Activities calendar

27 August 2015

22:12 - August 27, 2015

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్ట్‌ మహ్మద్‌ నవేద్‌...పట్టుబడి పట్టుమని నెలరోజులు కూడా కాలేదు...ఇంతలోనే మరో ఉగ్రవాది ఉత్తర కశ్మీర్‌లో భద్రతా దళాలకు సజీవంగా చిక్కాడు. 22 ఏళ్ల ఈ టెర్రరిస్ట్‌ పేరు జావేద్‌ అహ్మద్‌...అలియాస్‌ సజ్జాద్‌ అలియాస్‌ ఉబేదుల్లా. ఇతడు పాకిస్తాన్‌లోని ముజఫర్‌గడ్‌కు చెందినవాడని విచారణలో బయటపడింది.
ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదుల మృతి
పాకిస్తాన్‌కు చెందిన జావేద్‌ అహ్మద్‌ మరో నలుగురు అనుచరులతో కలిసి భారత సరిహద్దులోకి ప్రవేశించారు. ఉత్తర కశ్మీర్‌లో దాదాపు 20 గంటలపాటు సాగిన సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో జావేద్‌ అహ్మద్‌ ఒక్కడే సైన్యానికి సజీవంగా దొరికాడు.
రఫియాబాద్‌లోని గుహలో దాక్కున్న ఉగ్రవాదులు
ఉగ్రవాదులు తొలుత ఉరీలోనే ఉన్నారన్న సమాచారం అందింది. అయితే అక్కడి నుంచి వారు తప్పించుకున్నారు. బుధవారం సాయంత్రం రఫియాబాద్‌లోని ఓ గుహలో దాక్కున్నటు తెలియడంతో సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో బుధవారం సాయంత్రం ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మరో ముగ్గురు టెర్రరిస్టులు రోజంతా జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
జావేద్‌ ను విచారణ జరుపుతున్న అధికారులు 
సజీవంగా పట్టుబడ్డ జావేద్‌ అహ్మద్‌ను అధికారులు శ్రీనగర్‌కు తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఉధంపూర్‌లో మహ్మద్‌ నవేద్‌ను గ్రామస్థులు పట్టుకుని సైన్యానికి అప్పగించిన విషయం తెలిసిందే. పాక్‌ అధీనంలోని కశ్మీర్‌లో లష్కర్‌-ఎ-తోయిబా ఉగ్రవాదులకు శిక్షణనిస్తోందని విచారణలో భాగంగా నవేద్‌ వెల్లడించాడు.
పాకిస్తాన్‌ ఎలా స్పందిస్తుందో 
సీమాంతర ఉగ్రవాదంపై చర్చ జరపాలని భారత్‌ పట్టుబట్టింది. పాక్‌ మాత్రం కశ్మీర్‌ అంశం లేకుండా చర్చలు జరపమని స్పష్టం చేయడంతో భారత, పాక్‌ల మధ్య జాతీయ భద్రత సలహాదారుల సమావేశం రద్దయిన విషయం తెలిసిందే. నవేద్‌తో పాటు తాజాగా మరో ఉగ్రవాది పట్టుబడడంపై పాకిస్తాన్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

22:03 - August 27, 2015

మహిళలు నడుం కట్టారు. చేయి చేయి కలిపి దండు కట్టారు. సర్కారు చీప్ వ్యూహాలపై సమరానికి శ్రీకారం చుట్టారు. చీప్ లిక్కరా... లేక ప్రజారోగ్యమా.. అంటూ కందం తొక్కుతున్నారు. తెలంగాణాలో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సబలలు రగల్ జెండా ఎగరేస్తున్నారు. చీప్ లిక్కర్ వరద పారిస్తామంటున్న తెలంగాణ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా రగులుతున్న ఉద్యమంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:51 - August 27, 2015

బీజింగ్ : మానవచిరుత, జమైకన్ వండర్ రన్నర్ ఉసేన్ బోల్ట్...బీజింగ్ ప్రపంచ అథ్లెటిక్స్ స్ప్రింట్స్ లో డబుల్ గోల్డ్ తో అదరగొట్టాడు. 100 మీటర్ల పరుగులో మాత్రమే కాదు..200 మీటర్ల రేస్ లో సైతం చాంపియన్ గా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్ స్టేడియంలో ముగిసిన 200 మీటర్ల ఫైనల్లో బోల్ట్ 19.55 సెకన్ల రికార్డుతో బంగారు పతకం అందుకొన్నాడు. బోల్ట్ ప్రధాన ప్రత్యర్థి, అమెరికన్ స్ర్పింటర్ జస్టిన్ గాట్లిన్ ..రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే తన కెరియర్ లో తొమ్మిది బంగారు పతకాలు సాధించిన బోల్ట్ కు ..ఇది 10వ గోల్డ్ కావడం విశేషం. 200 మీటర్ల పరుగు చరిత్రలో ఐదవ అత్యుత్తమ టైమింగ్ ను బోల్ట్ బీజింగ్ మీట్ లో నమోదు చేశాడు.

 

21:45 - August 27, 2015

ఢిల్లీ: జాతీయ కార్మిక సంఘాలతో కేంద్రకేబినెట్ సబ్ కమిటీ రెండోరోజు జరిగిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. కార్మికసంఘాలు, మంత్రివర్గ ఉపసంఘం మధ్య కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. అయితే సెప్టెంబర్ 2 సమ్మెను విరమించుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం కార్మిక సంఘాలను కోరింది. వామపక్ష కార్మికసంఘాలు మాత్రం అన్ని డిమాండ్లను పరిష్కరించాలని.. లేకపోతే సమ్మె తప్పదని స్పష్టం చేశాయి.

 

21:41 - August 27, 2015

ఢిల్లీ: యావత్‌ దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన జీఎస్ ఎల్ వీ-డీ6 ప్రయోగం విజయవంతమయింది. శ్రీహరికోట నుంచి సరిగ్గా సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు... నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రయోగం సక్సెస్ చేసి మరో విజయబావుటా ఎగురవేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
నింగిలోకి జీఎస్ ఎల్ వీ-డీ6
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన GSLV-D6 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ అద్భుత ప్రయోగానికి షార్ వేదిక కాగా గురువారం సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌-డీ6 నింగిలోకి వెళ్లింది.
నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహం
జీఎస్ ఎల్ వీ-డీ6 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం కలిగిన క్రయోజనిక్ రాకెట్‌. ఈ వాహన నౌక ద్వారా జీశాట్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని సరిగ్గా 5గంటల 5 నిముషాలకు నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. 2,117 కిలోల బరువు గల జీశాట్-6లో... 1,132 కిలోల ఇంధనం, 985 కిలోల ఉపగ్రహం ఉంది. అంతేకాకుండా ఇందులో 10 ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేశారు. జీశాట్‌-6 ఉపగ్రహంలో 6 డయా మీటర్ల యాంటెనా ఉంది కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించిన వెంటనే అది తెరుచుకుని పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న జీఎస్ ఎల్ వీ-డీ6 విజయవంతం కావటంతో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. జీశాట్-6 ఉపగ్రహ సేవలు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. జీఎస్‌ఎల్‌వీ-డీ6 విజయవంతమైతే... దేశంలో ఎస్-బ్యాండ్ కమ్యూనికేషన్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. 

గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి భూసమీకరణ విధివిధానాలు

హైదరాబాద్: గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధికి భూసమీకరణ విధివిధానాలను ప్రకటిస్తూ... ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో అభివృద్ధి చేసిన స్థలాలు.. రాజధానికి భూములు ఇచ్చిన వారితో సమానంగా వార్షిక చెల్లింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

మెదక్: సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఫాంహౌస్ లోనే సీఎం మాకం వేయనున్నారు.

 

20:43 - August 27, 2015

విజయవాడ: అమరావతి కోసం భూములు కోల్పోయిన అసైన్డ్‌దారులకు కౌలు చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేత నటరాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏపీ వ్యవసాయ కార్మికసంఘం, కులవివక్ష పోరాటసంఘం సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక కుటుంబానికి 9వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

20:37 - August 27, 2015

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 98 స్మార్ట్‌ సిటీల జాబితాను కేంద్రం విడుదల చేసింది. స్మార్ట్‌ సిటీ నగరాలపై ఉత్కంఠ తొలగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 98 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రకు స్మార్ట్‌ సిటీల జాబితాలో కేంద్ర పెద్ద పీట వేసింది. ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలు, తమిళనాడులో 12 నగరాలు, మహారాష్ట్రలో 10 నగరాలు స్మార్ట్‌ సిటీలుగా రూపొందనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 2 నగరాలను కేంద్రం స్మార్ట్‌ సిటీల కింద చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి... తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌ నగరాలకు స్మార్ట్‌ సిటీల జాబితాలో చోటు దక్కింది. జమ్ముకాశ్మీర్‌ను మినహాయిస్తే దాదాపు ప్రతి రాష్ట్రానికి ఓ స్మార్ట్‌ సిటీ దక్కనుంది.
నగర జీవన ప్రమాణాల పెంపే ముఖ్య ఉద్దేశం
నగర జీవన ప్రమాణాలను పెంచడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వాస్తవిక దృష్టితోనే ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరని పేర్కొన్నారు.
డిజిటలైజేషన్, ఈ గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత
స్మార్ట్‌ సిటీల్లో భాగంగా నగరంలో పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. డిజిటలైజేషన్, ఈ గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. చెత్త చెదారంతో పవర్‌ ఉత్పత్తి, కంపోస్టు ఎరువుల తయారీకి ప్రాజెక్టులు రూపొందిస్తారు. స్వచ్ఛమైన తాగునీటిని అందజేయడం, స్మార్ట్‌ పార్కింగ్‌, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, టెలి మెడిసన్‌, టెలి ఎడ్యుకేషన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెంకయ్య పేర్కొన్నారు.
తొలివిడతలో 20 టాప్‌ నగరాల అభివృద్ధి
మొదటి విడత ప్రాజెక్టులో భాగంగా 20 టాప్‌ నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండేళ్ల తర్వాత మిగతా నగరాలను అభివృద్ధి చేయనుంది. రాబోయే ఆరేళ్లలో స్మార్ట్‌ సిటీల కోసం కేంద్రం 3 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద స్మార్ట్‌ సిటీగా ఎంపికైన ప్రతి నగరానికి ప్రతి ఏడాది వందకోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు మంజూరు చేయనుంది.

 

ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్య

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని త్వరగా పరిశీలించాలని కేంద్రదమంత్రి వె నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడిని కోరారు. రాజ్యసభ వేదికగా గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎపికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన విషయాన్ని వెంకయ్య ఆయనకు గుర్తు చేశారు. ప్రత్యేకహోదాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ సాయం, పోలవరానికి నిధుల విషయంపైనా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడికి వివరించారు. 

ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్య

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని త్వరగా పరిశీలించాలని కేంద్రదమంత్రి వె నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడిని కోరారు. రాజ్యసభ వేదికగా గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎపికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన విషయాన్ని వెంకయ్య ఆయనకు గుర్తు చేశారు. ప్రత్యేకహోదాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ సాయం, పోలవరానికి నిధుల విషయంపైనా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడికి వివరించారు. 

సెప్టెంబర్ 17 నుంచి కేసీఆర్ విదేశీ పర్యటన..

హైదరాబాద్: సెప్టెంబర్ 9 నుంచి 17 వ తేదీ వరకు సీఎం కేసీఆర్ విదేశీ పర్యటన చేయనున్నారు. చైనా, ఉత్తర కొరియా, తైవాన్, జపాన్ లలో సీఎం పర్యటించనున్నారు. 

'అనంత' జిల్లాలో విషాదం

అనంతపురం: జిల్లాలో విషాదం నెలకొంది. బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి పదో తరగతి విద్యార్థిని హరితకు మంటలు అంటుకున్నాయి. ఆమెను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిత పరిస్థితి విషమంగా ఉంది.

 

గృహ నిర్మాణాల అనుమతి కోసం సింగిల్ విండో విధానం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ పరిధిలోని గృహ నిర్మాణాల అనుమతి కోసం సింగిల్ విండో విధానం అమలు చేయాలని టీ.ప్రభుత్వం నిర్ణయించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పద్మారావు, నాయిని నర్సింహ్మారెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించి... నిధులు కేటాయించకుండా వదిలేసిన వాంబే, ఇందిరమ్మ లాంటి ఇళ్లను జీహెచ్ ఎంసీ కార్మికులు, హోంగార్డులను 4 వ తరగతి ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించారు.

 

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలోని 563 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీకి ఈనెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 29 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 28. అక్టోబర్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. 

రిలీవ్ అయిన విద్యుత్ ఉద్యోగులపై స్పందించిన బాబు..

విజయవాడ: టీఎస్ జెన్ కో నుంచి రిలీవ్ అయిన విద్యుత్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు స్పందించారు. 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న 520 మంది ఉద్యోగుల విషయంలో సత్వరం చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఉద్యోగులకు బాబు హామీ ఇచ్చారు. 

కార్మికసంఘాలు-కేబినెట్ ఉపసంఘం చర్చలు అసంపూర్ణం

ఢిల్లీ: జాతీయ కార్మిక సంఘాలతో రెండో రోజు జరిగిన కేంద్రమంత్రివర్గ ఉపసంఘం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కార్మిక సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వామపక్ష కార్మిక సంఘాలు సమ్మె తప్పదంటున్నాయి. 

19:24 - August 27, 2015

తూర్పుగోదావరి : ప్రేమకు కులం లేదు. ప్రేమకు మతం లేదు. అందంతో సంబంధం లేదు. ఐశ్వర్యంతో అంతకన్నా పనిలేదు. వయసు తేడా ఉండదు. ప్రాంతీయ బేధం అసలే ఉండదు. ఇవన్నీ రీల్‌ లైఫ్‌లో ఎన్నో సినిమాల్లో చూశాం. అదే రియల్‌ లైఫ్‌లో జరిగితే వావ్‌...అనుకుంటాం. ప్రేమకు హద్దులే కాదు సరిహద్దులూ ఉండవని ఓ జంట నిరూపించింది.
వారి ప్రేమ కులం గోడలను బద్దలు కొట్టింది..
వారి ప్రేమ కులం గోడలను బద్దలు కొట్టింది. మతాంతరాలను తరిమికొట్టింది. జాతి వైరుధ్యాలను పాతిపెట్టింది. సరిహద్దులు దాటి... ఖండాంతరాలను దాటి... సప్తసముద్రాలకు ఈది...చివరకు ఒక్కటైంది. ప్రేమకు మంచి నిర్మలమైన మసులు కావాలే కానీ ఇంకేమీ అవసరం లేదని ఈ జంట తేల్చిచెప్పింది. ప్రేమకు హద్దులే కాదు. సరిహద్దులు కూడా అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ కుర్రదానికి. స్వీడన్‌ చిన్నోడికి పైళ్లైంది. రాజమండ్రిలోని ఓ చర్చిలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.
స్వీడన్‌లో ఎమ్మెస్ చేసిన సుష్మ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రకాష్ రాజు, కుమారిల కుమార్తె సుష్మ. ఆమె స్వీడన్‌లో ఎంఎస్ చేసింది. చదువు పూర్తయ్యాక అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. సుష్మ పనిచేస్తున్న కంపెనీ పక్కనే ఎరిక్సన్‌ సంస్థ ఉంది. ఆ కంపెనీలో మికియేల్ ఫ్రెడ్‌ కాస్పెర్సన్‌ పనిచేస్తున్నాడు. ఇరువురీ మధ్యా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త స్నేహంగా మారి....ఆ తర్వాత ప్రేమగా ప్రమోషన్‌ పొందింది.
రాజమండ్రిలో వివాహం
ఇరు కుటుంబాలు కూడా వారి పెళ్లికి ఓకే చెప్పాయి. దీంతో రాజమండ్రిలోని సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ...తెలుగు సంప్రదాయాల ప్రకారం క్రైస్తవ పద్దతిలో వివాహం జరిగింది. ఈ వివాహాన్ని నైజీరియాకు చెందిన ఫాస్టర్‌ క్రిస్టిన్ అజేయ జరిపించారు. ఈ పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని అమ్మాయి తండ్రి ప్రకాష్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనడం ఈ పెళ్లి ద్వారా నిజమైందని పెళ్లికొచ్చిన పెద్దలు ఆశీర్వదించారు.
ఆదర్శంగా నిలుస్తోన్న నూతన జంట
ప్రేమ గెలవలేక....జీవితంలో ఓడిపోయి...ఆత్మహత్య చేసుకున్న జంటలను చాలామందిని చూశాం. వారందరికీ ఈ నూతన జంట ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు... కులాంతర వివాహాల వల్ల పగలు, ప్రతీకారాలు చూశాం. పరువు కోసం కన్నబిడ్డలను చంపుకున్నవారినీ చూశాం. వారందరికీ...వీరి తల్లిదండ్రులు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి టీసర్కార్ గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాఖలలోని అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. టీఎస్ పీఎస్ సీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

 

ప్రపంచ అథ్లెటిక్స్ లో బోల్ట్ సంచలనం

హైదరాబాద్: ప్రపంచ అథ్లెటిక్స్ లో బోల్ట్ సంచలనం సృష్టించాడు. 200 మీటర్ల పరుగు పందేంలోనూ బోల్ట్ కు స్వర్ణం లభించింది. 19.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.

 

రైతు భరోసాయాత్రలకు ఎపి సర్కార్ శ్రీకారం..

హైదరాబాద్: రైతు భరోసాయాత్రలకు ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 9న రైతు భరోసాయాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు నేతృత్వంలో తిరుపతిలో భరోసా యాత్ర ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి రాధామోహన్ యాత్రను ప్రారంభించారు. 

తలసానిని భర్తరఫ్ చేయాలని కోరాం: ఎర్రబెల్లి

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్ ను కోరినట్లు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గవర్నర్ తో టిటిడిపి నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడు తలసాని అంశంలో గవర్నర్ ను కలవడం ఇదే చివరిసారని ఆయనకు చెప్పామని తెలిపారు. తలసానిని బర్తరఫ్ చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

 

18:05 - August 27, 2015

నెల్లూరు: జిఎస్ ఎల్ వి-డి6 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి సరిగ్గా ఇవాళా సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ డి6 నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్రయోజనిక్‌ రాకెట్‌ 2వేల117 కిలోల బరువు ఉంది. ఇందులో ఒక వెయ్యి 132 కిలోల ఇంధనం, 985 కిలోల ఉపగ్రహం ఉంది. అంతేకాకుండా ఇందులో 10 ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 250 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇది 12 ఏళ్ల పాటు పని చేస్తుంది.

 

17:58 - August 27, 2015

విజయవాడ: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు... ఎపికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీతో గంటన్నర సేపు మాట్లాడానని బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టపోతామని మోడీకి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్ర సమస్యలను ప్రధానితో పాటు ఆర్థికమంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తానని, సమస్యలు అధిగమించే కార్యక్రమాలు రూపొందించినట్లు బాబు తెలిపారు. తాను రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్ తరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మరోసారి బాబు తేల్చి చెప్పారు.
కాంగ్రెస్, వైసిపిలపై బాబు ఆగ్రహం
రాష్ట్రావృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, వైసిపిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనతో ఎపి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాపోయారు. ఒక పద్ధతి, విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు విమర్శించే నైతిక హక్కు, తనపై ఆరోపణలుచేసే అర్హత లేదన్నారు. ఎపికి..కాంగ్రెస్ అడుగడుగునా అన్యాయం చేసిందని.. దానికి వైసిపి వంతపాడిందని విమర్శించారు. వీరికి రాజకీయాలు కావాల్సివుంటే... తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు.

 

జీఎస్ఎల్ వీ - డీ6 ప్రయోగం విజయవంతం..

నెల్లూరు : జీఎస్ఎల్ వీ డీ6 ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. జీశాట్ 6 నింగిలోకి తీసుకెళ్లిన జీఎస్ఎల్ వీ డి 6 రాకెట్ దానిని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందని ఆయన తెలిపారు. డీ6లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ పనితీరు అద్భుతమని కిరణ్ కుమార్ ప్రశంసించారు. 

17:34 - August 27, 2015

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున తనయుడు 'అఖిల్' తొలిసారిగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ గురువారం విడుదలైంది. 'అఖిల్' పేరిట ఈ పోస్టర్ విడుదలైంది. 29వ తేదీన 'నాగార్జున' పుట్టిన రోజు కానుకగా టీజర్ ని విడుదల చేస్తారని టాలీవుడ్ టాక్. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నటుడు నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఈ మేరకు టీమ్ రాత్రింబవళ్లూ పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికాలో సాంగ్స్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

17:28 - August 27, 2015

హైదరాబాద్: రాజధాని భూసేకరణకు కేబినెట్ ఆమోదం ఉందా అని ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణకు తాము వ్యతిరేకమన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై సీఎం స్పదించాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఆస్పత్రిలో శిశువుపై ఎలుకదాడి దారుణమన్నారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.

 

17:21 - August 27, 2015

ముంబాయి: స్టాక్ మార్కెట్ నిన్నటి నష్టాల నుంచి కోలుకుంది. ఉదయం నుంచి ఉన్న బైయింగ్ సెంటిమెంట్ పై సెన్సెక్స్ 516 పాయింట్లు పెరిగింది. ఈ సూచి ఇవాళ 26వేల 231 పాయింట్ల వద్ద ముగిసింది. మరో కీలక సూచి నిఫ్టి 157 పాయింట్ల లాభంతో 7వేల 949 వద్ద క్లోజైంది. నిన్న నష్టపోయిన బ్యాంకింగ్, కన్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ రంగాల్లో భారీగా కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీలో హెడ్ డిఎఫ్ సి అత్యధికంగా 8శాతం లాభపడింది. కెయిర్న్ ఇండియా, వేదాంత, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబూజా సిమెంట్స్ 5శాతానికి పైగా పెరిగాయి. అటు బిహెచ్ ఈఎల్, బజాజ్ ఆటో, ఎన్ టిపిసి, హీరో, గెయిల్ సంస్థలు స్వల్పంగా నష్టపోయాయి.

 

 

17:18 - August 27, 2015

గుజరాత్: రిజర్వేషన్ల కోసం మంగళవారం గుజరాత్‌లో పటేల్‌ సామాజికవర్గం చేస్తున్న ఆందోళనలో పోలీసులు అతిగా వ్యహరించిన తీరుపై విచారణ జరపాలని హైకోర్టు అహ్మదాబాద్‌ పోలీస్‌ చీఫ్‌కు నోటీస్‌ జారీ చేసింది. పోలీసుల వ్యవహరించిన తీరుపై కోర్టు సీరియస్‌ అయింది. రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం నాటు చోటుచేసుకున్న ఘర్షణలో ఒక పోలీస్‌తో పాటు ఎనిమిది మంది మృతి చెందారు. పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్డిక్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

17:10 - August 27, 2015

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. రఫియాబాద్‌లో మరో ఉగ్రవాది సజ్జద్‌ అహ్మద్‌ ఆర్మీ జవాన్లకు సజీవంగా పట్టుబడ్డాడు. ఒకే నెలలో నవేద్‌ తర్వాత్‌ మరో పాకిస్తాన్‌ ఉగ్రవాది భారత్‌కు చిక్కడం గమనార్హం. సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదిని భద్రతా దళాలు ప్రశ్నిస్తున్నాయి.

 

డిస్పూర్ పీఎస్ లో మిఖిల్ బౌరా..

అస్సాం : షీనా బోర హత్య కేసులో మిఖిల్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకుని డిస్పూర్ పీఎస్ కు తరలించారు. 2012 సంవత్సరంలో హత్యకు గురైన షీనా బోరకు మిఖిల్ బోరా సోదరుడు. తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసని మిఖిల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీయాను బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

17:06 - August 27, 2015

ఢిల్లీ: జాతీయ కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రమంత్రి వర్గ ఉపసంఘం ఢిల్లీలో కార్మిక సంఘాలతో సమావేశమైంది. అరుణ్ జైట్లీ నేతృత్వంలో వరుసగా రెండో రోజు ఈ భేటీ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్ తో పాటు.. 12 కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్మిక నేతల డిమాండ్లపై కేంద్రమంత్రులు చర్చిస్తున్నారు. సెప్టెంబర్ 2న జాతీయ సమ్మె విరమణపై చర్చలు కొనసాగుతున్నాయి.

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భార వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లి హిల్స్, పంజాగుట్టలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీనితో వాహనదారులు పలు ఇబ్బందుల ఎదుర్కొన్నారు.

మహాబోధి ఆలయంలో కేజ్రీవాల్..నితీష్..

పాట్నా : బోద్ గయాలోని మహాబోధీ ఆలయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ సీఎం కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టపోతాం - బాబు..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టపోతామని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలియచేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలను వెల్లడించారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలు..ప్రధానితో పాటు ఆర్థిక మంత్రికి వివరించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తానని, సమస్యలు అధిగమించే కార్యక్రమాలు రూపొందించినట్లు బాబు పేర్కొన్నారు. తాను ఏది చేసినా భవిష్యత్ తరాల కోసమేనని, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మరోసారి బాబు హామీనిచ్చారు.

జీఎస్ఎల్వీ డి- 6 విజయవంతం..

నెల్లూరు : దేశం సారి గర్వ పడేలా మన ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ డి-6 ని విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరి కోటనుంచి ప్రయోగించిన జీషాట్-5 ఉపగ్రహం విజయవంతమైంది. ఎన్ బ్యాండ్ ద్వారా సమాచార రంగంలో అదునాతన సేవలు అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 

టి.సచివాలయంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు..

హైదరాబాద్ : సచివాలయంలో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

జగన్ గుంటూరు అనుమతికి నో..

హైదరాబాద్ : గుంటూరు వెళ్లేందుకు అనుమతినివ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడి ఘటనలో మృతి చెందిన పసికందు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతానని జగన్ అభ్యర్థనలో పేర్కొన్నారు.

16:33 - August 27, 2015

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎపి డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన 'మీ ఇంటికి-మీ భూమి' కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 11 వేల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. 2 లక్షలకు పైగా ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు.

ఆశా వర్కర్లపై ఎమ్మెల్యే గాదరి ఆగ్రహం..

నల్గొండ : ఆశా వర్కర్లపై ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో డీఎంఅండ్ హెచ్ వో పదవీ విరమణ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా కార్యకర్తలపై ఎమ్మెల్యే గాదరి చిందులు తొక్కారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని టీఆర్ఎస్ ఎప్పుడైనా చెప్పిందా అంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఎప్పటికీ పర్మినెంట్ కావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:28 - August 27, 2015

రాజేంద్రప్రసాద్ హీరోగా గతంలో వచ్చిన 'లేడీస్ టైలర్' చిత్రం మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ దీనికి స్వీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్రలో సీక్వెల్ లో 'రాజ్ తరుణ్' నటించనున్నాడు. ఇందులో 'రాజేంద్రప్రసాద్' కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారంట.'సన్ అఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యనున్నారని టాక్. మధుర శ్రీధర్ నిర్మాణంలో రూపొందించబడుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ కోసం వంశీ వెతుకున్నారని తెలుస్తోంది. 

16:14 - August 27, 2015

హైదరాబాద్: గుజరాత్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడీ గుజరాత్ మోడల్ ఫలితమే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పటేళ్ల ఉద్యమం అని పేర్కొన్నారు. గుజరాత్ మోడల్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైందని, అది అన్ని వర్గాల ప్రజలకూ కాదని విమర్శించారు. గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమాన్ని తెలంగాణ ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ అసమానతలు పెరిగాయని, దళితులు, గిరిజనుల అభివృద్దిని పాలకులు మరిచారని విమర్శించారు.

 

16:13 - August 27, 2015

పురుషులు మారాల్సిన సమయం వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొంది. ఓ టివి ఛానెల్ తో ఆమె మాట్లాడింది. తాను సినీ రంగంలోకి ప్రవేశించినప్పుడు కొంతమంది వక్రదృష్టితో చూసేవారని, కొంతమందైతే చులకనగా మాట్లాడేవారని పేర్కొంది. హీరోయిన్లు..హీరోలు లేదా నిర్మాతలపై ఆధార పడుతారని, అలాంటి వారు 'క్యా కరేగీ' అంటూ వ్యంగ్యంగా అడుగుతారని తెలిపింది. మహిళలపై పురుషుల అభిప్రాయాలు మార్చుకోవాలని, విజయపథంలో దూసుకెళుతుండడంతో అలాంటి వారు వెనకడుగులు వేస్తున్నారని పేర్కొంది. లోపల ఒకటి ఉంచుకుని..బయటకు మరొకటి చెప్పేవారంటే తనకు గిట్టదని కంగనా కుండబద్ధలు కొట్టింది. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 'క్వీన్' చిత్రంలో కంగనా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ ఖాన్ తో కలిసి 'కట్టి బట్టి' అనే సినిమాలో నటిస్తోంది. 

కార్మిక సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల భేటీ..

ఢిల్లీ : సెప్టెంబర్ 2న జాతీయ సమ్మె విరమణపై కేబినెట్ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి 12 కార్మిక సంఘాలు హాజరయ్యారు. అరుణ్ జైట్లీ నేతృత్వంలో రెండో రోజు భేటీ జరుగుతోంది. 

15:55 - August 27, 2015

కరీంనగర్ : తెలంగాణలో మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఐద్వా చేపట్టిన బస్సు జాతా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి చేరింది. మద్యం తాగడం ద్వారా కలిగే నష్టాలపై ప్రజానాట్యమండలి సభ్యులు తమ కళారూపాలు, పాటలతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. చౌకమద్యంతో జనాలు రోగాల బారినపడే అవకాశం ఉందని వివరించారు. ఈనెల 17న మొదలైన ఈ బస్సు జాతా 28 వరకూ కొనసాగనుంది.

15:51 - August 27, 2015


హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ సమావేశం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి టి పిసిసి ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందిన పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎల్పీ కసరత్తు చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండకట్టడంతో పాటు..జనాలకు కూడా తెలపాలని సీఎల్పీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

రైతు సమస్యలపై లెఫ్ట్ పార్టీల భారీ ఆందోళన..

వెస్ట్ బెంగాల్ : రైతులకు మద్దతు ధర ఇతరత్రా సమస్యలపై లెఫ్ట్ పార్టీలు హౌరాలో భారీ ఆందోళన నిర్వహించాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కార్యకర్తలు తొలగించారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు లాఠిఛార్జీ జరిపారు. 

15:45 - August 27, 2015

ఆకసంలో సగం.. అవనిలో సగం.. సమాజంలో సగం.. ఓటర్లలో సగం... అంతటా సగం.. అన్నిటా సగం... మరి ఆ సగానికి భద్రమైన చోటు ఉందా? ఆ సగం మనుగడకు భరోసా ఉందా? ఆ సగాన్ని సాటి మనుషులుగా బతకనిస్తున్నామా? లేదు.. ఆ పరిస్థితి లేనే లేదు అంటున్న నివేదిక మన ముందుంది.
మహిళలకు అగౌరవం..
ఏ విభాగంలోనైనా ముందున్నామంటే మనం చక్కటి అభివృద్ధి సాధిస్తున్నామని గర్వ పడొచ్చు. ఉత్సాహంతో మరో ముందుడుగు వేయొచ్చు. కానీ మహిళలను అగౌరవపరచటంలో మనమే ముందున్నామంటోంది తాజా నివేదిక. మహిళలను అవమానకరంగా చూడటంలో, వారి పై జరుగుతున్న నేరాలలో మనమే ముందున్నాం మరి. ప్రతి పౌరుడు సిగ్గుతో తలదించుకునేలా ఉన్న తెలుగు సమాజంలో ఎందుకు ఇలా జరుగుతోంది? ఎలాంటి స్థితిగతులు మనల్ని ఈ దుస్థితిలోకి నెడుతున్నాయి?
మహిళల భద్రతపై ఆలోచించాలి
తరతరాలుగా వివక్షకు గురైన మహిళా లోకం తమ శక్తియుక్తులు నిరూపించుకునేందుకు సిద్ధమైన తరుణం ఇది. కట్టుబాట్లను అధిగమించి సమసమాజానికి కృషి చేస్తున్న నేపథ్యం ఇది. ఈ సమయంలో వారిపై దాడులు జరగటం, అందుకు సంబంధించిన నేరాల సంఖ్య పెరగటం మహిళా లోకాన్ని కలవరపరుస్తోంది. ఈ స్థితిలో వారి భద్రత పై సమాజమంతా ఆలోచించాలి. తరుణమిది. మహిళల రక్షణ ప్రతి పౌరుని బాధ్యతగా గుర్తించాలి. మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడే తీరు మారాలి. అలాంటి ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. ఇంటా, బయటా వారికి స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది అని గుర్తించాలని మానవి కోరుకుంటోంది.

 

నలుగురు ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాదినిన భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. 

15:22 - August 27, 2015

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం పటేల్ సామాజిక వర్గం చేపట్టిన నిరసనలతో... రెండ్రోజులుగా గుజరాత్ అట్టుడుకుతోంది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్డిక్ పటేల్ బుధవారం బంద్‌కు పిలుపు ఇవ్వటంతో.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా 8 మంది మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సైతం బంద్‌ వాతావరణమే కనిపిస్తోంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని కేంద్రబలగాలను రప్పించారు.

 

 

15:12 - August 27, 2015

ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉందని...ఇందుకు ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలో 'గ్లోబల్ కాల్ టు యాక్షన్‌ సమ్మిట్‌- 2015 ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్‌లో పోలియో మరణాలు పూర్తిగా తగ్గిపోయాయని...రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాధులపై యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నామన్నారు. భారత్‌ పోలియో రహిత దేశంగా తయారైందన్నారు. ఈ సమ్మిట్ కు 24 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

రాజమండ్రిలో వైసిపి, టిడిపి మధ్య వాగ్వాదం..

రాజమండ్రి : నగర పాలక సంస్థ సమావేశంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోదావరి పుష్కరాల్లో అవినీతి జరిగిందని వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

గిలానీ అరెస్టుకు పాక్ కోర్టు ఆదేశం..

పాక్ : మాజీ ప్రధాని గిలానీ అరెస్టుకు పాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గిలానీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

15:01 - August 27, 2015

ఢిల్లీ : స్మార్ట్ సిటీలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. మొత్తం 100 నగరాల్లో 98 పేర్లను వెంకయ్య వెల్లడించారు.
 

రాష్ట్రం నగరం
అండమాన్ అండ్ నికోబార్  పోర్ట్ బ్లెయిర్
ఆంధ్రప్రదేశ్  విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ.
అరుణాచల్ ప్రదేశ్ పాసీఘాట్
అసోం గువాహటి
బీహార్  ముజఫర్ నగర్, భగల్ పూర్, బీహార్ షరీఫ్
చంఢీగఢ్ చండీగఢ్
డామన్ అండ్ డయ్యూ డయ్యూ
దాద్రా అండ్ నగర్ హవేలి శివశాల
ఢిల్లీ  న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్
గోవా పణాజి
గుజరాత్ గాంధీనగర్, అహ్మదాబాద్,
సూరత్, వడోదర, రాజ్ కోట్, దహూద్
హర్యానా కర్నాల్, ఫరీదాబాద్
హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల
జార్ఖండ్ రాంచీ
కర్నాటక మంగళూరు, బేళగావి, శివమొగ్గ,
హుబ్లీ, ధార్వాడ్, తుముకూరు, దావణగెరె.
లక్షద్వీప్ కవరత్తి
మధ్యప్రదేశ్ భోపాల్, ఇండోర్, జబల్ పూర్,
గ్వాలియర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని
మహారాష్ట్ర నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై,
అమరావతి, సోలాపూర్, నాగపూర్, కల్యాణ్
ఔరంగాబాద్ పుణె
మణిపూర్ ఇంఫాల్
మేఘాలయ షిల్లాంగ్
మిజోరాం  ఐజ్వాల్
నాగాలాండ్  కోహిమా
ఒడిశా భువనేశ్వర్, రూర్కేలా
పుదుచ్చేరి ఔల్గారేట్
పంజాబ్ లూథియానా, జలంధర్, అమృతసర్
రాజస్థాన్ జైపూర్, ఉదయ్ పూర్, కోటా, ఆజ్మీర్
సిక్కిం  నామ్చీ
తమిళనాడు తిరుచ్చిరాపల్లి, తిరునల్వేలి, దుండిగల్, తంజావూరు, చెన్నై
తిరువూరు, సేలం, వేలూరు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూత్తుకుడి
తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్
త్రిపుర అగర్తల
ఉత్తర్ ప్రదేశ్ మొరదాబాద్, అలీగఢ్, షహరాన్ పూర్, బరేనిలి,
ఝాన్సీ, కాన్పూర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘజియాబాద్, ఆగ్రా, రాంపూర్
ఉత్తారాఖండ్  డెహ్రాడూన్
వెస్ట్ బెంగాల్  న్యూటౌన్ కోల్ కతా, విధాన్ నగర్, దుర్గాపూర్, హల్దియా
జమ్మూ కాశ్మీర్ ఏ నగరమో వెల్లడించలేదు

 

14:59 - August 27, 2015

ఢిల్లీ: తన అక్క షీనాబోరాను చంపిన వారు... తననూ చంపేందుకు టార్గెట్ చేసివుంటారని... షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరా ఆందోళన వ్యక్తం చేశాడు. తనతో పాటు తన గ్రాండ్ పేరెంట్స్‌నూ అంతమొందించి... ఇల్లు ఆక్రమించుకోవాలని వారు ప్లాన్‌ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. షీనా ఎక్కడని... తన తల్లిని పలుమార్లు ప్రశ్నించగా.. అమెరికాలో వుందనే చెప్పేదని వివరించారు. షీనా ఫోన్‌ నంబర్లు పనిచేయటం లేదని.. చివరకు ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ అవటానికి ప్రయత్నించినా స్పందన లేదని చెప్పారు. పోలీసులు తనవద్దకు వస్తే... అందుకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని మిఖైల్ వెల్లడించారు.

 

14:56 - August 27, 2015

వరంగల్: అదో వీరపోరాటం. సరిగ్గా 67 ఏళ్ల క్రితం... గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వొండిన చేతులే తుపాకీలు పట్టాయి. దొరల దాష్టీకాలకు... రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. గడీల పాలనను ప్రజలే తరిమికొట్టారు. సామాన్యులే సాయుధులై రణనినాదం చేశారు. రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే బైరాన్ పల్లి. నాటి తరానికే కాదు... నేటి తరానికీ స్పూర్తినిస్తోంది.
బైరాన్‌పల్లిలో నరమేధం...
1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది. సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైంది. అందుకే ఈ ఊరి పొలిమేరలో ఉన్న స్థూపం వీరుల అమరత్వాన్ని గుర్తు చేస్తూ స్వాగతం పలుకుతుంది. గ్రామం నడిబొడ్డున ఉన్న పెద్ద బురుజు... నిజాం అల్లరి మూకలను తరిమికొట్టానని సగర్వంగా చెప్పకనే చెబుతుంది. రజాకార్ల రాకను పసిగట్టి మోగించే నగారా చప్పుడుతో... జెజ్జాయితో జంగ్ సైరన్ ఊదిన చరిత్ర బైరాన్‌పల్లిది.
దొరలపై గ్రామస్తుల ధిక్కార స్వరం
బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్‌పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో... బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు.
బైరాన్‌పల్లిపై దాడికి విఫలయత్నం
1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్‌పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. 1948 ఆగస్టు 27న రాక్షసులు పంజా విసిరారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలను నగ్నంగా చేసి.. బతుకమ్మ ఆడించిన రజాకార్ల పైశాచిక ఆనందం నేటికీ వారి మనసుల్లో మానని గాయంగానే మిగిలిపోయింది.
నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం
ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువనిది. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం. వీరోచిత పోరాటాలకు కేంద్రమైంది. రజాకార్ల వికృత క్రీడకు బలిపశువైనా శౌర్యాన్ని చూపింది. విప్లవ చరిత్రను లిఖించుకున్న బైరాన్‌పల్లి ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. నిజాం మూకలపై నిప్పుల యాత్ర చేసి... అగ్ని జ్వాలలై రగిలిన నెత్తుటి మడుగుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. చరిత్ర పుటల్లో స్థానం దొరకని రక్తాక్షరమే బైరాన్‌పల్లి వీర పోరాటం.

 

14:46 - August 27, 2015

గుంటూరు: ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం.. భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...మంగళగిరిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. సింపూర్‌, జపాన్ కంపెనీలకు భూములను తాకట్టు పెడుతోందని విమర్శించారు.-

 

 

14:40 - August 27, 2015

వరంగల్‌: ఐఎస్ఐ తీవ్రవాది హజ‌ర్ మాసుద్ ఖాన్ అలియాస్ జియా ఉల్ల‌ఖాన్‌కు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోలీస్ అధికారులు వైద్య చికిత్సలు జ‌రిపించారు. చికిత్స నిమిత్తం భారీ బందోబ‌స్తు మధ్య తీవ్రవాదిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉగ్రవాది చికిత్స నిమిత్తం తీసుకురావ‌డంతో ఆస్పత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప‌లు కేసుల్లో నిందితునిగా ఉన్న ఉగ్రవాదిని వైద్యప‌రీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకురావ‌డంపై స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

 

పంపిణీ ఆపేయాలని రైతులకు పిలుపునిస్తాం - హర్దిక్ పటేల్..

గుజరాత్ : పరిహారం ఇవ్వకపోతే పాలు, కూరగాయాలు, నీళ్లు ఇతరత్రా పంపిణీ ఆపేయాలని రైతులను కోరుతామని పటేళ్ల ఉద్యమకర్త హర్ధిక్ పటేల్ పేర్కొన్నారు. 

ముగిసిన తెలంగాణ సీఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏకగ్రీవానికి అన్ని పార్టీల మద్దతు కోరాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. కిష్టారెడ్డి కుటుంబసభ్యులకే టికెట్ కేటాయించేలా హై కమాండ్ ను కోరాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం విద్యుత్ అమరవీరులకు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నేతలు పాదయాత్ర నిర్వహించనున్నారు.  

భిన్నత్వంపై దాడి జరుగుతోంది - ఏచూరి..

హైదరాబాద్ : దేశానికి పునాదిగా ఉన్న భిన్నత్వంపై దాడి జరుగుతోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పాలకులకు అనుకూలంగా చరిత్రను తిరగరాస్తున్నారని, భిన్నత్వంపై దాడి దేశ మనుగడకే ప్రమాదమన్నారు. హిందూ రాష్ట్రాన్ని నెలకొల్పో కుట్రలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మోడీ హాయాంలో వర్సిటీలపై ఆంక్షలు అధికమయ్యాయని, యూనివర్సిటీల్లో ప్రజాస్వామిక చర్యలను నిరోధిస్తున్నారని తెలిపారు. అప్రజాస్వామిక చర్యలను తిప్పికొట్టి యూనివర్సిటీలను కాపాడుకోవాలని ఏచూరి పిలుపునిచ్చారు. 

కేసీఆర్ చిత్రపటానికి చీప్ లిక్కర్ తో అభిషేకం..

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ చిత్రపటానికి నిరుద్యోగులు చీప్ లిక్కర్ తో అభిషేకం నిర్వహించారు. ఈ ఘటన ఓయూలో చోటు చేసుకుంది. చీప్ లిక్కర్ వద్దు..ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

13:42 - August 27, 2015

హైదరాబాద్ : ఉల్లిని కోస్తే కన్నీళ్లు వచ్చేవి.. కానీ ఇప్పుడు కొనాలంటేనే వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మాత్రం ఉల్లి ధరలపై సెటైర్లు మారుమోగుతున్నాయి. పాలకుల అసమర్థతను నెటిజన్లు ఎంతలా ఎగతాళి చేస్తున్నారో మీరే చూడండి.

దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన ఉల్లి...

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి లేని కూర భారతీయుల వంటకాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఉల్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఉల్లి ధరలు చుక్కలనంటడంతో.. వినియోగదారుల జేబుకు చిల్లి పడుతోంది.

తమ కోపాన్ని సోషల్‌ మీడియాలో .....

ఉల్లి ధరలు భారీగా పెరిగి పోవడంతో వినియోగదారుల గుండె రగిలిపోతోంది. పాలకుల అసమర్థతను... తమ కోపాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఉల్లిపాయను చూస్తూ అన్నం తినాలని ఒకరు ఫేస్‌బుక్‌లో ఫోస్ట్‌ చేసే... బంగారు ఉంగరంలో వజ్రానికి బదులుగా ఉల్లిపాయను పొదగాలని మరొకరు వాట్సాఫ్‌లో ఇమేజ్‌ పెట్టారు. బాహుబలిలో ప్రభాస్‌ శివలింగాన్ని ఎత్తినట్లుగా.. ఉల్లిపాయను ఎత్తాల్సి వస్తుందని ఒకరు.. శాంటాక్లాజ్‌లు పిల్లలకు ఉల్లిపాయలను బహుమతిగా ఇస్తున్నట్లు మరొకరు.. కార్డ్స్‌ ఆటలో డబ్బులకు బదులు ఉల్లిపాయలను పందెంగా పెట్టి ఆడుతున్నట్లుగా మరొకరు. ప్రధాని మోదీ ఉల్లిపాయలతో సెల్ఫీ దిగి డాలర్‌ కంటే తమ ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు పంపుతున్నట్లుగా.. ఇలా రకరకాల ఫోస్టింగులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సెల్‌ఫోన్‌ సిమ్‌ కొంటే కేజీ ఉల్లి పాయలు ఉచితం.....

సెల్‌ఫోన్‌ సిమ్‌ కొంటే కేజీ ఉల్లి పాయలు ఉచితం అంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఓ ఫోటో మారుమోగుతోంది. ఇది కూడా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌ నగర్‌లో అంటూ వార్తను ఫోస్ట్‌ చేశారు. మార్కెట్‌ నుంచి ఉల్లిపాయలు తెచ్చేటప్పుడు దుండగులు దృష్టిమరల్చి ఉల్లిపాయలను ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందంటూ ఓ వినియోగదారుడు ఉల్లిఘాటుపై సెటైర్‌గా వాట్సాఫ్‌లో ఫోస్ట్‌ చేశాడు.

ఉల్లిపాయల ధరలు బంగారంలా .....

ఇదిలా ఉంటే నేషనల్‌ న్యూస్‌ ఛానల్‌లో ఓ కామిడీ క్లిప్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉల్లిపాయల ధరలు బంగారంలా మారిపోయాయంటూ నెటిజన్లు చెప్పకనే చెబుతున్నారు. ఇతర దేశాల్లో వలే పంట వచ్చినప్పుడు ఉల్లిని నిల్వచేయక పోవడాన్ని వినియోగదారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

13:38 - August 27, 2015

హైదరాబాద్ :గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించేందుకు మంత్రులు పీతల సుజాత, కామినేని, ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చారు. అదే సమయంలో ఆసుపత్రి బయట అఖిలపక్షం నేతలు ఆందోళనకు దిగారు. ఎలుకల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని...మంత్రులు, ఎంపీని ఆసుపత్రిలోనికి పంపించారు. ఘటనపై మంత్రి కామినేని సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

13:36 - August 27, 2015

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ నిప్పులు చెరిగారు. నిన్న గుంటూరు ధర్నాలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్‌ది పూర్తిగా క్రిమినల్ మైండ్‌ అని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో వారంలో నాలుగురోజులు ఆ కేసులకే సమయం కేటాయించే జగన్‌కు..తమను ప్రశ్నించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. 

13:33 - August 27, 2015

హైదరాబాద్ : డి.శ్రీనివాస్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా పదవి ఇచ్చారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. డీఎస్‌కు కేబినెట్‌ హోదా ఎలా ఇస్తారని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ రేపు విచారణకు రానుంది. 

అతిసార ప్రబలకుండా చర్యలు - మున్పిపల్ ఛైర్ పర్సన్..

రంగారెడ్డి : తాండూరు మున్సిపాల్టీలోని పది ప్రాంతాల్లో అతిసార ప్రబలిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి పేర్కొన్నారు.150 మందిని ఆసుపత్రికి తరలించినట్లు, నీరు కలుషితం జరిగిన ప్రాంతాల్లో క్లోరినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

13:20 - August 27, 2015

హైదరాబాద్ : నిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ కె.మనోహర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రస్తుతం మనోహర్ పనిచేస్తున్నారు. 

శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్టులో ఫుడ్ పాయిజన్..

ఆదిలాబాద్ : శ్రీరాంపూర్ ఉపరితల గని క్యాంటీన్ లో కలుషిత ఆహారం తిని 70 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

13:17 - August 27, 2015

అనంతపురం: జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం కేసులో సూత్రధారి,వెంకటేశ్వరరెడ్డి బత్తలపల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. గత నెల 5వ తేదీ నుంచి సిట్ బృందాలు వెంకటేశ్వరెడ్డి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.35లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి - పటేల్..

గుజరాత్ : రాష్ట్రంలో జరిగిన అల్లరల్లో చనిపోయిన వారికి రూ.35 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని పటేళ్ల ఉద్యమ సారథి అహ్మద్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

12:48 - August 27, 2015

హైదరాబాద్ : దేశంలో ఎంపిక చేసిన వంద స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 98 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 13, తమిళనాడులో-12, మధ్యప్రదేశ్ -7, గుజరాత్ , కర్ణాటక నుంచి 6 నగరాలు, ఏపీలో మూడు, బీహార్ లో కూడా 3 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసినట్టు వెంకయ్య వివరించారు. ఇక తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికైందన్నారు. రాబోయే ఆరేళ్లలో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రతి స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తామన్నారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

12:43 - August 27, 2015

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అతిసార వ్యాధి పంజా విసిరింది. తాండూరు మండలం గొల్లచెరువు ప్రాంతంలో ఆ వ్యాధి బారిన పడి 9 ఏళ్ల బాలికతో సహా ఇద్దరు చనిపోయారు. మరో 50 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

12:41 - August 27, 2015

విజయవాడ : ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మారుస్తుందని సీఆర్డీఏ మాల మహానాడు కమిటీ ఆరోపించింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయాన్ని మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఎంతో కొంత ప్యాకేజ్‌ రూపంలో ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని నేతలు డిమాండ్‌ చేశారు. లేదంటే బీజేపీ కనుమరుగుకాక తప్పదని హెచ్చరించారు. 

భూ సేకరణ అవసరం లేదని భావిస్తున్నా - కేఈ..

హైదరాబాద్ : భూ సేకరణ అవసరం లేదని భావిస్తున్నట్లు డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు.కానీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించనని, రైతులే స్వచ్ఛందంగా భూములిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ మాకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని, పవన్ కల్యాణ్ తమకు వ్యతిరేకం కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలన్నారు. రాయలసీమకు రూ.లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని, ఈనెల 31న నుండి రెవెన్యూ అధికారుల బదిలీలు ఉంటాయని తెలిపారు. అనంతపురం జిల్లాలో 17వేల నకిలీ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 

పసికందు మృతదేహానికి రూ.5లక్షలు..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన పసికందు కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు మంత్రి కామినేని వెల్లడించారు. 

హోదా విషయంలో బాబు రాజీపడలేదు - సోమిరెడ్డి..

హైదరాబాద్ :ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు రాజీపడలేదని ఎమ్మెల్సీ సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చంద్రబాబు కేంద్రంపై సంప్రదిస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పేర్కొన్నారు. 

98 స్మార్ట్ సిటీలు - వెంకయ్య...

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీల ఏర్పాటు చేస్తామని వెంకయ్య తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో 14, తమిళనాడులో 12, మధ్యప్రదేశ్ 7, గుజరాత్, కర్నాటక 6, ఏపీ, బీహార్ 3 స్మార్ట్ సిటీలున్నాయి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి నాలుగు సిటీలు, స్మార్ట్ సిటీగా గ్రేటర్ హైదరాబాద్ ఎంపిక చేశారు. మొదటి విడతగా రూ.200 కోట్లు విడుదల చేయనున్నట్లు, వచ్చే ఐదేళ్లలో రూ.90వేల కోట్లు ఖర్చు పెడుతామన్నారు. ఆరేళ్లలో రూ.6లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన స్మార్ట్ సిటీల డిజైన్ కు రూ.

వైద్యులు, సిబ్బందికి దేవినేని క్లాస్..

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి మంత్రి దేవినేని ఉమ క్లాస్ తీసుకున్నారు. ఎన్నేళ్లు పనిచేశామన్నది కాదని..ఎంత మంచిగా సేవ చేశామన్నది ముఖ్యమని దేవినేని తెలిపారు. మళ్లీ రాత్రికి వచ్చి పరిశీలిస్తానని, ఈలోగా లోపాలన్నీ సవరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఏపీలో మూడు స్మార్ట్ సిటీలు - వెంకయ్య..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీల ఏర్పాటు చేస్తామని వెంకయ్య తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో 13, తమిళనాడులో 12, మధ్యప్రదేశ్ 7, గుజరాత్, కర్నాటక 6, ఏపీ, బీహార్ 3 స్మార్ట్ సిటీలున్నాయి. 

అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. 

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో స్వల్ప ఉద్రిక్తత..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటనపై విచారణ సరిగ్గా లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉదయం మంత్రులు కామినేని, పీతల సుజాత, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీ గల్లా జయదేవ్ లు ఆసుపత్రిని పరిశీలించారు. 

11:43 - August 27, 2015

హైదరాబాద్ : కన్యాశుల్కం అనగానే మనకు గుర్తొచ్చేది గురజాడ అప్పారావుగారు. కాని నాటి నేటి తరానికి కూడా గుర్తొచ్చేది ఎన్టీఆర్‌, సావిత్రి. సిగరెట్‌ తాగనోడు దున్నపోతై పుట్టున్‌ అంటూ గిరీశం కేరెక్టర్‌లో లీనమైపోయి ఎన్టీఆర్‌ పొగ వదులుతుంటే ఇప్పటికీ సరదాగా ఉంటుంది. సాత్వికంగా ఉండే సావిత్రి సైతం కవ్వింపు మాటలతో కులుకుతూ చేసిన నటనతో పెదవులపై చిరునవ్వు రాకుండా మానదు. ఇక సుబ్బిశెట్టి హాస్యానికి పగలబడి నవ్వనివారు ఉండరు. ఆ కన్యాశుల్కం సినిమాకు 60 ఏళ్లు నిండాయి. ప్రేక్షకులను నవ్విస్తూనే సామాజిక దురాచారాన్ని, కట్టుబాట్లను నిలదీసే ఈ చిత్రం ఓ అద్భుతం.

11:41 - August 27, 2015

కృష్ణా : విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద బందోబస్తు భారీగా పెంచారు. వంద మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యేకహోదా ఆందోళనలతో పాటు 29న బంద్‌ కూడా ఉన్నందునే సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది.

11:40 - August 27, 2015

నల్గొండ :దశాబ్దాల పాటు ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి పట్టి పీడించింది. గుక్క నీటిలో గంపెడంత గరళాన్ని నింపి అమాయకుల జీవితాలను కబళించింది. లక్ష్యం వైపు కదం తొక్కాల్సిన జీవితాలను చిందరవందర చేసి, బంగారు భవిష్యత్‌ను సొంతం చేసుకోవాల్సిన అడుగులను వంకర టింకర చేసింది. కానీ ఓ సంకల్పం ఆ దుస్ధితిని పారద్రోలింది. ఓ సమున్నత ఆశయం ముసురుకున్న చీకట్లను పారద్రోలి వెలుగులు నింపింది.

ఎడవల్లిని పట్టి పీడించిన ఫ్లోరైడ్.......

కొన్నేళ్ల క్రితం వరకు నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలంలోని మాద ఎడవల్లి గ్రామం దుస్ధితి ఇది. దశాబ్దాల కాలం పాటు మాద ఎడవల్లి గ్రామాన్ని ఫ్లోరైడ్ మహమ్మారి తన రాకాసి కోరల్లో బంధించింది. ఏ నీటి బొట్టును వదలకుండా విషాన్ని నింపి, వికట్టాటహాసం చేసింది. గత్యంతరం లేని ప్రజలు ఫ్లోరైడ్ నీటినే తాగి వ్యాధుల బారిన పడ్డారు. వంగిపోయిన నడుములతో, వంకర్లు పోయిన కాళ్లతో అటు చావలేక ఇటు బతకలేని స్ధితి చేరుకుని ఊహాకు సైతం అందని నరకయాతన అనుభవించారు, మాటలకు అందని యాతనను భరించారు.

ఎడవల్లిని సందర్శించిన విదేశీ ప్రతినిధులు.....

ఎడవల్లి గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి ఎంతగా బాధించింది అంటే ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు సైతం ఇక్కడికి వచ్చారు. ఫ్లోరైడ్ మహమ్మారి ఆకృత్యాలను చూసి, ఎడవల్లి గ్రామస్ధుల యమయాతనను చూసి చలించిపోయారు. టన్నుల కొద్ది సానుభూతిని, జాలిని కురిపించిన వారెవ్వరూ ఇసుమంత కూడా సహాయం చేయలేకపోయారు. కానీ ఒక్కడు మాత్రం ఎలాగైనా ఎడవల్లి ఎదపైన ఫ్లోరైడ్ చేసిన గాయాన్ని మాన్పాలనుకున్నాడు. ఆయనే డాక్టర్‌ ఎ.ఎఎస్ నారాయణ. అనుకున్నదే తడవు అనుమానాలను పటాపంచలు చేస్తూ, అవమానాలను పక్కకు నెట్టేస్తూ ఎడవల్లిని దత్తత తీసుకున్నాడు.

బంధువులను కలిసేందుకు ఎడవల్లికి రాక.....

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌. నారాయణ కొన్నేళ్ల క్రితం బంధువులను కలుసుకునేందుకు ఎడవల్లి గ్రామానికి వచ్చారు. జీవచ్ఛవాల్లాంటి గ్రామస్ధుల దీనస్ధితి నారాయణ హృదయాన్ని మెలితిప్పింది. ఎడవల్లి వేదనకు అంతం పలకాలని నిశ్చయించుకుని కార్యాచరణ ప్రారంభించారు. స్నేహితుల సాయంతో పరిస్ధితిలో మార్పు తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే NGOల నమ్మక ద్రోహంతో విసిగిపోయిన ఎడవల్లి గ్రామస్ధులు డాక్టర్‌ నారాయణకు అంతగా సహకరించలేదు. ప్రతికూల పరిస్ధితులు సవాల్ విసురుతున్నా మొక్కవోని దీక్ష సంకల్పజ్యోతికి అండగా నిలబడింది.

ఇంటింటికి వాటర్‌ ఫిల్టర్‌ పంపిణీ.....

ఫ్లోరైడ్‌ పై యుద్ధాన్ని ప్రకటించిన డాక్టర్‌ నారాయణ థాయ్‌లాండ్‌తో పాటు పలు దేశాలు పర్యటించారు. ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొట్టే సూత్రాలు ఒడిసిపట్టిన ఆయన సాయి ఓరల్‌ ఫౌండేషన్‌ను స్ధాపించి ప్రతి ఇంటికి వాటర్‌ ఫిల్టర్ పంపిణీ చేశారు. భూగర్భజలాలు పెరిగితే ఫ్లోరైడ్ భూతం పొలిమేరల్లోకి కూడా రాదనే సత్యాన్ని గ్రామస్ధులకు బోధపడేలా చేశారు. ఇంకుడుగుంతలు తవ్వించి వాన నీటిని ఒడిసిపట్టుకోవటంలో సఫలీకృతమయ్యారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటించి మోడు వారిన ఎడవల్లిలో పచ్చదనాన్ని నింపటంలో విజయం సాధించారు. గ్రామంలో అంతర్గత రహదారుల వ్యవస్ధకు ఓ రూపునిచ్చి, మరుగుదొడ్లు కట్టించారు. మహిళల్లో చైతన్యం నింపితేనే గ్రామంలో సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని భావించి వారికి కుట్టుమిషన్లు ఇప్పించి, వృత్తికళల్లో నైపుణ్యం సాధించేలా చేశారు. అంతే కాదు ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకున్న కొందరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చేయించారు.

నిండు మనస్సున శ్రీమంతుడు నారాయణ.......

ఎడవల్లి గ్రామం డాక్టర్‌ నారాయణకు ఏమి ఇవ్వలేదు. అయినా ఆయన ఎడవల్లికి ఎంతో ఇచ్చారు. సిరి సంపదలు లేకున్నా, సెలబ్రిటి కాకున్నా కల్మషం లేని మనస్సున్న శ్రీమంతుడు డాక్టర్ నారాయణ. అందుకే ఆయన సేవాతత్పరతకు ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు, కదంతొక్కాల్సిన యువతీయువకులు, విశ్రాంతితో సావాసం చేయాల్సిన వయో వృద్ధులు కదల్లేని స్ధితిలో ఉండటమే తనను కదిలించిందని వినమ్రంగా బదులిస్తారు డాక్టర్ నారాయణ. ఊపిరి ఉన్నంత వరకు ఎడవల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్తున్న డాక్టర్ నారాయణ మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.......

దీక్ష చేస్తున్న మాజీ సైనికులకు వైద్య పరీక్షలు..

ఢిల్లీ : వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనిక ఉద్యోగులు దీక్ష చేపడుతున్నారు. బుధవారం వైద్యులు వీరి ఆరోగ్యాన్ని పరిక్షించారు. 

ప్రభుత్వాసుపత్రి ఘటనపై ఎంక్వయిరీ కమిటీ - పరకాల..

హైదరాబాద్ : గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన దుర్ఘటనపై సీఎం బాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని ప్రభుత్వ సలహదారు ప్రభాకర్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ కమిటీని నియమించారని పేర్కొన్నారు. ఎలుకల దాడిలో పది రోజుల పసకిందు మృతి చెందిన విషయం తెలిసిందే. 

ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

హైదరాబాద్ : ఎమ్మార్ కేసులో కోర్టుకు హాజరుకానుందన ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎమ్మార్ కేసులో ఎల్వీ సుబ్రమణ్యం 11వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గురువారం కోర్టుకు బీపీ ఆచార్య, సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్ లు హాజరయ్యారు. తదుపరి విచారణనను వచ్చే నెల 21కి వాయిదా వేశారు. 

11:05 - August 27, 2015

'షాదీ మాటే వద్దు గురు..సోలో బతుకే సో బెటరు' అనే పాట వినే ఉంటారు. ప్రస్తుతం మన తెలుగు యూత్ కూడా ఇదే ఫాలో అవుతోందంట. అవునుండి ఇది నిజం. పెళ్లి..పిల్లలు..ఇలాంటి బాదరాబందీలకు దూరంగా ఉండాలని తహతహలాడుతున్నారంట. ప్రజల మైండ్ సెట్ చాటి చెప్పేలా సరికొత్త ట్రెండ్ గురించి వివరాలు బయటకు వచ్చాయి. చదువు.. ఉద్యోగం.. పెళ్లి లాంటి వాటిల్లో మొదటి రెండింటికి ఓకే అనుకున్నా మూడో విషయంలోనే తెలుగోళ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. అబ్బాయిలే కాదు.. అమ్మాయిల్లోనూ ఇదే ట్రెండ్ అట. పెళ్లి మాట ఎత్తకుండా బతుకు బండి లాగించేస్తున్నారట. ఇది అబ్బాయిలే కాదు.. అమ్మాయిల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందంట. అంతేకాదు పెళ్లి చేసుకున్నా పిల్లా..పీచు అన్నది లేకుండా జంటగా బతికేయటం కూడా ఓ అలవాటుగా మారిందని చెబుతున్నారు. నీల్సన్.. ఇండికస్ ఎనాలిటిక్స్ చేసిన తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇలా చిత్రమైన ట్రెండ్ లో తెలుగోళ్లు మొదటి స్థానంలో ఉంటే లక్షదీప్ లో అతి తక్కువగా ఉన్నారట. తెలుగోళ్లు 10.51లక్షల మంది ఉంటే.. లక్షద్వీప్ లో 653 మందే ఉన్నారట. మన తర్వాత తమిళనాడులో 9.80లక్షలు.. మహారాష్ట్రలో 9.77లక్షలు.. యూపీలో 8.55లక్షల మంది సింగిల్ గా లైఫ్ బాగుందంటున్నారట. ఇక.. ఆరుగురు అంతకంటే ఎక్కువమంది కుటుంబ సభ్యులున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంటే..రాజస్థాన్ చివరిలో ఉందట. చూస్తుంటే.. ఈ సింగిల్ జీవితం రానున్న రోజుల్లో మరెన్ని సామాజిక సమస్యలకు కారణమవుతుందో..?

పాశమైలారంలో మంత్రి జూపల్లి పర్యటన..

మెదక్ : పటన్ చెరు (మం) పాశంమైలారం పారిశ్రామిక వాడలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలతో మంత్రి జూపల్లి భేటీ కానున్నారు. 

మోడీ గుజరాత్ నమూనా విఫలం - ఏచూరి..

హైదరాబాద్ : మోడీ గుజరాత్ నమూనా విఫలం చెందిందిదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పటేళ్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, పటేలళ్లపై లాఠీఛార్జీ జరపడం అమానుషమన్నారు. పటేళ్ల ఉద్యమంతో టీఎస్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని తెలంగాణలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయన్నారు. బెంగాల్ లో శాంతి భద్రతలు ఉన్యాయో లేదో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : రఫియాబాద్ లోని విజ్జి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 4-5 మంది ఉగ్రవాదులు దాచుకున్నారని భద్రతా దళాలు భావిస్తున్నాయి. 

కేజ్రీవాల్ కు నిరసన సెగ..

బీహార్ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు నిరసన సెగ తగిలింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కలిసేందుకు కేజ్రీవాల్ పాట్నాకు వచ్చారు. ఎయిర్ పోర్టులో కొంతమంది కేజ్రీవాల్ కు నల్లజెండాలు ఊపి వ్యతిరేక నినాదాలు చేశారు. 

ప్రతొక్కరికీ సబ్సిడీ ఉల్లిగడ్డలు - మంత్రి గంటా..

విశాఖ : ఎంవీపీ రైతు బజార్ ను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీతలు సందర్శించారు. ఉల్లి విక్రయ కేంద్రాలను వారు పరిశీలించారు. సబ్సిడీ ఉల్లి సరఫరా వల్ల ప్రభుత్వంపై రోజుకు రూ.50 కోట్ల భారం పడుతోందని గంటా తెలిపారు. ఎంత భారమైనా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సీఎం ఆదేశించారని, రేషన్ కార్డు ఉన్న ప్రతొక్కరికీ సబ్సిడీపై ఉల్లిపాయలను అందిస్తున్నామన్నారు. ధరలు సాధారణ స్థితికి వచ్చే వరకు సబ్సిడీపై ఉల్లిసరఫరాను కొనసాగిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 

 

కొనసాగుతున్న జీఎస్ఎల్వీ -డి6 కౌంట్ డౌన్..

నెల్లూరు : జీఎస్ఎల్వీ -డి6 కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4.52 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. 

క్రీడా కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం...

గుంటూరు : క్రీడా కార్యాలయాన్ని సీపీఎం నేతలు ముట్టడించారు. గ్రామకంఠాలను విస్తరించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఫించన్లు ఇవ్వాలని నినాదాలు చేశారు.

పుంగనూరు ఎస్టీ హాస్టల్ నుండి విద్యార్థుల అదృశ్యం..

చిత్తూరు : పుంగనూరు ఎస్టీ హాస్టల్ నుండి నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

 

నన్ను విమర్శించే హక్కు వారికి లేదు - గుత్తా...

నల్గొండ : తనను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లకు లేదని కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని, 14 నెలల కాలంలో విదేశీ పర్యటనలు తప్ప మోడీ దేశానికి చేసిందేమి లేదని తెలిపారు. దేశంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. 

సీబీఐ కోర్టుకు జగన్..

హైదరాబాద్ : ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. 

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రుల తనిఖీలు...

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో మంత్రులు కామినేని, పీతల సుజాత , ఎంపీ గల్లా జయదేవ్ లు తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఎలుకల దాడిలో పది రోజుల పసికందు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన బాబు కుటుంబానికి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.

 

10:44 - August 27, 2015

హైదరాబాద్: ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి సూది గుచ్చి వెళ్లిపోతాడో తెలియని దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఇప్పటికే 11 మంది దాడి జరగడంతో... మహిళలు ఒంటరిగా తిరగడానికి భయపడుతున్నారు. మూడురోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు కూడా పెరిగాయి. దీంతో గత అర్థరాత్రినుండి పోలీసులు భారీ ఎత్తున గాలింపు చేపట్టి అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఇంజక్షన్ సైకో దాడులను అరికట్టేందుకు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 250 మంది పోలీసులు మఫ్టీలో 45 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. వీరి తనిఖీల్లో 4గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఓ ముఠా ఈ దాడులు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆగంతకుడు ఇంజక్షన్ సూది మాత్రమే వాడుతున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం.

10:41 - August 27, 2015

హైదరాబాద్ : శ్రీమంతుడి రాక కోసం ఆ గ్రామం ఎన్నేళ్లగానో వేచి చూస్తోంది. రాజకుమారుడి.. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గ్రామ కూడలిలో పెద్దలు, మహిళలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పడెప్పుడు వస్తాడా.. మా నేలమీద ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆ గ్రామం ఒక్కడి కోసం ఇంతలా ఎందుకు ఎదురుచూస్తోంది? శ్రీమంతుడి కాన్సెప్టా? లేక ప్రత్యేక అనుబంధమా? వాచ్‌దిస్.

మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చేయాలి....

మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చేయాలి. సొంత ఊరుని దత్తత తీసుకుని అక్కడి అవసరాలను సమకూర్చాలి ఇది శ్రీమంతుడి పాయింట్. ఈ చిత్రం కథ, ఎమోషన్స్, మహేశ్‌బాబు యాక్షన్‌ పక్కన పెడితే.. రియల్‌ లైఫ్‌లో శ్రీమంతుడు ఎందరినో కదిలించింది. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకుని ఎందరో పారిశ్రామివేత్తలు, ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు, యువత సొంత ఊరిని.. అనేక గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.

మహేశ్‌బాబు తల్లి ఇంద్రాదేవి స్వగ్రామం ముసలిమడుగు......

ఇదిలా ఉంటే.. శ్రీమంతుడి రాక కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ భార్య.. మహేశ్‌బాబు తల్లి ఇంద్రాదేవి స్వగ్రామం ముసలిమడుగు. తన అమ్మమ్మ దుర్గాంబ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటాడని ఇక్కడి గ్రామస్తులు మహేశ్‌బాబు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్రామస్తులకు పెద్దదిక్కుగా మారిన దుర్గాంబ.....

మహేశ్‌బాబు అమ్మమ్మ దుర్గాంబకు ముసలిమడుగుతో పాటు చుట్టుప్రక్కల ఊర్లలోను ఎంతో పేరుండేదని ఇక్కడి స్థానికులు చెప్తున్నారు. బీదవారికి, గ్రామస్తులకు ఆర్థికం సాయం, మాట సహాయం చేస్తూ పెద్ద దిక్కుగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం దుర్గాంబ కాలం చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులు కూడా గ్రామంలో ఉన్నాయి. దుర్గాంబ నివసించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో మౌలికసదుపాయాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు పాఠశాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి శ్రీమంతుడైన రాజకుమారుడు.. ముసలిమడుగు గ్రామస్తుల కలలను నిజం చేస్తాడని ఆశిద్దాం.

10:37 - August 27, 2015

హైదరాబాద్ : దేశంలో రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడంలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.... గుజరాత్‌లో జరిగే అల్లర్లే దానికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్లు అమలు కాకపోతే,..విద్య,ఉద్యోగాల్లో యువత భారీగా నష్టపోతారని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తూ..దేశీయ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

10:34 - August 27, 2015

హైదరాబాద్ : కేజ్రీవాల్‌ బీహార్‌ పర్యటనలో నిరసన సెగలు తగిలాయి. పాట్నా వచ్చిన కేజ్రీవాల్‌కు నల్లజెండాలతో కొందరు నిరసన తెలిపారు. అన్నాహాజారేకు ద్రోహం చేసి అధికారం సంపాదించాడంటూ నినాదాలు చేశారు. ఆప్‌ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య వాదులాట, తోపులాట జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

10:32 - August 27, 2015

హైదరాబాద్ : వర్జినీయాలో ముష్కరులు రెచ్చిపోయారు. టివి జర్నలిస్టులను దారుణంగా హతమార్చారు. వర్జినీయా అతిపెద్ద షాపింగ్‌ సెంటర్‌య అయిన బ్రిడ్జ్‌ వాటర్‌ ప్లాజా వద్ద ఓ టివి ఛానల్‌కు చెందిన ఎలిసన్‌ పార్కర్ అనే రిపోర్టర్ లైవ్‌ ఇంటర్వ్యూ చేస్తోంది. ఇంతలోనే రిపోర్టర్ పార్కర్‌, కెమెరామెన్‌ ఆడమ్‌ వార్డ్‌ లక్ష్యంగా దుండుగులు 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ మారణకాండలో పార్కర్‌, ఆడమ్‌లు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లైవ్‌లో జరిగిన ఈ సంఘటనకు ఛానల్ సిబ్బందితో పాటు యావత్‌ ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది. అయితే ఇటీవల ఆ ఛానల్‌ నుంచి వేటుకు గురైన కొందరు ఉద్యోగులే ఈ దారుణానికి పాల్పడ్డారని సంస్ధ యాజమాన్యం చెబుతోంది.

ఆ 'సూది'లో హనికరమైనవి లేవు - ఎస్పీ..

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇంజక్షన్లతో దాడులు చేస్తున్న నిందితుడు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ ఇంజక్షన్ లలో ఎలాంటి హానికరమైనవి లేవని ల్యాబ్ టెస్టులో రుజువైందని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పేర్కొన్నారు. ఈ కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించినట్లు తెలిపారు. 

ఖార్ పీఎస్ కు చేరుకున్న పీటర్ ముఖర్జీ కుమారుడు..

ముంబై : మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీయా తనయుడు రాహుల్ ముఖర్జీ ఖార్ పీఎస్ కు చేరుకున్నారు. 2012 సంవత్సరంలో హత్యకు గురైన షీనా బోర ఘటనలో మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీయాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఇద్దరు మావోయిస్టు సానుభూతి పరుల అరెస్టు..

హైదరాబాద్ : కుషాయిగూడలో మావోయిస్టు ఇద్దరు సానుభూతి పరులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐఎం ప్రతిఘటనకు చెందిన మధు, వేణుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

10:09 - August 27, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్ లో కేశవుల నగర్ కు చెందిన లక్ష్మయ్య ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌లో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించింది.

 

ఎమ్మెల్యే మాగంటి డ్రైవర్ ను విచారించనున్న టి.ఏసీబీ..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డ్రైవర్ ప్రదీప్ ను టి.ఏసీబీ విచారించనుంది. టి.ఏసీబీ ఎదుట ప్రదీప్ విచారణకు హాజరు కానున్నారు. 

తన నివాసంలోనే పోలీసులు ప్రశ్నించాలి - బోరా..

ముంబై : పోలీసులు తనను ప్రశ్నించాలని అనుకుంటే తన నివాసం వద్దకు రావాలని మిఖిల్ బోరా వెల్లడించాడు. 2012 సంవత్సరంలో హత్యకు గురైన షీనా బోరకు మిఖిల్ బోరా సోదరుడు. తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసని మిఖిల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జీయాను బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

బాబు క్యాంపు ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మంది ఎస్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి.

లాభాలతో స్టాక్ మార్కెట్ లు ప్రారంభం..

ముంబై : గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 300 పాయింట్లకు పైగా లాభంలో సెనెక్స్ ట్రేడవుతుండగా 90 పాయింట్లకు పైగా లాభంలో నిప్టీ ట్రేడవుతున్నాయి. 

గునియాలో ఫైర్ ఆక్సిడెంట్..8మంది మృతి..

గునియా : రాజధాని కొనక్రీలో ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృత్యువాతపడ్డారు. 

ప్రభుత్వ వ్యతిరేక సభలకు మందిరాలు ఇవ్వవద్దు కోహ్లీ ఆదేశాలు..

గుజరాత్ : ప్రభుత్వ వ్యతిరేక సభలకు మందిరాలను అద్దెకు ఇవ్వవద్దని గుజరాత్ గవర్నర్ కోహ్లీ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలు నియంతృత్వ పోకడలకు ప్రతీకగా ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిరసన వ్యక్తం చేశారు. 

ప్రత్యేక హోదా కోసం మరొకరు బలవన్మరణం ?

నెల్లూరు : కేశవులనగర్ లో లక్ష్మయ్య (56) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం.

09:54 - August 27, 2015

చెన్నై : మళయాళ నటి 'నీతూ కృష్ణ వాసు' (28)ను పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలు సమర్పించి యూఎస్ కాన్సులేట్ ను మోసం చేయడంతో పాటు దొంగదారిలో అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నించిందనే కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు నటిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ తాను మోస పోయానని కృష్ణ వాసు వాపోయినట్లు తెలుస్తోంది. చెన్నై వెళ్లి వీసా తీసుకోవాలంటే రూ.2లక్షలు అవుతుందని చెబితే తాను ఆ డబ్బు ఇవ్వడం జరిగిందని, తనకు ఇలా తప్పుడు పత్రాలు ఇచ్చి మోసం చేస్తారని అనుకోలేదని పోలీసుల విచారణలో కృష్ణ వాసు పేర్కొన్నట్లు సమాచారం. నిర్మాతలు రాజ, బ్రోకర్ కుంజుమోన్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అగరొత్తుల పొగతో కేన్సర్ ముప్పంట..!

హైదరాబాద్ : గుప్పుగుప్పుమంటూ వదిలే సిగరెట్‌ పొగతో పాటు ఇళ్లల్లో వెలిగించే అగరుబత్తీల పొగకూడా ఆరోగ్యానికి హానికరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత కల్పించే ఈ పొగ ఊపిరిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను చేరుస్తోందన్నారు. అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం జరిపా రు. అగరుబత్తీల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు ఉన్నట్లు తేలిందన్నారు. వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని సౌత్‌ చైనా వర్సిటీ పరిశోధకుడు రోంగ్‌ జో వివరించారు.

09:36 - August 27, 2015

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో క్షణక్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌..గుర్తు తెలియని అగంతకులు జరుపుతున్న ఇంజెక్షన్ల దాడులు జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అతివలమీదే దాడులు జరుగుతుండడంతో.. వారు బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. పోలీసు శాఖ.. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

కొనసాగుతున్న దుండగుల ఆగడాలు .....

పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ ముఠా ఆగడాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన మూడు రోజుల్లో మొత్తం 11 చోట్ల ఇంజెక్షన్ల దాడులు జరిగాయి. ఇంతకీ ఈ దాడులకు తెగబడుతోంది ఎవరు..? ఒక్కడే ఈ దాడులు చేస్తున్నాడా..? లేక ఏదైనా ముఠా ఈ అఘాయిత్యాలకు తెగబడుతోందా..? ఇంతకీ ఆ ఇంజెక్షన్ల ద్వారా ఏ పదార్థాన్ని మహిళల దేహాల్లోకి ఎక్కిస్తున్నారు..? ఇవే ఇప్పుడు అందరిని వేదిస్తున్న ప్రశ్నలు.

నిన్న వరకూ ఆరుగురిపై మత్తు ఇంజక్షన్ల దాడి ........

సోమవారం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరుగురిపై మత్తు మందు ఇంజక్షన్ల దాడి జరగగా... బుధవారం ఒక్కరోజే మూడు చోట్ల ఇంజెక్షన్ల దాడులు జరిగాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడల్లో దుండగులు ఇంజెక్షన్ల దాడులకు తెగబడ్డారు. మత్తుతో స్పృహ కోల్పోయిన ముగ్గురు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోజురోజుకు పెరిగిపోతున్న ఘటనలు .....

ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. యువతులు, మహిళలే లక్ష్యంగా దాడులు కొనసాగుతుండడంతో.. ఈ దాడుల వెనుక ఏదైనా ముఠా ఉందా ? లేక ఆకతాయిలు కావాలని చేస్తున్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత్తు మందు శాంపిల్స్‌ను సేకరించిన వైద్యులు.. పరీక్షల నిమిత్తం వీటిని హైదరాబాద్‌కు తరలించారు. ఇక రోజురోజుకు మత్తుమందు ఇంజక్షన్ల దాడులు పెరిగిపోతుండడంతో బాలికలు, మహిళలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేసి దాడుల వెనుక ఎవరున్నారో ఛేదించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. 

09:32 - August 27, 2015

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. రిషితేశ్వరి డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. ఈ మేరకు నివేదికను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి పోలీసులు అందుకున్నారు.

 

ఆ పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి :హర్దిక్ పేటేల్

అహ్మదాబాద్ : సూరత్ ఆందోళనకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పేటేళ్ల నాయకుడు హర్థిక్ పటేల్ డిమాండ్ చేశారు. కాల్పుల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రు. 30లక్షల నష్టపరిహారం చెల్లించాలని పటేల్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా నగరాలకు కూరగాయలు, పాలు సరఫరా ఆపాలని రైతులను హర్ధిక్ పటేల్ విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసి బస్సులో మహిళ ప్రసవం...

గుంటూరు :మాచర్లలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. శ్రీరాంపురం తండా నుంచి కాన్పు కోసం ఆసుపత్రికి బస్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. దీంతో మహిళతోపాటు శిశువును ఆసుపత్రికి తరలించారు. 

08:46 - August 27, 2015

హైదరాబాద్ : నూతన ఎక్సైజ్ పాలసీ విధా విధానాలను టీ. సర్కార్ ప్రకటించింది. ఈ విధానాలను చూస్తుంటే మద్యం మాఫియా చేతుల్లో ప్రభుత్వం బంధీ అయ్యిందా? అనే అనుమానాలను 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రంలో ద హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ వ్యక్తం చేశారు. ప్రతి 13 వేల మంది ఉన్న చోట నైబర్ స్కూల్స్ ఏర్పాటుకు బదులు నైబర్ బార్లు ఏర్పాటు చేయడం దారుణం అని తెలిపారు. మారుతున్న కాలంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వద్దు అనడం ఎంత వరకు సమంజసం? ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తయారుచేయాల్సిన అవసరం లేదా? యూనివర్శిటీలు రాజకీయ నాయకుల జోక్యాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం లేదా? భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సెప్టెంబర్ లో బార్డర్ చీఫ్ సెక్రటరీ మధ్య చర్చలు జరగడం శుభపరిణామం. ఇరు దేశాల మధ్య సమగ్ర చర్చలే పరిష్కారమా? వాణిజ్య సంబంధాలు, సాంస్కృతి సంబంధాలు, పెట్టుబడులు, ప్రజల సంబంధాలు ను పెంపొందించుకుంటే ఉగ్రవాదం పై సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం వుంటుందా? ఈ రెండు దేశాలు చర్చలపై పట్టుదలకుపోతే వినాశనమే జరుగుతుందా? ఈ అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి మీరు కూడా ఆ విశ్లేషణను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

'వినాయక చవితి' మండపాలకు అనుమతి తప్పనిసరి...

హైదరాబాద్ : నగరంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసే మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని నగర సీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరవాసులు సహకరించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. బస్తీలు, కాలనీలలో ఉత్సవాలు చేపట్టే నిర్వాహకులు సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకూ స్థానిక పోలీస్‌స్టేషన్లలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విగ్రహాలను ఏర్పాటుచేసే ప్రాంతానికి సంబంధించిన యజమానుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని సూచించారు. అనధికార విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటుచేసినా, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

విశాఖ : ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని పశ్చిమ మధ్య, వాయువ్వ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి పయనించే అవకాశముంది. ద్రోణి ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురస్తున్నాయి.

 

కోయంబత్తూరులో ముగ్గురిని కాల్చి చంపిన దుండుగులు

చెన్నై : కోయంబత్తూరులో ఇటీవల ఓ హత్య కేసులో బెయిల్ పై విడుదలైన ముగ్గురిని దుండుగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

08:04 - August 27, 2015

హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన వారం రోజుల చిన్నారి పై ఎలుకులు కరిచి చనిపోయాడు. దీనిపై మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, వైద్య సిబ్బంది స్పందించిన తీరు బాధాకరం. వెంటనే మంత్రి కామినేని స్పందించి ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుధ్యం మెరుగుకు నిధులు కేటాయించాలి. ప్రభుత్వాలు రాజకీయం కన్నా వెల్ఫేర్ పై దృష్టి సారించాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణాన్ని ఆపడానికి జగన్ ప్రయత్నిస్తోందా? వైఎస్ జగన్ చేసిన ధర్నాలో చిత్త శుద్ధి ఎంత? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత అనురాధ, టి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కె.ఎస్ లక్ష్మణరావు, వైసీసీ నేత నాగార్జున పాల్గొన్నారు.. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

భార్య గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్ : జవహర్‌నగర్‌ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో భార్యపై అనుమానంతో ఆమె గొంతు నులిమి చంపిన భర్త ఉదంతం జరిగింది. భార్యను హతమార్చాక భర్త నేరెడుమెట్‌ పోలీసుస్టేషనులో లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3.3 కిజీల బంగారం పట్టివేత...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ఓ వ్యక్తి నుంచి 3.3 కిలోలను తీసుకురాగా పట్టుకొని, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి మృతి

గుంటూరు : ప్రాణం పోయండని ప్రభుత్వాసుపత్రికి వెళ్తే..అక్కడి పరిస్ధితులు ఆ ప్రాణాల్నే తీసేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే..నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పేదోడి ప్రాణాలకు ప్రభుత్వాసుపత్రిలో గ్యారెంటీ లేదని మరోసారి నిరూపించింది ఓ దారుణ ఘటన.10 రోజుల పసికందుపై ఎలుకలు దాడిచేసి చంపేసిన హృదయ విదారక సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 48 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

నేటితో బైరాన్‌పల్లి ఘటనకు 67 ఏళ్లు

హైదరాబాద్ : అదో వీరపోరాటం. సరిగ్గా 67 ఏళ్ల క్రితం... గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వొండిన చేతులే తుపాకీలు పట్టాయి. దొరల దాష్టీకాలకు... రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. గడీల పాలనను ప్రజలే తరిమికొట్టారు. సామాన్యులే సాయుధులై రణనినాదం చేశారు. రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే బైరాన్ పల్లి. నాటి తరానికే కాదు... నేటి తరానికీ స్పూర్తినిస్తోంది.

రైతు జపం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు

హైదరాబాద్ : గులాబీ దళాన్ని ఢీ కొట్టేందుకు టీ-కాంగ్‌ పావులు కదుపుతోంది. రైతు ఎజెండాతో కారుకు బ్రేకులు వేసేందుకు వ్యూహరచన చేస్తోంది. గ‌తంలో తాము అన్నదాత‌ల‌కు చేసిందేమిటీ..? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందేమిటో..? ప్రజలకు చెప్పేందుకు రెడీ అవుతోంది. ప్రత్యేకంగా రైతన్నపైనే ఫోక‌స్ పెట్టింది హ‌స్తం పార్టీ. 

కన్నడ ప్రభుత్వం పై టీ.సర్కార్ గుస్సా....

హైదరాబాద్ : కన్నడ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు గరమైంది. కృష్ణాపై.. కర్నాటక అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కొద్దిపాటి నీళ్లు తెలంగాణకు రాకుండా కర్నాటక.. మోకాలడ్డుతోందని టీ.సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణానదిపై అక్రమ మినీ బ్యారేజీ నిర్మాణం తక్షణం నిలిపివేయాలని.. సమగ్ర వివరాల నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పించింది. 

చీప్‌ లిక్కర్‌కు రెడ్ కార్పెట్

హైదరాబాద్ : అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తోంది టీ సర్కార్‌. చెప్పింది పొల్లు పోకుండా ఆచరణలో పెట్టి చూపిస్తోంది. అయితే ఈ చిత్తశుద్ది సంక్షేమపధకాల్లోనో, అభివృద్ధి కార్యక్రమాల్లోనో అయితే అన్ని వర్గాల వారు ప్రభుత్వానికి జేజేలు పలికేవారు. కానీ మత్తులో ముంచే మాయదారి పనులయ్యేసరికి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పట్టించుకోని సీఎం కేసీఆర్‌ బార్ల లైసెన్సులకు మార్గం సుగమం చేశారు.

 

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-డీ6

హైదరాబాద్: జీఎస్ఎల్వీ డి6ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రాకెట్‌ లాంచింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు షార్ అధికారులు. శ్రీహరికోట నుంచి సరిగ్గా సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు... నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన... ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తామంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. 

07:07 - August 27, 2015

హైదరాబాద్ : సంక్షేమ హాస్టళ్లకు మంగళం పాడేందుకు... టీ-సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. విద్యార్థుల సంఖ్యను సాకుగా చూసి...పలు వసతి గృహాలను ఎత్తేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే సర్కారు సమాలోచనలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లను మూసివేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి.

సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు....

సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వసతులపై సర్కారును ప్రతిపక్షాలు ఇరుకునబెడుతున్నాయి. దీంతో హాస్టళ్లన ప్రక్షాళన చేసేందుకు టీసర్కార్ సిద్ధమైంది. అన్ని హాస్టళ్లను ఒకే గొడుకు కిందకు తేవాలని భావిస్తోంది. అంతేగాక విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే వసతి గృహాలను మూసివేయాలని భావిస్తోంది.

హాస్టళ్ల పనితీరుపై కార్యదర్శుల అధ్యయనం.....

తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లన్ని పలు శాఖల కింద పనిచేస్తున్నాయి. వాటి మధ్య ఎక్కడా పొంతన లేకుండాపోయింది. మెనూ నుంచి మొదలుకొని సిలబస్‌ వరకు అంతా భిన్నంగా ఉంటున్నాయి. దీంతో వాటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు టీసర్కార్ సిద్ధమైంది. శాఖల వారీగా కార్యదర్శులు సంక్షేమ హాస్టళ్ల పనితీరును అధ్యయనం చేస్తున్నారు. హాస్టళ్లలోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న హాస్టళ్లను ఎత్తేసి..వారిని ఇతర హాస్టళ్లకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిబ్బందిని కూడా పక్క హాస్టళ్లకు బదలాయించాలని భావిస్తోంది. తక్కువ సంఖ్యతో హాస్టళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందని అభిప్రాయపడుతోంది.

ఆదిలాబాద్‌లో 50 బీసీ సంక్షేమ హాస్టళ్లు.....

ఆదిలాబాద్‌ జిల్లాలో 50 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. అందులో 4 వేల 280 మంది విద్యార్థులు ఉండాలి కాని ప్రస్తుతం 3 వేల 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కొన్ని హాస్టళ్లలో నిర్దేశిత సంఖ్యలో సగం మంది కూడా విద్యార్థులు లేరు. బెజ్జూరు, దస్తురాబాద్‌లోని హాస్టళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పరిస్థితుల్లో ఆయా చోట్ల హాస్టళ్లను నడపటం కంటే... అక్కడి విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించటం ఉత్తమమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను సేకరించాక ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.

హాస్టళ్లను మూసివేయవద్దని విద్యార్థి సంఘాలు....

విద్యార్థుల సంఖ్య సాకుగా చూపి హాస్టళ్లను మూసివేయవద్దని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సరైన మౌళిక వసతులు కల్పిస్తే....నిర్దేశిత సంఖ్యకన్నా ఎక్కువ మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరుతారని సూచిస్తున్నాయి. ప్రభుత్వం హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని మానుకొని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

07:03 - August 27, 2015

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రధాన కార్మిక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన అంతర్‌ మంత్రిత్వశాఖ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దీంతో నేడు మరో దఫా చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది.

'సెప్టెంబర్‌ 2 దేశవ్యాప్త సమ్మె' యథాతథం.....

కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు అయిన కనీస వేతనం అమలు చేయడం, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయడం, కార్మిక సంఘాల సరళీకరణ ఆపడం, కాంట్రాక్టు విధానం ఎత్తివేయడం తదితర డిమాం డ్లపై ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. దీంతో 'సెప్టెం బర్‌ 2 దేశవ్యాప్త సమ్మె' యథాతథంగా కొనసా*-గు తుందని సమావేశనంతరం కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

12 డిమాండ్లపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చ.....

కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్‌గోయల్‌, డిఒపిటి మంత్రి జితేందర్‌సింగ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కార్మిక సంఘాలు కేంద్రం ముందుంచిన 12 డిమాండ్లలో ఒక్కొక్కదానిపై మొదట చర్చించారు. ఈ సమావేశానికి సిఐటియు నుంచి ఆ సంఘం ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, అధ్యక్షులు పద్మనా భన్‌ హాజరయ్యారు. కార్మిక చట్టాల మార్పులను సరైన మార్గంలో చేపడుతున్నామని, కార్మికులకు వ్యతిరేకంగా ఏ పనీ చేయడం లేదని కేంద్రం పెద్ద జోక్‌ చేసిందని తపన్‌ సేన్‌ ఎద్దేవా చేశారు.

కార్మిక చట్టాల సరళీకరణ ప్రతిపాదనలన్నీ విరమించుకోవాలి - కార్మిక సంఘాలు

కార్మిక చట్టాల సరళీకరణ ప్రతిపాదనలన్నీ విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. అయితే ఈ ప్రాతిపదనలు కేంద్ర మంత్రివర్గ పరిశీలనలోనే ఉన్నాయని ప్రభుత్వం దాటవేసింది.

అనైతిక, చట్టవిరుద్ద పనులకు చట్టరూపం.....

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనైతిక, చట్టవిరుద్ద పనులకు చట్టరూపం తీసుకొస్తోందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. అలాగే కనీస వేతనం ఎంత పెంచుతామనే దానిపై నిర్ధిష్ట ప్రతిపాదన చేయడం లేదని సమాచారం. 'సెప్టెంబర్‌ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు కట్టుబడి ఉన్నాం' అని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.

06:59 - August 27, 2015

హైదరాబాద్ : మనది అత్యధిక కార్మిక శక్తి గల దేశం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని రంగాలలోనైనా మనం స్వయం సమ్రుద్ధి సాధించాం. వివిధ రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగల శక్తిని సంపాదించాం. మనం సాధించిన ప్రగతి వెనక ఈ దేశ ప్రజల రక్తమాంసాలున్నాయి. చెమట చుక్కలున్నాయి. కార్మికుల అలుపెరగని శ్రమ వుంది.

పనిచేస్తున్న స్థలంలోనే కార్మికులు చనిపోతూనే....

ఈ దేశానికి అవసరమైన రకరకాల వస్తువులను ఉత్పత్తి చేసే పనిలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తాము పనిచేస్తున్న స్థలంలోనే కార్మికులు చనిపోతూనే వున్నారు. బొగ్గు బావుల్లో ఊపిరాడక, మురుగు కాలువల్లో విషవాయువులు పీల్చి, యంత్రాల కింద పడి నలిగి, కరెంట్ షాక్ కొట్టి, ఎత్తైన ప్రదేశాల నుంచి కిందపడిపోయి, గాజుపెంకులు గుచ్చుకుని, కడ్డీలు పేగులో దిగబడి, పేలుళ్లు సంభవించి... ఎలా ఏదో ఒకరూపంలో ఎక్కడో ఒక చోట ప్రతి నిత్యం మ్రుత్యువు కబళిస్తూనే వుంది.

కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం అనేక విషాదాలకు.....

యాజమాన్యాలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం అనేక విషాదాలకు కారణమవుతోంది. ప్రమాదకర పనిస్థలాల్లోనూ ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం అనేకమంది కార్మికులను బలి తీసుకుంటోంది. కేవలం అధిక లాభాలు జుర్రుకోవాలన్న యాజమాన్యాల ధనకాంక్ష కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. ఇక కొన్ని పరిశ్రమల్లో ఇప్పటికీ ఆదిమ కాలంనాటి, అనాగరిక చేష్టలను యాజమాన్యాలు వీడడం లేదు. కనీసం మలమూత్ర విసర్జనకీ, చంటి పిల్లలకు పాలిచ్చేందుకు కూడా వెళ్లనీయకుండా వేధిస్తున్న యాజమాన్యాలు మన చుట్టూ చాలా వున్నాయి. డ్యూటీకి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కన్నెర్ర జేసే యాజమాన్యాలకూ, జీతాల్లో కోతలు వేసే యాజమాన్యాలకు మనదేశంలో కొదవలేదు. కార్మిక సంక్షేమం కోసమంటూ ఎన్నెన్నో చట్టాలు, రక్షణలు వున్నా వాటిని యాజమాన్యాలు అపహాస్యం చేస్తూనే వున్నాయి.

కార్మికుల పక్షాన పోరాడినందుకు జైళ్లకు....

మనదేశంలో కార్మికుల పక్షాన పోరాడినందుకు జైళ్లకు వెళ్లిన నాయకులున్నారు. దాడులకు గురైన నాయకులున్నారు. హత్యలకు గురైన నాయకులున్నారు. కానీ, మనదేశంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు జైలుకెళ్లిన ఒక్క యజమానైనా వున్నాడా? దీనిని బట్టే అర్ధం కావడం లేదా ఇప్పటి దాకా కార్మిక చట్టాలు ఎంత లక్షణంగా అమలయ్యాయో.

చట్టాలు కార్మికులకు ఎంతోకొంత భరోసా.....

ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి ఇప్పటి దాకా మన పార్లమెంట్ లో మనం రూపొందించుకున్న చట్టాలు కార్మికులకు ఎంతోకొంత భరోసా ఇచ్చాయి. మీకు మేమున్నామన్నా మానసిక స్థయిర్యాన్ని అందించాయి. కానీ, ఇవాళ ఆ చట్టాలకే తూట్లు పడితే పరిస్థితి ఏమిటి? నిన్న చట్టాలు చేసిన పార్లమెంట్ లోనే ఇవాళ ఆ చట్టాల స్పూర్తికి భిన్నమైన సవరణలు జరుగుతుంటే ఇక కార్మిక వర్గానికి దిక్కెవరు? రక్ష ఎవరు? ఇదే ప్రశ్న, ఇదే ఆవేదన ఇప్పుడు కార్మికుల హృదయాంతరాల్లో ప్రతిధ్వనిస్తోంది.  

06:57 - August 27, 2015

హైదరాబాద్ :సంఘం పెట్టుకోవడం ఒక ప్రజాస్వామిక హక్కు. నిరసన తెలపడం ప్రజాస్వామిక సంప్రదాయం. సమ్మె ఒక ఆయుధం. ఇలాంటివాటన్నింటినీ నిరాకరిస్తే, లేదా వాటి చుట్టూ పరిమితులు విధిస్తే అది ప్రజాస్వామిక సమాజపు లక్షణం అవుతుందా? సెప్టెంబర్ 2 సమ్మెను విజయవంతం చేసేందుకు వివిధ కార్మిక సంఘాలు జోరుగా సన్నాహాలు చేస్తున్నాయి. ప్రచార కార్యక్రమం ఉధ్రుతం చేశాయి. ఈ అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బీఎంఎస్ నేత రవి శంకర్ పాల్గొన్నారు. మరి ఆ చర్చను మీరు కూడా చూడాలనుకుంటే....ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:53 - August 27, 2015

హైదరాబాద్ : రుణమాఫీ అమలుపై క్రెడిట్‌ కొట్టేందుకు ఏపీ సర్కారు సన్నద్ధవుతోంది. రైతు భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్‌ మొదటివారంలో సీఎం చంద్రబాబు.. జైత్రయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రుణమాఫీ.....

దేశంలోనే ఎక్కడా జరగని విధంగా.. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం. లోటు బడ్జెట్‌లో ఉన్నా రైతులకు ఎక్కడా లోటు చేయకుండా... ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని సంబరపడుతోన్న టిడిపి ప్రభుత్వం.

రైతు ఆత్మహత్యల నివారణే లక్ష్యం-చంద్రబాబు .......

రైతు మళ్లీ ఆత్మగౌరవంతో బతకాలి. ఎంత కష్టమైనా పర్వా లేదు.. రైతు ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాట. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల నాటి హామీ.. రుణమాఫీ అమలుపై క్రెడిట్‌ కొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్రలు చేపట్టేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు అవాంతరాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ యాత్రను.. అసెంబ్లీ సమావేశాలు అనంతరం సెప్టెంబరు మొదటివారంలో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 రోజుల పర్యటన......

ఈ విజయోత్సవ యాత్రలలో భాగంగా 13 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి జిల్లాలోను ఎంపిక చేసిన గ్రామాలలో పర్యటనతో పాటు ముఖ్య కేంద్రాలలో సభలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వ్యవసాయ రైతు అనుబంద రంగాలలో సంక్షేమ పథకాల అమలుపై ప్రచారాలు కల్పించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సభలలో ప్రభుత్వ రుణ ఉప‌శ‌మ‌నం ప‌థకం కింద ఉన్న ల‌బ్దిదారుల వివ‌రాల‌ను ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రద‌ర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

54.23 లక్షల ఖాతాల‌కు రుణ విముక్తి......

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా రుణ‌మాఫీ కింద 54.23 లక్షల ఖాతాల‌కు.. రుణ విముక్తి లభించింది. వీటిలో 50 వేల లోపు రుణాలు ఉన్న 17ల‌క్షల 18వేల మందికి పూర్తిగా రుణ విముక్తి జ‌రిగిందని సర్కార్ పేర్కొంటోంది. అయితే రైతు రుణ ఉప‌శ‌మ‌నం కింద 7వేల 447 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేసింది ప్రభుత్వం. అత్యుల్పంగా గుంటూరు జిల్లాలో 6.61 ల‌క్షల మంది రైతులకు 2 వేల 869.84 కోట్లు చెల్లించారు. ఇదేవిధంగా అధికంగా అనంత‌పురం జిల్లాలో 8 ల‌క్షల 2 వేల మంది ల‌బ్ది పొందారు. 

06:50 - August 27, 2015

హైదరాబాద్ : కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తొన్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రెండు టిఎంసీల సామర్థ్యం...194 గేట్లతో రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌ దగ్గర అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది.

తక్షణం ఆపకపోతే తెలంగాణకు తీరని నష్టం.....

కృష్ణా ట్రిబ్యునల్‌ అనుమతివ్వని ఆ ప్రాజెక్టును తక్షణం ఆపకపోతే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని గుర్తు చేస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్.కే జోషి.. కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాసారు.

గిరిజాపూర్ ప్రాజెక్టు సమగ్ర వివరాలను ......

గిరిజాపూర్ ప్రాజెక్టు సమగ్ర వివరాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. అనుమతులు లేకున్నా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తున్నారన్న విషయంతో పాటు ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణలోని జురాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు జరగనున్న నష్టాన్ని లేఖలో వివరించారు. తక్షణం జోక్యం చేసుకుని అక్రమ ప్రాజెక్టును నిలిపివేయాలని జోషి కోరారు.

ఒక వెయ్యి 170 మీటర్లలో గిరిజ్‌పూర్ బ్యారేజీ పొడవు....

గిరిజ్‌పూర్ బ్యారేజీ పొడవు ఒక వెయ్యి 170 మీటర్లలో కర్ణాటక ప్రాజెక్టు నిర్మిస్తోంది. మొత్తం 194 గేట్లను నిర్మిస్తోంది. 2 టీఎంసీల నీరు నిలువ చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని కర్ణాటక నిర్ణయించింది. మరి కర్నాటక అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను కేంద్ర జలసంఘం ఎంతమేరకు స్పందిస్తుందో చూడాలి.

06:47 - August 27, 2015

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీలే ప్రధాన అజెండాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు క్షణం తీరికలేకుండా వరుసభేటీలు జరిపారు. ప్రత్యేక హోదాపై తప్ప మిగిలిన అంశాల్లో ఢిల్లీ పెద్దలనుంచి ఆయనకు కాస్త సానుకూల స్పందనే లభించింది. ఆర్ధికశాఖ అధికారుల నుంచి ప్రధానమంత్రి వరకు పలువురితో చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు పర్యటన ఫలితం ఏంటో వేచిచూడాల్సిందే ?

ప్రధాని సహా కేంద్రమంత్రులతో ఏపీ సీఎం బాబు భేటీ.....

ఏపీ ఆశల చిట్టాతో హస్తినలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడు.. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం అందించాలని మంత్రులందర్నీ కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.

కేంద్ర మంత్రి వెంకయ్యతో భేటీ......

ఢిల్లీ టూర్ ఆద్యంతం ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులతో వరుసగా మీట్ అయ్యారు. మొదట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడ్ని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా అక్కడే భేటీ అయ్యారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరారు బాబు.

ప్రత్యేక హోదా, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుపై మోడీతో చర్చ.....

ఇక ప్రధాని మోడీతో సమావేశమైన బాబు టీమ్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, కేంద్రం సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదతర అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని మోడీని కోరారు సీఎం. ప్రధానితో భేటీలో అరుణ్ జైట్లీ, నీతి అయోగ్ సీఈవో కూడా పాల్గొన్నారు. వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు కూడా వివిధ అంశాలపై చర్చించారు. ఫైనల్ గా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు అరుణ్ జైట్లీ.

రాష్ట్రపతి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు

రెండో రోజు సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో బాబు సమావేశం జరిగిన తీరు పట్ల .. ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తప్పనిసరిగా రాష్ట్రానికి ఆర్థికసాయం చేస్తుందన్న భరోసాతో .. టీడీపీ ఎంపీలు ఉన్నారు. ప్రధాని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని .. ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు....

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ లాగా.. హస్తినలో భేటీలు బాగానే జరిగినా.. కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు. ఆర్థికసాయం ఏ విధంగా ఉంటుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే.. బీహార్ ఎన్నికల తర్వాత మోడీ ప్రకటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

06:41 - August 27, 2015

అనంతపురం :నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి మూల మలుపు వద్ద స్కార్పియో వాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తించారు. వీరు తిరుపతి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

చెట్టును ఢీకొన్న స్కార్పియో వాహనం : ముగ్గురు మృతి

అనంతపురం :నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి మూల మలుపు వద్ద స్కార్పియో వాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తించారు. వీరు తిరుపతి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

నేడు ఖమ్మంలో మైనారిటీ కమిషన్ పర్యటన

హైదరాబాద్ : రాష్ట్ర మైనారిటీ కమిషన్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నది. కలెక్టరేట్‌లో కలెక్టర్, జిల్లా అధికారులతో మైనారిటీ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షిస్తుందని కమిషన్ కార్యదర్శి హుస్సేన్ సాహెబ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ఇతర వివరాల కోసం 9848044746, 040-23323211, 23323212, 23323213 ఫోన్ నంబర్లకు సంప్రదించ వచ్చని ఆయన సూచించారు.

నేడు ప్రైవేట్ బీఈడీ కాలేజీ లెక్చరర్ల ధర్నా

హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేట్‌ బీఈడీ కాలేజీ లెక్చరర్లు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాచేయనున్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం హాజరవుతారని ప్రైవేట్‌ బీఈడీ కాలేజీ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు.

చెట్టును ఢీకొట్టిన స్కార్పియో : ముగ్గురి మృతి

అనంతపురం : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద స్కార్పియో వాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తించారు. వీరు తిరుపతి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Don't Miss