Activities calendar

27 September 2015

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి కొనసాగుతున్న ఏర్పాట్లు

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విగ్రహం చుట్టూ బారికేడ్లను నిర్వహకులు తొలగిస్తున్నారు. గణేషుడి శోభయాత్రకు ప్రత్యేకవాహనం ముస్తాబవుతుంది. గణేషుడి శోభయాత్ర మరింత ఆలస్యం కానుంది.

21:51 - September 27, 2015

హైదరాబాద్‌ : నగరంలో ఇప్పటివరకు గణేశ్‌ నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా జరుగుతుందని నగర పోలీస్‌ కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని అన్ని ప్రాంతంలో జరుగుతున్న నిమజ్జన శోభాయాత్రను బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో సీసీ ఫుటేజీ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నాలుగువేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని..సోమవారం ఉదయం 11గంటల వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనం మాత్రం అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఉంటుందన్నారు.

 

21:48 - September 27, 2015

హైదరాబాద్ : కూకట్ పల్లి అడ్డగుట్ట గణేష్ లడ్డూ ఈసారి రికార్డ్ సృష్టించింది. ఆదివారం నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ.15 లక్షలు పలికింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనార్థన్‌రెడ్డి అలియాస్‌ చంటిరెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. నెల్లూరులో తాను నిర్వహిస్తున్న సీఆర్‌ లేఅవుట్ వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయన్న నమ్మకంతో లడ్డూని దక్కించుకున్నానని చంటిరెడ్డి తెలిపారు. జంటనగరాల్లో ఇప్పటివరకూ నిర్వహించిన గణేశుని లడ్డూల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అయితే వేలంలో వచ్చిన 15 లక్షల రూపాయలను గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ఆపరేషన్‌ కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందచేస్తామని నిర్వాహకులు విజయ్‌కుమార్ తెలిపారు. 

21:46 - September 27, 2015

హైదరాబాద్ : ఇసకేస్తే రాలనంత జనం...ఎటు చూసినా...కనుచూపుమేర బారుల తీరిన లక్షలాది మంది భక్తులు గణపతి పప్పా మోరియా.. గణేశ్ మహారాజుకి జై..బైబై గణేశా.. అంటూ భక్తుల నినాదాలు. 11 రోజుల పాటు లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. 59 అడుగుల ఎత్తుతో త్రిశక్తిమయ మోక్షగణపతి రూపంలో ఉన్న ఖైరతాబాద్‌ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరి రోజు కావడంతో ఇవాళ ఒక్కరోజులోనే దాదాపు 6 లక్షల మంది భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు. మహాగణపతి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తుల రద్దీ...
చివరి రోజు కావడంతో ఖైరతాబాద్‌ త్రిశక్తిమయ మోక్షగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మనరాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాలు ఇసకేస్తే రాలనంత రద్దీగా తయారయ్యాయి. 10రోజుల పాటు దాదాపు 15 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. ఇక 11వ రోజు చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు బారులుతీరారు. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 5 నుంచి 6లక్షలమంది భక్తులు దర్శించుకున్నారని ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.
గణనాధుడి శోభాయాత్రకు ఏర్పాట్లు
59 అడుగుల ఎత్తుతో త్రిశక్తిమయ మోక్షపతి రూపంలో ఉన్న గణనాధుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఎస్‌టీసీ సంస్థకు 22 టైర్ల కంటెయినర్లు రెండింటిని శోభాయాత్రలో వినియోగిస్తున్నారు. ఓ దానిలో గణపయ్యను.. మరో కంటైనర్‌ మీద స్వామివారికి ఇరుపక్కల ఉన్న లక్ష్మీ, సరస్వతీ దేవి, గజేంద్రమోక్ష విగ్రహాలను అమర్చుతున్నారు. ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద స్వామివారిని నిమజ్జనం చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈనెల 30న భక్తులకు లడ్డూ పంపిణీ
త్రిశక్తిమయ మోక్షగణపతి చేతిలో ఉన్న 5,600 కిలోల లడ్డూని ఈనెల 30న స్వామివారు ఉన్న ఖైరతాబాద్‌ ప్రాంగణంలోనే భక్తులకు పంపిణీ చేయనున్నారు. లడ్డూలో సగభాగాన్ని భక్తులకు పంచిపెడతారు. మిగతా సగభాగాన్ని లడ్డూని తయారుచేసిన..సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తీసుకెళ్తారని గణేశ్‌ ఉత్సవ సమితి తెలిపింది. మొత్తానికి ఈ ఏడాది త్రిశక్తి మోక్షగణపతిగా లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు..వచ్చే ఏడాది ఏరూపంలో దర్శనమిస్తారో చూడాలి మరి.

 

21:02 - September 27, 2015

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హుస్సేన్ సాగర్.. క్రేన్ నెం.1 వద్ద కంటెయినర్ నుంచి భారీ వినాయకుడు కిందపడిపోయాడు. పులువురికి గాయాలయ్యాయి. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. కాగా జీహెచ్ ఎంసీ అధికారులు నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. ఘటన జరిగి తర్వాత కూడా ఏ ఒక్క అధికారి సంఘటనాస్థలానికి రాలేదని వాపోయారు. భారీ గణనాథులను నిమజ్జనం చేసే చోట అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినవసరం ఉందని చెబుతున్నారు.

 

కంటెయినర్ నుంచి కిందపడిన వినాయకుడు

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ క్రేన్ నెం.1 వద్ద కంటెయినర్ నుంచి భారీ వినాయకుడు కిందపడిపోయింది. తృటిలో ప్రమాదం తప్పింది. 

విజయవాడలో కొనసాగుతున్న మహా గణపతి నిమజ్జనం..

విజయవాడ : ఘంటశాల సంగీత కళాశాలలో ప్రతిష్టించిన 63 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం కొనసాగుతోంది. మహాగణపతిని ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం తర్వాత విగ్రహానికి సంబంధించిన మట్టిని నిర్వహకులు భక్తులకు అందజేయనున్నారు. 

20:30 - September 27, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. గణేష్ శోభయాత్ర కన్నులపండువగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జన సందడి నెలకొంది. నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న... గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నారు. వాడవాడలా వెలిసిన విఘ్నపతులు నిమజ్జనానికి బయల్దేరుతున్నారు. భక్తులు కూడా గణేశునికి బైబై గణేశా అంటూ మేళతాళాలు, బ్యాండ్ బాజాలతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సాగనంపుతున్నారు. జయజయ ధ్వానాల మధ్య విఘ్నేశ్వరులు ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నారు. కిలోమీటర్ల పొడవునా.. విగ్రహాలు క్యూ కట్టాయి. భక్తుల కోలాహలంతో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో హోరెత్తుతున్నాయి. గణపతి బప్పా మోరియా అంటూ... చిన్నా పెద్దా నినదిస్తున్నారు. శోభయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ లో ఇప్పటి వరకూ 5 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. మరో 30 వేలకు పైగా విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. ఎన్ టిఆర్ మార్గ్ లో మరో 21 క్రేన్ లు, ట్యాంక్ బండ్ మార్గ్ లో 21 క్రేన్ లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగరం చుట్టూ ఉన్న మరో 24 చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు.
గణేష్ శోభయాత్ర..
హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. చిన్న చిన్న... పెద్ద.. పెద్ద గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. శోభయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నగరంలో రోడ్లన్ని వినాయక విగ్రహాలు, భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా.. గణేష్ ప్రతిమలే కనపడుతున్నాయి. కనుచూపు మేరలో వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి. ట్రాలీ ఆటో, డిసిఎం, లారీ, భారీ కంటెయినర్ లలో విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. చంద్రాయన్ గుట్ట, పాతబస్తీ, ఫలక్ నుమా నుంచి వచ్చే విగ్రహాలు చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజె మార్కెట్ మార్గాల ద్వారా ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలు కన్నులవిందు చేస్తున్నాయి. బాహుబలి రూపంలో వినాయకులు దర్శనమిస్తున్నాయి. బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వద్దకు చేరుకున్నాడు. శోభయాత్రలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. శోభయాత్రలో చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తరలివచ్చారు. వీరితోపాటు మహిళలు అత్యధిక సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. పలు వినాయక పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తున్నారు. 
ఖైరతాబాద్ గణేషుడి తరలింపుకు ఏర్పాట్లు..
తెలంగాణలోనే అతి ఎత్తున్న 59 అడుగుల వినాయకుడుని నిమజ్జనానికి తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో గణనాథుడిని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. గణనాథుడిని తరలించే వాహనాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ భక్తులతో కిక్కిరిసిపోతుంది. అర్ధరాత్రి ఖైరతాబాద్ వినాయకున్ని మండపం నుంచి ట్యాంక్ బండ్ తరలించే అవకాశం ఉంది. వాహనాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేస్తున్నారు.
ట్యాంక్ బండ్.. జనసంద్రం
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు నిమజ్జనం నిమ్తితం ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. చార్మినార్, తెలుగుతల్లి ప్లైవోవర్, ట్యాంక్ బండ్, ఎంజె మార్కెట్, మల్కాజ్ గిరి, సనత్ నగర్ ప్రాంతాల ద్వారా గణనాథులు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. గణనాధులను, శోభయాత్రను చూసేందుకు నగర ప్రజలతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్త జన సంద్రంగా మారింది. ట్యాంక్ బండ్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. ఎన్ టిఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ మార్గ్ లో గణేష్ లను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. నెక్లెస్ రోడ్డులో 8 క్రేన్ లు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డు ప్రాంతం జాతరను తలపిస్తుంది. 17 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పోలీసులు చెబుతున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసుల బందోబస్తులో పాల్గొన్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనంతో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ముగుస్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా మట్టి విగ్రహాలు...
అయితే మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలు శోభయాత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందరూ మట్టి వినాయకులను ఇష్టపడుతున్నారు. వాటిని తమ తమ కెమెరాల్లో బందిస్తున్నారు. మట్టి విగ్రహాలను పూజించండి.. పర్యావరాణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నారు. గతం కంటే ఈ ఏడాది మట్టి వినాయకుళ్ల సంఖ్య పెరిగింది. అంత్యంత సుందరంగా అలంకరించి తీసుకొచ్చారు.
భారీ బందోబస్తు..
ఈ నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, రవాణ, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జలమండలి, ఆర్టీసీ తదితర విభాగాలు సిబ్బంది సిద్ధంగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. చత్తీస్ ఘడ్ నుంచి పోలీసులను రప్పించారు. అడుగడుగునా నిఘా కెమెరాలు, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. 25000 సీసీ కెమెరాలు, 10 మౌండెడ్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈసారి ప్రత్యేకంగా షీ టీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. ప్రతి 3 కి.మీకు ఒక గణేష్ యాక్షన్ టీం ఏర్పాటు చేశారు. 400 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటిఎస్ రైళ్లను ఏర్పాటు చేశారు. 150 షీటీమ్స్ విధుల్లో ఉన్నారు. అయితే 4 చైన్ స్నాచింగ్స్ చోటుచేసుకున్నాయి. భక్తులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
విజయవాడలో ఘనంగా గణేష్ నిమజ్జనం..
విజయవాడలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర కొనసాగుతోంది. శోభయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సంగీత కళాశాలలో దేశంలోనే అతి పెద్ద 63 అడుగుల ఎత్తున్న మట్టి గణనాథుడిని ప్రతిష్టించారు. రెండు వరల్డ్ రికార్డులను సంపాధించుకుంది. అయితే ప్రతిష్టించిన నుంచి ఇప్పటి వరకు 13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళా నిమజ్జనం చేయనున్నారు. నేడు చివరి రోజు కావడంతో వినాయకున్ని 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిమజ్జనం చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి.. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయనున్నారు. వచ్చే సంవత్సరం 73 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఎపిలోని 13 జిల్లాల్లోని ఆడపడచుల మొదటి పండుగ గణేష్ పండుగ అని తెలిపారు. మరోవైపు పలువురు భక్తులు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఎపిలో అనేక సమస్యలున్నాయని తెలిపారు. కేంద్రం ఎపిని ఆదుకోవాలని కోరారు.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం : నాయిని
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభయాత్ర, నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. వినాయక శోభయాత్ర, నిమజ్జనాన్ని ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నాయిని మీడియాతో మాట్లాడారు. చార్మినార్, సికింద్రాబాబాద్, సైబరాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే గణేష్ లను చూడడం జరిగిందన్నారు. 45 నిమిషాల పాటు హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అంతకంటే ముందు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీతో మీటింగ్ ఏర్పాటు చేసి... సదుపాయాలపై చర్చంచామని తెలిపారు. ముందు అనుకున్నట్లుగానే నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. ఇందులో పోలీసుల పాత్ర కీలకమన్నారు. అధికారులు, పోలీసులు.. డిజి, అడిషనల్ డిజి లు బందోబస్తులో నిమగ్నమై ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేశారని కొనియాడారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నాయిని పోలీసుల శాఖకు అభినందనలు తెలిపారు. భారత్ దేశంలోనే హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక ఉందన్నారు. అలాగే సహకరించిన మీడియా, పత్రిక ప్రతినిధులకు ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ లో మతసామరస్యం, లా ఆండ్ ఆర్డర్ ను కాపాడాలని కోరారు. అలా అయితేనే నగరంలో అందరూ కంటి నిండా నిద్ర పోతారని, ప్రశాంతంగా ఉంటారని వివరించారు. రేపు ఉదయం 11 గంటలకు వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని.. భవిష్యత్ లో కూడా హైదరాబాద్ పేరు, ఖ్యాతిని కాపాడే విధంగా నిర్వహిస్తామని చెప్పారు.

 

వివాహితపై వ్యక్తి అత్యాచారయత్నం

హైదరాబాద్ : వివాహితపై ఉపేందర్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మహిళ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఉపేందర్ పరారీలో ఉన్నాడు.

 

శృతి-సాగర్లను కడియమే ఎన్ కౌంటర్ చేయించారు : ఎర్రబెల్లి

వరంగల్ : శృతి, సాగర్ లను కడియం శ్రీహరే ఎన్ కౌంటర్ చేయించారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఎర్రబెల్లిని బచ్చన్నపేట పీఎస్ కు తరలించారు. పీఎస్ ఎదుట టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కడియం ఆగడాలు విజృంభించాయని విమర్శించాయి. తనకు గిట్టని వారిని ఎన్ కౌంటర్ చేయించిన చరిత్ర కడియం శ్రీహరిదేనని పేర్కొన్నారు.

 

మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందిచాలని ఆదేశం...

చిత్తూరు : తిరుమల కపిలతీర్థం పుష్కరిణిలో పడి మృతి చెందిన నలుగురి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని తిరుపతి అర్బన్ ఎస్పీని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశించారు. 

కపిలతీర్థంపుష్కరిణి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా

చిత్తూరు : కపిలతీర్థం పుష్కరిణిలో పడి మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తిరుమలోని కపిలతీర్థం పుష్కరిణిలో ప్రమాదవశాత్తు నలుగురు పడి మృతి చెందారు. ఒక మృత దేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

 

చార్మినార్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేష్..

హైదరాబాద్ : నగరంలో గణేష్ శోభయాత్రం కన్నులపండువగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న వినాయకుళ్లు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు. బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వద్దకు చేరుకుంది.

18:58 - September 27, 2015

చిత్తూరు : తిరుపతిలో విషాదం నెలకొంది. కపిలతీర్థం పుష్కరిణిలో ప్రమాదవశాత్తు నలుగురు పడి మృతి చెందారు. ఒక మృత దేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ముగ్గురు మృతులను అధికారులు గుర్తించారు. మృతులు శ్రీకాంత్, వెంకటేష్, లోహిత్ లుగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప... తిరుపతి అర్బన్ ఎస్పీని ఆదేశించారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

 

 

అత్యధిక ధర పలికిన కూకట్ పల్లి లడ్డూ

హైదరాబాద్ : తెలంగాణలో కూకట్ పల్లి లడ్డూ అత్యధిక ధర పలికింది. కూకట్ పల్లి అడ్డగుట్ట సొసైటీలో గణేష్ లడ్డూను రూ. 15లక్షలకు సీఆర్ రెసిడెన్స్ అధినేత చంటిరెడ్డి దక్కించుకున్నారు.

 

సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం

హైదరాబాద్ : సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన సందడి నెలకొంది. సైదాబాద్, చంపాపేట, చైతన్యపురి, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాల నుంచి గణనాథులు సరూర్ నగర్ చెరువుకు తరలివస్తున్నారు. చెరువు వద్ద 7 క్రేన్లు ఏర్పాటు చేశారు. సరూర్ నగర్ చెరువులో ఇప్పటివరకు 350 విగ్రహాల నిమజ్జనం జరిగింది. మొత్తం 3 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది.

 

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం రేపు పూర్తి : డిసిపి కమలాసన్ రెడ్డి

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం పూర్తయ్యే అవకాశం ఉందని డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ఖైరతాబాద్ వినాయక వాహనం కదులుతుందన్నారు.

 

వినాయక శోభయాత్రలో వైసిపి-టిడిపిల మధ్య ఘర్షణ

గుంటూరు : మాచర్లలోని వినాయక శోభయాత్రలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతారణం నెలకొంది.

 

కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురి మృతి

తిరుపతి : కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురు మృతి చెందారు. ఒక మృత దేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

బింద్రాకు స్వర్ణం..

ఢిల్లీ : ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో అభినవ్ బింద్రాకు స్వర్ణ పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం : నాయిని

హైదరాబాద్ : నగరంలో గణేష్ శోభయాత్ర, నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. వినాయక శోభయాత్ర, నిమజ్జనాన్ని ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నాయిని మీడియాతో మాట్లాడారు. చార్మినార్, సికింద్రాబాబాద్, సైబరాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే గణేష్ లను చూడడం జరిగిందన్నారు. 45 నిమిషాల పాటు హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 

18:02 - September 27, 2015

హైదరాబాద్ : నగరంలో గణేష్ శోభయాత్ర, నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. వినాయక శోభయాత్ర, నిమజ్జనాన్ని ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నాయిని మీడియాతో మాట్లాడారు. చార్మినార్, సికింద్రాబాబాద్, సైబరాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే గణేష్ లను చూడడం జరిగిందన్నారు. 45 నిమిషాల పాటు హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అంతకంటే ముందు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీతో మీటింగ్ ఏర్పాటు చేసి... సదుపాయాలపై చర్చంచామని తెలిపారు. ముందు అనుకున్నట్లుగానే నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. ఇందులో పోలీసుల పాత్ర కీలకమన్నారు. అధికారులు, పోలీసులు.. డిజి, అడిషనల్ డిజి లు బందోబస్తులో నిమగ్నమై ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేశారని కొనియాడారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నాయిని పోలీసుల శాఖకు అభినందనలు తెలిపారు. భారత్ దేశంలోనే హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక ఉందన్నారు. అలాగే సహకరించిన మీడియా, పత్రిక ప్రతినిధులకు ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ లో మతసామరస్యం, లా ఆండ్ ఆర్డర్ ను కాపాడాలని కోరారు. అలా అయితేనే నగరంలో అందరూ కంటి నిండా నిద్ర పోతారని, ప్రశాంతంగా ఉంటారని వివరించారు. రేపు ఉదయం 11 గంటలకు వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని.. భవిష్యత్ లో కూడా హైదరాబాద్ పేరు, ఖ్యాతిని కాపాడే విధంగా నిర్వహిస్తామని చెప్పారు.

 

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

వరంగల్ : జనగాం పిఎస్ ఎదుట టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎర్రబెల్లి దయాకర్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఎర్రబెల్లి అరెస్టు...

వరంగల్ : పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కడియం పర్యటనను అడ్డుకునేందుకు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు యత్నించారు. అయితే ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో తోపులాట జరిగింది. టీడీపీ, టీఆర్ ఎస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు కుర్చీలు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఎర్రబెల్లికి గాయాలు అయ్యాయి. ఎస్సై ఇస్మాయిల్ తోపాటు మీడియా ప్రతినిధులకు, 15 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు టీడీపీ, టీఆర్ ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. గాయపడ్డ ఎస్సైని తొర్రూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

17:13 - September 27, 2015

హైదరాబాద్ : నగరంలో గణేష్ శోభయాత్ర కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. చార్మినార్, తెలుగుతల్లి ప్లైవోవర్, ట్యాంక్ బండ్, ఎంజె మార్కెట్, మల్కాజ్ గిరి, సనత్ నగర్ ప్రాంతాల ద్వారా గణనాథులు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. గణనాధులను, శోభయాత్రను చూసేందుకు నగర ప్రజలతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్త జన సంద్రంగా మారింది. ట్యాంక్ బండ్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. ఎన్ టిఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ మార్గ్ లో గణేష్ లను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. నెక్లెస్ రోడ్డులో 8 క్రేన్ లు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డు ప్రాంతం జాతరను తలపిస్తుంది. 17 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పోలీసులు చెబుతున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసుల బందోబస్తులో పాల్గొన్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనంతో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ముగుస్తుంది.

 

16:52 - September 27, 2015

విజయవాడ : తెలుగు రాష్ట్రాలలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర కొనసాగుతోంది. శోభయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సంగీత కళాశాలలో దేశంలోనే అతి పెద్ద 63 అడుగుల ఎత్తున్న మట్టి గణనాథుడిని ప్రతిష్టించారు. రెండు వరల్డ్ రికార్డులను సంపాధించుకుంది. అయితే ప్రతిష్టించిన నుంచి ఇప్పటి వరకు 13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళా నిమజ్జనం చేయనున్నారు. నేడు చివరి రోజు కావడంతో వినాయకున్ని 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిమజ్జనం చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి.. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయనున్నారు. వచ్చే సంవత్సరం 73 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఎపిలోని 13 జిల్లాల్లోని ఆడపడచుల మొదటి పండుగ గణేష్ పండుగ అని తెలిపారు. మరోవైపు పలువురు భక్తులు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఎపిలో అనేక సమస్యలున్నాయని తెలిపారు. కేంద్రం ఎపిని ఆదుకోవాలని కోరారు.

 

16:37 - September 27, 2015

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. గణేష్ శోభయాత్ర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. చిన్న చిన్న... పెద్ద.. పెద్ద గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. శోభయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నగరంలో రోడ్లన్ని వినాయక విగ్రహాలు, భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా.. గణేష్ ప్రతిమలే కనపడుతున్నాయి. కనుచూపు మేరలో వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి. ట్రాలీ ఆటో, డిసిఎం, లారీ, భారీ కంటెయినర్ లలో విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. చంద్రాయన్ గుట్ట, పాతబస్తీ, ఫలక్ నుమా నుంచి వచ్చే విగ్రహాలు చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజె మార్కెట్ మార్గాల ద్వారా ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలు కన్నులవిందు చేస్తున్నాయి. బాహుబలి రూపంలో వినాయకులు దర్శనమిస్తున్నాయి. 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు... చత్తీస్ ఘడ్ నుంచి పోలీసులను రప్పించారు. 25 వేల సీసీ కెమెరాలు, 10 మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఉంచారు. 400 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటిఎస్ రైళ్లను ఏర్పాటు చేశారు. 150 షీటీమ్స్ విధుల్లో ఉన్నారు. అయితే 4 చైన్ స్నాచింగ్స్ చోటుచేసుకున్నాయి. భక్తులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

16:04 - September 27, 2015

ముంబై : దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. అంగరంగవైభవంగా వినాయక శోభయాత్ర కొనసాగుతోంది. భోపాల్, పూనే, ముంబై, హైదరాబాద్ నగరాల్లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న... గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నారు. వాడవాడలా వెలిసిన విఘ్నపతులు నిమజ్జనానికి బయల్దేరుతున్నారు. భక్తులు కూడా గణేశునికి బైబై గణేశా అంటూ మేళతాళాలు, బ్యాండ్ బాజాలతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సాగనంపుతున్నారు. జయజయ ధ్వానాల మధ్య విఘ్నేశ్వరులు నిమజ్జనానికి కదులుతున్నారు. కిలోమీటర్ల పొడవునా.. విగ్రహాలు క్యూ కట్టాయి. భక్తుల కోలాహలంతో ప్రధాన నగర పరిసర ప్రాంతాలు హోరెత్తుతున్నాయి. గణపతి బప్పా మోరియా అంటూ... చిన్నా పెద్దా నినదిస్తున్నారు. శోభయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం రంగంలోకి దిగాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఎంపీల వేతనాల పెంపుపై స్వతంత్ర కమిటీ

ఢిల్లీ : ఎంపీల వేతనాల పెంపుపై స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. 2010 సంవత్సరంలో చివరిసారిగా రూ.50 వేల మూల వేతన సవరణ చేశారు.

 

వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత

వరంగల్ : పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కడియం పర్యటనను అడ్డుకునేందుకు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు యత్నించారు. అయితే ఎర్రబెల్లిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. టీడీపీ, టీఆర్ ఎస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు కుర్చీలు, రాళ్లు రువ్వుకున్నారు. ఎర్రబెల్లికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. 

14:51 - September 27, 2015

హైదరాబాద్‌ : నగరంలో గణేష్ నిమజ్జన సందడి నెలకొంది. నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న... గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నారు. వాడవాడలా వెలిసిన విఘ్నపతులు నిమజ్జనానికి బయల్దేరుతున్నారు. భక్తులు కూడా గణేశునికి బైబై గణేశా అంటూ మేళతాళాలు, బ్యాండ్ బాజాలతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సాగనంపుతున్నారు. జయజయ ధ్వానాల మధ్య విఘ్నేశ్వరులు ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నారు. కిలోమీటర్ల పొడవునా.. విగ్రహాలు క్యూ కట్టాయి. భక్తుల కోలాహలంతో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో హోరెత్తుతున్నాయి. గణపతి బప్పా మోరియా అంటూ... చిన్నా పెద్దా నినదిస్తున్నారు. శోభయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు.
భారీ బందోబస్తు..
ఈ నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, రవాణ, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జలమండలి, ఆర్టీసీ తదితర విభాగాలు సిబ్బంది సిద్ధంగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. అడుగడుగునా నిఘా కెమెరాలు, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. 25000 సీసీ కెమెరాలు, 10 మౌండెడ్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈసారి ప్రత్యేకంగా షీ టీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. ప్రతి 3 కి.మీకు ఒక గణేష్ యాక్షన్ టీం ఏర్పాటు చేశారు. భక్తులతో ఖైరతాబాద్‌ కిక్కిరిసిపోతుంది. అర్ధరాత్రి ఖైరతాబాద్ వినాయకున్ని మండపం నుంచి ట్యాంక్ బండ్ తరలించే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎన్ టిఆర్ మార్గ్ లో మరో 21 క్రేన్ లు, ట్యాంక్ బండ్ మార్గ్ లో 21 క్రేన్ లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగరం చుట్టూ ఉన్న మరో 24 చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు.

 

రాయచోటిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు..

కడప : రాయచోటిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోడ్ల కూడలిలో పోలీసులకు వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గం నినాదాలు చేసింది.

 

 

ప్రతి రైతు కుటుంబానికి రూ.6లక్షలివ్వాలి - జూలకంటి..

నల్గొండ : రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.6లక్షల పరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పేరుతో శృతిని అమానుషంగా హత్య చేశారని, ఎన్ కౌంటర్ కు నిరసనగా 30న 'చలో అసెంబ్లీ' నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

రాజధాని విస్తరణతో ప్రజలకు లాభం లేదు - సీపీఎం..

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేటలో సీపీఎం సీఆర్డీఏ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో సీఆర్డీఏలో కలిపితే ప్రజలకు నష్టం జరుగుతుందని సీపీఎం సీఆర్డీఏ కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు పేర్కొన్నారు. రాజాధాని విస్తరణతో విదేశీ కంపెనీలకు తప్ప ఇక్కడి ప్రజలకు లాభం జరగదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొజంజాహి మార్కెట్ లో పోలీసుల చెంత చిన్నారి..

హైదరాబాద్ : మొజంజాహి మార్కెట్ లో ఒంటరిగా ఉన్న చిన్నారి అమ్ములును పోలీసులు చేరదీశారు. తల్లిదండ్రులు బాలామణి, రాజు అని ఆ చిన్నారి చెబుతోంది. 

13:39 - September 27, 2015

హైదరాబాద్ : వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. గత 11 రోజులుగా పూజలు చేసిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గణనాథుల వాహనాలతో కిక్కిరిసిపోయింది. తమ అందంగా అలంకరించిన వాహనాలలో వినాయకుడిని తరలిస్తున్నారు. మరోవైపు విచిత్రమైన ఆకారాలలో ఉన్న వినాయకుడులను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. 'బాహుబలి' గణేష్..'గబ్బరింగ్' గణేష్ ఇలా ఒకేటేమిటి విచిత్ర ఆకారాలతో ఉన్న వినాయకులు ఆకర్షిస్తున్నారు. షాలిబండ ప్రాంతానికి చెందిన వారు వినూత్నంగా వినాయకుడులను తయారు చేశారు. పండుగల నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేష్ లను చూడటానికి ప్రజలు ఆసక్తిని కనబర్చారు. రాఖీ..సంక్రాంతి..హోళీ..దీపావళి..దసరా..పండుగల ప్రతీకగా వినాయకుడులను ఏర్పాటు చేశారు. చివరగా మహాగణపతిని ప్రతిష్టించారు. వీటన్నింటినీ ఒక ట్రాలీపై పెట్టి సాగర్ వైపు తీసుకెళ్లారు.

నల్గొండలో ఇద్దరు రైతుల ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుర్రంపోడులో పత్తి రైతు యాదయ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే వేములపల్లి (మం) బుగ్గబావిగూడెంలో రైతు అనిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నిర్మల్ లో కల్తీ కల్లు బాధితులు ముగ్గురు మృతి..

ఆదిలాబాద్ : జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిర్మల్ లో ముగ్గురు కల్లీ కల్లు బాధితులు మృతి చెందారు. చంద్రలింగన్న, సిద్ధ లింగన్న (గొల్లపేట), వెంకటాద్రిపేటకు చెందిన చంద్రయ్యలు మృతి చెందారు. 

ఆత్మహత్యలు పెరగడంపై బాబు ఆందోళన..

విజయవాడ : విద్యార్థులు..ఇతర వర్గాల వారిలో ఆత్మహత్యలు పెరగడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మహత్యకు గల కారణాలు, అరికట్టే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

 

ఫొటోగ్రాఫర్ ఆశుతోష్ ను సన్మానించిన అఖిలేష్..

ఉత్తర్ ప్రదేశ్ : ఫొటోగ్రాఫర్ ఆశుతోష్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సన్మానించారు. 65 సంవత్సరాల వృద్ధుడి టైప్ రైటర్ ను ఎస్ఐ దుర్భషలాడుతూ టైప్ ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలను ఆశుతోష్ తన కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపెట్టాడు. 

తంగెడలో కానిస్టేబుల్, హోంగార్డు నిర్భందం..

గుంటూరు : దాచేపల్లి (మం) తంగెడలో పోలీసులను గ్రామస్తులు నిర్భందించారు. రైతుపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ కానిస్టేబుల్, హోంగార్డులను గ్రామస్థులు నిర్భందించారు.

శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన టీఎస్ మంత్రి తలసాని..

హైదరాబాద్ : చార్మినార్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిమజ్జన యాత్రను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో తలసాని మాట్లాడారు. నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూస్తున్నామన్నారు. మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చామన్నారు. 

యశ్ చోప్రాకు బిగ్ బి నివాళి..

ముంబై : బాలీవుడ్ ప్రఖ్యాత దర్శక, నిర్మాత యశ్ రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా 83వ జయంతి సందర్భంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయనకు నివాళులర్పించారు. 

సీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం..

హైదరాబాద్ : నిమజ్జన ఏర్పాట్లపై సీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని, ఆర్టీసీ, విద్యుత్, పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తీర్పు..

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు వెలువడించనుంది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని పిటిషన్ దాఖలైంది.

 

టౌన్ బ్యాంకు మహాజన సమావేశం రసాభాస..

చిత్తూరు : టౌన్ బ్యాంకు మహజన సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో డిపాజిటర్లు, డైరెక్టర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్యాంకు పాలకవర్గం అక్రమాలకు పాల్పడుతోందని డిపాజిటర్లు ఆరోపణలు గుప్పించారు. 

12:02 - September 27, 2015

'దూకుడు' తరువాత సరైన విజయం లేని 'మహేశ్' కు మళ్ళీ ఆ స్థాయిలో సంతృప్తి కలిగించిన చిత్రం 'శ్రీమంతుడు'. ప్రిన్స్ అభిమానుల ఆనందం అంబరమంటేలా చేసిన 'శ్రీమంతుడు'పై ఇప్పుడు బాలీవుడ్ బాబుల చూపు పడింది. ఈ చిత్రాన్ని 'సల్మాన్' చేస్తారని తొలుత వార్తలు వెలువడ్డాయి. తాజాగా కండల వీరుడు 'హృతిక్ రోషన్' హీరోగా ఈచిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మిస్తారని టాక్. ఎరాస్ ఇంటర్నేషనల్ సంస్థ ఇప్పుడు ఈచిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తోందంట. అందులో భాగంగా 'హృతిక్' ను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా చూసిన హృతిక్ కొన్ని మార్పులు చేర్పులు సూచించాడని, ప్రస్తుతం ఎరాస్ సంస్థ ఆ పనిలోనే ఉందంట. గ్రామాలను దత్తత తీసుకొనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగునాట విశేషాదరణ చూరగొంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రలోనూ, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కరవు తాండవిస్తున్న నేపథ్యంలో 'శ్రీమంతుడు' కథ, కథనం ఉత్తరాదివారికి కూడా నచ్చుతుందని ఎరాస్ సంస్థాధినేతలు భావిస్తున్నారు. మరి హిందీ 'శ్రీమంతుడు'కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. మరి హిందీ 'శ్రీమంతుడు'లో 'హృతిక్' నటిస్తున్నాడా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

నితీష్ కు హార్దిక్ పటేల్ మద్దతు..

బీహార్ : జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు పటేళ్ల నేత హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. 

తేనేటీగల దాడిలో ఇద్దరు మృతి..

ఛత్తీస్ గఢ్ : జస్ పూర్ లో తేనేటీగలు కుట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది. 

మక్కా తొక్కిసలాటలో మెదక్ వాసి మృతి..

మెదక్ : మక్కా తొక్కిసలాట ఘటనలో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. సదాశివపేటకు చెందిన ఖైరత్ ఆలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అదితి అదృశ్యంపై మరో కోణంలో పోలీసుల దర్యాప్తు..

విశాఖపట్టణం : చిన్నారి అదితి అదృశ్యంపై పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆదితిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని చిన్నారి తాత రమణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. కాల్వలో పడిపోయినట్లు ఎవరూ చూడలేదని ఆయన తెలిపారు. గత మూడు రోజులుగా ఆదితి ఆచూకీ తెలియడం లేదనే సంగతి తెలిసిందే. 

తేటగుంట చెక్ పోస్టుపై ఏసీబీ దాడి..

తూర్పుగోదావరి : తుని (మం) తేటగుంట చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అదనంగా ఉన్న రూ.20వేలను స్వాధీనం చేసుకుని ఇద్దరని అరెస్టు చేశారు. 

11:37 - September 27, 2015

హైదరాబాద్ : గత పద కొండు రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. దీనితో నగర రహదారులన్నీ గణ నాథులతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది. నిమజ్జనం సవ్యంగా జరిగేందుకు మైనార్టీ సోదరులు సహకరిస్తున్నారు. వారికి పోలీసులు ప్రత్యేకమైన 'టీ' షర్టులు ఇచ్చారు. ఈ సందర్భంగా వాలంటీరిలుగా విధులు నిర్వహిస్తున్న మైనార్టీ యువకులతో టెన్ టివి మాట్లాడింది. తాము హుస్సేనీ ఆలం పీఎస్ నుండి వచ్చామని, ఇటీవల కులీకుతుబ్ షా స్టేడియంలో శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ బాబురావు పలు సూచనలు అందచేశారని, నిమజ్జనానికి వచ్చే వారందరూ సహకరిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు జరిగినా స్పందిస్తామన్నారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామన్నారు. తాము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. 

సోమ్ నాథ్ నివాసం ఎదుట బీజేపీ ధర్నా..

ఢిల్లీ : మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి నివాసం ఎదుట బీజేపీ నేత ఆర్తి మెహ్రా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. 

11:25 - September 27, 2015

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జరుగుతున్న నిమజ్జనం కార్యక్రమాన్ని స్వయంగా చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ట్యాంక్ బండ్ వద్దకు 25 వేల విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని, ఉదయం 9.30 గంటల వరకు 900 విగ్రహాలు వచ్చాయన్నారు. నిమజ్జనం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తున్నామని, నిమజ్జనం కాగానే నీటిలో సిబ్బందితో క్లీన్ చేయడం జరుగుతోందన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు, ట్రాఫిక్ పోలీసులు తగిన రూట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడకు తొందరగా వచ్చేస్తే ఇబ్బంది జరిగే అవకాశం ఉందని, సోమవారం తెల్లవారుజాము వరకు ట్యాంక్ బండ్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. 300 మంది స్విమ్మర్స్, టూరిజం శాఖ నుండి బోట్స్ ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

పలాస హెచ్ పీ గ్యాస్ గోదాంలో చోరీ..

శ్రీకాకుళం : జిల్లా పలాస హెచ్ పీ గ్యాస్ గోదాంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గోదాంలో ఉన్న రూ.11 లక్షల నగదును తస్కరించారు. 

10:48 - September 27, 2015

హైదరాబాద్ : బాలాపూర్ 'లడ్డూ' ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ రూ.1,116 నుండి వేలం పాట ప్రారంభించగా అనూహ్యంగా లక్షలకు చేరుకుంది. చివరకు వేలం పాటలో ఆయన రూ.10.32 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.9 లక్షల 50 వేలకు ధర పలికిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం బాలాపూర్ గణేషుడిని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బొడ్రాయి వద్దకు చేరుకోగానే లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. లడ్డూ వేలం చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ వేలం పాటలో ఎన్ఆర్ఐ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన రుసుంను పంపించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వేలం పాటలో లడ్డూను దక్కించుకోవడానికి కళ్లెం మదన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు తీవ్రంగా పోటీ పడ్డారు. 9.50 లక్షల అనంతరం వీరిద్దరూ వేలకు వేలు పెంచుతూ వేలం కొనసాగించారు. శ్రీనివాస్ రెడ్డి కూడా పోటాపోటీగా పాట పాడారు. పది లక్షలకు చేరుకోగానే భక్తులు పెద్ద ఎత్తున్న హర్షధ్వానాలు చేశారు. చివరకు కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 10.30 లక్షలకు పాడి 'లడ్డూ'ను దక్కించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మదన్ మోహన్ రెడ్డిని సన్మానించారు. లడ్డూతో పాటు రెండు కిలోల వెండీని బహుకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ. 450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ.66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ. 85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ. 1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ. 4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ. 5, 45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ. 9,50,000.00
2015 కళ్లెం మదన్ మోహన్ రెడ్డి  రూ. 10,30,000.00

బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షల 32 వేలు..

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ లడ్డూను కల్లెం మదన్ మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో రూ. 10 లక్షల 32 వేల రూపాయలకు పాడి దక్కించుకున్నారు. 

పది లక్షలకు చేరిన బాలాపూర్ లడ్డూ..

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ వేలం పది లక్షలకు చేరుకుంది. 1,116 వేలంతో ప్రారంభమైన పాట పది లక్షల వరక పాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, కల్లెం మహేందర్ రెడ్డి లు వేలం పాట పాడుతున్నారు.

బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభం..

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తెలంగాణ మంత్రులు తలసాని, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు హాజరయ్యారు.

బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని దర్శించకున్న మంత్రి తలసాని..

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్ధేశించి తలసాని ప్రసంగించారు. నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 

10:00 - September 27, 2015

హైదరాబాద్ : గత పదకొండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వినాయక విగ్రహాలతో నిండిపోయాయి. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ నెలకొంది. ఇక వినాయక నిమజ్జన కార్యక్రమంలో 'కార్మికులు' అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గంటలు..గంటలు క్రేన్ లో నిలబడుతూ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రక్షణ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నా అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదని తెలుస్తోంది. పాదరక్షలు లేకుండానే వీరు పనులు చేస్తున్నారు. అలాగే విగ్రహాలు నిమజ్జనం కాగానే వాటిని ఓ పక్కకు తీసి ఇనుప చువ్వలను..ఇతరత్రా సామాగ్రీని విడదీస్తున్నారు. ఇవి తీసేటప్పుడు గాయాలు జరిగే ప్రమాదం ఉంది. వీరికి కూలి కూడా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చిన నిర్వాహకులు దయతలిచి డబ్బులు ఇస్తే అవి పంచుకుంటుంటారు. మొత్తానికి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో కార్మికులు షిప్టులుగా వారీగా పనిచేస్తుంటారు. 

బాలాపూర్ కు చేరుకున్న మంత్రి మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : బాలాపూర్ గణేషుడిని మంత్రి మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం శోభాయాత్ర జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు చేరుకున్నారు. కాసేపట్లో లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. 

కోల్ కతాలో అగ్నిప్రమాదం..

కోల్ కతా : పార్కు స్ట్రీట్ లోని మాగ్మా హౌజ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పది అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

స్కైప్ తరగతులు నిర్వహించడం అద్భుతం - సత్య నాదెళ్ల..

న్యూయార్కు : భారత్ లో గ్రామీణ ప్రాంతంలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించడం అద్భుతమని ప్రశంసించారు. ఏపీలో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకొనేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని, డిజిటల్ ఎకానమీలో భారత్ - అమెరికా భాగస్వామ్యానికి ఈ వేదిక నిదర్శనమన్నారు. 

మోడీ పర్యటన చారిత్రాత్మకమైంది - అడబ్ సీఈవో

న్యూయార్కు : భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన చారిత్రాత్మాకమైందని అడోబ్ సీఈవో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాకు మద్దతిస్తామన్నారు.

 

విశాఖలో నిమజ్జనం..భారీ బందోబస్తు..

విశాఖపట్టణం : వినాయక నిమజ్జనానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పీఎస్ కు 20 మంది గత ఈతగాళ్లను కేటాయించారు. భీమిలి నుండి యారాడ వరకు తీరంలో 200 మంది ఈతగాళ్లను కేటాయించారు.

 

గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలు..

రాజమండ్రి : గోదావరి నదిలో భారీగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. భారీగా ఊరేగింపులతో నిమజ్జనానికి 1400 విగ్రహాలు సిద్ధమయ్యాయి. సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. నిమజ్జనం ఊరేగింపులో బాణాసంచా కాల్చితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 

09:23 - September 27, 2015

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ లడ్డూకు ఎంతో ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్ గణేష్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టెన్ టివితో తీగల మాట్లాడారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆలయాల పునరుద్ధరణకు డబ్బులను ఖర్చు పెడుతారని పేర్కొన్నారు. అందుకనే బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకత ఏర్పడిందని చెప్పారు. గతంలో తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని దక్కించుకోవడం జరిగిందని, అనంతరం ఎమ్మెల్యే అయినట్లు గుర్తు చేశారు. ఈసారి వేలం పాటలో పాల్గొనడానికి కొంతమంది భక్తులు కొత్తగా తీగల కృష్ణారెడ్డి వచ్చారని తెలిపారు.

గణేష్ శోభాయాత్ర..
ఆదివారం తెల్లవారుజామున బాలాపూర్ గణష్ విగ్రహానికి ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో వినాయకుడిని ఎక్కించారు. గ్రామంలో నిర్వహించిన ఊరేగింపు బొడ్రాయి వద్దకు చేరుకుంది. అక్కడ లడ్డూ వేలం పాటను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 

ఇంటర్నెట్ వల్ల ఉత్తమమైన పాలన - మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్నారు. యాపిల్, మైక్రో సాప్ట్, గూగుల్ సీఈవోలతో ప్రధాన మంత్రి భేటీ అయ్యారు. ఇంటర్నెట్ సేవల వల్ల వేగమైన ఉత్తమమైన పరిపాలన అందించగలుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని మార్చే సత్తా సోషల్ మీడియాకు ఉందని, సోషల్ మీడియా సామాజిక అంతరాలను తగ్గిస్తోందన్నారు. మొబైల్ యాప్ లతో ప్రజలకు చేరువుగా ఉంటున్నట్లు, 500 రైల్వే స్టేషన్ లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే పాఠశాలలు, కళాశాలలను వైఫై తో అనుసంధానం చేస్తామని తెలిపారు. 

కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట..

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ వేలం పాట కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున పూజలు చేసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. 

పెన్నా, కుందూ నదుల్లో పెరిగిన వరద ప్రవాహం..

కడప : జిల్లాలోని కుందూ పెన్నా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. 

09:05 - September 27, 2015

హైదరాబాద్ : నగరంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నారు. ఈ గణేష్ ఉగ్రహాల ఊరేగింపు ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. ఈ యాత్ర హైదరాబాద్ నగరంలో శోభాయమానంగా జరుగుతోంది. గణేష్ ఉత్సవయాత్రను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది భక్తులు హైదరాబాద్ నగరానికి తరలి వచ్చారు. బాలాపూర్ గణేష్ విగ్రహానికి ఉదయమే పూజలు నిర్వహించి శోభాయాత్రను నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు క్రేన్ లు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకూ నిమజ్జనం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. అలాగే, ట్రాఫిక్ మార్పులు కూడా చేపట్టింది.

'బాహుబలి' గణేష్..
క్రేన్ నెంబర్ 1 వద్ద దాదాపు రకరకాల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. ఉదయం 9గంటలోపు 260 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిమజ్జనం చేసే సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో క్రేన్ కు నలుగురు సిబ్బందిని నియమించారు. నిమజ్జనం జీహెచ్ఎంసీ సిబ్బంది శుద్ధి చేస్తున్నారు. నగరం నుండి బయలుదేరిన విగ్రహాలు ఒకేసారి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడంతో భారీ రద్దీ నెలకొంది. అలాగే నగరంలో పలు ప్రధాన కూడళ్ల గణేష్ విగ్రహాల రాకతో సందడి నెలకొంది. 

09:00 - September 27, 2015

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ టెన్ టివికి వెల్లడించారు. చార్మినార్ ప్రాంతంలో ఆయన భద్రతను పర్యవేక్షించారు. సౌత్ జోన్ పరిధిలో సుమారు 4500 సిబ్బంది, 150 స్పెషల్ అధికారులు 12 మంది ఐపీఎస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర సాయిధ బలగాలు, ఏపీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో పికెట్లనుఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్కా మసీదు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇరువర్గాలతో తాము సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ సహకరించారని తెలిపారు. ఇతర వర్గాలు స్వాగత ఏర్పాట్లు చేసినట్లు, నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరుగుతుందన్నారు. సాయంత్రం ఆరు గంటల్లోగా విగ్రహాలు చార్మినార్ దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 500 సీసీ కెమెరాల నిఘా నీడన భద్రతను పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. నిమజ్జనం ఎలా జరుగుతుంది ? అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా ? ఎలాంటి పదార్థాలైనా ఉన్నాయా అనే దానిపై కంట్రోల్ టీం పరిశీలిస్తుందని డీసీసీ సత్యనారాయణ వెల్లడించారు. 

తిరుపతిని హెడ్ క్వార్టర్ చేయాలి - టీజీ..

చిత్తూరు : తిరుపతిని హెడ్ క్వార్టర్ చేయాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుమలకు రోప్ వే ఏర్పాటు చేయాలని కోరారు.

 

ఆర్టీసీ కండక్టర్ పై డ్రైవర్ అత్యాచారయత్నం..

నల్గొండ : దామచర్ల (మం) బాలెంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ మహిళా కండక్టర్ పై డ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. 

08:01 - September 27, 2015

ఈ మధ్య సినిమా వాళ్లు సినిమా మీద కంటే పబ్లిసిటీ మీద ఎక్కువ కష్టపడుతున్నారు. తమ ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగా రణదీప్ హుడా - రిచా చద్దాలు రచ్చ రచ్చ చేశారు. వీరి పబ్లిక్‌ రొమాన్స్ సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సినిమాల్లో నాయకా నాయికలు లిప్‌లాక్‌ చేస్తేనే రచ్చ చేస్తారు. అలాంటిది పబ్లిక్‌లో అదే సీన్‌ రిపీటైతే.. ఇంకేమైనా ఉంటుందా.. పైగా మీడియా ముందు.. ఇంకేముంది.. రచ్చరచ్చే. 'మై ఔర్‌ చార్లెస్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రిచా, రణదీప్‌లు లిప్‌లాక్‌తో స్టేజ్‌ రొమాన్స్ చేయడం చూసి మీడియా షాకైంది. కొద్దిసేపు తర్వాత.. సినిమాలో మా పాత్రలు కూడా ఇంత బోల్డ్ గా ఉంటాయని, ఆ పాత్రల తీరుతెన్నులు ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశామంటూ చాలా స్మూత్‌గా రిచా కవర్‌ చేసింది.

07:56 - September 27, 2015

దుల్కర్‌ సల్మాన్‌, నిత్యా మీనన్‌ జంటగా అన్వర్‌ రషీద్‌ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కి మంచి విజయం సాధించిన 'ఉస్తాద్‌ హోటల్‌' చిత్రాన్ని నిర్మాత సురేష్‌ కొండేటి 'జతగా..' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో దుల్కర్‌, నిత్యా మీనన్‌ల జంటకు విమర్శకుల ప్రశంసలందాయని తెలిపారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని. ఇటీవల 'ఓకే బంగారం' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ జంట మరోసారి 'జతగా..' రాబోతున్నారని పేర్కొన్నారు. ఈ చిత్రం మలయాళంలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా, ఉత్తమ సంభాషణలు, ఉత్తమ నటుడు విభాగంలో మూడు జాతీయ అవార్డులను గెలుచుకుందన్నారు. లవ్‌, సెంటిమెంట్‌, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం తదితర అంశాల సమాహారంతో రూపొందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. 

ట్యాంక్ బండ్ పై బారులు తీరిన గణనాథులు..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి గణనాథులు బారులు తీరారు. నేడు వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

07:43 - September 27, 2015

హైదరాబాద్ : శివారు గ్రామం బాలాపూర్ వినాయకుడి లడ్డూను ఈ సారి వేలంపాటలో ఎవరు సొంతం చేసుకోబోతున్నారు ? అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లడ్డూల వేలంపాట అంటేనే బాలాపూర్ లడ్డు గుర్తొస్తుంది. ఈ లడ్డూ వేలం పాట ప్రతిసారి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది దక్కించుకున్న వారి దశ తిరిగినట్లేనని భక్తుల నమ్మకం. అందుకే ఈ పోటీలో చాలా మంది పాల్గొంటారు.

1994 వేలం ప్రారంభం..
1994 నుండి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కి సొంతం చేసుకున్నారు. దానిని కొంత ఇంట్లో వారు తిని మరికొంత బంధువులకు పంచి మిగిలింది తన పొలంలో చల్లారు. అప్పటి నుండి తన పంటల దిగుబడి పెరిగిందని ఆయన నమ్మకం. ఆ తరువాత ఏడాది నుండి వరసగా 17 ఏళ్లు స్థానికులే ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్ధన్ రెడ్డి ఈ లడ్డూను రూ.7.50 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తన తండ్రి చివరి కోరిక మేరకు లడ్డూను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 2014లో మాజీ మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నందుకే తాను ఎమ్మెల్యేనయ్యానని ఆయన భావిస్తున్నారు. మరి ఈ సారి ఎవరు సొంతం చేసుకుంటారో ? వేచి చూడాలి.
 

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ.450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ.4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ.18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ.66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ.85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ.2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ.4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ.5, 45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ.9,50,000.00
2015       ? ? ?          ? ? ?
07:24 - September 27, 2015

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల భజనల మధ్య ఆ యాత్ర కొనసాగుతోంది. గణేష్ ను చూడటానికి సమీప గ్రామాల వారే కాక ఇతర ప్రాంతాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుండి ఊరేగింపు ప్రారంభమైన తరువాత ఇతర వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఆదివారం ఉదయం తెల్లవారుజామునే వినాయకుడికి పూజలు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన వాహనంపైకి వినాయకుడిని ఎక్కించి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. బొడ్రాయి వద్దకు చేరుకున్న అనంతరం లడ్డూ వేలం పాటను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న విద్యాచరణ్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు టెన్ టివితో మాట్లాడారు. భద్రతలో ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్ పె క్టర్లు, నలుగురు ఎస్ఐ లు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడి నుండి నిమజ్జనానికి బయలుదేరిన అనంతరం అక్కడి పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని చెప్పారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బును సహాయక కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ది, పురాతన ఆలయాల పునరుద్ధరణ, స్కూళ్లను బాగు చేయడం, హుదూద్ తుపాన్ బాధితులకు సహాయం చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం లడ్డూ వేలం పాటలో ఒక ఎన్ఆర్ఐ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ లడ్డూను అందించే ఉమా మహేశ్వరరావు లడ్డూను దక్కించుకున్న వారికి రెండు కిలోల వెండి పాత్ర కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. 

07:18 - September 27, 2015

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు భారీగా ప్రజలు పోటెత్తారు. ఆదివారం వినాయక నిమజ్జనం జరుగనుంది. దీనితో ఉదయం నుండే వినాయకుడిని దర్శించుకొనేందుకు పలు ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇందుకు పోలీసులు, గణేష్ ఉత్సవ కమిటీ పలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు మధుకర్ యాదవ్ మాట్లాడారు. మధ్మాహ్నాం రెండు గంటల వరకు గణేష్ ను సందర్శించుకునేందుకు భక్తులకు అనుమతినివ్వడం జరుగుతుందన్నారు. అంతకంటే ముందు ఉదయం 11గంటలకు మాజీ మంత్రి దానం నాగేందర్ కలశ పూజ చేస్తారన్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమౌతాయని చెప్పారు. ఈ వినాయక లడ్డూను అందరికీ పంచడం జరుగుతుందని తెలిపారు. 

06:38 - September 27, 2015

హైదరాబాద్ : బాలాపూర్ గణేష్ వద్ద నిమజ్జన సందడి నెలకొంది. ఆదివారం తెల్లవారుజామునుండే పూజలు ప్రారంభించారు. నిమజ్జనానికి పోలీసులు, నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో గొడ్రాయి వద్దకు చేరుకోగానే లడ్డూ వేలం పాటను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్వాహకుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. బాలాపూర్ గణేష్ కు పేరు, ప్రఖ్యాతలున్నాయని, ఇక్కడ గణేషుడు ఊరేగింపు ప్రారంభమైన తరువాతే ఇతర వినాయక విగ్రహాలు ఊరేగింపు జరుగుతుందన్నారు. ఉదయం 9.30గంటల నుండి లడ్డూ వేలం పాట ప్రారంభమౌతుందని చెప్పారు.

సంతోషంగా ఉంది - జైహింద్..
లడ్డూను వేలం పాటలో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని గతంలో వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న జైహింద్ పేర్కొన్నారు. తాను ఇచ్చిన డబ్బుతో నిర్వాహకులు ఆలయాలు కట్టించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించదన్నారు. లడ్డూను దక్కించుకోవడం ద్వారా తనకు ఆర్థికంగా..ఆరోగ్యంగా బాగుందని పేర్కొన్నారు.

లడ్డూ వేలం..
గణపతి లడ్డూ అనగానే ముందు గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూనే. గణపతి నవరాత్రుల సందర్భంగా లడ్డూను వేలం పాట వేయాలన్న ఆలోచన ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకే ఈ లడ్డూ అంటే అంత క్రే జ్‌ . ఇలా సమకూరిన డబ్బును గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ వస్తున్నారు. అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను దక్కించుకున్న వాళ్లకు మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంత వ్యయం చేయడానికైనా ప్రజలు వెనుకాడటం లేదు. 1994లో కేవలం రూ. 450తో ప్రారంభమైన వేలం నేడు లక్షల రూపాయలకు చేరుకుంది. ఇంత మొత్తం పెట్టి పాడిన లడ్డూను పాటదారులు తమ కుటుంబీకులకు, బంధువులకు, గ్రామస్థులకు పంచి పెడుతుంటారు. పంట పొలాల్లో చల్లుతారు.

06:29 - September 27, 2015

హైదరాబాద్ : కొండంత అండ ఆయన. పేదల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహా వ్యక్తి ఆయన...ఆయనే మన కొండా లక్ష్మణ్‌ బాపూజీ. నేడు ఆయన శత జయంతి సందర్భంగా 10 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజా జీవితంలో ఉండి వారి అభ్యున్నతే తన అభ్యున్నతిగా భావించి పనిచేసిన కార్యశీలి బాపూజీ. తన, పరాయి బేధం లేకుండా అన్యాయాన్ని ఎదిరించి...దౌర్జన్యాలను ప్రశ్నించారు. సమస్త ఉద్యమాలకు చిరునామాగా నిలిచారు. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, సహకార ఉద్యమం, దళిత బహుజన ఉద్యమాలకు అండగా, జెండాగా నిలిచారాయన. 16 ఏళ్ల చిరుప్రాయంలో మొదలుపెట్టిన ఉద్యమ జీవితాన్ని 97 ఏళ్ల పండువయసులో ముగించారు. జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. తుదిశ్వాస విడిచేవరకూ తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడారు. నైజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు రాష్ట్ర రాజకీయాల్లో బాపూజీ తనదైన ముద్ర వేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో జననం..
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో కొండా లక్ష్మణ్ 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. బాపూజీ 1938లో హైదరాబాద్‌లో 10వ తరగతి పూర్తి చేశారు. తన 25వ ఏట న్యాయవాదిగా పట్టా పొందారు. జాతీయోద్యమ ప్రభావంతో గాంధేయవాదిగా మారారు. 1940లో ఆంధ్రమహాసభలో చేరారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్టాఫీస్‌, కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీలపై జాతీయజెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధితులైన నేతలకు ఉచిత న్యాయ సహాయం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిక..
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 1967లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డిల మంత్రివర్గాలలో పనిచేశారు. తొలినాళ్లలో సమైక్యవాదిగా విశాలాంధ్ర ఆవిర్భావానికి మద్దతునిచ్చారు. ముల్కీ నిబంధనల అమలులో వైఫల్యం, ప్రాంతాల మధ్య ఆర్థిక ఆంతరాలను స్వయంగా ఎదుర్కొన్న బాపూజీ తన అభిప్రాయాలను మార్చుకుని 1969లో మంత్రిపదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వం ఆయనను రాజమండ్రి జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదల అయిన అనంతరం 1972లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం విశేష కృషి చేశారు. రాంకోఠిలో 1947లోనే పద్మశాలి భవన్‌ నిర్మాణానికి ఆయన పాటుపడ్డారు.

ధీశాలి బాపూజీ...
90 ఏళ్ల వయసులో గల్లి నుంచి ఢిల్లీ వరకు..గ్రామస్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఎంతో మందితో కలిసి పనిచేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు తన జలదృశ్యంను వేదికగా చేశారు. 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ బాపూజీ ఇంట్లోనే పుట్టింది. అయితే ప్రత్యేక తెలంగాణ కల సిద్ధించినా...దాన్ని కళ్ల చూడకుండా 2012 సెప్టెంబర్‌ 27న బాపూజీ కన్నుమూశారు. సామాజిక న్యాయం కోసం, మండల్‌ కమీషన్‌ అమలు కోసం, నేతన్నల ఆకలి చావుల నివారణ కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమాలు నడిపిన ధీశాలి బాపూజీ. 

06:25 - September 27, 2015

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని శంకుస్ధాపనకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి శంకుస్థాపనకు భారత, సింగపూర్‌ ప్రధానమంత్రులతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి హాజరవుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు సింగపూర్‌ ప్రధాని లీహసన్‌ లూంగ్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి రానుండడంతో కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో..కృష్ణానది ముఖద్వారం ఆనుకొని సీడ్ క్యాపిటల్ పరిధిలో శంకుస్ధాపన జరపాలనీ ప్రభుత్వం భావిస్తోంది. తీరానికి చేరువలో 50 ఎకరాల సువిశాల స్థలంలో 50వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
అమరావతి శంకుస్ధాపనకు అవసరమైన మట్టిని రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల నుండి సేకరించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల ప్రజలు..తమ గ్రామాల్లోని మట్టిని..కలశంలో తీసుకొని శాస్త్రోక్తంగా పూజలు జరిపి రాజధాని శంకుస్ధాపనకు తీసుకురావాలనీ సర్కార్ పిలుపునివ్వనుంది. ఈ తంతు పూర్తిచేసే బాధ్యతను ఆయా గ్రామాల సర్పంచులకే అప్పచెప్పింది. ఇలా చేస్తే రాజధాని ప్రాంతంలోని ప్రజలందరినీ శంకుస్ధాపన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అమరావతి శంఖుస్ధాపన కార్యక్రమాన్ని ఓ ఉత్సవాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 22న విజయదశమి కావడంతో..దేవీ శరన్నవరాత్రులతో పాటు..అమరావతి పరిధిలో కూడా 9రోజుల పాటు వేడుకలు జరపాలని నిర్ణయించింది. దాంతో పాటు..రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అమరావతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.

భారీ భద్రతా ఏర్పాట్లు..
ఇక శంకుస్ధాపనకు భారీగా ప్రజలు తరలివస్తారనీ భావిస్తున్న ప్రభుత్వం..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రముఖ కన్సల్టెన్సీకి పనులు అప్పచెప్పాలని భావిస్తోంది. ఆహ్వాన పత్రిక మొదలుకొని సాంస్ర్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా వంటి కార్యక్రమాలన్నీ కన్సల్టెన్సీనే చూసుకుంటుంది. వీఐపీలు కూర్చునేందుకు భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సింగపూర్‌, జపాన్‌, చైనా, అమెరికా దేశాల నుంచి వీఐపీలు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

చరిత్రలో నిలిచిపోయేలా ..స్ర్మృతి చిహ్నం..
ఇక..శంకుస్ధాపన జరిగే ప్రాంతాన్ని చరిత్రలో నిలిచిపోయేలా..స్ర్మృతి చిహ్నంగా ఉండేలా ఏపి సర్కార్‌ జాగ్రత్త పడుతోంది. అమరావతి శిల్పకళ, బుద్దిజాన్ని విశ్వవ్యాపితం చేయడం వంటి మహత్తర ఘట్టాలను కళ్లకు కట్టేలా చిహ్నాన్ని రూపొందించనుంది. అలాగే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పేర్లను వేదిక ప్రాంగణంలో అమరద్వారం పేరుతో నిర్వహించే ఎగ్జిబిషన్‌లో రాసి ప్రదర్శించాలనీ సర్కార్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.

06:22 - September 27, 2015

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిమజ్జనానికి సిద్ధమయ్యారు గణనాథులు. మహా నిమజ్జనం నేటి నుంచి రేపు ఉదయం వరకూ కొనసాగబోతోంది.. శుభ్రతతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు అధికారులు. గణేశ్ శోభాయాత్రను ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు ఇప్పటికే మరమ్మత్తులు పూర్తి చేశారు జీహెచ్ఎంసీ అధికారులు ఇందుకోసం దాదాపు 10కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక నిమజ్జనం జరిగే చెరువులతోపాటు. యాత్రా మార్గాల్లో భారీగా లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

హుస్సేన్ సాగర్‌ దగ్గర 24 క్రేన్లు రెడీ..
గ్రేటర్‌ పరిధిలో ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌కు భారీగా విగ్రహాలు తరలివస్తాయి. ఇక కాప్రా, సరూర్‌నగర్‌, దుర్గం చెరువు తదితరప్రాంతాల్లో నిమజ్జనం జరగనుంది.. ఈ కార్యక్రమంకోసం 42క్రేన్లు రెడీగా ఉంచారు.. ఒక్క హుస్సేన్‌ సాగర్‌దగ్గరే 24క్రేన్లు సిద్ధంగా ఉన్నాయి. అటు శోభాయాత్రలో చెత్త తొలగింపు కోసం 180 గణేశ్ యాక్షన్‌ టీంలు రంగంలోకి దిగబోతున్నాయి. ఇందులో ఒక సూపర్‌వైజర్‌, ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు మరో 21మంది సభ్యులున్నారు. 5వేల 793మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయబోతున్నారు. ఇక 357 కిలోమీటర్ల పొడవునా నిర్వహించబోయే యాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వ్యర్థాల తొలగింపు కోసం 41టన్నుల సామర్థ్యం గల 25వాహనాలు, 25టన్నుల సామర్థ్యంగల 114 వాహనాలు, 14 జేసీబీలు సిద్ధం చేశారు. అలాగే 30 మొబైల్ టాయ్‌లెట్స్ ఏర్పాటుచేశారు. నిమజ్జనం సమయంలో విద్యుత్‌ అంతరాయం కలగకుండా 23వేల 353 ప్రత్యేక లైట్లను సెట్టింగ్‌ చేశారు. నిమజ్జనం ఈ నెల 28 ఉదయం వరకూ జరిగే అవకాశం ఉంది.. అప్పటివరకూ జీహెచ్ఎంసీ సిబ్బంది విధుల్లోనే ఉంటారు.

101 తాగునీటి క్యాంపులు..
శోభాయాత్రకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ వాటర్‌ బోర్డు 101 తాగునీటి క్యాంపులు రెడీగా ఉంచింది. దాదాపు 30లక్షల వాటర్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే రోడ్లపై మురుగును శుభ్రపరిచేందుకు 32 ఎయిర్‌టెక్‌ మిషన్లు, 162మంది సిబ్బంది ఉన్నారు. ఈ నిమజ్జనం కోసం 900మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచింది వాటర్‌ బోర్డు. హుస్సేన్‌ సాగర్‌లో చేరే వ్యర్థాలపై హెచ్ఎండీఏ దృష్టి పెట్టింది. ఇప్పటివరకూ 750 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తొలగించింది. గత ఏడాదికంటే ఈసారి వాటర్‌ లెవల్‌ తగ్గిపోవడంతో విగ్రహాలు నీటిలో మునగడంలేదు. అందుకే వెంటవెంటనే విగ్రహాల శిధిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 18 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. భారీ వర్షాలతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారకుండా చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమలక్ష్యమని ప్రకటించారు.

నిమజ్జనం సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు..

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం సందర్భంగా 23వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 27 కంపెనీల కేంద్ర బలగాలు, 1,761 మంది ఏపీ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఛత్తీస్ గఢ్ పోలీసులనూ కూడా బందోబస్తులో వినియోగించనున్నారు. ఊరేగింపు ప్రాంతాల్లో 400సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఒకేసారి 64 సీసీ కెమెరాల ద్వారా దృశ్యాలను చూసేలా ఏర్పాట్లు చేశారు.

 

వచ్చే నెలలో సీపీఎం ప్లీనరీ సమావేశాలు..

హైదరాబాద్ : వచ్చే నెలలో సీపీఎం ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. 25-26వ తేదీల్లో నాగార్జున సాగర్ లో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

 

న్యూయార్కులో జీ-4 దేశాల సదస్సు..

న్యూయార్కు : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణల దిశగా ఒత్తిడి తెచ్చే అంశంపై భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలు చర్చలు జరిపాయి. వాతావరణ మార్పు, ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లుగా మారాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని, సంస్కరణలు అత్యంత అవశ్యకరమన్నారు.

 

రంగారెడ్డిలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి..

రంగారెడ్డి : బషీరాబాద్ (మం) నవంద్గిలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల మంజుల (20), ఉమాదేవి (45), చిన్నమ్మ (65) గా గుర్తించారు.

 

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు బయటకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చే భక్తులకు 8గంటల సమయం పడుతోంది. 

చిట్యాల తహశీల్దార్ ఆత్మహత్య..

వరంగల్ : హన్మకొండ ప్రగతి నగర్ లో చిట్యాల తహశీల్దార్ శ్రీనివాస్ (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. శ్రీనివాస్ కు భార్య, ఏడాదిన్నర చిన్నారి ఉన్నారు. గతంలో శ్రీనివాస్ కానిస్టేబుల్ గా కూడా పని చేశాడు. శ్రీనివాస్ ది కరీంనగర్ జిల్లా గంగాధర (మం) వధిర. ఘటనాస్థలాన్ని ఏఎస్పీ యాదయ్య సందర్శించారు.

Don't Miss