Activities calendar

30 September 2015

స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు అసెంబ్లీలోనే : ప్రతిపక్షాలు

హైదరాబాద్ : రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు అసెంబ్లీని విడిచి వెళ్లేది లేదని విపక్షాలు పట్టుబట్టాయి. రుణమాఫీ సింగిల్ సెటిల్ మెంట్ పై ప్రకటన చేయాలంటూ అసెంబ్లీలో ఎంఐఎం మినహా మిగిలిన పార్టీలన్నీ బైఠాయించాయి. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే, రెండు రోజుల చర్చలో ప్రభుత్వం రైతులకు ఏ రకంగా ఊరట కలిగించిందని వారు నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం విత్తన సబ్సిడీని కుదించింది, కరెంటు అడిగితే వచ్చే సంవత్సరం పగలు ఇస్తామంటారు, పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు, ఇలా అన్ని రకాలుగా రైతులను వేధిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి.

21:32 - September 30, 2015

హైదరాబాద్ : మయన్మార్‌లోకి చొరబడి ఉగ్రవాదులను హతమార్చామంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద విషయంలో కాంగ్రెస్‌ కన్నా మోది ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. భారత్ భద్రతే బిజెపి ప్రధాన ఎజెండా అని, మన భూభాగంలోకి చొరబడడానికి ఎవరూ సాహసించరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన అమిత్‌షా- లాలూ, నితీష్‌ల తీరుపై నిప్పులు చెరిగారు. మయన్మార్‌లో జరిపిన ఉగ్ర దాడులపై మోది ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రతిపక్షాలు అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి.

21:25 - September 30, 2015

హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసుల విధానం కల్పించాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిల్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పంచాయతీరాజ్‌ టీచర్లకు ఏకీకృత సర్వీసుల కల్పనకై రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు. 

21:22 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రేపటి వాయిదా పడింది. ఇవాళ రైతు సమస్యలపై శాసనసభలో వాడీవేడీ చర్చ సాగింది. రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ స్పందించే వరకు సభలోనే ఉంటామని టీ-కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

21:20 - September 30, 2015

హైదరాబాద్ : వాళ్లేమీ దోపిడీలు చేయలేదు.. అయినా బంధించారు..! దౌర్జన్యానికి పాల్పడలేదు.. అయినా అరెస్టులు చేశారు..! తుపాకులు చేతబట్టలేదు.. మారణాయుధాలతో విధ్వంసాలు సృష్టించలేదు..! వారు చేసిన తప్పల్లా.. న్యాయం చేయాలని నినదించడమే..! దీన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోయింది. ప్రజా ఉద్యమాన్ని భరించలేకపోయింది. న్యాయం అడిగిన గొంతు నొక్కేసింది..! నిరసన తెలిపే స్వేచ్ఛను హరించింది..! రాజ్యాంగం ఇచ్చిన హక్కునే కాలరాసింది..!

అడుగడుగునా..

వరంగల్‌ జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా సర్కారు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాఉద్యమాలను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రజాసంఘాల నేతలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఎవరికైనా మాట్లాడే హక్కుంది......

స్వతంత్ర భారత దేశంలో ఎవరికైనా మాట్లాడే హక్కుంది. తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంది. అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేసే హక్కులను రాజ్యాంగమే ప్రసాదించింది. కానీ.. అదే రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు.. యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పే కేసీఆర్‌ ప్రభుత్వం.. ఇవాళ అవే ఉద్యమాలపై నిర్బంధాలను ప్రయోగించడం వెనుక ఉద్దేశమేంటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.

నిరసనను తట్టుకోలేకనే ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు.....

371 సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనను తట్టుకోలేకనే ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు దిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిషేధిత సంస్థలు ఆందోళనలో పాల్గొంటున్నాయనే సాకు చూపిన ప్రభుత్వం.. అదే నిజమైతే వాస్తవాలను ప్రజలకు చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని, జనం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే నియంతృత్వ చర్యలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ.....

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా కేసీఆర్‌ వ్యవహరించిన తీరు.. కార్మిక సంఘాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు.. వరంగల్ ఎన్‌కౌంటర్‌ విషయంలో ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుందనే అడ్డుకునే చర్యలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు.

ఒకనాడు ఉద్యమం నిర్మించానని చెప్పే నేత..

ఒకనాడు ఉద్యమం నిర్మించానని చెప్పే నేత.. ఇవాళ అవే ఉద్యమాలను అడ్డుకోవాలని చూడడం సరికాదని అంటున్నారు. ప్రజాఉద్యమాలను అణచివేయాలని అనుకోవడం మూర్ఖత్వమే అంటున్న నేతలు.. గత ప్రభుత్వాలకు పట్టిన గతిని ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచిస్తున్నారు. కాదని మొండిగా వ్యవహరిస్తే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు.

చలో అసెంబ్లీ విజయవంతం : చాడా

హైదరాబాద్ బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమైందని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతంతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. అలాగే కార్యక్రమానికి రాకుండా ఎక్కడిక్కడే పోలీసులు దాదాపు 10వేల మందిని అరెస్టు చేశారన్నారు. కాగా... చట్టాన్ని కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నారని, విభజించి పాలించడంలో కేసీఆర్‌ దిట్ట అని వెంకటరెడ్డి అన్నారు.

20:39 - September 30, 2015

హైదరాబాద్ : బంగారు తెలంగాణ అన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ అన్నారు. సర్వతంత్ర, స్వతంత్ర తెలంగాణ అన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ తెలంగాణ అన్నారు. ఎందరో వీరులు ప్రాణాలకు తెగించి తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాడారు. ఏడాదిన్నర గడవకముందే చెప్పిన ఆశయాలన్నీ కుప్పకూలాయి. అప్పుడు వల్లించిన లక్ష్యాల కోసం ఇప్పుడు ఎవరు గొంతెత్తినా కత్తిరించే పనిలో పడ్డారు తెలంగాణ పాలకులు. బంగారు తెలంగాణ లో ఎందుకీ నిర్బంధ కాండ? అదే నేటి వైడాంగిల్ లో ప్రత్యేక కథనం. మరి మీరు కూడా ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:52 - September 30, 2015

విశాఖ :చోడవరం మండలంలోని గోవాడ చక్కెర ఫ్యాక్టరీ సర్వజన మహాసభ రసాభాసగా మారింది. సభలో ప్రసంగిస్తున్న ఛైర్మన్‌ మల్లునాయుడుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. వేదికపై కుర్చీలు, రాళ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు శాంతించలేదు. దీంతో సభ ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరి విలేకరులకు గాయాలు కాగా.. సుమారు 3 వందల కుర్చీలు, విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఛైర్మన్‌ మల్లునాయుడు అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేశారు.

19:50 - September 30, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చసాగుతోంది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కౌంటర్‌ వేస్తే...దానికి ప్రతికౌంటర్‌ ఇస్తూ ప్రతిపక్షాలు సభను వేడెక్కిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్‌రావు సభలో ప్రస్తావించినప్పుడు బీజేపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ మంత్రులు పోచారం, లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు లక్ష్మణ్‌. ప్రభుత్వం చేతనైతే రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి కానీ...రైతులను అవమానపరచవద్దని ఆయన ప్రతికౌంటర్‌ ఇచ్చారు. 

19:46 - September 30, 2015

ఖమ్మం : సత్తుపల్లిలో కొండచిలువ కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి 10 అడుగుల కొండచిలువ వెంగళరావు నగర్‌ నివాస ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలనీ వాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు.. గంట సేపు కుస్తీ పట్టి కొండచిలువను పట్టుకున్నారు.

19:44 - September 30, 2015

హైదరాబాద్ : సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులు ప్రవర్తించారు. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న పనులను అరికట్టాల్సిన పోలీసులే రెచ్చిపోయి చిందులేసిన సంఘటన వారణాసిలో జరిగింది. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో బార్‌ డ్యాన్సర్లతో కలిపి పోలీసులు చిందులేశారు. అంతటితో ఆగకుండా.. యువతులపై డబ్బులు వెదజల్లి తమ పైత్యాన్ని నిరూపించుకున్నారు. బహిరంగంగా పోలీసులు ప్రవర్తించిన తీరును చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 

19:24 - September 30, 2015

విశాఖ :తన కుమార్తె అదితి బతికే ఉంటుందన్న ఆశ ఉందని విశాఖపట్టణంలో గత వారం రోజులుగా అదృశ్యమైన బాలిక తండ్రి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. పాపను కిడ్నాప్ చేసినట్టు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని అన్నాడు. వర్షంలో కొట్టుకుపోయిందని అప్పుడు కొంత మంది చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా పాపను వెతికామని అన్నారు. అయితే ఇన్నాళ్ల వెతుకులాటలో పాపకు సంబంధించిన ఎలాంటి ఆధారమూ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి, తరలించారా? అనే అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెను తనకు అప్పగిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తన కుమార్తె తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే తమకు ఎవరిపైనా ఆనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. పాప ఆచూకీ తెలిస్తే ఎవరైనా చెప్పాలని ఆయన కోరారు.  

ఐఎస్ఐఎస్ పై పోరుకు రష్యా రెడి

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ పై పోరుకు రష్యా సిద్ధమవుతోంది. దేవుడి రాజ్యం స్థాపిస్తామంటూ సిరియాలో మానవ హననానికి పాల్పడుతున్న ఐఎస్ పై దాడులు చేయాలని రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. రష్యా బలగాలు సిరియా వెళ్లి, అక్కడ ఇస్లామిక్ తీవ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేయనుంది. అయితే సిరియా సేనలకు సాయంగా రష్యా కేవలం వైమానిక దాడులను మాత్రమే చేస్తుందని రష్యా స్పష్టం చేసింది. కాగా, ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ఇందిరా పార్కు వద్ద చెరుకు రైతుల ఆందోళన

హైదరాబాద్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇందిరా పార్కు వద్ద బుధవారం సాయంత్రం చెరుకు రైతులు ధర్నా నిర్వహించారు. వీరికి టి. టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి తదితరులు ధర్నా వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు. కాగా... చెరుకు రైతులందరూ అసెంబ్లీకి బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. చెరుకు రైతులతో కలిసి బయలుదేరిన మాజీ ఎంపీ మధుయాష్కీతోసహ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

సనుగోములు పీఎస్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

రంగారెడ్డి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా పోడూరు మండలం సనుగోములు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్‌లను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి రూరల్ ఎస్పీ శ్రీనివాసులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమేగాక అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో వీరిని ఎస్పీ సస్పెండ్ చేశారు.

గుంటూరులో అగతే కోచింగ్ సెంటర్ మోసం

గుంటూరు : గేట్ కోచింగ్ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసిన అగతే కోచింగ్ సెంటర్ మోసం చేసింది. గుంటూరు, నర్సరావుపేటలో 80 మంది విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన సంస్థ రంజయనాయక్ పరారీ లో ఉన్నాడు. అరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పీఎస్ ఎదుట బాధిత విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

త్రిపుర తాత్కాలిక గవర్నర్ గా కేసరినాథ్ త్రిపాఠి

హైదరాబాద్ : త్రిపుర తాత్కాలిక గవర్నర్ గా కేసరినాథ్ త్రిపాఠి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్ గా ఉన్న ఆయన త్రిపురకు కూడా గవర్నర్ గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ గుప్తా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

18:32 - September 30, 2015

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో గురువారం నుంచి అదనపు లడ్డూ టోకెన్లను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నాలుగు నుంచి ఐదు లడ్డూలు అందజేస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

18:22 - September 30, 2015

అనంతపురం : ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కరువు సీమగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమలో కొనసాగుతున్న రైతుకోసం చంద్రన్న యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాయలసీమకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి నదుల అనుసందానం చేసి ఇన్‌ఫ్రాస్ర్టక్షర్‌ అభివృద్ధి చేసి, భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసి రాయలసీమను మళ్లీ సశ్యశామలంగా మారుస్తానన్నారు.

18:20 - September 30, 2015

ప్రకాశం : జిల్లాలో దారుణం జరిగింది. క్షద్రపూజల పేరుతో ఐదేళ్ల బాలున్ని బలి తీసుకున్నారు. వలేటివారిపాలెం మండలంలోని పోమేరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగర్‌ అనే ఐదేళ్ల బాలున్ని అదే గ్రామానికి చెందిన తిరుమలరావు అనే వ్యక్తి తన ఇంట్లో క్షద్రపూజలు నిర్వహించి పసివాడిని బలి ఇచ్చాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని బయటకు తీసుకొని వస్తుండగా గ్రామస్తులు చూసి పట్టుకున్నారు. ఆగ్రహంతో తిరుమలరావుపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. తీవ్ర గాయాలైన తిరుమలరావును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

18:19 - September 30, 2015

విజయవాడ : పెట్రోల్‌ ట్యాంకర్‌ యజమానుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. గతంలో తీసుకున్న కేబినెట్‌ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ట్యాంకర్ల యజమానుల నుంచి వసూలు చేస్తున్న వ్యాట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ ట్యాక్స్‌ను ఆయిల్‌ కంపెనీల నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. సమ్మె విరమించుకోవాలని పెట్రోల్‌ ట్యాంకర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

18:00 - September 30, 2015

హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశాడు. చిరంజీవి 150వ సినిమా చేయడానికి అందిరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనికి పెద్ద ఫ్యాని. తెర మీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయన కన్నా....ఫ్యాన్స్ కే తెలుసు. ఈ కథ కుదరక పోతే మరో కథ చేస్తాను. అదీ కుదరక పోతే ఆయనకి నచ్చేంతవరకు చేస్తా. 150వ సినిమా నేనే చేస్తా...లేదంటే 151వ సినిమా చేస్తా. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నదే నాకోరిక' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే పూరి తాజా ట్విట్ పై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

వడ్డీ వ్యాపారి ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

మెదక్ :వడ్డీ వ్యాపారి ఇంటి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటరెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే... వెంకటరెడ్డి పరిస్థితి బాగోలేకపోవడంతో తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేకపోయాడని తెలుస్తోంది. కాగా... ఈ మధ్య కాలంలో వడ్డీ వ్యాపారి నుంచి వెంకటరెడ్డికి వేధింపులు పెరగడంతో తట్టుకోలేక బుధవారం వడ్డీ వ్యాపారి ఇంటి ఎదుట నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

17:45 - September 30, 2015

మెదక్ : తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఓ రైతు అప్పుల బాధతాళలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన పద్మా రెడ్డి అనే రైతు కరువుతో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన పద్మారెడ్డి తన పొలానికి వెళ్లి పరుగుల మందు తీసుకున్నాడు. వెంటనే ఆస్పత్రి తరలించినా...ఫలితం లేకుండా పోయింది. మార్గ మధ్యలోనే మృతి చెందాడు. పద్మారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాలుగు లక్షల వరకు అప్పు ఉన్నట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు.

 

17:43 - September 30, 2015

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి రెండు నెలల్లో విద్యుత్‌ను తీసుకొస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్‌...ఏడాదిన్నర అయినా ఇప్పటివరకు విద్యుత్‌ తేలేదని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించినప్పుడు రైతు సంతోషంగా ఉంటాడని అసెంబ్లీలో చర్చ సందర్బంగా అన్నారు. సబ్సీడి కింద ఎరువులను పంపిణీ చేయాలని ఎర్రబెల్లి ప్రభుత్వానికి సూచించారు.

 

ఏడాదైన విద్యుత్ ఎక్కడ : ఎర్రబెల్లి...

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి రెండు నెలల్లో విద్యుత్‌ను తీసుకొస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్‌...ఏడాదిన్నర అయినా ఇప్పటివరకు విద్యుత్‌ తేలేదని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించినప్పుడు రైతు సంతోషంగా ఉంటాడని అసెంబ్లీలో చర్చ సందర్బంగా అన్నారు. సబ్సీడి కింద ఎరువులను పంపిణీ చేయాలని ఎర్రబెల్లి ప్రభుత్వానికి సూచించారు. 

17:41 - September 30, 2015

హైదరాబాద్ : రైతు రుణమాఫీ అంతా గందరగోళంగా తయారైందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్న రైతుకు...రుణమాఫీ వర్తించినా..లక్షకుపైన ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జానారెడ్డి అన్నారు. లక్షకుపైన రుణం తీసుకున్న రైతుకు వడ్డీ అధికమై ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

 

రైతు రుణాలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ :కిషన్ రెడ్డి

హైదరాబాద్: వ్యవసాయ రంగానికి పాడి, పంట రెండు కావాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చ సందర్బంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నేటితో ఖరీఫ్ ముగిసిందని రబీలో నైనా రైతులకు రుణాలు ఇవ్వాలంటే రైతు రుణాలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని సూచించారు. అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పాడిని కాపాడాలని కోరారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు.

ప్రొఫెసర్ కోదండరాం పదవీ విరమణ

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం పదవీ విరమణ చేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ పీజీ కాలేజీలో చివరిసారిగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 34 ఏళ్ల అధ్యాపక వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరింత కృషి చేస్తానని వెల్లడించారు. ఎక్కువ సమయం తెలంగాణ కోసం కేటాయించే అవకాశం రానుందని వెల్లడించారు. ప్రొఫెసర్ కోదండరాంకు విద్యార్థులు, సహ ఆచార్యులు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు పలికారు. కోదండరాం తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

చైనాలో పేలుళ్లు : ముగ్గురి మృతి

హైదరాబాద్ : చైనాలోని ల్యూషెంగ్ కౌంటీలో గ్వాంక్జీ ప్రావిన్స్ లో బుధవారం పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. పేలు పదార్థాలు డెలివరీ పార్సిల్స్ లో అమర్చినట్లు అధికారులు చెప్తున్నారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విభజన సమయంలో ఏపీ అన్యాయం : వెంకయ్యనాయుడు

అనంతపురం : విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పాలసముద్రంలో భెల్ కంపెనీ ఏర్పాటుకు జరిగిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణానికి రూ. 1000 కోట్లు మంజూరు చేశామన్నారు. భెల్ పరిశ్రమ ఏర్పాటుకు పాలసముద్రం అనువైన ప్రదేశమన్నారు. అలాగే ఏపీకి ట్రిపుల్ ఐటీ, ఐఐటీ ఇప్పటికే వచ్చాయన్నారు.

అంబేద్కర్ స్మారక పోస్టల్ స్టాంప్స్‌ విడుదల

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం పోస్టల్ స్టాంప్స్‌ను విడుదల చేసింది. కేంద్ర సమాచార ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ స్మారక పోస్టల్ స్టాంప్‌‌లను ఆవిష్కరించారు. అంబేద్కర్ గౌరవార్ధం త్వరలో ఓ నాణెం కూడా ముద్రించనున్నారు. ఆర్థిక శాఖ నుంచి మూడు రోజుల కిందటే సంబంధిత అనుమతి లభించిందని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు. 

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి : వీహెచ్ పీ

హైదరాబాద్ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై వీహెచ్ పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి గళమెత్తారు. రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని సింఘాల్, స్వామి గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాతైనా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.  

కరీంనగర్ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

కరీంనగర్ : మంథని మండలం స్వర్ణపల్లిలో బుధవారం ఉప్పుల అశోక్ అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడక పోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

16:53 - September 30, 2015

హైదరాబాద్ : 'పీసీ' అంటూ బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సీరియల్ 'క్వాంటికో' కోసం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎదురు చూస్తున్నాడు. 'పీసీ' షో భారత్ లో ఎప్పట్నుంచి ప్రసారమవుతుంది? అంటూ అభిమానులను సల్లూ భాయ్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. 'పీసీ' అంటే అర్థం కాలేదేమోనని భావించి, 'పీసీ' అంటే ప్రియాంకా చోప్రా అని తెలిపాడు. కాగా, ప్రియాంకా చోప్రా నటించిన అమెరికా టీవీ షో 'క్వాంటికో' అక్టోబర్ 4 నుంచి అక్కడ ప్రసారం కానుంది. కాగా, అక్టోబర్ 11 నుంచి స్టార్ వరల్డ్ లో భారత్ లో దీనిని ప్రసారం చేస్తారు.    

16:50 - September 30, 2015

హైదరాబాద్ : వామపక్షాలు, ప్రజాసంఘాలపై తెలంగాణ సర్కారు.. నిర్బంధాన్ని ప్రయోగించడంపై ప్రొఫెసర్ హరగోపాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన బుధవారం 'టెన్ టివి'తో మాట్లాడుతూ...బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించిన ఆయన.. నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం.. ఎన్‌కౌంటర్లతో పరిపాలన కొనసాగించడం మంచిది కాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలన్నారు. మరిన్ని వివరాలు కావాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:47 - September 30, 2015

హైదరాబాద్ : గత 58 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, విద్యుత్‌ విషయంతో తీవ్ర వివక్షకు గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందువల్లే తెలంగాణలో దుర్బిక్షంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వచ్చే మార్చి నుంచి ఆరునూరైనా రైతులకు 9గంటల పగటిపూట విద్యుత్‌ను అందిస్తామని శాసనసభలో ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోయిందని...వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న నాథుడే లేడని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

వరంగల్ నగరంలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : వరంగల్ నగరంలో బుధవారం మూడు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. బ్యాంక్‌ కాలనీలో ఇద్దరు మహిళల మెడలో నుంచి 9 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. అలాగే ఆటోనగర్‌లో ఓ వ్యక్తి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును కూడా లాక్కెళ్లారు. కాగా... మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో మొత్తం 11 చోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. క్రమక్రమంగా ఈ చైన్‌స్నాచింగ్‌లు వరంగల్ నగరానికి కూడా పాకడంతో ముఖ్యంగా మహిళలు భయాందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసోం సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్ : అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ (79) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైన సీఎం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అసోం మెడికల్ కాలేజీ వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అంతర్వేదిలో రూ. 1800 కోట్లతో డ్రెజ్జింగ్ హార్బర్‌

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రూ. 1800 కోట్ల వ్యయంతో డ్రెజ్జింగ్ హార్బర్‌ను ఏర్పాటుచేసేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు అంతర్వేదిలో నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నౌకాయాన సంస్థ లేఖ రాసింది. డ్రెజ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు ముంబై, మంగుళూరు, అంతర్వేది ప్రాంతాలను తొలుత కేంద్ర నౌకాయాన సంస్థ గుర్తించింది. అనంతరం అంతర్వేది ప్రాంతం అనుకూలంగా ఉందంటూ... స్థలాన్ని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించగా స్థల పరిశీలనకు కేంద్ర బృందం త్వరలో రానుంది.

అనంతపురం జిల్లాలో బెల్ పరిశ్రమకు శంకుస్థాపన

అనంతపురం : గోరంటల మండలం పాలసముద్రంలో బెల్ పరిశ్రమకు ఈ రోజు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రక్షణరంగ అవసరాల కోసం అనంతపురం జిల్లాలో రూ.1500 కోట్లలో ఈ భారీ పరిశ్రమ ఏర్పాటవుతుంది. ఇందుకోసం పెనుకొండలో ఏపీ ప్రభుత్వం కొంత భూమిని ఇచ్చింది.

రైతులకు ఆత్మవిశ్వాసం కలిగించాలి : జానారెడ్డి

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలను నివారించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరుగుతన్న చర్చలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు శాసనసభ ద్వారా ఆత్మవిశ్వాసం కలిగించాలని జానా సూచించారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రైతులు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

16:15 - September 30, 2015

ముంబై : ప్రధాని మోదీ విదేశీ పర్యటన సూపర్‌ సక్సెస్‌ అంటూ బీజేపీ చెబుతోంది.. అంతా ఒట్టిదే అని కాంగ్రెస్‌ అంటోంది. ఈ నేపథ్యంలో స్వపక్షంలో విపక్షంలా ఉంది శివసేన పార్టీ తీరు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులను శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆకాశానికి ఎత్తివేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. దేశ ఆర్థికాభివృద్ధికి పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చేసిన కృషి మరిచిపోలేనిదని శివసేన అధిష్టానం వ్యాఖ్యానించింది ఆర్థికాభివృద్ధికి ఆ ఇద్దరు ప్రధానులు దశనిర్దేషం చేశారని గుర్తు చేసింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. విపక్ష కాంగ్రెస్‌ మాత్రం మోదీ తన స్వీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిస్తోంది. అయితే విపక్షాల వాదనకు బలం చేకూర్చేలా శివసేన పార్టీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేడం దుమారం రేపుతోంది. కేంద్రంలోనూ మహారాష్ట్రలోనూ అధికార బీజేపీకి శివసేన భాగస్వామ్య పక్షంగా ఉంది. తాజాగా ఈ వ్యాఖ్యల ద్వారా తన మిత్రపక్షం బీజేపీకి షాక్‌ ఇచ్చింది.

కాంగ్రెస్ ప్రధానులపై శివసేన ప్రశంసలు..

ముంబై : ప్రధాని మోదీ విదేశీ పర్యటన సూపర్‌ సక్సెస్‌ అంటూ బీజేపీ చెబుతోంది.. అంతా ఒట్టిదే అని కాంగ్రెస్‌ అంటోంది. ఈ నేపథ్యంలో స్వపక్షంలో విపక్షంలా ఉంది శివసేన పార్టీ తీరు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులను శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆకాశానికి ఎత్తివేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. దేశ ఆర్థికాభివృద్ధికి పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చేసిన కృషి మరిచిపోలేనిదని శివసేన అధిష్టానం వ్యాఖ్యానించింది ఆర్థికాభివృద్ధికి ఆ ఇద్దరు ప్రధానులు దశనిర్దేషం చేశారని గుర్తు చేసింది.

ఎనుమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన

హైదరాబాద్ : ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ-మార్కెట్ విధానం వల్ల పత్తి ధర తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ-మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మూకుమ్మడిగా కార్యాలయం ముట్టడించి కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

16:09 - September 30, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రంలో తమది కన్నతల్లి పాత్రని... కాంగ్రెస్‌ది కాన్పు చేసే మంత్రసాని పాత్రని ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీ-కాంగ్రెస్ సభ్యులు రసమయి వ్యాఖ్యలపై అభ్యతరం తెలిపారు. తక్షణమే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ జానా రెడ్డి సూచించారు. దీంతో రసమయి ఎట్టకేలకు తన వ్యాఖ్యల్ని వెనక్కితీసుకున్నారు. అయినా టీ-కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. వెంటనే హరీశ్‌ రావు జోక్యం చేసుకొని చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయోద్దన్నారు.

 

16:07 - September 30, 2015

హైదరాబాద్ : అక్కడ టీడీపీ ప్రభుత్వం.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచేయాలని చూస్తే.. గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 

16:06 - September 30, 2015

హైదరాబాద్ : ఓరుగల్లు కోటపై జరిగే ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ ఎంపి కవిత అన్నారు. వరంగల్‌ నగర పర్యటనకు వచ్చిన ఎంపీ కవిత టి టిడీపి అంటే తెలంగాణ దొంగల పార్టీఅని విమర్శించారు. మొన్నటికి మొన్న ఏసిబికి అడ్డంగా దొరికిన వాళ్లకు రాష్ట్ర కమిటీలో అత్యున్నత పదవి ఇచ్చారని కవిత అన్నారు. 

16:04 - September 30, 2015

విశాఖ: నగరంలో ప్రధాని ముద్రా యోజన మేళాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ముద్ర యోజన పథకం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు సాయం చేసేందుకు బ్యాంకులే ముందుకు వస్తాయన్నారు. మార్చి 31 నాటికి 1.25 కోట్ల మంది ఖాతాదారులకు రుణాలందిస్తామన్నారు.

 

16:02 - September 30, 2015

హైదరాబాద్ అడవిలో ఉండాల్సిన పులి హటాత్తుగా ఓ ఊళ్లోకి వచ్చింది. ఊళ్లోకి వచ్చిన పులి ఎంతో భీభత్సం సృష్టించి గడగడలాడించిందనుకుంటే పొరపాటే. ఓ నీటి బిందెలో తలను పెట్టి తీరా అందులో ఇరుక్కోవడంతో గిలగిలలాడింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని భుతోలి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఊళ్లోకి వచ్చిన పులికి దాహం వేయడంతో దానికి ఓ బిందెలో నీళ్లు కనిపించాయి. ఇంకేముందే చూసిందే తడువుగా బిందెలో తల దూర్చి దాహం తీర్చుకుంది. ఇక దాహం తీరడంతో తలను బయటికి తీసేందుకు ప్రయత్నించింది. కానీ అందులో తల ఇరుక్కుపోవడంతో నానా తంటాలు పడింది. మొదట పులిని గమనించిన గ్రామస్తులు దగ్గరకు రావడానికి బయపడ్డారు. కానీ పులి తల బిందెలో ఉండటంతో అది ఏమీ చేయలేదని భావించి దగ్గరకు వెళ్లి చూశారు. పులిని రక్షించే ప్రయత్నం చేస్తే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించి ఎవ్వరూ ఆ సాహసం చేయలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ దృశ్యాల్ని తన మొబైల్ లో బందించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తోంది. 

16:01 - September 30, 2015

హైదరాబాద్ : ఆయన ఎవరికీ దండం పెట్టరు. దండాన్ని ప్రయోగించరు. దండయాత్ర అసలే చేయరు. అయినా అట్టుడికిన తెలంగాణ ఉద్యమంలో ఆయనో నిశ్శబ్ద సేనాని. తన ఆలోచనలతోనే ఉద్యమానికి దారి చూపించారు. మహామహులందరితో మర్యాదగా ఉంటూనే తెలంగాణ నినాదాన్ని వారందరి గొంతుల్లో నినదించేలా చేశారు. ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూనే అసాధారణ ఉద్యమానికి నేతగా నిలబడ్డారు. ఆయనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌. మూడు దశాబ్దాల తరగతి గది జీవితానికి సెలవు చెప్పి.. చరిత్ర చూపించే దారిలో వెళతానంటున్నారు.

కరీంనగర్‌ జిల్లాలోని ఊటూరులో జననం......

తెలంగాణలో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా ఎన్నో ఏళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించిన కోదండరామ్‌ బుధవారం నాడు పదవీ విరమణ చేయబోతున్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులో జన్మించిన కోదండరామ్‌.. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో స్థిరపడ్డారు. వరంగల్‌లో డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ,.. ఢిల్లీ జేఎన్‌యూలో ఎంఫిల్‌ పూర్తి చేశారు.

1981 జూన్‌ 16న లెక్చరర్‌గా పదవీ బాధ్యతలు......

1981 జూన్‌ 16న నిజాం కాలేజీలో పొలిటికల్‌ సైన్‌ లెక్చరర్‌గా కోదండరామ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. 1987 నుంచి 97 వరకు కోఠిలోని ఉమెన్స్‌ కాలేజీలో పనిచేశారు. అప్పుడే రీడర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి 2007 వరకు నిజాం కాలేజీలో పని చేశారు. ఈ సమయంలోనే 1950-1990 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై కోదండరామ్‌ పరిశోధన చేశారు. 2004లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2007 నుంచి ఇప్పటివరకు సికింద్రాబాద్‌ పీజీ కళాశాలలో పని చేస్తున్నారు.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర....

పిల్లలకు విద్యాబుద్దులు చెప్పడమే కాకుండా.. తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని చూసిన కోదండరామ్‌ మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిన తరుణంలో ఉద్యమానికి పెద్ద దిక్కుగా మారారు. పార్టీలకతీతంగా ఉద్యమస్ఫూర్తిని రగిలించి అన్ని వర్గాలను ఏకం చేశారు. విద్యార్ధి, ఉద్యోగులు, కార్మిక, కర్షకులతో జేఏసీని ఏర్పాటు చేశారు. జేఏసీలను ఊరూరా విస్తరించి తెలంగాణ సాధనలో తనవంతు కీలక భూమిక పోషించారు.

సాగరహారం, సడక్‌బంద్‌ చేపట్టి జైలుకు ......

ఇక ఉద్యమంలో సాగరహారం మొదలుకుని సడక్‌బంద్‌ చేపట్టి జైలుకుపోయినా వెరవకుండా ఉద్యమస్ఫూర్తి రగిలించారు. సకల జనుల సమ్మె చేపట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఐక్య ఉద్యమాలు చేస్తూ.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. ధర్నాలు, దీక్షలు, ధూందామ్‌లు, వంటవార్పులతో ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకువచ్చారు. వినూత్న నిరసనలతో ఉద్యమ జ్యోతిని వెలిగించి.. పాలకవర్గానికి ముచ్చెమటలు పట్టించారు.

ఉద్యమబాట వీడని కోదండరామ్...

తెలంగాణ కల సాకారమైన తర్వాత కూడా కోదండరామ్‌ ఉద్యమబాట వీడలేదు. ఓవైపు విద్యార్ధులకు పాఠాలు బోధిస్తూనే.. బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌ సామాజిక, బంగారు తెలంగాణ నిర్మాణంలో తనదైన పాత్ర పోషించి,.. ప్రజా ఉద్యమాలను మరింత పదునెక్కించాలని కోరుకుందాం. 

15:57 - September 30, 2015

పశ్చిమగోదావరి :పండంటి కవలలు పుట్టారు. లోకం చూడకుండానే ఓ బిడ్డ శాశ్వత నిద్రలోకి జారుకుంది. పరిస్ధితి విషమించింది అంటూ మరో బిడ్డ ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యవసర అబ్జర్వేషన్‌లో ఉంచాలంటూ హడావుడి చేశారు. ఇంత చేసి ఆ ఆస్పత్రి యాజమాన్యం చేసిందేంటో తెలుసా.. ముక్కుపచ్చలారని పసికందు భవిష్యత్‌ను అంధకారం చేశారు. నిండా 12నెలలు కూడా లేవు. లోకం అందాలను ఇంకా చూడనే లేదు. నిజం చెప్పాలంటే మున్ముందు చూస్తుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ లేత కనుపాపలు కమిలిపోయాయి. గాజులాంటి ఆ కనుగుడ్లు లోలోపలే కాలిపోయాయి.

సత్యనారాయణ,బాలాజీలకు కవలలు.....

పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణ, బాలాజీ దంపతులకు కొంతకాలం క్రితం కవలలు పుట్టారు. పుట్టిన కాసేపటికే ఓ పాప చనిపోయింది. ఈ చిన్నారి ఆరోగ్య పరిస్ధితి కూడా విషమించిందని చెప్పిన స్ధానిక ఆపిల్‌ ఆస్పత్రి యాజమాన్యం అర్జెంట్‌గా పాపను ఇంక్యుబేటర్‌లో పెట్టాలని నానా హంగామా చేశారు. అనుకున్నట్లుగానే 28రోజులు పాపను ఇంక్యుబేటర్‌లో పెట్టి అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇంక్యుబేటర్ వేడికి, కాంతికి చిన్నారి కంటి చూపు పోయింది. తన వాళ్లను చూసుకుని మురిసిపోవాల్సిన పాప గుడ్డిదైపోయింది.

అంధురాలు నాకొద్దంటూ వదిలేసిన కన్నతల్లి.....

ఇదిలా ఉంటే చూపుకోల్పోయిన పాపను చూసి కన్న తల్లే చీదరించుకుంది. కడుపున పుడితేనేం... గుడ్డిది నాకొద్దు అంటూ నిర్ధయగా వదిలేసి పోయింది. పొట్టకూటి కోసం తండ్రి దుబాయ్‌కు వలసెళ్లాడు. కానీ మనసున్న నాయనమ్మ వెంకటలక్ష్మి మాత్రం చిన్నారిని అక్కున చేర్చుకుంది. 65ఏళ్ల వయసులోనూ అన్నీ తానై చూసుకుంటోంది.

మాకేం సంబంధం లేదంటున్న ఆపిల్ ఆస్పత్రి యాజమాన్యం....

జరిగిన నష్టానికి పరిహారమో, చేసిన తప్పుకు ప్రాయోచిత్తమో చేసుకోవాల్సిన తణుకు ఆపిల్ ఆస్పత్రి యాజమాన్యం తప్పించుకు తిరుగుతోంది. అటు పరిహారం మాత్రమే కాదు ఇటు ఇసుమంత సహాయం కూడా అందించకపోవడంతో పాపతో సహా వెంకటలక్ష్మి మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. న్యాయం చేయండి సార్‌ అంటూ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ను వేడుకుంది. గ్రామాలను దత్తత తీసుకుంటున్న శ్రీమంతులో లేక ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసున్న మారాజులో ఈ చిన్నారికి సాయం చేస్తే.... చీకట్లు రాజ్యమేలుతున్న లోకంలో దీపం వెలిగించినవారవుతారు. ఓ బంగారు భవిష్యత్తుకు నాంది పలికిన వారవుతారు.

15:54 - September 30, 2015

తిరుపతి : అవగాహనలోపం.. బరువు దింపుకోవాలనే ప్రయత్నం... వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు.. వెరసి బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి. తిరుపతిలో ఓ తండ్రి 18 ఏళ్లు కూడా నిండని తన కూతురుకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ చిన్నారికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. విషయం బయటకు తెలిసింది. రంగంలోకి దిగిన ఐద్వా, మహిళా సంఘాలు నేతలు బాల్యవిహానికి బ్రేకులు వేసి.. అమ్మాయి.. నిండు జీవితాన్ని మరికొన్ని గంటల్లో పెళ్లి.. బంధుజనంతో ఇళ్లు వాకిలి పెళ్లిసందడిగా మారింది. ఇంతలో ఇక్కసారిగా పెళ్లి ఇంట కళ తప్పింది.

తిరుపతిలోని పద్మావతి బాలికల పాఠశాలలో ఏడవ తరగతి.....

తిరుపతిలోని పద్మావతి బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి పేరు అలేఖ్య. 13 ఏళ్ల అలేఖ్య.. నిరుపేదలైన తన తల్లిదండ్రులకు భారంగా మారింది. దీంతో బాలికకు వరుసకు మేనమామ అయిన మోహనాచారితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని.. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. అలేఖ్యకు మొదటి నుంచి పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన బాధను తోటి స్నేహితురాళ్లతో పంచుకుంది. ఓ స్నేహితురాలు ఈ విషయాన్ని పోలీస్ వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేసింది. విషయం బయటకు తెలియడంతో.. ఐద్వా, ఐసిడిఎస్, మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. ముక్కుపచ్చలారని కూతురు పెళ్లి చేసి.. ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దని ఐద్వానేతలు బాలిక తండ్రికి అన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయినా అతను వినిపించుకోకుండా.. మీడియాపై, మహిళా సంఘాల నేతలపై చిందులేశాడు. అప్పటికే జరిగిన దానికి భయంతో వణికిపోతున్న అలేఖ్య తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పింది. చివరకు ఐసీడీఎస్‌, ఐద్వా, మహిళా సంఘాల సహకారంతో పోలీసులు ఈ వివాహానికి బ్రేకులు వేశారు.

బాలిక తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్‌....

చట్టాల గురించి అవగాహన లేని నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలని సూచించారు. బాల్య వివాహం.. చట్టరీత్యా నేరం. కూతురుని బరువుగా భావించే కన్నవారు చేస్తున్న పొరపాట్లు ఆ అమ్మాయి పాలిట శాపంగా మారుతుందని తెలుసుకోలేకపోతున్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల ఎన్నో సమస్యలు.. ఆ విషయంపై అవగాహనలేక కొందరు... తెలిసి కూడా మరికొందరు చేస్తున్న తప్పులు అనర్థాలకు దారితీస్తాయని తెలుసుకోండి. 

15:50 - September 30, 2015

హైదరాబాద్ : ముంబై వరుస పేలుళ్ల కేసులో ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2006 జూలై 11నాటి వరుస పేలుళ్ల కేసులో న్యాయమూర్తి ఐదు గురికి మరణశిక్ష మరో ఏడుగురికి యావజ్జీవ ఖైదు విధించారు. ఈ కేసులో మొత్తం 12మందిని దోషులుగా కోర్టు గతంలోనే ప్రకటించింది. ప్రాసిక్యూషన్ 8 మందికి ఉరిశిక్ష వేయాలని వాదించింది. అయితే న్యాయమూర్తి ఐదుగురికే మరణశిక్ష విధించారు. 2006 జులై 11న ముంబై లోకల్ ట్రైన్లలో జరిగిన పేలుళ్లలో 188 మంది చనిపోగా... 800 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న దోషుల ఆరోపణలను ముంబై ఏటీఎస్ ఖండించింది.

 

సిరియాలో ఐఎస్ ఐఎస్ పై విరుచుకుపడ్డ ఫ్రాన్స్ : 30 మంది మృతి

హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ తొలిసారి వైమానిక దాడులను నిర్వహించింది. సిరియాలోని తూర్పు ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్న స్థావరాలపై వైమానిక దాడులతో ఫ్రాన్స్ విరుచుకుపడింది. ఈ వివరాలను ఓ మానవహక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో 30 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. వీరిలో, ఉగ్రవాదులుగా శిక్షణ పొందుతున్న 12 మంది చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఇటీవల కాలంలో, ఐఎస్ ఉగ్రవాదులు ఫ్రాన్స్ లో కూడా దాడులకు తెగబడున్న సంగతి తెలిసిందే. 

వనస్థలీపురంలో చైన్ స్నాచింగ్...

హైదరాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లతో మహిళలు బెంబేలెత్తిపోతోన్నారు. నేడు మళ్లీ వనస్థలిపురంలోని ఆగమయ్య నగర్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయారు.

ఏకీకృత సర్వీసులపై పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలని దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు ఈ రోజు కొట్టేసింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పీఆర్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల అంశంపై రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ లోగా పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతలు కల్పించవద్దని ఆదేశాలు జీర చేసింది.

క్షుద్ర పూజల పేరుతో బాలుడు బలి

ప్రకాశం : వలేటివారిపాలెం మండలం పోకూరులో గ్రామం ఎస్సీ కాలనీలో క్షుద్రపూజల పేరుతో ఓ బాలుడ్ని గొంతుకోసి చంపారు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం ఎల్.బి. మహేందర్, ఆదిలక్ష్మిల కుమారుడు మనుసాగర్ (4)ను అదే గ్రామానికి చెందిన పి.తిరుమలరావు తన స్వగృహంలో క్షుద్రపూజలు చేసి బలి ఇచ్చాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, కందుకూరు సీఐ లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదనపు లడ్డూ టోకెన్ల నిలిపివేత : డిప్యూటీ ఈవో

తిరుమల భక్తుల రద్దీ నేపధ్యంలో... గురువారం నుంచి అదనపు లడ్డూ టోకెన్లను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నాలుగు నుంచి ఐదు లడ్డూలు అందజేస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

15:17 - September 30, 2015

హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా నిషేధిత మావోయిస్టు గ్రూపులతో సంబంధం పెట్టుకున్న కేసీఆర్ ను దమ్ముంటే డీజీపీ అరెస్టు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో లో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి లేదంటూ... నిషేధిత గ్రూపులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయాని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అసెంబ్లీకి బయల్దేరిన వామపక్ష పార్టీల అగ్రనేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని అరెస్టులతో కేసీఆర్‌ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన పద్ధతిని మార్చుకోవాలని అన్నారు.

14:58 - September 30, 2015

హైదరాబాద్ : చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన ప్రజాసంఘాలు, వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అటు అసెంబ్లీ ముందు ఓ పౌరహక్కుల నేత ఆత్మహత్యా యత్నం చేయడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

శృతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ....

వరంగల్‌ జిల్లాలో జరిగిన శృతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. గత రాత్రినుంచే ఎక్కడికక్కడ ప్రజాసంఘాల నేతలను, వామపక్షాల నేతలను పోలీసులు నిర్బంధించారు. తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు కొనసాగాయి. అర్థరాత్రి సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో పోలీసులు ఓవర్‌యాక్షన్‌ చేశారు. అనుమానితులు ఉన్నారనే నెపంతో విద్యార్థులను హడలెత్తించారు.

ఎస్వీకే వద్ద పోలీసులు భారీగా మోహరింపు...

ఉదయం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముళ్ల కంచెలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డితో పాటు పలువురు నేతలను అక్కడే నిర్బంధించారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్దామనుకున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ప్రభుత్వ తీరును పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. అటు ఇందిరాపార్క్‌ నుంచి ర్యాలీగా బయలు దేరిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై మహిళా నేతలు మండిపడ్డారు.

పౌరహక్కుల నేత రాజ్‌కుమార్‌ ఒంటిపై పెట్రోల్‌...

మరోవైపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరహక్కుల నేత రాజ్‌కుమార్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. అప్పటికే అసెంబ్లీ సమీపంలో భారీగా మోహరించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

14:56 - September 30, 2015

ప్రకాశం : జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన పొగాకు రైతు కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్.జగన్ పరామర్శించారు. టంగుటూరు మండలం పొదలవారిపాలెంలో గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కృష్ణారావు కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ తరపున కృష్ణారావు కుటుంబ సభ్యులను ఆదుకుంటామని జగన్‌ బరోసా ఇచ్చారు. 

14:54 - September 30, 2015

శ్రీకాకుళం : టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఎంపికయ్యారు. దీంతో కళా సొంత జిల్లా శ్రీకాకుళంలో టిడిపి శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా నేతలు, కార్యకర్తలు.. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు. టిడిపి ఏపీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల కళా వెంకట్రావు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కళా వెంకట్రావు అన్నారు.

14:51 - September 30, 2015

హైదరాబాద్ : ఆకాశంలో సగం..అన్నింటా సగం అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా..మరోవైపు రోజు రోజుకు వారిపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. బ్రూణహత్యలు..ఆత్యాచారాలు..గృహహింస తదితర వేధింపులు అధికమౌతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరియైన అవగాహన లేక ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఈ అంశంపై మానవి న్యాయ సలహాలు, సూచనలు అందించే 'మై రైట్' కార్యక్రమంలో గత వారం చర్చకు కొనసాగింపుగా ఈ వారం కూడా లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే ప్రజలు వ్యక్తపరిచిన పలు న్యాయ సమస్యలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. 

14:41 - September 30, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారమిక్కడ వెల్లడించారు. వైఎస్ జగన్ వచ్చే నెల 7వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించిన విషయం విదితమే.

14:19 - September 30, 2015

అనంతపురం : రైతులు అధైర్య పడవద్దని... మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేం తీసుకుంటాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం అనంతపురం జిల్లా కొత్త చెరువులో ఏర్పాటు చేసిన రైతు కోసం చంద్రన్న యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 'చంద్రన్న విజయాలు' కరదీపికను ఆవిష్కరించారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే నష్టపరిహారం రూ.5లక్షలు ఇస్తామని భారత్ దేశంలో మొట్టమొదటి సారి ప్రకటించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే దే తన కోరిక అని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. పేదల వాళ్లకు అండగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భూసార పరీక్ష చేసి ఎలాంటి న్యూట్రియంట్ ను వాడాలో పరిశీలిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపి జేసీ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం గొలుసుకట్టు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సును కోళ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ వేగంగా వచ్చి ఢీకొనగా అందులోని క్లీనర్ శివ(24) తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కోళ్ల లారీని మరో రెండు లారీలు వెనుక నుంచి ఢీకొట్టాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పర్యవేక్షించారు.

తిరుమలలో బ్లాక్‌లో టికెట్లు విక్రయించే ముఠా అరెస్టు..

తిరుమల: తిరుమలలో బ్లాక్‌లో టికెట్లు విక్రయించే ముఠాలు రెచ్చిపోతున్నాయి. బుధవారం..బ్లాక్‌లో సుప్రభాతం టికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రభాతం టికెట్‌ను రూ.5 వేలకు ఇప్పిస్తామని ముఠా సభ్యులు భక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే..సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

13:52 - September 30, 2015

హైదరాబాద్ : రైతు సమస్యలు ఒక్క రాత్రిలో తీరేవి కావని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వారు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతుల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల నుండి మంచి సలహాలు వస్తాయని ఆశించానని అలాంటివి ఏవీ రాలేదని చెప్పారు. రాష్ట్ర హైకోర్టులో ఏపీ, తెలంగాణలో రైతుల సమస్యలు..ఆత్మహత్యలు..వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పిల్ వేయడం జరిగిందన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా సమస్య మూలాల్లోకి వెళ్లాలని, అందుకు సంబంధించిన కార్యచరణ ఏముందో న్యాయస్థానానికి తెలియచేయాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. 58 సంవత్సరాల పరిపాలలో అతి భయంకరమైన దాడికి తెలంగాణ గురైందన్నారు.

తెలంగాణలో వివక్ష..
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. 1960 లో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, 58 సంవత్సరాల్లో జరిగిన ప్రాంతీయ వివక్ష తెలంగాణను వెంటాడిదన్నారు. తీవ్రమైన కరవు ఏర్పడడం..బావులు ఎండిపోవడం..భూగర్భ జలాలు ఎండిపోయాయన్నారు. దానికి తోడు కరెంటు కోతలు ఉండేవన్నారు. వ్యవసాయ శాఖలో 1300 ఉద్యోగాలు ఉంటే 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. తాను 40 ఎకరాల్లో అల్లం పంట వేసినట్లు, కానీ ఆ పంట పండుతుందో తెలియదన్నారు. రైతుల సమస్యల తీరాలంటే ప్రాజెక్టుల నుండి నీళ్లు రావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 364 విత్తన కంపెనీలున్నాయి. 650 మెట్రిక్ టన్నుల విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. 17వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 5వ తేదీన అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ కు అఖిలపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని సంబంధిత మంత్రి పోచారంకు కేసీఆర్ సూచించారు.

కరెంటు సమస్యపై దృష్టి..
పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమని, అనంతరం రాష్ట్రపతి పాలన, ఎన్నికలు రావడం జరిగిందన్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని, కొంతమంది నిపుణులు..మేధావులతో కూర్చొని బడ్ఝెట్ రూపొందించినట్లు చెప్పారు. ఉద్యోగాల కేటాయింపు కూడా ఆలస్యమైందన్నారు. ఆర్థిక ప్రగతి పూర్తిగా తెలియదని ఆనాడే తాను చెప్పినట్లు సభకు తెలిపారు. మొట్టమొదటిగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంటు కోతలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇక్కడ ఏపీ ప్రభుత్వం పంపిణీని ఎగబెట్టిందని, ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనితో పలు రాష్ట్రాల నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు.

వెయి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు..
కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో షోలాపూర్ రాయచూరు కారిడార్ వచ్చిందని, వెయి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని ఆనాడు చెబితే పెడచెవిన పెట్టారన్నారు. చివరకు వేయి మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిపై తాను విద్యుత్ నిపుణులతో మాట్లాడితే దేశంలో 2 లక్షల విద్యుత్ స్టాక్ ఉందని అందులో 1.50మెగావాట్లు వాడుతున్నారని తెలిపినట్లు పేర్కొన్నారు. కరెంటు కోతల వల్ల రైతులు పడే ఇబ్బందులను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చే వారని, మొక్క జొన్న, ఇతర పంటలు ఎండిపోయాయంటూ సభలో ప్రదర్శించే వారని గుర్తు చేశారు. కరెంటు సమస్యలు లేకుండా సభ జరగడం గర్వంగా ఉందన్నారు. 2018 ముగిసే నాటికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వడం జరుగుతుందని, 9గంటల కరెంటు విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని సభలో వెల్లడించారు.

8వేల కోట్లకు పైగా రుణమాఫీ..
36 లక్షల మందికి సంబంధించి రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, ఇప్పటికే రైతు రుణమాఫీ రూ. 8 వేల కోట్లకు పైగా విడుదల చేసినట్లు సభకు తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించినట్లు, రాష్ట్రానికి వాణిజ్య శాఖ నుంచి రూ. 4,500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అందులో 200-300 కోట్లు వచ్చాయన్నారు. వెంటనే మిగతా డబ్బులు రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 14వ ఆర్థిక సంఘం ప్రకారం అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రూ. 3 వేల కోట్ల వరకు రావాల్సి ఉందని సభకు తెలిపారు.

వ్యవసాయ శాఖలో 15వందల పోస్టుల భర్తీ..
రాష్ట్రంలో 1.08వేల వ్యవసాయ ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా పన్ను రద్దు చేసి 70 కోట్లు ట్యాక్స్ ఫ్రీ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖలో 15వందల పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒక అధికారి ఉండాలని నిబంధన పెట్టినట్లు తెలిపారు. అంతేగాకుండా రైతులకు మధ్యాహ్నాం భోజనం ఏర్పాటు చేస్తామని, ఉత్పత్తి భూమిలోనే దిగుబడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మిషన్ కాకతీయ పనులు అద్భుతం..
మిషన్ కాకతీయ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ పనులు ప్రారంభం కాకముందే కమీషన్ కాకతీయ అన్నారని విమర్శించారు. కానీ మిషన్ కాకతీయ వల్ల చాలా చెరువులు నీటితో నిండిపోయాయని, చెరువుల కింద రైతులు పంటలు వేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 

భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ కొచ్చి..

ముంబై: భారత్‌లో తయారు చేసిన అతిపెద్ద యుద్దనౌక ఐఎన్‌ఎస్ కొచ్చిని నేడు అధికారికంగా భారత నౌకదళంలోకి ప్రవేశపెట్టారు. భారత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేతులమీదుగా ముంబయి నావల్ డాక్ యార్డ్‌లో ఐఎన్‌ఎస్ కొచ్చిని నౌకదళంలోకి ప్రవేశపెట్టారు. 

13:19 - September 30, 2015

హైదరాబాద్ : నిర్భందాలు..పోలీసుల మోహరింపు..ఎక్కడికక్కడ అరెస్టులు..అయినా వామపక్ష నేతలు..ప్రజా సంఘాల నేతలు చలో అసెంబ్లీకి బయలుదేరారు. ఎస్వీకేను పూర్తిగా దిగ్భందనం చేసిన ఖాకీలు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. తమ నాయకులను అరెస్టు కానీయకుండా వామపక్ష కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. పట్టుకుని ఈడ్చారు. చివరకు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనకు నిరసనగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో నేడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెరలేపారు. ఉదయం 11గంటలకు ర్యాలీ ప్రారంభమౌతుందని టీడీఎఫ్ ప్రకటించడంతో పోలీసులు భారీగా ఎస్వీకే వద్ద మోహరించారు. బారికేడ్లు..ముళ్లకంచెలు ఏర్పాటు చేసి రోడ్డును దిగ్భందించారు. ఆ ప్రాంతం గుండా ఎవరినీ వెళ్లనీయలేదు. దీనితో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్వీకేలో ఉన్న వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు కరెక్టుగా పదకొండు గంటలకు బయటకు వచ్చారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసుల చర్యను..ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల జులుం నశించాలి అనే నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి. నేతల చుట్టూ కార్యకర్తలు వలయంగా ఏర్పడ్డారు. భారీగా మోహరించిన పోలీసులు ఒక్కో కార్యకర్తను లాగి పడేశారు. రోడ్లపై ఈడ్చుకుంటూ వ్యాన్ లలో పడేశారు. మహిళలని చూడలేదు. దీనితో పలువురు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. చివరకు సీపీఎం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై విరుచకపడ్డారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని తమ్మినేని విమర్శించారు.

ఉపశమన చర్యలతో రైతు సమస్యలు తీరవు - కేసీఆర్..

హైదరాబాద్ : ఉపశమన చర్యలతో రైతు సమస్యలు తీరవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా ఈ సమస్య ఉందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైందని, ఒక్క రాత్రిలో రైతుల సమస్యలు పరిష్కారం కాదన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో పరిశోధనలు సాగడం లేదని, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లలో 5వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. దశాబ్దాలుగా ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి సూచనలు ఇచ్చినా పరిగణలోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఎనుమాముల మార్కెట్ లో ఉద్రిక్తత..

వరంగల్ :జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 

పుట్టపర్తికి చేరుకున్న ఏపీ సీఎం బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తికి చేరుకున్నారు. కొత్త చెరువులో ఏర్పాటు చేసిన రైతు కోసం చంద్రన్న కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. 

మోకా కోర్టు కీలక తీర్పు..

ముంబై: లోకల్ రైళ్లలో వరుస పేలుళ్ల కేసులో మోకా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో దోషులుగా తేలిన 12 మందిలో ఐదుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. 2006 జులైలో ముంబై మెట్రో రైళ్లలో వరుస పేలుళ్లు సంభవించి 189 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఓయూ లైబ్రరీలో పోలీసులు..

హైదరాబాద్ : ఓయూ లైబ్రరీలోకి పోలీసులు దూసుకెళ్లారు. పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. 

విచారణ ఆదేశించే వరకు పోరాటం ఆగదు - ప్రొ.హరగోపాల్..

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనపై విచారణ ఆదేశించే వరకు పోరాటం ఆగదని ప్రొ.హరగోపాల్ వెల్లడించారు. రాష్ట్రంలో మెరుగైన పాలన ఉంటుందని ప్రజలు ఆశించి భంగపడ్డారని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అసాంఘిక శక్తులు అంటారా అని ప్రశ్నించారు.

 

ఇందిరాపార్కు వద్ద భారీ పోలీసు బందోబస్తు..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందిరాపార్కు నుండి లోయర్ ట్యాంక్ బండ్ కు వెళ్లే వాహన దారులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 

11:57 - September 30, 2015

హైదరాబాద్ : వ్యవసాయం అభివృద్ధి చెందింది తమ ప్రభుత్వ హాయాంలోనేనని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. 25 కోట్ల ఆహార ధాన్యాలు..14 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో కాంగ్రెస్ కృషి ఉందని గమనించాలని, 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 1956లో 16 లక్షల టన్నులుంటే 2004లో 57 లక్షల టన్నులకు చేరిందన్నారు. 2014 సంవత్సరంలో 107 టన్నులకు చేరిందని సభకు తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 66 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పంట రుణాలు 9 శాతం నుండి 4 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. 2004 -2014 వరకు రైతులకు బ్యాంకు రుణాలు అందించినట్లు, 8 జిల్లాల్లో వడ్డీ మాఫీ చేయడం జరిగిందన్నారు. క్వింటాళు వరికి రూ.100 మద్దతు ధర పెంచిందని, దానిని 800 వందల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర కేవలం రూ. 50కి పెంచడం జరిగిందన్నారు. లక్ష పశువులను రైతులకు ఇచ్చామని, 2004లో పంట రుణాలు 3500 కోట్లు ఉంటే తెలంగాణలో 2014 వరకు రూ. 25వేల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎవరూ పరామర్శించలేదని విమర్శించారు. 

అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : అసెంబ్లీ వద్ద పౌర హక్కుల నేత రాజ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అతడిని పీఎస్ కు తరలించారు. 

ప్రశ్నించే హక్కు లేదా ??

వరంగల్ : తమకు ప్రశ్నించే హక్కు లేదా అని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనకు నిరసనగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో నేడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలో పలువురు సీపీఎం, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని సుబేదారి పీఎస్ కు తరలించి నిర్భందించారు. ఈసందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. హిట్లర్ పాలన గుర్తుకు వస్తోందని, బూటకపు ఎన్ కౌంటర్ లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు.

ఎస్వీకే వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఎస్వీకే వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపై కూర్చొన్న వామపక్ష నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు కార్యకర్తలు పోలీసుల చర్యలను అడ్డుకుంటున్నారు. 

రోడ్డుపై కూర్చొన్న వామపక్ష నేతలు..

హైదరాబాద్ : ఎస్వీకే వద్ద వామపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. 

11:19 - September 30, 2015

హైదరాబాద్ : ఎస్వీకేకు వెళుతున్నారా..అయితే కొద్దిసేపు ఆగండి.. ఆ మార్గంలో ఏకంగా ముళ్లకంచెలు..బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు ఏ ఒక్కరిని అనుమతినించడం లేదు. ఇండియా - పాక్ బోర్డర్ లో ఉన్నామా అనే సందేహం కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ భారీగా పోలీసులు మోహరించి పలు ఆంక్షలు విధించారు. ఎస్వీకే పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. దీనిపై స్థానికుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఇదంతా చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ముళ్ల కంచెలు..బారికేడ్లు ఏర్పాటు చేసి ఎస్వీకే ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్వీకే నుండి ప్రారంభమయ్యే ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు..ర్యాలీ నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేయడంతో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో అసెంబ్లీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు నగరానికి చేరుకుంటున్నారు. వీరిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఎలాంటి నిర్భందాలు చేపట్టినా చలో అసెంబ్లీని నిర్వహిస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. 

11:06 - September 30, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనను నిరసిస్తూ ప్రజాసంఘాలు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి స్పందన వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయనమాట్లాడారు. చలో అసెంబ్లీకి వివిధ జిల్లాల నుండి ప్రజలు అనేక మంది తరలివస్తున్నారని, పోలీసుల నిర్భంద కాండ ఉన్నా అనేక మంది నగరానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల నుండి నిర్భందం చేయడం..బైండోవర్ లు చేయడం ప్రజలు ఏవగించుకొనే పరిస్థితికి దారి తీసిందన్నారు. శృతి, విద్యాసాగర్ ఎన్ కౌంటర్ ఘటన ప్రజలను కలిచివేస్తోందని, చలో హైదరాబాద్ విజయవంతం అవుతుందని చాడ స్పష్టం చేశారు. 

11:02 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనను నిరసిస్తూ ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుకు తెరలేపింది. ఈసందర్భంగా టెన్ టివితో తమ్మినేని మాట్లాడారు. ఎన్ కౌంటర్ ఘటనపై నిజాయితీ ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అక్కడ నిగ్గు తేల్చాలన్నారు. 371 సంఘాల్లో ఏ సంఘం నిషేధితమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి నేరస్తుడా ? ప్రజల కోసం పోరాడుతున్న వారు నేరస్తులో అసెంబ్లీ వేదికగా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ పతనానికి నాంది అని, చలో అసెంబ్లీని అడ్డుకోవాలని ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఈ విషయంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజాస్వామ్య హక్కులకు ఉల్లంఘన జరిగినా నిరంతరం పోరాటం జరుపుతామని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో చర్చకు అనుమతినిచ్చినా తేలుతుందని, లేదా అసెంబ్లీలో చర్చ పెట్టినా తేలుతుందన్నారు. హతులైన వారి శరీరాలు చిత్ర హింసలకు గురయ్యాయని, చేతి వేళ్లు నరకబడ్డాయని పేర్కొన్నారు. చిత్ర హింసలు పెట్టి చంపింది కాదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ దోషిగా నిలబెడుతోందని, ప్రజల్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. పక్కదారి పట్టించేందుకు అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదని తమ్మినేని సూచించారు. 

10:51 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మూడో రోజు ప్రారంభమయ్యాయి. వరంగల్ ఎన్ కౌంటర్ పై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి తెలంగాణ స్పీకర్ అనుమతినివ్వలేదు. దీనితో విపక్షాలు కొద్దిసేపు ఆందోళన చేశాయి. బీఏసీలో అనుకున్న విధంగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. దీనికి విపక్షాలు అంగీకరించలేదు. ఎన్ కౌంటర్ ఘటనపై చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన వారిని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారని విపక్షాలు ప్రశ్నించాయి. ఈ ఆందోళనల మధ్య సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు.

అన్నింటికీ చర్చకు సిద్ధం - కేసీఆర్..
రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగాలని అందరూ అనుకున్నారని, బీఏసీలో అనుకున్న విధంగానే జరుగుతోందని సీఎం కేసీఆర్ సభకు తెలిపారు. ఓవైసీ తీర్మానం ఇచ్చారని, వారొక పద్ధతిలో మాట్లాడారని తెలిపారు. ఇది కంప్లీట్ అయిన తరువాత ఏ విషయమైనా చర్చకు సిద్ధమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు..ఆరోపణలు చేశారని, ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగిందన్నారు. బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఇతరులు మాట్లాడితే సమయం గడిచిపోతుందని పేర్కొన్నారు. సభ ఎన్ని రోజులైనా జరిపి తీరుతామని, కొత్త రాష్ట్రం కనుక ప్రజలకు తెలియచేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

చర్చ జరపాలి - విపక్షాలు..
ప్రతిపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగిందని దానిపై అభిప్రాయాలు చెప్పే బాధ్యత సభ్యులకు ఉందని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల మీద పూర్తిగా చర్చ జరగాలని తీర్మానాలు కూడా ఇవ్వలేదని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ సభకు తెలిపారు. నగరంలో మంగళవారం ఒక్క రోజే స్నాచర్ లు రెచ్చిపోయారని, దీనిపై తీర్మానం ఇస్తే అనుమతి ఇవ్వలేదన్నారు. దీనిపై మాట్లాడే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. ఇక్కడ మంత్రి హరీష్ రావు విపక్షాలపై పలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాము సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం లేదని, పార్టీ ప్రతినిధులుగా మాట్లాడనివ్వక పోవడం సబబు కాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడిన తీరు సరికాదని టిడిపి నేత ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని సభకు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనపై తీర్మానం ఇవ్వడం జరిగిందని, దీనిపై మాట్లాడనీయకపోవడం సబబు కాదని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ ఘటనపై చర్చ జరపాల్సిందేనని సీపీఎం సభ్యుడు రాజయ్య డిమాండ్ చేశారు. ఎప్పుడు చర్చ జరుపుతారో చెప్పాలని రాజయ్య కోరారు. 

ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రైతుల సమస్యలపై చర్చకు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు.

రైతు సమస్యలపై చర్చకు సహకరించాలి - హరీష్..

హైదరాబాద్ : విపక్షాలు రైతు సమస్యలపై చర్చకు సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. వేరే అంశాలను తీసుకురావొద్దని, వేరే అంశాలపై తర్వాత మాట్లాడుకుందామన్నారు. 

10:31 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన నిజాం పాలన గుర్తుకు తెస్తోందని టిడిపి నేత ఎర్రబెల్లి ఘాటుగా విమర్శించారు. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనపై టీడీఎఫ్ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష నేతలు, ప్రజా సంఘాలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ విషయంపై టెన్ టివితో ఎర్రబెల్లి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నారని, తెలంగాణ పోరాటం చేసిన వారిని అరెస్టు చేస్తున్నారని తెలిపారు. ఓయూలో విద్యార్థులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనపై న్యాయవిచారణ చేస్తామని ప్రభుత్వం ఒప్పుకొంటే సరిపోతుందని తెలిపారు. వామపక్షాలను అణగదొక్కాలని ప్రయత్నించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వామపక్ష నేతలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అరెస్టులకు భయపడం - తమ్మినేని..

హైదరాబాద్ : అరెస్టులకు భయపడమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. చలో అసెంబ్లీని నిర్వహించి తీరుతామని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు తెలంగాణలోనే ఉద్యమాలు చేస్తున్నారని అనడం సబబుకాదన్నారు.

 

చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులు..

హైదరాబాద్ : చలో అసెంబ్లీకి ఓయూ విద్యార్థులు బయలుదేరారు. పీడీఎస్ యూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఓయూలో రెండు గేట్లు మూసివేశారు. 

టి.సర్కార్ పై సున్నం రాజయ్య ఆగ్రహం..

హైదరాబాద్ : ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ? నియంతృత్వ పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. 

అరెస్టయిన వారిని విడుదల చేయాలి - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని టిడిపి నేత ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. దీనిపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగిందని, ప్రజాస్వామ్యయుతంగానే వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని, వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తూ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 

09:59 - September 30, 2015

విజయవాడ : తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్ర కమిటీ, రెండు రాష్ట్ర కమిటీలు ఉంటాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొత్తం 17 మంది సభ్యులతో కేంద్ర పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్,, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాలయ అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావులను నియమించారు. ఎక్స్ అఫిషియోలుగా లోకేష్ తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్ రమణలను నియమించారు.
కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి రామ్మోహన్ రావు, డి.కె.సత్యప్రభ, నారా లోకేష్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కొనకళ్ల నారాయణలున్నారు. అధికార ప్రతినిధులుగా ఎం.శ్రీనివాసరావు, పంచుమర్తి అనురాధ, లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్య వరప్రసాద్ లను నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్. రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిలను నియమించారు. 

ప్రత్యామ్నాయం కోసం పోరాటం చేసేది టిడిపి..
జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం కోసం పోరాటం చేసేది టిడిపినేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేఏర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. టిడిపి నేతలకు ట్రైనింగ్ స్కూల్స్ పెడుతున్నామని, రాజకీయ నేతలకు శిక్షణ పెట్టింది మొదట టిడిపి పార్టీయేనన్నారు. రూ.53కోట్లు మెంబర్ షిప్ ద్వారా వచ్చాయని, అలాగే కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతోందన్నారు. మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించి పలు తీర్మానాలు చేసి అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యకర్తల కష్టార్జితంతో పార్టీని నడుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. 

09:52 - September 30, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ వద్ద ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. సుమారు వేయి నుండి రెండు వేల మంది పోలీసులు అసెంబ్లీ వద్ద పహారా కాస్తున్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా టీడీఎఫ్ చలో అసెంబ్లీకి పిలపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అసెంబ్లీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి రెండు కిలో మీటర్ల వరకు 144వ సెక్షన్ విధించారు. ఐడీ కార్డ్స్ లను చూసిన తరువాత లోనికి అనుమతినిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంతం మీదుగా వెళ్లే బస్సుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి వామపక్ష నేతలు ఎవరైనా ఉన్నారా ? అని ఆరా తీస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వామపక్ష నేతలను, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల చర్యలను వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు ఖండిస్తున్నారు.

టిడిపి, కేంద్ర, రాష్ట్రాల కమిటీలు..

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్ర కమిటీ, రెండు రాష్ట్ర కమిటీలు ఉంటాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొత్తం 17 మంది సభ్యులతో కేంద్ర పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

09:36 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవమరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా టీడీఎఫ్ చలో అసెంబ్లీకి పిలపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికం..అక్రమాలు చేస్తుందని ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు. కానీ సర్కార్ ప్రస్తుతం అదే చేస్తోందని, రాష్ట్రంలో 3-5వేల మందిని అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజా సంఘాలు, మేధావులు తగిన విధంగా స్పందించాలని, ఎక్కడికక్కడ రాస్తారోకో లు..నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉమఖ్యమంత్రి అబద్దాల మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్భందాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయని, ఏపీ రాష్ట్రంలో కూడా చేస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఇలా చేస్తున్నారని అనపుకోవడం పొరపాటన్నారు. పోరాటాలు చేయడం వల్ల ఏపీలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని గుర్తు చేశారు. కానీ ఇక్కడ జీతాలు పెంచలేదు. పెంచిన జీతాలు అమలు పర్చలేదన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తమ్మినేని తెలిపారు.

09:18 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సీపీఎం..పలు ప్రజా సంఘాల నేతలపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ టీడీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బస్టాండ్లు..రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను గృహ నిర్భందం చేశారు. ఓయూలో రాత్రి పోలీసులు తనిఖీలు చేసి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎస్వీకే వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వామపక్ష నేతల అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. అందులో భాగంగా ఎస్వీకే వద్ద బారికేడ్లు..ముళ్లకంచెలు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. అసెంబ్లీ వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రజా స్వామ్యయుతంగా ర్యాలీ తీయదలుచుకున్నామని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. ర్యాలీకి అనుమతించాలని కోరినా పోలీసులు నిరాకరించారని విమర్శించారు. ఎస్వీకే నుండి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తామని, సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయని పేర్కొనడం సబబు కాదన్నారు. 

09:01 - September 30, 2015

పాట్నా : గత దశాబ్ద కాలంగా గూండాలు, నేర చరితులు బీహార్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీహార్‌లో తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్పష్టమౌతోంది. ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 99 మంది నేర చరితులున్నారు. గూండాలు ప్రత్యక్షంగా గానీ, లేదా వారి జీవిత భాగస్వాములను, బంధువులను రంగంలోకి దించడం ద్వారా రాజకీయాలను వేదికగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు, అంగబలం ప్రధాన అవసరాలుగా నేటి రాజకీయ విలువలు మారిపోయాయి. ప్రస్తుత బీహార్‌ ఎన్నికల్లో నేర చరితుల సంఖ్య 99 మంది ఉండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

బిజెపి, జెడి(యు) పార్టీల నేతలే అధికం..
ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బిజెపి, జెడి(యు) పార్టీల నుండి నేర చరితుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ఇందులోనూ బిజెపి ప్రథమ స్థానంలో నిలిచింది. బిజెపి తరపున 47, జెడియు నుండి 38 మంది క్రిమినల్స్ పోటీ చేస్తుండగా, ఆర్‌జెడి నుండి ఆరుగురు బరిలో వున్నారు. కాంగ్రెస్‌ నుండి ముగ్గురు, జితన్‌ రాం మాంఝీ పార్టీ హెచ్‌ఎఎం నుండి ముగ్గురేసి చొప్పున పోటీలో ఉన్నారు. ఒకరు ఎల్‌జెపి తరపున, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇందులో 30 మంది అభ్యర్థులు తీవ్ర నేరాలైన హత్య, కిడ్నాప్‌, బలవంతపు వసూళ్లు, దోపిడీ తదితర అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తీవ్ర నేరాలనెదుర్కొంటున్న ఈ 30 మందిలో మహా కూటమికి చెందినవారు 17 మంది ఉండగా, బిజెపి తరపున 13 మంది ఉన్నారు. వరిసాలిగంజ్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జెడి(యు) అభ్యర్థి ప్రతాప్‌ కుమార్‌పై అత్యధికంగా 32 కేసులు నమోదై ఉన్నాయి. తర్వాతి స్థానానికి నవడ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆర్‌జెడి అభ్యర్థి రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ ఆక్రమించారు ఈయనపై 17 కేసులున్నాయి.

అనిల్ సింగ్ పై తీవ్రమైన నేర అభియోగాలు...
బిజెపి తరపున ఛాటపుర్‌ నుండి పోటీ చేస్తున్న నీరజ్‌ సింగ్‌, హిసువ్‌ నుండి పోటీ చేస్తున్న అనిల్‌ సింగ్‌పై కూడా తీవ్రమైన నేర అభియోగాలు నమోదైనాయి. జహనాబాద్‌ నుండి ఆర్‌జెడి తరపున పోటీ చేస్తున్న సురేంద్ర ప్రసాద్‌పై కూడా తీవ్రమైన కేసులున్నాయి. ఇటీవల శాసనమండలికి ఎన్నికైన సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్‌ రిట్లాల్‌ యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇతడి సోదరుడిని దనపుర్‌ నియోజకవర్గం నుండి రంగంలోకి దింపాడు. జైలు శిక్ష అనుభవించిన 'బాహుబలి'గా పిలవబడే మాజీ ఎంపి ఆనంద్‌ మోహన్‌ భార్య లవ్లీ ఆనంద్‌ హీహార్‌ నుండి హిందుస్తానీ అవాం మోర్చ (హెచ్‌ఎఎం) తరపున పోటీకి రంగం సిద్ధమైంది. ఈమె గత పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ టిక్కెట్‌ మీద, 2009లో కాంగ్రెస్‌ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది.

కొనసాగుతున్న సీపీఎం నేతల అరెస్టులు..

హైదరాబాద్ : ఎన్ కౌంటర్లకు నిరసనగా 'టీడీఎఫ్' నేడు 'చలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. వరంగల్ రఘునాథపల్లిలో సీపీఎం నేత యాదగిరితో పాటు పది గ్రామాలకు చెందిన 40 మంది సీపీఎం నేతలను అరెస్టు చేశారు. మట్వాడ పీఎస్ లో 54 మంది సీపీఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ లో ఉన్న 20 మంది సీపీఎం కార్యకర్తలను, జనగాంలో సీపీఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో సీపీఎం నేత వేముల నర్సింహం, సైదాబాద్ లో సీపీఎం నేత నజీరుద్దీన్ తో పాటు మరో 42 మంది సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారు.

టీ అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తరాలు రద్దు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి. రైతు ఆత్మహత్యలపై చర్చ కొనసాగనుంది. 

వచ్చే నెల రెండున్న ఖైరతాబాద్ లడ్డూ పంపిణీ..

ఖైరతాబాద్ : వచ్చే నెల 2వ తేదీన ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్షగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీకి పోలీసులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. కాకినాడకు చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తన సంప్రదాయాన్ని కొనసాగింపుగా ఈ సంవత్సరం ఏకంగా 5,600 కిలోల మహాప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించారు.

మల్దకల్ లో ప్రబలిన అతిసార..బాలిక మృతి..

మహబూబ్‌నగర్: జిల్లాలోని మల్దకల్ మండలం నాగర్‌దొడ్డిలో అతిసారం ప్రబలింది. అతిసారంతో ఓ బాలిక మృతి చెందింది. మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

08:36 - September 30, 2015

నిర్భందాల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అన్నదాతలపై హైకోర్టు వ్యాఖ్యలు తదితర అంశాలపై టెన్ టివిలోని 'గుడ్ మార్నింగ్' నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

ప్రదర్శన నిర్వహిస్తే ఏమవుతుంది ?
''ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహిస్తే ఏమవుతుంది . రాష్ట్ర ప్రభుత్వ అస్తిత్వానికి ఎలాంటి ముప్పు లేదు. పీఠం కదలదు. అలాంటిది లేనప్పుడు ఉలిక్కిపాటు ఎందుకు ? ఎన్ కౌంటర్ లేని తెలంగాణ వస్తుంది అని అన్నారు. మొదటి ఎన్ కౌంటర్ జరిగింది. హింస మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆ ససమస్య ఎందుకు వచ్చింది. ర్యాలీలు నిర్భందించడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోనే ఎందుకు ఉన్నారు ? ఇక్కడ భూమి సమస్య..ఇతరత్రా సమస్యలున్నాయి. ఎంతమంది గిరిజనులకు పట్టాలిచ్చారు ? ఈ ర్యాలీలో మావోయిస్టులు ప్రవేశిస్తారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నిజంగానే హింస జరిగితే వారిపై చర్యలు తీసుకొండి. ఈ ర్యాలీలో హింస జరిగితే ఎలా ? తదితర అంశాలపై నిర్వాహకులతో చర్చలు జరపాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారే ఇందులో పాల్గొంటున్నారు. నిర్భందాల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు. దీనికి తెలంగాణ ఉద్యమమే ఉదాహారణ. తెలంగాణ పల్లెల్లో నిర్బందం చేస్తారా ? ఇలాగే ప్రభుత్వ విధానాలు ఉంటే ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లలేరు. ప్రజల ఆవేదనను చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి.ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ విషయంలో అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి అక్కడకు వెళ్లి అధ్యయనం చేసింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎవరో కాదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇక్కడ శాంతిభద్రత సమస్య కాదని..అభివృద్ధి సమస్య అని నివేదిక ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ..
మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగింది. బతికి ఉంటే అప్పులు..చనిపోతే పరిహారం ఏమి చేయాలి ? చావుకు లెక్క కడుతున్నారు. ప్రాణానికి విలువ కట్టే పరిస్థితికి వెళుతున్నాం. మృత్యువుకు పరిహారం అంటూ ఉండదు. చావకుండా ఆపాలని హైకోర్టు పేర్కొంది. జయంతి ఘోష్, స్వామి నాథన్ నివేదికలు ముందు పెట్టుకోవాలి'. అని పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ పరపతి విధానం ప్రకటించింది. ఈ అంశంపై కూడా ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. 

అరుణోదయ కళాకారుల అరెస్టు..

హైదరాబాద్ : అరుణోదయ సాంస్కృతిక కేంద్ర కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అక్కడున్న 30మంది కళాకారులపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. 

న్యూయార్కులో పర్యటిస్తున్న సుష్మా..

న్యూయార్కు : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ న్యూయార్కులో పర్యటిస్తున్నారు. అక్కడి విదేశాంగ కార్యదర్శి పిలిఫ్ హమాండ్ ను సుష్మా కలిశారు. 

08:00 - September 30, 2015

వరంగల్ జిల్లాలో జరిగిన శృతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా ఏర్పడిన 370 ప్రజాసంఘాలు నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీనితో పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున్న సీపీఎం నేతలు, ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), ఒంటరి ప్రతాప్ (టిడిపి), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), గాలి వినోద్ కుమార్ (సామాజిక విశ్లేషకులు, వరంగల్ వామపక్షాల అభ్యర్థి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:59 - September 30, 2015

'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతాన్ని అందించి రెండు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ మరోసారి ఆస్కార్‌ బరిలో ఉన్నారు. ఆయన సంగీతమందించిన 'ముహమ్మద్‌: ద మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌' ఇరాన్‌ చిత్రం ఉత్తమ విదేశీ భాషాచిత్రం విభాగంలో 88వ అకాడమీ వేడుకల్లో పోటీపడుతోంది. ఈ చిత్రానికి ఇరానియన్‌ దర్శకుడు మజిద్‌ మజిదీ దర్శకత్వం వహించారు.
కన్నడ చిత్రం 'కేరాఫ్‌ ఫుట్‌పాత్‌ 2' సైతం..
ఇటీవల భారతదేశం నుంచి మరాఠీకి చెందిన జాతీయ ఉత్తమ చిత్రం 'కోర్ట్' ఆస్కార్‌ ఎంట్రీకి ఎంపికైన విషయం తెలిసిందే. లేటరల్‌ ఎంట్రీ విభాగంలో కన్నడకు చెందిన 'కేరాఫ్‌ ఫుట్‌పాత్‌ 2' చిత్రం 88వ అకాడమీ అవార్డులకు ఎంపికైంది. గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకున్న దర్శకుడు కిషన్‌ శ్రీకాంత్‌(మాస్టర్‌ కిషన్‌) ఈ చిత్రాన్ని రూపొం దించారు. 2006లో విడుదలైన 'కేరాఫ్‌ ఫుట్‌పాత్‌' చిత్రానికిది సీక్వెల్‌. ఇందులో ఈషా డియోల్‌, అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో సైతం ఈషా డియోల్‌కు తల్లిగా హేమా మాలిని నటించారు.

07:56 - September 30, 2015

బాలీవుడ్‌ కండల వీరుడు 'సల్మాన్‌ఖాన్‌' నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధాన్‌ పాయో' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీపావళికి 'ప్రేమ్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ పెద్ద క్యాప్షన్‌తో బ్యాక్‌ షాట్‌లో బ్లూ కుర్తా ధరించి ఓ వేదికపై సల్మాన్‌ అభివాదం చేస్తున్న లుక్‌ సినీ వర్గాల్లో అమితాసక్తిని కలిగిస్తోంది. 'సోనమ్‌ కపూర్‌' హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 'సల్మాన్‌' ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మెదక్ లో రైతు ఆత్మహత్య..

మెదక్: శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో పులగురి శంకర్ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక శంకర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

బీహార్ ర్యాలీలో ప్రసంగించనున్న అమిత్ షా..

బీహార్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో నిర్వహించే ఓ ర్యాలీలో ప్రసంగించనున్నారు. 

గంజాయి వ్యాపారుల మధ్య ఘర్షణ..

విశాఖపట్టణం : రావికమతం (మం) ఎల్ఎన్ పురంలో గంజాయి వ్యాపారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కత్తులతో దాడికి దిగడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కృష్ణ, రమణగా గుర్తించారు. 

 

ఏపీ సరిహద్దులోని సీపీఎం నేతలపై పోలీసుల నిఘా..

కృష్ణా : చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు. 

చుక్కా రామయ్య హౌస్ అరెస్టు..

హైదరాబాద్ : ప్రముఖ విద్యా వేత్త, మాజీ ఎమ్మెల్యే చుక్క రామయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ప్రజా సంఘాలు నేడు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విరసం నేత వరవరరావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు.

07:23 - September 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై కదం తొక్కేందుకు ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో నేడు చలో అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. ఓవైపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తుండగా.. ఎలాగైనా నిర్వహించి తీరాలనే పట్టుదలతో టీడీఎఫ్‌ నేతలున్నారు. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎస్వీకే వద్ద ఉదయం పది గంటలకు ర్యాలీ ప్రారంభమౌతుందని టీడీఎఫ్ ప్రకటించింది. దీనితో పోలీసులు ఉదయమే ఎస్వీకే వద్దకు చేరుకుని ముళ్ల కంచెలు..బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆప్రాంతం గుండా వాహనాలను అనుమతించలేదు. బస్, రైల్వే స్టేషన్ లలో పోలీసులు తనిఖీలు చేసి పలువురు సీపీఎం నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలను వామపక్ష నేతలు ఖండించారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

07:15 - September 30, 2015

ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే ఇవాళ 30 ఏళ్లయినా నిండకముందే భయంకర వ్యాధులు మనిషిని కుళ్లబొడుస్తున్నాయి. మూడేళ్లయినా నిండని పసిపిల్లలను డయేరియా లాంటివి పొట్టనబెట్టుకుంటుంటే, 30 ఏళ్లయినా రాకముందే బీపీ, షుగర్‌ భయపెడుతున్నాయి. సంపాదనలో అత్యధికభాగం వైద్య ఖర్చులకీ, మందులకీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక వైపు వైద్య రంగం విస్తరిస్తోంది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక నగరంలో వున్న మనిషి గుండెను ఆఘమేఘాల మీద తీసుకొచ్చి, మరో నగరంలోని పేషెంట్‌కి అమర్చి, ప్రాణాలు నిలబెడుతున్న స్థాయికి మన వైద్య పరిజ్ఞానం ఎదిగింది. వైద్యరంగంలో మనం సాధిస్తున్న ప్రగతిని, మన వైద్యులు సాధిస్తున్న విజయాలను చూస్తున్నప్పుడు మన హృదయాలు పరవశిస్తాయి.

వ్యాపారంగా మారిన వైద్యం..
వివిధ రకాల వ్యాధులతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేవారికి పునర్జన్మను ప్రసాదించేవి దవాఖానాలే. వ్యాధులతో బాధపడేవారికి చక్కటి వైద్య సేవలు అందించడానికి మించిన మానవ సేవ మరొకటి వుండదు. అయితే, దురదృష్టవశాత్తు ఇవాళ వైద్యం వ్యాపారంగా మారుతోంది. సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్ష పండుగా మారుతోంది. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతుంటే మరోవైపు ప్రయివేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు పోటాపోటీగా బ్రాంచ్‌లు పెంచుకుంటూ, భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లితే వ్యాధి నయం అవుతుందన్న గ్యారంటీ వుంటుందో లేదో చెప్పలేం కానీ, అక్కడ వైద్యం చేయించుకున్నవారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు తరిగిపోవడం, ఒక్కొక్కసారి అప్పులపాలవడమూ మనం చూస్తూనే వున్నాం. మనదేశంలో వైద్య ఖర్చులు భరించలేక ఏటా ఆరు కోట్ల మందికి పైగా పేదరికంలోకి జారుతున్నట్టు ఓ అధ్యయనం అంచనా వేసింది.

లక్షల్లో నగదు డిపాజిట్లు..
తమకు వచ్చిన వ్యాధి కంటే దానిని నయం చేయించుకోవడాన్ని పెడుతున్న ఖర్చులే సగటు మనిషిని ఎక్కువగా బాధపెడుతున్నాయి. ఓ వైపు తమ భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మరో వైపు అతని భార్య ఆరోగ్య శ్రీ సంతకాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన స్థితి ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. పేషెంట్‌ ఎంత ప్రాణాపాయ స్థితిలో వున్నా తక్షణమే చికిత్స ప్రారంభించకపోతే, ప్రాణానికే ప్రమాదమని తెలిసినా, ఇన్స్యూరెన్సో కార్డో, లక్షల్లో నగదు డిపాజిట్‌లో సమర్పించకుండా వైద్యులు పేషెంట్‌ వైపు కన్నెత్తైనా చూడలేని దౌర్భాగ్యం ఇవాళ మన వైద్య వ్యవస్థను ఆవహించింది.

ప్రయివేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజులు జేబులు గుల్ల చేస్తుంటే, ప్రభుత్వ ఆస్పత్రులు కనీస సౌకర్యాలు లేక వెక్కిరిస్తున్నాయి. ఒకనాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడు ఎలుకలు, పాములు తిరుగుతున్నాయంటే వాటి నిర్వహణను ప్రభుత్వాలు ఎంతగా నిర్లక్ష్యం చేశాయో అర్ధమవుతూనే వుంది. మందులు, సిరంజీలు, డాక్టర్లు, నర్సులు ఇవేవీ లేకుండానే ఆస్పత్రులను నడపడం మన ప్రభుత్వాలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. తాము నిర్వహించే ఆస్పత్రులకు పేషెంట్లు రావాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించిన ఘనత ఒక్క మన ప్రభుత్వాలకే దక్కుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం, ఎక్కడో ఊరి చివర ఉండడం, డాక్టర్ల డ్యూటీ వేళలు ప్రజలకు అనుకూలంగా లేకపోవడం లాంటి కారణాల వల్ల 65 శాతం మంది పేషెంట్లు ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నట్టు ఓ సర్వే వెల్లడించింది.

ఆధునిక ఆర్థికాభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి ?
ఇక గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణం. అసలు ఇవాళ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న అనేక జబ్బులు ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే విజృంభిస్తుండడం ఈ దేశ దౌర్భాగ్యం. డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ లాంటి నివారించదగ్గ వ్యాధులు ఏటా 20 లక్షల మంది పసిమొగ్గలను పొట్టనబెట్టుకోవడానికి మించిన విషాదం మరొకటి వుంటుందా? మన దేశంలో 74శాతం మంది మంచినీళ్లు దొరక్క అవస్థపడుతుంటే, మూడేళ్లలోపు పసిపిల్లల్లో 40శాతం మందికి పైగా పోషకాహార లోపంతో అవస్థపడుతున్నారు. ప్రతి పది మందిలో ముగ్గురు అమ్మాయిలను అండర్‌ వెయిట్‌ సమస్య వేధిస్తోంది. వాస్తవిక పరిస్థితులు ఇంత ఘోరంగా వుంటే, మనం సాధిస్తున్న ఆధునిక ఆర్థికాభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నట్టు? 

07:12 - September 30, 2015

ప్రజారోగ్యం ఇప్పుడో ప్రధాన టాపిక్‌ గా మారుతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కొన్ని సంస్థలు నడుంబిగిస్తున్నాయి. అక్టోబర్‌లో ఊరూరా సర్వేలు చేసి, నివేదికలు రూపొందించేందుకు స్వస్థా అభియాన్‌ సంస్థ సమాయత్తమవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యరంగం పరిస్థితి ఏమిటి? వైద్య ఆరోగ్య సేవలను అందించడంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ప్రజలందరికీ ఆరోగ్యం ఒక్క హక్కుగా అందాలంటే ప్రభుత్వాలు ఏయే అంశాల మీద దృష్టి సారించాల్సి వుంటుంది? ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి స్వస్థా అభియాన్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సురేష్‌ జనపథం లో విశ్లేషించారు. తదితర అంశాలపై జరిగే ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు. 

07:09 - September 30, 2015

విశాఖపట్టణం : పరిశ్రమల్లో ట్రేడ్ యూనియన్లను నామరూపాల్లేకుండా చేయడమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమా ? ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసి..తన గుత్తాధిపత్యాన్ని చాటుకోవాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. పరిశ్రమల్లో ట్రేడ్‌ యూనియన్లు లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పారిశ్రామికాభివృద్దికి ట్రేడ్ యూనియన్లు అడ్డంకికగా మారాయని చంద్రబాబు మండిపడ్డారు. ట్రేడ్ యూనియన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. విశాఖలో ఫార్మాసిటీ కంపెనీ యాజమాన్య ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు..పారిశ్రామికాభివృద్దికి ట్రేడ్ యూనియన్లు అడ్డంకిగా మారాయని మండిపడ్డారు. పలువురు ఫార్మా కంపెనీల నేతలు ట్రేడ్ యూనియన్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చినపుడు.. చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రభుత్వానికి కొన్ని పార్టీలు..యూనియన్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఒక వేళ యూనియన్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ పార్టీ ట్రేడ్ యూనియన్ ను కూడా సహించనని సీఎం వ్యాఖ్యానించారు.

ట్రేడ్ యూనియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బాబు..
పరిశ్రమలకు ఏం కావాలో అది చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేసారు. పరిశ్రమల్లో కొన్ని రాజకీయ పార్టీలు..యూనియన్ల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని..దాన్ని తాను సహించనని చంద్రబాబు అన్నారు. న్యాయమైన కోర్కెలు పేరుతో పరిశ్రమల ఉనికికే ట్రేడ్‌ యూనియన్లు ప్రమాదంగా తయారవుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఎంతో శ్రమించి పరిశ్రమల్ని స్థాపిస్తుంటే..ట్రేడ్ యూనియన్లు వాటిని నాశనం చేయాలని చూస్తున్నాయని అలాంటి వాటిపై కఠన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పూడిమడికలో ప్రజల తరపున సీపీఎం పోరాడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ భర్త, టిఇపి నేతల లాలం భాస్కరరావు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు...సీపీఎం విషయంలో గట్టిగా వ్యవహరిద్దామని అన్నారు.
మొత్తానికి కార్మిక పక్షపాతి అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు..కార్మిక సంఘాలను అణచివేయాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబు తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక సంఘాలను అణిచివేస్తుంటే...చూస్తూ ఊరుకోమని..ప్రభుత్వంపై తిరగబడతామని ట్రేడ్ యూనియన్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15గంటల సమయం పడుతోంది. నడకదారిన వచ్చే భక్తులకు 8గంటల సమయం పడుతోంది.

మెదక్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరెస్టు..

మెదక్ : చలో అసెంబ్లీ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.రాజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఖమ్మంలో సీపీఎం నేతల అరెస్టు..

ఖమ్మం : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఎం కార్యకర్తలను రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. బోనకల్లు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న 20 మంది సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వరంగల్ లో సీపీఎం నేతల అరెస్టు..

వరంగల్ : హన్మకొండలో సీపీఎం నేత దుబ్బా శ్రీనివాస్, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి శివాజీతో సహా 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని హన్మకొండ పీఎస్ కు తరలించారు. 

నల్గొండ జిల్లాలో పోలీసుల ఉక్కుపాదం..

నల్గొండ : జిల్లాలో వామపక్ష నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉన్న జిల్లా కమిటీ సభ్యుడు నర్సిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి, సీఐటీయూ నేత సత్తయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. కోదాడ డివిజన్ సీపీఎం కార్యదర్శితో సహా 30 మందిని అరెస్టు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 20 మందిని అరెస్టు చేశారు. 

టీడీఎఫ్ లో నిషేధిత సంస్థలు లేవు - చాడ..

హైదరాబాద్ : తెలంగాణ ప్రజాస్వామిక వేదికలో నిషేధిత సంస్థలు ఉన్నాయనడంలో వాస్తవం లేదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు మాత్రమే టీడీఎఫ్ లో ఉన్నాయన్నారు. 

అరెస్టు చేయడం అప్రజాస్వామికం - తమ్మినేని..

హైదరాబాద్ : పార్టీ కార్యాలయాల్లో పోలీసులు చొరబడి కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

 

ప్రకాశంలో జగన్ పర్యటన..

ప్రకాశం : నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు.

 

06:43 - September 30, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ సాగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. రైతు మరణాల నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విపక్షాలు మండిపడ్డాయి. రైతుకు భరోసానిచ్చేలా సర్కార్‌ చర్యలు తీసుకున్నప్పుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని ప్రతిపక్షాలు సూచించాయి. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశాయి.

చర్చను ప్రారంభించిన పోచారం..
తొలుత చర్చ ప్రారంభించిన..వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి..రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు బాధాకరమన్నారు. విత్తు వేశాఖ వర్షం లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో 80శాతం విస్తీర్ణంలో పంటలు సాగయినా..సకాలంలో వర్షాల్లేక పంటలు ఎండిపోయి..అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మంత్రి అన్నారు. రుణమాఫీని 50శాతం పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పోచారం ప్రకటించారు.

రుణమాఫీ ఒకేసారి చేయాలి - జీవన్ రెడ్డి..
రుణమాఫీ ఒకేసారి చేసుంటే..ఆత్మహత్యలు జరిగుండేవి కావని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. లక్షవరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నా..ధీర్ఘకాలిక రుణాలకు వర్తించలేదన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు మొలకదశ నుంచే దెబ్బతిన్నాయన్నారు. ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటివరకు 20శాతం మించి రుణమాఫీ జరగలేదని..2004లో కాంగ్రెస్‌ ఒకేసారి రుణమాఫీ చేసిందని జీవన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ హత్యలే - సీపీఎం..
తెలంగాణలో ఇప్పటివరకు 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా..ప్రభుత్వం మాత్రం వాటిని తక్కువ చేసి చూపిస్తోందని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కరవు, వరద నష్టాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదకలు పంపించట్లేదని, సరైన నివేదికలు పంపిస్తే కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రం..కానీ ప్రజలు మాత్రం పేదోళ్లేనన్నారు. భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ..తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చాలా బాధాకరమని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. నిజనిర్థారణ కమిటీ వేసి కారణాలను విశ్లేషించాలని సూచించారు. రైతుల సమస్యలపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.     

06:34 - September 30, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో నేడు చేపట్టే చలోఅసెంబ్లీకి సర్కార్ ఎన్నిక అడ్డంకులు సృష్టించినా నిర్వహించి తీరుతామని సీపీఎం రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. అక్రమ అరెస్టులు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 15 మాసాలుగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూని చేస్తుందో చాటి చెప్పడానికి చలో అసెంబ్లీని నిర్వహించడం తలపెట్టడం జరిగిందన్నారు. నిన్న రాత్రి నుండి ప్రారంభం చేశారని, ఆపీసులు, ఇంటి మీద పడి అరెస్టు చేసి ప్రజాస్వామ్యం ఎలా ఉందో సీఎం కేసీఆర్ లోకానికి తనకు తానే చాటుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న నిర్భంద చర్యలను తెలంగాణ ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలన్నారు. కేసీఆర్ నిజ స్వరూపం ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నిర్భందాలు చేసినా చలో అసెంబ్లీకి ప్రజలు తరలివస్తారని తమ్మినేని పేర్కొన్నారు. 

06:31 - September 30, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో జరిగిన శృతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా ఏర్పడిన 370 ప్రజాసంఘాలు నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. తెలంగాణ సర్కార్‌ దమనకాండను నిరసిస్తూ, అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో అసాంఘిక శక్తులు చలో అసెంబ్లీలో పాలుపంచుకుంటున్నాయంటూ పోలీసులు సరికొత్త వాదనకు తెరలేపారు. చలో అసెంబ్లీ జరిగితే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయంటూ చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరించారు. అయితే అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా చలో అసెంబ్లీ జరిపి తీరుతామంటూ టీడిఎఫ్‌ తేల్చి చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వామపక్ష నేతలను, ప్రజాసంఘాల సభ్యులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులతో ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. విరసం నేతలను గృహనిర్భంధంలో ఉంచారు. చివరికి ఉస్మానియా హాస్టల్లో అర్ధరాత్రి చొరబడి మరీ విద్యార్ధులను హడలగొట్టారు. అనుమానితులు ఉన్నారనే నెపంతో రూములను తనిఖీలు చేసారు. పోలీసుల ఓవర్‌యాక్షన్‌ పై ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు. హాస్టల్ టు హాస్టల్ క్యాంపేయిన్ నిర్వహిస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ జరపడం దారుణమని పేర్కొన్నారు. 200 మంది ర్యాలీగా వెళ్లగా వారిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపారు. వెంటనే వారిని విడుదల చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. 

చండీగఢ్ కు వెళ్లనున్న ప్రణబ్..

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు చండీగఢ్ కు వెళ్లనున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దక్షిణ, మధ్య ఆసియాలో శాంతి పరిరక్షణ, కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. 

కృష్ణా జిల్లాల పిటిషన్ విచారణ నేడు..

హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

ఓయూలో పోలీసులు తనిఖీలు..

హైదరాబాద్ : టీడీఎఫ్ తలపెట్టిన 'చలో అసెంబ్లీ' నేపథ్యంలో పోలీసులు ఓయూలో మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. చలో అసెంబ్లీలో పాల్గొంటారేమోనని విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఓయూలో విద్యార్థులపై జరిగిన దాడిని వరవరరావు ఖండించారు. వెంటనే పోలీసులు ఓయూ నుండి వెనక్కి వచ్చేయాలని డిమాండ్ చేశారు. 

చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం - టీడీఎఫ్..

హైదరాబాద్ : 'చలో అసెంబ్లీ'ని నిర్వహించి తీరుతామని టీడీఎఫ్ ప్రకటించింది. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని, వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు వందలాది మంది వామపక్ష నేతలను అరెస్టు చేశారని విమర్శించింది. ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఉదయం పది గంటలకు ఎస్వీకే నుండి ర్యాలీ ప్రారంభమౌతుందని టీడీఎఫ్ ప్రకటించింది. పోలీసులు చెబుతున్నట్లుగా తెలంగాణ ప్రజా స్వామ్య వేదికలో ఎలాంటి నిషేధిత సంస్థలు లేవని తెలిపింది. ఎన్ కౌంటర్లపై అసెంబ్లీలో చర్చ జరగాలని, సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

 

వామపక్ష నేతల ముందస్తు అరెస్టు..

హైదరాబాద్ : నగరంతో పాటు పలు జిల్లాల్లో వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ కౌంటర్లకు నిరసనగా 'టీడీఎఫ్' నేడు 'చలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వామపక్ష నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. నగరంలోని ఎంబీ భవన్, మగ్దూం భవన్, ఎస్వీకేతో పాటు పలు ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఎస్వీకే చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

Don't Miss