Activities calendar

28 September 2015

21:38 - September 28, 2015

హైదరాబాద్ : ఎదురు తిరిగిన ప్రతివారిపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పాలకుర్తి వివాదంలో అరెస్టైన ఎర్రబెల్లి.. బెయిల్‌పై విడుదలయ్యారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా భయపడేది లేదని అన్నారు..

పాలకుర్తి మార్కెట్ యార్డు ప్రారంభోత్సవ సందర్భంగా .....

పాలకుర్తి మార్కెట్ యార్డు ప్రారంభోత్సవ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో అరెస్టైన టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు బెయిల్‌పై విడుదలయ్యారు. ఎర్రబెల్లికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేసింది. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందన్న ఎర్రబెల్లి తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది.

భావోద్వేగానికి లోనయిన ఎర్రబెల్లి...

విడుదలైన అనంతరం కార్యకర్తలతో మాట్లాడిన ఎర్రబెల్లి.. భావోద్వేగానికి లోనయ్యారు. తనపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదన్న ఎర్రబెల్లి.. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు.

అసెంబ్లీకి రాకుండా చేసేందుకు కేసీఆర్‌ కుట్ర.....

తనను అసెంబ్లీకి రాకుండా చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజామోదం లేకుండా మంత్రిగా కొనసాగుతున్న కడియం.. దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్‌ చేశారు. శృతి, విద్యాసాగర్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేసీఆర్‌, కడియంను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరిపై.. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని ఎర్రబెల్లి చెప్పారు. ఇదిలాఉంటే.. రేపటి నుంచి కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలను ఈ అరెస్టు అంశం హీటెక్కించే అవకాశం కనిపిస్తోంది.

21:31 - September 28, 2015

విశాఖ : చిట్టి చిట్టి అడుగులతో చిందులేసిన ఆ చిన్నారి జాడ ఇంకా తెలియలేదు. గులాబీలా నవ్వులు రువ్విన ఆ చందమామ ఎక్కడుందో కనపడలేదు. ఇంకా ఆశ మిణుకు మిణుకు మంటోంది. నాలుగురోజుల నిరీక్షణకు ఇంకా ఫలితం దక్కలేదు. ఎక్కడో తమ చిట్టితల్లి బతికే ఉందని కన్నతండ్రి నమ్ముతున్నారు. విశాఖ నగరాన్ని చుట్టుముట్టిన ఈ విషాదానికి అంతమెప్పుడో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది.

అదితి బతికే ఉండవచ్చని ఆమె తండ్రి శ్రీనివాస్‌ ఆశాభావం......

విశాఖ డ్రైన్లో గల్లంతైన చిన్నారి అదితి బతికే ఉండవచ్చని ఆమె తండ్రి శ్రీనివాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించిన వారికి రివార్డ్‌ ఇస్తామన్నారు. అదితి ఆచూకీ దొరక్క పోవడంతో.. విశాఖలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

శృతికి ఓయూ విద్యార్థుల నివాళి...

హైదరాబాద్ : ఎన్ కౌంటర్ లో చనిపోయిన శృతికి ఓయూ విద్యార్థులు నివాళి అర్పించారు. అందులో భాగంగా లేడీస్ హాస్టల్ నుంచి ఎన్ సీపీ గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

గురుడ వాహనంపై ఊరేగిన శ్రీవారు...

తిరుమల :నేడు పౌర్ణమి సందర్భంగా శ్రీవారు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతున్న భక్తులకు దర్శనమిస్తున్నారు. మలయప్పస్వామిగా పిలవబడే గోవిందుడిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో విచ్చేశారు. తిరుమలలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. స్వామి వారి ఊరేగింపు సమయంలో కూడా వర్షం పడుతుండడంతో వానలోనే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

అసెంబ్లీ పరిధిలో ర్యాలీలు, సభలు నిషేధిస్తూ ఉత్తర్వులు..

హైదరాబాద్వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో సభలు, ర్యాలీలు నిషేధిస్తూ సీపీ మహేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. కాగా, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. మరోవైపు తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు అన్నీ హైకోర్టు ఆశ్రయించాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది.  

19:50 - September 28, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్య 150గానే ఖరారు చేస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో 200కు పెంచాలని పునర్విభజన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అయితే కొత్త నిర్ణయంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో గ్రేటర్‌ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే హైకోర్టు నవంబర్‌ 2 లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశమిచ్చింది.

 

19:48 - September 28, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో రేపటి నుంచే అసలైన వార్‌...ప్రభుత్వాన్ని ఎన్‌కౌంటర్‌ చేసేందుకు సిద్ధమవుతున్న విపక్షం... ధీటుగా కౌంటర్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్న అధికార పక్షం... ఇలాంటి కీలక సమయంలో సమర్థంగా వ్యవహరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. వెనక్కి తిరిగి చూసుకుంటోంది. ప్రాజెక్టుల రీడిజైన్‌ అంశంలో ఏ స్టాండ్‌ తీసుకోవాలి..? సభలో ఎలా వ్యవహరించాలి..? అన్న అంశంలో కాంగ్రెస్‌ తర్జనభర్జన పడుతోంది. దూకుడు మంత్రం పఠించాలని ఒకరంటే.. డిఫెన్సే మేలంటున్నారు మరొకరు.

రైతు ఆత్మహత్యలతోపాటు.....

రైతు ఆత్మహత్యలతోపాటు, ప్రాజెక్టుల రీ-డిజైన్ అంశాలపై సభలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీ-కాంగ్ నేతల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయించినా.. ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో మాత్రం తలో మాట మాట్లాడుతున్నారు.

సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం.....

గత పాలకులు తెలంగాణలో సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం చేశారు. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టుల జేబుల నింపడానికే ప్రయత్నించారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం.. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వ వాదన. ఈ వాదనను కాంగ్రెస్‌లోని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి సర్కారు వాదనతో ఏకీభవిస్తున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా.. రీడిజైన్ పై ముందూ వెనకా చూసుకుని స్పందిస్తే మంచిదనేలా మాట్లాడారని సమాచారం. అయితే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాత్రం.. రీడిజైన్ విషయంలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పేరుతో కమీషన్ల దందాకు కేసీఆర్ సర్కార్ తెరలేపిందని విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు.

ఈ రెండిట్లో ఏ వాదనను.....

అయితే.. ఈ రెండిట్లో ఏ వాదనను అసెంబ్లీలో వినిపించబోతున్నారన్నదే క్లారిటీ లేకుండా పోయింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. కొన్ని పనులు పూర్తయ్యాయి కూడా.. ఇందులో ముఖ్యమైనది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. అయితే.. ఈ ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టులను కూడా రీడిజైన్‌ చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

ప్రాజెక్టు డిజైన్‌ మార్చడం వల్ల రంగారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం ....

అయితే.. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్చడం వల్ల రంగారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆ జిల్లా కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచే నిరసన తెలుపుతున్నారు. ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తామని సీఎం ప్రకటించిన మరుసటి రోజే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కమీషన్ల కోసమే రీడిజైనింగ్‌ అంటున్నారని ఆరోపించారు. కానీ.. రీడిజైనింగ్‌పై పార్టీలో మొదట్లో వ్యక్తమైన వ్యతిరేకత.. రాను రానూ తగ్గిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పార్టీ వైఖరి ఖరారు కాకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం...

ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ.. రీడిజైన్‌ అంశంపై పార్టీ వైఖరి ఖరారు కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇటు మండలి అటు శాసనసభలో ఈ విషయం చర్చకు వస్తే.. ఎలా అన్న అంతర్మథనం కాంగ్రెస్‌ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే.. ప్రధాన ప్రతిపక్షం గందరగోళ స్థితి అధికార పక్షానికి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి, రీ డిజైన్‌ అంశంపై కాంగ్రెస్‌ ఏ స్టాండ్‌ తీసుకుంటుంది..? అసలు స్టాండ్‌ అనేది ఉంటుందా..? ఉండదా..? అన్న విషయాలకు సమావేశాల తర్వాతే స్పష్టత రానుంది.

19:42 - September 28, 2015

హైదరాబాద్ : పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారు. మానవత్వం మరచిపోయి.. ఓ అమ్మాయిపై దుర్భాషలాడారు. అందరూ చూస్తుండగా చేతులకు పనిచెప్పారు. దెబ్బ మీద దెబ్బ. చితగ్గొట్టారు. తర్వాత ఓవైపుకు లాగి పడేశారు. ఈ దృశ్యాలకు ముంబై వేదికైంది. ఇక.. అమ్మాయిపై చేయి చేసుకుంది మహిళా పోలీసులు కావటం ఆశ్చర్య కలిగిస్తోంది. ముంబైలో అత్యంత రద్దీగా వుండే లాల్‌బాగ్‌లో... వినాయక నిమజ్జనం సందర్భంగా ఇది జరిగినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లో వెళ్లకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఆ యువతి ప్రవర్తించినందువల్లే.. అలా వ్యవహరించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించిన ఈ దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక వెబ్‌సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్‌... ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.  

సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

గుంటూరు:సత్తెనపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 22నురాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ సర్కార్

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయనున్న అక్టోబర్ 22ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేయనున్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటుగా దేశ విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.

కారు బోల్తా : ఇద్దరుమృతి

మహబూబ్‌నగర్: జిల్లాలోని అడ్డాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తాపడిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దరిని కర్నూలువాసులుగా గుర్తించారు. 

అసోంలో పడవ ముగిని 25 మంది గల్లంతు

హైదరాబాద్ : అసోంలోని కామ్ రూప్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని కలహి నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది గల్లంతైనట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న నేషన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పడవలో దాదాపు 200 మంది ఉన్నట్టు భావిస్తున్నారు.  

పిచ్చికుక్కల దాడిలో నలుగురికి గాయాలు...

కరీంనగర్ :జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వేములగుర్తిలో పిచ్చికుక్కలు గ్రామస్థులపై దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

మహబూబ్‌నగర్‌: జిల్లాలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని అడ్డాకులలో హైవేపై అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

18:43 - September 28, 2015

హైదరాబాద్ : భూమిని కోల్పోయిన వాళ్లకు భూమి ఇస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వాళ్లకు మరోచోట ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. కానీ...ఏళ్లు గడుస్తున్నా..ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా..కాదు పొమ్మంటున్నారు. ఇదీ శ్రీశైలం ముంపు బాధితుల ఆవేదన. శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

శ్రీశైలం ముంపు బాధితుల కష్టాలు ......

శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా...ప్రభుత్వాలు మారుతున్నా శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరగడంలేదు. ఇదే విషయంపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్జాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక రౌండ్‌సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వీరంతా ముక్తకంఠంతో బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు-రావుల .....

1986లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని..ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీనిస్తూ..జీవో నెంబర్‌ 98, 99ని విడుదల చేశారు. అయితే ఇప్పటికీ శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరగడంలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 3 నియోజకవర్గాలైన కొల్లాపూర్‌, వనపర్తి, అలంపూర్‌లు పూర్తిగా ముంపుకు గురయ్యాయని..ఇప్పటికి ఆయా నియోజకపరిధిలోని 67 గ్రామాల ప్రజలకు న్యాయం జరగలేదని టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌ ఆరోపిస్తున్నారు.

ముంపు బాధితుల జీవితాల్లో చీకట్లు.....

వెయ్యిమెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు పాలమూరు వాసులు ముందుకొచ్చినా...ఇప్పటికి వారి జీవితాల్లో వెలుగులు నిండకుండా చీకట్లలోనే మగ్గుతున్నారని మేధావులు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లనుంచి ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా..న్యాయం జరగలేదని ప్రొఫెసర్‌ హరగోపాల్ అన్నారు. నేతల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నా...పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ముంపు బాధితులు భిన్న రూపాల్లో ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి..శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

18:38 - September 28, 2015

విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయినాథ్ కెమికల్స్‌లో భారీ పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

18:36 - September 28, 2015

కృష్ణా : విజయవాడలో రోడ్ల విస్తరణకు బాలరిష్టాలు తప్పడం లేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా పరిస్థితి మారింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో... అధికారులు భూసేకరణ సర్వే పనుల్లో జోరుపెంచినా.. గృహ యజమానులు వారి స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నారు. భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ ......

రాజధాని ప్రాంతం కావడంతో బెజవాడలో ట్రాఫిక్‌ అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న వాహన రద్దీని తట్టుకోవడానికి రోడ్లను విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ లేదా జెఎన్ఎ న్ యుఆర్ ఎం ఇళ్లు మంజూరు చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై గృహ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ, సీఆర్డీఏ అధికారులు తమ పరిధిలోని రోడ్లకు నష్టపరిహారంగా నగదు చెల్లిస్తామనడంతో... ఇదే విధానాన్ని నగరపాలక సంస్థ పాటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల విధానం ఏంటో చెప్పకపోతే... ఎట్టిపరిస్థితుల్లో స్థలం ఇచ్చేది లేదని చిట్టినగర్, ఎర్రకట్ట జంక్షన్ ప్రాంతవాసులు తెగేసి చెబుతున్నారు.

96.32 కోట్లతో 46.23 కి.మీ. మేర 14 రోడ్ల విస్తరణ.......

నగరంలో 14 రోడ్లను 46.23 కిలోమీటర్ల మేర 96.32 కోట్లతో విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కొన్ని ప్రాంతాల్లో పనుల్ని చేపట్టారు. కనకదుర్గా ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు 15 రహదారుల్ని 18.66 కోట్లతో విస్తరించాలని నిర్ణయించారు. స్థల సేకరణ సమస్యగా మారడంతో అధికారులకు ఈ వ్యవహరం తలనొప్పిగా మారుతోంది. స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో..నగర పాలక సంస్థ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.  

18:33 - September 28, 2015

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని శంకుస్ధాపనకు సమయం దగ్గరపడుతుండటంతో...ఏర్పాట్లలో మునిగిపోయింది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే..ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటు సింగపూర్‌ ప్రధాని లీహసన్‌ లూంగ్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి రానుండడంతో కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో..కృష్ణానది ముఖద్వారం ఆనుకొని సీడ్ క్యాపిటల్ పరిధిలో శంకుస్ధాపన జరపాలనీ ప్రభుత్వం భావిస్తోంది. తీరానికి చేరువలో 50 ఎకరాల సువిశాల స్థలంలో 50వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

29 గ్రామాల నుంచి మట్టి సేకరణ .....

అమరావతి శంకుస్ధాపనకు అవసరమైన మట్టిని రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల నుండి సేకరించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల ప్రజలు..తమ గ్రామాల్లోని మట్టిని..కలశంలో తీసుకొని శాస్త్రోక్తంగా పూజలు జరిపి రాజధాని శంకుస్ధాపనకు తీసుకురావాలనీ సర్కార్ పిలుపునివ్వనుంది. ఈ తంతు పూర్తిచేసే బాధ్యతను ఆయా గ్రామాల సర్పంచులకే అప్పచెప్పింది. ఇలా చేస్తే రాజధాని ప్రాంతంలోని ప్రజలందరినీ శంకుస్ధాపన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అమరావతి శంఖుస్ధాపన కార్యక్రమాన్ని ఓ ఉత్సవాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 22న విజయదశమి కావడంతో..దేవీ శరన్నవరాత్రులతో పాటు..అమరావతి పరిధిలో కూడా 9రోజుల పాటు వేడుకలు జరపాలని నిర్ణయించింది. దాంతో పాటు..రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అమరావతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.

ప్రముఖ కన్సల్టెంట్‌కు పనులు అప్పగింత .....

ఇక శంకుస్ధాపనకు భారీగా ప్రజలు తరలివస్తారనీ భావిస్తున్న ప్రభుత్వం..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రముఖ కన్సల్టెన్సీకి పనులు అప్పచెప్పాలని భావిస్తోంది. ఆహ్వాన పత్రిక మొదలుకొని సాంస్ర్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా వంటి కార్యక్రమాలన్నీ కన్సల్టెన్సీనే చూసుకుంటుంది. వీఐపీలు కూర్చునేందుకు భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. . సింగపూర్‌, జపాన్‌, చైనా, అమెరికా దేశాల నుంచి వీఐపీలు వస్తుండడంతో..భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

చరిత్రలో నిలిచిపోయేలా ..స్ర్మృతి చిహ్నం ......

ఇక..శంకుస్ధాపన జరిగే ప్రాంతాన్ని చరిత్రలో నిలిచిపోయేలా..స్ర్మృతి చిహ్నంగా ఉండేలా ఏపి సర్కార్‌ జాగ్రత్త పడుతోంది. అమరావతి శిల్పకళ, బుద్దిజాన్ని విశ్వవ్యాపితం చేయడం వంటి మహత్తర ఘట్టాలను కళ్లకు కట్టేలా చిహ్నాన్ని రూపొందించనుంది. అలాగే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పేర్లను వేదిక ప్రాంగణంలో అమరద్వారం పేరుతో నిర్వహించే ఎగ్జిబిషన్‌లో రాసి ప్రదర్శించాలనీ సర్కార్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.

18:31 - September 28, 2015

కర్నూలు : జూపాడుబంగ్ల పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. లింగాపురానికి చెందిన పుల్లన్న.. పీఎస్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సారాయి కేసులో పోలీసులు ఆదుపులోకి కోవడంతో మనస్థాపం చెందిన పుల్లన్న.. పురుగుల మందు తాగాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. పుల్లన్న చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు.. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పుల్లన్న మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

18:29 - September 28, 2015

గుంటూరు : చిలకలూరిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మురికిపూడి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి తల్లికూతుర్లు మృతి చెందారు. కొమ్మనబోయిన నాగమణి.. తన ఐదేళ్ల కూతురుతో కలిసి పొలం పనులకు వెళ్లింది. నాగమణి పొలం పనులు చేసుకుంటుండగా.. కూతురు బావిలో పడబోయింది. ఇది చూసిన తల్లి.. కూతుర్ను కాపాడబోయి బోరుబావిలో జారి పడిపోయింది. భార్య కూతరు మరణించడంతో భర్త బోరున విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

18:21 - September 28, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీష్‌రావులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌ యార్డుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గతేడాది 24 కేంద్రాల ద్వారా 56 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు.....

గతేడాది సీసీఐ ఆధ్వర్యంలో 24 కేంద్రాలు ఏర్పాటు చేసి 56 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా.. ఈసారి కూడా 24 కేంద్రాలు మంజూరయ్యాయి. గతంలో జరిగిన మోసాలు, అక్రమాలు తిరిగి జరగకుండా ఉండేందుకు ఈసారి మార్కెట్‌ యార్డుల్లోనే పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 1 నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇక 8 శాతం వరకు తేమ ఉండే పత్తికి 4100 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఒక్కో శాతం పెరిగేకొద్దీ 41 రూపాయల చొప్పున తగ్గించి చెల్లించనున్నారు. ఇలా 12 శాతం వరకు తేమ ఉన్న పత్తి కొనుగోళ్లకు అమనుతిస్తారు. సీసీఐ, ప్రైవేట్‌ వ్యాపారులు.. తూకం, హమాలీ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ జగన్మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు.

4.46 లక్షల మంది రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డులు.......

సీసీఐ కేంద్రాల్లో నిజమైన రైతులే పత్తిని విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం జిల్లాలోని 4.46 లక్షల మంది రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులివ్వాలని నిర్ణయించారు. రైతులు గుర్తింపుకార్డు తెస్తేనే వారి నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. వీటిపై బార్‌ కోడ్‌ ఉన్న నేపథ్యంలో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని అధికారులంటున్నారు. ఇప్పటికే కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలుకాగా.. మరో 15 రోజుల్లో రైతులందరికి కార్డులిస్తామంటున్నారు అధికారులు.

రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు......

మరోవైపు పత్తి కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులకు ఐదు రూపాయలకే భోజనం అందించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్‌, భైంసా మార్కెట్‌ యార్డులలో రైతులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేశారు. ఇక ఎడ్లబండ్లలో పత్తిని తీసుకువచ్చే పశువుల కోసం పశుగ్రాసం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రైతులు విక్రయించిన పత్తికి సంబంధించిన డబ్బును 48 నుంచి 72 గంటలలోపు వారి ఖాతాల్లో జమ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏదిఏమైనా ఈసారి పత్తి విక్రయాల కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

18:18 - September 28, 2015

హైదరాబాద్ :రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజాస్వామ్యవాదులు పిలుపునిచ్చారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష నేతలతో పాటు ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాలు నేతలు పాల్గొన్నారు. వరంగల్‌ జిల్లాలో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 30న చేపట్టనున్న చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని నేతలు కోరారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడినవారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. 

18:14 - September 28, 2015

కరీంనగర్ : తాగిన మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడ్ని.. స్థానికులు చితకబాదారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బివై.నగర్‌కు చెందిన శశి అనే యువకుడు.. గణేష్‌ శోభాయత్ర సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న వార్డు కౌన్సిలర్‌ లతతో పాటు ఆమె భర్త భాస్కర్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. శశిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

18:13 - September 28, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఖరే కారణమని టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై పోరాటానికి అన్ని దారులు వెదుకుతున్నామని.. అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. 

18:11 - September 28, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విపక్షాలను బెదిరించేలా వ్యవహరిస్తుందని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నందుకే ప్రభుత్వం అధికారం ఉపయోగించి ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాకోర్టులో కేసీఆర్‌ శిక్ష తప్పదని.. త్వరలోనే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

జీహెచ్ ఎంసీలో వార్డుల సంఖ్య యథాతథం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో వార్డుల సంఖ్య యథాతథం అని, వార్డుల సంఖ్య 150గా ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య...

నెల్లూరు : కుటుంబ కలహాలతో అంగన్‌వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనునరసాయపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కుంచెం లక్ష్మి(34) అంగన్‌వాడి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. గత కొన్ని రోజులుగా భర్త వెంకటే శ్వర్లుతో మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మశాలకు టీం ఇండియా...

హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈమేరకు భారత జట్టు క్రికెటర్లు ఇవాళ ధర్మశాలకు చేరుకున్నారు. కాంగ్రా విమానాశ్రయంలో క్రికెటర్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మ్యాచ్ జరిగే రోజు వరకు వారు ప్రాక్టిస్ చేయనున్నారు.

పోలీసు నియామకాల ఉద్యోగాలకు పరీక్ష ఫీజు ఖరారు...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు ఖరారైంది. దరఖాస్తు చేసే అభ్యర్థులందరి నుంచి రుసుము తీసుకోవాలని పోలీసు నియామక సంస్థ ఖరారు చేసింది. ఎస్ ఐ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250, కానిస్టేబుల్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్స, ఎస్టీ అభ్యర్థులకు రూ.200లుగా పరీక్ష ఫీజును ఖరారు చేయడం జరిగింది. ఇలా వచ్చే ఫీజును నియామక ప్రక్రియలకు అయ్యే ఖర్చు కోసం వినియోగిస్తామని నియామక సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. 

జ్యో‌తిష్యాన్ని నమ్ముకుని జగన్‌ సీఎం కాలేరు : మంత్రి పల్లె...

కర్నూలు :జ్యో‌తిష్యాన్ని నమ్ముకుని జగన్‌ సీఎం కాలేరని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో జరిగిన రైతుకోసం చంద్రన్న యాత్రలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి , మంత్రులు అచ్చెన్న, ప్రత్తిపాటి, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన యాత్రలో వారు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. జగన్‌కు దమ్ముంటే రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలన్నారు.

పోలవరాని ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్

న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారించిన ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై పిటీషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలంటూ ఆదేశించింది. అనంతరం విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిస్థాయిలో జరిగాకే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్లు ట్రిబ్యునల్‌ను కోరారు.

గ్రామపంచాయతీ ఈవో వాసంతిపై సస్పెన్షన్ వేటు

మెదక్: జిల్లాలోని నారాయణఖేడ్ గ్రామపంచాయతీ ఈవో వాసంతిపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈమేరకు విచారణకు ఆదేశించారు. 

16:54 - September 28, 2015

హైదరాబాద్ : యూపిఏ చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను తానే మొదలెట్టినట్టుగా ప్రధాని నరేంద్ర మోది గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. అమెరికా పర్యటనలో 2014కు ముందు దేశంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదని మోది పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇన్ఫర్మేషన్, టెలికాం రంగాలను భారత్‌లో ప్రవేశ పెట్టింది దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీయేనని ఆ పార్టీ నేత ఆనంద్‌శర్మ అన్నారు. డిజిటల్‌ ఇండియాకు కూడా తానే ఏదో చేస్తున్నట్టు మోది చెబుతున్నారని, 2011లోనే 'నేషనల్‌ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్ట్‌' పేరిట ఆప్టికల్‌ ఫైబర్ ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. ఇందు కోసం 20 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, బిజెపి అధికారంలోకి రాకముందే 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయన్నారు. అలాగే జి4 దేశాల కూటమి కూడా ఇప్పుడు ప్రారంభం కాలేదని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీ 4 దేశాలతో ఇంతకు ముందే సమావేశమయ్యారని గుర్తు చేశారు.

 

16:51 - September 28, 2015

హైదరాబాద్ : గృహ హింస కేసులో ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా లొంగిపోవాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ముందు లొంగిపోండి, తరువాత మధ్యవర్తిత్వం గురించి ఆలోచించవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ సమాచారాన్ని సోమనాథ్ భారతి తనకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తానని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. సోమనాథ్‌ భారతి భార్య లిపికా ఫిర్యాదు మేరకు ఆయనపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసులకు లొంగిపోకుండా సోమనాథ్ భారతి తప్పించుకుతిరుగుతున్నారు.

16:49 - September 28, 2015

హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఊరట లభించింది. కోల్‌ స్కాంలో సిబిఐ కోర్టు మన్మోహన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ను నిందితుడిగా చేర్చాలని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు సిబిఐ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసిన నేపథ్యంలో మాజీ ప్రధానికి గొప్ప ఊరట లభించినట్టయ్యింది. అంతకు ముందు జార్ఖండ్‌ మాజీ సిఎం మధుకోడా కూడా మన్మోహన్‌ ని నిందితుడిగా చేర్చాలని, ఆయనను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.  

16:47 - September 28, 2015

విజయవాడ : రైతులకు అప్పులిచ్చినవారిపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వాలని అప్పు తీసుకున్న రైతులపై ఒత్తిడి చేయద్దన్నారు. ఒకవేళ ఎవరైనా..అలా ఒత్తిడి చేస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

కోర్టు తీర్పు స్పీకర్ కు కనువిప్పు కావాలని :భట్టివిక్రమార్క

హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కోర్టు తీర్పు స్పీకర్ కు కనువిప్పు కావాలని టి.కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకపోతే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. టిడిఎల్పీ నేత ఎర్రబెల్లిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని భట్టి మండి పడ్డారు.

 

మధ్యాహ్నం భోజనం వికటించి 70 మందికి అస్వస్థత

నల్లగొండ : మధ్యాహ్నం భోజనం వికటించడంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చండూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

16:36 - September 28, 2015

హైదరాబాద్ :తెలంగాణ టిడిఎల్పీ నేత ఎర్రబెల్లికి బెయిల్ మంజూరయ్యింది. వరంగల్ జిల్లా జనగాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తుల జమానతు, రూ.20వేల పూచికత్తు చెల్లించాలని ఆదేశించింది. ఆయనతో పాటు మరో 20 మంది టిడిపి కార్యకుర్తలకు బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ జిల్లా పాలకుర్తిలో మార్కెట్ యార్డు ప్రారంభం సందర్భంగా టిడిపి, టిఆర్ ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే.

మంత్రి జగదీష్ రెడ్డి పై తమ్మినేని ఆగ్రహం

హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి పై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటంలో విశ్వాసం గల కుక్కలుగా వ్యవహరిస్తామని తమ్మినేని అన్నారు. పేదల బతులకు బాగుపడేందుకు ప్రభుత్వంపై వేట కుక్కలుగా పోరాడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అణచివేస్తున్నారని మండి పడ్డారు. వీలైతే కొనడం, కాదంటే కాల్చివేయడం అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని తమ్మినేని విమర్శించారు. 30న తలపెట్టిన చలో అసెంబ్లీకి ప్రజాసామ్యవాదులంతా కలిసి రావాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

గోదావరి పైప్ లైన్ పనులకు కేంద్రం అనుమతి

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కౌకూరు లో గోదావరి పైప్ లైన్ పనులు కొనసాగించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. వందేళ్ల వరకు పైప్ లైన్ పనులను కొనసాగించవచ్చని తెలిపింది.అ యితేఐ దు సంవత్సరాల తర్వాత అనుమతులు పునరుద్దరించుకోవాలని షరతు విధించింది.మరో వైపు హైదరాబాద్ వాటర్ వర్క్స్ పైప్ లైన్ పనులు కొనసాగించేందుకు సైతం అనుమతిచ్చింది. ఏడాదికి రూ.7.26 లక్షలు తమకు చెల్లించాలని పేర్కొంది.

 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 246 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంకు సమీక్ష ముందుండటంతో మార్కెట్లో అనిశ్చితి తప్పదన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మోదీ పర్యటనలో ఫేస్ బుక్ సీఈఓ వ్యాఖ్యలపై నిరసన

హైదరాబాద్ : "భారత ప్రధాని నరేంద్ర మోదీ మన కార్యాలయానికి వస్తున్నారు. ఫార్మల్స్ ఎవరూ ధరించవద్దు. క్యాజువల్స్ ధరించండి. మహిళలు స్లీవ్ లెస్, పొట్టి దుస్తులు ధరించవద్దు. 'నైస్ డ్రస్' ధరించి రండి" అని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఉద్యోగులకు చెప్పారట. మోదీ పర్యటన ముగిసిన తరువాత మార్క్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ క్యాజువల్ వేర్ ఇష్టపడుతూ, వివిధ రకాల టీషర్టులు, జీన్స్ ధరిస్తూ కనిపించే జుకర్ బర్గ్ సైతం మోదీతో సమావేశానికి డ్రస్ కోడ్ పాటిస్తూ సూట్ ధరించి వచ్చిన సంగతి తెలిసిందే.

గాన కోకిలకు సైకత శిల్పి తో జన్మదిన శుభాకాంక్షలు..

ఒడిశా : గాన కోకిల లతా మంగేష్కర్‌కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సరికొత్త రీతిలో 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతా మంగేష్కర్‌కు వీరాభిమాని అయిన పట్నాయక్ పూరీ తీరంలో ఆమె చిత్రంతో సైకత శిల్పాన్ని రూపొందించారు. కేక్‌ను తయారు చేశారు. లతా సైకత శిల్పానికి 6 టన్నుల ఇసుకను వినియోగించారు పట్నాయక్. లతా సైకత శిల్పం అభిమానులను, సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో జన్మించారు. భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు పురస్కారాలు లతాను వరించాయి.

రాజేంద్రనగర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ బండ్లగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ కు ఊరట

హైదరాబాద్ : బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.  

15:54 - September 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షత కమిటీ ఏర్పాటు సోమవారం టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెట్ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీకి వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులు సహాయ సహాకారాలు అందిస్తారు. ఈ కమిటీ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది.  

15:52 - September 28, 2015

మెదక్ : వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌ తగిలి ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మెదక్‌ జిల్లా రామయంపేట్ మండలం నస్కల్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామంలో గణేష్‌ శోభాయాత్ర నిర్వహిస్తుండగా.. మార్గమధ్యలో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న స్తంభం నుంచి కర్ర సహాయంతో కరెంట్ తీసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగిలింది. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటినా దగ్గరలోని సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల, కాళ్లు చేతులు, వీపు భాగంలో తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

15:51 - September 28, 2015

విజయవాడ : :ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పి.మధు ఫైర్ అయ్యారు. పేదల భూములను బలవంతంగా లాక్కొని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా...భూబ్యాంక్‌ విధానానికి చంద్రబాబు స్వస్తి పలకాలన్నారు. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

15:49 - September 28, 2015

హైదరాబాద్ : అనంతపురం- అమరావతి వయా కర్నూలు రహదారిని జాతీయ రహదారిగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. వెయ్యి కోట్ల రూపాయలతో ఎన్ హెచ్ -44 ను ఎన్ హెచ్ -65తో అనుసంధానించనున్నారు. నాలుగు లైన్ల రహదారిని 6 లేదా 8 లైన్లుగా మార్చనున్నారు. భూ సమీకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని చుట్టూ 126 కి.మీ. రింగురోడ్డుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

15:46 - September 28, 2015

విజయనగరం : ఎస్‌.కోటలో ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వసతి గృహానికి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ నిన్న సాయంత్రం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 156 మంది విద్యార్థినులు నీరసించిపోయారు. వీరిలో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

15:45 - September 28, 2015

హైదరాబాద్ : ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు భూమికి అతి సమీపానికి రావడంతో ఇవాళ తెల్లవారు జామున సూపర్‌ మూన్‌ ఏర్పడింది. ఈ నెల 14న ఒకసారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు. దీని ప్రభావంతో.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అక్టోబర్‌ 2 వరకూ తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ హెచ్చరించింది. ఇవాళ పౌర్ణమి కూడా కావడంతో సముద్రంలో తీవ్ర పోటు ఏర్పడనుందని తెలిపింది. సూపర్‌మూన్‌ వల్ల భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో అనేకచోట్ల ఆటుపోట్లు సంభవించనున్నాయి. దీనివల్ల 30వ తేదీ వరకు సుమారు ఐదడుగుల ఎత్తులో అలలు రావొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

 

అస్సాంలో ఇద్దరు మిలిటెంట్ల కాల్చివేత..

హైదరాబాద్: అసోంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు.ఛాలిభుయ్ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుఝామున ఈ ఘటన చోటుచేసుకుంది. 

తమిళనాడులో 'అమ్మ మొబైల్' పథకం ప్రారంభం

హైదరాబాద్ : తమిలనాడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మొబైల్స్ పేరుతో సీఎం జయలలిత మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. తొలి దశలో రూ.15 కోట్ల వ్యవంతో 20వేల మొబైల్ పోన్లును పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక బృందాల శిక్షకులకు ఉచితంగా అమ్మ మొబైల్ ఫోన్లను అందించనున్నారు.

'ఢిల్లీ సహా పలు నగరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం'

న్యూఢిల్లీ : ఢిల్లీ సహా పలు నగరాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందు కోసం 20 మంది ఉగ్రవాదులకు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. వీరంతా భారత్‌లోని వేర్వేరు నగరాలపై దాడులకు తెగబడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు హెచ్చరించాయి.

ఉపాధి హామీ కూలీలు ఆందోళన

ఆదిలాబాద్ : దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటేందుకు తీసిన గుంతలకు సంబంధించి కూలీ డబ్బులు చెల్లించాలని కూలీలు ధర్నాచేశారు. పనులు చేసి 3 నెలలైనా బకాయిలు ఇంకా చెల్లించలేదని ఉపాధి హామీ సిబ్బందిని నిలదీశారు.

బ్యాంకు ఎదుట డ్వాక్రా మహిళల నిరసన

ఆదిలాబాద్: దండేపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు మేనేజర్ రత్నాకర్ రెడ్డి ఇబ్బందులకు గురిచేస్నున్నాడని మహిళలు ఆరోపించారు. రుణాలు కోసం నెల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్లీ నెల రోజులు ఆగాలని బ్యాంకు మేనేజర్ తెలపడంతో ఆయన వైఖరికి నిరసనగా బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు.

ఎర్రబెల్లి అరెస్ట్ ఖండించిన బిజెపి నేత లక్ష్మణ్

హైదరాబాద్ : టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడం సరికాదని మండిపడ్డారు. అధికారపక్షం ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

15:05 - September 28, 2015

హైదరాబాద్ : భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ...రోజుకో పేరు బయటకు వస్తోంది. శరద్ పవార్, రాజీవ్ శుక్లా, అమితాబ్ చౌదరి, సౌరవ్ గంగూలీ పేర్లు పోయి... ఇప్పుడు సరికొత్తగా బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. శరద్ పవార్, అనురాగ్ ఠాకూర్ వర్గాల సంయుక్త అభ్యర్ధి శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి....

.రోజుకో కొత్తపేరు షికారు....

భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా అసాధారణ సేవలు అందించిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో...ఆయన వారసుడి ఎంపికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ...రోజుకో కొత్తపేరు షికారు చేస్తోంది. దాల్మియా మరణవార్త వచ్చిన కొద్ది గంటల్లోనే....దాల్మియాస్థానాన్ని భర్తీ చేసేవారిని ఎంపిక చేయడం కోసం..వచ్చే రెండువారాలలో బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించడంతో...పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

కింగ్ మేకర్ గా ఎన్. శ్రీనివాసన్...

బోర్డు సరికొత్త అధ్యక్షుడి ఎన్నికలో ఐసీసీ చైర్మన్ ఎన్ .శ్రీనివాసన్ కింగ్ మేకర్ కాబోతున్నారని....ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్, బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిల్లో ఎవరో ఒకరు అధ్యక్షస్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. ఒకదశలో ..క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు సైతం వినిపించింది. అయితే..ఇప్పుడు తాజాగా మాజీ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘానికి చెందిన శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది.

భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు......

భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు ఉంటాయి. ఇందులో శ్రీనివాసన్ వర్గం చేతిలో 10 ఓట్లు ఉంటే....కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అరుణ్ జైట్లీ, శరద్ పవార్ వర్గాల చేతిలో మిగిలిన 20 ఓట్లు ఉన్నాయి. అయితే ..పవార్, జైట్లీ, అనురాగ్ ఠాకూర్ వర్గాలు సంయుక్తంగా...శశాంక్ మనోహర్ ను బలపరుస్తూ ఉండటంతో...ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా....

2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో శశాంక్ మనోహర్ కు వివాదరహితుడుగా పేరుంది. పైగా కష్టపడి పనిచేసే స్వభావం కూడా శశాంక్ మనోహర్ కు ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కీ మాటల్లో చెప్పాలంటే...దాల్మియా వారసుడిగా, బోర్డు సరికొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

15:00 - September 28, 2015

హైదరాబాద్ : మొబైల్ మార్కెట్‌లో గూగుల్‌ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. అదిరిపోయే ఫీచర్లతో నెక్సస్ ఫైవ్ ఎక్స్ పేరుతో వీటిని తీసుకురానుంది. రెండు రోజుల్లో మార్కెట్‌లోకి రిలీజవుతున్న నెక్సస్ ఫైవ్ ఎక్స్ విశేషాలేంటో చూద్దాం....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌.....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌ ను ప్రారంభించింది గూగుల్. ఇప్పుడు ఇదే సిరీస్‌లో నెక్సస్ ఫైవ్ ఎక్స్ ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 29న అఫీషియల్‌గా వీటిని లాంఛ్‌ చేస్తోంది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లో.....

యాపిల్, శామ్‌సంగ్, సోని, మోటరోలా కంపెనీలు గడచిన రెండు నెలల్లో కొత్త ఫోన్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు గూగుల్ వంతు. లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ "ఆండ్రాయిడ్ మార్షమల్లోతో'' నెక్సస్ ఫైవ్‌ ఎక్స్‌ ను లాంచ్‌ చేయాలని భావిస్తోంది.న్యూ క్రోమ్ కాస్ట్ న్యూస్‌ కూడా ఇందులో ఉంటుందట. అంతేకాదు స్ఫూటితో భాగస్వామ్యం, అప్‌డేటెడ్ యాప్‌ నెక్సస్‌ కొత్త వెర్షన్‌లో ఉంటుందని గూగుల్ తెలిపింది. దీంతో నెక్సస్‌ ఫైవ్‌ ఎక్స్‌పై అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. దీని షేప్‌ ఎలా ఉంటుందో స్పష్టంగా బయటపడక పోయినా.. కొన్ని ఇమేజెస్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

డిస్‌ ప్లే 5.2 అంగులాలు......

దీని ఫీచర్ల విషయానికి వస్తే...నెక్సస్ ఫైవ్ ఎక్స్ డిస్‌ ప్లే భారీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 5.2 ఇంచెస్ డిస్‌ప్లే, 1080p రెజల్యూషన్‌ లు ఆకర్షణగా చెబుతున్నారు.

ఫింగర్ ప్రింట్ సెన్సర్....

ఫింగర్ ప్రింట్ సెన్సర్. గూగుల్ నెక్సస్‌ ఫైవ్ ఎక్స్ లో హైలెట్‌. ఈ ఫీచర్‌ తప్పకుండా మార్కెట్లో తమ ఫోన్లకు క్రేజ్ పెంచుతుందని గూగుల్ భావిస్తోంది. ఇక ఫోన్ వెనుక భాగం.. సిల్వర్‌ కలర్‌లో‌ ఉంటుందని తెలుస్తోంది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే... వెఉక భాగాన థర్టీన్ మెగాపిక్సల్‌ .. ముందు భాగాన 5 మెగా పిక్సల్‌ రిజల్యూషన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 2జీబీ లేదా 3జీబీ ర్యామ్‌తో ఫోన్‌ స్పీడ్ దూసుకుపోతుందని తెలుస్తోంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండొచ్చని నెటిజన్ల అంచనా. మొత్తానికి ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి ఎంటరవుతున్న గూగుల్ నెక్సస్ ఫైవ్ ఎక్స్...ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుందని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.

14:56 - September 28, 2015

హైదరాబాద్ : సందర్భానికి తగిన వస్త్రధారణతో అనేక మంది మహిళలు ప్రత్యేకత చాటుతారు. అందుకోసం మార్కెట్ లో లభించే అనేక మెటీరియల్స్ ను సేకరించటంలోనూ వారే ముందుంటారు. అలాంటి వారి కోసం ఎల్బీ నగర్ లో ఉన్న వసుంధర శారీస్ అండ్ డ్రెస్ మీటీరియల్స్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు.. మరి అవేంటో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:55 - September 28, 2015

హైదరాబాద్: 5 ట్యూబ్‌లైట్లు, 3బల్బులు, 3 ఫ్యాన్లు కూడా ఉండవు. విశాలమైన భవంతి కాదు. ఎటు చూసినా కేవలం నాలుగంటే నాలుగు గదులున్న అద్దె ఇల్లు. అలా అని నిరంతరాయంగా విద్యుత్ వినియోగం జరగదు. కానీ కరెంట్ బిల్లు మాత్రం మైండ్ బ్లాంక్‌ అయ్యే రేంజ్‌లో వచ్చింది. అసలు ఊహకు కూడా అందని సంఖ్యను చూసి వినియోగదారుడి కళ్లు బయర్లు కమ్మించింది.

కరెంటు బిల్లు చూసిన ప్రతిసారి....

సాధారణంగా కరెంటు బిల్లు చూసిన ప్రతిసారి జేబు తడిమి చూసుకోవడం సాధారణమే. కానీ, హర్యానాలో ఓ వ్యక్తికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే మాత్రం తప్పకుండా హర్ట్ ఎటాక్ రావాల్సిందే. ఎందుకంటే ఆ మధ్య తరగతి జీవికి విద్యుత్ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన బిల్లు అక్షరాలా 85 కోట్లు.

మహా అయితే బిల్లు 1500....

గుర్గావ్‌కు చెందిన హెచ్ ఎస్ వర్మ ఓ సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. వర్మ అద్దెకు ఉండే ఇంటికి ప్రతి నెలా 1500లకు మించి కరెంట్ బిల్లు రాదు. ఇది కట్టేందుకే వర్మ నానా తంటాలు పడుతుంటాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 85కోట్లు వచ్చింది. అది చూసే సరికి వర్మకు గుండె ఆగినంత పనయింది. ఇది ముమ్మాటికి విద్యుత్ అధికారుల తప్పిదమే అయినప్పటికి, ఎక్కడ తనను బిల్లు కట్టమంటారో అని గుండెలు గుప్పిట్లో పెట్టుకుని వాపోతున్నాడు వర్మ. మీడియా ఎదుట వర్మ తన ఆవేదనను వెలిబుచ్చుకుంటున్నా విద్యుత్ శాఖ వారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాకుంటే విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించాడు వర్మ.

14:49 - September 28, 2015

కృష్ణా : గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. 2016లో ప్రారంభం కానున్న కృష్ణా నది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. రాజమండ్రి కోటిలింగాల రేవు తరహాలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గ్రామం వద్ద రేవును నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

కిలోమీటర్ పొడవులో పుష్కర ఘాట్‌....

రాజమండ్రి కోటిలింగాల రేవు పొడవు ఒకటిన్నర కిలోమీటర్లు కాగా..ఫెర్రిలో కిలోమీటర్‌ పొడవులో పుష్కర ఘాట్ నిర్మించనున్నారు. ఇటీవలే ఫెర్రి గ్రామం మరో విశిష్టత సంతరించుకుంది. నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్ట్‌ నిర్మించడంతో... కృష్ణా, గోదావరి జలాల సంగమం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో రెండు నదుల పవిత్ర సంగమం పేరుతో సీఎం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. 23 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. 2016 కృష్ణా పుష్కరాల సమయానికి రేవును నిర్మిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఈ సందర్భంగా ప్రకటించారు.

కృష్ణా పుష్కరాలకు కేంద్ర బిందువు విజయవాడ.....

కృష్ణా పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. కృష్ణా పుష్కరాలకు కేంద్ర బిందువుగా విజయవాడ ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బెజవాడలో అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నారు. వాహనాల రద్దీతోపాటు అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మరమ్మతులు వంటి అంశాలపై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నారు.

14:47 - September 28, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్‌బాబు ప్రకటించారు. సినీ జీవితంలో శ్రీమంతుడిగా చెప్పుకునే ప్రిన్స్‌ మహేశ్‌బాబు.. రియల్‌లైఫ్‌లో కూడా శ్రీమంతుడనే అనిపించుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరు మండలం, సిద్ధాపురం గ్రామాన్ని ప్రిన్స్‌ మహేశ్‌బాబు దత్తత తీసుకున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా... మంత్రి కేటీఆర్‌ కోరిక మేరకు.. సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు మహేశ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

14:45 - September 28, 2015

కృష్ణా :విజయవాడలో గుర్రం జాషువా 120వ జయంతోత్సవాలను సీఐటీయూ ఘనంగా నిర్వహించింది. జిల్లా కార్యాలయంలో ఆ సంఘం నేతలు.. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. అగ్రకులం కవులున్న కాలంలోనే తక్కువ జాతి నుంచి వచ్చిన గుర్రం జాషువా తన కవితలతో అందరినీ ఆకట్టుకుని మెప్పించారని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.గఫూర్ అన్నారు. కుల నిర్మూలనకు పాటుబడిన కవులలో జాషువా ప్రథములని గఫూర్ కొనియాడారు.

14:41 - September 28, 2015

హైదరాబాద్ : తన పరిధిలో కాలుష్యానికి చెక్ పెట్టాలనుకుంది. ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరిగా మారిన తరుణంలో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ముందుకు తెస్తోంది. వాటికి అంతర్జాతీయ మార్కెట్ లలో స్థానం కల్పిస్తోంది. దీంతో పాటు మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందిలో స్పూర్తిని నింపుతున్న రజనీ వాసన్. మహిళలు ఒకవైపు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నప్పటికీ మరో వైపు సరియైన వేతనాలు పొందలేని స్థితిలో ఉన్నారు. స్వయం ఉపాధిలో ఉన్న వారు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు కరువైన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న వారికి చేయూతనివ్వాలనుకుంటున్న రజనీ వాసన్ కృషి అభినందనీయం. అయితే రజనీ వాసన్ విదేశాలలో జూట్ పరిశ్రమ కోసం కృషి చేస్తుంటే అదే వస్తూత్పత్తులను తయారు చేయటానికి ఎంతో మహిళలకు శిక్షణనిస్తున్న లక్ష్మీ వాసన్ .

మహిళల అభ్యుదయమే ఆమె లక్ష్యం.. వారి శ్రేయస్సే ఆమె గమ్యం.. వారి స్వావలంబనే ఆమె సాధన.. అందుకే వారి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సుదీర్ఘకాలంగా ఎంతో మంది మహిళలకు ఆదరువునిస్తూ వారి ఉపాధి కోసం పాటుపడుతున్న వనిత కథనంతో ఈ వారం స్పూర్తి మీ ముందుకు వచ్చింది.

కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టల్ స్టాఫ్ : దత్తాత్రే

హైదరాబాద్: తెలంగాణ కోసం తపించి, నిర్విరామంగా ఉద్యమించిన బాపూజీ చిత్రంతో త్వరలోనే ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో బాపూజీ శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ... కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాపూజీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. 

సీఎం కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర్లో రైతు ఆత్మహత్య...

మెదక్ :కేసీఆర్ ఫాంహౌస్ శివారు గ్రామం మర్కూక్ గ్రామంలో అప్పుల బాధతో కౌలు రైతు సంజీవ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఒకరు మృతి

సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నాగరాజు(25) అంబర్ పేట వాసిగా గుర్తించారు. అదే ఆసుపత్రిలో మరో 10 మంది స్వైన్ ఫ్లూతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

పుష్పగిరి సంస్థాన పీఠాధిపతిగా విద్యాశంకరభారతి

హైదరాబాద్: పుష్పగిరి సంస్థానం 49వ పీఠాధిపతిగా విద్యాశంకరభారతి నియమితులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం సంస్థానం పీఠాధిపతి విద్యా నర్సింహభారతి పరమపదించడంతో ఆయన స్థానంలో విద్యాశంకరభారతి పుష్పగిరి సంస్థానం బాధ్యతలు చేపట్టారు.

పొర్లుదండాలతో ఆశావర్కర్ల ఆందోళన

కరీంనగర్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు చేస్తున్న ఆందోళన 26వరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశావర్కర్లు రాజీవ్‌రహదారిపై పోర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

14:07 - September 28, 2015

ఢిల్లీ : ఇండియన్ ఏస్ షూటర్, ఒలింపిక్ చాంపియన్ అభినవ్ భింద్రా ఏషియన్ ఏర్ గన్ టోర్నీ బంగారు పతకం గెలుచుకొన్నాడు. న్యూఢిల్లీలో ముగిసిన పోటీల్లో అభినవ్ భింద్రా 10 మీటర్ల ఏర్ రైఫిల్ విభాగంలో 208.8 పాయింట్లతో విజేతగా నిలిచాడు. భారత షూటర్లు గగన్ నారంగ్ నాలుగు, చెయిన్ సింగ్ ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016 రియో ఒలింపిక్స్ కు అభినవ్ భింద్రా ఇప్పటికే అర్హత సాధించిన సంగతి తెలిసిందే...

 

సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన ఎస్టీ హాస్టల్ విద్యార్థినిలు

విజయనగరం : జిల్లాలోని శృంగవరపుకోట ఎస్టీ హాస్టల్ విద్యార్థినిలు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. తమకు శాశ్వత వసతి గృహ భవనాన్ని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తుండటంతో కొందరు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

14:05 - September 28, 2015

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బిసి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పాటుపడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొనియాడారు. రవీంద్రభారతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాటలో అందరూ నడవాలని.. ఆయన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని.. అలా చేస్తే.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. చేనేత కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల అభివృద్ధి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బిసి బిల్లు ప్రవేశపట్టాలని... అప్పుడే బిసి వర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు వెళ్తారని తెలిపారు. బిసిలు ఓటర్లుగా కాదు.. ఎమ్మెల్యేలుగా వెళ్లాలని.. సీటుపై కూర్చుకోవాలన్నారు.

 

13:54 - September 28, 2015

విజయవాడ : మహాకవి గుర్రం జాషువా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని.. సీఎం చంద్రబాబు అన్నారు. జాషువా 120వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోజాషువా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. తనను ఎగతాళి చేసిన వారిని.. జాషువా ఎదురుప్రశ్నలు అడిగి అబ్బురపరిచేవారని అన్నారు. జాషువా స్ఫూర్తితో మంచి కవితలు, రచనలు చేయాలని కోరారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

 

ఉండవల్లి లో భారీ అగ్ని ప్రమాదం...

గుంటూరు: ఉండవల్లి లంకలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఆకతాయి రెల్లుగడ్డికి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలం ఏపీ సీఎం చంద్రబాబు నివాసం దగ్గర్లో ఉండటంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

విశాఖలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ: జిల్లాలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి సాయినాథ్ కెమికల్స్ లో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని తెలిసింది. ప్రస్తుతం అగ్నిమాపక ఇంజన్లు మంటలార్పుతున్నాయి.  

13:48 - September 28, 2015

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. వినాయకశోభయాత్ర అంగరంగవైభవంగా సాగుతోంది. ట్యాంక్ బంద్ భక్తులతో కిక్కిరిసిపోయింది. నిన్న నుంచి నిమజ్జనం కొనసాగుతోంది. రెండో రోజు కూడా నిమజ్జనం కొనసాగుతుంది. తెల్లవారు జాము 3 గంటల నుంచి విగ్రహాలు భారీగా తరలివస్తున్నాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా వినాయకులు నిజమ్జనమైనట్లు తెలుస్తోంది. మరో 10 వేలకు పైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్, వెస్టు జోన్ ల నుంచి మరిన్ని విగ్రహాలు రానున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాల సంఖ్య పెరిగింది. పెద్ద విగ్రహాల సంఖ్య పెరిగింది. తెలంగాణతోపాటు ఎపి, మరియు ఇతర రాష్ట్రాలతో నుంచి విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. వచ్చే వాహనాలకు నెక్లెస్ రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. నేడు వర్కింగ్ రోజు..కావడంతో ట్రాఫిక్ జాం అవుంతుంది. 10 నుంచి 15 అడుగుల ఎత్తున్న విగ్రహాలను క్రేన్ నెంబర్ 1 నుంచి నిమజ్జనం జరుగతుంది. నిమజ్జనానికి గణనాధుడు క్యూలో నిల్చున్నాయి. ఇవాళా సుదూర ప్రాంతాల నుంచి విగ్రహాలు వస్తున్నాయి. నేడు సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షీటీమ్స్ పర్యవేక్షిణ కొనసాగుతోంది.

 

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర....

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర ప్రారంభం అయింది. 11 రోజులపాటు పూజలందుకున్న గణనాధుడు నిమజ్జనానికి కదులుతున్నారు. వినాయకుడి తరలింపుకు సంబంధించి నిర్వహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 

13:33 - September 28, 2015

చిత్తూరు : తిరుపతిలోని కపిలతీర్థంలో పెను విషాదం చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన యువకులు..అనూహ్యంగా వరద నీరు రావడంతో కొండపై నుంచి పుష్కరిణిలో పడి చనిపోయారు. కపిలేశ్వరాలయం కొలువై ఉన్న ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘటన తిరుపతి వాసులను కలవరానికి గురిచేసింది. అప్పటి వరకూ ఎంతో హుషారుగా ఆడిపాడిన వారంతా విగతజీవులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విహార యాత్ర కాస్తా.. విషాద యాత్రగా మిగిలింది. ప్రకృతిని ఆస్వాదించాలని తిరుమలకు వచ్చిన ఏడుగురు యువకులు తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణి దగ్గర జలపాతంలో జారిపడి మృత్యువాత పడ్డారు.
ఈత కొట్టే సమయంలోనే భారీగా వచ్చిన నీరు
తిరుపతి నగరంలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన ఐదుగురు యువకులు సాయంత్రంపూట కపిలతీర్థంలోని కొండపైన ఉన్న నీటి గుంటలలో ఈత కొట్టడానికి వచ్చారు. అయితే అంతకు ముందే తిరుమలలో ఎకధాటిగా భారీ వర్షం కురిసింది. సరదాగా యవకులు ఈత కొడుతున్న సమయంలోనే కొండపై కురిసిన వర్షంనీరు నీటి గుంటల మీదుగా జారి కపిలతీర్థం పుష్కరిణిలో పడుతోంది. సరిగ్గా యువకులు ఈత కొట్టే సమయంలోనే పై నుంచి నీరు అనూహ్యంగా భారీగా వచ్చేసింది. దీంతో నీటిప్రవాహం నుంచి ఒక యువకుడి తప్పించుకోగా.. నీటి కొలనులో ఉన్న నలుగురు యువకులు తప్పించుకోలేకపోయారు. నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక పై నుంచి కింద పుష్కరిణిలో పడి దుర్మరణం పాలయ్యారు.
తిరుపతి రుయాకు మృతదేహాలు తరలింపు
విషయం తెలియగానే వెంటనే టీటీడీ జాలర్లు, పోలీస్ సిబ్బంది నీటి కొలనులోని మృతదేహాలను బయటకు వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. మృతులు శ్రీకాంత్, తోహిత్, నిఖిల్, వెంకటేష్‌గా గుర్తించారు. చనిపోయిన వారంతా 15 నుంచి 20 సంవత్సరాలలోపే వారే. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. టీటీడీ ఈవో సాంబశివరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.
కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్న తల్లిదండ్రులు
చేతికి ఎదిగొచ్చిన కుమారులు అర్ధాంతరంగా మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా గట్టి చర్యలు తీసుకుంటామని టీడీడీ సిబ్బంది స్పష్టం చేసింది. ఏదిఏమైనా.. విహారయాత్రకు వచ్చిన నునుగు మీసాల కుర్రాళ్లు కపిలతీర్థం పుష్కరిణి జలపాతంలో పడి మృతిచెందడం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది.

 

 

13:19 - September 28, 2015

విజయవాడ : కొండా లక్ష్మణ్‌ బాపూజీ, గుర్రం జాషువాలు మహనీయులని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కొనియాడారు. ఏపీలో రైతాంగం కోసం చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులు పెంచాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కారణాలను అన్వేషించి.. రైతుకుటుంబాలకు మేలు చేయాలన్నారు.

 

13:00 - September 28, 2015

హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జనంలో జాప్యం హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ సమస్యలోకి లాగింది. ఎక్కడ చూసినా వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోవడంతో వాహనదారులు పడిన కష్టాలు అంతాఇంతా కావు. పంజగుట్ట, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమయత్‌నగర్‌ ఇలా అన్నీ రోడ్లలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. చిక్కడపల్లిలో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

 

12:57 - September 28, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనపై విచారణ జరిపించాలని వాపమపక్ష, ప్రజా సంఘాల నేతుల డిమాండ్ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యాయలం ముఖ్దుభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతుల మాట్లాడారు. టీసర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ వరంగల్ జరిగిన ఎన్ కౌంటర్.. బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. శృతి, సాగర్ లవి ప్రభుత్వ హత్యలేనని స్ఫష్టం చేశారు. వారి ఒంటిపై గాయం లేని చోటే లేదని వాపోయారు. ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరించిందని మండిపడ్డారు. రక్తం తోటి చేతులు కడుక్కొని తిండి తినడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రక్తపు కూడు తినడానికి సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని విమర్శించారు. గతంలో నియంతలకు ఏ గతి పట్టిందో అదే గతి ఇప్పుడు కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈనెల 30న తలపెట్టిన చలో అసెంబ్లీ.. కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుందన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. వారిని అరెస్టు చేసి.. కోర్టు హాజరు పర్చాలని.. కాని హత మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమది తప్పని తేలితే... ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.
వరంగల్ లో ఎన్ కౌంటర్ దుర్మార్గమైన చర్య
వరంగల్ లో ఎన్ కౌంటర్ ఘటన దుర్మార్గమైన చర్య అని విరసం నేత వరవరరావు అన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. హత్యానేరంగా నమోదు చేయాలని కోరడం జరిగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం రావడానికి చంద్రబాబు పాలన, విధానాలే కారణమన్నారు.

 

భూ బ్యాంక్ విధానానికి స్వస్తి పలకాలి : మధు

విజయవాడ : భూ బ్యాంక్ విధానానికి ఎపి ప్రభుత్వం స్వస్తి పలకాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హితవు పలికారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవసరానికి మించి భూములు సేకరించి... కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అక్టోబర్ 1న వామపక్ష నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

11:59 - September 28, 2015

హైదరాబాద్ : ప్రపంచానికి భారతదేశం ఆశాదీపంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం అవకాశాలకు కేంద్రబిందువుగా ఉందని తెలిపారు. ప్రధాని విదేశీ పర్యటనల ద్వారా దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దేశం ప్రగతిపథంలో నడిచేందుకు సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. దేశంలో బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తామని గూగుల్ ప్రకటించారు. అలాగే 500 రైల్వే స్టేషనన్ లలో వైఫై సదుపాయం కల్పిస్తామని ప్రకటించినట్లు తెలిపారు. 10 భారతీయ భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 5 లక్షల గ్రామాల్లో బ్రాండ్ కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందన్నారు. డిజిటల్ విప్లవం వల్ల ప్రజలకు సేవలు వేగంగా అందుతాయన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో సాంకేతిక దిగ్గజాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు.

 

 

భారత్ అవకాశాలకు కేంద్రబిందువు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : భారతదేశం అవకాశాలకు కేంద్రబిందువుగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి భారత్ ఆశాదీపంలా కనిపిస్తోందన్నారు.

11:49 - September 28, 2015

చిత్తూరు : తిరుపతి కపిల తీర్థం పుష్కరిణి ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇవాళ పుష్కరిణి నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న రాత్రి దొరికిన ఏడు మృతదేహాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. 

కపిలతీర్థం పుష్కరిణి ఘటనలో 8 కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు : తిరుపతి కపిల తీర్థం పుష్కరిణి ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇవాళ పుష్కరిణి నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న రాత్రి దొరికిన ఏడు మృతదేహాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు.

 

11:45 - September 28, 2015

నెల్లూరు : జిల్లాలోని తోటపల్లి గూడురులో ఓ కానిస్టేబుల్ ను స్థానికులు చితకబాదారు. మల్లకార్జున్ అనే కానిస్టేబుల్ ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. స్థానికులతో కలిసి.. కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

11:42 - September 28, 2015

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. విషయం స్పీకర్ పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం ప్రకటించింది. స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది.

 

11:30 - September 28, 2015

హైదరాబాద్ : ఎన్ డిఎ లో పాలనలో రిజర్వేషన్లపై దాడి జరుగుతోందని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, బిజెపి నేత రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిర, టిడిపి నేత.. పట్టాభిరామ్, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో మోడీ సర్కార్ పాలన కొనసాగుతుందన్నారు. ఆర్ ఎస్ ఎస్ విధానాలను బిజెపి సర్కార్ అమలు చేస్తుందన్నారు. టీసర్కార్ పాలనపై చర్చించారు. సీఎం కేసీఆర్ నియంత పాలన సాగుతోందని విమర్శించారు. అధికార పార్టీ.. ప్రతి పక్షాల గొంతు నొక్కుతుందని చెప్పారు. వరంగల్ లో మంత్రి కడియం శ్రీహరి, టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ ల మధ్య జరిగిన ఘర్షణతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యక్తిగత, రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్నాయన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:08 - September 28, 2015

కాలిఫోర్నియా : భారత ముద్దుబిడ్డ భగత్ సింగ్ కు కోటి వందనాలు సమర్పించారు ప్రధాని నరేంద్రమోడీ. కాలిఫోర్నియాలో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రవాస భారతీయుల సేవలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఎన్ ఆర్ ఐలు దేశాభివృద్ధికి పాటుపడుతున్నారంటూ అభినందించారు. మేధో వలస మేధో సంపద సృష్టిస్తోందన్నారు. భారత్ కొత్త ఇమేజ్ వచ్చిందన్నారు. ప్రధాని ప్రసంగానికి 18 వేల మంది ఎన్ ఆర్ ఐలు హాజరయ్యారు. 

10:50 - September 28, 2015

గుంటూరు : కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా 120 జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాశక్తి బుక్ హౌస్, సాహితి స్రవంతి, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జాషువ సమగ్ర రచనలు, సమాలోచన రాష్ట్ర స్థాయి సాహితీ సదస్సు నిర్వహించారు. గుంటూరు ఎసీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి అతిథులు నివాళులు అర్పించారు. కత్తి పద్మారావు, అద్దేపల్లి రామమోహన్ రావు, రాచపాళెం చంద్రశేఖరెడ్డి రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు.
గుంటూరుకు జాషువా పేరు పెట్టాలన్న కవులు
దళితులు, వెనకబడినవర్గాల జీవితాల్లోంచి గుర్రం జాషువా రచనలు పుట్టుకొచ్చాయన్నారు...కవులు, సామాజికవేత్తలు. బౌద్ధ సంస్కృతికి పట్టంకట్టిన కవియోధుడు జాషువా అన్నారు. గుంటూరుకు జాషువా పేరు పెట్టాలన్న సామాజికవేత్తలు...అమరావతిలో సాంస్కృతిక క్షేత్రానికి కూడా జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జాషువా రచనల స్ఫూర్తితో అణగారిన వర్గాలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమరావతి, బుద్దుని చరిత్రపై జాషువా అనేక రచనలు చేశారని, నేటి పాలకులు, నాయకులు అమరావతిపై కనీస అవగాహన లేకుండా పాలిస్తున్నారని దళిత నాయకులు కత్తి పద్మారావు విమర్శించారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన గొప్ప వ్యక్తి జాషువా అని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. జాషువా కడజాతి కవి కాదని, జాతి కవి అన్నారు. జాషువా ఔనత్యాన్ని చాటే విధంగా రాజధాని అమరావతిలో ఆయన పేరుతో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జాషువ 120 జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణ్. నాటికీ నేటికీ జాషువా రచనలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతున్నాయని సదస్సులో పాల్గొన్న వక్తలు కొనియాడారు. భవిష్యత్తులో జాషువా ట్రస్టు, కళా సాహిత్య అధ్యయన వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

 

10:40 - September 28, 2015

నెల్లూరు : పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం విజయవంంతం అయింది. ఖగోళ పరిశోధనకు సంబంధించి ఇస్రో తొలి ప్రయోగం ఇది. 7 ఉపగ్రహాలను నిర్ణీతక్షక్ష్యలో పీఎస్ ఎల్వీ సీ 30 ప్రవేశపెట్టింది. ఆస్ట్రోశాట్ తో పాటు అమెరిరా, కెనడా, ఇండోనేషియాకు చెందిన ఆరు ఉపగ్రహాలను పీఎస్ ఎవ్ వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లింది. ఐదేళ్లపాటు పీఎస్ ఎల్ వీ సీ-30 సేవలు కొనసానున్నాయి. గ్రహాలు, నక్షత్ర మండలాను ఆస్ట్రోశాట్ కనిపెట్టనుంది.
సాంకేతికంగా భారతదేశం మరో ముందడుగు
సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. పీఎస్ఎల్వీ సీ-30ని సోమవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించింది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. 50 గంటల తర్వాత రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది.
తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ 
భారత్ నింగిలోకి పంపుతున్న తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ ఇది. దీని బరువు 1513 కేజీలు. దీంతో పాటు ఇండొనేషియాకు చెందిన లపాన్-ఏ2 శాటిలైట్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-14...అమెరికాకు చెందిన నాలుగు నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ సీ-30 నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సుమారు 350 కోట్లు ఖర్చు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అస్ట్రోశాట్‌ రూపొందించేందుకు 178 కోట్లు వెచ్చించారు. ఇప్పటివరకు మన దేశానికి ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేదు. గతంలో పంపిన పరికరాలను ఇతర ఉపగ్రహాలతో అనుసంధానం చేసి పంపేవారు. ఈ ఉపగ్రహ తయారీకి సూర్యనారాయణ శర్మ సారథ్యం వహించారు. ఈ ఆస్ట్రోనాట్ ఐదు సంవత్సరాల కాలం పని చేస్తుందని ఈ సమయంలో 300 టెర్రాబైట్ డేటాను సేకరిస్తుందని స్పేస్ సెంటర్ అధికారులు తెలిపారు.

 

పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం సక్సెస్....

నెల్లూరు : పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం విజయవంంతం అయింది. ఖగోళ పరిశోధనకు సంబంధించి ఇస్రో తొలి ప్రయోగం ఇది. 7 ఉపగ్రహాలను నిర్ణీతక్షక్ష్యలో పీఎస్ ఎల్వీ సీ 30 ప్రవేశపెట్టింది. ఐదేళ్లపాటు పీఎస్ ఎల్ వీ సీ-30 సేవలు కొనసానున్నాయి. 

10:31 - September 28, 2015

నెల్లూరు : శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ ఎల్ వీ సీ-30 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆస్ట్రో శాట్ సహా 7 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.

 

10:22 - September 28, 2015

వరంగల్ : టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎర్రబెల్లిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని పాలకుర్తిలో ఎస్సైపై దాడి ఘటనలో ఎర్రబెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు... 120బి, 143, 147, 148, 322, 290, 324, 149 కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. నిన్న అరెస్టైన ఎర్రబెల్లి.. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతుండటంతో... జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను జనగామ కోర్టులో హాజరుపర్చారు. ఈమేరకు జనగాం న్యాయవాది ఎర్రబెల్లి దయాకర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఎర్రబెల్లిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 

పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం మూడోదశ సక్సెస్...

నెల్లూరు : శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ ఎల్ వీ సీ-30 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆస్ట్రో శాట్ సహా 7 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం మూడో దశ విజయవంతం అయింది. 

పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం రెండో దశ సక్సెస్...

నెల్లూరు : శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ ఎల్ వీ సీ-30 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆస్ట్రో శాట్ సహా 7 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. రెండో దశ విజయవంతం అయింది. 

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం..

నెల్లూరు : శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ ఎల్ వీ సీ-30 ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. ఆస్ట్రోశాట్ సహా 7 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.

 

09:47 - September 28, 2015

వాషింగ్టన్ : అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. డిజిటల్‌ ఇండియా ఏర్పాటైన సదస్సులో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో పాటు పలు కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు. డిజిటల్ ఎకానమీలో భారత్ అమెరికా భాగస్వామ్యానికి ఈ వేదిక నిదర్శనమని మోడీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ప్రపంచంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మన ఇరుగు పొరుగులాంటివన్నారు. ప్రపంచాన్ని మార్చే సత్తా సోషల్ మీడియాకు ఉందన్న మోదీ...వంద కోట్ల మంది భారతీయుల చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లతో ఎం-గవర్నెన్స్ లేదా మొబైల్ గవర్నెన్స్ తో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు.
డిజిటల్ ఇండియాలో భాగస్వాములు కావాలి
ఐటీ దిగ్గజ కంపెనీలు డిజిటల్ ఇండియాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశమైన మోదీ.. గూగుల్ సహకారంతో రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు. ఇండియాలోని పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ విప్లవానికి సహకరిస్తామని సీఈవోలు మోదీకి హామినిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్కైప్ ద్వారా తరగతులు
డిజిటల్ ఇండియా సదస్సులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడారు. ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించటం అద్భుతమని ప్రశంసించారు. అయితే గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బాండ్ సదుపాయం కల్పించాల్సిన అవసరముందన్నారు.
నూతన ఆవిష్కరణకు భారత్‌ వేదిక
టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. సాంకేతికత దేశాభివృద్ధికి ఎంతో అవసరమని మోదీ గుర్తించారన్నారన్న పిచాయ్‌...భారత్‌లో 3వేలకు పైగా స్టార్టప్ ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. నూతన ఆవిష్కరణలకు భారత్‌ను వేదికగా చేయటంలో మోదీ ముందున్నారని చెప్పారు.
మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం
అమెరికా పర్యటనలో మోదీకి ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. ఎన్ఆర్‌ఐలను కలవడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని మోదీ అన్నారు.

 

09:21 - September 28, 2015

ఢిల్లీ : ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌.
భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం
భగత్‌ సింగ్‌...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి ఈ పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్‌ 28న జన్మించిన భగత్‌ సింగ్
నేడు భరతమాత ముద్దుబిడ్డ భగత్‌సింగ్‌ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా విప్లవవీరుడి 108వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో... ఆ విప్లవ వీరుడికి కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.
12 ఏళ్ల వయసులో బ్రిటీష్ పాలకులపై కసి
ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
1928లో సైమన్‌ కమీషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్‌ చనిపోవటంతో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్‌ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీత
బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్ పాలకులు
చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.

 

09:16 - September 28, 2015

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరంలో వినాయక నిమజ్జనం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జన కోసం వేలాది విగ్రహాలు వేచి ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని వేలాది విగ్రహాలు ట్యాంకు బండ్ తరలివస్తున్నాయి. వేలాది విగ్రహాలు నిమజ్జనం కోసం భారీగా బారులు తీరాయి. సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 20 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అయితే ఇవాళా తెల్లవారు జాము నుంచి భారీగా విగ్రహాలు తరలిరావడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. ఈరోజు వర్కింగ్ డే కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా హైదరాబాద్ లో ట్రాపిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ఖైరతాబాద్ వినాయకున్ని తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. పూజలు నిర్వహించి, శోభయాత్రను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది.

 

టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు 14 రోజుల రిమాండ్

వరంగల్ : టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎర్రబెల్లిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. పాలకుర్తిలో ఎస్పైపై దాడి ఘటనలో ఎర్రబెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 

08:58 - September 28, 2015

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనం కన్నులపండుగగా సాగింది. గణపతి పప్పా మోరియా..జైజై గణేశా...బైబై గణేశా అంటూ నినాదాలు చేస్తూ భక్తులు గణనాధుడికి వీడ్కోలు పలికారు. దేశంలోని ముంబయి, పూనే, గుజరాత్‌లో గణేశ్‌ నిమజ్జనం కోలాహలంగా, సందడిగా సాగింది. దేశవ్యాప్తంగా 11రోజుల పాటు గణేశ్‌ నవరాత్రుల్ని ఘనంగా జరుపుకున్న భక్తులు..చివరి రోజు బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. చివరి రోజు ఎంతో భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాగణనాథుడిని నిమజ్జనం చేశారు.
ముంబయి
దేశంలోనే గణేశ్‌ నవరాత్రుల్ని అత్యంత ఘనంగా జరుపుకునే ముంబయిలో ఈసారి కన్నులపండుగగా గణేశ్‌ నిమజ్జనం వేడుకలు జరిగాయి. ముంబయిలో ప్రఖ్యాతిగాంచిన లాల్‌బాగ్‌రాజా గణపతిని చివరి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాధుడి శోభాయాత్రను నిర్వహించారు. బ్యాండ్‌ బాజాల మధ్య యువత కేరింతలు కొడుతూ శోభాయాత్రను నిర్వహించారు.
గుజరాత్
అటు గుజరాత్‌లోనూ గణేశ్‌ నిమజ్జనం కన్నులపండుగగా జరిగింది. నిమజ్జనం సందర్బంగా యువత ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ..నిమజ్జనానికి ప్రత్యేకశోభను తీసుకొచ్చారు. గుజరాత్‌లోని జునాగఢ్‌ వద్ద ఏర్పాటు చేసిన గజల్స్‌ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా బీజేపి ఎంపీ రాజేశ్ చుడస్మా గజల్స్ ఆలపిస్తున్న బృందంపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
పంజాబ్‌
ఇక పంజాబ్‌లోనూ గణేశ్‌ నిమజ్జనం కన్నుల పండుగగా జరిగింది. లుథియానాలో వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. బ్యాండ్‌బాజాలతో గణనాధుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అటు భోపాల్‌లోనూ గణేశ్‌ నిమజ్జనం అత్యంత కోలాహలంగా జరిగింది. ప్రేమ్‌పురా ఘాట్‌లో గణేశ్‌ విగ్రహాల్ని అత్యంత భక్తిశ్రద్దలతో భక్తులు నిమజ్జనం చేశారు. బైబై గణేశా అంటూ వినాయకుడికి వీడ్కోలు పలికారు.
ఢిల్లీ
దేశరాజధాని ఢిల్లీలో గణేశ్‌ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. 11రోజుల పాటు వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించిన భక్తులు..చివరి రోజు కన్నులపండుగగా గణేశ్‌ విగ్రహాలను యమునానదిలో నిమజ్జనం చేశారు. గణేశ్‌ నిమజ్జనం సందర్బంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో గణేశ్‌ నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. 

నేడు షార్ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం

నెల్లూరు: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-30ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన లక్ష్యంతో ఆస్ట్రోశాట్ ప్రయోగం నిర్వహిస్తున్నారు. 

08:49 - September 28, 2015

నెల్లూరు : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-30ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఆస్ట్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ-30 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఖగోళ వస్తువుల పరిశీలన లక్ష్యంతో ఆస్ట్రోశాట్ ప్రయోగం నిర్వహిస్తున్నారు.
సాంకేతికంగా భారతదేశం మరో ముందడుగు 
సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. పీఎస్ఎల్వీ సీ-30ని సోమవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించనుంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. 50 గంటల తర్వాత రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.
తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్
భారత్ నింగిలోకి పంపుతున్న తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ ఇది. దీని బరువు 1513 కేజీలు. దీంతో పాటు ఇండొనేషియాకు చెందిన లపాన్-ఏ2 శాటిలైట్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-14...అమెరికాకు చెందిన నాలుగు నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ సీ-30 నింగిలోకి తీసుకెళుతోంది. ఈ ప్రయోగానికి సుమారు 350 కోట్లు ఖర్చు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అస్ట్రోశాట్‌ రూపొందించేందుకు 178 కోట్లు వెచ్చించారు. ఇప్పటివరకు మన దేశానికి ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేదు. గతంలో పంపిన పరికరాలను ఇతర ఉపగ్రహాలతో అనుసంధానం చేసి పంపేవారు. ఈ ఉపగ్రహ తయారీకి సూర్యనారాయణ శర్మ సారథ్యం వహించారు. ఈ ఆస్ట్రోనాట్ ఐదు సంవత్సరాల కాలం పని చేస్తుందని ఈ సమయంలో 300 టెర్రాబైట్ డేటాను సేకరిస్తుందని స్పేస్ సెంటర్ అధికారులు తెలిపారు.

 

08:45 - September 28, 2015

వరంగల్ : పాలకుర్తిలో మంత్రి కడియం పర్యటన రసాభాసగా మారింది. పర్యటనను అడ్డుకునేందుకు ఎర్రబెల్లి నేతృత్వంలో టీడీపీ వర్గీయులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ పెనుగులాటలో ఎర్రబెల్లికి గాయాలయ్యాయి. మరోవైపు టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు, రాళ్లు విసురుకోవడంతో... పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పాలకుర్తి ఎస్సై ఇస్మాయిల్ కు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వీరిపై లాఠీఛార్జ్ చేశారు. దాడిలో గాయపడ్డ ఎస్సై ఇస్మాయిల్ ను తొర్రూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

కాలిఫోర్నియాలో మోడీ ప్రసంగం...

కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగానికి 18 వేల మంది ఎన్ ఆర్ ఐలు హాజరయ్యారు. ప్రవాస భారతీయుల సేవలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఎన్ ఆర్ ఐలు దేశాభివృద్ధికి పాటుపడుతున్నారంటూ అభినందించారు. మేధో వలస మేధో సంపద సృష్టిస్తోందన్నారు. భారత్ కొత్త ఇమేజ్ వచ్చిందన్నారు. భారత ముద్దుబిడ్డ భగత్ సింగ్ కు కోటి వందనాలు సమర్పించారు.

 

ఎర్రబెల్లిని జనగాం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు

వరంగల్ : టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు జనగాం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. నిన్న పాలకుర్తిలో ఎస్సైపై దాడి ఘటనలో ఎర్రబెల్లిపై 120బి, 143, 147, 148, 322, 290, 324, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

08:24 - September 28, 2015

హైదరాబబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3 లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టీఎస్ 08ఈసీ 1702 నెంబర్ గల కారులో శరత్ చంద్ర, నరేన్, తేజలు, కార్తీర్ రెడ్డిలు ప్రయాణిస్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శరత్ చంద్ర, నరేన్, తేజలు మృతి చెందారు. కార్తీక్ రెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స నిమ్తితం అతన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు.

 

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3 లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. 

07:49 - September 28, 2015

హైదరాబాద్ : శోభయాత్రకు ఖైరతాబాద్ త్రిశక్తిమయ గణనాధుడు సిద్ధమవుతున్నాడు. పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికాసేపట్లో గణనాధుని శోభయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం తర్వాతే ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం జరుగనుంది. 

07:48 - September 28, 2015

హైదరాబాద్‌ : నగరంలో గణేశ్ నిమజ్జనం కన్నులపండువగా కొనసాగుతోంది. గణేష్‌ శోభాయాత్రతో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అశేష భక్తజన సందోహం మధ్య నిమజ్జనానికి నగరంలోని విగ్రహాలు ఒక్కొక్కటిగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటున్నాయి. యువత సందడితో నగర వీధులన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి.
వేలాది గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌సాగర్ వైపు
నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌సాగర్ వైపు కదిలాయి. నగరంలోని 9 ప్రధాన మార్గాల ద్వారా ట్యాంక్‌బండ్‌కు విగ్రహాలు చేరుకున్నాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు 25 చెరువుల్లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సందడి
భారీ క్రేన్లతో నిమజ్జనం చేస్తున్న బొజ్జ గణపయ్యలను తిలకించేందుకు వచ్చిన భక్తుల కోలాహలంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. డప్పువాయిద్యాల శబ్దాలు, జైబోలో గణేశ్‌మహరాజ్‌కీ జై.. నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. గణేశుడి శోభాయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. నృత్యాలు, డప్పు వాయిద్యాలతో శోభాయాత్రను మరింత ఉత్సాహంగా మార్చేశారు. శోభాయాత్రలో చిన్నారులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
కూకట్‌పల్లి అడ్డగుట్ట గణేశుడి లడ్డూకు రికార్డు ధర
హైదరాబాద్‌ కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలో గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు ధరను సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన వేలంలో నెల్లూరుకు చెందిన చంటిరెడ్డి అనే వ్యక్తి 15లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణలోని లడ్డూ వేలాల్లో ఈ ధరే అత్యధికమని నిర్వాహకులు చెబుతున్నారు.
25 వేల భద్రతా సిబ్బంది ఏర్పాటు
వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి నిమజ్జనం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌లో వినాయకుల నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య ప్రశాంతంగా కొనసాగుతోంది.

 

 

మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాధుని శోభయాత్ర

హైదరాబాద్ : శోభయాత్రకు ఖైరతాబాద్ త్రిశక్తిమయ గణనాధుడు సిద్ధమవుతున్నాడు. పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికాసేపట్లో గణనాధుని శోభయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం తర్వాతే ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం జరుగనుంది. 

Don't Miss