Activities calendar

15 September 2015

21:34 - September 15, 2015

హైదరాబాద్ : సినిమాల్లో హీరో చేసే సాహసాలను చూస్తుంటాం... కానీ నిజ జీవితంలో కూడా అలాంటి సాహసం చేయవచ్చని ఓ పోలీస్‌ నిరూపించాడు. మహారాష్ట్ర నాసిక్‌ కుంభమేళాలో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తిని కానిస్టేబుల్‌ మనోజ్‌ కాపాడిన తీరు నిజంగా అతడిని హీరోగా మార్చేసింది. ఇపుడది ట్విట్టర్‌లోనూ హల్‌చల్‌ చేస్తోంది. గోదావరి బ్రిడ్జిపై నడచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి అతి సమీపంలోనే ఉన్న పోలీసులు కంగుతిన్నారు. అతడిని కాపాడేందుకు బ్రిడ్జి కిందకు పరుగులు తీశారు. ఇంతలోనే అక్కడి వచ్చిన 24 ఏళ్ల యువ కానిస్టేబుల్‌ మనోజ్‌- వెనకా ముందు ఆలోచించలేదు... ఒకటి కాదు రెండు కాదు...20 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిపై నుంచి నదిలోకి అమాతంగా దూకేశాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ వ్యక్తిని ఒడ్డుకు చేర్చాడు. ఈ విజువల్స్‌ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయ్యాయి. మనోజ్‌ ధైర్యసాహసాలను చూసిన జనం అతడికి జేజేలు పలికారు.

21:32 - September 15, 2015

హైదరాబాద్ : కట్టుకున్న భార్యను హత్య చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన సుశీల్‌ శర్మ త్వరలో బయటకు రానున్నాడు. కాంగ్రెస్‌ యువనేత సుశీల్‌ శర్మ తన భార్య మరో పార్టీ వర్కర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. భార్య నైనా సాహ్నీపై కక్ష పెంచుకున్న సుశీల్‌ శర్మ జులై 2, 1995లో ఆమెను ఇంట్లో దారుణంగా హతమార్చాడు. భార్య మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఓ రెస్టారెంట్‌లో తందూరి పొయ్యిలో వేసి కిరాతకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో ని ఆ హోటల్‌ యజమాని సుశీల్‌శర్మకు స్నేహితుడు. ఈ కేసులో సుప్రీంకోర్టు సుశీల్‌శర్మకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు ఎలాంటి షరతులు లేకుండానే పెరోల్‌పై విడుదల చేయాలని ఆదేశించడంతో సుశీల్‌శర్మకు త్వరలోనే జైలు నుంచి విముక్తి లభించనుంది.  

కళ్లుండీ చూడలేని కబోది జగన్ : యనమల

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆర్థిక మంత్రి యనమల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ను కళ్లుండీ చూడలేని కబోదిగా అభివర్ణించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. నదుల అనుసంధానం జగన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అడ్డదారి, అడ్డంగా మాట్లాడడమే జగన్‌ నైజమని నిప్పులు చెరిగారు. ధర్నాలు, దీక్షలు చేసి కేంద్రం పిలిస్తే వెళ్లి కేసుల గురించి మాట్లాడుకోవచ్చని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో జగన్‌ యూపీఏను బ్లాక్‌మెయిల్‌ చేసి కేసుల మాఫీకి బేరాలాడారని ఆరోపించారు.

21:20 - September 15, 2015

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చైనా పర్యటన ముగించుకుని రేపు హైద్రాబాద్ కు చేరుకోనున్నారు. పెట్టుబడులే లక్షంగా పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ప్రపంచ ఆర్దిక సదస్సు వేదికగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్న సంకేతాలిచ్చారు. మరోవైపు కేసీఆర్‌ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నాయి.

బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానం హైదరాబాద్‌కు కేసీఆర్ బృందం ......

తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల చైనా పర్యటన ముగించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానం లో కేసీఆర్ బృందం హైద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ నెల 7న చైనాకు వెళ్లిన సీఎం టీం...డలియన్, షాంఘై, బీజింగ్, షెంజన్, హంకాంగ్ వంటి నగరాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు. దీంతోపాటు చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. బుల్లెట్ ట్రెయిన్ లో ప్రయాణించారు.

లియో, జడ్ టీ ఈ, సిల్ కాన్, మకేనా.....

లియో, జడ్ టీఈ, సిల్ కాన్, మకేనా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్, చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధులు, మౌళిక వసతుల కంపెనీలతో చర్చించారు కేసీఆర్. సీఎం విజ్తప్తుల పట్ల పలు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. లియో గ్రూప్ కంపెనీల వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. సిలికాన్,మకెనా కంపెనీ కూడా ఎల్ ఈడీ టీవీల తయారి కంపెనీని తెలంగాణలో నెలకొల్పేందుకు హమీ ఇచ్చింది. 133 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రికల్ కార్పొరేషన్, చైనా రైల్వే కార్పొరేషన్ సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. తెలంగాణలోనూ పారిశ్రామిక నగరాలను అభివృద్ది చేయాలన్న సీఎం విజ్ఞప్తికి ఫార్చున్ ల్యాండ్ డెవలప్ మెంట్ కంపెనీ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అయితే గ్లోబల్ మార్కెట్ లో తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని మార్కెటింగ్ చేయడంలో చైనా పర్యటన సఫలమైందని చెప్పుకుంటున్నా..ఈ ఒప్పందాలు ,సానుకూల స్పందనలు ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో చూడాలి.

21:17 - September 15, 2015

విజయవాడ : నదుల అనుసంధానంలో ఇంజినీర్ల పాత్ర ముఖ్యమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసాధ్యమైన పనిని... కేవలం 5 నెలల 17 రోజుల్లో పూర్తిచేసి సుసాధ్యం చేసిన ఘనత ఇంజనీర్లకే దక్కుతుందని ఆయన అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం... మనదేశ ఇంజనీర్లే చేపడతారని, ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీ మనదేశంలో లేనందున... వారి సహకారంతో రాజధానిని నిర్మించుకోవటం జరుగుతుందని బాబు స్పష్టం చేశారు. ఇంజనీర్లు నిబద్ధతతో పనిచేస్తే... ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో..? పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రుజువైందన్నారు. నదుల అనుసంధానానికి "పవిత్ర సంగమం" నామకరణం చేస్తామని ఏపీ సీఎం అన్నారు .

21:15 - September 15, 2015

హైదరాబాద్ : సమస్యలు తీర్చమని కోరారు. విజ్ఞప్తులు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతే పోలీసులు రెచ్చిపోయారు. తమ లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎవరో రౌడీలు, గూండాలపై పడి చితకబాదినట్లుగా.. ఆడపిల్లలపై దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి మొదట ఆశ్చర్యపోయారు.. ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. కానీ, ఆ ఆడపిల్లలు ఆవేశంతో హెచ్చరికలు జారీ చేశారు. తమ సమస్యలు తీరేవరకు ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఖాకీల తీరుకు నిరసనగా బుధవారం ఏపీలోని విద్యాసంస్థల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.

పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం....

రాష్ర్ట విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ కొంతకాలంగా అలుపెరగకుండా పోరాటం చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినా మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం.. విద్యార్థుల సమస్యలను గాలికోదిలేసింది. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విశాఖ కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు బయలుదేరారు. అక్కడే కాచుక్కుర్చుని ఉన్న ఖాకీలు విద్యార్థులను అడ్డుకున్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ.....

కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని గేట్లను మూసివేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలను ఝుళిపించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థినీలను గొడ్డును బాదినట్లు బాదారు. కొంతమందిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల దాడిలో విద్యార్థులకు గాయాలు.....

పోలీసుల దెబ్బలకు తాళలేక చాలామంది విద్యార్థులు సొమ్మసిల్లి కిందపడిపోయారు. అయినా.. వారిని కూడా పోలీసులు వదల్లేదు. లాఠీలు విరిగే వరకూ కొట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల దాడిలో చాలామంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఖాకీల తీరును మేధావులు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా తప్పుపట్టారు. ఖాకీల తీరుకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం ఏపీలోని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజాసౌమ్యదేశంలో డిమాండ్ల సాధన కోసం నినాదించే హక్కు కూడా లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

 

21:11 - September 15, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు, ఉద్యోగులు, వారి పిల్లలపై స్థానికత అంశంపై స్పష్టత వస్తోంది. తెలంగాణలో స్థిరపడినా...ఏపీ ప్రజలకు స్వరాష్ట్రంలోనూ స్థానికత వర్తింపజేయాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని స్థానికత పదాన్ని సవరించాలని నివేదికలో ఏజీ కోరారు.  

20:37 - September 15, 2015

హైదరాబాద్ : ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిత్వం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనపడుతోంది. అనేక దేశాల్లో వామపక్ష శక్తులు దూకుడు కనపడుతోందా? లెప్టే రైట్ అని పశ్చిమదేశాలకు అర్థమయిందా? నవసమాజం వైపు యూరప్ ప్రజలు చూస్తున్నారా? ఇత్యాది అంశాలపై నేటి 'వైడ్ యాంగ్' లో చర్చించారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

పరీక్ష రాసే అభ్యర్థులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ : టీఎస్ పీఎస్ సీ

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న తొలి పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో పరీక్షపై అవగాహన లేక అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన టీఎస్ పీఎస్సీ ఆన్ లైన్ మాక్ టెస్ట్ ను నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో 99 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ పరీక్షలో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ కమిషన్ కొత్త ప్రయోగం చేపట్టింది.

సోమ్ నాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని సూచించిన ఆప్

హైదరాబాద్ : గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని ఆమ్ ఆద్మీ పార్టీ సూచించినట్లు సమాచారం. సోమనాథ్ భార్య లిపిక మిత్ర ఆయన పై గృహ హింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

ఉపాధి హామీ, గ్రామజ్యోతి పథకాలపై కేటీర్ సమీక్ష

హైదరాబాద్ : ఉపాధి హామీ, గ్రామజ్యోతి పథకాలపై జిల్లాల అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధుతల వేతనాల కోసం రూ.48.7 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గ్రామజ్యోతి లక్ష్యాలను సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు, ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య, ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని సర్పంచ్ లను మంత్రి కోరారు. ఉపాధి హామీ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే పని చేసే విధంగా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

తాడిపత్రి మండల ఆఫీసు ముందు ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం...

అనంతపురం : తాడిపత్రి మండల ఆఫీసు ముందు పురుగుల మందు తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో తమ గుడిసెలను తొలగించారని పురుగుల మందు తాగిన రవి, వెంకటరాముడును అనంతపురం ప్రభుత్వాస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చెన్నైలో మల్లీ లెవల్ కార్ పార్కింగ్ సిస్టమ్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మల్టీలెవల్ కార్‌పార్కింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. చెన్నై కార్పోరేషన్, అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంయుక్తంగా రూ.43కోట్లతో నుంగంబక్కమ్ ప్రాంతంలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. మల్టీ లెవల్ కార్‌పార్కింగ్ సిస్టమ్ సౌకర్యంతో ఒకేసారి 249కార్లు, 230 బైకులను పార్కింగ్ చేసుకోవచ్చు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు మాడ వీధుల్లో శ్రీవారి సర్వసేనాపతి విశ్వక్షేణుడు ఊరేగారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పుట్టమన్న సేకరించేందుకు వెళ్లారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఎంత మంది భక్తులు వచ్చినా స్వాగతించేందుకు టీటీడీ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు.

మంత్రి కొల్లు, ఎంపి కొనకళ్లకు మరోసారి చేదు అనుభవం

కృష్ణా : బందరు మండలం బుద్దాయిపాలెంలో మంత్రి కొల్లు, ఎంపి కొనకళ్లకు మరోసారి చేదు అనుభవం ఎదురయ్యింది. బందరు పోర్టుకు భూములు ఇచ్చేది లేదని... భూసేకరణ ఉత్తర్వును రద్దు చేసే వరకు గ్రామంలోకి రావొద్దని గ్రామస్తులు తేల్చి చెప్పారు. గ్రామ సభ జరపకుండానే మంత్రులు వెనుదిరిగారు.

టెక్కిలిలో ర్యాగింగ్ కలకలం

శ్రీకాకుళం : టెక్కిలిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కాలేజ్ నుంచి ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో నైజీరియన్ అరెస్ట్‌

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ నైజీరియన్ ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. విత్తన కంపెనీ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అరెస్టు చేసిన నైజీరియన్ ను జార్ఖండ్ కు తరలిస్తున్నారు.

19:31 - September 15, 2015

గుంటూరు : చిలకలూరిపేటలో మంగళవారం దారుణం జరిగింది. జానీబాయ్‌ అనే మహిళను దుండగులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే...నర్సరావు పేట సెంటర్లో ఓ హోటల్ లో పనిచేసే జానీ బాయ్ ను దారుణం హత్యకు పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు వున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చిలకలూరిపేటలో దారుణం...

గుంటూరు : చిలకలూరిపేటలో మంగళవారం దారుణం జరిగింది. జానీబాయ్‌ అనే మహిళను దుండగులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఏసీబీ వలలో కన్నూరు విఆర్ ఓ

కరీంనగర్ : కమలాపూర్ మండలం కన్నూరు వీఆర్‌వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పట్టాదారు పుస్తకంలో పేరు సరి చేసేందుకు రైతు నుంచి వీఆర్‌వో రమేశ్ లంచం డిమాండ్ చేశాడు. వీఆర్‌వోకు రైతు రూ. 13 వేలు ఇస్తుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు. అనంతరం వీఆర్‌వో నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 27న అరుదైన చంద్రగ్రహణం.

హైదరాబాద్ : ముఫ్పై సంవత్సరాలలో ఎన్నడూ చూడనటువంటి అరుదైన సంఘటన ఒక దానిని మనం చూస్తామని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అదేమిటంటే ఈ నెల 27న వచ్చే చంద్రగ్రహణం. ఆరోజు రాత్రి పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం కారణంగా చంద్రుడిని పూర్తిగా గ్రహణం పట్టేస్తుందని, ఎంతగా పడుతుందంటే.. దాని ప్రతిబింబం కన్నా ఎక్కువుగా. ఒక గంట సమయం కన్నా ఎక్కువ సేపు ఈ అరుదైన దృశ్యం ఉంటుందట. ఈ అరుదైన చంద్రగ్రహణంపై నాసా శాస్త్రజ్ఞులు దృష్టిసారించినట్లు సమాచారం.

 

కరీంనగర్ ఎస్పీకి హెచ్ ఆర్సీ నోటీసులు

హైదరాబాద్ : కరీంనగర్ ఎస్పీకి హెచ్ఆర్సీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కవిత అనే మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ క్రమంలో వచ్చేనెల 9 లోగా నివేదిక ఇవ్వాలని ఎస్పీని హెచ్ఆర్సీ ఆదేశించింది.

18:31 - September 15, 2015

హైదరాబాద్ : ఆయన పేరు వింటేనే... చండ్రనిప్పులు చెరుగుతారు. ఆగ్రహంతో తెగ ఊగిపోతారు. కానీ ఒక్కవిషయంలో మాత్రం... ఆయన చూపిన మార్గంలోనే అడుగులు వేస్తున్నారు. బద్దశత్రువులైన వైఎస్, చంద్రబాబుల్ని... తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సంప్రదాయం ఒక్కటి చేసింది. పొలిటికల్ సెంటిమెంట్‌... పట్టు వస్త్రమై పరిమళిస్తోంది.

ఇద్దరూ ఇద్దరే..! రాజకీయ ఉద్దండులు.....

వైఎస్ రాజశేఖర్ రెడ్డి... నారా చంద్రబాబు... ఇద్దరూ ఇద్దరే..! రాజకీయ ఉద్దండులు. వ్యూహరచనలో సిద్ధహస్తులు. రాజకీయంగా మాత్రం భిన్నధృవాలు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా పనిచేశారు. కానీ ఎవరి స్టైల్ వారిదే. ఎవరి పంథా వారిదే. వైఎస్‌ Yes అంటే, చంద్రబాబు నో అనేవారు. కానీ ఒకేఒక్క విషయంలో మాత్రం రాజశేఖరుడి బాటలోనే బాబు గారు అడుగులు వేస్తున్నారు. శ్రీవారి సేవలో పాతపద్దతినే ఫాలో అవుతున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టువస్త్ర్రాలు......

రాష్ట్ర ప్రభుత్వం తరఫున... తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టువస్త్ర్రాలు సమర్పించడమనే సంప్రదాయానికి... తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబే నాంది పలికారు. ఆ ఆనవాయితీ ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉత్సవాల్లో అతికీలకమైన పర్వదినంగా భావించే... గరుడోత్సవం రోజున లక్షలాది మంది భక్తులతో శ్రీనివాసుడి గిరులు కిటకిటలాడుతుంటాయి. అదే రోజున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించేవారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ సంప్రదాయమే కొనసాగింది. కానీ రోజు మాత్రం మారింది. వేడుకల్లో మొదటి రోజైన అంకురార్పణ ఘడియల్లోనే పట్టు వస్త్ర సమర్పణ తంతును ముగించేవారు వైఎస్. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సైతం... గరుడోత్సవానికి బదులుగా తొలిరోజే శ్రీవారికి పట్టు వస్త్రాల్ని సమర్పిస్తున్నారు.

తాను మొదలు పెట్టిన గరుడోత్సవం నాడు కాకుండా......

తాను మొదలు పెట్టిన గరుడోత్సవం నాడు కాకుండా... వైఎస్ మార్పు చేసిన మొదటి రోజుకే బాబు కూడా కట్టుబడటం ఏమిటనే విషయంలో పెద్ద సెంటిమెంటు దాగి ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించేందుకువస్తున్న సందర్భంలోనే... 2003 సంవత్సరంలో చంద్రబాబుపై దాడి జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో పదవీ వియోగం తప్పలేదు. పదేళ్ల పాటు వెంకటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం బాబుకు దక్కలేదు. 2014 ఎన్నికల తర్వాత మళ్లీ ఈ అవకాశం కలిసొచ్చింది. అయినా గరుడోత్సవం నాడు కాకుండా... తొలినాడే చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. గరుడోత్సవ సెంటిమెంటు వికటించడంతోనే... చంద్రబాబు ప్రమాదం బారినపడ్డారని భావన కూడా నెలకొంది. అందుకే రాజశేఖర్‌ రెడ్డి శ్రీకారం చుట్టిన... ఫస్టు డే పండుగకే బాబు ప్రయారిటీ ఇస్తున్నారట.

అవే హోదాల్లో......

అలిపిరి ఘటనలో గాయపడ్డ సీఎం చంద్రబాబు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా అవే హోదాల్లో కొనసాగుతున్నారు. అప్పట్లోఎమ్మెల్యేగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సేమ్ పదవులు... అయినా సెంటిమెంటు మాత్రం కొత్త రూట్ పట్టింది.

18:27 - September 15, 2015

విజయనగరం : జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. భూసేకరణ నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. భోగాపురం మండలం గూడెపువలసలో పది వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాయి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కావాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని... పోలీసులు అతిగా వ్యవహరిస్తే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. ఛలో అసెంబ్లీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 

18:24 - September 15, 2015

తూ.గో : రాజమండ్రిలో అదృశ్యమైన బాలిక రాజీ ఆచూకీ లభించింది. అనుమానాస్పద స్థితిలో ఓ పాతబావిలో పడి... ఆమె రెండ్రోజుల పాటు నరకయాతనను అనుభవించింది. లాలాచెరువు ప్రాంతానికి చెందిన రాజీ నాలుగురోజుల క్రితం... ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఆమె బంధువులు బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. మోడల్ కాలనీలోని... ఓ పాడుబడ్డ నూతిలోంచి... ఆర్తనాదాలు వినిపించడాన్ని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక ఉద్యోగుల సహకారంతో... రాజీని బావి నుంచి బయటకు తీశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే బావిలోకి ప్రమాదవశాత్తు పడిందా..? లేదా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇంజినీర్ల ప్రతిభ వల్లే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి : చంద్రబాబు

కృష్ణా : విజయవాడలో జరిగిన ఇంజినీర్స్ డే వేడుకల్లో వారి ప్రతిభను, కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు. భారతదేశ ఇంజినీర్లలో మొదటిస్థానంలో ఉన్న వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. ఇంజినీర్ల ప్రతిభ వల్లే పట్టిసీమ ప్రాజెక్టును అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేశామని చెప్పారు. కేవలం 5 నెలల 15 రోజుల్లోనే పట్టిసీమను పూర్తి చేయగలిగామంటే ఇంజినీర్ల కృషి వల్లేనని సీఎం ప్రశంసించారు. యువత ఇంజినీరింగ్ పై ఆసక్తి పెంచుకోవాలని సరికొత్త ఆలోచనలతో దేశంలో కరవును తరిమికొట్టేలా ప్రాజెక్టులు నిర్మించాలని చంద్రబాబు కోరారు.

ఆ ర్యాంకింగ్ ను పట్టించుకోం : కేటీఆర్

హైదరాబాద్: పారిశ్రామిక అనుకూల రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రాష్ర్టాన్ని వరల్డ్ బ్యాంకు 13వ స్థానంలో ఉంచడంపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఈమేరకు ఆయన తన ట్విటర్‌లో ట్విట్ చేశారు. జన సామాన్యం వరల్డ్ బ్యాంకు ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంకు ర్యాంకింగ్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా తెలియదన్నారు. ఈ ర్యాంకింగ్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ పని తాము చేసుకుపోతామన్నారు. తమ పని విధానమే ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తుందని ట్విట్ చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష

మెదక్: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రైతుల సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేసినట్టు సమాచారం.

17:45 - September 15, 2015

ఆదిలాబాద్ : జిల్లాలో మరో ప్రాజెక్టు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. 6.22 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో..30వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కుఫ్టీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని తయారు చేస్తోంది. జిల్లాలోని నేరడిగొండ ఇచ్చోడ మధ్య కుప్టి ఘాట్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఎత్తిపోతల ద్వారా 30వేల ఎకరాలకు నీరు....

ఆదిలాబాద్ జిల్లాలో ఎత్తిపోతల ద్వారా 30వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం మరో ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో పర్యటించి ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లాలోని నేరడిగొండ ఇచ్చోడ మధ్య కుప్టి ఘాట్ వద్ద బ్యాలెన్సింగ్ 6.22 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.

నేరడిగొండ, ఇచ్చోడల మధ్య కుఫ్టీ ఘాట్‌....

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే జాతీయ రహదారిపై నేరడిగొండ, ఇచ్చోడల మధ్య కుప్టి ఘాట్ ఉంది. ఇక్కడ సహజసిద్ధంగా ఉన్న రెండు కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ జాతీయ రహదారిలో భాగంగా ఉన్న బ్రిడ్జికి ఎగువన..కుప్టి గ్రామానికి దాదాపు అరకిలోమీటరు దూరంలో ఆనకట్ట కట్టాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. ఈ ప్రాజెక్టును కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చు. కడెం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు కేవలం 68,150 మాత్రమే సరిపోతుంది. ఒకవేళ కుప్టిఘాట్ వద్ద ఆనకట్ట నిర్మిస్తే బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్ మండలాల్లోని దాదాపు 30వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంటుంది. కుప్టి ప్రాజెక్టు పరివాహక ప్రాంతం సుమారు 236 చదరపు మైళ్ళు.

సుమారు 3 వేల ఎకరాల భూమిని అవసరం....

అయితే కుఫ్టీ ప్రాజెక్టు కోసం సుమారు 3 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం సేకరించాలనుకుంటున్న భుమి అంతా గిరిజన ప్రాంతంలోనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 4 గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో 4 గ్రామాల్లోని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుఫ్టి ఆనకట్టను నిర్మిస్తే..జల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఆనకట్ట కడితే..ఆదిలాబాద్‌లో ఇది మరో ప్రధాన పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉంది. 

17:42 - September 15, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో గుడుంబా నిల్వలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు చేస్తూ..నాటుసారా బట్టీలను ధ్వసం చేస్తున్నారు. పాలమూరు వాసుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గుడుంబాను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు దాడులు చేస్తున్నారు. మరోవైపు నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న పాలమూరు వాసుల్లో చైతన్యం నింపేందుకు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

గుడుంబ మత్తులో......

గుడుంబా..ఇది పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది..ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తోంది..గుడుంబ మత్తులో ఎంతోమంది బడుగులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాలమూరు వాసుల జీవితాల్లో చిచ్చుపెడుతున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు జిల్లా ఎక్సైజ్‌శాఖ పోలీసులు నడుం బిగించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై మెరుపుదాడులు చేస్తూ..సారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న గుడుంబా స్థావరాలపై దాడులు...

జిల్లావ్యాప్తంగా ఉన్న గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నాటుసారాను ధ్వంసం చేస్తున్నారు. పలు ఇళ్లల్లో నిల్వ ఉంచిన గుడుంబాను ధ్వంసం చేయడంతో పాటు..సారా తయారీకీ ఉపయోగంచే సామాగ్రిని సైతం ధ్వంసం చేస్తున్నారు. గుడుంబా తయారీకి ఉపయోగించే..పటిక, నల్లబెల్లం, వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు.

నల్లబెల్లం వ్యాపారులపై కేసులు....

కేవలం గుడుంబా తయారీదారులపైనే కాకుండా..నల్లబెల్లం అమ్మే వ్యాపారులపైనా ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వనపర్తి, జడ్చర్ల, గద్వాల, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో లక్షల రూపాయల విలువ చేసే టన్నుల కొద్ది నల్లబెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు.

గుడుంబా తయారీదారుల గుండెల్లో రైళ్లు....

ఎక్సైజ్ శాఖ గుడుంబా స్థావరాలపై దాడులు తీవ్రం చేయడంతో గుడుంబా తయారీదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వం ఇదే రీతిన కఠినంగా వ్యవహరించి నాటుసారాను కూకటివేళ్లతో పెకిలివేయాలని మహిళలు కోరుతున్నారు.

నేడు సాయంత్రం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు..

విజయవాడ : బందర్ రోడ్డులో గేట్ వే హోటల్ లో జరిగే ఓ సదస్సులో సీఎ చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రాత్రి 8.45గంటలకు పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు చేసుకోనుంది. 

పోలీసు కస్టడీకి ఉగ్రవాది నిక్కీ జోసెఫ్...

హైదరాబాద్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఉగ్రవాది నిక్కీ జోసెఫ్ ను పది రోజుల పోలీసు కస్టడీకి మియాపోర్టు కోర్టు అప్పగించింది. 

యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాలి - బాబు..

విజయవాడ : యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంజనీర్ల దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. దూరదృష్టితో ముందుకెళ్తే విజయాలు వస్తాయని, ఇంజీనర్లలలో అత్యున్నతుడు మోక్షగుండం అని తెలిపారు. 

17:38 - September 15, 2015

హైదరాబాద్ : ఆసరా అభాసుపాలవుతోంది. పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్దిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బులు మధ్యలోనే మింగేస్తున్నారు. పండుటాకులకు ఇచ్చే చిన్నమొత్తాన్ని కూడా బొక్కేస్తున్నారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు టీఎస్‌ సర్కార్‌ రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో సరికొత్త మార్పులు తీసుకురానుంది.

ఉసురు తీస్తున్న ఆసరా.....

పేదలకు కాసింతయినా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో , ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన పధకం ఆసరా. సకాలంలో పెన్షన్లు అందించి నిరుపేదలను ఆదుకోవాలనేది ఆసరా పథకం లక్ష్యం. కానీ ఆసరా లబ్దిదారుల ఉసురు తీసింది. నెలా నెలా పెన్షన్లు అందుకోవాలనుకునే వారికి ప్రాణం మీదకు తెస్తోంది. పెన్షన్లు తీసుకోవాలంటే క్యూలైన్లో నిల్చోవాల్సిందే. ఇది వికలాంగులు, వృద్ధులకు చెప్పలేనంత ఇబ్బందికరంగా పరిణమించింది. దీన్ని అదనుగా భావించిన అక్రమార్కులు లబ్దిదారుల పించన్‌ సొమ్మును కాజేస్తున్నారు. పింఛన్ సొమ్మును 1000,1500లకు పెంచడంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీలకు పింఛన్‌ పంపిణీని అప్పగించింది. ఇదే దళారులకు వరంగా మారింది.

ఆన్‌లైన్‌ ద్వారా పింఛన్‌ సొమ్ము పంపిణీ.....

పింఛన్‌ పంపిణీలో అక్రమాలను గుర్తించిన టీఎస్‌ సర్కార్‌ ఈ అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పింఛన్‌ సొమ్మును ఆన్‌లైన్‌ ద్వారా లబ్దిదారులకు అందిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం స్మార్ట్‌ కార్డులను రూపొందించాలని ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ అప్పగించినట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ కార్డులు అన్ని ఏటీఎం సెంటర్లలో చెల్లుబాటయ్యేలా ఏర్పాట్లు చేయబోతోంది. ఇక లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామ పంచాయితీలతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడే ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేయనుంది.

వితంతు, వికలాంగులు, బీడి కార్మికులు......

ఆసర పింఛన్ల పథకం ద్వారా వృద్దాప్య, వితంతు, వికలాంగులు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్ధులు ఇలా అందరినీ కలుపుకుంటే మొత్తం 30లక్షల 75 వేల మందికి పింఛన్లను తెలంగాణ సర్కార్‌ ఇస్తోంది. వీరిలో అధికశాతం నిరక్ష్యరాసులు కావటంతో ఏటిఎం ఆలోచన సత్ఫలితాలను ఇస్తుందా అనేది సందేహంగా మారింది. అందుకే తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి తర్వాత అన్నిగ్రామాలకు విస్తరించేందుకు సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది.

17:34 - September 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. సీఎంను కలిసినవారిలో ఎర్రబెల్లి, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి, వివేకానంద తదితరులున్నారు. పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలంతా ఐక్యంగా కృషి చేయాలని చంద్రబాబు చెప్పినట్లు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. త్వరలోనే 65 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని...అనుబంధ సంఘ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారని పేర్కొన్నారు. 

రేపు ఏపీలో విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపు..

విజయవాడ : బుధవారం రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. విశాఖపట్టణంలో విద్యార్థులపై జరిపిన లాఠీ ఛార్జీకి నిరసనగా ఈ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. 

17:32 - September 15, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు, కరువు పరిస్థితులపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ సీఎల్పీ తీర్మానం చేసింది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

17:30 - September 15, 2015

హైదరాబాద్ : ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో వరంగల్‌ జిల్లాలో మళ్లీ అలజడి నెలకొంది. నిశ్శబ్ధంగా ఉన్న ఏటూరునాగారం అడవుల్లో మళ్లీ కాల్పుల మోతలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టుల కదిలికలపై ఇప్పటికే అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు.. తాజా ఎన్‌కౌంటర్‌తో కూంబింగ్‌ మరింత ముమ్మరం చేశారు. 

వెంగళాపురం అడవుల్లో ఎన్‌కౌంటర్‌.....

వరంగల్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు సంచలనం సృష్టించాయి. తాడ్వాయి మండలం వెంగళాపూర్ అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వెంగళాపూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ బలగాలకు మావోయిస్టులు కనిపించడంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా జరిగాయి.

ఇద్దరు మృతిచెందినట్లుగా ధ్రువీకరించిన పోలీసులు.....

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి ప్రకటించారు. మృతులు మావోయిస్టు కీలక నేతలు కుక్కల రాజు, స్వరూపగా గుర్తించారు. కేకే దళానికి చెందిన నేతలుగా ప్రచారం ఊపందుకుంది. కొంతకాలంగా వరంగల్ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు వాల్ పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తుండటం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం ములుగు మండలం మల్లంపల్లిలోని ఎర్రమట్టి క్వారీ దగ్గర ప్రొక్లైనర్‌ను దగ్ధం చేశారు. తాజా ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీస్‌ ఉన్నతాధికారులు...పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను అడవుల్లో మోహరిస్తున్నారు.

ఎదురు కాల్పులతో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ గ్రామాలు...

మావోయిస్టులు, పోలీసుల ఎదురు కాల్పులతో వెంగళాపూర్‌, బయక్కపేట ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోతున్నాయి. గ్రామాల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ జోషికి జ్యుడిషియల్ కస్టడీ..

మధ్యప్రదేశ్ : ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ జోషికి కోర్టు సెప్టెంబర్ 19వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారుల జంట అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ సర్వీసు నుండి తొలగించిన సంగతి తెలిసిందే. 2010 ఫిబ్రవరిలో దంపతుల నివాసంపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రూ.350 కోట్లతో పాటు రూ.3కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు కనుగొన్నారు. 

 

17:27 - September 15, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లో ఆశావర్కర్లు మంత్రి ఈటల రాజేందర్‌ను అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని.. హన్మకొండ ఏకశిల పార్క్‌ వద్ద ఆశావర్కర్లు ఆందోళన చేశారు. హరిగ్రీవా మైదానం గుజరాత్ సభకు హాజరవుతున్నారన్న సమాచారంతో ఈటెల రాజేందర్‌ను ఆశావర్కర్లు అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందిచన ఈటెల.. కేబినెట్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని ఆశావర్కర్లకు హామీ ఇచ్చారు. 

కోల్ కతా సచివాలయానికి బాంబు బెదిరింపు..

పశ్చిమ బెంగాల్ : కోల్ కతా సచివాలయానికి బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో బాంబు నిర్వీర్య దళం ఘటన ప్రాంతానికి చేరుకుంది. దీనితో సచివాలయ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.

ట్రక్కులో తరలిస్తున్న 24 టన్నుల పేలుడు పదార్థాల స్వాధీనం..

ఢిల్లీ : ఇండోర్ - అహ్మదాబాద్ మార్గంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ లారీలో 24 టన్నుల పేలుడు పదార్థాలు లభ్యమమయ్యాయి. 

రేపు మచిలీపట్నానికి జగన్..

మచిలీపట్నం : వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం మచిలీపట్నంకు వెళ్లనున్నారు. భూ సేకరణకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. 

'టి'లో బలోపేతంపై చర్చించాం - వివేక్...

విజయవాడ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో టిటిడిపి నేతలు జరిపిన భేటీ ముగిసింది. తెలంగాణలో టిడిపి బలోపేతం, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాట్లపై చర్చించినట్లు టిటిడిపి ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. మూడు నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరుగుతుందన్నారు. 

కుంతియాతో ఉత్తమ్..జానా భేటీ..

హైదరాబాద్ : ఏఐసీసీ కార్యదర్శి కుంతియాతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదుపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

పోలవరం కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు..

విజయవాడ : పి.నయనవరం వద్ద పోలవరం కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన వారు షేక్ సుబానీ, మురళీలుగా గుర్తించారు. 

కడపలో పసికందు విక్రయం..

కడప : జిల్లాలో పసికూనను ఓ అమ్మ అమ్మకానికి పెట్టింది. పాత రిమ్స్ వద్ద వారం రోజుల బిడ్డను రూ.10వేలకు విక్రయించడానికి సిద్ధ పడింది. తల్లి రమణనమ్మను ఐటీడీఎస్ కార్యాలయానికి తరలించారు. నాలుగు రోజుల్లో పిల్లల అమ్మకానికి సంబంధించి ఇది రెండో ఘటన కావడం గమనార్హం.

 

అనుమానాలకు తావిస్తోన్న ప్రపంచ బ్యాంకు నివేదిక - ఎంపీ బూర..

హైదరాబాద్ : ప్రపంచ బ్యాంకు నివేదిక అనుమానాలకు తావిస్తోందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. మొదటి ఆరు స్థానాల్లో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే ఉండడం ప్రశ్నార్థకమన్నారు. తెలంగాణలో గీత కార్మికులున్న చోట కల్తీ కల్లు రావడం లేదని, కాంట్రాక్టర్లు ఉన్న చోట కల్తీ జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెటు..

ముంబై : మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 25,705.93 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 7,829.10 వద్ద ముగిశాయి.

సోమ్ నాథ్ భారతికి ముందస్తు బెయిల్ మంజూరు..

ఢిల్లీ : మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని సూచించింది. 

16:39 - September 15, 2015

హైదరాబాద్ : విశాఖలో పోలీసులు విద్యార్ధులపై తమ ప్రతాపం చూపించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్ధి సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. కలెక్టరేట్‌ గేట్‌ దగ్గర వీరిని అడ్డుకున్న పోలీసులు.. వెంటనే లాఠీలతో దాడి చేశారు. విచక్షణారహితంగా జరిగిన ఈ లాఠీఛార్జిలో పలువురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. 

16:38 - September 15, 2015

విజయవాడ : మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఆంధ్రా ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలో లక్ష ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది.

2013 నాటికి 6,586 పరిశ్రమలు .....

రాష్ట్ర విభజన అనంతరం కృష్ణాజిల్లాలో చిన్న, భారీ తరహా పరిశ్రమల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2013 నాటికి జిల్లాలో 6,586 పరిశ్రమలుండగా, 2013-14లో 299 పరిశ్రమలు, 2014-15లో 501 పరిశ్రమలు నెలకొల్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 331 పరిశ్రమలు నెలకొల్పగా... ఈ సంఖ్య 900కు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో ఎనిమిది మెగా ప్రాజెక్టులు .....

ఇప్పటివరకు జిల్లాలో ఎనిమిది మెగా ప్రాజెక్టులు ఉన్నాయి. దీని ద్వారా దాదాపు 7 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరో మూడు ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇవేకాక మరో 59 పెద్దతరహా పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. వీటిలో 16 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే సింగిల్‌డెస్క్‌ పోర్టర్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌లో అనుమతి ఇస్తున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఈ విధానం ద్వారా 130 మంది అనుమతులు పొందారు.

భూసేకరణ నోటిఫికేషన్లు తప్పుపడుతున్న పలువురు...

ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కొరకు భూసేకరణ నోటిఫికేషన్లు విడుదల చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం లక్షల ఎకరాలను సేకరిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి భూసేకరణపై ఉన్న శ్రద్ధ పరిశ్రమల స్థాపనపై లేదంటున్నారు. ఇదిలా ఉంటే పరిశ్రమలు, అభివృద్ధి పేరిట భూములు బలవంతంగా తీసుకోకుండా ఆచరణ సాధ్యమయ్యే వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని యువత కోరుతోంది. పరిశ్రమల్లో యువతకు స్థానం కల్పించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పలువురు కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం పరిశ్రమల కోసం భూములు సేకరించడంపైనే దృష్టి సారించకుండా.. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.

16:30 - September 15, 2015

హైదరాబాద్ : వరంగల్ సెంట్రల్ జైల్ ఖైదీ ధర్మాల రాంబాబు అనే వ్యక్తి అనారోగ్యంతో వరంగల్ జీఎంజీ లో చనిపోయాడు. నిన్న రాత్రి రాంబాబు చనిపోతే.. అతని పోస్టమార్టమ్‌పై అధికారులు స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన మృతుడి కుటుంబ సభ్యులు.. రాంబాబు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అధికారులను వేడుకున్నారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. వరంగల్ జైల్ సూపరెండెంట్‌తో మాట్లాడినా అధికారులు పట్టించుకోలేదు.

ఎస్ఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తం..

విశాఖపట్టణం : కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ చేస్తున్న ఆందోళన తీవ్ర ఉద్రక్త పరిస్థితులకు దారి తీసింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను లాఠీలతో చితక్కొట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

16:29 - September 15, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులను గుర్తించారు. మృతులు కుక్కల రాజు, స్వరూపగా నిర్దారించారు. వీరిని కేకే దళానికి చెందిన మావోయిస్టు నేతలుగా అనుమానిస్తున్నారు. 

16:27 - September 15, 2015

నిజామాబాద్‌ : జిల్లాలో రేంజల్‌ మండలం జూపల్లిలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు చనిపోయారు. పొలంలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఈ వ్యవసాయకూలీలు ఉన్న ప్రదేశంలోనే నేరుగా పిడుగు పడటంతో.. అక్కడికక్కడే చనిపోయారు. మృతుల పేర్లు రాణి, సంగీత, లక్ష్మిలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

లాలూ ఆ విషయాన్ని మరిచిపోతున్నారు - ఓవైసీ..

ఢిల్లీ : 2005 సంవత్సరంలో ఎలాంటి పిలుపు లేకుండానే బీహార్ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఆయన కొరకు ప్రచారం నిర్వహించామని ఈ విషయాన్ని లాలూ మరిచిపోతున్నారిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. 

ఢిల్లీలో ప్రభుత్వ..ప్రైవేటు పాఠశాలలకు సర్కార్ ఆదేశాలు..

ఢిల్లీ : రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధితో చిన్నారులు మృతి చెందుతుండడంతో సర్కార్ పలు చర్యలు తీసుకొంటోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ..ప్రైవేటు స్కూళ్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. దోమకాటు గురి కాకుండా విద్యార్థులు దుస్తులు ధరించే విధంగా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శరీరం కప్పి ఉంచేం విధంగా దుస్తులు వేయాలని, ఇందులో స్కూల్ డ్రస్ ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఏమీ లేదని ర్కొంది.

16:10 - September 15, 2015

హైదరాబాద్ : ముంబైలో లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. అంధేరీ-విల్లేపార్లె మధ్య ఏడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 

16:09 - September 15, 2015

హైదరాబాద్ : డెంగ్యూ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి వ్యాపారులు ముందుకు రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రావని అసోచామ్‌ సమావేశంలో సిఎం అన్నారు. గుళ్లు, గోపురాలకు ఖర్చు చేయడం కన్నా మానవతా దృక్పథంతో మనుషులను ఆదుకోవడానికి మించిన పుణ్యం ఏది లేదని సూచించారు. డెంగ్యూ వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంపై కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

 

16:06 - September 15, 2015

ఢిల్లీ : శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ అయ్యారు. అంతకు ముందు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో విక్రమ సమావేశమయ్యారు. విక్రమ సింఘే పలు ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు.  

బబ్లూను కిడ్నాప్ చేసిన నిందితుల అరెస్టు...

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో ఏడేళ్ల చిన్నారి బబ్లూని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం బబ్లూ కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. బాలుడిని కిడ్నాప్ చేసిన సమయంలో ఓ సెల్‌ఫోన్ పడిపోయింది. దీని ఆధారంగా ట్రాకింగ్ చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులు బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. సాయికృష్ణ, భాను ప్రకాష్, మనోహర్, శివరాజ్ లను అరెస్టు చేశారు. కారుతో పాటు నాలుగు సెల్ ఫోన్లు, మత్తు మందు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఐదు లక్షలివ్వాలి - టీ.సీఎల్పీ

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని తెలంగాణ సీఎల్పీ తీర్మానం చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించాలని, రైతు ఆత్మహత్యలు, కరవుపై సభలో చర్చ జరగాలని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా సమావేశాలు జరగాలని, తెలంగాణలో సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు నిర్వహిస్తే సరిపోదని తెలిపారు.

సమస్యలు పట్టించుకోకుండా ఉండేందుకే కొత్త జిల్లాలు - తమ్మినేని..

ఖమ్మం : ప్రజలు సమస్యలు పట్టించుకోకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రైతుఆ త్మహత్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. 

జగన్ సీఎం కాలేడు - కేఈ..

కర్నూలు : వంద సంవత్సరాలైనా జగన్ సీఎం కాలేరని డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. అభివృద్ధి పనులు చూడలేకే జగన్ టిడిపిపై బురద చల్లుతున్నాడని విమర్శించారు. 

ఎన్ కౌంటర్ లో మృతి చెందింది వీరే..

వరంగల్ : బయ్యక్కపేట - వెంగళాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కుక్కల రాజు అలియాస్ తిరుపతి, స్వరూపగా గుర్తించారు. ఏటూరు నాగారం (మం) చాపల్లికి చెందిన రాజు, స్వరూపలను వారం క్రితమే పోలీసులు అదుపులోకి తీసుక్నునట్లు తెలుస్తోంది.

 

15:54 - September 15, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడు ఇస్తారు ? పాత కార్డులనే ఇంకెన్నాళ్లు సాగదీస్తారు ? అక్టోబర్‌ 1 నుండి కొత్త కార్డులను జారీ చేస్తామన్న ఆర్ధికమంత్రి ఈటెల మాటలు నిజమయ్యే అవకాశమే లేదా ? తాజా పరిస్థితులు చూస్తుంటే అది నిజమనే అనిపిస్తోంది.

సంక్షేమ పథకాలపై ప్రభుత్వ ముద్ర .......

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై వారి ముద్ర ఉండేలా చూసుకోవడం పరిపాటి. అవి ఎలాంటి పథకాలైనా సరే... అందులో సీఎంతో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటోలు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రజల్లోకి నేరుగా వెళ్లే సంక్షేమ పథకాలైతే వీటిని మరింత పకడ్బందీగా అమలుచేస్తారు. రేషన్‌కార్డులాంటి వాటిలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదంతా ప్రభుత్వాలు మారినప్పుడు కామన్‌. కానీ... రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కొత్త రేషన్‌కార్డులు ఖచ్చితంగా జారీ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

ఏడాదిన్నరగా కొనసాగుతున్న వ్యవహారం.......

ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కొత్త రేషన్‌కార్డుల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. అక్టోబర్‌ 1 నుండి కొత్త కార్డులు జారీ చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రకటించారు.

రెండు కార్డులు సిద్ధం .......

కొత్త కార్డుల కోసం అధికారులు పలు నమూనాలు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని పౌరసరఫరాల శాఖ ఫైనల్‌ చేసింది. ఒకదానిపై కుడివైపున సీఎం కేసీఆర్‌ ఫొటో, ఎడమవైపున మంత్రి ఈటెల ఫొటోను.. మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగోను చేర్చారు. మరోదానిలో మొదటివైపు కేసీఆర్‌ ఫొటో, రెండోవైపు ఈటెల ఫొటోను చేర్చారు. ఈ కార్డు నమూనాల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయితే కేంద్రం ఈ ప్రపోజల్స్‌ను తిరస్కరించింది. ఆహార భద్రత చట్టంలో భాగంగా రేషన్‌ను ఆహార భద్రత కార్డుపై ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో రేషన్‌కార్డులను తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా ముద్రించేందుకు ఒప్పుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ కార్డుపై కేవలం కేంద్ర ప్రభుత్వ లోగో ఉంటే సరిపోతుందని సూచించింది.

కేంద్రం సూచనతో పునరాలోచనలో తెలంగాణ సర్కార్‌.......

ఇక ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై తెలంగాణ సర్కార్‌ పునరాలోచనలో పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి మరింత సమయం పట్టనుంది. దీంతో ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా అక్టోబర్‌ 1 నుంచి కార్డులు జారీ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న ప్రజలకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. 

15:51 - September 15, 2015

హైదరాబాద్ : ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరా తన సొంత గ్రామంలో క్రికెట్‌ ఆడి సందడి చేశారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో తన పెదనాన శ్రీరామరెడ్డి 109వ జయంతి ఉత్సవాల్లో రఘువీరా...శ్రీరామరెడ్డి మెమోరియల్ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా స్పందిస్తూ ఏపీలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా...ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదని విమర్శించారు.

 

15:49 - September 15, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం జగన్‌ చేపట్టబోయే దీక్ష అంశంపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాక సంపాదించిన అక్రమ ఆస్తులను జగన్‌ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు విభజన చట్టం హామీలు అమలైతే రాష్ట్రం ముందుకుపోతుందన్నారు.   

15:47 - September 15, 2015

హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం ఏపీ వీఆర్‌ఏలు ఆందోళన ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏపీ భూపరిపాలన శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనం 1500 వేలు చెల్లించడంతో పాటు తమను నాల్గో తరగతి ఉద్యోగుల కింద గుర్తించాలని డిమాండ్‌ చేశారు. 3 నెలల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

15:45 - September 15, 2015

వరంగల్‌ : నగరంలో రైలు కిందపడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాశిబుగ్గకు చెందిన స‌తీష్, సింధు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ స‌భ్యులు వారి ప్రేమ‌ను అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సతీష్‌, సింధు.. ధ‌ర్మారం స‌మీపంలోని ట్రైన్‌ ప‌ట్టాల‌పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సతీష్‌.. విశాఖ‌ప‌ట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు అతని బంధువులు తెలిపారు.

 

¤WA0 1760

15:43 - September 15, 2015

నల్గొండ : జిల్లా తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఇటియోస్‌ కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణీకులు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టోల్ గేట్ తరువాత నార్కెట్ పల్లి - అద్దంకి రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో ఛిద్రమైంది. ఆటోలో ఉన్న నలుగురు స్పాట్ లో చనిపోయారు. మరో ఆరుగురని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఈటెలను అడ్డుకున్న ఆశా వర్కర్లు..

వరంగల్ : హన్మకొండ ఏకశిల పార్కు వద్ద ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. ముదిరాజ్ మహాసభకు హాజరయ్యేందుకు ఈటెల హన్మకొండకు వచ్చారు. ఆశా వర్కర్లతో మంత్రులు ఈటెల, కడియం శ్రీహరిలు చర్చిస్తున్నారు. 

పాణ్యం ఎస్సీ కాలనీలో విషాదం..

కర్నూలు: పాణ్యం ఎస్సీ కాలనీలో కలుషిత నీరు తాగి 50 అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఆసుపత్రుల్లో కేజ్రీవాల్ అకస్మిక తనిఖీలు..

ఢిల్లీ : రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో సీఎం కేజ్రీవాల్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. డెంగ్యూ వ్యాధితో చిన్నారులు మృతి చెందడంపై కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ ప్రబలుతుండడంతో చికిత్స నిమిత్తం ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 

ఏపీలో పురపాలక, నగర పాలక సంస్థల ప్రత్యేక పాలన గడువు పెంపు..

హైదరాబాద్ : ఏపీలో పురపాలక, నగర పాలక సంస్థల ప్రత్యేక అధికారుల పాలన గడువు పొడిగించారు. శ్రీకాకుళం, కాకినాడ, ఒంగోలు, గుంటూరు రాజంపేట అధికారుల గడువును పొడిగించారు. 

మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : సచివాలయంలో ఉపాధి హామీ, గ్రామ జ్యోతి పథకాలపై జిల్లాల అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

నిజామాబాద్ లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

నిజామాబాద్ : రేంజల్ (మం) జూపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

భోపాల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన..

మధ్యప్రదేశ్ : భోపాల్ లోని పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ వార్డెన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడెక్కారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. 

ఢిల్లీలో ఎలాంటి ఇబ్బంది లేదు - కేజ్రీవాల్..

ఢిల్లీ : రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రబలుతుండడంపై ఆయన పై విధంగా స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఆసుపత్రుల్లో మరికొన్ని బెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. 

కరీంనగర్ లో వినాయక మండప పనుల్లో విషాదం..

కరీంనగర్ : ముస్తాబాద్ (మం) పోతుగల్ లో వినాయక మండపానికి విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. నరేష్, పరుశురామ్ లుగా గుర్తించారు. 

కరీంనగర్ తూర్పు డివిజన్ లో కూంబింగ్..

కరీంనగర్ : వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో కరీంనగర్ తూర్పు డివిజన్ లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మహాముత్తారం పరిసర గ్రామాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే అనుమానంతో తనిఖీలు చేశారు. 

హాంకాంగ్ లో సీఎం కేసీఆర్..

చైనా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్ లో పర్యటిస్తున్నారు. అక్కడ పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. 

వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ మృతి..

వరంగల్ : సెంట్రల్ జైలు ఖైదీ ధర్మాల రాంబాబు (45) మృతి చెందాడు. అనారోగ్యంతో బాధ పడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖైదీ స్వస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ చింతూరు. మృతుడి పోస్టుమార్టంపై అధికారులు తాత్సారం ప్రదర్శించడంతో మార్చూరీ వద్ద ఖైదీ బంధువులు పడిగాపులు కాస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా అప్పగించాలని జైలు అధికారులతో ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడారు. 

పుట్టపుర్తి ఎస్సీ హాస్టల్ వార్డెన్, అటెండర్ల సస్పెన్షన్..

అనంతపురం : విద్యార్థిని అత్యాచారం ఘటనలో పుట్టపుర్తి ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీదేవి, అటెండర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఏపీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అవమానం..

విజయవాడ : ఇంజనీర్స్ దినోత్సవం నాడే 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య'కు అవమానం జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరగానున్న విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని సీఎం, అధికారులు పట్టించుకోలేదు. రూ.లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని పెట్టినా అధికారులు పట్టించుకోలేదు.

 

నల్గొండలో కారు, ఆటో ఢీ..ఐదుగురి మృతి..

నల్గొండ : జిల్లాలోని తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారే మృతి చెందారని తెలుస్తోంది. మృతులు పెన్ పాడు (మం) పొట్లపాడుకు చెందిన జానకమ్మ, హనుమంతు, సైదులు, నర్సింహులుగా గుర్తించారు. 

భారత్ - పాక్ సిరీస్ కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది - అబ్బాస్..

హైదరాబాద్ : భారత్ - పాక్ సిరీస్ కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు. 18ఏళ్ల తరువాత జహీర్ నగరంలో పర్యటిస్తున్నారు. రాజీవ్ స్టేడియానికి ఆయన కితాబిచ్చారు.

 

వేరు శనగ రైతులతో ముగిసిన పోచారం సమావేశం..

హైదరాబాద్ : వేరు శనగ రైతులతో మంత్రి పోచారం జరిపిన సమావేశం కొద్దిసేపటి కింద ముగిసింది. వేరు శనగ రైతులకు ఇచ్చే సబ్సిడీపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని హామీనిచ్చారు. 421 జీవో ప్రకారం చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని మంత్రి పోచారం పేర్కొన్నారు. 

14:50 - September 15, 2015

హైదరాబాద్ : భారతదేశంలో ఎక్కువగా పౌష్టికాహార లోపంతో మతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతే సాధారణ మహిళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. అలా జరగకుండా ఉండాలంటే ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి? ప్రభుత్వం ఎలాంటి అవగాహన చర్యలను చేపట్టింది? అనే అంశంపై 'వేదిక'లో చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ నర్మద న్యూట్రీషియనిస్టు డాక్టర్ హరిత పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:41 - September 15, 2015

హైదరాబాద్ : తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టు పనుల నిధుల సమస్యలపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో సమావేశమయ్యారు మంత్రి హరీశ్ రావు.. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకుచెందిన ప్రాజెక్టుల పరిస్థితిపై నిన్న అధికారులతో చర్చించారు హరీశ్ రావు.. ఇందులో కాల్వల తవ్వకం, ప్రాజెక్టుల్లో భూములుకోల్పోయినవారికి పరిహారంపై వెంటనే చర్యతీసుకోవాలని అధికారులు మంత్రిని కోరారు.. ఇందుకుసంబంధించిన నిధులు విడుదల చేయాలని హరీశ్ రావు. ఈటెలను కోరారు. . 

14:39 - September 15, 2015

నెల్లూరు : దేశమంతటా ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తుంటే ఓ దగ్గరమాత్రం కుళ్లిపోయి కన్నీరు పెట్టిస్తోంది. కిలో కాదు రెండు కిలోలు కాదు సుమారు 4 టన్నుల ఉల్లిని కుళ్లబెట్టేశారు అధికారులు. కూరల్లో ఉడకాల్సిన సబ్సిడీ ఉల్లిని కేంద్రంలోనే కుళ్లబెట్టేశారు. తమ నిర్లక్ష్యం ముందు ఏదైనా సరే ఇలా పురుగులపాలు కావల్సిందేనని మరోసారి నిరూపించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగింది.

సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించి.....

ఇక్కడ నియోజకవర్గస్థాయి సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించి ఒకేసారి 22 టన్నుల ఉల్లిని దిగుమతి చేశారు. అయితే దీనికి తగ్గట్టుగా గదులను ఏర్పాటు చేయలేదు. ఉన్న ఒక్క గదిలోని ఉల్లినంతా నిల్వ చేశారు. దీంతో సరైన గాలి, వెలుతురు లేక ఉల్లిని దిగుమతి చేసిన కొద్దిరోజులకే కుళ్లడం ప్రారంభించింది.

వెంట వెంటనే సబ్సిడీకి విక్రయించడంలో......

మరో వైపు దిగుమతి అయిన ఉల్లిని వెంట వెంటనే సబ్సిడీకి విక్రయించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఉల్లివిక్రయ కేంద్రం దగ్గర రోజంతా పడిగాపులు కాసిన వారికి కనీసం ఉల్లివాసన కూడా చూపించలేదని స్థానికులు అంటున్నారు. కొంత మందికి మాత్రం సబ్సిడీ ఉల్లిని అందించారన్న విమర్శలు ఉన్నాయి. ఉల్లి కుళ్లిపోతుందన్న విషయాన్ని గమనించిన వెలుగు సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారుల నుంచి వచ్చిన స్పందన చూసి వెలుగు సభ్యులు అవాక్కయ్యారు. ఉల్లి కుళ్లిపోవడంతో వచ్చిన నష్టాన్ని మీరే భరించాలంటూ భారాన్ని వెలుగు సభ్యులపైకి నెట్టడంతో వారు షాక్‌కు గురయ్యారు.

తమను బాధ్యులను చేయడంపై వెలుగు సభ్యులు ఆందోళన....

జరిగిన నష్టానికి తమను బాధ్యులను చేయడంపై వెలుగు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నష్టాన్ని తాము భరించాల్సి వస్తోందని అంటున్నారు. జరిగిన నష్ట భారాన్ని అధికారులే భరించాలని, ఇందుకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

14:35 - September 15, 2015

అనంతపురం : తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజీలోని సీట్ల కేటాయింపులో జీవో నెంబర్‌ 120 ద్వారా రాయలసీమ విద్యార్ధులకు తీరని అన్యాయం జరుగుతోందని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక అనంతపురంలోని డీఎం అండ్ హెచ్ ఓ వద్ద ఆందోళన చేపట్టింది. వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక రక్షణ కోసం రాజ్యాంగంలో పొందుపర్చిన 371(డి)ని ప్రభుత్వం కాలరాస్తోందని వైద్యులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హృదయవిహారి అందిస్తారు.

14:32 - September 15, 2015

హైదరాబాద్ : సీఎల్పీ నేతలపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం నుంచి పొంగులేటి మధ్యలోనే వెళ్లిపోయారు. పోలవరం ముంపు ప్రాంతాలపై ఒక్కరూ మాట్లాడకపోవడంపై పొంగులేటి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు సొంత ఎజెండాలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలా అయితే పార్టీ నాశనమవుతుందని అన్నారు.

14:29 - September 15, 2015

కర్నూలు : కన్నతండ్రిలా చూసుకొని విద్యాబుద్దులు చెప్పాల్సిన లెక్చరర్లు కీచకులుగా మారిపోతున్నారు.. విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తున్నారు.. తాజాగా కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ అధ్యాపకుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.. నెలరోజులనుంచి మరింత రెచ్చిపోవడంతో బాధితురాలు తోటి విద్యార్థులకు చెప్పింది.. వెంటనే వారంతా కలిసి ఆ లెక్చరర్‌ను చితకబాదారు..

14:27 - September 15, 2015

అనంతపురం : పుట్టపర్తిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారంపై విద్యార్థి, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.. బాలికను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన జడ్పీ చైర్మన్ చెమన్నను అడ్డుకున్నాయి... ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ఐద్వా నేతలు డిమాండ్ చేశారు.. అటు చిన్నారిని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరామర్శించారు.. మరోవైపు బాధితురాలు చదువుతున్న పాఠశాలముందు విద్యార్థిని బంధువులు నిరసనకు దిగారు. ప్రధానోపాధ్యాయున్ని నిలదీశారు.. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పారు.. పుట్టపర్తిలోని ఎస్సీ హాస్టల్లోఉంటూ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది బాధితురాలు.. స్కూల్ అటెండర్ ముత్యాలు పాపపై అత్యాచారం చేశాడు.. తీవ్ర రక్తస్రావమైన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.. వెంటనే వారు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు..

ఇందిరాపార్కు వద్ద బీజేపీ భారీ ధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా నిర్వహించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు ఆందోళన కారులను అరెస్టు చేశారు. 

13:55 - September 15, 2015

ఢిల్లీ : భారత్‌లో వ్యాపార అనుకూల రాష్ట్రాలను ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. ఇందులో 71.14 శాతంతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 70.12 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం 13 వ స్థానంలో ఉంది. జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి. వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడులకు ఈ రాష్ట్రాలు అనుకూలమని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఇందులో నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలు కాగా...ఏపి ఎన్డీయే మిత్రపక్షం కావడం గమనార్హం. 1.23 శాతంతో అరుణాచల్‌ప్రదేశ్‌ అట్టడుగున ఉంది. ప్రపంచ బ్యాంక్‌ రిపోర్టులో భారత్‌ 142వ స్థానంలో ఉంది.

13:51 - September 15, 2015

తిరుపతి : ప్రత్యేకహోదా ఇవ్వడం వల్లే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. తిరుపతిలోని పీఎల్ ఆర్ కన్వెన్షన్ లో యువభేరీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు భారీ ఎత్తున యువత, నేతలు తరలివచ్చారు. ఈసందర్భంగా జగన్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నష్టపోతుందన్న భావనతో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల హోదాకు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఐదేళ్లు చాలదు..పదేళ్లు కావాలని విపక్ష నేతలుగా ఉన్న బీజేపీ నేతలు డిమాండ్ చేయడం జరిగిందన్నారు. కానీ అనంతరం మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఏదైనా మాట చెబితే అది జరుగుతుందని అందరూ ఎదురు చూస్తుంటారని, కానీ ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందనే దానికి ఇది పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. మంచిని నేర్పించాల్సిన పార్లమెంట్ హామీలను ఎలా నీటి బుడగులుగా చేయవచ్చో నేర్పించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
చంద్రాబాబుపై మండిపాటు...
కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రం దగ్గర సాగిలపడ్డారని తీవ్రంగా విమర్శించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజల జీవితాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి రకరకాల అబద్ధాలు చెబుతున్నారని, ప్రత్యేకహోదా ఇవ్వడం వల్లే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పరిశ్రమలు వస్తాయన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా వల్ల జార్ఖండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు, హిమాచల్ ప్రదేశ్ లో పది వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. ఏపీకి ఎందుకు ఇవ్వరని.. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తమ మంత్రులు రాజీనామా చేస్తారని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం బిజెపి, చంద్రబాబులపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
విద్యార్థులు జీవితాలతో బాబు చెలగాటం
విద్యార్థులు జీవితాలతో చంద్రబాబు చెలగాటం మాడుతున్నారని విమర్శించారు. జాబు రావాలంటే... బాబు అధికారంలోకి రావాలన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కొత్తగా జాబులు లేన్నారు. ఒకవేల జాబులు ఇవ్వకపోతే 2 వేల రూపాయల భృతి ఇస్తామన్నారని కానీ వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రజలు.. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని చెప్పారు. 'ప్రత్యేకహోదా మన హక్కు అడుక్కోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు. 'మన హక్కు కోసం మనమే పోరాడాలి అని పిలుపినిచ్చారు. ఈనెల 26 నుంచి తాను చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు.

 

కార్మికుల హక్కులు హరించే ప్రయత్నం - సీఐటీయూ

హైదరాబాద్ : చట్టాల సంస్కరణల పేరిట కార్మికుల హక్కులను హరించేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందని సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు పద్మనాభన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఇటీవలి సార్వత్రిక సమ్మెలో 15 కోట్ల మంది కార్మికులు పాల్గొనడమే ఇందుకు నిదర్శనమన్నారు.

 

స్మగ్లర్ రాజు భాయ్ లీలలు..

చిత్తూరు : అంతర్జాతీయ స్మగ్లర్ రాజుభాయ్ ఎట్టకేలకే పోలీసులకు చిక్కాడు. ముంబైలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 13కు పైగా ఎర్రచందనం కేసులు నమోదై ఉన్నాయి. రాజు వేయి టన్నుల ఎర్రచందనాన్ని తరలించాడు. గుజరాత్ లోని కాండ్లా, ముంబై రేవుల నుండి విదేశాలకు ఎర్రచందనం తరలించేవాడు. కస్టమ్స్ శాఖ పేరిట నకిలీ ముద్రలు సృష్టించి ఎర్రచందనాన్ని తరలించడంలో రాజు భాయ్ సిద్ధ హస్తుడు. జిల్లాలో పట్టుబడిన ప్రధాన స్మగ్లర్లకు రాజు భాయ్ బాస్. జితేంద్ర మోహన్ లాల్ అలియాస్ జిత్తు అలియాస్ రాజుభాయ్ గుజరాత్ వాసి. 

13:31 - September 15, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలు ఆ రాష్ర్ట రైతులను ఆందోళన కల్గిస్తున్నాయి. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. అభివృద్ధి పేరు చెప్పి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సర్కార్‌ అలజడి రేపుతోంది. భూ సేకరణ పేరుతో భూములను తీసుకోవడాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గుండెధైర్యం కోల్పోతున్న రైతన్నలకు మేమున్నామంటూ వామపక్షాలు పోరుబాట పట్టాయి. బలవంతంగా భూములు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నాయి.
భూములు ఇవ్వమని తేగేసి చెబుతున్న రైతులు
విమానాశ్రయాలు, పరిశ్రమలు, పోర్టులు.. ఇలా అభివృద్ధి పేరు చెప్పి.. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే సాగు భూములను తీసుకోవాలని సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. తమ భూములను ఇవ్వమని రైతులు చెబుతున్నా.. సర్కార్‌ మొండిగా ముందుకెళ్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు తెలియజేస్తున్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు వామపక్షాలు ముందునుంచి పోరాటం చేస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో 10 వామపక్ష నేతల పర్యటన
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు పోర్టు ప్రతిపాదిత గ్రామాలు, పోలాకి, కాకరాపల్లి థర్మల్ వ్యతిరేక పోరాట ప్రాంతాల్లో పది వామపక్షాల నేతలు పర్యటించారు. వీరి పర్యటనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సర్కార్‌ బలవంతంగా భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తే.. రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు.
మొండిగా వెళ్తున్న సర్కార్‌
ఏపీ రాజధాని భూములు.. విశాఖ ఎయిర్‌పోర్టు.. మచిలీపట్నం బందరు పోర్టు నిర్మాణం..శ్రీకాకుళం జిల్లా థర్మల్‌ భూములు.. పేరు ఏదైనా ఏపీ సర్కార్‌ రైతుల భూముల విషయంలో మొండిగా ముందుకెళ్తోంది. అభివృద్ధి పేరు చెప్పి.. రైతుల్లో అలజడి రేపుతోంది. పచ్చని సాగు భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని వామపక్షాల హెచ్చరిక
పేదల భూములను తీసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడాన్ని ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మొత్తంగా భూముల విషయంలో సర్కార్‌ తన వైఖరి మార్చుకోకుంటే.. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. రైతులెవరూ మనోధైర్యం కోల్పోవద్దని సూచిస్తున్నాయి.

 

ఆప్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు.

ఢిల్లీ : ఆగ్రాలో ఉన్న ఎఎపి కార్యాలయంలో ఢిలీ పోలీసు టీం తనిఖీలు చేపట్టింది. సోమనాథ్ భారతి కేసు విషయంలో పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పలువురు ఆప్ కార్యకర్తలు కార్యాలయం బయట ఆందోళన చేపట్టారు. 

భోగాపురం విమానాశ్రయ గ్రామాల్లో వామపక్షాల పర్యటన..

విజయనగరం : భోగాపురం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో వామపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా గుడుపువలసలో బహరింగసభ నిర్వహించారు. పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా ప్రజలు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఈ సభకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు హాజరయ్యారు. విమానాశ్రయం కోసం భూ సేకరణనను ఎదుర్కోవాలని సీపీఎం, సీపీఐ పార్టీలతో సహా మిగతా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అధికారులు వస్తే తరిమికొట్టాలని నేతలు పేర్కొన్నారు. 

13:20 - September 15, 2015

హైదరాబాద్ : నిర్మాణంపై ఓ నిర్ణయానికి వచ్చారు. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. ఆకాశంలో గాలిమేడలు కట్టించారు. అదిగో సూపర్‌స్పెషాలిటి హాస్పిటల్....ఇదిలో ఎయిమ్స్‌ అంటూ ఊదరగొట్టారు. ఊరించి..ఊరించి...చివరకు ఉసూరుమనిపించారు. దేవుడు వరమిచ్చినా....పూజారి కరుణించ లేదు. కేంద్రం సానుకూలంగా ఉన్నా....రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం కరువైంది. ఫలితంగా ఏపీలో ఆసుపత్రుల అభివృద్ధి... మాటలకే పరిమతమైంది.
ప్రభుత్వ చిత్తశుద్ధి బట్టబయలు..
ఏపీలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటళ్ల అభివృద్ధి, ఎయిమ్స్ ఏర్పాటులో... ప్రభుత్వ చిత్తశుద్ధి బట్టబయలైంది. నేతలు చెప్పే మాటలు....గాలిమాటలేని మరోసారి స్పష్టమైంది. నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా...రాష్ట్ర వాటా నిధులకు మాత్రం మోక్షం లభించటం లేదు. ఇటు ఎయిమ్స్ ఏర్పాటుకు ఇంకా స్థల నిర్ధారణ జరగలేదు. అటు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులపై...ప్రతిపాదనలను వెళ్లలేదు. దీంతో సూపర్ స్పెషాలిటి హాస్పిటళ్ల పరిస్థితి.... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
మ్యాచింగ్ గ్రాంట్లపై క్లారిటీ ఇవ్వని సర్కార్
గతేడాది జూన్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశంలోని పలు వైద్య కళాశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి స్వస్థ్‌ సురక్ష యోజన పథకానికి ఏపీలోని అనంతపురం, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలు ఎంపికయ్యాయి. ఆయా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం రూ.150 కోట్లు కేటాయించింది. ఆ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 20 శాతం చెల్లించాల్సి ఉంది. అంటే రూ.30 కోట్లు మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం..మ్యాచింగ్‌ గ్రాంట్లపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వలేదు.
ఎయిమ్స్‌ ఏర్పాటుకు కొనసాగుతున్న స్థలాన్వేషణ
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాటల్లో ఈ విషయం తేటతెల్లమైంది. రాష్ట్రం ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే...వెంటనే ప్రతిపాదలను పంపిస్తామని ఆయన తెలిపారు. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల విషయంలో...ప్రభుత్వం చిత్తశుద్ధేంటో...మరోసారి స్పష్టమైంది. మరోవైపు ఎయిమ్స్ ఏర్పాటకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండేలా....స్థలాన్ని ఎంపిక చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పుకొచ్చారు.
నిలిచిన కేంద్ర నిధులు
ఐదేళ్ల క్రితం సిద్ధార్థ వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సౌకర్యాల కల్సన కోసం....కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తొలి విడతగా రూ.7 కోట్లు కేటాయించగా, వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో రెండో విడత నిధులు నిలిచిపోయాయి. పక్క రాష్ట్రాలు మాత్రం రెండు, మూడు విడతల నిధులను సైతం సద్వినియోగం చేసుకున్నట్లు ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్ధితి వస్తోందని...వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనం త్వరగా మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయకపోతే....నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదముందని ప్రజాసంఘాలు వాపోతున్నాయి. అంతేగాక ఎయిమ్స్‌ ఏర్పాటకు వీలైనంత త్వరగా స్థలాన్వేషణ చేసి...కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

కేసీఆర్ త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు - లక్ష్మణ్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో నిజాం చరిత్రను చేర్చడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాన చరిత్రను ఆయన వక్రీకరిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. 

ప్రత్యేక హోదా కోసం ఉద్యమించండి జగన్ పిలుపు..

తిరుపతి : ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. తిరుపతిలోని పీఎల్ ఆర్ కన్వెన్షన్ లో యువభేరీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు భారీ ఎత్తున యువత, నేతలు తరలివచ్చారు. ఈసందర్భంగా జగన్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నష్టపోతుందన్న భావనతో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల హోదాకు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఐదేళ్లు చాలదు..పదేళ్లు కావాలని విపక్ష నేతలుగా ఉన్న బీజేపీ నేతలు డిమాండ్ చేయడం జరిగిందన్నారు. కానీ అనంతరం మోసం చేశారని విమర్శించారు.

ఈదర హరిబాబుకు సుప్రీంలో ఊరట..

ఢిల్లీ : ఈదర హరిబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వివాదం కేసులో హైకోర్టు కోర్టును సుప్రీం తోసిపుచ్చింది. జెడ్పీ ఛైర్మన్ పదవికి ఈదర అనర్హుడంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ..

హైదరాబాద్ : నగరంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఫీవర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. 

తార్నాక ఆసుపత్రిలో మంత్రి మహేందర్ రెడ్డి...

హైదరాబాద్ : తార్నాక ఆసుపత్రిలో మంత్రి మహేందర్ రెడ్డి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

ఇందిరాపార్కు వద్ద బీజేపీ ధర్నా..

హైదరాబాద్ : నగరంలోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది. 

గుంటూరులో సీపీఎం అఖిలపక్ష సమావేశం..

గుంటూరు : సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ప్రజా స్వామ్యంలో నిరసన తెలుపడం బాధితుల హక్కు అని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. హక్కులను కాలరాయడం అప్రజాస్వామికమని, సమస్యల పరిష్కారం కోసమే వామపక్షాలు పోరాటం సాగిస్తున్నాయని స్పష్టం చేశారు. సెక్షన్ 144 ఎత్తివేయకపోతే పోరాటమే మార్గమని తెలిపారు. 

13:00 - September 15, 2015

హైదరాబాద్ : భారీ వర్షం మరోసారి హైదరాబాద్ ను తడిసి ముంచేసింది. అరగంట నుంచి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తార్నాక, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ లో కుండపోతగా వర్షం పడుతోంది. దీంతో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

తిరుపతిలో యువ భేరీ సదస్సు ప్రారంభం...

తిరుపతి : పీఎల్ ఆర్ కన్వెన్షన్ లో యువభేరీ సదస్సు ప్రారంభమైంది. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైసీపీ ఈ సదస్సు ఏర్పాటు చేసింది. ఈసదస్సులో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు యువత భారీ సంఖ్యలో హాజరైంది. 

విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక వేధింపులు..

కర్నూలు : జిల్లాలోని బనగాపల్లెలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు లెక్చరర్ కు దేహశుద్ధి చేశారు. తక్షణం అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 

12:57 - September 15, 2015

విశాఖ : పశ్చిమ మధ్య, వాయవ్య ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరకోస్తాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కోస్తాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, ఒకటి, రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి.. పాడేరు ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పెద్దేరు జలాశయంలోకి భారీగా వరదనీరు చేరింది.. నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది.. ఒక గేటు ఎత్తివేసి 5వందల క్యూసెక్కులనీటిని కిందకు విడుదలచేశారు అధికారులు... విజయనగరం జిల్లాలోకూడా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి... రిజర్వాయర్లు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి..

 

12:33 - September 15, 2015

జమ్మూ కాశ్మీర్ : అన్నదాతలు..ప్రేమ వ్యవహరాలు..అమ్మాయిలు..మతాలు..దేశ భక్తులు..ఇలా ఒకటేమిటీ ప్రతి విషయంలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై బీజేపీ అగ్రనేతలు కూడా సీరియస్ అయిన సంగతులున్నాయి. కానీ కొందరు నేతలు మాత్రం 'నోరు' అదుపు పెట్టుకోవడం లేదు. తాజాగా 'గొడ్డు మాంసం'తో విందు ఇస్తానంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేత ఖుర్షీద్ అహ్మద్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు బీఫ్, హిందూవులకు శాకాహారంతో విందు ఏర్పాటు చేస్తానని తద్వారా మతసామరస్యానికి పాల్పడుతానని వెల్లడించారు. ఈ విందు పార్టీ అనుమతితో కాకుండా వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అధికార పీడీపీ, బీజేపీ నేతలు కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే గొడ్డు మాంసం..చికెన్.. చేపల అమ్మకాల్ని మూడు రోజుల పాటు నిలిపివేయాలంటూ మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం మంట పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని.. ఆ పార్టీకి మిత్రపక్షమైన శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్రతో పాటు ఇలాంటి ఆంక్షల్నే జమ్మూకాశ్మీర్.. రాజస్తాన్ లలోనూ అమలు చేస్తున్నారు. తాజాగా ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

12:28 - September 15, 2015

ఖమ్మం : పేదరికం... భవిష్యత్‌కు అడ్డుగోడగా నిలిచింది. ఆకలి....విజ్ఞానాన్ని కబళించే ప్రయత్నం చేసింది. కానీ ప్రతిభ, పేదరికపు అడ్డుగోడలను నిలువునా కూల్చేసింది. విజ్ఞానం ఆకలి సృష్టించిన ఆటంకాలను తుత్తునియలు చేసింది. సమాజ హితాన్ని కోరే ఆలోచనలు సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే నైపుణ్యాన్ని ఇచ్చాయి. ఖండాలు దాటి భరత ఖండం ఖ్యాతిని ఇనుమడింపచేసే అద్భుత అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
చిన్నవయస్సులోనే సామాజిక స్పృహ
ఉండేందుకు సరైన ఇల్లు లేదు. కట్టుకునేందుకు సరైన బట్టలు కూడా లేవు. అయితేనేం ఎనలేని ఆసక్తి, శోధించి సాధించే లక్షణాలు మెండుగా ఉన్నాయి. అందుకే కడు బీదరికంలో పుట్టిన సాధిక్‌ పాషా చిన్నవయస్సులోనే సామాజిక బాధ్యతను, సామాజిక స్పృహను అందిపుచ్చుకున్నాడు. 'దేశం నాకేమ ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమి ఇచ్చాను' అని ప్రశ్నించుకుని సమస్యాభూతాలపై సమరశంఖం పూరించాడు.
ప్రభుత్వ పాఠశాలలో సాధిక్‌ 9వ తరగతి విద్యార్ధి
ఖమ్మం నగరానికి చెందిన సాధిక్‌ పాషా రోటరీ నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సాధిక్‌ తండ్రి యాకూబ్‌ అలీ ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుడు కాగా తల్లి గృహిణి. వీరికి సొంత ఇల్లు కూడా లేదు. ఉండేందుకు కనీసం కొన్ని గజాల సొంత భూమి కూడా లేదు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన జాగాలో రేకుల షెడ్‌ వేసుకుని నివాసముంటున్నారు. పేదరికం ఎన్నో అవాంతరాలు సృష్టిస్తున్నప్పటికి సాధిక్‌ చదువుకుంటున్నాడు. తరగతి పుస్తకాలతో పాటు తన చుట్టూ ఉన్న సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత వల్ల కలిగే అనర్దాలను సాదిక్‌ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. సాదిక్‌ అంతటితో ఆగిపోలేదు పలు శిక్షణా శిబిరాల్లో రీసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించాడు. నాగుల్‌ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన సహకారంతో 'పీపుల్స్‌ ఫర్‌ రూరల్‌ అవేర్‌నెస్‌' అనే సంస్థను స్కూల్లోనే హ్యూమన్‌ రైట్స్ క్లబ్‌ను స్ధాపించాడు.
ఐరాసలో జరగనున్న జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం
సాధిక్ ప్రతిభను గమనించిన "వాదా నా తోడో " అనే స్వచ్చంధ సంస్థ ఐక్యరాజ్యసమితిలో జరగనున్న జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు. జనరల్ అసెంబ్లీలో నైన్‌ ఈజ్‌ మైన్‌ అంటూ బాలలకున్న 9హక్కులు, బాల్య వివాహాలు-వాటి దుష్పరిణామాలు, బాలకార్మిక వ్యవస్ధ-వెట్టి చాకిరీతో పాటు భారతదేశ గొప్పతనం పై సాధిక్‌ ప్రసంగిస్తాడు. ఐక్యరాజ్యసమితిలో జరగనున్న జనరల్‌ అసెంబ్లీకి దేశవ్యాప్తంగా ఎన్నికైన 17మంది విద్యార్ధుల్లో సాధిక్‌ ఒకడు.
ఈ నెల 22న అమెరికాకు బయలు దేరుతున్న సాధిక్‌..
ఈ నెల 22న అమెరికాకు బయలు దేరుతున్న సాధిక్‌.. ప్రతిభ ఉంటే చాలు, అవరోధాలన్నీ తొలగిపోతాయనే లోకోక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. 25,26 తేదిల్లో జరిగే జనరల్ అసెంబ్లీలో సాధిక్‌ ప్రసంగించి ఐక్య రాజ్య సమితి సాక్షిగా భారత్‌ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించనున్నాడు.

 

కూంబింగ్ నిర్వహిస్తుండగా కాల్పులు - డీఐజీ..

వరంగల్ : వెంగళాపూర్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారపడ్డారని డీఐజీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల్లో ఓ మహిళ ఉందన్నారు. 

మళ్లీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశం - ఎస్పీ

వరంగల్ : మళ్లీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉందని ఎస్పీ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. ఈ రోజు ఉదయం వెంగళాపూర్ వద్ద ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. 

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ లో ఖాళీగా ఉన్న స్థానాన్ని వారంలోగా భర్తీ చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయవద్దని కోర్టు సూచించింది. 

సూదిగాడు అనుకుని వ్యక్తి నిర్భందం..

కృష్ణా : జిల్లాలోని అగిరిపల్లి మండలం సగ్గూరులో సైకో సూదిగాడు అనుకుని మతిస్థిమితం లేని శివను గ్రామస్థులు నిర్భందించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. శివ మతిస్థిమితం లేని వాడని పోలీసులు నిర్ధారించారు. 

నీటి పారుదల ప్రాజెక్టులపై ఈటెలతో హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఈటెలతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు తమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకిరణ్ రెడ్డి పాల్గొన్నారు. 

వరంగల్ లో కొనసాగుతున్న కాల్పులు..

వరంగల్ : జిల్లాలోని తాడ్వాయి మండలం వెంగలాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

 

పౌరసరఫరాల శాఖపై ఈటెల సమీక్ష..

హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష జరిపారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, పప్పు ధాన్యాల ధరలపై సమీక్ష నిర్వహించారు.

 

జగన్ ను సూదీగాడుతో పోల్చిన దేవినేని..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఏపీ మంత్రి దేవినేని ఉమ 'సూదీగాడు'తో పోల్చారు. సూదిగాళ్ల వల్ల రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని, జగన్ కూడా సూదీగాడిలానే తయారయ్యారని విమర్శించారు. 

12:09 - September 15, 2015

గుంటూరు : రక్షకభటులు భక్షక భటులవుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అత్యుహాన్ని ప్రదర్శిస్తున్నారు. దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాటకు చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తాను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినకుండా పోలీసులు చితకబాదారు. కోటిరెడ్డి శరీరం, తలపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బెయిల్ పై కోటిరెడ్డిని విడిపించుకొచ్చారు. తీవ్రమనస్తాపం చెందిన కోటిరెడ్డి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విచారణ పేరిట బాధితుడిని పోలీసులు చితకబాదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల వేధింపులే కోటిరెడ్డి మృతికి కారణమని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈఘటనపై పోలీసులు ఏమీ మాట్లాడక పోపడం గమనార్హం.

 

12:05 - September 15, 2015

మహారాష్ట్ర : ముంబైలో లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే పెను ప్రమాదం తప్పింది.

 

ఢిల్లీలో డెంగ్యూతో చిన్నారి మృతి..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. మంగళవారం ఉదయం శ్రీనివాస్ పురిలో ఐదు సంవత్సరాల చిన్నారి అమన్ డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు.

మోడీతో భేటీ అయిన శ్రీలంక ప్రధాని..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. 

ముంబైలో పట్టాలు తప్పిన రైలు..

ముంబై : పశ్చిమ రైల్వే ట్రైన్ సర్వీసు పట్టాలు తప్పింది. విలే పార్లే రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

11:49 - September 15, 2015

భారత్ లో వ్యాపార అనుకూల రాష్ట్రాలను ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ నివేదికలు గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా లేవని.. నివేదికలు గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండాలని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. భారత్ లో వ్యాపార అనుకూల రాష్ట్రాలను ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఇదే అంశంపై గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను చూద్దాం...
గుజరాత్ మొదటిస్థానంలో ఉండడం ఆశ్చర్యం లేదు. గుజరాత్ కమ్యూనిటీకి వ్యాపారం దృక్పతం ఉంది. బాంబే హై వచ్చినప్పటి నుంచి ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి. మోడీ సీఎం కాక ముందు కూడా సారిశ్రామిక అభివృద్ధిలో గుజరాత్ మొదటి రాష్ట్రం మోడీ సీఎం అయ్యాక కూడా మొదటి రాష్ట్రమే. మొదటి నుంచి కూడా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షిండంలో ప్రథమ స్థానంలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలో పరిశ్రమలే లేవు..పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కావు. తమిళనాడు 50 శాతం అర్బన్ నైజ్డ్ రాష్ట్రం..తమిళనాడుకు 12 వ స్థానం ఇవ్వడం ఆశ్చర్యకరం. బ్రహ్మండంగా అభివృద్ధి చెందిందన్న తెలంగాణ రాష్ట్రం 13 వ స్థానంలో ఉంది. కట్టుబట్టలతో ఉన్న ఎపి రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఇది ఎలా కరెక్టు. ఎపికి ప్రత్యేకహోదా, ప్యాకేజీలను ఎగ్గొట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రంపచబ్యాంకు నివేదకను ఉపయోగించుకుంటుందా అన్న అనుమానం కల్గుతుంది. తమిళనాడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం.. అలాంటప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల కంటే వెనుకాల ఎందుకుంటుంది..? నిన్నటి దాకా ఎపి, తెలంగాణ కలిసే ఉంది. నిన్నటి దాకా కలిసే ఉన్నప్పుడు ఒక భాగం మూడో స్థానంలో, మరో భాగం 13 స్థానంలో ఎలా ఉంటుంది..? ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధి, బాగున్నప్పుడు.. ఇన్సెటివ్ ఎందుకు..? ప్రోత్సకాలు ఎందుకు?? ఎపికి ప్రోత్సకాలను వద్దమని చెబుదామా?? బ్రహ్మండంగా అభివృద్ధి చెశానన్న రాష్ట్ర13 వ స్థానంలో ఉంది.. కట్టుబట్టలతో ఉన్నామన్న రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. విశాఖపట్నం మినహా ఎపిలో ఏ పరిశ్రమలు ఉన్నాయి.. ? తెలంగాణలో బొగ్గు, సిమెంట్ పరిశ్రమలున్నాయి. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్ రంగంలో 14 శాతం ఎగుమతులు చేస్తున్నారు. మిస్సైల్, అగ్నిక్షిపణిలో వాడే పరికరాలు హైదరాబాద్ లోనే తయారవుతాయి. అలాంటప్పుడు తెలంగాణ ఎలా వెనుకబడిన రాష్ట్రం అవుతుంది. ఎప్పుడైనా నివేదికలు గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం తెలంగాణకు, ఎపికి అన్యాయం చేయడమే అవుతుంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు నిదేకను తెలంగాణ, ఎపిలు వ్యతిరేకించాలి. అని చెప్పారు. ఇంజనీరింగ్.. దినోత్సవం, జగన్ దీక్ష పై మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

చిన్నారులకు ఎలుకల మందు తాగించిన తల్లి..

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో కొడుకు, కుమార్తెకు ఓ తల్లి ఎలుకల మందు తాగించింది. ఆసుపత్రిలో చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

భద్రతా మండలి సభ్యదేశాల విస్తరణకు యూఎన్ఓ సానుకూలం?

వాషింగ్టన్ : భద్రతా మండలి సభ్యదేశాల విస్తరణకు ఐక్యరాజ్య సమితి సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యూఎన్ వోలో శాశ్వత సభ్యత్వంపై భారత్ కు అడ్డంకులు తొలుగుతున్నాయని తెలుస్తోంది. 

కాసేపట్లో తిరుపతిలో యువ భేరీ..

తిరుపతి : పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో కాసేపట్లో యువ భేరీ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరు కానున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. నాచారం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో భారీ వర్షం కురిసింది. దీనితో రహదారులన్నీ జలమయమయ్యాయి. 

హైకోర్టును ఆశ్రయించిన సోమ్ నాథ్ భారతి..

ఢిల్లీ : ముందస్తు బెయిల్ కోసం రా హైకోర్టును మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి ఆశ్రయించారు. భర్త సోమ్ నాథ్ భారతి తనను వేధిస్తున్నారని భార్య ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

11:24 - September 15, 2015

చిత్తూరు : మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండిల్ స్మగ్లర్ రాజుభాయ్ ను ముంబైలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అందేరి ప్రాంతంలో ఇవాళా తెల్లవారుజామున రాజుభాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లతో రాజు భాయ్ కు సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై 25 నంచి 30 కేసులున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రంలోగా అతన్ని చిత్తూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

మన్మోహన్ నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ పై వాయిదా..

ఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కె.ఎం.బిర్లాను నిందితులిగా చేర్చాలన్న పిటిషన్ పై వాదనలను సుప్రీం నిరవధికంగా వాయిదా వేసింది. 

11:06 - September 15, 2015

అందరూ కూర్చొని పని చేయలేరు..కొంతమంది నిలబడి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ట్రాఫిక్ పోలీసులు..హోం గార్డులు..బందోబస్తులో ఉండే పోలీసులు. వీరు నిలబడే పని చేయాల్సి ఉంటుంది. దీనితో వారి కాళ్లు కొన్నిసార్లు నొప్పి పెడుతుంటాయి. ఇలాంటి వారి కోసం ఓ సంస్థ 'బయోనిక్ పాంట్స్' ప్రవేశ పెట్టింది. వీటిని ధరించడం వల్ల కూర్చొవాలని అనుకున్నప్పుడు హాయిగా కూర్చొవచ్చు. (ఫొటోల్లో లాగా) ఇవి షూకి ఎటాచ్ చేయబడి ఉంటుంది. దీనివల్ల కాళ్లను వంచి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూర్చొనే ఫీలింగ్ కలుగుతుంది. 

పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వ్యక్తి ఆత్మహత్య..

గుంటూరు : దొంగతనం చేశాడని కోటిరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో తీవ్రమనస్థాపానికి చెందిన కోటిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాటలో చోటు చేసుకుంది. విచారణ పేరిట బాధితుడిని పోలీసులు చితకబాదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తాలుపేరు ప్రాజెక్టు 11 గేట్ల ఎత్తివేత..

ఖమ్మం: జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు వరదనీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. అధికారులు ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరును గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 

10:47 - September 15, 2015

నాజూగ్గా మారేందుకు వారికి టైం ఇచ్చారు..అయినా సన్నగా మారలేదు..అదే స్థూలకాయంతో ఉన్నారు..ఇంకేముంది..మీరు ఉద్యోగాలకు పనికి రారు..అంటూ వారిని ఉద్యోగాల నుండి పీకేశారు..స్థూలకాయం ఎంత పనిచేసిందిరా అంటూ వారు లబోదిబోమంటున్నారు..ఎవరు అనుకుంటున్నారా 'ఎయిర్ హోస్టెస్' సిబ్బంది.
ఎయిర్ హోస్టెస్ అంటేనే ఎన్నో నిబంధనలు ఉంటాయన్నది తెలిసిందే. 'ఎయిర్ ఇండియా' సంస్థలో పనిచేస్తున్న 600 మంది సిబ్బందికి స్థూలకాయం ఉంది. వీరందరికీ ఒళ్లు తగ్గించుకోవాలని సూచనలు చేసింది. ఇందుకు ఏడాదిన్నర సమయం ఇచ్చింది. కానీ సమయం మీరినా అందుఓ కొంతమంది స్థూలకాయం తగ్గకపోవడంతో ఏకంగా 125 మంది ఎయిర్ హోస్టెస్ లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఎయిర్ హోస్టెస్ ల విషయంలో పలు ఎయిర్ లైన్స్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణీకులకు ఆకర్షిణీయంగా కనిపించేలా అందం..చక్కటి శరీరాకృతి..మంచి ఎత్తు..నాజుగ్గా ఉండడం..ఇలా ఎన్నో నిబంధనలు ఉంటాయి. నియమిత బరువు కన్నా ఎక్కువ పెరిగితే వీరిని విధుల నుండి తొలగించేలా ముందే నిబంధనలు రాసుకుంటుంటారు. దీనితో వారు తమ శరీరాకృతి కోసం చాలా కష్ట పడుతుంటారు. 

10:39 - September 15, 2015

ముంబై : మహారాష్ట్ర ఆహార శాఖా మంత్రి గిరీష్ బపత్ తన స్థాయిని, హోదాను మరిచి.. విద్యార్థుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అశ్లీలాన్ని ప్రోత్సహించేలా వున్నాయని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుణెలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన, "రాత్రిళ్లు మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసైపోయిందని ఎలా అనుకుంటారు. మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే" అని అన్నారు. గిరీష్ వ్యాఖ్యలపై ఓ న్యాయ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

ముంబైలో స్మగ్లర్ రాజు భాయ్ అరెస్టు..

చిత్తూరు : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ రాజుభాయ్ ను ముంబైలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్లతో రాజు భాయ్ కు సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా చిత్తూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేరళలో ఐఎస్ మద్దతు దారుల అరెస్టు..

కేరళ : రాష్ట్రంలో నలుగురు ఐఎస్ మద్దతు దారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు సౌదీ నుండి వచ్చినట్లు భావిస్తున్నారు. 

10:36 - September 15, 2015

విశాఖ : పశ్చిమ మధ్య, వాయవ్య ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరకోస్తాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కోస్తాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, ఒకటి, రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

 

10:36 - September 15, 2015

నిత్యం రాజకీయాలు..సభలు..సమావేశాలతో ఎంతో బిజీ బిజీగా ఉండే సీఎం చంద్రబాబు సినిమా చూశారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఆయన సినిమా చూశారు. చూసిన అనంతరం ఆ సినిమా ఎంతో బాగుందని మెచ్చుకున్నారు కూడా. ఏ సినిమా అని అనుకుంటున్నారా ? అదేనండి ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, శృతిహాసన్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని బాబు చూసిన మెచ్చుకున్నారు. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనే కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఈ చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన 'స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు' కార్యక్రమానికి దగ్గరగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా సీఎం చంద్రబాబు అభినందించారు. ఒకవైపు సూపర్ హిట్ టాక్‌తో 'శ్రీమంతుడు' బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొడుతుంటే... మరో వైపు ఈ చిత్రాన్ని చూసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రభావంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ నాయకులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 

10:33 - September 15, 2015

విజయనగరం : ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన గుల్లిపిల్లి మురళి, చోడిపల్లి జ్యోతిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంటనే వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని.. చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.

 

రేపు ఇబ్రహింపట్నంకు రానున్న సీఎం చంద్రబాబు..

విజయవాడ : బుధవారం ఇబ్రహింపట్నంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం బహిరంగసభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. 

డెస్కు జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు - మంత్రి పల్లె..

పశ్చిమగోదావరి : డెస్కు జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. అక్రిడేషన్ కమిటీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు చోటు కల్పిస్తామన్నారు. 

బిందు సేద్యం కోసం రూ.వెయి కోట్లు - ప్రత్తిపాటి..

పశ్చిమగోదావరి : బిందు సేద్యం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు. తణుకులో రైతు కోసం చంద్రన్న యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో మంత్రులు ప్రత్తిపాటి, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. యంత్రాల రాయితీ పథకం పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని, యంత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించారు.

 

కడపలో బీజేపీ ప్రజాప్రతినిధుల పర్యటన..

కడప : జిల్లాలో బీజేపీ ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న జీఎన్ఎస్ఎఫ్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. పైడిపాలెం ప్రాజెక్టును నేతలు పరిశీలించారు. 

10:25 - September 15, 2015

అనంతపురం : దేశంలో నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశాన్ని భారతమాతగా చెప్పుకుంటున్న దేశంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కామాంధుల దాష్టీకానికి స్త్రీలు తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. మృగాళ్లు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. ఒక ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంటుంది. దుర్మార్గులు.. సభ్య సమాజం తలదించకునే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి బాలికల హాస్టల్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌లో అటెండర్‌ విధులు నిర్వహిస్తున్న ముత్యాలు అనే వ్యక్తి 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో శ్రీ సత్యసాయి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

పాశ్వాన్ ఇంటికి చేరుకున్న ధర్మేంద్ర ప్రదాన్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మంగళవారం ఉదయం రాం విలాస్ పాశ్వాన్ ఇంటికి వెళ్లారు.

పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం..

విశాఖపట్టణం : జిల్లా ఏజెన్సీలో సోమవారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 

10:13 - September 15, 2015

హైదరాబాద్‌ : మియాపూర్‌లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. విజయవాడలో అవినాష్‌ ఆచూకీ లభ్యమైంది. అవినాష్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న అవినాష్‌ నిన్న స్కూల్‌ నుంచి తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్‌ చేశారు. మరోవైపు అవినాష్‌ కిడ్నాప్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మియాపూర్ లోని హెచ్ ఎంటీ సర్వపురి కాలనీలో 9వ తరగతి చదువుతున్న అవినాశ్ నిన్న సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. ఎపి 29 బిబి 2727 వాహనంలో బాలుడిన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు బాలుడి తండ్రి శ్రీనివాస్ కు పోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రాత్రి 8గంటలకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడలో విద్యార్థి అవినాష్ ఆచూకీని కనుగొన్నారు. అవినాష్ ను పోలీసులు మధ్యాహ్నం వరకు హైదరాబాద్ కు తీసుకురానున్నారు.

 

మంత్రి సత్యేంద్ర జైన్ అకస్మిక తనిఖీలు..

ఢిల్లీ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మంగళవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అరుణ అసఫ్ ఆలీ ఆసుపత్రిలో ఆయన తనిఖీలు నిర్వహించి రోగులు, వైద్యులతో మాట్లాడారు. అవుట్ పేషెంట్ విభాగం 8.30 గంటల్లోగా తెరవాలని సూచించడం జరిగిందని ఆయన ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు.

పశు పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కామినేని..

కడప : జిల్లా పులివెందుల సమీపంలోని రూ.383.26 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ ఇందిరా గాంధీ పశుపరిశోధన కేంద్రాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీ హరిబాబు కూడా ఉన్నారు. 

మూడుకు చేరుకున్న కల్తీ కల్లు మృతుల సంఖ్య..

నిజామాబాద్ : జిల్లాలో కల్తీ కల్లు మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో 25 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

09:44 - September 15, 2015

పొగాకు రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్, కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్, టిడిపి నేత సూర్యప్రకాశ్, వైసిపి కొండా రాఘవరెడ్డిలు పాల్గొని, మాట్లాడారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పొగాకు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. ఎపికి ప్రత్యేకహోదాపై మాట్లాడారు. ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తన విజయం దేశ ప్రజలకు అంకితం - సానియా..

హైదరాబాద్ : తాను సాధించిన యూఎస్‌ ఓపెన్‌ విజయాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నానని టెన్నిస్‌స్టార్‌ సానియామీర్జా చెప్పారు. హైదరాబాద్‌కు చేరుకున్న సానియాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమె కుటుంబసభ్యులు, మిత్రులు ఘనస్వాగతం పలికారు.

 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ..

చిత్తూరు : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ఈ రోజు సాయంత్రం మాడ వీధుల్లో విశ్వక్సేనుడు ఊరేగనున్నారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

 

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

విజయనగరం : జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేశారు. పెళ్లి పెద్దలు ఒప్పుకోకపోవడంతో నిద్రమాతలు మింగి ఆత్మహత్యయత్నం చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. 

మియాపూర్ లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

హైదరాబాద్ : మియాపూర్ లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం అయింది. విజయవాడలో బాలుడి ఆచూకీ లభ్యం అయింది. విద్యార్థిని పోలీసులు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

 

09:30 - September 15, 2015

దేశంలో సబ్సిడీలను రక్షించుకోవాలని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి పిలుపినిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దేశంలోని పేదల అభివృద్ధికి సబ్సిడీలు ఉండాలని.. వాటికి కోసం పోరాటాల చేయాలని పిలుపునిచ్చారు. కొంత మంది ఉపయోగార్థం... పెద్ద మొత్తంగా ఉన్న ప్రజలకు నష్టం కలిగించే విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు కుదిస్తోంది. ఎత్తివేస్తోంది. ధాన్యం సేకరణ విధానానికి స్వస్తి చెబుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటపడుతున్నాయి. కేంద్రం నుంచి సిగ్నల్స్ అందుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐకేపీ ద్వారా ధాన్యం సేకరణ విధానానికి రాంరాం చెబుతోంది. మరి ఇప్పుడు రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి? ఎవరికి అమ్ముకోవాలి? లెవీ సేకరణ విధానం ఎత్తివేయడం వల్ల పౌర సరఫరా వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది? మరికొన్నాళ్ల తర్వాత మన ఊళ్లో, మన వీధిలో రేషన్ దుకాణాలు వుంటాయా? రేషన్ సరుకులుంటాయా? లెవీ విధానం ఎత్తివేస్తున్న ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను ఏం చేయబోతున్నాయి? వంటి అంశాలపై మల్లారెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:16 - September 15, 2015

కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నదాతకు శాపంగా మారుతున్నాయి. లెవీ సేకరణ విధానం ఎత్తివేసి, సబ్సిడీలకు మంగళం పాడుతుండడంతో ఇటు రైతులు, అటు రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదలు అష్టకష్టాలు అనుభవించాల్సిన దుస్థితి దాపురిస్తోంది.
అన్నదాతకు అన్నీ కష్టాలే
అన్నదాతకు అన్నీ కష్టాలే. ఇప్పటికే కరువు కోరల్లో విలవిలలాడుతున్న అన్నదాతకు పులిమీద పుట్రలా మరో కష్టం వచ్చిపడుతోంది. రేయింబవళ్లు అష్టకష్టాలు పడి, పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో, ఎవరికి అమ్ముకోవాలో అర్ధం కాని దుస్థితి దాపురించబోతోంది. ఇంతకాలమూ రైతులు పండించిన ధాన్యంలో కొంత భాగాన్ని ప్రభుత్వాలు నేరుగా సేకరిస్తే, మరికొంత భాగాన్ని ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధరకు మిల్లర్లు కొనుగోలు చేసేవారు. మన ఉభయ రాష్ట్రాల్లో ఇందిరా క్రాంతి పథం కార్యకర్తల ద్వారా ప్రభుత్వం ధాన్యం సేకరించేది. దీనివల్ల కుగ్రామాల్లోని రైతులకు సైతం మేలు జరిగేది. ఇటు రైతులకు మద్దతు ధర లభిస్తే, అటు ఐకేపీ కార్యకర్తలకు ఎంతోకొంత ఆదాయం లభించేది. ఐకేపీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వ గిడ్డంగులకు చేర్చి, అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు తరలించి, తెల్ల రేషన్ కార్డుదారులకు చౌకధరలకు అందించేవారు. ఇప్పుడు ఈ విధానం రద్దవుతోంది. లెవీ సేకరణ విధానానికి కేంద్రం మంగళం పాడింది. ఇక నుంచి లెవీని సేకరించేది లేదని మోడీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెవీ సేకరణకు రాంరాం చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం సేకరణ విధానాన్ని ఎత్తి వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయలేదు. మరోవైపు కేంద్రం లెవీ సేకరణకు స్వస్తి చెప్పడంతో మిల్లర్లు కూడా మునపటిలా ధాన్యం కొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలో అర్ధంకాని దీనావస్థలో చిక్కుకుంటున్నారు. గతంలో మాదిరిగా అన్నదాతకు మద్దతు ధర దక్కుతుందన్న గ్యారంటీ లేదు . ఇక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యం రాబోతోంది.
సామాన్యులకు దిక్కెవరు?
మరోవైపు ప్రభుత్వాలు లెవీ సేకరణను ఎత్తి వేయడంతో దాని ప్రభావం ప్రజా పంపిణీ వ్యవస్థ మీద కూడా పడబోతోంది. కేంద్ర గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు వుండవు కాబట్టి, మునపటిలా ప్రభుత్వాలు చౌక ధరలకు బియ్యం, పప్పు సరఫరా చేసే ఆస్కారం వుండదు. ఇక బియ్యానికి బదులుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే విధానం రాబోతున్నది. ప్రభుత్వం తాను ఇచ్చే సబ్సిడీని మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఎవరైనా బయట మార్కెట్ లోనే బియ్యం కొనుక్కోక తప్పనిసరి పరిస్థితి రాబోతోంది. తాము పండించిన పంటకు మద్దతు ధర లభించక, రైతులు నష్టపోతుంటే, బహిరంగ మార్కెట్ లో అధిక ధరలు పెట్టి తిండిగింజలు కొనుక్కోవాల్సిన దుస్థితి పేదలకు ఎదురుకాబోతోంది. బహిరంగ మార్కెట్ మీద మన ప్రభుత్వాలకు ఎంత కంట్రోల్ వున్నదో మనం చూస్తూనే వున్నాం. ఉల్లిగడ్డలు, పప్పులు బ్లాక్ చేసి, అడ్డగోలుగా ధరలు పెంచి, జనంతో చెడుగుడు ఆడుకుంటున్నా చోద్యం చూస్తున్నాయి తప్ప బ్లాక్ మార్కెట్ శక్తులను నియంత్రించే చర్యలేవీ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. కనీసం బ్లాక్ మార్కెట్ శక్తులను కూడా నియంత్రించలేని అసమర్ధ ప్రభుత్వాలున్న చోట ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా ఎత్తివేస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? రెక్కాడితేనే డొక్కాడని పేదలు బతికేదెలా? ఈ ప్రశ్నే ఇప్పుడు కలవరపెడుతోంది?
ఆర్థిక సంక్షోభాలు
ఇటు అన్నదాతనీ, అటు బీదలను చావుదెబ్బ కొట్టిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను కూడా ఎత్తివేస్తోంది. గ్యాస్ సబ్సిడీల్లో కోతలేస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేస్తోంది. ఈ చర్యలన్నీ సామాన్యుల జీవితాల్లో ఆర్థిక సంక్షోభాలు సృష్టించబోతున్నాయి.

 

09:14 - September 15, 2015

వరంగల్ : జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగాయి. పోలీసులకు - మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులతో సమీప గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. బయ్యక్కపేట - వెంగలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు ఇందులో ఒక మహిళా కూడా ఉంది. మృతులు కేకేడబ్ల్యూ కమిటీ సభ్యులుగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ ను జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝూ ధృవీకరించారు. ఘటనాస్థలం నుండి రైఫిల్, కార్బన్ లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దళాలు కూంబింగ్ నిర్విహిస్తున్నాయి. గత రెండు నెలలుగా మావోయిస్టులు వరంగల్ జిల్లాలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ములుగు మండలం మల్లంపల్లిలో మావోయిస్టులు ఓ జేసీబీని దహనం చేసిన సంగతి తెలిసిందే. 

 

వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్..

వరంగల్ : జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. తాడ్వాయి మండలం వెంగలపూర్ లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉంది.

 

08:43 - September 15, 2015

ఖమ్మం : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మగశిశువు మాయం అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చర్ల మండలం తేగడకు చెందిన రాధ అనే మహిళ భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నిన్న అర్ధరాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు కామెర్లు ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో ఇన్ క్యుబేటర్ లో పెడతామని ఓ మహిళ తీసుకెళ్లింది. అనంతరం శిశువు మాయం అయింది. దీంతో మగ శిశువు మాయమవ్వడంతో కుటుంబ సంభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి ముందు మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువు మాయమవ్వడంలో ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఉందని ఆరోపిస్తున్నారు. శిశువును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.

 

నేడు విజయనగరం జిల్లాలో ఎస్సీ కమిటీ పర్యటన

విజయనగరం : నేడు జిల్లాలో ఎస్సీ కమిటీ పర్యటన చేయనుంది. దళితుల సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చ జరుగనుంది.

 

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మగశిశువు మాయం..

ఖమ్మం : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మగశిశువు మాయం అయింది. చర్లకు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువును ఇన్ క్యుబేటర్ లో పెడతామని మరో మహిళ తీసుకెళ్లింది.

 

నేడు విద్యార్థులతో జగన్ ముఖాముఖి

తిరుపతి : నేడు విద్యార్థులతో వైసిపి అధినేత జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. వైసిపి.. ప్రత్యేకహోదాకు మద్దతుగా యాప్ ను తయారు చేసింది. యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. 

నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనుంది.

 

07:44 - September 15, 2015

హైదరాబాద్ : తెలంగాణలో పెండింగ్ పనులు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన పనులు సైతం...ఇప్పటికీ పూర్తికాలేదు. కేంద్రంప్రాయోజిత పథకాలు, నాబార్డ్ వంటి సంస్థల సహకారంతో మొదలైన వేల కోట్ల పనులు....ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వ్యవసాయం, రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం...ఐదేళ్ల కిత్ర మొదలైన పనులు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆయా పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించింది.
టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు
పనుల్లో జరుగుతున్న జాప్యంపై అధ్యయనం చేయటానికి...ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అసలు పనుల్లో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. తద్వారా పనులను సకాలంలో పూర్తిచేయచ్చని భావిస్తోంది. ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని బృందం....క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న టాస్క్‌ఫోర్స్
అధికారులు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మహేశ్వరం, సరూర్‌నగర్, కందుకూరు మండలాల్లో నాబార్డ్ నిధులతో జరుగుతున్న తాగు నీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. 2010లో ఆ మూడు మండలాల్లో పనులు ప్రారంభమైనా...ఇప్పటికీ పూర్తికాలేదు. నిధుల కొరత లేకున్నా...ఎందుకు పూర్తి కావటం లేదనే దానిపై వారు అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించి..తగు సూచలు, సలహాలు అందిస్తారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎదురవుతున్న సమస్యలపై...ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో నీటి ప్రాజెక్టుల భూసేకరణ, కాల్వల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ పనులపై ..సంబంధిత జిల్లా మంత్రులతో పాటు అధికారులతో చర్చించారు. జిల్లాల వారిగా విడివిడిగా సమావేశం నిర్వహించారు.
పరిహారం అందించాకే.. పనులు మొదలుపెట్టాలనే యోచిన
మొత్తానికి పెండింగ్ ప్రాజెక్టులు, ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. పెండింగ్ పనులను వచ్చే ఏడాదిలోపు పూర్తిచేయాలని భావిస్తోంది. అంతేగాక ప్రస్తుతం చేపట్టనున్న ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. నిర్వాసితులకు సంతృప్తి కలిగేలా...పరిహారం అందించాకే....పనులు మొదలుపెట్టాలని యోచిస్తోంది.

 

07:35 - September 15, 2015

చిత్తూరు : కట్టెదుర వైకుంఠం కాంతులతో వెలిగిపోనుంది. వేదములే శిలలై వెలిసిన కొండ కమనీయంగా మారనుంది. లక్షలాదిమంది భక్తి పారవశ్యంలో తేలియాడుతుండగా శ్రీదేవుడు శేషాద్రి కొండపై ఊరేగనున్నాడు. కోరిన వరాలు ఇచ్చే కొంగుబంగారంగా భావించే శ్రీవారు నాలుగుమాడ వీదుల్లో తిరుగాడనున్నాడు. నేడు జరగబోయే 9రోజుల బ్రహోత్సవాల అంకురార్పణలో శ్రీవారి సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుడు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాడు.
కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు
కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు భావించే శ్రీనివాసుడు వెలసినట్లుగా చెప్పే క్షేత్రం తిరుమల. అందుకే ప్రతి యేటా 9రోజుల పాటు తిరుమలలో కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఈ నెల 16 నుంచి 24 వరకు తిరుమలేశుడి బ్రహోత్సవాలు జరగనున్నాయి. 9రోజుల పాటు జరగబోయే శ్రీవారి బ్రహోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.
నవధాన్యాలతో చేసే అంకురార్పణ
బ్రహ్మోత్సవాల అంకురార్పణ సంధర్భంగా వెంకటేశ్వరుడి సర్వ సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. అలా తిరుగాడుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ధ్వజారోహణకు ముందురోజు సాయంత్రం ఆలయానికి నైరుతి వైపున ఉన్న వసంత మండపానికి వేంచేయటం ఆనవాయితీగా వస్తోంది. పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రదక్షిణంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరుణంలో నవధాన్యాలతో చేసేదే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
రేపు ధ్వజారోహణం
అంకురార్పణ జరిగిన మరుసటి రోజు అంటే బుధవారం సాయంత్రం 5 నుంచి5.30 మధ్య మకరలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణంతోనే ఉత్సవాలు ప్రారంభయినట్లు లెక్క. ఈ తంతు పూర్తయిన వెంటనే ఏపి సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహనం పై స్వామివారు ఊరేగుతారు. ఇక అప్పటి నుంచి 24 వరకు జరిగే బ్రహోత్సవాలను ఓసారి పరిశీలిస్తే 17వ తేది ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహనసేవ, 18వ తేది ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపు పందిరి, 19 ఉదయం కల్ప వృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 20వ తేది ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 21న హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రధోత్సవం, రాత్రి గజవాహనం, 22 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్ర ప్రభ వాహనం, 23 ఉదయం రధోత్సవం,రాత్రి అశ్వ వాహనం, 24 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజా రోహణం జరుగుతాయి.
ఏర్పాట్లు పూర్తి..
సాధారణ రోజుల్లో కంటే బ్రహోత్సవాల కోసం భక్తులు లెక్కకు మిక్కిలిగా తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు ఏపి ప్రభుత్వం కూడా తిరుమల భద్రతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వందలాది బలగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. 600లకు పైగా కెమెరాలు అమర్చిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేసారు.

 

07:27 - September 15, 2015

బీజింగ్ : చైనాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా కేసీఆర్‌ బృందం అడుగులు వేస్తోంది. పారిశ్రామిక కంపెనీలను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. డ్రాగన్‌ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ... టీఎస్ బృందం స్వాగతం పలుకుతోంది.
హాంగ్‌కాంగ్ చేరుకున్న కేసీఆర్‌
సోమవారం షెంజాన్‌ పర్యటన ముగించుకుని హాంగ్‌కాంగ్ చేరుకున్నారు కేసీఆర్‌. పలు కంపెనీలు, ఇండస్ట్రియల్‌ పార్కులను సందర్శించారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. తొలుత షెంజాన్‌లోని ఇండస్ట్రీయల్‌ పార్క్‌ను, అనంతరం చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎగుమతులు, దిగుమతులపై తమ అనుభవాలను పరస్పరం పంచుకున్నారు.
జెడ్ టీఈ మొబైల్ తయారీ కేంద్రం పరిశీలిన
జెడ్ టీఈ మొబైల్ తయారీ కేంద్రాన్ని కేసీఆర్ బృందం పరిశీలించింది. అక్కడ కంపెనీలకు కల్పిస్తున్న సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు కేసీఆర్‌. తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కూడా హాంగ్‌కాంగ్‌లోనే తెలంగాణ బృందం పర్యటించనుంది. బుధవారం నాడు చైనా పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం హైద్రాబాద్ చేరుకోనున్నారు.

 

నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : నేడు ఎపి సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశం కానున్నారు. వరంగల్ ఉప ఎన్నిక, తెలంగాణ టీడీపీ కమిటీ ఏర్పాటుపై చర్చ జరుగనుంది. 

07:17 - September 15, 2015

ఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించనుందా? లేదా...అన్నది ఇవాళ రాత్రి తేలిపోనుంది. చైనా తీసుకునే నిర్ణయంపైనే భారత్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం చైనా అనుకూలంగా వ్యవహరిస్తుందా... లేదా.. అన్నది కీలకంగా మారనుంది.
ఐరాసలోని మొత్తం 200 సభ్యత్వ దేశాల సమావేశం
ఐక్యరాజ్యసమితిలోని మొత్తం 2 వందల సభ్యత్వ దేశాలు సమావేశమవుతున్నాయి. భద్రతా సమితిలో సంస్కరణలు, విస్తరణపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నాయి. భద్రతా సమితిలో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉండగా ఇందులో చైనా, అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. వీటికి వీటో పవర్‌ ఉంటుంది. భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం గత కొన్నాళ్లుగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే యత్నం చేస్తోంది. ప్రస్తుతం జరిగే సమావేశంలో తొలిసారిగా ఆయా దేశాలు తమ తీర్మానాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే అమెరికా, చైనా, రష్యా దేశాలు ఇందులో భాగస్వామ్యం కావొద్దన్న నిర్ణయానికి వచ్చాయి. భారత దేశం చేస్తున్న డిమాండ్‌ను విఫలం చేసే దిశగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు సమాచారం. భారత అధికారులు మాత్రం చర్చలను ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు
భద్రతాసమితిని విస్తరించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న చైనా
భద్రతాసమితిని విస్తరించాలన్న ప్రతిపాదనను మొదటి నుంచి చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఓటింగ్‌ జరపడం తప్పనిసరైతే... భారత్‌తో పాటు మరికొన్ని దేశాలకు బోర్డులో సభ్యత్వం కల్పించాలని, దీనిపై చర్చలు జరపాలని చైనా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నదానిపై అమెరికా, రష్యా ఇంతవరకు మౌఖికంగా మద్దతు తెలిపాయే తప్ప లిఖితపూర్వకంగా ఎలాంటి హామీ నివ్వకపోవడం గమనార్హం.
భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని మోడీ విజ్ఞప్తి..
డ్రాఫ్ట్‌పై ఒప్పందం కుదిరిందంటే జనరల్ అసెంబ్లీలో జరిపే ఓటింగ్‌లో మూడింట్లో రెండొంతుల మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించి 70ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ప్రధాని నరేంద్రమోది ఇటీవల జరిపిన విదేశీ పర్యటనల్ల ఆయా దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు.

 

07:06 - September 15, 2015

విజయవాడ : పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించిన బాబు.. టూరిజం ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా మార్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ నూతన పర్యాటక విధానాన్ని పారిశ్రామిక వేత్తల సమక్షంలో బాబు విడుదల చేశారు. టూరిజంపై తొలి నుంచి తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్న చంద్రబాబు.. పర్యాటక రంగానికి ఏపీ అన్నివిధాలా అనువైన ప్రదేశమన్నారు.
టూరిజంలోనే ఉద్యోగ కల్పనకు అవకాశం..
వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం కన్నా.. టూరిజంలోనే ఉద్యోగ కల్పనకు ఎక్కువ అవకాశం ఉందన్నారు చంద్రబాబు. అందుకే.. పర్యాటక రంగంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగం ద్వారా.. సుమారు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు ఒక విజన్‌ రూపొందించుకున్నామని బాబు చెప్పారు. 2022 నాటికి దేశంలో టాప్‌ త్రీలో ఉండేందుకు కృషి చేస్తున్నామని చెప్పిన బాబు.. 2029 నాటికి దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు
ఇప్పటి వరకూ పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని చంద్రబాబు చెప్పారు. ఇంకా మరిన్ని ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న బాబు.. ఏపీని టూరిజంతోపాటు, అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

 

06:57 - September 15, 2015

హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్‌ డబుల్స్ టైటిల్‌ గెలిచిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. టైటిల్‌ గెలిచిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌ వచ్చిన ఆమెకు అభిమానులు బ్రహ్మరధం పట్టారు. అయితే టీం వర్క్‌ వల్లే విజయం సాధించామని సానియా తెలిపింది. తనకు సపోర్ట్ చేసిన వారందరికి సానియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

 

ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం

అనంతపురం : పుట్టపుర్తిలోని సాంఘీక సంక్షేమ వసతిగృహంలో దారుణం జరిగింది. ఐదో తరగతి విద్యార్థినిపై ముత్యాలు అనే ఉద్యోగి అత్యాచారానికి యత్నించాడు. దీంతో వసతి గృహ అధికారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

సానియాకు ఘన స్వాగతం

హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి స్వదేశం చేరుకున్న సానియాకు ఘన స్వాగతం లభించింది. ఇవాళా తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు తల్లిదండ్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

Don't Miss