Activities calendar

30 August 2015

22:08 - August 30, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో సైకో ఇంజక్షన్ దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ వ్యక్తిపై సైకో ఇంజక్షన్ దాడికి పాల్పడ్డాడు. రెండు చోట్ల సూదితో గుచ్చి పారిపోయాడు. బైక్ పై వచ్చి ఇద్దరికి సూది గుచ్చినట్టు బాధితుడు చెబుతున్నాడు. ఇదిలావుంటే ఇవాళా ఉదయమే పెనుగొండలో హాస్టల్ విద్యార్థినిపై సైకో ఇంజక్షన్ దాడి చేశాడు. దీంతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి సూది గుచ్చలేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే మొగల్తూరు (మం) ముత్యాలపల్లిలో నాలుగో తరగతికి విద్యార్థినిపై కూడా ఇంజక్షన్ దాడి జరిగింది. పోలీసులు విస్తృతంగా గాలింపులు చేస్తున్నా సైకో ఆగడాలు ఆగడం లేదు. దీంతో సిరంజి సైకో బాధితుల సంఖ్య 17 కు చేరింది. ఇటీవలే నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

21:59 - August 30, 2015

కర్నూలు : సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేసేందుకు కర్నూలులో కార్మిక సంఘాలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మోటార్‌ సైకిల్‌ ర్యాలీని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. గఫూర్‌ ప్రారంభించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్‌ లో కనీవినీ ఎరుగని రీతిలో సమ్మె చేపడతామని గఫూర్‌ తెలిపారు.

 

21:54 - August 30, 2015

మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షమే కార్యక్రమాలకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి పర్యటించారు. షాద్‌నగర్‌లో 90 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న...మురుగుకాలువల పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డితో పాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీపై తుమ్మల మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి...తన ప్రగల్భాలను మానుకోవాలని దుయ్యబట్టారు.

21:49 - August 30, 2015

ముంబై : సంచలనం సృష్టించిన షీనాబోరా మర్డర్ కేసు దర్యాప్తును.. ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇంద్రాణి ముఖర్జీ మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్‌మనోహర్‌రాయ్‌లను పోలీసులు.. రాయ్‌గఢ్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. షీనాబోరాను హత్య చేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని కాల్చి పూడ్చిపెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక పోలీసుల విచారణ సందర్భంగా ఇంద్రాణి, సంజీవ్‌ ఖన్నా పరస్పరం విమర్శలు చేసుకున్నట్లు తెలుస్తోంది. షీనా హత్యకు కొన్నిగంటల ముందు ఇంద్రాణి సైతం మందు తాగినట్లు ఆరోపణలు వున్నాయి. అటు.. షీనాబోరా సోదరుడు మిఖైల్‌బోరా ఆదివారమూ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

 

21:47 - August 30, 2015

ఇస్లామాబాద్ : ఉగ్రవాదంపై పోరును తీవ్రతరం చేయటానికి... పాకిస్థాన్‌కు పోరాట హెలీకాప్టర్లు సమకూర్చేందుకు.. అమెరికా సిద్ధమైంది. ఏహెచ్‌ వన్‌ జెడ్‌ వైపర్ హెలీకాప్టర్‌లు పంపనున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డాన్ పత్రిక కథనం ప్రకారం అమెరికా-పాకిస్థాన్ మధ్య.. హెలీకాప్టర్ల కోసం.. 3843 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 383.6 కోట్లను బెల్ హెలీకాప్టర్ సంస్థకు పాకిస్థాన్ రక్షణ విభాగం ఇప్పటికే చెల్లించింది. మొత్తం 15 ఏహెచ్ వన్ జెడ్ హెలీకాప్టర్లు కావాలని పాక్ విన్నవించింది. ఐతే ఇందులో కొన్నింటిని 2018 ఆగస్టు చివరికి అందజేసేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.

 

21:45 - August 30, 2015

ఉత్తరాఖండ్‌ : చంపావత్‌లో రాళ్ల దాడి వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్‌ రోజు ఇరువర్గాల ప్రజలు రాళ్లతో దాడి చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది జనం సమక్షంలో ఈ వేడుకలు ఉత్కంఠగా జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రాష్ట్ర సీఎం హరీశ్‌రావత్‌ ఈ వేడుకలను తిలకించారు. గతంలో పళ్లతో దాడులు జరిగేవని... మూడేళ్లుగా రాళ్లతో దాడులు జరగడంతో గాయాల తీవ్రత పెరుగుతోందని స్థానికులు అంటున్నారు. అయినా సంబరాలను ఆనందంగా ఆస్వాదిస్తున్నట్లు చెబుతున్నారు.

 

21:39 - August 30, 2015

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టెస్ట్ మూడో రోజుఆటలోనే టీమిండియా ...111 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజుఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్ 312 పరుగులకు ముగిసింది. ఓపెనర్ పూజారా 145 పరుగుల స్కోరుతో నాటౌట్ గా మిగిలాడు. సమాధానంగా తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 201 పరుగులకే ఆలౌటయ్యింది. శ్రీలంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా 55, రంగన్ హెరాత్ 49 పరుగులు చేసి..శ్రీలంకను ఆదుకొన్నారు. టీమిండియా బౌలర్లలో ఇశాంత్ శర్మ 54 పరుగులిచ్చి 5 వికెట్లు, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. భారీ ఆధిక్యంతో రెండోఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..కేవలం 21 పరుగులకే ఓపెనర్లు పూజారా, రాహుల్, వన్ డౌన్ రహానే వికెట్లు నష్టపోయింది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్...ఫాస్ట్ ,స్వింగ్ బౌలర్లకు అనువుగా ఉండడంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అంతతేలికగా కనిపించడం లేదు. మొత్తం మీద మూడోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 132 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో ఉంది.

 

21:35 - August 30, 2015

ఢిల్లీ : పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు సాధించేవరకూ ఉపక్రమించేది లేదని... పటీదార్‌ అనామత్‌ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. ఓబీసీ కోటాలో 27శాతం రిజర్వేషన్లు కోరుతూ... రెండు నెలలుగా గుజరాత్ లో ఆందోళనలకు నాయకత్వం వహిస్తోన్న హార్దిక్ పటేల్‌.. తాజాగా ఢిల్లీ బాట పట్టారు. వివిధ పార్టీల నేతలను కలుస్తూ... తమ పోరాటానికి మద్దతు కూడగడుతున్నారు. రాజకీయాల కోసమే హార్డిక్ పటేల్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్న విమర్శలపై... ఆయన తీవ్రంగా స్పందించారు. తనకు రాజకీయాలు అక్కర్లేదని... తన సామాజిక వర్గానికి మేలు చేయటమే తన లక్ష్యమన్నారు. 

21:19 - August 30, 2015

ఢిల్లీ : ఎలాగైనా ల్యాండ్ బిల్లు తెచ్చి తీరుతామని ప్రధాని నరంద్ర మోడీ స్పష్టం చేశారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ.. రేడియోలో అన్నదాతల సమస్యలపై మాట్లాడారు. 'జై జవాన్‌.. జై కిసాన్‌'.. ఇది కేవలం నినాదం కాదని.. అదో మంత్రమన్నారు. జై జవాన్.. జై కిసాన్‌.. నినాదాన్ని ఓ తారక మంత్రంగా భావించి.. దాన్ని అనుసరిస్తున్నట్లు మోడీ చెప్పారు. వివాదాస్పద ల్యాండ్‌ బిల్‌.. రేపటితో ల్యాప్స్‌ అవుతుందని.. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ బిల్లుపై.. విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నట్లు విమర్శించారు. ఏది ఏమైనా అన్నదాతల కోసం తప్పనిసరిగా బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. ల్యాండ్ బిల్లును తీసుకొచ్చినా.. ఆమోదానికి నోచుకోలేదు. బిల్లు కోసం ఇప్పటికే మూడు సార్లు ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చారు. నాలుగోసారి తెచ్చేందుకూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

21:08 - August 30, 2015

ఢిల్లీ : ల్యాండ్ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ తెచ్చే యోచన లేదని... కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఈనెల 31తో ల్యాండ్ బిల్లు ఆర్డినెన్స్‌ గడువు ముగిసిపోతుంది. బిల్లు కోసం కేంద్రం ఇప్పటికే మూడు పర్యాయాలు ఆర్డినెన్స్ తెచ్చింది. నాలుగోసారి కూడా ఆర్డినెన్స్ తెస్తారని ప్రచారం జరిగింది. ఐతే అలాంటిదేమీ లేదని అరుణ్‌ జైట్లీ చెప్పారు. బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనలో వుందని... తమ ప్రభుత్వ నిర్ణయానికి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే భావిస్తున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

21:00 - August 30, 2015

కర్నాటక : ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ధర్వాడ్ లోని ఆయన నివాసంలో ఈ ఘటన జరిగింది. 2006లో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న మల్లేషప్ప.. గతంలో హంపీ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా కూడా పనిచేశారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనలను చైతన్యవంతులను చేసేందుకు ఆయన కృషిచేశారు. మల్లేషప్ప హత్యపై సాహితీ ప్రియులు బెంగళూరులో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపి...దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 

20:57 - August 30, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీస్తామన్నారు వైసిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై టిడిపి, బీజేపీ డబుల్‌గేమ్‌ను బట్టబయలు చేస్తామన్నారు. అలాగే రాజధాని, కరువు అంశాలపై చర్చిస్తామన్నారు. పుష్కరాల్లో జరిగిన అవినీతి అంశాలపై గళమెత్తుతామని చెప్పారు.

మరో ఇంజక్షన్ దాడికి పాల్పడ్డ సైకో

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇటీవలి కాలంలో ఓ సైకో పలువురిపై ఇంజక్షన్ దాడికి పాల్పడ్డాడు. తాజాగా సైకో మరో ఇంజక్షన్ దాడికి పాల్పడ్డాడు. పెంటపాడు మండలం గట్లపాలెంలో ఓ బాలుడికి ఇంజక్షన్ ఇచ్చి సైకో పరారయ్యాడు. ఇంజక్షన్ దాడులకు సంబంధించి 16 వ కేసు నమోదు అయింది.

 

20:09 - August 30, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ సూచించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు, ఉల్లి ధరల పెరుగుదల, నిత్యవసరాల పెంపు, ఇసుక మాఫియా, ఓటుకు కోటి, రిషితేశ్వరి ఘటన వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఇష్టం లేక.. ప్రభుత్వం తప్పించుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను 5 రోజులు నిర్వహించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీయడంలో వెనకడుగు వేసేదిలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని శ్రీకాంత్ సూ చించారు.

 

19:56 - August 30, 2015

తిరుపతి : గుంటూరు ఘటన నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల పారిశుధ్యంపై నియమించిన ప్రభుత్వ నిపుణుల కమిటీ వివిధ ఆస్పత్రులను సందర్శించింది. ఈ క్రమంలోనే ఇవాళా తిరుపతి రుయా ఆసుపత్రిని సందర్శించింది. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్డుల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో శానిటేషన్‌ ఆధ్వాన్నంగా ఉందని కమిటీ సభ్యులు రుయా ఆధికారులపై మండిపడ్డారు.

 

19:47 - August 30, 2015

కృష్ణా : బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా ఉండవల్లిలో రైతు సదస్సు చేపట్టారు. ఈ సదస్సుకు 10 వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతలు పిలుపునిచ్చారు. రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తే తిరబగడతామని హెచ్చరించారు. ప్రైవేట్‌ కంపెనీలకు ధారదత్తం చేయడానికే భూసేకరణ చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

 

19:16 - August 30, 2015

విజయవాడ : ఏపీ ఒలింపిక్‌ అసోషియేషన్‌పై మళ్లీ దుమారం రేగుతోంది. తమదే గుర్తింపుపొందిన సంఘమంటూ... ఎవరికివారు ప్రకటను గుప్పిస్తున్నారు. విజయవాడలో పోటాపోటీగా గల్లా జయదేవ్‌ వర్గం, సీఎం రమేష్ వర్గం...ఒలింపిక్ సమావేశాలు నిర్వహించారు. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని...గల్లాజయదేవ్ వర్గం ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఒలింపిక్ సంఘం తమకే... అఫిలియేషన్‌ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో ఒలింపిక్‌ అసోషియేషన్‌ను పటిష్ట పరిచి...క్రీడలను అభివృద్ధి పరుస్తామన్నారు. మొత్తం 29 క్రీడా సంఘాలు తమకే మద్దతిస్తున్నాయని...వారి సహకారంతో కోర్టులో కేసు గెలుస్తామని చెప్పారు.

19:15 - August 30, 2015

హైదరాబాద్: ఏపీలో ఇంజెక్షన్ సైకో దాడి ఘటనలపై దుమారం రేగుతోంది. పోలీస్‌ వ్యవస్థ, హోంమంత్రి నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఐతే హోంమంత్రి చినరాజప్ప మాత్రం...తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలను కాపాడటంతో రాజీపడటం లేదన్నారు. త్వరలోనే సైకోను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

 

19:07 - August 30, 2015

తూర్పుగోదావరి : రాజమండ్రిలో కురిసిన భారీవర్షం నగరవాసులను అతలాకుతలం చేసింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. నగరంలోని ఆర్యాపురం, తుమ్మలావ, కంబాల చెరువు, రైల్వే స్టేషన్ ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు గోదావరినదిలోని మురుగునీటికి పంపింగ్ చేసే నల్లా ఛానల్ వద్ద మోటార్లు పనిచేయకపోవడంతో ఆర్యాపురం ప్రాంతంలో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరింది.

 

19:03 - August 30, 2015

నెల్లూరు : జిల్లాలో మాజీ భార్యను చంపేదుకు...భర్త స్కెచ్ వేశాడు. నాటు బాంబులతో దాడి చేసి...పెట్రోల్‌తో తగులపెట్టాలని ప్లాన్ చేశాడు. ఐతే ఆ ప్రబుద్ధుని కుట్రను స్థానికులు భగ్నం చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఈ ఘటన జరిగింది. పొదలకూరు మండలం నందవేలు గ్రామానికి చెందిన....సోమవరపు శ్రీధర్‌రెడ్డికి పదకొండేళ్ల క్రితం రమాదేవితో వివాహమైంది. ఏడేళ్ల క్రితం వారు బుచ్చిరెడ్డిపాలెంకు వచ్చి స్థిరపడ్డారు. ఐతే శ్రీధర్‌రెడ్డి మద్యానికి బానిసై...భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో ఆమె ఐదేళ్ల నుంచి భర్తకు దూరంగా...ఒంటరిగా నవసిస్తోంది. ఆమెపై అనుమానం పెంచుకున్న శ్రీధర్‌రెడ్డి...ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు. ఇంటి చుట్టూ నాటుం బాంబులు అమర్చాడు. అంతేగాక శనివారం రాత్రి... ఇంటిపై పెట్రోల్ స్ప్రే చేసి తగులపెట్టాలనుకున్నాడు. కాని స్థానికులు గమనించి...అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని దగ్గర నుంచి పోలీసులు...19 నాటుబాంబులు, వేట కొడవలి, పెట్రోల్ స్ప్రేయర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

 

18:56 - August 30, 2015

హైదరాబాద్ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య ద్వారానే అట్టడుగువర్గాల అభ్యున్నతి సాధ్యమని సామాజిక, విద్యా వేత్తలు పిలుపునిచ్చారు. సమీపంలో బారు పెట్టడం కాదని, స్కూలు స్థాపించాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలన్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంకు ప్రాధాన్యత పెరిగినప్పుడే విద్యార్థులు ఆధునిక ప్రపంచం అవకాశాలను అందిపుచ్చుకోగలరని...ఓయూలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో చెప్పారు.
ఓయూలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు..
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు జరిగింది. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ మీడియం, కేజీ టు పీజీ విద్య అమలు అంశంపై వివిధ సామాజిక, విద్య, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మాట్లాడారు. తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు ఈ సమావేశానికి తరలివచ్చారు. ప్రైవేటు విద్యను నియంత్రించి, ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టం చేయాలని అందరూ పిలుపునిచ్చారు.
ఇంగ్లీష్‌ మీడియంకు ప్రాధాన్యత : చుక్కా రామయ్య
20వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రను మలుపు తిప్పితే...21వ శతాబ్ధం ఐటీ విప్లవానిదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ఇంగ్లీష్‌ మీడియంకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.
పల్లెల్లో విద్యా విప్లవం సృష్టించాలి : ప్రొ.కంచ ఐలయ్య
ప్రస్తుతమున్న ఇంటర్మీడియట్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థగా మారిందన్నారు...ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి...హైస్కూల్‌లో విలీనం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెరగాలని చెప్పారు. టీచర్లు పల్లెల్లో విద్యా విప్లవం సృష్టించాలని పిలుపునిచ్చారు ఐలయ్య.
విద్యావ్యవస్థను పట్టించుకోని ప్రభుత్వం : ప్రొ.నాగేశ్వర్
పతనమవుతున్న విద్యావ్యవస్థను పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రంలో బార్‌లకు తలుపులు బార్లా తెరుస్తోందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బార్లను పెట్టడంలో ప్రదర్శిస్తున్న ఆసక్తి...స్కూళ్లను స్థాపించడంలో చూపడం లేదని అన్నారు.
అందని నాణ్యమైన విద్య : తమ్మినేని
తెలంగాణలో ఇంకా అనేకవర్గాలకు నాణ్యమైన విద్య అందడం లేదని...సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ప్రజల కలలు నెరవేరటం లేదని వ్యాఖ్యానించారు. ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ తెలంగాణ సర్కార్‌ ఆచరణ మీద పెట్టడం లేదని తమ్మినేని తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
పలు ఆంశాలపై తీర్మానం
ఫీజుల నియంత్రణ చట్టం, విద్యార్థులకు పోషక విలువలున్న మధ్యాహ్న భోజనం, విద్యారంగంలో అనాదిగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్రస్థాయి విద్యా సదస్సు తీర్మానించింది.

 

18:04 - August 30, 2015

ఆదిలాబాద్‌ : రాష్ట్రంలో చీప్‌ లిక్కర్తో ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్‌ చెలగాటం అడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. ఆదిలాబాద్‌లో జిల్లా ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వీహెచ్‌ పాల్గొని, మాట్లాడారు. మద్యం తాగితే ప్రాణాలు పోతాయని డాక్టర్లు చెబుతుంటే.. మంత్రి మాత్రం ఆయుష్షు పెరుగుతుందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని వీహెచ్‌ అన్నారు.

 

17:56 - August 30, 2015

కరీంనగర్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈమేరకు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తమపై విమర్శలు చేస్తున్నవారు.. పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు.

 

17:52 - August 30, 2015

కరీంనగర్: ఎన్నికల ముందు సాగునీటి విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు కరీంనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వివాదాస్పదం చేస్తోందని, ఇది ప్రజాహితమైన చర్య కాదని పేర్కొన్నారు. ఏదో ఒక కారణం చెబుతూ ప్రాజెక్టుల డిజైన్‌ మార్చడం, రద్దు చేయడం తగదని హితవు పలికారు. ఉత్తమ్‌..

 

17:45 - August 30, 2015

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మూసిక అనే 30 ఏళ్ల మహిళ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది. తనిఖీల్లో ఆమె శరీరంలో డ్రగ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను ఉస్మానియాస్పత్రికి తరలించారు. వైద్యులు మహిళకు ఆపరేషన్ చేసి.. ఆమె శరీరం నుంచి రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ ను వెలికి తీశారు. డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. మహిళకు ఆపరేషన్ కొనసాగుతోంది.

 

రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం రేపింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద వద్ద రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు.

 

శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్ కు వర్షం అంతరాయం

కొలంబో టెస్టు: శ్రీలంక, భారత్ టెస్టు మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. 132 పరుగుల ఆధీక్యంలో భారత్ ఉంది.

 

16:52 - August 30, 2015

హైదరాబాద్: రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను ప్రజాసమస్యలపై చర్చిచేందుకు ఉపయోగించాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సూచించారు. మొదటి నుంచీ రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వాడుకున్నారని విమర్శించారు. ఈ సారైనా ప్రజల కోసం ఉపయోగించాలని పేర్కొన్నారు.

16:47 - August 30, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల సన్నాహాలపై స్పీకర్‌ కోడెల శివప్రసాద్ స్పందించారు. 5 రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించాలని సూచించారు. అధికార విపక్షాలు సమయాన్ని వృధా చేయకుండా సభ సాఫీగా సాగేలా చూసే బాధ్యత ఇరు పక్షాలపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై చర్చ జరిగింది. భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ కోడెల సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

సభ సజావుగా జరిగేందుకు వైసిపి సహకరించాలి: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ

హైదరాబాద్ : సభ సజావుగా జరిగేందుకు వైసిపి సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ కోరారు. ప్రత్యేకహోదాపై చర్చకు టిడిపి సిద్ధంగా ఉందన్నారు. 

సింగరేణి కార్మికులను పట్టించుకోని కేసీఆర్

కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు.  

వైసిపి శాసనసభాపక్ష సమావేశం...

హైదరాబాద్: లోటస్ పాండ్ లోని వైసాపి కార్యాలయంలో వైసిపి శాసన సభాపక్ష సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

 

రాష్ట్రపతిని కలిసిన ఎంపీ కవిత, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీఆర్ ఎస్ ఎంపీ కవిత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం.. ఎపితో కలిసి పోరాడేందుకు సిద్ధమని ఎంపీ కవిత తెలిపారు.  

15:33 - August 30, 2015

హైదరాబాద్: నీటి వాటాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉమ్మడిగా కర్ణాటక ప్రభుత్వంపై పోరాడాలని టిఆర్ ఎస్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాలతీతంగా, ప్రాంతాలకతీతంగా తెలుగువారంతా సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు సైతం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టినా.. చంద్రబాబు వ్యతిరేకించకపోవడం వల్లే కృష్ణా, గోదావరి నదుల్లో నీటికి కొరత ఏర్పడిందని ఆరోపించారు.

 

15:25 - August 30, 2015

హైదరాబాద్: ప్రైవేటు విద్యను నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపర్చాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం, విద్యార్థులకు పోషక విలువలున్న మధ్యాహ్న భోజనం, విద్యారంగంలో అనాదిగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానం చేయాలని వక్తలు నిర్ణయించారు. ఉస్మానియా యూనివర్శిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో ''రాష్ర్ట విద్యా సదస్సు'' జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విద్యావేత్త చుక్కా రామయ్య, కంచ ఐలయ్య, ఐద్వా నేత హైమావతి, ప్రొఫెసర్‌ బంజా, యుటిఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. తెలుగుతో పాటు ఇంగ్లీషు మీడియం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు కోసం రాష్ర్ట విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు.
సృజనాత్మకత పెంపొందించేలా విద్యా బోధన : చుక్కా రామయ్య
ప్రతి గ్రామానికి కేజీ విద్య వస్తేనే.. విద్యా రంగంలో గొప్ప విప్లవం వస్తుందన్నారు విద్యావేత్త చుక్కా రామయ్య. ప్రైమరీ విద్య ప్రైవేటీకరణ వల్ల కొన్ని వర్గాలు మాత్రమే బాగుపడతాయన్నారు. సృజనాత్మకత పెంపొందించేలా విద్యా బోధన కొనసాగలన్నారు. శాస్ర్తీయ విద్య లేకపోవడం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని చుక్కా రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాకాంక్షలు నెరవేరలేదు : తమ్మినేని వీరభద్రం
ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ప్రజల కలలు నెరవేరటం లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ తెలంగాణ సర్కార్‌ ఆచరణ మీద పెట్టడం లేదని తమ్మినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదువుకునే రోజులు పోయి చదువు"కొనే" రోజులు వచ్చాయన్నారు.
స్కూళ్లు ఉండాలి.. వైన్‌ షాపులు కాదు: నాగేశ్వర్ 
పతనమవుతున్న విద్యావ్యవస్థను పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రంలో బార్‌లకు తలుపులు బార్లా తెరుస్తోందని హాన్స్‌ ఇండియా చీఫ్‌ ఎడిటర్‌ ప్రొ.నాగేశ్వర్‌ విమర్శించారు. స్కూళ్లను మూసేస్తున్న ప్రభుత్వం బార్‌లు తెరుస్తోందని ఎద్దేవా చేశారు. పొరుగునే స్కూళ్లు ఉండాలి కానీ వైన్‌ షాపులు, బార్లు కాదని పేర్కొన్నారు. సమిష్ఠిగా ఉద్యమించినప్పుడే సర్కార్‌ సరైన దారిలో నడుస్తుందని నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.

స్వాభిమాన్ ర్యాలీలో సోనియా..

బీహార్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వాభిమాన్ ర్యాలీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. సీఎం నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

13:30 - August 30, 2015

గుంటూరు : జిల్లాలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ క్రిస్టోపర్‌, చాగంటి కోటేశ్వరరావు, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1125 మందికి డిగ్రీలు, 14 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. నైతిక విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలుపుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలని వక్తలు సూచించారు.

13:24 - August 30, 2015

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో ''రాష్ర్ట విద్యా సదస్సు'' జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విద్యావేత్త చుక్కా రామయ్య, కంచ ఐలయ్య, ఐద్వా నేత హైమావతి, ప్రొఫెసర్‌ బంజా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. తెలుగుతో పాటు ఇంగ్లీషు మీడియం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు కోసం రాష్ర్ట విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యను నియంత్రించాలని, ప్రభుత్వ విద్య రంగాన్ని పటిష్టపర్చాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం, విద్యార్థులకు పోషక విలువలున్న మధ్యాహ్న భోజనం, విద్యారంగంలో అనాదిగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానం చేయాలని వక్తలు నిర్ణయించారు. 

13:16 - August 30, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా డొక్కా మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికలంటే పార్టీలో చేరాలని పలువురు సూచించడం జరిగిందని తెలిపారు. కానీ తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని వారికి స్పష్టం చేయడం జరిగిందన్నారు. కొన్ని రోజుల అనంతరం విడివిడిగా ఉండటానికి వీలు లేదని, కలిసి ఉండాలని రాయపాటి తో పాటు ఇతర నేతుల సూచించడం జరిగిందన్నారు. అంతేగాక పార్టీ హై కమాండ్ కూడా పార్టీలో చేరాలని కోరడం జరిగిందన్నారు. దీనితో తాను టిడిపి తీర్థం పుచ్చుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో ఏలాంటి పదవి ఆశిస్తున్నారని విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించారు. పార్టీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకొనేది చూడాలన్నారు. కలిసి ఉండి పార్టీని బలపరచాలని తాను కోరడం జరిగిందని రాయపాటి తెలిపారు. ఆయనకు సముచిత స్థానం కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 
డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గుంటూరు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న నేత. అనతికాలంలోనే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్, రోశయ్య, కిరణ్ క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డారు. డొక్కా రాకతో గుంటూరు జిల్లాలో టీడీపీ బలపడుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

13:08 - August 30, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇంజక్షన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పెనుగొండలో హాస్టల్ విద్యార్థినిపై సైకో ఇంజక్షన్ దాడి చేశాడు. దీనితో హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి సూది గుచ్చలేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే మొగల్తూరు (మం) ముత్యాలపల్లిలో నాలుగో తరగతికి విద్యార్థినిపై కూడా ఇంజక్షన్ దాడి జరిగింది. పోలీసులు విస్తృతంగా గాలింపులు చేస్తున్నా సైకో ఆగడాలు ఆగడం లేదు. 15 చోట్ల ఘటనలు జరిగినట్లు సమాచారం. ఇటీవలే నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

సౌతాఫ్రికాలో బస్సు ప్రమాదం..35 మంది మృతి..

దక్షిణాఫ్రికా : తూర్పు ప్రావిన్స్ లోని బట్టర్ వర్త్ - విల్లోవాలె ప్రధాన రహదారిపై బస్సు కొండపై నుండి కిందపడింది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణీకులు మృతి చెందారు. 

కొనసాగుతున్న ఇంజక్షన్ దాడులు..

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇంజక్షన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పెనుగొండలో హాస్టల్ విద్యార్థినిపై సైకో ఇంజక్షన్ దాడి చేశాడు. మొగల్తూరు (మం) ముత్యాలపల్లిలో నాలుగో తరగతికి విద్యార్థినిపై కూడా ఇంజక్షన్ దాడి జరిగింది. 

కష్టాల్లో లంక..

కొలంబో : భారత్ తో ఆడుతున్న శ్రీలంక జట్టు కష్టాల్లో పడింది. 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. శర్మ మూడు, బిన్ని రెండు, యాదవ్ ఒక వికెట్ తీశారు.

12:49 - August 30, 2015

నేడు సమాజంలో అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు సమానంగా ఎదుగుతున్నారు. సాహిత్యరంగంలోనూ..అదే జరిగింది. ఇంతవరకు దాశరధి, సి.నా.రె, పెన్నా, సూరారం శంకర్ లాంటి పురుషులు మాత్రమే చేపట్టిన గజల్ ప్రక్రియను చేపట్టి తొలి గజల్ కవయిత్రిగా పేరు గడించారు డా.యం.బి.డి.శ్యామల. సుహృల్లేఖ, ఆలాపన గజల్స్ తోపాటు నాగుండె గుమ్మానికి పచ్చనాకువై , సజీవ క్షణాలకోసం లాంటి వచన కవితా సంపుటాలు వెలువరించిన ప్రముఖ కవయిత్రి, గజల్ గంగోత్రి డా.యం.బి.డి శ్యామలపై ప్రత్యేక కథనం.

 

12:46 - August 30, 2015

సాహిత్యం సమాజ పురోగమణానికి దిక్సూచిలాంటిది. మానవ సమాజాలు అగాధాలవైపు జారిపోతున్నపుడళ్లా తొలుత ఆందోళన చెందేది సృజనకారులే. నిరంతరం మార్పును ఆశిస్తూ రేపటి తూర్పుకు ఆహ్వానం పలికే కవులు రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అణగారిన కులాల బతుకు చిత్రాలను కథలుగా అక్షరీకరించిన కథన శిల్పి తుమ్మల రామకృష్ణ. గ్రామీణ అభాగ్యుల దుర్భర బతుకు చిత్రాలను ఆయన అద్భుత కథలుగా మలిచారు. తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న నిమ్నకులాల బతుకులు ఎలా అణచివేయబడ్డాయో తన కథల్లో కళ్లకు కట్టినట్టు వర్ణించారాయన. రామకృష్ణ కథల నేపథ్యాన్ని ఆయన ధిక్కార స్వరాల్లోని ఆర్ద్రతను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు.

 

బీహార్ లో ప్రారంభమైన 'స్వాభిమాన్ ర్యాలీ'..

బీహార్ : రాష్ట్రంలో మహఘట్బంద్ 'స్వాభిమాన్ ర్యాలీ' ప్రారంభమైంది. ఈ ర్యాలీకి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు.

ఢిల్లీ, లక్నోలో నిరసనలు - హర్దిక్ పటేల్..

ఢిల్లీ : దేశ రాజధానిలోని జంతర్ మంతర్, లక్నో లో నిరసనలు చేయాలని యోచిస్తున్నట్లు పటేళ్ల ఉద్యమసారధి హర్దిక్ పటేల్ పేర్కొన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి..

చిత్తూరు : తిరుపతిలోని శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జగదీష్‌సింగ్ కెహర్ దర్శించుకున్నారు. 

ప్రాజెక్టులపై కాంగ్రెస్ ధర్నా చేయడం శోచనీయం - ఎంపీ వినోద్..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను ప్రజల ఉపయోగార్థం తీసుకొస్తుంటే ధర్నా చేయడం శోచనీయమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. 

ఎంపీ అభిజిత్ ను పరామర్శించిన ఎంపీ కవిత..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, ఎంపీ అభిజిత్ ముఖర్జీని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు పరామర్శించారు. ప్రణబ్ ముఖర్జీ సతీమణి సుబ్రాముఖర్జీ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. 

ప్రముఖ రచయిత ఎం.ఎ.కల్బుర్గిని కాల్చి చంపిన దుండగుడు..

కర్ణాటక : రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు ఎం.ఎ.కల్బుర్గిని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. దార్వాడలో ఆయన నివాసంలో ఉన్న కల్బుర్గిపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడనే కుప్పకూలిపోయారు. 

మోడీ మన్ కీ బాత్..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలందరూ జన్ ధన్ యోజనను విజయవంతం చేశారని, దీనికి ఏడాది పూర్తయ్యిందన్నారు. దాదాపు 18 కోట్ల మంది ఖాతాలు తెరిచారని, రూ.22వేల కోట్లు జమయ్యాయన్నారు. 

ఎంసీఐ నిబంధనలు మారుస్తాం - వెంకయ్య..

నెల్లూరు : సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తెచ్చేలా ఎంసీఐ నిబందనలు మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని వెంకటాచలంలోని స్వర్ణభారతి ట్రస్టులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

 

12:20 - August 30, 2015

హైదరాబాద్ : వర్షాకాల సమావేశాల్లో అందరూ సహకరించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ సూచించారు. రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న దృష్టా కోడెల టెన్ టివితో మాట్లాడారు. ప్రజల కోసం సమయాన్ని వెచ్చించాలని ఆయన అధికార, ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్షాలు సహకరిస్తే సభ సజావుగా సాగుతుందని, సంప్రదాయలు తూ.చ తప్పకుండా పాటిస్తామన్నారు. అందులో భాగంగానే గత సీఎం వైఎస్ చిత్రపటం తొలగించడం జరిగిందని, దీనికి సమాధానం చెబుతామన్నారు. స్పీకర్ ను ఉద్ధేశించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రతిపక్షం చక్కగా సహకరించిందని, సహకరించకపోతే ఏమి జరిగిందో చూశారని తెలిపారు.

ప్రత్యేక హోదా రావాల్సిందే..
ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాల్సిందేనని, ఎన్డీయే పక్షాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీనిచ్చారని గుర్తు చేశారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత అని తెలిపారు. ఏ కారణంచేతనైనా ఇవ్వలేకపోతే ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి జరిగే సహాయం ఎక్కువ అందించాలని, అప్పుడే ప్రజలు తృప్తి పడుతారని తెలిపారు. ఈ విషయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని, బలిదానాలు చేసి ఎవరిని ఉద్ధరిస్తారని వ్యాఖ్యానించారు.

పలు సామాజిక కార్యక్రమాలు..
ఏపీ రాష్ట్రంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతల్లోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగిందని, చెరువుల పునరుద్ధరణ చేశామన్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి నడుం కట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో స్పీకర్ గా తన కృషి చేస్తానని కోడెల పేర్కొన్నారు. 

12:16 - August 30, 2015

విజయవాడ : ఏ పార్టీలో చేరాలని ఇంతకాలం సందిగ్ధావస్తలో ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎట్టకేలకు టిడిపిలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన వెంట జిల్లా మంత్రి ప్రతిపాటి కూడా ఉన్నారు. రాజకీయ గురువు రాయపాటి సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సుదీర్ఘ కాలం పాటు రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావుకు అనుచరుడిగా కొనసాగారు. టిడిపిలో చేరాలని డొక్కా ఐదు సార్లు ప్రయత్నాలు చేసినా అది నెరవేరలేదు. తాజాగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డొక్కా టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయన చేరిక వల్ల జిల్లాలో పార్టీ పటిష్టం అవుతుందని టిడిపి భావిస్తోంది. ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల పార్టీ మరింత విస్తృమౌతుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇదే సామాజికి వర్గానికి చెందిన జూపూడి ఇటీవలే టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్, రోశయ్య, కిరణ్ ముఖ్యమంత్రుల హాయాంలో డొక్క మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరి ఆయన చేరిక వల్ల ఎలాంటి ఫలితాలు రానున్నాయో రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. 

టిడిపిలో చేరిన డొక్కా..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. 

శ్రీలంక 47/4..

కొలంబో : భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో లంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ రెండు, ఉమేష్ యాదవ్, బిన్నలు తలా ఒక వికెట్ తీశారు.

11:57 - August 30, 2015

అనంతపురం : ప్రయాణం అంటేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. అనంతపురం నగర శివార్లలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇస్కాన్ టెంపుల్ వద్ద బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్నాటక ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

తప్పిన ప్రమాదం..
అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కేరళలోని కాలికట్‌కు వెళ్తున్న కల్లాడ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైంది. గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక షాట్ సర్క్యూట్‌తో వోల్వో బస్సు దగ్ధమైంది.జీపీయస్‌ ద్వారా విషయం తెలుసుకున్న బస్సు యాజమాన్యం ముందుగా డ్రైవర్‌కు సమాచారమిచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపి.. నిద్రలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేశాడు. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్దిక్షణాల్లోనే బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై అరగంటపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఘటనాస్థలిని మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. 

11:55 - August 30, 2015

విజయవాడ : ఆ ఇద్దరు మంత్రులు వ్యాపారస్తులు.. పైగా వియ్యంకులు. ఇంకేముంది ఒక‌రి బిజినెస్ కు మ‌రొక‌రు ఫుల్ గా స‌పోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. డ‌జ‌న్లకు పైగా జీవోల‌తో విద్యా శాఖ‌పై త‌మ ఆధిప‌త్యంను సాగిస్తున్నారు. అధికారం వ్యాపారం రెండూ క‌లిశాయి. ఇంకేముంది త‌మ‌కు పోటీగా ఉన్న జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌ను బెదిరించో భయ‌పెట్టో త‌మ స్వాధీనం చేసుకుంటున్నారు సద‌రు మంత్రుల‌ ద్వయం. చంద్రబాబు కేబినెట్‌లో కీల‌క మంత్రిగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధిపతి. ఇక విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కు మంత్రి నారాయ‌ణ వియ్యంకుడు. ఇంకే ముంది ఒక‌రికి ఒక‌రు పూర్తిగా సహాయం చేసుకుంటున్నారు.

25కి పైగా కాలేజీల విలీనం..
గ‌త నెల‌రోజుల‌లో ఏపీ విద్యా శాఖ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియ‌ర్ కాలేజీల విలీనం, పేరు మార్పుల‌కు సంబంధించిన జీవోలు జారీ చేసింది. వీటిలో సగం పుర‌పాల‌క శాఖ‌మంత్రి నారాయ‌ణ కు చెందిన సంస్థల‌కే చెందినవే కావడం ప‌లు విమ‌ర్శల‌కు దారి తీసింది.  ఏపీ ఉన్నత విద్యా శాఖ.. 25కు పైగా కాలేజీల విలీనం, కాలేజీల పేరు మార్పు జీవోలు జారీ చేసింది. అందులో మంత్రి నారాయ‌ణ‌కు చెందిన విద్యా సంస్థల‌లో ఇత‌ర విద్యా సంస్థలు విలీనం అవుతూ పది జీవోలు విడుదల అయ్యాయి. ఇక మంత్రి నారాయ‌ణ భాగస్వామిగా ఉన్న శ్రీ చైత‌న్య క‌ళాశాల‌ల యాజ‌మాన్యానికి సంబంధించి 7, శ్రీ చైత‌న్య‌-నారాయ‌ణ స‌ంయుక్త యాజ‌మాన్యంలో న‌డుస్తున్న ఒక కాలేజీకి జీవో విడుద‌లైంది.

కళాశాలలకు నోటీసులు..
ఇదిలా ఉంటే ఏపీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుకు మంత్రి నారాయ‌ణ‌ స్వయంగా వియ్యంకుడు కావ‌డం ద్వారా ఈ జీవోలు ప‌లు విమ‌ర్శల‌కు దారి తీస్తున్నాయి. మంత్రి నారాయ‌ణ‌ త‌న వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌రువాత‌ విద్యా శాఖ నుంచి పలు కళాశాలలకు నోటీసులు వ‌చ్చాయి. క‌ళాశాల‌ల్లో స‌రైన స‌దుపాయాలు లేవన్నది వాటి సారాంశం. ఆ త‌రువాత‌ చాలా వరకూ కాలేజీలు నారాయ‌ణ సంస్థల్లో విలీనం అవుతూ విద్యా శాఖకు దరఖాస్తు చేసుకొన్నాయి.

బాబు సర్కార్ ఎలాంటి అడుగు వేస్తుందో ?
సాక్షాత్తూ విద్యా శాఖ మంత్రి వియ్యంకుడు కావ‌డంతో ఏం చెయ్యాలో తెలియ‌క విలీనానికి సిద్ధప‌డుతున్నాయి ఇతర క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు. వీరిద్దరూ ఇలానే త‌మ క‌ళాశాల‌ల‌ను ఆక్రమించుకుంటూ పోతుంటే ఇక రాష్ట్రంలో విద్యా వ్యవ‌స్థ భ్రష్టు పట్టిపోతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మంత్రుల ద్వయం నిర్వాకంతో ఇకపై చంద్రబాబు ప్రభుత్వం ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి.

ప్రజా సమస్యలపై చర్చించాలి - కోడెల..

హైదరాబాద్ : కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన టెన్ టివితో మాట్లాడారు. అసెంబ్లీ సంప్రదాయాన్ని పాటిస్తూ వైఎస్ చిత్రపటం తొలగించడం జరిగిందని, ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. 

సాగర్ కుడి కాలువకు నీరు విడుదల..

గుంటూరు : తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడికాలువకు 2,012 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. నీళ్లు విడుదల చేయడంతో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

 

మరొక మాజీ సైనిక ఉద్యోగి ఆసుపత్రికి తరలింపు..

ఢిల్లీ : మాజీ సైనిక ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు కోసం గత కొన్ని రోజులులగా జంతర్ మంత్ వద్ద మాజీ సైనికోద్యోగులు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. 

11:10 - August 30, 2015

విజయవాడ : రాజధాని నిర్మాణం పేదల పాలిట శాపంగా మారుతోంది. ఉండవల్లి గ్రామంలోని రోడ్డు మార్గంలో ఉన్న ఇళ్లను తొలగించడానికి సీఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నివాసాలపై మార్కింగ్ కూడా చేశారు. ఆదివారం వీరిని ఖాళీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరో 48గంటల్లో ఖాళీ చేయకపోతే ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకున్న 'టెన్ టివి' బాధితులను కలిసింది. తాము 30 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఉన్నఫలంగా వెళ్లిపోవాలంటే ఎలా వెళుతామని రోదిస్తూ చెప్పారు. మాట మాత్రం చెప్పకుండా ఇళ్లను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాము మాత్రం ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు

మరొక మాజీ సైనిక ఉద్యోగి ఆసుపత్రికి తరలింపు..

ఢిల్లీ : మాజీ సైనిక ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ అమలు కోసం గత కొన్ని రోజులులగా జంతర్ మంత్ వద్ద మాజీ సైనికోద్యోగులు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. 

శ్రీలంక 11/2..

కొలంబో : భారత్ తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో లంక మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించింది. తరంగ (4), సిల్వా (3) పరుగులకే అవుటయ్యారు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు. 

ఉండవల్లిలో రైతు సదస్సు..

విజయవాడ : బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి లో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సదస్సు జరుగుతోంది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. బలవంతంగా భూములు లాక్కొవాలని చూస్తే తిరగబడుతామని నేతలు హెచ్చరించారు. 

హోద కోసం ఆగిన మరో గుండె..

అనంతపురం : ప్రత్యేక హోదా రాలేదన్న కారణంతో మరో గుండె ఆగిపోయింది. సోమందేపల్లి కేతిగాని చెరువు గ్రామానికి చెందిన ఉప్పర సిద్దప్ప గుండె పోటు కారణంగా తుదిశ్వాస విడిచాడు. 

10:36 - August 30, 2015

విజయవాడ :బలవంతపు భూ సేకరణ చేయవద్దని పది వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని ఉండవల్లి గ్రామంలో ఆదివారం అఖిలపక్ష నేతలు పర్యటించారు. అక్కడ స్థానికంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి రైతులు తరలివచ్చారు. భూములు ఎలాంటి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెబుతున్నారు. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. ఉండవల్లిని భూ సేకరణ నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాయమాటలు చెబుతూ విలువైన భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. నంబర్ వన్ రాజధానిని కడుతామని బాబు మాయమాటలు చెబుతోందన్నారు. ఆచరణలో నయాన..భయనా వ్యక్తపరుస్తూ రైతుల నుండి భూములు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. భూ సేకరణ చేయాలని కొన్ని గ్రామాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని, తరువాత వెనక్కి వెళ్లిందన్నారు. ఇది తాత్కాలికంగా వెనకడుగు వేసిందని మళ్లీ ముందుకొస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేయడం సిగ్గు చేయడమన్నారు. వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీడ్ క్యాపిటల్ నాలుగు ఎకరాలు..150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవచ్చని మరి మిగతా భూమి ఎందుకు తీసుకొంటోందని ప్రశ్నించారు. 

10:28 - August 30, 2015

కొలంబో : శ్రీలకంతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ 312 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఛతేశ్వర్ పుజార అద్భుతం శతకం సాధించాడు. ఇతర ప్లేయర్స్ ఏ మాత్రం సపోర్టు ఇవ్వకపోయేసరికి ఒంటరిగానే రాణించాడు. చివరకు 145 పరుగులతో పుజార నాటౌట్ గా నిలిచాడు. శుక్రవారం 50/2 తో భారత్ ఆటను ఆరంభించింది. జట్టు స్కోరు 64 వద్ద ఉండగా కోహ్లీ (18) ని మాథ్యూస్ వెనక్కి పంపించాడు. అనంతరం వచ్చిన శర్మ..పుజారకు జత కలిశాడు. వీరిద్దరూ శ్రీలంక బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నారు. కానీ ప్రసాద్ బౌలింగ్ లో శర్మ (26) వెనుదిరిగాడు. వెంటనే బిన్ని (0) పరుగులేమి చేయకుండానే అవుటయ్యాడు. మరోవైపు పుజార ఒక్కడే ఒంటరిగా స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశాడు. ఓజా (21), అశ్విన్ (5) కూడా వెనుదిరిగారు. అప్పటికీ జట్టు స్కోరు 180 పరుగులు మాత్రమే. తరువాత వచ్చిన మిశ్రా వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఇదిలా ఉంటే పుజార శతకం సాధించాడు. చెత్త బాల్స్ ను మిశ్రా బౌండరీకి తరలించాడు. వీరిద్దరినీ విడదీయడానికి శ్రీలంక బౌలర్లు కష్టపడ్డారు. ఈ దశలో శర్మ అర్థ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 284 పరుగుల వద్ద ఉన్నప్పుడు మంచి ఊపు మీదున్న మిశ్రా (59) ను హెరాత్ పెవిలియన్ పంపించాడు. తరువాత పుజారకు శర్మ జతకలిశాడు. ఈ మధ్యలో వర్షం కురిసింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. తిరిగి ఆదవారం భారత్ ఆటను ఆరంభించింది. మరో ఆరు పరుగులు జోడించి శర్మ (6) అవుటయ్యాడు. జట్టే స్కోరు 312 వద్ద కౌశాల్ వెనుదిరిగాడు. లంక బౌలర్లలో ప్రసాద్ నాలుగు, ప్రదీప్, హెరాత్ మూడు, మాథ్యూస్, హెరాత్, కౌశాల్ తలా ఒక వికెట్ తీశారు. 

స్కోరు వివరాలు : భారత్‌ తొలి ఇన్నింగ్స్ : లోకేశ్‌ రాహుల్‌ (బి) దమ్మిక ప్రసాద్‌ 2, ఛతేశ్వర పుజార బ్యాటింగ్‌ 145, అజింక్య రహానే (ఎల్‌బి) నువాన్‌ ప్రదీప్‌ 8, విరాట్‌ కోహ్లి (సి) పెరీరా (బి) మాథ్యూస్‌ 18, రోహిత్‌ శర్మ (సి) తరంగ (బి) దమ్మిక ప్రసాద్‌ 26, స్టువర్ట్‌ బిన్ని (ఎల్‌బి) దమ్మిక ప్రసాద్‌ 0, నమన్‌ ఓజా (సి) తరంగ (బి) తారిండు కౌశల్‌ 21, అశ్విన్‌ (సి) పెరీరా (బి) దమ్మిక ప్రసాద్‌ 5, అమిత్‌ మిశ్రా (స్టంప్డ్) పెరీరా (బి) రంగన హెరాత్‌ 59, ఇషాంత్‌ శర్మ (బి) హెరాత్ 6, ఉమేష్ యాదవ్ (బి) హెరాత్
ఎక్స్ ట్రాలు : 13, మొత్తం : (100.1 ఓవర్లలో 11 వికెట్ల నష్టానికి) 312.
వికెట్ల పతనం: 1-2, 2-14, 3-64, 4-119, 5-119, 6-173, 7-180, 8-284. 9/298, 312/10
బౌలింగ్‌ : దమ్మిక ప్రసాద్‌ 26 -4-100-4, నువాన్‌ ప్రదీప్‌ 22-6-52-1, ఎంజెలో మాథ్యూస్‌ 13-6-24-1, రంగన హెరాత్‌ 27.1-3-84, తారిండు కౌశల్‌ 12-2-45-1.

భారత్ 312..

కొలంబో : శ్రీలకంతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ 312 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

బేగంబజార్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్..

హైదరాబాద్ : బేగంబజార్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు రట్టు చేశారు. వ్యాపారి అశ్విన్ కుమార్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జగదల్ పూర్ పట్టుబడిన మావోయిస్టులు...

ఛత్తీస్ గఢ్ : జగదల్ పూర్ లో ముగ్గురు మావోయిస్టులు పట్టుబడ్డారు. 9 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

09:54 - August 30, 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని హామీనిస్తోంది. మీ ఇంటికి నల్లా నీరు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని స్వయాన సీఎం కేసీఆర్ వెల్లడిస్తున్నారు. ఈ బృహత్తర్ పథకాన్ని ఆరంభించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే వాటర్ గ్రిడ్ పథకం ఏవిధంగా ఉంది ? దాని ప్రణాళిక ఏలా ఉంది ? ఈ పథకం ప్రజలు ఆశించిన ప్రయోజనాలు అందిస్తుందా ? ఈ అంశాలపై టెన్ టివి నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొని, విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.

అస్సాంలో వర్షాలు..

అస్సాం : రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కజ్రింగలోని జాతీయ పార్కులో భారీగా నీరు నిలిచిపోయింది. 

బాబు నివాసంలో నేడు టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో టిడిపి నేతలు సమావేశం కానున్నారు. ఉదయం 11.30గంటలకు జరిగే ఈ సమావేశంలో పలువురు మంత్రులు, చీప్ విప్ లు పాల్గొననున్నారు. 

ఎల్పీజీ కనెక్షన్లను ప్రారంభించనున్న మోడీ..

ఢిల్లీ : నేడు సహజ్ ఆన్ లైన్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 

'స్వాభిమాన్' ర్యాలీకి ఏర్పాట్లు..

బీహార్ : బీహార్ సీఎం నితీష్ కుమార్ మరియు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వలో జరిగే మహాఘట్బంధన్ 'స్వాభిమాన్' ర్యాలీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొనున్నారు. 

08:16 - August 30, 2015

మహబూబ్ నగర్ : చింతలకుంట.. పాలమూరు జిల్లాలోని ఈ గ్రామం.. మొన్నటి వరకూ ఎవ్వరికీ తెలిసేది కాదు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే ఆ గ్రామం.. ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. కారణం.. 'శ్రీమంతుడు'. అవును... ప్రిన్స్ మహేశ్‌బాబు ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తమ చింతలన్నీ తీరినట్లేనని చింతలకుంట ప్రజలు ఆనందంతో ఉన్నారు. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా శ్రీమంతుడని పిలిపించుకుంటున్న హీరో మహేష్ బాబు. మహబూబ్‌నగర్‌ జిల్లా చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పిలుపుతో స్పందించిన ప్రిన్స్.. అభివృద్ధి చేసేందుకు చింతలకుంటను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.

గద్వాలకు 45 కి.మీల దూరం..
మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలోని ఓ మారుమూల గ్రామం చింతలకుంట. కర్ణాటకలోని రాయచూరుకు 25 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని గద్వాలకు 45 కిలోమీటర్ల దూరం ఈ గ్రామం ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. మహేష్‌ బాబు దత్తత తీసుకోనున్న ఈ గ్రామంలో అడుగడుగునా సమస్యలే. కనీస సదుపాయాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.

బిందె నీటికోసం 3.కి.మీల నడక..
గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ తాగునీటి పథకం లేదు. ఉన్న ఒక్క బావి సుమారు 15 ఏళ్ల క్రితమే పాడుపడింది. దీంతో సమీపంలోని పంట పొలాల్లో ప్రవహించే నీటిపైనే వీరు ఆధారపడుతున్నారు. కలుషిత నీటిని తాగడం వల్ల తరచూ.. రకరకాల వ్యాధులతో రాయచూర్‌కు వెళ్తున్నారు. బిందె నీటి కోసం మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. గ్రామంలో సామాజిక భవనం, రచ్చబండలు లేవు. వీటిపై గత ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తించాయని స్థానికులంటున్నారు.

గ్రామంలో అత్యల్ప అక్షరాస్యత..
ఇక ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రెయిన్‌ వ్యవస్థలను అసంపూర్తిగా వదిలేశారు. అప్పట్లో చేపట్టిన రోడ్డు రూపురేఖలుమారాయి. అత్యంత కరువు ప్రాంతమైన గట్టులో వర్షపాతం నమోదు సైతం దేశంలోనే అత్యల్పం. గట్టు మండలంలో ఎటుచూసినా ఎడారిని తలపించే విధంగా ఉంటుంది. దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం కూడా గట్టు మండలంలోనే నమోదవుతుంది. అయితే తమ గ్రామాన్ని హీరో మహేశ్‌బాబు దత్తత తీసుకున్నాడనే వార్త.. ఇక్కడి ప్రజల్లో జీవం నింపింది. అత్యంత వెనకబడిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న మహేష్... నిజమైన శ్రీమంతుడంటూ స్థానికులు ఆకాశానికెత్తేస్తున్నారు. మహేష్ దత్తత స్వీకారంతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని.. తమ ఊరిపేరులోని చింతలు తీరుతాయని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

ఏ మంత్రులను కలవం - హర్దిక్ పటేల్..

ఢిల్లీ : తాము ఏ మంత్రితో కూడా సమావేశం కాబోమని హర్దిక్ పటేల్ పేర్కొన్నారు. ఓబీసీలో పటేళ్లకు రిజర్వేషన్లు కోరుతూ హర్దిక్ పటేల్ పోరాటం సాగిస్తున్న సంగి తెలిసిందే. ఆదివారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకి కూడా స్వాగతం లేదని హర్దిక్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రానికి తమ ఉద్యమం చేరుకోవాలని, అందులో భాగంగా వ్యూహ రచన కోసం ఢిల్లీకి వచ్చినట్లు ఆయన తెలిపారు. 

ముగిసిన మారథాన్ పోటీలు..

హైదరాబాద్ : ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ పోటీలు ముగిశాయి. ఈ మారథాన్ లో కెన్యా యువకులు విజయం సాధించారు. 2కే, 5కే, 10కే, హాఫ్ మారథాన్, పుల్ మారథాన్ విభాగాల్లో పరుగు నిర్వహించారు. 

అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : శనివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హిమాయత్ నగర్, నల్లకుంట, బర్కత్ పురా, చాదర్ ఘాట్, పురానాపూల్, మూసారాంబాగ్, సికింద్రాబాద్, పికెట్ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 

నేడు మీడియాతో మాట్లాడనున్న హార్ధిక్ పటేల్..

ఢిల్లీ : ఓబీసీలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటేల్ ఢిల్లీకీ చేరుకున్నారు. నేడు మధ్యాహ్నాం 12గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. 

నేడు వైసీఎల్సీ సమావేశం..

హైదరాబాద్ : నేడు లోటస్‌పాండ్‌లో వైసీఎల్పీ సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఆయన చర్చించనునున్నట్లు తెలుస్తోంది. 

బస్సు దగ్ధం ప్రాంతానికి వెళ్లిన పరిటాల సునీత..

అనంతపురం : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు గార్లదిన్నె మండలం తిమ్మంపేట దగ్ధమైందన్న విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నారు.

07:34 - August 30, 2015

హైదరాబాద్ : నిన్నటి దాకా పదవులు అనుభవించారు. ఇక ఆస్తుల సంపాదనపై దృష్టిపెట్టారు. కేవలం ఆస్తుల కోసమే గులాబీ గూటికి చేరారు. డీఎస్‌పై తాజాగా టీకాంగ్రెస్ చేస్తున్న కామెంట్లు ఇవి. ఇప్పటికే పార్టీ మారినందుకు గుర్రుగా ఉన్న నేతలు....తాజాగా కాంగ్రెస్‌పై డీఎస్‌ ఆరోపణలు చేయటంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో చేసిన డీఎస్‌ తప్పులను, అవినీతి-అక్రమాలను వేలెత్తి చూపిస్తున్నారు. డీఎస్‌....టీఆర్‌ఎస్‌లో చేరినందుకు... ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు రగిలిపోతున్నారు. అన్ని పదవులు అనుభవించి...ఇపుడు పార్టీని ఒంటరి చేసి వెళ్తారా...అంటూ మండిపడుతున్నారు. ఐతే తాజాగా కాంగ్రెస్‌పై డీఎస్‌ చేసిన కామెంట్లతో....హస్తం నేతలు మరింత ఉడికిపోతున్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ....ఆయన కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేశారు.

డీఎస్‌ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం..
కాంగ్రెస్ తనకేమీ ఇవ్వలేదని డీఎస్‌ అన్నారు. తానే కాంగ్రెస్‌కు ఎంతో చేసినట్లు చెప్పుకొచ్చారు. నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతల చరిత్రంతా బటయపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై హస్తం నేతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని ఎంపీ వీహెచ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ఏమీ సంపాదించుకోలేదంటూ.... ఇప్పుడు సంపాదించుకోవటానికే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లావా...అంటూ నిప్పులు చెరిగారు.

నిజామాబాద్‌కు ఏమీ ఒరగలేదని విమర్శలు..
డీఎస్‌ తీరుపై ఆయన సొంత జిల్లానేతలే మండిపడుతున్నారు. డి.శ్రీనివాస్‌కు రాజకీయ జీవితాన్నిచ్చింది...కాంగ్రెస్సేనని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఎనిమిది సార్లు టికెటిస్తే....కేవలం మూడు సార్లే గెలిచారని ఎద్దేవా చేశారు. ఆయన పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా, ఆయన కుమారుడు మేయర్‌గా చేసినా....నిజామాబాద్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శిస్తున్నారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు...బీఫామ్‌లకు వసూలు చేసిన డబ్బు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత డీఎస్‌ పార్టీ మారినపుడు కాంగ్రెస్‌ నెమ్మదిగా స్పందించింది. కాని ఇపుడు డీఎస్‌...ఏకంగా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేయటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ మాత్రం ఊరుకునేది లేదని...ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు.

07:30 - August 30, 2015

హైదరబాద్ : ఇక సమరమే అంటోంది టీ కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధమైంది.. ఊరూవాడా నిరసనలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు... త్వరలో ఊరూరా ఉద్యమానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ముప్పేట దాడిచేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ... ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది... ధర్నాలు, ఆందోళనలో సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు.

పీసీసీ కో ఆర్డినేషన్ భేటీ..
గాంధీభవన్లో జరిగిన పీసీసీ కో ఆర్డినేషన్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీ కాంగ్ నేతలు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. చీప్ లిక్కర్‌పై సమరభేరి మోగించాలని డిసైడయ్యారు.. గ్రామాలనుంచి రాష్ట్రస్థాయివరకూ ఆందోళనలు చేపట్టాలని భేటీలో తీర్మానించారు.. అటు సాగునీటి ప్రాజెక్టులపై కూడా కేసీఆర్ సర్కారుపై యుద్ధానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ.. డిజైన్ మార్పుల వెనక పెద్ద తతంగం ఉందని ఇప్పటికే ఆరోపించిన నేతలు... ఈ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయాలని నేతలు భావిస్తున్నారు.

అన్ని అస్త్రాలు రెడీ..
అటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలని హస్తం నేతలు నిర్ణయించారు.. ప్రజల పక్షాన జనంతో కలిసి ఆందోళనలు చేపట్టాలని చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న టీకాంగ్ నేతలు... కేసీఆర్ సర్కారుపై దాడికి... అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా... ఉద్యమ వ్యూహంపైనే వీటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. 

07:28 - August 30, 2015

విజయవాడ : తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకుల్లో సీఎం చంద్రబాబు పాల్గొని తెలుగు భాషను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు వివరించారు. తెలుగు భాషను కాపాడుకుంటే మన ఉనికిని కాపాడుకున్నట్టు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగుభాష దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

రెండో భాషగా తెలుగు..
ఈ సందర్భంగా పాఠశాల దశ నుంచి పదోతరగతి వరకు తెలుగు బాషను రెండో భాషగా చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంటర్‌ వరకు రెండో భాషగా తెలుగే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతే కాకుండా తెలుగు ఉర్దూ భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెడతామని, అందుకు పల్లె రఘునాధరెడ్డిని ప్రత్యేక మంత్రిగా నియమించామని చంద్రబాబు చెప్పారు. ఇకపై ప్రభుత్వ వ్యవహారాలన్ని సాధ్యమైనంత వరకు తెలుగులోనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు తేజాలకు సన్మానం..
తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మాణం చేపడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. కూచిపూడి నాట్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పొట్లూరి హరికృష్ణను నామినేట్‌ చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తేజాలైన పలువురు ప్రముఖులతో పాటు ఏపీ క్రీడాకారులకు సీఎం చేతుల మీదుగా సన్మానం జరిగింది. 

07:23 - August 30, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళయింది. అధికార, ప్రతిపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎలాగైన ఇరుకునపెట్టాలని వైసీపీ... ధీటుగా తప్పికొట్టాలని టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో ఈసారి సమావేశాలు హాట్‌హాట్‌ కానున్నాయి. ఆగష్టు 31 నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో హాట్ హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రతిపక్షం వైసీపీ... ఇటు అధికారపక్షం టిడిపి, బిజెపిలు సై అంటే సై అంటూ సమావేశాలకు రెడీ అవుతున్నాయి.

మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం..
ప్రత్యేకహోదా, రాజధాని భూసేకరణ, పుష్కరాల తొక్కిసలాట..రైతు రుణమాఫీ అమలు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతుల అవస్థలు తదితర అంశాలు సర్కారును కలవరపెడుతున్నాయి. దీనిపై విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ప్రతిపక్షం ప్రధానంగా లేవనెత్తే అంశాలు.. ఏ టాపిక్‌పై ఎవరు స్పందించాలి? ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న దానిపై చంద్రబాబు మంత్రులకు పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ హామీల అమలుపై జగన్ గళం..
ఇటు వైసీపీ కూడా టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న అనేక సమస్యలు ఈ పార్టీకి ఆయుధంగా మారనున్నాయి. ప్రభుత్వ హామీల అమలుపై సర్కారును నిలదీయాలని జగన్‌ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ సమస్యలపై ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడిపెంచాలని జగన్‌ ఇప్పటికే ఆపార్టీ నేతలు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.

అధికారులతో ఏపీ సీఎస్ కృష్ణారావు భేటీ..
మ‌రోవైపు సీఎస్‌ కృష్ణారావు కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. అలాగే అధికారులంతా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమై ఉండాలని ఆదేశించారు. మొత్తానికి ఐదు రోజులపాటు జరగబోయే ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను అధికార, ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకున్నాయి. 

07:19 - August 30, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం కోట్ల గొంతులు నినదించాయి. హోదా ఆంధ్రుల హక్కంటూ హోరెత్తించాయి. ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని గర్జించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతకు నిరసనగా వైసీపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. ప్రజలు స్వచ్చందంగా బంద్‌ పాటించారు. ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రజాప్రతినిధులు, వామపక్షాల నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తలు మినహా బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

భగ్గుమన్న రాష్ట్ర ప్రజలు..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నరేంద్ర మోదీ సర్కారు మీనమేషాలు లెక్కించడం, తెలుగుదేశం ఉదాసీనంగా వ్యవహరించడంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. వామపక్షాలు కూడా మద్దతివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు ప్రజలు స్వచ్చందంగా మద్దతిచ్చారు. అయితే పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు బంద్‌లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలందరూ అరెస్టయ్యారు.

విజయవాడలో..
విజయవాడలో బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఎం పార్టీ కార్యాలయంలో ఉన్నవారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశంలో...
ప్రకాశం జిల్లాలో వైసీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు భారీర్యాలీలు చేపట్టారు. కొన్ని చోట్ల వ్యాపార, వ్యాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలోని 8 డిపోలలోని బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

రాజమండ్రిలో..
ప్రత్యేక హోదా బంద్‌ రాజమండ్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. తమ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ప్రకాశ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కర్నూలులో..
కర్నూలులో కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. కబడ్డి ఆడుతూ సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. బంద్‌ కారణంగా జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోలలోని 970 బస్సులు నిలిచిపోయాయి.

ప.గోదావరిలో..
పశ్చిమగోదారి జిల్లాలోనూ బంద్‌ ఉధృతంగా సాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

తిరుపతిలో ..
తిరుపతిలో వైసీపీ, వామపక్షాల బంద్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంతపురంలో..
అనంతపురంలో బంద్ ఉధృతమవుతోంది. వైసీపీ ప్రకటించిన బంద్‌కు వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. నగర రహదారులపై సీపీఐ, సీపీఎం, వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో నగరంలోనూ పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించారు.

గుంటూరులో..
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలతో గుంటూరు హోరెత్తింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విశాఖలో..
వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ నగరంలో భారీ ర్యాలీ జరిగింది. అయితే పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపట్ల ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరంలో..
విజయనగరంలో బంద్ కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వామపక్ష నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళన ఉధృతమవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, పీఎస్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు తెల్లవారుజామునే పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నాకు దిగారు.
మొత్తానికి అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రత్యేక హోదా బంద్‌ ప్రశాంతంగా సాగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని వైసీపీ, వామపక్షాల నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు కూడా హోదా కోసం గట్టిగా ప్రయత్నించాలని సూచించారు.

07:12 - August 30, 2015

శ్రీకాకుళం: సోంపేట ప్రజల పంతం నెగ్గింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా వీరు సాగిస్తున్న దీక్షలు ఇన్నాళ్లకు ఫలించాయి. సోంపేట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం భూసేకరణకు ఉద్దేశించిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌ నిర్ణయంపై సోంపేట, పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడి భూములను మరో ప్రైవేటు సంస్థకు అప్పజెప్పాలని చూస్తే.. ఉద్యమానికి దిగుతామని సీపీఎం రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఆరేళ్లుగా పోరాటం..
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరేళ్లు.. కచ్చితంగా చెప్పాలంటే రెండు వేల తొంభై రోజులు..! శ్రీకాకుళం జిల్లా సోంపేట, దాని పరిసర గ్రామాల ప్రజలు అలుపెరుగకుండా.. అడుగడుగునా నిర్బంధాలను అధిగమిస్తూ సాగించిన దీక్షలతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సోంపేట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఉద్దేశించిన జీవోను రద్దు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సోంపేట మండలం బీల గ్రామంలో రెండున్నర వేల మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2008లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం సంకల్పించింది. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ సంస్థకు ప్లాంట్‌ నిర్మాణ బాధ్యతలతో పాటు.. 973 ఎకరాల భూములను అప్పగించింది. మరో 1500 వందల ఎకరాలను రైతులనుంచి సేకరించేందుకు అనుమతినిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. ఈ పవర్‌ ప్లాంట్‌ వల్ల 32 వేల ఎకరాల్లో కొబ్బరితోటలు నాశనం అవుతాయని, 36 గ్రామాలకు చెందిన సుమారు 40వేల మంది నిర్వాసితులవుతారని, ఆరేడువేల మంది ఉపాధిని కోల్పోతారని, ప్లాంట్‌ పరిసరాల్లోని 70 కిలోమీటర్ల పరిధిలోని పంటపొలాలు నాశనం అవుతాయన్న ఆందోళనతో స్థానికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 2010 జూలై 14న నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమాయక గిరిజనులు మరణించారు.

జీవో రద్దు చేస్తామని టీడీపీ హామీ..
సర్కారు తీరుకు నిరసనగా గడచిన రెండు వేల 94 రోజులుగా ఆందోళనకారులు దీక్షలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో జీవో 1107ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఆలశ్యంగానే అయినా ఇన్నాళ్లకు హామీని అమలు చేసింది. ఇప్పటికే సేకరించిన భూముల్లో మల్టీ ప్రాడక్టు ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అయితే మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తామని సీపీఎం హెచ్చరించింది. దాదాపు ఆరేళ్లుగా సాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో.. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ఉద్యమకారులకు ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించాక దీక్ష విరమణపై నిర్ణయం తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. 

07:05 - August 30, 2015

అనంతపురం : జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు దగ్ధమైంది. అర్థరాత్రి గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద జాతీయ రహదారిపై పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓల్వా బస్సులో అకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపాడు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో రోడ్డుపై సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి.

నేడు ఆలిండియా జ్యుడిషియల్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం..

హైదరాబాద్ : నేడు ఆలిండియా జ్యుడిషియల్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోంస్లే హాజరు కానున్నారు

ఏపీ అసెంబ్లీ సమావేశాల భద్రతపై నేడు సమావేశం..

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల భద్రతపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతనలో సమావేశం జరుగనుంది 

నేటి అర్థరాత్రి నుండి ఏపీలో పెట్రోల్ బంక్ ల బంద్..

హైదరాబాద్ : నేటి అర్థరాత్రి నుండి ఏపీలో పెట్రోల్ బంక్ లు బంద్ కానున్నాయి. పెంచిన వ్యాట్ తగ్గించాలని కోరుతూ ఈ బంద్ జరుగనుంది.

తిరుపతి - హైదరాబాద్ ప్రత్యేక రైలు ప్రారంభం..

హైదరాబాద్ : నేడు తిరుపతి - హైదరాబాద్ ల మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. తిరుపతిలో మధ్యాహ్నాం 1.45గంటల కు రైలు ప్రారంభంకానుంది. 

గుంటూరు సర్కారీ ఆసుపత్రిని సందర్శించనున్న వైసీపీ బృందం..

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిని వైసీపీ బృందం సందర్శించనుంది. ఎలుక దాడిలో చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని వైసీపీ బృందం పరామర్శించనుంది. 

ఆదిలాబాద్ లో నేడు కాంగ్రెస్ ధర్నా...

ఆదిలాబాద్ : నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నిర్వహించే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పాల్గొనున్నారు.

 

నెల్లూరులో నేడు వెంకయ్య పర్యటన..

నెల్లూరు : నేడు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. పది వేల మంది మహిళలకు జీవన సురక్ష బీమాను వెంకయ్య అందించనున్నారు. 

Don't Miss