Activities calendar

26 September 2015

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మోకింగ్ రూమ్ లో 3.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

22:00 - September 26, 2015

ఢిల్లీ : మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మృతిపై విచారణ జరిపించాలని ఆయన కుమారుడు అనిల్‌ శాస్త్రి డిమాండ్‌ చేశారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణం సహజమరణం కాదని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నరన్నారు. తాష్కెంట్‌ ఒప్పందంపై సంతకం చేయగానే లాల్‌బహదూర్‌ శాస్త్రి ఆకస్మిక మరణించడంపై సందేహాలున్నాయని తెలిపారు. శాస్త్రి చనిపోయినపుడు ఆయన ముఖం నీలిరంగుగా మారిందని, ఆయన దినచర్యకు సంబంధించిన డైరీ, పాలు తాగే థర్మాస్‌ కూడా మాయమైందన్నారు. ప్రధాని హోదాలో ఉన్న ఆయన గదిలో బెల్, టెలిఫోన్‌ లాంటి టెలిఫోన్ కనీస సౌకర్యాలు, వైద్యసదుపాయాలు కల్పించకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మృతికి సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టాలని ఆర్టీఐ ద్వారా కోరితే, విదేశాలతో సంబంధాలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో యూపీఏ ప్రభుత్వం వాటిని ఇవ్వడానికి నిరాకరించిందన్నారు.

 

 

21:59 - September 26, 2015

పాట్నా : బీహార్‌లో జంగల్‌ రాజ్‌ కాదు... కానూన్‌ కా రాజ్‌ నడుస్తోందంటూ సమస్తిపూర్‌లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. బిజెపి నేతలు జంగల్‌ రాజ్‌ పేరిట ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. బీహార్‌ ప్రజలు ఎలాంటి భయందోళనలు లేకుండా జీవిస్తున్నారన్నారు. బిజెపికి పరిపాలించే దమ్మే లేదని ఏడున్నరేళ్లు వాళ్లతో సహవాసం చేసిన అనుభవంతో చెబుతున్నానని నితీష్‌ ఎద్దేవా చేశారు. బిజెపి టికెట్లు అమ్ముకుంటోందని, క్రిమినల్స్‌కు టికెట్లుస్తున్నారని ఆ పార్టీ ఎంపీయే స్వయంగా వెల్లడించారని, అలాంటి పార్టీ జంగల్‌రాజ్‌ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని నితీష్‌ పేర్కొన్నారు. బీహార్‌ను అభివృద్ధి పథాన ముందుకు నడుపుతామని, మహాకూటమికే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

21:57 - September 26, 2015

ఢిల్లీ : భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని జి-4 దేశాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోది విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ శాంతి కోసం జి-4 దేశాలు కట్టుబడి ఉన్నాయని మోది పేర్కొన్నారు.
న్యూయార్క్ లో జి-4 దేశాల సమావేశం
న్యూయార్క్ లో జి-4 దేశాల సమావేశం జరిగింది. జీ-4 దేశాధినేతలైన జర్మన్ ఛాన్సెలర్ ఎంజెలా మెర్క్, జపాన్ ప్రధాని షింజో అబె, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రొస్సెట్‌లతో భారత ప్రధాని నరేంద్రమోది సమావేశమయ్యారు. ఐక్య రాజ్యసమితిలో చేయాల్సిన సంస్కరణలపై జి-4 దేశాలు ప్రధానంగా చర్చించాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పడ్డ నాటికి ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయని ప్రధాని మోది తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై దశాబ్దాలుగా జరుగుతోన్న చర్చకు ముగింపు పలకాలన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. తీవ్రవాదం, పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతున్నాయని, నిర్దిష్ట కాలపరిమితిలో సంస్కరణలను అమలులోకి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ దేశాలు ప్రయత్నం..
కాగా, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ-4 దేశాలు భారత్‌తో పాటు జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. భద్రత మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌, రష్యా దేశాలకు మాత్రమే భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం ఉంది. మిగతా 10 దేశాలను ప్రతి రెండేళ్లకోసారి యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. 2004లో తొలిసారిగా కూటమిగా ఏర్పడ్డ జీ 4 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత 4 దేశాల శిఖర సమ్మేళనం జరగడం ఇది రెండోసారి.

 

21:53 - September 26, 2015

గుంటూరు : జిల్లాలోని ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ఒకే కుటుంబానికిచెందిన ఏడుగురు మృతిచెందారు.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు... కుటుంబమంతా అమరలింగేశ్వరస్వామిని దర్శించుకొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.. మృతులు తక్కెళ్లపాడుకుచెందినవారు... కాసేపట్లో ఇంటికిచేరుకునేలోపే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు..

 

21:50 - September 26, 2015

హైదరాబాద్ : గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నగర శివార్లతో పాటు సీటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఐదు జోన్లలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
సౌత్‌జోన్‌
సౌత్‌జోన్‌ పరిధిలో కేశవగిరి నుంచి వచ్చే వాహనాలు మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి ఇంజిన్ బౌలి, హిమ్మత్ పురా, హరీ బౌలి, మదీనా జంక్షన్ దగ్గర మరలి ఎంజె బ్రిడ్జి మీదుగా దారుల్సిఫా క్రాస్ రోడ్ నుంచి సిటీ కాలేజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఈస్ట్‌జోన్‌
ఈస్ట్‌జోన్‌ పరిధిలో చంచల్‌గూడ నుంచి ముసారాంబాగ్‌ మీదుగా చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్‌, పుత్తిబౌల్‌ చౌరస్తా, ట్రూప్‌బజార్‌, జాంబాగ్‌ చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది.
వెస్ట్ జోన్‌
వెస్ట్ జోన్‌ పరిధిలో టోపి ఖానా మాస్క్‌ నుంచి అలాస్కా హోటల్‌ జంక్షన్‌, ఉస్మాన్‌గంజ్‌, శంకర్‌బాగ్‌, శీనా హోటల్‌ మీదుగా అజంతాగేట్‌, అబ్కారీలైన్‌, తాజ్‌ ఐలాండ్‌, బర్తన్‌ బజార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది.
సెంట్రల్‌ జోన్‌
సెంట్రల్‌ జోన్‌లో ఛాపెల్‌ రోడ్‌ నుంచి జీపీఓ గద్వాల్‌ సెంటర్‌, శాలిమర్‌ థియేటర్‌, గన్‌ఫౌండ్రీ, స్కైలాన్‌ రోడ్‌ మీదుగా దోమల్‌గూడలోని భారత్‌ స్కౌట్స్ అండ్‌ గైడ్స్‌ చౌరస్తా, కంట్రోల్‌ రూమ్‌ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్‌ ఆఫీస్‌ వై జంక్షన్‌, బీఆర్‌కే భవన్‌, ఇక్బాల్‌ మీనార్‌ మీదుగా వాహనాలు మళ్లించనున్నారు. సెంట్రల్‌ జోన్‌లోనే ట్రాఫిక్‌ను మళ్లించే మరికొన్ని మార్గాలు. రవీంధ్ర భారతి, ద్వారకా హోటల్‌ చౌరస్తా, వీవీ స్టాచ్యూ చౌరస్తా, చిల్ట్రన్‌ పార్క్‌, వైశ్రాయ్‌ హోటల్‌ చౌరస్తా, కవాడీ గూడజంక్షన్‌, కట్ట మైసమ్మ టెంపుల్‌, ఇందిరాపార్క్‌.
నార్త్‌జోన్‌
నార్త్‌జోన్‌ పరిధిలో ట్రాఫిక్ మళ్లించే మార్గాలు. కర్బాలామైదాన్‌, బుద్దభవన్‌, షెయిలింగ్‌ క్లబ్‌, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ట్రాఫిక్‌ను అనుమతించరు. అలాగే సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్‌ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్‌, బాటా ఎక్స్ రోడ్‌, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటాయి.

 

21:46 - September 26, 2015

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను జోడించి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మూడు రాష్ర్టాలకు చెందిన బలగాలను వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలెన్స్‌ కెమెరాల ద్వారా... సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అందేలా ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనయాత్ర
జంటనగరాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రతాదళాలు సైతం రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జన యాత్ర సాగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్ టిఆర్ మార్గ్‌లో పెద్దసంఖ్యలో నిఘానేత్రాలను ఏర్పాటుచేశారు. సుమారు 600 కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. 20 వేల మంది పోలీసులతో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. మఫ్టీలో మరో నాలుగు వేల మంది పోలీసులు గణేశ్‌ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తుంటారు. వీరితో పాటు పది కంపెనీల పారా మిలటరీ బలగాలు పాల్గొంటాయి. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు... సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు.
ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు
సిటీలో 7 అతి సమస్యాత్మక, 320 సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జన కార్యక్రమం త్వరగా... పూర్తి కావడానికి మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశమ్యారు. బాలాపూర్‌ గణేశ్‌ను అనుసరించే విగ్రహాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల గణనాథుల్ని తెల్లవారు జామునే బయలుదేరాలని ఆదేశించారు.
రూట్‌ మ్యాప్‌ను తయారు
మరోవైపు విగ్రహాలు వెళ్లే మార్గాలకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ను తయారుచేశారు. ఆయా ప్రాంతాల్లో ఆర్ టిసి బస్సులను సైతం నిషేధించారు. చంద్రాయణగుట్ట నుంచి చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజె మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, ట్యాంక్‌బండ్‌ మార్గాల్ని బారికేడ్లతో మూసివేశారు. గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు.

 

21:41 - September 26, 2015

భారతీయ సమాజం వర్ణవ్యవస్థ వల్ల చాలా నష్టపోయింది. అందులో కంసాలి, వడ్రంగి, కమ్మరిలాంటి కులాలవాళ్ళ శ్రమ గుర్తింపుకు నోచుకోలేదు. సామాజికంగా వారిని ఎవరూ గౌరవించనూలేదు. మనుసంస్కృతి సృష్టించిన నయవంచక భారతీయ సమాజంలో అట్టడుగు కులాల శ్రమజీవులకు తీరని అన్యాయం జరిగింది. వారి కులవృత్తులకు ప్రజాదరణ లభించిన శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇదే అంశంపై నిర్వహించిన జన చరిత శ్రమైక జీవన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక విశ్లేషకుడు కంచె ఐలయ్య పాల్గొని, అనేక విషయాలను వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం.....
'ఇనుము కరిగించే ప్రక్రియతో భారత్ లో ఇంజనీరింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. గొడ్డలి తయారితో అడువుల నరికివేత ఆరంభం అయింది. దాని అడ్వాన్స్ పరిణామమే కత్తుల తయారీ. కీ.పూ. 2000 సంవత్సరంలో ఇనుము, ఇంజనీరింగ్ పని మొదలయింది. సింధు నాగరికతలో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ముందు దూలాలతో ఇల్లు...నిర్మించారు. వడ్రంగీలు బార్షలతో చెక్కడం ప్రారంభించారు. కంసాలీలు బంగారాన్ని కరుగబెట్టి.. బ్రహ్మాండమైన నగలను తయారు చేశారు. దీంతో ఇంజనీరింగ్ అత్యున్నత స్థాయికి వెళ్లింది. అయితే ఇంజనీరింగ్ పని ఇంజనీరింగ్ గా పరిగణించబడలేదు. సామాజిక, ఆర్థిక గుర్తింపు ఇవ్వలేదు. రాజకీయ, మత పరమైన ఎత్తుగడులు వేయడబడ్డాయి. బ్రిటీష్ వారు ఇండియాకు వచ్చిన తర్వాతే ఇంజనీరింగ్ పని వెలికితీయబడింది. వృత్తి పరమైన ఇంజనీరింగ్ బయటికి వచ్చింది. వీరు చేసే పనులకు దేవుని దగ్గర, సమాజం, కులంలో గౌరవం లేదు. వారికి సమానమైన వేతనం లేదు. ఇంజనీరింగ్ పనికి తాత్విక గుర్తింపు ఉండాలి. ప్రజల గురించి ఆలోచించే పద్ధతి మార్చాలి. బ్రిటీష్ వారు వచ్చే వరకు ఇంజనీరింగ్ విద్యను భారత్ లో ప్రారంభించలేదు. మొదటగా అన్ని యూనిర్సిటీలు అధ్యాత్మికత నుంచే వచ్చాయి. ప్రాక్టికల్ గా చేసే ఇంజనీరింగ్ పనులకు గుర్తింపు ఇవ్వలేదు. కమ్మరి, వడ్రంగి, కంసాలీలు అజ్ఞాత ఇంజనీర్లుగా ఉన్నారు. అశోకుని కాలంలో వ్యవసాయక విప్లవం వచ్చింది. కమ్మరి, వడ్రంగి, కంసలి కులాలకు అద్భుత నైపుణ్యం ఉంది. తోలుతిత్తి ఉమ్మడి కులాల శ్రమఫలితం. వడ్రంగుల ఇంజనీరింగ్ పరిజ్ఞానం నాగలి, ఎడ్లబండి బంగారు, వెండికి సొగసులు అద్దిన కంసాసులు. కింది కులాల నైపుణ్యాలను హిందూమతం ప్రోత్సహించలేదు. కమ్మరి, వడ్రంగి, కంసలి వృత్తులను పాఠ్యాంశాలుగా చేర్చాలి. వారి పనికి సమానమైన వేతనం ఇవ్వాలి. వారిని గౌరవించాలి. ఆయన తెలిపిన మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

21:03 - September 26, 2015

హన్మకొండ : వరంగల్ జిల్లాలోని చిట్యాల ఎమ్మార్వో ఆత్మహత్య శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండలానికి చెందిన శ్రీనివాస్ (35) గ్రూప్స్ పరీక్షలో ఎమ్మార్వో ఉద్యోగం సాధించాడు. చిట్యాల మండలం ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన గ్రేహౌండ్స్ లో పని చేశాడు. భార్య, కుమార్తెతో కలిసి శ్రీనివాస్ హన్మకొండలోని ప్రగతినగర్ లో ఉంటున్నాడు. అయితే భార్యభర్తలు మొదటి నుంచి గొడవలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాళా కూడా ఇద్దరు త్రీవంగా గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో శ్రీనివాస్... ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా భార్యకు కూడా కొన్ని గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

 

వరంగల్ జిల్లా చిట్యాల ఎమ్మార్వో ఆత్మహత్య

హన్మకొండ : వరంగల్ జిల్లాలోని చిట్యాల ఎమ్మార్వో ఆత్మహత్య శ్రీనివాస్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ ప్రగతినగర్ లోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

రంగారెడ్డి : బషీరాబాద్ మండలం నవంద్గిలో విషాదం నెలకొంది. పొలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు మంజుల(20), ఉమాదేవ(45), చిన్నమ్మ (65)లుగా గుర్తించారు.

 

రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు : మంత్రి సిద్ధా రాఘవరావు

విజయవాడ : రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఎన్ హెచ్ ఏఐ, ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి మంత్రి సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రహదారులను అమరావతికి కలిపేలా రోడ్ కనెక్టివిటీ మ్యాప్ ను తయారు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. కాకినాడ-చెన్నై మధ్య కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

19:56 - September 26, 2015

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు జరుపుతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ దామోదర్ ఉత్తర్వు మేరకు జిల్లాలో 35 మంది బృందంతో 24 నాటు సారా తయారీ కేంద్రాల పై ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ దాడులు చేసారు. తయారీ దారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

 

19:47 - September 26, 2015

విశాఖ : చిన్నారి అదితి కోసం విశాఖలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలాల నుంచి సముద్రంలోకి బాలిక వెళ్లే అవకాశముందని భావిస్తున్న అధికారులు అక్కడ కూడా గాలింపు చేస్తున్నారు. అదితి కానరాక 48గంటలు అవుతోంది. 48గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అధికార యంత్రాంగం సముద్రంలో వెతుకుతోంది. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
గురువారం సాయంత్రం జరిగిన ఘటన..
కృష్ణా కళాశాల ప్రాంతంలో ఆరేళ్ల బాలిక 'అదితి' గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడిపోయింది. కానీ సమాచారం తెలిసినా జీవీఎంసీ అధికారులు సకాలంలో స్పందించలేదన్న విమర్శలు రేకెత్తాయి. గురువారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో నగర పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్..జీవీఎంసీ అధికారులందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో శుక్రవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. అందరూ కలిసి గాలింపు చేపట్టారు. జీవీఎంసీ అధికారులు..పారిశుధ్య సిబ్బంది..40 ప్రొక్లయినర్లు..జేసీబీలతో ఉపయోగించి ఎక్కడికక్కడ చెత్తను తీసివేయించారు. చిన్నారి ఆచూకి తెలియక బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఎక్కడైనా కనీసం గాయాలతోనైనా పాప సజీవంగానే ఉంటుందన ఆశతో వారున్నారు.

 

19:34 - September 26, 2015

రంగారెడ్డి : రైతులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని కాంగ్రెస్‌ శాసనసభ ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని పరిగి మండలం రాఘవాపూర్‌, తొండపల్లి గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సీఎల్పీ పరామర్శించింది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతులు శ్రీశైలం, బాలయ్యల కుటుంబాలను సీఎల్పీ నేతలు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ రైతులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నుంచ రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

గుంటూరు : ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

 

19:03 - September 26, 2015

హైదరాబాద్ : వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం అయ్యింది. పోలీసు, జిహెచ్‌ఎంసి, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో పెద్ద సంఖ్యలో క్రేన్‌లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 27 క్రేన్లు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 10 క్రేన్లన ఉంచారు. ఖైరతాబాద్‌ గణేష్‌తో పాటు 20 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాలను ఎన్టీఆర్‌మార్గ్‌లో నిమజ్జనం చేస్తారు. 20 అడుగుల కంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం చేస్తారు.

 

18:58 - September 26, 2015

అనంతపురం : జిల్లాలో భారీవర్షం కురసింది. ఉరుములు, మెరుపులతో జనాలకు చుక్కలు చూపించింది. ఉరవకొండ, రాయదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. డోనేకల్లు వాగులో రెండు బొగ్గు లారీలు బోల్తాపడ్డాయి... దీంతో దాదాపు 3 కిలోమీటర్లవరకూ ట్రాఫిక్ స్తంభించింది.. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఈ గ్రామం ఉంది.. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.. గాజులమల్లాపురంలోని ఎస్సీ కాలనీ నీటిలో మునిగిపోయింది.. రాయదుర్గంలో వరదబాధిత ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ పర్యటించారు.. ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు..  

18:55 - September 26, 2015

తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒకటో మలుపు వద్ద అదుపుతప్పిన వాహనం... పిట్టగోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో 8 మంది మహారాష్ట్ర భక్తులకు గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ప్రాణనష్టం తప్పింది.

 

18:52 - September 26, 2015

హైదరాబాద్‌ : నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే గణేష్‌ నిమజ్జనానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అడుగడుగునా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 400 సర్వే లెన్స్‌ కెమెరాలు సిద్దం చేశారు. 23 వేల మంది పోలీసులతో బందోబస్తు నియమించారు. గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై సిటీ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వివరించారు. ఆ వివరాను ఆయన మాటల్లోనే చూద్దాం..
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు 
'గణేష్ నిమజ్జనం సందర్భంగా... వినాయక శోభయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాము. నగరంలోని వివిధ ప్రాంతాలోని సిసి టివి కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేశాము. నగరంలో మొత్తం 400 సీసీ టీవీలు ఏర్పాటు చేశాం. ఇవి 30 క్రేన్ ఏరియాలను కవర్ చేస్తాయి. అన్ని డిపార్టు మెంట్ల అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ తో టచ్ లో ఉంటారు. సిపి టివి పుటేజీ ప్రతొక్క అధికారికి అందుబాటులో ఉంటుంది. బందోబస్తులో 23 వేల పోలీసులు పాల్గొంటున్నారు. హైదరాబాద్ జిల్లాతోపాటు తెలంగాణలోని 9 జిల్లాల్లోని పోలీసులు, అదనంగా ఎపి, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా అదనపు బలగాలు వచ్చాయి. పోలీసులందరూ విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు' ఆయన తెలిపారు.

 

18:16 - September 26, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని... తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వచ్చేవారం తెలంగాణ అసెంబ్లీలో ఓటుకు నోటు కేసు వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగితే ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సభలో అధికారపక్షాన్ని ఏ విధంగా ఇరుకునపెట్టాలని అనే దానిపై చర్చించినట్టు సమాచారం. 

17:50 - September 26, 2015

నేడు గుర్రం జాషువా 120 వ జయంతి. జాషువా జయంతి సందర్భంగా టెన్ టివి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, ప్రముఖ కవి శిఖామణి, సాహితీ స్రవంతి నిర్వహకుడు, ప్రముఖ రచయిత వొరప్రసాద్, ఆచార్య ఇనాక్ లు పాల్గొని, మాట్లాడారు. జాషువా గొప్ప జాతీయ కవి అన్నారు. ఆయన గొప్ప భావ కవి అభివర్ణించారు. భావ కవితతో ప్రత్యామ్నాయ కవిత్వాన్ని స్పృశించారని తెలిపారు. జాతీయోద్యమ సమయంలో జాషువా ఎన్నో రచనలు చేశారని గుర్తు చేశారు. అయితే ఆర్థిక అసమానతలు, కుల వివక్షతలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని వక్తలు వాపోయారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గుంటూరులో విద్యార్థి ఆత్మహత్య...

గుంటూరు : జిల్లాలోని దారుణం జరిగింది. ఓ పిజి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణ గుంటూరు జిల్లా బాపట్లలోని ఏజీ కళాశాలలో ఎంఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపత్యంలో సూర్యనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.

 

'అనంత'లో విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన పరమేశ్వరి.. వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది.

 

16:58 - September 26, 2015

గుంటూరు : వచ్చేనెల 7న గుంటూరులో జగన్ దీక్షకు అనుమతి కోసం వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో వైసీపీ నేతలు అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిశారు. అయితే నగరంలో దీక్షకు అనుమతించేది లేదన్న పోలీసులు స్పష్టం చేశారు. నల్లపాడు, అమరావతి రోడ్లలో ఏదో ఒక ప్రాంతంలో.. దీక్ష పెట్టుకుంటే పరిశీలిస్తామని తెలిపారు.

 

16:54 - September 26, 2015

కృష్ణా : విజయవాడ కబేళా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నీచర్ గోడౌన్ లో మంటలు అంటుకోవడంతో... భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... గంట పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 50లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అంచనా. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

16:51 - September 26, 2015

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో రణరంగం చేటుచేసుకుంది. ఐడీ కార్డుల విషయంలో ఆస్పత్రి సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. సిబ్బంది కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆస్పత్రి సూపరింటెండ్ జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగించారు. 

16:49 - September 26, 2015

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపనకు అన్నివర్గాల ప్రజల్ని ఆహ్వానించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అక్టోబర్‌ 1 లేదా 2వ తేదీల్లో శంకుస్థాపన స్థలాన్ని ప్రకటిస్తామని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో 95 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగతా 5 శాతం సమస్యల్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు.

 

16:43 - September 26, 2015

హైదరాబాద్ : ఆ అంటే ఆన్‌లైన్‌.. ఈ అంటే ఈ-మెయిల్‌ అంతలా వీటితో కనెక్ట్‌ అయిపోయింది జీవితం. అన్నం లేకపోయినా పూటగడుస్తుందేమోగాని ఆన్‌లైన్‌ కనెక్షన్లు ఆన్ చేయకుండా సెకను కూడా గడవదు. ఇది ఎంత వేగంగా మనిషి అవసరాలను తీర్చుతుందో అంతకంటే వేగంగా దుర్వినియోగమౌతూ దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ఆన్‌లైన్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
అంతా సెల్‌ఫోన్ల యుగం... 
ఉత్తరాలను కాలం ఊడ్చేసింది. స్పీడ్‌ పోస్టులు అంతే స్పీడుగా స్లో అయ్యాయి. టెలిగ్రాములు ఇప్పుడు కొలిచినా గ్రాముకూడా తూగవు. అంతా సెల్‌ఫోన్ల యుగం... ఈమెయిళ్ల కాలం... సమయమంతా ఫేస్‌ బుక్కుల పరం.
మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ హింస
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కనెక్టింగ్‌ ది పీపుల్‌లా మారిన ఆన్‌లైన్‌ సైలెంట్‌గా వాయిలెంట్‌కు సెంటర్‌ పాయింట్‌గా తయారైంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ దుష్ఫలితాలు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్ నేషన్స్‌ బ్రొడ్‌బాండ్‌ కమిషన్‌ తన సర్వేలో తేల్చింది. నెటిజన్లలో ముప్పావు వంతు మహిళలు ఆన్‌లైన్‌ హింసకు గురవుతున్నారు.
ఆన్‌లైన్‌హింసపై త్వరితగతిన చర్యలు
అత్యాచారాలు..హత్యల సరసన ఇప్పుడు లేటెస్టుగా చేరిన ఆన్‌లైన్‌ హింసపై కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. యుఎన్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో 86 దేశాల్లో త్వరతగతిన ఆన్‌లైన్‌ హింసపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఇండియా కూడా ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌ హింస లిస్టులో చేరడం విశేషం.
కేసులకు దూరంగా 46.7% మహిళలు
కేవలం 35 శాతం ఇండియన్‌ మహిళలు మాత్రమే తమపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేసులు పెడుతుంటే 46.7 శాతానికిపైగా మహిళలు విషయాన్ని బయటకు రానివ్వడం లేదని సర్వే తేల్చింది. మరోవైపు తమ అభిప్రాయాలను మహిళలు స్వేచ్ఛగా చెప్పడంలో మనదేశం టాప్‌ 6 దేశాల్లో ఒకటిగా ఉండటం విశేషం. ఓ వైపు టెక్నాలజీ దుర్వినియోగమౌతూ హింసకు వేదికగా మారుతుంటే మరో వైపు మన చట్టాలు డేటాను రహస్యంగా ఉంచే టెక్నాలజీని, ఇంటర్నెట్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ను మరింత పటిష్టం, అభవృద్ధి చేయాలని భావిస్తోంది. దూసుకుపోతున్న ఈ టెక్నాలజీ ఏ విచ్ఛిన్నానికి దారితీస్తుందో వేచి చూడాలి.

 

16:37 - September 26, 2015

నెల్లూరు : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-30ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన లక్ష్యంతో ఆస్ట్రోశాట్ ప్రయోగం నిర్వహిస్తున్నారు. రాకెట్‌ ప్రయోగానికి ఇవాళ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.
సాంకేతికంగా మరో అడుగు ముందుక
సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. పీఎస్ఎల్వీ సీ-30ని సోమవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించనుంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. 50 గంటల తర్వాత రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.
తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్
భారత్ నింగిలోకి పంపుతున్న తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ ఇది. దీని బరువు 1513 కేజీలు. దీంతో పాటు ఇండొనేషియాకు చెందిన లపాన్-ఏ2 శాటిలైట్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-14...అమెరికాకు చెందిన నాలుగు నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ సీ-30 నింగిలోకి తీసుకెళుతోంది. ఈ ప్రయోగానికి సుమారు 350 కోట్లు ఖర్చు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అస్ట్రోశాట్‌ రూపొందించేందుకు 178 కోట్లు వెచ్చించారు. ఇప్పటివరకు మన దేశానికి ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేదు. గతంలో పంపిన పరికరాలను ఇతర ఉపగ్రహాలతో అనుసంధానం చేసి పంపేవారు. ఈ ఉపగ్రహ తయారీకి సూర్యనారాయణ శర్మ సారథ్యం వహించారు. ఈ ఆస్ట్రోనాట్ ఐదు సంవత్సరాల కాలం పని చేస్తుందని ఈ సమయంలో 300 టెర్రాబైట్ డేటాను సేకరిస్తుందని స్పేస్ సెంటర్ అధికారులు తెలిపారు.

 

 

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రణరంగం

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో రణరంగం చేటుచేసుకుంది. ఐడీ కార్డుల విషయంలో ఆస్పత్రి సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. సిబ్బంది కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి.    

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం..

కృష్ణా : విజయవాడలో కబేళా సమీపంలోని ఫర్నీచర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాద ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

15:59 - September 26, 2015

వరంగల్ : వరంగల్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు.ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఎన్‌కౌంటర్లే ఉండవని చెప్పిన కేసీఆర్‌.. ఎన్‌కౌంటర్లతోనే రాష్ట్రాన్ని ప్రారంభించడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా మావోయిస్టు శృతిని చిత్రహింసలు పెట్టి... అత్యాచారం చేసి హతమార్చడం దారుణమని ఆరోపించారు. కేసీఆర్.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆయన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. 

15:54 - September 26, 2015

కర్నూలు : జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు కన్నుమూశాడు. వెల్దుర్తికి చెందిన షబాన ప్రసవం నిమిత్తం వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. ఇవాళ ఆమెకు మగబిడ్డ జన్మించాడు. అయితే కాన్పు సమయంలో డాక్టర్ల అజాగ్రత్త వల్ల పసికందు గొంతుకు తీవ్ర గాయమైంది. వెంటనే చిన్నపిల్లల డాక్టరుకు చూపించినా శిశువు దక్కలేదు. దీంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు. వైద్యుల అజాగ్రత్త వల్లే శిశువు మృతి చెందాడని బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

కర్నూలు : జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు కన్నుమూశాడు. దీంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు..

15:48 - September 26, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో సైకో సూదిగాడు కలకలం రేపుతున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలు, చిన్నపిల్లలపై సూదితో గుచ్చి పరార్‌ అవుతున్నాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూదిగాడు కలకలం రేపాడు. రైల్లోని ప్రయాణికులను సూదితో గుచ్చాడు. దీంతో స్థానికులు ఆ సూదిగాడ్ని పట్టుకుని జిఆర్ పి పోలీసులకు అప్పగించారు. సూదిగాడి నుంచి 2 సిరంజీలు, సూది మందు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

15:44 - September 26, 2015

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబుపై వైసిపి నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాకు బాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 7న గుంటూరులో జగన్ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. అయితే జగన్ దీక్షను హేళన చేయడం చంద్రబాబుకు సరికాదని హితవు పలికారు. నేడు మరోసారి గుంటూరులో అధికారులను కలుస్తామని చెప్పారు. పోలీసుల అనుమతి కోరుతామని... అనుమతి ఇవ్వని ఎడల హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.   

మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఖండించిన తమ్మినేని

వరంగల్ : వరంగల్ మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్ కౌంటర్లే ఉండవని చెప్పిన కేసీఆర్... ఎన్ కౌంటర్లతోనే రాష్ట్రాన్ని ప్రారంభించడం సిగ్గు చేటన్నారు.  

చంద్రబాబుపై బొత్స ఫైర్....

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసిపి నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాకు బాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలన్నారు. వచ్చే నెల 7న గుంటూరులో తలపెట్టిన జగన్ దీక్షను హేళన చేయడం చంద్రబాబుకు సరికాదని హితవుపలికారు. నేడు మరోసారి గుంటూరులో అధికారులను కలుస్తామని చెప్పారు. పోలీసుల అనుమతి కోరుతామమని. లేదంటే హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.   

రైతుల భూములను ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోం - సీపీఎం..

విజయవాడ : రాజధాని భూములను ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోమని సీపీఎం క్రిడా ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబురావు హెచ్చరించారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలకు పలు గ్రామాల నుండి రైతులు తరలివచ్చారు. భూములను అమ్మాలని అనుకుంటే రైతులు తిరగబడుతారని హెచ్చరించారు. 

విద్యార్థుల సూసైడ్స్ పై ఏకసభ్య కమిటీ - గంటా...

విజయవాడ : విద్యార్థుల ఆత్మహత్య ఘటనలపై ఏక సభ్య కమిటీని నియమించినట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. పూర్వ ఐఏఎస్ చక్రపాణి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతుందన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ గా చక్రపాణి పనిచేసిన సంగతి తెలిసిందే.

 

కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు..

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. నూజివీడు, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు, బాపులపాడు, గన్నవరం మండలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా బట్టీలను ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు.

 

 

ఏపీలో మావోయిస్టులు లేరు - చిన రాజప్ప..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో మావోయిస్టులు లేరని హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించారు. చింతూరు, తుళ్లూరులో పోలీసు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు, అర్బన్ మావోయిజం దృష్టి సారించినట్లు చెప్పారు. నగరంలో గణేష్ నిమజ్జనానికి సుమారు 2,560 మంది ఏపీ పోలీసులను కేటాయించినట్లు తెలిపారు.

పంచాయతీ రాజ్ అధికారులతో అయ్యన్న సమీక్ష..

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి అయ్యన్న సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

 

సచివాలయంలో మంత్రి కామినేని సమీక్ష సమావేశం..

హైదరాబాద్ : ఏపీ మంత్రి కామినేని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఎంసీహెచ్ ఆసుపత్రులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

13:53 - September 26, 2015

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తన కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలుగా తన తండ్రి ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారని, హెరిటేజ్ సంస్థ ద్వారా తమ కుటుంబానికి ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థకు జాతీయ అవార్డులు వచ్చాయని, అందరూ కూడా ఆస్తులు ప్రకటించి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. గత ఐదేండ్లుగా ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నామని, బాబుపై ఆరోపణలు చేసిన వారు ఇంతవరకు నిరూపించలేకపోతున్నారని విమర్శించారు. కొందరు నేతలు రాజకీయాలను అవినీతి మయం చేశారని విమర్శించారు. ఆరోపణలు మానేసి వారు కూడా ఆస్తులను ప్రకటించి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 1992లో హెరిటేజ్ సంస్థను 10ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. హెరిటేజ్ ప్రస్తుత విలువరూ.913 కోట్లు అని వెల్లడించారు. ఖర్చులు పోను హెరిటేజ్ కు ఏటా రూ.30 కోట్లు ఆదాయం వస్తోందని తెలిపారు. హుదూద్ తుఫాన్ సమయంలో హెరిటేజ్ సంస్థ సహాయం చేస్తోందన్నారు.

పేరు ఆస్తులు  అప్పులు నికరం
చంద్రబాబు నాయుడు  రూ.0.5 కోట్లు రూ.0.08 కోట్లు  రూ.0.42 కోట్లు
భువనేశ్వరి రూ.43.20 కోట్లు రూ.10.12 కోట్లు రూ.33.07 కోట్లు
లోకేశ్ రూ.12.39 కోట్లు  రూ.4.72 కోట్లు రూ.7.67 కోట్లు
బ్రాహ్మణి రూ.5.14 కోట్లు రూ.0.36 కోట్లు రూ.4.77 కోట్లు
నిర్వాణ హోల్డింగ్స్ రూ.27.81 కోట్లు రూ.26.44 కోట్లు   రూ.1.37 కోట్లు

తెలంగాణకు రూ.40 కోట్లు ఆదాయం..
తెలంగాణ ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ వ్యాపారం మొదలై 15 సంవత్సరాలు దాటిందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పాలు..కూరగాయలు వ్యాపారం చేస్తున్నామని, ఎంతోమంది రైతులకు తాము అండగా ఉన్నట్లు తెలిపారు. తమ హెరిటేజ్ సంస్థ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్లు వరకు ఆదాయం సమకూరుతోందని తెలతిపారు. హెరిటేజ్ పాలు నాణ్యతకు మారుపేరని, నాణ్యత బాగుండడం వల్లే తాను కాని..తన తండ్రి చంద్రబాబు కాని..ఇతర కుటుంబ సభ్యులు కాని హెరిటేజ్ పాలనే వాడుతున్నట్లు తెలిపారు. 

ఆస్తులను ప్రకటించిన నారా లోకేష్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కుటుంబం ఆస్తులను ప్రకటించారు. గత నాలుగేళ్లుగా తన తండ్రి ఆస్తులను ప్రకటిస్తున్నారని, ఇతరులు కూడా మార్గదర్శకంగా ఉండాలని లోకేష్ సూచించారు.

13:24 - September 26, 2015

గుంటూరు : భూములిచ్చే వరకూ ఒక మాట చెప్పారు. భూములు ఇచ్చిన తరువాత ఇప్పుడు మరో మాట చెబుతున్నారు. గతంలో ఒక రైతు రికార్డుల్లో ఉన్న భూమి ఇప్పుడు..సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం తక్కువగా ఉన్నట్లుగా కనపడుతోంది. భూముల రికార్డుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తమ దగ్గరున్న రికార్డుల ప్రకారంగానే భూముల వివరాలను నమోదు చేసుకోవాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సర్కార్‌ మరో సమస్య తెచ్చిపెట్టింది. ఇప్పటికే భూములు కోల్పోయి దిగాలుగా ఉన్న రైతులు ఈ కొత్త సమస్యతో మరింత ఆందోళన పడుతున్నారు. ఇంతకుముందు రైతుల డాక్యుమెంట్లలో పేర్కొని ఉన్న పొలంకంటే.. సీఆర్డీఏ నిర్వహించిన సర్వేలో తక్కువ భూమి ఉన్నట్లుగా చూపిస్తోంది. దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. అందుకే భూములను మరోసారి సర్వే చేయాలని బాధిత రైతులు సీఆర్డీఏ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. తమ కాగితాల్లో ఉన్నంత భూమిని సీఆర్డీఏ రికార్డుల్లోనూ యథాతధంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుదరనిపక్షంలో భూ సమీకరణ ప్రాతిపదికన రాజధాని నిర్మాణానికి తామిచ్చిన భూములను తిరిగిచ్చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తక్కువ విస్తీర్ణం నమోదు..
తాము అమరావతి కోసం ఇచ్చిన భూమికంటే, తక్కువ విస్తీర్ణాన్నే సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేస్తోందని రైతులు వాపోతున్నారు. దీనివల్ల భూములిచ్చిన తమకు ప్రభుత్వం ఇవ్వనున్న ప్లాట్ల విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంకు చెందిన ఒక కుటుంబం రాజధాని కోసం 54 సెంట్ల భూమిని ఇచ్చింది. అధికారుల కొలతల్లో వాస్తవ విస్తీర్ణం 50 సెంట్లుగానే తేలింది. దీంతో ఆ తరహాలోనే ప్యాకేజీని వర్తింపజేస్తామని అధికారులు చెబుతుండగా.. అలా కుదరని, తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఆధారంగా 54 సెంట్లు ఉన్నందున అంతే విస్తీర్ణాన్ని నమోదు చేసి, ప్యాకేజీని ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కుదరని పక్షంలో తమ పొలాన్ని తిరిగిచ్చేయాలని కోరుతున్నారు.

సాంకేతిక సమస్యలు తొలగించాలి..
గతంలో రహదారులకు లోపల ఉన్న పొలాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా వదిలిన బండ్ల బాటలు, నడక బాటల స్థలాల యాజమాన్య హక్కులపై కూడా కొన్ని గ్రామాల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. భూముల సర్వే శాస్త్రీయంగా జరిగిందంటున్న అధికారులు.. వాటి విస్తీర్ణం తగ్గిందంటున్న రైతుల వాదనను తోసి పుచ్చుతున్నారు. ఆస్తుల పంపకాల సమయంలో రాసుకున్న కాగితాల ఆధారంగా వాదిస్తే మాత్రం ఫలితం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఒకసారి పూలింగ్‌కు ఇచ్చి, పరిహారపు చెక్కులను కూడా పొందిన రైతులకు భూములను తిరిగివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేస్తున్నారు. పంట భూములను వాటి యజమానులు తరతరాలుగా సబ్ డివిజన్‌ చేయించుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సీఆర్డీఏ అధికారులు భూముల రికార్డుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను తొలగించాలని రాజధాని ప్రాంత రైతులు మొర పెట్టుకుంటున్నారు. 

13:18 - September 26, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో స్వైన్ ఫ్లూతో ఓ మహిళ మృతిచెందింది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన గంగారపు అనురాధ హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి చనిపోయింది. 15 రోజుల క్రితం వనపర్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన అనురాధ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ కుతరలించి.. 4 రోజులు చికిత్స అందించిన తర్వాత వైద్యులు స్వైన్‌ ఫ్లూగా నిర్దారించారు. ఆ తర్వాత అనురాధను కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. చనిపోయింది. అనురాధ మృతితో కుటుంబ సభ్యలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

13:17 - September 26, 2015

కర్నూలు/నల్గొండ : తొమ్మిది రోజులు ఘనంగా పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. కర్నూలు నగర పురవీధులలో తిరుగుతూ వినాయకఘాట్‌కు విగ్రహాలను నిమజ్జనాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

నల్గొండలో..
నల్లగొండ జిల్లాలో గణేష్‌ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ హనుమాన్‌నగర్‌లోని వినాయకుడు మొదట నిమజ్జనానికి బయల్దేరి వెళ్లాడు. అంతకుముందు.. స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు కలెక్టర్ తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెదక్ లో హరీష్ పర్యటన..

మెదక్ : జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్, చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు నేడు ప్రారంభించారు.

స్వైన్ ఫ్లూ వ్యాధితో మహిళ మృతి..

హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధితో మరో మహిళ మృతిచెందింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడింది. మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ . పరిస్థితి విషమించి నేడు మృతిచెందింది. 

వచ్చే నెల 7న గుంటూరులో జగన్ దీక్ష..

గుంటూరు : వచ్చే నెల ఏడో తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్ దీక్ష చేపట్టనున్నారని ఆ పార్టీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఏర్పాటు చేసుకుంటామని, పోలీసుల అనుమతి కోరుతామని లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని బోత్స స్పష్టం చేశారు. 

పరిశ్రమల శాఖపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : పరిశ్రమల శాఖపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న కంపెనీలపై సమీక్ష నిర్వహించారు. 

 

చిన్నారి గల్లంతుపై జీవీఎంసీ కమిషనర్ ఆగ్రహం..

విశాఖపట్టణం : చిన్నారి ఆదితి గల్లంతుపై జీవీఎంసీ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య, భవన విభాగాల ఇన్స్ పెక్టర్లు, ఏఈలను సస్పెండ్ చేశారు.

రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి..

హైదరాబాద్ : రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కొండా కృషికి కేసీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొండా జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. 

 

మిషన్ కాకతీయ..టెన్ టివికి అవార్డు..

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై పది అంశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు వేర్వేరుగా అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మొదటి బహుమతిని శ్రీమతి వంగవల్లి పద్మ (టెన్ టివి) గెలుచుకున్నారు.

 

సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఏచూరీ అధ్యక్షతనలో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రకాశ్ కరత్, బందాకరత్, రాఘవులు ఇతర నేతలు హాజరయ్యారు. దేశ పరిస్థితులు, రాజకీయ అంశాలు, డిసెంబర్ లో కలకత్తాలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో నేతలు చర్చించనున్నారు. 

రైతులను ఆదుకొనేందుకు కేంద్రం ముందుకు రావాలి - పోచారం..

హైదరాబాద్: దేశావ్యాప్త రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. నగరంలోని రవీంద్రభారతీలో వినియోగాదారుల సమన్వయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమస్యలు, పరిష్కారాల జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

12:32 - September 26, 2015

హిమాచల్‌ ప్రదేశ్‌ : సీఎం వీరభద్ర సింగ్‌ ఇంటిపై సీబీఐ ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ దాడులు చేపట్టింది. షిమ్లాలోని సీఎం నివాసంతో పాటు... జాకులోని సొంత ఇంట్లోనూ ఏకకాలంలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే సీబీఐ దాడుల సమయంలో సీఎం వీరభద్రసింగ్‌ ఇంట్లో లేరు. అదే సమయంలో ఆయన కుటుంబ పంక్షన్‌కు హాజరయ్యేందుకు స్థానిక ఆలయానికి ఫ్యామిలీతో వెళ్లారు.   

12:31 - September 26, 2015

విశాఖపట్టణం : కేంద్ర గ్రంథాలయ స్థలం వివాదం ప్రకంపనలు రేపుతోంది. అప్పనంగా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఓ మంత్రి గారి కంపెనీ సైలెంట్‌ అయ్యింది. పనులేవి చేపట్టకపోవడంతో ఉన్న కాంట్రాక్టు పోయింది. మళ్లీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారట. కంపెనీ తీరుపై ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. కంపెనీకి అప్పగించిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.

4536 గజాల స్థలం..
కేంద్ర గ్రంథాలయానికి విశాఖ కలెక్టరేట్‌ సమీపంలో 4536 గజాల స్థలం ఉంది. అప్పటి వైఎస్సార్‌ సర్కార్‌ గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి అప్పనంగా కట్టబెట్టింది. 2008 మే 28న జీవో నెం.366ను విడుదల చేసింది. 2009జూన్‌ 5న అత్యంత విలువైన గ్రంథాలయ స్థలాన్ని గంటా కంపెనీకి కట్టబెడుతూ నిర్ణయం వెలువడింది. 2010 ఫిబ్రవరి 15న అగ్రిమెంట్ రిజిష్టర్‌ అయింది.

తెర వెనుక మంత్రి గంటా..
కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ప్రత్యూష కంపెనీ.. లక్షా 60 వేల చదరపు అడుగుల ఫ్లోర్‌ స్పేస్‌తో 8 అంతస్థుల భవనం నిర్మించాల్సి ఉంది. 2012 సెప్టెంబర్‌ 19 నాటికి భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కనీసం పునాదిరాయి కూడా పడకపోవడం...కంపెనీ పని తీరుకు అద్దం పట్టింది. 2014 మే నెలలో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఒప్పందం రద్దు కావడంతో కంపెనీ మరో ట్విస్ట్‌ ఇచ్చింది. భవన నిర్మాణం కోసం ఖర్చు చేసిన సుమారు కోటి 30 లక్షలు 36 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వానికి లేఖలు పంపడం గమనార్హం. రద్దయినా ఒప్పందాన్ని తిరిగి దక్కించుకునేందుకు మంత్రి గంటా తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అద్దె భవనంలోకి గ్రంథాలయం..
మరోవైపు పాత గ్రంథాలయాన్ని కూల్చివేసిన ప్రత్యూష కంపెనీ.. రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్‌లోని ఓ అద్దె భవనంలోకి గ్రంథాలయాన్ని తరలించింది. సినిమా హాళ్ల మధ్య ఇరుకైన 4 గదుల్లో సేవలందించలేక గ్రంథాలయ నిర్వాహకులు సతమతమవుతున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాఠకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థలాన్ని కేంద్ర గ్రంథాలయ సంస్థకు తిరిగి అప్పగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. పాఠకుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. 

12:28 - September 26, 2015

వరంగల్ : ఆయనకు తెలిసింది వైద్యం ఒక్కటే. పట్టణానికే పరిమితం కాకుండా పల్లె ప్రజలకు వైద్యం చేయాలని సంకల్పించారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవాదృక్పథంతో చేసేవారు. ఎంతోమంది సామాన్యుల ప్రాణాలను నిలబెట్టారు. ఎవరొచ్చినా వైద్యం అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేసేవారు. ఇదే ఆయన పాలిట శాపంగా మారింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దుర్మార్గంగా అతన్ని హతమార్చారు. అయితే ఈ హత్య జరిగి 19 ఏళ్లు గడిచినా ఇంకా మిస్టరీని ఛేదించకపోవడం వెనక ప్రభుత్వ వైఫల్యం బయటపడుతోంది. ఆమెడ నారాయణ. వరంగల్ జిల్లా కురవిలో మహాలక్ష్మి, ముత్తయ్య దంపతుల ఆరుగురి సంతానంలో రెండోవాడు. 1957లో జన్మించిన నారాయణ.. పదో తరగతి వరకు కురవిలోనే చదివాడు. ఇంటర్‌ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్‌ కాలేజీలో డిగ్రీలో చేరారు. అప్పుడే మెడికల్‌ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో కాకతీయ మెడికల్‌ కాలేజీలో చేరారు.

ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం..
సోదరుడు నాగయ్య వామపక్ష భావజాల ప్రభావంతో నారాయణ విద్యార్ధి దశలోనే ఎస్‌ఎఫ్‌ఐలో చురుకుగా పాల్గొన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత నారాయణ.. వరంగల్‌లోని పిల్లల వైద్యుడు రామనాథం వద్దకు చేరారు. ప్రజలకు రామనాథం చేస్తున్న సేవలు చూసి నారాయణ కూడా ప్రజలకు సేవ చేయాలని భావించారు. ఇందుకోసం రాజకీయ కక్షలతో రగులుతున్న మొగిలిచర్ల గ్రామాన్ని ఎంచుకున్నారు.

ఫీజు లేకుండానే వైద్య సేవలు..
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో నారాయణ.. కుటుంబంతో సహా మొగిలిచర్లకు చేరారు. రాత్రనకా.. పగలనకా ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండేవారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండానే వైద్యం చేసేవారు. ఎవరైనా ఫీజు ఇస్తేనే తీసుకునేవారు. దీంతో ఆయనకు ప్రజావైద్యుడిగా పేరు వచ్చింది. ఈయన వద్ద వైద్యం చేయించుకునేందుకు దాదాపు 40 గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవారట. ఇక నారాయణ వద్దకు వచ్చినవారిలో పోలీసులున్నా,.. నక్సలైట్లు ఉన్నా ఎవరైనా సరే వైద్యం అందించేవారట.

వరంగల్‌కు మకాం మార్చిన నారాయణ..
ఆయన నక్సలైట్‌ కాదు.. పౌరహక్కుల కార్యకర్త కూడా కాదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వైద్యుడు. అయితే ఇది కొందరికి కంటగింపుగా మారింది. ఎలాగైనా ఆయనను మొగిలిచర్ల నుంచి పంపించాలని భావించారు. దీంతో 1994 ఎన్నికల సమయంలో నారాయణను పోలీసులు బెదిరించారు. 1995లో మొగిలిచర్లను వీడాలని హెచ్చరించడంతో ఆయన వరంగల్‌కు మకాం మార్చారు. అక్కడినుంచే ప్రతిరోజు మొగిలిచర్లకు వెళ్లేవారు.

1996 సెప్టెంబర్‌ 25న ఏనుమాముల వద్ద నారాయణ హత్య..
ఇక నారాయణ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వైద్యం చేస్తూనే ఉండేవారు. ప్రయాణ సమయంలోనూ కూడా రోగులు కనిపిస్తే వైద్యం అందించేవారు. ఇదే అదనుగా తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను 1996 సెప్టెంబర్‌ 25న ఏనుమాముల వద్ద ఆపి వైద్యం చేయాలని కోరారు. నిజమేనని నమ్మిన నారాయణ స్కూటర్‌ దిగగానే తూటాలతో కాల్చి చంపారు.

పోలీసులపై తిరగబడ్డ ప్రజలు..
ఇక విషయం తెలుసుకున్న 40 గ్రామాల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీసీఐడి విచారణకు ఆదేశించింది. అయితే 19 ఏళ్లు గడిచినా మిస్టరీ మాత్రం వీడలేదు. అదేవిధంగా ఈ హత్యకు ముందు పిల్లల వైద్యుడు రామనాథం,.. పౌరహక్కుల నాయకుడు, ప్రముఖ న్యాయవాది నర్రా ప్రభాకర్‌రెడ్డిల హత్యలు కూడా జరిగాయి. ఇప్పటివరకు ఈ హత్యల మిస్టరీ కూడా వీడలేదు. నారాయణ హత్య జరిగి 19 ఏళ్లు గడిచినా మొగిలిచర్ల ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు ఉబికివస్తున్నాయి. చుట్టూ పక్కల గ్రామాల్లో ఇంకా నారాయణ పేరును తలుస్తూనే ఉన్నారు. అయితే చిన్నపాటి ఘటనలపైనే క్లూస్‌టీమ్‌, డాగ్‌ టీమ్స్‌ పేరిట హడావుడి చేసే ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటనల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా ఈ హత్యల మిస్టరీని తేల్చాలని పలువురు కోరుతున్నారు. 

12:25 - September 26, 2015

నెల్లూరు : ఒక ఆలోచన.. ఒక ఆచరణ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. తాను చనిపోతూ మరికొంత మందిని బతికించాడు ఓ మహోన్నతుడు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను పెద్దమనుసుతో దానం చేశారు కుటుంబ సభ్యులు. ఐదు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌ నెల్లూరులో అందరినీ కదిలించింది. నెల్లూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మస్తానయ్య.. తన కూతురు స్కూల్‌ బస్సు మిస్‌ కావడంతో స్కూల్‌లో దింపేందుకు బైక్‌పై బయల్దేరాడు. ఇదే అతని పాలిట శాపంగా మారింది. వెనకనుంచి స్పీడ్‌గా వచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో మస్తానయ్యా తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే బంధువులు నెల్లూరు నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు 24 గంటలపాటు వైద్య చికిత్సలు అందించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక మస్తానయ్యా బ్రతకడని.. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

చెన్నై, తిరుపతి ఆసుపత్రులకు తరలింపు...
వైద్యుల మాటలతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమయంలో వైద్యులు చేసిన సూచన వారికి మంచి మార్గంలా కనిపించింది. ఇక తిరిగి రాని లోకాలకు పోతున్న మస్తానయ్యా అవయవాలను వేరేవాళ్లకు దానం చేస్తే.. కొంతమందిలోనైనా మస్తానయ్య బతికే ఉంటారని వారు భావించారు. బాధను దిగమింగుకొని మస్తానయ్యా అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో మస్తానయ్య గుండె, కాలేయం, కిడ్నీలను ఆపరేషన్‌ ద్వారా తీసి చెన్నై, తిరుపతి ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఐదు గంటలుగా సాగిన ఆపరేషన్..
రాత్రి 12 గంటలకు మొదలైన ఆపరేషన్‌ ఐదు గంటల పాటు కొనసాగింది. ఇక తీసిన అవయవాలను ప్రత్యేకమైన వాహనాల్లో నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతికి తరలించారు. చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి గుండె అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. తీరా మస్తానయ్యా గుండె ఆపరేషన్‌ చేసి తీసేసరికి నిరాశే ఎదురైంది. అప్పటికే మస్తానయ్య గుండె చెడిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది నిరాశతో వెనుదిరిగారు. ఇక కాలేయం, కిడ్నీలు తిరుపతి, హైదరాబాద్‌లోని ఇతర రోగులకు అమర్చేందుకు తరలించారు. ఏదిఏమైనా తాను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణాలు పోస్తున్న మస్తానయ్యా నిజంగా చిరంజీవుడే. 

భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సూది ఉన్మాది..

హైదరాబాద్ : భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సూది ఉన్మాది కలకలం సృష్టించాడు. బల్లార్షా నుండి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సూది ఉన్మాది పలువురు ప్రయాణికులను సూదితో గుచ్చాడు. వెంటనే ఆ ఉన్మాదిని ప్రయాణీకులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. 

భద్రాలచంలో కాళ్లవాపు వ్యాధితో ముగ్గురి మృతి..

భద్రాచలం : బూరుగుపాడులో విషాదం చోటు చేసుకుంది. కాళ్లవాపు వ్యాధితో కనుమల లచ్చమ్మ, కన్నయ్య, కుంద దూలయ్యలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆ కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. 

కర్నూలులో ప్రారంభమైన సీపీఎం జీపు జాతా..

కర్నూలు : జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సీపీఎం జాతా ప్రారంభమైంది. రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ ఈ జాతా జరుగుతోంది. అక్టోబర్ 1 వరకు జిల్లా అంతా ఈ జాత పర్యటించనుంది. సుందరయ్య సర్కిల్ వద్ద జీపు జాతాను సీపీఎం నేత గఫూర్ ప్రారంభించారు. అక్టోబర్ 5-12 వరకు నిరహార దీక్షలు, 15న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా జరుగనుంది. 

బీజాపూర్ వద్ద కాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి..

ఛత్తీస్ గడ్ : బీజాపూర్ జిల్లా పుస్నార్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

సాగర్, చెరువుల ఆధునీకరణ పన్నుల్లో లోపం..

ఖమ్మం : సాగర్, చెరువుల ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపించడంపై రైతు సంఘం నేతలు ప్రపంచ బ్యాంకు బృందానికి ఫిర్యాదు చేసింది. బ్యాంకు నిధులతో ఈ పనులు కొనసాగుతున్నాయి. అక్రమాలపై విచారణ జరిపించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు వినతిపత్రం అందచేశారు. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు అధికారులు ఆధునీకరణ పనులును తనిఖీ చేస్తామని హామీనిచ్చారు. 

సీఎం వీరభద్ర సింగ్ పై సీబీఐ కేసు...

హిమాచల్ ప్రదేశ్ : సీఎం వీరభద్రసింగ్ పై సీబీఐ కేసు నమోదైంది. కోట్ల విలువైన బీమా పాలసీలు ఉండడంపై కేసు నమోదు చేశారు. వీరభద్ర సింగ్ కు చెందిన 11 ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి.

 

 

యూనివర్సిటీల పాలకమండళ్లతో కడియం భేటీ..

హైదరాబాద్ : యూనివర్సిటీల పాలక మండళ్లతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి భేటీ అయ్యారు. అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిష్ట్రార్ లు హాజరయ్యారు. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుపై కడియం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగనుంది. 

11:37 - September 26, 2015

చిత్తూరు : తిరుపతిలో నిరుద్యోగ పోరుబాట ఉధృతమైంది. వందలాది మంది నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరసనలతో హోరెత్తించారు. టిటిడిలో 6వేల 700 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ యాత్ర జరుగుతోంది. నేటి నుండి అక్టోబర్ 4 వరకు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, టిటిడిలో ఆరువేల 700 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోవడం పాలక మండలి సహేతుక అంశం కాదనన్నారు. 16 సంవత్సరాల క్రితం 16వేల పోస్టులు ఉండేవన్నారు. 30వేల ఉద్యోగాల అవసరం ఉన్నా వెట్టి చాకిరి విధానంతో కొనసాగిస్తోందన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని తాము ఎన్నిసార్లు కోరినా నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గత ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. అందుకని తాము ఈ యాత్రను చేపట్టడం జరిగిందని, స్పందించకపోతే ఆరో తేదీన నిరహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. 

మూడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి..

కాకినాడ : కాజులూరు (మం) పినమళ్లలో దారుణం చోటు చేసుకుంది. మూడో తరగతి విద్యార్థినిపై పాఠశాల వంటమనిషి భర్త సత్యనారాయణ లైంగిక దాడి చేశాడు. దీనితో బాలిక పరిస్థితి విషమించింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

రవీంద్ర భారతిలో జాతీయ వినియోగదారుల సభ..

హైదరాబాద్ : రవీంద్రభారతిలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ సభకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఎంపీ కవిత పాల్గొన్నారు. 

11:25 - September 26, 2015

నెల్లూరు : గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సైకో సూదిగాడు మళ్లి రెచ్చిపోయాడు. జిల్లాలోని ఓ ఆరేళ్ల బాలికపై సూదితో దాడి చేసి పరారయ్యాడు. ఈఘటన కలకలం సృష్టించింది. తడ మండలం మాంబటి పంచాయతీ వడ్డీపాలెం గ్రామంలో చిన్నారులు ఆడుకుంటున్నారు. ఊయల ఊగుతున్న ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు సూది గుచ్చి పరారయ్యారు. దీనితో ఆ బాలిక సృహ కోల్పోయింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక పరిస్థితి నిలకడగానే ఉంది. 

11:17 - September 26, 2015

గుంటూరు : జిల్లాలో రైతుల ఆత్మహత్యల ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేసిన పంట గిట్టుబాటు కాకపోవడం..అప్పులు పేరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపాలెంకు చెందిన తిమ్మిశెట్టి వీరాస్వామి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూనే ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం..పెట్టుబడులు పెరిగి అప్పులు పేరుకపోయాయి. మరోవైపు వర్షాలు పడకపోవడంతో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. దీనితో ఐదు లక్షల రూపాయలకు పైగా అప్పులు పెరిగిపోయాయి. అటు బ్యాంకు నుండి తీసుకున్న రెండు లక్షల రూపాయలు మాఫీ కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వీరాస్వామి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరాస్వామి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

27,28వ తేదీల్లో పాట్నాలో జైదీ పర్యటన

బీహార్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ పాట్నాలో ఈనెల 27, 28వ తేదీల్లో పర్యటించనున్నారు. ఎన్నికల కోసం తీసుకుంటున్న చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు. కొద్ది రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. 

పశ్చిమగోదావరి జిల్లాలో అబ్కారీ శాఖ దాడులు...

పశ్చిమగోదావరి : జిల్లా వ్యాప్తంగా అబ్కారీ శాఖ దాడులు నిర్వహించింది. చింతలపూడి, నర్సాపురం, జంగారెడ్డి గూడెం, పోలవరం మండలాల్లో నాటు సారా విక్రయిస్తున్న కేంద్రాలపై అకస్మిక దాడులు నిర్వహించింది. 22 మంది నాటు సారా అమ్మకందార్లను అరెస్టు చేశారు. ఐదు బృందాలుగా 180 మంది సిబ్బంది ఈ దాడులు చేశారు. 

 

సిక్కోలులో ఏనుగుల బీభత్సం..

శ్రీకాకుళం : ఎల్ఎన్ పేట (మం) ఎరుకురాయిగూడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పైర్లు ధ్వంసం కావడంతో సుమారు రెండు లక్షల మేర నష్టం కలిగిందని తెలుస్తోంది. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. సూదిరాయిగూడలో నాలుగు పూరిళ్లు ధ్వంసం చేశాయి. 

 

కర్నూలులో పొంగి పొర్లుతున్న వాగులు..

కర్నూలు : శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. పత్తికొండ సమీపంలో చినఉల్తీ వాగు పొంగి పొర్లుతోంది. అదోని - పత్తికొండ మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క యువకుడు మృతి..

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం బూరుగుపల్లిలో కల్తీ కల్లు దొరక్క అనారోగ్యంతో యువకుడు శేఖర్ రెడ్డి మృతి చెందాడు. 

రేపు గుంటూరులో జాషువా 120వ జయంతి ఉత్సవాలు..

గుంటూరు : రేపు జిల్లాలో జాషువా 120వ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏసీ కళాశాలలో జాషువా భావజాలంపై సదస్సు జరుగనుంది. జాషువా ప్రగతిశీలత, కళాత్మకవాదం, దళిత సాహిత్యవాదం, జాషువా స్వప్నం - సందేశం, సాహిత్యం, దృక్పథం, పరిణామం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉండనుంది.

10:29 - September 26, 2015

హైదరాబాద్ : మంత్రి తలసాని పార్టీ ఫిరాయింపులపై ఎట్టకేలకు గవర్నర్ కార్యాలయం స్పందించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మంత్రి తలసానిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా టి.టిడిపి నేతలు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. టి.టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఈ అంశంపై వివరణనివ్వాలని సీఎస్ కు లేఖ రాసింది. ఈనెల 18వ తేదీన స్పందించి లేఖను రాసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టి.టిడిపి నేతలు గవర్నర్ ను కూడా కార్నర్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ ఈ విషయంలో తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపణలు గుప్పించారు. వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. పలు మార్లు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. చివరకు టిటిడిపి కోర్టు మెట్లు ఎక్కింది. తాజాగా గవర్నర్ కార్యాలయం సీఎస్ కు లేఖ రాయడంపై మంత్రి తలసాని, టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సొంత పార్టీపై బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపణలు..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ సొంత పార్టీపైనే ఆరోపణలు గుప్పించారు. టికెట్ల కేటాయింపులో డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

కలెక్టర్లతో బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వర్షపాతం, వ్యవసాయ పనులపై బాబు వివరాలు తెలుసుకున్నారు.

 

10:15 - September 26, 2015

విశాఖపట్టణం : 'అదితి' ఎమైంది..ఎక్కడుంది..? ఏమైంది..? ప్రస్తుతం ఈ ప్రశ్నలను ప్రజలను తొలిచివేస్తున్నాయి. వర్షం నీటితో నిండుగా ప్రవహిస్తున్న ముగురు కాల్వలో పడి 40గంటలు దాటుతున్నా చిన్నారి ఆచూకీ లభించలేదు. సంఘటన జరిగి ఇన్ని గంటలు జరుగుతున్నా మున్సిపల్ శాఖ మంత్రి రాకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 500 మంది జీవీఎంసీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గాలింపులు చేపట్టారు. సముద్ర తీరంలో మత్స్యకారులు, అధికారులు, గజఈతగాళ్లు వెతుకుతున్నారు. టెన్ టివి కూడా 'అదితి' కోసం గాలింపు చేపట్టింది. తాము ఎంత వెతికినా పాప ఆచూకీ దొరకలేదని, ఎక్కడుందో తెలియడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఒకవేళ మృతి చెంది ఉండి ఉంటే తీరంలో ఏదో ఒక గట్టుకు చేరుకుని ఉండవచ్చునని తెలిపారు. కానీ ఇంకా తేలలేదంటే కాల్వలోనే ఇరుక్కుని ఉండవచ్చునని మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గురువారం సాయంత్రం జరిగిన ఘటన..
కృష్ణా కళాశాల ప్రాంతంలో ఆరేళ్ల బాలిక 'అదితి' గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడిపోయింది. కానీ సమాచారం తెలిసినా జీవీఎంసీ అధికారులు సకాలంలో స్పందించలేదన్న విమర్శలు రేకెత్తాయి. గురువారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో నగర పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్..జీవీఎంసీ అధికారులందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో శుక్రవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. అందరూ కలిసి గాలింపు చేపట్టారు. జీవీఎంసీ అధికారులు..పారిశుధ్య సిబ్బంది..40 ప్రొక్లయినర్లు..జేసీబీలతో ఉపయోగించి ఎక్కడికక్కడ చెత్తను తీసివేయించారు.
చిన్నారి ఆచూకి తెలియక బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఎక్కడైనా కనీసం గాయాలతోనైనా పాప సజీవంగానే ఉంటుందన ఆశతో వారున్నారు. 

తలసాని వ్యవహారంపై ఎమ్మెల్యే గోపినాథ్ గవర్నర్ కు ఫిర్యాదు...

హైదరాబాద్ : మంత్రి తలసానిని మంత్రివర్గం నుండి తొలగించాలని గవర్నర్ కు టి.టిడిపి ఎమ్మెల్యే గోపినాథ్ డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. వివరణ కోరుతూ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. 

సూర్యలంక తీరంలో విద్యార్థి మృతదేహం లభ్యం..

గుంటూరు : సూర్యలంక తీరంలో విద్యార్థి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి జయదేవ్ కోసం గాలింపు కొనసాగుతోంది. సూర్యలంక బీచ్ లో వడ్లమూడి విజ్ఞాన్ విద్యార్థులు శ్రీనివాస్, జయదేవ్ లు గల్లంతైన సంగతి తెలిసిందే.

కాసేపట్లో అఖిల్ మృతదేహానికి పోస్టుమార్టం..

విజయవాడ : నిడమనూరు నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న అఖిల్ రెడ్డి మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అఖిల్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, కళాశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని అఖిల్ తండ్రి సింగారెడ్డి పేర్కొన్నారు. 

ఓబులవారిలపల్లె వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

కడప : ఓబులవారిపల్లె (మం) చిన్నఓరంపాడు వద్ద స్కార్పియోను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఓబులవారిలపల్లె వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

 

09:19 - September 26, 2015

విశాఖపట్టణం : వంద మంది సిబ్బంది..పదుల సంఖ్యలో ప్రొక్రెయిన్లు..గజఈతగాళ్ల గాలింపు..40 గంటలు దాటుతోంది..అయినా చిన్నారి అదితి ఆచూకిని కనుగోలేక పోయారు.. కాల్వలోకి జారుకున్న ఆ చిట్టి తల్లి ఎంత ఘోషించిందో.. ఏమైందో.. అని కన్న తల్లిదండ్రులు రోదిస్తున్నారు..చిన్నారి క్షేమంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..కానీ గంటలు గంటల సమయం దాటిపోతుండడంతో క్షేమ సమాచారాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.. ఈ ఘటనపై జివిఎంసిపై ప్రజానీకం మండి పడుతున్నారు..డ్రెయిన్లలో చిన్నారి ఎక్కడైనా చిక్కుకుపోయిందా ? లేక నేరుగా సముద్రంలోకి కొట్టుకుపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా కళాశాల దిగువ భాగంలోని స్టేట్‌ బ్యాంక్‌ వీధిలోని 3 అడుగుల వెడల్పు గల డ్రెయిన్‌లోకి 'అతిధి' అనే చిన్నారి జారిపోయిన సంగతి తెలిసిందే. వంద మీటర్ల దూరం తర్వాత ఆ చిన్న డ్రెయిన్‌ పెద్ద కాల్వలోకి కలుస్తోంది. ఆ కాల్వ వెంకోజిపాలెం, ఎంవిపి మీదుగా అప్పుఘర్‌ వద్ద సముద్రంలో కలుస్తుంది. తమ పాప ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోయినా పాపను కడసారి చూసుకునే అవకాశం లభిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జివిఎంసి కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, జోన్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జివిఎంసి సిబ్బంది పాప ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ జెసిబిలతో డ్రెయిన్లను ప్రక్షాళన చేస్తున్నారు. ఆ పెద్ద డ్రెయిన్‌ సముద్రంలో కలిసే చోటు వరకూ పరిశీలించారు. అయితే ఎక్కడా పాప ఆచూకీ లభించలేదు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ సాయంతో సముద్రంలోనే వెతకాలని నిర్ణయించారు. 'అతిధి' క్షేమంగా బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. 

09:10 - September 26, 2015

గుంటూరు : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను..కూతురుని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన నగరం మండలం చిలకలవారిపాలెంలో చోటు చేసుకుంది. వెంకటకృష్ణ, నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాగశ్రీ, యశ్వంత్ పిల్లలున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా కుటుంబకలహాలున్నాయి. భార్యపై వెంకట కృష్ణ అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగశ్రీని భర్త హత్య చేశాడు. దీనిని అడ్డుకోబోయిన నాగశ్రీని కూడా హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అనంతరం కుమారుడు యశ్వంత్ తో వెంకటకృష్ణ పరారయ్యాడు. యశ్వంత్ ను కూడా హత్య చేసి ఉంటాడా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పరారైన వెంకట కృష్ణ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

పీఎస్ఎల్ వీ సీ -30 కౌంట్ డౌన్ ప్రారంభం..

నెల్లూరు : పీఎస్ఎల్ వీ సీ -30 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సోమవారం ఉదయం 10గంటలకు పీఎస్ఎల్వీ - సీ 30ని ప్రయోగించనున్నారు.

08:24 - September 26, 2015

వరంగల్ : తెలంగాణలో మావోయిస్టులను అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యమా ? తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే అది నిజమేనన్న సమాధానం వస్తోంది. దశాబ్దకాలంగా మావోయిస్టులను కనబడకుండా చేసిన పోలీసులు..మళ్లీ పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ క్యాడర్‌ను బలపడకుండా చేసేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అదే టార్గెట్‌ కేకేడబ్ల్యూ. కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ మావోయిస్ట్‌ క్యాడర్ రిక్రూర్‌మెంట్ జరిగిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో..ఒక్క ఎన్ కౌంటర్ తో కేకేడబ్యూకు అనేక సమాధానాలు చెప్పామని అటు ప్రభుత్వం ఇటు పోలీసులు భావిస్తున్నారు. కానీ అదే ఎన్‌కౌంటర్ ఇప్పుడు తెలంగాణలో ఎన్నో అలజడులను సృష్టిస్తోంది.

18 మందితో అలజడి..
వరంగల్ తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ టార్గెట్ కేకేడబ్యూగా జరిగింది. 10ఏళ్లుగా తెలంగాణలో మావోయిస్టులపై పైచేయి సాధించామని చెప్పుకుంటున్న పోలీసులకు ఇటీవల నిఘా వర్గాలు మింగుడు పడని విషయాలని తెలిజేశాయి. యూనివర్శిటీలు, గ్రామాల నుంచి 200మంది మావోయిస్ట్ పార్టీలో చేరారని నివేదికలు అందాయి. దీంతో పోలీసులు అలెర్టయి మావోయస్టులను టార్గెట్ చేశారు. ఆర్కే, జంపన్నల తర్వాత సుమారు మూడేళ్ళ పాటు కేకేడబ్యూలో ఎలాంటి అలజడి జరగలేదు. కార్యదర్శి దామోదర్ ఏడాదిన్నరగా రిక్రూట్‌మెంట్‌లో కీలక పాత్ర వహించాడు. చదువుకున్న యువతను ఆకర్షించే విధంగా వ్యూహాలు రచించి విజయం సాధించారు. ముగ్గురు సభ్యులతో నడిచిన కేకేడబ్యూ ఇప్పుడు 18 మందితో అలజడి సృష్టిస్తున్నారు. అయితే పోలీసులు మరోసారి వారిని టార్గెట్ చేశారు. అందుకే శృతి, విద్యాసాగర్‌లను చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. దామోదర్‌ను పట్టుకునేందుకే..శృతిపై అత్యాచారం చేసి చంపారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు..
అయితే 10 ఏళ్ల క్రితం ఆర్కే, జంపన్న, చంద్రన్నలు కేకేడబ్యూలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పోలీసులు ఎన్‌కౌంటర్‌తో నల్లమల అడవులకు వెళ్లిపోయారు. అక్కడ కూడా ఇబ్బందులు ఎదురవ్వడంతో..దండకారణ్యానికి మకాం మార్చారు. కొన్నాళ్ల పాటు దామోదర్ అక్కడే మిలిటరి శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోవడం, తెలంగాణలో యువతను ఆకర్షించి..కేకేడబ్యూను పదేళ్ల కిత్రం ఎలా ఉండేదో..అంత కంటే మరింత బలోపేతం చేశారు. మరోవైపు సానుభూతి పరులను పెంచుకున్నారు. అయితే పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌తో ఎన్నో సమాధానాలు చెప్పామని అనుకుంటున్నారు. కానీ ప్రజాసంఘాలు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మన్ననలు పొందేందుకే శృతి, విద్యాసాగర్‌లను ఎన్‌కౌంటర్‌ చేశారని విమర్శిస్తున్నారు. మొత్తానికి కేకేడబ్యూను పోలీసులు టార్గెట్ చేయగా..ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ నెల 28న రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ..375 ప్రజాసంఘాలు ఛలో అసెంబ్లీ ముట్టడికి రెడీ అవుతున్నాయి. అయితే దీనిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, శామిర్ పేట, జవహార్ నగర్, చిక్కడపల్లి, కోఠి, పంజాగుట్ట, దిల్ సుఖ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

 

భార్య..ఇద్దరు పిల్లలను చంపిపన భర్త..

గుంటూరు : నగరం (మం) చిరకాలవారిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భార్య ఇద్దరు పిల్లలను వెంకటకృష్ణ హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. 

అదితి ఎక్కడ ?

విశాఖ : 36గంటలు అవుతున్నా చిన్నారి అదితి ఆచూకి దొరకడం లేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం డ్రైన్ లోకి అదితి జారి పడిపోయిన సంగతి తెలిసిందే. 

ఏపీ డీజీపీకి మాతృవియోగం..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ శనివారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 

కర్నూలులో నేడు సీపీఎం జీపు జాత..

కర్నూలు : జిల్లా సమగ్రాభివృద్ధిపై నేటి నుండి సీపీఎం జీపు జాత నిర్వహించనుంది. సుందరయ్య సర్కిల్ వద్ద జీపు జాతను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్ ప్రారంభించననున్నారు. 

08:02 - September 26, 2015

గుల్బర్గ : కర్నాటకలో వినాయక నిమజ్జనంలో దారుణం చోటు చేసుకుంది. నిమజ్జనం కార్యక్రమంలో అందరూ బిజీగా ఉండగా, సినీ ఫక్కీలో ఒక వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నీటిలో బలవంతంగా ముంచేసి దారుణంగా హత్య చేశారు. కర్నాటకలోని గుల్బర్గలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న మల్లిఖార్జున్‌ మృతదేహాన్ని పోలీసులు నదిలో కనుగొన్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తూ ఇతడు నీటిలో జారిపడి మరణించి వుంటాడని ముందుగా భావించారు. అయితే, మల్లిఖార్జున్‌ భయంకరంగా హత్యకు గురైన తీరును ఒక మొబైల్‌ పోన్‌ వీడియో వెలుగులోకి తెచ్చింది. వందలాదిమంది సమక్షంలో, అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని విధంగా గురుతెలియని వ్యక్తులు మల్లిఖార్జున్‌ను నీటిలో ముంచి హత్య చేయడాన్ని ఆ వీడియో స్పష్టం చేసింది.

08:00 - September 26, 2015

'అఖిల్‌ అక్కినేని', 'సాయేషా' జంటగా 'వి.వి.వినాయక్‌' దర్శకత్వంలో 'నిఖితారెడ్డి' సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై 'నితిన్‌' నిర్మిస్తున్న 'అఖిల్‌' చిత్ర ఆడియో ఆవిష్కరణ అమెరికాలోనూ జరిగింది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'నితిన్‌' మాట్లాడారు. ఇటీవల విడుదలైన చిత్ర ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన వస్తోందని, 'అఖిల్‌' ఆడియోను యు.ఎస్‌.లోని మూడు ప్రదేశాల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు 'అఖిల్‌' తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులంతా హాజరవుతున్నారని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్‌ 22న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు 'నితిన్' ప్రకటించారు. 

07:59 - September 26, 2015

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తలపెట్టిన నిరవధిక నిరహార దీక్ష వాయిదా పడింది. మరోవైపు ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావును జగన్మోహన్ రెడ్డి కలవడంపై టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు అమ్ముతామని, ఆ వచ్చే లాభాలను అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బదలాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), నల్లా సూర్యప్రకాష్ (వైసీపీ), జంగా గౌతమ్ (కాంగ్రెస్), సూర్య ప్రకాష్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.

 

07:47 - September 26, 2015

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దశ తిరిగిపోతోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో పలువురు హీరోలు 'కొరటాల' దర్శకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో 'మిర్చి'లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చినప్పటికీ ఆయనతో సినిమా చేసేందుకు అంగీకరించిన కొంతమంది హీరోలు చివరి నిమిషంలో సినిమా చేయడానికి నిరాకరించారు. దీంతో దాదాపు రెండేళ్ళు కొరటాల శివ ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్‌తో మళ్ళీ కొరటాల శివ చుట్టూ బడా హీరోలందరూ చక్కెర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో రోజుకో హీరోతో కొరటాల శివ సినిమా ఉంటుందనే ఊహాగానాలు సైతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పాతదే అయినా తాజాగా వచ్చిన ఓ సరికొత్త న్యూస్‌ ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్స్ లో సందడి చేస్తోంది. 'కొరటాల శివ' తదుపరి చిత్రంలో 'జూ.ఎన్టీఆర్‌' నటిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తొలి ప్రయత్నంలోనే 'శ్రీమంతుడు'వంటి మెగాహిట్‌ ఇచ్చిన మైత్రిమూవీస్‌ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు విజయదశమి రోజున ప్రారంభిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఎన్టీఆర్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

07:42 - September 26, 2015

ఢిల్లీ : ప్రస్తుత టీమ్‌ ఇండియా కూర్పు అద్భుతంగా ఉందని, టి20, వన్డే సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు. కానీ టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవాలని, సఫారీ జట్టు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థేనని తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ మీడియాతో మాట్లాడారు. ఏబీ డివిలియర్స్, హషీమ్‌ ఆమ్లా ప్రమాదకర ఆటగాళ్లని పేర్కొన్నారు. డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌లను విస్మరించే ప్రసక్తే లేదని, ఇమ్రాన్‌ తాహీర్‌ గూగ్లీ సంధించటంలో సిద్ధహస్తుడని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే అతడే ప్రధాన బౌలర్‌ పాత్ర పోషించగలడని, తాహీర్‌ను మనోళ్లు జాగ్రత్తగా ఆడాల్సి వుంటుందని సూచించారు. రెండు వైపులా నాణ్యమైన ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారని తెలిపారు. సాధారణ స్థాయి అనదగిన దక్షిణాఫ్రికా జట్టుతో నేనెప్పుడు తల పడలేదని, ప్రస్తుత జట్టు కూడా సఫారీ స్టాండర్డ్‌లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 1991లో సఫా రీలతో తొలి సిరీస్‌ అనుభవాలను మాస్టర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఒక మాదిరి నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

తడ చెక్ పోస్టు వద్ద నిలిచిపోయిన ప్రైవేటు బస్సు.

నెల్లూరు : తడ చెక్ పోస్టు సమీపంలో ఓ ప్రైవేటు బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఈ బస్సు చైన్నై నుండి హైదరాబాద్ వెళుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరగనుంది. 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12గంటల సమయం పడుతుండగా నడక దారి గుండా వచ్చే భక్తులకు 4గంటల సమయం పడుతోంది. 

 

నేడు సిలికాన్ వ్యాలీలో మోడీ ప్రసంగం..

అమెరికా : నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సిలికాన్ వ్యాలీలో ప్రసంగించనున్నారు. డిజిటల్ ఇండియాకు ప్రవాస భారతీయుల మద్దతు ఆయన కోరనున్నారు.

నేడు కొలనుపాకను సందర్శించనున్న దత్తాత్రేయ..

నల్గొండ : కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొలనుపాక గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

 

హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు..

హైదరాబాద్ : హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27 నుంచి నవంబర్‌ 25వ తేదీ వరకూ అమలులో ఉంటాయన్నారు. 

గణేష్ నిమజ్జనం..బస్సు రూట్లలో మార్పులు..

హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఆదివారం నగరంలోని ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా ఇతర జిల్లాలకు, అంతర్రాష్ట్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రూట్లలో మార్పు చేసి నడుపుతున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

 

జేఎన్టీయూలో ఆరోగ్యంపై అవగాహన సదస్సు..

హైదరాబాద్ : వరల్డ్ ఫార్మాసిస్టు డేను పురస్కరించుకుని కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఆరోగ్యంపై అవగాహన, ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించనున్నారు.

 

06:46 - September 26, 2015

ఢిల్లీ : ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ... న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ భేటీలో కీలక ఉపన్యాసం చేశారు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులకు ఊహించని స్థాయిలో ప్రపంచం మారిపోయిన నేటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు మోదీ. ఈ నేపథ్యంలో సంస్కరణలు తప్పనిసరి అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి శక్తిమంతం కావలసిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పు, సుస్థిరమైన అభివృద్ధి అనేవి ప్రపంచ దేశాలన్నింటి సమష్టి బాధ్యత అని మోదీ అన్నారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని, వీరిని అందులోంచి బయటకు తీసుకురావటం కోసం సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నారు.

భారత్ లో పర్సనల్ సెక్టార్..
వాతావరణ మార్పుల విషయంలో ఉమ్మడి బాధ్యతతో పాటు తమ వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలని మోడీ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం, సృజన, అర్థ వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో నిస్వార్థంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక వికాస చర్చ జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల గురించి మాత్రమే చర్చ జరుగుతూ ఉంటుందని..భారత్‌లో మాత్రం కొత్తగా పర్సనల్ సెక్టార్‌ను ప్రవేశపెట్టామని మోడీ తెలిపారు. వ్యక్తిగత పరిశ్రమల స్థాపన, స్టార్ట్అప్‌లను ప్రోత్సహించటం..ప్రతి ఒక్కరికీ, నివాసం, విద్యుత్తు, నీరు, వంటి వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో అందించడానికి పనిచేస్తున్నామన్నారు. భారత దేశంలో సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని మోడీ వివరించారు. పేదరికాన్ని ఓడించటానికి పేదలకు విద్య, నైపుణ్యాన్ని అందించటం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 180 లక్షల బ్యాంకు ఖాతాలను భారత్‌లో పేదలు తెరిచారని, ప్రభుత్వం అందించే ఫలాలు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయన్నారు. పేదల కోసం బీమా, పింఛను ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు. 15 ఏళ్లలో పేదరికం, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం తదితరాలతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. మన ప్రపంచాన్ని మార్చడం.. సుస్థిర అభివృద్ధి-2030 లక్ష్యాల ఎజెండా కొత్త ముసాయిదాను సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్‌కీ మూన్‌తో సమావేశమయ్యారు.    

06:41 - September 26, 2015

విశాఖపట్టణం : ఓ వైపు స్మార్ట్ సిటీగా ఎదుగుతోందంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న విశాఖలో.. చిన్నారులు రోడ్డెక్కలేని దుస్థితి నెలకొంది. రోడ్డుమీద కాలుమోపినందుకే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం, మరో చిన్నారి గల్లంతవడం నగరంలో నెలకొన్న దుస్థితికి, జీవీఎంసీ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. నగరంలోని నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డులో ఓ విద్యుత్ స్తంభం ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలు బలిగొంది. స్తంభానికి వేళాడుతున్న కరెంటు తీగలు తగలడంతో.. అభిరామ్ అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సంబంధిత అధికారులు విద్యుత్‌ తీగలను సరిచేసినట్లైతే.. అభిరామ్‌ ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుక్కలకు ఆహారంగా మారిన చిన్నారి..
ఇక మరో దారుణ ఘటనలో.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి కుక్కలకు ఆహారంగా మారాడు. ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చిన చిన్నారి శివకేశవ్‌ను.. వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్నాయి. కుక్కల సమూహం మీదపడి దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని, చిన్నారి చావుకు అధికారులే బాధ్యులని స్థానికులు ఆగ్రహించారు.

డ్రైనేజీ నీటిలో కొట్టుకపోయిన చిన్నారి..
ఇక తాజా ఘటనలో డ్రైనేజీ నీటిలో కొట్టుకుపోయింది ఆరేళ్ల అధితి. సీతమ్మధారకు చెందిన అధితి ఒకటో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం ట్యూషన్ సెంటర్ కి వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో పెద్ద వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్డు మీద నుంచి కారులోకి ఎక్కబోయిన అధితి వర్షపు నీటి ఉధృతికి డ్రెయినేజీలో పడిపోయింది. డ్రెయిన్‌ కాల్వపై సిమెంట్‌ పలకలు వేడయంతో స్థానికులు కాపాడలేకపోయారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చిన్నారి గల్లంతయితే.. 8 గంటల వరకూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రాత్రి 9 గంటలకు ప్రొక్లైనర్ తో తవ్వకాలు చేపట్టారు. మరో పక్క ఫైర్ సిబ్బంది వచ్చినా.. టార్చ్ లైట్లకు ఛార్జింగ్ లేదంటూ సహాయక చర్యలు చేపట్టలేదు. చివరకు.. అర్ధరాత్రి పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్ క్రిమినల్ కేసులు పెడతాంటూ హెచ్చరించే వరకూ జీవీఎంసీ అధికారులు స్పందించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల విమర్శలకు స్పందించిన జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌.. హుదుద్ తుఫాన్‌ ధాటికి డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అంతా బాగుచేయాలంటే కనీసం 50 కోట్లు ఖర్చువుతుందన్న కమిషనర్‌.. ప్రభుత్వమే స్పందించట్లేదని పరోక్షంగా చెప్పారు.
ఏదిఏమైనా నగరంలో పిల్లల మరణాలకు ప్రభుత్వమే బాధ్యతవహించాలని స్థానికులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు స్మార్ట్ సిటీలు, సింగపూర్లు వద్దని, నగరంలో కనీస సౌకర్యాలు కల్పిస్తే చాలని అంటున్నారు.

06:39 - September 26, 2015

విజయవాడ : కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి విద్యార్థులు బలవుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీలు పెట్టే చిత్రహింసలకు తాళలేక విద్యార్థులు తమ నిండు జీవితాలను మొగ్గ దశలోనే తుంచేసుకుంటున్నారు. విజయవాడలో అఖిల్‌రెడ్డి, కర్నూలులో శ్రీకాంత్‌ అనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కార్పొరేట్‌ కాలేజీల వికృత రూపాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల చదువుల ఒత్తిడికి విజయవాడలో అఖిల్‌రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. ఒంగోలు ప్రాంతానికి చెందిన అఖిల్‌రెడ్డి..విజయవాడలోని నిడమనూరు నారాయణ కాలేజీ ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే చికిత్స కోసం అఖల్‌రెడ్డిని హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అఖిల్‌రెడ్డి చనిపోయాడు.

శోక సంద్రంలో అఖిల్ రెడ్డి కుటుంబం..
విషయం తెలుసుకున్న అఖిల్‌ రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాలేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడి వల్లే అఖిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అఖిల్‌రెడ్డి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి. అఖిల్‌రెడ్డి మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మరోవైపు అఖిల్‌రెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అఖిల్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెప్తున్నారు.

కర్నూలులో..
ఇదిలా ఉంటే..కర్నూలులో కూడా మరో విద్యార్థి అధ్యాపకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉల్లిందకొండ గ్రామానికి చెందిన జీవి శ్రీకాంత్..ఓర్వకల్లు మండలం నన్నూరులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. అయితే లెక్చరర్‌ వేధింపులు తట్టుకోలేక..తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీకాంత్‌ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని కర్నూలు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. అప్పటికే శ్రీకాంత్‌ చనిపోయాడని వైద్యులు తెలిపారు. శ్రీకాంత్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని భోరున విలపించారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ముందు ఆందోళన దిగాయి. విద్యార్థి మృతికి యాజమాన్య వేధింపులే కారణమని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.

ర్యాంకుల పేరిట..
ర్యాంకుల పేరుతో కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థులను బలి పశువులను చేసి జైళ్లల్లో ఖైదీలకంటే హీనంగా చూస్తున్నాయి. ఉదయం 4 గంటలకు ప్రారంభయ్యే చదువుల ప్రస్థానం రాత్రి 11, 12 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. బట్టీపట్టించి మరీ చదివిస్తుంటారు. ప్రభుత్వ సిలబస్‌లే కాకుండా వీరి సొంత సిలబస్‌లను సైతం విద్యార్థులపై బలవంతంగా రుద్దడంవల్లే విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ కాలేజీల అరాచకాలను అడ్డుకట్ట వేసి విద్యార్థుల జీవితాలను నిలపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

06:34 - September 26, 2015

హైదరాబాద్ : పేదల ఇండ్ల డిజైన్ ను సీఎం కేసీఆర్ ఆమెదించారు. శుక్రవారం క్యాంపు కార్యలయంలో గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అధికారులు తయారు చేసిన పలు డిజైన్లను పరిశీలించారు. చివరికి ఓ డిజైన్ కు అంగీకారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండి పెండెంట్ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి చుట్టు కూడా ఖాళీ జాగా ఉండేలా డిజైన్ చేసింది. రైతులకు సంబంధించిన పశువులు, వ్యవసాయ పనిముట్లను భద్రపరుచుకునే విధంగా ఇంటి చుట్టు ఖాళీ జాగా ఉండనుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3 విధానంలో అపార్ట్ మెంట్లను నిర్మించనున్నారు. సీఎం ఫార్మ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో, వరంగల్ పట్టణంలో ఇండ్ల పనులు మొదలు ప్రారంభించనున్నారు.

రూ.5.30 లక్షలు..
గ్రామాల్లో రూ.5.04 లక్షలతో, పట్టణాల్లో రూ. 5.30 లక్షలతో 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనుంది సర్కార్. ఇక కాలనీలల్లో మౌలిక వసతులు కోసం మరిన్ని నిధులు వెచ్చించనుంది. అయితే ఈ ఏడాదిలో 60 వేల ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అందులో బాగంగా ప్రతి నియోజకవర్గంలో 400 గృహాలను నిర్మించనుంది. ఇదే పద్దతిన క్రమంగా అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూము ఇండ్లను కట్టించి ఇస్తామని సీఎం మరోసారి స్పష్టం చేసారు. అయితే కొత్త ఇళ్ల నిర్మాణాన్ని దసరాలో మొదలు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

06:31 - September 26, 2015

ఢిల్లీ : ఏపీకి వెయ్యికోట్ల సాయాన్ని కేంద్రం ప్రకటించింది. రాజధానికి, వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి 700 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 300 కోట్లు ఇవ్వనున్నారు. మరోవైపు ప్రత్యేక హోదాపై వచ్చే నెల15 లోపు స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఇక తెలంగాణకు కేంద్రం ఎప్పటిలాగే మొండి చేయి చూపింది. ఏపీలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు ఈ వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 350 కోట్లు కేటాయించారు. నూతన రాజధాని నిర్మాణానికి 350 కోట్లు.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 300 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

తెలంగాణకు మొండి చేయి..
ఏపీలో వెనుకబడిన జిల్లాలకు సాయం ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మాత్రం మొండి చేయి చూపింది. రాష్ట్రం విడిపోయి 16 నెలలు కావస్తున్నా.. నేటికీ ఒక్క రూపాయి విదిల్చిన దాఖలాలు లేవు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలి. గతంలోనూ ఏపీకి 350 కోట్లు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు మాత్రం ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కొంతమేర పన్ను ప్రోత్సాహాకాలనే ప్రకటించింది.

బాబు ఏకరువుతోనే..
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందంటూ సీఎం చంద్రబాబు కేంద్రం ముందు ఏకరువు పెట్టడంతో వెయ్యికోట్లు ప్రకటించారు. దీనితో పాటు ఏపీలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు తోడ్పాటునందిస్తామని తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4 వేల 403 కోట్ల సాయం అందజేసినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. ఆ ప్యాకేజీలో రాయలసీమ, కోస్తాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్లు, వనరుల వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు 2 వేల 303 కోట్లు, నూతన రాజధాని వనరుల కల్పనకు 1500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 250 కోట్ల చొప్పున అందజేసినట్లుగా తెలిపింది. ఇక వచ్చేనెల 15వ తేదీలోపు ఏపీ ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. అక్టోబర్‌ 22న నూతన రాజధాని నిర్మాణ శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని చెప్పారు. 

06:28 - September 26, 2015

నెల్లూరు : జిల్లాలో ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురయిన ఓ వ్యక్తి అవయవదానాలు చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. రెండు రోజుల క్రితం మస్తానయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురయిన సంగతి తెలిసిందే. చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి గుండె అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. నెల్లూరుకు చెన్నై నుంచి గ్లోబల్‌ ఆస్పత్రి అంబులెన్స్ కూడా చేరుకుంది. తీరా మస్తానయ్యా గుండె ఆపరేషన్‌ చేసి తీసేసరికి నిరాశే ఎదురైంది. అప్పటికే మస్తానయ్య గుండె చెడిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది నిరాశతో వెనుదిరిగారు. ఇక కాలేయం, కిడ్నీలు తిరుపతి, హైదరాబాద్‌లోని ఇతర రోగులకు అమర్చేందుకు తరలించారు. 

నేడు ఆస్తులను ప్రకటించనున్న నారా లోకేష్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తన ఆస్తులను సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటించనున్నారు.

ఐరాస సర్వప్రతినిధి సభలోల మోడీ ప్రసంగం..

న్యూయార్కు : ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. ప్రపంచంలో 1.3 మిలియన్ల మంది పేదలున్నారని, పేదరికం నుండి బయటపడాల్సినవసరం ఉందన్నారు. సుస్థిర అభివృద్ధి, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై మోడీ ప్రసంగించారు.

 

నెల్లూరులో బ్రెయిన్ డెడ్..

నెల్లూరు : జిల్లాలోని నారాయణ ఆసుపత్రిలో మస్తానయ్య బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఓ ప్రమాదంలో మస్తానయ్య గాయపడ్డాడు. ఇతని అవయవదానాలకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. చెన్నైకి తరలించాల్సిన గుండె ఆపరేషన్ ప్రక్రియ ఫెయిల్ కావడంతో అంబులెన్స్ తిరిగి వెళ్లిపోయింది. కిడ్నీలను రోడ్డు మార్గంలో తిరుపతి వైద్యులు తరలించారు.

 

 

Don't Miss