Activities calendar

13 September 2015

22:35 - September 13, 2015

టెన్ టివి నిర్వహించిన 'వన్ టు వన్ విత్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్సీ టిడి.జనార్ధన్ తో వన్ టు వన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్ధన్ తన రాజకీయ జీవిత విశేషాలను తెలిపారు. ఎపి రాజధాని నిర్మాణం, ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేకోప్రత్యేక ప్యాకేజీ, భూసేకరణ, భూసమీకరణ వంటి పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:24 - September 13, 2015

హైదరాబాద్ టీవీ స్టూడియోలో హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ సర్వసాధారణం. వాద ప్రతివాదాలతో వక్తలు స్టూడియో వాతావరణం వేడెక్కిస్తారు. ఒక్కోసారి కొట్టుకుంటారేమో అనిపిస్తుంది. అన్పించటం కాదు ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో అదే జరిగింది. మాటల తూటాలతో పాటు చెంపదెబ్బలు, పిడి గుద్దులకు వేదిక అయింది. లైవ్‌లో దేశమంతా చూస్తోంది అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు వక్తలు.

వివాదానికి దారి తీసిన ఇద్దరు ఆధ్యాత్మిక ప్రతినిధుల చర్చ.....
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఇద్దరు ఆధ్యాత్మిక ప్రతినిధుల చర్చ వివాదానికి దారి తీసింది. చివరికి ఇద్దరూ ఆవేశంతో కొట్టుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషుడు. హాట్‌హాట్‌గా డిబేట్ జరుగుతున్న సమయంలో సహనం కోల్పోయి గొడవ పడటం ఇప్పుడు దేశమంతా సంచలనం అయ్యింది.

రాధేమా వ్యవహారం పై....

దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన రాధేమా వ్యవహారం ఓ ప్రయివేటు ఛానెల్‌ వారు నిర్వహించిన చర్చలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హిందూ మహాసభకు చెందిన ఓమ్‌ జీ, మరో మహిళా ఆధ్యాత్మిక గురువు దీపా శర్మ మధ్య మాటా మాటా పెరిగింది. రాధేమాపై వచ్చిన ఆరోపణలను సదరు ఓమ్‌ జీ స్వామీ ఖండిస్తూ దీపాశర్మపై వ్యక్తిగత విమర్శలు చేశారు.

ఓమ్‌ జీ స్వామి చెంప ఛెళ్లు మనిపించిన దీపా శర్మ....

దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన దీపా శర్మ, ఓమ్‌ జీ స్వామి చెంప ఛెళ్లు మనిపించారు. సదరు స్వామీజీ సైతం దీపా శర్మపై ప్రతి దాడికి దిగారు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఇదంతా లైవ్‌ షోలో దేశమంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఛానెల్ వారు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అంటూ ప్రకటన చేశారు.

22:09 - September 13, 2015

మెదక్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కారణం ఆంధ్రాపాలకులే అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. 60 ఏళ్ల పాలనలో నీళ్ల గురించి ఆలోచన చేయలేదని... ఎపి గురించే ఆలోచన చేశారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.

21:54 - September 13, 2015

ప్రకాశం : జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరులో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కృష్ణారావు, వలేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకట్రావు కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు. రైతులు తమ అప్పులు తీర్చుకునేందుకు ఒక్కో రైతుకి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానమి భరోసా ఇచ్చారు.

21:50 - September 13, 2015

కర్నూలు : జిల్లాలోని డోన్‌లో దారుణం జరిగింది. వైఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు రాజేష్‌ గొంతు కోసి దుండగుడు పరారయ్యాడు. ప్రస్తుతం రాజేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

21:47 - September 13, 2015

ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకప్పుడు.. అడుగు ముందుకు వేయాలి... ఆ మొదటి అడుగు నాదే ముందుగా ఎందుకు కాకూడనుకుంది ఓ యువతి.. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఆడుకుంటున్న కీచకుడి భరతం పట్టింది. దెబ్బకు దెబ్బ తీసింది. ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఆ నీచుడిని కటకటాల వెనక్కి నెట్టింది. ఆ యువతే జనని.. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విద్యార్థి జనని, తల్లి శృతి, పోలీస్ అధికారి పాల్గొని, మాట్లాడారు. అన్ నోన్ ఫ్రెండ్ రిక్వెస్టు యాక్సెప్ట్ చేయొద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య రిలేషన్ బాగా ఉండాలన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు అర్ధగంట సమయం స్పెండ్ చేయాలని సూచించారు. పిల్లలకు సమస్యలు వస్తే.. వారు తల్లిదండ్రులకు చెప్పే విధంగా క్లోజ్ గా ఉండాలని చెప్పారు. ఏం జరిగినా వెంటనే తల్లిదండ్రులకు వెంటనే చెప్పాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:52 - September 13, 2015

వరంగల్ : మతోన్మాద గాలి విస్తున్న తరుణంలో ఎర్రజెండాలకు అనుంబంధ సంఘం ఏఐఎస్ఎఫ్ జేఎన్టీయూ ఎన్నికల్లో గెలువడం శుభపరిణామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ అన్నారు. జెఎన్టీయూలో విద్యార్థి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఏఐఎస్ఎఫ్ నేత అధ్యక్షుడుగా గెలుపోందారు. దీన్ని హర్షిస్తూ కాకతీయ యూనివర్సిటీలో స్వీట్లు పంచుకుని సంబరాలు జరిపారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వలీఉల్లాఖాద్రీ డిమాండ్ చేశారు. 

20:47 - September 13, 2015

తూర్పుగోదావరి : పిడింగొయ్యి గ్రామంలో దళితులపై సాంఘిక బహిష్కరణ విధించిన ఓ సామాజిక వర్గానికి చెందిన పెద్దలపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కారెం శివాజీ డిమాండ్ చేశారు. జిల్లాలోని రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామంలో దళితులపై సాంఘిక బహిష్కరణకు పిలుపునిచ్చిన పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలని కారెం శివాజీ ఆమరణ దీక్ష చేపట్టారు. వారం రోజులుగా పిడింగొయ్యి గ్రామంలో సాంఘిక బహిష్కరణ జరగడం దారుణమని ఆయన మండిపడ్డారు. గ్రామంలో ఐదు నెలల క్రితం దళితులు ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఓ సామాజిక వర్గానికి చెందినవారు పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు. దళితులకు నిత్యావసర వస్తువుల విక్రయాలను కూడా వ్యాపారులు నిలిపివేశారు. పొలాల్లోకి కూలీ పనులకు పిలవడం కూడా మానేశారు.

 

20:41 - September 13, 2015

కరీంనగర్‌ : తెలంగాణ రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుల బాధ తాళలేక ఓ రైతు కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు గోపగోని మల్లేషం ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిపంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తిపంట పూర్తిగా ఎండిపోయింది. పత్తి పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. దీనికి తోడు భార్య రాజేశ్వరి, కూతురు కూడా వికలాంగురాలు కావడంతో కుటుంబ పోషణ మల్లేషంకు కష్టంగా మారింది. కౌలుకు చెల్లించిన మొత్తము.. పెట్టిన పెట్టుబడి కలిపి దాదాపు 2 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన మల్లేషం.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్‌ చేశారు.

 

20:39 - September 13, 2015

హైదరాబాద్ : రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి నేతృత్వంలో "రైతు సంక్షేమం-తెలంగాణ రాష్ట్రం"పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. అలాగే చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ.కోదండరామ్‌ సహా పలువురు ప్రజా సంఘాల, రైతుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రెస్ క్లబ్ లో ముగిసిన రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ : నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన "రైతు సంక్షేమం తెలంగాణ రాష్ట్రం"పై రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. తెలంగాణ జాగృతి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీ.జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ సహా పలువురు ప్రజా సంఘాల, రైతుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

20:23 - September 13, 2015

కడప : విద్యా, ఉపాధిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని డీవైఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు విమర్శించారు. కడప నగర ఆరో మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహాసభలో యువతరం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రధానంగా విద్యా, ఉపాధిని యువతరానికి అందించటంతో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకరావాలంటున్న సీఎం చంద్రబాబు..యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్ట్‌లు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థలో మార్పు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

 

20:17 - September 13, 2015

కర్నూలు : రాయలసీమపై ఏపీ సర్కార్‌ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీలో ఉన్నప్పుడే 4.3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని బెరెడ్డి తప్పుబట్టారు. శ్రీశైలం నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ పేరు చెప్పి పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తీసుకుళ్ళే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

 

కర్నూలు జిల్లా డోన్ లో దారుణం...

కర్నూలు : జిల్లాలోని డోన్ లో దారుణం జరిగింది. దుండగులు.. రాజేష్ అనే నాలుగేళ్ల బాలుడి గొంతుకోసి పరారాయ్యారు. బాలుడి పిరిస్థితి విషమంగా ఉంది. రాజేష్ ను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

20:01 - September 13, 2015

విజయవాడ : విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలుపర్చడం లేదని కేంద్ర మాజీ హోమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. విజయవాడలో జరిగిన డాక్టర్.బీఆర్ అంబేద్కర్ 152 వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో...రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నో అంశాలను చేర్చామన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టాలను అమలు పర్చడంలో.. ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.

 

19:54 - September 13, 2015

గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలంలో మందకృష్ణ దీక్ష భగ్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో తన దీక్షను అడ్డుకుని అరెస్ట్‌ చేయడంపై మందకృష్ణ ఫైర్‌ అయ్యారు. ఇందుకు నిరసనగా మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. దళితులు, పేదలకు న్యాయం జరగాలని దీక్ష చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని మండిపడ్డారు. జగన్‌, పవన్‌ల ఆందోళనకు అనుమతితో పాటు రక్షణ కల్పించిన బాబు సర్కార్‌...తన దీక్ష విషయంలో భిన్నంగా వ్యవహరించడం దారుణమన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా దళితుల వాణి వినిపిస్తే తప్పా..? అని ప్రశ్నించారు.

 

19:45 - September 13, 2015

హైదరాబాద్ : హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని... మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బేవరేజేస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హమాలీలకు ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెరుపల్లి కోరారు.

 

19:34 - September 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులను అవమాన పరుస్తోందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత చావుల్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలను తిట్టడం మానుకుని... అన్ని గ్రామాల్లో తిరిగి రైతుల సమస్యలను తెలుసుకోవాలని... టీఆర్ఎస్‌ నేతలకు వీహెచ్‌ సూచించారు. 

19:18 - September 13, 2015

కృష్ణా : విజయవాడలో ఓనమ్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేరళ రాష్ట్రానికి పవిత్రమైన పండగ కావడంతో...వేలాది మంది కేరళ రాష్ట్ర వాసులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అయితే కేరళలో రెండు రోజుల కిత్రం ఈ ఓనమ్ ఉత్సవాలు జరిగాయి. విజయవాడలో ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల కోసం నగరంలో కేరళ వాసులు ఓ క్లబ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అన్నిమతాలకు కులాలకు అతీతంగా ఈ క్లబ్ ఉంటుందని విజయవాడ కలెక్టర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. అందరికి ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.

 

19:15 - September 13, 2015

హైదరాబాద్ : గోడౌన్‌లలో అక్రమ నిలువలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సీపీఐ భారీ ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. అక్రమ నిలువలను బయటకు తీయాలని సీపీఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ చేశారు. అంతకంటే ముందే అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ప్రచారం కల్పిస్తామన్నారు. ఎక్కడైనా...గోడౌన్లలో అక్రమ నిలువలు ఉన్నట్టు తెలిస్తే..గోడలు బద్దలు కొట్టైనా...ధాన్యాన్ని బటయకు తీస్తామని హెచ్చరించారు.

 

19:07 - September 13, 2015

ఖమ్మం : ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నేత నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. రుణమాఫీ సక్రమంగా అమలు కాకపోవడం సమస్యగా మారిందన్నారు. వేలాది మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం వాటిని వక్రీకరిస్తోందని మండిపడ్డారు. రుణమాఫీలో విడుదలైన మొత్తాన్ని బ్యాంకులు వడ్డీలుగా జమ చేసుకొంటున్నాయని, వెంటనే పూర్తిస్థాయి మాఫీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలన్నారు.

 

18:57 - September 13, 2015

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు బాధిత గ్రామం కొంగవానిపాలెంలో కలెక్టర్ ఎంఎం నాయక్ పోలీసుల భద్రత మధ్య పర్యటించారు. గ్రామస్తులు కలెక్టర్ ను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు అబివృద్ధి జరుగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రయత్నం చేశాడు. ఎయిర్ పోర్టు వద్దంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. మాటలతో మోసం చేయొద్దని గ్రామస్తులు అన్నారు. దీంతో కలెక్టర్ నాయక్ వెనుదిరిగారు.  

కలెక్టర్ ను అడ్డుకున్న కొంగవానిపాలెం గ్రామస్తులు..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు బాధిత గ్రామం కొంగవానిపాలెంలో కలెక్టర్ ఎంఎం నాయక్ పర్యటించారు. గ్రామస్తులు కలెక్టర్ ను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు అబివృద్ధి జరుగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రయత్నం చేశాడు. ఎయిర్ పోర్టు వద్దంటూ గ్రామస్తులు నినాదాదులు చేశారు. మాటలతో మోసం చేయొద్దని గ్రామసస్థులు అన్నారు. దీంతో కలెక్టర్ నాయక్ వెనుదిరిగారు.  

18:45 - September 13, 2015

విజయవాడ : బలవంతపు భూసేకరణ ఆపాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఎం ఎపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు లేఖ రాశారు. రాజధాని పేరుతో సేకరించిన భూముల్ని కార్పొరేట్లకు కేటాయించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ల్యాండ్ బ్యాండ్ విధానానికి స్వస్తి చెప్పాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలన్నారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో సేకరించిన భూములు నిరుపయోగంగా ఉంటే తిరిగి రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

సీఎం చంద్రబాబుకు మధు లేఖ...

విజయవాడ : బలవంతపు భూసేకరణ ఆపాలంటూ చంద్రబాబుకు సీపీఎం ఎపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు లేఖ రాశారు. రాజధాని పేరుతో సేకరించిన భూముల్ని కార్పొరేట్లకు కేటాయించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ల్యాండ్ బ్యాండ్ విధానానికి స్వస్తి చెప్పాలని సూచించారు. 

ఎంఆర్ పిఎస్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

గుంటూరు : జిల్లాలోని మంగళగిరిలో చేపట్టిన ఎంఆర్ పిఎస్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మందకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.  

పౌర వసతులు, మౌలికసదుపాయాలపై చంద్రబాబు సమీక్ష

విజయవాడ : నగరంలో పౌర వసతులు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, అధికారులు పాల్గొన్నారు.

 

17:51 - September 13, 2015

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో నిర్వహిస్తున్న బిగ్‌ మారథాన్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. రెచ్చిపోయిన యువకులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు యువకులపై లాఠీచార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

 

17:41 - September 13, 2015

మహబూబ్‌నగర్‌ : రైతుల ఆత్మహత్యలు, కరవు పరిస్థితులను టిఆర్‌ఎస్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జమిస్తాపూర్‌ గ్రామంలో పత్తి చేను ఎండిపోయిందన్న బాధతో పొలంలో ఉరివేసుకుని చనిపోయిన చెన్నమ్మ అనే మహిళా రైతు కుటుంబాన్ని పలువురు జిల్లా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు. రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

17:36 - September 13, 2015

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు తొలగించిన ఆంధ్ర ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లు ఉద్యోగుల జేఏసీ నేత సురేంద్ర తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రోడ్డు పాలైన 1 వెయ్యి 2 వందల 52 మంది ఉద్యోగులను అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా తొలగించిన విద్యుత్‌ ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

17:29 - September 13, 2015

హైదరాబాద్ : రైతు రుణమాఫీ వర్తించని కౌలు రైతులకు రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ.. రైతు సంఘం నాయకులు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వినతి పత్రం అందజేశారు. పోగాకు రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని దాదాపు 2 వేల దరఖాస్తులు మంత్రికి అందజేశారు. రైతు రుణమాఫీకి కౌలు రైతులు ఎవరైతే అర్హులో వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి నీర్మలా సీతారామన్‌తో మాట్లాడి.. పోగాకు రైతులకు న్యాయం చేస్తామన్నారు.

 

17:00 - September 13, 2015

వరంగల్ : రూపాయి ఖర్చు లేకుండా పేదలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్‌ జిల్లాలో మంత్రులు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌ దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు సిలిండర్లు, స్టౌవులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.  

16:57 - September 13, 2015

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌తో వెల్లువలా వ్యక్తమవుతున్న ప్రజాగ్రహానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చవిచూడాల్సి వచ్చింది. పోర్టు భూసేకరణ చేపట్టే గ్రామాల ప్రజలను, రైతులను కలిసేందుకు రఘువీరారెడ్డి కోన గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు, తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్‌ నేతలతో వాదనలకు దిగారు. తమ గ్రామంలో సమావేశం పెట్టేందుకు వీల్లేదని, వెంటనే వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఒక దశలో రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులపై రాళ్లు, మట్టిపెళ్లలు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జీ చేసి జనాన్ని చెల్లాచెదురు చేశారు. అయినా గ్రామస్తులు వెనక్కి తగ్గడకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో రఘవీరారెడ్డి, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లారు.

 

16:55 - September 13, 2015

తిరుపతి : తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 6ఎల్‌-1 దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ప్రొటో కాల్ పరిధిలోని ప్రముఖలకు 6ఎల్‌-1 దర్శన టికెట్లను విక్రయిస్తారు. అయితే పాకాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తితోపాటు మరో ముగ్గురు ముఠాగా ఏర్పడి... తిరుపతి ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లను పొందారు. సాధారణంగా 6 ఎల్ -1 టిక్కెట్ ధర రూ.500 ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఒక్కో టిక్కెట్ ను రూ. 10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈనేపథ్యంలోనే రూ.70 వేలకు హైదరాబాద్‌ భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయిస్తున్నారు. ఈక్రమంలో కానిస్టేబుల్‌ తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

16:40 - September 13, 2015

కృష్ణా : విజయవాడలో ఓటర్‌ ఐడీ కార్డుల కలకలం రేగింది. రోడ్డు పక్కన ఓటర్‌ ఐడీ కార్డులు కుప్పలు కుప్పులుగా పడివున్నాయి. 3 నియోజకవర్గాలకు చెందిన కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 10 వేలకు పైగా ఓటరు కార్డులను కుప్పులుగా పోశారు. అధికారులు లోతైన విచారణ చేపట్టారు. అయితే ఓటరు కార్డులను ప్రజలకు అందించకుండా ఈ విధంగా రోడ్డుపై పోయడాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒక వేల ఈ కార్డులను ఉగ్రవాదులు ఉపయోగించుకుంటే అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశాలున్నాయని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండ గడుతున్నారు.

 

బ్లాక్ లో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

తిరుమల : వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 6ఎల్-1 దర్శన టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. 

విజయవాడలో రోడ్డు పక్కన భారీగా ఓటర్ కార్టులు లభ్యం..

విజయవాడ : రోడ్డు పక్కన భారీగా ఓటర్ కార్టులు లభ్యం అయ్యాయి. మూడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ కార్డులు లభించాయి. అధికారులు విచారణ జరుపుతున్నారు. 

మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

విజయవాడ : పొగాకు సంక్షోభం, రైతుల స్థితిగతులపై మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు రైతులను ఆదుకునే అంశంపై సమీక్షిస్తున్నారు.

 

గాంధీ ఆస్పత్రిలో పవర్ కట్.. రోగి మృతి..?

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రోగి అనిల్ మృతి చెందాడు. అయితే ఆస్పత్రి వర్గాలు ధృవీకరించలేదు. మృతుడు అనిల్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వాసిగా గుర్తించారు. 

హామీలు ఒక్కొక్కటిగా అమలు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వ్యవసాయం సంక్షభంలో ఉందన్నారు. భారత్ లో పెట్టుబడులకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయని తెలిపారు. జీఎస్ టీ బిల్లుకు కాంగ్రెస్ సహకరిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. బిల్లులో అనుమానాలుంటే చర్చించాలి కానీ.. అడ్డుకోవద్దని హితవు పలికారు. బీహార్ లో బీజేపీ దే విజయమని జోస్యం చెప్పారు.

 

గాంధీలో పవర్ కట్ ?

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్న ఓ రోగి మృతి చెందినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించడం లేదు.  

ఏపీ కాంగ్రెస్ నేతలకు ఘోర పరాభవం..

కృష్ణా : బందరు (మం) కోనలో కాంగ్రెస్ నేతలకు పరాభావం ఎదురైంది. బందరు పోర్టు కోసం బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా సభ పెట్టేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి సభలు పెట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిపై గ్రామస్తులు తిరగబడ్డారు. కాంగ్రెస్ నేతలపై ఇసుకతో దాడి చేశారు. 

విజయనగరంలో బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటన..

విజయనగరం : జిల్లాలో ఆదివారం బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటించింది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎంపీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ తో పాటు పలువురు బీజేపీ నేతలున్నారు.

 

సుంకేశుల జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేత..

మహబూబ్ నగర్ : వడ్డేపల్లి మండలంలోని రాజోలి శివారులో ఉన్న సుంకేశుల జలాశయం నుండి ఆదివారం నీటిని విడుదల చేశారు. 

వరల్డ్ రెజ్లింగ్ లో నర్సింగ్ యాదవ్ కు కాంస్యం..

హైదరాబాద్ : ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో నర్సింగ్ యాదవ్ కు కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 

13:38 - September 13, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లా గద్వాల ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందును అపహరించేందుకు యత్నించిన యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. డెలీవరి కోసం వావిలాల గ్రామానికి వచ్చిన ఓ మహిళ గద్వాల్ ఏరియా ఆసుపత్రికి వచ్చింది. అయితే పసిపిల్లల వార్డులోకి అర్థరాత్రి ఆజాద్‌ అనే వ్యక్తి చొరబడ్డ పుట్టిన పసికందును అపహరించేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఆజాద్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఆజాద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

13:35 - September 13, 2015

నిజామాబాద్ : జిల్లా వాసులను కల్తీ కల్లు కాటేస్తోంది. కృత్రిమ కల్లుకు బానిసలుగా మారిన కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ రోడ్లపై చిందులేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో మానసిక నిపుణులు వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తుకోసం వినియోగించే అల్ఫాజోలం, డైజోఫాం తదితర రసాయనాల్ని పూర్తిగా తగ్గించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వైద్యులు చెప్తున్నారు. మత్తుకు బానిసైన వారికి కల్లులో మత్తు పదార్థాలు లేకపోవడంతో వారి మెదడుపై తీవ్ర ప్రభావం పడి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారని వైద్యులు చెప్తున్నారు. కల్తీ కల్లును పూర్తిస్థాయిలో నియంత్రిస్తే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయోచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు.  

13:32 - September 13, 2015

హైదరాబాద్ : అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ లో ఆదివారం ఉదయం దొంగలు హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ చేతులో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. అందులో లక్ష రూపాయలున్నాయని బాధిత మహిళ పేర్కొంది. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన పద్మావతి తన కుమారుడికి ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్లో దిగింది. టీ తాగి అల్వాల్ బస్టాప్‌కు వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె దగ్గరున్న బ్యాగ్ దోచుకెళ్లారు. వెంటనే బాధితురాలు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష రూపాయలు తస్కరించడం పట్ల ఆమె కన్నీరుమున్నీరైంది. 

13:28 - September 13, 2015

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో ఆదివారం మధ్యాహ్నాం కలకలం రేగింది. ఓ మూడేళ్ల బాలికలకు సూది ఇచ్చేందుకు ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఇతడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వణుకు పుట్టిస్తున్న సూదీగాడు బంజారాహిల్స్ లో ప్రత్యక్షమయ్యాడని..అతను పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్త దావానంలా వ్యాపించింది. ఇందిరానగర్ లో ఆదివారం మధ్యాహ్నాం ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికకు సూదీ ఇచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీనిని గమనించిన ఫణీ అనే యువకుడు ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే సూదీగాడు ఫణీని గాయపరిచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు ఆ సూదీగాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సూదీగాడు హిమాయత్ నగర్ లో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న సురేష్ అని తెలుస్తోంది. ఇతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని సమాచారం. పట్టుకున్న వ్యక్తిని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు దగ్గరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. 

13:21 - September 13, 2015

బిడ్డను లాలించే ఆ చేతులకు.. హద్దు మీరితే శిక్షించడమూ తెలుసు. కరుణ కురిపించే ఆ కనులకు క్రోధంతో కన్నెర్ర చేయడమూ తెలుసు. అంటూ స్త్రీ గురించి క్షమయా ధరిత్రీ కవితను శిల్పీకరించిన కవయిత్రి శైలజాబండారి. ఆమె ఇటీవల చేతి చివర ఆకాశం అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు. కవి సంగమం నుండి ఎగసిపడిన కొసమెరుపుల కవితా రసతరంగం శైలజ బండారి పరిచయ కథనం.

13:20 - September 13, 2015

బతుకు పోరులో సంతసించాల్సిన విషయాలేవీ లేనపుడు పాట ఒక ఊరట. ఊటలన్నీ అడుగంటినపుడు ప్రజల కన్నీటి ధారల ఊట పాట. అలాంటి పాటలను పోరు బాటలో ఎర్రెర్రని జెండాలుగా ఎగరేసిన గేయ రచయిత పయిలం సంతోష్. తెలంగాణా వాగ్గేయ కారుడు, గేయ రచయిత పయిలం సంతోష్ ను నేటి జనం పాటలో ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి పరిచయం చేస్తున్నారు.

13:19 - September 13, 2015

సాహిత్యం సమాసాన్ని సమూలంగా మార్చేస్తుందా? మార్చక పోవచ్చు కాని మనిషిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. మానవ సమూహాలను కదిలిస్తుంది. వినోదం, విజ్ఞానంతో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. సామాజిక పురోగమనానికి దోహదం చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో మన మధ్యన ఉన్నారు. రాయలసీమలోని బహుజనుల బతుకు చిత్రాలను రైతుల వ్యథార్థ గాథలను కథలుగా అల్లిన, కథన శిల్పి సుంకోజి దేవేంద్రాచారి. ఆయన రాసిన కథలు నవలలు సీమ జీవితానికి అద్దం పడతాయి. ఆయన కథల నేపథ్యాన్ని, వాటిలోని శిల్ప సౌందర్యాన్ని గురించి ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య పరిచయం.

13:17 - September 13, 2015

మిస్టర్ బీన్...వేల కోట్ల నవ్వుల ప్రపంచానికి రారాజు...ఆ అమాయకత్వం మనల్ని నవ్విస్తుంది...ఆ వెరైటీ చూపులు నవ్వుల పువ్వులు పూయిస్తాయి..ఒక్క మాటలో చెప్తే ...అతనే ఒక ఎటిఎన్..అవును ...ఎనీ టైం నవ్వులు..మిస్టర్ బీన్.. పిల్ల చేష్టలతో రకరకాల సమస్యలను ఫన్నీగా ఎదుర్కొనే పెద్ద వాడు. ఆ ప్రాబ్లం సోల్విన్గ్ క్రమం చూస్తే మనలోని అసహనం కాస్త నవ్వుగా మారి బయటకు పారిపోతుంది. అతను అమాయకుడా...అంటే అవును అనే చెప్పాలి. అతను అల్లరివాడా...అంటే కూడా ఎస్ అనాలి..అతను ఓ సరదా...ఓ సంచలనం..పాతికేళ్ళ పాత వాడైనా ఇవ్వాల్టికి కొత్త నవ్వులు పుట్టిస్తాడు..అందుకే క్లీన్ కామెడీ కి కింగ్ మిస్టర్ బీన్.

1990 జనవరి 1న ప్రసారం..
మిస్టర్ బీన్ ...లండన్ ఐటీవీలో 1990 జనవరి 1 నుండి ప్రసారమైన కామెడీ ఎపిసోడ్ ల ధారావాహికం. మొత్తం 14 ఎపిసోడ్ ల ఈ ధారావాహిక సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మిస్టర్ బీన్ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ పేరు 'రోవాన్ అట్కిన్సన్'. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్వీన్స్ కాలేజీ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతుండగా అతనే మిస్టర్ బీన్ క్యారక్టర్ ని సృష్టించాడు 1987 లో కెనడా లో జరిగిన జస్ట్ ఫర్ లాఫ్స్ కామెడీ ఫెస్టివల్ లో ఈ క్యారెక్టర్ ని తొలిసారి ప్రేక్షకుల ముందు ట్రయల్ రన్ చేసాడు.

మిస్టర్ బీన్ లో 'రావన్ అట్‌కిన్‌సన్' టైటిల్ రోల్‌..
మిస్టర్ బీన్ అతి తక్కువ మాటలు మాట్లాడతాడు. కామెడీ అంటే పంచ్ డైలాగ్స్ అన్న సెన్స్ లో ఉన్న వాళ్లకు అతి తక్కువ మాటలు మాటాడి నవ్వు తెప్పించవచ్చు అని పాతికేళ్ళ క్రితమే చాటి చెప్పాడు మిస్టర్ బీన్. సందర్భానికి తగ్గట్టు స్పందించడం లేని సమస్యని సృష్టించుకుని బాధపడటం అనక ఆ సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చెయ్యడం ఇదే మిస్టర్ బీన్ సిరీస్ లోని కథా కమామిషు. మిస్టర్ బీన్ లో 'రావన్ అట్‌కిన్‌సన్' టైటిల్ రోల్‌ను పోషించారు. ఈ పాత్రను విభిన్న తరహాలో ఉండేవిధంగా అట్‌కిన్‌సన్, రాబిన్ డ్రిస్కాల్, రిచర్డ్ కర్టిస్, బెన్ ఎల్టన్ సంయుక్తంగా రచించారు. లండన్‌‌లో ప్రసారమైన ఈ సీరీస్‌ను ఐదేళ్లలో దాదాపు రెండు కోట్ల మందిని అలరించిందని సమాచారం. మిస్టర్ బీన్ తాకిడితో అటు ఫీచర్ ఫిల్మ్‌లకు, యానిమేటెడ్ కార్టూన్లకు పెద్ద దెబ్బపడింది. మిస్టర్ బీన్ క్రేజ్ ఎలా ఉందంటే ఆ క్యారక్టర్ ని పెట్టుకుని ఎన్నో అనిమేషన్ సీరీస్ లు ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చాయి. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. మిస్టర్ బీన్ బెస్ట్ ఫ్రెండ్ టెడ్డీబేర్. ఈ బొమ్మ ముదురు బ్రౌన్ రంగు, బటన్ ఐస్‌తో ఉంటుంది. మిస్టర్ బీన్ ప్రతి పనిలోనూ టెడ్డీ కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మిస్టర్‌బీన్‌కి ప్రతిరూపం టెడ్డీ అని చెప్పవచ్చు. అలాగే మిస్టర్‌బీన్స్ కార్ కూడా ఈ షోలో హైలైట్. మిస్టర్‌బీన్ కార్ టాప్‌పై చెయిర్‌లో కూర్చొని, ఇల్లు తుడిచే కరత్రో కారును నడపడం, పార్కింగ్ ప్లేస్ కాదని ఎంట్రెన్స్‌లోనే కార్ పార్క్ చేయడం. ఇలాంటి ఎన్నో క్యారెక్టర్ల ద్వారా మిస్టర్ బీన్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీరూ పిల్లల్లా మారి సంతోషంగా ఉండటానికి ఒకసారి మిస్టర్ బీన్‌ను కలవండి. వర్రీలన్నీ తుర్రుమంటాయి. 

అమ్మకానికి వచ్చిన బీన్ ఉపయోగించిన కారు..
మిస్టర్ బీన్ ఉపయోగించిన కార్లలో ఓ పాపులర్ కారు అమ్మకానికి వచ్చింది. రోవన్ అట్కిన్సన్ దాదాపు రెండు సార్లు యాక్సిడెంట్ చేసిన మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్‌కారును చివరకు అమ్మేయాలని బీన్ నిర్ణయించుకున్నాడు. ఈ కారును 5.40 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. ఈ కారు మరమ్మత్తుల కోసం ఆయన బాగానే ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కారును 80 లక్షల పౌండ్లకు విక్రయించాలని నిర్ణయించారు. గతంలో ఈ కారు రిపేరు కోసం ఆయన ఏకంగా 9 లక్షల పౌండ్లను వెచ్చించారు. ఈ కారుకు రెండు సార్లు మరమ్మత్తులు చేసినప్పటికీ, దీని విలువ మాత్రం ఇంత భారీగా పలకడానికి కారణం దీనిని మిస్టర్ బీన్ ఉపయోగించడమే. పశ్చిమ లండన్‌లోని టేలర్ అండ్ క్రాలే అనే ప్లేస్‌లో ఈ కారును విక్రయించనున్నారు. మెక్‌లారెన్ ఎఫ్1 కారులో 6.1 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 241 మైళ్లు. ఇది కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ మెక్‌లారెన్ కారులో మూడు సీట్లు ఉంటాయి. ఇందులో డ్రైవర్ మధ్య సీటులో కూర్చొని డ్రైవ్ చేస్తాడు. వెనుక సీట్లలో ఇద్దరు ప్యాసింజర్లు కూర్చోవచ్చు.

నవ్వకుండా ఉండలేం...
రాత్రి పది గంటల నుంచి పదిన్నర వరకు పోగో ఛానల్‌ను చూడండి. అందులో శారీరకంగా ఎదిగినా, దానికి తగినట్టుగా ఎదగని చిన్నపిల్లల మనస్తత్వం గల ఓ వ్యక్తి కనిపిస్తాడు. చేతిలో చాక్‌లెట్ కలర్ ఉన్న టెడ్డీబేర్.. అతను చేసే రకరకాల పిల్ల చేష్టలు.. అవి చూసి మనం నవ్వకుండా ఉండలేం. ఇక పిల్లలైతే టీవీకే అతుక్కుపోతారు. నిద్రపొమ్మని చెప్పినా అతను వారిని తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాడు. అమాయకత్వం, అతితెలివి చేష్టలతో నవ్విస్తుంటాడు. అతనే మిస్టర్ బీన్. చానల్ మారిస్తే పిల్లల కోపానికి పెద్దలు కామ్ అయ్యే టైమ్ ఇదే అని ఒప్పుకోకతప్పదు. అది మిస్టర్ బీన్ మాయా జాలం. పాతికేళ్ళు కాదు ఇంకో 2 శతాబ్దాలైనా మిస్టర్ బీన్ నవ్వులు పంచుతూ ఉంటాడు. నవ్వుతో నవ్విస్తూ మిస్టర్ బీన్ రికార్డులు సృష్టిస్తూనే ఉంటాడు.

సిలిండర్ మృతులకు పరిహారం పెంచిన సీఎం చౌహాన్..

మధ్యప్రదేశ్ : బజువాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పెంచారు. రూ. పది లక్షలు ఇస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు. శనివారం ఉదయం రెస్టారెంట్లో జరిగిన పేలుడు వల్ల 104 మంది కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

శ్రీవారి లడ్డూల కుదింపు...

చిత్తూరు: తిరుపతిలో అదనపు లడ్డూల విక్రయాలను అధికారులు కుదింపు చేశారు. అదనపు లడ్డూల కోటాను 25వేల నుండి 15వేలకు తగ్గించారు. ముందస్తు సమాచారం లేకుండా లడ్డూల కుదింపు చేపట్టడం పట్ల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొండ సముద్రంలో ప్రజా సంఘాల ఆందోళన...

ప్రకాశం : కొండ సముద్రంలో ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాయి. రైతు కుటుంబాన్ని పరామార్శించేందుకు వచ్చిన పొగాకు సూపరింటెండెంట్ జయచంద్రరెడ్డి ఆర్ఎం రత్నసాగర్ ను రైతు సంఘం నేతలు నిర్భందించారు. 

13:13 - September 13, 2015

చెన్నై : ప్రముఖ ప్యాషన్ డిజైనర్ సిడ్నీ స్లేడన్ నిర్వహించిన బ్రేకవే ఫ్యాషన్‌ షో అదిరిపోయింది. నీరాస్ డిజైన్ స్టుడియో 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త డిజైన్లతో ప్యాషన్ షోని నిర్వహించారు. ఈ షోలో ప్రఖ్యాత మోడళ్లు ర్యాంప్‌పై తళుక్కుమనింపిచారు. ముఖ్యంగా మోడళ్ల క్యాట్ వాక్‌లు, మధ్యలో సినీతారల తళుక్కులు షోకు ప్రధానాకర్షణగా నిలిచాయి.14 మంది అంతర్జాతీయ మోడళ్లు 3రౌండ్లుగా నిర్వహించిన ఈ ప్యాషన్ షో చెన్నైలోని పేజ్ త్రీ పీపుల్‌కి కొత్త కిక్‌నిచ్చింది. ప్రముఖ సినీ నటులు త్రిష, శ్రియ, సమంత, సోనియా అగర్వాల్, రమ్యకృష్ణ ఈ షోలో సందడి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత మోడల్ షీతల్ మల్హర్, కరోల్ గార్సియాలు స్లేడన్ డిజైన్లతో ర్యాంప్ పై అందాలను ప్రదర్శించటం ప్యాషన్ షోకి హైలెట్‌గా నిలిచింది. 

13:12 - September 13, 2015

నిజామాబాద్ : హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య స్థితిగతులపై సర్కారు చేస్తోన్న వ్యాఖ్యలు.. వివాదాస్పదమవుతున్నాయి. లింబయ్య ఆర్థిక పరిస్థితి బావుందని... ఆయన పొలంలో పంటలు ఎండిపోలేదని... ఆయనకు అప్పులే లేవని.. పైగా బ్యాంకుల్లో లక్షకు పైగా బ్యాలెన్సు ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి అన్నీ బావుంటే లింబయ్య ఎందుకు ప్రాణాలు తీసుకుంటాడు..? ఆయన కుటుంబ సభ్యుల వేదనకు అర్థమే లేదా..? ఇంతకీ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవమెంత..?

వాస్తవాలేంటీ ?
రాజధాని నడిబొడ్డున అన్నదాత లింబయ్య ఆత్మహత్యతో అప్రతిష్ట పాలైన తెలంగాణ సర్కారు వాటిని కప్పిపుచ్చుకునేందుకు అబద్దాలాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి వాస్తవాలు వక్రీకరిస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డికి చెందిన లింబయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? దీనిపై ప్రభుత్వ నిర్ధారణలేంటి..అసలు వాస్తవాలేంటి.?

మంత్రి మాటలు పచ్చి అబద్ధం..
లింబయ్యకు అసలు అప్పుల్లేవని సాక్షాత్తు మంత్రిగారు సెలవిస్తున్న మాట పచ్చి అబద్ధమని కుటుంబ సభ్యులే కాదు స్వగ్రామం రామారెడ్డిలో ఎవర్ని అడిగినా చెబుతారు. లింబయ్య ఒక సాదాసీదా రైతు. ఆరు ఎకరాల్లో కుమారులకు పంచగా లింబయ్యకు మిగిలింది ఎకరమే. వృద్ధ తల్లిదండ్రులు, భార్య లక్ష్మీ, కుమారులు నరేశ్‌, నవీన్‌, కూతురు నవిత ఉన్నారు. ఇద్దరూ పెళ్లీడుకొచ్చారు. పెద్ద కొడుకు నరేశ్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. లింబయ్య భార్య వ్యవసాయ పనులతోపాటు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు బీడీలు చుడుతుంది. ఎకరా పొలంలో సోయాబీన్ పంట ఎండిపోయింది. ఇదే సమయంలో లింబయ్య పెద్ద కుమారుడు నరేష్ అనారోగ్యం పాలయ్యాడు. పంటల కోసం, కొడుకు ఆరోగ్యం కోసం దాదాపు 8 లక్షలు అప్పు చేశాడన్నది కుటుంబ సభ్యుల వాదన. మరి అప్పులే లేవని ప్రభుత్వం చెప్పడం బాధ్యతారాహిత్యమన్న విమర్శలొస్తున్నాయి.

లింబయ్యకు పెన్షన్ రావడం లేదు..
మంత్రి చెప్పినట్టు లింబయ్యకు రుణమాఫీ కాలేదని స్థానికులు చెబుతున్నారు. సహకార బ్యాంకులో 50 వేల లోన్ తీసుకోగా రుణమాఫి కాలేదంటున్నారు. లింబయ్య తల్లిదండ్రులు, భార్యకు పెన్షన్ వస్తుందన్న మాటా వావస్తమే కాని ఆయనకూ పెన్షన్ వస్తుందనడం వాస్తవం కాదంటున్నారు. లింబయ్య పంట ఎండిపోలేదని పోచారం చెబుతున్నారు. కానీ మంత్రి మాట వాస్తవం కాదని..పొలాన్ని పరిశీలించిన సీపీఐ ఎంఎల్ నేతలు అంటున్న మాట. అంతేకాదు లింబయ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని స్థానిక అధికారుల నివేదికను బట్టి తేల్చేసింది ప్రభుత్వం. అధికారుల రిపోర్ట్ పచ్చి అబద్దమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రైతుల్లో ఆత్మ స్థైర్యం నింపాలి..
ఎండిన పంటలు, పెరిగిన అప్పులు, వ్యవసాయంపై నీరుగారుతున్న ఆశలు లింబయ్యను ఉరికొయ్య మీదకు చేర్చాయి. ప్రతిరోజు ఎందరో లింబయ్య లాంటి రైతులు వ్యవసాయం సంక్షోభంతో ఊపిరి తీసుకుంటున్నారు. వారిలో భరోసా నింపాల్సిన ప్రభుత్వం...ఆత్మహత్యల కారణాలను వక్రీకరించి, వారి కుటుంబ సభ్యుల మనసును మరింత గాయపరుస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల్లో ఆత్మస్థైర్యం నింపి ఆదుకోవాలని కోరుతున్నాయి. 

13:10 - September 13, 2015

గుంటూరు : ఏపీ రాజధానిలో గ్రామ సరిహద్దులు నిర్ణయించడం ఇప్పుడు అధికారులకు పెను సవాలుగా మారింది. 2014 డిసెంబర్‌ 8న తీసిన ఛాయా చిత్రం ఆధారంగా గ్రామ కంఠాలను నిర్ధారిస్తామని.. ప్రభుత్వం గుర్తించిన సరిహద్దులనే గ్రామకంఠాలుగా పరిగణిస్తామని మంత్రి నారాయణ పదేపదే చెప్పారు. దీనిపై అన్ని గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం తలపెట్టిన విధానం కాస్తా బెడిసి కొట్టింది. ఆ తర్వాత జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి కృష్ణాయపాలెం గ్రామకంఠాన్ని పూర్తిచేశారు. ఇంకా 28 గ్రామాల్లో గ్రామకంఠాల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జేసీ మాత్రం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. గ్రామకంఠాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తుళ్లూరు మొదలు.. అన్ని గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న గ్రామ సరిహద్దులను కాదని,..ఏవో ఛాయా చిత్రాలను తీసి వాటినే హద్దులంటే ఒప్పుకునేది లేదని గ్రామస్తులు ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే గ్రామ కంఠాల సమస్యలు ఇప్పటికి తీరేలాగా లేవని చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ కంఠాల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రాజధాని ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను తమకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. 

13:08 - September 13, 2015

హైదరాబాద్ : నాగోల్‌లో వ్యాక్సిన్ చిన్నారి ప్రాణాలు తీసింది.. ఏడాదిన్నర పాప ప్రవణ్యకు అంగన్ వాడీ కేంద్రంలో తల్లిదండ్రులు టీకా వేయించారు. ఆ తర్వాత పాపకు తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్టర్‌ దగ్గరుకు తీసుకువెళ్లి మందులు వాడినా తగ్గలేదు. చివరికి పాప తీవ్ర జ్వరంతో ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది.

13:06 - September 13, 2015

హైదరాబాద్‌ : నగర వాసులు వచ్చే రెండు వారాల పాటు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ఇరుక్కోక తప్పేలా లేదు. వీధివీధినా వెలుస్తున్న గణేశ మండపాలతో.. రహదారులు ఇరుకుగా మారడం.. కొన్ని చోట్ల దారులు బంద్‌ అయిపోవడంతో.. జనం ఇప్పటి నుంచే అవస్థలకు గురవుతున్నారు. వీధివీధినా గణపతి మండపాలు సిద్ధమవుతున్నాయి. నగరంలో ఏటా దాదాపు 70వేల మంటపాలకు పోలీసులు అనుమతినిస్తారు. అయితే.. అనుమతులు లేకుండా నిర్మించేవి, రాజకీయ ఒత్తిళ్లతో ఏర్పాటు చేసేవి.. ఇలా అన్నీ కలిపి దాదాపు లక్షదాకా మంటపాలు ఉంటాయని అంచనా. ఈసారి కూడా ఇంతకు మించిన స్థాయిలోనే మంటపాలు రూపొందుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏర్పాటు చేసే మంటపాల్లో అత్యధికం రోడ్లను బ్లాక్‌ చేసేవే. అనుమతులు పొందేటప్పుడు రోడ్డుకు ఓ పక్కగా మంటపాలను నిర్మిస్తామని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించబోమని చెబుతున్న నిర్వాహకులు అనుమతి రాగానే.. యథావిధిగా రోడ్లను బ్లాక్‌ చేసేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు.

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు..
మంటపాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో పరిశీలించకుండానే పోలీసులు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో రద్దీగా ఉండే రోడ్లపైనా ఇబ్బడిముబ్బడిగా గణేశ మంటపాలు వెలుస్తున్నాయి. దీంతో వచ్చే రెండు మూడు వారాలు ఏ రోడ్డు ఎప్పుడు బంద్‌ అవుతుందో.. ఎక్కడ ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకుంటామో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. అందుకే గణేశ ఉత్సవాలు సాగినన్ని రోజులూ.. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

13:05 - September 13, 2015

ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరు ? కొంచెం నిశితంగా గుర్తిస్తే 'దగ్గుబాటి రానా' అని ఠక్కున చెబుతారు ? మరి ఆయన భుజంపై వాలిపోయిన అమ్ముడు ఎవరో ? చెప్పగలరా ? త్రిష..కాజల్..ఇంకా వేరే..వేరే పేర్లు చెప్పారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వారెవరూ కాదు ? అసలు ఈ ఫొటో ఎవరు తీశారు ? దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి..
ఈ ఫొటోను 'రానా' ట్విట్టర్ లో షేర్ చేశాడు. తన పక్కనున్న ఉన్న ఆ చిన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించాడు. దీనితో చాలా మంది ఎంతో మంది హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా 'బెంగళూరు డేస్ రీమెక్' హీరోయిన్ 'శ్రీ దివ్య' అని చెప్పారు. అనంతరం 'సమంత' ఈ గ్రూప్ లో చేరింది. 'ప్రేమ అన్ని సైజుల్లోనూ..షేఫుల్లోనూ ఉంటుందని' ట్వీట్స్ చేసింది. దీనితో 'రానా' పక్కన ఉన్నది 'సమంత' అని అభిమానులు తేల్చుకున్నారు. ఎందుకంటే 'బెంగళూరు డేస్ రీమెక్' సినిమా తమిళంలో కూడా రీమేక్ అవుతోంది. ఈ తమిళ వెర్షన్ లో 'సమంత' కూడా చేస్తోంది. అదండి విషయం.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య..

చిత్తూరు : తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ సతీమణి సుకేశన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణంగానే సుకేశన ఆత్యహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

సముద్రంలో పడవ బోల్తా..5గురికి గాయాలు..

ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకాల వద్ద సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈఘటనలో ఐదుగురు మృత్స్యకారులకు గాయాలయ్యాయి. 

బీజింగ్ లో సీఎం కేసీఆర్..

చైనా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీజింగ్ లో పర్యటిస్తున్నారు. తియాన్నెన్ స్వ్కేర్ ను సీఎం బృందం సందర్శించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను కూడా సందర్శిస్తారు.

 

ఎలాంటి వివాదాలు లేవు - భూపేంద్ర యాదవ్..

ఢిల్లీ : తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని బీహార్ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. జితన్ రాం మాంఝీతో పార్టీ జరిపిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

బంజారాహిల్స్ లో మూడేళ్ల బాలికకు సూదీ ఇచ్చిన వ్యక్తి..

హైదరాబాద్ : బంజారాహిల్స్ ఇందిరానగర్ లో సూదీగాడు కలకలం సృష్టించాడు. మూడేళ్ల బాలికకు సూది ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:29 - September 13, 2015

హైదరాబాద్ : ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు విద్యావాలంటీర్ పోస్టులకు కూడా పోటీపడలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో నిరాశలో కూరుకుపోతున్నారు దాదాపు లక్షమంది అభ్యర్థులు. ఈ అంశంపై వెంటనే క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ విద్య కోర్సులు చేసిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక... ఆ పరీక్షకు ద్వారం లాంటి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కాక అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. రేషనలైజేషన్, ఉపాధ్యాయ బదిలీల తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల 974 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు అర్హతలు కూడా ప్రకటించి జీవో విడుదల చేసింది. జీతం 8వేలుగా నిర్ధారించింది.

అభ్యర్థులకు టెట్ కష్టాలు..
అయితే విద్యా వాలంటీర్ల పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిబంధన కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు శాపంగా మారింది. రెండేళ్లుగా ఈ పరీక్ష నిర్వహించకపోవడంతో దాదాపు లక్షమంది పోటీలో వెనకబడుతున్నారు. ఉపాధ్యాయ కోర్సులు చదివినా కేవలం టెట్ అర్హత లేక అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ వచ్చే 8వేల జీతంతో తల్లిదండ్రులకు కాస్త ఆసరాగా ఉందామన్నా వీలు కావడంలేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

డీఎస్సీలో టెట్‌కు వెయిటేజీ ఇస్తారా? రద్దు చేస్తారా?..
టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిబంధనలప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలి. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013 సెప్టెంబరులోఈ పరీక్ష జరిగింది. ఆ తర్వాతనుంచి టెట్ గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అటు వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీ సర్కారు ప్రకటించింది. ఈ ఎంట్రన్స్ లో టెట్‌కు వెయిటేజీ ఇస్తారా? లేక ఏపీలోలాగా రద్దు చేస్తారా? అన్న అంశంపై ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో నిరుద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని ఎన్నో ఆశలతో కోర్సులు చేసిన అభ్యర్థులు టెట్ లేక విద్యావాలంటీర్ లాంటి పోస్టులకు పోటీపడలేకపోతున్నారు.. వెంటనే ఈ టెట్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

10:20 - September 13, 2015

విజయవాడ : బెజవాడలో వినాయక చవితి సందడి మొదలైంది. 17వ తేదీన వినాయకచవితి పర్వదినం ఉండడంతో నిర్వాహకులు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాల నిర్మాణంలో ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నారు. భారీ గణనాధులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నాలుగు రోజులే సమయం..
వినాయకచవితి పర్వదినానికి మరో 4 రోజుల సమయమే ఉండడంతో వినాయక విగ్రహల కొనుగోళ్లు బెజవాడలో ఊపందుకున్నాయి. తయారీ కేంద్రాల వద్ద రూపుదిద్దుకున్న గణపతి విగ్రహాల కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నవరాత్రులు జరిగే వినాయక ఉత్సవాలకు నిర్వహకులు మండపాలను భారీస్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. పోటీలు పడి సినిమా సెట్టింగ్‌లను తలపించే రీతిలో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అందమైన సెట్టింగ్‌లతో పాటు రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ఆలయాలను తలపించే రీతిలో రూపొందిస్తున్నారు.

అతి పెద్ద గణపయ్య..
ఖైరతాబాద్‌ మహాగణపతి తర్వాత అతిపెద్ద గణపయ్యను విజయవాడలో తొలిసారిగా ప్రతిష్టిస్తుండటం మరో విశేషం. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో భారీ గణనాథుడు కొలువుదీరనున్నాడు. బెజవాడ డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 63 అడుగుల భారీ విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టారు. అష్టలక్ష్మి, నాట్య మహాగణపతి భారీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఖైరతాబాద్‌లో విగ్రహాన్ని తయారు చేసిన చెన్నైకు చెందిన శిల్పులే దీనిని తీర్చిదిద్దుతున్నారు. 63 అడుగుల భారీ గణపతి చేతిలో 6,300 కేజీల మహాలడ్డూను ఏర్పాటు చేస్తున్నారు.

2014లో 1500 విగ్రహాలు..
గతేడాది కన్నా ఈసారి మండపాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఏ వీధి చూసినా... ఏ వాడ చూసినా వినాయక చవితి ఏర్పాట్లలో జనం నిమగ్నమయ్యారు. మండపాల ఏర్పాటు అనుమతుల కోసం కార్పొరేషన్‌, పోలీసులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. 2013లో నగరంలో 1450 విగ్రహాలు ప్రతిష్టించగా.. 2014లో ఆ సంఖ్య 1500కు చేరింది. ఎప్పటిలానే ప్రకాశం బ్యారేజ్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో రూపొందించిన ప్రతిమల కన్నా.. మట్టి విగ్రహాలు వాడాలంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. 

జబువాకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్..

మధ్యప్రదేశ్ : జబువా ప్రాంతంలో ఓ రెస్టారెంట్ లో చోటు చేసుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రాంతానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 104 మంది దుర్మరణం చెందగా ఎంతో మంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమే - లిపికా మిత్రా..

ఢిల్లీ : న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతిపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే తాను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన భార్య లిపికా మిత్రా ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులకు ఆయన సహకరించాలని, ఆరోపణలు నిజం కాకపోతే ముందుకు వచ్చి ఆయన వివరణ ఇవ్వాలని సూచించారు. గతంలో గృహహింకు పాల్పడుతున్నారంటూ సోమ్ నాథ్ పై ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

జబువాలో స్థానికుల ఆందోళన..

మధ్యప్రదేశ్ : జబువాలో స్థానికులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనలో 104 మంది దుర్మరణం చెందగా ఎంతో మంది గాయపడిన సంగతి తెలిసిందే.

టన్నెల్ లో ఇరుక్కుపోయిన కార్మికులు..

హిమాచల్ ప్రదేశ్ : బిల్సాపూర్ జిల్లాలో ఓ ప్రాంతంలో నిర్మాణమౌతున్న టన్నెల్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ఇరుక్కపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. 

నేడు ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ రోడ్డు దిగ్భందనం..

ఛత్తీస్ గఢ్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. 'చక్క జామ్' పేరిట రోడ్డు దిగ్భందనాలు జరుపనుంది.

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు..

శ్రీశైలం : భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకొనేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

09:58 - September 13, 2015

కేజీ టు పీజీ. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా ఏర్పడడానికి ముందు తెలంగాణలో రాష్ట్ర సమితి అద్భుతమైన నినాదం ఇచ్చింది. బంగారు తెలంగాణ సాకారాంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. అయితే కేజీ టు పీజీ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతోంది ? ప్రభుత్వ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ? ఈ అంశాలపై టెన్ టివి నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, ఉద్యమ నేత, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొని విశ్లేషించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆదివారం సిరిసిల్ల మండలం బద్దెనపల్లిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

నాగోల్ లో చిన్నారి మృతి..

హైదరాబాద్ : నాగోల్ లో ఏడాదిన్నర చిన్నారి లావణ్య మృతి చెందింది. పోలీయో వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

పాలమూరు పరుగులు ప్రారంభం..

మహబూబ్‌నగర్: జిల్లా షాద్‌నగర్‌లో 3కే పరుగు ప్రారంభమైంది. హాకీ మాజీ క్రీడాకారుడు ముకేష్‌కుమార్ ఈ 'పాలమూరు పరుగు'ను ప్రారంభించారు. 

09:26 - September 13, 2015

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌మెట్‌లో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్ పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుండి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8.30గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసులను ప్రశ్నించారు. చింతల్ మెట్ లో ఉన్న 670 నివాసాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 60 మంది అనుమానితలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తప్పించుకుని తిరుగుతున్న ఒక ఛైన్ స్నాచర్ ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పీఎస్ కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి పత్రాలు లేని 50 బైక్ లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

09:19 - September 13, 2015

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని జబువా జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. శనివారం ఉదయం రెస్టారెంట్ లో పేలుడు సంభవించడంతో 104 మంది మృతి చెందగా ఎంతో మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు..కూలీలున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం భారీ స్థాయిలో జరగడానికి రెస్టారెంట్ లో డిటోనేటర్లు ఉండడమే అని తెలుస్తోంది. మరోవైపు ఆదివారం పేలిన సేఠియా రెస్టారెంటును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే పేలుడు అనంతరం పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

09:12 - September 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ, రాయలసీమల్లో ఆదివారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. ఈ రెండింటి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఒక మాదిరి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో పడే ఈ వర్షాలు మంచి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుండడంతో పలు ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, దీనివల్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రదేశాన్ని సందర్శించనున్న ఎంపీ సీఎం..

మధ్యప్రదేశ్ : జబువా జిల్లా కేంద్రంలో పేలిన సేఠియా రెస్టారెంటును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించనున్నారు. 

పురుషుల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెర్బర్ట్, మహూట్ జోడి..

న్యూయార్కు : యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను ఫ్రాన్స్ జోడి హెర్బర్ట్ - మహూట్ లు కైవసం చేసుకున్నారు. ఫైనల్ లో ముర్రే - పీర్స్ జోడిపై 6-4, 6-4 తేడాతో హెర్బర్ట్ - మహూట్ జంట గెలుపొందింది. 

08:56 - September 13, 2015

మనసు కవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి సెప్టెంబర్ 13 . ఈ సందర్బంగా ఆయనపై ప్రత్యేక కథనం..వేదాంతం, తర్కం,మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే ఆత్రేయ. అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి... బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు ... ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .. సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు... మాటలు ఉద్వేగపు ఊటలూరి జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి... అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలు గా భాసిల్లుతున్నాయి.

1921, మే 7న జననం..
ఆత్రేయ గారి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన 'దీక్ష' చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు.

జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు..
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.

గొప్ప వేదాంతి..
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.

1400కిపైగా సినిమా పాటలు..
ఆత్రేయ రాయడం లేట్ చేసినా... ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆత్రేయ 1400కి పైగా సినిమా పాటలు రాశారు. వాటిల్లో 100కి పైగా మనసు పాటలే ఉన్నాయి. మనసు అనే ముడి పదార్ధంతో ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవీ రాయలేదు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి... ''మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.'' అంటూ మాట్లాడి... మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ.

అక్షర నివాళి..
ఆత్రేయుడు అంటే చంద్రుడు. వెన్నెలంత వేడిగా వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు. అరుదైన అక్షరయోగి, మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ. ఆయనకు మరో సారి అక్షరనివాళి అర్పిస్తోంది 10 టివి. 

రివర్స్ దండి యాత్రకు నో..

గుజరాత్ : పటేల్‌ వర్గీయులను ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో ఆదివారం జరగాల్సిన రివర్స్ దండి యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరోసారి అనుమతి నిరాకరించింది. అయితే, ఏది ఏమైనా తమ నిరసన ర్యాలీ జరిపి తీరుతామని హార్దిక్‌ పటేల్‌ ప్రకటించారు. 

08:14 - September 13, 2015

వాషింగ్టన్ : మన షూ సైజు ఎంతుంటుంది. ఇదేం ప్రశ్న ? మన పాదం సైజు ఎంతుంటుందో అంత ఉంటుందని అంటారు అంతేనా ? పాదం సైజు ఎంతుంటుంది అంటే ? ఆ ఆరు లేదా ఎనిమిది ఇంకా అంటే తొమ్మిది అంటారు కదా. కానీ ఒకతని షూ సైజ్ మాత్రం 26. ఆశ్చర్యపోతున్నారు కదా..అవును ఇది నిజం.
ప్రపంచంలోనే అతి పెద్ద 'పాదాలు' కలిగిన వ్యక్తిగా 'జెసన్ ఆర్లాన్డో' రికార్డు సృష్టించాడు. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన స్థానం సంపాదించాడు. వెనిజులా దేశస్థుడైన జెసన్ వయస్సు 20 ఏళ్లు. ఇతని పాదం మామూలుది కాదు. ఏకంగా ఒక్కో పాదం ఒక అడుగు నాలుగు అంగుళాల పొడవుంది (దాదాపు 40 సెంటిమీటర్లు) ఆయన షూ సైజు అక్షరాల 26. ఇతనికి పాదరక్షలను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. అందుకే గిన్నిస్ లో ఎక్కేశాడు.

జేఎన్ యు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

ఢిల్లీ : జేఎన్ యు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏబీవీపీ అభ్యర్థి కుమార్ శర్మ ప్రధాన కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు.

కర్నాటకలో ర్యాలీలో ప్రసంగించనున్న అమిత్ షా..

కర్నాటక : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా మైసూరులో నిర్వహించే ర్యాలీలో ప్రసంగించనున్నారు. 

07:49 - September 13, 2015

టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఈగ' విలన్ గా పరిచయమైన కన్నడ హీరో సుదీప్ అతడి భార్య ప్రియ రాధాకృష్ణనన్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా కన్నడ మీడియా బయటపెట్టింది. 'సుదీప్' బెంగుళూరులోని ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కి తాను తన భార్య పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిశ్చయించుకున్నట్లుగా కోర్టు వారికి తెలియచేశాడంట. అయితే పరిహారం కింద దాదాపు 19 కోట్ల రూపాయలను ప్రియకు సుదీప్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
15 ఏళ్ల కిందట బెంగుళూరులో ప్రియ రాధాకృష్ణన్ చదువుకుంటున్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలై ఆ తరువాత కొంత కాలం సహజీవనం చేసి పెళ్ళి చేసుకున్నారు. ఈమె కొంతకాలం ఒక ఎయిర్‌లైన్స్‌లో ఆమె ఉద్యోగం కూడ చేసింది. 2001లో వీరిద్దరి పెళ్ళి జరిగిన తరువాత చాలాకాలం వీరిద్దరూ అన్యోన్యంగా కనపడుతూ వచ్చారు. వీళ్లకి 11 ఏళ్ల శాన్వి అనే అమ్మాయి కూడా వుంది. ఇన్ని సంవత్సరాల అనంతరం వీరి సంసార జీవితంలో ఏమైందో కానీ వీరిద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారంట. కన్నడ సినిమా రంగంలోనే కాకుండా 'సుదీప్' కోలీవుడ్, టాలీవుడ్ రంగాలలో కూడ పాపులర్ యాక్టర్ గా పేరుగాంచిన నేపథ్యంలో వీరి విడాకుల వ్యవహారం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

07:39 - September 13, 2015

చిత్రంలో కనిపిస్తున్నది ఎవరో గుర్తు పట్టారా ? లేదు కదూ..ఆయనో సూపర్ స్టార్..ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పుడు గుర్తు వచ్చింది..కదూ..ఆయనే 'రజనీ కాంత్'...ఎందుకు గెటప్ లో ఉన్నారు ? ఏ చిత్రంలో నటిస్తున్నారు ? అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా..ఇది తెలుసుకోవాలంటే చదవండి..
సూపర్ స్టార్ 'రజనీకాంత్' 'కబాలీ' గెటప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రోజుకో గెటప్ తో అదరగొడుతోంది మూవీ యూనిట్. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కాంబినేషన్ సినీ హిస్టరీని షేక్ చేస్తోంది. వరుసగా వస్తున్న 'రజనీ' గెటప్స్ అంచనాల్ని పెంచేస్తున్నాయి. లెటెస్ట్ గా జోకర్ గెటప్ లో కనిపించారు సూపర్ స్టార్. ఫ్యాన్స్ గుర్తు పట్టలేనంతగా మేకప్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకటి డాన్ క్యారెక్టర్..మరొకటి పోలీసు వేషం చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి కర్నాటక డాన్ కబాళీశ్వర్ క్యారెక్టర్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని మరో ప్రచారం కూడా ఉంది. 'రజనీ' కెరీర్ లో మరో 'భాషా'లా ఉండొచ్చని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

07:32 - September 13, 2015

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో పేలుడు ఘటన తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఓ హోటల్‌లో పేలిన సిలిండర్ ధాటికి భవనం కుప్పకూలింది... ఈ బ్లాస్ట్‌లో ఒకరు కాదు... ఇద్దరు కాదు... 90 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్‌ జబువా జిల్లా కేంద్రంలోని సేఠియా రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్ వంటగదిలో జరిగిన పేలుడు ధాటికి మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది. అంతే... హోటల్‌ ఉన్న మనుషుల హాహా కారాలు మిన్నంటాయి. క్షతగాత్రులను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 82 మంది మృతి చెందారు...మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

జిలెటిన్ స్టిక్స్..
రెస్టారెంట్‌కు ఆనుకుని ఉన్న భవనంలో జిలెటిన్‌ స్టిక్స్ నిల్వ ఉంచడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. పేలుడు ధాటికి హోటల్‌ చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీ స్థాయిలో పేలుడు జరిగి మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ ఉంచడానకి తనకు పర్మిషన్‌ ఉన్నట్టు యజమాని రాజేంద్ర పేర్కొన్నారు.

మోడీ తీవ్ర దిగ్ర్భాంతి..
ఈ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతామని శివా రాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధిత కుటుంబాలకు 50 వేల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీనియర్ అధికారులు రిస్క్‌ ఆపరేషన్‌ పనులు చేపట్టారు. బుల్‌డోజర్లతో భవన శిథిలాలలను తొలగిస్తున్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 

తెలంగాణ, రాయలసీమల్లో భారీ వర్ష సూచన..

హైదరాబాద్ : తెలంగాణ, రాయలసీమల్లో ఆదివారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. ఈ రెండింటి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. 

నేడు యూఎస్ పురుషుల సింగిల్స్ ఫైనల్..

న్యూయార్కు : నేడు యూఎస్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఆల్ టైమ్ గ్రేట్స్ ఫెడరర్, నొవాక్ జకోవిచ్ లు తలపడనున్నారు. 

చైనాలో ఏడో రోజు సీఎం కేసీఆర్ పర్యటన..

చైనా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏడో రోజు కొనసాగుతోంది. షెంజెన్ నగరంలో ఆయన పర్యటించనున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి పది గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు..కాలికనడకన వచ్చే భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. 

06:54 - September 13, 2015

ఢిల్లీ : సుపరిపాలన, సమగ్ర అభివృద్ధికి సామాజిక మాధ్యమాల ఉపయోగం అనే అంశంపై ఢిల్లీలో జాతీయ సదస్సు జరిగింది. ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు సోషల్‌ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని... భవిష్యత్‌లో ఈ-గవర్నెన్స్ మరింత బలపడుతుందని ఈ సమావేశానికి హాజరైన అనేకమంది వక్తలు అభిప్రాయపడ్డారు.

ఎన్డీఎంసీ భవన్ లో జాతీయ సదస్సు..
'సుపరిపాలన, సుస్ధిర అభివృద్ధిలో సోషల్‌ మీడియా ప్రాధాన్యత' ప్రధానాంశంగా ఢిల్లీలోని ఎన్డీఎంసీ భవన్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. సమాచార చేరవేతలో సామాజిక మాద్యమాల పనితీరు, ప్రభుత్వం చేపడుతున్న పనులను సమీక్షించే తీరుపై సదస్సులో చర్చ జరిగింది. ఈ సదస్సులో అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలను చేరుకునేందుకు సామాజిక మాధ్యమాలను ప్రభుత్వాలు వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పనితీరుపై యువత ఆసక్తి..
సంక్షేమ పథకాల అమలులో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్న తీరును అనేకమంది ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి యువత సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ తెలిపారు.

అవినీతిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్న కేటీఆర్..
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరువయ్యేలా చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పథకాల్లో జరుగుతున్న అవినీతిని ప్రజలే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నామని కేటీఆర్‌ అన్నారు.

సామాన్యుడు, ప్రధాని మధ్య వ్యత్యాసం తగ్గిందన్న జయప్రకాష్ నారాయణ..
సాంకేతిక పరిజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. సామాన్యుడికి, ప్రధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సోషల్‌ మీడియా తగ్గించిందన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం సోషల్‌ మీడియా ద్వారా వచ్చిందని.. ఇది ప్రజాస్వామ్యం వికసించేందుకు మంచి తరుణమని ఆయన అభిప్రాయపడ్డారు. సుపరిపాలన-దేశ సుస్థిర అభివృద్ధిని సోషల్‌ మీడియా ద్వారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై అనేకమంది ప్రతినిధులు తమ సలహాలు, సూచనలు అందించారు. 

06:50 - September 13, 2015

ఆదిలాబాద్ : తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఏడేళ్లు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయింది. మరోపక్క ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్‌ చేస్తామంటూ కొత్త లెక్కలు చెబుతోంది. ఇంతకీ ఈ ప్రాజెక్టులో ఏముంది ? ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుంది ? ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ప్రాణహిత-చేవెళ్ల. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరానికి తరలించేందుకు కసరత్తు చేస్తోంది.

మహారాష్ట్ర ప్రాజెక్టును అడ్డుకునే అవకాశం..
తుమ్మిడిహెట్టి వద్ద కాలువ వెడల్పు, లోతు తక్కువగా ఉన్నందున ప్రాజెక్ట్ నిర్మిస్తే ఎక్కువ నీటిని నిల్వ చేయలేమని మంత్రి హరీష్‌రావు అంటున్నారు. అదేవిధంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలో అటవీప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్‌ అంటోది. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల వివాదాల గురించి పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల కోసం వేల కోట్లు వెచ్చించి కాలువలు తవ్వారన్నారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి చిత్తశుద్దితో ఉందన్నారు.

ప్రభుత్వ తీరుతో జిల్లాల మధ్య వివాదాలు..
అయితే... ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రాజెక్టును మార్చడం అంటే ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలను సమాధి చేయడమే అంటున్నారు. ప్రాజెక్టు మార్పు అంశంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశముందంటున్నారు.

కాళేశ్వరంతో మహారాష్ట్రలో ఎక్కువ ప్రాంతాలు ముంపు..
ఇక తుమ్మడిహెట్టి వద్ద కంటే కాళేశ్వరం వద్ద గోదావరి నది అతి వెడల్పుగాను.. బల్లపరువుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రాజెక్ట్‌ నిర్మించాలంటే అతిపొడవాటి స్పిల్‌వే నిర్మించాల్సి ఉంటుందని జలసాధన సంఘాల నేతలంటున్నారు. నీరు నిల్వ చేయాలంటే ప్రాజెక్ట్ ను ఎత్తుగా నిర్మించాల్సిన అవసరముంటుందంటున్నారు. తుమ్మిడిహెట్టి కంటే కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తేనే మహారాష్ట్రలో ఎక్కువ ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశముంటుందంటున్నారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం..
ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు జిల్లాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. కానీ సర్కార్‌ నిర్ణయంతో గత కొంతకాలంగా ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇన్నాళ్లు జిల్లాలో నిర్మిస్తారనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు మరో జిల్లాకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోపక్క ప్రాజెక్ట్ రీడిజైన్‌ చేసినా కోట్ల రూపాయలు వెచ్చించి తవ్విన కాలువలను ఉపయోగించుకుంటామని మంత్రి హరీష్‌రావు అంటున్నారు. అన్ని సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అవగాహనారాహిత్యంతో రోజుకో విధంగా ప్రకటన చేస్తుందంటున్నారు. ప్రాజెక్టును తరలించిన తర్వాత ఆ కాలువలను ఎలా వాడుకుంటాయని ప్రశ్నిస్తున్నాయి.

06:45 - September 13, 2015

విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్మించే మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ, విశాఖ పట్టణాల్లో నిర్మించే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు అప్పచెప్పింది. ఇక ప్రాజెక్ట్ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించడమే తరువాయి..మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని పండిట్ నెహ్రూబస్‌ టెర్మినల్‌ నుంచి పెనమలూరు కారిడార్‌ వరకు 26.03 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 6,769 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే విశాఖ మెట్రో రైలు వ్యయం 12,727 కోట్లుగా అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మెట్రోరైలు సలహాదారు శ్రీధరన్‌లు కలిశారు. ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు సమక్షంలో చంద్రబాబుకు శ్రీధరన్‌ విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను అందచేశారు.

42.55 కిలోమీటర్లు...
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖ నగరాలకు మెట్రోరైలు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌డీఏ నుంచి కొమ్మాడ వరకు గురుద్వారా నుంచి పాత తపాలా కార్యాలయం వరకు మొత్తం 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 2018 డిసెంబర్‌ నాటికి విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు పూర్తవుతాయని మంత్రి వెంకయ్య తెలిపారు. ఆ తర్వాత త్వరలో విజయవాడ-గుంటూరు మధ్య హైస్పీడ్‌ రైలును కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

త్వరలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
మొత్తానికి విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం వేగం పెంచడంతో..అతి త్వరలోనే ఆయా నగరాల్లో మెట్రో పనులు మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన తర్వాత..ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. దీంతో విజయవాడ, విశాఖ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. 

06:40 - September 13, 2015

హైదరాబాద్ : ఇత‌రుల‌కు చెప్పడానికే నీతులు ఉన్నాయనే సూక్తిని ఏపీ ప్రభుత్వ పెద్దలు బాగా పాటిస్తున్నారు. ఒక వైపు ఖజానాలో కాసులు లేవంటూనే..మరో వైపు అధ్యయనాల పేరిట విదేశీ యాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా 4 దేశాలు తిరిగి రాగా ఇప్పుడు మంత్రులూ అదే బాట పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు విదేశీ యానం ముగించుకుని రాగా మ‌రో ఇద్దరు ప్రభుత్వ లాంఛనాలతో విదేశీ టూర్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

విదేశీ పర్యటనలపై మోజు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విదేశీ ప‌ర్యటనలపై మోజు ప‌ట్టుకుంది. రాజ‌ధాని పేరుతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స‌హా మంత్రులు నారాయ‌ణ‌, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు విదేశీ ప‌ర్యటన చేశారు. పరిశ్రమలను ఆకర్షించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చైనా, జ‌పాన్, సింగ‌పూర్, లావోస్ లాంటి ప‌లు దేశాలు తిరిగొచ్చారు. ఇక మంత్రి నారాయ‌ణ రాజధాని ప్లాన్‌ కోసమంటూ..ఇప్పటికే సింగ‌పూర్‌కు ట్రిప్పుల మీద ట్రిప్పులు వెళ్లొస్తున్నారు. మధ్యలో ఐటీ అభివృద్ది కోసమంటూ ఐటీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డి దాదాపు నెల రోజుల పాటు అమెరికా, జ‌పాన్ లాంటి దేశాల ప‌ర్యటనకు వెళ్లారు.

సింగపూర్ లో పర్యటించనున్న గంటా..
కొద్ది రోజుల క్రితం ర‌వాణాశాఖ మంత్రి శిద్థా రాఘ‌వ‌రావు, డిఫ్యూటీ సీఎం చిన్న రాజప్పలు అమెరికా ప‌ర్యటనకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఈ నెల 21 నుంచి..అక్టోబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు విదేశీ ప‌ర్యటనకు వెళ్లనున్నారు. ఈ 11 రోజుల ప‌ర్యటనలో మంత్రి హాంకాంగ్, సింగ‌పూర్, చైనా దేశాల‌లో ప‌ర్యటించనున్నారు. రాష్ర్ట మాన‌వ‌ వన‌రుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ఈ నెల 27 నుంచి సింగ‌పూర్‌లో పర్యటించనున్నారు. అక్కడి ప్రైవేట్ యూనివ‌ర్సిటీల ప‌నితీరు గురించి అధ్యయనం చేయడానికి మంత్రి వెళ్తున్నారు.
మొత్తానికి అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు నిత్యం ఇలా విదేశి పర్యటనల వల్ల మేలు జరిగినా జరగకపోయినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారం పడుతోంది. ఒకవైపు పొదుపు పాటించాలంటూనే...ఇలా విదేశీ పర్యటనలతో ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడవడం ఎంతమేరకు సమంజసమని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. 

06:35 - September 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ విద్యావ్యవస్థలో ప్రస్తుతం అమలవుతున్న నాన్‌డిటెన్షన్‌ విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. సర్కార్‌ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచాలని కోరాయి. ఇందుకు అవసరమైన పలు సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందించాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1971 నుంచి అమలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1971 నుంచి నాన్‌ డిటెన్షన్‌ అమల్లో ఉంది. 2009లో విద్యాచట్టం వచ్చినప్పటికీ అదే పద్ధతిలో విద్యా విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. విద్యా విధానంలో నాణ్యత కోరవడుతోందని కేంద్రం ఇటీవల ఒక సమీక్ష నిర్వహించింది. అన్ని రాష్ర్టాలను డిటెన్షన్ విధానంపై అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ మేరకు అన్ని పార్టీలతో మంత్రి కడియం శ్రీహరి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలు నాన్‌ డిటెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
డిటెన్షన్ విధానం తేవడం విద్యా హక్కును కాలరాయడమే అవుతుందని, ఇది అమల్లోకి వస్తే నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారుని ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరిచేయాలని, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచాలని, డ్రాపౌట్స్‌ పెరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సీఎం దృష్టికి తీసుకెళుతానన్న కడియం..
ప్రతిపక్షాలన్నీ నాన్‌ డిటెన్షన్‌ విధానమే మేలని సూచించడంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి కడియం శ్రీహరి. త్వరలోనే రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్రానికి పంపిస్తామన్నారు. ఇటు కస్తూర్భా, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కడియం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు అన్ని స్కూళ్లలో ప్రహారీ గోడలు, నీళ్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా పేద విద్యార్థులకు అనువుగా ఉన్న ప్రస్తుత పద్ధతినే ఇక ముందు అమలు చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. 

06:32 - September 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై సర్కార్‌ను నిండుసభలో నిలదీసేందుకు టి-టిడిపి సిద్ధమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులను గాలి కూడా పీల్చుకోకుండా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టిటిడిపి శాసనసభాపక్షం.. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో టి-టిడిఎల్పి సమావేశమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని సమావేశంలో నాయకులు నిర్ణయించారు. రాష్ర్టంలో తీవ్రంగా నెలకొన్న కరువు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, లోపభూయిష్టంగా సాగుతున్న గృహనిర్మాణ పథకం, కాకతీయ మిషన్‌లో జరుగుతున్న అక్రమాలు, వాటర్‌ గ్రిడ్‌, పార్టీ ఫిరాయింపులు.. ఇలా తదితర 18 అంశాలపై అసెంబ్లీ కమిటీ హాల్లో నేతలు విసృత్తంగా చర్చించారు.

సర్కార్ ను కడిగిపారేస్తామంటున్న నేతలు..
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పును వ్యతిరేకిస్తూ ఈనెల 18 నుంచి మూడురోజుల పాటు పాదయాత్ర చేపట్టాలని, ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టాలని నాయకులు నిర్ణయించారు. 21 నుంచి రెండ్రోజుల పాటు రైతు ఆత్మహత్యలు అధికంగా జరిగిన జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా రైతు ఆత్మహత్యల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి సర్కార్‌ను కడిగేస్తామంటున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. గతేడాదిలాగే ఈసారి కూడా కరువు జిల్లాలను గుర్తించలేదని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోనూ సర్కార్‌ విఫలమైందని విమర్శిస్తున్నారు.
అసెంబ్లీని 15 రోజులు జరపాలని నేతల డిమాండ్ ..
అసెంబ్లీలో చర్చించాల్సిన 30 అంశాలను గుర్తించామని, సభను 15 రోజులు జరపాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. సభలో మంత్రి తలసానిని ప్రశ్న అడగబోమని, సభలో ఆయన మాట్లాడితే సభ నుంచి వాకౌట్ చేస్తామంటున్నారు. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి.. కేంద్రమంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించాలని నాయకులు నిర్ణయించారు.  మొత్తంగా రాష్ర్టంలో నెలకొన్న కరువు, రైతు ఆత్మహత్యలు, రీ-డిజైనింగ్‌ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతి ఇలా ప్రధానమైన అంశాలపై అసెంబ్లీలో సర్కార్‌ను నిలదీసేందుకు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి వీరి వ్యూహాలకు అధికారపార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

06:28 - September 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలో పారిశ్రామిక నగర నిర్మాణానికి ముందుకు రావాలని.. సీఎం కేసీఆర్‌, చైనా కంపెనీలను ఆహ్వానించారు. చైనా ఫార్చ్యూన్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రతినిధులతో ఆయనివాళ చర్చలు జరిపారు. తెలంగాణలోని వనరుల లభ్యతను వారికి వివరించారు. తెలంగాణలో పారిశ్రామిక నగరాన్ని నిర్మించాలని భావిస్తున్న కేసీఆర్‌.. ఆదిశగా చైనాలోని పలు కంపెనీలతో చర్చలు సాగిస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం బీజింగ్‌లో, చైనా ఫార్చ్యూన్‌ డెవలప్ మెంట్, ఇన్‌స్పూర్‌, తదితర సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం చర్చలు జరిపింది. తెలంగాణలో పారిశ్రామిక నగరాభివృద్ధికి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్న సీఎం పిలుపు పట్ల ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి.

పెట్టుబడులు పెట్టాలన్న సీఎం కేసీఆర్..
ఫార్చ్యూన్‌ సంస్థ చైనాలోని ఎన్నో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసింది. పారిశ్రామిక, థీమ్‌ జోన్‌లు, కాంప్లెక్స్‌లు, వర్క్‌షాపుల అభివృద్ధిలోనూ సంస్థకు విశేష అనుభవం ఉంది. అలాగే ఇన్‌స్పూర్‌ సంస్థ క్లౌడ్‌ కంప్యూటింగ్‌రంగంలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులు పెట్టింది. ఇటీవలే ప్రవేశపెట్టిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఈ సంస్థలకు వివరించిన సీఎం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా.. చైనా చారిత్రక ప్రదేశాల్లోనూ సీఎం బృందం సందర్శించింది. 1987లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ఫర్‌బిడన్‌ సిటీని సందర్శించారు. అక్కడి కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని కనబరిచిన సీఎం.. నగరాన్ని సంరక్షిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

06:26 - September 13, 2015

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌మెట్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బృందాలుగా ఏర్పడిన 300 మంది పోలీసులు.. ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. 

06:24 - September 13, 2015

తూర్పుగోదావరి : చూడ్డానికి చాలా సాఫ్ట్ టా కనిపిస్తున్నా మహాజాదూ. యువతులను ట్రాప్‌ చేయడంలో మహాముదురు. ఇతడి పేరు బొబ్బా హరీష్‌కుమార్‌. బుద్ధిమాత్రం వక్రం. ఇతగాడి లీలలు వింటే ఎవ్వరైనా ఖంగుతినాల్సిందే. అమ్మాయిలను నమ్మించి మోసం చేయడంలో దేశముదురు. చదువుతున్నదీ ఇంజనీరింగ్‌ అయిన పక్కా 420. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన బొబ్బా హరీష్‌కుమార్‌.. ఇదే గ్రామానికి చెందిన ఎంబీఏ చదువుతున్న ఓ యువతిని ప్రేమపేరుతో ట్రాప్‌ చేశాడు. రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఆ అమ్మాయితో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. మనువాడుతానని నమ్మించి చివరకు మోహం చాటేశాడు.

మండపేట పీఎస్ లో ఫిర్యాదు..
హరీష్‌ నిజ స్వరూపం తెలుసుకున్న బాధితురాలు మోసపోయానని గ్రహించి మండపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా హరీష్‌కుమార్‌ కొంతమంది అమ్మాయిలతో ఇదేవిధంగా ప్రేమ వ్యవహారం నడిపి.. వారి నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హరీష్‌ను అరెస్ట్‌ చేశారు. ఇతనిపై చీటింగ్‌, రేప్‌ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

06:21 - September 13, 2015

హైదరాబాద్ : కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. కన్నీళ్లతో ఎదురుచూస్తున్న కన్నవారిలో ఆనందం వెల్లివిరిసింది. కిడ్నాపర్లు బాలుడిని వదిలివెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..ఇక మిగిలింది..అసలు ఎవరు కిడ్నాప్ చేశారు.? ఎందుకు చేశారన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. బైరామల్‌గూడలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి బాలుడిని రక్షించారు. అనంతరం యాషిష్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మార్బుల్ వ్యాపారి కుమారుడు..
ఎల్బీనగర్‌కు చెందిన మార్బుల్‌ వ్యాపారి గారాలపట్టి యాషిష్‌ విజయ్‌ పట్రా. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న యాషిష్‌ విజయ్‌ పట్రాను... కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం కిడ్నాపర్లు బాలుడి పేరెంట్స్ కు ఫోన్‌ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు చెబితే బాలుడ్ని చంపేస్తామని బెదిరించారు. పిల్లాడి తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న నగర పోలీసులు రంగంలోకి దిగారు. 15 బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఫోన్‌ కాల్‌ సిగ్నల్‌ ఆధారంగా బైరామల్‌గూడలో కిడ్నాపర్లను గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న వారు.. బాలుడిని రక్షించి డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.

ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు చేశారు ?
చిన్నారి యాషిష్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు..? ఎందుకు చేశారు..? మార్బుల్‌ వ్యాపారిపై కక్షగట్టిందెవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు... దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబడతామంటున్నారు పోలీసులు. 

ఎల్ బినగర్ కిడ్నాప్ కథ సుఖాంతం..

హైదరాబాద్ : నగరంలోని ఎల్ బి నగర్ లో యాషిస్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. బైరామల్ గూడాలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సానియా విజయం..

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఇటలీ క్రీడాకారిణి సానియా పన్నెట్టా విజయం సాధించింది. 7-6, 6-2 తేడాతో రాబర్టా విన్సీపై గెలుపొందింది. 

చింతల్ మెట్ లో పోలీసుల కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని చింతల్ మెట్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులు ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా తనిఖీలు సోదాలు నిర్వహించారు. 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 50 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss