Activities calendar

06 September 2015

20:30 - September 6, 2015

గుంటూరు : రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటనపై సీబీఐచే విచారణ జరిపించాలని తండ్రి మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. నాగార్జున విశ్వ విద్యాలయంలో రిషితేశ్మరీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె రాసుకున్న డైరీలు పలు విషయాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తుపై ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఇటీవలే సీఎం చంద్రబాబు, మంత్రి గంటాలకు లేఖలు రాశారు. రిషితేశ్వరీ కేసు దర్యాప్తు పక్కదారి పట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయని కలెక్టర్ కు అందించిన వినతిపత్రంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ బాబురావును కేసు నుండి తప్పించాలని పోలీసులపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారని, ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుతో పాటు హైకోర్టు సిట్టింగ్ జిడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 

రిషితేశ్వరీ మృతి కేసును సీబీఐ విచారణ జరిపించాలి - మురళీ కృష్ణ..

గుంటూరు : తన కుమార్తె మృతి కేసులో సీబీఐ విచారణ జరిపించాలని కలెక్టర్ కు రిషితేశ్వరీ తండ్రి మురళీ కృష్ణ వినతిపత్రం అందించారు. రిషితేశ్వరీ కేసు దర్యాప్తు పక్కదారి పట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ బాబురావును కేసు నుండి తప్పించాలని పోలీసులపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారని, ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుతో పాటు హైకోర్టు సిట్టింగ్ జిడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 

నాలాలో కొట్టుకపోతున్న ఐదేళ్ల బాలికను రక్షించిన స్థానికులు.

హైదరాబాద్ : ఎల్బీనగర్ బైరామల్ గూడలో ఐదేళ్ల బాలిక కొట్టుకపోతుండగా స్థానికులు రక్షించారు.

 

టి.విశ్వవిద్యాలయం - చికాగో యూనివర్సిటీ మధ్య ఒప్పందం..

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వ విద్యాలయం, అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఇంచార్జి ఉప కులపతి పార్థసారధి, చికాగో విశ్వ విద్యాలయం వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిన్ ..ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం జీఆర్ఎఫ్, టోఫెల్ లేకుండానే నేరుగా చికాగో యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వీలు కలుగుతుంది. 

పిడుగు పాటు మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఏపీలో పిడుగుపాటు..19 మంది మృతి..

నెల్లూరు : ఆదివారం కురిసిన భారీ వర్షాలకు తోడు ఏపీలో పలుచోట్ల పిడుగుపాట్లు పడ్డాయి. దీనితో 19 మంది దుర్మరణం చెందారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఈ పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరులో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు అనంతపురంలతో ఒకరు మృతి చెందారు.

19:16 - September 6, 2015

బాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకంటూ ముందుకు వెళుతున్న 'సల్మాన్ ఖాన్' తాజాగా ఓ టాలీవుడ్ చిత్రంపై కన్ను పడిందంట. అదే 'ప్రిన్స్' మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు'. ఇప్పటికే పలు టాలీవుడ్ రీమెక్ చిత్రాల్లో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' తెలుగులో మంచి విజయం సాధించినసం గతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని 'ఈరోస్ ఇంటర్నేషనల్' సంస్థ నిర్మించింది. హిందీ రీమేక్ గురించి సల్మాన్ 'ఈరోస్ సంస్థ'తో చర్చలు జరుపుతున్నాడని టాక్. 'సల్మాన్' ఇప్పటికే మహేష్ చిత్రం పోకిరి, రామ్ – రెడీ, రవితేజ – కిక్ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసి మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మరి హిందీలో 'శ్రీమంతుడి'గా సల్మాన్ నటించనున్నారా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

18:54 - September 6, 2015

శ్రీకాకుళం : విశాఖకు రైల్వే జోన్ రావాలని నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు కూడా విశాఖలో స్పందించారు. రైల్వే జోన్ వచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కానీ రైల్వే జోన్ అంశంలో రాజ్యంగ సవరణ అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కుండబద్దలు కొట్టారు. విభజన బిల్లులో స్పష్టత లేకపోవడం వల్లే అన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సవరణ జరిగితేనే జోన్ వస్తుందన్నారు. భాషా..దరిద్రమో..భావ దరిద్రం అనాలో తెలియదని, విభజించే చట్టంలో అలా రాయలేదని విమర్శించారు. 

18:48 - September 6, 2015

ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన 'బాహుబలి' సినిమా పార్ట్ -2 కు రంగం సిద్ధం అవుతోంది. కథను మరింత రక్తికట్టించే విధంగా ప్లాన్ జరగుతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు అప్పుడే సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. అందులో 'శివగామి' పాత్రను 'శ్రీదేవి' పోషిస్తుందని టాక్. పాత్రల ఎంపిక విషయంలో రాజమౌళి ఎంత శ్రద్ధ తీసుకున్నాడనే విషయం ప్రేక్షకులకు బాగా అర్థమైపోయింది. ఏ పాత్రను చూసినా ఆ పాత్రకి వాళ్లే కరెక్ట్ అనిపించకమానదు. అలాంటి పాత్రల్లో రమ్యకృష్ణ పోషించిన 'శివగామి' పాత్ర ఒకటి. ఈ సినిమాలో ఈ పాత్ర ఎంత బలమైనదో అంత కీలకమైనది. 'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్రకు 'శ్రీదేవి'ని ఎంపిక చేసినా ఆమె నో అన్నారని..ఇందుకు పారితోషకమే కారణమని పుకార్లు షికార్లు చేశాయి. 'బాహుబలి' పార్ట్ -2లో 'శివగామి' పాత్రకు 'శ్రీదేవి' అయితే కరెక్టుగా ఉంటుందని చిత్రం టేకప్ చేస్తున్న ఓ కార్పొరేట్ కంపెనీ చెబుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

బాలరాజుపై దాడిని ఖండించిన ఎర్రోళ్ల శ్రీనివాస్..

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గువ్వలపై దాడి చేసిన కాంగ్రెస్ నేత రాంమోహన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 

ప్రజాస్యామంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు - గట్టు..

హైదరాబాద్: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని టీఆర్‌ఎస్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

చంద్రగిరికి చేరిన జరీనా మృతదేహం..

చిత్తూరు : యాసిడ్ దాడిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జరీనా బేగం మృతదేహం చంద్రగిరికి చేరుకుంది. భర్త యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన జరీనా చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. సుమారు 53 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జరీనా శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

రహదారులపై నీళ్లు..మునిగిపోయిన వాహనాలు..

హైదరాబాద్ : నగరంలో ఆదివారం మధ్యాహ్నాం కురిసన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు వాహనాలు నీటి ఉధృతికి కొట్టుకపోయాయి. కార్లు నీళ్లలో మునిగిపోయాయి. 

18:19 - September 6, 2015

చెన్నై : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మళ్లీ పెళ్లి కొడుకయ్యారు. 68ఏళ్ల డిగ్గీ రాజ మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం గత నెలలో జరిగింది. రాజ్యసభ టీవీ యాంకర్ అమృతారాయ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య సహజీవనం విషయం గత ఏడాది ఏప్రిల్‌‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 44 సంవత్సరాల రాయ్‌కు గతంలోనే వివాహం జరిగింది. విడాకుల తర్వాత ఆమె దిగ్విజయ్‌ను వివాహం చేసుకుంటానని గతంలోనే ప్రకటించారు. అలాగే వివాహం చేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ భార్య 2013లో సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. 68 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ అమెరికాలో ఉన్నారు. అమృతారాయ్ కూడా లీవ్‌లో ఉన్నారు.

18:14 - September 6, 2015

నెల్లూరు : జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం పడడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఆరుగురు మృత్యువాత పడ్డాయి. 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణితో ఆదివారం ఏపీలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నాం 2గంటల వరకు భారీ వర్షం కురిసింది. మెరుపులు..ఉరుములతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఓ ప్రాంతంలో వెంకయ్య అనే వ్యక్తి మృతి చెందగా ఏనుగుల బావి ఊరిలో ఉన్న ఓ పూరి గుడిసెపై పిడుగు పడింది. అందులో ఉన్న భార్య భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అందులోనే ఉన్న బాలుడు తప్పించుకోగలిగాడు. రెండు చోట్ల పడిన పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెలకాపర్లు మృతి చెందారు. మరో ప్రాంతంలో పడిన పిడగుగు పాటుకు మత్స్యకారులైన తండ్రి కొడుకులు మృత్యువాత పడ్డారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై పడిన పిడుగు పాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయలయ్యాయి. 

రేపటి నుండి వరంగల్ లో షర్మిల పాదయాత్ర..

వరంగల్ : వైఎస్ జగన్ సోదరి షర్మిల సోమవారం నుండి వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. సెప్టెంబర్ 7 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 

నగరంలో కూలిన పురాతన భవనం.

హైదరాబాద్: ఆదివారం కురిసిన భారీ వర్షానికి మలక్ పేటలోని ఓ పురాతన భవనం కుప్పకూలింది. అయితే ఈ భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. 

ఉండవల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు..

విజయవాడ : ఉండవల్లిలో తన నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఇకపై ఉండవల్లిలోనే చంద్రబాబు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 

సూది సైకో విషయంలో ఆందోళన వద్దు - ఏపీ డీజీపీ..

నెల్లూరు : సూది సైకో విషయంలో ఆందోళన చెందవద్దని ఏపీ డీజీపీ వెల్లడించారు. ఇతని కోసం 40 బృందాలు గాలిస్తున్నాయని, సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు ఐ - క్లిక్ విధానం రూపొందించినట్లు చెప్పారు. తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి నెలకొల్పినట్లు తెలిపారు. 

టి. ఎక్సైజ్ పాలసీ పాతదే..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులోవున్న మద్యం విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సచివాలయంలో ఎక్సైజ్‌ పాలసీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌ పాలసీని కేసీఆర్‌ ఖరారు చేశారు. అక్టోబర్‌ నుంచి ఎక్సైజ్‌ పాలసీ అమలు కానుంది. రిటైల్‌ వైన్‌షాపుల కోసం నోటిఫికేషన్‌లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రజా వ్యతిరేక విధానలపై ఉద్యమం - తమ్మినేని...

హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ వామపక్షాల అభ్యర్థిని నిలబెడుతామని తెలిపారు. ప్రాజెక్టుల డిజైన్ మార్చడం అన్యాయమని, డబ్బులు దండుకొనేందుకు ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేపట్టారని విమర్శించారు. 

17:38 - September 6, 2015

హైదరాబాద్ : విరసం వ్యవస్థాపకులు, ప్రముఖ సాహితీ వేత్త చలసాని ప్రసాద్ సంస్మరణ సభ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సాహితీ విమర్శకుడిగా చలసాని ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారని విరసం నేతలు పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడిన చలసాని ఎందరికో ఆదర్శ ప్రాయుడని, నిబద్ధత, అంకితభావం, ఆప్యాయతలకు చలసాని మారుపేరని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కవులు, విరసం నేతలు, రచయితలు పాల్గొని చలసానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

17:36 - September 6, 2015

హైదరాబాద్ : నగరానికి మంచి నీటి సరఫరా ఇబ్బందులపై హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వాటర్ బోర్డు జీఎం రామచంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో తాగు నీటి సరఫరాలో ఇబ్బందులపై సమావేశంలో చర్చ జరిగింది. వచ్చే ఏడాది వేసవినాటికి తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమావేశంలో చర్చించారు. నగరంలో మంచినీరు కలుషితం వంటి అంశాలపై వక్తలు సుధీర్ఘంగా చర్చించారు.

 

17:33 - September 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వాళ్లు ఆకర్శితలవుతున్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా..వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచిపనుల్ని చూసి ఓర్వలేక తమపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనను ఉదహరిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 

గోవా ప్రభుత్వానికి ముంబై హైకోర్టు నోటీసులు..

ముంబై : రాష్ట్ర హైకోర్టు గోవా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బస్సులు..ఆటోల్లో వెళుతున్న విద్యార్థుల క్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఓ ఆంగ్ల పత్రికల్లో విద్యార్థుల ప్రయాణం గురించి వచ్చిన కథనాన్ని ముంబై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 

17:15 - September 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన తమపై మంత్రి హరీష్ రావు పనిపాట లేదా అంటూ మండిపడ్డారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆశావర్కర్లు హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదంటూ ట్రేడ్ యూనియన్ లీడర్లు వార్నింగ్ ఇచ్చారు. 
సెప్టెంబర్ 2 నుండి నిరవధిక సమ్మె..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుండి ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌లో కు వచ్చిన మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు అక్కడకు వెళ్లారు. ఇది చూసిన హరీష్‌రావు.. 'మీరు ఆశావర్కర్లు అని తెలుసు.. మీ ఆశలు నిరాశలే. సక్కగా పని చేసుకోక ఎందుకొచ్చారు. మిమ్మల్ని మోడీ తొలగించారు... మాకేం సంబంధం లేదు' అంటూ ఎద్దేవా చేశారు. అక్కడనే వీరికి మద్దతుగా వచ్చిన సీఐటీయూ మండల కార్యదర్శి బొల్లం యాదగిరి ఆశా వర్కర్ల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించాడు. నువ్వెవరంటూ హరీష్ ప్రశ్నించి సీఐటీయూ నాయకుడివి.. రాజకీయం చేస్తున్నావా అంటూనే... వీడ్ని లోపలేయండి అంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. వెంటనే పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. 

జీఎస్టీ బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించాలి - రాజ్ నాథ్..

ఢిల్లీ : జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లు చట్టరూపం దాల్చేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. వస్తు, సేవల పన్ను బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. 

తెలుగు భాషా దినోత్సవంగా కాళోజి జయంతి - కేసీఆర్...

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భాషా, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కాళోజి పురస్కరం అందచేస్తామని వెల్లడించారు. 

ఫ్లెక్సీల వివాదంపై ఫ్యాన్స్ తో మాట్లాడిన పవన్..?

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో గత కొన్ని రోజులుగా ఫ్లెక్సీలపై జరగుతున్న వివాదంపై ఫ్యాన్స్ తో సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. భీమవరంలో తన అభిమాన సంఘాల నాయకులకు ఫోన్‌ చేశారని, కుల, మత వర్గాల పేరుతో జరుగుతున్న గొడవలను తీవ్రంగా ఖండించినట్లు టాక్. 

నెల్లూరులో ఏపీ డీజీపీ..

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిజిపి రాముడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఏపీ-తమిళనాడు బోర్డర్‌లో తమిళనాడు సర్కార్‌ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను ఆయన పరిశీలించారు

16:39 - September 6, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవియేషన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నాలుగు యాక్టివేట్ ఎయిర్ పోర్టులున్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో విమానాల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొన్నారు. 

16:35 - September 6, 2015

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఏపీపీసీసీ ఉద్యమ బాట పట్టబోతోంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులపై కేసులు ఎట్టేందుకు ఏపీ పీసీసీ సిద్ధమైంది. రేపటి నుండి మూడు రోజల పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పీఎస్ లో ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరా పేర్కొన్నారు. పార్లమెంట్ లో చేసిన ప్రకటనలు..వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను సిడిల ద్వారా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తనతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

తణుకులో సిరంజి దాడి..

తణుకు : తణుకు సమీపంలో మరో సిరంజి దాడి జరిగింది. ఆటోలో వెళుతున్న మహిళపై సిరంజి సైకో దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. 

16:18 - September 6, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో సూదిగాడు దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఓ సైకో మహిళలపై ఇంజక్షన్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతడిని పట్టుకోవడానిక పోలీసులు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు కానీ ఇంతవరకు అతని ఆచూకి తెలియ రావడం లేదు. తాజాగా తణుకులో ఓ మహిళపై సైకో సూదితో దాడి చేశాడు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సూదిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తేల్చారు. సదరు మహిళ తణుకు నుండి ఇరగవరానికి ఆటోలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పల్సర్ బైక్ వచ్చిన వ్యక్తి ముఖానికి ఎలాంటి మాస్క్ పెట్టుకోలేదని మహిళ పేర్కొన్నట్లు సమాచారం. 

16:09 - September 6, 2015

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితి 24గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు అల్పపీడన ద్రోణుల వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

హైదరాబాద్ లో భారీ వర్షం..
గత నెల రోజుల నుండి ఎండల తీవ్రతతో బాధ పడుతున్న నగర ప్రజానీకం ఆదివారం మధ్యాహ్నాం ఉపశమనం పొందారు. ఒక్కసారిగా మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. దీనితో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బాగ్ లింగంపల్లి, అంబర్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

వెస్ట్ బెంగాల్ లో బాంబు పేలుడు.

వెస్ట్ బెంగాల్ : రాష్ట్రంలోని ఇత్హార్ పీఎస్ పరిధిలో ముడి బాంబు పేలడంతో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక సాధారణ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

టెస్టు క్రికేట్ కు వాట్సన్ గుడ్ బై..

ఆస్ట్రేలియా : ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు క్రికెట్ నుండి వీడ్కోలు తీసుకున్నాడు. తాను టెస్టుల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 

15:47 - September 6, 2015

టాలీవుడ్ చిత్రాల్లో కామెడీ పాత్రలు పోషించి హీరో అయిన 'సునీల్' వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఆయన తాజాగా నటించిన 'కృష్ణాష్టమి' సినిమా టీజర్ విడుదలైంది. వాసువర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా నుండి వచ్చిన యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే పాయింట్ తో కథ నడుస్తుందని సమాచారం. 'వాసువర్మ' గతంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'జోష్' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక 'కృష్ణాష్టమి' చిత్రంలో 'నిక్కి గాల్ రాణి' కథానాయికగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, ఆశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర, లోకేష్ తదితరులు నటిస్తున్నారు. త్వరలో చిత్ర విడుదల తేదీ ప్రకటిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. 

15:42 - September 6, 2015

హైదరాబాద్ : బిడ్డా..దమ్ముంటే రా..అంటూ తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయినీ నర్సింహరెడ్డి సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులకు మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత పలు వ్యాఖ్యలు చేయడం పట్ల హోం మంత్రి పై విధంగా స్పందించారు. టీఆర్ఎస్ నాయకులను తిరగనివ్వమని పేర్కొంటున్నాడని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవని హితవు పలికారు. ఘటనపై విచారణ జరుపుతామని ఏ ఎమ్మెల్యేది తప్పు అయినా చర్యలుంటాయని స్పష్టం చేశారు. కానీ ఒక ఎస్సీ ఎమ్మెల్యేను కొట్టి ధర్నాలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. ఎవరూ కూడా క్షమించరని, తమ ఎమ్మెల్యే బాలరాజుపై చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. అనవసరంగా కొట్టాడని ఫిర్యాదు చేసి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. కావాలనే గొడవలు చేస్తున్నారని, అధికారంలో ఉన్న కారణంగానే గొడవలు చేయడం లేదని చెప్పారు. నీళ్లలో ఉన్న చేప భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో అలా కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ కు టిడిపి సహాయం చేస్తోందని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అడగాలని టి.టిడిపి నేతలకు సూచించారు. 

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో ఆదివారం మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నల్లకుంట, బాగ్ లింగం పల్లి తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

15:22 - September 6, 2015

వరంగల్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ నల్లా నర్సయ్య మృతి చెందారు. వరంగల్ జిల్లా జనగామ మండలం అడవికేసీపురానికి చెందిన నర్సయ్య ఏసీరెడ్డి దళంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఎన్నో పోరాటాల్లో పోరాట జెండా ఎగురవేసిన ఆయన తుది శ్వాస వరకు సీపీఎం అభివృద్ధి వరకు కృషి చేశారు. ఏసీ రెడ్డితోనే కాకుండా మిగతా నాయకులతో కలిసి పీడితుల కోసం పోరాటం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటని కుటుంబసభ్యులు తెలిపారు. 

విజయవాడలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

విజయవాడ : రైల్వే స్టేషన్ సమీపంలో లో బ్రిడ్జి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పలు రైళ్ల రాకపోలకు అంతరాయం కలిగింది. 

ఈనెల 7న వరంగల్ కు దత్తాత్రేయ..

వరంగల్: బీడి కార్మికుల సమస్యలపై ఈ నెల 7న వరంగల్ శంభునిపేటలో నిర్వహిస్తున్న బీడి కార్మికుల సదస్సుకు కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరుకానున్నట్లు వరంగల్ మాజీమేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు తెలిపారు.

 

ఓఆర్ఓపీ కోసం రూ.10వేల కోట్లకు పెంచాం - మోడీ..

హర్యానా: గత ప్రభుత్వం ఓఆర్‌ఓపీ కోసం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.10 వేల కోట్లకు పెంచామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడగానే ఓఆర్‌ఓపీ అమలుకు నిర్ణయించిందని చెప్పారు. 

హర్యానా తనకు రెండో ఇళ్లు - మోడీ..

హర్యానా : హర్యానా నాకు రెండో ఇల్లు వంటిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. బదర్‌పూర్ మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుజరాత్ నుంచి వచ్చాక చాలాకాలం తర్వాత హర్యానాలో గడిపానని పేర్కొన్నారు.

సానియా, బోపన్న జోడీల ముందంజ..

న్యూయార్కు : యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడి, పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న జంట ముందంజ వేశాయి. 

రక్షణ మంత్రి ప్రకటన తప్పుదోవ పట్టించేట్లుగా ఉంది - ఆంటోని..

ఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని మాజీ రక్షణమంత్రి ఎ.కే.ఆంటోని విమర్శించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ పై రాత పూర్వక ఆదేశాలిస్తేనే నమ్మశక్యంగా ఉంటుందన్నారు.

తలసానిపై షబ్బీర్ ధ్వజం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకుంది భూ కబ్జాలు చేసేందు కాదని, తలసాని సోదరుడు శంకర్ యాదవ్ బోయిన్ పల్లిలోని ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ తల్లి..బీజేపీ బిడ్డ – వెంకయ్య..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ తల్లి అయితే బిడ్డ బీజేపీలాంటిదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తల్లి దగ్గరకు పిల్లలు వెళితే తప్పా అని పేర్కొన్నారు. 

వైఎస్ విగ్రహం ధ్వంసం..

పశ్చిమగోదావరి : దివంతగత వైఎస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాలోని నల్లజర్ల మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. 

14:16 - September 6, 2015

విశాఖపట్టణం : విశాఖపట్టణాన్ని క్లీన్..గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం చంద్రబాబు విశాఖలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటక, పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాలు విశాఖలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడున్న ఆర్టీసీ కాంప్లెక్సును ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ దీనిని కమర్షియల్ గా ఉపయోగించుకొనే అవకాశాలను చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఫిషరీస్ మార్కెట్ ను ఒక పద్ధతి ప్రకారం మోడ్రన్ గా తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓల్డ్ సిటీ చాలా భయంకరంగా ఉందని, డ్రైన్ వాటర్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పాతకాలంగా ఉన్న డ్రైన్స్ ను తొలగించడంపై చర్యలు తీసుకుంటామని, నివాసాల్లో ఉన్న వారు చెత్తను డ్రైన్ లో వేయవద్దని సూచించారు. పేద వారు వివాహం చేసుకోవడానికి మ్యారేజ్ కాంప్లెక్సులు నిర్మాణం చేస్తామని చంద్రబాబు తెలిపారు.

క్రీడోత్సవాలను ప్రారంభించిన తెలంగాణ డీజీపీ..

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్రీడోత్సవాలను డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు.

 

కరీంనగర్ - హైదరాబాద్ మార్గంలో తనిఖీలు..

హైదరాబాద్ : కరీంనగర్ - హైదరాబాద్ మార్గంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓ యువతిని తుపాకితో బెదిరించి కారులో కొందరు వ్యక్తులు వెళ్లారని పోలీసులకు సమాచారం అందింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

 

ఏపీకి రూ.23వేల కోట్లు ఇచ్చాం - పురంధేశ్వరీ..

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి రూ.23వేల కోట్లను సాయంగా అందించామని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ పేర్కొన్నారు. జిల్లాలో నంద్యాలలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎంతవరకు వస్తుందన్న విషయాలని చెప్పలేమన్నారు. 

13:39 - September 6, 2015

గుంటూరు : రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. రాజధాని ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్తబ్ధత ఏర్పడిందని కేపిటల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంఘం నేతలు అంటున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం సమావేశం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు నూతలపాటి శ్రీధర్ రావు, సభ్యులు కె.రామకోటేశ్వరరావు తెలిపారు. వేదిక కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందన్నారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ ప్రమోటర్ల పరిస్ధితి మరింత దయనీయంగా మారిందంటున్నారు. అర్ధం లేని ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోతున్నామన్నారు.

13:36 - September 6, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని టీడీపీ నేత ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే రైతుల్ని పట్టించుకోని రాష్ట్రంగా మిగిలిందని ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఫాం హౌస్‌లోని వ్యవసాయం మీద ఉన్న దృష్టి తెలంగాణ రైతాంగం మీద లేదని ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. 

13:34 - September 6, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌, టీడీపీ నేతలపై.. మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్‌ అయ్యారు. జిల్లాపై మాట్లాడే నైతిక హక్కు నేతలకు లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి.. ఓ బూతుపురాణం అన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు బండబూతులు మాట్లాడాడని, ఆయన మృదు స్వభావికాదని.. ముదురు స్వభావి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే నైతిక హక్కు లేదని, మీ బతుకులే బానిస బతుకులు. మీబుద్ధే బానిసం అంటూ విరుచుకపడ్డారు. ఇరు పార్టీల నేతలకు ఇప్పట్లో సిగ్గు రాదంటూ మండిపడ్డారు.

13:32 - September 6, 2015

అనంతపురం : జిల్లా పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రక్త దానం చేశారు. సత్యసాయి ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలను మంత్రి కామినేని ప్రశంసించారు. వైద్య సేవలను అందించడంలో సత్యసాయి ముందంజ వేసిందన్నారు.

 

పాలకుర్తిలో ఎర్రబెల్లి పాదయాత్ర..

వరంగల్ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని గూదురులో టిడిపి శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి ఆదివారం పాదయాత్ర చేశారు. గూదూరు నుండి కొత్తలాబాద్ వరకు పాదయాత్ర జరిపారు. 

'రైల్వే జోన్ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం'

విశాఖపట్టణం : రైల్వే జోన్ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. విభజన బిల్లులో స్పష్టత లేనందునే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమస్యలపై కేంద్రం స్థాయిలో త్వరలోనే చర్చిస్తామన్నారు. 

ఎంపీ బీబీ పాటిల్ కు గాయాలు..

మెదక్ : కల్హేరు మండలం బాచేపల్లి వద్ద జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎంపీకి స్వల్పగాయాలయ్యాయి. 

మెడికో ఫైనల్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారయత్నం..

విజయవాడ : మెడికో ఫైనలియర్ విద్యార్థినిపై తోటి విద్యార్థి శ్రీధర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. పటమట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విమ్స్ లో ఉద్యోగాల మోసంలో నిందితుడు అరెస్టు..

విశాఖపట్టణం : విమ్స్ లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు రామన్ భల్లాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అతను కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఉద్యోగాల పేరిట రూ.90 లక్షలు వసూలు చేశామని, విమ్స్ డైరెక్టర్ సుబ్బారావు పాత్ర ఉందని రామన్ భల్లా వెల్లడించినట్లు తెలుస్తోంది. 

13:10 - September 6, 2015

మెదక్ : జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. పటన్ చెరులోని అమీన్ పూర్ లో హరితహారం కార్యక్రమంలో ఎంపీ పాటిల్ పాల్గొన్నారు. అనంతరం కారులో ఆయన నిజామాబాద్ కు వెళుతున్నారు. కల్హేరు మండలం బాజేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దును తప్పించబోయి కారు బోల్తా పడింది. దీనితో ఎంపీ పటేల్ కు స్వల్పగాయాలయ్యాయి. ఆయనతో పాటు ఉన్న అనుచరులకు కూడా గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్థానిక ఆసుపత్రిలో ఎంపీకి చికిత్స అందించారు. స్వల్పగాయాలేనని ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. 

కాంగ్రెస్ ఆకృత్యాలు సమాజం మరిపోదు - జూపల్లి..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత ఆకృత్యాలను తెలంగాణ సమాజం మరిచిపోదని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎమ్మెల్యేల సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చారని అభివర్ణించారు. పాలమూరు కరువుపై మాట్లాడే హక్కు టిడిపి వారికి లేదని, పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించపచేసే వరకు టిడిపి నేతలు మాట్లాడవద్దని సూచించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, ఓయూ విద్యార్థులను చితకబాదిన చరిత్ర దానం నాగేందర్ దని తెలిపారు. 

అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారం - మోడీ..

ఢిల్లీ : అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ - ఫరీదాబాద్ మెట్రో రైలును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ ప్రసంగించారు. దేశాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని, తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, విధానపరమైన నిర్ణయాలే ముఖ్యమని స్పష్టం చేశారు. అభివృద్దితోనే పేదలకు ప్రయోజనం కలుగుతుందని, ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు.

 

13:06 - September 6, 2015

విజయవాడ : నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గత కొంతకాలంగా విద్యార్థినిని వేధిస్తున్నాడని సమాచారం. సదరు విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో ఉంటోంది. శ్రీధర్ అర్ధరాత్రి విద్యార్థిని ఉంటున్న గదికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేసి అతని కబంధ హస్తాల నుండి విద్యార్థిని తప్పించుకుంది. ఈ విషయంపై విద్యార్థిని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

12:55 - September 6, 2015

మీరే భాషలో పలకరిస్తారో ఆ భాష మీదికాదు...నేను ఏ భాషలో ప్రతిస్పందిస్తానో అది నా భాషకాదు అంటూ.. సరికొత్త భాషలో కవితలు రాసి కవితా ప్రియులను మెస్మరిజం చేస్తూ విస్మయానికి గురి చేశారు యువ కవయిత్రి మెర్సీ మార్గరేట్. సరళమైన భాషలో సుమ సుకుమార భావాలతో అరుదైన ప్రతీకలతో కవితలల్లిన మెర్సీ మార్గరేట్ పరిచయకథనం.

12:50 - September 6, 2015

కొందరు గుండెలను పిండేసే పాటలు రాస్తారు. బడుగుజీవులు కష్టాలను కన్నీళ్ళను అక్షర భాషలోకి అనువదిస్తారు. పాటై ఆక్రోషిస్తాడు. అలాంటి గేయ కవే భానూరి సత్యనారాయణ. నవోదయం, ఎర్రసైన్యం, అరణ్యం లాంటి సినిమాల్లో పేదల ఈతి బాధలను విషాద గీతాలుగా మలిచిన భానురి సత్యనారాయణ జనం పాటలను ప్రముఖ గేయరచయిత స్ఫూర్తి పరిచయం.

12:47 - September 6, 2015

ప్రముఖ అభ్యుదయ నవలాకారుడు కన్నడ సాహితీవేత్త డా.యం.యం.కాల్ బుర్గి హిందూ మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు. భారతరాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. అయితే కొందరు మతోన్మాదులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే కవులను రచయితలను మేధావులను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా కర్నాటకలో ప్రముఖ సాహితీవేత్త కన్నడ హంపి యూనివర్సిటి మాజీవైస్ ఛాన్సర్ డా.యం.యం.కాల్ బుర్గిని మతోన్మాదులు హత్యచేశారు. ఈ హత్యోదంతాన్ని ఖండిస్తూ ఆ మహాసాహితీవేత్తకు 10 టి.వి.నివాళులర్పిస్తోంది.

12:44 - September 6, 2015

ఢిల్లీ : బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మహిళలు పింక్‌ థాన్‌ పేరిట మారథాన్‌ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ అవగాహన కోసం మారథాన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ తో పోరాడుతామని మహిళలంతా ప్రతిజ్ఞ చేశారు. 

12:42 - September 6, 2015

చిత్తూరు : తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో.. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. దీంతో సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 7 గంటలు పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దాదాపు అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. క్యూలైన్ల వెలుపల కూడా భక్తులు బారులు తీరారు.

ఇందిరాపార్కు వద్ద సిర్పూర్ పేపర్ కార్మికుల ధర్నా..

ఆదిలాబాద్ : సిర్పూర్ పేపర్ మిల్లును వెంటనే తెరిపించాలని ఆ సంస్థ కార్మికులు డిమాండ్ చేశౄరు. ఈ మేరకు మిల్లు కార్మికులు నగరంలోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. 

12:16 - September 6, 2015

రంగారెడ్డి : జిల్లాలోని మన్నెగూడలో విషాదం చోటు చేసుకుంది. ఓ కార్పొరేట్ స్కూలో లో 9వ తరగతి విద్యార్థి ఛాతి నొప్పితో మృతి చెందాడు. దీనికి స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దీనితో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ ఘటన పూడురు మండలం మన్నెగూడలో చోటు చేసుకుంది. నవీన్ గౌడ్ అనే విద్యార్థి కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఛాతినొప్పి రావడంతో ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలిపాడు. వికరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుక రాకపోవడం వల్లే నవీన్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. ఛాతి నొప్పి వస్తుందని చెప్పినప్పుడే ఆసుపత్రికి తరలించి ఉంటే నవీన్ మృతిచెందేవాడు కాదని తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. 

12:11 - September 6, 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి కోసం పది లక్షల ఎకరాల భూమి ఏర్పాటు కోసం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పారిశ్రామిక ప్రగతి ఆశించిన స్థాయిలో సాధ్యం కావాలంటే మనకు వీలైనంత స్థాయిలో భూమి అందుబాటులో ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల భూమిని సేకరించడం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందా ? పారిశ్రామిక ప్రగతి ఆశించిన స్థాయిలో అభివృద్ది సాధ్యమౌతుందా ? ఇందులో దీర్ఘకాలికంగా సమస్యలున్నాయా ? ఈ అంశాలపై టెన్ టివి నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొని, విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.

12:06 - September 6, 2015

ఢిల్లీ : మాజీ సైనికులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ అమలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్రం ప్రకటనతో గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఈ సమస్యకు కేంద్రం ప్రకటనతో ఎట్టకేలకు తెరపడింది. మరోవైపు తమ డిమాండ్లలో కేలవం ఒక్కదానినే మాత్రమే కేంద్రం ఆమోదించిందిని..ఇంకా ఆరుడిమాండ్లు అలాగే ఉన్నాయని..అవి సాధించేవరకు ఆందోళనల్ని కొనసాగిస్తామని మాజీ సైనికులు తేల్చిచెప్పారు.

ప్రతిష్టంభనకు తెరదించిన కేంద్రం..
మాజీ సైనికులకు సంబంధించి వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌పై గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్రం ఎట్టకేలకు తెరదింపింది. ఓఆర్‌ఓపిని అమలు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారీకర్ ప్రకటించారు. జూలై 1 2014 నుంచి వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ను అమలు చేస్తామని ప్రకటించిన మంత్రి..బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామన్నారు. అమర వీరుల కుటుంబాలకు ఒకే విడతలో బకాయిలను చెల్లిస్తామన్నారు. అయితే వీఆర్‌ఎస్‌ తీసుకున్న సైనికులకు ఇది వర్తించదని మంత్రి మనోహర్‌ పారీకర్‌ స్పష్టం చేశారు. 2013 సంవత్సరంలో అందిన సరాసరి పెన్షన్‌ను పునాదిగా తీసుకొని ప్రతి ఐదేళ్లకోసారి పెన్షన్‌పై సమీక్ష జరపనున్నట్టు ప్రకటించారు. ఓఆర్‌ఓపి అమలు వల్ల కేంద్రంపై సుమారు 10 వేల కోట్ల భారం పడుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఓఆర్‌ఓపి అమలు చేయడం వల్ల పడే భారాన్ని 500కోట్లుగా అంచనా వేసి బడ్జెట్‌లో కేటాయించడం జరిగిందన్నారు. ప్రధాని ఇచ్చిన హామీ మేరకు గత కొన్నిరోజులుగా విస్తృత సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పారీకర్‌ తెలిపారు.

సంతృప్తి చెందని మాజీ సైనికులు..
ఓఆర్‌ఓపిపై కేంద్రం చేసిన ప్రకటనను మాజీ సైనికులు స్వాగతించారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై తాము పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని తెలిపారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న సైనికులకు పెన్షన్‌ వర్తించదని చెప్పడాన్ని తాము ఒప్పుకోమన్నారు. సైనికుల్లో 40శాతం మంది స్వచ్చంధ పదవీ విరమణ తీసుకుంటారని...అలాంటప్పుడు ఈ పథకాన్ని సైనికులందరికి వర్తంపచేయాలని మాజీ సైనికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఐదేళ్లకోసారి పించన్‌పై సమీక్షిస్తామన్న ప్రభుత్వ..రెండేళ్లకోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. తాము చేపట్టిన పోరాటం ద్వారా 60శాతం మాత్రమే విజయం సాధించామని..ఇంకా 6డిమాండ్లు అలాగే ఉన్నాయన్నారు. తమ డిమాండ్లు పూర్తిగా సాధించేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అప్పటివరకు తాజా ప్రకటనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఆందోళనలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్..
ఒకే హోదా..ఒకే ఫించన్‌ పథకంపై కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీఏ హయాంలో రూపుదిద్దుకున్న వన్‌ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పై మోది సర్కార్‌ యూ టర్న్‌ తీసుకుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. రక్షణశాఖలో కూడా మోది ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్తిస్తున్నారు. మాజీ సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేయాలని నిర్ణయించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ ఆదేశం ?
40 ఏళ్లుగా నానుతున్న ఈ సమస్యకు తెర దించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ పథకం వల్ల 28లక్షల మాజీ సైనికోద్యోగుల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం రక్షణశాఖ పెన్షన్‌ చెల్లింపుల కోసం 54వేల కోట్లను వ్యయం చేస్తోంది. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశంలో వన్‌ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌కు సంబంధించి ముసాయిదా కాపీలను సర్క్యూలేట్‌ చేసినట్లు తెలిసింది. ఓఆర్‌ఓపిని నిర్లక్ష్యం చేయోద్దని ...ఆ సమస్యపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు మోడీ ప్రభుత్వానికి ఆదేశించినట్లు తెలుస్తోంది. అందువల్లనే మోడీ ప్రభుత్వం శనివారం హడావుడిగా వన్‌ ర్యాంక్‌..వన్‌ పెన్షన్‌పై ప్రకటన చేశారని సమాచారం. 

11:56 - September 6, 2015

గుంటూరు : జిల్లా నరసారావుపేట నకిలీ పాలు తయారీదారులపై దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక రెడ్డినగర్‌లో నకిలీపాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో.. గుంటూరు జిల్లా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూడు ఇళ్లలో సోదాలు చేసి.. నకిలీ పాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను, వాటి శాంపిల్స్‌ను సేకరించారు. ఈ దాడుల్లో సుమారు 70వేల విలువైన ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్లనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు.

11:54 - September 6, 2015

గుంటూరు : ఐ రైడ్‌ విత్‌ ఇండియా నినాదంతో గుంటూరులో ఐఎంఏ వైద్యులు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద మున్సిపల్‌ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిలు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వైద్యులతో కలిసి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వేణుగోపాల్‌ రెడ్డిలు 5 కిలో మీటర్ల సైక్లింగ్‌ లో పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతిలో ప్రత్యేకంగా సైక్లింగ్‌ కోసం ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 

11:31 - September 6, 2015

చిత్తూరు : భక్తులకు శ్రీవారి లడ్డూ భారం కానుందా ? రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను సాకుగా చూపించి లడ్డూ ధరను పెంచేందుకు టీటీడీ యత్నిస్తుందా ? ఇకపై సామాన్యులు శ్రీవారి లడ్డూలు కొనడం అసాధ్యమేనా ? శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు ముందుగా అడిగేది లడ్డూనే. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి టీటీడీ ప్రసాదంగా లడ్డూను అందిస్తుంటారు. అయితే ఇవి చిన్న పరిమాణంలో ఉంటాయి. నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టిటిడి వివిధ మార్గాల ద్వారా లడ్డూలను విక్రయిస్తోంది. ఉచిత దర్శనం భక్తులకు సబ్సిడీపై రెండు లడ్డూలను ఇస్తుండగా,..నడకదారి భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు 20రూపాయలకు రెండు సబ్సిడీ లడ్డూలు, ఇంకా అదనంగా కోరుకున్నవారికి 50 రూపాయలకు రెండు లడ్డూలను టోకెన్ల ద్వారా విక్రయిస్తోంది. ఇక 300, 50రూపాయల ప్రత్యేక ధర్శనం భక్తులకు టికెట్ పై రెండు లడ్డూలను ఇస్తున్నారు. ఇవిచాలని భక్తులకు శ్రీవారి ఆలయం వెలుపల అదనపు లడ్డు కౌంటర్ల ద్వారా ఒక్కోటి 25 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కూడా క్యూలైనులో ఉన్న వారికి రెండు లడ్డూల చొప్పున విక్రయిస్తారు. ఇలా శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి నాలుగు నుండి ఐదు లడ్డూలను ఇస్తోంది టీటీడీ.

5 లక్షలు తయారుచేయాలని లక్ష్యం ..
ప్రపంచవ్యాప్తంగా పేటెంట్‌ హక్కు పొందిన శ్రీవారి లడ్డూలను పోటు, అదనపు పోటులలో కలిపి రోజు 3 లక్షలకు పైగా తయారుచేస్తున్నారు. అయితే 5 లక్షల లడ్డూలను తయారుచేయాలని టీటీడీ భావిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. లడ్డూ తయారీ చేసేవాళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుండడంతో లడ్డూల తయారీకి టీటీడీ అనేక ప్రయోగాలు చేసింది. యంత్రాలపై లడ్డూలు తయారుచేయించింది. అవి అంత రుచికరంగా లేకపోవడం దానికితోడు నిల్వ కూడా ఉండకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ వెనక్కి తగ్గింది. టీటీడీ పోటులో శ్రీవైష్ణవులు చేతితో లడ్డూలు తయారుచేస్తుండగా...అదనపు పోటులో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు లడ్డూలు తయారీ చేస్తున్నారు.

సైజు తగ్గిందనే ఆరోపణలు..
ఇక రోజురోజుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో భక్తులకు సరిపడా లడ్డూలను టీటీడీ అందించలేకపోతోంది. గతంలో శ్రీవారి లడ్డూ సైజు కూడా తగ్గిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన టీటీడీ..ఒక్కో లడ్డూ పరిమాణం ఖచ్చితంగా 175 గ్రాములు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తులకు ఇచ్చే లడ్డూల పరిమాణాన్ని పరిశీలించేందుకు అన్ని కౌంటర్ల వద్ద వెయింగ్‌ మిషన్లను కూడా ఏర్పాటు చేశారు.

ఒక్కో లడ్డూ ధర రూ.39 ?..
మరోపక్క ఎంతో విశిష్టమైన శ్రీవారి లడ్డూ ధరలను పెంచేందుకు టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో ఒక్కో లడ్డూ తయారీకి 35 నుంచి 39 రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. దీంతో నష్టాన్ని పూడ్చుకోవాలంటే భక్తులకు అదనంగా ఇచ్చే లడ్డూల ధరలను పెంచడం ఒక్కడే మార్గమని భావిస్తున్నారు. దీంతో లడ్డూ ధరను 35 రూపాయలుగా నిర్ణయించాలని ఆలోచిస్తున్నారు. ఇదే అంశాన్ని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి సూచనప్రాయంగా తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత జరిగే సమావేశాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ధర పెంపుదల యోచనపై భక్తుల ఆగ్రహం..
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే శ్రీవారి లడ్డూ ధరను పెంచే ఆలోచనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని లడ్డూను ప్రసాదంగా స్వీకరించకపోతే తిరుమలకు వచ్చిన తృప్తే ఉండదని భక్తులంటున్నారు. అంతటి విశిష్టం ఉన్న లడ్డూ ధరను పెంచాలనుకోవడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలకు భక్తుల ద్వారా ఎన్నో కోట్లు ఆదాయం వస్తుండగా.. లడ్డూ తయారీపై నష్టం వస్తుందని సాకుగా చూపి ధరలు పెంచాలనుకోవడం దారుణమని భక్తులంటున్నారు. లడ్డూ ధరలు పెరిగితే సామాన్య భక్తులపై భారం మరింత పడుతుందని వారంటున్నారు. 

11:28 - September 6, 2015

చిత్తూరు : కలియుగ వైకుంఠుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకుంటారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదమైన లడ్డూను కొనుగోలు చేసేందుకు భక్తులు ఎంతో పరితపిస్తుంటారు. లడ్డూ ప్రసాదం స్వీకరించకపోతే... తిరుమలను దర్శించుకున్న ఫీలింగే ఉండదని శ్రీవారి భక్తులు అంటున్నారంటే ఆ లడ్డూకు ఎంత విశిష్టత ఉందో తెలుస్తోంది. తిరుమలకు ఎవరు వెళ్లొచ్చినా..ముందుగా అందరూ అడిగిదే శ్రీవారి ప్రసాదాన్నే. శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు మహా ప్రసాదం. అందుకే ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు ఎంతగానో ఆరాటపడుతుంటారు.

1940లో భక్తులకు అందుబాటులోకి వచ్చిన లడ్డూ..
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆచారం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. 1940లోనే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు కూడా ఎన్నో ప్రసాదాలు ఉన్నప్పటికీ.. లడ్డూనే బాగా ప్రాచుర్యం పొందింది. తిరుమలలో వడ ప్రసాదంగా ఉండేది. అయితే అప్పటి మద్రాసు ప్రభుత్వం స్వామివారికి ప్రత్యేకంగా ఒక ప్రసాదం ఉండాలని భావించింది. అందుకోసం మంచి రుచితో.. నిల్వ వుండేలా తయారు చేసింది. తొలుత బియ్యంపిండిలో బెల్లం కలిపి ప్రసాదాన్ని తయారుచేసే వారు కాలక్రమేణా అది రూపాంతరం చెంది లడ్డూగా మారింది.

3 లక్షలకు పైగా లడ్డూల తయారీ..
భక్తులకు ఎంతో తృప్తినిచ్చే లడ్డూ ప్రసాదం శ్రీవారి ఆలయంలోని పోటులోనే తయారుచేస్తారు. దీనినే దిట్టం అంటారు. ఒక్కో దిట్టంలో ఐదు వేల ఒక వంద లడ్డూలు తయారుచేస్తారు. ఇక శ్రీవారి లడ్డూ తయారీలో శనగపిండి, పంచదార, జీడిపప్పు, పచ్చకర్పూరం, నెయ్యి, పటిక బెల్లం వాడుతుంటారు. ఇక ఒక్కో దిట్టంలో తయారుచేసే లడ్డూలకు 400 కిలోల చక్కెర, 35 కిలోల ముంతమామిడి పప్పు, 1750 కిలోల కలకంద, 5 కిలోల యాలకులు, 10 కిలోల ఎండుద్రాక్ష, 185 కిలోల నెయ్యి, 200 కిలోల శనగపప్పు వాడుతారు. ఇది శ్రీవారి లడ్డూ పేటెంట్‌ హక్కు పొందినప్పటి దిట్టం. ఆ తర్వాత దిట్టంలో మార్పులు వచ్చాయి. ఇక లడ్డూ తయారీలో గతంలో కొండపై దొరికే ఎన్నో సుగంధ ద్రవ్యాలు వాడేవారు. ప్రస్తుతం కేరళ నుంచి సుగంధ ద్రవ్యాలను తెప్పిస్తున్నారు. శ్రీవారి లడ్డూలో ఎలాంటి రసాయనాలు కలపకపోయినా నెలరోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇదంతా శ్రీవారి మహాత్యమేనని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకునేందుకు 70 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. వీరి కోసం రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలు తయారుచేస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డూకు ఎంతో పేరు..
శ్రీవారి లడ్డూ రుచికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. లడ్డూ తయారీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. తిరుమల లడ్డూ రుచి మరెక్కడా రాదంటే అతిశయోక్తి కాదేమో ! తిరుమలలో తయారయ్యే లడ్డూ రుచి మరెక్కడా దొరకదని భక్తులంటుంటారు. వంటకాల్లో ఎంత చెయ్యి తిరిగినవారైనా.. ఇలాంటి రుచి తీసుకురావడం కష్టమే అంటుంటారు. ఇక్కడి లడ్డూకు ఇంతటి రుచి రావడం వెనుక శ్రీవారి మహిమ ఉందనేది భక్తుల విశ్వాసం. లడ్డూ నాణ్యతపై ఎన్ని ఆరోపణలు వచ్చినా దాని ప్రాముఖ్యత తగ్గలేదనేది వాస్తవం. 

11:23 - September 6, 2015

కృష్ణా : బందరు పోర్టు లో ఓ రైతు గుండె ఆగిపోయింది. తన భూమి ప్రభుత్వం లాక్కోంటోందని..దీనితో తన కుటుంబం ఎలా జీవనం సాగించాలనే దానిపై తీవ్ర మనస్థాపానికి గురైన రైతు తనువు చాలించాడు. గుండె పోటు రావడంతో ఆయన కన్నుమూశాడు. ఇటీవలే ఏపీ సర్కార్ బందరు పోర్టు నిర్మాణం కోసం భూముల సేకరణ చేపట్టింది. సుమారు 14,700 ఎకరాల భూములు సేకరించడానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులతో సమామేశమయ్యారు. స్వచ్ఛందంగా భూములివ్వాలని సూచించారు. దీనికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భూములిస్తే ఎక్కడ జీవనం సాగించాలని, తామంతా చిన్న, సన్నకారు రైతులమని వేడుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను పట్టించుకోలేదు. దీనితో మేకవానిపాలెంలో ఉండే పూర్ణచందర్ రావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనకున్న 3ఎకరాల 75 సెంట్ల భూమి పోతే తన కుటుంబం ఎలా జీవించాలని మథన పడ్డాడు. ఎలాగైనా భూమి ప్రభుత్వం లాక్కొంటుందని భావించిన పూర్ణచందర్ రావుకు ఆదివారం గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దీనితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

11:16 - September 6, 2015

అసోం : రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దుబ్రీలోని ఇండియా బంగ్లాదేశ్‌ సరిహద్దుకు వరదలు పోటెత్తాయి. దీంతో వరదల్లోనే బీఎస్ఎఫ్ సైనికులు పహారా కాస్తున్నారు. వరదలతో సైనికుల స్థావరాలు, క్యాంపులు నీట మునిగాయి. సరిహద్దులోని కంచెను మించి వరద నీరు ప్రవహిస్తుంది. అయితే అంత వరదల్లో కూడా సైనికులు ప్రత్యేక బోట్లతో కాపలా కాస్తున్నారు. ఎంతకష్టమైనా దేశ రక్షణకోసం భరిస్తామంటున్నారు సైనికులు.

11:14 - September 6, 2015

హైదరాబాద్ : సైబరాబాద్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డెన్‌ సర్చ్ చేపట్టారు. హస్మత్‌పేట్‌, అంజయ్యనగర్‌లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 28మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 51 బైక్‌లు, 3 ఆటోలు, 9 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డీసీపీ రామా రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

రిసార్ట్స్ పై ఎక్సైజ్ శాఖ దాడులు..

రంగారెడ్డి : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు రిసార్ట్స్ పై ఎక్సైజ్‌శాఖ పోలీసులు దాడులు చేపట్టారు. హ్యాపీ హోమ్ రిసార్ట్స్, విల్లో స్ప్రింగ్ రిసార్ట్ లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

బందరు పోస్టు భూ సేకరణలో విషాదం..

కృష్ణా : బందరు పోర్టు భూముల సేకరణలో విషాదం చోటు చేసుకుంది. మేకవానిపాలెంలో రైతు రామ్మోహన్ గుండెపోటుతో మృతి చెందాడు. పోర్టు భూ సేకరణలో భాగంగా తన భూమి కోల్పోతామని మనస్థాపానికి గురయ్యాడు. 

రైతులతో కొనకళ్ల, కొల్లు సమావేశం..

కృష్ణా : బందరు మండలం పెదకర ఆగ్రహారంలో రైతులతో ఎంపీ కొనకళ్ల, మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి స్వచ్చందంగా భూములివ్వాలని రైతులను వారు కోరారు. గ్రామంలో సెంటు భూమి కూడా ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. బలవంతంగా లాక్కొంటే సహించమని రైతులు స్పష్టం చేశారు. 

పారిశుధ్యంపై అసహనం వ్యక్తం చేసిన బాబు..

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం విశాఖలో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అల్లిపురంలో అపరిశుభ్రతపై ఆయన అసహానం వ్యక్తం చేశారు. సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి పరిసరాలు, అబ్బుల్‌ కలాం పార్క్ ను ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు.

 

11:06 - September 6, 2015

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. విశాఖలోని వైఎస్‌ఆర్‌ పార్క్, చావులమాదం, అల్లీపురంలోని పారిశుధ్యంపై ఆరా తీశారు. డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. పారిశుధ్యం సరిగా లేకపోవడంతో... జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24గంటల్లో పనులు మెరుగుపర్చాలని ఆదేశించారు.

11:01 - September 6, 2015

కడప : విద్యార్థులకు దారి చూపాల్సిన వాడే దారితప్పాడు..! 120 కోట్ల మంది తలవంచే జాతీయ చిహ్నానికి తలవంపులు తెచ్చాడు..! వ్యక్తిగత ఇష్టాలను.. వ్యవస్థపై రుద్దిన కడప యోగిమేన యూనివర్సిటీ వీసీ.. రాజ్యాంగాన్ని బహిరంగంగా అవమానించాడు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హద్దులు దాటిన వ్యక్తిగత మత విశ్వాసాలతో.. రాజ్యాంగాన్నే అవమానించాడు కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్ లర్ భేతనభట్ల శ్యామసుందర్. యూనివర్సిటీ పరిపాలనా భవనంపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేసి, దానిపై వినాయకుడి బొమ్మను ఏర్పాటు చేయించి, బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు.

వాస్తును నమ్మే వీసీ..
వాస్తు నమ్మకాలు అతిగా పాటించే వీసీ శ్యామసుందర్‌.. నైరుతి మూలలో బరువు ఉండాలంటూ పరిపాలనా భవనంపైన పెద్ద స్తంభం నిర్మించాడు. దానిపై నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయించాడు. ఇంత వరకూ సర్దుకుపోదామనుకున్నా.. ఆ జాతీయ చిహ్నంపై తన ఇష్టదైవమైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. రాజ్యంగం ప్రకారం.. జాతీయ చిహ్నంపైనా, జాతీయ జెండాపైనా ఇతర గుర్తులు ఏవీ ఏర్పాటు చేయకూడదు. అయితే.. విద్యార్థులకు బుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయ వీసీనే.. జాతీయ చిహ్నాన్ని అవమానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన వ్యక్తిగత నమ్మకాలకోసం.. ఏకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జాతీయ చిహ్నాని అవమానించడం దేశ ద్రోహం కిందకు వస్తుంది కాబట్టి.. వీసీ శ్యామ సుందర్ ను విధుల్లోంచి తొలగించి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

పోలీసులు ఫిర్యాదు చేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు..
ఈ వ్యవహారంపై కడప జిల్లా బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించినందుకు వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఏ విద్యాసంస్థలోనైనా.. పాలనాధికారి ఛాంబర్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి చిత్రపటాలు ఉండడం సహజం. కానీ.. ఇక్కడ మచ్చుకు ఒక్కరి చిత్రమైనా కనిపించకపోవడం గమనార్హం. కనీసం.. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫొటో కూడా ఏర్పాటు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.

బహిష్కరించాలనే డిమాండ్స్..
ఈ విధంగా.. తన వ్యక్తిగత విశ్వాసాలను యూనివర్సిటీలో పాదుకొల్పుతూ.. విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వీసీ వల్ల.. విద్యార్థుల్లోకి చెడు మెసేజ్‌ వెళ్తుందని భావిస్తున్న పలువురు.. శ్యామసుందర్‌ను వెంటనే విధుల్లోంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

10:58 - September 6, 2015

హైదరాబాద్ : గులాబీ నేతల్లో ఆశావహులంతా.. ఆరో నెంబర్‌ జపం చేస్తున్నారు..! కలలో ఆరునే కలవరిస్తున్నారు.. మనసులో ఆరునే పలవరిస్తున్నారు..! ఈ ఆరు మిస్సైతే ఆరిపోతామంటూ యమా ఆందోళన చెందుతున్నారు..! ఇంతకీ.. ఈ ఆరు గోల ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే..!తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా.. ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్‌ పద్ధతి మారలేదు. అదే జాతకాలను నమ్మడం. ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా.. ముహూర్త బలం చూసుకున్న తర్వాత కానీ అడుగు ముందుకేయరు గులాబీ దళపతి. ఈ నమ్మకాలపై వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్‌ సెంటిమెంట్‌లో వర్కౌట్‌ శాతమే ఎక్కువంటారు గులాబీ నేతలు. సీఎం కారు నంబరు మొత్తం కలిపితే వచ్చే సంఖ్య ఆరు. కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ఆరు కాబట్టే నంబర్‌ అలా ఉందంటారు సన్నిహితులు. దీన్నే నిజం చేస్తూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చివర్లో ఆరు నంబర్‌ వచ్చేలా మొబైల్‌ నంబర్లు మెయింటెయిన్‌ చేస్తున్నారు నేతలు.

నంబర్ ఫీవర్..
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే నంబర్‌ ఫీవర్‌ పట్టుకుంది గులాబీ దళంలో చాలా మందికి. నిన్న మొన్నటి వరకూ మంచిరోజులు లేవని నామినేటెడ్‌ పదవుల పంపకాలను కేసీఆర్‌ చేపట్టలేదు. దీంతో.. శ్రావణ మాసం వచ్చే వరకూ పడిగాపులు కాశారు ఆశావహులు. ఆ సమయం రాగానే.. బంగారు తెలంగాణ బ్యాచ్‌ కోటాలో.. పదవి దక్కించుకున్నారు డి.శ్రీనివాస్‌. ఇక మిగిలిన పదవుల పంపకాల్లో భాగంగా.. ఆరు కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవులను ఈ నెల ఆరో తేదీన ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

8న చైనా పర్యటన..
ఈ నెల 8వ తేదీన కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్తుండడంతో.. 6వ తేదీన ఉదయం సరిగ్గా 11 గంటలా 40 నిమిషాలకు పదవుల ప్రకటన ఉంటుందని సమాచారం. దీంతో... ఆ సిక్సర్‌ కొట్టే అదృష్ట వంతులు ఎవరా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. వీటితోపాటుగా.. మార్కెట్‌, దేవాలయ, సహకార కమిటీలతోపాటు చాలా విభాగాల్లో నామినేటెడ్‌ పదవుల పంపకం పెండింగ్‌లోనే ఉంది. అవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో, తమకు అవకాశం ఎప్పుడు వస్తుందో..? అంటూ ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

10:56 - September 6, 2015

హైదరాబాద్ : కోరిక చంపేస్తోంది. అది అతనితో పాటు పెంచి మరింత కసి రగిలేలా చేసుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు కుటుంబ పరిస్థితి అడ్డు వస్తోంది. ఏంచేయాలా అని బుర్రకు పదను పెట్టాడు. పన్నాగానికి పథకం తోడైంది. ఇంకేముంది. తన కోరికకు రెక్కలు తొడిగాడు. ఏకంగా ఖరీదైన 'హార్లీ డేవిడ్‌సన్‌'నే ఎత్తుకెళ్లాడు. వక్రమార్గంలో రయ్‌మని దూసుకెళ్తూ ముంబై నగరంలో తేలాడు. కానీ చివరికి కటకటాల పాలయ్యాడు.

కుటుంబ ఆర్థిక పరిస్థితితో వాయిదా..
నగరంలోని సైనిక్‌పురికి చెందిన దొర్లపాటి కిరణ్‌కుమార్. చెన్నైలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2012లో ముంబాయి ఓఎన్జీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ముంబై సముద్ర జలాల్లో 15 రోజులు విధులు నిర్వహిస్తూ.. మరో 15 రోజులు సెలవుల్లో ఉండేవాడు. ఉన్నత చదువు.. ఏడాదికి లక్షల్లో జీతం ఉన్న కిరణ్‌కు మరో తీరని కోరిక కూడా ఉంది. అదే కాస్లీ బైక్‌ను కొనుగోలు చేసి జీవితంలో ఒక్కసారైనా లాంగ్‌ టూర్‌ వెళ్లాలని. ఇది చిన్నప్పటి నుంచే ఉన్నా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసిన ప్రతిసారి తన ఎనలేని కోరికను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకునేవాడు.

లాంగ్ డ్రైవ్ చేయాలని కోరిక..
ఇదిలా ఉంటే.. సెలవుల్లో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన కిరణ్‌కుమార్‌.. ఈసారి ధైర్యం చేశాడు. తొలుత తల్లిదండ్రులను అడిగాడు. కిరణ్‌ కోరిక ఖరీదు ఐదు లక్షలకు పైగా ఉండటంతో దానికి వారు ససేమిరా అన్నారు. దీంతో కసి పెంచుకున్న కిరణ్ ఎలాగైనా బైకును లాంగ్ డ్రైవ్ చేసి తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.

ట్రయల్ రన్ చేస్తానని..
మూడు నెలల క్రితం కిరణ్‌కుమార్‌.. బైకు కావాలంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఈ హార్లీ డేవిడ్‌సన్ షోరూం నిర్వాహకులను సంప్రదించాడు. అప్పుడప్పుడు షోరూంకు వస్తూ వారిని నమ్మించే ప్రయత్నం చేసాడు. ఇదే క్రమంలో అదును చూసిన కిరణ్‌.. ట్రయల్ రన్ చేస్తానని ఈనెల 1వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు షోరూంకు వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ట్రయల్ రన్‌లో భాగంగా బైకును తీసుకున్నాడు. నిర్వాహకులు అనుసరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో సిగ్నల్ జంప్ చేసి అక్కడి నుండి బైకుతో ఉఢాయించాడు. తిరిగి ఎంతకి రాకపోవడంతో నిర్వాహకులు.. బంజారాహిల్స్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబై నుండి ఫోన్...
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మూడు నెలల క్రితం బైక్ కావాలంటూ వచ్చిన కాల్‌డేటాను పరిశీలించారు. విచారణలోదొరికిన సెల్‌ నెంబర్ ఆధారంగా మల్కాజ్‌గిరిలో నివాసం ఉంటున్న కిరణ్‌ తల్లిదండ్రులపై పూర్తి నిఘాపెట్టారు. పోలీసుల ప్లాన్‌ ఫలించింది. ముంబై నుంచి కిరణ్.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో అలర్ట్‌ అయిన పోలీసులు.. బైకుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రయల్‌ రన్ పేరుతో బైకును ఎత్తుకెళ్లిన రోజు కిరణ్ మొదట.. షామీర్‌పేట్ చేరుకుని అక్కడి నుంచి సదాశివపేట మీదుగా ముంబాయికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. మొత్తానికి బైకు నడిపి తన చిననాటి ముచ్చట తీర్చుకోవాలన్న కిరణ్‌ జీవిత కోరిక.. చివరికి కటకటాల్లోకి నెట్టింది. 

10:32 - September 6, 2015

గుంటూరు : మొన్నటివరకు నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులను భయబ్రాంతులకు గురి చేసిన అధికారులు.. తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. భూసేకరణ సమస్య సమిసిపోయిందని సంబరపడుతున్న తరుణంలో... ప్రభుత్వానికి ఇవ్వని భూములు వ్యవసాయానికి తప్ప మరేందుకూ ఉపయోగించకుండా చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారుల మాటలను బట్టి చూస్తుంటే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. భూసమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతుంటే..ఈ ప్రాంతాలను శాశ్వతంగా గ్రీన్‌బెల్ట్ చేసేద్దామా అంటూ గుంటూరు జేసీ శ్రీధర్‌కుమార్‌ వ్యాఖ్యలు చేశారు. ఈయన మాటలు వింటుంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ఇట్టే తెలిసిపోతోంది.

భూసేకరణపై వెనక్కి తగ్గిన సర్కార్‌..
ఇప్పటివరకు రాజధాని కోసం 98 శాతం భూములను సేకరించింది ప్రభుత్వం. ఇక మిగిలిన నాలుగు గ్రామాలకు మినహాయింపు ఇస్తే మిగతా ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తోంది. అందుకే ఉండవల్లి, పెనమాక, భేతపూడి, నిడమర్రు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం.. రైతులకు పవన్‌కల్యాణ్‌ అండగా నిలవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

కొత్త పన్నాగానికి శ్రీకారం..
కానీ..ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రామాలను వదిలేందుకు ఒప్పుకోని సర్కార్‌..ఎలాగైనా ఆ భూములను తీసుకునేందుకు కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోంది. ప్రభుత్వానికి ఇవ్వని భూములను శాశ్వతంగా గ్రీన్‌బెల్ట్ గా మార్చాలనే కుట్ర జరుగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాజధాని కోసం ఇవ్వని భూములను భవిష్యత్‌లో వ్యసాయానికి తప్ప మరేందుకూ ఉపయోగపడని విధంగా చేస్తామని అధికారులు రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. భూసేకరణను ఆపేశామని చెప్తున్న ప్రభుత్వం..రైతులను మోసం చేసేందుకు కొత్త పన్నాగం పన్నుతుందని సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు ఆరోపిస్తున్నారు.

దారుణమంటున్న ప్రజా సంఘాలు.
ప్రభుత్వం గ్రీన్‌బెల్ట్ ప్రయోగించాలనుకోవడం సరైంది కాదని ప్రజా సంఘాల నేతలంటున్నారు. రాజధాని కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టమని చెబుతున్న సీఎం, మంత్రులు ఇప్పుడు మరో కుట్ర పన్నడం దారుణమంటున్నారు. ఇప్పటికే భూసేకరణను వ్యతిరేకించిన ఈ నాలుగు గ్రామాల రైతులు.. ప్రభుత్వం మరేలాంటి కుట్రలు పన్నినా తిప్పికొడతామంటున్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

10:27 - September 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి మరో అడుగు ముందుకు పడింది. వాటర్‌గ్రిడ్ మూడో దశకోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ...నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 6 సెగ్మెంట్లకు 6వేల 589 కోట్ల అంచనాలతో టెండర్ నోటీస్‌ జారీ చేసింది. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో టెండర్లను పిలిచిన సర్కార్ తాజాగా థర్ఢ్ పేజ్ టెండర్ల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈసారి ఆరు సెగ్మెంట్‌లకు సంబంధించి 6,589 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ నోటీస్ జారీ చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి ఈ -ప్రాక్యూర్‌మెంట్‌ వెబ్ సైట్లలో టెండర్లు దాఖలు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

రంగారెడ్డి సెంగ్మెంట్‌కు రూ.18 వందల కోట్లు..
రంగారెడ్డి సెంగ్మెంట్‌కు 1800కోట్లు అంచనా వ్యయంతో టెండర్ నోటీసు జారీ చేసింది. ఈ సెగ్మెంట్‌ కింద చేవేళ్ల, వికారబాద్, పరిగి, తాండూర్, మహేశ్వరం ప్రాంతాలు రానున్నాయి. నల్గొండ సెగ్మెంట్‌కు 289 కోట్లు అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ జారీ చేసింది. దీనికింద సూర్యపేట, తిరుమలగిరి, ఉదయ సముద్రం, నల్గొండ, నార్కెట్‌పల్లి, నకిరేకల్, తుంగతుర్తి, మోతె ప్రాంతాలు రానున్నాయి. అలాగే కరీంనగర్ సెగ్మెంట్‌కు 835 అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈసెగ్మెంట్‌ కింద మంథని, భూపాలపల్లి పరిధి రానుంది. వరంగల్‌ సెగ్మెంట్‌కు 290 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ జారీ చేశారు. దీనికింద గోదావరి, మంగపేట రానున్నాయి.

వరంగల్ రెండో సెగ్మెంట్‌కు రూ.13 వందల 35 కోట్లు..
కరీంనగర్ రెండో సెగ్మెంట్‌కు 2 వేల 40 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ జారీ చేశారు. దీనికింద ఎల్ ఎండి కరీంనగర్, ఎల్ సిడి మానకొండూర్, రామడుగు, హుస్నాబాద్, హుజూరాబాద్‌లు రానున్నాయి. వరంగల్ రెండో సెగ్మెంట్‌కు 1,335 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈ సెగ్మెంట్‌ కింద ఎల్ఎండి పరకాల, స్టేషన్‌ఘన్ పూర్ ప్రాంతాలు రానున్నాయి.
మొత్తానికి వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు టెండర్ల నోటిఫికేషన్‌తో మరింత వేగం పుంజుకోనున్నాయి. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టు పనుల్ని పూర్తిచేసి..తెలంగాణ ప్రజల దాహర్తిని తీర్చుతామన్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

10:24 - September 6, 2015

హైదరాబాద్ : ఆధార్ కార్డే అన్నింటికి ఇప్పుడు ఆధారం. వ్యక్తిగత గుర్తింపు నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ఆధారే ప్రమాణికమని కొన్ని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే వారి ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. ఆధార్‌ లింకు తప్పని సరి చేయడాన్ని తప్పుబట్టింది. అయితే అర్హులు, అనర్హులను గుర్తించేందుకు ఆధార్ తప్పదంటున్న తెలంగాణ సర్కార్..సుప్రీం కేసులో ప్రతివాదిగా చేరేందుకు సిద్ధపడింది. ఆధార్‌ను తప్పనిసరి చేయాలని తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.

సుప్రీం కోర్టులో ప్రతివాదిగా టీ.సర్కార్..
ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పని సరి చేయడంపై అత్యున్నత న్యాయ స్థానం కన్నెర్ర చేసింది. ఇంకా ఆధార్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ప్రతిదాన్ని ఆధార్‌తో లింకు చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. ఈ తీర్పు తెలంగాణ సర్కార్ ఆశలపై నిళ్లు చల్లినట్టైంది. ఆధార్‌ లింక్‌ను తప్పనిసరి చేసి ఆ దిశగా పనుల్ని వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఇది రుచించడం లేదు. అందుకే సుప్రీం కేసులో ప్రతి వాదిగా చేరాలని నిర్ణయించింది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ దాదాపు పూర్తి అయిన తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఆధార్‌ను తప్పని సరి చేయాలని వాదించనుంది.

అనర్హులను గుర్తించడం ఆధార్‌తోనే సాధ్యం..
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఆధారే ఆధారమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అనర్హులను గుర్తించడం ఆధార్‌తోనే సాధ్యమని స్పష్టం చేస్తోంది. స్కాలర్‌షిప్‌లు, ఫించన్ల వంటి సంక్షేమ పథకాల అమల్లో ఆధార్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందంటోంది. ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా సంక్షేమ పథకాల్లో అక్రమాలను అడ్డుకొవచ్చనే వాదనను వినిపించనుంది. రైతు రుణమాఫీ విషయంలోనూ ఆధార్‌ ద్వారా ఫేక్ రైతులను, మల్టిపుల్ ఎకౌంట్లను గుర్తించామని సుప్రీంకు నివేదించనుంది.

ఆధార్‌ లింక్ చేస్తే వచ్చే నష్టమేంటి...?
తెలంగాణలో 98. 5 శాతం మంది ప్రజానికానికి ఆధార్‌లున్నాయి. త్వరలోనే ఇది 100 శాతం ప్రజానికానికి అందనుంది. అలాంటప్పుడు ఆధార్‌ లింక్‌ చేస్తే...వచ్చే నష్టమేంటనీ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. ఆధార్‌పై సుప్రీకోర్టులో గెలిచి రాష్ట్రంలో ఆధార్‌ను తప్పని సరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 

10:11 - September 6, 2015

తిరుపతి : శనివారం కిడ్నాప్ కు గురైన నెలన్నర వయస్సున్న చిన్నారి ఆచూకి లభ్యమైంది. తమిళనాడు సమీపంలోని నేనవూరులో బాబు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూజ అనే మహిళ శిశువును అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిన్నారిని తిరుపతికి తీసుకొస్తున్నట్లు సమాచారం. తిరుపతిలోని ఓ ప్రాంతంలో సంతోష్ దంపతులు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నెలన్నర వయస్సున్న బాబు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నాం సమయంలో ఇంట్లో రహస్యంగా ప్రవేశించి పసికందును ఎత్తుకెళ్లారు. దీనిని గుర్తించిన సంతోష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. పూజ అనే మహిళ కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించారు. కిడ్నాప్ చేసిన అనంతరం సదరు మహిళ తమిళనాడు ట్రైన్ ఎక్కినట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందం తనిఖీలు చేయగా శిశువు నేనవూరులో ఉన్నట్లు నిర్ధారించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు పసికందును అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన పూజ..సంతోష్ కు వరుసకు చిన్నమ్మ అవుతుందని సమాచారం. కిడ్నాప్ చేయడానికి కుటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది. ఏదిఏమైనా శిశువు ఆచూకి లభ్యం కావడం పట్ల సంతోష్ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తిరుపతిలో కిడ్నాప్ కు గురైన పసికందు ఆచూకి లభ్యం..

చిత్తూరు : తిరుపతిలో నిన్న కిడ్నాప్ కు గురైన నెలన్నర వయస్సున చిన్నారి ఆచూకి లభ్యమైంది. తమిళనాడులోని నేనవూరులో బాబు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూజ అనే మహిళ ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఓల్డ్ బోయిన్ పల్లిలో కార్డన్ సెర్చ్..

సికింద్రాబాద్: నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. డీసీపీ రామారాజేశ్వరి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు ప్రతిఇంటిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 26 మంది అనుమానితులు, ఇద్దరు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51 బైక్‌లను, కంప్యూటర్లు, 20 సిలిండర్లను సీజ్ చేశారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. 

బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..

వరంగల్: జిల్లా నర్సింహులపేట మండలం కుమ్మరికుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

నేడు ఢిల్లీ - ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గం ప్రారంభం..

ఫరిదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానా పారిశ్రామిక ప్రాంతం ఫరీదాబాద్‌కు ప్రయాణం సులభం కానుంది. 

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం.

వరంగల్ : నెక్కొండ మండలం శంభునికుంటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

 

ఖమ్మంలో కానిస్టేబుళ్ల వీరంగం..

ఖమ్మం: జిల్లాలోని మణుగూరులో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడపడంతో అదుపుతప్పిన కారు పార్క్ చేసివున్న ఇతర కార్లపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 

శంషాబాద్ లో తనిఖీలు..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నేడు భారత్ కు రానున్న శ్రీలంక ప్రధాని..

న్యూఢిల్లీ : ఈ నెల 14న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్‌కు రానున్నారు. విక్రమసింఘే భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో విక్రమసింఘే భేటీ కానున్నారు. 

Don't Miss