Activities calendar

21 September 2015

21:44 - September 21, 2015

అవి ఎదురు కాల్పులా...? లేక హత్యలా..? శృతి, సాగర్ల ఒంటిపై గాయాలెందుకున్నాయి..? ప్రజా ఉద్యమాల నుంచి మావోయిస్టుల వరకు వ్యతిరేకించే గొంతులను నులమడమే తెలంగాణ సర్కార్ మార్గమా...? విపక్షాన్ని, వ్యతిరేకస్వరాలను భరించే పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదా..? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి.. ప్రజా సంఘాలు... ఏమంటున్నాయి. గాయపడ్డ తెలంగాణపై ఈరోజ్ వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం చూద్దాం... ఆ వివరాలను వీడియోలో చూడండి.....

 

హెచ్ సియూ వీసీగా ప్రొ.అప్పారావు పాదిలె

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వీసీగా ప్రొ.అప్పారావు పాదిలె నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇరిగేషన్ పై మంత్రి దేవినేని వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ : ఇరిగేషన్ పై మంత్రి దేవినేని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26వ తేది నాటికి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 3 వరకు నీటి పరిరక్షణ లెక్కలపై అవగాహన కార్యక్రమాలు జరుపనున్నట్లు తెలిపారు.

 

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

హైదరాబాద్ : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అబ్దుల్ లతీఫ్ ను అరెస్టు చేశారు. కేరళలో చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు లతీఫ్ ను అరెస్టు చేశారు. 

20:53 - September 21, 2015

ఫ్యాషన్ ను అనుకరించటంలో టీనేజర్స్ దే ఫస్ట్ ఛాయిస్. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను మారుస్తూ న్యూలుక్ తో కనిపిస్తుంటారు. వారి కోసం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

20:51 - September 21, 2015

కెరీర్ నిర్మాణంలో ఈ తరం ప్రత్యేకత చాటుకుంటోంది. నలుగురికీ భిన్నంగా అడుగులేస్తోంది. ప్యాషన్ ను ప్రొఫెషన్ గా మార్చుకోవటానికి ఇష్టపడుతోంది. కళలకు ఆధునికతను అద్దుతోంది. అవే కళలకు సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించేందుకు అలుపెరుగని కృషి చేస్తోంది. అలాంటి కృషి చేస్తున్న యువ సాంకేతిక కళాకారిణిని పరిచయం చేసేందుకు ఇవాళ్టి స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
కెరీర్ కు పునాదులు
ఆడియో ఇంజనీర్ గా కెరీర్ కు పునాదులు వేసుకుంటున్న యువతి అరుదైన ఘనత సాధించింది. పలు రంగాలలో ప్రావీణ్యం సాధించి దక్షిణాదిలో అతి కొద్ది మంది ఆడియో ఇంజనీర్స్ లో ఒకరిగా ప్రత్యేకత చాటుతున్న వనిత సాజిదా ఖాన్.
కళలపై సాజిదాకు ప్రత్యేక ఆసక్తి
సంగీత దర్శకురాలిగా స్థిరపడాలనుకుంటున్న సాజిదా కళలపై తనకున్న ప్రత్యేక ఆసక్తినే కెరీర్ గా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళలు అరుదుగా రాణించే రంగంలో ప్రతిభ చాటుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె భవిష్యత్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మానవి కోరుకుంటోంది.


 

యువతిపై సామూహిక అత్యాచారం...

కరీంనగర్ : జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామంలో యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

 

వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి

పశ్చిమగోదావరి : టినర్సాపూర్ మండలం ధర్మాజీగూడెంలో నిర్వహించిన వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు యువకులు చెరువులో పడి గల్లంతయ్యారు.

 

20:32 - September 21, 2015

అమీర్ ఖాన్ కథానాయకుడుగా నటిస్తున్న కొత్త చిత్రం 'దంగల్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. పీకే తరహాలో ఈ చిత్రంలోనూ ఆమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

20:29 - September 21, 2015

కరీంనగర్‌ : జిల్లాలోని అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. చిగురు మామిడి మండలం నవాబుపేట గ్రామంలో సాగరిక అనే మహిళ రైతు గత ఐదేళ్లుగా ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. ప్రతి యేడాది పత్తి పంట నష్టాలు మిగిలిస్తోంది. ఈ ఏడాది కూడా నష్టాలే మిగిలాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సాగరిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

 

20:23 - September 21, 2015

నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పౌర హక్కులను, ప్రజాస్వాయ్యాన్ని కాలరాస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో... పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నవ తెలంగాణ జన తెలంగాణ వామపక్ష ఉద్యమ పోరు' అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 25 వేల మంది ఆశ ఉద్యోగులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవటం విచారకరమన్నారు. కార్మికులందరికి సిపిఎం వెన్నంటి ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు మావోయిస్టుల అజెండానే.. తమ ప్రభుత్వ అజెండా అన్న కేసీఆర్‌... నేడు మావోయిస్టుల ఏరివేతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

 

ముగిసిన గవర్నర్ సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. 

20:18 - September 21, 2015

హైదరాబాద్ : డీఎస్ కు టీఎస్ సర్కార్ కేబినెట్ హోదా కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ సర్కార్ ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. డీఎస్ కు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో ఈ పిటిషన్ వేశారు.

 

20:13 - September 21, 2015

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ యువతలో దేశభక్తిని రగిలించిన నవయుక కవితా వైతాళికుడు గురజాడ అప్పారావు. పాశ్చాత్య వ్యామోహంతో కొట్టుకుపోతున్న భారత యువతను తట్టిలేపిన కలం యోధుడు. తెలుగు సాహిత్యానికి వెలుగుజాడగా దారి చూపిన గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా టెన్‌ టెవీ ప్రత్యేక కథనం.
కలం పట్టిన యోధుడు గురజాడ
కలం పట్టిన యోధుడు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు గురజాడ అప్పారావు. జాతీయతా స్ఫూర్తి దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడాయన. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న యువతను మేల్కొలిపేందుకు ఆయన కలం కదం తొక్కింది. భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను యువతరానికి గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి గురజాడ.
విశాఖ జిల్లాలో జననం
విశాఖ జిల్లా యలమంచిలిలో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబర్ 21న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు గురజాడ. బాల్యంలోనే మాతృభాషపై మమకారం పెంచుకున్న గురజాడ...తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. వ్యవహారిక భాషోద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ప్రజల భాషకు సాహిత్య గౌరవాన్ని కలిగించడం, స్త్రీలకు కట్టుబానిసతనం నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పొందాలనే స్ఫూర్తిని రగిలించడం అనే రెండు లక్ష్యాలతో సాహిత్యరచనకు పూనుకొన్నాడు. గురజాడ అవతరణతో ఆంధ్రసాహిత్యంలో అసలైన స్త్రీపర్వం మొదలైంది. మహిళ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, హక్కునీ, శక్తినీ వాళ్లు గుర్తించేలా చేయగల నూతన సృజనమార్గానికి బాటలు వేశారు. స్త్రీజాతికి విముక్తి కల్పించడానికి, వారిలో ధైర్యసాహసాలు మేల్కొల్పడానికి కన్యాశుల్కమనే నూతన ఇతిహాస సృష్టితో స్త్రీలకు ప్రశ్నించడంలోని తొలి తెలుగు పాఠాలను నేర్పించినవాడు గురజాడ. పరాధీనతను వదిలించి ప్రగతిమార్గంలోకి మళ్లించిన వెలుగుజాడ గురజాడ.
విధవా వివాహ సమస్య, వేశ్యా వ్యవస్థ నిర్మూలన
నాటకం, కవిత్వం, కథలు అనే వేర్వేరు ప్రక్రియలు ఎంచుకున్నా గురజాడ వస్తువు మాత్రమే ఒకటే. పాశ్చాత్య నాగరికతా వ్యామోహం, బాల్య వివాహాలు, విధవా వివాహ సమస్య, వేశ్యా వ్యవస్థ నిర్మూలన, కులమత సంప్రదాయాలు, విద్యావ్యవస్థ, మూఢాచారాలు, అవినీతి అనే అంశాలను కన్యాశుల్కంలోను, మిగతా రచనల్లోనూ తనదైన శైలిలో మార్గనిర్దేశం చేశాడు గురజాడ. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30న అనారోగ్యంతో కన్నుమూశారు గురజాడ అప్పారావు.
దేశానికి నిర్దేశం గురజాడ
'వ్యక్తి స్వేచ్ఛను సాధించండి. అందువల్ల దేశం స్వతంత్ర దేశమవుతుంది. జాతి మత కుల భేదాలు మరచి ప్రేమను పంచండి. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది. కామించవద్దు, ప్రేమించండి. మనిషిని దేవుడిగా కొలుచుకో... స్వర్గాన్ని నేలకు దింపుకో. పరిశ్రమల కంటే పాడిపంటలకు పెద్దపీట వెయ్యండి, దేశం సుభిక్షమవుతుంది. చేతివృత్తులను పోషించండి' అంటూ నాడే దేశానికి నిర్దేశం చేసిన..మార్గదర్శి గురజాడ. అందుకే గురజాడ అడుగుజాడ...వెలుగుజాడ.

 

20:07 - September 21, 2015

వరంగల్ : తెలంగాణ కోసం పోరాడిన తమ బిడ్డను ప్రభుత్వమే హత్య చేసిందని.. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్ కౌంటరేనని శృతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఏ తల్లి, తండ్రికీ ఇటువంటి పరిస్థితి రావొద్దని చెప్పారు. ఈమేరకు వారు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన శృతి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. తెలంగాణకోసం శృతి పోరాడిందని... యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా గొంతు కలిపిందన్నారు. 'మా బిడ్డను అత్యంత దారుణంగా చంపారని ఆరోపించారు. యాసిడ్ పోసి నరకం చూపించారని.. ఒళ్లంతా గాయాలపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి ఏ తల్లిదండ్రికీ రావొద్దు అని పేర్కొన్నారు. శృతి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయామన్నారు. 'మనిషిని ఇంత దారుణంగా చంపడం మేం ఎక్కడా చూల్లేదు. మృతదేహాన్ని చూపాలంటూ 3గంటలు ధర్నా చేశాం. ఆ తర్వాతే కొద్దిసేపు మాత్రమే డెడ్ బాడీ చూపించారు అని శృతి తల్లిదండ్రులు వాపోయారు.

 

19:54 - September 21, 2015

కృష్ణా : జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపింది. జంగారెడ్డిగూడెంకు చెందిన భానుప్రీతి అనే విద్యార్థిని విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె కాలేజ్ హాస్టల్ లో ఉంటుంది. భాను ఫ్రెషప్ కావడానికి మధ్యాహ్నం త్వరగా హాస్టల్ కు వెళ్లింది. రెండు గంటలైనా... ఆమె తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ కు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మధ్యాహ్నం జరిగిన ఘటనను సాయంత్రం వరకు ఎందుకు గుర్తించలేదని అనే అనుమానాలున్నాయి. ఇదిలావుంటే కడుపునొప్పి, అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా భాను బాధపడుతున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ చెప్పారు. విద్యార్థిని నిన్న సాయంత్రమే ఆమె గ్రామం నుంచి హాస్టల్ కు వచ్చినట్లు తెలిపారు. ఘటనపై విద్యార్థులు మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు.  

 

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 4 గంటలుగా ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు.

ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

వరంగల్ : ఎసిబికి ఓ అవినీతి తిమింగలం చిక్కింది. రూ. 80 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్ ఆర్ వో కొండల్ రెడ్డి హన్మకొండలో ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.  

ఎపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ : దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై ఎపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

18:56 - September 21, 2015

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు అడ్డగోలుగా భూసేకరణ జరిపితే ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉరుకోమని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని మందస, పోలాకి మండలాల్లో రఘువీరా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజలకు ఇష్టంలేకుండా భూములు సేకరిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. 2013లో భూసేకరణపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెస్తే... బీజేపీ అందులో మార్పు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

 

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

18:10 - September 21, 2015

మహబూబ్ నగర్ : శ్రీశైలం ప్రాజెక్టు భూనిర్వాసితుల చలో అసెంబ్లీ పాదయాత్ర మహబూబ్‌ నగర్ జిల్లా కొత్తకోట చేరింది. తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ బీచుపల్లినుంచి హైదరాబాద్ వరకూ వీరంతా ఈ నెల 20న యాత్ర మొదలుపెట్టారు.. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంతో వనపర్తి, ఆలంపూర్, కల్లాపూర్ నియోజకవర్గాల్లోని 67 గ్రామాల్లో దాదాపు 11వేల 192 కుటుంబాలు తమ భూముల్ని కోల్పోయాయి.. 34ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

 

స్వర్ణరథంపై ఊరేగుతున్న తిరుమల శ్రీవారు..

చిత్తూరు : తిరుమల పుర వీధుల్లో శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగుతున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

18:03 - September 21, 2015

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఖాళీ కందిపప్పు ప్యాకెట్లు కలకలం సృష్టించాయి. ఇవి దాదాపు 10వేలకు పైగా ఉండడం, అందులోనూ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన సబ్సిడీ కందిపప్పు కావడంతో విశేషం. ఇవి రోడ్డు పక్కన ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో.. వారు తహశీల్దార్‌కు సమచారం అందించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఈ వ్యవహారంపై దర్యాప్తు వేగంవంతం చేశారు.

 

17:59 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్‌ పోస్టులు ఎస్ పిడిఎస్ ఎల్ లో 201 , ఎన్ పిడిసిఎల్ లో 159, జెన్‌కోలో 419 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. సివిల్‌ పోస్టులు ట్రాన్స్‌కోలో 22, జెన్‌కోలో 172 ఉండగా.. ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు జెన్‌కోలో 70, మెకానికల్‌ 195...మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే బాధ్యతను హైదరాబాద్‌ జెఎన్టీయూకు అప్పగించినట్లు తెలిపారు.

 

 

17:56 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు అధికారంలో ఉన్నామనే స్పృహ లేదని.. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రతి అంశానికీ కాంగ్రెస్‌ను వంకగా చూపడం తగదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.  

17:54 - September 21, 2015

మెదక్ : ప్రాణహిత-చేవెళ్ల నిర్వాసితులు మరోసారి ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలంలో రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. చందలాపూర్, పెద్దకొండూరు గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులను భారీగా మోహరించారు.

 

 

17:47 - September 21, 2015

కమల్ హాసన్..విలక్షణ నటుడు ఈయన కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కరెక్టే. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఏ యాడ్స్ లో నటించలేదు. తాజాగా తొలిసారిగా ఓ ప్రకటనలో కనిపించనున్నారు. 'పోతిస్' అనే టెక్స్ టైల్ షోరూం యాడ్ లో 'కమల్' నటించనున్నారు. ఈ వారంలో యాడ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. యాడ్ రెండు నిమిషాల పాటు ఉంటుందంట. ఇప్పటి వరకు టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ తదితర వుడ్ లకు చెందిన ప్రముఖులు వాణిజ్య ప్రకటనల్లో నటించినా 'కమల్' నటించలేదు. తొలిసారి ఓ ప్రకటనలో నటించబోతున్నారు.

షీనా బోరా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు..

ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితులకు ముంబైలోని కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. కేసులో నిందితులుగా ఉన్న షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్‌కు వచ్చే నెల 5 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

17:26 - September 21, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు, బీసీ సబ్‌ ప్లాన్‌ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని సీపీఐ కార్యదర్శి చాడా తెలిపారు. ఇప్పటి వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ ఆరు లక్షల పరిహారం చెల్లించాలన్నారు. రైతు ఆత్మహత్యలపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. వరంగల్‌ ఎన్‌ కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

 

 

17:23 - September 21, 2015

కృష్ణా : అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలోని కేబీఎన్‌ కాలేజీలో మూడు రోజులపాటు సాగే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్‌స్పైర్‌-2015 కార్యక్రమాన్ని దేవినేని ప్రారంభించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

 

17:18 - September 21, 2015

విశాఖ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సీటిల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తి చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌' తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఏడాది మొత్తం 54 మంది విద్యార్థులు.. విశాఖ ఐఐఎంలో చేరారని తెలిపారు. విశాఖ ఐఐఎంను ప్రపంచంలోనే నెంబర్ ఒన్‌ యూనివర్సీటిగా తీర్చిదిద్దుమన్నారు. ప్రారంభ తరగతులకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు.

 

17:10 - September 21, 2015

ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో 'అనుష్క' ప్రధాన పాత్రధారిణిగా పివిపి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.10గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'సైజ్‌ జీరో' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్ర లోగో..టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన టీజర్ సాంగ్ తెలుగులో ఉంది. వెయిట్‌ లాస్‌ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం 'అనుష్క' దాదాపు 20కేజీల బరువు పెరిగారని టాక్. అలాగే ఈ చిత్రం కోసం హీరో 'ఆర్య' క్లిష్టతరమైన సైక్లింగ్‌ విన్యాసాల్లో నటించారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నిర్వాషా, ఆర్ట్ : ఆనంద్‌సాయి, కథ, స్క్రీన్‌ప్లే : కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : సందీప్‌ గుణ్ణం, నిర్మాత : ప్రసాద్‌ వి.పొట్లూరి, దర్శకత్వం : ప్రకాష్‌ కోవెల మూడి. వచ్చే నెలలో 'సైజ్ జీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

17:09 - September 21, 2015

రంగారెడ్డి : జిల్లాలోని కొంపల్లిలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. మహిళలను అడిగి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, గ్రామ సర్పంచ్, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు.. కోటి రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో మార్కెట్ యార్డ్, చెత్త డంపింగ్ యార్డు, సీసీ రోడ్లను నిర్మించబోతున్నారు.. 

ఎమ్మెల్యే సండ్ర బెయిల్ షరతులు సడలింపు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ షరతులను హైకోర్టు సడలించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు వచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. 

బీహార్..సమాజ్ వాదీ పార్టీ మొదటి జాబితా విడుదల..

బీహార్ : శాసనసభ ఎన్నికలకు సమాజ్ వాదీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో 19 మంది అభ్యర్థులున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ లో చెలరేగిన హింస..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో హింస చెలరేగింది. కుషినగర్లో రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం పట్ల స్థానికులు ఆందోళన నిర్వహించారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు.

 

16:58 - September 21, 2015

మహబూబ్‌ నగర్‌ : అప్పుల బాధతో జిల్లాలో మరో రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తలకొండపల్లి మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన మాసయ్య తనకున్న భూమిలో పత్తివేశాడు. అయితే.. పంట సరిగా పండకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇవాళ ఉదయం పత్తిచేనుకు మందు కొడతానంటూ మందుడబ్బా తీసుకుని వెళ్లిన మాసయ్య.. పొలం వద్ద ఆ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మాసయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతుతున్నారు.

 

బెంగళూరులో ఛైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు..

బెంగళూరు : చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్దనుండి 60 లక్షల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

రణబీర్, ఫరాఖాన్ లపై ఎఫ్ఐఆర్..

లక్నో : బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, ఫరాఖాన్ లపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అడ్వరైజ్ మెంట్ విషయంలో లక్నో న్యాయవాది ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. 

సొరంగంలో కూరుకపోయిన వారిని రక్షించాం - ఎన్డీఆర్ఎఫ్..

హిమాచల్ ప్రదేశ్ : గత 9 రోజులుగా సొరంగంలో కూరుకపోయిన ముగ్గురిలో ఇద్దరిని రక్షించినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. 

దాల్మియా మృతి పట్ల ఐసీసీ సంతాపం..

ఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతిపట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

16:54 - September 21, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా తొలగించబడలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరో బుద్ధిలేని వ్యక్తి చెప్పగానే పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్ ఈసీకి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉందని విమర్శించారు. చౌకబారు రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో దాదాపు 2లక్షల 45వేల ఓట్లున్నాయని... లక్షకుపైగా ఓట్లు తీసేస్తే పరిస్థితి ఇలా ఉంటుందా? అని ప్రశ్నించారు.

 

 

16:51 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో ఓట్లర్‌ లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. జిహెచ్ ఎంసి పరిధిలో సీమాంధ్ర ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

 

16:48 - September 21, 2015

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తుం చేసింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి.. అంటూ ప్రశ్నించింది. ఏ విషయాన్ని కలెక్టర్ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ వ్యాఖ్యానించింది.

 

16:44 - September 21, 2015

హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బీ నగర్ గణేశ్ మండపాల్లో దొంగల్ హల్‌చల్ చేస్తున్నారు. మండపాల్లోని సామగ్రి, హుండీలోని డబ్బు, లడ్డూలను రాత్రిపూట దొంగిలిస్తున్నారు. వీటికి సంబంధించిన సీసీ ఫుటేజీలో వారి వీడియోలు లభ్యమయ్యాయి. పోలీసులు ఈ వీడియోల ఆధారంగా దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో కూడా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. మండపాల్లోని హుండీలు, డబ్బులు, స్పీకర్ బాక్సులు, కొన్ని విలువైన వస్తువులను కూడా చోరీ చేస్తున్నారు. రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 3 గంటలకు చోరీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

ఏపీలో ఇసుక రీచ్ లపై హైకోర్టు ఆగ్రహం..

పశ్చిమగోదావరి : ఇసుక మాఫియాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ కోర్టుకు హాజరయ్యారు. ఏ విషయాన్ని కలెక్టర్ పరిగణలోకి తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. గత వాయిదాలో కలెక్టర్ కోర్టుకు హాజరైనా సరైన సమాచారం ఇవ్వలేదని, అదనపు అఫిడవిట్ ను దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణనను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

16:38 - September 21, 2015

హైదరాబాద్ : ఎపిలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్' లో నిర్వహించిన సెమినార్ లో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు ఎపి సొంతమని చెప్పారు. కార్గో విభాగంలో నెంబర్ వన్ కావడమే తమ లక్ష్యమన్నారు. ఎపిని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

 

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణం ఆలస్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓడరేవు నిర్మాణం వెంటనే చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ చింతమోహన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 26,193 కు చేరుకోగా నిప్టీ 5 పాయింట్ల నష్టంతో 7,977 కు చేరుకుంది. 

డీఎస్ కేబినెట్ హోదా పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : డీఎస్ కు కేబినెట్ హోదా కేటాయింపును సవాలు చేస్తూ గుత్తా సుఖేంద్ రెడ్డి దాఖలైన చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తరువాత విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమాన విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. 

మహబూబ్ నగర్ ఇసుక వ్యవహారంపై కోర్టులో విచారణ..

మహబూబ్ నగర్ : ఇసుక మాఫియా వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను తెలపాలని సూచించింది. వాహనాలు జప్తు చేసి జరిమానా విధిస్తున్నామని, స్థానిక కోర్టుల నుండి వాహనాలను తిరిగి తీసుకుంటున్నారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. స్థానిక కోర్టుల తీర్పు పత్రాలను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పులను పరిశీలించిన అనంతరం మార్గదర్శకాలు ఇస్తామని కోర్టు తెలిపింది.

సింగపూర్ లో బాబు ప్రసంగం..

సింగపూర్ : ఏడాదిన్నరగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ కార్యక్రమంలో బాబు ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనేది సమస్యలతో పాటు అవకాశాలు కూడా కల్పించిందన్నారు. కోస్తా తీరం, సహజ వనరులు ఉండడం ఏపీకి వరమని తెలిపారు. 

జిందాల్ కు మన్మోహనే బొగ్గు కేటాయించారు - దాసరి..

ఢిల్లీ : జిందాల్ కు మాజీ ప్రధాని మన్మోహనే బొగ్గు కేటాయించారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ ను నిందితుడిగా చేర్చాలన్న మధుకోడా సూచనను దాసరి సమర్థించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి లిఖితపూర్వక వాదనలను దాఖలు చేశారు. 

పోలీసుల అదుపులో 36 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు..

తూర్పుగోదావరి : చింతూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 36 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరిపిస్తే జైళ్లు సరిపోవు - తలసాని..

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరిపిస్తే జైళ్లు సరిపోవని, ఉత్తమ్ కుమార్ తో సహా అందరూ జైళుకెళ్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరి ఓట్లను అక్రమంగా తొలిగించలేదని, తమ ఓట్లు తొలగించినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రతిపక్షాల చౌకబాబరు రాజకీయాల వల్లే పుకార్లు వ్యాపించినట్లు తెలిపారు. టిడిపి - కాంగ్రెస్ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని విమర్శించారు.

ఈశ్వరన్ తో బాబు సమావేశం..

సింగపూర్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణంపై చర్చిస్తున్నారు. అధికారులకు శిక్షణ, సామర్థ్యం పెంపు, స్మార్ట్ నగరాలపై చర్చ జరుగుతోంది. అమరావతి నిర్మాణానికి ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపికలో జాగ్రత్తలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. 

తెలంగాణలో దొరల పాలన - తమ్మినేని..

హైదరాబాద్ : తెలంగాణలో దొరల పాలన..నిజాం పాలన కొనసాగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్ కౌంటర్లు ఉండవని ఎన్నికల్లో హామీనిచ్చిన కేసీఆర్ గద్దెనెక్కిన తరువాత మరిచిపోయారన్నారు. వరంగల్ మావోయిస్టులను చంపేయించారని తెలిపారు. 

స్టాంపుల తొలగింపు నీచ రాజకీయాలు - ఎంపీ వీహెచ్..

హైదరాబాద్ : ఇందిరా, రాజీవ్ ల స్టాంపుల తొలగింపు మోడీ నీచ రాజకీయాలకు నిదర్శనమని ఎంపీ వీహెచ్ పేర్కొన్నారు.

 

ఒడిషా వద్ద అల్పపీడనం..

ఢిల్లీ : ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది.

 

సింగపూర్ లో బాబు బిజీ..

సింగపూర్ : సీఎం చంద్రబాబునాయుడు బిజీ బిజీగా ఉన్నారు. సింగపూర్‌లోని కన్సార్టియంతో సైన్స్ పార్కులో వాణిజ్య సమావేశంలో చంద్రబాబు బృందం పాల్గొంటోంది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో చంద్రబాబు బృందం విందు భేటీలో పాల్గొని అమరావతి నగర అభివృద్ధి, స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిపై చర్చించనున్నారు. 

టి.సర్కార్ కు సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ జాబితా నుంచి శెట్టి బలిజలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్‌ను స్వీకరించిన థర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని టీ. సర్కార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

 

ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ రాద్ధాంతం - తలసాని..

హైదరాబాద్: ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చవకబారు రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌ శాఖలో పోస్టుల భర్తీలో బ్రోకర్లు, పైరవీలకు ఆస్కారం లేదన్నారు. 

మేడ్చల్ లో మంత్రులు కేటీఆర్..మహేందర్ రెడ్డి పర్యటన..

రంగారెడ్డి : జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి పర్యటించారు. మేడ్చల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

 

కల్తీ కల్లు దొరక్క మహిళ ఆత్మహత్యాయత్నం..

నిజామాబాద్ : ధర్మారంలో కల్తీ కల్లు దొరక్కపోవడంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

 

13:36 - September 21, 2015

హైదరాబాద్ : ఇటీవల అరెస్టైన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన కడప పోలీసులు ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వీధులను జల్లెడ పట్టిన కడప జిల్లా పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్మగ్లర్ హుసేన్ కు సంకెళ్లేశారు. ఈ సందర్భంగా హుసేన్ ఢిల్లీలో దాచిపెట్టిన 8 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ప్రాణహిత - చేవెళ్ల నిర్వాసిత రైతుల ధర్నా...

మెదక్ : సిద్ధిపేట (మం) మండపల్లి వద్ద రాజీవ్ రహదారి ప్రాణహిత - చేవెళ్ల నిర్వాసిత రైతులు ధర్నా నిర్వహించారు. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

సీఐటీయూ నేతలు..ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీ ఛార్జీ..

రంగారెడ్డి : సమస్యలు పరిష్కరించాలంటూ మేడ్చల్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ చేశారు.

టి.అసెంబ్లీలో సర్కార్ ను నిలదీస్తాం - చాడ..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు, బీసీ సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో సర్కార్ ను నిలదీస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వీలైనన్నీ ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 

సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో గురజాడ జయంతి..

విజయవాడ : సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో గురజాడ జయంతి జరిగింది. గురజాడ చిత్రపటానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నివాళి అర్పించారు. సామాజిక మార్పు కోసం నిబద్ధతతో గురజాడ పని చేశారని మధు పేర్కొన్నారు. గురజాడ స్పూర్తితోనే సమాజ సేవలో సీపీఐ(ఎం) ముందుంటోందన్నారు.

 

 

13:29 - September 21, 2015

హైదరాబాద్ : భారత్‌, పాక్‌ సైనికాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై ఈ భేటీలో చర్చించనున్నారు. గత వారంలో ఒకసారి సమావేశమైనప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదు.

 

13:27 - September 21, 2015

నిజామాబాద్ : అతని చేయి పడిందంటేచాలు మట్టి బొమ్మలు జీవం పోసుకుంటాయి. ఎంతటి కళాఖండలైనా.. ఆయన చేతుల్లో అందమైన కళారూపాలుగా ఒదిగిపోతాయి. ఆ పెద్దాయన తయారు చేసిన వస్తువులు సాంస్కృతిక కార్యక్రమాల్లో అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇదీ నాటి రాష్ర్ట ప్రభుత్వం గుర్తింపు పొందిన మట్టిలో మాణిక్యం అసమాన ప్రతిభ. ఎలాంటి మట్టిపాత్రల్నీ అయినా అద్భుతంగా తయారు చేయడంలో గొప్పపేరు తెచ్చుకున్న మాణిక్యం.. పేదరికంతో చేస్తున్న యుద్ధంలో ఓడిపోతున్నాడు. ప్రభుత్వ ఆదరణకు నోచుకోలేకపోతున్నాడు.

అద్భుతంగా మట్టిపాత్రలు చేస్తున్న మాణిక్యం.....

నిజామాబాద్‌కు చెందిన ఈయన పేరు మాణిక్యం. అందరూ మట్టిలో మాణిక్యం అంటారు. ఎలాంటి మట్టి పాత్రల్ని అయిన తన చేత్తో అందంగా తీర్చిదిద్దుతాడు. చిన్నప్పటి నుంచి మట్టిపాత్రలు చేస్తున్న మాణిక్యం.. మిగితావారిలా మట్టి పాత్రలు తయారుచేసి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఆశపడలేదు. చేసే పనిలోనే తన ప్రతిభను కనబర్చాలనుకున్నాడు. అందుకే ఎవరూ తయారు చేయలేని, మట్టితో సాధ్యపడని అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు.

మాణిక్యం మట్టిపాత్రలకు మంచి గుర్తింపు.......

మాణిక్యం చేసిన మట్టిపాత్రలను జిల్లా నుంచే కాదు.. ఇతర రాష్ర్టాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తారు. 1993 నుంచి ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలుగానీ, స్కూలు ఎగ్జిబిషన్‌లు జరిగినా.. మాణిక్యం తయారు చేసిన మట్టిపాత్రలనే ప్రదర్శనకు పెట్టేవారు..! హైదరాబాద్‌లో శిల్పారామం ప్రారంభించినప్పుడు కూడా మాణిక్యం చేసిన మట్టి వస్తువులనే ప్రదర్శనలో పెట్టారు.

కరెంటు అవసరం లేని ఫ్రీజ్‌ తయారు చేసిన మాణిక్యం......

కరెంటు అవసరం లేకుండానే ఎనిమిది రోజులపాటు కూరగాయాలు, పండ్లు నిల్వ చేసుకునే గ్రామీణ ఫ్రీజ్‌ను కూడా తయారు చేశాడు. చెంచల్ జార్స్, మ్యాజిక్ జార్స్, గోర్ ముఖ్ జార్స్, బెడ్ ల్యాంప్, కోయినుక్ డ్యాం వంటి మట్టి వస్తువులను అద్భుతంగా.. అందంగా తయారుచేసి.. నాటి రాష్ర్టప్రభుత్వం దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు మాణిక్యం ఇంటికి వచ్చి.. ఈయన తయారు చేసిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయారంటే.. మాణిక్యం ప్రతిభ ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఈయన అసమాన ప్రతిభకు ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. గొప్ప పేరు, ప్రఖ్యాతలు వచ్చినా మాణిక్యం ఆర్థిక కష్టాలను గట్టెక్కించలేకపోతున్నాయి. అద్భుత కళానైపుణ్యం ఉన్న ఈ కళాకారునికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది.

ప్లాస్టిక్‌ వస్తువుల ధాటిని తట్టుకోలేకపోతున్న మట్టి పాత్రలు...

ఈ హైటెక్‌ యుగంలో మాణిక్యం చేసిన మట్టి పాత్రలు ప్లాస్టిక్‌ వస్తువుల ధాటిని తట్టుకోలేకపోతున్నాయి. అయినా ఎన్నో వ్యయప్రయాసాలకు ఎదురొడ్డి తయారు చేస్తున్న మట్టి పాత్రలకు గిరాకీ తక్కువగానే ఉంటోంది.మాణిక్యంలాంటి గొప్ప కళాకారులు రాష్ర్టంలో చాలామంది ఉన్నా.. ప్రభుత్వ ఆదరణకు నోచుకోక చాలామంది కులవృత్తిని వదిలి.. ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారు. 

13:23 - September 21, 2015

విజయవాడ : నూతన రాజధానిగా అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇతర రాష్ట్రాలను తలదన్నే రీతిలో మహా నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఇరుకైన రోడ్లే ప్రధాన అడ్డంకిగా మారాయి. దీంతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్ నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది.

చిన అవుటపల్లి నుంచి బెజవాడ ఇంద్రకీలాద్రి వరకు 6లేన్స్‌.....

అమరావతి నుంచి విజయవాడకు చేరుకోవాలంటే ఇరుకైన రోడ్లు. వీటిపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. దీంతో చిన అవుటపల్లి నుంచి బెజవాడ ఇంద్రకీలాద్రి వరకు 6లేన్స్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. విజయవాడలోకి వాహనాల రాకపోకలు పెరుగుతున్నందున రోడ్డు విస్తరణ అవసరమని నేషనల్ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా దృష్టికి ఏపి సర్కార్‌ తీసుకెళ్లింది. ఇటు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద రింగ్ నిర్మించాలనే ప్రతిపాదనను కూడా కేంద్రానికి నివేదించింది.

గుండుగొలను- విజయవాడ మధ్య 6లేన్స్‌.....

కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కాంట్రాక్టర్‌ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇటు గుండుగొలను- విజయవాడ మధ్య 103 కిలోమీటర్ల జాతీయ రహదారిని 6లేన్స్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో చిన అవుటపల్లి వద్ద నున్న, గొల్లపూడి, కృష్ణానది, వెంకటపాలెం, నిడమర్రు మీదుగా గుంటూరు జిల్లాలోని ఖాజ వరకు 4లేన్స్ విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం జరగాల్సి ఉంది. చినఅవుటపల్లి నుంచి గన్నవరం, విజయవాడ నగరం మీదుగా కనకదుర్గ వారధి (కృష్ణానది) వరకు 4లేన్స్‌ రోడ్డు అలాగే కొనసాగుతోంది. విమానాశ్రయం తర్వాత కేసరపల్లి, గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు కూడలి వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. సమయానికి విమానాశ్రయానికి వేగంగా చేరుకోవాల్సిన సమయాల్లో సమస్యలు తప్పడంలేదు. ఈ మార్గంలో పలు వాహనాల కంపెనీల షోరూంలు ఉన్నాయి. మరమ్మతులు చేసే యూనిట్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాలయాలుండటంతో ట్రాఫిక్ నరకం చూపిస్తోంది.

హదారుల నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు లేఖ....

రాజధాని చుట్టూ విశాలమైన రహదారుల నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఎన్ ఐ హెచ్ ఐఏ రాష్ట్ర విభాగం సీజీఎం చంద్రశేఖర్‌ రెడ్డితో చర్చించారు. అంతర్గత, బాహ్య రహదారుల విస్తరణతో పాటు గన్నవరం వద్ద అద్భుతమైన రింగ్‌ రోడ్, స్వాగత ద్వారం నిర్మించాలని చంద్రబాబు సూచించారు. ఈ ప్రతిపాదనలకు ఎన్ ఐ హెచ్ ఐఏ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి శరవేగంగా రహదారులను విస్తరించాలని నూతన రాజధాని వాసులు కోరుతున్నారు.

13:16 - September 21, 2015

కర్నూలు : జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త భాషాతో పాటు, వైసీపీ కార్యకర్త స్వామి చనిపోయారు. రెండు రోజుల కిందట టీడీపీ కార్యకర్తలకు చెందిన గేదెలను ఎవరో దొంగిలించారు. వైసీపీ కార్యకర్తలపై అనుమానంతో ప్రశించడంతో ఉద్రిక్తత తలెత్తి చివరకు ఘర్షణకు దారి తీసింది.

13:13 - September 21, 2015

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ ను విడుదల చేసినట్లు హీరో 'రాంచరణ్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో మెగాస్టార్ 'చిరంజీవి' ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్..ఓ మేకింగ్ వీడియో సాంగ్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. 'శ్రీను వైట్ల' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'తమన్' సంగీతాన్ని అందించారు. 'చెర్రీ' సరసన 'రకుల్ ప్రీతి సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. 'కోన వెంకట్', 'గోపీ మోహన్' కలిసి స్క్రిప్టు అందిస్తుండగా 'డివివి దానయ్య' నిర్మిస్తున్నారు.

దాల్మియాకు నివాళి అర్పించిన గంగూలి..

కోల్ కతా : భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా భౌతికకాయానికి మాజీ క్రికెటర్ గంగూలి నివాళి అర్పించారు. ఆయనతో పాటు బీసీసీఐ సెక్రటరీ ఠాకూర్ కూడా నివాళి అర్పించారు. 

గుంటూరులో 'రైతు కోసం చంద్రన్న' యాత్ర ప్రారంభం..

గుంటూరు : జిల్లాలో 'రైతు కోసం చంద్రన్న' యాత్ర ప్రారంభమైంది. యాత్రను ఏపీ మంత్రులు చిన రాజప్ప, పల్లె, ప్రత్తిపాటిలు ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం చంద్రబాబు నడుం బిగించారని మంత్రులు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమమని, జగన్ తలకిందులు చేసినా సీఎం కాలేడన్నారు. జగన్ ఉనికి కోసమే దీక్షలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

నూతన డీజీపీ నియామకానికి ఐదుగురి పేర్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ నియామకం కోసం ప్రభుత్వం ఐదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అనురాగ్ శర్మ, అరుణ బహుగుణ, తేజ్ దీప్ కౌర్, ఏకే ఖాన్, దుర్గా ప్రసాద్ పేర్లు అందులో ఉన్నాయి. 

ఈడెన్ గార్డెన్ లో దాల్మియ భౌతిక కాయం..

కోల్ కతా : ఈడెన్ గార్డెన్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

12:35 - September 21, 2015

హిమాచల్ ప్రదేశ్ : సిమ్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్ పూర్ ప్రాంతం..హైవే ప్రాజెక్టులో భాగంగా కొద్ది రోజుల క్రితం కార్మికులు అక్కడ సొరంగాన్ని తవుతున్నారు. ఈనెల 12వ తేదీ నుండి కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సొరంగంలో పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. వాటిని కార్మికులు తొలగిస్తున్నారు. అకస్మాత్తుగా ముగ్గురు కార్మికులు సొరంగంలో చిక్కుకపోయారు. వెంటనే ఈ సమాచారం అధికారులకు తెలిసింది. సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 9 రోజులు గడిచిపోయాయి. తమ వారు బతికి ఉంటారా ? లేదా ? అని ఆ కార్మికుల కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. వీరిని రక్షించేందుకు రెస్క్యూటీం, ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సొరంగంలో ఉన్న వారి క్షేమ సమాచారాలు తెలుసుకొనేందుకు ఓ పైపు ద్వారా సొరంగంలోకి అత్యాధునిక వీడియోను పంపించారు. 'ఇంకా ఏడు లేదా ఎనిమిది రోజులు బతుకుతాము' అంటూ ఓ కార్మికుడు మరొక కార్మికుడు చెబుతున్న మాటలు వీడియో ద్వారా తెలిసిందని సమాచారం. సొరంగంలో ఉన్న కార్మికులు నీరసించకుండా ఉండేందుకు ఓ పైపు ద్వారా ఆహార పదార్థాలను జాడ విరుస్తున్నారు. జైపూర్ నుండి తెప్పించిన డ్రిల్లింగ్ మిషన్ ను ఉపయోగించి కొండపై నుండి సొరంగం రూఫ్ కు ఒక పొడుగాటి రంధ్రం చేశారు. ఈ రంధ్రం ద్వారా వారికి గాలి అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలం వద్దే సొరంగంలో చిక్కుకపోయిన కార్మికులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారు క్షేమంగా బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు. 

12:34 - September 21, 2015

కరీంనగర్ : రోగం ఒకటైతే.. మందు మరోటి వేస్తే ఎలా ఉంటుంది. పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుంది కాదా..? రైతు సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. చెప్పిన సమస్యలను పరిష్కరించడం లేదుగానీ, తీయని కబుర్లు చెబుతూ సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. అసలు సమస్యలను వదిలేసి.. కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో 20 మంది రైతుల ఆత్మహత్య.....

వాన చినుకు ముఖం చాటేసింది. కరవు కోరలు చాసింది. ప్రకృతి పగబట్టింది. పాలకులు హామీలను విస్మరించారు. ఫలితంగా వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక కరీంనగర్‌ జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు.....

బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని వామపక్షాలతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో.. సర్కార్‌ కరీంనగర్‌ జిల్లాలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు.. వారి కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. పేరుకే హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారేగానీ, ఇక్కడ రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫోన్‌లో సమస్యలు వింటున్నారే తప్ప వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 10టీవీ చేపట్టిన ఫార్మర్స్‌ హెల్ప్‌లైన్‌ ఫాలో ఆఫ్‌లో ఈ విషయాలు వెలుగుచూశాయి. రైతు ప్రధాన సమస్యలైన రుణమాఫీ, నష్టపరిహారం వంటి సమస్యలను గాలికొదిలేస్తున్నారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తీయని కబుర్లు చెబుతూ తప్పించుకుంటున్నారు.

తక్షణమే పరిహారం అందించాలని వామపక్షాల డిమాండ్‌....

హెల్ప్‌లైన్‌ ముచ్చట్లతో అన్నదాత కుటుంబాల కన్నీళ్లు ఆగవని, వారి అప్పులు తీరవని.. సర్కార్‌ వెంటనే స్పందించి..పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దాంతోపాటే ఎలాంటి షరతుల్లేకుండా బ్యాంకు రుణాలనూ అందించాలని కోరుతున్నాయి. ఇటు ఖరీఫ్‌లో వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో రబీపై ఆశలు వదులుకుంటున్న రైతులు అధైర్య పడకుండా.. వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా.. సర్కార్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలి. వారికి మనోధైర్యం కల్పించి.. మేమున్నామంటూ భరోసా ఇవ్వాలి. 

12:31 - September 21, 2015

హైదరాబాద్ : అవసరం తీరేంత వరకు తెగ సంప్రదింపులు జరిపారు. కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీల వర్షం కురిపించారు. నష్టాన్ని పరిహారంతో భర్తీ చేస్తామని భరోసా కల్పించారు. అనుకున్న పని నెరవేరింది. కానీ ఇచ్చిన హామీలే నెరవేరకుండా వెక్కిరిస్తున్నాయి. బాధితులను ముప్పుతిప్పులు పెడుతున్నాయి.

2004లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన.....

దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆవిష్కృతమైనదే శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌. కరీంనగర్‌-ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దులో గోదావరి నదిపై 2004లో దివంగత వైయస్‌ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసారు.తొలుత ఆనకట్ట నిర్మాణం కోసం 408.85 కోట్లు కేటాయించి, ఆదిలాబాద్ జిల్లాలో 2.10 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 2.30 కిలోమీటర్లు మట్టి కట్ట నిర్మాణం పనులు చేపట్టారు. ఈ నిర్మాణంతో ఆదిలాబాద్ జిల్లాలోని 16 గ్రామాల వ్యవసాయ భూమి, 9 గ్రామాల్లో 3వేల నివాసాలు ముంపునకు గురవుతున్నాయి. ఇటు కరీంనగర్‌ జిల్లాలో కూడా 12 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి.

కడెం ప్రాజెక్ట్ లోకి 25వేల క్యూసెక్కుల నీరు విడుదల....

ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువన ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 25 వేల క్యూసెక్కుల నీరును వదిలారు. దీంతో కరీంనగర్ జిల్లాలో గోదావరి ప్రవాహం పెరిగింది. వరదతో పోటెత్తుతున్న గోదావరి కారణంగా కరీంనగర్ జిల్లా వెల్గాటూర్ మండలం తాళ్ళకోతపేట గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఇక చేసేది లేక అధికారులంతా తాళ్లకోతపేట గ్రామాన్ని పునరావాస శిబిరానికి తరలిస్తున్నారు.

మండిపడుతున్న బాధితులు.....

అయితే పునరావాస శిబిరాలకు తరలివెళ్లేది లేదని తాళ్లకోతపేట గ్రామస్ధులు తెగేసి చెబుతున్నారు. బలవంతంగా తరలించాలని చూస్తున్న అధికారులపై మండిపడుతున్నారు. పైగా పునరావాస శిబిరాల్లో సరైన సౌకర్యాలు లేవు. మహిళలకు కనీసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా హడావుడిగా పునరావాస శిబిరాలకు తరలించటమేంటని ప్రశ్నిస్తున్నారు.

బాధితులందరికి నష్టపరిహారం ఇస్తామన్న హామీ....

ముంపుకు గురవుతున్న బాధితులందరికి నష్టపరిహారం అందిస్తామని చెప్పిన సర్కార్‌ హామీ నేటి వరకు నెరవేరలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూరై వినియోగంలోకి వచ్చినా నేటికి మెజారిటీ బాధిత వర్గానికి పరిహారం అందలేదు. అందుకే బాధితులంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ తాత్కాలిక చర్యలపై పెడుతున్న శ్రద్ధ పరిహారం అందించటంపై పెడితే బాధితుల కష్టాలు తీరేవని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.

12:28 - September 21, 2015

వరంగల్ : ఓరుగల్లు రాజకీయం వేడెక్కుతోంది. ఎంపీ ఉపఎన్నిక నేపథ్యంలో ఓరుగల్లు కాస్తా పోరుగల్లుగా మారింది. ఆశావహులు టిక్కెట్‌ కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నిత్యం రాజకీయ పార్టీల పర్యటనలతో నగరమంతా హోరెత్తుతోంది.

లోక్‌సభ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా.....

వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యనేతలు ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో నగరమంతా సందడి నెలకొంది. అన్ని పార్టీల్లో ఆశావాహులు టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అభ్యర్థిత్వం కోసం వ్యూహాలు....

ప్రధానంగా గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువయ్యారు. సీనియర్ నేతలు, కొత్తవారు, తటస్థులు ఎవరికివారు అభ్యర్థిత్వం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే అధినేత కేసీఆర్ మనుసులో ఏముందో తెలియక అయోమయం నెలకొంది. పోటీ చేసే వారి అంశంలో తమను సంప్రదించకపోవడం జిల్లా నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది.

ఉపఎన్నికను సవాలుగా తీసుకుంటున్న కాంగ్రెస్......

కాంగ్రెస్‌ పార్టీ కూడా వరంగల్ ఎంపీ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటోంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఎన్నిక కోసం జిల్లాలో ఈ నెలాఖరులో పర్యటించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలను పక్కన పెట్టి అవసరమైతే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌నైనా బరిలో దించాలని నాయకులు అధిస్టానానికి సూచిస్తున్నారు.

మల్లెపల్లి లక్ష్మయ్యను ఆప్షన్‌గా తీసుకుంటున్న వామపక్షాలు......

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీడీపీ పొత్తుతో తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తోంది. వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన నేతలను తెరపైకి తీసుకొస్తున్నారు. జేఏసీ నేతగా కీలకంగా ఉన్న మల్లెపల్లి లక్ష్మయ్యను కూడా వామపక్షాలు ఆప్షన్‌గా ఎంచుకున్నాయి. వరంగల్ ఉపఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీకి చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలనే కృతనిశ్చయంతో వామపక్షాలు ముందుకు కదులుతున్నాయి.

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు వాయిదా..

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు మళ్లీ వాయిదా పడింది. రెండు వారాల అనంతరం విచారణకు రానుంది. 

12:25 - September 21, 2015

హైదరాబాద్ : నిరుద్యోగ అభ్యర్థులతో కోచింగ్‌ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా గల్లిగల్లీకి కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. సర్కార్‌ నౌకరీ కోసం అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్ల వెంట పరుగులు తీస్తున్నారు.

గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని తెలుస్తే చాలు.......

గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని తెలుస్తే చాలు.. అభ్యర్థులు అక్కడకు వేల సంఖ్యలో వెళ్తున్నారు. నిపుణులు చెప్పే సలహాలు, సూచనలు తీసుకుంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేందుకు వరంగల్‌ జిల్లాలో కోచింగ్‌ సెంటర్స్‌ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్న కొత్త రాష్ర్టంలో కొత్త సిలబస్‌ అభ్యర్థులను గందరగోళంలో పడేస్తోంది. సిలబస్‌ ఎలా ఉంటుందో అనే ఆందోళన వారిని తీవ్రంగా వెంటాడుతోంది.

ప్రామాణిక పుస్తకాలు ఏం చదవాలి..?

ఇప్పటి వరకూ పోటీపరీక్షలకు చదివిన చదువు వేరుగా ఉంది. కానీ, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీసుకొచ్చిన కొత్త సిలబస్‌ అభ్యర్థులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. నూతన సిలబస్‌లో చాలా అంశాలు కొత్తగా ఉండడంతో.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు ఏం చదవాలి..? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రం కొత్తగా ఏర్పాడిన నేపథ్యంలో కొత్త సిలబస్ కొంత ఇబ్బందిగా ఉన్నా..కచ్చితంగా చదవాల్సిందే అంటున్నారు ప్రొఫెసర్‌ కోదండరామ్. కొత్త సిలబస్‌పై నిరుద్యోగులు డైలమాలో ఉంటే.. కొచింగ్ సెంటర్లు మాత్రం అవగాహన సదస్సుల పేరుతో అభ్యర్థులను తమవైపునకు ఆకర్షించేపనిలో పడ్డాయి. 

రేవంత్ సోదరుడి మృతిపై బాబు..లోకేష్ సంతాపం..

మహబూబ్ నగర్ : టిటిడిపి నేత రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ సంతాపం తెలిపారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

ఏపీ ప్రయోజనాలను కేంద్ర వద్ద తాకట్టు - రోజా..

గుంటూరు : స్వప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్ర వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గుంటూరు జిల్లాలో జగన్ చేపట్టే దీక్షా స్థలిని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు నుండి బయటపడేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం బాబు కేంద్రంపై వత్తిడి చేయలేకపోతున్నారని విమర్శించారు. 

అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చిస్తాం - హరీష్ రావు..

హైదరాబాద్ : ఈనెల 23వ తేదీ నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలిపారు. 

12:21 - September 21, 2015

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక హంగులతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. ఆధునిక సాంకేతికతతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో ఈ భారీ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.

విజయవాడలో నిర్మించాలని ప్రతిపాదన......

తొలుత విజయవాడలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని 2000 సంవత్సరంలో ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ నిర్ణయించింది. అయితే స్థలం సమస్యతో గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో 30 వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 54 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా మారాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ స్టేడియం పనులకు మహర్దశ పట్టింది. పనులు వేగవంతం చేయాలని ఏసీఏ కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తోంది.

కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీ....

రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల మద్యే ఈ స్టేడియం ఉండడంతో...ప్రభుత్వం కూడా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించింది. స్టేడియం నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను ఐవీ.ఆర్.సీ.ఎల్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే గ్యాలరీ నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తుంది. మొత్తం మూడు అంతస్తుల గ్యాలరీలు.. క్రీడాకారుల డ్రెస్సింగ్ రూమ్, వీఐపి గ్యాలరీ, ప్రత్యేక వసతి గదులు నిర్మిస్తున్నారు. 30వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తుండటంతో.. పార్కింగ్ వంటి విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఏసీఏ సభ్యులు ఎప్పటికప్పుడు స్టేడియం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.  ఎమ్.ఎస్.కె. ప్రసాద్, భారత మాజీ క్రికెటర్, ఏసీఏ కార్యవర్గ సభ్యుడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను క్రీడల్లో కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు మంగళగిరి స్టేడియం పునాది అవుతుందని క్రికెట్‌ ఆటగాళ్లు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

బీహార్ ఎన్నికలు..ఎల్ జేపీ సెకండ్ లిస్టు..

బీహార్ : రానున్న అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టులను ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. సోమవారం లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) 9మంది అభ్యర్థులతో కూడిన రెండో లిస్టును విడుదల చేసింది. 

12:18 - September 21, 2015

మహబూబ్‌ నగర్ : జిల్లాలో కల్తీ కల్లుకు మరో మహిళ బలైపోయింది. ములకలపల్లెకు చెందిన మాలతి అనే మహిళ గద్వాల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కల్తీ కల్లుపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు పెంచడంతో... గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు నిలిచిపోయాయి. 5 రోజులుగా కల్లు సేవించకపోవడంతో మాలతి తీవ్ర అస్వస్థకు గురై పిచ్చిగా ప్రవర్తించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరోవైపు కల్తీ కల్లు బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా 21 మంది గద్వాల్‌ ఏరియా ఆస్పత్రిలో చేరారు. 

12:17 - September 21, 2015

ఖమ్మం : జిల్లాలో గోదారమ్మ శాంతించింది. భద్రాచలంలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. గోదావరి నీటి మట్టం 38 నుంచి 35 అడుగులకు చేరింది. ఎగువన వస్తున్న వరద తాకిడి తగ్గడంతో తాలిపేరు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.   

రాష్ట్ర ప్రభుత్వం..ఎంసీడీలకు కోర్టు నోటీసులు..

ఢిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం..మున్సిపల్ కార్పొరేషన్ ఢిలీకి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అజయ్ మాకెన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ఎంత ఖర్చు పెట్టారో తెలియచేయాలని నోటీసులో పేర్కొంది. 

కర్నూలులో ముఠాకక్షల్లో మరొకరి బలి..

కర్నూలు : వైసిపి..టిడిపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో మరొకరు మృతి చెందారు. వైసిపి కార్యకర్త కంబగిరి కన్నుమూశాడు. అంతకుముందు టిడిపి కార్యకర్త నాగూర్ బాషా మృతి చెందిన సంగతి తెలిసిందే. 

సీఎం సింగపూర్ పర్యటనపై రామకృష్ణ సెటైర్స్..

గుంటూరు : సింగపూర్ లోనూ క్యాంపు ఆఫీసు పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సెటైర్స్ వేశారు. సీఎం చంద్రబాబుకు సింగపూర్ పర్యటనలతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని, అక్టోబర్ 2వ తేదీ నుండి 'ప్రత్యేక' ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. జగన్ నిరవధి దీక్షకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రామకృష్ణ పేర్కొన్నారు. 

కోర్టు ఉత్తర్వులకు తలొగ్గిన హర్యానా సర్కార్..

హర్యానా : కోర్టు ఉత్తర్వులకు సర్కార్ తలొగ్గింది. పంచాయతీ ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. 

భద్రతపై సమీక్ష జరిపిన స్పీకర్ మధుసూధనాచారి..

హైదరాబాద్ : కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈనేపథ్యంలో స్పీకర్ మధుసూధనాచారి భద్రతపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, సీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

టిబిజెఎల్పీ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

 

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు విచారణ..

హైదరాబాద్ : జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణన రేపటికి వాయిదా పడింది.

 

ఆదిలాబాద్ అల్పాహారం తిని 50 మంది విద్యార్థినుల అస్వస్థత..

ఆదిలాబాద్: జిల్లాలోని మామడ మండల కేంద్రంలో అల్పాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఢిల్లీకి చేరుకున్న రాజీవ్ శర్మ..

ఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో రాజీశ్ శర్మ పర్యటించనున్నారు. ఇంటర్‌నేషనల్ క్రాప్స్ రీసర్చ్ ఇనిస్ట్యూట్ ఫర్ ద సెమి ఆరిట్ ట్రొపిక్స్( ఇక్రిసాట్) గవర్నింగ్ బాడి సమావేశంలో సీఎస్ పాల్గొంటారు. 

గుంటూరు ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు..

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరసన దీక్షకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఎస్పీని వైసీపీ నేతలు కలిశారు. దీక్షకు అనుమతినివ్వాలని వారు కోరారు. ఈనెల 26వ తేదీన గుంటూరు కేంద్రంగా జగన్ నిరవధిక నిరహార దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. 

11:31 - September 21, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని విమర్శలు చేసుకుంటున్నారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి ఆత్మహత్యలను ఎవరూ ఆపడం లేదు. నిన్న ఒక్క రోజే 11 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకరు...మెదక్ జిల్లాలో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు..
మెదక్ లో..
సీఎం సొంత జిల్లాలో కూడా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఏడుగురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా మెదక్ పట్టణంలోని కౌలు రైతు సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు..ఒక కుమార్తె ఉంది. సోమవారం ఉదయం పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఇతనికి 2 ఎకరాలు ఉండగా మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి..వరి పంటలను సాగు చేస్తున్నాడు. పంట చేతికి రాకపోవడం..అప్పులు భారీగా పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన సత్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలెక్టరేట్ లో ఏర్టాపు చేసిన హెల్ప్ లైన్ కూడా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
మహబూబ్ నగర్ లో ..
మహబూబ్ నగర్ : కరువు ప్రాంతంగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు తనువు చాలిస్తున్నారు. మిడ్జిల్ లో జంగయ్య కౌలు రైతు. సోమవారం ఉదయం ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలే కారణమని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. 

10:58 - September 21, 2015

ప్రస్తుతం టాలీవుడ్ లో 'బ్రూస్ లీ' చిత్రంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై భారీగా హైప్స్ పెరిగిపోతున్నాయి. సినిమాకు పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని..మెగస్టార్ 'చిరంజీవి'..'నాగార్జున'లు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కానీ 'చిరంజీవి' మాత్రం ఓ పాత్రలో పక్కాగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లారెన్స్ 'స్టైల్' సినిమాలో చేసినట్లుగానే 'చిరంజీవి' ఈ సినిమాలో 'రామ్ చరణ్' ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారని..'రకుల్ ప్రీతి' ని విలన్స్ నుంచి కాపాడటానికి 'చిరంజీవి' హెల్ప్ చేస్తారని టాక్. 'చెర్రీ' వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి 'చిరంజీవి' అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే. 'రకుల్ ప్రీతి సింగ్' హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి 'ఎస్ఎస్ తమన్' సంగీతం అందిస్తున్నారు. 'కోన వెంకట్', 'గోపీ మోహన్' కలిసి స్క్రిప్టు అందిస్తుండగా 'డివివి దానయ్య' నిర్మిస్తున్నారు. 

రేవంత్ సోదరుడు కన్నుమూత..

మహబూబ్ నగర్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి (62) గుండెపోటుతో మృతి చెందాడు. కల్వకుర్తిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంగనూరు (మం) కొండారెడ్డిపల్లిలో కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు.

 

మహబూబ్ నగర్ లో పెరుగుతున్న కల్లీ కల్లు మృతులు..

మహబూబ్ నగర్ : జిల్లా కల్తీకల్లు బాధితులు పెరుగుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు. జడ్చర్ల మండలంలో మరో వ్యక్తి మృతి చెందాడు.

వేములవాడ ఆలయంలో ప్రసాదం ధరల పెంపు...

కరీంనగర్ : వేముల వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి ప్రసాదం ధరలు పెరుగనున్నాయి. లడ్డూ ధర రూ.10 నుండి రూ.15కు పెంచారు. అలాగే పులిహోర ధర రూ.5 నుండి రూ.10కి పెంచారు.

 

ఆజ్మీర్ దర్గా బాంబు కలకలంపై దర్యాప్తు - ఎస్పీ..

రాజస్థాన్ : ప్రముఖ ఆజ్మీర్ దర్గాలో బాంబు కలకలం రేపింది. వెంటనే అక్కడకు చేరుకున్న బాంబు స్వ్కాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం లేదని ఎస్పీ వికాస్ కుమార్ జాతీయ ఛానెల్స్ తో పేర్కొన్నారు. వచ్చిన ఫోన్ కాల్ పై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

ఆశారం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఢిల్లీ : ఆశారం కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మెడిసిన్..ఆహార డబ్బాలో పేలుడు పదార్థాలు..

జమ్మూ కాశ్మీర్ : మెడిసన్..ఆహార పదార్థాల డబ్బాల్లో తీవ్ర వాదులు పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మేరకు కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఢిల్లీలో ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ అరెస్టు..

కడప : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ ను ఢిల్లీలో కడప పోలీసులు అరెస్టు చేశారు. 8 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

10:26 - September 21, 2015

అక్కినేని 'నాగార్జున' తనయుడు 'అఖిల్' హీరోగా నటించిన చిత్రం 'అఖిల్' (ది పవర్ అఫ్ జువా) అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఆడియో విడుదలైంది. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ అభిమానుల సందడి తో పాటు, సినీ అతిరధ మహారధుల సమక్షంలో ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ముఖ్యఅతిధిగా వచ్చారు. అలాగే నాగార్జున, అమల నితిన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 'అఖిల్', 'సయేశ సైగల్' హీరో హీరోయిన్లు గా, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న 'అఖిల్' సినిమాకి హీరో 'నితిన్' చిత్ర నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి 'అనూప్ రూబెన్స్' మరియు 'ఎస్ఎస్ తమన్' సంగీతాన్ని సమకూర్చారు. ఈ వినాయక చవితి సందర్బంగా విడుదల చేసిన ఈ చిత్రం లోని ఒక పాటకి ఇప్పటికే అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' చేతుల మీదుగా విడుదల చేసిన 55 సెకన్ల నిడివి గల 'అఖిల్' టీజర్ ఇప్పటికే 10లక్షల హిట్లతో దూసుకుపోతుంది.

 

10:26 - September 21, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ కు టీఆర్ఎస్ దే బాధ్యత అని కేకే డబ్ల్యూ దళం పేర్కొంది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ కేకే డబ్ల్యూ దళం కార్యదర్శి దామోదర్ పేరుతో లేఖ విడుదల చేసింది. శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్ కౌంటర్ బూటకమని మండిపడ్డారు. మంచినీళ్ల కోసం వెళ్లిన వీరిద్దరినీ చిత్ర హింసలు పెట్టి చంపారని దామోదర్ ఆరోపించారు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అంటూ టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. ఎన్ కౌంటర్ కు టిఆర్ ఎస్ నేతలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

10:21 - September 21, 2015

కర్నూలు : జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సోమవారం టిడిపి..వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపైకొకరు కర్రలు..రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీనితో కొందరి తలలు పగిలాయి. పలువురికి గాయాలయ్యాయి. ఇందులో టిడిపి కార్యకర్త మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ప్యాపిలి మండలం మునిమడుగులో ఉదయం బాషా పశువులు కనిపించడం లేదని వైసీపీకి చెందిన కొందరి వ్యక్తులను నిలదీశాడు. ఒక్కసారిగా వైసీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. అతడితో వాగ్వాదానికి దిగారు. వెంటనే అక్కడ వైసిపి..టిడిపి నేతలు గుమికూడారు. కర్రలు..రాళ్లతో ఒకరిపైకొకరు దాడులు చేసుకున్నారు. బాషాకు తీవ్రగాయాలు కావడంతో మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కొద్దిసేపటి అనంతరం టిడిపి వర్గీయులు వైసిపి నేతలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఇరు పార్టీలకు చెందిన నేతలకు పాత కక్షలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు సమాచారం. 

అజ్మీర్ దర్గాలో బాంబు కలకలం..

రాజస్థాన్ : ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బాంబు స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. 

నేపాల్ లో కొనసాగుతున్న ఆందోళనలు..

నేపాల్ : కొత్త రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిరసనకారులు బిర్ గుంజ్ ప్రాంతంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. 

10:16 - September 21, 2015

హైదరాబాద్ : జనసేనాని మరోసారి కదనరంగంలోకి దూకుతున్నారు. ఈసారి రైతుల కోసం కాదు.. తెలుగు భాష కోసం.. అవును తమిళనాడులో తెలుగు భాషను నిషేధించారు. దీనిపై అక్కడి తెలుగు సంఘాలన్ని ఆందోళన చేస్తున్నాయి. వారికి మద్దతుగా పవన్‌కళ్యాణ్‌ ఈ నెలాఖరులో చెన్నైలో దీక్ష చేపట్టనున్నారు.

ఢిల్లీలో బాలికపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ : దేశ రాజధానిలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నజఫ్ గఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టునట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అంతా వీడియో తీశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫేస్ బుక్ లో పెడుతామని వారు బెదిరించారని బాలిక వాపోయింది. 

ఎన్ కౌంటర్..టీఆర్ఎస్ దే బాధ్యత – కేకేడబ్ల్యూ దళం..

వరంగల్ : ఎన్ కౌంటర్ కు టీఆర్ఎస్ దే బాధ్యత అని కేకే డబ్ల్యూ దళం పేర్కొంది. మావోయిస్టు పార్టీ కేకే డబ్ల్యూ దళం కార్యదర్శి దామోదర్ పేరుతో లేఖ విడుదలైంది. శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్ కౌంటర్ బూటకమని తెలిపింది. మంచినీళ్ల కోసం వెళ్లిన వీరిద్దరినీ చిత్ర హింసలు పెట్టి చంపారని దామోదర్ ఆరోపించారు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అంటూ టీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. ఎన్ కౌంటర్ కు నేతలు బాధ్యత వహించాలని సూచించారు. 

10:11 - September 21, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో గోదావరి పోటు మీదుంటే.. భద్రాచలంలో మాత్రం కాస్త జోరు తగ్గింది. కొత్తూరు కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుంది. ఇటు పోలవరం మండలంలోని 19 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గు ముఖం పడుతుండటంతో..అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

10:10 - September 21, 2015

హైదరాబాద్ : సింగపూర్‌లో చంద్రబాబు మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యవర్గాలతో పెట్టుబడులపై సమావేశం పూర్తి కాగానే, బాబు ఈశ్వరన్‌తో సమావేశమయ్యారు. రాజధాని ప్లాన్‌ మలి దశపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 

జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..

జమ్మూ కాశ్మీర్ :కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్నారు. ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో చైనా - పాక్ సరిహద్దులను సందర్శించనున్నారు. 

తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు..

చిత్తూరు : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 

కర్నూలులో భగ్గుమన్న ఫ్యాక్షన్..టిడిపి నేత మృతి..

కర్నూలు : జిల్లాలో ఫ్యాక్షన్ భగ్గుమంది. ప్యాపిలి మండలం ముని మడుగులో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు..కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో టిడిపి కార్యకర్తల నాగూర్ బాషా మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

సీఎం సొంత ఇలాఖాలో మరో రైతు బలి..

మెదక్ : సీఎం సొంత నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం కౌలు రైతు సత్యనారాయణ బలవర్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతో చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. 

సింగపూర్ మంత్రితో చంద్రబాబు భేటీ..

సింగపూర్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సోమవారం అక్కడి మంత్రి ఈశ్వరన్ తో బాబు భేటీ అయ్యారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులపై చర్చిస్తున్నారు. 

మహబూబ్ నగర్ లో కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి..

మహబూబ్ నగర్ : జిల్లాలో మరో ఇద్దరు కల్తీకల్లు బాధితులు మృతి చెందారు. కల్లు దుకాణాలు మూత పడడంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. కొత్తూరు (మం) మేకగూడలో చెన్నయ్య...గద్వాల (మం) ముల్కపల్లిలో మరో వ్యక్తి కన్నుమూశారు.

 

శ్రీశైలంలోకి భారీగా వరద నీరు..

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీటి మట్టం 841.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇన్ ఫ్లో 8,395 ఉండగా ఔట్ ఫ్లో 1,000 క్యూసెక్కులుగా ఉంది. 

కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం...

తూర్పుగోదావరి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.3 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 7.42 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 7.38 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కనకాయలంక వద్ద కాజ్ వే నీట మునిగింది. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

ఎన్నారై ఇంట్లో చోరీ కేసును చేధించిన పోలీసులు..

గుంటూరు : బాపట్ల (మం) చుండూరిపల్లిలో ఎన్నారై ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈఘటనలో ఓ దొంగను అదుపులోకి తీసుకున్నారు. రూ. మూడు కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. 

చైనా - పాక్ సరిహద్దులను సందర్శించనున్న రాజ్ నాథ్..

జమ్మూ కాశ్మీర్ : నేడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా - పాక్ సరిహద్దులను సందర్శించనున్నారు. 

నేడు భారత్ - పాక్ సైన్యాధికారుల సమావేశం..

జమ్మూ కాశ్మీర్ : నేడు భారత్ - పాక్ సైన్యాధికారుల సమావేశం జరుగనుంది. పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఈ భేటీ జరుగనుంది. సరిహద్దులో శాంతి భద్రతల పరిరక్షణ అంశంపై చర్చిస్తారు.

 

09:40 - September 21, 2015

విజయవాడ : రాష్ట్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సర్కార్‌ వైఫల్యం వల్లే గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడలో కుక్కల దాడితో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

జనంపై కుక్కలు దాడి .......

ప్రతి వీధిలో, ప్రధాన సెంటర్లలో జనంపై కుక్కలు దాడి చేస్తున్నాయి. పాదాచారులకు కుక్కల దాడి మృత్యుపాశంగా మారుతోంది. చిన్నారులనైతే ఏకంగా నోటితో కరుచుకొని పోతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కుక్క కాట్ల కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడు నెలల్లో నగరంలో 12,563 మందిపై కుక్కలు దాడి చేశాయి. ఇక కుక్క కాటుకు గురైన వారు ఆస్పత్రికి వెళ్తే వ్యాక్సిన్‌లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో కుక్కపై రూ.600 ఖర్చు ......

ఇక కుక్కల సంతాన నియంత్రణ, టీకాల కోసం ప్రభుత్వం ఒకో కుక్కపై 600 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. మున్సిపల్‌ సిబ్బంది నాలుగు రోజులకోసారి కుక్కలను పట్టుకుని రేబిస్‌ నిరోధక టీకాలు వేయాల్సి ఉంటుంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. ఇందుకోసం ఒక్కో పురపాలక సంఘం ఏటా 40 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చించాల్సి ఉన్నప్పటికీ.. అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామాలలో కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. ఇక మున్సిపాలిటీలలో కుక్కలను పట్టుకునేందుకు సిబ్బంది కానీ.. ప్రత్యేక వ్యాన్లు, పరికరాలు కూడా సరిగా ఉండడం లేదు.

అధికారుల మొద్దు నిద్ర .....

నగరంలో రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పటిష్ట చర్యలు తీసుకుంటాం .....

అయితే కుక్కల దాడులు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. అయినా కుక్కల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని.. ఇకపై పటిష్ట చర్యలు చేపడతామన్నారు. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల దాడులను నివారించేందుకు మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

09:36 - September 21, 2015

కడప : జిల్లాలో చింతకొమ్మదిన్నెలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బక్రీద్‌ కోసం తరలిస్తున్న ఆవులను పోలీసులు అడ్డుకోవటంతో.. ఆగ్రహించిన ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. అర్ధరాత్రి 12 గంటల వరకు హంగామా నడిచింది. ముస్లిం మత పెద్దలతో పోలీసులు చర్చలు జరపటంతో.. చివరకు ఆందోళన విరమించారు.

కుంచారివారిపాలెంలో ప్రబలిన విషజ్వరాలు

గుంటూరు : చెరుకుపల్లి మండలం కుంచారివారిపాలెంలో విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ లక్షణాలతో ఎనిమిదేళ్ల బాడులు మృతి చెందాడు. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గణష్ మండపంలో నాగు పాములు..

 హైదరాబాద్‌ : నగరంలోని ల్యాంకోహిల్స్‌ సమీపంలోని ఖాజాగూడలో గణేష్‌ మండపంలోకి ఓ నాగుపాము వచ్చింది. కైలాసం నుంచి ఖాజాగూడకు పాము వచ్చిందని భక్తులు పెద్ద ఎత్తున చేరి రాత్రి నుంచి నాగుపాముకు పూజలు చేశారు. ఆ తర్వాత స్నేక్‌ సొసైటీ ప్రతినిధులు వచ్చి నాగుపామును పట్టుకొని అడవుల్లో వదిలారు. 

వరదనీటితో పోటెత్తుతున్న గోదావరి...

హైదరాబాద్ : గోదావరి నది ఎగువ భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 9.3 అడుగులలకు చేరింది. కనకాయలంక వద్ద కాజ్‌వే నీట మునగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

తమిళనాడులో పవన్ కల్యాణ్ దీక్ష

హైదరాబాద్ : నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో దీక్ష చేపట్టనున్నారు. ఈ నెలాఖరున ఆయన చేపట్టే దీక్ష కోసం పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంతో ఈ రాష్ట్రంలో మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమైపోతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించిన విషయం విదితమే.

కొనసాగుతున్న చంద్రబాబు సింగపూర్ టూర్

హైదరాబాద్ : చంద్రబాబు సింగపూర్‌ యాత్ర కొనసాగుతోంది. రాజధాని నిర్మాణంపై పలు కంపెనీలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. అలాగే ఏపీకి పెట్టుబడులు పెట్టాలంటూ వాణిజ్య వర్గాల భేటీలో బాబు కోరారు. మరికాసేపట్లో మంత్రి ఈశ్వరన్‌తో బాబు సమావేశం కానున్నారు.

 

08:43 - September 21, 2015

హైదరాబాద్‌ : నగరంలో దారుణం జరిగింది. సుల్తాన్‌బజార్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వెళ్తున్న షేక్ ఖాదర్ బాషను అతని బంధువు సర్ఫరాజ్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఖదర్‌ బాష అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే కుటుంబ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని డిసిపి రవీందర్ తెలిపారు.

08:42 - September 21, 2015

హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ జీహెచ్‌ఎమ్‌సీ కార్మికుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌ కాచిగూడ పరిధిలో జరిగింది. చెత్త తరలింపు వాహనం వద్ద కార్మికుడు పని చేస్తుండగా వెనకాల నుంచి వచ్చిన వరంగల్ డిపోకు చెదిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో..రాము అనే పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

08:39 - September 21, 2015

హైదరాబాద్ : పోలవరం కుడికాల్వకు తమ్మిలేరు వద్ద గండి పడింది. దీంతో నీళ్లు భారీగా వరదలా పోటెత్తాయి. కుడికాల్వకు నీళ్లు వదిలిన రెండురోజులకే ఈ ఘటన జరగడంతో అధికారులు అవాక్కయ్యారు. మంత్రి దేవినేని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల వైఫల్యమని మండిపడుతున్నాయి.

08:37 - September 21, 2015

హైదరాబాద్: తెలంగాణ లో రైతు రుణాలను ప్రభుత్వ రుణాలుగా మార్చాలని... రైతు ఆత్మహత్యలు నిలువరించాలంటే స్వామినాథన్ కమిటి, జయతిఘోష్ కమిటీలు సూచించిన 20 అంశాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని అమలు చేయాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. ఆ 20 అంశాలు ఏంతో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఇక్లక్ చేయండి...

08:01 - September 21, 2015

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాలు వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేయాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మహత్యల నివారణకు తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదా? విదేశీ టూర్ల పై దృష్టి పెట్టే సీఎంలు క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎందుకు దృష్టి పెట్టడంలేదు? తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలను ప్రతిపక్షాలు రాకీయాలు చేస్తున్నాయా? అంబేద్కర్ 125వ శతజయంతి ఉత్సవాల సందర్భంగా దళిత పార్లమెంట్ నిర్వహించడం శుభపరిణామం అని నేతలు అభిప్రాయపడ్డారు. షెడ్యూల్ కులాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం లేదా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నేత అద్దంకి దయాకర్, టిడిపి అధికార ప్రతినిధి వర్ల రామయ్య , మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,718 మంది భక్తులు దర్శించుకున్నారు. 

నేడు విశాఖలో ఐఐఎం ప్రారంభం

విశాఖ : నేడు విశాఖలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం-వి) ఏర్పాటు కాబోతోంది. ఆంధ్రా యూనిర్శిటీ లోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ రోజు ఉదయం ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం...

విశాఖపట్నం: ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో విస్తారంగా, దక్షిణకోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

07:09 - September 21, 2015

ప్రకాశం : సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనలో వాహనం ధ్వంసం అయింది. అదనపు పోలీసు బలగాలతో తెల్లవారుజామున గ్రామానికి వచ్చిన పోలీసులు దాడిచేసిన వారు లొంగిపోవాలని మైకుల్లో ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గ్రామస్థులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో 144 సెక్షన్ విధింపుకు పోలీసులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

నక్లెస్ రోడ్ లో ఫార్యావాక్....

హైదరాబాద్ : నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం నిర్వహించిన ఫార్మావాక్‌ ఆకట్టుకుంది. 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫార్మాసొసైటీ ఆధ్వర్యంలో జలవిహార్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు, తిరిగి జలవిహార్‌ వరకు వాక్‌ నిర్వహించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌డిఫ్యూటీడైరెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్రన్‌ వాక్‌ను ప్రారంభించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. సొసైటీఅధ్యక్షుడు డా.సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ, 1945 ఔషధచట్టాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు...

అమరావతి :తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఎంపిక దాదాపుగా పూర్తైంది. ఈ మేరకు నిన్న సింగపూర్ పర్యటనకు వెళ్లేముందే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ అవగాహనకు వచ్చారు. ఇక రాష్ట్ర కమిటీని పూర్తి చేసిన తర్వాత కిమిడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారు. ఉణుకూరు నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కళా వెంకట్రావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మునిసిపల్, హోం, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. 

మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారిదోపిడీ

గుంటూరు: మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారిదోపిడీ దొంగలు విజృంభించారు. మూడు వాహనాలను అడ్డుకుని సీసాలతో దాడి చేసి నగదు, సెల్ పోన్లు దోచుకున్నారు. ఈ ఘటనలో బందరు కు చెందిన ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షస్తున్నారు.

06:51 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక రైతుల గుండెలాగిపోతున్నాయి. ఈసారైనా కాలం కలిసి రాకపోతుందా అని ఎదురు చూసిన రైతుల ఆశలన్నీఅడియాశలయ్యాయి. చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక ఎండిపోయిన చేనులోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 11 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

తిరుమల : తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గరుడ సేవ అనంతరం మావటి సుబ్రహ్మణ్యంపై ఏనుగు దాడి చేసింది. దీంతో మావటి సుబ్రహ్మణ్యం చేతికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో మావటిని ఆసుపత్రికి తరలించారు.

06:42 - September 21, 2015

హైదరాబాద్ : ప్రధాని మోదీపై... రాహుల్‌గాంధీ మరోమారు విరుచుకు పడ్డారు. ఆయన మేకిన్‌ ఇండియా అంటున్నా.. జరుగుతున్నదంతా టేకిన్‌ ఇండియా అంటూ విమర్శించారు. మేకిన్ ఇండియాలో కార్మికులకు, కర్షకులకు స్థానం లేదని, కేవలం ఎంపిక చేసుకున్న కార్పొరేట్ స్నేహితులకు మాత్రమే మోదీ ప్రభుత్వం లబ్ది చేకూరుస్తోందని ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీయే అభివృద్ది నిరోధకంగా పని చేస్తోందని బీజేపీ ప్రతి విమర్శలు చేసింది.

రాంలీలా మైదానంలో కిసాన్ మజ్దూర్ సమ్మాన్ ర్యాలీ.....

బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు హోరెత్తిస్తున్న కాంగ్రెస్...ఢిల్లీ రాంలీలా మైదానంలో కిసాన్ మజ్దూర్ సమ్మాన్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు పలు రాష్ట్రాల పీసీసీ నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ ఆందోళనలతోనే బీజేపీ ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ పై వెనక్కితగ్గిందన్నారు.

మోదీ సర్కారుపై విమర్శల రాహుల్ దూకుడు.....

మరోవైపు నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శల దూకుడు కొనసాగించారు యువనేత రాహుల్ గాంధీ. మోదీది మేకిన్ ఇండియా కాదని, టేకిన్ ఇండియా పాలసీ అని విమర్శించారు. భారత్‌లో వనరులన్నీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ర్యాలీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు....

మరోవైపు కిసాన్ ర్యాలీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ కిసాన్ ర్యాలీపై మండిపడింది బీజేపీ. పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేశారో దేశ ప్రజలందరికీ తెలుసని ఆపార్టీ ఎద్దేవా చేసింది. 

06:36 - September 21, 2015

హైదరాబాద్ : టీటీడీ విద్యుత్‌ ఉత్పాదక రంగంలోకి అడుగుపెడుతోంది. పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ పెద్ద కంపెనీకి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే టీటీడీ వ్యాపారం చేయబోతోందా...? లేక అవసరాలకు వాడుతుందా అనేది ఆసక్తిగా మారింది.

ఎస్పీడీసీఎల్‌కు ఆదాయ వనరుగా టీటీడీ.....

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యాత్మిక మార్గం నుంచి విద్యుత్‌ ఉత్పాదక మార్గంలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం టీటీడీకీ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎస్పీడీసీఎల్‌కు టీటీడీ పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. ఎటా టీటీడీకి 4 లక్షల యూనిట్ల విద్యుత్ అసరమవుతోది. ఇందుకోసం ప్రతిఏటా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతో...తామే సొంత విద్యుత్‌ ఉత్పాదక కేంద్రం నెలకొల్పితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన సోలార్ పవర్ ప్రాజెక్టు వైపు అధికారులు అడుగులు వేస్తున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజవర్గంలో స్థలం గర్తింపు.....

టీటీడీ ఈవోగా సాంబశివరావు బాధ్యతలు చేపట్టాక ఈ పవర్ ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమయ్యాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజవర్గంలో స్థలాన్ని కూడా గుర్తించారు. ఓ దాత ఇచ్చిన 60 ఎకరాల స్థలంలో పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టును నిర్మించే బాధ్యతను బిల్డ్ వన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ స్కీంలో ఓ ప్రైవేటు కంపెనీకీ అప్పజెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 60 కోట్ల రూపాయలతో 10 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్రాజెక్టు చేపడుతోంది. పదేళ్ల వరకు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సర్కార్‌కు విక్రయిస్తుంది. పదేళ్ల తరువాత ఆ ప్రాజెక్టును పూర్తిగా టీటీడీకీ అప్పజెప్పాల్సి ఉంటుంది.

పవన విద్యుత్‌ కేంద్రాలు కూడా.....

తిరుమలలో ఇప్పటికే దాతలు ఏర్పాటు చేసిన పవన విద్యుత్‌ కేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా లక్షా 40 వేల యూనిట్ల విద్యుత్ తయారవుతోంది. అలాగే కొండపై మరిన్ని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు టీటీడీ సిద్ధమవుతోంది. మరీ కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న టీటీడీ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

కల్తీ కల్లుకు బానిసై ఎనిమిది మంది మృతి

హైదరాబాద్ : పల్లెల్లో కల్లు.. కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ కల్లుకు బానిసలైనవాళ్లు.. నేడు అదే కల్తీ కల్లు లేక మృత్యువాతపడుతున్నారు. మత్తుకు అలవాటుపడ్డ ప్రాణాలకు... మత్తు అందక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వింత వింత చేష్టలతో ఆస్పత్రి పాలవుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

06:31 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ స‌ర్కార్‌కు షాక్‌ తగిలింది. కొత్త ఎక్సైజ్‌ పాలసిని ప్రక‌టించిన సర్కార్‌ ఇప్పుడు ఆ పాలసికి స్పంద‌న క‌రువైంది. కొత్త మ‌ద్యం షాపుల‌కు దర‌ఖాస్తుకు ఇవాళ్టితో ఆఖ‌రు తేదీ. ఇప్పటికీ అనుకున్నంతగా దరఖాస్తుదారులు అస‌క్తి చూప‌ లేదు. దీంతో దర‌ఖాస్తుల అమ్మకానికి గ‌డువు పొడిగించాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.

నెల 14 నుంచి 21 తేదీ వరకు దరఖాస్తుల ఆహ్వానం.....

కొత్త మద్యం షాపులపై గులాబీ సర్కార్ పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. కొత్త మద్యం పాలసీతో ఖాళీ అయిన ఖజానాను నిండా నింపాలనుకున్న సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కొత్త మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే సర్కార్ అనుకున్నంతగా దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. దీంతో..ఆబ్కారీ శాఖ తర్జనబర్జన పడుతోంది.

రాష్ట్రంలో మొత్తం 2,216 షాపులు.....

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 వేల 2 వందల 16 షాపులున్నాయి. ఇందులో కేవలం 15 వందల వరకే దర‌ఖాస్తులు వచ్చాయి. దీంతో..మరోసారి గడువు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అసలు కారణం పెరిగిన లైనెన్స్‌ ఫీజులు, మార్జిన్‌ను పెంచకపోవడమేనని సమాచారం. ఈ కారణంగా మద్యం వ్యాపారుల్లో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌, సైబరాబాద్‌కు.....

పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్‌, సైబరాబాద్‌కు, వ‌రంగ‌ల్ కార్పొరేషన్‌ పరిధిలో తక్కువ దరఖాస్తులొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవే ఉన్నాయి. వీటిలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల నుంచే అధికంగా వచ్చాయి. ఒక షాప్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిన యజమానిని ఎంపిక చేయడం వంటి కారణాలు కూడా మద్యం వ్యాపారులు వెనక్కు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.

గతంలో లైసెన్స్ ఫీజు తగ్గినా..మిగిలిన 130 షాపులు.....

గ‌తంలో లైసెన్స్‌ ఫీజును త‌గ్గించిన‌ప్పటికీ జంట‌న‌గ‌రాల‌తో పాటు వ‌రంగ‌ల్ కార్పొరేషన్‌తో క‌ల‌సి మొత్తం 130 షాపులు మిగిలే ఉన్నాయి. ఈసారి ఏకంగా 20 శాతం ఫీజు పెరిగింది. దీంతో....వ్యాపారులపై భారం మోపడం ఖాయం. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే రిటైల్ షాపుల నిర్వహ‌ణ అంతా సులువు కాద‌ని తెలుస్తోంది.

06:29 - September 21, 2015

హైదరాబాద్‌ : నగరంలో మలయాళీల కోసం అందమైన కేరళ భవనం నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మలయాళీలు గొప్ప సేవాభావం కలిగిన వారని ఆయన కొనియాడారు. శిల్పకళావేదికలో జరిగిన కేరళావాసుల సమ్మేళనంలో కేసీఆర్‌తో పాటు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పేద మలయాళీలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. 700 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో అక్షరాస్యత పెంచేందుకు ఉమెన్‌చాందీ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయన్న కేసీఆర్‌.. తెలంగాణలో నిరక్షరాస్యతను తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నమని చెప్పారు. కేరళతో సంబంధాలు మరింత మెరుగుపర్చుకుంటామని.. తెలంగాణ అభివృద్ధిలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అందరి మద్దతు కోరుతున్నట్టు చెప్పారు. కేరళ భమవన్ కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలంతోపాటు రూ.కోటి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు కేరళ సీఎం ఉమెన్‌ చాందీ. కొత్తగా ఏర్పడిన తెలంగాణరాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

06:24 - September 21, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక రైతుల గుండెలాగిపోతున్నాయి. ఈసారైనా కాలం కలిసి రాకపోతుందా అని ఎదురు చూసిన రైతుల ఆశలన్నీఅడియాశలయ్యాయి. చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక ఎండిపోయిన చేనులోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 11 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు.

బేగంపేటలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య.....

హైదరాబాద్‌లో రైతు లింబయ్య ఆత్మహత్య ఘటన కళ్ల ముందు నుంచి చెరిగిపోకముందే.. నగరంలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలం రాంసాగర్‌కు చెందిన మల్లేశ్‌.. బేగంపేట పంప్‌ హౌస్‌ వద్ద చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఊళ్లో అప్పుల బాధ భరించలేక.. మల్లేశ్‌, వారం క్రితమే ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి.. ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక.. జీవితాన్ని అర్దాంతరంగా ముగించేశాడు.

ఎల్లప్ప అనే రైతు ఆత్మహత్య......

ఇక మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూర్‌ మండలం గురలింగంపల్లిలో తన పంట ఎండిపోవడంతో ఎల్లప్ప అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆరెకరాల్లో పత్తి, వరి సాగు చేశాడు. దీనికోసం లక్షా 60 వేల రూపాయలు అప్పు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం జనగామకు చెందిన బైకరి దేవయ్య చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మూడెకరాల్లో ఐదు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. మరోసారి రెండు బోర్లు తవ్వితే కొద్దిగా నీరుపడింది. దీంతో సాగు చేశాడు. అయితే వర్షాభావంతో ఆ బోర్లు కూడా ఎండిపోయాయి. ఇక చేసేదేమీ లేక మూడు నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడా పని దొరకక తిరిగి వచ్చేశాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఏమీ చేయాలో దిక్కుతోచని స్థితిలో తనువు చాలించాడు. అదేవిధంగా ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన రమేష్‌గౌడ్‌ కూడా చేసిన అప్పులు తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రామలింగాలగూడెంలో వెంకటయ్య ఆత్మహత్య........

మరోపక్క నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలో వలిశెట్టి వెంకటయ్య అనే రైతు అప్పుల బాధలు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. తన మూడెకరాలతో పాటు.. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని ప్రత్తి సాగుచేశాడు. పెట్టుబడి కోసం 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో వెంకటయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డిజిల్లా శంకర్‌పల్లి మండలం అంతప్పగూడలో వడ్డె జంగయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన అరెకరంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ప్రత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. ఇందుకోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పుచేశాడు. అయితే అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లలో కోలా సత్యనారాయణ అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన రెండెకరాలతో మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. తన పొలంలో ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరుపడలేదు. అప్పులన్నీ పేరుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన సత్యనారాయణ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆరేపల్లిలో రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య.........

కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ మండలం ఆరేపల్లిలో రాజయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలో మొక్కజొన్న పంట ఎండిపోవడం.. అప్పుల భారం ఎక్కువ కావడంతో చేసేది లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా పెద్దపల్లి మండలం సీతయ్య గ్రామానికి చెందిన మొండెద్దుల తిరుపతి సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్న భూమిని అమ్మేశాడు. మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. అయితే పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క వేములవాడ మండలం చంద్రిగిరికి చెందిన బుర్ర నర్సయ్య అనే రైతు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి బద్దం గంగారెడ్డి ఆత్మహత్య.........

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో కాప్రికి చెందిన రైతు బద్దం గంగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మూడెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపానికి గురైన గంగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బోర్లు అడుగంటి పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇక చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్థాపానికి గురైన మరో ముగ్గురు రైతులు గుండెపోటుతో మృతిచెందారు. 

బేగంపేటలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలో రైతు లింబయ్య ఆత్మహత్య ఘటన కళ్ల ముందు నుంచి చెరిగిపోకముందే.. నగరంలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలం రాంసాగర్‌కు చెందిన మల్లేశ్‌.. బేగంపేట పంప్‌ హౌస్‌ వద్ద చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఊళ్లో అప్పుల బాధ భరించలేక.. మల్లేశ్‌, వారం క్రితమే ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి.. ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక.. జీవితాన్ని అర్దాంతరంగా ముగించేశాడు. 

06:20 - September 21, 2015

హైదరాబాద్ : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం తీవ్ర ఛాతీ నొప్పితో ఆయన కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆయనకు కారొనరీ ఏంజియోగ్రఫీ చికిత్స చేశారు. శనివారం ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆదివారం సాయంత్రం మరోసారి తీవ్రంగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ....

బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న దాల్మియా... పదేళ్ల అనంతరం గత మార్చిలో బీసీసీఐకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచే అనారోగ్య కారణాలరీత్యా క్రికెట్ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. బీసీసీఐని ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో నిలిపిన పరిపాలకుడిగా ప్రసిద్ధికెక్కారు. అలాగే దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగానూ గుర్తింపు పొందారు. 1990వ దశకంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన వ్యాపార తెలివితేటలతో భారత క్రికెట్ బోర్డును ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేర్చారు

దాల్మియా మృతిపై బీసీసీఐ సభ్యులు సంతాపం.....

దాల్మియా మృతిపై బీసీసీఐ సభ్యులు సంతాపం తెలిపారు. భారత క్రికెట్ ఓ గొప్ప పరిపాలకుడిని కోల్పోయిందని బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. బోర్డు తరఫున దాల్మియా కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దాల్మియా మృతిపట్ల సంతాపం తెలిపారు.

క్రీడా పరిపాలకుల్లో దాల్మియా శిఖరం వంటివారని ......

క్రీడా పరిపాలకుల్లో దాల్మియా శిఖరం వంటివారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ను అమితంగా ప్రేమించిన వ్యక్తి అన్నారు. దాల్మియా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తోపాటు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, బిషన్‌ సింగ్ బేడీ, రోహిత్ శర్మ, రైనా.. దాల్మియా మృతి పట్ల సంతాపం తెలిపారు.

క్రికెట్‌కు వాణిజ్య హంగులు తెచ్చిన ఘనత దాల్మియాది......

శ్రీనివాసన్‌, లలిత్ మోదీలు పరిపాలనలో ఓనమాలు నేర్చుకోక ముందే క్రికెట్‌కు వాణిజ్య హంగులు తెచ్చిన ఘనత దాల్మియాది. ఇప్పుడు క్రికెటర్లు శ్రీమంతులవుతున్నా... హక్కుల రూపంలో బోర్డులు కోట్లు కొల్లగొడుతున్నా అదంతా ఆయన వ్యూహ చాతుర్యమే. క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన ఈ దాల్మియా బోర్డుకు డబ్బు తెచ్చి పెట్టడమే ఏకైక లక్ష్యంగా తన శక్తియుక్తులు ప్రదర్శించారు.

1979లో బోర్డులోకి అడుగు పెట్టిన దాల్మియా.....

1979లో బోర్డులోకి అడుగు పెట్టిన దాల్మియా 1983లో కోశాధికారి అయ్యారు. 90వ దశకంలో ఉపఖండంలో క్రికెట్ క్రేజ్ ఆకాశాన్నంటింది. టీవీల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ప్రసారాలు, వాటి హక్కుల కోసం పోటీ, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ప్రతీ చోట డబ్బు వచ్చి చేరడంలో దాల్మియాదే కీలక పాత్ర. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 1996 వరల్డ్ కప్ ఆట దశ, దిశను మార్చింది.

బీసీసీఐలో ఒక్కసారిగా డబ్బు వచ్చి చేరడమే కాదు....

బీసీసీఐలో ఒక్కసారిగా డబ్బు వచ్చి చేరడమే కాదు, ఈ వ్యూహాలు ఇతర బోర్డులకు సంపాదనను నేర్పించాయి. 1997 నుంచి మూడేళ్ల పాటు ఐసీసీ అధ్యక్షుడిగా, 2001 నుంచి 2004 వరకు బోర్డు అధ్యక్షుడిగా దాల్మియా పని చేశారు. బోర్డు రాజకీయాల కారణంగా 2005లో కీలక పదవులకు దూరమైన ఆయన పదేళ్ల పాటు ఒక రకమైన అజ్ఞాతవాసంలో గడిపారు.

అవినీతి ఆరోపణలు, బోర్డు సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం....

అవినీతి ఆరోపణలు, బోర్డు సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం, కేసులు... ఇలా ఎన్నో దాల్మియాను చుట్టుముట్టాయి. కానీ జీవితంలో ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడని ఈ బెంగాలీ పోరాటయోధుడు మరోసారి ఈ సమస్యలన్నీ ఛేదించుకొని బయటికి వచ్చారు. ఏడాదిన్నర క్రితం తాత్కాలికంగా, ఇటీవలి ఎన్నికల ద్వారా మళ్లీ బీసీసీఐ పీఠం ఎక్కి చివరకు అధ్యక్ష హోదాలోనే క్రికెట్‌తో పాటు జీవితం నుంచి కూడా సెలవు తీసుకున్నారు. లోటులో ఉన్న బోర్డును లాభాల బాటలోకి మల్లించిన దాల్మియా క్రికెట్‌ క్రీడాకారులందరికీ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఉగ్రవాదలు భయంతో ఈఫిల్ టవర్ మూసివేత

హైదరాబాద్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ప్రముఖ పర్యాటక కట్టడమైన ఈఫిల్ టవర్ ను ఈ రోజు మూసివేశారు. ఈ ఫిల్ టవర్ వద్దకు ఉగ్రవాది వచ్చాడన్న సమాచారంతో టవర్ పర్యటనను నిలిపివేదిసి, పర్యాటకులను అక్కడి నుండి పంపించేశారు. ఈఫిల్ టవర్ ను తిరిగి ఎప్పుడు తెరుస్తారన్న దానిపై పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

Don't Miss