Activities calendar

09 September 2015

భీమవరంలో మళ్లీ సైకో సూదిగాడి కలకలం

ప.గో: భీమవరంలో మళ్లీ సైకో సూది గాడు కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి సూది గుచ్చి సైకో సూది గాడు పరారయ్యాయడు. బాధితుడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

22:30 - September 9, 2015

రెండు రోజుల వర్షాలతో కరువు తీరినట్టేనా..? ఎండిన నేలకు సాంత్వన చేకూరినట్టేనా..? ఇప్పటికే సీమ నుంచి లక్షల మంది వలసబాట పట్టారు. దేశ వ్యాప్తంగా ఇవే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కరువు కోరలు చాస్తోంది. ఈ పరిస్థితికి పరిష్కారాలేంటీ..? అన్న అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేకకథనం.... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

22:12 - September 9, 2015

బీజింగ్ : చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన కొనసాగుతోంది. డలియన్ సిటీలో బుధవారం ఆయన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ప్రసంగించడంతో పాటు పలువురు ప్రముఖులను కలిశారు. ఆర్దిక వేదిక చైర్మన్ క్లాజ్ శ్వాబ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేకతను ఆయనకు వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ సామాజిక, ఆర్ధిక విషయాలను ఆయనతో పంచుకున్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ వివరాలను అందించారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని స్పష్టం చేసారు. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్ విండో సిస్టం గురించి తెలిపారు.
ప్రపంచంలో మాదే అత్యున్నత పారిశ్రామిక విధానం : కేసీఆర్
ప్రపంచంలో తమది అత్యున్నత పారిశ్రామిక విధానమని కేసీఆర్ అన్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 12 వేల కోట్ల పెట్టుబడులతో 52 పరిశ్రమలకు అనుమతులిచ్చిన సంగతిని గుర్తు చేశారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులిస్తామన్నారు. ఆర్ధిక వేదిక వచ్చే సమావేశాలను తెలంగాణలో నిర్వహించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. సీఎం ప్రతిపాదన పట్ల క్లాజ్ తో పాటు వేదిక నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. దాంతో పాటు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పొగిడారు క్లాజ్. తెలంగాణ లో చేపట్టిన సంక్షేమ, ఆర్థిక విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
రష్యా ఉప ప్రధానితో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చర్చలు
అనంతరం మంగోలియా ప్రధాని, చైనా ఐటీ శాఖ మంత్రి, రష్యా ఉప ప్రధానితో సీఎం ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తన ప్రసంగంలో హైదరాబాద్ అభివృద్ధిపై తన విజన్ గురించి వివరించారు. నగర అభివృద్ది నమూనాపై తన అనుభవాలు , అభిప్రాయాలను ఇతర నగరాల మేయర్లు, వైస్ మేయర్లతో పంచుకున్నారు. తెలంగాణ నగర అభివృద్దికి సలహాలు, సూచనలు కోరారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు, పార్టీ నేతలు చెబుతున్నారు.

 

22:07 - September 9, 2015

పశ్చిమగోదావరి : వ్యవసాయ రంగాన్ని ఏపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యవసాయ కార్మిక సంఘం వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని, మాట్లాడారు. భూసేకరణ పేరుతో భూములు లాక్కుంటున్నారని.. దీంతో వ్యవసాయ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. భూ సేకరణతో దళిత, బడుగుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని సహా అన్ని ప్రాంతాల్లో కూలీల బతుకులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని మధు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

22:03 - September 9, 2015

నిజామాబాద్ : రైతు ఆత్మహత్యలు జరుగుతున్న మాట వాస్తవమేనని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పోచారం, నిజామాబాద్‌ ఎంపీ కవిత పాల్గొన్నారు. రైతులు మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పులు పెరిగిపోయి, సంపాదన లేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే.. కాంగ్రెస్‌, బీజేపీ విమర్శలు చేస్తున్నాయని ఎంపీ కవిత విమర్శించారు.

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు..

చిత్తూరు : సోమల మండలం రామకృష్ణాపురంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఐదు ఇళ్లు, ఓ పాఠశాల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 

వర్షాల పరిస్థితిపై ఫోన్ లో సీఎంఓ అధికారులతో మాట్లాడిన కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఫోన్ లో సీఎంఓ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

 

రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుతాం : జపాన్ ప్రతినిధులు

విజయవాడ : సీఎం చంద్రబాబుతో జపాన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణంలో తాము భాగస్వాములవుతామని జపాన్ ప్రతినిధుల బృందం తెలిపింది. అక్టోబర్ లో నిర్ధిష్ట ప్రతిపాదనలతో ఆంధ్రాకు వస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి జేబీసీఐ నిధులు సమకూరుస్తుందని పేర్కొందన్నారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైలు నిర్మాణానికి జైకా నిధులు సమకూరుస్తుందని చెప్పారు.

 

21:17 - September 9, 2015

హైదరాబాద్ : గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సమస్యలను పరిష్కారిస్తామంటూ చాలా మంది ముందుకొస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నను దత్తత తీసుకునే వారే లేరా..కష్టాల కడలిలో ఎదురీదుతున్న కర్షకున్ని అక్కున చేర్చుకునే దాతలే లేరా...ఉరితో ఆగుతున్న రైతన్న ఊపిరిని నిలబెట్టే నాథులే లేరా...అనాథలైన అన్నదాతల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ప్రముఖులకు మనసు రావడం లేదా....అన్ని వ్యవస్థలూ విస్మరిస్తే కర్షకున్ని పట్టించుకునే వారెవరు.
దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు
దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. వ్యవసాయమే ఊపిరి. కాని దాన్ని నమ్ముకున్న రైతన్న కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. నష్టాన్ని దిగమింగలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక తనువు చాలిస్తున్నాడు. ఈ పరిస్థితి ఇంతేనా. రుణ మాఫీలు, భరోసా యాత్రలు ధీమా కల్పించలేని పరిస్థితుల్లో కర్షకుని కష్టాలను ఇష్టంగా తీసుకునే వారు ఎవరు...వారి సాధక బాధలను దత్తత తీసుకోరెందుకు.?
రైతన్న కష్టాన్ని దత్తత తీసుకోరా
గ్రామంలో మంచిని కాదు చెడును కూడా దత్తత తీసుకున్నా. ఇది శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు డైలాగ్. ఆ సినిమా ఎఫెక్టని కొందరు. కేసీఆర్ పిలుపునిచ్చిన గ్రామజ్యోతిలో భాగమయ్యామని కొందరు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. మంచిని ఆహ్వానించేవారు దీన్ని స్వాగతించాల్సిందే. అయితే గ్రామాల దత్తతంటే రోడ్లు వేయడమేనా. అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందిచడమేనా. మరి ఆ గ్రామంలో రైతన్న కష్టాన్ని దత్తత తీసుకోరా. ఇది టెన్ టీవీ అడుగుతున్న ప్రశ్న.
రైతు ఘోష వినేవారున్నారా.?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల మరణ మృదంగం మోగుతూనే ఉంది. అప్పుల బాధలు ఒక వైపు. పంట చేతికి రాకపోవడం, కల్తీ ఎరువులు, పురుగుల మందులు దీనికి తోడు వర్షాభావం ఇలా ఎలా చూసిన దిక్కుతోచని పరిస్థితి రైతన్నది. మహారాష్ట్రలో సినీ నటుడు నానా పటేకర్ మొత్తం 113 మంది రైతులకు ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున సాయం చేశారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొందరు సినీతారలు చేసిన దాతృత్వాన్ని మర్చిపోలేం కానీ...దేశానికి వెన్నెముకైన రైతన్న దీనగాథలనూ దత్తత తీసుకోవాలని, సాయం చేయాలనే వాదన వినిపిస్తోంది. మరి వినేవారున్నారా అన్నది.?
రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలి..
ప్రకాశ్ రాజ్, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్ లతో పాటు ఇరు రాష్ట్రాల్లో కొందరు సెలబ్రెటీలు, ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అలాగే కొందరు రైతు కుటుంబాలను దత్తత తీసుకోవడం, వాళ్లకు నష్టాలు రాకుండా సలహాలిచ్చే వ్యవస్థ ఏర్పరచడం వంటి వాటిపై దృష్టి పెడితే ఆత్మహత్యలను తగ్గించవచ్చని చాలా మంది కోరుతున్నారు.

 

21:00 - September 9, 2015

ఢిల్లీ : రాయలసీమలోని నాలుగు జిల్లాలను ప్రధాని మోడీ దత్తత తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జలసాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బైరెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తుంగభద్ర నది నుంచి సీమకు 300 టీఎంసీల నీటిని కేటాయించాలని బైరెడ్డి డిమాండ్‌ చేశారు. అమరావతి, మెట్రోరైల్‌, కృష్ణాడేల్టాలతో తమ కష్టాలు తీరవని ఆయన అన్నారు. రాయలసీమకు నీటి కేటాయింపులు జరిగినప్పుడే తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. 

20:52 - September 9, 2015

ప్రకాశం : జిల్లాలోని చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌,.. టిడిపి ఇన్‌చార్జ్‌ పోతుల సునీత వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చీరాలలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న సదరమ్‌ క్యాంప్‌లో పాల్గొనేందుకు ఎంపీ మల్యాద్రి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి చేరుకున్నారు. ఆ తర్వాత టిడిపి ఇన్‌చార్జ్‌ పోతుల సునీతను స్టేజిపైకి ఆహ్వానించగా..పార్టీ వ్యక్తులు స్టేజిమీద కూర్చోవడం పద్ధతి కాదని ఎమ్మెల్యే ఆమంచి అన్నారు. దీంతో పోతుల వర్గీయులు స్టేజిపై ఉండాల్సిందే అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు కుర్చీలను విసిరేస్తూ గందరగోళం సృష్టించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌తో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

20:41 - September 9, 2015

కరీంనగర్‌ : మానవత్వం మంటగలిచింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. జిల్లాలోని గొల్లపల్లి మండలం ఎనుగుమట్లలో దారుణం జరిగింది. కూతురిని అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులే హత మార్చారు. కూతురికి పెళ్లి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందని.. తండ్రి, సవతి తల్లి కలిసి కూతురిని హత్య చేశారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్యనారాణయ రెడ్డి, హేమలత దంపతులకు మౌనశ్రీ అనే కూతురు ఉంది. అయితే సత్యనారాయణ రెడ్డి, హేమలతలు విడాకులు తీసుకోవడంతో..కూతురు మౌనశ్రీ బాధ్యతలు తండ్రి సత్యనారాయణరెడ్డికి కోర్టు అప్పగించింది. తర్వాత సత్యనారాయణరెడ్డి.. లత అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. వివాహం, కట్నం విషయాలను మాట్లాడాలని మౌనశ్రీని తండ్రి సత్యనారాణయరెడ్డి ఇంటికి పిలిపించారు. మౌనశ్రీ ఇంటికి వచ్చాక... తండ్రి సత్యనారాణయరెడ్డి, సవతి తల్లి లతలు.. మౌనశ్రీకి పాలలో మత్తు మందు ఇచ్చి అనంతరం ఆమె గొంతు నులిమి చంపారు. పెళ్లి చేసి కట్నం ఇవ్వలేమనుకున్న సత్యనారాయణరెడ్డి, లత దంపతులు ఆమెను హత్య చేశారని.. మృతురాలి సొంత తల్లి హేమలత ఆరోపించింది. కూతురు మృతితో హేమలత కన్నీరుమున్నీరయ్యారు.

 

మెదక్ లో మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు

మెదక్ : చిన్నశంకరం పేట మండలం దవలపల్లిలో మరియమ్మ అనే మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

జీహెచ్ ఎంసీలో సర్కిళ్ల పెంపు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో18 సర్కిళ్లను 24 సర్కిళ్లకు పెంచారు. 3, 4, 7, 9, 10 సర్కిళ్లను విభజించారు. కొత్తగా ఏర్పడ్డ 6 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియమించారు. 3 సర్కిళ్ల మినహా డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. 

20:16 - September 9, 2015

విశాఖ : ఈ ఏడాది తుపానుల తాకిడి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు. మరీ ఎక్కువ రాకపోయినా...వచ్చిన తుపానుల తీవ్రత హెచ్చుగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే హిందూ మహా సముద్రంలో మూడు తుపానులు ఏర్పడిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. వాతావరణ శాస్త్రవేత్త రామకృష్ణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహిచింది. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. అక్టోబర్ నుంచి తుపానుల సీజన్ గా వాతావరణశాఖ భావిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తుపానుల ప్రభావం, రుతుపవనాలు మందగించడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. సాధారణ కంటే తక్కవ వర్షపాతం ఏపిలో నమోదైందని అంటున్నారు.

 

20:00 - September 9, 2015

కృష్ణా : జిల్లాలో ఓ కీచక టీచర్‌ ఉదంతం వెలుగు చూసింది. పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామపంచాయతీ పరిధిలోని ముతరాసిపాలెం ప్రాథమిక పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్‌ బోధించే యతిరాజువర్మ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా వారి దుస్తులు విప్పించేవాడని విద్యారుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉపాధ్యాయున్ని అదుపులోకి తీసుకున్నారు.

19:50 - September 9, 2015

నల్గొండ : అప్పుల బాధకు జిల్లాలో మరోరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం చింతలపాలెం గ్రామంలో అంతటి వెంకయ్య ఇవాళ పురుగుల మందు తాగి చనిపోయాడు. రెండేళ్లుగా వర్షాభావంతో అప్పులు పెరగటం, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడం, ఈసారి కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో... వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో.. నాగార్జున సాగర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 

19:46 - September 9, 2015

నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం తీరుపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమ్మినేని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 500 మంది చనిపోయారని వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

19:22 - September 9, 2015

వరంగల్‌ : జిల్లాలోని మహబూబాబాద్‌లో డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మానుకోట జిల్లా సాధనసమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మానుకోటను జిల్లాగా ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జిల్లా సాధన సమితి నేతలు హెచ్చరించారు.

 

19:12 - September 9, 2015

ఢిల్లీ : బీహార్‌ ఎన్నికలపై ఈసీ ప్రకటనను బిజెపి, జెడియు స్వాగతించాయి. ఈ ప్రకటనతో నితీష్‌, లాలూల సుదీర్ఘ పరిపాలనకు తెరపడిందని, బీహార్‌లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత షానవాజ్‌ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడే వరకు కూడా రాజకీయ లబ్ది కోసం ఓటర్లను ఆకర్షించే విధంగా మోది సర్కార్‌ ప్రత్యేక ప్యాకేజీ లాంటి పలు ప్రకటనలు చేసిందని జెడియు నేత కెసి త్యాగి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచడం కూడా ఇదే రోజు ప్రకటించడం గమనార్హమన్నారు.

 

19:01 - September 9, 2015

హైదరాబాద్‌ : నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచేత్తింది. సుమారు గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌,దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, పంజాగుట్టలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని నాలాలన్నీ పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదరనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. చాలాచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొద్ది ట్రాఫిక్‌ స్తంభించింది. 

18:59 - September 9, 2015

ముంబాయి : స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పుంజుకుంది. సెన్సెక్స్ ఇవాళ 402 పాయింట్లతో 25వేల 719 వద్ద ముగిసింది. అటు నిఫ్టి 130 పాయింట్లు పెరిగి 7వేల 8వందల 18 వద్ద క్లోజైంది. ఆటో మోబైల్, బ్యాంకింగ్, క్యాటిపల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియటం, యూరప్ మార్కెట్ల సెంటిమెంట్ పాజిటివ్ గా కనిపించడంతో... దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. నిఫ్టిలో ఎన్ ఎమ్ డిసి అత్యధికంగా 9శాతం పెరిగింది. హిండాల్కో 8శాతం, వేదాంతా 7శాతం లాభపడ్డాయి. బిఎస్ ఈలో 1975 షేర్లు లాభపడగా.... 718 కంపెనీలు నష్టపోయాయి.

 

18:51 - September 9, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ ఫోన్ దొంగిలించాడనే అభియోగం మోపడంతో మనస్తాపంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ లో ఆర్యవైశ్య భవనంలో గత కొంతకాలంగా హాస్టల్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ అనే విద్యార్థి ఆర్యవైశ్య భవనంలో ఉంటున్నాడు. హరీష్ సీఎ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో నాలుగు రోజులు క్రింతం హాస్టల్ ఒక సెస్ ఫోన్ పోయింది. హరీష్ పై సెల్ ఫోన్ దొంగిలించాడనే అభియోగం మోపారు. రాత్రి విద్యార్థులను సమావేశ పరిచిన వార్డెన్, సిబ్బంది.. 'సెల్ ఫోన్ నీవే తీసుకున్నావు.... ఎట్టి పరిస్థితుల్లోనైనా తెచ్చి ఇవ్వాలంటూ' హరీష్ ను హెచ్చరించారు. సెల్ ఫోన్ దొంగిలించాడనే అభియోగం మోపడంతో మనస్తాపంతో హరీష్ ఇవాళా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి.. మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. విద్యార్థి రూంలో తనిఖీ చేయాల్సి వుంది. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇదిలా వుంటే హాస్టల్ భవనంపైన చిన్న గొడవ జరిగింది. అక్కడి నుంచి అతన్ని కిందకు తోసేశారనే వాదన కూడా వినిపిస్తుంది. 

రెండు వర్గాల మధ్య ఘర్షణ...

కరీంనగర్ : పెద్దపల్లి మండలం కురుమపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. భూ తగాదాలే గొడవ కారణమని తెలుస్తోంది.

 

నదుల అనుసంధానంపై సెప్టెంబర్ 15న సదస్సు : మంత్రి దేవినేని

విజయవాడ : నదుల అనుసంధానంపై సెప్టెంబర్ 15న సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా తెలిపారు. 16 వ తేదీ నాటికి గోదావరి నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సెప్టెంబర్ 16న నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు వివరిస్తారని పేర్కొన్నారు.

 

విజయవాడలో సీఆర్ డీఏ సమావేశం

విజయవాడ : క్యాంపు కార్యాలయంలో సీఆర్ డీఏ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సీఆర్ డీఏ కమిషనర్, హాజరయ్యారు. భూసేకరణ, కన్సల్టెంట్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు.

 

17:42 - September 9, 2015

హైదరాబాద్ : ఆసియా, పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ దాతల జాబితాలో ఏడు గురు భారతీయులకు చోటు దొరికింది. ఆరోగ్య, విద్యా రంగాలకు చేసిన దానాల ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో చోటు దొరికిన ఏడుగురు భారతీయుల్లో ముగ్గురు ఎస్‌ గోపాలకృష్ణన్‌, నందన్‌ నీలెకని, ఎస్‌డి శిబులాల్‌ ఇన్ఫోసిస్‌ కంపెనీ సహ వ్యవస్థాపకులు కావడం విశేషం.
జాబితాలో ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి కుమారుడి పేరు  
ఇన్ఫోసిస్‌ మరో సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి కుమారుడు రోహన్‌ పేరు సైతం ఈ జాబితాలో చోటు చేసుకుంది. రోహన్‌ తండ్రి నారాయణ మూర్తి తరఫున ఆరోగ్య, విద్యా రంగాలకు దానాలు చేస్తుంటారు. ఇంకా కేరళకు చెందిన సన్నీ వర్కీకి సైతం ఫోర్బ్స్‌ దాతల జాబితాలో చోటు దొరికింది. వర్కీ దుబాయ్‌ కేంద్రంగా జెమ్స్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో 19 దేశాల్లో 70 ప్రైవేట్‌ స్కూల్స్‌ నడుపుతున్నారు. ఈయన తనకున్న 250 కోట్ల డాలర్ల విలువైన ఆస్తిలో సగం ఆస్తులను విద్య, ఆరోగ్య కార్యక్రమాలకు దానం చేస్తానని జూన్‌ లో ప్రకటించారు.
జాబితాలో సురేష్‌ రామకృష్ణన్‌, మహేష్‌ రామకృష్ణన్‌ సోదరుల పేర్లు
లండన్‌ నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న సురేష్‌ రామకృష్ణన్‌, మహేష్‌ రామకృష్ణన్‌ అనే సోదరులకు సైతం ఫోర్బ్స్‌ పత్రిక తాజా దాతల జాబితాలో చోటు దొరికింది.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 401 పాయింట్లు లాభానికి 25,719 వద్ద ముగియగా నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 7,818 పాయింట్ల వద్ద ముగిసింది.

గద్దర్ పోటీపై రెండు రోజుల్లో స్పష్టత – తమ్మినేని..

నల్గొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేసే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్దర్ ను బరిలోకి దింపాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించడం జరిగిందని, అయితే ఆయన పోటీకి సంసిద్ధత వ్యక్తం చేయలేదన్నారు. 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ ది అంతా ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు.

 

జీహెచ్ఎంసీ సోమేష్ కుమార్..విచారణ వాయిదా..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పై క్యాట్ లో మరోసారి విచారణ వాయిదా పడింది. తనను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలంటూ కమిషనర్ క్యాట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రోజు వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణనను రేపటికి వాయిదా వేసింది. 

తమిళనాడులో లక్ష కోట్ల పెట్టుబడులు - జయలలిత..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడి దారుల సదస్సులో ఆమె ప్రసంగించారు. తమిళనాడులో మంచి అవకాశాలున్నాయని, వివిధ దేశాల నుండి పెట్టుబడులు ఆహ్వానించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. 

16:40 - September 9, 2015

అమెరికా : లాస్ వెగాస్ ఎయిర్‌పోర్టులో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ కు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. లండన్‌కు టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఇంజిన్లో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో వెంటనే విమానంలో ఉన్న 172 మందిని కిందికి దింపారు. వీరిలో 13 మందికి స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు సిబ్బంది.

 

16:31 - September 9, 2015

హిందూ వివాహ చట్టం 1955 సంవత్సరంలో అమల్లోకి వచ్చిందని లాయర్ పార్వతి తెలిపారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. హిందూ వివాహ చట్టం గురించి తెలిపారు. ఈ చట్టం ప్రకారం హిందు వివాహాలు ఎలా జరపాలి.. వీటికి ఉండే క్రతువులు, వైవాహిక జీవితం, ఒక వేల భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తితే వారు విడాకులు ఎలా తీసుకోవచ్చు వంటి చట్టానికి సంబంధించిన పలు అంశాలను ఆమె వివరించారు.
భార్యాభర్తలు..విడాకులు.. కారణాలు..
భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి పలు కారణాలున్నాయని చెప్పారు. భార్యభర్తలుమధ్య తగాదాలు, పరస్పర అవగాహన లోపించిడం, దంపతులు కలిసి ఉండే సమయం ఎక్కువగా లేకపోవడం, చిన్న చిన్న గొడవలు, అనుమానం, అక్రమ సంబంధ అంటగట్టడం, వరకట్న వేధింపులు వంటి పలు కారణాలు విడాకులు తీసుకోవడాని కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:29 - September 9, 2015

వాహనాలు వేటితో నడుస్తాయి? గిదేం ప్రశ్న..పెట్రోల్ లేదా డీజిల్ లేదా గ్యాస్ లతో నడుస్తాయి అని అంటారు కదా. ఇందులో వింతేముంది ? అని అనుకుంటున్నారా ? కానీ 'విస్కీ'తో వాహనాలు నడుస్తాయంట తెలుసా ?. ఔనండీ మీరు చదువుతున్నది నిజమే. సాంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కు బదులు విస్కీ తో కార్లు నడిచే దిశగా ప్రయోగాలు ముమ్మరం చేసారు. విస్కీ తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాల నుంచి పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. విస్కీని ఇంధనంగా ఉపయోగించి రోడ్లపై పరుగులు పెట్టించనున్నారు. డీజిల్, పెట్రోల్, వంటి ఇంధనాల వల్ల విడుదలయ్యే కాలుష్యం కంటే ఈ బయో ఇంధనం వల్ల విడుదలయ్యే కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంటుందంట. ఈ ఇంధనం అందుబాటులోకి వస్తే ఇక మనకు పెట్రోల్, డీజిల్ ఇంధన కష్టాలు తీరినట్టే కదా.

16:16 - September 9, 2015

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం టీటీడీ లో విలీనం అయ్యింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ మెంబర్లు భానుప్రకాష్‌ రెడ్డి, హరిప్రసాద్ హాజరయ్యారు. దేవాలయ పాలకమండలి లాంఛనాలతో సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. భక్తుల సమక్షంలో దేవాలయ ఈవో అధికారాలను టీటీడీ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించారు. 

పార్టీ ఫిరాయింపులు..తీర్పు రిజర్వు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్యులో ఉంచింది. 

సంక్షేమానికి రూ.28వేల కోట్లు - కేటీఆర్..

మహబూబ్ నగర్ : దేశంలోనే అత్యధికంగా సంక్షేమానికి రూ.28వేల కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలకు గత 60 ఏళ్ల పాలకులే కారణమని, అన్నదాతలు చనిపోవద్దని భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు చెల్లిస్తున్నామని, కొత్త వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కటిస్తున్నట్లు చెప్పారు. 

కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసిన దత్తాత్రేయ...

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులను మంత్రికి కిసాన్ మోర్చా నాయకులు వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మత్య్స పరిశ్రమ అభివృద్ధికి త్వరలో బ్లూ రెవల్యూషన్ పథకం రాబోతోందని దత్తాత్రేయ తెలిపారు. కరవు నివేదిక అందలేదని కేంద్ర మంత్రి తెలిపారని దత్తాత్రేయ పేర్కొన్నారు.

15:59 - September 9, 2015

ప్ర‌పంచాన్ని క‌న్నీటి సంద్రంలోకి నెట్టిన చిన్నారి అయిల‌న్ కుర్దీ ఘ‌ట‌నను బాహ్య ప్ర‌పంచానికి తెలిసేలా ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు పనిచేస్తే....మరో వీడియో జ‌ర్నలిస్టు పెట్రాలాజ్లో మాత్రం ఛీ కొట్టించుకునే ప‌నిచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
స‌మాజంలో ఉన్న‌త‌మైన విలువ క‌ల్గిన జ‌ర్నలిస్టు వృత్తిలో ఉండి.. అప‌హాస్యానికి ఒడిగ‌ట్టింది. సిరియాలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త యుద్దం కార‌ణంగా పక్క‌దేశాల‌కు వేలాదిగా తరలివెళుతున్నారు. కుర్దీ చావుతో యూర‌ప్ మార్గాల ద్వారా కొత్త ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చంకలో బిడ్డలను ఎత్తుకుని ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు వ‌ల‌స‌వాదులు...హంగ‌రీ స‌రిహ‌ద్దు గుండా ఆ దేశంలోకి ప్ర‌వేశిస్తున్నారు. అక్కడ శరణార్థులను తనిఖీలు చేస్తుంటారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భారీగా ఉన్న శరణార్థులు తనిఖీల నిమిత్తం పరుగులు పెట్టారు. ఇదంతా ఎన్ 1 జర్నలిస్టు పెట్రాలాజ్లో వీడియో షూట్ చేస్తోంది. అంతలో ఓ పోలీసు పిల్లాన్ని ఎత్తుకుని వెళుతున్న వ్యక్తిని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అతడు పరుగెత్తాడు. పెట్రా లాజ్లో కాళ్లు అడ్డం పెట్టి, కింద ప‌డేసి రాక్ష‌సానందాన్ని పొందింది. వంద‌ల, వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి త‌మ బిడ్డ‌ల‌ను ఎత్తుకుని వ‌స్తున్న వారు ఈ ఘ‌ట‌న‌తో నిశ్చేష్టుల‌యినా.. పొరుగుదేశానికి బ‌త‌క‌డానికి వ‌చ్చామ‌న్న వేద‌న‌తో కిమ్మ‌న‌కుండా ఉండిపోయారు. పెట్రా వికృత ఆనందాన్ని కొందరు కెమెరాలో బంధించారు. దాంతో ఈ అమ్మ‌లాడి పైశాచికంపై పెద్దఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. దీంతో ఎన్1 టీవీ సంస్థ యాజ‌మాన్యం పెట్రా లాజ్లో ను ఉద్యోగంలోంచి తొల‌గించింది.

15:59 - September 9, 2015

'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' హీరో హీరోయిన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఆ చిత్రం హీరో హీరోయిన్ సాయిధరమ్ తేజ్, రెజీనాలు సినిమా విశేషాలు, తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:48 - September 9, 2015

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరకాదని... ఓ అరాచకవాది అని రేవంత్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే కొడంగల్ నియోజకవర్గం దాటి రేవంత్ బయటికి వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. దీంతో అప్పటి నుంచి రేవంత్ తన కొడంగల్ కే పరిమితమయ్యారు. ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాలు, వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ప్రిపేర్ కావాల్సివుండడంతో షరతు తొలగించాలని, నియోజవర్గం దాటి బయటికి వెళ్లేందుకు అనుమతివ్వాలని హైకోర్టుకు రేవంత్ అప్పీల్ చేసుకున్నారు. రేవంత్ దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని నిన్న హైకోర్టు తెలిపింది. ఈనేపథ్యంలో ఇవాళా రేవంత్ తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. దేశంలో ఎక్కడైనా తిరిగేందుకు హైకోర్టు అనుమతివ్వటంతో ఆయన... కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌ వరకు ర్యాలీగా బయలు దేరారు. ఎల్‌బీనగర్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. కండువా కప్పి రేవంత్‌...వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అరాచకవాదంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆట కాదు...వేట మొదలైందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు చివరి అవకాశం - తలసాని..

హైదరాబాద్ : నగరంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో మంత్రి తలసాని జరిపిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇస్తామని, ఆ తర్వాత అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో కేసీఆర్..

చైనా : ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో భాగంగా నేడు జరుగుతున్న సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర పాలన, దేశాభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నరపాటు పోరాడామని, తమది వేర్పాటువాద ఉద్యమం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైందని, 15 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామన్నారు.

26 నుండి జగన్ నిరవధిక నిరహార దీక్ష..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈనెల 26వ తేదీ నుండి నిరవధిక నిరహార దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 

15:26 - September 9, 2015

కృష్ణా : పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కతూ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో నదుల అనుసంధానికి సంబంధించిన చారిత్రక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. క‌ృష్ణా జిల్లాలో పల్లర్లమూడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ ఘట్టాన్ని రైతుల ఆనందంగా జరుపుకున్నారు. భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు గోదారమ్మ పసుపు, కుంకాలు సమర్పించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గోదావరి నీరు ప్రవేశిస్తున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న కల నెరవేరిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 

 

 

15:17 - September 9, 2015

ఢిల్లీ : బీహార్ లో ఎన్నికల గంట మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. 243 నియోజకవర్గాలకు ఐదు ఫేజ్ లలో ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం ప్రధాన కమిషనర్ నసీం జైదీ ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం ఐదు ఫేజ్ విడతల్లో ఎన్నికలు జరుగనున్నట్లు, తొలి దశ ఎన్నిక అక్టోబర్ 12న మొదలవుతుందని, ఫలితాలను నవంబర్ 8న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) కూటమిగా కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు మాత్రం విడివిడిగా పోటీ చేయనున్నాయి.

47 సమస్యత్మాక ప్రాంతాలు..
రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు, 47 సమస్యత్మాక ప్రాంతాలు గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 38 జిల్లాల్లో 34 జిల్లాల్లో సమస్యత్మాక ప్రాంతాలున్నాయని చెప్పారు. 6.6 కోట్ల మంది ఓటర్లున్నారని, కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామని చెప్పారు. సంఘ వ్యతిరేకమైన శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ డ్ ఆయుధాలను తప్పనిసరిగా స్టేషన్ లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఓటర్లకు ఫొటో కార్డులు, ఓటరు స్లిప్పులు ముందుగానే అందచేయడం జరుగుతుందని, ఈవీఎంలలో కూడా గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు తప్పనిసరిగా ఉంచనున్నట్లు తెలిపారు. ఓపినీయన్ పోల్స్, ప్రకటనలను ఎన్నికకు 48గంటల ముందు నుండి నిషేధించనున్నట్లు, ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. రాజకీయా పార్టీలు, ఇతర వ్యక్తులు ఈ కోడ్ ను పక్కాగా అమలు చేయడానికి సహకరించాలని జైదీ సూచించారు.

మొదటి దశ : నోటిఫికేషన్ తేదీ -16 సెప్టెంబర్. నామినేషన్లకు చివరి తేదీ -23 సెప్టెంబర్. ఉపసంహరణకు చివరి తేదీ 26 సెప్టెంబర్. ఎన్నికల తేదీ 12 అక్టోబర్. మొత్తం స్థానాలు 49.
రెండో దశ : నోటిఫికేషన్ తేదీ - 21సెప్టెంబర్. నామినేషన్లకు చివరి తేదీ - 28 సెప్టెంబర్. నామినేషన్ల పరిశీలన – 29 సెప్టెంబర్. ఉపసంహరణకు చివరి తేదీ 1 అక్టోబర్. ఎన్నికల తేదీ 16 అక్టోబర్. మొత్తం స్థానాలు 32.
మూడో దశ : నోటిఫికేషన్ తేదీ -01 అక్టోబర్. నామినేషన్లకు చివరి తేదీ - 08 అక్టోబర్. నామినేషన్ల పరిశీలన 17 అక్టోబర్. ఉపసంహరణకు చివరి తేదీ 19 అక్టోబర్. ఎన్నికల తేదీ 28అక్టోబర్. మొత్తం స్థానాలు 50.
నాలుగో దశ : నోటిఫికేషన్ తేదీ - 07 అక్టోబర్. నామినేషన్లకు చివరి తేదీ - 14 అక్టోబర్. నామినేషన్ల పరిశీలన 15 అక్టోబర్. ఉపసంహరణకు చివరి తేదీ 17 అక్టోబర్. ఎన్నికల తేదీ 01 నవంబర్. మొత్తం స్థానాలు 55.
ఐదో దశ : నోటిఫికేషన్ తేదీ - 08 అక్టోబర్. నామినేషన్లకు చివరి తేదీ - 15 అక్టోబర్. నామినేషన్ల పరిశీలన 17 అక్టోబర్. ఉపసంహరణకు చివరి తేదీ 19 అక్టోబర్. ఎన్నికల తేదీ 05 నవంబర్. మొత్తం స్థానాలు 57.
ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన 8 నవంబర్. మొత్తం ప్రక్రియ ముగింపు 12 నవంబర్.

బీహార్ బలబలాలు..
జేడీయూ 110. బీజేపీ 91. ఆర్జేడీ 25. కాంగ్రెస్ 5. ఇతరులు 6 : మొత్తం స్థానాలు 243.

14:44 - September 9, 2015

ఢిల్లీ : జీఎస్టీ బిల్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. బంగారం ధరకు సమానంగా 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్లను జారీ చేస్తారని, బంగారం స్థానంలో అదే విలువకు బాండ్లను కొనుగోలు చేయవచ్చన్నారు. బంగారం బాండ్లను ప్రభుత్వం తరపున రిజర్వు బ్యాంకు జారీ చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బంగారు బాండ్ల పథకానికి, సముద్ర తీర ప్రాంతాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులకు, వినియోగం లేని స్పెక్ట్రం కొనుగోలుపై విధి విధానాలకు ఆమోదం తెలిపారు. 

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఢిల్లీ : బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్ జైదీ బుధవారం షెడ్యూల్ ను ప్రకటించారు. అక్టోబర్ 12 నుండి నవంబర్ 5 వరకు ఎన్నికలు జరుగున్నాయి. 243 నియోజకవర్గాలకు ఐదు ఫేజ్ లలో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు..

ఢిల్లీ : బంగారం బాండ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పలు అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వివరాలను వెల్లడించారు. బంగారం ధరకు సమానంగా 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్లను జారీ చేస్తారని, బంగారం స్థానంలో అదే విలువకు బాండ్లను కొనుగోలు చేయవచ్చన్నారు. బంగారం బాండ్లను ప్రభుత్వం తరపున రిజర్వు బ్యాంకు జారీ చేస్తుందన్నారు.

13:51 - September 9, 2015

శ్రీకాకుళం : భూసేకరణపై మరో రణం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టుకు భూసేకరణ కష్టమైంది. భూములను ఇచ్చేది లేదని స్థానికులు తెగేసి చెబుతున్నారు. బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని గర్జిస్తున్నారు. పోర్టు వ్యతిరేక పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అటు విపక్షాలు సైతం బాధితులకు అండగా నిలుస్తున్నాయి. సర్కార్‌కుపై యుద్ధానికి సైరన్ మోగిస్తున్నాయి.

భావనపాడు పోర్టుకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం.....

శ్రీకాకుళం జిల్లా ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా సమరశంకం పూరిస్తున్నారు. భావనపాడు పోర్టుకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే...ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.

దేవునల్తాడ, పొల్లాడ, కొమరనల్తాడ, చీపురుపల్లి.....

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం భావనపాడులో పోర్టు నిర్మాణానికి ఏపీ సన్నద్ధమైంది. భూముల కోసం దేవునల్తాడ, పొల్లాడ, కొమరనల్తాడ, చీపురుపల్లి, సూర్యమణిపురం, పాతటెక్కలి, సైనూరు, భావనపాడు గ్రామాల్లో భూసేకరణ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోకి సర్వే కోసం.... రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించింది. సుమారు 1900 ఇళ్లను తరలించాలని అధికారులు యోచిస్తున్నారు.

భూములిచ్చేది లేదని స్పష్టం చేసిన స్థానికులు.....

ఐతే ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాలు, తోటలు, ఇళ్లను పోర్టుకు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. భూసేకరణకు వచ్చిన రెవెన్యూ బృందాలను అడ్డుకొని....నిరసన తెలిపారు. మత్స్యకారులు సహా ఇతర కులవృత్తుల వారికి....భూసేకరణతో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక....

అవసరమైతే హైకోర్టులో కేసు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు నడుం బిగించారు. భావనపాడు తీరం... షిప్పింగ్ హార్బర్‌కు పనికిరాదని నిపుణులు తేల్చారు. కాని ప్రభుత్వ మాత్రం ఓడరేవు, హార్బర్ నిర్మించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల ఆందోళనలకు విపక్షాల మద్దతు......

మొత్తానికి పోర్టు నిర్మాణ భూసేకరణ సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మండల వాసుల్లో చిచ్చు రేపుతోంది. ప్రభుత్వ భూమి రెండువేల ఎకరాలు ఉన్నా ...పంట భూములు, నివాసిత గ్రామాలను తరలించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విపక్షాలు సైతం బాధితుల ఆందోళనకు మద్దతిస్తున్నాయి. పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.

13:48 - September 9, 2015

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కాల్వశ్రీరాంపూర్‌లో భర్తను....భార్య చంపిన ఘటన కలకలం రేపింది. కాల్వశ్రీరాంపూర్‌ మండలకేంద్రంలో రాజయ్య, రాధమ్మ ...భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరికిరి వివాహమైంది. రాజయ్య కూలీ పనిచేస్తూ...కుటుంబాన్ని పోషించేవాడు. వీరిద్దరూ నిత్యం గొడవ పడుతుండేవారు. ఈ తరుణంలోనే తెల్లవారుజామునరాజయ్యపై....అతని భార్య రోకలి, కొడవలితో దాడిచేసి చంపింది. తీవ్రగాయాలపాలైన రాజయ్య అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు రాధమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని ఎల్బీనగర్ లో ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. తెలంగాణలో ఆట మొదలైందని కేసీఆర్ అన్నారని, కానీ ప్రారంభమైంది ఆట కాదని వేట అని తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. త్వరలో కేసీఆర్ అంతు చూస్తానని హెచ్చరించారు. 

13:46 - September 9, 2015

హైదరాబాద్ : కొడుకు ఆరోగ్యం బాగోలేదని తీవ్రమనస్థాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా సదాశివ మండలం రత్నాలరాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింబయ్య హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ దగ్గర ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృత దేహాన్ని గాంధీకి తరలించారు.

రాయ్ బరేలిలో సోనియా గాంధీ..

ఉత్తర్ ప్రదేశ్ : రాయ్ బరేలి కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. అంతకుముందు పంచాయతీ భవన్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది. 

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మంత్రి రావెల సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మంత్రి రావెల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు 11 శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

'రైతులు, వ్యవసాయ కూలీలతో ప్రభుత్వం ఆటలాడుతోంది'

పశ్చిమగోదావరి : ఏలూరులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యశాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరయ్యారు. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలతో టిడిపి ప్రభుత్వం ఆటలాడుకొంటోందని, భూములు కాజేసీ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సమస్యలపై ఆందోళన చేస్తామని వెల్లడించారు. 

మూడు రాష్ట్రాల సీఎస్ లకు సుప్రీం నోటీసులు..

న్యూఢిల్లీ : యాసిడ్ దాడుల కేసుల్లో అలసత్వం ప్రదర్శించిన మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నేడు నోటీసులు జారీచేసింది. కర్ణాటక, మిజోరం, కేరళ రాష్ట్రాల సీఎస్‌లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. యాసిడ్ దాడుల కేసులపై సుప్రీం నేడు స్పందిస్తూ ఈ నోటీసులు జారీచేసింది. యాసిడ్ దాడులపై స్పందించడంలో విఫలమయ్యారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

యూఎస్ ఓపెన్ సెమిస్ కు చేరిన సానియా - హింగీస్ జోడి..

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా - మార్టినా హింగీస్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్ లో తైపీ యంగ్ జాన్ చాన్ - చింగ్ చాన్ జోడిపై 7-6(5), 6-1 తేడాతో సానియా జోడి గెలుపొందింది.

2010 కుర్లా అత్యాచారం..హత్యపై తీర్పు...

ముంబై : 2010 సంవత్సరంలో ఎనిమిదేళ్ల బాలిక కుర్లాపై అత్యాచారం..హత్య జరిగిన ఘటనపై తీర్పు వెలువడింది. నిందితుడు జావేద్ రెహ్మాన్ షేక్ కు జీవిత ఖైదు విధించింది. 

యాదాద్రి ఈవో, టీఆర్ఎస్ నేత మధ్య వివాదం..

నల్గొండ : యాదాద్రి ఆలయ ఈవో, టీఆర్ఎస్ నేత మధ్య వివాదం చోటు చేసుకుంది. మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా గుట్టపైకి బైక్ ర్యాలీతో టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి వచ్చాడు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీత భర్త మహేందర్ రెడ్డిలు కూడా అక్కడకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన మహేందర్ రెడ్డిపై ఈవో ఎన్.గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతల కోసం ఏమైనా చేస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఈవో పేర్కొనడంతో ఇష్టమొచ్చినట్లు చేసుకోమని మహేందర్ బదులిచ్చారు. 

12:45 - September 9, 2015

హైదరాబాద్ : డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజి నారాయణరావు స్మారక పురస్కారం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించిన ఈ పురస్కారానికి అమ్మంగి వేణుగోపాల్‌ను ఎంపిక చేశారు. రవీంద్రభారతిలో జరిగిన కాళోజి జయంతి ఉత్సవంలో ఆయనను ఘనంగా సన్మానించి.. పురస్కారాన్ని అందించారు. మిణుగురు, భరోసా వంటి కవితా సంపుటిలను అమ్మంగి రచించారు.

12:44 - September 9, 2015

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజికి సెక్రటేరియేట్‌ ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు. కాళోజి నారాయణరావు 101వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా భాషా దినోత్సవాన్న జరుపుతోంది. టీజీ సెక్రటేరియేట్‌లోని ఉద్యోగులు సైతం కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

12:43 - September 9, 2015

యాషెస్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో ఆసీస్ క్రికేటర్లు ఒక్కొక్కరుగా టెస్టు క్రికేట్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్ టెస్టు మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్టు క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇకపై సిడ్నీ సిక్సర్స్ తరపున టి -20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతానని ప్రకటించాడు. గత మే నెలలోనే హాడిన్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం 66 టెస్టులు ఆడిన ఈ 37 ఏళ్ల హాడిన్ 270 వికెట్లు పతనంలో పాలుపంచుకున్నాడు. 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంగ్లండ్ లో జరిగిన యాషెస్ సిరీస్ లో బ్యాట్స్ మెన్ గా విఫలం చెందానని, పరుగులు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ చేయలేకపోయానని..అందుకే రిటైర్ కావాలని అనుకుంటున్నట్లు హాడిన్ పేర్కొన్నాడు. 

12:42 - September 9, 2015

చిత్తూరు : తిరుపతిలోని కొర్లకుంట జంక్షన్‌ వద్ద గోడ కూలి పలువురు కూలీలకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

12:40 - September 9, 2015

హైదరాబాద్ : అంతన్నారు.. ఇంతన్నారు. ఏళ్లు గడుస్తున్నా.. సమస్యను పరిష్కరించడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఊళ్లకు ఊర్లే వలసెళ్తున్నాయి. బాధిత పల్లెల్లో నిశబ్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. గ్రామాల్లో మొండిగోడలే దర్శనమిస్తూ.. వెక్కిరిస్తున్నాయి. ఎటు చూసినా.. ఎవరిని పలకరించినా.. ఇప్పుడు కన్నీటిగాథలే వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న 9 గ్రామాలు......

ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టు.. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపల్లి ఎగువ ప్రాంతాన నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 9 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చినప్పుడల్లా ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి దయనీయం.....

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న తొమ్మిది గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఊర్లల్లో చుద్దామన్నా ఎవరూ కనిపించడం లేదు. గ్రామాల్లోకి ప్రవేశించేవారికి మొండిగోడలే స్వాగతం పలుకుతున్నాయి. ఏ ఇంటి వైపు చూసినా తాళాలే కనిపిస్తున్నాయి. వృద్ధులు మాత్రమే ఊర్లో కనిపిస్తున్నారు. మనుషులు లేక ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.

ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ అందని నష్టపరిహారం......

ఇదిలా ఉంటే..ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. పునరావాసం గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదు. అధికారులు ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. పైగా గ్రామాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీచేస్తూ.. భయపెడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల గోడును క్షుణ్ణంగా తెలుసుకుని.. వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

12:38 - September 9, 2015

హైదరాబాద్ : అనంతపురంలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్‌ అనే విద్యార్ధి సబ్జెక్టులు ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు సబ్జెక్టులు ఫెయిలైనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడు. 

12:36 - September 9, 2015

నల్లగొండ :యాదగిరిగుట్టలో హరీష్‌రావు పర్యటన సందర్భంగా ఆలయ ఈవో గీత, ప్రభుత్వ విప్‌ సునీత భర్త మహేందర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనలను లెక్కచేయకుండా గుట్టపైకి ర్యాలీగా వచ్చిన విప్‌భర్తను ఈవో గీత నిలదీశారు. దీంతో ఇద్దరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న ఈవో వ్యాఖ్యలపై విప్‌ భర్త ఘాటుగా స్పందించారు.

12:33 - September 9, 2015

హైదరాబాద్ : పోర్చుగల్‌లో ప్రపంచ సెయిలింగ్‌ సిరీస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.పోర్టో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీకి దిగాయి. హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్‌ పోటీల్లో మస్కట్‌ టీమ్‌... టాప్‌ ప్లేస్‌లో నిలిస్తే.... రెడ్‌ బుల్‌ టీమ్‌ ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది.

12:19 - September 9, 2015

హైదరాబాద్ : రెవెన్యూ లోటుతో అల్లాడిపోతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం... రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు... లోటు బడ్జెట్ పూడ్చేందుకు అప్పుల చిట్టాను కొనసాగిస్తూనే ఉంది.. పదేళ్లలో లక్షా 26వేల కోట్ల రుణాన్ని మార్కెట్ బారోయింగ్స్ ద్వారా పొందింది ఉమ్మడి రాష్ట్రం. ఇందులో నవ్యాంధ్ర వాటా 73వేల 856. తెలంగాణ వాటా 52వేల 783కోట్ల రూపాయలుగా ఉంది.. రాష్ట్ర విడిపోయాక ఈ ఐదు నెలల్లో మళ్లీ 7వేల కోట్లు రుణం పొందింది ఏపీ ప్రభుత్వం.. దీంతో అప్పు 82వేల కోట్లకు చేరింది..

ప్రతి వెయ్యి కోట్ల అప్పుకు పదేళ్లలో 800కోట్ల వడ్డీ.....

సాధారణంగా తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని నిర్ణీత సమయంలోగా చెల్లించాలి.. ప్రస్తుతం ఆర్బీఐ లెక్కలప్రకారం ప్రతి వెయ్యి కోట్ల అప్పుకు పదేళ్లలో 800కోట్లు వడ్డీగా కట్టాలి.. ఈ లెక్కల ప్రకారం ఏపీ తీసుకున్న 82వేల కోట్లకు పదేళ్లలో 64వేల కోట్లు వడ్డీ అవుతుంది... అసలు వడ్డీ కలిపి మొత్తం 146వేల కోట్లకు చేరనుంది.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటా 15వేల 500కోట్ల రుణం మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 7వేల కోట్ల రుణం తీసుకుంది.. ఇంకా 7వేల 500కోట్లను ఒకేసారి పొందాలని భావిస్తోంది.. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది.

పెండింగ్‌లో చాలా పనులు....

కొత్త రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి.. కొత్త రాజధాని, నవ్యాంధ్ర నిర్మాణం, అభివృద్ధి ఇలా అనేక సవాళ్లు ప్రభుత్వం ముందున్నాయి.. దీంతో ఈ అప్పుల చిట్టా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయి.. ఈ అప్పులను సకాలంలో ప్రభుత్వం తీరస్తుందా? మధ్యలోనే చతికిలబడుతుందా? అన్నది వేచి చూడాలి.. 

12:14 - September 9, 2015

పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' నటించే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎంతో మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈచిత్రం తరువాత ఏ సినిమాలో నటిస్తాడు ? దానికి దర్శకుడు ఎవరు ఉంటారు ? అనే దానిపై అభిమానులు చర్చల మీద చర్చలు చేస్తుంటారు. తాజాగా పవన్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ సినిమా అనంతరం ఆయన 'దిల్' రాజు నిర్మాణంలో 'పవన్' నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు 'దిల్' రాజు 'జనగణమణ' అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేశాడంట. జనగణమణ, సుప్రీమ్, ఎవడో ఒకడు అనే పేర్లను తన బ్యానర్ పై రిజిస్టర్ చేయించాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా నిర్మించనున్నాను అని ప్రకటించిన దిల్ రాజు 'జనగణమణ' టైటిల్ తో వస్తాడని అంటున్నారు. ఇక సుప్రీమ్ టైటిల్ ను మెగా ఫ్యామిలీ మరో హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాకోసం అని ఇక ఎవడో ఒకడు సినిమా టైటిల్ ఎవరికోసమో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అందరిలో మరింత ఆసక్తి ఎక్కువైంది ? అంటే పవన్ కళ్యాణ్ తో సామజిక ఇతివృత్తం తో సినిమా చేస్తాడా ! అనే సందేహాలు మొదలయ్యాయి. సర్దార్ షూటింగ్ పూర్తీ కాగానే పవన్ తో సినిమా ఉంటుందని సమాచారం ? సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది..

12:13 - September 9, 2015

'నితిన్' హీరోగా గౌతమ్ మీనన్ నిర్మతగా రూపొందిన చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మళ్లీ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం సెన్సార్ కు అనుకున్న విధంగా స్లాట్ దొరకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇటీవలే... కొరియర్ బాయ్ కళ్యాణ్ పోస్టర్, సాంగ్స్ ప్రోమోలు విడుదలైన సంగతి తెలిసిందే. 'యామి గౌతమ్' హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాకి ప్రేమ్ సాయి దర్శకుడు. ఈ సినిమా కు కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ బాషల్లో రూపొందిన ఈ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా యాక్షన్, థ్రిల్, ఎంటర్ టైన్మెంట్ గా రుపొందింది. 

రాజీనామా చేయను - రాకేష్ మారియా..

ముంబై : బదిలీ చేయడంపై ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్పందించారు. ఈ నిర్ణయం తనకు బాధను కలిగించిందని, అయినా రాజీనామా చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. 

11:49 - September 9, 2015

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణలోని ప్రశ్నించేతత్వం, ధైర్యాన్ని అలవరుచుకోవాలని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రవీంధ్ర భారతి కాళోజీ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాళోజీతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కవులు, రచయతలు పుట్టినిల్లు అని తెలిపారు. వరంగల్ జిల్లా ఉద్యమాలు, విప్లవాలకు ప్రేరణ అని పేర్కొన్నారు.ఎవరికీ భయపడని తత్వం కాళోజీది అని.... ప్రజలగొడవను తన గొడవగా మరల్చుకున్నారని తెలిపారు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాళోజీ పురస్కారాన్ని అందుకుకోనున్న అమ్మంగి వేణుగోపాల్ రావుకి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.

11:45 - September 9, 2015

కృష్ణా : వేలమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గన్నవరంలోని వికెఆర్ కాలేజీ అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఎందరినో ప్రయోజకులుగా తీర్చిదిద్దిన సంస్థ కొందరి స్వార్థ రాజకీయానికి బలవుతోంది. కళాశాల కమిటీ సభ్యులే కాలేజీ ఆస్తులను దొడ్డిదారిన అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. అభివృద్ధి పేరుతో వినాశ కచర్యలకు పాల్పడుతున్నారు.

1969లో బుద్ధవరంలో వీకేఆర్‌ కాలేజీ ఏర్పాటు.....

కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలోని వీకేఆర్‌ కాలేజీది. ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షించిన కొందరు మహానీయుల దాతృత్వంతో 1969లో వీకేఆర్‌ కాలేజీ ఆవిర్భవించింది. ఈ కాలేజీలో చదవిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలాంటి ఈ కాలేజీ ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. వీకేఆర్‌ కాలేజీ గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణలో ఉండడంతో కమిటీ సభ్యులే కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. వీకేఆర్ కాలేజీకి చెందిన 30 కోట్ల ఆస్తులను కైంకర్యం చేసేందుకు కమిటీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీకేఆర్‌ కాలేజీ భూములను ఒక ఎకరా 1.25 కోట్లకు అమ్మేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో వీకేఆర్‌ కాలేజీ ఆస్తులు....

ప్రభుత్వ ఎయిడ్‌తో నడుస్తున్న ఈ కళాశాల ఆస్తులన్నీ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలోనే ఉన్నాయి. అయినప్పటికీ, కాలేజీ భూములను అమ్మి.. సొమ్ము చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం అండగా నిలుస్తుండడం కాలేజీ పూర్వ విద్యార్థులను ఆందోళన కల్గిస్తున్న విషయం. కాలేజీ పాలకవర్గం భూములను రియల్టర్లకు అమ్మేందుకు బేరసారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు వ్యూహరచన.....

దాతల కుటుంబాల పేరుతో రెండేళ్ల క్రితం పాలకవర్గంలోకి ప్రవేశించిన కొందరు, తమకు భూములను అమ్ముకునే హక్కు ఉందంటూ కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దాతలిచ్చిన కాలేజీ భూములు గన్నవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధీనంలో ఉన్నాయి. అయినప్పటికీ, దాతల పేర్లతో ఉన్న దస్తావేజులను చూపించి కాజేసేందుకు పాలకవర్గ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లుగా కాలేజ్ భూముల అమ్మకానికి ప్రయత్నాలు జరుగుతుండగా.. ప్రజా సంక్షేమం కోసం వామపక్షాలు అడ్డుకుంటున్నాయి.

వీకేఆర్‌ కాలేజీని రక్షించాలి....

ఎంతోమంది దాతల దాతృత్వంతో వెలిసిన విద్యాలయ భూములను కొందరు తమ స్వార్థం కోసం అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. వీకేఆర్‌ కాలేజీని రక్షించాలని పూర్వ విద్యార్థులు, వామపక్ష నేతలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

11:41 - September 9, 2015

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజి నారాయణరావు స్మారక తొలి పురస్కారం డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ను వరించింది. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు కాళోజి జయంతిని భాషాదినోత్సవంగా కూడా జరపాలని సర్కార్‌ సంకల్పించింది. ఈ సందర్భంగానే పురస్కారాన్న ఇవ్వాలనుకున్న ప్రభుత్వం.. అందులో భాగంగా ఇందుకు అమ్మంగిని ఎంపిక చేశారు. పచ్చబొట్టు, పటం చెరువు, భరోసా, మిణుగురు లాంటి కవితా సంపుటాలను వేణుగోపాల్‌ రచించారు. ఉస్మానియా నుంచి డాక్టరేట్‌ కూడా పొందారు. 

ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు..

కృష్ణా : పమిడిముక్కల (మం) ముత్రాసుపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు టీవై వైర్మ లైంగిక దాడి చేశాడు. విద్యార్థినుల దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో పమిడిముక్కల పోలీసులు వర్మను అదుపులోకి తీసుకున్నారు. 

11:39 - September 9, 2015

అమరావతి : ఏపీ ప్రభుత్వం చంద్రన్న యాత్రను ప్రారంభించింది. రైతుల కష్టాలను పరిశీలించడానికి.. రైతు రుణమాఫీపై ప్రచారం చేసి సందేహాలు తీర్చడానికి బాబు సర్కార్‌ ఈ యాత్రను మొదలెట్టింది. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, అచ్చెన్నాయుడు తదితరులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది.

రవీంద్ర భారతిలో కాళోజీ జయంతి ఉత్సవాలు..

హైదరాబాద్ : రవీంద్రభారతిలో కాళోజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల, నాయినీ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులు హాజరయ్యారు. కాళోజీ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కాళోజి గొప్ప వ్యక్తి అని హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. విప్లవ సమయంలో కాళోజీ చురుగ్గా పాల్గొన్నారని, కాళోజీ రచనలు చైతన్య పరిచాయని, కాళోజీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

 

11:37 - September 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 60కిపైగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ ఉందని వైద్యులు నిర్ధారించారు. వారు మెదక్ జిల్లాకు చెందిన గర్భిణీ మహిళలు. ఇందులో ఇద్దరు గర్భిణులు, ఓ మహిళ ఉన్నారు. వాతావరణ మార్పుల వల్లే ఫ్లూ వ్యాపిస్తోందని వైద్యులు అంటున్నారు. మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

11:33 - September 9, 2015

హైదరాబాద్ : ఓ సామాన్యుడు రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారాడు. ఏకంగా వెనీస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంట్రీ పాస్‌ సంపాదించాడు. ఆయన రచించిన నవల సినిమాగా తెరకెక్కి విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరా ఆటోవాలా? ఏమిటా కథ?

టో డ్రైవర్‌ జీవితాన్ని మార్చేసిన చేదు అనుభవం....

సాదాసీదాగా కనిపిస్తున్న ఈయన పేరు చంద్రకుమార్‌. వృత్తి ఆటో డ్రైవర్‌. ప్రవృత్తి నవల రచన. తమిళనాడు కోయంబత్తూరులో నివాసం. ఓ చేదు అనుభవం ఈయన జీవితాన్నే మార్చివేసింది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయాడు. గుంటూరులో కాయకష్టం చేసుకుంటూ బతుకు జట్కా బండిని ప్రారంభించాడు.

అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారట....

ఆ సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. చంద్ర కుమార్‌ను అకారణంగా గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. 13 రోజులు లాకప్‌లో పెట్టి చిత్రహింసలు పెట్టారట. మొత్తానికి ఠాణా నుంచి బయటపడ్డ అతడు బతుకుజీవుడా అంటూ తిరిగి సొంతూరు కోయంబత్తూరు చేరుకున్నాడు. గుంటూరులో జరిగిన పోలీసుల దౌర్జన్యంపై లాకప్ పేరుతో ఓ నవల రాశాడు. సామాన్యులు, నిస్సాయులైన పేదలకు న్యాయం జరగటం లేదంటూ తన బాధను నవలలో రాసుకున్నాడు. ఈ నవలను 2006లో బెస్ట్ డాక్యుమెంట్ ఆప్ హ్యూమన్ రైట్స్ అవార్డు వరించింది.

విసారణై పేరుతో చిత్రాన్ని నిర్మించిన హీరో ధనుష్‌....

లాకప్‌ నవల పాపులర్‌ కావడంతో హీరో ధనుష్‌ దృష్టిపడింది. దర్యాప్తు అని అర్థం వచ్చేలా విసారణై పేరుతో తెరకెక్కించాడు. ప్రతిష్ఠాత్మక వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. మన దేశంలో ఇంకా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తొలిసారిగా ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లోని కాంపిటీషన్ సెక్షన్ లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. దీంతో చంద్రకుమార్‌కు ఒక్కసారిగా సెలబ్రిటీ అయ్యే అవకాశం వచ్చింది. చిత్రోత్సావాలకు రావాలని ఆహ్హానం పంపడంతో.. చంద్రకుమార్ వెనీస్ బయల్దేరి వెళ్లాడు. చంద్రకుమార్ గతంలో కమ్యునిస్టు నాయకుల జీవిత చరిత్రలు, ఉగ్రవాదులపై రాసిన నవలలు పాఠకుల మన్ననలు పొందాయి. 

11:30 - September 9, 2015

హైదరాబాద్ : జీడిమెట్లలో కాల్పుల కలకలం రేగింది. ఉషోదయ అపార్ట్‌మెంట్లో గాల్లో కాల్పులు జరిపి దొంగతనానికి కొందరు దుండగులు యత్నించారు. రాఘవశర్మ అనే వ్యక్తి నుంచి బ్యాగ్‌ ఎత్తుకుపోయేందుకు యత్నించగా.. అతడు కేకలు వేయడంతో గాల్లోకి కాల్పులు జరిపి దొంగలు పారిపోయారు.

11:26 - September 9, 2015

హైదరాబాద్ : మీ పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్లో చదవాలని కలలు గంటున్నారా? నాణ్యమైన విద్యను అందించాలనుకుంటున్నారా? అయితే మా స్కూల్‌లో చేర్పించండి. కేజీ నుంచి టెన్త్‌ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్‌.. విత్‌ హాస్టల్‌ ఫెసిలిటీ. అయితే ఓ చిన్న కండిషన్‌. లక్ష డిపాజిట్‌ చేయండి...చదువు అయిపోగానే డబ్బులు రిటర్న్‌ చేస్తాం. ఇలాంటి ప్రకటనతోనే ఓ విద్యాసంస్థ...జనాలకు టోకరా ఇచ్చింది.

కేశవరెడ్డి విద్యాసంస్థల మాయాజాలం.....

నమ్మకమనే ముసుగులో కొందరు అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా మసిపూసి మారెడుకాయ చేస్తున్నారు. తమ పాచిక పారే వరకు నక్క వినయాలు ప్రదర్శిస్తూ జనాలను బుట్టలో వేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఈజీగా సంపాదించే రూట్లను ఎంచుకుంటున్నారు.

తెలుగురాష్ట్రాల్లో పరిచయమైన కార్పొరేట్ సంస్థ...

కేశవరెడ్డి విద్యా సంస్థలు. తెలుగురాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని కార్పొరేట్‌ సంస్థ ఇది. ఈ సంస్థ చేసే ప్రకటనలు గానీ, ఆర్భాటాలు గానీ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలుసు. ఇంతింతై వటువింతై అన్న చందంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభించి.. హైటెక్‌ హంగులతో కార్పొరేట్‌ విద్యను అందిస్తోంది. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు ఎడ్యుకేషన్‌ ముసుగులో నయా దందాకు తెరలేపింది. ఒక్కసారి లక్ష డిపాజిట్‌ చేస్తే కేజీ నుంచి టెన్త్‌ వరకు ఉచిత విద్య అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చింది. ఫ్రీ హాస్టల్‌ ఫెసిలిటీ అంటూ ఊదరగొట్టింది. అంతేకాదు డిపాజిట్‌ సొమ్మును టెన్త్‌ పూర్తికాగానే తిరిగి వెనక్కి ఇస్తామని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నాణ్యమైన విద్య అందించకపోయినా... మధ్యలోనే స్కూల్‌ మారాలనుకున్నా డిపాజిట్‌ డబ్బులు చెల్లిస్తామని నమ్మించింది. ఈ విషయాన్ని జనాల్లో విపరీతంగా ప్రచారం చేసింది. ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాక జనాలు కూడా నిజమేనని నమ్మారు. 

కేశవరెడ్డి విద్య సంస్థలకు లక్ష చొప్పున డిపాజిట్‌ ....

ఉచితంగా తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్య అందుతుందన్న ఆశతో.. తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును కేశవరెడ్డి విద్య సంస్థలకు సమర్పించుకున్నారు. ఇలా పేద్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బడిముబ్బడిగా డబ్బులు కట్టారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ప్లేట్ పీరాయిస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ పూర్తయిన వారు, మధ్యలో స్కూల్‌ మారిన వారు డిపాజిట్ సొమ్ము చెల్లించమంటే అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. చెప్పులరిగేలా తిరిగినా యాజమాన్యం పట్టించుకున్న పాపన పోవడం లేదని కర్నూలు జిల్లా వెల్దుర్ది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక న్యాయం చేయమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన దిన్నె దేవరపాడు వాసులు.....

దిన్నెదేవర పాడు గ్రామస్తులది ఇదే పరిస్థితి. తమ డిపాజిట్‌ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులు మొరపెట్టుకున్నారు. కేశవరెడ్డి స్కూల్‌ యాజమాన్యం తీరుపై భగ్గుమంటున్నారు.

తాండ్రపాడు నుంచి దిన్నె దేవరపాడుకు స్కూల్‌ తరలింపు.....

తాండ్రపాడు కేశవరెడ్డి స్కూల్‌లో చేరిన విద్యార్థులది మరో దీనగాధ. అక్కడ బ్రాంచ్‌ను తొలగించి దిన్నె దేవరపాడుకు మార్చింది యాజమాన్యం. నాణ్యమైన విద్య అందడం లేదని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర స్కూల్‌లో చేర్పిస్తామని డబ్బులు అడిగితే..రేపు,మాపు అంటు తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. తమ డిపాజిట్‌ సొమ్మును చెల్లించకపోతే తమ పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

ప్రాథమిక విద్యకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ యుగంలో... ఫ్రీ ఎడ్యుకేషన్‌ అని ఊదరగొడితే.. అందులో కచ్చితంగా ఏదో మోసం ఉంటుందని గ్రహించాలని విద్యావేత్తలు అంటున్నారు. ప్రజలను అడ్డంగా దోచుకునే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరికి గుణపాఠం మిగులుతుందని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో రైతు ఆత్మహత్య..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం వద్ద రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. 

గోదావరి నీటిని వదిలిన దేవినేని..

కృష్ణా : కృష్ణా జిల్లాలోకి గోదావరి నీటిని మంత్రి దేవినేని ఉమ విడుదల చేశారు. పూజలు, పూర్ణకుంభంతో గోదావరి నీటికి రైతులు స్వాగతం పలికారు. ప్రస్తుతం తాడిపూడి ఎత్తిపోతల నుండి 600 క్యూసెక్కుల నీరు చేరింది. పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు ప్రవేశించింది. 

 

యమన్ లో భారతీయులు చనిపోలేదు - విదేశాంగ శాఖ..

ఢిల్లీ : యమన్ లో భారతీయులెవరూ చనిపోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు బోట్లలో 20 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారు. తిరుగుబాటుదారులనుకొని భారతీయులపై వైమానిక దాడులు జరిపారని, 13 మంది క్షేమంగా ఉన్నారని, ఏడుగురి ఆచూకీ గల్లంతయైందని తెలిపింది. 

11:21 - September 9, 2015

హైదరాబాద్ : సకాలంలో వర్షాల్లేక వాగులు, వంకలు వట్టిపోయాయి. చినుకు రాకకోసం బీడు భూములు నోళ్లు తెరచి ఎదురుచూశాయి. కరువు దెబ్బతో చితికిపోతున్న రైతన్న తదేకంగా వానకోసం ఆకాశం వైపు ఎదురుచూశాడు. వరుణుడు మొహం చాటేయడంతో ప్రాజెక్టులు వెలవెలబోయాయి. నిన్నటిదాక అడుగంటిన జలాశయాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. ఒట్టికుండను తలపించిన కాలువలు ఇప్పుడు నీళ్ల గలగలతో సవ్వడి చేస్తున్నాయి.

రబీపై రైతుల ఆశలు.....

కర్నూలు జిల్లాలో ఈయేడాది వర్షాలు ఖరీఫ్‌ను ఎండగట్టినా.. రబీకి ఆశలు చిగురింపజేశాయి. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వేదవతి నది నుంచి సుంకేశుల బ్యారేజికి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటోంది. దీంతో సుంకేశుల డ్యాం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది.

2000 క్యూసెక్కుల మేర కేసీ కాల్వకు వరదనీరు.....

సుంకేసుల బ్యారేజీ నుంచి అధికారులు 2000 క్యూసెక్కుల మేర నీటిని కేసీ కాల్వకు వదిలారు. సుంకేసుల బ్యారేజీ 33 క్రస్ట్ గేట్లకు గాను 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 1,60,000 క్యూసెక్కుల మేర నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. ప్రస్తుతం 90వేల క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో ఉంది. ఖరీఫ్ సీజన్‌ రైతు పాలిట శాపంగా మారినా.. రబీలోనైనా కేసీ కాలువకు నీరు రావడంతో కేసీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జలకళను సంతరించుకున్న వేదవతి నది.....

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేదవతి నది జలకళను సంతరించుకుంది. వరదనీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఇటు మంత్రాలయంలో కూడా భారీ వర్షం కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్రలో వరదనీరు భారీగా వచ్చి చేరింది.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు......

కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌లో వేసిన ఆరుతడి పంటలు ప్రాణం పోసుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌ కష్టాలు మిగిల్చినా.. రబీ సీజన్‌ తమను ఆదుకుంటుందని.. జిల్లా రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. 

11:17 - September 9, 2015

గుంటూరు : అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలో బుద్ధుని కాలం నాటి శిలాశాసనాలు బయటపడ్డాయి. గాలిగోపుం పునర్నిర్మాణంలో భాగంగా గుంతలు తవ్వుతుండగా శిలాశాసనాలు బయటపడ్డాయి బుద్ధుని చరిత్రకు సంబంధించిన ఆధారాలతో కూడిన శిలా శాసనాలను బౌద్ధ మ్యూజియానికి తరలించారు.

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, స్పెక్ట్రమ్ వేలంపై చర్చిస్తున్నారు.

భారత శిఖరాగ్ర సదస్సులో జైట్లీ..

ఢిల్లీ : భారత శిఖరాగ్ర సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ప్రపంచ మార్కెట్లు సంక్షోభంలో ఉన్నా భారత్ నిలదొక్కుకొంటోందని, ఆశాజనకమైన వృద్ధి రేటు కనబరుస్తోందన్నారు. 2016 ఎప్రిల్ 1లోగా జీఎస్టీ బిల్లును ఆమోదింప చేయాలని అనుకుంటున్నట్లు, కానీ కాంగ్రెస్ అడుగడుగా అడ్డుకొంటోందన్నారు. 

తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 60కి పైగా కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణిలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 

10:01 - September 9, 2015

రంగారెడ్డి : శామీర్‌ పేట్‌ ఎస్‌బీహెచ్‌లో దుండగులు దోపిడీకి యత్నించారు. బ్యాంక్‌ కిటికీ గ్రిల్స్‌ తొలగించిన దుండగులు పెట్రోలింగ్‌ పోలీసులు రావడంతో పరారయ్యారు. గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు కిటికీ తెరిచేందుకు దుండగుల విఫలయత్నం చేశారు.

ఢిల్లీలో బైరెడ్డి దీక్ష..

ఢిల్లీ : నీటి కేటాయింపుల్లో రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ జలసాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దీక్ష చేపట్టారు.

 

నేడు నగరానికి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : హైకోర్టు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. నగరానికి వస్తున్న రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలు పోలీసు అకాడమీ వద్ద ఘనస్వాగతం పలకనున్నారు. 

09:59 - September 9, 2015

హైదరాబాద్ : దేశ రాజధాని నగరంలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా దైత్యవేత్త నివాసంలో దారుణం వెలుగులోకి వచ్చింది. నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అక్కడ బంధించి వారిపై పలుమార్లు అత్యాచారంతోపాటు హింసకు పాల్పడిన సంఘటనలో బాధితురాళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. కాగా ఈ వ్యవహారం మూడు దేశాలకు సంబంధించింది కావడంతో విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.

09:57 - September 9, 2015

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక...వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన సుకన్యకు... గుంటూరుకు చెందిన మహేష్‌తో గతేడాది పెళ్లి జరిగింది. గుంటూరులో ఓ ఫైనాన్స్‌ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్లిసమయంలో సుకన్య కుటుంబ సభ్యులు.... 5 లక్షల రూపాయలను కట్నంగా ఇచ్చారు. ఐతే గత మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలుపెట్టాడు. కట్నం తేవాలని తరచూ ఒత్తిడి తేవటంతో...నిజాంపేటలో ఉంటున్న తల్లిదండ్రల దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. ఈ తరుణంలోనే.....సుకన్య మనస్తాపంతో బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

09:53 - September 9, 2015

హైదరాబాద్ : యెమెన్‌ సంక్షోభం ఇంకా కలవరపెడుతూనే వుంది. ఏ క్షణం ఏమవుతుందో తెలీని పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాకుల శబ్దాలు, వైమానిక దాడుల మోతతో హోరెత్తుతోంది. ఇలాంటి భీతావహ వాతావరణం... పౌరులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది.

చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా......

చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా సౌదీ వాయుసేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ఈ దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. యెమెన్ లోని హుదైదా పోర్టు సమీపంలో సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా ఆయిల్ స్మగ్లర్లపై దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వైమానిక దాడుల్లో రెండు బోట్లు ధ్వంసం?....

వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో సుమారు 60 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతోంది. 

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న కేసీఆర్..

చైనా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన కొనసాగుతోంది. డేలియన్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

09:50 - September 9, 2015

హైదరాబాద్ : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. అదేరోజు రాత్రి పెద్ద శేషవాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఐదవరోజు జరిగే శ్రీవారి గరుడ సేవకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.

అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక....

ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నిఘాపై దృష్టిసారించారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. తిరుమలలో తొలిసారిగా డ్రోన్లను వాడాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి పుష్కరాల్లో డ్రోన్లు సత్ఫలితాలు ఇవ్వడంతో అధికారులు వాటిపై మొగ్గుచూపుతున్నారు. అయితే, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు మాత్రం ఆగమ శాస్ర్తం సమ్మతిస్తేనే డ్రోన్ల వినియోగం ఉంటుందంటున్నారు.

భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్న డీజీపీ రాముడు....

నిత్యం తిరుమలకు వచ్చే భక్తులతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అదనంగా లక్షలాది భక్తులు తిరుమలకు రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై రాష్ట్ర డీజీపీ రాముడు బలగాలకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులు, దొంగలపై నిఘా మరింత పెంచాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. 

అక్టోబర్ 13 నుండి ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు

హైదరాబాద్ : వచ్చేనెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు దహసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో నరసింగరావు ఎతలిపారు. ఈనెల 11 నుంచి జిల్లాలో కనకదుర్గమ్మ ప్రచారం రథం తిరుగుతుందని తెలిపారు. ఈనెల 11 నుంచి 16 వరకు శ్రీకాకుళం జిల్లాలో, 18 నుంచి 23 వరకు విజయనగరం జిల్లాలో, ఈ నెల 24 నుంచి 29 వరకు విశాఖ జిల్లాలో కనకదుర్గమ్మ ప్రచార రథం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదయ్యింది. వారం రోజుల క్రితం మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళ జ్వరంతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించన అనంతరం మహిలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : కూకట్‌పల్లి నిజాంపేట్‌ రోడ్డులోని సెవెన్‌హిల్స్‌ శేషాద్రి అపార్టుమెంట్‌లో సుకన్య అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల కారణం వల్లనే మృతురాలి బంధువులు ఆరోపించారు.

12న తిరుపతి పాస్‌పోర్ట్ మేళా...

హైదరాబాద్: ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 600 మందికి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నట్టు తెలిపారు.

జీడిమెట్లలో కాల్పుల కలకలం..

హైదరాబాద్ : జీడిమెట్లలో కాల్పులు కలకలం సృష్టించింది. ఉషోదయ అపార్ట్ మెంట్స్ ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. రాఘవ శర్మ అనే వ్యక్తి వద్దనున్న బ్యాగు తస్కరించే ప్రయత్నం చేయబోయాడు. రాఘశ శర్మ కేకలు వేయడంతో దొంగ గాల్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు. 

08:35 - September 9, 2015

హైదరాబాద్ : ప్రపంచంలో తీవ్రవాదులను పోషించింది బ్రిటన్, అమెరికాలే అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధం వల్ల కోట్లాది మంది ప్రజలు డిస్ ప్లేస్ అవుతున్నారు. అందులో భాగమే సిరియాలో ఏర్పడిన పరిస్థితులా? పశ్చిమ దేశాల్లో ఉన్న మీడియాకు ఇది ఒక సమస్యగా కనిపించడం లేదా? సోనియా గాంధీ మరో ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా కొనసాగనున్నారు. రాహుల్ గాంధీకి డెసిసివ్ నెస్ లోపించిందా? సెప్టెంబర్ 5న పిల్లలకు ఆప్టిట్యూడ్ టెస్టు పెట్టాలనే ప్రధాని ఆలోచన మంచిదే. కాని ఆ పరిస్థితులు పాఠశాలలో ఉన్నాయా? మన దేశంలో విదేశీ విద్యాలయాలు ఆహ్వానించాలని ప్రధాని తెలిపారు. అది ఎంత వరకు సబబు? ఇత్యాది అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణను మీరూ వినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

08:01 - September 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ లో రైతు ఆత్మహత్యలపై మంత్రులు సమీక్షించాలని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు... ప్రభుత్వ రైతులకు అండగా ఉంటుది.. రైతు ఆత్మహత్యలు వూహించింది కాదు అని కొందరు మంత్రులు తెలిపారు. ఆ భరోసా రైతులకు సరిపోతుందా? రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. అందులో మహిళా రైతలు ఆత్మహత్యల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది? రైతులకు భరోసా ఇవ్వలేని దుస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారా? కరువు మండలాలను ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు? వ్యవసాయం పట్ల ప్రభుత్వానికి ఉండాల్సిన చిత్త శుద్ధి లేదా? రుణ మాఫీ అనేది సర్వ రోగి నివాణి కాదా? సహకార రంగాన్ని బలోపేతం చేసి రుణాలు బలోపేతం చేయాల్సిన అవసరం లేదా? రైతులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం లేదా? రాజకీయ వ్యవహారాల్లో హరీష్, పరిపాలనా కార్యకలాపాల్లో కేటీఆర్ ఇద్దరూ షాడో సీఎంలుగా పనిచేస్తున్నారా? ఇద్యాతి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ఎస్.వీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టిఆర్ ఎస్ నేత రాకేష్, టి.టిడిపి అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పాల్గొన్నారు. మరింత విశ్లేషణాత్మకమైన చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

సుంకేశుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి విడుదల

హైదరాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సుంకేశుల జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 45 వేల క్యూసెక్కులు, ఔట్ ప్లో 54 వేల క్యూసెక్కులుగా ఉంది. 14 గేట్ల ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం...

కర్నూలు : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న రిజర్వాయరుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్‌లోకి 53,774 క్యూసెక్కుల నీరు చేరింది. ఔట్‌ఫ్లోను నిలిపివేయడంతో శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 799.10 అడుగులుంది. శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 28.57 టీఎంసీల నీరు నిల్వఉంది. మరో వైపు ఎగువన ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. తుంగభద్ర నీటిమట్టం 1625.21 అడుగులుండగా ఇన్‌ఫ్లో 5,420 క్యూసెక్కులు. భారీవర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

స్కాలర్ షిప్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు...

హైదరాబాద్ : 2014-15 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచింది. స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టుతో ముగిసినప్పటికీ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ కాని కారణంగా చాలా మంది విద్యార్థులు గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులుచేయలేదు.  ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సెప్టెంబర్ 20వ తేది వరకు గడువు పెంచింది. www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని జిల్లా ఎస్సీల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ హనుమంతు నాయక్ తెలిపారు.

విశాఖ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

విశాఖ: కేకేలైన్‌లో బొర్రా-కరకవలస రైల్వేస్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో 200 మీటర్ల మేర రైల్వేట్రాక్‌ దెబ్బతింది.ఈ గూడ్సు రైలు ప్రమాదంతో అరకు వెళ్లే రైలుతో సహా పలు గూడ్స్‌ రైళ్లను రద్దు చేశారు. రైలుపట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టారు.

బ్రిటన్ ఎయిర్ వేస్ విమానంలో మంటలు...

హైదరాబాద్ : అమెరికాలోని లాస్ వెగాస్ విమానాశ్రయంలో నేటి ఉదయం పెను ప్రమాదమే తప్పింది. 172 మంది ప్రయాణికులతో ఆ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంటున్న బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విమానంలో మంటలను పసిగట్టిన ఎయిర్ పోర్టు సిబ్బంది క్షణాల్లో స్పందించారు. విమానాన్ని నిలిపేసి పరుగు పరుగున విమానం వద్దకెళ్లి అందులోని ప్రయాణికులందరినీ క్షణాల్లో కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి కూడా గాయాలు కాకుండా ఎయిర్ పోర్టు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని టీటీడీకి అప్పగింత

కడప : జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని టీటీడీకి అప్పగించారు. ఒంటిమిట్ట ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఒంటిమిట్ట ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.

 

శామీర్ పేట ఎస్ బీ హెచ్ లో చోరికి యత్నం...

రంగారెడ్డి : శామీర్‌పేట్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో బ్యాంకు వెనుకభాగం నుంచి లోపలకు చొరబడేందుకు దుండుగులు ప్రయత్నించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

07:11 - September 9, 2015

హైదరాబాద్ : ఏజ్‌ లిమిట్ అస్సలు లేదు. రికమెండేషన్స్‌కు చోటే లేదు. హార్ట్‌వర్క్ చేస్తే చాలు... ఈజీగా హాట్‌ సీట్‌ దక్కించుకోవచ్చు. పుస్తకాలు పట్టండి... సీటు కొట్టండంటూ ఆఫర్ చేస్తున్నారు కాంగ్రెస్ యువరాజు. త్వరలో దేశంలో కొత్త పరీక్షలు రాబోతున్నాయి. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు... ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. అంతా ఓపెన్ కోటానే..! అయితే పరీక్ష రాసే అభ్యర్థులు మాత్రం కాంగ్రెస్ నేతలై ఉండాలి. ఇంతకీ ఏమిటా పరీక్ష..?

ఆర్‌బీఈలో ఉత్తీర్ణులైతేనే హస్తంలో చక్రం తిప్పొచ్చు.....

మీరు కాంగ్రెస్ లీడర్లా..? అయితే పాఠాలు చదవాల్సిందే..! పుస్తకాలు దులపాల్సిందే..! చదివే ఒపిక లేదంటారా..? ఇంకేముంది మీరు పార్టీలో ఉన్నా లేనట్లే..! అవునండి మీరు వింటోంది నిజమే. ఆర్‌బీఈలో ఉత్తీర్ణులైతేనే హస్తంలో చక్రం తిప్పొచ్చు.

కాంగ్రెస్ నేతల చేతుల్లో పుస్తకాలు...

ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్‌, సైన్స్ అండ్ టెక్నాలజీ... ఇలా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు... త్వరలో కాంగ్రెస్ నేతల చేతుల్లో కనిపించబోతున్నాయి. రాహుల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో... పాసవ్వాలంటే లీడర్లంతా ఆ బుక్స్‌ చదవాల్సిందే..! కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు... యువరాజు బృందం వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రం నుంచి కొందరిని సెలక్ట్ చేసి వారికి సెలక్టివ్‌గా పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టి వారిని ఎంపిక చేయనుంది. దీంతో పార్టీలో యువ నేతలు ప్రిపరేషన్‌లో పడ్డారు.

పీసీసీ పర్యవేక్షణలో ఎంపిక....

ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి సమర్థులైన అభ్యర్థుల జాబితాను రాహుల్ టీం... పీసీసీ పర్యవేక్షణలో ఎంపిక చేసింది. ఇలా దాదాపు 3 వేల మంది పేర్లును ఏఐసీసీ పదవుల కోసం సేకరించింది. వీరిలో సీనియార్టీ, పార్టీకి కష్టపడే తత్వం, సామాజికాంశాలపై పట్టు, నడవడిక ఆధారంగా 150 మందిని రాహుల్ టీం షార్ట్ లిస్ట్ చేసింది. ఒక్కో గ్రూపునకు ఏడుగురి చొప్పున 22 గ్రూపులుగా ఎంపిక చేసింది. వీరందరికి మొదట కొన్ని ప్రశ్నలను ఏఐసీసీ పంపించింది. వాటికి వీరు విపులంగా, విశ్లేషణాత్మకంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

త్వరలో జరిగే గ్రూప్ డిస్కషన్స్ , రాహుల్ తో ఇంటర్వ్యూ....

మత్మోనాదానికి, ఉగ్రవాదానికి సంబంధం ఏమైనా ఉందా...? ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి తేడా ఏంటీ..? ప్రభుత్వానికి ఇబ్బంది కల్గకుండా... రైతు ఆత్మహత్యలను నివారించలేమా..? ఇలాంటి ప్రశ్నల్ని సెలక్టెడ్ నాయకులకు ఢిల్లీ పెద్దలు పంపించారు. త్వరలో జరిగే గ్రూప్ డిస్కషన్స్ , రాహుల్ తో ఇంటర్వ్యూ నాటికి... వీరు సమాధానాలతో సిద్ధమవ్వాలి. అంతేకాదండోయ్‌..! ఈ అంశాలపై రాహుల్ మళ్లీ తిరిగి ప్రశ్నలడుగుతారు.

పార్టీ పదవితో పాటు డైరెక్ట్‌గా రాహుల్ దృష్టిలో....

పరీక్షలు నెగ్గితే జాతీయస్థాయిలో పార్టీ పదవితో పాటు డైరెక్ట్‌గా రాహుల్ దృష్టిలో పడే అవకాశం ఉండటంతో నేతలందరూ బాగా కష్టపడుతున్నారట. కాంగ్రెస్ భవిష్యత్తంతా రాహులే కాబట్టి... ఆయన టీంలో సభ్యుడైతే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే ఆశ కూడా... పరీక్షలకు గట్టిగా ప్రిపేర్ అయ్యేలా చేస్తోందంటున్నారు.

07:01 - September 9, 2015

హైదరాబాద్ : కోట్లాది రూపాయల సర్కార్‌ సొమ్మును కాజేశారు. అడిగే నాథుడే లేడని..అప్పనంగా నెలనెలా వస్తున్న కోట్లాది రూపాయల సర్కారీ సొమ్మును దిగమింగారు. అయితే ఎట్టకేలకు ఆ ఇంటిదొంగ గుట్టు రట్టు కాబోతుంది. కోట్లాది రూపాయల సర్కారు సొమ్మును కాజేసిన ఆ ఇంటిదొంగల భరతం పట్టేందుకు రంగం సిద్ధం అయింది.108 నిర్వహణ పేరుతో జీవీకే యాజమాన్యం చేసిన అక్రమాలు గుట్టు..మరో రెండు రోజుల్లో రట్టు కాబోతుంది.

తెలంగాణ వ్యాప్తంగా 320 అంబులెన్సులు......

ప్రజ‌ల‌కు సేవా చేస్తాము,..సేవే ప‌ర‌మావ‌ధి..ఇదీ ప్రభుత్వంతో జీవీకే చేసుకున్న ఒప్పందం. అయితే చేసిన మాటాల‌న్ని..రాసుకున్న రాతల‌న్ని నీటి మీద గీత‌లుగానే మారాయి. చెప్పిన మాటాల‌న్ని చిత్తు కాగితాల‌కే ప‌రిమితమ‌య్యాన‌ని తెలిపోతుంది. 108 వాహనాలు నడిపిస్తామని జీవీకే యాజ‌మాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 108 వాహనాలు 320 ఉన్నాయి. వీటిల్లో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి. వాటి మెయింట‌నెన్స్ కు అయ్యే ఖర్చేంతా అనే కోణంలో ప్రభుత్వం జరిపిన విచారణలో..కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు తెలిసింది. ఉద్యోగుల జీతాల్లో ఇష్టమొచ్చినట్లు కోతలు విధించడం, ఒక్కో అంబులెన్సుకు డీజిల్ ఖ‌ర్చు, అందులోకి మెడిసిన్, హౌస్‌కీపింగ్‌ ఇలాంటి ఖర్చులకు ప్రతినెలా అన్ని వాహనాలకు కలిపి ప్రభుత్వం 380 కోట్లను చెల్లిస్తోంది. అయితే ఇందులో భారీమొత్తంలో నిధులు దారీ మళ్లినట్లు కమిటీ గుర్తించిందని సమాచారం.

అత్యాధునిక టెక్నాలజీతో కోట్లు గోల్‌మాల్‌.....

ఇదిలా ఉంటే..ఇక అంబులెన్స్‌ల్లో అత్యాధునిక టెక్నాలజీ ప్రవేశ పెట్టాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం..జీవీకే యాజమాన్యానికి 79కోట్ల,37లక్షల,66వేల నిధుల్ని మంజూరు చేసింది. అయితే ఇరు రాష్ట్రాల్లోని 752 వాహనాలను అడ్వాన్స్‌ లైఫ్‌ సిస్టంలోకి మార్చేందుకు ఖ‌ర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపి అమలు చేయకుండానే బిల్లులు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే జీవీకేతో చేసుకున్న ఒప్పందం మరో ఏడాదిపాటు ఉంది. అయితే ఇన్ని అక్రమాల నేప‌థ్యంలో ఒప్పందాన్ని ర‌ద్దు చేయాలని సర్కార్‌ ఓ అభిప్రాయానికొచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో జీవీకే ప్రతినిధులతో స‌మావేశ‌మై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  

06:57 - September 9, 2015

మహబూబ్ నగర్ : సినీనటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు వెండతెర మీదనే హీరో కాదు. నిజజీవితంలోనూ...రియల్‌ హీరో అయ్యారు. మహమూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాని చెప్పిన 24 గంటల్లోనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు.

కొండారెడ్డిపల్లిలో పర్యటించిన ప్రకాశ్‌ రాజ్.....

దత్తత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించిన ప్రకాశ్‌ రాజ్ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు గ్రామంలో గడిపిన ప్రకాశ్‌ రాజ్ అక్కడి విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాలలోని గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలను ఓర్పుగా విన్నారు. కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. నిజ జీవితంలో నేరుగా సామాన్య ప్రజలతో మాట్లాడటం జీవితానికి కొత్త అర్థానిచ్చిందన్నారు. గ్రామాభివృద్ధి తన ఒక్కడితో సాధ్యం కాదని అందరు కలిసికట్టుగా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తోపాటు కలెక్టర్ శ్రీదేవి గ్రామ సర్పంచ్ హాజరయ్యారు. ప్రకాశ్‌రాజ్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 

ప్రధాన సమస్యగా మంచినీరు......

కొండారెడ్డిపల్లిలో మొత్తం జనాభా రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు. ఇందులో 14 వందల 60 మంది ఓటర్లున్నారు. కేశంపేట మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల చేరువలో ఉన్నప్పటికీ గ్రామంలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. చిరుజల్లులు కురిసినా వీధులన్నీ చిత్తడిగా మారిపోతాయి. మురుగుకాల్వలు లేకపోవటంతో ఇండ్లలో నుంచి వచ్చే నీటితోపాటు వర్షపునీరు కూడా వీధుల్లోనే నిలుస్తోంది. గ్రామానికి నీరందించే బోర్లు వట్టిపోవటంతో మంచినీటి సరఫరా ప్రధాన సమస్యగా మారింది. రవాణ సౌకర్యాలు కూడా లేకపోవటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు తమ పల్లె ఎలా ఉన్నా...ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ రాకతో తమకు కొండంత బలం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తమ గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు.

06:54 - September 9, 2015

హైదరాబాద్ : తలవంచటం ఆయనకు తెలియదు. అందుకే అక్షరాలు ఫిరంగులను తలదన్నాయి. అధికార దర్పానికి జీహుజూర్‌ అనలేదు. కాబట్టే ఆయన ప్రజా కవి. మాయమైపోతున్న మనిషితనాన్ని, కాలగర్భంలో కలిసిపోతున్న మంచితనాన్ని, తన కవిత్వ కొరడాతో కొట్టిలేపిన మహామనిషి. హేతువును అణిచివేయజూసిన తీతువుల భరతం పట్టిన ధైర్యశాలి. అన్యాయాన్ని ఎదిరించిన నాడే నాకు ముక్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడని చాటిన నిగర్వి.

మనిషితనాన్ని తప్పక తెలుసుకోవాలన్న కాళోజి.......

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. కేవలం 6 పదాల్లో మనిషి జీవిత లక్ష్యం ఇదే అని సూటిగా సుత్తి లేకుండా చెప్పిన ప్రజాకవి కాళోజి. మనిషి బతికినంత కాలం మంచితనాన్ని తెలుసుకోలేక పోయినా పర్లేదు కానీ మనిషితనాన్ని మాత్రం తప్పక తెలుసుకోవాలనేది కాళోజి తాపత్రయం. అందుకే అవకతవకలు నేను సవరించలేనప్పుడు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడు, అన్యులను గనియైన హాయిగా మనలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అంటూ ఆర్ధ్రత నిండిన హృదయంతో రాసిన మహా మనిషి కాళోజి. మనసుకు కష్టం కలిగినప్పుడు కాళోజి భోరున విలపించిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అని ఆయన సున్నిత మనస్కుడేం కాదు. ధిక్కార స్వరానికి అసలు సిసలైన ప్రతీక. అందుకే నిజాం నవాబుకు రాయప్రోలు సుబ్బారావు వంటివారు బాకా ఊదుతుంటే తిను తిండెవ్వారిదే కోయిలా.. పాడు పాటెవ్వారిదే కోయిలా అని గద్గద స్వరంతో ప్రశ్నించారు.

1914, సెప్టెంబర్‌ 9న కర్ణాటక రట్టిహళ్లిలో జననం.....

ప్రజాకవి కాళోజి 1914, సెప్టెంబర్‌ 9న కర్ణాటకలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లాకు వచ్చిన కాళోజి కుటుంబం వరంగల్ జిల్లా మడికొండలో స్ధిరపడింది. ప్రాధమిక విద్యానంతరం హైదరాబాద్‌కు వచ్చిన కాళోజి ఉన్నత చదువులు చదివారు. చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ కల్గిన కాళోజి 1930 నుంచే గ్రంధాలయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్ధి దశలోనే నిజాం ప్రభుత్వ ఆజ్ఞలను కాళోజీ ఉల్లంఘించారు. తీవ్ర నిర్బంధంలోనూ వరంగల్‌ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ధైర్యశాలి కాళోజి. సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న కాళోజి జైలు శిక్షను కూడా అనుభవించారు.

తెలుగు,ఉర్దూ, కన్నడ బాషల్లో కవిత్వం రాసిన కాళోజి......

సాహిత్యం కేవలం సంపన్న వర్గానికే పరిమితమైన రోజుల్లో తెలుగు,ఉర్దూ, కన్నడ బాషల్లో కవిత్వాన్ని సామాన్యుడి వాకిట్లోకి పంపించిన అసామాన్యుడు కాళోజి. కరెన్సీ కట్టలు బడా బాబుల ఖజానాలో బందీ అయినట్లు, బాష పండితుల గుత్త సొత్తు కాదు, అది శ్రమజీవుల నుడికారం అంటూ ఎలుగెత్తి చాటారు. తెలంగాణ యాస అంటూ ఛీత్కరింపులు రాజ్యమేలుతున్న తరుణంలో అది యాస కాదు, భాష అని బల్లగుద్ది చెప్పిన ఏకైక వ్యక్తి కాళోజి. అందుకే మనకు బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష కావాలి అంటూ నినదించారు.

ఏ భాష నీది ఏమి వేషమురా..?....

తేనేలూరే తెలుగును తెలుగువారే మర్చిపోయి ఇంగ్లీష్‌ కీకారణ్యంలోకి ప్రవేశిస్తున్నప్పడు ఏ భాష నీది ఏమి వేషమురా..? ఈ భాష ఈవేషమెవరి కోసమ్మురా..? తెలుగు వాడివై తెలుగు రాదనుచు.. ఇంక చెప్పుటెందుకు రా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ నిప్పులు చెరిగిన కాళోజి 2002 నవంబర్‌ 13న తుది శ్వాస విడిచారు. జీవించినంత కాలం నిండైన ఆత్మగౌరవంతో భాష కోసమే బతికిన ఏకైక కవి కాళోజి. స్వతంత్ర భారతం పూర్తి స్ధాయి ప్రజాస్వామికంగా మారకుంటే ఏ రాజ్యమైనా ఒకటేనంటూ విమర్శించిన ప్రజాస్వామ్య ప్రవక్త, ప్రజాకవి కాళోజి...

06:50 - September 9, 2015

విజయవాడ : ప్రతి మహిళా ఒక ఫైనాన్స్ మినిస్టర్ కావాలి. టాటా బిర్లాలను మించిన వ్యాపారవేత్తలు స్త్రీలు. కంప్యూటర్ విద్యలో మగువలు ఎక్స్ పర్ట్స్ గా తయారవ్వాలి. రాజధాని అమరావతిలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం. మీరు సాధించనిదేదిలేదు...మీకు అండగా ఉంటా. ఇదీ విజయవాడలో జరిగిన శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య మొదటి వార్షికోవత్సంలో...స్త్రీలను ఉత్సాహపరుస్తూ సీఎం చంద్రబాబు ప్రసంగం సాగిన తీరు.

శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ మొదటివార్షికోత్సవం.....

శ్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ మొదటివార్షికోత్సవ సర్వసభ్య సమావేశం విజయవాడలో జరిగింది. సీఎం చంద్రబాబు, గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని, అలాగే సర్ప్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మంది డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. రాష్ట్రంలో 80 లక్షల మంది డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారని, వారిలో అందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరింత మందిని డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించి, పేదలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. డ్వాక్రా మహిళల కోసం చంద్రన్న చేయూత పథకం ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా శ్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు.

కేబుల్ వైర్ ద్వారా బ్యాంక్ విడ్త్ కనెక్షన్లు.....

కేబుల్ వైర్ ద్వారా బ్యాంక్ విడ్త్ కనెక్షన్లు అందుబాటులోకి తెచ్చి ఇంట్లో ఉండే అన్నిరకాల సేవలు పొందేలా మహిళలను తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. ప్రతి మహిళకూ కంప్యూటర్ ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని కల్పిస్తామని సీఎం తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గాను తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబుకు గజమాలతో సత్కారం...

కార్యక్రమంలో అనేకమంది మహిళలతో మాట్లాడించారు ఏపీ సీఎం. నింపాదిగా వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. చివర్లో చంద్రబాబును మహిళలు గజమాలతో సత్కరించారు. చంద్రన్న చేయూత పేరుతో మహిళా సాధికార సంస్థ రూపొందించిన పాటల సీడిని ఆవిష్కరించారు చంద్రబాబు. 

06:47 - September 9, 2015

హైదరాబాద్ : చైనా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు టీ సీఎం కేసీఆర్... వివిధ కంపెనీల సీఈవోలతో వరుసగా భేటీ అవుతున్నారు.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు.. కేసీఆర్ విజ్ఞప్తితో భారీ పంపుసెట్ల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చారు లియో గ్రూప్ కంపెనీల ఛైర్మన్ లియో వాంగ్... దాదాపు వెయ్యికోట్ల పెట్టుబడితో ఈ కంపెనీని స్థాపిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.. లియోవింగ్‌కు సంబంధించిన 30 కంపెనీల ప్రతినిధులుకూడా టీ సీఎంతో సమావేశమయ్యారు.. ఆ తర్వాత చైనాలోని భారత రాయబారి అశోక్ కే కాంతాతో సమావేశమయ్యారు కేసీఆర్.. చైనా ఆర్థిక పరిస్థితి, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.. సీఎం టూర్లో తమను చేర్చాలన్న చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, షాంజన్ కౌన్సిల్ అటు మరికొన్ని కంపెనీల ప్రతినిధులుకూడా తమ సంస్థలను సందర్శించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.. అలాగే సీఎం టూర్ షెడ్యూల్లో తమ కౌన్సిల్‌ను కూడా చేర్చాలని చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, షాంజన్ కౌన్సిల్ విజ్ఞప్తి చేశాయి..

నేడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో కేసీఆర్ ప్రసంగం......

దాదాపు 50వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో చైనా టూర్ కు వెళ్లారు కేసీఆర్.. తన పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఈ బుదవారం ప్రసంగించబోతున్నారు.. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకోసం అనుకూలవాతావరణం, కొత్త పారిశ్రామిక విధానం, సింగిల్ విండో సిస్టం, 15రోజుల్లో అనుమతులు వంటి వివరాలను సదస్సులో ప్రెజెంట్ చేయబోతున్నారు..

06:43 - September 9, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా యువతీయువకుల చేతుల్లో పుస్తకాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలలోని కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. లైబ్రరరీలు కిటకిటలాడుతున్నాయి. లైబ్రరరీలలో కుర్చీలు చాలక, కొందరు తమతో పాటు కుర్చీలనూ తీసుకెళ్తున్నారు. తాము లేస్తే ఆ కుర్చీలో మరెవరు కూర్చుంటారోనన్న బెంగతో కొందరు అక్కడే టిఫిన్ లు, భోజనాలు చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రయివేట్ , చిరు ఉద్యోగాలకు సెలవు పెట్టో, ఉద్యోగం మానేశో కోచింగ్ లు తీసుకుంటున్నవారు, రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నవారు ఎందరో.

నోటిఫికేషన్ల కోసం ఆశగా, ఆర్తిగా.....

ఇప్పుడు అంతా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయబోయే నోటిఫికేషన్ల కోసం ఆశగా, ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఉద్యోగం సాధించాలన్న పట్టుదల ప్రతిఒక్కరిలోనూ కనిపిస్తోంది. దీనికి తోడు టీపీఎస్ సీ సిలబస్ కూడా ప్రకటించడంతో యువతలో ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. ఇప్పటికే కొన్ని వందల ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో వాటికి అర్హత లేనివారంతా గ్రూప్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్స్ రాయబోయేవారి సంఖ్య లక్షల్లో వుండబోతోంది. ఎన్ని ఉద్యోగాలొస్తాయో తెలియదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందు గ్రూప్ వన్ వస్తుందో, గ్రూప్ 2 వస్తుందో, గ్రూప్ త్రి వస్తుందో, గ్రూప్ ఫోర్ వస్తుందో తెలియదు. ఎన్నెన్ని పోస్టులతో నోటిఫికేషన్ లు వస్తాయో తెలియదు. నోటిఫికేషన్ కీ, ఎగ్జామ్ కీ ఎంత టైం ఇస్తారోనన్న మీమాంస నిరుద్యోగుల్లో వుండనే వుంది. నిరుద్యోగుల అంచనాల ప్రకారం లక్షకు పైగా పోస్టులు ఖాళీగా వున్నాయి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ఊరించారు. అంతకాకపోయినా తొలి దఫాగా కనీసం పాతికవేల ఉద్యోగాలైనా భర్తీ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి దాకా విడుదలైన నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల సంఖ్య వెయ్యి కూడా దాటలేదు. కానీ , హడావిడి మాత్రం కనిపిస్తోంది. ఉద్యోగార్ధుల్లో ఆశావాహ ద్రుక్పథం కనిపి స్తోంది. అందుకే కోచింగ్ సెంటర్లు, లైబ్రరరీలు కిటకిటలాడుతున్నాయి. దీంతో కోచింగ్ సెంటర్లు విపరీతంగా ఫీజులు పెంచేశాయి. గతంలో పది వేలు తీసుకున్న సెంటర్లు ఇప్పుడు 20వేల రూపాయల వసూలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద హాల్స్ , మాల్స్ ని కిరాయిలకు తీసుకుని, ఒక్కొక్క క్లాసు రూంలో రెండు మూడు వేల మందిని కూర్చోబెట్టి కోచింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడున్న ఊపును క్యాష్ చేసుకునేందుకు పాత కోచింగ్ సెంటర్లవారు కొత్తకొత్త బ్రాంచ్ లు ఓపెన్ చేస్తుంటే, కొత్తగా మరికొందరు కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ లో చిక్కడపల్లి, అశోక్ నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లకీ, రూములకీ , హాస్టళ్లకీ ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ ప్రాంతంలో మంచి హాల్ కోసం నెల రోజులుగా వెదుకుతున్నా, దొరకడం లేదని ఓ కోచింగ్ సెంటర్ నిర్వహకుడు చెప్పడం ఇప్పుడున్న డిమాండ్ కి అద్దంపడుతోంది. ఇప్పుడు నిరుద్యోగ యువతలో ఆశలు భారీగా వున్నాయి. రాబోయే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూ స్తున్నారు. మరీ తెలంగాణ తొలి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు తీరుస్తుందా? నామమాత్రపు నోటిఫికేషన్లతో సరిపెడుతుందా? భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తే కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు రాకపోతే యువత తీవ్ర నిరాశ చెందుతుంది. ఆ తర్వాత పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో ఊహించలేం. ఇప్పటికైతే కాలేజీ, యూనివర్సిటీ చదువులు పూర్తి చేసిన యువతను గ్రూప్స్ ప్రిపరేషన్ లో ప్రభుత్వం ఎంగేజ్ చేసింది. మరి చదువురాని, గ్రూప్స్ రాయలేని నిరుద్యోగుల సంఖ్య కూడా అంతకు రెండు మూడు రెట్లు వుంటుంది. మరి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేకపోతే రోజువారీ పరిపాలనలో అత్యవసర పోస్టులను భర్తీ చేయడానికే పరిమితం కాబోతున్నదా? 

06:40 - September 9, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఎక్కడ చూసినా పోటీ పరీక్షల కోలాహలమే కనిపిస్తోంది. నోటిఫికేషన్ల కోసం చదువుకున్న నిరుద్యోగులు ఎదురుచూ స్తున్నారు. వారు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీని కోరుకుంటున్నారు. మరి వారి ఆశలు ఫలిస్తాయా? లక్ష ఉద్యోగాల మాటను కేసీఆర్ నిలుపుకుంటారా? నిజంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేసినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య సమసిపోతుందా? మరి పెద్దగా చదువుకోని, గ్రూప్స్ అర్హతలేని ఇతర నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? వారి ఉపాధి మాటేమిటి? తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటి? ఇలాంటి అనేక అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నేత భాస్కర్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై మాట్లాడారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

లారీ -ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ:20 మందికి గాయాలు

కృష్ణా : జిల్లా పెనుగంచి ప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Don't Miss