Activities calendar

29 August 2015

22:11 - August 29, 2015

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరిగింది.. మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.. రాజకీయ ప్రముఖులు కూడా రాఖీలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు..

 

22:07 - August 29, 2015

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా రాజీవ్ ఖేల్ రత్న గౌరవం అందుకొంది. జాతీయక్రీడాదినోత్సవం వేడుకల్లో భాగంగా....రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఖేల్‌ రత్న పురస్కారం అందుకొంది. కెరీర్‌లో తొలిసారిగా వింబుల్డన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచిన సానియా ప్రస్తుతం ప్రపంచ మహిళా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను దేశఅత్యున్నత క్రీడాపురస్కారం.. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన మూడో హైదరాబాదీ స్పోర్ట్స్ గ్రేట్‌గా చరిత్ర సృష్టించింది.

 

22:04 - August 29, 2015

ఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మొత్తం 17 మంది రాష్ట్రపతి చేతుల మీదుగా....అర్జున అవార్డ్‌ అందుకున్నారు. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌, ఆర్చరీలో నయీబ్‌ సందీప్‌ కుమార్‌, జిమ్నాస్ట్‌ దీపా కుమారి,భారత హాకీ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌,మహిళా కబడ్డీ ప్లేయర్‌ అభిలాష శశికాంత్‌ మాత్రే, అనూప్‌ కుమార్‌ యామ, షూటర్‌ జీతూ రాయ్‌, వెయిట్‌ లిఫ్టర్‌ సతీష్‌ కుమార్‌, రెజ్లర్‌ భజరంగీ, సంతోయ్‌ దేవీ అర్జున పురస్కారాలు అందుకున్నారు. టీమిండియా యంగ్‌ గన్‌ రోహిత్‌ శర్మ...శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌లో ఆడుతున్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 

22:01 - August 29, 2015

ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్కినేని వంశంలో మూడో తరానికి చెందిన మరో హీరో తెరంగేట్రం చేసేశాడు. అఖిల్ హీరోగా.. అదే పేరుతో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ స్వయంగా వచ్చి ఈ టీజర్ విడుదల చేశారు. అఖిల్ ను మొదటి సినిమాలోనే తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో పరిచయం దర్శకుడు వీవీ వినాయక్ చేశాడు.

 

21:51 - August 29, 2015

మన దేశంలో వర్ణ వ్యవస్థ కుట్రకు ఎందరో అనగారిన వర్గాల వారు బలి పశువులు అయ్యారు. బానిసలుగా బతుకు వెళ్లదీశారు. తరతరాలుగా వారి శ్రమ దోపిడి గురైంది. సంఘంలో వారిని కనీసం మనుషులుగా గుర్తించి .. గౌరవించలేదు. అలాంటి వారిలో చాకలోళ్లు ఒకరు. అన్ని కులాల వారి బట్టను ఉతికి శుభ్రపరిచే.. చాకలోళ్ల పని తనం నిరాధరణకు గురైంది. చాకలోళ్ల చారిత్రక నేపథ్యం, వారికి జరిగిన చారిత్రక విద్రోహం వంటి పలు అంశాలపై ప్రముఖ విశ్లేషకులు ప్రొ.కంచ ఐలయ్య విశ్లేషించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
చాకలి వాడలో సోషలిస్టు కిచెన్..
''చాకలి వారు..దినం మొత్తం బట్టలు ఉతుకుతారు. కస్టమర్స్ దగ్గర అన్నం, గటక, తీసుకెళ్తారు. అందరి ఇళ్ల నుంచి అన్నం, కూర తెచ్చి.. కుటుంబం మొత్తం తినేవారు. మొదటగా వారికి వంట గది అంటూ లేదు. అందరు ఇచ్చిన తిండిని చాకలి వారు తిన్నారు. చాకలి తెలివి.. చువుకున్నవారికంటే గొప్పది. మానవులు బట్టలు తొడుక్కున్న తర్వాత మాసిపోతాయి. వాటిని చాకలి వారే శుభ్రం చేయాలి. శుభ్రమైన బట్టలు వేసుకుంటే... ఆ రోజంతా చురుకుగా పని చేస్తారు. చాకలి స్త్రీలు..లీడ్ తీసుకున్నారు. చౌడుమట్టిలో సబ్బును కనిపెట్టారు. చౌడుమట్టితో ఉతికితే బట్టలు తెల్లగా అవుతాయి. కానీ క్రిములు పోవు.. అప్పుడు వేడినీటిలో బట్టలను ఉడకపెట్టి ఉతికారు. గ్రామ ప్రజలు ఆర్యోగంగా బతకడానికి ఒక రకంగా చాకలి వారే కారణం. ఋగ్వేదం రాసిన తర్వాత..శూద్రులను వృత్తుల వారిగా విభజించారు. వృత్తి వారికి స్టేటస్ కల్పించారు. అందరూ ఇచ్చిన ఆహారాన్ని తింటారు. చాకలి వాడలో సోషలిస్టు కిచెన్ ఉండేది. చాకలి వృత్తిలో సోషలిస్టు స్వభావం.. శ్రమ గౌరవం ఉంది. చాకలి వృత్తిలో స్త్రీ, పురుషల సమానత్వం ఉంది. ప్రబంధ కావ్యాల వల్ల సమాజం మారదు. చాకలి, మంగలి, మాల, మాదిగలు వంటి వృత్తులు చేసే కులాల గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలి.. తాత్వికపోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. చాకలి కులస్తులకు ఆత్మగౌరవం కల్పించాలి.. బెస్టు క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.. వారి పిల్లలను ఇంగ్లీష్ విద్యను అందించాలి.. ఎల్ కేజీ నుంచి పిజి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. రిజర్వేషన్ ఒక్కటే పరిష్కారం కాదు. ఎడ్యుకేషన్, సమానవత్వం, మార్పు రావాలి' అని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

21:30 - August 29, 2015

మనదేశంలో వర్ణవ్యవస్థ కుట్రకు ఎందరో అణగారిన కులాలవాళ్లు బలి పశువులయ్యారు. బానిసలుగా బతుకులు వెళ్లదీశారు. తరతరాలుగా వారిశ్రమ దోపిడీకి గురయింది. సంఘంలో వారిని కనీసం మనుషులుగా గుర్తించి గౌరవించలేదు. అలాంటి వారిలో చాకలోళ్లు ఒకరు. అన్ని కులాలవారి బట్టలను ఉతికి శుభ్రపరిచే చాకలోళ్ళ పనితనం నిరాదరణకు గురయిందంటారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య. చాకలోళ్ల చారిత్రక నేపథ్యం వారికి జరిగిన చారిత్రక విద్రోహం గురించి ఇప్పడు తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎపిని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: గంటా

విజయవాడ : ఎపిని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా మారుస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారు. విజయవాడలో యూనివర్సిటీల వీసీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ కృష్ణారావు, డీజీపీ రాముడు హాజరయ్యారు.

 

గుంటూరు మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీ, హాస్టల్ భవనాలు పోలీస్ శాఖకు లీజ్...

గుంటూరు: జిల్లాలోని మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీ, హాస్టల్ భవనాలను పదేళ్ల పాటు పోలీసు శాఖకు లీజుకు ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీ విద్యార్థులను ఎక్కడికి తరలిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 

20:56 - August 29, 2015

రేడియో జాకీ.. శేఖర్ బాద్ షా తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శేఖర్ తన అనుభావాలను వివరించారు. తన బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్ వివరాలను తెలిపారు. పలువురు శ్రోతలతో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆ భూములను పేద రైతులకు ఇవ్వాలి: మధు

విజయవాడ : ఎపి ప్రభుత్వం రద్దు చేసిన సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ భూములను పేద రైతులకు కేటాయించాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. మరో కార్పొరేట్ కంపెనీకి భూములు కేటాయిస్తే.. మరో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. అసైన్డ్ భూములను పేదలకు దక్కకుండా చేస్తే.. ప్రత్యక్ష ఆందోళన చేపడతామని చెప్పారు. 

రెండు వర్గాల మధ్య ఘర్షణ

నల్గొండ : దామరచర్ల మండలం బాలంపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. గ్రామంలో పోలీసులు మోహరించారు.

19:50 - August 29, 2015

ఢిల్లీ: దేశరాజధాని హస్తినలోని రాష్ట్రపతి భవన్ లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'ఖేల్ రత్న'ను సానియామీర్జాకు రాష్ట్రపతి ప్రణబ్ ప్రదానం చేశారు. శ్రీకాంత్( బ్యాడ్మింటన్ ), అనూప్ కుమార్(రోలర్ స్కేటింగ్)లకు అర్జున అవార్డులను ప్రణబ్ అందచేశారు.

19:31 - August 29, 2015

హైదరాబాద్: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరనున్నారు. రేపు హైదరాబాద్ లో ఎపి సీఎం, టిడిపి ఎపి అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరనున్నారు. గత కొంతకాలంగా మాణిక్య వరప్రసాద్ వైసిపిలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈక్రమంలో టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు.. ఆయనతో చర్చించి.. వైసిపిలో చేరకుండా ప్రయత్నించారు. మాణిక్య వరప్రసాద్ రాజకీయ గురువు అయిన రాయపాటి మాటలను నమ్మిన వరప్రసాద్ వైసిపిలో చేరాలనే నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీంతో డొక్కాను టిడిపిలోకి రావాలని రాయపాటి సూచించారు. అయితే చంద్రబాబు నేతృత్వంలో టిడిపిలో చేరేందుకు డొక్కా సిద్ధమయ్యారు. చంద్రబాబు బిజి బిజిగా ఉండడంతో గతంలో చేరడానికి సాధ్యం కాలేదు. ఈక్రమంలో రేపు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో డొక్కా టిడిపిలో చేరనున్నారు.

 

టిడిపిలో చేరనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్

హైదరాబాద్: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరనున్నారు. రేపు హైదరాబాద్ లో ఎపి సీఎం చంద్రబాబు, టిడిపి ఎపి అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరనున్నారు. 

సానియాకు ఖేల్ రత్న పురస్కారం ప్రదానం

ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వార్టులను ప్రదానం చేశారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం వరించింది.

19:05 - August 29, 2015

విజయవాడ: ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశం 6 గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 42 అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అందులో ప్రధానంగా ప్రత్యేకహోదా, ప్యాకేజీ, అసైన్డ్ భూములు, అక్రమ కట్టడాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించే వ్యూహాలు, రాజధాని కోసం భూసేకరణ, భూసమీకరణ వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 31 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సీఆర్ డీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ, భూసమీకరణ అంశాలపై ప్రతిపక్షాల లేవనెత్తే ప్రశ్నలు, విపక్షాల దాడిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేత హోదాపై ప్రధాని మోడీతో చర్చించిన అంశాలను చంద్రబాబు కేబినెట్ లో వివరించారు. సమావేశం అనంతరం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి....

  • సోంపేట పవర్ ప్లాంటు రద్దుకు నిర్ణయం..
  • అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయం...
  • విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాల ఏర్పాటు...
  • చిత్తూరులో హెల్త్ సిటీ ఏర్పాటు...
  • రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయ బిల్లు...
  • ప్రపంచంలోనే టాప్ 10 యూనివర్సిటీలకు ఆహ్వానం..
  • సుబాబుల్ తో కాగితం తయారీ పరిశ్రమలకు 5 శాతానికి వ్యాట్ తగ్గింపు..
  • దేవాదాయశాఖలో బోర్డుల కాలపరిమితి రెండేళ్లకు పెంపు...
  • వ్యర్థాలతో తయారయ్యే ఇంధనాలకు వ్యాట్ మినహాయింపు..

 

18:49 - August 29, 2015

రంగారెడ్డి : దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజకు స్త్రీలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా... మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా... అమ్మాయిలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దేశవ్యాప్తంగా అనునిత్యం ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కామాంధులు రెచ్చిపోయారు. మానవత్వం మరిచి ప్రవర్తించారు. మతిస్తిమితంలేని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోర ఘటన ఎల్‌బి నగర్ ఇంద్రప్రస్తానం కాలనీలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ ఇంద్రప్రస్తానం కాలనీకి చెందిన ముగ్గురు ఆటో డ్రైవర్లు.... అదే కాలనీకి చెందిన మతిస్తిమితంలేని ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. గుర్రంగూడ ఫారెస్ట్ ఏరియాలోకి బాలికను తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి బాలికను తీసుకెళ్లి...ఆదిభట్లలోని ఓ ఇంట్లో నిర్భందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముగ్గురిపై పోలీసులు నిర్భయం చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడో నిందితున్ని రేపు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

 

17:58 - August 29, 2015

కొలంబో : శ్రీలంక తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. భారత ఓపెనర్ ఛతేశ్వర పుజార శతకం సాధించాడు. ఇతనికి శర్మ ఒక్కడే చక్కటి సహకారం అందించాడు. ఓవర్ నైట్ స్కోర్ 50/2 తో ఆటను ఆరంభించింది. జట్టు స్కోరు 64 వద్ద ఉండగా కోహ్లీ (18) ని మాథ్యూస్ వెనక్కి పంపించాడు. అనంతరం వచ్చిన శర్మ..పుజారకు జత కలిశాడు. వీరిద్దరూ శ్రీలంక బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నారు. కానీ ప్రసాద్ బౌలింగ్ లో శర్మ (26) వెనుదిరిగాడు. వెంటనే బిన్ని (0) పరుగులేమి చేయకుండానే అవుటయ్యాడు. మరోవైపు పుజార ఒక్కడే ఒంటరిగా స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశాడు. ఓజా (21), అశ్విన్ (5) కూడా వెనుదిరిగారు. అప్పటికీ జట్టు స్కోరు 180 పరుగులు మాత్రమే. తరువాత వచ్చిన మిశ్రా వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఇదిలా ఉంటే పుజార శతకం సాధించాడు. చెత్త బాల్స్ ను మిశ్రా బౌండరీకి తరలించాడు. వీరిద్దరినీ విడదీయడానికి శ్రీలంక బౌలర్లు కష్టపడ్డారు. ఈ దశలో శర్మ అర్థ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 284 పరుగుల వద్ద ఉన్నప్పుడు మంచి ఊపు మీదున్న మిశ్రా (59) ను హెరాత్ పెవిలియన్ పంపించాడు. తరువాత పుజారకు శర్మ జతకలిశాడు. ఈ మధ్యలో వర్షం కురిసింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ నాలుగు, ప్రదీప్, మాథ్యూస్, హెరాత్, కౌశాల్ తలా ఒక వికెట్ తీశారు. 

17:56 - August 29, 2015

హైదరాబాద్: ప్రత్యేకహోదాకు సీఎం చంద్రబాబు అనుకూలమా.. వ్యతిరేకమా స్పష్టం చేయాలని వైసిపి అధినేత జగన్ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి ప్రత్యేకహోదా అంటాడు.. మరోసారి ప్యాకేజీ అంటూ మంత్రులు, సీఎం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఇవాళా వైసిపి చేపట్టిన బంద్ ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈమేరకు హైదరాబాద్ లో జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లా కేంద్రంలో 144 అమలు చేశారని.. బంద్ సందర్భంగా తమ పార్టీకి చెందని 40 మంది ఎమ్మెల్యేను అరెస్టు చేశారని తెలిపారు. వేల సంఖ్యలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. విద్యార్థులను కొట్టి.. ఈడ్చు కెళ్లారని... మహిళలను సైతం కొట్టడంతోపాటు వారిని వ్యాన్ లోకి విసిరేశారని వివరించారు. ప్రత్యేకహోదాకు వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇవాళా కేబనెట్ సమావేశం జరిగిందని... ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ.. తీర్మానం చేస్తారని భావించాను... కానీ అది జరగలేదన్నారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు పోరాటం చేయడంలో వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. బాబు అబద్ధాలు చెబుతున్నారని.. రోజుకోమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు... పదేళ్లు ఇస్తామని చెప్పారు..కానీ ఇప్పుడు హోదా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. హామీలు ఇచ్చేటప్పుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయని గుర్తు లేదా అని నిలదీశారు. రాష్ట్ర బాగోగుల కోసం, భవిష్యత్ కోసం, ప్రత్యేకహోదా కోసం చేపట్టిన బంద్ కు మద్దతు తెలిపిన వామపక్షాలతోపాటు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది...
ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు 90 శాతం.. లోన్ లు 10 శాతం ఉంటాయన్నారు. హోదా లేకపోతే.. గ్రాంట్లు 30 శాతం, లోన్ లు 70 శాతం ఉంటాయని తెలిపారు. ప్రత్యేకోహోదా వస్తేనే ఎక్సైజ్ డ్యూటీ, ఎగ్జెంమ్షన్ ఉంటాయన్నారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు. ఎపికి 270 కిమి. మేర సముద్రం తీరం ఉందని.. దాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. పరిశ్రమలు వస్తే.. ఉద్యోగాలు వస్తాయని వివరించారు. గ్రాంట్లు ఇచ్చే విషయంలో 14వ కమిషన్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేహోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక.. మళ్లీ వెనక్కి తగ్గడం సరికాదన్నారు. ప్రత్యేహోదా మరిచి ప్యాకేజీ ముద్దు అంటున్నారని.. అది భావ్యం కాదని చెప్పారు. ప్యాకేజీ అనేది తమ హక్కు అని కొత్తగా ఇచ్చేది కాదని.. కాబట్టి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.

 

హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది - జగన్..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ కు మద్దతు తెలిపిన వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదాను ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో నేటి బంద్ తో రుజువైందని ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొనాలని తెలిపారు. కేంద్రంపై వత్తిడి తేవాలని లేదా కేబినెట్ నుండి తప్పుకోవాలన్నారు. హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇది వస్తే ఎలాంటి లాభాలు వస్తాయో తెలిసి కూడా చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. 

వర్సిటీ ఉపకులపతులతో గంటా భేటీ..

విజయవాడ : వర్సిటీ ఉపకులపతులతో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధంపై చర్చించారు. 

17:35 - August 29, 2015

పాట్నా : బీహార్‌ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాభవం తప్పదని ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ హెచ్చరించారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో రేపు జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ మహాకూటమి భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్లధనం, యువతకు ఉపాధి తదితర హామీలను ప్రధాని మోడీ ఇంతవరకు నెరవేర్చలేదని లాలూ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగే ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ ర్యాలీలో తమ పార్టీ పాల్గొనడం లేదని ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ పేర్కొనడం కూటమిలో విభేదాలను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీకి 5 సీట్లు కేటాయిస్తామని లాలూ ప్రకటించారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలు జెడియు.. 100, ఆర్జేడి.. 100, కాంగ్రెస్‌.. 40 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించాయి.

17:32 - August 29, 2015

'అక్కినేని నాగార్జున' జన్మదిన కానుకలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. 'నాగార్జున' నట వారసుడు 'నాగ చైతన్య' నటిస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో చైతన్య విడుదల చేశాడు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు చిత్ర టీజర్ విడుదల చేశారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ సంగీతాన్నందిస్తున్నాడు.
తెలుగు తమిళం భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తమిళంలో శింభు హీరోగా 'అచ్చమ్ ఎంబదు మడమయాడా' పేరుతో తెరకెక్కిస్తున్నాడు గౌతమ్ మీనన్. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. 'ఏ మాయ చేసావే' మూవీ తర్వాత గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాల్సిందే.

17:30 - August 29, 2015

విజయవాడ : సోంపేట థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ రద్దుకు ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యుత్‌ ప్లాంట్‌ కు సంబంధించి గతంలో ఇచ్చిన జీవో నెంబర్‌ 1107ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వం.. 972 ఎకరాల భూములను తీసుకుంది. స్థానికులు, ప్రజా సంఘాల నేతలు థర్మల్‌ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నారు. విద్యుత్‌ ప్లాంట్‌ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కనుక నిరాహారదీక్షను విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాసేపటి క్రితమే విజయవాడలో ఏపీ క్యాబినెట్‌ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ రద్దుకు ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

 

జార్ఖండ్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి..

జార్ఖండ్ : పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుంతి ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలం నుండి భారీగా ఆయుధాలు, మందుగుండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన..

మెదక్ : జిల్లాలోని ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సామూహిక భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. 

రైల్వేలోకి విదేశీ పెట్టుబడులు - సురేష్ ప్రభు..

ఢిల్లీ : భారతీయ రైల్వేల్లో విదేశాల నుండి పలు సంస్థలు పెట్టుబడులతో రావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే ఐదేళ్లలో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమౌతోందన్నారు. 

భారత్ 292/8..నిలిచిన మ్యాచ్...

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ లో భారత్ మిశ్రా (59) వికెట్ కోల్పోయింది. దీనితో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయినట్లైంది. ప్రస్తుతం ఓపెనర్ 135, శర్మ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ తరుణంలో వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. 

అందరికీ గ్యాస్ కనెక్షన్ పథకం - ఈటెల..

హైదరాబాద్ : కరీంనగర్ అందరికీ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించామని, మూడు, నెలల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామన్నా మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణకు అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే సీఎం లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో అక్రమాలకు తావులేదనే పరిస్థితి తీసుకొచ్చామని, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, రేషన్ బియ్యం అమ్ముకొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

16:54 - August 29, 2015

హైదరాబాద్‌: నగరంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వినూత్నంగా రాఖీపౌర్ణమి నిర్వహించారు. పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరలతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారి పలువురికి ఉల్లిరాఖీలు కట్టి నిరసనను తెలియజేశారు. ఇప్పటికైనా....సర్కార్ స్పందించి కొత్త ఉద్యోగాలు ప్రకటించి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

16:51 - August 29, 2015

అనంతపురం : అనంతపురం పోలీస్ స్టేషన్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అన్నకు రాఖీ కడదామని ఉదయం నుంచి ఆ చెల్లి ఇంటి దగ్గర ఎదురుచూస్తోంది. కానీ ప్రత్యేక హోదా బంద్‌లో అన్న అరెస్టయ్యాడు. ఎంతకీ ఇంటికి రాని అన్న కోసం చెల్లెలు చివరికి పోలీస్ స్టేషన్‌కే వెళ్లింది. గేటు బయటి నుంచే సోదరునికి రాఖీ కట్టి, స్వీటు తినిపించింది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నీకు ఆత్మీయ మద్దతుగా ఉంటా' అని చెల్లి భరోసా ఇచ్చింది. అనంతపురంలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆకట్టుకుంది.

 

16:16 - August 29, 2015

విజయవాడ: ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశం 6 గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 42 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందులో ప్రధానంగా ప్రత్యేకహోదా, ప్యాకేజీ, అసైన్డ్ భూములు, అక్రమ కట్టడాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించే వ్యూహాలు, రాజధాని కోసం భూసేకరణ, భూసమీకరణ వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 31 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సీఆర్ డీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ, భూసమీకరణ అంశాలపై ప్రతిపక్షాల లేవనెత్తే ప్రశ్నలు, విపక్షాల దాడిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేత హోదాపై ప్రధాని మోడీతో చర్చించిన అంశాలను చంద్రబాబు కేబినెట్ లో వివరించారు.

 

హాఫ్ సెంచరీ చేసిన మిశ్రా..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెననర్ పుజార సెంచరీ చేయగా తొమ్మిదో స్థానంలో వచ్చిన మిశ్రా హాఫ్ సెంచరీ చేశాడు. 73 బంతులను ఎదుర్కొన్న మిశ్రా 53 పరుగులు సాధించాడు. అందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. 

సోంపేట పవర్ ప్లాంట్ నిర్మాణ జీవో రద్దు - అచ్చెన్నాయుడు

విజయవాడ : సోంపేట ప్లవర్ ప్లాంట్ నిర్మాణానికి జారీ చేసిన జీవోను రద్దు చేసినట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్లాంట్ కు కేటాయించిన 972 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

15:57 - August 29, 2015

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్‌కు విద్యార్థినినులు, ఉద్యోగినులు, మీడియ మహిళా ప్రతినిధులు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలందరికి రక్షణ కల్పిస్తామని నరసింహన్ అన్నారు. రక్షాబంధన్‌లాగే ప్రజలకు మీడియా తోడుండాలన్నారు.

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై ప్రధానితో భేటీ వివరాలను మంత్రులకు సీఎం బాబు వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై కేబినెట్ సానుకూలంగా స్పందించింది. విద్యా నిపుణులతో చర్చించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పరిశ్రమలకిచ్చే భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టే అంశంపై నిబంధనలు ఖరారు చేయాలని బాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

రాష్ట్రపతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు..

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో రక్షా బంధన్ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. పలువురు చిన్నారులు, మహిళలు ప్రణబ్ కు రాఖీలు కట్టారు. 

15:52 - August 29, 2015

పశ్చిమగోదావరి: నవ్యాంధ్ర రాజధానిలో ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లి మండలం వెంకటపాలెం కరకట్ట వద్ద ఓ భవనాన్ని సీఎం అతిథి గృహంగా తీర్చిదిద్దారు. ఇక్కడి నుంచే సీఎం పరిపాలన కొనసాగించాలని నిర్ణయించగా... చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గెస్ట్‌హౌస్‌ను సందర్శించి పాలు పొంగించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు మీడియాను అనుమతించ లేదు. 

15:45 - August 29, 2015

హైదరాబాద్: చీప్ లిక్కర్ పై పునరాలోచిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన మద్యం పాలసీపై ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సూచనలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్, సర్పంచ్ లతో పాటు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గుడుంబాను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ ను విశ్వ కేంద్రంగా చేస్తామని స్పష్టం చేశారు.  

మరో హవాల్దార్ ను ఆసుపత్రికి తరలింపు...

ఢిల్లీ : నిరహార దీక్ష చేస్తున్న హవాల్దార్ మేజర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు కోసం జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 

కానిస్టేబుల్ ను పరామర్శించిన రాజ్ నాథ్..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహ్మద్ సాలిమ్ ను కేంద్ర హో మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. 

బీజేపీలో చేరిన జేడీయూ, ఆర్జేడీ రెబెల్ నేతలు..

బీహార్ : జేడీయూ, ఆర్జేడీ పార్టీలకు చెందిన రెబెల్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో మాజీ మంత్రి రేణుకుశ్వారా కూడా ఉన్నారు. 

మహాఘట్బంధన్ ర్యాలీలో పాల్గొనున్న సోనియా..

ఢిల్లీ : పాట్నాలో ఆదివారం నిర్వహించే మహాఘట్బంధన్ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గులాబ్ నబీ ఆజాద్ లు పాల్గొంటారని అశోక్ చౌదరి పేర్కొన్నారు. 

కంది @150..

హైదరాబాద్ : కందిపప్పు ధర పెరిగిపోతోంది. మూడు నెలల్లో రూ.80 నుండి రూ. 150కి చేరింది. టోకు ధర రూ.125 ఉంది. టోకు, చిల్లర ధరల్లో బారెడు వ్యత్యాసం ఉంది. ఇంతలా జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కర్నాటక, మహారాష్ట్రలకు ఎగుమతులవుతున్నాయి. బర్కా, దక్షిణాఫ్రికా నుండి దిగుమతులు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. నల్లబజారులో కుప్పలు తెప్పలుగా కంది నిల్వలున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

పదో తరగతి విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ దాష్టీకం..

కరీంనగర్ : మహాముత్తారం కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఓ విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ చితకబాదింది. పరీక్షలో కాపీ కొట్టిందని పదో తరగతి విద్యార్థిని సమ్మక్కను వార్డెన్ చితకబాదింది. నడవలేనిస్థితిలో ఉన్న సమ్మక్కను గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించేసింది. 

నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్..

విశాఖపట్టణం : నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ జగన్ మోహన్ రావు సస్పెన్షన్ కు గురయ్యారు. పలుచోట్ల స్వాధీనం చేసుకున్న గంజాయిని స్టేషన్ నుండది మాయం చేసిన కేసులో ఆయన్ను సస్పెండ్ చేశారు. అధికారులు జరిపిన విచారణలో నేరం రుజువైంది. 

ధ్యాన్ చంద్ కు నివాళులర్పించిన మోడీ..

ఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. 

ఏపీలో రెచ్చిపోయిన ఛైన్ స్నాచర్లు..

గుంటూరు : రాష్ట్రంలో నిన్నటి నుండి ఛైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గుంటూరులో 7 విజయవాడలో 4, విశాఖలో 10కిపైగా దొంగతనాలు చోటు చేసుకున్నాయి. గుంటూరులో 30 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

 

డీఎస్ పై నిప్పులు చెరిగిన వీహెచ్..

హైదరాబాద్ : ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్ లో చేసిన డీఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ తనకు ఏమీ చేయలేదని డీఎస్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. బీఫామ్ లు అమ్ముకున్న దరిద్రపు చరిత్ర డీఎస్ దని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. 

పుజారా సెంచరీ..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ ఓపెనర్ పుజరా సెంచరీ సాధించాడు. 214 బంతులను ఎదుర్కొన్న పుజార 100 రన్లు చేశాడు. ప్రస్తుతం 217 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఇతనికి మిశ్రా 23 సహకారం అందిస్తున్నాడు.

అనకాపల్లి పీఎస్ ను ముట్టడించిన వైసీపీ..

విశాఖపట్టణం : బంద్ సందర్భంగా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌ను వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. నేతల అరెస్టుకు నిరసనగా పీఎస్ ఎదుట బైఠాయించి...స్టేషన్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

వైవీ సుబ్బారెడ్డి, బాలినేని అరెస్టు..

ఒంగోలు : ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. బస్సులను అడ్డుకుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

క్యూ కట్టిన భారత ప్లేయర్లు..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ప్లేయర్లు క్యూ కట్టారు. వరుసగా అవుటై పెవిలియన్ దారి పడుతున్నారు. పుజార ఒక్కడే ఓపికగా క్రీజులో నిలబడ్డాడు. ప్రస్తుతం 180 పరుగలుకు ఏడు వికెట్లు కోల్పోయింది. 

చీప్ లిక్కర్ ను ప్రజలు వ్యతిరేకిస్తే విరమిస్తాం - నాయినీ..

వరంగల్ : చీప్ లిక్కర్ ను ప్రజలు వ్యతిరేకిస్తే విరమించుకుంటామని హోం మంత్రి నాయినీ వెల్లడించారు. తక్కువ ధరకే అందించడంపై కేబినెట్ భేటీలో చర్చిస్తామని, కార్మికులందరికీ ఎలాంటి ప్రీమియం లేకుండా రూ. 5లక్షల బీమా అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల కింద రూ.28వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. నగరాన్ని డల్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామని నాయినీ వ్యాఖ్యానించారు. 

173 పరుగులకే ఆరు వికెట్లు..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఛటేశ్వర్ ఒక్కడే రాణిస్తున్నాడు. పుజారా 87, అశ్విన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

13:45 - August 29, 2015

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి రోజు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు, హోంగార్డు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శుభవార్త అందించింది. ఇక వీరికి ప్రతినెలా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆరు నెలలు, ఎనిమిది నెలలకు వేతనాలు చెల్లించే పద్దతి ఇక నుంచి ఉండదన్నారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను కూడా సకాలంలో చెల్లిస్తున్నామని ఈటెల చెప్పారు. 

13:43 - August 29, 2015

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు భూమిని సమీకరించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకోసం 697.02 ఎకరాల భూమిని సమీకరించాలని.. దీనిని సీఆర్డీఏ కు అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ నేపథ్యంలో ఏలూరు కాలువను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

13:41 - August 29, 2015

శ్రీకాకుళం : పలాసలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఏకంగా ఓ వ్యక్తిపైదాడి చేసి.. కళ్లు పీకేసింది. దీంతో ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు బాధితుడు. పలాస మండలం మామిడిపల్లికి చెందిన పశువుల కాపరి జానకిరావు.. రోజులాగే కాపలాకు దగ్గర్లోని జీడితోటకు వెళ్లాడు. పశువులను గద్దిస్తుండగా.. ఎలుగుబంటి ఒక్కసారిగా మీదపడి దాడిచేసినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అప్పటికే జానకిరావు ఎదురుతిరగడంతో ఎలుగుబంటి పారిపోయింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఉండే జీడితోటల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా తిరుగుతున్నట్లు ఇక్కడి వారు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

13:39 - August 29, 2015

హైదరాబాద్ : అర్చకుల తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారు. చిక్కడపల్లిలోని బాలాజీ టెంపుల్‌లో ఓ అర్చకుడు గుడి గోపురంపైకి ఎక్కాడు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దిగేది లేదని నినాదాలు చేశాడు. తెలంగాణ సర్కార్‌ తమ కోర్కెల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆరోపించాడు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది అర్చకుడిని కిందకు దించారు. 

13:36 - August 29, 2015

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ తలపెట్టిన బంద్ ను ఏపీ సర్కార్ అణచివేయాలని చూస్తోందని ఆపార్టీ నేత బొత్స సత్యనారయణ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్ రాజకీయ ఉద్దేశ్యంతో కూడుకున్నది కాదని ముందే ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరుగుతున్నా బంద్ ను విఫలం చేసేందుకు చంద్రబాబు విఫలం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని మరి కేబినెట్ భేటీ పేరిట విజయవాడలో మకాం వేసి ప్రభుత్వ యంత్రాంగాన్నంతా రంగంలోకి దింపారని మండిపడ్డారు. అంతే కాకుండా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని అయినప్పటికి శాంతియుతంగా బంద్ చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర బాగుపడుతుందని తెలిపారు.

అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురి అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : పూంఛ్ జిల్లాలో ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇండియా - బంగ్లాదేశ్ బోర్డర్ లో రక్షా బంధన్..

వెస్ట్ బెంగాల్ : భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో రక్షా బంధన్ వేడుకల్లో జవాన్లు పాల్గొన్నారు. పలువురు చిన్నారులు, మహిళలు జవాన్లకు రాఖీలు కట్టారు

సెంచరీ దిశగా పుజార

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో భారత ఓపెనర్ ఛటేశ్వర్ పుజార శతకం వైపుకు దూసుకెళుతున్నాడు. 161 బంతులను ఎదుర్కొన్న పుజార 73 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లున్నాయి. ప్రస్తుతం ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ 153 పరుగులు చేసింది. పుజారాకు తోడుగా ఉన్న ఓజా 15 రన్లతో క్రీజులో ఉన్నాడు. 

బీజేపీ కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు..

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. 

బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది - బోత్స

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందని వైసీపీ పేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఈ రోజు బంద్ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బోత్స మీడియాతో మాట్లాడారు. బంద్ విఫలం చెందాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఢిల్లీ ప్రయాణాన్ని మానుకుని విజయవాడలో కూర్చొన్న సీఎం బాబు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రంతో బాబు ప్రభుత్వం లాలూచీ పడుతోందని, ఈ కుట్రను బహిర్గతం చేస్తామన్నారు. 

పీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో పీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి టిపిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలీ, పొన్నాల, గీతారెడ్డిలు హాజరయ్యారు. 

భారత్ 122/5..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ శర్మ (26) వికెట్ కోల్పోయింది. దీనితో నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తరువాత బిన్ని పరుగులు చేయడకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పుజారా 57 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ మూడు, ప్రదీప్, మాథ్యూస్ లు తలా ఒక వికెట్ తీశారు. 

12:41 - August 29, 2015

కృష్ణా : విజయవాడలో ఎస్‌ఎఫ్‌ఐతో సహా పలు విద్యార్ధి సంఘాలు సీఎం క్యాంప్‌ ఆఫీసు ముట్టడికి యత్నించాయి. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును వెనక్కు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు బజార్‌ సమీపంలో పోలీసులు విద్యార్ధులను అడ్డుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, విద్యార్ధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోపులాట జరిగింది. విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

సంక్షేమ కార్యక్రమాల అమల్లో రాజీ లేదు - ఈటెల..

హైదరాబాద్ : సంక్షేమ కార్యక్రమాల అమల్లో రాజీపడడం లేదని మంత్రి ఈటెల పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చిన నిధులను కేంద్రం రద్దు చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఉపకార వేతనాల విషయంలో సమస్యలను అధిగమిస్తామని హామీనిచ్చారు. 

రాజమండ్రిలో వైసీపీ ఆందోళన..

రాజమండ్రి : ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఎస్ఐ శివగణేష్ పై నేతలు దాడికి యత్నించారు. 

12:35 - August 29, 2015

రంగారెడ్డి : దారూర్‌ మండలం అలీపూర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు రోజుల శిశువును కవరులో కట్టి బావిలో పడేశారు. బావిలోనుంచి శిశువు ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిశువుకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటన అలీపూర్‌లో సంచలనం రేకెత్తించింది.

గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ముందడుగు..

విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ముందడుగు పడింది. సీఆర్డీఏ ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణకు ఉత్వర్వులు విడుదలయ్యాయి. అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని, విమానాశ్రయ విస్తరణకు గాను ఏలూరు కాలువ మళ్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. 

గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ముందడుగు..

విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ముందడుగు పడింది. సీఆర్డీఏ ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణకు ఉత్వర్వులు విడుదలయ్యాయి. అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని, విమానాశ్రయ విస్తరణకు గాను ఏలూరు కాలువ మళ్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. 

రాఖీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్..

హైదరాబాద్ : తెలుగు ప్రజలకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లిలని జాగ్రత్తగా చూసుకుంటామని ఈ సందర్భంగా నరసింహన్ హామీనిచ్చారు. ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, రక్షాబంధన్ లాగే ప్రజలకు మీడియా తోడుండాలని గవర్నర్ సూచించారు. 

హవాల్దార్ అభిషేక్ సింగ్ ఆసుపత్రికి తరలింపు..

ఢిల్లీ : నిరహార దీక్ష చేస్తున్న మాజీ సైనిక ఉద్యోగుడు హవాల్దార్ అభిషేక్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం అమలు కోసం గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

రాఖీ వేడుకల్లో ప్రధాని మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు మోడీ చేతికి రాఖీలు కట్టారు. 

భారత్ 119/4..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ శర్మ (26) వికెట్ కోల్పోయింది. దీనితో నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. పుజారా 55 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ రెండు, ప్రదీప్, మాథ్యూస్ లు తలా ఒక వికెట్ తీశారు. 

12:10 - August 29, 2015

'అక్కినేని నాగార్జున' నటిస్తున్న ‘సొగ్గాడే చిన్ని నాయన’ టీజర్ విడుదలైంది. శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో 'నాగ్' డబుల్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఇక నాగ్ కు జోడిగా 'రమ్యకృష్ణ', 'లావణ్య త్రిపాఠి'లు నటిస్తున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా రమ్య కృష్ణ, నాగ్ కాంబినేషనల్ లో సినిమా రావడం పట్ల అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.
సోషియో ఫాంటసీ తరహాలో 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం రూపొందిందని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాధామోహన్ కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

11:58 - August 29, 2015

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి.. అపూర్వమైన ఆత్మీయతానురాగాలకు ప్రతీక. సోదర సోదరీమణుల బంధానికి నిలువెత్తు నిదర్శనం. ఒకరికి మరొకరు తోడున్నారనే భరోసా. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఓ అపురూపమైన వేడుక రాఖీ పండగ. అయితే ఈ రాఖీకి మీరు మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇస్తున్నారు..? రాజస్థాన్‌లోని సోదరులు మాత్రం వాళ్ల సోదరీమణులకు రాత పూర్వకంగా ప్రమాణాలు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రమాణాలంటారా? వాచ్‌దిస్.

అపూర్వమైన అనురాగానికి ప్రతిరూపంగా......

అన్నా చెల్లెళ్ల అనుబంధాలతో భారతావని నిండిపోయింది. అపూర్వమైన అనురాగానికి ప్రతిరూపంగా.. మణికట్టుకు దారంతో బంధం వేసి జీవితాంతం తనకు రక్షగా సోదరుడు ఉంటాడన్న భరోసా సోదరిలో కనిపిస్తే.. తనకు ఆత్మీయతానురాగాలు పంచిపెట్టే సోదరి ఉందన్న భావాన్ని సోదరుడిలో నింపుతుంది.. రక్షా బంధన్.

సోదరి రాఖీ కడితే అన్నయ్యకు విజయం......

సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి రాఖీ కడుతుంది. అందుకు ప్రతిగా కష్టసుఖాలలో అండగా ఉండటమే కాదు.. జీవితాంతం భద్రంగా చూసుకునే బాధ్యతను సోదరుడు స్వీకరిస్తాడు. దీనికోసం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ఒకటే సందడి నెలకొంది. వీధివీధినా వెలసిన రాఖీల దుకాణాల్లో సందడి చేసే సోదరీమణుల హడావిడి అంతాకాదు. అయితే రాజస్తాన్‌ ప్రభుత్వం.. ఈసారి రక్షా బంధన్‌ను ప్రత్యేకంగా జరుపుకుంది.

నాగౌర్, జలర్, అజ్మీర్‌ జిల్లాల్లో పోటీలు.....

రాఖీని పురస్కరించుకొని నాగౌర్‌, జలర్‌, అజ్మీర్‌ జిల్లాల్లో పలు పోటీలు నిర్వహించారు. ఎవరైతే ఈ రాఖీకి మద్యం, పొగతాగడం మానేయడం, కుటుంబం కోసం మరుగుదొడ్లు నిర్మించడం లాంటివి చేస్తారో వారికి భాయి నెంబర్ ఒన్, ఆదర్శ్‌ భాయి, సబ్‌సే అచ్చా భాయి లాంటి బిరుదులు అందజేస్తామంటూ అధికారులు పిలుపునిచ్చారు. అంతేకాదు.. అందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని జలర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరుగుదొడ్డి సదుపాయం లేని తమ అక్కచెల్లెళ్లకు వాటిని నిర్మించి ఇవ్వండి అంటూ వారికి సూచిస్తున్నామన్నారు. పొగతాగం అని కాగితం మీద రాసిచ్చి సోదరితో కలిసి దిగిన సెల్ఫీలు తీసి పంపించాలని ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.

అధికారుల పిలుపు అందుకొని.....

అధికారుల పిలుపు అందుకొని రాజస్తాన్‌లోని ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయా జిల్లాల్లోని పలువురు సోదరులు తమ ప్రమాణాలను అధికారులకు రాసి పంపుతున్నారు. ఆయా జిల్లాల్లోని పలువురు సోదరులు తమ ప్రమాణాలను అధికారులకు రాసి పంపుతున్నారట. ఏదిఏమైనా రాజస్తాన్ ప్రభుత్వానిది మంచి ఆలోచనే చెప్పాలి.

11:54 - August 29, 2015

హైదరాబాద్ : కర్నూలులో బంద్ ఉధృతమవుతోంది. వైసీపీ చేపడుతున్న బంద్‌కు సీపీఐ, సీపీఎం కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. నగరంలో వినూత్నంగా కబడ్డి ఆడుతూ ..సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు.

కేజీహెచ్ లో రాజ్యసభ బృందం..

విశాఖపట్టణం : కేజీహెచ్‌ను రాజ్యసభ బృందం సందర్శించింది. ఎంపీ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సందర్శించిన బృందం పారిశుద్ధ్యంపై ఆరా తీసింది. 

11:51 - August 29, 2015

విజయవాడ : రాఖీ పండుగ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. అదేవిధంగా తెలంగాణ టీడీపీ నేత సీతక్క కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. మహిళలకు చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

పుజారా హాఫ్ సెంచరీ..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఛటేశ్వర్ పుజారా అర్థ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. పుజారా 51, శర్మ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

11:50 - August 29, 2015

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం కొత్త బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాలువలోకి దూసుకెళ్లిన కారును గమనించిన స్థానికులు... కారులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గుంటూరు సర్కారీ ఆసుపత్రిలో వైద్యులు, నర్సుల ఆందోళన..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు ధర్నా చేపట్టారు. వైద్యుడు భాస్కర్ రావు బదిలీ, ఇద్దరు నర్సుల సస్పెన్షన్ష కు నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. 

బాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు - పల్లె..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. రాఖీ రోజున వైసీపీ బంద్‌కు పిలునివ్వడం మహిళలను అవమానించడమే అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని పల్లె ఆరోపించారు. 

ఆర్మీ స్థావరంలో పేలుడు..6గురు జవాన్లకు గాయాలు..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా జిల్లాలో ఆర్మీ స్థావరం వద్ద సంభవించిన పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మహాకాళేశ్వర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు..

మధ్యప్రదేశ్ : ఉజ్జయినిలోని ప్రముఖ ఆలయమైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి భక్తులు పోటెత్తారు. రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బాంద్రా పీఎస్ కు మిఖిల్ బోరా..

ముంబై : షీనా బోర హత్య కేసులో మిఖిల్ బోరాను పోలీసులు బాంద్రా పీఎస్ కు తరలించారు. 2012 సంవత్సరంలో హత్యకు గురైన షీనా బోరాకు మిఖిల్ బోరా సోదరుడు.

కోహ్లీ అవుట్..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల వద్ద కోహ్లీ వెనుదిరిగాడు. 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినట్లైంది. ప్రస్తుతం పుజారా 29, శర్మ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

సుష్మాకు వెంకయ్య పట్టు చీర..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య సుస్మాకు పట్టుచీర బహుకరించారు.

రాఖీ పౌర్ణమి వేడుకల్లో బాబు...

విజయవాడ : రాఖీ పౌర్ణమి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల్లో మహిళలకు రక్షణగా ఉంటానని చంద్రబాబు నాయుడు తెలిపారు.

భారత్ - శ్రీలంక ఆట ప్రారంభం..

కొలంబో : భారత్, శ్రీలంక మధ్య చివరిటెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి భారత్ 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 19, కోహ్లీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

10:43 - August 29, 2015

విజయవాడ : గిడుగు రామ్మూర్తి జయంతి సందర్బంగా నేడు తెలుగు భాషాదినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర సర్కార్‌ నిర్ణయిస్తే... జగన్‌ బంద్‌కు పిలుపునివ్వడం దారుణమని మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. తెలుగు ప్రజల పట్ల జగన్‌కు ప్రేమాభిమానాలు లేవని ఆయన అన్నారు. తెలుగుభాషను కించపరిచే విధంగా నేడు బంద్‌కు పిలుపునిచ్చిన జగన్‌.. తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు

10:42 - August 29, 2015

హైదరాబాద్ : విజయనగరంలో బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ వైసీపీ ఇచ్చిన పిలుపుతో వామపక్షాలు కూడా పూర్తి మద్దతు తెలిపాయి. నగరం రహదార్లపై వామపక్ష నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళన ఉధృతమవడంతో...పోలీసులు వారిని అరెస్ట్ చేసి, పీఎస్‌కు తరలించారు.

10:40 - August 29, 2015

ప్రకాశం: చీరాలలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ, టీడీపీలు.. అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు, స్కూల్స్‌, కాలేజీలు స్వచ్చందంగా మూసివేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చీరాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

10:38 - August 29, 2015

హైదరాబాద్ : రక్షాబంధన్‌ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌.. మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రాఖీ కట్టారు. సోదరులు ఎప్పుడూ తమకు రక్షగా ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు రాఖీలు కడతారని.. ఈ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని వెంకయ్యనాయుడు అన్నారు. 

విశాఖలో సీపీఎం నేతల అరెస్టు..

విశాఖపట్టణం : జగదాంబ సెంటర్ లో బంద్ నిర్వహిస్తున్న సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు తో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు బీజేపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని నర్సింగ రావు తీవ్రంగా విమర్శించారు. 

వైసీపీ రెచ్చగొడుతోంది - కొల్లు..

విజయవాడ : వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రత్యేక హోదాపై పోరాడుతూనే ఉన్నామని మంత్రి కొల్లు పేర్కొన్నారు. 

ఏపీలో కొనసాగుతున్న బంద్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా ప్రకటించాలని బంద్ వైసీపీ పిలుపునిచ్చింది. వామపక్షాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. డిపోల ఎదుట వైసీపీ, వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. 

10:28 - August 29, 2015

అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, నాగార్జున ప్రత్యేకత. ముఖ్యంగా రొమాంటిక్ లుక్ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్. ఎంత వయసొచ్చినా ఇంకా నవయవ్వనుడిగా కనిపించడం ఆయకు మాత్రమే సాధ్యమైంది. అందుకే ఆయన టాలీవుడ్ కు ఎప్పటికీ మన్మధుడు. నాగార్జున మొదటి సినిమా నుంచి నిన్న మొన్నటి సినిమా వరుకూ పరిశీలిస్తే ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఆయన ఎన్ని మాస్ సినిమాలు, ఇంకెన్ని క్లాస్ సినిమాలు చేసినా.. ఆయన పాత్ర ఒకే ఒక అంశం చుట్టూ తిరుగుతుంది. రొమాన్స్.

మంచి పుషప్ ఇచ్చిన 'మజ్ను'
తండ్రి నట వారసత్వమే కాకుండా.. ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా నాగార్జున అందిపుచ్చుకోవడం ఎంతైనా గ్రేట్. అందుకే నాగార్జున ఎఎన్నార్ లాగానే సోషల్ మూవీస్ కు రొమాంటిక్ కింగ్ అయ్యారు. టాలీవుడ్ లో నాగార్జున కు మంచి పుషప్ ఇచ్చిన చిత్రంగా 'మజ్ను' చరిత్రలో నిలిచిపోతుంది. 'ప్రేమాభిషేకం' చిత్రంలోని కథానాయకుడు రాజేష్ పాత్రను పోలిన పాత్రలో నాగ్ అద్భుతంగా నటించి... తన కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సాధించారు.  నాగార్జున రొమాన్స్ ను పీక్ లెవెల్లో ఆవిష్కరించిన చిత్రంగా 'గీతాంజలి' చరిత్రలో నిలిచిపోతుంది. కళాత్మక చిత్ర శిల్పి మణిరత్నం మలిచిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ నాగ్ కెరీర్ లో ఓ మధుర ఘట్టం.

మలుపు తిప్పిన 'శివ'
నాగ్ కెరీర్ ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం 'శివ'. రామ్ గోపాల్ వర్మ అసాధారణ డెబ్యుటెంట్ మూవీ గా శివ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా యూత్ నాగ్ మ్యానియాతో ఊగిపోయారు. అంతేకాదు ఈ మూవీ మాస్ సినిమా నే అయినా... ఇందులో రొమాన్స్ కు కూడా ప్రత్యేక స్థానముంది. 'శివ' బ్లాక్ బస్టర్ తరువాత నాగార్జున హీరోగా... ఎన్నో లవ్ స్టోరీలు తెరకెక్కాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నాగ్ కు విజయాల్ని తెచ్చిపెట్టాయి.. 'శివ' అసాధారణ విజయం వల్లే అంతకు మించిన అంచనాల్ని అందుకోలేక ఆ చిత్రాలు అభిమానుల్ని నిరాశపరిచాయి.
నాగార్జున కెరీర్ ను మరో మలుపు తిప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్ళాడుతా'. టాబూతో నాగ్ నటించిన మొదటి చిత్రంగా ఈ మూవీ ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు కృష్ణవంశీ రెండో చిత్రంగా కూడా ఈ మూవీ చరిత్రలో నిలిచిపోయింది. ఎంత మంది కుర్ర హీరోలొచ్చినా.. ఎన్ని రొమాంటిక్ చిత్రాల్లో నటించినా నాగార్జున వారందరితోనూ పోటీ పడుతూ... ఇంకా రొమాంటిక్ గా మారిపోగలరని గ్రీకువీరుడు, మనం చిత్రాలు రుజువు చేసాయి. ఈ ఏజ్ లో కూడా ఆయన ఇంకా రొమాంటిక్ పాత్రలకే ప్రాధాన్యతనివ్వడం చాలా గొప్ప విషయం. త్వరలో రాబోతున్న 'సోగ్గాడే చిన్నినాయనా', కార్తితో చేస్తున్న ఊపిరి చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.  ఆ అక్కినేని నిత్యయవ్వనుడికి మరోసారి బర్త్ డే విషెస్ తెలియచేస్తోంది 10 టివి. 

10:22 - August 29, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పదవులే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్ మద్దతుగా వామపక్షాలు విజయవాడలోని విజయ వాడ లెనిన్ సెంటర్ నుండి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మధు 'టెన్ టివి' తో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంటే సహకరిచడం పోయి... అరెస్టు చేసి ప్రభుత్వ నిరకుశత్వాన్ని తెలియజేస్తోందని మండి పడ్డారు. వామపక్ష నేతలను హౌస్ అరెస్టు చేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. మారిన మనిషి కాదు.. మారనిమనిషే అని ఎద్దేవా చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా పై బిజెపి తెలుగుదేశం పార్టీలు ఏపీ ప్రజలను నమ్మక ద్రోహం చేశారని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు.

స్లాబ్ వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

కర్నూలు : ఓరవ్వకుల్ల మండలం లొబ్బిపల్లెలో ఇంటికి స్లాబ్ వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. కాపాడేందుకు వెళ్లిన అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న సూది సైకో

ప.గో: గత కొద్దిరోజులుగా మహిళలపై సూది దాడులకు పాల్పడుతూ.. హడలెత్తిస్తున్న సూది సైకో చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. భీమవరం అన్న కోడేరులో అశ్వని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద ఓ ఆటో డ్రైవర్ పై సూదితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఆటో డ్రైవర్ సైకోను పట్టుకునేందు ప్రయత్నించగా సూది గుచ్చి పారిపోయాడు. సైకో గ్రీన్ కలర్ ఖర్చీపు మొహానికి కట్టుకుని పల్సర్ పై పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటన శనివారం ఉదయం 9.30 గంట ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్వల్ప భూకంపం

హైదరాబాద్ : భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో గత అర్థరాత్రి దాటినత తరువాత ఒకటి గంట సమయంలో స్వల్పభూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4గా నమోదైంది. ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.

రాఖీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

హైదరాబాద్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతి రూపం రాఖీ పౌర్ణమి. ఈ రోజు రాఖీ పౌర్ణమి సుందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 

09:42 - August 29, 2015

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విశాఖలో తెల్లవారుజాము నుంచే బంద్‌ కొనసాగుతోంది. ఉదయం 4 గంటలకే బస్సు డిపోల వద్దకు చేరుకున్న వైసీపీ, వామపక్షాల నేతలు, కార్యకర్తలు.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లాలో బంద్‌ ఉధృతంగా కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం బస్‌డీపోలతోపాటు మరో 9 బస్‌ డిపోలలోని బస్‌లు..డీపోలకే పరిమితమయ్యాయి. మరిన్ని వివరాలు మాప్రతినిధి రాజు అందిస్తారు.

కడప జిల్లాలో...

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కడప జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సు డిపో వద్దకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు... బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

తిరుపతిలో....

తిరుపతిలో బంద్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రానికి ప్యాకేజీ వద్దు.. ప్రత్యేకహోదానే కావాలని డిమాండ్ చేశారు...తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు వినూత్నంగా బంద్‌ నిర్వహించారు. నేను ప్రత్యేక హోదా ఇవ్వను... ప్రత్యేక హోదా అడగను అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్లకార్డులను గాడిదలకు వేలాడదీసి ఊరేగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. చిత్తూరులో బంద్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సు డిపో వద్దకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు... బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

మంగళగిరిలో కొనసాగుతున్న బంద్‌....

గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ బంద్‌ను విచ్చిన్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. రోడ్డుపై ధర్నాకు దిగిన పలువురు నేతలను అడ్డుకున్నారు. ముంద జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విజయవాడలో....

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విజయవాడ బస్‌డిపో ఎదుట వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు పార్థసారథి, కొడాలినాని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీస్‌లు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

నెల్లూరులో...

నెల్లూరులో బంద్‌ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ బస్‌డీపో ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో పోలీస్‌లు భారీగా మోహరించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో...

ప్రత్యేక హోదా కోసం అనంతపురం జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. జిల్లాలోని అన్ని డిపోలు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు డిపోల ఎదుట వైసీపీ, వామపక్షాల కార్యకర్తలు ధర్నాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం ఆపేది లేదని నినాదాలు చేశారు. 

09:32 - August 29, 2015

ప.గో: గత కొద్దిరోజులుగా మహిళలపై సూది దాడులకు పాల్పడుతూ.. హడలెత్తిస్తున్న సూది సైకో చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. భీమవరం అన్న కోడేరులో రొయ్యల ఫ్యాక్టరీ వద్ద ఓ ఆటో డ్రైవర్ పై సూదితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఆటో డ్రైవర్ సైకోను పట్టుకునేందు ప్రయత్నించగా సూది గుచ్చి పారిపోయాడు. సైకో గ్రీన్ కలర్ ఖర్చీపు మొహానికి కట్టుకుని పల్సర్ పై పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటన శనివారం ఉదయం 9.30 గంట ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సూది దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ ను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

విజయవాడలో ప్రారంభమైన ఏపీ కేబినెట్...

 విజయవాడ : ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో డీఆర్‌డీఓతోపాటు పలు పరిశ్రమలకు భూకేటాయింపులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 42 కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. డీఆర్‌డీఏకు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భూమి కేటాయింపులపై మంత్రివర్గంలో తీర్మానం చేయనున్నారు. వెటర్నరీ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, ప్రైవేటు వర్శిటీల ఏర్పాటు, మార్కెటింగ్‌ శాఖలో సంస్కరణలు, నీటి సంఘాలపై మంత్రులు చర్చించిన నిర్ణయాలు చేయనున్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఏపీకి కేటాయించాలని మంత్రివర్గం తీర్మానించనుంది.

బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో మంటలు..

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ సమీపంలో బొగ్గుతో వెళుతున్న ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి బొగ్గుతో వస్తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు లేచాయి. లారీని వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో లారీ స్వల్పంగా దగ్ధమైంది.ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ సమీపంలో బొగ్గుతో వెళుతున్న ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి బొగ్గుతో వస్తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు లేచాయి.

పాఠ్యపుస్తకాల్లో నిజాం ఉద్యమ చరిత్ర ను తొలగించిన ఏపీ సర్కార్..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా అదే పని చేసింది. ఎనిమిదో తరగతిలో ఉన్న నిజాం ఉద్యమ చరిత్ర, తొమ్మిదిలో తెలంగాణ మాండలికంలో ఉన్న పాఠాలు, ఉపవాచకంలోని కాపు రాజయ్య, మిద్దె రామారావుల చరిత్రలను తొలగించారు. పదో తరగతి తెలుగులో ఉన్న హైదరాబాద్ నగరం వివరాలు, బసవేశ్వర చరిత్ర, సాంఘిక శాస్త్రంలో సింగరేణి కాలరీస్ గురించిన సమాచారం, ఖనిజాల వివరాలు తీసివేశారు.

నెల్లూరు జిల్లాలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు...

నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కు వామపక్షాల మద్దతుతో జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నుంచి జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొన్న కార్యకర్తలు బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. 

బావిలో ఏడు రోజుల శిశువు

రంగారెడ్డి : దారూర్‌ మండలం అలీపూర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు రోజుల శిశువును కవరులో కట్టి బావిలో పడేశారు. బావిలోనుంచి శిశువు ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిశువుకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటన అలీపూర్‌లో సంచలనం రేకెత్తించింది.

పోలీసులు దొంగల్లా చూస్తున్నారు: సీపీఎం నేత రాంభూపాల్

అనంతపురం : ఆర్టీసీ బస్ డిపో ఎదుట బంద్ చేపడుతున్న వామపక్ష నాయకులు రాంభూపాల్, జగదీష్ తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు వామపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తున్న తమను పోలీసులు దొంగల్లా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి రూంభూపాల్ తెలిపారు.

కడప, కర్నూలు జిల్లాల్లో నిలిచినఆర్టీసీ బస్సులు

కడప/ కర్నూలు : ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కడప, కర్నూలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైసీపీ, వామపక్ష కార్యకర్తలు డిపోట ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

విజయనగరం లో వామపక్ష కార్యకర్తల అరెస్ట్

విజయనగరం : ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీక ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వైసీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ వల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

తిరుపతిలో బంద్ ప్రశాంతం

తిరుపతి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వైసీపీ చేపట్టిన బంద్ కు వామపక్షాలు మద్దతు పలకడంతో తిరుపతిలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. జిల్లాలో తిరుమలకు మినహా ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైసీపీ నేతల రాస్తారోకో చేస్తున్నారు.

విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి: సోమిరెడ్డి....

తిరుమల : విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి కోరారు. బస్సులు ధ్వంసం చేయమని జగన్‌ అనటం సరికాదని ఆయన అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూసేకరణ అవసరమని, చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం సాధ్యమని సోమిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో చేస్తోన్న చర్చలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోతే తాము కూడా పోరాటం చేస్తామన్నారు. 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అరెస్ట్

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మద్దతుగా వైసీపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు 30 మంది పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్

హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చ ర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌.ఆర్‌ ఆచా ర్య ఆదేశించారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో కమిషనర్‌ చిరంజీవులతో శుక్రవారం కలసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని, పా ఠశాలల్లో మరగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాజేందర్‌, డీఈఓ సోమిరెడ్డిలు పాల్గొన్నారు.

నేడు సానియాకు ఖేల్ రత్న పురస్కారం...

హైదరాబాద్ : భారత క్రీడారంగంలో ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల్లో అత్యుత్తమమైనదిగా భావించే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా నేడు అందుకోనుంది. ఆమెకీ పురస్కారాన్ని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారా ఒలింపియన్ హెచ్ఎన్ గిరీషా వేసిన పిటిషన్ పై స్పందించిన కర్ణాటక హైకోర్టు సానియాకు ఖేల్ రత్నపై స్టే విధించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం, తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి వున్నట్టు స్పష్టం చేసింది. టెన్నిస్ రంగంలో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ ర్యాంకులో ఉన్న సానియా ఈ అవార్డుకు అర్హురాలని తేల్చింది.

తరలిపోయిన అల్పపీడనం

హైదరాబాద్ : ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య, పశ్చిమబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వైపుగా తరలిపోయింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. కోసాంధ్ర పై అల్పపీడనం ప్రభావం చూపే అవకౄశం లేదని విశాఖ లోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శుక్రవారం అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలో కొద్దిపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 15 మందిపై కేసు

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ పోలీసులు గడిచిన రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు కార్లు, రెండు ఆటోలు, తొమ్మిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు

విశాఖ: నర్సీపట్నం నుంచి చోడవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలను చెట్టుపల్లి దగ్గర వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. బంద్‌ వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

08:00 - August 29, 2015

హైదరాబాద్ : ఏపీ లో భూ సేకరణ పై ప్రభుత్వం వెనక్కి తీసుకున్న మంత్రి నారాయణ ప్రకటించారు. కానీ భూములు తీసుకోవటం ఆపేస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు. ఏదోక రూపంలో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందా? కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ లాప్స్ కావడం కూడా కారణం కావచ్చా? ప్రభుత్వ ఆలోచనలో మార్పు రాలేదు. ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు వుందా? రాజధాని నిర్మాణం పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందా? నిరసనల నేపథ్యంలో గత్యంతరం లేక ఎత్తుగడ మార్చిందా? భూ సేకరణ పై పవన్ కల్యాణ్ శిఖండి పాత్ర పోషిస్తున్నాడా?

ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఈ అంశంలో కేంద్రంతో చంద్రబాబు లోపాయికార ఒప్పందం చేసుకున్నారే తప్ప ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే తేలేదా? ఏపీ ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ పై ప్రకటన ఎందుకు రావడం లేదు?

గ్రేటర్ పరిధిలో 13 వేల మందికి ఒక బార్ ఉండాలని కేసీఆర్ సర్కార్ చెప్పింది. ప్రజల ముందు టీ.సర్కార్ దోషిగా నిలబడబోతోందా? చౌకధరకే మద్యం అందుబాటులోకి ఎందుకు తెస్తోంది? గతంలో మద్య నిషేధం ఉద్యమాలు ఫెయిల్ అయ్యాయా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు ఎస్. వినయ్ కుమార్, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, కాంగ్రెస్ నేత వకుళాభరణం కృష్ణ మూర్తి, టిడిపి నేత రాజారాంయాదవ్, సీపీఎం నేత బాబూరావు, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

9న ఏపీ ఎన్జీరంగా వర్శిటీ స్నాతకోత్సవం...

హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 46వ స్నాతకోత్సవం గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వచ్చే నెల 9న జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్‌లర్ హోదాలో, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ హర్షకుమార్ భన్వాలా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి స్నాతకోత్సవంలో వ్యవసాయ రంగ ప్రముఖులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలన్న వినతులను వర్సిటీ అధికారుల సమావేశం చర్చించింది. దీనిపై పాలక మండలి త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిన ఆర్టీసీ బస్సులు...

తూ.గో : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా 9 ఆర్టీసీ డిపోల్లో 920 బస్సులు నిలిచిపోయాయి. కాకినాడ బస్టాండ్ ఎదుట వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో వైసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

విజయవాడలో వైసీపీ నేతల అరెస్ట్

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చింది. బంద్ లో భాగంగా విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

బంద్ విజయవంతం చేసేందుకు వైసీపీ ప్రత్యేక వ్యూహం

విజయవాడ : ప్రత్యేక హోదా పోరు ఉధృతం అవుతోంది. వాడవాడలా స్పెషల్ స్టేటస్‌ రగడ రగులుతోంది. హోదా సాధన కోసం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసేందుకు జగన్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. వామపక్షాల కలుపుకుని రాష్ట్రాన్ని స్తంభింప చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక హోదా నిరసన సెగ తాకేలా చేయాలని జగన్ బృందం భావిస్తోంది. 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

విజయవాడ : ఒకవైపు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు హోరెత్తిస్తున్నాయి. మరోవైపు భూములిచ్చేది లేదంటూ రాజధాని రైతులు తెగేసి చెబుతున్నారు. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. నేడు విజయవాడ వేదికంగా ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌పై టీఆర్ఎస్ గురి

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌పై గులాబీ దళం స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది టీఆర్ఎస్‌. జెట్‌ స్పీడ్‌తో జనంలోకి దూసుకెళ్లేందుకు గులాబీ కారు రెడీ అవుతోంది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. గ్రామజ్యోతి తరహాలోనే పట్టణజ్యోతికి అడుగులు వేస్తోంది. 

నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి

విజయవాడ : తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చప్పేందుకు ప్రతిఏటా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన రాజధాని విజయవాడలో సన్నాహాలు చేసింది. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులందరిని స్మరించుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.  

రేపు జనసాధారణ రైలు...

గుంటూరు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 30వ తేదీన (ఆదివారం) తిరుపతి నుంచి గుంటూరు మీదగా హైదరాబాద్‌కు జనసాధారణ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతిలో బయలుదేరే ఈ రైలు జిల్లాలో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో ఆగి బయలుదేరుతుంది. ఈ రైలు సోమవారం వేకువజామున 5.10 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. మొత్తం 10 భోగీలతో నడిచే ఈ రైలుకు ఎలాంటి రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 17 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

06:42 - August 29, 2015

హైదరాబాద్ : ఆత్మీయతానురాగాలకు ప్రతీక... ఒకరికి మరొకరు తోడున్నారనే భరోసా... సోదర సోదరీమణుల బంధానికి నిలువెత్తు నిదర్శనం... రక్షాబంధన్. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న మన భారతీయ సంస్కృతిలోని ఓ అపురూపమైన వేడుక రాఖీ పండగ

తెలుగు లోగిళ్లలో...

తెలుగు లోగిళ్లు అన్నా చెల్లెళ్ల అనురాగాలతో నిండిపోయాయి. ప్రతి ఏటా శ్రావణమాసపు పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. మణికట్టుకు దారంతో బంధం వేసి... జీవితకాలపు అనుబంధాన్ని గుర్తుచేయడమే రక్షాబంధన్ గొప్పతనం. ఎలాంటి సమయంలోనైనా... తనకు రక్షగా అన్నయ్య ఉన్నాడన్న భరోసా సోదరిలో కనిపిస్తే.... తనకు ఆత్మీయతానురాగాలు పంచిపెట్టే సోదరి ఉందన్న భావాన్ని అన్నయ్యలో నింపుతుంది ఈ బంధనం.

సోదరితో రాఖీ కట్టించుకుంటే అన్నయ్యకు....

సోదరితో రాఖీ కట్టించుకుంటే అన్నయ్యకు అన్నింటా విజయమే వరిస్తుందన్నది నమ్మకం. అన్నయ్యకు రాఖీ కడితే కష్టసుఖాలలో అండగా ఉంటాడన్నది ప్రతి ఆడపడచు విశ్వాసం. అందుకే నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష అన్న అర్థంతోనే ఈ పండగ రక్షాబంధన్ గా పేరుతెచ్చుకుంది. అందుకే పల్లె నుంచి పట్నం దాకా ఒక్కటే సందడి నెలకొంది. వీధివీధినా రాఖీ షాపులు, ఫ్యాన్సీ షాపుల్లో హడావుడి కనిపిస్తోంది. ఆకర్షణీయమైన కానుకలు, అద్భుతమైన రాఖీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఒక్క భారతదేశంలోనే కాకుండా......

ఒక్క భారతదేశంలోనే కాకుండా మారిషస్‌, నేపాల్‌, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ రక్షాబంధన్ వేడుక జరుగుతుంది. నిజానికి ఈ రాఖీ పౌర్ణమి వెనక గొప్ప చారిత్రక నేపథ్యమే ఉంది. చరిత్ర పుటల్ని తిరగేస్తే సోదరభావంతో కట్టే... ఈ రాఖీలు పెద్ద పెద్ద యుద్ధాలనే ఆపాయి. రక్తపాతాన్ని నివారించి, శాంతిమార్గానికి బాటకు వేశాయి. 

06:38 - August 29, 2015

హైదరాబాద్ : ఎన్నో హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కేసీఆర్ అందులో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు డ్యాం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ధర్నా నిర్వహించారు.

ప్రాజెక్టుల పరిరక్షణకై.....

ప్రాజెక్టుల పరిరక్షణకై చేపట్టిన పోరాటాన్ని టీ-కాంగ్రెస్ ఉధృతం చేస్తోంది. అధికార పార్టీ టార్గెట్‌గానే అడుగులు వేస్తోంది. ప్రాజెక్టులపై సర్కార్‌ నిర్లక్ష్యాన్ని, టీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు హస్తం లీడర్లు. మిడ్ మానేరు నిర్వాసితులకు అండగా ఆందోళన బాట పట్టారు.

డ్యాం ముంపు నిర్వాసిత ప్రాంతాల్లోని ప్రజలతో.....

టీ-కాంగ్ బృందం పర్యటించింది. మిడ్‌మానేరు డ్యాం ముంపు నిర్వాసిత ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమైంది. మిడ్‌మానేరు ప్రాజెక్టును హస్తం నేతలు పరిశీలించారు. తక్షణమే నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముంపు ప్రాంత ప్రజలతో ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.

ఇసుకమాఫియాపై టీ-కాంగ్రెస్ లీడర్లు ......

మరోవైపు ఇసుకమాఫియాపై టీ-కాంగ్రెస్ లీడర్లు స్పందించారు. అధికార పార్టీ నేతల అనుచరులే... అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ముంపు ప్రజలకు... పూర్తి పరిహారం చెల్లించకుండానే... సహజ సంపదను దోచుకుంటున్నారని హస్తం లీడర్లు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో... మిడ్‌ మానేరు ముంపు ప్రాంత ప్రజల పక్షాన ఉంటామన్న కేసీఆర్‌ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకునే పరిస్థితుల్లో లేరని కాంగ్రస్‌ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రాజెక్టుల బాట పట్టి... అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను సంధిస్తున్నారు. మరి గులాబీ దళం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి

06:33 - August 29, 2015

హైదరాబాద్ : ఇప్పటికే చౌక మద్యం పాలసీ ప్రతిపాదనలతో అన్ని వర్గాల నుంచి విమర్శలెదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇది చాలదన్నట్లు.. తాజాగా మరో సంచలన.. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానంలో భాగంగా.. మైక్రో బేవరేజ్ ఏర్పాటుకు కేసీఆర్ సర్కారు.. ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ మైక్రో బేవరేజ్‌ పేరిట బీరు తయారీ.......

తెలంగాణ మైక్రో బేవరేజ్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బెంగళూరు, నాంధేడ్, ముంబై తరహాలో రాష్ట్రంలోను ఎక్కడికక్కడ బీరు తయారయ్యేలా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో రోజుకు వెయ్యి లీటర్లు మించకుండా డ్రాట్ బీరు తయారు చేసేందుకు వీలుగా బీరు కంపెనీలకు అనుమతులు ఇవ్వనుంది. అయితే బీరు కంపెనీ యాజమాన్యాలు స్థానిక సంస్థల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంతో ఎక్సైజ్ శాఖ తర్జనభర్జన పడుతోంది. మైక్రో బేవరి యూనిట్లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలా లేక, కొన్ని జిల్లాలకే పరిమితం చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది.

మైక్రో బేవరీ మద్యం 36 గంటల వరకే నిల్వ........

మైక్రో బేవరి యూనిట్ల ద్వారా తక్కువ సమయంలో బీరు తయారు చేసేందుకు వీలుంటుంది. ఒక్కో యూనిట్ ద్వారా రోజుకు వెయ్యి లీటర్ల కంటే అధికంగా బీరు తయారు చేయడం సాధ్యం కాదు. అయితే మైక్రో బేవరీల్లో తయారైన మద్యం కేవలం 36 గంటల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. దీంతో మైక్రో బేవరి మద్యం అమ్మకాలపైన మార్గదర్శకాలు విడుదల చేసింది. నిర్ణీత సమయంలోనే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం.. ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు.. ఒక్కో మైక్రో బేవరేజ్‌కు లైసెన్స్‌ ఫీజు.. ఏడాదికి 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అలాగే అనుమతిదారుడు.. ఒక్కో దానికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని ఆదేశించింది.

మద్యం పాలసీపై విపక్షాల ఆందోళన...

ఇప్పటికే కేసీఆర్ సర్కారు చౌక మద్యం పాలసీపై మహిళలతో పాటు విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. గత ప్రభుత్వాల తరహాల్లోనే టీఆర్ఎస్‌ సర్కారు కూడా మద్యమే పరమావధిగా భావిస్తుందే తప్ప ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులను పట్టించుకోవడం లేదని అన్ని వర్గాల వారు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇపుడు కొత్త మైక్రో బేవరేజ్‌కు ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో చూడాలి. 

06:31 - August 29, 2015

కృష్ణా : విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో.. శనివారం ఏపీ మంత్రి మండలి సమావేశం జరగబోతోంది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ అంశాలపై విపక్షాలు తమను ఇరుకున పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. విపక్షాల సవాళ్లకు దీటుగా స్పందించాల్సిన తీరుపైనా మంత్రిమండలి దృష్టి సారించనుంది.

రాష్ట్రానికి కేంద్ర హామీలపై చర్చ .....

భూసేకరణ చట్టం తర్వాతి పర్యవసానాలపై చర్చ

చంద్రబాబు ఇటీవలి ఢిల్లీ పర్యటనపై క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. కేంద్రం ఇచ్చిన హామీలు, నీతిఆయోగ్‌ రూపొందించనున్న రోడ్‌ మ్యాప్‌ తదితర అంశాలను ముఖ్యమంత్రి సహచరులకు వివరించనున్నారు. కేంద్ర హోంమంత్రి పిలుపు మేరకు చంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో కొత్తగా ప్రస్తావించాల్సిన అంశాలపైనా మంత్రివర్గం చర్చించనుంది. భూసేకరణ నోటిఫికేషన్‌.. తర్వాత వెనక్కి తగ్గడం, విపక్షాల ఆందోళన తదితర అంశాలపైనా మంత్రివర్గం దృష్టి సారించనుంది.

ప్రత్యేక హోదా కోసం పెరుగుతున్న ఆత్మహత్యలు........

ప్రత్యేకహోదా సాధనకోసం రాష్ట్రంలో సాగుతున్న ఆత్మహత్యలు.. ఆర్టీసీ చార్జీల పెంపు... అమరావతి నిర్మాణానికి మాస్టర్ డెవలపర్స్‌ను పిలవడం, శాఖల తరలింపు, పెండింగ్ ప్రాజెక్ట్ ల నిర్మాణం, రాష్ట్రంలో వర్షా భావ పరిస్థితులపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఈడీ జప్తు చేసిన ఆస్తులు ఆయా రాష్ట్రాలకే చెందాలని తీర్మానం.......

అటు వివిధ ఆర్థిక నేరాలతో ఈడీ జప్తుచేసిన ఆస్తులను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. విద్యాప్రమాణాల పెంపులోభాగంగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుబిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

06:28 - August 29, 2015

విజయవాడ : ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉధృతం అవుతోంది. తెల్లవారుజాము నుంచే వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ... వైసీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు, కాకినాడలో బస్సులను అడ్డుకున్నారు. ఇక విశాఖలో పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గాజువాక డిపో ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళనలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వైసీపీ బంద్....

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌ తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అయ్యింది. కాకినాడ బస్టాండ్‌ లో ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ బంద్‌ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా పలు సర్వీసులను రద్దు చేశారు.

 

ఏపీలో కొనసాగుతున్న వైసీపీ బంద్

హైదరాబాద్:ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ... ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీలో వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది. వీరి మద్దతుకు వామపక్ష పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు ఈ బంద్‌నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నేటి తెల్లవారుజాము నుంచే ఆర్టీసి బస్సుల ముందు బైటాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. 

Don't Miss