Activities calendar

25 September 2015

21:58 - September 25, 2015

హైదరాబాద్ : ఉనికిని కాపాడుకునేందుకే జగన్ యత్నిస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి కుట్ర రాజకీయాలకు ప్రజలు నమ్మలేరని పేర్కొన్నారు. గడువు లోపే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.

21:54 - September 25, 2015

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ  భారత జాతీయ జెండాను కానుకగా ఇవ్వనున్నారు. ఒబామాకు ఇవ్వనున్న జెండాపై మోడీ తన ఆటోగ్రాఫ్ చేశారు. సెప్టెంబర్‌ 28న సిలికాన్‌ వ్యాలీలో మోడీ ఒబామాతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ప్రముఖ చెఫ్- వికాస్ ఖన్నా చేతుల మీదుగా ఒబామాకు అందించనున్నారు. అయితే జాతీయ జెండాపై మోదీ సంతకం చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జెండాపై మోది సంతకం నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందా..? రాదా.. అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ప్రధాని త్రివర్ణ పతాకంపై సంతకం చేయనే లేదని, ఆ జెండాలో తెలుపు రంగు, అశోక చక్రం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

21:52 - September 25, 2015

ముంబై : మహారాష్ట్ర గవర్నర్‌ను క్షమాభిక్ష పెట్టమని కోరినట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఖండించారు. తాను అలాంటి పిటిషనేమీ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. సంజయ్‌దత్‌కు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు క్షమాభిక్ష పెట్టేందుకు నిరాకరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తి మార్కెండేయ ఖట్జు సంజయ్ దత్ కోసమే కాకుండా జైబున్నిసా ఖాజీ వంటి ఇతర కేసుల్లో నిందితుల కోసం సుమోటోగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని సంజయ్ దత్ తరపు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్ పేర్కొన్నారు. సంజయ్ దత్ శిక్షా కాలం దాదాపుగా పూర్తి కావస్తోందని, త్వరలో ఆయన విడుదలవుతారన్నారు. సంజయ్ దత్ ఉగ్రవాది కాదని కేవలం పొరపాటు మాత్రమే చేశారని ఖట్జు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కారణంతో సంజయ్‌దత్‌ ఎరవాడలో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

 

21:48 - September 25, 2015

విజయవాడ : కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మృత్యుకూపాలుగా మారాయి. డబ్బే పరమావిధిగా భావించిన కాలేజీ యాజమాన్యాలు వేధింపులకు పాల్పడుతున్నాయి. ఎపి మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. నారాయణ కాలేజీలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారుతున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంటుంది. తాజాగా విజయవాడ నిడమనూరులో మరో విద్యా కుసుమం రాలింది. నిడమనూరులోని నారాయణ కాలేజీ ఆవరణంలో అఖిల్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ రెడ్డి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అఖిల్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి మృతి
ఇదిలావుంటే కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధ్యాపకుడి వేధింపులు తాళలేక శ్రీకాంత్ ఇవాళా ఉదయం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. అతని మృతితో తల్లితండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

 

ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి మృతి

కర్నూలు : ఓర్వకల్ మండలం నన్నూరు నారాయణ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అధ్యాపకుడి వేధింపులు తాళలేక శ్రీకాంత్ ఇవాళా ఉదయం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

 

గృహ నిర్మాణాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : గృహ నిర్మాణాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహనిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 400 చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. క్రమంగా ఇళ్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు కడియ శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావులు పాల్గొన్నారు.

 

అదితి కోసం కొనసాగుతున్న గాలింపు

విశాఖ : చిన్నారి అదితి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హెచ్‌బీ కాలనీ నుంచి బీచ్‌ వరకూ ఉన్న డ్రైన్‌లో గాలింపు కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్నారి అదితి డ్రైన్‌ లో పడి 24 గంటలు గడుస్తోంది. 

20:57 - September 25, 2015

హైదరాబాద్‌ : నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాల ధాటికి భాగ్యనగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, ఉప్పల్, మలక్‌పేట, ఎల్బీ నగర్, సంతోష్‌ నగర్లలో భారీ వర్షాలు కురిశాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మదీనాగూడ, చందానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ఎక్కిడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్‌ పొంగి, వాటి నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. దీంతో నడక కూడా కష్టంగా మారిపోయింది.

 

 

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విజయవాడ : నిడమనూరులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అఖిల్ రెడ్డి అనే విద్యార్థి ఓ కార్పొరేట్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  

20:46 - September 25, 2015

విశాఖ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాల వల్లే కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. కాలేజీల్లో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినా కాలేజి యాజమాన్యాలు వాటిని బేఖాతర్‌ చేస్తున్నాయని నేతలు మండిపడుతున్నారు.

 

20:37 - September 25, 2015

గుంటూరు : రేపటి నుంచి గుంటూరులో తలపెట్టిన ఆమరణ దీక్షను జగన్ వాయిదా వేసుకున్నారు. దీక్షకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించడం, పోలీసుల అనుమతి కూడా లేకపోవడంతో దీక్ష తేదీల్లో మార్పులు చేయాలని వైసీపీ నిర్ణయించింది. సోమవారం హైకోర్టు విచారణ తర్వాత తుది తేదీని ఖరారు చేయాలని భావిస్తోంది వైసీపీ. మరోవైపు దీక్షపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
నిరాహారదీక్షకు అవాంతరాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు దీక్షకు అనుమతిచ్చేదిలేదని ఇప్పటికే ప్రకటించాయి. ఎలాగైనా ఈనెల 26న దీక్ష ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఉన్నత న్యాయస్థానంలోనూ ఆ పార్టీకి నిరాశే ఎదురైంది.
పిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు
జగన్‌ ఆమరణ నిరాహార దీక్షకు అనుమతిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. బక్రీద్ కారణంగా సెలవు కావడంతో.. దీన్ని అత్యవసర పిటిషన్‌గా భావించి ఇంట్లోనే విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటి దగ్గర హౌస్ మోషన్ పిటిషన్‌ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు..సాధారణ కోర్టు పని దినాల్లో పిటిషన్‌ వేయాలని సూచించింది.
దీక్ష కొనసాగింపుపై పునరాలోచన
హైకోర్టు తీర్పుతో.. దీక్ష కొనసాగింపుపై వైసీపీ పునరాలోచించింది. సోమవారం మరోసారి హైకోర్టును ఆశ్రయించాలని.. న్యాయస్థానం తీర్పు మేరకు దీక్ష తేదీలను ప్రకటించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. జగన్‌ దీక్షను అడ్డుకుంటున్న చంద్రబాబు పాలన నిరంకుశత్వాన్ని చాటుతోందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
జగన్‌ దీక్ష వ్యవహారంపై టిడిపి ఫైర్..
మరోవైపు.. జగన్‌ దీక్ష వ్యవహారంపై... తెలుగుదేశం నేతలు శుక్రవారం కూడా విరుచుకు పడ్డారు. జగన్‌ దీక్షల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజా సమస్యల కోసం.. ప్రజలకు కష్టాలు సృష్టించే పనులు చేపట్టొద్దని టీడీపీ నేతలు సూచించారు. మొత్తానికి శనివారం నుంచి గుంటూరులో జగన్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష వాయిదా పడింది. సోమవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ ప్రకటించింది. కోర్టు అనుమతించిన తర్వాత దీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

 

20:28 - September 25, 2015

మెదక్‌ : జిల్లాలోని కోహీర్‌ మండలంలోని పిచారగడ్డి గ్రామంలో సినీనటి త్రిష సందడి చేస్తోంది. ఈ గ్రామంలో నాయకి అనే షూటింగ్‌ జరుగుతుండడంతో... చుట్టుపక్కల ప్రజలంతా షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డారు. నాయకి సినిమా కోసం.. మూడు నెలలుగా లొకేషన్‌ వెతికి.. పిచారగడ్డి గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ప్రొడ్యూసర్‌ గిరిధర్‌ చెప్పారు. ఈ సినిమా హర్రర్‌, కామెడీ మిళితమై ఉంటాయని.. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 

ప్రశ్నించే వారిపై నిర్బంధాన్ని ఆపాలి : తమ్మినేని

హైదరాబాద్ : ప్రశ్నించే వారిపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎంబీ భవన్ లో నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా 30న ప్రజా సంఘాల తలపెట్టిన చలో అసెంబ్లీకి సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి జూన్ 2 నుంచి రూ. 6 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బీసీ సబ్ ప్లాన్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు.

 

20:08 - September 25, 2015

హైదరాబాద్ : తనకు అసభ్యకర మెసేజీలు పంపిస్తున్నాడంటు ఓ సెన్సార్ బోర్డు సభ్యురాలు తన అనుచరులతో ఓ డైరెక్టర్ పై దాడి చేయించింది. సదరు వ్యక్తులు రాడ్లతో తీవ్రంగా గాయపరచడంతో డైరెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి.. గత కొద్ది రోజులుగా డైరెక్టర్ శరత్ కుమార్ తనకు అసభ్యకరమైన మెసేజీలు పంపుతున్నాడంటూ తన అనుచరుల చేత అతడిపై దాడి చేయించింది. విచక్షణా రహితంగా దాడి చేయడంతో డైరెక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. రాడ్లతో తలపై కొట్టడంతో శరత్ కుమార్ కు తీవ్ర రక్తస్రావం కూడా అయ్యింది. దీంతో స్థానికులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

20:02 - September 25, 2015

కరీంనగర్‌ : నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు ఓ యువతి బలైంది. బోయిన్‌పల్లి మండలం జగ్గారావుపల్లెకు చెందిన సరిత అనే 19 ఏళ్ల యువతి.. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొందరు ఆకతాయిలు తనను వేధిస్తున్నారంటూ ఆమె లేఖలో పేర్కొంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

19:55 - September 25, 2015

కరీంనగర్ : 'మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా' అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు మావోయిస్ట్ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌ సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ వారిని ఎన్ కౌంటర్ లకు ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

 

19:51 - September 25, 2015

మెదక్‌ : జిల్లాలోని నంగునూర్‌ మండలం వెల్కటూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా కుటుంబకలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. 

19:48 - September 25, 2015

మెదక్‌ : జిల్లాలోని పటాన్‌చెరులో కల్తీకల్లు బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే 18మంది ఇన్‌పేషెంట్లుగా జాయిన్‌ అయ్యారు. అయితే మూడు రోజులుగా కొంతమంది బాధితులకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి నయం కాకపోవడంతో.. సంగారెడ్డికి తరలించారు. బాధితులంతా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ.. వింత చేష్టలు చేస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కల్తీకల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. మందులకు కూడా ఎలాంటి కొరతలేదన్నారు.

 

రాజధాని విషయంలో కాంగ్రెస్ కుట్ర : చంద్రబాబు

విజయవాడ : ఎపి రాజధాని విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో సీఆర్ డీఏ అధికారులతో భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహకారాన్ని తీసుకున్నామని సీఎం తెలిపారు. విభజించినవారు అసూయపడేలా రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్ కు ధీటుగా రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.

 

పశ్చిమబెంగాల్ లో బాంబు పేలుడు...

పశ్చిమబెంగాల్ : బుర్ద్వాన్ లోని పాఠశాల భవనంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అమరావతి మెట్రో సివిల్ పనుల టెండర్లకు ఆహ్వానం

గుంటూరు : అమరావతి మెట్రో సివిల్ పనుల టెండర్లకు ఆహ్వానం పలికారు. డీఎంఆర్ సీ టెండర్లను ఆహ్వానించింది. 12 కిమీ మెట్రో పనులకు 2 భాగాలుగా టెండర్లు వేయనున్నారు. రూ. 314 కోట్లు, రూ. 390 కోట్లతో టెండర్లకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 23న ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

19:30 - September 25, 2015

విజయవాడ : అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎపి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కమిటీ వేసిందని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. రాజధాని రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. రాజధాని నిర్మాణం కోసం భూముల సమీకరణకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొస్తే దానికి కూడా అడ్డు తగిలారని మండిపడ్డారు. అయినా రైతులు.. స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులను రెచ్చగొట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని తెలిపారు. రాజధాని విషయంలో కూడా కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. అసెంబ్లీలో కూడా రాజధాని రాకుండా ప్రయత్నించారని పేర్కొన్నారు. సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఉచితంగా సహకరిస్తుందన్నారు. గతంలో ఏర్పడిన రాష్ట్రాలకు ఇంకా రాజధాని నిర్మాణం పూర్తి కాలేదని గుర్తు చేశారు.

 

అన్నీ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు

విజయవాడ : అన్నీ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని తెలిపారు. 

మక్కాలో కరీంనగర్ వాసి గల్లంతు

కరీంనగర్ : మక్కాలో జగిత్యాల మండలం ఉస్మాన్ పుర వాసి అబ్దుల్ అజీజ్ గల్లంతయ్యాడు. ఈనెల 2న అజీజ్ దంపతులు హజ్ యాత్ర నిమిత్తం మక్కాకు వెళ్లారు. అయితే అజీజ్ కనిపించడం లేదని ఆయన భార్య నఫీసా ఇంటికి ఫోన్ చెప్పింది. నిన్న మక్కాలో తొక్కిసలాట జరిగడంతో 717 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

18:57 - September 25, 2015

ఢిల్లీ : ఈద్‌-ఉల్‌-జుహా సందర్భంగా భారత్‌-బంగ్లా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. బిఎస్‌ఎఫ్‌ జవాన్లు బంగ్లా సైనికులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల సైనికులు ఆప్యాయంతో ఆలింగనం చేసుకున్నారు. ఇరు దేశాల్లో ప్రధాన పండగల సందర్భంగా సరిహద్దులో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితి.

18:24 - September 25, 2015

జైపూర్ : రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వం గనుల కేటాయింపుల్లో భారీ అక్రమాలకు పాల్పడిందని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ ఆరోపించారు. 45 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు. రెండున్నర నెలల లోపు 653 పైగా మైనింగ్‌ లీజులను వేలం వేయకుండా రాజస్థాన్‌ ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని పేర్కొన్నారు. లక్షా 47 వేల ఎకరాల మైనింగ్‌ భూములను ప్రభుత్వం తమ అనుయాయులకు ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. ఈ భూముల్లో ఉన్న సిలికాన్‌, జిప్సం, తదితర ఖనిజాల విలువ రెండు లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకున్నారని ఆయన ఆరోపించారు.

18:20 - September 25, 2015

ఖమ్మం : ముఖ్యమంత్రి నుంచి మంత్రి మండలి సభ్యులంతా.. తమ వృథా ఖర్చులను వదులుకోవాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య సూచించారు. ఖమ్మంలో టిపిఈఆర్ ఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఇతర పథకాలకు వెచ్చించే నిధులను తగ్గించి, విద్యా రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా హామీని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ.. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ మేరకు గ్రామస్థాయిలో ఆయా తరగతులకు సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

 

18:15 - September 25, 2015

చిత్తూరు : తిరుపతిలోని కొర్లగుంట జంక్షన్‌లోని సాయిబాబా ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఆర్పేందుకు భక్తులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగి ఎగసిపడిన మంటలతో.. స్వామివారి పూజా సామగ్రి, పల్లకి, చిత్రపటాలు, ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీపాలు వెలిగించినప్పుడు మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే మరోవైపు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉంటుందని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు.

 

18:03 - September 25, 2015

అతివల అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. అలాంటి ఆభరణాలలో కొందరు సింపుల్ గా ఉండే వాటిని ఇష్టపడితే మరి కొందరు ప్రత్యేక సందర్భాలలో హెవీగా ఉండే ఆభరణాలకు ప్రాధాన్యతనిస్తారు. అయితే బంగారం ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో వన్ గ్రాం ఆభరణాలు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. అలాంటి ఆభరణాలను మీ ముందుకు తెచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం... 

17:43 - September 25, 2015

సమానత్వం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ
బాలికల సంరక్షణ, లింగనిష్పత్తి లో సమానత్వం కోసం కృషి చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లో సదస్సు నిర్వహించింది. భేటీ జిందాబాద్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మహిళలను అగౌరవపరిచే తీరును సహించేది లేదు.. 
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం పలు నియమ నిబంధనలు ఆచరణలోకి తీసుకువస్తోంది. మహిళలను అగౌరవపరిచే తీరును సహించేది లేదని స్పష్టం చేసింది.
ఆడపిల్లల కోసం సరికొత్త పథకం 
ఎదుగుతున్న క్రమంలో ఆడపిల్లల ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం పదేళ్లు నిండిన ఆడపిల్లలు వారి పొదుపు ఖాతాను వారే నిర్వహించుకునే వెసులుబాటును కల్పించింది.
అక్కడ ఆడపిల్లలు తమకిష్టమైన వస్త్రాలను ధరించేందుకు వీలులేదు
సమాజంలో సగభాగమైన మహిళా లోకంపై అనేక ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనటానికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది ఈ నిబంధన. అక్కడి ఆడపిల్లలు తమకిష్టమైన వస్త్రాలను కూడా ధరించేందుకు వీలులేదంటోంది ఆ గ్రామ కౌన్సిల్.

17:38 - September 25, 2015

మహిళలు సాధికారత సాధనలో భాగంగా అటు విద్య, ఇటు ఉద్యోగాలలో రాణిస్తున్నారు. అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో అనేక చోట్ల లైంగిక వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. మరి ఈ స్థితికి ఎలాంటి పరిష్కారమార్గాలున్నాయో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియాల్లో చూద్దాం....


 

ఆకతాయిల వేధింపులతో యువతి ఆత్మహత్య

కరీంనగర్ : బోయిన్ పల్లి మండలం జగ్గారావుపల్లెలో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సరిత(19) అనే యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఆకతాయల వేధింపులే కారణమంటూ లేఖ రాసింది. 

బాలిక గల్లంతు ఘటనపై విచారణకు ఆదేశం..

హైదరాబాద్ : విశాఖలో బాలిక గల్లంతు ఘటనపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

అపహరించిన ఇద్దరిని విడిచిపెట్టిన మావోయిస్టులు

విశాఖ : ముంచంగిపుట్ట మండలం కరపాదరులో నిన్న అపహరించిన ఇద్దరిని మావోయిస్టులు విడిచిపెట్టారు. లక్ష్మీపురం ఉప సర్పంచ్, సాక్షరభారత్ సమన్వయకర్తను మావోయిస్టులు నిన్న కిడ్నాప్ చేశారు. ఇవాళా వారిని విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

16:39 - September 25, 2015

హైదరాబాద్ : మక్కాలో తొక్కిసలాటలో మరణించిన హైదరాబాద్‌ నివాసి బీబీజాన్‌ కుటుంబసభ్యులను తెలంగాణ రాష్ట్ర మంత్రి పీ మహేందర్‌ రెడ్డి పరామర్శించారు. ఎల్బీ నగర్‌లోని వారి మృతురాలి స్వగృహానికి వెళ్లిన మంత్రి మహేందర్‌ రెడ్డి వారికి సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులను మక్కాకు పంపేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

 

16:36 - September 25, 2015

హైదరాబాద్ : జగన్ దీక్షను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసిపి నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడివయాతో మాట్లాడారు. జగన్ దీక్షకు సంబంధించి చంద్రబాబు యక్ష ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు మీడియా ప్రతినిధులకే సీఎం ప్రశ్నలు వేశారని గుర్తు చేశారు. జగన్ దీక్ష వల్ల ట్రాపిక్ జాంతోపాటు అనేక అనేక సమస్యలు వస్తాయనడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు గతంలో ఢిల్లీలో, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్ష ఎందుకు చేశారని ప్రశ్నించారు. దీక్ష అంటే ఆయనకు ఒక్కడికే తెలుసు అన్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. జగన్ దీక్ష వల్ల చంద్రబాబు భయపడతున్నారని పేర్కొన్నారు. అందుకు జగన్ చేపట్టబోయే దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. జగన్ దీక్ష వల్ల ఎపికి ప్రత్యేకహోదా వస్తుందన్నారు.

 

16:08 - September 25, 2015

కడప : జిల్లా పోలీసులు అంతర్జాతీయ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఈమధ్య అరెస్టు చేసిన ముగ్గురు ఘరానా స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీలో అరెస్టు చేసిన వీరి దగ్గర నుంచి పదికోట్ల రూపాయల విలువైన 11టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కడప స్మగర్ల విచారణలో వీరి ఆచూకీ దొరికిందని ఎస్పీ నవీన్ గులాఠి తెలిపారు. ఈ దుంగలను కడపకు తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని... లారీ డ్రైవర్‌తోపాటు.. కానిస్టేబుల్ ప్రసాద్ మృతిచెందారని చెప్పారు.

16:03 - September 25, 2015

గుంటూరు : జిల్లాలో విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో సరదాగా గడపడానికి వచ్చిన విద్యార్థుల్లో నలుగురు స్నానం చేస్తూ గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం ఈతగాళ్లు సముద్రంలో గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వడ్లమూడి విజ్ఞాన్ కళాశాలలో బీటెక్‌ సెకండియర్ చదువుతున్న 12 మంది విద్యార్థులు సూర్యలంక సముద్రంతీరం వెళ్లారు. వీరిలో మహేష్‌ నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి కాగా...కృష్ణప్రసాద్ పొన్నూరు, జయదేవ్ గుంటూరు, శ్రీనివాస్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. చేతికొచ్చిన కొడుకులు కానరాని లోకాలకు తరలిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

15:58 - September 25, 2015

హైదరాబాద్ : జగన్‌ దీక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల కోసమని.. ప్రజలకు కష్టాలు సృష్టించే పనులు చేపట్టొద్దని కోరారు. జగన్‌కు ఇప్పుడే సమస్యలు గుర్తుకు కొస్తున్నాయా.. అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోద కోసం మోడీని అడగాలని.. అందుకు ఢిల్లీలో దీక్షలు చేయకుండా.. గల్లీల్లో చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.

విద్యార్థుల గల్లంతు ఘటనపై విచారణకు ఆదేశం...

గుంటూరు : సూర్యలంక బీచ్ లో విద్యార్థుల గల్లంతు ఘటనపై విచారణకు మంత్రి చినరాజప్ప ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో గాలించాలని మంత్రి ఆదేశించారు. 

ఎమ్మెల్సీ సలీమ్ ఇంట్లో బక్రీద్ విందు

హైదరాబాద్ : ఎమ్మెల్సీ సలీమ్ ఇంట్లో బక్రీద్ విందుకు సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్, ఎంపీ కవితలు హాజరయ్యారు. 

గెయిల్, షెల్ తో సంయుక్తంగా ఎల్ ఎన్ జీ టెర్మినల్

విజయవాడ : కాకినాడలో గెయిల్, షెల్ తో సంయుక్తంగా ఎల్ ఎన్ జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద కుదిరింది. ఒప్పందంలో ఎపి ప్రభుత్వానికి 48 శాతం వాటా. 

15:39 - September 25, 2015

వరంగల్‌ : జిల్లాలోని ఎంజీఎంలో స్వైన్‌ఫ్లూతో మూడేళ్ల బాలుడు చనిపోయాడు. డోర్నకల్‌కు చెందిన బత్తుల జన్ను ప్రసాద్‌ ను మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు. దీంతో డాక్టర్లు బాలుడి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం బ్లడ్‌ శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అయితే.. స్వైన్‌ ఫ్లూ చికిత్స నిర్వహించకముందే ప్రసాద్‌ మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

14:44 - September 25, 2015

హైదరాబాద్ : గుంటూరులో జగన్ దీక్షకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వైసిపి హౌస్ మోషన్ దాఖలు చేసింది. అయితే వైసిపి వేసిన హౌస్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వైసిపి ఈనెల 28న హైకోర్టులో రెగ్యులర్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్ : గుంటూరులో జగన్ దీక్షకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వైసిపి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే వైసిపి వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. 

రాజకీయం కోసమే జగన్ దీక్ష : సోమిరెడ్డి

హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై జగన్ దీక్ష రాజకీయం కోసమే టిడిపి నేత సోమిరెడ్డి విమర్శించారు. ఎపి అభివృద్ధికి ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసన్నారు. విభజన చట్టం అమలుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకహోదాపై జగన్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇవ్వాల్సిన వారిని కాకుండా సీఎంనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

 

13:55 - September 25, 2015

హైదరాబాద్ : భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్..... జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ....టెన్నిస్ వండర్, అమెరికన్ బ్లాక్ థండర్.. సెరెనా విలియమ్స్.....టీమిండియా యంగ్ గన్ విరాట్ కొహ్లీ...ఈ పేర్లు వినగానే ఆయా క్రీడల్లో స్టార్లుగా మాత్రమే కాదు...క్రీడాకారులుగా వందలకోట్లు సంపాదించిన సెలబ్రిటీలుగా మనకు కనిపిస్తారు. అయితే..వీరి సంపాదనలో కొంత భాగాన్ని క్రీడావ్యాపారంలోనూ, లీగ్ ల బిజినెస్ లోనూ పెట్టుబడులను పెట్టి...లక్షల్ని కోట్లుగా మార్చుకొంటున్నారు.

బ్యాడ్మింటన్ ఫ్రాంచైజీల ఓనర్ గా సచిన్...

భారత క్రికెట్ దేవుడిగా ఒకవెలుగు వెలిగిన సచిన్...రిటైర్మెంట్ తర్వాత...ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ ఫ్రాంచైజీల ఓనర్ గా అవతారమెత్తాడు. ఇండియన్ సూపర్ లీగ్ సాకర్ పోటీల్లో పాల్గొంటున్న కేరళ బ్లాస్టర్స్ టీమ్ కో-ఓనర్ గా సచిన్ వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టుకు పీటర్ టేలర్ కోచ్ గా ఉంటే, స్పానిష్ స్టార్ కార్లోస్ మార్చెనా ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు..ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో సైతం...సచిన్ కో-ఓనర్ గా నిలిచాడు.

సునీల్ గవాస్కర్.....

భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ కు క్రికెట్ తర్వాత..బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని ఇప్పుడు ముంబై మాస్టర్స్ జట్టు కోఓనర్ గా మలచుకొన్నాడు. మలేసియా ఆల్ టైమ్ గ్రేట్ లీ చాంగ్ వీ..ఈ జట్టులో స్టార్ ప్లేయర్ గా ఉన్నాడు. టీమిండియా యంగ్ గన్ , టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ...ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ లో...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్స్ ఫ్రాంచైజీ కో-ఓనర్ గా తరించిపోతున్నాడు. ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్, ఇండియన్ టెన్నిస్ షాన్ సానియా మీర్జా..కొహ్లీ ఫ్రాంచైజీలో ప్రధాన ప్లేయర్లుగా ఉన్నారు.

సౌరవ్ గంగూలీ...

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...ఇండియన్ సూపర్ లీగ్ చాంపియన్ అత్లెటికో డీ కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. 2014 ప్రారంభసీజన్లో గంగూలీ ఓనర్ గా ఉన్న జట్టే విజేతగా నిలవడం విశేషం. స్పానిష్ స్టార్లు జోసెమీ, ఆంటోనియో లోపేజ్, పోర్చుగీస్ స్టార్ హెల్డెర్ పోస్టీగా....కోల్ కతా జట్టులో సభ్యులుగా ఉన్నారు. మహిళాటెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ సైతం...నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ఫ్రాంచైజీ మియామీ డాల్ఫిన్స్ ఓనర్లుగా ఉన్నారు. 2009 సీజన్ నుంచి సెరెనా, వీనస్ భాగస్వాములుగా ఉన్నారు.

మహేంద్రసింగ్ ధోనీ...

ఇక...టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ... మోటార్ రేసింగ్ లో.. మహీరేసింగ్ టీమ్ కు, జాతీయహాకీ లీగ్ లో జార్ఖండ్ ఫ్రాంచైజీకి చెందిన రాంచీ రైనోస్ జట్టుకు ఓనర్ గా ఉండటమే కాదు...ఇండియన్ సూపర్ లీగ్ సాకర్ లో...చెన్నైయన్ ఫుట్ బాల్ క్లబ్ కు కో-ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. క్రీడల ద్వారా తాము సంపాదించిన కోట్ల రూపాయలను తిరిగి ఆయా క్రీడల లీగ్ లకే ఖర్చు పెట్టడం...క్రీడాసేవగా మాత్రమే కాదు..లాభసాటి వ్యాపారంగానూ తృప్తినిస్తోందనడంలో ఎలాంటి సందేహమూలేదు.

13:51 - September 25, 2015

హైదరాబాద్ :  హైద్రాబాద్ సెంట్రల్ యునివర్సిటీ మరో సారి వివాదాల్లో చిక్కుకుంది. పాలక మండలి తీసుకొచ్చిన డ్రెస్ కోడ్ వ్యవహరం తాజా వివాదానికి కేంద్రమైంది. శిల్పకళా వేదికగా అక్టోబర్ 1 న స్నాతకోత్సం నిర్వహిస్తోంది యునివర్సిటీ. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి డ్రెస్ కోడ్ ను విధించింది. గతంలో పట్టాలు పుచ్చుకునే విద్యార్ధులు నల్లటి గౌన్లను ధరించేవారు. అది కూడా ఇష్టముంటేనే. లేని పక్షంలో రోజు మాదిరిగానే వచ్చేవారు. అయితే ఈ విధానాన్ని మార్చేసారు.

డ్రస్ కోడ్...

నల్ల గౌన్ల స్థానంలో అందరు ఒకే రకమైన డ్రెస్ ధరించాలని ఆదేశాలు జారి చేసింది యునివ్సరిటీ పాలకమండలి. అందరు చేనేత దుస్తులు వేసుకురావాలని, పట్టాలు పుచ్చుకునే విద్యార్ధులకు సమాచారం అందించారు. అమ్మాయిలైతే చీర లేదా కుర్తా కమీజ్ లు..అబ్బాయిలైతే కుర్తా పైజామా లేదా కుర్తా ధోతి వేసుకు రావాలని షరతు విధించారు. డ్రెస్ కోడ్ ను పాటించని విద్యార్ధులపై చర్యలుంటాయని వర్సిటీ అధికారులు హెచ్చరించారు.

మండిపడుతున్న విద్యార్థుళు..

అయితే అధికారుల తీరుపై విద్యార్ధులు మండి పడుతున్నారు. పట్టాలకు.. వేసుకునే డ్రెస్ లకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చీరలు, దోతి, కుర్తా వంటివి హిందూ సంస్కృతిలో భాగమని వాటిని తమపై రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. మోడీ హయంలో క్యాంపస్ ల కాషాయికరణలో భాగంగానే డ్రెస్ కోడ్ ను తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు.

కాషాయికరణను అడ్డుకుంటాం...

క్యాంపస్ లో కాషాయికరణను అడ్డుకుని తీరుతామంటున్నారు విద్యార్థులు. యునివర్సిటీ తన నిర్ణయాన్ని మార్చుకోని పక్షంలో స్నాతకోత్సవాన్ని బహిష్కరించి అక్కడే నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ యునివర్సీటీ విద్యార్ధుల పోరాటం మరింత తీవ్రం కానుంది.

13:48 - September 25, 2015

కృష్ణా : చందర్లపాడు మండలం ఉస్తేపల్లి వద్ద కృష్ణానదిలో చమురు తెట్టు, బుడగలు ఏర్పడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు పరిశీలించేందుకు ఘటనా స్థలికి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.

 

13:46 - September 25, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కావాలంటూ గుంటూరులో ఏసీ కాలేజీ ఆవరణ లో వైసీపీ అధినేత జగన్‌ దీక్షకు అనుమతినివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైసిపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి జస్టిస్ శేషసాయి నివాసంలో వాదనలు ప్రారంభమయ్యాయి. 

13:44 - September 25, 2015

హైదరాబాద్ : మరో విద్యాకుసుమం నేల రాలింది. కర్నూలు నారాయణ కాలేజీలో చదువుతున్న శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయిన శ్రీకాంత్‌ ఓర్వకల్లు మండలం నన్నూరులో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. అధ్యాపకుడి వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ద్వంద్వ విధానాల వల్లే.....

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాల వల్లే కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. కాలేజిల్లో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినా కాలేజి యాజమాన్యాలు వాటిని బేఖాతర్‌ చేస్తున్నాయని స్టూడెంట్ లీడర్స్ మండిపడుతున్నారు.

ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్

హైదరాబాద్ : హసన్ భాయ్, నఫీస్ హుస్సేన్, అశోక్ కుమార్ అగర్వాల్ అనే ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 కోట్లు విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్ లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ స్మగ్లర్లు చిక్కారు. వెంటనే వారిని కడప తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ, జైపూర్ లో 3 గోదాములు జప్తు చేశామని, నిందితులు దుబాయ్ కు చెందిన అలీభాయ్ అనుచరులుగా పోలీసులు ధ్రువీకరించారు. 

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి చేయతలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పిటిషన్ పై జస్టిస్ శేషసాయి నివాసంలో నేడు విచారణ జరగనుంది. రేపు నిర్వహించాలనుకున్న దీక్షపై కోర్టు సాయంత్రంలోగా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు ఆదేశాల కోసం వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. 

సూర్యలంక బీచ్ లో ఇద్దరి గల్లంతు..

గుంటూరు: సూర్యలంక బీచ్‌లో దారుణం జరిగింది. ఈతకు వచ్చిన యువకులు మృత్యువాదపడ్డారు. ముగ్గురు యువకులు ఈతకు రాగా ఇందులో ఇద్దరు గల్లంతయ్యారు. మరొకరి కోసం గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విద్యార్థులు స్థానిక కళాశాలకు చెందినవారైనట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

త్వరలో ట్విట్టర్లో ఎంట్రీ ఇస్తున్న 'ఐష్'

హైదరాబాద్ : బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నటి ఐశ్వర్యారాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది. రిఎంట్రీ సినిమా 'జజ్బా' రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 8న ఈ మాజీ మిస్ వరల్డ్ తన ట్విట్టర్ ఖాతా తెరవబోతుంది. ఆ తరువాతి రోజు విడుదలవబోయే తన కొత్త చిత్రం గురించిన విశేషాలను ఐష్ అభిమానులతో పంచుకుంటుంది. ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ అందాలభామ ఇప్పుడెందుకు రాబోతుంది అని చాలామంది మనసులో ప్రశ్నించుకుంటున్నారు.

12:54 - September 25, 2015

విజయవాడ : ప్రశ్నిస్తే పోలీసు లాఠీలు కుళ్లబొడుస్తున్నాయి..! నిలదీస్తే.. ఖాకీ బూట్లు కర్కశంగా తొక్కేస్తున్నాయి..! నిరసన తెలిపితే నిర్దాక్షిణ్యంగా ఈడ్చేస్తున్నారు..! న్యాయం అడిగితే అన్యాయంగా చావబాదుతున్నారు..! ఆందోళన చేసేవారికి బేడీలు వేస్తున్నారు, ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు..! అసలు, చంద్రబాబు ఏలుబడిలో ఏం జరుగుతోంది..? ప్రజా ఉద్యమాలను అణిచేయ చూస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు ఎలాంటి సందేశమిస్తోంది..??

విద్యార్థులను చావబాదుతున్నారు......

సమస్యలు పరిష్కరించాలన్న విద్యార్థులను చావబాదుతున్నారు... భూములు లాక్కోవద్దంటున్న రైతులను బెదిరిస్తున్నారు... నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్బంధం ప్రయోగిస్తున్నారు... ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక చర్య రాజ్యమేలుతోంది. నిరసన తెలిపే స్వేచ్ఛను, ఆందోళన చేసే హక్కును కూడా హరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగిస్తున్న పాలనను తరచిచూస్తే ఇలాంటివి ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆందోళనలు కలుగుతున్నాయి.

నెలల తరబడి ఆందోళన చేస్తున్న బాధితులు......

మా బతుకులపై రన్‌వే నిర్మించొద్దంటూ.. మా జీవితాలపై విమానాల రాకపోకలు సాగించొద్దంటూ భోగాపురం ఎయిర్‌ పోర్టు బాధితులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు పచ్చటి భూములను బలిచేయొద్దని, తమ బతుకులను బలివ్వొద్దంటూ నిరసన తెలుపుతున్నారు. వాళ్లు ఎన్నిరకాల ఆందోళనలు చేసినా వినిపించుకోని ప్రభుత్వం.. భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. బలవంతంగానైనా భూములు తీసుకుని తీరుతామంటూ పరోక్షంగా తేల్చిచెప్పింది.

బందరు పోర్టు వ్యవహారంలోనూ అదే తీరు....

ఇక రాజధాని భూముల విషయంలోనూ, బందరు పోర్టు భూముల అంశంలోనూ ప్రభుత్వం నిర్బంధ సూత్రాన్నే అమలు చేస్తోంది. రాజధానికోసం అవసరానికి మించి వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు బందరు పోర్టు విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. వేలాది ఎకరాలను లాక్కుంటున్న ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు. బందరు పోర్టు భూములను బలవంతంగా లాక్కునేందుకే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యార్థులకు కొట్టించిన సర్కార్‌......

ఇక, ఇటీవల విద్యార్థులపైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రతాపం చూపింది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తోపాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరడమే విద్యార్థుల పాపమైంది. తమను ఆదుకోవాలని నినదించినందుకు విద్యార్థులపట్ల అమానుషంగా ప్రవర్తించింది. ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు.. విద్యార్థులను రోడ్డుమీద పడేసి గొడ్డును బాదినట్టు బాదారు.

ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అరెస్ట్‌ ......

ప్రతిపక్షాలను సైతం ప్రభుత్వం వదలడం లేదు. భూములు కోల్పోతున్న రైతులతో ముచ్చటించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును మధ్యలోనే అడ్డగించిన పోలీసులు.. అక్రమంగా అరెస్టు చేశారు. తాజాగా.. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపడుతున్న వైసీపీ విషయంలోనూ ఇదేతరహా విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గుంటూరులో దీక్ష చేపట్టేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారు. దీంతో.. అటు వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.

తుళ్లూరులో పోలీసుల నిర్భంధం.....

తుళ్లూరు వాసులది మరో వేదన. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చి.. నిరాశ్రయులైన ఈ ప్రాంత రైతులు.. నెలనెలా ప్రభుత్వం ఇస్తామన్న చెక్కులు అందక పోవడంతో ఆందోళనకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల నుంచి నిర్బంధం ఎదురైంది. నిలదీస్తే నిర్బంధాలు.. రోడ్డెక్కితే అరెస్టులు.. జరుగుతుండడంతో.. వీరు బయటకు వచ్చేందుకే జంకారు. అయితే.. తమ నిరసనను వ్యక్తీకరించేందుకు.. వినూత్నంగా గృహదీక్షకు కూర్చున్నారు.

ప్రశ్నించిన వారికి నిర్బంధం.....

ఈ విధమైన చర్యల ద్వారా.. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నించిన వారికి నిర్బంధం తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ప్రభుత్వం జనాల్లోకి పంపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ప్రజాసంఘాలు మాత్రం సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిర్బంధానికి పరాకాష్టగా నిలిచిన గత పాలనను గుర్తుచేసుకోవాలని, పాత బాటలోనే మళ్లీ పయనిస్తే.. ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాయి...

12:51 - September 25, 2015

గుంటూరు : ఎలుకల దాడిలో శిశువు మృతి ఘటనలో బదిలీ వేటు పడింది.. గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఇంఛార్జ్ సూపరిండెంట్, పిల్లల విభాగం హెచ్ ఓడీ లను బదిలీచేసింది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు ఆస్పత్రిలో యుద్ధప్రాతిపదికన నడుస్తున్న స్పెషల్ డ్రైవ్ రేపటితో పూర్తికానుంది.. చెత్తా చెదారం శుభ్రం చేయడంతోపాటు... అత్యవసర సదుపాయాలపై దృష్టిపెట్టారు అధికారులు..

కొనసాగుతున్న ఆపరేషన్ జీజీహెచ్...

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ జీజీహెచ్ కొనసాగుతోంది.... 72గంటల ప్రత్యేక డ్రైవ్‌లోభాగంగా పనులు వేగంగా నడుస్తున్నాయి. నగరపాలకసంస్థకు చెందిన 5వందలమంది శానిటేషన్ సిబ్బందితో పాటు.. మరో యాభైమంది యుద్ధప్రాతిపదికన క్లీనింగ్ చేస్తున్నారు.. శిధిలావస్థలోఉన్న కొన్ని నిర్మాణాలకు మరమ్మత్తులు చేస్తున్నారు.. శానిటేషన్ మెరుగుపర్చటం, వార్డుల్లో ఎలుకలు, పాములు లేకుండా చేయటం, రోగులకు వసతి సౌకర్యాలు కల్పించటంపై ఈ డ్రైవ్‌లో ప్రత్యేక దృష్టిపెట్టారు.. ఈ నెల 25వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది..

ప్రత్యేకాధికారిగా పులిచింతల డిప్యూటీ కలెక్టర్ రఘునాథ్...

వచ్చే నెలలో సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వస్తున్నారు.. అప్పుడు ప్రభుత్వాస్పత్రిని సందర్శించే అవకాశముంది.. సీఎం వచ్చేలోపే ఆస్పత్రిని సెట్ చేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆస్పత్రి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పులిచింతల డిప్యూటీ కలెక్టర్ రఘునాథ్‌ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు..

వేణుగోపాలరావు స్థానంలో ప్రొ. రాజనాయుడుకు బాధ్యతలు....

అటు ఎలుకల దాడిలో శిశువు మృతి ఘటనలో అధికారులపై బదిలీవేటు పడింది.. ఇంఛార్జ్ సూపరిండెంట్ వేణుగోపాలరావును వైద్య విద్య సంచాలకుడి కార్యాలయానికి ప్రభుత్వం బదిలీచేసింది.. ఆయన స్థానంలో ప్రొఫెసర్ రాజనాయుడుకు సూపరిండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.. చిన్నపిల్లల విభాగం హెచ్ ఓడి భాస్కరరావును కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది సర్కారు.. మరోవైపు ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యల మెరుగుకోసం దాతల సహకారం తీసుకుంటున్నారు.. హృదయ్ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు.. అలాగే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆస్పత్రికోసం ఒకరోజు జీతనాన్ని విరాళంగా ఇచ్చారు.. 

12:47 - September 25, 2015

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్ లేని తెలంగాణ కోసం ఈ నెల 30న చలో అసెంబ్లీకి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని విరసం, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మావోయిస్టులు శృతి, విద్యాసాగర్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. శృతి, విద్యాసాగర్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విరసం నేత వరవరరావు డిమాండ్‌ చేశారు.

12:46 - September 25, 2015

హైదరాబాద్ : మరో విద్యాకుసుమం నేల రాలింది. కర్నూలు నారాయణ కాలేజీలో చదువుతున్న శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయిన శ్రీకాంత్‌ ఓర్వకల్లు మండలం నన్నూరులో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. అధ్యాపకుడి వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ స్వస్థలం కర్నూలు జిల్లా ఉల్లిందుకొండ. జరిగిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

12:43 - September 25, 2015

హైదరాబాద్ : ఉద్యోగుల విభజన అంశంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు వేగం పెంచారు. కమలనాథన్‌ కమిటీ పని సులువయ్యేలా వీరిద్దరూ స్వయంగా రంగంలోకి దిగారు.ఇన్నాళ్లూ కమిటీ ఇచ్చిన నివేదికపై ఆధారపడి.. తొమ్మిది, పది షెడ్యూళ్ల అంశాలను మాత్రమే పర్యవేక్షించిన సీఎస్‌లు... ఇప్పుడు మొత్తం వ్యవహారంపైనా దృష్టి సారించారు.

75 శాఖల్లో పూర్తయిన విభజన ప్రక్రియ......

విభజన ప్రక్రియలో ఇప్పటికే దాదాపు 75 శాతం శాఖల్లో పని పూర్తయింది. ఇక 34 శాఖల్లో విభజనే మిగిలింది. ఇంతకు ముందే విభజించిన శాఖలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలూ వచ్చాయి. దీంతో.. భవిష్యత్తులో ఉద్యోగులెవరూ కోర్టులు, ట్రైబ్యునల్స్‌కి వెళ్లే అవకాశం లేకుండా సమస్యను జాగ్రత్తగా పరిష్కరించాలని సీఎస్‌లు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మిగిలిపోయిన 34 శాఖల్లోని ఉద్యోగుల విభజనను కూడా ఈనెల 27, 28, 29 తేదీల్లో పూర్తి చేయాలని కమలనాథన్‌ కమిటీని కోరారు.

సంక్షేమ, ఆర్థిక, ఆర్కియాలజీ అండ్‌ మైనింగ్‌ శాఖల్లో విభజన......

ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిపే విభజన ప్రక్రియలో.. సంక్షేమ, ఆర్థిక, ఆర్కియాలజీ అండ్‌ మైనింగ్‌, పౌరసరఫరాలు, అటవీ, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయం, పశుసంవర్ధక, పాఠశాల విద్య, తదితర 34 శాఖల అధిపతులతో కమలనాథన్‌ కమిటీ సమావేశమవుతుంది. అనంతరం 30న ఇద్దరు చీఫ్‌ సెక్రెటరీలూ కూర్చుని కమిటీ తీర్మానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు ఇతర పెండింగ్‌ సమస్యల పరిష్కారానికీ ఇద్దరు సీఎస్‌లు ప్రయత్నించనున్నారు. 

12:40 - September 25, 2015

హైదరాబాద్ : బక్రీద్ సంధర్భంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని మీర్‌ ఆలం ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బక్రీద్ పర్వదినం యొక్క ఆవశ్యకతను మత పెద్దలు వివరించారు. పాతబస్తీలో 25వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు సిపి మహేందర్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

12:38 - September 25, 2015

కర్నూలు : జిల్లాలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజే బక్రీద్ రావటంతో భారీ ఎత్తున ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇది ఇలా ఉంటే అటు వినాయక నిమజ్జనంతో పాటు ఇటు బక్రీద్‌ కూడా ఒకటే రోజు రావటంతో ఎలాంటి అవాంఛనీయఘటనలు జరుగకుండా పోలీసులు పూర్తి స్ధాయి బందోబస్తు ఏర్పాటు చేసారు. అయినా మతాలు వేరయినా తామంతా కలిసే ఉంటామని ముస్లిం సోదరులు చెప్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు

ప్రకాశం : దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెలిగొండయ్య అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సచిన్ దత్తత గ్రామానికి 'ఆదర్శ' పురస్కారం..

హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ దత్తత గ్రామానికి జాతీయస్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారికండ్రిగకు ఆదర్శ గ్రామం పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన'పై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ నుంచి నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ పురస్కారం అందుకున్నారు. సచిన్ దత్తత గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జేసీ అహ్మద్ ఈ సమావేశంలో వివరించారు. 

12:21 - September 25, 2015

ముంబై: మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆమె ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది.

తనపై వివక్ష చూపిస్తున్నారు...

సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని మేరో కోమ్ ఆరోపిస్తున్నారు. వారి ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని గమనించాలన్నారు.

పింకీ జాంగ్రాకే ఎక్కువ ప్రాధాన్యతని....

తన చేతిలో అనేకసార్లు ఓడిపోయిన హర్యానాకు చెందిన పింకీ జాంగ్రాకే సెలక్లర్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఒలింపిక పతక విజేత మేరీకోమ్ వాపోయింది. అయినా తాను నిరుత్సాహపడననీ,తనకీ అవమానాలు, వివక్ష కొత్తకాదనీ, గతంలో ఇలాంటివి చాలా అనుభవించానన్నారు. తానేంటో బాక్సింగ్ రింగ్ లో నిరూపించుకుంటానంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయింది. దీంతో పక్కనే సింధు ఆమెను ఓదార్చారు.

నారాయణ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య..

కర్నూలు: నారాయణ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో ఉన్న జూనియర్ కాలేజ్ లో ఈ ఘటన సంభవించింది. శ్రీకాంత్ స్వస్థలం కర్నూలు జిల్లా ఉల్లిందుకొండ. అయితే, ఈ ఆత్మహత్య కాలేజీ వెలుపల జరిగిందని యాజమాన్యం చెబుతోంది. జరిగిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

జమ్మూకశ్మీర్ లో భారీ అగ్ని ప్రమాదం...

హైదరాబాద్  : జమ్మూకశ్మీర్‌లోని దోడ జిల్లా ట్రయింకా గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాలు, రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

12:00 - September 25, 2015

విశాఖ : నగరంలో నాలాలో పడి కొట్టుకుపోయిన చిన్నారి అతిధి మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. అయితే ఈ ఘటనపై విశాఖ వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత జీవిఎంసీ అధికారులే వహించాలని నిప్పులు చెరుగుతున్నారు. చిన్నాది అతిధి ప్రాణాన్ని ఎవరు తిరిగి తెచ్చిస్తారని ప్రశ్నిస్తున్న విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారి అతిధి మృతదేహం కోసం తీవ్ర గాలింపు నిర్వహిస్తున్నామని విశాఖ మున్సిపల్ కమిషనర్‌ చెప్పారు. డ్రైనేజ్‌లు అన్నీ క్లీన్‌గా ఉండటంతో మృతదేహం నేరుగా సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటుదని కమిషనర్ అభిప్రాయపడ్డారు.

11:58 - September 25, 2015

ఖమ్మం : ఫేస్‌బుక్‌ను ఎకౌంట్ ద్వారా యువతులకు అశ్లీల చిత్రాలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడి భరతం పట్టారు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు. భద్రాచలంలోని సీతారామనగర్‌కు చెందిన బాలరాజు ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్‌ అకౌంట్ క్రియేట్‌ చేసాడు. ఈ ఎకౌంట్‌తో పలువురు యువతులకు నగ్న చిత్రాలు పంపిస్తున్నాడు. బాధితులు ఇద్దరూ తల్లితండ్రులకు చెప్పటంతో బాలరాజు అకౌంట్‌ను హ్యాక్‌ చేసి అసలు అడ్రస్‌ కనుకున్నారు. అతని ఇంటికి వెళ్లి దేహశుద్ది చేశారు. గాయాలపాలైన బాలరాజును స్ధానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

11:57 - September 25, 2015

ఆదిలాబాద్ : గణేష్‌ నిమజ్జనం, బక్రీద్‌ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసాలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ టీ. తరుణ్‌ జోషి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, వివిధ మార్గాల్లో 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భైంసా పట్టణంలో గణేశ్ నిమజ్జనోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గణేష్‌ విగ్రహాలను గడ్డేన్న వాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. 

11:55 - September 25, 2015

ఆదిలాబాద్‌ : జిల్లా సిర్పూర్‌ పేపర్‌ మిల్లుపై '10 టీవీ' ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం సమీక్షించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జిల్లాకు చెందిన మంత్రి జోగురామన్న, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్పలతో సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మిల్లు యాజమాన్యం 420 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని బ్యాంకర్లు అధికారులకు వివరించారు. అయితే.. వీటిని తగ్గించే అవకాశం ఏమైనా ఉందా..? రుణాలపై చక్రవడ్డీని ఎత్తేస్తారా..? అని అధికారులు బ్యాంకర్లను ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకర్ల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనట్లు తెలిసింది. ఐటీసీ, జేకే పేపర్స్‌, పీసీఈఎల్‌ వంటి జర్మనీ సంస్థలు యాజమాన్య బాధ్యతులు చేపట్టడానికి ముందుకు వస్తున్నాయని అధికారులు వివరించారు. మిల్లుకు సరఫరా చేసే విద్యుత్తు ధరలు, సేల్స్‌టాక్స్‌ బకాయిలపైనా చర్చ జరిగింది. నాలుగు రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లుపై 10 టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించడం వల్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

11:54 - September 25, 2015

హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై నీతి అయోగ్‌ తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని.. ఈ లోపు అర్జెంటుగా కావాల్సిన నిధులకు గాను మరో వెయ్యి కోట్లు కేంద్రం విడుదల చేసిందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలియచేశారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్‌ ఎంత వేగంగా కడితే.. అంత వేగంగా నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసిందని సుజనాచౌదరి చెప్పారు.

11:51 - September 25, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గ‌ణ‌నాథుల నిమ‌జ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న అధికారులు... సాగ‌ర్ లో పెరుకుపోతున్న వ్యర్థాల‌ను ఎప్పటిక‌ప్పుడు తొలగించేందుకు ప్లాన్ చేశారు. ప్లాస్టర్ ఆప్ పారిస్ ఉప‌యోగించి చేసిన గ‌ణాథుల వ‌ల్ల సాగ‌ర్ జలాలు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హుస్సేన్ సాగ‌ర్ లోకి దాదాపు 70వేల విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం..............

హైద‌రాబాద్ గ‌ణ‌నాథుల నిమ‌జ్జన సంద‌డి మొద‌లైంది. హుస్సేన్ సాగ‌ర్ లోకి దాదాపు 70వేల విగ్రహాలు వ‌స్తాయి. వాటిని ఎన్టీఆర్ మార్గంలోనూ....., ట్యాంకుబండ్ వైపు నిమ‌జ్జనం చేస్తారు. సాగ‌ర్ లో నిమ‌జ్జన‌మ‌య్యే గ‌ణేష్ విగ్రహాల తొలగింపు బాధ్యత‌ను హెచ్ఎండిఎనే చేప‌ట్టాల‌ని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ప‌నుల‌ను వేగ‌వంతం చేసింది హెచ్ఎండిఎ. సాగ‌ర్ లో నిమ‌జ్జన‌మైన గ‌ణేష్ విగ్రహాల శిథిలాల‌ను ఎప్పటిక‌ప్పుడు తొల‌గిస్తున్నారు.

సాగ‌ర్ వ్యర్థాలు తొల‌గిస్తామ‌ని ముందుకొచ్చిన జిహెచ్ఎంసి.....

ప్రతీసారి సాగ‌ర్లోని వ్యర్థాల‌ను హెచ్ఎండిఎ తొల‌గిస్తుండ‌గా, బ‌య‌టి వ్యర్థాల‌న్ని జిహెచ్ఎంసి తొల‌గిస్తుంది. అయితే ఈ సారి సాగ‌ర్ వ్యర్థాలు కూడా తామే తొల‌గిస్తామ‌ని జిహెచ్ఎంసి ముందుకు రాగా ప్రభుత్వం జోక్యం చేసుకోని హెచ్ఎండిఎకే ఈ కార్యక్రమాన్ని అప్పగించింది.

గ‌ణేష్ విగ్రహాలను నీటిలోంచి బ‌య‌టికి వేసేందుకు మూడు డిఇసిల‌ వినియోగం......

గ‌ణేష్ విగ్రహాలను నీటిలోంచి బ‌య‌టికి వేసేందుకు మూడు డిఇసిల‌ను వినియోగిస్తున్నారు. వాటిని లారిల్లోకి వేసేందుకు మ‌రో 4జేసిబిల‌ను 10టిప్పర్లను ఏర్పాటు చేశారు. ఇత‌ర ప‌నులు చేయ్యడానికి 600 మంది వ‌ర‌కు కార్మికుల‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు 500ట‌న్నుల‌కు పైగా వ్యర్థాలను తొల‌గించారు.

గ‌త ఏడాది దాదాపు 4500 ట‌న్నుల వ్యర్థాలు తొల‌గింపు.....

గ‌త ఏడాది దాదాపు 4500 ట‌న్నుల వ్యర్థాలు తొల‌గించారు. ఈ సారి కూడా అదే స్థాయిలో వ్యర్థాలు ఉండే అవ‌కాశం ఉంది. అయితే ప్రమాదక‌రమైన ర‌సాయ‌నాలు సాగ‌ర్ లో క‌లువ‌కుండా ఉండేందుకు ప్రతి ఎడాది వేగంగా నిమ‌జ్జన వ‌ర్థాల‌ను తొలగిస్తోంది ప్రభుత్వం. గ‌త ఏడాది వ‌ర్షాలు ఉన్న కారణంగా ఇన్ ఫ్లో ఔట్ ప్లో భారీగా ఉండ‌టంతో పెద్దగా కాలుష్యం పెరిగిన‌ట్లు రికార్డు కాలేదు. ఈ సారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

విజయవాడలో ....

విజయవాడ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా భక్తులు వేలాది గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలన్నీ రసాయనిక పదార్థాలతో తయారయ్యాయి. గణేష్‌ విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేయడం వల్ల.. ఆ నీరు కలుషితమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిలో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ.. విజయవాడలో అశోక్‌కుమార్‌ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మండల లీగల్ సర్వీసు అథారిటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి వివరణ కోరుతూ.. విజయవాడ సీపీ గౌతం సవాంగ్‌కు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 31లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానం జోక్యంతో అధికారులు వినాయక నిమజ్జనాల కోసం ప్రకాశం బ్యారేజ్ దిగువన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కర్నూలు జిల్లాలో...

మత సామరస్యానికి ప్రతీక అయిన కర్నూలు జిల్లాలో ఈ ఏడాది కూడా పాతబస్తీలో కొందరు ముస్లీంలు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీరు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కర్నూలులో మత సామరస్యానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకొవచ్చు. సాంప్రదాయం ప్రకారం నగరంలోని కుమ్మరి వీధిలోని రాంబొట్ల దేవాలయం విగ్రహానికి పూజలు నిర్వహించి వినాయక నిమజ్జన ఊరేగింపునకు శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి వినాయకుల విగ్రహాలు ఒక్కొక్కటిగా వినాయక ఘాట్‌లో ఊరేగింపునకు బయలు దేరనున్నాయి. కర్నూలు నగరంలో శ్రీ గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనాలకు కోసం అధికారులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేశారు. అయితే.. నిబంధనలు ఉల్లంఘించి విగ్రహాలను నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా బక్రీద్‌, గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. 

11:46 - September 25, 2015

హైదరాబాద్ : బక్రీద్‌ నాడే శ్రీనగర్‌లో అల్లర్లు చెలరేగాయి. మసీదులో ప్రార్ధనలు ముగిసిన అనంతరం బయటకు వచ్చిన కొందరు యువకులు పాకిస్ధాన్‌ జెండాలు ఎగురవేశారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఉద్రిక్త పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

11:44 - September 25, 2015

హైదరాబాద్ : 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన మత కలహాల్లో స్థానిక సమాజ్‌వాది పార్టీ, బిజెపి నేతలకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిన రిటైర్డ్‌ జస్టిస్‌ విష్ణు సహాయ్‌ కమిటీ నివేదికలో ఎస్పీ, బిజెపి నేతల పాత్రపై అనేక సందేహాలను వ్యక్తం చేసింది. కమిటీ రూపొందించిన 775 పేజీల నివేదికలో పోలీసులు, అధికార యంత్రాగం నిర్లక్ష్యంపై కూడా ప్రస్తావించింది. విచారణ కమిటి 101 మంది అధికారులు 377 మందిపై విచారణ జరిపింది. ఈ నివేదికను గవర్నర్‌ రామ్‌నాయక్‌కు సమర్పించారు. విచారణ కమిటీని అఖిలేష్‌ ప్రభుత్వం నియమించింది. ముజఫర్‌నగర్‌లో జరిగిన మత కలహాల్లో 60 మంది మృతి చెందగా, 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముజఫర్‌ నగర్ బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.

11:42 - September 25, 2015

హైదరాబాద్ : వ్యాపం స్కాంపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో సిబిఐ 40 చోట్ల దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్, ఉజ్జయిన్‌, రేవా, జబల్‌పూర్‌లో దాడులు చేయగా... ఉత్తరప్రదేశ్‌లో లక్నో, అలహాబాద్‌లో పలుచోట్ల సిబిఐ సోదాలు జరిపింది. వ్యాపం స్కాంపై 2 వందల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 122 కేసులపై సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ దాడులు జరిపిన వారిలో ఎంపీ మాజీ మంత్రి లక్ష్మీకాంత్‌ శర్మ ఇల్లు కూడా ఉంది. వ్యాపం కుంభకోణంలో నకిలీ అభ్యర్థులకు సంబంధించి యూపీతో లింక్‌ ఉండడంతో సిబిఐ అక్కడ కూడా సోదాలు నిర్వహించింది. వ్యాపం స్కాంతో సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా మృత్యువాత పడడం, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. 

11:40 - September 25, 2015

హైదరాబ్ : చందమామ ఈ ఆదివారం రక్తవర్ణశోభితుడై భారీ పరిమాణంలో సూపర్‌ బ్లడ్‌ మూన్‌లా కనిపించనుంది. ఈ నెల 27న అమెరికాలో రాత్రివేళ ఆకాశంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమవనుంది. చంద్రడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం సమయంలో సూపర్‌ బ్లడ్‌మూన్‌ ఏర్పడుతుంది. భూమి నీడ ద్వారా వెళ్లేటప్పుడు చంద్రుడికి ఎరుపువర్ణం సంతరించుకుంటుంది. సూపర్‌మూన్‌తో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం 33 ఏళ్ల క్రితం చోటుచేసుకుంది. గత 115 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే ఇలాంటి ఘటన నమోదైంది. చంద్రుడి భౌతిక పరిమాణంలో మార్పు ఏమీ ఉండదనీ, భూమికి సమీపంగా రావడం వల్ల ఆకాశంలో భారీస్థాయిలో కనిపించడం జరుగుతుందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి రక్షణ ఉపకరణాలు అవసరం లేకుండా నేరుగా చూడొచ్చనీ, ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు పసిఫిక్‌ ప్రాంతాల్లో కనిపిస్తుందని నాసా తెలిపింది.

 

నల్గొండ జిల్లాలో మారిషస్ మంత్రి పర్యటన

నల్లగొండ: జిల్లాలో మారిషస్ మంత్రి పృథ్విరాజ్‌సింగ్ పర్యటిస్తున్నారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో పృథ్విరాజ్‌సింగ్ పర్యటిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి బృందం అధ్యయనం చేస్తుంది. చేనేత సహాకార సంఘం పాలకవర్గంతో మంత్రి సమావేశం కానున్నారు.

సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్ : సీల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలీవరం, ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్లుసమాచారం.

11:01 - September 25, 2015

హైదరాబాద్ : రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మారిపోయాడు. మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్ వాలే' సినిమా కోసం షూట్ చేయాల్సి ఉన్న ఒక్క పాటకు సెంథిల్ ను సినిమాటోగ్రఫీ అందించాలంటూ ఆహ్వానించాడు. ఇందుకు అంగీకరించిన సెంథిల్ త్వరలోనే దిల్ వాలే టీంతో జాయిన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఒక్క పాటకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన షారూఖ్, తన వర్క్ నచ్చితే తదుపరి సినిమాకు పూర్తి స్థాయి కెమెరామన్ గా తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది.

ఈద్గాలో తేనెటీగల దాడి: 40 మందికి గాయాలు...

ఆదిలాబాద్ :నెన్నెల మండల కేంద్రంలోని ఈద్గాలో ప్రార్థనల సందర్భంగా ముస్లింలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 మందికి గాయాలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బక్రీద్ సందర్భంగా సుమారు 150 మంది ముస్లింలు ఈద్గా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. గాయపడ్డ వారిలో ఇబ్రహీం, మోహిన్, డప్పులు వాయించాడనికి వచ్చిన లింగంపల్లి శంకర్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడగా..వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు

యమన్ లో మసీదు పై ఉగ్రపంజా : పది మందిమృతి

హైదరాబాద్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ దాడుల పంథాను మార్చారు. యమన్ లో హౌతీ గ్రూప్ నిర్వహిస్తున్న ఓ మసీదుపై వినూత్న రీతిలో దాడి చేశారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడికి మహిళ వేషం వేయించి, ఒంటి నుండా బాంబులు అమర్చి పంపారు. బక్రీదు పర్వదినం సందర్భంగా మసీదులో పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ దాడి జరుగగా, 10 మందికి పైగా మరణించారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

'పోలవరాన్ని త్వరలో పూర్తి చేస్తామని కేంద్రం చెప్పింది

ఢిల్లీ: పోలవరాన్ని త్వరలో పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... అక్టోబర్ 15 లోపు కొలిక్కి తీసుకొస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక సాయం కింద రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిందని, పోలవరానికి రూ.400 కోట్లు మంజూరు చేసిందని, రాజధానికి రూ.350 కోట్లు, పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకొస్తే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వస్తారని చౌదరి తెలిపారు.

మరో ముగ్గురు కల్తీ కల్లు బాధితుల మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో కల్తీ కల్లు దొరక్క అస్వస్థత పాలైన బాధితుల్లో మరో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. వీరంతా జడ్చర్ల మండలానికి చెందిన వారు. మండలంలోని జంగాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ(50) ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అలాగే, బూరుగుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(45) ఇంటివద్దే మృతి చెందగా, చెన్నయ్య(50) మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

సెంథిల్ కు షారూక్ పిలుపు...

హైదరాబాద్ : రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా మారిపోయాడు. మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్ వాలే' సినిమా కోసం షూట్ చేయాల్సి ఉన్న ఒక్క పాటకు సెంథిల్ ను సినిమాటోగ్రఫీ అందించాలంటూ ఆహ్వానించాడు. ఇందుకు అంగీకరించిన సెంథిల్ త్వరలోనే దిల్ వాలే టీంతో జాయిన్ అవుతున్నాడు.

మీర్ అలం ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు

హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో మీర్ అలం ఈద్గా, మక్కా మసీదు, తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్..

హైదరాబాద్: నేడు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ మానవాళిలో ఐక్యతను, సోదరాభావాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బక్రీద్ త్యాగనిరతికి, భక్తి భావనకు, పేదలపై కరుణకు నిదర్శనంగా నిలుస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు.

88ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన సూర్యుడు...

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఎన్నడూ చూడనటువంటి మార్పు. సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా సెప్టెంబరులో ఎండ వేడిమి సగటున 31 నుంచి 33 డిగ్రీలుగా ఉంటుంది. 1927లో మాత్రం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్, రామగుండం, రెంటచింతల సహా పలు ప్రాంతాల్లో 88 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. హైదరాబాదులో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి వివరించారు. గాలిలో తేమ 60 శాతం మేరకు ఉండటంతో ఉక్కపోత అధికంగా ఉందని వివరించారు. కాగా, నిన్న సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

అత్త పై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు..

మెదక్: జిల్లాలో నంగనూరు మండలం వెల్కటూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అత్తపై కిరోసిన్ పోసి కోడలు నిప్పంటించింది. ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయి అత్త మృతి చెందింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికుల సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మక్కా తొక్కిసలాటలో 14 మంది భారతీయులు దుర్మరణం: కేంద్రం

హైదరాబాద్ : మక్కాలో నిన్న చోటుచేసుకున్న తొక్కిసలాటలో 717 మంది చనిపోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. పవిత్ర యాత్రకు వెళ్లిన భక్తులు అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది భారతీయులు చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. అయితే చనిపోయిన వారి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 14 మంది భారతీయుల్లో హైదరాబాదుకు చెందిన మహిళ కూడా ఉన్నారు.  

09:44 - September 25, 2015

శ్రీకాకుళం : ఏ ఫైవ్‌ స్టార్‌ హోటళ్లోనూ దొరకని భోజనం అది... మరే.. రెస్టారెంట్లలోనూ కనిపించని వంటకం అది...మసాలా దట్టించిన బిర్యానీలు.. నోరూరించే తందూరీలు.. చివరకు ఏ ఇతర విదేశీ వంటకమైనా దానిముందు బలాదూరే..! అదే.. ఇసుక భోజనం. ఇంతటి ప్రత్యేకమైన భోజనాన్ని భోంచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు ప్రజాప్రతినిధులు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాలకు మాటలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. అనుచరులకు మాత్రం ఇసుక మూటలు దండిగానే అందిస్తున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. తెర ముందు ఇసుక అక్రమ రవాణాకు రెడ్‌ సిగ్నల్‌ వేస్తున్న నేతలు.. తెరచాటున గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్టు సమాచారం.

ఇసుక విధానం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తుండగా.. .....

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తుండగా.. నేతలకు, వారి అండదండలతో ఇసుక మాఫియాకు మాత్రం సిరులు కురిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరద ఉధృతి పెరగడంతో.. అక్రమంగా ఇసుక నిల్వ చేసుకున్నవారి పంట పండుతున్నట్టు సమాచారం. ఒక్క లారీ లోడు 50 వేల రూపాయలకు అమ్ముతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.

చివరకు చంద్రబాబే స్పందించాల్సి వచ్చింది.....

ఇసుక మాఫియా దందా శ్రుతిమించడంతో చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబే స్పందించాల్సి వచ్చింది. సీఎం ఆదేశాలతో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టరేట్‌లో ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమాలు వాస్తవమేనని అంగీకరించిన మంత్రి.. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డా.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మంత్రి మాటలు నీటి మూట....

కానీ.. మంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయి. ఇసుక అక్రమ రవాణాకు ఏమాత్రం అడ్డుకట్ట పడకపోవడంతో... మబగాం, గోపాలపెంట, జలుమూరు, ముద్దాడపేట, సింగూరు వంటి ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. జిల్లాలో మొత్తం 27 రేవులు ఉంటే.. 13 రేవుల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దొంగ బిల్లులతో వందలాది లోడులు తరలిస్తున్న అక్రమార్కులు.. కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతోనే....

అయితే.. మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతోనే ఇసుక మాఫియా చెలరేగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అధికారులు చూసీచూడనట్టు వ్యవవహరిస్తున్నారని, దీంతో.. అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ మాత్రం.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని విమర్శిస్తోంది. జిల్లా నుంచి రోజుకు సుమారు కోటి రూపాయల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతోందని అంచనా. నిబంధనలకు పాతర వేస్తూ.. నేతలు తెరవెనుక చక్రం తిప్పుతుండటమే ఈ పరిస్థితి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖనగరానికీ పెద్ద కష్టమే వచ్చిపడింది....

శ్రీకాకుళంలో కొనసాగుతున్న ఇసుక దందా వల్ల.. జిల్లాతోపాటు, విశాఖనగరానికీ పెద్ద కష్టమే వచ్చిపడింది. నదీ పరివాహకం లేని విశాఖకు.. సిక్కోలే ప్రధాన ఇసుక వనరు. అక్కడి నుంచి వచ్చిన ఇసుకను డీఆర్‌డీఏ విశాఖలో విక్రయిస్తుంది. కానీ.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతున్న ఇసుక మాఫియా.. డీఆర్‌డీఏను కూడా ప్రభావితం చేస్తున్నట్టు సమాచారం. దీనివల్లే.. డీఆర్‌డీఏ నాణ్యతలేని, మట్టి కలిసిన ఇసుకను విక్రయిస్తోందని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. తద్వారా.. అక్రమంగా తరలివస్తున్న ఇసుకను కొనాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారనే విమర్శిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు.. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ కోట్లు కొల్లగొడుతున్నారు.

అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న ముఠాలు..

విశాఖలో అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న ముఠాలు.. ఏడు యూనిట్ల ఇసుకను ఏకంగా 80 వేల రూపాయలకు అమ్ముతున్నాయి. ఇసుక ధర భారీగా పెరిగిపోవడంతో నాలుగు నెలల నుంచి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన రెండు నెలలుగా ఇసుక కొరత మరింత తీవ్రమైంది. చాలా ప్రాంతాల్లో కొందామన్నా ఇసుక లభించని పరిస్థితి. ఫలితంగా.. విశాఖ నగరంలో సుమారు 1500 ప్రాజెక్టులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

కేవలం 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే .....

ఈ పరిస్థితిపై.. మంత్రి గంటా ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం విశాఖకు 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండగా.. కేవలం 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు తేల్చారు. దీంతో.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమావేశమై విశాఖ ఇసుక సమస్య పరిష్కారంపై చర్చించారు.మొత్తానికి.. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామంటూ కొత్త ప్రభుత్వం తెచ్చిన సరికొత్త విధానం.. ఆ పనిచేయకపోగా, అక్రమాలకు మరింత ఊతమిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి, ఇసుక అక్రమ రవాణాకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది...

09:39 - September 25, 2015

హైదరాబాద్ : కొన్ని గంటలుగా జరుపుతున్న గాలింపు ముగిసింది. గుండెలను పిండేసే వార్త తెలిసింది. ముక్కుపచ్చలారని ఆరేళ్ల ఆ పసిపాప చనిపోయిందన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి మనసులూ ఆవేదనతో నిండిపోయాయి. అప్పటివరకు అదే ప్రమాదాన్ని శంకిస్తూ వచ్చినవారంతా అదే నిజమయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు. అప్పటివరకు ఏ మూలో ఉన్న చిన్న ఆశ ఆరిపోయింది. చిన్నారి అతిథి మృతదేహమై కనిపించింది. తల్లిదండ్రులు, బంధువులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. భారీవర్షానికి వరద నీటిలో కొట్టుకుపోయిన ఆరేళ్ల చిన్నారి అతిథి మృతదేహం ఎంవీపీ కాలనీ సెక్టార్‌-1లో కనపడింది.

మనం ఇంకా బీసీ కాలంలోనే ఉన్నామా...

మనం ఇంకా బీసీ కాలంలోనే ఉన్నామా. ఏ అభివృద్ధి జరగని ఆనాటి పాత కాలంలోనే ఉన్నామా.. ఏమో అదే అనిపిస్తుంది. చిన్నారి అతిథి అవే ప్రశ్నలు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని వంతెనలు.. మరెన్నో రంగురంగుల భవంతులు.. సాగరతీరంలో కనపడే దృశ్యం. కాని ఒక భారీ వర్షం గట్టిగా కురిస్తే ప్రాణాలే పోతాయా.. రోడ్డు మీద నడిచేంత భద్రత కూడా లేదా.. పుట్టినప్పటి పసి కందును పెద్దయ్యేవరకు అరచేతుల్లో పెట్టుకుని రక్షించుకోవాల్సిందేనా.. చిన్నారి అతిథి మరణం ఇవే సూటి ప్రశ్నలను సంధిస్తుంది.

ఎవరి పేరు మీద ఎఫ్‌ఐఆర్‌ రాయాలి? ......

చిన్నారి అతిథి మరణానికి ఎవరి పేరు మీద ఎఫ్‌ఐఆర్‌ రాయాలి? ఎవరిని శిక్షించాలి? ఎలాంటి శిక్ష వేయాలి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. వర్షం కురిపించిన ప్రకృతిని నిందించాలా.. చదువుకోవటానికి ట్యూషన్‌కు వెళ్లాలనుకున్న ఆ చిన్నారి కోరికను తప్పుబట్టాలా... డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్థంగా వదిలేసిన అధికారులను దండించాలా.. అలా ఉన్నా ప్రశ్నించని మనల్నే శిక్షించుకోవాలా..ఎవరిని.. ఎవరిని..ఎవరిని.. శిక్షించాలి? ఇలాంటి సంఘటనలెన్నో.. అయినా ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. 

09:14 - September 25, 2015

 దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ ఫార్ములను సరిగ్గా వంటబట్టించుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకునే. సక్సెస్‌లో ఉన్నప్పుడే అవకాశాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా వచ్చిన ఛాన్సుల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని తెగేసి చెబుతోంది దీపికా. ఈ బామ ఇటీవల ఉన్న పళంగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసే కమర్షియల్‌ యాడ్స్‌ రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసింది. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించగా, 'అవును 2 కోట్ల పారితోషికం ఎక్కువ తీసుకుంటున్నా.. ఇందులో నాకైతే ఏమీ తప్పనిపించలేదు. ఎందుకంటే వాళ్ళైనా నేను సక్సెస్‌లో ఉంటేనే కదా నా దగ్గరకు వచ్చేది' అని గడుసుగా సమాధానం చెప్పింది. అవకాశాలు, యాడ్స్ రాబట్టుకోవడానికి సోప్ వేసే సినీతారలను చూసాం కానీ ఇలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా తెగేసి చెప్పే దీపిక గట్స్ చూసి ఔరా అంటున్నారు అభిమానులు. 

తిరుమలలో నేడు 'బాగ్ సవారీ' ఉత్సవం...

తిరుమల : వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది. గురువారం సాయంత్రం ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు వెల్లువెత్తుతున్నారు. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

అతిథి మృత దేహం లభ్యం...

విశాఖ : నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షానికి వరద నీటిలో కొట్టుకుపోయిన ఆరేళ్ల చిన్నారి అతిథి మృతి చెందింది. ఎంవీపీ కాలనీ సెక్టార్ 61 లో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. ఈ వార్త విన్న బాలిక కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ముగినిపోయారు.

08:33 - September 25, 2015

హైదరాబాద్ : ప్రతిపక్షాలకు దీక్ష చేసే హక్కు ఉంటుందని దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పై వైసీపీ నేత జగన్ చేపట్టిన దీక్షకు ప్రభుత్వం ఎందుకు అనుమతి నిరాకరిస్తోంది? అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలు దీక్ష చేస్తే శాంతి భద్రతలను చూసే బాధ్యత ప్రభాత్వానిది కదా? ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు పోవాలని కోరుకుంటారు. అలాంటి హజ్ యాత్ర తొక్కిసలాటలో 717 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ముందే తగు జాగ్రత్తలు చేపట్టాలని నాగేశ్వర్ సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లో నెక్ టూ నెక్ పోటీ నెలకొంది. ఇత్యాది అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఈ పూర్తి పాఠవాన్ని మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

08:17 - September 25, 2015

హైదరాబాద్: విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా మునగాల మండలం మాధవవరం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షత గాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీవారు. బాధితులు హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

07:57 - September 25, 2015

హైదరాబాద్: హజ్ యాత్ర తొక్కిసలాటలో 717 మంది మృతి చెందడం దురదృష్టకరమని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. అంతే కాక ఏపీకి ప్రత్యేక హోదా గుంటూరు లో వైసీపీ నేత జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకు ఏపీ సర్కార్ జగన్ దీక్షను వ్యతిరేకిస్తోంది? ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, వైసీపీ నేత జగన్ భేటీలో ఆంతర్యం ఏమిటి? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండారాఘవరెడ్డి, ఏపీపీసీసీ రాం శర్మ, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకంక్షలు తెలిపిన ప్రధాని

న్యూఢిల్లీ: నేడు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్-ఉల్-జుహా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇవే నా హృదయ పూర్వక శుభాకాంక్షలంటూ మోడీ సందేశం ద్వారా విషెస్ తెలిపారు. ప్రధాని
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. 

నగరంలో రెండు రోజులు మద్యం బంద్...

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 28 మధ్యాహ్నం 12 గంటల వరకు మద్య విక్రయాలు జరపరాదని ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇద్దరు ఎర్రచందనం కూలీల అరెస్ట్

తిరుపతి : చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు తమిళ కూలీలను అరెస్టు చేశారు.

చెట్టును ఢీకొన్న ఎర్రచందనం లారీ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ : కర్ణాటకలోని బిజాపూర్ వద్ద ఎర్రచందనం లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్ ఐ, డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. ఢిల్లీలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను కడపకు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

07:24 - September 25, 2015

హైదరాబాద్ : త్యాగానికి ప్రతీకగా నిర్వహించే పండుగ బక్రీద్‌. హైదరాబాద్‌ పాతబస్తీతోపాటు ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పండగ శోభ కన్పిస్తోంది. ఓల్డ్‌సిటీలోని మీరాలం దర్గా, పలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈద్ ముబారక్ ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బక్రీద్‌. దైవత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున ముస్లింలు ఖుర్బానీ పేరిట గొర్రెలను, మేకలను బలిదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. హజరత్‌ ఇబ్రహీంకు లేకలేక కలిగిన సంతానం ఇస్మాయిల్‌ అల్‌ సలాం. ఓ రోజు ఇబ్రహీం కలలో అల్లా కనిపించి.. అతని కుమారుడిని బలి ఇవ్వాలని కోరాడట. దీంతో ఎనిమిదేళ్ళ బాలుడ్ని మక్కా అడవుల్లో బలిదానం చేయడానికి తీసుకెళ్తాడు. కళ్ళకు గంతలు కట్టుకుని తనను బలివ్వమని తండ్రిని ఇస్మాయిల్‌ కోరతాడు. కుమారుడి సలహా ప్రకారమే.. ఇబ్రహీం తన కరవాలాన్ని జులిపిస్తాడు. అనంతరం గంతలు విప్పి చూడగా అక్కడ గొర్రె తల తెగిపడి కనిపిస్తుంది. అల్లాయే తన కుమారుడిని కాపాడాడని పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి బక్రీద్‌ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రోజూ ఐదు సార్లు నమాజ్‌ చేసే ముస్లింలు బక్రీద్‌ రోజున ఆరు సార్లు ప్రార్థన చేస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

 

కారు బోల్తా: ముగ్గురు మృతి

నల్గొండ : మునగాల మండలం మాగారం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

07:16 - September 25, 2015

హైదరాబాద్ : నగరంలో బక్రీద్ సందడి నెలకొంది. బక్రీద్‌కు ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. హైదరాబాద్‌ ముస్లింలు ఖుర్బానీ ఇవ్వటంలో ముందుంటారు. ఇందుకోసం వారం రోజుల ముందు నుంచే గొర్రెలు, మేకల అమ్మకాలు కొనసాగాయి. పండగ సీజన్‌లో ఒక్కో గొర్రె, మేక 5 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రేటు పలుకుతాయి. అయితే భారీ రేట్లు పలికే మేలిరకం గొర్రె, మేకపోతులు పండుగకు ఒకరోజు ముందు మాత్రమే అమ్మకానికి పెడతామని వ్యాపారులు చెబుతున్నారు. ఖుర్బానీ కోసం మార్కెట్లోకి వచ్చిన వాటిలో ఒంగోలు, మహారాష్ట్ర, నాగపూర్, కర్ణాటక ఖుర్గీ జాతి గొర్రెలు, మేకలకు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి ధరలు కాస్తా తక్కువగా ఉన్నాయని కొనుగోలు దారులు అంటున్నారు.

ఖర్చుకంటే ఆచారానికే పెద్దపీట....

బక్రీద్ పండుగకు దేవుని పేర గొర్రెలు, మేకలను బలి ఇచ్చి వాటి మాంసాన్ని ఖుర్బానీగా దానం చేయడం ఆనవాయితీ. ఖుర్బానీ ఇచ్చేందుకు ముస్లిం సోదరులు ఖర్చుకంటే ఆచారానికే పెద్దపీట వేస్తారు. ప్రత్యేకించి ఖుర్బానీ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన నగరంలో బక్రీద్ కూడా సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతోంది.

07:12 - September 25, 2015

హైదరాబాద్ : భోలక్‌పూర్‌. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. 2009లో కలుషిత నీరు తాగి 13 మంది మృత్యువాత పడ్డారు. 600లకు పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు కూడా నగరంలో అలాంటి బోలక్‌పూర్‌లు వెలవనున్నాయా..? నగర వాటర్ బోర్డు తీరు చూస్తే అవుననిపిస్తోంది. బోర్డు నిర్లక్ష్యంతో...కలుషిత నీరు తాగి నగరవాసులు అనారోగ్యం పాలవుతున్నారు.

పలు కాలనీల్లో .....

హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో తాగడానికి సరఫరా అవుతోన్న మురికినీరు ఇదే. నగరంలో మంచినీరు వచ్చిందంటే చాలు పలు కాలనీల్లో 15 నుంచి 20 నిమిషాలపాటు నీటిని వృధాగా వదిలేయాలి. లేదంటే బిందెల్లో పడేది మంచినీరు కాదు ఈ మురికి నీరే. పొరపాటున ఒకబొట్టు ఈ నీరు తాగినా అంతే సంగతులు.. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.

మంచినీటిలో దాదాపు 40 శాతం కలుషిత నీరే......

హైదార‌బాద్‌ నగరం కలుషిత నీటి సరఫరాకు కేరాఫ్ అ్రడస్‌గా మారింది. నగరంలో స‌ర‌ఫ‌రా అవుతున్న మంచినీటిలో దాదాపు 40శాతం కలుషిత నీరు ఉన్నట్లు నివేదికల్లో తేలింది. నగరం నడిబొడ్డున ఉన్న బోల‌క్‌పూర్ ఘటన జరిగిన తరువాత వాట‌ర్ పొల్యుష‌న్ ఒక్కసారిగా తెర‌పైకి వ‌చ్చింది. ఆ సమయంలో హడావుడి చేసిన అధికారులు తరువాత శాశ్వత నివారణను గాలికొదిలేశారు.

20 నిమిషాల వరకు నల్లాల్లో మురికి నీరే ప్రవాహం......

ఇంతటి నీటి కాలుష్యానికి ప్రధాన కారణం రెండు మూడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లేనని తెలుస్తోంది. ఆ పైపుల లీకేజీ కార‌ణంగా వాటికి స‌మాంత‌రంగా ఉన్న సివ‌రెజ్ లైన్స్‌లో ప్రవ‌హించే మురుగునీరు డ్రింకింగ్‌ వాట‌ర్ పైపుల్లోకి చెరుతోంది. దీంతో 20 నిమిషాల వరకు నల్లాల్లో మురుగునీరే వస్తోంది. కలుషితమైన నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నామని నగరవాసులు వాపోతున్నారు. జలమండలి అధికారులు మాత్రం కాలనీ వాసుల మాటలను కొట్టిపారేస్తున్నారు. తాము ఇప్పటికీ స్వచ్ఛమైన మంచినీరే ఇస్తున్నామంటున్నారు.నగరంలో కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారినపడుతున్నా...వాటర్ బోర్డు అధికారులు మాత్రం ఏళ్ల తరబడిగా ఉన్న పైపులైన్లను మార్చడం లేదు. ఇప్పటికైనా...ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

07:09 - September 25, 2015

విశాఖ: సీతమ్మధారకు చెందిన రిటైర్డ్ ఆర్‌ అండ్ బీ ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అతిథి. టింపనీ స్కూల్లో 1వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ట్యూషన్‌కని వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగు ప్రయాణమైంది. అయితే ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలువలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ చిన్నారి రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కనే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి చిన్నారి అతిథి అందులో పడి కొట్టుకుపోయింది. అక్కడివారు వెంటనే వెతికేందుకు ప్రయత్నించారు. కాలువపై 200 మీటర్ల మేరకు అక్రమంగా సిమెంట్ పలకలతో కప్పేయడంతో రక్షించడానికి కష్టంగా మారింది. అయినప్పటికీ స్థానికులు సాహసించి కాలువలో దూకి వెతికేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అతిథి 6 గంటల ప్రాంతంలో గల్లంతయినప్పటికీ అధికారులు 8 గంటల వరకు సంఘటనా స్థలానికి చేరకుకోలేదు. గాలింపు చర్యలు చేపట్టలేదు సరికదా కనీసం ప్రొక్లైనర్స్‌ని తీసుకొచ్చి సిమెంట్ దిమ్మలను తొలగించలేదు. దీంతో స్థానికులు ఆగ్రహించారు. ఎట్టకేలకు 9 గంటల సమయంలో ప్రొక్లైనర్‌తో త్రవ్వకాలు చేపట్టారు. జీవీఎంసీ నిర్లక్ష వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోప్రక్క ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చినప్పటికీ టార్చ్‌లైట్లు చార్జింగ్‌ లేవనే సాకుతో, సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరం. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. దీంతో చిన్నారి అతిథి తాతయ్య వద్దే ఉంటూ చదువుకుంటోంది. 

07:01 - September 25, 2015

హైదరాబాద్ : ఇప్పటికే టీస‌ర్కార్‌ విధానాల‌పై కాలుదువ్వుతున్న కాంగ్రెస్‌ .. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే దూకుడును ప్రద‌ర్శించాల‌ని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం అమ‌లు చేస్తున్న విధానాల‌లోని లోపాల‌ను ఎత్తి చూపి... స‌భా సాక్షిగా ప్రభుత్వాన్ని దోషిగా నిలిపేందుకు ప‌క్కా ప్రణాళిక‌ల‌ను రూపొందిస్తోంది. ఈ నెల 29న రైతుల ఆత్మహ‌త్యల‌పై స‌భ‌లో పూర్తి స్థాయి చ‌ర్చ ప్రారంభంకానుండ‌టంతో... ఇక ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకు ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌తో రంగంలోకి దిగుతోంది కాంగ్రెస్.

ఆత్మహ‌త్యల‌కు ప్రభుత్వ విధానాలే కార‌ణం....

రైతుల ఆత్మహ‌త్యల‌కు ప్రభుత్వ విధానాలే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్... ఇప్పటికే దీనిపై అనేక రూపాల్లో నిర‌స‌న‌లు తెలిపింది. ఈ విష‌యంలో మిగ‌తా అన్ని పార్టీలు ఎవ‌రికి వారు ఇదే వాయిస్‌ను వినిపిస్తూ వ‌స్తున్నాయి. దీన్నిస‌భ‌లో అనుకూలంగా మ‌లుచుకోవ‌డంపై కాంగ్రెస్‌ దృష్టిపెట్టింది. స‌భ‌లో ఫ్లోర్ కోఆర్డినేష‌న్‌తో పార్టీల‌ను ఏకం చేయాల‌ని నిర్ణయించింది. దీని కోసం స‌భ ప్రారంభానికి ముందే... ఫ్లోర్‌ కోఆర్డినేష‌న్ కోసం స‌మావేశం ఏర్పాటుకు ప్రయ‌త్నాలు చేస్తోంది. ప్రజా స‌మ‌స్యల‌పై అంద‌రినీ ఏకం చేసి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాల‌న్నది కాంగ్రెస్

 వాట‌ర్‌గ్రిడ్, మిష‌న్ కాక‌తీయలో కోట్ల రూపాయ‌ల అవినీతి....

అంతేకాకుండా వాట‌ర్‌గ్రిడ్, మిష‌న్ కాక‌తీయలో కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్.... స‌భలో దీనిపై ప్రభుత్వాన్ని నిల‌దీయాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ప్రాజెక్ట్‌ల రీడిజైన్లపై .. సీఎం స‌భ‌లో ప‌వ‌ర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్‌కు సిద్దమ‌వుతున్నార‌న్నది దృష్టిలో పెట్టుకున్న హ‌స్తం పార్టీ... అంతే ధీటుగా స‌మాధానం చేప్పేందుకు ప్రిపేర్ అవుతోంది. ఈ అంశంపై కూడా ప్రతిపక్షాల‌న్నీ ఒకే వాదనలో ఉన్నాయి. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ ప్లాన్‌ అమ‌లు, పలు ప్రజా సమస్యలపై స‌భ‌లో ప్రతిప‌క్షాల‌కు పెద్దన్న పాత్ర వ‌హించి ప్రభుత్వ తీరును ఎండ‌గ‌డ‌తామంటోంది కాంగ్రెస్. రైతు ఆత్మహ‌త్యలు, వాట‌ర్ గ్రిడ్ , మిష‌న్ కాకతీయ , ప్రాజెక్ట్‌ల డిజైన్‌ల మార్పులు, పలు ప్రజా సమస్యలపై సభ బ‌య‌ట క‌త్తులు నూరుతున్న అన్నీ పార్టీలను ఏకం చేసి సభలో ప్రభుత్వంతో అమీ తుమీకి రెడీ అవుతోంది కాంగ్రెస్. 

06:58 - September 25, 2015

హైదరాబాద్ : ప్రత్యేక‌ హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టనున్న దీక్ష ఉత్కంఠ రేపుతోంది. ఒక‌వైపు దీక్షకు గుంటూరులో వైసీపీ నేత‌లు సిద్ధమవుతుంటే... మ‌రోవైపు ఆనుమ‌తి లేదంటూ గుంటూరు పోలీసులు ఏర్పాట్లని ఆడ్డుకుంటున్నారు. ఆయితే ప్రభుత్వం ఎన్ని ఆడ్డంకులు సృష్టించినా జ‌గ‌న్ మాత్రం ఎట్టిప‌రిస్థితులోనూ దీక్షని కొన‌సాగించాల‌ని పట్టుద‌ల‌తో వున్నారు. దీంతో జ‌గ‌న్ దీక్ష అంశంలో ఏం జ‌రుగుతోందా అనే ఉత్కంఠ స‌ర్వత్రా నెల‌కొంది.

పోలీసులు దీక్షకు ఆనుమ‌తి నిరాక‌రణ......

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ నెల 26 నిర‌వ‌ధిక నిరహార దీక్ష చేయాల‌ని నిర్ణయించారు. గుంటూరులో దీక్షకు పార్టీ నేత‌ల ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. అయితే దీక్ష వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్యలు త‌లెత్తడంతో పాటు, చుట్టుప‌క్కల ఉన్న విద్యా సంస్థలు, ఆసుప‌త్రుల్లో ఉన్నవారికి ఇబ్బందులు వ‌స్తాయంటూ పోలీసులు దీక్షకు ఆనుమ‌తి నిరాక‌రించారు. ఈ నేప‌థ్యంలో దీక్షా ప్రాంగ‌ణంలో పార్టీ నేత‌లు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు ఆడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహాంగా వున్న వైసీపీ నేత‌లు ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ దీక్షను చేపడతామని చెప్పుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ఎన్నిఆడ్డంకులు సృష్టించినా ఉల్ఫా గ్రౌండ్ లోనే దీక్ష.....

ప్రభుత్వం ఎన్నిఆడ్డంకులు సృష్టించినా ఉల్ఫా గ్రౌండ్ లోనే దీక్ష చేస్తాన‌ని పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ స్పష్టం చేశారు. దీంతో ఆ పార్టీ నేత‌లు పోలీసులు ఆదికారుల‌తో మ‌రోసారి భేటీ ఆయ్యారు. జ‌గ‌న్ దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయితే పోలీసులు ఆందుకు ఆంగీక‌రించ లేద‌నీ తెలుస్తోంది. మ‌రో వైపు దీక్షకు అనుమ‌తి నిరాక‌ర‌ణపై వైసీపి న్యాయ పోరాటం చేస్తామంటుంది. దీనిలో భాగంగానే దీక్షపై ప్రభుత్వం ఆనుస‌రిస్తున్న తీరుపై హైకోర్టును ఆశ్రయించారు ఆ పార్టీ నేత‌లు. హైకోర్టు లో హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌గ‌న్ చేప‌ట్టనున్న దీక్షకు ఆనుమ‌తించాల‌ని పిటిషనర్‌ కోరారు..మొత్తానికి జ‌గ‌న్ దీక్షపై అటు పోలీసులు ఇటు పార్టీ నేతలు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. దీంతో ఆస‌లు దీక్ష కొన‌సాగుతుందా..అస‌లు ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేది పార్టీ నేత‌ల్లోనూ, క్యాడ‌ర్ లోనూ ఉత్కంఠ‌గా మారింది.

06:55 - September 25, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలతో పాటు.. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర అంశాలపై మంత్రులతో చర్చించారు.

పామాయిల్‌,పట్టుపరిశ్రమ సమస్యలుపై చర్చ......

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పెండింగ్‌ ప్రాజెక్టుల అంశంతో పాటు.. విభజన చట్టంలోని హామీల అమలు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. పామాయిల్‌, పట్టు పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలని వాణిజ్య మంత్రిని కోరారు. అమరావతి- కర్నూలు- అనంతపురం రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కూడా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకూ ఏపీకి సహకరించాలని కోరారు. ఈ అంశంపై నెలరోజుల్లోగా కేంద్రం నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు.

నదుల అనుసంధానంపై అభినందనలు......

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై కేంద్రమంత్రి ఉమాభారతి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలవరం కోసం.. ఇప్పటికే ఖర్చుచేసిన నిధులను కేంద్రం తిరిగివ్వాలని, వచ్చే మూడేళ్లలో పోలవరానికి మరిన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు అభివృద్ధి పథంవైపు అడుగులేయడం అభినందనీయమని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.

కేంద్రం దృష్టికి ఎయిర్‌పోర్టులు, అటవీ భూముల వ్యవహారం......

ఆంధ్రప్రదేశ్‌‌లో మూడు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సి ఉందని, అటవీ భూములు డీనోటిఫై చేయాలని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. అమరావతిలో మ్యూజియం ఏర్పాటుకు నిధులిచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు.. ఏపీలో నెలకొన్న సంక్షోభాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నెలకొల్పాల్సిన కేంద్ర విద్యా సంస్థల గురించీ చంద్రబాబు కేంద్రంతో చర్చించారు. అనంతరం ఆర్థిక అభివృద్ధి సంస్థ అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్థిక వనరుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిధుల వినియోగంపై అధికారులతో సమీక్షించారు.

06:52 - September 25, 2015

హైద‌రాబాద్‌ : నగరంలో మ‌రో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని తయారుచేస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు..మూసిన‌దిపై ఈస్ట్ వెస్ట్ కారిడర్‌ను నిర్మించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీ ప్రాజెక్టులను నిర్మించే అనుభవం ఉన్న చైనా స‌హ‌కారాన్ని తీసుకుంటోంది. సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్తే ల‌క్ష్యంగా జీహెచ్ఎంసీ వేస్తున్న అడుగులకు మ‌రో ముంద‌డుగు ప‌డుతోంది.

రూ. 22వేల కోట్లతో రోడ్ల నిర్మాణం.....

హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దాలన్న ల‌క్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరంలో దాదాపు 22వేల కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపడుతోంది. ఇందులో మొదటి దశ పనులకు 1100కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. న‌గ‌రంలో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసులకు సులువైన ప్రయాణాన్ని క‌ల్పించాల‌ని ప్రభుత్వం చూస్తోంది. దాంతో ఎక్కడెక్కడ రోడ్లు అవ‌స‌రం ఉన్నాయో గుర్తించి వాటిని నిర్మించాలని సర్కార్‌ ప్రణాళికల్ని తయారుచేస్తోంది. అందులో భాగంగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఈస్ట్ వెస్ట్ కారిడర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికల్ని రూపొందించింది.

మొత్తం 42 కిలోమీటర్ల మేర....

మొత్తం 42 కిలోమీట‌ర్ల మేర నిర్మించ‌నున్న ఈ కారిడార్‌ను నార్సింగ్ ఔట‌ర్ రింగ్ రోడ్డు నుండి బీబీన‌గ‌ర్ వ‌ద్ద ఉన్న కొర్రెముల ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ప్లాన్ చేస్తున్నారు. 6లైన్లుగా ఉండే ఈ రోడ్డు ఎలివేటేడ్ ప‌ద్దతిలో పూర్తిగా మూసీన‌దిపై నిర్మించ‌నున్నారు. అయితే దీనిని ఎలా నిర్మించాలన్న దానిపై చైనా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతిపాదిత రోడ్డు నిర్మాణంతో పాటు..నగరంలో ఎత్తైన టవర్ల నిర్మాణంపై కూడా కేసీఆర్‌ చైనా ప్రతినిధులతో చర్చించారు. అయితే ఈ ప్రతిపాదిత వంతెన నిర్మాణ ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు చైనా బృందం ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించింది. ఇందులో అంజు ఇన్‌ఫ్రా, బ్రిడ్జి డిజైనింగ్, రాడిక్ క‌న్సల్‌టెన్సీల ప్రతినిధుల‌తో పాటు జీహెచ్ఎంసి కమిష‌న‌ర్ కూడా పాల్గొన్నారు. ఈస్ట్‌-వెస్ట్ కారిడార్ వంతెన నిర్మాణానికి ఏ విధ‌మైన అడ్డంకులు ఎదుర‌వుతాయి,.భూసేక‌ర‌ణ ఎంత మేర‌కు అవ‌స‌రమవుతుంద‌న్న అంశాల‌ను ప్రాథ‌మికంగా అంచ‌నా వేయ‌డానికి ఈ బృందం ఏరియ‌ల్ స‌ర్వే నిర్వహించింది. ఏ ప్రాంతంలో మూసీన‌ది వైశాల్యం ఎక్కువ‌గా ఉంది. ఏ ప్రాంతంలో త‌క్కువ నిడివితో ఉంది, ఎక్కడ ఎక్కువ‌ క‌బ్జాకు గురైంది త‌దిత‌ర అంశాల‌ను కూడా ఈ బృందం ప‌రిశీలించిన‌ట్లు స‌మాచారం.

న‌గ‌రంలో స్కైవేస్., ప్లైఓవ‌ర్స్ నిర్మాణం.....

ఇప్పటివరకు ఔట‌ర్ రింగ్ రోడ్డు, అలాగే పీవీ ఎక్స్ ప్రెస్‌వే మాత్రమే న‌గ‌రంలో వేగంగా ప్రయాణించడానికి రోడ్డు మార్గాలుగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో న‌గ‌రంలో స్కైవేస్., ప్లైఓవ‌ర్స్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది. తాజాగా మూసిన‌దిపై ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంతెన నిర్మాణం కూడా ప్రారంభ‌మైతే మ‌రో భారీ రోడ్డు హైద‌రాబాద్ ఖాతాలో చేర‌బోతుంది. అయితే నెల రోజుల్లో ప్రతిపాదిత రోడ్డు నిర్మాణంపై చైనా బృందం ఓ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతే..ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కానుంది. 

06:49 - September 25, 2015

హైదరాబాద్ : మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జానీబీ మరణించారు. ఆమె మృతితో బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. జానీబీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు యాత్రికుల సమాచారం కోసం.. టీ సర్కారు హజ్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...

ఎల్బీ నగర్‌కు చెందిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. జానీబీ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకు పోయారు. బక్రీదు పండుగకు ముందు ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని భావించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి....

మక్కా తొక్కిసలాటలో వందలాది యాత్రికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ నుంచి మక్కాకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలని.. దీనికోసం జెడ్డాలోని ఇండియన్‌ ఎంబసీని సంప్రదించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన యాత్రికుల సమాచారం కోసం 040-23214125 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని అధికారులు తెలిపారు.

మక్కా తొక్కిసలాటలో నగర వాసి...

హైదరాబాద్ : మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జానీబీ మరణించారు. ఆమె మృతితో బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. జానీబీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు యాత్రికుల సమాచారం కోసం.. టీ సర్కారు హజ్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

06:44 - September 25, 2015

హైదరాబాద్ : 108 ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 108 నిర్వహణ లోపాల మీద ప్రతిరోజూ వార్తలు వస్తూనే వున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవికె వ్యవహారశైలి మీద కూడా విమర్శలొస్తున్నాయి. మరోవైపు పదేళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిబ్బంది ఆక్రందిస్తున్నారు. ఇంతకీ 108 ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? 108 సిబ్బంది కోరికలేమిటి? పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్న 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతలను ప్రయివేట్‌ సంస్థలకు అప్పగించి, ప్రభుత్వం తప్పు చేస్తోందా? 108 వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత యాదానాయక్‌ పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను విశ్లేషణ చేశారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:42 - September 25, 2015

హైదరాబాద్ : 108 ... అదొక ఆపద్భందువు. ఆపదలో చిక్కుకుని, అత్యవసర వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి 108 ఆపద్బంధువుగా మారిందనండంలో ఏమాత్రం సందేహం లేదు. 108 సర్వీసుల సిబ్బంది ప్రదర్శించిన వృత్తి నిబద్దత, ఎండనక, వాననక, చలి అనక రేయింబవళ్లు ఎంతో సహనంతో అందించిన సేవలు ప్రభుత్వాలకు క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. ఎందరో ప్రాణాలు నిలిపాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి 108 కూడా తోడ్పడిందనడంలో సందేహం లేదు. అలాంటి 108 కే కష్టకాలమొచ్చింది. .

2005లో ప్రారంభం....

108 సేవలను 2005లో ప్రారంభించారు. మొదట్లో సత్యం కంప్యూటర్స్‌ సంస్థ 108 సేవలు అందించింది. రాష్ట్ర ప్రభుత్వమే 95 శాతం నిధులిస్తే, నిర్వాహణ బాధ్యతలు సత్యం సంస్థ చూసుకునేది. రామలింగరాజు ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కున్న తర్వాత 108 జీవీకే గ్రూపు చేతిలోకి వెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వమే వంద శాతం నిధులిస్తోంది. ఒక్కొక్క వాహనానికి లక్షా ముప్పైవేల రూపాయల చొప్పున ముట్టచెబుతోంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్న 108 సేవలను సక్రమంగా అందించడంలో జీవీకే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అన్ని వాహనాలను తిప్పకుండా ప్రతిరోజూ కనీసం పాతికశాతం వాహనాలను షెడ్డులలోనే వుంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. సేవాభావంతో నిర్వహించాల్సిన 108 సర్వీసుల విషయంలో కక్కుర్తి పడడానికి మించిన దారుణం మరొకటి వుండదు. నిజానికి ఇప్పుడు వాహనాల్లో అత్యధికశాతం కాలం చెల్లిపోయినవే. ఫిట్‌నెస్‌ నిబంధనల ప్రకారం లక్ష కిలోమీటర్లు తిరిగినవాటిని కాలం చెల్లినవాహనాలుగా లెక్కిస్తారు. కానీ మన 108 సర్వీసులలో మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన వాహనాలు కూడా వున్నాయంటే ఆశ్చర్యపోకండి. మరో విస్మయం గొలిపే అంశం ఏమిటంటే ఈ వాహనాలను ప్రారంభించిన కొత్తలో 68 రకాల మందులు, పరికరాలు అందుబాటులో వుంచేవారు. కానీ ఇప్పుడు ఏ వాహనంలోనూ అందులో సగం కూడా కనిపించని దుస్థితి. ఎందరో ప్రాణాలను కాపాడిన 108 సర్వీసుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం, నిర్లప్తత ప్రదర్శిస్తున్నారో ఎవరికీ అర్ధం కాదు.

అత్యంత నిర్లక్ష్యంగానూ, నిరంకుశంగానూ.....

జీవీకే యాజమాన్యం తమ పట్ల అత్యంత నిర్లక్ష్యంగానూ, నిరంకుశంగానూ వ్యవహరిస్తోందనేది 108 సిబ్బంది ఆరోపణ. ఇందులో పనిచేసే సిబ్బందికి కనీసం పది వేలు పొందుతున్నవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. డీఏ చెల్లించడం లేదనీ, పీఎఫ్‌ సక్రమంగా అమలు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరోవైపు రోజుకు కనీసం 12 గంటలపాటు పనిచేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు 8 గంటల పనివిధానమే అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న 108 సిబ్బంది మాత్రం పన్నెండు గంటలు పనిచేయాల్సి రావడం కార్మిక చట్టాల స్పూర్తికే విరుద్ధం. పనిగంటల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇలా వెట్టిచాకిరీ చేయించుకోవడం సరికాదనే విమర్శలూ వస్తున్నాయి. అయినా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్న 108 నిర్వహణను ప్రయివేట్‌ యాజమాన్యాల చేతిలో పెట్టడం ఎంత వరకు కరెక్టన్న ప్రశ్నలూ వున్నాయి.

ప్రభుత్వ నిధులతోనే 108 సేవలు....

మొత్తం ప్రభుత్వ నిధులతోనే 108 సేవలు నడుస్తున్నందున సిబ్బంది బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే వుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబ్బంది డిమాండ్స్‌ విషయంలోనూ, 108 సర్వీసుల నిర్వహణ విషయంలోనూ మరింత చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఎంతో మందికి అత్యవసర వైద్య సేవలతో ముడిపడి వున్న 108 విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా చొరవ చూపితే, ఆపదలో వున్నవారికి అంత మేలు జరుగుతుంది.

హజ్ యాత్ర తొక్కిసలాటలో 717 మంది మృతి

హైదరాబాద్ :మక్కాలో మాటల కందని మహా విషాదం. పవిత్ర స్థలంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని నింపింది. 717 మంది మృతి కారణమైంది. హజ్ యాత్ర ప్రారంభమైన రెండో రోజే ఈ ప్రమాదం జరిగింది. మక్కాలో రెండు వారాల్లోనే 2 పెను ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పవిత్రమైన హజ్ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు తరలివస్తారు.

నేడు, రేపు జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సర్వీసులు బంద్

హైదరాబాద్ :నేడు, రేపు జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీసును సంఘవిద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం వెనుక పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

ఖమ్మం: విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన పంతులు, టీచర్ ఈజ్ సెకండ్ ఫాదర్ అనే నానుడికి నిదర్శనంగా నిలవాల్సింది పోయి.. విద్యార్థినులను లైంగిక వేధించడంతో తల్లిదండ్రులు చితకబాదారు. ఖమ్మం జిల్లా రూ రల్ మండలంలోని తెల్దారుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గడిపూడి వీరయ్యచౌదరి కొంతకాలంగా విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో ఆశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో కొద్దిరోజులుగా విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం లేదు. తల్లిదండ్రులకు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

Don't Miss