Activities calendar

28 August 2015

23:02 - August 28, 2015

            టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేకుండానే హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా అలరిస్తూ వస్తున్నారు హీరో సుమన్.  ఆయన పుట్టిన రోజు సందర్భంగా 10టీవీ ప్రేక్షకులతో తన స్మృతులను, పంచుకున్నారు. తను సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఒక మిరాకిల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ మరియు ఫ్యామిలీకి సంబందించిన అనేక విషయాలు సుమన్ 10టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు వీడియోలో చూడవచ్చు. 

ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆలస్యం : పవన్

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని ఆయన ట్విట్టర్ లో వాపోయారు. 

21:45 - August 28, 2015

హైదరాబాద్: బషీర్‌బాగ్‌ కాల్పులకు 15 ఏళ్లు పూర్తయ్యాయి. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో, ప్రభుత్వ దమనకాండకు బలైన అమరవీరులకు వామపక్షాలు ఘన నివాళులు అర్పించాయి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించే ఏ ప్రభుత్వాన్నయినా గద్దె దించుతామని బషీర్‌బాగ్‌ అమరవీరుల స్ధూపం సాక్షిగా హెచ్చరించాయి.
బషీర్‌బాగ్‌ రణరంగం
సరిగ్గా 15 ఏళ్ల క్రితం అంటే 2000 ఆగష్టు 28న బషీర్‌బాగ్‌ రణరంగమైంది. భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, ఆనాడు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ,కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దీన్ని తీవ్రంగా అణిచివేయాలనుకున్న ప్రభుత్వం అన్నంత పని చేసింది. పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురిని బలి తీసుకుంది.
అమరవీరులకు సిపిఎం నేతల నివాళులు
బషీర్‌బాగ్‌ ఘటనకు 15ఏళ్లు పూర్తి కావటంతో సిపిఎం నేతలు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌లోని అమరవీరుల స్ధూపం వద్దకు వచ్చిన నేతలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఆనాటి టిడిపి ప్రభుత్వంలానే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ సామాన్యులను పట్టించుకోవటం లేదని, నిరుపేదలను అలక్ష్యం చేస్తున్నాయని తీవ్ర స్ధాయిలో ఫైరయ్యారు.
కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ
సీఎల్పీ నుంచి బషీర్‌బాగ్‌ షాహిద్‌ స్ధూపం వద్దకు ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా వచ్చారు. ఆనాడు విద్యుత్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు టిడిపి సర్కార్‌ అవలంబించిన క్రూర విధానాలను విమర్శించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఇటు సిపిఐ నేతలు కూడా బషీర్‌బాగ్‌ ఘటనను ఖండించారు. రెండు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రభుత్వాలు సైతం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలోనే రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే రోజు ఉందంటూ హెచ్చరించాయి.

 

21:39 - August 28, 2015

హైదరాబాద్: టీఎస్‌ ఐపాస్‌ తరహాలో అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్టున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్ఠం చేశారు. అయితే ఇందులో వివిధ సంస్థలతో పాటు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆ నివేదిక సీఎంకు అందజేస్తామని తలసాని తెలిపారు. హెచ్ ఎండిఎ పరిధిలో అక్రమ కట్టడాలకు తావు లేకుండా చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.

 

21:30 - August 28, 2015

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని ఆయన ట్విట్టర్ లో వాపోయారు. అయితే ఈ విషయంలో భావోద్వేగాలకు పోకుండా కొంతకాలం వేచి చూద్దామని సలహా ఇచ్చారు. అప్పటికీ న్యాయం జరగకుంటే ఎలా సాధించాలో ఆలోచిద్దామని ట్వీట్ పవన్ చేశారు.

 

 

కృష్ణా జిల్లాలో విషాదం...

కృష్ణా : జిల్లాలోని గుడవర్రులో విషాదం నెలకొంది. టీచర్ కొట్టడంతో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఆగస్టు 7న జిల్లాలోని గుడవర్రులో అల్లరి చేసాడని ట్యూషన్ టీచర్ సుధాకర్ చింటూ అనే విద్యార్థిని చితకబాదాడు. బాలుడి మెడమీద తీవ్రగాయం కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇవాళా మృతి చెందాడు. చింటూ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ముగిసిన సీఆర్ డీఏ సమావేశం

విజయవాడ: సీఆర్ డీఏ సమావేశం ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీలు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.

 

20:49 - August 28, 2015

విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారాలు మోపవద్దని వక్తలు తెలిపారు. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు... విద్యుత్ ఛార్జీల పెంపు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తులసీదాస్, టిడిపి నేత జూపూడి ప్రభాకర్, బిజెపి నేత మారెప్ప, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. రెండు ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఛార్జీలు పెంచితే.. ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తారని హెచ్చరించారు. మరిన్ని వివరాలలను వీడియోలో చూద్దాం...

 

సమ్మెను వాయిదా వేసే ప్రసక్తే లేదు: తపన్ సేన్

ఢిల్లీ : సెప్టెంబర్ 2న తల పెట్టిన కార్మిక సంఘాల సమ్మెను వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ తేల్చి చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్మిక సంఘాల సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. బీఎంఎస్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరామని చెప్పారు.

 

సెప్టెంబర్ 2న కార్మిక సంఘాల సమ్మె యథాతథం..

ఢిల్లీ: జాతీయ కార్మిక సంఘాల సమావేశం ముగిసింది. సెప్టెంబర్ 2న కార్మిక సంఘాల సమ్మె యథాతథంగా ఉంటుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

 

20:30 - August 28, 2015

కృష్ణా : జిల్లాలోని గుడవర్రులో విషాదం నెలకొంది. టీచర్ కొట్టడంతో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. జిల్లాలోని పెనమలూరు మండలం గుదర్రులోని జిల్లా పరిషత్ పాఠశాలలో చింటూ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 10న అదే గ్రామంలోని సుధాకర్ అనే వ్యక్తి వద్దకు ట్యూషన్ కోసం వెళ్లాడు. అయితే అల్లరి చేసాడని ట్యూషన్ టీచర్ సుధాకర్.. చింటూను చితకబాదాడు. దీంతో బాలుడి మెడమీద, వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని హైదరాబాద్ తీసుకెళ్లారు. వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులు భరిస్తానని చెప్పిన... సుధాకర్ చివరకు తనకు ఎలాంటి సంబంధం లేదని... ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేసాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేకపోవడంతో చింటూను తిరిగి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. గత వారం రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈనేపథ్యంలో ఇవాళా సాయంత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రేపు పది గంటలకు చింటూ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. చింటు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. టీచర్ సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పెనుమలూరు పిఎస్ లో సుధాకర్ పై కేసు నమోదు అయింది. టీచర్ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ కొట్టిన దెబ్బలకే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.

 

ఎపి డిఎస్సి-15 కీలో తప్పులపై విచారణకు ఆదేశం..

హైదరాబాద్: ఎపి డిఎస్సి-15 కీలో తప్పులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో కమిటీ వేశారు. 

అప్రజాస్వామిక చర్యలకు దిగొద్దు: సీపీ గౌతం సవాంగ్

విజయవాడ: రేపటి బంద్ లో అప్రజాస్వామిక చర్యలకు దిగొద్దని సీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సమీపకాలంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనం..

ఢిల్లీ: సమీప కాలంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనం అయ్యాయని స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసింది. పన్నులు పెంచకపోతే లీటరు పెట్రోలు రూ. 30 కే లభ్యం అవుతుందని చెప్పారు. ఈ ఏడాదిలో బ్యారల్ ధర రూ.10 నుంచి 54 డాలర్ల మధ్య ఉండొచ్చని గతంలోనే అంచనా వేశారు. 2016లో 20 డాలర్లకు పడిపోయే అవకాశం ఉంది.

 

స్థానిక సంస్థల్లో ఆడిట్ అభ్యంతరాలు: మంత్రి యనమల

విజయవాడ: స్థానిక సంస్థల్లో రూ.7.41 లక్షల మేర ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించుకోకపోతే.. నిధులను నిలిపివేస్తామని చెప్పారు.

 

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌: ఎపి సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్రహోంమంత్రితో చంద్రబాబు భేటీ కానున్నారు. 

19:41 - August 28, 2015

గుంటూరు: ఎలుకల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనతో అప్రమత్తమైన గుంటూరు జిల్లా అధికారులు....ఆస్పత్రిలో ఎలుకలు పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటు చేశారు. దీంతో 50కి పైగా ఎలుకలు పట్టుబడ్డాయి.

 

19:35 - August 28, 2015

నెల్లూరు: జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి కసాయి తల్లిగా మారింది. పిల్లలను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి వారి పాలిట రాక్షసత్వం ప్రదర్శించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని... కన్నబిడ్డలను చిత్రహింసలు పెట్టిన కసాయి తల్లి వ్యవహారం బయటపడింది. జిల్లాలోని బాగోలు మండలం కప్పరాళ్లతిప్పలో మెర్సి, ప్రభాకర్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రభాకర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనేపథ్యంలో చీరాలకు చెందిన శ్యాంసన్ బాబు కప్పరాళ్లతిప్పకు ఫాస్టర్ గా వచ్చాడు. ఈక్రమంలో శ్యాంసన్ బాబుతో మెర్సి వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలానికి ఆమెకు మాయమాటలు చెప్పడంతో పిల్లలతో మెర్సి.. శ్యాసంన్ తో వేరే ప్రదేశానికి వెళ్లిపోయింది. భర్త అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈనేపథ్యంలో తమ వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇద్దరిని తీవ్రంగా హింసించేది. ఈ క్రమంలోనే తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని... కన్నబిడ్డలను చిత్రహింసలు పెట్టింది. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కసాయితల్లి మెర్సిని అరెస్ట్ చేశారు. పిల్లలకు గాయాలయ్యాయి. చిన్నారులు తల్లి దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

 

19:09 - August 28, 2015

హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ జరపబోమని ఏపీ సర్కార్ చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన సీఎం చంద్రబాబుకు ఆయన ట్విట్టర్ లో... కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో రైతుల మనోభావాలను గుర్తించి, భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు.. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులకు కూడా పవన్ ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు. 

చంద్రబాబుకు ట్విట్టర్ లో పవన్ కృతజ్ఞతలు..

హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ జరపబోమని ఏపీ సర్కార్ చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన సీఎం చంద్రబాబుకు ఆయన ట్విట్టర్ లో... కృతజ్ఞతలు తెలిపారు.

18:52 - August 28, 2015

మహిళల ఆభరణాలలో ముత్యాల ఆభరణాలు ప్రత్యేకం. ఒకప్పుడు హారంకు మాత్రమే పరిమితమైన ముత్యాలు ఇప్పుడు అనేక రకాల ఫ్యాన్సీ ఆభరణాలుగా రూపుదిద్దుకున్నాయి. అలాంటి ముత్యాల ఆభరణాలతో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....


 

18:50 - August 28, 2015

మహిళల రక్షణకు ప్రత్యేక రక్షణ బృందాలు
రైళ్లలో మహిళల సురక్షిత ప్రయాణం కోసం ముంబయిలో ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి మహిళల రక్షణ కోసం పటిష్టమైన చర్యలను తీసుకునేందుకు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రయోజనాలు పొందే హక్కు భార్యకు ఉంటుంది
మలి వయస్సులో కట్టుకున్న వాడు వదిలి వెళ్లిపోతే ప్రభుత్వ ప్రయోజనాలు పొందే హక్కు అతని భార్యకు ఉంటుందని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి పొందే అన్ని రకాల ప్రయోజనాలకు ఆమె అర్హురాలని ఒక కేసు విషయంలో తీర్పునిచ్చింది.
లారీ డ్రైవర్ గా మహిళ
ట్రక్ లాంటి హెవీ వెహికిల్స్ ను సాధారణంగా పురుషులే నడపడం చూస్తుంటాం. అయితే అందుకు భిన్నంగా దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఒక మహిళ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది.


 

సెప్టెంబర్ 2 సమ్మెపై కార్మిక సంఘాల సమావేశం...

ఢిల్లీ: సెప్టెంబర్ 2 సమ్మెపై కార్మిక సంఘాల చర్చ ఐఎన్ టీయూసీ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాలు సమావేశం అయ్యాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు.

 

18:41 - August 28, 2015

నల్గొండ: నక్కలగండి ప్రాజెక్టుకింద భూమి కోల్పోయినవారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. నక్కలగండి బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కంభాలపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. పొగిళ్లలో మంచినీటి సరఫరాకోసం సాగర్ బ్యాక్ వాటర్ పనులకు శంకుస్థాపన జరిపారు. చింతపల్లి మండలంలో కస్తారిబా పాఠశాల, మోడల్ స్కూల్ భవనాలను మంత్రి ప్రారంభించారు.

 

18:36 - August 28, 2015

నల్లగొండ: హిజ్రాలు.. మరోసారి మానవత్వం చాటుకున్నారు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణీకి ప్రసవం చేశారు. రైలు నల్లగొండ జిల్లా బీబీ నగర్‌కి రాగానే మహిళకు ప్రసవ వేదన మొదలైంది. అదే రైళ్లో ఉన్న హిజ్రాలు ఆమెకు పురుడు పోశారు. ఆ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లిబిడ్డను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

18:26 - August 28, 2015

ముంబై: షీనాబోరా హత్యకేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ పోలీసు కస్టడీలో వున్న ఇంద్రాణిముఖర్జీ, ఆమె కారు డ్రైవర్ శ్యామ్‌మనోహర్‌ రాయ్‌, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను ప్రశ్నిస్తున్నారు. అలాగే షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరాను సైతం విచారిస్తున్నారు. ఇదే సమయంలో హత్య తర్వాత షీనా డెడ్‌బాడీని కాల్చి.. పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. క్లూస్‌ టీం ముంబైకి 84 కిలోమీటర్ల దూరంలో రాయ్‌గఢ్‌ వద్ద అటవీ ప్రాంతానికి చేరుకొని అణువణువూ పరిశీలిస్తోంది.

 

18:22 - August 28, 2015

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వానికి ప్రాథమిక విచారణ కమిటీ నివేదిక అందింది. రిపోర్ట్ ను పరిశీలించిన ప్రభుత్వం.. ఘటనకు బాధ్యులగా చేస్తూ... సూపరింటెండెంట్ వేణుగోపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కర్ రావు బదిలీను చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. హెడ్ నర్స్ విజయలక్ష్మి, స్టాఫ్ నర్సు నిర్మల సస్పెండ్ చేసినట్టు మంత్రి కామినేని ప్రకటించారు. ఆస్పత్రుల శానిటేషన్, సెక్యూరిటీపై సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో సమావేశం కూడా నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. 

18:15 - August 28, 2015

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రైతులను పలుకరిస్తున్నాయి. నల్గొండ జిల్లా చుండూరులో ఉదయం భారీవర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, వరంగల్ జిల్లా మహబూబ్ బాద్ లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం, బయ్యారం మండలాల్లో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్...
జంటనగరాలను భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం 2గంటల నుంచి దాదాపు అరగంట పాటు కురిసిన వర్షం పలు ప్రాంతాలను జలమయం చేసింది. కోఠి,సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, లిబర్టీ, లక్డీకాపూల్‌తో పాటు ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురిసింది. ఇటు మెట్రో పనులు జరుగుతుండటం, అటు భారీగా కురిసిన వర్షంతో వాహనదారులు, నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జాం కావడంతో ఇబ్బందులు పడ్డారు.

 

17:48 - August 28, 2015

తట్టుకోలేని ఒత్తిడికి లోనయినప్పుడు, మానసిక దృడత్వాన్ని కోల్పోయినప్పుడు, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మన చుట్టూ ఉన్న కొద్దిమంది. తమను తాము అంతం చేసుకోవడం సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు. నిజంగా అంతటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఎలా వెతుక్కోవాలో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 
17:43 - August 28, 2015

'ఊరు మనకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేదా లావయిపోతాం' అంటూ వచ్చిన సందేశాత్మక కమర్షియల్ చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి మరిని సొగబులు అద్దబోతోంది చిత్ర యూనిట్. 'శ్రీమంతుడు' చిత్రంలో కొన్ని సన్నివేశాలను జత చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ అధినేతలు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం మూడో వారం దాటినా ఈ రోజుకీ విజయవం తంగా ప్రదర్శితమవుతుంది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచడానికి చిత్ర బృందం సినిమా ఎడిటింగ్‌లో తీసేసిన కొన్ని సన్నివేశాలను తిరిగి జత చేయనుంది. కొరటాల శివ మాట్లాడుతూ ''శ్రీమంతుడు' థియేట్రికల్‌ ట్రైలర్‌ ఉన్న రెండు సన్నివేశాలను నిడివి కారణంగా తీయాల్సి వచ్చింది. ఆ సీన్లను యాడ్‌ చేయమని మమ్మల్ని చాలా మంది అడిగారు. మాకు కూడా ఆ సీన్స్‌ను జోడిస్తే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారనిపించింది. సెన్సార్‌ కంప్లీట్‌ చేసిన ఆ రెండు సీన్స్‌ శుక్రవారం అన్ని థియేటర్లలో ప్రదర్శింపజేస్తున్నామని చెప్పారు. కాగా కొత్త సీన్లు యాడ్ అవుతుండటంతో అభిమానులు కూడా మళ్లీ చూడటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

17:34 - August 28, 2015

తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఆస్కార్ రేసులో ఉంది. ప్రముఖ దర్శకుడు అమోల్‌ పాలేకర్‌ నేతృత్వంలో ఆస్కార్‌ ఎంపిక ప్యానల్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వారు భారత్‌ తరఫున ఆస్కార్‌ అకాడమీ అవార్డుల నామినేషన్స్‌కి పంపాల్సిన 45 సినిమాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ చేయాలని మన తెలుగు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు టాలీవుడ్‌ నుంచి 'బాహుబలి'ని అధికారిక ఎంట్రీగా అస్కార్‌ ప్యానల్‌కు పంపారు. ఆస్కార్‌ ప్యానల్‌ కూడా 'బాహుబలి' సినిమాను ఆస్కార్‌ నామినేషన్స్‌కి పంపించడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ ఏడాది ఆస్కార్‌కు వెళుతున్న బాలీవుడ్‌ సినిమాలు అమీర్‌ ఖాన్‌ చిత్రం 'పికె', అనురాగ్‌ కశ్యప్‌ సినిమా 'అగ్లీ', విశాల్‌ భరద్వాజ్‌ ' హైదర్‌', ప్రియాంకా చోప్రా ' మేరీ కోమ్‌'. ఈ చిత్రాల జాబితాలో మన 'బాహుబలి' సినిమా కూడా పోటీ పడుతుంది. కె.విశ్వనాథ్‌ -కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ' స్వాతి ముత్యం' చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్‌కు వెళ్లనున్న మరొక సినిమా 'బాహుబలి' కావడం విశేషం.

తెలంగాణ మద్యం విధానం పేదలకు వ్యతిరేకం: జగమతి

హైదరాబాద్: తెలంగాణ మద్యం విధానం పేదలకు వ్యతిరేకమని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగమతి పేర్కొన్నారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ఐద్వా బస్సు జాతా ముగింపు సభలో ఆమె పాల్గొని, మాట్లాడారు. మద్యానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. 

మద్యంతో కేసీఆర్ కు మరణశాసనం: మల్లు స్వరాజ్యం

హైదరాబాద్: మద్యంతో సీఎం కేసీఆర్ కు మరణశాసనం రాస్తామని ఐద్వా నేత మల్లు స్వరాజ్యం హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ఐద్వా ప్రచార జాతా ముగింపు సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మద్యం వల్ల మహిళలు వితంతువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం నూతన పాలసీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

ఇందిరాపార్కు వద్ద ఐద్వా బస్సుజాతా ముగింపు సభ..

హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఐద్వా బస్సు జాతా ముగింపు సభను నిర్వహించారు. ఈ సభకు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగమతి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఐమావతి, మల్లు స్వరాజ్యం, విమలక్క హాజరయ్యారు. మద్యాన్ని నివారించాలనీ, మహిళపై హింసను అరికట్టాలని ఐద్వా బస్సు జాతా నిర్వహించింది.

 

ముగిసిన ఎపి బీజేపీ శాసనసభా కమిటీ సమావేశం

రాజమండ్రి: ఎపి బీజేపీ శాసనసభా కమిటీ సమావేశం ముగిసింది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తెలిపారు.  

మచిలీపట్నం ఓడరేవుకు 15 రోజుల్లో అనుమతి

విజయవాడ: మచిలీపట్నం ఓడరేవుకు 15 రోజుల్లో అనుమతి రానున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల తెలిపారు. రేపటి నుంచి భూ సేకరణ మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

 

16:42 - August 28, 2015

ఢిల్లీ: వన్‌ ర్యాంక్ వన్‌ పెన్షన్‌ హామీపై... కేంద్రం కట్టుబడి వుందని... రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని సైతం దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చినట్లు గుర్తు చేశారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ కు సంబంధించి... ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని మనోహర్ పారికర్ వెల్లడించారు.

 

16:40 - August 28, 2015

ముంబై: 9X మీడియా పౌండర్ ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాకు... ఆగస్టు 31 వరకు బాంద్రాకోర్టు పోలీసు కస్టడీ విధించింది. సంజీవ్‌ను బుధవారం కోల్‌కతాలో అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు... గురువారం అక్కడే అలిపుర కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ముంబై తీసుకొచ్చారు. ఇవాళ బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్య కేసులో పోలీసులు సంజీవ్‌ను కీలక నిందితుడిగా భావిస్తున్నారు. షీనాను కారులో గొంతునులిమి చంపినపుడు... అదే కారులో సంజీవ్ వున్నట్లు... ఇంద్రాణి కారు డ్రైవర్ పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. మర్డర్ చేసి శవాన్ని ముంబై 84 కిలో మీటర్ల దూరంలో కాల్చివేశారు. ఆ మరుసటి రోజు సంజీవ్ కోల్‌కతా తిరిగి వెళ్లినట్లు డ్రైవర్ వెల్లడించారు.

 

16:33 - August 28, 2015

రంగారెడ్డి : ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగర కలాన్‌ గ్రామానికి చెందిన రాఘవేందర్‌, మమత ప్రేమించుకున్నారు. అయితే మమతకు ఈ సంవత్సరం మే నెలలో సతీష్‌తో వివాహం జరిగింది. అయినా రాఘవేందర్‌, మమతల ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని రాఘవేందర్‌ నమ్మించి మమతను అత్తవారింటి నుంచి తీసుకువచ్చాడు. వీరిద్దరూ విజయవాడలో ఓ రోజంతా గడిపారు. పెద్దలు మన పెళ్లికి అంగీకరించారని నమ్మించిన రాఘవేందర్‌ అమ్మాయిని వాళ్ల బందువుల ఇంటివద్ద ఉండమన్నాడు. తర్వాత ముఖం చాటేయడంతో .. మోసపోయానని గ్రహించిన మమత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 

16:23 - August 28, 2015

హైదరాబాద్: జంటనగరాలను భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం 2గంటల నుంచి దాదాపు అరగంట పాటు కురిసిన వర్షం పలు ప్రాంతాలను జలమయం చేసింది. కోఠి,సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, లిబర్టీ, లక్డీకాపూల్‌తో పాటు ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లిలో భారీ వర్షం కురిసింది. ఇటు మెట్రో పనులు జరుగుతుండటం, అటు భారీగా కురిసిన వర్షంతో వాహనదారులు, నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జాం కావడంతో ఇబ్బందులు పడ్డారు.

 

16:20 - August 28, 2015

విజయవాడ: రాజధాని కోసం సేకరించాల్సిన భూముల విషయంలో ల్యాండ్‌పూలింగ్‌ ద్వారానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూసేకరణను పక్కన పెట్టామని ఆయన తెలిపారు. గతంలో కూడా భూసేకరణ నోటిఫికేషన్‌ను తానే జారీ చేశానని.. సీఎం చంద్రబాబుకు భూసేకరణ ఇష్టం లేదని నారాయణ అన్నారు. రాజధాని కోసం మరో 3 వేల ఎకరాల భూమి అవసరముందని.. రైతులతో మాట్లాడి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే భూములు సమీకరిస్తామని మంత్రి తెలిపారు.

 

15:51 - August 28, 2015

జమ్మూకాశ్మీర్‌: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జమ్మాకాశ్మీర్ పర్యటన కొనసాగుతోంది. గండర్‌బల్‌లోని భవాని మాత ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలనూ నిర్వహించారు. అనంతరం రాహుల్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత రాహుల్ శ్రీనగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు.

 

15:49 - August 28, 2015

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో అమరవీరులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఘన నివాళి అర్పించారు. ఢిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి మెమోరియల్ స్థల్ వద్ద ..యుద్ధంలో మరణించిన వారికి నివాళులర్పించారు. 1965లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య 17రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో దాదాపు 3వేల మంది మరణించారు. ప్రధానంగా యుద్ధవిమానల బాంబుదాడుల వల్లే వీరంతా మరణించారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. 

15:40 - August 28, 2015

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద మాజీ ఆర్మీ అధికారుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వన్‌ ర్యాంక్ వన్‌ పెన్షన్‌ కోరుతూ వారు... జూన్ 15 నుంచి రిలే దీక్షలు చేపట్టారు. న్యాయపరమైన డిమాండ్‌ను పరిష్కరించే వరకూ దీక్షలు విరమించేది లేదని విశ్రాంత సైనికులు చెబుతున్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరిని స్థానిక ఆర్ ఆర్ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఇక రిలే దీక్షలో కూర్చున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 

15:37 - August 28, 2015

ముంబై: 9X మీడియా ఫౌండర్ ఇంద్రాణి కుమారుడు, షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరా ముంబై చేరుకున్నారు. తన సోదరి షీనాబోరా హత్యకు గురైన విషయం తెలిసిన తర్వాత మిఖైల్... తన తల్లిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. సోదరి గురించి ఎన్నిసార్లు అడిగినా అమెరికాలో చదువుతున్నట్లు చెప్పిందని తెలిపారు. షీనా ఫోన్‌ నంబర్లు పనిచేయలేదని, చివరకు ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించినా స్పందన రాలేదని చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అవసరమైన ఆధారాలు ఇస్తానని ప్రకటించాడు. తాజాగా పోలీసుల విచారణ కోసం మిఖైల్ అస్సాం గువాహటి నుంచి ముంబై చేరుకున్నారు. మరికాసేపట్లో పోలీసుల విచారణకు హాజరవుతారు. 

15:32 - August 28, 2015

హైదరాబాద్: ఎపికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్యాకేజీల గురించి టీడీపీ పోరాడుతుందని ఆయన చెప్పారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

 

భూసమీకరణ పద్ధతే ముఖ్యం: మంత్రి నారాయణ

విజయవాడ: రాజధాని కోసం భూసమీకరణ పద్ధతే ముఖ్యమని మంత్రి నారాయణ తెలిపారు. భూసేకరణకు ప్రభుత్వం మొగ్గు చూపడం లేదన్నారు. మిగతా భూముల కోసం రైతులను ఒప్పిస్తామని పేర్కొన్నారు. భూసేకరణకు ముందు నుంచీ ముఖ్యమంత్రి వ్యతిరేకమని చెప్పారు.

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్ పేట్, బాగ్ లింగంపల్లిలో వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. 

ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను చేపట్టిన డీఎస్...

హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఆయన సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు డీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, డీఎస్‌ను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నత శ్రేణి నేతగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన డీఎస్ కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు.

తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్: సనత్ నగర్ లోని వక్ఫ్ బూములని ఆక్రమించాలని మంత్రి తలసాని తన అనుచరులకు చెప్పారని మర్రిర శశిధర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు రేఖ రాసినట్లు తెలిపారు. ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకోవాలని సీఎం చెప్తుంటే తలసాని ఆక్రమించుకోమని చెబుతున్నారని మర్రి విమర్శించారు. తలసానిని కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

గుంటూరు : రిషితేశ్వరి కేసులో ప్రధాన నిందితులు చరణ్, శ్రీనివాసరావు, అనీషాల బెయిల్ పిటిషన్ విచారణకు 31కి వాయిదా వేశారు. వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది.

13:29 - August 28, 2015

విజయవాడ : రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ పద్దతే ముఖ్యం అని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... భూ సేకరణకు ప్రభుత్వం మొగ్గు చూపడం లేదని, భూ సేకరణ నోటిఫికేషన్‌ నేనే విడుదల చేశానని, భూ సేకరణకు ముందు నుంచీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తెలిపారు. పవన్‌ విజ్ఞప్తి మేరకు మిగతా భూముల కోసం రైతులను ఒప్పిస్తామని స్పష్టం చేశారు.

13:24 - August 28, 2015

హైదరాబాద్ : నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్‌ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులను ఇంతవరకు ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

13:21 - August 28, 2015

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో మద్యంపై మహిళలు పోరుబాట పట్టారు. జానావాసల మధ్య ఉన్న మద్యంషాపుపై దాడిచేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. భీమవరం 12వ వార్డులో ఉన్న వైన్‌షాపు మాకొద్దంటూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు. కనీసం ఆసుపత్రికి వెళ్లాలన్నా తాగుబోతుల వల్ల వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంషాపును ఇక్కడి నుంచి మార్చాలని ఎన్నిసార్లు రాజకీయ నాయకులకు చెప్పినా...వినలేదని దాంతో తామే మద్యంషాపును తరలిస్తామని హెచ్చరించారు. 

12:59 - August 28, 2015

హైదరాబాద్ : అణుశక్తిని సంపాదించిన దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానం ఎవరిది? పాకిస్థాన్‌దేనా.. అవును త్వరలోనే పాక్‌ మూడో స్థానంలో రాబోతుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన కథనం ప్రచురించింది. దాదాపు ఏడాదికి 20 అణుబాంబులు పాక్‌ తయారు చేస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు. వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్న అమెరికా, రష్యాల సరసన త్వరలోనే పాక్‌ చేరబోతుందని చెబుతున్నారు.

12:57 - August 28, 2015

శ్రీకాకుళం : తక్కువ ధరకే సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని ఊదరగొట్టారు. రైతుల దగ్గరనుంచి కోట్ల రూపాయలు డిపాజిట్లు కూడా చేయించుకున్నారు. కొత్త బోరు వేస్తే..క్షణాల్లో పంపుసెట్ ఇస్తామన్నారు. కానీ..దరఖాస్తు చేసి 7నెలలు గడుస్తున్నా,..రైతుల చేతికి మాత్రం పంపుసెట్లు అందలేదు. దీంతో బోర్‌లు వేసిన రైతులు అప్పులపాలై ఆందోళన చెందుతున్నారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా రైతులు పడుతున్న ఆవేదన.

రైతులకు విద్యుత్ శాఖ షాక్...

సోలార్ ఆధారిత నీటి పంపుసెట్లు పెట్టుకోవాలని ఆశపడ్డ శ్రీకాకుళం రైతులకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. రాయితీతో సోలార్‌ పంపుసెట్ అందిస్తామని ఒక్కో రైతు నుంచి 40నుంచి 50వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసుకున్నఎపిఈపీడీసీఎల్  ఇప్పుడు మొండిచేయి చూపిస్తోంది. పంప్‌సెట్‌ కోసం దరఖాస్తు చేసి 7నెలలవుతున్నా..అతీగతీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో మొత్తం 117 యూనిట్ల కోసం.....

జిల్లాలో మొత్తం 117 యూనిట్ల కోసం 3హెచ్ పి పంపుకు 40వేలు, 5హెచ్ పి పంపుకు 50వేలు ఎపిఈపీడీసీఎల్ డిపాజిట్ చేయించుకుంది. 90శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్ వస్తే బిల్లుల భారం, కరెంటు కోతలు లేకుండా పంటలు పండిచ్చుకోవచ్చని ఆనందపడ్డ చాలా మంది రైతులు డీడీలు కూడా సమర్పించారు. అయితే దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా..విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రేపు, మాపంటూ రైతులను కార్యాలయాల చుట్టు కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. సోంపేట పరిసర ప్రాంతాలకు చెందిన 14మంది ఇటీవలే ఉన్నతాధికారులకు సంప్రదిస్తే..తమను అధికారులు దుర్భాషలాడారని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు.

మొత్తం 117 పంపుసెట్‌ యూనిట్లు....

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 117 యూనిట్ల కోసం..రైతులంతా కలిసి దాదాపు 60లక్షల రూపాయల్ని డిపాజిట్ చేశారు. అయితే పోలాకి మండలం బోరుభద్రలో కేవలం ఒక్కటంటే ఒక్క యూనిట్‌ని మాత్రమే ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు మంజూరు చేశారు. మిగతా 116 యూనిట్ల విషయంలో నోరు మెదపడంలేదు. వేలరూపాయలు అప్పులు తెచ్చిమరీ బోర్లు వేశామని...ఇప్పుడు పంపుసెట్లు ఇవ్వకపోతే...తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి...సోలార్‌ పంపుసెట్లను అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

12:53 - August 28, 2015

హైదరాబాద్ : 2019 ఎలక్షన్‌ వార్‌కు వారసులు రెడీ అవుతున్నారు. స్ట్రాంగ్‌ బేస్‌తో తమ పోలిటికల్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ... గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.. రాజీకీయ రంగంలో రాటుదేలేందుకు తర్ఫీదు పొందుతున్నారు... ఇంతకీ ఎవరా యువనేతలు... ఏంటా కధ వాచ్ దిస్ స్టోరీ.

2019 ఎన్నికలే టార్గెట్‌గా బరిలో.....

ఆంధ్రప్రదేశ్‌లో యువనేతల శకం ప్రారంభం కాబోతోంది. టీడీపీలో ఉన్న యువ నేతలంతా.. రాజకీయ తెరంగేట్రం చేసేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీలోని సీనియర్ల తనయులందరూ... 2019 ఎన్నికలే టార్గెట్‌గా బరిలో నిలిచి విజయం సాధించుకునేందుకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. నియోజక వర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. స్థిరమైన రాజకీయ పునాది వేసుకునేందుకు తండ్రుల దగ్గర నుంచి... తర్ఫీదు పొందుతున్నారు. దీంతో చంద్రబాబు పొలిటికల్ స్కూల్ బిజీబిజీగా మారింది. టీడీపీలో సమాంతరంగా ఓ తరం ఎదుగుతోంది. చినబాబు సారధ్యంలో యంగ్‌ టీం రెడీ అవుతోంది. 2019 ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. టీడీపీలో సినియర్లుకు వయసు మీద పడటంతో... వారివారి పిల్లలను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.

రాజకీయాల్లో క్రియాశీలకంగా యువనేతలు...

టీడీపీ యువనేతల్లో పలువురు ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా... మరికొందరు... ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్నారు. వారసుల్లో.. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి... చిత్తురు జిల్లా రాజకీయల్లో క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్దం చేసుకుంటున్నారు.

గాలి ముద్దుకృష్ణమ నాయుడు.....

ఇక చిత్తురు జిల్లాలోని మరో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు. ఈయన కుమారుడు గాలి జగదీశ్‌ కూడా పొలిటికల్ కెరీర్‌ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు... 2014 ఎన్నికల్లోనే నగరి స్ధానం నుండి జగదీశ్ పోటీకి దిగాలనీ చూసినా... అధినేత ఆదేశాల మేరకు నిర్ణయాన్ని మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి తన కుమారుడిని రంగంలోకి దింపి గెలిపించుకొవాలని ముద్దుకృష్ణమ చూస్తున్నారు.

డికే ఆదికేశవులు నాయుడు.....

దివంగత నేత డికే ఆదికేశవులు నాయుడు కుమారుడు డికే శ్రీనివాస్ కూడా చిత్తూరు ఎమ్మెల్యే స్ధానానికి పోటీచేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ తల్లి... సత్యప్రభ చిత్తురు ఎమ్మెల్యేగా ఉండగా...రానున్న రోజుల్లో ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని శ్రీనివాస్‌ భావిస్తున్నారు.

పరిటాల శ్రీరామ్......

ఇక అనంత రాజకీయల్లో తన శఖం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు పరిటాల శ్రీరామ్. తండ్రి పరిటాల రవి డైనమిజాన్ని పునికిపుచ్చుకున్న ఈయన... తనను నమ్ముకొన్న వారిని చేరదీస్తూ... ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టిపెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పొటీ చేసేందుకు శ్రీరామ్ సిద్దం అవుతున్నారు.

జేసీ పవన్‌కుమార్ రెడ్డి .....

అనంతపురం జిల్లాకే చెందిన మరో నేత జేసిదివాకర్ రెడ్డి. తన తనయుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి సైతం రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు... తండ్రి ఇమేజ్‌తో... తనకు పట్టున్న ప్రాంతాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో... తాడిపత్రి ఎమ్మెల్యే స్ధానానికి గానీ అనంతపురం ఎంపీ స్ధానానికి గానీ పవన్‌ పొటీ చేసే అవకాశం కన్పిస్తోంది.

కొడెల శివరాం సైతం...

ఇక స్పీకర్ కొడెల శివప్రసాద్ కుమారుడు కొడెల శివరాం సైతం... ప్రజాసేవలో దూసుకు పొతున్నారు. తన తండ్రిలాగే గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉంటూ... ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రానున్నరోజుల్లో నర్సరావుపేట నియోజకవర్గంనుంచి శివరాం పొటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

కరణం వెంకటేష్ .....

ప్రకాశం జిల్లా విషయానికొస్తే...పార్టీ సీనియర్ నేత కరణం బలరాం.. కుమారుడు కరణం వెంకటేష్ కూడా రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువనేతల జోరు కాస్త ఎక్కువగానే .....

ఇక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువనేతల జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది... దివంగతనేత...ఎర్రన్నాయుడు కుమారుడు... కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఎన్నికై... తన వాక్ చాతుర్యంతో మన్ననలు పొదుతుండగా.... మరో సీనియర్ నేత... మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా... రాజకీయ ఆరంగేట్రానికి సిద్దమయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు మాజీ ఎంపీ బోళ్ళ బుల్లిరామయ్య మనమడు... బోళ్ళ రాజీవ్ కూడా ప్రజాక్షేత్రంలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. 2014 లోనేపోటీకి యోచించి లోకేష్ టీం లో ఉన్నప్పటకీ రాష్ట్ర విభజన నేపధ్యంలో పొటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక కడప నుంచి వరదరాజులు రెడ్డి మనమడు, కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు, కృష్ణా నుంచి దేవినేని కుంటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్‌ ట్రైనింగ్ పూర్తిచేసుకొని రాజకీయ తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు. తన తల్లితండ్రుల ఇమేజ్ కొంత... తమ టాలెంట్ మరికొంత...వెరసి పొలిటికల్‌ కెరీర్ బిల్డప్ చేసుకునే పనిలోపడ్డారు యువ లీడర్లలంతా. మొత్తానికి భవిష్యత్‌ టిడిపి మొత్తం యువనాయకులతో నిండిపోనుంది. ప్రస్తుతానికి ట్రైనింగ్ బాగానే సాగుతున్నప్పటకీ పార్టీకి అసెట్‌లా మారినా యువరక్తం ఎంతమేరకు విక్టరీని సెట్ చేస్తుందో చూడాలి. 

12:47 - August 28, 2015

గుంటూరు : మంత్రి రావెల కిషోర్‌బాబు మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను పరిశీలించారు. ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. హాస్టల్స్‌ అభివృద్ధికి చంద్రన్న చేయూత పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్ధులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. తనిఖీ చేసిన కిషోర్‌బాబు వసతి గృహంలో సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు. వార్డెన్ సహా నలుగురు సిబ్బంది సస్సెండ్ చేశారు. 

గుంటూరు ఆస్పత్రిలో లోకాయుక్త విచారణ

హైదరాబాద్ : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటనపై లోకాయుక్త విచారణ ప్రారంభమైంది. లోకాయుక్త ఉప సంచాలకుడు రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆస్పత్రికి చేరుకుని వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి వార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకాయుక్త విచారణ ఈ నేపథ్యంలో ఆస్పత్రి వార్డులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయటం ప్రారంభించారు.

'ఫాంతమ్' మూవీ పాక్ లో బ్యాన్...భగ్గుమన్న సైఫ్

హైదరాబాద్ : కబీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'ఫాంతమ్' మరోసారి హెడ్ లైన్ గా మారింది. సినిమా ప్రారంభం అయిన దగ్గరనుంచి ఏదో ఒక వివాదానికి కేంద్రంగా మారుతున్న ఈ సినిమా పై పాకిస్తాన్ లో బ్యాన్ విధించటంతో మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే ఫాంతమ్ బ్యాన్ పై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి. సైఫ్ కు జోడిగా కత్రినా నటించిన ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్ర కథ అంతా పాక్ తీవ్రవాదం చుట్టూ తిరుగుతుంది. 26/11 ముంబై దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను మట్టుపెట్టే పోలీస్ పాత్రలో సైఫ్ ఆకట్టుకున్నాడు.

1965 యుద్ధ వీరులకు రాష్ట్రపతి నివాళి

న్యూఢిల్లీ: 1965లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనాటి యుద్దంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. జమ్మూ కశ్మీర్‌లోకి పాకిస్థాన్ తన బలగాలను అక్రమంగా చొప్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు భారతదేశం ఏప్రిల్ 1965 నుంచి సెప్టెంబర్ 1965 మధ్య పాకిస్థాన్‌తో యుద్ధం చేసిన విషయం తెలిసిందే.

3ఏళ్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటున్న ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు

హైదరాబాద్ : ప్రయివేటు మెడికల్ కాలేజీల నిర్వాకం బయటపడింది. ఏడాదికే బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలన్న ప్రభుత్వ జీవోను పట్టించుకోని ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మిగతా మూడేళ్లు బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే సీటు ఇస్తామని తేల్చి చెప్పాయి. గడువు ముగుస్తుండటంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

కొలంబో టెస్టుకు వర్షం అడ్డంకి

హైదరాబాద్ : శ్రీలంక, భారత్ ల మధ్య చివరిదైన మూడో టెస్టు కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో వర్షం కారణంగా ఆగిపోయింది. ఆట ఆగే సమయానికి భారత్ స్కోరు 50/2. క్రీజులో కోహ్లీ, పుజారా ఉన్నారు.

తిరుమల కొండ పై తీవ్ర నీటి సమస్య...

చిత్తూరు : తిరుమల శ్రీవారి కొండపై నీటి సమస్య తీవ్ర మవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. వీరికి తోడు 20వేల మంది టీటీడీ సిబ్బంది కొండపైనే నివాసం ఉంటారు. వీరందరికీ సరిపడా నీరు అందించేందుకు టీటీడీ విశ్వప్రయత్నమే చేస్తోంది. ఇప్పటికే తిరుమల కొండపై నీటి కోసం ఐదు జలాశయాలు ఉన్నాయి. ఇవికాక తిరుపతి కళ్యాణి డాం నుంచి బోర్ల ద్వారా నీటిని తిరుమలకు తరలిస్తున్నారు. తిరుమల కొండపై నిత్యం 25 నుంచి 30 గ్యాలెన్ల నీటి వాడకం జరుగుతుంది. అయితే వానలు కురవకపోవడంతో జలాశయాలు ఎండిపోయాయి.

11:53 - August 28, 2015

ప.గో: జిల్లాలో సైకో ఇంజక్షన్ దాడులు ఆగడం లేదు. నర్సాపురంలో నాలుగో తరగతి విద్యార్థినికి ఇంజక్షన్ గుచ్చి సైకో పరారయ్యాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేశారు. సైకోను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సైకో ఊహా చిత్రాన్ని భీమవరంలో డీఎస్పీ సౌమ్యలత విడుదల చేశారు. మూడు రోజుల్లో సైకో 14 మందిపై ఇంజక్షన్లతో దాడి చేశాడు. ఇదిలా ఉండగా సూదిమందు సైకో ఊహా చిత్రాన్ని నరసాపురం డీఎస్పీ సౌమ్యలత విడుదల చేశారు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సైకోను పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తామని రివార్డును సైతం ప్రకటించారు. సైకో మెడికల్‌ లేదా వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.  

11:50 - August 28, 2015

హైదరాబాద్ : నిరంకుశత్వ ప్రభుత్వాలకు ఆ పోరాటం వణుకుపుట్టించింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెగితే ఏ శక్తీ నిలవరించలేదని నిరూపించింది. కాల్చండిరా అంటూ బ్రిటీష్‌ వారికి రొమ్ము చూపిన ప్రకాశం పంతులు లాంటివారు.. ఆ మహోద్యమంలో ఎందరో తారసపడ్డారు. ఆ యువకుడూ అలాంటి వాడే. తుపాకులకు ఎదురొడ్డి ముందుకెళ్లాడు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ దూసుకొచ్చిన తూటాలకు బలయ్యాడు. ఆ వీరుడు నేలకొరిగి ఇప్పటికి 15 ఏళ్లు పూర్తైంది. రామకృష్ణ.. ఆగస్టు 28, 2వేల సంవత్సరంలో జరిగిన ప్రచండ ఉద్యమంలో అసువులు బాసిన యువతేజం.

యావత్‌ రాష్ట్రాన్ని కదిలించేలా ఉద్యమం.....

నాడు చంద్రబాబు సర్కారు హయాంలో విపరీతంగా పెరిగిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీ యావత్‌ రాష్ట్రాన్ని కదిలించేలా ఉద్యమం చేశాయి. చలో అసెంబ్లీకి వెల్లువలా తరలొచ్చిన ప్రజలు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఆ జనసందోహాన్ని చూసి హడలెత్తిన నాటి బాబు సర్కార్‌ కాల్పులకు దిగింది.

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణం.....

ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా... ఓట్లేసి గెలిపించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం చేసిన దమనకాండలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు నేలకొరిగారు. వారిలో ఒకరే ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం కార్యకర్త సత్తెనపల్లి రామకృష్ణ. కాల్పుల తర్వాత 12 రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన రామకృష్ణ చివరకు తుది శ్వాస విడిచాడు. సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్దన్‌రెడ్డి అమరులై 15 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటి పోరాట ఫలితంగానే 2006 దాకా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల ఆలోచన చేయలేదు. 2008 తర్వాత ఎప్పటిలాగే ప్రభుత్వాలన్నీ ప్రపంచ బ్యాంక్‌ తొత్తులే అన్నట్లు ఛార్జీలు పెంచారు.

కుటుంబాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చిన సీపీఎం...

రామకృష్ణ అమరుడవటంతో ఆ కుటుంబాన్ని ఆదుకొనేందుకు సీపీఎం ముందుకు వచ్చింది. రామకృష్ణకు భార్య మంగ, కుమార్తె ఉన్నారు. అప్పట్లో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పార్టీ శాశ్వత ప్రాతిపదికన ఉపాధి చూపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా... ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చలనమొచ్చింది. సిపిఎం ఒత్తిడి పెంచటంతో రామకృష్ణ భార్య మంగకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. రామకృష్ణ త్యాగానికి గుర్తుగా ఖమ్మంలో భారీ స్తూపాన్ని నిర్మించారు. ప్రతి ఏడు ఇక్కడ ఆగస్టు 28న నివాళులర్పిస్తారు. కట్టుకున్నవాడు లేడన్న బాధ వేధిస్తున్నా, రామకృష్ణ భార్యగా తనను లోకం గుర్తిస్తుంటే గర్వంగా ఉందని మంగ చెబుతున్నారు.

ఆయన ఇచ్చిన ధైర్యం తమను వెన్నంటే....

ఆయన ఇచ్చిన ధైర్యం తమను వెన్నంటే ఉంటుందని సీపీఎం నేతలు, కార్యకర్తలు చెపుతున్నారు. బషీర్‌బాగ్ ఆందోళనలో ప్రభుత్వం కాల్పులు జరపడంలో విజయం సాధించింది. కానీ ఆ ఉద్యమం ఇచ్చిన స్పూర్తిని మాత్రం ఏమీ చేయలేకపోయింది. 

11:45 - August 28, 2015

గుంటూరు : తెనాలి మండలం నందివెలుగులో గుర్తుతెలియని దుండగులు టాటా సంస్థకు చెందిన ఇండిక్యాష్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశారు. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను పగలగొట్టారు. అయితే క్యాష్‌ కౌంటర్‌ ఓపెన్‌ కాకపోవడంతో వెనుదిరిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. ఏటీఎం నుంచి ఎలాంటి డబ్బులు పోలేదని పోలీసులు తెలిపారు. 

11:44 - August 28, 2015

హైదరాబాద్ : అసలే వృద్ధురాలు, అందులోనూ పక్షవాతం. పైగా కంటి చూపు మందగించింది. తినడానికి నోరు తెరిచినా.. మాట పలకలేని దుస్థితి. అలాంటి ఓ వృద్ధురాలికి... తన కోడలు నిత్యం నరకం చూపిస్తోంది. చంపడం తప్పితే.. చేయాల్సిన దారుణాలన్నీ చేస్తోంది. ఇంకేముందీ... తల్లి ఒంటిపైన గాయాలు చూసిన కొడుకు... మూడో కన్నుతో.. ఆ గయ్యాలి గుట్టు రట్టు చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని కుశంబి సమీపంలోని మంజన్‌పూర్‌లో దారుణం....

అమ్మలా చూసుకోవాల్సిన అత్తను అడ్డగోలుగా ఎలా హింసిస్తోందో. అన్నం తినిపించినట్టే తినిపించి.. చెంపలపై ఇష్టమొచ్చినట్లు కొడుతోంది. అంతేకాదు.. పట్టిపట్టి మరీ మంచంపై నుంచి ఎలా కిందపడేస్తోందో ఈ రాక్షసి కోడలు. ఈ దారుణ సంఘటన.. ఉత్తరప్రదేశ్‌లోని కుశంబి సమీపంలోని మంజన్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జల్లార్‌ అనే యువకుడి తల్లే ఈ వృద్ధురాలు. గత ఆరు నెలలుగా ఈమె పక్షవాతానికి గురైంది. దీంతో అప్పటి నుంచి ఇలా మంచానికే పరిమతమవడంతో.. ఈమే కోడలు సరిత... ఇక తన విశ్వరూపం చూపిస్తోంది.

మయానికి నీళ్లు, అన్నం పెట్టని కోడలు...

తన తల్లికి సమయానికి నీళ్లు, అన్నం పెట్టదని వృద్ధురాలి కొడుకు జల్లార్‌ చెబుతున్నాడు. దీంతో తన తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అంటున్నాడు. ఇంట్లో ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో... ఆమె పైశాచకాన్ని.. తన తల్లిపై చూపిస్తోందని అంటున్నాడు సరిత భర్త జల్లార్‌.

ఇష్టమొచ్చట్లు కొడుతుండడంతో..

ప్రతిరోజూ సరిత తన ఇష్టమొచ్చట్లు కొడుతుండడంతో.. తల్లి ముఖంపై, ఒంటిపై గాయాలను గుర్తించాడు జల్లార్‌. ముఖంపై ప్లేట్‌తో కొట్టిన ఆనవాళ్లు కపిస్తుండడంతో.. సరితపై అనుమానం వచ్చి.. ఎవరికీ తెలియకుండా.. తన తల్లిగదిలో సీసీ కెమెరాలను అమర్చాడు. దీంతో సరిత దాష్టికం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జల్లార్‌ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

దెబ్బలు భరిస్తూ.. కన్నీళ్లను ......

నోటి మాట రాని వృద్ధురాలు.. దెబ్బలు భరిస్తూ.. కన్నీళ్లను దిగమింగుకుంటోంది. అత్తంటే అమ్మతో సమానం. అందులోనూ వృద్ధాప్యంలో ఉన్నవారంటే కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు. అలాంటిది బాధ్యత మరిచి.. విచక్షణ రహితంగా ప్రవర్తించిన సరితను కఠినంగా శిక్షించాలని స్థానికులు అంటున్నారు.

నాలుగో తరగతి విద్యార్థిని పై ఇంజక్షన్ దాడి....

ప.గో: జిల్లాలో సైకో ఇంజక్షన్ దాడులు ఆగడం లేదు. నర్సాపురంలో నాలుగో తరగతి విద్యార్థినికి ఇంజక్షన్ గుచ్చి సైకో పరారయ్యాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేశారు. సైకోను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సైకో ఊహా చిత్రాన్ని భీమవరంలో డీఎస్పీ సౌమ్యలత విడుదల చేశారు. మూడు రోజుల్లో సైకో 14 మందిపై ఇంజక్షన్లతో దాడి చేశాడు.

ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ పై ఎఫ్ఐఆర్

హైదరాబాద్ : ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వాటర్ ట్యాంకర్ల కుంభకోణం కేసులో షీలా పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో 400 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు నేడు ఆరంభం నుండే లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయిట్లు, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడవుతున్నాయి.

ఎస్టీ విద్యార్థి వసతి గృహంలో మంత్రి రావెల తనిఖీలు..

గుంటూరు : మంగళగిరి ఎస్టీ విద్యార్థి వసతి గృహంలో మంత్రి రావెల కిశోర్ బాబు తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలో సిబ్బంది కనిపించకపోవడంతో రావెల ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. వసతి గృహంలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే చేరారని వసతి గృహాన్ని మూసివేయాలని మంత్రి ఆదేశించారు.

10:40 - August 28, 2015

హైదరాబాద్ : రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. కలిసే ముందుకు సాగుతున్నా పాలన మాత్రం వేరుగా సాగుతోంది. సమస్యలు కూడా ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కొన్నింటికి పరిష్కారాలు లభిస్తున్నా మరికొన్నింటికి మాత్రం దొరకటం లేదు. అలాంటి వాటిలో జలజగడాలు అతి ముఖ్యమైనవి......

ట్రిబ్యునల్‌ లేదా న్యాయస్ధానానికి...

దేనికదే వేర్వేరుగా విడిపోయింది. అయితే రాష్ట్రాలుగా ఏర్పడినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి సారి ట్రిబ్యునల్‌కో, కోర్టుకో వెళ్లడం అలవాటుగా మారింది. ఇప్పుడు గోదావరి వంతు వచ్చింది. జల వివాదాలను తేల్చుకొని రైతులకు సాగునీరు పై భరోసా కల్పించాల్సిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కయ్యానికి సై అంటున్నాయి. పట్టి సీమను ఏ హక్కు ఉందని కడుతున్నారని తెలంగాణ ప్రశ్నిస్తోంటే, మీరు మాత్రం మాకు చెప్పి కంతనపల్లి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారా అంటూ ఏపి ఎదురు ప్రశ్న వేస్తోంది.కృష్ణా జలాల వినియోగంపై సుప్రీం కోర్టు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేటాయించిన వాటాలోనే రెండు తెలుగు రాష్ట్రాలు తేల్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఈ నెల 29న గోదావరి బోర్డు ముందు కొత్త పంచాయతీకి రెండు రాష్ట్రాల సాగునీటి శాఖలు సిద్దమైపోయాయి...

అక్రమంగా పట్టిసీమ నిర్మిస్తోందంటూ....

పట్టి సీమపై గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలంగాణా సాగునీటి శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. కనీస సమాచారం లేకుండా ఏపి పట్టిసీమను నిర్మిస్తోందని, దీనికి ప్రతిగా కృష్ణా జిలాల్లో 45 టీఎంసీలను తెలంగాణాకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని గోదావరి బోర్డును గట్టిగా కోరాలని టీ సర్కార్ భావిస్తోంది. ఏపీ వాదిస్తున్నట్లు పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు కొత్తవి కాదని.. చేసిన కొన్ని మార్పులకు సంబంధించి ఆధారాలతో గోదావరి బోర్డుకు వెళ్లేందుకు టీ సాగునీటి శాఖ సమాయత్తమవుతోంది. అయితే తెలంగాణ సర్కార్‌ తప్పుగా వాదిస్తోందని, పక్కా ప్రణాళికతో గోదావరి బోర్డు ముందుకు హాజరుకావాలని ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమ అధికారులను ఆదేశించారు. పట్టిసీమ నిర్మాణం తాత్కాలికమే అని, ఇది పోలవరంలో అంతర్బాగమని ఏపీ అధికారులంటున్నారు.. టీ సర్కారే కంతనపల్లి అంటూ కొత్త ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని ఫిర్యాదు చేయనున్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే పట్టి సీమ ప్రాజెక్టును నిలిపేస్తామని గోదావరి యాజమాన్య బోర్డు కు స్పష్టంగా చెప్పాలని ఏపీ నిర్ణయించింది.

జూరాలను నీటి వనరుగా చూపిస్తే......

డిండి ప్రాజెక్టుకు డీపీఆర్ ఆమోదం లేదని, కృష్ణా నదిపై నిర్మించాలనుకుంటున్న పాలమూరు, రంగారెడ్డికి గతంలో జూరాలను నీటి వనరుగా చూపిస్తే.. ఇప్పుడు తెలంగాణా సాగునీటి శాఖ శ్రీశైలం జలాలను చూపించడం ఏపీ హక్కును భంగపరచడమేనని వాదించడానికి అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 29న జరిగే గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఎవరి వాదన వైపు బోర్డు మొగ్గు చూపుతుందో చూడాలి. లేకుంటే కృష్ణా జలాలపై సుప్రీం చెప్పినట్లు అన్నదాతలను ఆదుకునేందుకు మీరే సర్దుకుపోండి అనే కోణంలో పరస్పర అవగాహనకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే జలజగడాలను బలహీనతగా తీసుకుని మహారాష్ట్ర, కర్నాటకలు నీటి వాటాను మరింతగా కాజేస్తాయని జలనిపుణులు హెచ్చరిస్తున్నారు.

10:36 - August 28, 2015

హైదరాబాద్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్‌లోని ఆర్‌ఎన్ పురా సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ శిబిరాలే లక్ష్యంగా అర్థరాత్రి నుంచి పాక్‌సైన్యం కాల్పులకు తెగబడుతుంది. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా...16మందికి తీవ్రగాయాలయ్యాయి. భారత జవాన్లు, పాక్‌ సైనికుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆర్‌ఎన్‌పురా సెక్టార్‌లో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. 

ఇంటింటికీ తిరిగి సినిమా టికెట్లు అమ్ముకుంటున్న పూనం పాండే...

హైదరాబాద్ : "టికెట్లండోయ్ టికెట్లు... మాలినీ అండ్ కో సినిమా టికెట్లు..." అంటూ బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఇల్లిల్లూ, వీధి వీధీ తిరుగుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం థియేటర్లను తాకనున్న నేపథ్యంలో ప్రచారం కోసం కొత్త అవతారం ఎత్తిందీ 'హాట్ బాంబ్'. ప్రజల్లోకి చిత్రాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించిన దర్శకుడు వీరూ కే, పూనమ్ లు సినిమా టికెట్లను ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. బజారుల్లో తిరుగుతూ టికెట్లను అమ్ముతున్నారు. పూనమ్ దగ్గర టికెట్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నప్పటికీ, ఈ కొత్త ప్లాన్ సినిమా విజయవంతానికి ఏ మేరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిందే. 

వికెట్ కోల్పోయిన భారత్

హైదరాబాద్ : శ్రీలంక, భారత్ ల మధ్య చివరిదైన మూడో టెస్టు కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ వికెట్ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద రాహుల్ ఔట్ అయ్యాడు.

సూది సైకో ఊహాచిత్రం విడుదల

ప.గో : సూది సైకో ఊహా చిత్రాన్ని నర్సాపురం డీఎస్పీ సామ్య లత విడుదల చేశారు. నిందితుడు వైద్యశాఖలో ఉద్యోగి అని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారికి రూ.లక్ష బహుమానం ప్రకటించారు.

మద్యం దుకాణంపై మహిళలు దాడి

ప.గో : భీమవరం మండలం గునుపూడిలో మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండు చేస్తూ మహిళలు దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మద్యం మహమ్మారి వల్ల గ్రామస్థులు ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వేటుకు రంగం సిద్ధం

గుంటూరు : జీజీహెచ్ ఆస్పత్రి జీజీహెచ్ సూపరిండెంట్ పై వేటుకు రంగం సిద్ధమైంది. అపరిశుభ్రతకు వేణుగోపాలరావు నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా ఆరోపనలు ఎదుర్కొంటున్న వేణుగోపాలరావు వ్యవహార శైలిపై పలువురు ప్రజా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

హైదరాబాద్ : శ్రీలంక, భారత్ ల మధ్య చివరిదైన మూడో టెస్టు కొలంబో వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్, శ్రీలంక చెరో పాయింట్ సాధించాయి. దీంతో మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది.

పాలకొండ మెయిన్ రోడ్డు లో అగ్రి ప్రమాదం

శ్రీకాకుళం : పాలకొండ మెయిన్ రోడ్డు లో అగ్రి ప్రమాదం సంభవించింది. ఓ జనరల్ స్టోర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ

అనంతపుం : అప్పుడేపుట్టి.. కనీసం నిండుగా శ్వాసైనా పీల్చుకోని ఆడశిశువు చెట్ల పొదల్లో కనిపించిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పుట్లూరులోని కస్తూర్భా పాఠశాల విద్యార్థినులు ఈ రోజు తెల్లవారు జామునే పాఠశాల భవనానికి సమీపంలోని చెట్ల పొదల్లో ఒక శిశువు పడిఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులకోసం గాలిస్తున్నారు.

సైకో సూదిగాడి కోసం 40 పోలీసు బృందాలు..

ప.గో : ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశంతో ఇంజక్షన్‌ సైకో కోసం 40 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు ఆరంభించారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సైకోను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. వరుసగా మహిళలకు ఇంజక్షన్‌లు చేస్తూ బెంబేలెత్తించిన సైకోను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

పాక్ సైన్యం కాల్పుల్లో ముగ్గురి మృతి

హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లోని ఆర్.ఎస్.పురా, ఆర్నియా సెక్టార్ లో బీఎస్ ఎఫ్ శిబిరాలే లక్ష్యం అర్థరాత్రి నుండి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఆర్ ఎస్ పురా సెక్టార్ వద్ద కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. భారత జవాన్లు, పాక్ సైనికుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రత్యేకహోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మనస్తాపంతో గుడివాడలో శ్రీరాపురం కాలనీకి చెందిన ఉదయభాను(40) గత అర్థరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ డీఎస్పీ, వై.బి.పి.టి అంకినీడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయభాను తల్లి సిరిపురపు తలసీరాణి గుడివాడ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

ఆడపడచులకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని: సీఎం చంద్రబాబు

విజయవాడ : తెలుగింటి ఆడపడచులకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగు ఆడపడచులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ శైలంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం ఆరంభమైంది.

నేటి నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు...

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. నిన్నటి నుంచి ప్రారంభమైన ధృవపత్రాల పరిశీలన ఈ నెల 30తో పూర్తి కానుంది. ఈ నెల 31 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

08:35 - August 28, 2015

హైదరాబాద్ : ప్రపంచ బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడం తప్పు కాదు.. కానీ ఆ రుణాలను ఉత్పాదక రంగాల్లో పెడితే ఉపయోగం ఉంటుందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అన్నారు. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానంతో రూపొందిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6 ప్రయోగం విజయవంతమైంది. భూసేకరణతో రెవన్యూశాఖకు సంబంధం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కే.ఈ కృష్ణ మూర్తి తెలిపారు. భూములు రెవెన్యూ శాఖకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంటుంది? భూసేకరణపై పార్టీ ప్రభుత్వంలో విబేధాలు బయటపడుతున్నాయా? సంక్షేమ పథకాల కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తే ప్రమాదకరం కాదా? స్మార్ట్ సిటీల పేరుతో సాధారణ ప్రజల కనీస మౌలిక సౌకర్యాలను తీర్చగలుగుతుందా? వంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రామగుండం ఎన్టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీపీసీ ఒకటో యూనిట్ లో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

 

08:00 - August 28, 2015

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు. స్మార్ట్ సిటీల పేరుతో సాధారణ నగరాల్లో సేవ పేరుతో ప్రజల నుంచి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేయనున్నారా? దేశానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా పెంచుతామని మోడీ చెపుతున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ముప్పు పొంచి ఉందా?

ప్రజాసంక్షేమ పథకాలు ముందుకు సాగాలంటే డబ్బులు అవసరమని... దాని కోసం టి.సర్కార్ ప్రపంచం బ్యాంక్ తలుపులు తట్టింది. టి. సర్కార్ విషకౌగిలిలోకి వెళుతోందా?

మొన్న గుంటూరులో వారం రోజుల చిన్నారి పై ఎలుకలు పీక్కుతిన్నాయి. నిన్న మహబూబాబాద్ లో ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి పై పందులు దాడి చేశాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, కనీస వైద్యం అందించాల్సిన బాధ్య ప్రభుత్వాల పై ఉదందని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బి.వెంకట్, బిజెపి నేత ఆచారి, కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్, టిడిపి నేత సతీష్ మాదిగ, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

నేడు నెల్లూరులో పర్యటించనున్న జగన్

నెల్లూరు : జిల్లాలో నేడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వేదాయపాలెంలో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్‌ పరామర్శించనున్నారు. జగన్‌ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

ఆర్ఎస్ పురా సెక్టార్ లో కాల్పులకు తెగబడ్డ పాక్

హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్ లో మళ్లీ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఆర్ ఎస్ పురా సెక్టారర్ లో కాల్పులకు తెగబడింది. బీఎస్ ఎఫ్ బేస్ క్యాంపుల లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి.

దసరా దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : దసరా, దీపావళి పండగల సందర్భంలో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ మీదగా పలు రైళ్లను నడపనున్నట్లు సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు గురువారం తెలిపారు. నెంబర్‌ 08573 విశాఖపట్టణం- తిరుపతీ వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌ అక్టోబర్‌ 12, 19, 26, నవంబర్‌ 2, 9, 16, 23 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 6.05 గంటలకు న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చి మధ్యా హ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకొంటుంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

అన్ని పథకాలకు సింగిల్‌ విండో విధానం అమలు

హైదరాబాద్ : సింగిల్ విండో విధానాన్ని అన్ని పథకాలకు వర్తింపజేయనున్నారా..? దీని ద్వారా జీహెచ్ ఎంసీ తోపాటు, హెచ్ ఎండీఏ లో అవినీతి, అక్రమాలకు చెక్‌ పెట్టనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. సింగిల్‌ విండో విధానాన్నే ఇరిగేషన్ ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతుల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది.

06:56 - August 28, 2015

విజయవాడ : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికాను. ఏ తప్పు చేయలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రెయింబవళ్లు ఆలోచిస్తుంటే... మీ రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా..? అంటూ ఆగ్గిమీద గుగ్గిలం అయింది ఎవరో కాదు. స్వయానా సీఎం గారే. ఏపీరాష్ట్ర అభివృద్ధి కోసం.. నానా తంటాలు పడుతుంటే... ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని.. ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

ప్రతిపక్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు గరంగరం.......

ప్రతిపక్షాలపై సీఎం చంద్రబాబు.. ఒంటికాలుపై లేచారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారంటూ.. మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో.. రాజీపడుతున్నానని, నాపై కేసుల కోసమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగటంలేదని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనుంచి ప్రజలెవరూ బలికావొద్దని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మంత్రి రోడ్ మ్యాప్ తయారీకి ఆదేశించారని, రోడ్ మ్యాప్ వస్తే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు అన్నారు.

బీసీశాఖ మంత్రితో సమావేశం......

ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు విజయవాడకు చేరుకుని సమీక్షలు, సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్‌ల మధ్య బిజీబిజీగా గడిపారు. ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రితోను, అధికారులతో సమావేశమైన చంద్రబాబు.. మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీఎంతో సమావేశమై.. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై వివరణ అడిగారు. పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్న సీఎం చంద్రబాబు.. హోదా వల్ల ఉపయోగంలేదని కాదు.. హోదాతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరగాలన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏది ఎప్పుడు చేయాలో తమకు తెలుసునన్నారు.

భావోద్వేగాలతో ఆటలొద్దు : సీఎం

ప్రత్యేక హోదా వస్తే అన్ని వస్తాయని మభ్యపెట్టే వాళ్లు.. ప్రజల భావోద్వేగాలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధాని భూముల విషయంలో 95 శాతం మంది ప్రజలు ముందుకురాగా, 5 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని, వారికోసం భూ సేకరణ నిలుపుదల చేయాల్సిన అవసరం లేదన్నారు. రైతులను ఒప్పించి భూములు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అవసరమైతే పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని అన్నారు. గుంటూరులో బాలుడు మరణం, పశ్చిమ గోదావరిలో సైకో వీరంగంపై అధికారులకు హెచ్చరికలతో కూడిన ఆదేశాలిచ్చామన్నారు. మొత్తంగా బాబు విజయవాడ టూర్‌ గరంగరంగా జరిగింది.

ప్రజల భావోద్వేగాలతో ఆటలు వద్దు-చంద్రబాబు

విజయవాడ : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికాను. ఏ తప్పు చేయలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రెయింబవళ్లు ఆలోచిస్తుంటే... మీ రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా..? అంటూ ఆగ్గిమీద గుగ్గిలం అయింది ఎవరో కాదు. స్వయానా సీఎం గారే. ఏపీరాష్ట్ర అభివృద్ధి కోసం.. నానా తంటాలు పడుతుంటే... ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని.. ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

 

06:49 - August 28, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో... వైద్యం వికటించి మహిళ చనిపోయింది. ఇబ్రహీంపట్నం ప్రగతినగర్‌కు చెందిన శంకర్‌, ఉమామహేశ్వరి దంపతులకు పెళ్లయి 20 ఏళ్లు అయినా పిల్లలు లేరని... సికింద్రాబాద్‌లోని గోపాలపురం టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. రెండుసార్లు ఆస్పత్రి చుట్టూ తిప్పుకున్న వైద్యులు.. వారికి పిల్లలు పుడతారని ఆశలు రేపారు. దీంతో ఈనెల 26న పరీక్షలు చేయాలంటూ అనస్తీషియా ఇచ్చారని భర్త శంకర్‌ చెబుతున్నాడు. అప్పటికే ఉమామహేశ్వరి కోమాలోకి వెళ్లిపోయిందని.. ఏమైందని ప్రశ్నిస్తే.. తనకు ఆస్తమా ఉందని ఎందుకు చెప్పలేదంటూ దమాయించారని చెప్పాడు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేయించి... చేతులు దులుపుకున్నారని అంటున్నాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం.. కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తన భార్య చనిపోయిందని బాధితుడు శంకర్‌ వాపోతున్నాడు. గోపాలపురం టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

06:47 - August 28, 2015

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ప్రపంచ బ్యాంకు తలుపు తట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ...ప్రభుత్వం తీసుకున్నా వివిధ పథకాలు, లక్ష్యాల సాధన కొసం వరల్డ్ బ్యాంక్ సహకారం అవసమని భావిస్తోంది. సచివాయలంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం అయ్యారు.

విద్యత్‌ ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన పదిహేనేళ్ల తర్వాత...

ప్రపంచ బ్యాంకు చప్పుళ్లు మళ్లీ వినిపిస్తున్నాయి. సరిగ్గా విద్యత్‌ ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన పదిహేనేళ్ల తర్వాత... తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ బ్యాంక్ బృందం సంప్రదింపులకు తెరలేపింది. తెలంగాణ సీఎస్‌ రాజీవ్ శర్మ, శాఖాధిపతులతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సచివాయలంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినా తర్వాత నూతన ప్రభుత్వం తీసుకున్నా సంక్షేమ పథకాలు, వాటి తీరుతెన్నులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు సీఎస్ రాజీవ్ శర్మ. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం లక్షన్నర కోట్ల రుణం అవసరమని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వరల్డ్‌ బ్యాంకుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.

విద్యుత్‌ రంగంలో కొత్తంగా థర్మల్ కేంద్రాల నిర్మాణం....

విద్యుత్‌ రంగంలో కొత్తంగా థర్మల్ కేంద్రాల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, డిస్కంల పునర్‌వ్యవస్థీకరణ తదితర అవసరాల కోసం నిధుల్ని ప్రభుత్వ వర్గాలు అడిగాయి. ఇదిలా ఉంటే గతంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థలు యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణానికి 20వేల కోట్ల రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. 11 శాతం వడ్డీకే రుణాన్ని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే తెరవెనుక ఈ సొమ్మును సమకూరుస్తోంది వరల్డ్‌ బ్యాంకేనని విశ్లేషకులు అంటున్నారు. పైకి ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా కనిపిస్తున్నా వీటి మూలాలు మాత్రం వరల్డ్‌ బ్యాంక్‌కు చెందినవిగా తేలింది.

ప్రపంచ బ్యాంకు అధికారుల ముందు....

తెలంగాణలోని వివిధ శాఖల ఆర్థిక అవసరాలన్నింటినీ ప్రభుత్వ అధికారులు ప్రపంచ బ్యాంకు అధికారుల ముందు పెట్టారు. విద్య వైద్యం రహదారుల నిర్మాణం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, వాటర్‌ గ్రిడ్‌, తదితరాల్లో రుణాలు కావాలని చర్చల్లో ప్రతిపాదించారు. బ్యాంక్‌ షరతులపై మాత్రం ఎవరూ నోరెత్తే సాహసం చేయడం లేదు. వరల్డ్‌ బ్యాంకు ప్రభుత్వం కోరిన లక్షన్నర కోట్ల సహాయం పై విషయంలో పథకాల సమగ్ర రిపోర్టు ను ఇచ్చినట్లయితే తమ కన్సల్టెన్సీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి హమీ ఇచ్చారు వరల్డ్‌ బ్యాంకు అధికారులు.

మీడియాకు తెలపకుండా అత్యంత గోప్యంగా .....

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జరిగిన సమావేశ వివరాలను ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలపకుండా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. గతంలో చంద్రబాబు సర్కారు సైతం వరల్డ్‌ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలను ఎక్కడా లీక్‌ చేయకుండా గోప్యంగా ఉంచింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

06:43 - August 28, 2015

హైదరాబాద్ : ప్రజాందోళన ప్రజ్వరిల్లిన రోజది. తూటాలకు వెరవని ఎర్రదండు ఆవేశమది. నూతన సహస్రాబ్దిని సమరశీల యుగంగా మార్చిన విప్లవశంఖారావమది. అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిన పాలకుల మెడలు వంచిన సందర్భమది. విప్లవించిన బషీర్‌బాగ్ విద్యుత్తేజమది. దేశ,రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు, ప్రజా ఉద్యమాలు ఎగసేలా స్ఫూర్తి నింపిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు నేటితో 15 ఏళ్లు.                                                      

ఒక ఉద్యమం ప్రజాగ్రహాన్ని ఏకం చేసింది......

తెలుగు రాష్ట్రాల చరిత్రలో, దేశ ఉద్యమ ప్రస్థానంలో విప్లవాక్షరాలతో లిఖించదగిన ఘటన బషీర్‌బాగ్ పోరాటం. అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచిన నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజాలు పడ్డ మహోజ్వల నిరసన. అక్కడ పేలిన తూటాలు, విరిగిన లాఠీలు, నెత్తురోడిన రోడ్లు, క్షతగాత్రులతో నిండిన ఆసుపత్రులు నాడు తొమ్మిదేళ్ల బాబు సర్కారును దింపడమే కాదు ఇప్పటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి.

ఖాకీల లాఠిన్యానికి సజీవ సాక్ష్యంగా రగులుతూనే ఉంది.....

బషీర్‌బాగ్‌ కాల్పులకు ఆగస్టు 28తో 15 ఏళ్లు. అమరులైన ముగ్గురు వీరుల స్మృతి చిహ్నం నాటి ఘట్టాన్ని నేటికీ కళ్లకు కడుతూ ఉంది. నాడు జరిగిన కాల్పులు, అశ్వికదళం అరాచకాలు, ఖాకీల లాఠిన్యానికి సజీవ సాక్ష్యంగా రగులుతూనే ఉంది. పోలీసుల కాల్పులతో బషీర్‌బాగ్ నెత్తురోడింది. బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ పోలీసు తూటాలకు తీవ్రంగా గాయపడి...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రాణాలకు వెరవని ఆ అమరులకు ప్రపంచం మొత్త లాల్ సలాం చేసింది. చేస్తూనే ఉంటుంది. కాల్పుల ఘటనపై రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉద్యమాలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు సర్కారుపై నిరసనలు హోరెత్తాయి. వికసించిన విద్యుత్తేజం, మార్మోగే భూ పోరాట స్వరాలు పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తూనే వుంటాయి.

06:40 - August 28, 2015

హైదరాబాద్ : ప్రభుత్వాలు ఏడాదికోసారి మేడే ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. శ్రామికరత్న అవార్డులిచ్చి సత్కరిస్తుంటాయి. కార్మిక సంక్షేమం కోసం తాము చేపడుతున్న కార్యక్రమాలను ఘనంగా చెప్పుకుంటూ వుంటాయి. ఏడాదిలో ఒక్క రోజు కార్మికుల యోగ క్షేమాల గురించి మాట్లాడే ప్రభుత్వాలు మిగిలిన మున్నూట అరవై నాలుగు రోజులు యాజమాన్యాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, కార్మికుల పట్ల నిర్ధయగా వ్యవహరించడం మనం చూస్తున్నదే.

పరిశ్రమలు మూతపడినా స్పందించని ప్రభుత్వాలు...

ఎక్కడైనా ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మూతపడితే ప్రభుత్వాలు స్పందించవు. వాటిని తెరిపించేందుకు ఎలాంటి గట్టి చర్యలూ తీసుకోవు. కార్మికులకు దక్కాల్సిన పరిహారం ఇప్పించేందుకూ చొరవ చూపవు. ఎక్కడైనా ఫ్యాక్టరీల మూసివేతకు నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగితే తక్షణమే అక్కడ పోలీసులు ప్రత్యక్షమవుతారు. కాల్పులు జరపడం, కార్మికులు చనిపోవడం లాంటి సంఘటనలు గతంలో సమైక్యరాష్ట్రంలో జరిగాయి.

20శాతం కంపెనీలు మూతపడ్డాయి...

2014 చివరి నాటికి మనదేశంలో రిజస్టర్ అయిన కంపెనీలలో దాదాపు 20శాతం కంపెనీలు మూతపడ్డట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే ప్రారంభమైన ప్రతి అయిదు కంపెనీల్లో ఒకటి మూతపడింది. ఇవేవీ రీ ఓపెనింగ్ కి నోచుకోవడం లేదు. ఆయా కంపెనీలలో పనిచేసిన కార్మికులకు దక్కాల్సిన కనీస పరిహారాలేవీ అందలేదు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది తమకు రావాల్సిన పరిహారాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే వున్నారు.

పీ ఎఫ్, ఈ ఎస్ ఐ లాంటి పథకాలను.....

పీ ఎఫ్, ఈ ఎస్ ఐ లాంటి పథకాలను ఎన్ని కంపెనీలు నిక్కచ్చిగా అమలు చేస్తున్నాయో, ఏ యే కంపెనీలు కార్మికుల, ఉద్యోగుల జీతాల్లోం చి కోతకోసిన వాటిని కూడా జమ చేయడం లేదో ప్రభుత్వాలకు పక్కాగా తెలుసు. ఏయే కంపెనీల యాజమాన్యాలు ఏయే రూపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయో, ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులతో పనిచేయించుకుంటున్నయో, ఎన్ని రకాలుగా వేధిస్తున్నాయోనన్న సమాచారం ప్రభుత్వాల దగ్గర లేదనుకోలేం. అయినా, ఆయా యాజమాన్యాలను ఇప్పటి దాకా ఏ ఒక్క ప్రభుత్వమూ గట్టిగా మందలించలేదు.

మోడీ ప్రభుత్వం ఒక ఆకు ఎక్కువే చదివినట్టుంది....

గత ప్రభుత్వాల కంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఆకు ఎక్కువే చదివినట్టుంది. కార్మిక సంక్షేమాన్ని కాంక్షించి చేసిన చట్టాలను కూడా కుళ్లబొడుస్తోంది. అప్రెంటిస్ చట్టం మారిపోతోంది. అప్రెంటిస్ ల పేరుతో ఎంతకాలమైనా గొడ్డు చాకిరీ చేయించుకునే చక్కటి అవకాశాన్ని యాజమాన్యాలకు కట్టబెడుతోంది. ఓవర్ టైమ్ లు పెంచుతోంది. ఫిక్స్ డ్ టర్మ్ ఉద్యోగాలు తీసుకొస్తోంది. అంటే ఆరు నెలల తర్వాతో, ఏడాది తర్వాతో తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అర్ధంకాని భయానక పరిస్థితిని స్రుష్టిస్తోంది. మహిళలతో బలవంతంగా నైట్ డ్యూటీలు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంఘాలు పెట్టుకునే విషయంలోనూ వింత వింత షరతులు పెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యాలు చెప్పింది చెయ్యి వారు ఇచ్చింది తీసుకో అన్న రీతిలో కేంద్రం చట్టాలు మారుస్తోంది. 

06:36 - August 28, 2015

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2 సమ్మెను దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలంటూ వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రక్రియ సాగిస్తున్నప్పటికీ, అవి ఆశాజనకంగా సాగడం లేదు. ఈ సమ్మెకు దారితీసిన కారణాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఐఎన్ టియూసీ నాయకులు ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:33 - August 28, 2015

హైదరాబాద్ : బెంగాల్‌లో తృణమూల్ నిరంకుశ వైఖరి శృతి మించుతోంది. ప్రజాస్వామ్యానికే మచ్చతెచ్చేలా మారుతోంది. శాంతియుతంగా నిర్వహిస్తున్న... లెఫ్ట్ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. లాఠీ దెబ్బలు తింటున్నా, వెన్నుచూపని లెఫ్ట్‌ కార్యకర్తల పోరాట స్ఫూర్తికి... పోలీసులే నివ్వెరపోయారు.

పైశాచిక పాలనకు సజీవ సాక్ష్యం.....

పశ్చిమ బెంగాల్‌లోని దృశ్యాలివి. పైశాచిక పాలనకు సజీవ సాక్ష్యాలివి. దీదీ రాజ్యంలో ఖాకీల దాష్టీకానికి నిదర్శనాలివి. న్యాయం కోసం రోడ్డెక్కిన రైతన్నలపై మమతా సర్కార్ కన్నెర్ర చేసింది. పోలీసుల్ని ఉసిగొల్పి అన్నదాతల రక్తంచిందేలా చేసింది.

రణరంగాన్ని తలపించిన కోల్‌కతా వీధులు......

కోల్‌కతా వీధులన్నీ రణరంగాన్ని తలపించాయి. ప్రజా సమస్యలపై... లెఫ్ట్ పార్టీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆకలి కేకలతో అలమటిస్తున్న రైతన్నలకు అండగా వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరల్ని తగ్గించాలని, భూ సేకరణ ఆర్డినెన్స్‌ను విరమించుకోవాలని 17 డిమాండ్లతో CPM నేతృత్వంలో లెఫ్ట్ పార్టీలు చేపట్టిన ఛలో అసెంబ్లీ హింసాత్మకంగా మారింది.

మహిళల్ని ఇష్టమొచ్చినట్లు బాదిన పోలీసులు.......

శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వామపక్ష కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళల్ని కూడా లాఠీలతో ఇష్టమొచ్చినట్లు బాదారు. నెత్తురోడేలా తలపై చితకబాదారు. లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు, ఎంపీ రితాబ్రత బెనర్జీ సహా పలువురు లీడర్లు గాయపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే తృణమూల్ కార్యకర్తల్లా మారిపోయారు పోలీసులు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచేందుకు ప్రయత్నించారు.

ఎత్తిన జెండా దించని కామ్రేడ్లు ......

నెత్తుటి ధారలు కారినా... మరఫిరంగులు మోగినా... బుల్లెట్ల వర్షం కురిసినా... కామ్రేడ్లు ఎత్తిన జెండా దించలేదు. లాఠీ దెబ్బలు తింటున్నా.. వెన్ను చూపని వామపక్ష కార్యకర్తల పోరాట స్ఫూర్తికి పోలీసులే నివ్వెరపోయారు. దీంతో ఉద్యమతీవ్రతకు దిగొచ్చిన ఖాకీలు అరెస్టు చేసిన వారిని విడుదల చేశారు.

కోల్‌కతా ఘటనను ఖండించిన సీపీఎం పొలిట్‌బ్యూరో......

కోల్‌కతా ఘటనను సీపీఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. మమత పాలన ప్రజాస్వామ్యానికే మచ్చతెచ్చేలా ఉందని లెఫ్ట్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ ప్రభుత్వానికి ధీటైన సమాధానమిస్తామని హెచ్చరించారు. 

కిటకిటలాడుతున్న ఆలయాలు...

విజయవాడ : నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో కిటకిటలాడుతోంది.

అంబేద్కర్ యూనివర్శిటీలో కొత్త పీజీ కోర్సు

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ కోర్సును తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో ఉన్న ఈ కోర్సుకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 8 గడువుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ బదిలీ...

హైదరాబాద్ : ఖమ్మం కలెక్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ లోకేష్‌ కుమార్‌ను నియమించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా అకున్ సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

200 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు :నర్సరావు పేటలో అక్రమంగా తరలిస్తున్న2000 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాసరావుతో చర్చించారు. ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయో దర్యాప్తు చేస్తామని ఆర్డీవో తెలిపారు. ఇవి అధికారపక్షానికి చెందినవేనని గోపిరెడ్డి ఆరోపించారు.

Don't Miss