Activities calendar

03 October 2015

సోమనాథ్ భారతిపై మరో కేసు....

హైదరాబాద్ : ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతిపై ఆ రాష్ట్ర పోలీసులు నాలుగో కేసు నమోదు చేశారు. భార్య లిపికా మిత్రాపై గృహ హింస, హత్యయత్నంపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, న్యాయస్థానం లొంగిపోవాలని ఆదేశించినా తప్పించుకుని తిరగడంపై మూడో కేసు నమోదు చేశారు. అలాగే న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి ఆఫ్రికా మహిళలపై దాడులు చేసిన ఘటనపై ఢిల్లీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీనిపై మెజిస్ట్రేట్ వద్ద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి అందజేసిన నివేదికను అక్టోబర్ 30న విచారణకు స్వీకరిస్తామని న్యాయస్థానం తెలిపింది.

పిడుగుపాటుకు యువ రైతు బలి

నిజామాబాద్ : నందిపేట్ మండలం గాదేపల్లి గ్రామంలో పిడుగుపాటుకు యువ రైతు తలారి రవి (26) బలయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తలారి రవి తన వ్యవసాయ క్షేత్రంలో పని చేయటానికి వెళ్లాడు. పొలంలో పని చేని చేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన వచ్చి హఠాత్తుగా పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగు పాటు శబ్ధం రావడంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సరికి రవి మృతి చెంది ఉన్నాడు. రవికి భార్య రజిత, కొడుకు రిత్విక్ ఉన్నారు.

ఇంద్రాణి స్పృహలోకి వస్తున్నారు : వైద్యులు

హైదరాబాద్ : షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. నిన్న కోమాలోకి వెళ్లిన ఇంద్రాణి ప్రస్తుతం స్పృహలోకి వస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆమె పరిస్థితి ఇప్పటికీ ఇంకా విషమంగానే ఉందని, మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని జెజె ఆసుపత్రి డీన్‌ టిపి లహానే తెలిపారు. ఆమె మోతాదుకు మించి మందులు వేసుకున్నరన్న వార్తల్లో నిజం లేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి కెమికల్స్ తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదని వైద్యులు తెలిపారు.

21:33 - October 3, 2015

హైదరాబాద్ : చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలకు తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.ఈ వేడుకలకు 8 జట్ల ప్రాంచైజీ ఓనర్లతో పాటు కేరళా బ్లాస్టర్స్‌ కో-ఓనర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, బాలీవుడ్‌ షెహన్‌ షా అమితాబ్‌ బచ్చన్‌,ముఖేష్‌ అంబానీ,నీతా అంబానీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఆఖర్లో ఏ ఆర్‌ రెహ్మాన్‌ జాతీయ గీతం ఆలపించిన తర్వాత .....అధికారికంగా ఇండియన్‌ సూపర్ లీగ్‌ రెండో సీజన్‌ పోటీలను ఆరంభించారు.

ప్రారంభవేడుకల్లో బాలీవుడ్‌ బ్యూటీ..మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యా రాయ్‌....

ఇండియన్‌ సూపర్ లీగ్‌ రెండో సీజన్‌ పోటీల ప్రారంభవేడుకల్లో బాలీవుడ్‌ బ్యూటీ..మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యా రాయ్‌, రీసెంట్‌ సెన్సేషన్‌ ఆలియా భట్‌ సందడి సందడి చేశారు.షాన్‌దార్‌, స్టూడెంట్ ఆఫ్‌ ద ఇయర్‌ సినిమాల్లోని హిట్‌ సాంగ్స్‌కు డాన్స్‌ చేసిన ఆలియా భట్‌....అభిమానులను ఉర్రూతలూగించింది.ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ప్రమోషనల్‌ సాంగ్‌కు ఆలియా భట్‌ వేసిన స్టెప్స్‌ వీక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు.దేవదాస్‌ సినిమాలోని డోలారే... పాటలకు ఐశ్వర్యారాయ్‌ చేసిన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ప్రారంభవేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది.

21:30 - October 3, 2015

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగల్పూర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది సర్కార్‌పై ధ్వజమెత్తారు. మోది ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల దేశంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయని ఆమె విమర్శించారు. మోది ఇచ్చే వాగ్దానాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్యాకేజీ- రీప్యాకేజీలో ప్రధాని సిద్ధహస్తుడని సోనియా తీవ్రస్థాయిలో ఆరోపించారు. నరేంద్రమోది దేశంలోకన్నా విదేశాల్లోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారు. కేంద్ర విధానాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పోరేట్లకు అనుకూలంగా ఉన్నాయని సోనియా తెలిపారు. 

21:28 - October 3, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 12 నుంచి 20 వరకు జరిగే బతుకమ్మ ఉత్సవాలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్‌శర్మ సూచించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిపే ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్‌లో ఆయన సమీక్షసమావేశం నిర్వహించారు. బతకమ్మ ఉత్సవాల చివరి రోజున ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల ప్రతిపాదనలపై సీఎంతో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

21:26 - October 3, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్శించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సింగ‌పూర్, జ‌పాన్, చైనా దేశాల‌లో ప‌ర్యటించిన చంద్రబాబు..దృష్టి ఇప్పుడు దక్షణకొరియాపై పడింది. అమ‌రావ‌తి శంఖుస్ధాప‌న కార్యక్రమం అక్టోబర్‌ 22న ముగిసిన తర్వాత..దక్షిణకొరియాలో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. అక్కడి హార్డ్‌వేర్, ఆటో మొబైల్ రంగ పారిశ్రామిక‌వేత్తలతో స‌మావేశం అయి రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆహ్వానించ‌నున్నారు.

హార్డ్‌వేర్‌, ఆటోమొబైల్‌రంగ పారిశ్రామికవేత్తలతో సమావేశం ....

ప్రపంచంలోనే హార్ట్‌వేర్‌, ఆటోమొబైల్‌ రంగంలో దక్షిణకొరియా దూసుకుపొతున్న నేప‌థ్యంలో అక్కడ అమ‌లవుతున్న పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యయనం చేయనున్నారు. దాంతోపాటు..అక్కడి ఆటోమొబైల్‌ రంగం పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. మేకిన్‌ ఆంధ్రా నినాదంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీలో పెట్టుబ‌డుల‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. అయితే..గ‌తంలోనే చంద్రబాబు దక్షిణకొరియా పర్యటన ఖ‌రారైనా..అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. దీంతో అమ‌రావ‌తి శంఖుస్ధాప‌న కార్యక్రమం పూర్తైన తర్వాత దక్షిణకొరియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు. 

21:19 - October 3, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతుండడంతో ఏపీ సర్కార్‌ ఏర్పాట్లలో నిమగ్నమైంది. పనుల పర్యవేక్షణకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్గనైజింగ్‌ కమిటీకి మంత్రి నారాయణ,.. రిసెప్షన్‌ కమిటీకి సత్యనారాయణ,.. వెన్యూ కమిటీకి గుంటూరు జిల్లా కలెక్టర్‌, కల్చరల్‌ మరియు మీడియా కమిటీ బాధ్యతలను పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు.

ఈనెల 22 దసరా రోజున మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల...

ఇక ఈనెల 22 దసరా రోజున మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేశారు. ఉద్దండరాయునిపాలెం, తాళ్లయపాలెం, మందడం గ్రామాల మధ్యన.. కృష్ణానది తీరానికి దగ్గరగా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నట్లు ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఏపీ సర్కార్‌కు సమాచారమిచ్చింది.

దేశ విదేశాల నుంచి 1500 మంది ఆహ్వానితులు....

ఇక ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 1500 మంది ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం పలకబోతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్ననేపథ్యంలో.. ఈ వేదికను పంచుకునేందుకు సోనియా, రాహుల్‌ ఇష్టపడకపోవచ్చని పలువురు నేతలంటున్నారు.

10 నుంచి 22 వరకు అనేక కార్యక్రమాలు.....

మరోవైపు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి 22 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక శంకుస్థాపనకు స్థలాన్ని ఎంపిక చేసే పనిలో అధికారులున్నారు. ఇక ప్రభుత్వం ఓవైపు నిధులు లేవంటూనే.. ప్రపంచం తలదన్నేవిధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రపంచమంతా ఇటువైపే చూస్తుండడంతో సమస్యలన్నింటిని పరిష్కరించి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సర్కార్‌ భావిస్తోంది. 

20:43 - October 3, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయ కెరీర్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 50 అంతర్జాతీయ టీట్వంటీ మ్యాచ్ లకు నేతృత్వం వహించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇందులో 26 టీ -20ల్లో జట్టును విజయ పథాన నడపగా, 22 మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ ను టైగా ముగించగా, మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ధర్మశాలలో సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్ తో ధోనీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక టీ-20లకు కెప్టెన్సీ చేపట్టిన వ్యక్తిగా ధోనీ నిలిచాడు. కాగా, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికి కూడా ధోనీ కెప్టెన్సీ చేస్తే కెరీర్ లో మరిన్ని మైలు రాళ్లు అధిగమించే అవకాశం ఉంది.  

ఆర్టీసీ కార్మికులకు పక్కా ఇళ్లు నిర్మిస్తా: చంద్రబాబు

విజయవాడ: ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం విజయవాడలో ఆర్టీసీ కార్మిక పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణిస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం, కార్మికులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించారు.

పటేళ్ల బాటలో బ్రాహ్మణులు...

హైదరాబాద్ :గుజరాత్‌లో తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన పటేళ్ల బాటలోనే తాము నడవాలని అక్కడి బ్రాహ్మణులు నిర్ణయించారు. ఈమేరకు నిన్న ఆల్ గుజరాత్ బ్రాహ్మిణ్ సమాజ్ అధ్యక్షుడు శైలేష్ జోషీ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం శైలేష్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న 55 లక్షల మందికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజారులుగా పనిచేస్తోన్న బ్రాహ్మణులకు ప్రతీ నెలా జీతాలు చెల్లించాలని కోరారు.

గాంధీ ఆసుపత్రిలో ఐదుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇప్పటికే మరో తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

నెల్లూరులో గాయకుడు ఎస్పీ బాలు తండ్రి విగ్రహావిష్కరణ

హైదరాబాద్ : నెల్లూరు నగరంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తండ్రి సాంబమూర్తి విగ్రహావిష్కరణ జరిగింది. బాలు తల్లి శకుంతలమ్మ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్, స్థానికులు పాల్గొన్నారు. అంతకుముందు నెల్లూరులో 15వేల మంది విద్యార్థులతో స్వచ్ఛభారత్ ర్యాలీ నిర్వహించారు. వీఆర్ సీ మైదానం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. 

యూపీలో విశాఖ వ్యాపారి కిడ్నాప్

హైదరాబాద్: విశాఖ స్క్రాప్‌ వ్యాపారి అబ్దుల్‌ రెహమాన్ ఉత్తరప్రదేశ్‌లో కిడ్నాప్‌‌కు గురయ్యాడు. అయితే పోలీసుల సాయంతో రెహమాన్ దుండగుల నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళితే.. రాగిని తక్కువ ధరకు అమ్ముతామంటూ అబ్దుల్ రెహమాన్‌ను దుండగులు యూపీకి పిలిపించారు. రెహమాన్ అక్కడికి చేరుకున్నాక దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు. అతడి వద్దనున్న సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డులు, డబ్బు లాక్కున్నారు.

పేకాట కేంద్రాలపై పోలీసులు దాడులు

నల్లగొండ: మిర్యాలగూడలో జోరుగా పేకాట కేంద్రాలు కొనసాగుతున్నాయి. పోలీసులు జరిపిన దాడిలో ఒకే రోజు 11 అడ్డాల్లో పేకాడ ఆడుతూ నిందితులు పట్టుబడారు. నిందితుల నుంచి 1.13 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌నగర్‌లో ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. బంగారు గడ్డలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు...

తూర్పుగోదావరి: జిల్లాలోని సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఘోరం జరిగింది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టారు. పోలీసులకూ సమాచారం అందించారు.

రేపు బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నిక

హైదరాబాద్ : బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడి ఎన్నిక రేపు జరుగనుంది. రేపు జరుగబోయే ప్రత్యేక సమావేశంలో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ మాజీ అద్యక్షుడు శరద్ పవార్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. గత నెల 20వ తేదీన బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మృతిచెందడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే.

20:03 - October 3, 2015

హైదరాబాద్ : మన దేశంలోమాంసాన్ని ఆహారంగా ఎప్పటి నుంచి తింటున్నారు? బర్రెల్ని, ఆవుల్ని పాలిచ్చే జంతువులుగా ఎవరు మలిచారు? ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా దగా అన్నట్టు మనదేశంలోవర్ణవ్యవస్థ అణగారిణ కులాల ప్రజలను దగా చేసింది. ఫలితంగా భారత ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసిన యాదవకులం సమాజంలో సముచిత గౌరవం పొందలేక పోయింది.వారు కేవలం గొర్రెలకాపర్లుగానే మిగిలిపోయారు.ఆర్థిక సామాజిక రాజకీయరంగాల్లోయాదవులకు సరైన న్యాయంజరగలేదు.నిచ్చెనమెట్ల కులసమాజంలో యాదవులకు జరిగిన చారిత్రక విద్రోహాలపై ఇదే అంశంపై నిర్వహించిన జన చరిత కార్యక్రమంలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సీఆర్డీఏ అధికారులతో ముగిసిన చంద్రబాబు సమావేశం

విజయవాడ: సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సమావేశం ముగిసింది. కృష్ణా నది, కొండవీటి వాగు రిజర్వాయర్‌..వాటర్‌ఫ్రంట్‌ మధ్య బ్లూగ్రీన్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. రెండు ఐకాన్‌ టవర్లు, వాటర్‌ఫ్రంట్‌, సువిశాల రహదార్ల మధ్య చారిత్రక పర్యాటక కేంద్రంగా రాజధాని నిలవాలని ఆయన చెప్పారు. రాజధానిలో మూడు రీజియన్ కేంద్రాల మధ్య 9 థీమ్‌ సిటీల నిర్మాణముంటుందని బాబు తెలిపారు. నిర్మాణం పకడ్బందీగా పర్యావరణ హితంగా జరుగుతుందని ఆయన చెప్పారు.

శంషాబాద్ లో ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్టు

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకున్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ప్రకటించిన జీహెచ్ ఎంసీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల నమోదుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ సోమేశ్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. 2016 జనవరి 11 వరకు ఓటు నమోదుకు గడువు విధించామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 4లోగా తెలియజేయాలని సోమేశ్ కుమార్ తెలిపారు.

ఏపీలో పొగాకు రైతులకు శుభవార్త..

ఢిల్లీ: ఏపీలో పొగాకు సాగుచేస్తున్న రైతులకు కేంద్రం తీపికబురునందించింది. పొగాకు మద్దతు ధర కేజీకి రూ.20 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 14.89 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

బతుకమ్మ ఉత్సవాలపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్ : ఈనెల 12 నుంచి జరగనున్న బతుకమ్మ ఉత్సవాల పై సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో వారం రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ ఉత్సవాల ముగింపు రోజున ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

హుస్సేన్‌సాగర్‌లోకి దూకిన మహిళ

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లోకి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళలను హుస్సేన్‌సాగర్ లేక్ పోలీసులు కాపాడారు. జహీరాబాద్‌కు చెందిన అమ్రీన్‌బేగంగా లేక్ పోలీసులు గుర్తించారు. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు యత్నించినట్లు అమ్రీన్‌బేగం పోలీసులకు తెలిపింది. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ఆర్కే బీచ్ లో నలుగురు గల్లంతు : ఒకరి మృతి

విశాఖపట్నం:ఆర్‌కేబీచ్‌లో నలుగురు గల్లంతయ్యారు. స్థానిక రక్షణ సిబ్బంది ముగ్గురిని కాపాడారు. ఆగ్రాకు చెందిన పండిత్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఓటమి భయంతోనే ఓట్లు తొలగింపు: ఎల్. రమణ

హైదరాబాద్ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌‌తో టీటీడీపీ బృందం భేటీ అయింది. జీహెచ్ఎంసీలో ఓట్ల తొలగింపుపై ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతో సోమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని గ్రేటర్‌లో ఆరు లక్షల ఓట్లను తొలగించారని టీడీపీ నేత ఎల్.రమణ ఆరోపించారు.

18:33 - October 3, 2015

విశాఖ : దెయ్యం..ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా మాత్రం కాదు. ఈ పేరెత్తితే విశాఖ ఏజెన్సీలోని రెండుగ్రామాలు గజ గజా వణికిపోతున్నాయి. పిల్లలు స్కూలుకు వెళ్ళడమే మానేశారు. అలా ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజులుగా. దెయ్యం భయంతో ఆ గ్రామాలన్నీ బిక్కు బిక్కు మంటున్నాయి.

కనీసం అడుగు తీసి అడుగేద్దామన్న భయం.....

ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే భయం... కనీసం అడుగు తీసి అడుగేద్దామన్న భయం.. ఇంటి గుమ్మం దాటి బయట అడుగుపెట్టాలంటే చచ్చేంత భయం ...స్కూలుకెళ్లమంటే...వామ్మో స్కూలుకా ...నేనెళ్లనంటూ పిల్లలు మారాం. ఒకవేళ ఎవరైనా ధైర్యంచేసి ఆ స్కూలుకు వెళ్లారో..దారిలో దఢేల్‌మంటూ రాళ్లవర్షం..పిడిగుద్దుల వర్షం

ఓ రెండు గ్రామాల పరిస్థితి......

ఇదీ.విశాఖ ఏజెన్సీలోని ఓ రెండు గ్రామాల పరిస్థితి. దెయ్యం పేరెత్తితే చాలు..ఏజెన్సీలోని ఓమర్తి, అర్జాపురం అనే గ్రామాలు గజగజా వణికిపోతున్నాయి. పిల్లలు నెలరోజులుగా స్కూలుకు వెళ్ళడమే మానేశారు. ఎందుకంటే స్కూలుకెళ్తే దారి మధ్యలో దెయ్యం ఉందన్న భయంతో పిల్లలు వణికిపోపతున్నారు.

గజగజా వణికిపోతున్న గ్రామస్తులు ......

ఓమర్తి,.పక్కనే ఉన్న అర్జాపురం గ్రామాల ప్రజలకు నెల రోజులుగా ఓ దెయ్యం పీడిస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. నడిచే దారిలో రాళ్ళు పడుతున్నాయని..వెంటబడి తరుముతోందని గ్రామస్థులు చెప్తున్నారు. దీంతో అప్పర్‌ప్రైమీరీ స్కూలుకు చెందిన 30 మంది విద్యార్ధులు...గత నెలరోజులుగా స్కూలుకు వెళ్లడమే మానేశారు. బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చని.. స్కూలుకు మాత్రం అసలు వెళ్ళమంటూ భీష్మించుకూర్చున్నారు.

దెయ్యం పట్టిపీడిస్తుందని పుకార్లు .....

స్కూలుకి..దెయ్యానికి మధ్య సంబంధం ఏంటని అనుకుంటున్నారా ? అయితే దీనికి ఓ కారణం ఉంది. ఓవర్తి గ్రామానికి చెందిన భీమాలయ్య అనే వృద్దురాలు నెల రోజుల క్రితం చనిపోయింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి. పాఠశాలకు మధ్యలో ఉన్న ప్రదేశంలో పూడ్చిపెట్టారు. గ్రామం నుంచి అదే రోడ్డు గుండా కిలోమీటరు నడిచి పిల్లలంతా వెళ్లాలి. ఇలా వెళ్తున్నపుడు విద్యార్దులపై రాళ్ళు పడుతున్నాయని, ఇదంతా ఆ దెయ్యం పనేనని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామస్తులకు దెయ్యం భయం పట్టుకుంది.

నెల రోజుల క్రితం వృద్ధురాలు మృతి .....

లేని దెయ్యం పేరుతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయంలో వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు సైతం సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో ఎంతో విలువైన విద్యను విద్యార్థులు కోల్పోతున్నారు. 

18:27 - October 3, 2015

హైదరాబాద్ :సీఎం చంద్రబాబు, కుమారుడు లోకేష్‌ను స్పూర్తిగా తీసుకుని మిగిలిన రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రకటించాలని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ అన్నారు. చంద్రబాబుకు సింగపూర్‌లో ఆస్తులు ఉన్నాయని, మారిషస్ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లిస్తున్నారని ఓ పత్రిక అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించిన వాటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని వారికే రాసిస్తామని జూపూడి సవాల్ విసిరారు.

18:21 - October 3, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కమిటీలను చంద్రబాబు నియమించారు. సీఆర్‌డీఏతో సమావేశమైన బాబు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. 1500 మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులు రానున్న ఈ కార్యక్రమ నిర్వహణా కమిటీకి మంత్రి నారాయణను, రిసెప్షన్‌ కమిటీకి ప్రోటోకాల్‌ విభాగం అధికారి సత్యనారాయణ, వేదిక కమిటీకి గుంటూరు జిల్లా కలెక్టర్‌, కల్చరల్ మరియు మీడియా కమిటీకి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.

 

ఏపీలో బ్రాహ్మణ సహకార పరపతి సంఘంకు అనుమతి

హైదరాబాద్ : ఏపీలో బ్రాహ్మణ పరపతి సంఘం ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 కోట్ల మూల నిధితో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా బ్రాహ్మణులలో పేదలకు రుణపరపతి కల్పించేందుకు వీలు కలుగుతుంది.

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతు ఆత్మహత్యలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం సంక్షోభంలో ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 200 మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

నంద్యాల - అనంతపురం మధ్య రాకపోకలకు అంతరాయం

కర్నూలు : కొలిమిగుండ్లలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ఇళ్లలోకి నీరు చేరుతోంది. నంద్యాల - అనంతపురం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

'విలీన మండలాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించండి'

హైదరాబాద్ : విలీన మండలాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు లేఖ రాశారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని... పీహెచ్ సీలలో డాక్టర్ల కొరతను పరిష్కరించాలని మధు విజ్ఞప్తిచేశారు.

ఒత్తిడి లేని నాణ్యమైన విద్యే మాలక్ష్యం : గంటా

గుంటూరుఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యమని గంటా శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీ సెమినార్ హాల్‌లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి గంటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుషితేశ్వరి ఆత్మహత్యతో విద్యాసంస్థలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై లోతైన విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు. యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల వైఖరిలో మార్పురావాలని సూచించారు.

17:35 - October 3, 2015

హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం మృతుడు మహ్మద్ సాహెల్‌గా అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్న సాహెల్‌ను దుండగులు వెంబడించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో సాహెల్ కిందపడిపోయూడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురుగా ఉన్న సంధ్య రెస్టారెంట్‌లోకి పరుగులు తీశాడు. వెంటవచ్చిన దుండగులు రాడ్లతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయుపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, డీఐ ప్రకాశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బండిలోని డ్రైవింగ్ లెసైన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తున్నారు.

17:32 - October 3, 2015

మహబూబ్‌నగర్‌ : పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఔసులోను పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పిడుగు పాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

17:29 - October 3, 2015

హైదరాబాద్ : రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బైఠాయించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన హస్తం పార్టీ.. ఇక మిగిలిన ఐదు రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది. ఫ్లోర్‌ కో-ఆర్డినేషన్‌తో అవసరమైతే సర్కార్‌పై అవిశ్వాస అస్త్రాన్ని సంధించేందుకు రెడీ అవుతోంది.

సర్కార్‌ను కార్నర్‌ చేసిన కాంగ్రెస్‌ ......

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ జోరు కనబరుస్తోంది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై సభలో జరిగిన చర్చలో దూకుడుతో సర్కార్‌ను ఇరుకునపెట్టింది. సభలో అన్ని పార్టీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. విపక్షాలపై చేయి సాధించామని ప్రభుత్వం అనుకునేలోపు.. సభలో బైఠాయించి ఊహించని విధంగా సర్కార్‌కు జలక్‌ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగకుండా పార్టీ జెండాలు, అజెండాలు పక్కనబెట్టి టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీలను ఏకం చేసి రోడ్డెక్కి సర్కార్‌ను టార్గెట్‌ చేశారు.

సోమవారం సభను స్తంభింపచేసే యోచనలో కాంగ్రెస్‌ ......

ఇక ఇదే దూకుడును సోమవారం నుంచి జరిగే ఐదు రోజుల్లో కూడా కొనసాగించాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై కేసీఆర్‌ సమాధానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్‌తో పాటు.. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. దీన్ని ఆయుధంగా మలచుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహం రచించింది. అన్ని పార్టీలను కలుపుకుని సోమవారం సభను స్తంభింపచేయాలని నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే.. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైసీపీలతో కలిపి ఫ్లోర్‌ కో-ఆర్డినేషన్‌ చేసుకుని అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు.

రైతుల విషయంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం....

ఇక రైతుల విషయంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే చివరకు ఎంఐఎం కూడా సర్కార్‌కు బాసటగా నిలవదని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ సభలో ఏకాకిగా మిగులుతుందని.. ఇదే జరిగితే తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల దొంగాటను కూడా సభలో ప్రస్తావించవచ్చని.. దీనిద్వారా అటు స్పీకర్‌పై కూడా ఒత్తిడి పెంచడంలో సక్సెస్‌ సాధించవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా రైతు సమస్యలపై విపక్షాలన్నింటిని ఏకం చేసి.. ప్రభుత్వంపై అవిశ్వాస సమరానికి కాంగ్రెస్‌ కాలుదువ్వుతోంది. 

మోదీ పై విమర్శల వర్షం కురిపించిన సోనియా

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శల వర్షం కురిపించారు. మోదీది పేదల, రైతుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. మోదీ ఉత్తిత్తి హామీలపై ప్రజలకు నమ్మకమే లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమీని గెలిపిస్తే బీహార్ దశ తిరుగుతుందని పేర్కొన్నారు. ప్రధానిగా మోదీ స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

నగరంలో వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

హైద రాబాద్ :ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకూ వీకెండ్స్ లో మాత్రమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే శనివారం నుంచి కొత్త రూల్ ను ప్రవేశపెట్టారు. ఇక నుంచి ప్రతిరోజూ మిట్టమధ్యాహ్నం ప్రధాన కూడళ్లలో డ్రంకన్ డ్రైవ్ సోదాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

గోవధ నిషేధంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నిరసన

జమ్మూ కశ్మీర్గోవధ నిషేధంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నిరసన వ్యక్తమైంది. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు బ్యానర్ పట్టుకుని సభలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలాసేపు వెల్‌లోనే ఉండి నిరసన తెలిపాడు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కూడా సభలోనే ఉన్నారు. దానిపై ఆయన ఏమాత్రం స్పందించలేదు. మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం తగదని సదరు ఎమ్మెల్యే నినాదాలు చేశారు.

పిడుగు పాటుకు ముగ్గురు మహిళలు మృతి

మహబూబ్ నగర్ : పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఔసులోను పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పిడుగు పాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

గుంటూరు జడ్పీ వైస్‌ చైర్మన్‌ పూర్ణ రాజీనామా

హైదరాబాద్ గుంటూరు జడ్పీ వైస్‌ చైర్మన్‌ పూర్ణ రాజీనామా చేశారు. కలెక్టర్‌, జడ్పీ సీఈవోకు పూర్ణ తన రాజీనామా లేఖను అందజేశారు. డిస్ట్రిబ్యూటరీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రావణ్‌ తీరుపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మెజార్టీ నిర్ణయాన్ని పెడచెవినపెట్టడంపై పూర్ణ నిరసన వ్యక్తం చేశారు. విలువ లేని పదవి ఎందుకంటూ పూర్ణ వర్గీయులు చెప్పారు.

16:52 - October 3, 2015

హైదరాబాద్ : బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యావ్ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్నే డబ్ స్మాష్ చేశారు. ప్రధానితో పాటు అమిత్ షానూ తన హావ భావాల్ని, పెదవుల కదలికల్ని జోడించేశారు. ఎలా అనుకరించారో మీరూ చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

16:47 - October 3, 2015

శ్రీకాకుళం : విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు.. గాడి తప్పాడు. ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఈ ఘటన జరిగింది. సిరుసువాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉమాపతి.. రెండ్రోజుల క్రితం ఖాళీ తరగతి గదిలోకి బాలికను తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాన్ని చూసిన తోటి విద్యార్థులు.. తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో స్కూలు వద్దకు చేరుకున్న గ్రామస్తులు.. ఉమాపతిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించే ప్రయత్నంలో ఉమాపతి పరారయ్యాడు.

16:43 - October 3, 2015

విజయవాడ : కార్మిక సంఘాలను, కార్మికులను అణగదొక్కేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కార్మికసంఘాల నేతలు విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలు, అక్రమాలపై పోరాడే కార్మిక సంఘాలను రాష్ట్రంలో లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు చేస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కార్మికసంఘాల నేతలు స్పష్టం చేశారు. 

16:40 - October 3, 2015

వరంగల్‌ : జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ను ఆశావర్కర్లు కలిసే ప్రయత్నం చేశారు. కాని పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేయడంతో..వారు నిరసన తెలియచేశారు. గత కొన్ని రోజులుగా సమ్మెలో ఉన్న ఆశా వర్కర్లు మంత్రికి సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని తోసివేయడంతో..ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేసి ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

16:38 - October 3, 2015

విజయవాడ : రాజధాని ప్రాంతంలో రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రజాసమస్యలపై విజయవాడలో సీపీఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజధాని ప్రాంత ప్రజల పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసినట్లు సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు తెలిపారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. 

16:36 - October 3, 2015

హైదరాబాద్ : జూన్‌ 2017 కల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తరలివచ్చిన వారికే స్థానికత కల్పించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు సీఎం చంద్రబాబును కలిశారు. పీఆర్సీ, ఉద్యోగుల తరలింపు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగులు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న వారికి కొంత వెసులుబాటు కల్పించాలన్నారు. అమరావతి ప్రాంతంలోని ఉద్యోగులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలని సీఎంని కోరినట్లు సమాచారం. 

16:34 - October 3, 2015

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రి కామినేని, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు ఉన్నారు. అలాగే త్వరలోనే ఏపి ఎక్స్ ప్రెస్‌ను విజయవాడ మీదుగా తిరుపతి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపామని వెంకయ్య తెలిపారు.

16:31 - October 3, 2015

హైదరాబాద్ : రుణమాఫీని వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేసేంతవరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. జలదృశ్యంపై అసెంబ్లీలో సినిమా చూపిస్తానన్న కేసీఆర్‌...ముందు రైతు ఆత్మహత్యల నివారణపై అసెంబ్లీలో చిత్రాన్ని చూపించాలన్నారు. ఆ తర్వాతే జలదృశ్యం చిత్రాన్ని చూపించాలని ఆమె కోరారు. 

16:29 - October 3, 2015

హైదరాబాద్ : కొన్నిరోజులుగా ఉక్కపోతతో ఉడుకెత్తిస్తున్న నగరాన్ని చినుకు పలకరించింది. ఆ పలకరింపు అలా ఇలా కాకుండా కుమ్మరించేసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లపైకి నీరు వచ్చి పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. శివారు ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో నీరు చేరడంతో జలమయమయ్యాయి.

ఏపీ రాజధాని శంకుస్థాపనకు కమిటీల నియామకం

విజయవాడ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం నాలుగు కమిటీలను నియమించాలని సమావేశంలో బాబు నిర్ణయించారు. మంత్రి నారాయణ నేతృత్వంలో ఆర్గనైజింగ్ కమిటీ, ప్రొటోకాల్ డైరెక్టర్ నేతృత్వంలో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేదిక కమిటీ, పరకాల ఆధ్వర్యంలో సాంస్కృతిక, మీడియా కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు.

దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల చివరివారంలో ఆయన దక్షిణకొరియా పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని తెలిసింది. అయితే పర్యటన ఎప్పటి నుంచి, ఎన్నిరోజులుంటుంది తదితర విషయాలు వెల్లడి కావల్సి ఉంటుంది. అంటే దానిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

సుందరిగిరి వద్ద రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

కరీంనగర్: చిగురుమామిడి మండలం సుందరిగిరి వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సిఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

స్వైన్ ఫ్లూ తో మహబూబ్ నగర్ జిల్లా వాసి మృతి

మహబూబ్‌నగర్: ఆలంపూర్ మండలం క్యాతూర్ గ్రామంలో శివకుమార్ (28) అనే యువకుడు స్వైన్‌ఫ్లూ బారిన పడి మృతిచెందాడు. గత మూడు రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండగా ఆయనను కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. శివకుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్‌ఫ్లూగా నిర్దారించారు. ఈ క్రమంలో ఇవాళ ఉయదం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్రాజధాని నగరం హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, చందానగర్‌, మాదాపూర్, కూకట్‌పల్లిలో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరవాసులకు వర్షాలు ఆహ్లాదానిచ్చినా, ట్రాఫిక్‌తో మాత్రం నరకం అనుభవిస్తున్నారు. పలు చోట్ల ఓపెన్ నాలాలు ఉండడంతో చినుకు పడితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

బ్యాంక్ మేనేజర్ పేరుతో ఘరానా మోసం...

నెల్లూరునగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీలో ఘరానా మోసం జరిగింది. గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ ఖాతాదారుడి నంబర్‌కు ఫోన్ చేసి మేనేజర్‌నంటూ ఓ వ్యక్తి  నమ్మపలికాడు. అకౌంట్‌కు సంబంధించి సమస్య ఉందని, పిన్ నంబర్ చెప్పాలని మాట్లాడాడు. దీంతో నిజమేనని నమ్మిన ఖాతాదారుడు ఏటీఎం పిన్‌ నెంబర్‌ చెప్పాడు. అతడు అకౌంట్ చెక్ చేసుకోగా రూ.36 వేలు డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో ఫోన్ ఫేక్ కాల్‌గా తేలిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌కాల్‌ గుజరాత్‌ నుంచి వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

నేరేడ్‌మెట్‌ చోరీ ఘటనలో కొత్తకోణం...

హైదరాబాద్ : నగరంలోని నేరేడ్‌మెట్‌లో జరిగిన చోరీ ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బాధితుడే గాయపర్చుకుని బంగారం చోరీకి గురైనట్టు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం కాజేసేందుకు నాటకం ఆడినట్టు అనుమానిస్తున్నారు. మోహన్ గత కొంతికాలంగా స్థానికంగా ఉంటున్న జ్యువెలరీ షాపుల్లో బంగారం తీసుకుని నగలు తయారు చేస్తుండేవాడు. ఇదే క్రమంలో నిన్న సాయి బాలాజీ దుకాణంలో కొంత బంగారాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఇద్దరు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ బంగారాన్ని మోహనే కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

15:33 - October 3, 2015

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా భారీగా విద్యావాపారం జరుగుతోందని ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి అన్నారు. కార్పొరేట్ విద్య- పరిణామాలు అనే అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో దేవితో పాటు సైక్రియాటిస్ట్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీనికి కారణాలు ఏమిటి? విద్య కార్పొరేట్ చేతుల్లోకి పోకుండా ప్రభుత్వమే విద్యను ఎందుకు అందించలేకపోతోంది. ఇత్యాది అంశాలపై చర్చ జరిగింది. ఏఏ అంశాలపై వారు చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న 400 మంది అరెస్ట్...

హైదరాబాద్ : నగర పరిధిలో టికెట్ లేకుండా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న 400 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

నేరేడ్ మెట్ చోరీ ఘటనలో కొత్త కోణం...

హైదరాబాద్ : నగరంలోని నేరేడ్‌మెట్‌లో జరిగిన చోరీ ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బాధితుడే గాయపర్చుకుని బంగారం చోరీకి గురైనట్టు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం కాజేసేందుకు నాటకం ఆడినట్టు అనుమానిస్తున్నారు. మోహన్ గత కొంతికాలంగా స్థానికంగా ఉంటున్న జ్యువెలరీ షాపుల్లో బంగారం తీసుకుని నగలు తయారు చేస్తుండేవాడు. ఇదే క్రమంలో నిన్న సాయి బాలాజీ దుకాణంలో కొంత బంగారాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఇద్దరు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ బంగారాన్ని మోహనే కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తాం: గంటా...

గుంటూరు : ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా, నాలెడ్జ్ హబ్‌గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థపై గుంటూరులో జరిగిన సదస్సుకు ఆయనతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ హాజరయ్యారు. అక్షరాస్యత ప్రభావం అన్ని రంగాలపైన ఉంటుందని కోడెల అన్నారు. విద్యాశాఖ అధికారులు, విద్యారంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'పాలమూరు ఎత్తిపోతల'ను రెండేళ్లలో పూర్తి చేయాలి: కేసీఆర్

హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పారు. ఈ పథకంపై సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించారు. పంప్ హౌస్ లు, కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెల్స్ పనులు సమాంతరంగా జరగాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, హేమసముద్రం రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. రెండు వారాల్లో సర్వే పనులు పూర్తి చేసి టెండర్లు పిలవాలని, ప్రాజెక్టులపై ప్రతి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరపాలని పేర్కొన్నారు. పాలమూరు పథకం కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు.

15:10 - October 3, 2015

నెల్లూరు : మర్రిపాడు మండలం కుదిరినేనిపల్లిలో విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు లైన్‌మెన్లు మృతి చెందారు. విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు వేణు, శ్రీను, శ్రీనివాస్‌లుగా గుర్తించారు.

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు లైన్‌మెన్లు మృతి

నెల్లూరు : మర్రిపాడు మండలం కుదిరినేనిపల్లిలో విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు లైన్‌మెన్లు మృతి చెందారు. విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు వేణు, శ్రీను, శ్రీనివాస్‌లుగా గుర్తించారు.

15:08 - October 3, 2015

కరీంనగర్‌ : జిల్లాలో మరో రైతు అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన జగన్‌కు ఐదెకరాల పొలం ఉంది.. రెండేళ్లుగా నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోయాయి.. నిత్యావసరాలు, పిల్లల చదువుల భారంతో ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడింది.. ఈ ఇబ్బందులతో ఆవేదన చెందిన రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. 

15:07 - October 3, 2015

విశాఖ : ఆక్రమణదారులకు శుభవార్త అంటూ విడుదలచేసిన జీవో సర్కారుకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది.. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నవారు అధికారులకు షాక్ ఇచ్చారు.. క్రమబద్దీకరించుకోవాలంటూ విజ్ఞప్తిచేసినా కుదరదు పొమ్మన్నారు.. దీంతో గడువు మరింత పొడిగించారు అధికారులు.

ఆశించిన స్థాయిలో రాని స్పందన...

సర్కారు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌కు విశాఖవాసులనుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదు.. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నవారు వాటిని క్రమబద్దీకరించుకోవాలంటూ ఆగస్టులో ప్రకటించింది ప్రభుత్వం... 296 పేరుతో జీవో విడుదలచేసింది.. వందగజాలలోపు స్థలంఉన్నవారికి ఇది పరిమితమని.. గృహిణులపేరుతో ఇంటిపట్టా ఇస్తామని స్పష్టం చేసింది...

విశాఖలో 50 వేల ఆక్రమణలు ఉంటాయని అంచనా.....

ప్రభుత్వ సర్వే ప్రకారం విశాఖలో 50 వేల ఆక్రమణలు ఉంటాయని అంచనా. క్రమబద్దీకరణకు చాలా దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశించారు.. కానీ వారికి నిరాశే మిగిలింది.. 20శాతానికిమించి దరఖాస్తులు రాలేదు.. వంద అడుగులకంటే ఎక్కువ ఆక్రమించినవారు వివిధ కాలనీల్లో ఉన్నారు.. అందుకే క్రమబద్దీకరణకు పెద్దగా స్పందన రాలేదు.. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు... ఇప్పుడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు.. అయితే సింహాచలం అప్పన్న పరిధిలోని ఆక్రమణదారులను ఈ జివో పరిధిలోకి చేర్చలేదు.. దీంతో అక్కడ నివసిస్తున్నవారు అసంతృప్తికి గురయ్యారు..ఈ నవంబర్‌లోగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.. ఈ జీవోపై మరింత ప్రచారానికి సిద్ధమయ్యారు.. 

15:01 - October 3, 2015

హైదరాబాద్ : క్రికెట్ క్రేజీ భారత్ లో ...అతిపెద్ద ఫుట్ బాల్ లీగ్ రెండోసీజన్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇండియన్ సూపర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈటోర్నీని అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకూ..దేశంలోని ఏడు నగరాల వేదికల్లో నిర్వహించడాని రంగం సిద్ధం చేశారు. చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగే ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ అత్లెటికో డి కోల్ కతా, చెన్నయన్ ఫుట్ బాల్ క్లబ్ జట్లు ఢీ కొనబోతున్నాయి....

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తలదన్నే రీతిలో....

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో...అందరికీ క్రికెట్టే మతం. అయితే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తలదన్నే రీతిలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ 2015 సీజన్ పోటీలకు...చెన్నై నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకూ దేశంలోని ఏడు ప్రధాననగరాలలోని ఎనిమిదివేదికల్లో జరిగే ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ సమరంలో...మొత్తం ఎనిమిదినగరాలకు చెందిన ఫ్రాంచైజీజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తొలిసీజన్ చాంపియన్ అత్లెటికో డి కోల్ కతా , కేరళ బ్లాస్టర్స్, చెన్నయన్ ఫుట్ బాల్ క్లబ్, ఢిల్లీ, గోవా, నార్త్ ఈస్ట్, పూణే, ముంబై ఫుట్ బాల్ క్లబ్ జట్లు..అంతర్జాతీయ, జాతీయ, దేశవాళీ సాకర్ ప్లేయర్లతో కూడిన జట్లతో సమరానికి సిద్ధమయ్యాయి.

ప్రారంభవేడుకలకే ఐశ్వర్యా బచ్చన్ నృత్యం...

ఈ టోర్నీ ప్రారంభవేడుకలకే ఐశ్వర్యా బచ్చన్ నృత్యం , రెహ్మాన్ సంగీత కార్యక్రమం ప్రధాన ఆకర్షణకానున్నాయి. నాలుగేళ్ల విరామం తర్వాత ఐశ్వర్య నృత్యం ప్రదర్శన కావడంతో...ప్రారంభవేడుకల టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. 2014 సీజన్లో తొలిసారిగా నిర్వహించిన ఇండియన్ సూపర్ లీగ్ కు..కేవలం 55 కోట్ల రూపాయలు మాత్రమే స్పాన్సర్షిప్ ఆదాయం వచ్చింది. అయితే..2015 సీజన్లో..ఆ మొత్తం 100 కోట్ల రూపాయలకు పెరగటం విశేషం. వివిధ జట్ల జెర్సీలపై ముద్రించే లోగో మనీ సైతం 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెరగటంతో వివిధ ఫ్రాంచైజీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రారంభసీజన్ లీగ్ టేబుల్ టాపర్ గా ..చెన్నై 23 పాయింట్లతో నిలిస్తే...సౌరవ్ గంగూలీకి చెందిన అత్లెటికో డి కోల్ కతా జట్టు విజేతగా ట్రోఫీ అందుకొంది.

61 మ్యాచ్ ల్లో 129 గోల్స్ నమోదు కావడం....

మొత్తం 61 మ్యాచ్ ల్లో 129 గోల్స్ నమోదు కావడం మరో రికార్డు. జాన్ సెడా, ఫిక్రూ, ఎలానో, జాన్ స్టోతాంజీ, సునీల్ చెత్రీ, సందేశ్ జింగాన్, లూయి గార్షియా, ఫ్రెడ్డీ జుంగ్ బెర్గ్ లాంటి ఆటగాళ్లు...తొలిసీజన్ టోర్నీకే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మరి..2015 సీజన్ పోటీల్లో మరెన్ని రికార్డులు, అద్భుతాలు నమోదవుతాయో..వేచిచూడాల్సిందే..

14:57 - October 3, 2015

హైదరాబాద్ : దీపావళికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. కాని బాలీవుడ్‌లో అప్పుడే దివాళి వచ్చేసింది. ఒక్క బాలీవుడ్డే కాదు యావత్‌ సినీ ప్రేక్షకుల్లో ఇప్పుడే దివాళి మతాబులు వెలుగుతున్నాయి. 25 సంవత్సరాల క్రితం ప్రేమపావురమై ఎగిరి దేశాన్ని ఊపేసిన ప్రేమ్ మళ్లీ వస్తున్నాడు. ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయోతో ప్రేమికుడిగా మళ్లీ రొమాన్స్‌ పండించబోతున్నాడు ఖాన్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్.

ఒక మైనే ప్యార్ కియా..

1989లో యంగ్‌ డైరెక్టర్‌ సూరజ్‌ బరజాత్య, సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన మైనేప్యార్‌కియా సినిమా దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాలో ప్రేమ్‌ పాత్రలో సల్మాన్‌ యూత్‌ మనసులో ఫిక్స్‌ అయిపోయాడు. సిల్వర్‌ జూబ్లీ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై వచ్చినా రిమోట్‌ కంట్రోల్‌ ఆ ఛానల్‌పైనే ఆగిపోతుంది. ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది.

1994లో మళ్లీ సూరజ్‌ బరజాత్య......

ఆ తరువాత 1994లో మళ్లీ సూరజ్‌ బరజాత్య, సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌ సిల్వర్‌ జూబ్లి సినిమాను అందించింది. స్టార్‌ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌తో కలిసి నటించిన హమ్‌ ఆప్‌కే హే కౌన్‌ సినిమా సల్మాన్‌ను స్టార్‌ను చేసింది. ఈ సినిమాతో లవర్‌ బాయ్‌గానే కాకుండా సకుటుంబ సపరివారానికి సల్మాన్‌ చేరువయ్యడు. ఇందులోను సల్మాన్‌ ప్రేమ్‌గానే నటించాడు .

హమ్‌ సాథ్ సాథ్‌ హే సినిమాలోను ప్రేమ్‌గా.....

ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లోనే 1999లో వచ్చిన హమ్‌ సాథ్ సాథ్‌ హే సినిమాలోను ప్రేమ్‌గా, సైలెంట్‌ లవర్‌బాయ్‌గా నటించిన సల్మాన్‌కు స్టార్‌డమ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇక సినిమాతో సూరజ్‌ బరజాత్య, సల్మాన్‌ కాంబినేషన్‌ బాలీవుడ్‌లో బంపర్‌ హిట్‌గా నిలిచిపోయింది. మూడు సినిమాలతో లైఫ్‌ టైమ్ మెమోరీని అందించిన వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. అదే ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో హై ఎక్సెపెక్టేషన్సే ఉన్నాయి.

రాచరిక నేపథ్యం..కుటుంబ నేపథ్యంతో పాటు లవ్‌.....

జుడువా తరువాత సల్మాన్‌ఖాన్‌ ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయోలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. రాచరిక నేపథ్యం..కుటుంబ నేపథ్యంతో పాటు లవ్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని అమాంతం పెంచేసింది. అంతే కాదు ఈ సినిమాతో సోనమ్‌ కపూర్‌ ఫస్ట్ టైమ్‌ సల్మాన్ పక్కన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది.

డైరెక్టర్‌ సూరజ్‌ బరజాత్య ఈ సినిమాలోనూ.....

కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత నిచ్చే డైరెక్టర్‌ సూరజ్‌ బరజాత్య ఈ సినిమాలోనూ ఫ్యామిలీ సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువగానే పండించినట్టు తెలుస్తోంది. అంతే కాదు మైనేప్యార్‌కియా నుంచి హమ్‌ సాథ్‌ సాథ్‌హే వరకు సల్మాన్‌ కుటుంబ సభ్యులుగా నటించిన రీమ లాగు, మోనిష్‌ బేల్‌, అలోక్‌ నాథ్‌ వంటి సినియర్‌ నటులు ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయోలో సెంటిమెంట్‌ను పండించబోతున్నారు. నవంబర్‌ 12 దీపావళి రోజు రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా మరో లైఫ్‌ టైమ్‌ మెమోరిని అందిస్తుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

14:49 - October 3, 2015

హైదరాబాద్ : ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ షూటింగ్ స్పీడందుకుంది. శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్‌తో ఐటెమ్‌సాంగ్‌ చిత్రీకరణ మొదలైంది.  లక్ష్మీరాయ్‌ ఇరగదీసే స్టెప్స్‌తో పవన్‌ని అలరించిందని టాక్. ఈ సాంగ్‌కు సంబంధించి కొన్ని స్టిల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఖాకీ డ్రెస్‌, రెడ్ టవల్, చేతికి గుబాలించే మల్లెలతో పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం నానక్ రామ్‌గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ సెట్టింగ్ అదుర్స్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే లక్ష్మీరాయ్‌ సాంగ్ ఏ మేరకు సినిమాకు ఉపయోగపడుతుందో  చూడాలి

కొమరం భీం వర్ధంతి ఏర్పాట్లపై సమీక్ష...

ఆదిలాబాద్కొమరం భీం వర్ధంతి ఏర్పాట్లపై మంత్రి జోగు రామన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. జోడేఘాట్‌లో అధికారులతో మంత్రి జోగు రామన్న చర్చించారు. ఈనెల 20లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

 

జల విధానంపై కాదు..రైతు ఆత్మహత్యలపై చెప్పు:డీకే అరుణ

హైదరాబాద్ : జల విధానంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని అన్నారు. ఈ ఏడాది కాలంలో రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో అసెంబ్లీలో అందరం చూద్దామని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసేంతవరకు సభాకార్యక్రమాలను జరగనివ్వమని ఆమె స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై ఉభయసభలను కలిపి సంయుక్త సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

నాగోల్ లో చైన్ స్నాచర్లు....

హైదరాబాద్ : నాగోల్ లో దారుణం జరిగింది. కృషీనగర్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. సుశీల అనే మహిళ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. మహిళను గాయపరిచి చైన్ లాక్కొని దొంగలు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మగపిల్లలు లేరని కూతుర్ని చంపిన తండ్రి..

మెదక్: పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో దారుణం జరిగింది. మగపిల్లలు లేరన్న కారణంగా రెండేళ్ల చిన్నారిని కన్నతండ్రి ధన్‌రాజ్ కొట్టి చంపాడు. ఈ అమానవీయ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ధన్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

డీసీఎం-టిప్పర్ ఢీ : డ్రైవర్ మృతి

హైదరాబాద్ : బొమ్మలరామారం నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో టిప్పర్ డ్రైవర్ కాశమియ(45) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంద్రాణి మరో మూడు రోజు ఆస్పత్రిలోనే

హైదరాబాద్: సంచలనం రేపిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ మరో 3 రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు వెల్లడించారు. ఆర్థర్ రోడ్డులోని జైలో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ శుక్రవారం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

కొరియోగ్రాఫర్ గా దేవీశ్రీ ప్రసాద్..

హైదరాబాద్ : సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫాంలో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ మరో కొత్త అవతారం ఎత్తుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలకు సంగీతం అదించటంతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తున్న దేవీ తాజాగా కొరియోగ్రాఫర్ గా మారాడు. 

ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్ డైరెక్టర్ల పై బదిలీ వేటు..

 హైదరాబాద్ : ఏపీ ఎక్సైజ్ శాఖలో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే ఈ శాఖలోని ఓ అధికారి మొత్తం ఆ శాఖనే తన గుప్పిట్లో పెట్టుకుని నవ్రాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పి ఉద్యోగుల వద్ద నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేశారు. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను దారిలో పెట్టాలని ఆయన అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. 

13:46 - October 3, 2015

విజయనగరం : పార్వతీపురంలో ఎస్ ఎఫ్ ఐ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఐటిడిఎ పాలకవర్గ సమావేశం జరుగుతుండగా గిరిజన విద్యార్థుల సమస్యలపై కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు.

 

13:43 - October 3, 2015

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహం తొలగించేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ పార్కులో వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కాకాకు కేటాయించిన స్థలంలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అంబేద్కర్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే... ధ్వసం చేస్తామని హెచ్చరించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

 

13:39 - October 3, 2015

కృష్ణా : జిల్లాలోని నందిగామలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ మృతి చెందింది. ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. నందిగామకు చెందిన కరీమున్నా అనే మహిళ అనారోగ్యంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్న కరీమున్నాకు ఆక్సిజన్ అందించకుండా... వైద్యులు నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు. కరీమున్నా మృతికి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

 

ట్యాంక్ బండ్ అంబేద్కర్ పార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహం తొలగించేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. 

కృష్ణా జిల్లా నందిగామలో దారుణం...

కృష్ణా : జిల్లాలోని నందిగామలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. అయితే మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆమె బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. 

జీహెచ్ ఎంసీ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద జీహెచ్ ఎంసీ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మాజీ మంత్రి భర్తపై కబ్జా ఆరోపణలు ఉన్నాయి. 

13:13 - October 3, 2015

హైదరాబాద్ : బాక్సాఫీస్‌పై పవర్‌ ఫుల్‌ పంచ్‌లు విసిరేందుకు సిద్ధమవుతోంది రామ్‌చరణ్‌ బ్రూస్లీ. అయితే.. ఇంతలోనే రింగులోకి ఎంటరైంది రామ్‌గోపాల్‌ వర్మ బ్రూస్లీ..! రెడీ టూ ఫైట్‌ అంటూ సవాల్‌ చేస్తోంది. మరి, ఇంతకీ ఏ బ్రూస్లీ పవర్‌ చూపుతుంది..? అసలు వర్మ బ్రూస్లీ సంగతేంటి..??
అందరికీ షాక్‌ ఇచ్చిన వర్మ
బాక్సాఫీస్‌ దగ్గర రచ్చ చేసేందుకు బ్రూస్‌లీగా మారాడు రామచరణ్‌. ఇవాళ ఆడియో ఫంక్షన్‌ జరుపుకున్న ఈ చిత్రం.. ఈ నెల 16న వెండితెరపై సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. మెగాస్టార్‌ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుండడంతో కావాల్సినంత హైప్‌వచ్చేసింది రామ్‌చరణ్‌ బ్రూస్లీకి. అయితే.. ఈ సమయంలో అందరికీ షాక్‌ ఇచ్చాడు రామ్‌గోపాల్ వర్మ. తానూ ఒక బ్రూస్లీకి ప్రాణం పోశానని, అదికూడా సిల్వర్‌ స్క్రీన్‌పై పంచ్‌లు విసిరేందుకు సిద్ధమవుతోందని ప్రకటించాడు వర్మ. ఎప్పుడు మొదలు పెట్టాడో..? ఎంతవరకు వచ్చిందో తెలీదు కానీ..? ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశాడు ఆర్జీవీ. అయితే.. పేరు బ్రూస్లీ అని పెట్టుకున్నప్పటికీ.. ఈ ట్రైలర్‌లో పోరాటాలు చేస్తున్నది మాత్రం ఓ యువతి.
గత జ్ఞాపకాలను నెమరువేసుకున్న వర్మ
ఈ సినిమా గురించి మాట్లాడిన వర్మ.. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. బ్రూస్లీ నటించిన ఎంటర్‌ ద డ్రాగన్‌ సినిమా తనకు పిచ్చెక్కించిందన్న వర్మ.. ఆ చిత్రాన్ని 17 సార్లు చూశానని చెప్పారు. ఆ తరువాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాన్నైతే.. 23 సార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఎంతో మందికి బ్రూస్లీ ప్రేరణగా నిలిచారని చెప్పిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఆ కారణాలతో తన బ్రూస్లీ సినిమా కథను తయారు చేసుకున్నట్టు చెప్పాడు.
ఎవరి బ్రూస్లీ సత్తాచాటబోతోంది..?
అయితే.. రామ్‌చరణ్‌ బ్రూస్లీ రిలీజ్‌ కాబోతుండగానే తన బ్రూస్లీని ఎందుకు రంగంలోకి దించాడన్నది మాత్రం వర్మ చెప్పలేదు. మొత్తానికి తన.. మార్క్‌ కాంట్రవర్సీని మరోసారి ప్రూవ్‌ చేశాడు వర్మ. మరి, ఎవరి బ్రూస్లీ సత్తాచాటబోతోంది..? బాక్సాఫీస్‌ను షేక్‌ చేయబోయేది రామచరణ్‌ బ్రూస్లీనా..? లేక రామ్‌గోపాల్ వర్మ బ్రూస్లీనా..? అన్నది సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే...

 

హైదరాబాద్ నేరేడ్ మెట్ లో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్ : నగరంలోని నేరేడ్ మెట్ లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. శ్రీసాయి బాలాజీ జ్యూయలరీ షాపులో దొంగలు.. వ్యాపారి మోహన్ నోట్లో యాసిడ్ పోసి 10తులాల బంగారం చోరీ చేశారు. 

12:50 - October 3, 2015

హైదరాబాద్ : నగరంలోని నేరేడ్ మెట్ లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. శ్రీసాయి బాలాజీ జ్యూయలరీ షాపులో దొంగలు.. వ్యాపారి మోహన్ నోట్లో యాసిడ్ పోసి 10తులాల బంగారం చోరీ చేశారు. నిన్న మధ్యాహ్నం ఘటన జరగగా... ఇవాళ ఆలస్యంగా వెలుగూ చూసింది.

 

12:45 - October 3, 2015

విజయవాడ : రాజధాని ప్రాంతంలోని స్థానికులు అభివృద్ధి చెందాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యదర్శివర్గం సభ్యులు బాబురావు అన్నారు. ఈమేరకు రాజధాని ప్రాంతంలోని సమస్యలపై విజయవాడలో సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో రైతులు, కార్మికులు, రియల్ ఎస్టేట్స్, స్థానికులు అభివృద్ధి ముఖ్యం తప్ప.. విదేశీయల అభివృద్ధి ముఖ్యం కాదన్నారు. రాజధాని గ్రీన్ బెల్టు పేరుతో ఉన్న వాటిని మార్చాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి 'రాజధాని ప్రజా వేదిక' ఏర్పాటు చేశారు. ఈనెల 5 నుంచి 13 వరకు 58 మండలాలతోపాటు ముఖ్యమైన పట్టణాల్లో రౌండ్ టేబుల్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 16న విజయవాడలోని సీఆర్ డీఏ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ లోపు ఏరియాలలో సమావేశాలు నిర్వహించాలన్నారు.

 

12:38 - October 3, 2015

చిత్తూరు : జిల్లాలోని చౌడేపల్లి మండలం కాటనేరి వద్ద స్కూల్ వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో 30మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఉదయం పిల్లలను ఎక్కించుకొని.. స్కూలుకు వెళ్తుండగా.. వ్యాను అదుపుతప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. 

ఆంధ్ర-కర్నాటక సరిహద్దు వద్ద ఉద్రిక్తత

అనంతపురం : జిల్లాలోని ఆంధ్ర-కర్నాటక సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సువర్ణముఖి నదిపై ఉన్న గోడను తొలగించేందుకు కర్నాటక అధికారుల యత్నించగా... ఆంధ్రా రైతులు వారిని ఆడ్డుకున్నారు. 

12:10 - October 3, 2015

అనంతపురం : జిల్లాలోని ఆంధ్ర-కర్నాటక సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సువర్ణముఖి నదిపై ఉన్న గోడను తొలగించేందుకు కర్నాటక అధికారుల యత్నించగా... ఆంధ్రా రైతులు వారిని ఆడ్డుకున్నారు. గోడను తొలగిస్తే.. తమ ప్రాంతానికి నీళ్లు రావని వారు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.

12:05 - October 3, 2015

ఉత్తరప్రదేశ్ : ఫరూఖాబాద్‌ లో కలకలం చెలరేగింది.. రైల్వే స్టేషన్లో బాంబులాంటి అనుమానాస్పదన వస్తువు దర్శనమిచ్చింది.. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.. ఆ వస్తువును పరిశీలించిన పోలీసులు అందులో ఎలక్ట్రిక్ సర్క్యూట్‌, టైమర్లున్నాయని గుర్తించారు. బాంబ్‌ స్క్వాడ్‌ బృందంతో కలిసి ఆ వస్తువును తనిఖీ చేస్తున్నారు.

11:58 - October 3, 2015

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. బదాన్ నగర్ లోని ఓ ఓటింగ్ కేంద్రంలో.. కొందరు ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. లాఠీఛార్జ్ చేశారు. మరో ఘటనలో తృణముల్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

 

11:53 - October 3, 2015

వరంగల్ : నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తుపాకులమోతలేని రాష్ట్రాన్ని చూడటమే తమలక్ష్యమని స్పష్టంచేశారు. ఈమేరకు వరంగల్ మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని... ఆదిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్ని పసలేని ఆరోపణలు చేస్తున్నాయిని మంత్రి చెప్పారు. ఉనికి కోసమే జెండాను పక్కనబెట్టి ఒక్కటయ్యారని విమర్శించారు. అధికారం కోల్పోయేసరికి అసహనం ఎక్కువైందన్నారు. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగితే.. చిన్న సూచన కూడా చేయకపోవడం దారుణమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. 15 నెలల్లో ఏం చేశామో తాము ఉప ఎన్నికల్లో చెప్తామని పేర్కొన్నారు. 60 ఏళ్లల్లో ఏం చేశారో వాళ్లు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఎఎస్ ల విభజనకు ఇంత సమయం తీసుకున్న కేంద్రం తెలంగాణకు చేసిందేమీలేదని విమర్శించారు.

 

11:45 - October 3, 2015

పశ్చిమగోదావరి : కాకినాడ ఎంపీ తోట నర్సింహం బ్యాంక్ ఖాతా నుంచి రూ.50వేలు మాయమయ్యాయి. క్లోనింగ్ ద్వారా ఆయన డెజిట్ కార్డ్ నుంచి సైబర్ నేరగాళ్లు గోవాలో డబ్బులు డ్రా చేశారు. విషయం తెలుసుకున్న ఆయన... ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

11:41 - October 3, 2015

వరంగల్ : హన్మకొండలోని పోచమైదాన్, సిద్ధార్థ నగర్ కేయూసీ ఎక్స్ రోడ్, ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి బంగారం గొలుసులు ఎత్తుకెళ్లారు. ఊర్మిళ అనే మహిళ నుంచి 5తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. 

11:37 - October 3, 2015

హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రెండురోజుల క్రితమే రాజధానిలో తమ ప్రతాపం చూపిన స్నాచర్లు ఇవాళ వనస్థలీపురంలో ఓ మహిళ నుంచి 4తులాల గొలుసు లాక్కెళ్లారు. ఇంటి ముందు పూలు కోస్తున్న సమయంలో... బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు... వెనక నుంచి వచ్చి గొలుసు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 

హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల కలకలం...

హైదరాబాద్ : నగరంలో చెన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రెండురోజుల క్రితమే రాజధానిలో తమ ప్రతాపం చూపిన స్నాచర్లు ఇవాళ వనస్థలీపురంలో ఓ మహిళ నుంచి 4తులాల గొలుసు లాక్కెళ్లారు. 

ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు : కేటీఆర్

వరంగల్ : ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్ని పసలేని ఆరోపణలు చేస్తున్నాయిని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈమేరకు వరంగల్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉనికి కోసమే జెండాను పక్కనబెట్టి ప్రతిపక్షాలన్ని ఒక్కటయ్యారని విమర్శించారు. అధికారం కోల్పోయేసరికి అసహనం ఎక్కువైందన్నారు. 

హన్మకొండలో చైన్ స్నాచింగ్

వరంగల్ : హన్మకొండలోని పోచమైదాన్, సిద్ధార్థ నగర్ కేయూసీ ఎక్స్ రోడ్, ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి బంగారం గొలుసులు ఎత్తుకెళ్లారు.  

10:35 - October 3, 2015

విశాఖ : డుంబ్రిగూడ మండలం లాపేరులో గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంది పంట విషయంలో గొడవ చోటుచేసుకుంది.

ఎంపీ తోట నర్సింహం డెబిట్ కార్డు క్లోనింగ్

కాకినాడ : ఎంపీ తోట నర్సింహం డెబిట్ కార్డు క్లోనింగ్ జరిగింది. నర్సింహ ఖాతా నుంచి రూ.50 వేలను దుండగులు కాజేశారు.

09:35 - October 3, 2015

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, నడకదారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.

గిరిజనుల మధ్య ఘర్షణ.. ఇద్దరి మృతి

విశాఖ : డుంబ్రిగూడ మండలం లాపేరులో గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంది పంట విషయంలో గొడవ చోటుచేసుకుంది. 

విద్యుత్ షాక్ తో ముగ్గురు లైన్ మెన్లు మృతి

నెల్లూరు : మర్రిపాడు మండలం కుదిరినేనిపల్లిలో విద్యుత్ షాక్ తో ముగ్గురు లైన్ మెన్లు మృతి చెందారు. విద్యుత్ లైన్లు మమ్మత్తులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వేణు, శ్రీను, శ్రీనివాస్ లుగా గుర్తించారు. 

 

 

08:33 - October 3, 2015

సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు టిడిపి నేత విద్యాసాగర్ రావు, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, బిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్ హామీలు ఘనంగా ఉన్నాయని.. అమలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అలాగే కేంద్రప్రభుత్వ పనితీరుపై చర్చించారు. అధికారంలోకి వస్తే.. నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానన్న ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. భారతదేశంలో నల్లధనం ఇతర దేశాలకు పెట్టుబడులుగా వెళుతోందని ఆరోపించారు. నల్లధనాన్ని తీసుకురాకపోగా ఉన్న ధనం కూడా ఇతర దేశాలకు వెళ్లిపోతోందని పేర్కొన్నారు. దేశంలోకి పెట్టుబడుల రూపంలో అక్రమ పంపద వస్తోందని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఎవరూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు 'అనంత' జిల్లాలో కేఈ.కృష్ణమూర్తి పర్యటన

అనంతపురం : ఎపి డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి నేడు అనంతపురంలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

07:58 - October 3, 2015

ధర్మశాల : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ- 20 మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ , సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది. టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 లీడ్‌కు చేరుకున్నారు.
ఉత్కంఠగా తొలి టీ-20 మ్యాచ్‌
ధర్మశాలలో ఉత్కంఠగా సాగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్‌పై- సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో రెండు బంతులుండగానే సఫారీలు విక్టరీ కొట్టేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరులుగు చేసింది. రోహిత్‌ శర్మ సెంచరీతో కథం తొక్కాడు. 66 బంతుల్లో 5 సిక్స్‌లు, 12 ఫోర్లతో 106 పరుగులు చేశాడు.
కోహ్లీ 43 పరుగులు
శిఖర్‌ ధవన్‌ నిరాశపరిచినా.. రోహిత్‌తో కలిసి కోహ్లీ 43 పరుగులు సాధించాడు. తర్వాత వచ్చిన రైనా 14, ధోనీ 20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.
చెలరేగిన డుమినీ
సఫారీ బౌలర్లలో అబాట్‌ రెండు, మోరీస్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. మొదట్లో ఆచి తూచి ఆడింది. ఓపెనర్లు ఆమ్లా, డివిలియర్స్‌ బలమైన పునాది వేశారు. ఆమ్లా 36 పరుగులు చేయగా.. డివిలియర్స్‌ 32 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. వీరి తర్వాత వచ్చిన డుమినీ, బిహర్డియన్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశారు. ముఖ్యంగా డుమినీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 7 సిక్స్‌లు 1 ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. బిహర్డియన్‌ 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు. డుమినీ, బిహర్డియన్‌ ఇద్దరూ 4వ వికెట్‌కు 54 బాల్స్‌లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మరో రెండు బాల్స్‌ ఉండగానే.. కేవలం మూడు వికెట్లు కోల్పోయి సఫారీలు విజయం సాధించారు.
డుమినికి ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌
భారత బౌలర్లలో అశ్విన్‌ , అరవింద్‌ చెరో వికెట్‌ తీశారు. మ్యాచ్‌ విజయంలో కీలకంగా వ్యవహరించిన డుమినికి ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ లభించింది.

 

07:43 - October 3, 2015

ముంబై : షీనా బోరా కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురయ్యింది. షీనా బోరా తల్లి.. కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా బైకుల్లా జైలులో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు కేసు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇంద్రాణి ఆత్మహత్యాయత్నంపై పలు అనుమానాలు
షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో అధికారులు వెంటనే ఆమెను ముంబయి జేజే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కస్టడీలో ఉన్న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అయితే బైకుల్లా జైలులో కస్టడీలో ఉన్న ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కోమాలో ఇంద్రాణి
మరోవైపు ఇంద్రాణి కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఏ తరహా మాత్రలు తీసుకున్నారో అని వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంద్రాణి పరిస్థితి సీరియస్‌గా ఉందని, మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని జేజే ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సీబీఐ విచారణ
కాగా ఈ కేసు దర్యాప్తును ఇప్పిటికే సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులపై సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంద్రాణీ, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, అప్పటి వారి కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటురామ్ రాయ్ లు కస్టడీలో ఉన్నారు. అయితే, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2012, ఏప్రిల్ 24న షీనాబోరా హత్యకు గురైన విషయం విధితమే.

 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో షర్మిల పర్యటన...

ఆదిలాబాద్ : వైసిపి నాయకురాలు వైఎస్ షర్మిల నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమో పాల్గొననున్నారు. 

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు గుంటూరు జిల్లాలో మంత్రి గంటా పర్యటన

గుంటూరు : మంత్రి గంటా శ్రీనివాస్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అధికారులతో కొత్త విద్యావిధానంపై గంటా సమీక్ష చేయనున్నారు. 

నేడు మహబూబ్ నగర జిల్లాలో టీఅసెంబ్లీ స్పీకర్ పర్యటన

మహబూబ్ నగర్ : టీఅసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.  నల్లమల, చెంచుగ్రామాల్లో స్పీకర్ పర్యటించనున్నారు. 

07:24 - October 3, 2015

కరీంనగర్‌ : జిల్లాలో వేములవాడ మండలం అగ్రహారంలో వాటర్‌ గ్రిడ్‌ పథకానికి పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాసన చేశారు. 1100 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ వాటర్‌ గ్రిడ్‌ పథకంతో వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి నియోజక వర్గ ప్రజలకు రక్షిత మంచినీరు అందుతుందన్నారు.
వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
తెలంగాణలోని సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 20 రోజుల వ్యవధిలో దాదాపు 12 వేల 800 మరుగుదొడ్లను నిర్మించిన ఘనత సిరిసిల్లదేనని కేటీఆర్‌ అన్నారు. ఇది దేశంలోనే రికార్డని చెప్పారు. సిరిసిల్ల స్వచ్ఛ నియోజకవర్గంగా గుర్తింపుపొందిందన్నారు. హరీష్‌రావు సైతం సిద్దిపేటలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారని కేటీఆర్‌ తెలిపారు. ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే పల్లెలు బాగుపడుతాయని చెప్పారు. తెలంగాణలోని మిగతా 117 నియోజకవర్గాల్లోనూ వందశాతం మరుగుదొడ్లను నిర్మింపచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలు ముందుకొస్తే.. 50 శాతం డబ్బులు ముందుగా చెల్లిస్తామని కేటీఆర్‌ చెప్పారు. వేములవాడలో జరిగిన ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబు, కరీంనగర్‌ జిల్లా ఎంపీ వినోద్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, మేయర్‌ రవీందర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

 

 

07:14 - October 3, 2015

గుంటూరు : స్వయంగా ముఖ్యమంత్రే చెత్త ఊడ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చీపుర్లు పట్టారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌... స్వచ్ఛ భారత్‌ అంటూ నినదించారు. స్వచ్ఛ సంకల్పంతో మహాత్ముడి పుట్టినరోజు సాక్షిగా... ఏపీ పెద్దలు చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చారు. పరిసరాల్ని శుభ్రం చేశారు. స్వర్ణాంధ్ర కోసం అహర్నిశలు కృషిచేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వాములై రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన పిలుపు ఇచ్చారు. దేశాభివృద్ధిలో పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని చంద్రబాబు అన్నారు.
ఆదర్శవంతంగా ప్రతి గ్రామం
స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనకు ప్రతినబూని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నా... తనను ఆశీర్వదించండని ఆయన ప్రజలను కోరారు. అలాగే విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత పెరగాలని విద్యార్ధులకు సూచించారు.
పాల్గొన్న మంచులక్ష్మీ
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త మంచులక్ష్మీ పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జీజీహెచ్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. జీజీహెచ్‌ అభివృద్ధిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో ఇటీవల పరిణామాలు తనను బాధించాయన్నారు. జీజీహెచ్‌ ప్రక్షాళన ప్రారంభించామన్నారు. కాంట్రాక్టర్లు పారిశుద్ధ్యాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేసే వైద్యులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వైద్యులు కానీ, సిబ్బంది కానీ డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రంలో 12 విద్యుదుత్పత్తి ప్లాంట్లు
రాష్ట్రంలో 12 విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 60 లక్షల మరుగుదొడ్లు అవసరముందన్నారు. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చును 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించేలా... కేంద్రానికి ప్రతిపాదనను పంపడం జరిగిందన్నారు. మురుగునీటి ద్వారా భూగర్భజలాలు కలుషితం కాకుండా ప్రణాళికలు రూపొందుస్తున్నామని ఆయన అన్నారు. 2019 అక్టోబర్ 2నాటికి క్లీన్ అండ్ గ్రీన్ రాష్ట్రంగా నవ్యాంధ్రను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చెప్పారు.

 

06:56 - October 3, 2015

హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒక హత్య లక్డికాపూల్ లో మరో హత్య బార్కాస్ లో చోటుచేసుకున్నాయి. ఈ హత్యలు నగరంలో కలకలం రేపాయి. ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం మృతుడు మహ్మద్ సాహెల్‌గా అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్న సాహెల్‌ను దుండగులు వెంబడించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో సాహెల్ కిందపడిపోయూడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురుగా ఉన్న సంధ్య రెస్టారెంట్‌లోకి పరుగులు తీశాడు. వెంటవచ్చిన దుండగులు రాడ్లతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయుపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, డీఐ ప్రకాశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బండిలోని డ్రైవింగ్ లెసైన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తున్నారు.
బార్కాస్‌ ప్రాంతంలో...
అటు బార్కాస్‌ ప్రాంతంలోనూ దారుణం జరిగింది. స్నేహితుల మధ్య తగాదా కత్తిపోట్లకు దారితీసింది. ఫలితంగా ఒకరు ప్రాణం విడవగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ గుర్రపు బగ్గీ విషయమై ముగ్గురు స్నేహితులు అలీ అఫారీ, ఇబ్రహీం, సాదిక్‌ ఘర్షణ పడ్డారు. వీరిలో అలీ అఫారీ కత్తితో ఇబ్రహీంను వీపులో కత్తితో పొడవగా, ఇబ్రహీం అదే కత్తితో అలీ అఫారీపై దాడికి ప్రయత్నించాడు. అడ్డొచ్చిన మరో యువకుడు సాదిక్‌ను కూడా కత్తితో పొడిచాడు. కాగా ఈ ఘటనలో అలీ అఫారీ మరణించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

 

నేడు వరంగల్ జిల్లాలో కడియం, కేటీఆర్ ల పర్యటన

వరంగల్ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ లు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయనున్నారు.  

Don't Miss