Activities calendar

10 September 2015

22:34 - September 10, 2015

ఢిల్లీ : త్వరలోనే భారతదేశం వెలిగిపోనుంది. దేశవ్యాప్తంగా చిమ్మచీకట్లు తొలిగిపోనున్నాయి. నీటి ప్రాజెక్టుల వద్దనే కాకుండా.. దేశవ్యాప్తంగా.. థర్మల్, విండ్ సహా పలు మార్గాల్లో కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. తాజాగా విస్తృత సముద్ర తీరాన్ని.. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించాలని సర్కారు భావిస్తోంది. ఆఫ్‌షోర్‌ విండ్‌ పవర్‌ కోసం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
సముద్రంలో పవన విద్యుత్ విధానానికి గ్రీన్ సిగ్నల్
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా ముందుడుగు పడింది. తీరానికి సమీపాన సముద్రంలో ఆఫ్‌షోర్ పవన విద్యుత్ విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక ఆర్థిక జోన్‌లో పవన విద్యుత్ సంస్థల అభివృద్ధితో పాటు.. భారత జలాల్లో పరిశోధనలకూ ఇది వీలు కల్పిస్తుంది. ఇంధన భద్రత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలు సాధించటానికి తోడ్పడుతుంది.
ఇంధన వనరుల పటం రూపకల్పన
గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు నెలకొల్పేందుకు డెవలపర్లకు సముద్రంలో పవన విద్యుత్ ప్రాంతాలను కేటాయించటం ఈ విధానం లక్ష్యం. దీని కింద దేశంలో ఇంధన వనరుల పటాన్ని రూపొందించటంతో పాటు అత్యధిక ఉత్పత్తికి అవకాశం గల ప్రాంతాలను గుర్తిస్తారు. అంతరిక్ష, రక్షణ, నౌకా రవాణా వంటి విభాగాల అనుమతి తీసుకున్నాక ప్రభుత్వం ప్రాజెక్టులకు బిడ్డింగులను ఆహ్వానిస్తుంది.
గుజరాత్‌ తీరంలో లక్ష మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం
ఆఫ్‌షోర్ పవన విద్యుత్ సామర్థ్యాన్ని ఇప్పటికే అంచనా వేశారు. గుజరాత్‌ తీరప్రాంతంలోనే లక్షకుపైగా మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం వుంది. తమిళనాడు తీరప్రాంతం 60వేల మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగి వుంది. 2022 సంవత్సరానికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. 
తొలి ఆఫ్‌షోర్‌ విండ్ ప్లాంట్‌ డెన్మార్క్‌లో ఏర్పాటు
తొలి ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్ ప్లాంట్‌ను 1991లో డెన్మార్క్ ఏర్పాటు చేసింది. జర్మనీ, నెదర్లాండ్, స్వీడన్, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, నార్వే, పోర్చుగల్ దేశాల్లో... విస్తృతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. చైనా 2020 సంవత్సరానికి 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో 2014లో 100 మెగావాట్ల సామర్థ్యం గల ఆఫ్‌షోర్ విండ్ పవర్‌ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గుజరాత్‌ సముద్ర తీరంలో దీన్ని నెలకొల్పారు. మొత్తానికి సముద్ర తీరంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్లాంట్‌ల వల్ల పర్యావరణ సమస్యలు సైతం పెద్దగా వుండవని నిపుణులు చెబుతున్నారు.

 

22:18 - September 10, 2015

వరంగల్ : చాకలి ఐలమ్మ వీరత్వం మరువ లేనిదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కొనియాడారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఐలమ్మ ఆశయం మనందరికీ ఆదర్శమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.

 

22:13 - September 10, 2015

వరంగల్ : సీఎం కేసీఆర్ నైజాం అడుగుజాడలో నడుస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. టీసర్కార్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేలమందిని నైజాం సర్కార్ పెట్టనపెట్టుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా.. 1300 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వం చేసిన హత్యలు కావా... అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక చేత్తో ఐలమ్మకు దండం పెడతారు.. మరో చేత్తో నైజాం నవాబుకు దండం పెడతారని, ఒక నోటితో దొడ్డి కొమురయ్యను పొగుడుతాడు... అదే నోటితో నైజాం నవాబును పొగుడుతాడని ఎద్దేవా చేశారు. నైజా నవాబు జాడలోనే నడస్తున్నానని కేసీఆర్ పరోక్షంగా చెబుతున్నారని పేర్కొన్నారు.

 

21:51 - September 10, 2015

ఉత్తరప్రదేశ్ : అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. ఓ వృద్ధుడిని వీధిలోకి లాక్కొచ్చి ఓ యువకుడు హాకీ స్టిక్‌తో ఇష్టమొచ్చినట్టు కొడుతున్న దృశ్యం సిసిటీవీ ఫుటేజీలో రికార్డ్‌ అయింది. మానవత్వం మరచిన కొందరు యువకులు వృద్ధుడని కూడా చూడకుండా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ పెద్దాయన చివరకు కన్ను మూశాడు. మృతుడు షేక్‌ ముస్తాక్‌ ఇంటిపై దాడి చేసి 20 వేల నగదుతో పాటు ఆయన భార్యపై ఉన్న నగలను కూడా దోచుకున్నారు. ఇదేమని ప్రశ్నించినందుకు ఇలా వీధుల్లోకి తీసుకొచ్చి కొట్టారని మృతుడి కుమారుడు అబ్దుల్‌ ఖాదర్‌ తెలిపాడు. తమ వీధిలోనే ఉండే ఈ రౌడీలపై పలు హత్యా కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు. 'మా నాన్నను హత్య చేసిన రౌడీలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది' అని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంలో పోలీసుల వద్దకు వెళ్తే తమపైనే కేసు పెట్టి జైలుకు పంపారని, తర్వాత బెయిలుపై బయటకు వచ్చినట్టు బాధితుడు పేర్కొన్నాడు.


 

21:48 - September 10, 2015

రాయ్ పూర్ : వాటర్‌ బాటిల్‌లో పాము. ఆశ్చర్యం అక్కర్లేదు. వాస్తవమే. ఇదేదో సాదారణ పౌరులు కొన్న బాటిల్‌లో కనిపించలేదు. సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రికి ఇచ్చిన బాటిల్‌లో.. వుండటం కలకలం రేపుతోంది. ఛత్తీష్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌, కేంద్రమంత్రి జెపి నడ్డా సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు... బుధవారం రాయ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికోసం వాటర్ బాటిల్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులోని ఓ బాటిల్‌లో పాము కనిపించటం.. అధికారులు, వాటర్‌ బాటిల్‌ యాజమాన్యం నిర్లక్ష్యవైఖరికి అద్దం పట్టింది. సీఎం కార్యక్రమం అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇచ్చిన బాటిల్‌లోనే ఇలా వుంటే.. ఇక ఇతరుల మాటేంటని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. అటు ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వాటర్ బాటిల్ యాజమాన్యాన్ని ఇప్పటికే విచారించినట్లు సమాచారం.

 

21:43 - September 10, 2015

వరంగల్ : ఐలమ్మ పోరాటం స్ఫూర్తిగా మోడీ నయా జమీందారి వ్యవస్థపై ఉద్యమం చేసేందుకు ప్రతిన బూనుదామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బృందాకారత్‌ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పేదలు, రైతుల దగ్గర్నుంచి నరేంద్ర మోడీ సర్కారు బలవంతంగా భూములు లాక్కుంటూ...కార్పొరేట్ పెద్దలకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రజలు తెలంగాణను సాధించుకున్నారని, అయితే కేసీఆర్ సర్కారు ఆ ఆకాంక్షలను నెరవేర్చడం లేదని ఆమె విమర్శించారు.

 

21:35 - September 10, 2015

హైదరాబాద్ : కేశవరెడ్డి విద్యాసంస్థల్లో డిపాజిట్ల సేకరణ అంశాన్ని రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు కోసం డీజీపీ రాముడు రేపు కర్నూలు వెళ్లనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

 

21:14 - September 10, 2015

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రామలింగరాజు కుటుంబానికి చెందిన 10 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ పది సంస్థలు... సత్యం స్కాంలో అక్రమంగా సంపాదించిన 1800కోట్లను వెంటనే చెల్లించాలని ఆదేశించింది. వీటిపై 1500కోట్లు వడ్డీగా చెల్లించాలని సూచించింది. జనవరి 7 2009 నుంచి ఈ జరిమానా విధించింది. దీంతో మొత్తం 3వేల 300కోట్లు కట్టాల్సి ఉంటుంది. సెబీ పంపించిన నోటీసులో పది సంస్థలు రాజు సమీప బంధువులవే. వీటిలో ఎస్ ఆర్ ఎస్ ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ ఆండ్ ఎఫ్ ఎస్ చింతలపాటి హోల్డింగ్స్ ఉన్నాయి. 

 

సత్యం స్కాంలో సెబీ కీలక నిర్ణయం

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. సత్యంరామలింగరాజు కుటుంబంతోపాటు మరో పదిమందికి సెబీ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా సంపాదించిన రూ. 1800 కోట్లను చెల్లించాలని ఆదేశించింది. 

20:58 - September 10, 2015

హైదరాబాద్ : ఎపికి ఉద్యోగుల తరలింపు ఒక్కసారిగా కాకుండా విడతల వారిగా చేయాలని ఉద్యోగుల తరలింపు కమిటీ నిర్ణయించింది. ఈమేరకు ఇవాళా హైదరాబాద్ లో ఉద్యోగుల తరలింపు కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. ఉద్యోగుల తరలింపులో ఉన్న సమ్యలను చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మొత్తం 13 వేల మంది ఉద్యోగులుంటారని అంచనా వేశారు. దశల వారిగా ఉద్యోగుల తరలింపు చేపట్టాలని ప్రభుత్వ కమిటీ నిర్ణయించింది. తొలి దశలో 3 వేల మంది ఉద్యోగులను రాజధానికి పంపాలని నిర్ణయించారు. అయితే స్థానికత ప్రభావం పడని ఉద్యోగులకు మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


 

ముగిసిన ఉద్యోగుల తరలింపు కమిటీ సమావేశం

హైదరాబాద్ : ఎపికి ఉద్యోగుల తరలింపు ఒక్కసారిగా కాకుండా విడతల వారిగా చేయాలని ఉద్యోగుల తరలింపు కమిటీ నిర్ణయించింది. ఈమేరకు ఇవాళా హైదరాబాద్ లో ఉద్యోగుల తరలింపు కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. ఉద్యోగుల తరలింపులో ఉన్న సమ్యలను చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో సదస్సు

చైనా : తెలంగాణ ప్రభుత్వం, సీఐఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్, 65 మంది చైనా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

 

19:56 - September 10, 2015

విశాఖ : జిల్లా ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జన్సీని ప్రకటించాలని సీపీఎం ప్రజా ఆరోగ్య కమిటీ కన్వీనర్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దేశంలోనే మలేరియా కేసులు విశాఖ ఏజెన్సీలో ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ మొత్తంలో 13 వేల కేసులు ఉంటే ఒక్క విశాఖలోనే 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. డెంగ్యూతో చిత్తూరులో 23 మంది చనిపోయారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపరచాల్సింది పోయి.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని నర్సింగరావు ఆరోపించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఇప్పటికే పలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.

 

19:49 - September 10, 2015

కర్నూలు : జిల్లాలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగి ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఇంటర్‌ విద్యార్థిని గీత తెల్లవారు జామున అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం తెలియడం లేదు.

 

19:43 - September 10, 2015

కాకినాడ : ప్రైవేటు విద్యారంగం వ్యాపారంగా మారిందని యూటీఎఫ్‌ నేతలు ఆరోపించారు. కేశవరెడ్డి విద్యాసంస్థల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడాన్ని వారు తప్పుపట్టారు. ఈమేరకు కాకినాడలో ఆ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణపై సర్కార్‌ దృష్టిపెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

 

19:32 - September 10, 2015

నల్గొండ : జిల్లాలో అప్పుల బాధకు మరోరైతు చనిపోయాడు. యాదగిరిగుట్ట మండలం సాదువెల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాదువెల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ అనే రైతు.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. పొలంలో నీళ్ల కోసం వేసిన రెండు బోర్లు పనిచేయకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరగడంతో... ఉదయం బావి దగ్గరకు వెళ్లి ఊరివేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు.

 

19:17 - September 10, 2015

ఆదిలాబాద్ : ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్‌ పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు హరీష్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగురామన్న ప్రారంభోత్సవం చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఉట్నూరులో పాలిటెక్నిక్‌ కాలేజీతోపాటు, హాస్టల్‌ వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు.

 

18:53 - September 10, 2015

విజయనగరం : ఉత్తరాంధ్ర వాసుల రైతు కష్టాలను తీర్చే తోటపల్లి రిజర్వాయర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ పదేళ్ల క్రితమే పూర్తి కావల్సి ఉండగా... కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పూర్తికి 12 ఏళ్లు పట్టిందని బాబు ఆరోపించారు. 2003లో తానే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని ఇప్పుడు తన చేతులమీదనే ప్రారంభమైందన్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

 

18:49 - September 10, 2015

హైదరాబాద్ : నగరంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూబ్ అలీ చాంబర్ లో మంత్రులు పద్మారావు, తలసాని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు సమావేశమయ్యారు. భారీవర్షాలతో లోతట్టు ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు నివేదిక అందజేశారు. ఈ ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 

18:47 - September 10, 2015

హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దైంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లి, ఆబిడ్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లంగర్‌హౌజ్‌, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అంబర్‌పేట, తార్నాక, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

 

18:44 - September 10, 2015

కర్నూలు: కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు కేసులపై ఆయనను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. చట్ట విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బాండ్ల రూపంలో డబ్బులు వసూలు చేశారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ రవికృష్ణ చెప్పారు. మరోవైపు కేశవరెడ్డి విద్యాసంస్థల్లో జరిగిన తప్పిదానికి తనే కారణమని కేశవరెడ్డి అన్నారు. విద్యా సంస్థల్లో డిపాజిట్‌ చేసిన తల్లిదండ్రులను మోసం చేసే ఆలోచన తనకు లేదన్నారు. ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయానని.. వచ్చే సంవత్సరం జులై నెల వరకు అప్పులు తీరుస్తామన్నారు.

 

కేవీ కామత్, జియాంఝాను కలిసిన కేసీఆర్

చైనా : షాంఘై లో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాంఝాను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. వ్యర్థాలతో విద్యుదుత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని వారిని కోరారు.

 

పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..

వరంగల్ : జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, తెలంగాణ సాయుధపోరాట యోధురాలు, సీపీఎం నాయకురాలు మల్లు స్వరాజ్యం, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తోపాటు పది వామపక్ష పార్లీల నేతలు, భారీగా ప్రజలు హాజరయ్యారు.

 

17:39 - September 10, 2015

వృద్ధాప్యం రెండో బాల్యం. అలాంటి వృద్ధాప్యంలోనే అనేకానేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎక్కువగా బాధిస్తుంటాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే ఈ చర్మ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలున్నాయో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:38 - September 10, 2015

అమ్మ ప్రేమ.. నాన్న గోరు ముద్దలు.. అమ్మమ్మ మురిపాలు.. తాతాయ్య గారాలు.. ఇలాంటి ప్రేమలు అందుకోలేని చిన్నారులను మనం గుర్తిస్తున్నామా? వారిని ఆదరిస్తున్నామా? అందమైన బాల్యం వారికి అందుతోందా? భద్రమైన బతుకు వారికి సొంతమవుతోందా?
పిల్లలు రేపటి సమాజానికి ప్రతినిధులు
పిల్లలు ఎవరికైనా పిల్లలే. వారే రేపటి సమాజానికి ప్రతినిధులు. వారి భవితే సమాజ భవిత. అలాంటి చిన్నారులు ఎంతో మంది ఎలాంటి ఆలనాపాలన అందక నిర్లక్ష్యానికి గురవుతున్న స్థితి. వారు ఆ స్థితిలో ఎందుకు ఉన్నారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. వారే అనాధలుగా ముద్ర వేయబడిన రేపటి తరం. మరి వారు చేసిన తప్పేంటి..? వారి మనసులో మాటేంటి? వారి ఆలోచనలేమిటి? వారి డిమాండ్స్ ఏమిటి? ఇవాళ్టి ఫోకస్ లో తెలుసుకుందాం.
దుర్భరమవుతోన్న బాల్యం..
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం పూర్తి జీవితానికి పునాదులు వేస్తుంది. అలాంటి విలువైన బాల్యం అనేక కారణాలతో దుర్భరమవుతోంది. అందుకు కారణాలేవైనప్పటికీ రేపటి తరానికి ప్రతినిధులైన చిన్నారులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, సమాజానిది.

17:21 - September 10, 2015

ఒరిస్సా : నిరుపేదలు, రైతులను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇద్దరు.. ముగ్గురు కార్పోరేట్ల కోసం ప్రధాని పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఒరిస్సా పర్యటనలో ఉన్న రాహుల్‌ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల భూములను లాక్కొని కార్పోరేట్లకు కట్టబెట్టాలన్ని మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని.. పార్లమెంట్‌లో తాము అడ్డుకున్నామని పేర్కొన్నారు. రైతులకు తాము అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు.

 

16:57 - September 10, 2015

కర్నాటక : ఆలస్యంగా వచ్చారని, హోంవర్క్ చేయలేదని, అల్లరి చేస్తున్నారని ఉపాధ్యాయలు.. విద్యార్థులను తీవ్రంగా బాదేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా కర్నాటకలో మరో ఘటన చోటుచేసుకుంది. పసివాడని కనికరం లేకుండా ఓ టీచర్‌ కఠినంగా దండించాడు. స్కూలుకు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో రెండు చెవులు పీకాడు. చేతికి బ్యాండేజీ ఉన్నా కనికరించకుండా కోపంతో పిల్లాడిపై చిందులు వేశాడు. చేతితో ఇష్టమొచ్చిన రీతిలో కొట్టాడు. ఈ ఘటన బంట్వాల్‌లో చోటు చేసుకుంది.

 

16:49 - September 10, 2015

కడప : జిల్లాలో ఓ పేద మహిళ తన శిశువును అమ్మకానికి పెట్టింది. ఆర్థిక భారంతో పెంచుకునే స్థోమత లేక ఇలా చేశానని పేర్కొంది. ఇదిలా ఉంటే సంఘటనను గమనించిన స్థానికులు ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు ఆ మహిళను శిశువును ఐసీడీఎస్‌ కార్యాలయానికి తరలించారు. 

16:44 - September 10, 2015

హైదరాబాద్ : నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. పెరిగిన ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

సోమేష్ కుమార్ పిటిషన్ పై వచ్చే బుధవారం వాదనలు వినిపిస్తాం : కేంద్రం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పిటిషన్ పై వచ్చే బుధవారం వాదనలు వినిపిస్తామని కేంద్ర ప్రభుత్వం క్యాట్ కు తెలిపింది. తనను తెలంగాణకు కేటాయించాలని సోమేష్ కుమార్ క్యాట్ లో పిటిషన్ వేశారు.

 

ముషీరాబాద్ లో మోడల్ పోలీసు స్టేషన్ ప్రారంభం

హైదరాబాద్ : ముషీరాబాద్ లో మోడల్ పోలీసు స్టేషన్ ను మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రారంభించారు. పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. 

నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్రం విఫలం : బృందాకరత్

హైదరాబాద్ : నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

16:22 - September 10, 2015

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మాంసం విక్రయాలపై రగడ మొదలైంది. ఇది మహారాష్ట్ర సర్కారుకు, శివసేన, ఎమ్ ఎన్ ఎస్ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించే స్థాయికి చేరుకుంది. జైనులు పవిత్రంగా భావించే 'పర్యుషాన్' సందర్భంగా మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఎనిమిది రోజుల పాటు నిషేధం విధించాలని నిర్ణయించినప్పటికీ... చివరకు పలువురితో చర్చించిన అనంతరం నిషేధాన్ని నాలుగు రోజులకు పరిమితం చేశారు. దీనిపై శివసేన మండిపడింది. తాజాగా ఎమ్ ఎన్ ఎస్ పార్టీ మరో అడుగు ముందుకువేసింది. మహారాష్ట్రలో తామే మాంసం అమ్మకాలను స్వయంగా చేపట్టనున్నట్టు ప్రకటించింది. ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న అగర్ బజార్ వద్ద తమ కార్యకర్తలతో మాంసం విక్రయాలను విక్రయించారు. 

16:08 - September 10, 2015

హైదరాబాద్ : ఒకప్పుడు.... తిరుగులేని నేతలు. ఎదురు లేని మనుషులు. ప్రజల్లో పలుకుబడి. పార్టీలో ప్రాముఖ్యత. కాని ఇపుడు సీన్‌ సితారైంది. పార్టీ పాతాళానికి పడి మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా గాని....భవిష్యత్‌పై బెంగ మొదలైంది. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. చౌరస్తాలో నిలబడి...చంటిపిల్లల్లా దిక్కులు చూస్తున్నారు. పిలుపు...ఒకే ఒక్క పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఆహ్వానం వస్తే చాలు... అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.
తలో దారి వెతుకున్న కాంగ్రెస్ నేతలు
ఏపీలో కాంగ్రెస్‌లో ఖాళీ అయ్యాక...నేతలంతా తలో దారి వెతుకున్నారు. ఇటు టీడీపీలోకి కొందరు, అటు వైసీపీలోకి మరికొందరు వెళ్లి...తమ రాజకీయమనుగడను సుగమం చేసుకున్నారు. లేటెస్ట్‌గా కాంగ్రెస్ హార్డ్‌కోర్ ఫ్యాన్, మాజీ పీసీసీ చీఫ్‌ కూడా హ్యాండిచ్చారు. వైసీపీలోకి వెళ్లి రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. కాని నెల్లూరు జిల్లాకు చెంది ఆనం బ్రదర్స్‌ మాత్రం..ఎటూ తేల్చుకోలేక తికమకపడుతున్నారు.
వైఎస్‌కు కుడిభుజంగా ఉన్న ఆనం రాంనారాయణరెడ్డి
ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి. నెల్లూరు జిల్లాలోనేకాదు... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లకు పరిచయం అక్కర్లేదు. కాంగ్రెస్‌లో... తిరుగులేని నేతలుగా..ఎదురులేని నాయకులుగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా రాంనారాయణరెడ్డి...వైఎస్‌కు కుడిభుజంగా ఉన్నారు. ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో.... ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి అంతకంటే ఎక్కువే ఫేమస్ అయ్యారు. తొడలు కొడుతూ, మీసం మెలేస్తూ, నడ్డిరోడ్డుపైనే దమ్ముకొడుతూ...తనదైన హావభావాలతో నిత్యం వార్తల్లో ఉండేవారు. కాంగ్రెస్‌లో దర్జాగా ఉన్న వీరి పరిస్థితి...ఇపుడు దయనీయంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బాగోకపోవడంతో...వీరూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఆనం బ్రదర్స్‌ను పట్టించుకోని పార్టీలు
ఏ పార్టీలోకి జంపు చేద్దామా.. అని ఆనం బ్రదర్స్‌ గోడమీద పిల్లిలా ఎదురు చూశారు. పిలుపొస్తే...చాలు పరుగెత్తుకు వెళ్దామనుకున్నారు. కానీ ఏ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ తామే ఓ అడుగుముందుకేసీ... సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కాని పసుపు పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. నెల్లూరులో బలంగా ఉన్నాం...వీరి వల్ల ఒరిగేదేంలేదనే అభిప్రాయానికి వచ్చారు. అంతేగాక ఆనం బదర్స్‌ రాకను...సీనియర్లు వ్యతిరేకంచారు. దీంతో చంద్రబాబు...వారిని పక్కనబెట్టారు.
మేకపాటి వర్గంతో ఆనం బ్రదర్స్‌కు విబేధాలు
ఐనా వారి ప్రయత్నం ఆగలేదు. రూటు మార్చి....ఫ్యాన్ గాలి కోసం వెళ్లారు. కాని అక్కడా...అదే పరిస్థితి. నెల్లూరు ఎంపీ మేకపాటి వర్గానికి....ఆనంబ్రదర్స్‌కు అస్సలు పడదని.. నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఓ దశలో నల్లపురెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని....ఆనం బద్రర్స్‌తో ఫిల్‌ చేయానలి జగన్ భావించారు. కాని అందుకు నెల్లూరు నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో గ్రూపు తగాదాలు తప్ప....వారి వల్ల ఫ్యాన్ స్పీడేం పెరగదని...జగన్‌ కూడా డిసైడయ్యారు. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీ...ఏ ఒక్కరూ ఆనం బ్రదర్స్‌ను చేర్చుకునేందుకు సుముఖంగా లేరు. దీంతో ఏం చేయాలో పాలుపోక...ఎటు వెళ్లాలో దారి తెలియక....చౌరస్తాలో చంటిపిల్లాడిలా తయారైంది వారి పరిస్థితి. ఈ తరుణంలో ఆనం బ్రదర్స్‌ ఏ రూట్‌ను ఎంచుకుంటారో...వేచి చూడాలి.

 

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, ఆబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, జీడిమెట్ల, అమీర్ పేట, లంగర్ హౌస్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. 

హరీష్ పై ఫిర్యాదు..

నల్గొండ : యాదగిరిగుట్టపై నిబంధనలకు విరుద్ధంగా మంత్రి హరీష్‌రావు ర్యాలీ నిర్వహించారంటూ డీజీపీ అనురాగ్‌శర్మకు టీ.టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఒక మినిష్టర్ గా ఉండి కూడా హరీష్‌రావు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. 

 

15:05 - September 10, 2015

పశ్చిమ గోదావరి:  జిల్లాలో సైకో సూదిగాడు మళ్లీ రెచ్చిపోయాడు. నర్సాపురంలో ఓ మహిళకు సూదిగుచ్చి పారిపోయాడు. రాజులలంక గ్రామానికి చెందిన 36ఏళ్ల మహిళ శ్వేతరత్నంపై ఇంజెక్షన్‌తో దాడి చేసి పరారయ్యాడు. కాగా సూదిగాడిని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేసినా చిక్కకుండా పారిపోయాడు. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో వరుస దాడులు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

15:00 - September 10, 2015

నల్గొండ జిల్లాలోని పెద్దగూడెం మండలం సపావతుతండాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో మెగావత్ శ్రీను అనే యువ రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేక అతని సోదరి లక్ష్మీ కూడా పురుగుల సేవించి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీనుది వ్యవసాయ కుంటుంబం. గత రెండుమూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలో వచ్చాయి. దీంతో ఆ కుటుంబం అప్పులలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో తండ్రి బాధను చూడలేక శీను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా గత రెండు రోజులుగా జిల్లాలో అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

తండ్రిని కొట్టి చంపిన బాలుడు..

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో దారుణ సంఘటన జరిగింది. కన్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు రోకలి బండతో కొట్టి చంపాడు. తాగిన మైకంలో తల్లిని వేధిస్తుండటంతో కొడుకు తండ్రిని హతమార్చినట్లు తెలిసింది. మూగా, చెవిటివాడైన బాలుడిని తండ్రి తీవ్రంగా కొట్టేవాడని అది తట్టుకోలేక తిరగబడి రోకలి బండతో తలపై కొట్టడంతో తండ్రి మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు కార్పొరేషన్ లో 6గురు ఉద్యోగుల సస్పెన్షన్

గుంటూరు: అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గుంటూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులపై నగరపాలక కమిషనర్ అనురాధ సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను డిస్మిస్ చేసి, ముగ్గురు పర్యవేక్షణాధికారులకు చార్జి మెమోలు ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను చెల్లించిన సుమారు కోటి రూపాయల సొమ్మును అక్రమంగా వాడుకున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ అనురాధ దీనిపై ఇద్దరు ఉన్నతాధికారులతో రహస్య విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్: మంత్రి లక్ష్మారెడ్డి...

   హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం కోఠిలోని 104 ఆరోగ్య కేంద్రంలో ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరగడం బాధాకరమని ఆయన చెప్పారు.

సారా విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు

నల్గొండ :చండూరు పరిధిలో సారా విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు జరిగాయి. దీనిలో 30 లీటర్ల నాటుసారాను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అదేవిదంగా నలుగురు వ్యక్తులను బైండోవర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

13:32 - September 10, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధానిలో తాత్కాలిక రహదారుల అభివృధ్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విజయవాడ నుండి రాజధాని ప్రాంతానికి చేరుకోవడానికి సరైన రహదారి లేకపోవడం, అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేయబోతుండడంతో తాత్కాలికంగా రహదారులు అభివృద్దికి నడుం బిగించింది. ఇప్పటికిప్పుడు పెద్ద రహదారులు అంటే సాధ్యం కాకపోవడంతో, ఉన్న రహదారులను విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజి నుంచి ఉండవల్లి మీదుగా.....

నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతుండడంతో , తాత్కాలిక వసతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది..రాజధానికి చేరుకోవాలంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి మీద వెళ్లాల్సి ఉంది..అయితే ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి సెంటర్ మీదగా రాజధానిలోకి రావాలంటే సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

రాజధాని ,సీఎం క్యాంపు ఆఫీసుతో ట్రాఫిక్ సమస్య .....

సాధారణంగా ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి వరకు ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం రాజధాని ,సిఎం అతిథి గృహం కారణంగా ఊహించని స్థాయిలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. రాజధాని కి వెళ్లాలంటే అతి చిన్న రహదారి మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇక్కడికి వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రహదారుల విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు .

ఉండవల్లి సెంటర్ నుండి తుళ్లూరు వరకు......

ఉండవల్లి సెంటర్ నుండి తుళ్లూరు వరకు ప్రస్తుతం రహదారిని విస్తరించేందుకు అధికారుల కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లి సెంటర్ నుండి ఉండవల్లి గ్రామం వరకు రోడ్డు పై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించారు. అలాగే పెనమాక నుండి తుళ్లూరు వరకు రహదారిని విస్తరించేందుకు అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు.

అక్టోబర్‌ 22 లోగా రహదారుల విస్తరణ పూర్తి ......

వచ్చే నెల 22 లోపు రహదారులు విస్తరణ పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులు భావిస్తున్నారు..రాజధాని శంకుస్థాపనకు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు రాబోతున్నారు. అప్పటిలోగా రహదారులు విస్తరణ పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఏర్పాటైన సీఎం అతిథి గృహం......

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న అతిథి గృహానికి కావాల్సిన అన్ని వసతులను ఆగమేఘాల మీద అధికారుల ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకునే రోడ్డు ఇరుకుగా ఉండడంతో , ఆగమేఘాల మీద నూతన రహదారిని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మద్రాస్ కాలువ పై నిర్మించిన నూతన వంతెన మీదగా కరకట్టకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న కొన్ని ఇళ్లను తొలగిస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మార్గంలో భారీ భద్రతను ఏర్పాటు.....

ఇప్పటికే ముఖ్యమంత్రి అతిథి గృహం కారణంగా ఆ మార్గంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రస్తుతం రహదారి కోసం ఇళ్లును తొలగించడంతో, భవిష్యత్తులో సీఎం అవసరాల కోసం ఇంకేం చేస్తారో అని అక్కడి వాసులు హడలెత్తి పోతున్నారు...

13:22 - September 10, 2015

మెదక్ : పిడుగుపాటుకు రైతు మృతిచెందిన సంఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్‌ మండలం గొంగ్లూర్‌ తండాకు చెందిన శంకర్‌ అనే రైతు.. వర్షంలోనే పొలంలో పని చేస్తుండగా పిడుగుపడింది. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్‌ మృతితో ఆ కుటుంబం అనాథగా మారిపోయిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

13:20 - September 10, 2015

హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీంకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్‌లో ఖాళీ స్థానం భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ట్రిబ్యునల్‌ లో ఉంటే వివాదాలు వస్తాయని న్యాయస్థానానికి కర్నాటక తరపు న్యాయవాది తెలిపారు. ఎవర్ని నియమిస్తారు అనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోర్టు తెలిపింది. 

కేశవ రెడ్డి పై సెక్షన్ 5, ఐపీసీ సెక్షన్లు 420, 403,109 కింద కేసులు

హైదరాబాద్ : కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని కర్నూలు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. కేశవ రెడ్డి పై సెక్షన్ 5, ఐపీసీ సెక్షన్లు 420, 403,109 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 1100 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, 800 మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి డిపాజిట్లు సేకరించారని తెలిపారు. మొత్తం రూ.470 కోట్లు డిపాజిట్లు రూపంలో... స్కూల్ ఆస్తులు తాకట్టు పెట్టి వివిధ బ్యాంకుల్లో రూ.62 కోట్లు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు.

హరీష్ రావు పై డీజీపీకి నర్సిరెడ్డి ఫిర్యాదు...

హైదరాబాద్: పవిత్రమైన యాదగిరిగుట్టపై నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారంటూ మంత్రి హరీష్‌రావుపై డీజీపీ అనురాగ్‌శర్మకు టీ.టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ఫిర్యాదు చేశారు. హరీష్‌రావు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

రైతు ఆత్మహత్య తట్టుకోలేక చెల్లి కూడా...

నల్గొండ : పెద్దవూర మం. సపావతుతండాలో మెగావత్‌ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీను కుటుంబం గత రెండుమూడేళ్లుగా వ్యవసాయంలో లాభం లేకుపోవడంతో అప్పులో కూరుకుపోయింది. దీంతో తండ్రి బాధను చూడలేక శీను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న జిల్లాలో అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

తూగో జిల్లా పిడింగొయ్యిలో ఉద్రిక్తత

తూ.గో: రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు సామాజికవర్గాల మధ్య జరిగిన వివాదం ఓ సామాజిక వర్గాన్ని గ్రామం నుంచి వెలివేసే పరిస్థతి ఏర్పడింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఖాళీ స్థలంలో దేవాలయం నిర్మించేందుకు రెండు సామాజివర్గాలు శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్సీ సామాజికవర్గం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఆగ్రహించిన రెండు సామాజిక వర్గాలు అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి చెత్తకుప్పల్లో పడవేశారు. ఈ ఘటనపై పోలీసులకు, ఉన్నతస్థాయి అధికారులకు ఎస్సీ సామాజిక వర్గం ఫిర్యాదు చేసింది.

12:47 - September 10, 2015

గుంటూరు :తాడేపల్లి మండలం ఉండవల్లిలో గత కొద్ది రోజులుగా విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం ఓ మహిళ విషజ్వరంతో మృతి చెందింది. నేడు డెంగ్యూ లక్షణాలతో మరో ఇద్దరు మృతి చెందారు. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న ఉండవల్లి గ్రామంలో ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎలాటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా దోమలు పెరిగి విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని...దాని పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

12:43 - September 10, 2015

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కాసేపట్లో ఏపీ, టీఎస్‌ సీఎస్‌ల భేటీ జరగనుంది. కమలనాథన్‌ కమిటీ ముందు రెండు రాష్ట్రాల సీఎస్‌లు సమవేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజనపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. 

12:41 - September 10, 2015

హైదరాబాద్ : పోలవరం కాలువ పనుల్లో తవ్విన కోట్ల రూపాయల విలువ చేసే మట్టి.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతోంది. రాత్రికి రాత్రే లారీల్లో అక్రమంగా మట్టిని సరిహద్దులు దాటిస్తున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులే..చోద్యం చూస్తున్నారు. డబ్బుకు ఆశపడి వేల క్యూబిక్కుల పోలవరం మట్టిని అమ్ముకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధిని రాకుండా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న మట్టి తరలింపు.. చొద్యం చూస్తున్న అధికార యంత్రాంగం..

పోలవరం కాలువ మట్టిని అమ్ముకుంటున్న అధికారులు......

పోలవరం కాలువ మట్టిని కొందరు ప్రభుత్వ అధికారులు, పర్యవేక్షకులు అమ్ముకుంటున్నారు. గోదావరి-కృష్ణా నదులను పోలవరం కాలువ ద్వారా అనుసంధానం చేసి, కృష్ణా-గుంటూరు డెల్టాకు సాగు, తాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని సర్కార్‌ గడువు విధించడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వేల క్యూబిక్కుల పోలవరం కాలువ మట్టిని అమ్ముకుంటున్నారు. క్వారీ గోతులను పోలవరం మట్టితో పూడ్చటానికి ఒక ఎకరానికి 7 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూజివీడు మండలం సీతారాంపురం, పల్లెర్లమూడి గ్రామ పరిసరాల్లో తాడిచెట్టు లోతు ఉన్న క్వారీ గుంతలు కూడా పోలవరం మట్టితో పొలాలుగా మారిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కాలువ తవ్వకంలో 8,37,337 క్యూబిక్ మీటర్ల మట్టి ......

పోలవరం మట్టిని స్థానిక గ్రామాల అవసరాల మేరకే వినియోగించాలనే నిబంధన ఉంది. కానీ, అధికారులు తమ స్వాలాభం కోసం మట్టిని అమ్ముకుంటున్నారు. పోలవరం కుడికాలువలో 118.9 కిలోమీటర్ నుంచి 123.06 కిలోమీటర్ వరకు కాలువ తవ్వకంలో 8,37,337 క్యూబిక్ మీటర్ల మట్టిరాగా, ప్రస్తుతం ఈ కాలువగట్ల మీద ఉన్నమట్టి 2026 క్యూబిక్ మీటర్లు మాత్రమే. అక్షరాల 8,35,331 క్యూబిక్ మీటర్ల మట్టి ఏ గ్రామానికి చేరిందో..? అంతు చిక్కడంలేదు. గ్రామం నుంచి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించినపుడు నిబంధనల ప్రకారం ఆ గ్రామానికి క్యూబిక్ మీటర్‌కు 22 రూపాయల చొప్పున సీనరేజ్ పంచాయతీకి చెల్లించాలి. అయితే ఇక్కడ ఆ నిబంధనను పాటించలేదు. దీంతో అనేక గ్రామాలు తమకు న్యాయపరంగా రావాల్సిన లక్షలాది రూపాయల సీనరేజ్‌ని కోల్పోయాయి. ఈ వ్యవహారంపై స్థానిక గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఒక లారీకి వెయ్యి చొప్పున, ట్రాక్టర్‌కు 500 రూపాయల చొప్పున అపరాధ రుసుము వేసి.. అధికారులు చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అక్రమ మట్టి తరలింపుపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరపాలని స్థానిక గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమ గ్రామాలకు రావాల్సిన సీనరేజ్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

12:37 - September 10, 2015

ఢిల్లీ : భారత్‌, పాక్‌లకు చెందిన సైన్యాధికారులు నేడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో కాల్పులు, చొరబాట్లపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యాధికారుల సమావేశం రద్దయిన తర్వాత ఈ సమావేశం జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ..ఉద్రిక్తతలు రెచ్చగొట్టబడుతున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది.

 

12:35 - September 10, 2015

హైదరాబాద్ : ఏపీ సచివాలయం ఎల్ బ్లాక్ వద్ద ప్రమాదం జరిగింది. ఎల్ బ్లాక్ లోని 5వ అంతస్తు నుండి పెయింట్ వేస్తూ కార్మికుడు కింద పడ్డాడు. తీవ్ర గాయాలయిన కార్మికుని తోటి కార్మికులు, సచివాలయ సిబ్బంది ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి సేప్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

12:33 - September 10, 2015

నెల్లూరు : సమాజంలో ఎంతోమంది వికలాంగులు ఉంటారు. అయితే వారిలో వైకల్యాన్ని జయించి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నవాళ్లు ఒకరైతే.. తమ వైకల్యాన్ని తలచుకుంటూ జీవితాంతం కుమిలిపోయేవాళ్లు మరికొందరుంటారు. ఇందులో మొదటికోవకు చెందినవాడు నెల్లురు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లికి చెందిన మల్లిక్‌..

ఏనాడు అధైర్యపడని మల్లిక్‌ .....

70 శాతం అంగవైకల్యంతో రెండు కాళ్లు పని చేయకపోయినా ఏనాడు అధైర్యపడలేదు. ఏదో ఒకటి చేయాలన్న అతని తపన ఒక్క దగ్గర కూర్చోనీయలేదు. దాంతో తమకు ఉన్న పొలానికి వెళ్లి పనులన్నీ నేర్చుకున్నాడు. తొలుత కష్టమనిపించినా వెనక్కి తగ్గకుండా కష్టపడ్డాడు. నేడు ఒంటరిగా పొలం పనులన్నీ చేయగల సత్తా సాధించాడు. ప్రతిరోజు తనకు ఉన్న మూడు చక్రాల రిక్షాపై పొలానికి వెళ్లి పనులు చూస్తుంటాడు. తనకు ఉన్న వైకల్యాన్ని ఎవరూ ఎత్తిచూపకుండా ఉండేందుకు తాను ఈ పనులన్నీ నేర్చుకున్నానని ఎంతో గర్వంగా చెబుతుంటాడు మల్లిక్‌. పొలంలో చెట్లు నరకడం, పంట కోయడం, పాదులు తీయడంతో పాటు.. ఎవరి సాయం లేకుండానే మిరప , మామిడి పంటలను సాగు చేస్తానంటున్నాడు. వైకల్యం ఉందని వికలాంగులు కుమిలిపోకుండా తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు తాను ఆదర్శంగా నిలిస్తే అంతే చాలని మల్లిక్‌ అంటున్నాడు.

నిత్యం పొలం పనులతో బిజీబిజీగా ......

నిత్యం పొలం పనులతో బిజీబిజీగా ఉండే మల్లిక్‌తో ఓ మూగ జంతువు స్నేహం చేసింది. తనకు అన్ని పనుల్లో అండగా నిలుస్తోంది. మల్లిక్‌ ప్రతిరోజు పొలానికి వెళ్లేందుకు సిద్దం కావడమే ఆలస్యం... కుక్క కూడా రెడీ అవుతుంది. రిక్షాకు ఉన్న గొలుసును తన మెడకు తగిలిస్తే చాలు.. అదే లాక్కుపోతుంటుంది. ఇది ఏ ఒక్కరోజుకో పరిమితం కాదు... ప్రతిరోజు తనను పొలం మొత్తం తిప్పుతుందని సంతోషంగా చెబుతుంటాడు మల్లిక్‌.

ఐదుగురు సంతానంలో మల్లిక్‌ వికలాంగుడు.....

తమ ఐదుగురు సంతానంలో మల్లిక్‌ వికలాంగుడైనప్పటికీ... పొలం, ఇంటి పనులన్నీ చేస్తుంటాడని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. కొడుకు సంకల్పాన్ని చూస్తుంటే మాకు ఎంతో ముచ్చట వేస్తుందని వారంటున్నారు. మల్లిక్‌ అండగా ఉండడం వల్ల మిగతా పిల్లలు ఉన్నత చదువులు చదివారని మల్లిక్‌ తండ్రి తారాపతిరావు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

వైక్యలం శరీరానికే కానీ.. మనసుకు కాదని ......

వైక్యలం శరీరానికే కానీ.. మనసుకు కాదని నిరూపించాడు మల్లిక్‌. ప్రతి వికలాంగుడు కూడా మల్లిక్‌ను ఆదర్శంగా తీసుకుని తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆశిద్దాం. 

కృష్ణాజలాల వివాదం కేసు విచారణ 15కి వాయిదా.

హైదరాబాద్ : కృష్ణాజలాల వివాదం కేసు విచారణను సుప్రీం కోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్‌లో ఖాళీ అయిన స్థానాన్ని వారంలోగా భర్తీ చేస్తామని కేంద్రం సుప్రీంకు తెలియజేసింది.

 

తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన బాలుడు..

వరంగల్: జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో దారుణ సంఘటన జరిగింది. కన్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు రోకలి బండతో కొట్టి చంపాడు. తాగిన మైకంలో తల్లిని వేధిస్తుండటంతో కొడుకు తండ్రిని హతమార్చినట్లు తెలిసింది. మూగా, చెవిటివాడైన బాలుడిని తండ్రి తీవ్రంగా కొట్టేవాడని అది తట్టుకోలేక తిరగబడి రోకలి బండతో తలపై కొట్టడంతో తండ్రి మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

షాంఘై చేరుకున్న కేసీఆర్ బృందం

హైదరాబాద్ :తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. గురువారం కేసీఆర్ బృందం డెలియన్ నుంచి షాంఘై చేరుకుంది. ఈ సందర్భంగా షాంఘైలోని న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బృందం సందర్శించనుంది. అలాగే ఇవాళ సాయంత్రం పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల పెట్టాల్సింది కేసీఆర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. కాగా తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా కేసీఆర్ చైనా పర్యటన జరుగుతోంది.

భారత్ - పాక్ డీజీ స్థాయి అధికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : భారత్ - పాక్ సరిహద్దు దళాల డీజీ స్థాయి అధికారుల సమావేశం ప్రారంభమైంది. రెండు దేశాల సైన్యాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశం అయ్యారు. 3 రోజుల పాటు జరిగే చర్చల్లో సరిహద్దులో కాల్పులు, చొరబాట్లు వంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.

గిరిజనాభివృద్ధికి రూ.600 కోట్లు : మంత్రి రావెల

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో లక్షమంది గిరిజనుల అభివృద్ధికి రూ.600 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి గెహ్లాట్‌ను ఏపీ మంత్రి కలిసి మాట్లాడారు. ఏపీలో గిరిజనుల అభివృద్ధికి సహకరించాలని కిశోర్‌బాబు కోరారు. ఏపీలో గిరి గోరు ముద్దలు, గిరి పుత్రిక కళ్యాణ పథకం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్రమంత్రికి రావెల వివరించారు. 

11:43 - September 10, 2015

హైదరాబాద్ : బందరుపోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సిపిఎం అలుపెరగని ఉద్యమం చేస్తున్నాయి. భూసేకరణ నిర్ణయాన్ని ఏపి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో చినకర అగ్రహారంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నౌకాశ్రయ నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదన్నారు. నౌకాశ్రయ నిర్మాణానికి ఎంత భూమి కావాలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా భూములు లాక్కుంటే రైతుల నుండి తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. రెండు వేల ఎకరాల్లో బందరు పోర్టు నిర్మాణం చేపట్టకుండా ఏపీ ప్రభుత్వం ఐదు వేల 500ల ఎకరాలను లాక్కోవాలని చూస్తోందని ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు విమర్శించారు. భూబ్యాంక్ పేరుతో ఏపీ అంతటా రైతుల భూములను లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారు. సీపీఎం బృందం ఇవాళ బందరు పోర్టు భూములను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడింది. రైతులకు అండగా ఉంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చింది. అన్ని పార్టీలను కలుపుకుని కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.

11:37 - September 10, 2015

హైదరాబాద్ : క్యూబాపై అంతర్జాతీయ చట్టాలకు విరుద్దంగా ఐదు దశాబ్దాలుగా అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక,వాణిజ్య ఆంక్షలను హనోయి డిక్లరేషన్ తిరస్కరించింది. అమానవీయమైన బంధనాలను తొలగించాలన్న క్యూబా ప్రజల డిమాండ్‌కు మద్దతు ప్రకటించింది. హనోయిలో రెండు రోజుల 7వ ఆసియా పసిఫిక్ క్యూబా సంఘీభావ ప్రాంతీయ సదస్సు డిక్లరేషన్‌ను అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

హనోయి డిక్లరేషన్‌ విడుదల......

వియత్నాం రాజధాని హనోయిలో 7వ ఆసియా పసిఫిక్ క్యూబా సంఘీభావ ప్రాంతీయ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు బుధవారంతో ముగిసింది. 18 దేశాల నుంచి దాదాపు 220 మంది ప్రతినిధులు ఈ కాన్ఫిరెన్స్ కు హాజరయ్యారు. ప్రస్తుతం క్యూబా ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య సమస్యలు, అమెరికాతో సంబంధాలపై చర్చించారు. సమావేశం చివరి రోజైన బుధవారం నాడు డిక్లరేషన్‌ వెలువరించింది సదస్సు.

క్యూబాపై అమెరికా ఆర్థిక,వాణిజ్య ఆంక్షలు ఖండించిన సదస్సు......

క్యూబాపై అంతర్జాతీయ చట్టాలకు విరుద్దంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును హనోయి డిక్లరేషన్ తిరస్కరించింది. ఐదు దశాబ్దాలుగా అగ్రరాజ్యం కొనసాగిస్తున్న ఆర్థిక,వాణిజ్య ఆంక్షలను ఖండించింది. అమానవీయమైన బంధనాలను తొలగించాలన్న క్యూబా ప్రజల డిమాండ్‌కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది డిక్లరేషన్. అయితే ఇటీవల క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దౌత్య చర్చలను స్వాగతించింది హనోయి సదస్సు. దౌత్య సంబంధాలను పునరుద్దరించాలన్న ఇరు దేశాల అధినేతల నిర్ణయాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అయితే యుద్ధ ఖైదీలను శిక్షించడానికి అమెరికా ఉపయోగిస్తున్న క్యూబాలోని గ్వాంటానామా బేను తిరిగి ఆ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేసింది హనోయి డిక్లరేషన్.ఈ సదస్సుకు భారత ప్రతినిధిగా ఎస్ ఎఫ్ ఐ మాజీ అధ్యక్షుడు ఆర్‌. అరుణ్‌ కుమార్ అటెండయ్యారు. కాన్ఫిరెన్స్ సుహృద్భావ వాతావరణంలో సాగిందని ఆయన చెప్పారు.

11:32 - September 10, 2015

హైదరాబాద్ : తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక దీక్ష చేపట్టింది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ దీక్షకు ఎమ్మెల్సీలు గేయానంద్‌, శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. విద్యార్ధులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జీవో నెం.120ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టులో అప్పీల్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, 371 డిని రక్షించడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ప్రైవేటు రాజధాని అమరావతిలో పెట్టుకోండి... రెండో ప్రజారాజధానిని తిరుపతిలో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.

11:29 - September 10, 2015

హైదరాబాద్ : నాందేడ్ ఎక్స్ పెస్ర్ లో భారీ చోరి జరిగింది. ఖమ్మం దగ్గర ఎస్ 7, 8, 10,20 బోగిల్లో చైన్ లాగి దొపిడికి పాల్పడ్డారు. 20తులాలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 10 మంది బాధితులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాత్రి మూడు గంటలకు ఈ సంఘటన జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని ముసుగులో వచ్చి బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

 

11:27 - September 10, 2015

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లో దారుణం వెలుగు చూసింది. ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామకృష్ణ తన భార్యను చంపేసి.. ఏమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. ఎవరికీ అనుమానం రాకుండా వికారాబాద్‌ అడవుల్లో కాల్చి..పాతి పెట్టాడు. భార్య సుప్రియను చంపడానికి కారణం అనుమానమేనని రామకృష్ణ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు.

గుంటూరు కార్పొరేషన్ లో నిధుల గోల్ మాల్...

గుంటూరు : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.కోటి నగదు గోల్‌మాల్ జరిగింది. ఏడాది కాలంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ.కోటి ఆస్తి పన్నును కొందరు సిబ్బంది నొక్కేశారు. ఇటీవల బయటపడిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గోల్‌మాల్‌కు కారణమైన ఆరుగురు సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది.

ఏసీబీ వలలో సర్వే డిప్యూటీ ఇన్ స్పెక్టర్

ఖమ్మం : సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారిని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఇన్‌స్పెక్టరును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ దుర్గాప్రసాద్‌ కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వాసిరెడ్డి దుర్గాప్రసాద్‌ (84) కన్నుమూశారు. బాలీవుడ్‌లో 99 సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తెలుగులో దుర్గాప్రసాద్‌ పనిచేసిన చివరి చిత్రం స్వరాభిషేకం. అమితాబచ్చన్‌, మనోజ్‌కుమార్‌ సినిమాలకు ఈయన ఎక్కువగా పనిచేశారు

10:42 - September 10, 2015

హైదరాబాద్ : పట్టు పడితే అంతే.. ఉడుం కూడా ఇంచు కదలదు..! పోటీలోకి దిగాడంటే.. అతనికి పోటీనే ఉండదు..! ప్రత్యర్థి ఎవరైనా.. వార్‌ వన్‌సైడే..! పాల్గొన్న ప్రతిచోటా విజయమే. గేమ్‌ ముగిసిందంటే.. కంఠం కనకంతో మెరిసిపోవాల్సిందే..! లేదంటే.. కంచుతోనైనా మురిసిపోవాల్సిందే..! ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌లో తనదైన ముద్రవేసిన దేవీసింగ్ ఠాకూర్‌ చరిత్ర. మల్ల యుద్ధంలో మొనగాడిగా పేరుతెచ్చుకున్ దేవీసింగ్‌.. పేదరికంతో జరిగిన పోరాటంలో మాత్రం ఓడిపోయాడు...

దేవీసింగ్‌ బరిలో నిలిచాడంటే..

దేవీసింగ్‌ బరిలో నిలిచాడంటే.. ప్రత్యర్థికి ఓ మూల వణుకే...గెలుస్తామా..? లేదా..? అంటూ ప్రత్యర్థి మనసులో ఒకింత బెరుకే... రింగులోకి దిగాడంటే.. ప్రేక్షకులు వండరైపోవాల్సిందే...మనవాడి పట్టుకు ప్రత్యర్థులు కుదేలైపోవాల్సిందే...ఇవీ.. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి.. ఇంటర్నేషనల్‌ రెజ్లర్‌గా ఎన్నో బహుమతులు సాధించిన దేవీసింగ్‌ సత్తాను తెలిపే పదాలు. అక్కడా ఇక్కడా అనే తేడాలేదు. ఎక్కడ పాల్గొన్నా పతకంతోనే తిరిగివచ్చాడు ఈ ధూల్‌పేట ఆణిముత్యం.

రెజ్లింగ్‌ పట్ల అంతులేని అభిమానంతో..

రెజ్లింగ్‌ పట్ల అంతులేని అభిమానంతో.. అదే ఆశగా, శ్వాసగా ముందుకు సాగాడు. పోటీలో ఎవరున్నా.. అతని అంతిమ లక్ష్యం విజయమే. నిరంతరం గెలుపు మంత్రాన్నే పఠించిన దేవీసింగ్‌.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఏషియన్‌ కేడెట్‌లో గోల్డ్‌ మెడల్‌తో పాటు, హంగేరీ, కజకిస్థాన్‌లలో మెడల్స్‌ గెలిచిన దేవీసింగ్‌.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాధించిన పతకాలకు లెక్కే లేదు.

తన అవార్డును బ్రేక్‌ చేసే రెజ్లర్‌ లేడని ధీమాగా....

ఇప్పటికీ.. హైదరాబాద్‌లో తన అవార్డును బ్రేక్‌ చేసే రెజ్లర్‌ లేడని ధీమాగా చెబుతాడు దేవీసింగ్‌. రెజ్లింగ్‌లో తిరుగులేని ఆటగాడిగా ఎదిగిన దేవీసింగ్‌.. బరిలో తానుంటే.. ప్రత్యర్థులకు విజయం అందని ద్రాక్షే అన్న భావనను సుస్థిరం చేశాడు. అయితే... ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు అతడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయి. చివరకు ప్రాణసమానమైన క్రీడకే దూరమవ్వాల్సిన దుస్థితిని తెచ్చిపెట్టింది.

అంతులేని ప్రతిభ ఉన్నా..ఆదరణ కరువు...

అంతులేని ప్రతిభ ఉన్నా.. ప్రభుత్వాల ఆదరణ కనుచూపు మేరలో కూడా కనిపించ లేదు. ఏదో సాధించాలనే తపన ఓవైపు.. అడుగు కూడా ముందుకు వేయనివ్వని పేదరికం మరోవైపు. కనీసం శిక్షణకు కూడా డబ్బులేని పరిస్థితుల్లో.. భారీ ఖర్చుతో కూడున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం మరింత ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని మోసేందుకు, రెజ్లింగ్‌ను వదిలి, కుంచె చేత పట్టుకోవాల్సి వచ్చిందీ మల్ల యోధుడు. ఢిల్లీలో ఉండి శిక్షణ పొందాలంటే కనీసం నెలకు 30 వేల రూపాయలు కావాల్సి వచ్చింది. కానీ.. చిల్లిగవ్వ కూడా లేని దేవీసింగ్‌కు.. ప్రభుత్వం నుంచి సైతం ఎటువంటి సహాయమూ లభించలేదు. దీంతో.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇలా.. వినాయక ప్రతిమలు తయారుచేసి కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.

దేవీసింగ్‌తో పాటు అతని సోదరుడు కిషన్‌ సింగ్‌ ....

దేవీసింగ్‌తో పాటు అతని సోదరుడు కిషన్‌ సింగ్‌ కూడా రెజ్లరే. అతనూ పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. తమ ఇద్దరు పిల్లలూ రెజ్లింగ్‌లో ప్రతిభ చూపడం ఆనందం కలిగిస్తున్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితే తమను వెక్కిరిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డలు మరింతగా ఎదగాలనే కోరిక ఉన్నా.. ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వం తగిన విధంగా చేయూతనివ్వాలని కోరుతున్నారు.

10:36 - September 10, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ దూకుడు పెంచింది. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రత్యేక హోదా అస్త్రంతో ఏపీలో బాబు సర్కార్‌ను.. రైతు ఆత్మహత్యలే ఆయుధంగా కేసీఆర్‌ సర్కార్‌ను ఏకి పారేస్తోంది. రెండు రాష్ట్రాల్లో పునర్‌ వైభవం సాధించేదిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది.

అందివచ్చిన అన్ని అవకాశాలను .....

రెండు రాష్ట్రాల్లో పార్టీని పటిష్టపరిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటోంది. ఇరు ప్రభుత్వాల తప్పిదాలే ఆయుధంగా మలుచుకుంటూ విరుచుకుపడుతోంది. ఏపీ రాజదాని భూసేకరణ, ప్రత్యేక హోదా అంశాలపై ఆందోళన స్వరం వినిపించింది. నిరసనలతో హోరెత్తించింది. ఇప్పటికే పోలవరంపై పోరు, ప్రత్యేక హోదా కోసం కోటీ సంతకాల సేకరణ, విభజన చట్టం అమలుకు ధర్నాలు చేపట్టింది. ఏపీని మోసం చేశారంటూ..ఏకంగా మోదీ,వెంకయ్య,చంద్రబాబులపై ఠాణాల్లో ఫిర్యాదు చేస్తూ మరింత జోరు పెంచుతోంది.

తెలంగాణలోనూ అదే ఒరవడి....

ఇటు తెలంగాణలోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది హస్తం పార్టీ. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వైపల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతోంది. అటు రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు బలవన్మరాలపై పోరును ఉద్ధృతం చేసింది. రాహుల్‌తో రైతు భరోసా యాత్ర చేపట్టి రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేసింది. ఇక చీఫ్‌ లిక్కర్, ప్రాజెక్ట్ డిజైన్ల మార్పుపై నిరసన గళమెత్తింది.

'జలయజ్ఞం' ప్రాజెక్టుల సాధనకు పోరుబాట......

ఇక సాగునీటి ప్రాజెక్టులపై టీఎస్‌ సర్కార్‌ తీరును తీవ్రంగా ఖండిస్తోంది. పాత ప్రాజెక్టుల డిజైన్ల మార్పుకు యత్నించడంపై పెదవి విరుస్తోంది. పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు జలయజ్ఞం పథకంలో చేపట్టిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. వరంగల్‌ జిల్లాలో దేవాదుల, కంతానపల్లి గుండ్లవవాగుల, కరీంనగర్‌ జిల్లాలో తోటపల్లి, మిడ్ మానేరు తదితర ప్రాజెక్టుల పూర్తి కోసం పోరుబాటకు రెడీ అవుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అటు ప్రాణహిత చేవెళ్ల మార్పుపై రంగారెడ్డి జిల్లా నేతలు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. ఇరు రాష్టాల్లో చేస్తున్న పోరుతో కాంగ్రెస్‌ పార్టీకి ఏ మేరకు మైలేజ్‌ పెరుగుతుందో చూడాలి.  

10:33 - September 10, 2015

హైదరాబాద్ : కర్నూలు కేశవ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనేకమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేసి.. చేతులెత్తేయడంతో బాధితులంతా ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరెడ్డిని నేడు పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో హాజరుపర్చాక..రిమాండ్‌తో పాటు కస్టడీ కూడా కోరనున్నట్లు తెలుస్తోంది.

డిపాజిట్‌ సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్....

కేశవరెడ్డి స్కూల్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధిత తల్లిదండ్రుల నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. యాజమాన్యం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. డిపాజిట్‌ సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

ఆల్‌ ఫ్రీ మంత్రంతో ఘరానా మోసం.....

కొన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు.. రాజకీయ నాయకుల హామీలను మించి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆల్‌ ఫ్రీ మంత్రం జపిస్తూ బురిడీ కొట్టిస్తున్నాయి. ఈ విషయంలో కేశవరెడ్డి విద్యాసంస్థలు తామేమీ తక్కువ తినలేదంటున్నాయి. లక్ష డిపాజిట్‌ చేస్తే కార్పొరేట్‌ విద్య ఫ్రీ అంటూ విద్యార్థుల పేరెంట్స్‌కు గాలం వేసిన కేశవ రెడ్డి స్కూళ్లు...ఇప్పుడు కొత్త పల్లవి వినిపిస్తున్నాయి. ఉచిత రాగం ఆలపించిన యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి పెంచుతోంది. దీంతోపాటు పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు డిపాజిట్‌ వెనక్కి ఇవ్వలేమంటూ చేతులెత్తుస్తున్నాయి.

తిరుపతిలో కదం తొక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు...

యాజమాన్యం తీరుపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు... చిత్తూరు జిల్లాలో బాధిత సంఘాలుగా ఏర్పడి కదం తొక్కారు. తిరుపతి కేశవరెడ్డి స్కూల్‌ ఎదుట ఆందోళనలతో హోరెత్తించారు. డబ్బులు చెల్లించకుండా 4 నెలలుగా తిప్పుకుంటున్నారని బాధితులు భగ్గుమంటున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోకపోతే తమ తడఖా ఏంటో చూపిస్తామంటున్నారు. ఇక స్కూల్‌ నిర్వాహకులు ఆస్తులు అమ్మైనా సరే డబ్బులు చెల్లిస్తామని చిలకపలుకులు పలుకుతున్నారు.

కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మిన్నంటిన ఆందోళనలు....

కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బాధిత తల్లిదండ్రుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం కల్పించుకుని తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

సూది సైకో బాధితురాలి పరిస్థితి విషమం...

పశ్చిమ గోదావరి: నల్లజర్లలో 15 రోజుల క్రితం సూది సైకో చే తిలో గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమం గా మారింది. ముక్కు, నోరు నుంచి రక్తం రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. గత నెల 26న గంటా చంటి అనే మహిళ నడిచి వెళుతుండగా, మోటారు సైకిల్‌పై వచ్చిన సూదిగాడు వెనుక నుంచి పొడిచి పరారయ్యాడు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి భయపడాల్సిందే మీ లేదని ఇంటికి పంపించేశారు. బుధవారం ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం రావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న చంటి అనారోగ్యం పాలవడంతో సైకో బాధితులతో పాటు జిల్లావాసుల్లోనూ భయాందోళనలు మొదలయ్యాయి.

జీహెచ్ఎంసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్‌: నగరంలోని జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ సర్కిల్‌లో తొలగించిన పారిశుద్ధ్య కార్మికుడు ఉప్పలయ్య కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన ఉప్పల్‌ సర్కిల్‌లో సంచలనం సృష్టించింది.

ఆప్ఘనిస్థాన్ లో భూ ప్రకంపనలు..

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో గురువారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

 

కన్నడ రచయిత భగవాన్ కు బెదిరింపులు..

హైదరాబాద్: ప్రముఖ కవి కాల్ బుర్గీ దారుణ హత్యను మరువకముందే అదే రాష్ట్రానికి చెందిన మరో రచయితకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. కాల్ బుర్గీ స్థాయి రచయిత అయిన కేఎస్ భగవాన్ కు తాజాగా బెదిరింపు లేఖ అందింది. ‘‘ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాం. ఇప్పుడిక నీ వంతే. ఏ పోలీసులు కూడా నిన్ను రక్షించలేరు. నీ గడువు ఇప్పటికే మించిపోయింది. ఇక రోజులు లెక్కపెట్టుకో’’ అన్న తీవ్ర వ్యాఖ్యలతో కూడిన బెదిరింపు లేఖ నిన్న భగవాన్ ఇంటికి వచ్చింది. దీనిపై భగవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘బెదిరింపు లేఖ నిన్న మధ్యాహ్నం వచ్చింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను.

ఆంధ్ర ఖజానా ఖాళీ

హైదరాబాద్ : ఆంధ్ర ఖజానా ఖాళీ అయ్యింది. 5 నెలల్లో రూ.4వేల కోట్లు లోటు, వాణిజ్యంలో తరుగు, వాణిజ్య పన్నుల్లో రూ.300 కోట్ల తరుగు ఏర్పడింది. రాజధాని పేర భూముల ధర పెంచిన ఫలితంగా ఆస్థి రిజిస్టేషన్ల రాబడే ఆదాయ వనరుగా మారింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం భూకరణలో నిమగ్నమైంది. పరిశ్రమల పేరిట 15 లక్షల ఎరాల లక్ష్యంగా భూనిధి ఏర్పాటు చేసి.. ఇప్పటికే 7 లక్షల ఎకరాల సేకరించారు. పేదల నుంచి భూముల సేకరణకు రంగం సిద్ధం చేసింది.

భార్యను చంపి..అదృశ్యం అని ఫిర్యాదు చేసిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్

హైదరాబాద్ : హిమాయత్ నగర్ లో దారుణం జరిగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్యను చంపి కనిపంచట్లేదని గత నెల 14న నారాయణ గూడ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అనుమానంతో రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా స్నేహితుడు ప్రదీప్ తో కలిసి భార్యను హత్య చేసి వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినుల్ తెలిపాడు. విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులు వికారాబాద్ అడవులకు బయల్దేరారు.

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల పేరిట లెక్కకు మిక్కిలి విద్యాలయాలను ప్రారంభించి ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన కేశవరెడ్డి కొద్దిసేపటి క్రితం అరెస్టయ్యారు.కర్నూలు పోలీసులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ అనంతరం వారం రోజుల పాటు కేశవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి రూ.800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి, గడువు తీరినా డిపాజిట్ సొమ్మును వెనక్కివ్వలేదు. దీనిపై బాధితులు కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్ : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

09:48 - September 10, 2015

హైదరాబాద్ : కాలం కాటేస్తోంది.. వరుణుడు దోబుచులాడుతున్నాడు. కరువు ఉరుముతోంది. గద్దెనెక్కిన పాలకుల హామీలు.. నీటిరాతలవుతున్నాయి. వెరసి అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారిలేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు.

అప్పుల ఊబిలో అన్నదాత......

కరవుతో ఎండిపోతున్న పంటలు...పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు...ఉచ్చులా బిగుస్తున్న అప్పులు..వెరసి అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రైతుల ఇంట చావుడప్పు మోగుతోంది. వర్షాభావం, కరవు, అప్పులు, బ్యాంకుల నిర్లిప్తత, గిట్టుబాటు ధరల లేమితో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు. ఆదుకోనే ఆపన్న హస్తం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో రైతు ఆత్మహత్య ......

అప్పుల బాధ తాళలేక నల్గొండ జిల్లాలో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం చింతలపాలెంలో అంతటి వెంకయ్య పురుగుల మందు తాగి ఊపిరి తీసుకున్నాడు. అప్పులు పెరగటం, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ.. మృతదేహంతో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు నాగార్జున సాగర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

వరంగల్‌ జిల్లాలో అన్నదాత బలవన్మరణం....

వరంగల్‌ జిల్లాలోనూ మరో రైతు బలవన్మరణం చేసుకున్నాడు. ఖిలా వరంగల్‌కు చెందిన బిల్ల శ్రీనివాస్‌ మూడు ఎకరాలలో పత్తిసాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో మనస్థాపం చెందిన ఆయన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నష్టాల సాగు, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో శ్రీనివాస్‌ ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

హైదరాబాద్‌లో నిజామాబాద్‌ రైతు ఆత్మహత్య....

పంటలు పండక అప్పులపాలై హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్‌ జిల్లా రైతు పెద్ద లింబయ్యది మరో దీన గాధ. చేతికందిన కొడుకు అప్పులు తీరుస్తాడని ఆశపడిన ఆయనకు పిడుగులాంటి వార్త వినిపించింది. పెద్ద కొడుకు నరేషన్‌ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో.. 3 రోజుల క్రితం హైదరాబాద్‌లోని న్యూ లైఫ్‌ ఆస్పత్రిలో అతన్ని చేర్పించాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో హతాశుడైన ఆయన బుధవారం తెల్లవారుజామునే ఆస్పత్రి నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌కు చేరుకున్నాడు. ఆర్టీసీ బస్సు కిందపడి ఆత్మహత్యాకు ప్రయత్నించడంతో.. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది అడ్డుకుని మంచినీళ్లు ఇచ్చి సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత ఓ గుడి సమీపంలో విద్యుత్‌ స్తంభానికి ఊరేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.

మెదక్‌ జిల్లా జండారాయిలో రైతు శ్రీనివాస్‌ ఆత్మహత్య.....

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జండారాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 5 ఎకరాల భూమిలో 5 బోర్లు వేయగా.. 3 బోర్లు పాడైపోయ్యాయి. ఉన్న రెండు బోర్లు మొక్కజొన్న పంటకు చాలినన్ని నీటిని సరఫరా చేయలేకపోయాయి. పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చదేలా అని మనస్తాపం చెందాడు. తన పొలంలోనే వేపచెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. కాలం కలిసిరాక అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతు సంఘాలు, మేధావులు కోరుతున్నారు. 

09:43 - September 10, 2015

హైదరాబాద్ : వాటర్‌ గ్రిడ్‌పై ఎంతోకాలంగా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్న తెలంగాణ సర్కార్‌.. దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రిడ్‌లు ఏర్పాటు చేయాలి... ఎంత ఖర్చు చేయాలనే అంశాలపై ఎంతో కసరత్తు చేసిన సర్కార్‌.. ఇప్పటికే రెండు దశల్లో 19 సెగ్మంట్లకు టెండర్లు పిలిచింది. ఇందులో తొమ్మిది సెగ్మెంట్లకు ఫైనాన్సియల్‌ బిడ్స్‌ను ఓపెన్‌ చేసింది.

గ్రాఫిక్స్‌..

కోడ్‌ చేసిన ఎల్‌1 సంస్థ సెగ్మెంట్‌ పేరు పని విలువ(రూ.కోట్లలో) టెండరు శాతం

మెగా ఇంజనీరింగ్‌ మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి 3931.54 0.20

ఐహెచ్‌పి జురాల-గద్వాల 417.98 0.60

కావేరి ఇన్‌ఫ్రాం మేడ్చల్‌ 120.62 1.20

జివిపిఆర్‌ ఇంజనీరింగ్‌ నల్లగొండ టెయిల్‌పాండ్‌ 1044.43 0.75

ప్రతిభ ఇండస్ట్రిస్‌ సంగారెడ్డి 380.32 0.35

మెగా ఇంజనీరింగ్‌ గజ్వేల్‌ 550.32 1.10

కోయా అండ్‌ కంపెనీ ఎల్లంపల్లి,మంచిర్యాల 396.50 1.20

ఖానాపూర్‌

మెగా ఇంజనీరింగ్‌ పాలేరు-వరంగల్‌ 996.80 0.40

ఎన్‌సిసి వరంగల్‌ మెట్రో 605.28 0.70

వాటర్‌ గ్రిడ్‌ పనులకు అంచనా విలువ కంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసిన తొమ్మిది కంపెనీల టెండర్లను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో మెగా ఇంజనీరింగ్స్‌, ఐహెచ్‌పీ, కావేరి ఇన్‌ఫ్రా, జీవీపీఆర్‌ ఇంజనీరింగ్‌, ప్రతిభా ఇండస్ట్రీస్‌, కోయా అండ్‌ కంపెనీ, ఎన్‌సీసీలు ఉన్నాయి. మొత్తం తొమ్మిది సెగ్మెంట్లలో మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ మూడు సెగ్మెంట్లకు అంచనా విలువ కంటే తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేయడంతో ఆ మూడు సెగ్మెంట్లలో ప్రాథమికంగా మెగా ఇంజనీరింగ్‌ కంపెనీనే అధికారులు గుర్తించారు.

రెండో దశ టెండర్ల ప్రీ-బిడ్‌కు టెండర్లు ......

ఇక ఈ తాగునీటి పథకం రెండో దశ టెండర్ల ప్రీ-బిడ్‌కు సంబంధించి ఇటీవలే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు టెండర్లను పిలిచారు. దేశవ్యాప్తంగా 18 కంపెనీల ప్రతినిధులు టెండర్లలో పాల్గొన్నారు. సుమారు 14,098 కోట్ల రూపాయల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. ఇందులో ఉన్న 10 సెగ్మెంట్లలో... నల్లగొండ సెగ్మెంట్‌కు 2106 కోట్ల రూపాయలు, సింగూరు మెదక్‌ సెగ్మెంట్‌కు 750 కోట్లు, మెదక్‌-నర్సాపూర్‌ సెగ్మెంట్‌కి 445 కోట్లు, నిజామాబాద్‌-బాల్కొండ, ఆర్మూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌కి 1350 కోట్లు, నిజామాబాద్‌-జుక్కల్‌, బాన్సువాడ, బోధన్‌ సెగ్మెంట్‌కి 1300 కోట్లు, కోరుట్ల-జగిత్యాల-ధర్మపురి సెగ్మెంట్‌కు 1300 కోట్లు, కరీంనగర్‌-సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, ఎల్లంపల్లి, పెద్దపల్లి, రామగుండం సెగ్మెంట్‌కు 1585 కోట్లు, ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌కు 1530 కోట్లు, కొమరంభీం-అసిఫాబాద్‌ సెగ్మెంట్‌కు 1650 కోట్ల రూపాయలు, గోదావరి-పూసూర్‌ భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, వైరా సెగ్మెంట్‌కు 2082 కోట్ల రూపాయలకు టెక్నికల్‌ బిడ్లను పిలిచారు. అయితే వీటికి కూడా ఒక్కో సెగ్మెంట్‌కు దాదాపు మూడు నుంచి ఐదు కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి.

మూడో దశ టెండర్లకు నోటిఫికేషన్‌ ........

ఇక ఇదిలా ఉంటే పథకం మూడో దశ టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 6 సెగ్మెంట్లకు గాను 6589 కోట్ల అంచనాలతో టెండర్‌ నోటీసులను జారీ చేసింది. వీటిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూర్‌, మహేశ్వరంలో 1800 కోట్ల రూపాయలు, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, ఉదయ సముద్రం, నల్లగొండ, నార్కెట్‌పల్లి, నకిరేకల్‌, తుంగతుర్తి, మోతె సెగ్మెంట్‌లో 289 కోట్లు, కరీంనగర్‌ జిల్లాలో మంథని, భూపాలపల్లి 835 కోట్లు, ఎల్‌ఎండి కరీంనగర్‌, ఎల్‌ఎండి మానకొండూరు, రామడుగు, హుస్నాబాద్‌, హుజురాబాద్‌లో 2040 కోట్లు, వరంగల్‌ మంగపేటలో 290 కోట్లు, వరంగల్‌ ఎల్‌ఎండి పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ సెగ్మెంట్‌లో 1335 కోట్ల రూపాయలకు టెండర్ల నోటిఫికేషన్‌ జారీ చేసింది.

క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం....

మొత్తానికి మొదటి దశలో టెండర్లు దక్కించుకున్న సంస్థలు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తే రెండోదశలోని టెండర్‌ బిడ్స్‌ను కూడా అధికారులు త్వరగా ఓపెన్‌ చేస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చిన సెగ్మెంట్స్‌కు కూడా టెండర్స్‌ కాల్‌ఫర్‌ చేస్తే పూర్తిగా వాటర్‌గ్రిడ్‌ పనులు ప్రారంభమైనట్లేనని అధికారులంటున్నారు. 

09:37 - September 10, 2015

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ వ్యాపారి ఆగిరి వెంకటేష్‌ అదృశ్యమయ్యారు. మూడు రోజుల నుంచి ఆచూకీ లేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలియచేశారు. దీంతో పోలీసులు అన్ని పీఎస్‌లకు లుకౌట్‌ నోటీసిచ్చి.. ఆయన కోసం గాలిస్తున్నారు. వెంకటేష్‌ గతంలో టీఆర్‌ఎస్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేశారు.

09:33 - September 10, 2015

హైదరాబాద్ : విజయనగరంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన రాక ముందే.. పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో సీపీఎం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. భూసేకరణ వివాదాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. 

మరోసారి బయటపడ్డ అమెరికా దాష్టీకం

హైదరాబాద్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్ జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే నిందితుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

జూరాలకు భారీ వరద నీరు

మహబూబ్ నగర్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 15,551 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం 318.00 అడుగులుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా వరదనీటితో ప్రాజెక్టు నిండిపోయింది.

యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో పేస్, హింగిస్ జోడీ

హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లోకి లియాండర్ పేస్- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 4వ సీడ్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 7-5 తేడాతో 2వ సీడ్ జోడీ రోహన్ బోపన్న(భారత్) యంగ్ జాన్ చన్ లపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ మిక్స్#డ్ డబుల్స్ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది.

చిత్తూరు జిల్లాల కంపించిన భూమి

హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలోని సోమల మండలం రామకృష్ణాపురంలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో గ్రామంలోని పలు ఇళ్లు బీటలువారాయి. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

నేటి నుంచి తాడేపల్లిగూడెంలో నిట్ తరగతులు

ప.గో : తాడేపల్లిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిట్ లో నేటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు నిట్ తరగతులను ప్రారంభించనున్నారు.

08:51 - September 10, 2015

           న్యూఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. తన దూకుడు ప్రవర్తనకు విరుద్ధంగా చాలా ఆచీతూచీ వ్యవహరిస్తున్నాడు. టీమ్‌ ఇండియా కొత్తగా అనుసరిస్తున్న దూకుడు వ్యుహం మూలంగా మైదానంలో తలెత్తిన వివాదాలపై స్పందించేందుకు టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాకరించాడు. శ్రీలంక పర్యటనలో పేసర్‌ ఇషాంత్‌ శర్మ లంక ఆటగాళ్లతో మైదానంలో కవ్వింపు చర్యలకు దిగటం వివాదస్పదమైంది. భారత మాజీలు బిషన్‌ సింగ్‌ బేడీ, సంజరు మంజ్రేెకర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ వంటి వారు ఈవిషయమై ఇప్పటికే విమర్శించారు. బుధవారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్‌ కోహ్లి ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడాడు. ఇషాంత్‌ శర్మ దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌కు దూరమవటం టీమ్‌ ఇండియాకు ఏవిధంగా ప్రభావం చూపిస్తుందని అడుగగా..' ఇషాంత్‌ శర్మ విషయంలో ఇదివరకు ఏం జరిగింది.. ఏం జరుగబోతుంది, కెప్టెన్సీ విషయాలపై మాట్లాడను' అని కోహ్లి అన్నాడు. ఎవరూ అడుగక ముందే కోచ్‌పై స్పందించనని చెప్పిన కోహ్లి.. కొద్దిసేపాగి టీమ్‌ మెంటర్‌గా రవిశాస్త్రి వైపు నా మొగ్గు అని చెప్పాడు. భారత్‌కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడంపై కోహ్లి నేరుగా సమాధానం ఇవ్వలేదు. 

08:47 - September 10, 2015

యు.ఎస్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా టైటిల్‌ దిశగా సాగుతోంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా స్విస్‌ పార్ట్‌నర్‌ మార్టినా హింగిస్‌తో కలిసి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సానియా జోడి వరుస సెట్లలో విజయం సాధించింది. చైనీస్‌ తైపీ జంట యుంగ్‌ జన్‌ చాన్‌, హవో చింగ్‌ చాన్‌లపై 7-6 (7-5), 6-1తో సానియా, హింగిస్‌ జోడి గెలుపొందింది. తొమ్మిదో సీడ్‌ జన్‌ చాన్‌, చింగ్‌ చాన్‌లు తొలి సెట్‌లో గట్టి పోటీనిచ్చారు. దీంతో తొలి సెట్‌ నువ్వా నేనా అన్న ట్లుగా సాగింది. టైబ్రేక్‌లో 7-5తో పైచేయి సాధించిన సానియా జోడి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో సెట్‌లో సానియా జోడికి ఎదురే లేకుండా పోయింది. 6-1తో ఏకపక్షంగా రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సానియా జోడి సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఫైనల్‌ బెర్త్‌ కోసం సాని యా, హింగిస్‌లు 11వ సీడ్‌ ఎరానీ, పన్నెట్టాలతో తలపడనున్నారు.

08:42 - September 10, 2015

                      అమెరికా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నెం.1 సెరెనా విలియమ్స్‌ క్యాలెండర్‌ స్లామ్‌కు మరింత దగ్గరైంది. క్వార్టర్‌ఫైనల్స్‌లో అక్క వీనస్‌ విలియమ్స్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో సెరెనా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 6-2, 1-6, 6-3తో సెరెనా సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన అక్కాచెల్లెల్ల పోరు ఎలాంటి సంచలనం లేకుండా ముగిసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సెరెనా విలియమ్స్‌ అక్క వీనస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సెరెనా పవర్‌ గేమ్‌తో చెలరేగగా..పాయింట్లు సమర్పిం చుకోవటం తప్ప వీనస్‌ చేసేదేమీ లేకపోయింది. తొలి సెట్‌ను 6-2తో చేజిక్కించుకున్న సెరెనాకు రెండో సెట్‌లో వీనస్‌ షాకిచ్చింది. ఒక్క మ్యాచ్‌ పాయింట్‌ మాత్రమే సాధించిన సెరెనా 1-6తో రెండో సెట్‌ను కోల్పోయింది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్‌లో సెరెనా పవర్‌ చూపించింది. వేగ వంతమైన సర్వ్‌, ఏస్‌లతో రెచ్చిపోయింది. సెరెనా పవర్‌, స్పీడ్‌ను వీనస్‌ అందుకోలేదు. 6-3తో మూడో సెట్‌ను కైవసం చేసుకున్న సెరెనా.. సెమీఫైనల్స్‌ లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌ యు.ఎస్‌ ఓపెన్‌ కూడా నెగ్గితే 1988 తర్వాత క్యాలెండర్‌ స్లామ్‌ సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలుస్తుంది. కాగా సెమీఫైనల్స్‌లో రాబర్టా విన్సీ తో వరల్డ్‌ నెం.1 సెరెనా విలియమ్స్‌ తలపడనుంది.

08:40 - September 10, 2015

హైదరాబాద్ : నేడు 'ఐరాస' ఆత్మహత్యల నివారణ దినోత్సవం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వాలను హత్యలు చేసుకునే విధంగా పిడికిలి బిగించాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వాలపై రైతులు తమ తడాఖా చూపించాల్సిన అవసరం వుందా? నేడు వ్యవసాయ రంగం నష్టదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా మారిందా? కారణాలు ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న భద్రత రైతుకు ఎందుకు లేదు? భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడే 52శాతం ప్రజానీకానికి 14 శాతం ఆదాయం మాత్రమే వస్తోందా? రైతులు పిడికలుబిగిస్తేనే ప్రభుత్వాలు మారతాయి. మౌలికంగా వ్యవసాయ విధానమే మారాలి. రాజకీయ పార్టీలు అనవసర విమర్శలు చేయకుండా మౌలిక అంశాలపై ఏకాభిప్రాయంతో పోరాడాలని నాగేశ్వర్ సూచించారు. బీహార్ ఎన్నికల నగారా మోగింది. పార్టీల బలాబలాలు, బలహీనతల పై చక్కటి విశ్లేషణ చేశారు. నాగేశ్వర్ చేసిన ఆ విశ్లేషణను మీరూ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:35 - September 10, 2015

విజయ్, శ్రుతిహాసన్‌, హన్సిక హీరో హీరోయిన్లుగా, శ్రీదేవి మరో ముఖ్య పాత్రలో ఎస్‌.కె.టి స్టూడియోస్‌ పతాకంపై చింబుదేవన్‌ దర్శకత్వంలో సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ తెలుగు, తమిళం,  హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌ మీడియా ప్రై.లి.బ్యానర్‌పై సి.శోభ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ మాట్లాడుతూ, 'తెలుగులో 'తుపాకి' ఘనవిజయం సాధించి నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే 'జిల్లా' చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ సినిమాకు కూడా నాకొక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్‌ చింబుదేవన్‌ ఈ చిత్రాన్ని చాలా హై రేంజ్‌లో తీశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది' అన్నారు. 'తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్న ఈ చిత్రంతో తెలుగులో మంచి రీ ఎంట్రీ అవుతుందని భావిస్తున్నాను' అని శ్రీదేవి తెలిపారు. నిర్మాత సి.శోభ మాట్లాడుతూ, 'ఈనెల 19న శిల్పకళావేదికలో 'పులి' ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 
 

08:30 - September 10, 2015

తేజ దర్శకత్వంలో దీపక్‌, దక్ష జంటగా శ్రీ రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర ప్రసాద్‌ నిర్మించిన 'హోరాహోరి' చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం తేజ మీడియాతో ఎమోషనల్ గా మాట్లాడారు. ''జయం' సినిమా తర్వాత నా మీద ప్రేమ కథలు తీస్తాడనే ముద్ర పడింది. నేను ఎలాంటి ప్రేమ కథలు తీసినా 'తేజ మళ్ళీ 'జయం' సినిమానే తీస్తున్నాడు' అని అంటున్నారు. అయితే ఈ సినిమాని కూడా మళ్ళీ 'జయం' సినిమాలాగే తీశా. కాని నేను అన్ని రకాల చిత్రాలు చేస్తాను. కథ పరంగా ఈ సినిమాకు ఎక్కువగా వర్షం అవసరం కావడంతో కర్నాటకలోని ఆగుంబే ప్రాంతంలో చిత్రీకరించాం. కాని అక్కడ కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో ప్రత్యేకంగా రెయిన్‌ మిషన్‌ని తయారు చేయించి, కేవలం 54రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. అంతేకాదు ఈ చిత్రాన్ని అతి తక్కువగా 20 మందితోనే షూటింగ్‌ చేశాం. అలాగే సినిమా ఫోర్త్‌ వాల్‌ స్టైల్‌లో విడ్త్‌ ఎక్కువగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు రియల్‌ లైఫ్‌ డ్రామాలా అనిపిస్తుంది. దీంతోపాటు ఈ చిత్రంలో చాలా ప్రయోగాలు చేశాం.
పెద్ద పెద్ద సినిమాలన్నీ, హాలీవుడ్‌ భారీ హిట్‌ చిత్రాలన్నీ ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలే. కాని ఇక్కడ ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు కలిసి సినిమా ఎంత ఉండాలో నిర్ణయిస్తున్నారు. సినిమా మేకర్స్‌ కూడా అదే మాయలో పడి అసలు సినిమాను చంపేస్తున్నారు. మనం తీసే కథలో దమ్ముంటే, సరైన ఏమోషన్స్‌ క్యారీ చేయగలిగితే, ప్రేక్షకుడు ఎంత నిడివి ఉన్నా చూస్తాడు. ప్రస్తుతమంతా సినిమాలతో మనీ మేకింగ్‌ ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నారు. నేను ఎక్కువగా సమాజంలో జరిగే సంఘటనల నుంచే ఇన్‌స్పైర్‌ అవుతాను. ఇకపై వరుసగా సినిమాలు తీసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తీయ బోతున్నాను. కమల్‌ హాసన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దానికింకా సమయం పడుతుంది. ఈ చిత్రంలో కథ పరంగా ప్రేమ కోసం పోరాటం చేస్తే, నేను మాత్రం దర్శకుడిగా సక్సెస్‌ కోసం పోరాటం చేస్తున్నాను'' అని తెలిపారు. 

08:15 - September 10, 2015

'మగధీర'తో టాలీవుడ్ లో బిగ్ హిట్ సాధించి.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు లేక సతమతమవుతున్న రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ 'బ్రూస్ లీ ద ఫైటర్ ' కోసం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. ఈ మూవీ పబ్లిసిటీ కోసం మెగాస్టార్ తో పాటు ఫవర్ స్టార్ ఇమేజీని కూడా వాడేస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న 'బ్రూస్‌ లీ ద ఫైటర్‌' చిత్రానికి మరో సరికొత్త సర్‌ప్రైజ్‌ జతకానుంది. ఈ చిత్రానికి పవనకళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ఓకే చెప్పారని సమాచారం. ఇప్పటికే ఈచిత్రంలో ఓ పదినిమిషాల పాటు చిరంజీవి సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే చిత్రానికి పవన్‌కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించడమనేది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్త సర్‌ప్రైజ్‌లతో 'బ్రూస్‌ లీ ద ఫైటర్‌' పబ్లిసిటీ పరంగా మంచి హైప్‌ సొంతం చేసుకుంది. ఏకధాటిగా షూటింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయదశమి కానుకగా విడుదల కానుంది. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇమేజీ ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. 

 

08:04 - September 10, 2015

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరువుతో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు కన్నీరు పెడితే దేశానికే అరిష్టమని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. ఆత్మహత్య పై స్వామినాథన్ కమిటి, జయంతి ఘోష్ కమిటీలు అనేక సూచనలు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదు? రాజకీయాలకు అతీతంగా రైతు ఆత్మహత్యలను చూడాల్సిన అవసరం లేదా? రైతు రుణ మాఫీ కంటి తుడుపు చర్యగా.. వడ్డీలకే సరిపోతుంది. ఇద్దరు సీఎంలు హైటెక్కు హంగులు ఆపి రైతుల పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి రైతు ఆత్మహత్యల నివారణకు చర్చించాల్సిన అవసరం లేదా? బ్యాంకులు రుణ సౌకర్యాన్ని రైతులకు అందడం లేదని మంత్రి పోచారం చెప్పారు. మరి కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు తయారు చేస్తున్న వారి పై ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వాలు గిట్టుబాటు ధరను ఎందుకు నిర్ణయించడం లేదు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశం బాగుపడదు. అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం పెడుతున్నారా? రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? భవిష్యత్ అవసరాల దృష్ట్యానే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారా? చంద్రబాబు భూ బకాసురుడుగా మారిపోతున్నాడా? ప్రైవేటు యాజమాన్యానికి, కార్పొరేట్ కంపెనీలకు భూమిని కట్టబెట్టడానికి చంద్రబాబు భూమిని సేకరిస్తున్నాడా? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రిటైర్డ్ న్యాయవాది , మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, బిజెపి నేత విల్సన్, టిడిపి నేత సాంబశివరావు, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మేకలను అమ్ముకున్న ఎస్సై, ఇద్దరు హోగార్డుల సస్పెన్షన్

నల్గొండ : మేకలను అమ్ముకున్న సంస్థాన్ నారాయణపురం ఎస్సై, ఇద్దరు హోంగార్డులను ఎస్పీ విక్రమ్ జిత్ సస్పెండ్ చేశారు. విచారణలో నిజం తేలడంతో ఎస్పీ పోలీసులపై వేటు వేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది...

కర్నూలు : గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 18 వ జాతీయ రహదారిపై కుందూ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదనీటి ధాటికి కర్నూలు - తిరుపతి నగరాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలో పలు చెరువుల్లోకి నీరు చేరింది.

ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ కు భారీగా వచ్చిన అభ్యర్థులు...

మెదక్ : సంగారెడ్డిలో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీకి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. కనీస సౌకర్యాలు లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ముషీరాబాద్ టిఆర్ ఎస్ నేత అదృశ్యం...

హైదరాబాదు: టీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జీగా పనిచేసిన ప్రముఖ వ్యాపారి ఆగిరి వెంకటేశ్ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇదివరలో వాసవి క్లబ్ అధ్యక్షుడిగానూ వ్యవహరించిన వెంకటేశ్ ఫైనాన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు ముషీరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు ఇంతవరకు ఏ ఒక్క చిన్న క్లూ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.  

నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో చోరీ

ఖమ్మం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బోనకల్ దగ్గర చైన్‌లాగిన దుండగులు దోపిడికి పాల్పడినట్లు సమాచారం. మహిళల నుంచి దుండగులు 12 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి

అనంతపురం : ఇసుక లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లింబగల్లు వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

నెల్లూరు జిల్లాలో టీచర్ కిడ్నాప్ కలకలం

నెల్లూరు :దొరవారిసత్రం మండలం ఆర్మేనికండ్రిగ సమీపంలో ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని దుండుగులు కిడ్నాప్‌ చేశారు. కారులో వచ్చిన కిడ్నాపర్లు ఉపాధ్యాయుడిని ఎత్తుకెళ్లడంతో ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి కిడ్నాప్‌ ఎందుకు జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ప్రసంగించిన కేసీఆర్

హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక కోణాలను ఆవిష్కరించారు. హైద్రాబాద్ విశిష్టతను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వనం పలికారు. ఆర్ధిక సదస్సు వచ్చే సమావేశాలను హైద్రాబాద్ లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనలకు సదస్సు నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు.

 

07:08 - September 10, 2015

హైదరాబాద్ : విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణ వ్యవహారాలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధాని ప్రాంతానికి కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపుపై జవహర్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ.. ఈ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు అవసరమైన నివాస వసతి కల్పనపై దృష్టి సారించాలన్నారు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న పైలాన్‌ను రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా, తెలుగు ప్రజల వైభవానికి ప్రతీకగా రూపొందించాలని, పైలాన్‌ ఉన్న ప్రాంతాన్ని చక్కని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధాని నగరం అమరావతికి నాలుగు వరుసల రహదారులను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధాని శంకుస్థాపన ముహూర్తమైన అక్టోబరు 22వ తేదీ దగ్గర పడుతున్నందున భూసమీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కార్మికులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం నర్సరీల పెంపకం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు.

ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంపు.......

ప్రస్తుతం 3 టీఎంసీలున్న ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్‌ ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం ఈ నెల 21, 22 తేదీల్లో సింగపూర్‌ వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో విమాన పార్కింగ్ స్టాండ్లను 16కు విస్తరించాలని నిర్ణయించారు. పోర్టు నుంచి నేరుగా జాతీయ రహదారికి వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించనున్నారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసమీకరణను పూర్తి చేయాలని నిర్ణయించారు. 

07:06 - September 10, 2015

హైదరాబాద్ : నిజాం కర్కశంపై కత్తి దూసిన వీరనారి.. దొరల దౌర్జన్యాలపై ఎదురు తిరిగి.. గడీల ఆగడాలపై జరిగిన దండయాత్రలకు దన్నుగా నిలిచిన ధీర వనిత. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన మహా ఉద్యమానికి ఊపిరూలూదిన పోరు గీతిక. బాంచెన్‌ దొరా అనే బతుకును తరిమెయ్యడానికి.. బరిగీసి నిలిచిన చురకత్తి.. చాకలి ఐలమ్మ. నేడు ఆ ధీరవనిత 30వ వర్ధంతి.

పాలకుర్తిలో కాంస్య విగ్రహావిష్కరణ .......

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు.. నిజాంను ఎదిరించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ. నేడు ఐలమ్మ 30వ వర్ధంతి సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో సాయంత్రం 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పది వామపక్ష పార్టీల నేతలు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంతో పాటు అనేకమంది యోధులు, కళాకారులు పాల్గొననున్నారు.

వెయ్యి దీపాలను వెలిగిద్దాం.. కోటి గొంతులను వినిపిద్దాం..........

సాయుధ పోరాట యోధుల త్యాగాలను వివరిస్తూ అరుణోదయ, ప్రజానాట్యమండలి కళాకారులు పెద్ద ఎత్తున శౌర్యయాత్రను నిర్వహించనున్నారు. వెయ్యి దీపాలను వెలిగిద్దాం... కోటి గొంతులను వినిపిద్దామన్న నినాదంతో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న దుర్గ్యనాయక్‌, జైనీ మల్లయ్యగుప్తా, కందిమల్ల ప్రతాపరెడ్డిలు కూడా పాల్గొననున్నారు. విగ్రహావిష్కరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సీపీఎం జిల్లా కమిటీ నేతలు తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మల్లు స్వరాజ్యం ఆవిష్కరించనున్నారు. సాయుధ పోరాటంలో నిజాం పాలనపై పోరాటం చేసిన ఎంతోమంది వీరుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వామపక్ష పార్టీలు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. 

26 నుండి గుంటూరులో జగన్ దీక్ష

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జగన్ ఏపీ నేతలతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో దీక్ష చేపట్టాలని జగన్ ఇంతకుముందు నిర్ణయించారు. అయితే 17న వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు దీక్ష తేదీని 26కు వాయిదా వేసుకున్నారు.

07:01 - September 10, 2015

విజయవాడ : మచిలీపట్నం బందరు పోర్టు వ్యవహారం రణరంగాన్ని తలపిస్తోంది. ఏపీ రాజధాని తుళ్లూరు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందనుకుంటుండగానే, బందరు పోర్టు భూముల కుంపటి రాజుకుంటోంది. పోర్టుతో పాటు.. పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్ వెలువడడంతో తీరంలో అలజడి రాజుకుంటోంది.

సాగు భూముల విషయంలో సర్కార్‌ దూకుడు.....

ఏపీ రాజధాని భూములు.. విశాఖ ఎయిర్‌పోర్టు.. మచిలీపట్నం బందరు పోర్టు నిర్మాణం.. పేరు ఏదైనా ఏపీ సర్కార్‌ రైతుల భూముల విషయంలో మొండిగా ముందుకెళ్తోంది. అభివృద్ధి పేరు చెప్పి.. రైతుల్లో అలజడి రేపుతోంది. పచ్చని సాగు భూములను బలవంతంగా తీసుకుంటూ ఏకపక్షంగా ముందుకెళ్తోంది. తాజాగా బందరు పోర్టుతో పాటు పరిశ్రమల కోసం వెలువడిన భూసేకరణ నోటిఫికేషన్‌.. రైతుల్లో అలజడి రేపుతోంది. బందరు పోర్టు నిర్మాణం కోసం 4,800 ఎకరాలు కావాల్సి ఉన్నా.. సర్కార్‌ మాత్రం అవసరానికి మించి భూములను సేకరించాలని ప్రయత్నిస్తోంది. మరో 12 వేల ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

భూసేకరణను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని......

పోర్టు భూముల విషయంలో రైతులతో ఇప్పటికీ సంప్రదింపులు పూర్తికాలేదు. ఇంతలోనే పరిశ్రమల కోసం భూ సేకరణ అనడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. పొలాలు, స్థలాలే కాకుండా ఇళ్లు, వాకిళ్లు కోల్పోతామనే బాధ రైతులకు నిద్రపట్టకుండా చేస్తోంది. సర్కార్‌ భూసేకరణకు సిద్ధమవడాన్ని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటు భూసేకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాసంఘాలు అలుపెరగకుండా పోరాడుతున్నాయి.

భూసేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్న రైతులు...

భూసేకరణ నోటిఫికేషన్‌ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో.. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భూసమీకరణ కింద భూములిచ్చే వారికి అమరావతి తరహాలో మంచి ప్యాకేజీ ఇస్తామని రైతులకు హామీ ఇస్తున్నారు. పోర్టు సిటీని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. సర్కార్‌ తీరును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలవంతంగా భూములను తీసుకోవద్దని డిమాండ్‌ చేస్తోంది.

బందరులో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పి. మధు పర్యటన...

బందరుపోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సిపిఎం అలుపెరగని ఉద్యమం చేస్తున్నాయి. భూసేకరణ నిర్ణయాన్ని ఏపి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పి. మధు బందర్‌ పోర్ట్‌లో నేడు పర్యటించనున్నారు. ఆందోళనలో ఉన్న రైతుల్లో ధైర్యం నింపేందుకు మధు ప్రయత్నిస్తున్నారు.

 

06:57 - September 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. డీఏను 3.1 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో.. ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

06:55 - September 10, 2015

హైదరాబాద్ : సముద్రంలోకి కలిసే గోదావరి నీళ్లు ఇప్పుడు కృష్ణమ్మలోకి కలిసేందుకు పరుగులు పెడుతోంది. మరో 4 రోజుల వ్యవధిలో కృష్ణ చెంతకు గోదావరి నీరంతా చేరబోతోంది. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వలోకి వదిలిన నీరంతా ఇప్పుడు పశ్చిమ-కృష్ణా జిల్లాలకు అత్యంత సమీపంలోని పెదవేగి మండలం జానంపేట అక్విడెక్ట్ వద్ద ముందుకు సాగుతోంది. ఇక్కడ గోదావరి జలాలకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున సంబరాలు జరిగాయి. ప్రభుత్వ విఫ్ చింతమనేని ప్రభాకర్, పశ్చిమ కలెక్టర్ కాటంనేని భాస్కర్ కుడి కాల్వలోకి దిగి పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి కృష్ణాజిల్లా వైపు గోదావరి నీటిని సాగనంపారు.

పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలు .....

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణాడెల్టాకు వరప్రసాదం కానుంది. తాటిపూడి ఎత్తిపోతల పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరేందుకు పరుగులు పెడుతోంది. దీనిద్వారా కృష్ణాడెల్టాలో నాలుగు జిల్లాల పరిధిలోని 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. ఏటా నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదలచేసి కృష్ణాడెల్టాకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నా..డెల్టాకు సరిపడా నీరందకపోవడంతో..పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ఈనెల 15న పట్టిసీమ నీటివిడుదలకు ముహూర్తం.......

పట్టిసీమ నుంచి గోదావరి జలాలు పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణాడెల్టాకు వచ్చే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన నీటి విడుదలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.ఈ ఏడాది మార్చి 29న పట్టిసీమకు పునాది రాయి వేసినా..కేవలం 120 రోజుల్లోనే 4.2 కిలోమీటర్ల నిడివి పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్ చరిత్రలో ఇదొక రికార్డు.150 రోజుల వ్యవధిలో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తిచేశారు. తొలిదశలో 6పైపుల ద్వారా నీటిని పూర్తిగా తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో 350 క్యూసెక్కుల నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టిసీమ పూర్తికావడంతో కృష్ణాడెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

06:51 - September 10, 2015

హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు... 5 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

అక్టోబర్ 12న తొలి దశ పోలింగ్....

తొలి దశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 12న జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్‌ 16న వెలువడుతుంది. నామినేషన్లకు చివరి తేదీ సెప్టంబర్‌ 23. సెప్టెంబర్ 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సెప్టెంబర్ 26. తొలి దశలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

రెండో దశలో 32 స్థానాలకు ఎన్నికలు.....

రెండో దశలో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాయి. ఇందుకోసం సెప్టెంబర్ 21న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 28. నామినేషన్ల పరిశీలన 29వ తేదీ జరుగుతుంది. ఉపసంహరణకు గడువు అక్టోబర్ 1. పోలింగ్ అక్టోబర్ 16న నిర్వహిస్తారు.

మూడోదశలో 50 స్థానాలకు ఎన్నికలు.....

మూడోదశలో 50 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ అక్టోబర్ ఒకటిన విడుదలవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 8. తొమ్మిదో తేదీన నామినేషన్ల పరిశీలిస్తారు. ఉపసంహరణకు గడువు అక్టోబర్ 12. పోలింగ్ అక్టోబర్ 20న జరుగుతుంది.

నవంబర్ ఒకటిన నాలుగోదశ పోలింగ్.....

నాలుగోదశ పోలింగ్ నవంబర్ ఒకటిన నిర్వహిస్తారు. 55 స్థానాలకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 14. 15వ తేదీ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17.

నవంబర్ ఐదున చివరి దశ పోలింగ్......

చివరి దశ పోలింగ్ నవంబర్ ఐదున జరుగుతుంది. మొత్తం 57 స్థానాలకు అక్టోబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 15. నామినేషన్ల పరిశీలన 17న జరుగుతుంది. ఉపసంహరణకు గడువు అక్టోబర్ 19. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలూ తీసుకోనున్నట్లు వెల్లడించింది. 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 243 స్థానాలకు... ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితాలు నవంబర్ 8న వెల్లడిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా... సున్నిత ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన మేర కేంద్ర బలగాలు వినియోగించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

06:47 - September 10, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో పలు అంశాలపై చర్చించిన మంత్రివర్గం స్పెక్ట్రం, కరువుభత్యం, బంగారం బాండ్ల పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యం 119 శాతానికి చేరుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.

బంగారం బాండ్ల పథకానికి కేంద్రం ఆమోదం.....
2015-16 బడ్జెట్‌ ప్రతిపాదన మేరకు బంగారం బాండ్ల పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. బంగారం ధరకు సమానంగా బాండ్లు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2, 5, 10 గ్రాముల లెక్కన బాండ్ల జారీ చేయనున్నారు. బాండ్‌ కాలపరిమితి 5 నుంచి ఏడేళ్లుంటుంది. బంగారం బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బంగారం స్థానంలో అదే విలువకు బాండ్లు కొనుగోలు చేయవచ్చని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

టెలికం సంస్థలకు ఊతమిచ్చే దిశగా.....

టెలికం సంస్థలకు ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం చర్యలు చేపట్టింది. వినియోగంలో లేని స్పెక్ట్రం కొనుగోలుపై విధివిధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగంలో లేని స్పెక్ట్రమ్ కొనుగోలు లేదా అమ్మకానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానంతో కాల్ డ్రాప్ సమస్యలు తగ్గనున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సమ్మతించింది.

06:43 - September 10, 2015

హైదరాబాద్ : వినాయక చవితి దగ్గరకొస్తోంది. హైదరాబాద్ తో పాటు అనేక పట్టణాల్లో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వమూ, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో భారీ వినాయక విగ్రహాలు రూపొందించి, వాటికి రకరకాల రంగులు వేయడం వల్ల పర్యావరణపరంగా అనేక సమస్యలు తలెత్తుతున్నమాట నిజం. వినాయక పూజకు మట్టి విగ్రహాలనే వాడాలంటూ అనేక సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్ లోని సంఘ మిత్ర వాకింగ్ ఫౌండేషన్ కూడా కొంతకాలంగా మట్టి వినాయకులు ప్రాధాన్యతను వివరిస్తూ అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. మట్టి వినాయకుల ఆవశ్యకత, వినాయక విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, వివిధ రసాయనాలు, రంగులు వాడడం వల్ల కలిగే అనర్ధాల గురించి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సంఘ మిత్ర ఫౌండేషన్ నేత ప్రొఫెసర్ వెంకటదాసు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:41 - September 10, 2015

హైదరాబాద్ : మనం చేసుకునే చాలా పండుగలకీ, ప్రక్రుతికీ అవినాభావ సంబంధం వుంది. ప్రక్రుతిని ప్రేమించడం, చెరువులను, కుంటలను, అరుదైన, ఔషధ గుణాలున్న వ్రుక్ష జాతులను కాపాడుకోవడం కొన్ని పండుగల్లోని విశిష్ట లక్షణం. అయితే, రానురాను పండుగల, ఉత్సవాలలో అసలు స్పూర్తి లోపించి, పై పై పటాటోపాలు పెరగడం బాధాకర పరిణామం. ఇందుకు చక్కటి ఉదాహరణ గణేష్ ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు వీధివీధిన కొలువుదీరే బొజ్జగణపయ్యలు చూడముచ్చటైన రూపాల్లో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి.

పదిహేను వేలకు పైగా విగ్రహాలు కొలువుదీరబోతున్నాయి......

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఓ అపురూప, అపూర్వ ఘట్టం. హైదరాబాద్ లో పదిహేను వేలకు పైగా విగ్రహాలు కొలువుదీరబోతున్నాయి. ఇక విఘ్నేశ్వరుడి ఆరాధించే ప్రతి ఇంటిలోనూ మరికొన్ని వేల సంఖ్యలో విగ్రహాలు పూజలందుకోబోతున్నాయి. అయితే, ఒకప్పుడు బొజ్జగణపయ్యలను పూర్తిగా మట్టితోనే తయారుచేసేవారు. వాటిని పూజించిన అనంతరం సమీపంలోని చెరువులోనో, కుంటలోనూ నిమజ్జనం చేసేవారు. అయితే, కాలక్రమంలో మట్టి విగ్రహాల వాడకం తగ్గి, భారీ సెట్టింగ్ లు, కళ్లు మిరుమిట్లు గొలిపే వివిధ రకాల రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేయడం ఒక క్రేజ్ గా మారింది. అయితే కొంతమంది ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం పర్యావరణానికి ముప్పు తెస్తోంది.

రసాయనాల రంగులు నీళ్లలో కలిసి, జల కాలుష్యానికి ......

నిమజ్జనం చేసిన లంబోదురడి విగ్రహాల తాలుకు రసాయనాల రంగులు నీళ్లలో కలిసి, జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. నిమజ్జనం అనంతరం వినాయక విగ్రహాల అవశేషాలను తొలగించడం శక్తికి మించిన భారంగా మారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం మొత్తం పర్యావరణానికే ముప్పు తెస్తోంది. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన అనేకమంది ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు మట్టివినాయకుల ఆవశ్యకతను వివరిస్తూ, ప్రచారం నిర్వహించడం, మట్టి వినాయకులను పంపిణీ చేయడం ఓ మంచి పరిణామం. ఈ స్ప్రుహ మనలో మరింత వెల్లివిరియాలి. జల కాలుష్యానికి తావులేకుండా, పర్యావరణానికి హాని కలుగని రీతిలో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడమే ఇప్పుడు మనందరి బాధ్యత. విజ్జుల, పర్యావరణవేత్తల మాటలను ఇప్పుడు మనం పెడచెవినపెడితే, మనం భవిష్యతులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక పారిశ్రామిక వ్యర్థాలు, పరిశ్రమలు వెదజల్లే రసాయనాల కారణంగా అనేక జల వనరులు కలుషితమయ్యాయి. హైదరాబాద్ లో మూసీ నది ఎంత ఘోరంగా తయారైందో మనం చూస్తూనే వున్నాం. ఆ బాధలు అనుభవిస్తూనే వున్నాం. ప్రమాదాలు తెలిసి కూడా వినాయక విగ్రహాల తయారీలో మితిమీరిన రంగులను , ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను అనుమతిద్దామా? ఎవరికీ ఏ హానీ కలగని రీతిలో మట్టి వినాయకుల విగ్రహాల ప్రతిష్టించుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. 

నగరంలో మూడు నెలల పాటు నిషేధాజ్ఞలు

హైదరాబాద్ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ప రిధిలో నిషేధాజ్ఞలు జారీచేస్తూ సీపీ సి.వి.ఆనంద్‌ బుధ వా రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 10 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలి పారు. ఐదుగురికి మించి అధికంగా గుమి కూడడం, ప్ర దర్శనలు చేయడంపై ఆంక్షలున్నట్టు పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న చర్యకు ప్రజలు సహకరించా లని ఆయన కోరారు. 

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3శాతం డిఏ పెంపు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144శాతం డీఏ పెంచుతూ సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం ఉద్యోగులు పెరిగిన డీఏ అందుకునేందుకు వీలు కల్పిస్తూ వినాయకచవితి కానుకగా జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు డీఏ బకాయిలు అందుకోనున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6% పెంపు

న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్రమోదీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) ఆరుశాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రస్తుతం 113శాతం ఉన్న కరువు భత్యం 119 శాతానికి పెరిగింది. ఈ పెంపు వల్ల 50లక్షల మంది ఉద్యోగులు, 56లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

Don't Miss