Activities calendar

23 September 2015

21:22 - September 23, 2015

గుజరాత్ : పటేల్‌ సామాజిక ఉద్యమ నేత హార్దిక పటేల్‌ అరెస్ట్ విషయంలో హై డ్రామా చోటు చేసుకుంది. హార్దిక్‌ పటేల్‌ కనిపించడం లేదని పోలీసులు, కాదు పోలీసులే నిర్బంధించారన్న అతడి తరపు న్యాయవాది ఆరోపించారు. హార్దిక్‌ పటేల్‌ మిస్సింగ్‌పై జోక్యం చేసుకున్న హైకోర్టు రేపటిలోగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఇంతలోనే హార్థిక పటేల్‌ ప్రత్యక్ష మయ్యాడు.

పోలీసులే అరెస్టు చేశారన్న హార్దిక్ న్యాయవాది..
పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ.. హార్దిక్ పటేల్‌ మంగళవారం అరవల్లి జిల్లా తెన్పూర్ గ్రామంలో సభ నిర్వహించారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారన్న కారణంతో పోలీసులు ఆయనను, అతడి అనుచరులను అరెస్టు చేశారని హార్దిక్ పటేల్ తరుపు న్యాయవాది మంగూకియా ఆరోపించారు. పోలీసులు మాత్రం హార్దిక్‌ పటేల్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అక్కడి నుంచి ఓ వాహనంలో తన అనుచరులతో కలిసి పారిపోయాడని, తాను ఎక్కడ ఉన్నాడన్న సమాచారం కూడా లేదని అన్నారు.

అహ్మదాబాద్ లో ఉన్నట్లు సమాచారం..
22 ఏళ్ల హార్దిక్ పటేల్‌ను పోలీసులు నిర్బంధించారంటూ న్యాయవాది మంగూకియా మంగళవారం రాత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు గురువారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయ్యే సమయానికి హార్దిక్‌ పటేల్‌ను ప్రవేశ పెట్టాలని అర్థరాత్రి రెండున్నరకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే హార్దిక్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు 155 కిలోమీటర్ల దూరంలో హల్వాడ్‌లో ఉన్నట్టు తనకు ఎస్‌ఎమ్‌ఎస్‌ చేశాడంటూ న్యాయవాది చెప్పారు.

21:22 - September 23, 2015

బీహార్‌ : అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను జెడియు - ఆర్జేడి - కాంగ్రెస్‌ మహాకూటమి ప్రకటించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 242 అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ విడుదల చేశారు. జేడీయు-ఆర్జేడీ చెరి 101 స్థానాలు పంచుకోగా, కాంగ్రెస్‌కు 41 స్థానాలను కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ప్రకటించినట్టు నితీష్‌ పేర్కొన్నారు. బిసిలకు 55 శాతం, ఎస్‌సి ఎస్‌టిలకు 15 శాతం, మైనారిటీలకు 14 శాతం, ఇతర వర్గాలకు 16 శాతం సీట్లు కేటాయించినట్టు నితీష్‌ తెలిపారు. ఈ జాబితాలో లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్‌, తేజస్వీల పేర్లు కూడా ఉన్నాయి. అక్టోబర్‌ 12న జరిగే మొదటి దశ పోలింగ్‌కు నామినేషన్‌ వేయడానికి ఈ రోజు ఆఖరు తేది.

21:17 - September 23, 2015

మెదక్ : నారాయణఖేడ్‌ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కిష్టారెడ్డి కుటుంబం నుంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేసింది. అయితే.. ఈ ప్రతిపాదనపై సీఎల్పీ నేత జానారెడ్డి సభలో నోరు మెదపక పోవడం విశేషం.
కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీని.. ఆయన కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ దీన్ని ఏకగ్రీవం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా అన్ని పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజున.. కిష్టారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూనే తమ మనోగతాన్ని సభ ముందుంచారు. పాలక టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కిష్టారెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడిన సీఎల్పీ నేత జానారెడ్డి.. ఏకగ్రీవ ప్రతిపాదనను ప్రస్తావించక పోవడం విశేషం. దీనిపై కొందరు పార్టీ నేతలు జానా వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  

ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు ఆదేశాలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు ఎస్సీ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులతో ఎంవీ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో అక్టోబర్ 10లోపు ఎస్సీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలన్నారు.

అమెరికా పర్యటన రద్దు చేసుకున్న కొయిరాలా..

ఖాట్మండు : నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. నేపాల్‌లో నూతన రాజ్యాంగం ఆమోదించడంపై అక్కడి ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

కేంద్ర మంత్రి గజపతి ఇంట్లో విందుకు హాజరైన సీఎం బాబు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు నివాసంలో ఏర్పాటు చేసిన విందులో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, సీఎం చంద్రబాబు, ఇతరులు పాల్గొన్నారు. 

విశాఖలో యువతి ఆత్మహత్య..

విశాఖపట్టణం : నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో నవీనారెడ్డి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈమెది విజయనగరం జిల్లా.  

విశాఖ రైల్వే స్టేషన్ లో దొంగ నోట్లు కలకలం..

విశాఖపట్టణం : రైల్వేస్టేషన్ లో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. గౌహతి - బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో రూ.5లక్షల దొంగనోట్లు స్వాధీనం చేసుకోగా ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

 

స్విమ్స్ లో బ్రెయిన్ డెడ్..అవయవాల దానం..

తిరుపతి : స్విమ్స్ లో రెడ్డప్ప అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. అతని అవయవదానాలు ఇచ్చేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. కిడ్నీలు, గుండెను దానం చేశారు. ఓ కిడ్నీని నెల్లూరుకు, గుండెను చెన్నైకి తరలించారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో రెడ్డప్ప తీవ్ర గాయాలకు గురై బ్రెయిన్ డెడ్ అయ్యాడు. 

అర్బన్ ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు..

గుంటూరు : ఉల్ఫ్ గ్రౌండ్ లోనే దీక్ష చేపట్టేందుకు అనుమతినివ్వాలని అర్బన్ ఎస్పీ త్రిపాఠిని వైసీపీ నేతలు కోరారు. ఎలాంటి ఆటంకం కలిగించకుండా దీక్ష జరుపుకుంటామని వినతిపత్రం ఇచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. అనుమతి రాని పక్షంలో దీక్షకు సంబంధించిన స్థలంపై రేపు నిర్ణయం తీసుకుంటామని వైసీపీ నేతలు వెల్లడించారు.

రోడ్లు..బ్రిడ్జిల నిర్మాణంలో సహకారం - అంజూ..

హైదరాబాద్ : రోడ్లు..బిడ్జిల నిర్మాణంలో పాలుపంచుకుంటామని అంజూ సంస్థ పేర్కొంది. సీఎం కేసీఆర్ తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం కేసీఆర్ కోరడంతో పై విధంగా స్పందించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్ లలో భాగస్వామ్యమౌతాయని తెలిపింది. 

ఏపీ జెన్ కో ఆర్ ఈసీ ఒప్పందం..

ఢిల్లీ : సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో తో రూ.9వేల కోట్లతో ఆర్ ఈసీ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురంలో రూ.3వేల కోట్లతో 500 మెగావాట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ రాజధాని నిర్మాణ ప్రాంతంలో రూ.6వేల కోట్లతో ట్రాన్స్ మిషన్ అండ్ సిస్టం ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టులకు ఒప్పందం కుదిరింది. 

సచివాలయంలో మత్స్య పరిశ్రమపై మంత్రుల భేటీ..

హైదరాబాద్ : సచివాలయంలో మత్స్య పరిశ్రమపై మత్స్యకారులతో మంత్రులు ఈటెల, హరీష్ రావు, పోచారంలు సమవేశమయ్యారు. చేపల పెంపకానికి సంబంధించిన కేజ్ కల్చర్ పై చర్చ జరిగింది. చేపల పెంపకంపై పది వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిటన్లు మంత్రులు పేర్కొన్నారని మత్స్యకార సంఘం అధ్యక్షుడు బండా ప్రకాష్ పేర్కొన్నారు. మత్స్య కార్మికుల కోసం కొత్త చట్టం తేవాలని మంత్రులను మత్స్యకారులు, ముదిరాజ్ సంఘాలు కోరగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

19:40 - September 23, 2015

ఢిల్లీ : చేసింది తప్పని తెలుసు. సరిదిద్దుకుంటే సరిపోతుందని కూడా తెలుసు. కానీ అలా చేయలేదు. తప్పును ఒప్పును చేయాలనుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తప్పుకు కవరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ తల తన్నే వాడొకడుంటే తాడి తన్నేవాడొకడుంటానే నిజం తెలుసుకోలేక అంతర్జాతీయ స్ధాయిలో బొక్క బోర్లా పడ్డారు. ఎక్కడ తల ఎత్తుకు తిరిగారో అక్కడే తలదించుకునే స్ధితికి వచ్చారు.

పర్యావరణం కాలుష్యం..
ఆటోమొబైల్స్‌ రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో సత్తా చాటిన కార్ల తయారీ కంపెనీ వోక్స్ వాగన్‌. జర్మనీకి చెందిన ఈ కంపెనీ పలు స్టైలిష్‌ మోడల్స్ తో కార్‌ లవర్స్ హృదయాలను గెలుచుకుంది. అంతేనా అత్యుత్తమ పనితీరుతో ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లను సంపాదించుకుంది. అయితే ఈ అత్యుత్తమ పనితీరు అనే పదానికి వోక్స్ వాగన్‌ తూట్లు పొడిచిందని, పర్యావరణాన్ని కాలుష్య కాసారం చేసిందని అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాలు ఆరోపించాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు వోక్స్ వాగన్‌ చేసిన మోసాన్ని బట్టబయలు చేశాయి. వ్యాగన్‌ తయారు చేసిన కోటికి పైగా డీజిల్‌ కార్ల ఇంజిన్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ కారణంగా పరిమితికి మించి కాలుష్య కారకాలను ఇవి వెదజల్లుతాయి. ఈ ఇంజిన్లలోని లోపాలను కప్పిపుచ్చేందుకు ఓ ప్రత్యేక సాప్ట్ వేర్‌ను రూపొందించి వాటిని ఆయా కార్లకు అమర్చిచింది. దీన్ని గమనించిన అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాలు వోక్స్ వాగన్‌ పై దర్యాప్తుకు ఆదేశించాయి.

కేసులను ఎదుర్కొనేందుకు 730 కోట్ల డాలర్లు..
తమ బండారం కాస్త బయటపడటంతో వోక్స్ వాగన్‌ పొంతన లేని సమాధానాలు చెప్తోంది. నిర్ధేశిత ప్రమాణాల కన్నా 40 రెట్లు కాలుష్యం వెదజల్లే డీజిల్ ఇంజన్లను తాము తయారు చేయలేదంటూ చెప్పుకొస్తోంది. అయినా కేసులను ఎదుర్కొనేందుకు దాదాపు 730 కోట్ల డాలర్లను కేటాయించింది వోక్స్ వాగన్‌ కంపెనీ. ఈ తాజా ఆరోపణలతో వోక్స్‌ వాగన్‌ కంపెనీ షేర్లు మార్కెట్లో భారీగా పడిపోయాయి.

19:36 - September 23, 2015

ముంబాయి : 7/11 ముంబాయి వరస బాంబు పేలుళ్ల దోషులకు కఠిన శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఈ కేసులో దోషులుగా ఉన్న 8 మందికి మరణశిక్ష, మరో నలుగురికి యావజ్జీవ శిక్ష విధించాలని విన్నవించింది. ముంబై వరుస పేలుళ్ల కేసులో మోకా కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న వీరికి శిక్షలు ఖరారు చేయనుంది.
2006 జులై 11న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లతో పట్టణం వణికిపోయింది. ముంబాయి సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లు జరిపారు. మొత్తం 189 మంది మృతి చెందారు. సబర్బన్ రైళ్లలో బాంబులను ప్రెషర్ కుకర్లలో అమర్చి పేల్చారు. 11 నిమిషాల తేడాతో ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘాతుకానికి సంబంధించి యాంటీ ట్రెరరిజమ్ స్వ్కాడ్ 15 మంది నిందితులను అరెస్టు చేసింది. ఇదే కేసుకు సంబంధించి మరో పది మంది పరారీలో ఉన్నారు. 

19:31 - September 23, 2015

ఢిల్లీ: గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్‌ భారతి పోలీసులకు లొంగిపోవాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. సోమనాథ్‌ భారతి ఎందుకు పారిపోతున్నారు? జైలుకు వెళ్లడానికి ఎందుకు వెనకాడుతున్నారు ? ఆయన తీరు వల్ల పార్టీ, కుటుంబం అప్రతిష్ట పాలవుతోందని పేర్కొన్నారు. మంగళవారం సోమనాథ్‌ భారతి ముందస్తు బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పోలీసుల కంటబడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సోమనాథ్‌ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా గృహ హింస, హత్యా యత్నం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 

19:29 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణా బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ... బీఏసీ స‌మావేశం హాట్ హాట్ గా జ‌రిగింది. శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై బిఎసిలో ఏకాభిప్రాయం రాలేదు. కొన్ని విషయాలపై టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు.. చివరకు సభలో చర్చించాల్సిన కీలక అంశాలకు సభ్యులు ఒకే చెప్పారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్ 10వరకూ నిర్వహించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.. బుధవారం సమావేశాల్లో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లాం, ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు.. ఆ తర్వాత సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశమైంది.

29న రైతు సమస్యలపై చర్చ..
అసెంబ్లీలో ఈనెల 29న రైతు సమస్యలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అవసరమైతే ఇదే అంశంపై మరో రోజు కూడా చర్చకు సిద్ధమని అధికార పార్టీ స్పష్టంచేసింది.. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు తాము సిద్ధమన్న విపక్షాలు.. ఆదిశగా ముందుకు రావాలని పాలక పక్షాన్ని కోరాయి. దీనికి సానుకూలంగా స్పందించిన టీఆర్‌ఎస్‌.. హౌసింగ్ పథకానికి సంబంధించి ప్రతిపక్ష సభ్యుల తీరును ఆక్షేపిపించింది. ఈ స్కీం అమలులో టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపించగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీ నేతల అవినీతిపై తాము అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.. అలాగే తమ పార్టీ నుంచి మరో సభ్యుడికి ముందు వరుసలో కూర్చునే అవకాశం ఇవ్వాలని టీడీపీ కోరింది.. అయితే.. దీనిపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రశ్నోత్తరాలతర్వాతే వాయిదా తీర్మానాలు..
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటనుంచి గంటన్నరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే వాయిదా తీర్మానాలను మాత్రం ప్రశ్నోత్తరాల తర్వాతే స్వీకరించాలంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చకు సమయం సరిపోదని గడువును పెంచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పదో తేదీ వరకూ అన్ని అంశాలు చర్చకు రాకపోతే అప్పుడు మరోసారి బీఏసీ సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇక పార్టీ ఫిరాయింపులపై సభలో చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. దీనిపై అధికారపార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు.. స్పీకర్ పరిధిలోని అంశంపై చర్చ ఎందుకంటూ దాటవేసినట్లు సమాచారం.

ఐర్లాండ్ లో మోడీ..

ఐర్లాండ్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐర్లాండ్ లో పర్యటిస్తున్నారు. ప్రధాని ఎండా కెన్నీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్ - ఐర్లాండ్ మధ్య అనేక సౌరూప్యతలున్నాయని, ఐర్లాండ్ అభివృద్ధిలో 26 వేల మంది భారతీయుల కృషి ఉందని కొనియాడారు. మందగమనంలోనూ భారత్ - ఐర్లాండ్ మధ్య వాణిజ్య వృద్ధి పథంలో కొనసాగుతోందని ఐర్లాండ్ ప్రధాని పేర్కొన్నారు. 

ఏపీ సర్కార్..జియాన్ లాంగీ సిలికాన్ మధ్య ఒప్పందం..

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం చైనా సంస్థ జియాన్ లాంగీ సిలికాన్ మెటీరియల్స్ మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై శ్రీ సిటీ ప్రైవేటు లిమిటెడ్, జియాన్ లాంగి మెటిరీయల్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు. శ్రీ సిటీలోని 60 ఎకరాల్లో రూ.1600 కోట్లతో యూనిట్ ఏర్పాటు కానుంది. 

19:01 - September 23, 2015

గౌహతి: అస్సాం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆదివాసి మహిళ తలను నరికివేశారు. దీనికి కోడి దొంగతమనే కారణమని తెలుస్తుండగా మంత్రాలు చేస్తుందనే హత్య జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...సోనిత్‌పూర్ జిల్లాలోని బార్‌ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి(50) కుటుంబానికి, అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబం నివాసం ఉంటోంది. వీరి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపర్చారు. తమని తాము రక్షించుకునేందుకు ఫాగుని కుటుంబసభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు కోళ్ల దొంగతనమే కారణమని తెలుస్తోంది. కాగా, మృతురాలు మంత్రాలు చేస్తున్న నేపథ్యంలోనే హత్య జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - రాధా మోహన్ సింగ్..

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీలో రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలపై నివేదికలు పంపిస్తే తెలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

బక్రీద్..నిమజ్జనంపై సీపీ సమీక్ష..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగలపై సీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హాజరైన పోలీసు అధికారులతో బందోబస్తుపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

సీఎం కేసీఆర్ తో చైనా ఇన్ ఫ్రా ప్రతినిధుల భేటీ..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులను కోరారు.

యూపీలో ఎద్దు మాంసం స్వాధీనం..

లక్నో: అక్రమంగా ఎద్దు మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. బార్‌గేన్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులు 20క్వింటాళ్ల మాంసాన్ని ఓ వాహనంలో ఢిల్లీకి తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా రక్షణ శాఖ అనుమతి..

న్యూఢిల్లీ : గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా ప్రాజెక్టు పైపులైన్లకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి లభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా ప్రాజెక్టుకు సంబంధించి భూగర్భ పైపులైన్ల అనుమతి దస్త్రంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సంతకం చేశారు. 

బీహార్ లో నాలుగు ర్యాలీలు - పటేల్ వర్గం..

పాట్నా: పాటిదర్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ నేతృత్వంలో బీహార్‌లో నాలుగు ర్యాలీలు చేపట్టనున్నట్టు పటేల్ వర్గం సభ్యుడు అభిషేక్ కటియార్ తెలిపారు. 

జగన్ దీక్షలు మానాలి - కేఈ..

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ దీక్షలు మానుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. దీక్షలు మాని ప్రధాని నరేంద్రమోడిని కలిసి హోదా గురించి మాట్లాడాలని ఆయన చెప్పారు.

 

ప్రత్యేక హోదా కోసం కర్నూలులో మానవహారం..

కర్నూలు : పట్టణంలోని కొండారెడ్డి బురుజు తెలుగుతల్లి విగ్రహం దగ్గర ప్రత్యేకహోదా కోసం మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. 

18:46 - September 23, 2015

హైదరాబాద్ : ట్రెండ్‌ మారుతోంది. యువత ఆలోచన కూడా హై స్పీడ్‌ వేగంతో ముందుకెళ్తోంది. అందుకే ఈ సారి చవితి ఉత్సవాల్లో లంబోదరుడు వివిధ రూపాల్లో.. వినూత్నంగా భక్తులకు దర్శనిమిస్తున్నాడు. విశాఖలో ఏర్పాటు చేసిన బహుబలి, గబ్బర్‌సింగ్‌, శ్రీమంతుడు గణేష్‌ విగ్రహాలు.. భక్తులచే పూజలందుకుంటున్నాయి. అయితే.. భిన్నరూపాల్లో వినాయక విగ్రహాలను నెలకొల్పడాన్ని కొందరు స్వామిజీలు తీవ్రంగా తప్పపడుతున్నారు.
కాలానికి అనుగుణంగా వినాయక విగ్రహాల రూపాలు మారుతున్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టు గణేష్‌ విగ్రహాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. యూత్‌ కోరుకున్నట్లుగా లంబోదరుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ యేడాది బహుబలి గణేష్‌, శ్రీమంతుడు వినాయకుడు, ఉల్లిగడ్డల లంబోదరుడు, హెల్మెట్‌ వినాయకుడు విగ్రహాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. వీటితో పాటు మరికొన్ని వినాయక విగ్రహాలు కూడా విశాఖలో కొలువుదీరాయి. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ వినాయక ఉత్సవాల నిర్వహణ తీరుపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివాదం మాట ఎలా ఉన్నా.. సరికొత్త రూపంలో ఉన్న ఈ వినాయక విగ్రహాలు మాత్రం యూత్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి.

18:43 - September 23, 2015

అనంతపురం : సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురంలో పర్యటించారు. అనంతరం ఆయన అభిమాని గౌస్ మొహినుద్దీన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. జిల్లాలోని తాగు, సాగునీటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోతానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఏడాది చివరికల్లా జిల్లాలోని అన్ని చెరువులనూ నింపుతామని తెలిపారు. అనంతరం త్వరలో రానున్న డిక్టేటర్ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. అనంతరం ఆ సినిమాలో డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సహాపరిచాడు బాలయ్య. 

18:41 - September 23, 2015

విశాఖపట్టణం : ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు స్టూడెంట్స్ క్లాస్ పీకారు. ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదాపై విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ నిలదీశారు. విభజన ఎందుకు చేశారంటూ నిలదీశారు. ఇదంతా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి జరిపిన సమావేశంలో చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఎంఎస్ ఉద్యమంలో ఆ పార్టీ నేతలను విద్యార్థులు నిలదీశారు. విద్యార్థులంతా ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. కాంగ్రెస్‌ నేతలకు చెమటలు పట్టించారు. ఒక విధంగా చెప్పలంటే... నాయకులపై మాటల తూటాలు వదిలారు. బిజెపి ప్రభుత్వం ఏపికి ప్రత్యకహోదా ఇవ్వకుండా.. ప్రజలను మోసం చేస్తుందని.. పీసీసీ చీఫ్‌ రఘువీరా అంటుండడంతో.. విద్యార్థులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్సేనంటూ... ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్ని దొంగ పార్టీలేనని.. అంతా యువతను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. 

18:38 - September 23, 2015

హైదరాబాద్ : ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మార్గదర్శకంగా నిలిచిందని ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గిరిజన సంక్షేమంపై మంత్రి రావెల 31 శాఖలతో మంత్రి రావెల సమీక్షించారు. వసతి గృహాల వార్డెన్లకు ట్యాబ్‌లను పంపిణీ చేసిన మంత్రి, హాస్టళ్లలో సదుపాయాలపై బయో మెట్రిక్‌ విధానం ద్వారా తెలుసుకుంటాం అని తెలిపారు. 

18:37 - September 23, 2015

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సబ్‌ కమిటీ భేటీలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్‌ భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ సాకారం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన సీఎం చంద్రబాబు అధ్యక్షతన దిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సబ్‌కమిటీ సమావేశం ముగిసింది. స్వచ్ఛభారత్‌పై 10 రోజుల్లో ప్రధాని నరేంద్రమోడీకి నివేదిక ఇస్తామన్నారు. ఈ సందర్భంగా సబ్‌కమిటీ చేసిన పలు సూచనలను మీడియాకు వెల్లడించారు.

 

18:34 - September 23, 2015

భారత గడ్డపై సఫారీ సిరీస్ వేటకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2 నుంచి జరిగే టీ-20, 11 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్లను రెండుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు బెంగళూరు జాతీయక్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న సన్నాహక శిబిరంలో కసరత్తులు చేస్తున్నారు. మూడుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రోగ్రామ్ మీ కోసం..
భారత్ లో సౌతాఫ్రికా జట్టు 74 రోజుల పర్యటనకు రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా సఫారీ టీమ్ మూడు మ్యాచ్ ల టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే, నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ల్లో టీ మిండియాతో ఢీ కొనబోతోంది.

శిక్షణ..
ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ బోర్డులు టీ-20, వన్డే సిరీస్ ల కోసం వేర్వేరు జట్లను ప్రకటించడం ద్వారా నగారా మోగించాయి. టీ-20 సిరీస్ లో పాల్గొనే సౌతాఫ్రికా టీమ్ కు డూప్లెసిస్, టీమిండియాకు ధోనీ నాయకత్వం వహిస్తుంటే వన్డే సిరీస్ లో పాల్గొనే సఫారీ టీమ్ కు 'ఏబీ డివిలియర్స్', టీమిండియాకు 'ధోనీ' నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు బెంగళూరులోని జాతీయక్రికెట్ అకాడెమీలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో సమాయత్తమవుతున్నారు.  ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా రెండోర్యాంక్ లో ఉంటే సౌతాఫ్రికా మూడోర్యాంక్ లో కొనసాగుతోంది.

సిరీస్ లో భాగంగా..ముందుగా మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ నిర్వహిస్తారు.
అక్టోబర్ 2న జరిగే తొలి టీ-20 మ్యాచ్ కు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం ఆతిథ్యమిస్తుంది.
సిరీస్ లోని రెండోవన్డేను కటక్ బారాబటీ స్టేడియం వేదికగా అక్టోబర్ 5 న జరుగుతుంది. 
సిరీస్ లోని ఆఖరి టీ-20మ్యాచ్ ను కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో అక్టోబర్ 8న నిర్వహిస్తారు.
మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ముగిసిన మూడురోజుల విరామం తర్వాత ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
సిరీస్ లోని తొలివన్డేను అక్టోబర్ 11న..కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.
సిరీస్ లోని రెండో వన్డే...ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా అక్టోబర్ 14న నిర్వహిస్తారు.
మూడో వన్డే అక్టోబర్ 18న రాజ్ కోట్, నాలుగో వన్డే చెన్నై చెపాక్ స్టేడియంలో అక్టోబర్ 22న, సిరీస్ లోని ఆఖరివన్డే అక్టోబర్ 25న బ్రబోర్న్ స్టేడియంలోనూ నిర్వహిస్తారు.
నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నవంబర్ లో ప్రారంభమవుతుంది. మొత్తం మీద మూడుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లతో దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.

18:28 - September 23, 2015

సౌతాఫ్రికాతో వచ్చేనెలలో జరిగే సిరీస్ కోసం తాను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యానని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించమే తన లక్ష్యమని ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ప్రకటించాడు. జట్టులో సమతౌల్యం తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో శిక్షణ పొందుతున్న బిన్నీ..తన అభిప్రాయాలను మీడియా ముందు ఉంచాడు. టెస్ట్ మ్యాచ్ ల్లో రాణించడం అంతతేలిక కాదని ఇటీవలే ముగిసిన శ్రీలంక టూర్ లో తనకు అనుభవమయ్యిందని చెప్పాడు. సఫారీటీమ్ తో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20, ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో స్టువర్ట్ బిన్నీకి చోటు దక్కిన సంగతి తెలిసిందే.

18:27 - September 23, 2015

హైదరాబాద్ : వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైసీపీ నేత బొత్స ఆరోపించారు. ఈనెల 26వ తేదీన చేపట్టదలిచిన జగన్ దీక్షకు పోలీసులు బుధవారం మధ్యాహ్నాం అనుమతి నిరాకరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోత్స మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. తాము రాజకీయ లబ్ది కోసం చేయడం లేదని, వాస్తవానికి ఈ విషయంలో సీఎం బాబు దీక్ష చేయాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం పోరాటానికి మద్దతు తెలుపాల్సింది పోయి రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని బోత్స విమర్శించారు. 

18:24 - September 23, 2015

గుంటూరు : ప్రత్యేక హోదాపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దీక్ష అప్పుడే ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోంది. దీక్షకు అనుమతి లేదని పోలీసులు బుధవారం మధ్యాహ్నాం చెప్పడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. దీక్ష ప్రాంగణానికి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీక్ష స్థలిని మార్చేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఈసందర్భంగా టెన్ టివితో అంబటి రాంబాబు మాట్లాడారు. చట్ట ప్రకారం చేయాల్సినవన్నీ చేశామని, రెండు, మూడు చోట్ల ప్రాంతాల చూపెట్టి దీక్షకు అనుమతినివ్వాలని కోరడం జరిగిందన్నారు. దీనికి నిరాకరించడంతో ప్రైవేటు స్థలానికి చెందిన ఏసీ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించి అనుమతిని తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించిన డబ్బులను కూడా యాజమాన్యానికి అందించినట్లు దీనికి సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేసినట్లు చెప్పారు. జగన్ దీక్ష చేపడుతున్న సందర్భంగా తగిన రక్షణ కల్పించాలని ఈనెల 20వ తేదీన కోరడం జరిగిందన్నారు. కానీ బుధవాంర మధ్యాహ్నాం అనుమతి లేదని పేర్కొనడం సబబు కాదన్నారు. కారణాలు ఏనైన్నా చెబుతారని, గతంలో స్పీకర్ కోడెల, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఉద్యమం చేయాలేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టిన సమయంలో ఈ నిబంధనలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇక్కడి నుండి వెళ్లేది లేదని, జగన్ దీక్ష ఇక్కడ చేపడుతారని అంబటి స్పష్టం చేశారు. 

17:59 - September 23, 2015

'ప్రేమికులు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తరువాత ఎన్నో సినిమాల్లో 'కామ్నా జెఠ్మలాని' నటించి మెప్పించింది 'గోపిచంద్' తో 'రణం', అల్లరి నరేష్ తో 'బెండు అప్పారావు ఆర్ఎంపి' వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే చాలా మంది కథానాయికలు తాము గర్భవతి అన్న విషయాన్ని దాచి పెడుతుంటారు. కానీ 'కామ్నా' మాత్రం తను గర్భవతి అన్న విషయాన్ని మీడియా ముందు ఎంతో సంతోషంగా వెల్లడించింది. తనకిప్పుడు ఐదవ నెల అని త్వరలో తాను తల్లి కాబోతున్నానని ప్రకటించింది. ఆమె ప్రస్తుతం 'చంద్రిక' అనే హర్రర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 25 న విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోగా జయరాం కార్తీక్ నటిస్తున్నాడు. కామ్నా ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నాగ్పాల్ ను గత సంవత్సరం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళయిన తరువాత కూడా నటనను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 

ప్రజల మనోభావాలు తెలిపేందుకు జగన్ దీక్ష..

గుంటూరు : ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలు తెలిపేందుకు జగన్ దీక్ష చేపడుతున్నారి వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్ష కోసం మూడు స్థలాలను ప్రతిపాదించడం జరిగిందని, ప్రైవేటు స్థలంలో దీక్ష చేసుకోవాలని అధికారులు సూచించడం జరిగిందని తెలిపారు. 

కోల్ కతా లో ఫైర్ ఆక్సిడెంట్...

కోల్ కతా : వేర్ హౌజ్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. 

17:36 - September 23, 2015

మెదక్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌.. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.15000 లు ఇవ్వాలని, సెకండ్ ఏఎన్ ఎంగా గుర్తించాలని సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా ఆశా వర్కర్లు ఆశలు వదులుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో కడుపు మండిన ఆశా వర్కర్లు మెదక్ లో బుధవారం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. తమకు కనీసం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారిని రెండో ఏఎన్ ఎం గా గుర్తించాలని, అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి.. స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోయేసరికి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేసిందని, తమ పట్ట నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట తప్పిందని, రాబోయే కాలంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

మమతను కలిసిన గంగూలీ..

కోల్ కతా : మాజీ క్రికేటర్ గంగూలీ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిశారు. పశ్చిమ బెంగాల్ క్రికెట్ ఛైర్మన్ రేసులో మాజీ క్రికెటర్ గంగూలి నిలిచారు. గంగూలీకి కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపారు. జగన్మోహన్ దాల్మియా మృతితో స్థానం అయిన సంగతి తెలిసిందే. 

ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగ్ లు..

అనంతపురం : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగ్ లు వదిలారు. బాబు వస్తే జాబు వస్తుందని హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. నెమ్మది నెమ్మదిగా హామీలు అమలు చేస్తామని, అనుకున్నవన్నీ జరిగిపోవడానికి జై పాతాళ భైరవీ మంత్రమన్నారు. ఈడీ ఆధీనం నుండి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు. 

వోక్స్ వాగన్ మోసం..

ఢిల్లీ : 15 ఏళ్లుగా వినియోగదారులను వోక్స్ వాగన్ మోసం చేస్తోందని వర్జినీయా వర్సిటీ ఇంజనీర్ కార్డర్ వెల్లడించారు. ఐదుగురితో కలిసి పరిశోధనలు నిర్వహించారు. దీనికి సంబంధించిన నిజాలను బయటపడ్డాయి. ప్రపంచ వాహన చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమంటూ విశ్లేషించింది. సంస్థ ధృవీకరణకు భిన్నంగా 20 నుండి 40 రెట్ల వరకు అధిక కాలుష్యాన్ని విడుదల చేస్తోందని, వీటి వివరాలను వోక్స్ వాగన్ దాచి పెట్టిందని పేర్కొంది. మోసం భయటపడడంతో వోక్స్ వాగన్ షేర్లు 40 శాతానికి పడిపోయాయి. కేసులను ఎదుర్కొనేందుకు రూ.48వేల 80 కోట్లను వోక్స్ వాగన్ విడుదల చేసింది.

17:16 - September 23, 2015

చెన్నై : ఈ ఘటనను చూస్తే మనం ఏ సమాజంలో ఉన్నామని అనిపిస్తుంది. ఆధునిక కాలంలోనూ ఇలాంటి 'రూల్స్' ఉంటాయా అనిపిస్తుంది. కానీ ఉంటాయని ఓ కాలేజీ నిర్వాకం చూస్తే తెలిసిపోతుంది. చెన్నైలోని సాయిరామ్ ఇంజ‌నీరింగ్ కాలేజ్‌కి చెందిన‌దిగా చెబుతున్న ఒక ఇంట‌ర్నల్ స‌ర్కులర్ బ‌య‌ట‌కు రావ‌డం సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నియ‌మ నిబంధ‌న‌లు నిబంధ‌నల పేరిట ఆ కాలేజీ క‌నీసపు స్వేఛ్చను కూడా కాల‌రాస్తున్న వైనాన్ని నెటిజ‌న్లు నిర‌సిస్తున్నారు.
నిబంధ‌న‌లేమిటంటే.
నిబంధ‌న‌లేమిటంటే... పొట్టి డ్రెస్సులు మాత్రమే కాదు లెగ్గింగ్స్ వంటి టైట్ ఫిట్స్, షార్ట్ కుర్తాలు కూడా వేసుకు రాకూడ‌దు. అబ్బాయిల‌తో మాట్లాడ‌డం నిషేధం. మొబైల్ ఫోన్స్ వాడ‌కం నిషేధం, ఫేస్‌బుక్ అకౌంట్ నిషిద్ధం, వాట్సప్ వినియోగం కుద‌ర‌దు. లూజ్ హెయిర్..హెయిర్ క‌ల‌రింగ్..బ‌నియ‌న్ టైప్ క్లాత్ డ్రెస్‌లు కుద‌ర‌వు. దుప‌ట్టా రెండు వైపులా పూర్తిగా పిన్‌తో గుచ్చి ఉంచాలి.. పుట్టిన‌రోజు సెలబ్రేష‌న్స్ నిషిధ్దం..పెన్‌డ్రైవ్‌లు, సిమ్‌కార్డులు క‌లిగి ఉండ‌కూడ‌దు. ఇలా మొత్తం 22 ర‌కాల నిబంధ‌న‌ల‌తో జారీ అయిన స‌ర్క్యుల‌ర్ ను ఎవ‌రో స్క్రీన్ షాట్ తీసి నెట్లో ఉంచారు. ఇప్పుడది సంచ‌ల‌నంగా మారింది. స‌ద‌రు కాలేజ్ నిబంధ‌న‌లు అమ్మాయిల క‌నీసపు హ‌క్కుల్ని కాల‌రాచే విధంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ స‌ర్క్యుల‌ర్ త‌మ‌ది కాద‌ని దానిపై ఎటువంటి అధికారిక సీల్ లేద‌ని కాలేజీ యాజ‌మాన్యం వాదిస్తోంది.

ముంబాయి రైలు పేలుళ్ల కేసు..

ముంబాయి : 2006 ముంబాయి రైలు పేలుళ్ల కేసులో దోషులకు ఈనెల 30వ తేదీన న్యాయంస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులగా ఉన్న 12 మందిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. వీరిలో 8మందికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరింది. 

అతి పెద్ద సమస్య కాశ్మీరే - నవాజ్ షరీఫ్..

పాకిస్థాన్ : భారత్ పాక్ మధ్య సమస్య కాశ్మీరే అని దీనిని తప్పకుండా పరిష్కరించాలని పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పక్కపక్కనే ఉన్న దేశాలను ఈ సమస్య సుదీర్ఘకాలంగా వేధిస్తోందని, త్వరలో పరిష్కారం వస్తుందన్న ఆశను వ్యక్తపరిచారు. 

16:58 - September 23, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్ట తలచిన దీక్ష అప్పుడే ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దీక్షా స్థలికి పోలీసులు అనుమతినివ్వలేదు. 26వ తేదీన
ఇక్కడే దీక్ష చేపడుతామని వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం పోలీసులు భారీగా దీక్షా ప్రాంగాణానికి చేరుకున్నారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలని, సామాగ్రీని తరలించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇక్కడే ఉంటామని, దీక్ష ఇక్కడే కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేయడంతో దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సందర్భంగా వైసీపీ నేత అప్పిరెడ్డి టెన్ టివితో మాట్లాడారు. ఖాళీ చేయడానికి సిద్ధంగా లేమని, ఇది ప్రైవేటు స్థలమన్నారు. గతంలో లీజులకు ఇచ్చిన సందర్భాలున్నాయని, మూడు ప్రదేశాల్లో దీక్ష చేయడానికి అనుమతినివ్వాలని కోరినా ఆ ప్రాంతాలకు అనుమతికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇది పార్టీ కోసం చేయడం లేదని, ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం చేస్తున్నామన్నారు. 20వ తేదీ నుండి పనులు మొదలయ్యాయని, కానీ 23వ తేదీ మధ్యాహ్నాం అనుమతి లేదని పేర్కొనడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. తాము రహస్యంగా చేయడం లేదని, దీనికి ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం భయపడుతోందని, అడ్డుకోవాలని చూస్తే నడిరోడ్డుపై జగన్ దీక్ష చేపడుతారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. 

ఐనవోలులో రైతు ఆత్మహత్య..

మెదక్ : పటన్ చెరువు మండలం ఐనవోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు ఎల్లయ్య (30) అప్పుల బాధతో పొలంలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు..

అశోక్ గజపతి రాజుతో బాబు భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఆధునీకరణపై వీరు చర్చించారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుండి సర్వీసుల పెంపుదలపై చర్చించినట్లు సమాచారం. 

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. 171 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 25,823 వద్ద ముగియగా, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 7,846 వద్ద ముగిసింది.

ఏసీబీకి చిక్కిన పశు సంవర్ధక శాఖ ఏడీ..

మెదక్ : లంచం తీసుకుంటూ జహీరాబాద్ పశు సంవర్ధక శాఖ ఏడీ రోహిత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా రోహిత్‌రెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

రేవంత్ తరపు న్యాయవాదికి నోటీసులు..

హైదరాబాద్ : రేవంత్ బెయిల్ పై ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఎందుకు రద్దు చేయవదో తెలుపాలని రేవంత్ తరపు న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.  

సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాకర్ లో నగదు మాయం..

పటన్ చెరువు : సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతాదారు దాచుకున్న నగదు అపహరణకు గురైంది. బాధితుడు గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెస్ట్ బెంగాల్ క్రికెట్ ఛైర్మన్ రేసులో గుంగూలీ..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ క్రికెట్ ఛైర్మన్ రేసులో మాజీ క్రికెటర్ గంగూలి నిలిచారు. గంగూలీకి కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపారు. జగన్మోహన్ దాల్మియా మృతితో స్థానం అయిన సంగతి తెలిసిందే. సాయంత్రం సీఎం మమత బెనర్జీని గంగూలీ కలువనున్నారు.

 

16:49 - September 23, 2015

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో అరెస్టయి జైలు నుండి ఇటీవలే విడుదలైన టిటిడిపి నేత 'రేవంత్ రెడ్డి' బెయిల్ పై విచారణ జరిగింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ ఎందుకు రద్దు చేయవద్దో తెలుపాలని రేవంత్ తరపు న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది. రేవంత్ సోదరుడు మృతి చెందడం వల్ల సమాధానం చెప్పలేమని తగినంత గడువు కావాలని రేవంత్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్తించారు. దీనితో వారం రోజుల పాటు గడవునిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

మే 31న రేవంత్ అరెస్టు..
ఓటుకు నోటు కేసు..నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ కు రూ.50లక్షలు ఇస్తూ టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని మే 31వ తేదీన అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి విచారణ చేసింది. ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా అరెస్టు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులకు ఏపీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అనంతరం రేవంత్ కు జూన్ 30వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కొడంగల్ నియోజకవర్గంలోనే ఉండాలని కోర్టు షరతులు విధించింది. దీనిపై రేవంత్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం దేశంలో ఎక్కడైనా రేవంత్ పర్యటించవచ్చని సెప్టెంబర్ 9వ తేదీన కోర్టు పేర్కొంది. అనంతరం రేవంత్ భారీ ర్యాలీగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో టి.సర్కార్ పై..ఏసీబీపై పలు వ్యాఖ్యానాలు చేశారు. దీనితో టి.న్యాయవాదులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల ఆడియో..వీడియోలను కోర్టుకు ఏసీబీ సమర్పించింది. మరి రేవంత్ మళ్లీ జైళుకు వెళుతాడా ? లేదా కొడంగల్ నియోజకవర్గానికి పరిమితం అవుతాడా ? అన్నది తెలియాలంటే వారం రోజులు వేచి చూడాలి. 

16:44 - September 23, 2015

హైదరాబాద్ : ఇంట్లో దాచుకుంటే దొంగల భయం..పోనీ బ్యాంకుల్లో దాచుకుందామంటే అక్కడ కూడా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ము అపహరణకు గురవుతుండడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటన్ చెరువులో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో లాకర్ లో దాచుకున్న నగదు అపహరణకు గురి కావడం కలకలం రేపుతోంది. గంగాధర్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఈనెల 9వ తేదీన రూ.19.50 లక్షల నగదును దాచుకున్నాడు. అనంతరం 20వ తేదీన వచి చూస్తే దాచుకున్న డబ్బు కనబడలేదని అదే రోజున మేనేజర్ కు ఫిర్యాదు చేయడం బాధితుడు తెలిపారు. బ్యాంకులో అలాంటిది జరగదని మేనేజర్ నిర్లక్ష్యంగా చెప్పారని పేర్కొన్నారు. దీనితో తాను ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 

ఇన్ఫోసిస్ లో కొండచిలువ కలకలం..

రంగారెడ్డి : ఘట్ కేసర్ మండలం పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ లో కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సెక్యూర్టీ సిబ్బంది అప్పగించారు. 

ఐర్లాండ్ కు చేరుకున్న మోడీ..

ఐర్లాండ్ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని డబ్లిన్ కు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఐర్లాండ్, అమెరికాలో పర్యటించనున్నారు.

 

జగన్ దీక్షా స్థలి వద్ద పోలీసులు..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టదలిచిన దీక్షా ప్రాంగణం వద్దకు పోలీసులు చేరుకున్నారు. తక్షణమే ఏర్పాట్లు నిలిపివేసి దీక్షా స్థలం నుండి వెళ్లిపోవాలని లేదంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పోలీసులపై తీరుపై నేతలు అంబటి, అప్పిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రపూరితంగానే దీక్షను అడ్డుకొంటోందని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 20వ తేదీనే దీక్షా స్థలం ఎక్కడనేది పోలీసులకు స్పష్టంగా చెప్పామని నేతలు తెలిపారు. సమయం దగ్గర పడుతున్న సమయంలో దీక్షకు అనుమతినివ్వకపోవడం దుర్మార్గమన్నారు. 

ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి టి.సర్కార్ ఉత్తర్వులు..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై జి.వెంకటస్వామి (కాకా) విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఎన్ కౌంటర్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి - తమ్మినేని..

వరంగల్ : శృతి, విద్యా సాగర్ రెడ్డిల ఎన్ కౌంటర్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంతవరకు హత్యలు మాత్రమే చేసేదని, ఇప్పుడు ఆత్యాచారాలు చేసి చంపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం అణిచివేత విధానాలపై ప్రజా, కుల సంఘాలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. 

15:40 - September 23, 2015

మహబూబ్ నగర్ : యూనియన్ ఏర్పాటు..ఇది వింటేనే కొంతమంది యాజమాన్యాలు భగ్గుమంటాయి. యూనియన్ ఏర్పాటు చేయవద్దని హుకుంలు జారీ చేస్తాయి. తమకు ఎక్కడ భంగం కలుగుతుందోనని భావించి ఆ యూనియన్ లపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ కంపెనీలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహించిన కంపెనీ కొంతమంది కార్మికులను ఇతర పరిశ్రమలోకి బదలాయించింది. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సంస్థలో సీఐటీయూ పేరిట కార్మికులు యూనియన్ ను రిజిష్టర్ చేయించుకున్నారు. దాదాపు 18 మంది కార్మికులు అనుకూలంగా సంతాకాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం 18 మందిని పులివెందులలోని బట్టల పరిశ్రమకు బదిలీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కార్మికులు సంస్థ ఎదుట ఆందోళనకు దిగారు. బదిలీలను వెంటనే ఆపి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు ధర్నాతో కంపెనీలో పనులు ఆగిపోయాయి. 

15:33 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పుల బాధ భరించలేక..పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. బుధవారం పలు జిల్లాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రంగారెడ్డి..
రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్షాలు లేకపోవడంతో పంటలు నష్టపోయాడు. అప్పుల బాధలు భరించలేక లక్ష్మణ్ బుధవారం ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. లక్ష్మణ్ కుటుంబాన్ని జడ్పీటీసీ సభ్యుడు పరామర్శించారు.

నల్గొండలో..
నల్గొండ జిల్లాలోని మోత్కురు మండలం చౌలారామారంలో కృపాకర్ రెడ్డి అనే రైతు తనువు చాలించాడు. కేవలం అప్పుల బాధ భరించలేకనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. గత ఏడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా పంటలు చేతికి రాలేదు. పెట్టుబడికి అప్పుల బాధ పెరగడం..వారి వత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడని రైతుల కుటుంబీకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే కృపాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. 

15:25 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉభయ రాష్ట్రాల గవ్నరర్ నరసింహన్ కితాబులివ్వడం సరికాదని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్ వ్యవహార శైలిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఫిరాయింపులో గవర్నర్ కు సాక్ష్యాలు సమర్పించామని తెలిపారు. ప్రస్తుతం అదే మంత్రితో కలిసి గవర్నర్ మోడల్ హౌజ్ ను సందర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలిసిపోయారో..తెలియక పోయారో అర్థం కావడం లేదన్నారు. 

15:20 - September 23, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టదలిచిన 'నిరవధిక దీక్ష' ప్రాంగణం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 'దీక్ష'కు అనుమతి లేదని బుధవారం సాయంత్రం అర్బన్ ఏస్పీ ప్రకటించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుటాహుటిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అప్పిరెడ్డి దీక్షా ప్రాంగాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. దీక్ష ఇక్కడే చేస్తామని నేతలు పేర్కొనడం..అనుమతినివ్వలేదని పోలీసులు పేర్కొనడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీక్షకు అన్ని సిద్ధం చేసుకుంటున్నామని..ఇప్పుడు అనుమతి లేదని పేర్కొనడం ఎంతవరకు కరెక్టు అని వారు ప్రశ్నిస్తున్నారు.

26న దీక్ష..
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ ఇప్పటికే ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వర్సిటీల బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ నుండి నిరవధిక దీక్ష చేయాలని తలిచారు. ఇందుకు గుంటూరు జిల్లాలోని ఉల్ఫా హాల్ గ్రౌండ్ ను ఎంపిక చేశారు. ఆ పార్టీ నేతలు దీక్ష ప్రాంగణం వద్ద పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం 'దీక్ష' కు అనుమతి లేదని అర్బన్ ఎస్పీ త్రిపాఠి ప్రకటించారు. దీక్ష ప్రాంగణం వద్ద వివిధ ఆసుపత్రులు..కళాశాలలు ఉండడం..అందులో ప్రధాన మార్గం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. అందుకనే అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీనితో వైసీపీ సందిగ్ధంలో పడింది. తాము ఈనెల 20వ తేదీనే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, సమయం దగ్గర పడుతున్న సమయంలో అనుమతినివ్వకపోవడం దారుణమన్నారు. తాము ఇప్పటికే పనులు పూర్తి చేస్తున్నామని, ప్రస్తుత తరుణంలో సామాగ్రీని ఎలా తరలిస్తామని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అప్పిరెడ్డిలు ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా ఇక్కడే దీక్ష చేపడుతామని వైసీపీ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. 

బీజేపీకి ఆర్ఎస్ఎస్ సుప్రీం - నితీష్..

పాట్నా: ఆర్‌ఎస్‌ఎస్.. బీజేపీకి సుప్రీంకోర్టు లాంటిదని జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ అన్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి తమ 242 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జనరల్ కేటగిరీకి 16, ఓబీసీలకు 55, ఎస్సీ, ఎస్టీలకు 16, ముస్లిం మైనార్టీలకు 14 శాతం చొప్పున సీట్లను కేటాయించింది. 

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..

కర్ణాటక: రాష్ట్రంలోని దార్వాడ్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు-కారు ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలైయ్యాయి. 

రాజస్థాన్ లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన సర్కార్..

రాజస్థాన్ : విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను 68 శాతానికి పెంచుతూ 2 బిల్లులను రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించింది. రిజర్వేషన్ కోటా 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది.

14:47 - September 23, 2015

ఆకాశంలో సగం..అన్నింటా సగం అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా..మరోవైపు రోజు రోజుకు వారిపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. బ్రూణహత్యలు..ఆత్యాచారాలు..గృహహింస తదితర వేధింపులు అధికమౌతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరియైన అవగాహన లేక ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతి అంశానిఇక ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఈ అంశంపై మానవి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే ప్రజలు వ్యక్తపరిచిన పలు న్యాయ సమస్యలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. 

14:42 - September 23, 2015

తూర్పుగోదావరి : మన్యం మంచం పట్టింది. గిరిజనం వణికిపోతోంది. ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరాల్సిన అడవి బిడ్డలు విషజ్వరాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మాయదారి జ్వరాలు ఎప్పుడు ఎవరిని కబళిస్తాయోననే భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. చెవులకు తూట్లు పడేలా మరణమృదంగం విన్పిస్తున్నా, మనసున్న మారాజులు స్పందిస్తున్నారే కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం దున్నపోతు మీద వాన కురిసిన చందంగానే ఉంది.  కొన్ని రోజులుగా మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు తూర్పు గోదావరి జిల్లా మన్యాన్ని పట్టి పీడిస్తున్నాయి. పదుల సంఖ్యలో గిరిపుత్రుల ప్రాణాలను మింగేస్తున్నాయి. జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, దేవిపట్నం, వై.రామవరం, రాజవొమ్మంగి ఏజెన్సీ మండలాలలోని 566 గ్రామాలలో దాదాపు 70శాతానికి పైగా గిరిజనులను విషజ్వరాలు కబళిస్తున్నాయి.

అధికారుల చీత్కారపు మాటలు..
తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన చింతూరు, నెల్లిపాక, వరారామచంద్రపురం, కూనవరం మండలాలు ఇక్కడి ఏజెన్సీలో విలీనం కావడంతో గిరిపుత్రులను కాపాడుకునే బాధ్యత తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంపై పడింది. కానీ మన్యం జనమంటేనే అధికారులు చీత్కారపు చూపులు చూస్తున్నారు. విలీన మండలాల ప్రజలంటేనే అంటరానితనం పాటిస్తున్నారు. అందుకే గత్యంతరం లేక వీరంతా ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి చికిత్సకోసం వెళ్తున్నారు. చింతూరు మండలంలోని తులసీపాక పీహెచ్సీ జాతీయస్ధాయిలోనే మలేరియా అత్యధికంగా నమోదయ్యే కేంద్రం. అయినా ఇక్కడ ఇప్పుడు ఆర్ డిటి కిట్లు లేవు. తులసిపాకలో70, రేఖపల్లి 65, జీడిగుప్ప 70 , కూటూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కేవలం వారం వ్యవధిలోనే 30 మలేరియా కేసులు నమోదయినా అధికారులు పట్టించుకోవటం లేదంటే బాధ్యతారాహిత్యం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మందులను పంపిణీ చేసిన సీపీఎం శ్రేణులు,..
పట్టించుకోవల్సిన ప్రభుత్వాలే వదిలేయటంతో వివిధ స్వచ్ఛంద సంస్ధల సహకారంతో సీపీఎం శ్రేణులు, గిరిజన సంఘాలు గిరిపుత్రుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను భుజాలకెత్తుకున్నాయి. వామపక్ష నేత మిడియం బాబురావు స్వతహాగా వైద్యులు కావటంతో కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడి మెగా వైద్యశిబిరం పెట్టించారు. జ్వర పీడితులకు పరీక్షీలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.

పాలకుల్లో మార్పు రావాలి..
అన్నార్తులు, అనాధలు ఉండని ఆ నవయుగం ఎంత దూరం అంటూ ఓ మనసున్న కవి ఆవేదనతో ప్రశ్నించాడు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యంతో అది ఎన్నటికి ప్రశ్నగానే మిగిలిపోయే ప్రమాదం కన్పిస్తోంది. పిట్లల్లా రాలుతున్న మన్యం బిడ్డల దీనస్ధితి చూసి కూడా పాలకుల్లో మార్పు రాకపోవడం శోచనీయమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

14:39 - September 23, 2015

విశాఖపట్టణం : 'గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ'. ఈ పేరు చెబితే చాలు విశాఖ జిల్లాతో పాటు పక్క జిల్లా చెరకు రైతుల్లో సైతం మంచి పేరుంది. లాభాల పంట పండించిన ఘనతను సొంతం చేసుకుంది కనుకే గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ అంటే చెరకు రైతులకు అంతటి మంచి అభిప్రాయం ఉండేది. విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలోని 1955 సంవత్సరంలో షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. రైతుల సహకారంతోనే ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీ తొలి ఏడాది నుంచే రోజుకు వెయ్యిటన్నుల ఉత్పత్తి జరుగుతుండేది. 1978 నాటికి అదే ఉత్త్పత్తి 1600 టన్నులకు చేరింది. ఇక 1990 నాటికి రోజుకు 2500 టన్నులు, 2003 నాటికి ఏకంగా 5 లక్షలకు పైగా సామర్ధ్యం పెరిగింది.

1417 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు..
షుగర్ ఫ్యాక్టరీ తొలినాళ్లలో రైతులంతా కలిసి ఒక వెయ్యి 417.30 లక్షలు ఇన్వెస్ట్ చేయగా ప్రభుత్వం కేవలం ఒక వెయ్యి 88.95 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఈ కర్మాగారంలో దాదాపు 24వేల రైతులున్నారు. కార్మికులు 507మంది ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు మరో 400మంది వరకు ఉంటారు. ఇది ఇలా ఉంటే హుదూద్‌ తుఫాను గోవాడ చక్కెర ఫ్యాక్టరీ పరిస్ధితిని తలకిందులు చేసింది. గోడౌన్లో ఉన్న 4లక్షల చక్కెర బస్తాలు తడిచి పాడయ్యాయి. ఇదే అదనుగా భావించిన ఫ్యాక్టరీలో కీలకాధికారులంతా కలిసి తడిచిన బస్తాల విక్రయంలో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి సుజనా చౌదరి బంధువు ఇందులో చక్రం తిప్పాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీంతో రైతులంతా వామపక్షాల సహకారంతో ఆందోళన బాట పట్టారు. గోవాడ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతిని బట్ట బయలు చేయాలని, రైతుల బకాయిలు చెల్లించాలని ఫ్యాక్టరీ గేట్‌, విశాఖ కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నాలు చేపట్టారు. ఇంత జరుగుతున్న స్ధానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో అవినీతి లేదని చెప్పటం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంలా, బాధ్యతారాహిత్యానికి అసలు సిసలైన ఉదాహరణలా నిలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1417 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు..

14:36 - September 23, 2015

అమెరికా : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపు పొందిన నటీమణులలో 'లయ' ఒకరు. అమెరికాలో ఆమె ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంపై 'లయ' స్పందించింది. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని లయ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తన తల్లిదండ్రులు..బంధువులు..శ్రేయోభిలాషులు చాలా కంగారు పడ్డారని పేర్కొన్నారు. ఉదయం నుండి ఫోన్లు వస్తున్నాయని, వారికి తన క్షేమ సమాచారం తెలిపినట్లు తెలిపారు. వార్త ప్రచురించే ముందు నిర్ధారించుకోవాలని 'లయ' సూచించారు. 

14:28 - September 23, 2015

ఖమ్మం : తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఆందోళన బాట పడుతున్నారు. కానీ సర్కార్ మాత్రం వీరి ఆందోళనలపై స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన ఆశా వర్కర్లు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఖమ్మంలో వర్కర్లు కదం తొక్కారు. ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు.. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సీఐటీయూ నేతలు, కార్యకర్తలతో పాటు ఆశావర్కర్లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యలను ఆశావర్కర్లు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, నెలకు 15 వేలు వేతనం చెల్లించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.

14:17 - September 23, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. అసలే కరువు జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీరి ఆత్మహత్యలు ఆపడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కొల్హాపూర్‌ తాలుకా చెన్నపురావుపల్లి గ్రామంలో అప్పుల బాధతో పిట్టల వెంకటస్వామి అనే రైతు తన పొలంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరికి పెళ్లి చేయటంతో పాటు పొలంలో 10 సార్లు బోర్లు వేయించాడు. జలధార పడలేదు కానీ అప్పులకు వడ్డీలు మాత్రం రెట్టింపయ్యాయి. దీంతో అప్పుల భారాన్ని తట్టుకోలేని వెంకటస్వామి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

14:12 - September 23, 2015

హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు..వీరి ఆగడాలకు అంతే ఉండదు. వీరితో విబేధించారా ? వారితో ఇబ్బందులు తప్పవు. తాజాగా ఓ కూరగాయలు అమ్ముతున్న చిరు వ్యాపారిపై జులుం చేశారు. రహదారికి అడ్డంగా వ్యాపారం చేస్తున్నాడని ఓ కూరగాయల గంపను ఎత్తుకెళ్లాడు. అయ్యో సార్..వద్దు..సార్ అంటున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం తాపీగా వెళ్లిపోయారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉప్పల్ రహదారిపై ఓ వ్యాపారి కూరగాయాలు అమ్ముకొనేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఓ ట్రాఫిక్ వెహికల్ అక్కడకు చేరుకుంది. అమాంతం అందులో ఉన్న పోలీసు దిగి కూరగాయల గంపను అమాంతం వ్యాన్ లో పడేశాడు. కొద్దిదూరంలో ఉన్న ఆ వ్యాపారి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నాడు. వద్దు సార్..వద్దు సార్ అంటున్నా తాపీగా పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ట్రాఫిక్ పోలీసులు వ్యవహార శైలిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలపై ప్రేమను కనబరిచే ట్రాఫిక్ పోలీసులు చిరు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. 

13:53 - September 23, 2015

ఎనర్జిటిక్ స్టార్ 'రామ్' హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్' అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామ్' సరసన 'రాశీ ఖన్నా' హీరోయిన్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిందని 'స్రవంతి' రవికిశోర్ పేర్కొన్నారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అన్నారు. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశారని, కథాబలం ఉన్న చిత్రమన్నారు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు.
 

13:52 - September 23, 2015

హైదరాబాద్ : భాగ్యన‌గ‌రంలో గ‌ణేష్ నిమ‌జ్జనానికి అడ్డంకులు తొల‌గించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ర‌ద్దీమార్గాల్లో మెట్రోప‌నులకు తాత్కాలిక బ్రేక్‌ వేసింది. దీంతో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు ప‌నుల‌ను నిలిపివేసి గ‌ణేష్ విగ్రహాలు సాఫీగా వెళ్ళేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

శోభాయాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో .....

గణేష్ నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో మెట్రో పనులను నిలిపివేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాల మేరకు పనులను నిలిపివేయాలని హెచ్‌ఎంఆర్ వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 27 వరకు 5 రోజుల పాటు మెట్రో పనులకు బ్రేక్ పడనుంది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనున్న మోజాంజాహీ మార్కెట్ , ఖైరతాబాద్ కూడలి, పంజాగుట్ట ప్రాంతాల్లో పనులను పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే, రోడ్డుపై ఏర్పాటు చేసిన‌ బారికేడ్లను కుదించాలని, ఇత‌ర‌ అడ్డంకులుంటే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. సాధారణ రోజుల్లోనే పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ప్రస్తుతం పంజాగుట్ట ప్టైఓవర్‌పై నుంచి భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. దీంతో పంజాగుట్ట నుంచి ఎర్రమంజిల్ వరకు బారీకేడింగ్‌ను కుదించనున్నారు.

ఖైరతాబాద్ కూడలిలో .....

ఇక‌ ఖైరతాబాద్ కూడలిలో మెట్రోస్టేషన్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పైగా కూడలిలో భారీ వంతెన నిర్మాణపనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిమజ్జనం దృష్ట్యా వంతెన నిర్మాణ పనులు నిలిపివేశారు. ప్రధానమైన మోజాంజాహీ మార్కెట్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు పనులు నిలిపివేయడంతో పాటు అక్కడ స్వాగతవేదిక ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా అడ్డంకులను తొలగించారు. ఇక్కడ నెలాఖరు వరకు పనులు కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే మలక్‌పేట, చాదర్‌ఘాట్, పుత్లిబౌలి ప్రాంతాల్లో బారీకేడింగ్‌ను కుదించనున్నారు.

రాజ‌కీయ‌పార్టీల బ్యాన‌ర్‌లు, ఫ్లెక్సీల‌ను కూడా....

గ‌ణేష్ నిమ‌జ్జనం సంద‌ర్భంగా మెట్రోప‌నులకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్న అధికారులు, అడ్డుగా ఉన్న రాజ‌కీయ‌పార్టీల బ్యాన‌ర్‌లు, ఫ్లెక్సీల‌ను కూడా తొల‌గించాల్సిందిగా భ‌క్తులు, ప్రజ‌ల‌కు కోరుతున్నారు. వివిధ ప్రాంతాల్లో రోడ్డుపై త‌క్కువ ఎత్తులో ఉన్న కేబుల్స్, విద్యుత్ వైర్లను తొలింగించాలని కోరుతున్నారు. 

13:49 - September 23, 2015

హైదరాబాద్ : మీరు లాటరీ గెలిచారు. ఇక కోట్ల రూపాయలు మీసొంతం. అంటూ మీ సెల్‌ఫోన్‌కు, మెయిల్‌, ఫేస్‌బుక్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా...? అయితే బీకేర్‌ఫుల్. ఆశపడ్డారా ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఓ వ్యక్తి ఆ మెసేజ్‌లకు రిప్లై ఇచ్చి...కోట్లు దారపోశాడు. చివరికి అది ఫేక్‌ అని తెలుసుకొని మతిస్థిమితం కోల్పోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో వింతగా ప్రవర్తిస్తున్నాడు.

బీహెచ్‌ఈఎల్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పదవి విరమణ...

హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పదవి విరమణ పొందారు. విద్యావంతుడైన ఈయన నైజీరియన్ల ఆగడాలకు నిండా మునిగిపోయాడు. పార్థసారథి పదవి విరమణ పొందిన తర్వాత తన సొంత నివాసమైన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో నివాసముంటున్నాడు.

మీకు 600 కోట్లు వచ్చాయని మెసేజ్.....

మూడేళ్ల క్రితం తన సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను నమ్మి దానిని ఫాలో అయ్యాడు. మొదట మీకు 600 కోట్లు వచ్చాయని మెసేజ్ వచ్చింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌లో వేయాలంటే కొంత ఖర్చవుతుందన్నారు. దీంతో ఈరిటైర్డు డిప్యూటీ జీఎం తన వద్ద ఉన్న డబ్బుతో పాటు పూర్వికుల నుంచి వచ్చిన ఆస్తిని సైతం తన పిల్లలకు తెలియకుండానే అమ్మేశాడు. తన భార్య వద్దన్నా వినకుండా ..బలవంతంగా హైదరాబాద్‌కు వెళ్లి నైజీరియన్ల అకౌంట్లలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు జమచేశాడు. తాము మోసపోతున్నామని పార్థసారథి భార్య తీవ్ర అనారోగ్యానికి గురై ఈ ఏడాది మే నెలలో మృతి చెందింది. అనంతరం పార్థసారథి మానసిక పరిస్థితి దెబ్బతింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చించారు.

రూ.4 కోట్లు డిపాజిట్ చేశాను-బాధితుడు......

బాధితుడి అల్లుడు రాజన్ ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పార్థసారథి ఇంట్లో పూర్తిగా తనిఖీలు చేపట్టారు. నైజీరియన్లు పంపిన దొంగనోట్లు, రసాయనం ఉన్న బాక్స్‌లను కనుగొన్నారు. అప్పటికే కాస్త కోలుకున్న బాధితుడు పార్థసారథి తాను నైజీరియన్లు ఇచ్చిన అకౌంట్లలో 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశానని తెలిపాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నాడు. వారు తనకు రెండు బ్యాగులు ఇచ్చారని అందులో ఒకదానిలో నల్లపేపర్ల బండిల్స్, మరో బ్యాగులో సీలు వేసిన బాక్స్ ఉన్నాయని తెలిపాడు. ఆ బాక్సులను కొద్దిరోజుల తరువాత ఓపెన్ చేసి నల్లకాగితాల కట్టలను కెమికల్‌లో ముంచితే డాలర్లుగా మారుతాయని నైజీరియన్లు తనకు చెప్పినట్టు పోలీసులకు తెలిపాడు. నైజీరియన్ల ఆదేశాల ప్రకారమే బాక్స్‌లను కొన్ని రోజుల తరువాత ఓపెన్ చేయగా అందులో నుంచి భరించలేని రసాయన వాసన వచ్చింది. దీంతో ఇదంతా ఫేక్ అని తెలుసుకున్నారు.

ఫేక్‌ మెసేజ్‌లకు ప్రభావితం కావద్దు...

ఇప్పటికైనా.... తన మామయ్య వలే ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లకు ప్రభావితం కావద్దని బాధితుని అల్లుడు రాజన్ సూచిస్తున్నాడు. తాము మోసపోయినట్టు ఎవరూ మోసపోవద్దంటున్నాడు. 

13:45 - September 23, 2015

హైదరాబాద్ : గాలి జనార్ధనరెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు ఇతర ఎనిమిది చోట్ల ఈ సోదాలు జరగుతున్నాయి. బళ్లారి అ్రకమ మైనింగ్‌ వ్యాపారం కేసు నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగుతున్నాయి. లోకయుక్త ఆధ్వర్యంలో ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. 

13:41 - September 23, 2015

హైదరాబాద్ : అసెంబ్లీలో కిష్టారెడ్డి సంతాప తీర్మానం సమయంలో జానారెడ్డి వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని జానారెడ్డి ప్రస్తావించకపోవడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. అయితే.. ఎవరో ఒకరు ప్రస్తావించారు కదా.. అని ఆ పార్టీ నేతలకు జానారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

13:39 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాఓ ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జెల్లా కుమారస్వామి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం తట్టుకోలేక కుమారస్వామి సూసైడ్‌ చేసుకున్నాడు. కుమారస్వామి ఆత్మహత్యతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్లంకి గ్రామంలో దాదాపు 500 మంది చేనేత కార్మికులు ఉన్నారు. దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. చాలామందికి పనుల్లేక పస్తులుంటున్నారు. ఉపాధికోసం కొంతమంది దూరప్రాంతాలకు వెళ్తున్నారు. 

13:34 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరుగుతున్న బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, కడియం శ్రీహరి, హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. ఇటు కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, చిన్నారెడ్డి హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ నుంచి లక్ష్మణ్‌, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ నుంచి రవీంద్రకుమార్‌, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ మధుసూధనాచారి వారితో చర్చించారు. అక్టోబర్‌ 10 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆశా వర్కర్ల సమ్మెకు వామపక్షాల మద్దతు..

వరంగల్ : హన్మకొండ ఏకశిలాపార్కు నుండి కలెక్టరేట్ వరకు ఆశా వర్కర్ల ప్రదర్శన నిర్వహించారు. వీరు చేస్తున్న ఆందోళనలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మద్దతు తెలిపారు. ఆశా వర్కర్ల సమ్మె న్యాయమైందన్నారు. ఈ సమ్మెకు వామపక్షాల పూర్తి మద్దతుంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఆశాలను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. 

వీసీ పోస్టుల భర్తీపై నివేదికలు పూర్తి - ఏపీ మంత్రి గంటా..

విజయవాడ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీపై సెర్చ్ కమిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి గంటా తెలిపారు. నివేదికలను అందగానే వీసీలను నియమిస్తామన్నారు. కామన్ యూనివర్సిటీ యాక్ట్ పై మంత్రి గంటాకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి నివేదిక ఇచ్చారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తో ఆంధ్రా యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుందని మంత్రి గంటా పేర్కొన్నారు. అక్టోబర్ 9వ తేదీన రాయలసీమ యూనివర్సిటీ వీసీల భేటీ ఉంటుందన్నారు. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్బంగా ప్రతిభ అవార్డుల ప్రధానం చేస్తామని, విద్యార్థుల ఆత్మహత్యలపై కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆలోచిస్తామన్నారు. 

తుళ్లూరులో ఇళ్లలోనే దీక్షలకు దిగిన రైతులు..

గుంటూరు : తుళ్లూరులో ఇళ్లలోనే రైతులు దీక్షలకు దిగారు. అసైన్డ్ భూ యజమానులకు కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధలు చెప్పుకొనేందుకు రోడ్ల మీదకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో రైతులు ఇళ్లలోనే దీక్షలకు దిగుతున్నారు. అసైన్డ్, సీలింగ్ భూ లబ్ధిదారులకు కౌలు చెల్లించకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని సీపీఎం క్రిడా ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబురావు పేర్కొన్నారు. 

 

ఏపీలో 11,735 అంగన్ వాడీ నియామకాలు - మంత్రి పీతల..

విజయవాడ : త్వరలో ఏపీ రాష్ట్రంలో 11,735 అంగన్ వాడీ నియామకాలు చేస్తామని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. పారదర్శకంగా అంగన్ వాడీ కార్యకర్తల నియామకాలు చేపడుతామని, అక్రమాలు జరిగితే పీడీలదే బాధ్యతనని తెలిపారు.

 

శ్రీనివాసమంగాపురంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు..

చిత్తూరు : చంద్రగిరి (మం) శ్రీనివాసమంగాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు కూలీలను అరెస్టు చేశారు. అక్రమంగా దాచిన రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

 

ముగిసిన టి.బీఏసీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ఈనెల 29న సభలో చర్చ జరుగనుంది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు వర్తించనున్నాయి. ప్రశ్నోత్తారల సమయం గంట నుండి గంటన్నర వరకు పెంచారు. ప్రశ్నోత్తరాల తరువాత వాయిదా తీర్మానాలపై చర్చ జరుగనుంది. 

కోటి ఎస్ఎంఎస్ ల ఉద్యమం..

విశాఖపట్టణం : పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోటి ఎస్ఎంఎస్ ల ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగనుంది. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్ కు ఎస్ఎంఎస్ లు పంపించారు. 

చింతలమోరులో గ్యాస్ లీకేజీ...

తూర్పుగోదావరి : సకినేటిపల్లి మండలం చింతలమోరులో గ్యాస్ లీకేజీ అయ్యింది. క్రూడాయిల్, గ్యాస్ ఎగిసి పడుతున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 

 

ఓయూలో రాజ్యహింసపై రౌండ్ టేబుల్ సమావేశం..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో 'రాజ్యహింస' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పలు సంఘాల నేతలు హాజరయ్యారు. మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ ప్రశ్నించాయి. పోరాడి తెలంగాణ సాధించిన విద్యార్థులకు ఎన్ కౌంటర్లు బహుమానాలా అని నిలదీశాయి. శృతి, విద్యాసాగర్ లను నిరాయుధులుగా పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి చంపారని ఆరోపించాయి. 

వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆశా వర్కర్లు..

ఖమ్మం : అశ్వరావుపేటలో ఆశా వర్కర్లు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. తమ సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

 

గాలి ఇంట్లో సిట్ అధికారుల సోదాలు..

కర్నాటక : బళ్లారిలోని ఎనిమిది ప్రాంతాల్లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. గాలి జనార్ధన్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కౌసల్యేంద్రకుమార్ నేతృత్వంలో ఐదు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. 

బాబు అధ్యక్షతన స్వచ్చ భారత్ ఉప సంఘం సమావేశం..

ఢిల్లీ : నీతి ఆయోగ్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్వచ్చ భారత్ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వచ్చ భారత్ ముసాయిదా నివేదికకు ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపనున్నారు. ఈనెలాఖరుకల్లా ప్రధానికి నివేదిక అందించే అవకాశం ఉంది. 

కంచె' రిలీజ్ వాయిదా :వరుణ్ తేజ్

హైదరాబాద్: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన 'కంచె' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా కథానాయకుడు. ఇటీవలే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. వాస్తవానికి అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, విడుదల తేదీ వాయిదా పడింది. ఈ వివరాలను వరుణ్ తేజ్ స్వయంగా తెలిపాడు. "కంచె విడుదలను నవంబర్ 6కు వాయిదా వేశాం. దీని వెనకున్న కారణాలను త్వరలోనే వెల్లడిస్తాం" అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 

ప్రారంభమైన బిఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ శాససన సభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ ) సమావేశం అసెంబ్లీ హాల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతర పక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు.

12:46 - September 23, 2015

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌.. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.15000 లు ఇవ్వాలని, సెకండ్ ఏఎన్ ఎంగా గుర్తించాలని సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా ఆశా వర్కర్లు ఆశలు వదులుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో కడుపు మండిన ఆశా వర్కర్లు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు కనీసం వేతనం చెల్లించాలని ఆశావర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అర్హులైన వారిని రెండో ఏఎన్ ఎం గా గుర్తించాలని, అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి.. స్పష్టమైన ప్రకటన చేయాలని ఆశావర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

నల్గొండ లో ...

 నల్గొండ కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను అధికారులకు చెబుతామని కలెక్టరేట్‌కు వెళ్తున్న ఆశావర్కర్లను పోలీసులు లాక్కెళ్లి.. వ్యాన్‌లో కుక్కారు. ఆశాలకు మద్దతుగా వచ్చిన సీఐటీయూ నాయకులను కూడా పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో ఇద్దరు కార్మికులు సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తంగా నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని కొన్నాళ్లుగా ఆశావర్కర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆశావర్కర్లు కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరగా.. వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.

వరంగల్‌ లో..

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశావర్కర్లు వరంగల్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు కనీసం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో..

సీఐటీయూ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ఆశావర్కర్లు.. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అధికారులను దిగ్బంధించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. గత 23 రోజులుగా సమ్మె చేస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆశావర్కర్లు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. అసెంబ్లీ సమావేశాల్లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు.

 

12:42 - September 23, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వెంకయ్య ఆహ్వానం మేరకు చంద్రబాబు అల్పాహార విందుకు హాజరయ్యారు. 2019 వరకు గాంధీజీ కలలు గన్న స్వచ్ఛ భారత్‌గా ఇండియాను తీర్చిదిద్దుతామని వెంకయ్య వెల్లడించారు.

12:40 - September 23, 2015

కర్నూలు : జిల్లాలో హంద్రినీవా కాలువకు గండిపడింది. నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరులో పంటపొలాలు నీటమునిగాయి. ఒకేసారి 4 పంపుల ద్వారా నీరు విడుదల చేయడంతో.. తూములకు అడ్డంగా వేసిన ఇసుక మేటలు కొట్టుకుపోయాయి. సుమారు 450 ఎకరాలు నీటమునిగినట్లు సమాచారం. స్థానిక రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. తూముకు గేటు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాలువకు గండిపడినట్లు తెలుస్తోంది. 

12:38 - September 23, 2015

తూర్పుగోదావరి : రాజమండ్రి పరిధిలోని వీఆర్ పురంలో నేటి ఉదయం గుర్తు తెలియని దుండగులు పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థిపై దాడికి దిగారు. చేతిలో బ్లేడు పట్టుకుని దుండగులు చేసిన దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికపై దాడి పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒకరు హెల్మెట్ ధరించగా మరో ఇద్దరు ముఖాలకు ఖర్పీలు కట్టుకుని దుండగులు సైకో సూేదిగాడి తరహాలో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

12:34 - September 23, 2015

హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలో గణేష్‌ నిమజ్జనం ఉద్రిక్తతకు దారితీసింది. గంగానదిలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో...పోలీసులు, సాధువుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు సాధువులు, స్థానికులపై లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసుల తీరుపై సాధువులు ధ్వజమెత్తారు. 

12:33 - September 23, 2015

హైదరాబాద్ : బాంబు ఉందన్న వార్త దావానంలా వ్యాపించడంతో ఓ రైలులో ప్రయాణిస్తున్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న బాంబు స్క్వాడ్ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన హౌరా రైల్వే స్టేషన్‌ పరిదిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం హౌరా రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ లో బాంబు ఉందని తెలియగానే ప్రయాణీకులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. సిమెంటు బస్తాలో దాచి ఉంచిన పేలుడు పదార్థలను స్వాదీనం చేసుకున్నారు. ఇక ప్రమాదమేమీ లేదని పోలీసులు తెలపడంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. కాగా ఈ రైలులో బాంబు పెట్టిందెవరు? దీని వెనుక ఏమైనా ఉగ్రవాద సంస్థల కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

 

మంగళవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీకి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంబమైన తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కాలం, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుస్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

తెలంగాణ లో మద్యం లాటరీలు ప్రారంభం...

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సోమవారం దాకా టెండర్లు స్వీకరించిన అధికార యంత్రాంగం కొద్దిసేపటి క్రితం టెండర్ బాక్సులను ఓపెన్ చేసింది. ఒకే షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల కేటాయింపునకు లాటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బిడ్లు దాఖలైన అన్ని షాపులకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాటరీలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలో ఎక్సైజ్ శాఖాధికారులు లాటరీలు నిర్వహిస్తున్నారు.

శాసనమండలి 29కి వాయిదా...

హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. శాసనమండలి సమావేశ ప్రారంభం అనంతరం సభ్యులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్ణారెడ్డి అకాల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను సభ్యులు ఈ సందర్భంగా కొనియాడారు. సంతాప తీర్మానాల అనంతరం ఛైర్మన్ సభను ఈనెల 29కి వాయిదా వేశారు.

పదో తరగతి విద్యార్థిని పై బ్లేడుతో దాడి

తూ.గో : రాజమండ్రి పరిధిలోని వీఆర్ పురంలో నేటి ఉదయం గుర్తు తెలియని దుండగులు పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థిపై దాడికి దిగారు. చేతిలో బ్లేడు పట్టుకుని దుండగులు చేసిన దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికపై దాడి అనంతరం దుండగులు సైకో సూేదిగాడి తరహాలో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

11:41 - September 23, 2015

హైదరాబాద్ :వరంగల్ జిల్లా మేడారం అడవులను గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. వారం రోజులుగా భారీస్ధాయిలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాడ్వాయి మండలం కాల్వపల్లిలో సిద్ధబోయిన సంపత్‌ అనే ఓ మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంగళాపురం ఎన్‌కౌంటర్‌ స్ధలం నుంచి సంపత్‌ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్‌ను వరంగల్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

 తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని తిరిగి పెంచుకోవడానికి దళంలో యువసైన్యాన్ని చేర్చుకుని తమ ఉనికిని కాపాడుకోవడంపై మావోయిస్టు నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేపట్టినట్లు సమాచారం. గత వారంలో జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శృతి ఎలియాస్‌ మహిత, మనికంటి విద్యాసాగర్‌రెడ్డి అలియాస్‌ సాగర్‌లు మృతి చెందారు. ఈ ఘటనలో కొందరు మావోయుస్టులు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి దామోదర్‌ కూడా ఈ ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉన్నట్లు అతను చాకచక్యంగా తప్పించుకుని అడవుల్లోకి పారిపోయినట్లు పోలీసు వర్గాలు అనుమానిన్నాయి. ఈ ఘటనా స్థలంలో ఆయుధాలు, క్లైమోర్‌మైన్‌లు, మందులు, కిట్‌ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కెకెడబ్ల్యూ దళం సభ్యులని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నుండి గత 10 రోజుల క్రితమే మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత అడవుల్లోకి చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అమిత్ షా ను విచారణ కోరిన ఈసీ

హైదరాబాద్: "ఎన్నికల కమిషన్ మా చేతుల్లోనే ఉంది" అని బీజేపీ నేత జాయ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎల్లుండిలోగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన కార్మికుల సమావేశంలో జాయ్ బెనర్జీ మాట్లాడుతూ, "గతంలో మమ్మల్ని మోసం చేసి ఓడించారు. ఇప్పుడు సైన్యం రంగంలోకి దిగింది. ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉంది. విజయం మాదే" అని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈసీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ సమంజసం కాదని వ్యాఖ్యానిస్తూ, ఈ తరహా ప్రసంగాలను తాము సహించబోమని ఈసీ స్పష్టం చేసింది.

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత ఇట్టబోయిన సంపత్

హైదరాబాద్ : వరంగల్ జిల్లా మేడారంలో గ్రేహాండ్స్ లో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇట్టబోయిన సంపత్ ను మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాడ్వాయి మండలం ఇసుకపల్లిలో సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మేడారం అడవుల్లో... ఏజెన్సీ గూడాలు ఇనుప బూట్లతో దద్దరిల్లుతున్నాయి.

11:29 - September 23, 2015

బాలీవుడ్‌లో అలియాభట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ఒక్కటవనున్నారనే వార్త కోడై కూస్తోంది. అలియా పెళ్ళి వార్త ఇంతగా హల్‌చల్‌ చేయడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవల జరిగిన సిద్ధార్థ్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో సిద్ధార్థ్‌ తల్లిదండ్రులతో అలియా డిన్నర్‌ చేయడమే కాకుండా సిద్ధార్థ్‌ ఫ్యామిలీకి స్వయంగా డిష్‌ ఐటెమ్స్‌ను వడ్డించింది. దీంతో ఈ జోడీ ప్రేమ బంధాన్ని పెళ్ళి బంధంగా మార్చుకునే ప్రయత్నానికి రంగం సిద్ధం చేసుకున్నారని భావిస్తున్నారంతా. ఈ విషయంపై సిద్ధార్థ్‌ మల్హోత్రాని మీడియా ప్రశ్నిస్తే ఇప్పుడిప్పుడే మా కెరీర్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. అప్పుడే పెళ్ళేంటి? అని అసలు విషయం చెప్పకుండా దాటవేశాడు. ఇదే ప్రశ్నను అలియానడిగితే రబ్బిష్‌...అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. ఏదేమైనా బాలీవుడ్ లో మరో జోడి త్వరలో ఓ ఇంటివారు కబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

11:27 - September 23, 2015

హైదరాబాద్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, పబ్లిక్ ఎకౌట్స్ సభ్యుడు పటేళ్ల కిష్టారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ సంతాపం తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డితో తనకు 45 సంవత్సరాల సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో కొన్ని విలువలు నేర్పిన వ్యక్తని... అందుకే స్వయంగా ఆయన అంత్యక్రియలకు హాజరయినట్లు తెలిపారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయామని సీఎల్పీ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజకు కృష్ణారెడ్డి ఇచ్చిన హామీలను ప్రభుత్వ నిలబెట్టాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి శాంతి చేకూరాలని కొరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో అంచెలంచెలగా కృష్టా రెడ్డి ఎదిగారని, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి అని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి కొనియాడారు. సభలో రైతు ఆత్మహత్యలపై కూడా సంతాప తీర్మానం ప్రవేశ పెట్టాలని ఎర్రబెల్లి ప్రభుత్వానికి సూచించారు. ఎంఐఎం నేత పాషా ఖాద్రి, వైసీపీ నేత వెంటకేశ్వరరావు, సీపీఎం నేత సున్నం రాజయ్య, సీపీఐ నేత శ్రీనివాస్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు కిష్టారెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు.

ఓఎన్జీసీ పైపుల నుంచి గ్యాస్ లీకేజీ

తూర్పుగోదావరి : జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం రేగింది. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవబాసుపాలెం సమీపంలోని ఓఎన్జీసీ పైపుల నుంచి రెండు రోజులుగా గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ లీకేజీని గుర్తించిన అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై గ్రామస్థుల నుంచి రెండు రోజుల క్రితమే సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు మాత్రం స్పందించిన పాపాన పోలేదు. గ్యాస్ లీకేజీని నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచకొస్తుందోనన్న భయంతో జనం వణికిపోతున్నారు.  

రైతు ఆత్మహత్యలపై సంతాప తీర్మానం పెట్టాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, పబ్లిక్ ఎకౌట్స్ సభ్యుడు పటేళ్ల కృష్టారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానానికి టిడీఎల్పీ నేత ఎర్రబెల్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారని పేర్కొన్నారు. తెలంగాణ ఓ మంచి నాయకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి మృతి సంతాపం తెలియజేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

11:12 - September 23, 2015

              మిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రం 'కబాలి'. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న విషయం తెలిసింది. మరొక కీలక పాత్ర కోసం ఎవరి పెడితే బాగుంటుందని యూనిట్‌ ఆలోచించింది. చివరకు ఐశ్వర్య రాయ్ ను ఎంపిక చేసింది. ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ కు రజనీకాంతే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారట. ఈమె పాత్ర చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

11:01 - September 23, 2015

          'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివకు మహేష్‌బాబు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆడిఎ6 మ్యాట్రిక్‌ కారును ఆయనకు బహుమతిగా అందజేశారు. 'శ్రీమంతుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ తనకెంతో పేరు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న ఈ కారు తనకు బహుమతిగా ఇవ్వడం పట్ల కొరటాల వర్ణించలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ కారు మార్కెట్లోకి మహేష్‌బాబు ద్వారా రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం: వెంకయ్య

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా కేంద్ర సహకరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ రోజు తన నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబుకు అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మూడు నగరాలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు తన సింగపూర్ పర్యటన వివరాలు తనతో పంచుకున్నట్లు వెంకయ్య తెలిపారు.

గుంటూరు జీజీహెచ్ లో పారిశుద్ధ్య పనులు

హైదరాబాద్ : గుంటూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 500 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకాధికారి రఘు పర్యవేక్షణలో ఆసుపత్రిలో ప్రక్షాళన పనులు మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: బిజెపి

హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, చింతల, ప్రభాకర్‌లు చెప్పారు. వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రంగా వెళ్లారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేక పోతుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాలని వారు సూచించారు. గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్లకార్డులు, గడ్డిని తీసుకువెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్గుకోవడంతో పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.

హౌరా రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

పశ్చిమబెంగాల్: కోల్ కతాలోని హౌరా రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు అగంతకులు ఫోన్ చేశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్‌లో బాంబ్‌స్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మూడు అనుమానాస్పద బ్యాగులు, ఒక పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోన్‌కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

10:28 - September 23, 2015

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కాసేపటి కిత్రం ప్రారంభం అయ్యాయి. మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మృతి దేశానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశం ఘనంగా నివాళులర్పించింది. సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎంకేసీఆర్ మాట్లాడుతూ... కలాం మరణం రక్షణ రంగానికి తీరని లోటని అన్నారు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కలాం అని కొనియాడారు. హైదరాబాద్ తో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఉన్న డిఆర్ డీఎల్ కు కలాం పేరు పట్టాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. అనంతరం సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ కలాం స్ఫూర్తిని భారత జాతి పొందాలని సూచిస్తూ ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. దేశానికి వెన్నె తెచ్చిన కలాం అని, కలాం స్ఫూర్తితో రాష్ట్రం ముందుకు పోవాలని, ఆయన మృతి తీరని లోటని.. అలాంటి వ్యక్తి తెలంగాణ లో మళ్లీ పుట్టాలని టిడిపి నేత ఎర్రబెల్లి తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు. కలాం గొప్ప మానవతా వాది అని బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ కొనియాడారు. కలాంకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం వుందని గుర్తు చేసుకున్నారు. కలాం గొప్ప వ్యక్తి పాషా ఖాద్రి తెలిపారు. శాస్త్ర వేత్తగా కలాం మరువలేని సేవలు అందించారని...మెట్రో రైలుకు కూడా కలాం పేరు పెట్టాలని వైసీపీ నేత వెంకటేశ్వర్లు కలాం మృతికి సంతాపం తెలిపారు. సీపీఎం నేత సున్నం రాజయ్య మాట్లాడుతూ...కలాం విద్యార్థులకు యువతకు ఎన్నో సూచనలు చేశారని, సీఎం సతాప తీర్మానానికి మద్దతు తెలిపారు. సీపీఐ నేత రవీందర్ మాట్లాడుతూ...భారతదేశం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలని తెలిపారు. కలాం మృతిపట్ల సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు.

ఆర్థిక మంత్రి ఈటెల, సీల్పీ ఉప నాయకుడు భట్టి విక్రమార్క, టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకృష్ణ, బిజెపి నేత కిషన్ రెడ్డి పలువురు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతూ.. తమ అనుభవాలను పంచుకున్నారు.

కలాం మృతి తీరని లోటు : కేసీఆర్

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మృతి దేశానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశం ఘనంగా నివాళులర్పించింది. సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎంకేసీఆర్ మాట్లాడుతూ... కలాం మరణం రక్షణ రంగానికి తీరని లోటని అన్నారు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కలాం అని కొనియాడారు. హైదరాబాద్ తో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఉన్న డిఆర్ డీఎల్ కు కలాం పేరు పట్టాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వెంటనే ఏపీ జే అబ్ధుల్ కలాం మృతి పై సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారు.

సోమనాథ్ భారతి వ్యవహారంపై కేజ్రీవాల్ ఆశ్చర్యం....

హైదరాబాద్: గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు సోమ్ నాథ్ భారతి ఎందుకు పారిపోతున్నారో తనకు అర్థం కావడం లేదని కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సోమ్ నాథ్ భారతి వ్యవహారం ఆయన కుటుంబానికే కాక, తమ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని కూడా కేజ్రీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా పోలీసులకు సోమ్ నాథ్ సహకరించాలని ఆయన అన్నారు. ఇందుకోసం సోమ్ నాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాల్సిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

రణస్థలంలో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు...

శ్రీకాకుళం : రణస్థలం మండలం బంటుపల్లి గ్రామం. అధికార, విపక్షాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. నేటి ఉదయం బంటుపల్లిలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు చేతబట్టుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.  

ఎస్పీజీ భద్రత వద్దు : మన్మోహన్ కుమార్తెలు..

హైదరాబాద్ : మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి నుండి దిగిపోయినా... నిబంధనల మేరకు ఆయనకే కాక ఆయన కుమార్తెలకు కేంద్రం ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు’(ఎస్పీజీ) భద్రత కల్పిస్తోంది. అయితే ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన కుమార్తెలిద్దరూ కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. ఇప్పటికే మన్మోహన్ పెద్ద కుమార్తె, రచయిత్రి దామన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత స్థానంలో ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇక ఢిల్లీ వర్సీటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మన్మోహన్ చిన్న కుమార్తె ఉపిందర్ సింగ్ కూడా ఎస్పీజీ భద్రత అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది.

తొటి విద్యార్థులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నవ్య

ప్రకాశం : బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో దారుణం జరిగింది. తోటి విద్యార్థుల వేధింపులతో మనస్థాపం చెందిన 9వ తరగతి విద్యారిన్థి నవ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 5వ తేదీన స్కూల్‌లోనే పురుగుల మందు తాగిన నవ్య నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

09:45 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అన్నారు. నేటి నుండి ప్రారంభం తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఆయన టెన్ టివితో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలకు టిఆర్ ఎస్ ప్రభుత్వం కారణం అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. పంటల బీమా పథకం లోప భూయిష్టంగా ఉందని కేంద్రానికి లేఖ రాశాము. ఇంత వరకు స్పందించలేదు. టిఆర్ ఎస్ మాత్రమే రైతులకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు.

09:41 - September 23, 2015

హైదరాబాద్: కడప జిల్లా చినమండ్య తాలూకా కేశవపురానికిచెందిన నాగేంద్రకుమార్ రెడ్డి చదువులో ఎప్పుడూ టాప్‌లో ఉండేవాడు.. బీటెక్‌లో మంచి గ్రేడ్ సాధించి చెన్నై ఐఐటి లో ఎంటెక్ సీటు సాధించాడు.. అతని ప్రతిభను గుర్తించిన ల్యాండ్ టీ సంస్థ నాగేంద్రకు నెలకు 13వేల రూపాయల స్టయిపెండ్‌ఇచ్చేందుకు అంగీకరించింది.. ఆ డబ్బుతో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు నాగేంద్ర.. రెండ్రోజులక్రితం సొంత గ్రామానికివెళ్లాడు.. స్నేహితులు, తల్లిదండ్రులతో సరదాగా గడిపాడు.. తిరిగి తన క్యాంపస్‌కు చేరుకున్నాడు.. క్షేమంగా చెన్నయ్ వచ్చానని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.. అదే అతని చివరి మాట అయింది..

హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్టుడెంట్....

తన హాస్టల్ గదిలోకి చేరుకున్న కుమార్ అందులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. సాయంత్రం ఈ విషయం గమనించిన తోటి విద్యార్థులు డైరెక్టర్‌కు సమాచారం అందించారు.. అటు ఫోన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు హుటాహుటిన చైన్నైకి చేరుకున్నారు..

నాగేంద్ర ఆత్మహత్య క్యాంపస్‌లో విషాదం....

బ్రిలియంట్ స్టుడెంట్ నాగేంద్ర ఆత్మహత్య క్యాంపస్‌లో విషాదం నింపింది.. బిడ్డ చదువు పూర్తిచేసుకొని ఆసరాగా ఉంటాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది.. తమ కుమారుడి ఆత్మహత్యకు కారణాలు అంతుచిక్కడంలేదని తండ్రి కన్నీరుపెట్టుకోవడం అందరినీ కలచివేసింది.. నాగేంద్ర మృతదేహానికి రాయపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును కొరట్టూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

09:37 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా.. టీ సర్కార్‌ను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించేశారు. అయితే... ఈసారి అధికార పార్టీ విసిరే వ్యూహాల వలలో చిక్కుకోకుండా.. అసెంబ్లీలోనే ఉండి పోరాడాలని నిర్ణయించారు.

21 సమస్యలపై టీడీపీ చర్చ......

సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు... 21 సమస్యలపై అస్త్రాలను సిద్ధం చేశామని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలే చర్చకు రావాలంటున్నారు. ఏడాదిన్నర కేసీఆర్‌ పాల‌న‌లో ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి.. అసెంబ్లీలో టీఆర్ఎస్ స‌భ్యుల‌ను ఇరకాటంలో పెట్టేలా ప్రణాళిక సిద్దం చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రజ‌ల‌కిచ్చిన హామీల‌పై టీస‌ర్కార్‌ను నిల‌దీసేలా వ్యూహ రచన చేశామంటున్నారు.

టీడీపీ వాణి విపించాలని తహతహ.....

గత సమావేశాల్లో ఏ ఒక్కరి వల్లో అందరూ సస్పెండ్ కావాల్సి వచ్చిందని..... తర్వాత కూడా అసెంబ్లీలో పార్టీ గొంతు వినిపించే అవకాశం లేకుండా పోయిందని తెలుగు దేశం నాయకులు భావిస్తున్నారు. ఈసారి కచ్చితంగా ప్రజల తరపున తమ వాణిని వినిపిస్తామని అంటున్నారు. పాలక పక్షం రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని తెరపైకి తెస్తే.. తలసాని వ్యవహారంతో దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు. మొత్తంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలు ఫణంగా పెట్టలేమని తేల్చి చెప్తున్నారు.

అసెంబ్లీ వేదికగా చర్చ.....

మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ వైఖ‌రిపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న తమ్ముళ్లు... అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సర్వ శక్తులనూ సమీకరించుకుంటున్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసిన తమ్ముళ్లు.. ఇదే ఊపుతో అసెంబ్లీ భేటీలోనూ హీట్ పెంచాలని యోచిస్తున్నారు. 

09:35 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో.. తమదైన వాణి వినిపించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇన్నాళ్లూ మాటల యుద్ధానికే పరిమితమైన కాంగ్రెస్‌.. అసెంబ్లీలో అధికార పక్షం దుమ్ముదులిపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పలు పార్టీలు తమ వాణిని సభలో వినిపించేందుకు రెడీ అవగా... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఏకంగా సర్కార్‌కు సమస్యల అస్త్రాన్ని ఎక్కు పెట్టింది.

రాష్ట్ర సమస్యలపై పోరుబాటలో ఉన్న కాంగ్రెస్‌..

రాష్ట్ర సమస్యలపై పోరుబాటలో ఉన్న కాంగ్రెస్‌.. ఈ అసెంబ్లీ సమావేశాలను అందుకు బాగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలపై సభలో సర్కార్‌ను ఎండగట్టాలని డిసైడయింది. వీటితో పాటు.. ప్రాజెక్ట్‌ రీ డిజైన్‌, వాటర్‌గ్రిట్‌, మిషన్‌కాకతీయ తదితర ముఖ్యాంశాలనే అస్త్రాలుగా చేసుకుంది. రైతు రుణమాఫీలు అవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు అలాంటి పనులు చేయలేదని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ మాట మార్చడం వల్లనే రైతులు చనిపోతున్నారని, ఈ విషయంపై ఎన్నిరోజుల చర్చకైనా సిద్ధమేంటున్నారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో కూడా.....

ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో కూడా.. స్పీకర్‌పై అవిశ్వాసానికి కూడా సిద్ధంగా ఉంది కాంగ్రెస్‌ పార్టీ. టీఆర్‌ఎస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు... కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అవసరమైతే.. తమ పార్టీ చేసిన వైఫల్యాలు ఏంటో కూడా చర్చించాలని అంటున్నారు.

09:32 - September 23, 2015

హైదరాబాద్ : అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటలయుద్ధం అసెంబ్లీకి చేరనుంది. సర్కార్‌పై విమర్శనాస్ర్తాలు సంధించేందుకు... ప్రతిపక్షాలు సిద్ధమవుతుంటే... వాటిని ఎలా తిప్పికొట్టాలనే పనిలోపడింది అధికారపక్షం. ఈనేపథ్యంలో గులాబీ బాస్‌.. తన జట్టుకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని నూరిపోశారు.

విమర్శలపై అధికారపక్షం కూడా అస్త్రాలను సిద్ధం.....

తెలంగాణ శాసనసభా వర్షాకాల సమావేశాల్లో.. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు అధికారపక్షం కూడా అస్త్రాలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న రైతుఆత్మహత్యలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో.. అధికారపార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. సభకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చారు.

విపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా.....

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన టిఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రైతు ఆత్మహత్యలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కొనేందుకు.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్‌ల మార్పులపై సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

దసరా నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ....

దసరా నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నట్లు సంకేతాలను ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10గంటలకు తెలంగాణ శాసనసభతో పాటు శాసనమండలి కూడా ప్రారంభమవుతుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి ఉభయ సభలు సంతాపం ప్రకటిస్తాయి. మధ్యాహ్నం 12గంటలకు బిఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే సభ ఎజెండాను బిఏసీ నిర్ణయిస్తుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా

రైతు సమస్యలపై పోరాడుతాం : ఎర్రబెల్లి...

హైదరాబాద్‌ : తమను అవమానించినా, కొట్టినా సహనంతో సభలోనే ఉండి రైతుల సమస్యలపై పోరాడుతామని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. రైతుల ఆత్మహత్యలే ప్రధాన అంశంగా తాము అసెంబ్లీలో తీసుకుంటామన్నారు. అసెంబ్లీని కనీసం 15 రోజులు నడపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

అగ్నిప్రమాదంలో ఐదు షాపుల దగ్ధం...

అనంతపురం : అమరాపురం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు షాపులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రోడ్డు వెంట సుమారు 18 షాపులు ఉన్నాయి. ఆకస్మికంగా ఎగసిన మంటలు ఐదు లకు విస్తరించగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు షాపులు దగ్ధం అయ్యాయి. వీటిలో ప్లాస్టిక్ వస్తువులు, బీరువాల విక్రయ షాపులు, హోటల్ ఉన్నాయి. ఎవరో కావాలనే నిప్పంటించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

తిరుమలలో కన్నుల పండువగా మహారథోత్సవం

తిరుమల: ఎనిమిదో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం శ్రీవారు మహా రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. గరుడ వాహన సేవ తర్వాత ఎక్కువ మంది భక్తులు పాల్గొనే ఈ రథోత్సవానికి టిటిడి భారీ ఏర్పాట్లు చేసింది. దేవరులతో కలిసి సర్వాంగ సుందరంగా ముస్తాబైన మలయప్పస్వామి రథంపై తిరుమాఢ వీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

08:34 - September 23, 2015

హైదరాబాద్ : నేటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనస సభలో ప్రజా సమస్యలు సీరియస్ చర్చిస్తారన్న నమ్మకం కలగడం లేదని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అస్త్ర శస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ, ఏపీ లను ఆ రాష్ట్ర సీఎంలు సింగపూర్ లా తయారు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అది సాధ్యమా? సింగపూర్ నుండి క్యాపిటల్ నిర్మాణమే కాకుండా మ్యాన్ ఫ్యాక్టర్ రంగం వంటి వాటిలో అభివృద్ధిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందని నాగేశ్వర్ తెలిపారు. ఈ అంశాలపై మరింత పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

08:01 - September 23, 2015

హైదరాబాద్ : నేటి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ప్రజల సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యధిక సమస్యలున్న రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు వుంది?అసెంబ్లీ సమావేశాల ఉద్ధేశ్యాన్ని సీఎం కేసీఆర్ గుర్తిస్తున్నారా? సభలో ప్రతిపక్షాల విమర్శలకు దూకుడుగా సమాధానం చెప్పాలని కేసీఆర్ ఎందుకు సూచించారు? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చలో సీపీఎం నేత బి.వెంకట్, కాంగ్రెస్ నేత అనిల్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టిడిపి నేత రాజారాం యాదవ్ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నెల్లూరు జిల్లాలో మూడు దేవాలయాల్లో చోరీలు

నెల్లూరు : బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెంలోని మూడు దేవాలయాల్లో గుర్తు తెలియని దొంగలు చోరీలు చేశారు. గ్రామంలోని రామాలయం, పోలేరమ్మ, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రెండు లక్షల రూపాయలకు పైగా విలువగల హుండీలు, దేవుని నామాలను ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో చోరీలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గాంధీ ఆసుపత్రి మ్యాన్ హోల్ లో మృతదేహం

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ దవాఖానలోని మ్యాన్‌హోల్‌లో లభించిన ఓ గుర్తు తెలియని మృతదేహాం తీవ్ర కలకలం రేపింది. వైద్యశాల ప్రధాన భవనం వెనుకాల ఉన్న మ్యాన్‌హోల్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్లంబర్ అందులోని మృతదేహానికి గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అధికారులు వచ్చి చూడగా మ్యాన్‌హోల్‌లో తల భాగం కిందికి, కాళ్లు పైకి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సుమారు మూడు రోజుల క్రితం అతడు అందులో పడి ఉంటాడని తెలుస్తోంది. ఈ మేరకు వైద్యశాల అధికారులు చిలకల గూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఉమేష్ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని బయటికి తీయించారు.

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

నల్లగొండ: విద్యుత్‌షాక్‌ కు గురై ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది మండలంలోని ఆల్లగడప గ్రామానికి చెందిన శైలజ(35)కు ఇంట్లో కరెంటు వైరులు తగలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి కుంటుంబం విషాదంలో మునిగిపోయింది.

హంద్రీ నీవాకు గండి...

కర్నూలు : హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఇంకా పూర్తే కాలేదు. అప్పుడే ఆ కాలువకు భారీ గండి పడింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు పరిధిలో ఈ కాలువకు నిన్న రాత్రి భారీ గండి పడింది. కొద్దిరోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఈ కాలువలో భారీ స్థాయిలో నీరు నిల్వ ఉంది. అంతేకాక శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. దీంతో బ్యాక్ వాటర్ పోటెత్తడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా నిండిపోయింది. ఈ నేపథ్యంలో హంద్రీ కాలువకు పడిన గండి కారణంగా నందికొట్కూరు పరిధిలోని పంట పొలాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న సాగు నీటి శాఖ అధికారులు గండిని పూడ్చే పనిని ప్రారంభించారు.  

బక్రీద్ సందర్భంగా 25న హైకోర్టుకు సెలవు

హైదరాబాద్‌: ఈ నెల 25 శుక్రవారం బక్రీద్‌ పురస్కరించుకుని ఉమ్మడి హైకోర్టుకు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని కింది కోర్టులకు, ట్రిబ్యునల్స్‌, ఇతర జ్యుడీషియల్‌ సంస్థలకు సెలవు ప్రకటించారు. పరిపాలనపరమైన కారణాలవల్ల నవంబర్‌ 7వ తేదీ శనివారం హైకోర్టు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ పేరిట మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్

కర్నూలు : ఆత్మకూరులో 14 మంది సభ్యులున్న బ్రౌన్‌షుగర్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. గుట్టుగా జిల్లాలో బ్రౌన్‌షుగర్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ అరెస్టులు జిల్లాలో సంచలనం సృష్టించాయి.

07:16 - September 23, 2015

హైదరాబాద్ : రెండు రోజుల సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబు...మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు...అనంతరం కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్‌ పనులపై కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

వెంకయ్య నివాసంలో అల్పాహార విందు......

రెండు రోజుల సింగపూర్‌ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగొచ్చిన చంద్రబాబు..రాజధానిలో ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం ఢిల్లీలోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత ప్రధాని అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్నారు. స్వచ్ఛభారత్‌ అంశంపై ఏర్పాటైన నీతి ఆయోగ్‌ సబ్‌ కమిటీకి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున..సబ్‌ కమిటీ తుది నివేదికను ఆయన సమర్పించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై చర్చిస్తారు. గ్రామీణ విద్యుదీకరణ, సౌర విద్యుత్తు అంశాలకు సంబంధించిన రెండు కీలక అవగాహన ఒప్పందాల ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు.

మధ్యాహ్నం 3గం. అశోక్‌గజపతి రాజుతో సమావేశం.......

ఆ తర్వాత 3గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుతో సమావేశం కానున్నారు. విభజన చట్టం ప్రకారం..రాష్ట్రానికి రావాల్సిన విమానాశ్రయాల గురించి రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ గురించి మంత్రితో చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, రాజధాని నిర్మాణానికి ఆర్ధిక సహాయం, లోటు బడ్జెట్‌పై మంత్రితో చర్చిస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత గురువారం ఉదయం ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడకు చేరుకోనున్నారు చంద్రబాబు. 

07:14 - September 23, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని సింగపూర్‌ ప్రధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను సీఎం వివరించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ పర్యటనను ముగించుకుని చంద్రబాబు తిరిగి వచ్చారు.

విజయవంతంగా ముగిసిన బాబు పర్యటన...

ఏపీ సీఎం చంద్రబాబు ఆయన బృందం రెండు రోజుల సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకుంది. రెండు రోజుల సింగపూర్‌ పర్యటనలో ఆ దేశ పారిశ్రామిక వేత్తలను, ప్రజాప్రతినిధులను కలిసి రాజధాని నిర్మాణంపై చర్చించారు. పర్యటన విజయవంతమైందని..ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్‌లోని అనేక సంస్థలు ముందుకొచ్చాయని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు.

మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చినందుకు సీఎం కృతజ్ఞతలు.....

పర్యటనలో భాగంగా రెండోరోజు సింగపూర్‌ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో చంద్రబాబు భేటీఅయ్యారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుకు నాలెడ్జ్ ఎకానమీగా ఏపీ ఆవిర్భావానికి సహకరించాలని సింగపూర్‌ ప్రధాని లూంగ్‌ను బాబు కోరారు.

అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి....

నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి, నాలెడ్జ్‌ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి, అంతర్జాతీయ స్థాయి ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ ఏర్పాటుకు సహకరించాలని చంద్రబాబు సింగపూర్‌ ప్రధానిని కోరారు. ఏపీకి సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్‌ హబ్‌గా చేయాలనేది తన సంకల్పమంటూ.. అందుకు తగిన సహకారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు అనుకూల రాష్ర్టాలపై ప్రపంచ బ్యాంకు జరిపిన అధ్యయనంలో ఏపీ రెండో స్థానం సాధించిందని లీ సీన్ లూంగ్‌కు తెలియజేశారు. అమరావతి చారిత్రక ప్రత్యేకత గురించి చంద్రబాబు వివరించారు. రాజధాని మెట్రో నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని చెప్పారు. అక్టోబర్‌ 22న జరగనున్న అమరావతి రాజధాని నగర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని సింగపూర్‌ ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

సింగపూర్‌లోని సిటీగ్యాలరీ సందర్శన....

అంతకుముందు...ఆంధ్రప్రదేశ్‌ బృంద సభ్యులు సింగపూర్‌లోని సిటీగ్యాలరీని సందర్శించారు. 40 ఏళ్లలో సింగపూర్‌ భౌగోళికంగా..సామాజికంగా ఏవిధంగా పరివర్తన చెందిందో ఈ గ్యాలరీ కళ్లకు కట్టినట్లుగా ఉందని ఏపీ మంత్రులు తెలిపారు. ఆ తర్వాత సింగపూర్‌లోని జూరాంగ్‌ ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి చేసిన టౌన్‌షిప్‌లను సందర్శించారు. మొత్తానికి ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు రెండు రోజుల సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా ముగిసింది. ఏపీకి పెట్టుబడులతో పాటు..రాజధాని నిర్మాణం, అక్టోబర్‌ 22న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్‌ ప్రధానిని ఆహ్వానించడం వంటి అంశాలపై చంద్రబాబు పర్యటన విజయవంతంగా కొనసాగింది. 

07:09 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో స్పీకర్‌ మధుసూదనాచారి, మండలిలో ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రారంభించనున్నారు. మొదటిరోజు ఉభయసభలు ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డికి సంతాపం ప్రకటించనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది.

మ.12 గంటలకు బీఏసీ సమావేశం .....

ఇక మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలి,.. ఏ అంశాలు చర్చించాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా.. ఎన్నిరోజులైనా జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ.. ఈనెల 30 వరకు మాత్రమే సమావేశాలను ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. విపక్షాలు పట్టుబడితే మరో రోజు పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 25న బక్రీద్‌, 26న శనివారం, 27న ఆదివారం సందర్భంగా అసెంబ్లీకి సెలవు. ఇక అసెంబ్లీ సమావేశాలు 24, 28, 29, 30 తేదీలలో నాలుగు రోజులు మాత్రమే జరగనున్నాయి.

ప్రధాన ఎజెండాగా రైతుల ఆత్మహత్యలు .....

ఇక ఈ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలు ప్రధాన ఎజెండాగా మారబోతుంది. రాష్ట్రంలోని సమస్యలపై ప్రతిపక్షాలు సర్కార్‌ను ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం ప్రణాళిక ఖరారు చేసింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

07:05 - September 23, 2015

హైదరాబాద్‌ : అంబర్‌పేటలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇంటి నిర్మాణం కోసమే తవ్వకాలని ఇంటి యజమాని వాదిస్తున్నారు. కాని స్థానికులు మాత్రం ఈ తవ్వకాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయని.. గుప్త నిధుల కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఇంటివారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

07:03 - September 23, 2015

హైదరాబాద్ : రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ పరిధిలో మళ్లీ భారీ మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.

సీఆర్‌డీఏ పరిధి 7068.20 చదరపు కిలోమీటర్లు.....

ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.

నియోజకవర్గం దాదాపు సీఆర్‌డీఏ పరిధిలోకి......

పరిపాలన, భౌగోళిక అవసరాలకనుగుణంగా అదనంగా కొన్నిగ్రామాలను సీఆర్‌డీఏలో కలపగా పరిమిత గ్రామాలను దాన్నుంచి మినహాయించారు. దీనిపై ఎప్పటి నుంచో తర్జనభర్జనలు జరుగుతున్నా అంతిమంగా నిర్ణయం తీసుకుని సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి ఈ మార్పులు చేశారు. తాజా సవరణ ప్రకారం జగ్గయ్యపేట నియోజకవర్గం దాదాపు సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చింది.

జగ్గయ్యపేట మున్సిపాలిటీ, మండలంలోని 24 గ్రామాలు......

జగ్గయ్యపేట మున్సిపాల్టీ, మండలంలోని 24 గ్రామాలు, వత్సవాయి మండలంలో 26 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 12గ్రామాలు సీఆర్‌డీఏ పరిధిలో కలిశాయి. మైలవరం మండలంలో నాలుగు, నూజివీడు మండలంలో రెండు, బాపులపాడులో మూడు, మొవ్వలో ఏడు, ఘంటశాలలో 9, చల్లపల్లిలో రెండు, మోపిదేవిలో ఏడు, పామర్రులో పది, నందివాడ పది, గుడివాడలో ఆరు గ్రామాలు, నందిగామ మండలంలో ఒక గ్రామం సీఆర్డీఏలో కలిశాయి. ఈ గ్రామాల విస్తీర్ణం 1099.97 చ.కి.మీగా ఉంది.

మాదిపాడు అగ్రహారం, మాదిపాడు షేరి.....

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో మాదిపాడు అగ్రహారం, మాదిపాడు షేరి, గింజుపల్లె, చల్లగరిగ, తాడ్వాయి, కొండూరు, క్రోసూరు మండలంలో దొడ్లేరు, హస్సన్ బాద, గరికపాడు, తాళ్లూరు, గుడిపాడు, సత్తెనపల్లి మం డలంలో ధూళిపాళ్ల, భృగుబండ, ఫిరంగిపురం మండ లంలో గుండ్లపాడు, పొనుగుపాడు, మేరకపూడి, యడ్లపాడు మండలంలో సందెపూడి, తుర్లపాడు, ప్రత్తిపాడులో వంగిపురం, పొన్నూరు మండలంలో వల్లభరావుపాలెం, నండూరు, ములుకుదురు, భట్టిప్రోలు మండలంలో సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, గొరిగపూడి, పెదపులివర్రు, పెసర్లంక, పెదలంక, ఓలేరు గ్రామాలు సీఆర్డీఏలో కలిశాయి. ఈ గ్రామాల విస్తీర్ణం 300.53 చదరపు కిలోమీటర్లు.

గుడ్లవల్లేరు మండంలోని ఆరు గ్రామాలు.....

రెండు జిల్లాల్లోని తొమ్మిది గ్రామాలను సీఆర్డీఏ పరిధి నుంచి తప్పించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని ఆరు గ్రామాలు, గుంటూరు జిల్లాలో పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం, నాదెండ్ల మండలంలోని నాదెండ్ల, ముప్పాళ్ళ మండలంలోని మాదల గ్రామాలను తప్పించారు.

06:58 - September 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్లు ముగిశాయి. ఇవాళ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వేలం పాట జరగనుంది. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్‌షాప్‌లకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం దరఖాస్తులు పెరిగాయి.

మొత్తం 2216 మద్యం దుకాణాలకు దరఖాస్తుల పిలుపు.....

తెలంగాణలో 2015-17 సంవత్సరానికి గాను మద్యం షాపుల దరఖాస్తుల స్వీకకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 30,987 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 2216 మద్యం దుకాణాలకు దరఖాస్తులు పిలిచారు. ఇందులో 2,111 షాపులకే దరఖాస్తులు వచ్చాయి. 154 కోట్ల 93 లక్షల ఆదాయం కేవలం ఈ దరఖాస్తుల రుసుం ద్వారానే వచ్చింది.

వరంగల్‌ జిల్లాలో 233 షాపులకు 4924 దరఖాస్తులు....

వరంగల్ జిల్లాలో 233 షాపులకు 4924 దరఖాస్తులు, అదిలాబాద్‌లో 158 షాపులకు 1541 దరఖాస్తులు, నిజామాబాద్‌లో 130 షాపులకు 1293 దరఖాస్తులు, నల్లగొండలో 266 షాపులకు 4382 దరఖాస్తులు, మెదక్ జిల్లాలో 178 షాపులకు 1676 దరఖాస్తులు వచ్చాయి.

హైదరాబాద్‌లో మొత్తం 212 షాపులు.....

హైదరాబాద్‌లో 212 షాపులుంటే 160 షాపులకు 316 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 390 షాపులకు గాను ..358 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 200 షాపులకు 2939 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో 301 షాపులకు 3416 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 148 షాపులకు అత్యధికంగా 6615 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది ఖమ్మం జిల్లాలో 148 షాపులకు 3921 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాలో గతేడాది కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఒక్క దరఖాస్తు కూడా అందని షాపులు 105గా ఉన్నాయి. వీటిటన్నంటికి త్వరలో ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

06:56 - September 23, 2015

హైదరాబాద్ : ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మెఉధృత రూపం దాల్చుతోంది. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని ఆశా వర్కర్ల యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. తమ డిమాండ్‌లు పరిష్కరించే వరకు ఈ ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

ఈనెల 2 నుంచి అన్ని జిల్లాల్లో నిరవధిక దీక్షలు.......

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 25 వేల మందికి పైగా ఆషా వర్కర్లు అన్ని జిల్లాల్లో నిరవధిక దీక్షలు చేపడుతున్నారు. కాని ఇప్పటి వరకు అధికారులుగాని, పాలకులు గానీ స్పందించలేదు. దీంతో...అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున ధర్నాలు చేపట్టాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు.

ఎన్ ఆర్ హెచ్ ఎం గైడ్ లైన్స్ ప్రకారం సేవలు.....

పదేళ్ల నుంచి ఆశా వర్కర్లు ఎన్ ఆర్ హెచ్ ఎం గైడ్ లైన్స్ ప్రకారం సేవలు అందిస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్, ఆస్పత్రిల్లో డెలివరీలు, ఇమ్యూనైజేషన్స్‌ ఫ్రోగ్రామ్‌లతోపాటు కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. కానీ వీరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నామమాత్రపు పారితోషికాలు అందిస్తున్నారు. ఒక్క ఆశా వర్కర్‌కు 400 వందల నుంచి 1500 వరకు ఈ పారితోషికాలున్నాయి. ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీస వేతనం రూ.15 వేలు......

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 15 వేలుగా చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారిని సెకండ్ ఏఎన్ ఎం లుగా గుర్తించాలంటున్నారు. అలాగే పెన్షన్‌, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు కల్పించాలని వీరు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్‌ బిల్లులు, యూనిఫామ్‌లు వెంటనే చెల్లించాలంటున్నారు. ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా...అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యల చర్చించి అనుకూల ప్రకటన చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

06:53 - September 23, 2015

హైదరాబాద్ : నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఐర్లాండ్‌లో.. ఆ తర్వాత అమెరికాలో పర్యటించనున్నారు. అయితే అమెరికా పర్యటనకు ముందే మోదీ సర్కార్‌ ఆదేశంతో 3.1 మిలియన్‌ డాలర్ల వైమానిక ఒప్పందం చేసుకుంది. చిన్న విమానాలు, అపాచీ హెలిక్యాప్టర్లను ఈ డీల్‌లో కొనుగోలు చేయనున్నారు.

అమెరికా పర్యటన నేపథ్యంలో....

ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అపాచీ హెలిక్యాప్టర్లు, చిన్న విమానాల కోసం 3.1 మిలియన్‌ డాలర్లను ఆ దేశానికి భారత్‌ చెల్లించింది. కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. హెలిక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందం 2013లోనే జరిగింది. అయితే అప్పటి నుంచి చెల్లింపులు జరగలేదు. రక్షణ రంగంలో ఈ డీల్‌ ఎంతో కీలకమైందని.. నిఫుణలు చెబుతున్నారు.

నేడు ఐర్లాండ్ కు....

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి ఏడు రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. టూర్‌లో భాగంగా నేడు ఐర్లాండ్ వెళ్లనున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల్లో ఆ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. డబ్లిన్‌లో ఆ దేశ ప్రభుత్వాధినేత ఎన్డా కెన్నీతో చర్చలు జరుపుతారు.

ప్రజా, ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు.....

రానున్న సంవత్సరాల్లో ఐర్లాండ్‌తో ప్రజా, ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయంత్రం ఐర్లండ్‌లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి అమెరికా వెళతారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.

భారత్‌లో పెట్టుబడుల అవకాశాలపై......

పలు ప్రపంచ దేశాల నేతలను, బడా పారిశ్రామిక వేత్తలను, ఆర్థికరంగ సంస్థల అధిపతులనూ మోదీ కలవనున్నారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత వెస్ట్‌కోస్ట్‌లో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని, గూగుల్ క్యాంపస్‌ను, టెస్లా మోటార్స్ సంస్థను సందర్శిస్తారు. ఈ నెల 27న శాన్ జోస్‌లో భారత సంతతి ప్రజలతో మోదీ ముచ్చటిస్తారు. అమెరికాలో తన గత పర్యటన, ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనను మోదీ గుర్తుచేయనున్నారు. తాజా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయనుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

న్యూయార్క్‌లో మోదీ, నవాజ్ షరీఫ్ ఒకే హోటల్ లో....

న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒకే హోటల్‌లో విడిది చేయనున్నారు. ప్రఖ్యాత ఆస్టోరియా హోటల్ ఇందుకు వేదిక కానుంది. ఈ వారంలో జరగనున్న 70వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరు దేశాల ప్రధానులూ అక్కడకు చేరుకోనున్నారు. నేటి సాయంత్రం మోదీ ఆస్టోరియాకు చేరుకోనున్నారు. 25న సాయంత్రానికి షరీఫ్ అక్కడకు వెళ్తారు. వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే వీరిరువురూ ఒకే హోటల్‌లో బస చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

06:45 - September 23, 2015

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 2న ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మె రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. చెవిలో పువ్వులు పెట్టుకోవడం లాంటి రూపాల్లో ప్రారంభమైన ఆశాల నిరసన కార్యక్రమాల ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్ల ముట్టడి లాంటి రూపంలోకి మారుతున్నాయి. గ్రామీణ ఆరోగ్య సేవల్లో అత్యంత కీలకపాత్ర పోషించే ఆశా వర్కర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఈ అంశంపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆశా వర్కర్ల రాష్ట్ర కార్యదర్శి బి.జయలక్ష్మి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:43 - September 23, 2015

హైదరాబాద్ : గ్రామీణ భారతంలో వైద్య ఆరోగ్య సేవల్లో ఆశా వర్కర్లు పోషిస్తున్న పాత్ర ఎందరెందరో ప్రశంసలందుకుంది. వీరు ఇళ్లిళ్లూ తిరిగి అందిస్తున్న సేవల కారణంగా మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించగలిగినట్టు కేంద్ర ప్రభుత్వమే ఘనంగా ప్రకటించిన సందర్భాలనేకం. ఇంజక్షన్‌ అంటేనే భయపడే రోజుల్లో , దేవుడిచ్చే బిడ్డలను కనకుండా ఆపకూడదనే సెంటిమెంట్స్‌ ప్రబలంగా వున్న రోజుల్లో ఇళ్లిళ్లూ తిరిగి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకు సంసిద్ధులను చేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇలాంటి అతిపెద్ద చాలెంజ్‌ను స్వీకరించి, సక్సెస్‌ సాధించి చూపించిన ఘనత మన ఆశాల సొంతం. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలోనూ, అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన అయిదు జబ్బులను నిర్మూలించడంలోనూ ఆశాలు పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. 2005 నుంచి ఆశా వర్కర్లు సాగించిన కృషి, ప్రదర్శించిన పట్టుదలలు కుటుంబ సంక్షేమ పథకాల విజయవంతంలో కీలకపాత్ర పోషించాయి. ప్రతి ఇంటికీ వెళ్లి గర్భిణీలను, పసిపిల్లలను, చంటి పిల్ల తల్లులను పలకరించి, వారికి అవసరమైన సూచనలు సలహాలిస్తూ, జనన మరణ రికార్డులను తయారుచేసి, వైద్య ఆరోగ్య అధికారులకు సమర్పించడం ఆశా వర్కర్ల డ్యూటీలో ప్రధానమైనది. సాంకేతికంగా వీరిది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగమే అయినా, ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులతో సమానంగా శ్రమించడం ఆశా వర్కర్ల ప్రత్యేకత. ఇంతగా శ్రమిస్తున్నా వీరికి నిర్ణీత వేతనం లేదు. ఎంతమందిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ఒప్పించారు? ఎంతమందికి టీకాలు వేయించారు? అన్న లెక్కల ఆధారంగానే వీరికి పారితోషకం లభిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించే ప్రతి టార్గెట్‌ను ఛేదించడంలో ఆశా వర్కర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాము టార్గెట్లు సాధిస్తున్నా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తి సమయం వెచ్చించి పనిచేస్తున్నా, కనీస వేతనం ఇవ్వకపోవడం ఎంత వరకు ధర్మమన్నది ఆశాల ఆవేదన. ఈ ఆవేదనే వీరిని సమ్మె మార్గం పట్టించింది. తెలంగాణలో సెప్టెంబర్‌ 2 న ప్రారంభమైన సమ్మె, ఉధృత రూపం దాలుస్తోంది. ముందు నిరసన కార్యక్రమాలతో ప్రారంభమైన సమ్మె బతుకమ్మ ఆటలు, మోకాళ్లమీద నిలబడడం, చెవిలో పువ్వులు పెట్టుకోవడం లాంటి రూపాల్లో సాగి, ఎమ్మెల్యేల, కలెక్టర్ల ముట్టడిలాంటి రూపాల్లోకి మారుతోంది. ఆశా వర్కర్లు ఇంతగా ఆందోళన చేస్తున్నా బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ లాంటివారు తమకున్న శక్తియుక్తులతో సమస్య పరిష్కారానికి కృషి చేయకపోగా, కార్మిక సంఘాల మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. విభిన్న వర్గాల ప్రజలు తమ కోరికల సాధన కోసం సమ్మెకు దిగిన్నప్పుడు ఆయా నాయకత్వాలతో చర్చలు జరిపి, సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం ఉత్తమ పాలకుల లక్షణం. ఆశా వర్కర్ల సమ్మె విషయంలో ప్రదర్శిస్తున్న ఉదాసీనతను చూస్తుంటే....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సద్గుణమే లోపిస్తున్నదా అన్న అనుమానం కలుగుతోంది.

ఐర్లాండ్ కు బయలు దేరిన ప్రధాని

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరారు. ఐర్లాండ్ లో స్వల్ప పర్యటనను ముగించుకున్న తర్వాత ఆయన అటు నుంచి అటే అమెరికా బయలుదేరతారు. అమెరికాలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారు.

 

నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

చిత్తూరు: నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనపై ఉన్నతాధికారులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో బాలాజీనాథ్ యాదవ్ ను మంగళవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలాజీనాథ్ స్థానంలో ఇంఛార్జ్ అధికారిగా పుత్తూరు కమిషనర్ హరిబాబుకు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కణ్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రైవేటు ఆసుపత్రులకు '108' బంద్

హైదరాబాద్: అత్యవసర వైద్య సేవల కోసం ‘108’ అంబులెన్సుల్లో తీసుకెళ్లే రోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించవద్దని జీవీకే-ఈఎంఆర్‌ఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే తరలించాలని నిర్ణయించింది. తక్షణమే అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు తాము కోరుకున్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే అవకాశాలను రోగులు కోల్పోయారు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.

తెలంగాణ లో 3 ఎమ్మెల్సీ స్థానాలు పెంపు...

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను; సర్ధుబాటు చేస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి,మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీస్ధానం పెరిగింది.

నేటి నుండి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐర్లాండ్, అమెరికా దేశాల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఏడు రోజుల పర్యటనలో ముందుగా బుధవారం నాడు ఐర్లాండ్ వెళ్లనున్న మోదీ.. దాదాపు ఆరు దశాబ్దాల్లో ఆ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. డబ్లిన్‌లో ఆ దేశ ప్రభుత్వాధినేత (తాషెక్) ఎన్డా కెన్నీతో చర్చలు జరుపుతారు.

అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు :సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : శాసన సభ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ హాల్‌కు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 23వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 24వ తేదీ వరకు అమలులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున ఈ ప్రాంతంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు వివరించారు.

 

సీఆర్డీఏ పరధి పెంపు

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన తేదీ సమీపిస్తున్న తరుణంలో రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సీఆర్‌డీఏ పరిధిని పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 7068.38 నుంచి 8352 చదరపు కిలోమీటర్లకు సీఆర్‌డీఏ పరిధిని పెంచుతూ మున్సిపల్ శాఖ జీవో జారీచేసింది. దీని ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలను సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి. దీంతోపాటుగా గతంలో పాక్షికంగా సీఆర్‌డీఏ పరిధిలో ఉండే మండలాలను కూడా పూర్తిగా సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చింది.

Don't Miss