Activities calendar

17 September 2015

21:28 - September 17, 2015

హైదరాబాద్ : విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయ్‌. సర్కార్‌ స్పీడు ఇలాగే కొనసాగితే.. ఈ ట్రైన్‌ త్వరగానే పరుగులు పెట్టే అవకాశముంది. 2015 మార్చిలో డీఎంఆర్‌సీ రూపొందించిన డీపీఆర్‌కు అనుగుణంగా మెట్రో నిర్మాణం చేపట్టాలనే షరతు విధిస్తూ.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలన్నా కేంద్రం అనుమతి తీసుకునే చేయాల్సి ఉంటుంది.

25 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లుగా మెట్రో రైల్‌......

25 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లుగా ఈ మెట్రో లైన్‌ వేయబోతున్నారు. 12.76 కిలోమీటర్లతో మొదటి మార్గం పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు వేయనున్నారు. అలాగే 13.27 కిలోమీటర్లతో పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ నుంచి నిడమానూరు వరకు రెండో మార్గం వేస్తారు.

ఇప్పటికే మెట్రో కార్పొరేషన్‌ ఏర్పాటు.....

ఇప్పటికే మెట్రో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి..దానికి ఎస్పీ స్థాయి అధికారి రామకృష్ణారెడ్డిని ఎండీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముగ్గురు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. దసరా పండగనాడు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న తరుణంలో.. మెట్రో రైల్‌ ప్రక్రియ కూడా వేగవంతం కావటంతో.. ఏపీ రాజధాని అమరావతిలో ఆ హడావుడి మొదలైందనే చెప్పొచ్చు. 

21:25 - September 17, 2015

హైదరాబాద్ : ఉద్యమం ఊపు మీదున్నప్పుడు విమోచన దినోత్సవం ఎందుకు జరపరంటూ నిప్పులు చెరిగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నాటి ముఖ్యమంత్రిపైనే విరుచుకుపడ్డారు. కాని నేడు అదే పదవిలో ఉన్న కేసీఆర్‌.. మాట మార్చారు. ఎప్పటిలానే టీఆర్‌ఎస్‌ జరుపుతుంది.. ప్రభుత్వం జరపాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. నిజాంను పొగుడుతూ.. మజ్లిస్‌తో దోస్తానా చేస్తున్న కేసీఆర్‌ మాట మార్చడంలో ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

21:22 - September 17, 2015

హైదరాబాద్ : హీరో నందమూరి బాలకృష్ణ తన తాజా సినిమా డిక్టేటర్ బృందంతో కలిసి ఖైరతాబాద్ వినాయకున్ని దర్శించుకున్నారు. బాలయ్య రాకతో అభిమానులు కేరింతలు కొట్టారు. వినాయక చవితిని పురస్కరించుకుని డిక్టేటర్ చిత్రం సాంగ్‌ను కూడా తన టీంతో కలిసి బాలయ్య రిలీజ్ చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా ఖైరతాబాద్ లంబోదరున్ని ఎన్నోసార్లు దర్శించుకుని పూజలు చేశారని గుర్తు చేసుకున్నారు బాలయ్య. సింహా, లెజెండ్ తరహాలోనే డిక్టేటర్ కూడా అభిమానులకు ఎంతగానో నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

కొండను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు : పది మందికి గాయాలు

కర్నూలు : శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన బస్సుగా తెలుస్తోంది.

'డిక్టేటర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడి సన్నిధిలో 'డిక్టేటర్' సినిమా ఫస్ట్ లుక్ ను నటులు బాలకృష్ణ, అంజలి విడుదల చేశారు.

20:44 - September 17, 2015

హైదరాబాద్ : అది మట్టి మనుషుల పోరాటం.. దొరతనాన్ని సమాధి చేసిన సాయుధ సమరం. భూమి కోసం... భుక్తి కోసం... దాస్యశృంఖలాలను తుత్తినీయం చేయడానికి సామాన్యుడు గర్జించిన పూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతిని జనం నడిపించిన విప్లవం అది. బాంచన్ దొర కాళ్లు మొక్కుతా అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులను కదిలించిన వైనం అది. ప్రపంచ చరిత్రలో అది చెరగని అధ్యాయం. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. చారిత్రక తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి విశ్లేషణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

పొగాకు బోర్డు ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా మనోజ్ ద్వివేది

హైదరాబాద్ : పొగాకు బోర్డు ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా మనోజ్ ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరంలోని పొగాకు బోర్డు కార్యాలయంలో కొనుగోళ్లు, తాజా పరిస్థితుల పై సమీక్షిస్తున్నారు. 

ఈ నెలాఖరు లోపు రెండో విడుత రుణమాఫీ :ఈటెల

మెదక్ : సంగారెడ్డి మండలం కంగ్డిలో దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు రెండో విడుత రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీపం పథకం నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని మంత్రి ఈటల అన్నారు.

 

ఎస్ఐ రమేశ్ మృతదేహం స్వస్థలానికి తరలింపు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల్ ఎస్సై రమేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల బందోబస్తు మధ్య రమేశ్ మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లా శేరిపల్లి తండాకు పోలీసులు తరలిస్తున్నారు. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు రమేశ్ మృతదేహానికి నివాళులర్పించారు.

18:57 - September 17, 2015

హైదరాబాద్ : వీర తెలంగాణా విప్లవ ఘట్టం, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నత విప్లవ ప్రజా పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నిర్మూలన కోసం, ఉత్తేజకరంగా సాగిన మహోన్నత పోరాటం. పురుషులతో సమంగా మహిళలు కూడా భుజం భుజం కలిపి కదిలిన ఉద్యమం. అటువంటి పోరాట క్రమంలో సెప్టెంబర్ 17 ఒక చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చారిత్రక నేపథ్యాన్ని సింహావలోకనం చేసుకునే సందర్భమిది. ఈ పోరాటంలో కదం తొక్కి కదిలిన సాహాస వనితల గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది.. ఈ నేపథ్యంలో మానవి అందిస్తున్న ప్రత్యేక కథనం ’తెలంగాణా సాయుధ పోరులో వీరవనితలు‘.

మల్లు స్వరాజ్యం......

తెలంగాణా సాయుధ పోరాటంలో వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. పదేళ్ల వయసులో ఏ ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారో, మహిళా పక్షపాతిగా ఎనభై వసంతాలు దాటిన ఈ సమయంలోనూ అంతే చైతన్యంతో, స్ఫూర్తితో ప్రజల పక్షపాతిగా పనిచేస్తున్నారు. వృద్ధాప్యం తాలూకూ అనారోగ్యం వెంటాడుతున్నా, గత కాలపు జ్నాపకాలు మనసు దొంతర్లోంచి జారిపోతున్నా, తెలంగాణా సాయుధ పోరులో పాల్గొన్న అనుభవాలను మాత్రం కళ్లకు కట్టినట్టు చెప్తున్నారు శారద. 90 ఏళ్ల వయసులోనూ అంతే ఉత్సాహంతో గొంతెత్తి నినదిస్తున్నారు.

కాసర్ల కమలమ్మ......

నాటి పోరాటంలో పురుషుని వేషంలో పాల్గొన్న మరో వనిత తన అనుభవాలను మన ముందుంచుతోంది. నాడు ఈశ్వరయ్యగా దళంలో సాగిన వనితే మన ముందు నిలుస్తున్న కాసర్ల కమలమ్మ.

అసువులు బాసిన వారందరికీ మానవి జోహార్లు.....

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారందరికీ మానవి జోహార్లు తెలుపుతోంది. సాహసంతో ఉద్యమాలకు ఊపిరినిచ్చిన ప్రతి మహిళకి జేజేలు పలుకుతోంది. మాతృత్వం కన్నా అమరత్వమే రమణీయమని నమ్మిన అమ్మలందరికీ చేతులెత్తి నమస్కరిస్తోంది. మహిళల భాగస్వామ్యం లేకుండా, వారి సహకారం అందకుండా ఏ ఉద్యమాలూ విజయవంతం కావని బలంగా విశ్వసిస్తోంది. 

రేపు ప్రకాశం జిల్లాలో నిర్మలా సీతారామన్ పర్యటన

హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించనున్నారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పొగాకు రైతుల కుటుంబాను ఆమె పరామర్శించనున్నారు.

18:42 - September 17, 2015

కడప : జిల్లా కలెక్టరేట్ వద్ద విశ్వహిందూ పరిషత్ నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు కడపలో ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో హత్య నిషేధ చట్టం అమలు చేయాలని హిందువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నేత రాధాక్రిష్ణ.. ఓ వర్గంపై హిందువులను రెచ్చగొట్టేవిధంగా తీవ్ర పదజాలంతో ప్రసంగించారు. చట్టానికి భయపడాల్సిన పనిలేదన్నారు. అనంతరం సుప్రీంకోర్టుపై కూడాను తూలనాడాడు. ఇదంతా పోలీసు సమక్షంలో జరిగినా... వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనితో కడప ఒన్ టౌన్ పోలీస్టేషన్ వద్ద ఓ వర్గం నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

18:39 - September 17, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైల్లోంచి ఓ వ్యక్తి కిందకు దూకాడు. వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం కేంద్రానికి చెందిన దారావత్‌ రమేష్‌ కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో టీటీ టికెట్‌ అడగడంతో.. టికెట్‌ చూపించే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. అతని మిత్రుడు మాత్రం.. టీటీ దుర్భాషలాడిన కారణంగానే కిందకు దిగే క్రమంలో రమేష్‌ ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నాడు. క్షతగాత్రున్ని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

18:37 - September 17, 2015

హైదరాబాద్ : నాలుగు వేల మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి తెలంగాణకు విముక్తి కల్పిస్తే.. ఆ మహత్తర పోరాటాన్ని హైజాక్‌ చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని లెఫ్ట్‌ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ తరుణంలో.. తెలంగాణ వారసత్వాన్ని కమ్యూనిస్టులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.

ఎవరికి వారు వక్రభాష్యాలు చెబుతున్నారు.....

భూమి కోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఎవరికి వారు వక్రభాష్యాలు చెబుతున్నారని వామపక్ష నేతలు విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. కనీసం.. సాయుధ పోరాటం వైపు కన్నెత్తి చూడని వారు కూడా.. ఇవాళ దానికి సారధులమంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని.....

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని కించపరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలను రాక్షసంగా అణిచివేసి, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన నిజాంను పొగుడుతున్న కేసీఆర్‌.. అమరవీరుల కుటుంబాల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమే....

తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. నాటి పోరాటాన్ని బీజేపీ, ఎంఐఎం లాంటి పార్టీలు.. మతాల మధ్య కొట్లాటగా చిత్రించేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొన్ని పార్టీలు, సంస్థలు తమకు అనుకూలంగా వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇంతటి మహత్తరమైన విముక్తి పోరాట ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించకపోవడం బాధాకరమన్న నేతలు.. తద్వారా నిజాం నిరంకుశత్వానికి మద్దతు పలుకుతోందని అన్నారు.

18:34 - September 17, 2015

హైదరాబాద్ : డెంగ్యూతో ఢిల్లీ వణుకుతుంటే దానికంత భయపడాల్సిన పనిలేదని, ఆయుర్వేద మందులతో తగ్గించొచ్చని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా అభయమిస్తున్నారు. 4 రకాల ఆకుల రసంతో డెంగ్యూ వ్యాధికి ఆయన విరుగుడు కనిపెట్టారు. గిలోయ్, అనార్‌ అంటే దానిమ్మ, అలొవేరా అంటే కలబంద, పపీతేకా పత్తా అంటే బొప్పాయి ఆకులతో తీసిన జూస్‌ను 50 ఎంఎల్‌ చొప్పున తీసుకుంటే 4 రోజుల్లో డెంగ్యూ నయమవుతుందని తెలిపారు. డెంగ్యూ చాలా సీరియస్‌గా ఉంటే ప్రతి రెండు గంటలకోసారి ఈ రసాన్ని తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల డెంగ్యూ వ్యాధి తగ్గడమే కాదు..ప్లేట్‌లెట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని కొంతమంది రోగులకు చికిత్స చేసిన తర్వాతే దీన్ని రుజువు చేశామని బాబా తెలిపారు. డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో బాబా మందు ఎంతవరకు పనిచేస్తుందన్నది వేచి చూడాలి.

18:31 - September 17, 2015

హైదరాబాద్ : రాజస్థాన్‌ ఏసిబి అధికారుల వలకు భారీ తిమింగిలం చిక్కింది. గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ సింఘ్వీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. 6 గనులకు అనుమతిచ్చేందుకు గాను 3 కోట్ల 80 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. అశోక్‌ సింఘ్వీ ఇంటిని సోదా చేసిన అధికారులు, తెల్లవారుజామున 3 గంటలకు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ అవినీతి దందాలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అశోక్‌ సింఘ్వీతో పాటు అడిషనల్‌ డైరెక్టర్‌ పంకజ్‌ గెహ్లాట్‌కు ఇందులో షేర్‌ ఉంది. పంకజ్‌ గెహ్లాట్‌కు ఏకంగా 14 బ్యాంకు అకౌంట్లున్నాయి. అవినీతి అధికారులు, మధ్య వర్తుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదా చేసి భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు మధ్యవర్తులు, ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌ను ఎసిబి అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా యాలాల్ ఎస్సై మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, టిడిపి, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

భారీ వర్షాలతో ఆగిన బొగ్గు ఉత్పిత్తి

కరీంనగర్ : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా మంథని డివిజన్ లోని 20 అటవీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా, జిల్లాలోని ధర్మపురిలో 21.8 సెం.మీ, సారంగాపూర్లో 21.3 సెం.మీ, మల్యాలలో 19.4 సెం.మీ, జగిత్యాల 16 సెం.మీ, రాయ్#కల్ లలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరపి లేకుండా ఓపెన్ కాస్ట్ నిల్వల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ఛత్తీస్‌గఢ్ సమీపంలో తీవ్ర వాయుగుండం

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ సమీపంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇల్లెందు పీఎస్ నుండి ఖైదీ పరార్

ఖమ్మం : ఇల్లెందు నూతన పోలీస్ స్టేషన్ నుంచి ఓ ఖైదీ పరారీ అయ్యాడు. చోరీ కేసులో విచారణకు గత రాత్రి నిందితుడిని పీఎస్‌కు పోలీసులు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి ఖైదీ తప్పించుకుపోయాడు. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

విజవాడ మెట్రోకు కేంద్రం అంగీకరించింది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 25 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. మెట్రోరైల్ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి నిబంధనల ప్రకారం మెట్రోరైల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు. మెట్రో రైల్ ఏర్పాటు చేయాలంటే పట్టన, నగర స్థాయి రవాణా నిధిని ఏర్పాటు చేయాలి. సూత్రప్రాయ అంగీకారం తెలిపినందును కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆయన తెలిపారు.

భార్యను నరికి చంపిన భర్త

హైదరాబాద్ : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను నరికి చంపాడు.

17:18 - September 17, 2015

టాలీవుడ్ మన్మథుడు 'అక్కినేని నాగార్జున' తనయుడు 'అఖిల్' తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'అఖిల్' సినిమాలోని ఓ పాట విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా సరికొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటను విడుదల చేసినట్లు 'అఖిల్' ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన చిత్రం ఆడియో విడుదల కానుంది.
సెన్సేషనల్‌ డైరెక్టర్‌ 'వి.వి.వినాయక్‌' దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై 'నిఖితారెడ్డి' సమర్పణలో యూత్‌ స్టార్‌ 'నితిన్‌' నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అఖిల్‌ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సప్తగిరి, హేమలతో పాటు పలువురు నటిస్తున్నారు. 

ముగ్గురు మేయర్లతో భేటీ కానున్న మంత్రి సత్యేంద్ర జైన్..

ఢిల్లీ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ముగ్గురు మేయర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న విషయం తెలిసిందే. 

ఎస్ఐ మృతిపై విచారణ జరిపించాలి - మోత్కుపల్లి..

రంగారెడ్డి : యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీబీఐ చే విచారణ జరిపించాలని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు టి.ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రమేష్ కుటుంబ సభ్యులను టిడిపి, కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. 

బాగ్ధాద్ లో వరుస దాడులు..14 మంది మృతి..

ఇరాక్ : రాజధాని బాగ్ధాద్ లో వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. జరిగిన రెండు దాడుల్లో 14 మంది మృతి చెందగా 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

విజయవాడ మెట్రోకు కేంద్రం ఆమోదం - వెంకయ్య..

ఢిల్లీ : విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

సోమనాథ్ ముందస్తు బెయిల్ ను రిజర్వ్యులో ఉంచిన కోర్టు..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజర్యులో ఉంచిందని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. 

రేపు ఎల్ జేపీ అభ్యర్థుల లిస్టు..

బీహార్ : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ఎల్ జేపీ శుక్రవారం ప్రకటించనుంది. గురువారం ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. 

16:40 - September 17, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో ఇద్దరు అన్నదాతలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో పురుగులమందు తాగి ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం చేయూత అందించకపోవడం, పెరిగిన అప్పులే తన భర్త ప్రాణం తీశాయని భార్య కన్నీరుమున్నీరవుతోంది.

16:39 - September 17, 2015

హైదరాబాద్ : తన భర్త రమేష్‌ది హత్యేనని, ఇసుక వ్యాపారి లక్ష్మణ్‌తో తన భర్తకు విభేదాలున్నాయని యాలాల ఎస్‌ఐ భార్య ఆరోపించారు. తన భర్త మృతి విషయంలో తగిన న్యాయం చేయాలని కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు. పాతబస్తీలో బంధువులతో కలిసి ధర్నా నిర్వహించిన ఆమె.. తనకు న్యాయం చేయాలని కోరారు.

16:37 - September 17, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించేందుకు టీఆర్‌ఎస్‌ కుట్రచేస్తోందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్న ఆయన.. ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ టీఆర్‌ఎస్‌ కుట్రలో భాగం పంచుకుంటున్నారని అన్నారు.

16:35 - September 17, 2015

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులపాలైపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... .. చైనా పర్యటన పేరుతో కేసీఆర్ లక్షల రూపాయలు వృధా చేస్తున్నారని మండిపడ్డారు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా టీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు.. 

16:33 - September 17, 2015

హైదరాబాద్ : ఉద్యమ సమయంలో ప్రగల్భాలు పలికి ఇప్పుడు తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని జరపకపోవడం కేసీఆర్‌ నైజాన్ని తెలియచేస్తుందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ...ఆంధ్రా పాలకులు అన్యాయం చేశారంటూ మాట్లాడి..నేడు ఆయన చేస్తుందేంటని యాష్కీ నిలదీశారు.

స్టాంప్ రద్దు పై కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : ఇందిరా, రాజీవ్ స్టాంప్ లు రద్దు చేయడం పట్ల కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. గురువారం మంత్రి రవి శంకర్ ప్రసాద్ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. 

16:29 - September 17, 2015

ప.గో : లిబియాలో కిడ్నాప్‌ అయిన డాక్టర్‌ రాంమూర్తిని క్షేమంగా విడిపించేందుకు కృషి చేయాలని ఆయన బంధువులు ఏలూరులో ఎంపీ మాగంటి బాబుకు విజ్ఞప్తి చేశారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న తన భర్తను రక్షించాలని రాంమూర్తి భార్య అన్నపూర్ణ మాగంటిని వేడుకుంది. ఇండియన్‌ ఎంబీసీ అధికారులతో మాట్లాడి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్‌ గురించి విదేశాంగశాఖ ఉన్నతాధికారులతో తాను మాట్లాడినట్లు ఎంపీ మాగంటి బాబు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భరత్‌ భూషణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

16:28 - September 17, 2015

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా నెల్లూరులోని పప్పులవీధిలో 4,500 మొక్కజొన్న కంకులతో ఏర్పాటు చేసిన వినాయకుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. నెల్లూరు డిప్యూటి మేయర్ ద్వారకానాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయకుడిని రూపొందించారు. వెరైటీగా ఉన్న ఈ మొక్కజొన్న కంకుల వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాలుష్యం కాకుండా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటుచేయడం అభినందిచదగ్గ విషయమని ఎంపీ మేకపాటి అన్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో లవణ గణపతి.......

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పినాకిల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజీ విద్యార్థులు వేరైటీగా లవణ గణపతిని తయారు చేశారు. ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ లవణ గణపతిని ఆకట్టుకుంటోంది. 30 కిలోల మైదా పిండి, 30 కిలోల ఉప్పు, 5 కిలోల చక్కెర, ఫుడ్‌ కలర్స్‌ లాటి తినే పదార్థాలతో దీన్ని తయారు చేశారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా తినే పదార్థాలతో వినాయకుడిని తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.....

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలో విభన్న ఆకృతుల్లో, వెరైటీ వినాయకులు కొలువుదీరాయి. రాజాం పట్టణం సంత మార్కెట్ సెంటర్‌లో రూపాయి, రెండు రూపాయల నాణేలతో తయారు చేసిన భారీ ఏక దంతుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. కవిటి మండలం బోరివంక గ్రామంలో వనమూలికల విగ్రహం అలరిస్తోంది. ప్రకృతి గణనాథుని విగ్రహాన్ని తిరుపతిరావు అనే వ్యక్తి తీర్చిదిద్దాడు.

రాజమండ్రిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.....

రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీటిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పుష్కరాల రేవు వద్ద రెండు రూపాయిల కాయిన్స్‌తో ఏర్పాటు చేసిన విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. జేసీ రోడ్డులో వేరుశనగ కాయలతో, నల్లమందు సందులో గురువింద గింజలతో గణనాథులను తయారు చేసి పూజలు చేస్తున్నారు. ఏవీ అప్పారావు వీధిలో భారీ విగాహాన్ని ఏర్పాటు చేశారు.

రేడియం పూల లంబోదరుడు .....

కడప నగరంలోని ఊరగాయల వీధిలో ఏర్పాటు చేసిన రేడియం పూల లంబోదరుడు అమితంగా ఆకట్టుకుంటున్నాడు. చీకటిలోనూ వెలుగుతుండడం ఈ విగ్రహం ప్రత్యేకత. ఈ విగ్రహం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు.

ఉల్లి వినాయకుడ్ని దర్శించుకుంటున్న భక్తులు.......

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో.. వినూత్నంగా ఆలోచించారు వినాయకుడి భక్తులు. వెరైటీగా ఉల్లిగడ్డలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. దీంతో ఈ ఉల్లి గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నెలరోజులుగా ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈనేపథ్యం ఈ వినాయక చవితి తర్వాత అయినా.. ఉల్లిగడ్డల రేట్లు తగ్గించాలని.. ఆ వినాయకుడ్ని కోరుకున్నట్లు నిర్వాహకులు చెప్పారు. మొత్తంగా ఉల్లిగడ్డల వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టకుంటున్నాడు.

డెంగ్యూను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం - రాందేవ్..

ఢిల్లీ : డెంగ్యూ వ్యాధి బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారని, దీనిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. 

సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్న చిలీ..

చిలీ : సునామీ హెచ్చరికలను దక్షిణ అమెరికాలోని చిలీ దేశం వెనక్కి తీసుకుంది. చిలీదేశ తీరంలోని సముద్రగర్భంలో ఈ ఉదయం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. 

బీజేపీ ఎమ్మెల్యే కారులో రూ.12 లక్షలు..

బీహార్ : బీజేపీ ఎమ్మెల్యే ఉషా విద్యార్థి కారులో రూ. 12 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కారులో లేరని, సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం.

 

భోపాల్ లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్..

మధ్యప్రదేశ్ : భోపాల్ లో కదులుతున్న బస్సులో ఓ మహిళపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఎంపీ నగర్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. 

కేసీఆర్ ఫాం హౌస్ లో భేటీ..

మెదక్ :జిల్లాలోని ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు పోచారం, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు.

 

భన్వర్ లాల్ పై శశిధర్ రెడ్డి ఫిర్యాదు..

హైదరాబాద్ : ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జైదీకి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఓట్లను తొలగించేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఇందులో భన్వర్ లాల్ భాగస్వాములవుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎజెంట్ లా భన్వర్ లాల్ వ్యవహారం ఉందని తాను ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో తక్షణం స్పందించాలని భన్వర్ లాల్ కు ఆదేశాలు జారీ చేస్తామని కమిషనర్ జైదీ హామీనిచ్చారని తెలిపారు. 

విదేశీ పర్యటనకు వెళ్లనున్న జైట్లీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సింగపూర్, హాంకాంగ్ కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 18-19వ తేదీల్లో సింగపూర్, 20-21వ తేదీల్లో హాంకాంగ్ లో పర్యటించనున్నారు. 

15:19 - September 17, 2015

హైదరాబాద్ : యాలాల ఎస్‌ఐ రమేష్‌ అనుమానాస్పద మృతిపై సీబీసీఐడీతో విచారణ జరుపుతున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. పెద్దేముల్‌ పీఎస్‌లో పనిచేస్తున్నప్పుడు రమేష్‌కు ఇసుక వ్యాపారి లక్ష్మణ్‌తో గొడవలు ఉన్నట్లు తెలుస్తుందని.. వాటిపై విచారిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా సీఐడీ విచారణలో నిజాలు తేలుస్తామన్నారు. దోషులు ఎవరైనా ఉంటే వారిని విడిచిపెట్టేది లేదన్నారు. 

15:15 - September 17, 2015

తూ.గో : కాకినాడలో వట్టివేర్లతో తయారు చేసిన 18 అడుగుల వినాయకుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. వట్టివేర్లతో వినాయకున్ని తయారు చేశారు. 

15:12 - September 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జేఏసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. విలీన దినం సందర్బంగా హైదరాబాద్ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నందున..దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యంతో సమానమైన విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమని బిజేపి నేత నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఆయన..ఇకనైనా కేసీఆర్‌ కళ్లు తెరిచి తెలంగాణ చరిత్రను, ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. 

15:10 - September 17, 2015

హైదరాబాద్ : ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్టాంపుల ప్రింటింగ్ నిలిపివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. దేశకోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్టాంపులు రద్దు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఈ నెల 22న ఆందోళనలు చేపడతామని ప్రకటించారు..

'లిబియాలో అహరణకు గురైన తెలుగు వారు సురక్షితం'

ఢిల్లీ : లిబియాలో అపహరణకు గురైన తెలుగు వారు సురక్షితంగా ఉన్నట్లు ఏపీ భవన్ అదనపు రెసిడెన్స్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. ముగ్గురు తెలుగు వాళ్లు మరొకరు ఒడిశా వాసిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రిపోలీలోని రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. సిర్తే పట్టణానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, ఉగ్రవాదులు, విద్యుత్, టెలిఫోన్, రహదారి వ్యవస్థలను ధ్వంసం చేశారని తెలిపారు. 

మక్కా మృతులకు సౌదీ అరేబియా భారీ పరిహారం..

ఢిల్లీ : మక్కా మసీదులో మృతి చెందిన..గాయపడిన వారికి సౌదీ అరేబియా ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.1.76 కోట్ల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.88.35 లక్షల పరిహారం ఇవ్వనుంది. క్రేన్ కూలీ 107 మంది చనిపోగా 238 మందికి గాయాలయ్యాయి. 12 మంది భారతదేశీయులు ఉండగా అందులో ఏపీకి చెందిన వారు నలుగురున్నారు. 

టిటిడిపి నేతలతో ముగిసిన బాబు భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి నేతలతో సీఎం చంద్రబాబు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. పలు కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం. 

యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ దర్యాప్తు - నాయినీ..

హైదరాబాద్ : యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ దర్యాప్తు జరిపిస్తామని తెలంగాణ హోం మంత్రి నాయినీ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పెద్దేముల్ ఇసుక వ్యాపారి లక్ష్మణ్ తో ఎస్ఐ రమేష్ కు విబేధాలున్నట్లు సమాచారమని తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. 

రైతాంగ సాయుధ పోరాటంలో వక్రీకరణలు - సురవరం..

హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో వక్రీకరణలు చోటు చేసుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హెచ్చరికలు చేశారు. నిజాంను పొగిడితే తప్పేమిటనీ సీఎం కేసీఆర్ బుకాయిస్తున్నారని ప్రజలను అణిచి వేసిన నిజాం గొప్పవాడెలా అవుతాడని ప్రశ్నించారు. ఓట్ల కోసమే ఐలమ్మ, మగ్ధుం, నిజామును కలగలిపి కేసీఆర్ పొగుడుతున్నారని తెలిపారు. పొగడ్తలు ఓట్లు తెచ్చి పెడుతాయనుకుంటే భ్రమే అవుతుందని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలను నివారించలేక కేసీఆర్ గత ప్రభుత్వాలపై నెట్టివేస్తున్నారని సురవరం విమర్శించారు. 

14:02 - September 17, 2015

హైదరాబాద్ : తెలంగాణా సీఎం కేసిఆర్ నియంతలా వ్యవహారిస్తున్నారని తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ ఛైర్ పర్సన్ విమలక్క విమర్శించారు. హైదరాబాద్ దోమల్ గూడలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంలో విమలక్క తెలంగాణా విమోచన దినానికి వ్యతిరేకంగా నల్లజెండా ఎగురవేసారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహదినమని ఆమె అన్నారు. ఆనాడు కమ్యూనిస్టులు పంచిన భూములు నేడు కబ్జాకు గురైయ్యాయని..ఆ భూములు పేదలకు పంచిన రోజే నిజమైన విముక్తి అన్నారు .

 

నదుల అనుసంధానం చారిత్రాత్మకం - బాబు..

హైదరాబాద్ : కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గంగా, కావేరీ నదుల అనుసంధానం జరిగితే దేశానికి లాభమని, నదులను అనుసంధానం చేస్తే చాలదని తగినంత నీరు ఉండాలన్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని హాజరౌతారని, సింగపూర్ ప్రధానిని కూడా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. రాయలసీమకు త్వరలో నీళ్లు అందిస్తామని, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చి పట్టిసీమను పరిపూర్ణ చేస్తామన్నారు. 

14:00 - September 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకోని పార్టీలు కూడా ఇవాళ విలీన దినాన్ని పాటించడం హాస్యాస్పదం అని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఎస్ వికెలో నిర్వహించిన సదస్సులో పాల్గొని, మాట్లాడారు. అనంతరం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం నవాబును పొగడడం అంటే..సాయుధ పోరాటాన్ని కించపరచడమే అని అన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిజాం చేసిన పనులను పొగుడుతున్నాడని...దాంతో ప్రజా పోరాటాన్ని కించపర్చుతున్నారని విమర్శించారు. 

13:56 - September 17, 2015

 హైదరాబాద్ : తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణ సాయుధ పోరాటం'పై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వామపక్షాల అగ్గిని ఆర్పేందుకు ఆనాటి నిజాం తీవ్ర ప్రయత్నాలు చేశాడని చెప్పారు. ఆనాడు బలంగా వామపక్షాల్ని అణగతొక్కేందుకు నిజాం తీవ్రంగా ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఖాసిం రజ్వీ ముస్లీం అయినా..తెలంగాణలోని ముస్లీంలను చిత్రహింసలకు గురిచేశాడని..ఆయన అన్నారు. కమ్యూనిష్టుల అగ్గిని ఆర్పేందుకు ఖాసిం రజ్వీ కుట్రలు పన్నాడని...కానీ ఆ కుట్రలన్నింటిని ఎర్రజెండా సైన్యం తిప్పికొట్టిందన్నారు. ఈ సదస్సులో వామపక్ష నేతలు పాల్గొని ఆనాటి సాయుధ పోరాట ఘట్టాల్ని మరోసారి గుర్తుచేశారు.

 

చైనా యాత్రలపై శ్వేతపత్రం విడుదల చేయాలి - షబ్బీర్ ఆలీ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జరిపిన చైనా యాత్రపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం యాత్రలు చేయడం ఘోరమన్నారు. పారిశ్రామిక ఒప్పందాల్లో స్థానికులకు 20 శాతం ఉపాధి కల్పించాలన్న నిబంధన పెట్టాలని సూచించారు. కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని దివాళా కేంద్రంగా మారుస్తున్నారని విమర్శించారు.

 

 

మోడీది సంకుచిత పాలన - ఉత్తమ్..

హైదరాబాద్ : ప్రధాని మోడీ సంకుచిత పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఇందిరా, రాజీవ్ స్టాంప్ లు రద్దు చేయడం సిగ్గు చేటని, ఈనెల 22వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనతో ఒరిగేదేమి లేదని ఉత్తమ్ తెలిపారు. 

ఎస్ రమేష్ ఆత్మహత్యపై సీఐడీ విచారణ - డీఐజీ గంగాధర్

హైదరాబాద్ : ఎస్ రమేష్ ఆత్మహత్యపై సీఐడీ విచారణ జరిపిస్తామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ పేర్కన్నారు. గాంధీ, ఉస్మానియా వైద్యులతో పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.

బీహార్ ఎన్నికల్లో తమదే విజయం - జైట్లీ..

ఢిల్లీ : బీహార్ శాసనసభ ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికలే పునరావృతమౌతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన పాంచ్ క్రాంతి అభియాన్ ను ఆవిష్కరించారు. 

13:06 - September 17, 2015

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న 'డిక్టేటర్' ఫస్ట్ లుక్ వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా పలు టాలీవుడ్ చిత్రాల ఫస్ట్ లుక్స్..చిత్రాలకు సంబంధించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 'బాలయ్య' లుక్ అభిమానులను అలరించే విధంగా ఉంది. ధగధగలాడే సూటు, బూటు ధరించిన 'బాలయ్య' ఓ పెద్ద కుర్చీలో ఠీవిగా కూర్చొని..ఓ వైపుకు చూస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ లో 'బాలకృష్ణ' పక్కన గ్లోబు..మరోపక్క గుర్రం ప్రతిమలున్నాయి.
బాలకృష్ణ కు ఇది 99వ చిత్రం కావడం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'బాలయ్య' సరసన 'అంజలి', 'సోనాల్ చౌహాన్' లు నటిస్తున్నారు.

నైజాం బ్రిటీష్ ఏజెంట్ల తొత్తు - తమ్మినేని..

హైదరాబాద్ : నైజాం బ్రిటీష్ ఏజెంట్ల తొత్తుగా వ్యవహరించాడని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'నైజాం పాలన అంతం - ప్రజల విజయం 1948 సెప్టెంబర్ 17'పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ రైతుల పోరాటాన్ని హిందూ - ముస్లిం ఘర్షణగా బీజేపీ ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. పోరాటాన్ని మత ప్రాతిపదికన బీజేపీ, ఎంఐఎం మాట్లాడుతున్నాయని విమర్శించారు. మత పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసమే పూర్వపు వాసనలు వెతుకుతున్నాయని, తెలంగాణ పోరాటం భూమి, భుక్తి, ఆత్మగౌరవ కోసం జరిగిందన్నారు.

హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుతో పాటు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న సీఎం చంద్రబాబు వారంలో ఐదు నుండి ఆరు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బాబు పూజలు చేశారు. అనంతరం టిటిడిపి నేతలతో భేటీ అయ్యారు. 

శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం..

మహబూబ్‌నగర్ : శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 36,518 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-4964 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయ ప్రస్తుత నీటి మట్టం 836.50గా ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.

12:39 - September 17, 2015

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'సుకుమార్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమ'తో ఫస్ట్ లుక్ విడుదలైంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విడుదల చేసినట్లు 'ఎన్టీఆర్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వెరైటీ కటింగ్..వెరైటీ గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమాకు 'దేవిశ్రీ ప్రసాద్' సంగీతాన్ని అందించారు.

కేజ్రీవాల్ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతుండడం..సర్కార్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. గురువారం సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. 

12:22 - September 17, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని శౌర్యాంజలిని సందర్శించారు. 1965 యుద్ధానికి ఇవాళ్టితో యాభైఏళ్లు పూర్తయ్యాయి. పాక్‌తో భారత్ జరిపిన ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. గోల్డెన్ జూబిలీ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మోడీ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మోడీతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

 

మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాహుల్..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

నైజాం పాలన అంతం - ప్రజల విజయంపై సదస్సు...

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నైజాం పాలన అంతం - ప్రజల విజయంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీపీఐ నాయకులు సురవరం, నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నేత తమ్మినేనిలు హాజరయ్యారు. వీరితో పాటు మిగతా వామపక్ష నేతలు కూడా హాజరయ్యారు. 

ఎంఐఎం అంటే ప్రభుత్వానికి భయం - కిషన్ రెడ్డి...

హైదరాబాద్ : ఎంఐఎం అంటే తెలంగాణ ప్రభుత్వానికి భయమని బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎంను ప్రసన్నం చేసుకొనేందుకు విమోచన దినోత్సవాన్ని దూరం పెట్టిందని, ఓట్ల కోసం ఆనాటి వీరుల త్యాగాలను సీఎం కేసీఆర్ పణంగా పెట్టారని వ్యాఖ్యానించారు.

 

తెలంగాణలో నియంతలా కేసీఆర్ పాలన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన నియంతలా కొనసాగుతోందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నేత విమలక్క విమర్శించారు. ఎన్ కౌంటర్లు ఉండని తెలంగాణ కోసం ఉద్యమం చేయడం జరిగిందని, వరంగల్ ఎన్ కౌంటర్ బూటకమని అభివర్ణించారు. శృతిపై హత్యాచారం చేసి ఎన్ కౌంటర్ అంటున్నారని, ఈ ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఐఏఎస్ అశోక్ సింగ్వీ అరెస్టు..

రాజస్థాన్ : అవినీతి ఆరోపణలతో ఐఏఎస్ అశోక్ సింగ్వీని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గనులు, పెట్రోలియం శాఖ ముఖ్యకార్యదర్శిగా అశోక్ సింగ్వీ వ్యవహరించారు. మూతబడిన ఆరు గనుల్లో తిరిగి తవ్వకాలు జరిపేందుకు రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అశోక్ సింగ్వీతో పాటు మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

 

12:18 - September 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భవన్‌లో తెలంగాణ విలీనాన్ని ఘనంగా జరిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండా, తెలంగాణ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు..ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌, ఎంపీ సుమన్‌ పాల్గొన్నారు. నిజాం ప్రభువు తెలంగాణలో స్వతంత్రంగా ఉండలేక భారత్‌లో విలీనం చేశారని..అందుకే విలీన దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి నాయిని అన్నారు.
బిజెపి కార్యాలయంలో..
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన రోజును జరుపుకున్నారు. రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్‌ వల్లభాయ్ పటేల్ కృషివల్లే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్చా వాయువల్ని పీలుస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. బిజేపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం కంట్రోల్ రూం అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్‌వల్లభాయ్‌ పటేల్ విగ్రహం దగ్గర జరిగిన నిజాం పరిపాలన విమోచన ఉత్సవంలో నేతలంతా పాల్గొన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సన్మినించారు.
టిడిపి కార్యాలయంలో
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు నేతలు. టి టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాం నవాబు భారత్‌ ప్రభుత్వానికి తలొగ్గి..తెలంగాణను భారత్‌లో విలీనం చేయడంతో సెప్టెంబర్‌ 17ను విలీన దినంగా జరుపుకుంటున్నామని టి టిడిపి అధ్యక్షుడు రమణ అన్నారు.

 

12:13 - September 17, 2015

కరీంనగర్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు పడుతున్నాయి. రామగుండంలో రాత్రి నుంచి భారీవర్షం కురుస్తోంది. దీంతో సింగరేణి 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరడంతో... డోర్లీ 1,2 గనుల్లో ఉత్పత్తి ఆగిపోయింది. జిల్లాలోని బెజ్జూరు మండలంలో వాగులు పొంగిపొర్లుతుండటంతో.. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 691 అడుగులకు చేరింది.

 

 

12:05 - September 17, 2015

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ వైపు కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

 

ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా - గవర్నర్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ విఘ్నాలు తొలిగి సంతోషంగా జీవించేలా చూడాలని తాను విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించింది. 

డెంగ్యూపై ఎలాంటి జాగ్రతలు తీసుకున్నారన్న ఢిల్లీ హైకోర్టు..

ఢిల్లీ : రాష్ట్రంలో ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సూచించింది. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. 

గాంధీ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

చిత్తూరు : చంద్రగిరి మండలం మొరపల్లి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతిచ చెందారు. 

20న కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్..

ఢిల్లీ : ఈనెల 20వ తేదీన రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీ నిర్వహించనుంది. రాహుల్, పీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. 

ఏపీ ఆబ్కారీ శాఖలో బదిలీలు..

హైదరాబాద్ : ఏపీ ఆబ్కారీ శాఖలో 200 మంది సీఐలు, ఏఈఎస్ లను బదిలీ చేశారు. ప్రతిభ ఆధారంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

 

11:29 - September 17, 2015

విశ్వ విఖ్యాత నటుడు 'కమల్ హాసన్' నటించిన 'చీకటి రాజ్యం' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. సస్పెన్స్ తో పాటు థ్రిల్లర్‌లా ఈ మూవీ ఉండనున్నట్లు టాక్. తమిళంలో 'తూంగవనమ్‌' గా ఈ చిత్రం తెరకెక్కింది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు. 'ప్రకాశ్ రాజ్', 'త్రిష'లు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. నటి 'మధుశాలిని ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలు ఒక ఎత్తు..ఈ సినిమా మరొక ఎత్తు అని 'కమల్' ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని, ప్రేక్షకులు లీనమై పోతారని పేర్కొన్నారు. మరి 'కమల్' నటించిన 'చీకటి రాజ్యం' ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందా ? లేదా ? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. 

భారీగా వర్షాలు..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ లోకి భారీగా నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతోంది. డోర్లీ 1,2 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండంలో బుధవారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. బెజ్జూరు మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

11:05 - September 17, 2015

సెప్టెంబర్ 17.. చారిత్రక దినోత్సవమని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. చారిత్రక పోరాటంతోనే నిజాం పాలన అంతమైందన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్.. భారత యూనియన్ లో విలీనం అయిందని తెలిపారు. సొంతరాష్ట్రం ఏర్పిడినా తెలంగాణ విలీన దినోత్సవం జరుపకపోవడం బాధాకరమన్నారు. ముస్లీంల ఓట్లకు దూరమవుతామనే ఉద్ధేశంతోనే తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను విద్రోహ దినం అనడమంటే దేశభక్తిని శంకించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను ఆయన మాట్లోనే చూద్దాం...
తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం జరుపకపోవడం బాధాకరం..
తెలంగాణ రాష్ట్ర సమితి..అధికారంలో లేనప్పుడు సెప్టెంబర్ 17ను జరపడం లేదని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలపై టీఆర్ ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు ఆంధ్రా పాలకులు, తెలంగాణ చరిత్రను గుర్తించరు'.. అని టిఆర్ ఎస్ నేతలు విమర్శించారు. మహారాష్ట్ర, కర్నాటకలో పాత హైదరాబాద్ రాష్ట్ర ప్రాంతాలున్నాయి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు.. అధికారంగా జరుపుతున్నాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, సొంత రాష్ట్రమై, స్వపరిపాలన వచ్చాక, తెలంగాణకు ఉన్న ఒక చారిత్రక దినాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే సెప్టెంబర్ 17 పై వక్రీకరణ రావడం విచిత్రం. నిజాం అంటే ముస్లీం.. నిజాం నుంచి విమోచన పొందిన రోజు అంటే ముస్లీములకు కోపం వస్తుంది, ముస్లీంల ఓట్లు పోతాయనే ఒక రాజకీయ దౌర్భాల్యాన్ని ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ కూడా ముస్లీం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడారనే భావన ఇచ్చి... దీనికి మళ్లీ ఆజ్యం పోస్తున్నారు.
ముస్లీం రాజు, హిందూప్రజలకు మధ్య జరిగిన పోరాటం కాదు..
వాస్తమేమిటంటే ముస్లీం రాజు, హిందూ ప్రజలకు మధ్య జరిగిన పోరాటం కాదు. రాజరికానికి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బాంచన్ దొర కాల్మొక్త అన్న పేదరైతాంగం, కూలీనాలి వీరోచితంగా తిరగబడినటువంటి గడ్డ. నిజాంకు మద్దతుగా అనాటి దేశముఖ్ లు (హిందూ భూస్వాములు) నిలబడ్డారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముస్లీంలు కూడా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కవితలు, రచనలు చేసినందుకు షోయబుల్లాఖాన్ చేతులను నిజాం... నరికి వేశారు. మఖ్దుం మోయినుద్దీన్ ఊర్దులో విప్లవ గీతాలు రాసి.. ఆలపించారు. తెలంగాణలో జరిగిన పోరాటం రెండు మతస్తుల మధ్య జరిగిన పోరాటం కాదు. ఇది పీడనకు వ్యతిరకంగా, పీడితులు.. పీడించే వారికి వ్యతిరేకంగా జరిగిన వీరోచిత ర్గం పోరాటం. ఇలాంటి పోరాటాన్ని కేవలం రెండు మతాల మధ్య పోరాటంగా చూపించి... అటువైపు బిజెపి, ఇటువైపు ఎంఐఎం మధ్యలో టిఆర్ ఎస్.. ముస్లీంల ఓట్లు పోతాయనే భయంతో పోరాట ప్రాధాన్యతను పక్కకు నెడుతున్నారు.
సెప్టెంబర్ 17 అనేక రకాల వాదనలు..
విలీన దినమా?. విమోచన దినమా..? విద్రోహ దినమా.? అనే రకరకాల వ్యాఖ్యాలను వస్తున్నాయి. అయితే ఇది ముందుగా విలీన దినమే. ఎందుకంటే.. భారత్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయింది. 1947 ఆగస్టు 15 న తెలంగాణ గడ్డపై జాతీయ పతాకం ఎగరేలేదు. ఎందుకంటే అప్పటికి భారత్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాలేదు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనం అయింది. నిజంగా హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది.. సెప్టెంబర్ 17. భారత్ లో విలీనమయిన రోజు కాబట్టి ఈరోజుకు ప్రత్యేకత ఉంది. అయితే ఈ విలీనం సర్దార్ పటేల్ సైన్యాలు పంపితే.. ఆయన పౌరుషాల వల్ల అయిందనేది కూడా ఒక వక్రీకరణే. జనం నిజాం నిరంకుశ పాలనపై జనం తిరగబడ్డారు. 4 వేల మంది అమరులయ్యారు. కమ్యూనిస్టుల నాయకత్వాన వీర తెలంగాణ సాయుధవిప్లవ పోరాటం జరిగింది. ఇది ప్రపంచ చరిత్ర. చారిత్రాక్మమైన పోరాటం నేపథ్యం ఉంది. అలాంటి పోరాటానికి స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజ్ పోరాడారు. ఈ పోరాటాల ప్రతిఫలం నిజాం పాలన అంతం పలుకుతున్న సమయంలో, నిజాం రేపోమాపో అంతమవుతాడన్న సందర్భంలో సర్దార్ పటేల్ సైన్యాలు వచ్చాయి. ఆ సైన్యాలకు నైజాం లొంగిపోయిన మాటా వాస్తవం. భారత్ లో తెలంగాణ విలీనం అయింది కనుక ఇది విలీనం దినం..ఒక చారిత్ర దినం. అయితే చారిత్ర నేపథ్యాన్ని మరిచిపోయి.. కేవలం సర్దార్ పటేట్ పంపిన సైన్యాలతోనే విలీనం అయిందంటే.. నిజాంకు రాజు ప్రముఖ్ గా బిరుదు ఇచ్చి రాజ్ ప్రముఖగా ప్రకటించింనట్లే అవుతుంది. నిజాం కాలంలో కొన్ని మంచిపనులు జరిగాయి. ఓయూ విశ్వవిద్యాలయం కట్టారు. సాగునీటి వ్యవస్థ, మురుగునీరు వ్యవస్థ, రూరల్ ఇండస్త్రీల ఏర్పాటు.. దీన్ని మెచ్చుకోవాలి. కానీ నిజాం రాజరిక, భూస్వామ్య విధానికి ప్రతినిధి. రాజరిక వ్యస్థపై స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. నిజాం... ప్రజలను దొచుకుని సంపన్నుడు అయ్యాడు.
తెలంగాణ సాయుధపోరాటం 
నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటం సాగింది. భూస్వామ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థ నుంచి ఒక నూతన సమాజాన్ని నిర్మాణాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. అందువల్ల నూతన సమాజ నిర్మాణం జరగలేదు. నూతన ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ నిర్మించడ లేదు. కాబట్టి ఇది పాక్షికంగా విమోచన దినోత్సవం తప్పా... సంపూర్ణ విమోచన దినోత్సవం కాదు. భూస్వామ్య విధానం నుంచి విముక్తి కాలేదు. దేశముఖ్ ల నుంచి భూములు కాపాడుకోవడం కోసం ప్రజలు తిరగబ్డారు. రాజరిక పాలన నుంచి విముక్తి పొందారు. అని తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, వినాయక చవితిపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

11:04 - September 17, 2015

మెగస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ మేకింగ్ వీడియోను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. 'లే ఛలో..' అనే సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసినట్లు 'చెర్రీ' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. 'శ్రీను వైట్ల' దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'చెర్రీ' సరసన 'రకుల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి 'థమన్' సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మెగస్టార్ 'చిరంజీవి' ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

రాజ్ పథ్ లో 'శౌర్యాంజలి' స్మారక ప్రదర్శన..

ఢిల్లీ : రాజ్ పథ్ లో జరుగుతున్న 'శౌర్యాంజలి' స్మారక ప్రదర్శనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిలకించారు. 1965 యుద్ధం జరిగి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్మారక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

10:28 - September 17, 2015

ఉత్తర్ ప్రదేశ్ : భారతదేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం..కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం..దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది..అని పాలకులు పదే పదే చెబుతుంటారు. కానీ దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామం చూస్తే అర్థమౌతోంది. రాష్ట్ర సచివాలయ 368 'బంట్రోతు' ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగానికి కనీస అర్హత ఐదో తరగతి, సైకిల్ ఉండాలని నిబంధన పెట్టింది. నిరుద్యోగులు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తీరా దరఖాస్తులను చూస్తే అధికారులకు దిమ్మ తిరిగింది. ఏకంగా 23 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో పీహెచ్ డీ, బీటెక్, ఎమ్మెస్సీలు కూడా దరఖాస్తు చేసుకోవడాన్ని చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. దరఖాస్తు దారుల్లో మొత్తం 255 మంది పీహెచ్ డీలు ఉండడం విశేషం. దరఖాస్తుల వెల్లువ చూసి ఆశ్చర్యపోయామన సచివాలయ నిర్వాహణాధికారి ప్రభాత్ మిట్టల్ పేర్కొన్నారు. ఖాళీగా ఉండే కన్నా 'బంట్రోతు' ఉద్యోగమైనా వస్తే చాలని అనుకుంటున్నట్లు పీహెచ్ డీ విద్యాధికుడు అలోక్ పేర్కొన్నాడు. 

తృణముల్ ఎంపీకి వేయి కోట్ల బినామీ ఆస్తులు..?

హిమాచల్ ప్రదేశ్ : తృణముల్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేడీ సింగ్ కి రూ.1000 కోట్ల విలువైన బినామీ ఆస్తులున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెయి కోట్లతో భూములను కొనుగోలు చేశారని, నల్లధనంతో కేడీసింగ్ హిమాచల్ ప్రదేశ్ లో భూములు కొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలైన కుఫ్రీ, మాసోర్బా, సిమ్లాలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ముఖ్యమంత్రికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ సలీం వివరాలను అందించారు. 

బీహార్ శాసనసభకు సీపీఎం అభ్యర్థుల జాబితా వెల్లడి..

బీహార్ : శాసనసభకు సీపీఎం అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. 33 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల్లో వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అక్టోబర్ 12 నుండి బీహార్ ఎన్నికలు జరుగనున్నాయి.

 

 

10:22 - September 17, 2015

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్నారు. గణేషుడికి తొలి పూజలు నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేకపూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్, దైవజ్ఞశర్మతోపాటు పలువురు పాల్గొన్నారు. గణేష్ మండపం భక్తులతో కటకిట లాడుతోంది. ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఉత్సవకమిటీ వినాయకున్ని అంగరవంగ వైభవంగా ముస్తాబు చేశారు. మండపం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. అక్కడి ప్రాంతమంతా జనంసంద్రోహంగా మారింది. 

రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరిన చంద్రబాబు..

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానశ్రయానికి బయలుదేరారు. 

వరంగల్ లో కిడ్నాపైన బాలుడు హత్య..

వరంగల్ : కాశీబుగ్గలో కిడ్నాపైన బాలుడు హత్యకు గురయ్యాడు. దుగ్గొండి (మం) పానకల్ కొత్తచెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది. హత్య చేసి పడేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, హన్సరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్ గణేష్ వద్ద గవర్నర్ దంపతులు..

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని ఉభయ రాష్ట్రాల గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు..

ముంబై : వినాయకచవితి పండుగా సందర్భంగా ఇవాళ ముంబై స్టాక్‌ ఎక్చేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయవు. 

ఆదిలాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు..

ఆదిలాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్,బెల్లంపల్లి, మంచిర్యాల,చెన్నూరు, ఖానపూర్, బోధ్ ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. బెజ్జూరు మండలంలో కుశన పల్లి వాగు పొంగిపొర్లుతోంది. వాగు ఉధృతికి 12 గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 

న్యూజిలాండ్ లోనూ సునామీ హెచ్చరికలు..

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లోనూ గురువారం సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. చిలీలో భూకంపం సంభవించడంతో అప్రమత్తమైన పొరుగుదేశం న్యూజిలాండ్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

వాయు గుండంగా మారిన అల్పపీడనం..

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాయ్‌పూర్‌కు ఆగ్నేయంగా 130 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

చిన్న శేష వాహనంపై ఊరేగుతున్న శ్రీ వారు..

చిత్తూరు : శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరు వీధుల్లో చిన్న శేష వాహనంపై ఊరేగారు. ఉదయం 9గంటలకు చిన్న శేష వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగారు. 

09:30 - September 17, 2015

ట్రిపోలీ : లిబియాలో తెలుగు వ్యక్తి కిడ్నాప్ కు గురయ్యాడు. కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన రామ్మూర్తి లిబియాలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. గత పది రోజులుగా కుటుంబ సభ్యులతో ఫోన్ లో టచ్ లో లేడు. ఈనేపథ్యంలో దుండగులు అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసముంటున్న రామ్మూర్తి భార్య, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర అందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులు మాగంటిబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామ్మూర్తి వివరాలను సేకరిస్తున్నాయి. లిబియా ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడుతోంది. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తామంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ మాట్లాడవద్దని ప్రభుత్వం కటుంబసభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది.

 

లిబియాలో తెలుగు వ్యక్తి కిడ్నాప్...

ట్రిపోలీ : లిబియాలో తెలుగు వ్యక్తి రామ్మూర్తి కిడ్నాప్ కు గురయ్యాడు. లిబియాలో అతను డాక్టర్ గా పని చేస్తున్నాడు. రామ్మూర్తి...కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి నివాసి.

08:06 - September 17, 2015

మహబూబ్‌ నగర్ : జిల్లాలో పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన బిజీబిజీగా సాగింది. జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చేరుకున్న ఆయన ఎల్లూరు సెగ్మెంట్‌కు సంబంధించిన వాటర్‌గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన
అనంతరం బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్‌.. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశామన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బాబు కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణకు 1200 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు కేటీఆర్‌. చట్టపరంగా రావాల్సిన నీటిని కూడా రానివ్వకుండా బాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందరి కుట్రలను తిప్పికొడుతూ.. తెలంగాణను దేశంలోనే అత్యంత ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
హామీలను నెరవేరుస్తాం : కేటీఆర్‌
రాబోయే మూడేళ్లలో ఏ ఆడబిడ్డయినా మంచినీటి కోసం రోడ్డెక్కితే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వాటర్‌గ్రిడ్ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

 

07:36 - September 17, 2015

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు సింగ‌పూర్ ప‌ర్యట‌న‌కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజ‌ధానిలోని అంశాల‌ను చ‌ర్చించ‌డ‌మే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 20 వ తేదీన సింగ‌పూర్ వెళ్లనున్న సీఎంతో పాటు మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, నారాయ‌ణ‌ అధికారులు వెళ్లనున్నారు.
పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డ‌మే ఎజండా
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో వివిధ అంశాల‌ను చ‌ర్చించ‌డ‌మే సీఎం సింగ‌పూర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇంతే కాకుండా కొత్తగా ఎన్నికైన సింగ‌పూర్ ప్రభుత్వాన్ని రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు అహ్వానించ‌డంతో పాటుగా పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డ‌మే సీఎం చంద్రబాబు ప్రధాన ఎజండాగా క‌నిపిస్తోంది. ఇప్పటికే రాజ‌ధాని నిర్మాణంపై మూడు మాస్టర్ ప్లాన్ లు సింగ‌పూర్ ప్రభుత్వం అందించింది.
సింగపూర్‌ వర్కింగ్‌ గ్రూప్‌తో సమావేశం
ఈ సీడ్ క్యాపిట‌ల్ మాస్టర్ ప్లాన్‌లో రాష్ర్ట ప్రభుత్వం కొన్ని మార్పులు కోరుకుంటున్నట్లు స‌మాచారం. వీటి పై సింగ‌పూర్ వ‌ర్కింగ్ గ్రూప్‌తో సీఎం బృందం స‌మావేశం కానుంది. ప్రధానంగా రాజ‌ధాని కోసం భూముల‌ను ఇచ్చిన రైతుల‌కు వారి వారి గ్రామాల ప‌రిధిలోనే స్థలాలు కేటాయించ‌డం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
పెట్టుబడుల ఆకర్షణకు వాణిజ్య ప్రముఖులతో సమావేశం
ఇక అమ‌రావ‌తి మాస్టర్ డెవ‌ల‌పర్‌గా భాగ‌స్వామ్యం స్వీక‌రించ‌టానికి సింగ‌పూర్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు సుముఖత వ్యక్తం చేసింది.. ఈ అంశం పైనా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన సింగ‌పూర్ ఎన్నిక‌ల‌లో ఎన్నికైన కొత్త ప్రధానిని కూడా చంద్రబాబు క‌లిసే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌చ్చే నెల 22న జ‌రిగే అమ‌రావ‌తి శంఖుస్థాప‌న కు సింగ‌పూర్ ప్రధానిని ఆహ్వానించాల‌ని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేర‌కు సింగ‌పూర్ ప్రధానిని సీఎం అధికారికంగా ఆహ్వానించే అవ‌కాశం ఉంది. ఇంతే కాకుండా ఏపీలో పెట్టుబ‌డులకు అహ్వానించాల‌ని సింగ‌పూర్ కు చెందిన వాణిజ్య ప్రముఖుల‌తో స‌మావేశం కానున్నారు. ముఖ్యమంత్రి బృందం లో మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పి.నారాయ‌ణ‌, ప్రభుత్వ స‌ల‌హాదారుడు ప‌ర‌కాల ప్రభాక‌ర్, అధికారులు సింగ‌పూర్ లో ప‌ర్యటించ‌నున్నారు. ఈ సింగ‌పూర్ ప‌ర్యట‌న‌కు 63 లక్షలు ఇప్పటికే అర్ధిక శాఖ విడుద‌ల చేసింది.

 

ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ చేయనున్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడికి ఉదయం 9.45 గంటలకు గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజలు నిర్వహించనున్నారు. 59 అడుగుల ఎత్తులో త్రిశక్తిమయ మోక్షగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు కొలువైఉన్నాడు. ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గనుంది. సాయంత్రం సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. 

07:15 - September 17, 2015

శాంటిగో: దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.3 గా నమోదు అయింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సముద్ర గర్భంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావంతో చిలీ, పెరూ, హవాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

 

 

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు : నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలు 21 రోజులపాటు కొనసానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వినాయక చవితి, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు..తెల్లవారుజాము నుంచి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

 

07:02 - September 17, 2015

హైదరాబాద్ : అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో...అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు చరమగీతం పాడారు. బారు ఫిరంగులు మోగినా, తుపాకీ తూటాల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించలేదు. రవ్వంత స్ఫూర్తిని కూడా తగ్గనివ్వలేదు. బలిదానాలు చేసి మరీ సాయుధపోరాటానికి ఊపిరిలూదారు. రజాకార్ల ఆకృత్యాలను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు.
తిరుగుబాటే శరణ్యమన్న ప్రజలు
తెలంగాణ పై గుత్తాధిపత్యం సాగించాలనేది నిజాం నవాబు పన్నాగం. ఏం చేసయినా సరే తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలనేది నిజాంకు తొత్తులైన దొరల కుతంత్రం. రెండు కలిసి అమాయక తెలంగాణ ప్రజలను చెప్పలేని రీతిలో బాధించాయి. మాన, ప్రాణాలను దోచుకుని నిస్సహాయుల్లా మార్చాయి. రజాకార్ల ఆకృత్యాలకు విసిగి వేసారిపోయిన ప్రజలు తిరుగుబాటే శరణ్యమనుకున్నారు. ప్రాణం పోతే ఏంటి...? బాంచన్‌ దొర బతుకులు పోతే చాలు అనుకుని బరిలోకి దిగారు. ప్రపంచం నివ్వెర పోయే రీతిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికారు.
100 మందిని కాల్చి చంపిన నిజాం సైన్యం
రజాకార్లు ఊర్ల మీద పడి దోచుకుతింటున్న రోజులవి. మహిళల మాన, ప్రాణాలను కబళిస్తున్న చీకటి పాలన అది. ఈ సమయంలోనే వరంగల్‌ జిల్లా బైరాన్‌ పల్లిలో నిజాంకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాటం ఎగిసింది. దీన్ని తట్టుకోలేని నిజాం సైన్యం 100మంది అమాయకులను కాల్చి చంపింది. అదే రోజు కుటిగల్లు గ్రామంలో నిజాం వ్యతిరేక విధానాలకు పోరాడినందుకు 40మందిని రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. ఇటు పాలకుర్తి తాలుకాలో చిట్యాల ఐలమ్మ దొరతనానికి వ్యతిరేకంగా నడుం బిగించింది. అంతులేని కదనోత్సాహంతో వీరుడు దొడ్డికొమురయ్య రజాకార్లకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాడు. నైజాంకు వ్యతిరేకంగా చేసిన పోరులోనే అమరుడయ్యాడు. అటు పరకాల అమరధామంలోనూ 13మందిని నిజాం మూకలు బలి తీసుకున్నాయి.
అక్షరాలకు అందని దుర్మార్గం
ఒక్కటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే నిజాం సాగించిన దాష్టీకం మాటలకు అందనిది. రజాకార్లు సాగించిన దుర్మార్గం అక్షరాల్లో ఒదగలేనిది. అందుకే ఆనాడు కమ్యూనిస్టులంతా తెలంగాణ ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి పోరాటానికి బీజం వేశారు. ప్రజలతో కలిసి అమరత్వాన్ని కౌగిలించుకున్నారు. అయినా నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకునేందుకు తెగువ ప్రదర్శిచటం లేదు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావటం లేదు.
విలీనం కాదు విద్రోహం..
ప్రభుత్వాలు ముందుకు రాకున్నా విమోచన దినోత్సవం యొక్క విశిష్ఠతను కమ్యూనిస్టులు ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. శౌర్య యాత్రలు చేస్తూ విలీనం కాదు విద్రోహమే అని చాటి చెబుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి భవిష్యత్‌ తరాలకు చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారు.

 

'నైజాం పాలన అంతం-ప్రజల విజయం'పై నేడు సదస్సు

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నైజాం పాల అంతంన-ప్రజల విజయం-1948 సెప్టెంబర్ 17' అశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. 

కరీంనగర్ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం..

కరీంనగర్ : జిల్లాలోని సుల్తానాబాద్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంపై బిజెపి నేతలు జాతీయ జెండాను ఎగరవేశారు.   

Don't Miss