Activities calendar

31 August 2015

సీఐడీ ఐజీగా సౌమ్యా మిశ్రా

హైదరాబాద్: నేర విచారణ విభాగం (సీఐడీ) ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా డాక్టర్ సౌమ్యామిశ్రా (ఐపీఎస్) నియమితులయ్యారు. అదే విధంగా ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పరిపాలన డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న కల్పనా నాయక్, ఐపీఎస్‌ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ) జాయింట్ డెరైక్టర్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

21:39 - August 31, 2015

హైదరాబాద్ : అందాలతార జేజేమ్మ.. బోండాం సైజులో హల్‌చల్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సైజ్ జీరో టీజర్ విడుదలైంది. దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సైజ్‌ జీరో ఆడియోను వచ్చేనెల 6న విడుదల చేస్తుండగా.. సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క షాకింగ్‌ లుక్‌ పోస్టర్లతో ఈ చిత్రంపై ఆసక్తి, అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 

21:35 - August 31, 2015

హైదరాబాద్ : హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ మెహరిషి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా కేంద్రం మరో రెండేళ్లపాటు ఆయన పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎల్సీ గోయల్ వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

21:34 - August 31, 2015

హైదరాబాద్ : మనదేశంలో ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్‌ సిఫార్సు చేసింది. ఐతే తీవ్రవాదం లాంటి నేరాలకు ఇందులో మినహాయింపు ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని తెలిపింది. ముగ్గురు సభ్యులతో కూడిన లా కమిషన్‌ ఈ మేరకు రిపోర్టును ప్రభుత్వానికి పంపింది.

21:31 - August 31, 2015

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ప్రజలను కోరారు. ప్రత్యేక హోదాపై కసరత్తు జరుగుతోందని...ఎట్టపరిస్థితుల్లోనూ ఏపీకి కేంద్రం అన్యాయం చేయదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

21:29 - August 31, 2015

హైదరాబాద్: ఎనీటైమ్‌... ఎనీ సెంటర్‌... సై అంటే సై. అసెంబ్లీ లోపలైనా... మీడియా పాయింటైనా... డోంట్ కేర్‌. ఎక్కడైనా డిష్యూం డిష్యూమే. ఏపీలో అధికార, విపక్ష నేతల తీరిది. తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునే... మీడియా చిట్‌చాట్‌లోనూ లీడర్లిద్దరూ చిటపటలేస్తున్నారు. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.

ఇద్దరూ ఇద్దరే......

ఒకాయనేమో సభా నాయకుడు... మరొకాయనేమో ప్రతిపక్ష నాయకుడు...ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు బద్ధశత్రువులు. ఒకరు సై అంటే మరొకరు నై అంటారు. కళ్లు మూసినా కళ్లు తెర్చినా ఢీ అంటే ఢీ అంటూనే ఉంటారు. అసెంబ్లీ లోపలైనా..! బయటైనా..! ఒక్కటే. నీళ్లు, నిప్పుగా ఉండే... చంద్రబాబు, జగన్‌ బాబులు చిట్‌చాట్‌లోనూ చిటపటలాడుతున్నారు. ఒకరిపై ఒకరు ఒంటికాలుతో లేస్తున్నారు.

మీడియాతో జరిగిన మాటముచ్చట్లలో...

మీడియాతో జరిగిన మాటముచ్చట్లలో... అసెంబ్లీ కౌరవ సభలా మారిందని... ప్రతిపక్ష నేత జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రం విడిపోకుండా ఉండటానికి పోరాడింది... వైసీపీ మాత్రమేనని గర్వంగా చెప్పగలమన్నారు జగన్‌. ప్రత్యేకహోదాకు బాబు అనుకూలమైతే... తక్షణమే తీర్మానం చేసి, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని ఆయన సవాల్‌ విసిరారు. అసలు హోదాపై సీఎం స్టేట్‌మెంట్‌ ప్రతుల్లో ఉన్నదొకటైతే.. బాబు మాట్లాడింది ఇంకొకటని ప్రతిపక్షనేత విమర్శించారు. ఆ విషయం నిరూపించడానికి తాను సిద్ధమని.. నిరూపిస్తే బాబు రాజీనామా చేస్తారా అని జగన్‌ ప్రశ్నించారు.

మరోవైపు ముఖ్యమంత్రి సైతం అదేస్థాయిలో రియాక్ట్ .......

మరోవైపు ముఖ్యమంత్రి సైతం అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. జగన్‌కు ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. గీతదాటితే సహించేది లేదన్నారు. లైన్ క్రాస్ అయితే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే పుష్కర విషాదంపై చంద్రబాబు స్పందించారు. శవరాజకీయాలు చేయడం తగదన్నారు. వీఐపీ ఘాట్‌లో కంచి పీఠాధిపతి ఉన్నందునే... పక్క కోటిలింగాల రేవుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా వీఐపీ ఘాట్‌లో ఎందుకు స్నానం చేయలేదో చెప్పాలంటూ జగన్‌ను ప్రశ్నించారు.మొత్తానికి అటు చంద్రబాబు, ఇటు జగన్‌ బాబులు కత్తులతోనే కవాతు చేస్తున్నారు. ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. 

తీర్మానం చేస్తే బిజెపి మద్దతు ఉంటుంది: కామినేని

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చేయాలనుకుంటున్న తీర్మానం కేంద్రానికి వ్యతిరేకం కాదని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ,... ప్రత్యేకహోదాపై తీర్మానానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడితే అంతా నిశ్శబ్దంగా ఉండాలని, ముఖ్యమంత్రికి కూడా మాట్లాడే అర్హత లేదన్నట్టు జగన్ తీరు ఉందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అనుకున్నట్టు ఆడడానికి అసెంబ్లీ తోలుబొమ్మలాట కాదని మంత్రి కామినేని స్పష్టం చేశారు.  

మణిపూర్ లో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు

హైదరాబాద్ : మణిపూర్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ వివాదంపై ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఆ రాష్ట్ర హోంమంత్రి నివాసానికి నిప్పుపెట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకూ ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటన చురాచంద్‌పూర్ జిల్లాలో జరిగింది. మణిపూర్ అసెంబ్లీలో ఈ వివాదాస్పద బిల్లులు ఆమోదం పొందాయి. దీన్ని నిరసిస్తూ మూడు గిరిజన విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బంద్‌కు పిలుపిచ్చాయి. 

20:53 - August 31, 2015

హైదరాబాద్ : పేరుకే మనది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. కానీ జరుగుతున్న ఘటనలు చూస్తే ప్రజాసామ్యం అన్న మాట నేతి బీరయకాయ చందంగా మారింది. స్వేచ్ఛగా ఆలోచించే వారు హేతుబద్ధంగా తర్కించే వారు, లౌకిక సూత్రాలను పాటించేవారు వరుసగా ఒక్కొక్కరు తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ప్రముఖ హేతువాది నరేంద్రధబోల్కర్ హత్యను ప్రజలు ఇంకా జీర్ణించుకోలేనే లేదు. ప్రఖ్యాత నాస్తికవాద నాయకుడు గోవింద పన్సారే హత్యను ఎవరూ మర్చిపోనే లేదు. ఇంతలోనే కర్ణాటకలోని మరో సాహితీ శిఖరం ఎంఎం కలబుర్గి ఉన్మాద కత్తులకు బలై నేలకొరిగింది. ఏమిటా విధ్వంసం, ఏమిటా ఆ నిరంకుశత్వ పైశాచికత్వం. తలచుకుంటనే లౌకిక వాద ప్రేమికులకు నరాల్లో భయ విస్పోటనం కలుగుతోంది. దేశంలో పెరిగిపోతున్న మతమౌఢ్య శక్తులపై ప్రత్యేక కథనం ఈ రోజు వైడాంగిల్ లో చర్చించారు. మరి మీరు కూడా వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:10 - August 31, 2015

హైదరాబాద్ : ఆరోపణలు, ప్రత్యారోపణలు... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అట్టుడికింది. ప్రత్యేక హోదా, పుష్కర వివాదంపై... టీడీపీ, వైసీపీ మధ్య సభా సమరమే జరిగింది. మాటల తూటాలతో వైసీపీ అస్త్రాలు సంధిస్తే... అధికార పక్షం సైతం ధీటుగా సమాధానం చెప్పింది.

. తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు....

తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కించాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా, పుష్కర విషాదంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ వైసీపీ పట్టుబట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలని... ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్ చేశారు. టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటకు వస్తేనే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అనవరసరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు.

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం.....

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం రేగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా... అపశృతి చోటుచేసుకుందని చంద్రబాబు ప్రకటించారు. పుష్కరాల మృతులకు ఏపీ సీఎం సంతాపం ప్రకటించారు. పుష్కరాల మృతులపై బాబు చేసిన ప్రసంగంపై జగన్‌ మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బాబు పబ్లిసిటీ కోసం చేసిన నిర్వాహకం వల్ల 29 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగన్‌ ప్రసంగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్....

అటు ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్ చేశారు. స్పీకర్‌ వారించినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రత్యేక హోదాపై మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెట్టి ఎందుకు వెనక్కి తీసుకున్నారో..? చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు.. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీలో వైసీపీ ఆందోళనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి యనమల. ప్రతిపక్షానికి సభ సజావుగా సాగడం ఇష్టంలేదని ఆరోపించారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు శాంతించలేదు.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.. దీంతో సభను మంగళవారానికి వాయిదావేశారు స్పీకర్.

20:06 - August 31, 2015

పశ్చిమగోదావరి: సైకో రెచ్చిపోతున్నాడు. ఇంజక్షన్ గుచ్చి ఆగడాలు సృష్టిస్తున్నాడు. సూదిగాడి వీరంగంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహిళలైతే రోడ్డు మీద ఒంటరిగా వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఎప్పుడు.. ఎక్కడ ఏం జరుగుతుందోనని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరంజిలతో గుచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకోను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అతని కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. కాగా.. నిన్న మొగల్తూరు, ఈరోజు భీమవరంలో జరిగిన ఘటనలు వాస్తవాలు కాదని ఎస్పీ తెలిపారు.

 

20:03 - August 31, 2015

హైదరాబాద్ : తమ బతుకులను కబళించే కుట్రపై... కార్మిక లోకం కన్నెర్ర జేసింది. ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించేందుకు కార్మిక వర్గం ఏకమవుతోంది. కార్మిక చట్టాలకు తూట్లుపొడిచి... కార్పొరేట్‌ గద్దలకు ద్వారాలు తెరిచే కుట్రలపై పోరుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా కార్మికవర్గం కవాతు చేయబోతోంది. అసలు కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు. కార్మిక చట్టాలను సవరించేందుకు మోదీ సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తోంది. కార్మిక చట్టాల్ని ఎందుకు అమలు పరచడం లేదు? కుట్రల్ని పటా పంచలు చేస్తామని కార్మిక సంఘాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి? రెక్టేపిజానికి.. కార్మికులకు సంబంధం ఏమిటి? కార్మికుల సమ్మెకు వామపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయి. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు ఎందుకు పెద్ద పీట వేస్తోంది? ఈఅంశాలపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నేత నాగేశ్వరరావు ,మజ్దూర్ యూనియన్ నుండి అశ్వద్ధామ రెడ్డి, బిజెపి ప్రకాష్ రెడ్డి, సిఐటియు నేత సాయిబాబు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏపీలో అంగన్ వాడీ పోస్టుల భర్తీ త్వరలో..

హైదరాబాద్ : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 31న 60 సంవత్సరాలు దాటిన 658 మంది వర్కర్లు, 2540 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ శారద తెలిపారు.

ఉరి శిక్షను రద్దు చేయాలని కోరిన లా కమిషన్

హైదరాబాద్ : ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే, యుద్ధ నేరాలు, ఉగ్రవాదం కేసుల్లోని దోషులకు మాత్రం ఉరిశిక్ష విధించవచ్చని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికపై లా కమిషన్ లోని ముగ్గురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా... మరో ఆరుగురు మాత్రం మద్దతు తెలిపారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి మరణశిక్షపై పార్లమెంటులో చర్చ జరగాలని... ఈ కేసులకు సంబంధించి ఉరిశిక్ష రద్దుకు సిఫారసు చేయబోమని లా కమిషన్ స్పష్టం చేసింది. 

సీఎం కేసీఆర్ ఫైర్ అయిన దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. మోసం, దగా, వంచన, మాట, మూట, వేట.. ఇవి సీఎం కేసీఆర్ విధానాలు అని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పటమే కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు ఉన్నా ఓపికతో ఉన్నారన్నారు. తిరగబడే స్వభావం తెలంగాణ సమాజానిదని.. ఆ విషయం సీఎం కేసీఆర్ మరువరాదని దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా సూచించారు.

ఉక్రెయిన్ పార్లమెంటు వద్ద బాంబు దాడి

హైదాబాద్ : ఉక్రెయిన్ పార్లమెంట్ ఎదుట బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసులు, జర్నలిస్టులు సహా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వేర్పాటువాద ప్రాంతాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం పట్ల పార్లమెంటు వద్ద పలువురు ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది.

తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్ : పెట్రోల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్ లీటర్‌కు రెండు రూపాయలు, డీజిల్ లీటర్‌కు అర్ధరూపాయి తగ్గింది. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

18:45 - August 31, 2015

హైదరాబాద్ : పద్మాలయా శాఖమూరి మల్లికార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్‌గా జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్‌, గోవర్షిణి ఫిలింస్‌ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఒక చిత్రమ్‌'. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు బై ఎ' సర్టిఫికెట్‌ను పొందిందీ చిత్రం. ఈ సందర్భంగా దర్శక,నిర్మాత జె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ,'ఎటువంటి అసభ్యత, అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ప్రేమ కథా చిత్రాన్ని తీశారని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. దీంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. ఓ వైవిధ్యమైన పాయింట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 11వ తేదీన భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్నీ అంశాలున్న ఈ చిత్రం హీరో శివకు మంచి బ్రేక్‌ నిస్తుంది. ట్రెండ్‌కి అనుగుణంగా రూపొందిన ఈ చిత్రం నా తొలి చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌' మాదిరిగానే మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.

 

'తెలుగు రాష్ర్టాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం ఉండాలి'

హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి లారీ యజమానుల సంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. లారీ యజమానుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా, తెలుగు రాష్ర్టాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం ఉండాలని లారీ యాజమాన్య సంఘాలు కోరాయి.

ముగిసిన టిడిఎల్పి సమావేశం

హైదరాబాద్ : అసెంబ్లీలో నిర్వహించిన టిడిఎల్పి సమావేశం ముగిసింది. ఇసుక విధానంలోని లోటుపాట్లను ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక విధానాన్ని సమీక్షిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

 

ఖమ్మం జిల్లా కలెక్టర్ గా లోకేష్ కుమార్

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కలెక్టర్ గా లోకేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. లోకేష్ కుమార్ అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు.

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ...

హైదరాబాద్ : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీల విధివిధానాలపై జీవో నెం.63ను ఈరోజు విడుదల చేసింది. బదిలీల ప్రక్రియకు ఆన్ లైన్ అవకాశం కల్పించింది. గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్స్, ఎస్ జీటీ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీలకు జిల్లా స్థాయి, జోన్ల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.  

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : నిర్మలా సీతారమన్

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చలేమన్నారు. ప్రత్యేకహోదాపై 14వ ఆర్థికసంఘం చేసిన సూచనలు విలువైనవని ఆమె తెలిపారు. కేంద్రమంత్రులు వెంకయ్య,సుజనాచౌదరిలతో కలిసి విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేస్తామని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్సే పెట్టి ఉంటే తమ పని సులువయ్యేదని ఆమె వెల్లడించారు. విభజన చట్టంలోని హామీల అమలు ఆలస్యం వాస్తవమేనన్నారు.

హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ జర్నలిస్టులకు శుభవార్త.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ జర్నలిస్టులకు శుభవార్త. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకారం తెలిపారని ఏపీ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తెలిపారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో సెప్టెంబర్‌ 15లోపు దరఖాస్తులు పంపాలని ఆయన సూచించారు. డెస్క్‌ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు మంత్రి అంగీకరించినట్లు తెలిసింది.

తెలంగాణ లో ఉపాధి హామీ పథకం పనిదినాల పెంపు...

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధి హామీ పథకం పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ పథకం ద్వారా సాధారణంగా ప్రతి కుటుంబానికి గరిష్టంగా వంద రోజుల పాటు పనులు కల్పిస్తారు. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది కరవు పరిస్థితులు నెలకొనడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల సంఖ్యను 150 రోజులకు పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు అవసరమైన పనులను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

18:20 - August 31, 2015

భిన్న నేపథ్యాలతో రూపొందిన 'మసాన్‌', 'ధనక్‌', 'బ్లాక్‌ హార్స్‌ మెమరీస్‌' చిత్రాలు 20వ బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ఒకే నిర్మాణ సంస్థ దృశ్యం ఫిలిమ్స్‌ ఈ మూడు చిత్రాల్ని నిర్మించడం విశేషం. నీరజ్‌ గవాన్‌ దర్శకత్వంలో 'మసాన్‌', నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో 'ధనక్‌', శ్యామ్‌రామ్‌ అలీది దర్శకత్వంలో 'బ్లాక్‌ హార్స్‌ మెమరీస్‌' చిత్రాలు రూపొందాయి. ఈ సందర్భంగా దృశ్యం ఫిల్మ్స్ సీఈఓ శైలాధిత్య బోరా మాట్లాడుతూ.. 'ఈ మూడు చిత్రాలు ఇప్పటికే 'సన్‌డాన్స్‌, బెర్లీన్‌, కేన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డుల్ని పొందాయి. తాజాగా బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో సైతం ప్రదర్శనకు అర్హతను సంపాదించడం గర్వంగా ఉంది. ఆసియన్‌ సినియాల అభివృద్ధికి బుసాన్‌ చలన చిత్రోత్సవం చేస్తున్న కృషి అభినందనీయం. ఈ ఫెస్టివల్‌ కాంపిటీషన్‌ సెక్షన్‌లో 'బ్లాక్‌ హార్స్‌ మెమరీస్‌', 'ఎ విండో ఆన్‌ ఆసియన్‌ సినిమా' సెక్షన్‌లో 'మసాన్‌', 'వైడ్‌ యాంగిల్‌' సెక్షన్‌లో 'ధనక్‌' చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి' అని చెప్పారు.

 

18:11 - August 31, 2015

చెన్నై: దక్షిణాది సినీ పరిశ్రమలోని నటీనటుల ఆత్మీయ కలయిక శనివారం సాయంత్రం చెన్నై ఒలివ్‌ బీచ్‌లోని నీనారెడ్డి గెస్ట్‌హౌస్‌లో జరిగింది. 1980 నాటి నటీనటులంతా ఈ అరుదైన గెట్‌ టు గెదర్‌లో పాల్గొని సందడి చేశారు. చిరంజీవి, వెంకటేష్‌, ప్రభు, భానుచందర్‌, నరేష్‌, సుమన్‌, మోహన్‌లాల్‌, భాగ్యరాజా, సత్యరాజ్‌, జాకీషరాఫ్‌, జయసుధ, సుమలత, సుహాసిని, రాధ, రాధిక, శోభన, ఖుష్బూ, రమ్యకృష్ణ, రేవతి, రెహ్మాన్‌ తదితరులు పాల్గొని పార్టీ ఆద్యంతం హల్‌చల్‌ చేశారు. ఇందులో భాగంగా 'నాటికి, నేటికి ఎప్పటికీ మెగాస్టార్‌ మెగాస్టారే.. చిరంజీవి రాకింగ్‌..' అంటూ ఖుష్బూ ట్విట్‌ చేశారు. అంతేకాకుండా తొలి హీరో వెంకటేష్‌ తన జీవితంలో చాలా చాలా ప్రత్యేకమని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 2న అన్ని రాష్ట్రాల్లో సమ్మె ..

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న అన్ని రాష్ట్రాల్లో సమ్మె నిర్వహిస్తామని ఎఐటియుసి ప్రధాని కార్యదర్శి గురుదాస్ దాస్ గుప్తా చెప్పారు. అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. సమ్మెను వ్యతిరేకించవద్దని బీఎంఎస్ కు జాతీయ కార్మిక సంఘాల సూచన చేశాయి.  

17:54 - August 31, 2015

హైదరాబాద్ : ప్రత్యేక సందర్భాలలో అమ్మాయిలు రకరకాల బంగారు ఆభరణాలను ధరించటానికి ఇష్టపడుతుంటారు. బంగారం ధరలు అందరికీ అందుబాటులో లేని స్థితిలో వన్ గ్రాం గోల్డ్ ఆభరణాలు అతివలకు చేరువయ్యాయి. అలాంటి వన్ గ్రాం ఆభరణాలను మీ ముందుకు తెచ్చింది ఇవాళ్టి సొగసు.. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:52 - August 31, 2015

హైదరాబాద్: చాక్లెట్... ఈ మాట వినగానే నోరూరుతుంది.. ఆ రుచిని ఆస్వాదించటానికి ఇష్టపడని వారుండరు. నోట్లో వేసుకోగానే కరిగిపోతూ కమ్మనైన అనుభూతిని మిగులుస్తుంది. అందుకే చిన్నా పెద్దా ఎంతో ఇష్టంగా తీసుకునే పదార్థాల్లో చాక్లెట్ ది ప్రత్యేక స్థానం. అలాంటి చాక్లెట్ ను వ్యాపారానికి పునాదిగా చేసుకుంది ఒక మహిళ.. ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తికి ఆధునికతను జోడిస్తూ కస్టమర్ల అభిరుచికి ప్రాధాన్యతనిస్తే విజయం సాధ్యమే అని నిరూపించారు లక్ష్మి. మరి ఎందుకాలస్యం.. మీ ఆలోచనలకు పదును పెట్టండి.. అవకాశాలను అందుకోండి... అభిరుచికి, ఆసక్తికి మెరుగులు దిద్దండి. వ్యాపారంలోకి అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకొండి..

17:38 - August 31, 2015

హైదరాబాద్ : జగన్‌ గీత దాటనంతవరకు ఉపేక్షిస్తాం.. గీత దాటితే సహించేది లేదని బాబు హెచ్చరించారు. పుష్కరాల్లో తొలిరోజు జరిగిన ఘటన పొరబాటే కాని.. తప్పిదం కాదని ఆయన చెప్పుకొచ్చారు. తగిన సూచనలు చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో బాబు చిట్‌ చాట్‌ చేస్తూ ఆ రోజు కంచిపీఠాధిపతులు వీఐపీ ఘాట్‌లో చేయడం వల్లే.. తాను పక్క ఘాట్‌కెళ్లానని.. బాబు వివరణ ఇచ్చారు.

 

17:36 - August 31, 2015

గుంటూరు :జిల్లాలో నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో ఎమ్మార్వోతో పాటు నలుగురు వీఆర్‌వోలపై వేటుపడింది. ఈపూరు మండలం తహసీల్దార్ నాగోల్‌ తోసింగ్‌తో పాటు మరో నలుగురు వీఆర్‌వోలను సస్పెండ్‌ చేస్తూ....రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో దర్యాప్తు జరిపిన అధికారులు...వీరి ప్రమేయం ఉందని నిర్ధారించారు. దీంతో వారందరిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

17:35 - August 31, 2015

పశ్చిమగోదావరి : సూది సైకో వ్యవహారంలో గందరగోళం కొనసాగుతోంది. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలో రవికుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నమని పోలీసులు ప్రకటించగా.. మరోవైపు పెరవలి మార్కెట్‌లో పంపన జ్యోతి అనే యువతిపై సూది దాడి జరిగింది. 

17:33 - August 31, 2015

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ సౌతాఫ్రికా మహిళ కడుపులోంచి అరకిలో కొకైన్‌ను డాక్టర్లు వెలికి తీశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆ మహిళకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు 40 ప్యాకెట్లలో ఉన్న డ్రగ్స్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగానే ఉందని డాక్టర్లు తెలియచేశారు.

 

17:31 - August 31, 2015

హైదరాబాద్ : కేసు విచారణ ముగిసే వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మవద్దని హై కోర్టు అదేశాలు జారీ చేసింది. కోర్టుకు సమర్పించిన ఆస్తులు కాకుండా అనుబంధ సంస్థల అస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే గతంలో సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను హై కోర్టు ప్రశ్నించగా.. తాము అరెస్ట్ చేస్తే బాధితులు నష్టాపోతారని కోర్టుకు సిఐడీ తరుపు న్యాయవాది తెలిపారు. అగ్రిగోల్డ్ తన ఆస్తులను తమ వద్ద తాకట్టు పెట్టిందని ఆంధ్రాబ్యాంకు వివరణ ఇచ్చుకుంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది హై కోర్టు.

శ్రీలంక విజయలక్ష్యం 386 పరుగులు...

కొలంబో టెస్టు : రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆలౌట్ అయింది. 274 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. శ్రీలంక విజయలక్ష్యం 386 పరుగులుగా ఉంది. 

17:29 - August 31, 2015

హైదరాబాద్ : గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ను టీఎస్‌పీఎస్‌సీ రూపొందించింది. సిలబస్‌ను టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ ఛైర్మెన్‌ కోదండరాంతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్‌, చుక్కారామయ్య పాల్గొన్నారు. త్వరలోనే అగ్రికల్చర్‌, వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, హెచ్ ఎండీఏ , వాటర్‌వర్క్స్‌ విభాగాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

17:27 - August 31, 2015

మహబూబ్‌నగర్: వనపర్తిలో మున్సిపల్ సమావేశంలో రసాభాస నెలకొంది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మహిళా కౌన్సిలర్ పట్ల కొందరు కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించారు. వారిపై మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని....ఛైర్మెన్ ఛాంబర్‌ ముందు నిరసన తెలిపారు. ఛైర్మెన్ కలుగజేసుకొని... నచ్చజెప్పటంతో వారు శాంతించారు

అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇతర సంస్థల, ఆస్తుల వివరాలు తెలపాలని ఆదేశించింది. ఇతర ఆస్తులు విక్రయింబోమని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డు సమర్పించిన ఆస్తులపై ఆంధ్రా బ్యాంక్ వివరణ ఇచ్చింది. తమ వద్ద తాకట్టు పెట్టిన ఆస్తులు ఉన్నాయని.. హైకోర్టుకు తెలిపింది. నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని... న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

 

 

17:24 - August 31, 2015

హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం దగ్గర ఆర్టీసీ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ అనేకమందిని ఆస్పత్రిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదాని అతి వేగమే కారణంగా తెలుస్తోంది. 

మంత్రి పద్మారావుతో చంద్రవదన్, ఇతర అధికారుల భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో మంత్రి పద్మారావుతో ఎక్పైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు భేటీ అయ్యారు. నూతన మద్యం పాలసీ ప్రకటించే అవకాశం ఉంది. 

రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద ఓ లారీ.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిండి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  

రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

కొలంబో టెస్టు : రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు వద్ద తరంగ డకౌట్ అయ్యాడు. 

పోలీసుల అదుపులో ముగ్గురు నైజీరియన్లు...

హైదరాబాద్ : ముగ్గురు నైజీరియన్లను సీసీఎస్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామంటూ బురిడీ కొట్టారు. లక్ష్మీనారాయణ పేరు చెప్పి.. నైజీరియన్లు రూ. 10 లక్షలు వసూలు చేశారు.  

జగన్ గీత దాటితే సహించేది లేదు : చంద్రబాబు

హైదరాబాద్ : జగన్ గీత దాటనంత వరకూ ఉపేక్షిస్తాం...గీత దాటితే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. సూచనలు చేయడం వేరు, శవ రాజకీయాలు వేరని తెలిపారు. వీఐపీ ఘాట్ లో కంచి పీఠాధిపతి ఉన్నందునే... తాను పక్క రేవుకు వెళ్లాల్సి వచ్చిందని బాబు స్పష్టం చేశారు. జగన్ వీఐపీ ఘాట్ లో ఎందుకు స్నానం చేయలేదో చెప్పాలన్నారు. పుష్కరాల్లో మృతులకు మరుసటి రోజే పరిహారం అందించామని గుర్తు చేశారు. పుష్కరాల్లో తొలినాటి ఘటన పొరబాటని.. తప్పిదం కాదన్నారు.

ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు : జగన్

హైదరాబాద్ : అధికార పక్షం.. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వైసిపి అధినేత జగన్ వాపోయారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవ సభను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. స్పీకర్ స్వీయ భాగస్వామ్యంతో రాజకీయ కుతంత్రాలతో సభను నడుపుతున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే చంద్రబాబు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు.  

పోలీసుల అదుపులో ఇంజక్షన్ దాడుల అనుమానితుడు

తూ.గో: ఇంజక్షన్ దాడుల అనుమానితుడు రవికుమార్ ను బొబ్బరలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కుమార్ నుంచి నీడిళ్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పోలీసు స్టేషన్ కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రవికుమార్ ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.

 

ఎపి అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సమావేశాలను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. 

ఎసిబికి చిక్కిన గాంధీ ఆస్పత్రి ఏడీ రమేష్ బాబు

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఏడీ రమేష్ బాబు ఎసిబికి చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ.. ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. 

15:28 - August 31, 2015

హైదరాబాద్ : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలుడిపై ఎలుకల దాడి ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎలుకను పట్టేందుకు స్పెషల్ డ్రైవ్‌ చేపట్టింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు విభాగాల్లో ఎలుకల ఉచ్చులు ఏర్పాటు చేశారు. ప్రసూతి వార్డు, క్యాజువాలిటీలో దాదాపుగా ఆరు ఎలుకలు దొరికాయి. ఆసుపత్రిలో ఎలుకలు చేస్తామని శానిటేషన్ సూపర్‌వైజర్‌ చెప్పారు.

15:25 - August 31, 2015

హైదరాబాద్: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం చర్చిచేందుకు అధికార, విపక్షాలు సిద్ధం కాకపోవడం దారుణమని సీపీఎం నేతలు విమర్శించారు. ఉల్లి ధరల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో కాకినాడలో రాస్తారోకో నిర్వహించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

15:19 - August 31, 2015

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలో రవికుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ దాడులకు పాల్పడుతున్న వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంజక్షన్‌లు, సూదులు స్వాధీనం చేసుకుని రావులపాలెం పీఎస్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు.

15:16 - August 31, 2015

హైదరాబాద్ : చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని.. అసెంబ్లీ కౌరవసభలా ఉందని జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోకుండా ఉండటానికి పోరాడింది వైసీపీ మాత్రమేనని గర్వంగా చెప్పగలమన్నారు. ప్రత్యేకహోదాకు చంద్రబాబు అనుకూలమైతే తీర్మానం చేసి, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని జగన్‌ సవాల్‌ విసిరారు. అసలు హోదాపై సీఎం స్టేట్‌మెంట్‌ ప్రతుల్లో ఉన్నదొకటైతే.. బాబు మాట్లాడింది ఇంకొకటని జగన్‌ విమర్శించారు. ఆ విషయం నిరూపించడానికి తాను సిద్ధమని.. నిరూపిస్తే బాబు రాజీనామా చేస్తారా అని జగన్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసిపి అభ్యంతరం

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారు. 

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషి

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ మెహరుషి 1979 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గోయల్.. స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా రాజీవ్ మెహరుషిని నియమించారు.  

రాష్ట్ర విభజనకు హేతుబద్ధత లేదు: చంద్రబాబు

హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు హేతుబద్ధత లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యుపిఎ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామనే భరోసా ప్రజలకు ఇవ్వాలన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడడంలో అందరికంటే టిడిపి ముందుంటుందని తెలిపారు. 

ప్రత్యేకహోదాపై ప్రభుత్వం ప్రకటన

హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అందరం కలిసి ప్రత్యేకహోదా సాధిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా విభజించారని పేర్కొన్నారు.

 

మహబూబ్ నగర్ ఇసుక మాఫియాపై విచారణ వాయిదా...

హైదరాబాద్ : మహబూబ్ నగర్ ఇసుక మాఫియాపై జిల్లా ఎస్పీ హైకోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. ఇసుక మాఫియాపై నివేదిక సమర్పించాలని ఎస్పీని ఆదేశించారు. 

సభా సమయాన్ని 15 రోజులకు పెంచాలని కోరాం : జ్యోతుల నెహ్రూ

హైదరాబాద్ : సభా సమయాన్ని 15 రోజులకు పెంచాలని బీఏసీలో కోరామని వైసిపి నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 

భారత్ 163/6..

కొలొంబో : శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓజా 29, మిశ్రా 2 పరుగులతో ఆడుతున్నారు. 

సంతాప తీర్మానాలను వివాదం చేయడం నేనెప్పుడూ చూడలేదు: స్పీకర్

ఎపి అసెంబ్లీ : అసెంబ్లీలో జగన్ తీరుపై స్పీకర్ కోడేల శివప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. సంతాప తీర్మానాలను వివాదం చేయడం.. తన 30 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ చూడలేదని స్పీకర్ అన్నారు.

'హోదా'పై చర్చ జరగకుండా ఉండేందుకు కుట్ర : జగన్

ఎపి అసెంబ్లీ : ప్రత్యేక హోదాపై చర్చ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చూస్తోందని జగన్ విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కావాలంటున్నారు కానీ.. చర్చకు ముందుకు రావడం లేదని చెప్పారు.

 

13:14 - August 31, 2015

హైదరాబాద్ : బీఏసీ సమావేశంలో అధికారంపక్షం ఆరోపిస్తున్న మాటలు సత్యదూరమని, తాము అలాంటివి ఏదీ ఒప్పుకోలేదన్నారు. మధ్యాహ్నాం ప్రశ్నోత్తరాలకు స్పీకర్ కోడెల అనుమతించడంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పన్నెండు తరువాత ప్రశ్నోత్తరాలను చేపట్టలేదని తెలిపారు. బీఏసీకి సమావేశానికి రావడం తనకు సభ ఇచ్చిన హక్కని, చాలా ప్రధానమైన అంశాలున్నాయని బీఏసీలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, నిత్యావసర ధరలు పెరిగిపోవడం, ఇతరత్రా అంశాలపై చర్చించాలని ఇందుకు పదిహేను రోజుల వరకు సమావేశాలు జరగాలని కోరడం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం తిరస్కరించడంతో తాము ఒక మెట్టు దిగి మూడు రోజులైనా పొడిగించాలని కోరడం జరిగిందన్నారు. దీనికి కూడా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సంతాప తీర్మాన ప్రవేశంలో ఘటన ఎలా జరిగింది..ఎలా మృతి చెందారనే దానిపై కూలంకుషంగా చర్చించాల్సినవసరం ఉందన్నారు. అందుకనే తమ నాయకుడు జగన్ ప్రసంగం చేశారని, ఎవరి అసమర్థతతో ఘటనలు జరిగాయో చెప్పడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాపై జరిగిన బంద్ లో ప్రజల స్పందన ఎలా ఉందో చూడాలని, ఈ సమస్య పరిష్కారం కోసం సభ తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరడం జరిగిందని తెలిపారు. ఇది సభ సంప్రదాయం కాదని, స్పీకర్ విజ్ఞతతో వ్యవహరించాలని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. 

సీఆర్ డీఏ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ : ఎపి రాజధాని నిర్మాణం, సీఆర్ డీఏ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఐఏఎస్ అధికారి దైవసహాయం పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని నిర్మాణంపై ఎపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని దైవసహాయం పటిషన్ లో పేర్కొన్నారు.

 

13:07 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ర రాష్ట్ర శాసనసభా సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షం సహకరించాలని, అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జగన్ మాట్లాడుతున్న తీరు చాలా బాధాకరమన్నారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడుతున్నారని, అధ్యక్ష స్థానంపై ఎలాంటి గౌరవం లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని, అధ్యక్ష స్థానాన్ని కించపరిచి లబ్ధి పొందాలని అనుకుంటే ఏ మాత్రం తగదన్నారు. అమార్యాదగా ప్రవర్తిస్తూ జగన్ తనంటత తానే కించపరచుకుంటున్నారని, అంతేగాకుండా శాసనసభను కించపరుస్తున్నారని విమరిశంచారు. ఎలాంటి అంశాలపైనైనా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు కొనసాగుతున్నాయని కాల్వ పేర్కొన్నారు. 

13:03 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే రగడ ప్రారంభమైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రతిపక్ష నాయకుడు జగన్ మధ్య కొద్దిసేపు సంవాదం జరిగింది. సంతాప తీర్మానంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అధికారపక్షంతో సహ స్పీకర్ కోడెల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సభ వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో జగన్ మాట్లాడారు. మధ్యాహ్నాం తరువాత ఎక్కడైనా ప్రశ్నోత్తరాలను చేపడుతారా అంటూ నిలదీశారు. తాము సమావేశాల దినాలను పెంచాలని కోరడం జరిగిందని, ముగ్గురు పిల్లలు చనిపోయిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నోత్తరాలు చేపట్టిన సందర్భం లేదని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రేపు నిర్వహించాలన్నారు. సంతాప తీర్మానంపై ప్రతిపక్ష నేత మాట్లాడనీవకుండా చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, మీతో (స్పీకర్) పోరాడుతున్నామో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నారని స్పీకర్ ను ఉద్ధేశించి జగన్ పేర్కొన్నారు. 

ప్రతిపక్ష నేత తీరు ఇబ్బందికరం: విష్ణుకుమార్ రాజు

హైదరాబాద్ : సంతాప తీర్మానం సమయంలో ప్రతిపక్ష నేత తీరు ఇబ్బందికరంగా ఉందని టిడిపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేకహోదా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజా సమస్యలపై చాలా ప్రశ్నలు పెండింగ్ లోన్నాయని.. చాలా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సివుందని.. ఇందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు.

 

బాబు పబ్లిసిటీ పిచ్చివల్లే 29 మంది మృతి : రోజా

హైదరాబాద్ : చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే 29 మంది చనిపోయారని వైసిపి నేత రోజా ఆరోపించారు. తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారని పేర్కొన్నారు. టిడిపికి తాము ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్ వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందని చెప్పారు.

 

12:54 - August 31, 2015

ఖమ్మం : అభం శుభం తెలియని ఓ గిరిజన బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టేకులపల్లి వంతెన దగ్గర బాధితురాలిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. అనంతరం స్నేహితులతో కలిసి ఈ ఘాతునికి తెగబడ్డారు. ఓ వాహనంలోకి ఎక్కించుకున్న నిందితులు వరంగల్ మార్గంలో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కొనిజర్లలో బాలికను వదిలిపెట్టారు. ఆ సమయంలో వెతుక్కుంటూ వస్తున్న తల్లిదండ్రులకు బాలిక ఎదురైంది. జరిగిన ఘోరాన్ని తెలియచేయడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాలికను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 

12:53 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ధ్వజమెత్తింది. ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో సంతాప తీర్మానాలపై రగడ చెలరేగింది. విపక్ష..అధికార పక్ష సభ్యుల మధ్య తీవ్ర విమర్శలు చెలరేగాయి. సభ వాయిదా పడిన అనంతరం వైసీపీ చెందిన సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

బాబు పబ్లిషిటీ వల్లే 29 మంది చనిపోయారు..
సీఎం చంద్రబాటు మాటలకు..పనులకు సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు పబ్లిషిటీ పిచ్చివల్లే 29 మంది మృతి చెందారని, వీరిని చంపిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంతాప తీర్మానం ప్రవేశ పెట్టే అర్హత మీకు ఉందా ? అని నిలదీశారు. తొక్కిసలాటపై మాట్లాడుతుండగానే జగన్ మైక్ కట్ చేశారని, సంతాపం కంటే ముందే వివరాలు తెలియాలన్నారు. ఏపీని హత్యల ప్రదేశ్ గా ఛస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అంతేగాకుండా పుష్కరాల్లో సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు చేశారని విమర్శించారు. జగన్ కొత్తగా వచ్చారని బొండా విమర్శిస్తున్నారని, ఆయన ఎప్పుడొచ్చారని ఎదురు ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చామన్నది కాదని రోజా పేర్కొన్నారు. మోడీ, పవన్ కల్యాణ్ వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. సంతాప తీర్మానంలో వివరాలు తెలియాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. 

12:46 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. శాసనసభలో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా సభ నుండి ఒక తీర్మానం చేసే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదాను ఒక ప్రధాన అంశంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ శాసనసభా సమావేశాలను అందరూ ఉపయోగించుకోవాలని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

జగన్ మూర్ఖత్వాన్ని వదులుకోవాలి : అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత జగన్ మూర్ఖత్వాన్ని వదులుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటే.. వైసిపి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షం ఏం అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

 

జగన్ తీరు బాధాకరం : కాల్వ శ్రీనివాసులు

హైదరాబాద్ : జగన్ తీరు బాధాకరమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

హోదాపై తీర్మానం చేయమంటే పట్టించుకోవడం లేదు : జగన్

హైదరాబాద్ : వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ప్రత్యేకహోదాపై తీర్మానం చేయమంటే పట్టించుకోవడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

వాయిదా అనంతరం ప్రారంభమైన ఎపి అసెంబ్లీ...

హైదరాబాద్ : వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సంతాప తీర్మానాన్ని వివాదం చేయడం తగదని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.

12:22 - August 31, 2015

హైదరాబాద్ : సంతాప తీర్మానంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాలపై అసెంబ్లీలో రగడ చెలరేగింది. సభ వాయిదా పడిన అనంతరం బోండా విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన వారిపై కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం..సీఎంపై వైసీపీ సభ్యులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ కు అనుభవం లేదని, సభ సంప్రదాయలను పట్టించుకోవడం లేదన్నారు. తప్పులు ఎత్తి చూపాలంటే చర్చలో చూపెట్టాలని తెలిపారు. ప్రత్యేక హోదా వెనక్కితగ్గమని బోండా స్పష్టం చేశారు. 

జగన్ మాటలు అభ్యంతరకరం : బోండా

హైదరాబాద్ : జగన్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సభ సంప్రదాయాలను జగన్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సంతాప తీర్మానంలో రాజకీయాలు చొప్పిస్తున్నారని వాపోయారు. గోదావరి పుష్కరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

హ్యాకింగ్ కు గురైన అమితాబ్ ట్విట్టర్ అకౌంట్..

హైదరాబాద్ : బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ లో హ్యాకర్లు బూతు వీడియోలను ఆప్ లోడ్ చేశారు.  

కాల్బురి అంతిమ యాత్ర ప్రారంభం..

ధార్వాడ్ : ప్రముఖ కన్నడ విద్యావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత ఎం.ఎఎం.కాల్బురి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించి కడసారి నివాళిలు అర్పించారు. కాల్బుర్గిపై ఆదివారం ఆయ నివాసంలో ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 

12:16 - August 31, 2015

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లో అపరచిత వ్యక్తి ఉన్నాడని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మాన సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పుష్కరాల్లో జరిగిన ఆనాటి దుర్ఘటనను సంఘటనను జ్ఞాపకం చేసుకుని మృతులకు సంతాపం వ్యక్తం చేస్తుంటే జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐదు కోట్ల ప్రజలను జగన్ కించపరిచి మాట్లాడారని కానీ ఆయన మాట్లాడుతున్న తీరు దురదృష్టకరమన్నారు. శవాల పునాదిపై వైసీపీ ఏర్పడిందని, సంతాప తీర్మానం ఎలా ప్రతిపాదించాలో ఆ పార్టీకి తెలియదన్నారు. 144 సంవత్సరాల తరువాత 12 సంవత్సరాలకొకమారు వచ్చే పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచించిందని గొల్లపల్లి తెలిపారు. 

జగన్ లో అపరిచితుడు ఉన్నాడంట..

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లో అపరచిత వ్యక్తి ఉన్నాడని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మాన సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పుష్కరాల్లో జరిగిన ఆనాటి దుర్ఘటనను సంఘటనను జ్ఞాపకం చేసుకుని మృతులకు సంతాపం వ్యక్తం చేస్తుంటే జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐదు కోట్ల ప్రజలను జగన్ కించపరిచి మాట్లాడారని కానీ ఆయన మాట్లాడుతున్న తీరు దురదృష్టకరమన్నారు. శవాల పునాదిపై వైసీపీ ఏర్పడిందని, సంతాప తీర్మానం ఎలా ప్రతిపాదించాలో ఆ పార్టీకి తెలియదన్నారు.

కాల్బుర్గి హత్య కేసు సీఐడీకి అప్పగింత..

ధార్వాడ్ : హత్యకు గురైన కన్నడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ ఎం.ఎం.కాల్బుర్గి హత్య కేసును సీఐడీ కి అప్పగిస్తున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

శర్మ అవుట్..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ శర్మ (50) వికెట్ కోల్పోయింది. 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. బిన్ని 37, ఓజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు 241 పరుగుల ఆధిక్యతలో భారత్ కొనసాగుతోంది. 

జగన్ లో అపరిచితుడు ఉన్నాడు: గొల్లపల్లి

హైదరాబాద్ : వైసిపి అధినేత జగన్ పై టిడిపి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ లో అపరిచితుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. శవ రాజకీయాలపై పుట్టిన పార్టీ వైసిపి అని విమర్శించారు. 

పదకొండు రోజుల్లో 53 మంది శిశువుల మృతి..

ఒడిశా : కటక్ లో ఉన్న శ్రీ రామచంద్ర భంజ్ మెడికల్ కాలేజీ (ఎసీబీ)లోని పీడియాట్రిక్ సెంటర్ లో గత 10-11 రోజుల్లో 53 మంది శిశువులు మృతి చెందినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. 

చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అన్యాయం : రోజా

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రత్యేకహోదా ప్రకటన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

 

ఓటుకు నోటు కేసు..విచారణ వాయిదా..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు మూడు వారాల పాటు విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

యుద్ధం ప్రకటిస్తే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాలి - పాక్..

పాకిస్తాన్ : పాక్‌పై యుద్ధాన్ని ప్రకటించాలని ప్రయత్నిస్తే.. భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ హెచ్చరించారు. ఆ నష్టం భారత్‌కు దశాబ్దాల వరకూ గుర్తుంటుందన్నారు. శిలాకోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడివున్న కుందున్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మాజీ సైనిక ఉద్యోగుల దీక్షకు రాంజెఠ్మలానీ సంఘీభావం..

ఢిల్లీ : వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం అమలు కోసం మాజీ సైనిక ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వారి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. దీక్షా స్థలికి వద్దకు చేరుకున్న జెఠ్మలానీ కేంద్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. 

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : చంద్రబాబు

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకహోదా రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి మృతికి సభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాలను చంద్రబాబు ప్రవేశపెట్టారు. అనంతరం జగన్ మాట్లాడిన వ్యాఖ్యలపై బాబు మాట్లాడారు. ప్రతిపక్ష నేత జగన్ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అది సరికాదన్నారు. జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వైసిపి లాలూచీ వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. జగన్ ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు.

షీనా బోరా హత్య ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసుల బృందం..

మహారాష్ట్ర : షీనా బోరా హత్యకు గురైన రాయ్ గఢ్ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. రాయ్ గఢ్ జిల్లా సమీపంలోని అడవిలో షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ మృతదేహం తాలూకు పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

భారత్ 100/4..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో వంద స్కోరు దాటింది. మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. శర్మ 44, బిన్ని 25 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 3 వికెట్లు తీయగా ప్రసాద్ ఒక వికెట్ తీశాడు. 

11:12 - August 31, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే అధికార, విపసక్ష సభ్యుల మధ్య వాడి వేడి విమర్శలు చెలరేగాయి. మొదటి రోజు పలు సంతాప తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కలాం, పుష్కరాల్లో మృతి చెందిన వారికి, ప్రత్యేక హోదా కోరుతూ బలవన్మరణానికి పాల్పడిన వారి ఆత్మకు సంతాపం తెలియచేస్తూ సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టింది. పుష్కరాలు..బలవన్మరణాలపై ప్రవేశ పెట్టిన తీర్మానంపై వైసీపీ జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం, స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతుండడం పట్ల కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. హోదాను ఏ విధంగా సాధించాలనే దానిపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వం మొదటి నుండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని, ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. మృతి చెందిన వారికి సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు.

మాట్లాడుతున్న మాటలకే చనిపోతున్నారు...
ప్రత్యేక హోదా అంశంపై నేతలు మాట్లాడుతున్న మాటలకే బలవన్మరణానాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని బాబు పేర్కొంటున్నారని, హోదా రాదని అరుణ్ జైట్లీ పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ చావులకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకు డమ్మిడి పైసా ఇవ్వలేదని జగన్ తెలిపారు.

బాబు ఆగ్రహం..
వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం తగదన్నారు. వీళ్ల రాజకీయ కుట్రలకు రాష్ట్రం తగులబడిందని, ఎవరు లాలూచీ పడ్డారని ప్రశ్నించారు. కేసుల కోసం లాలూచీ పడ్డారని, కుట్రలు..కుతంత్రాలు చేయడం పట్లే అక్కడ కూర్చొపెట్టారని వైసీపీని ఉద్దేశించి పేర్కొన్నారు. దానిని కరెక్టు చేయడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ లో తలుపులు మూసేసి ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో వెంకయ్య నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. విమర్శించే హక్కు వీరికి లేదని చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని అంటున్నారని, రాజీనామా చేస్తే ఎన్డీయేతో కలుస్తారా అని వైసీపీని ప్రశ్నించారు. అజెండా ప్రకారం రావాలని దాని ప్రకారం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తనపై బురదచల్లితే చులకన అయిపోతారని చంద్రబాబు తెలిపారు. 

చంద్రబాబు, మంత్రుల ప్రకటన వల్లే ఆత్మహత్యలు : జగన్

హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఆలస్యమవుతుందని ప్రజలు చనిపోవడం లేదని.. చంద్రబాబు, మంత్రుల ప్రకటన వల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. ఈ బలిదానాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

 

ఎపి అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వాయిదా పండింది. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి ఎపి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సంతాప సూచికంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ కొద్ది సేపు అసెంబ్లీ వాయిదా పడింది. 

ఆత్మహత్య చేసుకున్న వారికి ఎపి అసెంబ్లీ సంతాపం...

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి ఎపి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సీఎం చంద్రబాబు సంతాప తీర్మాన్ని ప్రవేశపెట్టారు. సంతాప సూచికంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

10:57 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గోదావరి పుష్కర మృతులకు ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానంపై అధికార, విపక్ష సభ్యులు విమర్శలు చేసుకున్నారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. సంతాప తీర్మానాన్ని రాద్ధాంతం చేయవద్దని స్పీకర్ కోడెల సూచనలు చేశారు. పుష్కరాల మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ రాజమండ్రిలో తొలిరోజే తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. సంఘటనా స్థలానికి వెంటే తాను వెళ్లి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మృతి చెందిన వారికి రూ. పది లక్షలు, గాయపడిన వారికి రూ.25వేలు అందచేయడం జరిగిందన్నారు. వారు మృతి చెందడం పట్ల సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు.

దెయ్యాలు వేదించినట్లుగా ఉంది - జగన్..
గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియచేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ 29 మందికి చావుకు కారణమైన పరిస్థితుల మధ్య నివాళులర్పిస్తుంటే ఏమనాలో తెలియడం లేదన్నారు. వీఐపీల కోసం ఘాట్ లు పెట్టారని, ఘాట్ లలో స్నానాలు చేయాలని పాస్ లు కేటాయించారని తెలిపారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసమని షూటింగ్ చేయాలని హీరోలాగా కనబడాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. సరస్వతీ ఘాట్ వదిలేసి బాబు స్నానం చేశారని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా చనిపోయారన్నది చెప్పకపోతే చనిపోయిన కుటుంబాలకు వారి ఆత్మకు శాంతి కలుగుతుందా అని జగన్ ప్రశ్నించారు.

ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారు - యనమల..
గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిందని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. సంతాప తీర్మానంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరూ తీసుకరారని, కానీ ఆ పరిస్థితి ఈ రోజు నెలకొందన్నారు. సంతాపం తీర్మానం కాకుండా జగన్ ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారని యనమల పేర్కొన్నారు. సంతాప సందేశంలో ఒకరిపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కుదరదని యనమల తెలిపారు.

జగన్ వ్యాఖ్యలు సరికాదు - కోడెల..
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ చేసే వ్యాఖ్యలు సరికాదని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. శాసనసభ మొత్తంపైనే వ్యాఖ్యలు చేస్తున్నారని, వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోడెల సూచించారు. సభను కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదన్నారు. 
చివరకు జగన్ సంతాప తీర్మానం పూర్తికాకముందే పుష్కరాల్లో మృతి చెందిన వారికి మౌనం పాటించారు. 

పుష్కరాలపై చర్చకు సిద్ధం : అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : గోదావరి పుష్కరాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పుష్కరాలపై స్పీకర్ చర్చకు అనుమతించాలని కోరారు. ఓ మూర్ఖుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

జగన్ పరిధి దాటి మాట్లాడుతున్నారు: మంత్రి యనమల

హైదరాబాద్ : జగన్ పరిధి దాటి మాట్లాడుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో యనమల మాట్లాడారు. 

జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: స్పీకర్ కోడెల

హైదరాబాద్ : జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరారు. సభపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పీకర్ అన్నారు. సంతాప తీర్మానాన్ని రాద్ధాంతం చేయడం ఆయనకు సబబు కాదని హితవు పలికారు. 

చంద్రబాబు 29 మంది మృతికి కారణమయ్యారు : జగన్

హైదరాబాద్ : చంద్రబాబు దగ్గరుండి 29 మంది మృతికి కారణమయ్యారని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. ఈమేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పుష్కర మృతుల పట్ల చంద్రబాబు ప్రసంగం... వాస్తవాలను పట్టి చూపడం లేదని విమర్శించారు.

భారత్ 50/3..

కొలంబో : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆటను ప్రారంభించింది. మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.

పుష్కరాల మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి..

హైదరాబాద్ : గోదావరి పుష్కరాల్లో మృతి చెందిన వారికి ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు.

 

10:27 - August 31, 2015

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి, భారతరత్న కలం మృతి చెందడం తీరని లోటని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో కలాం మృతిపై సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. భరత మాత అందించిన అరుదైన ఆణిముత్యం కలాం అని, అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారని తెలిపారు. చిత్తశుద్ధితో వ్యవహరించిన కలాం రాష్ట్రపతి పదవి అనుభవించారని, స్పేస్ టెక్నాలజీలో సేవలు అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. నైతిక విలువలు కలిగిన వ్యక్తి కలాం చివరి వరకు పాఠాలు బోధిస్తూ మృతి చెందారని తెలిపారు. దేశానికి ఒక దశ..దిశ నిర్ధేశించారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని మంత్రి పల్లె తెలిపారు. 

10:20 - August 31, 2015

హైదరాబాద్ : భరతమా ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. ఆయన మృతి చెందడం తనకే కాకుండా దేశాన్ని కలిచివేసిందన్నారు. వ్యక్తిగతంగా వందల కోట్ల మందికి ఆరాధ్యాయుడని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కలాం పేపర్ బాయ్ గా పని చేసి రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రపతి పదవి నుండి తప్పుకున్న తరువాత ఉపాధ్యాయుడిగా మారి అతి సామాన్య మైన జీవితం గడిపారన్నారు. 84 వయస్సులో కూడా దేశం గురించి, సైన్స్ గురించి ఆలోచించారని తెలిపారు. పార్టీ తరపు నుండి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. 

కలాం మృతి కలిచివేసింది - జగన్..

హైదరాబాద్ : భరతమా ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జనగ్ ప్రసంగించారు. ఆయన మృతి చెందడం తనకే కాకుండా దేశాన్ని కలిచివేసిందన్నారు.

10:16 - August 31, 2015

హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాం అందరికీ స్పూర్తిదాత అని, ఆయన పేరిట పురస్కారాలు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కలాం మృతిపై ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. ఒక పేద కుటుంబంలో జన్మించిన కలాం ఉన్నతస్థాయికి వెళ్లారని గుర్తు చేశారు. వాజ్ పాయి ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి ఎవరు ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు, కలాం అయితే బాగుంటుందని తాము సూచించడం జరిగిందన్నారు. ఒక్క కమ్యూనిస్టు పార్టీలు మాత్రం పోటీ పెట్టాయని తెలిపారు. రాష్ట్రపతి అయిన తరువాత ప్రపంచంలో దేశం అగ్రగామిగా నిలబడాలని కృషి చేశారని తెలిపారు. బంగారు కలలు కనండి..ఆ కలలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించాలని కలాం సూచించారని తెలిపారు. నదుల అనుసంధానం కోసం కృషి చేశారన్నారు. ఖాళీ సమయాల్లో యూనివర్సిటీ, సైన్స్ టెక్నాలజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించడం జరిగిందన్నారు. అంతేగాకుండా యువత స్పూర్తినిచ్చే విధంగా ఆయన పుస్తకం వెలువరించారని తెలిపారు. తాను రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ కలాం తీసుకున్నారని, అలిపిరిలో తనపై దాడి జరిగినప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టిన పరామర్శించారని ఇది స్నేహానికి ఒక నిర్వచనం అని కొనియాడారు. తాను మృతి చెందితే హాల్ డే డిక్లేర్ చేయవద్దని, ఇంకా రెండు గంటలు పనిచేస్తే తనకిచ్చే ఘనమైన నివాళి అని కలాం పేర్కొన్నారని తెలిపారు. అందుకోసం తాము ఆయన చనిపోయినప్పుడు రెండు గంటలు అదనంగా పనిచేయాలని కోరడం జరిగిందన్నారు. రాజకీయ నాయకులు కలాంను ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి కలాం పేరు పెట్టాలని, అబ్దుల్ కలాం పేరిట పురస్కారాలు అందచేయాలని..నాగార్జున వర్సిటీలో కలాం విగ్రహం నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 

10:08 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సమావేశాల ప్రారంభమైన తొలిరోజే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక హోదాపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై చర్చ చేపట్టాలని పట్టుబట్టింది. కానీ దీనికి స్పీకర్ అనుమతించలేదు. ఒకసారి వాయిదా తీర్మానాలు తిరస్కరించిన తరువాత అనుమతించబడదని స్పీకర్ వెల్లడించారు. ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తామని ప్రభుత్వం బీఏసీ సమావేశంలో వెల్లడించిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. కానీ వైసీపీ సభ్యులు దీనికి అంగీకరించలేదు. 'ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. దీనికి స్పీకర్ కోడెల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిన్ననే నోటీసు ఇచ్చిందని, వైసీపీ ఈ రోజు ఉదయం నోటీసు ఇచ్చిందని గుర్తు చేశారు. సభల్లో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేయడం సరికాదని కోడెల సూచించారు.

కేంద్ర మంత్రులను ఉపసంహరించుకోవాలి - జగన్..
ప్రత్యేక హోదా మీద తీర్మానం చేయాలని, తీర్మానానికి బలం చేకూర్చేందుకు కేంద్ర మంత్రులు ఉపసంహరించాలని కోరుతున్నట్లు ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేయాలని తాము కోరడం జరిగిందని తెలిపారు.

సభా సమయం వృదా చేయవద్దు - యనమల..
సభా సమయం వృథా చేయవద్దని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. తామంట తామే ప్రకటన, తీర్మానం చేస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందన్నారు. కానీ ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అబ్దుల్ కలాం మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి..

హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు ఏపీ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని సూచించారు. 

సభా సమయం వృదా చేయవద్దు - యనమల..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీనిపై వైసీపీ ఆందోళన చేపట్టింది. సభా సమయాన్ని వృదా చేయవద్దని యనమల సూచించారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తామని ప్రభుత్వం బీఏసీ సమావేశంలో వెల్లడించిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. 

09:06 - August 31, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. స్పీకర్ అనుమతితో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
నేటి నుండి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఈ సమావేశాలను పదిహేను రోజుల పాటు కొనసాగించాలని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కోరుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాల నిర్వాహణపై బీఏసీ సమావేశం కానుంది. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు, యనమల, కేఈ, శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రతిపక్షం నుండి జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డిలు హాజరు కానున్నారు. కానీ ప్రతిపక్ష నేత జగన్ ఇంకా అసెంబ్లీకి చేరుకోకపోవడంతో ఇంకా ఈ సమావేశం ప్రారంభం కాలేదని తెలుస్తోంది. మరి బీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 

కాల్బురికి పలువురు నివాళి..

ధార్వాడ్ : ప్రముఖ కన్నడ విద్యావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత ఎం.ఎఎం.కాల్బురి భౌతికకాయాన్ని పలువురు సందర్శిస్తున్నారు. కడసారి నివాళిలు అర్పించేందుకు ప్రజలు బారులు తీరారు. కాల్బుర్గిపై ఆదివారం ఆయ నివాసంలో ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 

ప్రత్యేక హోదాపై చర్చ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏసీలో ప్రాధాన్యత గల 13 అంశాలపై చర్చించాలని టిడిపి కోరనుంది. 

కలాం..పుష్కరాల మృతులకు ఏపీ అసెంబ్లీ నివాళి..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత అబ్దుల్ కలాం మృతి, గోదావరి పుష్కరాల మృతులకు ఏపీ అసెంబ్లీ నివాళి అర్పించనుంది. 

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ..

హైదరాబాద్ : రవీంద్రభారతి సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం నుండి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 

అసెంబ్లీకి చేరుకున్న బాబు..

హైదరాబాద్ : కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకున్నారు. 

08:31 - August 31, 2015

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అదే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం..భూ ఆర్డినెన్స్ పై కేంద్రం వెనకడుగు వేయడం..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్య..కృష్ణా జలాలు..వంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

అదే తీరు...
'' ఏపీ అసెంబ్లీ సమావేశాలు గతంలో ఎలా జరిగాయో అలానే జరుగుతాయి. టిడిపి, వైసీపీలు మాత్రమే సభలో ఉన్నాయి. బీజేపీది వేరే పరిస్థితి. తెలంగాణ శాసనసభలో కొన్ని పార్టీలున్నాయి. రెండు శాతం ఓట్ల తేడాతో టిడిపి అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదు. ఏ అంశమైనా ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం అభివృద్ధి కాదని చెబుతూనే రాబోయేది తమ ప్రభుత్వమే అని జగన్ అంటున్నారు. ప్రజాసమస్యల కన్నా ఆయనకు అధికారంలోకి రావడమే ముఖ్యమని భావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి ఉందా ? లేదా అధికారంలోకి రావడంపై ఆసక్తి ఉందా అనేది ప్రజలు ఆలోచిస్తుంటారు. వైఎస్, చంద్రబాబు వ్యక్తిగత సంకులిక సమరం ప్రస్తుతం బాబు, జగన్ లకు మధ్య వైరంగా మారింది. ఏ ప్రజాసమస్యపైనా చర్చించలేదు. అటైనా..ఇటైనా ప్రజా సమస్యలు చర్చించాలని అనుకోవడం లేదు. అధికారంలో ఉన్న టిడిపి, బిజెపికి సమాధానం చెప్పుకొనే అవకాశం లేదు. ప్రజల ఎదుట క్షమాపణలు చెప్పే అర్హత వారికి లేదు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అని అంటే విమర్శలు చేయడం ప్రారంభిస్తారు. అరుపులు..కేకలు..వాకౌట్ లు అవే జరుగుతాయి.

భూ సేకరణ తీసుకరాం..
భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకరామని ప్రధాని మోడీ చెప్పారు. తీసుకరాకుండా ఉండే విధంగా పార్టీలు చేశాయి. ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లును గట్టెక్కించుకుంటామని ప్రభుత్వం యోచించింది. కానీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏ లక్ష్యంతో భూములు తీసుకున్నారో ఆ లక్ష్యాలను పట్టించుకోవడం లేదని కాగ్ తేల్చింది.

సుమిత్రా మహజన్ గత పార్లమెంట్ నాయకురాలు, ప్రస్తుతం లోక్ సభ స్పీకర్. ఈమె నాయకత్వంలో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం చేసింది. భూ సేకరణ ఆర్డినెన్స్ పై నివేదిక ఇచ్చింది. మోడీ అనుసరిస్తున్న విధానానికి నివేదిక పూర్తిగా విరుద్ధం. పెట్టుబడి దారి దేశమైన అమెరికాలో కార్పొరేట్ వారి కోసం భూములు తీసుకోవడంపై నిషేధం ఉంది. పారిశ్రామికాభివృద్ధి కోసం కాదు పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కోసం భూములు సేకరించడం తప్పు. ఇలా చేస్తున్నారు కనుకే విమర్శలు వస్తున్నాయి.

కృష్ణా జలాల వాడకం..
కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల చేసిన అన్యాయంపై ఉమ్మడి ఏపీ పోరాడింది. ఏపీ, తెలంగాణలు దిగువ రాష్ట్రాలు. కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భిన్నంగా ఉంది. మిగులు జలాలు వాడుకొనే స్వేచ్ఛ ఏపీకి ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలు పంపిణీ చేశారు. ఈ ట్రిబ్యునల్ పై రెండు రాష్ట్రాలు పోరాడాలి. ఆల్మట్టి ఎత్తును పెంచడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఇద్దరు కొట్టుకొంటే దిగువ రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నారు.

కేజీ టు పీజీ విద్య...
ప్రభుత్వానికి ముందు స్పష్టత ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతోంది. 9వేల పోస్టులు అదృశ్యమయ్యాయి. ఇంకా ఖాళీలు భర్తి చేయాల్సి ఉంది. ఏ కారణం రీత్యా ప్రయివేటు పాఠశాలలకు వెళుతున్నారనే దానిపై ఆలోచించాలి. మధ్యాహ్నా భోజన పథకాన్ని మెరుగ్గా అమలు చేయాలి. ఉదయం కూడా అల్పహారం పెట్టే విధంగా చూడాలి. క్లాస్ రూమ్ లలో బోధనా పద్ధతి మారాలి. పర్యవేక్షణా యంత్రాంగం పటిష్టంగా ఉంటే ఉపాధ్యాయుల పనితీరు మెరుగ్గా ఉంటుంది. దేశంలో 20 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని యునెస్కో పేర్కొంది. నాణ్యత, ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలుండాలి. కానీ ప్రభుత్వం తీరు వేరే విధంగా ఉంది. నైబర్ హుడ్స్ బార్ వద్దు..నైబర్ హుడ్స్ పాఠశాలలు కావాలి'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు.

08:01 - August 31, 2015

నితిన్‌, సమంత నాయకా నాయికలుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించబోయే చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు సెప్టెంబర్‌ మూడోవారంలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను నిర్మాత రాధాకృష్ణ మీడియాకు తెలియచేశారు. 'త్రివిక్రమ్‌' దర్శకత్వంలో ఇప్పటికే తమ బ్యానర్‌ ద్వారా 'జులాయి', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌హిట్స్ సినిమాలు చేయడం జరిగిందన్నారు. వైవిధ్యమైన కథలతో సినిమాల్ని రూపొందించే 'తివిక్రమ్‌'తో మూడోసారి తమ బ్యానర్‌లో సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. నితిన్‌ సరసన తొలిసారి సమంత నటిస్తోందని, అలాగే ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా నటించనున్నట్లు వెల్లడించారు. 2016 జనవరి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించి త బ్యానర్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ సాధిస్తుందని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్‌, అందిస్తున్నారు. 

07:59 - August 31, 2015

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కానీ పదిహేను రోజుల పాటు సమావేశాలు జరిగే విధంగా చూడాలని వైసీపీ కోరుతోంది. మరోవైపు విభజన హామీల అమలుకు కేంద్రంపై కలిసి పోరాడుదామని ఎపి టిడిపి నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆ రాష్ట్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), లేళ్ల అప్పిరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ ఘాట్ లో నివాళలర్పించిన బాబు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు.

07:51 - August 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివిధ పోటీపరీక్షల సిలబస్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి విలేకరుల సమావేశంలో విడుదల చేయనున్నారు. గ్రూప్స్-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 తోపాటు వివిధ పోటీపరీక్షల సిలబస్‌ను విడుదల చేయనున్నారు. సోమవారం లేదా మంగళవారం ఉదయం టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి సిలబస్‌ను పొందపరచనున్నారు. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా సిలబస్‌ను రూపొందించినట్లు తెలిసింది. గ్రూప్స్ తోపాటు వివిధ పోటీపరీక్షల పూర్తిస్థాయి సిలబస్‌ కోసం అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం అనే తేడా లేకుండా అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా సిలబస్‌ను తయారు చేసినట్లు సమాచారం.

నేడు సీఆర్డీఏ కీలక సమావేశం..

గుంటూరు : సామాజిక అభివృద్ధి విధానం అమలులో భాగంగా అమరావతి రాజధాని నగర నిర్మాణంతో ప్రభావితమయ్యే కుటుంబాలకు కల్పించాల్సిన సౌకర్యాలపై సోమవారం సీఆర్‌డీఏ కీలక సమావేశం జరగనుంది.

07:26 - August 31, 2015

సెప్టెంబర్‌ 2 వస్తోంది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె సన్నాహాలు మరింత ఉధృతం చేశాయి. ఈ సమ్మెలో ప్రభుత్వరంగ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు ఈ దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధిలో పోషించిన పాత్ర ఏమిటి? ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీటికి పరిష్కారాలేమిటి? ప్రభుత్వరంగ సంస్థలు లాభాలిస్తున్నాయా? నష్టాలే మిగులుస్తున్నాయా? ప్రభుత్వం వాటిని ఎందుకు అమ్మాలనుకుంటోంది? ప్రభుత్వరంగ సంస్థల పనితీరు మెరుగుపడాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై జనపథంలో ప్రభుత్వరంగ సంస్థల కార్మిక నేత నరసింగరావుగారు విశ్లేషించారు. 

07:25 - August 31, 2015

ఈ దేశానికి అసాధారణ సేవలందించిన అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరికొన్నేళ్ల తర్వాత ప్రభుత్వరంగ సంస్థలు అనేవి మిగులుతాయా? లేదా? అన్న అనుమానమూ కలుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది?  పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో 1947కి పూర్వం మనదేశానికి చెప్పుకోదగ్గ చరిత్రేదీ లేదు. సామాజిక పరిస్థితులు అత్యంత ఘోరంగా వుండేవి. కనీసం రోడ్లు, విద్యుత్‌ లాంటి మౌలిక సదుపాయాలేవీ లేక కోటానుకోట్ల భారతీయులు అవస్థపడేవారు. సరికొత్త భారత్‌ను ఆవిష్కరించుకోవడం అప్పుడొక పెద్ద సవాల్‌. అలాంటి కఠిన సవాలును ఛేదించే లక్ష్యంతోనే ఏర్పాటయ్యాయి వివిధ ప్రభుత్వరంగ సంస్థలు. ఆనాటి కలలను సాఫ్యలం చేసుకోవడానికి అవసరమైన పెట్టుబడులు ప్రయివేట్‌ రంగం నుంచి రాలేదు. ప్రభుత్వరంగం నుంచే వచ్చాయన్నది ఎవరూ దాచిపట్టలేని వాస్తవం.

ఆ రోజుల్లో తొలి అడుగు వేసింది ప్రభుత్వమే..
మౌలిక సదుపాయాలు సమకూర్చడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, సందలను ఆదాయాలను ప్రజలకు పంపిణీ చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య సమతూకం సాధించడం, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించడం ఇలాంటి ఎన్నో మహోన్నత ఆశయాలను సాధించే లక్ష్యంతో ఏర్పాటైనవే ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ ఆ రోజుల్లో కరెంట్‌ లేదు. ఆయిల్‌ లేదు. స్టీల్‌ లేదు. భారీ యంత్రాలు లేవు. ఇలా ఈ సువిశాల భారతదేశంలో ఏ సౌకర్యం సమకూర్చుకోవాలన్నా తొలి అడుగు వేసింది ప్రభుత్వ రంగమే.

రేయింబవళ్లు శ్రమించిన కార్మికులు...
భిలాయ్‌, రూర్కెలా, దుర్గాపూర్‌, సింద్రిలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో స్టీల్‌, ఎరువులు లాంటి భారీ పరిశ్రమలు పెట్టే సాహసం ప్రయివేట్‌ రంగం చేయగలదా? కానీ అత్యంత వెనుబడిన మారుమూల ప్రాంతాల్లో సైతం తమకు అప్పగించిన బాధ్యతలను మన ప్రభుత్వరంగ సంస్థలు ధైర్యంగా స్వీకరించాయి. రాళ్లు - రప్పలు, కొండలు - గుట్టలు, తేళ్లు పాములు తిరిగే ప్రాంతాల్లో గుడ్డి దీపాలైనా కురువైన రోజుల్లో, కనీసం మంచినీళ్లయినా దొరక్కపోయినా అలాంటి ఇబ్బందులేవీ లెక్కచేయకుండా మన ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి చక్కటి మౌలికవసతులు సమకూర్చిపెట్టారు. ఒక్కొక్క ప్రభుత్వరంగ సంస్థను నిర్మించడానికి, దానిని బలోపేతం చేయడానికి నాటితరం తమ రెక్కలు ముక్కలు చేసుకున్న తీరు, తమ రక్తమాంసాలు ధారపోసిన తీరు నేటి రాజకీయ నేతలకు తెలియకపోవచ్చు.

పది లక్షల  కోట్లకు చేరుకున్న పెట్టుబడులు..
మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో కేవలం 29 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమైన మన ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులు ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మన ప్రభుత్వరంగ సంస్థలు కొన్ని లక్షల మందికి ఉద్యాగాలిచ్చాయి. ప్రయివేట్‌ రంగంలోని అనేక నష్ట జాతక సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకుని, మరికొన్ని లక్షల మంది ఉద్యోగాలను,జీవితాలను నిలబెట్టాయి. మన దేశంలోని మొత్తం పారిశ్రామిక రంగం కల్పించిన ఉద్యోగాల్లో రెండింటి మూడొంతుల ఉద్యోగాలను ప్రభుత్వరంగ సంస్థలే ఇచ్చాయన్నది ఎవరూ కప్పిపెట్టలేని వాస్తవం. ఉద్యోగుల, కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడంలోనూ, పని పరిస్థితులు మెరుగుపరచడంలోనూ, భద్రత కల్పించడంలోనూ మన ప్రభుత్వరంగ సంస్థలు రోల్‌ మోడల్‌గా నిలిచాయి. అంతేనా, ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేశాయి. నీళ్లిచ్చాయి. పార్కులు ఏర్పాటు చేశాయి. విద్య, వైద్య సంస్థలు నెలకొల్పాయి. టౌన్‌ షిప్స్‌ ఏర్పాటు చేశాయి. ప్రతి ప్రభుత్వరంగ సంస్థ తన పెట్టుబడుల్లో కనీసం పది శాతం నిధులు ప్రజా సంక్షేమానికే వినియోగించాయి. వినియోగదారులకీ సరసమైన ధరలకే ఉత్పత్తులు అందించాయి. ఇలాంటి చరిత్ర తమకూ వుందని ఏ ఒక్క ప్రయివేట్‌ సంస్థ అయినా గుండెల మీద చేయి వేసి చెప్పగలదా?

ప్రభుత్వరంగ సంస్థల వార్షిక లాభాలు లక్ష కోట్ల పై మాటే..
ఎంఎంటీసీ, హిందుస్థాన్‌ స్టీల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌ఎంటీ లాంటి సంస్థలు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించిపెట్టడంలో పోషించిన పాత్రను ఎవరైనా విస్మరించగలరా? హిందుస్థాన్‌ యాంటీ బయోటిక్స్‌, ఐడీపీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లాంటి సంస్థలు దిగుమతుల భారాన్ని తగ్గించడంలోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలోనూ పోషించిన పాత్రను కాదనగలమా? మనదేశంలో వెలుగులు విరజిమ్మడంలో కోల్‌ఇండియా, ఎన్టీపీసీ సంస్థలు, ఆయిల్‌ గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీయడంలో ఓఎన్‌జీసీ పోషిస్తున్న పాత్రకు వెలకట్టగలమా? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలోనూ, రీసెర్చి అండ్‌ డవలప్‌మెంట్‌ వింగ్‌లోనూ మన ప్రభుత్వరంగ సంస్థలు దమ్ము చూపిస్తున్నాయి. వివిధ రకాల పన్నులు, డివిడెండ్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్షా 60 వేల కోట్ల రూపాయల ఆదాయం ముట్టచెబుతున్నాయి. మన దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల వార్షిక లాభాలు లక్ష కోట్ల పై మాటే.

ఇన్ని రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల విషయంలో దేశభక్తి స్వభావం గల ఏ ప్రభుత్వామైనా ఏం చేస్తుంది? వాటిని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వరంగ సంస్థలకు తోడుగా మరికొన్ని సంస్థలను నెలకొల్పి జాతిరుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది కానీ, 1991 ప్రభుత్వాలు బడ్జెట్‌ సపోర్ట్ ఇవ్వడం మానేశాయి. మన ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం మొదలుపెట్టాయి. ఇలా అమ్ముకోగా వచ్చిన డబ్బులతో రోజువారీ ఖర్చులు వెళ్లదీస్తున్నాయి. దేశంలో సంక్షేమ, అభవృద్ధి పథకాలకీ నిధులు లేవంటున్న ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం ఏటా అయిదున్నర లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్నాయి. తమ శక్తి సామర్థ్యాలతో మన ప్రభుత్వరంగ సంస్థలు చెమటోడ్చి రూపాయి సంపాదించుకొస్తే, దానికి మరో నాలుగు రూపాయలు జత చేసి, కార్పొరేట్‌ సంస్థలకు నైవేద్యం పెడుతున్నాయి మన ప్రభుత్వాలు. ఈ దేశం పట్ల బాధ్యత గల ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా ఇది?

అమ్మాలను కోవడం ధర్మమేనా ?
రీసెర్చి అండ్‌ డవలప్‌మెంట్‌కి 1991 నుంచే ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు మానేసినా, మన ప్రభుత్వరంగ సంస్థలు అధైర్యపడలేదు. తమకున్న వనరులతోనే ప్రయివేట్‌, కార్పొరేట్‌, విదేశీ సంస్థలతో పోటీ ఔరా అనిపించాయి. తమ దమ్మేంటో చూపించాయి. అలాంటి సంస్థలను అమ్మాలనుకోవడం ధర్మమేనా? చివరకు దేశ భద్రతకు సంబంధించిన డిఫెన్స్‌ రంగంలోకి కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారంటే ఇక ఏమనాలి?  

తెలంగాణలో నేడు హజ్ శిబిరం..

హైదరాబాద్ : నేటి నుండి నాంపల్లిలోని హౌజ్ హౌస్ లో హజ్ శిబిరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి యాత్రికుల ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 

కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఆదివారం అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తాలో అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 

తెలంగాణలో నేడు హజ్ శిబిరం..

హైదరాబాద్ : నేటి నుండి నాంపల్లిలోని హౌజ్ హౌస్ లో హజ్ శిబిరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి యాత్రికుల ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 

తెలంగాణలో నేడు హజ్ శిబిరం..

హైదరాబాద్ : నేటి నుండి నాంపల్లిలోని హౌజ్ హౌస్ లో హజ్ శిబిరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి యాత్రికుల ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 

07:04 - August 31, 2015

ఖమ్మం : సాధించాలన్న తపన ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ లేదంటున్నాడు ఓ బాలుడు. కార్పొరేట్‌ స్కూల్స్ లోనే కాదు... ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రతిభకు కొదవ లేదంటున్నాడతను. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. జశ్వంత్‌. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. నిత్యం ఏటీఎంలను పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లడం లాంటి వార్తలను చూసిన ఈ బాలుడు... దీని నివారణ కోసం ఏదైనా చేయాలని భావించాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం... ఫుల్లీ ప్రొటెక్టడ్‌ ఏటీఎంను తయారుచేశాడు. ఎవరైనా బలవంతంగా ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నిస్తే ఆటోమెటిక్‌గా మెయిన్‌డోర్‌ లాక్‌ అవుతుందని.. వెంటనే బ్యాంక్‌ సిబ్బందికి సమాచారం వెళ్లడమే కాకుండా... సైరన్‌ మోగి స్థానికులను అప్రమత్తం చేస్తుందని జశ్వంత్‌ అంటున్నాడు.

గర్వంతో ఉప్పొంగుతున్న ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు..
ఇక జశ్వంత్‌ ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్ధులకు తీసిపోని విధంగా తమ స్కూల్‌ విద్యార్ధి ప్రతిభ చాటడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే పాఠశాల ప్రదర్శనలో ఈ పరిజ్ఞానంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రదర్శిస్తామని ఉపాధ్యాయులంటున్నారు. జశ్వంత్‌లాంటి వారిని ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్ధుల్లో మానసిక స్థైర్యం పెరుగుతుందంటున్నారు.
చేయాలనే పట్టుదల ఉండాలే కానీ.. పల్లెటూరు అయినా పట్నం అయినా ఒక్కటే అని చెప్పడానికి జశ్వంత్‌ ప్రదర్శిస్తున్న ప్రతిభే నిదర్శనం. జశ్వంత్‌ ప్రతిభను ఆదర్శంగా తీసుకుని మరెంతమందో ఇలాంటి ఆవిష్కరణలు రూపొందించాలని ఆశిద్ధాం. 

06:45 - August 31, 2015

కరీంనగర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దేందుకే ప్రభుత్వం సైన్స్‌ఫేర్‌లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ అన్నారు. కరీంనగర్‌ ఆల్పోర్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి" ఇన్‌స్పైర్‌" కార్యక్రమానికి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పిల్లలు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రయోగలను రెబ్బన్‌ కట్‌ చేసి తిలకించారు. పిల్లలు తయారు చేసిన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలను వాటి వివరాలు అడిగి అవి పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. చేయబోయే ప్రయోగాలు, రాబోయే ప్రమాదాలను అరికట్టే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా చిన్నరులు ప్రదర్శించిన డ్యాన్స్‌లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

06:41 - August 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై యుజీసీ కన్నెర్రజేసింది. యూనివర్సిటీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడింది. ఇక నుంచి యూజీసీ గ్రాంట్ల నుంచి కోతలు కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పొంతనలేని లోపాలు చూపి నాణ్యతలేని పరిశోధనలు కుప్పలుగా పంపుతున్నారంటూ ఫైర్ అయింది. తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలకు ఇంకా గడ్డుకాలం వెంటాడుతూనే వుంది. అసలే యూనివర్సిటీలు ప్రొఫెసర్లు లేక విలవిలాడుతుంటే..ఇప్పుడు యూజీసీ క్లాస్‌తీసుకోవడం తలనొప్పిగా మారింది.

అభిప్రాయాలు వ్యక్తం చేసిన యూజీసీ..
విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీల క్వాలిటీ తగ్గిపోతున్న నేపథ్యంలో యూజీసీ తన అభిప్రాయాలను వెల్లగక్కింది. ఒక్క ప్రొఫెసర్ కింద ఎనిమిది మంది పీహెచ్‌డీ స్కాలర్స్ మాత్రమే ఉండాలి. కానీ రాష్ట్రంలో ఏకంగా పది నుంచి పదిహేను మందికిపైగా కొనసాగుతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే కఠిన చర్యలు తప్పవనే హింట్‌ని తాజాగా యూజీసీ వర్గాలు అందించాయి. దీంతో...వర్సిటీలకు నిధులకు ఎక్కడ అడ్డుకోగలుగుతారోనని వర్సిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం..
యూజీసీ ఆగ్రహం చెందడంపై వర్సిటీ ప్రొఫెసర్లు తమ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల ఒత్తిడిమేరకు కొందరు సూపర్‌వైజర్స్ విద్యార్థులకు గైడ్‌లుగా వ్యవహరిస్తున్నారని కొందరు ప్రొఫెసర్‌లు చెబుతున్నారు. అధికారుల సమాధానం అలా ఉంటే...యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగాలతో పోలిస్తే సగానికి పైగా సోషల్ సైన్స్ డిపార్టుమెంట్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. అటు విద్యావేత్తలు కూడా యూనివర్సిటీల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గైడ్ కింద పదుల సంఖల్లో పరిశోధనలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విధానాన్ని నియంత్రించలేకపోతే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోపాలను సరిదిద్ది యూనివర్శిటీలను, ఉన్నత విద్యను బతికించాలని విద్యావేత్తలు సైతం సూచిస్తున్నారు.

06:35 - August 31, 2015

హైదరాబాద్ : పక్క రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోలు, డీజిల్ డీలర్లు ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ పిలుపు మేరకు సోమవారం పెట్రోలు బంకుల బంద్ పాటిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు అన్ని పెట్రోలు బంక్‌లను మూసివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ తొలి హెచ్చరికగా బంకులన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేయాలని నిర్ణయించారు. బంకులను మూసివేసి, వాటి యజమానులు నిరసనలో పాల్గొంటారు. సోమవారం రోజంతా పెట్రోలు, డీజిల్ విక్రయాలు, కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు.

40 శాతం పడిపోయిన విక్రయాలు...
రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం పెట్రోలు, డీజిల్ విక్రయాలపై 4 శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం రాష్ట్రంలో 4 శాతం వ్యాట్ విధించడం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏపీలో డీజిల్ విక్రయాలు దాదాపు 40 శాతం పడిపోయాయి.

వ్యాట్ ను ఎత్తివేయాలి..
మరోవైపు పెట్రోలు బంకులపై ఇటీవల కాలంలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న దాడులను ఆపాలని డీలర్లు కోరుతున్నారు. మామూళ్లకోసం అగ్నిమాపక సిబ్బంది తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. రవాణా వాహనాలకు సంబంధించి ఆయిల్ ట్యాంకర్లకు వచ్చే కిరాయిపై కూడా ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌ను ఎత్తివేయాలని పెట్రోలు, డీజిల్‌ డీలర్లు కోరుతున్నారు. 

06:33 - August 31, 2015

హైదరాబాద్ : నేటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైసీపీ సిద్ధమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో...టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేలా వైసీపీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీలో వ్యవహరించాల్సి తీరుపై ఎమ్మెల్యేలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా 19 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల ముందుకు తీసురావాలని యోచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణం, రాజమండ్రి పుష్కరాల్లో తొక్కసలాట, ముసునూరు ఎమ్మార్వోపై ఎమ్మెల్యే దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలుడిపై ఎలుకల దాడి, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, కొత్తమాజేరులో విష జ్వరాలు వంటి అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించింది.

క్లారిటీ ఇచ్చిన జగన్...
ఏ అంశంపై ఎవరు మాట్లాడాలనే దానిపైనా నేతలకు జగన్ క్లారిటీ ఇచ్చారు. పోలవరం, రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటపై జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతారు. రాజధాని నిర్మాణం, భూసేకరణపై ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే రిషితేశ్వరి ఆత్మహత్య, ముసునూరు ఎమ్మార్వోపై ఎమ్మెల్యేదాడి, నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యపై తగిన వివరాలను సిద్ధం చేసుకోవాలని రోజాతో పాటు కోటం శ్రీధర్‌రెడ్డికు సూచించారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, భోగాపురం ఎయిర్‌పోర్టు వివాదంపై సుజయకృష్ణ రంగారావు, రైతు ఆత్మహత్యలు, రుణాలు రీషెడ్యూల్, రుణమాఫీపై విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గిడ్డి ఈశ్వరి మాట్లాడుతారు.

వైసీపీ కేటాయించే సమయంపై నేడు నిర్ణయం..
వైసీపీకి కేటాయించే సమయంపై...బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను స్పష్టత కోరనుంది. జగన్‌కు ఎన్ని గంటల సమయం ఇస్తారు? ఏ ఏ అంశాలపై చర్చకు అనుమతిస్తారనే దానిపై వైసీపీ క్లారిటీ తీసుకోనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి..అధికార టిడిపికి ముచ్చెమటలు పట్టిస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.

06:31 - August 31, 2015

హైదరాబాద్ : ఏపీ సభా సమరానికి సర్వం సిద్ధమైంది. మాటల యుద్ధానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సర్కార్‌కు చుక్కలు చూపించేందుకు వైసీపీ అస్త్రాలను సిద్ధం చేసింది. ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్లాన్ గీసింది. ఇక అసెంబ్లీ వేదికగా జగన్ పార్టీ వ్యూహాల్ని... చిత్తు చేసేందుకు తమ్ముళ్లు వ్యూహరచన చూస్తున్నారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో హాట్ హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రతిపక్షం వైసీపీ... ఇటు అధికారపక్షం టిడిపి, బిజెపిలు సై అంటే సై అంటూ సమావేశాలకు రెడీ అవుతున్నాయి.

మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం..
ప్రత్యేకహోదా, రాజధాని భూసేకరణ, పుష్కరాల తొక్కిసలాట, రైతు రుణమాఫీ అమలు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతుల అవస్థలు తదితర అంశాలు సర్కారును కలవరపెడుతున్నాయి. దీనిపై విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయిన సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ప్రతిపక్షం ప్రధానంగా లేవనెత్తే అంశాలు.. ఏ టాపిక్‌పై ఎవరు స్పందించాలి? ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న దానిపై చంద్రబాబు పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వ హామీల అమలుపై జగన్ గళం..
ఇటు వైసీపీ కూడా టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న అనేక సమస్యలు ఈ పార్టీకి ఆయుధంగా మారనున్నాయి. ప్రభుత్వ హామీల అమలుపై సర్కారును నిలదీయాలని జగన్‌ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ సమస్యలపై ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడిపెంచాలని జగన్‌ ఇప్పటికే ఆపార్టీ నేతలు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఐదు రోజులపాటు జరగబోయే ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను అధికార, ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకున్నాయి. 

06:28 - August 31, 2015

హైదరాబాద్ : బల్కంపేట్ ఎస్ బిఐ బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఆ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నీచర్‌, కంఫ్యూటర్‌లు దగ్ధమయ్యాయి. బ్యాంకులోంచి మంటలు ఎగసిపడటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలు ఆర్పారు.
షార్ట్ సర్య్కూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో కొన్ని కంఫ్యూటర్‌లు, ఫర్నీచర్ మాత్రమే దగ్ధమయ్యాయని లాకర్ రూం, ముఖ్యమైన ఫైళ్ళకు ఏమీ జరగలేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఘటనాస్థలిని పలువురు నేతలు సందర్శించారు.

ఎస్ఆర్ నగర్ బ్యాంకులో ఫైర్ ఆక్సిడెంట్..

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ ఎస్ బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నీచర్ మంటలకు ఆహుతయ్యాయ్యి. భారీగా ఆస్తినష్టం కలిగింది.

 

తెలంగాణలో నేడు వామపక్షాల బైక్ ర్యాలీ..

హైదరాబాద్ : సెప్టెంబర్ 2వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వామపక్షాల పార్టీలు నేడు తెలంగాణ రాష్ట్రంలో బైక్ ర్యాలీ నిర్వహించనుంది. 

కర్నూలులో నేడు రఘువీరా పర్యటన..

కర్నూలు : నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ రఘువీరా పర్యటించనున్నారు. జూపాడబంగ్లా (మం) టంగడంచలో పుడ్ పార్కు రైతుల భూములను రఘువీరా పరిశీలించనున్నారు. 

ఏపీలో మూత పడిన పెట్రోల్ బంక్ లు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. పెట్రోల్, డీజీల్ పై పెంచిన వ్యాట్ కు నిరసనగా పెట్రోల్ డీలర్ల సంఘం బంద్ కు పిలుపునిచ్చింది. 

Don't Miss