ప్రయాణికులు ప్రాణాలకు తెగించి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది ఇళ్లు, పంటలు నీట మునిగాయి. రహదారులు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. వరదలపై అప్రమత్తమైన ప్రభుత్వం.. సహాయక చర్యలు చేపట్టింది. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి.. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

09:44 - August 21, 2015

ఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు మోత మోగిస్తున్నాయి.. అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ నాసిక్‌లోని లాసల్‌గావ్ లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరింది.. ఇక్కడ క్వింటాలు ఉల్లి 4వేల 900 పలుకుతోంది.. నిన్న ఒక్కరోజే క్వింటాలుకు 4వందల రూపాయలు పెరిగింది.. రెండేళ్లుగా ఈ మార్కెట్లో ఉల్లిపాయలకు అత్యధిక ధర ఇదే.. అటు ఢిల్లీలో కిలో ఉల్లి రేటు 80రూపాయలకు చేరింది.. కొత్త పంట రాకపోవడం... డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.. వర్షాభావ పరిస్థితులు మరో కారణమంటున్నారు.. 

09:43 - August 21, 2015

కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెట్‌పల్లి జాతీయ రహదారిపై పాల వ్యాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

 

09:38 - August 21, 2015

హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ సబ్‌-ప్లాన్‌పై గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సబ్‌ ప్లాన్ నిధులు ఖర్చు చేయడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. గతేడాది కేటాయించిన ప్రణాళిక నిధుల్లో దాదాపు 7 వేల కోట్లు మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం.
ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.7500 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. వీటిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.7500 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.4500 కోట్లిచ్చింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా రూ.3వేల కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా రూ.1574 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. అంటే దాదాపు 7,426 కోట్లు మిగిలిపోయాయి. ఈ నిధులు క్యారీఫార్వర్డ్ అంటే వచ్చే ఏడాదికి కూడా బదిలీ చేయడానికి వీలుండదు. దీంతో పెద్ద మొత్తంలో ఎస్సీ, ఎస్టీ నిధులు ఎందుకూ పనికిరాకుండా మురిగిపోయాయి.
2015-16 ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.8089 కోట్లు
2015-16 ఆర్థిక సంవత్సరానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం సబ్ ప్లాన్ కు భారీగా నిధులిచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది. ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.8089 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.5035 కోట్లు కేటాయించామని ఘనంగా ప్రకటించుకుంది. అయితే ఇప్పటివరకు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.2150 కోట్లకు బిఆర్‌ఓలు విడుదల చేయగా అందులో నుంచి కేవలం రూ.1249 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇక ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.1550 కోట్లకు బిఆర్‌ఓలు ఇవ్వగా రూ.766 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోతే ఆ నిధులు కూడా క్యారిఫార్వర్డ్ అయ్యే అవకాశం లేదని సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు.
సబ్‌ప్లాన్‌ చట్టంలో సవరణలు ప్రస్తావించని కేసీఆర్
గత పాలకుల హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నీరుగార్చారని గగ్గోలు పెట్టింది టీఆర్‌ఎస్. అధికారంలోకి వస్తే లోపభూయిష్టంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సవరణలు చేపడతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా సబ్‌ప్లాన్‌ చట్టంలో సవరణల గురించి కేసీఆర్ ప్రస్తావించలేదు. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లోనే సబ్‌ప్లాన్‌లో సవరణలు చేపడుతామని ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. ప్రధానంగా సబ్‌ప్లాన్‌ నిధులు దారి మల్లించకుండా, వినియోగం కాని నిధులు వచ్చే ఏడాదికి వాడుకునేలా సవరణలు తీసుకువస్తామని సీఎం చెప్పారు. కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉప ప్రణాళికకు సవరణలు చేయాలని, లేదంటే వేలాది కోట్ల దళితుల నిధులు వృధా అవుతాయని ప్రజాసంఘాలంటున్నాయి

 

09:22 - August 21, 2015

రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. తొలి విడత భూసేకరణ నోటిఫికేషన్ విడుదల అనే అంశంపై నిర్వహించిన చర్చాకార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత నరసింహ, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు బాబురావు, బిజెపి నేత సూర్యప్రకాశ్ రెడ్డి, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. రాజధాని పేరుతో బడా కంపెనీలకు లీజుకు ఇవ్వడానికే భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి, బిజెపిలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు ఇష్టపడి ఇచ్చిన భూములనే తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:48 - August 21, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త మద్యం విధానం ఆసక్తికరంగా మారుతోంది. ఎక్సయిజ్ పాలసీ ఎలా వుండాలన్న అంశంపై విభిన్న చర్చలు నడుస్తున్నాయి. మద్యం విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ మరోవైపు ఐద్వా లాంటి సంఘాలు జన జాగ్రుతే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు
దాహంతో గొంతు పిడచకట్టుకుపోయేవారికి మన తెలుగు నేల మీద గుక్కెడు మంచినీళ్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు కానీ, పీకల దాకా తాగి ఊగదల్చుకున్నవారికి మాత్రం మస్తుగా మద్యం దొరుకుతుంది. ఇదీ స్వాతంత్ర్య భారతం సాధించిన ప్రగతి. మద్యం మానండి. మత్తు వీడండి అని ఒకప్పుడు మన జాతీయ నాయకులు పిలుపునిస్తే, ఫుల్లుగా తాగండి. ఖజానా నింపండి అన్నట్టు ఇప్పుడు మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మద్యాన్ని ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. ఏయేటికాయేడు మద్యం ద్వారా వచ్చే రాబడులు పెంచుకుంటూ, కొత్త కొత్త టార్గెట్ లు నిర్ధేశించుకుంటున్నాయి.
ఏ ప్రభుత్వమూ మద్యపాన నిషేధం ఊసెత్తడం లేదు
ఇప్పుడు ఏ ప్రభుత్వమూ మద్యం నిషేధం ఊసెత్తడం లేదు. దాని మూలంగా ఎన్ని సంసారాలు నాశనమవుతున్నాయో, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో, ఎంత మంది పసిపిల్లలు పోషకాహారం లేక అలమటిస్తున్నారో, ఎంతమంది మద్యానికి వ్యసనగ్రస్తులై ప్రాణాలు కోల్పోతున్నారో ఆలోచించే స్థితిలో మన ప్రభుత్వాలు లేవు. మద్య నిషేధ ఉద్యమాన్ని మరో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించిన నాయకులే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాపారానికి పూర్తిగా అండదండలందిస్తున్న దౌర్భాగ్య ద్రుశ్యం మన రెండు రాష్ట్రాల్లోనూ ఆవిష్క్రుతమైంది.
ఆదాయ వనరుగా మారిన మద్యం
ఇవాళ అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకులకు మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అనేకమంది నాయకులకు మద్యం వ్యాపారంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. మద్యం వ్యాపారం చేస్తూ, లేదా వాటికి లైసెన్స్ లిప్పిస్తూ కోట్లు కూడేస్తున్న నాయకులు ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి, వారి ప్రాణాల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించడం లేదు.
దుర్భర జీవితాలకు కారణం మద్యం
దాదాపు 30శాతం మంది మహిళలు చిన్న వయస్సుల్లోనే భర్తలను కోల్పోయి, ఒంటరిగా దుర్భర జీవితాలు గడపాల్సి వస్తుందంటే ఆ పాపం మద్యం మహమ్మారిది కాదా.? దానిని పెంచి పోషిస్తున్న పాలకులది కాదా? మందు కొట్టిన మత్తులో వావి వరుసలు మరచి, కన్నబిడ్డల మీదే అత్యాచారాలు చేసే ప్రబుద్ధులు తయారవుతున్నారంటే ఆ పాపం ఎవరిది?
కనీస సౌకర్యాలు కరువు
జనాభా ప్రాతిపదికన మద్యం షాపులంటూ మహా జోష్ గా చెబుతున్న ప్రభుత్వాలు అదే జనాభా ప్రతిపదికన కనీస సౌకర్యాలెందుకు కల్పించడం లేదు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక తరగతి గదది, ప్రతి 30 వేల మందికి ఒక ఆరోగ్య కేంద్రం వుండాలన్న కనీస కర్తవ్యాన్ని ఎందుకు పాటించడం లేదు. ఇప్పటికే ఒక్క తెలంగాణలోనే 2200కి పైగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇచ్చిన ప్రభుత్వాలు ప్రతి పల్లెలోనూ ఒక డాక్టర్ వుండేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జాతీయ రహదారుల వెంట అర్ధరాత్రి వేళ కూడా మద్యం అమ్మి, అనేక భయంకర రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయి? చివరకు విద్యాలయాలు, ప్రార్ధనా స్థలాల సమీపంలో కూడా మద్యం దుకాణాలు తెరుస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ప్రభుత్వం అవకోకనం చేసుకోవాలి...
కొత్త ఎక్సయిజ్ పాలసీ రూపొందించడానికి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఎంతగా నాశనమవుతున్నాయో, ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో అవలోకించాలి. మద్యం పాలసీని రూపొందించే ముందు ఆ సమస్యతో ముడిపడిన విభిన్న వర్గాల, విభిన్న సమూహాల గుండెచప్పుడు వినేందుకు ప్రయత్నించాలి.

 

08:37 - August 21, 2015

రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని ఐద్వా నాయకురాలు జ్యోతి డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతన మద్యం విధానం అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గుడుంబాను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం.. చీఫ్ లిక్కర్ ను అనుమతించకూడదని పేర్కొన్నారు. తెలంగాణలో నూతన మద్యం విధానాన్ని మార్చాలని సూచించారు. 'అక్టోబర్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సయిజ్ పాలసీ తీసుకురాబోతోంది. కొత్త మద్యం విధానంపై కసరత్తు నడుస్తోంది. అయితే, మద్యం పాలసీ ఎలా వుండాలి? మద్యం పాలసీ రూపొందించే ప్రభుత్వం ఏయే అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి?' అనే అంశాలపై జ్యోతి మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు విజయవాడ సీఆర్ డీఏ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా

గుంటూరు: భూసేకరణ నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ.. నేడు విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా చేపట్టనున్నారు.

 

రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

కరీంనగర్: నెట్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతినగర్ వద్ద పాల వ్యాను, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

 

08:01 - August 21, 2015

గుంటూరు: 'ప్రపంచం నివ్వెర పోయే రాజధాని నిర్మిస్తా.. ఇతర దేశాలను తలదన్నే రీతిలో క్యాపిటల్‌ను రూపొందిస్తా'.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాటి నుంచి ఏపి సీఎం చంద్రబాబు పనిగట్టుకుని మరీ చెబుతున్న మాటలు ఇవి. అత్యుత్తమ రాజధాని నిర్మాణం జరగాలంటే రైతుల సహకారం అతి ముఖ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, రైతులను మభ్యపెట్టి కొన్ని వేల ఎకరాలను సేకరించారు. రాజధాని నిర్మాణానికి ఇవి సరిపోవంటూ ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఏపి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాజధాని నిర్మాణానికి తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బలవంతపు భూసేకరణకు దిగుతున్న సర్కార్‌
ల్యాండ్ పూలింగ్‌ అసలు రూపం తెలుసుకున్న రైతులు, బంగారం పండే తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములిచ్చేది లేదంటూ హెచ్చరించారు. అయినా అనుకున్నది నెరవేర్చుకోవాలనుకున్న ఏపి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగుతోంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే వెలువరించిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా తుళ్లూరు మండల పరిధిలోని 5 గ్రామాల్లో 11ఎకరాల 4 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి బలవంతపు భూసేకరణతో అన్నదాతల పొట్టకొట్టనుంది.
11ఎకరాల 4 సెంట్ల భూసేకరణ
తొలి నోటిఫికేషన్‌ను అనుసరించి తుళ్లూరు మండల పరిధిలోని పిచ్చుకలపాలెంలో 78 సెంట్లు, అబ్బరాజుపాలెంలో 89 సెంట్లు, తుళ్లూరులో 4ఎకరాల 28 సెంట్లు, బోరుపాలెంలో 83 సెంట్లు,అనంతవరంలో 4 ఎకరాల 26 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఏపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. మలి విడతలో వచ్చే నోటిఫికేషన్లను అనుసరించి తాడేపల్లి,మంగళగిరి మండలాల్లో భూములను బలవంతంగా లాక్కోనుంది. అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పేపర్‌ వర్క్ ను అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే మలివిడత నోటిఫికేషన్లను ఏపి సర్కార్‌ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వామపక్షాలు పోరుకు సిద్ధం
అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చవద్దంటూ వామపక్షాలు కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. అయినా వీటిని పట్టించుకోని ఏపి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసి తన కపటబుద్ధిని బయటపెట్టుకుంది. దీంతో రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వామపక్షాలు సమరశంఖాన్ని పూరించాయి. ఏపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు అలుపెరగని పోరు చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

 

రాజధాని భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల..

గుంటూరు: ఎపి రాజధాని భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదలయింది. మొదటి విడతగా తుళ్లూరు పరిధిలోని 11.04 భూమిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టర్  

Don't Miss