Activities calendar

02 October 2015

21:52 - October 2, 2015

కడప : జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి టీడీపీలో ఎంట్రీకి రూట్‌ క్లియరయినట్లే కనపడుతోంది. కాని టీడీపీ రామసుబ్బారెడ్డి మాత్రం అదే జరిగితే తాను తట్టుకోలేనంటున్నారు. బాలకృష్ణ, లోకేష్‌లను కలిసిన రామసుబ్బారెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలియచేసినట్లు తెలుస్తోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. వైఎస్‌ను ఎదుర్కొన్న తనను కాదని.. ఇప్పుడు అధికారం వచ్చాక వస్తామనేవారికి పట్టం కడతారా అని నిలదీసినట్లు సమాచారం. తమ రెండు గ్రూపుల మధ్య గొడవల్లో 150 మంది కార్యకర్తల ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి పార్టీలోకి వస్తే తానేం సమాధానం చెప్పుకోవాలని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. అయితే సర్దుకుపోవాలని బాలకృష్ణ, లోకేష్‌లు చెప్పినట్లు సమాచారం. అది జరగని పనని తానో, ఆదినారాయణరెడ్డో తేల్చుకోమన్నట్లు తెలుస్తోంది. రేపు చంద్రబాబును కూడా కలవనున్న రామసుబ్బారెడ్డి తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పనున్నట్లు సమాచారం.

21:50 - October 2, 2015

హైదరాబాద్ : ప్రాజెక్టులపై టీ-సర్కార్‌ ప్రత్యేకంగా దృష్టిసారించింది. సమగ్ర జలవిధానంపై... పాఠాలు చెప్పేందుకు ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. ఉభయసభల్ని సమావేశపర్చాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌. ప్రతినీటి బొట్టును వినియోగించుకుని... బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు... వ్యూహరచన చేస్తున్నారు. అవసరమైతే విపక్షాల సహకారాన్ని సైతం తీసుకోనున్నారు.

శరవేగంగా అడుగులు....

సమగ్ర జల విధానంపై టీ-సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సమాయత్తం అవుతున్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై సభ్యుల్లో ఉన్న సందేహాల్ని తొలగించే ప్రయత్నం చేయనున్నారు కేసీఆర్‌. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాల్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటించనున్నారు.

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ...

శుక్రవారం గవర్నర్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఉభయ సభల్ని సమావేశపర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రభుత్వం అనుసరించనున్న జల విధానాన్ని నరసింహన్‌కు వివరించారు. బడ్జెట్ సమావేశాలప్పుడే ఉభయ సభలను సమావేశ పరుస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఉమ్మడి సమావేశం నిర్వహించుకోవచ్చు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అలా జరిగిన దాఖలాలు లేవు. దీంతో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరమే కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

నూతన జల విధానంపై...

నూతన జల విధానంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు టీ-సర్కార్ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే శాసనసభ, శాసనమండలిలో వేర్వేరుగా కాకుండా ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ 8,9 తేదీల్లో జల విధానంపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, ఉప నదులు, ప్రాజెక్టులు, కేటాయించిన జలాలు, వినియోగించు కుంటున్న జలాలు, పాత ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి వివరాలను సభ ముందుంచేందుకు సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను జిల్లాల వారీగా సభ ముందుంచనున్నారు.

అత్యంత వివాదంగా మారిన ప్రాణహిత-చేవేళ్ల....

అత్యంత వివాదంగా మారిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పాత ప్రాజెక్టులను కాదని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి వంటి కొత్త ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనకగల కారణాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించనున్నారు. ఉభయ సభల ఉమ్మడి సమావేశం... తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో... మైలురాయిగా నిలిచిపోనుంది. ముఖ్యమంత్రి చేసే సుదీర్ఘ ప్రసంగం... విపక్షాల్ని ఏ మేరకు మెప్పిస్తుందో..? చూడాలి.

21:46 - October 2, 2015

హైదరాబాద్ : పేరులోనే భద్రత ఉంది. కానీ అడుగడుగునా అభద్రతే. పేదలంటే అందరికీ చులకనే. పాలకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వం... సామాన్యుడికి శాపంగా మారుతున్నాయి. సర్కారీ సరుకులతో... బతుకుబండిని నడిపే పేదలపై... పాలకుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన... ఆహారభద్రత అమలుపై దృష్టిసారించాల్సిన లీడర్లు రెండేళ్లు చోద్యం చూశారు. తీరా గడువు ముగిశాక... తామేం చేయలేమంటూ తర్జన భర్జన బడుతున్నారు. కేంద్ర నిధుల్ని రాబట్టడంలో... తెలుగురాష్ట్రాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల పాలకులు పదేపదే పలికే మాటలివి.....

సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఒకరు...పేదల కడుపు నింపుతామని మరొకరు...ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పాలకులు పదేపదే పలికే మాటలివి. కానీ మన ముఖ్యమంత్రుల డైలాగ్‌లకు... వాళ్ల చేష్టలకు ఏ మాత్రం సంబంధం ఉండటం లేదు. పేదలంటే ఇద్దరు చంద్రుళ్లకు చులకనే. అందుకేనేమో..! ఆహారభద్రత పథకం కింద... కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తామన్నా... మన పెద్దసార్లకు నివేదికలు పంపే తీరిక కూడా దొరకలేదు. తీరా గడువు ముగిసాక తేరుకున్న నేతలిప్పుడు తర్జనభర్జన పడుతున్నారు.

సామాన్యుడి అవసరాల కన్నా...

తెలుగు రాష్ట్రాల్లో ఆహార భద్రతకు భద్రత లేకుండా పోయింది. సామాన్యుడి అవసరాల కన్నా... రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతో... కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీ బియ్యం సరఫరాలో భారీగా కోత పడనుంది. దేశవ్యాప్తంగా అక్టోబరు 1 నుంచి ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ముందుకొచ్చాయి. కానీ మన తెలుగురాష్ట్రాల అడుగులు మాత్రం ముందుకు పడలేదు. కేంద్ర నిబంధనలను పాటించడంలో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు మీనమేషాలు లెక్కించాయి. దీంతో వేలకోట్ల రూపాయల భారాన్ని మోయక తప్పేట్లు లేదు.

ఒక్క తెలంగాణలోనే 3 వేల కోట్ల భారం....

ఒక్క తెలంగాణలోనే 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం తెలంగాణలో 1.74 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 75 శాతాన్ని అంటే 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేంద్రం అందిస్తుండగా, మిగతా 25 శాతం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసేది. ఆహారభద్రత చట్టం పరిధిలోకి రాని కారణంగా కేంద్రం అందించే సబ్సిడీ బియ్యంలో కోత పడనుంది. సుమారు 40 లక్షల టన్నుల భారాన్ని తెలంగాణ సర్కార్‌ భరించాల్సి వస్తుంది. ఏపీపైనా ఇంతకన్నా ఎక్కువగానే భారం పడే అవకాశముంది.

2013 జులై 5న ఆహారభద్రత యాక్ట్‌.....

2013 జులై 5న ఆహారభద్రత యాక్ట్‌ను కేంద్రం రూపొందించింది. చట్టాన్ని అమలు చేసేందుకు రెండేళ్లు గడువు ఇచ్చింది. అయినా మన పాలకులు మాత్రం స్పందించలేదు. తీరా సెప్టెంబరు30తో డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత... మరింత గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి తెలుగు రాష్ట్రాలు. ఇప్పటికే రెండేళ్లు గడువు ఇచ్చామని, ఇక పొడిగించే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

లెక్కల కన్నా ఎక్కువగా తెల్లకార్డులు.....

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం నిర్దేశించిన లెక్కల కన్నా ఎక్కువగా తెల్లకార్డులు ఉన్నాయి. ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే అధికంగా ఉన్న తెల్లకార్డులను తొలగించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించిన పాలకులు... ఆహార భద్రత చట్టం అమలుపై ఉదాసీన వైఖరిని ప్రదర్శించారు. రెండేళ్ల గడువును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చూపారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో ఆహారభద్రత చట్టం అమలు కాని పరిస్థితి నెలకొంది. 

21:41 - October 2, 2015

హైదరాబాద్ : నేపాల్‌ ప్రధానమంత్రి సుశీల్‌ కోయిరాలా రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌బరన్‌ యాదవ్‌కు అందజేశారు. కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలి తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నేపాలి కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కోయిరాలాను ఫిబ్రవరి 10, 2014న ప్రధానిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 20న నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. దీంతో హిందూ రాజ్యం నుంచి నేపాల్‌ ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఆవిర్భవించింది. 

21:37 - October 2, 2015

హైదరాబాద్ : ఆర్జేడి, జెడియు మహాకూటమిని చూసి ఓర్వలేక ప్రధాని జంగల్‌రాజ్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ దుయ్యబట్టారు. మది జంగల్‌ రాజ్‌ కాదు... కానూన్‌ రాజ్‌అన్నారు. నేషనల్‌ క్రైం బ్యూరో రికార్డ్స్‌ ప్రకారం నేరాలకు సంబంధించి దేశంలో బీహార్‌ 22 వ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజధాని ఢిల్లీలోనే నేరాల సంఖ్య అధికంగా ఉందని- సమస్తిపూర్‌ ఎన్నికల సభలో నితీష్‌ పేర్కొన్నారు. సిఎం అభ్యర్థిని ప్రకటించని బిజెపి- మోది నేతృత్వంలో బరిలోకి దిగుతామని చెప్పడం వారికి నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని నితీష్‌ తెలిపారు. భవిష్యత్తులో గ్రామపంచాయితీ ఎన్నికల్లో కూడా ప్రధాని నేతృత్వంలోనే బిజెపి రంగంలోకి దిగుతుందేమోనని ఎద్దేవా చేశారు.

21:35 - October 2, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోది బాంకా సభలో అభివృద్ధి పాటను ఆలపించారు. బీహార్‌ అభివృద్ధి లేకుండా భారత్‌ అభివృద్ధి చెందలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీహార్‌లో అహంకార్‌ పాలన, కుటుంబ పాలనలను చూశారని నితీష్‌, లాలూల నుద్దేశించి మోది పరోక్షంగా విమర్శించారు. అభివృద్ధివాదాన్ని ఎంచుకున్న బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువతను, మహిళలను ఆకట్టుకునే రీతిలో ప్రధాని ప్రసంగం కొనసాగింది. 

21:33 - October 2, 2015

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. జామా మసీదులో ప్రార్థనల అనంతరం కొందరు యువకులు ఐఎస్‌ఐఎస్‌, జిహాదీ జెండాలను పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.

ఆదినారాయణ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న రామకృష్ణారెడ్డి

కడప: జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి తీసుకొచ్చేందుకు అధిష్టాన వర్గం ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జమ్మల మడుగు టిడిపి ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డితో బాలకృష్ణ, లోకేష్ చర్చలు జరిపారు. ఆదినారాయణ రెడ్డి చేరికను వ్యతిరేకించవద్దని సూచించగా రామసుబ్బారెడ్డి ససేమిరా అంటున్నారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే టిడిపిని వీడతానని హెచ్చరించినట్లు సమాచారం. ఇదే అంశం పై రేపు ఉదయం చంద్రబాబును రామసుబ్బారెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆదినారాయణ రెడ్డి పార్టీలోకి చేర్చుకోవాలనే కృతనిశ్చయంతో టిడిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా

హైదరాబాద్ : ధర్మశాలలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్ లో సఫారీలు బ్యాటింగ్ ప్రారంభించారు. సూపర్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్, ఆమ్లా ఓపెనర్లుగా బ్యాటింగ్ ప్రారంభించారు.

సఫారీల లక్ష్యం 200

హైదరాబాద్ : ధర్మశాల వేదికగా దక్షణాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 199 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ (106), ధావన్‌ (3), విరాట్‌ కోహ్లి (43), రైనా(14), ధోని (20), అంబటి రాయడు (0), అక్షర పటెల్‌ (2) పరుగులు చేశారు.

20:53 - October 2, 2015

ఈ రోజు బాక్స్ ఆఫీస్ ముందు శివాలేత్తుతా అంటూ శివం సినిమాతో మనముందుకి వచ్చాడు ఎనేర్జిటిక్ స్టార్ రామ్.... రామ్ రాశికన్నా హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో శ్రీ స్రవంతి మూవీస్ బానర్ పై రవి కిషోర్ నిర్మించిన మాస్ ఎంటర్ టైనేర్ శివం....

కొండంత అండ కావలిసినంత దండ అవసరానికి మించిన ఎనర్జీ. ఓ మాంచి సినిమా కోసం రామ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా హిట్లు అప్పుడప్పుడు ఫ్లాపులు ఎల్లప్పుడూ...ఇది రామ్ పరిస్థితి...కనీసం శివం సినిమాతో అయినా ఓ దిమ్మ తిరిగే హిట్టిచ్చి మళ్లీ హిట్ రేసులో నిలబడాలి అనేది రామ్ ఆశ.  ఈ సినిమా విషయానికి వస్తే..

ఫ్లస్ పాయింట్స్

  1. ఫస్ట్ హాఫ్ లో కామెడీ

  2. సినిమాటోగ్రఫీ

  3. ఒక పాట

మైనస్ పాయింట్స్

  1. కథ

  2. కథనం

  3. దర్శకత్వం

  4. లీడ్ క్యారెక్టర్స్

    రివ్యూ విశ్లేషణ మరియు రేటింగ్  కోసం వీడియో చూడండి. 

 

20:39 - October 2, 2015

కళ్ల జోడు, చేతికర్ర, వెండి కుండలా పండిన తల, బక్క పల్చని రూపం. చెరగని బోసి నవ్వు.. చురుకైన చూపులు... చకచకా కదిలే అడుగులు... అతి సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడు. రక్తపు బొట్టు చిందకుండా దేశాన్ని దాస్య శృఖలాల నుండి విముక్తి చేసిన అహింసా మూర్తి. భారత జాతికి నిత్య స్ఫూర్తి. ప్రపపంచానికి శాంతి పవనాలు ప్రసరింపచేసిన దీప్తి. మరి ఆ మహాత్యుడు కలలు కన్న దేశం ఇదేనా? జయంతి, వర్థంతుల్లో రెండు నిమిషాల మౌనం... పూలదండలు ... ఇవేనా బాపూజీకి నిజమైన నివాళి..మనం ఆ మహాత్ముని అడుగు జాడల్లో నడుస్తున్నామా? అక్టోబర్ 2 మహాత్ముని జయంతి సందర్భంగా అవలోకనం నేటి వైడాంగిల్. ఆ విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రూ.16 కోట్లు విరాళమిచ్చిన కమల్ హాసన్

చెన్నై: సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. భారీ మొత్తంలో విరాళం అందజేసి మానవత్వం చాటుకున్నారు. హెచ్ ఐవీ బాధితుల సహాయార్థం పనిచేస్తున్న పీటీపీ సంస్థకు కమల్ 16 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. 2011లో పీటీపీని స్థాపించారు. హెచ్ ఐవీ తో బాధపడుతున్న చిన్నారులకు వైద్య బీమా అందిస్తోంది. కమల్ హాసన్, హల్లో ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ భాగస్వామ్యంతో ఈ సంస్థను నడుపుతున్నారు. ఇదిలావుండగా, వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్న కమల్ హాసన్ తన జీవితంలో తొలిసారి ఓ ప్రకటనలో కనిపించబోతున్నారు. టెక్స్ టైల్ షోరూమ్ బ్రాండ్ పోతిస్ తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు.

రోహిత్ సూపర్ సెంచరీ

హైదరాబాద్ : భారత్‌ దక్షణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటి-20  మ్యాచ్‌ లో రోహిత్‌ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్‌ 62 బంతుల్లో 103 పరుగులు( 12 ఫోర్లు ఒక 5 సిక్స్ లు) చేశాడు. ఆది నుంచి విలయ తాండవం చేసిన రోహిత్ సిక్సర్లు ఫోర్ల తో విరుచుకు పడ్డాడు. ఒక వైపు రోహిత్ మరో వైపు కోహ్లి దంచి కొట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. 

20:02 - October 2, 2015

హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవిః'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 9 న విడుదల అవుతోంది. హిందీ వెర్షన్ సైతం అదే రోజు రిలీజ్ కు సిద్దమవుతోంది. రిలియన్స్ వారు హిందీలో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ నేపధ్యంలోట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు సూపర్ గా ఉందని మెచ్చుకుంటున్నారు. మీరూ కూడా చూడండి. 

మొదటి వికెట్ కోల్పోయిన భారత్...

హైదారబాద్ : భారత దక్షణాప్రికా జట్ల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ టిమిఇండియా తొలి వికెట్‌ కొల్పయింది. 22 పరుగుల దగ్గర ధావన్‌ (3)పరుగులు చేసి వెనుదిరిగాడు.

ముషీరాబాద్‌లో మహిళ ఆత్మహత్య...

హైదరాబాద్ : నగరంలోని ముషీరాబాద్‌లో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహంతో భర్త ఇంటి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పిల్లలు పుట్టలేదనే వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా రాజీనామా!

హైదరాబాద్: నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఆ దేశ పార్లమెంట్#లోనే ప్రకటించేశారు. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్ బరన్ యాదవ్#కి తన రాజీనామా లేఖను సుశీల్ కొయిరాలా ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 20న ఆదేశం కొత్త రాజ్యాంగాన్ని అమలుచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నూతన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను ఎన్నుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్ సమావేశంలో పేర్కొన్నారు.

కల్తీ కల్లు విక్రయ కేంద్రం సీజ్

నల్గొండ:‌ నాగార్జునసాగర్‌లో కల్లు డిపోలో కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కల్తీకల్లు ను రాష్ట్రవ్యాప్తంగా లేకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం తప్ప చేసేదేమీ ఉండడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

19:40 - October 2, 2015

హైదరాబాద్ : అందమైన బిల్డింగ్స్‌.. అబ్బురపరిచే టవర్స్‌.. అహో అనిపించే ఫ్లై ఓవర్స్‌..సూపర్‌గా ఉండే హైవేలు.. కాలు బయటపెడితే కారు.. చేతిలో సెల్‌ఫోన్‌.. అందులోనే ప్రపంచం..నాగరికత పైపైకి ఎదిగిపోతోంది. దాన్ని అందుకోలేని వారిని చూసి నవ్వుకుంటుంది. స్మార్ట్‌ సిటీయే హార్టు అని చెప్పే అధినేతల సంగతి చెప్పనక్కర్లేదు. ఇంత అభివృద్ధి.. అంత అడ్వాన్సుడ్ టెక్నాలజీ.. అయినా మనిషి రోడ్డు మీదకు వెళితే ప్రాణానికి గ్యారంటీ లేదు. ఇంటి నుంచి బయటికెళ్లాక తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వాన పడితే రోడ్ల మీదే అలలు పోటెత్తుతాయి. ఆ రోడ్లపై కళ్లున్నా కళ్లకు గంతలు కట్టుకుని నడిచినట్లే.. ఎక్కడ ఏ మూల ఓపెన్‌ డ్రెయిన్‌ ఉందో తెలియదు. ఇదేం అభివృద్ధి.. ఇదేం టెక్నాలజీ.. మనిషి ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని ఈ మాయా ప్రపంచాలు ఎవరికి కావాలి? అదితి మరణానికి బాధ్యులెవరు? ఎవరిపై కేసు పెట్టాలి? ఎవరిని శిక్షించాలి? అదితి మరణం ఎన్నో గుణపాఠాలను చెబుతోంది. మరి ఆ గుణపాఠాలను తీసుకుని ఆచరించే దమ్ము ఈ వ్యవస్థకు ఉందా?

ఇది మాటలకందని విషాదం..! ఊహలకందని ఆవేదన..! ఆశలు అడియాసలయ్యాయి..! హృదయం కన్నీటి సంద్రమైంది..! తమ బిడ్డ చెంతుకు చేరుతుందని, చిరునవ్వులు చిందిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీరని కడుపు కోతే మిగిలింది. అంతులేని విషాదాన్ని మిగుల్చుతూ.. తనతో గడిపిన క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మార్చేస్తూ.. అమ్మానాన్నలను అనాథలను చేస్తూ.. అదితి వెళ్లిపోయింది..!

మాంసపు ముద్దగా.....

కళ్లముందున్న బిడ్డను కళ్లారా చూసుకోలేని దైన్యం... చిట్టి చేతులను కనీసం ముట్టుకోలేని పరిస్థితి.... చిన్ని బుగ్గలను ప్రేమగా నిమరలేని దుస్థితి.. అదితి అమ్మచెంతకు చేరింది. కానీ.. అమ్మా అని పిలవట్లేదు. నాన్న వద్దకు చేరింది.. గుండెలపై మాత్రం ఆడుకోవట్లేదు. అడిగింది ఇవ్వలేదని అలిగినట్టుగా.. అమ్మకు, నాన్నకు దూరంగా ఉండిపోయింది. ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసి చిట్టితల్లి.. మాంసపు ముద్దగా మారిపోయింది. అదితిలా వచ్చి.. అతిథిలా వెళ్లిపోయింది.

ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వస్తూ...

విశాఖలో సెప్టెంబర్ 24న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వస్తూ... డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన అదితి నిర్జీవంగా కంటపడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బల పాలెం వద్ద సముద్రపు ఒడ్డున విగతజీవిగా కనిపించింది. వారం రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోవడంతో.. మృతదేహం గుర్తుపట్టడానికి వీళ్లేకుండా పాడైపోయింది.

దిబ్బపాలెం వద్ద చిన్నారి మృతదేహం.....

దిబ్బపాలెం వద్ద చిన్నారి మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులతో తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యం చూసి తండ్రి హృదయం తల్లడిల్లింది. గుండె ఆగినంతపనైంది. కనీసం గుర్తు పట్టలేనంత స్థితిలో ఉన్న అదితి మృతదేహాన్ని చూసి తండ్రి కుప్పకూలిపోయారు. చివరకు ప్రేమతో చేయించిన చెవి దిద్దులే అదితికి ఆనవాళ్లయ్యాయి. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అదితి వేసుకున్న పింక్ డ్రస్‌తో పాటు చెవి దుద్దులు, మెడలోని తాయత్తు ఆధారంగా ఆ మృతదేహం అదితిదేనని తండ్రి గుర్తించారు.

ఎప్పటికైనా తిరిగొస్తుందనే నమ్మకంతో .....

వారం రోజులపాటు కనిపించకుండాపోయిన తమగారాల పట్టి ఎప్పటికైనా తిరిగొస్తుందనే నమ్మకంతో ఉన్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. నిద్రాహారాలు మాని వారు చేసిన పూజలు ఫలించలేదు. ఏ వార్త అయితే.. వారు వినకూడదనుకున్నారో అదే వినాల్సి వచ్చింది. మనసు శంకించిన కీడే నిజమైంది. అదితి ఇక లేదన్న వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూతురు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదిస్తున్నారు.

ముట్టుకునేందుకు వీళ్లేకుండా.....

ముట్టుకునేందుకు వీళ్లేకుండా ఉన్న చిన్నారి అదితి మృతదేహాన్ని.. వస్త్రాల్లో చుట్టి తీసుకొచ్చారు. భోగాపురం మండలం దిబ్బల పాలెం నుంచి అదితి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం పోస్టుమార్టం చేసిన తర్వాత తల్లిదండ్రులకు అదితిని అప్పగించారు. వారం రోజులుగా తల్లిదండ్రులతోపాటు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపిన అదితి అంశం.. చివరకు విషాదాంతంగా ముగియడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది.

ఫలించని తల్లిదండ్రుల పూజలు.....

అమ్మానాన్నల పూజలు అదితికి ప్రాణం పోయలేకపోయాయి. రెండు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు అదితిని ఆదుకోలేకపోయాయి. అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వారం రోజులపాటు కొనసాగిన ఉత్కంఠ.. చివరకు విషాదంతోనే అంతమైంది.

సెప్టెంబర్‌ 24న ట్యూషన్‌కోసం వెళ్లిన చిన్నారి....

సెప్టెంబర్‌ 24న ట్యూషన్‌కోసం వెళ్లిన చిన్నారి అదితి ఇంటికి వచ్చేందుకు కారెక్కుతూ ప్రమాదానికి గురైంది. కారులో కాలుపెట్టేందుకు ప్రయత్నించగా.. జారి పక్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. అప్పటికే జోరుగా కురిసిన వర్షంతో డ్రెయినేజీ పొంగి పొర్లుతోంది. ఆ వరద నీటి ఉధృతికి అదితి వేగంగా కొట్టుకుపోయింది. పక్కనున్నవారు చూసి వెంటనే స్పందించినా ఫలితం లేకపోయింది. చివరకు డ్రెయినేజీలోకి దూకి వెతికినా అదితి జాడ కనిపించలేదు.

మానవతా దృక్పథంతో....

సెప్టెంబర్‌ 24న సాయంత్రం 6 గంటలకు అదితి గల్లంతయ్యింది. మానవతా దృక్పథంతో స్పందించిన స్థానికులు.. రాత్రి మూడు గంటల వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అదితికోసం గాలింపు చేపట్టారు. ఎంతగా ప్రయత్నించినా అదితి ఆచూకీ మాత్రం లభించలేదు.

గాలింపు చర్యలను ముమ్మరం....

తర్వాత స్పందించిన అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చిన్నారి అదితి పడిన కాల్వ సముద్రంలోకి కలుస్తుండడంతో అంతటా వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో.. నేవీ సిబ్బందిని రంగంలోకి దించారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలీకాఫ్టర్‌ ద్వారా గగనతలం నుంచీ వెతుకులాడారు. ప్రత్యేక డ్రైవర్లు స్పీడ్‌ బోట్లతో, ఆపరేషన్‌ కొనసాగించినా అదితి గురించి కనీస ఆనవాళ్లు కూడా లభించలేదు. చివరికి పాప భుజానికున్న బ్యాగ్ కూడా దొరక్కపోవడంతో.. అదితి తల్లిదండ్రులతోపాటు, కుటుంబ సభ్యుల్లో ఆశలు చిగురించాయి.

72 గంటలు గడిస్తే ఏ దేహమైనా.....

72 గంటలు గడిస్తే ఏ దేహమైనా సముద్రంలో తేలుతుందని నేవీ అధికారులు చెప్పడంతోపాటు, రోజులు గడిచినా చిన్నారి జాడ తెలియకపోవడంతో అదితి ప్రాణాలతోనే ఉందేమోననే తల్లిదండ్రులు ఆశించారు. కాల్వపడి కొట్టుకుపోతున్న చిన్నారిని ఎవరైనా రక్షించారేమోనని అనుకున్నారు. లేదంటే.. ఎవరైనా కిడ్నాప్‌ చేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. చివరికి తన కూతురి ఆచూకీ చెప్పినవారికి 5 లక్షల రూపాయలు కూడా అందజేస్తానని తండ్రి శ్రీనివాస్‌ ప్రకటించారు.

మున్సిపల్‌ అధికారులతోపాటు, పోలీసులు కూడా....

మరోవైపు.. మున్సిపల్‌ అధికారులతోపాటు, పోలీసులు కూడా గాలింపు ముమ్మరం చేశారు. మిస్సింగ్‌ కేసుకూడా నమోదు చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేశారు. డీసీపీ నేతృత్వంలో విచారణ మొదలు పెట్టి, చివరకు కారు డ్రైవర్‌ కాల్‌డేటాను కూడా పరిశీలించారు. అదితి కుటుంబాలకు ఏవైనా పాత గొడవలు ఉన్నాయా? అనే కోణంతోపాటు, డబ్బు కోసం ఎవరైనా అపహరించారా..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు.

సీఎం చంద్రబాబును కలిసిన తండ్రి శ్రీనివాస్..

ఇక, అదితి గల్లంతైన తర్వాత ఐదో రోజున తండ్రి శ్రీనివాస్‌ సీఎం చంద్రబాబును కలిశారు. అన్నివిధాలా సహకరిస్తామన్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరింత సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. తీవ్రంగా గాలింపు చేపట్టారు. మరోవైపు... అదితి అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నారి దొరకాలనే అభిలాషతో సోషల్‌ మీడియాలో పోస్టుల వెల్లువ కూడా కొనసాగింది.

అదితి రాకకోసం వేచి చూసినప్పటికీ నిరాశే....

ఈ విధంగా.. కోట్లాది మంది అదితి రాకకోసం వేచి చూసినప్పటికీ నిరాశే ఎదురైంది. తన నవ్వుతో అందరినీ కట్టిపడేసిన చిన్నారి.. ఇక లేదనే వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వారంరోజులుగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆ పాప ఇక లేదని తెలిసి కంట కన్నీరు ఆగడం లేదు.

ఈ పాపం ఎవరిది?...

ఈ పాపం ఎవరిది..? ఈ నేరం ఎవరిది..? ఈ చిట్టితల్లిని చిదిమేసిందెవరు..? తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చిందెవరు..? ఆ రోజున కురిసిన వర్షమా..? ఆ నీరు ప్రవహించిన డ్రైనేజీనా..? లేదంటే.. చదువుకోవాలనే తపనతో వర్షంలోనూ ట్యూషన్‌కు వెళ్లిన అదితిదే తప్పా..? ఎవరు..? ఈ ఘోరానికి, ఈ దారుణానికి సమాధానం చెప్పాల్సిందెవరు..?

ఆరేళ్లకే అదితికి నూరేళ్లూ....

కేవలం ఆరేళ్లకే అదితికి నూరేళ్లూ నిండిపోయాయి. డ్రెయినేజీ వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడం, డ్రెయినేజీలోకి వచ్చిన నీరు సాపీగా పోయేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా డ్రెయినేజీని ఆక్రమించి, దాన్ని సిమెంట్‌ దిమ్మెలతో కప్పేయడం కూడా కారణమేనని అంటున్నారు.

అధికారులు స్పందించిన తీరుపైనా విమర్శలు...

డ్రెయినేజీలో అదితి పడిపోయిన తర్వాత అధికారులు స్పందించిన తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు డ్రెయినేజీలో పడి గల్లంతైతే... ఎనిమిది గంటల వరకు కూడా విశాఖ మున్సిపల్‌ అధికారులు స్పందించలేదని సమాచారం. స్థానికులు టార్చిలైట్లతో వెతులాట ప్రారంభించిన తర్వాత తీరిగ్గా సిబ్బంది వచ్చారని చెబుతున్నారు. వచ్చిన తర్వాత కూడా.. టార్చిలైట్లలో ఛార్జింగ్‌ లేదనే కారణంతో గాలింపు చర్యలు చేపట్టలేదు. తొమ్మిది గంటల తర్వాత తీరిగ్గా గాలింపు మొదలు పెట్టినట్టు సమాచారం. ఇక మున్సిపల్‌ విభాగంలో ఉన్నత స్థాయి అధికారులు రాత్రి 12 గంటల వరకు కూడా స్పందించలేదని సమాచారం. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఓ వైపు విశాఖ పట్టణం స్మార్ట్ సిటీగా ....

ఓ వైపు విశాఖ పట్టణం స్మార్ట్ సిటీగా ఎదుగుతోందంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండగా.. మరోవైపు నగరంలో చిన్నారులు రోడ్డెక్కలేని దుస్థితి నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో రోడ్డుమీద కాలుమోపినందుకే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం జీవీఎంసీ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్ స్తంభం ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలు బలిగొంది.....

నగరంలోని నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డులో ఓ విద్యుత్ స్తంభం ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాలు బలిగొంది. స్తంభానికి వేళాడుతున్న కరెంటు తీగలు తగలడంతో.. అభిరామ్ అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సంబంధిత అధికారులు విద్యుత్‌ తీగలను సరిచేసినట్లైతే.. అభిరామ్‌ ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారి కుక్కలకు ఆహారంగా....

ఇక మరో దారుణ ఘటనలో.. ఏడాదిన్నర వయసున్న చిన్నారి కుక్కలకు ఆహారంగా మారాడు. ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చిన చిన్నారి శివకేశవ్‌ను.. వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్నాయి. కుక్కల సమూహం మీదపడి దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని, చిన్నారి చావుకు అధికారులే బాధ్యులని స్థానికులు ఆగ్రహించారు. ఇక తాజా ఘటనలో... అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి అదితి బలైంది.

ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడానికే తప్ప,....

ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడానికే తప్ప, ప్రజల పట్ల ప్రభుత్వాలు కనీస బాధ్యతతో కూడా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదితి అంశంపై స్పందించిన జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌.. హుదుద్ తుఫాన్‌ ధాటికి డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అంతా బాగుచేయాలంటే కనీసం 50 కోట్లు ఖర్చువుతుందని చెప్పారు. పరోక్షంగా ప్రభుత్వమే నిధులు జారీచేయడం లేదని పరోక్షంగా చెప్పారు.

దారుణాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి.....

దారుణాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్న ప్రభుత్వాలు.. శాశ్వత చర్యలు తీసుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని ప్రభుత్వాలు.. స్మాట్‌ సిటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపుతున్నాయని మండిపడుతున్నారు. తమకు స్మార్ట్‌ సిటీతో ఏమాత్రం అవసరం లేదని, సేఫ్‌ సిటీలను ఏర్పాటు చేస్తే చాలని అంటున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మరెన్నో అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

19:28 - October 2, 2015

నిజామాబాద్‌ : ఎడపల్లి మండలం కుర్నిపల్లిలో పిడుగుపాటుకు తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. పొలంలో పని చేస్తుండగా పిడుగుపడడంతో కొండ లక్ష్మీ, కొండ రజనీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం వెంటనే అందిస్తామని అధికారులు తెలిపారు. 

19:26 - October 2, 2015

తిరుపతి : తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. పెరటాసి నెల మూడో శనివారం రానుండడంతో...తిరుమల మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుండి వైకుంఠం క్యూకాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. రద్దీ అంతకంతకు పెరుగుతుండడంతో...టిటిడి అధికారులు విఐపి బ్రేక్‌ దర్శనాలను ఈనెల 4వరకు రద్దు చేశారు. మరో మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి అధికారులు అంచనా వేస్తున్నారు. దానికితోడు సాయంత్రం తిరుమలలో కురిసిన కుండపోత వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంలో భక్తులు తడిసిముద్దయ్యారు. 

19:24 - October 2, 2015

హైదరాబాద్ : నల్గొండ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చింతపల్లి మండలం కూర్మేడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. 

బ్యాటింగ్ ఆరంభించిన భారత్

హైదరాబాద్ : ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అరంభించగా తొలి ఓవర్ సఫారీ బౌలర్ కైల్ అబాట్ వేశాడు.

ఛత్తీస్‌గఢ్ లో జవాన్ ను హతమార్చిన మావోలు...

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో మావోయిస్టులు జవాన్‌ను హతమార్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా కొడేనార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్గం గ్రామంలోని ఔట్‌పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మానేరు రామ్‌బొంజం అనే జవాన్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. రామ్‌బొంజం బుర్గం గ్రామంలోని ఓ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మావోయిస్టులు కాల్చి చంపినట్లు అక్కడి పోలీసులు మీడియాకు తెలియజేశారు.

ఇంద్రాణీ ముఖర్జీ అస్వస్థత...

హైదరాబాద్ : షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ అస్వస్థతకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఇంద్రాణీకి శుక్రవారం ఛాతీ నొప్పి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను ముంబయిలోని ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, 2102 లో షీనాబోరా అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఆర్థిక కారణాలతో తల్లి ఇంద్రాణీ ముఖర్జీయే తన కూతురిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.  

18:56 - October 2, 2015

తూ.గో : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజమండ్రిలో పీసీసీ చీఫ్ రఘువీరా ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు... ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి మారకపోతే అమరావతి శంకుస్థాపనరోజు ప్రధాని మోదీకి నల్లజెండాలతో నిరసన తప్పదని హెచ్చరించారు.. రఘువీరాకు కేంద్రమాజీ మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు సంఘీభావం తెలిపారు..

18:54 - October 2, 2015

విజయవాడ : గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో మహిళలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో పైపులరోడ్డు సెంటర్‌ గాంధీ విగ్రహం ముందు ఒకవైపు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు.. మరోవైపు మద్యం బాటిళ్ళతో కాటా వేసి నిరసన తెలిపారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం సరికొత్త విధానాలతో మద్యం పాలసీలు రూపొందిస్తోందని ఐద్వా నేతలు ధ్వజమెత్తారు.

 

18:52 - October 2, 2015

విజయనగరం : వెలుగులు విరజిమ్మమంటే అందిన కాడికి దోచుకున్నారు. కారు చీకటిని పారద్రోలమంటే లెక్కల్లో తెలివి చూపించారు. అడిగే వాడెవడున్నాడనే రీతిలో ప్రజాధనాన్ని దోచుకున్నారు. అవినీతి భాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే సరికి ఏం చేసినా ప్రజల కోసమే కదా అంటూ కలరింగిస్తున్నారు.

2013లో 1.50లక్షలు నిధుల కేటాయింపు......

బాధ్యత కలిగిన విజయనగరం జిల్లా ఎంపిడీఓ లు అడ్డదారులు తొక్కారు. గ్రామాల్లో వెలుగులు పంచాలనే ఓ ఎంపీ లక్ష్యాన్ని నీరు గార్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు టి.రత్నాబాయి 2013లో తన ఎంపీ నిధుల నుంచి కోటి, 50లక్షలు విజయనగరం జిల్లాకు కేటాయించారు. ఆ నిధులతో వీధి దీపాలను ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. దీంతో అధికారులు గజపతినగరం నియోజకవర్గంలో 30లక్షలు, రామభద్రాపురం నియోజకవర్గంలో 50లక్షలు, సాలూరులో 25లక్షలు, రామభద్రపురం పంచాయతీలో 25లక్షలు మంజూరుకు అనుమతించారు.

కొటేషన్స్ తీసుకుని టెండర్ కేటాయించే ఎంపిడీవోలు.....

ఒక ఎంపీ నిధులు మంజూరు చేస్తే వారు కోరిన చోట అభివృద్ధి పనులకు జిల్లా ప్రణాళికాధికారి బాధ్యత తీసుకుంటారు. అప్పుడు సంబంధిత ఎంపిడీవోలే కొటేషన్స్ తీసుకుని ఎవరైతే తక్కువ ధరకు ఇస్తారో వారికే టెండర్‌ కేటాయింపులు చేస్తారు. అనంతరం ఎం.బుక్, యూసీ లు సీపీఓ కి సమర్పించాల్సి ఉంటుంది. సరిగా ఇదే రీతిలో విజయనగరం జిల్లా ఎంపీడీవోలు వ్యవహరించారు. కానీ ఎల్ ఈడీ దీపాల కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక్కో ఎల్ ఈడీ బల్పు ఖరీదు వెయ్యి నుంచి 1500లోపు ఉంటుంది. ఇంకా నాణ్యమైనది అయితే 2వేల కన్నా మించదు. కానీ ఎంపీడీఓ లు ఇచ్చిన బిల్లులు చూస్తే ఒక్కోదాని ఖరీదు 6వేల నుంచి 7 వరకు ఉంది. అంతా కుమ్మక్కై నిధులను మింగేసారని వామపక్ష నేతలు మండి పడుతున్నారు.

విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వామపక్ష నేతలు

ఎంపిడీవోలు చేసిన ఈ అక్రమాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వామపక్ష నేతలు తీసుకెళ్లారు. నెల గడుస్తున్నా ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. దీంతో అక్రమార్కులను వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.

18:50 - October 2, 2015

శ్రీకాకుళం : రోగులను కంటికి రెప్పలా చూసుకోవల్సిన బాధ్యత వారిది. కష్టమొస్తే కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన ఉద్యోగం వారిది. కానీ విలువలన్నింటికి తిలోదకాలు ఇచ్చారు. గురుతర బాధ్యతకు సమాధి కట్టి కక్కుర్తిగా కాసుల వేటలో పడ్డారు. పేదోడనే కనీస జ్ఞానం మరిచి నిలువుదోపిడీ చేస్తున్నారు.

ఒడిషా రాష్ట్రం నుంచి కూడా .....

ఎంతో పేరున్న శ్రీకాకుళం జిల్లా పెద్దాసుపత్రి ఇది. జిల్లా నలుమూలల నుంచే కాదు పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రం నుంచి కూడా నిరుపేదలు ఇక్కడికి వైద్యం కోసం వస్తారు. కార్పోరేట్ ఆస్పత్రుల్లో కాసుల మూటలు అప్పగించలేని నిస్సహాయులంతా రిమ్స్‌లో వైద్యులను ఆశ్రయిస్తారు.

ప్రసవం కోసం రిమ్స్‌కు వచ్చే రోగులు.......

జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది రోగులు రిమ్స్‌కు వస్తుంటారు.ముఖ్యంగా గర్భిణులు సుఖప్రసవం కోసం రిమ్స్‌కు వస్తారు. అయితే ఇక్కడి వైద్య సిబ్బందికి పట్టిన డబ్బు జబ్బు వల్ల రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గైనిక్‌, ప్రసూతి వార్డులో చేరిన మహిళా పేషేంట్ల వద్ద నుంచి ఆస్పత్రి సిబ్బంది అకారణంగా డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గ్రూపులుగా విడిపోయిన వైద్య సిబ్బంది డెలివరీకి ఓ రేటు, పురిటి శిశువును శుభ్ర పరిచేందుకు ఓ రేటు, బొడ్డు తాడు కోసేందుకు ఓ రేటు ఇలా ఒక్కో పనికి ఒక్కో రేట్ నిర్ణయించారు. వార్డు బాయ్‌ల నుంచి సీనియర్ నర్స్‌ల వరకు ఒక్కో బాలింత నుంచి సుమారు 1500 రుపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు .....

ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పై వారి నిర్లక్ష్యపు మత్తును ఆసరాగా చేసుకున్న కిందిస్ధాయి సిబ్బంది మరింతగా చెలరేగిపోతున్నారని సమాచారం. ఇప్పటికైనా వైద్యశాఖామంత్రి పట్టించుకోకుంటే రిమ్స్‌కు మాత్రమే కాదు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలన్నా రోగులు భయపడే పరిస్ధితి వస్తుందని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

18:47 - October 2, 2015

కృష్ణా : విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ కొత్త సొబగులు అద్దుకుంటోంది. రాజధాని ప్రాంతంగా అవతరించక రూపు రేఖలు మార్చుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణకు ధీటుగా ఎదిగేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోంది. రోజుకు నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి 2,700 బస్ సర్వీసులు రాష్ట్రం నలుమూలలకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇప్పటికే వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్ఈడీ డిస్ ప్లే, బస్సుల రాకపోకలు, జీపీఎస్ తదితర ఆధునిక సమాచార వ్యవస్థను సమకూర్చుకుంది.

పీపీఏ పద్ధతిలో బహుళ అంతస్తుల నిర్మాణం...

బస్టాండ్‌లో సినిమా హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఆర్టీసీ ప్రధాన పాలన కార్యాలయమైన బస్ హౌస్‌ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దారు. పై అంతస్తులో నిర్మించిన ఈ కార్యాలయంలో ఎండీ, ఈడీలు, పాలనా సిబ్బంది ఉండేలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. మిగతా స్థలంలో ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి...కమర్షియల్‌ స్పేస్‌ను లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంనుంచైనా విజయవాడకు అనుసంధానం చేసేలా ఆర్టీసీ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. విజయవాడ కేంద్రంగా అన్ని జిల్లా కేంద్రాలకు రెండేసి ఆధునాతన సౌకర్యాలు కలిగిన బస్సులను నడపనుంది. ఇందుకోసం 40 లగ్జరీ బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. విజయవాడ కేంద్రంగా సెప్టెంబర్ మొదటివారం నుంచి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వారంలో మూడ్రోజులు ఇక్కడి నుంచే ఆర్డీసీ ఎండీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కసరత్తు.....

మరోవైపు విజయవాడలో ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మరికొన్ని కీలక విభాగాలను ఏర్పాటు చేసేలా కసరత్తు సాగుతోంది. 4 వేల రూట్లలో సంస్థ సర్వీసుల లాభనష్టాలను బేరీజు వేసి లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని 126 డిపోల మేనేజర్లకు శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టారు. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ధర్మశాల : దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ తో దక్షిణాఫ్రితో తలపడుతున్న విషయం తెలిసిందే..

దేశంలో రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం...

హైదరాబాద్ : దేశంలో రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. అమీర్‌పేటలోని సెస్‌లో జరిగిన తెలంగాణ పత్తి రైతుల సమ్మేళనంలో గంగ్వార్ ప్రసంగించారు. పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఈ నెల 10 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తామని ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర పెంచాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

గొలుసు దొంగల పై పీడీ యాక్టు : సీపీ

హైదరాబాద్ : నగరంలో వరుస చోరీలకుపాల్పడుతున్న గొలుసు దొంగలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీసీఎస్ పరిధిలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పట్టుబడిన పీడీయాక్టు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ46 మంది పై పీడీ యాక్టు నమోదు చేశామని తెలిపారు.

పత్తి రైతులకు మద్దతు ధర పెంచాలి - దత్తాత్రేయ..

హైదరాబాద్ : పత్తి రైతులకు మద్దతు ధర పెంచాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో పత్తి రైతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. దళారులకు అడ్డుకట్ట వేయాలని కేంద్రమంత్రిని కోరడం జరిగిందన్నారు. రైతు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, పంటల సమగ్రబీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు సంఘాలుగా ఏర్పడి సలహాలు, సూచనలివ్వాలని తెలిపారు.

 

పత్తి రైతులను ఆదుకుంటాం - కేంద్ర మంత్రి గంగ్వార్..

హైదరాబాద్ : పత్తి రైతులను కేంద్రం ఆదుకుంటుందని కేంద్రమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పత్తి రైతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈనెల 10 నుండి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమని రైతుల సహకారంతోనే దళారీ వ్యవస్థను రూపుమాపచ్చని తెలిపారు. 

గుంటూరు సర్కారీ ఆసుపత్రిలో బాబు..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

 

కర్నూలులో ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసన..

కర్నూలు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వేదిక వ్యవస్థాపకులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ విద్యార్థులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాయలసీమను సమ్మర్‌ క్యాపిటల్‌గా ప్రకటించాలని టీజీ డిమాండ్ చేశారు.

17:44 - October 2, 2015

హైదరాబాద్ : ఇన్నాళ్లూ మన్యాల్లో, గ్రామాల్లో దాడులు చేసే ఆ కీటకాలు... హైదరాబాద్‌ నగరవాసులపై యుద్ధం ప్రకటించాయి. వాటిని చూసి బస్తీలకు బస్తీలే బెంబేలెత్తిపోతున్నాయి. సాయంత్రం బయట తిరగాలంటేనే భయంతో వణికిపోతున్నారు. వాటి దెబ్బకు బచావో బచావో అంటూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇంతకీ.. హైదరాబాదీలను అంతగా భయపెట్టేవి ఎంటనే కదా మీ డౌటు. అయితే ఇటో లుక్కెయ్యండి.

వణికిపోతున్న హైదరాబాదీలు...

దోమలు. ఈ పేరు వింటేనే హైదరాబాదీలు గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా దోమలే దోమలు. ఇన్నాళ్లూ గ్రామాలు, మన్యాలకే పరిమితమైన దోమలు.. నగరాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అంటూ... ఏకంగా నగరవాసులపై యుద్ధం ప్రకటించేశాయి.

పేదల ఆరోగ్యంతో చెలగాటం....

ఈ బెడదకు.. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి ప్రాణాంత జ‌బ్బులు పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. కుంట‌లు, నాలాలు మూసీ ప‌రిస‌రాల్లో ఉన్న కాల‌నీల్లో, బ‌స్తీల్లో అయితే దోమ‌ల స‌మస్య చెప్పతరం కావట్లేదని స్థానికులు అంటున్నారు. హైద‌రాబాద్‌లో పెరిగిపోతున్న అప‌రిశుభ్రతతో.. కుంట‌లు, చెరువులు, నాలాలు.. దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి.

180 డెంగీ, 120 మలేరియా కేసులు......

దోమ‌ల వ‌ల్ల గ్రేట‌ర్ మ‌లేరియా, డెంగి కేసులు భారీగా పెరిగిపోయాయి. గ‌తేడాదితో పోల్చితే.. ఈ ఏడాది వీటి సంఖ్య వీప‌రీతంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు సిటిలో 180వరకు డెంగీ కేసులు నమోదు కాగా.. 120 మలేరియా కేసుల వరుకు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉంది. ఇక మూసీనది ప‌రిస‌రాలన్నింటిలో దోమ‌ల బెడ‌ద దారుణంగా ఉందని బాధితులంటున్నారు. దోమల విజృంభణ వల్ల.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని వాపోతున్నారు.

దోమల నివారణకు 3వేల మంది సిబ్బంది.....

దోమ‌ల నివార‌ణ‌కు జీహెచ్‌ఎంసీ వివిధ చ‌ర్యలు చేప‌డుతుంది. ముఖ్యంగా దోమలు పెర‌గ‌కుండా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తారు. వీటిని సకాలంలో చేయకపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని అంటున్నారు. నగరంలో దోమల సమస్యను పరిష్కరించడానికి దాదాపు 3వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని.. మందులకు 25 నుంచి 30కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పేదలు ఆస్పత్రు చుట్టూ తిరుగుతన్నారు.

రోజుకు నెలకు రూ.50 ఖర్చు....

అధికారులపై ఆధారపడకుండా.. దోమల నుంచి రక్షించుకునేందుకు.. ప్రజలు వివిధ రకా చర్యలు చేపడుతున్నారు. మస్కిటో కాయిల్స్, ఎలాక్ట్రానిక్ బ్యాట్స్ వాడుతున్నారు. కనీసం 15లక్షల కుటుంబాలు నెలకు 50రూపాయల చొప్పున ఖర్చు చేసినా.. నెలకు 7కోట్ల 5లక్షల రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి హైదరాబాదీలు కేవలం దోమల రక్షణకోసం సూమారు 100కోట్ల వరకు ఖర్చుచేస్తున్నారు. ఇక వాటి ద్వారా వచ్చే రోగాలకు ఎంతో ఖర్చుచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా బల్దియా అధికారులు.. ప్రజలను దోమలకు బలివ్వకుండా.. తొందరగా మేల్కోవాలని ప్రజలంటున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి.. దోమలనుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటున్నారు.

17:41 - October 2, 2015

వరంగల్ : ఓరుగల్లులో చైన్ దొంగలు రెచ్చిపోతున్నారు.. ఒకేరోజు కొద్ది నిమిషాల తేడాతో మూడుచోట్ల గొలుసు చోరీలు ప్రజలను హడలెత్తించాయి.. బ్యాంక్ కాలనీ, గోపాలపురంలో దాదాపు రెండున్నరలక్షల విలువైన 111గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి... హన్మకొండ కాకతీయ కాలనీకి చెందిన కవిత స్నేహితులతో కలిసి గోపాలపురం వెళుతున్నారు.. ఇంతలో వెనకనుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 26గ్రాముల గొలుసు లాక్కెళ్లాడు... బ్యాంకు కాలనీలో సరిత తన ఇంటినుంచి నడివస్తుండగా చైన్ స్నాచర్లు దాడిచేశారు.. 65గ్రాముల నల్లపూసల గొలుసు, పుస్తెల తాడు దొంగిలించారు.. అక్కడికి సమీపంలోని అరుణ మెడలోని 20గ్రాముల గొలుసుకూడా తెంచుకుపోయారు..

2012లో ఇదే తరహాలో వరుసగా గొలుసు చోరీలు.....

ఒకేరోజు ఇలా చైన్ స్నాచింగ్‌లు జరగడం అందరిలో టెన్షన్ పెంచింది.. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే మహిళలు వణికిపోతున్నారు.. 2012లో ఇదే తరహాలో వరుసగా గొలుసు చోరీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన ఓ బ్యాచ్ దాదాపు రెండు నెలలు హంగామా చేశారు.. స్థానిక లాడ్జీల్లో బసచేస్తూ సుమారు కిలోన్నర బంగారాన్ని దోచుకెళ్లారు.. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న అప్పటి అర్బన్ ఎస్పీ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.. ఆ తర్వాత అక్కడక్కడా చైన్ దొంగతనాలు జరిగినా వెంటనే దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు..మళ్లీ ఇంతకాలంతర్వాత చైన్ చోరులు రెచ్చిపోతున్నారు.. ఈ దొంగలను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.. 

17:39 - October 2, 2015

ఖమ్మం : తెలుగురాష్ట్రాల్లో సరిహద్దు సమరం ముదురుతోంది. భద్రాచలం బోర్డర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరురాష్ట్రాల అధికారులు సై అంటే సై అంటున్నారు. హద్దుల పంచాయితీతో వేడిపుట్టిస్తున్నారు.

ఇసుకను తరలిస్తున్న తెలంగాణ ట్రాక్టర్లకు ఏపీ అధికారులు బ్రేకులు....

ఇరురాష్ట్రాల రెవెన్యూ అధికారులు ఢీ అంటే ఢీ అన్నారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గోదావరి నదిలోంచి ఇసుకను తరలిస్తున్న తెలంగాణ ట్రాక్టర్లకు ఏపీ అధికారులు బ్రేకులు వేశారు. దీంతో ఇరురాష్ట్రాల మధ్య ఇసుక పంచాయితీ అగ్గిరాజేసింది. తాము భద్రాచలం ఆర్డీవో ఆదేశాల మేరకే ఇసుకను తీసుకెళ్తున్నట్లు ట్రాక్టర్ల యజమానులు చెబుతున్నారు. సరిహద్దు వివాదంపై స్థానికులు సైతం మండిపడుతున్నారు. తమ ప్రాంతంలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటని ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని తెలంగాణలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

తమ సరిహద్దుల్ని చూపించి, ఇసుక తవ్వకాలు.....

ఇక ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం... తమ భూభాగంలో ఇసుక తవ్వకాలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి డీపీఓ ఆదేశాల మేరకే అడ్డుకున్నట్లు నెల్లిపాక ఎంఆర్వో తెలిపారు. మరోవైపు ట్రాక్టర్ యజమానులు భద్రాచలం రెవిన్యూ అధికారుల్ని ఆశ్రయించారు. దీంతో హుటాహుటిన అక్కడికి వెళ్లిన తెలంగాణ సిబ్బంది... తమ సరిహద్దుల్ని చూపించి, ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతం తమదేనంటూ స్పష్టం చేశారు. దీంతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు వెనక్కి తగ్గారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను భద్రాచలం ఆర్డీవోకు అప్పగించారు. మొత్తానికి హద్దుల పంచాయితీకి తాత్కాలికంగా తెరపడింది. కానీ శాశ్వత పరిష్కారం చూపితేనే ఇరుప్రాంతాలకు ప్రయోజనమంటున్నారు స్థానికులు. 

17:35 - October 2, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లాలో అఖిలపక్షం నేతలు పాదయాత్ర చేపట్టారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పుకు నిరసనగా నాయకులు.. మంచిర్యాల నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. సీఎం కేసీఆర్ తన కుటుంబ అవసరాల కోసమే ప్రాజెక్టు డిజైన్ను మారుస్తున్నారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని.. తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

 

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ డీఎస్పీ మృతి..

హైదరాబాద్ : నల్గొండ - మహబూబ్ నగర్ సరిహద్దులో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో రిటైర్డ్ డీఎస్పీ రాంరెడ్డి, అక్టోపస్ కానిస్టేబుల్ సంజీవ, సంజీవ తల్లి చంద్రమ్మలున్నారు. ఘటనలో మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి చింతపల్లి మండలం వింజమూరుకు కారులో కానిస్టేబుల్ కుటుంబం వెళుతోంది. హైదరాబాద్ వైపు రిటైర్డ్ డీఎస్పీ వాహనం వెళుతోంది. చింతపల్లి మండలం కూర్మేడు సమీపంలో ఈ కార్లు ఢీకొన్నాయి. 

మదేశి జాతుల ఆందోళన..

బీహార్ : నేపాల్ సరిహద్దులోని తెరాయి ప్రాంతంలోని బిర్ గుంజ్ వద్ద మదేశి జాతులకు చెందిన కొందరు రోడ్డు దిగ్భందం చేశారు. దీనితో చాలా వాహనాలు నిలిచిపోయాయి.

17:03 - October 2, 2015

విజయనగరం : భోగాపురం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయ గ్రామాల్లో రైట్స్‌ సంస్థ ప్రతినిధులు సర్వే చేస్తుండడంతో బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్త్‌ మధ్య రైట్స్‌ సంస్థ ప్రతినిథులు భూముల్ని సర్వే చేస్తుండగా..తుడెం, రవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సర్వే బృంధాన్ని అడ్డుకున్న 10మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల అరెస్ట్‌ సమాచారం తెలుసుకున్న ఇతర గ్రామాల ప్రజలు..భోగాపురం చేరుకునేందుకు పెద్ద ఎత్తున బయలుదేరారు. 

మోడీపై కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సీఎం కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు చేశారు. స్వచ్చ భారత్ అంటూ పాటలు పాడితే వీధులు శుభ్రం కావని, కార్యక్రమాలకు తగ్గట్టూ కార్యాచరణ ఉండాలని సూచించారు. ఫొటోల కోసం ఏడాదికొకసారి వీధులు శుభ్రం చేస్తే స్వచ్ఛ భారత్ కల నెరవేరదని తెలిపారు. 

బీహార్ లో ఎన్డీయేదే విజయమన్న మోడీ..

పాట్నా : భారత ప్రధాన మంత్రి బంకాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఈసారి రెండు సార్లు దీపావళి పండుగను జరుపుకుంటారని, అనవాయితీగా వచ్చే దీపావళి ఒకటైతే ఎన్నికల్లో గెలిచాక మరో దీపావళిని జరుపుకుంటారని అభివర్ణించారు. 

బీజేపీ ఆధ్వర్యంలో పత్తి రైతులతో సదస్సు..

హైదరాబాద్ : బీజేపీ ఆధ్వర్యంలో పత్తి రైతులతో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు సంతోష్ కుమార్, దత్తాత్రేయ పాల్గొన్నారు. 

17:01 - October 2, 2015

కరీంనగర్‌ : చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో దంపతులు ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. బావిలోకి భార్యాభర్తలు దూకగా.. భార్య చనిపోయింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

16:59 - October 2, 2015

నల్లగొండ : మిర్యాలగూడ పీఎస్‌ ఎదుట గిరిజన మహిళ మిర్యాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని కొందరు కబ్జా చేయడంతో పాటు.. రిలయన్స్‌ టవర్‌ ఏర్పాటు చేసుకునేందుకు లీజుకు కూడా ఇచ్చారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా... తనపైనే తిరిగి కేసు పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలును ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై మిర్యాలు బంధువులు మండిపడుతున్నారు.

 

దివాళ తెలంగాణగా మారుస్తున్నారు. - టి.టిడిపి..

హైదరాబాద్ : మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని దివాళ తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. 

కోల్ బ్లాక్ స్కాం..ఎవరినీ ప్రభావితం చేయలేదు - మన్మోహన్ సింగ్..

ఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల స్కాం లో తాను ఎవరినీ ప్రభావితం చేయలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు. సీబీఐ కోర్టులో తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బిర్లాకు గనుల కేటాయింపు చేస్తానని ఎవరికీ హామీ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. 

16:58 - October 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్రంలో తొలి సారిగా జరుగుతున్న మేడారం జాతరను రాష్ట్ర పండగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను అదేశించారు. సమ్మక్క, సారక్క జాతర ఏర్పాట్లపై ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. జాతర మౌళిక సదుపాయాల ఏర్పాట్ల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్షా.....

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగే సమ్మక్క సారక్క జాతరపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ జాతరకు దాదాపు 60 లక్షల వరకు భక్తులు హాజరవుతారని అంచానా వేశారు అధికారులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. అక్కడ చేపట్టాల్సిన వర్క్స్‌పై రెండు రోజుల్లోగా ప్రతిపాదనలు పంపాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా, మెడికల్ క్యాంపులు, టాయిలెట్లు, పార్కింగ్, రోడ్ల మరమ్మత్తులు తదితర పనుల నిమిత్తం వంద కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

జాతరను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ లు....

ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇరత రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, జాతరను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. అయితే ఏర్పాట్లన్నింటినీ జనవరిలోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పనులన్నింటినీ ఐటిడిఏ తో పాటు గిరిజన శాఖ, జిల్లా కలెక్టర్ లు సమన్వయం చేసుకోవాలని అదేశించారు. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై మరోసారి మంత్రులు, ముఖ్యమంత్రి స్ధాయిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని .. ఆ లోపు అన్నిరకాల ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలని సీఎస్‌ రాజీవ్‌శర్మ సూచించారు.

16:54 - October 2, 2015

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూ మాయం అయింది. నిమజ్జనం పూర్తయిన తర్వాత లడ్డూ పంపిణీని చేపట్టి..సగం లడ్డూని హైదరాబాద్‌ భక్తులకు పంచారు. మిగతా సగం లడ్డూని తాపేశ్వరం తరలిస్తుండగా..మార్గమధ్యలోనే దళారులు లడ్డూని మాయం చేశారు. హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌ మెట్‌ అటవీ ప్రాంతం వద్దకు రాగానే లారీని ఆపిన దళారులు లడ్డూని డబ్బులకు అమ్ముకున్నారు. విషయం తెలిసిని మీడియా అక్కడికి వెళ్లేసరికి..లారీతో పాటు లడ్డూని కొనేందుకు కారులో వచ్చి పరారయ్యారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ అటవీప్రాంతంలో లారీని లడ్డూని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపు డబ్బులకు అమ్ముకుంటుండగా అక్కడ ఒక్కసారిగా జనం గుమిగూడడంతో విషయం బయటపడింది. చివరకు మీడియాను చూసి అంతా పరుగులు పెట్టారు.

 

16:52 - October 2, 2015

హైదరాబాద్ : కృష్ణా జిల్లాలో లంచగొండుల గుండెల్లో రైళ్ల పరుగులు ఆగిపోయాయా.? అవినీతి జలగలు దర్జాగా జనాన్ని పీల్చుకు తింటున్నాయా..? రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్న ఏసీబీకి టిడిపి బ్రేకులు వేసిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలే... ఏసీబీ చేతులకు సంకెళ్లు వేస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

వాణిజ్య పన్నులు, హాస్టళ్లు, రెవెన్యూ....

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ దాడులు ఈ ఏడాది మిగతా అన్ని జిల్లాల కంటే అత్యధికంగా నమోదు కావడం వెనుక.. మొన్నటి వరకు ఏసీబీ దూకుడు స్పష్టంగా కనిపించింది. వాణిజ్య పన్నులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, రెవెన్యూ, రవాణా, విద్యుత్, రిజిస్ట్రేషన్లు ఐసీడీఎస్ ఇలా పలు శాఖల్లో పలువురు ఉద్యోగులు, అధికారులు ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా ఏసీబీ దూకుడు బ్రేకులు పడ్డాయి.

విజయవాడలో 21 మంది, గుంటూరులో 14మంది......

విజయవాడలో 21 మంది, గుంటూరులో 14మందిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఊచలు లెక్కింటింది ACB. కృష్ణాజిల్లాలోని ఏసీబీ అధికారులు ప్రజల్లోకి చొచ్చుకెళ్లి వారితో మమేకం కావడంతోనే ఇది లంచగొండుల ఆటకట్టించామంటున్నా అధికారులు. అయితే ఆగస్టు మూడో వారం నుంచి నేటివరకు ఒక్క దాడి కూడా నమోదు కాలేదు. దాడులు ఒక్కసారిగా స్తంభించడం వెనుక పలువురు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ చెలరేగిపోవడంతో ఆందోళనకు గురైన లంచావతారులు.. నేతల ద్వారా చురుగ్గా పావులు కదిపినట్టు తెలుస్తోంది. వీరిలో కొంతమంది మంత్రులు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.

దాడులు చేసేముందు సమాచారం.....

ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే.. తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎవరిని ట్రాప్ చేయొద్దంటూ సూచిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ వేగం జోరు తగ్గి.. ప్రజలలో విమర్శలకు తావిస్తోంది. మరోపక్క ఏసీబీలోనూ లంచం గొండితనం పెరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకపక్క అధికార పార్టీ నేతల ఒత్తిడి, మరోవైపు అవినీతిని అరికట్టాలనే లక్ష్యం వెనుక.. ఏసీబీ అధికారులు నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లపై ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

16:48 - October 2, 2015

హైదరాబాద్ : మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణహోమం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని సాటి మనుషులే కొట్టి చంపారు. మతమౌఢ్యం పరాకాష్ఠకు చేరిన ఈ ఘటన దేశ రాజధానికి అత్యంత సమీపంలో జరిగింది. ఈ దారుణానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలే కారణమని సిపిఎం ధ్వజమెత్తింది.

రెచ్చిపోతున్న మతతత్వ శక్తులు...

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఆవును వధించి దాని మాంసం తిన్నాడన్న నెపంతో గ్రేటర్ నోయిడా పరిధిలోని బిసాడా గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంపై కొందరు దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో 58 ఏళ్ల ఇఖ్లాక్‌ మృతి చెందగా, అతడి కుమారుడు 21 ఏళ్ల డానిష్‌ మృత్యువుతో పోరాడుతున్నాడు.

తీవ్రంగా స్పందించిన సిపిఎం .......

బిసాడాలో జరిగిన దారుణంపై సిపిఎం తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. కుటుంబసభ్యులను ఓదార్చింది. ఈ ఘటనకు ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపియే కారణమని స్పష్టం చేసింది. మోది అధికారంలోకి వచ్చాక మీట్‌ బ్యాన్‌ పేరిట దేశవ్యాప్తంగా మతతత్వ శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని పేర్కొంది. ప్రశాంతంగా ఉన్న బిసాడాలో మతతత్వశక్తులు చిచ్చు పెట్టాయని ధ్వజమెత్తింది. దీనిపై ప్రధాని ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించింది.

షాక్‌ నుంచి తేరుకోని ఇఖ్లాక్ భార్య, కుమార్తె....

బిసాడాలో జరిగిన ఘోరంతో ఇఖ్లాక్ భార్య, కుమార్తె, బంధువులు షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. తాము ఈ గ్రామంలో ఉండలేమని బోరున విలపిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు పలు ముస్లిం కుటుంబాలు బిస్వాడా గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే స్థానిక అధికారులు వారికి నచ్చజెప్పారు. ముస్లిం కుటుంబాలకు ఎలాంటి హాని జరగకుండా భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఇఖ్లాక్‌ మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సమాజం డిమాండ్‌ చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడడంలో సమాజ్‌వాది ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

జిస్టీరియల్ విచారణకు ఆదేశించిన సర్కార్...

ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం- మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించింది. బాధితుల ఇంట్లో లభించిన మాంసాన్ని ఆవు మాంసమా కాదా...అనేది నిర్ధారించేందుకు పరీక్షలకు పంపింది. గోహత్యపై నిషేధం ఉందని, హిందువుల మనోభావాలు గౌరవించాలని బిజెపి చెబుతోంది.

16:45 - October 2, 2015

హైదరాబాద్ : అమెరికా మరోసారి కాల్పుల మోతతో వణికిపోయింది. ప్రశాతంగా ఉండే విశ్వవిద్యాలయం నెత్తుటి మరకలతో తడిచిపోయింది. ఓ ఉన్మాది బీభత్సం 10మందిని బలితీసుకుంది. ఈ ఘటనతో మరోసారి అమెరికాలో తుపాకుల కల్చర్ పై చర్చ మొదలైంది.

ఒరెగాన్‌ వర్సిటీలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు....

అమెరికాలోని ఒరెగాన్‌ నగరంలోని ఉంప్ క్వా యూనివర్సిటీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వంద ఎకరాల యూనివర్సిటీ క్యాంపస్ లోకి.. 26 ఏళ్ల ఓ ఆగంతకుడు ఉదయమే తుపాకులతో క్యాంపస్ లోకి చొరబడ్డాడు. క్లాసుల్లోకి వెళ్లి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. తుపాకుల మోత విన్న విద్యార్థులు... చెల్లాచెదరుగా పారిపోయారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో 10మంది అక్కడికక్కడే చనిపోయారు. 20మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

యూనివర్సిటీని చుట్టుముట్టిన ప్రత్యేక బలగాలు...

సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బలగాలు యూనివర్సిటీని చుట్టుముట్టారు. ఎన్ కౌంటర్లో ఆగంతకుడిని మట్టుపెట్టారు. అతని దగ్గరి నుంచి 4 ఆటోమెటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు మాత్రం నిందితుని వివరాలు వెల్లడించారు. స్థానికులు మాత్రం చార్లెస్ హార్పర్ గా గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు యూనవర్సిటీ మొత్తం గాలించారు.

ఉలిక్కి పడ్డ రోస్ బర్గ్ నగరం...

కాల్పుల ఘటనతో 20వేల మంది ఉన్న రోస్ బర్గ్ నగరం ఉలిక్కిపడింది. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని స్థానికులు తెలిపారు. కాల్పుల అనంతరం... ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. దర్యాప్తు ప్రారంభించింది. US బ్యూరో ఆఫ్ ఫైర్ ఆర్మ్ అండ్ ఎక్స్ ప్లోజివ్ అధికారులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నారు.

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒబామా....

మరోవైపు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయుధ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కాల్పుల ఘటనలు 45 వరకు జరిగాయి. గతంలోనూ కాల్పుల ఘటనల అనంతరం.. వ్యక్తిగత ఆయుధాలు నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 

16:41 - October 2, 2015

మెదక్ : ప్రముఖ సినీనటి కాజల్‌ అగర్వాల్‌ మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో సందడి చేసింది. పట్టణంలో జేసీ బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించింది. ఈసందర్భంగా ప్రత్యేకమైన వివిధ రకాల చీరలను ప్రదర్శించి ఆకట్టుకుంది. కాజల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మెదక్‌జిల్లాలోని జహీరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని..నూతనంగా ప్రారంభించిన జేసీ బ్రదర్స్‌లో అన్ని రకాల వస్త్రాలు లభ్యం అవుతాయని నటి కాజల్ అన్నారు. 

పోలీసుల అదుపులో మాలిక్..

శ్రీనగర్ : జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్ మధ్యభాగంలోని ఓ ప్రాంతంలో నిర్వహించే సభలో ప్రసంగించేందుకు వెళుతుండగా మాలిక్ ను అదుపులోకి తీసుకున్నారు. 

భజరంగ్ జూట్ మిల్లు కార్మికులను ఆదుకుంటాం - బాబు..

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు కార్మికులను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో పర్యటనకు వచ్చిన చంద్రబాబును జూట్ మిల్లు కార్మికులు కలిశారు. లాకౌట్ ఎత్తివేసి జూట్ మిల్లును తెరిపించాలని సీఎం చంద్రబాబును కార్మికులు కోరారు. 

ప్రభుత్వ ఉద్యోగుల ఓపీ కేంద్రం ప్రారంభం..

హైదరాబాద్ : నిమ్స్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీ సేవల కోసం ప్రత్యేక కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 

16:12 - October 2, 2015

బెంగళూరు : భారత్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 72 రోజులపాటు టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ టీమ్ సౌతాఫ్రికా ఆడే మెగా సిరీస్ కు సమయం దగ్గరపడింది. మూడు మ్యాచ్ ల టీ-20,ఐదుమ్యాచ్ ల వన్డే, నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి ఫ్రీడమ్ సిరీస్ అని రెండు దేశాల క్రికెట్ బోర్డులు కలసి నామకరణం చేశాయి. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీగా నిర్ణయించారు. క్రికెట్టే ఊపిరిగా భావించే భారత గడ్డపై అతిపెద్ద సిరీస్ కు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికా, ఐదో ర్యాంకర్ టీమిండియా ఢీ అంటే ఢీ అంటున్నాయి.

అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 7 వరకు..
అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకూ 74రోజులపాటు సాగే ఈ మహాసమరంలో భాగంగా మూడు మ్యాచ్ ల తీన్మార్ టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే పాంచ్ పటాకా, నాలుగు మ్యాచ్ ల సాంప్రదాయ టెస్ట్ సిరీస్ లు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు భారత్, క్రికెట్ సౌతాఫ్రికా కలసి...రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ కు ఫ్రీడం సిరీస్ పేరుతో నామకరణం చేశాయి. అంతేకాదు సిరీస్ నెగ్గిన జట్టుకు మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని ఇవ్వాలని కూడా నిర్ణయించాయి.

గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీగా నామకరణం..
13 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ యాషెస్ సిరీస్, ఫ్రెండ్షిప్ సిరీస్, ట్రాన్స్ టాస్మన్ ట్రోఫీ , బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ, పటౌడీ ట్రోఫీ అన్నపేర్లు మాత్రమే మనకు తెలుసు. క్రికెట్ సిరీస్ ట్రోఫీలకు విఖ్యాత మాజీ క్రికెటర్ల పేర్లను మాత్రమే ఇప్పటి వరకూ పెడుతూ వచ్చారు. అయితే...తొలిసారిగా...రెండు దేశాల జాతి పితల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని ఇటు భారత్, అటు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. అందులో భాగంగానే..టీమిండియా, సౌతాఫ్రికా జట్ల సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని మహాత్మాగాంధీ- నెల్సన్ మండేలా ట్రోఫీగా నామకరణం చేశాయి.

ట్రోఫి ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి..
అహింసే ఆయుధంగా పోరాడి..భారత్ కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధానపాత్ర వహించిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ... ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. మరోవైపు..సౌతాఫ్రికా గాంధీగా పేరుపొందిన నెల్సన్ మండేలా సైతం శ్వేత జాతిపాలకుల పై పోరాడి తమ దేశానికి జాతిపితగా నిలిచిపోయారు. ఇద్దరు నేతల పేర్లతో ఓ క్రికెట్ ట్రోఫీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

క్రికెట్ అభిమానులకు పండుగే..పండుగ..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సౌతాఫ్రికా నెంబర్ వన్ గా ఉంటే...టీమిండియా 5వ ర్యాంకులో కొనసాగుతోంది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో టీమిండియా నాలుగు, సౌతాఫ్రికా ఆరు ర్యాంకుల్లో నిలిచాయి. వన్డే క్రికెట్లో...టీమిండియా రెండో ర్యాంకులో ఉంటే...సౌతాఫ్రికా మూడోర్యాంకు జట్టుగా ఉంది. సౌతాఫ్రికా టెస్ట్ జట్టుకు హషీమ్ ఆమ్లా, వన్డే జట్టుకు ఏబీ డివిలియర్స్, టీ-20 జట్టుకు డూప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు..టీమిండియా టీ-20, వన్డే జట్లకు మహేంద్రసింగ్ ధోనీ, టెస్ట్ జట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్లుగా ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పదివారాలపాటు జరిగే ఈ మారథాన్ సిరీస్ తో...ప్రపంచ క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.

16:02 - October 2, 2015

బెంగళూరు : టీ మిండియా - సఫారీ జట్ల మధ్య టీ- 20 సిరీస్‌ తొలి సమరానికి ధర్మశాల క్రికెట్ స్టేడియం సకలహంగులతో సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు... టీ 20 ఫార్మాట్‌లో రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్..

నాలుగో స్థానంలో భారత్..ఆరో స్థానంలో దక్షిణాఫ్రికా..
టీ 20 మాజీ వరల్డ్ చాంపియన్‌ టీమిండియాకు....డు ప్లెసిస్‌ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు సవాల్‌ విసురుతోంది. ఇప్పటికే ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. ప్రస్తుతం టీ 20 ఫార్మాట్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో ఉండగా....సఫారీ టీమ్‌ 6వ స్థానంలో ఉంది. వన్డేలు టీ 20ల్లో దక్షిణాఫ్రికాపై చెత్త రికార్డ్‌ ఉన్న భారత జట్టుకు ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్‌లో మాత్రం రికార్డు ఘనంగా ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 8... టీ 20 మ్యాచ్‌ల్లో పోటీ పడగా భారత జట్టు 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా సఫారీ టీమ్‌ 6 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. చివరి సారిగా ఈ రెండు జట్లు గత యేడాది బంగ్లాదేశ్‌ వేదికగా ముగిసిన టీ 20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్లో పోటీ పడగా భారత జట్టే విజేతగా నిలిచింది. టీ 20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయె ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు. ధనా ధన్‌ ధోనీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌,రహానేలతో పాటు...టీమిండియా స్టార్‌ బ్యాట్స్ మెన్‌ విరాట్‌ కొహ్లీ...ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అంతే కాదు టీ 20 ఫార్మాట్‌లో భారత జట్టు తరఫున సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్ క్రియేట్‌ చేసిన సురేష్‌ రైనా,ఇదే ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ప్రస్తుతం జట్టులో ఉన్నారు.

భారత్ హాట్ ఫెవరేట్..
మరోవైపు పవర్‌ ప్యాకెడ్‌ సఫారీ టీమ్‌ నిండా మ్యాచ్‌ విన్నర్లే. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌, డు ప్లెసిస్‌, ఆమ్లా, డుమినీ, కిల్లర్ మిల్లర్‌ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు స్పీడ్‌ గన్‌ డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, రబద,మ్యాజిక్‌ స్పిన్నర్‌ తాహిర్‌ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉంది. అటు ట్రాక్‌ రికార్డ్, వ్యక్తిగత ప్రదర్శనల పరంగా చూసుకున్నా టీ 20 ఫార్మాట్‌లో మాత్రం దక్షిణాఫ్రికా జట్టు కంటే భారత జట్టే హాట్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ ప్రపంచ క్రికెట్‌లో సంచలనాలకు మారు పేరైన సౌతాఫ్రికా జట్టును అసలే మాత్రం తక్కువ అంచనా వేయలేం. ధనా ధన్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు సొంతగడ్డపై జరుగనున్న తొలి మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో నెగ్గాలని పట్టుదలతో ఉంది. మరి టీ 20 వార్‌లో ఏ జట్టు పై చేయి సాధిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

స్వచ్ఛభారత్ పాటలు పాడితే వీధులు శుభ్రం కావు : కేజ్రీవాల్

హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా, దానిక అవసరమైన కార్యాచరణ ఉండాలని చెప్పారు. స్వచ్ఛభారత్ అంటూ పాటలు పాడుకుంటూ ఉంటే వీధులు శుభ్రం కావని ఎద్దేవా చేశారు. ఏడాదికి ఒకసారి ఫొటోలకు పోజులిస్తూ రోడ్లు ఊడిస్తే స్వచ్ఛభారత్ కల సాకారం కాదని విమర్శించారు. ఢిల్లీలో తాము కొత్తగా 350 పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించామని చెప్పారు. 

భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

తమిళనాడు: శ్రీలంక నావికా దళ అధికారులు ఏడుగురు తమిళ జాలర్లను అరెస్టు చేశారు. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని, అందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని జాఫ్నాకు సమీపంలోని కాంకేసంతురాయ్ వద్ద విచారిస్తున్నట్లు సమాచారం.

గుంటూరు జిల్లాలో బాలిక పై వీధి కుక్కల దాడి...

గుంటూరు : పొన్నూరు మండలంలో ఒక బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. సీతారాంపురంలో పదేళ్ల బాలికపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో పొన్నూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బాలికను తరలించారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయి. 

15:56 - October 2, 2015

బెంగళూరు : టీమిండియాతో జరిగే తొలి టీ-20 సమరానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని, ధర్మశాల పిచ్ పైన పరుగులు వెల్లువెత్తడం ఖాయమని సౌతాఫ్రికా కెప్టెన్ ఫాప్ డూప్లెసీ చెప్పాడు. ధర్మశాలలో జరిగిన మీడియా సమావేశంలో డూప్లెసీ పాల్గొన్నాడు. సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ కు తాము పూర్తిస్థాయిలో సిద్ధమని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రకటించాడు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని..పరిమితమైన దూకుడుతో పోటీకి దిగుతామని ధర్మశాలలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. జట్టులోని ఆటగాళ్లంతా శారీరకంగా, మానసికంగా పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉన్నారని తెలిపాడు.

15:54 - October 2, 2015

బెంగళూరు : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల ఫ్రీడమ్ సిరీస్ తొలి సమరానికి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యేఈ మ్యాచ్ లో రెండు జట్లూ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

తొలి టీ-20 మ్యాచ్..
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫ్రీడం సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ కు 4వ ర్యాంకర్ టీమిండియా, 6వ ర్యాంకర్ సౌతాఫ్రికా సై అంటే సై అంటున్నాయి. భారత్ లో సఫారీ టీమ్ 72 రోజుల పర్యటనకు ఈ తొలిటీ-20 సమరంతోనే అధికారికంగా తెరలేవనుంది. సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్న ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా...శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. రెండు జట్లూ ఇప్పటికే ..ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియానికి చేరి సన్నాహాలు పూర్తి చేశాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా సముద్రమట్టానికి 700 అడుగుల ఎత్తులో ట్రెక్కింగ్ చేయడం ద్వారా ప్రత్యేక శిక్షణ పూర్తి చేసింది. ఐసీసీ తాజా టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం.. మాజీ చాంపియన్ టీమిండియా నాలుగోర్యాంక్ లో ఉంటే...సౌతాఫ్రికా టీమ్ మాత్రం ఆరో ర్యాంకులో కొనసాగుతోంది.

సై అంటే సై..
రెండు జట్లలోని ప్రధాన ఆటగాళ్ళంతా ఐపీఎల్ లీగ్ లో ఆడుతూ రావడంతో బలాబలాలపై సంపూర్ణ అవగాహనతోనే వ్యూహాలు రూపొందించుకొని పోటీకి దిగుతున్నాయి. ఫాఫ్ డూప్లెసిస్ నాయకత్వంలోని సఫారీటీమ్ లో క్వింటన్ డికాక్, పాల్ డుమ్నీ, ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, కీల్ అబ్బోట్, బెహార్డియన్, ఇమ్రాన్ తాహీర్, డేవిడ్ మిల్లర్, ఎడ్డీ లీ, అల్బీ మోర్కెల్, లాంగే, క్రిస్ మోరిస్, రబాడా, డేవిడ్ వీజీ లాంటి ఆటగాళ్ళున్నారు. ఇక..జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియాలో శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, అజింక్యా రహానే, మోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, అరవింద్, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.

ఎవరు గెలుస్తారో ?
రెండు జట్ల బలాబలాలను బట్టి చూస్తే...ఈ పోటీ సమఉజ్జీల సమరంలా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ నెగ్గిన జట్టుకే మూడు మ్యాచ్ ల సిరీస్ పై పట్టుబిగించే అవకాశం ఉండడంతో...రెండుజట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తొలి దెబ్బ ఏ జట్టు కొడుతుందో?.. ఏ జట్టు మీద పడుతుందో? తెలుసుకోవాలంటే మరికొద్దిగంటల పాటు వేచిచూడాల్సిందే.

బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఉద్రిక్తత

గుంటూరు : బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు యాజమాన్య తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సూర్యారావు(22) మృతిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలో ఉన్న అంశాలను బయటపెట్టాలని విద్యార్థులు కోరారు. అందుకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. అయితే కాలేజ్, హాస్టళ్లను మూసివేస్తున్నట్టు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు అసోసియేషన్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు.

చేర్యాలలో కొనసాగుతున్న రైతు పరిరక్షణ యాత్ర

వరంగల్చేర్యాలలో రైతు పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో కోదండరాం, చుక్కా రామయ్య, కె.శ్రీనివాస్‌, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

నేటి మ్యాచ్ లో టాస్ కు ప్రత్యేక కాయిన్

హైదరాబాద్ : ధర్మశాల వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో తొలి మ్యాచ్ లో టాస్ కు ప్రత్యేక కాయిన్ ను వినియోగించనున్నారు. 20 గ్రాముల బరువున్న ఈ కాయిన్ కు వెండిపూత పూశారు. ఈ నాణేనికి ఒకవైపు మహాత్మాగాంధీ, మండేలా బొమ్మలు ముద్రించగా, రెండో (బొరుసు) వైపు భారత్, సిరీస్ లోగో ముద్రించారు. నేటి సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, మ్యాచ్ ముందు టీమిండియా కెప్టెన్ ధోనీ, సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తో కలిసి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కాయిన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం టాస్ వేయనున్నారు.

15:29 - October 2, 2015

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం రెండున్నర గంటల పాటు గవర్నర్‌తో సమావేశమైన సీఎం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తీరుతో పాటు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోసారి సమగ్ర జలవిధానం పై అక్టోబర్ 8,9 తేదీల్లో ఉభయ సభలను సమావేశ పర్చాలని గవర్నర్ ను కోరినట్లు తెలుస్తోంది.

15:25 - October 2, 2015

గుంటూరు : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు స్వచ్ఛ్‌భారత్‌ సాకారం అవుతుందని స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త మంచు లక్ష్మీ అన్నారు. గాంధీజయంతి సందర్బంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంచులక్ష్మీ..పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. వీరి భేటీలో కేకే కూడా పాల్గొన్నారు. 

 

మిర్యాలగూడలో పీఎస్ ఎదుట గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం..

నల్గొండ : మిర్యాలగూడ రూరల్ పీఎస్ ఎదుట గిరిజన మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన స్వస్థలంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని పేర్కొంది. సీఐ, ఎస్ఐ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు..

విజయవాడ : గాంధీ జయంతి సందర్భంగా గాంధి హిల్స్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంత్రులు దేవినేని, కామినేనిలు ప్రారంభించారు. 

ఇక్కడ కాదు అక్కడ దీక్షలు చేయాలి - గాలి..

విజయవాడ : కాంగ్రెస్ నాయకులు ఏపీలో కాకుండా ఢిల్లీలో దీక్షలు చేయాలని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. ధైర్యముంటే సోనియా గాంధీతో దీక్ష చేయించాలని సవాల్ విసిరారు.

 

ఎంపీ కవిత టి.జాగృతిని సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు - టిటిడిపి..

హైదరాబాద్ : ఎంపీ కవిత సొంత ప్రచారానికి తెలంగాణ జాగృతిని ఉపయోగించుకుంటున్నారని టిటిడిపి అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి ఆరోపించారు.

 

స్వచ్చ ఏపీలో అందరూ భాగస్వామ్యం కావాలి - బాబు..

గుంటూరు : స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి నెల మొదటి శనివారం స్వచ్ఛ ఏపీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

కుర్నాపల్లిలో పిడుగుపాటుకు తల్లి, కొడుకు మృతి..

నిజామాబాద్ : ఎడపల్లి (మం) కుర్నాపల్లిలో పిడుగుపాటుకు తల్లి లక్ష్మి, కుమారుడు రజనీకాంత్ మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

భోగాపురం విమనాశ్రాయ ప్రాంతాల్లో ఉద్రిక్తత..

విజయనగరం : భోగాపురం విమానాశ్రయ భూ సేకరణ గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భూములు సర్వే చేస్తున్న రైట్స్ సంస్థ ప్రతినిధులను తుడెం, రావాడా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పది మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. 

జగన్ దీక్షను జయప్రదం చేయాలి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి..

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షను జయప్రదం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశౄరు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. స్వలాభం కోసమే ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అని బాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

15:21 - October 2, 2015

గుంటూరు : స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములై రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్బంగా గుంటూరులో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో పాల్గొన్న బాబు..దేశాభివృద్ధిలో పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమన్నారు. 

15:18 - October 2, 2015

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా భువనగిరిలో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మర్యాలలో కిడ్నాపైన ధీరావత్ సుమన్ దొరికాడు. తనను దుండగులు కిడ్నాపర్లు తీసుకెళ్లారని సుమన్ తెలిపాడు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ... తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారని సుమన్ చెప్పాడు.

15:16 - October 2, 2015

హైదరాబాద్ : కడపలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్ధిని మనీషారెడ్డి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు నెలలో నారాయణ జూనియర్‌ కాలేజీలో తన కూతురు మనీషారెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం.. దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నారాయణ కాలేజీలో విద్యార్ధినుల ఆత్మహత్యలపై అప్పట్లో జిల్లావ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మనీషారెడ్డి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

విద్యార్థిని మనీషారెడ్డి తల్లి ఆత్మహత్యాయత్నం..

కడప : విద్యార్థిని మనీషారెడ్డి తల్లి సరోజ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆగస్టు 17వ తేదీన నారాయణ కళాశాలకు చెందిన మనీషారెడ్డి ఆత్మహత్యకు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేయించాలని గత కొంతకాలంగా బాలకృష్ణారెడ్డి, సరోజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

15:07 - October 2, 2015

హైదరాబాద్ : మహిళలకు మెటర్నిటీ లీవ్ మంజూరుచేస్తామని, వారి పిల్లల కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటంలో శ్రద్ద తీసుకుంటామని అనేక సంస్థలు తమ నిబంధనలలో చేరుస్తున్నప్పటికీ వాస్తవంలో అదంతా అమలు కావట్లేదని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వారికి సౌకర్యవంతమైన మాతృత్వం అందట్లేదని ఈ నివేదిక తేల్చింది.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా నేరాల సంఖ్యలో మార్పు లేదు. అయితే బాధితులుగా మిగిలిపోతున్న మహిళలకు సమాజంలో ఆదరణ కరువైన స్థితిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం ప్రత్యేక పథకాలను అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

:ప్రముఖ భారత మహిళా బాక్సర్ గా రాణిస్తున్న మేరీ కోమ్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పాలనుకుంటోంది. భారత్ తరపున బాక్సింగ్ లో సత్తా చాటి అనేక పతకాలు కైవసం చేసుకున్న ఆమె రానున్న సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకుంటానంటోంది.

జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా అర్జున అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ప్రస్తుత సంవత్సరానికి గాను ఈ అవార్డు నందుకున్న వారిలో ఇద్దరు మహిళా అథ్లెట్స్ ఉన్నారు.

 

15:05 - October 2, 2015

హైదరాబాద్ : హింస రూపం మారుతోంది. ఇంటా-బైటా తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక్కోసారి ఆ హింస రూపాన్ని గుర్తించలేని పరిస్థితి. ఈ హింసను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఆ సమస్య నుండి బైటపడాలో ఇవాళ్టి నిర్భయ లో ప్రముఖ సైక్రియాటిస్తు పూర్ణిమా నాగరాజు వివరించారు. ఆ వివరాలను మీరు కూడా చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:02 - October 2, 2015

హైదరాబాద్ : ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా అతివలు ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తారు. మరి చీరలకు మ్యాచింగ్ బ్లౌజ్ ఒకప్పటి ట్రెండ్ అయితే డిజైనర్ బ్లౌజెస్ ప్రస్తుత ట్రెండ్. అలాంటి ట్రెండీ డిజైనర్ బ్లౌజెస్ కి ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:55 - October 2, 2015

హైదరాబాద్‌ : గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌లో దేశంలోనే పెద్దదైన భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి హాజయరయ్యారు. కేంద్ర యువజనుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, ఖాదీవస్త్ర పరిశ్రమ సంయుక్త ఆధ్వర్యంలో.. దాదాపు 4.7 కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని విద్యార్థులు రోడ్లపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వేలాదిగా తరిలారు. ఇది రికార్డు జాతీయ పతాకంగా నమోదైనట్లు నిర్వాహకులు చెప్పారు. ఖాదీ, చేనేత కార్మికులకు చేయూత నివ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తుందని మంత్రులు చెప్పారు.

ఆర్టీఐ బలహీన పరిచేందుకు ప్రయత్నాలు - మాడభూషి శ్రీధర్..

హైదరాబాద్ : ఆర్టీఐ చట్టం బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఐ కమిషనర్ మాడభూమి శ్రీధర్ పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రజా ప్రయోజనాలు - అవరోధాలు అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఆర్టీఐ చట్టాన్ని స్వప్రయోజనాలకు కాకుండా ప్రజా ప్రయోజనాలకు వాడుకోవాలని మాడభూషి శ్రీధర్ సూచించారు. 

ప్రజా రాజధాని కాదు..ప్రైవేటు రాజధాని - సీపీఎం..

విజయవాడ : ప్రజా రాజధాని నిర్మిస్తానని ప్రైవేటు రాజధానిని నిర్మిస్తున్నారని సీపీఎం రాజధాన ప్రాంత కన్వీనర్ సీ.హెచ్.బాబురావు పేర్కొన్నారు. అఖిలపక్షంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విదేశీ కంపెనీల పాత్రపై ప్రభుత్వం వాస్తవాలు చెల్లించాలని, సింగపూర్ కంపెనీలతో బాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. శంకుస్థాపనలోపే రాజధాని నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

13:53 - October 2, 2015

వరంగల్‌ : జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిని ఆశా వర్కర్లు ఘెరావ్‌ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. ఆశావర్కర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల, కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

 

13:50 - October 2, 2015

నల్లగొండ : జిల్లాలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇందులో ఒక మహిళారైతు కూడా ఉన్నారు.. చందంపేట మండలం నేరేడుగొమ్ముకుచెందిన శ్రీను తన ఐదెకరాల పొలంలో పత్తివేశారు . ఈ పంటకు తెగులు రావడంతో వ్యవసాయం వదిలి కరీంనగర్‌ జిల్లాకు వలసపోయారు.. పంటకోసం అప్పులిచ్చినవారు వేధించడంతో పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.. దేవరకొండ మండలం కొండబీమనపల్లి పంచాయితీలో నేనావత్ కమ్లీ అనే మహిళారైతుకూడా అప్పులతో కుంగిపోయారు.. పత్తిచేనుకు తెగులు సోకడంతో మనస్తాపం చెందారు. అప్పులిచ్చినవారి మాటలు భరించలేక పురుగులమందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఒకేరోజు రెండు మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. కమ్లీకి నలుగురు పిల్లలు ఉన్నారు. మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

13:47 - October 2, 2015

హైదరాబాద్ : నగర వాసులను గడగడలాడిస్తున్న చైన్‌ స్నాచింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఆరుగురు సభ్యులు గల ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన నలుగురు మొత్తం ఆరుగురు గత ఎనిమిది నెలలుగా చోరీలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాళా ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి బంగారం ఆభరణాలను లభ్యం అయ్యాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మిగిలిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తెలంగాణ, మహారాష్ట్రలలో 32 కేసులున్నాయని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

13:44 - October 2, 2015

టీమిండియా క్రికెటర్ 'హర్భజన్ సింగ్' కొద్దిరోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రియురాలు..బాలీవుడ్ నటి 'గీతాబస్రాను' పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 29వ తేదీన పంజాబీ పద్ధతిలో వీరి వివాహం జరుగబోతోంది. నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీరి పెళ్లి కోసం అతిథులను ఆహ్వానించేందుకు 'హార్భజన్' కుటుంబం కలర్‌పుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా 'భజ్జీ' వివాహ వేడుక జరగనుంది. 'గీతాబస్రా' పెళ్లికి ధరించాల్సిన దుస్తులను ముంబైలోని డిజైనర్లు డిజైన్‌ చేస్తున్నట్లు సమాచారం. ధర్మశాలలో జరగనున్న ట్వంటీ 20 మ్యాచ్‌ జట్టులో 'హార్భజన్ సింగ్‌' చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, 'హర్భజన్‌'కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖరారు చేసినట్లు సమాచారం. 'భజ్జీ' వివాహ వేడుకకు టీమిండియా ఆటగాళ్లతోపాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరు కానున్నారు.

13:36 - October 2, 2015

విశాఖ : ఎనిమిది రోజులు.. లక్షలాది మంది ఎదురు చూపులు నిష్ఫలమైపోయాయి. కోట్లాదిమంది నిరీక్షణ విషాదాంతమైంది. చిన్నారి అదితి అదృశ్యం విషాదంతంగా ముగిసింది. వారం క్రితం విశాఖ డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి ఈ ప్రపంచాన్ని వీడి.. వెళ్లిపోయింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. మద్దెలపాలెం స్మశాన వాటికలో చిన్నారి అదితి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అదితి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. చిన్నారిని కడసారి చూసేందుకు వచ్చిన స్థానికులు భారీ వచ్చారు. తీవ్రంగా విలపించారు.
సెప్టెంబర్ 24న ట్యూషన్‌కు వెళ్లిన అదితి
విశాఖలో సెప్టెంబర్ 24న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వస్తున్న అదితి వర్షం నీటిలో పడి డ్రైనేజీలో కొట్టుకుపోయింది. క్షేమంగా వస్తుందనుకున్న అదితి భోగాపురం మండలం దిబ్బల పాలెం వద్ద ఉన్న సముద్రపు ఒడ్డున విగతజీవిగా కనిపించింది.
భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం గుర్తింపు
భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనస్థలికి చేరుకున్నారు. మృతదేహంపై గుర్తులు, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అదితి వేసుకున్న పింక్ డ్రస్‌తో పాటు చెవి దుద్దులు, మెడలోని తాయత్తు ఆధారంగా ఆ మృతదేహం అదితిగా ఆమె తండ్రి గుర్తించారు. గుర్తుపట్టరానిస్థితిలో ఉన్న కూతురు శవాన్ని చూసి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. అదితి బంధువుల ఆర్తనాదాలతో ఆప్రాంతం ఒక్కసారిగా హృదయ విదారకంగా మారింది.
శోకసంద్రంలో అదితి తల్లిదండ్రులు
కనిపించకుండాపోయిన తమగారాల పట్టి తిరిగొస్తుందన్న నమ్మకంతో ఊపిరి నిలుపుకున్న కుటుంబసభ్యులకు ఈ వార్త ఆశనిపాతమే అయింది. తన బుజ్జాయి ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకంతో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అయ్యాయి. వారు చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు. వారం రోజులుగా ఏ వార్త వినకూడదనుకున్నారో.. ఆ వార్తను అదితి తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది. కూతురు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదిస్తున్నారు.
విశాఖ కేజీహెచ్‌కు అదితి మృతదేహం తరలింపు
అదితి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఉదయం పోస్టుమార్టం చేసి..తల్లిదండ్రులకు అదితి డెడ్‌ బాడీని అప్పగించారు. పోస్టుమార్టం వివరాలను హైదరాబాద్‌కు పంపిన తర్వాత.. నివేదికను వెల్లడిస్తామని కేజీహెచ్‌ డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఉదయ్‌కుమార్‌ చెప్పారు. మద్దెలపాలెం స్మశాన వాటికలో చిన్నారి అదితి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అదితి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. చిన్నారిని కడసారి చూసేందుకు వచ్చిన స్థానికులు భారీ వచ్చారు. వారు తీవ్రంగా విలపించారు.

 

13:28 - October 2, 2015

ముఖానికి అందం జట్టు. మహిళలకైతే జుట్టును అపురూపంగా చూసుకుంటుంటారు. జుట్టు రాలిపోతే కృంగిపోతారు. ఏదో ఏదో క్రీమ్స్ వాడుతుంటారు. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాజీ భార్య 'రేణు దేశాయ్' బొద్దుగా..పొడవైన జుత్తుతో ఓ గృహిణిగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆమె స్టైలిష్ గా మారిపోయారు. ఎదో సినిమా కోసమో..స్టైల్ కోసం కాదు సుమా.. తాను మేకోవర్ అయిపోయానంటూ జుట్టును కత్తిరించి న్యూ స్టైల్లో ఉన్న ఫొటోలను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఎందుకిలా ? అని అనుకుంటే ఓ కేన్సర్ రోగి కోసం ఈ త్యాగం చేశానంటూ పోస్టు చేసింది. ఆ పేద మహిళ కేన్సర్ వల్ల జుట్టును కోల్పోయిందంట.
'హెయిర్ ఫర్ హోప్' వంటి స్వచ్చంద సంస్థ ద్వారా ఈ విషయం తెలుసుకుని తన వంతుగా ఈ సాయం చేసినట్లు రేణు పేర్కొంది. ఈ సంస్థ దాతల జట్టుతో విగ్గులు తయారు చేసి కేన్సర్ బాధితులకు అందచేస్తోంది. 'కురుల దానం' మరోసారి అందర్నీ ఆలోచింప చేస్తోంది. 

13:11 - October 2, 2015

గుంటూరు : నగరంలో మున్సిపల్ శానిటరీ కార్మికులు ఆందోళనకు దిగారు. పెంచిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే మోదుగులను కార్మికులు నిలదీశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పగలు, రాత్రిలతో నిమిత్తం లేకుండా తమతో పారిశుద్ధ్య పనులు చేయించుకుని. వేతనాల విషయానికి వచ్చే సరికి తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

గాలి అరెస్టుకు రంగం సిద్ధం..

కర్ణాటక : ఓఎంసీ కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో గడిపి వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మరోమారు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. బెళికరి పోర్టు నుండి ఇనుమును అక్రమంగా గాలి రవాణా చేశాడని లోకాయుక్త నిర్ధారించింది. దీనితో లోకాయుక్త అరెస్టు వారెంట్ జారీ చేసింది. గాలిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేయనుంది. 

మెదక్ లో స్వచ్ఛ కార్యక్రమం..

మెదక్ : సిద్ధిపేటలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు హరీష్ రావు, నాయినీ, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న సిద్ధిపేట రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఆదర్శం కావాలని హరీష్ పేర్కొన్నారు. 

నగరంలో ఛైన్ స్నాచింగ్ ముఠా గట్టు రట్టు..

హైదరాబాద్ : ఛైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టైంది. ఆరుగురు సభ్యుల గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కిలో బంగారు నగదలను సౌత్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణలో 30కిపైగా కేసులున్నాయి.

 

13:01 - October 2, 2015

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ లడ్డూ ప్రసాదం పంపిణీని ఆపేశామని పోలీసులు ప్రకటించారు. 3వేలమందికి ప్రసాదం పంచాలని ఏర్పాట్లు చేశామని.. ఉదయం నుంచి 20వేలమందికిపైగా భక్తులు వచ్చారని డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉండడంతో కౌంటర్ మూసివేయించామని చెప్పారు. అటు నగరంలోని అన్ని ఆలయాల్లో ఈ ప్రసాదం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ స్పష్టం చేశారు.

శాస్త్రికి మోడీ ఎందుకు నివాళి అర్పించలేదు - శాస్త్రి మనువడు..

ఢిల్లీ : జై జవాన్..జై కిసాన్ అని ప్రసంగంలో పేర్కొనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..లాల్ బహదూర్ శాస్త్రీకి ఎందుకు నివాళి అర్పించలేదని శాస్త్రి మనువడు విబకర్ శాస్త్రి పేర్కొన్నారు. ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. శాస్త్రి స్మారక ప్రదేశానికి ఎందుకు వెళ్లలేదో తెలియదని తెలిపారు. 

12:53 - October 2, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణం వద్దగల గాంధీ విగ్రహానికి.. సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతిపిత గాంధీకి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు, పలువురు సీనియర్‌ నేతలు నివాళులర్పించారు.
గాంధీ ఘాట్‌ దగ్గర
గాంధీ ఘాట్‌ దగ్గర గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మహాత్మునికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
మహాత్మునికి చంద్రబాబు నివాళి
గాంధీ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాత్మునికి నివాళులర్పించారు. గుంటూరులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను ఆయన సన్మానించారు.

 

ఏపీలో నలుగురు ఐఏఎస్ ల బదిలీ..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. సీసీఎల్ ఏ కమిషనర్ గా వాణీ మోహన్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ గా పి.ఉషా కుమారి, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా ప్రసన్న వెంకటేష్, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా వి.బి.రమణమూర్తిలను నియమించారు. 

అదితి ఘటన జరగడం దురదృష్టకరం - గంటా..

విజయవాడ : చిన్నారి అదితి మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

 

మరోసారి గవర్నర్ ను కలువనున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గవర్నర్ ను కలువనున్నారు. మధ్యాహ్నాం 3.30గంటలకు కలువనున్నట్లు తెలుస్తోంది. గురువారం కేసీఆర్, గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. 

తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత నిర్మించాలి - తమ్మినేని..

ఆదిలాబాద్ : మంచిర్యాలలో జలసాధన సమితి చేపట్టిన ర్యాలీని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కమీషన్ల కోసం ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పు చేస్తున్నారని విమర్శించారు. 

తిమ్మినాయుడులో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సోదాలు..

తిరుపతి : రూరల్ మండలం తిమ్మినాయుడుపాలెంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. రూ.120 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారయ్యారు. 

12:46 - October 2, 2015

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి 6వేల కిలోల లడ్డూ ప్రసాదం పంపిణీ రసాభాసగా మారింది. ఇవాళ్టి నుంచి లడ్డూ పంపిణీ ఉంటుందని ముందే ప్రకటించడంతో... వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. అయితే వారికి తగ్గట్టు నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.. భక్తులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నిర్వాహకుల్లో కొందరు తమకు తెలిసిన వారికే ప్రసాదం పంచడంతో... వరుసలో నిల్చున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రసాదం దక్కదేమోనన్న ఆందోళనతో ముందుకు తోసుకొచ్చారు. పరిస్థితి శ్రుతిమించడంతో.. పోలీసులు వారిని అదుపుచేసేందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రసాదం పంపిణీ కాసేపు నిలిచిపోయింది. నిర్వహకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహకులు తమ సొంతం వారికి లడ్డూలు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు తమ జేబుల్లో లడ్డూలను ఉంచుకుని వెళ్తున్నారని.. కొంతమంది ఉత్సవ కమిటీ పేరు చెప్పి... దొడ్డిదారిన బస్తాల్లో లడ్డూలు తీసుకెళ్తున్నారని బెబుతున్నారు. తాము తెల్లవారుజాము 4 గంటలను నుంచి లడ్డు కోసం క్యూలో నిల్చున్నామని.. కానీ తమకు నిరాశే మిగిలిందని వాపోయారు. 

 

12:39 - October 2, 2015

భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఉన్నంత పాపులార్టీ మరే ఆటకు లేదు. ప్రస్తుతం మిగిలిన ఆటలకు ప్రాముఖ్యతనిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు 'కబడ్డీ' లీగ్ లు క్రీడాభిమానుల అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో 'ఫుట్ బాల్' కూడా చేరబోతోంది. గతేడాది కంటే ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ పుల్ గా ప్రమోట్ చేస్తున్నారు ఐఎస్ఎల్ నిర్వాహకులు. ఇప్పటికే ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలకు బాలీవుడ్ హీరోలు సహా యజమానులు ఉండగా..కోలీవుడ్, టాలీవుడ్ హీరోలను బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమిస్తారు. తాజాగా కోలీవుడ్ హీరో 'ధనుష్' ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ -2కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ మూడో తేదీ నుండి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయి. దేశీయ క్రీడాకారులతో పాటు విదేశీ ఫుట్ బాల్ ప్లేయర్స్ ఈ లీగ్ లో ప్రేక్షకులకు ఫుట్ ఆటలోని కిక్ ను పరిచయం చేస్తారని హీరో 'ధనుష్' పేర్కొన్నాడు. గతేడాది చెన్నయి ఎఫ్ సీ సెమీఫైనల్ వరకే పరిమితమైంది. ఈసారి చెన్నై ఎఫ్ సీ టైటిల్ గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు బ్రాండ్ అంబాసిడర్ ధనుష్. ఫుట్ బాల్ స్టోరీతో సినిమా తీసేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటే తాను నటించేందుకు రెడీ అని చెప్పాడు.
ఇటీవలే బాలీవుడ్‌ హీరోలు, భారత క్రికెటర్లతో ప్రత్యేకంగా రూపొందించిన ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేసింది. టీమిండియా స్టార్‌ బ్యాట్స్ మెన్‌ , ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ, దాదా సౌరవ్‌ గంగూలీతో పాటు బాలీవుడ్‌ హీరోలు సైతం ఈ ప్రమోషనల్‌ వీడియోలో సందడి చేశారు. హృతిక్‌రోషన్‌, రాక్‌ స్టార్‌ రణ్‌బీర్‌కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌తో పాటు ముంబై సిటీ జట్టు ఓనర్‌ నీతా అంబానిలతో ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించారు.

12:25 - October 2, 2015

విశాఖ : ఎనిమిది రోజులు.. లక్షలాది మంది ఎదురు చూపులు నిష్ఫలమైపోయాయి. కోట్లాదిమంది నిరీక్షణ విషాదాంతమైంది. చిన్నారి అదితి అదృశ్యం విషాదంతంగా ముగిసింది. వారం క్రితం విశాఖ డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి ఈ ప్రపంచాన్ని వీడి.. వెళ్లిపోయింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ఆ చిన్నారి నవ్వులు సముద్రపు అలల్లో కలిసిపోయాయి. ఆ ఆట పాటలు సంద్రం ఆటుపోటుల్లో మునిగిపోయాయి. క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న ఆశ అడియాశలయ్యింది. చిరునవ్వులు చిందిస్తూ చెంగుచెంగున ఎగిరిన చిన్నారి.. కట్టెలా మారి కనిపించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ముద్దుమురిపాలతో చేయించిన చెవిదిద్దులే.. ఆనవాళ్లయ్యాయి. రక్ష కోసం వేయించిన తాయత్తు కూడా విపత్తు నుంచి కాపాడలేకపోయింది. ఎంత ఘోరం.. ఎంత విషాదం..! చెప్పడానికి మాటలు రావడం లేదు.
సెప్టెంబర్ 24న ట్యూషన్‌కు వెళ్లిన అదితి
విశాఖలో సెప్టెంబర్ 24న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వస్తున్న అదితి వర్షం నీటిలో పడి డ్రైనేజీలో కొట్టుకుపోయింది. క్షేమంగా వస్తుందనుకున్న అదితి భోగాపురం మండలం దిబ్బల పాలెం వద్ద ఉన్న సముద్రపు ఒడ్డున విగతజీవిగా కనిపించింది.
భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం గుర్తింపు
భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనస్థలికి చేరుకున్నారు. మృతదేహంపై గుర్తులు, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అదితి వేసుకున్న పింక్ డ్రస్‌తో పాటు చెవి దుద్దులు, మెడలోని తాయత్తు ఆధారంగా ఆ మృతదేహం అదితిగా ఆమె తండ్రి గుర్తించారు. గుర్తుపట్టరానిస్థితిలో ఉన్న కూతురు శవాన్ని చూసి తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. అదితి బంధువుల ఆర్తనాదాలతో ఆప్రాంతం ఒక్కసారిగా హృదయ విదారకంగా మారింది.
శోకసంద్రంలో అదితి తల్లిదండ్రులు
కనిపించకుండాపోయిన తమగారాల పట్టి తిరిగొస్తుందన్న నమ్మకంతో ఊపిరి నిలుపుకున్న కుటుంబసభ్యులకు ఈ వార్త ఆశనిపాతమే అయింది. తన బుజ్జాయి ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకంతో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అయ్యాయి. వారు చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు. వారం రోజులుగా ఏ వార్త వినకూడదనుకున్నారో.. ఆ వార్తను అదితి తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది. కూతురు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదిస్తున్నారు.
విశాఖ కేజీహెచ్‌కు అదితి మృతదేహం తరలింపు
అదితి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఉదయం పోస్టుమార్టం చేసి..తల్లిదండ్రులకు అదితి డెడ్‌ బాడీని అప్పగించనున్నారు. అమాయకమైన అందమైన మోముతో ఉన్న ఆ పసిపాప ఇక ఓ జ్ఞాపకం మాత్రమే.

 

ఎక్కువ మంది భక్తులు వచ్చారు - డీసీపీ..

హైదరాబాద్ : ఖైరతాబాద్ లడ్డూ పంపిణీకి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని డీసీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు వేల మంది భక్తులకు పంపిణీ చేయాలని అనుకున్నారని, కానీ 15-20వేల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు. కొంత తోపులాట చోటు చేసుకోవడం..భక్తుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని లడ్డూ పంపిణీని నిలిపివేసినట్లు చెప్పారు. 

ఖైరతాబాద్ లడ్డూ పంపిణీ నిలిపివేశాం - ఉత్సవ కమిటీ..

హైదరాబాద్ : ఎక్కువ రావడంతో లడ్డూ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ పేర్కొన్నారు. నగరంలోని అన్ని ఆలయాలకు ప్రసాదం పంపించి అక్కడే ప్రసాదం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 

లడ్డూ కోసం వెళితే..లాఠీ దెబ్బలు పడ్డాయి..

హైదరాబాద్ : ఖైరతాబాద్ లడ్డూ కోసం వెళితే లాఠీ దెబ్బలు పడ్డాయని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ లడ్డూ పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో భారీగా భక్తులు పోటెత్తారు. కానీ లడ్డూ పంపిణీ చేయడం లేదని భక్తులు పేర్కొనడం ముందుకు తోసుకరావడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'గాలి' అరెస్టు కానున్నారా ?

ఢిల్లీ : ఓఎంసీ కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో గడిపి వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మరోమారు అరెస్టు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాలి అరెస్టు కోసం కర్ణాటక లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాల కాపీలతో బయలుదేరిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు జనార్ధన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

గాంధీ భవన్ లో నేతల మధ్య కొట్లాట..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ ఛైర్మన్ జగన్ లాల్ మధ్య గొడవ చెలరేగింది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ సెల్ ఇన్ ఛార్జుల నియామకాల్లో తనను సంప్రదించడం లేదని జగన్ లాల్ ఆరోపణలు గుప్పించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందే నేతలు ఒకరినొకరు తీసుకున్నారు. 

ధ్వేషంతోనే హత్య చేశారు - ఓవైసీ..

ఉత్తర్ ప్రదేశ్ : ధ్వేషంతోనే అఖలక్ ను హత్య చేశారని ఎఐఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఆయన దాద్రిలో అఖలక్ కుటుంబాన్ని పరామర్శించారు. గొడ్డు మాంసం తిన్నందుకు గుర్తు తెలియని దుండగులు అఖలక్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే.

దాద్రి ఘటనపై అఖిలేష్ స్పందన..

ఉత్తర్ ప్రదేశ్ : దాద్రిలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. న్యాయం వస్తుందని, ఈఘటనలో అపరాధులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. గొడ్డు మాంసం తిన్నందుకు గుర్తు తెలియని దుండగులు అఖలక్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే.

11:46 - October 2, 2015

హైదరాబాద్ : రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా..వారిలో మనోనిబ్బరం కల్గించాలని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గన్‌పార్క్ దగ్గర రైతురక్షణ యాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల్లో ధైర్యం నింపేందుకు మేధావులంతా కలిసి యాత్రలో పొల్గొంటున్నారని పేర్కొన్నారు. రైతులను చైనత్యం కల్గించేందుకే యాత్రను చేపట్టినట్లు తెలిపారు. విద్యావంతుల లక్ష్యం.. కోర్కెలు సంపాధించి ఇచ్చేదు కాదని.. ప్రజలను చైతన్యం చేయడం.. వారిలో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం... ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై కాకుండా.. పోరాడి సాధించుకోవాలని సూచించారు. అన్నదాతలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.

 

11:34 - October 2, 2015

మీకు ట్విట్టర్ లో అకౌంట్ ఉందా? ఉండే ఉంటుంది. ఎందుకంటే సోషల్ నెట్ వర్క్ అంతగా దూసుకెళుతోంది. అందులో భాగమైన 'ట్విట్టర్'ను ప్రముఖులు సైతం ఉపయోగిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై వచ్చిన ఓ వార్త సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఉన్న వారి నెలసరి సంపాదన ఎంతో ట్విట్టర్ చెబుతుందంట. ఆదాయానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ ఆదాయం ఎంతన్నది ట్విట్టర్ చెప్పేస్తుంది. వినటానికి విచిత్రంగా అనిపించినా ఈ విషయాన్ని శాస్త్రీయంగా టెస్ట్ చేసి మరీ చెబుతున్నారు. పెన్సిల్ వేనియా, జాన్ హాప్కిన్స్ విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీ కాలేజ్ లండన్ మరియు మైక్రోసాఫ్ట్ రీసెర్స్ కు సంబంధించిన పరిశోధకులు ట్విట్టర్ వినియోగదారుల మనోభావాలపై పరిశోధనలు జరిపారు. వినియోగదారులు వాడే పదాలను, భాషను బట్టి వారి ఆదాయాన్ని, వృత్తిని తెలుసుకోవచ్చని నిర్ధారించారు. లండన్ కు చెందిన ఒక భారీ శాంపిల్ పై జరిపిన పలు పరిశోధనలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 5లక్షల మంది వినియోగదారులు పోస్ట్ చేసిన ట్వీట్స్ చేసిన 10 మిలియన్ ట్వీట్స్ ను అధ్యయనం చేసి విశ్లేషించి ఎవరి ఆదాయం ఎంత ఉంటుందన్న విషయంపై ఒక లెక్క వేశారు. అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండటం గమనార్హం.

ఎక్కువ భయాన్ని, ఆందోళనను, కోపాన్ని వ్యక్తపరుస్తారో వారు అధిక ఆదాయం ఉండేవారుగానూ, ఆశా వాదాన్ని వినిపించే వారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారు గాను పరిశోధకులు గుర్తించారు. అలాగే బ్రాకెట్లలో సరళమైన పదాలను వాడేవారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారుగానూ..తరచుగా రాజకీయాలు, సంస్థలు గురించి చర్చించే వారు అధిక ఆదాయం కలిగి ఉంటారని పరిశోధకులు నిర్ధారించారంట.

ముగిసిన అదితి మృతదేహం పోస్టుమార్టం..

విశాఖపట్టణం : చిన్నారి అదితి మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. వైద్యులు చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 

టి.మంత్రులను అడ్డుకున్న ఆశా వర్కర్లు..

వరంగల్ : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మంత్రులు కడియం, తుమ్మలను ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల హామీనిచ్చారు. 

నల్గొండలో మహిళా రైతు ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. దేవరకొండ (మం) పశ్యనాయక్ తండాలో రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

శ్రీశైలం వద్ద బీజేపీ జలసాధన దీక్ష..

కర్నూలు : శ్రీశైలం జలాశయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జలసాధన దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. జలాశయంలో 854 అడుగుల నీటి నిల్వ ఉందని, రాయలసీమ రైతాంగానికి సాగు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

రఘువీరా సత్యాగ్రహ దీక్ష ప్రారంభం..

రాజమండ్రి : ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ కేంద్ర మంత్రి కిల్లికృపారాణి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టారు.

 

11:03 - October 2, 2015

నల్గొండ : ఏకంగా తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో మృగాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చదువుతున్న విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొంత దూరం ప్రయాణించాక ఆటో డ్రైవర్ తన అసలు రూపం చూపడం మొదలుపెట్టాడు. అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. తనకు సహకరించాలని... లేకపోతే ఊరుకోనని హెచ్చరించాడు. డ్రైవర్ బెదిరింపులతో ఏం చేయాలో అర్థంకాని ఆ అమాయకురాలు ఆటోనుంచి బయటకు దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు ఆటోను వెంబడించి ఆ దుర్మార్గున్ని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. అటు గాయపడ్డ బాధితురాలిని మహిళపై అత్యాచారానికి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ నిర్వాహకులు ఆ విద్యార్థినికి ధైర్యం చెప్పారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆటోలపై నిఘా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

10:59 - October 2, 2015

ఖమ్మం : పట్టణంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి... నిప్పంటించి... తాను నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్వర్ పాషా, పర్వీన్ లు దంపతులు. ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. రహీమా, రేష్మలు ఉన్నారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. పర్వీన్ బక్రీద్ కు పుట్టింటికి తిరిగి వచ్చింది. అయితే ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. పర్వీన్.. భర్త అన్వర్ పాషాపై పీఎస్ లో పిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో పోలీసులు నిన్న అన్వర్ పాషా ఇంటికి వచ్చి.. దర్యాప్తు చేసి.. వెళ్లారు. ఈక్రమంలో మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ పాషా.. రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. తన ఇద్దరు కూతుళ్లు రహీమా, రేష్మలపై కిరోసిన్ పోసి... నిప్పంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో కూతురు రహీమా, తండ్రి అన్వర్‌పాషా మృతి చెందారు. మరో చిన్నారి రేష్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

దాద్రికి చేరుకున్న ఓవైసీ..

ఉత్తర్ ప్రదేశ్ : ఎఐఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ దాద్రికి చేరుకున్నారు. అక్కడ హత్యకు గురైన మహ్మద్ అఖలక్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గొడ్డు మాంసం తిన్నందుకు గుర్తు తెలియని దుండగులు అఖలక్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే.

స్వచ్ఛ భారత్ తో ఎన్ని వీధులు శుభ్రమయ్యాయి ? - కేజ్రీ..

ఢిల్లీ : స్వచ్ఛ భారత్ మొదలు పెట్టి సంవత్సరం పూర్తయ్యిందని, ఈ క్యాంపెయిన్ లో ఎన్ని వీధులు శుభ్రమయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద గవర్నర్, కేసీఆర్ నివాళి..

హైదరాబాద్ : లంగర్ హౌస్ వద్దనున్న బాపూ ఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. వారితో పాటు డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ, మంత్రి తలసాని, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కేకే, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తదితరులున్నారు. 

బాబు పర్యటనలో కార్మికుల నిరసన..

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ మున్సిపల్ శానిటరీ కార్మికులు నిరసన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెంచిన జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

శంషాబాద్ లో ఆర్టీఏ అధికారుల దాడులు..

రంగారెడ్డి : శంషాబాద్ లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు బస్సులు..మూడు కార్లను అధికారులు సీజ్ చేశారు.

 

భోపాల్ లో గుండ్లు గీయించుకున్న కాంగ్రెస్ నేతలు..

భోపాల్ : కాంగ్రెస్ నేతలు గోవింధ్ గోయల్, ఇతర నేతలు గుండ్లు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర యూనిట్ కు వ్యతిరేకంగా ఈ నిరసన వ్యక్తం చేశారు.

10:36 - October 2, 2015

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ్' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రం ట్రైలర్ వచ్చేసిందా ? ఇంకా ఆడియో విడుదలే కాలేదు. అప్పుడే ఎలా వచ్చేసింది అంటూ గందరగోళానికి గురి కాకండి. ఇది ఆయన నటించిన చిత్రం కాదు. సంచలనాలతోనే సినిమా చేసే 'వర్మ' రామ్ చరణ్ 'బ్రూస్ లీ' విడుదలకు సిద్దమైన ఈ సమయంలో తన 'బ్రూస్ లీ' సినిమా ట్రైలర్ ని విడుదల చేశాడు. దానికి ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాడు. 'బ్రూస్ లీ' అంటే పడి చచ్చే 'వర్మ' ఈ సినిమాని అయన జీవితం ఆధారంగా తీయనున్నారని టాక్. వివాదాలతోనే తన సినిమాకి పాపులారిటీ తెచ్చుకునే 'వర్మ' ఈ సారి మెగా హీరోని టార్గెట్ చేసి వివాదం సృష్టిస్తున్నాడనే టాక్.
ఈ సినిమా ట్రైలర్ లో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించింది. ఇందులో 'వర్మ' అక్కడక్కడ ఇంగ్లీష్ లో వాయిస్ ఓవర్ అందిచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి 'వర్మ' ఇంకా పేర్కొనలేదు. ఇప్పుడు గనక చరణ్ 'బ్రూస్ లీ' బృందం 'వర్మ' సినిమాకి అభ్యంతరం చెబుతుందా ? లేదా ? అన్నది చూడాలి. అభ్యంతరం పెడితే 'వర్మ' సినిమాకు బోలెడంత పబ్లిషిటీ వచ్చే అవకాశాలుంటాయనే టాక్ వినిపిస్తోంది. 

10:31 - October 2, 2015

విశాఖ : నగరంలోని గాజువాక సింహగిరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లు కూలి దంపతులు ప్రకాశరావు, పైడమ్మ మృతి చెందారు. అయితే రాత్రి పెద్ద శబ్ధం వచ్చింందని... ఒక వేళ ఇళ్లుపై పిడుగుపడి మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.

 

10:23 - October 2, 2015

కాశ్మీర్... భారత్ లో అంతర్భాగమని దిహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాశ్మీర్.. భారత్ లో విలీనం కావడమే న్యాయమైందన్నారు. చార్రితక పరిస్థితుల్లో కాశ్మీర్ భారత్ లో విలీనం అయిందని తెలిపారు. కాశ్మీర్... భారత్ ఆక్రమణలో ఉందనడం అవాస్తవమన్నారు. కాశ్మీర్.. పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉందని పేర్కొన్నారు. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయాల్సివుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం......
'పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తడం ఇప్పుడు కొత్తకాదు. పాకిస్తాన్.. ఒకవైపు తాము తీవ్రవాద బాధితులమని అంటూనే.. మరో వైపు తీవ్రవాదాన్ని సృష్టించింది. ప్రపంచ తీవ్రవాదానికి పురిటిగడ్డ పాకిస్తాన్. కాశ్మీర్ విదేశంలో ఉందనే విషయాన్ని చర్రిత తెలిసిన ఎవరూ.. ఒప్పుకోరు. కాశ్మీర్ భారత్ లోనే అంతర్భాగం. పాకిస్తాన్ తన అవసరాల కోసం, ప్రజల దృష్టిని మరల్చడానికి.. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడమనేది విదేశీ విధానంగా ఉంది. కాశ్మీర్ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవడం అవసరం లేదు. పాకిస్తాన్ లో నాలుగు శక్తులున్నాయి. మిలిటరీ, మత చాంధసవాదం, రాజకీయం, మత్తు మందుల వ్యాపారం. శాంతి కోసం సమగ్ర చర్చలు జరగాలి.
టీఅసెంబ్లీ...వాయిదా.. ఆందోళన...
టీ.అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు ఆందోళన కల్గిస్తుంది. రైతు రుణమాఫీపై మొత్తం ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. వన్ టైంలోనే రుణమాఫీ చేయాలని పట్టుబట్టాయి. రుణమాఫీకి రూ. 8 వేల కోట్లు ప్రభుత్వం వద్ద లేవా అని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వరంగల్ ఎన్ కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. రాజ్యం విచక్షణారహితంగా వ్యవహరిస్తుంది. రాజ్యమే హింసంకు మరిగినప్పుడు రాజ్యేతర హింసను వ్యతిరేకించడంలో అర్థం లేదు'. అని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. బిజెపి మేనిఫెస్టో విడుదల అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:22 - October 2, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' హైదరాబాద్ కు వచ్చారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'దిల్ వాలే' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొనేందుకు గురువారం 'షారుఖ్' నగరానికి వచ్చారు. విరామ సమయంలో 'షారుఖ్' సరదాగా వాలిబాల్, బ్మాడ్మింటెన్ ఆడాడు. ఆయనతో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి, ఇతర నటీనటులు కూడా ఆడారు. చిత్రబృందం అంతా వీరి ఆటను చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. షారుఖ్ ఖాన్, కాజల్, వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల చేయనున్నారు. 

10:14 - October 2, 2015

బెంగళూరు : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ప్రజాధనాన్నే దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వస్త్రధారణ చూడటానికి సంప్రదాయంగానే ఉంటుంది. కానీ ఆయన భుజంపై ఉండే 'కండువా' ఖర్చులు చూస్తే బైర్లు కమ్ముకోవడం ఖాయం. ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో ఆయనపై వచ్చిన వార్త హల్ చల్ చేస్తోంది.
మరిలింగె గౌడ అనే ఆర్టీఐ కార్యకర్త పలు వివరాలు సంపాదించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి సీఎం కండువాల కోసం రాష్ట్ర సర్కారు రూ.4.78 లక్షలు ఖర్చు చేసింది. వీటిలో టవళ్లు..ఫేస్ టవల్స్..స్నానపు టవల్స్ ఇతరత్రా ఉన్నాయి. సిద్ధరామయ్య నివాసంలో ఉన్న దుప్పట్లు, బెడ్ షీట్లు మొదలైన అవసరాల కోసం మరో రూ.4.79 లక్షలు ఖర్చు చేశారంట. మొత్తంగా సీఎం అధికారిక నివాసంలో కనీస అవసరాల కోసం ఆరు సంవత్సరాలలో రూ.39.73 లక్షలు ఖర్చు చేశారంట. అదండి అసలు విషయం. 

మోడీ ర్యాలీకి ఏర్పాట్లు..

బీహార్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు. బంకా జిల్లాలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గన్ పార్కు వద్ద 'రైతు రక్షణ యాత్ర' ప్రారంభం..

హైదరాబాద్ : గన్ పార్కు వద్ద రైతు రక్షణ యాత్రను ప్రొ.కోదండరాం, ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్యలు ప్రారంభించారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు రైతు రక్షణ యాత్ర జరుగనుంది. 

పోరుబందర్ లో సీఎం ఆనందిబెన్ పటేల్..

గుజరాత్ : గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జన్మస్థలమైన పోరు బందర్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ పాల్గొన్నారు. 

గాంధీ విగ్రహానికి కేసీఆర్ నివాళి..

హైదరాబాద్ : అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నెక్లెస్ రోడ్డులో గాంధీ జయంతి..ఖాదీ దినోత్సవం..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో గాంధీ జయంతి, ఖాదీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 

చిన్నారి ఆదితి మృతిపై బాబు దిగ్ర్భాంతి..

విజయవాడ : చిన్నారి అదితి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రికి శుక్రవారం బాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరు రోజుల క్రితం ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదితి మురుగుకాల్వలో పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులు అదితి కోసం గాలించారు. కానీ గురువారం అదితి విజయనగరంలోని ఓ బీచ్ వద్ద విగత జీవిగా కనిపించింది. 

ఖైరతాబాద్ వినాయకుడి ప్రసాదం కోసం పోటెత్తిన భక్తులు..

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడి ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. ఉదయం 10.30 గంటలకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు లడ్డూను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 59 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే. వినాయకుడి చేతిలో తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఏకంగా 5,600 కేజీల లడ్డూను తయారు చేశారు. 

09:42 - October 2, 2015

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో గోమాంసం తింటున్నారన్న నెపంతో కుటుంబాన్ని హత్య చేయడం దారుణమని వక్తలు అన్నారు. నాగరిక సమాజంలో ఈఘటన క్షమించరాని నేరమని తెపారు. న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో సీపీఎం ఎపిరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, కాంగ్రెస్ నేత మల్లురవి, టిడిపి నేత జూపూడి ప్రభాకర్, బిపెపి నాయకురాలు పాదూరి కరుణలు పాల్గొని, మాట్లాడారు. ఈ ఘటనకు బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. హత్యా ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎపి రాజధాని.. అమరావతి శంకుస్థాపన, రైతుల ఆత్మహత్యల వంటి పలు అంశాపై మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

భార్య కూర వండలేదని..

హైదరాబాద్ : భార్య కూర వండలేదన్న కోపంతో ఓ భర్త మూడేళ్ల కుమారుడితో హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన లేక్ పోలీసులు వారిని రక్షించారు. 

బాపూ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు..

ఢిల్లీ : గాంధీ జయంతి సందర్భంగా బాపూ ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీలు నివాళులర్పించారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

నల్గొండలో ఇద్దరు రైతుల ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వలిగొండ (మం) ఆర్రూర్ లో రైతు వెంకటరామిరెడ్డి..హోం మంత్రి నాయినీ స్వగ్రామమైన చందంపేట (మం) నేరేడుగుమ్ములో రైతు ఇద్దయ్య అలియాస్ శ్రీనులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

చిత్తూరులో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ..

చిత్తూరు : మోతగుంట వద్ద ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈఘటనలో 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

 

నేటి నుంచి తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం..

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం అమలు కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమ్స్ లో మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. 

ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తండ్రి ఆత్మహత్య

ఖమ్మం : వికలాంగుల కాలనీలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న ఇద్దరు కుమార్తెలకు తండ్రి నిప్పంటించారు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

08:39 - October 2, 2015

ఏపీలో పెట్రోల్‌ బంకుల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. డీజిల్‌ పన్ను తగ్గింపుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మంత్రి యనమల వచ్చాక నిర్ణయం తీసుకుంటామని రవాణా మంత్రి శిద్దారాఘవరావు హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమించారు.
బ్లాక్‌లో యదేచ్ఛగా అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌బంకులు, ట్యాంకర్లు, లారీల యాజమాన్యాల సమ్మెతో వాహనాలు ఒక్కొక్కటే నిలిచిపోతున్నాయి. పెట్రోల్‌ దొరక్క జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బ్లాక్‌లో నడివీధిలోనే కొందరు పెట్రోల, డీజిల్‌ అమ్మేస్తున్నారు. అవసరం తీర్చుకోవడానికి అడిగినంత ఇచ్చి కొనేసుకుంటున్నారు.
వ్యాట్‌ తొలగించాలని ప్రధాన డిమాండ్‌
పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విధించిన వ్యాట్‌ను తొలగించాలనేదే ప్రధాన డిమాండ్‌గా లారీలు, పెట్రోల్‌ ట్యాంకర్ల యాజమానులు సమ్మెలోకి దిగారు. మరోవైపు టోల్‌గేట్‌ వసూళ్లపైనా వారు అభ్యంతరాలు తెలియచేస్తున్నారు.
రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో చర్చలు
రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో ఒకసారి చర్చలు జరిగాయి. అయితే అందులో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో.. సీఎం చంద్రబాబునే నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యాట్‌ తగ్గించేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. సమ్మె విరమించుకోకపోతే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు.

 

08:33 - October 2, 2015

పెట్రోల్‌ బంక్‌ల యజమానుల సమస్యలను పరిష్కరించాలని పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేత చుంచు నరసింహారావుగారు డిమాండ్ చేశారు. ఇందే అంశంపై నిర్వహించన జనపథం చర్చా కర్యాక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పెంట్రోల్‌ బంక్‌ల నిర్వహణను లాభసాటి వ్యాపారంగా చాలామంది భావిస్తుంటారు. అయితే, బయటకు కనిపించేంత గొప్పగా తమ వ్యాపారం ఉండదనీ ఇందులోనూ చాలా సాధకబాధకాలున్నాయని పెట్రోల్‌ బంక్‌ల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ రోజురోజుకీ కష్టతరంగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా పన్నుల మోత శక్తికి మించిన భారంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ లో పెట్రోల్‌ బంక్‌ల యజమానులు సమ్మె చేశారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క వాహనదారులూ అవస్థపడ్డారు. ఇంతకీ పెట్రోల్‌ బంక్‌ యజమానులు ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది.? బంక్‌ల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సేల్స్‌ టాక్స్‌, వ్యాట్‌ తదితర పన్నులు వీరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? పోటీ ప్రపంచంలో పెట్రోల్‌ బంక్‌ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:59 - October 2, 2015

హైదరాబాద్ : రాష్ర్టంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు.. తెలంగాణ సర్కార్‌ స్పీడ్‌ పెంచింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలోని జవహర్ భవన్‌లో జరిగిన తొలి 'మీట్ ది స్టేట్స్' సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రాష్ర్టంలో పెట్టుబడులుకు ఉన్న అన్ని అవకాశాలను అక్కడి ప్రతినిధులకు వివరించారు.
'మీట్ ది స్టేట్స్ '
మేకిన్‌ ఇండియాలో భాగంగా ప్రపంచ దేశాల రాయబారులను, ప్రతినిధులను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేసేలా కేంద్రం మీట్ ది స్టేట్స్ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం : మంత్రి జూపల్లి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 45 దేశాల ప్రతినిధులు, రాయబారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానాన్ని.. పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను వివిధ దేశాల రాయబారులకు.. ప్రతినిధులకు మంత్రి జూపల్లి వివరించారు. ఇప్పటి వరకు నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రంలో 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రానున్న రోజుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందన్నారు. అవినీతి లేని పారిశ్రామిక విధానం వల్ల 15 రోజులలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని జూపల్లి చెప్పారు. త్వరలోనే దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

 

07:43 - October 2, 2015

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు నగరంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీగా గడపనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రెవిన్యూ, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
అధికారులు హడావుడి ఏర్పాట్లు
ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గుంటూరులో అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులో నిర్వహించనున్న వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నగరానికి చేరుకోనున్న సీఎం తొలుత జిన్నాటవర్‌ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి స్వాతంత్ర సమరయోధులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పీవీకే నాయుడు మార్కెట్‌ వద్దకు చేరుకుని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత కాలినడకన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కంకరగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జీతో పాటు, స్థంభాలగరువు హనుమయ్య గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తారు. చివరగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేస్తారు.
గుంటూరు సుందరంగా ముస్తాబు
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రోడ్లపై గతుకులు లేకుండా ప్యాచ్‌ వర్కులు చేయడంతో పాటు డివైడర్లు, ప్లైఓవర్లకు రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సభకు సుమారు 25 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. దీని కోసం వేదికను.. రెయిన్‌ ఫ్రూఫ్‌ షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా గుంటూరులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భద్రతా పరంగా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి మొత్తం 2 వేల మంది పోలీసులను రప్పించారు. సీఎం పర్యటనతోనైనా.. గుంటూరు నగరం క్లీన్‌గా మెరిసి పోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

నేడు సిద్ధిపేటలో స్వచ్ఛ సంబురాలు

మెదక్ : నేడు సిద్ధిపేటలో స్వచ్ఛ సంబురాలు నిర్వహించనున్నారు. స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రి హరీష్ రావులు పాల్గొనన్నారు.

 

నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

గుంటూరు : సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గాంధీ జయంతి వేడుకలతోపాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించనున్నారు. 

తిరుమలలో నేటి నుంచి 4 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా నేటి నుంచి 4 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రొటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. 

నేటి నుంచి తెలంగాణలో ఈ-పంచాయతీ సేవలు

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో ఈ-పంచాయతీ సేవలు అందనున్నాయి. నిజామాబాద్ జిల్లా బిబిపేటలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ-పంచాయతీ సేవలను ప్రారంభించారు. 101 గ్రామాల్లో పౌరసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆయా జిల్లాల్లో జిల్లా మంత్రులు ప్రారంభించనున్నారు. 

06:59 - October 2, 2015

కరీంనగర్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థల వేధింపులు అధికమయ్యాయి. తాజాగా పరీక్ష ఫీజు ఓ విద్యార్థి ప్రాణాల్ని తీసింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకొంది. అబ్బాపురానికి చెందిన రైతు ఈదుల శ్రీనివాస్‌రెడ్డి అంజలి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకొడుకు సంతోష్‌రెడ్డి జూలపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సంవత్సరానికి ఫీజు 12 వేలు. ఇటీవలే మొదటి విడతగా ఐదువేల రూపాయలు చెల్లించారు. రెండ్రోజుల క్రితం పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందిగా కరస్పాండెంట్ విద్యార్థులకు సూచించారు. ఫీజు చెల్లించేందుకు డబ్బు ఇవ్వాలని సంతోష్‌రెడ్డి తన తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం ఉదయం అడిగాడు. ఈమధ్యే ఐదువేలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ..పంటలు పండలేదని, ఇంట్లో డబ్బులు లేవని నాలుగైదు రోజుల్లో ఇద్దామని తండ్రి సర్దిచెప్పగా సంతోష్‌రెడ్డి బడికి వెళ్లాడు. అదేరోజు సంతోష్‌రెడ్డితోపాటు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులనందరిని పాఠశాలలో నిలబెట్టారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన సంతోష్‌రెడ్డి.. తాను చనిపోతున్నానని ఇంటి వద్ద ఉన్న ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ విషయాన్ని ఓ చీటిపై రాసి దుస్తులు తగిలించుకునే చోట తగిలించాడు. సాయంత్రమైనా సంతోష్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం బంధువులు వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దుస్తులు మార్చుకునే సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి సంతోష్ రాసిన చీటి కనిపించింది. ఫోన్‌లో చూడగా చనిపోతున్నానని ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని పెద్దపల్లి దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర గుర్తించారు. ఈ విషయమై కరస్పాండెంట్ సత్యాన్ని సంప్రదించగా.. అందరితోపాటే సంతోష్‌ను నిలబెట్టానని ప్రత్యేకంగా ఏమీ అనలేదన్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

అమెరికాలో కాల్పుల కలకలం

వాషింగ్టన్ : అమెరికాలోని ఒరెగాన్‌ యూనివర్సిటీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో 13 మంది కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ 20 ఏళ్ల దుండగుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. 

06:47 - October 2, 2015

వాషింగ్టన్ : అమెరికాలోని ఒరెగాన్‌ యూనివర్సిటీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో 13 మంది కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ 20 ఏళ్ల దుండగుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయుధ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

Don't Miss