Activities calendar

02 September 2015

మహ్మాదాపురంలో విషాదం..

వరంగల్ : జిల్లా దుగ్గొండి మండలం మహ్మాదాపురంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా ఓ తండ్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు రాము (35), అభిరామ్ (7), ఈశ్వర్ (7) లుగా గుర్తించారు. 

ఐఆర్ఎస్ అధికారికి జైలు శిక్ష..

హైదరాబాద్ : ఐఆర్ఎస్ అధికారి మల్లిఖార్జున్ కు జైలు శిక్ష విధించారు. రూ. లక్షల జరిమాన విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లిఖార్జున్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అసిస్టెంట్ ఇన్ కం ట్యాక్స్ అధికారిగా మల్లిఖార్జున్ పని చేశారు. 

21:28 - September 2, 2015

వరంగల్ : జిల్లాలో గిరిజనులు వినూత్నంగా సమ్మె చేపట్టారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా.. కార్మికులకు మద్దతుగా గిరిజన కళాకారులు వారి సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ట్రైబల్ మ్యూజియం ఎదురుగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

21:27 - September 2, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ మూడోరోజు దద్దరిల్లింది. ప్రజా సమస్యలపై చర్చించకుండా అధికార, ప్రతిపక్షాలు మాటలయుద్ధం కొనసాగించాయి. వైసీపీ అటాక్‌ ఇస్తే.. టిడిపి కౌంటర్‌ చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించాయి. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్‌ ఫొటో తొలగించడంపై రగడ మొదలై.. వైసీపీ ఆందోళనకు దిగింది. జగన్ పార్టీ తీరుపై టిడిపి సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇరువర్గాల సభ్యుల నినాదాలతో సభలో మైకు హోరెత్తింది. చివరకు సభాపతి.. క్లారిటీ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది.

వైఎస్ చిత్రపటంపై ఆందోళన..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం తొలగింపుపై మరోసారి రగడ మొదలైంది. ఇన్నాళ్లు లేఖలు, వైసీపీ నేతల డిమాండ్లతో బయట రచ్చకాగా.. ఇపుడు అసెంబ్లీ వేదికగా హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ చిత్రపటాన్ని తొలగించడంపై మూడోరోజు సభలో వైసీపీ సభ్యులు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో తొలగించిన వైఎస్. రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. మంత్రిగా, సీఎంగా, ఎంపీగా రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని.. వెంటనే ఆయన చిత్రపటాన్ని అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వైఎస్‌ఆర్ నినాదాలతో సభలో హోరెత్తిస్తూ ఆందోళనకు దిగారు.

మండిపడిన కోడెల..
వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని అడగటం ఎంతవరకు సమంజసమని చెప్పారు. అసెంబ్లీ సంప్రదాయాలు పాటించాలన్న స్పీకర్ కోడెల.. సభలో సభాపతుల ఫొటోలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. వైఎస్‌ ఫొటో తొలగింపుపై కేవీపీ రామచంద్రరావు అసెంబ్లీని కించపరుస్తూ తనకు లేఖ రాశారని.. దీనిని వైసీపీ సభ్యులు సమర్థిస్తారా అని కోడెల ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు అభ్యంతరం..
ఇదిలా ఉంటే.. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యుల ఆందోళనపై అభ్యంతరం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టుపట్టించిన వైఎస్‌ను చనిపోయిన ఆరేళ్లకే ప్రజలందరూ మర్చిపోయారని ఆరోపించారు. ఎంతో మంది మహానాయకులు రాష్ట్రానికి సేవలందించారని.. పెడితే అందరి ఫొటోలు పెట్టాలని కోరారు. వైఎస్‌ ఫొటో ఒక్కటే పెట్టమనడం ఎంతవరకు సమంజసమని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చివరికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు.. సభలో చర్చించి వైఎస్‌ ఫొటో విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

21:23 - September 2, 2015

హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్యపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రిషితేశ్వరి ఘటనపై అధికార పక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం వైసీపీ విమర్శించింది. కాగా రిషితేశ్వరి ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధితులుకు న్యాయం చేస్తామని అధికార పక్షం ప్రకటించింది.

మాటల యుద్ధం..
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో అధికార విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురు దాడికి దిగారు. నాగార్జున వర్సిటీలో లైంగిక వేధింపులు, ర్యాగింగ్ రిషితేశ్వరిని చంపేశాయని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తేల్చిందని, ప్రభుత్వం ముగ్గురిని అరెస్ట్ చేసి పనైపోయిందని సర్కార్ చేతులు దులుపుకుంటోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

రోజా వర్సెస్ గంటా..
రిషితేశ్వరి చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు ప్రెస్మీట్ పెట్టి...హడావుడిగా శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొనడానికి మంత్రి గంటా హైదరాబాద్ వచ్చారని ఈసందర్భంగా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అనంతరం విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో కమిటీ 172 మందిని ప్రశ్నించిందని తెలిపారు.

ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు..
ఇదిలా ఉంటే రోజా విమర్శలపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర స్పందించారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన నైతిక హక్కు వైసీపీకి లేదని విమర్శించారు. వర్సిటీలో కుల సంఘాలు కాంగ్రెస్‌ హయాంలో పుట్టుకొచ్చాయని అన్నారు. రిషితేశ్వరి ఘటనపై వైసీపీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలని ఎమ్మెల్యే నరేంద్ర డిమాండ్‌ చేశారు.

బాబురావుపై ఎందుకు చర్చించలేదు..
ఇదిలా ఉంటే రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్‌ బాబు రావును నిందితుడిగా ఇంకా ఎందుకు చేర్చలేదని రిషితేశ్వరి తండ్రి వాపోయారు. మరోవైపు అసెంబ్లీలో హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతోందని, ప్రిన్సిపల్ బాబూరావవు పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

21:20 - September 2, 2015

అపారమైన ఉపయోగమే కాదు.. అంతులేని విధ్వంసానికీ కారణం కాబోతోందా?  సాంకేతిక ప్రగతి అంతిమంగా వణికించే విధ్వంసానికి పునాదులు వేయబోతోందా..? జరుగుతున్న పరిణామాలు అవుననిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, అవి ఆకాశంలోంచి ప్రమాదాన్ని మోసుకొస్తాయి. క్షణాల్లో విధ్వంసం సృష్టిస్తాయి. ఉగ్రసంస్థల చేతిలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. అవే డేంజర్ డ్రోన్స్.. అంశంపై ప్రత్యేక కథనం..

పలు నగరాల్లో నిషేధం..
డ్రోన్ ల గురించి ఇటీవలి కాలంలో చర్చ విపరీతంగా పెరుగుతోంది. వాడకం పెరిగి నగరాలు, పట్టణాల్లో తరచుగా కనిపించటం మొదలైన తర్వాత, ఈ చిన్న పరికరంతో ఉపయోగం మాట తర్వాత నష్టాలు మాత్రం తీవ్రంగా కనిపించటం మొదలయ్యాయి. దీంతో డ్రోన్ లపై నిషేధంలో నగరాలు వరుస కడుతున్నాయి.

హైదరాబాద్ ఉగ్రవాదులకు టార్గెట్ గా మారిందా?..
లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు... నగరవాసి మది నుండి చెరిగిపోలేదు.. ఇప్పుడు మళ్లీ, అలాంటి డేంజర్ బెల్స్ వినిపిస్తున్నాయా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లు ఏం చెప్తున్నాయి?

ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ?
డ్రోన్ లతో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ? డ్రోన్ లు ఏ రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి? వైమానిక దాడులకు ప్రత్యామ్నాయంగా, మిసైల్ దాడులకు మరో రూపంగా డ్రోన్ లు మారనున్నాయా? ఎగిరే చిన్న వాహనం అంతులేని విధ్వంసానికి కారణం అయ్యే అవకాశాలున్నాయా? శాస్త్ర సాంకేతిక రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి యంత్రాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఈ పరిణామంలో నుంచి పుట్టిందే డ్రోన్ టెక్నాలజీ. కాలు కదపకుండా చకచకా అన్ని పనులు జరిగిపోవాలి ఈ ఆలోచనే డ్రోన్ ల ఆలోచనకు పురుడు పోసింది.

నియంత్రణలు ఉండాలి..
యుద్ధ రంగంలో విధ్వంసానికే కాదు, డ్రోన్లను నిత్య జీవితంలో కూడా విరివిగా వాడటం మొదలు పెట్టేశారు. పిజ్జా డెలివరి నుంచి ఫిల్మ్ షూటింగ్, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలు ఇలా అన్ని రకాలుగానూ నేడు డ్రోన్లు కీలకంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సైన్స్ ఎప్పుడైనా రెండంచుల కత్తిలాంటిదే. అది డ్రోన్లకైనా, న్యూక్లియర్ ఆయుధాలకైనా వర్తిస్తుంది. అదే విధంగా డ్రోన్లతో కూడా ఎంత అపాయం పొంచి ఉందో అంతే ఉపయోగం కూడా ఉంది. వీటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో విధ్వంసానికి కూడా వాడవచ్చు. సరైన నియంత్రణలు ఉన్నప్పుడే ఇలాంటి అపాయాలను నిరోధించే అవకాశాలున్నాయి. 

12వేల కిలోల బెల్లం స్వాధీనం..

మహబూబ్ నగర్ : జిల్లాలోని వనపర్తిలో ఓ వ్యాపారి ఇంటిపై అబ్కారీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వ్యాపారి ఇంట్లో ఉన్న 12వేల కిలోల నల్లబెల్లాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. 

నల్గొండ మున్సిపల్ లో 3.32 కోట్లు స్వాహా..21 మంది సస్పెన్షన్..

నల్గొండ : జిల్లా మున్సిపల్ లో శాఖలో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆడిట్ అధికారుల తనిఖీల్లో రూ.3.32 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆరుగురు రెవెన్యూ అధికారులు, 15 మంది బిల్ కలెక్టర్లను సస్పెండ్ చేశారు. 

బాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఆమంచి..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గుంటురు జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ టిడిపిలో చేరారు. 

20:31 - September 2, 2015

హైదరాబాద్ : చీప్ లిక్కర్ పై టి.సర్కార్ తోక ముడించింది. గుడుంబాను అరికట్టి కొత్త చీప్ లిక్కర్ తేవాలని టి.ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజలు, ప్రజా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పాత విధానానే కొనసాగిస్తామని, గుడుంబాను మాత్రం ఉక్కుపాదంతో అణిచివేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం కేసీఆర్ మీడియాకు వివరాలు తెలియచేశారు. ఈనెల 23 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతాయని, ప్రతిపక్షాలు కోరుకున్నంత వరకు సమావేశాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఆయన మాటల్లోనే..

గుడుంబాపై ఉక్కుపాదం..
''
గుడుంబా అరికట్టాలనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. ప్రజల నుండి అనేక సూచనలు అందాయి. ప్రత్యామ్నాయ డ్రింక్ అందించాలని వినతులు వచ్చాయి. గుడుంబాలో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. గుడుంబాను ఏ రకమైన ధరతో కొంటారో అదే ధరను మద్యాన్ని విక్రయించాలనే దానిపై చర్చ జరిగింది. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. గుడుంబాపై ఐజీ స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం. 

కొత్త జిల్లాలు..
ఎన్నికల హామీల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పాం. దీని కోసం నలుగురితో కమిటీ వేశాం. సీఎస్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటవుతాయి.

రూ.3,900 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు..
డబుల్ రూ. 3,900 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించడం జరుగుతోంది. ఈ సంవత్సరం 60 వేల డబుల్ రూం ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోక్క ఇళ్లు 560 చ.అ. ఉంటుందని, ఇందుకు రూ. 5 లక్షల 40 వేల ఖర్చు చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు రూ. 5లక్షల 30వేల రూపాయలు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో మంజూరైన ఇళ్ల విషయంలో స్కాం జరిగింది. ఇందులో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేసి వెంటనే వారికి పేమెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పాత వాటిని పూర్తి చేసి బిల్లులు చెల్లిస్తాం.

మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు..
మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం 183 మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో 13 పీసా చట్టం కింద గిరిజనులకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 170 మార్కెట్ కమిటీలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 85 రిజర్వేషన్ ఉంటాయి. మిగతా 85కు జనరల్ గా ఉంటాయి. పైరవీలకు ఆస్కారం లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయించడం జరుగుతుంది.

ఆర్టీసీ సంస్థను పరిరక్షించడం కోసం..
నగరంలో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. 218 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. ఈ నష్టం పూడ్చడానికి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఈ నష్టాన్ని పూడ్చాలని నిర్ణయం తీసుకున్నాం. 96 లక్షల మందిని ఒక చోట నుండి మరొక చోటికి చేరవేయడం జరుగుతోంది. 3,800 బస్సులు ప్రజలకు సేవలందిస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలలో అర్బన్ ట్రాన్స్ పోర్టులో నష్టం వస్తుంటోంది. అక్కడ కొన్ని సదుపాయాలు అప్పగించడం జరిగింది. ఇతర రంగాల్లో వచ్చే లాభాలను తీసుకుని నడిపిస్తుంటుంది. దేశంలో ముంబైలో ఈ తరహా విధానం అమలు ఉంది. ఇక్కడ అలాంటి ఏర్పాటు చేయలేదు. ఇక అధికారికంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్టీసీలో బోర్డు సభ్యుడిగా కొనసాగుతుంటారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి...
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ నివేదికలు అందుతున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందుతున్నాయి. కాళేశ్వరం పరిధిలో నిర్మించే బ్యారేజీ లైడార్ సర్వే ప్రారంభమైంది. రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి రూ. 25వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పాలమూరు - రంగారెడ్డి కీ మానిటరింగ్ కోసం 'పాలమూరు అథార్టీ' ఏర్పాటు చేయడం జరిగింది''.అని కేసీఆర్ తెలిపారు. మరికొన్ని నిర్ణయాలు..

  • ​నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేస్తాం.
  • రూ.2,631 కోట్లతో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేయడం జరుగుతుంది.
  • ఉద్యోగాల నియామకాల్లో అన్యాయం జరిగిందనేది ఉంది. అందు కోసం 34 వయస్సును 44 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
  • నగరంలో మొబైల్ మ్యాన్యుఫాక్షరింగ్ ఏర్పాటుకు కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇందుకు పరిశ్రమ ఏర్పాటు చేసే వారికి అనుమతినివ్వడం జరిగింది.

ఈనెల 24 నుండి టి. అసెంబ్లీ..

హైదరాబాద్ : ఈనెల 24వ తేదీ నుండి ఆరు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశ వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ నియమించనుంది. కమిటీ నివేదిక రాగానే జిల్లాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.3,900 కోట్ల ఖర్చుతో ఈ ఏడాది 60వేల ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు కేటాయించనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

చంద్రన్న పేరిట యాత్రలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'చంద్రన్న' పేరిట యాత్రలు నిర్వహించనుంది. ఈ యాత్రలో మంత్రులు అచ్చెన్నాయుడు, పత్తిపాటి, రావెల, పల్లె రఘునాథ్ రెడ్డిలు పాల్గొనున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ఈ యాత్ర ముగియనుంది. 

19:47 - September 2, 2015

ఢిల్లీ : తమతో క్రికేట్ ఆడుతారో ? లేదో చెప్పాలంటూ పాక్ క్రికెట్ బోర్డు బీసీసీకి లేఖ రాసింది. క్రీడలు, రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వేర్వేరుగా చూడాలని లేఖలో సూచించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం భారత్ - పాక్ మధ్య డిసెంబర్ లో మూడు వన్డేలు, రెండు టెస్టులను నిర్వహించేందుకు సహకరించాలని బీసీసీఐని కోరింది. తటస్థ వేదికపై భారత్ తో పాటు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేందుకు పీసీబీ ఉత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ల వల్ల భారీగా ఆదాయం సమకూరుతుందని పీసీబీ యోచిస్తోంది. కానీ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాక్ తో మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ రాసిన లేఖపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

19:38 - September 2, 2015

కరీంనగర్ : గోదావరి నది జలాలను సద్వినియోగం చేసుకొనేందుకు ప్రభుత్వం చేపట్టిన లైడార్ సర్వే బృందం కరీంనగర్ జిల్లా రామగుండంకు చేరుకుంది. ఆరుగురితో కూడిన సభ్యుల బృందం సర్వే నిర్వహించనుంది. గోదావరి జలాల సద్వినియోగం, ప్రాజెక్టుల రీ డిజైనింగ్, జలాల వాటాపై ఈ బృందం సర్వే చేయనుంది. దుబ్బగూడెం నుంచి కాళేశ్వరం వరకు ఆ తర్వాత మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు లైడార్ సర్వే ను చేపట్టనున్నారు. సుమారు 15 రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. కొత్త ప్రాజెక్టులు, చేపట్టిన ప్రాజెక్టు గురించి రీ డిజైనింగ్ చేయాల్సినవసరం ఉందా ? లేదా ? అనే దానిపై సర్వే చేయాలని ప్రభుత్వం భావించిందని అధికారి పేర్కొన్నారు.

హెలికాప్టర్ లో ప్రయాణం..
గోదావరి నదిపై గగనతలం నుండి ఈ లైడార్ సర్వే జరుపుతారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ లైడార్ పరికరాల ద్వారా లేజర్ కిరణాలు నేల మీదకు ప్రసరింప చేసి సమాచారం సేకరిస్తారు. ఆ మార్గంలో నేలపై ఐదు కిలోమీటర్ల వెడల్పున ఉండే ప్రదేశమంతా చిత్రాలను తీస్తారు. ఇందులో అతి చిన్న పరిమాణంలో ఉన్న వాటిని సైతం స్పష్టంగా గుర్తించేలా డిజిటల్ చిత్రాలు వస్తాయి. ఇలా గోదావరి నది పొడవు, వెడల్పు, లోతు స్థాయిని పరిశీలిస్తారు. ప్రదేశాల్లోని భౌగోళికాంశాలు, ఆవాసాలు, ప్రాంతాల్లో అక్కడ ఏంది ఉంది ? ఎలా ఉంది ? ఇలా అన్ని వివరాలను ఫొటోలతో సహా రికార్డు చేస్తారు. హెలిక్యాప్టర్ లో పైలట్, కో పైలట్, రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీర్, లైడార్ పరికరాన్ని ఆపరేట్ చేసే నిపుణులు ఉంటారు. 

19:20 - September 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బిజెపి నేత కిషణ్ రెడ్డి ఆఫర్ ప్రకటించారు. ఆయన పార్టీ మారుతారా ? ఏదైనా పదవి డిమాండ్ చేశారా ? అనుకుంటున్నారా ? కాదు. మరి ఆయన దేని కోసం ఆఫర్ చేశాడంటే ఇది చదవండి..భాగ్యనగరంలో ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధారం ఏకంగా నల్లకుంటలోని ఫీపవర్ ఆసుపత్రి ఎదుట నిర్వహించిన ధర్నాలో స్వయంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగించారు. రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని తెలిపారు. రోడ్ల మీద గుంతలు లేవు..బాగున్నాయి అని, ఎక్కడైనా గుంతలు ఉన్నాయని చూపిస్తే రూ. వేయి ఇస్తానని సీం కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ గుంతలు లేని ఒక్క రోడ్డు చూపిస్తే సీఎంకు లక్ష రూపాయలిస్తానని కిషన్ రెడ్డి ప్రకటించారు.

రాజమండ్రిలో ఎన్ఆర్ఐ కిడ్నాప్..?

రాజమండ్రి : జిల్లాలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఓ ఎన్ఆర్ఐ ని నలుగురు వ్యక్తులు బైక్ వచ్చి కిడ్నాప్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిని పోలీసులు ధృవీకరించడం లేదు.

 

19:09 - September 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి పలు అంశాలకు ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో కేబినెట్ భేటీ జరిగింది. సుమారు మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఉద్యోగుల డీఏ మంజూరు..రాష్ట్ర సహాకార బ్యాంకు ఏర్పాటు..తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఏర్పాటు..వృత్తిపన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపు..వ్యాట్ చట్టంలో మార్పులు..వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం తీర్మానించింది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను లాటరీ పద్ధతిన చేపట్టాలని..కరీంనగర్, మహబూబ్ నగర్..నిజామాబాద్ జిల్లాల్లోఅగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వేర్‌హౌసింగ్ ఏర్పాటు..కాళేశ్వరం ఎత్తిపోతల కార్పోరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. 

ముగిసిన టి.కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి కింద ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. కాసేపట్లో సీఎం కేసీఆర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు. 

మన్మోహన్ సింగ్ పై కోడా ఆరోపణలు..

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మధుకోడా తీవ్ర ఆరోపణలు చేశారు. బొగ్గు కేటాయింపులు మన్మోహన్ కు తెలిసే జరిగాయని, జిందాల్ కంపెనీకి కేటాయించిన విషయం మన్మోహన్ కు తెలియకుండా ఏ కుంభకోణం జరుగలేదని పేర్కొన్నారు. మన్మోహన్ ను కూడా కోర్టుకు పిలిపించి విచారించాలని సీబీఐ కోర్టుకు కోడా వెల్లడించాడు. 

పలు అంశాలకు టి. కేబినెట్ ఆమోదం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి పలు అంశాలకు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఉద్యోగుల డీఏ మంజూరు..రాష్ట్ర సహాకార బ్యాంకు ఏర్పాటు..తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఏర్పాటు..వృత్తిపన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపు..వ్యాట్ చట్టంలో మార్పులు..వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం తీర్మానించింది.

18:18 - September 2, 2015

విజయవాడ : ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి విచారణ అధికారిగా నియమిస్తే ఎలా ఉంటుంది ? ఎలా ఉంటుందేది అవినీతి ఎంత జరిగింది ? అవినీతికి కారకులెవరు ? అన్నది ఎలా తేలుతుంది అని అంటారు కదా మరి ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియదా ? ఎందుకంటే ఇటీవల విజయవాడ దుర్గగుడిలో పలు అక్రమాలు చోటు గంధం సత్యనారాయణ అనే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, దేవాదాయ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇందులో ఈవో నర్సింగ్ రావు పాత్ర ఉందని పేర్కొన్నాడు. కానీ దేవాదాయ శాఖ మాత్రం ఈ అవినీతి విచారణ చేపట్టేందుకు విచారణ అధికారిగా ఈవో నర్సింగ్ రావును నియమించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అవినీతి చేసిన వ్యక్తిని విచారణ అధికారిగా నియమించడం సహేతుకం కాదని భక్తులు పేర్కొంటున్నారు. 

కొనసాగుతున్న టి. కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల డీఏ మంజూరు, వృత్తి పన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాట్ చట్టంలో మార్పులు చేయాలని, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 

సూదిగాడి రెండో ఊహాచిత్రం...

పశ్చిమగోదావరి : సూదిగాడి రెండో ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. భీమవరం పీఎస్ లో పోలీసు అధికారులు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 

17:48 - September 2, 2015

మహబూబ్ నగర్ : పక్కన భార్య మృతదేహం.. చేతిలో అప్పుడే పుట్టిన బిడ్డ.... పక్కన మరో ఇద్దరు చిన్నారులు.. అంత్యక్రియలకోసం సొంతూరుకు వెళ్లాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు.... బస్టాండ్లోనే గుండెలవిసేలా రోదిస్తున్న ఆ కుటుంబానికి మేమున్నామంటూ చేయూతనిచ్చారు కార్మికులు..... పోరాటంలోనేకాదు.. మానవత్వంలోకూడా తమకు ఎవరూ సాటిరారని నిరూపించారు. బతుకుతెరువుకోసం పొట్టచేతపట్టుకొని వలసపోయిన కుటుంబానికి తీరని శోకం మిగిలింది.. భార్య అంత్యక్రియల ఖర్చుకు డబ్బులేక... బస్టాండ్లో చిక్కుకుపోయిన ఆ కుటుంబాన్ని కార్మికులు ఆదుకున్నారు.. మేమున్నామంటూ చేయూత అందించారు.

ప్రసవం కోసం ఆసుపత్రికి..
మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూర్‌కు చెందిన వెంకటయ్యకు ఇద్దరు మగపిల్లలున్నారు. భార్య నిండుగర్భిణీ కావడంతో ఆమెను ఇంట్లోఉంచి పనికివెళ్లాడు. మంగళవారం ఆమెకు నొప్పులు రావడంతో ఒక్కతే దగ్గర్లోని ఆస్పత్రిలో చేరింది. పూర్తిగా బలహీనంగాఉన్న ఆమె శిశువు జన్మించాక ప్రాణాలు విడిచింది. ఇంతలో ఆస్పత్రికి చేరుకున్న వెంకటయ్య భార్య మృతి వార్త విని విషాదంలో మునిగిపోయాడు. ముగ్గురు పిల్లల్ని తీసుకొని భార్య శవంతో బస్సులో సొంతూరు బయలుదేరాడు. పాలమూరు బస్టాండ్లో చిక్కుకుపోయాడు.

ఆదుకున్న కార్మికులు...
అత్యంత దయనీయస్థితిలోఉన్న ఆ కుటుంబాన్ని అక్కడి కార్మికులు గమనించారు. విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే అందరూ కొంత డబ్బు వేసుకొని ఆటో మాట్లాడారు. వెంకటయ్యకు 5వేల రూపాయలిచ్చి సొంతూరుకు పంపారు. శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పాలమూరు కూలీల దుర్భర బతుకులకు ఈ ఘటన అద్దంపడుతోంది. తల్లి మృతితో ముగ్గురు బిడ్డలు అనాధలయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న వెంకటయ్య భార్య మృతితో మరింత కుంగిపోయాడు. ఇద్దరు బిడ్డల్ని ఎలా పెంచాలంటూ కన్నీరు పెట్టడం అందరినీ కదిలించింది. 

17:44 - September 2, 2015

హైదరాబాద్ : ఆటో చక్రం ఆగిపోయింది..! బస్సు హారన్‌ మూగబోయింది..! రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారితే.. ప్రయాణ ప్రాంగణాలన్నీ వెలవెలబోయాయి..! కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె తెలంగాణలో సంపూర్ణంగా ముగిసింది. రోడ్డెక్కిన కార్మిక లోకం మోదీ సర్కారు తీరును దునుమాడింది. పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించింది. కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ సర్కారుపై కార్మిక లోకం సమర శంఖం పూరించింది. కార్మికుల జీవితాలను నాశనం చేసే నిర్ణయాలను ఉప సంహరించుకోవాలని ఆల్టిమేటం జారీచేసింది. కాదని ముందుకెళ్తే మాత్రం.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీచేసింది.

రోడ్డెక్కిన కార్మికులు..
సార్వత్రిక సమ్మె పిలుపునందుకున్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు. దీంతో.. వాణిజ్య సముదాయాలు మూతపడగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్‌ ప్రభావంతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లు వెలవెలబోయాయి. నగరంలోని పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించిన కార్మికులు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించారు. బంద్‌లో భాగంగా.. ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన సభావేదిక నుంచి కేంద్రానికి హెచ్చరికలు జారీచేశారు.

పరిశ్రమలు బంద్..
హైదరాబాద్‌ బీహెచ్ఈఎల్ పరిశ్రమలోని కార్మికులు భారీగా సమ్మెలో పాల్గొన్నారు. పటాన్‌ చెరు పారిశ్రామిక వాడలో పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అటు సిద్ధిపేటలోని డిపో ఎదుట సైతం కార్మికులు ధర్నాకు దిగారు. రోడ్‌ సేఫ్టీ చట్టాన్ని విరమించుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్‌ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని డివిజన్‌ కేంద్రాల్లో రవాణా నిలిచిపోయింది. రోడ్లమీదికి వచ్చిన కార్మికులు.. కేంద్ర విధానాలను నిరసించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లాలోని 11 డిపోలకు చెందిన పదిహేను వందల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దేశ ప్రజల ఓట్లతో గెలిచిన మోడీ ప్రభుత్వం.. విదేశీ సంస్థలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోందని కార్మికులు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సైతం సమ్మె ఉధృతంగా సాగింది. వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు కదంతొక్కారు. దీంతో.. ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తిచెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు.

గుణపాఠం తప్పదన్న కార్మికులు...
నల్గొండ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఉదయాన్నే రోడ్లమీదికి వచ్చిన కార్మికులు.. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయబోమని నేతలు హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం బంద్‌ ప్రశాంతంగా సాగింది. రెండు జిల్లాలో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. లారీ, ఆటో యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలపడంతో ప్రజారవాణా పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన కార్మికులు.. మోదీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే.. గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

17:41 - September 2, 2015

వరంగల్ : తాము అనుకున్న విధంగా మిషన్‌కాకతీయ మంచి ఫలితాలను ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. వచ్చే ఏడాది మిషన్‌కాకతీయ - 2 కూడా నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఉన్న చెరువులు నిండాయన్నారు. చెరువులు నిండడం వల్ల పంటలు పండుతాయని, నర్సంపేట వద్ద లక్ష చెట్లు నాటడం జరిగిందని, చెరువు గట్ల మీద ఈత ఇతర చెట్లు పెట్టడం వల్ల పలువురికి లాభం కలుగుతుందని తెలిపారు.

17:39 - September 2, 2015

వరంగల్ : కొత్త మద్యం పాలసీని ప్రజలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వెనక్కు తీసుకుంటామని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. మద్యం పాలసీపై అన్ని రిపోర్టులు తెప్పిస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు పద్మారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా ఎక్సైజ్ శాఖ సొంత ఖర్చు 5కోట్ల తాటి చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందుకోంస ఇద్దరు ఫారెస్టు ఆఫీసర్లను ఎక్పైజ్ శాఖకు కేటాయించారని, రాబోయే వంద సంవత్సరాల వరకు గీత కార్మికులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు పలుచర్చలు జరుగుతుంటాయని, గుడుంబాపై టి.సర్కార్ వార్ ప్రకటించిందన్నారు. గుడుంబాను నిర్మూలిస్తామని, తాగాలని ప్రోత్సాహించడం లేదన్నారు. కిందిస్థాయి నుండి రిపోర్టు తీసుకుని కేబినెట్ భేటీలో చర్చిస్తామన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోదని మంత్రి పద్మారావు స్పష్టం చేశారు.

17:36 - September 2, 2015

హైదరాబాద్ : చీప్ లిక్కర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని టి.టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చీప్ లిక్కర్ వద్దు..గుడుంబాను అరికట్టాలని ప్రతి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారని వారు తీర్మానం చేస్తున్నారని ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అరికట్టే ప్రయత్నం చేయాలని సూచించారు. ఆదాయం కోసం చీప్ లిక్కర్ ను ప్రవేశ పెట్టడం మంచిది కాదన్నారు. కంట్రోల్ చేసే శక్తి లేకపోతే ప్రభుత్వం నుండి దిగిపోవాలని సూచించారు. గీత కార్మికులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారికోసం ఆలోచించకుండా వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కులవృత్తులు నాశనమయ్యాయని, కులవృత్తుల వారికి పని లేకుండాపోయిందన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలు తిరగకుండా మహిళలు కొట్టే పరిస్థితి వచ్చిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. 

రాష్ట్రపతిని కలిసిన వివిధ దేశాల రాయబారులు..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బుధవారం వివిధ దేశాల నూతన రాయబారులు మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో జర్మని రాయబారి మార్టిన్ నెయి, మారిషస్ రాయబారి జగదీశ్వర్ గోబర్దన్, బ్రెజిల్ రాయబారి తోవర్ ద సిల్వ, మాలి దేశ రాయబారి నైకొరో, మంగోలియా దేశ రాయబారి గోన్ చింగ్ గన్బొల్ట్ లున్నారు. 

17:09 - September 2, 2015

కరీంనగర్ : జిల్లాలో ఓ ఆటో అదుపుతప్పి పాడుపడిన బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు 9మంది ప్రయాణీకులతో ఓ ఆటో వస్తోంది. కోనరావుపేట ప్రాంతానికి చేరుకోగానే ఆటో అదుపుతప్పి బావిలో పడిపోయింది. దీనితో పిట్టరాములు వృద్ధుడు అక్కడికక్కడనే చనిపోయాడు. బావి లోతుగా ఉండడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ఫైరింజన్ వచ్చేవరకు స్థానికులు బావిలో పడిన వారిని పైకి తీసుకొచ్చారు. ఖతీజా అనే మహిళ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అజాగ్రత్తగా నడుపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతివేగం, అధిక లోడ్ తో ప్రయాణించడం వల్లే ఇది చోటు చేసుకుందని తెలుస్తోందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది చోటు చేసుకుందని గ్రామస్తుడు పేర్కొన్నాడు. 9మంది ప్రయాణించారని, ఒకతను మృతి చెందగా మిగతా వారికి గాయాలయ్యాయని తెలిపాడు. 

బీసీసీఐకి పాక్ క్రికెట్ బోర్డు లేఖ..

ఢిల్లీ : భారత్ క్రికేట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. డిసెంబర్ లో నిర్వహించాల్సిన సిరీస్ పై అభిప్రాయం తెలియచేయాలని లేఖలో కోరింది. 

లోయలో పడిన కారు..ముగ్గురు మృతి..

ఉత్తరాఖండ్ : ప్రమాదవశాత్తు కారు లోయలో పడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. తెహరీ జిల్లా కీర్తీనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పెంపు..

ముంబై : ఆదాయ పన్ను రిటర్న్ ల దాఖలుకు గడువు పెంచుతూ ఆదాయపన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. ఈనెల 7వ తేదీ వరకు రిటర్న్ ల దాఖలుకు గడువు పెంచింది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై :  బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 243 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,453 పాయింట్ల వద్ద ముగిసింది. 69 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,717 వద్ద ముగిసింది. 

రిషితేశ్వరీ ఘటనకు కారణమైన వారిపై చర్యలు - చినరాజప్ప..

హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్యలో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.

చిత్తూరు, అనంతపురంలో తాగు నీరు లేదు - బుచ్చయ్య..

హైదరాబాద్ : చిత్తూరు, అనంతపురం జిల్లాలో తాగునీరు లేదని టిడిపి సభ్యుడు బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాయలసీమకు న్యాయం చేసేందుకు పట్టుసీమ చేపట్టినట్లు పేర్కొన్నారు. 

లక్నోలో వికటించిన మధ్యాహ్నా భోజనం..

లక్నో : రాష్ట్రంలోని ఓ స్కూల్ లో మధ్యాహ్నా భోజనం వికటించింది. భోజనం తిన్న 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కామన్ వెల్త్ గేమ్ లో స్కాంలో ఐదుగురికి జైలు శిక్ష..

ఢిల్లీ : కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా వీధి దీపాల అలంకరణలో చోటు చేసుకున్న కుంభకోణం కేసులో ఐదుగురు వ్యక్తులకు ఢిల్లీ కోర్టు శిక్ష విధించింది. నలుగురు మున్సిపల్ అధికారులకు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్వేక పవర్ టెక్ ఇంజినీర్స్ మేనేజింగ్ డైరక్టర్ టిపి సింగ్ కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. 

కొనసాగుతున్న టి. మంత్రివర్గ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగుతోంది. సంక్షేమ పథకాల అమలు తీరు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. 

బారాముల్లాలో కాల్పులు..సైనికుడు మృతి..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో రఫియాబాద్ లో ఉగ్రవాదుల, సైన్యం మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. 

పీటర్ ముఖర్జీ వాంగ్మూలం..

ఢిల్లీ : షీనాబోరా హత్య కేసులో స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీ వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం రికార్డు చేశారు. ఈ హత్య కేసులో ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. షీనాబోరా 2012లో హత్యకు గురైంది. ఈమె హత్యకు గురైందన్న విషయం తెలియగానే పీటర్ ముఖర్జీ విచారం వ్యక్తం చేసి పోలీసులకు సహకరిస్తానని తెలిపారు.

 

15:52 - September 2, 2015

విజయవాడ : ప్రాణత్యాగాలు సాధించుకున్న కార్మిక హక్కులన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. కేంద్రంలోని అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై మరోసారి స్వాతంత్రోద్యమ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాల చట్టం..ఎనిమిది గంటల పని దినం రద్దు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. మరో రూపంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరగాలని మధు పిలుపునిచ్చారు.

 

15:45 - September 2, 2015

గుంటూరు : ప్రిన్స్ పల్ బాబురావుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరీ తండ్రి ప్రశ్నించారు. ర్యాగింగ్ ను ప్రోత్సాహించినట్లు ఆధారాలున్నా కేసు నమోదులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో బాబురావును ప్రధాన నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బెయిల్ ఇస్తే విద్యార్థులు చులకన అయ్యే ప్రమాదం ఉందన్నారు. పిల్లల విషయంలో న్యాయం జరుగుతుంది కానీ అధ్యాపకుల విషయంలో న్యాయం జరగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాక్ష్యాలు లేవంటున్నారని, వెతికితే అన్ని దొరుకుతాయని తెలిపారు. నైట్ అవర్ లో జరుగుతున్న పార్టీకి బాబురావు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? మొదటి సంవత్సర విద్యార్థులు కాకుండే నాలుగో సంవత్సర విద్యార్థులు అక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. అన్ని బహుమతులు బాబురావు ఇచ్చిన తరువాత తన కుమార్తెకు మాత్రం ఒక వ్యక్తితో ఇప్పించాడని తెలిపారు. ఈ వ్యక్తిపై పలు ఆరోపణలున్నాయని రిషితేశ్వరీ తండ్రి పేర్కొన్నారు. 

15:39 - September 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు..కొత్త రెవెన్యూ డివిజన్లు..కొత్త మండలాల ఏర్పాటు..మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు..సంక్షేమపథకాల అమలు తీరుపై సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, వాటర్ గ్రిడ్, గ్రామజ్యోతి, వర్షాభావ పరిస్థితులు, గణేష్ నిమజ్జనంతో పాటు 25 అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. అలాగే డబుల్ బెడ్ రూం, నూతన ఎక్సైజ్ పాలసీ విధానంపై చర్చించనున్నారు.

మంత్రులకు దిశ నిర్ధేశం చేయనున్న కేసీఆర్...
సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు సీఎం కేసీఆర్‌ చైనాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అందుకే అంతకు ముందే మంత్రులకు దిశా నిర్దేశం చేసే ఉద్దేశంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలపై అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. అందుకే మంత్రులు తమ శాఖలపై హోం వర్క్ పూర్తి చేసే విధంగా...సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రభుత్వం అట్టహాసంగా పలు పథకాలు ప్రారంభించినప్పటికీ.. క్షేత్ర స్థాయికి చేరుకోవడంలో అనుకున్నంత సఫలం కావడం లేదు. రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ ఏడాది 1890 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం రోడ్లెక్కుతున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ లబ్దిదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

15:26 - September 2, 2015

హైదరాబాద్ : తమ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మూడో రోజు పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీ చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు పూర్తయితే ఎన్నో సమస్యలు పూర్తవుతాయని, అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటితంచారు. గత ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం కరెక్టుగా చేస్తే కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవని తెలిపారు. పుష్కర 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరగిందని, తోటపల్లి ప్రాజెక్టు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. కానీ గత ప్రభుత్వం నాసిరకం పనులు చేయడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఒక ఛాలంజ్ గా తీసుకున్నామని, పోలవరం ప్రాజెక్టు రావడం వల్ల రైట్ మెన్ కెనాల్ ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా నదికి వస్తుందని పేర్కొన్నారు. ప్రతొక్క నీటి చుక్కను ఉపయోగించుకోవాలని, అనంతపురానికి 11 టీఎంసీలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. 11 టీఎంసీల నీటికే చాలా ఫలితాలు వచ్చాయని, అన్ని రిజర్వాయర్ లో నీరు వస్తే ఎన్నో సమస్యలు తీరుతాయన్నారు. 1810 ఎకరాలకు రూ.700 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇచ్చిందని, ఎక్కడా అవినీతి జరుగకుండా ఉండేందుకు వారి అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగిందన్నారు.

వైసీపీ రెచ్చగొడుతోంది..
పెద్దగా కాల్వలు తీయాలి..కానీ చిన్న కాల్వలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎర్రకాల్వ ఇతర కాల్వలు కట్టడం జరిగిందని అలాగే కొన్ని ప్రాంతాల్లో టెంపరీరీ పైపు లైన్ లు వేయడం జరిగిందని తద్వారా 20-30 టీంఎసీల నీరు ఇస్తే చాలా ఉపయోగం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏపీలో కరువు తీవ్రంగా ఉందని తెలిపారు. గోదావరి జిల్లాల ప్రజలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఒక సవాల్ గా తీసుకుని చౌకబారు విమర్శలు చేయడం వల్ల బాధ కలుగుతుందన్నారు. వైసీపీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుందని, రెండో మైక్ ఇచ్చినా జ్యోతుల నెహ్రూ ఒక విషయానికి రావడం లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో మంత్రి దేవినేని ఉమ చాలా కృషి చేస్తున్నారని, సెప్టెంబర్ రెండో వారంలో నీళ్లు వస్తాయని తాను చెప్పడం జరిగిందని అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

నదులు అనుసంధానం చేస్తే సమస్య రాదు - చంద్రబాబు..

హైదరాబాద్ : నదులు అనుసంధానం చేస్తే సమస్య వచ్చి ఉండేది కాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కొన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందని, అందులో కొన్ని వందల టీఎంసీల నీరు ఉపయోగించుకుంటే ఎన్నో ఫలితాలు వస్తాయన్నారు. 

రైతుల ఆత్మహత్యలను నివారిస్తాం - పోచారం..

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, రైతుల ఆత్మహత్యలను నివారిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ప్రకటించారు. లక్ష రూపాయల వరకు రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, రైతు రుణాలు వడ్డీతో సహా మాఫీ చేశామని రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతు సకాలంలో చెల్లిస్టే వడ్డీ లేని రుణమిస్తున్నట్లు చెప్పారు. 

టి కేబినెట్ ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన.. కొత్త జిల్లాల ఏర్పాటు..కొత్త రెవెన్యూ డివిజన్లు..కొత్త మండలాల ఏర్పాటు..మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు..సంక్షేమపథకాల అమలు తీరుపై సమావేశంలో చర్చిస్తున్నారు. 

 

సంపూర్ణంగా బంద్...

ఢిల్లీ : కోల్ కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తిరువంతపురంలో సంపూర్ణంగా సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. 

కొనసాగుతున్న కార్మిక సమ్మె..

ఢిల్లీ : భారతదేశంలో కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడంపై నిరసన వ్యక్తమౌతున్నాయి. పది జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కార్మిక సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించగా పరిశ్రమలు, పాఠశాలలు, బ్యాంకులు మూతబడ్డాయి. సమ్మెలో 15 కోట్ల మంది కార్మికులు పాలుపంచుకుంటున్నారు.

పట్టిసీమ నుండి తొలిదశ నీటి విడుదల – దేవినేని..

హైదరాబాద్ : మరో రెండు వారాల్లో పట్టిసీమ నుండి తొలి దశ నీటి విడుదల చేస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు.

 

14:40 - September 2, 2015

హిందూ వివాహ చట్టం 1955 అమల్లోకి వచ్చిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. ఏ పరిస్థితులు హిందు మహిళలు విడాకులు తీసుకోవచ్చు ? హిందూ వివాహ చట్టం ఏం చెబుతుంది ? అనే దానిపై మానవి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. హిందువులందరికీ ఈ చట్టం వర్తిస్తుందని, ఇతరులకు ప్రత్యేక చట్టాలున్నాయన్నారు. ఏ మతానికి చెందని వారు సమాజంలో ఉన్నారని, వారి కట్టుబటాట్లు వేరేగా ఉంటాయన్నారు. వారు మాత్రం కస్టమర్స్ డైవైర్స్ తీసుకుంటారని, కుల సంప్రదాయలు, ఆచారాల ప్రకారం విడాకులు తీసుకుంటుంటారని పేర్కొన్నారు. వారు హిందూ చట్ట పరిధిలోకి రారని, హిందూ వివాహానికి కొన్ని షరతులున్నాయని తెలిపారు. ఇద్దరికీ వయస్సు.. వివాహయ్యే నాటికి జీవించి ఉన్న భార్య లేదా భర్త ఉండకూడదు..వివాహమైతే విడాకులు తీసుకుని ఉండాలి..లేదా చనిపోయి ఉండాలి..ఇలా కొన్ని షరతులు పెట్టారని తెలిపారు. అలాగే పలువురు వ్యక్తపరిచిన న్యాయ సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. 

14:35 - September 2, 2015

హైదరాబాద్ : గత ప్రభుత్వం నిర్వహించిన జలయజ్ఞం కేవలం ధనయజ్ఞంగా నిర్వహించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మూడో రోజు పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాధ్యత ఎరిగి మాట్లాడాలని, సభలో ఏదీ పెడితే మాట్లాడుతామంటే కుదరదన్నారు. రాయలసీమలో డబ్బులు ఖర్చు పెట్టలేదని వాస్తవం కాదన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టుకు రూ.665.64 లక్షలు ఖర్చుపెట్టడం జరిగిందని, గాలేరు - నగరి ప్రాజెక్టుకు రూ.267.70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 1822.46 ఈ సంవత్సరం ఖర్చు పెట్టామని, మొత్తం ప్రాజెక్టులకు రూ.8567.19 ఖర్చు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన జలయజ్ఞం ధనయజ్ఞమన్నారు. వాళ్లు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, పట్టిసీమకు వైసీపీ వ్యతిరేకమా ? అనుకూలమా ? తేల్చిచెప్పాలని బాబు సూచించారు. తోటపల్లి శంకుస్తాపన చేశానని, ఈనెల పదో తేదీన ప్రారంభిస్తానని చెప్పారు. పులిచింతలకు రెండు టీఎంసీల నీరు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల రైతుల బాధలు తీర్చడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల దగ్గర పడుకుని ప్రాజెక్టులను పరుగెత్తించే ప్రయత్నం చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం తగదన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. 

14:19 - September 2, 2015

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు పట్టిసీమ ప్రాజెక్టు పై చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ప్రాజెక్టులు నాలుగు లేదా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి రాయలసీమకు తదితర ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చని సూచించారు. 2014-15 సంవత్సరంలో పులిచింతల 273.56 కోట్లు కేటాయించారని, నిధులు సక్రమంగా కట్టబెడుతున్నారా అనే దానిపై ఆలోచించాలన్నారు. రాయలసీమపై అమిత ప్రేమ ఉందని, నిధులు ఎన్ని కేటాయించారని ప్రశ్నించారు. రూ.4500 కోట్లు కేటాయిస్తే గాలరి - నగరి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గోదావరి కృష్ణా అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదన్నారు. 

పట్టిసీమకు వైసీపీ వ్యతిరేకమా ? అనుకూలమా ? బాబు..

హైదరాబాద్ : పట్టిసీమకు వైసీపీ వ్యతిరేకమా ? అనుకూలమా ? చెప్పాలని వైసీపీని ఉద్ధేశించి ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పలు ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం బాబు స్పందించారు. ప్రాజెక్టు దగ్గర పడుకుని వాటిని పరుగెత్తించే ప్రయత్నం చేస్తున్నామని, దీనిని అభినందించకుండా విమర్శలు చేయడం సరికాదని బాబు తెలిపారు. 

పట్టిసీమ ధనార్జన కోసమే - జ్యోతుల నెహ్రూ..

హైదరాబాద్ : పట్టిసీమ ధనార్జన కోసమే చేస్తున్నారని ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. గోదావరి కృష్ణా అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదని నెహ్రూ ఆరోపించారు. 

నెల్లూరులో టిడిపి - వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ..

నెల్లూరు : ఉట్కూరు (మం) వెంకన్నపాలెంలో టిడిపి వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు వైసిపి కార్యకర్తల ఇళ్లకు టిడిపి వర్గీయులు నిప్పు పెట్టారు. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

ప్రిన్స్ పాల్ బాబురావుపై కేసులు నమోదు చేయాలి - రిషితేశ్వరి తండ్రి..

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్స్ పాల్ బాబురావుపై కేసులు నమోదు చేయాలని రిషితేశ్వరీ తండ్రి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ ను ప్రోత్సాహించినట్లు ఆధారాలున్నా బాబురావుపై కేసు నమోదులో అలసత్వం చేస్తున్నారని ఆరోపించారు.
 

హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం..

హైదరాబాద్ : ఈసారి కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. ఉత్సవాలకు ప్రభుత్వం సహకరించాలని గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని, డీజేను నిషేధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

13:57 - September 2, 2015

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుష్ట విధానాలకు వ్యతిరేకంగా విజయవాడలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. విజయవాడ వన్‌టౌన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి చెప్పబోయే గుణపాఠానికి సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మె ప్రారంభమని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

13:54 - September 2, 2015

శ్రీకాకుళం : జిల్లాలో కార్మికులు కదం తొక్కారు.. సిఐటియుతోపాటు పది కార్మికసంఘాలు, ఆటో, లారీ యూనియన్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాది హామీ, అంగన్వాడీ కార్మికులు విధులు బహిష్కరించారు.. డైమండ్ పార్క్ కూడలిదగ్గర భారీ ర్యాలీ నిర్వహించారు.. అటు ఎపిఎన్ జివో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. రణస్థలమండలంలోని పారిశ్రామికవాడలో పదిహేనువేలమంది కార్మికులు పరిశ్రమల ముందు ధర్నా చేపట్టారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.. కార్మికులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..

 

13:48 - September 2, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ లాంజ్‌లో వైయస్‌ చిత్రపటం వివాదంపై ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. జనరల్ పర్పస్‌ కమిటీ ఆమోదం లేకుండా మరే ఇతర నాయకుడి ఫోటో పెట్టడం సభా హక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్ఠం చేశారు.

 

13:42 - September 2, 2015

హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు సమాధానం చెప్పలేని టిడిపి నేతలు తప్పును కాంగ్రెస్ పాలనపైకి నెట్టివేసే ప్రయత్నం చేసారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ఉన్న ప్రభుత్వం తమదేనంటూ టిడిపి ఎమ్మెల్యే అనిత సమస్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 10లక్షలు నష్టపరిహారంతో సరిపెట్టుకున్నామనటం సరికాదన్నారు.

 

13:39 - September 2, 2015

హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్య, తదనంతర పరిణామాలపై వైసిపి ఎమ్మెల్యే రోజా, మంత్రి గంటా మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ ఆడపిల్లను ర్యాగింగ్‌ మహమ్మారి కాటేస్తే యాక్షన్‌ తీసుకోవాల్సిన మంత్రి గంటా ఓ ఆడియో ఫంక్షన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారని రోజా మండిపడ్డారు. అయితే తాను ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన మాట నిజమే కాని జబర్దస్త్‌ వంటి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు ఉండే ప్రోగ్రామ్‌లో మాత్రం భాగస్వామిని కానంటూ మంత్రి గంటా కౌంటర్‌ ఇచ్చారు..

 

13:36 - September 2, 2015

హైదరాబాద్ : ర్యాగింగ్‌ భూతానికి బలైన ఎఎన్ యు విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్యపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. తీవ్ర మనో వేదనకు గురై రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నా టిడిపి సర్కార్‌ నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని వైసిపి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. 10లక్షలు నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన తప్పు, ఒప్పు అయిపోదన్నారు. రోజా ర్యాగింగ్‌ కోరల్లో చిక్కి అమాయక విద్యార్ధినీ విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు పటిష్ఠంగా ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని రోజా ఫైరయ్యారు.

 

13:30 - September 2, 2015

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌లో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఎం అనుంబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపారు. ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. గొడ్డును బాదినట్లు బాదారు. పోలీసుల దెబ్బలకు తాళలేక పారిపోతున్న కార్యకర్తలను చావబాదారు.

 

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె..

ఖమ్మం : దేశవ్యాప్తం సమ్మె సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లిలో సమ్మె కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న బంద్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

 

రిషితేశ్వరి ఘటన నిందితులపై కఠిన చర్యలు : గంటా

ఎపి అసెంబ్లీ : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో 172 మందిని కమిటీ ప్రశ్నించిందని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. 

12:47 - September 2, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడే రావాణా వ్యవస్థ నిలిచిపోయింది. మోదీ సర్కార్‌ దూకుడుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. కార్మికలోకం ఏకమైంది. సర్కార్‌ ద్వంద్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు 10 కార్మికసంఘాలు మద్దతిచ్చాయి. ఇటు కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

 

12:43 - September 2, 2015

హైదరాబాద్ : విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఆబిడ్స్ లోని సెయింట్ జోసెఫ్ స్కూళ్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నిన్న మధ్యాహ్నం గొడవ పడ్డారు. ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సిద్ధిఖీ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన టీచర్ గొడవను వారించడానికి వెళ్లారు. అయితే అప్పటికే ఇద్దరు త్రీవంగా కొట్టుకున్నారు. దీంతో సిద్ధిఖీ అనే విద్యార్థి టీచర్ వడిలో కుప్పకూలిపోయాడు. అతన్ని కింగ్ కోఠి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

 

12:06 - September 2, 2015

కోల్ కతా : సమ్మె సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న సీపీఎం కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు విరుచుకుపడ్డారు. సీపీఎం కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు దాడి చేస్తున్న వారిని నిలువరించాల్సిన పోలీసులు... ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలపై దౌర్జన్యం ప్రదర్శించారు. కార్యకర్తలను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. చితకబాది... వారిని ఈడ్చుకెళ్లారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మెలో భాగంగా పశ్చిమబెంగాల్ లోని ముషీరాబాద్ లో సీపీఎం కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. వీరిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. వెంబడించి మరీ దాడులకు పాల్పడ్డారు. సీపీఎం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. అయితే పోలీసులు సైతం తృణమూల్ కార్యకర్తలకు వత్తాసు పలికారు. దాడికి పాల్పడ్డవారిని వారించాల్సింది పోయి.. పోలీసులు సైతం సీపీఎం కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కార్యకర్తలను చావబాదారు. విచక్షణారహితంగా కొట్టి, ఈడ్చు కెళ్లారు. ఒక వైపు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

11:18 - September 2, 2015

హైదరాబాద్ : దేశంలో మరో చారిత్రాత్మక సమ్మె మొదలైంది. మోదీ సర్కార్‌ దూకుడుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికలోకం గళమెత్తింది. సర్కార్‌ ద్వంద్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ... కార్మిక సోదరులు చేపట్టిన ఒక్కరోజు సమ్మె మొదలైంది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కార్మికులు కదం తొక్కుతున్నారు. కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెతో రవాణా రంగం పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రవాణారంగంలోని కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొనడంతో.. బస్సులు షెడ్లకే పరిమితమయ్యాయి. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
ఖమ్మం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో సమ్మె కొనసాగుతోంది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. తమ పట్ల కేంద్రం వ్యవహారిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమ హక్కులను కాలరాయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బంద్‌కు ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
వరంగల్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె కొనసాగుతోంది. ఈమేరకు వరంగల్ జిల్లాలో సమ్మె కొనసాగుతోంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులు, ఆర్టీసీ బస్సు డిపో కార్మికులు సమ్మెలో ఉన్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఒక్కరోజు సమ్మెతో 12 వందల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సంస్థ పరిధిలో సమ్మెను నిషేధించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సింగరేణిలో.. సమ్మెతో 12 వందల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బంద్‌కు ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
విశాఖ..
విశాఖలో కార్మికుల సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖలోని అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్‌ ప్లాంట్‌లోని కార్మికులు సమ్మెలో కొనసాగుతున్నారు. ప్లాంట్‌లోని ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కార్మిక చట్టాలకు తూట్లు పొడిస్తే.. ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రజానీకం సమ్మెకు మద్దతు ఇస్తుంది.
కరీంనగర్‌..
కరీంనగర్‌ జిల్లాలోనూ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సు డిపోల ఎదుట కార్మిక నాయకులు నిరసన తెలిపారు. కేంద్రం తీసుకువస్తున్న కార్మిక చట్టాల సవరణలు వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాల నేతలు విమర్శలు చేశారు. కార్మికుల హక్కులను కాలరాయొద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని కార్మికసంఘాలు డిమాండ్‌ చేశారు. లేదంటే సమ్మెలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మెదక్‌...
కేంద్రం తీసుకురానున్న రోడ్డు భద్రత బిల్లు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. మెదక్‌ జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రవాణా బంద్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలో కొనసాగుతున్నాయి. కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలనే ..12 డిమాండ్లతో కార్మికులు సమ్మెలో ఉన్నారు. బంద్‌కు ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.

 

10:59 - September 2, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో తొలగింపుపై వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈమేరకు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ ఫొటో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో మిగిలిన ఫొటోల సంగతేంటని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎప్ ఫొటో ఉందంటున్నారు.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో చాలా ఫొటోలున్నాయని..మరి ఆ ఫొటోలు నిబంధనలకు విరుద్ధంగా లేవా అని ప్రశ్నించారు. వైఎస్ బతికుంటే కరువు ఉండేదా- అన్నారు. వైఎస్ తన చిరునవ్వుతో మేఘాలు మధించి వర్షాలు కురిపించారని కొనడియారు.

 

 

10:50 - September 2, 2015

ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాల్లో సవరణలకు వ్యతిరేకంగా, కనీస వేతనం పెంచాలని కార్మికులు దేశ వ్యాప్తంగా చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైనదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. దేశ వ్యాప్త సమ్మె... ట్రేడ్ యూనియన్లు న్యాయబద్ధంగా ఇచ్చిన పిలుపు అని పేర్కొన్నారు. యాజమాన్యాలకు కార్మికులను తొలగించే స్వేచ్ఛ ఇస్తే.. కార్మికులు దోపిడీకి గురవుతారని పేర్కొన్నారు. శాంతి రహిత సమాజాన్ని నిర్మించలేమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
సమ్మెకు అన్ని రంగాల కార్మికులు మద్దతు
కార్మికులు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు అన్ని రంగాలు, సంస్థలు ఉద్యోగులు, కార్మికులు మద్దతు ప్రకటించాయి. సమ్మెలో వామపక్ష పార్టీలో అనుబంధ సంస్థలతోపాటు కాంగ్రెస్ అనుబంధ సంస్థ.. ఐఎన్ టియుసి, టీఆర్ ఎస్ అనుబంధ సంస్థలు పాల్గొన్నాయి. అన్ని కార్మికసంఘాలు జాయింట్ గా సమ్మెకు పిలపు ఇచ్చారు. విదేశీపెట్టుబడులను వ్యతిరేకించాలి, 15 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి, ప్రజా వ్యతిరేక విధానాలను ఉససంహరించుకోవాలి, కార్మిక చట్టాల సవరణను వివరమించుకోవాలని కోరుతూ.. కార్మికులు సమ్మెకు దిగారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలో కూడా డిజిన్వెస్ట్ మెంట్ పెడతారని కార్మికులు భయపడుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు, ఎల్ ఐసి, ఆర్టీసీ, రైల్వే సంస్థలతోపాటు పలు సంస్థలు సమ్మెలో పాల్గొన్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ ఐసి ఏజెంట్ల వ్యవస్థను నాశనం చేశారు. ప్రజా రవాణాను నిర్వీర్యం చేశారు. దీన్ని ఆర్టీసీ యూనియన్స్ వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్ లో 54 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇందులో 3వేల కంపెనీలు ఉన్నాయి. 8 లక్షల మంది పని చేస్తున్నారు. వీరికి ఈఎస్ ఐ, పీఎఫ్ లేదు. తెలంగాణ వ్యాప్తంగా 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. హైదరాబాద్ లో 40 వేల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. రక్షణ రంగంలోని ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా లాంటి కొన్ని సంస్థలు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా.. సమ్మెకు సౌహార్ధత సందేశాన్ని పంపారు. కొంతమంది సమ్మెలో ఉన్నారు. మరికొంత మంది సౌహార్ధ సందేశాలు పంపించారు. హైర్ ఆండ్ ఫైర్ పాలసీ అమలు చేయడానికి స్వేచ్చ ఇవ్వాలి. యాజమానులకు స్వేచ్చ ఇస్తే...కార్మికులను దోపిడీ చేస్తున్నారు. యూనియన్లు పెట్టుకునే హక్కు లేదు. 92 శాతం అసంఘటిత, అనియత రంగంలో కార్మికులు ఉన్నారు.
సంపదలో శ్రమజీవి వాటా తగ్గుతుంది
ప్రత్యామ్నాయ మార్కెట్ ఉన్నప్పుడు హైర్ ఆండ్ ఫైర్ విధానం అమలు చేయవచ్చు. మొత్తం ఉత్పత్తిలో కార్మికుల వేతనాల వాటా తగ్గుతుంది. సృష్టించే సంపదలో శ్రమజీవి వాటా తగ్గుతుంది. యాజమాన్యాల లాభాల వాటా పెరుగుతుంది. కార్మికుల వాటా తగ్గుతుంది. ఆగస్టులో పెద్ద ఎత్తున్న పెట్టుబడులు వెనుదిరిగాయి. అప్పుడు కార్మికులు ఎలాంటి ఆందోళ, ధర్నాలు, సమ్మె చేయలేదు. జాబ్ లెస్ అభివృద్ధి ఉంది. అశాంతితో సమాజాన్ని నిర్మించలేం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:12 - September 2, 2015

కార్మికులకు వ్యతిరేకంగా చట్టాల్లో సవరణలు చేయడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, సిఐటియు జాతీయ కార్యదర్శి ఆర్.సుధాకర్, బిజెపి నేత టి.ఆచారి, టిడిపి నేత రామానాయుడు, వైసిపి ఎస్సీ సెల్ కన్వీనర్ నాగార్జున పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని సూంచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడింది. ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. కరువు, నీటి సమస్యలు, ఆత్మహత్యలు వంటి అంశాలపై వైసిపి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. అయితే వైసిపి ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా అసెంబ్లీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో తొలగించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. వైఎస్ జోహార్ అంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు.

09:30 - September 2, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. కరువు, నీటి సమస్యలు, ఆత్మహత్యలు వంటి అంశాలపై వైసిపి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది. అయితే వైసిపి ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా అసెంబ్లీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో తొలగించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. వైఎస్ జోహార్ అంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ప్రశ్నోత్తరాల సమయం.. గందరగోళం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. కాగా అసెంబ్లీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్ద బైటాయించారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల 3వ రోజు సెషన్ ప్రారంభమయ్యింది. వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తిరస్కరించారు.  

08:51 - September 2, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. కరవు, నీటి సమస్యలు, రైతు ఆత్మహత్యలపై వైసిపి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ.. వైసిపి తరపున లీడ్ చేయనున్నారు.

 

08:49 - September 2, 2015

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ విడుదల చేశారు. పోలీస్ డ్రెస్ లో, ఎర్ర శాలువా బుజంపై దరించి గుర్రాన్ని పట్టుకుని పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే టీజర్ ఒక్క రోజులోనే లక్షల హిట్స్ దక్కించుకుంది. 

08:40 - September 2, 2015

హైదరాబాద్ : దేశంలో మరో చారిత్రాత్మక సమ్మె జరగబోతోంది. మోదీ సర్కార్‌ దూకుడుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికలోకం ఏకమవుతోంది. సర్కార్‌ ద్వంద్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సోదరులు నేడు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సమ్మెతో కదం తొక్కేందుకు కార్మికులు సిద్ధమయ్యారు.
విజయవాడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ...చేపట్టిన సమ్మె జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. లక్షలాది మంది సమ్మెకు మద్దతు తెలిపారు. అన్ని సంస్థలు మద్దతు ప్రకటించాయి. గ్రామ స్థాయి నుంచి బంద్ కొనసాగుతోంది. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ప్రకటించారు. 12 కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. అన్ని రంగాల్లోని కార్మికులు ఏకమయ్యారు. బ్యాంగింగ్, ఉపాధ్యాయులతోపాటు అన్ని సంఘాలు పాల్గొన్నాయి. పోలీస్ పహారా నడుమ బస్సులను నడుపుతున్నారు.
విశాఖ:
ప్రజలు, అసంఘటిత కార్మికుల ఇప్పటికే రెండు బంద్ లు జరిగాయి. ప్రజలు, కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే సమ్మెను విఫలం చేయడాని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేస్తూ.. అడ్డుకుంటున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబు, మోడీని డిమాండ్ చేశారు. ఉద్యమాలను ఎంతగా అనగదొక్కాలని చూస్తే అంతగా ఉవ్వెత్తున పైకి లేస్తాయి. గాజువాక లో అన్ని పరిశ్రముల మూసివేశారు.
వరంగల్..
జిల్లా వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. జిల్లాలోని బస్సులు నిలిచిపోయాయి. 9 ప్రధాన ట్రెడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వామపక్షాలు కూడా మద్దతునిచ్చాయి. రెండు పెద్ద ర్యాలీలను నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. బ్యాంక్, రైల్వే యూనివయన్స్ పాల్గొంటున్నాయి. కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి. జిల్లాలోని 9 డిపోలోని 4800 మందికార్మికులు. వరంగల్ 1, వరంగల్ 2 డిపోల్లోని అన్ని బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగ భద్రత లేదు. రోడ్డు సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం..
తిరుపతి..
కనీస వేతనాలు, పీఎఫ్ ఇవ్వాలి, కార్మిక చట్టాల్లో సవరణలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ మనుగడకు ముప్పు కలుగుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి.
గుంటూరు..
జిల్లా వాప్తంగా బంద్ కొనసాగుతోంది. ట్రాన్స్ పోర్టు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. 370 మంది ఎంపీలు డబ్బులు పెట్టి గెల్చుతున్నారు. వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారు. కనీస వేతనం ఉండాలి. 15 వేలు కనీస వేతనం ఇవ్వాలి. నిత్యవసరాల ధరలు తగ్గించాలి.
హైదరాబాద్...
ఎంజిబింఎస్ లో ఆర్ధరాత్రి నుంచి రాకపోకలు... బంద్ అయ్యాయి. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు దిగారు. బంద్ లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ, అటో కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపారు. 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది. రోడ్డు సేఫ్టి బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

 

07:39 - September 2, 2015

దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ వర్గాలు సమ్మెకు దిగాయి. ఉదయం ఆరు గంటల షిఫ్టులకు వెళ్లాల్సిన కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడికక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటోలు తిరగడం లేదు. రవాణా రంగం స్తంభించిపోయింది దేశంలో ఎక్కడ చూసినా సమ్మె వాతావరణమే కనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి భారీ సమ్మె ఇది. దాదాపు 20 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు అంచనాలున్నాయి. ఇంతమంది ఇంత భారీ సంఖ్యలో సమ్మెలో పాల్గొనడానికి కారణం ఏమిటి? కార్మిక సమ్మెకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్‌ ఏమిటి? వాటికి ప్రభుత్వం స్పందించిన తీరు ఎలా వుంది? కార్మిక సంఘాలకీ ప్రభుత్వానికీ మధ్య ఏయే అంశాలలో ఏకాభిప్రాయం కుదిరింది? ఏయే అంశాలను కార్మిక సంఘాలు సమ్మతించలేదు? ఇంతమంది కార్మికులు సమ్మెకు దిగినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకింత మొండిగా వ్యవహరిస్తోంది? ఇలాంటి అనేక అంశాలపై ఇవాళ్టి జనపథంలో ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగ విశ్లేషకులు, ఆల్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జాతీయ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌ పాల్గొని, మాట్లాడారు. వివరాలను ఆయన మాటల్లోనే....
సమస్యలు పరిష్కరించనందుకే సమ్మె
కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాల సవరణ, ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఏడాది నుంచి పోరాటాలు, ఆందోళనలు , ధర్నాలు చేస్తున్నారు. కానీ కార్మికుల సమస్యలు, డిమాడ్లను పరిష్కరించలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. 11 జాతీయ కార్మిక సంఘాలతోపాటు దేశంలోని అన్ని రంగాల్లోని ఇండిపెండెంట్ ఫెడరేషన్స్ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు. 15 నుంచి 20 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. వామపక్ష యూనియన్స్ తోపాటు ఐఎన్ టియుసి, బిఎంఎస్ సంఘాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కనీసం వేతనం ఇవ్వడం లేదు. ప్రధాన చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా మార్చుతున్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా మార్చుతున్నారు. ఉద్యోగ కల్పన లేదు.. పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం అవుతున్నాయి. కనీస వేతనాలు ఇవ్వాలి. కార్మిక చట్టాల సవరణను మానుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. కార్మికులకు సామాజిక సౌకర్యాలు కల్పించాలి. నిత్యవసరాల ధరలు తగ్గించాలి. కార్మిక-ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

హైదరాబాద్ : మౌలాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ పెట్రోల్ బంక్ వద్ద బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. 

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న సమ్మె

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో జిల్లా వ్యాప్తంగా 15 మంది కార్మికులు పాల్గొన్నారు. 

06:57 - September 2, 2015

ఢిల్లీ : మోడీ సర్కార్‌ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికలోకం నేడు సమ్మె చేపడుతోంది. ఈ సమ్మెకు 10 కార్మికసంఘాలు మద్దతిచ్చాయి. ఇప్పటికే కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
సమ్మెలో పాల్గొననున్న 15 కోట్ల మంది కార్మికులు
మరోపక్క వివిధ రంగాల్లోని 11 కార్మిక సంఘాలు యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో 15 కోట్ల మంది పాల్గొననున్నట్లు కార్మికసంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికసంఘాలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. సమ్మెలో భాగంగా నేడు అన్ని మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో ఆందోళన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు పెద్ద ఎత్తున మానవహారాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు చేపట్టనున్నారు. ఇక సమ్మెలో బ్యాంకింగ్‌, తపాల, రవాణా, టెక్స్‌టైల్స్‌, చమురు సంస్థలన్నీ పాలుపంచుకోనున్నాయి.
గతంలో ఎన్నడూ జరగని విధంగా సమ్మె
ఇప్పటికే ఉన్న సమాచారాన్ని బట్టి గతంలో ఎన్నడూ జరగని విధంగా సమ్మె జరిగే అవకాశముందని కార్మికసంఘాల నేతలంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలైన గుర్గావ్‌, జంషేడ్‌పూర్‌లో సమ్మె తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలిసారి టాటా కార్ల తయారీ యూనిట్లలోనూ కార్మికులు సమ్మె చేస్తున్నారంటున్నారు. కార్మిక సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడంతోనే సమ్మె చేస్తున్నామని నేతలంటున్నారు. కార్మిక చట్టాల సరళీకరణ, కనీస వేతనం అమలు, కాంట్రాక్ట్‌ విధానం ఎత్తివేత, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేత లాంటి డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని వారంటున్నారు.
సమ్మెను విచ్చిన్నం చేసేందుకు యత్నాలు
మరోపక్క సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కార్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కార్మికుల 12 డిమాండ్లలో తొమ్మిదింటిని ఆమోదించామని.. మరో మూడు డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉన్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కార్మిక గర్జనను గ్రహించి దిగిరాకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు ఊపిరిపోసుకునే అవకాశం కనిపిస్తోంది.

మెదక్ జిల్లాల్లో ప్రారంభమైన సార్వత్రిక సమ్మె

మెదక్ : జిల్లా వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె ప్రారంభం అయింది. జిల్లాలో ఉన్న ఆరు డిపోల్లోని బస్సులు నిలిచిపోయాయి. 

ఆదిలాబాద్ జిల్లాలో సమ్మె ప్రారంభం...

ఆదిలాబాద్ : జిల్లాలో కార్మికుల సార్వత్రిక సమ్మె ప్రారంభం అయింది. జిల్లా పరిధిలోని 6 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. 

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న సమ్మె

మహబూబ్ నగర్ : జిల్లా వ్యాప్తంగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. జిల్లాలోని 9 డిపోలో 900 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెకు రైల్వే, ఆర్టీసీ, లారీ, ఆటో కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. 

నేడు దేశ వ్యాప్త కార్మిక సమ్మె

ఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు.

 

Don't Miss