Activities calendar

16 September 2015

21:32 - September 16, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పేరును భద్రతకు సంబంధించిన వివిఐపి లిస్టు నుంచి కేంద్రం తొలగించింది. ఎయిర్పోర్టుల్లో తనిఖీ అవసరం లేని ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి రాబర్ట్ వాద్రా పేరును తొలగిస్తున్నట్లు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో వాద్రాను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తారు. నో ఫ్రిస్కింగ్‌ లిస్ట్‌ నుంచి తన పేరును తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా వాద్రా సోషల్‌ మీడియా ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. 

21:30 - September 16, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీలలో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లలో కోటా కల్పించాలంటూ గుజరాత్లో జరుగుతున్న ఆందోళన రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే వ్యూహంలో భాగంగా పటేల్‌ వర్గం ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెంచే దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా పటేల్ వర్గానికి చెందినవాళ్లు బ్యాంకులోని తమ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంకులలో తమ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్మును వెనక్కి తీసేసుకుంటున్నారు.

దానిమీద వడ్డీ రాకపోయినంత మాత్రాన ......

ఉత్తర గుజరాత్‌లోని ఖోరోల్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి బాబూభాయ్ పాటీదార్‌ ఉదయమే బ్యాంకుకు వెళ్లి, తన పేరుమీద ఉన్న రెండు లక్షల రూపాయలు డ్రా చేసేసుకున్నారు. దానిమీద వడ్డీ రాకపోయినంత మాత్రాన తనకు వచ్చే నష్టం ఏమీ లేదని.. కానీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత తెలిసి వస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

వాద్రాద్ గ్రామంలో ఒక్కరోజులోనే 27 లక్షలను డ్రా ......

ఉత్తర గుజరాత్లో పటేల్ వర్గం ఎక్కువగా ఉండే వాద్రాద్ గ్రామంలో ఒక్కరోజులోనే 27 లక్షలను డ్రా చేసినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఖోరోల్‌ గ్రామంలో కూడా పటేల్‌ సామాజిక వర్గీయులు బ్యాంకుల ముందు క్యూకట్టారు. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో.. బ్యాంకుల లోంచి ఎంత మొత్తం నగదును బయటకు తీసేస్తారో అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. అహ్మదాబాద్‌లో పటేల్‌ సామాజిక సభను ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన 22 ఏళ్ల హార్దిక్‌ పటేల్‌కు ఆయన సామాజికవర్గం అండగా నిలుస్తోంది.మొత్తానికి గుజరాత్‌ ప్రభుత్వానికి పటేళ్ల ఆందోళన గుదిబండగా మారింది.

21:28 - September 16, 2015

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోది 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమాన్ని ఆపేయాలని, ఇది కూడా ఎన్నికల కోడ్‌ కిందకే వస్తుందని సిపిఎం అభిప్రాయపడింది. ఎన్నికల ప్రచారంలో బిజెపి తరపున ప్రధాన వక్త , ప్రధాని నరేంద్ర మోదీయే కావడంతో 'మన్‌ కీ బాత్‌' ప్రజలను ప్రభావితం చేసే అవకాశముందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన్‌ కీ బాత్‌పై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.  

21:22 - September 16, 2015

హైదరాబాద్‌ : వినాయక చవితితో నగరానికి ఉత్సవశోభను సంతరించకుంది. ఎంతో విశిష్టత కల్గిన ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులచే పూజులు అందుకునేందుకు కొలువుదీరాడు. 59 అడుగుల ఎత్తులో త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో కనువిందు చేస్తున్నాడు. కుడివైపు గజేంద్రమోక్షం, ఎడమవైపు వరంగల్‌ భద్రకాళీ విగ్రహాలను ప్రతిష్టించారు. స్వామి పాదాల వద్ద లక్ష్మీ, సరస్వతీ మాత విగ్రహాలు ఏర్పాటు చేశారు.

శిల్పి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ వినాయకుడు రూపకల్పన.....

శిల్పి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో 200 మంది కార్మికులు మూడు నెలల పాటు శ్రమించి త్రిశక్తిమయ మోక్ష గణపతిని తీర్చిదిద్దారు. చవితిరోజు గవర్నర్‌ దంపతుల తొలిపూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తాపేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం మాదిరిగానే 5,600 కేజీల లడ్డూని స్వామివారికి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా పద్మశాలీ సంఘం వారి తరపున 75 అడుగుల కండువా, జంద్యం గణనాథునికి సమర్పించనున్నారు. భక్తుల దర్శనానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

హైదరాబాద్‌లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు......

గణేష్‌ ఉత్సవాల సందడితో హైదరాబాద్‌లో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. వినాయక చవితి, బక్రీద్‌, అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి రావడంతో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 కేంద్ర పారామిలిటరీ బృందాలు బందోబస్తులో ఉన్నాయి. గణేష్‌ విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకూ భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. నగరంలో భద్రత ఏర్పాట్లను కంట్రోల్‌ రూం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మొత్తంగా వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంది. 

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం...

కర్నూలు : శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో బుధవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లోలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం రాత్రి ట్రయల్ రన్ కింద కొద్ది మేర విద్యుత్ ఉత్పత్తి చేశారు. 27 క్యూసెక్కులను వినియోగించుకుని 0.013 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

20:38 - September 16, 2015

హైదరాబాద్ : మన దేశంలో ఆకలితో అలమటిస్తోందా? కోట్లాది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా? పౌష్టికాహార నివేదికలు చెప్పిన సత్యం ఏంటి? ఆఖలి రాజ్యం రాబోతోందా? ఇలాంటి అంశాలపై నేటి 'వైడాగింల్' లో విశ్లేషించారు. ఈ విశ్లేషణను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : గత పది రోజులుగా చైనాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం శంసాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు మంత్రులు, అధికారాలు ఘన స్వాగతం పలికారు.

రామ్మూర్తిని కాపాడేందుకు చర్యలు చేపట్టాం: మంత్రి పల్లె

విజయవాడ : లిబియాలో కిడ్నాప్ అయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మూర్తిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే... తమిళనాడులో సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు భాషను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాస్తామని, అవసరమైతే ప్రతినిధుల బృందాన్ని తమిళనాడుకు పంపి చర్చిస్తామన్నారు.

తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపినచంద్రబాబు

విజయవాడ తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు నాయకుడైన వినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న విఘ్నాలను తొలగించాలని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బాబు

తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరుపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

20:02 - September 16, 2015

హైదరాబాద్ : ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఏపీకే నష్టమా! వరల్డ్ బ్యాంక్ నివేదికలో వాస్తవమెంత! నివేదిక తయారీలో కేంద్రం జోక్యం నిజమేనా! నివేదికల్లో ర్యాంకు ఉంటే పెట్టుబడులు వస్తాయా? ఇదే అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిడిపి నేత జూపూడి ప్రభాకర్, ద హన్స్ ఎండిటర్ , ప్రొ.కె. నాగేశ్వర్, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, ఆర్థిక రంగ నిపుణులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక

శ్రీకాకుళం : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని వంశధార నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రిలక్ష్మారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి స్వైన్ ఫ్లూ భయం చుట్టేయడంతో.. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గత వారం రోజులలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఐదుగురు మృతిచెందిన నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనఖీ చేశారు. వైద్యులతో మాట్లాడి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏపీ రెవెన్యూ శాఖలో బదిలీలు నిలిపివేత

హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో తాజాగా జరరిగిన బదిలీలను నిలిపివేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం 872,873,874,875 జి.ఓ.లతో 22 మంది అధికారులను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది. ఈ నాలుగు జివోల ద్వారా జరిగిన బదిలీలను నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా 882 జి.ఓ జారీ చేసింది.

బాలికల వసతిగృహాన్ని పరిశీలించిన ఎంపి, ఎమ్మెల్యే

విశాఖపట్టణం ఎంవీపీ కాలనీలోగల బాలికల వసతిగృహాన్ని పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే రామకృష్ణబాబు తదితరులు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పేందుకు ప్రత్యేకంగా ఓ టీచర్‌ను నియమింపజేస్తామన్నారు. అలాగే విద్యార్ధులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామన్నారు. వసతిగృహంలో నెలకొన్న ఆయా సమస్యలను పరిష్కరిస్తామని, విద్యార్ధినీలు ఆధైర్యపడవద్దన్నారు.

విశాఖలో 226 కేజీల గంజాయి స్వాధీనం...

విశాఖపట్టణం : నగరంలో బుధవారం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 226 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి వ్యవహరంతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్టు చేశారు. దీనిపై క్రైమ్ డీసీపీ రవికుమార్‌మూర్తి విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బోర్డర్(ఏవోబీ)లో కొందరు స్మగ్లర్లు రైతులతో గంజాయిని సాగుచేయిస్తున్నట్లు తమ విచారణ వెల్లడయిందన్నారు. అనంతరం నగరం మీదుగా నిర్ణిత ప్రదేశాలకు దాటవేస్తున్నారన్న సమాచారం ఉందని, దీనిపై తమ పోలీసు బృందం ప్రత్యేక నిఘా వేసిందన్నారు.

ట్రిపోలీలో ఇద్దరు భారతీయుల అపహరణ

హైదరాబాద్ : ట్రిపోలీలో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. అపహరణకు గురైన భారతీయులను విడిపించేందుకు విదేశాంగ శాఖ యత్నిస్తోంది. అపహరణకు గురైన వారిలో ఒడిశాకు చెందిన పర్సువ రంజన్ సమాల్, ఏపీకి చెందిన కొసనం రామమూర్తి ఉన్నారు. ఈ ఇద్దరిని ట్రిపోలీలో అపహరించినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

పాల్వంచలో స్కూల్ బస్, వ్యాన్ ఢీ...

ఖమ్మం : పాల్వంచ పట్టణంలో ఓ స్కూల్ బస్సును కోళ్ల వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఓ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు వెళుతుండగా, భద్రాచలం వైపు నుంచి కోళ్లతో వస్తున్న వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7వ తరగతి విద్యార్థి సాయివినేష్, ఎనిమిదో తరగతి విద్యార్థిని స్నేహ భావ్‌తోపాటు వ్యాన్ డ్రైవర్ సాయి (30)కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బ్యాంకుల్లోని డబ్బులు వెనక్కి తీసుకుంటున్న పటేళ్లు...

హైదరాబాద్ : ప్రధాని అమెరికా పర్యటన దగ్గర పడుతున్న కొద్దీ పటేళ్లు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ లో పటేళ్లను చేర్చాలంటూ హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేళ్లు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనలో పటేళ్లు ఆయనకు అమెరికాలో నిరసన తెలపాలని నిర్ణయించారు. అంతవరకు పటేళ్లు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తారని, బ్యాంకుల్లోని డబ్బులు వెనక్కి తీసుకుని నిరసన తెలపాలని హార్దిక్ పటేల్ పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను పటేళ్లు వెనక్కి తీసుకుంటున్నారు.

సానియా చెల్లి ఆనమ్ కు నిశ్చితార్థం...

హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహ నిశ్చితార్థం ఈ రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్ లో జరగనుంది. దగ్గరి బంధువులు, 200 మంది స్నేహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాదుకే చెందిన అడ్వర్టయిజింగ్ ప్రొఫెషనల్ అక్బర్ రషీద్, సానియా చెల్లెలు ఆనమ్ లు గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారట. వీరి ప్రేమను ఇరువైపుల పెద్దలూ అంగీకరించడంతో... సానియా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకలో సానియా సిస్టర్స్ డిజైనరీ వేర్ లో మెరవనున్నారట.

మేడారం జాతర ఏర్పాట్ల పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి రెండేళ్లకోమారు సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. గిరిజన కుంబమేళాగా పిలవబడే ఈ జాతరకు దాదాపు కోటి మంది దాకా భక్తులు విచ్చేస్తుంటారని అనధికారిక అంచనా.

రైతుబంధు పథకంతో రైతులకు వడ్డీ లేని రుణాలు..

హైదరాబాద్ : రైతుల లాభం - వినియోగదారుల క్షేమమే మార్కెటింగ్ శాఖ లక్ష్యమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రతి మండలంలో గోదాము ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. రూ. 80 కోట్లతో అన్ని మార్కెట్‌యార్డులలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

ఈపీఎఫ్ బీమా రూ.6లక్షలకు పెంపు...

హైదరాబాద్ : తాజ్‌కృష్ణలో ఈపీఎఫ్ కేంద్రీయ ధర్మకర్తల మండలి సమావేశం జరగింది. సమావేశానికి హాజరైన కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఈపీఎఫ్ బీమా రూ. 6 లక్షలకు పెంచామని తెలిపారు. బీమా వర్తింపు నిబంధనలో సడలింపు చేశామన్నారు. ఒక్క రోజు పని చేసినా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. భవిష్యనిధి ఖాతాదారులకు సమాచారం కోసం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రవేశపెట్టామని తెలిపారు.

18:34 - September 16, 2015

హైదరాబాద్ : ఏపీ టొబాకో బోర్డు ఛైర్మన్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వేటు వేశారు. సెలవులపై ఇటలీ వెళ్లిన ఆయనను విధుల నుంచి తొలగించారు. రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో బోర్డ్‌ ఛైర్మన్‌ విదేశీ యాత్రకు వెళ్లడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. సీనియర్‌ అధికారికి అడిషనల్‌ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.  

18:32 - September 16, 2015

అమరావతి : కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాల ప్రారంభానికి కేంబ్రిడ్జి అంగీకరించినట్లు చెప్పారు. సెక్షన్ 8 సంస్థ ద్వారా లాభాపేక్ష లేని కార్యకలాపాలను కేంబ్రిడ్జి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్య, నూతన ఆవిష్కరణలపై యూనివర్సిటీ సేవలు అందిస్తుందన్నారు. కేంబ్రిడ్జితో ఒప్పందం కుదుర్చుకోవడం విద్యారంగంలో ఇదో మైలురాయి అని మంత్రి గంటా అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వంతో నిర్మాణత్మకమైన చర్చలు జరగడం సంతోషంగా ఉందని కేంబ్రిడ్జి ప్రతినిధి తెలిపారు.

18:30 - September 16, 2015

కడప : అప్పుల బాధ తట్టుకోలేక తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం, గోపవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, కొడుకు మీరావళి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వ్యవసాయానికి సుబ్బారాయుడు దాదాపు 7లక్షల అప్పులు చేశాడు. వర్షాలు లేకపోవడం పంటలకు దిగుబడి రాకవపోడంతో.. అప్పులు భారమయ్యాయి. కొడుకు మీరావళి చదువుకు కూడా అప్పులు చేశాడు. దీంతో అప్పులవారు నిత్యం వేధిస్తుండడంతో... ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్‌నోట్‌ రాసి చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

18:29 - September 16, 2015

హైదరాబాద్ : విశాఖలో దారుణం జరిగింది. మాతృత్వం మర్చిన తల్లి... ఓ పసికందును చెత్తలో పడేసింది. చెత్తకుప్పలో ఉన్న బిడ్డను పందికొక్కులు పీక్కుతినసాగాయి. చేతివేలును కొరికేసాయి. దీంతో రక్తస్రావంతో ఏడుస్తున్న పసికందును ఓ మత్స్యకారుడు చూసి అవాక్కయ్యాడు. వెంటనే పసిబిడ్డను కేజీహెచ్ లో కు తరలించాడు. బిడ్డను తనకు అప్పగిస్తే... పెంచుకుంటానని డాక్టర్లును కోరాడు మత్స్యకారుడు. 

18:27 - September 16, 2015

తిరుపతి : కోదండరాముని నగల తాకట్టు కేసులో... తిరుపతి కోర్టు తుది తీర్పు ప్రకటించింది. దేవుడి నగలు తాకట్టుపెట్టిన అర్చకుడు... వెంకటరమణ దీక్షితులుకు మూడేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే నగదు తాకట్టు పెట్టుకున్న వ్యాపారి సాగర్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. 2008లో రామాలయ నగదు తాకట్టు కేసు సంచలనం సృష్టించింది. 

18:25 - September 16, 2015

కృష్ణా : మక్కా మసీదులో క్రేన్‌ కూలి చనిపోయిన ఫాతిమా కుటుంబాన్ని... వైసిపి అధినేత జగన్‌ పరామర్శించారు. హజ్‌యాత్రకు వెళ్లి.. ఖాదర్‌, ఫాతిమా మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన జగన్‌.. ఫాతిమా కుటుంబసభ్యులు ఓదార్చి... వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిలక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. హజ్‌యాత్ర మృతులను ఇంతవరకూ పరామర్శించకపోవడం దారుణమన్నారు.

18:24 - September 16, 2015

అనంతపురం: జిల్లాలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. బెళుగుప్పలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ధర్నా చేస్తున్న వైసీపీ శిబిరాన్ని తొలగించారు. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల్ని వేధిస్తున్నారంటూ కలెక్టర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. 2009లో జరిగిన సూరయ్య హత్య కేసులో బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపాలన కొనసాగుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:21 - September 16, 2015

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోలవరం పూర్తయ్యే వరకూ నీటిని ఒడిసిపట్టేందుకే పట్టిసీమ చేపట్టామన్న బాబు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

పలు వివాదాలను, అడ్డంకులను దాటుకుని.......

పలు వివాదాలను, అడ్డంకులను దాటుకుని పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయింది. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల కరువు, వరదలను నియంత్రించే అవకాశం ఉందన్న బాబు.. పట్టిసీమను ప్రారంభించడంతో తన జీవితం చరితార్థమైందన్నారు.

పోలవరం పూర్తయ్యే వరకు నాలుగేళ్లు పట్టే అవకాశం.....

పోలవరం పూర్తయ్యే వరకు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. అప్పటి వరకూ తాగునీటికోసం ఇబ్బందులు పడుతూ, కరువుతో అల్లాడడం సరికాదన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామన్నారు.

నదుల అనుసంధానం కార్యక్రమం కొనసాగుతుంది...

నదుల అనుసంధానం కార్యక్రమాన్ని మున్ముందూ కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారు. దీనిద్వారా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ, చెరువులకూ నీటిని తరలిస్తామని చెప్పారు. తద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఎంతో మంది అనుమానం వ్యక్తం చేసినా.. సంకల్పంతో పట్టిసీమ పూర్తిచేశామన్న బాబు.. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేయడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం 5 నెలల్లో ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టామన్న బాబు.. ఇందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.

ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు : తుమ్మల

హైదరాబాద్ : ప్రతిపక్షాలు ఆత్మహత్యలను అడ్డం పెట్టుకొని శవ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య పంటల సాగు మొదలైనప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.మనోధైర్యం కల్పించాల్సిన పార్టీలు.. రైతులను కృంగదీస్తున్నాయన్నారు. ఎవరు మంచోళ్లు అనుకుంటే వాళ్లను ప్రజలు అధికారంలోకి తెస్తారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

బీహార్ లో మొదలైన నామినేషన్ల పర్వం....

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి దశ ఎన్నికలకు ఈరోజు నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 23లోగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. 24న నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 26. అక్టోబర్ 12న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా తొలిదశలో 49 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.  

17:48 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణలో టీఎస్ పిఎస్ సి ద్వారా తొలిసారి నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిసారి ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్ధులు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలుగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేసింది. ఇక పరీక్షను పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.

931 ఏఈఈ పోస్టుల భర్తీకి 20న ఆన్‌లైన్‌ పరీక్ష.......

తెలంగాణలో 931 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్‌లైన్‌ పరీక్షకు అభ్యర్ధులు ముందుగా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్ధులే ఆన్‌లైన్‌లో మాక్‌టెస్ట్‌ ద్వారా ప్రాక్టీస్‌ చేసుకునేలా ప్రత్యేక లింకును కల్పించింది. మొదటిసారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్ధులు పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా,.. ముందుగా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

మాక్‌టెస్టులో ఆన్‌లైన్‌ పరీక్షలో ఉండే నిబంధనలు......

ఆన్‌లైన్‌ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్‌ టెస్టులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం,.. బహుళ ఐచ్ఛిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలనే అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌లో ముందుగా ప్రాక్టీస్‌ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యార్దులు బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందన్నారు.

హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలలో 99 పరీక్షా కేంద్రాలు....

ఇక హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలలో 99 పరీక్షా కేంద్రాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. 30,783 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ పరీక్ష ఉంటుందని,... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష కోసం వచ్చే అభ్యర్ధులు 45 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు. పరీక్ష రోజున అభ్యర్ధులు సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక్కరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ సర్కార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించే మొదటి పరీక్షను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

17:44 - September 16, 2015

హైదరాబాద్‌ : నగరంలో ఆట-పాట-మాట కార్యక్రమం జరుగుతోంది. బంజారాహిల్స్‌లోని రావినారాయణ ఆడిటోరియంలోని జరుగుతున్న ఈకార్యక్రమానికి అభ్యుదయ కవులు, కళాకారులు, వామపక్ష అగ్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు ఎండగట్టారు. పేదలను కొట్టి.. కార్పొరేట్‌ సంస్థలకు భూములను ధారదాత్తం చేస్తున్నారని విమర్శలు చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

17:42 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఆశా వర్కర్ల ధర్నా అంతకంతకు ఉధృతమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు వినూత్న రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం ఎదుట ఆశా వర్కర్లు వంటవార్పు చేపట్టారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. 

17:40 - September 16, 2015

ఆదిలాబాద్‌ : జిల్లాలో టీడీపీ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పెద్దఎత్తున చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌ ముట్టడించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రైతుల రుణాలు రీషెడ్యూల్‌.. రుణమాఫీ ఒకే విడుతలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పత్తి పంట క్వింటాలుకు 6 వేల మద్దతు ధర ప్రకటించాలని పట్టుపట్టారు. 

17:38 - September 16, 2015

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన శృతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. వడ్డేపల్లికి శృతి మృతదేహాం తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో శృతి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఫిలిఫ్పైన్స్ లో అమెరికా వ్యతిరేక ఆందోళనలు....

హైదరాబాద్ : అమెరికా వ్యతిరేక ఆందోళనలతో ఫిలిఫ్పైన్స్‌ అట్టడుకింది. అమెరికా ఎంబసీ ఎదుట యువకులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఎర్ర పెయింట్‌తో ఎంబసీపై దాడికి దిగారు. అమెరికా సైనిక బలగాలు తమ దేశాన్ని వదలిపోవాలని నినాదాలు చేశారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

నిమజ్జనం సందర్భంగా భారీ భద్రత : సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ ఈనెల 27న జరిగే గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి 20వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడమేగాక 9 కంపెనీల కేంద్ర పారామిటలరీ బలగాలను రప్పిస్తున్నామన్నారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో డీజేకు అనుమతి లేదన్నారు.

17:28 - September 16, 2015

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దముల్‌ మండలం కందనెల్లిలో ఎస్‌ఐ రమేష్‌ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ లభించింది. ఉరి వేసుకున్నట్లు కనిపించినా.. మృతదేహాన్ని పరిశీలించిన పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా దేవరకొండ శేరిపల్లితండా.....

నల్లగొండ జిల్లా దేవరకొండ శేరిపల్లి తండాకు చెందిన రమేష్‌ 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొదటి పోస్టింగ్‌ రంగారెడ్డి జిల్లా పెద్దముల్‌లో లభించింది. అక్కడినుంచి ధరూర్‌కు బదిలీ అయ్యాడు. ప్రస్తుతం యాలాల్‌లో పని చేస్తున్నాడు. సౌమ్యుడిగా ప్రజలతో సన్నిహితంగా మెలిగే రమేష్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని సన్నిహితులు చెబుతున్నారు. ఏడు నెలల క్రితమే రమేష్‌కు వివాహమైంది.

భార్యతో మార్కెట్‌కు వెళ్లిన రమేష్‌కు సీఐ కార్యాలయం నుంచి ఫోన్‌ .......

మంగళవారం సాయంత్రం తాండూరు మార్కెట్‌కు వెళ్లిన తన భర్త రమేష్‌కు.. సీఐ శివశంకర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చినట్లు రమేష్‌ భార్య తెలిపింది. గణేశ్‌ ఉత్సవాల నిర్వహణపై మీటింగ్‌ ఉందనడంతో వెంటనే రమేష్‌ ఆఫీసుకు వెళ్లినట్లు ఆమె చెప్పారు. ఇక తన భర్త నుంచి ఎలాంటి ఫోన్‌ రాకపోవడంతో.. తానే అనేకసార్లు ఫోన్‌ చేశానని.. ఫోన్‌ అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా అని రావడంతో సీఐ కార్యాలయానికి ఫోన్‌ చేసినట్లు ఆమె తెలిపింది. అయితే అక్కడకు రమేష్‌ రాలేదని చెప్పడంతో.. తన భర్తకు సన్నిహితంగా ఉండేవారికి ఫోన్లు చేశానని... అయినా ఎలాంటి సమాచారం లభించలేదన్నారు. ఇక రాత్రి 9 గంటల 50 నిమిషాలకు రమేష్‌ ఫోన్‌ నుంచి.. ఐయామ్‌ ఎట్‌ కందనెల్లి చింతచెట్టు అనే మెసెజ్‌ వచ్చిందని... ఆ తర్వాత వెంటనే అయామ్‌ సారీ.. అంటూ మరో మెసెజ్‌ వచ్చిందన్నారు. తిరిగి ఫోన్‌ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చినట్లు రమేష్‌ భార్య చెబుతోంది.

కందనెల్లి సమీపంలో పోలీసులు గాలింపు చర్యలు.....

ఇక రమేష్‌ భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే కందనెల్లి రహదారి సమీపంలోని అటవీప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డుకు కొద్దిదూరంలో చింతచెట్టుకు రమేష్‌ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అప్పటికే అతను విగతజీవిగా మారాడు. అయితే చింతచెట్టుకు కాళ్లు అందే ఎత్తులో ఉండడంతో రమేష్‌ మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి మహేందర్‌రెడ్డిని అడ్డుకున్న బంధువులు .....

ఇక రమేష్‌ మృతి విషయం తెలుసుకుని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డిని బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకునేంత ఇబ్బందులు తమకు లేవని కుటుంబ సభ్యులంటున్నారు. రమేష్‌ మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క సీఐ శివశంకర్‌ వేధింపులతోనే రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా రమేష్‌ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడాలంటే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 

17:24 - September 16, 2015

వరంగల్‌ : జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు విరసం నేత వరవరరావు. ఆయన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ...మావోయిస్టు పార్టీ ఏ నాడూ తమ అజెండా అమలు చేయాలని ఏ ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. అయితే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వారు ఆ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలన్నారు. నాడు ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కోసం కలలు కంటున్నానని చెప్పిన కేసీఆర్‌...అయితే అధికారంలోకి వచ్చాక మావోయిస్టులను ఎన్‌కౌంటర్లు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.  

మార్కెటింగ్ శాఖ పై మంత్రి హరీశ్ రావు సమీక్ష

హైదరాబాద్ : మార్కెటింగ్‌ శాఖపై రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో రూ. 1024 కోట్లతో గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు ఈ గోదాములు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే... రైతులు నిల్వ చేసుకున్న ధాన్యంపై వడ్డీలేని రుణం ఇచ్చేలా రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

పొగాకు బోర్డు ఛైర్మన్ పై వేటు

హైదరాబాద్ : ఏపీలో పొగాకు సంక్షోభం పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా పొగకు బోర్డు ఛైర్మన్ గోపాల్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పొగాకు సంక్షోభం నెలకొన్న సమయంలో ఇటలీ పర్యటనకు వెళ్లిన ఆయన పై కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు డైరెక్టర్ బాధ్యతలను సీనియర్ అధికారికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 25,964 వద్ద ముగియగా, నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 7,899 వద్ద ముగిసింది.

సీఎం కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మెదక్ మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి మండిపడ్డారు. మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... అధికారాన్ని చేపట్టాక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని అన్నారు. కేవలం రాజ్యం మారిందే తప్ప రాజ్య హింస ఆగలేదని దుయ్యబట్టారు. 

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి....

వరంగల్ మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు బుధవారం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేశారు. జిల్లాలోని తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ - మేడారం అడవుల్లో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో కేకేడబ్ల్యూ(కరీంనగర్, ఖమ్మం, వరంగల్) దళ సభ్యులు తంగెళ్ల శృతి అలియాస్ మహిత(24), మణికంట విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యం, అలియాస్ సత్యం(33)లు మృతిచెందారు. అయితే... వీరి మృతదేహాలకు బుధవారం ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించిననంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

16:36 - September 16, 2015

తిరుపతి : ఉన్న రోగం నయం చేయమంటే.. లేని రోగం అంటగట్టారు..! కడుపు నొప్పి తగ్గించమంటే.. చేయి పనిచేయకుండా చేశారు..! ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమన్నారు..! పోలీసులే దిక్కనుకుంటే వారూ బయటికెళ్లమన్నారు..! దీంతో.. చివరకు మీడియాను ఆశ్రయించాడో అభాగ్యుడు. తనకు న్యాయం చేయండంటూ వేడుకుంటున్నాడు...

కడుపు నొప్పితో రష్ ఆసుపత్రికి....

శిరీష్‌ అనే ఓ యువకుడు కడుపు నొప్పి వచ్చింది కాస్త చూడమంటూ తిరుపతిలోని రష్‌ ఆస్పత్రికి వెళ్లాడు.. చేతికి ఏదో ఇంజక్షన్‌ ఇచ్చారు డాక్టరు. వెంటనే నొప్పి మొదలైంది. ఇంజక్షన్ వేసినందుకు వచ్చిన నొప్పి కావొచ్చని భావిస్తే.. సమయం గడిచేకొద్ది పెరిగింది తప్ప, తగ్గలేదు. రెండు రోజులు గడిచిన తర్వాత చూస్తే.. ఇదీ పరిస్థితి..!

ఇంజక్షన్‌ దెబ్బకు మాడిపోయిన చేతివేళ్లు .........

ఇంజక్షన్‌ దెబ్బకు చేతివేళ్లు మాడిపోయాయి. ఆందోళన చెందిన శిరీష్‌.. మళ్లీ రష్‌ ఆస్పత్రికి పరిగెత్తితే.. అబ్బే, అదేం లేదు. ఇదంతా మామూలే. ఐస్‌ ముక్కలు పెట్టుకో తగ్గిపోతుందని సలహా ఇచ్చారు. కానీ.. తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయిన శిరీష్‌ పరిస్థితి గమనించిన వైద్యులు.. వేరే డాక్టరు దీనికి వైద్యం చేయాలంటూ.. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించి చేతులు దులుపుకున్నారు. అక్కడా సంబంధిత డాక్టర్‌ లేకపోవడంతో.. చివరకు హుటాహుటిన చెన్నైకు తరలించారు ఈ బాధితున్ని.

ఆశ్చర్యం వ్యక్తం చేసిన చెన్నై వైద్యులు..

ఆశ్చర్యం వ్యక్తం చేసిన చెన్నై వైద్యులు.. శిరీష్ కుడి చేతి నరాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఫలితంగా కుడి చేతి వేళ్లు రెండు స్పర్శ కోల్పోయాయి. ఇందులో ఒకటి ఇలా బొగ్గులా మారిపోయింది. వెంటనే ఆ ప్రాంతాన్ని కోసి అక్కడ నరాలలోని ఒత్తిడిని విడుదల చేయకపోతే.. ఏకంగా చెయ్యినే పూర్తిగా తీసేయాల్సి వస్తుందన్నారు. ఆ వెంటనే ఆపరేషన్‌ చేశారు. ఫలితంగా లక్షల రూపాయలు ఖర్చు కావడంతోపాటు.. కీలకమైన కుడి చేయి ఇలా అంగవైకల్యం బారిన పడింది.

శిరీష్ వైద్యం కోసం.. కుటుంబం అప్పుల పాలు...

శిరీష్ వైద్యం కోసం.. కుటుంబం అప్పుల పాలైంది. ఈ పరిస్థితికి కారణమైన రష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా.. పట్టించుకోలేదని బాధితుడు చెబుతున్నాడు. దీనితో తమకు సంబంధం లేదని, ఇంతకు ముందు ఎలాంటి జబ్బులు ఉన్నాయో తమకేం తెలుసంటూ బయటకు గెంటేశారని బాధితుడు చెబుతున్నాడు.

రష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా..

దీనిపై రష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. శిరీష్ కు వేసిన ఇంజక్షన్ ఒక సేఫ్ డ్రగ్ అని, దాన్ని నిత్యం వందలాది మందికి తాము పెయిన్ కిల్లర్ గా వాడుతుంటామని చెప్పారు. శిరీష్ కు నరాల సంబంధిత సమస్య ఉండవచ్చని, ఈ కారణంగానే అది వికటించిందని యాజమాన్యం అంటోంది. రష్‌ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే.. తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోతున్నాడు. తన పరిస్థితికి కారణమైన రష్ యాజమాన్యమే ఆదుకోవాలని కోరుతున్నాడు.

16:32 - September 16, 2015

కడప : బ్రహ్మగారిమఠం గ్రామానికి చెందిన ఓ వివాహితను పవన్‌ అనే వ్యక్తి కొంత కాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. బాధితురాలు ఇంటి యాజమాని కుమారుడు.. వివాహితను అసభ్యంగా చిత్రాలు తీసి, కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తిరుపతికి తీసుకెళ్లి.. అక్కడ గాజు పెంకులతో ఒళ్లంతా గాయాలు చేసి.. చిత్రహింసలు పెట్టాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. పవన్‌ నుంచి తప్పించుకుని పారిపోయి కుటుంబ సభ్యుల చెంతకు చేరానని చెబుతోంది. పవన్‌ చేష్టలతో తన భర్త తనను తీసుకెళ్లడానికి ముందుకురావడం లేదని బాధితురాలు వాపోయింది. బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తిపై ఇవాళ కడప జిల్లా ఎస్పీ నవీన్‌ గులాఠీకి ఫిర్యాదు చేసింది. 

16:31 - September 16, 2015

విజయనగరం : జిల్లాలో సబ్సిడీ ఉల్లి కొనుగోలు కోసం మహిళలు కుస్తీ పడుతున్నారు. భారీ ఎత్తున జనం రావడంతో క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకెళ్లడంతో...నిర్వాహకులకు వారిని అదుపుచేయడం కష్టంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఉల్లి విక్రయాలు కొనసాగాయి.  

16:30 - September 16, 2015

విశాఖ : విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా విశాఖలో జరుగుతున్న విద్యా సంస్ధల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజూ కూడా పోలీసులు తీరు మారలేదు. విద్యార్ధినులపై తమ ప్రతాపాన్ని చూపించారు. విద్యార్ధులను చెల్లాచెదురు చేశారు. దీంతో ఉద్రిక్తవాతావరణ నెలకొంది. మహిళాపోలీసులతో విద్యార్ధినులను అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్లకు తరలించారు. 

16:29 - September 16, 2015

హైదరాబాద్ : మద్యం పాలసీపై ఖమ్మంలో మహిళా సంఘాలు కన్నెర్రజేశాయి. నూతన ఎక్సైజ్‌ పాలసీని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఐద్వా, పీవోడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రోటరీ నగర్‌లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మద్యాన్ని నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. వీరిపై విరుచుకు పడిన పోలీసులు.. బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి జీపుల్లో పడేశారు.

హైదరాబాద్ కు బయలు దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం నేడు హైదరాబాద్‌కు తిరిగి పయనమైంది. ఏడు రోజుల పర్యటనలో సీఎం కేసీఆర్ బృందం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అంతే కాకుండా ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేదిక సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని వివరించారు. చైనా గోడను సీఎం బృందం సందర్శించింది. విజయవంతంగా చైనా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్ బృందం రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది.

ర్యాగింగ్ పై ఉస్మానియాలో అవగాహనా సదస్సు

హైదరాబాద్ : ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న డీసీపీ రవీందర్ మాట్లాడుతూ... ర్యాగింగ్‌ను అరికట్టేందుకు విద్యార్ధులే ముందుకు రావాలన్నారు. ర్యాగింగ్‌ను సామాజిక నిషేధంగా పరిగణిస్తేనే పూర్తి‌స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. ర్యాగింగ్ చట్టాలు కఠినతరంగా ఉన్నాయన్నారు.

ఇక నుండి ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదు: కోదండరాం

హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నికకు జేఏసీ దూరంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఇక నుంచి తమకు ఏ ఎన్నికలతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జేఏసీ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దేశంలో విదర్భ తరువాత తెలంగాణలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళర వ్యక్తం చేశారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయంటూ వరంగల్ ఎన్ కౌంటర్ పై స్పందించారు.

 

15:57 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్‌ గణేషుడిది ప్రత్యేక స్థానం. మహాగణపతిని దర్శించుకోవాలన్నా... గౌరీతనయుడి ప్రత్యేకతలను కనులారా వీక్షించాలన్నా ఖైరతాబాద్‌కు వెళ్లాల్సిందే. ఏటా ఒక్కో అడుగు చొప్పున పెరుగుతూ వచ్చిన మహా గణపతి.. గత సంవత్సరం 60 అడుగులతో దర్శనమిచ్చారు. ఇక ఈ ఏడాది నుంచి ఒక్కో అడుగు ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ఈ మహావినాయకుడు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా 59 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రధాన విగ్రహానికి కుడివైపు గజేంద్ర మోక్షం, ఎడమ వైపున వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ప్రతిఏడాది మాదిరిగానే ఈసారి కూడా......

ప్రతిఏడాది మాదిరిగానే ఈసారి కూడా మహాగణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం 75 అడుగుల యజ్ఞోపవీతం, 80 అడుగుల పొడవైన కండువాను సమర్పించనున్నారు. వీటిని నల్లగొండ జిల్లాలో తయారు చేయించారు. గణపయ్యకు అంబికాదర్బార్ కంపెనీ భారీ అగర్‌బత్తిని సమర్పిస్తోంది. ఈ ఏడాది 10 అడుగుల అగర్‌బత్తిని తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏలూరులో 15 రోజులపాటు 10 మంది కార్మికులు కలసి దీన్ని రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

జూన్‌ 12న ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో......

ఖైరతాబాద్‌ గణేష విగ్రహాన్ని జూన్‌ 12న ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో మొదలుపెట్టారు. సెప్టెంబర్ 10 నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. మహాగణపతి విగ్రహం తయారీకి 20 టన్నుల స్టీలు, 34 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారీస్, 75 బండిళ్ల కొబ్బరి నార, 600 బ్యాగుల బంకమట్టి, 30 లీటర్ల ఫెవికాల్, 50 సబ్బులు, 40 లీటర్ల నూనె, 22 టన్నుల కర్రలు, 200 లీటర్ల రంగులను వినియోగించారు. ప్రతి ఏటా ఎరుపు, గులాబీ, పసుపు వర్ణంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపయ్య ఈసారి నీలిమేఘ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. మొత్తంగా విగ్రహాల తయారీకి రూ. 50 లక్షలు ఖర్చైనట్లు నిర్వాహకులు చెప్పారు.

తాపేశ్వరం నుండి హైదరాబాద్ కు.......

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు 5,600 కిలోల భారీ లడ్డూను ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించనున్నారు. మహా ప్రసాదాన్ని తాపేశ్వరం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఖైరతాబాద్‌ మహా గణపతికి మహా లడ్డూ రెడీ ........

ఖైరతాబాద్ మహా గణపతికి నైవేథ్యంగా పెట్టే మహా లడ్డూ రెడీ అయింది. తాపేశ్వరం..ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఊరించే కాజా. తాపేశ్వరం కాజాతో ఫేమస్‌ అయిన సురుచి ఫుడ్స్‌ కొన్నేళ్లుగా ఖైరతాబాద్‌ బొజ్జ గణపయ్యకు నైవేధ్యంగా భారీ లడ్డూలను తయారుచేస్తోంది. ఈ సారి ఖైరతాబాద్‌లోని త్రిశక్తిమయ మోక్ష గణపతికి నైవేధ్యంగా 5,600 కిలోల భారీ సైజు లడ్డూని తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు తయారుచేశారు.

5,600 కిలోల మహాలడ్డూ .....

గత ఐదేళ్లనుంచి తాపేశ్వరం లడ్డూని మహా నైవేథ్యంగా అందుకుంటున్న బొజ్జ గణపయ్య..ప్రతి ఏడాది తన లడ్డూ బరువును టన్నుల్లో పెంచుకుంటున్నాడు. 2010లో 500 కిలోలతో ప్రారంభమైన తాపేశ్వరం లడ్డూ 2011లో 2,400 కిలోలు పెరిగింది. 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోల లడ్డూను ఇచ్చి భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది ఏకంగా 5,600 కిలోల బరువున్న భారీ లడ్డూని స్వామివారికి నైవేథ్యంగా సమర్పిస్తున్నారు.

సురుచి ఫుడ్స్‌ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు....

2010లో 500 కిలోలు, 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు ,2015లో 5,600 కిలోలు త్రిశక్తిమయ విద్యాగణపతి ఆకారంలో తయారుచేసిన ఈ భారీ లడ్డూని తన సొంత ఖర్చులతో తయారుచేశారు సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు. సురుచి ఫుడ్స్‌ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు,16 మంది సిబ్బంది వినాయక మాల వేసుకొని ఎంతో నియమ నిష్టలతో లడ్డూని రెండు రోజుల్లో తయారుచేశారు. వేద పండితుల పూజల అనంతరం తాపేశ్వరం గ్రామంలో లడ్డూని ఊరేగించిన తర్వాత భారీ లడ్డూని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఈసారి లడ్డూని అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేశామని సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు తెలిపారు.

ఖైరతాబాద్‌ త్రిశక్తిమయ మోక్ష గణపతి చేతిలో నైవేథ్యంగా.....

ఇక ఈ లడ్డూ తయారీకి 2,425 కిలో పంచదార, 1,565 కిలోల శెనగపిండి, 1100 కిలోల ఆవునెయ్యి, 100 కిలోల బాదం పప్పు, 365 కిలోల జీడిపప్పు, 33 కిలోల యాలకులు, 11 కిలోల కర్పూరాన్ని వినియోగించారు. ఖైరతాబాద్‌ త్రిశక్తిమయ మోక్ష గణపతి చేతిలో నైవేథ్యంగా ఈ భారీ లడ్డూని చివరి రోజు సగం లడ్డూని ఇక్కడి భక్తులకు పంచుతారు. ఆ తర్వాత సగం లడ్డూని తిరిగి సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబుకు అప్పగిస్తారు. ఆయన తన బంధుమిత్రులకు ఆ లడ్డూని మహాప్రసాదంగా పంచుతారు. 

15:47 - September 16, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మహాగణపతి కొలువుదీరుతున్నాడు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి నాట్యగణపతిగా దర్శనమివ్వనున్నాడు. రాజధాని నిర్మాణ పనులకు ముందుగానే భారీ విఘ్నాధిపతిని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని గణేష్‌ సేవా సమితి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

63 అడుగుల ఎత్తైన గణేషుడి విగ్రహం......

విజయవాడలో తొలిసారి ప్రతిష్టాత్మకంగా గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నగరంలో డూండీ గణేష్‌ సేవా సమితి ఆధ్వర్యంలో 63 అడుగుల ఎత్తయిన వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ గణేషుడు విగ్రహం అతి పెద్దదని నిర్వాహకులు చెబుతున్నారు.

అష్టలక్ష్మి, నాట్య గణపతి రూపంలో గణేషుడు .......

ఈ 63 అడుగుల ఎత్తయిన గణేషుడు అష్టలక్ష్మి, నాట్య గణపతి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. వినాయకుడికి రెండు వైపులా అష్టలక్ష్మి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గురువారం నాడు మహా గణేషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తుల దర్శనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ గణేషుడిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు ఈ గణేషుడిని దర్శించుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

డూండీ గణేష్‌ సేవా సమితి నిర్వాహకులు......

ఇక భక్తుల దర్శనార్ధం అన్ని ఏర్పాట్లు చేసినట్లు డూండీ గణేష్‌ సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. గురువారం నాడు ఈ మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులతో పాటు.. రాష్ట్ర మంత్రులు దర్శించుకోనున్నారు. ఇప్పటికే పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం క్యూలైన్లు, వికలాంగులు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈనెల 24వ తేదీన తమిళనాడు గవర్నర్‌ రోశయ్య , ఈ 10 రోజుల ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కూడా దర్శించుకుంటారంటున్నారు.

లడ్డూ ప్రసాదాన్ని భారీ ఉరేగింపు మధ్యలో.....

ఇక ఇక్కడే గణేషుడిని నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో లడ్డూ ప్రసాదాన్ని భారీ ఉరేగింపు మధ్యలో తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో నగర పురవీధుల్లో అలంకార్‌, గాంధీనగర్‌ నుంచి కళాశాల ప్రాంగణానికి 6300 కిలోల లడ్డూను చేరుస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో యజ్ఞయాగాలు, విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులకు ముందుగానే గణేష్‌ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం శుభశూచకమని నగరవాసులు భావిస్తున్నారు. 

గుంటూరు లో...

నగరంలో విగ్రహాల కొనుగోలు కేంద్రాలు సందడిగా మారాయి.. పెద్ద పెద్ద విగ్రహాలను క్రేన్ల సహాయంతో లారీలు, ఆటోల్లో ఎక్కించుకొని తీసుకువెళుతున్నారు భక్తులు.. మంగళగిరి, నల్లపాడు, పొన్నూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నారు.. అయితే ఈసారి ధరలు మాత్రం అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి.. అటు వ్యాపారులు మాత్రం విగ్రహాల రేట్లు స్వల్పంగానే పెంచామని చెబుతున్నారు.. గత ఏడాదితోపోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. మున్సిపల్ సిబ్బంది వసూళ్లతో తమకు ఖర్చు మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి బొజ్జ గణపయ్యకు సేవలు చేసేందుకు అందరూ ఉత్సాహం చూపుతున్నారు..

పండుగల ఉత్సవాల్లో లోపిస్తున్న స్ఫూర్తి.....

మనం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే చాలా పండుగలకీ, ప్రకృతికీ అవినాభావ సంబంధం వుంది. ప్రకృతిని ప్రేమించడం, చెరువులను, కుంటలను, అరుదైన, ఔషధ గుణాలున్న వృక్ష జాతులను కాపాడుకోవడం కొన్ని పండుగల్లోని విశిష్ట లక్షణం. అయితే, రానురాను పండుగల ఉత్సవాలలో అసలు స్ఫూర్తి లోపిస్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ గణేష్ ఉత్సవాలు.

21పత్రాలతో పూజ చేయడం....

మట్టితో వినాయకున్ని తయారుచేయడం, 21 పత్రాలతో పూజ చేయడం నవరాత్రుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేస్తారు. ఇది నాయకుని చవితికి చేయవల్సిన నిజమైన సేవ. చెరువుల్లో, కుంటల్లోని మట్టి తీసుకొచ్చి గణపతి ప్రతిమలు చేస్తారు. దీంతో వర్షాలు పడినప్పుడు కాలువలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరుగుతుంది. ఇంతటి పరమార్థం మట్టివినాయకుల తయారీ వెనుక ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మట్టివినాయకుల తయారీ జలయజ్ఞంలో అంతర్భాగమని చెప్పొచ్చు.

పత్రి పూజ చేసేవి మామూలు ఆకులు కాదు.....

గణనాథుడ్ని 21 పత్రాలతో పూజించడం ఆచారంగా వస్తోంది. పత్రి పూజకు ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధమొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలేకానీ, వేరేవాటితో చేయకూడదు. ఔషధ పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటివల్ల ఇబ్బందులు పోతాయి.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు మరలిన సంస్కృతి....

ఇప్పటి సంస్కృతి పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు మరలిపోయింది. ఒకపక్క ప్రభుత్వం వినాయకుని మట్టి విగ్రహాలు వాడాలన్న ప్రచారం హోరెత్తిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దైవం పేరుతో పర్యావరణానికి మనమే ద్రోహం చేసుకుంటున్నాం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు విషపూరిత రసాయనాలతో రకరకాల రంగులు అద్దుతున్నారు. నిమజ్జనం చేసిన ప్పుడు విషపదార్థాలు నీటిలోకిచేరి భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు నిమజ్జనమప్పుడు చెరువు అడుగున చేరి అక్కడ ఒక గట్టుగా మారుతోంది. దీంతో చెరువులోవున్న జీవజలరాశికి విఘాతంగా మారుతోంది.

జల కాలుష్యానికి తావులేకుండా.....

జల కాలుష్యానికి తావులేకుండా, పర్యావరణానికి హాని కలుగని రీతిలో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడమే ఇప్పుడు మనందరి బాధ్యత. ప్రమాదాలు తెలిసి కూడా వినాయక విగ్రహాల తయారీలో మితిమీరిన రంగులున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను అనుమతిద్దామా? ఎవరికీ ఏ హానీ కలగని రీతిలో మట్టి వినాయకుల విగ్రహాల ప్రతిష్టించుకుందామా? ఒక్కసారి మీరే ఆలోచించండి.

నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు : కేటీఆర్

మహబూబ్‌నగర్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తోందన్నారు. జిల్లాలోని జడ్చర్ల మండలం పందిరిగడ్డ దగ్గర తెలంగాణ సాగునీటి సరఫరా పథకానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 85 లక్షల కుటుంబాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమని కేటీఆర్ చెప్పారు.

మత్తు మందు చల్లి బ్యాగ్ చోరీ...

నల్గొండ : హైదరాబాద్‌- వరంగల్‌ బస్సులో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. ఓ ప్రయాణికురాలిపై మత్తు మందు చల్లిన దుండగులు ఆమె బ్యాగ్‌‌ను చోరీ చేశారు. బ్యాగ్‌లో 10 తులాల బంగారం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం...

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్‌పీఎంఆర్‌ఎం పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. పథకం కింద గ్రామాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. ఆకర్షణీయ గ్రామాల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లతో బడ్జెట్ కేటాయించనున్నారు. వచ్చే మూడేళ్లలో 300 పారిశ్రామిక కేంద్రాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

'మన్ కీ బాత్' నిషేధం కుదరదు: ఈసీ

హైదరాబాద్ : బిహార్ ఎన్నికల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' మీద నిషేధం విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దానిమీద గంపగుత్తగా నిషేధం విధించడం కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆలిండియా రేడియోను ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు.

15:18 - September 16, 2015

హైదరాబాద్ : నల్గొండ జిల్లాను కరువు జిల్లా ప్రకటించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు రూ5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని 'టెన్ టివి'తో మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 సార్లు అధికారులను కలిసి రైతులను ఆదుకోవాలని విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ను కలిసి విన్నవించుకుందామన్నా అధికారులు ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి ధర్నా చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది.

ఎస్ఐ రమేష్ ఆత్మహత్యపై భార్య గీత ఫిర్యాదు...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ రమేశ్ పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చెట్టుకు ఉరి వేసుకుని నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రమేశ్ ఆత్మహత్యపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన భార్య గీత ఫిర్యాదు చేసింది. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ గీత ఫిర్యాదులో పేర్కొన్నారు. యాలాల సీఐ, మరో వ్యక్తి కలిసి తన భర్తను హత్య చేశారంటూ గీత చెప్పారు. అయితే రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

15:03 - September 16, 2015

హైదరాబాద్ : హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 9లో వైవాహిక హక్కుల చట్టం గురించి చెప్పబడింది. అస్సలు వైవాహిక చట్టం అంటే ఏమిటి? న్యాయ సలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి వివరాలు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:52 - September 16, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎక్కడ అనే సందిగ్ధతకు తెరపడింది. తొలుత గుంటూరులోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడలోనే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మూడు నెలల్లోనే పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం......

ఇప్పటికే నాలుగు రోజులు బెజవాడలోనే ఉంటానని ప్రకటించిన చంద్రబాబు... విజయవాడ కేంద్రంగా పరిపాలనతో పాటు పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్నే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మారుస్తారని అందరూ భావించారు. కానీ.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలవారికి అందుబాటులో ఉండాలంటే విజయవాడనే సరైందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే బెజవాడలో ప్రస్తుతమున్న కార్యాలయం మరీ చిన్నదిగా ఉండడంతో.. కొత్తది ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. దీంతో మూడు నెలల్లో విజయవాడలో కొత్త పార్టీ కార్యాలయ ఏర్పాటు కానుంది.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కేంద్ర కమిటీ కార్యాలయం......

ఇక పార్టీ జాతీయ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. కేంద్ర కమిటీ కార్యాలయాన్ని ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లోనే కొనసాగించాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడే కొనసాగించనున్నారు. ఇక కేంద్ర కమిటీలో 35 మంది సభ్యులు ఉండనున్న నేపథ్యంలో వీరందరికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క పార్టీ మీడియా కమిటీని కూడా జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నారు. అవసరమైతే కేంద్ర కమిటీయే రెండు రాష్ట్రాల మీడియా సంబంధాలను చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 కృష్ణానదీ తీరంలో చంద్రబాబు నివాసం వద్ద హెలీప్యాడ్‌......

ఇక చంద్రబాబు విజయవాడలో ఏర్పాటు చేసుకున్న నివాసం నుంచి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలకు వెళ్లాలంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు 45 నిమిషాల సమయం వృధా అవుతోంది. రానుపోను 90 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయం వృధా కాకుండా చేసేందుకు అధికారులు కృష్ణానదీ తీరంలో చంద్రబాబు నివాసం వద్ద హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే దీని కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

14:49 - September 16, 2015

హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే... పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి.. ఇంతకంటే సాక్ష్యం ఇంకొటి ఉండదు. నెల రోజుల నుంచి కొండెక్కి కూర్చున్న ఉల్లి ధరలు... తగ్గనని మొండికేస్తుండడంతో... జరగాల్సింది జరిగిపోయింది. హైదరాబాద్‌లో ఉల్లిగడ్డలు దొంగిలించబడ్డాయి. ఉల్లిపాగడ్డలతో పాటు ఆలుగడ్డలు కూడా చోరికి గురయ్యాయి. ఈ ఘటన కాటేదాన్‌లోని రేణుక హోటల్‌లో చోటుచేసుకుంది. దాదాపు క్వింటా ఉల్లిగడ్డలు, అరక్వింటా ఆలుగడ్డలను, కొంత డబ్బును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఉల్లిగడ్డల రేటు పెరగడంతోనే ఈ దొంగతనం జరిగిఉంటుందని యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే.. గతంలో కూడా చోరీలు జరిగాయని.. ఈ తరహాలో ఎప్పుడూ ఉల్లిగడ్డలు చోరీకి గురికాలేదని వాపోతున్నాడు యజమాని బాలప్ప. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

14:45 - September 16, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లా ఆత్మకూర్‌ మండలం అమరచింత గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నందకిశోర్‌ అనే 6నెలల బాలుడు గొంతులో రాత్రి ఇడ్లీ ఇరుక్కొని శ్వాస ఆడక మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులైన వెంకటేశ్‌, శ్రీలక్ష్మీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న బాబు..తమ కళ్లముందే విలవిలలాడి మృతిచెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పిల్లాడు ఏడుస్తుంటే ఇడ్లీ తినిపించామని..అయితే ఇడ్లీ గొంతులో ఇరుక్కొని అక్కడికక్కడే చనిపోయాడని బాలుడి బంధువులు తెలిపారు.

 

కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి అనే యువ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సంఘటనపై వివరాలు తెలియాల్పి ఉంది.

కడపలో ఇద్దరు రైతుల ఆత్మహత్య

కడప: అప్పులబాధతో జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కమలాపురం మండలం కోకటంలో చెట్టుకు ఉరివేసుకుని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన వారుగా గుర్తించారు.

14:36 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసానిచ్చే చర్యలు చేపట్టడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలకు బ్యాంకర్లే కారణమని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

14:32 - September 16, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లా ఎల్లూరులో వాటర్‌గ్రిడ్‌ పనులకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత నీరు అందిస్తామని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

13:44 - September 16, 2015

విక్టరీ వెంకటేష్..వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రధానంగా ఆయన వివిధ భాషల్లో వచ్చిన సినిమాలను రీమెక్ చేయడంలో ఆసక్తి చూపుతుంటారు. ఆ మ‌ధ్య మ‌ల‌యాళ 'దృశ్యం' చిత్రం అలా చేసిందే. ఆయన కెరీర్ లో చాలా రీమేక్స్ వున్నాయి. తాజాగా అమితాబ్, దీపిక ప‌దుకోణే, ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో వ‌చ్చి విజ‌యం సాధించిన 'పికు' హిందీ చిత్రాన్ని సురేష్ బాబు రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్నార‌నే టాక్. 'వెంకీ' ఈ సినిమాలో లీడ్ రోల్ చేయ‌డానికి సిద్ద ప‌డిన‌ట్లేన‌ని తెలుస్తోంది. నాగేంద్ర బాబు తనయ వెంకీ డాట‌ర్ గా కూడా క‌నిపిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. 'పికు' తో మ‌రో మంచి సినిమా ఇస్తాడా ? లేదా ? అన్నది చూడాలి. 

13:38 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణను హరితవనం చేస్తామన్నారు. ఊరూరా....చెట్లు నాటి ఫొటోలకు పోజులిచెచ్చారు. ఓ మగ్గు నీళ్లు పోసి మెల్లగా జారుకున్నారు. ఇంటికో మొక్క పంచి చేతులు దులుపుకున్నారు. వర్షాలు కురవక భూమిలో తడి లేక చాలా మొక్కలు ఎండిపోయాయి. కాని ఇపుడు జోరుగా వర్షాలు కరుస్తున్నాయి. అధికారులు మాత్రం హరితహారం ఊసెత్తటం లేదు.

నగరంలో భారీ ప్రణాళిక..
వర్షాకాలంలో రాష్ట్రం అంతటా మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో హరితహారం కార్యక్రమం చేపట్టారు. కాని వర్షాలు కురవక మొక్కలు ఎండిపోతున్నాయని వాయిదా వేశారు. హైదరాబాద్‌లో మాత్రం వర్షాలు కురిశాక మొక్కలు నాటాలని భారీ ప్రణాళిక రూపొందించారు. ఈ వారం మొత్తం విస్తారంగా వర్షాలు కురిసి నగరం జలమయమైంది. అయినా అధికారులు మాత్రం హరితహారం ఊసెత్తటం లేదు.

గ్రేటర్‌లో 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం..

నాలుగేళ్లలో ఒక గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 3కోట్ల 30 లక్షల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే 50 లక్షల పైగా మొక్కలను నాటాలని జిహెచ్‌ఎంసి లక్ష్యంగా పెట్టుకుంది. కాని వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో... లక్ష్యాన్ని సగానికి తగ్గించినట్లు తెలుస్తుంది. ముందుగా గ్రేటర్‌లో 2,583 ప్రదేశాల్లోని 4,402 ఎకరాల్లో ఐదు దశల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులు భావించారు. మొత్తం 23 కోట్ల 42 లక్షల రూపాయలను ఖర్చు చేయడానికి ప్లాన్ చేశారు.

మరో 40 లక్షల మొక్కలను ఏపీ నుంచి తేవాలని నిర్ణయం..
నగరంలోని 19 నర్సరీలతో పాటు ఇతర నర్సరీల ద్వారా మొక్కలను తీసుకురావాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. కనీసం ఐదు ఫీట్లకు పైగా ఎత్తు ఉన్న మొక్కలను నాటడానికి ఏర్పాట్లు చేసింది. హరితహారం ఆలస్యం కాకూడదని గుంతలు తీసేందుకు కొత్త యంత్రాన్ని సైతం తీసుకొచ్చారు. ఇప్పుడు గుంతలు సిద్ధంగా ఉన్నా నాటడానికి మాత్రం మొక్క ల్లేవు. మొదటి దశలో నాటే 50లక్షల మొక్కలకుగాను..10లక్షల మొక్కలు గ్రేటర్‌లో ఉంటే.. మరో 40 లక్షలు ఆంధ్రప్రాంతం నుంచి తీసుకురాలని బల్దియా నిర్ణయించింది. మొక్కలను నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని భావించింది.

ప్రచారానికే పరిమితం..
ఐతే ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్‌ఎంసీ నిర్ణయాలు, ప్రణాళికలు భారీగా ఉన్నా అవి ప్రచారానికే పరిమతయ్యాయి. ఇపుడు నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నా అధికారులు హరితహారంపై దృష్టి సారించటంలేదు. మొక్కలను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేయటం లేదు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చైనా పర్యటన అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సీఎంతో గ్రాండ్‌గా హరిత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ హామీ ఎంత మేరకు నిజమవుతుందో చూడాలి.

13:33 - September 16, 2015

గుంటూరు : వైసీపీ కార్యాలయాన్ని గుంటూరుకు త‌ర‌లించేందుకు ఆ పార్టీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. ఏపీలో పార్టీ కార్యక‌లాపాల‌ను గుంటూరు నుంచే నిర్వహించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో..ఆ పార్టీ నేతలు నూతన కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు విజ‌య‌వాడ నుంచే పాల‌న కొనసాగిస్తున్నారు. ఇక ప్రతిప‌క్ష నేత‌ జ‌గ‌న్ కూడా గుంటూరుకు మ‌కాం మార్చాలని నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.

గుంటూరుకు మార్చాలని జగన్ ప్లాన్..
వైసీపీ కార్యక్రమాలు త్వర‌లో ఏపి నుంచే కొన‌సాగ‌బోతున్నాయి. ఏపిలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ప్రస్తుత రాష్ట్ర కార్యాల‌యం హైద‌రాబాద్‌ లోట‌స్‌పాండ్‌లో ఉంది. ఏపీకి సంబంధించిన పార్టీ కార్యక‌లాపాలన్నీ హైద‌రాబాద్ నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఒక‌ప‌క్క అమ‌రావ‌తిలో ఏపీ రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుండ‌డం, మ‌రోప‌క్క సీఎం చంద్రబాబు సైతం విజ‌య‌వాడ నుంచి ప‌రిపాల‌న సాగిస్తుండ‌టంతో వైసీపీ తమ మకాం గుంటూరుకు మార్చాల‌ని చూస్తోంది. త్వర‌లో గుంటూరులో పార్టీ కార్యాల‌యం ప్రారంభించి పార్టీ స‌మావేశాలు, కార్యక‌ర్తల‌కు అక్కడి నుంచే అందుబాటులో ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్టు స‌మాచారం.

విజ‌య‌వాడ స‌మీపంలో వైసీపీ రాష్ట్ర కార్యాల‌యం..
గ‌తంలోనే విజ‌య‌వాడ స‌మీపంలో వైసీపీ రాష్ట్ర కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌స‌ర‌త్తు జ‌రిగింది. కాని విజ‌య‌వాడ న‌గ‌రం ర‌ద్దీ దృష్ట్యా కొన్నిస‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఆ ప్రయ‌త్నాన్ని విర‌మించుకుంది. తాజాగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల‌ను క‌లుపుతూ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించే ప్రయ‌త్నం చేస్తోంది. న‌గ‌రాల్లో జ‌నావాసాల మ‌ధ్య కాకుండా న‌గ‌ర శివారుల్లో విశాలమైన కార్యాల‌యాన్ని నిర్మించాల‌నుకుంటున్నారు. ఇందుకోసం స్థల అన్వేష‌ణ కూడా పూర్తైన‌ట్లు తెలుస్తోంది.

ఐదు వేల మంది కార్యక‌ర్తల స‌మావేశ మందిరం..
నూత‌నంగా నిర్మించే పార్టీ కార్యాల‌యంలో సుమారు ఐదు వేల మంది కార్యక‌ర్తల స‌మావేశ మందిరం, పార్టీ ఉన్నత స్థాయి స‌భ్యుల స‌మావేశాల‌కు అనువైన హాల్‌తో పాటు ముఖ్యమైన మీటింగ్‌ల కోసం మ‌రో హాల్‌ను నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అంతేకాకుండా ఒక‌వేల‌ భ‌విష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చినా, కార్యక‌ర్తలు లీడ‌ర్ల తాకిడిని త‌ట్టుకునే విధంగా ఈ కార్యాల‌యానికి రూప‌క‌ల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నూత‌న కార్యాల‌య నిర్మాణ బాధ్యతను పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్యనారాయ‌ణ స్వయంగా ప‌ర్యవేక్షిస్తున్నట్లు పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి పార్టీ రాష్ట్ర కార్యాల‌యాన్నిరాజ‌ధాని ప్రాంతానికి త‌ర‌లించేందుకు వైసీపీ స‌న్నాహాలు చేస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జ‌రిగితే ఈ విజ‌య‌ద‌శ‌మి నాటికి పార్టీ కార్యాల‌యానికి శంకుస్ధాప‌న చేయాల‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నట్లు స‌మాచారం.

13:30 - September 16, 2015

అనంతపురం : టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అక్రమాలపై వైసీపీ ఆందోళన చేపట్టింది. పయ్యావుల అక్రమాలపై విచారణ కోరుతూ అనంతపురం జిల్లా బెలుగుప్ప తహశీల్దార్ కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అయితే ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆలూరు ఎమ్మెల్యే జయరాంను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గుంతకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ధర్నాలో పాల్గొనకుండా మాజీ ఎంపీ, వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. మరో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇంటి వద్ద భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 

13:28 - September 16, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం కేసీఆర్‌ విదేశాల్లో పర్యటిస్తున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీటీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎల్‌ రమణ, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సొమ్ముతో జల్సానా - రేవంత్..
ప్రజలు కట్టిన సొమ్ముతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్ల కార్లు నచ్చలేదని తెల్లటి కార్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. టీఆర్ఎస్ మంత్రులకు మానసిక వైద్యం కావాలని మరో నేత పేర్కొన్నారు. ఈ ధోరణి ప్రభుత్వ విడనాడాలని సూచించారు. రైతు ఆత్మహత్యలు ఘోషించే విధంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. 

13:25 - September 16, 2015

కృష్ణా : ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం ప్రాశస్త్యంపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు, నేతలు పాల్గొన్నారు.

13:21 - September 16, 2015

చిత్తూరు : కేశవరెడ్డి పాఠశాలల్లో బుధవారం ఉదయం సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకున్న కేశవరెడ్డి విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా అధికంగా విద్యాలయాలున్న చిత్తూరు, కడప జిల్లాలో ప్రధాన దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తంగా 13 జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో ఎంత డబ్బు సేకరించారు ?అనే దానిపై ఆరా తీసినట్లు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కోట్ల రూపాయల డిపాజిట్ల సేకరణ..
నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి... వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని అందిన ఫిర్యాదులపై సీసీఎస్‌ పోలీసులు 9వ తేదీ సాయంత్రం కేశవరెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
రూ.లక్ష, రూ.2 లక్షలు చెల్లిస్తే ఉచిత విద్య అందిస్తామని, పదో తరగతి పూర్తయ్యాక డిపాజిట్‌ సొమ్ము వెనక్కి చెల్లిస్తామంటూ కేశవరెడ్డి కొత్త స్కీమ్‌ ప్రవేశపెట్టారు. ఇలా సుమారు 11 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేటు వ్యక్తులు కూడా కేశవ రెడ్డికి భారీగా అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేశవరెడ్డి రూ.3 నుంచి రూ.6 వరకు వడ్డీ చెల్లిస్తుండటంతో పెద్ద మొత్తంలో రుణాలు వచ్చినట్లు విమర్శలున్నాయి. మొత్తంగా 547 కోట్ల రూపాయలు బాకీ పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వారు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో వ్యవహారం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. 

శ్రీలంక ప్రధాని పర్యటనను నిరిసిస్తూ చెన్నైలో ఆందోళనలు..

చెన్నై : శ్రీలంక ప్రధాని భారత దేశ పర్యటనను నిరసిస్తూ వైటిఎం (యంత్ తమిళనాడు మూవ్ మెంట్) గ్రూపు బుధవారం ఆందోళన చేపట్టింది. 

12:59 - September 16, 2015

పరిచయం అక్కర లేని పేరు.. మ్యూజిక్‌తో మంత్రముగ్ధుల్ని చేస్తాడు. ఆస్కార్‌ ముందు దేశఖ్యాతిని ఎలుగెత్తాడు. అలాంటి మ్యూజిక్‌ లెజెండ్‌ ఇప్పుడు వివాదాలకు కారణమయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఢిల్లీ షోను రద్దు చేసుకున్నాడు రెహమాన్‌. మరోవైపు యూరోప్ పర్యటనలో బిజీగా ఉండటం వల్లే షో రద్దైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్.. ఎన్నో సినిమాలకు అద్భుత సంగీతాన్ని అందించారు. పాటకు పల్లవే ప్రాణం అనుకుంటున్న రోజుల్లో తన మ్యూజిక్‌తో.. సాంగ్స్ కు ప్రాణం పోశాడు. యువతరాన్ని ఉర్రూతలూగించాడు.

మొహమ్మద్‌ ద మెసెంజర్‌ ఆఫ్ గాడ్ చిత్ర వివాదం...
ఇప్పుడు అదే సంగీతంతో వివాదాలకు కారణమయ్యాడు ఏఆర్‌ రెహమాన్‌. ఇరాన్‌ భాషలో రూపొందిచిన 'మొహమ్మద్‌ ద మెసెంజర్‌ ఆఫ్ గాడ్' చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేకి అంటూ ముంబయ్ కేంద్రంగా పని చేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది. 'మొహమ్మద్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి ఇరాన్‌కు చెందిన మాజీద్ మజిదీ దర్శకత్వం వహిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాకు సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న సున్నీ ముస్లిం సంస్థ రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.

ఫేస్ బుక్ లో లెటర్ ను పోస్టు చేసిన రెహమాన్..
సున్నీ ముస్లీం సంస్థ ఫత్వాపై రెహమాన్‌ స్పందించారు. తాను మొహమ్మద్‌ ద మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ చిత్రానికి దర్శకున్ని కాదు.. నిర్మాతను కాదు.. కేవలం సంగీతం అందించానంటూ ఫేస్‌బుక్‌లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉందన్న ఆయన అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించాలనేదే తన ధ్యేయమన్నారు. రెహమాన్‌ లెటర్‌లో కొన్ని ఖురాన్‌ సూక్తులను సైతం వివరించారు. రెహమాన్‌కు ముస్లిం మత పెద్దలకు మధ్య నడుస్తున్న ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

విశాఖపట్టణంలో అఖిలపక్ష సమావేశం..

విశాఖపట్టణం : సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విద్యార్థులపై లాఠీఛార్జీని నేతలు ఖండించారు. కలెక్టర్ ను అఖిలపక్ష బృందం కలువనుంది. 

సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు సమ్మక్క సారక్క జాతరల ఏర్పాటప్లై మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, కడియం శ్రీహరిలు సమావేశం ఏర్పాటు చేశారు.

 

మల్కాజిగిరి కోర్టుకు ఉగ్రవాదులు..

హైదరాబాద్ : నగరంలోని మల్కాజిగిరి కోర్టుకు 13 మంది అలీభాయ్ ఉగ్రవాదులను పోలీసులు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు సిబ్బంది విచారణకు తీసుకొచ్చారు. వివిధ కేసుల్లో వీరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 

నల్గొండ కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా...

నల్గొండ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. పది లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని బాధిత కుటుంబాలతో సీపీఎం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డిలు పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదలమని సీపీఎం నేతలు, బాధితులు తేల్చిచెప్పారు. 

పశువుల మాంసం నిషేధంపై జమ్మూ హైకోర్టులో పిటిషన్..

జమ్మూ కాశ్మీర్ : పశువుల మాంసం నిషేధంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది. 

దర్శి గురుకుల పాఠశాల ఘటనపై స్పందించిన గంటా..

హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలోని దర్శి గురుకుల విద్యాలయంలో విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందడంపై మంత్రి గంటా స్పందించారు. ఆత్మహత్యపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు అధికారిగా డీఈఓ రామలింగంను నియమించారు. 

గన్ పార్కు వద్ద టిడిపి మహి నేతల ధర్నా..

హైదరాబాద్ : గన్ పార్కు వద్ద టిడిపి మహిళా నేతల ధర్నా నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో కలిసి ఈ ఆందోళన చేశారు. ధర్నాలో ఎర్రబెల్లి, రేవంత్, రమణ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నేతలు పరామర్శించారు. 

రేపు ఆర్జేడీ పార్లమెంటరీ బోర్డు భేటీ..

పాట్నా : ఆర్జేడీ పార్లమెంటరీ బోర్డు సమావేశం గురువారం జరుగనుంది. ఎన్నికల అభ్యర్థులను ఈ సమావేశం లో ఖరారు చేయనున్నట్లు సమాచారం. 

12:33 - September 16, 2015

వరంగల్ : జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని వివిధ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఎంజిఎం ఆసుపత్రి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శృతి, విద్యాసాగర్ మృతదేహాలను చూపించాలని బంధుమిత్రుల కమిటీ, విరసం, బీటీఎఫ్ ఆందోళన చేపట్టాయి. దీనికి అనుమతి నిరాకరించడంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎన్ హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ మేరకే ఎన్ కౌంటర్ మృతులకు పోస్టుమార్టం నిర్వహించాలంటూ పిల్ దాఖలు చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓ సంఘం నేత టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ వస్తే ఒక్క ఎన్ కౌంటర్ జరగదని, మావోయిస్టుల ఏజెండా తమదేనని పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఏం జరిగిందని ప్రశ్నించారు. ఎక్కడో నుండి పట్టుకుని వచ్చి చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపించారు. ఘటనా స్థలంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించి కాల్పులకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు బాధ్యత వహించి రాజీనామా చేస్తారా ? లేదా ? అనేది వారు ఆలోచించుకోవాలని సూచించారు. 

హెల్మెట్ లేని వారికి సన్మానం..

హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి పోలీసులు పూలతో సత్కారం నిర్వహిస్తున్నారు. శిరస్త్రాణ ధారణపై వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసులు పాఠాలు బోధిస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ప్రచారం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి గులాబీ పూలు అందించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు

కేశవరెడ్డి విద్యా సంస్థలో సీఐడీ అధికారుల తనిఖీలు..

చిత్తూరు : కేశవరెడ్డి విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు అకస్మిక తనిఖీలు జరిపారు. మదుపరుల వివరాలను అధికారులు తీసుకెళ్లారు. 

కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన పోచారం..

నిజామాబాద్: జిల్లా కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. 

బాబును కొనియాడిన పల్లె..

కృష్ణా : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం పైలాన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పల్లె మాట్లాడారు. బహుళార్థకమైన ప్రాజెక్టును పూర్తి చేయడం బాబుకే చెల్లుతుందని, బాబు చేస్తున్న కృషి అమోఘనీయమన్నారు. 

గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం పైలాన్ ఆవిష్కరణ..

కృష్ణా : జిల్లాలో ఇబ్రహింపట్నం ఫెర్రీ వద్ద గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం పైలాన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిప కొలువైన కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

 

నదుల అనుసంధానం శుభ పరిణామం..

ఢిల్లీ : పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం జరగడం శుభపరిణామామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో అసోచామ్ ఆధ్వర్యంలో అందరికీ ఇళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్, ఏపీ ముందుండడం సంతోషదాయకమన్నారు. ఇదే రీతిలో మిగతా రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధిలో పోటీ పడాలని, తెలంగాణ ర్యాంకు మెరుగవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఎన్టీఆర్ ఆశయాన్ని చంద్రబాబు నెరవేర్చారు - హరికృష్ణ..

హైదరాబాద్ : దివంగత ఎన్టీఆర్ ఆశయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చారని టిడిపి నేత హరికృష్ణ పేర్కొన్నారు. నదుల అనుసంధానం అనేది ఎన్టీఆర్ కల..ఆశయమన్నారు.

 

పిల్ దాఖలు చేసిన ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు..

వరంగల్ : జిల్లా కోర్టులో ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాల పిల్ దాఖలు చేశారు. ఎన్ హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ మేరకే ఎన్ కౌంటర్ మృతులకు పోస్టుమార్టం నిర్వహించాలంటూ పిల్ దాఖలు చేశారు. 

11:38 - September 16, 2015

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ర్యాగింగ్ కారణంగా..అధ్యాపకుల లైంగిక వేధింపుల కారణంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా దర్శి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. గురుకుల పాఠశాలలో వినయ్ అనే విద్యార్థి పదో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం ఓ రూంలో వినయ్ ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై మండి పడుతున్నారు. వినయ్ ఆత్మహత్య చేసుకోడని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రం వినయ్ కనిపించడం లేదని స్కూల్ ప్రిన్స్ పాల్ పేర్కొంటున్నారు.

11:31 - September 16, 2015

హైదరాబాద్ : నగరంలో కేబీఆర్ పార్కు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఓ ఛైన్ స్నాచర్ పార్కు వద్ద హల్ చల్ చేశాడు. ఈ పార్కుకు ఎంతో మంది మార్నింగ్ వాక్ కోసమని ఈ పార్కుకు వస్తుంటారు. బుధవారం ఉదయం ఓ మహిళ మార్నింగ్ వాక్ చేస్తోంది. అపరిచిత వ్యక్తి ఆ మహిళ వద్దనున్న బంగారం తెంపుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే మహిళ కేకలు వేయడం..ప్రతిఘటించడం జరిగిపోయాయి. తన ప్రయత్నం విఫలమౌతుందని గ్రహించిన స్నాచర్ తన వద్దనున్న కత్తితో మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీనితో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా చూస్తున్న ఇతరులు వెంటనే ఆ స్నాచర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు సంతోష్ అని తెలిసింది. ఇతను మూడు స్నాచింగ్ కేసుల్లో నిందితుడని, గతంలో కూడా అరెస్టయ్యాడని తెలుస్తోంది. ఇటీవలే పార్కు వద్ద గ్రే హౌండ్స్ పోలీసుపై ఓ వ్యక్తి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. పార్కు వద్ద సరియైన భద్రత లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. 

11:21 - September 16, 2015

హైదరాబాద్ : నగరంలోని 'భాష్యం' స్కూల్ బస్సును ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన వనస్థలిపురం ఆటోనగర్ వద్ద చోటు చేసుకుంది. విజయవాడ జాతీయ రహదారిపై భాష్యం పాఠశాలకు చెందిన బస్సు హయత్ నగర్ నుండి వనస్థలిపుం వైపు వెళుతోంది. ఆటోనగర్ వద్ద స్కూల్ బస్సును ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పాఠశాల బస్సు అద్దాలు పగలడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన 13 మంది విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య..

ప్రకాశం : జిల్లా దర్శి గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న వినయ్ పాఠశాల రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం నుండి వినయ్ కనిపించడం లేదని స్కూల్ ప్రిన్స్ పాల్ పేర్కొంటున్నారు. 

11:10 - September 16, 2015

నెల్లూరు : ఇటీవల రైళ్లలో దుండగులు పలు దోపిడిలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై దాడి చేసి నగలు లాక్కెళ్లిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కాకినాడ నుండి బెంగళూరు వెళుతున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా మనుబోలు వద్ద చోటు చేసుకుంది. ఎస్ -3 బోగీ చైన్ లాగి దుండగులు మహిళలను బెదిరించారు. ఎస్ -2, ఎస్-7, ఎస్ -8 బోగీల్లోకి ఎక్కిన దుండగులు మహిళల వద్దనున్న బంగారు ఆభరణాలను లాక్కొన్నారు. అనంతరం చైన్ లాగి గూడురు వద్ద దిగి తాపీగా వెళ్లిపోయారు. అనంతరం బాధితులు చిత్తూరు జిల్లా రేణిగుంట స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల్లో ఇది రెండో సంఘటనగా పేర్కొనవచ్చు. దొంగతనాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకుంటున్నామని మాటలకే చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. 

దశబ్ధాల కల నెరవేరింది - బుద్ధ ప్రసాద్..

విజయవాడ : దశాబ్ధాల తెలుగు వారి కల నెరవేరిందని, పట్టిసీమతో కృష్ణా డెల్టాలో బంగారం పడుతుందని డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. నదుల అనుసంధానం చంద్రబాబు దార్శినికతకు నిదర్శనమన్నారు. పట్టిసీమపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. 

డెహ్రాడూన్ తగులబడిన కారు..ముగ్గురి మృతి..

ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్ లోని రాయ్ పూర్ లో ఓ కారు తగులబడింది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. 

లుధియానాలో 17వ తేదీన మీట్ బ్యాన్..

పంజాబ్ : రాష్ట్రంలో 17వ తేదీన వినాయక చవితి సందర్భంగా లుధియానాలో మాంసం విక్రయాలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ..

ఢిల్లీ : కాసేపట్లో నిర్వహించే కేంద్ర కెబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు సమావేశ ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

 

మన్ కీ బాత్ పై ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్..

బీహార్ : రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్వహించే మన్ కీ బాత్ ను నిషేధించాలని కాంగ్రెస్ ఈసీని కోరనుంది. 

10:38 - September 16, 2015

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ మోడల్, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ 'పూజా మిశ్రా' మరో వివాదంతో తెరమీదకొచ్చింది. హోటల్ సిబ్బందిపై పూజా మిశ్రా దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల పూజా మిశ్రా న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ద్వారకాలో బస చేసింది. ఆమె ఉన్న రూములో కొన్ని సామన్లు పగిలాయని, వాటికి బిల్లు కట్టకుండా పూజా మిశ్రా వెళ్లేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అందుకోసమే సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని తెలుస్తోంది. అడ్డుకున్న సిబ్బందిని కొట్టడమే కాకుండా సామాను తీసుకెళ్లకుండా ఆపిన వారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వెంటపడి తన్నింది. ఈ దృశ్యాన్ని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన హోటల్ సిబ్బందిపైనా దాడి చేసింది. ఈ అమ్ముడికి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో ఓ సారి నోయిడా అతిథి గృహంలో మూడు రోజుల పాటు తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. అంతకుముందేమో.. సోనాక్షి సిన్హా, ఇషా కొప్పికర్లపై కేసులు పెట్టిన ఘనత కూడా అమ్మ‌డిదే.

10:32 - September 16, 2015

వరంగల్ : ఎందరో కోరుకున్న తెలంగాణ రాలేదని ప్రస్తుతం దొరల తెలంగాణ ఉందని విప్లవ రచయిత సంఘం నేత పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ఎంజిఎం ఆసుపత్రికి పలువురు విప్లప రచయిత సంఘం నేతలు, ప్రజా సంఘాలు చేరుకున్నాయి. నిన్న ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి మృతదేహాలను చూపించాలని కోరారు. అధికారులు అనుమతిని నిరాకరించడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలువురు మాట్లాడారు. పాలకుల పాశవిక చర్యలు ప్రజలు గమనిస్తారని, మృతదేహాలను ప్రజల ఎదుట ఉంచేందుకు భయపడుతోందన్నారు. ప్రజలు గమనించాలని సూచించారు. పాలకులు మారారే కానీ పాలన విధానంలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేయాల్సినవసరం ఉందన్నారు. కనీసం మృతదేహాలను చూపించడం లేదని, తమ బిడ్డలో కాదో తెలుసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నా అనుమతించడం లేదన్నారు. తాము పోస్టుమార్టం నిర్వహించే గదిలోకి వెళ్లమని చెబుతున్నా అనుమతించడం లేదని దీనితో నడిరోడ్డుపై కూర్చొన్నామన్నారు.

మంగళవారం కాల్పులు..
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ అడవుల్లో గల పెద్దగుట్ట శివారు జిన్నెల ఒర్రెల ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందారు. మృతులు వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన సంగేటి శృతి (25) అలియాస్ పార్వతి, ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన మణికంఠి విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ (27)గా పోలీసులు గుర్తించారు. 

10:27 - September 16, 2015

విశాఖపట్టణం : విద్యార్థుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. విశాఖపట్టణంలో విద్యార్థులపై పోలీసులు నిర్వహించిన లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్ఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది. దీనితో పలు కళాశాలలు మూతపడ్డాయి. బంద్ ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బుధవారం పలు ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన నిర్వహించారు. వీరిని ఎక్కడికక్కడనే అరెస్టు చేసి వ్యాన్ లలో తరలించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత రాముతో సహా పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘ నేతలు స్పష్టం చేశారు. ప్రశాంతంగా విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంటే అరెస్టులు చేయడం సబబు కాదని వివిధ ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. పోలీసు కమిషనర్ వైఖరిని విద్యార్థులు తప్పుబడుతున్నారు.

నిన్న లాఠీల కరాళ నృత్యం..
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పై నుండి అందిన ఆదేశాలతో విశాఖలో విద్యార్థులపై మంగళవారం లాఠీలు కరాళ నృత్యం చేశాయి. బెదిరింపులూ, పిడిగుద్దులతో పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పదేపదే విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు సమస్యలు నివేదించడానికి తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారం కొట్టారు. విద్యార్థినీలను సెల్‌పోన్లో చిత్రీకరించారు. 500 మందిని అరెస్ల్‌ చేశారు. పోలీసుల ఈ అమానుష దాడిలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ లాఠీఛార్జిని తీవ్రంగా ఖండించారు. పోలీసు కమిషనర్‌ను కలిసి, ఈ సంఘటనకు పాల్పడ్డ పోలీసులపై చర్య తీసుకోవాల్సిందిగా కోరారు.

వరంగల్ ఎంజిఎం వద్ద ఉద్రిక్తత..

వరంగల్ : ఎంజిఎం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహాలను తమకు చూపించాలంటూ తల్లిదండ్రులు, విప్లవ రచయిత సంఘ నేతలు రోడ్డుపై బైఠాయించారు. 

 

శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో చోరీ..

నెల్లూరు : జిల్లా మనుబోలు వద్ద కాకినాడ నుండి బెంగళూరు వెళుతున్న శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. ఎస్ -3 బోగీ చైన్ లాగి దుండగులు దోపిడికి పాల్పడ్డారు. ఎస్ -2, ఎస్-7, ఎస్ -8 బోగీల్లో దొంగలు నగలు లాక్కెళ్లారు. బాధితులు చిత్తూరు జిల్లా రేణిగుంట స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 40 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

10:11 - September 16, 2015

'మహానదుల సంగమం' ప్రారంభానికి అడ్డంకి..

పశ్చిమగోదావరి : గోదావరి - కృష్ణమ్మలను కలిపే ముహూర్తం మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు 8.45 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేయనున్నారు. కానీ ఈ ముహూర్తం సమయాన్ని మార్చారు. సాయంత్రం 03.45గంటలకు పోస్టుపోన్డ్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. దీనితో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. వాస్తవానికి సాంకేతిక కారణాలే సమయం పొడిగింపునకు కారణమని తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నంలో స్మారక చిహ్నం..
విజయవాడ సమీపాన ఇబ్రహీంపట్నం సెంటర్ లో నిర్మించిన స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆఘమేఘాల మీద చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు టిడిపి శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నారు. 250 బస్సుల్లో రైతులను తరలించేందుకు టిడిపి నేతలు శ్రమిస్తున్నారు. 

మంత్రి మహేందర్ రెడ్డిని అడ్డుకున్న మృతి చెందిన ఎస్ఐ బంధువులు..

రంగారెడ్డి : అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన యాలాల ఎస్ఐ రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డిని మృతుడి బంధువులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దెముల్ మండలం కందనవెల్లిలో ఎస్ఐ రమేష్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాలాల పీఎస్ లో రమేష్ ఎస్ ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

సుంకేశుల జలాశయంలోకి వరదనీరు..

మహబూబ్ నగర్ : సుంకేశుల జలాయశంలోకి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 14 క్యూసెక్కుల ఉండగా ఔట్ ఫ్లో 17వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

 

పాఠశాల బస్సు - ఆర్టీసీ బస్సు ఢీ..

హైదరాబాద్ : వనస్థలిపురం ఆటోనగర్ వద్ద పాఠశాల బస్సు - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 

ఆర్టీసీ - బైక్ ఢీ..విద్యార్థి మృతి..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఋద్వేల్ లో ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. 

 

గుంటూరు జిల్లాలో భారీ చోరీ..

గుంటూరు : బాపట్ల మండలం పరిధిలోని సుండూరుపల్లిలో భారీ చోరీ జరిగింది. ఎన్ఆర్ జాస్తి సాంబశివరావు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు మూడు కోట్ల విలువైన వజ్రాలు..బంగారం, ఆభరణాలు అపహరించారు.

 

బాబు పర్యటనలో మార్పులు..

పశ్చిమగోదావరి : పట్టిసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో మార్పులు చేశారు. ఇబ్రహీంపట్నం బహిరంగసభలో పాల్గొన్న అనంతరం పట్టిసీమకు 3.45గంటలకు వెళ్లనున్నారు. 

09:37 - September 16, 2015

 

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విద్యాసాగర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుకు మృతి చెందడం బాధగా ఉందన్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ అడవుల్లో గల పెద్దగుట్ట శివారు జిన్నెల ఒర్రెల ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందారు. మృతులు వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన సంగేటి శృతి (25) అలియాస్ పార్వతి, ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన మణికంఠి విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ (27)గా పోలీసులు గుర్తించారు.

ఎంజిఎం ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు..
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన సంగేటి శృతి, సాగర్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వరవరరావు, ప్రొ.హరగోపాల్ రానున్నట్లు సమాచారం.

డ్రైవింగ్ నేర్చుకుంటానని వెళ్లాడు విద్యాసాగర్ తండ్రి..
హైదరాబాద్ డ్రైవింగ్ నేర్చుకుంటానని వెళ్లాడని విద్యాసాగర్ తండ్రి తెలిపాడు. 15 రోజుల తరువాత పోలీసులు వచ్చారని, అప్పుడు అసలు విషయం తెలిసిందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన విషయం ఎవరూ చెప్పలేదని, టివి చూసిన తరువాత వచ్చామని పేర్కొన్నాడు. ఈ రోజు కడక్ పోయేదుండే. ఒక్కడే కొడుకని తల్లి విలపిస్తూ చెప్పింది. చాలా బాధాకరంగా ఉందని, మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు కానీ ఎలా పోయాడో తెలియదని మృతుడి మేనత్త పేర్కొంది. 

09:29 - September 16, 2015

అనంతపురం : ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. సీతారాంపల్లి వద్ద ఓ లారీ డ్రైవర్ ను గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
కర్నాటక నుండి ధర్మవరం వైపు లో ఓ లారీ వస్తోంది. సీతారాంపల్లి వద్దకు రాగానే లారీకి అడ్డంగా ఒకతను కారు అడ్డంగా నిలిపాడు. అనంతరం లారీలో ఉన్న డ్రైవర్ ను కిందకు దించిన దుండగుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం పరారయ్యాడు. ఘటనపై లారీలో ఉన్న క్లీనర్ ఇతరులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న లారీ డ్రైవర్ ను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. లారీని అడ్డుకున్న కారు కర్నాటక రిజిస్ట్రేషన్ తో నెంబర్ తో ఉందని క్లీనర్ పేర్కొన్నట్లు సమాచారం. ఖాళీ లోడ్ తో వస్తున్న లారీని ఆపి కాల్పులు జరపడం వెనుక వ్యక్తిగత విబేధాలున్నాయని తెలుస్తోంది.

ముంబైకి చేరుకున్న పేస్..

ముంబై : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ముంబైకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో ఆయన టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రపతిని కలువనున్న శ్రీలంక ప్రధాని..

ఢిల్లీ : మూడు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు.

కేజీ సెక్టార్ లో పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : మళ్లీ పాక్ కాల్పులకు తెగబడింది. పూంఛ్ లోని కేజీ సెక్టార్ లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. భారత భద్రతా దళాలు కాల్పులను తిప్పికొడుతున్నాయి.

నేడు జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడనున్న రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్నారు.

 

08:45 - September 16, 2015

పారిశ్రామిక అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని వరల్డ్ బ్యాంకు 13వ స్థానంలో ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ బ్యాంకు ర్యాంకులు ప్రకటించడంపై ఎన్నో అనుమానాలున్నాయని, కేంద్రం పెద్దలు ఆడిన నాటకమని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంకు ర్యాంకింగ్స్, తెలంగాణలో తొలి ఎన్ కౌంటర్, జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..తదితర అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...

తెలంగాణలో పరిశ్రమలు లేవా..?
''ఏపీకి 2వ స్థానం, తెలంగాణకు 13వ స్థానం రావడం పట్ల విమర్శలు సహజంగానే వస్తాయి. అసలు ఈ నివేదిక ఎవరు తయారు చేశారు ? కేంద్ర ప్రభుత్వ కరసేవ హస్తం ఉందా ? లాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ నివేదికలో బీజేపీ పాలిత రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకును ఉపయోగించుకుని నివేదికలిస్తే సహజంగానే కోపం వస్తుంది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్ నెంబర్ వన్ గా ఉందనడం వాస్తవమే. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిస్సా ముందున్నాయని నివేదికలో పేర్కొన్నారు. మరి అక్కడకు ఎందుకు పెట్టుబడులు ఎందుకు పోలేదు ? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు లేవని చెబితే కోపం రాదా ? ఎన్నో వాటికి తెలంగాణ రాష్ట్రంలోనే పరికరాలు తయారయ్యాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ముందున్నాయనడం అవాస్తవం. పెట్టుబడులను ఆహ్వానించేలా చేయడం ఒక ఎత్తుకాగా పెద్దలు ఆడిన నాటకమని చెప్పవచ్చు. ప్రతిపక్షాలను రాజకీయంగా అవమానపరచాలనే ఇది చేశారు. సీఐఐ, ఫిక్కీ వాణిజ్య సంస్థలు చివరకు ప్రపంచ బ్యాంకును ఉపయోగించుకోవడం కరెక్టు కాదు. ఇందులో ప్రపంచ బ్యాంకు విశ్వసనీయత కూడా పోయింది.

రిపోర్టు..వాస్తవాలు...
ఈ రిపోర్టు మాది కాదు అని కేంద్రం చెబుతోంది. కేంద్రం చేసిన పని అని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని ఉదహారణలు చెప్పగలను. 1.కవర్ పేజీ చూడండి. కొన్ని లోగోలతో పాటు 'మేకింగ్ ఇన్ ఇండియా' లోగో కూడా ఉంది. 2.ప్రపంచ బ్యాంకు ఇండియా డైరెక్టర్ ముందు మాట రాశారు. సమాచారం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 3.నివేదిక విడుదలైనప్పుడు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వేదికపై ఉన్నారు. సంబంధం లేని నివేదికలో ఆయన ఎందుకు ఉంటారు ?. 4. నివేదిక రాకముందే ''ఇన్ పుట్ మాత్రమే ఇచ్చాం..ర్యాంకింగ్ ప్రపంచ బ్యాంకు ఇస్తుంది'' కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి చెప్పారు. మార్కులు మీరు వేసి ర్యాంకులు ప్రపంచ బ్యాంకు ఇచ్చినట్లుంది. 5.మేమే స్పాన్సర్స్ చేశామని కేంద్ర ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులే పేర్కొన్నారు. ఇన్ని ఓపెన్ గా కనబడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం ఏమన్నా సంబంధం ఉందా ?

నెంబర్ 2 కదా..ప్రత్యేక హోదా ఎందుకు ?
ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులను, ఆకర్షిస్తోందన్నారు. ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం ఏపీ రెండో స్థానంలో ఉంది కనుక ప్రత్యేక హోదా ఎందుకు ? అనేది రావచ్చు. ఒకవేళ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం 13వ స్థానంలో ఉంది కనుక ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. ఒకవే అడిగితే ఏపీ ప్రభుత్వం ఏమి చెబుతుంది ? ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. స్పెషల్ స్టేటస్, ప్యాకేజీ ఎగ్గొట్టడానికి ఆడుతున్న నాటకమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉభయ రాష్ట్రాల ప్రజలు ఈ నివేదికలను తీసి బయటపడేయాలి.

కోటి ఆశలు..ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ..
మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తున్నామని ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రతి ఎన్ కౌంటర్ ను హత్యలాగా రిజిష్టర్ చేసి దర్యాప్తు చేపట్టాలని సుప్రీం పేర్కొంది. ఇందులో విచారణ జరగాలి. వాస్తవాలు ఏంటో బయటకు రావాలి. మావోయిస్టు సానుభూతి పరులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత అసలు స్వభావాలు అర్థమౌతాయని ఆనాడు తాను చెప్పడం జరిగింది. తెలంగాణ కోటి, ఆశలు, ఆకాంక్షలతో వచ్చింది. ఆచరణలో జరుగకపోతే మళ్లీ మావోయిస్టు కార్యకలాపాలకు ఊతం ఇస్తుందని 60వ దశకం ఉద్యమం చెబుతోంది. వ్యవసాయం శిథిలమై, నిరుద్యోగం పెరిగి రకరకాల భావోద్వేగాలకు కారణమౌతోంది. ఏ తెలంగాణ ఆశించామో ఏ తెలంగాణ వస్తుంది ? ప్రజా తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామా ? గతంలో ఏ రాజకీయ సంస్కృతి శాసించిందో అదే సంస్కృతి పేరిట శాసిస్తోందా ? అనేది ఆలోచించాలి. ప్రశ్నించే వారు తక్కువై పోతున్నారు.

లోకేష్ విమర్శలు..
సింగపూర్ ప్రధానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాశాడని సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విమర్శించారు. విశ్వసనీయత లేకుండా విమర్శలు చేసే నాయకుడి భవిష్యత్ దెబ్బ తింటుంది. లేఖ రాస్తే బయటపెట్టండి శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని జగన్ పేర్కొన్నారు. మరి లోకేష్ లేఖను ఎందుకు బయటపెట్టడం లేదు ? జగన్ రాసి ఉంటే ఆ లేఖను బయటపెట్టాలి. ప్రజాక్షేత్రంలో జగన్ ను ప్రశ్నించవచ్చు. తక్షణం మీ దగ్గరున్న లేఖను బయటపెట్టండి. నిజమా ? కాదా ? అనేది తేలాలంటే లేఖ బయటపెట్టాలి. లేనిపక్షంలో లోకేష్ విశ్వసనీయతను ప్రశ్నించాల్సి వస్తుంది''. అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. 

07:55 - September 16, 2015

ప్రత్యేక హోదాపై వైసీపీ ఆందోళన ఉధృతం చేసింది. అందులో భాగంగా మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు తిరుపతిలో ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎపి కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే బిజెపి ప్రభుత్వం దిగి వస్తుందని వైసిపి అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. నెల రోజుల లోపు రాజీనామా చేయాలని లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుందామని జగన్ పేర్కొన్నారు. మరోవైపు హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం విరుచకపడింది. పై నుండి అందిన ఆదేశాలతో విశాఖలో విద్యార్థులపై మంగళవారం లాఠీలు కరాళ నృత్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్ కౌంటర్ జరిగింది. వరంగల్ లో జరిగిన ఎన్ కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ), సతీష్ మాదిగ (టిడిపి), లక్షణ్ రావు (మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకులు), భాను ప్రకాష్ రెడ్డి (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఓల్డ్ సిటీలో 5కే రన్..

హైదరాబాద్ : సలాం హైదరాబాద్ పేరిట పాతబస్తీలో చార్మినార్ నుండి బార్కాస్ వరకు 5కే రన్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ, సీపీ మహేందర్ రెడ్డి లు ఈ రన్ ను ప్రారంభించారు.

ధర్మవరంలో లారీ డ్రైవర్ పై కాల్పులు..

అనంతపురం : ధర్మవరం (మం) సీతారాంపల్లిలో కాల్పుల కలకలం సృష్టించాయి. లారీ డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతని పరిస్థితి విషమించడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. 

07:43 - September 16, 2015

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తోంది. డెంగ్యూ వ్యాధితో 10 మంది మృత్యువాత పడ్డారు. 18 వందల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు రోగులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో పడకలు సరిపోక పేషంట్లను చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్ల బాలుడు చికిత్స అందక మృత్యువాత పడ్డాడు. పేషంట్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రయివేట్‌ ఆసుపత్రులపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

బలైపోయిన ఐదేళ్ల అమన్...
డెంగ్యూ వ్యాధితో బాధ పడుతున్న ఐదేళ్ల బాబు అమన్ అనే బాలుడికి సమయానికి చికిత్స అందక మృత్యువాత పడ్డాడు. బాలుడు చనిపోవడానికి నాలుగు రోజుల ముందు గురువారం తండ్రి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుడికి డెంగ్యూ లేదని అడ్మిట్‌ చేసుకోకుండానే తిప్పి పంపారు. 24 గంటలపాటు అమన్‌ ఎలాంటి చికిత్స అందలేదు. శనివారం అర్ధరాత్రి ఉన్నట్టుండి అమన్‌కు హై ఫీవర్‌ రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ప్రయివేట్‌ ఆసుపత్రులకు తీసుకెళ్తే అడ్మిట్‌ చేసుకోవడానికి నిరాకరించారు. చివరకు ఓ ఆసుపత్రి కనికరం చూపినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆదివారం తెల్లవారుజామున అమన్‌ కన్నుమూశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకును కాపాడుకోలేక పోయామని తల్లిదండ్రుల ఆవేదనను ఎవరు తీర్చగలరు.

పసివాడి ట్రీట్‌మెంట్‌కు నిరాకరించిన ఆసుపత్రుల లైసెన్స్ ల రద్దు..
పసివాడి మృతిపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. పేషంట్లను నిర్లక్ష్యం చేసిన ప్రయివేట్‌ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. డెంగ్యూ రోగులు పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎప్పుడూ లాభాలపైనే గుడ్డిగా దృష్టి పెట్టకుండా ఇలాంటి సమయాల్లో వ్యాపారులు మానవత్వంతో స్పందించాలని అసోచాం సమావేశంలో కేజ్రీవాల్‌ సూచించారు.

సహకారం అందిస్తామన్న నడ్డా..
ఢిల్లీలో డెంగ్యూ విజృంభనతో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు లేక రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో 15 వందల పడకలుంటే ఎమర్జెన్సీ కింద అదనంగా మరో 60 మందికి ట్రీట్‌ మెంట్‌ చేస్తున్నారు. ప్రతిరోజు పదివేలమంది పేషంట్లు వస్తుండడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా చెప్పారు.

వారం రోజుల క్రితం డెంగ్యూతో ఏడేళ్ల అవినాష్ మృతి..
వారం రోజుల క్రితం ఏడేళ్ల అవినాష్ డెంగ్యూతో మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక ఆ బాలుడి తల్లిదండ్రులు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇపుడేమో ఐదేళ్ల అమన్‌ చికిత్స అందక మృత్యువాత పడడం మరో విషాదం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెంగ్యూను నిర్మూలించడానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

07:13 - September 16, 2015

తెలంగాణలో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా గ్రూప్స్ గురించే ముచ్చటించుకుంటున్నారు. నాలుగు పదులు నిండిన వారు సైతం గ్రూప్స్ రాయాలన్న పట్టుదలతో వున్నారు. కానీ ఇలాంటి వారికి కొత్త సిలబస్ కి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు దొరకడం లేదు. ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు నిర్వహించడం లేదు. దీంతో గ్రూప్స్ కి ప్రిపేరవుతున్నవారికి అష్టకష్టాలు తప్పడం లేదు. ఈ అంశంపై జనపథంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కమిటీ కన్వీనర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆంజనేయులు విశ్లేషించారు.

07:11 - September 16, 2015

గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ లకు కొత్త సిలబస్ ప్రకటించిన టీఎస్ పీ ఎస్సీ ప్రామాణిక పుస్తకాల సంగతి మాట్లాడడం లేదు. మెటీరియల్ సమకూర్చిపెట్టడం తమ బాధ్యత కాదంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎక్కడా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం లేదు. తెలంగాణలో గ్రూప్స్ ఫీవర్ పెరుగుతోంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్ లో ఏ కోచింగ్ సెంటర్ చూసినా కళకళలాడుతోంది. ఎవరు ఎక్కడ గ్రూప్స్ పరీక్షలపై అవగాహనా సదస్సులు నిర్వహించినా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరువుతున్నారు.

కోచింగ్ సెంటర్లకు పెరిగిన డిమాండ్...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్, టూ, త్రీ, ఫోర్ లకు సిలబస్ విడుదల చేసిన తర్వాత కోచింగ్ సెంటర్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ప్రిపరేషన్ కి మొదలయ్యారు. ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు ఫీజులు భారీగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్ లో పేరొందిన ప్రయివేట్ సంస్థలు రెండు మూడు వేల మందిని ఒకే హాల్లో కుక్కేసి, పాఠాలు చెబుతున్నాయి. కోచింగ్ సెంటర్ లలో అడ్మిషన్ల కోసం తిరుగుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. డబ్బులున్నవారు ఎక్కడో ఒక చోట ఏదో రకంగా కోచింగ్ తీసుకుంటున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో సైతం కోచింగ్ సెంటర్లకు గిరాకీ పెరిగింది. కోచింగ్ సెంటర్ లు ఎంతగా కిటకిటలాడుతున్నా, డబ్బులు కట్టి కోచింగ్ లకు వెళ్లలేనివారి సంఖ్య లక్షల్లో వుంటుందన్నది అంచనా.

మారిన సిలబస్...
అందులో సిలబస్ మారింది. కొత్త సిలబస్ వచ్చింది. తెలంగాణ అంశం చుట్టూ ఎక్కువ మార్కులు వుండబోతున్నాయి. గ్రూప్ పరీక్షలకు ఏం చదవాలి ? ఎలా చదవాలి ? మెటీరియల్ ఎక్కడ సంపాదించాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు లక్షలాది మంది నిరుద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోబోయే నూతన ఉద్యోగతరానికి తమ రాష్ట్ర చరిత్ర మీద సంపూర్ణ అవగాహన, పట్టు వుండాలన్న లక్ష్యంతో సిలబస్ లో అదనపు అంశాలు చేర్చినట్టు చెబుతున్నారు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. సిలబస్ కూర్పు విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ, సిలబస్ ను ఖాయం చేసి, విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల నిర్వహణ మీద దృష్టి పెట్టలేదు.

ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు ఎక్కడ ?
హైదరాబాద్ లో ఒకట్రెండు చోట్ల మినహా మరెక్కడా ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు పనిచేయడం లేదు. గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో సైతం తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో సైతం ప్రభుత్వ కోచింగ్ సెంటర్లుండేవి. ఉచితంగా భోజనాలు పెట్టి మరీ కోచింగ్ ఇచ్చేవారు. అలాంటిది కేసీఆర్ సారధ్యంలోని తొలి తెలంగాణ ప్రభుత్వమే కోచింగ్ సెంటర్ల నిర్వహణ విషయంలో అలసత్వం ప్రదర్శించడం విస్మయం కలిగిస్తోంది. మునుపటి కంటే మరింత బాధ్యతగా కోచింగ్ సెంటర్లు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదో , ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టదు. దీనివల్ల ప్రయివేట్ సంస్థల్లో కోచింగ్ తీసుకోలేనివారు, గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రామాణిక పుస్తకాలెక్కడా ?
ఒక సదాశయంతో సిలబస్ ను రూపొందించిట్టే, ఆ సిలబస్ పట్ల విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వమో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనో స్వీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సిలబస్ రూపకల్పనలో ప్రదర్శించిన శ్రద్ధ దానిని బోధించే విషయం మీద పెట్టకపోతే, లాభమేమిటి? తెలంగాణ పునర్ నిర్మాణానికో, బంగారు తెలంగాణ నిర్మాణానికో అవసరమైన కొత్తతరం ఉద్యోగులు ఎలా రూపుదిద్దుకుంటారు? సిలబస్ లో కొత్తగా చేర్చిన అంశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంత వరకు ప్రామాణిక పుస్తకాలనైనా ప్రచురించలేదు. మెటీరియల్ సమకూర్చడం తమ బాధ్యత కాదన్నట్టుగా టీఎస్పీఎస్సీతో పాటు ప్రభుత్వమూ వ్యవహరిస్తుండడం విస్మయం గొలుపుతోంది. ప్రామాణిక పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్ల నిరుద్యోగులకే కాదు తెలంగాణ రాష్ట్రానికీ మేలు జరుగుతుంది. ఆ పని చేయకుండా సిలబస్ ప్రకటించాం మీ కష్టాలు మీరు పడండి అన్నట్టుగా వ్యవహరిస్తే ప్రయివేట్ కోచింగ్ సెంటర్ల మీద కనకవర్షం కురుస్తుంది తప్ప ప్రభుత్వం ఆశించే నాలెడ్జ్ వున్న కొత్త ఉద్యోగులు దొరకరు. 

07:05 - September 16, 2015

హైదరాబాద్ : ఎప్పుడో...పదేళ్ల కింద పునాది వేశారు. వేల కోట్ల నిధులను ఖర్చుచేశారు. కాని ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పేరుకుపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి. నిధులు కరుగుతున్నాయి. కాని ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కటం లేదు. దీంతో పెండింగ్‌ ప్రాజెక్టులపై టీ-సర్కార్ దృష్టిపెట్టింది. 2004 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చి పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటీకీ పూర్తికాలేదు. సుమారు 90 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా ప్రాజెక్టుల్లో కాలువలు తవ్వి అలాగే వదిలేశారు. కాని ప్రాజెక్టు నిర్మాణాలను మాత్రం చేపట్టలేదు. దీంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది.

మొదటి దశలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రాజెక్టులు..
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏఏ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్ని నిధులు ఖర్చు చేశారనే అంశాలపై అధికారుతో కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను... మొదటిదశలో చేపట్టాలని నిర్ణయించారు. గతంలో మంజూరైన అన్ని కాంట్రాక్టులను రద్దుచేసి... మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఒక్కఆదిలాబాద్‌ జిల్లాలోనే 96 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరైనా అమలుకు నోచుకోలేదని తెలిపారు. వాటికి జపాన్ నిధులు, నాబార్డుతో పాటు పలు సంస్థలు నిధులు కేటాయించాయి. ఐతే పనులు ప్రారంభం కాకపోవటంతో..గ్రాంట్లు మొత్తం తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని సమీక్షలో తేలింది.

7 నెలలో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం..
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టు కోసం 2600ల ఎకరాల భూమి అవసరముంది. వాటికోసం తక్షణమే 100 కోట్లు కేటాయించాలని మంత్రి హరీశ్‌రావు ఆర్థికశాఖను కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 400ల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఐతే కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ తిరిగి వెనక్కి వెళ్లటంతో.... ఆ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు 96 వేల 173 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆయా పనులను 7 నెలల్లో యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు..
ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో చాలా ప్రాజెక్టులకు భూసేకరణ చేశారు. నిర్వాసితులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. దీంతో ప్రాజెక్టుల నిర్వాసితులకు వెంటనే పరిహారాలను చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అందులో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన కల్వకుర్తి, మోడికుంట వాగు పనుల పై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. వాటితో పాటు కొమరం భీం, ప్రాణాహిత చేవెళ్ళ, రాజీవ్ సాగర్ వంటి ప్రాజెక్టులకు అటవీశాఖతో ఇబ్బందులు లేకుండా కోఆర్డినేట్ చేసుకోవాలని అధికారులను సూచించారు. ఇకపై సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హరీశ్‌రావు అధికారులను సూచించారు. వివిధ శాఖలను సమన్వయపర్చేందుకు ప్రతి సోమవారం ఇరిగేషన్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు సమావేశం కావాలని ఆదేశించారు.

07:01 - September 16, 2015

ఢిల్లీ : ఈసారైనా పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటే... మళ్లీ సుప్రీం కోర్టులో కృష్ణా నదీ జలాల పంపిణీ కేసు వాయిదా పడింది. కృష్ణా నదీజలాల పంపకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు దాఖలు చేసిన ఆరు ఎస్ఎల్పీపీలను జతచేసి సుప్రీం ధర్మాసనం విచారించాలనుకుంది. కానీ కృష్ణా ట్రిబ్యునల్ లో ఖాళీగా ఉన్న సభ్యుని స్ధానాన్ని కేంద్రం భర్తీ చేయలేదు. దీంతో కృష్ణా జలాల కేసు సెప్టెంబర్ 30కి వాయిదా పడింది.

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్ తీర్పులోనూ అన్యాయం- ఏపీ..
వాయిదాకు ముందు అరగంట పాటు సాగిన వాదనలలో నీటి పంపకాల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితమని మహారాష్ట్ర మరోసారి వాదనలు విన్పించింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రాజెక్టుల వారీగా పంపకాలు జరగాలని వాదించింది. ప్రాజెక్టుల వారీగా పంపకాలు జరగాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులోనూ తమకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ తరఫున ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. నియామకాలను మొదట్నుంచి చేపట్టాలా లేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చెయ్యాలన్న అంశంపై స్పష్టత వస్తే ట్రిబ్యునల్ లో విచారణ సులువుగా సాగుతుందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ సి.పంత్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పునర్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 పరిధిని ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

త్వరగా ఖాళీ భర్తీ చేయాలని ఆదేశం..
ఇక కృష్ణా ట్రిబ్యునల్‌లో ఖాళీ అయిన స్ధానాన్ని కేంద్రం భర్తీ చేయకపోవడంపై స్పందించిన ధర్మాసనం వీలయినంత త్వరగా ఖాళీని భర్తీ చేయాలని సూచించింది. గతంలో భర్తీ చేసే ప్రయత్నం చేసినప్పటికి ఆ సభ్యుడు కర్ణాటకు చెందిన వారై ఉండటంతో చెలరేగిన వివాదాన్ని కేంద్రం తరపు న్యాయవాది ధర్మాసనానికి గుర్తు చేసారు. చివరకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని కర్ణాటక, మహారాష్ట్ర తరపు న్యాయవాదులు చెప్పడంతో ఖాళీ స్ధానాన్ని కర్ణాటక మాజీ సిట్టింగ్ న్యాయమూర్తి రామ్మోహన్ రెడ్డితో భర్తీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంటోంది.

06:59 - September 16, 2015

వరంగల్ : ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో వరంగల్‌ జిల్లాలో మళ్లీ అలజడి నెలకొంది. నిశ్శబ్ధంగా ఉన్న ఏటూరు నాగారం అడవుల్లో మళ్లీ కాల్పుల మోతలు కలకలం సృష్టిస్తున్నాయి. ఘటనా స్థలంలో ఆయుధ సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదిలికలపై ఇప్పటికే అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు.. తాజా ఎన్‌కౌంటర్‌తో కూంబింగ్‌ మరింత ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించినవారికి మాత్రం పోలీసుల కథనంపై అనుమానాలు వస్తున్నాయి.

హోరాహోరీగా కాల్పులు..
వరంగల్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు సంచలనం సృష్టించాయి. గోవిందరావు పేట మండలం మొద్దుల గుట్ట అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ బలగాలకు మావోయిస్టులు కనిపించడంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా జరిగాయి.

ఇద్దరు మృతి చెందినట్లుగా ధ్రువీకరించిన పోలీసులు..
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి ప్రకటించారు. మృతులు మావోయిస్టు నేతలు విద్యాధర్‌ రెడ్డి అలియాస్‌ సాగర్‌... తంగేంట శృతి అలియా మహితగా గుర్తించారు. విద్యాధర్‌ రెడ్డి ధర్మసాగర్‌ మండలం పెద పెండియాల్‌ వాసిగా... శృతి వడ్డేపల్లికి చెందిన మహిళగా గుర్తించారు. ఘటనా స్థలంలో కార్బన్‌, ఎస్‌ఎల్‌ఆర్, ఐదు కిట్‌ బ్యాగులు, 2 ల్యాండ్‌మైన్లు, 2 డిటోనేటర్లు, సోలార్‌ లైట్‌, విప్లవ సాహిత్యం, బైబిల్‌ స్వాధీనం చేసుకున్నారు.

స్థానికుల్లో భయాందోళన..
కొంతకాలంగా వరంగల్ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు వాల్ పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తుండటం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం ములుగు మండలం మల్లంపల్లిలోని ఎర్రమట్టి క్వారీ దగ్గర ప్రొక్లైనర్‌ను దగ్ధం చేశారు. తాజా ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీస్‌ ఉన్నతాధికారులు...పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను అడవుల్లో మోహరిస్తున్నారు. మావోయిస్టులు, పోలీసుల ఎదురు కాల్పులతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోతున్నాయి. గ్రామాల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

06:56 - September 16, 2015

విజయవాడ : మనిషక్కడ మనసిక్కడ... అందుకే తానెక్కడుంటే అక్కడకు... టీ-టీడీపీ నేతల్ని పిలిపించుకున్నారు బాబుగారు. తెలంగాణ తమ్ముళ్లలో నూతనోత్సహాం నింపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇన్నాళ్లు ఏపీ టీడీపీ కార్యాలయాల్లో సమావేశం పెట్టే టి-టిడిపి లీడర్లు... ఏకంగా సరిహద్దు దాటేశారు. బెజవాడలోని ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులోనే మకాం వేశారు.

రెండు రాష్ట్రాలు రెండు కళ్లన్న బాబు..
ఆంధ్రప్రదేశ్‌... తెలంగాణ... రెండు కళ్లలాంటివి. చంద్రబాబు పదేపదే చెప్పే మాటలివి. అన్నట్లుగానే బాబుగారు రెండు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. త్వరలో కేంద్రకమిటీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తెలంగాణ తమ్ముళ్లతో భేటీ అయ్యారు. ఎప్పుడు హైదరాబాద్‌లో సమావేశమయ్యే టిటిడిపి లీడర్లు తొలిసారిగా బెజవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అధినేతను కలిశారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి, నామా నాగేశ్వరరావు, వివేకానంద సహా పలువురు నేతలు ఉన్నారు.

నేతల అభిప్రాయాలను తెలుసుకున్న బాబు..
తెలంగాణలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, కేంద్ర కమిటీలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశంపై తమ్ముళ్లు చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యనేతల అభిప్రాయాల్ని తీసుకున్నారు. ఇంటరాక్టివ్ వాయిస్‌ రికార్డింగ్ సిస్టమ్‌ ద్వారా నూతన సారథిని ఎన్నుకుంటామని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది క్రియాశీల సభ్యుల అభిప్రాయాల్ని తెల్సుకోనున్నారు. ఎక్కువ మంది ప్రతిపాదించిన వారికే అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక బాధ్యతను బాబుకే అప్పగించారు టిటిడిపి లీడర్లు.

త్వరలో 65 మందితో రాష్ట్ర కమిటీ..
మరోవైపు పలు కీలక విషయాలపై తెలంగాణ టిడిపి నేతలు చర్చించారు. టీఆర్ఎస్‌ కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే 65 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి నేతలంతా ఐక్యంగా కృషి చేయాలని అధినేత చెప్పినట్లు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని తమ్ముళ్లు నిర్ణయించారు. రాష్ర్టంలో నెలకొన్న కరువు, రైతు ఆత్మహత్యలు, రీ-డిజైనింగ్‌ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతి ఇలా ప్రధానమైన అంశాలపై అసెంబ్లీలో సర్కార్‌ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి వీరి వ్యూహాలకు అధికారపార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

06:51 - September 16, 2015

హైదరాబాద్ : టీ-కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎల్పీ మీటింగ్‌లో ఎవరికి వారుగా వాణి వినిపించారు. హాట్‌ హాట్‌గా చర్చ జరిగినా....ఏకాభిప్రాయం కురదలేదు. ఓ దశలో నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుల రీడిజైన్‌పై.. పార్టీ వైఖరి తేలలేదు. సీఎల్పీ నేత జానారెడ్డితో కొందరు నేతలు విభేదించటం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ.. వారిలో మొదలైంది.

రీ డిజైన్‌ను గుడ్డిగా వ్యతిరేకించకూడదు - జానా..
సీఎల్పీలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలు డిసైడయ్యారు. రెండో ప్రాధాన్యతగా ప్రాజెక్టుల రీడిజైన్‌ అంశాన్ని లేవనెత్తాలని అభిప్రాయపడ్డారు. ఐతే వారి అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుబట్టారు. రీడిజైన్‌పై పార్టీ వైఖరి పునరాలోచించుకోవాలని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నర్సారెడ్డి సూచించారు. వారికి సీఎల్పీ నేత జానారెడ్డి వత్తాసు పలికారు. ప్రాజెక్టు రీడిజైన్‌ను గుడ్డిగా వ్యతిరేకించకూడదని నేతలను కోరారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై ఊరికే విమర్శలు చేయకూడదనే రీతిలో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.

జానా వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి అభ్యంతరం..
ఐతే జానారెడ్డి వ్యాఖ్యలకు సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ విషయంలో దూకుడుగానే వ్యవహరించాలని స్పష్టం చేశారు. పునరాలోచించుకోవటమంటే ప్రభుత్వానికి వత్తాసు పలికినేట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతగా సర్కారుకు మద్దతు ఇవ్వటం సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్‌పై ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఆ ఉద్యమానికి మీరే నాయకత్వం వహించాలని జానారెడ్డిని కోరారు. ఐతే ప్రాజెక్టు రీడిజైన్‌లపై మరో రెండు రోజుల్లో సదస్సు ఏర్పాటు చేయాలని జానా నిర్ణయించారు. రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావుల అభిప్రాయం తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

జానా వ్యవహారశైలిపై నేతల్లో అనుమానం..
సీఎల్సీ నేతగా జానారెడ్డి...పార్టీ నేతల దూకుడు ఆది నుంచీ అడ్డకట్ట వేస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆచితూచి అడుగులు వేశారు. ప్రాజెక్టుల విషయంలోనూ అదే వైఖరిని అవలంబిస్తున్నారు. ఐతే జానారెడ్డి వ్యవహారశైలిపై....కొందరు నేతలకు అనుమానం మొదలైంది. జానా...టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్నారనే వార్తలకు బలం చేకూరుతోందని...వారు భావిస్తున్నాన్నారు. 

06:48 - September 16, 2015

చిత్తూరు : తిరుమల బ్రహోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. శ్రీవారి సర్వ సైన్యాధిపతిగా భక్తులు భావించే విశ్వక్సేనుడు ఉత్సవాల ఏర్పాట్లను తిరువీధుల్లో వూరేగుతూ సమీక్షించారు. సేనాధిపతి శంఖం, చక్రం, గద, ఖడ్గం లాంటి ఆయుధాలను ధరించి తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చి వాహనంపై వైభవంగా వూరేగారు. ఈ సందర్భంగా వసంత మండపంలో భూదేవికి పూజలు నిర్వహించి మట్టిని సేకరించారు. అనంతరం తిరువీధుల్లో వూరేగుతూ ఆలయానికి చేరుకుని సేకరించిన మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింప చేశారు. నేడు ధ్వజారోహణ మహోత్సవం జరుగనుంది. ఏపి సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

06:46 - September 16, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై స‌ర్కార్‌ను నిల‌దీద్దాం..రుణ‌మాఫీపై ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ వేదిక‌గా ఎండ‌గ‌డ‌దాం..ఇలాంటి వ్యూహాలతోనే ముందుకెళ్లాలని కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం డిసైడ్ అయ్యింది. రైతు స‌మ‌స్యలే ఎజెండాగా స‌భ‌ను స్తంభింప‌జేయాల‌ని నిర్ణయించిన హస్తం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. స‌భాప‌తి టార్గెట్‌గా అవిస్వాస తీర్మాణం పెట్టేందుకు సై అంటుంది.

24 నుండి అసెంబ్లీ సమావేశాలు..
కేసీఆర్‌ సర్కార్‌పై కాలుదువ్వుతున్న కాంగ్రెస్ .. అసెంబ్లీ వేదిక‌గా సెగ‌పుట్టించేందుకు అస్తశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండటంతో స‌భ‌లో తేల్చుకునేందుకు బాణాలను ఎక్కుపెడుతోంది. నాలుగు గంట‌ల‌పాటు జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో... అసెంబ్లీ సమావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించింది. రైతు ఎజెండానే అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డుతున్న సీఎల్పీ .. అన్నదాతల ఆత్మహత్యలపై స‌భావేదిక‌గా సర్కార్‌ను నిల‌దీయాల‌ని నిర్ణయించింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల‌కు 5 ల‌క్షల ఎక్స్ గ్రేషియా అందించాల‌ని తీర్మానం చేసింది సీఎల్పీ. రుణ‌మాఫీ పూర్తిగా చేయ‌ని కార‌ణంగానే అత్మహ‌త్యలు జ‌రుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

సభ నుండి వెళ్లిపోయిన పొంగులేటి..
మరోవైపు వాట‌ర్ గ్రిడ్‌లోని అవినీతి, పోలవ‌రం ముంపు మండ‌లాల‌పై ప్రభుత్వ తీరును స‌భ‌లో ఎండ‌గ‌ట్టాల‌ని ఎమ్మెల్సీ పొంగులేటి ప్రస్తావించారు. దీనిపై కొంద‌రు విభేదించిన‌ట్లు సమాచారం. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న రైతు స‌మ‌స్యల‌ను వాయిదా తీర్మానం పెట్టి చ‌ర్చకు ప‌ట్టుబ‌డ‌దామ‌ని మరికొందరు నేతలు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభనుంచి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్యలు తీసుకోకపోవ‌డంపై ఆగ్రహం ఉన్న కాంగ్రెస్ అస‌ర‌మైతే.. స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి, మండ‌లి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ల‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమన్నారు. ఇప్పటికే రైతు ఆత్మహ‌త్యల పై ధ‌ర్నాలు , నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న కాంగ్రెస్ ఇక అసెంబ్లీ వేదిక‌గా ప్రభుత్వాన్ని మ‌రింత ఇరుకునబెట్టేందుకు పక్కా ప్రణాళిక‌తో ముందుకెళుతుంది. ఇది ఏమేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

06:43 - September 16, 2015

చిత్తూరు : ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడేందుకు వైసీపీ అస్త్రాలను బయటకు తీస్తోంది. పక్కా ప్రణాళికతో ప్రజాక్షేత్రంలోకి ముందుకెళ్తున్నారు జగన్‌. ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతను ఆకర్షించే దిశగా ఆయన అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అధినేత క్యాంపస్‌ల బాట పట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన... యువభేరి సదస్సులో వైసీపీ అధినేత పాల్గొన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి స్పెషల్ స్టేటస్‌ ఇస్తామన్న కేంద్రం ఇప్పుడెందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు కుమ్మక్కై... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారని జగన్ విమర్శించారు. మరోవైపు స్పెషల్ స్టేటస్‌ కోసం పూర్తిస్థాయి పోరాటానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఢిల్లీ పెద్దల్ని కదిలించేలా... సెప్టెంబర్‌ 26న జగన్‌ నేతృత్వంలో నిరాహార దీక్షకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు కసరత్తు చేపట్టిన వైసీపీ నేతలు.. జగన్‌ దీక్షను సక్సెస్‌ చేసేందుకు పక్కా ప్లాన్‌ గీస్తున్నారు.

సక్సెస్ అవుతుందా ?
ఇక యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా వైసీపీ కసరత్తు చేస్తోంది. ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్‌లో వచ్చే నష్టాల్ని విద్యార్థులకు వివరిస్తున్నారు వైసీపీ లీడర్లు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలోని విద్యార్ధులతో కలుస్తున్నారు. సెప్టెంబర్ 20న ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులతోనూ జగన్ భేటీకానున్నారు. ప్రత్యేక హోదాపై విద్యార్ధులకు పూర్తి అవగాహన వస్తే తన నిరాహారదీక్ష పెద్ద ఎత్తున సక్సెస్‌ సాధిస్తుందని జగన్‌ భావిస్తున్నారు. యువతను తమవైపు తిప్పుకుంటే భవిష్యత్‌లో మరింత నిర్ణయాత్మక శక్తిగా... మారవచ్చనే భావనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ ఆలోచన ఎంత మేరకు సక్సెస్‌ సాధిస్తుందో వేచి చూడాలి. 

06:34 - September 16, 2015

రంగారెడ్డి : జిల్లా యాలాల ఎస్ఐ రమేష్‌ అనుమానస్పదస్ధితిలో మృతి చెందాడు. పెద్దముల్‌ మండలం కందనెల్లి గ్రామంలో రమేష్‌ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతోంది. ఉరి వేసుకున్నట్లు ఎస్ఐ రమేష్‌ మృతదేహాం వేలాడుతున్నా, డెడ్‌బాడీ తీరు తెన్నులు చూస్తోంటే ఇది ఆత్మహత్య కాదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎస్ఐ రమేష్‌ తన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాకుండా మరొక పీఎస్‌ పరిధిలో చనిపోవటం కూడా అనుమానాలకు కారణమవుతోంది. రమేష్‌ చనిపోయేముందు తన భార్యకు మెసేజ్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. మృతుడు రమేష్‌ది నల్లగొండ జిల్లాలోని దేవరకొండ వద్ద నున్న శేరిపల్లితండా అని సన్నిహితులు చెబుతున్నారు.  

యాలాల ఎస్ఐ ఆత్మహత్య...

రంగారెడ్డి : పెద్దెముల్ మండలం కందనవెల్లిలో ఎస్ఐ రమేష్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాలాల పీఎస్ లో రమేష్ ఎస్ ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

నేడు రాష్ట్రానికి రానున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన ముగించుకుని నేడు నగరానికి రానున్నారు. పది రోజుల పాటు చైనాలో పర్యటించన సంగతి తెలిసిందే. 

నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజరోహణం..

చిత్తూరు : నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజరోహణం జరుగనుంది. సాయంత్రం శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున పెద్ద శేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 

నేడు భారత్ ఏ - బంగ్లాదేశ్ ఏ మధ్య వన్డే మ్యాచ్..

నేడు భారత్ ఏ - బంగ్లాదేశ్ ఏ మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. భారత్ - ఏ జట్టుకు కెప్టెన్ గా ఉన్మక్ చంద్ కెప్టెన్ గా నిర్వరిస్తుండగా బంగ్లాదేశ్ - ఏ జట్టుకు మోమినుల్ హక్ కెప్టెన్ గా నిర్వర్తించనున్నారు. 

నేడు ఏపీలో విద్యా సంస్థల బంద్..

విజయవాడ : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ఈ బంద్ కు పిలుపునిచ్చింది. 

నేడు ఎన్ కౌంటర్ మృతులకు పోస్టుమార్టం..

వరంగల్ : నేడు ఎన్ కౌంటర్ మృతులకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు మహబూబ్ నగర్ కు కేటీఆర్..

మహబూబ్ నగర్ : నేడు వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన జరుగనుంది. జడ్చర్ల (మం) నాగసాల గ్రామంలో ఉదయం పది గంటలకు వాటర్ గ్రిడ్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

 

Don't Miss