Activities calendar

01 September 2015

22:36 - September 1, 2015

హైదరాబాద్ : అసలే అంతంత మాత్రం హక్కులు. వాటినీ హరించడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ వేయడం కోసం కార్మికుల ప్రయోజనాలకు రెడ్‌సిగ్నల్‌ చూపిస్తున్నారు. అందుకే సమ్మె సైరన్‌ మోగింది. సర్కార్‌ ద్వంద్వ విధానాలపై కార్మికలోకం గర్జించింది. రేపటి నుంచి జరగనున్న సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్ కార్మికలోకం సమ్మెతో కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు.

చారిత్రాత్మక సమ్మె.. 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా యావత్‌ కార్మికలోకం మండిపడుతోంది. ఈ దుష్ట ఆర్ధిక విధానాలను నిరసిస్తూ  సెప్టెంబర్‌ 2 బుధవారం నుంచి చారిత్రాత్మక సమ్మెకు కార్మికులు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక్కటై కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తున్నాయి. సమ్మెతో పాలకులకు షాక్‌ ఇవ్వనున్నాయి. బిజెపీ అనుబంధ సంఘం BMS మినహా అన్ని కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి.

వెట్టి బానిసలుగా కాంట్రాక్ట్ కార్మికులు
ఆర్థిక విధానాల అమలుతో పారిశ్రామిక రంగంలో కాంట్రాక్ట్,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సంఖ్య లెక్కకు మించి పెరిగిపోయింది. ఇక పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్‌ సిబ్బందిని వినియోగించకూడదనే నిబంధనలు కార్మిక చట్టం చెబుతోంది. అంతేకాక పర్మినెంట్ ఉద్యోగంలో కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తే పర్మినెంట్ ఉద్యోగికి ఇచ్చే అలవెన్సులు, వేతనమే కాంట్రాక్ట్ కార్మికుడికి ఇవ్వాలని కూడా చట్టాలు చెప్తున్నాయి. కాని ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో కాంట్రాక్ట్‌ కార్మికులు వెట్టి బానిసలయ్యారు. ఈ దుస్ధితిని మార్చాలని కార్మిక సంఘాలు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నాయి. క్యాబినెట్‌ సబ్‌కమిటీతో పలు మార్లు చర్చలు జరిపాయి. అయినా ఫలితం శూన్యం. కార్మిక సంఘాల డిమాండ్లలో దేన్ని అంగీకరించాలన్న చిత్తశుద్ధి ఇటు క్యాబినెట్ సబ్‌ కమిటీలో కాని అటు ప్రభుత్వంలో కాని ఇసుమంతైనా కన్పించకపోవటంతో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాయి.

15 వేలు కనీస వేతనం ఇవ్వాలి..
నెలకు 15వేల రుపాయలు కనీస వేతనంగా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. కనీస వేతనం ఏడు వేల కంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని స్పష్ఠం చేసాయి. కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరించి, సమ్మె హక్కు లేకుండా చేయాలని, హైర్‌ అండ్ ఫైర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావించటం అత్యంత ప్రమాదకరం. ఇన్ని విపత్కర పరిణామాలకు పాతర వేయాలనే బృహత్తర లక్ష్యంతో కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు.
ఏకతాటిపైకి... 
దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు ఏకతాటిపైకి వచ్చి చేస్తున్న ఈ సమ్మెతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వణుకు పుడుతోంది. కార్మికలోకం ఐక్యత పెను కలవరాన్ని పుట్టిస్తోంది. ఎలాగైనా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసి తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని పాలకులు కుయుక్తులు పన్నుతున్నారు. అయినా వెన్ను చూపని కార్మికలోకం కార్పొరేట్ శక్తులకు గట్టి షాక్‌ ఇస్తామని స్పష్టం చేసింది.

ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిపై 420 కేసు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో పరిగి పోలీసులు ఆయనపై సెక్షన్ 420 సహా 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించారు. విచారణలో రామ్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. 

21:34 - September 1, 2015

హైదరాబాద్ : షీనా బోరా హత్యకు గురి కాలేదా? నిజంగానే ఆమె అమెరికాలో బతికే ఉందా? షీనా బోరా హత్య కేసు విచారణలో ఇంద్రాణి ముఖర్జీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు షీనా బోరాను డబ్బు కోసమే ఇంద్రాణి ముఖర్జీ హత్య చేసి ఉంటుందని ఆమె మొదటి భర్త ఆరోపించారు.

షీనా బోరా అమెరికాలో సజీవంగానే ఉందంటున్న తల్లి ఇంద్రాణి

షీనా బోరా హత్య కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తూ రోజుకో మలుపు తిరుగుతోంది. షీనా బోరాను తాను చంపలేదు..., అమెరికాలో ఉంటోందని పోలీసుల విచారణలో ఇంద్రాణి ముఖర్జి తెలిపారు. తనపై ఉన్న ద్వేషంతోనే ఆమె ఎవరికీ కనిపించకుండా ఉండిపోయిందని ఇంద్రాణి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. షీనా బోరా పాస్‌పోర్టును రాహుల్‌ నుంచి తాము స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పగా... రెండో పాస్‌పోర్ట్‌ ద్వారా తన కూతురు అమెరికా వెళ్లినట్టు ఇంద్రాణి సమాధానమిచ్చారు.

డబ్బు కోసమే షీనాను ఇంద్రాణి చంపి ఉంటుందన్న మొదటి భర్త.....

డబ్బు కోసమే తన కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ పొట్టన పెట్టుకుందని తండ్రి సిద్ధార్థ్‌దాస్‌ ఆరోపించారు. షీనా మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ మొదటి భర్త సిద్ధార్థ్‌దాస్‌. షీనా బోరా, మిఖల్ బోరా వీరికి పుట్టిన పిల్లలే. అయితే ఇంద్రాణి ముఖర్జీని తాను పెళ్లి చేసుకోలేదని 1986-89 మధ్య మేమిద్దరం కలిసి సహజీవనం చేశామని, ఆ తర్వాత ఆమె తనకు దూరమైందని చెప్పారు. ఇంద్రాణి ముఖర్జీ డబ్బుపై మక్కువ ఎక్కువని, తనకు ఉద్యోగం లేనందునే ఆమె తనని విడిచి వెళ్లి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఇంద్రాణి ముఖర్జీయే షీనాను చంపినట్టయితే ఆమెకు ఉరిశిక్ష వేయాలన్నారు. షీనా హత్య కేసులో పోలీసులకు సహకరిస్తానని సిద్ధార్థ్‌దాస్‌ స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా సిద్ధార్థ్‌దాస్‌ తన కుటుంబంతో కోల్‌కతాలోనే ఉంటున్నారు.

గత వారం రోజులుగా పోలీసులు ప్రశ్నిస్తూనే...

షీనా బోరా హత్య కేసులో గత వారం రోజులుగా ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నేరుగా ముంబై పోలీస్‌ కమిషనర్‌ రాకేష్‌ మారియానే ఆమెను ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు. ఆమెను గంటల తరబడి ప్రశ్నించినా తన న్యాయవాదిని సంప్రదించాలన్న సమాధానమే ఎదురవుతోంది. విచారణాధికారులు ఇంద్రాణిని తప్పుదోవ పట్టిస్తున్నారని, కొడుతున్నారని ఆమె తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు.

షీనా బోరా 2012, ఏప్రిల్‌ 24న హత్యకు గురైనట్టు కేసు నమోదు......

24 ఏళ్ల షీనా బోరా 2012, ఏప్రిల్‌ 24న హత్యకు గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ స్టార్‌ సిఇఓ పీటర్‌ ముకర్జీయా భార్య ఇంద్రాణి ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షీనా కేసులో ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా షీనా అమెరికా వెళ్లిందని మూడేళ్లుగా ఇంద్రాణి చెబుతూ వచ్చింది... షీనా నిజంగా అమెరికా వెళ్లిందా, లేదా అనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షీనా హత్యకు గురైన సమయంలో అమెరికా వెళ్లిన ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. విచారణలో తన రెండో భర్త సంజీవ్‌ ఖన్నాపై ఇంద్రాణి ఆరోపణలు చేస్తోంది. షీనా బోరే మూడేళ్ల క్రితమే హత్యకు గురైనట్టు పోలీసులు నమ్ముతున్నారు.

21:30 - September 1, 2015

హైదరాబాద్ : గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటోంది. ఆయన వస్తాడనే వార్తలతో ప్రత్యర్థుల గుండెలు ఝల్లుమంటున్నాయ్‌. ఓరుగల్లులో గద్దర్‌ గజ్జె కట్టి ఘల్లుమనిపిస్తారనే వార్తలు ప్రధాన పార్టీలకు కలవరం పుట్టిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక బరిలో ప్రజా గాయకుడు గద్దర్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నాయి వామపక్షాలు. తమ ప్రతిపాదనను గద్దర్‌ ముందు ఉంచబోతున్నట్టు చెప్పిన నేతలు.. ఆయన స్పందన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

గద్దర్‌ను నిలపాలని భావిస్తున్న వామపక్షాలు...

వరంగల్‌ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రజా గాయకుడు గద్దర్‌ను నిలపాలని భావిస్తున్నట్టు వామపక్షాలు నేతలు ప్రకటించారు. హైదరాబాద్‌లో సమావేశమైన పది వామపక్ష పార్టీల నేతలు.. గద్దర్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే.. ఈ ప్రతిపాదనను గద్దర్‌ ముందు ఉంచబోతున్నామన్న నేతలు.. ఆయన స్పందన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

గద్దర్‌ విజయమే నాంది కావాలని....

తెలంగాణలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి.. వరంగల్‌ ఉప ఎన్నికలో గద్దర్‌ విజయమే నాంది కావాలని లెఫ్ట్‌ నేతలు ఆకాంక్షించారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేస్తున్నాయన్న వామపక్ష నేతలు.. వాటిని పరిరక్షించుకునేందుకు ప్రజలతో, ప్రజాసంఘాలతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. మరో వైపు రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని గద్దర్ ప్రకటించారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన బైకు : ఒకరి మృతి

శ్రీకాకుళం : డివైడర్‌ను బైకు ఢీకొనడంతో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పలాస మండలం సుమాదేవిరోడ్డు వద్ద జరిగింది. బైకు టైర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మృతుడు మందస మండలం కేఎస్‌పురానికి చెందిన లింగరాజుగా గుర్తించారు.

21:14 - September 1, 2015

హైదరాబాద్ : వచ్చిన వారందరికీ రెడ్‌కార్పెట్ పరిచారు. రండి..రండంటూ...ఘనంగా ఆహ్వానం పలికారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ పెద్ద పీట వేశారు. దీంతో కొత్త స్నేహం చిగురించింది. పాత బంధానికి బ్రేకు పడింది. దీంతో బాల్య మిత్రులు అసంతృప్తిగా ఉన్నారు. కొత్త మిత్రులు వచ్చాక...పాత దోస్తులను మర్చిపోయారని వాపోతున్నారు. ఈ వ్యవహారంతో..అసలైన సమయంలో.. అధినేతకు కొత్త తలనొప్పి మొదలైంది. గ్రేటర్‌లో తలసానికే తలకాయ ఉందా.. మాకు లేదా.. ఇదే ఇప్పుడు సంప్రదాయక గులాబీ నేతల గుండెలను తొలిచేస్తున్న ప్రశ్న.

గ్రేటర్ ఎన్నికలే టార్గెట్‌గా...

గ్రేటర్ ఎన్నికలే టార్గెట్‌గా...టీఆర్‌ఎస్‌ ప్లాన్ రెడీ చేసింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ముఖ్యనేతలను పార్టీలో కలుపుకుంది. అన్ని వర్గాల నాయకులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అందర్నీ కేబినెట్‌లో చేర్చుకొని...గ్రేటర్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాని కొత్తవారికి ప్రాధాన్యమివ్వటాన్ని...పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

తలసానికి ప్రాధాన్యత ఇవ్వటంపై అసంతృప్తి....

గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడిన సమయంలో గులాబీబాస్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇటీవల పార్టీలోకి వచ్చిన వలస నేతలకు....ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాత నేతలకు మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నాయినీ నర్సింహ్మారెడ్డి, మహమూద్ అలీ...ఉద్యమంలో పాల్గొన్నారు. కాని రాష్ట్రం ఏర్పాటయ్యాక...పార్టీలోకి వచ్చి...ప్రాధాన్యత తెచ్చుకున్న తలసాని వ్యవహారం వారికి రుచించటం లేదు.

సనత్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు శ్రీకారం......

కేసీఆర్‌తో మంచి పేరు తెచ్చుకునేందుకు..తలసాని అవకాశం వచ్చినప్పడల్లా ప్రయత్నిస్తున్నారు. సీఎం కూడా తలసానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. తలసాని పార్టీలో చేరకముందే.... సనత్‌నగర్‌లో కేసీఆర్ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచీ...పట్టుకోసం తలసాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగానే కేసీఆర్...ఇళ్ల నిర్మాణ బాధ్యతలను, గృహ నిర్మాణంపై వేసిన సబ్‌కమిటీ బాధ్యతలను వలస నేతకు అప్పగించారు.

కేసీఆర్‌తో అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు......

తలసానికి ప్రాధాన్యత ఇవ్వటం..పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. తలసానిపై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలంతా...కేసీఆర్‌తో అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా... సొంత ఇమేజ్‌ కోసం ఆరాటపడుతన్న వలసనేతకు ఎందుక ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను కూడా తలసానికే...అప్పగిస్తారా...అని మంత్రుల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అసలైన గ్రేటర్ ఎన్నికల సమయంలో నేతల మధ్య అగాధం ఏర్పడటం...కేసీఆర్‌కు ఇబ్బందిగా మారింది. అసలే బలహీనంగా ఉన్న గ్రేటర్‌లో...నేతల మధ్య సయోధ్య లేకపోవటం... తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదముందని నేతలు వాపోతున్నారు.

20:31 - September 1, 2015

హైదరాబాద్‌ : ఎవరైనా సరే తనకు తాను ఎదగాలని కానీ.. అండదండలు చూసుకుని ముందుకెళ్లకూడదని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. వరుణ్‌తేజ కంచె సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... పెద్ద సినిమా ఫ్యామిలీ నుండి వస్తున్నవారికి ఆ కుటుంబం నుండి రావడం ఎంత వరమో.. అంతే శాపమన్నారు. ఇండస్ట్రీలో ముందు నుండి కొనసాగుతున్న వారు సలహాలు ఇస్తుంటారని, ప్రతి విషయాన్ని ఇతర దానితో పోలుస్తారని చెప్పారు. వరుణ్‌ తేజ తనకు తాను పైకి ఎదగాలని రాజమౌళి ఆకాంక్షించారు. వరుణ్‌ నటన తీరు, ఎంచుకుంటున్న సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయన్నారు. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి రాజమౌళి మాట్లాడిన మాటలను మీరే వినేయండి.

19:59 - September 1, 2015

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుష్ట ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక లోకం మరోసారి దేశ వ్యాప్తంగా సమ్మె శంఖారావాన్ని మోగించింది. ఇలాంటి చారిత్రాత్మకమైన సమ్మె ఏఏ అంశాలు కారణమయ్యాయి. వెట్టి చాకిరీ చేస్తున్ కాంట్రాక్ట్ కార్మికులు, హైర్ అండ్ ఫైర్ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందా? కార్మికుల దేశ వ్యాప్త సమ్మెతో కేంద్రం వెన్నులో వణుకు పుడుతోందా? దుష్ట ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న కార్మికలోకం, కనీస వేతనం ఇవ్వాలనే ప్రతిపాదనకు ససేమిరా అన్న క్యాబినెట్ సబ్ కమిటి, సమ్మెలు ప్రగతికి వ్యతిరేకమా? సవరణల పేరుతో నరేంద్ర మోడీ మొదటి దాడి కార్మికుల మీద ఎందుకు చేస్తోంది? సమాన పనికి సమాన వేతనం ఇస్తోందా? ఇదే అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సిఐటియు నేత గఫూర్, ఐఎన్ టియుసి నేత క్రాంతి కుమార్, బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు, ఏఐటియుసి నేత రమారావు పాల్గొన్నారు. ఎలాంటి అంశాలపై వీరు చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఆర్కేబీచ్‌లో ముగ్గురు గల్లంతు

విశాఖపట్నం: ఆర్కేబీచ్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిలో ఒకరిని స్థానికులు కాపాడారు. గల్లంతైన వారిలో మహేశ్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతుడు విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గద్దర్ పోటీ చేయాలి : తమ్మినేని

హైదరాబాద్: వరంగల్ లోక్ సభ ఉపెన్నికలలో గద్దర్ తో పోటీ చేయించాలని మేధావులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాద్ లో 10 వామపక్ష పార్టీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణంలో గద్దర్ పాత్ర కీలకమని, ప్రస్తుత పరిస్థితుల్లో గద్దర్ పోటీ చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 10వ తేదీన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం నుండి ఉపెన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. 

వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరుపున గద్దర్?

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ ను పోటీకి నిలబెట్టాలని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో వామపక్షాలకు చెందిన పది పార్టీలు సమావేశమయ్యాయి. సమావేశంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గద్దర్ ను నిలబెట్టాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. గద్దర్ ను నిలబెడితే విజయం సాధిస్తామని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ పోరాటంలో గద్దర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న పార్టీలు ఆయనను వామపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలోకి దించనున్నాయి. అదే జరిగితే వరంగల్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.  

19:05 - September 1, 2015

హైదరాబాద్ : తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీ సీట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఇప్పటికే సీటు పొందిన ఏయూ పరిధిలోని విద్యార్థులకు...అడ్మిషన్లు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు 85 శాతం కేటాయించాలన్న నిబంధనలను తుంగలో తొక్కి... 13 జిల్లాలలోని విద్యార్థులకు మొదట సీట్లు కేటాయించారు. చాలావరకు సీట్లను ఏయూ పరిధిలోని విద్యార్థులకే కేటాయించారు. దీంతో రాయలసీమ విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రం మొత్తాన్ని లోకల్‌గా పరిగణించి సీట్లను కేటాయించారని కోర్టుకు విన్నవించారు. కోర్టు విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో.. ఇప్పటికే సీట్లు పొందిన ఏయూ పరిధిలోని విద్యార్థులకు అడ్మిషన్లను నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు : జేసీ

హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. ఈ విషయం అందరికీ అర్థమైందని, అయినా.. ఇంకా హోదా అడగడంలో అర్థం లేదన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో నీతి నిజాయితీలు లేనే లేవన్న జేసీ.. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు తీసుకునేవారు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు.

19:02 - September 1, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేలును జగన్‌ వివరిస్తే.. హోదా వల్ల మాత్రమే అన్నీ వచ్చే అవకాశం లేదన్నారు ఏపీ సీఎం.

ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలపై...

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలపై, దానివల్ల కలిగే లాభాలపై శాసనసభలో సుదీర్ఘ చర్చజరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ.. స్పెషల్‌ స్టేటస్‌ వల్ల రాష్ట్రానికి 90 శాతం నిధులు గ్రాంటుగా రావడంతో పాటు మరెన్నో లాభాలున్నాయని చెప్పారు. అయితే.. జగన్‌ చూపిస్తున్న ఆధారాలకు హేతుబద్ధత లేదన్నారు చంద్రబాబు. పీఎస్ఆర్‌ అనేది శాసన సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే సంస్థ మాత్రమే అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న జగన్‌.. దీనివల్ల ఎక్సైజ్‌, కస్టమ్స్‌ డ్యూటీ, ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ వంటి ఎన్నో విభాగాల్లో రాయితీలు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే.. గతంలో ప్రత్యేక హోదా ద్వారా ఈ రాయితీలన్నీ వచ్చిన మాట వాస్తవమేనన్న బాబు.. రానురానూ వాటిల్లో కోత విధిస్తూ వచ్చారని, ఇప్పుడు హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదన్నారు.

నరేంద్ర మోదీ అనుకుంటే నిమిషాల్లో పని....

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నరేంద్ర మోదీ అనుకుంటే నిమిషాల్లో పని అన్న జగన్‌.. ఇప్పటి వరకూ ఇచ్చిన 11 రాష్ట్రాలకూ కేంద్ర కేబినెట్‌ సమావేశాల్లోనే ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన బాబు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, మేలు జరిగే అన్ని అవకాశాల కోసం పోరాడుతున్నామని బాబు చెప్పారు. వాదోపవాదాలతోపాటు, సుదీర్ఘంగా చర్చజరిగిన తర్వాత.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

కర్నూలు మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు

హైదరాబాద్ : కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉల్లివ్యాపారుల షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

వరంగల్ : మంత్రి హరీష్ రావుకు ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా నర్సంపేట లో మంత్రి హరీష్ రావు కారును ఆటో ఢీ కొట్టడంతో కారు అదుపు తప్పింది. అయితే హరీష్ రావు సురక్షితంగా బయటపడ్డారు. ఆటోలోని ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి.

టీమిండియాకు మోడీ అభినందనలు...

హైదరాబాద్ : శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 22 ఏళ్ల తర్వాత భారత్ శ్రీలంక గడ్డపై సిరీస్ విజయం సాధించింది. జట్టు సభ్యులంతా సమష్టిగా ఆడి విజయం చేకూర్చారని కితాబునిచ్చారు.

ఏసీబీ వలలో విశాఖ ఆర్టీ సూపరింటెండెంట్

హైదరాబాద్ : ఆర్డీ ఆఫీసులోని సూపరింటెండెంట్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. విధుల్లో ఉన్న సీనియర్‌ అసిస్టెంట్ వద్దకు వచ్చిన ఓ నర్సు తన జీతాలకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని కోరారు. దీనికి సూపరింటెండెంట్ రూ.30 వేలు చెల్లించాలని నర్సును కోరారు. దీంతో ఆమె ఏమీ చేయలేక రూ.30 వేలు సూపరింటెండెంట్‌కు ఇస్తుండగా ఏసీబీ ఆధికారులు పట్టుకున్నారు.

మణిపూర్ అల్లర్లలో ఆరుకు చేరిన మృతులసంఖ్య

హైదరాబాద్ : మణిపూర్ అల్లర్లలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇన్నర్ లైన్ పర్మిట్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. చురాచాంద్‌పూర్‌లో పోలీసులు కర్ప్యూ విధించారు.

18:30 - September 1, 2015

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒకలాగా, ఏపీలో ఒకలాగా మాట్లాడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో ఆమట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకే ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గారు. కేంద్రం పై గట్టిగా బాబు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని తెలిపారు. ఈ నెల15వ తేదీ లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకపోతే నిరాహార దీక్షకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో సీఎం ఇచ్చిన వివరణ అస్పష్టంగా ఉందని తెలిపారు. కేంద్రంలో బిజెపికి ఇస్తున్న మద్దతును టిడిపి ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

18:19 - September 1, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం తెరమీదకు రావడంతో.. తెలంగాణ సర్కార్ కూడా కేంద్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. వెనకబడ్డ తెలంగాణకు భారీగా ఆర్థిక సహయం చేయాలని కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తోంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని మోదీకి లేఖలు రాసారు. తెలంగాణలో నెలకొన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను లేఖలో సవివరంగా పేర్కొన్నారు. తెలంగాణ వెనకబడ్డ రాష్ట్రమని స్వయంగా ప్లానింగ్ కమిషన్, ఆర్ధిక కమిషన్ చెప్పిన విషయాలను లేఖలో గుర్తుచేసారు. విద్య, వైద్యం, విద్యుత్ వసతుల కల్పన, వ్యవసాయం, సాగు, త్రాగు నీటి వనరులు, వర్షాభావం, కరువు, వ్యక్తిగత ఆదాయం తదితర అంశాల్లో వెనకబాటుతనాన్ని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని ఆయా రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలే 85 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తుచేసారు.

కేంద్రాన్ని ఆర్ధిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ ......

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లకు ఆర్ధిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సహాయం చేయడంతో పాటు..45వేల చెరువుల పునరుద్దరణకు కేంద్రం వాటాగా 10,216 కోట్లను అందించాలన్నారు. దాంతోపాటు.. వాటర్ గ్రిడ్ కోసం 20,355 కోట్లను అందించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి వచ్చే 5 ఏళ్లలో 30,571 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.

అప్పుల పరిమితిని పెంచాలని.....

ఇక అదే సమయంలో అప్పుల పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రాలు తమ జాతీయ స్థూల ఉత్పత్తి- జీఎస్డిపి లో కేవలం 3 శాతం మాత్రమే అప్పులు తీసుకోవచ్చు. దీన్ని 3.5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్. రెవెన్యులో 10 శాతంలోపే వడ్డీల రూపంలో చెల్లిస్తున్నందున..అప్పుల పరిమితిని పెంచుకునేలా తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియాకు మరోసారి లేఖలు రాసారు సీఎం కేసీఆర్.

భారీగా నిధులను సమీకరించాలని.....

మొత్తానికి ఓ వైపు అప్పుల పరిమితిని పెంచుకోవడంతో పాటు..కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని రాబట్టడం ద్వారా భారీగా నిధులను సమీకరించాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. తద్వారా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విజ్ఞప్తులకు కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

18:16 - September 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ బుధవారం భేటీ కానుంది. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సెప్టెంబర్ చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో చర్చించే అంశాలతో పాటు ప్రభుత్వ వ్యూహాలపై కేబినెట్లో చర్చించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు సీఎం కేసీఆర్‌ చైనాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అందుకే అంతకు ముందే మంత్రులకు దిశా నిర్దేశం చేసే ఉద్దేశంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలపై అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. అందుకే మంత్రులు తమ శాఖలపై హోం వర్క్ పూర్తి చేసే విధంగా...సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రభుత్వం అట్టహాసంగా పలు పథకాలు ప్రారంభించినప్పటికీ.. క్షేత్ర స్థాయికి చేరుకోవడంలో అనుకున్నంత సఫలం కావడం లేదు. రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ ఏడాది 1890 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం రోడ్లెక్కుతున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ లబ్దిదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన పథకాలపై సైతం.....

కొత్తగా ప్రవేశ పెట్టాల్సిన పథకాలపై సైతం మంత్రి వర్గంలో చర్చించనున్నారు. అందులో ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్‌లు, ఫ్లాట్ల విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఎంత విస్తీర్ణంలో..ఎంత బడ్జెట్ లోపల ఇండ్లను నిర్మించాలన్న అంశాలపై కేబినేట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక కేజీ టు పీజీ విద్యలో చేయాల్సిన మార్పులపై సైతం చర్చించనున్నారు. కేజీ నుంచి కాకుండా 4 వ తరగతి నుంచి ఉచిత రెసిడెన్షియల్ విద్య ను అందించాలని ప్రభుత్వం తలపిస్తోంది. ఉచిత విద్య కోసం ఎక్కడెక్కడ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేయాలన్న దానిపై విధి విధానాలు ఖరారు చేయనున్నారు. నూతన మద్యం విధానానికి సైతం కేబినేట్ అమోదం తెలపనుంది. దీంతో పాటు పాలనా పరమైన అంశాలపై చర్చలు సాగించనున్నారు. 

18:11 - September 1, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ పోస్టింగ్‌పై క్యాట్‌ తన విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ నిర్ణయం ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉండగా.. తనను తెలంగాణలోనే ఉంచాలని సోమేష్‌కుమార్‌ క్యాట్‌కు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కోరగా.. కేంద్రం మాత్రం క్యాట్‌కు ఇచ్చిన వివరణలో కుదరదని స్పష్టం చేసింది. ఇప్పుడు క్యాట్‌ ఏం తేలుస్తుందో.. సోమేష్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

18:05 - September 1, 2015

హైదరాబాద్‌ : బేగంపేటలో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. నలుగురు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తలు.. కిడ్నాప్‌కు యత్నించారు. నలుగురికి మత్తమందు ఇచ్చి ఆటోలో తీసుకెళ్లిన కిడ్నాపర్లు.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు.

18:03 - September 1, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఓ అమాయకుడు ఇరుక్కున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో దినసరి కూలీకి తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. పాలకుర్తి గ్రామానికి చెందిన రాములుగౌడ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఓటుకు నోటుకు వ్యవహారంలో వాడిన ఓ ఫోన్‌ నంబరును....రాములుకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఆ కారణంతోనే అతనికి నోటీసులు ఇచ్చారు. ఐతే రెండేళ్ల క్రితమే తన ఫోన్ పోయిందని...ఇపుడు కొత్త నంబరును వాడుతున్నట్లు చెప్పాడు. తనకే పాపం తెలియదని...సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నానని వాపోయాడు. చివరకు విచారణకు హైద్రాబాద్‌కు విచారణకు వెళ్లాంటే..డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అధికారులు మాత్రం... ఈ నెల 2న..ఉదయం పదిన్నర గంటలకు ఏసీబీ ముందు హాజరుకావాలని నోటీసులిచ్చారు.

18:01 - September 1, 2015

హైదరాబాద్ : కడుపులో డ్రగ్స్‌ పెట్టుకుని స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నించిన దక్షిణాఫ్రికా యువతి మూసాను ఉస్మానియా నుంచి డిశ్చార్జ్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మూసా కడుపునుంచి ఈ రోజు మరో 11 డ్రగ్స్ ప్యాకెట్లను డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసారు. తాజాగా వెలికితీసిన ప్యాకెట్లతో కలుపుకుని మొత్తం 51 డ్రగ్స్ ప్యాకెట్లను వెలికితీసినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మూసా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

17:56 - September 1, 2015

హైదరాబాద్ : మలావత్ పూర్ణ. కృషి...పట్టుదలకు మారు పేరు. ఇప్పటికే అతిచిన్న వయసులో ఎవరెస్ట్‌ ఎక్కి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. కోట్లాది మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఆమె ప్రతిభకు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సైతం పట్టం కట్టింది. అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.

రిజన తండాలోని అత్యంత పేద కుటుంబంలో ....

మలావత్ పూర్ణ. గిరిజన తండాలోని అత్యంత పేద కుటుంబంలో పుట్టింది. ఈమె స్వగ్రామం నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామం. ఈమె సంకల్ప బలం ముందు ఎవరెస్టు శికరం సైతం తలవంచింది. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేసింది పూర్ణ.

తనదైన శైలిలో విజయాలు 

టీఎస్‌, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థిని ఆ సాహస యాత్రను పూర్తి చేసింది. ఒకవైపు చదువులో దూసుకెళుతూ మరోవైపు స్పోర్స్ట్‌లోనూ రాణిస్తోంది. తనదైన శైలిలో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ విజయపరంపర కొనసాగిస్తోంది.

ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం

గత ఏడాది పూర్ణ ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించింది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్‌లో పేదరికం అనే అంశంపై ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. అలాగే చిల్ర్డన్స్‌ డే కు భారత ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశాన్నికూడా పూర్ణ కట్టేసింది.

కసరత్తు ప్రారంభం

ఐక్యరాజ్య సమితి నుంచి పిలుపు అందుకున్న మలావత్ పూర్ణ. అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. ఇంతటి అవకాశం రావడానికి కారణం తమ తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రోత్సహమే అంటోంది.

 

 

17:56 - September 1, 2015

హైదరాబాద్ : అతడి పేరు ఒక సంచలనం..అతడి మాట..ఒక ప్రభంజనం..అతడి చూపు..ఒక ప్రకంపనం..అతడి మ్యానరిజమ్..ఒక విస్ఫోటనం..దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరపై తిరుగులేని పవర్ తో..చెలరేగుతున్న ఆ ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్. ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

పవన్ అంటే ఒక స్టైల్..
పవర్ స్టార్ అంటే ఒక స్టైల్. అతడి నడక, మాటలు, నడవడిక అన్నీ విభిన్నంగానే ఉంటాయి. అందుకే అతడంటే ప్రాంతాలకు అతీతంగా, కుల, మతాలకు అతీతంగా విపరీతమైన క్రేజ్. పవనిజం అంటూ ఆయన పేరు జపిస్తూ అభిమానులు ఊగి పోతూ ఉంటారు. పవన్ సాధించిన విజయాలూ, రికార్డుల కంటే ఆయన వ్యక్తిత్వమే ఆయనకు ఎక్కువమంది అభిమానులను సంపాదించిపెట్టింది. పవన్ కళ్యాణ్ తను నటించే సినిమా సెట్ లో చాలా నిరాడంబరంగా ఉంటాడని ఆయనతో పనిచేసిన సహనటులు చెపుతూ ఉంటారు. పవర్ స్టార్ మొదటి సినిమాతో అంతగా హిట్టు కొట్టలేకపోయినా తరువాత తరువాత తనకుంటూ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా ప్రేమకథలతో యువతను కట్టిపడేసారు. ఆ తరువాత తనదైన బాణీలో మాస్ యాక్షన్ మూవీస్ చేసి కుర్రకారును తన మాయలో పడేసారు. తనకే సాధ్యమైన డైలాగ్స్, మేనరిజమ్స్ తో పవనిజాన్ని సిల్వర్ స్ర్కీన్ పై సరికొత్త గా ఆవిష్కరించారు.

ఉన్నత వ్యక్తిత్వం...
పవన్ కళ్యాణ్ కు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన్ను అభిమానించే వారు గణనీయమైన సంఖ్యలో ఉండడటమే. వీరిలో ఒక సాధారణ ప్రేక్షకుడి నుండి పరిశ్రమలో యువ హీరోలు మరియు ఇతరత్రా ప్రముఖుల వరకు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు. ఉన్నవాళ్ళంతా భక్తులే. మిగతా హీరోల సినిమాలలో పవన్ ఒక్క ఫ్రేం లో కనిపించినా చాలు ప్రేక్షకులు కాసులు కురిపిస్తున్నారు. అందుకే పవన్ పాటలు, డైలాగ్స్ సినిమా టైటిల్స్ గా మారిపోతున్నాయి. ప‌వ‌న్‌ని ఆయన సాధించిన విజ‌యాల‌తో మాత్రమే బేరీజు వేయ‌లేం. అత‌ని స్టామినాకు బాక్సాఫీసు వ‌సూళ్లే కొల‌త‌లూ, తూనిక‌రాళ్లు కావు. ఆయన ఉన్నత వ్యక్తిత్వమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. సాధారణ మైన జీవనమే ఆయన్ను పవర్ స్టార్ ను చేసింది.

టాలీవుడ్ లో పవన్ హావా...
పవర్ స్టార్ మిగతా హీరోలకు చాలా భిన్నం. ఇప్పుడున్న యంగ్ స్టార్సే కాకుండా ఆయన కాంటెపరరీ కథానాయలకు, ఆయనకు ఉన్న డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన ప్రతీ చిత్రంలోనూ తనదైన బాణీలో ఏదో ఒక స్పెషల్ ఉండేలా పవన్ తన చిత్రాలను ప్లాన్ చేసుకుంటాడు. దటీజ్ పవర్ స్టార్.  పవన్ ఒక్కసారి మెడమీద చెయ్యిపెట్టుకొని కోపం గా చూస్తే చాలు.. రికార్డులన్నీ ఆయనకు దాసోహమైపోతాయి. ఆ మ్యానరిజమ్ తోనే ఆయన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా... అభిమానుల్ని వెర్రెత్తిస్తూ .. పవర్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నారు. హీరోయిజమంటే పవనిజమని కొత్త నిజాన్ని చెబుతున్నారు. పవర్ స్టార్ కు మరోసారి బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది 10టివి. 

మగ్ధూం భవన్ లో పది వామపక్ష పార్టీల సమావేశం..

హైదరాబాద్ : మగ్దూం భవన్ లో పది వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి తమ్మినేని, చాడ, ఇతర వామపక్ష నేతలు హాజరయ్యారు. 

తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ లకు పోస్టింగ్..

హైదరాబాద్ : తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ లకు ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా జగదీశ్వర్, మత్య్స శాఖ కమిషనర్ గా సంజయ్ కుమార్, పట్టణ పేదరిక నిర్మూలన కమిషనర్ గా నియమించారు.

పోలీసులను అప్రమత్తం చేసిన ఐబీ..

హైదరాబాద్ : నగర పోలీసులను ఐబీ అప్రపమత్తం చేసింది. ఉగ్రవాదులు జరుగవచ్చని, రిమోట్ కంట్రోల్ విమానాలు, క్షిపణుల ద్వారా దాడులు జరుగవచ్చని పేర్కొంది. దీనితో సైబరాబాద్ లో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాలను కమిషనర్ నిషేధించారు. 

రేపు కార్మిక సంఘాల జేఏసీ ప్రదర్శనలు..

హైదరాబాద్ : బుధవారం దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరుగనున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకు కార్మిక సంఘాల జేఏసీ భారీ ప్రదర్శన నిర్వహించనుంది. అనంతరం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. 

టీమిండియాకు ప్రధాని అభినందనలు..

ఢిల్లీ : శ్రీలంకపై భారత్ విజయం సాధించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 22 సంవత్సరాల తరువాత శ్రీలంక గడ్డపై భారత్ మూడో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత క్రీడాకారులు ఆకట్టుకునే ప్రదర్శించడం గర్వంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. 

టీమిండియాకు సచిన్ అభినందనలు..

ఢిల్లీ : శ్రీలంక జట్టుపై భారత్ విజయం సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు. భారత మాజీ క్రికేటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. భారత్ మరిన్ని విజయాలు సాధించాలని ఈ మేరకు ట్విట్టర్ లో సచిన్ ట్వీట్స్ చేశారు. 

లోయలో పడిన బస్సు..16 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కిన్నూరు జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీనితో 16 మంది దుర్మరణం చెందారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి బీఎసీ సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 25,685 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఐదు లక్షలివ్వాలి - మల్లు..

వరంగల్ : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశౄరు. మంగళవారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మల్లు మాట్లాడారు. రుణమాఫీ విధానంలో లోపాలున్నాయని రైతుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.

సైనికోద్యోగులకు వైద్య పరీక్షలు..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకం అమలు చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగులు దీక్ష చేపడుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మంగళవారం పరీక్షించారు. 

కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపండి - మోడీ..

బీహార్ : రాష్ట్రాభివృద్ధి కోసం విడుదల చేసిన నిధుల లెక్కలు చూపుతారా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశిన్ంచారు. రూ.3.76 లక్షల కోట్లు ఇస్తే అందులో రూ.2.70 లక్షళ కోట్లకు మాత్రమే లెక్కలున్నాయని మిగతా రూ.1.06 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు.

చితూర్తులో అదృశ్యమైన బాలుడు హత్య...

చిత్తూరు : కురవల కోటలో అదృశ్యమైన బాలుడు ఇమ్రాన్ హత్యకు గురయ్యాడు. షాదీమహల్ బాత్ రూంలో ఇమ్రాన్ మృతదేహం లభ్యమైంది. 

సమ్మెలో పాల్గొనాలి ఏపీ సీపీఎం పిలుపు..

విజయవాడ : రేపు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్మిక సమ్మెకు రైతాంగం మద్దతుగా నిలవాలని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు తెలిపారు. కార్పొరేట్ సేవలో మునిగి తేలుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమ్మెతో గుణాపాఠం చెప్పాలన్నారు. 

16:53 - September 1, 2015

హైదరాబాద్ : ఆకాశంలో సగం అని గర్వంగా చెప్పుకుంటున్న ఆడపిల్లలు తల్లి గర్భంలోనే చిధ్రమైపోతున్నారు. అస్సలు ఎందుకు ఇలా జరుగుతోంది. ఈ పరిస్థితికి గల కారణాలు ఏమిటి? ఏం చేస్తే ఈ పరిస్థితి మెరుగు పడుతుంది. అనే అంశాలపై వేదికలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సుమిత్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు, కల్పన యాక్షన్ ఎయిడ్ సభ్యులు పాల్గొన్నారు. వారుఏఏ అంశాలను ప్రస్తావించారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:39 - September 1, 2015

హైదరాబాద్ : కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 2న తలపెట్టిప దేశవ్యాప్త సమ్మెకు విశాఖ సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కార్మికులు బంద్‌లో పాల్గొంటున్నారు. సమ్మె సన్నాహాక చర్యల్లో భాగంగా విశాఖ పోర్టు పరిపాలన భవన్ ఎదుట కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.

జేసీ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు, సీఎం రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ వ్యాఖ్యానాలు చేశారు. బీహార్ కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనం రావచ్చేమో గాని, ప్రత్యేక హోదా మాత్రం రాదని కుండబద్ధలు కొట్టారు. ఒకవేళ ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీనిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరో పది ఎంపీలతోనూ రాజీనామా చేయిస్తానని జేసీ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా తీసుకరాకపోతే మాత్రం తమను ఏకగ్రీవంగా పార్లమెంట్ కు పంపుతారా అంటూ సవాల్ విసిరారు. 

16:37 - September 1, 2015

హైదరాబాద్ : ఏపీలో ఇంజెక్షన్‌ సైకో కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా విరవసరం మండలం ముత్యపూడిలో ఇంటింటికి వెళ్లి.. పోలీసులు సోదాలు చేశారు. ఆధార్‌కార్డులు చూసి... ఫొటోలను గుర్తిస్తున్నారు. అంతేగాక సైకో వాడుతున్న బైక్‌ ఎవరిదనే దానిపైనా....ఆరా తీస్తున్నారు. స్థానికులు, సర్పంచ్‌ సహాయం తీసుకొని...సైకో కోసం గాలిస్తున్నారు . త్వరలోనే సైకోని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

16:34 - September 1, 2015

గుంటూరు : రిషితేశ్వరి ఆత్యహత్య ఘటనలో నిందుతుల బెయిల్ పిటిషిన్‌పై తీర్పును గుంటూరు 1వ అదనపు సెషన్స్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ పై ఇరువైపు వాదనలు పూర్తయ్యాయని రిషితేశ్వరి తరపు న్యాయవాది వైకో అన్నారు. FSL రిపోర్టులోని రిషితేశ్వరి చేతి రాత, డైరీలోని రాత ఒక్కటే అని కోర్టు నిర్ధారించిందన్నారు. రేపు డైరీని పరిశీలించాక బెయిల్‌పై తీర్పును వెల్లడించే అవకాశం ఉందని న్యాయవాది వైకో అన్నారు. 

16:32 - September 1, 2015

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 5న విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరగనున్న ... గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అందుకు సంబంధించి...ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి గంటాశ్రీనివాసరావు ఏర్పాట్లును సమీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం మూడుగంటలకు... గురుపూజోత్సవంలో సీఎం పాల్గొంటారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అక్కడి నుంచి విశాఖ పోర్టు స్టేడియానికి చేరుకొని... నేషనల్ గేమ్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎంవీపి కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటారని మంత్రి గంటా చెప్పారు.

16:31 - September 1, 2015

హైదరాబాద్ : సుప్రీంకోర్టులో కేంద్రమంత్రి సుజనాచౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చుక్కెదురైంది. మారిషస్ కమర్షియల్ బ్యాంకుకు చెల్లించాల్సిన 106 కోట్ల రూపాయలను కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. సుజనా చౌదరికి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో మారిసష్‌ బ్యాంకు నుంచి హెస్టియా కంపెనీ 106 కోట్ల రూపాయల రుణాన్నీ తీసుకుంది. ఆ డీల్‌కు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ షూరిటీగా ఉంది. కాని హెస్టియా కంపెనీ ఇప్పటికీ రుణాన్ని చెల్లించలేదు. దీంతో హామీదారుగా ఉన్న సుజనా చౌదరే...ఆ మొత్తాన్ని కట్టాలని మారిషస్ బ్యాంకు కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 30లోగా రుణాన్ని చెల్లించాలని సుజనా కంపెనీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.

16:30 - September 1, 2015

హైదరాబాద్ : ఎట్టకేలకు ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఉదయం నుంచి అధికార, విపక్షాల మధ్య వాడీవేడీగా సాగిన చర్చ అనంతరం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హోదా తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించింది.

16:28 - September 1, 2015

హైదరాబాద్ :  ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలకు చెందిన సాయినాధ్‌ కోటి ఆశలతో హైదరాబాద్‌ కొంపల్లిలోని సీఎంఆర్ ఇంజనీరింగ్‌ కాలేజిలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. తన చదువుకోసం తల్లితండ్రులు అనుభవించిన కష్టానికి ప్రతిఫలం తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. కానీ క్యాంపస్‌లో అడుగు పెట్టిన వెంటనే సాయినాథ్‌ ర్యాగింగ్‌ అతి క్రూరంగా స్వాగతం పలికింది.

కాపాడమంటూ కాలేజ్‌కు అభ్యర్ధన.....

ర్యాగింగ్‌ ముసుగేసుకున్న సీనియర్ల వెకిలిచేష్ఠలు సాయినాధ్‌ను తీవ్రంగా బాధించాయి. సీనియర్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ర్యాగింగ్‌ పేరుతో వేధిస్తున్నారంటూ సాయినాధ్‌ కాలేజ్‌ యాజమాన్యాన్ని ఆశ్రయించాడు. కానీ ఫలితం లేదు. ఎప్పటిలానే చర్యలు తీసుకుంటామనే నీటి మీద రాత లాంటి హామీని ఇచ్చారు. సాయినాధ్‌ మేనేజ్‌మెంట్‌కు కంప్లయింట్ చేసాడనే విషయం తెలుసుకున్న సీనియర్ విద్యార్ధులు వేధింపులను తీవ్రతరం చేశారు. దీంతో తట్టుకోలేని సాయినాధ్‌ వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వే ట్రాక్‌ పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ర్యాగింగ్‌ భూతం వేధింపులు తట్టుకోలేకే.....

ర్యాగింగ్‌ భూతం వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాయినాధ్‌ రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయినాధ్‌ను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ర్యాగింగ్‌ మహమ్మారిని అణిచివేయాలని విద్యార్ధిసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే భావి భారత నిర్మాతలు కాలేజ్‌లో అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్ధితులు వస్తాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. 

16:27 - September 1, 2015

కొలంబో : లంక గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలన్న ఇండియా లక్ష్యం నెరవేరింది. సుమారు 22 ఏళ్ల తరువాత కోహ్లీ సేన చిరస్మరణీయ విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు సిరీస్ ను 2-1 తేడాతో విజయం సాధించింది. 1993లో భారత్ టెస్టు సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. సోమవారం ఆటలో రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ లంక ఎదుట 386 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. భారీ లక్ష్యంతో ఆటను ఆరంభించిన లంక జట్టు 268 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో 117 రన్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 
ఓవర్ నైట్ స్కోర్ 67/3 తో లంక రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఓపెనర్ సిల్వ 24, కెప్టెన్ మాథ్యూస్ 22 పరుగులతో ఆటను ఆరంభించారు. కానీ మరో ఆరుగు పరుగులు జోడించిన తరువాత సిల్వ (27) ను ఉమేష్ పెవిలియన్ పంపించాడు. మాథ్యూస్ మాత్రం అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశాడు. ఇతను అర్థ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 107 వద్ద ఉండగా తిరుమన్నే (12) అవుట్ అయ్యాడు. అనంతరం శ్రీలంక బ్యాట్స్ మెన్స్ వికెట్ కాపాడుకొనే ప్రయత్నంలో పడ్డారు. మాథ్యూస్ తో జత కలిసిన పెరీరా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ దశలో మాథ్యూస్ సెంచరీ పూర్తి చేయగా తిరుమన్నే హాఫ్ సెంచరీ సాధించాడు. వీరి జోడిని అశ్విన్ విడదీశాడు. 70 స్కోరు వద్ద ఉన్న పెరీరాను అశ్విన్ వెనక్కి పంపించాడు. అప్పటికీ శ్రీలంక జట్టుస్కోరు 242 పరుగులు. మరో ఏడు పరుగులు జోడించిన అనంతరం మాథ్యూస్ (110) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఎలాంటి పోరాటం చేయలేదు. హెరాత్ (11), ప్రసాద్ (6), ప్రదీప్ (0) పరుగులు సాధించారు. కౌశాల్ 1 నాటౌట్ గా మిగిలాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా శర్మ మూడు వికెట్లు తీశాడు. యాదవ్ రెండు, మిశ్రా ఒక వికెట్ తీశారు. మ్యాచ్ లో 8 వికెట్లు తీసిన ఇషాంత శర్మ టెస్టుల్లో 200 వికెట్లు తీసిన ఎనిమిదో భారత్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పుజారా (145) ను వరించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్ 312.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 201.
భారత్‌ రెండో ఇన్నింగ్స్ పుజారా (బి) 0, రాహుల్‌ (బి) 2, రహానే ఎల్బీడబ్ల్యూ (బి) ప్రదీప్‌ 4, విరాట్‌ కోహ్లి (సి) తరంగ (బి) ప్రదీప్‌ 21, రోహిత్‌ శర్మ (సి) ప్రదీప్‌ (బి) ప్రసాద్‌ 50, స్టువార్ట్ బిన్నీ (సి) తరంగ (బి) ప్రసాద్‌ 49, నమన్‌ ఓజా (సి) కరుణరత్నే (బి) హెరాత్‌ 35, అమిత్‌ మిశ్రా రనౌట్‌ 39, అశ్విన్‌ (సి) పెరీరా (బి) ప్రసాద్‌ 58, ఉమేశ్‌ యాదవ్‌ (సి) హెరాత్‌ (బి) ప్రదీప్‌ 4, ఇషాంత్‌ శర్మ నాటౌట్‌ 10, ఎక్స్ ట్రాలు 10. మొత్తం ( 76 ఓవర్లలో ఆలౌట్‌ ) 274.
వికెట్ల పతనం 1-0, 2-2, 3-7, 4-64, 5-118, 6-160, 7-179, 8-234, 9-269, 10-274.
బౌలింగ్‌ ప్రసాద్‌ 19-3-69-4, ప్రదీప్‌ 17-2-62-4, హెరాత్‌ 22-0-89-1, మాథ్యూస్‌ 6-3-11-0, తరిందు కౌశాల్‌ 12-2-41-0.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : ఉపుల్‌ తరంగ (సి) ఓజా (బి) ఇషాంత్‌ శర్మ 0, జెకె సిల్వ నాటౌట్‌ 24, కరుణరత్నే (సి) ఓజా (బి) ఉమేశ్‌ యాదవ్‌ 0, చండిమాల్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ శర్మ 18, మాథ్యూస్‌ (110) ఎల్బీడబ్ల్యూ ఇషాంత్, తిరుమన్నే (సి) రాహుల్ (బి) అశ్విన్ 12, పెరీరా (సి) రోహిత్ (బి) అశ్విన్ 70, హెరాత్ 11 ఎల్బీడబ్ల్యూ, కౌశాల్ 1 నాటౌట్, ప్రసాద్ (సి) బిన్ని (బి) అశ్విన్ 6, ప్రదీప్ 0 ఎల్బీడబ్ల్యూ మిశ్రా, 
ఎక్స్ ట్రాలు 13, మొత్తం (85 ఓవర్లలో 10వికెట్లకు) 268
వికెట్లపతనం 1-1, 2-2, 3-21, 4-74, 5-107, 6-242, 7-249, 8-257, 9-263, 10-268
బౌలింగ్‌ ఇషాంత్‌ శర్మ 19-5-31-3, యాదవ్‌ 15-3-65-2, స్టువార్ట్ బిన్నీ 13-3-49-0, అమిత్‌ మిశ్రా 18-1-47-1, అశ్విన్‌ 20-2-69-4.

సీఎంఆర్ కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..

వరంగల్ : కాజీపేట రైల్వే ట్రాక్ పై హైదరాబాద్ కు చెందిన సీఎంఆర్ కాలేజీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయినాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ లో విద్యార్థి పేర్కొన్నాడు. 

భారత్ ఘన విజయం..

కొలంబో: మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 117 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. లంక గడ్డపై 22 ఏళ్ళ తర్వాత భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గినైట్లెంది. చివరిసారిగా 1993లో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది.    

13:53 - September 1, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోణలతో ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారం ప్రస్తావనకు రావడంతో అధికార, విపక్షాల మధ్య వ్వాగ్వాదం జరిగింది. వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. పెద్ద ఎత్తున వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. సభను నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

13:44 - September 1, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేకహోదాపై చర్చ కాస్తా..వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలు, ప్రత్యారోపణులకు దారి తీసింది. చంద్రబాబు, జగన్ లు పరస్పరం విమర్శించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. స్టీఫెన్ సన్ ని ఎమ్మెల్సీ చేయడానికి కేసీఆర్ కు జగన్ లెటర్ ఇచ్చారని .. మంత్రి హరీష్, జగన్ మీటింగ్ ఆయిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ స్టీఫెన్ సన్ ఎవరో తనకు తెలియదన్నారు. 'నేను లెటర్ ఇస్తేనే... స్టీఫెన్ ను ఎమ్మెల్సీ చేశారని... రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని ..ఋజువు కాని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా..అని సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు.. మోడీ వద్ద సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ ఎస్, వైసిపి కలిసినా తనను ఏం చేయలేవన్నారు. నీతి, నిజాయితితో ఉన్న తనను ఎవరూ ఏం చేయలేదని పేర్కొన్నారు. జగన్ పగటి కలలు కనవద్దని తెలిపారు.

 

శ్రీలంక 187/5...

కొలంబో : భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మాథ్యూస్ 78, పెరీరా 44 పరుగులతో ఆడుతున్నారు. 

లక్నోలో బీపీఈడీ డిగ్రీ హోల్డర్స్ నిరసన..

ఉత్తర్ ప్రదేశ్ : లక్నోలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీపీఈడీ డిగ్రీ హోల్డర్స్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ ప్రయోగించారు. అనంతరం వాటర్ కెనాన్ లను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

గౌరవల్లిలో పర్యటించిన మంత్రి హరీష్..

కరీంనగర్:  జిల్లాలోని గౌరవెల్లిలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.

గౌడ కులస్తులు ఆందోళన చెందవద్దు - పద్మారావు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గౌడ కులస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. చీప్ లిక్కర్ వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభమేమీ ఉండదన్నారు. 

నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం : జగన్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా పై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టింది. అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఓటుకు నోటు కేసులో ప్రతిపక్ష నేత జగన్ హస్తం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని జగన్ ప్రకటించారు.

సబ్సిడీ రహిత వంటగ్యాస్ ధర తగ్గింపు..

ఢిల్లీ : సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25.50 మేరకు తగ్గించినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గిన ధర ధర తక్షణం అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. ఢిల్లీలో రూ.585గా ఉన్న 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.559.50 కి తగ్గింది. 

13:18 - September 1, 2015

హైదరాబాద్ : గతంలో వైఎస్ ఆర్ .. తనపై 25 విచారణలను వేశారని... కానీ ఏం చేయలేకపోయారని కాబట్టి నీతండ్రి వల్లే కాలేదు.. నీవల్లేమవుతుందని జగన్ చేసని వ్యాఖ్యలను ఉద్దేశించి... చంద్రబాబు అన్నారు. జగన్ పై 11 ఛార్జీషీట్ ఉన్నాయని తెలిపారు. తన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని.. నిప్పులాంటి వ్యక్తినని తెలిపారు. అవినీతిరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. వైసిపి సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. గతంలో తాను బూతులు మాట్లాడలేదు కానీ వైసిపి సభ్యులు బూతులు మాట్లాడుతున్నారు. ఆనాడు సభలో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి మహానేతలు ఉన్నప్పుడు తాను హుందాగా వ్యవహరించానని చెప్పారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. గతంలో వైఆర్ ఆర్ ప్రభుత్వంలో మాట్లాడుకోవడానికి మైక్ కూడా ఇవ్వలేదని... కానీ ఇప్పుడు జగన్ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నామని తెలిపారు. 

 

ఏపీ అసెంబ్లీలో గందరగోళం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టింది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు చేసుకున్నారు. 

13:00 - September 1, 2015

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాటం చేయడం లేదని జగన్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లే ప్రత్యేకహోదా కోసం బాబు మాట్లాడటం లేదని ఆరోపించారు. చంద్రబాబు దేన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అన్నారు. టిడిపి సభ్యులకు వినడానికి కూడా ఓపిక లేదని అసహనం వ్యక్తం చేశారు.

 

 

12:45 - September 1, 2015

హైదరాబాద్ : విలువలతో ఉంటే బాగుపడుతారని వైసిపి నేత జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. విలువలకు కట్టుబడి ఉండి తాము కష్టపడి పని చేస్తామని చెప్పారు. జగన్ గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చి తెలివైన వాడిలా జగన్ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేసింది తానేనని స్పష్టం చేశారు.

 

మాథ్యూస్ హాఫ్ సెంచరీ..

కొలంబో : భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ మాథ్యూస్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఐదు వికెట్లు కోల్పోయిన లంక జట్టు 134 పరుగులు సాధించింది. ప్రస్తుతం మాథ్యూస్ 56, పెరీరా 12 పరుగులతో ఆడుతున్నారు. 

మూసా కడుపులో నుండి డ్రగ్స్ వెలికితీత..

హైదరాబాద్ : దక్షిణాఫ్రికా యువతి మూసా మూసాయనన్ కడుపులో నుండి డ్రగ్స్ మొత్తం బయటకు తీశారు. కడుపులో డ్రగ్స్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూసాయిన్ శరీరం నుండి ఇప్పటి వరకు 51 సంచుల డ్రగ్స్ ప్యాకెట్ లను తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. మళ్లీ స్కానింగ్ చేస్తే ఏమి లేవని తేలిందన్నారు. డిశ్చార్జీ అనంతంర ఆమెను నార్కోటిక్ అధికారులకు అప్పగించనున్నట్లు, ఆమె ఆర్యోగ్యం నిలకడగానే ఉందన్నారు. 

12:28 - September 1, 2015

హైదరాబాద్ : ఎపి సర్కార్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని వైసిపి అధినేత జగన్ విమర్శించారు. లోక్ సభలో 19 రోజులకుగానూ 5 సార్లు తాము అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చామని తెలిపారు. నోటీస్ ఒక్కరు ఇచ్చినా 50 మంది మద్దతు ఇవ్వాలన్నారు. అయితే ఒక్కసారి కూడా తమ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలేదన్నారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందన్నారు. ప్రత్యేకహోదా వల్ల కేంద్రం 90 శాతం నిధులు, 10 శాతం లోన్ గా ఇస్తుందని తెలిపారు. ప్రత్యేకోహోదా వల్ల పన్ను రాయితీలు కూడా వస్తాయని చెప్పారు. కేంద్రం నుంచి గ్రాంట్లు ఎక్కువగా వస్తే... అప్పుల ఒత్తిడి రాష్ట్రంపై తక్కువగా ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబుకు కూడా ప్రత్యేకహోదా గురించి పూర్తిగా తెలియదని.. తెలుసుకోవాలని సూచించారు. నోట్ లో ప్రత్యేకహోదా కోసం ఏం చేస్తున్నారో ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ మధ్య ఓటుకు కోట్ల వ్యవహారంలో ఎక్కువ హోంర్క్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేకహోదా ఉన్నా... ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఏఐబీపీ నిధులు వస్తాయన్నారు. ఉత్తరాఖండ్ ను విభజించిన వెంటనే హోదా ఇచ్చారని గుర్తు చేశారు.

 

ప్రత్యేక హోదా..జగన్ ప్రకటన..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తారని ప్రతిపక్ష నేత జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉద్ధేశించి ప్రశ్నించారు. ఈ విషయంలో అసెంబ్లీని మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, బాబు సుదీర్ఘ ప్రసంగంలో గణాంకాలు తప్ప, హోదా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని పేర్కొన్నారు. ఏపీకి తక్షణం హోదా కల్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పకుండా ఏవోవో మాట్లాడరని ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రయత్నం...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రయత్నించింది. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఐక్యవేదిక నేతలను అరెస్టు చేశారు. 

అమరావతి శివాలయంలో బౌద్ధ విశేషాలు..

గుంటూరు : అమరావతి శివాలయంలో బౌద్ధ విశేషాలు బయటపడ్డాయి. అమరలింగేశ్వరాలయ గోపురం తొలగిస్తుండగా పునాదుల తవ్వకాల్లో మూడో శతాబ్దపు బౌద్ధ శాసనాలు, విగ్రహాలు బయటపడ్డాయి. 

11:49 - September 1, 2015

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు ప్రత్యేకోహోదాపై ప్రకటన చేస్తున్నారా... లేక చర్చ చేస్తున్నారా..చెప్పాలని వైసిపి అధినేత జగన్ ప్రశ్నించారు. నోట్ లోని అంశాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు చెప్పే దానికి ఇచ్చిన నోట్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇచ్చిన నోటుకు సంబంధించి మాట్లాడాలని సూచించారు. నోట్ అనే ముసుగులో చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. గత విషయాలను చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు ప్రకటన చేస్తున్నారా.. చర్చ చేస్తున్నారా... చెప్పాలని ప్రశ్నించారు.

 

నగరంలో మాజీ సైనికుల ఆందోళన..

హైదరాబాద్ : ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అమలు కోరుతూ నగరంలో మాజీ సైనికులు ఆందోళనకు దిగారు. ఈమేరకు త్రివిధ దళాలకు చెందిన మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

11:42 - September 1, 2015

హైదరాబాద్ : వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. దివంగత మాజీ శాసనసభ్యుల మృతి పట్ల స్పీకర్ కోడెల శివప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. దివంగత మాజీ శాసనసభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. వారి మృతికి సంతాప సూచకంగా సభ్యులు మౌనం పాటించారు.

 

 

భారత్, శ్రీలంక ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు..

ఢిల్లీ : భారత్, శ్రీలంకకు చెందిన నలుగురు ఆటగాళ్లపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇషాంత్ శర్మ, చండిమాల్, తిరిమానే, ప్రసాద్ లపై ఐసీసీ చర్యలు చేపట్టింది. మూడో టెస్టు నాలుగో రోజు క్రీజులో ఆటగాళ్లు ఆవేశానికి లోనైన సంగతి తెలిసిందే. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆటగాళ్లపై ఆరోపణలు రావడంతో ఐసీసీ స్పందించింది. 

శ్రీలంక 111/5..

కొలంబో : భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక ఐదు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 111 పరుగులు చేసింది. మాథ్యూస్ 46, పెరీరా 3 రన్లతో క్రీజులో ఉన్నారు. 

11:35 - September 1, 2015

మెగా ఫ్యామిలీ నుండి వెండి తెరకు పరిచయమైన 'వరుణ్ తేజ్' తాజాగా నటిస్తున్న 'కంచె' సినిమా ట్రైలర్ విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'క్రిష్' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'ప్రగ్వా జైస్వాల్' హీరోయిన్ గా నటిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 'కంచె' చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతాస్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా 'కంచె'ను విడుదల చేయనున్నట్లు సమాచారం. 

11:33 - September 1, 2015

హైదరాబాద్ : హేతు బద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక పద్ధతి, విధానం లేకుండా విభజన చేశారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. గతంలో దేశంలోని ఇతర రాష్ట్రాలను విభజన చేసినప్పుడు ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. నాడు తమిళనాడులో ఉన్న ఎపిని, ఉత్తరాంచల్, జార్ఖండ్, చత్తిస్ ఘడ్ రాష్ట్రాలను ప్రజల అభిప్రాయాలకనుగుణగా విభజించారని చెప్పారు. కాంగ్రెస్.. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజన చేశారని... దీంతో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. యవత ఆవేశాలకు పోవద్దని సూచించారు.  విభజన సందర్భంగా రాష్ట్ర ఆస్తులను భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పంచారు. అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికన కేటాయించారని... ఇది ఎలా కరెక్టు అని అన్నారు. 59 శాతం జనాభా ఉన్న ఎపికి 47 శాతం ఆదాయం ఇచ్చారని... 43 శాతం జనాభా కలిగిన తెలంగాణాకు 53 శాతం ఆదాయం ఇచ్చారని పేర్కొన్నారు. ఎపికి రాజధాని లేదు... మెగాసిటీ, అర్బనైజేషన్ ఉన్న చోట ఆదాయం ఉంటుందన్నారు. రాజధాని లేనివారు విభజన కోరుకున్నారు. కానీ ఎపి రాష్ట్ర విభజన విషయంలో రాజధాని ఉన్న తెలంగాణ ప్రాంత వారు రాష్ట్ర విభజన కోరారని చెప్పారు. పార్లమెంట్ డోర్లు మూసి వేసి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. బిల్లును పాస్ చేశారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేయడంతోనే సమస్యలు వచ్చాయని విమర్శించారు. ముఖ్యమైన సమస్యలను నిర్వీర్యం చేయొద్దని హితవు పలికారు. హుందాగా ప్రవర్తించాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ లాంటి రాజధాని రావాలంటే.. రూ.5 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు.

 

స్పెయిన్ కర్మాగారంలో పేలుడు - ఐదుగురి మృతి..

స్పెయిన్ : బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

కేటీపీఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి..

ఖమ్మం : పాల్వంచలోన కేటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓఅండ్ ఎం కర్మాగారానికి చెందిన 8 యూనిట్లు మంగళవారం ఉదయం ఒకేసారి ట్రిప్ అయ్యాయని, ఫలితంగా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. 

శ్రీలంక 103/4..

కొలంబో : భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. మాథ్యూస్ 40, తిరుమన్నే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఏపీలో ముదుపర్ల రక్షణ చట్టానికి సవరణలు..

హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముదుపర్ల రక్షణ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేయనుంది. అగ్రిగోల్డ్ తో పాటు 25 సంస్థల ఆస్తుల స్వాధీనానికి కసరత్తు జరుగుతోంది. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు వీలు చేయనుంది. ప్రస్తుత సమావేశాల్లో సభ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. 

ప్రత్యేక హోదా..బాబు ప్రకటన..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని, అందరూ సమన్వయం పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభజన హేతుబద్ధంగా జరుగలేదని, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేయడం వల్ల సమస్యలు వచ్చాయన్నారు. దేశంలో తొలిసారి ఆర్టికల్ -3 ఏపీపై ఉపయోగించారని తెలిపారు. ఆ రోజు సమన్యాయం చేయాలని చెబితే అవహేళన చేశారని, అప్పట్లో తన వంతుగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగిందన్నారు. 59 శాతం జనాభా ఉన్న ఏపీకి 47 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. ఆస్తులను భౌగోళికంగా పంచారని, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచారని తెలిపారు.

10:47 - September 1, 2015

హైదరాబాద్ : దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ. పది లక్షల జరిమాన విధించింది. 2007 సంవత్సరంలో వర్మ 'ఆగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. 1975లో హిందీలో విజయం సాధించిన 'షో'లే చిత్రానికి ఇది రీమెక్. ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు..పాత్రలు..నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారని 'షో'లే నిర్మాత మనవడు సచ్చా సిప్పి కాపీరైట్ కింద వర్మపై గతంలో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వర్మతో పాటు 'ఆగ్' సినిమా నిర్మాతలు ఆర్ జీవి ప్రొడక్షన్ ప్రై.లి., వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007 ఆగస్టు 31న రిలీజ్ కాగా 2015 లో అదే రోజు ఈ సినిమాపై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడడం గమనార్హం.

 

 

 

ఒక్క రవ్వ కూడా అర్థం కావడం లేదు - జగన్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఒక్క రవ్వ కూడా అర్థం కావడం లేదని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. అధికారపక్షం ఇచ్చిన నోట్ లో బాబు పేర్కొన్న అంశాలు లేవని తెలిపారు. 

మాజీ సైనికోద్యుగుల పట్ల కేంద్రం ఉదాసీనత – మనీష్ తివారీ..

ఢిల్లీ : మాజీ సైనికోద్యుగుల పట్ల కేంద్రం ఉదాసీనత వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ కోసం జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికోద్యుగులు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. వారి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని, ఇది నిజంగా సిగ్గు చేటన్నారు. 

సోనియాతో బీహార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో బీహార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. 

పోలీసు జీపును ఢీకొన్న లారీ..

నెల్లూరు : ఆత్మకూరు మండలం కర్కటంపాడు మలుపు దగ్గర వేగంగా వస్తున్న లారీ పోలీసు జీపును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఉదయగిరి ఎస్‌ఐతో సహా హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

హరితహారంలో మంత్రి పద్మారావు..

హైదరాబాద్ : మెదక్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. 

శ్రీలంక 77/4..

కొలంబో : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. మాథ్యూస్ 30, తిరుమన్నే 2 క్రీజులో ఉన్నారు.

10:15 - September 1, 2015

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడిన సౌతాఫ్రికా మహిళ మూసా కడుపులో నుండి ఇంకా డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. మంగళవారం ఉదయం మరో 11 ప్యాకెట్లు బయటకు తీశారు. నిన్న 40 ప్యాకెట్లు బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 51 ప్యాకెట్లు బయటకు తీసినట్లైంది. ఇంకా కొన్ని ప్యాకెట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించినట్లు సమాచారం. ఒక్కో ప్యాకెట్లలో 550 గ్రామాలు కొకైన్ డ్రగ్స్ వేసినట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ.60లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఉస్మానియాలోని ఐసీయూ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. శస్త్ర చికిత్స లేకుండానే బయటకు తీయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీనితో ఆలస్యం జరుగుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మూసా తాను గర్భవతిని అని పేర్కొంది. అధికారులకు అనుమానం వచ్చి స్కానింగ్ నిర్వహించారు. కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మూసాను అదుపులోకి తీసుకున్నారు. లేడీ డాక్టర్ తో కొన్ని టెస్టులు చేయగా కడుపులో ఏవో ముద్దలు కదులుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఉస్మానియా వైద్యులు ఎక్సరే తీయగా మూసా బాడీలో కొన్ని ప్యాకెట్స్ ఉన్నట్టు క్లియర్ గా తెలిసింది. దీంతో కస్టమ్స్ అధికారులు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సమాచారం అందించారు. ఎన్ సీ బీ అధికారులు తమ దగ్గరున్న అత్యాధునిక స్కానర్లతో పరిశీలించారు. కడుపులో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె కడుపులో ఇంకా ఎన్ని డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడుతాయో వేచి చూడాలి. 

కరువు కోరల్లో రాయలసీమ..

హైదరాబాద్ : రాయలసీమ కరువు కోరల్లో కూరుకపోయింది. నాలుగు లక్షల బోర్లు ఒట్టిపోయాయి. కొత్తగా మూడు లక్షల బోర్లు తవ్వకాలు సాగించారు. సాగునీరు, తాగునీటికి కరువు ఏర్పడింది. పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. రక్షిత నీటి పథకాలు ఉన్నచోట వారానికి ఒక రోజు సరఫరా జరుగుతోంది. ట్యాంకర్ నీటి ధర రూ.500 పలుకుతోంది. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. 

గోదావరి నీటిపై లైడార్ సర్వే..

కరీంనగర్ : గోదావరి నీటిపై లైడార్ సర్వే నిర్వహించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టు వరకు గోదావరిపై అధికారు బృందం అధ్యయనం చేయనుంది. 

ఏపీలో దేవాలయాల పారిశుధ్య పనులకు టెండర్..

హైదరాబాద్ : ఏపీలో దేవాలయాల పారిశుధ్య పనులకు టెండర్ లు పిలిచారు. ప్రధాన దేవాలయాల పారిశుధ్య పనులు ఒకే సంస్థకు అప్పగించారు. అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకాతిరుమల, సింహాచలం ఆలయాల్లో పారిశుధ్య పనులు పద్మావతి ఏజెన్సీ దక్కించుకుంది. గతంలో పోలిస్తే రూ.11 కోట్ల అదనపు ఖర్చు కానుంది. గతేడాది వరకు ఎక్కడికక్కడ పారిశుధ్య పనులు ఉన్నాయి. ఏపీలో దేవాదాయ శాఖను బీజేపీ నిర్వహిస్తోంది. 

కల్బుర్గిని చంపింది తామే - భజరంగ్ దళ్...

ఢిల్లీ : కల్బుర్గిని చంపింది తామేనని భజరంగ్ దళ్ నేత భవిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. గతంలో యుఆర్ అనంతమూర్తిని కడతేర్చామని, తదుపరి లక్ష్యం కేఎస్ భగవాన్ అని పేర్కొన్నారు. హిందూత్వను వ్యతిరేకించే వారందరినీ నరికివేస్తామన్నారు. 

09:45 - September 1, 2015

హైదరాబాద్ : తాము 11 ఛార్జీషీట్ లు వేయించుకోలేదని ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీనుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. దీనికి వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. స్పీకర్ కోడెల చేసిన పలు సూచనలు వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. దీనిపై జగన్ మాట్లాడిన అనంతరం యనమల మాట్లాడారు. అవాకులు చెవాకులు అనేది అన్ పార్లమెంటరీ వర్డ్స్ అని , సభా సంప్రదాయాలు తెలియదన్నారు. వారికి ప్రవర్తన తెలియదని, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం బాధాకరమన్నారు. ప్రశ్నోత్తరాలు ఉండాలా ? వద్దా ? అనేది సభ్యులను అడగడాలి కాని ఒక్కరు చెప్పినంత మాత్రాన రద్దు కాదన్నారు. అనంతరం సభ ఉద్ధేశ్యం తెలుసుకోవాలని సూచించారు. ప్రశ్నోత్తరాల అవసరం లేకుంటే బయటకు వెళ్లిపోవాలని, అనంతరం స్టేట్ మెంట్ చదువుతున్న సమయంలో సభలోకి రావచ్చన్నారు. అవినీతి మాకు వద్దని, మీ సలహా కూడా వద్దని.. మీరందరూ కుమ్మక్కయ్యే సలహాలని వైసీపీని ఉద్దేశించి యనమల ఎద్దేవా చేశారు. 

09:41 - September 1, 2015

మౌళిక వసతులు అభివృద్ధి చెందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ది హన్స్ ఇండియా చీఫ్ ఎటిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. యుపిఎ, ఎన్ డిఎ హయాంలో ఆర్థిక గణాంకాల్లో తేడాలు లేవన్నారు. స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా పతనమవుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్ లో ధరలు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. మరిన్ని వివరాలను వివరాను ఆయన మాటల్లోనే...
విధాన పరమైన పక్షవాతం
దేశంలో వృద్ధి రేటు పడిపోయింది. ద్రవ్యలోటు తగ్గింది. ప్రస్తుత ఎకానమిక్ ఇండికేటర్ ఘోరంగా ఉంది. రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ లోని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ద్వంద్వ నీతి వల్ల అస్థిర విధానాల కారణంగా ఆర్థిక రంగంలో విధాన పరమైన పక్షవాతం ఏర్పడిందని పలు పత్రికలు, మ్యాగ్జిన్స్ సిద్ధాంతీకరించాయి. ఆర్థిక వైఫల్యాలు సృష్టించిన అసంతృప్తిని మోడీ ఉపయోగించుకున్నారు. ప్రస్తుత ఎన్ డిఎ ప్రభుత్వం పరిపాలన మొత్తం కూడా మోడీ నాయకత్వంలోనే ఉంది. కేంద్రీకృతమైన పాలన ఉంది. ఈ సందర్భంలో మోడీ ఆర్థిక విధానంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. ద్రవ్యలోటు 7 శాతం పడిపోయింది. వ్యవసాయ ఉత్పిత్తి రేటు మరింతగా పడిపోనుంది. కీలక రంగాల వృద్ధి రేటు పడింది. సేవల రంగంలో కూడా వృద్ధి పడిపోయింది. ద్రవ్యలోటు పెరుగుతోంది. పెట్టుకున్న లక్ష్యానికి రెట్టింపులో ద్రవ్యలోటు ఉంది. ఆదాయానికి కంటే అధికంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. చమురు ధరలు పడిపోతున్నాయి. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో పతనం అవుతున్నాయి. మోడీ మిగిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ లో ఎందుకు ద్రవ్యలోటు పెరుగుతుంది. మౌలిక వసతులు అభివృద్ధి అయితేనే మిగిలిన రంగాలు అభివృద్ధి అవుతాయి.
ఉరిశిక్ష అమలు...
భారతదేశంలో అత్యంత అరుదైన సందర్భంల్లోనే ఉరిశిక్ష అమలు చేయాలని చట్టంలో ఉంది. అయితే అ అత్యంత అరుదైన సంఘటనలుగా వేటిని భావించాలనే వాటిపైనే సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఉగ్రవాదం, దేశద్రోహం అంశాలను పరిశీలించాలి. రకరకాల ఆర్గమెంట్స్ ఉన్నాయి.
ఎపి అసెంబ్లీ..
ఇవాళా కూడా సభలో గందరగోళం నెలకొంటుంది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. అధికార పక్షం.. ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి'. అని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:40 - September 1, 2015

హైదరాబాద్ : ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని, వెంటనే ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాని ప్రతిపక్ష నాయకుడు జగన్ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. దీనికి వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. స్పీకర్ కోడెల చేసిన పలు సూచనలు వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. దీని కోసం పోరాటం చేస్తే వారికే అడ్వాటేంజ్ వస్తుందని అధికారపక్షాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. దీనిపై తాము ముందుండి పోరాటం చేస్తున్నామని సభకు తెలిపారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది కేవలం అరగంట మాత్రమేనని, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు నోట్ కు సంబంధం లేదన్నారు. ఐదు రోజుల సమావేశాల్లో ఒక రోజు సమయం గడిచిపోయిందని, అందుకని ప్రశ్నోత్తారాలతో పాటు మొత్తం బిజినెస్ ను రద్దు చేసి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందు స్టేట్ మెంట్ చదవాలని, తరువాత చర్చ మొదలు పెట్టండని స్పీకర్ కు తెలిపారు. ప్రత్యేక హోదా టాపిక్ జరగకనీయకుండా చూస్తున్నారని, అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పీకర్ కోడెల తీవ్ర అభ్యంతరం తెలిపారు. 

09:35 - September 1, 2015

హైదరాబాద్ : వైసీపీ పార్టీ గందరగోళ పార్టీ అని ఏపీ శాసనభా వ్యవహారాల మంత్రి యనమల ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజైన మంగళవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీనికి వైసీపీ అభ్యంతరం చెప్పింది. స్పీకరన్ చేసిన పలు సూచనలు వైసీపీ సభ్యులు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో యనమల జోక్యం చేసుకుని మాట్లాడారు. ప్రశ్నోత్తరాలను నడిపించాలని, ప్రత్యేక హోదాపై స్టేట్ మెంట్ కంప్లీట్ చేస్తామన్నారు. అనంతరం దీనిపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడవచ్చని సూచించారు. ఈ రోజు వైసీపీ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, వెల్ లోకి దూసుకొచ్చి గందరగోళం చేయడం సరికాదన్నారు. వారి రహస్యం బయటపడుతుందనే దానితో సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభా సంప్రదాయాల వారికి తెలియవని, ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని సభకు తెలిపారు. ప్రత్యేక హోదాపై స్టేట్ మెంట్ కంప్లీట్ చేయాలని, అందులో పేర్కొన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని యనమల పేర్కొన్నారు. 

09:31 - September 1, 2015

హైదరాబాద్ : ఎవరి ఏజెండా వారిదే..ఎవరి పట్టు వారిదే..ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ..ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని అధికార పక్షం పట్టుబట్టింది. దీనితో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు సేమ్ అదే పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరిగి మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీనిని వైసీపీ అడ్డుకుంది. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ప్రశ్నోత్తరాల తరువాత చర్చ చేపట్టవచ్చని సహకరించాలని స్పీకర్ వైసీపీ సభ్యులకు సూచించారు. దీనికి వైసీపీ ఏమాత్రం అంగీకరించలేదు. 'ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలి..ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలు చేశారు. చివరకు సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వడం లేదు - శ్రీకాంత్ రెడ్డి..
ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వడం లేదని వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దానిపై ఆలోచించాలన్నారు. కానీ వాళ్లు చెప్పిన విధంగా నడిపించారని, స్టేట్ మెంట్ ముందు తెలియచేయలేదన్నారు. స్టేట్ మెంట్ లో లేని అంశాలను అడుగుతున్నామని, తీర్మానం అనేది స్టేట్ మెంట్ లో కనిపించలేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను తప్పించుకుండా పోరాటం చేస్తామని అధికారపక్షంలో అంటోందని తెలిపారు.

వైసీపీ..ఇది పద్ధతేనా- విష్ణుకుమార్ రాజు..
సభను అడ్డుకోవడం సరైంది పద్ధతి కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్రశ్నలు చాలా ఇంపార్ట్ మెంట్స్ ఉన్నాయని, భోగాపురం ఎయిర్ పోర్టు తదితర అంశాలపై ప్రశ్నలున్నాయని, తల్లి కాంగ్రెస్...పిల్ల కాంగ్రెస్ అంటే ఏదో అనుకున్నానని, ఈ రెండు ఒకటే అనిపిస్తోందన్నారు. ప్రశ్నోత్తరాలను ఆపడం చాలా దారుణమని, దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సివసరం ఉందని సభకు తెలిపారు. ఏ మాత్రం సహించడానికి వీలు లేదని, వైసీపీ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నోత్తరాల తరువాత ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని సూచించారు. 

ఏపీ అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన రెండో రోజు అదే రగడ నెలకొంది. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని, మొత్తం బిజినెస్ రద్దు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ తిరస్కరించారు. సభలో ఎలాంటి పరిస్థితి మార్పు లేకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. 

ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలి - జగన్..

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. 

వైసీపీపై కఠినంగా వ్యవహరించాలి - విష్ణుకుమార్..

హైదరాబాద్ : ప్రశ్నోత్తరాలను వైసీపీ కావాలనే అడ్డుకొంటోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. దీనికి వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ప్రశ్నోత్తరాల తరువాత మాట్లాడవచ్చని, ఇలా అడ్డుకోవడం సంప్రదాయం కాదన్నారు. 

ప్రత్యేక హోదాపై వైసీపీ పట్టు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కాకుండా ప్రత్యేక హోదాపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది.

పొట్ట నుండి మరో 11 డ్రగ్స్ ప్యాకెట్లు..

హైదరాబాద్ : సౌతాఫ్రికా మహిళ మూసా శరీరం నుండి మరో 11 డ్రగ్స్ ప్యాకెట్లను వైద్యులు బయటకు తీశారు. ఇప్పటి వరకు 51 డ్రగ్స్ ప్యాకెట్లు తీశారు. 

09:01 - September 1, 2015

అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. పరస్పర విమర్శలు చేసుకుండా.. ప్రజా సమస్యలపై చర్చించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎపి అసెంబ్లీ సమావేశాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసిపి నేత కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, టిడిపి నేత ఆనంద్ రావు పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:51 - September 1, 2015

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. నగరంలో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నట్లు అనుమానం.

 

నేడు ఎపి అసెంబ్లీలో లేవనెత్తనున్న ప్రశ్నలు...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాల్లో నేడు వైసిపి పలు ప్రశ్నలను లేవనెత్తనుంది. భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నకిలీ పాస్ పుస్తకాలు, వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త రాజధాని నిర్మాణానికి భూములు, ఎపి ప్రత్యేకహోదాపై వంటి అంశాలపై వైసిపి చర్చకు పట్టుపట్టనుంది. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. టిడిపి ఎమ్మెల్యే యామిని బాల మాట్లాడుతూ జగన్ తీరును ఎండగడతామని చెప్పారు. 

08:48 - September 1, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాల్లో నేడు వైసిపి పలు ప్రశ్నలను లేవనెత్తనుంది. భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నకిలీ పాస్ పుస్తకాలు, వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త రాజధాని నిర్మాణానికి భూములు, ఎపి ప్రత్యేకహోదాపై వంటి అంశాలపై వైసిపి చర్చకు పట్టుపట్టనుంది. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. టిడిపి ఎమ్మెల్యే యామిని బాల మాట్లాడుతూ జగన్ తీరును ఎండగడతామని చెప్పారు.

 

కొన్ని శాఖల బాధ్యతలను మంత్రులకు అప్పగించిన చంద్రబాబు

హైదరాబాద్ : అసెంబ్లీలో తనకు చెందిన కొన్ని శాఖల బాధ్యతలను ఎపి సీఎం చంద్రబాబు మంత్రులకు అప్పగించారు. యనమల రామకృష్డుడికి న్యాయశాఖ, పరిశ్రమలు.., నారాయణకు టూరిజం, సినిమా ఆటోగ్రఫీ, అచ్చెన్నాయుడుకు మౌలిక సదుపాయాలు, విద్యుత్ శాఖను బాబు అప్పగించారు.

 

08:07 - September 1, 2015

వారంతా బడుగు జీవులు. బండి లాగితేగాని జీవన చక్రం నడవదు. ఇలాంటివారు ప్రతి పూట మనకు ఎక్కడో ఒక చోట ఎదురుపడుతూనే వుంటారు. వారే ఫుట్‌పాత్‌, తోపుడుబండ్ల వ్యాపారులు. మరి జీవితాలెలా వున్నాయి.
ఫుట్‌పాత్‌ వ్యాపారమే ఆధారం
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోనే కాదు చిన్నచిన్న పట్టణాల్లో సైతం ఫుట్‌పాత్‌ వ్యాపారం, తోపుడుబండ్ల వ్యాపారం అనేకమందికి బతుకుదెరువు చూపిస్తోంది. మార్కెట్‌లకు వెళ్లే తీరిక, అవకాశం లేనివారికి తోపుడుబండ్ల వ్యాపారులు, సైకిల్‌ వ్యాపారులు ఆపద్భాంధవుల్లా తోడు నిలుస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా జీవించే వృద్ధ జంటలకు వీరి వల్ల కలుగుతున్న మేలు చిన్నదేమీ కాదు. సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న వేళ తోపుడుబండ్ల వ్యాపారం ప్రాధాన్యత మరింత పెరుగుతోంది.
కోటి మందికి పైగా ఫుట్‌పాత్‌, తోపుడుబండ్ల వ్యాపారులు
మనదేశంలో కోటి మందికి పైగా ఫుట్‌పాత్‌, తోపుడుబండ్ల వ్యాపారులుంటారని అంచనా. దేశ రాజధాని ఢిల్లీలోనే 5 లక్షల మంది స్ట్రీట్‌ వెండర్స్‌ వుంటారు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లాంటి నగరాల్లో వీరి సంఖ్య రెండు లక్షల పై మాటే. ప్రతి పట్టణంలోనూ కనీసం రెండు శాతం మంది వుంటారనే అంచనాలున్నాయి. అంతకు ఎన్నో రెట్ల జనాభా వీరివల్ల తమకు కావాల్సిన వస్తువులు పొందగలుతున్నారు. చాలా కుటుంబాలకు తోపుడుబండ్ల వ్యాపారులే నమ్మకమైన సేవకుల్లా, స్నేహితుల్లా వ్యవహరిస్తుండడం మనం చూస్తున్నదే.
ఫుట్‌పాత్‌ వ్యాపారం చేసే పరిస్థితి దారుణం
రోజుకి పది నుంచి పన్నెండు గంటలపాటు శ్రమిస్తే తప్ప ఫుట్‌పాత్‌ వ్యాపారుల జీవితం వెళ్లదు. ఇంతకష్టపడ్డా వీరికి రోజుకి వంద రూపాయలైనా గిట్టుబాటుకావడం కష్టమే. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి లెక్కచేయకుండా ఇన్ని గంటల పాటు వీధులవెంట తిరగడం వల్ల వీరి ఆరోగ్యాలూ దెబ్బతింటున్నాయి. ఫుట్‌పాత్‌, తోపుడుబండ్ల వ్యాపారుల్లో 85శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. మైగ్రెయిన్‌, హైపర్‌ ఎసిడిటీ, హైపర్‌ టెన్షన్‌, హైబ్లడ్‌ ప్రెషర్‌ లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. నిత్యం వీధుల వెంట వ్యాపారం చేసే వీరికి మూత్ర విసర్జన అతి పెద్ద సమస్యగా మారి, ఆరోగ్యాలకు హాని చేస్తోంది. ఫుట్‌పాత్‌ వ్యాపారం చేసే పరిస్థితి మరీ దారుణం. మూత్రకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. ఇక లైంగిక వేధింపులూ తప్పడం లేదు.
వారికి వేధింపులు తప్పడం లేదు
ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ మనకు చేరువలో విక్రయాలు సాగిస్తున్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు పోలీసుల, మున్సిపల్‌, కార్పొరేషన్‌ అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ప్రతి నెలా మామూళ్లు ముట్టచెప్పాల్సిదే. లేదంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్న పేరుతో వీరి మీద పోలీసులు, అధికారులు చెలరేగిపోతారు. తమ సంపాదనలో పది నుంచి ఇరవై శాతం మామూళ్ల రూపంలో ముట్టచెప్పాల్సిన దుస్థితి వీరిది. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ స్ట్రీట్‌ వెండర్స్‌ అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించారు. ఫలితంగా 2014లో స్ట్రీట్‌ వెండర్స్‌ పాలసీని కేంద్రం రూపొందించింది. అయినా, వారి కష్టాలు తీరడం లేదు.
వీధి వ్యాపారుల పట్ల చిన్నచూపు
వీధి వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులివ్వాలని చట్టం పేర్కొంది. టౌన్‌ వెండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలనీ, ప్రత్యేకంగా వెండింగ్‌ జోన్స్‌ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టం స్పష్టం చేసింది. కానీ, ఆ దిశగా అధికారులు ప్రయత్నిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇటు అధికారుల సహకారం లేక, అటు మామూళ్ల బాధ భరించలేక, చాలీచాలని సంపాదనతో అవస్థపడుతున్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు రిటైల్‌ రంగంలోకి దూకుతున్న విదేశీ పెట్టుబడులు కూడా పెను సవాలుగానే మారుతున్నాయి.

 

హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. నగరంలో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నట్లు అనుమానం.

 

07:54 - September 1, 2015

హాకర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని విజయవాడ హాకర్స్‌ అసోసియేషన్‌ నేత మురళి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సెప్టెంబర్‌ 2 సమ్మెలో తోపుడు బండ్ల వ్యాపారులు కూడా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా హాకర్స్‌ వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో హాకర్స్‌ సమస్యలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. హాకర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి డిమాండ్స్‌ ఏమిటి? వంటి అంశాలపై మురళి మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

07:49 - September 1, 2015

ఢిల్లీ : బిజెపిలో విభేదాలు ముదిరాయా? కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ప్రధాని సంతృప్తిగా లేరా? హోంశాఖ మంత్రికి తెలియకుండానే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియామించడం వెనక మతలబేంటి? ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్‌ కానున్న రాజీవ్‌ మెహరిషిని ఉన్నట్టుండి హోంశాఖ కార్యదర్శిగా కేంద్రం ఎందుకు ప్రమోషన్‌ ఇచ్చింది?
హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి
1978 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ మెహరిషి ఆర్థిక కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అయితే ఆయన పదవికాలం సోమవారంతోనే ముగియడంతో రాజీవ్‌ సహచరులు వీడ్కోలు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ కంగు తిన్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
ఎల్సీ గోయల్ పదవికి రాజీనామా
హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎల్సీ గోయల్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయగా కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. వాస్తవానికి గోయల్‌ పనితీరుపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోది, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అసంతృప్తిగా ఉండడమే ఇందుకు కారణం. సన్‌ టీవికి 37 చానళ్లకు హోంమంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపడం జైట్లీకి నచ్చలేదు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు కూడా.. ఎందుకంటే సన్‌టీవీపై మనీలాండరింగ్‌, అవినీతికి సంబంధించిన మూడు కేసులపై విచారణ జరుగుతోంది. అలాగే నాగాలాండ్‌తో ఒప్పందంపై పిఎంఓ అసంతృప్తిగా ఉంది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ వ్యవహారంలో తాత్కాలిక విచారణకు హోంశాఖ కార్యదర్శి నిరాకరించారు.
అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల పాత విభేదాలు
హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియామకంపై ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మాటవరసకైనా చెప్పకపోవడం బిజెపిలో ముదురుతున్న విభేదాలను సూచిస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ఎల్‌సి గోయల్‌ని తప్పించినట్టు తెలుస్తోంది. ఈ నియామకంతో అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల మధ్య ఉన్న పాత విభేదాలను గుర్తుకు తెస్తోందని చెబుతున్నారు.

 

07:41 - September 1, 2015

ఢిల్లీ : వాహనదారులకు శుభవార్త. చమురు ధరలు సామాన్యుడికి కాస్తా ఊరట కలిగించాయి. లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 50 పైసల చొప్పున తగ్గాయి. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

 

07:35 - September 1, 2015

హైదరాబాద్ : సుధీర్ఘ విరామం తర్వాత సమావేశమైన ఏపీ శాస‌నమండ‌లి వాడీవేడీగా సాగింది. దేవుడి సొమ్ముపై సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో టిడిపి స‌భ్యులు య‌ల‌మంచిలి బాబు రాజేంద్రప్రసాద్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆదాయం అంశాన్ని లేవనెత్తారు. టిటిడి ఆదాయాన్ని ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు.. గతేడాది 7359.45 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌న్నారు. ఆదాయం మొత్తాన్ని బ్యాంకులో వేస్తే 700 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌ని వివ‌రించారు మంత్రి. దీనిపై టిడిపి సభ్యులు పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
టిటిడి సొమ్మును ప్రజా అవ‌స‌రాల‌కు ఉపాయోగించాలి
టిటిడి సొమ్మును ప్రజా అవ‌స‌రాల‌కు ఉపాయోగించాల‌ని పయ్యావుల సూచించారు. దేవుడి పేరుతో వ్యాపారం ఎందుకు చేస్తున్నార‌ని.. పాల‌క మండ‌లిగా వ్యవ‌హరించ‌డం స‌రికాద‌న్నారు. పీడీఎఫ్‌ సభ్యులు బాల సుబ్రమణ్యం.. దేవ‌స్థానం డ‌బ్బులతో విద్యా సంస్థలు, విద్యాభివృద్ధికి కృషి చెయ్యాల‌ని ప్రభుత్వానికి సూచించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చిన మాణిక్యాలరావు.. అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
రావెల వ్యాఖ్యలతో గందరగోళం
ఇక వైద్యం అదించ‌డంలో ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై ప్రతిప‌క్ష స‌భ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కామినేని శ్రీనివాస‌రావు స‌మాదానం ఇస్తూ.. ప్రస్తుతం 88 ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యాయని.. మ‌రికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే స్థానిక‌త అంశంలో జ‌రిగిన చ‌ర్చ ర‌భస‌కు దారి తీసింది. తెలంగాణలో చ‌దువుతున్న ఆంధ్రా విద్యార్ధుల‌కు ప్రభుత్వం స్కాల‌ర్‌షిప్స్ ఏవిధంగా ఇచ్చిందో తెల‌పాల‌ని వైసీపీ స‌భ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి రావెల కిషోర్‌బాబు.. విపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు. రావెల వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ సభ్యులు సుధాకర్‌ పోడియం వద్ద బైఠాయించారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పలువురి మృతికి సంతాపం...
అంతకుముందు ఉదయం మండలి ప్రారంభం కాగానే.. తొలుత ఇటీవ‌ల మృతి చెందిన మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లామ్, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన భక్తులు, ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి సభ్యులు సంతాపం ప్రకటించారు. మరోవైపు.. కొత్తగా సభలోకి వచ్చిన పలువురు సభ్యులను మండలి ఛైర్మన్‌ చక్రపాణి.. సభకు పరిచయం చేశారు. 

07:27 - September 1, 2015

ఒడిషా : భువనేశ్వర్‌లో మరో దొంగ బాబా అక్రమాలు వెలుగుచూశాయి. దైవం పేరుతో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బాబాపై అనేక ఆరోపణలున్నాయి. మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని ఎంతోమంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. బాబా తాహ్రి ఆశ్రమంలోకి పోలీసులు వెళ్తుండగా పలువురు బాబా అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆశ్రమంలోని వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో నేడు చంద్రబాబు ప్రకటన...

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో నేడు సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.

 

 

07:07 - September 1, 2015

హైదరాబాద్ : యాదాద్రి ఆలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్టులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. యాదాద్రి ప్రధాన ఆలయంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను చక్కగా తీర్చి దిద్దేందుకు స్థపతి, ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్‌లను సీఎం పరిశీలించారు. ప్రధాన గుట్టపై దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం నాలుగు మాడ వీధులు, నాలుగు రాజ గోపురాల నిర్మాణ డిజైన్‌ను సీఎం పరిశీలించారు.
ప్రధాన ద్వారం నిర్మాణ డిజైన్‌ పరిశీలన
కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో వచ్చే పుష్కరిణి విస్తరణ, తూర్పున శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ద్వారం నిర్మాణ డిజైన్‌ను పరిశీలించారు. సీఎం చేసిన సూచనల మేరకు ఆలయ ప్రాంగణంలోనే నాలుగు వైపుల పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మండపం, యాగశాల నిర్మాణాలకు కూడా డిజైన్‌ను రూపొందించినట్టు ఆలయ శిల్పులు తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతోపాటు చుట్టు పక్కల ఉన్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలనే విషయాలపై స్పష్టత ఇచ్చారు.
యాదాద్రిపై భక్తి వాతావరణం
యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంతో నిండిపోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కుటుంబ సభ్యులతో సహా వచ్చే భక్తులకు ఆహ్లాదంగా గడిపే భక్తి వాతావరణం యాదాద్రిపై ఉండాలన్నారు. యాదాద్రి ప్రాంతాన్నంతటినీ సెంట్రల్ మైక్ సిస్టం ఏర్పాటు చేసి నిత్యం భక్తి స్తోత్రాలు వినిపించేలా చేయాలన్నారు.
గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు వేర్వేరు దారులు
గుట్టపై నిర్మాణాలన్నింటిని ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టాలని అధికారులకు సూచించారు. మండల దీక్షలు చేసే వారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్స్‌లు నిర్మించాలని చెప్పారు. గుట్ట కింద భాగంలో 2500 మంది పట్టేలా కళ్యాణ మండపంను నిర్మించాలన్నారు కేసీఆర్‌. గుట్టపై ఏకకాలంలో 30 వేల మంది తిరిగినా ఇబ్బంది కలుగకుండా ఉండాలని సూచించారు. గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు వేర్వేరుగా దారులు ఉండాలని తెలిపారు.
రిజర్వాయర్‌గా బస్వాపూర్ చెరువు
యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్‌గా మారుస్తామని కేసీఆర్‌ అన్నారు. రిజర్వాయర్‌కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కును నిర్మించాలని అధికారులకు సూచించారు. భక్తులకు సరిపడే విధంగా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. మెరుగైన మురుగు నీటి నిర్వహణ ఉండాలని తెలిపారు. మొత్తానికి యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు.

 

06:54 - September 1, 2015

హైదరాబాద్ : ఆరోపణలు, ప్రత్యారోపణలు... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అట్టుడికింది. ప్రత్యేక హోదా, పుష్కర వివాదంపై... టీడీపీ, వైసీపీ మధ్య సభా సమరమే జరిగింది. మాటల తూటాలతో వైసీపీ అస్త్రాలు సంధిస్తే... అధికార పక్షం సైతం ధీటుగా సమాధానం చెప్పింది.
అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
నిరసనలు... నినాదాలు... అరుపులు... ఆందోళనలు...ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని దృశ్యాలివి. తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కించాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా, పుష్కర విషాదంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ YCP పట్టుబట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది.
కేంద్రం నుంచి టిడిపి వైదొలగాలని జగన్‌ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలని... ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్ చేశారు. టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటకు వస్తేనే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అనవరసరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు.
గోదావరి పుష్కరాలపై దుమారం
అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం రేగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా... అపశృతి చోటుచేసుకుందని చంద్రబాబు ప్రకటించారు. పుష్కరాల మృతులకు ఏపీ సీఎం సంతాపం ప్రకటించారు. పుష్కరాల మృతులపై బాబు చేసిన ప్రసంగంపై జగన్‌ మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బాబు పబ్లిసిటీ కోసం చేసిన నిర్వాహకం వల్ల 29 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగన్‌ ప్రసంగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్ చేశారు. స్పీకర్‌ వారించినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు.
ప్రత్యేక హోదాపై మృతులకు సంతాప తీర్మానం
అనంతరం ప్రత్యేక హోదాపై మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెట్టి ఎందుకు వెనక్కి తీసుకున్నారో..? చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు.. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీలో వైసీపీ ఆందోళనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి యనమల. ప్రతిపక్షానికి సభ సజావుగా సాగడం ఇష్టంలేదని ఆరోపించారు.
సభ నేటికి వాయిదా
స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు శాంతించలేదు.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

 

నేడు వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

వరంగల్ : నేడు వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మిషన్ కాకతీయ చెరువు పనులను మంత్రి పరిశీలించనున్నారు.  

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మైనార్టీ కమిషన్ పర్యటన

మహబూబ్ నగర్ : నేడు జిల్లాలో మైనార్టీ కమిషన్ పర్యటించనుంది. ఉదయం 11 గంటలకు అధికారులతో సమావేశం జరుపనుంది. 

Don't Miss