Activities calendar

29 September 2015

22:40 - September 29, 2015

బాలీవుడ్ బామలు ఏమడిగినా తిన్నగా సమాదానం చెప్పరు సరికదా. ప్రశ్నించినవారి దిమ్మదిరిగే కౌంటర్లిస్తుంటారు. విషయంలోకి వెళ్తే.. తమిళ అగ్రదర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తాజాగా రూపొందబోయే 'రోబో2' చిత్రంలో దీపికా పదుకునె నటిస్తుందనే వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని మీడియా దీపికను ప్రశ్నించగా 'నేనా రోబో-2లో నా' అని సంతూర్ యాడ్ లెవెల్లో ప్రశ్నించిందంట. గత కొన్ని రోజులుగా సామాజిక మీడియాలో వస్తున్న ఈ వార్తలన్ని రూమర్లేనని, ఈ చిత్ర విషయమై ఎవ్వరూ తనని కలవలేదని దీపిక చెప్పింది. 'ఐ' చిత్ర ఘోర పరాజయం తర్వాత దర్శకుడు శంకర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో 'రోబో2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'రోబో'లో రజనీకాంత్‌ సరసన ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. దీని సీక్వెల్‌గా రూపొందుతున్న 'రోబో2' చిత్రంలో రజని సరసన ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని 2డి, 3డి ఫార్మెట్స్‌ల్లో తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్‌ వర్క్‌ని ప్రారంభించారు కూడా. 'రోబో', 'బాహుబలి' చిత్రాలకు పని చేసిన సాంకేతిక నిపుణుల్నే ఈచిత్రానికి కూడా ఉపయోగిస్తున్నారట. ఈ సినిమాలో దీపిక హీరోయిన్ కాదనేది స్పష్టమవ్వడంతో మరి ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 

స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ నివేదిక సిద్ధం : చంద్రబాబు

విజయవాడ : భారత దేశాన్ని ఒక స్వచ్ఛ భారత్‌గా తయారు చేయడం కోసం అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌పై నీతి అయోగ్‌ నివేదిక సిద్ధమైందని అన్నారు. నాతో పాటు తొమ్మిది మంది సీఎంలు కమిటీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఒక పక్క వ్యక్తి గత మరుగుదొడ్లు, కమ్యూనిటీ మరుగుదొడ్లు, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం, మురుగు నీటీకి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం, పడగొట్టిన భవనాల మెటిరియల్‌ను తిరిగి రీ సైక్లింగ్‌కు చేయడం...

21:38 - September 29, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో నితీష్‌ను అడ్డుకోవడానికి బిజెపి కుయుక్తులు పన్నుతోంది. నవాడా ఎన్నికల సభలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రసంగాన్ని బిజెపి కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. మోదికి మద్దతుగా బిజెపి జెండాలు ప్రదర్శిస్తూ- నితీష్‌ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఎన్నికలను ఎదుర్కోలేకపోతున్న బిజెపి ఇలాంటి చీప్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని జెడియు ధ్వజమెత్తింది. ఓటమి భయంతో నిరాశకు లోనైన బిజెపి శ్రేణులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత వసిష్ట నారాయణ్‌సింగ్‌ అన్నారు. 

21:36 - September 29, 2015

హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రిజర్వేషన్ల పేరిట జనాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విద్వేషాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో లాలూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై లాలూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనని ఉరి వేసినా దళిత, బిసి వర్గాల రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని లాలు ప్రకటించారు. లాలూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అన్యాయమని, బిజెపి కక్ష్యపూరిత చర్యలకు దిగుతోందని జెడియు నేత కెసి త్యాగి పేర్కొన్నారు. 

21:34 - September 29, 2015

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖలో బిజీబిజీగా గడిపారు. విశాఖ స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌పై సమీక్షతో పాటు.. జాతీయ విప్‌ల సదస్సులో బాబు పాల్గొన్నారు. ఫార్మా పరిశ్రమల సమస్యలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన....

విశాఖపట్టణంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన నోవాటెల్‌ హోటల్‌లో 17వ జాతీయ విప్‌ల సదస్సు కొనసాగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెల ప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ చక్రపాణితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 179 మంది చీఫ్‌ విప్‌లు, పార్లమెంటరీ, శాసనసభ వ్యవహారాల మంత్రులు హాజరయ్యారు.

పార్లమెంటరీ వ్యవస్థను అందరూ గౌరవించాలని.....

పార్లమెంటరీ వ్యవస్థను అందరూ గౌరవించాలని.. సభ్యులు చాలా సందర్భాల్లో సభకు హాజరుకాకపోవడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలు, పద్ధతులపై ఎక్కువ సదస్సులు జరగాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు.

చంద్రబాబును కలిసిన అదితి తండ్రి శ్రీనివాసరావు......

జాతీయ విప్‌ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబును అదితి తండ్రి శ్రీనివాసరావు కలిశారు. గత నాలుగు రోజుల క్రితం మిస్సయిన కూతురు ఆచూకీ త్వరగా లభించేలా చూడాలని చంద్రబాబును కోరగా.. ఆ మేరకు కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

ఫార్మా పరిశ్రమల ప్రతినిధులతో .....

ఇక ఫార్మా పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు.. ఫార్మా పరిశ్రమలకు అనుమతులు, రాయితీల విషయంలో ప్రభుత్వం సరళంగా వ్యవహరిస్తుందన్నారు. కాలుష్యం, భద్రత విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఫార్మా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 

21:30 - September 29, 2015

హైదరాబాద్: నగరాలు అడవులుగా మారిపోయాయి. జనారణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను కూంబింగ్‌ చేసిన పద్ధతిలో వామపక్షాల కార్యకర్తలను వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఆఫీసు అయినా, ఇల్లు అయినా.. ఏదైనా సరే యధేచ్ఛగా లోపలికి చొరబడిపోతున్నారు పోలీసులు. అల్లర్లు జరిగే ప్రాంతంలో మోహరించినట్లుగా లెఫ్ట్‌ కార్యాలయాల చుట్టూ పోలీసులు మాటు వేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ రేపు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా తాము మాత్రం చలో అసెంబ్లీ నిర్వహించి తీరతామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నేతలు స్పష్టం చేస్తున్నారు.

కేసీఆర్ కు చేతగాకనే ఎన్ కౌంటర్ : విమలక్క...

హైదరాబాద్ : ఆడ బిడ్డలను పైశాచికంగా ఎన్‌కౌంటర్‌ చేయడం దారుణమని, చిత్రహింసలు పెట్టిచంపాల్సిన అవసరమేమొచ్చిందని విమలక్క తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను ఏలుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌కు చేతగాక ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని విమలక్క అన్నారు.

పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు..

హైదరాబాద్ : రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఎంబీ భవన్, మగ్ధూం భవన్ లలో పోలీసులు సోదాలు నిర్వహించి పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు.

కాకతీయ యూనివర్శిటీలో పోలీసులు సోదాలు

వరంగల్ : రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో కాకతీయ యూనివర్శిటీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పిడిఎస్ యూ నేత సారయ్య సహా విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

20:42 - September 29, 2015

హైదరాబాద్ : గుప్పెడంత గుండె.. కానీ అదిచేసే ఉప్పెనంత శబ్ధం మాత్రం ఒక్కటే అదే తస్మాత్ జాగ్రత్త. ఏంటి ఇంతకీ మన గుండె మనకి ఏం చెబుతోంది? తనని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతోంది. తెలిసి చేసిన నిర్లక్ష్యం తెలియకుండానే నిన్ను కబళిస్తుందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినం. నేటికీ మన సమాజంలో గుండె జబ్బులే అతి పెద్ద మరణ కారణంగా నిలుస్తోంది. దీనికి కారణాలు ఏమిటి? ఈ అంశాలపై నేటి వైడాగింల్. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సింగపూర్ కు మంత్రి నారాయణ బృందం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం మంగళవారం రాత్రి సింగపూర్‌ పర్యటనకు బయలుదేరనుంది. ఆ బృందంలో ఇరిగేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌, అర్‌అండ్‌బీ నిపుణులు ఉన్నారు. ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు ఈ బృందం తుది మెరుగులు దిద్ధనుంది. అక్టోబర్ 22న నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే.

ప్రశ్నించే వాళ్లంతా మావోయిస్టులేనా? : గోవర్థన్

హైదరాబాద్ : ప్రభుత్వాన్వి ప్రశ్నించే వాళ్లంతా మావోయిస్టులేనా? అని న్యూడెమొక్రసి నేత గోవర్ధన్ సర్కార్‌ ప్రశ్నించారు. మావోయిస్ట్ ముద్రతో ఎవరినైనా అరెస్టు చేయదలచుకుంటే.. ముందు సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తామని చెప్పి... మాట తప్పిన కేసిఆర్‌ను ఎందుకు అరెస్టు చేయరని గోవర్ధన్ ప్రశ్నించారు.

ఎన్నికల ప్రచారంలో రికార్డింగ్ డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి

హైదరాబాద్ : జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయత్నం చేశారు.ఈ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభయ్ కుష్వాహా ఓ లేడీ డాన్సర్‌తో కలిసి చిందేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇలా రికార్డింగ్ డ్యాన్సు చేయడం ఇప్పుడు బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధమైన ఎన్నికల ప్రచారాన్ని తాము ఎక్కడా చూడలేదని పలువురు బీహార్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆర్జేడీ అధినేత లాలూ పై ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్ : బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈసీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాలూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మంత్రి కేటీఆర్ ను కలిసిన టీఎన్జీవో నేతలు..

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కె. తారక రామారావును మంగళవారం సాయంత్రం టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి తదితరులు కలిశారు. పంచాయతీ ఉద్యోగుకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పాత పద్ధతిలో ఈవోగా మార్చాలని టీఎన్జీవో నేతలు కేటీఆర్‌ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఏసీబీ వలలో మండల సర్వేయర్ శ్రీనివాస్

కరీంనగర్ : జగిత్యాలలో మండల సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ఏసీబీ) చిక్కాడు. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

స్నాతకోత్సవానికి డ్రెస్ కోడ్ తో పనిలేదు : హెచ్ సీయూ వీసీ

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) స్నాతకోత్సవానికి ఇకపై డ్రెస్ కోడ్ తో పనిలేదు. ఈ విషయాన్ని వర్శీటీ వీసీ అప్పారావు వెల్లడించారు. డ్రెస్ కోడ్ కారణంగా స్నాతకోత్సవ సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. డ్రెస్ కోడ్ అనేది బ్రిటీష్ కాలం నాటిదని, ఆ సంప్రదాయానికి స్వస్తి చెబుతున్నామని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతి లోనే స్నాతకోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. స్నాతకోత్సవ రోజున డిగ్రీ పట్టాలు స్వీకరించే విద్యార్థులు ఏ దుస్తులైనా ధరించవచ్చని అప్పారావు వివరించారు. 

చైన్ స్నాచర్లపై ఆందోళనకు గురికావొద్దు : డీసీపీ

హైదరాబాద్ : నగరంలో మగళవారం వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న గొలుసు దొంగతనాలపై వెస్ట్ జోన్ డీసీపీ వెంటకేశ్వరరావు స్పందించారు. సంఘటనలు జరిగిన ప్రాంతాల్లోని పీఎస్ లను పరిశీలించారు. గొలుసు దొంగతనాలపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ఆయన సూచించారు. ఇప్పటికే చాలా మంది గొలుసు దొంగలను అరస్ట్ చేసి వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటలన్నీ పరిశీలిస్తే వేరే రాష్ట్రానికి చెందిన ముఠాలే చేసినట్లు కనిపిస్తోందని... వీరిని త్వరలో పట్టుకుంటామన్నారు.

యువతిని కొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్

హైదరాబాద్: ముంబైలోని ప్రఖ్యాత లాల్ బాగా రాజా వినాయక మండలంలో యువతిని కొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 25న వినాయక మండపంలో వీఐపీ గ్యాలరీలోకి ప్రవేశిస్తున్న యువతిపై మహిళా కానిస్టేబుళ్లు దాడి చేసిన కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..

ఐఏఎస్ అధికారి ఇలంబరిదికి 4 నెలల జైలు శిక్ష

హైదరాబాద్ : కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ఇలంబరిదికి హైకోర్టునాలుగు నెలల జైలు శిక్ష విధించింది. భూ సేకరణలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని 2013లో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఇలంబరిదిని హైకోర్టు ఆదేశించింది. అయితే తనకు పరిహారం ఇవ్వలేదని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైవ ఇచారించిన హైకోర్టు తమ ఆదేశానలు ఎందుకు పాటించలేదని ఇలంబరిదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు పాటించనందుకు ఇలంబరిదితో పాటు సత్తుపల్లి డీఈ శ్రీనివాసరెడ్డికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

రేపు చలో అసెంబ్లీని నిర్వహించి తీరుతాం : టీడీఎఫ్

హైదరాబాద్ : రేపు చలో అసెంబ్లీని నిర్వహించి తీరుతామంని టీడీఎఫ్ నేతలు స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 వందల మంది వామపక్ష నేతలను అరెస్టు చేశారని తెలిపారు. ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వం వ్యహరిస్తోందని మండి పడ్డారు. రేపు ఉదయం 10గంటలకు ఎస్ వీకే నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

అనంతపురంలో సూదిగాడి కలకం

హైదరాబాద్ : అనంతపురంలోని హౌసింగ్ బోర్డుకాలనీలో సురేష్ అనే వ్యక్తికి సూది గుచ్చి దుండగుడు పరారయ్యాడు. బాధితుడిని ప్రపభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రేపటి చలో అసెంబ్లీకి అనుమతి లేదు : డీసీపీ

హైదరాబాద్: రేపటి చలో అసెంబ్లీ ధర్నాకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అసెంబ్లీకి కిలో మీటర్ దూరం నుంచే భారీ భద్రతను చేపట్టామని, పలు ఆంక్షలు విధించామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆంక్షలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

19:31 - September 29, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని పేరుతో రైతుల వద్ద భూములు లాక్కుని వ్యాపారం చేయబోతోందా?అమరావతిలో కోరుకున్న చోట కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వబోతోందా? ,కంపెనీలకు అవసరమైతే మాస్టర్ ప్లాన్ కూడా మార్పులు చేస్తామన్న బాబు!అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోందా?కార్పొరేట్ జపం చేస్తున్న ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు వెత్తుతున్నాయా? భూములిచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళ కలుగుతోందా? ఇత్యాది అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రవిచంద్రా రెడ్డి, టిడిపినేత శ్రీరాములు, సీపీఎం నేత తులసీదాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:21 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో రైతు బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యల నివారణతో పాటు.. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాదనే అంశాలపై కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ వివరించారు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:18 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై కదం తొక్కేందుకు ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో రేపు చలో అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. ఓవైపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తుండగా.. ఎలాగైనా నిర్వహించి తీరాలనే పట్టుదలతో టీడీఎఫ్‌ నేతలున్నారు. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

సెప్టెంబర్‌ 14న వరంగల్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ......

రాష్ట్ర సర్కార్ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆందోళన బాట చేపట్టబోతుంది. సెప్టెంబర్ 14న వరంగల్ జిల్లా మెడారంలో జరిగిన శృతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్లకు నిరసనగా బుధవారం నాడు ఛలోఅసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి 370 ప్రజాసంఘాలతో పాటు,.. పలువురు మేధావులు, కవులు మద్దతు తెలిపారు.

చలో అసెంబ్లీకి పోలీసుల అనుమతి నిరాకరణ.....

ఇప్పటికే ప్రజాస్వామిక వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ధర్నాలు, ఆందోళనలకు అనుమతిచ్చేది లేదంటున్నారు. ఇది ఇలా ఉంటే ఎలాగైనా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని నేతలంటున్నారు.

రైతు ధర్నాకు తరలివస్తున్న రైతులు......

మరోవైపు రైతు సమస్యలపై హైదరాబాద్‌లో జరుగుతున్న ధర్నాకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు కూడా బయల్దేరుతున్నారు. బుధవారం నాడు చలో అసెంబ్లీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు భారీ ఎత్తున తరలివస్తున్న రైతులు, ప్రజాసంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పలువురిని అరెస్ట్‌ చేసి పోలీసులు.. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వస్తే సమస్యలన్నీ తీరుతాయని భావించిన తమకు నిరాశే ఎదురయ్యిందని పలువురు వాపోతున్నారు.

సర్కార్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా....

ఏదిఏమైనా.. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని ఓవైపు టీడీఎఫ్‌ నేతలు ప్రకటించగా.. అణిచివేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. 

19:15 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ఇవాళ స్వైన్‌ ఫ్లూతో మహిళ మృతి చెందింది. ఇప్పటి వరకు స్వైన్‌ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 7 కు చేరుకుంది. మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. 

19:13 - September 29, 2015

హైదరాబాద్ : విశాఖపట్టణం డ్రైనేజీలో గల్లంతైన అదితి తండ్రి శ్రీనివాస్ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు వద్ద తన బాధను వినిపించారు. తమకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే తన బడ్డ బతికే ఉన్నట్టు అనుమానం కలుగుతోందని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

19:10 - September 29, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పోలీసింగ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే విషయంపై ఏపీ హోంశాఖ దృష్టిపెట్టింది. విజయవాడతోపాటు అమరావతి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో సమర్థ పోలీస్ అధికారులను నియమించేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది.

బెజవాడ కేంద్రంగా...

ఏపీ పరిపాలనా వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు బెజవాడ కేంద్రంగా సాగడంతో చంద్రబాబుకు భద్రతా వ్యవహారాలు కీలకంగా మారాయి. అంతేకాకుండా చంద్రబాబు కాన్వాయ్ కు భద్రతను మరింత పెంచడంతోపాటు కీలకంగా మారిన విజయవాడ నగరాన్ని పోలీస్ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

చంద్రబాబు కాన్వాయ్‌కు సెక్యూరిటీ....

విజయవాడ నగరంలో అదనపు పోలీస్ బలగాలతోపాటు చంద్రబాబు కాన్వాయ్‌కు సెక్యూరిటీ పెంచాలని విజయవాడ సీపీ గౌతం సవాంగ్ నివేదిక సమర్పించారు. ముఖ్యంగా గన్నవరం ఎయిర్ పోర్టు మొదలుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు, అక్కడి నుంచి తాడేపల్లి మండలంలో చంద్రబాబు నివాసం వరకు, ఇతర ఉన్నతాధికారులకు భద్రత విషయమై హోంశాఖతోపాటు ఇంటెలిజెన్స్ సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు తన నివాసం నుంచి....

చంద్రబాబు తన నివాసం నుంచి విడిది కార్యాలయానికి చేరుకునే అన్ని మార్గాల్లో భద్రతను పక్కాగా, పకడ్బందీగా పర్యవేక్షించగలిగే సమర్థత, నైపుణ్యత, ఓర్పు, నేర్పు ఉన్న ఉన్నతస్థాయి అధికారులను గుర్తించి వారిని ఏరికోరి రాజధాని ప్రాంతానికి తరలించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుండటంపై పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశం కాబోతోంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, అమరావతి ప్రాంతాలకు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తరచూ రాకపోకలు సాగిస్తున్నారు. అక్టోబర్ 22 తర్వాత నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారగణం సమర్థ పోలీస్ అధికారుల జాబితా సిద్ధం చేసే పనిలో నిగమ్నమైంది.

ఏపీ హోంశాఖ దృష్టి....

అదనపు సిబ్బంది, బలగాలను విజయవాడ, గుంటూరు నగరాలకు తరలించే విషయం కూడా ఏపీ హోంశాఖ దృష్టిసారించింది. పాలనలో మంచి పట్టున్న గౌతం సవాంగ్ తోపాటు గతంలో విజయవాడలో నాలుగైదేళ్లపాటు సమర్థవంతమైన పనితీరు కనబర్చి పైకేడర్ లో ఉన్న ఉన్నతాధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద రాబోయే రోజులలో విజయవాడ నగరం, గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి ప్రాంతాలను పోలీస్ కనుసన్నల్లో నడవబోతోంది.

19:05 - September 29, 2015

శ్రీకాకుళం :ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. నిజమే. ఏ ఆధారం లేని వారికి కావాల్సింది.. చెవులకు ఇంపుగా ఉండే నీతులు కానేకాదు. కడుపు నింపే సాయం. అందుకే మానవత్వం మూర్తీభవించిన ఓ సామాన్య వ్యక్తి పేదలకు అండగా నిలిచాడు. ప్రతి రోజూ అన్నదానం చేస్తూ తన ఔదర్యాన్ని చాటుకుంటున్నాడు.

నిత్యాన్నదానం చేస్తున్న చిరు వ్యాపారి.....

తన స్వార్థం కోసం ఇతరులను నిండాముంచుతున్న కలికాలంలో...సమాజ సేవ కోసం కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చుచేస్తున్నాడీ సామాన్యుడు. పేరు వారణాసి జగన్నాధస్వామి. ఊరు శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామం. రోజూ సైకిల్‌పై ఇల్లిల్లు తిరిగి అప్పడాలు, వడియాలు అమ్ముతాడు. ఆ వచ్చిన డబ్బుతో ఊళ్లో అన్నదానం చేస్తాడు.

16 ఏళ్లుగా రోజూ 30 మందికి అన్నదానం....

తన ఆదాయంతో పాటు దాతల సహకరంతో నిత్య అన్నదానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు. 16 ఏళ్లుగా రోజూ ముప్పై మందికి... నెలలో చివరి ఆదివారం సుమారు మూడువందల మందికి అన్న సంతర్పణ చేస్తున్నాడు. జగన్నాధ స్వామి చేస్తున్న సేవకు తన ఇద్దరు కుమారుల సహకారం, మిత్రుల సహాయం ఊతమిస్తోంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా అన్నదానం కొనసాగుతూ వస్తోంది.

అన్నార్థుల ఆకలి తీర్చేందుకు కొన్నిసార్లు అప్పులు....

ఆకలితో అలమటించే వారికి ఆపన్నహస్తంగా నిలుస్తున్నాడు. పక్కవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావిస్తున్నాడు. అందుకోసం అప్పు చేయడానికైనా వెనుకాడటం లేదు. అప్పడాలు, ఒడియాలు అమ్ముడుపోని రోజుల్లో...అప్పుచేసి మరి అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వస్తున్న ఫలసాయ ఆదాయాన్ని కూడా అన్నదానానికే వెచ్చిస్తున్నాడు. తన పొలంలోనే చిన్న పాటి షెడ్డు నిర్మించి.. శ్రీరామ ధర్మ క్షేత్రం నిత్యాన్నదాన నిలయంగా నామకరణం చేశాడు. అంతేకాదు అన్నదాన సమయాల్లో రామాయణ, మహాభారతం పురాణ గాధలు వినిపిస్తూ.. ఆధ్యాత్మిక చింతన కలిగిస్తున్నాడు. పేదల కడుపునింపడం తనకెంతో తృప్తినిస్తుందని జగన్నాధస్వామి చెబుతున్నాడు. తన చివరి శ్వాస వరకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటున్నాడు.

ఎలాంటి లాభాన్ని ఆశించకుండా....

ఎలాంటి లాభాన్ని ఆశించకుండా నిత్య అన్నదానం చేస్తున్న జగన్నాధస్వామి సేవలను గ్రామస్తులు కొనియాడుతున్నారు. డబ్బుండి సాయం చేసేందుకు వెనకాడేవారికన్నా ఈ సామాన్యుడు ఆదర్శప్రాయుడని ప్రశంసిస్తున్నారు.

ఏపీలో పెట్రోలు పై వ్యాట్ తగ్గించాలి : డీలర్లు...

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో డీలర్లు ఆందోళనను ఉధృతం చేశారు. పెట్రోల్‌పై పెంచిన వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అక్టోబర్‌ ఒకటి నుంచి పెట్రోల్‌ బంక్‌లను నిరవధికంగా బంద్‌ చేస్తామని వారు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో సమావేశం అయిన డీలర్లు నిరవధిక బంద్‌ పోస్టర్లను విడుదల చేశారు.

నక్షత్ర బిల్డర్స్ అధినేత కొండారెడ్డి ఆస్తుల జప్తు...

ప్రకాశం ఒంగోలులోని మైత్రీ ప్లాంటేషన్‌, నక్షత్ర బిల్డర్స్‌ కంపెనీ అధినేత కొండారెడ్డి, భాగస్వాముల ఆస్తులను జప్తు చేశారు. 370 ఎకరాలు, 3469 గజాల స్థలాన్ని జప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రియల్ ఎస్టేట్‌లో మోసాలకు పాల్పడుతూ డిపాజిటర్లకు రూ.100 కోట్ల మేర నష్టాన్ని కలిగించినందుకు జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

షీనా బోరా హత్య కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్: షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఇవాళ సీబీఐ అధికారులు కేసులో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న షీనాబోరా తల్లి ఇంద్రాణీ ముఖర్జీయా, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ మనోహర్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వివరాలు.. 2012 ఏప్రిల్‌లో షీనాను పై ముగ్గురు నిందితులు హత్య చేశారు. అనంతరం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న షీనా మృతదేహాన్ని రాయ్‌గఢ్ అడవిలో పడేశారు. గుర్తుపట్టని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో- బైక్ : ఒకరు మృతి

గుంటూరు : చెరుకుపల్లి మండలం పొన్నపల్లి వద్ద మంగళవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాకా కోటేశ్వరరావు(21) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతిచెందిన యువకుడి స్వగ్రామం నగరం మండలం పెద్దవరం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

కార్మిక యూనియన్లు పెడితే ఊరుకోం : సీఎం చంద్రబాబు

విశాఖ :పరిశ్రమల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇచ్చేలా టాస్క్ ఫోర్స్ పని చేస్తుందని తెలిపారు. పరిశ్రమల్లో కార్మిక యూనియన్లను పెడితే ఊరుకోమన్నారు. పారిశ్రామికాభివృద్ధికి కార్మిక యూనియన్లు అడ్డంకిగా మారుతున్నాయన్నారు. ఏ పార్టీ అయినా పరిశ్రమల్లో యూనియన్లు పెడితే యాజమాన్యాలు మాకు సమాచారమివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో టీడీపీ నేత లాలం భాస్కర్ రావుకు క్లాస్ పీకాడు. ఫార్మాసిటీలో రాజకీయం ప్రమేయం తగ్గించాలని సూచించారు.

ముషీరాబాద్‌లో దారుణం

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో దారుణం జరిగింది.  కూతురితో సహా ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముషీరాబాద్ ప్రశాంత్ టవర్స్‌లో నివాసముండే శ్వేత అనే మహిళ తన నాలుగేళ్ల కూతురు ఐశ్వర్యతో కలిసి ఉంటోంది. అయితే... మంగళవారం సాయంత్రం కూతురికి నిప్పటించిన ఆమె, తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటరితనాన్ని భరించలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

టపాసుల కంపెనీలో పేలుడు : నలుగురు మృతి

హైదరాబాద్: యూపీలోని ఓ టపాసుల కంపెనీలో సంభవించిన పేలుడులో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. గోసాయిగంజ్ ప్రాంతంలోని టపాసుల తయారీ కంపెనీలో కార్మికులు టపాసులు తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో కంపెనీలో పనిచేస్తోన్న అలీముద్దీన్(60), అన్వారి (55), గుడియా (25), ఖుష్బూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

విజయనగరంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

విజయనగరం:ఎస్.కోటలోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విద్యార్థిని కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది.

సోమ్ నాథ్ భారతికి 2 రోజుల పోలీస్ కస్టడీ

హైరదాబాద్ : గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి 2 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. కొద్ది రోజులుగా అజ్ఞాతంలో గడిపిన సోమనాథ్ భారతి నిన్న ఢిల్లీలోని ద్వారాక పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

కొందుర్గులో అంగన్ వాడీ కార్యకర్త నిర్వాకం...

మహబూబ్ నగర్ : కొందుర్గులో అంగన్ వాడీ కార్యకర్త యామిని 15 మంది చిన్నారులను గదిలో పెట్టి తాళం వేసి సొంత పని మీద బటయకు వెళ్లింది. 3 గంటల పాటు గదిలోపలే చిన్నారులు ఉండిపోయారు. పిల్లల ఏడుపులు విని స్థానికులు తాళం పగలగొట్టారు.

మార్పు కోసమే రాజకీయాల్లోకి : గాలి వినోద్

వరంగల్ తాను మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు వామపక్షాల అభ్యర్ధిగా ఎంపికైన ప్రొ. గాలి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం తెలంగాణలో ఎవరికీ స్వేచ్చ లేదన్నారు. అలాగే హింసకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తాడని ఆయన ప్రశ్నించారు. 

17:07 - September 29, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయ సరిహద్దులో ఎలాంటి గోడ నిర్మాణం చేపట్టే ఆలోచన భారత్‌కు లేదని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐజి స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఎల్వోసి వద్ద భారత్‌ గోడ నిర్మాణం చేపడుతోందని పాకిస్తాన్‌ సెప్టెంబర్‌ 9న ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ఫిర్యాదు చేసింది. 197 కిలోమీటర్ల పొడవు 10 మీటర్ల ఎత్తుతో భారత్‌ గోడ కడుతున్నట్టు యుఎన్‌ఓలో పాక్‌ రాయబారి మలీహా లోధి సెక్యూరిటీ కౌన్సిల్‌కు లేఖ రాస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్బుల్‌ ముజాహిదిన్‌ నేత సయీద్‌ సలావుద్దీన్‌ ప్రకటన ఆధారంగా పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసినట్టు భారత్‌ పేర్కొంది.

17:04 - September 29, 2015

హైదరాబాద్ : ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ముంబై డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్, తాజ్‌ హోటల్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై ఎయిర్‌పోర్ట్, తాజ్‌ హోటల్‌పై బాంబులతో దాడులు జరుపుతామని ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌కు నిన్న రాత్రి ఫోన్‌ కాల్‌ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మూడు చోట్ల వాహనాల్లో పేలుడు పదార్థాలు పెట్టినట్టు కూడా అజ్ఞాతవ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. ఇది ఫేక్‌ కాల్‌ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఎయిర్‌పోర్టు, తాజ్‌ హోటల్‌ వద్ద భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. 2008లో నవంబర్‌లో తాజ్‌ హోటల్‌పై పాక్‌ ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. 

17:01 - September 29, 2015

హైదరాబాద్ : లారీ యజమానులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 72 లక్షల లారీలు, ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. దీని ప్రభావం పెట్రోల్ బంక్ ల మీద కూడా పడే అవకాశం వుంది. సరుకు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీల ఓనర్స్ సమ్మెకు కారణం ఏమిటి? లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య లేమిటి? వీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి?

నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర లారీ ట్రాన్స్ పోర్ట్ దే...

మన దేశంలో సరుకులు, నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నది లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం. మన దేశంలో సరుకుల రవాణా రంగంలో 65శాతం దాకా రోడ్డు మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. కొద్ది రోజుల పాటు లారీల రవాణా స్తంభిస్తే, అనేక గ్రామాలకు, పట్టణాలకు నిత్యావసరాలు అందని పరిస్థితి ఎదురవుతుంది. మన దేశంలో దాదాపు 72 లక్షల లారీలు, ట్రక్కులున్నట్టు అంచనా. అయితే, మన దేశంలో అయిదుకంటే తక్కువ లారీలు కలిగిన యజమానుల సంఖ్యే ఎక్కువ. పదికి మించి లారీలు, ట్రక్కులు కలిగినవారి శాతం చాలా తక్కువ. వందల సంఖ్యలో లారీలున్న యజమానులు మరీ స్వల్పం. ఒకట్రెండు వాహనాలు మాత్రమే కలిగినవారిలో చాలామంది డ్రైవర్లను పెట్టుకోలేక తామే స్వయంగా వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.

విభజన తర్వాత పెరిగిన సమస్యలు..

ఇక రాష్ట్ర విభజన తర్వాత తమ సమస్యలు మరింత పెరిగినట్టు రెండు తెలుగు రాష్ట్రాల లారీల యజమానులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం ప్రవేశపెట్టాలని ఇరు రాష్ట్రాల లారీ యజమానులు కోరుతున్నారు. అయితే, ఈ సింగిల్ పర్మిట్ విధానం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదరకపోవడంతో లారీ యజమానుల మీద ఆర్థికభారం పడుతోంది. టెంపరరీ పర్మిట్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్వం మాదిరిగానే ఇప్పటికీ 23 జిల్లాలకు కలిపి క్వార్టర్ చార్జీలు వసూలు చేస్తుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు ఎక్కువగా వుంది. ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 33శాతం, డీజీల్ 22. 25శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా, అది చాలదన్నట్టు గత ఫిబ్రవరి నుంచి లీటరుకి మరో నాలుగు రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ పేరుతో అధికారులు తమను తరచూ వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు. .....

హైదరాబాద్ తో పాటు ఉభయ రాష్ట్రాల్లోని అనేక పెద్ద పట్టణాలలో లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడైనా రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి, చలాన్లు రాస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ గేట్లు , అక్కడ వసూలు చేస్తున్న టోల్ రుసుములు తమ నడ్డివిరిస్తున్నాయని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా వుండడం. లారీ కిరాయిలపై టీడీఎస్ ను రద్దు చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు. 

16:57 - September 29, 2015

హైదరాబాద్ : రైతుపట్ల రాజ్యానిదెప్పుడూ నిర్లక్ష్యమే. నేతలను ఎన్నుకున్న పాపానికి అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతూనే ఉన్నారు. ప్రకృతి విళయతాండవానికి తోడు.. పాలకుల నిర్లక్ష్యంతో.. రైతులకు పురుగుల మందే పెరుగన్నం అవుతోంది. ఏ రైతు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... ఎక్కడ విన్నా అప్పుల బాధలు, అధిక వడ్డీల పీడలే. ఎవ్వరిని కదిపినా కన్నీటి కథలే. వెరసి.. ఈఏడాది దాదాపు 11వందల 68మంది రైతులు బలవంతంగా ఉసురు తీసుకున్నారు.

తెలంగాణలో 1,168 మంది ఆత్మహత్య......

ఎన్నడూ లేనంతగా తెలంగాణ రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతోంది. ఒక్క తెలంగాణలోనే ఇప్పటి వరకు దాదాపు 11వందల68 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

64మంది మహిళారైతులు, 334 యువరైతుల ఆత్మహత్య....

ఇప్పటి వరకు చనిపోయిన వారిలో 64మంది మహిళా రైతులు ఉన్నారు. యువరైతులు 334 మంది ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డవారిలో 70శాతం కౌలు రైతులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పంటలకు దిగుబడి రాకపోవడం, ప్రకృతి విలయాలు పెరిగిపోవడం.. తీవ్ర వర్షాభావంతో రైతన్నలు కుదేలయ్యారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్‌.. తీవ్ర నిర్లక్ష్యం వహించడం, సకాలంలో రుణమాఫీ చేయకపోవడం, రుణాలు ఇవ్వకపోవడంతో.. రైతన్నలు తనువు చాలిస్తున్నారు.

సిఎం ఇలాఖాలో 55మంది ఆత్మహత్య......

బంగారు తెలంగాణ సాధించుకుంటామని ప్రగల్బాలు పలుకుతున్న... సిఎం సొంత నియోజకవర్గంలో 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలోనే 219 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నారు. మొత్తంగా రైతు ఆత్మహత్యల్లో 90 శాతం పత్తి రైతులే ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 188 మంది. కరీంనగర్‌లో 166 మంది. వరంగల్‌లో 137 మంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 124 మంది. రంగారెడ్డి జిల్లాలో 102 మంది. నల్లగొండలో 102 మంది. నిజామాబాద్‌ జిల్లాలో 74 మంది. ఖమ్మంలో 56 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణ నిండా రైతు సమస్యల పుట్ట....

తెలంగాణ నిండా రైతు సమస్యల పుట్ట, కందిరీగల తుట్టె. కదిపితే కన్నీళ్ల పర్యంతమే. ఇక వ్యవసాయానికి ఏ సాయం లేదు. కాగడా పట్టి చూసినా అభివృద్ధి కానరాదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసి.. రైతు కుటుంబాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇది ముమ్మాటికీ పాలకుల పాపమే అంటోంది రైతాంగం. ఇకనైనా నేతలు పగలు పెంచుకోకుండా... ఈ సమావేశాల్లోనైనా రైతు ఆత్మహత్యలకు పరిష్కారాలు వెతకాలని సర్వాత్ర కోరుకుంటున్నారు. 

16:54 - September 29, 2015

హైదరాబాద్‌ : గాయత్రినగర్‌లో జనావాసాల మధ్య ఉన్న బాలాజీ వైన్స్‌, తిరుమల వైన్స్‌ను అక్కడనుంచి తరలించాలని కాలనీ మహిళలు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కాలనీల మధ్య వైన్‌షాపులు ఉండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగుబాతుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని..వెంటనే వైన్స్‌ను అక్కడి నుంచి తరలించాలని మహిళలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వైన్స్‌ను తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

16:53 - September 29, 2015

హైదరాబాద్‌ : నగరంలోసోమవారం చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక్కరోజులోనే దాదాపు 11 చోట్ల చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. కూకట్‌పల్లిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 

16:51 - September 29, 2015

హైదరాబాద్ : అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగిన సమయంలోనే.. అదే అసెంబ్లీ ఎదురుగా ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు డబ్బా తీసుకుని సెల్‌టవర్‌ ఎక్కిన రైతు సమ్మయ్య.. తనకు 2 లక్షల అప్పు ఉందని.. తీర్చే దారి లేదని.. సీఎంను కలుద్దామంటే పోలీసులు అడ్డుకున్నారని.. అందుకే దిక్కు లేక టవర్‌ ఎక్కానని చెప్పుకొచ్చాడు. అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. పోలీసులు, స్థానికులు నచ్చచెప్పి సమ్మయ్యను టవర్‌ నుంచి దింపి వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమ్మయ్య వరంగల్‌కు చెందినవారుగా తెలుస్తోంది.

ఏయూ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు

విశాఖ : ప్రొఫెసర్లు ప్రసాద్ రెడ్డి, అబ్బులుకు ఏయూ అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక హోదా - యువభేరీ సభకు హాజరయ్యారని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

 

యెమెన్‌లో పెళ్లి బృందం పై దాడి: 131 మంది మృతి

హైదరాబాద్ : యెమెన్‌లోని ఎర్రసముద్రం తీరంలో ఆల్‌మోకా రేవుకు సమీపంలో ఉన్న ఆల్ వాహిజాలో ఓ పెళ్లి బృందంపై నిన్న మిస్సైళ్లతో జరిపిన దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 131కి చేరింది. దాడి జరిగి వెంటనే 27 మంది మృతిచెందారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇవాళ మృతిచెందిన వారితో కలిపి మృతిచెందిన వారి సంఖ్య 131కి చేరింది. అయితే ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని సౌదీ అరేబియా సంకీర్ణ సేనల అధికారులు ప్రకటించారు. ఇది స్థానిక మిలిటెంట్ల పని అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. యెమెన్‌లో పెళ్లి బృందంపై జరిగిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ఖండించారు. 

పంట నష్టానికి పరిహారం చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అకాల వర్షాలు కురిసి పంట నష్టపోయిన తెలంగాణ రైతులకు శుభవార్త. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అకాల వర్షాలు కురిసి పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూప్రకంపనలు..

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో మంగళవారం సాయంత్రం పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్‌ మనోహర్‌

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్‌ మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ఠాకూర్‌ తెలిపారు. అక్టోబర్ 4న ముంబైలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, శశాంక్‌ను ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటన చేశారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన

కరీంనగర్ : ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలంటూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ మాటల గారడీ చేస్తోందన్నారు. గత కొద్ది రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

లోకేష్‌ సభలో విలేకరిని ఈడ్చుకెళ్లిన సీఐ

పశ్చిమగోదావరి : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నల్లజర్లలో ఏర్పాటు చేసిన నారా లోకేష్‌ సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ పత్రికా విలేకరిపై తాడేపల్లిగూడెం సీఐ దౌర్జన్యం ప్రదర్శించారు. విలేకరి చొక్కాపట్టుకుని కొట్టుకుంటూ సీఐ ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి చినరాజప్ప ఎదుట విలేకరుల ఆందోళనకు దిగారు. సీఐపై చర్యలు తీసుకుంటామని చినరాజప్ప హామీ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

ఆదిలాబాద్ :జిల్లాలో విషజ్వరాలు ప్రబలాయి. బోథ్ మండలం కొత్తగూడ గ్రామంలో విషజ్వరాల బారిన పడి పలువురు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మందికి విషజ్వరాలు అలుముకోవడంతో వారు బోథ్‌లోగల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా... పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన బోథ్ ఏరియాలో కొత్తగూడ గ్రామస్తులేగాక మరికొన్ని గ్రామాల ప్రజలు కూడా విషజ్వరాల బారిన పడ్డారని సమాచారం. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, అపరిశుభ్రత వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెలుస్తోంది.

ఆర్టీసీ బస్ ఢీకొని ఓ యువకుడు మృతి

సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. ఆ యువకుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

16:03 - September 29, 2015

హైదరాబాద్ : అరుదైన సూపర్‌మూన్‌ చంద్రగ్రహణం వీక్షకులను అలరించింది. దాదాపు గంటపాటు కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు వీధుల్లోకి వచ్చి వీక్షించారు. ఎరుపెక్కిన చంద్రుడి దృశ్యాలను స్మార్ట్‌ ఫోన్‌లలో, కెమెరాల్లో బంధించారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో ఈ దృశ్యం కనువిందు చేసింది. భారత్‌కు మాత్రం నిరాశపరచింది.

చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రయాణించినప్పుడు సూపర్‌మూన్‌ ఏర్పడుతుంది...

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో పయణించినప్పుడు సూపర్‌మూన్‌ ఏర్పడుతుంది. అప్పుడు చంద్రుడి భూకక్ష్య 2లక్షల 26వేల000 మైళ్ల దగ్గరలో ఉంటుంది. దీంతో చంద్రుడు ఆకాశంలో పెద్ద రూపంలో కనిపిస్తాడు. చంద్రుడ్ని భూమి నుంచి వీక్షిస్తే 14శాతం పెరిగిన వ్యాసంతో, ఎరుపైన రంగులో కనిపిస్తాడు. దీనిని సూపర్‌మూన్‌ చంద్రగ్రహణమని, హార్వెస్ట్‌మూన్‌ ఎక్లిప్స్‌, సూపర్‌బ్లడ్‌ మూన్‌ అంటూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నామకరణం చేసింది.

1900 నుంచి సూపర్‌మూన్‌ కేవలం ఐదు సార్లే సంభవించింది.....

సాధారణంగా చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఇది సాధారణంగా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రుడు ఎరుపురంగులో కనిపించే దృశ్యం దశాబ్ధాల్లో ఓ సారి మాత్రమే కనిపిస్తోంది. 1900 నుంచి సూపర్‌మూన్‌ కేవలం ఐదు సార్లే సంభవించిందని నాసా వెల్లడించింది. సూపర్‌మూన్‌ చంద్రగ్రహణం 1982లో సంభవించిందని, తర్వాత 2033లోనే ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించగలమని తెలిపింది.

'సూపర్‌మూన్‌' వల్ల సముద్రంలో అత్యధిక ఆటుపోటులు.......

ఇదిలా ఉంటే సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 2 వరకు బంగాళాఖాతంలో 'సూపర్‌మూన్‌' అనే ఖగోళ ప్రక్రియ వలన సముద్రంలో అత్యధిక ఆటుపోటులు ఏర్పడవచ్చని విశాఖలోని బంగాళాఖాతం అధ్యయన కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో అక్టోబరు 2 వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

15:59 - September 29, 2015

హైదరాబాద్ : ఆసక్తితోనే ఉపాద్యాయ వృత్తిలోకి అడుగు పెట్టానని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. మూడున్నర దశాబ్దాల పాటు ఉస్మానియాలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించిన కోదండరామ్ రేపు పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడారు. పదవి విరమణ తరువాత ప్రజాఉద్యమాల్లోనే ఉంటానని, రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు చరిత్రే సమాధానం చెబుతుంది అని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:57 - September 29, 2015

హైదరాబాద్ : గ్రామీణులకు అన్ని రకాల పౌర సేవలను అందించేందుకే ఈ పంచాయతీని చేపట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గ్రామస్థాయి పెట్టుబడిదారులు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో సంభాషించారు. ఈ పంచాయతీలతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా సుమారు పది వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

సమగ్రాభివృద్ధి, మహిళా సాధికారికత సాకారం సాధ్యం-కేటీఆర్‌

ఈ పంచాయతీలతో సమగ్రాభివృద్ధి, మహిళా సాధికారికత సాకారం సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళలు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం కల్గించారని.. ఆ నమ్మకంతోనే పల్లె సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సేవలను కొనియాడారు. ఈ సంఘాలన్నీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నాయని.. సుమారు 5వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లిస్తున్నాయన్నారు. ఈ పంచాయతీలు నిర్వహించే మహిళలు...తమకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని మరిన్ని ఆదాయ వనరులు పెంచుకోవాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు.

పాలనా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయనే నమ్మకం....

ప్రభుత్వ పాలన విధానాలతో సాంకేతికత అనుసంధానమైనప్పుడు అవినీతి తగ్గుతుందని..ప్రజలకు ప్రతిఫలాలు వందశాతం దక్కుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ పంచాయితీల ఏర్పాటుతో ప్రభుత్వ పాలనా లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయనే నమ్మకం తనకుందన్నారు. ఉపాధి హమీ పథకం, పెన్షన్ల చెల్లింపులు ఈ కేంద్రాలకు అనుసంధానం చేస్తామన్నారు. ఏ ఏ అంశాల మీద శిక్షణ ఇచ్చారు? పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు పట్ల గ్రామాల్లో స్పందన ఎలా ఉంది? తదితర వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్‌. 

15:54 - September 29, 2015

హైదరాబాద్ : ప్రజల జేబులను మరో రూపంలో కొల్లగొట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బీరు, వైన్ బార్ల పేరుతో వీటిని నగరాల్లో ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి తయారు చేసిన బీర్లు, వైన్లతో బార్లు ఏర్పాటు చేసేందుకు ఏపి సర్కార్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

8.5శాతం పెరిగిన ఆదాయం.....

కర్నాటక ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానం లాభాల పంట పండించింది. అందుకే ఏపిలో కూడా ఇదే పద్దతిని అమలు చేసేందుకు ఏపి సర్కార్ రెడీ అయిపోయింది. తొలి 5 మాసాలలో ఏపీ సర్కార్‌కు మద్యం విక్రయాల ద్వారా 8.5 శాతం ఆదాయం పెరిగింది. ప్రస్తుతం రెండేళ్లకుగాను బార్లకు 40 లక్షల వరకూ లైసెన్స్ ఫీజు ప్రభుత్వానికి చేరుతోంది. నూతన మద్యం పాలసీ ప్రకారం వైన్, బీరు బార్లకు ప్రోత్సాహం కల్పించేందుకుగాను కనీసంగా లైసెన్స్ ఫీజును 10 శాతం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రారంభించిన కసరత్తు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. బార్ల లైసెన్స్ గడువు అక్టోబర్ తో పూర్తికానుందని, నవంబర్ నాటికి కొత్త బార్లు రానున్నాయి.

మగ,ఆడవారికి విడివిడిగా మరుగుదొడ్లు......

ప్రభుత్వం వీటికి కొన్ని మార్గదర్శక సూత్రాలను అమలు చేయనుంది. ఏసీ తప్పనిసరిగా ఉండాలని, మగ, ఆడవారికి మరుగుదొడ్లు విడివిడిగా ఉండాలని, పార్కింగ్ సౌకర్యం తప్పనిసరని, బయటి ఆహారం కాకుండా లోపలే కిచెన్ సదుపాయాలను, అందుకు తగ్గ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నది తాజా నిబంధన. ఈ నిబంధనలను కొన్ని బార్ల యాజమాన్యాలు ఇప్పటికే అమలు చేస్తున్నందున కొత్తగా కేవలం ఆరు నుంచి ఏడు శాతం మంది మాత్రమే బార్ల వ్యాపారంలోకి వచ్చే అవకాశం ఉందని జిల్లా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. అయినా ప్రభుత్వ దమననీతిపై, ద్వంద్వ ప్రమాణాలపై స్ధానికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

ఆల్కహాల్ శాతాన్ని పెంచి బార్ల సంఖ్యను రెట్టింపు....

తక్కువ ఆల్కహాల్ పేరుతో మద్యం బ్రాండ్లను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే మున్ముందు ఆల్కహాల్ శాతాన్ని పెంచి బార్ల సంఖ్యను రెట్టింపు చేసే పన్నాగమేనని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

15:52 - September 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్ధిగా ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ను తమ అభ్యర్ధిగా వామపక్ష పార్టీలు ప్రకటించాయి. అనేక విధాలుగా చర్చించిన అనంతరం పోటీకి ముందుకు వచ్చిన వినోద్‌కుమార్‌ను అభ్యర్ధిగా నిలబెడుతున్నట్లు నేతలు ప్రకటించారు. వినోద్‌కుమార్‌ విజయానికి అందరూ కృషి చేయాలని,.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలకు వివరిస్తే వినోద్‌కుమార్‌ గెలుపు ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

15:50 - September 29, 2015

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు టీడీపీ యువనేత లోకేశ్ నాయుడు.. జిల్లాకువచ్చిన లోకేశ్‌కు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.. అక్కడినుంచి నల్లజర్లలోని టీడీపీ కార్యకర్తల శిక్షణాశిబిరానికి హాజరయ్యారు యువనేత..

15:48 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు మరియు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా రేపు చలో అసెంబ్లీకి ప్రజాసంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు, ప్రజాసంఘాల నేతలు భారీ ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తరలివస్తున్నవారిని ఖమ్మం, నల్లగొండ జిల్లాలో పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌కు తరలివచ్చే వారిపై కూడా పోలీసుల నిఘా పెట్టారు. 

ఛత్తీస్‌గఢ్‌లో కానిస్టేబుల్ కిడ్నాప్

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పండురామ్ కుడియమ్‌అనే పోలీసు కానిస్టేబుల్‌ను నక్సలైట్లు అపహరించుకు పోయారు. పండురామ్ కుడియమ్ ఫార్సేగడ్ పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయన పాల్మందిర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి పోలీసు స్టేషన్‌లో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా నక్సలైట్లు అడ్డుకున్నారు. కిడ్నాప్ చేసి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అయితే పండురామ్ కోసం గాలిస్తున్నామని ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎదుట కలకలం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎదుట కలకలం రేగింది. సెల్ టవర్ ఎక్కిన రైతు సమ్మయ్య విషం తాగాడు. అప్రమత్తమైన పోలీసులు సమ్మయ్యను కిందకు దించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పంట సాగు కోసం రూ.2లక్షలు అప్పు చేశానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని సమ్మయ్య డిమాండ్ చేశాడు.

'అగ్రి గోల్డ్' సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. గజం రూ.200 విలువ చేసే భూమిని రూ.25వేలుగా చూపారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అగ్రి గోల్డ్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, అవసరమైతే సీఐడీ డైరెక్టర్ ను తప్పించాలని ఆదేశించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అనుచిత ప్రవర్తన....

అనంతపురం : ఓ మహిళా ఉద్యోగిని పట్ల హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మి భర్త నాగరాజు అనుచితంగా ప్రవర్తించాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాగరాజు మంగళవారం ఉదయం 12వ వార్డుకి వెళ్లాడు. వార్డులో ఉన్న ఓ మహిళా ఉద్యోగి ఇంటి ముందు పూలమొక్కలు ఉన్నాయి. పూలమొక్కలు ఎందుకు పెంచావు.. ఎవరి కోసం పెంచావ్.. వెంటనే తీసేయ్.. అంటూ అందరి ముందు నానా బూతులు తిట్టాడు. ఈ విషయం గురించి బాధిత మహిళ హిందూపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎఫ్‌టీఐఐ విద్యార్థులతో అధికారుల చర్చలు...

ముంబై: ఎఫ్‌టీఐఐ విద్యార్థులతో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎఫ్‌టీఐఐకు (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఛైర్‌పర్సన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని నిరసిస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌టీఐఐ సంస్థ ప్రక్షాళన చేయడంతోపాటు సంస్థ అభివృద్ధి కోసం కొత్త కమిటీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో మంగళవారం మరో యువతి మరణించింది. బంజారాహిల్స్‌కు చెందిన జాసింబేగమ్(21) అనే యువతి ఈ నెల 23న స్వైన్‌ప్లూతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

పురుగుల మందు తాగి రైతు దంపతులు ఆత్మహత్య

రంగారెడ్డి : పురుగుల మందు తాగి రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కల్మన్ కాల్వ అటవీ ప్రాంతంలో వెంకటయ్య, అంజిలమ్మ అనే రైతు దంపతులు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారు వేసిన పంటలు దెబ్బతిన్నాయనే కారణంతో వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... తెలంగాణ ప్రాంతంలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు వర్షాభావం, మరో వైపు పంటల కోసం తెచ్చిన అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రుణాలపై వడ్డీ తగ్గించిన స్టేట్ బ్యాంక్ !

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి అడుగు వేసింది. బ్యాంకు బేస్ రేటును 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నట్టు ఈ మధ్యాహ్నం ఎస్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం 9.7 శాతంగా ఉన్న కనీస బేస్ రేటు ఇకపై 9.3 శాతానికి మారుతుందని, ఈ నిర్ణయం అక్టోబర్ 5 నుంచి అమలవుతుందని వెల్లడించింది. దీంతో మిగతా అన్ని బ్యాంకులూ తాము ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను నేడో, రేపో తగ్గించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. 

రైతు ఆత్మహత్యలు బాధాకరం: రవీంద్రకుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చాలా బాధాకరమని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై నిర్వహించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజనిర్ధారణ కమిటి వేసి కారణాలను విశ్లేషించాలని సూచించారు. రాష్ట్రంలో 70శాతం మంది రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారని, దీని కోసం ఎక్కువ మొత్తంలో అప్పు చేశారని తెలిపారు. తీవ్ర వర్షాభావంతో పంట దిగుబడి రాకపోవడంతో చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు ను కలిసిన అదితి తండ్రి శ్రీనివాస్

విశాఖపట్టణం : మురుగు కాలువలో గల్లంతైనట్లు భావిస్తున్న ఆరేళ్ల చిన్నారి అదితి తండ్రి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసారు. మంగళవారం సీఎం చంద్రబాబు విశాఖకు విచ్చేశారు. ఈ సందర్బంగా అదితి ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కాగా... అదితి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే ప్రభుత్వ పరంగా అదితి కోసం విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. అయినప్పటికీ ఏ చిన్న ఆధారం దొరకకపోవడం దురదృష్టకరమన్నారు.

టిడిపి పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన లోకేష్

పశ్చిమగోదావరి :టిడిపి పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కమిటీ కన్వీనర్ నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. మూడు జిల్లాల కార్యకర్తలకు ఈ శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ... కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిపాటు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలు ఒక్క తెలుగుదేశం పార్టీతోనే అమలవుతుందన్నారు.

14:45 - September 29, 2015

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీినివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం ముందుకు వచ్చి రైతు సమస్యలపై చర్చకు అంగీకరించామని తెలిపారు. రైతు సమస్యలపై ఏదైనా మాట్లడవచ్చని తెలిపారు. నిజంగా విపక్షాలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై మాట్లాడాలన్నారు.

 

రేపటి అసెంబ్లీ ముట్టడి యథాతథం: వరవర రావు

హైదరాబాద్: వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా 400 ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో ఎలాంటి మార్పు లేదని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ముట్టడి యథాతథంగా జరుగుతుందని కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించారు. 400 ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ కౌంటర్లు లేని రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్, ప్రస్తుతం బూటకపు ఎన్ కౌంటర్లకు తెరతీశారని ఆయన ఆరోపించారు.

14:43 - September 29, 2015

హైదరాబాద్ : యూపీలో కొన్ని గ్రామ కౌన్సిల్స్ లో అమ్మాయిలు లెగ్గిన్స్ వేసుకోవద్దని, సెల్ ఫోన్స్ వాడవద్దని ఆంక్షలు పెట్టారు. సమాంజనంలో మన చుట్టూ వున్నఅమ్మాయిల పై కూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు? సమస్యలు ఎదుర్కోవడటానికి మహిళలంతా ఐక్యంగా స్పందించాల్సిన అవసరం లేదా? మహిళలను లైంగిక వస్తువుగా చూసే భావజాలంలో మార్పు రావాల్సిన అవసరం లేదా?ఇదే అంశం పై వేదికలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సత్యవతి భూమిక పత్రిక సంపాదకరాలు, సత్య పీహెచ్ డి స్కాలర్, కావేరీ స్టూడెంట్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:42 - September 29, 2015

హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో నెలకొన్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎక్స్ గ్రేషియా పెంచాం, నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. చర్యలు తీసుకుంటున్నా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో.. నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుతాలను హైకోర్టు అదేశించింది.

 

రేపటికి వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ కొనసాగింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభంకాగానే రైతు సమస్యలపై చర్చ మొదలుపెట్టారు. రైతు సమస్యలపై మొదట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్చ ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఈ సమస్యపై వాడీవేడిగా చర్చించారు.

14:34 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలని వైసిపి నేత పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టీఅసెంబ్లీలో రైతు ఆత్మహ్యలపై జరిగిన చర్చలో పాల్గొని, మాట్లాడారు. మహిళా రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రైతులకు ఆహారం భద్రత కల్పించాలని కోరారు.

 

14:30 - September 29, 2015

హైదరాబాద్ : తప్పంతా ప్రతిపక్షంపై నెట్టి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. రైతు సమస్యల పరిష్కారం దిశగా చర్చ సాగాలిగాని నువ్వెంతంటే నువ్వెంత అని అనుకోవడం లాభం లేదని అన్నారు.

14:29 - September 29, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే రైతులు త్రీవంగా నష్ట పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామనడం సంతోషకరమన్నారు. కౌలు, మహిళ, యువ రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆరు జిల్లాలో పూర్తిగా వర్షపాత లేదన్నారు. అప్పుల బాధలు తట్టుకోలేకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో అన్ని పంటలు సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. కౌలు దారుల రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించాలన్నారు. మంత్రులు ఆత్మహత్యలపై పూటకో మాట చెబుతున్నారని... వాస్తవంగా ఎంతమంది చనిపోయారో స్పష్టం చేయలన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పులపై మారిటోరియం ప్రకటించాలని కోరారు. కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని.. కౌలు దారులకు రక్షణ చట్టం చేయాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టాలని సూచించారు. అప్పులు.. వడ్డీలు, బ్యాంకులు రుణాలివ్వకపోవడం, ప్రైవేట్ వ్యాపరస్తుల దోపిడీ, రైతులను ఆదుకోవడం, భరోసా కల్పించడంలో ప్రభుత్వ విఫలం వంటి తదితర అంశాలు వల్ల రైతులు ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

 

14:27 - September 29, 2015

హైదరాబాద్: అసెంబ్లీ ఎదుట యువకుడు హల్‌చల్ చేస్తున్నాడు. సెల్‌ టవర్‌ ఎక్కి తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన సమ్మయ్యగా తెలుస్తోంది. తన తండ్రి అప్పుల బాధతో బాధపడుతున్నాడని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న తెలుస్తోంది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

14:24 - September 29, 2015

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చెయ్యొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతు ఆత్మహత్యలకు చర్చించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం మాదేనని అన్నారు.

14:17 - September 29, 2015

హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. ఫిల్మ్ నగర్ లో రోడ్ క్రాస్ చేసేందుకు రోడ్డు పై వెయిట్ చేస్తుండగా మెడలో ఉన్న గొలుసును లాగడంతో ఆ మహిళ వెంటనే కింద పడిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు బండి నెంబర్ ను కనుగొన్నట్లు సమాచారం. ఉదయం సమయంలో ఫిలింనగర్, సంజీవరెడ్డి‌నగర్ ఏరియాలో మూడు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి దాదాపు పది తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఇక మధ్యాహ్న సమయంలో కూకట్‌పల్లిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నెం 2లో ఓ మహిళ మెడలోంచి రెండు తులాల గొలుసును లాక్కెళ్లారు. అలాగే... ధర్మారెడ్డి కాలనీలో కూడా మరో మహిళ మెడలోంచి తులంన్నర బంగారు గొలుసును కూడా లాక్కెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం వరకు నగరంలో మొత్తం ఐదుచోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో బయటకు రావాలంటే మహిళలు హడలెత్తిపోతున్నారు.

14:14 - September 29, 2015

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై టీఅసెంబ్లీలో చర్చ జరిగి క్రమంలో గందరగోళం నెలకొంది. ఎంఐఎం నేత అక్బరుద్ధీన్, మంత్రి కేటీఆర్ ఒకరిపైమరొకరు విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యపై సుదీర్ఘం చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చర్చింలన్నారు. తెలంగాణలో 14వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడలేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం మాట్లాడుతుంటే నవ్వులాటగా ఉందా...అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలు అన్ని పార్టీలు కలిసికట్టుగా కృసి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఓ స్మార్ట్ రైతు అని.. ఆయనలాగే అందరు రైతులు స్మార్ట్ రైతుల్లా మారాలన్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇతర విషయాలు, అనవసర విషయాలు మాట్లాడకుండా.. కేవలం రైతు సమస్యలకు పరిమితమై మాట్లాడాలన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో అర్థం లేదన్నారు. సీదాగా మాట్లాడాలన్నారు. దీంతో అక్బరుద్ధీన్ ఆగ్రహానికి గురయ్యారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతుంటే సీదాగా మాట్లాడాలనడంలో అర్థం లేదన్నారు. సీదా ఎలా మాట్లాడాలో మంత్రి చెప్పాలన్నారు. మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలివ్వాలని బ్యాంకులకు సీరియస్ గా ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదన్నారు. రైతుల వల్లే టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇరువురి వాదోపవాదాలతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. 

వామపక్షాల అభ్యర్థిగా ప్రొ.గాలి వినోద్ కుమార్

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికకు వామపక్షాల అభ్యర్థినగా ప్రొ.గాలి వినోద్ కుమార్ ను ఖరారు చేశారు.

మైనర్ బాలికిపై నాలుగు నెలలుగా అఘాయిత్యం....

నిజామాబాద్ ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు ప్రబద్దులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బాల్కొండ మండలం నల్లూరు గ్రామానికి చెందిన పదిహేను సంవత్సరాల బాలిక బుస్సాపూర్ హైస్కూల్‌లో 7వతరగతి చదువుతోంది. అయితే... ఆ బాలికకు వరుసకు బావ అయిన రేపుల రాజు, అతని స్నేహితుడు బలరాంలు కలిసి ఆ బాలికను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని పాఠశాలలో దించుతామంటూ నమ్మబలికి మార్గమధ్యలోని పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన పురాతన భవనంలోకి తీసుకెళ్లి తమ వాంఛ తీర్చుకునేవారు. అయితే...

ఆశా భోంస్లే కుమారుడు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ గాయని ఆశా భోంస్లే రెండో కుమారుడు హేమంత్ భోంస్లే(66) స్కాట్లాండ్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. హేమంత్ సంగీత దర్శకుడు కూడా. 15 హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. పలు మరాఠీ చిత్రాలకు స్వరాలను అందించారు. ఇక ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే(57) కూడా సింగపూర్‌లో 2012లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

13:28 - September 29, 2015

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని బిజెపి నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు. రైతు ఆత్మహత్యపై అసెంబ్లీలో జరిగి చర్చల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. గత ఏడాది నుంచి వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వర్షాలు పడితేకానీ పంటలు పండే పరిస్థితి లేదన్నారు. గత ఏడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు మండలాలను వెంటనే ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చెరుకు రైతుల బకాయిలను చెల్లించాలని కోరారు. నకిలీ విత్తనాలు, ఎరువులను కొని రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు తయారు చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వం స్పష్టమైన విధానం, ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. చేనేతల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పారు. రైతులకు ఇస్తున్న పరిహారాన్ని ఆత్మహత్య చేసుకున్న చేనేతలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులు చావడానికి కాదు... బతకడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

 

12:56 - September 29, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చాలని, భరోసా ఇవ్వాలని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రుణమాఫీలో కోత పెట్టకుండా మొత్తం మాఫీ చేయాలన్నారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి వర్తింప చేయాలన్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విధానాల వల్లే పంటలు ఎండిపోయాయని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు కొద్దిగా ప్రభుత్వం దిగ్గొచ్చిందన్నారు. కరువు మండలాలపై రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రిస్టేజికి పోతుందని.... అది మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలు రైతుల సమస్యలపై ఆందోళన చేస్తే... ప్రభుత్వం వారిని హేళన చేస్తుందని పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. 14 రాష్ట్రాలు కేంద్రానికి కరువు నివేదికలు పంపించారు. తెలంగాణ నుంచి ఒక్క రిపోర్టు కూడా రాలేదని కేంద్రం చెబుతోందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే కానీ... ప్రజలు పేదవాళ్లు అని తెలిపారు. 50 శాతం కరువు మండలాలు ఉన్నాయని.. వాటిని వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో రైతుల పంటలన్నీ ఎండిపోయాయని తెలిపారు. గత ఏడాది ఖరీఫ్ లో ఒక్క పంటకు కూడా మద్దతు ధర రాలేదన్నారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేక పత్తిని చెట్లపైనే వదిలేశారని వాపోయారు. పంటలు ఎండిపోవడానికి కారణం ప్రభుత్వమే అని ఆరోపించారు. మిర్చి రేటు పడిపోతే రూ.200 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అదుకుందని గుర్తు చేశారు. రైతులను హేళన చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. సమస్యలపై ప్రశ్నిస్తే.. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడులు జరుగుతున్నాయని.. వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దాడుల చేయడం మానుకోవాలన్నారు. వరంగల్ జిల్లాలో తమపై దాడి జరిగిందని.. ఈదాడిపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరామని తెలిపారు. ప్రభుత్వం పబ్బం గడిపే పనులు మానుకోవాలన్నారు.  

రైతులకు ఆహార భద్రత కల్పించాలి : వెంకటేశ్వర్లు...

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. మహిళా రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రైతులకు ఆహారం భద్రత కల్పించాలని కోరారు.

 

రైతు ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాలి :లక్ష్మణ్..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని బిజెపి నేత లక్ష్మణ్ అన్నారు. రైతు ఆత్మహత్యపై అసెంబ్లీలో జరిగి చర్చల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. గత ఏడాది నుంచి వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వర్షాలు పడితేకానీ పంటలు పండే పరిస్థితి లేదన్నారు.

 

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు భరోసా ఇవ్వాలి :ఎర్రబెల్లి..

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు భరోసా ఇవ్వాలని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. రైతు రైతు ఆత్మహత్యలపై టీఅసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మహత్యల సంఖ్యను ఎందుకు కుదించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తే రైతు ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. 

11:32 - September 29, 2015

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీినివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. కొత్త రాష్ట్రం వస్తే.. సమస్యలన్నీ తీరుతాయని ప్రజలంతా ఆశపడ్డారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు జరిగాయని.. గత ప్రభుత్వాలపై నెపం నెట్టం సరికాదన్నారు. రైతుల కష్టాల్లో ఉన్నారని తెలిపారు. రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నారు. ఏక మొత్తంలో రుణమాఫీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రుణమాఫీ ఇప్పుడు కొత్త కాదు.. గతంలో కూడా ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. 

రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలి : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీినివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. కొత్త రాష్ట్రం వస్తే.. సమస్యలన్నీ తీరుతాయని ప్రజలంతా ఆశపడ్డారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు జరిగాయని.. గత ప్రభుత్వాలపై నెపం నెట్టం సరికాదన్నారు. రైతుల కష్టాల్లో ఉన్నారని తెలిపారు. రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నారు.

11:22 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీఏసీలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై చర్చించాలని మాట్లాడుకున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలతోపాటు ఇతర సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. ఎంఐఎం నేత వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై చర్చకు పట్టుబట్టారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. బీఏసీ నిర్ణయం ప్రకారమే రైతు సమస్యలపై చర్చించుకుందామని చెప్పారు. అయతే మొదటగా ఆత్మహ్యలపై చర్చిద్దామని.. ఆ తర్వాత ఇతర సమస్యలపై చర్చిద్దామని సూచించారు. నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు.

 

చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై మాట్లాడాలి : హరీష్ రావు

హైదరాబాద్ : టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీినివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం ముందుకు వచ్చి రైతు సమస్యలపై చర్చకు అంగీకరించామని తెలిపారు. రైతు సమస్యలపై ఏదైనా మాట్లడవచ్చని తెలిపారు. నిజంగా రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై మాట్లాడాలన్నారు.

 

రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై చర్చించాలి : జానా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీఏసీలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై చర్చించాలని మాట్లాడుకున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలతోపాటు ఇతర సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. 

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం :పోచారం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. 

10:55 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వాడివేడిగా చర్చిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీఏసీలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై చర్చించాలని మాట్లాడుకున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలతోపాటు ఇతర సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. ఎంఐఎం నేతలు వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై చర్చకు పట్టుబట్టారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. బీఏసీ నిర్ణయం ప్రకారమే రైతు సమస్యలపై చర్చించుకుందామని చెప్పారు. అయతే మొదటగా ఆత్మహ్యలపై చర్చిద్దామని.. ఆ తర్వాత ఇతర సమస్యలపై చర్చిద్దామని సూచించారు. నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం ముందుకు వచ్చి రైతు సమస్యలపై చర్చకు అంగీకరించామని తెలిపారు. రైతు సమస్యలపై ఏదైనా మాట్లడవచ్చని తెలిపారు. నిజంగా రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై మాట్లాడాలన్నారు. కొత్త రాష్ట్రం వస్తే.. సమస్యలన్నీ తీరుతాయని ప్రజలంతా ఆశపడ్డారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు జరిగాయని.. గత ప్రభుత్వాలపై నెపం నెట్టం సరికాదన్నారు. రైతుల కష్టాల్లో ఉన్నారని తెలిపారు. రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నారు. ఏక మొత్తంలో రుణమాఫీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రుణమాఫీ ఇప్పుడు కొత్త కాదు.. గతంలో కూడా ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రైతు ఆత్మహత్యలపై చర్చను పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 

09:55 - September 29, 2015

టీఅసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల జీవితాలు, ఆత్మహత్యలపై చర్చించాలని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదోపవాదాలు, పరస్పర విమర్శలకు పోకుండా హుందాగా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చిస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ కాంగ్రెస్ ను, గత ప్రభుత్వాలను తిడితే రైతు ఆత్మహత్యలు పరిష్కారం కావన్నారు. అలాగే అధికార పార్టీపై ప్రతిపక్షాలు రాజకీయ దాడులు చేయడంతో మాత్రమే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. కౌలు, చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసే రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. విదేశాల్లో కంటే భారతదేశంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఈ అంశాన్ని చాలా సీరియస్ తీసుకుని చర్చించాలని సూంచించారు. రాజకీయాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలపై మారిటోరియం ప్రకటించాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు, రైతుల జీవితాలపై చర్చించాలన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం...
అమెరికాలో మోడీ ప్రసంగం...
భారతదేశానికి డెమోగ్రఫీ డివిడెండ్ ఉన్నమాట వాస్తవం. ఎక్కువ మంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే.. మరింత ఉత్పాదక శక్తిని కల్గివుంటుంది. 2050 నాటికి సగటు భారతీయుని వయస్సు 29 ఏళ్లు ఉంటుంది. చైనా పౌరుని వయస్సు 37 ఏళ్లు ఉంటుంది. సగటు జపాన్ పౌరుని వయస్సు 48 ఏళ్లు ఉంటుంది. సగటు అమెరికా పౌరుని ఏజ్ 37ఏళ్లు ఉంటుంది. సింగపూర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏజింగ్ పాపులేషన్. చైనా, సింగపూర్, జపాన్, అమెరికా దేశాల్లో వర్కింగ్ ఏజ్ లో జనాభ లేదు. భారతేశంలో వర్కింగ్ ఏజ్ ప్రజలు అధికంగా ఉన్నారు. అయితే జనాభా అధికంగా ఉన్నంత మాత్రాన డెమోగ్రఫీ డివిడెండ్ ఉన్నట్లు కాదు... విద్య, ఆరోగ్యం, వైద్యం, నైపుణ్యం, పౌష్టికాహారం, శిక్షణ ఇవ్వగలిగితే కచ్చితంగా డెవిడెన్స్ వస్తుంది.. లేకపోదే ఇదే జనాభా ఉపద్రవంగా మారుతుంది. నిరుద్యోగవిద్యావంతులు సమాజికి పేలుడు పదార్ధం లాంటివారు. భారతదేశ గూగుల్ , యాపిల్ మనమెందుకు తయారు చేసుకోకూడదు. మోడీ వెళ్లి సిలికాన్ వ్యాలీలో మాట్లాడితే మనం పులకిరించిపోవడం కాదు... ఒబామా వచ్చి హైటెక్ సిటీలో మాట్లాడితే అమెరికన్లు పులరించే రోజు రావాలి.
పీఎప్ ఎల్ వీ సీ-30 ప్రయోగం...
పీఎప్ ఎల్ వీ సీ-30 ప్రయోగం విజయవంత కావడం శుభపరిణామం. ఇందులో శాస్త్రవేత్తలు కృషి ఉంది. అంతరిక్షంలో రహస్యాలను పరిశీలించనున్న తొలి రాకెట్ ప్రయోగం విజయంతం చేశాము. 1975లో తొలి రాకెట్.. ఆర్యభట్టను ప్రయోగించారు. తర్వాత రోదసీ. 1980లో ఇన్ శాట్ ఉపగ్రహాలు, 1988లో రిమోట్ శాట్ ఉపగ్రహాలు, 1990 లో ఎక్స్ క్లూజివ్స్ శాటిలైట్ ప్రయోగించారు.
ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపులు..స్పీకర్ నిర్ణయం..
పలు పార్టీల ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపులకు పాల్పడడం.. వీరిపై స్పీకర్ నిర్ణయం అనే అంశంపై మాట్లాడారు. అసెంబ్లీలో జరిగి ఏ అంశాలను కోర్టు పరిశీలించదు. రాజ్యాంగ అధికారాలను దుర్వినియోగం అయినప్పుడు స్పీకర్ పై ఒత్తిడి పెరుగుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:21 - September 29, 2015

గుంటూరు : జిల్లాలో విషాదం నెలకొంది. పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. రైలుపేట మూడో వీధిలో తెల్లవారు జాము 5.30 సమయంలో పాతభవనం కూలింది. దీంతో ఇంట్లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు అంజమ్మ(70), ప్రదీప్(3)లుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

 

09:13 - September 29, 2015

హైదరాబాద్ : నేటి నుంచి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు అసెంబ్లీ, మండలి పున:ప్రారంభం కానుంది. రుతు పవనాలు వైఫల్యం-రైతు సంక్షేమం వంటి పలు అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే రైతు ఆత్మహత్యలపై చర్చించనున్నారు. రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సభలో ప్రకటన చేయనున్నారు. అధికార టీఆర్ ఎస్ తో పాటు విపక్షపార్టీలు రైతు ఆత్మహత్యలపాటు సమస్యలపై చర్చించనున్నారు.

 

నేటి నుంచి టీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : నేటి నుంచి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు అసెంబ్లీ, మండలి పున:ప్రారంభం కానుంది. రైతు ఆత్మహత్యలు, రుతు పవనాలు వైఫల్యం-రైతు సంక్షేమం వంటి పలు అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. 

08:49 - September 29, 2015

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించాలని వక్తలు పేర్కొన్నారు. టీఅసెంబ్లీ సమావేశాలు, రైతుల ఆత్మహత్యలు వంటి పలు అంశాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నాయకురాలు శోభ, టిడిపి నేత జనక్ ప్రసాద్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ రావు పాల్గొని, మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలపై చర్చించాలని.. వారి సమస్యలను పరిష్కారించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:43 - September 29, 2015

లారీ యజమానులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 72 లక్షల లారీలు, ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. దీని ప్రభావం పెట్రోల్ బంక్ ల మీద కూడా పడే అవకాశం వుంది.
సరుకులు, నిత్యావసరాల సరఫరాలో లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం కీలకం 
మన దేశంలో సరుకులు, నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నది లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం. మన దేశంలో సరుకుల రవాణా రంగంలో 65శాతం దాకా రోడ్డు మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. కొద్ది రోజుల పాటు లారీల రవాణా స్తంభిస్తే, అనేక గ్రామాలకు, పట్టణాలకు నిత్యావసరాలు అందని పరిస్థితి ఎదురవుతుంది. మన దేశంలో దాదాపు 72 లక్షల లారీలు, ట్రక్కులున్నట్టు అంచనా. అయితే, మన దేశంలో అయిదుకంటే తక్కువ లారీలు కలిగిన యజమానుల సంఖ్యే ఎక్కువ. పదికి మించి లారీలు, ట్రక్కులు కలిగినవారి శాతం చాలా తక్కువ. వందల సంఖ్యలో లారీలున్న యజమానులు మరీ స్వల్పం. ఒకట్రెండు వాహనాలు మాత్రమే కలిగినవారిలో చాలామంది డ్రైవర్లను పెట్టుకోలేక తామే స్వయంగా వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రవాణారంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ట్రక్ ఆపరేటర్లు వివిధరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా అవి పరిష్కారం కాని పరిస్థితి దేశవ్యాప్తంగా వుంది.
సమస్యలు మరింత పెరిగాయన్న లారీల యజమానులు 
ఇక రాష్ట్ర విభజన తర్వాత తమ సమస్యలు మరింత పెరిగినట్టు రెండు తెలుగు రాష్ట్రాల లారీల యజమానులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం ప్రవేశపెట్టాలని ఇరు రాష్ట్రాల లారీ యజమానులు కోరుతున్నారు. అయితే, ఈ సింగిల్ పర్మిట్ విధానం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదరకపోవడంతో లారీ యజమానుల మీద ఆర్థికభారం పడుతోంది. టెంపరరీ పర్మిట్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్వం మాదిరిగానే ఇప్పటికీ 23 జిల్లాలకు కలిపి క్వార్టర్ చార్జీలు వసూలు చేస్తుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు ఎక్కువగా వుంది. ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 33శాతం, డీజీల్ 22. 25శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా, అది చాలదన్నట్టు గత ఫిబ్రవరి నుంచి లీటరుకి మరో నాలుగు రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది. పెట్రో బాదుడు వాహన యజమానుల జేబులకు భారీగానే చిల్లు పెడుతోంది. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ పేరుతో అధికారులు తమను తరచూ వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు
హైదరాబాద్ తో పాటు ఉభయ రాష్ట్రాల్లోని అనేక పెద్ద పట్టణాలలో లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడైనా రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి, చలాన్లు రాస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ గేట్లు , అక్కడ వసూలు చేస్తున్న టోల్ రుసుములు తమ నడ్డివిరిస్తున్నాయని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా వుండడం. అడ్డదిడ్డమైన మలుపులు, గుంతలు తేలిన రోడ్లు, ఇరుకు ఇరుకు రోడ్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. వాహనాలూ తుక్కుతుక్కై ఆర్థికంగా దెబ్బతింటున్న పరిస్థితి. లారీ కిరాయిలపై టీడీఎస్ ను రద్దు చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు.

 

నేడు నిజామాబాద్ జిల్లాలో ఎంపి కవిత పర్యటన

నిజామాబాద్ : ఎంపీ కవిత నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకస్థాపన చేయనున్నారు. 

 

07:48 - September 29, 2015

లారీల యజమానుల సమస్యలను పరిష్కరించాలని లారీ ట్రాన్స్ పోర్ట్ యజమానుల సంఘం కార్యదర్శి వైవి.ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి లారీల యజమానులకు సమ్మెకు దిగబోతున్నారు. సరుకు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీల ఓనర్స్ సమ్మెకు కారణం ఏమిటి? లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య లేమిటి? వీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి? వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:43 - September 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి జగదీశ్‌పై రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన సీపీఎం, సీఐటియు నేతలను కుక్కలు అని మంత్రి వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా...సీఎం, మంత్రులు అహంకారపూరిత ధోరణి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. అలాగే తాము కూడా ప్రజలకు కాపలాగా ఉంటామని... సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేకంగా విధానాలు, పాలన కొనసాగిస్తే... వేట కుక్కల్లా... వెంటాడుతామని తేల్చి చెప్పారు. సీఎం ధోరణి మార్చుకోకపోతే కుక్కల్లా చీల్చిచెండాడుతామన్నారు.

 

07:29 - September 29, 2015

రంగారెడ్డి : చాంద్రాయణగుట్ట మండలం పల్లెచెరువుకు గండి పడింది. దీంతో బండ్లగూడ, మైలార్ దేవ్ పల్లి రహదారిపైకి నీరు చేరింది. ఆర్టీసీ బస్సులోని 35 మంది ప్రయాణికులు నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు వారిని రక్షించారు. అలీ నగర్ బస్తీలోని ఇళ్లు నీట మునిగాయి.

 

07:25 - September 29, 2015

హైదరాబాద్ : భాగ్యనగరి వీధులు జనసంద్రమయ్యాయి. దారులన్నీ హుస్సేన్‌సాగర్‌కు దారితీశాయి. ఖైరతాబాద్‌ త్రిశక్తి మోక్ష గణపతి శోభాయాత్రలో జనం పులకించారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న పార్వతీ తనయుడు సెలవు తీసుకుని గంగమ్మ ఒడికి చేరాడు. దారి పొడవునా మేళ తాళాలతో, అంబరాన్నంటిన సంతోషాలతో భక్తజనం త్రిశక్తి మయ గణనాధుడికి వీడ్కోలు పలికారు.
హుస్సేన్‌సాగర్‌ భక్తజన సంద్రం
హుస్సేన్‌సాగర్‌ భక్తజన సంద్రమైంది. ఖైరతాబాద్‌ త్రిశక్తి మోక్ష గణపతి నిమజ్జన శోభాయాత్రతో హైదరాబాద్ మహానగరం మురిసిపోయింది. వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గణపతి బప్పా మోరియా అనే నామస్మరణతో లక్షలాది గొంతులు పులకించాయి. సోమవారం ఉదయం నుంచి సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల జయజయ ధ్వానాలతో ట్యాంక్‌బండ్‌ హోరెత్తింది.
కన్నులపండువగా నిమజ్జన శోభాయాత్ర
ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల నుంచి పూజలందుకున్న గణనాథుడు రాత్రి 10 గంటల సమయంలో గంగమ్మ ఒడికి చేరాడు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌ సాయంతో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. భక్తజనం కేరింతల మధ్య లంబోదరుడి నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.
శోభాయాత్రలో యువత సంబరాలు
అంతకుమందు గణేష్‌ శోభాయాత్రలో యువత సంబరాలు అంబారాన్నంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు దారిపోడవునా బారులు తీరారు. డప్పుల దరువుకు చిందేస్తూ.. తీన్‌మార్‌ నృత్యాలతో ఆద్యంతం సందడి చేశారు. మొత్తంగా గణేషుడి నిమజ్జనోత్సవం సమైక్యతకు ప్రతిరూపంగా నిలిచింది. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అబాలగోపాలం వినాయకుల నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పదకొండు రోజులు పాటు జరిగిన గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

పాతభవనం కూలి ఇద్దరి మృతి

గుంటూరు : రైలుపేటలో విషాదం నెలకొంది. పాతభవనం కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు అంజమ్మ(70), ప్రదీప్(3).

 

సీఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ హత్య...

కృష్ణా : ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెంలో దారుణం జరిగింది. భార్య, అత్త కలిసి సీఆర్ పిఎఫ్ సీఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ ను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

07:10 - September 29, 2015

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది ప్రభుత్వం. దీనికోసం ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల రూపాయలను ఆ సంస్థకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నామని చెపుతూ.. మరోవైపు కోట్లాది రూపాయలు దుబారాచేయడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల బాణాలు
'మాట్లాడితే.. మాకు అన్యాయం జరిగిందంటారు.. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటారు... 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో నెట్టుకొస్తున్నామంటారు. కానీ, కోట్లాది రూపాయలు దుబారా చేసేస్తుంటారు'. ఇవీ.. కొన్నాళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంపైకి దూసుకొస్తున్న విమర్శల బాణాలు. తాజాగా వాటికి మరింత పదును పెట్టే పనిచేసింది బాబు సర్కారు. ఈ నెల 22న చేపట్టబోతున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజ్‌ క్రాఫ్ట్‌ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి ఏకంగా 9 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడింది ప్రభుత్వం. అధికారికంగా వెలువడాల్సిన ఈ ప్రకటనపై అప్పుడే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 16న సీఆర్డీఏ టెండర్లు
ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఈ నెల 16న సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. అయితే.. పది కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు కేవలం రెండు సంస్థలే టెండర్లు దాఖలు చేశాయి. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే.. టెండరు నిబంధనలు, సమయం తదితరాల విషయంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై వివరణ కోరితే.. అలాంటిదేమీ లేదన్నారు మంత్రి నారాయణ. పైగా.. ఇలాంటి పెద్ద కార్యక్రమాలను నిర్వహించాలంటే అనుభవం ఉన్న సంస్థల వల్లనే అవుతుందని చెప్పుకొచ్చారు. గతంలో రాజధాని భూమి పూజ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులే సమర్థంగా నిర్వహించారు కదా అన్న ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వని మంత్రి.. ఏది చేసినా పారదర్శకంగా చేస్తామని సెలవిచ్చారు.
నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న విజ్‌ క్రాఫ్ట్‌
టెండరు ప్రకారం.. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న విజ్‌ క్రాఫ్ట్‌ సంస్థ పలు విధులు నిర్వహించాల్సి ఉంది. తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణాన్ని చదును చేసి, కార్పెట్ పరచాలి. వెయ్యి మంది వీవీఐపీలతోపాటు, 50 వేల మంది ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలి. వందమంది కూర్చునేలా సభావేదికను తీర్చిదిద్దాలి. ముఖ్యులను ఆహ్వానించడం మొదలు.. తిరిగి వెళ్లే వరకు సంస్థదే బాధ్యత.
పెద్ద ఎత్తున ప్రచారం
ఇక, ఆహ్వాన పత్రికలు, టీవీ, ఎఫ్ఎం, సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రవేశ ద్వారాలు, బారికేడ్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ముఖ్య అతిథులకు అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర బాధ్యతలు కూడా సంస్థవే. కార్యక్రమం పూర్తయ్యాక వీడియో, ఫొటోగ్రఫీతోపాటు 2, 3 లఘు చిత్రాలు సిద్ధం చేయాలి.
ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
అయితే.. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కష్టాల్లో ఉందన్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలను ఎందుకు దుబారా చేస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం చేతిలో ఎంతో మంది సమర్థవంతమైన అధికారులు ఉండగా.. ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడమేంటని నిలదీస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదంటున్న ప్రతిపక్షాలు.. వెంటనే ఈ టెండర్లను రద్దుచేయాలని, ప్రభుత్వ అధికారులకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

 

06:56 - September 29, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఇక అసెంబ్లీలో తాడోపేడో తెల్చుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని స్పీకర్‌ను టార్గెట్‌ చేసేందుకు కాంగ్రెస్‌ వ్యూహం రచిస్తోంది. రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసేందుకు టీడీపీ స్కెచ్‌ గీస్తోంది.
పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
తమ పార్టీ నుండి కారెక్కిన ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్‌ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌.. ఇదే అంశంపై గవర్నర్‌ను కూడా కలిశారు. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌కు కొట్టివేయడంతో ఇక పూర్తిస్థాయిలో తేల్చుకునేందుకు హస్తం పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
యుద్ధానికి సై అంటోన్న కాంగ్రెస్‌
కోర్టులో తమ ఆశలు నీరుగారడంతో ఇక అసెంబ్లీని వేదికగా చేసుకుని యుద్ధానికి కాంగ్రెస్‌ సై అంటోంది. అనర్హత పిటిషన్‌ వ్యవహారంలో స్పీకర్‌ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేతలు... సభా వేదికగా ఈ వ్యవహారాన్ని ఎండగట్టేందుకు పక్కా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తోంది. స్పీకర్‌ను టార్గెట్‌గా చేసుకుని అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మినహా అన్ని పార్టీల మద్దతు తీసుకుని సభను స్తంభింపచేయాలని డిసైడ్‌ అయిన కాంగ్రెస్‌.. స్పీకర్‌ దిగివచ్చేలా సభలో నిద్ర చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు.
ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు టీడీపీ యత్నం
మరోవైపు ఇదే వ్యవహారంపై పోరాటం చేస్తున్న టీడీపీ కూడా.. హైకోర్టు పిటిషన్‌ కొట్టివేయడంతో ఎలా ముందుకు వెళ్లాలా అని దారులు వెదుకుతోంది. ఇక ఢిల్లీ స్థాయిలో పోరాడాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్‌కు, ప్రధాని మోదీకి తలసాని వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ లేఖలు కూడా రాశారు. ఇక ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మరోసారి స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రైతు సమస్యలతో పాటు ఇతర ప్రజాసమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తేందుకు టీడీపీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఏదిఏమైనా రైతు సమస్యలు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కాంగ్రెస్‌, టీడీపీలు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరి.. విపక్షాల వ్యూహాలకు కేసీఆర్‌ ఎలా చెక్‌ పెడతారో వేచి చూడాలి. 

06:51 - September 29, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రైతు సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండగా.. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుండగా.. ఎర్రబెల్లి వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు టీడీపీ వ్యూహాం రచిస్తోంది.
హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు
శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు హాట్‌హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైతు సమస్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు అనేక ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా వీటన్నింటికి ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది.
రైతు సమస్యలపై నివేదికలు సిద్ధం
అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ నేపథ్యంలో రైతుల సమస్యలు, ఆత్మహత్యలకు గల కారణాలపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేసింది. అదేవిధంగా టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ఆత్మహత్యలపై కూడా లెక్కలను బటయకు తీసింది. వీటిని ఉపయోగించుకొని విపక్షాల దూకుడుకు బ్రేక్‌ వేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు రైతులను ఆదుకునేందుకు సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు,.. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు చేస్తున్న ఆర్ధిక సాయాన్ని సభకు వివరించనుంది. ఈ వివరాలతో విపక్షాలను ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌ హామీలను తెరపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం
మరోవైపు రైతు సమస్యలపై సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు.. టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ తెరపైకి తీసుకురాబోతుంది. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాలో కట్‌-ఆఫ్‌ డేట్‌ విషయం కూడా ప్రధానంగా సభలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ సక్రమంగా అమలుచేయకపోవడం వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో.. ఒకేసారి రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎత్తులు
ఇక టీడీపీ కూడా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఎత్తులు వేస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ప్రతిపక్షాలపై సర్కార్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. అందుకే ఎర్రబెల్లిని అరెస్ట్‌ చేశారంటూ టీడీపీ నేతలంటున్నారు. ప్రజాకోర్టులో కేసీఆర్‌కు శిక్ష తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనా అధికార, ప్రతిపక్షాల వ్యూహాలతో అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయోనని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

నేడు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ శిక్షణా తరగతులు

ఏలూరు : నేడు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి. నారా లోకేష్ శిక్షణా తరగతులను ప్రారంభించనున్నారు. 

నేడు విశాలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : నేడు విశాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లు పాల్గొననున్నారు.

 

రైతు ఆత్మహత్యల పిల్ పై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యల పిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. 

పల్లెచెరువుకు గండి

రంగారెడ్డి : చాంద్రాయణగుట్ట మండలం పల్లెచెరువుకు గండి పడింది. దీంతో బండ్లగూడ, మైలార్ దేవ్ పల్లి రహదారిపైకి నీరు చేరింది. ఆర్టీసీ బస్సులోని 35 మంది ప్రయాణికులు నీటిలో చిక్కుకున్నారు. అలీ నగర్ బస్తీ ఇళ్లు నీట మునిగాయి.

 

Don't Miss