Activities calendar

04 September 2015

21:48 - September 4, 2015

హైదరాబాద్ :ఢిల్లీ వాసంత్ కుంజ్‌లోని మధ్యాంచల్ భవన్‌లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మేధో మధనంపై దేశవ్యాప్తంగా అందరి దృష్టినెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కీలక శాఖల మంత్రులు, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొనడమే ఇంతటి ఆసక్తికి కారణం. నరేంద్ర మోదీ సర్కారు ఏడాదిన్నర పాలనపై ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్‌ తో పాటు కీలక నేతలు కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. ప్రభుత్వ విధానాలు, పథకాలు, దేశ భద్రత, ప్రజా సమస్యలు, రామమందిరం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, గంగా ప్రక్షాళన, కశ్మీర్ పండిట్ల పునరావాసం సహా అనేక అంశాలపై ప్రభుత్వ పెద్దలతో ఆరెస్సెస్ అగ్రనాయకులు చర్చించినట్టు సమాచారం. తమతమ శాఖల రిపోర్టులను కొందరు మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు తెలుస్తోంది.

నరేంద్ర మోదీ పాలనపై ఆరెస్సెస్ పెద్దల సంతృప్తి.....

నరేంద్ర మోదీ పాలనపై ఆరెస్సెస్ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యావ్యవస్థలో భారతీయత సంబంధించిన అంశాలు చేర్చాలని సూచించినట్టు సమాచారం. అంతేకాదు మాజీ సైనికుల ఓఆర్ఓపి సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పినట్టు తెలుస్తోంది. పార్లమెంటును స్తంభింపజేస్తున్న కాంగ్రెస్, విపక్షాలను కట్టడి చేయాలని నిర్దేశించింది

ఆరెస్సెస్ తో ప్రధాని, కేంద్రమంత్రుల సమావేశం రాజ్యాంగ విరుద్దం...కాంగ్రెస్

మరోవైపు ఆరెస్సెస్ తో ప్రధాని, కేంద్రమంత్రుల సమావేశం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆరెస్సెస్ చెప్పినట్టు, బీజేపీ పాలకులు ఆడుతున్నారన్న విషయం ఈ మీటింగ్‌ తో మరోసారి తేటతెల్లమైందని ఆరోపించింది. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు ఆరెస్సెస్ నేతలు. తాము కూడా దేశ పౌరులేమనని, మంత్రులు మీడియాతో మాట్లాడినట్టు తమతోనూ అనేక విషయాలు పంచుకున్నారని సమర్థించుకున్నారు.

21:45 - September 4, 2015

హైదరాబాద్ : భాగ్యనగరంలో శ్రీ కృష్ణాష్టమి సంబరాలు మిన్నంటాయి. గాంధీనగర్‌లోని బచ్‌పన్ స్కూల్‌ విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారులు డాన్స్‌లు చేస్తూ ఆకట్టుకున్నారు. 

21:44 - September 4, 2015

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కొవ్వూరులో అన్నదమ్ముల ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. వేర్వేరు సమయాల్లో గోదావరి వంతెనపై నుంచి దూకి... కోనా శ్రీధర్‌, మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. మొదట బ్రిడ్జిపై నుంచి దూకి కోనా శ్రీధర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో శ్రీధర్ సోదరుడు మహేంద్ర కూడా బ్రిడ్జిపై దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

21:42 - September 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీతో అర్చకులు సమ్మె విరమించారు. ఈ నెల 15లోగా అర్చకుల సమస్యలు పరిశీలించి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అర్చకుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.                                                                   

చట్టానికి లోబడి అర్చకుల డిమాండ్లను నెరవేరుస్తాం - ఇంద్రకరణ్‌

దీంతో గత 11 రోజులుగా హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద చేస్తున్న అర్చకుల రిలే నిరాహార దీక్షలను విరమించారు. అర్చక ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టానికి లోబడి అర్చకుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పారు. అర్చకుల గౌరవానికి భంగం కలగనీయమని అర్చకులంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఎనలేని గౌరవమని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు.

ట్రెజరీ ద్వారా జీతాలు వేయాలనేది అర్చకుల ప్రధాన డిమాండ్

ట్రెజరీ ద్వారా జీతాలు వేయాలనేది అర్చకుల ప్రధాన డిమాండ్..దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు, హెల్త్ కార్డుల జారీలోనూ అర్చకులకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. జీవో రూపంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని అర్చకులు డిమాండ్‌ చేశారు. అయితే మంత్రి మాత్రం వీలయితే మరో జీవో ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.

హామీ నెరవేర్చకపోతే మరోసారి ఆందోళనలు..

ఈ సందర్భంగా మంత్రి యాదాద్రిని మరో తిరుపతిలా తయారు చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే అర్చకులు మాత్రం ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేదని, ఈ నెల 15 వ తేదీ తర్వాత మరో సారి నిరసనలు ఆందోళనలు చేపడతామని అర్చకులు మంత్రికి స్పష్టం చేశారు.

21:40 - September 4, 2015

హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో... ఏపీకి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు మంత్రి గంటా. హైకోర్టు తీర్పుతోనైనా అడ్మిషన్లకు సహకరించాలని... తెలంగాణ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చివరకు సిలబస్ విషయంలోనూ టీ-సర్కార్ రాద్ధాంతం చేస్తోందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:38 - September 4, 2015

మహబూబ్ నగర్ : బల్లలు విరిగాయి.. చెంపలు ఛెళ్లుమన్నాయి.. ఒకరినొకరు తోసేసుకున్నారు.. రక్కేసుకున్నారు.. తన్నుకున్నారు. ఇవన్నీ ఏ వీధిరౌడీల గొడవలోనో ఆకతాయి కుర్రాళ్ల ఫైట్‌ లోనో చోటుచేసుకున్న సంఘటనలు కాదు . సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరి మధ్య జరిగిన సీన్‌ ఇది. ఈ సంఘటనలన్నింటికీ మహబూబ్‌ నగర్‌ జడ్పీ సమావేశం వేదికయ్యింది. ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచిపోయి మరీ రెచ్చిపోయారు. ఇక్కడ చెంప ఛెళ్లు మనిపిస్తోంది మరెవరో కాదు సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే . ఆగ్రహంతో ఊగిపోతూ ఎక్కడ ఉన్నామన్న సంగతి సైతం మరిచిపోయి రెచ్చిపోయారు. ఈ సంఘటన జరిగింది మరెక్కడో కాదు మహబూబ్‌నగర్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలోని సీన్లు.

కరువు జిల్లాగా ప్రకటించాలంటూ జెడ్పీ సమావేశంలో.....

మహబూబ్ నగర్ ను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ జెడ్పీటీసీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన ఆటంకాలపై మాట్లాడాలని రాజేంద్ర రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు.

ఆగ్రహించిన రాజేంద్రరెడ్డి ...

దాంతో ఆగ్రహించిన రాజేంద్రరెడ్డి ... నేను ఏం మాట్లాడాలో మంత్రి ఎలా డిక్టేట్ చేస్తారంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దాంతో ఇటు టీడీపీ... అటు టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు జడ్పీ ఛైర్మన్ పోడియం వైపు దూసుకువెళ్లారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం..

అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తాను మాట్లాడేందుకు మైక్ ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలరాజు, రామ్మోహన్‌రెడ్డిల మధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జడ్పీ ఛైర్మన్ అదుపుచేయాలని ఎంతగా ప్రయత్నించినా ఉద్రిక్తత తగ్గలేదు. ఓ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే బాలరాజు జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

తోపులాటలో ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలు...

ఇది ఇలా ఉండగా, తోపులాటలో ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు ఎమ్మెల్యేలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

బీసీ జాబితా నుండి26 కులాలను తొలగింపు సబబే..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీల జాబితా నుంచి 26 కులాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో ఉనికిలో లేని కులాలను బీసీల జాబితా నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈమేరకు ఇవాళ తీర్పు చెప్పింది.

20:57 - September 4, 2015

హైదరాబాద్ : ఒక హత్యతో కొన్ని నిజాలు కప్పి పెట్టాలనుకున్నారు. కానీ సరికొత్త సమస్యలను సృష్టించారు. ఒక హత్యతో ఉన్న సమస్య నుండి బయట పడాలనుకున్నారు.కానీ సరికొత్త రహస్యాలను సృష్టించారు. చివరికి చట్టం ముందు నేరస్తులుగా నిలిచారు. ఏ హత్య వెనుక ఎవరి ప్రోద్భలం, ఎవరి ప్రయోజనం ఉందో.. ఏ చావు వెనుక ఏ మిస్టిరీ ఉందో ఈ ప్రపంచానికి ఎప్పుడూ ఆసక్తి కరమే. చావు, హత్య ఇవి ప్రజలను భయపెడుతూనే ఆసక్తికల్గించే అంశాలు. ఈ క్రమంలో గుట్టు వీడని మిస్టరీలను, హత్యల వెనుక దాగిన హిస్టరీని నేటి వైడాలింగ్ లో చూద్దాం. మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

తెలంగాణ లో ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య

హైదరాబాద్ : ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దొనబండలో పురుగుల మందుతాగి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలో మిర్చి, పత్తిపంటలు ఎండిపోయాయనే ఆవేదనంతో ఈ బలవన్మరణానికి పాల్పడాడడు. రంగారెడ్డి జిల్లాబషీరాబాద్ మండలం జీవంగిలో అప్పుల బాధతో మరో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏఎన్ యూలో మరోసారి ర్యాగింగ్ కలకలం

గుంటూరు : నాగార్జున వర్శిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంబీఏ చదువుతున్న సీనియర్ విద్యార్థిని పై జూనియర్ విద్యార్థి హరగోపాల్ ర్యాగింగ్ కు పాల్పడ్డాడు. అప్రమత్తమైన యూనివర్శిటీ అధికారులు హరగోపాల్ ను సస్పెండ్ చేశారు.

గుప్పెడు మెతుకుల కోసం కిడ్నాప్

హైదరాబాద్ : గుప్పెడు మెతుకుల కోసం కిడ్నాప్ చేశారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతంలోని ఘటాంబ్రి ప్రాంతంలో ముగ్గురు రైతులు సుదమ్ సురద్ కర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతని టిఫిన్ బాక్సును ఆబగా తినేశారు. ముగ్గురికీ ఒక్క టిఫిన్ బాక్సు సరిపోకపోవడంతో వెంటనే అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, భోజనం పంపిస్తే కానీ అతనిని విడిచిపెట్టమని బెదిరించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు భోజనం పంపారు. భోజనం తీసుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు సురద్ కర్ ను విడిచిపెట్టారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు, ఆ ముగ్గురు ఎవరు? అనేదానిపై ఆరాతీస్తున్నారు.

ఏసీబీ వలలో నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్

హైదరాబాద్ : నిమాజాబాద్ జిల్లా రిజిస్ట్రార్ మోహన్ అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

19:52 - September 4, 2015

హైదరాబాద్ : గుజరాత్ లో పటేళ్ల ఆందోళనతో రిజర్వేషన్ల పై మళ్లీ రగడ మొదలైంది. పటేళ్ల ఆందోళన సామాజిక న్యాయం కోసమా.. ఆధిపత్యం కోసమా? దానికున్న పరిమితులేమిటి.... ఫలితాలు ఎలా ఉన్నాయి? పటేళ్ల ఆందోళనకు మోదీ గుజరాత్ మోడల్ కారణమా? రిజర్వేషన్లు లేని ప్రైవేటు అగ్రకులాలను ఎందుకు ఉపాధి కల్పించకలేకపోతోంది? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గడమే కారణమా? ప్రైవేటు రంగంలో లాభాల ఆలోచనలే తప్ప పూర్తి స్థాయిలో ఉపాధి చూపలేకపోతున్నాయా? ఇలాంటి అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హరిశ్చంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నేత వకుళాభరణం రామకృష్ణ, సీపీఎం నేత వి. శ్రీనివాసరావు,సీనియర్ విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ముగిసిన చిన్నారి అయ్‌లాన్ కుర్ది అంత్యక్రియలు

హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో సంక్షోభిత ప్రాంతంగా మారిన సిరియా నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్తూ పడవ ప్రమాదంలో మరణించిన చిన్నారి అయ్‌లాన్ కుర్ది అంత్యక్రియలు ముగిశాయి. సొంత ఊరు కొబానీలో అంత్యక్రియలు నిర్వహించారు. పడవ మునిగి మరణించిన వారిలో మూడు సంవత్సరాల అయ్‌లాన్ కుర్దీతో పాటు ఐదేళ్ల వయసున్న అతడి సోదరుడు గాలిబ్ కుర్దీ, అతడి అమ్మ రెహాన్ కూడా ఉన్నారు. వీరందరి మృతదేహాలను కొబానీకి శవపేటికలల్లో తీసుకొచ్చారు. అయ్‌లాన్ మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో అతడి తండ్రి అబ్దుల్లా కుర్దీ దు:ఖంతో కుమిలిపోయారు. కన్నీరు వరదలా ప్రవహించింది.

ఢిల్లీలో ఉచిత అంబులెన్స్ సేవలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఉచిత అంబులెన్స్ సేవలను ఆ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం విప్రో సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఢిల్లీ ప్రభుత్వం ఆధునిక కంట్రోల్ రూంతో ‘ హోమ్ టు హాస్పిటల్ కేర్’ పథకం పేరుతో వైద్య సేవలు కొనసాగించనుంది. ఇందుకోసం 110 అత్యాధునికమైన అంబులెన్స్‌లను ప్రభుత్వం వినియోగించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.13.90 కోట్లు ఖర్చవుతుందని.. అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యతలను విప్రో చూసుకుంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఏపీలో పైలెట్ ప్రాజెక్ట్ లుగా మూడు నగరాలు..

గుంటూరు :మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ విభాగం ప్రక్షాళనపై దృష్టి సారిస్తామని  పట్టణ ప్రణాళిక డైరెక్టర్ రఘు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 1 నుంచి ఇంటి ప్లాన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చున్నారు.పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు, విజయవాడ, విశాఖ పట్టణాలను ఎంపిక చేశామని ఆయన తెలిపారు.

గుంటూరు జిల్లాలో మావోయిస్టుల కలకలం

గుంటూరు : జిల్లాలోని దుర్గిలో మావోయిస్టుల పేరుతో వెలిసిన వాల్‌పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు లంచాలకు అలవాటు పడి కళాశాలల్లో ర్యాగింగ్‌ను పట్టించుకోవడం లేదని మావోయిస్టుల అతికించిన పోస్టర్లలో ఆరోపించారు. పోలీసులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని మావోయిస్టులు హెచ్చరించారు.

గంగిరెడ్డిని త్వరలోనే రప్పిస్తాం: డిజీపీ రాముడు

తిరుమల : అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని త్వరలోనే ఏపీకి రప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు అన్నారు. శుక్రవారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగానే ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తున్న సిరంజి సైకోను త్వరలో పట్టుకుంటామన్నారు. సాధ్యమైనంత త్వరలో విజయవాడ నుంచి పాలన వుంటుందని చెప్పారు. త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అదనపు బలగాలు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ఏపీ పోలీసులను పంపుతామని చెప్పారు.

ఫైనాన్స్ వ్యాపారి తోట ఫణీంద్ర దారుణ హత్య

తూ.గో : ముమ్మిడివరం మండలం గాడిలంకలో గల నెల 25న అదృశ్యమైన ఫైనాన్స్ వ్యాపారి తోట ఫణీంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినందుకు కుంచె శ్రీను అనే వ్యక్తి ఫణీంద్రను హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో దాచినట్లు పోలీసుల విచారణ లో వెల్లడించారు.

గోదావరి నదిలోకి దూకి ఇద్దరు యువకుల ఆత్మహత్య..

ప.గో : కొవ్వూరులో రోడ్ కం రైలు బ్రిడ్జి పై నుంచి గోదావరి నదిలోకి దూకి ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చర్లపల్లి జైలు వద్ద ఖైదీల స్టాల్..

కుషాయిగూడ : చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌లో సబ్బులు, ఫినాయిల్, కాటన్ వస్త్రాలు, కుర్చీలు, చెప్పుల స్టాండ్‌లను ఉంచి విక్రయిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు జైలు అధికారులు ఉత్పత్తుల విక్రయానికి పూనుకున్నారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే ఖైదీల బంధువులతో పాటు ఆ మార్గంలో వచ్చేవారు స్టాల్‌లోని వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన మత్స్యకారులు..

నెల్లూరు : పోలీసుల అదుపులోఉన్న తమ వారిని విడుదల చేయాలని నెలటూరుపాలెం మత్స్యకారులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.నెల్లూరు జిల్లా నెలటూరుపాలెంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మత్స్యకారుల ఆందోళనకు బీజేపీనేత సురేష్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఎన్‌సీసీ కంపెనీ ఫిర్యాదు మేరకు పలువురి మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.

తెలంగాణ లో సమ్మె విరమించిన అర్చక సమాఖ్య

హైదరాబాద్ : దేవదాయకశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీతో అర్చకులు సమ్మె విరమించారు. అర్చకుల సమసమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని మంత్రి తెలిపారు. ఈనెల 15 లోగా అర్చకుల సమస్యలు పరిశీలించి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

చెక్‌బౌన్స్ కేసులో మానుకోట డీఎస్పీ జైలు శిక్ష

మహబూబాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో మానుకోట డీఎస్పీ నాగరాజుకు రంగారెడ్డి జిల్లా కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌లో ఓ ప్లాటు కొనుగోలుకు సంబంధించి నాగరాజు ఓ వ్యక్తికి కొంత నగదును అడ్వాన్స్‌గా చెల్లించడంతోపాటు మిగతా సొమ్ముకు చెక్ అందజేశారు. అయితే, చెక్ బ్యాంక్‌లో బౌన్స్ కావడంతో సదరు బిల్డర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో చెక్‌బౌన్స్ కేసు విషయంలో వాదోపవాదాలు విన్న మీదట నాగరాజుకు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

అక్టోబర్ రెండో వారంలో బీహార్ ఎన్నికలు?

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ రెండో వారంలో జరిగే అవకాశముంది. వచ్చేవారం ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని తెలిసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు జరిపింది. సమావేశంలో ఎన్నికల తేదీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల ఏర్పాట్లకు సమయం తదితర అంశాలపై చర్చ జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉండటంతో ఐదు విడతలుగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.

17:55 - September 4, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. బ్యాంకర్లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో బ్యాంక్‌ల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్న బ్యాంకులు రుణమాఫీ చేయకపోగా.... వడ్డీలు వసూలు చేస్తున్నాయని పోచారం అన్నారు. కొత్త రుణాల మంజూరుకు ముందుకు రావాలంటూ బ్యాంకర్లకు వ్యవసాయమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కొత్త రుణాలు 30 శాతం కూడా ఇవ్వలేదని పోచారం తెలిపారు.

17:53 - September 4, 2015

హైదరాబాద్: ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం సాగదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలబడదు అనేది తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ పదే పదే చెప్పిన మాట. కానీ ఇపుడు తెలంగాణలో ప్రకృతి కరుణించక ప్రభుత్వం పట్టించుకోక అన్నదాతలు.. కంటికి పుట్టెడు శోకం పెడుతున్నారు.

అచేతనంగా రైతులు...

అవును.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతున్నల పరిస్థితి అచేతనంగా మారింది. ఉరితాడు, పురుగు మందులే శరణ్యం అనుకునే దీనస్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలి కేకలు, అప్పుల బాధలతో రోజురోజుకి రైతుల వరుస ఆత్మహత్యలు పెరిగిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

గడిచిన మూడు సీజన్లలోను రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో....

గడిచిన మూడు సీజన్లలోను రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో కాలువల్లో చుక్కునీరు లేదు. ప్రాజెక్టుల్లో తగిన నీటి నిల్వలు లేవు. పైరులు బీటలు వారితే.. అరకొరగా వేసిన పంట కాస్త చేతికొచ్చిన సమయంలో నీరందక.. తడిలేక ఎండిపోయే పరిస్థితి. ఇటు చేతినిండా పనిలేక.. మరో ఉపాధి లేక పంటలకు తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండంత పెరిగిపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

సుమారు వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు....

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయి. గడిచిన నెల రోజుల్లో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 25 మంది రైతులు ఆత్మహత్యు చేసుకున్నారు. గురువారం ఒక్కరోజే జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ నెలలో కురిసిన వర్షాలే తప్ప జూలై నెలలో చినుకు పలకరింపు లేదు. ఆగస్టు నెలలో అడపాదడపా అక్కడడక్కడ వర్షాలు కురిసినా అప్పటికే చేలు ఎదుగుదల సామర్థ్యాన్ని కోల్పోయాయి. వరినాట్లు వేద్దామన్నా వరి సాగుకు కావాల్సిన నీరు లేని పరిస్థితి. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రమంతటా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.

57 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు...

మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 57 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్ జిల్లాలో 17 మండలాలు, నల్లగొండలో 20, కరీంనగర్ జిల్లాలో 49 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 278 మండలాల్లో కరువు నెలకొంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కరువు మండలాల ప్రకటన ఊసే ఎత్తడం లేదు.

ఆత్మహత్యలతో రాష్ట్రం తల్లడిల్లుతున్నా..

వరుసగా ఆత్మహత్యలతో రాష్ట్రం తల్లడిల్లుతున్నా.. గద్దెనెక్కిన పాలకులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ అంత చేస్తాం.. ఇంత చేస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం వాటిపై రోజుకో ప్రకటనలతో దాటవేస్తూ.. రైతులను మభ్యపెడుతోంది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే సర్కారు.. రైతు మరణాలపై స్పందించేందుకు తీరికే లేకుండా పోయింది. ఇప్పటికైనా.. ప్రభుత్వం, పాలకులు స్పందించి కరువు కోరల్లో చిక్కుకుని నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ.. ఉరికొయ్యల వైపు దీనంగా ఎదురుచూస్తున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం : ఆర్ ఎస్ ఎస్

ఢిల్లీ : గత మూడు రోజుల పాటు కొనసాగిన ఆర్ ఎస్ ఎస్ సమావేశాలు ముగిశాయి. చివరి రోజు సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ నేత హౌసబలే మాట్లాడుతూ... రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, దీనికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ సమైక్యత, భద్రత, ఇతర సామాజిక అంశాలపై సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం రామమందిర నిర్మాణం, వన్ పెన్షన్, వన్ ర్యాంక్ పై కసరత్తు చేస్తోందని స్పష్టం చేశారు.

ఓయూ సైన్స్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : ఓయూలో సైన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెండోసారి పీజీ చేసే విద్యార్థులకు హాస్టల్ లో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో ఓయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ ను ధ్వంసం చేశారు. అంతే కాకుండా ప్రిన్సిపల్ నర్సింగరావుతో విద్యార్థులు వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటలో ప్రిన్సిపల్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగ ప్రవేశ చేసిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో పలు చోట్ల వర్షం..

హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, విద్యానగర్, తార్నాక, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం...

రంగారెడ్డి : ఓ మతిస్థిమితం లేని బాలికపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని అచ్యుతాపురం నివాసి అయిన ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

హోంగార్డులు, విలేకరులకు రూ.లక్షల బీమా: నాయిని

హైదరాబాద్ : కార్మిక బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని హోంగార్డులు, విలేకరులకు రూ. 5 లక్షల బీమా కల్పించామని తెలంగాణ హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. శుక్రవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక బీమాపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. 18 నుంచి 70 సంవత్సరాల వారికి బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

ఐసీయూలో చిన్నారి ముక్కు కొరికిన ఎలుక

హైదరాబాద్ : గుంటూరు జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృత్యువాత పడ్డ ఘటనను మరువక ముందే అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒకటిన్నర నెల వయసున్న పసికందు ముక్కను ఓ ఎలుక కొరికేసింది. ఈ ఘటన ధార్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో, ఐసీయూలో ఉన్న ఆ పిల్లాడి ముక్కును ఎలుక కొరికేసింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేశారు.

కొట్టుకున్న పాలమూరు ఎమ్మెల్యేలు...

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడటంతో వివాదం మొదలైంది. అయితే తర్వాత కాసేపటికి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూ శరం లేవని వ్యాఖ్యానించడంతో వివాదం కాస్తా తారస్థాయికి చేరుకుంది. ఓ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే బాలరాజు జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు.

త్వరలో కొత్త రెవెన్యూ పాలసీ : డిప్యూటీ సీఎం

నల్లగొండ : త్వరలోనే కొత్త రెవెన్యూ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం మహమ్ముద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇండియాలోనే సీఎం కేసీఆర్ పని తీరుపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.

16:42 - September 4, 2015

శ్రీకాకుళం : రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారింది.. కృష్ణాష్ఠమి చందాలపై రాజాంపట్టణంలో యాదవ కాలనీకిచెందిన రెండు గ్రూపులు సమావేశమయ్యాయి.. వీటి వసూలుపై భేదాభిప్రాయాలు రావడంతో ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకును్నారు.. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించారు.. గ్రామంలో గట్టి భద్రత ఏర్పాటుచేశారు.. 

16:41 - September 4, 2015

అనంతపురం: హిందూపురంలో ఓ చిన్నారిని మాజీ సైనికోద్యోగి.. చిత్ర హింసలు పెడుతున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఓ మహిళ భర్తను వదిలేసి రెండు నెలలుగా ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమెతో మాజీ సైనిక ఉద్యోగి తిప్పేస్వామి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ కూతురు కారుణ్య.. వారి బంధానికి అడ్డు వస్తుందని చిత్రహింసలకు గురిస్తున్నాడు తిప్పేస్వామి. సిగిరెట్‌తో కాల్చడం, బెల్టుతో కొట్టడంతో చిన్నారి శరీరం కందిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేసి.. బాలికను, తల్లిని స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

16:39 - September 4, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ నిరుద్యోగ సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు దగ్గరే నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ వెలువడే వరకు తాము ఉద్యమం కొనసాగిస్తామని, చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరించారు. 

16:38 - September 4, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. పాలమూర్‌ ఎత్తిపోతల పథకంపై టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. కరువు జిల్లాగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌, టీడీపీ నేతలు జడ్పీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రసంగంను టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అడ్డుకున్నారు. 

పోచమ్మగడ్డతండాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

మహబూబ్ నగర్ : వరుస కరువుతో వేసిన పంట ఎండిపోవడంతో ఓరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండమండలం పోచమ్మగడ్డతండాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలో పోచమ్మగడ్డతండాకు చెందిన లచ్చిరాంనాయక్‌కు వ్యవసాయమే జీవనాధారం. అయితే పంట దిగుబడి సరిగా లేక పోవడం, చేసిన అప్పులు తీరే మార్గం లేక పోవడంతో లచ్చిరాంనాయక్ ఉరేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

శృంగార తార సన్నీలియోన్ కు బాసటగా శిల్పా శెట్టి

హైదరాబాద్ : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. శృంగార తార సన్నీలియోన్ కు బాసటగా నిలిచారు. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 'మ్యాన్ ఫోర్స్' కండోమ్ లో సన్నీ లియోన్ నటన యువతను రెచ్చగొట్టేలా ఉందని, ఆ యాడ్ అత్యాచారాలను ప్రేరేపించేదిగా ఉందని సీపీఐ ఎంపీ అతుల్ కుమార్ అంజాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సన్నీలియోన్ మాట్లాడుతూ, తనపై విమర్శలు చేస్తూ శక్తి వృథా చేసుకోకుండా, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని రిటార్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో సన్నీ లియోన్ కి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బాసటగా నిలిచింది.

వరంగల్ లో పోటీచేసేందుకు గద్దర్ సుముఖం :తమ్మినేని

నిజామాబాద్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీచేసేందుకు గద్దర్ సుముఖంగానే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వరంగల్ ఉపఎన్నికలో ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. గద్దర్ వరంగల్ స్థానానికి పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్, బీజేపీ, నేతలు చెప్పారని తమ్మినేని తెలిపారు.

విద్యుత్ కనెక్షన్లు కట్ .. రోడ్డెక్కిన అన్నదాతలు..

నల్గొండ: కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని త్రిపురారం మండలం రైతులు శుక్రవారం మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. బిల్లులు చెల్లించలేదని సత్యనారయణపురం, పనసాయి క్యాంప్, ఇండ్లకోటయ్యగూడెం, నారమ్మగూడకు చెందిన రైతుల విద్యుత్ కనెక్షన్లకు ఉన్న జంపర్లను తొలగించారు. ఎలాంటి హెచ్చరిక లేకండా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.

రేపు తెలుగు రాష్ట్రాల్లో మూత పడనున్న సెల్ ఫోన్ షాపులు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు సెల్ ఫోన్ షాప్ లు మూతపడనున్నాయి. సెల్ ఫోన్ కంపెనీల అనైతిక చర్యలకు నిరసనగా తెలుగు సెల్యులార్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దాంతో రెండు రాష్ట్రాల్లోని ఆరువేల సెల్ ఫోన్ షాప్ లను మూసివేస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ బంద్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

15:47 - September 4, 2015

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్ మరోసారి భారీగా పతనమైంది. దేశీయంగా సెంటిమెంట్ పాజిటివ్ గా కనిపించకపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, వీకెండ్ ప్రభావంతో.. ఇన్వెస్టర్లు ఉదయం నుంచే భారీగా అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 571 పాయింట్లు పతనమైంది. అటు నిఫ్టి 175 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఆటోమోబైల్, క్యాపిటల్ గూడ్స్ విభాగాల్లో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిఫ్టిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, వేదాంతా, టాటా పవర్ షేర్లు 4శాతానికిపైగా నష్టపోయాయి. 

15:45 - September 4, 2015

నిజామాబాద్ : ప్రపంచ, దేశ ఆర్థిక పరిస్థితిపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో జిల్లాలో ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన ఆయన.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రోజుకో హామీలు.. పూటకో ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతున్నారని రాఘవులు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో మూడ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల తొలిరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం ప్రారంభించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు పార్టీ నేతలకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

15:42 - September 4, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు అంశాన్ని లేవనెత్తుతే టీడీపీకి ఎందుకంత ఉలికిపాటు అని వైసీపీ సభ్యురాలు రోజా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.... కోర్టు పరిధిలో ఉన్న కేసును సభలో చర్చించరాదని స్పీకర్‌ అంటున్నారని.. జగన్‌పై బనాయించిన కేసుల గురించి రోజూ టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.

 

15:39 - September 4, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారం కేసీఆర్‌, జగన్‌ చేసిన కుట్ర అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈ వ్యవహారంలో జగన్‌కు, కేసీఆర్‌కు మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయడానికి సాక్షాలు ఉన్నాయని అన్నారు. వైసీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కాల్వ మండిపడ్డారు.

 

15:37 - September 4, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభా సమావేశాలు 5 రోజులే నిర్వహించడం దారుణమన్నారు. చివరి రోజున ఓటుకు కోట్లుపై చర్చకు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఐదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..

హైదరాబాద్ : లంగర్‌హౌజ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. ఐదో తరగతి విద్యార్థి కనిష్క్ యాదవ్‌ను ఉపాధ్యాయుడు సుధీర్ చితకబాదాడు. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గోల్కోండ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు సుధీర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు లంగర్‌హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల మధ్య ట్రేడ్ అవుతుఆన్నయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

5లక్షల పరిహారాన్ని ఇవ్వాలి: కోదండరాం

మెదక్ :ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులన్నీ రీడిజైన్‌ చేయాలని సూచించారు. అప్పుల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరాం అన్నారు. పార్టీలకతీతంగా రైతులకు అండగా నిలుద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.

కవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి కన్నుమూత

హైదరాబాద్: కవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు, సమాజాన్ని మేల్కొల్పేందుకు బిక్షపతి అనేక పాటలు రాసి పాడారు.

15:00 - September 4, 2015

హైదరాబాద్: మహిళల ఆల్ టైం ఫేవరేట్ డ్రెస్సింగ్ సారీ. ఎలాంటి సందర్భానికైనా ప్రత్యేక ఆకర్షణగా కన్పించే సారీస్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ను మీ ముందుకు తెచ్చే 'సొగసు' ఇవాళ దిల్ షుక్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ శారీస్ వద్దకు వచ్చింది. అవేంటో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

14:57 - September 4, 2015

హైదరాబాద్ : కల్లాకపటం తెలియని చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. కుటుంబ సభ్యులు, బంధువులే ఈ దాడులకు ఒడిగట్టి వారి బంగారు భవితను చిదిమేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దాడులకు గురైన పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది? పెద్దలు పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలేమిటి? అంశాలపై సైకియాట్రిస్ట్ సలహాలను ఇవాళ్టి 'నిర్భయ'లో డాక్టర్ పూర్ణిమా నాగరాజు వివరించారు.. మరి వారు ఏఏ అంశాలపై మాట్లాడారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:55 - September 4, 2015

హైదరాబాద్ : మహిళలను సెకండ్ జెండర్ గా పరిగణించే సౌదీ అరేబియాలో మహిళలకు కొత్త హక్కులు కల్పించాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కునే ఈ సమాజంలో మహిళలను స్థానిక పాలనలో భాగస్వామ్యులుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పోషకాహార వారోత్సవాలు......

ఒకవైపు పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నవజాత శిశువులకు తల్లి పాలు అందటం లేదనే వాస్తవాన్ని వెల్లడించింది ఒక అధ్యయనం. అందుకు సంబంధించి అనేక అపోహలతో భారతీయ తల్లులు వెనకబడి ఉన్నారంటోంది ఈ నివేదిక.

మహిళల జీవితంలో గర్భధారణ, ప్రసవం కీలక దశలు.....

మహిళల జీవితంలో గర్భధారణ, ప్రసవం కీలక దశలు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ దశ ఎంతో దుర్భరంగా ఉంటోంది. అందుకే వారి కోసం ప్రసూతి సెలవుల సౌకర్యాన్ని కల్పించినప్పటికీ ప్రస్తుతం అమలులో ఉన్న సెలవులు సంతృప్తికరంగా లేవన్నది వాస్తవం. ఈ స్థితిని అధిగమించేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకురావటం ఆహ్వానించదగిన పరిణామం.

మహిళల భద్రత కోసం చట్టాల రూపకల్పన....

పనిప్రదేశాలలో మహిళల భద్రత కోసం చట్టాల రూపకల్పన జరుగుతోంది. కానీ ఈ చట్టాల అమలులో మాత్రం అలసత్వమే కనిపిస్తోందని మరో అధ్యయనం తేల్చి చెప్పింది.

14:52 - September 4, 2015

హైదరాబాద్ : కూకట్‌పల్లి కమలప్రసన్న నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే రెండు రోజులుగా ఇంట్లోనే అపస్మారక స్థితిలో బాలుడు పడివున్నాడు. 

14:50 - September 4, 2015

హైదరాబాద్ : ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్సార్‌ చిత్రపటాన్ని అతికించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని టీడీపీ సభ్యురాలు అనిత ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టారు. ఇరువురి నోటీసులపై స్పందించిన స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి సిఫార్స్‌ చేస్తామని... కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

14:46 - September 4, 2015

ఖమ్మం : ఇల్లెందు మండలం సుభాష్‌నగర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న బిఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న సంధ్యను లారీ కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు తీవ్రంగా గాయమై, షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన సంధ్య నుండి ప్రమాదం జరగడానికి గలకారణాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

14:43 - September 4, 2015

హైదరాబాద్ : అంతకు ముందు ఉదయం సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అవినీతి గురించి జగన్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అచ్చెంనాయుడు విమర్శించారు. ఓటుకు నోటు అంశంపై అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని కేసీఆర్‌ జగన్‌కు ఫోన్‌ చేసి మరీ అడిగారని ఆరోపించారు. అందుకు కౌంటర్‌గా జగన్‌ స్పందిస్తూ.. కేసీఆర్‌ నాకు ఫోన్‌ చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని.. లేనిపక్షంలో చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. వాయిదా తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగానే.. కేవీపీకి సభా హక్కుల నోటీస్‌ను టీడీపీ ప్రవేశపెట్టింది. స్పీకర్‌కు రాసిన లేఖలో ఆయన స్థానాన్ని కించపరిచారంటూ నోటీస్‌లో ఆరోపించింది.  

14:41 - September 4, 2015

హైదరాబాద్ : ఏపీ శాసనసభ వర్షకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజులపాటు కొనసాగిన సమావేశాల్లో 9 బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం 20 గంటల 39 నిమిషాలపాటు సమావేశాలు కొనసాగాయి. మరోవైపు ఓటుకు నోటు అంశంపై చర్చ జరగాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళనలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరవధిక వాయిదా వేశారు. 

కేసీఆర్ కు కేంద్ర బలగాల భదత్రను తొలగింపు

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు కల్పిస్తున్న కేంద్ర బలగాల భద్రతను తొలగిస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, కేంద్రం భద్రత కల్పిస్తున్న మరో 30 మంది వీఐపీల వద్ద పనిచేస్తున్న బలగాలనూ ఉపసంహరించుకుంది. కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబంలోని 8 మంది, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, టెలికం శాఖ మాజీ మంత్రి, 2జి కుంభకోణం నిందితుడు ఎ రాజా, జమ్మూకాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కే.

అదృశ్యమైన ఫైనాన్స్‌ వ్యాపారి ఫణీంద్ర మృతి

తూ.గో : వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐ.పోలవరానికి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి ఫణీంద్ర మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొమ్మానపల్లిలోని ఓ సెప్టిక్‌ ట్యాంకులో ఫణీంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్యకు ఆర్థికలావాదేవీల వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, వారి నుంచి మరిన్ని వివరాలు సేకరింస్తామని పోలీసులు తెలిపారు.

నిజామాబాద్ లో వీహెచ్ అరెస్్ట...

నిజామాబాద్: ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరుకు నిరసనగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని బోర్గాం బ్రిడ్జీపై ధర్నా చేసిన నాయకులు వాహనాలను అడ్డుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న వి. హనుమంతరావుతో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేశారు.

13:42 - September 4, 2015

తెలుగు వారు పలు రాణిస్తూ పలు దేశాల్లో ఉన్నత పదవులను చేజిక్కించుకుంటున్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో గా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త సంచలనం సృష్టిస్తోంది. కీలకమైన ట్వీట్టర్ సీఈవో గా తెలుగు అమ్మాయి పేరు పరిశీలనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ అని తెలుస్తోంది.
పద్మశ్రీ వారియర్ గత 20 సంవత్సరాలుగా అమెరికా లో స్థిరపడ్డారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించింది. మరో వ్యక్తి స్టెన్సార్ స్టూవర్ట్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరికి సీఈవో పదవి లభిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కన్సూమర్ ఇంటర్నెట్ వ్యాపారంలో ఆరితేరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ యాజమాన్యం మొగ్గు చూపినట్లు సమాచారం. దీని పై ఈ రోజు ట్వీట్టర్ యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోనుంది.

13:40 - September 4, 2015

ఢిల్లీ : విద్యార్థులతోనే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శనివారం గురుపూజోత్సవం సందర్భంగా.. హస్తినలో మోడీ వివిధ రాష్ట్రాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధ్యాయులకు అసలు పదవీ విరమణే లేదన్నారు. మోడీతో మాట్లాడిన వారిలో పిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ కూడా ఉన్నారు. తన జీవితాన్ని తల్లిదండ్రులే కాకుండా... ఎందరో ప్రముఖులు ప్రభావితం చేశారని మోడీ.. పూర్ణ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

13:33 - September 4, 2015

హైదరాబాద్ : ప్ర‌ధాని ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన స్వ‌చ్ఛ భారత్దేశంలోని ప‌లు ప్ర‌ముఖులు ఎంతో బాధ్య‌తగా తీసుకుని దేశాన్ని ప‌రిశుభ్రం చేయాల‌ని శ్ర‌మించారు. ఈ స్వ‌చ్ఛ భారత్ మిష‌న్ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సినీ న‌టి, నిర్మాత ల‌క్ష్మి మంచు ఎంపికయింది. స్వచ్ఛ్ భారత్‌ తెలంగాణ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు మంచు లక్ష్మి... కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..ఈనెల 10న స్వచ్ఛ్ భారత్ ప్రచారకర్తలకు రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వబోతున్నారు.. ఈ కార్యక్రమానికి లక్ష్మి హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడారు. ప్రధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, ఇప్ప‌టికే ఎన్నో కార్య‌క్ర‌మాలు చేయడం జరిగిందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయ‌డం మ‌రింత బాధ్య‌త పెంచిందన్నారు. ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ర్ట‌ప‌తి కార్యాల‌యంలో రాష్ర్ట‌ప‌తి చేతుల మీదుగా గౌర‌వాన్ని అందుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

13:26 - September 4, 2015

నల్గొండ : ఇంటర్‌ విద్యార్థిని భవానీ సూసైడ్‌పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన లెక్చరర్‌ శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలంటూ ఎస్పీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఝుళిపించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఇవాళ నగరంలోని కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

13:24 - September 4, 2015

ఢిల్లీ : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్ కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ఇప్పుడిప్పుడే చిక్కుముడి వీడుతోంది. ఎట్టకేలకు నేరం తానే చేసినట్లు ఇంద్రాణి ముఖర్జీ అంగీకరించింది. షీనాబోరా హత్య కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇంద్రాణిపైనే దృష్టి నిలిపి దర్యాప్తు చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. షీనాబోరా హత్యకు దారితీసిన పరిస్ధితులను పోలీసులకు వివరించింది ఇంద్రాణి.

డైరీ కలకలం..
ఈ కేసులో షీనాబోరా డైరీ కలకలం సృష్టిస్తోంది. తల్లి ఇంద్రాణీ అంటే తనకు అసహ్యమని, ఆమె ఓ పెద్ద మంత్రగత్తె అని షీనా డైరీలో రాసుకుంది. అదే సమయంలో తండ్రి సిద్ధార్ధ దాస్ నుంచి చాలా ఆశించినట్లు షీనా తెలిసింది. తండ్రి వచ్చి తనను చూడాలని, తనతో మాట్లాడాలని ఆమె కోరుకుంది. తాజాగా డైరీ బయటపడటంతో... షీనాతో అరుదుగా ఫోన్లో మాట్లాడేవాడినని... ఇటీవల సిద్ధార్ధ దాస్ చెప్పినదంతా అబద్ధమని తేలిపోయింది. ఉత్తరాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా షీనా ఆయనతో టచ్‌లో ఉన్నట్లు డైరీలో వెల్లడైంది. దీంతో ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు మరోసారి.. ఇంద్రాణి, సిద్ధార్థ దాస్ ను ప్రశ్నిస్తున్నారు.

పరీక్ష నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కు తరలింపు..
షీనా బోరా హత్య కేసులో ముంబై పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే షీనా బోరాను ఎక్కడ పాతిపెట్టారో గుర్తించిన అధికారులు.. ఆ ఎముకలకు పరీక్షలు నిర్వహించారు. వాటిని పాతికేళ్ల యువతి ఎముకలుగా నిపుణులు నిర్థారించారు. మరింత ఖచ్చితత్వం కోసం పోలీసులు వాటిని హైదారాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్ కు తరలించారు. 

ఈనెల 11న ఢిల్లీకి బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 11న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని, పలువురు కేంద్రమంత్రులను కలువనున్నట్లు సమాచారం. 

13:11 - September 4, 2015

కృష్ణా : ఆంధ్రాకే అది సుందర స్వప్నం. కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరిన ద్వీపకల్పం. అదే భవానీ ద్వీపం. బెజవాడ దుర్గమ్మ చెంతనే సహజ సిద్ధం వెలసిన అత్యద్భుత ప్రకృతి సౌందర్యాన్ని విదేశీ పరం చేసేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. అమరావతి అభివృద్ధి జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని విదేశీ పరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీతో పాటు సింగపూర్‌ కంపెనీల చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో పలుమార్లు ఇరు దేశాల కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు సమాచారం.

133 ఎకరాల విస్తీర్ణంలో భవానీ ద్వీపం..
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన హడావుడి పూర్తయిన అనంతరం.. ప్రభుత్వం భవానీ ద్వీపం లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. వీటిలో 133 ఎకరాల విస్తీర్ణంలో భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటోంది. ఇపుడు ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ పరిశీలన..
ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు డాలియన్ వాండా గ్రూప్‌కు ఆహ్వానించారు. దీంతో వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతో పాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. దీనిలో భాగంగా భవానీ ద్వీపం ఏరియల్ వ్యూను ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌ సహాయంతో చైనా బృందం పరిశీలించింది.

దేవినేని ఉమా ఆధ్వర్యంలో ఆందోళనలు..
ఇదిలా ఉంటే.. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పారు. అయితే ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా .. సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి 33 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు రెడ్‌కార్పెట్‌ పరిచినట్లు తెలుస్తోంది. గత కాంగ్రెస్ హయాంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి ఆపార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండటం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వానికే తెలియాలి.

13:08 - September 4, 2015

తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువులకు శుభాకాంక్షలు తెలిపి, వారి ఆశీస్సులు పొందేందుకు శిష్యులు సిద్ధమవుతున్నారు. కాస్త ఊహ ప్రారంభంకాగానే పిల్లలు ఆడే తొలి ఆట టీచర్ టీచర్. దీనిని బట్టే అర్ధమవుతోంది మన పిల్లలు టీచర్ వృత్తికి ఎంత మహోన్నతస్థానమిస్తున్నారో. ఈతరం పిల్లలకు అమ్మానాన్నల తర్వాత పరిచయం అయ్యే తొలి స్నేహితులు టీచర్లే. అమ్మ ఒడితో పాటు పిల్లలు అమితంగా పరవశించేది స్కూల్ మైదానంలోనే. బుజ్జిబుజ్జి పాపాయిలకు తొలి అడుగులు నేర్పేది అమ్మానాన్నలైతే, తొలి అక్షరం నేర్పేది గురువులే. ఈ తరం పిల్లలు ఇంట్లో అమ్మానాన్నలతో గడిపే సమయం కంటే స్కూళ్లో టీచర్లతో గడిపే సమయమే ఎక్కువ. ఇప్పుడు ఐదేళ్లు వచ్చే దాకా అక్షరాభ్యాసం కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు. మూడో ఏట అడుగుపెట్టడమే ఆలస్యం బడిబాట పడుతున్నాయి నేటి పసిమొగ్గలు. అంటే మూడేళ్ల వయస్సు నుంచే పిల్లలను ప్రభావితం చేసే శక్తిమంతులుగా మారుతున్నారు నేటితరం టీచర్లు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గురువుల మీద బాధ్యతలు పెరుగుతున్నాయి. నిజమే మన టీచర్లు తమ బాధ్యతల నిర్వహణలో ఏనాడూ ఎవరికీ తీసిపోలేదు.

పిల్లల భవిష్యత్ ..
బాలల మీద గురువులు తీసుకునే శ్రద్ధాశక్తులే ఆ పిల్లల భవిష్యత్ ను నిర్ధేశిస్తాయనడంలో సందేహం లేదు. స్కూళ్లో టీచర్లు చెప్పే మాటలు పిల్లల హృదయాలను హత్తుకుంటాయి. వారి చెప్పింది ఆచరించేందుకు సదా సిద్ధంగా వుంటారు. ఇంట్లో అమ్మానాన్నలు చెప్పే మాటలను పెడచెవిన పెట్టిన పిల్లలే తమ టీచర్ చెప్పగానే వాటిని ఆచరిస్తుండడం మనం చూస్తూనే వున్నాం. టీచర్ వృత్తిలో ప్రవేశించడం ఎంత అదృష్టం. ఆ అవకాశం అందరికీ రాదు కదా. అనేక గ్రామాలలో చాలామందికి టీచర్ల వాక్కే వేదవాక్కు. చదువు సంధ్యలురాని తమకు ఎక్కడి నుంచైనా ఉత్తరం ముక్క వస్తే అది పట్టుకుని ముందుగా పరుగు తీసేది ఆ గ్రామంలోని టీచర్ల దగ్గరకే. దైనందిన జీవితంలో తమకు వచ్చే సందేహాలను తీర్చుకోవడానికి వెళ్లేదీ టీచర్ల దగ్గరకే. గురువులను మన సమాజం ఎప్పుడూ గౌరవిస్తూనే వుంది. శిష్యులు తమ గురువులను ఎప్పటికీ ప్రేమిస్తూనే వుంటారు. కొంతమంది గురువులు తమ శిష్యుల ఉన్నతి కోసం పడుతున్న శ్రమ తాపత్రయం చూస్తుంటే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. అలాంటి గురువుల కన్న ఈ నేల నిజంగా ధన్యభూమే కదా.

మాయని మచ్చలు...
కానీ, దురదృష్టవశాత్తు అప్పుడప్పుడు, అక్కడక్కడ కొంతమంది టీచర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. సమయానికి స్కూలుకి రారనీ, శ్రద్ధగా పాఠాలు చెప్పడం లేదనీ, తరచూ డుమ్మాలు కొడతారన్న ఫిర్యాదులు కొంతమంది టీచర్ల మీద వినిపిస్తున్నాయి. తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన శిష్యరాళ్లతో అభ్యంతరకరంగా, అనైతికంగా ప్రవర్తిస్తున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకటి జరిగినా, అవి మొత్తం గురుకులం మీదే మాయని మచ్చలుగా మారుతున్నాయి. సందేహం లేదు. సమాజంలో జరిగే రకరకాల మార్పులు గురువులనూ ప్రభావితం చేస్తాయనడంలో మరో వాదనకు తావులేదు. సామాజిక ప్రభావాలకు ఎవరూ అతీతులు కారు. కాలేరు. ఇలాంటి సందర్భంలో గురువుల బాధ్యతలు మరింత పెరుగుతున్నాయి. తమకు విద్యాబుద్ధులు ప్రసాదించే మంచి మాస్టార్ లకు చేతులెత్తి నమస్కరించడమే శిష్యులు ఇస్తున్న గురుదక్షణ.  

13:04 - September 4, 2015

రేపు టీచర్స్ డే. మనకు విద్యా బుద్ధులు నేర్పి, మన ఉన్నతికి చక్కటి బాటలు వేసిన, వేస్తున్న గురువర్యులకు నమస్కరించి, కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన దినోత్సవం. అయితే, దురద్రుష్టవశాత్తు ఇటీవల కాలంలో గురు శిష్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? మారుతున్న సమాజంలో ఆధునిక గురువుల పాత్ర ఏమిటి ? వారు పోషించాల్సిన పాత్ర ఏమిటి ? ఇలాంటి ఆసక్తికర అంశాలపై టెన్ టివి జనపథంలో యూటీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చావా రవి విశ్లేషించారు. 

కార్ఖానా ఎసీబీహెచ్ వద్ద చోరీ..

హైదరాబాద్ : కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ బ్యాంకు వద్ద దొంగతనం జరిగింది. వ్యక్తి దృష్టి మరల్చిన గుర్తు తెలియని దుండగులు రూ. 50 వేలు ఎత్తుకెళ్లారు. 

ఉపాధ్యాయుడిగా మారిన రాష్ట్రపతి..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు ఉపాధ్యాయుడిగా మారారు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణలోని డా. రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులతో జరుగుతున్న ముఖాముఖి కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొన్నారు. 

వారాసిగూడలో ఫైర్ ఆక్సిడెంట్..

హైదరాబాద్: చిలకలగూడ పరిధిలోని వారాసిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఔషధ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

హయత్ నగర్ ప్రభుత్వ హాస్టల్ లో కలకలం..

రంగారెడ్డి : హయత్ నగర్ ప్రభుత్వ హాస్టల్ లో కలకలం రేగింది. ఇద్దరు దుండగులు అర్ధరాత్రి హాస్టల్ లోకి ప్రవేశించారు. కత్తితో బెదిరించడంతో బాలికలు గట్టిగా అరిచారు. దీనితో ఇద్దరు దుండగులు పరారయ్యారు. 

12:53 - September 4, 2015

రంగారెడ్డి : హయత్ నగర్ బాలిక హాస్టల్ లో గురువారం అర్ధరాత్రి ఓ దుండగుడు ప్రవేశించాడు. దీనితో హాస్టల్ లో ఉన్న బాలికలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా అరుపులు..కేకలు వేయడంతో దుండగుడు పలాయనం చిత్తగించాడు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పలువురు బాలికలు విద్యనభ్యసిస్తుంటారు. వార్డెన లేకపోవడం చూసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హాస్టల్ లోకి ప్రవేశించారు. అనంతరం కత్తితో బాలికలను బెదిరించారు. దీనితో బాలికలు భయపడ్డారు. వెంటనే తేరుకుని గట్టిగా అరిచారు. వెంటనే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

స్టాక్ మార్కెట్ లో మరో భారీ పతనం..

ముంబై : అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెసర్ట సెంటిమెంట్ ను దెబ్బతీయడం..అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వచ్చిన గణాంకాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు..రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలపై మొగ్గు చూపారు. దీనితో నిఫ్టీ కీలకమైన 7,700 పాయింట్ల వద్ద మద్దతును పొందలేకపోయింది. సెన్సెక్స్ 491.78 పాయింట్లు పడిపోయి 1.91 శాతం నష్టంతో 25,273.30 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు పడిపోయి 1.97 శాతం నష్టంతో 7,669 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

12:34 - September 4, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తానని హామీనిచ్చారు. శుక్రవారం ఉదయం కొందరు బాధితులు సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. అనంతరం వారు టెన్ టివితో మాటాలడారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఖాతాదారులందరికీ న్యాయం చేస్తామని బాబు పేర్కొనడం జరిగిందన్నారు. గత రెండు నెలలుగా కోర్టులో జరుగుతున్న పరిణామాలు, దర్యాప్తుపై ఒక నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని, కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని నివేదికలో పేర్కొనడం జరిగిందన్నారు. అవినీతి పరులపై ఒక చట్టం తీసుకరావడం జరిగిందని, వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారని తెలిపారు. ప్రతొక్క ఖాతాదారుడి డబ్బులు ఇస్తామని బాబు హామీనిచ్చారని పేర్కొన్నారు. అమ్మేసిన ఆస్తులను అటాచ్ మెంట్ లో చూపించారని, అగ్రిగోల్డ్ ఆస్తులను చూపించడం లేదని, ఇదంత ఒక కుట్రలో భాగమేనన్నారు. ఆస్తులను గుర్తించి చెబితే దానిని బయటకు తీస్తామని పేర్కొంటున్నారని, దర్యాప్తు సంస్థలు ఎందుకని ప్రశ్నించారు.

12:30 - September 4, 2015

హైదరాబాద్ : కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల అనంతరం ఈ విషయం బయటకు తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న గదిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ చిన్నారి ఆకలికి తాళలేక సృహ కోల్పోయాడు. కమలప్రసన్న నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ్, రాణిలు ప్రేమ వివహం చేసుకున్నారు. మంజునాథ్ సమీపంలో రిలయెన్స్ మార్కెట్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. కానీ వీరు రెండు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యను హత్య చేసిన అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వీరి వద్దనుండి ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. సంసారంలో తరచూ తగాదాలు జరుగుతున్నాయని, కాపురం చేసుకోవడం గగనంగా మారిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గదిలో ఉన్న ఏడాది బాబు సొమ్మసిల్లిపడిపోయాడు. ఇతను తొలుత చనిపోయారని స్థానికులు, పోలీసులు భావించారు. కానీ అతను బతికి ఉన్నాడని తెలుసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరొక చిన్నారిని స్థానికులు అక్కున చేర్చుకుని ఆకలి తీర్చారు. 

12:14 - September 4, 2015

హైదరాబాద్ : అవినీతి నిర్మూలన కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. న్యాయవిచారణ త్వరగా పూర్తిచేయడంతోపాటు, అవినీతిపరుల ఆస్తులను జప్తుచేసేందుకు అనువుగా తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా.. అవినీతి అంతమవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కరప్షన్‌కు కేరాఫ్ గా మారిపోయిన ప్రభుత్వ కార్యాలయాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. అయితే.. ఈ అవినీతిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలున్నా ఉపయోగం లేకపోయింది. ఈ చట్టం ప్రకారం.. అవినితీ కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అవినితీకి పాల్పడినట్టు సర్కారు భావిస్తే.. ఈ ప్రత్యేక కోర్టుల్లోనే విచారణ జరుగుతుంది. ఇతర కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండదు. కేసు విచారణ మొదలు పెట్టినప్పటి నుంచి సంవత్సరంలోపే విచారణ పూర్తి చేయాలని కొత్త చట్టం నిబంధనలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు రుజువైతే.. దోషుల ఆస్తులు జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

30 రోజుల్లో పై కోర్టుకు..
ఇక, ప్రత్యేక కోర్టుల తీర్పులపై ఉన్నత న్యాయ స్థానాల్లో అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంటుంది. అయితే.. ప్రత్యేక కోర్టు తీర్పు అనంతరం 30 రోజుల్లోనే పై కోర్టుకు అప్పీల్‌ చేసుకోవాలి. గడువు దాటితే అవకాశం ఉండదు. ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పై కోర్టులు సదరు నిందితున్ని నిర్దోషి అని తేలిస్తే.. ప్రభుత్వం జప్తుచేసిన ఆస్తులను వాపస్ చేయాలి. స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 5 శాతం వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని చట్టంలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని సభ ఇవాళ ఆమోదించింది.
ఈ చట్టం ద్వారా అవినీతి చాలా వరకు అంతమవుతుందని ప్రకటించింది ప్రభుత్వం. మరి, నిజంగానే ఈ చట్టం అవినీతిని అంతం చేస్తుందా..? పాలకులు చట్టాన్ని ఆ విధంగా ఉపయోగిస్తారా..? అన్న ప్రశ్నలకు భవిష్యతే సమాధానం చెప్పాలి.

12:12 - September 4, 2015

కృష్ణా : ఆంధ్రాకే అది సుందర స్వప్నం. కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరిన ద్వీపకల్పం. అదే భవానీ ద్వీపం. బెజవాడ దుర్గమ్మ చెంతనే సహజ సిద్ధం వెలసిన అత్యద్భుత ప్రకృతి సౌందర్యాన్ని విదేశీ పరం చేసేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. అమరావతి అభివృద్ధి జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని విదేశీ పరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీతో పాటు సింగపూర్‌ కంపెనీల చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో పలుమార్లు ఇరు దేశాల కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు సమాచారం.

133 ఎకరాల విస్తీర్ణంలో భవానీ ద్వీపం..
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన హడావుడి పూర్తయిన అనంతరం.. ప్రభుత్వం భవానీ ద్వీపం లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. వీటిలో 133 ఎకరాల విస్తీర్ణంలో భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటోంది. ఇపుడు ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ పరిశీలన...
ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు డాలియన్ వాండా గ్రూప్‌కు ఆహ్వానించారు. దీంతో వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతో పాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. దీనిలో భాగంగా భవానీ ద్వీపం ఏరియల్ వ్యూను ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌ సహాయంతో చైనా బృందం పరిశీలించింది.

దేవినేని ఉమా ఆధ్వర్యంలో ఆందోళనలు..
ఇదిలా ఉంటే.. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పారు. అయితే ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా .. సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి 33 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు రెడ్‌కార్పెట్‌ పరిచినట్లు తెలుస్తోంది. గత కాంగ్రెస్ హయాంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి ఆపార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండటం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వానికే తెలియాలి.

11:59 - September 4, 2015

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను రైతుల నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తోందని, దీన్ని తిప్పికొట్టాలని ఏపీ రైతాంగానికి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. భూ బ్యాంక్‌కు వ్యతిరేకంగా రాష్ర్ట వ్యాప్త ఉద్యమానికి రైతులకు మద్ధతుగా నిలబడతామన్నారు. రైతుల నుంచి భూములు లాక్కోవడానికి ఏర్పాటు చేసిన కొత్త ఆర్డినెన్స్‌ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్‌ చేశారు. రైతుల దగ్గర భూములు సేకరించిన ప్రభావాన్ని సర్వే నిర్వహించాలని, నష్టపోయిన వారికి పరిహారం అందించాలని చట్టంలో ఉందని తెలిపారు. కానీ ఈ ఆర్డినెన్స్ లో దానిని తొలగించారని తెలిపారు. దీనిని చేపట్టడానికి టిడిపి ప్రయత్నం పూనుకుందని మధు పేర్కొన్నారు. 

11:56 - September 4, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ మీడియా పాయింట్‌లో టీడీపీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ఓటుకు నోటు అంశాన్ని లేవనెత్తుతే టిడిపికి ఎందుకంత ఉలికిపాటు అని వైసీపీ సభ్యురాలు రోజా విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న కేసును సభలో చర్చించరాదని స్పీకర్‌ అంటున్నారని.. జగన్‌పై బనాయించిన కేసుల గురించి రోజూ టిడిపి సభ్యులు మాట్లాడుతున్నదుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. మత్తయ్యకు టిడిపి నేతలు ఏపీలో ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. ఓటుకు నోటుకు కేసుకు ఏపీకి సంబంధం ఉందని, పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న వందల కోట్ల రూపాయలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బ్రీఫ్డ్ డీ మీ అన్న దానికి బ్రీఫ్ కేసులు ఎక్కడి నుండి వచ్చాయని రోజా ప్రశ్నించారు.

11:53 - September 4, 2015

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడేనా అని టిడిపి సభ్యుడు ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడారు.
టీఆర్‌ఎస్‌తో జగన్‌ చేతులు కలిపి ఏపీలో ప్రభుత్వాన్ని అస్తిరపరచాలనే కుట్రలో భాగంగా వైసీపీ ప్రవర్తిస్తోందని ధూళిపాళ్ల ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పేరు వినిపించాలని టీఆర్ఎస్ నాయకులు వత్తిడి చేశారని మత్తయ్య విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సెక్షన్ 8పై జగన్ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఉందని అక్కడ ఓటుకు నోటు ప్రశ్నిస్తే సబబుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పేరు కేవలం కుట్రతో ఇరికించారని ధూళిపాల పేర్కొన్నారు. 

11:49 - September 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఫోన్ చేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రతిపక్ష నేత జగన్ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీలో ఓటుకు నోటు అంశంపై జగన్ ప్రసంగించారు. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు పలు ఆరోపణలు చేశారు. దీనిపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. కేసీఆర్ రాత్రి ఫోన్ చేశానని ఆరోపణలు చేశారని, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే నిజాయితీగా ఉండాలని సూచించారు. కేసీఆర్..చంద్రబాబు పొత్తుతో పెట్టుకున్నప్పుడు వచ్చిన ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. దొంగ దొంగతనం చేస్తే పట్టుకోవడం తప్పు అన్నట్లుగా వాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు ఆడియో టేపులో వచ్చిన వాయిస్ బాబుది అవునా ? కాదా ? డబ్బు మీదా కాదా చెప్పాలని జగన్ సూటిగా ప్రశ్నించారు. 

11:42 - September 4, 2015

హైదరాబాద్ : ప్రతిపక్ష నాయకుడు జగన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెండాను అమలు చేస్తున్నారని టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మీడియా పాయింట్ వద్ద బోండా మాట్లాడారు. ఐదు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడానికి కారణం జగనేనని తెలిపారు. ప్రతి నిమిషం అడ్డుకుంటూ ప్రశ్నోత్తరాలు జరుగకుండా..ప్రజా సమస్యలపై చర్చించలేని ఘనత జగన్ దేనని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణాకా. ఏపీకా అని ప్రశ్నించారు. అస్థిర పరచాలనే దురుద్ధేశ్యంతో కేసీఆర్ ఏజెండాను అమలు చేస్తున్నారన్నారు. అవినీతి కేసుల గురించి అడిగే నైతికహక్కు లేదన్నారు. ఓటుకు నోటు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సెక్షన్ 8 ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను విమర్శించడం లేదని, కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారాడని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పనిలో అడ్డుపడుతున్నాడని, కుట్రలు..కుతంత్రాలు టిడిపిని ఏమి చేయలేమన్నారు. ఎన్నో సమస్యలుంటే సొంత ఏజెండా అమలు కోసం అసెంబ్లీని అడ్డుకుంటున్నారని తెలిపారు. మూర్ఖపు పట్టుదల వల్ల ఐదు రోజు సమావేశాలు జరుగలేదని పేర్కొన్నారు. అయినా కూడా కొన్ని సమస్యలపై చర్చ..కొన్ని బిల్లులను ఆమోదించడం జరిగిందని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

 

11:41 - September 4, 2015

హైదరాబాద్ : వైసీపీకి బుద్ధి లేదని...భగవంతుడే వారికి బుద్ధి చెప్పాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చివరి రోజైన అసెంబ్లీ సమావేశాల్లో ఓటుకు నోటు అంశం తీవ్ర దుమారం రేపింది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. కోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రాలేదని విమర్శించారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన శిఖరం ఎదంటే ఎవరెస్టు అని చెబుతారని, అలాగే అత్యంత అవినీతి పరుడు ఎవరంటే ప్రతొక్కరూ జగన్ వైపు వేలు చూపిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యే టికెట్లు వేలం వేయలేదా ? ఓటుకు నోటు ముందే ఆయన తీసుకున్నాడని తెలిపారు. చంద్రబాబు నాయుడు తప్పు చేయాల్సినవసరం లేదని కడిగిన ముత్యంలా ఉన్నాడని కితాబిచ్చారు. రాష్ట్రంలో అనేకమైన సమస్యలున్నాయని, తాగు, సాగు, కరవు ఉందన్నారు. సమస్యలకు పరిష్కారం వస్తుందోమోనని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని తెలిపారు. పార్టీ ఎక్కడ పునాదులు కదిలిపోతుందోనని భయంతో వైసీపీ ఉందన్నారు. తలదించుకొనే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని, జగన్ ఒక దోషిగా నిలిచిపోతారని మంత్రి పల్లె తెలిపారు.

11:40 - September 4, 2015

ముంబై : కొద్దిగా కోలుకున్నదని భావించిన స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల బాటలోనే నడిచింది. శుక్రవారం భారీగా స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నాయి. ఆరంభంలోనే 450 పాయింట్లను సెన్సెక్స్ నష్టపోయింది. 150 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. బ్యాంకు ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, వేదాంతా, టాటా పవర్ లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ విభాగాల్లో భారీగా అమ్మకాలు చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇన్వెసర్టు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. 

ఆర్బీఐ టవర్ లో అగ్నిప్రమాదం..

ముంబై : ఆర్బీఐ టవర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. 

11:38 - September 4, 2015

హైదరాబాద్ : ప్రతిపక్ష నాయకుడు జగన్ కు గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారని, అందుకనే ఓటుకు నోటు అంశంపై తీర్మానం ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చివరి రోజైన శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఓటుకు నోటు అంశంపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు అనుమతితో సభలో మాట్లాడుతున్న వ్యక్తి ఏపీ శాసనసభలో మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉందన్నారు. జగన్ డబ్బు పిచ్చి వల్ల, అవినీతి వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారని తెలిపారు. సీఎ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతుంటే సిగ్గు పడుతున్నామని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 11 కేసుల్లో ఏ 1 ముద్దాయిగా ఉన్న జగన్ బాబుపై మాట్లాడే హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 

11:38 - September 4, 2015

హైదరాబాద్ : వైసీపీ పార్టీకి భయం పట్టుకుందని మంత్రి రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. ఓటుకు నోటు అంశంపై వైసీపీ ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రావెల మాట్లాడారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కుట్ర జరుగుతోందని, నవ్యాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకోవద్దని వైసీపీ భావిస్తోందన్నారు. నిరుపేదలు..ఆకలి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక మునిలాగా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ ఇది వైసీపీకి ఇష్టం లేదని, రాజకీయ భవిష్యత్ శూన్యమై పోతుందని భయపడుతున్నారని, జగన్ మానసిక బాధతో పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని మంత్రి రావెల ఆరోపించారు. 

11:36 - September 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వైసీపీ తోక పార్టీయా ? లేక అనుబంధ పార్టీయా ? అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. వైసీపీ ఇచ్చిన ఓటుకు నోటు తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. కానీ ఓటుకు నోటు అంశంపై చర్చకు అనుమతినివ్వాలని వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకున్నారు. సభా సమయాన్ని ఎలా వృధా చేయాలనే దానిపై ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది ఒక విధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధం లేని అంశమని, తెలంగాణలో టిడిపి బలపడకుండా ఉండేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేపై కుట్ర చేసి ఒక కేసు పెట్టిందని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించారు. దీనికి వైసీపీ వంత పాడుతోందని, ప్రతిపక్ష నాయకుడు జగన్ పై 12 ఛార్జీషీట్లు ఉన్నాయని సభలో తెలిపారు. ప్రతి శుక్రవారం ఆయన హాజరవుతుంటారని, టీఆర్ఎస్, వైసీపీ పార్టీలకు అవినావ సంబంధం ఉందనే దానికి తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది. చర్చించాల్సినవసరం లేదని ప్రబుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

11:35 - September 4, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు కూడా రగడే చోటు చేసుకుంది. ప్రతిపక్షం..అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు. తాము ఇచ్చిన తీర్మానంపై చర్చ చేయాలని వైసీపీ పట్టుబట్టగా ఈ అంశం ఇతర రాష్ట్రానికి సంబంధించిందని దీనిపై చర్చ అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. దీనితో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఓటుకు నోటు కేసు అంశం..నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. దీనిని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. గురువారం ఇచ్చిన నిత్యావసర ధరల పెరుగుదల అంశంపై తీర్మానం ఇస్తే ఈ రోజు చర్చకు అనుమతించడం జరిగిందని స్పీకర్ తెలిపారు. చాలా అంశాలు ఉన్నాయి కనుకే సమావేశాలను 15 రోజులు పొడిగించాలని కోరితే కేవలం ఐదు రోజులే సమయం సరిపోతుందని పేర్కొన్నారని వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ ప్రజా సమస్యలే కదా అన్నారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందించారు. నిన్న ఇచ్చిన నిత్యావసర వస్తువుల పెరుగుదల తీర్మానాన్ని ఈ రోజు చర్చకు అనుమతినివ్వడం జరిగిందన్నారు. బిఏసీలో ఏది నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తానని స్పీకర్ తెలిపారు. మీరు ఎంత టైం వేస్టు చేసుకున్నారో మీకు తెలియాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని కోడెల సూచించారు. 

11:34 - September 4, 2015

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారని మరి వేతనాలు పెంచాలని..ఇతరత్రా కారణాలతో ఆందోళన చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించడానికి డబ్బులు లేవా అని ది హాన్య్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నించారు. బీహార్ లో మహా లౌకిక కూటమి..ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరు..కేసీఆర్ చైనా పర్యటనపై విమర్శలు తదితర అంశాలపై నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

సమాజ్ వాది పెద్ద పార్టీ ఏమీ కాదు...
''మహా లౌకిక కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. బీహార్ లో వాస్తవానికి సమాజ్ వాదీ పార్టీ పెద్దదేమి కాదు. జేడీయూ, ఆర్జేడి బలమైన పార్టీలు. బీహార్ ఎన్నికలపై దాని ప్రభావం ఎంత ఉంటుందని ఆందోళన చెందాల్సినవసరం లేదు. ఈ పార్టీలకు ఉన్న బలహీనతలు గమనించాలి. ప్రాంతీయ పార్టీల్లో నిలకడమైన విధానాలు ఉండవు. యూపీఏ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకొనే సమయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంది. అప్పుడు వామపక్షాలతో ఉన్న సమాజ్ వాదీ పార్టీ చివరకు యూపీఏ గూట్లో చేరింది. ఒక కుటుంబం చుట్టూ, లేదా రాష్ట్ర ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూడండి. మొన్నటి వరకు టీఆర్ఎస్ పై విమర్శలు చేయని బీజేపీ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. దీనికి కారణం వరంగల్ ఉప ఎన్నిక ఉండడమే.

తెలంగాణ ధనిక రాష్ట్రం..
తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ పేర్కొంటున్నారు. కానీ గణాంకాల ప్రకారం చూస్తే అది తప్పు. తెలంగాణకు తలసారి ఆదాయం జాతీయ తలసారి ఆదాయం కన్నా ఎక్కువ. దీనిని చూసి భ్రమ పడకూడదని తెలంగాణలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. ఇదంతా ప్రభుత్వమే పేర్కొంది. నగరం చుట్టూ ఉన్న రెండు జిల్లాల మినహా ఇతర జిల్లాల ఆదాయం చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనే ఇది ఉంది. ధనిక రాష్ట్రమని పేర్కొనడం వల్ల కేంద్రం నుండి నిధులు రావడం లేదు. జాతీయ రహదారులు నిర్మించాలని..రైల్వే నెట్ వర్క్ పెంచుతామని..పారిశ్రామిక రాయితీలు...ఇలా ఎన్నో చట్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నయా ? ధనిక రాష్ట్రమైతే మున్సిపల్, పంచాయతీ..ఇతరత్రా వారి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు. వీరికి వేతనాలు ఎందుకు పెంచడం లేదు. డబ్బులు లేవా ? సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించరా ? గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం ఇవ్వాలని చెబుతున్నారు. డబ్బులు లేవా ? డబుల్ బెడ్ రూం కట్టడానికి డబ్బులు లేవా ?

సీఎం కేసీఆర్ చైనా పర్యటన..
సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన అందరూ ప్రయాణించే విమానంలో వెళ్లవచ్చు. విమానంలో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక విమానం ఎందుకు ? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాచరికంలో లేము. సామాన్య ప్రజానీకంలో తప్పుడు సంకేతాలు వెళుతాయి. ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటి వరకు పేర్కొన్న కొన్ని నిర్ణయాలు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనిని కూడా ఉపసంహరించుకుంటారేమో.

ఏపీ అసెంబ్లీ చివరి రోజు..
తాను తొలి రోజే చెప్పాను. సమావేశాలు గందరగోళం జరుగబోతోంది. ఏమీ ఉండదు. మయసభల మారిపోవడానికి కారణం ఎవరో ఆలోచించాలి. రాజకీయ పార్టీల హోరాహోరికి, ముష్టి ఘాతాలకు వేదిక అవుతోంది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

11:30 - September 4, 2015

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకంగా తొమ్మిది బిల్లులను ఒకే రోజు ఆమోదించింది. వీటిలో నాలుగు బిల్లులను ముందురోజు ఎజెండాలో పెట్టకుండా హఠాత్తుగా ప్రవేశపెట్టడంపై విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల చరిత్రలో ఎన్నడులేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఈ అంశాలపై టెన్ టివి నిర్వహించిన చర్చా వేదికలో పట్టాభిరామ్ (టిడిపి), బొడ్డు నాగేశ్వరరావు (పిడిఎస్ ఎమ్మెల్యే), కోన రఘుపతి (వైసిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

పట్టాలు తప్పిన చెన్నై మంగళూరు ఎక్స్ ప్రెస్..

చెన్నై : కడలూరు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై - మంగళూరు ఎక్స్ ప్రెస్ కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 40మందికి గాయాలయ్యాయి.

నల్గొండలో నేడు టి. డిప్యూటి సీఎం, మంత్రి జగదీష్ పర్యటన..

నల్గొండ : నేడు జిల్లాలో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి జగదీష్ రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

భవాని హత్యకు నిరసనగా నేడు కాలేజీల బంద్..

నల్గొండ : ఇంటర్ విద్యార్థిని భవానీ ఆత్మహత్యకు నిరసనగా నేడు పట్టణంలోని కాలేజీల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

నిజామాబాద్ లో నేడు కాంగ్రెస్ ఆందోళన...

నిజామాబాద్ : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నగరంలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వి. హనుమంతరావు హాజరు కానున్నారు.

 

రేణిగుంటలో కానిస్టేబుల్ అనుమానస్పద మృతి..

తిరుపతి : రేణిగుంట సమీపంలోని ఎర్రచందనం గోడౌన్ లో కానిస్టేబుల్ సంతోష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. తుపాకితో నుదుటిపై కాల్చుకుని చనిపోయాడని సిబ్బంది పేర్కొంటున్నారు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. 

విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని..

ఢిల్లీ : నేడు విద్యార్థులతో రాష్ట్రపతి, ప్రధాని ముచ్చటించనున్నారు. రాష్ట్రపతి భవన్ సర్వోదయ విద్యాలయంలో విద్యార్థులకు రాష్ట్రపతి ప్రణబ్ పాఠాలు బోధించనున్నారు. ఉదయం 10గంటలకు మానెక్ షా ఆడిటోరియంలో ప్రధాని విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. 800 మంది విద్యార్థులు 60 మంది టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం రూ.125, రూ.10విలువైన నాణాలను మోడీ విడుదల చేయనున్నారు. 

ప్రత్యేక హోదా కోసం మరొకరి ఆత్మహత్య...

నెల్లూరు : జిల్లాలోని గూడూరు రూరల్ ప్రాంతంలోని చెన్నూరులో రమణయ్య అనే వ్యక్తి ప్రత్యక హోదా కోరుతూ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. 

11:22 - September 4, 2015

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రమణయ్యరాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. గూడురు రూరల్ ప్రాంతంలోని చెన్నూరుకు చెందిన రమణయ్య ఇంజినీరింగ్ కాలేజీలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం కోసం ఇతను కృషి చేసేవాడు. అంతేగాక ఇటీవలే జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలతో కూడా చురుకుగా పాల్గొన్నాడు. కానీ ప్రత్యేక హోదా కల్పించ లేకపోవడంపై రమణయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవాడు. హోదా వస్తే అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించాడు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలపై మధ్య వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యేక హోదాపై జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతడిని కలిచివేశాయి. దీనితో గత రాత్రి బావిలోకి దూకి రమణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి కావడంతో ఈ వియయ బటకు పొక్కలేదు. శుక్రవారం ఉదయం ఈ వార్త దావానంలా వ్యాపించింది. జై..పత్యేక హోదా..జై..జై ప్రత్యేక హోదా..స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించాలని సూసైడ్ నోట్ లో రమణయ్య పేర్కొన్నాడు. 

నేటి నుండి మహేందర్ రెడ్డి జిల్లాల పర్యటన...

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. హన్మకొండలోని బస్ స్టేషన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

గుజరాత్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న పటేల్..

అహ్మాదాబాద్ : నేడు గుజరాత్ ఎమ్మెల్యేలతో పాస్ కన్వీనర్ హార్ధిక్ పటేల్ భేటీ కానున్నారు. ఓబిసి కోటాలో పటేళ్లకు రిజర్వేషన్ల కల్పనపై ఎమ్మెల్యే వైఖరైంటో పటేల్ అడిగి తెలుసుకోనున్నారు. 

అవయవ మార్పిడికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు..

గుంటూరు : అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా నేడు జీజీహెచ్ లో నిపుణుల బృందం పరిశీలనకు రానుంది. 

మేడిపల్లి ఎంపీపీపై కేసు..

కరీంనగర్ : మేడిపల్లి ఎంపీపీ జమునపై కేసు నమోదైంది. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు సంతాన వివరాలు పేర్కొన్నారనే ఆరోపణలున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

కంతనపల్లి నుండి వరంగల్ కు టిడిపి, బిజెపి యాత్ర..

వరంగల్ : నేడు టిడిపి, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో కంతనపల్లి నుండి వరంగల్ వరకు యాత్ర నిర్వహించనుంది. కంతనపల్లి సాధించే వరకు రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని టి.టిడిపి నేత ఎర్రబెల్లి స్పష్టం చేశారు. 

దత్తా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని కొట్టిన సీనియర్లు...

రంగారెడ్డి : ఇబ్రహింపట్నంలో శ్రీ దత్తా ఇంజినీరింగ్ కళాహాస్టల్ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సంజీవ్ కుమార్ ను సీనియర్లు కర్రలతో చితకబాదారు. సంజీవ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తాడేపల్లి గూడెంలో విజిలెన్స్ దాడులు..

పశ్చిమగోదావరి : తాడేపల్లి గూడెంలో పలు వ్యాపార సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. రూ.కోటి విలువైన పప్పు ధాన్యాలు సీజ్ చేశారు. 

Don't Miss