Activities calendar

03 September 2015

ఏపీ సీఎం, మంత్రి గంటాకు రిషితేశ్వరి తండ్రి లేఖ

గుంటూరు : నాగార్జున యూనివర్శిటీలో ర్యాంగి భూతానికి బలైన రిషితేశ్వరి తండ్రి గురువారం ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావులకు ఏడు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. కేసు విచారణలో తన అభ్యంతరాలు, సందేహాలను ప్రస్తావిస్తూ రిషితేశ్వరి తండ్రి ఈ లేఖను రాశారు. ప్రిన్సిపల్ బాబూరావును కేసు విచారణలో చేర్చకపోవడాన్ని లేఖలో ఆయన ఆక్షేపించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పోలీసులు త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు.

18:45 - September 3, 2015

హైదరాబాద్ : పోలవరాన్ని 2018 కల్లా పూర్తి చేస్తామంటూనే పట్టిసీమ ప్రాజెక్ట్ ను ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. పట్టిసీమ ఇంకుడు గుంతలాంటిదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ వైఖర్లను వ్యతిరేకిస్తూ..ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడులపై అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదు చేస్తామని రఘువీరా అన్నారు.

18:43 - September 3, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరువు పరిస్ధితులపై చర్చ జరుగుతుండగా జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ మండిపడింది. పట్టిసీమపై జగన్‌ మాట్లాడటంతో చర్చ పక్కదారి పట్టించొద్దని స్పీకర్‌ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా అదే పరిస్ధితి కొనసాగడం.. చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతుండగా జగన్‌ మైక్‌ కట్‌ చేయడంతో.. వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష సభ్యులు జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. జగన్‌ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. 

టీచర్ గా మారనున్న ప్రణబ్..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు టీచర్ గా మారనున్నారు. టీచర్స్ డే సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. 

18:34 - September 3, 2015

హైదరాబాద్ : ట్రయిల్ రన్ అంటూ ఖరీదైన హార్లీ డేవిడ్ సన్ బైక్ తో ఉడాయించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్ సన్ షోరూంకు ఆధునిక దుస్తుల్లో వచ్చిన ఓ యువకుడు ....టెస్ట్ డ్రైవ్ అంటూ ఆ బైక్తో పరారైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నాలుగు బృందాలుగా ఏర్పడి బైక్ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

ఆదిలాబాద్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : ఆదిలాబాద్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు, విద్యాసాగర్ లతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 

18:33 - September 3, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈనెల 8వ తేదీ నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలోని డాలియన్ సిటీ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొననున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయనతో పాటు ప్రత్యేక ప్రతినిధి బృందం చైనాకు వెళ్లనుంది. సీఎం కేసీఆర్ చైనా పర్యటన కోసం "బొంబార్డియర్‌ సీఆర్జే" జెట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. దీని అద్దె కోసం అక్షరాల రూ.2కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన బిజినెస్ క్లాస్ స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇదే కావడం గమనార్హం. ఇలాంటి విమానాన్ని ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అద్దెకు తీసుకున్నారు. ఈ సదస్సుకు వెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ మంత్రి కేటీఆర్, మరికొంతమంది మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

 

పోలవరంతోనే సీమకు న్యాయం - జగన్..

హైదరాబాద్ : పోలవరంతోనే సీమకు న్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నాయకుడు జగన్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం జగన్ మీడియాతో ముచ్చటించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆలస్యం చేస్తున్నాడని, పనులు జరుగకపోయినా గుత్తేదారుకు అదనంగా రూ. 250కోట్లు ఇచ్చారని ఆరోపించారు. పట్టిసీమకు పెట్టే ఖర్చుతో పులిచింతల, హంద్రీనీవా, వెలిగొండలను పూర్తి చేయవచ్చన్నారు. ప్రభుత్వం..స్పీకర్ లు ఒక్కటై ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. 

కర్నూలులో నకిలీ పురుగుల ముందు గుట్టు రట్టు..

కర్నూలు : నకిలీ పురుగుల మందుల గుట్టురట్టైంది. రూ.9కోట్ల విలువైన పురుగు మందులను నిఘా బృందం స్వాధీనం చేసుకుంది. 20 పేర్లతో పురుగుల మందును ముఠా తయారు చేస్తోంది. 

ఉయ్యూరు గ్రామీణ పోలీసుల అమానుషం..

కృష్ణా : ఉయ్యూరు గ్రామీణ పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విచారణ పేరిట వెంకటేశ్వరరావును అనే వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీనితో వెంకటేశ్వరరావు అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తొలుత స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

బాబు..గంటాలకు రిషితేశ్వరీ తండ్రి లేఖ...

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గంటాకు రిషితేశ్వరీ తండ్రి లేఖ రాశారు. ప్రిన్స్ పల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

 

తగ్గిన బంగారం ధర..

ముంబై : వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. రూ.190 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.26,810కి చేరింది. కానీ వెండి ధర రూ. 300 ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.35,300గా ఉంది. 

కేరళలో స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న హైకోర్టు...

కేరళ : అక్టోబర్ 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలను వాయిదా వేసేందుకు అనుమతించాలన్న ప్రభుత్వ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 

18:17 - September 3, 2015

హైదరాబాద్ : సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో విద్యార్ధుల ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ విజువల్స్‌ విడుదల అయ్యాయి. చుట్టూ విద్యార్ధులుండగానే గ్రౌండ్‌ మధ్యలో విద్యార్ధులు ఇద్దరూ కొట్టుకున్నారు. కాసేపటికే సిద్దిఖీ బలమైన గాయం తగలడంతో పడిపోయాడు.

18:16 - September 3, 2015

115వ అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో బ్లాక్ థండర్, హాట్ పేవరెట్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. రెండోసీడ్ సిమోనా హాలెప్ సైతం తొలివిజయం నమోదు చేసింది. పురుషుల సింగిల్స్ లో మాజీ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్, థామస్ బెర్డిచ్, రిచర్డ్ గాస్కే రెండోరౌండ్ చేరారు.

మహిళల సింగిల్స్ కు గురి పెట్టిన సెరెనా..
అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్...2015 అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ కు గురిపెట్టింది. న్యూయార్క్ ఫ్లషింగ్ మెడోస్ వేదికగా జరుగుతున్న..ఈ టోర్నీ తొలిరౌండ్లో సెరెనా అలవోక విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా పోటీకి దిగిన టాప్ సీడ్ సెరెనా..తొలిరౌండ్లో కేవలం 30 నిముషాలలోనే విటాలియా డయాట్చెంకోనూ 6-0, 2-0తో ఊదిపారేసింది. రెండోసెట్ పూర్తికాకుండానే గాయంతో విటాలియా పోటీ నుంచి ఉపసంహరించుకొంది.
అమెరికన్ ఓపెన్లో సెరెనాకు ఇది వరుసగా 22వ సింగిల్స్ విజయం కావడం విశేషం. ఇప్పటికే ఐదుసార్లు అమెరికన్ ఓపెన్ క్వీన్ గా నిలిచిన సెరెనా..డబుల్ హ్యాట్రిక్ టైటిల్ కు గురిపెట్టింది. రెండోసీడ్ సిమోనా హాలెప్ సైతం వరుస సెట్ల విజయంతో శుభారంభం చేసింది. తొలిరౌండ్లో న్యూజిలాండ్ ప్లేయర్ ఇరాకోవిచ్ ను 6-2, 3-0తో అధిగమించింది. 4వ సీడ్ కారోలిన్ వోజ్నియాకీ తొలిరౌండ్లో అమెరికన్ ప్లేయర్ లోయెబ్ ను 6-2, 6-0తో చిత్తు చేసి...రెండో రౌండ్లో అడుగుపెట్టింది. 23వసీడ్ వీనస్ విలియమ్స్ మూడుసెట్ల పోరులో 6-4, 6-7, 6-3తో పోర్టోరికో ప్లేయర్ ప్యుగ్ ను అధిగమించింది. 5వ సీడ్ పెట్రా క్విటోవా 6-1, 6-1తో జర్మన్ ప్లేయర్ సీజ్ ముండ్ పై విజయం సాధించి రెండోరౌండ్ బెర్త్ సాధించింది.

పురుషుల సింగిల్స్..
పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో రెండోసీడ్ రోజర్ ఫెదరర్ 61, 6-2, 6-2తో అర్జెంటీనా ఆటగాడు మేయర్ ను చిత్తు చేశాడు. మరో తొలిరౌండ్ పోటీలో 12వ సీడ్ రిచర్డ్ గాస్కే ఐదుసెట్ల హోరాహోరీ సమరంలో ఆస్ట్రేలియా ఆటగాడు కొక్కినాకిస్ ను అధిగమించాడు.ఉత్కంఠభరితంగా సాగిన ఈపోటీని 4-6, 6-1, 4-6, 6-3, 6-2తో గాస్కే గెలుచుకొన్నాడు. మరో ఫ్రెంచ్ ఆటగాడు, 11వ సీడ్ సిమోన్ పై అమెరికా అన్ సీడెడ్ ప్లేయర్ యంగ్ సంచలన విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సమరంలో .. యంగ్ 6-2, 6-4, 4-6, 4-6, 4-6తో విజేతగా నిలిచాడు. ఆరవ సీడ్ థామస్ బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో అమెరికా ఆటగాడు ఫ్రాటాంజెలోను ఓడించి..రెండోరౌండ్ చేరుకొన్నాడు. టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, 8వ సీడ్ రాఫెల్ నడాల్, మూడోసీడ్ యాండీ ముర్రే సైతం అమెరికన్ ఓపెన్లో తొలివిజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

18:12 - September 3, 2015

అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో టాప్ సీడెడ్ స్టార్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ అలవోకగా మూడోరౌండ్ చేరుకొన్నారు. మూడో సీడ్ యాండీ ముర్రే, 5వ సీడ్ వావరింకా తొలి విజయాలు నమోదు చేశారు. మహిళల సింగిల్స్ లో వెస్నినా, క్విటోవా, క్లాడియో పెనెట్టా శుభారంభం చేశారు. యూఎస్ ఓపెన్ మూడ రోజు పోటీల సమయంలో న్యూయార్క్ ఫ్లిండర్స్ పార్క్ నిప్పుల కుంపటిలా మారడంతో టెన్నిస్ స్టార్లు ఉక్కిరిబిక్కిరయ్యారు.

పోరాడుతున్న ప్లేయర్లు..
2015 అమెరికన్ ఓపెన్ టోర్నీ హాట్ హాట్ గా మారింది. పురుషుల, మహిళల సింగిల్స్ లో ఢీ కొంటున్న సీడెడ్ స్టార్ల కంటే...పోటీల వేదిక న్యూయార్క్ ఫ్లిండర్స్ పార్క్ వేసవితీవ్రతతో నిప్పులకొలిమిలా మారింది. తొలిరౌండ్ పోటీలు పూర్తిగా ముగియకముందే వాతావరణం వేడెక్కడంతో...ఓవైపు ప్రత్యర్థులతో పాటు వేసవి తీవ్రతతోనూ ప్లేయర్లు పోరాడాల్సి వస్తోంది. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల, మహిళల సింగిల్స్ రెండోరౌండ్ పోటీల్లో...టాప్ సీడ్ స్టార్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ అలవోక విజయాలు సాధించి..మూడోరౌండ్లో అడుగుపెట్టారు.

జోకోవిచ్ ముందంజ..
పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ మూడు సెట్ల సమరంలో ప్రత్యర్థి, 52వ ర్యాంక్ యాండ్రియాస్ హైదర్ ను 6-4, 6-1, 6-2తో చిత్తు చేశాడు. 2011లో తొలిసారిగా అమెరికన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్..ఆ తర్వాత ఐదుసార్లు ఫైనల్స్ చేరినా రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జోకోవిచ్ చేతిలో రెండోరౌండ్లోనే ఓటమి ఎదురైనా...యాండ్రియాస్ హైదర్ 70వేల డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకోగలిగాడు.

మార్డీ పిష్ ను ఇంటి దారి పట్టించిన లోపేజ్..
పురుషుల సింగిల్స్ మరో హోరాహోరీ సమరంలో 18వ సీడ్ లోపేజ్ ఐదుసెట్ల సమరంలో...6-2, 3-6, 6-1, 5-7, 6-2తో మార్డీ ఫిష్ ను ఇంటిదారి పట్టించాడు. ఇతర తొలిరౌండ్ పోటీల్లో..3వ సీడ్ యాండీ ముర్రే 7-5, 6-3, 4-6, 6-1తో ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు కిర్గియోస్ ను ఓడించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ చాంపియన్, 5వ సీడ్ వావరింకా సైతం రెండోరౌండ్ చేరుకొన్నాడు. తొలిరౌండ్లో రామోస్ వినోలాస్ ను 7-5, 6-4, 7-6తో అధిగమించాడు.

మహిళల పోటీలు..
మహిళల సింగిల్స్ రెండోరౌండ్ పోటీలో టాప్ సీడ్ సెరెనా 7-6, 6-3తో డచ్ క్వాలిఫైయర్, 110 వ ర్యాంకర్ కికి బెర్టెన్స్ ను అధిగమించింది. తన కెరియర్ లో ఇప్పటికే ఆరు అమెరికన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సెరెనా..రికార్డుస్థాయిలో ఏడో టైటిల్ కు గురిపెట్టింది. మహిళల సింగిల్స్ ఇతర పోటీల్లో ఎలెనా వెస్నినా 6-3, 3-6, 7-5తో లారా రాబ్సన్ ను, 26వ సీడ్ క్లాడియో పెనెట్టా 6-1, 3-6, 6-1తో జెర్మిలా గజడసోవాను, 19వ సీడ్ కీస్ 6-1, 6-2తో స్టిట్ కోవాను ఓడించి..రెండోరౌండ్లో చోటు ఖాయం చేసుకొన్నారు.
పురుషుల, మహిళలసింగిల్స్ లో రెండోసీడ్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, సిమోనా హాలెప్ ఇప్పటికే తొలిరౌండ్ విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

18:05 - September 3, 2015

హైదరాబాద్ : ప్రతిపక్షాలు, మహిళల ఆందోళనతోనే ప్రభుత్వం చీప్ లిక్కర్‌పై వెనక్కితగ్గిందన్నారు... కాంగ్రెస్ నేత డీకే అరుణ.. అవగాహనలోపంతో టీసర్కారు పనిచేస్తోందని ఆరోపించారు.... వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు..

 

18:04 - September 3, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని విపక్ష పార్టీలపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కరీంనగర్‌ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్‌పై ప్రతిపక్ష నేతలు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయడం వల్ల అనేక మండలాలు ముంపుకు గురికాకుండా కాపాడామని చెప్పారు. గతంలో సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.

 

18:01 - September 3, 2015

హైదరాబాద్‌ : కొత్తపేటలోని కిడ్జి ప్రైవేటు పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్‌కేజీ, ఆపైస్థాయి తరగతుల విద్యార్థులు కృష్ణుడి వేషధారణలతో ఎంతో ఆకట్టుకున్నారు. రాధా, కృష్ణ, గోపికలుగా మారి నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం వివిధ ఆటలు ఆడి ఉల్లాసంగా కృష్ణాష్టమిని జరుపుకున్నారు.

 

మాలిలో పడవ మునక 19 మంది మృతి..

మాలి : దేశంలో పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో పడవ మునిగిపోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందం 70 మందిని రక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. 

పోలీసుల అదుపులో సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థి..

హైదరాబాద్ : సెయింట్ జోసఫ్ పాఠశాలలో చోటు చేసుకున్న ఘర్షణ కేసులో పాఠశాల విద్యార్థిని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. విద్యార్థిని జువెనల్ హోంకు తరలించనున్నారు. పాఠశాల విద్యార్థుల ఘర్షణలో సిద్ధిఖి అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

పటేల్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న హార్దిక్ పటేల్..

ఢిల్లీ : పటేల్ కులానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు హర్దిక్ పటేల్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో పటేదారు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యేల నిర్ణయం ఏమిటో తెలుసుకోనున్నట్లు చెప్పారు. గుజరాత్ లో మొత్తం 182 మంది శాసనసభ్యుల్లో 35కి పైగా పటేల్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. 

స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా 'మంచు' లక్ష్మి..

హైదరాబాద్ : స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా సినీ నటి నిర్మాత, నటి మంచు లక్ష్మీ నియమితులయ్యారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పలువురు ప్రముఖుల మధ్య లక్ష్మీ ఈ భాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవాన్ని అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

17:32 - September 3, 2015

ఈ శుక్రవారం టాలీవుడ్‌లో ఇద్దరు హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగబోతోంది. 'నాని' హీరోగా తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్'.. 'విష్ణు' నటించిన 'డైనమైట్' సినిమాలు ఈ శుక్రవారం రానున్నాయి. కమర్షియల్ సక్సెస్ కోసం ఈసారి హీరోలతో పాటు డైరెక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్య అంతగా హిట్ లు లేని విష్ణు ఈ సినిమా ద్వారా మంచి విజయం సాధిస్తాడని టాక్. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న 'నాని' సినిమా ఫీల్ గుడ్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. వెరైటీ క్యారెక్టరైజేషన్ లో నాని కనబడుతాడని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. డైనమైట్‌గా మంచు విష్ణు పేలుతాడా? భలేభలే మగాడిగా నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడా? అనేది చూడాలి. తమిళంలో హిట్టయిన 'అరిమ నంబి'ని తెలుగులో 'డైనమైట్'గా రీమేక్ చేశారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్..థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి, శ్రీమంతుడు హిట్ మూవీల తర్వాత తెలుగు ఆడియన్స్, ఈ రెండు సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిసిన అరుణాచల్ సీఎం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ ను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నాబ్ తుకి కలిశారు.

పశ్చిమ బెంగాల్ లో మళ్లీ అల్లర్లు..

ఢిల్లీ : రాష్ట్రంలో మళ్లీ అలర్లు చెలరేగాయి. నార్త్ డింజాపూర్ జిల్లాలోని రాయిగంజ్ ప్రాంతంలో కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠిచార్జీ జరిపారు.

విద్యుత్ ఉద్యోగుల కేసు వాయిదా..

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల విద్యుత్‌ శాఖ అధికారులు సమావేశం కావాలని సూచించింది. సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది.

 

వామ్మో ఇదేం గొర్రె!

కాన్‌బెర్రా :ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా శివార్లలోని అడవుల్లో కొందరు బుష్‌వాకర్లు ఓ భారీ ఆకారాన్ని గమనించారు. అది చూసేందుకు గొర్రెలానే ఉంది. ఒత్తుగా (మామూలు గొర్రెల ఉన్నికి దాదాపు నాలుగు రెట్లు) ఉన్ని పెరిగిపోయింది. దాని ఉన్ని దానికే బరువై నడవటానికి చాలా ఇబ్బంది పడుతోంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కళ్లపైనుంచి ఉన్ని కిందికి జారటంతో.. దానికేమీ కనిపించటం లేదు. పశుసంరక్షణ అధికారులు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొన్నేళ్ల క్రితం మంద నుంచి తప్పిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘ఇంతవరకు మనం చూడని పెద్ద గొర్రె ఇది.

ట్రాఫిక్ సిబ్బందిపై టి.సర్కార్ వరాలు..

హైదరాబాద్ :ట్రాఫిక్ లో పనిచేస్తున్న సిబ్బందిపై టి.సర్కార్ వరాల జల్లు కురిపించింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రూ.2500, హెడ్ కానిస్టేబుల్ కు రూ.3000, ఏఎస్ఐకి రూ.3500, ఎస్ఐకి రూ.4000, సీఐకి రూ.4500 అదనంగా ఇవ్వాలని టి.సర్కార్ నిర్ణయించింది. త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. 

జగన్ పై కోడెల కోపం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో కరవుపై చర్చలో జగన్ మాట్లాడారు. అనంతరం కోడెల జోక్యం చేసుకున్నారు. గంటల తరబడి మాట్లాడుతానంటే మిగతా సభ్యుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఇప్పటికే 40 నిమిషాలు మాట్లాడారని జగన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దశలో జగన్ కు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ వైసీప సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. 

అనంతపురంలో 101 మంది రైతుల ఆత్మహత్యలు - జగన్..

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను తాను పరామర్శిస్తానని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలుచేశారు. ఒక్క అనంతపురంలోనే 101 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో గణాంకాలను జగన్ వెల్లడించారు. రైతు కుటుంబాలకు అందరికీ పరిహారం అందచేయలేదని ఆరోపించారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. 311 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 25,764 వద్ద ముగియగా, నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 7,823 వద్ద ముగిసింది. స్టాక్‌మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిసిన విషయం విదితమే. 

అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలి - కాల్వ..

హైదరాబాద్ : అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. కాంగ్రెస్ హాయాంలో వ్యవసాయం సంక్షోభానికి గురైందని, రైతులను రాజశేఖరరెడ్డి మోసం చేశారని విమర్శించారు. 

జగన్ వన్నీ అవాస్తవాలే - పల్లె..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో జగన్ చెప్పినవన్నీ అవాస్తవాలే అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆత్మహత్యలాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత వైఎస్ దేనని విమర్శించారు. 

జగన్ తప్పుడు ప్రచారం - అచ్చెన్నాయుడు..

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై జగన్ తప్పుడు ప్రచారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు చనిపోయినా ఒకే ఖాతాలో వేయడం జగన్ కు అలవాటని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 

పోలవరం, పట్టిసీమ చర్చకు వైసీపీ పట్టు..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో పోలవరం, పట్టిసీమపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. పట్టిసీమపై చర్చకు ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమల అంశాలపై నిన్ననే చర్చ ముగిసిందని స్పీకర్ వెల్లడించారు. 

ఏపీలో 197 మంది రైతుల ఆత్మహత్య..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 197 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. దాదాపు 50 మంది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, చంద్రబాబు తీరు వల్లే పంటలు వేయలేకపోయారని విమర్శించారు. బాబు సీఎం అయినప్పుడల్లా రైతులకు కష్టాలే అని ఎద్దేవా చేశారు. రైతులు రుణాలు తీసుకోలేని పరిస్థితికి వచ్చారని, రూ. ఏడు వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. బ్యాంకులను రైతుల అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తోందని సభకు తెలిపారు. కరవు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పెట్టుబడి రాయితీ పెంచాల్సింది పోయి తగ్గించారని విమర్శించారు. 

తోటపల్లి ప్రాజెక్టుకు రీడిజైన్ - హరీష్ రావు..

హైదరాబాద్ : తోటపల్లి ప్రాజెక్టు రద్దు చేయడం వల్ల అదనంగా ఆరు వేల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు రద్దు చేయాలని చాడ వెంకట్ రెడ్డి గతంలో లేఖ రాశారని, ఇప్పుడేమో ప్రాజెక్టు రద్దు చేయొద్దని ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టును రద్దు చేస్తే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారికి ముంచడం తప్ప తేల్చడం తెలియదని పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీలో గందరగోళం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కరవుపై జగన్ ప్రసంగిస్తున్నారు. గంటలు గంటలు మాట్లాడడం సబబు కాదని, ఇతరులు కూడా మాట్లాడాలని స్పీకర్ కోడెల సూచించారు. షార్ట్ డిస్కషన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. జగన్ మైక్ కట్ కావడంతో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. 

16:13 - September 3, 2015

విశాఖ : హిందుస్థాన్ షిప్ యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. గత వారం రోజుల క్రితం మరమ్మత్తుల కోసం ముంబై నుండి వచ్చిన ఫిషింగ్ వెలజ్ ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాదాపుగా రూ.50 కోట్ల విలువైన వెజల్ కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

స్మార్ట్ సిటీల వర్క్ షాప్ ను ప్రారంభించిన వెంకయ్య..

ఢిల్లీ : స్మార్ట్ సిటీల వర్క్ షాప్ ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీల నిర్మాణంపై ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రతి స్మార్ట్ సిటీకి రూ.2 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, విడతల వారీగా స్మార్ట్సిటీలకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. 

టెన్ టివి కథనాలపై ఎంపీ కవిత స్పందన..

హైదరాబాద్ : టెన్ టివిలో వచ్చిన కథనాలపై ఎంపీ కవిత స్పందించారు. నిజామాబాద్ దుస్థితిపై టెన్ టివిలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. నగరాభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో భూగర్భ మురుగునీటి వ్యవస్థను నిర్మిస్తామన్నారు. 

షిప్ యార్డులో ఫైర్ ఆక్సిడెంట్..

విశాఖపట్టణం : షిప్ యార్డులో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మత్తులు చేస్తున్న షిప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

తన అరెస్టు వెనుక రాజకీయ కోణం - కిషన్ రెడ్డి..

వరంగల్ : తనను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రానికి..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 

అర్చకుల డిమాండ్లపై టి.సర్కార్ సానుకూలం..

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గురువారం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి వారితో నిర్వహించిన చర్చలు ముగిశాయి. శుక్రవారం మరోసారి వీరు భేటీ కానున్నారు. అనంతరం టి.సర్కార్ నిర్ణయం వెలువడించే అవకాశం ఉంది.

రిషితేశ్వరి ఆత్మహత్యే.. ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి....

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈరోజు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. ఆమెది ఆత్మహత్యేనని నివేదిక నిర్థారించింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ముగ్గురు విద్యార్థులే ఈ కేసులో నిందితులని నివేదిక తేల్చి చెప్పింది. కాగా కేసుకు సంబంధించి రెండు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. 

కాంగ్రెస్ నేతలకు ముంచుడు తప్ప తేల్చడం తెలియదు: హరీష్ రావు

హైదరాబాద్: తోటపల్లిప్రాజెక్టును రద్దు చేయమని ఆనాడే ప్రతిపక్ష పార్టీలు ఆనాటి ప్రభుత్వానికి లేఖలు రాశాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఆరు గ్రామాలను ముంపు నుంచి రక్షించిందని వివరించారు. అదనంగా ఆరువేల ఎకరాలకు నీరందించేలా రీ డిజైన్ చేశామని తెలిపారు. ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కనీస అవగాహనలేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

తొమ్మిది బిల్లులు ఆమోదం తెలిపి ఏపీ అసెంబ్లీ...

హైదరాబాద్ : ఏపి శాసనసభలో తొమ్మిది బిల్లులకు గురువారం అమోదం తెలిపింది. ఆర్థిక నేరాల్లో అవినీతి పరుల ఆస్తుల జప్తు చేసేలా అనుమతించే కీలక చట్టసవరణ బిల్లును సభ ఆమోదించింది. సాగునీటి సంఘాల నిర్వహణ బిల్లు, గ్రురపు పందేల చట్టసవరణ బిల్లు, దేవాదాయ శాఖకు సంబంధించిన మరో చట్టానికి సవరణ చేసింది. డిపాజిటర్ల రక్షన కోసం చట్ట సవరణ చేస్తూ మరో బిల్లుకు ఆమోదం తెలిపింది.

బిజెపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది : హరీష్ రావు

హైదరాబాద్ : బిజెపి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ను పక్కనబెట్టి నీతి ఆయోగ్ ను తీసుకొచ్చారని... మరింత బెటర్ గా ఉండాలనే కోణంలోనే ఈ మార్పులు చేసి ఉంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత బాగా ఉండాలనే ఆలోచనతోనే ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని నిర్ణయించిందని... మరి దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ చేస్తే కరెక్ట్... మేం చేస్తే తప్పా అని నిలదీశారు.

సామర్ల కోటలో నిన్న సైకో దాడి జరగలేదు...

తూర్పుగోదావరి : సామర్లకోటలో బుధవారం సూదితో సైకో దాడులు జరగలేదని పోలీసులు తేల్చారు. కేవలం ప్రచారం కోసమే ఓ వ్యక్తి తనపై సూదితో సైకో దాడి చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. బుధవారం... సైకో సూదితో తనను పొడిచి వెళ్లాడని ఓ వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైకో కోసం ఇప్పటికే తీవ్రంగా గాలింపు చర్యలు కూడా జరుగుతుండగా బుధవారం తనపై సూదితో దాడి చేశాడని అతను చెప్పడంతో పోలీసులు అతన్ని విచారించగా... ప్రచారం కోసమే తాను ఈ విధంగా చెప్పానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవారి లడ్డూ ధర పెంపు పై సమీక్ష : చదలవాడ...

తిరుమల : తిరుమలలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరుణుడు కరుణిస్తే తప్ప నీటి సమస్య తీరదన్నారు. అయినప్పటికీ నీటి ఎద్దడి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయనన్నారు. అలాగే... త్వరలో శ్రీవారి లడ్డూ ధర పెంపుపై సమీక్ష జరుపుతామని, ప్రస్తుతం ఒక్కో లడ్డూ తయారీకి రూ. 38 వరకు ఖర్చు అవుతోందని, అయినప్పటికీ భక్తులకు రూ. 25కే ఇవ్వడమేగాక నడకదారి, సర్వదర్శనం భక్తులకు రూ.10కే ఇస్తున్నామని ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.

బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్ట్...

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్రను చేపట్టారు. ఆయన వెంట భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు, కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నలుగురు ఉగ్రవాదులు, ఒక జవాను మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుపార్వా జిల్లా హంద్వారా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. హంద్వారా గ్రామంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాను కూడా మృతి చెందాడు. హంద్వారాలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

14:58 - September 3, 2015

హైదరాబాద్: ర్యాగింగ్‌ రాక్షసత్వానికి విద్యా సుమాలు రాలిపోతూనే ఉన్నాయి..! అమ్మానాన్నల ఆశాదీపాలు అర్ధాంతరంగా ఆరిపోతూనే ఉన్నాయి..! ఈ అకృత్యానికి అంతం పలకాల్సినవారు.. ఈ దారుణానికి అడ్డుకట్ట వేయాల్సినవారే.. వేడుక చూస్తుంటే, విద్యాసంస్థల్లో మాటువేసిన ర్యాగింగ్‌.. నిర్ధాక్షిణ్యంగా కాటేస్తోంది..! అక్షర దీపాలను అన్యాయంగా మింగేస్తోంది..!                                                                            

ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా..? .....

ఒక తల్లి తన గారాల మారాజుపై ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది..? ఒక తండ్రి తన గారాల పట్టి గురించి ఎన్ని కలలు కంటాడు..? ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా..? తల్లిదండ్రులకు తప్ప, ఇది వేరెవరికీ అంతుచిక్కని ఆశల తరంగం. మరెవరూ తరచి చూడలేని అంతరంగం. అలాంటి ఆశల సౌధాన్ని ర్యాగింగ్‌ రక్కసి కూలదోస్తే..? అపురూపుంగా చూసుకునే గాజుబొమ్మను కళ్లెదుటే ముక్కలు చేస్తే..? ఆ అమ్మ మనసు ఎలా తల్లడిల్లుతుంది..? నాన్న హృదయం ఎంతలా ద్రవిస్తుంది..?

1997లో ర్యాగింగ్‌ నిరోధానికి చట్టం....

తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తూ.. విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్న ఈ దారుణంలో.. అందరికన్నా ముందుగా నిందించాల్సింది, బోనులో నిలబెట్టాల్సింది వేరెవరినో కాదు. ఆయా కాలేజీల యాజమాన్యాలను. ఏళ్ల తరబడి ర్యాగింగ్‌ రక్కసి కోరల్లో చిక్కి ఎందరో విద్యార్థులు బలైన తర్వాత.. ఎట్టకేలకు 1997లో ర్యాగింగ్‌ నిరోధానికి చట్టం తెచ్చింది ప్రభుత్వం. ర్యాగింగ్‌కు పాల్పడితే అమలు చేసే శిక్షలతోపాటు.. కాలేజీల యాజమాన్యాలు అనుసరించాల్సిన పద్ధతులను ఈ చట్టంలో పొందుపరిచారు. కరపత్రాలతో మొదలు పెడితే.. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించడం, విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో బాధ్యతలను చట్టం ద్వారా గుర్తుచేశారు.

ఇవాళ యాజమాన్యాలు చేస్తున్నదేంటి..?......

కానీ.. ఇవాళ యాజమాన్యాలు చేస్తున్నదేంటి..? చదువును దుకాణంలో సరుకును చేసి.. తమ డబ్బుల సంచులు ఏ మేరకు నిండుతున్నాయి..? ఇంకా ఎంత వరకు వెలితిగా ఉన్నాయని చూస్తున్నారే తప్ప, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, అందించాల్సిన రక్షణను ఏనాడో గాలికి వదిలేశాయి. పైపెచ్చు, జూనియర్లను పీక్కుతినండంటూ సీనియర్లకు వత్తాసు పలుకుతూ, ఏదైనా దారుణం జరిగిపోయాక మొసలికన్నీరు కారుస్తున్నాయి. తమ చదువుల దుకాణానికి కస్టమర్లు రాకుండా పోతారేమోననే భయంతో.. సాధ్యమైనంత వరకూ దారుణాలను బయటకు రాకుండా కప్పేస్తున్నాయి యాజమన్యాలు.

ఇక చట్టాలను అమలు చేస్తున్న తీరు కూడా అత్యంత అన్యాయంగా.....

ఇక చట్టాలను అమలు చేస్తున్న తీరు కూడా అత్యంత అన్యాయంగా ఉంది. ర్యాగింగ్‌ కేసులో నిందితులైన విద్యార్థులతోపాటు, ప్రిన్సిపాల్‌, యాజమాన్యాలపైనా కేసులు నమోదు చేయాల్సి ఉంది. కానీ.. ఎక్కడా ఇలాంటి కేసులు నమోదైన దాఖలాల్లేవు. నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఉదంతంలో ప్రిన్సిపాల్ పాత్ర ఉందని రుజువైనా.. ఇప్పటి వరకూ కనీసం కేసుకూడా నమోదు చేయలేదని విద్యార్థిని తండ్రి పోరాడుతున్నాడు. రిషితేశ్వరి ఘటన మరచిపోకముందే.. వరంగల్‌ జిల్లాలో రైలు కింద పడి మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.

ర్యాగింగ్‌ అకృత్యాలకు బలవుతున్న విద్యార్థులకు అంతే లేకుండా....

ఇలా.. ర్యాగింగ్‌ అకృత్యాలకు బలవుతున్న విద్యార్థులకు అంతే లేకుండా పోతోంది. ర్యాగింగ్‌ను అరికట్టాల్సిన వారు వేడుక చూస్తుంటే.. అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అటు ప్రభుత్వాలు, ఇటు యాజమాన్యాలు ఇకనైనా స్పందించాల్సి ఉంది. లేదంటే.. మరెన్నో విద్యా కుసుమాలు రాలిపోయే ప్రమాదం ఉంది.

14:54 - September 3, 2015

హైదరాబాద్ : మహిళ తల్లిగా మారే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంటుంది. మరి ఇలాంటి సమస్యలకు నిపుణులు సూచించే పరిష్కార మార్గాలేమిటో ఇవాళ్టి మానవి హెల్త్ కేర్ లో డాక్టర్ నర్మద, ప్రముఖ గైనకాలజిస్ట్ వివరించారు. ఆ వివరాలు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:47 - September 3, 2015

హైదరాబాద్ : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాలవాయిలో చిరుత హల్‌చల్ చేసింది.. ఓ ఆవుదూడను చంపేసింది... కొద్దిరోజులక్రితం గొర్రెలనుకూడా ప్రతాపంచూపింది.. దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.. అటవీ అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.. అధికారులుమాత్రం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.. నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటిస్తామని చెబుతున్నారు..

 

14:43 - September 3, 2015

ప.గో : సైకో సూదిగాడు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.... ఈ దుండగుడికోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు... పల్సర్, హోండా షైన్ బైక్‌లున్న ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.. సందేహంవస్తే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. 

14:41 - September 3, 2015

హైదరాబాద్ : ప్రజాస్వామ్య భారతంలో న్యాయం కోసం ఏళ్లపాటు ఎదురు చూడాల్సిన స్థితి. జనాభాకు సరిపడ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే పరిస్థితులు కరువై న్యాయవ్యవస్థ కుంటి నడకన కేసులను పరిష్కరిస్తోంది. ఏడీఆర్ అంటే ఏమిటి? ఆర్బిట్రేషన్ అందుకు ప్రత్యామ్నాయంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన న్యాయసేవలను పరిచయం చేసేందుకు ఈ వారం 'ఫోకస్' మీ ముందుకు వచ్చింది.

తరాలు మారుతున్నా.....

తరాలు మారుతున్నా పరిష్కారం కాని వివాదాలు ఎన్నో ఉన్నాయి. సామాన్యుడికి న్యాయం చేరేసరికి దశాబ్దాలు గడుస్తున్నాయి. అమూల్యమైన సమయం గడిచిపోయిన తరువాత న్యాయం చేరినా ఆ ప్రతిఫలాలు అనుభవించే స్థితి దాటిపోతోంది. ఈ ప్రహసనం మొత్తంలో బాధితులుగా మిగులుతున్నది ఎక్కువగా మహిళలే. అందుకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అనే పద్ధతి అమలులోకి వచ్చింది.

వివాదంలోనైనా బాధితులుగా మిగిలే వారిలో .....

ఎక్కడైనా, ఎలాంటి వివాదంలోనైనా బాధితులుగా మిగిలే వారిలో ముందు వరుసలో నిలిచేది మహిళలు, చిన్నారులే. సత్వర న్యాయం జరగకపోయినా అంతిమంగా బాధితులుగా మిగిలేది వారే. అందుకే ప్రతి వివాదానికి సత్వర పరిష్కారం దొరకాలి. అందుకోసం ఏర్పాటైన వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి, ఆ సేవలు అందరికీ అందాలి అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరిన్ని వివరాలను చూడాలనుకుంటే... ఈ వీడియోను క్లిక్ చేయండి.

పోలీసు సంస్కరణలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: పోలీసు సంస్కరణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయారు. పోలీసు సంస్కరణలపై చర్చించారు.

 

బీహార్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమైన ఎస్పీ

హైదరాబాద్ : బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఓ వైపు సభలు, సమావేశాలు, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే జేడీయూ - ఆర్జేడీ మహాకూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వైదొలగింది. బీహార్ ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిపోరు చేయాలని నిర్ణయించింది. సీట్ల పంపకంపై తమను మహా కూటమి సంప్రదించలేదని ఎస్పీ పేర్కొంది. ఇక ఎస్పీ ఒంటరి పోరు చేయనుంది.

అర్చకులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు

హైదరాబాద్: రాష్ట్ర అర్చక సంఘం నేతలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు జరుపుతున్నారు. సచివాలయంలో జరుగుతోన్న ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు.

మాస్కో ఎయిర్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : మాస్కో ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం సంభవించడంతో ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 40 విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. అగ్నిప్రమాదం నేపథ్యంలో 3,000 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి చేయించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి జోగు భేటీ...

హైదరాబాద్ : సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి జోగు రామన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ వసతి గృహాలు, భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

13:58 - September 3, 2015

ఢిల్లీ: జనతాపరివార్ లో భారీ చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరలేదు. జనతా పరివార్ నుంచి ములాయంసింగ్ బయటకు వచ్చారు. నితీష్, లాలు వైఖరిపై సమాజ్ వాది పార్టీ మండిపడింది. 

జనతాపరివార్ లో భారీ చీలిక...

ఢిల్లీ: జనతాపరివార్ లో భారీ చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరలేదు. జనతా పరివార్ నుంచి ములాయంసింగ్ బయటకు వచ్చారు. నితీష్, లాలు వైఖరిపై సమాజ్ వాది పార్టీ మండిపడింది.

 

13:51 - September 3, 2015

ముంబయి: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు మిస్టరీ వీడింది. కూతురు షీనాబోరాను తానే హత్య చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ ఒప్పుకుంది. ముంబయి పోలీసులు ఖార్ పోలీస్ స్టేషన్ లో ఇంద్రాణీని సుదీర్ఘంగా విచారించారు. షీనాబోరాను తానే హత్య చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ ఒప్పుకుంది. ఇంద్రాణి నేరం అంగీకరించింది. కూతురు హత్యకు దారితీసిన పిరిస్థితులను వివరించింది. కూతురు షీనాబోరాను హత్యచేసినట్లు ఒప్పుకుని..ఇంద్రాణి కుప్పకూలిపోయింది. అయితే పదిరోజుల సస్పెన్షన్ కు తెరపడడంతో పోలీసులు రిలాక్స్ అయ్యారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

నేరం అంగీకరించిన ఇంద్రాణి...

ముంబయి: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు మిస్టరీ వీడింది. కూతురు షీనాబోరాను తానే హత్య చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ ఒప్పుకుంది. 

13:40 - September 3, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డుకు చెందిన 14 ఖాళీ స్థలాలను విక్రయించాలని ఆదేశించింది. వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని హైకోర్టుల సూచించింది. అగ్రిగోల్డు అనుబంధ ఆస్తును సీఐడీ రక్షిస్తోందని బాధితులు తెలిపారు. 

అగ్రిగోల్డు బాధితుల పిటిషన్ పై విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డుకు చెందిన 14 ఖాళీ స్థలాలను విక్రయించాలని ఆదేశించింది. 

13:05 - September 3, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ డిమాండ్ చేశారు. ఈమేరకు గాంధీ భవనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో వర్షాలు లేక కరువు తాండవిస్తుందని.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతుల గురించి మాట్లాడటానికి ప్రభుత్వానికి సమయం లేకపోవడం శోచనీయమన్నారు. రైతు కన్నీరు ప్రభుత్వానికి పట్టదా.. అని ప్రశ్నించారు. ఇప్పటికి కూడా కరువు మండలాలు, జిల్లాలను ప్రకటించకపోవడం దారుణమన్నారు.

 

12:56 - September 3, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనమండలిలోబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన చేసేటప్పుడు.. కుటుంబం పాటించే ధరాన్ని కూడా పాటించలేదన్నారు. పార్లమెంట్ డోర్స్ మూసివేసి, టివిలు ఆఫ్ చేసి.. విభజన బిల్లు పాస్ చేశారని తెలిపారు. ప్రత్యేక డిఫెన్స్ విమానంలో లో పునర్విభజన బిల్లు పంపించారని పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా విభజించి వుంటే సమస్యలు వచ్చవి కావన్నారు. విభజన చేయాలంటే ఎపికి న్యాయం చేయండి.. సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణను ఒప్పించాలి అని తెలిపినా.. వినలేదన్నారు. ఆస్తులు... భౌగోళిక ప్రాతిపదికన.. అప్పులు జనాభా ప్రాతిపదికన కేటాయించారని పేర్కొన్నారు. ఎపిలో 59 శాతం ఉన్న జనాబాకు 43 శాతం ఆస్తులు... తెలంగాణలోని 41 శాతం జనాభాకు 47 శాతం ఆస్తులు పంచారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం చేయాలంటే రూ. 5 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ప్రత్యేకోహోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు.

12:44 - September 3, 2015

వాషింగ్ టన్ : సెల్ఫీ సరదా అమెరికాలో ఓ యువకుడి ప్రాణం తీసింది. హోస్టన్‌కు చెందిన డెలియోన్ అలొన్సో స్మిత్ అనే 19 ఏళ్ల యువకుడు తుపాకీతో తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడ్డాడు. స్మిత్ తన అపార్ట్మెంట్లో లోడ్ చేసిన గన్తో ఫోజిచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ ప్రయత్నంలో స్మిత్‌ ప్రమాదవశాత్తూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ గొంతులోకి దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలావుండగా ఈ ఏడాది ఆరంభంలో రష్యాలో మరో యువతి గన్తో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

 

 

12:39 - September 3, 2015

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో ఉదయం మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. హంద్వారాలో ఉగ్రవాదులున్న సమాచారంతో.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 2 గంటల పాటు జరిగిన కాల్పుల్లో సైన్యం ముగ్గురు తీవ్రవాదులను హతమార్చింది. ఈ ఘటనలో ఓ సైనికుడు కూడా చనిపోయాడు.

 

12:34 - September 3, 2015

హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జనం కారణంగా తలెత్తే కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది యధావిధంగా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరగాలని కోర్టు ప్రభుతాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాదికి కాలుష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిమజ్జనం జరిగిన వెంటనే సాగన్ నుంచి తొలగించాలని సూచించింది.

 

12:22 - September 3, 2015

హైదరాబాద్ : 'నేరాన్ని నమ్ముకుని... రాజకీయాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన జగన్‌ తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రభుత్వ చిఫ్‌ విఫ్‌ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాల్వ డిమాండ్‌ చేశారు. ఇటు కాల్వ వ్యాఖ్యలతో సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. 

12:19 - September 3, 2015

హైదరాబాద్ : 'వైసిపి ప్రతిపక్ష పార్టీ కాదు సైకో పార్టీ' అన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు జగన్ తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబుపై జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభలో రౌడీ సీఎం, రౌడీ సభ్యులు ఉన్నారని అన్నారు. అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. జగన్‌ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాగా జగన్ వ్యాఖ్యలపై టీడీపీ భగ్గుమంది.

సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసీపీ

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీ కాదు సైకో పార్టీ అన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అచ్చెన్నాయుడుపై స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.

 

11:58 - September 3, 2015

వరంగల్ : పెండింగ్‌లోఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లా చేరింది. జిల్లాలో కంతనపల్లి నుంచి దేవాదులవరకూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. 30కిలోమీటర్లపాటు ఈ యాత్ర సాగనుంది. ఇందులోభాగంగా మూతబడ్డ బ్రిడ్జి కంపెనీని తెరిపించాలంటూ దీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు.. ఈ కంపెనీ ప్రారంభానికి కేంద్రంనుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు..

 

వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి పాదయాత్ర

వరంగల్ : పెండింగ్‌లోఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లా చేరింది. జిల్లాలో కంతనపల్లి నుంచి దేవాదులవరకూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు

11:53 - September 3, 2015

హైదరాబాద్ : ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్‌ ఆయ్యారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈమేరకు ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

11:47 - September 3, 2015

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు మరవకముందే నాగార్జున యూనివర్సిటీలో మరో ఈవ్ టీజింగ్ కేసు నమోదు అయింది. రత్నమంజరీ అనే విద్యార్థిని ఎమ్మెస్సీ (బాటనీ) రెండో సంవత్సరం చదువుతోంది. బాలయ్య అనే సీనియర్ విద్యార్థి...మంజరీని రెండు రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నీ డ్రస్ బాగుందంటూ బాలయ్య నన్ను వేధిస్తున్నాడు' అని ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. అతని కోసం వెతుకుతున్నారు. సాయంత్రం లోగా పోలీసులు బాలయ్యను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

 

నాగార్జున యూనివర్సిటీలో మరో ఈవ్ టీజింగ్ కేసు

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో మరో ఈవ్ టీజింగ్ కేసు నమోదు అయింది. సీనియర్ విద్యార్థి బాలయ్య... ఎమ్మెస్సీ చదువుతున్న మంజరీ అనే విద్యార్థినిని రెండు రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వాయిదా అనంతరం ప్రారంభమైన ఎపి అసెంబ్లీ..

హైదరాబాద్ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అయింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 

10:44 - September 3, 2015

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను, 95,32,42,733 రూపాయల షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండిస్టీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ,'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌గా నిలిచింది. సినిమా రిలీజై 25 రోజులు దాటినా ఇంకా చాలా మంది ఫోన్లు చేసి చాలా మంచి సినిమా చేశావంటూ అభినందిస్తున్నారు. ఈ రేంజ్‌లో ప్రశంసలు నాకే సినిమాకీ రాలేదు. నేనెప్పుడు మంచి సినిమా చేసినా నాకు పూర్తి సపోర్ట్‌ ఇచ్చే నా అభిమానులు 'శ్రీమంతుడు' సాధించిన ఘన విజయం పట్ల చాలా ఆనందంగా వున్నారు. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఈ విజయం నన్నెంతో ఇన్‌స్పైర్‌ చేసింది. టోటల్‌ టీమ్‌ కృషితో ఇంత మంచి విజయం లభించింది. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్‌' అని అన్నారు. 'కథని నమ్మి మహేష్‌బాబు, నేను, నా టీమ్‌, నిర్మాతలూ అందరం కష్టపడి చేసిన 'శ్రీమంతుడు'కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ మంచి కథకు ఓ సూపర్‌స్టార్‌ తోడయితే సినిమా ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్తుందన్నది 'శ్రీమంతుడు' నిరూపించింది' అని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,'టాలీవుడ్‌లో సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' రికార్డ్‌ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ నిర్మించిన తొలి చిత్రమే ఇండిస్టీ హిట్‌ అవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన మా హీరో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుగారికి, దర్శకులు కొరటాల శివగారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మహేష్‌బాబు అభిమానులకు మా కృతజ్ఞతలు' అని అన్నారు.

10:36 - September 3, 2015

హైదరాబాద్ : మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదని.. అది ఒక సైకో పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే వైసిపి సభ్యులు మాత్రం స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయకపోతే అన్ని అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. ప్రతి విషయానికి పోడియం వద్దకు వచ్చి గొడవ చేయడం వైసిపికి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ పార్టీ... ఒక సైకో పార్టీయని.. అవిధంగా పేరు పెట్టుకోండని ఉచిత సలహా ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో వైసిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

 

వైఎస్సార్ పార్టీ.. ఒక సైకో పార్టీ: అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదని.. అది ఒక సైకో పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

10:19 - September 3, 2015

చీప్ లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెనక్కి తగ్గడం సంతోషకరమని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామనడం మంచిదే అన్నారు. అయితే పొలిటికల్ గా డ్యామేజ్ కావడం కంటే ముందే టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంలాటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చమురు క్షేత్రాలను ప్రైవేట్ రంగాలకు అప్పగించిలాని చూస్తుందని తెలిపారు. ఓఎన్ జీసీకి సాధ్యం కానిది ప్రైవేట్ చిన్న కంపెనీలు ఎలా భరిస్తాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
'చీప్ లిక్కర్ వెనక్కి తగ్గాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. గుడుండాపై ఉక్కుపాదం మోపడం కూడా మంచిదే. అయితే రాజకీయ నేతల ప్రోద్బలంతోనే గుడుంబా తయారవుతుంది. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే గుడుంబా తయారు అవుతుంది. రాజకీయ మాఫియాలో భాగమే గుడుంబా మాఫీయా. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా గుడుంబా తయారు కావడం లేదు. గుడుంబాను అరికట్టాలి తప్ప... చీప్ లిక్కర్ ప్రవేశపెట్టవద్దు. ప్రజా స్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి. తప్పుడు విధానానిన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఆహ్వానించాల్సిందే. అయితే వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటున్నారు. ఒక విధానాన్ని ప్రవేశపెట్టబోయే ముందే ప్రభుత్వం ఆలోచించాలి. సీఎం చూట్టూ ఆయనను మోసం చేసే వారు ఉన్నారు. ఆయన ఏం చేసినా జై కొడుతున్నారు. అది కరెక్టు కాదు. సీఎం... నిజాయితీని నమ్మే వారిని నమ్మాలి. ప్రజాస్వామ్యంలో ముందే ఆలోచించాలి. ఉస్మానియా యూనిర్సిటీ కూల్చివేత, సెక్రటేరియట్ తరలింపు, టిబి అస్పత్రి తరలింపు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు, దళితులు భూ పంపిణీ.. ఇలాంటి వివాదాస్పద కార్యక్రమాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు సీరియస్ నెస్ పోతుంది. ప్రభుత్వం విమర్శలను తీసుకోవాలి. ప్రజాస్వామిక విలువలను గౌరవించాలి' అని అన్నారు. కేంద్రప్రభుత్వ చమరు కంపెనీల వేలం... ప్రైవేట్ పరం చేయడం, ఎపి అపెంబ్లీ, ఎపికి ప్రత్యేకహోదా అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:04 - September 3, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో మళ్లీ గందరగోళం నెలకొంది. వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే వైసిపి సభ్యులు మాత్రం వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయవద్దని వైసిపి సభ్యులకు సూంచించారు. సభా సమయాన్ని వృధా చేయకపోతే అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో వైసిపి సభ్యుల ఆందోళన కొనసాగింది. ఈక్రమంలో మంత్రి వైసిపి ఒక సైకో పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసిపి సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి.. ఆందోళన చేపట్టారు. మంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పిన వినలేదు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. 

09:38 - September 3, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు తగలబడుతోంది. ప్రయాణికులు దిగడంతో ప్రమాదం తప్పింది. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

 

09:35 - September 3, 2015

చీప్ లిక్కర్ నూతన విధాన్ని వెనక్కి తీసుకుంటు టీసర్కార్ నిర్ణయం చేయడం సంతోషకరమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి శ్రీరాములు, టిఆర్ ఎస్.. నేత రాకేష్ , సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు.. బూబురావు, వైసిపి ఎస్సీ సెల్ కన్వీనర్.. మెరుగు నాగార్జున పాల్గొని, మాట్లాడారు. ఎపిలోని పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులపై చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్టీసీ బస్సులో మంటలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు తగలబడుతోంది. ప్రయాణికులు దిగడంతో ప్రమాదం తప్పింది. 

09:21 - September 3, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే.. నిత్యవసర ధరలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో వైసిపి సభ్యులు స్పీకర్ పోడిమం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి, ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. హౌజ్ లో ప్లకార్డులు ప్రదర్శించద్దని తెలిపారు. నినాదాలు చేయడం సరికాదన్నారు. అయినా వైసిపి సభ్యులు నినాదాలు అగలేదు. స్పీకర్ ఎంత చెప్పిన వినిపించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగళం నెలకొంది. స్పీకర్ సభను పదేహేను నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించరారు.

 

ఎపి అసెంబ్లీ పావుగంట వాయిదా...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు పావుగంట వాయిదా పడ్డాయి. సమావేశాలు నాలుగో రోజు ప్రారంభంగానే నిత్యవసర ధరలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో వైసిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి, ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత చెప్పిన వినడం లేదు. దీంతో స్పీకర్ సభను పదేహేను నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించరారు. 

వైసిపి వాయిదా తీర్మానం తిరస్కరణ

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. నిత్యవసర ధరలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో వైసిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. 

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్....

జమ్మూ కాశ్మీర్ : హంద్వాడలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భారత జవాన్లు.. నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఎదురు కాల్పుల్లో ఒక జవాను మృతి చెందారు.

 

08:07 - September 3, 2015

చీప్ లిక్కర్ విధానంపై టీసర్కార్ వెనక్కి తగ్గడం హర్షణీయమని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. 'చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన తీవ్ర వివాదస్పదమైంది. చీప్ లిక్కర్ వద్దంటూ ఇప్పటికే అనేకమంది అనేక రూపాల్లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రేపు, ఎల్లుండి ఆందోళనలు నిర్వహించేందుకు గౌడలు, కల్లుగీత వ్రుత్తిదారులు సమాయత్తమవుతున్నారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో రమణ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

నేటి వైసిపి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : నేడు నాలుగో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నిత్యావసర ధరలపై నేడు వైసిపి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

07:49 - September 3, 2015

చీప్ లిక్కర్ వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. విభిన్న వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకనాడు తెలుగు నేల మీద సాగిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం యావత్ జాతిని ఆకర్షించింది. ఆనాటి పోరాటాన్ని మరో స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు. కానీ, ఆ తర్వాత కొన్నాళ్లకే సారా వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తికి ఆనాటి ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. మద్యం మహమ్మారి మన నుంచి దూరం కాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం మాఫియా పోకడలు పోతోంది. మద్యం వ్యాపారంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు బంధాలు పెనవేసుకుంటున్న తీరు రోత పుట్టిస్తోంది. జాతీయోద్యమకాలం నాటి నాయకులు మద్యపానానికి వ్యతిరేకంగా జనంలో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తే, నేటి తరం నాయకులు మద్యం వ్యాపారాల్లో మునిగి తేలుతూ, ప్రతి ఒక్కరినీ తాగుబోతులుగా మార్చే వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రభుత్వాలు.. మద్యం వ్యాపారం
ప్రభుత్వాలు సైతం మద్యం వ్యాపారాలు నిర్వహించేందుకు పోటీపడుతున్నాయి. మరోవైపు కల్లీ సారా, గుడుంబాలు అనేకమంది ప్రాణాలు పొట్టనబెట్టుకుంటున్నాయి. చివరకు జనం ప్రాణాలు హరించే గుడుంబా వ్యాపారాలు నిర్వహించే స్థితికి మన నాయకులు దిగజారుతున్నారు. వీటిని అరికట్టే విషయంలో పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వాలు చివరకు తామే చీప్ లిక్కర్ ప్రవేశపెట్టే స్థితికి దిగజారుతున్న వైనం తెలుగు నేల మీద కనిపిస్తోంది. చీప్ లిక్కర్ ప్రవేశపెట్టొద్దంటూ ఇప్పటికే మహిళా సంఘాలు, గౌడ సంఘాలు, కల్లు గీత కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
కల్లుగీత వృత్తికి ప్రమాదం
వీధివీధినా చీప్ లిక్కర్ అమ్మకాలు ప్రారంభిస్తే మందుబాబుల సంఖ్య మరింత పెరుగుతుందనీ, అనేక సంసారాలు నాశనమవుతాయన్న ఆందోళనే అనేక మందిని ఉద్యమబాట పట్టిస్తోంది. మరోవైపు ఇప్పటికే బీరు, బ్రాందీ, గుడుంబాల ధాటికి విలవిలలాడుతున్న కల్లు గీత వ్రుత్తి చీప్ లిక్కర్ తో మరింత ఛిద్రమవుతుందున్న భయాలు ఆయావర్గాల్లో వున్నాయి. తెలంగాణలో కల్లుగీత కొన్ని లక్షల కుటుంబాలకు జీవనాధారం. బీరు, బ్రాంది, చీప్ లిక్కర్, గుడుంబాలతో పోల్చుకుంటే కల్లు ఏమంత ప్రమాదకారి కాదన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అయితే, మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న మద్యం విధానాలు ఓ వైపు కల్లుగీత కార్మికులను శాపగ్రస్తులుగా మారుస్తూ, మరోవైపు మద్యం మాఫియాను సృష్టిస్తున్నాయి. మద్యం వేలం పాటల ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నతీరు వెగటుపుట్టిస్తోంది. నిజానికి బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలు పెంచే మార్గాల గురించి ఆలోచించకూడదు. మద్యపాన వ్యసనం నుంచి జనాన్ని బయటపడేసే మార్గాల గురించి ఆలోచించాలి. తాగుబోతులు లేని సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేయాలి. ఆ పని చేయకుండా గుడుంబాను అరికట్టే పేరుతో చౌక మద్యాన్ని ప్రవేశపెడితే తాగుబోతుల సంఖ్య పెరగడమే కాకుండా, కల్లుగీతలాంటి పురాతన వృత్తులు దెబ్బతినే ప్రమాదమూ వుంది.

 

07:46 - September 3, 2015

హైదరాబాద్ : సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ కేబినెట్‌ సమావేశమై అనేక కీలకనిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పదమైన చీప్‌లిక్కర్‌ నిర్ణయాన్ని విరమించుకోవడంతో పాటు.. పేదలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకానికి కేబినెట్‌ ముహూర్తాన్ని ఖరారు చేసింది. దాంతో పాటు..తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్‌ కమిటీని వేసింది.                                                                
చీప్‌లిక్కర్‌పై వెనక్కి తగ్గిన సర్కార్
తెలంగాణ కేబినేట్ సమావేశం బుధవారం సుధీర్ఘంగా 4గంటల పాటు సాగింది. సమావేశంలో వివాదస్పదమైన చిప్ లిక్కర్ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఈ ఏడాదికి పాత విధానాన్ని కొనసాగించాలని కేబినెట్‌ తీర్మాణించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎస్ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమిటీ నివేదిక రాగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకానికి ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది 3,900 కోట్లతో 60 వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 4వేలతో, పట్టణ ప్రాంతాల్లో 5లక్షల30వేలతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఇక పాత బకాయిల చెల్లింపులకు సైతం పచ్చ జెండా ఊపింది సర్కార్‌. అక్రమాలకు తావు లేకుండా అర్హులకే ఇళ్లు అందేలా కలెక్టర్లకు బాధ్యత అప్పగించింది కేబినేట్.
సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పూర్తి
తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్‌ పూర్తయిందని..గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ పూర్తిగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుందని కేబినెట్‌ నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టులకు వచ్చే మూడేళ్లలో ప్రతి ఏటా 25 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. 81 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దాంతోపాటు పాలమూరు ప్రాజెక్టుకు ప్రత్యేక అథారిటీని నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని మంత్రి వర్గం తీర్మానించింది. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు అసెంబ్లీని నడిపిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ ఆర్టీసీ బాధ్యతలు జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్టీసీ 218 కోట్ల నష్టంతో నడుస్తోందని హైదరాబాద్‌లో వచ్చే నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను అమలు పరచాలని మంత్రివర్గం తీర్మాణించింది. 170 మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్, మిగిలినవి లాటరీ ద్వారా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్ల వరకు పొడిగించారు. యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాల కోసం వయో పరిమితి సడలింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు.
హైదరాబాద్‌లో స్కై వేల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం
హైదరాబాద్‌లో 2,631 కోట్లతో స్కై వేల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ పచ్చ జెండా ఊపింది. ఉద్యోగుల విభజన పూర్తి కాగానే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తామన్నారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపులేదన్నారు సీఎం. రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అవి నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం నాల్‌తుమ్మెర, మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహరం చెల్లించేందుకు కలెక్టర్లకు నిధులు అందచేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో కరువు మండలాల గుర్తింపు ప్రక్రియ ఈ నెలాఖరు తర్వాత ప్రారంభింస్తామన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ మినహా ఇతర జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయని సీఎం అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనేక ప్రోత్సహకాలు కల్పిస్తున్నట్లు సీఎం వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో చైనా, జపాన్‌, కొరియా దేశాల్లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. వీటితోపాటుగా స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటు, రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ ఏర్పాటు, వ్యాట్ చట్టంలో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

07:30 - September 3, 2015

ఢిల్లీ : చిన్న ఆయిల్‌, గ్యాస్‌ క్షేత్రాలను ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనేక రంగాలను ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేసిన ప్రభుత్వం.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్ జీసీ, ఆయిల్‌ ఇండియాలు.. నిర్వహించలేక చేతులెత్తేసిన క్షేత్రాలను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వేలంతో రూ.70 వేల కోట్లు సేకరణ
69 క్షేత్రాలను వేలం వేసి 70 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని బీజేపీ సర్కార్‌ భావిస్తోంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. దేశీయ హైడ్రోకార్బన్‌ ఉత్పాదనను పెంచుకొని, దిగుమతులపై ఆధారపడడాన్ని మరింతగా తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రోత్సాహకర విధానం వల్ల చాలామంది డెవలపర్లు ఈ క్షేత్రాల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశముందన్నారు. ఇక వేలం వేయనున్న 69 క్షేత్రాల్లో 63 ఓఎన్ జీసీ, 6 ఆయిల్‌ ఇండియా సంస్థ విరమించుకున్న క్షేత్రాలున్నాయని మంత్రి తెలిపారు.
ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేందుకే కొత్త విధానం
అయితే.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్ జీసీ, ఆయిల్‌ ఇండియాలు నిర్వహించలేక చేతులెత్తేసిన సంస్థలు ప్రైవేట్‌ పరం చేస్తే ఎలా లాభాలు వస్తాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రైవేట్‌ కంపెనీలకు ఈ క్షేత్రాలను అప్పగించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంబిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేజీ బేసిన్‌ను రిలయెన్స్‌కు అప్పగించి అడిగినంత రేటు ఇస్తున్న ప్రభుత్వం.. ఈ కీలక నిర్ణయంతో మరోసారి సహజ సంపదను కార్పొరేట్ల పరం చేయబోతోంది.

 

 

07:24 - September 3, 2015

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. పోలవరం పూర్తయ్యే వరకూ నీటిని మళ్లించేందుకే పట్టిసీమ చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తే... కమీషన్ల వరద పారించేందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ప్రతిపక్షం విమర్శించింది. ఈ విధంగా అధికార, విపక్ష సభ్యులు వాదోపవాదాలతో సభను వేడెక్కించారు.
అధికార-విపక్షాలు సిగపట్లు...
పట్టిసీమ ప్రాజెక్టుపై అధికార విపక్షాలు సిగపట్లు పట్టాయి. పోలవరాన్ని పక్కన పెట్టేందుకు, లంచాలతో జేబులు నింపుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించారని వైసీపీ సభ్యులు ఆరోపించగా.. ఆ సంస్కృతి తమది కాదన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పట్టిసీమ ప్రాజెక్టును కేవలం ధనార్జన కోసమే చేపట్టారని వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగమూ లేదని అన్నారు. దీనిపై అధికార పార్టీ తీవ్రంగా స్పందించింది. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన చరిత్ర వైసీపీదేనని చంద్రబాబు ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా.. ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని అన్నారు. పట్టిసీమపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షం.. అసలు పట్టిసీమ ప్రాజెక్టుకు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో వైసీపీకి ఒక స్టాండ్‌ అంటూ లేకుండా పోయిందని విమర్శించారు. అయితే.. వైసీపీని దివాళాకోరు పార్టీ అనడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ తీరును తప్పుబట్టారు. రోజుకు మూడు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతోందన్న బుచ్చయ్య.. ఆ నీటిని ఒడిసిపట్టేందుకే పట్టిసీమ చేపడుతున్నామన్నారు.
'పట్టిసీమ'కు తాము వ్యతిరేకం కాదు : రోజా
అయితే.. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా.. పట్టిసీమ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అందులో జరిగే అవినీతికే తాము వ్యతిరేకమని చెప్పారు. మొత్తానికి.. పట్టిసీమపై చర్చ వాడీవేడిగా సాగింది. ఎవరి వాదనకు వారు కట్టుబడ్డ అధికార, విపక్ష సభ్యులు పైచేయి కోసం శతవిధాలా ప్రయత్నించారు.

 

07:18 - September 3, 2015

హైదరాబాద్ : గుడుంబా స్థానంలో చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో నిర్ణయాన్ని మార్చుకుని పాతపద్ధతిలోనే చీప్‌ లిక్కర్‌ను విక్రయించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గుడుంబా తయారు చేసేవారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుడుంబా అమ్మకాలపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్‌. ఇందుకు ఐజీస్థాయి అధికారిని నియమించనుంది .                                                                       
సర్కార్‌ నిర్ణయంపై ప్రజా వ్యతిరేకత
గుడుంబా నివారించాలనే పేరుతో గ్రామాల్లో 15 రూపాయలకే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కొత్త ఎక్సైజ్ పాలసీలో చేర్చాలని భావించింది. దీనికోసం బాటిళ్ళు డిజైన్‌తో పాటు వాటిని ప్రత్యేకంగా ఎలా అమ్మాలో, ఎంత ధరకు విక్రయించాలో కూడా ఆబ్కారీ అధికారులకు సూచనలు కూడా ఇచ్చారు. అయితే సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఉహించని ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇటీవల గ్రామజ్యోతి సందర్భంగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. మాహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విపక్షాలు, ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో..ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రులు తీవ్ర ఒత్తిడి చేయడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయమం తీసుకున్నారు.
అందోళనతో వెనక్కి తగ్గిన సర్కార్
చీప్‌ లిక్కర్‌ అమలుపై తొలుత ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తున్నప్పుడు ప్రజాభిప్రాయం అవసరంలేదని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే మంచిదని కొందరు సీనియర్ ఐఏఎస్‌ అధికారులు సీఎంకు సూచించారు. చౌకమద్యం ప్రవేశపెడితే..ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని మహిళలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అవకాశాలు ఎక్కువున్నాయని ఇంటలిజెన్స్‌ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనచేసి ఈ ఏడాదికి చూక మద్యం ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మొత్తానికి చౌక మద్యంపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

 

నేడు సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు

హైదరాబాద్ : నేడు సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. 

నేడు బాల్ నగర్ లో రైతు భరోసా యాత్ర

మహబూబ్ నగర్ : నేడు బాల్ నగర్ లో రైతు భరోసా యాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బచావో మిషన్ అధ్యక్షుడు నాగం జనార్థన్ రెడ్డి పాల్గొననున్నారు.

 

06:23 - September 3, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సిమ్‌కార్డుల వ్యవహారం ఏసీబీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ కేసుతో సంబంధమున్న సిమ్‌కార్డులను గుర్తించిన అధికారులు... ఆ కార్డుదారులకు నోటీసులిచ్చి విచారిస్తున్నారు. అయితే సిమ్‌కార్డులు ఒకరి పేరుపై ఉండగా.. ఆ ఫోన్‌ను ఉపయోగించేది మరొకరుగా విచారణలో బయటపడుతోంది. నిందితులు వ్యూహాత్మకంగా జిమ్మిక్కులు చేయడంతో కేసును ఎలా చేధించాలో తెలియక అధికారులు తంటాలు పడుతున్నారు.
ఓటుకు నోటు కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు అరెస్ట్‌
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు.. మరో ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇందుకు న్యాయపరమైన సాంకేతిక కారణాలు అడ్డుపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ఉపయోగించిన సెల్‌ఫోన్‌ ఆధారాలు సేకరించిన ఏసీబీకి షాక్‌ తగిలింది. సిమ్‌కార్డు తీసుకునేందుకు ఇచ్చిన ఐడీ ప్రూఫ్‌ వేరే వ్యక్తి పేరుపై ఉండడంతో ఏమీ చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు అధికారులు.
ప్రదీప్‌ అనే వ్యక్తిని విచారించిన ఏసీబీ
ఇక ఇలాంటి తరుణంలో ప్రదీప్‌ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చి విచారించినప్పటికీ ఏసీబీకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైగా తన పేరుపై ఉన్న సిమ్‌ గురించి తెలియదని ప్రదీప్‌ తెలిపాడు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. మరో ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వాలనుకున్న అధికారుల యత్నాలకు బ్రేక్‌ పడింది. విచారణలో ఎవరూ కూడా ఆ ఎమ్మెల్యే పేరు చెప్పకపోవడంతో కేసు నత్తనడకన కొనసాగుతోంది.
కరీంనగర్‌కు చెందిన రైతుకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు
మరోవైపు కరీంనగర్‌కు చెందిన ఓ రైతుకు ఏసీబీ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఈ సిమ్‌కార్డు రైతు పోగొట్టుకోవడంతో.. వేరేవాళ్లు దీన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. గతంలో ఉగ్రవాదులు మాత్రమే ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడడంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కానీ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, గల్లీలీడర్లు కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈ వ్యవహారంతో బయటపడింది. మరి ఏసీబీ అధికారులు ఈ జిమ్మిక్కులను ఏలా చేదిస్తారో చూడాలి.

 

Don't Miss