Activities calendar

20 September 2015

బీహార్ ఎన్నికలు..బీజేపీ మూడో జాబితా విడుదల..

బీహార్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా భారతీయ జనతా పార్టీ ఆదివారం విడుదల చేసింది. ఇందులో 11 మందికి అవకాశం కల్పించింది. 

21:22 - September 20, 2015

ఢిల్లీ : దళితుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డీఎస్ఎంఎం డిమాండ్ చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వివిధ దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు విమర్శించాయి. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టానికి మరిన్ని సంస్కరణలు తేవాలని, ప్రైవేట్ సంస్థల్లోనూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశాయి.

దళిత్ శోషణ్‌ ముక్తి మంచ్ ఆధ్వర్యంలో దళిత్ పార్లమెంట్ ..
ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర దళిత్ శోషణ్‌ ముక్తి మంచ్ ఆధ్వర్యంలో దళిత్ పార్లమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి 17 రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో దళితుల ప్రతినిధులు హాజరయ్యారు. సీపీఎం సహా వివిధ పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. దళితులపై పెరుగుతున్న దాడులను ఖండించారు. దళితుల సమస్యలు, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సవరణలపై చర్చించారు.

చట్టాల్లో మార్పులు..
చట్టాల్లో సమూల మార్పులు చేసిన రోజే దళితులకు సరైన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని డీఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ, సంఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని ఆరోపించారు.

పోరాటానికి సీపీఎం కట్టుబడి ఉందన్న ఏచూరి..
దళితుల సమస్యలపై పోరాటానికి సీపీఎం కట్టుబడి ఉందని..ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దళితుల సమస్యలపై చర్చకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
దళితుల సమస్యలు, దాడులు, ప్రైవేట్ రిజర్వేషన్లపై దేశవ్యాప్త ఉద్యమం చేయాలని భావిస్తున్నట్టు దళిత సంఘాలు ప్రకటించాయి. ఆర్థిక,సామాజిక దోపిడీలకు వ్యతిరేకంగా కనివినీ ఎరుగనిస్థాయిలో పోరాడాలని నిర్ణయించాయి. దళిత్ పార్లమెంట్‌లో విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు.

21:19 - September 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఉద్యోగ పోటీ పరీక్షకు అభ్యర్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరీక్షకు సుమారు 76 శాతం మంది హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పరీక్ష కేంద్రాల వద్దకు పోటెత్తారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తినా.. మొత్తమ్మీద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ఉద్యోగ పరీక్ష విజయవంతమైందని అధికారులు తెలిపారు. 

21:15 - September 20, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజా పౌర సంఘాలు నిర్ణయించాయి. అత్యంత పాశవికమైన ఈ ఘటనకు బాధ్యులైన వారిని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌ పూర్వాపరాలపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. శ్రుతి, విద్యాసాగర్‌లను నిర్బంధించి.. దారుణ చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని.. ఆ ఘటన కలచి వేసిందని సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం కళ్లనీళ్ల పర్యంతమయ్యారు.

అణచివేత కేసీఆర్ నైజం - తమ్మినేని..
రౌండ్‌టేబుల్‌ భేటీకి హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. అణచివేత కేసీఆర్‌ నైజమన్నారు. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. భేటీలో పాల్గొన్న జస్టిస్‌ చంద్రకుమార్‌ దొరల పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని వక్తలు ఆరోపించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. 

21:11 - September 20, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా.. సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణ ప్రణాళికలపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయనివాళ సింగపూర్‌ బయలుదేరి వెళ్లారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పట్టాలెక్కించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం.. ఆదివారం మరోసారి సింగపూర్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఈ బృందం.. అక్కడినుంచి సింగపూర్‌ బయలుదేరి వెళ్లింది. చంద్రబాబుతో పాటు.. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సీఆర్‌డీఏ కమీషనర్‌ శ్రీకాంత్‌ ఈ బృందంలో ఉన్నారు.

సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో విందు భేటీ..
సోమవారం సింగపూర్‌ కన్సార్టియంతో జరిగే వాణిజ్య సమావేశంలో సీఎం బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో జరిగే విందు సమావేశంలో అమరావతి నగరాభివృద్ధిలో స్విస్‌ చాలెంజ్‌ విధానంపై చర్చిస్తారు.

మూడు టౌన్‌షిప్‌లను సందర్శించనున్న చంద్రబాబు బృందం..
రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం మూడు టౌన్‌షిప్‌లను సందర్శిస్తుంది. సింగపూర్‌ సిటీ గ్యాలరీ, క్యాలింగ్‌ బెండ్‌మీర్‌ రీజన్‌, ఛాంగి బిజినెస్‌ పార్క్‌ రీజయన్‌, వన్‌ నార్త్‌ రీజియన్‌ హబ్బులనూ పరిశీలిస్తారు. అక్కడి నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఎయిర్‌బేస్‌లు, రిజర్వాయర్లను అధ్యయనం చేస్తారు. దీంతోపాటే సివిక్‌ డిస్ట్రిక్ట్‌, మెరీనా బే ప్లానింగ్‌పైనా సమీక్షిస్తారు. చంద్రబాబు బృందం 22న రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతుంది. 

మహబూబ్ నగర్ లో ఇద్దరు కల్తీ కల్లు బాధితుల మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలో ఇద్దరు కల్తీ కల్లు బాధితులు మృతి చెందారు. ధరూర్ మండలం పెద్దపాడుకు చెందిన వృద్ధురాలు, జడ్చర్లకు చెందిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

గుంటూరు సర్కారీ ఆసుపత్రిలో మంత్రి ప్రత్తిపాటి తనిఖీలు..

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎముకలు, కీళ్ల విభాగాల్లో ఆయన తనిఖీలు చేశారు. 

ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉంది - జాయ్ బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ : నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ పార్టీ కంట్రోల్ లో ఉందని వ్యాఖ్యానాలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆర్మీ నిఘాలో జరుగుతాయన్నారు. ఆదివారం రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పార్టీ సమావేశంలో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల్లో చీటింగ్ చేసి గెలిచారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది సాధ్యం కాదన్నారు. ఎందుకంటే ఆర్మీ నిఘాలో ఎన్నికలు జరుగుతాయని అలాగే ఎలక్షన్ కమిషన్ తమ కంట్రోల్ లో ఉంటుందన్నారు. 

20:19 - September 20, 2015

హైదరాబాద్ : భారతదేశంలో నెంబన్ గా కేరళ భవన్ రావాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం కేరళ భవన్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం ఉమెన్ చాందీ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో.. మలయాళీల సమ్మేళనంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు నిర్వహించిన ఇరు రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ, కేరళ రెండూ సంప్రదాయాలతో అనుబంధమైన రాష్ట్రాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలవారు ఉన్నారని... అందులో మలయాళీలు.. ఇక్కడివారితో పూర్తిగా కలిసి పోయారని కితాబిచ్చారు. అందుకే హైదరాబాద్ సబ్ కా షహర్ అని పేరు తెచ్చుకుందన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. కేరళ ఎంతో అందమైన ప్రదేశమని, కేరళలో ప్రాముఖ్యత కలదన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని, అభివృద్ధి కోసం తాము కృషి చేయడం జరుగుతోందన్నారు. కేరళ రాష్ట్రంతో సంబంధాలు కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళయాలీలు మానవవాళికి సేవలందిస్తున్నారని, ఈ సేవలకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. తాను ఎక్కువ సేపు మాట్లాడనని, పనిచేసి చూపిస్తానన్నారు. ఒకటి..ఒకటిన్నర సంవత్సరంలో దేశంలోనే నెంబర్ వన్ గా కేరళ భవన్ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మళయాలీలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహాకారాలు అందచేస్తుందన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 

ముంబైలో అగ్నిప్రమాదం..

ముంబై : చింబూర్ ప్రాంతంలోని సురానా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

సింగపూర్ గ్రాండ్ ఫ్రీ విజేత వెటల్..

ఢిల్లీ : సింగపూర్ గ్రాండ్ ఫ్రీ విజేత వెటల్ నిలిచారు. డిపెండింగ్ ఛాంపియన్ సెబాస్టియన్ ఓటమి పాలయ్యారు. ఒకే సీజన్ లో మూడు టైటిళ్లు సాధించి వెటల్ రికార్డు సృష్టించారు. 

మంత్రి సత్యేంద్ర జైన్ అకస్మిక తనిఖీలు..

ఢిల్లీ : రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్ ఆదివారం రాత్రి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రబలి పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.

 

ఈఫిల్ టవర్ వద్ద అనుమానిత ఉగ్రవాది అరెస్టు..

ఫ్రాన్స్ : పారీస్ లోని ప్రముఖ ఈఫిల్ టవర్ వద్ద అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. దీనితో ఈఫిల్ టవర్ ను మూసివేశారు. 

కర్నూలులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి..

కర్నూలు : జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని గొర్మన్ కొండ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ఈతకెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. 

గుజరాత్ లో ప్రారంభమైన ఇంటర్నెట్ సర్వీసులు..

గుజరాత్ : రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. ఒక్క నావ్సారీ ప్రాంతంలో ప్రారంభం కాలేదు. 

ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో 10 కేజీల బంగారం..

ఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయంలో అధికారులు ఆదివారం జరిపిన తనిఖీల్లో పది కేజీల బంగారం పట్టుబడింది. 

సింగపూర్ కు చేరిన సీఎం బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ కు చేరుకున్నారు. రాజధాని నిర్మాణం, పెట్టుబడులపై చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధి బృందం చర్చిస్తోంది.

 

వంద నోటీసులిచ్చినా భయపడను - స్మృతి..

ఢిల్లీ : వంద నోటీసులిచ్చినా తాను భయపడనని..దమ్మూ ధైర్యం ఉంటే తనను జైల్లో పెట్టాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన అమేథీలో ఆమె పర్యటించారు. 

19:20 - September 20, 2015

విజయవాడ : తమ డిమాండ్ల సాధన కొరకు ఏపీ లారీ అసోసియేషన్ నడుం బిగించింది. అందులో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు లారీ అసోసియేషన్ అధ్యక్షులు పి.గోపాల్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 72 లక్షల ట్రాన్స్ పోర్టు వాహనాలు సమ్మెలో పాల్గొనబోతున్నాయని, ఏపీలో 2.50వేల వాహనాలు అక్టోబర్ 1వ తేదీ నుండి సమ్మెకు దిగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో లారీ అసోసియేషన్ సంఘాలు పాల్గొన్నాయి. పెట్రోల్ బంక్ యజమానుల సంఘం మద్దతు తెలిపింది. అక్రమ టోల్ గేట్ ల కనెక్షన్లను నిరోధించాలని..లారీల అద్దెపై పీడీఎస్ నిలిపివేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది. 

19:11 - September 20, 2015

చిత్తూరు : జిల్లా గంగాధర్ లో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. రంగు నీళ్లలో యాసిడ్ కలపడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళితే....వడ్డేపల్లి..గణేష్ నిమజ్జనంలో ప్రతి ఇంటి నుండి ఒక రంగు నీళ్ల బాటిల్ ను తీసుకొచ్చే సంప్రదాయం ఉంది. వీటన్నింటినీ ఒక దగ్గర కలిపి ఒకరిపైకొకరు రంగు నీళ్లు చల్లుకుంటారు. అందులో భాగంగా ఆదివారం నిమజ్జన వేడుకలు నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. రంగునీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. అంతే ఒక్కసారిగా కలకలం. చేతులు..కాళ్లు..ముఖాలు కాలిపోయాయి. మంటలకు తాళలేక పలువురు కేకలు వేశారు. వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ గ్రామంలో రెండు మూడు కుటుంబాల మధ్య తీవ్ర విబేధాలున్నట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డి అనే కుటుంబం ఈ ఘటనకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. 

19:00 - September 20, 2015

జానపదుల హృదయాల నుండి పెల్లుబికి గొంతు నుండి వెల్లువలా పొంగుకొచ్చిన ప్రజారంజక గీతం పాట. అయితే ఈనాడు ఆ పాటను ప్రజలను చైతన్య పరచడానికి గేయ రచయితలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిలో ఎన్నార్ ఒకరు. తెలంగాణా ప్రాంతంలోని అనేక సామాజిక సమస్యలకు స్పందించి పదునైన పాటలు రాస్తున్న గేయ రచయిత, గాయకుడు ఎన్నార్ జనం పాటను ప్రముఖ గేయ రచయిత స్పూర్తి పరిచయం.

18:55 - September 20, 2015

సాహిత్యం ఎప్పుడు పుట్టింది ? ఎక్కడ పుట్టింది ? అంటే సరైన సమాధానం చెప్పలేం. అయితే మానవులు శ్రమించే క్రమంలో జానపద సాహిత్యం పుట్టింది. ఆ తర్వాత కావ్యాలు ఇతిహాసాలు ప్రబంధాలు ఆధునిక సాహిత్యం వచ్చింది. ఆధునిక సాహిత్యం ప్రజా సాహిత్యంగా పేరు పొందింది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో త్రిపురనేని శ్రీనివాస్ ఒకరు. త్రిపురనేని శ్రీనివాస్.. ఈ పేరు వినగానే రహస్యోద్యమం గుర్తొస్తుంది. వచన కవిత్వానికి త్రిపురనేని శ్రీనివాస్ చేసిన సేవ అపూర్వం. దళిత...స్త్రీవాద మైనార్టీ కవిత్వ వాదాలకు ప్రాచుర్యం కల్పించిన విశాల భావాల కవి, ప్రచురణకర్త, నిబద్ధత కలిగిన పాత్రికేయుడతడు. ఈ నాటి ధిక్కార స్వరంలో త్రిపురనేని శ్రీనివాస్ గురించి ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు.

18:49 - September 20, 2015

శ్రీకాకుళం : సముద్ర తీరానికి విహార యాత్రకు వెళ్తే.. అది కాస్త విషాద యాత్రగా మారిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేద్దామని నేపాల్ నుంచిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. శనివారం మధ్యాహ్నం పదిమంది నేపాలీ విద్యార్థులు సంతబొమ్మాలి మండలం భావనపాడు బీచ్ కు వెళ్లారు. ఆ సమయంలో ఎగిరిపడ్డ రాకాసి అలల్లో రాజ్ కుమార్, వివేక్ కుమార్, సుమిత్ గల్లంతయ్యారు. రాజ్ కుమార్ మృతదేహం నిన్న సాయంత్రం లభించగా... మిగతా ఇద్దరి బాడీలు ఇవాళ దొరికాయి.

18:47 - September 20, 2015

హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం ఐడీపీ సంస్థ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు మంచి స్పందన లభించింది. ఒక్క చోటే పలు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు కొలువుదీరడంతో స్టూడెంట్స్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అక్కడున్న కోర్సులు, స్కాలర్‌షిప్‌ వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించింది ప్రఖ్యాత ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ ఐడీపీ. వివిధ దేశాల్లో మంచి పేరున్న విశ్వవిద్యాలయాలను ఒక్కగొడుకు కిందకు చేర్చింది. డిగ్రీ పూర్తి చేసుకుని, విదేశాల్లో విద్యావకాశాలు అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్ , వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో ఈ ఫెయిర్‌కు హాజరయ్యారు.

26 యూనివర్సిటీలు...
అమెరికా, యూకె, కెనడా, న్యూజిలాండ్‌ దేశాలకు చెందిన 26 యూనివర్సిటీల యాజమాన్యాలు ఐడీపీ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాలు పంచుకున్నాయి. ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు స్వయంగా విద్యార్థులతో ముచ్చటించారు. తమతమ వర్సిటీల్లో లభించే కోర్సులు, మౌలిక సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు, వీసాలకు సంబంధించిన వివరాలను స్టూడెంట్స్ కు వివరించారు. విద్యార్థులు కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

అపోహలు తొలిగాయి..
కన్సల్టెన్సీల ద్వారా కాకుండా నేరుగా యూనివర్సిటీలను విద్యార్థుల ముందుకు తీసుకురావడం వల్ల అపోహలు తొలగిపోతాయని ఐడీపీ కంట్రీ హెడ్‌ పీయూష్‌ కుమార్ తెలిపారు. నేరుగా యూనివర్సీటీల ప్రతినిధులను కలుసుకుని, మాట్లాడటం ద్వారా అపోహలు, సందేహాలు తొలగిపోయాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఐడీపీ సంస్థ ప్రయత్నాన్ని అభినందించారు.
 

18:44 - September 20, 2015

విజయవాడ : భారతదేశంలో ఉన్న మత, కుల వ్యవస్థల వలన లౌకికవాద వ్యవస్థపై దాడి జరుగుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. లౌకిక ప్రజాతంత్రవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ మాంటిస్సోరి మహిళా కళాశాలలో ''లౌఖిక ఉదార భావనలు-పొంచి ఉన్న ప్రమాదాలు'' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయవాడలోని లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక, సాహిత్య, ప్రజాస్వామ్య సంఘాలన్నీ ఐక్యం కావటం సంతోషకరమన్నారు. ఇటువంటి ఐక్యవేదికలు రెండు రాష్ట్రాల్లో ఆవిర్భవించాలని ఆకాంక్షించారు.

18:43 - September 20, 2015

విజయనగరం : జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్ పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రిశ్వరరావు డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల్లో జరుగుతున్న రిలే దీక్షల శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం నియంత్రత్వ పాలనతో సాధారణ రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు.

 

18:31 - September 20, 2015

శ్రీకాకుళం : జిల్లాలోని మడ్డువలస రిజర్వాయర్ కు భారీగా వరద నీరు పోటెత్తింది. జలాశయంలో నీరు నిండడంతో నాలుగు గేట్లు ఎత్తివేశారు. దిగువకు 9వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనితో కొప్పర, కొండఖేకరపలిల్ గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అంతేగాకుండా పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఒడిషా భారీ వర్షాలతో వేదవతి, సువర్ణ ముఖి నదులు పొంగిపొర్లుతున్నాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయలోనూ నీటి ప్రవాహం పెరిగింది. 

18:29 - September 20, 2015

హైదరాబాద్ : అసలే ఆదివారం..గణేష్ నవరాత్రులు..ఇంకేముంది..సాయంత్రం వేళ వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన గణేష్ విగ్రహాలను చూడటానికి నగర ప్రజలు ఆసక్తి కనబర్చారు. దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీగా రద్దీ నెలకొంది. అత్యంత ఎత్తైన గణేష్ ను దర్శించుకోవడానికి ఉభయ రాష్ట్రాల నుండే కాక విదేశీయులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పలు చర్యలు తీసుకుంది. ప్రత్యేకమైన బారికేడ్లన ఏర్పాటు చేయడమే కాకుండా మూడు లైన్ల ద్వారా వినాయకుడిని దర్శించుకొనేందుకు ఏర్పాటు చేశారు. కానీ క్యూలైన్లు నిండిపోవడంతో రెండు..మూడు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో భారీ రద్దీ నెలకొంది. రెండు..మూడు కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపి దర్శనానికి వస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, మింట్ కాంపౌండ్, లకడీకపూల్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. వచ్చే ఆదివారం జరిగే నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోరారు.

59 అడుగుల ఎత్తు..
ప్రతి ఏటా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ఈ మహావినాయకుడు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 'త్రిశక్తిమయ మోక్ష గణపతి'గా 59 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రధాన విగ్రహానికి కుడివైపు గజేంద్ర మోక్షం, ఎడమ వైపున వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ గణేష విగ్రహాన్ని జూన్‌ 12న ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో మొదలుపెట్టారు. సెప్టెంబర్ 10 నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. మహాగణపతి విగ్రహం తయారీకి 20 టన్నుల స్టీలు, 34 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారీస్, 75 బండిళ్ల కొబ్బరి నార, 600 బ్యాగుల బంకమట్టి, 30 లీటర్ల ఫెవికాల్, 50 సబ్బులు, 40 లీటర్ల నూనె, 22 టన్నుల కర్రలు, 200 లీటర్ల రంగులను వినియోగించారు. మొత్తంగా విగ్రహాల తయారీకి రూ. 50 లక్షలు ఖర్చైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఖైరతాబాద్ వద్ద భారీ రద్దీ..

హైదరాబాద్ : ఖైరతాబాద్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకొనేందుకు ప్రజలు భారీగా పోటెత్తారు. దీనితో ఎన్టీఆర్ మార్గ్, మింట్ కాంపౌండ్, లకడీకపూల్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. 

టిఎస్ తో డీజీపీ, హైదరాబాద్ సీపీ భేటీ..

హైదరాబాద్ : సీఎస్ రాజీవ్ శర్మతో హోం శాఖ కార్యదర్శి డీజీపీ, హైదరాబాద్ సీపీ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు..గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై చర్చిస్తున్నారు.

 

చాలా సంతోషంగా ఉంది - అమన్ ప్రీత్ కౌర్..

ఢిల్లీ : సౌతాఫ్రికా సిరీస్ లో తమ కుమారుడిని ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అమన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. సౌతాఫ్రికా సిరీస్ కు గురుకిరత్ మన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తల్లి అమన్ ప్రీత్ కౌర్ ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడింది.
 

నేపాల్ లో ఘర్షణ..ఒకరి మృతి..

నేపాల్ : బిర్ గుంజ్ ప్రాంతంలో నిరసన కారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనిని నిరిసిస్తూ నిరసనకారులు వాహనానికి నిప్పు పెట్టి ఆందోళన చేశారు

కేసీఆర్ ను కలిసిన ఉమెన్ చాందీ..

హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. జూబ్లిహిల్స్ లో కేరళ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు చాందీ నగరానికి వచ్చారు. 

ఏ సహాయమైనా ఢిల్లీ ప్రభుత్వానికి చేస్తాం - జేపీ నడ్డా..

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం కోరినా తాము ముందుకొస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న సంగతి తెలిసిందే. 

ఘనంగా 1965 వార్ గోల్డెన్ జూబ్లీ వారోత్సవాలు..

ఢిల్లీ : 1965 యుద్ధం జరిగి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలో సైనికులు ప్రదర్శనలు నిర్వహించారు. సైనికులు ప్రదర్శించిన పలు విన్యాసాలు ఆహుతులని ఆకట్టుకున్నాయి.

 

తిరుమలలో వర్షం..భక్తుల ఇబ్బందులు..

చిత్తూరు : తిరుమలలో వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులుడు పడుతున్నారు. మరోవైపు తిరుమల భక్తజన సంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారు గరుడ సేవపై ఊరేగనున్నారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. 

హైదరాబాద్ కు కేరళ ముఖ్యమంత్రి..

హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయకు తెలంగాణ మంత్రులు నాయినీ, జూపల్లి, జగదీష్ రెడ్డి, ఎంపీ వీహెచ్ తదితరులు స్వాగతం పలికారు. జూబ్లిహిల్స్ లో కేరళ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు చాందీ నగరానికి వచ్చారు. 

మంత్రి చిన రాజప్పను అడ్డుకున్న మహిళలు.

తూర్పుగోదావరి : జిల్లాలోని సామర్ల కోట మండలం వేట్లపాలెం వద్దకు వచ్చిన మంత్రి చిన రాజప్పను మహిళలు అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులతో మాట్లాడి పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీనివ్వడంతో మహిళలు శాంతించారు. 

ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత పోరాటం - సోనియా..

ఢిల్లీ : ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతులకు నష్టంచేసే అభివృద్ధికి తాము వ్యతిరేకమన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి ప్రధాని మోడీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. 

మంత్రి స్తృతి ఇరానీకి కాంగ్రెస్ లీగల్ నోటీసులు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టుపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆరోపించింది. 

17:36 - September 20, 2015

హైదరాబాద్ : నగరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం గమనార్హం. రైతుల ఆత్మహత్యలకు పాల్పడవద్దని పలువురు సూచిస్తున్నా అప్పులు తీర్చలేక..తీవ్ర వత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే ట్యాంక్ బండ్ వద్ద ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బేగంపేట పంప్ హౌజ్ వద్ద మల్లేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిది మెదక్ జిల్లా దౌల్తాబాద్ (మం) రాంసాగర్ స్వస్థలం. వారం క్రితమే మల్లేష్ ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. ఓ కంపెనీలో సెక్యూర్టీ గార్డుగా మారాడు. కానీ అప్పుల బాధ అతడినికి కృంగదీసింది. చివరకు తనువు చాలించాలని అనుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అప్పులు ఎప్పుడు తీరుస్తావని పలువురు వత్తిడి తేవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. వారంలో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

 

17:30 - September 20, 2015

ఖమ్మం : ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాల తేడాలున్నాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో రూ. పది కోట్లతో నిర్మించిన పుట్టకోట పనులను ఆయన ప్రారంభించారు. రూ. ఏడు కోట్లతో పూర్తి చేసిన ఏదులాపురం మంచినీటి పథకం ప్రజలకు అంకితమిచ్చారు. జీళ్ల చెరువులో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాటాట్లాడారు. రైతులకు ఆరు లక్షల పరిహారాన్ని అందచేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధాలన్నింటినీ నెరవేర్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బిల్డప్ ఎక్కువ..పని తక్కువ చేస్తారని..అదే కేసీఆర్ బిల్డప్ తక్కువ..పని ఎక్కువ చేస్తారని తెలిపారు. మామను వెన్నుపోటు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 

17:25 - September 20, 2015

హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలా పోరాడుదామని టిటిడిపి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఆదివారం ఆ టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి నివాసంలో నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. అధికార పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుందనే దానిపై చర్చించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లి రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆత్యహత్యల పరిహార విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనపై అసెంబ్లీలో నిలదీయాలని నిర్ణయించారు. మరోవైపు 65 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలన్న బాబు ఆదేశాలపై ఆరుగురు సభ్యులుతో ఓ కమిటీని నియమించారు. ఈ ఆరుగురు సభ్యులు కూడా ఎర్రబెల్లితో చర్చించారు.

రైతుల పరిహారంలో సర్కార్ మెలికలు - ఎర్రబెల్లి..
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం మెలికలు పెడుతోందని ఎర్రబెల్లి విమర్శించారు. ఈనెల 19వ తేదీ నుండి పరిహారం చెల్లింపులు అమలు చేస్తామనడం దారుణమని, 19వ తేదీకి ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలని కోరారు. 

ఏపీలో అక్టోబర్ 1 నుండి లారీల బంద్..

విజయవాడ : అక్టోబర్ 1వ తేదీ నుండి లారీల బంద్ కు ఏపీ లారీ యజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి పెట్రోల్ బంక్ యజమానుల సంఘం మద్దతు తెలిపింది. అక్రమ టోల్ గేట్ ల కనెక్షన్లను నిరోధించాలని..లారీల అద్దెపై పీడీఎస్ నిలిపివేయాలని డిమండ్ చేస్తున్నారు.

 

హైదరాబాద్ లో మరో రైతు ఆత్మహత్య..

హైదరాబాద్ : నగరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరి వేసుకుని మల్లేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేట పంప్ హౌజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లేష్ స్వస్థలం మెదక్ జిల్లా దౌల్తాబాద్ (మం) రాంసాగర్. వారం క్రితమే ఉపాధి కోసం నగరానికి వచ్చిన మల్లేష్ సెక్యూర్టీ గార్డుగా మారాడు. అప్పుల బాధతో మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

పెరిగిన గోదావరి ఉధృతి..

ఖమ్మం: జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరింది.

 

తమది రైతు ప్రభుత్వం - హరీష్ రావు..

నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన జిల్లాలోని బీర్కూరు మండలం చించెల్లిలో లిఫ్టు ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. 

దొరల పెత్తనాన్ని ప్రజలు సహించరు - కేసీఆర్...

హైదరాబాద్ : దొరల పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు సహించరని సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేధావులు మౌనం వీడాలని సూచించారు.

 

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి..

నల్గొండ : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు చిన్నారులను కారు ఢీకొంది. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళుతానని ఇద్దరు చిన్నారులను కారులో ఓ వ్యక్తి ఎక్కించుకున్నాడు. అనంతరం చిట్యాల (మం) వెలిమినేడు వద్దకు చేరుకోగానే గణేష్ (11) బాలుడు మృతి చెందాడు. దీనితో గణేష్ ను, గాయపడిన మరో బాలుడిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు గమనించి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. 

16:59 - September 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల క్షేమం కోసం తాను సహాయం చేస్తానని ప్రముఖ బ్యాడ్మెంటెన్ క్రీడాకారిని గుత్తా జ్వాల పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్న సందర్భంలో తెలంగాణ జాగృతి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో గుత్తా మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా సీరియస్ ఇష్యూ అని, దీనిపై దృష్టి పెట్టాల్సినవసరం ఉందన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. ఎలాంటి సహాయం చేయాలన్నా తాను ముందుకొస్తానని వెల్లడించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు..ఇతరత్రా కార్యక్రమాలు చేయాలని సూచించారు. భవిష్యత్ లో ప్రభుత్వానికి తన సహాయ సహాకారాలు అందిస్తానని గుత్తా జ్వాల తెలిపారు.

16:46 - September 20, 2015

తూర్పుగోదావరి : మండపేట ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల్లో మహిళల అభ్యంతకర వీడియోలు తీసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మండపేటలో జరిగిన ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో మహిళలను అభ్యంతకర వీడియోలు తీశారు. వీటిని వారి కుటుంబసభ్యులకు చూపించి బ్లాక్ మెయిల్ లకు పాల్పడ్డారు. వారి నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.

16:40 - September 20, 2015

కరీంనగర్ : జిల్లాలో కల్లు సేవిస్తున్న పలువురు అనారోగ్యాలకు గురవుతున్నారు. మరికొంతమంది వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జగిత్యాల మండలం తిమ్మాపూర్ లో కల్లును సేవించిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. వీరి సంఖ్య 50కి చేరుకుంది. ఇదిలా ఉంటే కల్లును సేవించిన పలువురు వింతవింతగా ప్రవర్తిసున్నారు. కల్తీ కల్లును నిలిపివేయడంతో సాధారణ కల్లునే వారు సేవిస్తున్నారని, నిషా ఎక్కకపోవడంతో మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కల్తీ కల్లులో సాధారణంగా కలిపే మత్తు మందు దొరక్క పోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

16:26 - September 20, 2015

తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వరా అంటూ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి వాహన సేవల ఎదుట తమకు ప్రాధాన్యత కల్పించడం లేదంటూ కోప్పడ్డారు. ఇదంతా శ్రీవారి వాహన సేవ ఎదుటే జరగడంతో అక్కడున్న భక్తుల నోరెళ్లబెట్టారు. ఆదివారం మోహినీ అవతారంలో శ్రీవారు ఊరేగుతున్నారు. ఆ సమయంలో సభ్యులు ఏవీ రమణ, కృష్ణమూర్తి, శేఖర్ లు టిటిడి ముఖ్య భద్రతా అధికార నాగేంద్ర కుమార్ తో వాగ్వాదానికి దిగారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా గమనించిన శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఈఓ చిన్నంగారి రమణ సభ్యులను శాంతింప చేశారు. 

16:16 - September 20, 2015

గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదాపై తాడో పేడో తేల్చుకోవడానికి వైసీపీ సిద్ధమైంది. హోదా ఇస్తారా ? లేదా ? అని ప్రశ్నించబోతోంది. హోదా ఇవ్వనిపక్షంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నిరహార దీక్షకు కూర్చొబోతున్నారు. ఇందుకు జిల్లాలోని ఏసీ కాలేజీ సిద్ధమౌతోంది. ఆదివారం దీక్షకు ఎంపిక చేసిన ఏసీ కాలేజీని వైసీపీ నేతలు బోత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పార్థ సారధిలు పరిశీలించారు. అనంతరం భూమి పూజ చేశారు. ప్రత్యేక హోదాపై ఈనెల 25వ తేదీలోపు నిర్ణయం వెల్లడించాలని లేనిపక్షంలో జగన్ 26వ తేదీ నుండి దీక్ష ప్రారంభిస్తారని బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. 

ఎక్తా ర్యాలీ ఫ్లాప్ కాలేదు - హార్దిక్ పటేల్..

గుజరాత్ : ఎక్తా ర్యాలీ ఫ్లాప్ కాలేదని పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మరిన్ని ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, 10-15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

బీహార్ లో 150 సీట్లకు పోటీ - శివసేన..

బీహార్ : రాష్ట్రంలో 150 సీట్లకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన నేత సంజయ్ రావత్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు.

 

అలాహాబాద్ లో ఐదుగురు ఆత్మహత్య...

ఉత్తర్ ప్రదేశ్ : అలహాబాద్ లోని ఓ ప్రాంతంలో రైలుకు ఎదురుగా పడి ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. 

ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు - రాజ్ నాథ్ సింగ్..

మహారాష్ట్ర : ఇరుగు పొరుగు దేశాలతో భారత దేశం సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. వ్రిందావన్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటారని పేర్కొన్నారు. 

రైతుల పరిహారంలో సర్కార్ మెలికలు - ఎర్రబెల్లి..

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం మెలికలు పెడుతోందని ఎర్రబెల్లి విమర్శించారు. ఈనెల 19వ తేదీ నుండి పరిహారం చెల్లింపులు అమలు చేస్తామనడం దారుణమని, 19వ తేదీకి ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలని కోరారు. 

ఎర్రబెల్లి నివాసంలో టిటిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి నివాసంలో పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి తదితరులు హాజరయ్యారు. టిటిడిపి అధ్యక్షుడి ఎన్నిక, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

ప్రత్యేక ప్యాకేజీపై కాంగ్రెస్ పోరాటం - రఘువీరా..

ఢిల్లీ : ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై పోరాటం చేసి సాధిస్తామని ఎపి పిసిసి చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బీజేపీ నిజ స్వరూపం బయటపడిందని, బీహార్ ఎన్నికల్లో సోనియా, రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28 తేదీన చలో అసెంబ్లీ..

హైదరాబాద్ : బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈనెల 28వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఎస్వీకేలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విరసం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ఉంటుందని, విద్యాసాగర్ రెడ్డి, శృతిలను ముందే పట్టుకుని చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరగడం తొలిసారి కాదని, కేసీఆర్, చంద్రబాబులు అధికారంలోకి వచ్చినప్పటి నుండే బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. 

పుత్తూరులో రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి..

చిత్తూరు : పుత్తూరు (మం) తడుకు చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొని తల్లి, కూతురు మృతి చెందారు. 

వరంగల్ ఎన్ కౌంటర్ బూటకం - తమ్మినేని..

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ బూటకమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎస్వీకేలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ వ్యతిరేక విధానాలపై ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమని తమ్మినేని ప్రకటించారు. 

ఎన్ కౌంటర్ ఘటన కలిచివేసింది - బొత్స తారకం..

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ ఘటన కలిచివేసిందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బొత్స తారకం పేర్కొన్నారు. పోలీసులు మానత్వం లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు.

 

ఎస్వీకేలో ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం..

హైదరాబాద్ : ఎస్వీకేలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమ్మినేని వీరభద్రం, వరవరరావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి బొత్స తారకం, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్టు యాదగిరి, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. 

 

దళితుల సమస్యలపై పోరాడుతాం - ఏచూరీ..

ఢిల్లీ : దళితుల సమస్యలపై పోరాడుతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. దళితుల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఒత్తిడి తెస్తామన్నారు. మోడీ పాలనలో దళితులపై రైతులు పెరిగాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోడీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసమే కాంగ్రెస్ కిసార్ ర్యాలీ నిర్వహించిందన్నారు. 

15:26 - September 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు, వారిని ఆదుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత టెన్ టివితో మాట్లాడారు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు తెలంగాణ జాగృతి ముందుకొచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్స్ గ్రేషియా పెంచాలని తాము ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అందుకనుగుణంగానే సర్కార్ ఎక్స్ గ్రేషియా పెంచిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు స్పోర్ట్, ఫిలిం రంగాలకు చెందిన వారు ముందుకొచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగం, చదువు ఇప్పించడంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నెల..ఆరు నెలలకు సహాయం చేయడమా తదితర విషయాలపై కొద్ది రోజుల్లో వివరాలు మీడియాకు తెలుపడం జరుగుతుందన్నారు. నవంబర్ నెల నుండి దీనిపై ముందుకెళుతామని, రైతుల ఆత్మహత్య సంఖ్య విషయంలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలున్నారని, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు తాము కృషి చేస్తామని ఎంపీ కవిత తెలిపారు. 

15:18 - September 20, 2015

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ఆరేపల్లికి చెందిన కల్లూరి రాజయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో మొక్క జొన్న పంటను రాజయ్య సాగు చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. గత ఏడాది కూడా పంట నష్టంతో నాలుగు లక్షల రూపాయల మేర అప్పు పడ్డాడు. ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపానికి గురైన రాజయ్య ఆదివారం పంట చేనులో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించారు. 

15:09 - September 20, 2015

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరాలు ఆగడం లేదు. పంటలు చేతికి రాకపోవడం..అప్పులు తీర్చాలంటూ వత్తిడిలు...దీనితో తీవ్ర ఒత్తిడికి లోనైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంగం మండలం గవిచర్లకు చెందిన శ్రీనివాస్ అనే రైతు అప్పులు చేసి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. కానీ పత్తి పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీనితో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల వాళ్ల వత్తిడి..పంట నష్టపోవడం వల్లే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రైతు ఆత్మహత్య చేసుకున్నా ఆయన కుటుంబాన్ని ఎవరూ పలకరించ పాపన పోలేదని, కేవలం సానుభూతి తప్ప ఎలాంటి సహాయం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

15:05 - September 20, 2015

ఉత్తర్ ప్రదేశ్ : ఓ ఎస్‌ఐ మానవత విలువలను మర్చి.. 65 ఏళ్ల వృద్ధుడి పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. కృష్ణకుమార్ అనే 65 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్లుగా లక్నోలోని జనరల్ పోస్ట్‌ఆఫీస్ బయట ఉన్న ప్లాట్‌ఫాంపై తన పాత టైప్ రైటర్‌తో చిన్నా చితక పనులు చేసుకుంటు బతుకీడుస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఎస్‌ఐ కృష్ణకుమార్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లాడు. ఎప్పటి నుంచో తన బతుకు బండిని అక్కడే ఉండి నడుపుకుంటున్న కృష్ణ కుమార్ తిరిగి మరోసారి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈలోగా అక్కడికి మరోసారి వచ్చిన ఎస్‌ఐ కోపంగా అక్కడికి వెళ్లి ఆయన్ను అనరాని మాటలని, టైప్ రైటర్‌ను కాలితో తన్నుతూ నానా బీభత్సం చేశాడు. ఈదృశ్యాలను లోకల్ జర్నలిస్టులు చిత్రించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఎస్‌ఐ తీరుపట్ల పలువురు భగ్గుమన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వరకు వెళ్లింది. వెంటనే ఆ ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. సదరు పెద్దాయనకు తిరిగి ఓ కొత్త టైప్ రైటర్‌ను అధికారులు ఇప్పించారు. 

14:35 - September 20, 2015

చిత్తూరు : తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాధ్‌ జట్టీ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన గరుడసేవ ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరగనుంది. టీటీడీ అధికారులు, అర్బన్‌ జిల్లా పోలీసు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. టెన్ టివితో ఆయన ముచ్చటించారు. గత ఐదు రోజులులగా బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, లక్ష నుండి రెండు లక్షల మంది ప్రజలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగడం లేదని, కానీ గరుడ సేవకు అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. శాంతి భద్రతలపై, ట్రాఫిక్ పై దృష్టి సారించడం జరిగిందని, ఆర్టీసీ, ట్యాక్సీ, ప్రైవేటు వాహనాలకు మార్గాలు సూచించడం జరిగిందన్నారు. 140 సిసి కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బయటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ కేంద్రాల్లో గరుడ మహోత్సవాన్ని చూడవచ్చన్నారు. మొత్తం 6వేల మంది అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. 

14:32 - September 20, 2015

ఢిల్లీ : దేశంలో నయా ఉదారవాద శక్తులు నిరుపేద వర్గాలను దోచుకుతింటున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా విమర్శించారు. అకుంఠిత దీక్షతో రాజ్యాంగం రాసిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తికి సామ్రాజ్యవాద శక్తులు తూట్లు పొడుస్తున్నారని సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు విధాలుగా దోపిడి జరుగుతోందని, కులం..మతంపైనా, ఆర్థిక కారణంగా దోపిడి జరుగుతోందన్నారు. ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా, సామాజిక దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

14:29 - September 20, 2015

ఢిల్లీ : తాను కూడా రైతునే అని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కిసాన్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రైతు సమస్యలకు పరిష్కారం మాట దేవుడెరుగు అసలు అన్నదాతల సమస్యలు వినే తీరిక కూడా ప్రధాని మోడీకి లేదని కాంగ్రెస్‌ యువనేత రాహుల్ మండిపడ్డారు. దేశానికి రైతే రాజు అని గొప్పులు చెప్పే పాలకులంతా అన్నదాతల వైపు చూసేందుకే ఇష్టపడటం లేదని నిప్పులు చెరిగారు. రైతు శ్రేయస్సు లేకుంటే దేశం అంధాకరమవుతుందని, మోడీ భూమి తీసుకోవడం లేదని, ఒక అమ్మను దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. 

14:02 - September 20, 2015

ఖమ్మ జిల్లాకు చెందిన బాల మేధావి, వండర్ కిడ్ లక్ష్మీశ్రీజ..తన అపూర్వ మేధస్సుతో అబ్బురపరిచింది. ఆ వండర్ కిడ్ లక్ష్మీశ్రీజతో టెన్ టివి ముచ్చటించింది. తెలంగాణ చరిత్రను తడుముకోకుండా చెప్పింది. చరిత్రలోని కీలకఘట్టాలను తడుముకోకుండా చెప్పింది. నాటి నుంచి నేటి వరకు దేశ ప్రధానులుగా పని చేసిన వారి పేర్లు, ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రుల పేర్లను అనర్గలంగా పేర్కొంది. దేశంలోని రాష్ట్రాల పేర్లు వాటి రాజధానులు, తెలంగాణలోని నియోజకవర్గాలు, ఎంపీల పేర్లు, రాష్ట్ర రాజధానుల పేర్లను తడుముకోకుండా టకటకా చెప్పేసింది. ఆ బాల మేధావి చెప్పిన మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం....

 

ఎంఎస్ జి 2 నిషేధంపై పంజాబ్ లో నిరసనలు..

పంజాబ్ : ఎంఎస్ జి -2 చిత్ర ప్రదర్శనను నిషేధించడంపై పంజాబ్ లో డేరా సచ్చ సౌదా అనుకూల వర్గాలు ఆందోళన నిర్వహించాయి. సంగ్రూర్ ప్రాంతంలోని రైలు పట్టాలపై నిరసన వ్యక్తం చేయడంతో పలు రైళ్లు ఆగిపోయాయి. 

13:56 - September 20, 2015

బెంగళూరు : సౌతాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 , వన్డే సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. టీ 20 జట్టులో సీనియర్ మోస్ట్‌...ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి భారత టెస్టు జట్టులో చోటు సాధించాడు. ఆల్‌రౌండర్‌ రవీందర్‌ జడేజాను పక్కన పెట్టిన సెలక్టర్లు , యువ ఆల్‌రౌండర్‌ గురుకీరత్‌ సింగ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేశారు.

అక్టోబర్ 2న ప్రారంభం..
అక్టోబర్‌ 2న ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌తో పాటు, రెండో వారం నుంచి జరుగనున్న వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్లను బీసిసిఐ ప్రకటించింది. ముంబైలో జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ జట్లను ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌తో పాటు,5 వన్డేల సిరీస్‌లో భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడు.

తొలిసారిగా ఎంపికైన గురుకీరత్..
బంగ్లాదేశ్‌ సిరీస్‌తో టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను సెలక్టర్లు టీ 20 జట్టుకు ఎంపిక చేశారు. యువ ఆల్‌ రౌండర్‌ గురుకీరత్‌ సింగ్‌ భారత జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తరఫున అద్భుతంగా రాణించడంతో పాటు బంగ్లాదేశ్‌ -ఎ తో ముగిసిన వన్డే సిరీస్‌లో భారత్‌-ఎ జట్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న గురుకీరత్‌ సింగ్‌ తొలి సారిగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. లంకతో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించిన అమిత్‌ మిశ్రా రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూర్‌ జట్టు తరఫున తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరచిన పేసర్‌ శ్రీనాథ్‌ అరవింద్‌ టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా ఆల్‌రౌండర్‌గా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన రవీందర్‌ జడేజా...రెండు జట్లలోనూ చోటు కోల్పోయాడు. మొత్తం మీద దక్షిణాఫ్రికా టీ20, వన్డే సీరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్లలో రవీందర్‌ జడేజాను పక్కనపెట్టడంతో పాటు గురుకీరత్‌ సింగ్‌కు చోటు కల్పించడం మినహా...పెద్దగా సంచలనాలేమి లేకపోవడం విశేషం.

వన్డే జట్టు :  మహేందర్‌ సింగ్‌ ధోనీ, విరాట్‌ కొహ్లీ, శిఖర్‌ ధావన్‌,సురేష్‌ రైనా, అంబటి రాయుడు, అజింక్యా రహానే,రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, స్టువార్ట్‌ బిన్నీ, మోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌,అమిత్‌ మిశ్రా, గురుకీరత్‌ సింగ్‌.

టీ 20 జట్టు : మహేందర్‌ సింగ్‌ ధోనీ, విరాట్‌ కొహ్లీ, శిఖర్‌ ధావన్‌, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, అజింక్యా రహానే,రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌,అక్షర్‌ పటేల్‌, స్టువార్ట్‌ బిన్నీ, మోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, అమిత్‌ మిశ్రా, హర్భజన్‌ సింగ్‌,శ్రీనాద్‌ అరవింద్‌.

13:50 - September 20, 2015

హైదరాబాద్ : ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రొ.కోదండరాం అన్నారు. బచావో తెలంగాణ మిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 'రైతాంగం సంక్షోభం-మన తక్షణ కర్తవ్యం' అనే అంశంపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లి వారిని అన్ని ఆదుకోవాలన్నారు. వ్యవసాయంరంగం బాగుంటేనే రాజకీయ, ఆర్థికరంగం సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదంరాంతోపాటు రైతు సంఘం నేతలు, నిపుణులు హాజరయ్యారు.

 

వన్డే, టీ 20కెప్టెన్ గా ధోని..

బెంగళూరు : బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. సౌతాఫ్రికాతో భారత జట్టును ఎంపిక చేశారు. మూడు వన్డేలు, రెండు టీ 20లకు కమిటీ ఎంపిక చేసింది. వన్డే, టీ 20 కెప్టెన్ గా ధోని వ్యవహరించనున్నాడని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 

వన్డే టీం : ధోని, ధావన్, రోహిత్, కోహ్లీ, రాయుడు, రైనా, రహానే, బిన్నీ, అశ్విన్, అక్షర్ పటేల్, గుర్ కిరత్ సింగ్,

 

13:35 - September 20, 2015

ఢిల్లీ : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవ్వడంతో....లీగ్‌ నిర్వాహకులు ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు.బాలీవుడ్‌ హీరోలు, భారత క్రికెటర్లతో ప్రత్యేకంగా రూపొందించిన ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేసింది.టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ , ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ, దాదా సౌరవ్‌ గంగూలీతో పాటు బాలీవుడ్‌ హీరోలు సైతం ఈ ప్రమోషనల్‌ వీడియోలో సందడి చేశారు. హ్యాండ్‌సమ్‌ హంక్‌ హృతిక్‌రోషన్‌, రాక్‌ స్టార్‌ రణ్‌బీర్‌కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌తో పాటు ముంబై సిటీ జట్టు ఓనర్‌ నీతా అంబానిలతో ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ చెట్రీ ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

 

13:32 - September 20, 2015

ఢిల్లీ : కులవ్యవస్థ నిర్మూలించి... చట్టాల్లో సమూల మార్పులు చేసిన రోజే దళితులకు సరైన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని డిఎస్ ఎమ్ ఎమ్ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దళిత పార్లమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రిజర్వేషన్‌ వల్ల లబ్ధి పొందుతున్న దళితులశాతం అత్యల్పమే అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై ఆత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వాపోయారు. కులాంతర వివాహాలు చేసుకునే దళితులను హత మారుస్తున్నారు. ప్రభుత్వ రంగం క్షీణించడంతో రిజర్వేషన్లు పడిపోతున్నాయని పేర్కొన్నారు.

 

డేవీస్ కప్ టోర్నీలో ఫైనల్ లో జయరాం ఓటమి..

ఢిల్లీ : డేవిస్ కప్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. అన్ని మ్యాచ్ ల్లో సత్తా చాటిన భారత ప్లేయర్ అజయ్ జయరాం కొద్దిసేపటి క్రితం ముగిసిన ఫైనల్ లో పరాజయం పాలయ్యాడు. వరల్ నెంబర్ వన్ ర్యాంకర్ చైనాకు చెందిన చెన్ లాంగ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14-21, 13-21 స్కోరుతో వరుస సెట్లలో జయరాం ఓటమి చవి చూశాడు.

అనంతపురంలో పల్లె..పరిటాల సునీతల పర్యటన..

అనంతపురం : ఆత్మకూడురు మండలంలో గొరిదిండ్ల వద్ద పీఏబీఆర్ కాలువ పనులను మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీతలు పరిశీలించారు. 

రైతు సమస్యలపై పోరాడేందుకు తాము సిద్ధమే - రాహుల్..

ఢిల్లీ : రైతు సమస్యలపై పోరాడేందుకు తాము సిద్ధమేనని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు మోడీకి పట్టవని, ల్యాండ్ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవడం ప్రజా విజయమన్నారు. రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ బిల్లును ఎదుర్కొవాలని సూచించారు. మేక్ ఇన్ ఇండియాను టేక్ ఇన్ ఇండియాగా కేంద్రం మారుస్తోందని ఎద్దేవా చేశారు.

13:14 - September 20, 2015

నల్గొండ : జిల్లాలో సైకో సూదిగాడి సంచారం కలకలం రేపుతోంది. కనగల్‌ మండలం చెన్నారంలో సంతోషి అనే యువతిపై బైక్‌పై వచ్చిన సూదిగాడు దాడి చేసి వెళ్లాడు. ఈ ఘటనలో సంతోషి చేతికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు బాధితురాలి బ్లడ్‌ షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. 

12:59 - September 20, 2015

ఎపికి ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలని.... అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇదే అంశాలపై నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో రాఘవులు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీలు వంటి అంశాలను రాజకీయంగా పరిష్కారం చేయాలి తప్ప.. ఎవరికి నచ్చిట్లు వారు చేయాలంటే సాధ్యం కాదన్నారు. ప్రత్యేకహోదా అంశం ఒప్పందం ప్రకారం జరగాలంటే దానిపై రాజకీయమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు అందులోకి వస్తాయన్నారు. 'ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, స్పెషల్ స్టేటస్ డెవలప్ మెంట్ సపోర్టు' అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 26 న కేంద్రపభుత్వానికి ఒక మెమోరండాన్ని సమర్పించారు. ఈ మెమోరండంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయం కావాలి. ఏఏ అంశాల ప్రాతిపదికన సాయం అవసరమవుతుందనే అంశాలను ఆయన దీని మీద కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది. ఇంతకు ఆ మెమోరండంలో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఉన్నాయా.. అనే అంశాలపై రాఘవులు మాట్లాడారు.
మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ఎపికి ప్రత్యేకహోదా ఎందుకు ప్రకటించరూ.?
ఎపికి ప్రత్యేకహోదా ప్రకటన విషయంలో అరవింద్ పనగారియాకు, నీతి ఆయోగ్ కు సంబంధం లేదు. నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాంటిది.. వారికి తోచింది చెబుతారు. దాన్ని కేంద్రం పాటించవచ్చు., పాటించకపోవచ్చు. ప్లానింగ్ కమిషన్ కు ఉన్న హక్కులు, శక్తి.. నీతి ఆయోగ్ కు లేవు. నీతి ఆయోగ్ కేవలం ఆలోచన చేసే బృందం మాత్రమే.. అంతకుమించి దానికి ఎక్కువ విలువ లేదు. వారి ఆలోచనలు ప్రభుత్వంపై ప్రభావం చూపే పరిస్థితి లేదు. పనగారియా సలహా అడిగి బీహార్ కు ప్రత్యేకోహోదా ప్రకటన చేయలేదు. బీహార్ కు లక్షా 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేకప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.... ప్రత్యేకోహోదా కోసం 18 నెలలుగా పోరాటం చేస్తున్న ఎపికి ఎందుకు ప్రకటించలేదు. బీహార్ లో ఎన్నికల కోసం కేంద్రం ప్రత్యేకప్యాకేజీ ప్రకటన చేశారు. ఇది రాజకీయ నిర్ణయం. ఎపికి ప్రత్యేకహోదాపై ఒక రాజకీయ నిర్ణయం ఎందుకు చేయించలేకపోతున్నారు. ఎపికి ప్రత్యేకోహోదా ఇవ్వండి.. ఆ లోగా ప్రత్యేకప్యాకేజీ ప్రకటించండని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేద..? బీహార్ కు ఏ ప్రాతిపదిక మీద కేంద్రం.. లక్షా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఎపికి ఎందుకు ఇవ్వదు..? సంస్కరణలు గట్టిగా రావాలనుకునే వారు రాష్ట్ర హక్కులను ఎలా రక్షిస్తారు. వారు రాయితీలు ఇచ్చే అవకాశమే లేదు. ఎపి సర్కార్ రాజధాని నిర్మాణంపై పెట్టిన దృష్టి... ప్రత్యేకహోదాపై పెట్టడం లేదు'. అని అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:31 - September 20, 2015

ఇద్దరు సూపర్ స్టార్లు.. ఒకరు టాలీవుడ్ 'రాజకుమారుడు'. మరొకరు బాలీవుడ్ ' రారాజు'. బేషజాలు మర్చిపోయారు. తమది సినిమా కుటుంబమని.. ఆ సినీ వినీలాకాశంలో ఆత్మీయతలు తప్ప మరొకటి ఉండవని హద్దులు చెరిపేశారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ శనివారం 'బ్రహ్మోత్సవం' సెట్ లో ప్రత్యక్షమై ఆ చిత్ర యూనిట్ కు థ్రిల్ అందించారు. షారుఖ్ లాంటి స్టార్ తన సెట్ ని సందర్శించడంతో మహేష్ మనసు పులకించింది. అందుకే వెంటనే ట్విట్టర్ లో ఖాన్ దాదాకు  ప్రిన్స్ 'థ్యాంక్స్' చెప్పాడు. మహేష్ ట్వీట్ చేయగానే వెంటనే స్పందించాడు షారుఖ్ ఖాన్. 'బ్రహ్మోత్సవం' సెట్ ని సందర్శించడం చాలా సంతోషాన్నిచ్చిందని మహేష్ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. మీ యూనిట్ స్వాగతించిన విధానం చాలా బాగుందని మెచ్చుకొన్నాడు. త్వరలోనే మరోసారి కలుస్తాననీ చెప్పాడు. అప్పుడు ఇద్దరం కలిసి హైదరాబాదీ రుచులు ఆస్వాదిద్దాం అని షారుఖ్ ఓపెన్ గా తెలియజేశారు. 

మరి షారుఖ్ వస్తానంటే మహేష్ వద్దంటాడా... 'తప్పకుండా సర్... ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటా' అని రిప్లై ఇచ్చి తన హుందాతననాన్ని చాటుకున్నాడు. అయితే ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ హీరోల మైత్రి కొనసాగుతోంది. రామ్ చరణ్ - సల్మాన్, రానా - అభిషేక్, ఇలా చెబుతూ పోతే చాలా మందే ఉన్నారు. తాజాగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కీ - మహేష్ బాబుకీ మధ్య దోస్తీ కుదిరింది. ఈ సూపర్ స్టార్స్ ఫ్రెండ్షిప్ సినిమాదాకా వెళ్తే బావున్ను అని సిని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 

నల్గొండ జిల్లాలో సైకో సూదిగాడి కలకలం

నల్గొండ : జిల్లాలో సైకో సూదిగాడి దాడి కలకలం రేపింది. సంతోషి అనే యువతిపై సూదిగాడి దాడి చేశాడు. బాధితురాలి బ్లడ్ శాంపిల్స్ ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

11:43 - September 20, 2015

హైదరాబాద్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రంలో 252 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అందులో 171 రైతు కటుంబాలను ఆదుకున్నామని పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు క్రీడారులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన క్రీడాకారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సానియా మీర్జా తల్లి నసీమా మీర్జా మాట్లాడారు. 

171 రైతు కటుంబాలను ఆదుకున్నాం : కవిత

హైదరాబాద్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రంలో 252 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అందులో 171 రైతు కటుంబాలను ఆదుకున్నామని పేర్కొన్నారు.

11:31 - September 20, 2015

విజయవాడ : ఎయిర్ ఇండియా విమాంనలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. 

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం...

విజయవాడ : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. 

టిటిడి అధికారులపై పాలకమండలి ఆగ్రహం

తిరుమల : టిటిడి అధికారులపై పాలకమండలి సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్య భద్రత అధికారి నాగేంద్రకుమార్ తో బోర్డు సభ్యులు ఏవీ రమణ, శేఖర్, కృష్ణమూర్తి వాగ్వాదానికి దిగారు.

 

10:34 - September 20, 2015

శ్రీకాకుళం : ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆరు నెలలు దర్శనానికి అనువుగా ఉంటుంది. ఇదీ ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ విశిష్టత. ఇదే తరహా ప్రత్యేకతను కలిగి ఉందో ఆలయం. అదికూడా మనకు సమీపంలోనే..! ఎక్కడుంది..? ఏంటా ప్రత్యేకత..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే.
సిక్కోలు బద్రీనాథుడు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతంలోని శివాలయం ఉంది. క్రీస్తు శకం ఈ పురాతన ఆలయాన్ని 1676లో నిర్మించారు. కొండకోనల నడుమ ఉన్న ఈ ఆలయం ఇతర ఆలయాలకన్నా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
బద్రినాథ్‌ ఆలయానికి-శివాలయానికి దగ్గరి సామీప్యం
ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌ ఆలయానికి ఈ శివాలయానికి దగ్గరి సామీప్యం ఉండడం విశేషం. సంవత్సరంలో 6 నెలలు మంచుతో కప్పబడి, మిగిలిన ఆరు నెలలు దర్శనానికి అనువుగా ఉండడం బద్రినాథ్‌ విశిష్టత అయితే.. ఆరు నెలలు గుడి మొత్తం నీటిలో ఉండడం, మిగిలిన ఆరు నెలలు ఖాళీగా ఉండడం ఈ శివాలయం ప్రత్యేకత. కొండకోనల్లోంచి జాలువారే నీరు ఏకంగా గర్భగుడిలోకి సైతం చేరడం విశేషం.
జలకంఠస్వామి ఆలయంగా ప్రసిద్ధి
ఈ విధంగా చుట్టూ నీటి ప్రత్యేకత కలిగి ఉండడంతో ఈ నీలకంఠేశ్వర ఆలయం.. జలకంఠస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా.. ఎక్కడా కనిపించని విభూది చెట్లు సైతం ఇక్కడ ఉండడం గమనార్హం. ప్రకృతే స్వామివారికి జలాభిషేకం చేసే అద్భుత దృశ్యం ఇక్కడ తప్ప, మరెక్కడా కనిపించదని అర్చకులు చెబుతున్నారు.
అభివృద్ధికి నోచుకోని ఆలయం
ఇదిలాఉంటే.. అతిపురాతన క్షేత్రంగా ఉన్న ఈ శైవాలయం పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. ఈ నీలకంఠేశ్వర స్వామికి వందెకరాల మాన్యం ఉన్నా.. ఎవరికివారు ఆక్రమించుకోవడంతో.. భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయని చెబుతున్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధచూపాలని స్థానికులు కోరుతున్నారు.

 

10:24 - September 20, 2015

హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్ర్తతలు తీసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోడ్లు, వీధి లైట్ల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. 
ఆ సందడే వేరు..
వినాయక చవితి.. ఆ సందడే వేరు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ హుషారుగా చవితి సంబరాల్లో పాల్గొంటారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లే కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రేట‌ర్ ప‌రిధిలో 23 నిమ‌జ్జన కేంద్రాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో వ‌చ్చే వ్యర్థ ప‌దార్థాల‌ను తొల‌గించ‌డానికి 41 ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల 25 వాహ‌నాలు, 25 ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల 114 వాహ‌నాలు, 14 జేసీబీలను ఏర్పాటు చేయనున్నారు. 
చెత్తను తొల‌గించేందుకు 162 టీమ్‌లు
గణేష్‌ నిమజ్జన స‌మ‌యంలో వ‌చ్చే చెత్తను ఎప్పటిక‌ప్పుడు తొల‌గించేందుకు ప్రత్యేకంగా 162 టీమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో 2063 మంది పారిశుద్ధ్య కార్మికులు, 364 ఫిల్డ్ అసిస్టెంట్లు, 70 మంది సూప‌ర్ వైజ‌ర్లు ఉంటారు. వీరంతా భక్తులకు 24 గంట‌ల‌పాటు అందుబాటులో ఉంటారు. 
గ్రేటర్‌లో రోడ్ల పునరుద్ధరణకు చర్యలు
ఈ నెల 24న జ‌రిగే బ‌క్రీద్‌ సంద‌ర్భంగా వ‌చ్చే జంతు సంబంధిత వ్యర్థాల‌ను వెంట‌ వెంటనే తొల‌గించ‌డానికి ప్రత్యేక చ‌ర్యలు చేపట్టారు. ఇటీవ‌ల హైదరాబాద్‌లో కురిసి భారీ వర్షాల కార‌ణంగా రోడ్లు బాగా దెబ్బతిన్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకే గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. గ్రేటర్‌లో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని అధికారులు ప్లాన్‌ చేశారు. ఇందుకోసం 10 కోట్లు మంజూరు చేశారు. ఇక ఇప్పటికే ఉన్న వీధి దీపాలను సరిచేయడంతో పాటు అదనంగా మరిన్ని వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నారు. గణేష్‌ నిమజ్జన సమ‌యంలో విద్యుత్‌కు అంత‌రాయం క‌లగ‌కుండా ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టారు. మొత్తంగా గణేష్‌ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

 

10:09 - September 20, 2015

కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 845 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 9879 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద ఉధృతి

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 845 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 9879 క్యూసెక్కులుగా ఉంది.

ప్రారంభమైన ఏఈఈ ఆన్ లైన్ పరీక్ష

హైదరాబాద్ : ఏఈఈ ఆన్ లైన్ పరీక్ష ప్రారంభం అయింది. 931 ఏఈఈ పోస్టుల భర్తీకి 30, 783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఏఈఈ పరీక్షకు మొత్తం 99 సెంటర్లను ఏర్పాటు చేశారు.

 

ఉదయం 10 గంటలకు ఏఈఈ ప్రారంభం

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు ఏఈఈ ప్రారంభం కానుంది. 931 ఏఈఈ పోస్టుల భర్తీకి 30, 783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు గంట ముందే అనుమతి ఇవ్వనున్నారు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నారు. ఏఈఈ పరీక్షకు మొత్తం 99 సెంటర్లను ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

హైదరాబాద్ : పాతబస్తీ డబీర్ పురాలో దారుణం జరిగింది. దుండగులు ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

09:17 - September 20, 2015

హైదరాబాద్ : మరికాసేపట్లో టీఎస్పీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులకు పరీక్ష జరగనుంది. టీఎస్ పీఎస్ సీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు మొత్తం 99 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 75, కరీంనగర్‌ 4,ఖమ్మంలో 6, వరంగల్‌లో 14 సెంటర్లు ఏర్పాటు చేసారు. ఆన్‌లైన్‌ ద్వారానే ఏఈఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 30వేల 783 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30నిముషాల వరకు జనరల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం 2.30 నిముషాల నుంచి సాయంత్రం 5వరకు సివిల్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష జరగనుంది. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టీఎస్ పీఎస్ సీ సభ్యులు తెలిపారు.
వరంగల్ ..
జిల్లాలో మొత్తం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2860 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 8.30 గంటలకు అభ్యర్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 29 మంది ప్రత్యేకస్క్వాడ్స్... అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. అంధులకు అదనంగా మరో 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 20 మందికి ఒక ఇన్విజిలేటర్ తనిఖీ చేస్తున్నారు.  

08:59 - September 20, 2015

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగులో వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌'లో అనుపమ నటించింది. అక్కడ మంచి మార్కులు రావడంతో అలాగే తెలుగు 'ప్రేమమ్‌'లో కూడా ఈ అమ్మడే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించుకోకుండానే.. నితిన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న 'అ ఆ' సినిమాలో సైతం హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. అంతటితో ఆగకుండా తాజాగా రవితేజ సరసన కూడా నటించే లక్కీఛాన్స్‌ని దక్కించుకుందక్కించుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోయే చిత్రంలో ఒక హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారని సమాచారం. ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చి పడుతుండటంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోందట ఈ మలయాళ భామ. 

08:52 - September 20, 2015

హీరో రానా ట్విట్టర్ లో ఓ వెరైటీ ఫొటో పోస్టు చేయడం.. దానికి 'ప్రేమ అన్ని షేపుల్లో, సైజుల్లోనూ ఉంటుంది' అంటూ సమంత కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'బెంగుళూరు డేస్‌' రీమేక్‌లో రానా, సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం తాలూకు ప్రమోషన్ లో భాగంగానే ఈ ట్వీటాయణం నడిచింది. ఇక ఈచిత్రంలో పాత్రల విషయానికి వెళితే రానాకు పెళ్ళికి ముందే లవ్‌ఎఫైర్‌ ఉంటుంది. ఈ ప్రేమాయణం తాలూకు ఫ్లాష్‌బ్యాక్‌ సినిమాలో పది నిమిషాలుంటుంది. ఆ పది నిమిషాలు రానా ప్రేయసిగా సమంత నటిస్తోంది. అయితే ఈ పది నిమిషాల పాత్రకు సమంత ఎలా ఒప్పుకుందనే డౌట్ సహజంగానే వస్తుంది. అయితే ఈ పదినిమిషాలే సినిమాకు కీలకం కావడం అందునా దగ్గుబాటి కండల వీరుడి సినిమా కావడంతో సమంత కాదనలేకపోయిందట. కాగా మలయాళంలో ఈ పాత్రను నిత్యమీనన్‌ పోషించి మంచి మార్కులు కొట్టేసింది. మరి సమంత ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

08:37 - September 20, 2015

             నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. సాయి నిహారిక, శరత్‌ చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 10న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాత,హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌తో 'షేర్‌'లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. మల్లికార్జున్‌ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌ రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుం ది. 'పటాస్‌'తో సూపర్‌ హిట్‌ సాధించిన కళ్యాణ్‌ రామ్‌కి 'షేర్‌' మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది'' అని అన్నారు. దర్శకు డు మాట్లాడుతూ ''అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆక ట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవు తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. థమన్‌ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్‌ అవుతుంది'' అని చెప్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

08:35 - September 20, 2015

         'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' ఫేమ్‌ సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెలాఖరుకి పూర్తి కానుంది. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర మొదటి పోస్టర్‌ని విడుదల చేశాం. ఒకమ్మాయి చైర్‌లో కూర్చోవటం, బల్బ్‌ వెలుగుతూ పక్కనే హీరో సుధీర్‌బాబు నిలబడి ఉండటం ఇలా చాలా వైవిధ్యంగా ఉండే పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశాం . దీనికి మంచి స్పందన వస్తోంది. రెండో పోస్టర్‌ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశాం. ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్‌ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్‌వాల్వ్‌ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని'' అని అన్నారు

 

నేడు కేరళ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ : నేడు ఫిల్మ్ నగర్ లో కేరళ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్య అతిథిగా కేరళ సీఎం ఊమెన్ చాందీ హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎపీసీసీ చీఫ్ రఘువీరా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరుకానున్నారు. 

నేడు టీఎస్ పీఎస్సీ తొలి పరీక్ష..

హైదరాబాద్ : నేడు టీఎస్ పీఎస్సీ తొలి పరీక్ష జరుగనుంది. 931 ఏఈఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 30, 783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నాలుగు జిల్లాల్లో 99 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి పేపర్ జనరల్ స్టీడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు రెండో పేపర్ పరీక్ష జరుగనుంది. 

07:54 - September 20, 2015

ఢిల్లీ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. విమాన ప్రమాదంలో మరణించలేదా..? స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆయన జీవించే ఉన్నారా..? అవుననే అంటున్నాయి.. శుక్రవారం బహిర్గతమైన నేతాజీ రహస్య దస్త్రాలు. నేతాజీకి సంబంధించి ఇన్నాళ్లూ ప్రజల్లో ఉన్న ఎన్నో అనుమానాలు.. అపోహలను ఈ ఫైళ్లు పటాపంచలు చేశాయి.
1947 తర్వాత కూడా జీవించే ఉన్న నేతాజీ
సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలస పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు ఇప్పటివరకూ ప్రపంచం నమ్ముతోంది. కానీ ఆయన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా అంటే.. 1947 తర్వాత కూడా జీవించే ఉన్నారని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శుక్రవారం బహిర్గతం చేసిన ఫైళ్లు బలపరుస్తున్నాయి.
తండ్రికి లేఖ రాసిన నేతాజీ సోదరుడు ఎస్‌కే బోస్‌
నేతాజీ సోదరుడు శరత్‌ చంద్రబోస్‌ కుమారుడు ఎస్‌కే బోస్‌ రాసిన ఉత్తరం ఓ ఫైళ్లలో ఉంది. దీన్ని, 1949 డిసెంబర్‌ 12న ఆయన కోల్‌కతాలోని తన తండ్రికి రాశారు. నేతాజీ... రేడియోలో ప్రసంగించనున్నట్లు పెకింగ్‌ రేడియో తనకు సమాచారం అందించిందని.. హాంకాంగ్‌ ఆఫీసు ఆ ప్రసంగాన్ని వినేందుకు ప్రయత్నించినా.. ఏమీ వినిపించలేదని ఎస్‌కే బోస్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.
1945లో నేతాజీ మరణించలేదని లిల్లీ లేఖ ద్వారా రూఢీ
శరత్‌చంద్రబోస్‌కు స్విట్జర్లాండ్‌ పాత్రికేయురాలు లిల్లీ అబెగ్‌.. 1949 నవంబర్‌ ఒకటో తేదీన రాసిన ఇంకో లేఖ ప్రకారమూ నేతాజీ 1945లో మరణించలేదన్నది రూఢీ అవుతోంది. సుభాష్‌ చంద్రబోస్‌ పెకింగ్‌లో ఉన్నట్లు ఆమె లేఖ వెల్లడిస్తోంది. ఈ లేఖ అందిన నెలకే శరత్‌ రాసిన ప్రత్యుత్తరంలో తన సోదరుడు జీవించే ఉన్నట్లు 1946లో జపాన్‌ వర్గాలు లిల్లీకి చెప్పి ఉంటే తమ నమ్మకం మరింత బలపడినట్లేనని పేర్కొన్నారు.
1945 ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని వెల్లడి
మరోవైపు.. నేతాజీ అదృశ్యంపై 1949లో హౌరా సీఐడీ జరిపిన విచారణలో.. 1945 ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదమూ నమోదు కాలేదని తేలింది. నేతాజీ విమాన ప్రమాదానికి సంబంధించిన వదంతులు 1942 నుంచి 1944 వరకూ జోరుగా షికారు చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిందని భావించిన రోజున.. బ్యాంకాక్‌లోని నేతాజీతో ఆయన సోదరుడు శరత్‌ బోస్‌ మాట్లాడినట్లు రాయిటర్స్‌ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ అందిన రహస్య ఫైళ్ల సమాచారాన్ని బట్టి నేతాజీ 1945 విమాన ప్రమాదంలో మరణించలేదన్నది స్పష్టమవుతోంది.
నేతాజీ కుటుంబ సభ్యులపై భారత ప్రభుత్వం నిఘా
నేతాజీ కుటుంబంపై భారత ప్రభుత్వ నిఘా అంశం చర్చనీయాంశమైంది. నేతాజీ అదృశ్యం తర్వాత ఆయన కుటుంబ సభ్యులపైనా.. వారికి వచ్చే ఉత్తరాలు.. ప్రత్యుత్తరాలపైనా నిఘా ఉంచారని తాజా ఫైళ్ల ద్వారా అర్థమవుతోంది. కోల్‌కతాలోని ఎల్గిన్‌ రోడ్డులోని పోస్టాఫీసులోను, జనరల్‌ పోస్టాఫీసులోనూ ఈ ఉత్తరాలను చదివే వారని తెలుస్తోంది. నేతాజీ సన్నిహితులైన కాంగ్రెస్‌ నేతలపైనా.. ఆయన స్థాపించిన నేషనల్‌ ఆర్మీ అధికారులపైనా నిఘా ఉంచారని తేలడంతో.. నేతాజీ వారసులు తీవ్రంగా గర్హిస్తున్నారు.
కేంద్రం వద్ద మరో 130 దాకా రహస్య పత్రాలు
నేతాజీకి చెందిన 64 రహస్య దస్త్రాలను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇవి కాకుండా కేంద్రం వద్ద మరో 130 దాకా నేతాజీ రహస్య ఫైళ్లు ఉన్నట్లు భావన. వీటినీ బహిర్గత పరిస్తే.. నేతాజీకి సంబంధించిన అన్ని అనుమానాలూ పటాపంచలవుతాయని ఆయన వారసులు అభిప్రాయపడుతున్నారు. కానీ విదేశాలతో దౌత్య సంబంధాల దృష్ట్యా వీటిని ఎప్పుడు బయట పెట్టేదీ ఇప్పుడే చెప్పలేమని కేంద్రం చెబుతోంది. సో.. నేతాజీ రహస్యం పార్ట్‌ టూ కోసం మరింత కాలం వేచి ఉండక తప్పదన్న మాట.

 

 

07:40 - September 20, 2015

ఢిల్లీ : వివక్ష పెరిగిపోతోంది. అంటరానితనపు కత్తి అమాయక దళితులపై వేటు వేస్తూనే ఉంది. ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లపై కొందరి కడుపుమండిపోతోంది. మాకు రిజర్వేషన్లు అమలు చేయండి లేకుంటే మొత్తం రిజర్వేషన్లు తీసేయండి అంటూ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి విపరీత పరిస్ధితులను ఎదుర్కొనేందుకు దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ నడుం బిగించింది. దళితులను ఐక్యం చేసేందుకు ఉద్యమం ప్రారంభించింది.
వివక్ష రూపు మాపేందుకు దళిత సంఘాలు సన్నద్ధం
దళితులపై వివక్ష రూపు మాపేందుకు దళిత సంఘాలు సన్నద్ధమయ్యాయి. సామాజికంగా,ఆర్ధికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న దళితుల సంక్షేమం కోసం పోరాడాలని నిశ్చయించుకున్నాయి. అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని దళిత్‌ శోషణ ముక్తి మంచ్‌(డిఎస్ ఎస్ ఎమ్) న్యూఢిల్లీలో ఓ జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రొఫెసర్లు, దళిత మేధావులు, దళిత నాయకులు, విద్యార్ధులు హాజరై తమ భావాలను పంచుకున్నారు.
కులవ్యవస్ధలో మార్పు వచ్చినప్పుడే సమసమాజం : కంచె ఐలయ్య
కులవ్యవస్ధలో సమూల మార్పు వచ్చినప్పుడే సమసమాజం, సమానత్వం ఏర్పడుతుందని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య తేల్చిచెప్పారు. నేను బిసీని మొత్తుకుంటున్న ప్రధాని, దేశంలో వెనుకబడిన వర్గాలకు కాసింత న్యాయం కూడా చేయలేదని కంచె ఐలయ్య మండిపడ్డారు. అదీకాక హిందుత్వాన్ని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలు దళిత పోరాటాల్లో ముందంజలో ఉన్నందుకు ఐలయ్య హర్షాన్ని వ్యక్తం చేశారు.
తిరుగుబావుటా ఎగురవేసిన నాడే దళితులకు న్యాయం : బివి.రాఘవులు
దళిత సమస్యలపై తిరుగుబావుటా ఎగురవేసిన నాడే దళితులకు న్యాయం జరుగుతుందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడంతో పాటు దళితుల సమస్యలపైనే చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. దళితుల పట్ల వివక్ష చూపిస్తే వామపక్షాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రాఘవులు హెచ్చరించారు.
దళిత పార్లమెంట్
ఇదిలా ఉంటే దళిత సమస్యల పరిష్కారం కోసం నేడు జంతర్‌మంతర్‌ వద్ద దళిత్ పార్లమెంట్ పేరుతో దళిత నాయకులు ధర్నా చేపట్టనున్నారు. దళిత్‌ నేత అషీమ్‌ బాలా అధ్యక్షతన జరుగుతున్న ఈ ఆందోళనలకు జాతీయనేత పీఎస్‌ కృష్ణ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతో పాటు కాంగ్రెస్‌ నేత జేడీ శీలం హాజరవుతున్నారు.

 

నేడు నిజామాబాద్ జిల్లాలో దత్తాత్రేయ, హరీష్ పర్యటన

నిజామాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి హరీష్ రావులు నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయనున్నారు.

 

నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

ఖమ్మం : మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.

 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ పర్యటన

ఆదిలాబాద్ : నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

06:59 - September 20, 2015

హైదరాబాద్ : సుదీర్ఘంగా సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడం రైతులకు తీవ్ర నిరాశ కలిగించింది. దీని ప్రకారం నిన్నటి వరకు చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు ఈ పరిహారం వర్తించదు.
వర్షాభావ పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై చర్చ..
తెలంగాణ మంత్రివర్గం సమావేశం ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై చర్చించింది. అన్నదాతల బలవన్మరణాలపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్తప్తి చేసింది. ఆత్మహత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
కరవు మండలాలు ప్రకటించాలని నిర్ణయం
మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరవు మండలాలు ప్రకటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈనెల 30 వరకు జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం, పంటల విస్తీర్ణం, ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకని సెప్టెంబర్ 30 తర్వాత కరవు మండలాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. వెయ్యి మంది అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను నియమించాలని తీర్మానించింది. అలాగే మెదక్ జిల్లా ములుగులో ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే రబీలో ఏయే పంటలు వేసుకోవాలో రైతులకు గైడెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కడియం శ్రీహరి వెల్లడించారు.
నాలుగు ఇండియా రిజర్వ్ బెటాలియన్ల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో నాలుగు ఇండియా రిజర్వ్ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ లో వీటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వీటి ద్వారా దాదాపు 3,896 పోస్టులు ఏర్పడతాయని తెలిపింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అధికారులతో 3 ట్రస్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

06:53 - September 20, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు మరోసారి సింగపూర్‌ పర్యటనకు చంద్రబాబు బృందం సిద్ధమైంది. ఈనెల 20న మంత్రులు, సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సింగపూర్‌ బయల్దేరతారు. ఆ దేశ ప్రధాని లీ శాన్‌లూంగ్‌ను రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించనున్నారు. 21న సింగపూర్ కన్సార్టియంతో సైన్స్ పార్క్‌లో జరిగే వాణిజ్య సమావేశంలో సీఎం నేతృత్వంలోని ప్రభుత్వ బృందం పాల్గొంటుంది. ఆ తరువాత మంత్రి ఈశ్వరన్‌తో జరిగే విందు సమావేశంలో...అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టే స్విస్ ఛాలెంజ్ విధానంపై చర్చిస్తారు. సాయంత్రం సౌత్ ఆసియన్‌ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్టియం ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు.
22న సింగపూర్ సిటీ గ్యాలరీ సందర్శన
ఇక రెండో రోజున చంద్రబాబు బృందం సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శిస్తుంది. అక్కడి నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఎయిర్ బేస్‌లు, రిజర్వాయర్లు ఇతర ప్రాంతాలను పరిశీలిస్తారు. సివిక్ డిస్ట్రిక్ట్‌, మెరీనా బే ప్లానింగ్‌పై సమీక్షిస్తారు. కాన్సెప్ట్ ప్లాన్‌, మాస్టర్ ప్లాన్లను అధ్యయనం చేస్తారు. సింగపూర్ సిటీ గ్యాలరీ సందర్శనలో గ్రీన్‌ అండ్ బ్లూ స్పేసెస్, వినోద ప్రాంతాలు, ఐలాండ్ వైడ్ వాటర్ క్యాచ్ మెంట్, వ్యర్థాల నిర్వహణ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నెట్‌వర్క్స్ తో భూముల సద్వినియోగంపై ప్రణాళికలను పరిశీలిస్తారు.
22న సింగపూర్‌ నుంచి తిరుగు ప్రయాణం
రెండు రోజుల పర్యటనలో 3 టౌన్‌షిప్‌లను చంద్రబాబు సందర్శిస్తారు. క్యాలింగ్ బెండమీర్ రీజియన్, ఛాంగి బిజినెస్ పార్క్ రీజియన్, వన్‌ నార్త్ రీజియన్ హబ్బులను పరిశీలిస్తారు. చంద్రబాబు బృందం 22న తిరుగు ప్రయాణమవుతుంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ముఖ్య విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. దీంతో సీఆర్డీఏ విభాగాల డైరెక్టర్లు, ఇతర అధికారులు సింగపూర్ పర్యటనకు కావాల్సిన సమస్త సమాచారం సేకరించేపనిలో పడ్డారు. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులను సీఆర్డీఏ క్రోడీకరిస్తోంది.

 

 

నేడు తెలంగాణలో ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ ఆన్ లైన్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ ఆన్ లైన్ పరీక్ష జరుగనుంది. టీఎస్ పీఎస్సీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది. 30,783 మంది అభ్యర్థులు హాజురుకానున్నారు.

నేడు సింగపూర్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు..

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు నేడు సింగపూర్ వెళ్లనున్నారు. ఉదయం 8.45 గంటలకు చెన్నై బయల్దేరనున్నారు. చంద్రబాబు చెన్నై నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.

 

నేడు కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ విజయోత్సవ ర్యాలీ

ఢిల్లీ: నేడు రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. భూసేకరణ బిల్లుపై ఎన్ డిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో సంబర పడుతున్నారు.  

Don't Miss