Activities calendar

04 October 2015

21:36 - October 4, 2015

ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధ్యమేనా ? కాంగ్రెస్ లో రఘువీరా ఒంటరేనా ? పాలక, ప్రతిపక్ష నేతలపై రఘువీరా మనోగతం ఏంటీ ? అంశాలపై టెన్ టివి 'వన్ టు వన్' విత్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మనోగతం వెల్లడించారు. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో చూడండి..

21:32 - October 4, 2015

ఉత్తర్ ప్రదేశ్ : దాద్రి బాధిత కుటుంబానికి మొదట ప్రకటించిన రూ.10లక్షల ఎక్స్ గ్రేషియాను ఏకంగా రూ.45లక్షలకు పెంచారు. లక్నోలో ఆక్లాక్ కుటుంబసభ్యులు సీఎం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలేష్ భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత యూపీలో మతసామర్యం దెబ్బతిన్నదని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో శివం, విశాల్ అనే ఇద్దరు యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 28వ తేదీన గోవును వధించి దాని మాంసం తిన్నారనే వదంతులతో విశాడ గ్రామానికి చెందిన 50 ఏళ్ల ఆక్లాక్ కుటుంబంపై 200 మంది స్థానికులు దాడి చేసి ఆక్లాక్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.  

21:25 - October 4, 2015

హైదరాబాద్ : అంబర్ పేట తహశీల్దార్ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆదివారం పబ్బుగా మార్చేశారు. మందు..విందుతో మజా చేశారు. ఇన్నాళ్లు తహశీల్దార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న అంటెండర్ రిటైర్ మెంట్ కావడంతో అతను అధికారులకు పార్టీ ఏర్పాటు చేశాడు. కార్యాలయంలోని ప్రాంగణంలో దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం పార్టీ చేసుకున్నారు. ఘుమ ఘుమలాడే నాన్ వెజ్ వంటకాలను కార్యాలయంలోనే వండారు. ఈ విషయం కాస్తా మీడియాకు పొక్కింది. దీనితో అక్కడకు మీడియా చేరుకోవడంతో అధికారులు పారిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. మందు..వంట సామాగ్రీని దాచేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

21:17 - October 4, 2015

హైదరాబాద్ : టీటీడీపీలో అసమ్మతి రాగం బహిరంగంగానే వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు.. తమకు దక్కిన పార్టీ పదవులపై అలకబూనారు. తెలంగాణలో సత్తా చాటాలనుకుంటున్న టీడీపీకి.. నేతల అసమ్మతి ఏ పరిణామాలకు దారి తీస్తాయో అనే కలవరం కార్యకర్తల్లో నెలకొంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీకి.. తెలంగాణలో అసమ్మతి రాగం బాహాటంగానే వినిపిస్తోంది. టీటీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ సీనియర్‌ నేతలు ఎర్రబెల్లి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణాయాదవ్‌లు డుమ్మా కొట్టారు. పార్టీలోని అగ్రనేతల అసంతృప్తికి ఇది నిదర్శనమన్న భావన వ్యక్తమవుతోంది.

ఎర్రబెల్లి అలక..
రేవూరు ప్రకాశ్‌రెడ్డికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం పట్ల.. టీడీపీ శాసన సభాపక్షం నేత ఎర్ర బెల్లి దయకరావు అసహనంగా ఉన్నట్లు సమాచారం. చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రేవూరికి కీలక పదవి ఎలా ఇస్తారన్నది ఆయన వాదన. ఇక పార్టీ సీనియర్ నాయకుడు ఇ.పెద్ది రెడ్డి, జాతీయ ఉపాధ్యక్ష పదవిని గరికపాటికి అప్పగించడంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు.. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు దక్కిన పార్టీ పదవిని సమర్ధంగా నిర్వర్తించ లేనంటూ అశక్తత వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం.

కృష్ణ యాదవ్ గుర్రు..
హైదరాబాద్‌ పార్టీ అధ్యక్ష పదవి మాగంటి గోపీనాథ్‌కు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గుర్రుగా ఉన్నారు. హైదరాబాద్‌లో బీసీలను తెలుగు దేశం దూరం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వర్గం కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ నేతకు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుంచి మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం పట్ల.. వారు గుర్రుగా ఉన్నారు.

బాబు ఆశలకు నేతల గండి..
ప్రమాణ స్వీకారోత్సవానికి.. తెలంగాణ నుంచి కార్యకర్తలు కూడా అతి పలుచగా వచ్చారు. నేతల అసంతృప్తే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. పనిచేసే వారిని కాదని.. సామాజిక సమీకరణతోనే పార్టీ కార్యవర్గం రూపొందిందని అసమ్మతి నేతలు అంటున్నారు. మొత్తానికి 2019 లో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న చంద్రబాబు ఆశలకు.. రాష్ట్ర నేతల అసమ్మతి సెగలు.. గండి కొట్టేలాగానే కనిపిస్తోంది. 

20:52 - October 4, 2015

ఖాకీ డ్రెస్ లు వేసుకున్న కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడం..లంచాల తీసుకుంటుండడం..వేధింపులకు గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ ఖాకీ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఆయన చేసేది ఉద్యోగం పోలీసే. కానీ టీచర్ అయిపోయాడు ఎలా అంటారా ? అయితే ఇది చదవండి.
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్..ఇక్కడ కొంతమంది పేద పిల్లలు పాపడ్స్ అమ్ముతుంటారు. ఈ దృశ్యం ధర్మపాల్ సింగ్ అనే కానిస్టేబుల్ కు కనిపించింది. వెంటనే తన మదిలో వెలిగిన ఐడియాను అమల్లో పెట్టేశాడు. కనీసం గంటసేపు పుస్తకం చేతబడితేనే ఈ చుట్టుపక్కల పాపడ్స్ అమ్ముకునేందుకు అనుమతిస్తానని ఆ పిల్లలకు షరతు పెట్టాడు. చదువుకు చదువు...వ్యాపారానికి వ్యాపారం అవుతుందని భావించి ఆ పిల్లలతా చదువుకొనేందుకు ఒకే చెప్పేశారు. అంతే.. ప్లాట్ ఫాం కాస్తా పాఠశాల అయిపోయింది. ఇలా ధర్మపాల్ సింగ్ ప్రతి రోజూ గంటసేపు పాఠాలు చెబుతున్నాడు. నాలుగు నెలల క్రితం పోస్టింగ్‌పై ఈ ప్రాంతానికి వచ్చిన సింగ్.. ఇది తన ధ్యేయమని అంటున్నాడు. మొదట ఇష్టం లేకపోయినా ఆ పేద పిల్లలు ఇందుకు ఒప్పుకున్నారు. తన డ్యూటీ ఫ్రీ టైంలో ధర్మపాల్ సింగ్ వీళ్ళకు లెక్కలు, ఇతరత్రా బోధిస్తున్నాడు. 23 ఏళ్ళుగా సర్వీసులో ఉన్న ఈ కానిస్టేబుల్.. ఈ పిల్లల దుస్థితి చూసి తాను చలించిపోయానని, ప్రతొక్క పోలీసు ఇద్దరికి చదువు చెప్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం తెలిపాడు.

ఈనెల 7నే జగన్ దీక్ష - వైసీపీ..

గుంటూరు : ఈనెల 7వ తేదీ నుండే జగన్ నిరవధిక దీక్ష ఉంటుందని వైసీపీ నేతలు బోత్స, విజయసాయిరెడ్డిలు ప్రకటించారు. ఈనెల 22లోపు ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు, ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని వెంకయ్య అనడం సరైంది కాదన్నారు. 

సోమవారం విజయనగరంలో జగన్ పర్యటన.

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఎయిర్ పోర్టు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులతో కలిసి జగన్ ఆందోళన చేయనున్నారు.

 

ఫిర్యాదులు అందాయి - వెస్ట్ బెంగాల్ ఈసీ..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై ఫిర్యాదులు అందాయని వెస్ట్ బెంగాల్ ఈసీ సుశాంత ఉపాధ్యాయ పేర్కొన్నారు. అలాగే ప్రిసైడింగ్ అధికారుల నివేదికలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల ద్వారా కొన్ని దృశ్యాలను తీసుకోవడం జరిగిందని, అంతేగాకుండా టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ద్వారా వాయిస్ లను రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. కొన్ని టివి క్లిప్పింగ్స్ లను చూసినట్లు సుశాంత ఉపాధ్యాయ తెలిపారు. 

ఎఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అరెస్టు..

గౌహతి : ఎఐయుడిఎఫ్ ఎమ్మెల్యే గోపినాథ్ ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. గోపినాథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 

అంబర్ పేట తహశీల్దార్ కార్యాలయంలో మందు పార్టీ..

హైదరాబాద్ : అంబర్ పేట తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాను చూసి అధికారులు పరారయ్యారు. 

ఈనెల 8 నుండి సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు - మధు..

విజయవాడ : విభజన చట్టం హామీలను అమలు చేయాలని ఈనెల 8వ తేదీ నుండి సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు ఉంటాయని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

20:21 - October 4, 2015

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఎలా ఏ వుడ్ లోనైనా హీరోలపై పలువురు అభిమానులు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు వ్యంగ్యంగా సోషల్ మాధ్యమాల్లో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హీరోలు..హీరోయిన్లు..మిత్రులు..ఎవరైనా ఉద్ధేశ్యపూర్వకంగా బాధ పడేలా..అసభ్యకరంగా పోస్టు చేస్తే అలాంటి వారు తన అభిమానులు కాదని ట్విట్టర్ ద్వారా షారుఖ్ ట్వీట్స్ చేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేయడం..సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించాడు. అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చిందని..దానిని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. కొందరి ఇడియట్స్ తో తాను వ్యంగ్యంగా వ్యవహరిస్తానని హెచ్చరించాడు. 

20:14 - October 4, 2015

దసరా ధమాక అనగానే ఇదేదో చీరల ప్రోగ్రామో ...లేదంటే ఒకటి కొంటె ఒకటి ఫ్రీ ఇచ్చే సెల్ ఫోన్ షాపింగ్ కార్యక్రమామో కాదండి. అది కాదు ఇది కాదు అంటున్నావ్ అంటున్నారా..అంటే దసరా అంటే సరదాల పండుగ. ఈ ఫెస్టివల్ కి మరింత ఎంజాయ్ ని యాడ్ చెయ్యడానికి బోలెడన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. సో మన దసరా పండగ సినీ సరదాలు పంచడానికి రెడీ అయిపొయింది అన్నమాట. అసలు దసరా సరదాలు అందించడానికి రెడీ అవుతున్న హీరోలు ఎవరు ? ఆ సినేమాలేంటి ?

అఖిల్ ...
'కింగ్' నాగార్జున నట వారసుడు 'అఖిల్'..ఆల్రెడీ 'నాగ చైతన్య' హీరో గా ఉన్న ఈ టైం లో 'అఖిల్' ఎంట్రీ చాలా ఇంటరెస్టింగ్ గా మారింది. 'అఖిల్' లాంచింగ్ హై రేంజ్ లో ఉండాలి అనుకుంటున్నా టైం లో హీరో 'నితిన్' ప్రొడ్యూసర్ గా మారండం ప్లస్ అయింది. ఒక హీరో ఇంకో హీరోని లాంచ్ చెయ్యడం అనే ట్రెండ్ ఈ సినిమాతోనే మొదలైందని చెప్పొచ్చు. 'అఖిల్' మూవీ దసరా రోజున అంటే అక్టోబర్ 22 న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం గమనార్హం. ఎస్ఎస్ థమన్‌, అనూప్‌ రూబెన్స్ పాటలకు స్వరాలు సమకూర్చగా.. మణిశర్మ నేపథ్య సంగీతమందించారు. ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అయేషా సెహగల్‌ కథానాయిక.

రాంచరణ్..బ్రూస్ లీ..ద ఫైటర్..
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో మూవీ 'బ్రూస్‌లీ'. ద ఫైటర్ ట్యాగ్‌లైన్. రామ్‌ చరణ్‌ హీరో. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కింది. దసరా కానుకగా అక్టోబర్‌ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఫైటర్‌గా కన్పించనున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఆయన ఓ పాటలో సైతం కన్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 'చెర్రీ' సరసన 'రకుల్ ప్రీత్ సింగ్' నటించింది.

కంచెగా రానున్న వరుణ్ తేజ్..
నాగ బాబు తనయుడు 'వరుణ్ తేజ్' కూడా దసరా ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు క్రిష్‌. ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంచె'. మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరో వరుణ్‌ తేజ్‌. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం పూర్తిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు.

రుద్రమదేవి రెడీ..
దసరా ధమాక అందించడానికి గుణ శేఖర్ రుద్రమదేవి రెడీ గా ఉంది. అనుష్క ప్రధాన పాత్రధారిగా, రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రం రుద్రమదేవి చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 9వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడినా చిత్రీకరణలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా దర్శకుడు గుణశేఖర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా యత్నించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఈ చిత్రం హిందీ భాషలోనూ అనువాదమవుతోంది.
తుది పనులు కాకపోయినా 2డి ఫార్మాట్ లోనే సినిమాని రిలీజ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారట. చూద్దాం ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.

సైజ్ జీరో వస్తుందా ?
'అనుష్క' నటించిన 'సైజు జీరో' కూడా దసరా కి సందడి చేస్తుంది అంటున్నారు. కాని డేట్ ఇంకా కన్మాఫ్ అవలేదు. కోవెల మూడి ప్రకాష్ దర్శకత్వంలో లో రూపొందిన ఈ సినిమా ఫుల్ కామెడీ గా ఉండబోతుందని అంటున్నారు.

షేర్ తో వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్..
హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం 'షేర్‌'. 'పటాస్‌'తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'షేర్‌'. ఈ సినిమా అక్టోబర్‌ 30వ తేదీన విడుదలవుతోంది. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. గతంలో 'కత్తి' చిత్రాన్ని తీసిన మల్లికార్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మరి ఈ సినిమాల్లో బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధిస్తాయో ? లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడకతప్పదు...

ఉగ్రవాదులకు..భద్రతా దళాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో మిలిటెంట్లు..భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 

ఏడిద మృతి పట్ల జగన్..తమ్మినేని సంతాపం..

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత 'ఏడిద నాగేశ్వరరావు' వైసీపీ అధ్యక్షుడు జగన్, మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు.

19:44 - October 4, 2015

హైదరాబాద్ : ఏడాద నాగేశ్వరరావుకు కొడుకులుగా పుట్టడం గర్వకారణంగా ఉందని ఆయన కుమారులు పేర్కొన్నారు. ఏడాద నాగేశ్వరరావు చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఏడాద నాగేశ్వరరావు కుమారులు మీడియాతో మాట్లాడారు. గత 20వ తేదీన అస్వస్థతకు గురయ్యారని, రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు, రేపు ఉదయం పలువురి సందర్శనార్థం ఏడాది భౌతికకాయాన్ని నివాసానికి తరలిస్తామన్నారు. మధ్యాహ్నాం టాలీచౌకీలోని మహా ప్రస్థానంలో 'ఏడాది నాగేశ్వరరావు' అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.
ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా పలు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ స్థాపించి పలు ఆణిముత్యాల లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిబద్ధతో చిత్ర నిర్మాణాన్ని సాగించారు. ఎటువంటి అసభ్యతకు తావులేని, కళాత్మకతతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించడమే ధ్యేయంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 

ఏడిద సేవలు వెలకట్టలేనివి - చంద్రబాబు..

విజయవాడ : సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చేసిన సేవలు వెలకట్టలేనివని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన మృతికి బాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. 

ఏడిద మృతి పట్ల కె.విశ్వనాథ్ సంతాపం..

హైదరాబాద్ : సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి సినీ రంగానికి తీరని లోటని దర్శకులు కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విశ్వనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

19:15 - October 4, 2015

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథ చంపూకావ్యాల పుటల్లో దాక్కొని సామాన్య ప్రజలకు చేరువకాలేక పోయింది. 19 వ శతాబ్దప్రారంభం నుండి స్వేచ్ఛగా ప్రజల మధ్య విహరించింది. గురజాడ దిద్దుబాటు కథతో అసలు సిసలైన తెలుగు కథాసాహిత్యం ప్రారంభమయింది. వస్తు శిల్పాల నవ్యతతో పాఠకులను అలరించింది. గత పాతికేళ్ళలో ఎందరో కథా రచయితలు అద్భుత కథలు సృష్టించారు. అలాంటి కథలలో కొన్ని మంచి కథలను ఎంపిక చేసి కథా సాహితీ ప్రతియేటా ప్రత్యేక సంచికలుగా ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెనాలిలో జరిగిన 'కథ - 2014' ఆవిష్కరణసభ ప్రత్యేక కథనం.

 

19:13 - October 4, 2015

నాకవితా వధూటి వదనంబు ఎగాదిగాజూచి..భళీ భళీ ..అన్నవాడె నీదేకులమన్న ప్రశ్నవెలయించి చివాలున లేచిపోగా బాకునగుమ్మినట్లయినదని మహాకవి గుర్రం జాషువా బాధపడ్డారు. అంతే కాదు గవ్వకు సాటిరాని పలుకాకుల మూకలు నన్నెవ్విధిదూరిన ననువరించిన శారదలేచిపోవునే అంటూ గంభీరంగా ప్రకటించుకున్నారు. నాల్గుపడగల హైందవనాగరాజును కలం ఖడ్గంతో కుళ్లుబొడిచాడు. అలాంటి నవయుగ కవిచక్రవర్తి, పద్యకవికోకిల, దళిత కవితా ఆత్మగౌరవ కేతనం, గుర్రంజాషువా జయంతుత్సవాలు ఇటీవల గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. కవులు కళాకారులు గుర్రంజాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలను ప్రారంభించి కనుల విందుగా జరుపుకున్నారు.

ఏడిద మృతి పట్ల టి.ప్రజానాట్య మండలి సంతాపం..

హైదరాబాద్ : ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల తెలంగాణ ప్రజా నాట్య మండలి అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.మారయ్య, టి.నర్సింహలు సంతాపం తెలిపారు. 

ముజఫర్ నగర్ లో పేలిన సిలిండర్..ముగ్గురి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : ముజఫర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇళ్లే ధ్వంసమైంది. 

లాలూ..కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన అమిత్ షా..

బీహార్ : లాలూ ప్రసాద్ యాదవ్..కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా విమర్శలు గుప్పించారు. బీహార్ ను అభివృద్ధి చేయడం వారితో సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ కు రూ.లక్షల కోట్ల స్కాం చరిత్ర ఉంటే లాలూ 15 ఏళ్ల చరిత్రలో బీహార్ అడవిరాజ్యంగా ఉందన్న పేర్లు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. 

18:51 - October 4, 2015

ఫేస్ బుక్ ప్రొఫైల్స్ లో ఇక నుండి వీడియో పెట్టుకొనే ఆప్షన్ రాబోతోంది. దీనిపై ప్రస్తుతం వర్క్ జరుగుతోందంట. ప్రొఫైల్ చిత్రాలుగా చిన్న చిన్న వీడియోలను పెట్టుకునేందుకు ఫేస్‌బుక్ రంగం సిద్ధంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా 149 కోట్ల మంది వినియోగదారులున్న ఫేస్ బుక్ సంస్థ బ్రిటన్, కాలిఫోర్నియాల్లోని ఐ-ఫోన్ వినియోగదారులకు ఈ నూతన సదుపాయాన్ని పరీక్షించే ప్రక్రియ మొదలుపెట్టింది. మరింత మంది ప్రొఫైల్ చిత్రాలుగా వీడియోలను అనుమతించేందుకు త్వరలో సిద్ధమవుతున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 12.5 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు. అమెరికా తర్వాత ఈ సామాజిక అనుసంధాన వేదికను భారత్‌లోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. రోజుకి 400 కోట్ల కంటే ఎక్కువ ప్రొఫైళ్లను వినియోగదారులు వీక్షిస్తున్నారని సంస్థ వెల్లడించింది. చరవాణి ప్రొఫైల్‌లో కూడా మార్పులు చేసినట్లు పేర్కొంది.

18:42 - October 4, 2015

అనుష్క శర్మ..అనగానే క్రికేటర్ 'కోహ్లీ' గుర్తుకొస్తాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉంది. పలు సందర్భాల్లో వీరు పబ్లిక్ గానే కనిపడ్డారు కూడా. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'లవ్ లాక్' పై కోహ్లీ పేరు రాయక 'డ్యూడ్' అని రాసిందంట. అసలు లవ్ లాక్ ఏంటీ ? డ్యూడ్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఇది చదవండి.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 'లవ్ లాక్' బ్రిడ్జి ఉంది. సాధారణంగా ఇక్కడ తాళం కప్పుపై పేర్లు రాసి తమ ప్రేమకు గుర్తుగా ఆ బ్రిడ్జికి లవ్ లాక్ వేసి తాళం చెవిని నదిలో పడేస్తుంటారు. ఇక్కడకు వచ్చిన 'అనుష్క శర్మ' 'లవ్ లాక్' వేసింది కానీ ఆ లవ్ లాక్ పై 'కోహ్లీ' పేరు లేదు. 'డ్యూడ్' పేరు రాసి ఉంది. దీనికి సంబంధించిన చిత్రాన్ని పోస్టు చేయడంతో గుసగుసలు మొదలయ్యాయి. ఈ డ్యూడ్ ఎవరు ? అని. అయితే 'అనుష్క' ఎంతగానో ప్రేమగా చూసుకునే కుక్క పేరంట. ప్రేమికులందరూ తమ ప్రియుడు..ప్రేయసిల పేర్లు రాస్తుంటే 'అనుష్క' కుక్క పేరు రాయడం ఏంటనీ ఆశ్చర్యపోతున్నారంట. 

18:22 - October 4, 2015

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి భౌతికకాయన్ని తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.రేపు రాయదుర్గం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏడిద మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కళాత్మక సినిమాల గురించి ఆలోచించడానికే వెనకడుగు వేస్తున్న రోజుల్లో ఎన్నో చిత్రాలు తీసిన సాహస నిర్మాత ఏడిదని కొనియాడింది.


స్వస్థలం తూర్పుగోదావరి..
ఏడిద నాగేశ్వర రావు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట. 1934 ఏప్రిల్ 24న ఆయన జన్మించారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు. బాల్యం నుంచి సినిమాలపై ప్రేమ పెంచుకున్న ఏడిద నాగేశ్వర రావు నిర్మాతగా మారారు. పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థను స్థాపించి కళాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టారు. ఉన్నత ఆశయాలతో ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ తో ఏడిద సినిమా ప్రయాణం అనన్య సామాన్యం.

టౌలిచౌకిలో అంత్యక్రియలు..
ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ఏడిద భౌతిక కాయాన్ని స్టార్ హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ రోడ్‌ నెం 8లోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

అభిరుచి గల నిర్మాత..
ఏడిద నాగేశ్వర రావు పూర్ణోదయ సంస్థ ద్వారా శంకరాభరణం సినిమా నిర్మించి నాడు సంచలనం సృష్టించారు. పాశ్చాత్య సంగీతంతో కొట్టుకుపోతున్న సమాజానికి శాస్త్రీయ సంగీతం గొప్పతనమేంటో శంకరాభరణం ద్వారా చాటి చెప్పారు. అలాగే భారతీయ శాస్త్రీయ నృత్యం ప్రధానాంశంగా సాగరసంగమం నిర్మించిన దిగ్గజ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వర రావు. ఆపధ్భాంధవుడు, స్వరకల్పన, సిరివెన్నెల, స్వాతిముత్యం, సితార, సీతాకోక చిలుక, తాయారమ్మ బంగారయ్య, సిరిసిరిమువ్వ వంటి చిత్రాలు నిర్మించిన అభిరుచిగల నిర్మాత.

డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభం..
డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. నిర్మాత యు.విశ్వేశ్వరరావు అనువందించిన 'పార్వతీకల్యాణం' చిత్రంలో శివుడి పాత్రధారికి ఆయన తొలిసారిగా డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ నటించిన 'ఆత్మబంధువు' చిత్రంతో తెర వెనుక నుండి తెరపైకి వచ్చారు. 1960 – 1974 మధ్య కాలంలో దాదాపు 30 చిత్రాల్లో గుర్తింపు కలిగిన వేషాలు వేశారు. వందకు పైగా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. కానీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాత అదృష్టం కలిసి వచ్చింది. 'శ్రీ వెంకటేశ్వర కల్యాణం' పేరుతో విడుదలైన ఆ అనువాద చిత్రం రెట్టింపు లాభాలు తెచ్చి పెట్టింది. 1976లో విడుదలైన 'సిరిసిరిమువ్వ' విజయం సాధించింది. అనంతరం పూర్ణోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం 'తాయారమ్మ – బంగారయ్య' చిత్రాన్ని నిర్మించారు. ఇక అప్పటి నుండి నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు జైత్రయాత్ర మొదలైంది.
వాణిజ్య విలువలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఎక్కువ సంపాదించి ఉంటారేమో. పది సినిమాలు తీసి వంద సినిమాలు తీసి పేరు తెచ్చుకన్న వ్యక్తి ఏడిద నాగేశ్వరరావు. 

ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత..

హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూశారు. సాయంత్ర ఐదు గంటలకు నగరంలోని ఓ స్టార్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి భౌతికకాయన్ని తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.

18:11 - October 4, 2015

తూర్పుగోదావరి : అభిమాన హీరో..హీరోయిన్ లను చూడటానికి అభిమానులు ఎగబడుతుంటారు. ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. కొంతమంది అభిమానులు గాయాల పాలు కావడమే కాకుండా మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా కాకినాడలో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' మూవీ టీం జైత్రయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. హీరో కారును చుట్టుముట్టారు. అయితే కారు కదులుతుండగా ఓ అభిమాని కారు కింద పడగా, కాలు విరిగింది. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

18:07 - October 4, 2015

విజయవాడ : చినుకుపడితే రోడ్లు చిత్తడవుతున్నాయి..రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీనితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడను ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో రెండు గంటలకు పైగా కుంభవృష్టి కురిసింది. భారీ వర్షంతో కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నీరంతా రోడ్లపైకి రావడంతో రహదారులు కాలువలను తలపించాయి. శివారు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్, పాతబస్తీ, పెనమలూరు, సింగ్ నగర్, గవర్నర్ పేట తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయాయి. ఈదురుగాలుల దాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. 

18:04 - October 4, 2015

కటక్ : టీమిండియా, సౌతాఫ్రికా జట్ల తీన్మార్...టీ-20 సిరీస్ సర్కస్ ఉత్తర భారతదేశంలోని ధర్మశాల నుంచి...తూర్పు భారత్ లోని కటక్ నగరానికి చేరింది. బారాబటీ స్టేడియం వేదికగా రేపు జరిగే రెండో టీ-20 సమరం సఫారీలకు చెలగాటం టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కటక్ యుద్ధంలో ఆరు నూరైనా నెగ్గి తీరాల్సి ఉంది. అయితే ఈమ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

హాట్ హాట్...
మహాత్మాగాంధీ- నెల్సన్ మండేలా ట్రోఫీ కోసం ప్రపంచ మాజీ చాంపియన్ టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ధూమ్ ధామ్ టీ-20 సిరీస్..రెండో మ్యాచ్ కే హాట్ హాట్ గా మారింది. ధర్మశాలలో ముగిసిన తొలి టీ-20 సూపర్ చేజింగ్ లో సౌతాఫ్రికా కళ్ళు చెదిరే విజయం సాధించడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడిపోయింది. అసలే బౌలర్ల వైఫల్యం, ఆ పైన అంపైర్ పొరపాటు నిర్ణయాలతో తాము నెగ్గాల్సిన మ్యాచ్ లో ఓడామంటూ కెప్టెన్ ధోనీ లబోదిబో అంటున్నాడు. 199 పరుగుల స్కోరు సాధించి ప్రత్యర్థి ఎదుట 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా...విజయం సాధించలేకపోడాన్ని ధోనీసేన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ధర్మశాల వన్డేలో సూపర్ సెంచరీ సాధించిన...టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ మాత్రం రెండో వన్డేలో విజయం తమదేనని ధీమాగా చెప్పాడు.

మార్పులు చేసే అవకాశం..
తొలి వన్డేలో తమ బ్యాటింగ్ బాగానే ఉన్నా..బౌలింగ్ ఏమాత్రం సంతృప్తికరంగా సాగలేదని ధోనీ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. స్లోబౌలింగ్ కు అనువుగా ఉండే కటక్ బారాబటీ స్టేడియం పిచ్ పైన భారత తుదిజట్టులో ఒకటి రెండు మార్పులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీడియం పేస్ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీతో పాటు..మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ స్కోరైనా సాధిస్తామన్న డూప్లెసీ..
మరోవైపు..తొలివన్డేలో సాధించిన విజయంతో గాల్లో తేలిపోతున్న సఫారీటీమ్ మాత్రం రెండో టీ-20లో సైతం ఇదే దూకుడు కొనసాగించి 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి తమ ఎదుట ఎంత భారీస్కోరు ఉంచినా..అధిగమించే సత్తా తమకు ఉందని..అయితే..బౌలింగ్ లో మాత్రం నిలకడసాధించాలని సఫారీ కెప్టెన్ డూప్లెసీ అంటున్నాడు.

సఫారీ బౌలర్లకు పరీక్ష..
ఇప్పటి వరకూ..ఈ రెండుజట్లూ ముఖాముఖీ..తొమిదిమ్యాచ్ లు ఆడితే..టీమిండియా ఆరు , సౌతాఫ్రికా మూడు విజయాలతో ఉన్నాయి. కటక్ లోని ఉక్కబోత వాతావరణంతో పాటు అక్కడి మందకొడి పిచ్ సైతం..సఫారీ బౌలర్ల సహనానికి పరీక్షేకానుంది. చావోరేవో అన్నట్లుగా మారిన ఈ మ్యాచ్ లో ధోనీసేన ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా 0-2తో సిరీస్ నే చేజార్చుకొనే ప్రమాదం లేకపోలేదు.

ఉత్కంఠ..
ఒక్కమాటలో చెప్పాలంటే..సఫారీటీమ్ కు చెలగాటం..టీమిండియాకు సిరీస్ సంకటంగా మారిన ఈమ్యాచ్...ఏకపక్షంగా ముగుస్తుందా? లేక ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగుతుందా ? అన్న ప్రశ్నలే అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధర్మశాలలో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ పరుగుల వెల్లువలా, రికార్డుల మోతతో ముగిస్తే...ఇప్పుడు కటక్ లో జరుగబోతున్న రెండో టీ-20 మ్యాచ్ ఏవిధంగా జరుగుతుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

17:58 - October 4, 2015

ముంబై : భారత క్రికెట్ బోర్డు ను సమూలంగా ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని బీసీసీఐ సరికొత్త బాస్ శశాంక్ మనోహర్ ప్రకటించారు. జగ్ మోహన్ దాల్మియా చేపట్టిన మంచిపనులను తానూ కొనసాగిస్తానని బోర్డు అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టిన తర్వాత ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. క్రికెట్ అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పాదుకొలపడమే తనముందున్న కర్తవ్యమని చెప్పారు. బోర్డుకు అనుబంధంగా ఉన్న క్రికెట్ సంఘాలలో జరుగుతున్న అవకతవకలను ఇకముందు కొనసాగించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.

17:50 - October 4, 2015

హైదరాబాద్ : పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు..ముఖ్యంగా తెలంగాణలో వివాహం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇక పేదింటి తల్లిదండ్రులయితే ఆర్థికంగా మరింత చితికిపోతారు. కోలుకోలేని విధంగా అప్పుల్లో కూరుకుపోతారు. ఇలాంటి వారికి ఆసరా అందించే లక్ష్యంతో 'కల్యాణలక్ష్మి', 'షాది ముబారక్‌' పథకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌ 2న ఈ కార్యక్రమం మొదలైంది. కల్యాణ లక్ష్మి కింద ఎస్సీ, ఎస్టీ వధువులకు 51 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కోసం గత బడ్జెట్‌లో 150 కోట్ల రూపాయలు. ఈసారి బడ్జెట్‌లో 157 కోట్లు కేటాయించింది.

ఇప్పటివరకు 60వేల మందికి ఆర్థిక సహాయం..
ఈ స్కీంకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అంచనాకు మించి దరఖాస్తులొచ్చాయి. దీంతో సర్కారు బడ్జెట్‌ను రివైజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ 60వేల మందికి సహాయం అందించామని సర్కారు ప్రకటించింది. అంటే దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇందులో 25 వేల మంది ఎస్సీలు, 15 వేల మంది ఎస్టీ యువతులున్నారు.

పెండింగ్‌లో 403 దరఖాస్తులు..
కల్యాణలక్ష్మి లాగానే మైనార్టీ యువతుల కోసం షాదీ ముబారక్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కీంకోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 21,454మంది అమ్మాయిలకు 109 కోట్ల రూపాయలను అందజేశారు. ఇంకా 403 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిశీలించాక నిధులు విడుదల చేయనున్నారు అధికారులు.

మాకూ అమలు చేయాలని బీసీలు డిమాండ్..
ఈ పథకాలను ప్రవేశపెట్టినప్పుడు దరఖాస్తు ప్రక్రియ క్లిష్టంగా ఉండేది. కేవలం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్న నిబంధన ఉండేది. పైగా దృవపత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయం, ఈ సేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీనితో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇందులో లోటు పాట్లు గుర్తించిన సర్కారు తాజాగా ప్రక్రియను సరళతరం చేసింది. దీంతో ఇప్పుడు అర్హులంతా దరఖాస్తుల కోసం క్యూ కడుతున్నారు. అటు ప్రభుత్వంకూడా ఈ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తోంది. కులాలతో సంబంధంలేకుండా దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలన్నింటికీ వర్తింపజేయాలని చూస్తోంది.  

17:46 - October 4, 2015

వరంగల్  : ఆమె ఓ డాక్టరమ్మ... అలాంటి ఇలాంటి వైద్యురాలు కాదు.. సిజేరియన్‌ అంటూ ఆమె చేసిన ఘనకార్యం ఓ తల్లి ప్రాణాలుపోయే పరిస్థితి వచ్చింది.. ఆ కుటుంబం నిండా అప్పుల్లో మునిగిపోయింది.. పసిబిడ్డను వదిలేసి రోగిని నాలుగు నెలలుగా ఆస్పత్రులచుట్టూ తిరిగేలా చేసింది.. ఇంతచేసినాకూడా అందరిపై ఎగిరెగిరిపడుతూ ఇంకా హంగామా చేస్తోంది.. లేడీ డాక్టర్ అనురాధ... ఈ డాక్టరమ్మ చేసిన ఆపరేషన్ వికటించి ఓ తల్లి ప్రాణాలమీదకొచ్చింది. దీనిని ప్రశ్నించినందుకు ఈ పెద్దమ్మ అందరిపై చిందులేసింది. బెదిరించి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

సిజేరియన్ అంటూ బిల్డప్ ఇచ్చిన రాధమ్మ..
విజయ... భర్త చిరుద్యోగి... జూన్‌లో రెండోసారి కాన్పుకోసం శ్రీనివాస నర్సింగ్‌ హోంలో చేరింది. వెంటనే సిజేరియన్‌ అంటూ బిల్డప్ ఇచ్చిన రాధమ్మ పేషంట్‌ను ఆపరేషన్ రూంలోకి తీసుకువెళ్లింది. పదినిమిషాల్లో బిడ్డను బంధువుల చేతుల్లో పెట్టి సీరియస్‌గా ఉందంటూ పిల్లల ఆస్పత్రికి పంపింది. పేషంట్‌కు రక్తం తేవాలంటూ భర్తను ఆదేశించింది. ఇంతలో ఏమైందో ఏమో విజయను అంబులెన్స్ ఎక్కించి లక్ష్మి నరసింహ ఆస్పత్రికి తరలించింది. ఇక్కడ డాక్టర్ సంధ్యారాణి విజయకు పదకొండు రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

దిగజారిన విజయ ఆరోగ్యం..
ఆపరేషన్‌కు ముందు చక్కగా ఉన్న విజయ ఆరోగ్యం ఆ తర్వాత నిమిషం నుంచి రోజు రోజుకూ దిగజారిపోయింది. రోజులు గడుస్తున్నా బ్లీడింగ్ ఆగలేదు. విపరీతమైన నొప్పి తనకు తెలియకుండానే మూత్రం బయటకు వస్తోంది. కనీసం లేవలేని పరిస్థితి. అయినా అంతా సర్దుకుంటుంది అంటూనే సిజేరియన్‌ జరిగినా డీ అండ్ సీ చేశారు సంధ్యారాణి. ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. డాక్టర్లు ఏం ఫరవాలేదంటూ 37వేల బిల్లువేసి ఇంటికి పంపారు. ఇక్కడ తమ ఆపరేషన్ ఖర్చు చెల్లించలేదంటూ అనురాధమ్మ ఫోన్ చేసి మరీ 17వేలు కట్టించుకుంది.

తీవ్ర రక్తస్రావం..
ఆపరేషన్ జరిగి నెలలు గడుస్తున్నా విజయ ఆరోగ్యంలో ఎలా మార్పు రాలేదు. కారణమేంటో తెలియదు రక్తం పోతూనే ఉంది.. రోజురోజుకీ నీరసించి మంచంమీదనుంచి లేవలేని స్థితికి చేరింది. ఇక లాభం లేదనుకొని ఆమెను మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె తల్లి. డాక్టర్ రూంలోకి వెళ్లిన విజయ పరీక్షకోసం బెడ్‌మీద కూర్చున్న నిమిషాల్లోనే రక్తంతో కింద ప్రాంతమంతా తడిసిపోయింది. ఈ స్థాయిలో బ్లీడింగ్‌ చూసి కంగారుపడ్డ డాక్టర్లు వెంటనే పరీక్షలు చేశారు. చివరికి అసలు విషయం చెప్పారు. బిడ్డను బయటకు తీశాక గర్భసంచిని... మూత్రాశయాన్ని కలిపి కుట్టారని ఆ సమయంలో ఈ రెండు అవయవాలకు రంద్రం పడిందని తేల్చారు. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ చేసి గర్భసంచీ తొలగించాలని సూచించారు.

రూ.4లక్షలకు చేరిన బిల్లు..
విజయ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సిజేరియన్‌ కోసం రూపాయి రూపాయి కూడబెట్టి బిల్లు కట్టారు. డాక్టర్ అనురాధ పుణ్యమాని ఇప్పుడు బిల్లులు దాదాపు 4లక్షలకు చేరింది. కుటుంబం అప్పులపాలైంది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయించాలి.. ఓవైపు విజయ అనారోగ్యం... పుట్టిన బిడ్డకు లేచి పాలు ఇవ్వలేని పరిస్థితి... మరోవైపు ఆస్పత్రుల చుట్టూ తిరగడం. ఇన్ని ఇబ్బందులుపడ్డ తమకు న్యాయం చేయాలని ఇలా మరో పేషంట్‌కు జరగొద్దంటూ ఈ కుటుంబసభ్యులు డాక్టర్‌ను నిలదీశారు.. దీంతో ఈ దుర్మార్గపు డాక్టరమ్మ మరింత రెచ్చిపోయింది. మీకు దిక్కున్నచోట చెప్పుకోవాలంటూ అహంకారం చాటుకుంది. లాయర్‌ను తీసుకెళితే వాళ్లనూ మేనేజ్ చేసేసింది. చివరికి చేసేదేంలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరిమధ్యా రాజీకుదర్చడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఆదుకోవాలని విజ్ఞప్తి..
ఆపరేషన్ ఖర్చులో సగం భరిస్తానని పోలీసులముందు హామీ ఇచ్చిన అనురాధ ఆ తర్వాత మళ్లీ ప్లేట్ ఫిరాయించింది.. చివరికి బాధితులు టెన్‌ టీవీని ఆశ్రయించారు. వైద్య వృత్తికే కలంకం తెస్తున్న ఇలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు కోరుతున్నారు. విజయ ఆపరేషన్ ఖర్చు మొత్తం అనురాధ భరించేలా చూడాలని అధికారులకు విజ్ఙప్తి చేస్తున్నారు.

నర్సన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్..

మెదక్ : జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం నర్సన్నపేట గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో నిర్వహించిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఎర్రవల్లితో పాటు నర్సన్నపేటను కూడా అభివృద్ధి చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. 

ప్రెస్ మీట్ నిర్వహించిన 'రుద్రమదేవి' చిత్ర యూనిట్..

హైదరాబాద్ : త్వరలో విడుదల కాబోతున్న 'రుద్రమదేవి'కి సంబంధించిన విశేషాలు చిత్ర యూనిట్ మీడియాకు తెలియచేస్తోంది. నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుణశేఖర్, అనుష్క, రానా, అల్లు అర్జున్ పాల్గొన్నారు. బన్నీ, రానా పాత్రలకు స్టార్ వాల్యూ ఉందని చిత్ర దర్శకుడు గుణశేఖర్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. 

మంత్రి కేటీఆర్ సభలో ఆశా వర్కర్ల ఆందోళన..

మెదక్ : నారాయణఖేడ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సభలో ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షం..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలో భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లా రేపల్లేలో భారీ వర్షం కురవగా నిజాంపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలో కురిసన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

తిరుమలకు మాంసం తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు..

చిత్తూరు : తిరుమలకు మాంసం, గుడ్లను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను అలిపిరి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..

తిరుమల : మొదటి ఘాట్ రోడ్డు 36,37 మలుపు వద్ద అదుపు తప్పిన సుమో అడవిలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న తమిళనాడుకు చెందని భక్తులకు ఎలాంటి ప్రమాదం కాలేదు.

 

బీహార్ లో ల్యాండ్ మైన్స్..

బీహార్ : గయాలోని ఓ ప్రాంతంలో ఎనిమిది ల్యాండ్ మైన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ల్యాండ్ మైన్ బరువు 8-10 కిలోలు ఉంటుందని అంచనా. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

కొలుకొంటున్న ఇంద్రాణి..

ముంబాయి : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ముంబాయి జేజే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. 

16:29 - October 4, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. బూత్ ల ఆక్రమణ, ఓటర్ల బెదిరింపులు, బాంబు దాడులతో హడలెత్తించారు. ఈ సందర్భంగా ఆదివారం వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారని మధు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట్ర పాల్గొని మమత పాలనను ఎండగట్టారు. 

16:16 - October 4, 2015

విజయవాడ : రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ తిరునావక్కరసు హాజరయ్యారు. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, బీజేపీ ఉద్ధేశ్యపూర్వకంగానే రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని రఘువీరా విమర్శించారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి శాసనమని, ఆయన వ్యాఖ్యలు ఖండించకపోవడం బట్టి చూస్తే రిజర్వేషన్ లను వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

22న అమరావతి లోగో - నారాయణ..

విజయవాడ : అమరావతి లోగోను 22వ తేదీన ప్రజల ముందు ఉంచుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇందుకోసం 28 మంది నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

రాష్ట్రం సాధించింది ఏదీ లేదు - ఎంపీ వీహెచ్..

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ ఏడాదిన్నర పాలనలో రాష్ట్రం సాధించిన ఘనత ఏదీ లేదని ఎంపీ వీహెచ్ విమర్శించారు. రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలం చెందిందని, కేసీఆర్ ప్రభుత్వం, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. రైతు ఆత్మహత్యలకు గత పాలకుల తప్పిదాలే కారణమని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. 

సింగరాయకొండలో మానసిక రోగి హల్ చల్..

ప్రకాశం : సింగరాయకొండలో మానసిక రోగి హల్ చల్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న వారిపై రాళ్లతో దాడి చేశాడు. వెంటనే స్థానికులకు మానసిక రోగిని చితకబాది పోలీసులకు అప్పగించారు. 

టెన్ టివి కథనానికి హోం మంత్రి చిన రాజప్ప స్పందన..

కాకినాడ : ఎస్ఐ వెంకటేశ్వరరావు దీనస్థితిపై టెన్ టివిలో వచ్చిన కథనానికి హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు భార్య ప్రభుత్వానికి పెట్టుకున్న విజ్ఞప్తిని పరిశీలించారు. వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 

 

సుబ్రమణ్యం ఫర్ సేల్ పర్యటనలో అపశృతి..

కాకినాడ : 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్ర బృందం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. హీరో సాయిధరమ్ తేజ్ కారు కిందపడిన అభిమాని పడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

15:53 - October 4, 2015

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య రంగాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో పర్యటించిన మంత్రి లక్ష్మారెడ్డి...టీఆర్‌ఎస్‌ పోలిట్‌ బ్యూరో సభ్యులు హరీశ్వర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామన్నారు. ప్రతి పీహెచ్‌సీని 80 పడకల ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా...పరిగి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. 

15:51 - October 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ వ్యాపారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ఫ్లైవుడ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ని మంత్రి తలసాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని కొద్దిసేపు బ్యాటింగ్ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ టోర్నీలో వివిధ కంపెనీలకు సంబంధించిన 12 జట్లు పాల్గొంటాయన్నారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఫ్లైవుడ్‌ అసోసియేషన్‌ వాళ్లు నిర్వహించడం అభినందనీయమని మంత్రి తలసాని అన్నారు. ఏడు వారాల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ నవంబర్‌ 14న ముగుస్తుందని తెలంగాణ ఫ్లైవుడ్ అసోసియేషన్‌ ప్రసెడింట్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 

15:47 - October 4, 2015

విశాఖపట్టణం : త్వరలో ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకురాబోతున్నట్టు మంత్రి గంటా శ్రీనివాస్‌ తెలిపారు. దీని వల్ల గవర్నమెంట్‌ వర్సిటీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన మంత్రి.. తమ ఉద్దేశం మాత్రం ప్రభుత్వ వర్సిటీలను ఇబ్బందుల్లోకి నెట్టడం కాదన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పోటీ పడాలని చెప్పారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రైవేటు వర్సిటీల ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. సింగపూర్ లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని అందుకొనేలా చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు యూనివర్సిటీల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. 

15:44 - October 4, 2015

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. రుణమాఫీని ఒకేసారి చెల్లిస్తే ఆత్మహత్యలు జరగవని ఆయన అన్నారు. రైతు మరణాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సర్కార్‌ తరపున భరోసా కల్పించాలన్నారు. ఇకపై ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని, మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ గ్రామస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరవు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పొన్నం దుయ్యబట్టారు.

15:41 - October 4, 2015

నిజామాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. వెంటనే రైతులకు మనోధైర్యం ఇచ్చే విధంగా వ్యవహరించాలని విపక్షాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం పలువురు రైతు రక్షణ యాత్ర పేరిట యాత్రలు మొదలు పెట్టాయి. తాజాగా మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవీపేట్‌ మండలం బినోల గ్రామానికిచెందిన చిన్నలింగం కౌలు రైతు నాలుగెకరాల పొలంలో పంటవేశాడు. వర్షాభావంతో చేను ఎండిపోయింది. రూ.4 లక్షల వరకూ అప్పులు మిగిలాయి. అప్పులిచ్చినవాళ్లు డబ్బుకట్టాలని వేధించడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

15:38 - October 4, 2015

విజయవాడ : భోగాపురంలో టిడిపి చేస్తున్న బలప్రయోగాన్ని అందరూ ఖండించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారని, జనాలను భయపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే లాఠీచార్జ్ చేసి చావగొడుతున్నారన్నారు. పెద్ద ఎత్తున్న బలగాలను దించి రైతులను భయబ్రాంతులను గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లక్షలాది ఎకరాలు తీసుకుంటే తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ఖండించాలని మధు పేర్కొన్నారు.

15:35 - October 4, 2015

హైదరాబాద్ : మళ్లీ అదే పరిస్థితి.. చినుకు పడితే చాలు నగర రోడ్లు చిత్తడవుతున్నాయి. భారీ వర్షానికైతే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నక, సికింద్రాబాద్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉంటాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నగర రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చినుకు పడితేనే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారడంతో పబ్లిక్‌ జీహెచ్‌ఎంసీ అధికారులపై మండిపడుతున్నారు. 

15:30 - October 4, 2015

కరీంనగర్‌ : జిల్లాలో ప్రసూతి కోసం వచ్చిన ఓ మహిళ బంధువులపై ఓ వాచ్ మెన్ ఉగ్రరూపం దాల్చాడు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదాడు. ఈ ఘటన జగిత్యాల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వందన అనే గర్భిణీ చికిత్స కోసం వచ్చింది. వీరిని వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. ఎంతసేపయినా లోపలికి పంపకపోవడంతో రోగి బంధువులు వాచ్‌మెన్‌ను నిలదీశారు. ఆగ్రహించిన వాచ్‌మెన్ వారిని చితగ్గొట్టాడు. దీంతో ఆగ్రహించిన పేషంట్ బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరికీ నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

14:31 - October 4, 2015

ముంబాయి : భారత క్రికెట్ బోర్డు సరికొత్త అధ్యక్షుడుగా..మాజీ చైర్మన్, నాగపూర్ లాయర్ శశాంక్ మనోహర్ ఎంపికయ్యారు. బీసీసీఐకి రెండు విడతలుగా అసాధారణ సేవలు అందించిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో...ఆయన వారసుడి ఎంపిక కార్యక్రమాన్ని ముంబైలో ముగిసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ముగించారు. 75 ఏళ్ల జగ్ మోహన్ ద్మాల్మియా హఠాన్మరణంతో ఆయన వారసుడిగా ..బోర్డు అధ్యక్షపదవి కోసం పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

గంగూలి పేరు..
అధ్యక్షుడి ఎన్నికలో ఐసీసీ చైర్మన్ ఎన్ .శ్రీనివాసన్ కింగ్ మేకర్ కాబోతున్నారని ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్, బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిల్లో ఎవరో ఒకరు అధ్యక్షస్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఒక దశలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు సైతం వినిపించింది. అయితే..ఇప్పుడు తాజాగా బోర్డు మాజీ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘానికి చెందిన శశాంక్ మనోహర్ పేరు బయటకు రావడమే కాదు దాల్మియాకు చెందిన ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధులు సంపూర్ణమద్దతు ప్రకటించడంతో ఎన్నిక కాకుండా ఎంపికతోనే తతంగం ముగిసింది. అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్ధిగా శశాంక్ మనోహర్ ను ఖరారు చేశామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ గత వారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సమావేశానికి శ్రీనివాసన్ గైర్హాజరయ్యారు. అధ్యక్షపదవి కోసం శశాంక్ మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ ఏకపక్షమైపోయింది. 

మొత్తం 30 ఓట్లు..
భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు ఉన్నాయి. ఇందులో శ్రీనివాసన్ వర్గం చేతిలో 10 ఓట్లు ఉంటే....కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అరుణ్ జైట్లీ, శరద్ పవార్ వర్గాల చేతిలో మిగిలిన 20 ఓట్లు ఉన్నాయి. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఓట్లు సస్పెన్షన్ లో ఉండడంతో..29 మంది సభ్యులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే పవార్, జైట్లీ, అనురాగ్ ఠాకూర్ వర్గాలు సంయుక్తంగా శశాంక్ మనోహర్ ను బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. 

వివాదరహితుడు..
శశాంక్ మనోహర్ గతంలో..2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడిగా సేవలు అందించారు. వివాదరహితుడుగా ఉండటం, కష్టపడే తత్వం మరోసారి..శశాంక్ మనోహర్ ను బోర్డు అధ్యక్షుడిగా చేసింది. భారత క్రికెట్ బోర్డ్ చరిత్రలో..1928 నుంచి 30 మంది ప్రముఖులు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పదవిలో ఉండి మృతి చెందిన బోర్డు తొలి అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మాత్రమే. ఇప్పటికే పలు రకాలుగా సంక్షోభం ఎదుర్కొంటున్న బీసీసీఐకి దాల్మియా ఆకస్మిక మృతితో నెత్తిమీద మరో పిడుగుపడినట్లయ్యింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో...వివాదరహితుడుగా పేరుపొందిన శశాంక్ మనోహర్ లాంటి వ్యక్తి బోర్డు అధ్యక్షుడుగా ఉండటం అవసరమని భావించామని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాకు చెప్పారు. 

2017 వరకు కొనసాగనున్న శశాంక్..
2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా పని చేసిన సమయంలో శశాంక్ మనోహర్ పారదర్శకంగా వ్యవహరించి..చక్కటి వ్యక్తిగా పేరు తెచ్చుకొన్నారు. కష్టపడి పనిచేసే స్వభావం కూడా శశాంక్ మనోహర్ కు అదనపు అర్హతగా ఉపయోగపడింది. శశాంక్ మనోహర్ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.

ఆత్మకూరు మండలంలో ఏపీ మంత్రి కామినేని పర్యటన..

నెల్లూరు : ఆత్మకూరు మండలంలో ఏపీ మంత్రి కామినేని పర్యటించారు. ఆత్మకూరు 100 పడకల ఆసుపత్రి, మహిమలూరు పీహెచ్ సీని కామినేని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై కామినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

14:22 - October 4, 2015

అక్కడ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్లు తొణికిసలాడుతుంటాయి..! శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు అంగళ్లు అడుగడుగునా దర్శనమిస్తాయి..! మణిమాణిక్యాలు మతులు పోగొడితే.. కెంపులు అతివల మనసులు దోచేస్తాయి. అక్కడ దొరకని నగలుండవు.. కనిపించని డిజైన్‌ ఉండదు..! ఎటు చూసినా వినియోగదారులే.. ఏ పండగొచ్చినా జన జాతరే..! ఇదీ.. కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు అంగళ్ల ఘనత. కానీ.. ఇదంతా చరిత్ర కాబోతోంది. నాణ్యతే పెట్టుబడిగా.. నమ్మకమే రాబడిగా కొనసాగిన వ్యాపారం.. దివాళా అంచున నిలిచింది. కళకళలాడాల్సిన బంగారు వ్యాపారం వెలవెలబోతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది..?
ప్రొద్దుటూరు బంగారం ఎందుకు మెరుపు తగ్గుతోంది..?? 
ప్రొద్దుటూరు బంగారం ఎందుకు మెరుపు తగ్గుతోంది..?? వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి. ఇక బంగారమనేది కొంటే మాత్రం ప్రొద్దుటూరులోనే కొనాలి. ఇదీ.. వినియోగదారుల మాట. ముక్కు పుడక నుంచి మురిపించే నెక్లెస్‌ వరకు.. ఉంగరం నుంచి వడ్డాణం వరకూ.. నచ్చిన డిజైన్‌లో మెచ్చిన మోడల్‌లో.. ఇక్కడి స్వర్ణం మెరిసిపోతుంది. కొనుగోలుదారులను మురిపిస్తుంది. క్వాలిటీ క్వాంటిటీ విషయంలో 24 క్యారెట్స్‌ గోల్డ్‌ పట్టణంగా పేరుతెచ్చుకుంది ప్రొద్దుటూరు. తన బంగారు కాంతులను నలుదిశలా వెదజల్లుతూ స్వర్ణ నగరి కిరీటాన్ని సొంతంగా చేసుకుంది. చీరలు కొనాలంటే కంచికే వెళ్లాలంటారు... బంగారం కొనాలంటే మాత్రం కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకే వెళ్లాలి. ఈ కాంతులు ఈ నాటివి కావు. ఈ మెరుపులు ఈ రోజువి కావు. వందేళ్లక్రితం మొదలైన ప్రొద్దుటూరు ధగధగలు.. దేశం నలుమూలలకూ ప్రసరించాయి. స్వర్ణ ప్రియుల మనసు దోచాయి. ఎంతలా అంటే.. ప్రొద్దుటూరును కాస్తా సిరిపురం అనేలా, ప్రొద్దుటూరు కాస్తా మరో ముంబై అనిపించుకునేలా... దేశానికి స్వాతంత్యం రాక ముందు నుంచే బంగారం వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు.. ఆ వైభవాన్ని అప్రతిహతంగా కొనసాగించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుప్రొద్దూటూరులో బంగారు వ్యాపారం విస్తరించింది. రానురానూ మరింత ఉచ్ఛస్థితికి చేరిన గోల్డ్‌ బిజినెస్‌ ఏ స్థాయికి చేరిందంటే.. ప్రొద్దుటూరులో ఏకంగా బంగారు అంగడి అంటూ ఒక వీధి ఏర్పాటైంది.
ప్రొద్దుటూరు బంగారం అంటే కస్టమర్లకు అత్యంత విశ్వాసం 
ప్రొద్దుటూరు బంగారం అంటే కస్టమర్లకు అత్యంత విశ్వాసం. బంగారం నాణ్యత విషయంలోనూ, తూకంలోనూ ఎక్కడా తేడారాదనేది వినియోగదారుల నమ్మకం. కల్తీకి ఏమాత్రం అవకాశం లేకుండా.. వ్యాపారం కొనసాగుతుందని చెప్తుంటారు. ఇక ఇక్కడ లభించే వెరైటీలకు కొదవలేదు. ఎక్కడా దొరకని మోడళ్లు కూడా ఇక్కడ లభిస్తుంటాయి. ఆర్డర్‌ తీసుకున్నారంటే.. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా ఇక్కడి వ్యాపారులు నగలు అందిస్తారనే పేరుంది. అందుకే.. వినియోగదారులు ఇక్కడికి క్యూ కడుతుంటారు.
బంగారు అంగళ్ల వీధిలో చిన్నపాటి జాతరే 
ఇక పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిదంటే ప్రొద్దుటూరులోని బంగారు అంగళ్ల వీధిలో చిన్నపాటి జాతరే కొనసాగుతుంది. భారీ సంఖ్యలో తరలివచ్చే వినియోగదారులతో బంగారు అంగళ్లవీధి కిటకిటలాడుతుంది. సంపన్నుల నుంచి నిరుపేదల వరకూ తమ స్థాయికి తగ్గ ఆభరణాలు ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. సాధారణ ముక్కు పుడకలు, చెవి దిద్దులు మొదలు.. పెద్ద పెద్ద నెక్లెస్‌లు, వడ్డాణాలకు ఇక్కడి దుకాణాలు ప్రసిద్ధిగాంచాయి. ధరలు కూడా అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉంటాయంటారు వినియోగదారులు. అందుకే.. ధనిక, పేద తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ప్రొద్దుటూరు అంగళ్ల వీధిలో బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు సంపాదించిన ప్రొద్దుటూరు పేరు చెప్పగానే స్వర్ణ ప్రియుల ముఖం విప్పారుతుంది. వినియోగదారుల అభిరుచికి, నమ్మకానికి తగ్గట్టుగానే ఇక్కడి వ్యాపారులు అమ్మకాలు నిర్వహిస్తుంటారు. దశాబ్దాల తరబడి సాగించిన వ్యాపారంతో, సంపాదించుకున్న నమ్మకంతో.. ప్రొద్దుటూరు బంగారు అమ్మకాల విషయంలో 24 క్యారెట్‌ గోల్డ్‌ పట్టణంగా అవతరించింది.
ప్రొద్దుటూరుకు బంగారు కిరీటాన్ని తొడిగిన స్వర్ణకారులే..!
తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరో తెలీదు కానీ.. ప్రొద్దుటూరుకు బంగారు కిరీటాన్ని తొడిగింది మాత్రం ఇక్కడి స్వర్ణకారులే..! నగలకు నగిషీలు చెక్కే స్వర్ణకారులు అంతటా ఉన్నారు. బంగారానికి మెరుగుపెట్టే స్వర్ణకారులు ఎక్కడైనా కనిపిస్తారు. కానీ.. వీళ్లు మాత్రం ఊరికే మెరుగుపెట్టారు..! తమ దశాబ్దాల శ్రమతో.. ప్రొద్దుటూరు స్వర్ణకాంతులను దేశమంతా ప్రసరింపజేశారు ఇక్కడి స్వర్ణకారులు...
ప్రొద్దుటూరు అంటేనే బంగారు వ్యాపారం...
ఇదీ.. గోల్డ్‌ బిజినెస్‌లో ప్రొద్దుటూరు సాధించిన ఘనత. అయితే.. ఈ ఘనత ఆయాచితంగా వచ్చిందేమీ కాదు. దీని వెనుక దశాబ్దాల కార్మికుల కష్టం దాగి ఉంది. శతాబ్ద కాలం నుంచీ స్వర్ణకారులు ధారపోసిన శ్రమ ఉంది. రాత్రి పగలూ అనే తేడా లేకుండా కష్టపడిన స్వర్ణకారులు.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరును కనీవినీ ఎరుగని రీతిలో బంగారు పళ్లెంలో కూర్చోబెట్టారు. ప్రొద్దుటూరు మెడలో స్వర్ణహారాన్ని వేశారు. పచ్చగా మెరిసిపోతూ ఒంటిపై ధగధగలాడే నగలు.. అతివ అందానికి మరింత మెరుపులు అద్దుతాయి. అయితే.. మెరిసిపోయే ఆ నగ వెనుక కార్మికుల కష్టం దాగి ఉంటుంది. శారీరక కష్టంతోపాటు, మానసిక శ్రమ కూడాతోడైతేనే మేలి ఆభరణాలు రూపుదిద్దుకుంటాయి. అయితే.. అలాంటి నగలు ప్రాణం పోయడానికి కార్మికులు ఒక్కోసారి ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్వర్ణకారులు నగలు తయారుచేయాల్సి ఉంటుంది. తేడా వస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం.
బంగారం తయారీ...
అత్యంత వేడిమిలో బంగారాన్ని కరుగబెట్టాలి. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించాలి. అనారోగ్యకర వాతావరణంలో పని చేస్తుండటంతో బాధించే వ్యాధులకూ కొదవే లేదు. ఈ విధంగా బంగారు ఆభరణాలు తయారు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరెందరో వికలాంగులయ్యారు. ప్రొద్దుటూరులోని బంగారు అంగళ్ల వీధిలో దాదాపు 4,500 మందికి పైగా స్వర్ణకారులు ఉన్నారు. వందేళ్ల క్రితమే ప్రసిద్ధి చెందిన ఇక్కడి వ్యాపారాన్ని నమ్ముకొని వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాయి. కేవలం స్థానికులే కాకుండా.. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాల నుండి అనేక మంది కార్మికులు ఇక్కడికి స్థిరపడ్డారు. ప్రొద్దుటూరులో బంగారం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు వీరికి క్షణం తీరిక ఉండేదికాదు. త్వరగా నగలు తయారు చేసి ఇవ్వమని వ్యాపారస్తుల నుండి ఒత్తిడి ఉండేది. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు తలకిందులైంది. నామమాత్రంగా కూడా చేతిలో పనిలేకుండా పోయింది. ఒకప్పుడు ఉన్నత స్థాయిలో జీవితాలు కొనసాగించిన కార్మికులు నేడు పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. నాడు ఎవరెస్టు స్థాయిలో కొనసాగిన వ్యాపారం.. రానురానూ పాతాళానికి పడిపోతూ వచ్చింది. దీంతో.. కార్మికుల ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో తగ్గిపోతూ వచ్చాయి. కొనుగోలు దారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ రావడంతో కార్మికులకు పనిదూరమైంది. దీంతో.. చేసేందుకు పనిలేక, మూడు పూటలా తిండి తినేందుకు కూడా ఇక్కడి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.
ప్రొద్దుటూరులో ధగధగలాడిన వ్యాపారం
ఒకనాడు ధగధగలాడిన ప్రొద్దుటూరు బంగారు వ్యాపారం.. నేడు మెరుపు తగ్గింది..! ఒకప్పుడు కొనుగోలు దారులతో కిటకిటలాడిన బంగారు అంగళ్ల వీధి.. ఇప్పుడు వెలవెలబోతోంది..! కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్టుగా.. ప్రొద్దుటూరు వ్యాపారం పతనావస్థకు చేరుకోవడానికి సవాలక్ష అంశాలు కారణమయ్యాయి. 
ఏ వ్యాపారానికైనా నమ్మకమే ప్రధానం
ఏ వ్యాపారానికైనా నమ్మకమే ప్రధానం. అది నాణ్యతతోనే వస్తుంది. ఈ రెండింటి మేళవింపుతో కొనసాగింది ప్రొద్దుటూరు వ్యాపార ప్రస్థానం. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా నగలు తయారు చేయడంలో, వాటిని నాణ్యతతో అందించడంలో ఇక్కడి వ్యాపారులకు మంచి పేరుంది. దీంతో.. మూడు నెక్లెస్‌లు ఆరు చైన్లు అన్నట్టుగా బంగారు వ్యాపారం కొనసాగింది. అయితే.. రానురానూ పరిస్థితిలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఐదేళ్ల ముందు వరకూ బాగానే ఉన్న బిజినెస్‌.. ఒక్కసారిగా డల్‌ అయింది. ప్రొద్దుటూరు బంగారంగళ్ల వీధిలో సంవత్సరానికి 30 కోట్ల రూపాయలకు పైగా సాగిన టర్నోవర్.. ఇప్పుడు 12 కోట్లకు చేరుకోవడం కూడా గగనంగా మారింది. ఇంత దయనీయమైన స్థితిని ఎప్పుడూ చూడలేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రజలు దుకాణాల వైపు చూడకపోవడంతో.. వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ప్రధానంగా.. వరుస కరువులు ఈ పరిస్థితికి కారణమయ్యాయి. వ్యవసాయం దెబ్బతినడంతోపాటు, ఇతర ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. పొట్టకూటికోసం ప్రజలు అధిక సంఖ్యలో వలసలు వెళ్లారు. స్థానికంగా ఉన్నవారు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బంగారం కొనడం సంగతి అటుంచితే.. ఒంటిమీద ఉన్న బంగారాన్నే తాకట్టులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు బంగారం వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనికితోడు.. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు బంగారం వ్యాపారంలోకి ప్రవేశించడం కూడా.. సాంప్రదాయ స్వర్ణకారుల వ్యాపారానికి గండికొట్టింది. డిస్కౌంట్ల పేరుతో రకరకాల వాగ్దానాలు చేస్తుండడంతో వినియోగదారులు అటువైపు ఆకర్షితులయ్యారు. ధనికులంతా ఆడంబరాలున్న కార్పొరేట్‌ షాపులవైపే వెళ్తుండడంతో.. గతంలో మాదిరిగా స్వర్ణకారులను సంప్రదించేవారు కరువయ్యారు.
ప్రొద్దుటూరు వ్యాపారంపై రాష్ట్ర విభజన ప్రభావం
ఈ పరిస్థితులకు తోడు.. రాష్ట్ర విభజన కూడా ప్రొద్దుటూరు వ్యాపారంపై ప్రభావం చూపిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో బంగారు ధర తక్కువగానే ఉన్నా.. ఇప్పుడు వేరే రాష్ట్రం కావడంతో అక్కడ కొనలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. బయటి రాష్ట్రాల్లో బంగారం కొంటే ట్యాక్సులు భారీగా మీద పడుతున్నాయంటున్న వ్యాపారులు.. సొంత రాష్ట్రంలో కొంటే ధరలు గిట్టుబాటు కావడంలేదని అంటున్నారు. ఆదాయం గణనీయంగా పడిపోవడంతో.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని, దీంతో విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. పనులు ఉన్నప్పుడు షాపులు తెరుస్తూ.. మిగతా సమయంలో మూసేస్తున్నామని చెబుతున్నారు. బంగారం ధరలు పెద్దగా పెరగకపోయినా... ఇలాంటి కారణాల వల్లే వ్యాపారాలు సరిగా సాగట్లేదని చెబుతున్నారు. గతంలో బాగా సంపాదించిన పెద్ద వ్యాపారస్తుల ఆర్థిక సరిస్థితి బాగానే ఉన్నప్పటికీ... చిన్న వ్యాపారులే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులతో ఇప్పటికే చాలా మంది శాశ్వతంగా షాపులు మూసేశారని, మిగిలిన వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుత్తడి బతుకులు ఇత్తడికన్నా దారుణం
పుత్తడి బతుకులు ఇత్తడికన్నా దారుణంగా తయారయ్యాయి..! బంగారానికి మెరుపులద్దిన చేయి.. ఆటో స్టీరింగు తిప్పుతోంది..! స్వర్ణాన్ని కరిగించిన చేతులు.. టీ నీళ్లు మరిగిస్తున్నాయి..! పూలమ్మిన చోటే కొందరు కట్టెలమ్ముతుండగా.. పొట్ట చేతబట్టుకొని దేశం సరిహద్దులు దాటిపోతున్నారు మరికొందరు. బంగారు ఆభరణాలు తయారు చేసిన చేయి.. కుటుంబానికి బుక్కెడు బువ్వపెట్టలేకపోతోంది..! లక్షలాది మందికి హారాలు అందించిన చేయి.. కన్నబిడ్డలకు ఆహారం అందిచేందుకు అష్టకష్టాలు పడుతోంది..! ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారం సజావుగా సాగిన కాలంలో.. కార్మికులకు చేతినిండా పని ఉండేది. కనీసం తీరిక చేసుకునేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో న్యాయం చేసేందుకు కార్మికులు రేయింబవళ్లూ కష్టపడేవారు. దాంతో.. వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి ఉండేవి. కానీ.. క్రమంగా వ్యాపారం దెబ్బతినడంతో కార్మికుల జీవితాలు సైతం కష్టాలపాలవుతూ వచ్చాయి.
ఉపాధి కోసం నానా అవస్థలు పడుతున్న స్వర్ణకారులు
ఒకప్పుడు ఇంత పని మావల్ల కాదనే పరిస్థితిలో ఉన్న కార్మికులు.. ఇప్పుడు ఒక్క పూట పనిదొరికినా బాగుండుననే స్థితికి చేరుకున్నారు. దీంతో.. కుటుంబ జీవనం దారుణంగా దిగజారింది. దీనికితోడు అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం మూలిగే నక్కపై తాటిపండు మాదిరిగా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తరాలుగా నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక, కొత్తగా ఏదైనా పని వెతుక్కోలేక స్వర్ణకార కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టమో నిష్ఠురమో అనుకుంటూ కొందరు అదే వృత్తిలో కొనసాగుతుండగా.. ఆర్థిక భారాలను మోయలేని వారు తప్పని పరిస్థితుల్లో ఇతర పనుల్లోకి వెళ్తున్నారు. ఏ ఇతర పనీ అలవాటు లేనివారు చివరకు టీ కొట్లు నడుపుకుంటున్నారు. మరికొందరు ఆటోలు నడుపుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. జీవితాలను బాగు చేసుకునేందుకు అప్పోసప్పో చేసి కొందరు గల్ఫ్‌ దేశాల బాట పడుతున్నారు. కన్నతల్లి లాంటి ఊరును, కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను వదిలి, జానెడు పొట్టకోసం కానరాని దేశంలో కాలం వెళ్లదీస్తున్నారు.
స్వర్ణకారులు, కార్మికులు బతుకులు అగమ్యగోచరం
కేవలం బంగారు ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు, కార్మికులు మాత్రమే కాకుండా.. ఈ రంగంపై ఆధారపడిన మిగతావారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారాన్ని నమ్ముకొని అనేక వ్యాపారాలు అనుబంధంగా కొనసాగుతుండేవి. బంగారం నాణ్యతను పరిశీలించే వ్యాపారం, ధర్మకాటా వ్యాపారం వంటి అనేక వ్యాపారాలు అనుబంధంగా కొనసాగుతుండేవి. అయితే.. బంగారం వ్యాపారాలు పడిపోవటంతో అనుబంధ వ్యాపారులు కూడా దివాలా తీసే పరిస్థితిలో పడ్డారు.
బంగారు వ్యాపారం మెరుపు కోల్పోతోంది
ఇలాంటి పరిస్థితులతో ప్రొద్దుటూరు బంగారు వ్యాపారం మెరుపు కోల్పోతోంది. ఒకప్పుడు బంగారం వ్యాపారంతో ఆర్థికంగా పరిపుష్టి సాధించినవారు.. ఇప్పుడు దారుణంగా బక్కచిక్కిపోతున్నారు. గూడు చెదిరిన పక్షుల్లా తలోదిక్కుకు వెళ్లిపోతున్నారు. ఇందులో బంగారం వ్యాపారుల పరిస్థితి ఒకరకంగా ఉంటే.. కార్మికుల పరిస్థితి మరీ దీనంగా తయారైంది. నమ్ముకున్న వృత్తి నష్టాల బాటలో పయనిస్తుండడంతో దిక్కుతోచక రోడ్డున పడుతున్నారు అనేక మంది కార్మికులు. బంగారు కాంతులతో వికసించిన వీరి జీవితాలు కాకిబంగారం మాదిరిగా కమిలిపోతున్నాయి.
ప్రొద్దుటూరు స్వర్ణయుగం మసకబారుతోంది..
ప్రొద్దుటూరు స్వర్ణయుగం మసకబారుతోంది..! కార్మికులు కట్టిన స్వర్ణ సౌధం కూలిపోతోంది..! వ్యాపారులు దివాళా తీస్తుంటే.. దానిపై ఆధారపడ్డవారు రోడ్డున పడుతున్నారు..! ఈ సమయంలో సరిగ్గా స్పందించాల్సిందీ, ఆరిపోతున్న బంగారు దీపాన్ని మళ్లీ వెలిగించగలిగిందీ ప్రభుత్వం మాత్రమే. దశాబ్దాల తరబడి ఘనంగా కొనసాగిన ప్రొద్దుటూరు వైభవం.. గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పతనావస్థలో కొనసాగుతోంది. ఫలితంగా ఏడాదికి 30 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం సాగించిన ప్రొద్దుటూరు బంగారు మార్కెట్‌.. ప్రస్తుతం 12 కోట్ల రూపాయల టర్నోవర్ కు దిగజరాడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
18 కోట్ల రూపాయల మేర పడిపోయిన బిజినెస్‌
కేవలం ఐదేళ్లలోనే 18 కోట్ల రూపాయల మేర బిజినెస్‌ పడిపోవడం సంక్షోభ స్థాయిని సూచిస్తోంది. ఈ ప్రభావం మొత్తం ప్రొద్దుటూరు వ్యాపార సామ్రాజ్యాన్నే కుదిపేసింది. ఎంతో మంది వ్యాపారులు, కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయి. చాలా మంది వ్యాపారులు ఈ రంగాన్నే వదిలేస్తే.. పనులు దొరక్క కార్మికులు రోడ్డున పడుతున్నారు. చివరకు రోజూవారి జీవనానికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టేందుకు కూడా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిపై తలపండిన వారు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. వినియోగదారులతో నిండిపోవాల్సిన దుకాణాలు.. ఖాళీగా కనిపిస్తుండడంతో వ్యాపారులు ఉసూరుమంటున్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రొద్దుటూరు బంగారు వ్యాపారాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అంటున్నారు.
వ్యాపారులకు రాయితీలు ప్రకటించాలి
ప్రధానంగా వ్యాపారులకు రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు. నగలు తయారు చేసేందుకు అవసరమైన రసాయనాలు, పనిముట్ల ధరలు తగ్గించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా లోన్లు అవసరమైన వారందరికీ ఇచ్చేలా చూడాలని అంటున్నారు. లోన్ల కోసం బ్యాంకుల వద్దకు వెళితే.. ష్యూరిటీలు అడుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు ఇచ్చే అప్పులకు ష్యూరిటీలు పెట్టగలిగే స్థోమత ఉంటే.. తాము అప్పులు ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యాపారాన్ని ఆదుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రొద్దుటూరులో వ్యాపారం బాగా సాగిన రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పన్ను రూపంలో బాగానే ఉండేదంటున్నారు. ఇప్పుడు వ్యాపారాలు దివాళా తీస్తుండడంతో వ్యాపారులతోపాటు, ప్రభుత్వ ఆదాయానికీ నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల కుటుంబ ఆదాయాలు గణనీయంగా పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకోలేని స్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే.. ప్రొద్దుటూరు స్వర్ణ యుగం చరిత్రగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ వేలాది మందికి బతుకునిచ్చిన బంగారు వృక్షం ఇప్పుడు కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. దానిపై ఆధారపడిన వారంతా చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా చెల్లాచెదురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ప్రొద్దుటూరు వైభవం చరిత్రలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది.

రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలి - నాగం..

హైదరాబాద్ : రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలు నివారించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు పంట బీమా, పెట్టుబడి రాయితీ, కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

సువర్ణముఖి నది ప్రాంతంలో చంద్రశేఖర్ పర్యటన..

అనంతపురం : సువర్ణముఖి నది ప్రాంతంలో అడ్డుకట్టను కర్నాటక రైతు సంఘం నేత చంద్రశేఖర్ పరిశీలించారు. 1892లో ఒప్పందపత్రాన్ని పరిశీలిస్తామని, ఒప్పందపత్రంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఉంటే గౌరవిస్తామని తెలిపారు. అనంతపురం, తుముకూరు జిల్లాల కలెక్టర్లతో చర్చిస్తామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

మహిమలూరును దత్తత తీసుకున్న రక్షణ శాఖ సలహాదారు..

నెల్లూరు : ఆత్మకూరు (మం) మహిమలూరును రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కామినేని, ఎంపీ మేకపాటి, పలువురు నేతలు హాజరయ్యారు. 

ఆక్లాక్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియాను పెంచిన సీఎం అఖిలేష్..

ఉత్తర్ ప్రదేశ్ : మృతి చెందిన ఆక్లాక్ కుటుంబానికి ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను సీఎం అఖిలేష్ యాదవ్ పెంచారు. బాధిత కుటుంబానికి రూ.30లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాద్రిలో గొడ్డు మాంసం నిల్వ చేసి తింటున్నారని ఆరోపిస్తూ ఆక్లాక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

కొనసాగుతున్న బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్..

ముంబై : బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్ కొనసాగుతోంది. జగన్ మోహన్ దాల్మియా హఠాన్మరణంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బోర్డులో రెండు అధికారిక కేంద్రాలు..శరద్ పవార్, అరుణ్ జైట్లీ అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ను ప్రెసిడెంట్ గా ఎంచుకోవడంతో నేటి ఎన్నిక అధికారిక లాంఛనమే కానుంది. 

రేపు ఢిల్లీకి బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశానికి బాబు హాజరు కానున్నారు. మధ్యాహ్నాం 3 గంటలకు కేంద్ర అంతర్గత నదీ జలాల సంస్థ చైర్మన్ అమితాబ్ వర్మ..సాయంత్రం 5.30గంటలకు ప్రధాన మంత్రి మోడీతో సమావేశం కానున్నారు. స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ సబ్ కమిటీ నివేదికను ప్రధానికి బాబు అందచేయనున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్ర మంత్రులను అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. 

14:02 - October 4, 2015

అనంతపురం : జిల్లాలోని ఆగలిలో ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణముఖి నది ఆనకట్ట దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎపి, కర్నాటక రైతులు ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. ఆనకట్ట తొలగించాలని కర్నాటక రైతులు డిమాంద్ చేస్తున్నారు. తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఎపి రైతులు హెచ్చరిస్తున్నారు. రైతుల్లో పెద్ద ఎత్తున్న ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. కర్నాటక రైతు సంఘం నేతలు పోరాటాన్ని లీడ్ తీసుకుని కొనసాగిస్తున్నారు. ఆనకట్ట దగ్గర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. 500 వందల మంది కర్నాటక పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

హజ్ మృతుల్లో పెరిగిన భారతీయుల సంఖ్య..

ఢిల్లీ : హజ్ యత్రా సందర్భంగా మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 58కి చేరింది. మరో 78 మంది భారతీయుల వివరాలు తెలియాల్సి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

13:56 - October 4, 2015

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ, మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కులాల వారీగా బడ్జెట్‌ కేటాయించాల్సిందేనని ఈ క్రమంలో బీసీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనన్న తమ్మినేని.. దీని సాధనకోసం సంఘాలన్నీ ఉమ్మడి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు బాధ్యులకు అందలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయిస్తున్నారు...కానీ ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో జరిగే అనేక కుంభకోణాల్లో ఒక కుంభకోణం డబ్బులు సబ్ ప్లాన్ కు సరిపోతాయని చురకలంటించారు. ఆర్థిక విముక్తి జరిగితే... సామాజిక విముక్తి జరుగుతుందని గతంలో తాము భావించామని...కానీ ఆర్థిక విముక్తి జరగాలంటే ముందుగా సామాజిక విముక్తి జరగాలన్నారు. ఎవరి కులం అభివృద్ధికి వారు సహాయం చేయడమే కాదు తోటి కులాల హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి, వారి హక్కులను కాపాడేందుకు మిగతా కులాల వారు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలో అన్ని కులాల వారు ఉన్నారని గుర్తు చేశారు. మనిషి అన్నవాడు.. కుల, మత, వర్గ బేధం లేకుండా స్పందిచాలన్నారు. ప్రతి ఒక్కరు బిసి, మైనారిటీల సబ్ ప్లాన్ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

 

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం - అక్లాక్ సోదరుడు..

ఉత్తర్ ప్రదేశ్ : మద్దతిస్తున్నందుకు సీఎం అఖిలేష్ యాదవ్ కు కృతజ్ఞతలు పేర్కొంటున్నట్లు మృతి చెందిన అక్లాక్ సోదరుడు పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే దాద్రిలో గొడ్డు మాంసం నిల్వ చేసి తింటున్నారనే ఆరోపణలతో అక్లాక్ ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. 

నా ఓటు నితీష్ కే - రాం జెఠ్మాలనీ..

బీహార్ : నేను ఓటు వేసే అవకాశం వస్తే నితీష్ సర్కార్ కే వేస్తానని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలనీ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 'మోడీ మస్ట్ బి ఫనీష్డ్' అంటూ వ్యాఖ్యానించారు. 

ఆక్లాక్ కుటుంబానికి అఖిలేష్ ఎక్స్ గ్రేషియా..

ఉత్తర్ ప్రదేశ్ : దాద్రిలో మృతి చెందిన ఆక్లాక్ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రూ.30 లక్షలు ఆఖ్లాక్ కుటుంబానికి అలాగే ఆక్లాక్ ముగ్గురు సోదరులకు తలా రూ.5లక్షలను సీఎం ప్రకటించారు. ఇటీవల ఆవును చంపి దానం మాంసం నిల్వ చేసి తింటున్నారన్న నెపంతో ఆక్లాక్ ను కొంతమంది దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

అనంతపురం జిల్లాలో పరిస్థితి డిప్యూటి సీఎం ఆరా..

అనంతపురం : జిల్లాలో పరిస్థితిపై ఏపీ డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణముఖి నది ఆనకట్ట తొలగించాలని కర్నాటక రైతులు, తొలగిస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఏపీ రైతులు హెచ్చరిస్తున్నారు. 

13:42 - October 4, 2015

రంగారెడ్డి : ఫీజుల కోసం ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బే పరమావధిగా భావించిన యాజమాన్యాలు ఫీజుల వసూళ్లు చేసే క్రమంలో వేధింపులకు పాల్పడుతున్నాయి. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పవన్ అనే ఇంటర్ విద్యార్థి నారాయణ కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే కాలేజీ యాజమాన్యం అధిక ఫీజులు అడిగినందుకే తమ కొడుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తూ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా ఇటీవలే ఎపి, తెలంగాణలోని నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. 

ఇంద్రాణి పరిస్థితి విషమం..

ముంబై : మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్, కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈమేరకు ఆమెకు చికిత్సనందిస్తున్న జేజే ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి కేజీ టు పీజీ విద్య - కడియం..

వరంగల్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ విద్య అమలు చేస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. జిల్లాలోని గంగదేవిపల్లిలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా కేజీ టు పీజీ విద్య ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు కేటాయించారని తెలిపారు. 

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో ఆదివారం మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

మధురై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం..

చెన్నై : మధురై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కొలంబో, దుబాయ్ నుండి వచ్చిన పది మంది నుండి 32 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

వర్సిటీల్లో ర్యాకింగ్ సిస్టం - గంటా..

విశాఖపట్టణం : వర్సిటీల్లో ర్యాంకింగ్ సిస్టమ్ ను ప్రవేశ పెడుతామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రైవేటు వర్సిటీల బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు ఈ బిల్లుతో ప్రభుత్వ అనుబంధ వర్సిటీలకు నష్టం జరగదని చెప్పుకొచ్చారు. సింగపూర్ లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని అందుకొనేలా చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు యూనివర్సిటీల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. 

 

జగన్ కు దీక్షలు చేసే హక్కు లేదు - ధూళిపాళ్ల..

గుంటూరు : జగన్ కు దీక్షలు చేసే నైతిక హక్కు లేదని టిడిపి నేత ధూళిపాళ్ల విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా దీక్షలు చేయడం సరికాదన్నారు. దీక్షల పేరిట అభివృద్దిని అడ్డుకుంటున్నారని, ఎన్ని అరాచక శక్తులు అడ్డుపడినా నవ్యాంధ్ర అభివృద్దిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. 

రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది - జూలకంటి..

నల్గొండ : జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు రైతు రక్షణ యాత్ర చేపట్టాలని సూచించారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, ఈనెల 25, 26, 27 తేదీల్లో నాగార్జున సాగర్ లో సీపీఎం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు ఉంటాయని జూలకంటి పేర్కొన్నారు.

నాగం కిసాన్ బచావో దీక్ష ప్రారంభం..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద నాగం కిసాన్ బచావో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి చెరుకు సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.

 

ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతోనే ఆత్మహత్యలు - పొన్నం..

కరీంనగర్ : ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ గ్రామస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరవు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు.

రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలి - రఘువీరా..

విజయవాడ : కాంగ్రెస్ కార్యాలయంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ తిరునావక్కరసు హాజరయ్యారు. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, బీజేపీ ఉద్ధేశ్యపూర్వకంగానే రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

చర్లపల్లిలోని ఓ ఇంట్లో మృత దేహం లభ్యం..

నల్గొండ : చర్లపల్లిలో ఓ ఇంట్లో మృతదేహం లభ్యమైంది. చోరీ కోసం వచ్చి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రజల్లో నమ్మకం కలిగేలా పనిచేయాలి - బాబు..

హైదరాబాద్ : ప్రజల్లో నమ్మకం కలిగేలా పనిచేయాలని టిడిపి కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీగా ముందుకెళుతూ 16వ సారి కేంద్ర కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు, కొత్త, పాత కలయికతో పారత్ట కమిటీలను వేయడం జరిగిందన్నారు. పార్టీలో పనిచేసే ప్రతొక్కరికీ న్యాయం చేస్తున్నామని, పార్టీ కార్యకర్తలు నా కుటుంబసభ్యులకంటే ఎక్కువని తెలిపారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ టిడిపియేనని, తెలుగు వారి భవిష్యత్ కోసమే ఎన్డీయేతో పొత్తు ఉందని తెలిపారు.

'అనంత' జిల్లా ఆగలిలో టెన్షన్

అనంతపురం : జిల్లాలోని ఆగలిలో ఉద్రిక్తత నెలకొంది. స్వర్ణముఖి నది ఆనకట్ట దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎపి, కర్నాటక రైతులు ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. ఆనకట్ట తొలగించాలని కర్నాటక రైతులు డిమాంద్ చేస్తున్నారు. తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఎపి రైతులు హెచ్చరిస్తున్నారు.

 

12:52 - October 4, 2015

హైదరాబాద్ : అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ తలపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. రైతు రుణమాఫీపై తేల్చకుండా..సభలో మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదంటుంది హస్తం పార్టీ. అంతేకాదు ఉభయ సభల సమావేశానికి అనుమంతించవద్దని..గవర్నర్‌ను డిమాండ్ చేస్తోంది.
డిజైన్ల మార్పుపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌
తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్ట్‌ల డిజైన్‌లు మార్చి తీరుతామంటోంది సర్కార్. అంతేకాదు..దీనిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు రెడీ అవుతోంది. దీనికోసం సీఎం కేసీఆర్ ఉభయ సభలను సమావేశపర్చి ప్రాజెక్ట్‌ల డిజైన్ మార్పుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధవుతున్నారు. అయితే దీనిపై ఇప్పుడు టీ కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది.
రుణమాఫి వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేయాలి
రైతు రుణమాఫీపై తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. మిగిలిన రుణమాఫిని వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదే ఎజెండాగా..మొన్న అన్ని పార్టీలను కలుపుకుని సభలోనే బైటాయించిన హస్తం పార్టీ..సభ బయటకూడా నిరసనలతో హోరెత్తించింది. ఇప్పడు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్న కేసీఆర్‌ను సభలోనే నిలదీస్తామంటుంది. అంతేకాదు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంతవరకు..సభను నడవనీయమంటున్నారు హస్తం పార్టీనేతలు.
గవర్నర్‌పై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌
ఇదిలా ఉంటే..ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు గవర్నర్ అనుమతించడంపై హస్తం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆందోళనలో ఉన్న రైతులకు భరోసా కల్పించాల్సిందిపోయి..ఉభయ సభలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. రైతుల పట్ల గవర్నర్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా..ముందు ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజెంటేషన్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ రెడీ 
ఇప్పడికే రైతు రుణమాఫీపై..అసెంబ్లీ లోపలా, బయట ప్రతిపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చిన కాంగ్రెస్..ప్రాజెక్ట్ డిజైన్‌ల మార్పుపై కూడా ఇదే పంథాను కొనసాగించాలని చూస్తోంది. సోమవారం సభలో ప్రభుత్వ స్పందన చూసిన తర్వాతే కాంగ్రెస్‌...కేసీఆర్ ప్రజెంటేషన్‌ను అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికను అమలుచేసి.. గులాబి బాస్ కు జలక్ ఇవ్వాలని చూస్తోంది హస్తం పార్టీ. మరి హస్తం పార్టీ ప్లాన్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

కేసీఆర్ నియోజకవర్గంలో మహిళా రైతు ఆత్మహత్య..

మెదక్ : సీఎం నియోజకవర్గంలో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. వర్గల్ మండలం పాములపర్తిలో అప్పులబాధతో మహిళా రైతు దుర్గమ్మ(40) ఆత్మహత్య చేసుకుంది.  

టీటీడీపీ నేతల్లో అసంతృప్తి సెగలు

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల్లో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి డుమ్మా కొట్టారు. 

12:39 - October 4, 2015

హైదరాబాద్ : పార్టీకోసం పని చేసే కార్యకర్తలను పూర్తిగా ఆదుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎన్ టిఆర్ ట్రస్ట్‌ భవన్ లో టిడిపి కేంద్రం, తెలుగు రాష్ట్రాల కమిటీలు ఆయంన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇతర పార్టీలకు రాని విరాళాలు, నిధులుగా టిడిపికి వచ్చాయని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా... రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామని తెలిపారు. కార్యకర్తలను టిడిపి పూర్తిగా ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము ఇక్కడ కూర్చున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం.. అక్కడ రాజీ లేని పోరాటం చేయాలని సూచించారు. ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకున్న ఏకైకపార్టీ టిడిపి అని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. బాధ్యతతో ముందుకు పోతున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు ఎన్నిక కాబడిన తెలంగాణ, ఎపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూడు నెలలకు ఒకసారి ప్రొగ్రెస్ రిపోర్టు ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర కమిటీల మధ్య స్పష్టమైన పని విభజన చేశామని చెప్పారు. మెరిట్ ప్రకారం.. హోదాలు ఇస్తామన్నారు. పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు. తెలంగాణలో టిడిపి తిరుగులేని శక్తి ఎదగాలన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి అధికారంలోకి రావాలని కాంక్షించారు. ఎపిలో మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తే.. బాగా పని చేసే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయంలో అధికారం కూడా అవసరమని స్పష్టం చేశారు.

 

 

12:24 - October 4, 2015

హైదరాబాద్ : పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పాతబస్తీలోని హుస్సేనిహాలం పరిధిలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. దీంతో ఇంట్లో ఉన్న భార్యభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి ఇద్దరి పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యేలు పాషా ఖాద్రి, కిషన్ రెడ్డి లు సందర్శించారు. హెరిటేజ్ అధికారులపై పాషా ఖాద్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

మచిలీపట్నంలో గొలుసు దొంగలు

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నంలో గొలుసు దొంగలు విజృంభించారు. హిందూ కాలేజీ సీనియర్‌ అసిస్టెంట్‌ పరసా సునీత ఇంట్లో చొరబడిన దొంగలు 40 కాసుల బంగారం దోచుకెళ్లారు. 

12:16 - October 4, 2015

కృష్ణా : తెలుగు రాష్ట్రాల్లో గొలుసు దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ పంజా విసురుతున్నారు. గడిచిన వారంలో ఏకంగా 40కి పైగా చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ఆరుగురు స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా.. మచిలీపట్నం ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. రోజురోజుకూ పెచ్చరిల్లిపోతున్న గొలుసుదొంగల కారణంగా.. రోడ్డుమీద నడవాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గొలుసు దొంగలు విజృంభించారు. హిందూ కాలేజీ సీనియర్‌ అసిస్టెంట్‌ పరసా సునీత ఇంట్లో చొరబడిన దొంగలు 40 కాసుల బంగారం దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సునీత కాళ్లు, చేతులతోపాటు, మెడకు తాడు కట్టారు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడిపోయిన సునీతను బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

12:09 - October 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల్లో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి డుమ్మా కొట్టారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పీఠంపై ఎర్రబెల్లి ఆశలు పెట్టుకున్నారు. కానీ దయాకర్ రావును చంద్రబాబు ఎంపిక చేయలేదు. దీంతో ఎర్రబెల్లి తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. 

12:06 - October 4, 2015

హైదరాబాద్ : జాతీయ రహదారిపై సైకిల్ జర్నీ ప్రారంభమైంది. రీజినల్ పార్టీ... నేషనల్ పార్టీగా మారింది. ఇన్నాళ్లు తెలుగురాష్ట్రాల్లోనే చక్కర్లు కొట్టిన... సైకిల్ నేషనల్ హైవే పైకెక్కింది. ఎన్ టిఆర్ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ కేంద్ర, తెలుగు రాష్ట్రాల కమిటీ కొలువు దీరింది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. కేంద్ర ప్రధాన కార్యదర్శిగా లోకేశ్, ఏపీ అధ్యక్షుడిగా కళావెంకట్రావు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్‌ రమణతోపాటు ప్రధాన కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. 

11:58 - October 4, 2015

ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు.  వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు స్పందించి.. రైతులను ఆదుకుని, ఆత్మహత్యలను నివారించాలని పేర్కొన్నారు. 'తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే రైతుల ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగింది కానీ.. తగ్గడం లేదు. రైతుల పరిస్థితి ఎందుకింత దయనీయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎందుకింత సంక్షోభంలో ఉంది. వంటి పలు అంశాలపై నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విశ్లేషించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'తెలంగాణలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. అలాగే రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు 26 శాతానికి పైగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగే రైతుల ఆత్మహత్యలు కంటే అంతకమించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2014 సం.లో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్రప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాము వచ్చాక ఆత్మహత్యలు ఆగిపోతాయిన టీసర్కార అధికారంలోకి వచ్యిచంది. కానీ అధికారంలోకి వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు ఆగకపోవడం గమనించాల్సిన విషయం. దళితులు, లంబాడీలు, వెనుకబడి కులాలు వారు అధికంగా ఉన్నారు. పేద, మధ్య తరగతి, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. పేదరికంతోనే ఆత్మహత్యలకు పాల్పడడం లేదు.. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయి., అప్పులు పెరిగి.. ప్రభుత్వం, చుట్టు ఉన్నవారు ఎవరూ తమను ఆదుకోరని.. తాను ఒంటరినని భావించి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేనేత, రైతాంగంలో ఆత్మహత్యలు కనబడుతున్నాయి. పేద, మధ్య తరగతి, వాణిజ్య పంటలు వేసేవారు, అప్పుల్లో కూరుకుపోయిన వారు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే రైతుల ఆత్మహత్యలకు అప్పులను కారణంగా చూపకుండా... వారి ఆత్మహత్యలకు సాధారణ కారణాలని ప్రభుత్వం చెబుతుంది. అది సరికాదు. ప్రభుత్వాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పవన్ అనే విద్యార్థి నారాయణ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయం చేసుకున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 

 

టీడీపీ కేంద్రం, తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : నగరంలోని ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో టీడీపీ కేంద్ర, తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎపి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎపి టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణలు ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇల్లు కూలి దంపతుల మృతి

హైదరాబాద్ : హుస్సేనీఆలంలో వర్షానికి ఇల్లు కూలింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతులు సయ్యద్ హుస్సేన్ (45), ఫాతిమా (38)లుగా గుర్తించారు. 

కాసేపట్లో టీడీపీ కేంద్రం-తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : కాసేపట్లో టీడీపీ కేంద్రం, తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రమాణ స్వీకారం జరుగనుంది. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించానున్నారు. 

09:46 - October 4, 2015

వరంగల్ : తెలంగాణలో ఉప ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికపై అన్ని పార్టీలు కన్నేయగా.. తాజాగా నారాయణఖేడ్‌ శాసనసభ ఉప ఎన్నికపై చర్చ ఊపందుకుంది. రెండు స్థానాలకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడుతున్నట్లు వార్తలు వస్తుండటంతో.. అధికార పార్టీ అందుకు సిద్ధమవుతోంది. నారాయణఖేడ్‌ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..లేదా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.
వరంగల్‌, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలు
త్వరలో జరగునున్న వరంగల్‌, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలకు అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారంతో.. పార్టీ నేతలు టికెట్ దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ టికెట్ దక్కితే విజయం సులువే అన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. అయితే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు గులాబి పార్టీ పెద్దలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎంత పోటీ ఉన్నా గెలుపు గుర్రానికే ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.
నారాయణఖేడ్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో నారాయణఖేడ్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని అటు అధికార పార్టీ.. ఇటు విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటినుంచే రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అయితే ఈ సీట్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. హైకమాండ్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఏకగ్రీవానికి కాంగ్రెస్ ప్రయత్నాలు
నారాయణఖేఢ్‌ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఏకగ్రీవం చేయాలని ఆ పార్టీ కోరుతోంది. కానీ గులాబి బాస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదని సమాచారం. దీంతో స్థానిక నేతలు పోటీ తప్పదనే అంచనాకు వస్తున్నారు. అయితే చివరి నిమిషం వరకు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియక వారిలో టెన్షన్‌ నెలకొంది. పరిస్థితులు ఎలా మారినా.....ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకు జిల్లా నేతలు రెడీ అవుతున్నారు. ఏదీ ఏమైనా రెండు ఉప ఎన్నికల స్థానాలకు గులాబీ బాస్‌ ఎవరిని ఎంపిక చేస్తారన్నది సర్వాత్ర ఆసక్తి రేపుతోంది.

 

09:42 - October 4, 2015

శ్రీకాకుళం : జిల్లాలో డయేరియా విజృంభించింది. దీంతో.. సిగడం మండలం వెలగాడ గ్రామంలో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో.. బాధితులను రాజాం ఆస్పత్రికి తరలించారు.

 

09:40 - October 4, 2015

హైదరాబాద్ : తన తాజా చిత్రం బ్రూస్లీని ఈ నెల 15వ తేదీన దేవనార్‌ స్కూల్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని హీరో రామ్‌ చరణ్‌ తెలిపారు. దేవనార్‌ వరడల్డ్‌ సైట్‌ డే సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా దగ్గర బ్లైండ్‌ ఫోల్డ్‌ వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ.. చిన్నారులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

 

09:37 - October 4, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో నిన్న గోదావరిలో గల్లంతయిన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. పురుశోత్తమ్‌పట్నంలో వద్ద ఉన్న గోదావరిలో ప్రమాదవశాత్తూ జారిపడి నలుగురు గల్లంతయ్యారు. అయితే ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. చిన్నకొండేరు వీరబాబు, దీపికగా పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపును తీవ్రతరం చేశారు.

 

09:33 - October 4, 2015

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. హేమంత్‌కుమార్‌కుమార్‌ అనే టీవీ జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు పొట్టనపెట్టుకున్నారు. చండూలి గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌ కూరగాయాల మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా...గుర్తుతెలియని దుండగులు హేమంత్‌కుమార్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన హేమంత్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో హేమంత్‌కుమార్‌ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఎందుకు కాల్పులు జరిపారో విచారణలో తేలుతుందని..నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

 

09:31 - October 4, 2015

గుజరాత్ : పటేల్‌ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న హార్దిక్‌ పటేల్‌పై కరెన్సీ వర్షం కురిసింది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన పటీదార్‌ సన్మాన కార్యక్రమానికి పటేల్‌ హాజరయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న హార్దిక్‌పై ఇతర నేతలు, కార్యకర్తలు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీంతో.. వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. అయితే.. హార్దిక్‌ వారిని ఏమాత్రం వారించకుండా ప్రసంగం కొనసాగించడం గమనార్హం.

09:20 - October 4, 2015

మహబూబ్ నగర్ : ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ సర్కార్‌ దృష్టి కేంద్రీకరించింది. ప్రాజెక్టుల పూర్తి కోసం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్లు, సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సర్కార్‌ ఆదేశించింది. ఎట్టి పరిస్థితిలోనూ అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్‌ అంటోంది.
రెండు వారాల్లో సర్వే పనులు
పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రులు హరీష్‌రావు, జూపల్లి, లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల ప్రాజెక్టులంటే గతంలో మాదిరిగా ఏళ్లకు ఏళ్లు కాకుండా.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు కేసీఆర్‌. పాలమూరు ఎత్తిపోతల పథకంపై రెండు వారాల్లో సర్వే పనులు పూర్తి చేసి.. డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తి
ఇక ఈ టెండర్ల ప్రక్రియ కూడా రెండు వారాల్లోనే పూర్తి చేసి.. ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ రెండేళ్లలోనే పాలమూరు ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలన్నారు. వలస జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లాను పసిడి పంటలు పండే జిల్లాగా మారుస్తామన్నారు. ఇక ప్రతి సోమవారం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీష్‌రావును కేసీఆర్‌ ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణపై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని కలెక్టర్‌ శ్రీదేవిని ఆదేశించారు.
నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత
నీటిపారుదల రంగానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేసీఆర్‌. ప్రతి ఏటా 25 వేల కోట్లను నీటిపారుదల రంగానికి కేటాయిస్తామన్నారు. ప్రాజెక్టుల పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు డిజైన్ల తయారీలో అవసరమైతే రిటైర్డ్‌ ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ఏది ఏమైనా రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని కేసీఆర్‌ అన్నారు.

 

నేడు భారత్ లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన

ఢిల్లీ : జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ నేడు భారత్ లో పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. 

మంచిర్యాలలో నేటి నుంచి ఏఐటీయూసీ తొలి మహాసభలు

ఆదిలాబాద్ : మంచిర్యాలలో నేటి నుంచి ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభలకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ హాజరవ్వనున్నారు. 

08:51 - October 4, 2015

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో ఉదయం 5గంటలకు శంషాబాద్‌ మండంల మదనపల్లి వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 32 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. 

08:43 - October 4, 2015

కర్నూలు : తెలుగురాష్ట్రాల్లో ప్రయాణాలు భయాందోళన కలిగిస్తున్నారు. కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హిందూపురం వెళ్తోంది. మార్గంమధ్యలో తెల్లవారుజామున అవుకు రిజర్వాయర్‌ సమీపంలో బస్సు బోల్తా పడింది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అక్కడి నుంచి రోడ్డుపైకి చేరుకున్న ప్రయాణికులు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

 

మురళీకృష్ణ కృష్ణ ట్రావెల్స్ బోల్తా...

రంగారెడ్డి : శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద మురళీకృష్ణ కృష్ణ ట్రావెల్స్ బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

08:09 - October 4, 2015

చండీఘర్ : హర్యానాలోని గుర్‌గావ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫర్నీచర్‌ షాపులో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల భారీగా మంటలంటుకున్నాయి. దీంతో షాపులో ఉన్న ఫర్నీచర్‌ అంతా పూర్తిగా దగ్దం అయింది. ఫర్నీచర్‌తో పాటు...వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. 

07:59 - October 4, 2015

కరీంనగర్ : జిల్లాలోని గోదావరిఖనిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్త....మద్యం మత్తులో భార్య, కొడుకుపై కత్తిపీటతో దాడిచేశాడు. దీంతో భార్య, కొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని రాంనగర్‌లో నివాసం ఉండే...సమ్మయ్య సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సమ్మయ్యకు భార్య శారద, కుమారుడు వంశీ ఉన్నారు. అయితే సమ్మయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. రాత్రి కూడా పీకలదాకా మద్యం సేవించి ఇంటికొచ్చిన సమ్మయ్య..భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో భార్య, కొడుకుపై కత్తిపీటతో దాడిచేశాడు. దీంతో భార్య శారద తలకు, వంశీకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. సమ్మయ్యను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

 

07:44 - October 4, 2015

ఉత్తరప్రదేశ్ : గోమాంసం తిన్నారన్న అపోహతో ఇఖ్‌లాక్‌ను కొట్టి చంపిన కేసులో పోలీసులు ప్రధాన నిందితులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయనేతలు క్యూ కడుతున్నారు. గ్రామస్థులు నేతలను, మీడియాను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇఖ్‌లాక్‌ కుటుంబం గ్రామం వదిలి లక్నోకు పయనమైంది.
గ్రామస్థుల మూకుమ్మడి దాడి
దాద్రీలోని బిసాడా గ్రామంలో గోమాంసం తిన్నారని, మాంసాన్ని నిలువ ఉంచారన్న పుకార్లు షికార్లు చేయడంతో గ్రామస్థులు మూకుమ్మడిగా దాడి చేసి కర్రలు, ఇటుకలతో ఇంటి యజమాని 52 ఏళ్ల ఇఖ్‌లాక్‌ను కొట్టి చంపిన కేసులో 20 ఏళ్ల విశాల్‌ రాణా, శివంకుమార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి విశాల్‌ గ్రామంలో సమావేశం జరిపి ఇఖ్‌లాక్‌ కుటుంబంపై దాడి చేయడానికి జనాలను రెచ్చగొట్టాడని పోలీసులు చెబుతున్నారు. నిందితులంతా బిసాడా గ్రామానికి చెందిన వారే కావడంతో వారి కుటుంబాలు విచారణకు సహకరించడం లేదంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేతల 'క్యూ'
ఈ ఘటనకు రాజకీయరంగు పులుముకోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేతలు క్యూకట్టారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దాద్రీ ఘటనపై ప్రధాని ఎందుకు మౌనం వీడడంలేదని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇఖ్‌లాక్‌ కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరామర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మతచిచ్చు పెట్టాయని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. అఖ్‌లాక్‌ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉంటే... విచారణ పేరిట హిందు కుటుంబాల పిల్లలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీలు నేతలకే లాభం కలిగిందన్నారు.
మీడియాపై గ్రామస్తుల దాడి
ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు మీడియాను అడ్డుకుని దాడి చేశారు. మీడియా, నేతల రాక వల్ల తమ దైనందిన జీవితానికి విఘాతం కలుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో డానిష్‌ కు చికిత్స
గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇఖ్‌లాక్‌ కుమారుడు 21 ఏళ్ల డానిష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో కుమారుడు సర్తాజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఐఎఎఫ్‌ చీఫ్‌ అరుప్‌ రాహా సర్తాజ్‌ కుటుంబం ఎక్కడ ఉండాలంటే అక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని అండగా నిలిచారు.

 

07:36 - October 4, 2015

ముంబై : షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని ఆమెకు వైద్యం అందిస్తున్న జేజే దవాఖాన వైద్యులు శనివారం తెలిపారు. బైకుల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించటంతో శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచీ ఆమె గాఢ నిద్రలోనే ఉన్నదని జేజే దవాఖాన డీన్ టీపీ లహానే తెలిపారు. ఆమెకు నిర్వహించిన గ్యాస్ట్రిక్ పరీక్షలో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభించలేదని, ఆమె శరీరంలోని మత్తు మందును పూర్తిగా తొలగించాలంటే ముందుగా మూత్ర, రక్త పరీక్షలు చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ఆ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ అమర్చలేదని, ఆక్సిజన్ మాత్రం అందిస్తున్నామని వివరించారు. ఇంద్రాణి ఆత్మహత్యాయత్నం చేశారా? అన్న ప్రశ్నకు డాక్టర్‌ లహానే సమాధానమివ్వలేదు.

 

నేడు ఓయూలో 'ప్రైవేట్ రంగలో రిజర్వేషన్లు'పై సదస్సు

హైదరాబాద్ : ప్రైవేట్ రంగలో రిజర్వేషన్లు అనే అంశంపై ఉదయం 10 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ జరుగనుంది. ఈ సదస్సుకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ.గాలి వినోద్ కుమార్ లు పాల్గొననున్నారు.

 

నేటి నుంచి టీఎస్ పీఎస్సీ-2015 డిపార్ట్ మెంటల్ పరీక్షలు

హైదరాబాద్ : నేటి నుంచి 9 వ తేదీ వరకు టీఎస్ పీఎస్సీ-2015 డిపార్ట్ మెంటల్ పరీక్షలు జరుగనున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

07:14 - October 4, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాళ్లు, ఇటుకలతోపాటు ఇప్పుడు డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకే చంద్రబాబు రెడీ అవుతున్నారు. అసలు ఈ డిజిట‌ల్ బ్రిక్స్ అంటే ఏంటి ? వాటిని ఎలా వాడతారో మీరే చూడండి.
భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి ?
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజథాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి.? సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఇంటికో ఇటుక ఇవ్వాలా? లేకపోతే..ఇటుకతో సమానమైన డబ్బును విరాళంగా ఇవ్వాలా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం..మీరు శ్రమటోడ్చి ఇటుకను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటుకతో సమానమైన డబ్బును ఆన్‌లైన్‌ అకౌంట్లో జమచేస్తే చాలు. అంతే మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనట్లే..మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదెలాగో చూడండి.
కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్రిక్స్
డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక డిజిటల్ ఇటుక ఇవ్వాలనుకుంటే క‌నిష్టంగా ప్రభుత్వం నిర్దేశించిన వెయ్యి రుపాయ‌లు మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ఖాతాలోకి జమచేయాలి. అలా జమచేసిన వెంటనే..ఒక డిజిటల్ ఇటుక ఇచ్చినట్లు ఇటుక బొమ్మకానీ..లేదా మెసేజ్ గానీ వస్తుంది. ఎవ‌రి శక్తికి తగ్గట్టుగా ఎన్ని డిజిటల్ ఇటుకలు ఇవ్వాలనుకుంటే అన్ని వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. డిజిటల్ ఇటుకలు ఇచ్చిన వారి పేర్ల జాబితాను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టి బహిరంగపర్చుతారు. అంటే డిజిటల్ బ్రిక్స్ కోసం డబ్బుకడితేచాలు..అమరావతి నిర్మాణంలో స‌ద‌రు వ్యక్తి ఇటుక ఇచ్చినట్లే లెక్క. ఇదే ఆలోచనతో దీన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
చంద్రబాబుకు మరో హైటెక్ ఆలోచన
మొత్తానికి హైటెక్ ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ చంద్రబాబు..మరో హైటెక్ ఆలోచనతో రాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రజల రాజధాని అమరావతి అన్నపేరు సార్థకమయ్యేలా ఉండేందుకు డిజిటల్ బ్రిక్స్ పద్ధతిని తీసుకొస్తున్నారు. మ‌రి ఇది ఎంత మేర‌కూ ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

 

07:06 - October 4, 2015

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌ హౌజ్‌ ప్రాంతంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఆర్మీ జవాను దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు పరస్పరం ఘర్షణ పడగా ఆర్మీ జవాను హెల్మెట్‌తో కానిస్టేబుల్‌ తలపై దాడి చేసినట్లు సమాచారం.

 

నేడు ప్యారిస్ లో వెంకయ్యనాయుడు పర్యటన

ప్రాన్స్ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నేడు ప్యారిస్ లో పర్యటించనున్నారు. 21 వ తెలివైన రవాణా వ్యవస్థ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. వివిధ దేశాల రవాణా రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. 

Don't Miss