Activities calendar

18 September 2015

21:39 - September 18, 2015

హైదరాబాద్ : విశాఖలోని హార్బర్ పార్క్ లో దారుణం చోటు చేసుకుంది. శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడి పై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయగా పొట్టలోని పేగులన్నీ బయటకు వచ్చాయి. ఆ బాలుడ్ని కేజీహెచ్ మార్చురికి ఆ బాలుడ్ని తరలించారు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రెటర్ విశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు మండిపడుతున్నారు.

21:35 - September 18, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈనెల 23 నుంచి సమావేశాలు మొదలు అయ్యే అవకాశాలున్నాయి. అందులో భాగంగా శనివారం కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వం. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించనున్నారు కేసీఆర్. ప్రధానంగా రైతు ఆత్మహత్యలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. దాంతో పాటు కరువు మండలాల గుర్తింపులోనూ జాప్యం జరుగుతోందని మండిపడుతున్నాయి. వీటిపై విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు మంత్రివర్గ సమావేశంలో వ్యూహం రెడీ చేయబోతున్నారు కేసీఆర్.

ప్రాణహిత -చేవేళ్ల, కంతనపల్లి, దుమ్ముగూడెం......

ఇక ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశం కూడా రాష్ట్రంలో మంటలు రాజేస్తోంది. ప్రాణహిత -చేవేళ్ల, కంతన పల్లి, దుమ్ముగూడెంతో పాటు గోదావరి నదీ జలాలపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు డిజైన్ మార్పులు చేపట్టింది ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. దాంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రపంచ బ్యాంకు అప్పుల వ్యవహారం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వీటిని సమర్దించుకునేందుకు ప్రభుత్వం తర్జనభర్జనపడుతోంది. మరోవైపు సంక్షే మ పథకాల అమలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాలు వంటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ప్రతిపక్షాల చేతుల్లో ఇవి విమర్శనాస్త్రాలయ్యే అవకాశముంది.

శాఖల వారిగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం....

ఇలా మరెన్నో అంశాలపై విపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా శాఖల వారిగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. సీఎస్ రాజీవ్ శర్మ అన్ని శాఖల అధిపతులతో సమావేశమయ్యారు. శాఖల వారిగా అమలవుతున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని సేకరించారు. విపక్షాల నుంచి ఎదురయ్యే అవకాశమున్న ప్రశ్నలకు సమాధానాలను కూడా సిద్దం చేస్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్, టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలు, సంక్షేమ పథకాల కోసం వెచ్చించిన మొత్తాల డేటాను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

విపక్షాలను ఇరుకున పెట్టి పైచేయి సాధించాలని....

ఇలా ముందస్తు సమాచారం ద్వారా విపక్షాలను ఇరుకున పెట్టి పైచేయి సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకోసం అవసరమైన సమాచారాన్ని అందించేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు ముమ్మరం చేసింది. అసెంబ్లీ వేదికగా అధికార, విపక్షాల్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఈ సమాచారం మీదే ఆధారపడి ఉంది. 

21:27 - September 18, 2015

హైదరాబాద్ : ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్చొద్దంటూ... తెలంగాణ టీడీపీ పాదయాత్ర చేపట్టింది. డిజైన్ మార్పు వల్ల రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతుందంటూ పోరుబాట పట్టింది. శంకర్ పల్లి నుంచి చేవెళ్ల వరకు చేపట్టిన ఈ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి నేతృత్వంలో ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు పాదయాత్రకు తమ సంఘీభావం తెలిపారు.

ప్రజాక్షేత్రంలో తెలంగాణ తమ్ముళ్లు.....

 గ్రేటర్‌లో పసుపుదండు కదిలింది. నీళ్ల కోసం పోరుబాట పట్టింది. ప్రాణహిత-చేవెళ్లను రక్షించేందుకు పాదయాత్ర చేపట్టింది. తెలంగాణకు జీవనాధారంగా ఉన్న ప్రాజెక్టును కుదించే టీఆర్ ఎస్ కుట్రను... ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటున్నారు తెలంగాణ తమ్ముళ్లు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నేతృత్వంలో టీ-టీడీపీ పాదయాత్ర చేపట్టింది.

ప్రాణహిత-చేవెళ్ల నాలుగో నెంబర్ టన్నెల్ పనులను.....

ప్రాణహిత-చేవెళ్ల నాలుగో నెంబర్ టన్నెల్ పనులను పరిశీలించిన తెలంగాణ తమ్ముళ్లు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డిజైన్ మార్పు వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర ఉందని నేతలు ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పు వల్ల... రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో 283 గ్రామాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 12 ప్యాకేజీలకు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇప్పుడు డిజైన్ మార్పు చేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

డిజైన్ మార్పు వల్ల జాతీయ హోదా దక్కదని వాదన....

ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్పు వల్ల జాతీయ హోదా దక్కదని తెలంగాణ తమ్ముళ్లు అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే చర్యలను... కేసీఆర్ తన స్వార్ధం కోసం చెడగొడుతున్నాడని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజల ఉసురు తీసుకునే యత్నాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నేతలు తేల్చి చెప్పారు.

టీడీపీ పాదయాత్రకు కాంగ్రెస్ సంఘీభావం.....

మరోవైపు పసుపుదళం పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. టీ-టీడీపీ నేతల పోరాటానికి కాంగ్రెస్ యువనేత కార్తీక్ రెడ్డి మద్దతు తెలిపారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు పోరాటం చేస్తామన్నారు. మొత్తానికి శనివారం చేవెళ్లలో భారీ ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టీ-టీడీపీ సమాయత్తమవుతోంది.

21:23 - September 18, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీ-కాంగ్రెస్ లీడర్లు కలిశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఓట్లు తొలగింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టీ విక్రమార్క అన్నారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను... తక్షణమే వెబ్‌సైట్‌లో పెట్టాలని మాజీ మంత్రి దానం నాగేందర్ డిమాండ్ చేశారు. 

21:21 - September 18, 2015

హైదరాబాద్ : పొగాకు రైతులను పరామర్శించడానికి.. సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పొగాకు రైతుల కుటుంబాలను కలిశారు. అనంతరం విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయి సమస్యలపై చర్చించారు. పొగాకు రైతులకు కొనుగోలు ధరకు తోడు కేంద్రం, రాష్ట్రం నుంచి అదనంగా చెల్లింపులు ఉంటాయని ప్రకటించారు. లోక్వాలిటీ పొగాకును కూడా కొనుగోలు చేయాలని బోర్డుకు మంత్రి సూచించారు.

21:19 - September 18, 2015

ప.గో : పట్టిసీమ నీళ్లు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక సమస్యలతో విసిగించిన మోటారు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. మంత్రి దేవినేని దగ్గరుండి పనులు పూర్తి చేయించి..నీరు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదలైన నీరు పోలవరం కుడికాల్వలోకి ప్రవహించింది. అప్పటివరకు టెన్షన్‌తో ఉన్న అధికారులు, నేతలు కేరింతలు కొట్టారు. మొదట మంత్రి దేవినేని లాంఛనంగా స్విచాన్‌ చేసినా.. చాలాసేపటివరకు నీరు రాలేదు. దీంతో కాసేపు నిరుత్సాహం నెలకొంది. ఇంజనీర్లు అన్నీ సెట్‌ చేశాక.. చివరకు మళ్లీ విడుదల చేయగా నీరు వచ్చింది. మంత్రితో సహా అందరూ ఊపిరి పీల్చుకుని.. ఉత్సాహంగా వెనుదిరిగారు. మొత్తం మీద మంత్రి దేవినేని మాత్రం రెండురోజులుగా ఇక్కడే ఉండి పని పూర్తి చేయించారు.

మెదక్ జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్య...

మెదక్ : సీఎం కేసీఆర్‌ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలో వేరువేరు కారణాలతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.శుక్రవారం తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో అప్పుల బాధతో వెంకటేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జగదేవ్‌పూర్‌ మండలం ఎల్లాయిగూడెంలో సహకార బ్యాంకు అధికారులు రుణం ఇవ్వలేదని మనస్తాపం చంద్రయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ : భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ వద్ద భువనేశ్వర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది. టాటానగర్ స్టేషన్ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ కు సంబంధించిన రెండు పట్టాలు తప్పాయి. దీనిని గుర్తించిన డ్రైవర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజిన్ మార్చి, పట్టాలు సరిచేశారు. దీంతో రైలు గంటపాటు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు.  

20:11 - September 18, 2015

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంలో మేము అమలుచేయబోయేది మావోయిస్టుల ఎజెండానే...నవ తెలంగాణలో బూటకపు ఎన్‌కౌంటర్లకు అవకాశమే ఉండదు... ఎన్నికల ముందు వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి గర్వంగా చేసిన ప్రకటనలివి. కానీ.. ఒకే ఒక్క ఎన్‌కౌంటర్‌ గులాబీ శిబిరంలో అంతర్మథనం కలిగిస్తోంది. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ ద్వారా పడిన నెత్తుటి మరకను చెరిపేసుకునేందుకు ప్రభుత్వం నానా అవస్థలు పడుతోందని ప్రచారం సాగుతోంది.

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ తీరు పై సర్వత్రా విమర్శలు.....

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై, అది జరిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడమే దీనికి కారణం. మావోయిస్టులు ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, మహిళా మావోయిస్టుపై అత్యాచారం కూడా జరిగిందని తల్లిదండ్రులు తీవ్రంగా విమర్శించారు. ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాల్సి వస్తే.. ఆ పని కోర్టు చేయాలే తప్ప, పోలీసులకు, ప్రభుత్వానికి ఆ హక్కు ఎక్కడిదని పౌరహక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ పార్టీలు కూడా....

రాజకీయ పార్టీలు కూడా వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమనే అంటున్నాయి. వామపక్షాలతోపాటు, కాంగ్రెస్‌, టీడీపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ కాదంటోంది. ఎదురు కాల్పుల్లోనే మావోయిస్టులు మృతిచెందారని చెబుతోంది.

నక్సల్స్‌ ఎజెండాయే తమ ఎజెండా అంటూ కేసీఆర్‌ .....

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగినన్ని రోజులూ.. నక్సల్స్‌ ఎజెండాయే తమ ఎజెండా అంటూ కేసీఆర్‌ పలుమార్లు ప్రకటించారు. కానీ.. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మావోయిస్టులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విధించిన నిషేధాన్నే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎన్‌కౌంటర్‌ జరగడంతో గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే కొత్త ప్రభుత్వం కూడా నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

. కొన్నాళ్లుగా కరపత్రాలు, బ్యానర్ల రూపంలో నిరసన.....

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంగా ఉన్న మావోయిస్టులు.. కొన్నాళ్లుగా కరపత్రాలు, బ్యానర్ల రూపంలో తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఎన్‌కౌంటర్‌ జరగడంతో.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

20:06 - September 18, 2015

హైదరాబాద్ : యాలాల సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ డెత్‌ మిస్టరీగా మారింది... ఇప్పటివరకు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలున్నా చివరకు పోస్టుమార్టం నివేదిక ఆత్మహత్యగానే రావడంతో పోలీసుల దృష్టి మారింది...దర్యాప్తును వేగం చేసిన పోలీసులు రమేష్‌ డెత్‌లో అనుమానాలు నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు....ఇటు పోలీసులకు, అటు బంధువులకు సైతం అంతుచిక్కని కొన్ని ప్రశ్నలు రమేష్‌ మృతి ఘటనలో ఎదురౌతున్నాయి...

పెద్దేముల్‌లో 16 నెలలు డ్యూటీ...

యాలాల్‌లో పనిచేస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఆత్మహత్య చేసుకోవడానికి పెద్దముల్‌ మండలానికి ఎందుకు వెళ్లాడన్నది తేలడం లేదు...పెద్దముల్‌లో 16 నెలల పాటు పనిచేయడం, ఆత్మహత్య అదే మండలంలో చేసుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది...ఆత్మహత్య చేసుకునే ముందు భార్యతో పాటు మరో కానిస్టేబుల్‌కు ఒకే మెస్సేజ్‌ పంపించాడు...భార్యతో ఎందుకు మాట్లాడలేకపోయాడన్నది మిస్టరీనే...ఏవరైనా బలవంతంగా ఆత్మహత్యకు ప్రేరేపించి సెల్‌ఫోన్‌ ద్వారా మెస్సేజ్‌ పంపించారా అన్నది కూడా అనుమానమే...భార్యతో పాటు అతని వద్ద పనిచేసే కానిస్టేబుల్‌కు మెస్సేజ్‌ చేయడాన్ని బట్టి రమేష్‌ స్వయంగా పంపించి ఉండాలి, లేదా రమేష్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తులు పంపించి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉరి వల్లే ప్రాణం పోయిందని నిర్థారణ.......

ఎస్‌ఐ రమేష్‌ మృతిపై ఉస్మానియా మార్చురీ వైద్యులు ప్రాధమిక నివేదికను రంగారెడ్డి పోలీసులకు అందించారు. ఉరి వేసుకోవడం వల్లనే ప్రాణం పోయిందని నిర్థారించారు. ఉరితాడు మెడును నొక్కివేయడంతో అక్కడి కండరాలు దెబ్బతిన్నాయని, ఎముక విరిగిందని స్పష్టం చేశారు. శరీరంపై ఎక్కడా గాయాలు లేవని వివరించారు. పూర్తి స్థాయి నివేదిక పదిరోజుల తరువాత అందే అవకాశం ఉంది. పోస్టుమార్గం నివేదిక ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు .....

వాయిస్....ఆత్మహత్య చేసుకునే రోజు భార్య గీతకు వైద్య పరీక్షల కోసం రమేష్‌ తాండూరుకు వచ్చాడు, సాయంత్రం భార్యతో ఉండగానే సిఐ శివశంకర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అంతకు ముందు లక్ష్మణ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని భార్య చెప్పింది. అప్పటి నుంచి రమేష్‌ ఆందోళనగా కనిపించాడని ఆమె స్పష్టం చేసింది....పోలీసులు వివిధ కోణాల నుంచి దర్యాప్తును ముమ్మరం చేశారు. వారం రోజుల కాల్‌డేటాను సేకరించడం ద్వారా కొంతవరకు క్లూను రాబట్టాలని యోచిస్తున్నారు.

విధి నిర్వహణలో విభేదాలా...

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి తండాకు చెందిన రమేష్‌ 2012లో ఎస్‌ఐగా ఎంపిక అయ్యాడు. అప్పాలో శిక్షణ పొందిన తరువాత రంగారెడ్డి జిల్లా పెద్దముల్‌ మండలంలో ఎస్‌ఐగా మొదటి పోస్టింగ్‌ లభించింది. ఇక్కడ సుమారు 16 నెలల పాటు పనిచేశాడు. ఈ సమయంలో ఎంపిటిసి భర్త లక్ష్మణ్‌ నాయక్‌తో కొన్ని విభేదాలు ఉన్నాయని తెలిసింది...ఓ వివాహిత మృతి కేసులో ఎటువంటి వత్తిడికి లొంగకుండా అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిసింది....ఈ విషయంలో లక్ష్మణ్‌ నాయక్‌తో ఘర్షణ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో రెండు కేసుల విషయంలో కొంతమందితో విభేదాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ముక్కుసూటిగా డ్యూటీ చేసుకుంటూ పోవడమే చివరకు ప్రాణాలమీదకు వచ్చిందా..? లేక మరేదైనా కారణాలున్నాయాన్నది తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు..

 

20:01 - September 18, 2015

హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్.. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన పోరాటం విలక్షణం. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆయనకు గురించి తెలియని నిజాలేవో వెలుగు చూడాలని అందరూ ఆశిస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఘడియ రానే వచ్చింది. సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 64 ఫైళ్ళను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది.

ఆయన ఎలా చనిపోయారు?

భారతదేశ ప్రజల మనో ఫలకాల మీద చెరిగిపోని పేరు.. సుభాష్ చంద్రబోస్. ఆయన ఎలా చనిపోయారు? స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ అనుసరించిన పంథా ఏమిటి? అసలు ఈ బెంగాల్ సాహసికి ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన సమాచారం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. 67 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీ, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారంతో ఉన్న 64 ఫైళ్ళను విడుదల చేసింది. ఇన్నేళ్ళుగా కోల్ కతా పోలీసుల అధీనంలో రహస్యంగా ఉన్న ఈ ఫైళ్ళను కలకత్తా పోలీసు మ్యూజియంలో అందుబాటులో ఉంచారు. ఆ ఫైళ్ళన్నింటినీ డిజిటలైజ్ చేసి, ఆ సిడిని నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు.

మిస్టరీగా నేతాజీ అదృశ్యం......

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు జన్మించారో అందరికీ తెలుసు. కానీ.. 1945, ఆగస్టు 18 నుంచి నేతాజీ అదృశ్యమైన తర్వాత అసలేం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీ గురించి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేతాజీ అదృశ్యం తర్వాత ఆయన కుటుంబ సభ్యులపై నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిఘా కొనసాగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫైళ్లను విడుదల చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. దీనిపై నేతాజీ కుటుంబసభ్యులు సైతం ప్రధాని మోదీని కలిశారు. మరోపక్క నేతాజీ చివరి రోజులకు సంబంధించిన సమాచారం దేశ ప్రజలు తెలుసుకునే అవసరం ఉందని భావించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. ఆ ఫైళ్లను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నేతాజీ ఫైళ్లను విడుదల చేశారు.

కోల్‌కతా పోలీసు ఉన్నత కార్యాలయంలో నేతాజీ ఫైళ్లు.....

ప్రస్తుతం కోల్‌కతా పోలీసు ఉన్నత కార్యాలయంలో ఉన్న ఈ ఫైళ్లను.. సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. కోల్ కతా పోలీసు మ్యూజియంలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఈ ఫైళ్ళు 1937-47 మధ్య కాలంలో నేతాజీకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. 64 ఫైళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు విడుదల చేసిన ఫైళ్లను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పరిశీలించారు.

బోస్‌ కుటుంబ సభ్యులు సంతోషం.....

నేతాజీ ఫైళ్లను ప్రభుత్వం బహిర్గతం చేయడం పట్ల బోస్‌ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైళ్లు వెలుగు చూడడం వల్ల నేతాజీపై ఉన్న సందేహాలకు తెర పడుతుందని వారు భావిస్తున్నారు.

ఎన్నికల లబ్ది కోసమే మమతా హడావుడి చేస్తున్నారా.?....

కాగా.. ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని.. వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చని కూడా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నేతాజీకి సంబంధించిన కీలకమైన సమాచారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండవచ్చని తెలుస్తోంది. విదేశాలతో జాతీయ, అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన పత్రాలు విడుదల చేయలేమని గతంలో ప్రధాని కార్యాలయం కేంద్ర సమాచార కమిషన్‌కు తెలియజేయడంతో అసలైన ఫైల్స్‌ కేంద్రం వద్దే ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక వచ్చే ఏడాదిలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ ఈ ఫైల్స్‌తో హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఏమైనా, ఈ ఫైళ్ళలో ఏముందన్నది సోమవారం నాటికి తెలిసిపోతుంది..

19:57 - September 18, 2015

హైదరాబాద్ : అధికారాల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ల మధ్య జంగ్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించొద్దని గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ గురువారం రాత్రి అధికారులకు ఓ మెమో జారీ చేశారు. కేజ్రీవాల్‌ సర్కార్‌ ఆదేశాలను పాటించే అధికారులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారం .....

ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌ల ప్రజా సేవలకు సంబంధించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారం కేంద్రం గవర్నర్‌కే కట్టబెట్టిందని, దీన్ని ఉల్లంఘించిన అధికారులపై కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని మెమోలో పేర్కొన్నారు. అధికారుల చర్యల వల్ల ప్రభుత్వానికి ఏర్పడే నష్టాన్ని కూడా వారి నుంచే వసూలు చేస్తామని నజీబ్‌జంగ్‌ హెచ్చరించారు.

గవర్నర్‌ మెమో పై కేజ్రీవాల్ తీవ్ర అభ్యంతరం....

లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మెమో జారీ చేయడంపై కేజ్రీవాల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తున్న సమయంలో కొట్లాడడం అవసరమా అన్నారు. డెంగ్యూ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే పనుల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉందని తెలిపారు. ప్రస్తుతం డెంగ్యూపై పోరాటం చేయడానికి తమకు సహకారం అందించాలని ప్రధానమంత్రి మోది, కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

అసలు కథ వేరే ఉందా?

అయితే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ మెమో జారీ చేయడం వెనకాల అసలు కథ వేరే ఉంది. సిఎన్‌జీ ఫిట్‌నెస్‌ స్కాంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో పాటు, గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ను కూడా విచారించే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ల మధ్య పోరు మరింత ముదిరింది.

19:50 - September 18, 2015

హైదరాబాద్ : పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. చాలా ఏళ్లుగా మనం గరీబీ హటావో అనే నినాదం వింటున్నామని, పేదల సంక్షేమం గురించి రాత్రి పగలు మాట్లాడుకోవడం ఒక సంప్రదాయంగా మారిందన్నారు. కానీ వారి జీవితాల్లో కొంత మార్పే వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని 501మందికి రిక్షాలు పంపిణీ చేశారు. బ్యాటరీతో నడచే 101 ఈ రిక్షాలను కూడా మోదీ పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం పేదల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే యత్నం చేస్తోందని మోది చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేదలకు ఉపయోగపడుతుందన్నారు.

19:48 - September 18, 2015

హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్‌లో బీఫ్‌ బ్యాన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత పెద్దఎత్తున జనాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. కొంతమంది యువకులు ముఖాలకు ముసుగులు వేసుకుని పాక్‌ జెండాలను ఎగరేశారు. భారీగా మోహరించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు గోళీలను ప్రయోగించారు.

19:46 - September 18, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉందని చెప్పుకునే టీడీపీ.. ఎన్నికల్లో బలహీన ఫలితాలను చూపించింది. ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆ పార్టీ వ్యవహరించిన విధానం తెలంగాణలో టీడీపీని కాస్త నెమ్మది చేసింది. ఆ తర్వాత పరిణామాల్లో ఓటుకు నోటు వ్యవహారం పార్టీకి మరింత తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో ఎలాగైనా టీడీపీని తెలంగాణ రాజకీయ యువనికపై దూకుడుగా నడిపించాలని పార్టీ అధినేత చంద్రబాబు డిసైడయ్యారు. అందుకే పార్టీలో స్పీడ్ పెంచేందుకు కొత్త టీంను సిద్దం చేయడానికి కసరత్తు ప్రారంభించారు.

చంద్రబాబు మెడకు చుట్టుకున్న రేవంత్ అత్యుత్సాహం .....

టీ అసెంబ్లీలో పార్టీ ఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి దూకుడు ప్రారంభంలో ఆ పార్టీకి కొంత హుషారిచ్చింది. అటు కేసీఆర్ తోనూ ప్రభుత్వంతోనూ ఢీ కొట్టడానికి రేవంత్ సిద్దమవ్వడం పార్టీ అధినేతకు కూడా నచ్చింది. కాని ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. రేవంత్ అత్యుత్సాహం ఓటుకు నోటు రూపంలో చంద్రబాబు మెడకు చుట్టుకొంది. దీంతో ఆ పార్టీ తీవ్ర చిక్కుల్లో పడింది. దీంతో రాబోతున్న వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని ఉత్సాహంగా ముందుకు నడిపేందుకు గట్టి నాయకత్వం ఉండాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందో సూచించండంటూ ఐవీఆర్ఎస్ పద్దతిలో బాబు పార్టీ క్యాడర్ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేశారు.

ఐవీఆర్ సర్వే రేవంత్‌కే మొగ్గు చూపిందని ప్రచారం.....

అయితే ఈ సర్వేలో రేవంత్ రెడ్డి వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారని రేవంత్ వర్గం ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ లాంటి దూకుడు ఉన్న వ్యక్తే పార్టీ స్పీడ్ పెంచగలరని కొందరు నేతలంటున్నారు. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగుతున్నారు. తెలంగాణలో టీడీపీకి బలమైన బీసీ ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో వివాద రహితుడు, సీనియర్ నేత ఎల్ రమణనే అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ పార్టీలో ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. రేవంత్ వల్ల పార్టీకి నష్టం జరిగిందని.. టీఆర్ఎస్ మనపై పైచేయి సాధించిందని రేవంత్ వ్యతిరేక వర్గం చెబుతోందంటున్నారు. రేవంత్ విషయంలో కేసులుండటం కూడా భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుందని కొందరు సీనియర్లు బాబు చెవిలో వేశారంటున్నారు. దీంతో రేవంత్ విషయంలో బాబు పునరాలోచనలో పడ్డారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఎల్‌.రమణను తొలగిస్తే బీసీ సంఘాల్లో అసంతృప్తి రాజుకుంటుందా.?

గత ఎన్నికల్లో బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసి తీరా ఫలితాలు తేడా వచ్చేసరికి కృష్ణయ్యకు టీడీఎల్పీలో కార్యదర్శి పదవిని కూడా పార్టీ ఇవ్వలేదు. దీంతో అప్పట్లోనే కృష్ణయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కార్యక్రమాల్లో అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. మళ్లీ ఎల్. రమణ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే బీసీ సంఘాల్లో అసంతృప్తి రావొచ్చనే చర్చ బాబు వద్ద ఉందంటున్నారు. ప్రస్తుతం టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పనితీరుపైనా బాబు అసంతృప్తిగా ఉన్నారట. అయితే సమీకరణాల్లో భాగంగా ఆయన్ను కొనసాగిస్తున్నారంటున్నారు. ఎప్పటికైనా ఎర్రబెల్లి టీఆర్ఎస్ మనిషేనంటూ టీటీడీపీలో ఓ వర్గం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఎల్ .రమణను అధ్యక్షునిగా కొనసాగిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే ఎలా ఉంటుందనే భావనలో బాబు ఉన్నారంటున్నారు. అటు బీసీలను ఇటు రెడ్డి సామాజికవర్గాన్ని బ్యాలెన్స్ చేయోచ్చనేది బాబు ఆలోచన.. మొత్తానికి తెలంగాణ టీడీపీలో జోష్ నింపేందుకు కొత్త నాయకత్వం కోసం కసరత్తు చేస్తున్న చంద్రబాబు...చివరికి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.

19:42 - September 18, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎన్‌కౌంటర్‌ను టీ-జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఖండించారు. మావోయిస్టులను పట్టుకున్న తర్వాతే కాల్చి చంపినట్లు ఉందన్నారు. మనుషులను లేకుండా చేస్తే... రాజకీయలు సమస్యలు మాయమైతాయనుకోవడం తప్పని ఆయన హెచ్చరించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు కోదండరామ్‌. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అగ్నిగుండంగా మార్చొద్దన్నారు.

కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ : విశాఖలోని హార్బర్ పార్క్ లో దారుణం చోటు చేసుకుంది. శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడి పై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాలయలు అలముకున్నాయి.

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహాంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కూకట్‌పల్లి ఎస్సై శేఖర్‌ సస్పెండ్

హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి ఎస్సై శేఖర్‌ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. తన బావమరిది కోసం ఒక అమాయకుడిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిన ఎస్సై శేఖర్‌ అకృత్యాలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. ఎస్సై శేఖర్‌ బాగోతంపై మాదాపూర్‌ డీసీపీ విచారణ జరిపిన అనంతరం నిజమని తేలడంతో ఈ మేరకు సస్పెండ్‌ చేశారు.

19:28 - September 18, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం జానకీ పురం దేవాదుల మొదటి దశలో ఉన్న పైప్ లైన్ లీకేజీ అయ్యింది. భారీ ఎత్తున నీరు ఎగిసి పడుతున్నాయి. ధర్మపురం రిజర్వాయర్ నుండా ధర్మ సాగర్ రిజర్వాయర్ కు వెళ్తున్న పైప్ లీకైంది. దీంతో చుట్టు పక్కల ఉన్న పొలాలు నీట మునుగుతుండడంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 

చంద్రబాబుతో నిర్మలా సీతారామన్ భేటీ

విజయవాడ : నగరంలో గేట్ వే హోటల్ లో సీఎం చంద్రబాబు నాయుడు తో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై వీరు చర్చించనున్నట్లు సమాచారం.

పోలీసులపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన ఎస్ ఎఫ్ఐ

విశాఖ : పోలీసులపై ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టరేట్‌ దగ్గర ఆందోళన చేస్తుంటే ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు విచక్షణారహితంగా తమను కొట్టారని మానవహక్కుల కమీషన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు.

షీనా బోరా హత్య కేసు సీబీఐకి బదిలీ

హైదరాబాద్ : సంచలనాత్మక షీనా బోరా హత్య కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ కేసులో కేవలం హత్యే కాకుండా ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నందున విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖలోని ముఖ్య అధికారి కేపీ భక్షి తెలిపారు. ఇంతవరకు ఈ కేసును ముంబై పోలీసులు విచారించారు. ఈ కేసును విచారిస్తూ వచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను ఇటీవల అనూహ్యంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అహ్మద్ జావేద్ నియమితులయ్యారు.

'ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు లేదు'

హైదరాబాద్: ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేయబోమని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో రంగారెడ్డి జిల్లాకు అతి తక్కువ కాలంలో నీళ్లు వస్తాయని తెలిపారు. 

18:44 - September 18, 2015

ప్రకాశం : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగులకు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనను జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీతో ఈదర హరిబాబు...పరిషత్ ఆఫీసులోకి వెళ్లేందుకు తన అనుచరులతో కలిసి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. అయితే కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం తెరిచేందుకు సీఈవో రావాలంటూ ఉద్యోగులు, పోలీసులు అడ్డుకోవడాన్ని హరిబాబు తప్పుపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి సంబంధిత అధికారులు ఈదర హరిబాబుకు తాళం ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

18:43 - September 18, 2015

కృష్ణా : బెజవాడ నగరానికి కొత్త లుక్ రానుంది. రోడ్లవిస్తరణ, కాలువ గట్లు, కృష్ణాతీరం అభివృద్ధి పనుల కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా నగర అభివృద్ధిని సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రహదారుల విస్తరణకు రూ.96కోట్లు.....

విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి. నగరానికి రాజదాని లుక్ తీసుకురావాలని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే పనిలో పడింది. మొదట రహదారులను విస్తరించాలని నిర్ణయించారు. అందుకోసం 96 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. రహదారుల అభివృద్ధికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు సీఎం బాబు ఆమోదముద్ర కూడా వేశారు.

నగరంలో మొత్తం 40 కిలోమీటర్ల వరకు రహదారులు.....

నగరంలో మొత్తం 40 కిలోమీటర్ల వరకు 14 ప్రధాన రహదారులున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను అభివృద్ధి చేయటంతో పాటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను కొంత మేరకు విస్తరించాలని నిర్ణయించారు. గతంలో నగరపాలక సంస్థ కమిషనర్ నేతృత్వంలో అధికారుల బృందం మౌలిక సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికి కూడా సీఎం చంద్రబాబు నగర అభివృద్ధి సమీక్షలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

కృష్ణానది తీరం వెంబడి ఉన్న కాల్వ గట్టులను.....

కృష్ణానది తీరం వెంబడి ఉన్న కాల్వ గట్టులను సుందరీకరించాలని సర్కార్ నిర్ణయించిది. ఆ ప్రాంతం అంతా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోనున్నారు. తీరంలో ఉన్న ఆక్రమణలను తొలగించి రాజధాని నగరంగా తీర్చిదిద్దటానికి కసరత్తు ప్రారంభించారు.

ప్రకాశం బ్యారేజీకి రెండు వైపులా సర్కార్ అభివృద్ధి పనులు.....

పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి రెండు వైపులా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరాన్ని పర్యాటక హబ్‌గా రూపొందించేందుకు అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. నగరానికి తలమానికంగా ఉన్న భవానీద్వీపాన్ని అభివృద్ధి చేస్తే మంచిదన్న అభిప్రాయంతో సీఎం బాబు కూడా ముందుకెళ్తున్నారు. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. అలాగే రహదారుల విస్తరణపై మరోసారి పునరాలోచించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

18:38 - September 18, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌పై టిడిపి లీడర్లు మండిపడ్డారు. తన ఫాంహౌస్‌కు నీటిని తరలించేందుకే... ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ను మార్చుతున్నారని... ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి... రంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తామనడం అవాస్తవమన్నారు దయాకర్ రావు. అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేతలంతా కలిసి... అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.

 

18:35 - September 18, 2015

హైదరాబాద్ : ఘనమైన చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయాలు ఇప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు లేకపోవడం, సొంత భవనాల లేమి, సిబ్బంది కొరత ఒకవైపు వేధిస్తుంటే, మరో వైపు సెస్ రూపంలో వచ్చిన నిధుల వినియోగంలోనూ పారదర్శకత లోపిస్తోంది.

కరీంనగర్ జిల్లాలో మొత్తం 63 గ్రంథాలయాలు....

ఈ పరిస్థితి ఎక్కడోకాదు. కరీంనగర్ జిల్లాలోనే నెలకొంది. జిల్లాలో మొత్తం 63 గ్రంథాలయాలున్నాయి. ఇందులో 13 గ్రంథాలయాలు మాత్రమే స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పడున్న గ్రంథాలయాలు కూడా అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న గదుల్లోనే ఉన్నాయి. ఇవి కూడా అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో నియమించిన పాలకవర్గం చురుగ్గా వ్యవహరించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది మార్చిలో 80లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. వీటిని కొనుగోలు చేసి ఏడాదవుతున్నా పాఠకులకు మాత్రం ఇప్పటికీ అందలేదు.

పెద్దపల్లి, హుజురాబాద్, జమ్మికుంట.....

జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి, హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, ధర్మపురి, సిరిసిల్ల, వేములవాడలలో గ్రంధాలయాల నిర్వాహణ అధ్వాన్నంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనాల్లో...పిచ్చి మొక్కలతో పుస్తక ప్రియులను అటు వైపు చూడకుండా చేస్తున్నాయి. పెద్దపల్లిలో గ్రంధాలయ ఆవరణలో గేదెలకు స్థావరంగా మారింది. జమ్మికుంటలో గ్రంధాలయ నిర్వాహకులు లేక తాళం వేసి ఉన్న పరిస్థితి ఉంది. వేములవాడలో జనావాసాలకు దూరంగా గ్రంధాలయం ఉండటంతో పాఠకులు అటు వైపు వెళ్లడం లేదు. సిరిసిల్లలో పై కప్పు లేకపోవడంతో మరో అద్దె భవనంలో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. గత వర్షానికి పై కప్పు లేకపోవడంతో పుస్తకాలు తడిసిముద్దయ్యాయి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంధాలయాల పరిస్థితి.

మహబూబ్‌ నగర్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయం.......

మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు షాద్ నగర్ లో గ్రేడ్-1 లైబ్రరీ, నారాయణపేటలో గ్రేడ్-2 లైబ్రరీ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో గ్రేడ్-3 లైబ్రరీలు ఉన్నాయి. 66 శాఖా గ్రంథాయాలు, 15 గ్రామీణ గ్రంథాలయాలు, 111 పుస్తక పఠన కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయానికే ఉద్యోగార్థులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, ఉద్యమం, ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి దాదాపు సగం మార్కులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సంబంధిత సిలబస్ పుస్తకాలు ఇంకా గ్రంథాలయాల్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. అభ్యర్థులు జిల్లా గ్రంథాలయాల్లో ఏ ఒక్క పుస్తకం అందుబాటులో లేదు.

గ్రూప్స్ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు....

గ్రూప్స్ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు ముఖ్యంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. గ్రూప్స్ ప్రిపరేషన్‌ కోసం 100మంది వరకు వస్తున్నారు. ఈ గ్రంథాలయంలో దాదాపు 45వేల పుస్తకాల వరకు ఉన్నాయి. ఎంట్రన్స్‌ పరీక్షలకు సంబంధించి పాత సిలబస్ పుస్తకాలు అధికంగా ఉన్నాయి.నూతన సిలబస్ ప్రకారం ఒక్క పుస్తకం కూడా అందుబాటులో లేకపోవడంతో పేపర్లలో వచ్చిన సమాచారంతో సర్దుకుపోతున్నారు. గ్రూప్స్ కు సంబంధించిన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

ఉదయం నుంచే గ్రంథాలయాలకు చేరుకుంటున్న నిరుద్యోగులు.....

పేద, మధ్య తరగతి విద్యార్థులు, నిరుద్యోగులకు నిత్య స్నేహితులు గ్రంథాలయాలు. పోటీ పరీక్షల సమయంలో ఉదయం నుంచే సమీపంలోని గ్రంథాలయాలకు చేరుకుంటారు మారుమూల పల్లెల నిరుద్యోగులు. రాష్ట్ర రాజధానితో పాటు ఇప్పుడు తెలంగాణలోని జిల్లా గ్రంథాలయాల్లో కనిపిస్తున్న వాతావరణమిది.

లైబ్రరీలను ఆశ్రయిస్తున్న పేద, మధ్య తరగతి నిరుద్యోగులు.....

పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు, నిరుధ్యోగులు ప్రభుత్వ లైబ్రరీలపై అధికంగా ఆధారపడుతున్నారు. నల్లగొండ వంటి ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు జిల్లా కేంద్ర లైబ్రరీని ఆశ్రయిస్తున్నారు. మునుగోడు, గుర్రంపోడ్, కనగల్, నార్కట్ పల్లి, తిప్పర్తి సమీప గ్రామాల ప్రజలు జిల్లా కేంద్ర గ్రంధాలయానికి వస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 200 మంది పోటీ పరీక్షల కోసం లైబ్రరీకి చేరుకుంటున్నారు. కానీ సరిపడా కుర్చీలు లేక చాలామంది వెనక్కి తిరుగుతున్నారు. పుస్తకాల సెట్స్ తక్కువగా ఉండడం వల్ల తోపులాట జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గ్రంథాలయాల్లో కనీస మౌలిక వసతులు లేవు......

గ్రంథాలయాల్లో కనీసం మౌలిక వసతులు లేకపోవడం వల్ల పోటీపరీక్షలకు సిద్ధపడే వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. తాత్కాలికంగా అయినా.. ఎక్కువమంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

నల్గొండలో 86 ప్రభుత్వ గ్రంథాలయాలున్నాయి.....

నల్లగొండ జిల్లావ్యాప్తంగా గ్రంధాలయసంస్థ ఆధ్వర్యంలో సుమారు 86 గ్రంథాలయాలున్నాయి. అయితే అందులో సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్వహణలో సమస్యలు వస్తున్నాయి. 86 గ్రంధాలయాలుంటే కేవలం 64 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. రాష్ట్రస్థాయిలో గ్రంధాలయ పరిషత్ ఏర్పాటు కాకపోవడం, నియామకాలు జరగకపోవడం వల్లే సిబ్బంది కొరత ఏర్పడిందని జిల్లా గ్రంధాలయ పాలక వర్గం చెబుతోంది. కొత్తగా ప్రకటించిన సిలబస్ ఆధారంగా అధికారికంగా అకాడమీ పుస్తకాలను గ్రంధాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు.

18:22 - September 18, 2015

కరీంనగర్ : మంథనిలో ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల.. ఎంతోమందికి సంగీత భిక్షను పెట్టింది. ఎందరినో అత్యుత్తమ నృత్యకళాకారులుగా మలచింది. కానీ నేడు ఆ పాఠశాల అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాక.. బోధించే వారు లేక.. ఇక్కడ సంగీత రస ఝరి స్తంభించింది... నృత్యరీతుల సాధన నిలిచిపోయింది.

1992లో దుద్దిళ్ల శ్రీపాదరావు చొరవతో పాఠశాల ఏర్పాటు.....

కరీంనగర్ జిల్లా మంథనిలోని ప్రభుత్వ సంగీత పాఠశాల అత్యంత దయనీయ స్థితికి చేరింది. 1992లో అప్పటి స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చొరవతో ఏర్పాటైన ఈ పాఠశాల.. తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగింది. పండితులు ఎక్కువగా ఉండే మంత్రపురిలో.. సంగీత, నృత్య కళలకు ఎంతో ఆదరణ ఉండేది. అందుకే ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, సితార్, వీణ, వయోలిన్, మృదంగ వాయిద్యాల శిక్షణతో పాటు.. కూచిపూడి నాట్యాన్నీ ఇక్కడ నేర్పేవారు..

కోర్సు పూర్తి చేసిన విద్యార్థులతో......

మంథని సంగీత పాఠశాలలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులతో.. కళాశాల ఆధ్వర్యంలోనే వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు.. జాతీయ స్థాయిలో కూడా తమ కళను ప్రదర్శించేవారు ఇక్కడి విద్యార్థులు... అలా ఆ రంగంలోనే వారికి ఉపాధి దొరికేది... పైగా వయసుతో సంబంధంలేకపోవడంతో పెద్దవారు కూడా ఇక్కడ పాఠాలు నేర్చుకునేవారు..

విద్యార్థులు, ఉపాధ్యాయులు లేక వెలవెల....

ఒకప్పుడు ఎంతో మందికి సంగీత, నృత్య కళలను నేర్పిన ఈ పాఠశాల నేడు విద్యార్థులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతోంది.. టీచర్లంతా రిటైర్ అయిపోయారు.. ప్రస్తుతం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఇక్కడ కూచిపుడి నాట్యం నేర్పుతున్నారు.. మంథని సంగీత పాఠశాలను సౌకర్యాల లేమీ వేధిస్తోంది. దీంతో ఇటువైపు చూసే విద్యార్థులే కనిపించడం లేదు. ప్రస్తుతం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా లేరు. స్కూలు యాజమాన్యం కూడా.. విద్యార్థులను చేర్పించడంపై దృష్టి పెట్టకుండా.. టీచర్లు లేరని వంకపెడుతూ ఈ స్కూల్‌ను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు..

వీణలు, సితార్లు, మృదంగాలకు బూజు....

ఉపాధ్యాయులు, విద్యార్థులు లేక.. పాఠశాలలోని వీణలు, సితార్లు, మృదంగాలు బూజుపట్టిపోతున్నాయి... ప్రస్తుతం ఈ స్కూల్ అద్దె భవనంలో నడుస్తోంది.. సొంత భవనం నిర్మాణం కోసం స్థలం ఉన్నా ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తికాలేదు.. ఈ సమస్యలన్నీ తీర్చి ఉపాధ్యాయుల్ని నియమిస్తే ఈ సంగీత పాఠశాలకు పూర్వ వైభవం వచ్చే అవకాశముంది.. 

18:18 - September 18, 2015

హైదరాబాద్: సెల్ఫీల్లో హైదరాబాద్ కుర్రోడు గిన్నీస్ రికార్డుకు చేరువయ్యాడు. ఒకగంటలో 1800 మంది విద్యార్థులతో ఫోటోలు దిగి అదుర్స్ అనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన భానుప్రకాశ్ రచ్చ... ఒక్క గంటలోనే అత్యధిక సెల్ఫీలు తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. గాజులరామారంలోని మాంట్రిడ్జ్ ఇంటర్నేషనల్‌ స్కూల్ విద్యార్థులతో సెల్ఫీలు దిగాడు. అమెరికాకు చెందిన పాట్రిక్ పీటర్సన్ రికార్డును అధిగమిస్తానని భానుప్రకాశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత

నిజామాబాద్ : బీర్కూర్ మండలం దామరంచ పాఠశాలకు చెందిన విద్యార్థులు మధ్యాహ్నం భోజం తిని 32 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భన్వర్‌లాల్‌ను కలిసిన టి.కాంగ్రెస్ నేతలు...

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై తెలంగాణ వర్కిగ్‌ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం సాయంత్రం ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓట్లు తొలగింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు. తొలగించిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరామని చెప్పారు. ఓట్లను తొలగించినవారిపై చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ చెప్పినట్లు విక్రమార్క వెల్లడించారు.

నిమజ్జనానికి 7 వేల మందితో భద్రత : సైబరాబాద్ కమిషనర్

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7 వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బందోబస్తు కోసం రెండు వేల మంది ఒడిశా, ఛత్తీస్ గఢ్ పోలీసులను రప్పిస్తున్నామని చెప్పారు. దీనికితోడు, రెండేసి కంపెనీల ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా ఉపయోగించుకోనున్నామని వెల్లడించారు. అలాగే, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు రూ. 2 కోట్లతో అన్ని హంగులను సమకూరుస్తామని చెప్పారు.   

కొత్తపల్లి లంకల్లో చిక్కుకున్న రైతులు...

ఖమ్మం: జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతితో పనుల్లోకి వెళ్లిన రైతులు, కూలీలు చర్ల మండలం కొత్తపల్లి వద్ద లంకల్లో చిక్కుకున్నారు. బాధితులను రక్షించేందుకు అధికారులు ఇంజిన్ బోటును పంపిస్తున్నారు. బాధితులను కొత్తపల్లి, కొపంల్లి, లింగాపురం వాసులుగా గుర్తించారు.

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పాము కలకలం...

గుంటూరు: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. ఆసుపత్రిలో ఎలుకల బెడద ఎక్కువ కావడంతో ఎలుకలను పట్టుకోవడానికి ఆసుపత్రి సిబ్బంది అక్కడక్కడా వలలు పెట్టారు. అయితే, ఈ వలలో ఎలుకలకు బదులు పాము చిక్కుకుంది. వల నుంచి తప్పించుకోవడానికి పాము తీవ్ర ప్రయత్నం చేసింది. అయితే, ఎప్పుడు తప్పించుకొని ఎటు వైపు వస్తుందోనని ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళన చెందారు. ఇంతలో ఆసుపత్రి సిబ్బంది పామును చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెదరావూరు వద్ద లారీ బోల్తా : ఒకరి మృతి

గుంటూరు : తెనాలి మండలం పెదరావూరు దగ్గర లారీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వక్తిని దుగ్గిరాల మండలం తుమ్మపూడి వాసి శంకర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

17:02 - September 18, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో ఫుట్ బాల్ ఆడుకునే పిల్లలు అనుకోకుండా రాత్రికి రాత్రే పెద్ద హీరోలయ్యారు. ఢిల్లీ అంతటా శబాష్ అనిపించుకుంటున్నారు. ఓ విదేశీయురాలిని రక్షించడమే వారిని హీరోలుగా మార్చింది. గత ఆగస్టులో ఓ రోజు ఎప్పటిలానే పార్క్‌లో సాయంత్రం ఈ యువకులు ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. అదే సమయంలో రాత్రి పూట ఓ విదేశీయురాలు నడుచుకుంటూ వెళుతోంది. రోడ్డుకు ఇరువైపుల కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అనూహ్యంగా ఓ యువకుడు కొంత దూరం ఆమెను అనుసరించి చుట్టూ ఎవరూ లేరనుకోని ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. ఆమె సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించే క్రమంలో పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఆ మహిళ రక్షించండంటూ కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న కుర్రాళ్లు వెంటనే ఫెన్సింగ్ గోడ దూకి వచ్చారు. ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన దొంగ వీరిని చూసి పారిపోయాడు. అయితే, అతడు దూరంగా పారిపోయినట్లు నటించి ఓ కారు వెనకాలే దాక్కున్నాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు అదే గుంపులో కలిశాడు. దొంగను పసిగట్టిన యువకులు అతడిని కొట్టి బందించి పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

17:00 - September 18, 2015

విజయవాడ : అతడు పోలీస్ కాదు... కనీసం హోంగార్డుకూడా కాదు.. అయినా ఐడీ కార్డులో పోలీస్ డిపార్ట్‌మెంట్ లోగో వేసుకున్నాడు.. దుస్తులు కుట్టేది వదిలేసి కొత్త దందాకు దిగాడు.. ఏకంగా ఓ మహిళనుంచి 33 కాసుల బంగారం కొట్టేశాడు.. తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆమెను చితగ్గొట్టాడు.. ఈ పోలీస్ టైలర్ వ్యవహారం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్‌గా మారింది..

మాంటిస్సోరి మహిళా కళాశాల రోడ్లో షాప్ నడిపేవాడు.....

ఇతనో టైలర్... అలాంటి ఇలాంటి టైలర్ కాదు... మహా ముదురు కిలాడీ టైలర్.. పేరు అందుగుల శ్రీనివాసరావు.. విజయవాడ బందరు రోడ్డులోని మాంటిస్సోరి మహిళా కళాశాల రోడ్లో ఏడేళ్లనుంచి షాప్ నడుపుతున్నాడు.. మామూలు దుస్తులతోపాటు పోలీస్ యూనిఫాంలు కుట్టడంలో ఆరితేరాడు... నగరంలోని హోంగార్డులనుంచి కమిషనర్ స్థాయి అధికారివరకూ అందరూ ఈయన దగ్గరే తమ యూనిఫాం కుట్టించుకుంటారు.. అలా అందరితో చక్కగా పరిచయం చేసుకున్నాడు.... పోలీసులు బిజీగా ఉంటారని... వారి ఇంటిదగ్గరికే వెళ్లిమరీ సైజ్‌లు తీసుకుని బట్టలు కుట్టి ఇచ్చేవాడు... మెల్లగా పోలీసుల కుటుంబసభ్యులకు దగ్గరయ్యాడు.. ఈ స్నేహంతో ఏకంగా తన ఐడీ కార్డుపై పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లోగోను ముద్రించుకున్నాడు.. పోలీసులకంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చే స్థాయికి చేరాడు..

వివాహితతో పరిచయం పెంచుకున్న శ్రీనివాసరావు.....

గుణదల బసవపున్నయ్య వీధికిచెందిన ఓ వివాహిత ఈ పోలీస్ టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకునేవారు.. ఆమె కుటుంబంతోకూడా ఈయన స్నేహం పెంచుకున్నాడు.. ఈ ఏడాది ఏప్రిల్ 5న తన భార్యతోకలిసి పెళ్లికి వెళుతున్నానని... దయచేసి ఓ మూడు రోజులపాటు నగలు ఇవ్వాలని రిక్వస్ట్ చేశాడు.. అతని మాయ మాటలు నమ్మిన ఆ అమాయకురాలు మొత్తం 33 కాసుల బంగారు నగల్ని ఇచ్చింది...

ఏకంగా ఆమె కుటుంబంపై దాడికి....

ఆ తర్వాత ఈ దర్జీ మళ్లీ కనిపించడం మానేశాడు.. ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా వేసేవాడు.. ఎంతకీ నగలు ఇవ్వకపోవడంతో సందేహంవచ్చిన బాధితురాలు అతన్ని గట్టిగా నిలదీసింది.. దీంతో ఆగ్రహించిన ఈ కిలాడీ టైలర్ ఏకంగా ఆమె కుటుంబంపై దాడికి దిగాడు... సీఎం సెక్యూరిటీగార్డులనుంచి పోలీసుశాఖలోని ప్రముఖులంతా తనకు తెలుసని... నీ ఇష్టం వచ్చినట్లు చేసుకొమ్మంటూ రెచ్చిపోయాడు..

బాధితురాలి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు....

ఈ టైలర్‌ దెబ్బతో విస్తుపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించింది.. అయితే కారణమేంటో తెలియదుకానీ పోలీసులు ఫిర్యాదుమాత్రం తీసుకోలేదు... ఎలాగైనా తన నగలు దక్కించుకోవాలని పట్టుదలగాఉన్న ఆమె చివరకు మెట్రోపాలిటర్ కోర్టులో పిటిషన్ వేసింది.. కేసును దర్యాప్తుకు స్వీకరించిన కోర్టు... కేసు నమోదు చేయాలని మాచావరం పోలీసులను ఆదేశించింది..

ఇలాగే మరికొంతమందినికూడా.....

ఈ టైలర్ శ్రీనివాసరావు ఇలాగే మరికొంతమందినికూడా మోసం చేసినట్లు తెలుస్తోంది.. ఆయన బెదిరింపులతో భయపడి వారంతా బయటకు రాలేదని సమాచారం.. ఉన్నత స్థాయిలో విచారణ జరిపితేనే ఈ టైలర్ చరిత్రంతా బయటకు వచ్చే అవకాశముంది.. 

16:55 - September 18, 2015

కడప : జిల్లాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బద్వేల్‌లో భయాందోళన సృష్టిస్తున్నాయి. శునకాల దాడితో ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. మరోవైపు మున్సిపాలిటీ సిబ్బంది అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. ఒకవైపు డేంజర్ డాగ్స్ దడపుట్టిస్తుంటే... అధికారులు మాత్రం ఎలాంటి చర్యల్ని చేపట్టడం లేదు. దీంతో అధికారులు, పాలకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

16:54 - September 18, 2015

తూ.గో : సిరంజి సైకో మళ్లీ హల్‌చల్‌ చేశారు. సామర్లకోట మండలం వేటలపాలెంలో సూది దాడి జరిగింది. తాపీ మేస్ర్తీ శ్రీనుకు (40) సూది గుచ్చి దుండగుడు పరారయ్యాడు. ఓ బైక్‌పై వచ్చిన యువకుడు, మహిళ సూది గుచ్చి పరారయినట్లు బాధితుడు తెలిపారు. స్థానికుల సహాయంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో బాదితుడికి గుచ్చిన సూదిని 108 వాహన సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు శ్రీనును వివిధ కోణాలలో ప్రశ్నిస్తున్నారు. సూదిగాడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు.

16:49 - September 18, 2015

విజయవాడ : శ్మశానవాటిక కబ్జాపై బెజవాడ తమ్ముళ్లు వెనక్కి తగ్గారు. టెన్‌ టీవీ వరస కథనాలు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. అమాయకుల భూములపై కన్నేసిన బడాబాబుల తీరును నిర్భయంగా '10 టీవీ' ప్రసారం చేసింది. దీంతో ఎట్టకేలకు అధికారులు మొద్దునిద్ర వీడారు. భవానీపురంలోని హిందూ శ్మశాన వాటికను... మట్టితో పూడ్చేసిన పాలకపక్షమే తిరిగి మట్టిని తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. శ్మశానంలో వేసిన మట్టిని తొలగిస్తుండడంతో... పశ్చిమ నియోజకవర్గ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారముందని అడ్డగోలుగా కబ్జా చేస్తే... ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.

16:47 - September 18, 2015

హైదరాబాద్ : సెటిలర్‌ పేరుతో ఏపీకి చెందిన విద్యార్థులకు అన్యాయం చేయడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...అమెరికాలో జన్మించిన కేసీఆర్‌ మనవడు ఇక్కడ సెటిలర్‌ కానప్పుడు.. ఎప్పుడో ఇక్కడ పుట్టి, పెరిగినవారు ఎలా సెటిలర్లు అవుతారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

16:45 - September 18, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ను భన్వర్‌లాల్ కలవడం పట్ల... సీఈసీ సీరియస్‌గా ఉందని... కాంగ్రెస్‌ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్‌కు... అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు మేల్కోవాలని శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ మెట్రో రైల్లో 16ఏళ్ల బాలుడి హత్య....

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. సీటు కోసం జరిగిన చిన్నపాటి గొడవలో ఓ బాలుడు ప్రాణాలు పొయాయి. మెట్రో రైల్లో సీటు కోసం గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు కొందరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇషు అనే 16 సంవత్సరాల బాలుడిని మిగతా విద్యార్థులు కత్తితో పొడిచి చంపినట్టు తెలిసింది.. కింగ్స్ వే క్యాంప్ సమీపంలో జరిగిన ఈ ఘటన మెట్రో రైలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గరిచేసింది. పోలీసులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.  

20న జంతర్ మంతర్‌లో దళిత్ పార్లమెంట్ :సీపీఎం

ఢిల్లీ దళితుల సమస్యలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో ఈనెల 19న దళితుల సమస్యలపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కంచ ఐలయ్య, రాఘవులు పాల్గొంటారని శ్రీనివాసరావు చెప్పారు. అంతేకాకుండా 20న జంతర్ మంతర్‌లో దళిత్ పార్లమెంట్ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా పాల్గొంటారని ఆయన వివరించారు.

కేటీఆర్ ను కలిసిన దానం...

హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్‌ను మాజీ మంత్రి దానం నాగేందర్ కలిశారు. బంజారాహిల్స్‌లో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కేటాయించిన భూములను... ఇస్కాన్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని దానం కోరినట్లు తెలుస్తోంది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. 255 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 26,219 వద్ద ముగియగా, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 7,982 వద్ద ముగిసింది.

'ఎలుక దాడి పసికందు మృతి ప్రభుత్వానికి మాయని మచ్చ'

విజయవాడ : విద్య, వైద్యం, బీసీ సంక్షేమశాఖల పనితీరుపై కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యం పూర్తిగా పడకేసిందని ఆయన చెప్పారు. సౌకర్యాలు ఉన్నచోట ప్రభుత్వ వైద్య సిబ్బంది విధుల్లోకి రావడంలేదని తెలిపారు. జీజీహెచ్‌లో పసికందు మృతి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల, టీచర్ల నిష్పత్తిలో మనం మెరుగ్గా ఉన్నా ఫలితాల్లో వెనుకబడ్డామని చెప్పారు. స్త్రీ, శిశుసంక్షేమం, వైద్యం, విద్యాశాఖల్లో ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

వీరేశలింగం పంతులును యువత ఆదర్శంగా తీసుకోవాలి'

రాజమండ్రి : వీరేశలింగం పంతులును యువత ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సూచించారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో కందుకూరి వీరేశలింగం స్మారక ఉపన్యాస సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండలి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంఘిక దురాచారాల నిర్మూలన, స్త్రీజనోద్ధరణకు కందుకూరి వీరేశలింగం పాటుపడ్డారన్నారు.

 

బడివైడర్ ను ఢీకొట్టిన బైక్ :బీటెక్ విద్యార్థి మృతి

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు వద్ద ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థితకి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాం జరిగినట్లు సమాచారం.

త్వరలో పాలమూరులో మెడికల్ కాలేజ్ :లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్ : త్వరలోనే జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నూతన రిక్రూట్‌మెంట్ ద్వారా వైద్యాధికారులు, సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. నాగం జనార్ధన్‌రెడ్డి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని సూచించారు. 

భారత హైకమిషనర్ కు పాక్ సమన్లు

హైదరాబాద్ : భారత హైకమిషనర్ కు పాకిస్థాన్ నేడు సమన్లు జారీ చేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లఘించిందని.. ఈ కాల్పుల్లో తమ పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపిస్తోంది.

తూ.గో జిల్లాలో మళ్లీ సూది గుచ్చేశారు...!

తూర్పుగోదావరి : జిల్లాలో సైకో సూదిగాళ్లు మళ్లీ ఇంజెక్షన్ వేశారు. జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. వేట్లపాలెంకు చెందిన శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం పని ముగించుకుని బైక్ పై వెళుతుండగా... వెనక నుంచి బైక్ పై వచ్చిన ఓ పురుషుడు, ఓ మహిళ శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. ఊహించని ఘటనతో షాక్ కు గురైన శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.

పొగాకు రైతులను ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్

ప్రకాశం :పొగాకు రైతుల సమస్యలసై ప్రధానికి నివేదిక ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నెలాఖరుకు 172 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు జరుపుతామని ఆమె చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రైతు సమస్యల పరిష్కారానికై ప్రజా ప్రతినిధులు రైతుల సూచనలు సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో రెండు మృతదేహాలు..

వరంగల్ : చేర్యాల మండలం తపాస్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను ప్రవీణ్(15), ముస్తఫా(14)గా పోలీసులు గుర్తించారు. మృతులు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం అంకాయగూడెం వాసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

15:42 - September 18, 2015

హైదరాబాద్ :టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...గ్రేటర్ హైదరాబాద్‌లో 42 శాతం ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. భన్వర్‌లాల్‌, సోమేశ్ కుమార్‌లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

15:39 - September 18, 2015

మహబూబ్‌ నగర్‌ :జిల్లాలో ప్రొటోకాల్‌ రగడ టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదానికి కారణమైంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో.. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావుకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. వీరికి ప్రతిగా స్పందించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. బస్టాండ్‌ ప్రాంగణమంతా రసాభాసగా మారింది. చివరకు మంత్రులు మహేందర్‌ రెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

15:38 - September 18, 2015

హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డితో... రైతు సంఘాల నేతల భేటీ ముగిసింది. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు... 11 అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రైతుసంఘం నేతలు. శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో 11 అంశాలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. 

15:35 - September 18, 2015

హైదరాబాద్ : మోసపు మాటలు, అసత్య ప్రచారాలు చేయడంలో నారా లోకేష్ తన తండ్రిని మించి పోతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ......రాజధానిలో భాగస్వామ్యం కావద్దంటూ, చంద్రబాబుకు సహకరించ వద్దంటూ జగన్...సింగపూర్ ప్రధానికి లేఖ రాశారని లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే లోకేష్ తన ఆరోపణలు నిరూపించాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి చుక్క నీరు కూడా తీసుకురాకుండానే నదుల అనుసంధానం చేశామంటూ గొప్పలు పోతున్నారని అంబటి విమర్శించారు.

 

15:33 - September 18, 2015

విజయవాడ : రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లోటును తగ్గించేందుకు అధికారులు వనరులపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో నిధులను సక్రమంగా వినియోగించుకునేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. 

15:30 - September 18, 2015

చిత్తూరు : తిరుమల శ్రీనివాసుని తొలుతగా తామే దర్శించుకోవాలని భక్తులు ఆరాట పడుతుంటారు. కానీ సంవత్సరంలో ఏ రోజైనా సరే.. స్వామిని తొట్టతొలుత దర్శించుకునే అవకాశం ఒక కుటుంబానికే వారసత్వంగా దక్కుతోంది. ఇంతకీ ఆ వారసులెవరు ? వారికే ఈ అవకాశం ఎందుకు తిరుమల శ్రీనివాసుడు కలియుగ వరదుడని.. స్వామి దర్శనం పురాకృత పుణ్యఫలంగా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వేంకటేశుని తొట్టతొలుత తామే దర్శించుకోవాలని భక్తులు ఆసక్తిని కనబరుస్తుంటారు. కానీ.. ఈ భాగ్యం మాత్రం వారసత్వంగా ఓ కుటుంబానికే దక్కింది. యాదవ కులానికి చెందిన ఓ కుటుంబం తరతరాలుగా శ్రీవారిని మొట్టమొదట దర్శించుకుంటూ వస్తోంది. ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి.. వేకువ ఝామునే శ్రీవారి ఆలయ తలుపుల తాళాలను తెరిచి.. అర్చకులతో పాటు లోనికి వెళ్లి.. ముందుగా స్వామిని దర్శించుకుంటారు. ఈ వ్యక్తిని సన్నిధి గొల్లగా పిలుస్తారు.

స్వామివారి ఆలయ భద్రతను గొల్లలు చూసేవారు .....

తిరుమల శ్రీవారి ఆలయంలో ఎప్పటి నుంచో స్వామి వారి ఆలయ భద్రతను గొల్లలు చూసేవారని... అదే ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నారన్నది భక్తుల నమ్మకం. అర్చకులు సన్నిధిగొల్ల ఇంటికి వెళ్లి.. ఆలయం తెరిచేందుకు ఆహ్వానించగానే.. అప్పటికే శుచియైన సన్నిధి గొల్ల.. వేకువన మూడు గంటల ప్రాంతంలో.. చేతిలో దివిటీ పట్టుకొని కుంచెకోలతో ఆలయానికి బయలుదేరడం తిరుమలలో నిత్యకృత్యం.

తాళాలతో తలుపులను తెరవనున్న సన్నిధిగొల్ల....

అర్చకులు, సన్నిధి గొల్ల కలసి ఆలయానికి చేరుకుని.. సన్నిధిగొల్ల వద్దనున్న తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం జీయంగార్లు, అర్చకులు, వేదపండితులతో కలిసి బంగారు వాకిలి వద్దకు చేరి..సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలుపుతారు. ఈ ప్రక్రియతో శ్రీ వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం చేసుకునే మహా భాగ్యం అర్చకులతో పాటు..సన్నిధి గొల్లకూ దక్కుతుంది. ఆ తర్వాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి..రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొస్తారు. తరువాత అన్ని రకాల పూజా కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి. రాత్రి తుది దర్శనం తర్వాత.. సన్నిధిగొల్ల.. ఆలయ తలుపులు మూసి..తాళాలు వేసుకొని తన ఇంటికి తీసుకెళ్తారు సన్నిధి గొల్ల. ఈ విధంగా తిరుమల శ్రీవారిని జీవితాంతం తొలిదర్శనం చేసుకునే గొప్ప అవకాశం తమ కుటుంబానికి వారసత్వంగా లభించడం పట్ల సన్నిధి గొల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గుజరాత్ తీరంలో కాల్పులు: మత్స్యకారుడు మృతి

హైదరాబాద్ : గుజరాత్ తీర ప్రాంతంలో బోటుపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో మత్స్యకారుడు మృతి చెందాడు. పాక్ బలగాలు కాల్పులు జరిపినట్లు మత్స్యకారులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో హుటాహుటిన తీర రక్షక దళం ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లింది. ఓఖా పోర్టు నుంచి గుజరాత్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మత్స్యకారుడిని పోరుబందర్‌కు చెందిన ఇక్బాల్‌గా పోలీసులు గుర్తించారు. 

కర్నూల్ లో న్యాయవాదుల ఆందోళన...

కర్నూలు అడ్వకేట్ ప్రభాకర్‌పై దాడికి నిరసనగా కోవెలకుంట్లలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అడ్వకేట్ లపై దాడి చేస్తే పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చోవడం దారుణమన్నారు. అడ్వకేట్ లపై దాడులకు దిగడం మంచి సాంప్రదాయం కాదన్నారు. భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.

15:12 - September 18, 2015

హైదరాబాద్ : కర్ణాటక, మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో తెలుగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11.9 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 10.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రస్తుతం 11465 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా..13965 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. దీంతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా..10వేల క్యూసెక్కులు నీరు శ్రీశైలం వైపు వెళ్తున్నాయి. మరోవైపు సుంకేసుల నుంచి సైతం నిలకడగా నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి సుమారు 40వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు వెళ్తోంది. 

15:11 - September 18, 2015

కరీంనగర్ : తెలంగాణ పల్లెల్లో అలజడి మొదలైంది. ఓరుగల్లులో ఇద్దరు మావోయిస్టుల మృతి కలకలం సృష్టిస్తోంది. మావోయిస్టు పార్టీపై ఎలాంటి ఆంక్షలు విధించకుండానే... తమ వైఖరిని స్పష్టం చేయకుండానే... పోలీసులు వేటను ప్రారంభించారు.

తూర్పు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారని అనుమానం.....

ఇటీవల వరంగల్ అటవీ ప్రాంతం నుంచి... కరీంనగర్ జిల్లా తూర్పు అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహాముత్తారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

కంకణాల రాజిరెడ్డి, దామోదర్‌లే టార్గెట్........

కెకెడబ్ల్యు నాయకులతో పాటు యాక్షన్‌టీమ్‌ నాయకులు కంకణాల రాజిరెడ్డి, దామోదర్‌లను టార్గెట్ చేస్తూ కరీంనగర్‌ పోలీసులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో మావోయిస్టు అగ్ర నాయకులు తిరిగి పార్టీ పునర్‌ నిర్మాణంపై దృష్టిసారించారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడుతారని ఖాకీ బలగాలు ముందస్తుగా ఇన్‌ఫార్మర్‌లను అప్రమత్తం చేస్తున్నాయి. అలాగే జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు కోరుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు.....

మరోవైపు విద్యార్థులు, యువతపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న... మాజీ మావోయిస్టులను, సానుభూతిపరులను పోలీస్‌స్టేషన్లకు రప్పించి తమదైన శైలిలో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రశాంతంగా పల్లెలు పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిపోతోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా... మావోయిస్టులపై గత ప్రభుత్వాల వైఖరినే...కొనసాగిస్తుండటంతో పరిస్థితి ఎటువైపు వెళ్తుందోనని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు.

15:08 - September 18, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఐకెపి కొనుగోలు కేంద్రాలు ఉంటాయా...? ఊడుతాయా..? అసలు వాటిపై సర్కార్ ఉద్దేశం ఏంటి..? దీనిపై క్లారిటీ లేక జిల్లాల్లో అటు మహిళ సమాఖ్య సభ్యులు..ఇటు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

గత సర్కార్ 2006లో ఐకేపీ కేంద్రాలు ......

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత సర్కార్ 2006లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మంచి ధరకు అమ్మాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

మొత్తం 58 ఐకేపీ కేంద్రాలు........

మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 58 ఐకేపీ కేంద్రాలున్నాయి. మొన్నటి రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్ణయించుకున్న లక్ష్యానికి రెండు రెట్లు అధికంగా ధాన్యం సేకరించి ఐకేపీ సభ్యులు జిల్లాలో రికార్డు సృష్టించారు.

రైతులకు రవాణా సౌకర్యం.....

ప్రతి సీజన్లో రెండు నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగేవి. దీంతో...జిల్లాలో వందల మంది వీటి ద్వారా ఉపాధి పొందేవారు. నాలుగైదు గ్రామాలకు ఒకే ఐకేపి కేంద్రం ఏర్పాటు చేయడం వలన రైతులకు రవాణా సౌకర్యం, సకాలంలో ధాన్యం అమ్ముడకోవడం, మంచి ధర పలకడం జరిగేది. ఈ ఐకేపీ కేంద్రాల ద్వారా అటు రైతులకు ఇటు ఐకేపీ సభ్యులు లాభదాయకంగా ఉండేది.

శాశ్వతంగా రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ....

కాని ఇప్పుడు ఈ పద్ధతిని సర్కార్ వ్యతిరేకిస్తోంది. కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరికొందరు మంత్రులేమో కొనసాగిస్తామంటున్నారు. దీంతో ఐకేపీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు అంతోఇంతో ఉపాధి పొందిన తాము ఎప్పుడు ఎక్కడికెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా...టీఆర్‌ఎస్‌ సర్కార్ స్పందించి ఐకేపీ కేంద్రాలను యధావిధిగానే కొనసాగించాలని వారు కోరుతున్నారు.

15:05 - September 18, 2015

చిత్తూరు : తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడోత్సవం.. ఆదివారం జరుగనుండడంతో.. భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఈవో సాంబశివరావు తెలిపారు. ఆయన 10టివి తో మాట్లాడుతూ... భక్తులకు సౌకర్యాల కల్పనే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మాడ వీధుల్లో లక్షా 70వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని.. మిగిలిన వారికీ స్వామి దర్శనం కలిగేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తామని ఈఓ తెలిపారు.

15:00 - September 18, 2015

విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానానికి విజయవాడనుంచి దాదాపు 10 టన్నుల కూరగాయలు లారీల్లో వెళ్లాయి.. పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ కూరగాయాల్ని టీటీడీకి పంపారు.. బందరు రోడ్లోని ఎ కన్వెన్షన్ హాల్‌నుంచి ఈ లారీలను పారిశ్రామికవేత్త అశోక్ జెండా ఊపి ప్రారంభించారు.. 2007నుంచి ఇప్పటివరకూ వీరు దాదాపు 15వందల టన్నుల కూరగాయాలు పంపారు..

14:54 - September 18, 2015

హైదరాబాద్ : అతివల అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. అలాంటి ఆభరణాలలో కొందరు సింపుల్ గా ఉండే వాటిని ఇష్టపడితే మరి కొందరు ప్రత్యేక సందర్భాలలో హెవీగా ఉండే ఆభరణాలకు ప్రాధాన్యతనిస్తారు. అయితే బంగారం ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో వన్ గ్రాం ఆభరణాలు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. వాటిలో జుంకాస్ కు అతివలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ఆభరణాలను మీరూ చూడాలనుకుంటున్నారు. అందుకు బేగంపేటలో ఉన్న ప్యాట్నీ జెవెల్లర్స్ ఉన్న వెరైటీ ఆభరణాలను మీ ముందుకు తీసుకొచ్చి సొగస్సు.. వాటన్నింటినీ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:48 - September 18, 2015

హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ పాదయాత్ర కొనసాగుతోంది... రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది.. దోభీఘాట్ దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లినుంచి ఈ పాదయాత్రను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రారంభించారు.. టీడీపీ, కాంగ్రెస్ ఒకే వేదిక పంచుకోవడం ఇది మొదటిసారి అని కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి తెలిపారు.

14:44 - September 18, 2015

హైదరాబాద్ : రెండు వేరు వేరు కుటుంబాల నుండి వచ్చిన స్త్రీ, పురుషులను ఒక్కటి చేసే బంధం వివాహం. అలా భిన్న నేపథ్యాలతో ఒక్కటయ్యే జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. మరి ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎకలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై నిర్భయలో సైకియాట్రిస్ట్ పూర్ణిమా నాగరాజ్ సూచించారు. మరి మీరు కూడా ఈ అంశాలను వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

14:41 - September 18, 2015

హైదరాబాద్ : మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కేసులో పదేళ్ల బాలుడికి సంకేళ్లు వేసి పోలీసులు హింసించారు. కోర్టు నుంచి సంకెళ్లతోనే ఆర్టీసీ బస్సులో బాలుడిని తరలించారు. అయితే పదేళ్ల బాలుడికి సంకెళ్లు వేసి తీసుకెళ్లడంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

14:37 - September 18, 2015

బాలల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు చొరవ తీసుకుంది. అందుకు తగు చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ప్రతిష్టాత్మకమైన ఫార్చ్యూన్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. అనేక రంగాలలో విశిష్ట కృషి చేస్తున్న వీరికి ఈ జాబితాలో ప్రత్యేక స్థానం లభించింది.

భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపాలాహిరి అరుదైన ప్రత్యేకత సాధించింది. అమెరికా అధ్యక్షుని చేతుల మీదుగా ఘన సన్మానం పొందింది.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన ఖాతాలోకి మరో గ్రాండ్ స్లామ్ ను చేర్చుకుంది. యుఎస్ టెన్నిస్ టోర్నీడబుల్స్ లో చక్కటి ప్రతిభ కనబరిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ అంశాలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తాజ్ మహల్ మెట్ల పై నుండి ఓ వ్యక్తి మృతి

హైదరాబాద్ : ఓ పర్యాటకుడు తాజ్ మహల్ మెట్ల మీది నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోఆయాడు. జపాన్ కి చెందిన హెచ్ ఉయెద్ గుర్తించారు. 

పట్టిసీమ నుంచి నీరు విడుదల

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం ఈ రోజు నీటిని విడుదల చేసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టిసీమ మొదటి సంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.

యువతులను మోసగిస్తున్న నలుగురు అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో పెళ్లి పేరుతో యువతులను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యువతులను మోసగిస్తున్న వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నైజీరియన్లను పోలీసులు విచారిస్తున్నారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

14:21 - September 18, 2015

హైదరాబాద్ : ఉరివేసుకోవడం వల్లే యాలాల మండలం ఎస్సై రమేష్ మృతి చెందాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. రమేష్ ఉరివేసుకోవడం వల్లే అతని మెడ ఎముక విరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు రమేష్ మృతిపై అనుమానాలున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆత్మహత్య కాదని.. ఇది హత్యేనని రమేష్ కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండురోజుల క్రితం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 

 

పదేళ్ల బాలుడికి పోలీసులు సంకెళ్లు

మెదక్ :చోరీ కేసులో పదేళ్ల బాలుడికి పోలీసులు సంకెళ్లు వేశారు. కోర్టు నుంచి సంకెళ్లతో బాలుడిని ఆర్టీసీ బస్సులో తరలించారు. బాలుడికి సంకెళ్లు వేయడంపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుడికి సంకెళ్లు వేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మంత్రి మహేందర్ రెడ్డి పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం

హైదరాబాద్ : మంత్రి మహేందర్ రెడ్డి పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదమయ్యింది. హైదరాబాద్ లో మంత్రి మహేందర్‌రెడ్డి బస్టాండ్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును ఆహ్వానించలేదని బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిపై ఎదురు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

14:11 - September 18, 2015

హైదరాబాద్ : అందరు ఉండి తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించినా కొందరు ఫలితాలు సాధించరు. అలాంటి యువత నేటి సమాజంలో కోకొల్లలు. కాని ఓ యువకుడు ఎవరి మద్దతు లేకుండానే ప్రపంచానికి పరచయమయ్యాడు. అతనికి డాక్టరేట్‌లంటే ఎల్‌కేజీ, యూకేజీతో సమానం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 భారత, అంతర్జాతీయ భాషలతో ప్రావీణ్యం పొందాడు. 12 భాషలను ఈజీగా చదవగలడు. ఇంతకి ఆ యువరాకెట్‌ ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడండి.
నేపథ్యం...
ఆర్యవర్ధన్ రాజ్ హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలికి చెందినవాడు. జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కష్టపడి ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. 2013 నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ అనేక పరిశోధనలు చేస్తున్నాడు. తాళపత్ర గ్రంథాలలోని అపారమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఇప్పటి వరకు ఆరువేల తాళపత్ర గ్రంధాలను సేకరించి భద్రపరిచాడు. మన దేశంలోని తాళపత్ర గ్రంథాలనే కాకుండా విదేశాలలోని యూనివర్సిటీలు, గ్రంధాలయాల నుంచి సేకరించి స్వంత ఖర్చులతో వాటిని డిజిటలైజ్ చేస్తున్నాడు.
సాంకేతిక పద్ధతలో భద్రత
భావితరాలకు విలువైన సమాచారాన్ని అందించాలని ఇప్పటి వరకు లక్ష 30వేల తాళపత్ర గ్రంధాలను సాంకేతిక పద్థతులలో భద్రపరుస్తున్నాడు. దేశ, విదేశాల నుంచి సేకరించిన గ్రంధాలలోని విషయాలను అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రాంతీయ భాషలలో వాటిని అనువదించి స్వంత సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలుగా ముద్రించి సామాన్యులకు అందిస్తున్నాడు.
మత గురువులు, ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై పరిశోధనలు
ప్రపంచంలోని 527 మతాలపై...రామాయణం, మహాభారత, భాగవత, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి మత గ్రంధాలపై కాకుండా మత గురువులు...ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై పరిశోధనలు చేస్తున్నాడు. విమర్శలు, విశ్లేషణలను సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రపంచ భౌగోళిక చరిత్ర, ప్రపంచ బానిసల చరిత్ర...మనస్తత్వ చరిత్ర, తత్త్వశాస్త్రం, వేశ్యల చరిత్ర, ప్రపంచ రాజకీయ, ఆర్ధిక చరిత్రలను వ్యాసాలుగా...గ్రంధాలుగా అందరికి అర్ధమయ్యే విధంగా ఆర్యవర్ధన్ రాజ్ అందిస్తున్నాడు.
వెయ్యికి పైగా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్
చరిత్రకారుడిగానే కాకుండా కవితలు, కథలు, గజల్స్, పాటలు, బొమ్మలు గీయడంలో తనదైన శైలిని చూపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనే స్వంతగా కథను రాసుకొని స్వయంగా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించి వాలి వధ-రామకథ షార్ట్ ఫిల్మ్ తీసి విడుదల చేశాడు. ఇందులో ఆరు అంతర్జాతీయ అవార్డులు, ఎనిమిది జాతీయ అవార్డులు...పదమూడు ప్రాంతీయ అవార్డులను అందుకొని రికార్డులు సృష్టించాడు. మతాలు, సాహిత్యం, చరిత్ర, రాజకీయ వ్యవస్థలపై జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలకు రీసెర్చ్ పేపర్స్‌కు అందిస్తూ అనేక విషయాలను తెలియచేస్తున్నాడు. మూడు వందల యూనివర్సిటీలు...వెయ్యికి పైగా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ ఇస్తూ విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
మోస్ట్ స్టైలిష్ జీనియస్ ఇన్ వరల్డ్‌
చిన్న వయస్సులోనే డాక్టరేట్లు...ప్రాచీన కళలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఆర్యవర్ధన్ రాజ్‌ను మోస్ట్ స్టైలిష్ జీనియస్ ఇన్ ద వరల్డ్‌గా ఆస్ర్టేలియా మేగ్జిన్ ప్రకటించింది. ప్రఖ్యాత ద హెరాల్డ్ సన్ మేగిజిన్ సర్వే చేసిన ద మోస్ట్ రొమాంటిక్ ఐస్ ఇన్ ద వరల్డ్‌గా ఎన్నికై ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో 20వ స్థానాన్ని దక్కించుకున్న ఆర్యవర్ధన్ రాజ్‌కు 10టీవీ కూడా కంగ్రాట్స్ చెబుతోంది.

 

 

14:00 - September 18, 2015

ఢిల్లీ : నిత్యం కాంట్రవర్సీ కామెంట్లు చేసే ఆయన మరో వివాదానికి తెరతీశారు. ఈ సారి ఏకంగా సుభాశ్ చంద్రబోస్‌, రవీంద్రనాథ్ ఠాగూర్‌లపైనే బాంబు పేల్చారు. నేతాజీ, గురుదేవ్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు సంధించారు. సుభాశ్‌ చంద్రబోస్‌ జపాన్‌ దేశపు ఏజెంట్‌ అని, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటీషర్ల తొత్తని ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు కట్జూ. ఈ అంశాలపై మాట్లాడేందుకు త్వరలో కోల్‌కతా వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
కట్జూ కామెంట్స్‌ పై దుమారం
మరోవైపు కట్జూ కామెంట్స్‌ సోషల్ వెబ్ సైట్లలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కట్జూ వ్యాఖ్యలపై చర్చజరిగే అవకాశం ఉంది. కట్జూ గతంలోనూ అనేక కాంట్రవర్సరీ కామెంట్లు చేశారు. "మహాత్మాగాంధీ-ఫాదర్ ఆఫ్ ది నేషన్‌, వాజ్ ఏ బ్రిటీష్ ఏజెంట్ " అంటూ తన బ్లాగులో రాసుకున్నారు. అలాగే 90 శాతం భారతీయులు ఇడియట్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రాష్ట్రపతి అయితే చూడాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టారు. న్యాయ వ్యవస్థ అవినీతిపై కూడా మార్కండేయా ఆరోపణాస్త్రాలు సంధించారు. హైకోర్టు జడ్జీలు అవినీతి కూపంలో కూరుకుపోయారని ఆయన కుండబద్ధలు కొట్టారు. నిజానికి ముక్కుసూటిగా వెళ్లే కట్జూకు వివాదాలు కొత్తేం కాదు. వివాదాల కారణంగా ఆయన తన వైఖరీ మార్చుకోలేదు. దేశ శ్రేయస్సు కోసం తాను నమ్మిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు మార్కండేయ.

 

13:56 - September 18, 2015

విశాఖ : విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను అణిచివేసేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతుందోని సీపీఎం నేత నర్సింగరావు విమర్శించారు. జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై లాఠీచార్జ్‌కి నిరసనగా ఇవాళ అఖిలపక్షం నిరసన ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థులు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే ప్రభుత్వ చేతకానితనంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 

13:51 - September 18, 2015

హైదరాబాద్ : టిడిపి నేత గాలిముద్దుకృష్ణమనాయుడు వైసిపి నేత జగన్ మండిపడ్డారు. భూసేకరణ విషయంలో జగన్

రైతులను రెచ్చగొడుతున్నారని.. అది కరికాదన్నారు. ఎపికి రాజధాని కావాలా.. వద్దా.. జగన్ చెప్పాలన్నారు. భూములు తీసుకోకుండా రాజధానిని ఆకాశంలో కట్టాలా... అని అసహనం వ్యక్తం చేశారు. 

ఆర్థిక సంస్కరణల పేరుతో భూదోపిడి : మధు

హైదరాబాద్ : ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం భూదోపిడికి పాల్పడే కుట్రపన్నుతోందని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 14న ప్రపంచబ్యాంకు అందించిన భారత్‌లో పెట్టుబడుల అంశంపై ఇచ్చిన నివేదిక అదే తేటతెల్లం చేస్తుందన్నారు. 

13:42 - September 18, 2015

హైదరాబాద్ : ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం భూదోపిడికి పాల్పడే కుట్రపన్నుతోందని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 14న ప్రపంచబ్యాంకు అందించిన భారత్‌లో పెట్టుబడుల అంశంపై ఇచ్చిన నివేదిక అదే తేటతెల్లం చేస్తుందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు పేద రైతుల భూముల్ని తాకట్టు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు.
భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలివ్వాలి... 
భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలివ్వాలన్నారు. అధికారంలోకి రాకుముందు సొంపేట భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. సొంపేట భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ బ్యాంక్ విధానానికి స్వస్తి పలికాలన్నారు. టిడిపి ప్రభుత్వం.. చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. మళ్లీ ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఎపి సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీఆర్ డీఏ పరిధిలో మూడు నెలల పాటు 144 సెక్షన్ విధించారని తెలిపారు. సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం తగదన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థినిలకు టాయిలెట్స్ లేవన్నారు. అద్దె బిల్డింగ్స్ లో నడుస్తున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినిలు జిల్లా కలెక్టర్ కు వినితి పత్రం తీసుకోలేదని.. ఆపై సమస్యలపై అడినందుకు వారిపై లాఠీచార్జీ చేయించారని తెలిపారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోకపోతే.. అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

 

13:38 - September 18, 2015

విజయవాడ : రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో విజయవాడలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లోటును తగ్గించేందుకు అధికారులు వనరులపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో నిధులను సక్రమంగా వినియోగించుకునేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. 2022కి దేశంలో మూడు అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందన్నారు. 2029కి దేశంలో మొదటిస్థానంలో ఏపీ నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. 2050కి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

 

కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎం విజయవాడలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.

 

13:30 - September 18, 2015

ఢిల్లీ : భూ సేకరణ చట్టంపై కాంగ్రెస్‌ చేస్తున్న కిసాన్‌ ర్యాలీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. భూసేకరణపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తూ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. 50 ఏళ్లకాలం నాటి బ్రిటీష్‌ భూసేకరణ చట్టాన్నే కాంగ్రెస్ అమలు చేసిందని ఆయన అన్నారు. 9ఏళ్ల యూపీయే పాలనలో రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేశారని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు.  

కాంగ్రెస్‌ చేస్తున్న కిసాన్‌ ర్యాలీపై వెంకయ్య ఫైర్...

ఢిల్లీ : భూ సేకరణ చట్టంపై కాంగ్రెస్‌ చేస్తున్న కిసాన్‌ ర్యాలీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. భూసేకరణపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తూ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.

13:24 - September 18, 2015

చిత్తూరు : భక్తులకు సౌకర్యాల కల్పనే తొలి ప్రాధాన్యమని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. ఈమేరకు ఈవో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడోత్సవం.. ఆదివారం జరుగనుండడంతో.. భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. మాడ వీధుల్లో లక్షా 70వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని.. మిగిలిన వారికీ స్వామి దర్శనం కలిగేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తామని ఈఓ తెలిపారు. .

 

ఉరివేసుకోవడం వల్లే యాలాల ఎస్సై రమేష్ మృతి ఎస్పీ శ్రీనివాస్

హైదరాబాద్ : ఉరివేసుకోవడం వల్లే యాలాల మండలం ఎస్సై రమేష్ మృతి చెందాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. రమేష్ ఉరివేసుకోవడం వల్లే అతని మెడ ఎముక విరిగిందని స్పష్టం చేశారు. 

12:58 - September 18, 2015

హైదరాబాద్ : ఎల్లుండి జరగనున్న ఆన్‌లైన్‌ ఏఈఈ పరీక్షపై టీఎస్‌పీఎస్‌సీ సమీక్ష నిర్వహించింది. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ తెలుగులో కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థుల కోరిక మేరకే తెలుగులో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఇస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు.

 

12:56 - September 18, 2015

ప్రకాశం : జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరులో కేంద్రమంత్రి సీతారామన్‌ పర్యటిస్తున్నారు. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మిగిలిన పొగాకు మొత్తాన్ని కొంటామని హామీ ఇవ్వాలంటూ రైతులు మంత్రిని అడ్డుకుని, ఘెరావ్ చేశారు.

 

 

12:48 - September 18, 2015

నల్లగొండ : జిల్లాలోని దేవరకొండలో యాలాల ఎస్సై రమేష్‌ అంతిమయాత్ర కొనసాగుతుంది. రెండురోజుల క్రితం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రమేష్‌ భౌతికకాయం ఆయన స్వగ్రామం చెరుపల్లికి చేరుకుంది. అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్రలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రమేష్ మృతిపై అనుమానాలు : రవీంద్రనాయక్
రమేష్ మృతి దురదృష్టకర సంఘటన. రామావత్ రమేష్ నాయక్ ఆత్మహత్య చేసుకునే పరికివాడు కాదు. మూడు రోజుల క్రితం.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో రమేష్ ను ఆఫీస్ కు పిలిచారు. వెళ్లాడు. తిరిగి శవమై వచ్చాడు. ఎస్సై రమేష్ మృతిపై అనుమానాలున్నాయి. రమేష్ బొటన వేలు కట్ అయింది. మోకాళ్లకు గాయాలయ్యాయి. మృతిపై అనేక అనుమానాలున్నాయి. రమేష్ మృతి ఘటనపై హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిశాము. సిబిసిఐడి ద్వారా.. విచారణ చేయించాలని నాయిని కోరాము. వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. మృతికి బాధ్యులై వారిపై చర్యలు తీసువాలని డిమాండ్ చేశాము. భార్యకు ఉద్యోగం కల్పించాలి. కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

 

12:04 - September 18, 2015

నల్గొండ : ఎస్సై రమేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రమేష్ అంతిమక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని స్థానికులు అంతిమయాత్రను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

12:02 - September 18, 2015

కోల్ కతా : ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ రహస్య పత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. బోస్‌కు సంబంధించిన 64 ఫైళ్లతో పాటు పలు డీవీడీలను బెంగాల్‌ ప్రభుత్వం కుటుంబసభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,774 పేజీలు ఉన్నాయి. సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కోల్‌కతా పోలీసు మ్యూజియంలో వీటిని ఉంచనున్నారు. ఈ పత్రాలు బహిర్గతం కావడంతో సుభాష్‌చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వీడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

 

11:54 - September 18, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 12వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ ఫ్లో 14 వేల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం 10.5 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 11.9 టీఎంసీలు.

 

జూరాలకు కొనసాగుతున్న వరద

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 12వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ ఫ్లో 14 వేల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం 10.5 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 11.9 టీఎంసీలు.

 

11:51 - September 18, 2015

వరంగల్‌ : జిల్లాలోని మేడారం, ఏటూరునాగారం అటవీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్‌, స్పెషల్‌పార్టీ బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ భారీ ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏటూరునాగారం(మం) చిట్యాల సమీపంలో ముగ్గురు మావోయిస్టు దళ సభ్యులు మహేష్‌, సిద్ధప్ప, శేఖర్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. 

 

11:44 - September 18, 2015

హైదరాబాద్ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో అర్హులకు చోటు కల్పించాలని సెర్చ్‌ కమిటీకి చంద్రబాబు సూచించారు. సెర్చ్‌ కమిటీతో ఈనెల 23న మరోసారి భేటీ కావాలని చంద్రబాబు సూచించారు. 

11:37 - September 18, 2015

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పెషావర్‌లోని బాదాబర్‌ ఎయిర్‌బేస్‌పై 10 మంది ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఉగ్రవాదుల దాడిని పాక్‌ సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు సైనికులు మృతి చెందారు. కాల్పుల ఘటనతో సైన్యం బందోబస్తు పెంచింది. ఇక దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్‌-ఇ-తాలిజన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

 

ఎస్సై రమేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత

నల్గొండ : ఎస్సై రమేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రమేష్ అంతిమక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని స్థానికులు అంతిమయాత్రను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

10:54 - September 18, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం జరిగింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజలూడి మండలం ఐతపూడి గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు ఊపరితిత్తుల వ్యాధితో జూన్ 25న ఆస్పత్రిలో చేరాడు. ఎంతకూ తగ్గకపోవడంతో మనస్తాపం చెందాడు. ఎస్ 1 వార్డులో ఉంటున్న సతీష్ దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించలేదని అంటున్నారు. కాగా ఎస్ 1 వార్డులో రోగితోపాటు డాక్టర్లు, సిబ్బంది ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నిర్మలాసీతారామన్

ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పేర్నమిటలో పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కాగా ఆమె కారును వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 430 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసున్నారు.

09:48 - September 18, 2015

తూర్పుగోదావరి : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజమండ్రిలోని గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో...2 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు.

 

09:42 - September 18, 2015

ఢిల్లీ : లిబియాలో తిరుగుబాటుదార్ల నుంచి ఒక భారతీయుడు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశా వాసి రంజన్ సమాల్... క్షేమంగా బయటపడ్డారు. విదేశాంగ శాఖ ధృవీకరించ లేదు. ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు తిరుగుబాటు చెరలోనే ఉన్నారు. జులై 29న అధ్యాపకులు కిడ్నాప్ కు గురయ్యారు. 

నేడు దేవరకొండలో ఎస్సై రమేష్ అంత్యక్రియలు...

నల్గొండ : ఎస్సై రమేష్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లాలోని చెరుపల్లి షేర్ పల్లి తండాకు చేరుకుంది. ఇవాళా దేవరకొండలో రమేష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రెండు రోజుల రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 

09:38 - September 18, 2015

నల్గొండ : ఎస్సై రమేష్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లాలోని చెరుపల్లి షేర్ పల్లి తండాకు చేరుకుంది. ఇవాళా దేవరకొండలో రమేష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రెండు రోజుల రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రమేష్ మృతితో ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. కన్నీటిపర్యంతమయ్యారు. గుండెలవిసేలా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ఐఎస్ గా రమేష్ 2012లో విధుల్లో చేరాడు. 2015 ఆగస్టు 15న మంత్రి చేతుల మీదుగా రమేష్ ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నాడు. రమేష్ ది ఆత్మహత్య కాదని.. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇది రాజకీయ హత్యని.. దీని వెనుకాల అధికార పార్టీ నేతలు, ఇసుక మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. రమేష్ హత్య వెనుక రూరల్ సిఐ, టౌన్ సిఐ, స్థానిక ఇసుక వ్యాపారి లక్ష్మణ్ నాయక్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
రమేష్ మృతికి నరసనగా బంద్
మరోవైపు రమేష్ మృతికి నిరసనగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. బంద్ లో టిడిపి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. దేవరకొండ బస్టాండ్ వద్ద తలపెట్టిన ధర్నాలో టిడిపి అధ్యక్షుడు బిల్యానాయక్ పాల్గొన్నారు.

 

కాసేపట్లో టిటిడిపి నేతలతో చంద్రబాబు భేటీ...

హైదరాబాద్ : కాసేపట్లో చంద్రబాబు నివాసంలో టిటిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రోగి ఆత్మహత్య

ప.గో: కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ రోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాజులూరు మండలం ఐతపూడి వాసి సతీష్ గా గుర్తించారు.

 

08:48 - September 18, 2015

సీఎం కేసీఆర్ నయా నిజాం అని వక్తలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్... నిరంకుశ పోకడలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టిటిడిపి అధికార ప్రతినిధి విద్యాసాగర్, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టిఆర్ ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్... తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఓట్ల కోసం... బిజెపి, టిఆర్ ఎస్ పార్టీలు తెలంగాణ విలీన దిన, విమోచన దినం అంటూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. బిజెపి.. తెలంగాణ సాయుధపోరాటాన్ని హిందూ, ముస్లీం మధ్య కొట్లాడగా చూపించి..ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి చర్రితను చరిత్రగా చూడాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:40 - September 18, 2015

ప్రభుత్వం.. జానపద కళాకారులను ఆదుకోవాలని జానపద వృత్తి కళాకారుల సంఘం నేత యాదగిరి డిమాండ్ చేశారు. 'తిరుమల బ్రహ్మోత్సవాలు.. జానపద కళాకారులు' అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఓ వైపు తిరుమలలో శ్రీవారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. మరోవైపు ఆ బ్రహ్మోత్సవాలలో తమ కళను ప్రదర్శించే అవకాశం కల్పించండంటూ కొన్ని వేల మంది జానపద కళాకారులు తమ గుండె చప్పుడు వినిపిస్తున్నారు. ఈ అంశాలంపై యాదగిరి మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:34 - September 18, 2015

తిరుమలకు వచ్చే విభిన్న రంగాల సెలబ్రిటీలకు టీటీడీ రాచమర్యాదలు చేస్తుంది. సినీ స్టార్ లు వస్తే టీటీడీ అధికారులు వారిని మహామురిపెంగా చూస్తారు. కానీ, స్వామివారి కీర్తనలను నలుదశలా వ్యాపింపచేసే జానపద కళాకారులను మాత్రం పెద్దగా ఆదరించదు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలే బ్రహ్మోత్సవాల వేళ జానపద కళాకారుల గుండు చప్పుడు వినకపోతే, ఇక అంతరించిపోతున్న ఈ కళలను కాపాడేదెవరు?
జానపద కళారూపాలు
జానపద కళారూపాలు. ఒకప్పుడు ఇవే మనకున్న ఏకైక వినోదం. ఇప్పుడున్న సినిమాలు, టీవీలు లేని రోజుల్లో జానపద కళాకారులే వివిధ పనుల్లో అలసిసొలసినవారికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేవారు. తమ కళారూపాలతో కడుపుబ్బ నవ్వించేవారు. ఏడిపించేవారు. మురిపించేవారు. బాధలు మరిపించేవారు. ఆలోచింపచేసేవారు. కాలం గడుస్తున్నద్దీ కొద్ది పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతున్నా కొద్ది, ఆధునిక మాధ్యమాలు పెరుగుతున్నా కొద్దీ పల్లెసీమల్లోని జానపద కళాకారుల జీవితాలు తలకిందులవుతున్నాయి. ఈ వ్రుత్తినే నమ్ముకున్నవారికి కుటుంబ పోషణ కష్టంగా మారుతోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆధునిక మాధ్యమాలు ఎంతగా విస్తరించినా, ఇటీవల కాలంలో సాగిన విభిన్న ఉద్యమాల్లో జానపద కళాకారులు పోషించిన పాత్ర అద్వితీయమైనది. ప్రతి ప్రభుత్వమూ జానపద కళాకారులను ఆదుకుంటామనీ, ఆ కళను కాపాడతామని వాగ్ధానం చేస్తూనే వున్నాయి. ఏ ఉత్సవానికైనా, ఊరేగింపుకైనా, కోలాహలానికైనా, జాతరకైనా జానపద కళా ప్రదర్శనలు లేనిదే నిండుతనం రాదు. అవి లేని చోట వెలితిగానే కనిపిస్తుంది. ఇదీ జానపద కళలకున్న ప్రాధాన్యత.
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
అయితే, ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి చెంత, అశేష భక్తజనుల నడుమ తమ కళను ప్రదర్శించాలని ఉత్సాహపడే కళాకారులెందరో. వైభవోపేతంగా సాగే ఉత్సవాల నడుమ తమ కళను ప్రదర్శించినప్పుడు, భజనలు చేసినప్పుడు ఆయా బృందాలకు కలిగే సంతృప్తి వేరు. సంపద కంటే సంతృప్తినే ఎక్కువగా ప్రేమించడం కళాకారుల స్వాభావిక లక్షణం కదా. కానీ, ఎందరెందరికో సత్కారాలు చేసే టీటీడీ తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన గ్రామీణ జానపద కళాకారుల్లో గూడుకట్టుకుంది. తిరుమలలో ఆ ఏడు కొండలవాడి సన్నిధిలో ఏడాదికి కనీసం ఒక్కసారైనా తమకు భజన చేసే అవకాశం రావడం లేదంటూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో రిజిష్టర్ చేయించుకున్న బృందాలు ఆవేదన చెందుతున్నాయి. కనీసం ఏదాడికి ఒక్కసారైనా ప్రదర్శన అవకాశం కల్పించి, రానుబోను చార్జీలు ఇచ్చి, అక్కడున్న రెండు పూటలు భోజనం పెట్టి, కాస్తంత లడ్డూ ప్రసాదం తమ చేతిలో పెడితే చాలన్నది జానపద కళాకారుల కోరిక. ఈ చిరుకోరికను తీర్చడం టీటీడీకి పెద్ద కష్టమేమీకాదుకదా! 

పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదుల దాడులు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ లక్ష్యంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 7 నుంచి 8 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. 

08:18 - September 18, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో గణేష్‌ ఉత్సవాలు సందడి మొదలైంది. ఎక్కడ చూసినా... ఏ వీధి చూసినా... గణేష్‌చవితి సంబరాలు మార్మోగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాడ వాడలా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు.
ఖైరతాబాద్‌ మహాగణపతికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతుల తొలిపూజ
ఖైరతాబాద్‌ మహాగణపతికి తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీమంత్రి దానం, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
విజయవాడలో భారీ వినాయకుడు
విజయవాడలో భారీ వినాయకుడు సందడి చేస్తున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి నగరంలో 63 అడుగుల అష్టలక్ష్మిసమేత నాట్య గణపతిని ప్రతిష్టించారు. ఈ గణపయ్యను దర్శిచుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ భారీ మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిరోజూ రెండులక్షల మంది దర్శించుకునే ఏర్పాట్లు చేశారు.
వరంగల్‌లో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
చవితి సందర్భంగా వరంగల్‌లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్‌లోని గణేష్‌ దేవాలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మట్టి వినాయక ప్రతిమలకు పెరిగిన గిరాకీ
మరోవైపు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలకు ఈ ఏడాది గిరాకీ బాగా పెరిగింది. ఈ విషయంలో పర్యావరణవేత్తల కృషి కొంతమేరకు ఫలించిందనే చెప్పాలి.

 

 

07:46 - September 18, 2015

హైదరాబాద్ : ఖరీఫ్‌ ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు చివరి దశలో విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో, రాబోయే రెండు రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఖమ్మం మణుగూరు, కరీంనగర్‌ రామగుండం ఓపెన్‌ కాస్టుల్లో బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. రామగుండం నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఖైరిగూడ ఓపెన్ కాస్టులో సైతం డోర్లీ 1, 2 గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.
ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరదనీరు
భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. జూరాల, కడెం ప్రాజెక్టులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 691 అడుగులకు చేరింది. దీంతో అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. సుంకేసుల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి సైతం వరద నీరు పోటెత్తుతోంది. వరదనీరు భారీగా వస్తుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 5 గేట్లను అధికారులు ఎత్తేశారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
మరోవైపు ఏపీలోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. పలాస, తిరువూరు, మందస, టెక్కలిలో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్దేరు జలాశయంలో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో ఒక గేటు ఎత్తివేసి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు విజయనగరంలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి.
వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో మరోసారి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

07:40 - September 18, 2015

హైదరాబాద్ : లిబియాలో అపహరణకు గురైన పశ్చిమగోదావరి జిల్లా వాసి డాక్టర్‌ రామ్మూర్తి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా.. ఆయన జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రవాష్‌ రాజన్‌ సమాల్‌తోపాటు, ఏపీకి చెందిన రామ్మూర్తిని ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్టుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఎంపీ మాగంటి బాబును కలిసిన కుటుంబ సభ్యులు
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఏలూరు ఎంపీ మాగంటి బాబును కలిశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కిడ్నాపర్ల చెరలో ఉన్న రామ్మూర్తిని ఎలాగైనా విడిపించాలని కోరారు. ఈ అంశం గురించి విదేశాంగశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టు ఎంపీ మాగంటి వెల్లడించారు.
ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం
లిబియాలోని సిర్తేలో రామ్మూర్తి పనిచేస్తున్న స్థలం నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. రెండు నెలల క్రితం కిడ్నాపైన తెలుగు వ్యక్తులు గోపీకృష్ణ, బలరాంలు ఇంకా విడుదల కాకముందే ఈ సంఘటన జరగడం కలకలం రేపుతోంది.
రామ్మూర్తిని విడిపించాలని వేడుకోలు
తాజా ఘటనతో బాధిత కుటుంబాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా చురుగ్గా స్పందించి తమవారిని విడుదల చేయించాలని కోరుతున్నాయి.

07:33 - September 18, 2015

కోల్ కతా : బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను అత్యవసర చికిత్స మేరకు...కోలకతాలోని బిఎం బిర్లా ఆస్పత్రికి తరలించారు. దాల్మియా కొంతకాలంగా తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాల్మియాను మాజీ క్రికెటర్ సౌరబ్‌ గంగూలీ పరామర్శించారు.

 

07:30 - September 18, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విపక్షాల విమర్శలు సమర్థంగా తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్లుండి క్యాబినెట్ భేటి కానుంది. పది రోజుల ముఖ్యమంత్రి చైనా పర్యటన ఫలితాలు, రైతుల ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై విపక్షాలు కత్తులునూరుతుండటంతో వాటికి సమాధానం చెప్పేందుకు గణాంకాలతో సిద్దం కావాలని మంత్రులకు మార్గనిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.
రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం
వారం రోజుల చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేశారు. గతేడాది కాలంగా ఎప్పుడు లేని విధంగా 20 రోజుల వ్యవధిలో మంత్రివర్గం భేటి కావడం పట్ల మంత్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నెల రెండోవ తేదిన క్యాబినెట్ మీటింగ్‌ జరిపిన సీఎం..ఐదు రోజుల తర్వాత తన బృందంతో చైనా పర్యటనకు వెళ్ళారు.
ఈనెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు గత క్యాబినెట్ సందర్భంగానే నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవిధంగా విపక్షాలు అస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపరపై సర్కార్ ను ఎండగట్టేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే మున్సిపల్‌ పారిశుద్ద్య కార్మికుల సస్పెన్షన్, ఆశా వర్కర్ల ఆందోళన, కాంట్రాక్టుల కార్మికుల రెగ్యులరైజ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వ తీరుపై అసెంబ్లీలో సర్కారు వైఖరిని ఎండగడుతామని విపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం పెంచాలని చాలా రోజుల నుంచి విపక్షాలు కోరుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి అమోదం కోసం వేచి చూస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశం పై చర్చించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ మంత్రులతో చర్చించనున్నారు కేసీఆర్. విపక్షాలను కట్టడి చేసేందుకు సిద్దం కావాలని మార్గనిర్దేశం చేయనున్నారు. మరోవైపు ప్రాజెక్టుల రీ డిజైన్లకు సంబందించి ఇప్పటికే ప్లానింగ్ జరుగుతోంది. దీనిపై అసెంబ్లీలో పూర్తి వివరాలను సభలో వివరించాలని సాగునీటిపారుదల శాఖ నోట్ సిద్దం చేస్తోంది.
శాసనసభలో సమగ్ర జల విధానం ప్రకటించే అవకాశం
సమగ్ర జల విధానాన్ని అసెంబ్లీ వేదికగా సిఎం ప్రకటించే అవకాశముంది. దీనిపై కూడ మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్సుంది. చైనా పర్యటన విశేషాలను కేసీఆర్ మంత్రులకు వివరించనున్నారు. ప్రాజెక్టులు, పథకాలు, నిధుల వినియోగంపై అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ముఖ్యమంత్రి. దీంతో శుక్రవారం సాయంత్రం శాఖాధిపతులతో చీఫ్ సెక్రటరీ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా విపక్షాలు సంధిస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు మంత్రులకు కేసీఆర్ గట్టిగానే మార్గనిర్దేశం చేయబోతున్నారు.

07:24 - September 18, 2015

ప్రకాశం : నేడు ప్రకాశం జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాల్ని కలుస్తారు. ఆమెతో పాటు పలువురు రాష్ట్రమంత్రులు బాధితుల్ని పరామర్శించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశంకానున్నారు.
ఎట్టకేలకు కేంద్రప్రభుత్వంలో చలనం
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తోంది. మోదీ సర్కార్ మొద్దునిద్ర వీడుతోంది. రైతులకు అండగా ఉండేందుకు ఎన్ డిఎ అడుగులు వేస్తోంది. పొగాకు ధరల పతనం, రైతుల ఆత్మహత్యలపై దృష్టిసారించింది. పొగాకు రైతుల్ని ఆదుకునే దిశగా కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయని నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు మద్ధతు ధర కోసం... జులైలోనే టోబాకో బోర్డుతో చర్చించామన్నారు. సెప్టెంబర్‌ 30లోగా పొగాకు నిల్వలు... కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం పర్యటన ముగిసిన అనంతరం నిర్మలా సీతారామన్‌ విజయవాడకు చేరుకోనున్నారు. ఎపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొంటారు. పొగాకు ధరల పతనం, రైతులు సమస్యలపై సమీక్షిస్తారు.

 

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు

కరీంనగర్ : ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రామగుండం సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కల్గుతోంది. ఓసీపీ-1, 2, 3 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్, బోథ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వేమనపల్లి మండలంలో గొర్లపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. గొర్లపల్లి వాగు ఉధృతికి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 

నేడు మూడో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల : నేడు మూడో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు సింహవాహనంపై శ్రీవారిని ఉరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి ముత్యాల పందిరి వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. 

నేడు ప్రకాశం జిల్లాలో నిర్మలాసీతారామన్ పర్యటన

ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చనిపోయిన పొగాకు రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 

నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపు

నల్గొండ : ఎస్సై రమేష్ మృతికి నిరసనగా నేడు దేవరకొండ నియోజకవర్గం బంద్ కు టిడిపి పిలుపినిచ్చింది. 

Don't Miss