Activities calendar

24 September 2015

22:17 - September 24, 2015

నినాదాలు నింగినంటుతున్నాయి. నిరసనలు విరామం లేకుండా సాగుతున్నాయి. వ్యతిరేకిస్తూ.. విద్యార్తులు సాగిస్తున్న నిరవధిక యజ్ఞం. నేటికి ఆ పోరాటానికి 105 రోజులు నిండాయి. ఒక్క పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూటే మాత్రమే కాదు.. దేశంలోని పలు విద్యా పరిశోధనా సంస్థల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రజాస్వామిక , లౌకికవాదులకు హెచ్చరికగా మారుతున్నాయి. ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

22:06 - September 24, 2015

ఢిల్లీ : భారత క్రికెట్ బోర్డు సరికొత్త అధ్యక్షుడు, జగ్ మోహన్ దాల్మియా వారసుడు ఎవరన్న ప్రశ్నకు...రోజుకో పేరు సమాధానంగా బయటకు వస్తోంది. శరద్ పవార్, రాజీవ్ శుక్లా, అమితాబ్ చౌదరి పేర్లు పోయి..ఇప్పుడు సరికొత్తగా టీమిండియా మాజీ కెప్టెన్, సీఏబీ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు...బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గంగూలీని ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడంతో..బోర్డు అధ్యక్షుడుగా ఎంపిక కావడానికి దాదాకు దాదాపు మార్గం సుగమమయ్యింది.... భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కాగలరని...ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ, భారత క్రికెట్ కు ఎనలేని సేవలు చేసి...భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు హోదాలో...జగ్ మోహన్ దాల్మియా మృతి చెందడంతో...భారత క్రికెట్ బోర్డులో కుర్చీలాటకు మరోసారి తెరలేచింది. దాల్మియా వారసుడు ఎవరన్న ప్రశ్నకు...రోజుకో పేరు బయటకు వస్తూ గందరగోళానికి కారణమవుతోంది.
గుండెపోటుతో దాల్మియా మృతి
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు హోదాలో ..భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన 75 ఏళ్ల జగ్ మోహన్ దాల్మియా..గత 15 మాసాలుగా తనదైన శైలిలో సేవలు అందించారు. అయితే..గుండెపోటుతో దాల్మియా మృతి చెందడంతో...ఆయన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరన్నది..బోర్డువర్గాలను అయోమయంలో పడవేసింది. దేశంలోని 28 క్రికెట్ సంఘాలు అనుబంధంగా ఉన్న....భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో...కేవలం 30 ఓట్లు మాత్రమే ఉంటాయి. నార్త్ , సౌత్, ఈస్ట్ , వెస్ట్, సౌత్ జోన్ లకు చెందిన క్రికెట్ సంఘాల అధ్యక్షకార్యదర్శులు...ఈ ఎన్నికలో పాల్గొంటారు. మొత్తం 30 ఓట్లలో...ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ చేతిలో 10 ఓట్లు ఉన్నాయి. దక్షిణభారత క్రికెట్ సంఘాలన్నీ శ్రీనివాసన్ గుప్పిట్లో ఉన్నాయి. మరోవైపు.. ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు, కేంద్రమాజీ మంత్రి శరద్ పవార్ వెస్ట్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తుంటే...బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నార్త్ జోన్ కు, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరి ఈస్ట్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాల్మియా మృతి తర్వాత...ఆయన వారసుడిగా..ఈ ముగ్గురి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. ఈ ముగ్గురు కాకుండా..ఇప్పుడు సరికొత్తగా భారత మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ పేరు బయటకు వచ్చింది. బెంగాల్ క్రికెట్ సంఘం తో సౌరవ్ గంగూలీ కుటుంబానికి అనుబంధం ఈనాటిది కాదని, సౌరవ్ తండ్రి చండీదాస్ సైతం గతంలో సీఏబీ కార్యదర్శిగా వ్యవహరించారని..బెంగాల్ క్రికెట్ సంఘం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గంగూలీ కలుసుకోడం కూడా దీనికి ఊతమిస్తోంది.
రేసులో కొత్తగా గంగూలీ
బిసిసిఐ నిబంధనల ప్రకారం ఈస్ట్ జోన్ కు చెందిన వ్యక్తినే బోర్డు అధ్యక్షుడుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఆ స్థానంలో సౌరవ్ గంగూలీని ఎన్నుకొంటే అందరిమద్దతూ ఉంటుందని, జగ్ మోహన్ దాల్మియా తర్వాత బోర్డు అధ్యక్షుడుగా ..సౌరవ్ ను మించిన అర్హుడు ఎవరుంటారన్న మాట కూడా వినిపిస్తోంది. మరోవైపు..బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ .శ్రీనివాసన్..తన చెప్పుచేతల్లో ఉన్న క్రికెట్ సంఘాల సభ్యులతో...బెంగళూరు వేదికగా ఓ కీలకసమావేశం నిర్వహిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడుగా ఎవరు ఎన్నిక కావాలన్నా...శ్రీనివాసన్ చేతిలో ఉన్న 10 ఓట్లే కీలకం కానున్నాయి. శ్రీని కరుణాకటాక్షాలు ఉంటేనే..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కాగలరని...ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.6 గా నమోదు అయింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 

21:53 - September 24, 2015

సౌది అరేబియా : మక్కాలో మరో పెను విషాదం సంభవించింది. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 717 మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 805 మందికి పైగా గాయపడ్డారు. మృతులో 17 మంది భారతీయులున్నారు. ఇందులో ఒకరు హైదరాబాద్ వాసి ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ విషాద దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
గత 15 రోజుల్లో మక్కాలో ఇది రెండో దుర్ఘటన
సౌదీ అరేబియాలో మక్కాలో ముస్లింల పవిత్ర హజ్‌ యాత్ర బుధవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది జరిగే ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు మక్కాకు వెళ్తారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 717 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది దాదాపు 805 మంది గాయపడ్డారు. మక్కాకు 5 కి.మీ. దూరంలోని మీనాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన సౌదీ అధికారులు 220 అంబులెన్స్‌లు, 4 వేల మంది సిబ్బందితో సహాయ కార్యకలాపాలు చేపట్టారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొంత మందికి సంచార వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నారు.
పెను విషాదానికి దారితీసిన తొక్కిసలాట
హజ్ యాత్రలో చివరి ప్రధాన కర్మ అయిన సైతాన్‌ను రాళ్ళతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం నాడు హజ్ యాత్రికులు సౌదీలోని పవిత్ర స్థలమైన ముజదలీఫాకు చేరుకొని ప్రధాన కర్మ నిమిత్తం అక్కడ గులక రాళ్ళను ఏరుకున్నారు. ముజదలీఫా తర్వాత కొందరు యాత్రికులు పవిత్ర కాబా చుట్టడానికి వెళ్ళగా మిగతా మంది మీనాకు చేరుకున్నారు. హజ్ యాత్రలో చివరి మజిలీగా మీనా ప్రాంతంలో సైతాన్‌గా పిలిచే మూడు స్తంభాలపై రాళ్ళు విసురుతారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. మీనా నుంచి తిరిగి మక్కాకు చేరుకోవడానికి సౌదీ అధికారులు రవాణా సౌకర్యం కల్పించారు. అయితే యాత్రీకులు పుణ్యం వస్తుందనే నమ్మకంతో కాలినడకనే బయలు దేరడం కూడా తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. తొక్కిసలాటలో మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువమంది ఆఫ్రికా, ఇరాన్‌ దేశాలకు చెందినవారని సమాచారం.
20 లక్షల మంది విదేశీ యాత్రికులు
దాదాపు 20 లక్షల మంది విదేశీ యాత్రికులు హజ్ యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి లక్షన్నర మంది మక్కాకు వెళ్ళినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతంలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉన్నట్టు సమాచారం. గడిచిన 15 రోజుల్లో మక్కాలో ఇది రెండో విషాదం. ఈ నెల మొదట్లో మక్కాలోని మసీదు వద్ద క్రేన్ కూలడంతో 109 మంది మరణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌ వాసి మృతి
మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జానీబీ మరణించారు. ఆమె మృతితో బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. జానీబీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు యాత్రికుల సమాచారం కోసం.. హజ్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది టీ సర్కారు. ఎల్బీ నగర్‌కు చెందిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. జానీబీ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకు పోయారు. బక్రీదు పండుగకు ముందు ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని భావించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌ దిగ్భ్రాంతి
మక్కా తొక్కిసలాటలో వందలాది యాత్రికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ నుంచి మక్కాకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలని.. దీనికోసం జెడ్డాలోని ఇండియన్‌ ఎంబసీని సంప్రదించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన యాత్రికుల సమాచారం కోసం 040-23214125 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని అధికారులు తెలిపారు.
విషాదయాత్రగా హజ్‌ యాత్ర
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర కాస్తా విషాదయాత్రగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా మక్కాకు తరలివచ్చే యాత్రీకులకు రక్షణ లేకుండా పోతోంది. కిక్కిరిసిన యాత్రీకుల కారణంగా తొక్కిసలాట లాంటి ప్రమాదాల కారణంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలం మక్కా
ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలం మక్కా...మదీనా... జీవితంలో ఒక్కసారైనా మక్కా, మదీనాలను సందర్శించాలని ప్రతీ ముస్లిం కోరుకుంటాడు. ధనిక, పేద అనే తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మక్కాను సందర్శించడానికి ఉబలాటపడుతుంటారు. ఎంత శ్రమ కలిగినా, ఎన్ని కష్టాలెదురైనా మక్కాకు వెళ్లి ప్రార్థనలు చేసి తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా హజ్‌ యాత్రికులు మక్కాకు వెళ్లడం రివాజు. ప్రతియేటా భారీ ఎత్తున తరలివచ్చే యాత్రీకులకు భద్రత కల్పించడం సౌదీ అధికార యంత్రాంగానికి ఓ సవాలుగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు, తొక్కిసలాటలు లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సౌదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరిగి యాత్రికుల మరణాలు సంభవిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
గతంలోనూ పలు విషాద ఘటనలు
హజ్‌ యాత్రలో గతంలోనూ పలు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. 2006లో మక్కాలోని మీనా వద్ద జరిగిన తొక్కిసలాటలో 360 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అంతకు ముందు రోజు యాత్రికులు సేద తీరుతున్న 8 అంతస్తుల భవనం కూలి 73 మంది మరణించారు. 2004లో మీనా వద్ద భక్తుల రద్దీ కారణంగా 244 మంది మృత్యువాత పడ్డారు. వందలాదిగా గాయపడ్డారు. 2001లో జరిగిన తొక్కిసలాటలో 35 మంది మృతి చెందారు. 1998లో మీనా వద్ద సైతాన్‌పై రాళ్లు విసరడానికి యాత్రీకులు పోటీపడడం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 180 మంది చనిపోయారు. 1997లో యాత్రీకులున్న టెంట్‌కు నిప్పంటుకుని 340 మంది ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన గాలులు రావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. 1990లో మక్కాలో పాదాచారులు రద్దీగా ఉన్న చోట జరిగిన తొక్కిసలాటలో 1426 మంది హజ్‌ యాత్రీకులు మృత్యువాత పడ్డారు. హజ్‌ యాత్రలో ప్రమాదాలు నివారించి, యాత్రీకుల ప్రాణాలు కాపడడానికి సౌదీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

21:39 - September 24, 2015

తూర్పుగోదావరి : కాకినాడలో బాలుడి కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. నిన్న కిడ్నాపైన బాలుడు దుర్గా... మృతి చెందాడు. వెంకటాయపాలెం చెరువులో బాలుడి మృత దేహం లభ్యం అయింది. తాళ్లరేవు మండలం లక్ష్మీపతి గ్రామంలో దుర్గా అనే రెండేళ్ల బాలుడు నిన్న అదృశ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇవాళా బాలుడి మృత దేహాన్ని వెంకటాయపాలెం చెరువులో గుర్తించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

కాకినాడలో బాలుడి కిడ్నాప్ విషాదాంతం

తూర్పుగోదావరి : కాకినాడలో బాలుడి కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. నిన్న కిడ్నాపైన రెండేళ్ల బాలుడు దుర్గా... మృతి చెందాడు. వెంకటాయపాలెం చెరువులో బాలుడి మృత దేహం లభ్యం అయింది.

21:09 - September 24, 2015

నల్గొండ : ప్రాణంతో సరితూగే ఒకే ఒక బంధం స్నేహ బంధం. లోకంలో ఎన్ని బంధాలున్న స్నేహ బంధాన్ని మించిన బంధం మరొకటి లేదు. ప్రాణ స్నేహితుడు అన్నపదమే ఇందుకు నిదర్శనం. ప్రాణానికి ప్రాణమైన తన ప్రాణస్నేహితుడు లోకంలో లేడని తెలిసి మరో స్నేహితుడి గుండె ఆగిపోయింది. మానవ సంబంధాలను తట్టి లేపే ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
అపూర్వ స్నేహితుల బంధం
నల్గొండ జిల్లాలో అపూర్వ స్నేహితుల బంధం కంటతడి పెట్టించింది. ప్రాణ స్నేహితుడి ప్రాణం పోయిందని తెలిసి మరో స్నేహితుడి గుండె ఆగిపోయింది. దీంతో ఆ గ్రామస్తులంతా వారి స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు. హుజూర్‌ నగర్‌ మండలం శ్రీనివాస పురం, లింగగిరి గ్రామాలకు చెందిన దగ్గుపాటి వినోద్‌, తోట వినోద్‌ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదివారు. పదిహేనేళ్లుగా ఇద్దరు ప్రాణమిత్రులుగా తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.
స్నేహ బంధానికి బీటలు
ఇంతలోనే వారి స్నేహ బంధానికి బీటలు వారేలా దగ్గుపాటి వినోద్ కు బ్లడ్‌ క్యాన్సర్‌ సోకింది. సుమారు పది నెలల పాటు మృత్యువుతో పోరాడిన దగ్గుపాటి వినోద్‌ చివరికి ఈ నెల 20న ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసిన తోట వినోద్‌ దుఃఖంతో కన్నీరు మున్నీరయ్యాడు. స్నేహితుడికి తుది వీడ్కోలు పలికి ఇంటికి చేరుకున్న తోట వినోద్‌ దుఃఖంతో కుమిలిపోయి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు.
ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు
దగ్గుపాటి వినోద్‌ చనిపోయిన కొద్ది గంటల్లోనే తోట వినోద్‌ సైతం మృతి చెందడంతో ఇరు గ్రామాల వారు వీరి స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇద్దరు మిత్రులు చనిపోవడం పట్ల ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు మిత్రులు కేవలం 23 సంవత్సరాల వయస్సు కలవారే కావడంతో వారి కుటుంబసభ్యులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.

 

20:59 - September 24, 2015

కరీంనగర్‌ : జిల్లాలో మరో యువరైతు తనువు చాలించాడు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన.. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలం, పెద్దకల్వల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గైని కుమార్‌ అనే యువరైతు... మూడేళ్ల నుంచి పంటల్లో తీవ్రనష్టం చవిచూస్తున్నాడు. దీంతో తీవ్రమనస్తాపం చెంది.. వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుమార్‌కు మూడు లక్షల అప్పులు ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

20:56 - September 24, 2015

తిరుపతి : టిటిడి సెంట్రల్ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. 90 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టిటిడి అధికారులు ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు నియామకాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయకుండా కొత్తవారిని ఎలా నియమిస్తారని కాంట్రాక్టులు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

టిటిడి సెంట్రల్ ఆస్పత్రిలో ఉద్రిక్తత

తిరుపతి : టిటిడి సెంట్రల్ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. 90 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టిటిడి అధికారులు ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు నియామకాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయకుండా కొత్తవారిని ఎలా నియమిస్తారని కాంట్రాక్టులు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

బోయిన్ పల్లి ఎస్టీ హాస్టల్ లో దారుణం

హైదరాబాద్ : బోయిన్ పల్లి ఎస్టీ హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్ ఆవరణలో ఆడుకుంటున్న 3వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ పై కుక్కలు దాడి చేశాయి. శ్రీకాంత్ తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. 

20:46 - September 24, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు.. అతి పెద్ద వేదిక ఏర్పడింది. సర్కారు తీరుపై పోరాటం.. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుంది. వామపక్షాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ, సామాజికశక్తులతో కలసి ఏర్పడిన తెలంగాణ వేదిక పేదల గొంతుకై నినదించనుంది. బూటకపు ఎన్ కౌంటర్లను నిరసిస్తూ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
పీడీఎఫ్ ఏర్పాటు...
తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగునా నిగ్గదీసేందుకు.. ఓ వేదిక ఆవిర్భవించింది. సీపీఐ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. వామపక్షాలు, ప్రజా, పౌర సంఘాలు, అభ్యుదయ సామాజిక శక్తులతో కలసి తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటైంది. కేసిఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైనా.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ఈ వేదిక పోరాడనుందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
కేసీఆర్ నియంత : తమ్మినేని
ప్రశ్నించేవారిని, పోరాడేవారిని అణచి వేస్తూ సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. శ్రుతి, సాగర్‌లను చిత్ర హింసలు పెట్టి హత్య చేసారని.. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా.. ఈ నెల 30న.. వేదిక తరపున చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. శ్రుతి ,సాగర్ లవి బూటకపు ఎన్ కౌంటర్లని.. బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని విరసం నేత వరవర రావు డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రజలు దొరల పెత్త నాన్ని సహించరని విమలక్క తెలిపారు. తెలంగాణ వస్తే ఎన్ కౌంటర్లు జరుగవని ఆశించామని చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ వేదిక ఏర్పాటు కార్యక్రమంలో.. వామపక్ష నేతలు, పలు ప్రజా, పౌరసంఘాలు అభ్యుదయ, సామాజిక శక్తులు, కవులు కళాకారులు, మేధావులు పాల్గొన్నారు .

 

20:41 - September 24, 2015

కోల్ కతా : క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షునిగా సౌరభ్ గంగూలీ అనూహ్యంగా ఎన్నికయ్యారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో బీసీసీఐ ప్రెసిడెంట్ రేస్ లో ఇక సౌరబ్ గంగూలీ కూడా నిలిచారు.

 

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షునిగా గంగూలీ

కోల్ కతా : క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షునిగా సౌరభ్ గంగూలీ అనూహ్యంగా ఎన్నికయ్యారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో బీసీసీఐ ప్రెసిడెంట్ రేస్ లో ఇక సౌరబ్ గంగూలీ కూడా నిలిచారు.

 

20:38 - September 24, 2015

కర్నూలు : ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్రౌన్‌షుగర్‌ అలవాటుచేసే ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల శివారు ప్రాంతమైన ఐటిసి కంపెని వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు బ్రౌన్‌షుగర్‌ తరలిస్తున్న 16మంది సభ్యులుగల ముఠాను పోలీసులు అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 500 గ్రాముల బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 25లక్షల రూపాయలపైనే ఉంటుందని అంటున్నారు. తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5మంది సభ్యులు.. అలాగే నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన 11మంది ముఠాగా ఏర్పడి... నంద్యాలలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్రౌన్ షుగర్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

20:35 - September 24, 2015

ఢిల్లీ : పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తర్వలోనే కృష్ణా, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. అలాగే ప్రపంచబ్యాంక్‌ ర్యాంకింగ్‌లో రెండోస్థానంలో ఉన్నట్లు సీఎం వెల్లడించారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పెద్దలు సుముఖంగా ఉన్నారని.. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకానియనని చంద్రబాబు చెప్పారు.

20:19 - September 24, 2015

మెగా వృక్షం నుంచి జారిపడ్డ మరో లేటెస్ట్ లేత పండు అయిన సాయి ధరం తేజ్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనేర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్... సాయి ధరం తేజ్, రెజీనా కసండ్రా, అదా శర్మ హీరో హీరొయిన్ లుగా...నాగ బాబు, సుమన్, బ్రన్హానందం, కోట శ్రీనివాసులు రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో మిక్కి జె మేయర్ సంగీత సారధ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన క్రేజీ చిత్రం... సుబ్రహ్మణ్యం ఫర్ సేల్...
ఫ్లస్ పాయింట్స్
సాయి ధరమ్ తేజ్
కామెడీ సీన్స్
సినిమాటోగ్రఫీ
కలర్ ఫుల్ మేకింగ్
మైనస్ పాయింట్స్
పాత కథ
బలం లేని ప్రధాన పాత్రలు
ఎడిటింగ్
సంగీతం
టెన్ టివి రేటింగ్... 2/5
విశ్లేషణ కోసం వీడియో చూడండి...

 

20:09 - September 24, 2015

విజయవాడ : సంచలనం సృష్టించిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో విచారణ వేగవంతమైంది. ఈ దాడిపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శర్మ విచారణ ప్రారంభించారు. విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శర్మబృందం విచారణ ప్రారంభించింది. ఈ విచారణకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మార్వో వనజాక్షి హాజరయ్యారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపిన తర్వాత.. వివరాలు వెల్లడించనున్నారు.

20:07 - September 24, 2015

 

తిరుపతి : ఏపికి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేయడం లేదని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరోసారి చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు.. ఏపికి ప్యాకేజీ సైతం అడుగుతున్నామని వారు తెలిపారు. దేశం గర్వించేలా ఏపి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో మంత్రలు పాల్గొన్నారు. పొగాకు రైతులకు క్వాంటాకు రెండు వేల రూపాయల సబ్సిడీని ఇస్తున్నట్లు మంత్రి పత్తిపాటి తెలిపారు. రాజధాని నిర్మాణానికి జపాన్‌, సింగపూర్‌ దేశాలు ముందుకొచ్చినట్లు మంత్రి నారాయణ చెప్పారు. 

19:07 - September 24, 2015

ఢిల్లీ : బెజవాడలో రాజకీయాలు మారుతున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేరుతారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబుతో లగడపాటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

చంద్రబాబుతో లగడపాటి భేటీ..

ఢిల్లీ : బెజవాడలో రాజకీయాలు మారుతున్నాయి. ఢిల్లీలో సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. లగడపాటి టీడీపీలో చేరుతారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. గత కొంతకాలంగా లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఈనేపథ్యంలో చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

18:48 - September 24, 2015

గుంటూరు : పట్టణంలో దీక్ష చేపట్టేందుకు.. వైసిపి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే గుంటూరు రేంజ్‌ ఐజీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు కలిశారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామన్న వైసిపి నేతలు.. జగన్‌ దీక్షకు అనుమతి ఇవ్వాలని సంజయ్‌ని కోరారు. ఒకవేళ పోలీసులు దీక్షకు అనుమతించపోయినా... ఈనెల 26న ఏసీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లోనే జగన్‌ తప్పుకుండా దీక్ష చేస్తారని... ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం కావాలనే దీక్షను అడ్డుకుంటోందని బొత్స అన్నారు.

18:22 - September 24, 2015

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా టీడీఎఫ్‌ ఈనెల 30న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈమేరకు హైదరాబాద్ లో 'చలో అసెంబ్లీ' పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ శృతి, సాగర్‌లను కేసీఆర్ ప్రభుత్వం అకారణంగా హత్య చేయించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

18:18 - September 24, 2015

కృష్ణా : జిల్లాలోని నందిగామ మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బకాయిలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న సుబాబుల్‌ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులను బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సుబాబుల్‌ రైతులను పోలీసులు ఈడ్చేశారు. మహిళా రైతులను కూడా బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఎస్‌పీఎం పేపర్‌ మిల్లు తమకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అరెస్ట్‌కు నిరసనగా రైతులు నినాదాలు చేశారు.

 

18:07 - September 24, 2015

మారిపోతున్న ఆహారపుటలవాట్లు అనేక కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సమస్యలలో ఒకటి దంత సమస్య. మరి దంత సమస్యలు రాకుండా చిన్న వయసు నుండే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, బ్రషింగ్ లో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

17:59 - September 24, 2015

పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అమ్మానాన్నలు కోరుకుంటారు.. పుట్టీ పుట్టగానే తమ ప్రతిరూపాలను చూసుకుని మురిసిపోతారు.. ఆ బిడ్డ ఎదిగే ప్రతిదశలోనూ ఆరోగ్యంగా ఉండాలని, ఆడుతూ పాడుతూ పెరగాలని కోరుకుంటారు.. కానీ, వివిధ కారణాలతో, అనేకమందిమంది చిన్నారులు రకరకాల మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి చిన్నారులందరికీ అనేక వైద్య సేవలను అందిస్తోంది స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్..
స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్..
అనేకానేక సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎన్నెన్నో సంస్థలు పుట్టుకొస్తాయి.. కొన్ని సంస్థలు కొంతకాలమే ఆ నిబద్ధతతో పనిచేస్తాయి.. మరికొన్ని ఇంకొంత కాలం వాటిని కొనసాగించగలుగుతాయి.. కానీ అతి కొన్ని సంస్థలు మాత్రమే సుదీర్ఘ కాలం పాటు తన సేవలు అందిస్తూ, సంస్థను అభివృద్ధి పరుచుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ముందుకుసాగుతాయి..అలా విస్తరించిన అతికొద్ది సంస్థల్లో స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి..
వ్యక్తుల శక్తియుక్తులపై బలమైన వ్యవస్థల పునాదులు 
వ్యక్తులెప్పుడూ వ్యవస్థల్లో ఒక భాగం మాత్రమే.. అయితే అలాంటి వ్యక్తుల శక్తియుక్తుల మీదే  బలమైన వ్యవస్థల పునాదులు ఆధారపడి ఉంటాయి.. అటువంటి బలమైన పునాదులతోనే ఆ వ్యవస్థ , తిరిగి అనేకమంది వ్యక్తులకు ప్రయోజనాన్ని కలిగించేలా వృద్ధి చెందుతుంది.. .... స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్  సెంటర్ అలాంటి పరస్పర ఆధారితంగా , సామాజిక ప్రయోజనంతోనూ  ముందుకు సాగుతోంది.. ఎందరి జీవితాల్లోనో వెలుగులునింపుతోంది..
వివిధ రంగాల్లో సేవలు
స్వీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్  సెంటర్ వివిధ విభాగాలల్లో సేవలు అందిస్తూనే, మరోపక్క అనేక రంగాల్లో సమాజానికి అవసరమైన సేవకులను తయారు చేస్తోంది.. అనేక ప్రత్యేకతలతో రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రత్యేకతను సాధించింది..


 

17:47 - September 24, 2015

సౌదిఅరేబియా : మక్కాలో మరోసారి పెను విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్తనాదాలు, ఆహాకారాలతో మక్కా మార్మోగుతోంది. రోదనలు మిన్నంటుతున్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనబడుతున్నాయి. మక్కాలోని పవిత్ర హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాట ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈదుర్ఘటనలో ఇప్పటి వరకు 453 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 మంది భారతీయులున్నారు. తొక్కిసలాటలో హైదరాబాద్ ఎల్ బి నగర్ నివాసి.. షేక్ జానిబీ మృతి చెందారు. ఆమెతోపాటు వెళ్లిన మరో ముగ్గురికి స్వల్పగాం గాయపడ్డారు. వీరు మజీద్, రసూఫ్ లు గుర్తించారు. ఆమె మృత దేహాన్ని మాక్కాలోని భద్రపరిచారు. ఈనెల 2న హజ్ యాత్రకు షేక్ జానిబీతోపాటు మరో ముగ్గురు మక్కా వెళ్లారు. వీరి కాకుండా సుమారు 1500 మంది హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లారు. సైతాన్‌ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడడంతో... ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డ వారి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో.. దాదాపు 20 లక్షల మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి. పదిహేను రోజుల్లో ఇది రెండో దుర్ఘటన.
వివరాల్లోకి వెలితే...
ప్రతి సంవ్సతరం ముస్లీంలు మక్కాలోని హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఈఏడాది కూడా భారత్ తోపాటు వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. హజ్ యాత్రలో దాదాపు 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే ముస్లీంలకు ఇవాళా పవిత్రమైన రోజు. దీంతో అక్కడ భారీ ఎత్తును ప్రార్థన చేస్తారు. అనంతరం మక్కా దగ్గర మీనా అనే ప్రాంతంలో సైతాన్ ను గులకరాళ్లతో కొట్టే ఆచారం ముస్లీంలకు ఉంటుంది. నేపథ్యంలో ఈరోజు కూడా సైతాన్ ను గులకరాళ్లతో కొట్టేందుకు భారీగా ముస్లీంలు ఎగబడ్డారు. ఒక్కసారిగా అధికసంఖ్యలో వచ్చే సరికి తొక్కిసలాట జరిగింది. దీంతో దీంతో 453 మంది మృతి చెందారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అక్కడి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వందలాంది అంబులెన్స్ లతో క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 13 మంది భారతీయులున్నారు. తొక్కిసలాటలో హైదరాబాద్ ఎల్ బి నగర్ నివాసి.. షేక్ జానిబీ మృతి చెందారు. ఆమెతోపాటు వెళ్లిన మరో ముగ్గురికి స్వల్పగాం గాయపడ్డారు. వీరు మజీద్, రసూఫ్ లు గుర్తించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. యాత్రలో 1లక్షా 36 వేల మంది భారతీయులున్నారు. అయితే హజ్ యాత్రలో తొక్కిసలాట జరగడం మృతి చెండడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సారి తొక్కిసలాట జరుగుతుంది. భారీ సంఖ్యలో ముస్లీంలు మృతి చెందుతున్నారు.
క్రేన్ కూలిన ఘటన..
ఈనెల 12న క్రేన్ కూలిన ఘటనలో 107మంది మృత్యువాత పడ్డారు. గ్రాండ్ మసీద్ వద్ద... యాత్రికుల ఏర్పాట్ల కోసం తీసుకొచ్చిన క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో.. ఈ ప్రమాదం జరిగింది. అది జరిగిన 12రోజులకే ఇవాళ మరో పెను విషాదం చోటు చేసుకుంది. హజ్ యాత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2006లో మక్కాలోని మీనా వద్ద జరిగిన తొక్కిసలాటలో 360 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు 8 అంతస్తుల భవనం కూలి 73 మంది యాత్రీకులు మరణించారు. 2004లో మీనా వద్ద భక్తుల రద్దీ కారణంగా 244 మంది మృత్యువాత పడ్డారు. 2001లో జరిగిన తొక్కిసలాటలో 35 మంది, 1998లో మీనా వద్ద జరిగిన ఘటనలో180 మంది చనిపోయారు. 1997లో యాత్రీకులున్న టెంట్‌కు నిప్పంటుకుని 340 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది హజ్‌ యాత్రీకులు మృతి చెందారు.

ఏపీ భవన్ లో బాబు మీడియా సమావేశం..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ లో గురువారం సాయంత్రం ఆరు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ పర్యటన అనంతరం ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. 

బాబుకు సీపీఎం నేత మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు లేఖ రాశారు. సుబాబుల్ రైతులకు బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో మధు కోరారు. సుబాబుల్ బకాయిల కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ఎదురు చూపులు చూస్తున్నారని తెలిపారు. వారు నందిగామలో ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 

మలేషియా టౌన్ షిప్ తో ఏపీ సర్కార్ ఒప్పందం..

విజయవాడ : మలేషియా టౌన్ షిప్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ మంత్రులు..ఐఏఎస్ ల నివాసం కోసం టౌన్ షిప్ లో విల్లాలు..అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 245 అపార్ట్ మెంట్లు, 26 విల్లాలు అద్దెకు తీసుకోనుంది. నవంబర్ 1 వరక నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని ప్రభుత్వం కోరింది. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 25,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 7,896 వద్ద ముగిసింది.

17:21 - September 24, 2015

ఖమ్మం : జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం తెల్దారుపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వీరయ్య అనే ఉపాధ్యాయుడు విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం అందింది. దీనిపై ఆరా తీసిన విద్యార్ధుల తల్లిదండ్రులకు అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహోద్రిక్తులైన విద్యార్ధుల తల్లి దండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

సోమ్ నాథ్ ఎక్కడున్నారో తెలుసు - జాయింట్ పోలీసు కమిషనర్..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి ఎక్కడున్నారో తెలుసని ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. ఒక ప్రొఫెషనల్..క్రిమినల్ గా ఆయన స్థావరాలు మారుస్తున్నారని తెలిపారు. 

స్వామి దయానంద్ కు నివాళి అర్పించిన సీఎం హరీష్ రావత్..

ఉత్తారాఖండ్ : రిషికేశ్ గురువు స్వామి దయానంద్ భౌతికకాయాన్ని సీఎం హరీష్ రావత్ సందర్శించి నివాళులర్పించారు. 

తెలంగాణ ప్రజా స్వామ్య వేదిక ఏర్పాటు..

హైదరాబాద్ : తెలంగాణ ప్రజా స్వామ్య వేదిక ఏర్పాటైంది. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాలు ప్రకటించాయి. వామపక్షాలు, ప్రజా, పౌర సంఘాలు, అభ్యుదయ శక్తులతో తెలంగాణ ప్రజా స్వామ్య వేదిక ఏర్పడింది. వేదిక ద్వారా బూటకపు ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఈ నెల 30న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రకటించారు.

 

మక్కా ఘటనపై మోడీ..సోనియా విచారం..

ఢిల్లీ : మక్కాలో జరిగిన ఘోర దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలియచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కేంద్ర మంత్రి ఉమా భారతితో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ఉమా భారతితో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని చంద్రబాబుకు ఉమాభారతి హామీనిచ్చారు. 

మక్కా మృతులు 453 మంది..

సౌదీ అరేబియా : మక్కా మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 453 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో 13 మంది భారతీయులున్నట్లు సమాచారం. 

కాగజ్ నగర్ పేపర్ మిల్లు వివాదంపై సమీక్ష..

హైదరాబాద్ : కాగజ్ నగర్ పేపర్ మిల్లు వివాదంపై సచివాలయంలో సీఎస్ తో మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోనప్ప, అధికారులు సమావేశమయ్యారు. 

నాంపల్లి హజ్ హౌస్ లో కంట్రోల్ రూం..

హైదరాబాద్ : మక్కాలో మృతి చెందిన యాత్రికుల సమాచారం కోసం నాంపల్లిలోని హజ్ హౌస్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ 040-2321 4125.

మక్కా మృతుల్లో హైదరాబాద్ మహిళ..

హైదరాబాద్ : గురువారం మక్కా వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో 310 మంది మృతి చెందారు. ఇందులో హైదరాబాద్ మహిళ కూడా ఉంది. ఎల్ బినగర్ కు చెందిన షేక్ బీబీజా ఊపిరాడక చనిపోయినట్లు తెలిసిందని హజ్ అధికారి పేర్కొన్నారు. 

16:26 - September 24, 2015

సౌదిఅరేబియా : మక్కాలో మరోసారి పెను విషాదం చోటు చేసుకుంది. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈదుర్ఘటనలో ఇప్పటి వరకు 717 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. సుమారు 805 మందికి పైగా గాయపడ్డారు. సైతాన్‌ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడడంతో... ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డ వారి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో.. దాదాపు 20 లక్షల మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి. పదిహేను రోజుల్లో ఇది రెండో దుర్ఘటన.
వివరాల్లోకి వెలితే...
ప్రతి సంవ్సతరం ముస్లీంలు మక్కాలోని హజ్ యాత్రకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి మక్కాను దర్శించుకోవడం, ప్రార్థనంలు చేయడం గొప్పగా, పవిత్రంగా భావిస్తారు. ఈనేపథ్యంలో ఈఏడాది కూడా భారత్ తోపాటు వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. హజ్ యాత్రలో దాదాపు 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే ముస్లీంలకు ఇవాళా పవిత్రమైన రోజు. దీంతో అక్కడ భారీ ఎత్తును ప్రార్థన చేస్తారు. అనంతరం మక్కా దగ్గర మీనా అనే ప్రాంతంలో సైతాన్ ను గులకరాళ్లతో కొట్టే ఆచారం ముస్లీంలకు ఉంటుంది. నేపథ్యంలో ఈరోజు కూడా సైతాన్ ను గులకరాళ్లతో కొట్టేందుకు భారీగా ముస్లీంలు ఎగబడ్డారు. ఒక్కసారిగా అధికసంఖ్యలో వచ్చే సరికి తొక్కిసలాట జరిగింది. దీంతో 717 మంది మృతి చెందారు. మరో 805 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అక్కడి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 220 అంబులెన్లను ఏర్పాటు చేసింది. 4 వేల మంది రెస్క్యూటీం సహాయక చర్యల్లో ఉంది. అన్ని దేశాల అంబసీ అప్రమత్తంగా అయ్యారు. వందలాంది అంబులెన్స్ లతో క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. యాత్రలో 1లక్షా 36 వేల మంది భారతీయులున్నారు.
ఎపిని నుంచి వెళ్లిన ప్రయాణికులు క్షేమం
ఎపిని నుంచి వెళ్లిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు హజ్ కమిటీ చైర్మన్ హబీద్ రసూల్ ఖాన్ తెలిపారు. అయితే తెలంగాణ,  భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన ప్రయాణికుల యోగక్షేమాల సమాచారం  ఇప్పటివరకు తెలియరాలేదు. కాగా  నేపథ్యం చూస్తే భద్రత వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. అయితే హజ్ యాత్రలో తొక్కిసలాట జరగడం మృతి చెండడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సారి తొక్కిసలాట జరుగుతుంది. భారీ సంఖ్యలో ముస్లీంలు మృతి చెందుతున్నారు. 
క్రేన్ కూలిన ఘటన..
ఈనెల 12న క్రేన్ కూలిన ఘటనలో 107మంది మృత్యువాత పడ్డారు. గ్రాండ్ మసీద్ వద్ద... యాత్రికుల ఏర్పాట్ల కోసం తీసుకొచ్చిన క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో.. ఈ ప్రమాదం జరిగింది. అది జరిగిన 12రోజులకే ఇవాళ మరో పెను విషాదం చోటు చేసుకుంది. హజ్ యాత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2006లో మక్కాలోని మీనా వద్ద జరిగిన తొక్కిసలాటలో 360 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు 8 అంతస్తుల భవనం కూలి 73 మంది యాత్రీకులు మరణించారు. 2004లో మీనా వద్ద భక్తుల రద్దీ కారణంగా 244 మంది మృత్యువాత పడ్డారు. 2001లో జరిగిన తొక్కిసలాటలో 35 మంది, 1998లో మీనా వద్ద జరిగిన ఘటనలో180 మంది చనిపోయారు. 1997లో యాత్రీకులున్న టెంట్‌కు నిప్పంటుకుని 340 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది హజ్‌ యాత్రీకులు మృతి చెందారు.

 

16:01 - September 24, 2015

గుంటూరు : ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ వేణుగోపాలరావు బదిలీ అయ్యారు.. పీజీహెచ్‌లో పలు అవకతవకలు బయటకురావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సూపరిండెంట్‌గా రాజునాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.. రాజు నాయుడు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌గా సుబ్బారావును నియమించారు.

 

15:57 - September 24, 2015

సౌదిఅరేబియా : మక్కాలో మహా విషాదం నెలకొంది. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 220 కి చేరింది. 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే మరో 100 మందికి పైగా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటు సమాచారం. ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కాగా గత 15 రోజుల్లో ఇది రెండో ఘటన.
వివరాల్లోకి వెలితే...
ముస్లీంలు ఇవాళా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకోసం అయితే ప్రతి సంవ్సతరం ముస్లీంలు మక్కాలోని హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఈఏడాది కూడా భారత్ తోపాటు వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. హజ్ యాత్రలో దాదాపు 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే ముస్లీంలకు ఇవాళా పవిత్రమైన రోజు. దీంతో అక్కడ భారీ ఎత్తును ప్రార్థన చేస్తారు. అనంతరం మక్కా దగ్గర మీనా అనే ప్రాంతంలో సైతాన్ ను గులకరాళ్లతో కొట్టే ఆచారం ముస్లీంలకు ఉంటుంది. నేపథ్యంలో ఈరోజు కూడా సైతాన్ ను గులకరాళ్లతో కొట్టేందుకు భారీగా ముస్లీంలు ఎగబడ్డారు. ఒక్కసారిగా అధికసంఖ్యలో వచ్చే సరికి తొక్కిసలాట జరిగింది. దీంతో దీంతో 220 మంది మృతి చెందారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అక్కడి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వందలాంది అంబులెన్స్ లతో క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ముస్లీంలు హజ్ యాత్రకు వెళ్లారు. యాత్రలో 1లక్షా 36 వేల మంది భారతీయులున్నారు. అయితే హజ్ యాత్రలో తొక్కిసలాట జరగడం మృతి చెండడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సారి తొక్కిసలాట జరుగుతుంది. భారీ సంఖ్యలో ముస్లీంలు మృతి చెందుతున్నారు. 1994 నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
క్రేన్ కూలిన ఘటన..
ఈనెల 12న క్రేన్ కూలిన ఘటనలో 107మంది మృత్యువాత పడ్డారు. గ్రాండ్ మసీద్ వద్ద... యాత్రికుల ఏర్పాట్ల కోసం తీసుకొచ్చిన క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో.. ఈ ప్రమాదం జరిగింది. అది జరిగిన 12రోజులకే ఇవాళ మరో పెను విషాదం చోటు చేసుకుంది. హజ్ యాత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2006లో మక్కాలోని మీనా వద్ద జరిగిన తొక్కిసలాటలో 360 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు 8 అంతస్తుల భవనం కూలి 73 మంది యాత్రీకులు మరణించారు. 2004లో మీనా వద్ద భక్తుల రద్దీ కారణంగా 244 మంది మృత్యువాత పడ్డారు. 2001లో జరిగిన తొక్కిసలాటలో 35 మంది, 1998లో మీనా వద్ద జరిగిన ఘటనలో180 మంది చనిపోయారు. 1997లో యాత్రీకులున్న టెంట్‌కు నిప్పంటుకుని 340 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది హజ్‌ యాత్రీకులు మృతి చెందారు.

మక్కా హెల్ప్ లైన్ నెంబర్లు..

ఢిల్లీ : మక్కాలో జరిగిన ఘెర దుర్ఘటనలో 310 మంది మృతి చెందారు. మృతుల, క్షతగాత్రుల వివరాలను తెలుసుకొనేందుకు అక్కడి ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు తెలియచేసింది. 0096125458000, 00966125496000 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

మక్కా ఘటనపై పర్యవేక్షణ – నఖ్వీ..

ఢిల్లీ : మక్కా ఘటనపై పర్యవేక్షణ చేస్తున్నామని కేంద్ర మంత్రి నఖ్వీ పేర్కొన్నారు. మక్కాలో జరిగిన ఘటన విషాదకరమని, ఈ ఘటనలో భారతీయులకు ప్రమాదం జరిగిందనేది వార్తలు తెలియలేదన్నారు. 

నిర్మల సీతారామన్ తో ముగిసిన బాబు భేటీ..

విజయవాడ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన భేటీ ముగిసింది. పోగాకు కొనుగోళ్లు, నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అపెరల్ పార్కు ఏర్పాటు తదితర అంశాలపై వారు చర్చించారు. 

దీక్షకు అనుమతి లేదు - రేంజ్ ఐజీ..

గుంటూరు : ఏసీ కాలేజీ గ్రౌండ్ లో వైసీపీ దీక్షకు అనుమతించమని జిల్లా రేంజ్ ఐజీ సంజయ్ స్పష్టం చేశారు. నగర శివారులో ఉన్న మార్కెట్ యార్డు ప్రాంతంలో లేదా గోరంట్ల ప్రాంతంలో గాని దీక్షా స్థలం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశ్యంతో దీక్షా స్థలాన్ని మరోచోటికి మార్చుకోవాలని, బాధ్యత కలిగినటువంటి నేతలకు తాము చేసిన విజ్ఞప్తిని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. 

ప్రభుత్వం వద్దని అనుకుంటే ఎన్ కౌంటర్లు ఉండవు - వరవరరావు..

హైదరాబాద్ : ప్రభుత్వం వద్దని అనుకుంటే ఎన్ కౌంటర్ లు ఉండవని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ బాధ్యులపై హత్యానేరం నమోదు చేయాలని వరవరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్ కౌంటర్ లు జరగవని ఆశించినట్లు ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు.

ఏసీ కళాశాల ఆవరణలోనే జగన్ దీక్ష – బోత్స..

గుంటూరు : ఏసీ కళాశాల ఆవరణలోనే జగన్ దీక్ష జరుగుతుందని వైసీపీ నేత బోత్స నారాయణ స్పష్టం చేశారు. ఐజీ సంజయ్ కు వైసీసీ బృందం తేల్చిచెప్పింది. పోలీసులకు అన్ని విధాల సహకరిస్తామని, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబే దీక్ష చేయాలని బోత్స సూచించారు. 

15:17 - September 24, 2015

కృష్ణా : విజయవాడలో టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పింఛన్ల మంజూరు విషయంలో వైసిపి కార్పొరేటర్ బహదూర్, టిడిపి 14 వ డివజన్ అధ్యక్షులు రమేష్ ల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువురు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

తెలంగాణ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మక్కాలో యాత్రికులు మరణించడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. హజ్ యాత్రకు వెళ్లిన తెలంగాణ యాత్రికుల యోగ క్షేమాల గురించి తెలుసుకోవాలని మైనార్టీ సంక్షేమ కార్యదర్శి ఉమర్ జలీల్ కు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. 

30న చలో అసెంబ్లీ - తమ్మినేని..

హైదరాబాద్ : వామపక్షాలు, ప్రజా, పౌర సంఘాలు, అభ్యుదయ శక్తులతో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేదిక ద్వారా బూటకపు ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ 30న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాలు మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. శృతి సాగర్ లను హింసించి హత్య చేశారని, విమర్శలు భరించలేక కేసీఆర్ నియంతలా వ్యవమరిస్తున్నారని విమర్శించారు. 

 

ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష...

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష జరిపారు. ఉద్యోగుల కోసం అక్టోబర్ రెండో తేదీ నుండి నిమ్స్ తో సహా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ క్లినిక్ లు ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్నాం రెండు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపీ క్లినిక్ లు పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇన్ పేషెంట్లపై ఆసుపత్రి హెచ్ వోడీలకు నిర్ణయాధికారం ఉంటుందని, కల్తీ కల్లు బాధితులకు ఆసుపత్రుల్లో అన్ని సేవలందిస్టున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పుకొచ్చారు. 

వేణుగోపాల చారి పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం..

ఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి తోసిపుచ్చారు. విభజన చట్టం హామీలు నెరవేర్చేలా కేంద్రానికి సూచనలివ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. విభజన చట్టం అమలు కాకపోతే రాష్ట్రాలే కేంద్రాన్ని అడుగుతాయని ధర్మాసనం పేర్కొంది. చట్టం అమలుపై జోక్యం చేసుకోలేమని, కేంద్రాన్ని డిమాండ్ చేసే హక్కు రాష్ట్రానికి ఉందని తేల్చిచెప్పింది. 

హజ్ తొక్కిసలాటలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

సౌదీ అరేబియా : హజ్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 220 మంది మృతి చెందారు. మరో 500 మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. 15 రోజుల వ్యవధిలో రెండో ఘటన. గత 12వ తేదీన క్రేన్ కూలిన ఘటనలో 107 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వేణుగోపాల్ రావును బదిలీ అయ్యారు. పీజీహెచ్ లో పలు అవకతవకలు వెల్లడైన నేపథ్యంలో వేణుగోపాల్ రావును బదిలీ చేశారు. కొత్త సూపరింటెండెంట్ గా గుంటూరు వైద్య కళాశాల ప్రిన్స్ పాల్ గా రాజు నాయుడు విధులు నిర్వరిస్తున్న రాజునాయుడు నియమితులయ్యారు. వైద్య కళాశాలకు నూతన ప్రిన్స్ పాల్ గా సుబ్బారావును నియమించారు. 

రాబోయే కాలంలో 50శాతానికి సౌరశక్తి - చంద్రబాబు..

ఢిల్లీ : రాబోయే కాలంలో 50 శాతానికి సౌరశక్తి ఉత్పత్తిని పెంచుతామని ఏపీ సీఎ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో తయారయ్యే సౌరశక్తిలో ఏపీ వాటా పది శాతంగా ఉందన్నారు. 

14:59 - September 24, 2015

గుంటూరు : వైసిపి అధినేత జగన్‌ దీక్షా స్థలంపై వివాదం కొనసాగుతోంది. ఏసీ కాలేజీ గ్రౌండ్స్‌లో సభకు అనుమతివ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా ఏర్పాట్లు చేస్తుండటంతో వాటిని అధికారులు తొలగించారు. ప్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించి పక్కన పెట్టారు. ప్రత్యామ్నాయ స్ధలం చూసుకోవాలా లేదా అక్కడే దీక్ష కొనసాగించాలా అనేదానిపై వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. అయితే దీక్షాస్థలాన్ని మార్చేది లేదని జగన్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాలని స్థానిక నేతలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ వివాదంతో గుంటూరులో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

14:54 - September 24, 2015

ఢిల్లీ : విభజనచట్టంలో పేర్కొన్న హామీలపై నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఈనెలలో నిధుల విడుదలతో పాటు స్పెషల్‌ కంపెన్‌సెట్‌ ప్యాకేజీ ఇవ్వొచ్చన్న సంకేతాలు వెలువడినట్లు తెలిపారు. స్పెషల్‌ స్టేటస్‌, స్పెషల్‌ ప్యాకేజీ, ఇంటిగ్రేటేడ్‌ డెవలప్‌మెంట్‌ ప్యాకేజీలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 

14:50 - September 24, 2015

ఎవరో చెప్పుకోండి చూద్దాం..అంటూ హీరో 'రామ్' ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఎవరబ్బా కొద్దిసేపు ఆలోచిన ప్రేక్షకులు కరెక్టుగానే సమాధానం చెప్పారు. 'రామ్' ఇలా పోస్టు చేశాడో లేదో వెంటనే అది 'నువ్వేనంటూ' సమాధానం చెప్పేశారు. ఓ ఫొటోగ్రాఫర్ 'రామ్' ఫొటోను ఇలా డిజైన్ చేశాడు. అది బాగా నచ్చిన 'రామ్' సోషల్ సైట్ లో పోస్టు చేశాడు. ఇక ఇతను నటిస్తున్న 'శివమ్' అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై 'రామ్' ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి అతని ఆశలు నెరవేరుతాయా ? లేదా ? అన్నది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాలి. 

14:43 - September 24, 2015

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అనునిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక చోట స్వైన్ ఫ్లూ కేసులు బయటపడుతున్నాయి. ఫ్లూతో జనం విలవిలలాడుతున్నారు. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫ్లూ మళ్లీ విజృంభించింది. తాజాగా స్వైన్ ఫ్లూ మరో ఇద్దరిని బలి తీసుకుంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సత్యనారాయణ చికిత్స పొందుతూ చనిపోయారు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌కు చెందిన 13 ఏళ్ల స్వాతిబాయి ఈరోజే మృతి చెందింది.

 

14:30 - September 24, 2015

సౌదిఅరేబియా : మక్కాలో మహా విషాదం నెలకొంది. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 150 మృతి చెందారు. 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రలలో అత్యవసర పరిస్థితి విధించారు. కాగా గత 15 రోజుల్లో ఇది రెండో ఘటన. గత నెల 12న క్రేన్ ఘటనలో 107 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

 

మక్కాలో తొక్కిసలాట 100 మంది మృతి..

సౌదీ అరేబియా : మక్కాలో మరో ఘోరం చోటు చేసుకుంది. గురువారం నాడు జరిగిన తొక్కిసలాటలో సుమారు వంద మంది మృతి చెందగా మరో 390 మందికిపైగా గాయపడ్డారు. 

13:54 - September 24, 2015

గుంటూరు : అమరావతిలో అధికారులకు వసతి ఏర్పాట్లు చేసే దిశగా ఏపి సర్కార్‌ ముందుకు వెళ్తోంది. మరి కాసేపట్లో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు వసతి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ సమీక్షకు ఆర్ధిక శాఖతో పాటు జీఏడీ అధికారులు, ఫ్లాట్‌ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమీక్షలో ఫ్లాట్ సేకరణతో పాటు అద్దె వంటి అంశాలపై విధివిధానాలు ఖరారయ్యే అవకాశం కన్పిస్తోంది.

13:53 - September 24, 2015

హైదరాబాద్ : ఇళ్లిళ్లూ తిరుగుతారు. మూడు కాళ్ల ముసలమ్మకు ఊతకర్రగా నిలుస్తారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి తామున్నామనే భరోసా కల్పిస్తారు. పిల్లలకు ఎలాంటి టీకా మందులిప్పించాలో తపన పడే తల్లులకు దిక్సూచిలా మారుతారు.

మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించగలిగినట్టు....

వీరు ఇళ్లిళ్లూ తిరిగి అందిస్తున్న సేవల కారణంగా మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించగలిగినట్టు కేంద్ర ప్రభుత్వమే ఘనంగా ప్రకటించిన సందర్భాలనేకం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకు సంసిద్ధులను చేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. చాలెంజ్‌లు స్వీకరించడమే కాదు.. వాటిని సక్సెస్ చేయడంలోనూ ఆశాల సేవలు అనిర్వచనీయమైనవి.

వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలోనూ.....

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలోనూ, ప్రాణాంతకమైన అయిదు జబ్బులను నిర్మూలించడంలోనూ ఆశాలు పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. సాంకేతికంగా వీరిది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగమే అయినా, ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులతో సమానంగా పనులు చేయిస్తున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు. ఇంతగా శ్రమిస్తున్నా తమకు నిర్ణీత వేతనం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.....

ఇక వీరికిచ్చే పారితోషకం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంతమందిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ఒప్పించారు? ఎంతమంది గర్భిణులకు టీకాలు వేయించారు? అన్న లెక్కల ఆధారంగానే వీరికి పారితోషకం లభిస్తుంది. నెలరోజులు శ్రమిస్తే కనీసం వెయ్యి రూపాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు.

ప్రతి టార్గెట్‌ను ఛేదించడంలో ఆశా వర్కర్లే కీలక పాత్ర .....

వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించే ప్రతి టార్గెట్‌ను ఛేదించడంలో ఆశా వర్కర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాము టార్గెట్లు సాధిస్తున్నా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తి సమయం వెచ్చించి పనిచేస్తున్నా, కనీస వేతనం ఇవ్వకపోవడం ఎంత వరకు ధర్మమన్నది ఆశాల ఆవేదన. ఈ ఆవేదనే వీరిని సమ్మె మార్గం పట్టించింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.  

13:50 - September 24, 2015

కరీంనగర్ : జిల్లాలో జ్వరాలు జడిపిస్తున్నాయి. వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్‌ మండలాలను వణికిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరైనా రోగాల బారిన పడి మంచంపడుతున్నారు. వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన మల్లేశం.. అదే గ్రామానికి చెందిన మరో మహిళ డెంగ్యూతో మరణించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందని మెరుగైన వైద్య సేవలు.....

బతుకు జట్కాబండిని లాగలేక సతమవుతున్న పేదలను...పులిమీద పుట్రలా విషజ్వరాలు మరింత కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన రోగులకు..సరైన వైద్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకెళ్లే ఆర్థిక స్తోమత లేక మృత్యువాత పడుతున్నారు. కళ్లముందు కాటికి చేరుతున్న వారిని చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందని మెరుగైన వైద్య సేవలు....

విషజ్వరాల అదుపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన వైద్యాధికారులు.. డెంగ్యూ కేసులు నామమాత్రమే అంటూ తేలికగా కొట్టిపారేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణంపై భయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 

13:48 - September 24, 2015

తూ.గో : కాకినాడలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఘనంగా ప్రకటించారు. హార్ట్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోతాయని ఊదరగొట్టారు. ఉద్యోగాలు, ఉపాధికి కొదవే ఉండదని మైకుల తుప్పు వదిలేలా స్పీచులిచ్చారు. ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన కేంద్ర పెద్దలు ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. హార్డ్‌ వేర్‌ పార్క్‌ కాకినాడలో ఏర్పాటు చేస్తారో లేదో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఏడాదిగా ఎందురు చూస్తున్న యువకులు...

కేంద్ర ప్రకటనతో యువకులు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కళ్లలో ఒత్తులెసుకుని మరీ నిరీక్షిస్తున్నారు. ఎదురుచూసి..ఎదురుచూసి వారు నిరసించిపోతున్నారు. కానీ ఏ ఒక్కరూ కనిపించడం లేదు. మాట ఇచ్చిన ఏలికలు కానీ, హడావుడి చేసిన అధికారులు గానీ దర్శనం ఇవ్వడం లేదు.

తొలిబడ్జెట్‌లో కాకినాడకు వరాలు.....

మోదీ సర్కార్‌ ఏర్పాటు అయ్యాక ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్‌లో కాకినాడకు వరాలు కురిపించింది. హార్డ్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇది తమ ప్రభుత్వం ఘనతే అని చంద్రబాబు ప్రభుత్వం కూడా గొప్పగా ప్రచారం చేసుకుంది.

అరచేతిలో వైకుంఠం చూపించారు......

నవ్యాంధ్ర నిర్మాణంలో కాకినాడకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. హార్డ్‌వేర్‌ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. హార్డ్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటుతో కాకినాడ పేరు ప్రపంచస్థాయికి వెళ్తుందని భావించారు. ఎగుమతులు, దిగుమతులు పెరగడమే కాకుండా సాఫ్ట్‌వేర్, హార్డ్‌ వేర్ ఆధారిత పరిశ్రమలు కూడా వెలుస్తాయనుకున్నారు. కానీ ఇవన్నీ నీటి మీద రాతల్లానే కనిపిస్తున్నాయి. రాను రాను కాకినాడ ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయి.

హార్డ్‌వేర్‌ ప్రకటించి ఏడాది గడిచినా....

హార్డ్‌వేర్‌ ప్రకటించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు కనీసం పునాదిరాయి కూడా పడకపోవడంతో కాకినాడ ప్రజలను అనుమానాలు వెంటాడుతున్నాయి. హార్డ్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటులో ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు కాకినాడలోనే ఏర్పాటు చేస్తారా లేక వేరే ప్రాంతానికి తరలిస్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటకు కట్టుబడి కాకినాడలో హార్డ్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని తూర్పు గోదావరి జిల్లా వాసులు కోరుతున్నారు. 

13:45 - September 24, 2015

ముంబై : మున్నాభాయ్‌కు ఆశాభంగం కలిగింది. క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్న సంజయ్‌దత్‌కు నిరాశే ఎదురైంది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్‌ క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు తిరస్కరించారు. 

13:44 - September 24, 2015

హైదరాబాద్ : ముంబై వరుస పేలుళ్ల కేసులో 8మంది దోషులకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ మోకా కోర్టును కోరింది. ఈ కేసులో దోషులుగా ఉన్న మరో నలుగురికి యావజ్జీవ శిక్ష విధించాలని విన్నవించింది. ఈ నెల 30న వీరికి శిక్షలు ఖరారు చేయనుంది.

2006 జూలై 11న ముంబైలో వరుస పేలుళ్లు....

2006 జులై 11న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి వరుస పేలుళ్ల కేసు తీర్పు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని దోషులుగా తేల్చిన ముంబయిలోని మోకా కోర్టు..ఈనెల 30న దోషులకు శిక్షలను ఖరారు చేయనుంది.

పేలుళ్లలో 189 మంది మృతి....

ముంబయి వరస బాంబు పేలుళ్లలో 189 మందిని పొట్టన పెట్టుకున్న దోషులకు కఠిన శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. ఈ కేసులో దోషులుగా ఉన్న 8 మందికి మరణశిక్ష, మరో నలుగురికి యావజ్జీవ శిక్ష విధించాలని విన్నవించింది. 60 ఏళ్లకు తగ్గకుండా వారి శిక్ష ఉండాలని ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఈ కేసులోని దోషుల్లో ఇంతవరకు ఎలాంటి మార్పు రాలేదని...భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం లేదని ప్రాసిక్యూషన్‌ తెలిపింది. వారు చేసిన పనికి కించిత్తు కూడా పశ్చాత్తాపడటం లేదని,,వారు రక్త పిపాసులని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ థాకరే కోర్టుకు విన్నవించారు. సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టించేందుకే ఈ నేరం చేశారని తెలిపారు. వారి అనారోగ్యం, సామాజిక-ఆర్ధిక నేపథ్యం, విద్య, కుటుంబ పరిస్థితులను ఎలాంటి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దని థాకరే వాదించారు.

2006, జులై 11న వరుస పేలుళ్లు....

2006 జూలై 11న ముంబయి సబర్బన్ రైళ్లలో బాంబులను పేల్చారు. నిమిషాల వ్యవధిలోనే 7సార్లు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 189మంది మరణించగా.. 800మందికిపైగా గాయాలపాలయ్యారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, లష్కరే తోయిబా తీవ్రవాదులు ఈ ఘాతుకానికి వ్యూహ రచన చేశారని..ఈ కేసును దర్యాప్తు చేసిన మహారాష్ట్ర ATS అధికారులు తేల్చారు.

13మందిని అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు....

కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగింది. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు.. మొత్తం 13 మందిని అరెస్ట్‌ చేయగా.. 12మంది దోషులుగా తేలారు. వీరిలో.. కమల్ అహ్మద్ అన్సారీ, తన్వీర్ అహ్మద్ అన్సారీ, ఫైజల్ షేక్, సిద్దిఖి, మహమ్మద్ మాజిద్‌ షఫి, షేక్‌ ఆలం, మహమ్మద్‌ సాజిద్‌ అన్సారీ, ముజ్జామ్మిల్ షేక్‌, సొహైల్ మెహమూద్ షేక్, జమీర్‌ అహ్మద్ షేక్, నవీద్‌ హుస్సేన్ ఖాన్, ఆసిఫ్‌ ఖాన్‌వున్నారు. వీరంతా భారతదేశంలో నిషేధానికి గురైన సిమీ ఉగ్రవాద గ్రూపునకు చెందిన సభ్యులే. పేలుళ్ల ప్లాన్‌లో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత వహించారు. 2006లో ముంబైలో నరమేథం సృష్టించిన దోషులకు ఎలాంటి శిక్షలు పడతాయనేది ఈనెల 30న తేలనుంది. 

13:41 - September 24, 2015

హైదరాబాద్ : రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే అని మరోసారి నిరూపించాడు బేయర్న్‌ మ్యునిక్‌ స్ట్రైకర్‌ ...రాబర్ట్‌ లెవాండోస్కీ. బండెస్‌లీగాలో ఓల్ఫ్స్‌బర్గ్‌ జట్టుతో ముగిసిన లీగ్‌ మ్యాచ్‌లో పోలిష్‌ ప్లేయర్‌...బేయర్న్‌ మ్యునిక్‌ నయా స్ట్రైకర్‌ లెవాండోస్కీ పెద్ద సంచలనలమే సృష్టించాడు.బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన లెవాండోస్కీ ......

ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన లెవాండోస్కీ ....ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 గోల్స్‌ కొట్టి చరిత్రను తిరగరాశాడు. అలియాంజ్‌ ఎరీనా వేదికగా జరిగిన ఈ లీగ్‌ మ్యాచ్‌లో ఆట 50వ నిమిషం వరకూ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమైన బేయర్న్‌ మ్యునిక్‌ జట్టు 0-1 గోల్స్‌తో వెనుకబడింది.ఆ తర్వాతి నుంచి రాబర్ట్‌ లెవాండోస్కీ షో మొదలైంది. 51వ నిమిషం నుంచి లెవాండోస్కీ అదరగొట్టడంతో సీన్‌ ఒక్కసారిగా రివర్సైంది. బ్యాక్‌ టు బ్యాక్ గోల్స్‌తో హోంగ్రౌండ్‌ ఫ్యాన్స్‌ను అలరించాడు.

51వ నిమిషంలో థామస్‌ ముల్లర్‌ ఇచ్చిన పాస్‌ను......

51వ నిమిషంలో థామస్‌ ముల్లర్‌ ఇచ్చిన పాస్‌ను....సునాయాసంగా గోల్‌ కొట్టి ఓల్ఫ్స్‌బర్గ్‌ జట్టు ఆధిక్యాన్ని సమం చేశాడు. 53వ నిమిషంలో రెండో గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. మరో నిమిషం తర్వాత లెవాండోస్కీ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. వరల్డ్‌ కప్‌ హీరో మ్యారియో గోట్జా ఇచ్చిన పాస్‌ను....ఓల్ఫ్స్‌బర్గ్‌ డిఫెండర్లు, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి మరీ మూడో ప్రయత్నంలో గోల్‌ కొట్టి వారెవ్వా...అనిపించాడు. హ్యాట్రిక్‌ పూర్తైన తర్వాత కూడా లెవాండోస్కీ....ఎక్కడా తగ్గలేదు. 57వ నిమిషంలో పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో....మెరుపు వేగంతో నాలుగో గోల్‌ కొట్టి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

60వ నిమిషంలో మరో కళ్లు చెదిరే గోల్‌తో.....

60వ నిమిషంలో మరో కళ్లు చెదిరే గోల్‌తో తనదైన స్టైల్‌లోనే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. మ్యారియో గోట్జా ఇచ్చిన పాస్‌ను....మెరుపు వేగంతో అందుకున్న లెవాండోస్కీ కళ్లు చెదిరే సైడ్‌ వోలీ కిక్‌తో గోల్‌ పోస్ట్‌లోకి షూట్‌ చేసి ఔరా అనిపించాడు. గాల్లో ఎగురుతూ లెవాండోస్కీ కొట్టిన ఈ యాక్రోబ్యాటిక్ వోలీ కిక్‌ టోటల్‌ మ్యాచ్‌కై హైలైట్‌గా నిలిచిపోయింది. బేయర్న్‌ మ్యునిక్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన లెవాండోస్కీ....ఈ ఫీట్‌తో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బండెస్‌ లీగా చరిత్రలో ఫాస్టెస్ట్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో పాటు......ఇదే లీగ్‌లో అతి తక్కువ సమయంలోనే 5 బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా రికార్డులు బద్దలు కొట్టాడు.

5 గోల్స్‌ తాను ఒక్కడినే కొట్టానంటే నమ్మలేకపోతున్నా.....

ఇదంతా కలలా ఉందని.....5 గోల్స్‌ తాను ఒక్కడినే కొట్టానంటే నమ్మలేకపోతున్నానని మ్యాచ్‌ అనంతరం లెవాండోస్కీ సంబరపడిపోతూ చెప్పాడు. కేవలం నాలుగు నిమిషాల్లోనే హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టిన లెవాండోస్కీ.....కేవలం 9 నిమిషాల్లోనే 5 గోల్స్‌ కొట్టి చరిత్ర సృష్టించాడు.బండెస్‌ లీగాలో గత 24 ఏళ్లుగా మైఖేల్‌ టోయెన్నీస్‌ పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న ఫాస్టెస్ట్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ రికార్డ్‌ను రాబర్ట్‌ బద్దలు కొట్టాడు. కేవలం 9 నిమిషాల్లోనే 5 గోల్స్‌ కొట్టి అందరినీ ఆశ్చర్యపరచిన లెవాండోస్కీ.....ప్రస్తుతం ఫుట్‌బాల్‌ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారాడు. 

గాంధీలో స్వైన్ ప్లూతో ఇద్దరు మృతి..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో ఇద్దరు రోగులు మృతి చెందారు. అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సత్యనారాయణ, హైదరాబాద్ నేరెడ్ మెట్ కు చెందిన స్వాతి బాయి (13) మృతి చెందారు. 

ప్రత్యేక ప్యాకేజీపై సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం - సుజనా..

ఢిల్లీ : నేడు నీతి ఆయోగ్ సమావేశం జరుగనుందని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, ఆర్థిక లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీపై సాయంత్రంలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి సృజనా చౌదరి పేర్కొన్నారు. అలాగే ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు సమావేశంలో రాష్ట్రాభివృద్దికి బ్యాంకులు, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేసేలా అంశంపై చర్చించడం జరిగిందన్నారు. ట్యాక్స్ కలెక్షన్, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఆర్థిక అభివృద్ధి బోర్డు పని చేస్తుందని మంత్రి సుజనా చౌదరి తెలిపారు. 

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన వైసీపీ నేతలు..

గుంటూరు : రేంజ్ ఐజీ సంజయ్ ను వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బోత్సలు కలిశారు. జగన్ దీక్షకు ఏసీ కాలేజీ ఉల్పాహాల్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నందున అనుమతినివ్వాలని వారు కోరారు. 

విజయవాడలో ఘర్షణ పడిన టీడీపీ, వైసీపీ నేతలు..

విజయవాడ : నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్సణ చోటు చేసుకుంది. వైసీపీ కార్పొరేటర్ బహదూర్, టీడీపీ 14వ డివిజన్ అధ్యక్షుడు రమేష్ మధ్య ఘర్షణ చెలరేగింది. ఫించన్ల మంజూరు వ్యవహారాంలో ఈ గొడవ జరిగింది. 

బుగ్గాలపాలెంలో రైతులతో వామపక్ష నేతల సమావేశం..

కృష్ణా : మచిలీపట్నం (మం) బుగ్గాలపాలెంలో పోర్టు బాధిత రైతులతో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు రైతుల నుండి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే రైతులు సహకరించాలని కోరారు. 

నిర్మలా సీతారామన్ తో బాబు భేటీ..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించాలని చంద్రబాబు కోరారు. 

స్వామి దయానంద గిరికి నివాళులు..

ఉత్తరాఖండ్ : స్వామి దయానంద గిరి భౌతికకాయానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆయన రిషికేశ్ లోని ఆశ్రమంలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. స్వామి దయానంద గిరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గురువు అన్న సంగతి తెలిసిందే. 

కొమరావడలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

విజయనగరం : కొమరావడ (మం) పాతకల్లికోటలో పిడుగుపాటు ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు దుర్గారావు, గౌరమ్మలుగా గుర్తించారు. 

నల్గొండను కరవు జిల్లాగా ప్రకటించాలి - జూలకంటి..

నల్గొండ : జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో 170 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 76 మందినే గుర్తించడం సరికాదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా కావాలంటే తామిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజా సమస్యలు చర్చకు రావాలంటే శాసనసభను 20 రోజుల పాటు సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. 

రాజధానిలో ఐఏఎస్, మంత్రుల నివాసాలపై యనమల సమీక్ష..

విజయవాడ : ఏపీ రాజధానిలో ఐఏఎస్, మంత్రుల నివాసాలపై మంత్రి యనమల సమీక్ష నిర్వహించారు. ఐజేఎంకు చెందిన రెయిన్ ట్రీ పార్కు 250 ప్లాట్లను ప్రభుత్వం అద్దెకు తీసుకొంటోంది.

 

నిలిచిపోయిన పినాకిని ఎక్స్ ప్రెస్..

విజయవాడ : పట్టాల మరమ్మత్తుల కారణంగా పినాకిని ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. నెల్లూరు జిల్లా దొరవారిపత్రం వద్ద రైలును నిలిపివేశారు. విజయవాడ నుండి చైన్నైకి పినాకి ఎక్స్ ప్రెస్ వెళుతోంది. 

 

జోగిపేట సబ్ ట్రెజరరీ కార్యాలయం ఫైర్ ఆక్సిడెంట్..

మెదక్ : జోగిపేట సబ్ ట్రెజరరీ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పలు పైళ్లు దగ్ధమయ్యాయి.

 

 

12:57 - September 24, 2015

ముంబాయి : బాలీవుడ్ నటులు జూహీ చావ్లా, అనీల్ కపూర్ లకు బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు నటుడు జితేంద్ర, గాయకుడు అమిత్ కుమార్ గంగూలీలకు కూడా నోటీసులు అందచేశారు. ఇటీవల దేశంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఎంసీ అధికారులు పలు నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్ల తనిఖీలు చేసి అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లకు నోటీసులు అందచేస్తున్నారు. అందులో భాగంగా ముంబైలోని జూహీ, మలబార్ హిల్ లో వారి ఇళ్ల వద్ద డెంగ్యూ కారక దోమలు వచ్చేందుకు పరిసరాలు ఉన్నందువల్లే వాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా లేకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

12:57 - September 24, 2015

హైదరాబాద్ : సినీ తారలు.. యాడ్స్‌లో నటించే ముందు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. భారీగా డబ్బులు వచ్చేస్తాయి కదా అని.. ఇష్టానుసారంగా యాడ్స్‌లో నటించేస్తే.. తర్వాత తీరిగ్గా విచారించాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న అమితాబ్‌ తన తప్పిదానికి నాలుక కరుచుకుంటే.. తాజాగా కేరళ స్టార్‌ మమ్ముట్టి.. ఏకంగా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.

సబ్బు యాడ్ వివాదంలో.....

సినీ తారల చర్మ సౌందర్య సాధనం మా సబ్బేనంటూ ఊదరగొట్టే యాడ్స్‌ మనకు తెలుసు. ఫలానా సబ్బు వాడండి.. లేదా ఫలానా క్రీమ్‌ వాడండి.. అచ్చు నాలాగే మీ చర్మమూ నిగనిగలాడుతుందంటూ తారలు యాడ్స్‌లో నటిస్తూ చెప్పడమూ చూశాము. ఒక్క సౌందర్య సాధనాలే అనేంటి.. నూడుల్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఇలా ప్రతి వస్తువునూ సినీతారలు ప్రమోట్‌ చేస్తుంటారు. అభిమాన తారలు యాడ్స్‌ రూపంలో చెప్పే మాటలతో ప్రభావితమై వీరాభిమానులు.. సదరు వస్తువులను కొనడమూ.. ఆయా సంస్థల రెవిన్యూ గణనీయంగా పెరగడమూ తెలిసిందే. అయితే.. ఇకపై యాడ్స్‌లో నటించే ముందు తారలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చేతికి భారీ మొత్తం వస్తోందా లేదా అన్న అంశమే క్రైటీరియాగా.. తారలు యాడ్స్‌లో నటిస్తున్నారు. ఇంతకాలం బాగానే సాగింది కానీ.. ఇప్పుడు వీరు పెద్ద చిక్కుల్లోనే పడుతున్నారు. తాజాగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఇలాగే ఇరుక్కున్నాడు.

కోర్టు మెట్లెక్కెని ముమ్ముట్టి...

మమ్ముట్టి కేరళలో ఉత్పత్తి అయ్యే ఓ సబ్బుల సంస్థ రూపొందించిన వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఈ సబ్బు వాడితే మూడు వారాల్లో ఊహించని తెల్లదనం మీ సొంతమంటూ ఊదరగొట్టాడు. ఇంకేముందీ.. జనం వేలం వెర్రిగా ఆ సబ్బును కొనడం ప్రారంభించారు. ఇదే తరహాలో మమ్ముట్టి చెప్పిన సబ్బును ఏడాది పాటు వాడిన వినియోగదారుడు... తన ముఖవర్చస్సులో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. ఏకంగా కోర్టు మెట్లెక్కాడు. దీంతో మమ్ముట్టి కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

ముమ్మూటీలాగానే తెలుగు హీరోలూ...

మమ్మూటీలాగానే తెలుగు హీరోలూ చాలా యాడ్స్‌లో నటిస్తున్నారు. మహేష్ బాబు సంతూర్ సబ్బుల యాడ్‌లోను, జూనియర్ ఎన్టీఆర్ నవరత్న ఆయిల్, అల్లు అర్జున్ క్లోజప్, అఖిల్, రామ్ చరణ్‌లు శీతల పానీయాలను ప్రమోట్‌ చేస్తూ యాడ్స్‌లో యాక్ట్‌ చేశారు. కేవలంలో యాడ్‌లో నటిస్తే సరిపోదు.. భవిష్యత్తులో వినియోగదారులు సదరు ప్రోడక్ట్‌పై అభ్యంతరం చెబితే.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా హీరోలపై ఉంటుందని మమ్ముట్టి ఘటన ప్రూవ్‌ చేసింది. మొన్నామధ్యన మ్యాగీ వివాదంలో అమితాబ్‌పైన, గతంలో ఓ శీతలపానీయాల యాడ్‌కు సంబంధించి చిరంజీవిపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

రూ.18కోట్లు వదులుకున్న పవన్‌కల్యాణ్‌.....

సెలబ్రెటీలు ఏం చెబితే మెజారిటీ జనం దాన్నే ఫాలో అవుతారు. ఒకవేళ అటూ ఇటూ అయితే గొడవ అన్న కారణంతో.. కొందరు సెలెబ్రిటీలు యాడ్స్‌లో నటించేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ మధ్యన నటి కంగనారౌనత్.. మూడు కోట్ల రూపాయల విలువైన ఆఫర్‌ వచ్చినా.. ఓ కంపెనీ యాడ్‌ను వదులుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా.. ఓ శీతల కంపెనీ ఏడాదికి ఆరు కోట్లు చొప్పున మూడేళ్లకు 18 కోట్ల ఆఫర్‌ ఇచ్చినా కాదన్నాడు. మొత్తానికి ప్రకటనల్లో పాల్గొంటున్న సెలెబ్రిటీలు సదరు సంస్థ ఉత్పత్తులకూ బాధ్యత వహించాల్సి వస్తోంది. 

12:49 - September 24, 2015

నిజామాబాద్ : జిల్లా ఆర్మూరు పట్టణానికి తాగునీరు అందించేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. సంవత్సరం లోపు మంచినీళ్లు అందిస్తామని తానే వచ్చి నల్లా తిప్పుతానని సీఎం కేసీఆర్‌.. తాగునీటి పథకం ఆవిష్కరణ సభలో గొప్పగా చెప్పారు. అయితే కాంట్రాక్టర్ జాప్యం...అధికారుల నిర్లక్షంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో సంవత్సరం గడిచినా పనుల తీరు..ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ఏడాదిలో కేవలం 33 శాతం పనులు పూర్తి......

సంవత్సరం లోపు పనులు పూర్తి చేస్తామని స్వయనా సీఎం చెప్పడంతో... పట్టణ వాసుల్లో ఆశలు చిగురించాయి. తాగునీటి కష్టాలు తీరుతాయని సంబరపడ్డారు. ఇప్పటివరకు కేవలం 33 శాతం పనులే పూర్తి కావడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.

114 కోట్లు మంజూరు చేసిన వరల్డ్‌ బ్యాంక్‌....

ఆర్మూరుకు తాగునీటి సరఫరా కోసం వల్డ్‌ బ్యాంక్‌ 114 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా కంపనీ... పనులు చేపట్టింది. గతేడాది ఆగస్టు 7న సీఎం కేసీఆర్‌ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి ఆర్మూరుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. 19 కిలోమీటర్ల దూరం మెయిన్ పైపులైన్ వేయాల్సి ఉండగా..14 కిలొమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. పట్టణంలో మొత్తం 106 కిలొమీటర్లకు గాను... 33 కిలోమీటర్లు మాత్రమే పైప్‌లైన్ వేశారు. టీచర్స్ కాలనీలొ 4.50.లక్షల లీటర్ల సామర్ద్యం కలిగిన ట్యాంకులు నిర్మిస్తున్నారు. బాల్కొండ గుట్టమీద నీటి శుద్ది ట్యాంక్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆర్మూర్‌ వాసుల తాగునీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

12:47 - September 24, 2015

గుంటూరు :అమరావతి క్యాపిటల్‌ను వరల్డ్ క్లాస్‌సిటీగా నిర్మించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం విషయంలో పారదర్శకతతో కూడిన అధునాతనమైన సమాచార వ్యవస్థ రూపొందించేందుకు రెడీ అవుతోంది.

కీలక ఘట్టాలను ఘనంగా ఆవిష్కరించేందుకు వ్యూహాలు....

రాజధాని నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? కీలక భవనాలు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు. వాటి పురోగతి ఎలా ఉంది? తదితర వివరాలను భూములిచ్చిన రైతులు సహా వివిధశాఖల అధికారులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ఉద్యోగార్థులు, పర్యాటకులకు.. ఎప్పటికప్పుడు తెలియచేసేలా కమ్యూనికేషన్ వ్యూహం ఉండాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీంతోపాటు రాజధాని నిర్మాణంలోని కీలక ఘట్టాలను ఎప్పటికప్పుడు ఘనంగా ఆవిష్కరించడం ద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా అన్నివర్గాల్లో ఆసక్తి పెంచేలా కార్యాచరణ ఉండాలని భావిస్తోంది.

అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పనకు కసరత్తు ......

ఇక అమరావతికి ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణంపై అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించి ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నారు. ఈ విధమైన సమగ్ర, అంతర్జాతీయస్థాయి కమ్యూనికేషన్ స్ట్రాటజీని రూపొందించేందుకు ఎంపిక చేసిన సంస్థ రెండేళ్లపాటు సీఆర్డీఏతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైతే కాలవ్యవధిని మరో ఏడాది పొడిగిస్తారు. ఒకవేళ సదరు సంస్థ పనితీరు నిరాశాజనకంగా ఉన్నట్లైతే మూడు నెలల నోటీసుతో తొలగిస్తారు. మొత్తం మీద అంతర్జాతీయస్థాయిలో అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ తన శాయశక్తుల ప్రయత్నాలు ప్రారంభించింది. మరి సీఆర్డీఏ అధికారుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 

గాంధీ క్యాంటీన్ పై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసంతృప్తి..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సందర్శించారు. అక్కడున్న పారిశుధ్యంపై ఆరా తీశారు. గాంధీ క్యాంటీన్ లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడున్న లోపాలపై కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ, కుళ్లిన ఆహారాన్ని క్యాంటీన్ లో పెడుతున్నారని ఆరోపించారు. తక్షణమే క్యాంటీన్ ను సీజ్ చేయాలని, గాంధీ ఆసుపత్రిలో పారిశుధ్య లోపంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

12:43 - September 24, 2015

చిత్తూరు : తిరుమలలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కౌస్తుభం అతిధి గృహంలో బస ఏర్పాట్లు చేసుకున్న తమిళనాడు కాంచీపురానికి చెందిన ఇద్దరు మహిళలకు మత్తు మందు ఇచ్చి నగలు,నగదు చోరి చేశారు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.

 

రంగారెడ్డిలో మళ్లీ ప్రబలిన అతిసార..ఒకరు మృతి..

రంగారెడ్డి : జిల్లాలోని బంట్వారం (మం) బోప్నారంలో అతిసార ప్రబలింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 24 మంది అస్వస్థతకు గురి కావడంతో వీరిని కామినేని ఆసుపత్రికి తరలించారు. 

12:41 - September 24, 2015

గుంటూరు : నగరంలో జగన్‌ దీక్షా స్ధలంపై వివాదం కొనసాగుతోంది. ఏసీ కాలేజీ గ్రౌండ్స్‌లో సభకు అనుమతివ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా ఏర్పాట్లు చేస్తుండటంతో వాటిని అధికారులు తొలగించారు. ప్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించి పక్కన పెట్టారు. ప్రత్యామ్నాయ స్ధలం చూసుకోవాలా లేదా అక్కడే దీక్ష కొనసాగించాలా అనేదానిపై వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. అయితే దీక్షాస్థలాన్ని మార్చేది లేదని జగన్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాలని స్థానిక నేతలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ వివాదంతో గుంటూరులో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆరుగురు శ్రీలంక వాసుల అరెస్టు..

కోచి : ఆరుగురు శ్రీలంక వాసులను కోచి పోలీసులు అరెస్టు చేశారు. మున్నాబమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ప్రయత్నించారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో నలుగురు భారతీయ ఏజెంటన్లు కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.

12:29 - September 24, 2015

సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కబాలీ'పై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. డిఫరెంట్ గెటప్ లో ఉన్న 'రజనీ' చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' మోషన్ పోస్టర్ రిలీజైంది. డార్క్ షేడ్ లో ఉన్న 'కబాలి' రెండో లుక్ తోనే మోషన్ పోస్టర్ రెడీ చేశారు. ప్రస్తుతం చెన్నైలో 'కబాలి' షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అయిపోయాక 40 రోజుల భారీ షెడ్యూల్ కోసం మలేషియా వెళ్లబోతోంది 'కబాలి' టీమ్. ఈ సినిమాలో 'రజనీ' సరసన 'రాధికా ఆప్టే' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కబాలీశ్వరన్ అనే వయసు మీద పడ్డ డాన్ పాత్రను పోషిస్తున్నాడని టాక్. 'రజని' ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. ఒకటి డాన్ పాత్ర అయితే.. ఇంకోటి పోలీస్ క్యారెక్టర్ అని టాక్. 

బీహార్ లో మిస్ ఫైర్..జవానుకు గాయాలు..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఓ జవన్ తుపాకిని శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. దీనితో జవాను గాయపడ్డాడు. బుక్సర్ ప్రాంతంలోని ఐటీబీపీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

స్వదేశీ ఫర్నీచర్ తో యూపీ సర్కార్ ఒప్పందం..

ఉత్తర్ ప్రదేశ్ : స్వదేశీ ఫర్నీచర్ సంస్థతో యూపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఒప్పందాలను మార్చుకున్నారు. రాష్ట్రంలో స్వదేశీ ఫర్నీచర్ స్టోర్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది. 

దీక్ష స్థలంపై కోర్టుకు వెళ్లనున్న వైసీపీ..?

హైదరాబాద్ : ఏసీ కాలేజీ ఉల్ఫా గ్రౌండ్ లోనే దీక్ష చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు జగన్ ను కలిశారు. గుంటూరులోని ఉల్ఫా గ్రౌండ్ లో దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వైసీపీ కోర్టుకు వెళ్లానని భావిస్తోంది. పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

దీక్ష స్థలంపై వైసీపీ సమాలోచనలు..

హైదరాబాద్ : గుంటూరులో జగన్ దీక్ష స్థలంపై వైసీపీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఏసీ కాలేజీ ఉల్ఫా గ్రౌండ్స్ లోనే దీక్ష చేపట్టాలని నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అక్కడే దీక్ష చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాలని జగన్ సూచించినట్లు సమాచారం. 

ప్రతిభ కాలేజీ బస్సులో పొగలు..

ప్రకాశం : కందుకూరులో ప్రతిభ కాలేజీ బస్సులో పొగలు రావడంతో విద్యార్థులు కిందకు దూకారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

లక్ష్మీపురం ఉప సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

విశాఖపట్టణం : ముంచంగిపుట్టు ఏజేన్సీ సమీపంలో లక్ష్మీపురం ఉప సర్పంచ్ ధనుంజయ్, నీలకంఠలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. 

వీఆర్వోలను అడ్డుకున్న కొత్తపూడి గ్రామస్తులు..

కృష్ణా : మచిలీపట్నం కొత్తపూడిలో పోర్టు భూముల సర్వేకు వచ్చిన వీఆర్వోలను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. మంగినపూడి రహదారిపై ధర్నా నిర్వహించారు. 

వైద్య శాఖాధికారులతో లక్ష్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : వైద్య శాఖాధికారులతో గురువారం మంత్రి లక్ష్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

12:01 - September 24, 2015

గుంటూరు : ఎలుకలు, పాముల దాడులతో బిత్తరపోయిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఎట్టకేలకు రంగంలోకి దిగారు. 72 గంటల ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. మొత్తం ఆస్పత్రి అంతా శుభ్రం చేస్తున్నారు. శానిటేషన్ కు 50 మంది సిబ్బందిని కేటాయించి ప్రతి పది మందికి ఒక సూపర్ వైజర్ ను నియమించారు. జేసీ శ్రీధర్ కూడా అధికారులతో ఆపరేషన్ జీజీహెచ్ పై సమీక్షిస్తున్నారు. జీజీహెచ్ పునర్వైభవం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్ర మంత్రి కామినేని పరీశీలించనున్నట్లు సమాచారం. మరో సారి గతంలో జరిగిన ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మాజీ ఎంపీ లక్ష్మీకాంత్ ఇంట్లో సీబీఐ సోదాలు..

మధ్యప్రదేశ్ : వ్యాపమ్ కేసులో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని సిరోంజి ప్రాంతంలో ఉన్న మాజీ ఎంపీ లక్ష్మీకాంత్ శర్మ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

నేడు డీఈఆర్సీ టారీఫ్ ను ప్రకటించే అవకాశం..

ఢిల్లీ : డీఈఆర్సీ (న్యూఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) పవర్ టారీఫ్ ను నేడు ప్రకటించే అవకాశం ఉంది. పవర్ టారీఫ్ ను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

11:55 - September 24, 2015

మహబూబ్‌ నగర్‌ :  జిల్లాలో బంగారు పంట పండబోతోంది... కరువు కోరల్లో చిక్కిన ప్రాంతంలో.. ఖరీదు కట్టలేని పంట సాగులోకి రాబోతోంది... పాలమూరు ప్రజల పంట పండేలా వజ్రాల పంట పండబోతోంది... అవును, మహబూబ్‌ నగర్‌ జిల్లాను అంతులేని అదృష్టం వరించబోతోంది. అపార సంపదకు పాలమూరు జిల్లా కేరాఫ్ అడ్రస్ గా నిలవబోతుందని జిల్లా కడుపులో వెలకట్టలేని వజ్రాల గనులున్నాయని పరిశోధకలు స్పష్టం చేస్తున్నారు.

కృష్ణా నదితోపాటు, భీమా పరివాహక ప్రాంతాల్లో .....

కృష్ణా నదితోపాటు, భీమా పరివాహక ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ సైంటిస్టులు తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 21 ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. ప్రొఫెసర్‌ రాందాస్ నేతృత్వంలోని ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ అండ్ ఎక్స్‌ప్లొరేషన్ కేంద్రానికి చెందిన బృందం ఇటీవలే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించింది. పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ టీం.. వజ్రాల అడుగు జాడలను కనిపెట్టింది.

మహబూబ్‌ నగర్‌తో పాటు జిల్లాను ఆనుకొని ఉన్న.....

మహబూబ్‌ నగర్‌తో పాటు జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్ పరిధిలోని గ్రామాల్లో.. తక్కువలో తక్కువ రెండు డజన్ల వరకూ వజ్రాల జోన్లు ఉన్నట్టు గుర్తించారు. పాలమూరులోని నారాయణ్‌పేట్, గుర్మిట్కల్, అమ్మిరెడ్డిపల్లె, దామరగిద్ద, నిడుగుర్తి గ్రామాలతోపాటు, మక్తల్ నుంచి రాయచూర్ వరకు వజ్రాల గనులు విస్తరించి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని చోట్ల వీ ఆకారంలోనూ, మరికొన్ని చోట్ల క్యారెట్ ఆకారంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు తమ నివేదికలో పేర్కొన్నారు.

గతంలోనూ వజ్రాల లభ్యతపై మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశోధనలు....

ఇదిలాఉంటే.. గతంలోనూ వజ్రాల లభ్యతపై మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశోధనలు జరిగాయి. కానీ.. వజ్రాలు లభించడానికి ఆస్కారమున్న 21 జోన్లను గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. ఇదివరకు.. కృష్ణా -భీమా నదుల మధ్య, అదేవిధంగా కృష్ణా-తుంగభద్ర-పెన్నా నదుల మధ్య అక్కడక్కడా వజ్రాలు లభించే అవకాశమున్నట్టు గుర్తించారు. తాజాగా.. పరిశోధనలు చేపట్టిన ప్రొఫెసర్‌ రాందాస్‌ బృందం 1,999 చదరపు కిలోమీటర్ల పరిధిలో.. ఏరో మాగ్నెటిక్ అధ్యయనం నిర్వహించింది. భూగర్భంలో నాలుగు వందల నుంచి 1200 మీటర్ల మధ్యన వజ్రాల గనులు ఉన్నట్టు తేల్చారు. మరింత విస్తృతంగా పరిశోధనలు జరిపితే.. వెలకట్టలేని వజ్రాలను వెలికితీయొచ్చని ప్రభుత్వానికి అందించిన నివేదికలో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

కోహినూర్‌ వజ్రం మహబూబ్‌ నగర్‌లోనే దొరికిందనే ప్రచారం......

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో వజ్రాల గనులున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. గత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. వజ్రాల విపణిలో తనదైన ముద్ర వేసుకున్న గోల్కొండ కోటకు.. పాలమూరు నుంచే వజ్రాలు సరఫరా అయ్యేవనే ప్రచారం ఉంది. ప్రపంచంలోనే అద్భుతమైన వజ్రంగా గుర్తింపు పొందిన కోహినూరుతోపాటు, హోప్‌ డైమండ్‌ కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని మాగనూరు మండలం కొల్పూరు వద్ద కృష్ణానది తీరంలో లభించినట్లుగా స్థానికులు నమ్ముతారు. ఇక్కడి నుంచే ఆ వజ్రాలు గోల్కొండ కోటకు చేరాయని అంటారు. ప్రస్తుతం కోహినూర్‌ డైమండ్‌ ఎలిజబెత్ రాణి కిరీటంలో ఒదిగిపోగా, హోప్ డైమండ్ వాషింగ్టన్‌ మ్యూజియం చేరింది.

ప్రసిద్ధి చెందిన అనేక రత్నాలు ఇక్కడే....

వీటితోపాటు ప్రసిద్ధి చెందిన అనేక రత్నాలు ఇక్కడ లభ్యమయ్యాయి. గోల్కొండ కోటకు చేరిన వజ్రాల్లో అధిక శాతం.. మహబూబ్ నగర్, కర్ణాటక జిల్లాల పరిధిలో లభించినవని చెబుతుంటారు. గోల్కొండకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో వజ్రాల గనులు ఉండేవని, అక్కడి నుంచే వెలికితీసి హైదరాబాద్ లో రాసులుగా పోసి అమ్మేవారని వృద్ధులు చెబుతుంటారు. తాజా పరిశోధనలు సైతం నాటి విషయాలను ధృవీకరించడంతో... వజ్రాలు లభించడానికే ఎక్కువ అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

వజ్రాల కల సాకారమైతే..

వజ్రాల కల సాకారమైతే.. తమ కష్టాలు తొలగిపోతాయని పాలమూరు వాసులు ఆశపడుతున్నారు. కరువు కోరల్లో చిక్కిన మహబూబ్‌ నగర్‌.. వలస జిల్లాగా పేరుమార్చుకుంది. ఈ జిల్లా నుంచి లక్షలాది మంది ప్రజలు పొట్టకూటి కోసం దేశ, విదేశాలకు వలస వెళ్తుంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా వజ్రాలను వెలికితీస్తే జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కరువు పూర్తిగా నివారణ కాకున్నా.. కొంత వరకైనా వలస కష్టాలు తొలగిపోతాయని ఆశిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం స్పందించి, వజ్రాల వెలికితీతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

శాస్త్రవేత్తల పరిశోధనలు పాలమూరువాసుల్లో ఆశలు.....

మొత్తానికి.. శాస్త్రవేత్తల పరిశోధనలు పాలమూరువాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. బీడుభూముల్లో వజ్రాల పంటలు పండుతాయంటూ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన సరికొత్త కోరికలకు జీవం పోస్తోంది. మరి, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది..? మహబూబ్‌ నగర్‌ ప్రజల కోరికలు ఫలిస్తాయా..? లేదా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

11:52 - September 24, 2015

హైదరాబాద్ : దసరా వేడుకలను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని ప్రభుత్వం గతేడాది ఘనంగా ప్రకటించింది. కానీ, ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. మరో నెలరోజుల్లో దసరా ఉత్సవాలు రాబోతున్నాయి. పనులు ఇంకా ప్రారంభించలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తక్షణమే దసరా ఉత్సవాలను రాష్ర్ట పండుగగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బెజవాడ దసరా ఉత్సవాలు వస్తున్నాయంటే ఆ సందడే వేరు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దుర్గమ్మను దర్శించుకుంటారు. రాష్ర్టం నుంచే కాదు.. ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

దసరా ఉత్సవాలపై ప్రకటన చేయని ప్రభుత్వం......

గతేడాది కొత్త రాష్ర్టంలో తొలిసారిగా దసరా ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉత్సవాలను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని గొప్పగా చెప్పారు. అయితే.. 11 మాసాలు గడిచినా దసరా ఉత్సవాల ఊసే ఎత్తేడం లేదు. నెలరోజుల్లో 20 రోజుల పాటు విజయవాడలోనే పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి దసరా ఉత్సవాలపై ఎలాంటి రివ్యూ చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతవారం విజయవాడలో జరిగిన సమావేశంలో దసరాను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. జీఓ మాత్రం జనరల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంకా జారీ చేయలేదు.

అక్టోబర్‌ 13 నుంచి దసరా ఉత్సవాలు....

అక్టోబర్‌ 13 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండడంతో త్వరగా రాష్ర్ట ప్రభుత్వం దసరా ఉత్సవాలను రాష్ర్ట పండుగగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. 

11:49 - September 24, 2015

హైదరాబాద్‌ : మెట్రోరైల్. నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా ఉండటానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు. కాన్‌సెప్ట్ బాగానే ఉంది కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ప్రస్తుతం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. వాహనాల్లో బయటకు వెళ్తే చాలు అరగంటలో వెళ్లొస్తామనే గ్యారంటీ లేదు. గమ్యం అరగంట అనుకుంటే రెండుగంటలు పడుతోంది. అయినా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తే.....

హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తే నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. అందుకోసం సర్కార్ వేగంగా పనులు కూడా చేపడుతోంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే వాహనదారులకు ఎంత కంపర్టబుల్‌గా ఉంటుందోగాని ఇప్పుడు మాత్రం నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మెట్రో పనులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. ఈ పనుల వల్ల నగరంలో ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. బైక్‌పై వెళ్లినా...బస్సెక్కినా..కార్లలో వెళ్లినా.. గమ్యస్థానానికి చేరాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు....

ఇప్పుడున్న రోడ్లకు మరమ్మతులపై కూడా చేపట్టడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై అనేక గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే చాలు వీటిలో నుంచి బయటపడటమే గగనమవుతోంది. ఈమెట్రో పనులు చేపట్టే ముందే రహదారుల విస్తరణ కూడా జరగాలి. అయితే కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ కూడా జరగలేదు. ఈ సమస్యలపై అధికారులుగాని, పాలకులుగాని కనీసం జీహెచ్‌ఎమ్‌సీగాని దృష్టిపెట్టడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా...అధికారులు, పాలకులు స్పందించి నగరంలో ట్రాఫిక్‌జామ్‌ కాకుండా చర్యలు చేపట్టాలని విపక్షాలు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

11:46 - September 24, 2015

హైదరాబాద్ : బాలీవుడ్‌ హీరోయిన్‌..బిగ్‌బీ కోడలు ఐశ్వర్యాబచ్చన్‌ ముంబై సిద్ధివినాయక టెంపుల్‌లో సందడి చేశారు. తన కూతురు ఆరాధ్యతో పాటు వచ్చిన ఐశ్వర్య.. వినాయకుడికి పూజలు నిర్వహించారు.

 

వ్యాపమ్ కేసు..సీబీఐ తనిఖీలు..

ఉత్తర్ ప్రదేశ్ : వ్యాపమ్ కేసుకు సంబంధించి సీబీఐ బృందం 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లో ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. 

కోల్ కతాలో డెంగ్యూ వ్యాధితో చిన్నారి మృతి..

కోల్ కతా : డాక్టర్ బి.సి.రాయ్ ఆసుపత్రిలో ఐదు సంవత్సరాల చిన్నారి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. 

కొద్దిసేపట్లో ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశం..

ఢిల్లీ : ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశం కాసేపట్లో జరుగనుంది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈ భేటీ జరుగనుంది.

 

అమెరికాలో మోడీ..

అమెరికా : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రముఖ మీడియా, సాంకేతిక రంగ ప్రతినిధులతో మోడీ సమావేశం కానున్నారు. 25వ తేదీన ఐరాసలో సుస్థిరాభివృద్ధి సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు. 

తిరుమల అతిథి గృహంలో చోరీ..

తిరుమల : అతిథి గృహంలో దోపిడి దొంగలు ఇద్దరు మహిళలకు మత్తు మందు ఇచ్చి నగలు..నగదును తస్కరించారు. బాధితులు తమిళనాడులోని కాంచీపురం వాసులుగా గుర్తించారు. 

ఆపరేషన్ జీజీహెచ్..సిబ్బంది అత్యుత్సాహం..

గుంటూరు : ఆపరేషన్ జీజీహెచ్ లో సిబ్బంది అత్యుత్సాహం చూపారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెట్లను ఇష్టానుసారంగా నరికివేశారు. దీనితో చెట్ల కింద ఉన్న 70 వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు ధ్వంసం కావడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఓ చెట్టు కొమ్మ పడడంతో విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగింది. చెట్ల నరికివేతలో సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

నందిగామ మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత..

కృష్ణా : నందిగామ మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బకాయిలు చెల్లించాలని సుబాబుల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎస్టీఎం కంపెనీ రూ.9.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. మార్కెట్ యార్డులోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ కరు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ ప్రజాప్రతినిధులు..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణష్, ఎమ్మెల్సీ రామచంద్రయ్యలు సందర్శించారు. 

ఏసీబీకి చిక్కిన గుడివాడ వీఆర్వో..

విశాఖపట్టణం : రావికమతం (మం) గుడివాడ వీఆర్వో ఏసీబీకి చిక్కారు. రూ.50వేలు లంచం తీసుకుంటుడగా వీఆర్వో ముత్యాలును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

పోలీసుల ఆధీనంలో ఏసీ కాలేజీ మైదానం..

గుంటూరు : ఏసీ కాలేజీ మైదానాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈనెల 26వ తేదీన జగన్ చేపట్టదలిచిన దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. ఏపీఎస్పీ బెటాలియన్ తో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల పోలీసులను అధికారులు రప్పిస్తున్నారు. 

బందరులో వామపక్ష బృందం పర్యటన..

కృష్ణా : బందరులో వామపక్ష బృందం పర్యటించనుంది. పోర్టు బాధిత రైతులను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మదు, రామకృష్ణలు కలువనున్నారు. 

సంజయ్ దత్ క్షమాభిక్ష పటిషన్ తిరస్కరణ

హైదరాబాద్ : ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తనకు విధించబడ్డ శిక్షను పూర్తిగా అనుభవించాల్సిందేనని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తేల్చి చెప్పారు. సంజయ్ దత్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. తనను క్షమించాలని సంజయ్ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినట్టు అధికారులు వివరించారు. కాగా, ఈ కేసులో అక్రమ ఆయుధాలను ఉద్దేశపూర్వకంగా కలిగివున్నాడన్న ఆరోపణలు రుజువైన నేపథ్యంలో సంజయ్ కి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.

యువభేరీలో పాల్గొన్న ప్రొఫెసర్ పై వేటుకు రంగం సిద్ధం..

విశాఖపట్టణం : వైసీపీ యువభేరీలో పాల్గొన్న ఏయూ ప్రొఫెసర్ పై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రొ.ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

10:52 - September 24, 2015

గుంటూరు : తుళ్లూరు వాసులు.. విభిన్న దీక్షలకు దిగారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిసరాల్లో పాలకుల నిర్బంధాన్ని నిరసిస్తూ.. గృహ దీక్షలు చేపట్టారు. న్యాయం కోసం గొంతెత్తితే అణిచేస్తున్నారు.. ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.. రోడ్లపైకి వస్తే రచ్చ చేస్తున్నారంటూ లాఠీలతో చితక బాదుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. తుళ్లూరు పరిసర ప్రజలు.. ఇళ్లల్లోనే నిరసన దీక్షలు చేపట్టారు.

నమ్మి భూములు ఇస్తే....

నమ్మి భూములు ఇవ్వండి.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటానన్నారు.. చంద్రబాబు. నిజంగానే ఆయన్ను నమ్మి ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చారు. కానీ నెత్తిన పెట్టుకుంటానన్న బాబు సర్కారు.. ఇప్పుడు ప్రజల మాడు పగుల గొడుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు చెక్కులు ఇస్తామన్న హామీని నెరవేర్చకుండా.. పచ్చిగా మోసం చేసింది. అన్యాయం జరుగుతోందని.. న్యాయం కోసం గొంతెత్తితే.. నోట మాటరాకుండ కొట్టిస్తోంది ప్రభుత్వం. ఆందోళనలంటే ఆగ్రహంతో ఊగిపోతూ.. అక్రమ అరెస్ట్‌లు చేస్తోంది సర్కార్‌. దీంతో చేసేది లేక.. భూములిచ్చిన పాపానికి.. నోరెత్తలేక బాధితులంతా ఇలా ఇళ్లలోనే నిరసనలకు దిగారు.

అసైన్డ్‌, సీలింగ్‌ లబ్దిదారులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్‌.....

అసైన్డ్‌, సీలింగ్‌ భూముల లబ్దిదారులకు చెక్కులు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు బాధితులు. ల్యాండ్‌ ఇచ్చిన వారికి ప్రభుత్వం చెక్కులు ఇవ్వకపోడంతో.. కుటుంబం గడవక చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. పూటగడవం కూడా కష్టంగా ఉందని.. రైతులమైన తాము.. కూలీలుగా వలసలు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ చెక్కులు ఇంకా ఇవ్వకపోవడంతో... వచ్చే వంద రూపాలతో కుటుంబమంతా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

తమను సర్కారు మోసం చేసిందంటున్న బాధిత మహిళలు.....

దాదాపు 5నెలల నుంచి చెక్కుల కోసం తిప్పించుకుంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో చెక్కులు బాగానే ఇచ్చినా.. తర్వాత చెక్కులు ఇవ్వడం మానేశారని అంటున్నారు. ప్రభుత్వం నెలకు ఇస్తున్న 2వేల 5వందలు సరిపోవడం లేదని... ఉన్న పొలాలను అధికారులు తీసుకోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పైగా ఉపాధి పనులు చూపిస్తామని చెప్పి.. తీరా ఎవ్వరూ నోరెత్తడం లేదని.. ధర్నాలు చేస్తుంటే అరెస్ట్‌ చేస్తున్నారని.. మా ఆకలి మంటను తీర్చేదెవరని ప్రశ్నిస్తున్నారు.

తమ గోడు వినేవారికోసం ఎదురు చూస్తున్న బాధితులు......

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నా.. ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని వాపోతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో... కుటుంబం గడవడం కష్టంగా ఉందంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

10:47 - September 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చైనాకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలను సీఎం కేసీఆర్‌ కోరారు. చైనాకు చెందిన అంజు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌, రాడిక్ కన్సల్టెంట్స్‌, బ్రిడ్జి డిజైనింగ్ విభాగాధిపతి తదితరులు సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు. రహదారులు, బ్రిడ్జిలు, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌ కార్యక్రమంతో పాటు మూసీనదిపై 42 కిలోమీటర్ల 6 లేన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను సీఎం వివరించారు. 

10:44 - September 24, 2015

హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన కొనసాగిస్తున్నారు. అమెరికాకు వెళ్లే మార్గమధ్యంలో ఐర్లాండ్‌ను సందర్శించారు. దాదాపు ఐదు గంటలపాటు గడిపిన మోదీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించటానికి మద్దతివ్వాలని ఐర్లాండ్‌ను కోరారు. అణు సరఫరాదారుల బృందంతోపాటు ఇతర అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణ విధానాల్లోనూ భారత్‌కు సభ్యత్వం కల్పించటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐర్లాండ్‌లో పర్యటించిన మోదీ డబ్లిన్‌లో ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీతో చర్చలు జరిపారు.

ఉగ్రవాదంతో పాటు పలు అంశాలపై చర్చ....

ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు అంతర్జాతీయ సవాళ్లు, యూరప్‌-ఆసియాలో పరిస్థితి గురించి విస్తృతస్థాయిలో అభిప్రాయాలను పంచుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2008లో ఎన్‌ఎస్‌జీ నుంచి భారత్‌ను ప్రత్యేకంగా మినహాయించటానికి మద్దతు ఇచ్చినందుకు ఆయన ఐర్లాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పుంజుకుంటున్నాయని వివరించారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య నేరుగా విమాన ప్రయాణ సేవలు ప్రారంభం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

భారత్‌కు హామీ ఇచ్చిన ఎండా కెన్నీ.....

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతిస్తామని ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీ హామీ ఇచ్చారు. తదుపరి భారత ప్రధాని పర్యటనకు మరో 60 ఏళ్లు పట్టకూడదని ఎండా ఆశించారు. వచ్చే ఏడాది ఐర్లాండ్‌లో పర్యటించాలని రాష్ట్రపతి ప్రణబ్‌కు ఆహ్వానం పలికారు.

కెన్నీకి చారిత్రక పత్రాలను అందించిన మోదీ .......

ఇక బ్రిటీష్‌ పాలన నాటి ఇద్దరు ఐర్లాండ్‌ అధికారులు థామస్‌ ఓల్తామ్‌, జార్జ్‌ అబ్రహామ్‌లకు సంబంధించిన పలు చారిత్రక పత్రాలను మోదీ ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీకి కానుకగా బహూకరించారు. అదేవిధంగా ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన వెండి, చలువరాయిలతో కూడిన కొవ్వొత్తి స్టాండ్‌ను కూడా కెన్నీకి ప్రధాని అందజేశారు. అనంతరం మోదీ ఐర్లాండ్‌ పర్యటన ముగించుకొని అమెరికాకు బయల్దేరారు. అమెరికాలో మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. 

10:40 - September 24, 2015

సైప్రస్‌ : ఇద్దరు జర్మనీ మహిళలు విమానాశ్రయాన్నే తమ ఆశ్రయంగా మలుచుకొని ఏకంగా 15నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఈ విషయం కాస్త ఆశ్చర్యమనిపించినా ముమ్మాటికి నిజం. వీసాపై ఇజ్రాయిల్‌లో నివసించిన తల్లీ కూతుళ్లకు అనుకోని అవాంతరం ఎదురైంది. వారి వీసా గడువు ముగియడంతో ఇజ్రాయిల్‌ ప్రభుత్వం వెనక్కి పంపింది. దీంతో గతేడాది నుంచి వారు సైప్రస్‌లోని లార్‌నాసా విమానాశ్రయంలోనే గడుపుతున్నారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోని షాపింగ్‌, రెస్టారెంట్‌, వైఫై, స్నానాల గదులను ఉపయోగించుకుంటూ కాలం గడుపుతున్నారు. కారు పార్కింగ్‌లోని కాంక్రీట్‌ నేలపై నిద్రిస్తున్నారు. విపరీతమైన చలి, వేడిమిని లెక్కచేయకుండా అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. వారిపై విమానాశ్రయ అధికారులు ఔదార్యం చూపారు. జర్మనీ పంపేందుకు సాయం చేస్తామన్నారు. కాని తాము ఇజ్రాయిల్‌కే తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆ మహిళలు తెలిపారు. విమానాశ్రయం నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. సహాయం కోసం అర్థించిన మహిళల విషయం తమ దృష్టికి రాలేదని జర్మనీ ఎంబసీ వెల్లడించింది.

10:38 - September 24, 2015

ప్రపంచంలోనే భారీ లగ్జరీషిప్‌గా రికార్డు
మాస్కో: బడా బిజినెస్‌మెన్లు తమ స్థోమతను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. భారీగా డబ్బులు ఖర్చు చేస్తూ బంగ్లాలు..స్థలాలు..విమానాలు..ఇలా ఎవో కొంటుంటారు. తాజాగా ఓ బిజినెస్ ప్రపచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ 'నౌక'ను సొంతం చేసుకున్నాడు. అతను ఎవరో కాదు. రష్యా బిజినెస్‌మెన్‌ ఎండ్రీ టగరోవిచ్‌ మెలినిచెంగో. ఆయన ప్రపంచంలోనే పెద్దదైన భారీ లగ్జరీ షిప్‌ను తయారు చేయించుకున్నాడు. అధికారులు ఈ షిప్‌ టెస్టింగ్‌ను ఉత్తర జర్మనీలోని కీల్‌ సముద్రంలో నిర్వహించారు. నౌక ప్రత్యేకత ఏంటంటే.. దీనికి హైబ్రిడ్‌ ఫ్యూయిల్‌ పవర్‌తో లైస్‌ ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రికల్‌, డీజిల్‌తో నడిచే ఇంజన్లు అమర్చారు. ఇక ఈ షిప్‌ ఎత్తు విషయానికొస్తే 5300 ఫీట్లు, పొడవు 468 ఫీట్లు.
కాగా, ఈ నౌక ప్రపంచంలో ఉన్న షిప్పుల్లో అత్యంత సురక్షితమైందని తయారీ సంస్థ చెబుతోంది. ఇందులో ఓకేసారి 20 మంది అతిథులు, 54 మంది క్రూమెంబర్స్ పయనించవచ్చు. 8 అంతస్తులున్న ఈ నౌకలో ప్రతిచోటా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనితో అండర్‌వాటర్‌ అబ్జర్వేషన్‌ రూమ్‌ కూడా ఉంది. అత్యంత ఖరీదైన ఈ లగ్జరీ షిప్‌ 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా, 9 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపత్తి కలిగిన మెలినిచెంగో ఆధీనంలో రష్యాలోని అతిపెద్ద కోల్‌ ప్రొడ్యూసర్‌ 'సెర్బియన్‌ కోల్‌ ఎనర్జీ కంపెనీ(ఎస్‌యుఈకె)' ఉంది. ఈయన ప్రముఖ సెర్బియా ఫ్యాషన్‌ మోడల్‌ ఎలెక్యూజోడ్రా నికోలిక్‌ను వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే అతని వద్ద బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ ఉంది. వీటితో పాటు అల్టాయర్‌ పేరుతో ఓ విలాసవంతమైన భవంతి కూడా ఉంది. న్యూయార్క్ లో 12 మిలియన్‌ డాలర్లు ఖరీదు చేసే ఓ పెంట్‌హౌస్‌ ఉంది.

10:32 - September 24, 2015

మెగాస్టార్ కాక ముందు 'చిరంజీవి' 'సుప్రీమ్' హీరో. ఆయన మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్' ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 'సాయి ధరమ్‌ తేజ్‌', 'రాశి ఖన్నా' జంటగా అనిల్‌రావి పూడి దర్శకత్వంలో 'దిల్‌' రాజు నిర్మిస్తున్న 'సుప్రీమ్‌' చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, హీరో 'కళ్యాణ్‌ రామ్‌' కెమెరా స్విచాన్‌ చేశారు. 'హరీష్‌ శంకర్‌' గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా 'దిల్‌' రాజు మాట్లాడుతూ, 'పిల్లా నువ్వు లేని జీవితం'తో సాయి ధరమ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేశామని, ఆ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఆ తర్వాత తమ బ్యానర్‌లోనే 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రంలో నటించారు. ఈ సినిమాతో పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 5 నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ ప్రారంభించనున్నామని, నవంబర్‌ 15 వరకు ఈ షెడ్యూల్‌ ఉంటుందని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. 'దిల్‌' రాజు నాకు చాలా ప్రత్యేకమని, ఆయనతో మంచి అనుబంధం ఉందని 'సాయి ధరమ్‌ తేజ్' పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు కథ తెచ్చి సినిమా చేయమన్నా నేను చేయడానికి రెడీగా ఉంటానన్నారు. 

10:31 - September 24, 2015

'బ్రూస్‌లీ ద ఫైటర్‌' చిత్రంలో చిరంజీవిగారు రోల్‌ ఏంటి ? ఏ సందర్భంలో ఆయన ఎంట్రీ ఉంటుంది ? ఇలా అనేక విషయాలపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అందరికీ సర్‌ప్రైజ్‌గా ఉండాలని రివీల్‌ చేయడం లేదని, అయితే ఆయన రావాల్సిన సందర్భంలోనే వస్తారని దర్శకుడు శ్రీనువైట్ల పేర్కొన్నారు. గురువారం జన్మదినం సందర్భంగా బుధవారం ప్రెస్ మీట్ లో 'శ్రీను వైట్ల' మాట్లాడారు. 'బ్రూస్ లీ' చిత్రంలో 'చిరంజీవి' గారు నటించే సీన్‌ ఆయన చేయబోయే 150వ సినిమాకి ట్రైలర్‌లా ఉంటుందన్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరినీ డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన పుట్టినరోజున ఒన్‌ మినిట్‌ సాంగ్‌ టీజర్‌ను విడుదల చేయడానికి నిర్మాత 'దానయ్య' ప్లాన్‌ చేసినట్లు చెప్పారు. థమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడని, అక్టోబర్‌ 2న ఆడియోను..సినిమాని అక్టోబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత డి.వి.వి.దానయ్య చెప్పారు.

10:18 - September 24, 2015

ఢిల్లీ : భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ప్రముఖ వ్యాపారి ముకేష్ అంబానీ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 1,25,222 కోట్ల రూపాయలు. ఫోర్బ్స్ టాప్ టెన్ జాబితాను విడుదల చేసింది. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ముకేష్ నిలవడం గమనార్హం. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్డు వ్యవస్థాపకులు తొలిసారిగా దేశంలోని వందమంది అత్యంత సంపన్నవంతుల జాబితాలో చోటు సంపాదించుకోగలిగారు. అంబానీ తరువాత రెండో స్థానంలో 1,19,259 కోట్ల సంపదతో సన్ ఫార్మా అధినేత 'దిలీప్ సంఘ్వీ' నిలువగా మూడో స్థానంలో 1,05,345 కోట్ల సంపదతో విప్రో అధినేత 'అజీమ్ ప్రేమ్ జీ' ఉన్నారు.

టాప్ ధనవంతులు వీరే..
ముకేష్ అంబానీ - 1,25,222 కోట్లు.
దిలీప్ సంఘ్వీ - 1,19,259 కోట్లు.
అజీమ్ ప్రేమ్ జీ - 1,05,345 కోట్లు.
హిందూజా సోదరులు - 1,05,345 కోట్లు.
పలోంజీ మిస్త్రీ - 97,394 కోట్లు.
శివ్ నాడార్ - 85,469 కోట్లు.
గోద్రెజ్ కుటుంబం - 75,530 కోట్లు.
లక్ష్మీ మిట్టల్ - 74,205 కోట్లు.
సైరస్ పూనావాలా - 52,341 కోట్లు.
కుమార మంగళం బిర్లా - 51,679 కోట్లు. 

గుంటూరులో గణేష్ విగ్రహం పడి ఒకరు మృతి..

గుంటూరు : తుళ్లూరు (మం) వెంకటపాలెంలో వినాయక విగ్రహ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ విగ్రహం మీద పడి ఒకరు మృతి చెందారు.

 

నాలుగో రోజుకు చేరుకున్న సీపీఐ నిరహార దీక్షలు..

గుంటూరు : ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సీపీఐ చేస్తున్న నిరవధిక నిరహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. నలుగురి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

అంగన్ వాడీ సహాయకులకు ఊరట..

కాకినాడ : అంగన్ వాడీ సహాయకులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అంగన్ వాడీ సహాయకులకు అంగన్ వాడీ కార్యకర్తలుగా ఉద్యోగోన్నతి కల్పించాలని ఆదేశం జారీ చేసింది. విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంగన్ వాడీ కార్యకర్తల నియామాకానికి ఐసీడీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

పానకాల స్వామిని దర్శించుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ...

మంగళగిరి : అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీ రామకృష్ణారెడ్డి మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పానకాలరావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు :తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి గంట..కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. 

అత్యంత వైభవంగా చక్రస్నానం..

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం మహోత్సవం గురువారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించి చివరిగా అవభృదస్నానంలో సంపూర్ణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 

09:51 - September 24, 2015

హైదరాబాద్ : ఆ మహమ్మారి ఎప్పుడో కరాళ నృత్యం చేసింది. అది ఎవరికి కనపడలేదు. కాని ఆ దృశ్యం ఇప్పుడు భయానకంగా దర్శనమిస్తోంది. మత్తుతో నిద్రపుచ్చే ఆ మాయదారి.. ఇప్పుడు శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తోంది. నరనరాల్లోని రక్తంలో కలిసిపోయిన ఆ విషం శరీరాలను బానిసలుగా చేసుకుంది. ఆ విషపు చుక్కలు లేక ఇప్పుడు ఆ బానిస శరీరం ఎగిరెగిరి పడుతోంది. తనకు తానే తగలబెట్టుకుంటోంది. చస్తావా..చంపమంటావా అంటూ రంకెలేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనపడని యుద్ధం జరుగుతోంది.

నిండిపోతున్న ఆస్పత్రులు....

ఆస్పత్రులు నిండిపోతున్నాయి.. స్వైన్‌ఫ్లూ వల్ల మాత్రం కాదు..! ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.. డెంగీ ప్రభావంతో కానేకాదు..! అమాయకులను ఓ మహమ్మారి మింగేస్తోంది..! ఇన్నాళ్లూ కొంచెం కొంచెంగా ఒళ్లు గుల్లచేసిన రాకాసి.. ఇప్పుడు ఏకంగా మనసును, మనిషినే హరించివేస్తోంది..! దవాఖానాలను పిచ్చాస్పత్రుల్లా మార్చేసి, చావుకేకలు పెట్టిస్తోంది...

అమాయకులను వెంటాడుతోన్న కల్లు....

కల్తీ కల్లు ప్రభావం. కల్లును కల్తీ చేసిన వారి పాపం. ఈ అమాయకులను ఇలా వెంటాడుతోంది. వేధిస్తోంది. చివరకు ప్రాణాలనే తోడేస్తోంది. కల్తీ మద్యాన్ని నివారించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. కల్లు కాంపౌండ్‌లపై ఎక్సైజ్‌ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అయితే.. కల్తీ కల్లుకు అలవాటు పడిన వారికి.. అకస్మాత్తుగా అది దూరమవడంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో.. గడిచిన నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదీ పరిస్థితి. కల్తీ మద్యానికి పూర్తిగా బానిసలైన వారు ఇలా వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేని వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కల్తీకల్లు బారిన పడి ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ జిల్లాల్లో...

నిజామాబాద్, ఆదిలాబాద్... మహబూబ్‌నగర్, కరీంనగర్.. మెదక్, వరంగల్‌.. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏ జిల్లా ఆసుపత్రిలో చూసినా కనిపిస్తున్న దృశ్యాలివే. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న కల్తీ కల్లు బాధితులు నానా అవస్థలు పడుతున్నారు, అయినవారికి నరకం చూపుతున్నారు. కొందరు ఫిట్స్‌తో వణికిపోతుంటే, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిపోతున్నారు. పరిస్థితి విషమించి బాధితులు చేస్తున్న హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లుతున్నాయి. ఒక్క మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే గడిచిన నాలుగు రోజులుగా దాదాపు 8 వందల మంది కల్తీ కల్లు ప్రభావానికి లోనయ్యారు. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని ఏరియా ఆస్పత్రులు కల్తీ కల్లు బాధితులతో నిండిపోయాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న కల్తీ కల్లు బాధితులకు ఆస్పత్రులు చాలడం లేదు. దీంతో రోగులను కిందే పడుకోపెట్టి చికిత్స అందిస్తున్నారు. వైద్యం అందించేందుకు డాక్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. రోగులు ఏమాత్రం సహకరించకపోడంతో.. మంచాలకు కట్టేసి మరీ వైద్యం చెయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రాణాలే కోల్పోతున్న బాధితులు...

ఇక ఆస్పత్రుల్లో చేరని వారి పరిస్థితి దారుణంగా తయారవుతోంది. మతిస్థిమితం కోల్పోతున్న బాధితులు.. ప్రాణాలే కోల్పోతున్నారు. ఎంత ప్రయత్నించినా కల్తీ కల్లు దొరక్కపోవడంతో.. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ మహిళ.. ఏకంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పిచ్చిగా ప్రవర్తించిన మరో వ్యక్తి.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు దొరక్కపోవడంతో మరో మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. ఈ బాధితులంతా నిరుపేదలు కావడం గమనార్హం. రెక్కాడితే గాని డొక్కాడని అభాగ్యులే కల్తీ కల్లు బారిన పడి, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కల్లు.. ప్రకృతి ప్రసాదించిన పానీయం..

కల్లు.. ప్రకృతి ప్రసాదించిన పానీయం.. తాటిచెట్టు నిస్వార్థంగా అందించే కమనీయ పదార్థం.. కానీ.. పరిస్థితి మారిపోయింది. తాటివనంలోంచి రావాల్సిన కల్లు.. నగరంలోని గుడారాల్లోంచి వస్తోంది. తాటిచెట్టుతో సంబంధం లేకుండానే కల్లు తయారవుతోంది. గీతకార్మికుడికి బదులు.. ఆ వృత్తికి అర్థం తెలియనోళ్లంతా కల్లు దుకాణాలు తెరిచేస్తున్నారు..

సహజంగా తాటిచెట్టు నుంచి కల్లు తీస్తారు....

పల్లె ప్రాంతాల్లో గీత కార్మికులు సహజంగా తాటిచెట్టు నుంచి కల్లు తీస్తారు. దాన్ని.. కొనుగోలు దారులకు పోస్తారు. అయితే.. కొందరు అక్రమార్కులు కొంత మోతాదులో నిజమైన కల్లును తీసుకొచ్చి, దాంతో.. విచ్చలవిడిగా కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. నగరాల్లో ఏర్పాటు చేసిన గుడారాల్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మించి రహస్యంగా కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఉదాహరణకు బిందెడు నీళ్లు తీసుకుని అందులో మత్తుకోసం డైజోఫాం, అల్ఫాజోం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత కేవలం ఒకే ఒక గ్లాసు అసలైన కల్లు పోస్తారు. అంతే.. బిందెడు కల్లు రెడీ అయిపోతుంది.

లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు......

ఈ విధమైన కల్లును తెలంగాణ వ్యాప్తంగా తయారు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కాయకష్టం చేసే నిరుపేదలు పొద్దంతా కష్టపడి, దాన్ని మర్చిపోయేందుకు కల్లుతాగుతుంటారు. అయితే.. కల్తీ కల్లులోని రసాయనాలు అమాయకులను వ్యసనపరులుగా మార్చేస్తున్నాయి. ఫలితంగా.. కల్తీ కల్లు లేనిది ఉండలేని స్థితికి వారు చేరిపోతున్నారు.

ఈ కల్లుకు అలవాటు పడి....

ఈ కల్లుకు అలవాటు పడిన వారి ఆరోగ్యం తీవ్ర దుష్ప్రభావాలకు లోనవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం ఏకకాలంలో దెబ్బతింటుంది. ప్రధానంగా నాడి వ్యవస్థపై ప్రభావం చూపుతూ.. క్రమేపీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మెదడు మొద్దుబారుతుంది. నరాలు బలహీనమవుతాయి. కాళ్లూ చేతులు చచ్చుబడిపోతాయి. కాలేయం క్రమక్రమంగా పాడవుతుంది. తిండి తినలేక పోవడం, తిన్నది జీర్ణించుకోలేకపోవడం, కంటి నిండా నిద్రలేకపోవడం.. ఒక్కటేమిటి..? సవాలక్ష రోగాలు మనిషిని పీల్చి పిప్పిచేస్తాయి.

కల్తీ కల్లుకు బానిసై....

ఈ దశలో మనిషి పూర్తిగా కల్తీ కల్లుకు బానిసైపోతాడు. అదిలేనిదే ఉండలేని స్థితికి చేరుకుంటాడు. సమయానికి తిండి లేకపోయినా.. కల్లుతో గొంతు తడుపుకోవాల్సిందే. పొరపాటున కల్లు అందుబాటులో లేకపోతే బాధితుడు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఇదే. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ అందుబాటులో లేకపోవడంతో దాని బాధితులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లు కావాలని గొడవ చేస్తున్నారు. చివరకు ఆత్మహత్యలు సైతం సిద్ధపడుతున్నారు.

గల్లీ గల్లీకో కల్తీ కల్లు దుకాణం... వీధి వీధికో కల్తీ కల్లు డిపో...

గత కొన్నేళ్లుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కల్తీ కల్లు దందా తీరిది. మూడు సీసాలు, ఆరు డ్రమ్ములు అన్నట్టుగా కొనసాగిన కల్తీ దందా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును యథావిధిగా వినియోగదారులకు అందించాలి. కానీ.. వనాలను దాటగానే కల్లు స్వరూపం మారిపోతోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్నవారు అందుకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. వాస్తవానికి ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండా.. కల్లు దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని గీతకార్మికుల సొసైటీలకు ఉన్నట్టుగానే.. పట్టణ ప్రాంతాల్లోని దుకాణాలకూ అనుమతులు ఉండాలి. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా సగానికిపైగా కల్లు డిపోలకు అనుమతుల్లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్సైజ్‌ అధికారులు నిత్యం తనిఖీ చేయాలి....

తమ పరిధిలోని దుకాణాలు, కల్లు డిపోలను ఎక్సైజ్‌ అధికారులు నిత్యం తనిఖీ చేయాలి. ప్రతి నెలా కల్లు శాంపిళ్లను సేకరించి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబరేటరీకి పంపాలి. అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒక డిపోలో కల్లు మిగులుతున్నట్లయితే.. ఇతర సొసైటీల వారు లిఖిత పూర్వకంగా కోరితేనే ఆయా ప్రాంతాలకు కల్లు సరఫరా చేయాలి. కానీ.. ఈ తరహా డ్యూటీ చార్ట్‌ ఎక్కడా సక్రమంగా అమలవుతున్న దాఖలాల్లేవు.

ఏళ్ల తరబడి ఈ తంతు కొనసాగుతున్నా....

ఏళ్ల తరబడి ఈ తంతు కొనసాగుతుండడంతో కల్తీకల్లు ప్రవాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. విచ్చల విడిగా రసాయనాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేస్తున్న ముఠాలు.. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఏనాడూ ఎక్సైజ్‌ అధికారులు సరిగా పట్టించుకున్న దాఖలాల్లేవు. కల్తీ కల్లు తయారీ దారులు ఇస్తున్న లంచాలకు అలవాటుపడ్డ అధికారులు.. తనిఖీలు చేయడమే మరిచిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా పరీక్షలు నిర్వహించినా.. కల్తీ లేదనే రిపోర్టు ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా.. ఏళ్ల తరబడి కొనసాగిన దందాకు హఠాత్తుగా ఫుల్‌ స్టాప్‌ పెట్టింది ప్రభుత్వం. దీనివల్ల అమ్మకం దారులకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. జనాల ఆరోగ్యంతోపాటు, కోట్లు కొల్లగొట్టిన ముఠాలు బాగానే ఉన్నాయి. లంచాలకు మరిగి విధినిర్వహణను విస్మరించిన అధికారులూ బాగానే ఉన్నారు. ఎటొచ్చీ.. అటు డబ్బుతోపాటు, ఇటు ఆరోగ్యాన్నీ నాశనం చేసుకున్నవారికే ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.

కల్తీ కల్లును పూర్తిగా నిరోధించాల్సిందే... కానీ....

ఈ నేపథ్యంలో..ప్రభుత్వం కల్తీ కల్లును పూర్తిగా నిరోధించాల్సిందే. కానీ.. దానికి బానిసలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నవారి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. వారికి అందాల్సిన వైద్యసదుపాయాలు, ఇతరత్రా అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కూడా సర్కారు మీదనే ఉందన్నది కాదనలేని వాస్తవం. కాబట్టి, ప్రభుత్వం ఆ తరహా చర్యలకు సిద్ధం కావడంద్వారా.. అమాయకుల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

09:41 - September 24, 2015

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైసీపీ అధినేత జగన్ నిర్వహించనున్న దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష ప్రాంగణానికి దగ్గరలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్నాయని.. పౌరులకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందితో పాటు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా సమస్యలు నెలకొంటాయనే అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు. దీక్ష శిబిరం వద్ద పనులు నిలిపివేయాలని సూచించారు. వెంటనే దీక్షా స్థలం నుంచి వెళ్లిపోవాలని లేకుంటే... అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

80 శాతం పనులు పూర్తి....

మరోవైపు ఈ నెల 26 నుంచి చేపట్టనున్న దీక్షకు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని పార్టీ నేతలు తెలిపారు. ఏర్పాట్లు పూర్తయ్యాక పోలీసులు అభ్యంతరం చెబుతున్నారని విమర్శించారు.

ట్రాఫిక్ ఇబ్బందులకు.....

ఈ నెల 20వ తేదీనే జిల్లా ఎస్పీని కలిసి దీక్షపై సమాచారం అందించామని పార్టీ నేతలు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏర్పాట్లకు ఆటంకాలు కలిగిస్తే నడిరోడ్డుపైనే జగన్ దీక్ష చేస్తారని స్పష్టం చేశారు పార్టీ నేత అంబటి రాంబాబు.

పార్టీ శ్రేణుల సూచన మేరకు.....

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈనెల 26 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తానని ముందుగానే ప్రకటించారు. అంతకు ముందు 15 నుంచి దీక్ష చేపట్టాలని నిర్ణయించినా... వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు నిరసన తేదీని వాయిదా వేసుకున్నారు. అనుమతి లేదని పోలీసులు, జరిగి తీరుతామని వైసీపీ నేతల సవాళ్ల మధ్య... జగన్ దీక్ష ఉత్కంఠను కలిగిస్తోంది.

 

09:38 - September 24, 2015

హైదరాబాద్‌ : రాకేష్‌రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి.. కొన్ని గంట్లోనే దారుణంగా హతమార్చారు. నిన్న ఉదయం నాగారంలో రాకేష్‌రెడ్డి కిడ్నాప్‌కు గురైనట్లు కేసు నమోదైంది. అయితే వారి కుటుంబానికి తెలిసివవారి ఇంట్లోనే అతని మృతదేహం దొరికింది. రాకేష్‌రెడ్డిని గొంతు కోసి చంపారని పోలీసులు చెబుతున్నారు.

కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు తెలిపిన లిపిక

హైదరాబాద్ : ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని సూచించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమనాథ్ భార్య లిపికా మిత్ర కృతజ్ఞతలు తెలిపారు. సోమనాథ్ తనపై హత్యాయత్నం, గృహహింసకు పాల్పడ్డాడని లిపిక కేసుపెట్టిన విషయం విదితమే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సోమనాథ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరుమృతి

నల్గొండ : చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఉదుర్ నగర్ నుంచి కోదాడకు బైక్ పై వెళ్తున్న వారిని కోదాడ నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

అత్యంత ధనవంతుడిగా ముకేష్ అంబానీ...

హైదరాబాద్ : దేశంలో అత్యంత ధనవంతుడిగా వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ముకేష్ అంబానీయే నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 1,25,222 కోట్ల రూపాయలని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు తొలిసారిగా దేశంలోని వందమంది అత్యంత సంపన్నవంతుల జాబితాలో చోటు సంపాదించుకోగలిగారు. అంబానీ తర్వాత రెండో స్థానంలో 1,19,259 కోట్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, మూడో స్థానంలో 1,05,345 కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఉన్నారు.

జగన్ దీక్ష పై టిడిపి బహిరంగ లేఖ...

హైదరాబాద్ : వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ ముప్పేట దాడి చేస్తూనే ఉంది. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై గుంటూరులో జగన్ చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీ బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించింది. ఈ మేరకు నిన్న టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేరిట బహిరంగ లేఖ విడుదలైంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టింది చాలక ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చారా? అంటూ ఆ లేఖలో జగన్ ను ఆంజనేయులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకే జగన్ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

నేడు కూడా ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఈ రోజు ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. నేడు ఉదయం 10.30కి సుజనా చౌదరితో ఆయన భేటీ కానున్నారు. విభజన చట్టంలోని హామీల అమలు తీరుపై సుజనాతో చర్చించనున్నారు. అదేవిదంగా తరువాత కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఉమాభారతితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నాం అరుణ్‌జైట్లీని కలవనున్నారు. ఆయనతో వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ, పోలవరం నిధులపై చర్చలు జరుపుతారు.

 

పలు బీసీ హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్న మంత్రి కొల్లు...

కడప జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటిస్తున్నారు. నగరంలోని పలు బీసీ హాస్టళ్లను ఆయన తనిఖీ చేశారు. నిర్వాహకులను విద్యార్థులకు ఎట్టి పరిస్థితులలో అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కొన్ని బీసీ హాస్టళ్లలోని ఆహారాన్ని పరిశీలించిన మంత్రి పద్దతి మార్చుకోపోతే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.

08:41 - September 24, 2015

 :హైదరాబాద్ యూనివర్శిటీల్లో పని చేసే ప్రొఫెసర్లకు భావన ప్రకటన స్వేచ్ఛ ఉండాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా పై వైసీపీ నేత జగన్ దీక్షకు పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయ్యింది. స్వచ్ఛ భారత్ పై పన్ను విధించనున్నారా? నేపాల్ లో రాజ్యంగం అమలులోకి రావడంతో భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతోంది? ఈ అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణాత్మకమైన వివరణ ఇచ్చారు. మరి మీరు కూడా ఆ వివరాలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

డెంగ్యూతో హోంగార్డు మృతి

నల్గొండ: ఒక హోంగార్డు డెంగ్యూ వ్యాధికి బలయ్యాడు. ఆలేరు మండలం కొల్లేరుకు చెందిన హోంగార్డు రాజు డెంగ్యూతో మృతి చెందాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. రాజు కొద్దిరోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్నాడు. రాజుకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

నేడు కాణిపాక వినాయకుడి రథోత్సవం

చిత్తూరు : కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని బ్రహోత్మత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం ప్రారంభవుతుందని, ఈ ఉత్సవానికి భారీగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణ చంద్రరావు తెలిపారు.

07:42 - September 24, 2015

హైదరాబాద్: వరంగల్ ఎన్ కౌంటర్ అనుమానాలపై '10 టివి' 'న్యూస్ మార్నింగ్' లో ప్రత్యేక చర్చను చేపట్టింది.ఈ చర్చా కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి వెంకటరామయ్య, టిడిపి నేత, సతీష్ మాదిగ, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివసరావు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పాల్గొన్నారు. ఆసక్తి కరమైన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కౌకుంట్లలో కౌలు రైతు ఆత్మహత్య

మహబూబ్ నగర్ : అప్పుల బాధ తాళలేక దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాము ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానాకి గురయ్యి ఈ రోజు ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సోలార్ పై ఉచిత శిక్షణా తరగతులు...

హైదరాబాద్‌ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏవియాన్‌ టెక్నో సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత సోలార్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తునట్లు ఎలక్ర్టిసిటీ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి తెలిపారు. ఎన్‌ఐఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎన్‌ఆర్‌ఈ ద్వారా ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత సెప్టెంబర్‌ 5లోపు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9290181824 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. 

కిడ్నాప్ కు గురైన రాకేష్ రెడ్డి హత్య...

హైదరాబాద్ జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న కిడ్నాపైన రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాకేష్‌రెడ్డిని కత్తులతో పొడిచి దుండగులు కిరాతకంగా చంపారు. రాకేష్ ను విడిచిపెట్టడానికి దుండగులు కుటుంబ సభ్యులను రూ.8 లక్షలు డిమాండ్ చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

07:16 - September 24, 2015

హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్‌ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం వెనుక తమ బంధువుల పాత్ర ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

07:08 - September 24, 2015

హైదరాబాద్ : మద్యం ద్వారా మరింత ఆదాయాన్ని అర్జించాలని టీ.సర్కార్ నిర్ణయించింది. నిన్నమొన్నటి వరకు బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపిన సర్కార్ ఇప్పడు వాటికి అధికారికంగా అనుమతులిచ్చింది. నూతన మద్యం విధానంలో భాగంగా ఈ బెల్టు షాపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

మద్యం ద్వారనే వీలైనంత ఆదాయం.....

తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపులను నియంత్రించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న సర్కార్...ఇప్పుడు ఈ మద్యం ద్వారనే వీలైనంతా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది. బెల్టు షాపుల నిర్వాహకుల నుంచి భారీగా ఫీజు వసూలు చేసి అనుమతులిస్తున్నట్టు అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలియజేశారు. భారీగా డబ్బు చెల్లించి మద్యం షాపులకు దక్కించుకున్న యజమానులకు నష్టం రాకుండా ఉండేందుకు బెల్టు షాపుల నిర్వాహకుల నుంచి ఫీజు వసూలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు. కాని ఎంత వసూలు చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.

బెల్టు షాపులకు కూడా లైసెన్స్‌లు జారీ చేసే అవకాశాలు ?......

రాష్ట్రంలో బెల్టు షాపులను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. వాటిని తొలగించాల్సింది పోయి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తామని సర్కార్ తెలపడం దారుణమని వారు మండిపడుతున్నారు. ఇదే పద్దతిని అనుసరిస్తే భవిష్యత్తులో బెల్టు షాపులకు కూడా లైసెన్స్‌లు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. మద్యం మీద వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని కూడగట్టేందుకే సర్కార్ ఈరకమైన సన్నాహాలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డ్రా పద్దితిన 2,111 మద్యం షాపుల కేటాయింపు.......

మద్యం షాపుల నిర్వహణ కోసం దరఖాస్తులు చేసుకున్న 2,111 షాపులను ఆయా జిల్లా కేంద్రాల్లో డ్రా పద్దతిన కేటాయించారు. జిల్లా రెవిన్యూ యంత్రాంగం, పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

మొత్తం 2,216 మద్యం షాపుల కోసం దరఖాస్తులు......

రాష్ట్రంలో మొత్తం 2,216 మద్యం షాపుల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన అనంతరం 105 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో...ఈషాపుల కోసం మళ్లీ ఈనెల 29 తేదీన రీ-నోటిఫికేషన్ విడుదలవుతుంది. 5వ తేదీన దరఖాస్తుల పరిశీలన అనంతరం 7వ తేదీన డ్రా పద్దతిలో షాపులను కేటాయిస్తారు.

105షాపులకు రాని దరఖాస్తులు......

రెండో విడత నోటిఫికేషన్‌లోనూ 105 షాపులకు దరఖాస్తులు రాని పక్షంలో ఆ షాపులను సర్కారే నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించనుంది. రిటైల్ షాపుల తరహలోనే షాపులను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

07:06 - September 24, 2015

హైదరాబాద్‌ : కుషాయిగూడలోని ఏఎస్‌రావునగర్‌లో మసాజ్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. స్టూడియో లెవన్‌ ఫేసియల్‌ పేరుతో క్రాస్‌ మసాజ్‌ చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు దాడి చేశారు. మసాజ్‌ చేస్తున్న ముగ్గురు మణిపూర్‌ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:04 - September 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 10 వరకు నిర్వహించాలని బీఏసీలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. సెలవులు పోనూ సమావేశాలు తొమ్మిది రోజులు జరగనున్నాయి. అయితే తొలుత ఈ సమావేశాలు ఈనెలాఖరు వరకే జరుగుతాయని అందరూ భావించారు. దీంతో ప్రతిపక్షాలు సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్ని రోజులైనా సభను జరపడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 10 వరకు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చలు....

అయితే గడువు పెంచిన విధంగానే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చలు సహృద్భ వాతావరణంలో జరుగుతాయా? లేదా ? అనే చర్చ తలెత్తింది. గత సమావేశాలను పరిశీలించిన పలువురు విశ్లేషకులు.. అధికార, ప్రతిపక్ష పార్టీలు గతంలో మాదిరిగానే విమర్శలు, ప్రతి విమర్శలతో కాలం గడిపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో వీటిపై సమగ్ర చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం 29వ తేదీన చర్చకు అంగీకరించింది. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేసి సభ నుండి పారిపోయేలా చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా జరగడంతో పాటు.. ప్రతిపక్షాలను అధికార పక్షం టార్గెట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్‌ వ్యాఖ్యలను తప్పుపడుతు రైతు సంఘాలు....

మరోవైపు కేసీఆర్‌ వ్యాఖ్యలను రైతు సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి. రైతులకు లాభం జరిగే విధంగా సభలో చర్చ జరగాలని వారు కోరుతున్నారు. సభలో సభ్యులు హుందాతనంగా వ్యవహరించాలని కేసీఆర్‌ సూచిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను చూస్తుంటే సభలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతుందంటున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించామని కాకుండా.. ప్రజాసమస్యలపై ఎంత సమయం కేటాయించారనేది ముఖ్యమని పలువురు సూచిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా సభను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. విపక్ష నేతలు కూడా రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు పోకుండా రైతులు, ఇతర ప్రజా సమస్యలపై సమయం కేటాయిస్తే అందరికీ మేలు జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహా ప్రతివ్యూహాలతో సమావేశాలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. 

07:00 - September 24, 2015

హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను పక్కాగా అమలు చేసే విషయంలో అధికారులు కిందా మీదా పడుతుంటే.. తాజాగా మద్రాస్ హైకోర్టు సరికొత్త తీర్పు ఇచ్చింది. తాజాగా ఇచ్చిన తీర్పు అటు వాహనదారులే కాదు.. వాహన తయారీ కంపెనీలకు సైతం కొత్త ఇబ్బందిని తెచ్చి పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో మాట లేదని మద్రాస్ హైకోర్టు.....

ద్వి చక్ర వాహనదారులకు హెల్మెట్‌ను తప్పనిసరి చేయాలన్న అంశంపై మరో మాట లేదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. వాహనం నడిపే వారు మాత్రమే కాదు.. వెనుక కూర్చున్న వారికి సైతం హెల్మెట్ ఉండాల్సిందేనని తేల్చింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారికి రెండు కొత్త హెల్మెట్లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. వాహనదారులు ఒకరైనా.. హెల్మెట్లు మాత్రం రెండు కొనాల్సిన పరిస్థితి. అంతేకాదు.. వాహనానికి హెల్మెట్‌ను లాక్ చేసేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా వాహన కంపెనీలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది.

వాహనానికి హెల్మెట్లు పెట్టుకోవటానికి వీలుగా.....

వాహనానికి హెల్మెట్లు పెట్టుకోవటానికి వీలుగా వాహన ఉత్పత్తిదారులే ఏర్పాట్లు చేయాలని.. అది ఎగస్ట్రా ఫిట్టింగ్‌గా ఉండకూడదని.. దాని కోసం అదనంగా ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒక్క హెల్మెట్ వినియోగం విషయంలోనే కిందా మీదా పడుతున్న వారికి.. ఇప్పుడు రెండు హెల్మెట్ల కాన్సెప్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది ఒక వాదన. అయితే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని వాహన కంపెనీలు ఎంత వరకు అమలు చేస్తాయో చూడాలి.

06:58 - September 24, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుదశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి రధోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు మహారధంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు.

రధోత్సవం నిర్వహణకు టిటిడి ఏర్పాటు...

గరుడసేవ తరవాత అంతటి ప్రాధాన్యత కలిగినది రధోత్సవం. ఈ రధోత్సవం నిర్వహణకు టిటిడి విజిలెన్సు, పోలీసు విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసాయి. వేలాదిమంది భక్తులు రధోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం ....

ఇవాళ పుష్కరణిలో జరిగే చక్రస్నానంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. సాయంత్రం ఆలయంలోని ద్వజస్థంభం పైనుంచి గరడకేతనాన్ని అవనతం చేస్తారు. దీన్నే ద్వజ అవరోహనం అనివ్యవహరిస్తారు. ద్వజాఅవరోహనంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. మళ్లీ అక్టోబరు 14 నుండి 24 వరకూ స్వామివారికి నవరాత్రి బ్రహ్మోత్పవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో టిటిడి ఊహించిన మేరకు రద్దీ రాక పోవడంతో బ్రహ్మోత్సవాలు వెలవెల బోయాయి.

పీఐపీ దర్శనాలు, ఆర్జితసేవలు రద్దు .....

గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధానిచ్చి పీఐపీ దర్శనాలు, ఆర్జితసేవలు రద్దు చేయడంతో భక్తులు డైరెక్టు లైనులో కేవలం రెండు గంటల్లో శ్రీవారిని దర్శించుకన్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో లడ్డూల కొరత ఏర్పడకుండా అవసరమైన లడ్డూలు స్టాక్ ఉంచుకొని ప్రతి భక్తుడికీ నాలుగు నుండి 5 లడ్డూలు అందజేసినట్లు చెప్పారు. గత ఏడాది 4.76 లక్షలమంది భక్తులు మూల విరాట్టును దర్శించుకోగా ఈఏడాది మంగళవారం వరకు 4.57 లక్షల మంది శ్రీవారిని దర్శించుకన్నట్లు చెప్పారు.

రద్దీ తగ్గడానికి అనేక కారణాలు....

ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా రద్దీ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని టిటిడి ముఖ్యభద్రతాధికారి నాగేంద్రకుమార్ చెప్పారు. ఈబ్రహ్మోత్సవాల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకొని రెండవ బ్రహ్మోత్సవాలకు మరింత సమర్దవంతంగా నిర్వహిస్తామని అన్నారు.

06:56 - September 24, 2015

హైదరాబాద్ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. రాం విలాస్‌ పాశ్వాన్‌.. ఈ ఇద్దరూ రాజకీయ దురంధరులు. బీహార్‌ ప్రగతి రథాన్ని ఒంటి చేత్తో నడిపించిన సమర్థులు. కానీ.. ఇప్పుడు వీళ్లిద్దరూ అల్లుళ్ల దెబ్బకు హడలెత్తి పోతున్నారు. సినిమా చూపిస్త మావా అంటున్న అల్లుళ్ల గిల్లుళ్లతో.. లాలూ, పాశ్వాన్‌లు డంగై పోతున్నారు.

మామా అల్లుళ్ల మధ్య సవాళ్లు..

అచ్చంగా ఇదే పాటను కాదు గానీ.. ఈ అర్థమే వచ్చే పాటలను బీహార్‌ ప్రజలు పాడుకుంటున్నారిప్పుడు. కాకలు తీరిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్‌ పాశ్వాన్‌లు.. సన్‌ ఇన్‌లాస్‌ స్ట్రోక్‌ అంటే అల్లుళ్ల గిల్లుళ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకుందామన్న వీరి ఆశలపై.. అల్లుళ్లు నీళ్లు జల్లుతున్నారు. మామా అల్లుళ్ల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లతో బీహార్‌ రాజకీయం బాగా వేడెక్కింది.

పాశ్వాన్‌ కుటుంబంలో టిక్కెట్ల చిచ్చు ....

బీహార్ ఎన్నికల టిక్కెట్ల పంపిణీ వ్యవహారం.. పాశ్వాన్ కుటుంబంలో చిచ్చును రేపింది.. పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ టిక్కెట్ దక్కించుకుంటే.. పార్టీలో దళిత్ సేనను నడిపిస్తున్న అల్లుడు అనిల్ సాధూకు టిక్కెట్ లభించలేదు.. పార్టీలో బీసీ, దళిత వర్గాలతో... నియోజకవర్గ బ్లాక్ స్థాయి వరకూ అనిల్ సాధూకు మంచి పట్టుంది. పైగా ఈ విభాగం పార్టీకి చాలా కీలకం. అలాంటి తనకు టిక్కెట్‌ ఇవ్వక పోవడంతో సాధూ... మామ, బావమరిదిపై యుద్ధం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మామా అల్లుళ్ల మధ్య రాజుకున్న కుంపటి.. తమ విజయావకాశాలకు ఎక్కడ గండి కొడుతుందోనని ఎన్డీయే కూటమి ఆందోళన చెందుతోంది.

కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ కూటములకు వ్యతిరేకంగా ప్రచారం......

ఇక లాలూ విషయానికోస్తే.. ఆయన్ను చిన్నల్లుడు గిల్లుతున్నాడు. సాక్షాత్తు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మనవడు తేజ్‌ప్రతాప్‌ సింగ్‌..లాలూయాదవ్‌ చిన్న కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఎస్పీ..మరికొన్ని పక్షాలతో కలిసి వేరేగా బరిలోకి దిగింది. దీంతో కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ కూటములకు వ్యతిరేకంగా లాలూ అల్లుడు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా మామ అధ్యక్షుడిగా ఉన్న ఆర్జేడీకి పట్టున్న ప్రాంతాలపై అల్లుడు తేజ్‌ప్రతాప్‌ దృష్టి పెట్టాడు. దీంతో అల్లుడి గిల్లుడికి.. ఎలా బదులివ్వాలో తేల్చుకోలేక మామ లాలూ సాబ్ తల పట్టుకుంటున్నాడు.

ఇద్దరు కొడుకులకు టికెట్లు ఇచ్చిన లాలూ ....

అల్లుళ్ల సంగతి ఎలా ఉన్నా..తన ఇద్దరు కొడుకులే ముద్దనుకున్నాడు లాలూ. ముద్దులకొడుకులైన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లిద్దరికీ టికెట్లు ఇచ్చి..కొడుకులపై తనకు ఎనలేని ప్రేమఉందని నిరూపించారు లాలూ. మహువా స్థానం నుంచి తేజ్‌ ప్రతాప్‌ పోటీచేస్తారని..రాఘేపూర్‌ నుంచి తేజస్వి యాదవ్ పోటీచేయబోతున్నారు. తేజస్వి టికెట్‌ స్థానం కోసమైతే..బీహార్ సీఎం నితీష్‌ ప్రత్యేకంగా శ్రద్ద తీసుకున్నారట. లాలూతో మాట్లాడి..ఆయన్ను ఒప్పంచి తేజస్విని రాఘెపూర్‌ నుంచి పోటీ చేసేలా టికెట్‌ ఇప్పించారు. మరి లాలూ కొడుకులు బీజేపిని ఎదుర్కొంటారో లేదంటే..తోకముడుస్తారో చూడాలి.

రసవత్తరంగా బీహార్ రాజకీయాలు.....

మొత్తానికి బీహార్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ల కేటాయింపుల్లో ఎక్కడా లేని రాజకీయాలు- ఎత్తుగడలు-అలకలు,..ఆగ్రహాలు-అనుగ్రహాలు,.ఏడుపులు-పెడబొబ్బలు అన్నీ కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నేతల సమీప బంధువుల విషయంలో జరుగుతున్న పరిణామాలు సామాన్యులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా..రాజకీయాలను శాసించిన ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలకు..ఇప్పుడు అల్లుళ్లు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. 

06:50 - September 24, 2015

హైదరాబాద్ : ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు భారతదేశపు ఎంట్రీగా మరాఠీ సినిమా 'కోర్ట్‌'ను ఎంపిక చేసినట్టు భారత ఆస్కార్‌ స్ర్కీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అమూల్‌ పాలేకర్‌ చెప్పారు. స్ర్కీనింగ్‌కి వచ్చిన సినిమాలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడేలా ఉన్నాయని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. వాటిలో నుంచి ఒక్క సినిమాను ఎంపిక చేయడం కష్టతరంగా మారిందని పాలేకర్‌ చెప్పారు. మా జ్యూరీ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో మరాఠీ సినిమా కోర్ట్‌ను ఎంపిక చేశాం అని అన్నారు. మొదట్లో జ్యూరీలో 17 మంది సభ్యులు ఉండేవారని.. ఇందులో సుకన్య, రాహుల్‌ రావెల్‌ తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో 15 మంది సభ్యులం కలిసి ఈ సినిమాను ఎంపిక చేశామన్నారు. సృజనాత్మకత, సాంకేతిక విలువలు, నటనా పటిమ, సమకాలీన భారతదేశాన్ని ప్రతిబింబించే విధానం... అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని కోర్ట్‌ను నామినేట్‌ చేస్తున్నాం అని అన్నారు.

జ్యూరీకి మొత్తం 30 సినిమాలు.......

మొత్తం 30 సినిమాలు జ్యూరీకి వచ్చినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అకాడెమీ గౌరవ కార్యదర్శి సి.కల్యాణ్‌ చెప్పారు. వాటిలో తెలుగు నుంచి బాహుబలి, శ్రీమంతుడు ఉన్నాయన్నారు. గత తొమ్మిది రోజులుగా సభ్యులందరూ రోజుకు ఐదు సినిమాల చొప్పున చూసి కోర్ట్‌ చిత్రాన్ని నామినేట్‌ చేసినట్లు చెప్పారు.

కోర్టు లోపల జరిగే సన్నివేశాలతో సాగే డ్రామాతో ......

కోర్టు లోపల జరిగే సన్నివేశాలతో సాగే డ్రామాతో ఈ కోర్టు చిత్రాన్ని ప్రముఖ మరాఠీ దర్శకుడు చైతన్య తమనే రూపొందించారు. ముంబయి కింది స్థాయి కోర్టులో ఓ వృద్ధ ఫోక్ సింగర్‌కు సంబంధించిన కేసు వాదోపవాదాలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బాహుబలి, శ్రీమంతుడు, బాలీవుడ్ నుంచి పీకే, బజరంగీ బాయ్‌జాన్‌ వంటి చిత్రాలున్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టేసి మరీ కోర్టు చిత్రం నామినేషన్ పొందింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలలో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది.

06:47 - September 24, 2015

హైదరాబాద్ : తాము నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ను చాలా చక్కగా నిర్వహిస్తున్నామని ఏ ఒక్క ప్రభుత్వమూ చెప్పుకోలేని దౌర్భాగ్యం మనదేశంలో నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వివిధ హాస్టల్స్‌ను సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి వారే విస్మయం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. ఆహారంలో నాణ్యత లేక, ఎముకలు కొరికే చలిలో సైతం కప్పుకునేందుకు కనీసం దుప్పట్లు లేక, కిటికీలకు, ద్వారబంధాలకు తలుపులు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలకు సంబంధించిన కథనాలు ప్రతిరోజూ మీడియాలో రిపోర్ట్‌ అవుతూనే వున్నాయి. జెర్రులు, తేళ్లే కాదు పాములు కరిచి హాస్టల్‌ విద్యార్థులు చనిపోతున్న తీరు హృదయ విదారకం. కనీసం తాము సందర్శించిన హాస్టల్స్‌లోని దుర్భర పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేసిన నాయకుడు ఒక్కరైనా వున్నారా అన్నదీ ప్రశ్నే. హాస్టల్స్‌లో సవాలక్ష సమస్యలున్నా, అక్కడ జీవించడం దుర్లభమైనా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా సర్దుకుపోక తప్పనిస్థితి విద్యార్థులది. తమది లక్ష కోట్లు దాటిన బడ్జెట్‌ అంటూ గర్వంగా ప్రకటించుకునే ప్రభుత్వాలు కనీసం లక్ష మంది బాలబాలికలైనా చదువుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతే ఇక ఆ అభివృద్ధికి అర్ధం వుంటుందా? ప్రతి పట్టణాన్ని ఒక సింగపూర్‌గా తీర్చి దిద్దుతామంటూ చెబుతున్నవారు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్‌ సిటీలను సృష్టిస్తామంటున్నవారు చిన్నచిన్న పిల్లలు చదువుకునే హాస్టల్స్ నైనా సక్రమంగా నిర్వహించడం చేతకాక, వాటిని మూతవేయడంలో అర్ధం వుంటుందా? హాస్టల్‌ మూసివేత కార్యక్రమం 14 ఏళ్ల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలన్న రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధం కాదా? దుర్భర దారిద్ర్యం తమను పీడిస్తున్నా, ఏవో నాలుగు అక్షరాలైనా నేర్చుకోవాలన్న తపనతో హాస్టల్స్‌ లో చదువుకుంటున్న చిన్న పిల్లల మీద ఎందుకింత కక్ష. తమకు కనీసం కడుపు నిండా భోజనం పెట్టండి , కట్టుకోవడానికి నాలుగు బట్టలు ఇవ్వండి, చదువుకోవడానికి పుస్తకాలివ్వండి మహాప్రభో అంటూ చిన్నచిన్న ఆడపిల్లలు కూడా వీధుల్లోకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటే వివిధ దేశాల చుట్టూ చక్కెరలు కొట్టే ప్రభుత్వాధినేతలు ఎవరి సంక్షేమానికి పాటుపడుతున్నట్టు? ఎవరి బాగోగుల గురించి ఆలోచిస్తున్నట్టు? 

06:46 - September 24, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో హాస్టల్‌ విద్యార్థులు పోరుబాట పట్టారు. తమ సమస్యలను ఏకరువు పెడుతూ ప్రతిరోజూ విద్యార్థులు ఎక్కడో ఒకచోట ఆందోళన చేస్తూనే వున్నారు. ఒక్కొక్కసారి కలెక్టర్ల దగ్గర ధర్నాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. లాఠీచార్జీలూ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు ధర్నాలకు అనుమతులే ఇవ్వని పరిస్థితి. హాస్టల్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులేమిటి? హాస్టల్స్‌ మూసివేత లాంటి అంశాలు విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? హాస్టల్స్‌ బాగుపడాలంటే ప్రభుత్వం తక్షణం ఏయే అంశాల మీద దృష్టి సారించాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి నూర్‌ మహమద్‌ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్రధాని మోదీ గురువు దయానందగిరి కన్నుమూత

హైదరాబాద్ :ప్రధాని మోదీ గురువు స్వామి దయానందగిరి రిషికేశ్ లోని ఆశ్రమంలో కన్నుమూశారు. ఇటీవలే స్వామి దయానందగిరిని ప్రధాని మోదీ కలిశారు. 

ఆమెరికాలో ప్రధాని మోదీ పర్యటన

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రెండోసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రముఖ మీడియా, సాంకేతిక రంగ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

 

06:34 - September 24, 2015

ఆదిలాబాద్ : వినాయక నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కరెంట్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

డాక్టర్ నాగదుర్గారాణి అదృశ్యం..

హైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్‌ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం వెనుక తమ బంధువుల పాత్ర ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

విశాఖ రైల్వేస్టేషన్‌లో నకిలీ కరెన్సీ పట్టివేత...

విశాఖపట్నం : విశాఖ రైల్వేస్టేషన్‌లో బుధవారం రూ. 5 లక్షల నకిలీ కరెన్సీనీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీ బంగ్లాదేశ్‌ నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

ఆదిలాబాద్ : వినాయక నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కరెంట్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది.

వనపర్తిలోపేకాట రాయుళ్ల అరెస్ట్....

మహబూబ్‌నగర్ : వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు ఉన్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.

పోలీసులపై దాడి చేసి పరారైన ఎర్రచందనం స్మగ్లర్లు...

చిత్తూరు : చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఎర్రగుట్ట దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడి చేశారు. పోలీసులు వీరిని నియంత్రించడానికి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారయ్యారు. ఆ ప్రదేశంలో ఉన్న 38 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం కూలీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Don't Miss