Activities calendar

26 August 2015

ఫ్రొ. కంచె ఐలయ్యకు ఊరట..

హైదరాబాద్‌ : ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తనపై సుల్తాన్ బజార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బుధవారం పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే విదించింది. 

వీరభద్ర దేవాలయ కోనేరులో పడి ముగ్గురు మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీరభద్ర స్వామి దేవాలయ కోనేరులో పడి రాజు (30), మల్లు (28), సాయి (18)లు మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా తాండూరు వాసులుగా గుర్తించారు. 

శాతవాహన ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..

వరంగల్ : శాతవాహన ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. డోర్నకల్ జంక్షన్ లో లూప్ లైన్ లోకి వెళ్లడంతో భయంతో ప్రయాణీకులు కిందకు దూకేశారు. దీనితో ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు.

నాందేడ్ ఎక్స్ ప్రెస్ ఘటనలో ఇద్దరు అరెస్టు..

అనంతపురం : నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను లారీ ఢీకొన్న ఘటనలో లారీ యజమాని వెంకట సుబ్బయ్యతో పాటు లారీ డ్రైవర్ బాషాలను పోలీసులు అరెస్టు చేశారు. 304-ఎ, 301, 37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిని గుంతకల్ రైల్వే కోర్టులో పోలీసులు హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

ఏపీలో 13 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్..

విజయవాడ : మహిళలపై జరుగుతుఉన్న నేరాల విచారణకు 13 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

20:03 - August 26, 2015

పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' నటించే చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకుంటుంటారు. చిత్రానికి సంబంధించిన మొదటి ఫొటో, టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అంతలా కేజ్రీ పెంచుకున్న పవన్ కల్యాణ్ తాజాగా 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'పవన్' పుట్టిన రోజు అంటే సెప్టెంబర్ 2వ తేదీన 'సర్ధార్ గబ్బర్ సింగ్' టీజర్ ను రిలీజ్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అందాల చందమామ 'కాజల్' పవన్ తో తొలిసారి జోడీ కట్టనున్నది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

కోల్ కతాలో ఇంద్రాణి మాజీ భర్త అరెస్టు..

కోల్ కతా : షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణి ముఖర్జీ మాజీ భర్త సంజీవ్ ఖన్నాను ముంబాయి పోలీసులు కోల్ కతాలో అరెస్టు చేశారు. ఇంద్రాణి స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఆమె గత రాత్రి షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇంద్రాణికి, మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు షీనా జన్మించినట్లు తెలుస్తోంది. 

19:41 - August 26, 2015

గుడుంబాను తరిమేయటానికే చీప్‌లిక్కర్‌ అని తెలంగాణ మంత్రులు కొత్త సూత్రం వినిపిస్తున్నారు. ప్రభుత్వం పేర్కొంటున్న లిక్కర్‌ పెద్దగా కిక్‌ ఇవ్వదు..మాకూ ఆదాయమూ ఉండదు.. అయినా ప్రజల కోసం తెస్తున్నామని టీసర్కార్‌ పేర్కొంటోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఇందిరా (టి.కాంగ్రెస్), శోభారాణి (టిడిపి), టి.జ్యోతి (ఐద్వా), సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), రమణ (కల్లుగీత  కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

19:38 - August 26, 2015

హైదరాబాద్ : పేరుకే మద్యం.. కాని ఇదే గుడుంబాకు వైద్యం. ఆల్కహాలే కాని అంత ఉండదు. ఎంత తాగినా ఖర్చు పెద్దగా అవదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవన్నీ ఏ డాక్టరో చెప్పటం లేదు. కాని డాక్టర్‌ కంటే వివరంగా.. అందంగా చెబుతున్నారు మన తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్యులు. ఒక కుండ పగలగొట్టి మరో కుండ పెట్టినట్లు.. గుడుంబాను తరిమేయటానికే చీప్‌లిక్కర్‌ అని కొత్త సూత్రం వినిపిస్తున్నారు. ఈ లిక్కర్‌ పెద్దగా కిక్‌ ఇవ్వదు.. మాకూ ఆదాయమూ ఉండదు.. అయినా ప్రజల కోసం తెస్తున్నామంటోంది టీసర్కార్‌.

తక్కువ ధరకే మద్యం అమ్మకం..
నూతన మద్యం పాలసీ ద్వారా చీప్‌ లిక్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం తెరతీస్తోంది. ''తాగండి.. తాగి ఊగండి.. మా ఖజానా నింపండి'' అన్న రీతిలో సర్కార్‌ వ్యవహరిస్తోంది. అతి తక్కువ ధరకే మద్యాన్ని అందిస్తామంటోంది. గుడుంబాను తరిమేయమంటే చీప్‌లిక్కర్‌ ఎలా తెస్తారంటూ ప్రతిపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చీప్‌ లిక్కర్‌ అమలును వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయినా సర్కార్‌ వెనక్కి తగ్గడం లేదు. చీప్‌గా ఇస్తున్నంత మాత్రాన అది చీప్‌ లిక్కర్‌ కాదని చెబుతోంది. గుడుంబాను అరికట్టేందుకు తక్కువ ధరకే మద్యాన్ని విక్రయిస్తామని చెప్పుకుంటోంది.

విచక్షణ కోల్పోతున్న మందుబాబులు..
విపక్షాల మాట వినకుండా..చీప్‌ లిక్కర్‌ను అందించడమే సర్కార్‌ ధ్యేయంగా పెట్టుకుంది. గ్రామజ్యోతి పేరుతో గ్రామాలభివృద్ది అని చెబుతున్న సీఎం కేసీఆర్.. చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టి అభివృద్దికి ఆటంకం కల్గిస్తారా..? అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మద్యం మత్తులో చాలామంది అనేక నేరాలకు పాల్పడుతున్నారు. మహిళలపై, బాలికలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నేరాలన్నీ మద్యం మత్తులోనే జరుగుతున్నాయని ఐద్వా నేతలు స్పష్టం చేస్తున్నారు.

అండర్‌ ప్రూఫ్‌ వద్ద నీటిని కలిపి లిక్కర్‌ తయారు..
ఈఎన్‌ఏకు 42.8 శాతం అండర్‌ ప్రూఫ్‌ వద్ద నీటిని కలిపి లిక్కర్‌ను తయారు చేస్తారు. కాకపోతే మీడియం, ప్రీమియం బ్రాండ్లలో వాడినంత ఎస్సెన్స్ లేదా ఫ్లేవర్ లను చీప్‌ లిక్కర్‌కు వాడరు. పైగా మొలాసిస్‌ నుంచి తీసిన రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ తోనే దీనిని తయారు చేస్తారు. గ్రెయిన్‌ ఈఎన్‌ఏ వంటి ఖరీదైన ముడి పదార్థాలను వాడరు. ఎనిమిది రూపాయలతో 180 ఎంఎల్‌ మద్యం తయారవుతుంది. ఇదే చీప్‌ లిక్కర్‌ను 50 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. కొత్త విధానంలో దీనిని 30కి తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోంది. సర్కార్ చెబుతున్న చౌక మద్యం 180 ఎంఎల్ బాటిల్ ను ప్రస్తుతం 50 రూపాయలకు వివిధ బ్రాండ్లు అమ్ముతున్నాయి.

నూతన మద్యం పాలసీపై విపక్షాల ఆందోళన..
ఏ రాయి అయితేనే తల పగల కొట్టుకోవడానికి అన్న చందంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని, ఖరీదైన మద్యమైనా..చౌక మద్యం అయినా, గుడుండా అయినా ఆల్కహాల్‌ ఏదైనా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. గ్రామాల్లో మద్యం మహమ్మరిని తరిమికొట్టాల్సిందిపోయి..తాగండి.. తాగి ఊగండి అన్న చందంగా సర్కార్‌ మందుబాబులను మరింత ప్రోత్సహిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు తక్కువ ధరకు అందించి.. రేపటి రోజు ఆదాయాన్ని పెంచుకోవడానికి తిరిగి రేటు పెంచితే బానిసగా మారిన వారు ఇంట్లో సామాన్లు సైతం అమ్ముకోని తాగాల్సిన పరిస్థితి వస్తుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యానికి బానిసలై ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే ఇప్పుడు చీప్‌ మద్యాన్ని అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. 

ప్రత్యక్ష ప్రసారం..ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత..

అమెరికా : వర్జినీయాలో ఓ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీవీ జర్నలిస్టులు మృతి చెందారు. బెడ్ ఫోర్డ్ కంట్రీకి అలిసన్ పార్కర్, అడమ్ వార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు స్థానిక టెలివిజన్ సంస్థలో టీవీ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. బుధవాంర విధుల్లో భాగంగా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొందరు దుండగులు వారిప కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులు అక్కడికక్కడనే మృతి చెందారు. 

జగన్ తప్పుడు ప్రచారం - బొజ్జల..

తిరుపతి : పట్టిసీమ, రాజధాని విషయంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు.

ఐఐఎంకు భూములిచ్చిన రైతులకు పరిహారం..

విశాఖపట్టణం : ఐఐఎం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. బుధవారం మంత్రి గంటా శ్రీనివాస రావు చేతుల మీదుగా రూ. 15.75 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. 

విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణం - అయ్యన్న..

పశ్చిమగోదావరి : రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే జగన్ ఈనెల 29న బంద్‌కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. 

కేంద్ర మంత్రులతో కేజ్రీవాల్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ఉమా భారతి, నితిన్ గడ్కరిలతో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అయ్యారు. యమున యాక్షన్ ప్లాన్ గురించి చర్చిస్తున్నారు. 

ఏడో వేతన సంఘం గడువు పొడిగింపు..

ఢిల్లీ : ఏడో వేతన సంఘం గడువు పొడిగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 

నీరుకొండలో మంత్రి నారాయణ పర్యటన..

గుంటూరు : నీరుకొండలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. గ్రామకంఠాలను అధికారికంగా నిర్ధారించినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.

 

విజయవాడకు సీఎం చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వచ్చ భారత్ పై నివేదికను సెప్టెంబర్ లోపల అందచేస్తామన్నారు. స్వచ్ఛ భారత్ పై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. విభజ చట్టం హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కచ్చితంగా తీసుకొస్తామని బాబు తెలిపారు. 

ఎమ్మెల్యే పాషా ఖాద్రీకి కోర్టు సమన్లు..

హైదరాబాద్ : చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రికి కరీంనగర్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 20న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. 2013 సంవత్సరంలో మహాత్మాగాంధీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఖాద్రికి కోర్టు సమన్లు జారీ చేసింది. 

ఏలూరులో ఆర్ఎస్ఎస్ వర్గీయుల అరాచకం..

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆర్ఎస్ఎస్ వర్గీయులు అరాచకం సృష్టించారు. ఏలూరులో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

కార్మిక సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘ భేటీ..

ఢిల్లీ : కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘ భేటీ ముగిసింది. సెప్టెంబర్ 2వ తేదీన కార్మిక సంఘాల సమ్మె నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కార్మిక సంఘాల కోర్కెలను మంత్రులు అంగీకరించలేదు. మరోసారి చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొన్నారు. కార్మికుల కోసమే ప్రభుత్వం ఉందని చెప్పడం హాస్యాస్పదమని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పేర్కొన్నారు. కనీస వేతన పెంపుదలపై మంత్రులు చెప్పలేదని, సెప్టెంబర్ 2న సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. 

18:30 - August 26, 2015

హైదరాబాద్ : 'తాట తీస్తానంటావా ? ఒక మంత్రి అలా మాట్లాడవచ్చా ? రౌడీలా మాట్లాడుతున్నారు' అంటూ వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణను నిరసిస్తూ జగన్ విజయవాడలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. దీనిపై వైసీపీ నేత బోత్స అదేస్థాయిలో నిప్పులు చెరిగారు. మంత్రిగా ఉన్న నాయకుడు ఇలాంటి భాష మాట్లాడమేంటీ ? చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు. జగన్ చేపట్టిన ధర్నాలు విజయవంతం అయ్యాయని, ప్రత్యేక హోదాపై చంద్రబాబు తొక ముడిచారన్నారు. 

18:23 - August 26, 2015

హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో ఎలుకల దాడిలో  పసికందు మృతి చెందడంపై తల్లి పడుతున్న ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తమ బిడ్డను ఇంకా తీసుకపోనియడం లేదని టెన్ టివితో వాపోయింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎవరూ వచ్చి చూడలేదని తెలిపింది. ఎలుకలు వస్తున్నాయి..దాడి చేస్తున్నాయని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని రోదిస్తూ తెలిపింది. తనను హేళన చేస్తూ మాట్లాడరని, పేదోళ్లం కాబట్టే ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. మ బాబును మాకు ఇప్పించాలని ఆ తల్లి వేడుకుంది. 
ఎచ్చార్సీ సీరియస్
చిన్నారి మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది. ఓ న్యాయవాది ఈ ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

18:18 - August 26, 2015

హైదరాబాద్ : వార్షిక ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ రేస్ కోసం నిర్వాహక హైదరాబాద్ రన్నర్స్ సొసైటి విస్త్రుత ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 30 న జరిగే ఈ మారథాన్ రేస్ లో దేశంలోని విఖ్యాత రన్నర్లతో సహా మొత్తం 14వేల మంది పాల్గొంటారని నిర్వాహక సంఘం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించింది. హైదరాబాద్ నగరానికే ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ రేస్ ను భారతి ఎయిర్ టెల్‌, డిజిటల్ హైదరాబాద్ సంయుక్తంగా స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఇన్ఫర్మెషన్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, భారతీ ఎయిర్ టెల్ సీఈవో విజయరాఘవన్, రేస్ డైరెక్టర్ డాక్టర్ మురళీ నన్నపనేని, సినీనటుడు దగ్గుబాటి రానా పాల్గొన్నారు. మారథాన్ రేస్ లో 42.195 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ లో 21.095 మీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రారంభమయ్యే ఈ రేస్ హైటెక్ సిటీ, గచ్చిబౌలీ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాల గుండా సాగుతుంది. విజేతలకు మొత్తం 7 లక్షల 50 వేల రూపాయలు ..ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

18:15 - August 26, 2015

జమైకన్‌ స్ప్రింట్ క్వీన్ షెల్లీ యాన్‌ ఫ్రేసర్‌ ప్రైస్‌...మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల స్ప్రింట్‌ ఫైనల్‌లో షెల్లీకి మరోసారి పోటీనే లేకుండా పోయింది. కెరీర్‌లో 5వ వరల్డ్ చాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 

బీజింగ్ లో పోటీలు..
బీజింగ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్‌ వరల్డ్ చాంపియన్‌షిప్‌ పోటీల్లో...100 మీటర్ల స్ప్రింట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన షెల్లీ యాన్‌ అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టింది. పోటీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన షెల్లీ ఎక్కడా తడబడలేదు. ఎక్కడా జోరు తగ్గించలేదు. రేస్‌ ట్రాక్‌లో మెరుపు వేగంతో దూసుకుపోయిన షెల్లీ ప్రత్యర్ధులందరి కంటే ముందుగా రేస్‌ను ముగించింది. 10.76 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి విజేతగా నిలిచింది. గెలిచిన ఆనందంలో గాల్లో ఎగురుతూ సంబరాలు జరుపుకుంది.

రెండోస్థానంలో డఫ్నే..
షెల్లీతో ఆఖరి వరకూ పోరాడిన నెదర్లాండ్స్‌కు చెందిన డఫ్నే షిప్పర్స్ చివరకు రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ నెగ్గడం చాలా ఆనందంగా ఉందని పోటీకి ముందు కాస్త ఒత్తిడికి గురయ్యానని ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఒకటని షెల్లీ అభిప్రాయపడింది.

మరిచిపోలేని అనుభూతి అన్న షెల్లీ..
2008 బీజింగ్‌ ఒలింపిక్స్ లో కెరీర్‌లో తొలి గోల్డ్ మెడల్‌ సాధించానని మళ్లీ అదే వేదికపై 7 ఏళ్ల తర్వాత
వరల్డ్ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గడం మరచిపోలేని అనుభూతి అని షెల్లీ సంబరపడిపోతూ చెప్పింది. షెల్లీ యాన్‌ ఫ్రేసర్‌ కెరీర్‌లో ఇది 5వ వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్‌ కావడం విశేషం. 28 ఏళ్ల షెల్లీ...భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో రాణించాలని పట్టుదలతో ఉంది. 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో షెల్లీకి....ప్రస్తుతానికైతే పోటీనిచ్చేవారే లేరనడంలో ఎటువంటి సందేహం లేదు. 

18:07 - August 26, 2015

ఢిల్లీ : భారత మహిళా టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జాకు...కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న' పురస్కారం పై కర్నాటక హైకోర్ట్ స్టే విధించింది. తనకు దక్కాల్సిన ఖేల్ రత్న అవార్డును సానియాకు ఇవ్వడం అన్యాయమంటూ కర్నాటకకు చెందిన పారా ఒలింపిక్ అథ్లెట్ గిరీషా నాగరాజే గౌడ కోర్టు కెక్కాడు. 2012 లండన్ పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్ లో గిరీషా రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన తనను పక్కన పెట్టి వింబుల్డన్ మహిళల డబుల్స్ లో మరో ప్లేయర్ తో కలసి విజేతగా నిలిచిన సానియాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కర్నాటక హైకోర్టు..కేంద్ర ప్రభుత్వాన్ని, అవార్డుల కమిటీని వివరణ కోరింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈనెల 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా..సానియాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అంద చేయాల్సి ఉంది.

డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు..

గుంటూరు : జిల్లాలో జరిగిన ఎలుకల దాడి పసికందు మృతి చెందడంపై హెచ్చార్సీలో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు డీఎంఅండ్ హెచ్ ఓ తో పాటు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

 

స.హ.ఉద్యమకారుడిపై దాడి..13 మందికి జైలుశిక్ష..

కడప : దొరబాబు అనే సమాచార హక్కు ఉద్యమకారుడిపై దాడి చేసిన ఘటనలో 13 మందికి కడప సబ్ కోర్టు జైలు శిక్ష విధించింది. 13 మంది నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష, జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది. 2012 జూన్ 17వ తేదీన చెన్నూరు మండలం చిన్నమాచుపల్లెలోని అంగన్ వాడీ కేంద్రంపై వివరాలను స.హ.చట్టం ద్వారా అడిగాడు. కొందరు దుండగులు దొరబాబుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 13 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు శిక్షతో పాటు జరిమాన విధించింది. 

రాష్ట్రాల సీఎస్ లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్..

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి రావాల్సిన ముఖ్య ప్రాజెక్టులు, ఆర్థిక అంశాలపై ఏపీ సీఎస్ కృష్ణారావు ప్రధానికి వివరించారు. 

నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాది నవేద్..

జమ్మూ కాశ్మీర్ : మెజిస్ట్రేట్ ఎదుట ఉగ్రవాది నవేద్ నేరాన్ని అంగీకరించాడు. ఈనెల 5వ తేదీన ఉధంపూర్ లో కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అదే తేదీన నవేద్ ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 

జూబ్లిహిల్స్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరి అరెస్టు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనలో ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు సమీర్‌, నవీనుద్దీన్‌ లను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు - తుమ్మల..

 ఖమ్మం : ప్రతిపక్ష నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుగంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు తెలంగాణకు వరమన్నారు.

 

సైకోను పట్టుకుంటాం - ఏడీజీ ఠాకూర్..

నర్సాపూర్ : గోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతున్న సైకోను త్వరలోనే పట్టుకుంటామని ఏపీ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ఠాకూర్ తెలిపారు. 

హిందూపురంలో కారు బోల్తా..

అనంతపురం : హిందూపురం మండలం తూమకుంట చెక్‌పోస్ట్ వద్ద బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సామాజిక తెలంగాణ రావాలి - తమ్మినేని..

నిజామాబాద్ : రాష్ట్రంలో సామాజిక తెలంగాణ రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన వారు ప్రభుత్వ పోకడను చూసి నిరాశ చెందితే లాభం లేదన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ రావాలని, బతుకు దెరువు రావాలన్నారు. సామాజిక తెలంగాణ రావాలని పది వామపక్ష పార్టీలు ప్రజల ముందుకొస్తున్నాయని తెలిపారు. ఆర్థిక సమానత్వం కాదని, ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సీపీఎం కోరుకొంటోందన్నారు.

17:20 - August 26, 2015

నిజామాబాద్ : జిల్లాలో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించింది. అనంతరం కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ర్యాలీలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సీపీఎం నేతలు టెన్ టివితో మాట్లాడారు. జిల్లాలో సీపీఎం బలహీన పార్టీయైనా ర్యాలీకి, సభకు భారీగా ప్రజలు తరలివచ్చారని, అధికారంలోకి వచ్చే ప్రభుత్వం భిన్నమైన విధానాలు అవలింబిస్తుందని ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలింబిస్తున్నాయని, ఉన్నటువంటి కార్మిక చట్టాలకు సవరణలు తీసుకొస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని విమర్శించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి తాగు, సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 

వైపీన్ ద్వీపంలో ప్రమాదం..

కోచి : వైపీన్ ద్వీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. బల్లకట్టును మత్స్యకారు బోటు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందారు. బల్లకట్టుపై ఉన్న మరో 20 మందిని నేవీ, మెరైన్ సిబ్బంది రక్షించారు. 

గుజరాత్ లో రంగంలోకి దిగిన ఆర్మీ..

గుజరాత్ : రాష్ట్రంలో ఆర్మీని ప్రభుత్వం రంగంలోకి దించింది. బంద్ హింసాత్మకంగా మారింది. ఇందులో ముగ్గురు మృతి చెందారు. పటేల్ కులస్తుల ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతోంది

ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు - ఏచూరి..

నిజామాబాద్ : ఎన్నికల హామీలను కేంద్ర అమలు చేయడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. జిల్లాలోని కలెక్టరేట్ మైదానంలో సీపీఎం బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగించారు. ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ప్రజలు సీపీఎం పార్టీని బలపరిచి ప్రజాపోరాటాలకు మద్దతివ్వాలని సూచించారు. మతోన్మాదం నుండి దేశాన్ని కాపాడాలన్నారు. 

16:40 - August 26, 2015

నిజామాబాద్ : తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు..ఆశయాలు నెరవేరుతాయా అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రశ్నించారు. ఇవి నెరవేరడానికి సమయం పట్టవచ్చు కానీ ఆ దారిలో ఉన్నామా అనేది ప్రశ్న అని తెలిపారు. దశాబ్ధాలుగా నిజామాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిజామామాద్ జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సీపీఎం ర్యాలీ నిర్వహించింది. అనంతరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏచూరి పాల్గొని ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

వాగ్ధానాలు నెరవేరుస్తున్నారా ?
''వాగ్ధానాలు చేయడంతో పూర్తయ్యేవి కావు. అనేక దశాబ్దాలుగా తెలంగాణ వెనుకబడింది. ఉద్యోగాలు కావాలి. బతుకు తెరువు మెరుగుపర్చుకోవాలి. దీనిపై అనేక పోరాటాలు జరిగాయి. అనంతరం నూతన నవతెలంగాణ ఏర్పడింది. గతంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేసింది. ఎలాంటి వాగ్దానాలు చేసిందో కేంద్రం పూర్తి చేయడం లేదు. ఏడాది క్రితం అచ్చే దిన్ పేర్కొంటూ మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. సంవత్సరం దాటింది. ఏం జరిగింది? ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలువదు కానీ ఢిలీల్లో ఉల్లిగడ్డ ధర 80 రూపాయలకు చేరుకుంది. ఉద్యోగాలిస్తామని వాగ్ధానాలు ఇచ్చారు కానీ ప్రస్తుతం ఉద్యోగాలు తగ్గుతున్నాయి.

అన్ని రంగాల్లో సంక్షోభం..
వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోంది. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 26 శాతం వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్కార్ గణాంకాలు చూపెడుతోంది. వర్షాలు ఏ విధంగా పడ్డాయో రైతాంగంలో పంటలు ఆ విధంగా లేవని దేశం మొత్తం కనిపిస్తోంది. రైతులకివ్వాల్సిన మద్దతు ధరలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. పరిశ్రమ రంగంలో ఇలాంటి సంక్షోభం ఉంది. అన్ని రంగాల పరిస్థితి చూస్తే దోపిడి కనబడుతోంది''.అని ఏచూరి తెలిపారు. 

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 25,715 పాయింట్ల వద్ద ముగియగా నిప్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,792 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఏసీబీ వలలో శ్రీకాకుళం వాటర్ వర్క్స్ డీఈ, ఏఈ

శ్రీకాకుళం : వాటర్ వర్క్స్ డీఈ వెంకటరమణ, ఏఈ మనోహర్ బుధవారం ఏసీబీ వలలో చిక్కారు. వాటర్ కనెక్షన్ కోసం ఓ వ్యక్తి నుండి వీరు డబ్బులు డిమాండ్ చేశారు. 

16:31 - August 26, 2015

ఢిల్లీ : ఇద్దరు నాయుళ్లు (చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు)లు కలిసి ఏపీ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా తీసుకరాకపోవడంపై ఆయన ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పెళ్లి చేస్తామని తాంబులాలు మార్చుకుని పెళ్లి ఎందుకు కాపురం చేసుకొనే అనే చందంగా ప్రత్యేక హోదాపై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై కొట్లాడడం ద్వారానే టిడిపి, బిజెపిలు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. చరిత్రలో సమర్థుడు, తెలివైన వారని చంద్రబాబుకు ఓట్లు వేశారని, తోక ముడిస్తే మాత్రం చరిత్ర క్షమించదన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే మోడీ పేర్కొన్నారని, ప్రస్తుతం దీని వెనుక రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసం చేసిందని భావించారని, అందుకే అడ్రసు లేకుండా కొట్టారని పేర్కొన్నారు. టిడిపి బలహీన పడిందని తెలుసుకోవాలంటే ఎన్నికలు కూడా లేవన్నారు. స్పెషల్ కేటగిరి అనేది సెంటిమెంట్ అని, ఎన్ని వేల కోట్ల రూపాలివ్వడం సబబు కాదన్నారు. నిన్న నరేంద్ర మోడీని కలిసిన బాబు ఏం సాధించారని, మోడీకి నచ్చితే ఏమైనా చేస్తారని, బాబు ముఖం మోడీకి నచ్చలేదా అని ప్రశ్నించారు. బతికున్న వాళ్లలో వెంకయ్య నాయుడిని తప్పించి ఇతరులను మోడీ పొడగలేదన్నారు. చంద్రబాబు ఎందుకు డిఫెన్స్ లో పడుతున్నారని తెలిపారు. యాక్డులో ఉన్న వాటిని సాధించలేక పోతున్నామన్నారు. పది వేల కోట్లు ఇవ్వాలని ఆనాడు రాజ్యసభలో వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని, ఏర్పాటు చేయని రాష్ట్రానికి ఎలా ఇస్తారని కాంగ్రెస్ పేర్కొందన్నారు. ఆ సమయంలో మా ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారని తెలిపారు. ఇండియాలో ఉన్నామా ? ఎక్కడున్నాం అని అప్పుడు సుజనా చౌదరి పేర్కొన్నారని, అప్పుడు చిరంజీవి బిల్లును సమర్థించలేదన్నారు. 14 వ ఆర్థిక సంఘం, ప్లానింగ్ కమిషన్ చెప్పింది వేదం కాదని, ఈ కమిషన్ సిఫార్సులు బైండింగ్ కాదని, పార్లమెంట్ కు అత్యున్నత అధికారాలుంటాయని ఉండవల్లి తెలిపారు. 

సానియాకు ఖేల్ రత్నపై కర్నాటక హైకోర్టులో పిటిషన్..

కర్నాటక : టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఖేల్ రత్న పురస్కారం ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టులో హెచ్.ఎల్.గిరీశ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పురస్కారాన్ని తనకు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. దీనిపై విచారించిన అభిప్రాయం తెలుపాలంటూ కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. 

ప్రశాంతంగా ఉండండి - అహ్మద్ పటేల్..

గుజరాత్ : రాష్ట్రంలో ప్రతొక్కరూ ప్రశాంతంగా ఉండాలని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. పటోళ్లలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శాంతిభద్రతలను భంగం కలుగకుండా చూడాలన్నారు. 

మిషన్ కాకతీయలో అక్రమాలపై లోకాయుక్తలో ఫిర్యాదు..

మహబూబ్ నగర్ : జిల్లాలో మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ నీటిపారుదల శాఖ అధికారులపై చౌటచెట్ల గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి చెరువు మరమ్మత్తు కోసం కేటాయించిన నిధుల దుర్వినియోగం చేశారని, కేటాయించిన రూ.26 లక్షల్లో రూ.22 లక్షలు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొన్నారు. వివరణ కావాలని అధికారులను లోకాయుక్త కోరింది. 

బాల్ కోట్ కు చేరుకున్న రాహుల్..

జమ్మూ కాశ్మీర్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాల్ కోట్ కు చేరుకున్నారు. కాల్పుల బాధితులను ఆయన పరామర్శించనున్నారు. 

జగన్ కలలు కంటున్నాడు - దేవినేని..

విజయవాడ : అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నాడని, దొంగలను 420లను రాష్ట్ర ప్రజలు నమ్మరని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. 

ఎలుకల దాడి కారణంగా చనిపోలేదు - వేణుగోపాల్..

గుంటూరు : ఎలుకల దాడి కారణంగా పసివాడు చనిపోలేదని, అనారోగ్యంతో జన్మించాడని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్ పేర్కొన్నారు. నిర్లక్ష్య ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

అర్చక సమ్మెకు కోదండరాం మద్దతు..

హైదరాబాద్ : అర్చక జేఏసీ సమ్మెకు జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని, అర్చకుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

మూడు జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు - జూపల్లి..

హైదరాబాద్ : రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సహకాలు ఇస్తామన్నారు.

 

చీప్ లిక్కర్ అంటే చీపుర్లు పట్టుకుంటాం - శోభారాణి..

హైదరాబాద్ : రాష్ట్రంలో చీప్ లిక్కర్‌ను ఉపసంహరించుకోకపోతే మేం చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుందని టీడీపీ మహిళా నేత శోభారాణి హెచ్చరించారు. కేసీఆర్ తాగుబోతు కాబట్టే తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 

వైసీపీ సమన్వయ కమిటీ రసాభాస..

అనంతపురం : జిల్లాలోని కళ్యాణదుర్గంలో వైసీపీ నిర్వహించిన సమన్వయ కమిటీ రసాభాసాగా మారింది. పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 

15:26 - August 26, 2015

విజయవాడ : మళ్లీ వైసీపీ, టిడిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం భూములు సేకరించడంపై వైసీపీ పోరుబాట పట్టింది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. మంగళవారం విజయవాడలో జగన్ ధర్నా చేపట్టి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. దీనిపై ఏపీ మంత్రి దేవినేని ఉమ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 11 సీబీఐ కేసుల్లో, ఎన్ ఫోర్స్ మెంట్ సుప్రీంకోర్టులో డైరెక్షన్ లు కేసులు వాయిదా పడుతున్నాయన్నారు. ప్రతి శుక్రవారం హాజరై సంతకం చేయాల్సిన జగన్ మా నాయకుడిని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ బతుకు ఇది..పిట్టలదొరలా మాట్లాడుతున్నాడని, శ్రీ కృష్ణ జన్మస్థానం రాసిపెట్టి ఉందని ఘాటుగా విమర్శలు చేశారు. సమాధానం చెప్పలేక నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడని విమర్శించారు. జగన్ లాంటి 420, దొంగలను ప్రజలు రానివ్వరని తెలిపారు. 2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం డ్యాం నిర్మాణం కాకుండా సుప్రీంలో కేసులు వేయిస్తున్నాడని, సాక్షి దినపత్రిక, ఛానెల్ లో వార్తలు రాసే వారితో రాజధానిని అడ్డుకోవాలని ట్రిబ్యునల్ లో జగన్ కేసులు వేయిస్తున్నాడని ఆరోపించారు. రాజధానిని తొందరగా కట్టాలని డిమాండ్ చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. భూ సమీకరణ ద్వారా అమరావతి ప్రజలు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు స్వచ్చందంగా భూములిచ్చారని తెలిపారు. పోలవరం నిర్మాణం తొందరలో పూర్తి చేస్తామని, ట్రిబ్యునల్ కు తగిన సమాచారం ఇచ్చి రాజధాని నిర్మాణం వేగవంతం చేస్తామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. 

బంగాళఖాతంలో అల్పపీడనం..

విశాఖపట్టణం : బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్టణం తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఒడిశా తీరం, ఉత్తర కోస్తాలను ఆనుకుని కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు. 

కిష్టారెడ్డి అంత్యక్రియల్లో కేసీఆర్..

మెదక్ : మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ శాసనసభ్యుడు కిష్టారెడ్డి అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 

15:01 - August 26, 2015

ఢిల్లీ : బాలీవుడ్ అలనాటి నటి డింపుల్ కపాడియా షూటింగ్ లో గాయపడింది. ఆలస్యంగా ఈ సమాచారం బయటకు వచ్చింది. దుబాయి లోని మార్ఘమ్ ఏడారి ప్రాంతంలో 'వెల్ కమ్ బ్యాక్' సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో డింపుల్ నటిస్తున్నారు. ఇసుకలో వేగంగా పరుగెతాల్సిన సీన్ ఒకటుంది. ఈ సన్నివేశంలో డింపుల్ లెహెంగా ధరించి డైలాగులు చెబుతూ పరుగెత్తుతోంది. ఒక్కసారిగా డింపుల్ కిందపడిపోయింది. దీనితో ఆమె కాలికి గాయాలయ్యాయి. వెంటనే వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు. డింపుల్ కొలుకొన్నాక తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సంఘటన వాస్తవమేనని దర్శకుడు నిర్ధారించారు. 

14:41 - August 26, 2015

హెచ్ఐవి..1976 హెచ్ఐవీ ఉందని మద్రాసులో గుర్తించడం జరిగిందని న్యాయవాది పార్వతి పేర్కొన్నారు. టెన్ టివిలో మానవి 'మై రైట్' కార్యక్రమంలో హెచ్ఐవి బాధితులకు ఎలాంటి హక్కులున్నాయనే దానిపై ఆమె విశ్లేషించారు. ఏ రోగాలు వచ్చినా ధైర్యంతో చెప్పగలరని, సాంఘీక బహిష్కరణకు గురవుతున్నారన్నారు. ఎవరూ కూడా ఆమోదించడం జరగడం లేదని, ఆసుపత్రుల్లో చికిత్స చేయడానికి కూడా నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. హెచ్ఐవీ బాధితులకు రాజ్యాంగపరమైన హక్కులున్నాయని, అనేక సందర్భాల్లో సుప్రీం, హైకోర్టు పలు మార్లు పేర్కొందన్నారు. ఇతర న్యాయపరమైన సందేహాలపై లాయర్ పార్వతి సమాధానం చెప్పారు. 

14:40 - August 26, 2015

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో వారం రోజుల పసికందు మృతి చెందడంపై కుటుంబసభ్యులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. టెన్ టివితో కుటుంబసభ్యులు మాట్లాడారు. గాయపడిన అనంతరం వైద్యులు వచ్చి కట్టుకట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. డాక్టర్లే పట్టించుకుంటారా ? తల్లి పట్టించుకోదా అని అంటున్నారని తెలిపారు. నర్సులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దీనంతా తమ సెల్ ఫోన్ లో వీడియో తీసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని నిలదీస్తే వైద్యుడు పారిపోయారని తెలిపారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా చేస్తామని, ఎలుకల వల్ల చనిపోలేదు, మా వల్ల చనిపోలేదని అంటున్నారని మరి పిల్లాడు ఎలా మృతి చెందాడని ప్రశ్నించారు. ఎంతమంది వైద్యులు, నర్సులున్నారు ? ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే దానిపై విచారణ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై కూడా కమిటీ వేశారని, ఇలాంటివి ఎన్నో వందల కమిటీలు వేశారని విమర్శించారు. చిన్నారి మృతి చెందడంపై కమిటీ ఎలా న్యాయం చేస్తుందో వేచి చూడాలన్నారు. 

14:37 - August 26, 2015

విజయవాడ : వైసీపీ, టిడిపి పార్టీలు పోటాపోటీ ధర్నాలు చేపడుతున్నాయి. జిల్లాలో భూ సేకరణ, భూ సమీకరణ పేరిట వైసీపీ ధర్నా చేపడితే విజయవాడలో జగన్ కనువిప్పు పేరిట ధర్నా చేపట్టింది. ఈసందర్భంగా నేతలు వైసీపీపై నిప్పులు చెరిగారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలుతారా ? ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని సుప్రీం పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. చెంపలు వేసుకుని కొంగ జపాలు మాని మంచి పద్ధతిలో నడవాలని జగన్ కు నేతలు సూచించారు. 

14:31 - August 26, 2015

రంగారెడ్డి : జిల్లాలో అతిసార ప్రబలింది. తాండూరులో ఉన్న ఓ పరిశ్రమ నుండి వెలువడిన వ్యర్థాలతో కలుషితమైన నీరు త్రాగడమే దీనికి కారణం తెలుస్తోంది. అతిసారకు 9 బాలికలతో పాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మరో 50మందికి పైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20-30 మంది వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంగన్ వాడీ కేంద్రాలు, ఇతర వైద్య సిబ్బంది మందులను పంపిణీ చేస్తున్నారు. 

పసికందు మృతి..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. వారం రోజుల చిన్నారిపై ఎలుకలు దాడి చేశాయి. దీనితో ఆ పసికందు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

14:23 - August 26, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త బార్ లైసెన్స్ ల మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో 148 ప్రకారం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంది. జీహెచ్ఎంసీ, పురపాలికలు, నగర పంచాయతీల వారీగా లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించేలా మార్గదర్శకాలు రూపొందించింది. పురపాలికలు, నగర పంచాయతీల్లో 30వేల జనాభాకు ఒక బార్, 30-60 వేల జనాభాకు రెండు బార్లకు అనుమతినివ్వనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి 13వేల జనాభాకు ఒక బార్, 13-26 వేల జనాభా ఉంటే రెండు బార్లను అనుమతించనున్నారు. త్రీస్టార్ ఆపై హోటళ్లు, రెస్టారెంట్లకు ఆంక్షలు లేకుండా బార్లకు అనుమతి మంజూరు చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో అనుమతినించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మద్యం విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చే మద్యంపై ఐద్వా పోరుబాట పట్టింది. జిల్లాల్లో మద్యం వచ్చే నష్టాలపై కళాకారులు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. మరి తాజాగా బార్ లైసెన్సులపై విడుదల చేసిన మార్గదర్శకాలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

14:12 - August 26, 2015

హైదరాబాద్ : నగరంలో ఛైన్ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మహిళల నుండి బంగారు ఆభరణాలు అపహరిస్తున్నారు. ఇటీవలే మలక్ పేటలో జరిగిన ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఎల్లయ్య, యాదమ్మ దంపతులు వాహనంపై బాట సింగారం నుండి చౌటుప్పల్ కు వెళుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అనుసరించారు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం దుండగులు యాదమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపారు. దీనితో ఎల్లయ్య, యాదమ్మలు వాహనంపై నుండి కింద పడిపోయారు. యాదమ్మ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే తేరుకున్న ఎల్లయ్య యాదమ్మను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో అతిసార వ్యాధి పంజా...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అతిసారా వ్యాధి పంజా విసిరింది. తాండూరు మండలం గొల్లచెరువు ప్రాంతంలో ఆ వ్యాధిబారిన 9 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో 50 మంది మృత్యువాత పడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

13:51 - August 26, 2015

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. వారం రోజుల చిన్నారిపై ఎలుకలు దాడి చేశాయి. దీనితో ఆ పసికందు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ పసికందు కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళ్తే....రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో జీజీహెచ్‌లో చేరింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి. రోజుల పసికందు కావడంతో ఆ బాధకు గుక్కపట్టి ఏడ్చాడు. ఏడుపును విని నిద్రలేచిన తల్లి ఎలుకలు బిడ్డను కొరుక్కుతినడం గమనించింది. వెంటనే ఆ బాబును వైద్యుల వద్దకు తీసుకెళ్ళింది. బాబు మృతి చెందండంపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని కన్నెర్ర చేశారు. మరోవైపు ఆస్పత్రిలో ఎలుకలపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. 

కొత్త బార్లకు లైసెన్సుల పై ఉత్తర్వులుజారీ

హైదరాబాద్ : కొత్త బార్లకు లైసెన్సుల పై టీ.సర్కార్ ఉత్తర్వులుజారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బార్ల కేటాయింపు చేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు ఒక బార్ చొప్పున కేటాయించారు. త్రీస్టార్ ఆపై స్తాయి హోటళ్లు, రెస్టారెంట్లకు ఆంక్షలు లేకుండా బార్లకు అనుమతి ఇచ్చారు. పురపాలక, నగర పంచాయితీల్లో 30వేల జనాభాకు ఒక బార్ చొప్పున కేటాయించారు. 30 వేల నుంచి 60 వేల జనాభాకు రెండు బార్లకు అనుమతిచ్చారు. డ్రా పద్ధతిన బార్ల లైసెన్సులను కేటాయింపులు చేస్తారు.

13:47 - August 26, 2015

హైదరాబాద్ : పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికలకు ముందు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న కేసీఆర్‌ ఒక్కటైనా నిర్మించి ఇచ్చారా అని ప్రశ్నించారు. గ్రేటర్‌ బస్సుయాత్రలో పాల్గొన్న ఎర్రబెల్లి సీఎం తీరును ఎండగట్టారు. కేసీఆర్‌ కొడుకు, కూతురు, అల్లుడు, మంత్రులు మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. 

13:44 - August 26, 2015

హైదరాబాద్ : ఎర్రమంజిల్‌లో సివిల్‌ సప్లై కార్యాలయం ఎదుట రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఆందోళనలు ఉద్రిక్తం కావడంతో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. 

ఎమ్మెల్యే కిష్టా రెడ్డి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్

మెదక్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పంచగామ చేరుకున్న సీఎం కేసీఆర్ కిష్టారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. పంచగామ కన్నీటి సంద్రమైంది. కిష్టారెడ్డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కిష్టారెడ్డికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

13:23 - August 26, 2015

విజయవాడ : అధికారం ఉందని బలవంతంగా భూములు లాక్కుంటున్నారని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. విజయవాడలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సీఆర్డీఏ కార్యాలయం ఎదుట జగన్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు పంటలు పండే భూములను లాక్కోవడం కోసం చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నాడని మండి పడ్డాడు. మనసు ఉన్నవాడు సీఎం కావాలి... మన దౌర్భాగ్యం కొద్ది భూ బకాసురుడు సీఎం అయ్యాడని ఆవేశంగా ప్రసంగించారు. మీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుందని.....వచ్చేది మా ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక లాక్కున్ను భూములను రైతులకు పూలలో పెట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తి విస్మరించారని విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

13:15 - August 26, 2015

బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు 'నానా పాటేకర్'. విలక్షణ పాత్రధారణలతో భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన దిల్లున్నోడిగా నిరూపించుకున్నారు. తన వంతు సామాజిక బాధ్యతను నిర్వహించారు. మహారాష్ట్రలో కరవు బారిన పడిన రైతుల పరిస్థితి చూసి 'నానా' మనస్సు చలించిపోయిందంట. దీనితో వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకొచ్చారు. మరాఠీ స్టార్ మకరండ్ అనాస్ పురేతో కలిసి బీద్ గ్రామాన్ని సందర్శించి వారిని పరామార్శించారు. భర్తలను కోల్పోయిన ఒక్కో రైతు భార్యకు రూ.15వేల చొప్పున దాదాపు రూ.24లక్షల రూపాయలను వీరిద్దరూ అందించారు. అంతే కాకుండా ఈ కుటుంబాల్లోని పిల్లల చదువు నిరాటంకంగా సాగేందుకు వీలుగా పూర్తి స్థాయిలో నిధులు సేకరించి, వీరికి శాశ్వత నిధిని ఏర్పాటు చేయనున్నారంట. కార్లకు సులభంగా లోన్లు దొరికే దేశంలో.. అన్నం పెట్టే రైతన్న రుణాలు కోసం కష్టాలు పడటం తనను ఆవేదనకు గురి చేసిందని నానా పటేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలెన్ని మారినా.. రైతుల తలరాతలు మారటం లేదని ఆయన వాపోయారు. 

13:08 - August 26, 2015

సెల్‌ఫోన్‌.. ఇది లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అంతలా జీవితంలో ఓ భాగమై పోయింది. వివిధ కంపెనీలు మార్కెట్ లో రోజుకో కొత్త రకం సెల్ ఫోన్ లు విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరంపై బ్యాక్టీరియా తయారవుతోందని గత పరిశోధనల్లో వెల్లడైంది. మరి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఒక కొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని ఛార్జీంగ్ గా కూడా వాడుకోవచ్చంట. సెల్‌ఫోన్‌పై పెరుగుతున్న బ్యాక్టీరియాను నిర్మూలించేందుకు ఈ చార్జర్‌ సరైన ప్రత్యామ్నాయమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందులోని అతినీలలోహిత కిరణాలు ఫోన్‌పై ఉన్న సూక్ష్మక్రిములను కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తిగా తుడిచి పెట్టేస్తాయంట. బ్యాక్టీరియాను నిర్మూలించే ఈ చార్జర్‌ వెల 60 డాలర్ల(దాదాపు రూ.4 వేలు)ని దీన్ని రూపొందించిన 'ఫోన్‌ సోప్‌' కంపెనీ తెలిపింది

13:03 - August 26, 2015

మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం నుంచి 'సమంత'ని తప్పించారని సమాచారం. కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారంట. 'సమంత'ను ప్రధాన నాయికగా ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రం నుంచి 'సమంత'ని తొలగించి ఆ ప్లేసులో 'రకూల్ ప్రీత్ సింగ్' ని ఓకే చేశారట. '1'నేనొక్కడినే టైమ్ లో 'మహేష్' పోస్టర్ విషయంలో 'సమంత' వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం నుంచి సమంతను తొలగించడానికి కారణం అది కాదంట. ఓ ఫ్రెష్ ఫేస్ ని ఎంపిక చేసుకుంటే కథలో కిక్కు పెరుగుతుందని మహేష్ సూచించారని ఇండస్ట్రీ టాక్.

బాట సింగారం దగ్గర చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : దొంగల అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. హయత్‌నగర్ మండలం బాట సింగారం దగ్గర బైక్‌పై వెళుతున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళ బైక్‌పై నుంచి కింద పడింది. తీవ్రంగా గాయాలయిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దొంగల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో దొంగలు కాపుకాసి ప్రయాణికుల వద్ద నుంచి సొమ్మును దోచుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించడానికే ప్రజలు భయపడుతున్నారు.

12:58 - August 26, 2015

త్రిష...త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఎన్నో ఏళ్లుగా నటిస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలతో నటించి స్టెప్పులేసింది. తెలుగు, తమిళ భాషల్లో'త్రిష కథానాయికగా 'నాయకి' చిత్రం రూపొందుతోంది. ఇది హీరోయిన్ ఓరిటెంటెడ్ చిత్రం. ఈ చిత్ర పాత్ర కోసం ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పడరాని పాట్లు పడుతోందంట. ఎందుకంటే తన వయస్సు కన్నా పదేళ్లు తక్కువ కనబడాలంట. అందుకోసం తిండి త‌గ్గించేసి, క‌స‌ర‌త్తులు అవీ చేసేస్తోంది. సినిమాలోని పాత్రకు తగ్గట్టు నప్పాలనే యత్నం. హార‌ర్‌ కామెడీ క‌ధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా 1980 ప్రాంతంలో జ‌రిగిన క‌ధ‌తో రూపొందుతోంద‌ట‌. చిత్ర క‌ధానుసారం త్రిష ఇర‌వై ఏళ్ల వ‌యసున్న యువ‌తి పాత్ర పోషిస్తోంద‌ట‌. త‌నంత తానే అవ‌స‌రాన్ని అర్ధం చేసుకుని క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేసింద‌ని టాక్. ఇప్పటికే చెప్పుకోద‌గ్గ స్థాయిలో బ‌రువు త‌గ్గింద‌ని స‌మాచారం. బ‌రువైతే త‌గ్గొచ్చు గాని వ‌య‌సుతో పాటు ముఖంలో వ‌చ్చే మార్పుల్ని ఆప‌లేం క‌దా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పాత్రకు త‌గ్గట్టుగా త్రిష రూపాన్ని తీర్చిదిద్దడానికి ముంబ‌యికి చెందిన ఒక మేక‌ప్ ఆర్టిస్ట్ ను, కాస్ట్యూమ్ డిజైన‌ర్ ను రప్పిస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి 'నాయకి' చిత్రంలో 'త్రిష' ఎలా కనబడనుందో చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

గుజరాత్ లో ఆగిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు

హైదరాబాద్ : ఓబీసీ కోటా కోసం పటేల్ సామాజిక వర్గం చేపట్టిన నిరసన ప్రదర్శన, తదనంతర పరిణామాలు, రాష్ట్ర బంద్ నేపథ్యంలో గురజరాత్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి మోసానాలో మొదలైన హింస తాజాగా ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదు, సూరత్, సౌరాష్ట్రలకు కూడా పాకింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం పటేల్ సామాజిక వర్గాన్ని ముందుండి నడిపిస్తున్న 22 ఏళ్ల యువ సంచలనం హార్దిక్ పటేల్ ను నిర్బంధించింది. అంతేకాక అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది.  

గుజరాత్ బంద్ హింసాత్మకం..

హైదరాబాద్ : పటేల్ కులస్థుల ఆందోళనలతో గుజరాత్ అట్టుడుకుతోంది. ఉద్యమ నేత హర్దిక్ పటేల్ పిలుపుతో ఇవాళ రాష్ట్రబంద్ కొనసాగుతోంది. సూరత్, అహ్మదాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. భారీగా ప్రభుత్వం, ప్రైవేటు వాహనాలను తగులబెట్టారు. గుజరాత్ ఆర్టీసీ బస్సులు, చములు ట్యాకంర్లకు నిప్పుపెట్టారు.రాజ్‌కోట్‌లో ప్రభుత్వ కార్యాలయాల కిటికి అద్దాలు పగులగొట్టారు. బస్టాప్‌ను తగులబెట్టారు.

కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం వైఖరి చెప్పాలి: సుప్రీం...

హైదరాబాద్ : రాష్ట్ర విభజన కారణంగా కృష్ణా జలాల పంపిణీపై రేగిన వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. బ్రిజేష్‌కుమార్‌ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై నేడు వాదనలు జరిగాయి. తెలంగాణ తరపున వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

12:30 - August 26, 2015

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పాక్‌ సరిహద్దు ప్రాంతంలో రాహుల్‌గాంధీ పర్యటన కొనసాగుతోంది. బాల్‌కోట్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌ కాల్పుల్లో మృతిచెందిన కుటుంబ సభ్యులను రాహుల్‌ పరామర్శించారు. 

బొగ్గు గనిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

కరీంనగర్ : గోదావరిఖని బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. పైకప్పు కూలడంతో విధి నిర్వహణలో ఉన్న రాజయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసిన కార్మికులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 

 

ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం చేస్తున్నాయి. వారం రోజుల శిశువును ఎలుక కరిచింది. దీంతో ఆసుపత్రిలో ఎలుకల పై ఆరోగ్య శాఖ ఆరా తీశారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

వరంగల్ : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు సాదుతండాకు చెందిన వెంకన్న (45) అనే రైతు అప్పుల బాధతో బుధవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడాడు. వివరాల్లోకి వెళ్తిఏ... వెంకన్న ఏడాది క్రితం కుమార్తె పెళ్లి నిమిత్తం కొంత అప్పు చేశాడు. తన రెండెకరాల్లో ఈఏడాది కూడా పంట నస్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. ఆ బాధ తాళలేక బుధవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎం కు సుప్రీంలో ఊరట

హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబం టుకీకి సుప్రీం కోర్టులో వూరట లభించింది. అవినీతి ఆరోపణలపై విచారణ జరపించాలన్న గువాహటి హైకోర్టు ఉత్తర్వులపై బుధవారం సుప్రీం స్టే మంజూరు చేసింది.

నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం అయ్యారు. స్వచ్ఛ భారత్ పై నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

కృష్ణా జలాల వివాదంపై విచారణ వాయిదా..

న్యూఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని కోర్టు పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలోనే వాటా అడగాలని కోర్టు అభిప్రాయపడింది. తెలంగాణ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తెలంగాణ తరపున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.

ఇంజక్షన్ సైకోను పట్టుకుంటాం: మంత్రి పీతల

ప.గో : జిల్లాలో కలకలం సృష్టిస్తున్న ఇంజెక్షన్‌ సైకోను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఇంజెక్షన్‌లో వాడే మందు తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు భయాందోళనకు లోనుకావద్దని, పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారని చెప్పారు.  

11:31 - August 26, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన, భూ సేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 

11:27 - August 26, 2015

ప.గో: తన కుమార్తెకు ఏ తెలుగు రాష్ట్రంలోనూ ఉద్యోగం రాదన్న మనస్తాపంతో ఓ తండ్రి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితులు, తెలుగు ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం ఎలా ఉందన్న విషయానికి ఈ ఘటన సజీవ సాక్ష్యం. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరుకు చెందిన దుర్గా ప్రసాద్ కు నిఖిల అనే కుమార్తె ఉంది. ఆమె వరుసగా నాలుగేళ్లు రంగారెడ్డి జిల్లాలో చదువుకుంది. రాష్ట్ర విభజన తరువాత, నిఖిలకు స్థానికత లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయగా, వరుసగా నాలుగేళ్లు ఏపీలో చదవలేదన్న కారణం చూపుతూ, డీఎస్సీ రాసేందుకు ఆంధ్రా అధికారులు నిరాకరించారు. దీంతో తన కూతురికి ఉద్యోగం రాదని మనస్తాపం చెందిన దుర్గా ప్రసాద్, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను తాడేపల్లి గూడెం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు రాజకీయ నాయకులు ప్రసాద్ ను పరామర్శించారు. 

ఏపీలో 30న పెట్రోల్ బంక్ ల బంద్....

గుంటూరు : ఈనెల 30 అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు పెట్రోల్ బంక్‌ల బంద్ చేస్తున్నట్లు ఏపీ పెట్రోల్‌బంక్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. ఏపీ సర్కార్ వసూలు చేస్తున్న అదనపు వ్యాటు వల్ల తాము నష్టపోతున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వ్యాట్ తక్కువగా ఉన్న పక్క రాష్ట్రాలకు వినియోగదారులు వెళ్లిపోతున్నందున అమ్మకాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్య

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే రైతు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ, పత్తి, ఉల్లిని సాగు చేసింది. వర్షాభావం వల్ల వేరుశనగ, పత్తి ఎండిపోయాయి. తెగుళ్లతో ఉల్లి నిరాశపరిచింది. ఐదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి తలెత్తడంతో భాగ్యమ్మ మనస్తాపానికి లోనైంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న భాగ్యమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంజయ్ దత్ కు 30 రోజుల పెరోల్ మంజూరు...

హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు, ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సంజయ్ దత్ కు మరోమారు పెరోల్ లభించింది. కుమార్తె అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ, తనకు పెరోల్ మంజూరు చేయాలని జూన్ నెలలో ఆయన దరఖాస్తు చేసుకోగా, విచారణ జరిపిన అధికారులు ఆయనకు 30 రోజుల పెరలోల్ ను మంజూరు చేశారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తరువాత మరో రెండు రోజుల్లో సంజయ్ జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. కాగా, అధికారులు 30 రోజుల పెరోల్ మంజూరు చేసినప్పటికీ, దీన్ని గరిష్ఠంగా మరో 60 రోజుల పాటు పొడిగించుకునే సదుపాయం ఉంది. దీంతో ఈ దఫా సంజయ్ మూడు నెలల పాటు బయట ఉంటాడని తెలుస్తోంది.

శ్రీశైలం నుండి 5వేల క్యూసెక్కుల నీరు విడుదల

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో తాగునీటి అవసరాలకు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా బుధవారం ఉదయం 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

ఆదిలాబాద్: తాంసీ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

10:41 - August 26, 2015

హైదరాబాద్ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో బిఎండబ్ల్యూ కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కిమ్స్‌ ఆస్పత్రి ఇన్‌ఛార్జి రాఘవేంద్రగా గుర్తించారు. కారులో మద్యం సీసాలను గుర్తించారు. రాఘవేంద్రది హత్యా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

10:39 - August 26, 2015

హైదరాబాద్ : ఏవోబీలో మావోయిస్టులు పంజా విసిరారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జాన్‌భాయి అటవీప్రాంతంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు బీఎన్‌ఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

10:37 - August 26, 2015

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజక్షన్ల కలకలం కొనసాగుతోంది. ఇంజక్షన్ల దాడి చేస్తోంది సైకో పనే నర్సాపుం డీఎస్పీ సౌమ్యా తెలిపారు. మరో ఈ వ్యవహారం పై ఏపీ సర్కార్, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఆమె టెన్ టివితో మాట్లాడుతూ... మంగళవారం దాడికి పాల్పడుతన్నట్లు ఓఅనుమానితుడ్ని పట్టుకున్నామని అయితే విచారణలో దాడికి పాల్పడింది అతను కాదని తెలిదని చెప్పారు. సైకో ఉపయోగిస్తున్నది మత్తు మందు కాదని, ఓన్లీ సూదిని మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిపారు. సైకోను పట్టుకునేందుకు 20 టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా బుధవారం పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుని దాడిలో సిద్ధాంతంలో సూర్యకుమారి అనే మహిళ గాయపడింది. పిల్లలు.., పెద్దలు తేడా లేకుండా ఆడవాళ్లను కనిపిస్తే ఇంజక్షన్‌ గుచ్చుతున్నాడు. ద్విచక్ర వాహనంలో చక్కర్లు కొడుతూ సూదితో గుచ్చి మాయమవుతున్నాడని తెలిపారు. ఇంతకీ సైకో ఎందుకు ఆడవారిని టార్గెట్ చేస్తున్నాడు? ఏం మందు ఎక్కిస్తున్నాడన్నది మాత్రం పోలీసులకు సవాలుగా మారింది. దాడికిగురైన బాధితుల రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపి పరీక్షిస్తున్నారు.

భద్రాచలం బస్టాండులో తుపాకీ మిస్ ఫైర్

ఖమ్మం: భద్రాచలం బస్టాండు వద్ద ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. తుపాకీ పేలుడుతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

బోయిన్ పల్లి వద్ద కారులో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి వద్ద కారు లో వ్యక్తి మృతేహాన్ని గుర్తించారు. మృతుడు కిమ్స్ ఆస్పత్రి మేనేజర్ రాఘవరావుగా గుర్తింపు. కారు లోపలనుంచి లాక్ అయి ఉంది. కారులో మద్యం సీసాలు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మావోయిస్టుల దాడిలో ముగ్గురు బీఎస్ ఎఫ్ జావన్ల మృతి

హైదరాబాద్ : నిషేధిత మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. ఒడిశాలో భద్రతా బలగాలపై మెరుపు దాడికి దిగారు. ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. మరో ఎనిమిది మంది జవాన్లను గాయాలపాల్జేశారు. మల్కన్ గిరి జిల్లా జాన్ భాయ్ అటవీ ప్రాంతంలో నేటి ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మావోలు మెరుపు దాడి చేశారు. మావోల దాడితో క్షణాల్లో తేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినా అప్పటికే నష్టం జరిగిపోయింది. బీఎస్ఎఫ్ జవాన్ల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో మావోలు అడవుల్లోకి పరారయ్యారు.  

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూడగా, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇక రూపాయి మారకం విలువ కూడా 46 పైసలు క్షీణించి 66.23 పైసల వద్దకు చేరుకుంది.  

ఆలేరు శివాలయంలో పంచలోహ విగ్రహాల చోరీ....

నల్లగొండ:ఆలేరులో మంగళవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. స్థానిక శివాలయం వీధిలోని శివాలయంలో ఉన్న నాలుగు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకు పోయారు. బుధవారం ఉదయం అర్చకులు ఆలయానికి రాగా విషయం తెలిసింది. ఆలయంలో ఉన్న రాముడు, సీత, ఆంజనేయుడు, లక్ష్మణుల విగ్రహాలను దుండగులు అపహరించారని ఆలయ కమిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

09:26 - August 26, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ ఇళ్ల పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలో అధికారులు సోదాలు చేపట్టారు. జనగామ డీఎస్సీ కార్యాలయంతో పాటు హన్మకొండ, నర్సంపేట, జనగామ, హైదరాబాద్ లోని ఇళ్లలోనూ ఏక కాలంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 1.5 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. దీని విలువ బహిరంగ మార్కెట్లు 10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

09:15 - August 26, 2015

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సుయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పర్యటనను ప్రారంభించారు. అసెంబ్లీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర... రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, శేర్‌లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజ్‌గిరిలో ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం వహిస్తోందని, బస్తీల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీటీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేజిన్నర బంగారంపట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తీసుకువచ్చిన కిలోన్నర బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి తన పాదరక్షల్లో బంగారు బిస్కెట్లు పెట్టి తీసుకువచ్చాడు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అధికారులు అక్రమ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

09:03 - August 26, 2015

హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల బుధవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.. రెండు సెకన్ల నుంచి 10 సెంకన్ల పాటు భూమి కంపించింది. సోంపేట మండలంలోని బారువా, మిమిడిపల్లి, ఎర్రముక్కాం, ఉప్పాల, తాళ్లభద్ర, కంచి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలువ చ్చినట్లుఉ స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా భూప్రకంపనలు కలకలం సృష్టించాయి.

గుజరాత్ రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో కర్ఫ్యూ

హైదరాబాద్ : గుజరాత్ లో పటేల్ వర్గం ఆందోళన హింసాత్మకంగా మారింది. ఓబీసీ కోటా కోసం నిరసన తెలుపుతూ గుజరాత్ బంద్ కు పటేల్ వర్గం పిలునిచ్చింది. అర్థరాత్రి ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలపై దాడి చేశారు. అంతే కాకుండా బిజెపి నేతలఇ ళ్లపై ఆందోళన కారులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. అహ్మదాబాద్, సూరత్, మోసానాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడంతో భారీగా పోలీసులు మోహరించారు. 9 ప్రాంతాంలో కర్ఫ్యూ విధించారు. పలు చోట్ల ఇంర్నెట్, మొబైల్ సర్వీసులు నిలిపివేశారు.

08:44 - August 26, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు ప్రాతిపదికే ప్రత్యేకహోదా అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సంజీవినిగా ప్రజల్ని నిమ్మించింది చంద్రబాబు ఇప్పుడు పేరు ఏదైనా అనడం సరికాదు. పార్లమెంట్ ఉన్న పత్రి ఒక్క పార్టీ ఏపీ ప్రజలను మోసం చేశాయా? ఏపికి నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తయారు చేయడమేటి? బీహార్ కు ఏ రోడ్ మ్యాప్ ఆధారంగా నిధులు ఇస్తామన్నారు? అస్సలు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా కాదా? అవసరం అయితే చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? స్టాక్ మర్కెట్ల హెచ్చ తగ్గులపై సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. కార్మికుల పీఎఫ్ ను స్టాక్ మార్కెట్లలో పెట్టారా? స్టాక్ మార్కెట్లో సంపద ఆవిరి అయ్యిందంటే సామాన్యుడు పై పెద్ద ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్టాక్ మార్కెట్లకు చీర్ లీడర్లలా వ్యవహరిస్తున్నాయా? తెలంగాణకు కూడా న్యాయం చేస్తామని పుర్విభజన చట్టంలో చెప్పబడింది. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ప్రజల్ని మోసం చేస్తోందా? ఇలాంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణాత్మకమైన వివరణ ఇచ్చారు. ఆ వివరణను మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

08:15 - August 26, 2015

.గో : జిల్లాలో గత మూడు రోజులుగా మహిళల పై ఇంజక్షన్ల దాడి కొనసాగుతోంది. తాజాగా ఈ రోజు ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతంలో యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి దుండగుడు పరారయ్యాడు. ఆ దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం ఓ దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. జిల్లాలో 5గురు సభ్యుల ముఠా ఈదాడులకు పాల్పడుతున్న తెలిపారు. వీరిని పట్టుకునే విధంగా పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాట్లు తెలిపారు. ఇంజక్షన్ల దాడికి గురైన వారి రక్త పరీక్షలను హైదరాబాద్ లేబరేటరీకి పంపి పరిశీలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

జనగామ డీఎస్పీ సురేందర్ ఇంటిపై ఏసీబా దాడులు...

వరంగల్ : ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో జనగామ డీఎస్పీ సురేందర్ ఇంటిపై, జనగామ డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది.

07:58 - August 26, 2015

హైదరాబాద్ : ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి మార్పూ లేదని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న సీపీఎం నేత బాబూరావు అన్నారు. విభజన చేసి కాంగ్రెస్ మోసం చేస్తే... ప్రత్యేక హోదా పై టిడిపి, బిజెపి మోసం చేస్తున్నాయా? ప్రత్యేక హోదా కంటే టిడిపి, బిజెపి, వైసీపీ రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయా? ప్రత్యేక హోదా అంటే సంజీవిని కాదు అన్న చంద్రబాబు వ్యాఖ్యలనుఎలా అర్థం చేసుకోవాలి. కేంద్రం ఇచ్చిన హామీలతో ఏపీ సర్కార్ సంతృప్తిగా ఉందా? ఇలాంటి అంశాలపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో బాబురావుతో పాటు వైసీపీ నేత నల్లా సూర్యప్రకాష్, టిడిపి నేత నన్నపనేని రాజకుమారి, బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కొనసాగుతున్న ఇంజక్షన్ల కలకలం

హైదరాబాద్ : ప.గో జిల్లాలో ఇంజక్షన్ల కలకలం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతంలో యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి దుండగుడు పరారయ్యాడు.

సోంపేట మండలంలో స్వల్ప భూప్రకంపనలు

శ్రీకాకుళం: సోంపేట మండలంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. బట్టిగల్లూరు, వ్రజపుకొత్తూరు తీర ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో స్థానికులు ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు.

సబ్సిడీ ఉల్లి అమ్మకాలపై తనిఖీలు చేపట్టిన గంటా...

విశాఖ : కంకర పాలెం రైతుబజారులో సబ్సిడీ ఉల్లి అమ్మకాలను పరిశీలించిన మంత్రి గంటా శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

రాజధాని ప్రాంతంలో వైసీపీ ఉద్యమ బాట

అమరావతి : రైతుల కోసం కొట్లాడుదాం... బాబుపై సమరభేరీ మోగిద్దాం... వైసీపీ శ్రేణులకు అధినేత జగన్‌ హితోపదేశమిది. భూ సేకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంతం రైతులతో సీఆర్డీఏ ఎదుట ధర్నాకు రెడీ అవుతోంది. 

నేను అనుకున్నదే చేస్తా:కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా. ఏం చేసినా రాష్ట్ర బాగోగుల కోసమే చేస్తాం. ఇదే విజన్‌తో ముందుకెళ్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విపక్షాలు, యూనియన్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అస్థిత్వం కోసమే రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. అరిచి గీపెట్టినా వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు. అనుకున్నది చేసి తీరుతామని తెగేసి చెప్పారు.

వరంగల్ వేదికగా గర్జించిన కామ్రేడ్లు

హైదరాబాద్ : ప్రజాక్షేత్రమే వేదికగా అమితుమీ తేల్చుకునేందుకు వామపక్షాలు రెడీ అయ్యాయి. అధికారమత్తులో మునిగితేలుతున్న టీఎస్‌ సర్కార్‌కు బ్యాలెట్‌తోనే బుద్ది చెప్పేందుకు సై అంటున్నాయి. ప్రజాతీర్పుతో అద్భుతమార్పులేమి జరుగకపోయినా గెలుపునిషాలో జోగుతున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పినట్లవుతుందని వరంగల్ వేదికగా గర్జించాయి.

ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించే పనిలో ఏపీ

విజయవాడ : ప్రజలు అక్కడ. పాలన ఇక్కడ. ఇంకెన్నాళ్లు..? అమరావతి పిలుస్తోంది. వెళ్లిపోదాం రండి. కొద్దిరోజులుగా ఉద్యోగులతో ఏపీ సర్కార్ చెబుతున్న మాటలివి. అన్నట్లుగానే ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై బాబు టీమ్ స్పీడ్ పెంచుతోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి చర్యలు వేగవంతం చేస్తోంది. ఏపీ కార్యాలయాల తరలింపుపై కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది.

ఏపీలో మరో పోరాటానికి సిద్ధమైన వామపక్షాలు

విజయవాడ : ఏపీలో మరో పోరాటానికి వామపక్షాలు సిద్ధమయ్యాయి. ఉద్యమానికి కార్యాచరణ ప్రకటించాయి. రాజధాని భూసేకరణ, కరవు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు సమాయత్తమయ్యాయి. కరవు ప్రాంతాల్లో పర్యటించి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి.  

మెట్రోకు బెజవాడ పనికి రాదన్న కేంద్రం

హైదరాబాద్ : ఇప్పటికే సర్వే పూర్తైంది. సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది. ముహూర్తం ఖరారు చేసి...కొబ్బరి కాయ కొట్టడమే ఆలస్యమనుకున్నారు. పిల్లర్లు వేసి...పట్టాలు పరవటమే తరువాయని భావించారు. కాని అంతోలోనే బెజవాడ వాసుల ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు మెట్రో రాదని కేంద్రం.... చావు కబురును చల్లగా చెప్పింది. మెట్రో రైలు కూతపెట్టేంత సీను...బెజవాడకు లేదని తెగేసి చెప్పింది. 

మతం ప్రాతిపదికన 2011 జనాభా లెక్కలు విడుదల

హైదరాబాద్ : మతం ప్రాతిపదికన... 2011 జనాభా లెక్కలు విడుదలయ్యాయి. మొత్తంగా హిందువులు అత్యధికంగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నా... జనాభా పెరుగుదల రేటులో మాత్రం... ముస్లింలు అగ్రస్థానంలో నిలిచారు. ఇదే ఒరవడి కొనసాగితే... 2050కి.. ముస్లింలు ఎక్కువగా వున్న దేశంగా భారతదేశం నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

07:20 - August 26, 2015

హైదరాబాద్ : గుజరాత్‌లో బలమైన కమ్యూనిటీ గల పటేల్ వర్గం గర్జించింది. తమను ఓబిసిలో చేర్చాలని భారీ ర్యాలీ నిర్వహించింది. సర్దార్‌ పటేల్‌ వారసులమైన తమకు న్యాయం చేయాల్సిందేనంటూ పట్టుబడుతోంది. దీంతో రిజర్వేషన్ లొల్లి ముదురుతోంది. పటేల్‌ల ఆందోళన ఉద్రిక్తంగా మారుతోంది. అర్ధరాత్రి పటేట్ వర్గీయులు హల్‌చల్ చేశారు. పలుచోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. బస్సుల్ని, వాహనాల్ని తగలబెట్టారు.

బలమైన కమ్యూనిటీ గల పటేల్ వర్గం .....

గుజరాత్ రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీ గల పటేల్ వర్గం అహ్మదాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి లక్షలాదిగా జనం తరలివచ్చారు. వెనకబడిన తరగతుల కులాల జాబితాలో తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్‌ వర్గం భారీ సభ నిర్వహించింది. ఇంత పెద్ద ర్యాలీకి నేతృత్వం వహించింది 22 ఏళ్ల యువకుడు హార్దిక్‌ పటేల్‌ అంటే నమ్మలేం కానీ ఇది నిజం.

దేశవ్యాప్తంగా 27 కోట్లు మంది....

గుజరాత్‌లో 80 లక్షల మంది, దేశవ్యాప్తంగా 27 కోట్లు మంది పటేల్‌ సమాజానికి చెందిన వారున్నారన్న హార్ధిక్‌, దేశవ్యాప్తంగా చట్టసభల్లోనూ 172 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. బీహార్‌లో నితీష్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తమవారేనని పేర్కొన్నాడు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కమ్యునిటికి చెందిన తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 2017 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని హార్ధిక్‌ పటేల్‌ హెచ్చరించారు.

ఆగస్టు 25ను పాటిదార్ క్రాంతి దివస్‌గా ......

ఆగస్టు 25ను పాటిదార్ క్రాంతి దివస్‌గా ప్రకటిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి చెందినవాళ్లం కాదు. పాటిదార్ కమ్యూనిటికి చెందినవారం మాత్రమే. నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తమ ఐదు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హార్ధిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

పటేల్ వర్గం డిమాండ్లను సీఎం తిరస్కరణ....

పటేల్ వర్గం డిమాండ్లను సీఎం తిరస్కరించారు. పటేల్‌ కమ్యునిటీకి రిజర్వేషన్‌ ఇవ్వలేమని, ఆందోళన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్ కూడా అదే కమ్యునిటీకి చెందినవారు కావడం గమనార్హం.

డిమాండ్లను ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని పడగొడ్తాం.....

మరోవైపు పటేల్‌ వర్గం డిమాండ్లను ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని పడగొడ్తామని ఓబిసిలు హెచ్చరించారు. రిజర్వేషన్‌ కల్పించాలన్న పటేల్‌ వర్గం డిమాండ్‌ను సామాజిక కార్యకర్త జిగ్నేష్‌ మోవాని తప్పు పట్టారు. పటేల్‌ సముదాయం వాణిజ్య, రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్య వర్గంగా ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. పటేల్ వర్గ నిరసన కార్యక్రమంతో ప్రభుత్వం అహ్మదాబాద్‌లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. వేలాదిమంది పోలీసులు, పారామిలటరీ బలగాలతో శాంతిభద్రతలకు భంగంవాటిల్లకుండా భద్రతను పర్యవేక్షించింది.

07:16 - August 26, 2015

హైదరాబాద్ : శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరో రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. జీఎస్ ఎల్వీ -డి6 ను నింగిలోకి పంపేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఈ అద్భుత ప్రయోగానికి షార్ వేదిక కానుంది. గురువారం సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌-డీ6 నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే 29 గంటల ముందుగానే... అంటే బుధవారం ఉదయం 11 గంటల 52 నిమిషాలకు కౌంట్‌ డౌన్ ప్రక్రియ జరగనుంది.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం .....

జీఎస్ ఎల్వీ -డి6 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం కలిగిన క్రయోజనిక్ రాకెట్‌. ఈ వాహన నౌక ద్వారా జీశాట్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. 2,117 కిలోల బరువు గల జీశాట్-6లో... 1,132 కిలోల ఇంధనం, 985 కిలోల ఉపగ్రహం ఉంది. అంతేకాకుండా ఇందులో 10 ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 250 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇది 12 ఏళ్ల పాటు పని చేస్తుంది.

జీశాట్‌-6 ఉపగ్రహంలో 6 డయా మీటర్ల యాంటెనా....

జీశాట్‌-6 ఉపగ్రహంలో 6 డయా మీటర్ల యాంటెనా ఉంటుంది. కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించిన వెంటనే అది తెరుచుకుని పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ఉపగ్రహ సేవలు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. జీఎస్ ఎల్వీ -డి6 విజయవంతమైతే... దేశంలో ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అలాగే ట్రాకింగ్, విమానాల భద్రత, డిజిటల్ ఆడియో, వీడియో ప్రసారాలు, మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయాలు ఈ శాటిలైట్ ప్రయోగం ద్వారా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ ఎఫ్ బలగాలతో పాటు ఏపీ పోలీసులు, స్పెషల్ పోలీసు బలగాలు శ్రీహరికోట పరిసర ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతున్నారు.

07:10 - August 26, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోది ఆ రాష్ట్రానికి లక్షా 25 వేల కోట్ల ప్రత్యేక ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో రాజకీయ పార్టీలు ఆందోళన మొదలు పెట్టాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కూడా కలుసుకున్నారు. దీంతో మేల్కొన్న తెలంగాణ అధికార పార్టీ ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏనాడూ ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌ చేయని గులాబీ శ్రేణులు ఇపుడు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి.

కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు టిఆర్ఎస్‌ వ్యూహం.......

బీహార్‌ మాదిరే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ విధానాన్ని అమలు చేసే అవకాశాలున్నాయని టిఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై వత్తిడి తెస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

విభజన చట్టంలోని అంశాలపై మాత్రమే.....

ఇప్పటివరకు విభజన చట్టంలోని అంశాలపై మాత్రమే కేంద్రంతో సంప్రదింపులు జరిపిన గులాబీ నేతలు త్వరలో ప్రత్యేక ప్యాకేజీపై ద్విముఖ వ్యూహంతో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీలు తమతో కలిసి రావాలని విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని టిఆర్ఎస్‌ రచిస్తోంది. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

అనుకూలం మార్చుకునేందుకు అధికార పార్టీ స్కెచ్‌...

కేంద్రం తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తమకు అనుకూలం మార్చుకునేందుకు అధికార పార్టీ స్కెచ్‌ వేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ప్యాకేజీ ఇస్తే ఆ ఘనత తమకే దక్కుతుంది. కేంద్రం స్పందించకుంటే తాము పోరాడినా కేంద్రం పట్టించుకోలేదనే సంకేతాలను జనం దృష్టికి తీసుకెళ్లేదుకు మార్గం సుగమమం అవుతుందన్న వ్యూహంతో టిఆర్‌ఎస్‌ ఉంది. 

07:07 - August 26, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై భ్రమలు తొలగిపోయాయి. రేపు,మాపు అంటూ ఊరించిన ఊహలు తేలిపోయాయి. స్పెషల్ స్టేటస్ రాదని దాదాపు తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేరుస్తామని చెబుతూనే...చట్టంలో లేని స్టేటస్‌ హామిపై ఆశలు వదులుకోవాలని అరుణ్‌ జైట్లీ పరోక్షంగా సెలవిచ్చారు. మన్మోహన్ ఇచ్చిన ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని, ఏదో ఒక రూపంలో దాని ప్రయోజనాలు అందిస్తామనడంతో స్టేటస్ ఆశలపై నీళ్లుచల్లినట్టయ్యింది.

స్వరం మార్చి బిజెపి...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పదేళ్లు ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో గొంతు చించుకున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక స్వరం మారుస్తోంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అనేక అడ్డంకులున్నాయిని పరోక్షంగా సెలవిస్తున్న కేంద్రం... చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాక్షిగా మరింత క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన దాన్ని కన్నా ఎక్కువ సాయం చేస్తామంటూనే ముఖ్యమైన ఆశైనా ప్రత్యేక హోదాను గోదాలోకి నెట్టేసినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించింది.

హామీల అమలుకు రోడ్ మ్యాప్.......

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడులను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని నిర్మాణం, పోలవరంకు నిధులు, విభజన చట్టంలోని హామీలుపై ప్రధానంగా చర్చించారు. తర్వాత జైట్లీ, చంద్రబాబు ఇద్దరూ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని జైట్లీ తెలిపారు. విభజన చట్టంలోని హామీల అమలుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని నీతి ఆయోగ్‌ అధికారులను ప్రధాని ఆదేశించారని చెప్పారు జైట్లీ.

విమర్శలు హోరెత్తుతున్నా....

ప్రత్యకే హోదాపై ఆందోళనలు,ప్రతిపక్షాల విమర్శలు హోరెత్తుతున్నా అరుణ్ జైట్లీ యధావిధిగా దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షపై నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా ఆర్థిక సాయం అందిస్తామన్న జైట్లీ...దీన్ని స్పెషల్ స్టేటస్ అనుకోవచ్చు లేదంటే ఆర్థిక వెసులుబాటు అనుకున్నా పర్వాలేదన్నారు. ప్రత్యేక హోదా వలన లభించేవన్నీ ఏపీకి వస్తాయన్నారు. అలాగని ఏపీకి పదేళ్లు ప్రత్యక హోదా ఇస్తామన్న హామిపై వెనక్కితగ్గమన్నారు.

46,90,94లోని హామీలను నెరవేరుస్తాం....

విభజన చట్టంలోని 46,90,94లోని హామీలను నెరవేరుస్తామన్నారు జైట్లీ. సెక్షన్‌ 94లో ఉన్న హామీలు ఏంటంటే...తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థికవృద్దికి చర్యలు, ఇరు రాష్ట్రాలకూ పన్ను రాయితీలు, పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు అమరావతి నిర్మాణం కోసం అటవీ భూముల డీనోటిఫై. ఇక సెక్షన్‌ 40లో ఇరు రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాటుకు సహకారం.

నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్న వెంకయ్యనాయుడు...

మరోవైపు ప్రత్యేక హోదా పేదళ్లు కావాలంటూ నాడూ పార్లమెంటులో ఆవేశంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్‌ స్టేటస్‌కు జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళికా సంఘం అనుమతిలేదని చెప్పారు. వీటి ఆమోదం కావాలంటే 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని చెప్పారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన దాని కన్నా ఎక్కువే చేస్తామంటున్న కేంద్రం...అభివృద్ధికి మూలమని ఆశిస్తున్న ప్రత్యేక హోదాపై మాత్రం దాటవేత దోరణి అవలంభిస్తోంది.

07:01 - August 26, 2015

హైదరాబాద్ : మన దేశంలో ఇప్పుడొక అలజడి మొదలైంది. కొన్ని కోట్ల మందిలో కొత్త అభద్రతాభావం ప్రవేశించింది. ఈ క్షణం గడిస్తే మరుక్షణంలో తమ జీవితం ఏమవుతుందోనన్న దిగులు ఆవహించింది. పని చేయనివాడో, పని చేతకానివాడో అభద్రతాభావంలో వుంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ , అదేమి చిత్రమో కానీ, మనదేశంలో పనిచేసేవారు, పొద్దస్తమానం చెమటోడ్చేవారు, తమ రెక్కల కష్టంతో ఈ దేశాభివ్రద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నవారు అభద్రతాభావంతో ఆందోళన చెందుతున్నారు.

అభద్రతకీ, భయానికీ ఏకైక కారణం....

ఇలా అభద్రతాభావంతో కలవరపడుతున్నవారి సంఖ్య కోట్ల సంఖ్యలో వుంది. ఇంతమంది అభద్రతకీ, భయానికీ ఏకైక కారణం కేంద్ర ప్రభుత్వం విధానాలు. తమ ప్రభుత్వం తమకు రక్షా కవచంలాగా పనిచేయాలని ఏ పౌరుడైనా, ఏ కార్మికుడైనా కోరుకుంటాడు. కానీ, తమకు రక్షణగా పనిచేయాల్సిన ప్రభుత్వమే తమ పట్ల నిర్ధయగా వ్యవహరిస్తోందన్న భావం కార్మికుల్లో గూడుకట్టుకుంటోంది. ఇందుకు కారణం కార్మిక చట్టాల్లో వస్తున్న మార్పులే.

కార్మిక చట్టాలు మారితే....

ఇప్పుడు కార్మిక చట్టాలు మారుతున్నాయి. ఇంతకాలమూ కార్మిక శ్రేయస్సును కాంక్షించి, వారి సామాజిక భద్రతను ఆపేక్షించి చేసిన చట్టాలకు ఇప్పుడు తూట్లు పడుతున్నాయి. తాము పనిచేసే చోట సంఘం పెట్టుకోవడమూ, తమ కోరికలను యాజమాన్యాలకు విన్నవించడమూ, అవసరమైతే సమ్మెకు దిగడం ఇలాంటివన్నీ నేరంగా పరిగణించే రోజులు వస్తున్నాయన్న ఆందోళన కొన్ని కోట్ల మందిని సమ్మెకు పురిగొల్పుతోంది.

చట్టాలన్నీ యజమానుల చుట్టాలుగా .....

తాము ఇంతకాలమూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్న చట్టాలన్నీ యజమానుల చుట్టాలుగా మారుతున్నాయన్న ఆవేదన కార్మికవర్గంలో ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. అసలు మనదేశంలో కార్మిక చట్టాల పరిధిలో రక్షణలు పొందే కార్మికుల సంఖ్యే చాలా స్వల్పం. దాదాపు 90 శాతం మంది అసంఘటితరంగంలోనే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. సంఘటిత రంగంలో పనిచేసేవారిలోనూ 70శాతం మంది కార్మిక సంక్షేమ చట్టాలకు నోచుకోలేని దౌర్భాగ్యం. తాము పనిచేస్తున్న స్థలంలో తాగేందుకు స్వచ్ఛమైన మంచినీళ్లు వుండాలనీ, తినేందుకు శుభ్రమైన భోజనశాల వుండాలనీ, పని చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ వైద్యసాయం అందాలని, తమకు నిర్ధిష్టమైన పని గంటలు వుండాలనీ, తమ ఉద్యోగానికి భద్రత వుండాలనీ, తాము రిటైరన తర్వాత వ్రుద్ధాప్యంలో ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా బతికేందుకు అవసరమైన పెన్షన్ పథకాలు వుండాలనుకోవడం గొంతెమ్మ కోరికేమీ కాదు. కానీ, ఇలాంటి చిన్నచిన్న కోరికలు కోరడమే నేరమయ్యే రోజులు రాబోతున్నాయి. కార్మిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, తీసుకొస్తున్న చట్టాలు, సవరణలు చూస్తుంటే ఇలాంటి భయమే కలుగుతోంది. 

06:58 - August 26, 2015

హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ చూసినా సెప్టెంబర్ 2 గురించే చర్చ నడుస్తోంది. ఆ రోజు మన దేశంలో కార్మికులంతా సమ్మె చేయబోతున్నారు. దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇంతకీ సెప్టెంబర్ 2 సమ్మెకి కారణం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? గత కొంతకాలంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో హెచ్ ఎం ఎస్ నేత ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss