Activities calendar

05 October 2015

రేపిస్టు తండ్రికి జైలు శిక్ష..

హైదరాబాద్ : 2011 సంవత్సరంలో జరిగిన ఘటనపై ఓ తండ్రికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. చాంద్రాయణగుట్టలో 9 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన సలీంకు పదేళ్ల జైళు శిక్ష పడింది. 

విత్తన కంపెనీలు ముందుకు రావాలి - కేసీఆర్..

హైదరాబాద్ : విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియలో విత్తన కంపెనీలు భాగస్వాములు కావాలని సూచించారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో విత్తన కంపెనీ దత్తత తీసుకోవాలని, కంపెనీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో రైతులను విత్తన ఉత్పత్తికి ప్రోత్సాహించాలని తెలిపారు. రైతులకు మేలు రకం సాగుపై అవగాహన కల్పించాలని, తెలంగాణలో విత్తనోత్పత్తికి సమశీతోష్ణ వాతావరణం ఉందన్నారు. ఇక్రిశాట్ తో సహా 365 విత్తన కంపెనీలు ఇక్కడున్నాయన్నారు.

రాజధానిపై పూర్తి వివరాలు వివరించా - బాబు..

హైదరాబాద్ : రాజధానిపై పూర్తి వివరాలు ప్రధానికి వివరించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై ప్రధానికి వివరించినట్లు, పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ కు ఆంధ్రప్రదేశ్ అనువైన స్థలమని, ఏపీ లాబిస్టిక్ హబ్ గా తయారవుతుందన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాన మంత్రిని ఆహ్వానించడం జరిగిందని, దీనికి మోడీ అంగీకరించారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ బృందం మూడు బృహత్ ప్రణాళికలు ఇచ్చినట్లు, అత్యుత్తమ రాజధాని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

21:33 - October 5, 2015

ఢిల్లీ : జర్మనీ ఛాన్స్ లర్‌ ఏంజిలా మోర్కెల్‌ భారత్‌ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బస చేస్తున్న మోర్కెల్‌ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోడీ, ఛాన్స్ లర్‌ మోర్కెల్‌ సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోర్కెల్‌ భారత - జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను చాటిచెప్పారు. ఇరు దేశాలు పరస్పరం శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ, వాణిజ్య రంగాల్లోనూ కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిందిగా మోర్కెల్‌ తెలిపారు. కాగా ప్రధాని మోడీ భారత్‌ జర్మనీలు సహజ మిత్రులని, భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై జర్మనీ మద్దతు నివ్వాలని మోడీ తెలిపారు. ఇరు దేశాలు కలిసి సుదీర్ఘ కాలం పాటు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

21:31 - October 5, 2015

బీహార్ : ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని సైతాన్‌, జాలిమ్‌ అంటూ కిషన్‌గంజ్‌లో ఎన్నికల సభలో అక్బరుద్దీన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్‌ నరమేధాన్ని ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్‌- మోడీపై తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగించారు. గుజరాత్‌లో ముస్లింలను తరిమి తరిమి చంపారని, మహిళలు, పిల్లలను సజీవ దహనం చేశారని ఆరోపించారు. గుజరాత్‌ హంతకులను జైలుకు ఎందుకు పంపలేదని కాంగ్రెస్‌ను నిలదీశారు. పైగా బిజెపి నుంచి డబ్బులు తీసుకున్నారని మమ్మల్ని బ్లేమ్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌పై అక్బరుద్దీన్‌ ధ్వజమెత్తారు.

21:30 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చేందుకు విత్తన కంపెనీలు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం అందుకవసరమైన ప్రణాళికను ప్రకటించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణం దృష్ట్యా రాష్ర్టాన్ని సీడ్‌ బౌల్‌గా మార్చాలని విత్తన కంపెనీలను సీఎం కోరారు. తెలంగాణలోని ఒక్కో గ్రామాన్ని.. ఒక్కో విత్తన కంపెనీ దత్తత తీసుకోవాలని కోరారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో రైతులను విత్తనాల ఉత్పత్తికి ప్రోత్సహించాలని కోరారు. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేరాల్పని విత్తన కంపెనీలకు కేసీఆర్‌ సూచించారు. ఏ ప్రాంతంలో ఏ విత్తనాలు వాడాలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. 

21:27 - October 5, 2015

ఢిల్లీ : ఏపీ రాజధాని శంకుస్థాపనకు రావాలని ప్రధాన మంత్రి మోడీని చంద్రబాబు ఆహ్వానించారు. విభజన చట్టం అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను ఆయనతో చర్చించారు. అంతకుముందు సాగరమాల ప్రాజెక్ట్‌ సదస్సుకు హాజరైన చంద్రబాబు పలు సూచనలు, సలహాలు చేశారు. మరోవైపు రాష్ట్రపతి, హోంమంత్రిని కలిసిన గవర్నర్‌ నరసింహన్‌.. తెలుగురాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు.  ఢిల్లీలో జరిగిన సాగరమాల ప్రాజెక్టు సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సదస్సు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ భేటీలో సముద్ర తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలకు చెందిన ఇతర సీఎంలు, ఆర్థిక, జలవనరులు, రైల్వే, గ్రామీణాభివృద్ధి, పర్యాటక,పౌర విమానయాన శాఖలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.

సాగరమాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం..
సాగరమాల ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని... తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. సరుకు రవాణాపై పెరుగుతున్న వ్యయం తగ్గించేందుకు ఇది ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనను అభివృద్ధి పరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన అజెండా అని అన్నారు. విధాన రూపకల్పనకు 6నెలల సమయం పెట్టుకున్నట్లు తెలిపారు. సాగర తీరంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగినా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

అమితాబ్ వర్మతో బాబు భేటీ..
అనంతరం ఏపీ భవన్‌లో కేంద్ర అంతర్గత జలరవాణా శాఖ కార్యదర్శి అమితాబ్‌ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అంతర్గత జలవనరుల అభివృద్ధిపై చర్చించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో చంద్రబాబు సమావేశమయ్యారు. స్వచ్ఛభారత్ కమిటీకి కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు ప్రధానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈనెల 22న ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించారు. దీంతో పాటు విభజన చట్టం అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి ఇతర అంశాలను మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ పర్యటన..
అటు గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్రపతి ప్రణబ్‌లను విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తలసాని రాజీనామా అంశం స్పీకర్‌ పరిధిలో ఉందన్నారు. త్వరలోనే విద్యుత్‌ ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు. మంగళవారం రక్షణశాఖ మంత్రితో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపారు. 

21:03 - October 5, 2015

ఏ మలుపులో ఏ దొంగ ఉంటాడో తెలియదు. ఏ బస్టాపులో ఏ చోరీ కాపు కాస్తాడో బోధ పడదు. ఏ బైక్ మీద నుండి రయ్యిలా దూసుకొస్తాడో అంతుపట్టదు. ఏన్నాళ్ల నుండి మెడలో ఉన్న బంగారు గొలుసులపై కేటుగాళ్లు కన్ను పెట్టాడో ఊహకు కూడా రాదు. ఏ వీధి గుండా వెళ్లాలో..ఏ రోడ్డు పక్కన తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో మహిళలు అర్థం కావడం లేదు. మహిళలకు భద్రత ఇదేనా ? సెక్యూర్టీ అంటే వీవీఐపీల సేవలో తరించడమేనా ? ఛైన్ స్నాచర్ల ఆగడాలు..ప్రభుత్వాల చర్యలపై 'వైడాంగిల్'..

20:53 - October 5, 2015

ఆర్తి అగర్వాల్ 'ఆత్మ'నా..వచ్చేస్తుందా..ఏంటీ విషయం అని ఆశ్చర్యపోతున్నారా. అసలు విషయం తెలుసుకోవాలంటే ఇది చదవండి..అతి చిన్న వయసులోనే 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన 'ఆర్తి అగర్వాల్' తక్కువ వ్యవధిలోనే మంచి హోదాని పొందింది. వరుస హిట్లతో స్టార్ హీరోల సరసన నటించింది. రాను రాను అవకాశాలు తగ్గడం..అదే సమయంలో వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని డౌన్ చేశాయి. ఇటీవలే బరువు తగ్గే ప్రయత్నంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే 'ఆర్తి' నటించిన 'ఆత్మ' త్వరలోనే విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్దం అవుతున్నారు. ఆత్మ ప్రతీకారం నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 'ఆర్తి' జీవితంలో చిట్టచివరి సినిమా అని అంటున్నారు. అదండి విషయం.

20:50 - October 5, 2015

సామాజిక అంశానికి కమర్షియల్ ఎలివెంట్స్ జోడించి అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించగలే దర్శకుల్లో 'శంకర్' ఒకరు. జెంటిల్ మేన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, ఒకే ఒక్కడు ఆ కోవలకే చెందినవే. తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయి గురింపు తెచ్చాడు. తాజాగా శంకర్ 'రోబో' సీక్వెల్ గా 'రోబో - 2' ను రూపొందించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకంగా ఉండే విలన్ కోసం 'శంకర్' చాలా కసరత్తు చేస్తున్నాడంట. మొదట విలన్ గా 'అమీర్ ఖాన్'..తరువాత 'షారుఖ్'..'కమల్'..'విక్రమ్' ఇలా అనుకున్నారంట. కానీ కుదరలేదని టాక్. చివరకు 'రోబో - 2' కు విలన్ గా హాలీవుడ్ స్టార్ 'ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్' తో శంకర్ టీం చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆర్నాల్డ్ కూడా విలన్ గా చేయడానికి అంగీకరించినట్లు టాక్. 'శంకర్' 'ఐ' ఆడియో వేడుకలో 'ఆర్నాల్డ్' హాజరై సందడి చేసిన విషయం విదితమే. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. 

20:43 - October 5, 2015

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన 'శ్రీమంతుడు' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తరువాతి చిత్రం 'బ్రహ్మోత్సవం' ఇంకా సెట్స్ పైన ఉండగానే సోషల్ మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ 'మురుగదాస్' తో సినిమా చేస్తున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'మురుగదాస్' ఓ స్టోరీ లైన్ వినిపించగా 'మహేష్' దానిని డెవలప్ చేయాలని సూచించాడట. 'బ్రహ్మోత్సవం' తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నదని టాక్. దీనితో 'మహేష్' అభిమానులు 'గజని'కి సీక్వెల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. మరి ఈ వార్తలు నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే 'మహేష్' లేదా 'మురుగదాస్' చెప్పాలి.

 

భారత్ 92 ఆలౌట్..

కటక్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ 92 పరగులకే కుప్పకూలిపోయింది.
భారత్ బ్యాటింగ్ : శర్మ (22), ధావన్ (11), కోహ్లీ (1), రైనా (22), రాయుడు (0), ధోని (5), పటేల్ (9), హర్భజన్ సింగ్ (0), అశ్విన్ (11), కుమార్ (0) పరుగులు సాధించగా మోహిత్ శర్మ 0 నాటౌట్ గా మిగిలాడు.
సౌతాఫ్రికా బౌలింగ్ : మోర్కెల్ మూడు, మోరిస్, తాహిర్ లు చెరో రెండు, రబడ ఒక వికెట్ తీశారు. 

20:29 - October 5, 2015

ముంబై: బాలీవుడ్ హాట్ హీరోయిన్ 'కంగనా రనౌత్' కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై 'ఉమెన్ ఇన్ ది వరల్డ్' పేరుతో సమావేశాలు జరుగనున్నాయి. ఈ చర్చలు ఈనెల 8, 9వ తేదీలలో లండన్ లో జరుగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనాలని 'కంగనా'కు ఆ సమిట్ నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశాల్లో పాల్గొనే మొదటి బాలీవుడ్ హీరోయిన్ 'కంగానే'కే ఆ క్రెడిట్ దక్కనుంది.
గత ఏడాది ఏంజెలినా జోలీ, హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, క్యారీ ముల్లిగన్ వంటి భామలు పాల్గొననున్నారు. మరి ఈ సమావేశంలో 'కంగనా' ఎలాంటి కామెంట్లు చేయనుందో, ఏ విధంగా స్పందించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

భారత్ 73/7..

కటక్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. 13 ఓవర్లల్లోనే 73 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 

అక్బరుద్దీన్ పై బీహార్ లో కేసు..

పాట్నా: ప్రధాని మోడీ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

20:06 - October 5, 2015

గోమాంసం తిన్నారన్న పుకార్లతో గ్రామస్తులు అఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటనపై రాజకీయ మంటలు చల్లారలేదు. బిజెపి అధికారంలోకి వచ్చాకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు కమలాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులు బిజెపి నేతకు సంబంధించినవారు కావడం గమనార్హం. మరోవైపు యుపి మైనారిటీ మంత్రి ఆజంఖాన్‌ దీనిపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ప్రొ.విశ్వేశ్వరరావు (సామాజిక విశ్లేషకులు), జంగా గౌతమ్ (ఏపీ కాంగ్రెస్), మాల్యాద్రి (కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి), రామరాజు (వీహెచ్ పి)పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.

20:02 - October 5, 2015

ఉత్తర్ ప్రదేశ్ : తండ్రి చనిపోయినా ఆ బాధను గుండెల్లోనే దాచుకున్నాడు...తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నా అతడి క్షేమం గురించి ప్రార్థించమంటున్నాడు. తండ్రిని చంపారన్న కక్ష్యతో కాకుండా దేశంలో మత సామరస్యాన్ని కాపాడలని విజ్ఞప్తి చేస్తున్నది ఎవరో కాదు దాద్రీ మూకుమ్మడి దాడి ఘటనలో చనిపోయిన ఇఖ్లాక్‌ కుమారుడు సర్తాజ్‌. ఎయిర్‌ ఫోర్స్ లో పనిచేస్తున్న సర్తాజ్‌ 'సారే జాహాసే అచ్ఛా... హిందూ సితా హమారా' అంటూ దేశం పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నాడు. కొన్ని దశాబ్దాలుగా బిసాడాలో ఉంటున్న తమ కుటుంబానికి ఎవరితోనూ గొడవలు లేవని ఇలాంటి ఘటన జరగడం పట్ల గ్రామంలో అభద్రతా భావం పెరిగిందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని, తమ కుటుంబానికి అండగా నిలబడ్డవారందరికీ సర్తాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షించాలన్నారు. తమ బాగోగులు చూసే ఎయిర్‌ఫోర్స్ పెద్దలు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటామని సర్తాజ్‌ పేర్కొన్నాడు.

19:52 - October 5, 2015

ఉత్తర్ ప్రదేశ్ : మదమెక్కిన మతోన్మాదం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తోంది. మన మెనూ కూడా మనుశాస్త్రమే చెబుతుందంటూ మరణ మృదంగాన్ని మోగిస్తున్నారు. వంటింట్లోకి సైతం చొరబడి వారి పైత్యాన్ని వడ్డన చేస్తామంటున్నారు. జంతు హింస తగదంటూనే మానవ హింసకు తెగబడుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతీయ సమాజంలో భిన్నత్వాన్ని సహించమంటున్నారు. నిజాలు రాసే జర్నలిస్టు..తాము చెప్పే సంస్కృతిని పాటించనివారు.. ఎవరైనా సరే వారిపై అసహనంతో విరుచుకుపడుతున్నారు. ఊ కొట్టనివారి ఊపిరిని తీసేస్తున్నారు. ఎవరి అండతో వారు ఈ కండకావరం చూపిస్తున్నారు? ఎవరి మద్దతుతో ఇలా చెలరేగిపోతున్నారు? వీరిని ఆపేదెవరు? ఆపాల్సింది ఎవరు? గోమాంసం తిన్నారన్న పుకార్లతో గ్రామస్తులు అఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటనపై రాజకీయ మంటలు చల్లారలేదు. బిజెపి అధికారంలోకి వచ్చాకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు కమలాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులు బిజెపి నేతకు సంబంధించినవారు కావడం గమనార్హం. మరోవైపు యుపి మైనారిటీ మంత్రి ఆజంఖాన్‌ దీనిపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.

దాద్రీ ఘటనపై ఐక్యరాజ్యసమితికి లేఖ..
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ గ్రామంలో గోవును చంపి తిన్నాడనే ఆరోపణలపై గ్రామస్థులు ముస్లిం కుటుంబంపై దాడి చేసి ఇంటి యజమాని అఖ్లాక్‌ను కొట్టిచంపిన ఘటన ఇంకా మంటలు రేపుతూనే ఉన్నది. ముఖ్యంగా బిజెపి ఎస్పీల మధ్య వార్‌ మరింత వేడెక్కింది. సిఎం అఖిలేష్‌ యాదవ్‌ మతం రంగు పులుముతున్నారని బిజెపి ఆరోపించింది. పథకం ప్రకారమే బిజెపి బిసాడాలో అఖ్లాక్‌ కుటుంబంపై దాడి చేసిందని ఎస్పీ ఆరోపిస్తోంది. మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌- ముస్లింల నరమేధానికి కంకణం కట్టుకుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆజంఖాన్‌ ధ్వజమెత్తారు. బీఫ్‌ అమ్మే స్టార్‌ హోటళ్లను కూడా బాబ్రీ మసీదులా బద్దలు కొట్టండని ఆగ్రహించారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాసినట్టు మంత్రి పేర్కొన్నారు.

9 మంది అరెస్టు..
అఖ్లాక్‌ను కొట్టి చంపిన కేసులో యుపి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. ఇందులో ఏడుగురు బిజెపి నేత సంజయ్‌ రాణా అనుచరులే. ప్రధాన నిందితుడు విశాల్‌ రాణా సంజయ్‌ రాణా కొడుకు కావడం గమనార్హం. విశాల్‌ రాణా గ్రామంలో సమావేశం జరిపి అక్లాక్ కుటుంబంపై దాడి చేయడానికి జనాలను రెచ్చగొట్టాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు వివేక్‌, సచిన్‌, సౌరభ్, గౌరవ్, శివం, సందీప్‌లు సంజయ్‌ రాణాకు సమీప బంధువులే. నిందితులంతా బిసాడా గ్రామంలోని ఇరుగు పొరుగు కుటుంబాలా వారే.

పరామర్శించిన అఖిలేష్ యాదవ్..
బిసాడా నుంచి లక్నోకు వెళ్లిన అఖ్లాక్‌ కుటుంబాన్ని ఆదివారం ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పరామర్శించారు. ఇంతకుముందు 20 లక్షలు ప్రకటించిన పరిహారాన్ని 30 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. వీటితోపాటు మృతుడి ముగ్గురు సోదరులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున15 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. దాడిలో గాయపడిన అఖ్లాక్ కుమారుడు డానిష్‌కు వైద్యచికిత్సకు అయ్యే ఖర్చును కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని సిఎం హామీ ఇచ్చారు.

బిసాడకు నేతల క్యూ..
గత సోమవారం ఆవును చంపి గోమాంసం తిన్నారంటూ గుళ్లో మైక్‌ ద్వారా ప్రకటన రావడం..ఈ పుకార్లతో రెచ్చిపోయిన కొంతమంది అక్లాక్ కుటుంబంపై కర్రలు, ఇటుకలతో దాడి చేశారు. దీనితో 52 ఏళ్ల అఖ్లాక్‌ మృతి చెందాడు. అతడి కుమారుడు డానిష్‌ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటనకు రాజకీయరంగు పులుముకోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేతలు బిసాడాకు క్యూకట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌, కేంద్రమంత్రి మహేష్‌ శర్మ ఉన్నారు. రాజకీయ వత్తిళ్లను తట్టుకోలేక బాధిత ఇఖ్లాక్‌ కుటుంబం బిసాడా నుంచి లక్నోకు షిఫ్ట్ అయింది.

అంబటి రాయుడు డకౌట్..

కటక్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో భారత్ ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాలో పడింది. శర్మ (22), ధావన్ (11), కోహ్లీ (1), రాయుడు (0) పెవిలియన్ చేరారు. 

ఇసుక అక్రమ రవాణా తరలించిన వారికి రిమాండు..

ప్రకాశం : చీమకుర్తిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న 29 మందికి 14 రోజుల జిల్లా కోర్టు రిమాండ్ విధించింది.

 

 

నీటి కుంటలో పడి విద్యార్థుల మృతి..

అనంతపురం : కళ్యాణదుర్గం (మం) కుర్లపల్లి సమీపంలో నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు రాణి, హర్షితగా గుర్తించారు.

 

సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన జమ్మూ ప్రభుత్వం..

శ్రీనగర్: పశు మాంసం విక్రయంపై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది.

బీహార్..బీజేపీ నాలుగో జాబితా..

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నాలుగవ జాబితాను బీజేపీ విడుదల చేసింది. హజీపూర్, పలిగంజ్ నియోజవర్గాలనుంచి అవదేశ్‌కుమార్, రంజానమ్ శర్మలను అభ్యర్థులుగా పోటీలో ఉండనున్నారని బీజేపీ ప్రకటించింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

కటక్ : దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ అరవింద్ స్థానంలో హర్బజన్ ను తీసుకున్నారు.

హోం శాఖ్ కార్యదర్శితో ముగిసిన గవర్నర్ భేటీ..

ఢిల్లీ : హోం శాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తలసాని అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్య కూడా పరిష్కారమౌతుందని, అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వెళుతానని తెలిపారు. రాష్ట్రపతి, హోం శాఖతో సమావేశం కావడం జరిగిందని, మంగళవారం రక్షణ శాఖ మంత్రితో సమావేశం ఉంటుందన్నారు.

 

18:42 - October 5, 2015

విశాఖపట్టణం : అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అధికారులపై వాగ్వాదానికి దిగారు. పురపాలక శాఖాధికారులపై తిట్ల దండకం అందుకున్నారు. చివరకు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే..హుదూద్ తుపాన్ కు సంబంధించిన భూముల కేటాయింపు విషయంలో మాట్లాడాలని అపాయింట్ మెంట్ ఇవ్వాలని పురపాలక శాఖాధికారులకు ఎమ్మెల్యే కోరినట్లు తెలుస్తోంది. కానీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో సోమవారం సాయంత్రం నేరుగా కార్యాలయానికి ఎమ్మెల్యే రామకృష్ణ చేరుకున్నారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు వేరే సమావేశంలో ఉన్నారు. దీనితో ఎమ్మెల్యే మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులకే ఇలా ఉంటే సామాన్య ప్రజానీకానికి ఎలా ఉంటుందంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాళ వళవన్ తో రామకృష్ణ గొడవకు దిగారు. చివరకు పురపాలక శాఖాధికారులు మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. తొందరపాటులో తాను అలా తిట్టడం జరిటగిందని ఎమ్మెల్యే పేర్కొనగా ఇదంతా మాములే అని అధికారులు పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. 

18:31 - October 5, 2015

విజయనగరం : ఇష్టం లేకుండా సెంటు భూమి తీసుకోవడానికి ఎవరు వచ్చిన బాధితుల తరఫున వ్యతిరేకిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఏ రావివలసలో విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. భూముల విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. భోగాపురం విమాశ్రయం కోసం ప్రభుత్వం సేకరించ తలపెట్టిన భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. భోగాపురం మండలం రావివలసలో ఎయిర్‌పోర్టు బాధితులు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.

ఉపసంహరించుకోవాలి..
పచ్చని పంటపొలాలను సెజ్‌ల పేరిట రైతుల దగ్గర నుంచి భూములను బలవంతగా తీసుకుంటోందని జగన్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తామని జగన్‌ హెచ్చరించారు. భూముల విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా రైతులకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే ఇదే ప్రాంతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెందిన భూములు ఉన్నాయని ఆయన భూములు వదిలి... కేవలం రైతుల భూములు మాత్రమే తీసుకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

బాధితులతో జగన్ ముఖాముఖి..
ఈ సందర్భంగా భోగాపురంలోని బాధితులతో జగన్‌ ముఖా ముఖి నిర్వహించారు. తమ ఊరికి ఎర్ర బస్సే రాదు ... ఇంకా ఎయిర పోర్ట్ ఎందుకు సార్ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని గూడెపువలస గ్రామానికి చెందిన నర్సాయమ్మ అనే యువతి ప్రశ్నించింది. ఎయిర్పోర్ట్ వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది. కావాలంటే ప్రాణాలైన ఇస్తాం కానీ... భూములు మాత్రం ఇవ్వమని నర్సాయమ్మ తెలిపింది.

జగన్ పై మంత్రి మృణాళిని ఫైర్..
ఇదిలా ఉంటే జగన్‌ విజయనగరం పర్యటనపై జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎయిర్‌ పోర్టును ఎంత మంది రైతులు అడ్డుకున్నా ఆగదని స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు రక్షణ శాఖ ఆధీనంలో ఉండటం వల్ల ఆంక్షలు ఉన్నాయన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేయాల్సిన అవకాశం ఉందన్నారు. మొత్తానికి భోగాపురంలో రైతులు మొదలు పెట్టిన ఆందోళన ఉద్యమం రూపు సంతరించుకుంది. విపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి బలంగా బద్దతు లభిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో తేలాల్సి ఉంది.

హక్కుల సాధనకై మైనార్టీల ఉద్యమించాలి - ఏచూరి..

హైదరాబాద్ : హక్కుల సాధనకై మైనార్టీలు ఉద్యమించక తప్పదని, మైనార్టీల ఉద్యమానికి సీపీఎం మద్దతు ఉంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి తెలిపారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మైనార్టీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. మైనార్టీలకు సబ్ ప్లాన్ చట్టం...12 శాతం రిజర్వేషన్ ల అమలు చేయాలని ఏచూరి డిమాండ్ చేశారు. సీపీఎం హాయాంలో బెంగాల్ లో మైనార్టీలకు సబ్ ప్లాన్..రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని తెలిపారు. 

రేపటి నుండి ఆందోళన – రమణ..

హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపటి నుండి టిడిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మిత్రపక్షంతో కలిసి ధర్నాలు చేస్తామని, రేపు గజ్వేల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. 7,8,9 తేదీల్లో హన్మకొండ, నిజామాబాద్, రంగారెడ్డి, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రూ. లక్షలోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని అలాగే కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో ఎమ్మెల్యే వాగ్వాదం..

హైదరాబాద్ : పురపాలక శాఖాధికారులతో విశాఖపట్టణం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వాగ్వాదానికి దిగారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాళ వళవన్ తో రామకృష్ణ గొడవకు దిగారు. అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటూ రామకృష్ణ దుర్భషలాడారు. 

మోడీతో బాబుతో భేటీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. స్వచ్ఛ భాతర్ కమిటీకి కన్వీనర్ గా ఉన్న బాబు ఆయనకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. విభజన చట్టం అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి ఇతర అంశాలను మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. 

జమ్మూ లో కాల్పులు..విజయనగరం జవాన్ మృతి ?

జమ్మూ కాశ్మీర్ : గత అర్ధరాత్రి జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ రాష్ట్రానికి చెందిన బొత్త సత్యం (36) మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాద్రి గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. 

17:58 - October 5, 2015

ఖమ్మం : జిల్లా మణుగూరులో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. విజయనగరం గ్రామానికి చెందిన విద్యార్థులు రామానుజవరంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని తప్పించుకునే క్రమంలో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోజు రావాల్సిన డ్రైవర్ రాకపోవడంతో వేరే డ్రైవర్ వచ్చాడని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

17:57 - October 5, 2015

హైదరాబాద్ : ఛైన్ స్నాచర్ల ఆట కట్టిస్తామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామన పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ టెన్ టివితో మాట్లాడారు. చైన్‌ స్నాచర్ల ఆటకట్టించేందుకు తనఖీలు పెంచామన్నారు. ఛైన్ స్నాచింగ్ తీవ్రమైన నేరంగా పరిగణించామని, కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని తనిఖీలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాత్రి 5వందల మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు. 160 మందిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఉన్నారన్నారు. కరుడుగట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు, వీరి ఫింగర్ ప్రింట్ తీసుకుని ఆయా రాష్ట్రాల్లో ఏవైనా కేసులున్నాయో లేదో పరిశీలిస్తామన్నారు. ఛైన్ స్నాచర్లను ఉక్కుపాదంతో మోపడమే తమ కర్తవ్యమన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం తక్కువగా ఉందని, ఇతర నగరాల్లో కంటే చూస్తే తక్కువగా ఉందని డీసీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

17:52 - October 5, 2015

హైదరాబాద్ : తాము నాస్తికులమైనా ప్రజల దైవ విశ్వాసాలకు రక్షకులుగా ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హామీనిచ్చారు. ప్రజలు ఎవరు ఏ దేవుడిని విశ్వసించినా...ఆ విశ్వాసం యొక్క అధికారాన్ని కమ్యూనిస్టు రక్షిస్తుందన్నారు. పరామత్మ, ఆత్మ మధ్య ధర్మం అనే సంబంధం రక్షిస్తుందని...ఏ మతమైనా ఇదే విషయాన్ని చెబుతుందన్నారు. పరామత్మ ఎవరూ అనేది ఆత్మనే ఎంచుకుంటుందన్నారు. ఆ అధికారం ఆత్మదేనని, ఇతరులకు హాని కలిగించే హక్కు ఎవరికీ లేదని ఏచూరీ స్పష్టం చేశారు. 

17:50 - October 5, 2015

కరీంనగర్ : నిత్యావర ధరలు పెరిగిపోయాయనని..ఇక అంబలే గతా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా కరీంనగర్‌లో సీపీఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. మహిళలు అంబలి తయారు చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో చాడ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా.. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని లేకుంటే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

17:48 - October 5, 2015

హైదరాబాద్ : తలసాని పార్టీ మార్పు వివాదానికి టీఆర్‌ఎస్‌ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమవుతోందా? సనత్‌నగర్‌ ఉప ఎన్నికకు అధికార పార్టీ రెడీ అవుతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సనత్‌నగర్‌ ఉప ఎన్నికతోపాటు గ్రేటర్ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు పార్టీ హై కమాండ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి అధికార పార్టీ గూటికి చేరిన మంత్రి తలసాని వ్యవహారంపై గులాబీ పార్టీ స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్‌ రాజీనామా వ్యవహారాన్ని తేల్చాలని, మంత్రి పదవి నుంచి తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న గులాబీ..
ఈ అంశంలో గులాబీ పార్టీ కూడా కాస్తా ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంది. స్పీకర్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై మాట్లాడేది లేదంటూ అధికార పార్టీ నేతలు దాట వేస్తూ వస్తున్నారు. అయితే త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యూహం మార్చిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు... లేదంటే తర్వాత సనత్‌నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికకు రెడీ ?
సనత్‌నగర్‌ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆ నియోజకవర్గంలోనే మొదలు పెట్టి త్వరలో వాటిని లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రెండోవిడతలో ఆ నియోజకవర్గ పరిధిలో మరిన్ని గృహాలను సీఎం మంజూరు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సనత్‌నగర్ నియోజకవర్గం నుంచే గులాబీ పార్టీ శ్రీకారం చుట్టింది. దీంతో సనత్ నగర్‌లో పైచేయి సాధించాలనే అభిప్రాయంతో అధికార పార్టీ నేతలున్నట్లు సమాచారం. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంతో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న గ్రేటర్ మంత్రులు కూడా సనత్ నగర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమనే వ్యాఖ్యలు చేయడం త్వరలో ఉప ఎన్నికలకు రెడీ అన్న సంకేతాలేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

17:45 - October 5, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. రైతు సమస్యల పరిష్కారం కోసం జెండాలను పక్కనపెట్టి ఉద్యమబాటపట్టాయి. ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. మొదట మంగళవారమే బంద్‌కు పిలుపునివ్వాలని టీడీపీ,బీజేపీలు ప్రతిపాదించాయి. దీనిపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. రైతు సమస్యలపై జిల్లా పర్యటనల తర్వాతే బంద్ చేయాలని జానా సూచించారు. దీనికి టీడీపీ,బీజేపీలు ఏకీభవించాయి. ఈనెల 6 నుంచి జిల్లా కేంద్రాల్లో రైతు భరోసా యాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలపాలని తెలుగు దేశం పార్టీ డిసైడ్ అయ్యింది. అసెంబ్లీలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర..
తెలంగాణ జిల్లాల్లో రైతు భరోసాయాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి ఈ యాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 6న మహబూబ్ నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసాయాత్రలు చేపడుతామన్నారు. 10న రాష్ట్ర బంద్ సందర్భంగా ఆరోజు యాత్ర ఉండదని చెప్పారు. అప్పులబాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, రైతులలో ధైర్యాన్ని నింపేందుకు తమ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని టీపీసీసీ చీఫ్ వివరించారు.

దిష్టిబొమ్మల దహనం..
10న తెలంగాణ బంద్‌ సందర్భంగా...అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలపుతామని టీ టీడీపీ నేత ఎల్‌ రమణ ప్రకటించారు. మామ అల్లుళ్లు అసెంబ్లీని ఆటవిడుపు కేంద్రంగా మార్చారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో మామా అల్లుడిదే రాజ్యం అన్నారు.. కేసీఆర్ హరీష్ రావు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ రాజ్యానికి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని రేవంత్ అరోపించారు. రైతులకు రుణమాఫీ అయ్యే వరకు ప్రతిపక్షాలన్ని ఏకమై పోరాడుతామన్నారు.

ఒకేసారి మాఫీ చేయాలి - సీపీఎం, సీపీఐ..
అసెంబ్లీ సమావేశాల్లో నేడు చీకటి రోజని విపక్షాలు ధ్వజమెత్తాయి. రైతుల పక్షాన మాట్లాడితే అసెంబ్లీ నుంచి గెంటివేశారని ప్రభుత్వంపై మండిపడ్డాయి. రైతు రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేయాలని సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. మొత్తంగా రైతు సమస్యలే ఎజెండాగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ నెల 10న బంద్‌కు సిద్ధమవుతున్నాయి. మరి ఆ లోగా కేసీఆర్‌ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ పై టి.సీఎస్ సమావేశం.

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. 

బాలల హక్కు సంఘాన్ని ఆశ్రయించిన బాలిక..

హైదరాబాద్ : తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని ఇంటి నుండి పారిపోయిన బాలిక ఐశ్వర్య బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బోడుప్పల్ లో ఉంటున్న తండ్రి శ్రీనివాస్ పై ఐశ్వర్య ఫిర్యాదు చేసింది. తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది.

జీహెచ్ఎంసీ అధికారులపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఆగ్రహం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ శివన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం సమాచారం ఇచ్చినా సమాచారం లేకుండా సమావేశం నిర్వహించారని మండిపాటు పడింది. ఏడో తేదీ సాయంత్రం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. సఫాయి కర్మచారులకు సరైన సౌకర్యాలు కల్పించకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. 

గొడ్డు మాంస ఉత్సవం..ఆరుగురు విద్యార్థుల సస్పెండ్..

కేరళ : రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కళాశాలలో ఎస్ఎప్ఐ గొడ్డు మాంస ఉత్సవాన్ని నిర్వహించింది. పలు రాష్ట్రాల్లో గొడ్డు మాంస అమ్మకాలను నిషేధించడంపై ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేసింది. దీనితో ఆరుగురు విద్యార్థులను ప్రిన్స్ పల్ సస్పెండ్ చేశారు. 

 

ప్రతిపక్షాల సస్పెన్షన్ దారుణం - ఉత్తమ్..

హైదరాబాద్ : అసెంబ్లీ నుండి ప్రతిపక్షాల సస్పెన్షన్ దారుణమని, ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి నుండి జిల్లాల్లో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ప్రభుత్వం దిగిరాకపోతే అఖిలపక్షాల మద్దతుతో పదో తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామన్నారు. 

అనంతపురంలో 9వ తరగతి విద్యార్థి హత్య..

అనంతపురం : నల్లచెరువు సంక్షేమ హాస్టల్ నుండి అదృశ్యమైన 9వ తరగతి విద్యార్థి వంశీకుమార్ హత్యకు గురయ్యాడు. కదిరి సమీపంలో ఎర్రదొడ్డి వద్ద వంశీకుమార్ మృతదేహం లభ్యమైంది. తండ్రి చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి గంగులమ్మే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. తల్లి గంగులమ్మ, ప్రియుడు రవినాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బంగారం ధర తగ్గింది..వెండి ధర పెరిగింది..

ముంబై : కొనుగోళ్లు పడిపోవడంతో బంగారం ధర కాస్తా తగ్గింది. 99.9 స్వచ్ఛత గల 10 గ్రామలు బంగారానికి రూ.201 తగ్గింది. పది గ్రామలు బంగారం ధర రూ.26,600గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం పెరిగింది. కిలీఓకు రూ.150 పెరగడంతో రూ.35,760 పలుకుతోంది. నాణేల తయారీ దారులు, పారిశ్రామిక వర్గాల నుండి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధరలు పెరిగాయి. 

ధోనికి అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాలు..

అనంతపురం : భారత జట్టు వన్డే కెప్టెన్ ధోకి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మేగజైన్ లో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోని చిత్రాన్ని ముద్రించి చేతిలో బూటు ఉంచడంపై వీహెచ్ పి అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనిపై గతంలో వేసిన కేసును కోర్టు రిజిష్టర్ చేసింది. నవంబర్ 7న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

రాజకీయాలు చేయడం సరికాదు - గువ్వల..

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీలు రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు.

రైతుల పట్ల ప్రభుత్వం ఉదారంగా ఉంది - జూపల్లి..

హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు తాత్కాలిక ఉపశమనమే చేయడం కాకుండా.. శాశ్వత ఉపశమనం చూపిస్తున్నామని తెలిపారు. రైతుల గురించి ఏనాడూ కాంగ్రెస్, టీడీపీలు ఆలోచించలేదు. విపక్షాలు కావాలనే సభను అడ్డుకుంటున్నాయని, ఒక్క జూరాల ప్రాజెక్టు కట్టడానికే గత ప్రభుత్వాలకు 24 ఏళ్లు పట్టిందని విమర్శించారు. రైతు భరోసా యాత్రలు ఎందుకు చేస్తున్నారని, కాంగ్రెస్, టిడిపిలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ఆవు మాంసం తింటా - కట్టు..

న్యూఢిల్లీ : దాద్రీ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండయ కట్జూ స్పందించారు. ఆవు మాంసం తిన్నారని ఓ వ్యక్తిని కొట్టి చంపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆవు ఒక జంతువు మాత్రమేనని, ఒక జంతువు ఎవరికీ తల్లి కాదన్నారు. ఆవు మాంసం తింటే తప్పేంటి ? నేను కూడా తింటాను.. ఇకపై కూడా తింటాను అని కట్టూ స్పష్టం చేశారు. 

జమ్మూ కాశ్మీర్ లో పశు మాంసంపై సుప్రీం స్టే..

న్యూఢిల్లీ : పశు మాంసం విక్రయంపై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు విధించిన రెండు నెలల నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

16:39 - October 5, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా.. అండగా ఉండేందుకు ఆ పార్టీ రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ సీపీఎం కన్వీనర్‌ బాబురావు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాజధాని రావడానికి ఎవరికి అభ్యరంతం లేదని, అలాగే శంకుస్థాపనకు కూడా అభ్యంతరం లేదన్నారు. ప్రజల సంతోషాల మధ్య శంకుస్థాపనలు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించలేదని బాధలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామలు నెరవేర్చడం లేదని, గత పది నెలల నుండి పని, ఉపాధి లేదని పేర్కొన్నారు. ప్యాకేజీల విషయంలో తేదీలు మార్చుతున్నారని, ఉచిత వైద్యం ఎక్కడ అని ప్రశ్నించారు. జపాన్, సింగపూర్ ప్రధానులను పిలుస్తున్నారే కానీ స్థానిక ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో రాజధానిలో ప్రజల భాగస్వామ్యం ఏంటనే ప్రశ్న వస్తుందన్నారు. పాదయాత్ర చేపట్టిన అనంతరం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టి వినతిపత్రాలు సమర్పిస్తామని బాబురావు పేర్కొన్నారు. 

16:35 - October 5, 2015

కడప : ఇద్దరు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను కడప జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి మండలం బుడుగుంట పల్లెకు చెందిన షేక్ దర్భార్ బాషా, వీరబల్లి మండలం అంచలవాండ్ల పల్లెకు చెందిన మన్నూర్ హుస్సేన్ సాహెబ్‌ను రైల్వేకోడూరు మండలం బాలపల్లె చెక్‌పోస్ట్ వద్ద అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువైన 28 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. దర్భార్ బాషాపై ఇప్పటివరకు 14 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మన్నూరు హుస్సేన్ సాహెబ్ ఐదేళ్లుగా స్మగ్లింగ్ చేస్తున్నా అతనిపై ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

16:33 - October 5, 2015

కర్నూలు : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ విమర్శించారు. ఆయన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే.. ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

16:31 - October 5, 2015

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ అభివృద్ధికి నిరోధకుడని ఏపీ టిడిపి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఘాటుగా విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీపై ఏపీ టీడీపీ ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అక్కడ ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించాలనుకుంటే...అక్కడకెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గమని విమర్శించారు. బందరు పోర్టు కావాలని ఎన్నో సంవత్సరాల నుండి ఆందోళన ఉందన్నారు. రాజధాని అమరావతిలో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎయిర్ పోర్టు రావడం వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తుంటే వైసీపీ ఇలా ప్రయత్నిస్తోందని కళా విమర్శించారు. 

16:27 - October 5, 2015

చిత్తూరు : జిల్లాలోని కుప్పంలో విమానాశ్రయం ప్రతిపాదిత స్థలం కడవల్లిలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పర్యటించారు. రైలు దిగిన రఘువీరాకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతుండటంతో ఆయన వారిని కలిశారు. కాగా కుప్పంలో సభ నిర్యహించదలచిన కాంగ్రెస్ కు పోలీసులు అభ్యంతరం తెలిపారు. సభకు అనుమతి లేదంటూ భారీగా పోలీసులు మోహరించారు. అలాగే రఘువీరా సభకు వెళుతున్న 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

16:24 - October 5, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక..వత్తిడిలు భరించలేక రైతన్నలు అసువులు బాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో రైతు ప్రాణాలు విడిచాడు. పుట్లగట్లగూడెంలో అప్పుల భాధ తాళలేక పారేపల్లి మంగరాజు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 9 ఎకరాలను కౌలుకు తీసుకున్న మంగరాజు.. 4 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 5 ఎకరాల్లో వరి పంట వేశాడు. అయితే వర్షాభావానికి తోడు సకాలంలో విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంగరాజు చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి 8 నెలల క్రితమే వివాహం కావడంతో కుటుంబంలోను.. గ్రామంలోను విషాదఛాయలు అలుముకున్నాయి.

గుంటూరు జిల్లాలోనూ..
గుంటూరు జిల్లాలోను అన్నదాత తనువు చాలించాడు. గురజుల మండలం మాడుగుల గ్రామంలో ఎనిగెల పిచ్చేశ్వరరావు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాల్లో వేసిన పత్తి, మిర్చి పంట పూర్తిగా ఎండిపోయాయి. దీనికి తోడు అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై పిచ్చేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దీనితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

15:51 - October 5, 2015

అతివల ఆల్ టైం ఫేవరెట్ డ్రెస్సింగ్ చుడీదార్స్. క్యాజువల్ గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకత చుడీదార్స్ ది. అలాంటి చుడీదార్స్ లో లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం.

15:49 - October 5, 2015

ఊహ తెలిసిన నాటి నుండే ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. భవిష్యత్ జీవితం గురించి ఎన్నో లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు. ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. పలువురికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒక అతివ పరిచయం. యాంత్రికత, సాంకేతికతే ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో కళను కెరీర్ గా మలుచుకునే వారు అరుదు. ఇలాంటి స్థితిలో కళనే శ్వాసించి, కళనే ధ్యాసించి, కళనే లోకంగా మార్చుకున్న అతివ అపర్ణ. ప్రకృతి పట్ల చిన్ననాడు నాటుకున్న భావనలే ఆమె కళలకు ప్రాణం పోశాయి. అందమైన ప్రకృతిని కాన్వాస్ పై పరిచే ప్రయత్నం ఊహ తెలిసిన నాటి నుండే మొదలుపెట్టింది. కాలానికి తగ్గట్లు కళలో మార్పుకు ఆహ్వానం పలికింది. అద్భుత కళాఖండాలను సృష్టిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎంచుకున్న రంగంలో విశిష్ట కృషి చేసి ప్రత్యేకత చాటుతున్న అపర్ణను మానవి అభినందిస్తోంది.

15:42 - October 5, 2015

హైదరాబాద్ : సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ రంగం తగ్గిపోతోందని, సమాన అవకాశాలు దక్కాలంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు తప్పనిసరి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో 'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు - మానవ హక్కు' సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏచూరి ప్రసంగించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై చర్చించేందుకు పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జాతీయ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని, రిజర్వేషన్లు సమీక్షించాలని ఆర్ఎస్ఎస్, వీహెచ్ పి డిమాండ్ కు సీపీఎం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, జస్టిస్ చంద్రకుమార్, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.

15:38 - October 5, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ సీపీఎం పోరుబాట పట్టనుంది. ఈనెల 8వ తేదీ నుండి పాదయాత్రలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. టిడిపి, బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని అన్ని జిల్లా కేంద్రాలలో 8వ తేదీ నుండి పాదయాత్రలు జరుగుతాయన్నారు. రాయలసీమలో కరువు కాటకాలు రావడంతో లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, చాలా ప్రాంతాల్లో పరిశ్రమలు మూత పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు ఎక్కువగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి లోటు పూడుస్తామని విబజన చట్టంలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లోటు బడ్జెట్ కు సంబంధించి రూ.15వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో జిల్లాలో పాదయాత్ర ప్రారంభమౌతుందని, వెంకయ్య, చంద్రబాబు నాయుడు రకరకాలు వాదనలు వినిపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన వాగ్దానాలను అమలు పరచాలని ప్రజానీకం కోరుతోందని మధు వెల్లడించారు. 

15:32 - October 5, 2015

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, కార్మికులు, ఇతర రంగాల వారు ఆందోళన బాట పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాలకు చెందిన కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన నిర్వహించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎప్ఎఫ్ఐ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఓ నుండి ర్యాలీగా విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఇందిరాపార్కు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో విద్యార్థులు..పోలీసుల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యార్థి సంఘ నేతలు పేర్కొన్నారు. కానీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్ లలో పడేశారు. పోలీసు జులుం నశించాలి అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు టెన్ టివితో మాట్లాడారు. ఇంత వరకు మెస్ బకాయిలు రద్దు చేయలేదని, పీహెచ్ డీ విద్యార్థులకు ఒక్కు పైసా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వర్సిటీల్లో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని గుర్తు చేశారు. యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 

15:21 - October 5, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం త్వరలోనే నెరవేరనుంది. అగ్రిగోల్డ్ మోసాలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అందులో భాగంగా ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురితో విచారణ సంఘాన్ని నియమిస్తామని తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. సోమవారం జరిగిన విచారణకు నలుగురు అగ్రిగోల్డ్ డైరక్టర్లు కోర్టుకు హాజరయ్యారు. సీఐడీ డీజీ హాజరు కావాలని ఆదేశించడంతో ఆయన కూడా కోర్టుకు హాజరయ్యారు. దర్యాప్తు బాగానే చేస్తున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించిన 14 ఆస్తులను అమ్మి వచ్చిన డబ్బును బాధితులకు అందచేయాలని కోర్టు సూచించింది. ఇందులో భాగంగా కోర్టు ఏర్పాటు చేసిన విచారణ సంఘం సమర్పించిన నివేదికతో కోర్టు తదుపరి నిర్ణయం వెలువరించనుంది. అగ్రిగోల్డ్ బాధితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ అందచేసిన ఆస్తుల జాబితా వాస్తవమేనని ప్రమాణ పత్రం దాఖలు చేయాలని డైరెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో తప్పులుంటే డైరెక్టర్లకు శిక్ష తప్పదని హైకోర్టు హెచ్చరించింది. దర్యాప్తును సీఐడీ ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించింది. ఏయే ఆస్తులను గుర్తించారో తెలపాలని సూచించింది. తదుపరి విచారణనను మంగళవారానికి వాయిదా వేసింది.

మోసం అంతా ఇంత కాదు..
తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం అంతా ఇంతా కాదు. సుమారు 7 వేల కోట్ల రూపాయల మేర జనాన్ని ముంచేసినట్లు ఆరోణలున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినా.. జనానికి డబ్బులు సరిపోవని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే.. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా ఉన్న సంస్థల ఆస్తులు మాత్రం వందల రెట్లు అధికంగా ఉన్నట్టు సమాచారం. కానీ.. కేవలం అగ్రిగోల్డ్ చుట్టే తిరుగుతున్న వ్యవహారం.. అనుబంధ సంస్థల దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఈ విషయమై బాధితులు హైకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది.

రాజధానిలో రేపటి నుండి పాదయాత్రలు - సీపీఎం..

విజయవాడ : రాజధాని ప్రాంత సమస్యలు పరిష్కరించాలని రేపటి నుండి పాదయాత్రలు చేపట్టనున్నట్లు రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ బాబురావు వెల్లడించారు. 11వ తేదీ వరకు 29 గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు, ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా రాజధాని శంకుస్థాపన చేయడం సరైంది కాదన్నారు. శంకుస్థాపన లోపే రాజధాని ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

8 నుండి సీపీఎం పాదయాత్రలు..

విజయవాడ : టిడిపి, బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని 8వ తేదీ నుండి సీపీఎం పాదయాత్రలు చేపట్టనుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..రైల్వే జోన్ ల విషయంలో కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెడుతున్నాయని తెలిపారు. 

సీపీఎం నేత మధును కలిసిన వైసీపీ నేతలు..

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జగన్ దీక్షకు మద్దతివ్వాలని సీపీఎం నేత మధును వైసీపీ నేతలు కోరారు. వామపక్ష పార్టీలతో చర్చించి నిర్ణయం చెబుతామని మధు స్పష్టం చేశారు. 

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు..

ముంబై : షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 19వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెతో పాటు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా..కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు కూడా కస్టడీని పొడిగించారు. 

14:39 - October 5, 2015

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు రూపంలో ఉన్న ఫెక్సీలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడంతో కొంతమంది రైతులు తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు. బాబును అవతారమూర్తిగా భావిస్తూ.. వివిధ రూపాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆయన పేరుమీద గుడిని కూడా కట్టబోతున్నారు. తమ ఊరును రాజధాని చేశారని బాబును దేవుళ్ల అవతారాల్లో ముంచెత్తారు ఆయన అభిమానులు. ఏపీ రాజధానిగా తుళ్లూరు పరిసర ప్రాంతాలు ప్రకటించిన సమయంలో చంద్రబాబు రూపాలు ఇవి. రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని ప్రకటించి అక్కడ భూములకు భూమ్‌ తీసుకొచ్చారు చంద్రబాబు. దీంతో ఎకరం 10 లక్షల విలువ కూడా లేని భూమి ఒక్కసారిగి రెండు కోట్లకు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో రైతులు ఉన్న పొలంలో సగం రాజధానికి ఇచ్చి, సగం భూములను అమ్ముకున్నారు. అలా రాజధాని రూపంలో తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన చంద్రబాబును ఇలా దేవుడిగా కొలుచుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హరిశ్చంద్రపురంలో కృష్ణానది ఒడ్డున చంద్రబాబు గుడి..
తుళ్లూరులోని టీడీపీ నాయకులు, రైతులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు గుడి నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని భూ సమీకరణలో లేని గ్రామం హరిశ్చంద్ర పురంలో కృష్ణానది ఒడ్డున చంద్రబాబు గుడిని కట్టబోతున్నారు. దీనికి సంబందించి స్థలాన్ని కూడా పరిశీలించారు. తుళ్లూరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో గుడి కడితే, రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో హరిశ్చంద్రపురంలో గుడి కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ఇప్పటికి 8 దేవాలయాలు ఉన్నాయని, చంద్రబాబు గుడి కట్టి 9 దేవాలయాల్లోనూ పూజలు నిర్వహిస్తామని గుడి నిర్మాణం చేయబోతున్న సతీష్‌ చెబుతున్నారు.

ఉద్దండ్రాయిన పాలెం రైతులు కూడా..
ఇటు రాజధాని శంఖుస్థాపన ప్రాంతం అయిన ఉద్దండ్రాయిన పాలెం రైతులు కూడా చంద్రబాబుకి గుడి కట్టాలని భావిస్తున్నారు. అయితే.. ఉద్దండ్రాయిని పాలెం సీడ్ క్యాపిటల్‌లో ఉండబోతుండడంతో.. అక్కడ గుడి కడితే ఇబ్బందులు వస్తాయని రైతులు భావిస్తున్నారు. హరిశ్చంద్రపురంతో పాటు ఉద్దండ్రాయిని పాలెంలో చంద్రబాబు గుడికి సంబంధించి అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. తుళ్లూరు ప్రాంత ప్రజలను కోటీశ్వరులుగా చేసిన చంద్రబాబు, మరి తన గుడి నిర్మాణానికి అనుమతి ఇస్తారా..? ఇవ్వరా అనేది ఇంకా తెలియాలి. 

14:37 - October 5, 2015

హైదరాబాద్ : కార్మికుల తొలగింపులో జీహెచ్ఎంసీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. చట్టం ప్రకారం సమ్మెచేసిన కార్మికులను చట్టవిరుద్ధంగా తొలగించింది జిహెచ్ఎంసి. 15వ తేదీన విధులకు హాజరు కానందునే వీరిందరినీ తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అదే నోట.. దీనికి సంబంధించి తాము ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ మున్సిపల్‌ కార్మికుల తొలగింపులో అధికారులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కిన వైనం కార్మికులను ఆవేదనకు గురిచేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సమ్మెబాట పట్టిన సమయంలో సమ్మె విరమించండి ఆలోచిస్తాం అంటూ నమ్మబలికిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. అనంతర కాలంలో కుట్రపూరితంగా కార్మికులను తొలగిస్తూ వచ్చారు.

సర్క్యులర్..మెమో ఎక్కడ ?
ప్రభుత్వ హామీ అనంతరం కూడా 15వ తేదీన విధులకు రాలేదన్న సాకుతో.. జీహెచ్ఎంసీ అధికారులు.. దఫ దఫాలుగా వారిని పనులకు రాకుండా అడ్డుకున్నారు. ఒకేసారి అందరినీ తొలగిస్తే ఆందోళన ఉధృతమవుతుందన్న భావనతో.. అధికారులు కార్మికులపై ఇలా దొంగదెబ్బ తీశారు. కార్మికులను తొలగించడంలో జిహెచ్ఎంసి పరిగణలోకి తీసుకున్న అంశాలేంటి, బల్దియా చట్టం ప్రకారమే వీరిని తొలగించిందా? అంటే అలాంటిదేమి లేదన్నది జిహెచ్ఎంసి అధికారుల సమాధానం.  జూలై 15న విధులకు హాజరుకావాలని జిహెచ్ఎంసి ఎక్కడ సర్క్యులర్ కాని, మెమోకాని జారీ చేయ్యలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. కేవలం కమీషనర్ నోటి మాటే ఆదేశంగా.. వీరిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. విధులకు హాజరు కాని వారు అనారోగ్యంతో ఉన్నారని తెలిసీ అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

స్పష్టత లేని కార్మికుల సంఖ్య..
అక్రమ మార్గాన విధులకు రానీయకుండా అధికారులు అడ్డుకున్న కార్మికుల సంఖ్య విషయంలోనూ స్పష్టత నివ్వడం లేదు. ఒకరు వెయ్యి మంది అంటే.. మరొకరు 1300 మంది అని చెబుతున్నారు. సుమారు 1700లపై దొంగదెబ్బ వేశారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ వస్తే తమ బ్రతుకులు బాగుపడుతాయని భద్రత వస్తుందని అనుకున్న కార్మికుల ఉన్న ఉద్యోగాలు ఊడతీశారని నేతలు మండి పడుతున్నారు. 

14:34 - October 5, 2015

హైదరాబాద్ : ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగిన నేత దళిత నేత వెంకటస్వామి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండార దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ర్ట మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. చిన్నస్థాయి నుంచి మనిషి అత్యున్నతస్థాయికి ఎదగగలడు అని నిరూపించిన వ్యక్తి వెంకటస్వామి అని కేసీఆర్ అన్నారు. వెంకటస్వామి రాజకీయ భీష్ముడు అని కితాబిచ్చారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ దెబ్బ తగిలినా భయపడకుండా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. పేదల కోసం, దళితుల కోసం అహర్నిశలు శ్రమించారని కేసీఆర్ తెలిపారు. 

14:30 - October 5, 2015

ఆదిలాబాద్ : 'మీకు వేతనాలు కావాలి..మాకు వేతనాలు వద్దా' అంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు పలు రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదు. దీనితో సోమవారం ఆదిలాబాద్ జిల్లాల్లో ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసు జులుం నశించాలి అంటూ ఆశా వర్కర్లు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీనితో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఆశా వర్కర్లను లాగిపడేశారు. ఈ ఘటనలో కొందరు కార్యకర్తల చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసుల వైఖరిని ఆశా వర్కర్లు తీవ్రంగా ఖండించారు. 

14:26 - October 5, 2015

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల వ్యవహారంపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్న జగన్‌.. అవగహన లేని ఒక ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమన్నారు. తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రంలో కొంగజపాలు చేస్తున్న జగన్‌.. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తే బాగుంటుందని గంటా హితవు పలికారు. ఈనెల ఏడో తేదీ నుండి జగన్ గుంటూరులో దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆపార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

14:25 - October 5, 2015

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతోంది. దీనితో అధికారులందరూ బిజీగాబిజీగా గడుపుతున్నారు. ఏర్పాట్లు ఎలా చేయాలన్నఅంశంపై సమీక్షలు జరుపుతున్నారు. అడిషనల్ డీజీ సురేంద్రబాబుతోపాటు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, కోస్టల్ ఐజీ సంజయ్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ ఈ ఏర్పాట్లపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. దసరా రోజు... తూళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం సమీప ప్రాంతంలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. పార్కింగ్, రూట్‌మ్యాప్, బహిరంగసభ ప్రదేశంలాంటి అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.

 

14:12 - October 5, 2015

ప్రకాశం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై టెన్ టివిలో ప్రసారమైన కథనాలపై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మంత్రి శిద్ధా రాఘవయ్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం 29 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది.
చీమకుర్తిలో ఇసుక అక్రమరవాణాపై ఈనెల 25వ తేదీన టెన్ టివిలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. మైలవరం తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 29 మంది ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఇద్దరు బంధువులున్నట్లు సమాచారం. 

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం..

తిరుమల : రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బైక్ నుండి దంపతులు కిందపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. 

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ఆవు మాంసం నిషేధంపై ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, పీడీపీకి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు.

బోరుబావిలో పడిన చిన్నారి క్షేమం..

రాజస్థాన్ : దౌసా జిల్లాలో బిహారిపురా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నాం బోరుబావిలో పడిపోయిన రెండన్నరేళ్ల చిన్నారి సురక్షితంగా బయట పడింది. దాదాపు 20గంటల పాటు సహాయక సిబ్బంది శ్రమించారు. 

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

ప్రకాశం : అర్థ వీడు (మం) బొమ్మలింగలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మృతులు రమణమ్మ (25), పూజిత (4), హేమ (2).

సస్పెన్షన్ కు గురైన సభ్యులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విపక్ష సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.
కాంగ్రెస్ సభ్యులు : ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజయ్, అరుణ, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సంపత్, వంశీ చంద్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, రాంరెడ్డి, భాస్కరరావు, పద్మావతిరెడ్డి.
టిడిపి సభ్యులు : రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎ.గాంధీ, గోపినాథ్, రాజేందర్ రెడ్డి, సాయన్న, వివేకానంద,
బీజేపీ సభ్యులు : కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, రాంచంద్రారెడ్డి,

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల :రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి దంపతులు కింద పడిపోయారు. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మంగళవారం నుండి కాంగ్రెస్ రైతు భరోస యాత్ర..

హైదరాబాద్ : రేపటి నుండి నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోస యాత్ర నిర్వహించనుంది. 6 మహబూబ్ నగర్, 7 మెదక్, 8 ఖమ్మం, 9 వరంగల్ లో యాత్ర కొనసాగనుంది. 9వ తేదీలోపు ప్రభుత్వం దిగి రాకపోతే 10వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. 

కేంద్ర, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం నోటీసులు...

ఢిల్లీ : ఏపీ ఉన్నత విద్యా మండలి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది. 

అగ్రిగోల్డ్ బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ అందచేసిన ఆస్తుల జాబితా వాస్తవమేనని ప్రమాణ పత్రం దాఖలు చేయాలని డైరెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో తప్పులుంటే డైరెక్టర్లకు శిక్ష తప్పదని హైకోర్టు హెచ్చరించింది. దర్యాప్తును సీఐడీ ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించింది. ఏయే ఆస్తులను గుర్తించారో తెలపాలని సూచించింది. సీఐడీ అడిషనల్ డీజీ తిరుమల రావు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ మధ్యాహ్నాం 2.15గంటలకు వాయిదా వేసింది. 

పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఘర్షణ..

కాకినాడ : గ్రానైడ్ తవ్వకాల వ్యవహారంలో పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. రామేశంపేట గ్రావెల్ కొండబ తవ్వకాలపై వివాదం చెలరేగింది. గ్రావెల్ తవ్వకాలు ఆపాలంటూ అనూరు రైతులు ఆందోళన నిర్వహించారు. తవ్వకాలకు అనుమతినివ్వాలని సూరంపాలెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

 

13:43 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో రేపటి నుంచి రైతు భరోసాయాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... 6న మహబూబ్ నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసాయాత్రలు చేపడుతామని ఉత్తమ్ వివరించారు. ఈ 10న రాష్ట్ర బంద్ సందర్భంగా ఆరోజు యాత్ర లేదని చెప్పారు. అప్పులబాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, రైతులలో ధైర్యాన్ని నింపేందుకు తమ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని టీపీసీసీ చీఫ్ వివరించారు.

భోగాపురానికి బయలుదేరిన జగన్..

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు కాసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం జగన భోగాపురానికి బయలుదేరి వెళ్లారు. 

చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఎస్ఎఫ్‌ఐ

హైదరాబాద్ : యూనివర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఓయు నుంచి ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు గేట్ దగ్గరే అడ్డుకొని అరెస్ట్ చేశారు.

 

13:36 - October 5, 2015

హైదరాబాద్ : అసెంబ్లీలోని గాంధీ విగ్రహంముందు ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.. రైతు సమస్యలపై ప్రశ్నించినందుకు అన్యాయంగా తమను సస్పెన్షన్ చేశారని ప్లకార్డులు ప్రదర్శించారు.. ప్రభుత్వ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. 

13:34 - October 5, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయంగా కనిపిస్తున్న సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్ దూసుకెళ్తుంది. సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడింది. ఈ సూచి 26వేల 580 పాయింట్లకు చేరింది. అటు నిఫ్టి వంద పాయింట్లు బలపడింది. దసరా, దీపావళికి కారు సేల్స్ పెరుగుతాయన్న అంచనాతో ఆటోమోబైల్ షేర్లకు డిమాండ్ పెరిగింది. వీటితో పాటు బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీ, అదానీ పోర్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నుంచి 6శాతం లాభపడ్డాయి. 

13:32 - October 5, 2015

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఇవాళ దద్ధరిల్లింది. బీఫ్ బ్యాన్ తో పాటు వరద సాయంలో అవకతవకలు వంటి అంశాలపై వెంటనే సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీ సభ్యులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వరద సాయం కొందరికే అందటం, వైష్ణోదేవి భక్తులపై పన్నులు వేయటాన్ని వారు తప్పుపట్టారు. కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవడంతో.. సభలో కాసేపు గందరగోళం నెలకొంది. స్పీకర్ కావెందర్ గుప్తా సభను రెండు సార్లు వాయిదా వేసిన సభ్యులు శాంతించలేదు. 

13:30 - October 5, 2015

విశాఖ: సింహాచలం ఆలయ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజినిగిరిపాలెం గ్రామస్తులను ఖాళీ చేయాలని ఆలయ ఈవో బెదిరించడంపై స్థానికులు మంత్రి గంటాకు ఫిర్యాదు చేశారు. పట్టాలున్న తమ భూములు దేవస్థానంకు చెందినదని ఈవో బోర్డులు పెట్టారు. ఇదేంటని ప్రశ్నించిన 12 మంది రైతులపై ఈవో అక్రమ కేసులు పెట్టారు. దీంతో గ్రామస్తుల ఆందోళనతో స్పందించిన మంత్రి గంటా.. ఈవో చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు ఉపసంహరించుకుని.. గ్రామంలో బోర్డులు తొలగించాలని ఆదేశించారు.

13:29 - October 5, 2015

హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండార దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ర్ట మంత్రులు హాజరయ్యారు. చిన్నస్థాయి నుంచి మనిషి అత్యున్నతస్థాయికి ఎదగగలడు అని నిరూపించిన వ్యక్తి వెంకటస్వామి అని కేసీఆర్ అన్నారు. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన దళిత నేత వెంకటస్వామి అని కొనియాడారు.

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ – ఏచూరి..

హైదరాబాద్ : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాసినట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో 'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు - మానవ హక్కు' సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏచూరి ప్రసంగించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై చర్చించేందుకు పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జాతీయ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ రంగం తగ్గిపోతోందని, సమాన అవకాశాలు దక్కాలంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు తప్పనిసరి అని నొక్కాణించారు.

13:26 - October 5, 2015

హైదరాబాద్ : ఏపీ ఉన్నతవిద్యామండలి వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.. తర్వాతి విచారణను నవంబర్‌ 30కి వాయిదావేసింది..

13:23 - October 5, 2015

కడప : ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారి మృత్యువాత పడిన సంఘటన మరువకముందే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో అలాంటి సంఘటనే పునరావృతం అయింది. ఎర్రమ్మ అనే మహిళ కాళ్ల వేళ్లను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. కూతురి కాన్పు కోసం వచ్చిన ఎర్రమ ప్రసూతి వార్డులో నిద్రిస్తుండగా పందికొక్కులు కరిచి గాయపరిచాయి. స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆమెకు వెంటనే టీటీ ఇంజక్షన్ ఇచ్చి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్పత్రిలో పారిశుధ్యం లోపించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

13:21 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో సైతం రైతు సమస్యలపై దద్దరిల్లింది. రైతు రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలంటూ విపక్షసభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడ్డుపడుతున్నారంటూ.. షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ రావు, ఫరూక్‌ హుస్సేన్‌, లలిత, రామచందర్‌రావును సస్పెండ్‌ చేస్తూ సభా ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం తీసుకున్నారు.

13:19 - October 5, 2015

హైదరాబాద్ : రైతు సమస్యలపై అసెంబ్లీ దద్దరిల్లింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై వాయిదా తీర్మానానికి విపక్షాలు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ ప్రశ్నోత్తరాలకు అనుమతివ్వగా.. విపక్షాలు నిరసన తెలిపాయి. దీంతో సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌ రావు.. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాల్సిందిగా కోరారు. దీంతో స్పీకర్‌ సభ్యులపై ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.   

దసరా ఉత్సవాలకు దుర్గ గుడి మొబైల్ యాప్ లు

విజయవాడ :దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ దుర్గమ్మ వారి పేరుపై రెండు మొబైల్ యాప్ లు తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ గుడి ఈవో ఆ యాప్ లను ఆవిష్కరించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తి సమాచారంతో యాప్ లను రూపొందించినట్టు ఈవో తెలిపారు. అంతేగాక ఉత్సవాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18001217749 నంబర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన

తూ.గో : కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తుని మండలం ఎన్‌.ఎస్‌ వెంకటనగరంలో 30 ఎకరాల్లో జీడితోటలను అటవీశాఖ అధికారులు నరికివేశారంటూ రైతులు ధర్నా చేపట్టారు.

విచారణకు రావాలని ఏపీ సీఐడీ చీఫ్ కు ఆదేశం...

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ను హైకోర్టు ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని సీఐడీని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు, లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సోమవారం అగ్రిగోల్డ్ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ కేసులో సీఐడీ విచారణ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ చైర్మన్ సహా నలుగురు డైరక్టర్లు కోర్టుకు హాజరయ్యారు.

ప్రభుత్వం పారిపోయింది : డీకే అరుణ

హైదరాబాద్: చేతగాని, దివాళకోరు ప్రభుత్వమని సీఎం ఒప్పుకున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయని డీకే అరుణ అన్నారు.

కాకా రాజకీయ భీష్ముడు :సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : మాజీ ఎంపీ స్వర్గీయ వెంకటస్వామి(కాకా) రాజకీయ భీష్ముడు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1969లో బుల్లెట్ దెబ్బ తిన్నా తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. చివరి క్షణం వరకు తెలంగాణ కోసం పరితమిపంచారని.. తెలంగాణ చూసే కన్నుమూయాలని కాకా కోరుకున్నారని పేర్కొన్నారు. కాకా జన్మధన్యమైందని.. ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన నేత కాక అని కేసీఆర్ కొనియాడారు.

12:43 - October 5, 2015

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. గుడిలోకి వెళ్లినందుకు 90 ఏళ్ల దళిత వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడిచేసి, సజీవ దహనం చేశాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన జలౌన్ జిల్లా బిల్గాం ప్రాంతంలోని బాబా గుడిలో జరిగింది. చిమ్మ.. తన భార్య, కొడుకుతో కలిసి స్థానికంగా వుండే  మైదాని బాబాగుడికి వెళ్లాడు. గుళ్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ సంజయ్ తివారీ.. వీళ్లని అడ్డుకున్నాడు. ఆయన మాటలు లెక్క చేయకుండా ముందుకు వెళ్లాడు చిమ్మ. దీంతో రెచ్చిపోయిన సంజయ్.. ఆ వృద్ధుడ్ని గొడ్డలితో నరికి, ఆపై నిప్పంటించాడు.భక్తులంతా చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. దీనిపై కొంతమంది భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోవైపు మద్యం మత్తులోవున్న తివారీ.. వృద్ధుడితోపాటు ఇంకా చాలామంది భక్తులను గుడిలోకి వెళ్లొద్దంటూ హెచ్చరించాడు. అయితే వారందరూ తిరస్కరించారు. అప్పటికే కోపంతోవున్న తివారీ.. వృద్ధుడని లెక్కచేయలేకుండా అతడిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని భార్య సహాయం కోసం కేకలు పెట్టినా, సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 

ప్రధాని మోదీతో జర్మన్ చాన్స్ లర్ భేటీ

న్యూఢిల్లీ : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్‌లో మోడీతో మెర్కెల్ సమావేశమయ్యారు. సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భద్రత, రక్షణతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌లో మెర్కెల్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏంజెలా మెర్కెల్ భారత్ రావడం ఇదే ప్రథమం. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కోసం ఏప్రిల్‌లో మోడీ జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో ఏంజెలా మెర్కెల్‌తో మోడీ సమావేశం అయ్యారు.

ఉన్నత విద్యామండలి ఖాతాలపై విచారణ వాయిదా

హైదరాబాద్ : ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాల వివాదం విచారణను నవంబర్ 30వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల విద్యామండళ్ల ఖాతాల వివాదం అంశం సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకి వచ్చింది. 4 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని  కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల కౌన్సిల్ల పరిధి, వాటి ఖాతాల నిర్వహణపై వివాదం కొనసాగుతున్న విషయం విదితమే.

నెల్లిమర్లలో విజృంభిస్తున్న డయేరియా...

విజయనగరం : నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ఓయూ లో 'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు - మానవ హక్కు' సదస్సు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో 'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు - మానవ హక్కు' సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్య అతిధిగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ హాజరయ్యారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, జస్టిస్ చంద్రకుమార్, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.

ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహావిష్కరణ

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైకోర్టుకు అగ్రిగోల్డ్ చైర్మన్...

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడులకు చెందిన లక్షలాది మంది మధ్యతరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ చైర్మన్ వీఆర్ రావ్ అవ్వాస్ కొద్దిసేపటి క్రితం హైకోర్టుకు వచ్చారు. తక్కువ కాలంలోనే రెట్టింపు రాబడులు ఇస్తామని నమ్మబలికిన అగ్రిగోల్డ్ నిర్వాహకులు వేలాది కోట్ల రూపాయలను సేకరించారు. మెచ్యూరిటీ తీరిన బాండ్ల డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థపై కేసులు నమోదయ్యాయి. తదుపరి జరిగే ప్రతి విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

అసెంబ్లీ 15 నిమిషాలు పాటు వాయిదా...

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో రైతు సమస్యలపై మళ్లీ చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాట్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై టీ బ్కేర్ తర్వాత చర్చిద్దామని పేర్కొంటూ స్పీకర్ సభను టీ బ్రేక్ కోసం పావుగంట వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

మండలిలో ఆరుగురు సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో కూడా విపక్ష సభ్యుల సస్పెన్షన్ జరిగింది. రైతుల రుణాలను ప్రభుత్వం తక్షణమే మాఫీ చేయాలని విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్ర నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ఫరూక్ హుస్సేన్, లలిత, బీజేపీ సభ్యడు రామచంద్రరావు వున్నారు. 

పోలీసుల అదుపులో 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లు..

చిత్తూరు: జిల్లా పోలీసులు 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ల నుంచి 55 లక్షల రూపాయల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం ఎక్కడికి తరలించనున్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

రేపు తెలంగాణ బంద్ కు టిడిపి పిలుపు...

హైదరాబాద్‌ : రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీ టీడీపీ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి సర్కారుకు నిరసన తెలపుతామని టీ టీడీపీ నేత ఎల్‌ రమణ ప్రకటించారు. విపక్షాలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి ఏం చర్చిస్తారని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. పత్తికి రూ.5వేల మద్ధతు ధర ఇవ్వాలని లేకుంటే ఆందోళన చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. జెండాలను పక్కన పెట్టి రైతుల పక్షాన ఐక్యపోరాటం చేస్తామని ఎర్రబెల్లి వివరించారు.

గ్రామ సభల ద్వారానే రైతు ఆత్మహత్యల నివారణ: సున్నం రాజయ్య

హైదరాబాద్ : మా  అజెండా అంతా రైతు అంజడానే అని...గ్రామ సభల ద్వారా రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటు రుణాలను ప్రభుత్వమే భరించాలని కోరారు. రైతు అంశాలను అసెంబ్లీలో చెప్పడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారని మండి పడ్డారు. సమాధానం చెప్పలేక దాట వేసేపద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించిందని వైసిపి నేతలు ఆరోపించారు

రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని టిడిపి నేత రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... రైతుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రతి ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపినందుకు మమ్మల్ని మార్షల్స్ తో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మామా అలుళ్లు తప్ప ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన అవసరం లేదని తమ నిరంకుశ వైఖరిని ప్రభుత్వం ప్రకటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది :లక్ష్మణ్

హైదరాబాద్ : తెలంగాణ సమాజంలో ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని బిజెపి నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..సమస్యలకు పరిష్కారానికి మార్గం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వం ఎన్నికల హామీలనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశాం. రైతులకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను చేనేత కార్మికులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశాం.

11:39 - October 5, 2015

హైదరాబాద్ : రైతు రుణ మాఫీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ విపక్షాలన్నీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకం అయ్యాయి. విపక్షాలన్నీ శాసనసభలో నిరసన తెలియజేశాయి. నిరసన చేస్తున్న సభ్యులను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. విపక్షాలు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. సభలో సస్పెన్షన్ చేసినా ప్రజా క్షేత్రంలో తేల్చకుంటామాని, రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. రైతులకు అండగా ఉంటామని విపక్షాలు స్పష్టం చేశాయి. వీరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వారి మాటల్లోనే చూద్దాం...

సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికం: జానారెడ్డి

అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ దురదృష్టకర సంఘటన ఈ రోజు సభలో చోటు చేసుకుందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. శాసనసభలో రైతు సమస్యలపై రెండు రోజుల చర్చ జరిగినా పరిష్కారం దొరకలేదని అన్నారు. రుణమాఫీ రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై అడిగినందుకే సభ్యుల్ని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకని ఒకేసారి రుణమాఫీ చేసేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని.. రైతుల పై స్పష్టమైన ప్రకటన చేయమంటే మార్షల్స్ తో మమ్మల్ని బలవంతంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఆలోచనా విధానానికి తార్కణం అని మండి పడ్డారు. అలివికాని కోరికలు విపక్షాలు కోరుతున్నాయి సీఎం అన్నారని... అలవికాని హామీలు ఇచ్చింది కేసీఆర్ అని విమర్శించారు

ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది :లక్ష్మణ్

తెలంగాణ సమాజంలో ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని బిజెపి నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు పరిష్కారానికి మార్గం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వం ఎన్నికల హామీలనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశాం. రైతులకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను చేనేత కార్మికులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశాం. అసెంబ్లీలో ఏక కాలంలో రైతు రుణ మాఫీ చేయమంటే మా గొంతు నొక్కారాని ఆ విధానాన్ని తప్పుపడుతున్నట్లు తెలిపారు. విపక్షాలు అన్నీ కలిసి రైతు రుణమాఫీ చేయాలన్న ఒక్క డిమాండ్ ను స్పీకర్ తోసిపుచ్చారని మండి పడ్డారు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యల పై ఎంఐఎం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.

రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని టిడిపి నేత రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రతి ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపినందుకు మమ్మల్ని మార్షల్స్ తో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మామా అలుళ్లు తప్ప ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన అవసరం లేదని తమ నిరంకుశ వైఖరిని ప్రభుత్వం ప్రకటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా జెండాలు వేరు... రైతుల పట్ల మేమంతా ఒకటే అని స్పష్టం చేశారు. సీఎం తీరును ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

గ్రామ సభల ద్వారానే రైతు ఆత్మహత్యల నివారణ: సున్నం రాజయ్య

మా అజెండా అంతా రైతు అంజడానే అని...గ్రామ సభల ద్వారా రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ప్రైవేటు రుణాలను ప్రభుత్వమే భరించాలని కోరారు. రైతు అంశాలను అసెంబ్లీలో చెప్పడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారని మండి పడ్డారు. సమాధానం చెప్పలేక దాట వేసేపద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించిందని వైసిపి నేతలు ఆరోపించారు

సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య : జానారెడ్డి

హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడితే వారి సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సస్పెన్షన్ కు గురయి విపక్షాలు అన్ని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడాయి. ఈ సందర్భంగా జారెడ్డి మాట్లాడుతూ సభలో విపక్షాలు లేకుండా సభ అసెంబ్లీ చర్రితలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని..

సిద్ధాంతాలను పక్కన పెట్టి విపక్షాలన్నీ ఏకం

హైదరాబాద్ : రైతు రుణ మాఫీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ విపక్షాలన్నీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకం అయ్యాయి. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో వ్యవహరించి తీరు ఇందుకు ఉదాహరణ. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురయి తరువాత భవిష్యత్ కార్యక్రమం పై బిజెపి ఆఫీసులో భేటీ అయ్యాయి. మరో వైపు అన్ని పక్షాలు రైతులకు అండగా ఉండేందుకు , రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయాలని గవర్నర్ కు వినతిప్రతం సమర్పించాలని అనుకున్నట్లు సమాచారం.

10:45 - October 5, 2015

హైదరాబాద్ : కొత్త రాష్ట్రంలో ఈ రోజు బ్లాక్ డే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుపట్టిన విపక్షాలను సస్పెండ్ చేయడం దారుణమని కోమటిరెడ్డి మండి పడ్డారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లకున్నా నన్ను ఎందుకు సస్పెండ్ చేశార అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చించే దమ్ము లేకనే ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేసిందని కోమటి రెడ్డి ఆరోపించారు.

10:33 - October 5, 2015

హైదరాబాద్ : రైతు రుణ మాఫీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్న విపక్ష సభ్యుల్లో కొందరిని (ఎంఐఎం మినహా కాంగ్రెస్ నుండి జానారెడ్డి, టిడిపి నుండి ఆర్ కృష్ణయ్య, ఎర్రబెల్లి) మినహా మిగతా సభ్యులను స్పీకర్ మధు సూధనాచారిని సస్పెండ్ చేశారు. 

తెలంగాణ శాసనసభ మొదలైన వెంటనే రైతుల సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. రైతుల సమస్యపై చర్చ సందర్భంగా ప్రభుత్వ సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంటూ సభలో నినాదాలు చేశాయి. దీని స్పందిచిన స్పీకర్ మధు సూదనాచారి ప్రభుత్వం, ప్రతిపక్షాలు 13 గంటల పాటు చర్చించారని ఇంకా చర్చించాల్సిన ప్రధాన అంశాలు ఉన్నందున సభ్యులు సభకు సహకరించాల్సిందిగా సభాపతి విజ్ఞప్తి చేశారు. అయినప్పటి విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేపట్టడంతో రైతు ఆత్మహత్యల నివారణకు తమ ప్రభుత్వం సభలో స్పష్టమైన ప్రకటన చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఏసీ సమావేశంలో నిర్దేశించిన ప్రకారం రైతు ఆత్మహత్యలపై సభలో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ చేపట్టామని, రైతు సమస్యలను ఎలా పరిష్కరిస్తామో స్పష్టం ప్రకటన చేసినప్పటికీ విపక్షాలు సభ జరగనివ్వబోమని అనడం సరికాదని సూచించారు.

స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, టిడిపి, బిజెపి సభ్యుల్లో కొందరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన సభ్యులు వెంటనే సభ నుంచి బయటకు వెళ్లి పోయావాలి స్పీకర్ ఆదేశించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో పువ్వాడ అజయ్ కుమార్, డికె. అరుణ, మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సంపత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి, వెంటకరెడ్డి తదితరులు ఉన్నారు. సస్పెండ్ చేయకపోయినా జానారెడ్డి బయటకు వచ్చేశారు. మరో వైపు టిడిపి నుండి ఆర్.కృష్ణయ్య మినహా మిగతా సభ్యులను సస్పెండ్ చేశారు.

సభలో నిరసన తెలుపుతున్న సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్ : రైతు రుణ మాఫీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులను (ఎంఐఎం మినహా) సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు సభలో ప్రకటన చేయడంతో స్పీకర్ దాన్ని ఆమోదించారు.  దీంతో ఎంఐఎం సభ్యులు మినహా మిగతా విపక్ష సభ్యుల పై ఈ సెషన్ అంతా సస్పెన్షన్ వేటు పడింది.

తెలంగాణ శాసన మండలి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. విపక్షాలు రుణ మాపీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకట చేయాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే.

సభలో గందరగోళం...

హైదరాబాద్ : తెలంగాణ శానససభ, శాసన మండలి సమావేశాలు కొద్ది సేపటి కిత్రం ప్రారంభం అయ్యాయి. వెను వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టాయి. రుణ మాఫీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలుపట్టు బట్టాయి. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.ఈ విషయంపై రెండోరోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగిందని స్పీకర్ తెలిపారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు 13 గంటల పాటు చర్చించారని ఇంకా చర్చించాల్సిన ప్రధాన అంశాలు ఉన్నందున సభ్యులు సభకు సహకరించాల్సిందిగా సభాపతి విజ్ఞప్తి చేశారు.

ప్రారంభమైన శాసనసభ, శాసన మండలి సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ శానససభ, శాసన మండలి సమావేశాలు కొద్ది సేపటి కిత్రం ప్రారంభం అయ్యాయి. వెను వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టాయి. అడ్డు పడ్డ విపక్షాలు రైతు రుణ మాఫీ పై చర్చల జరపాలని పట్టుపడుతున్నాయి.

ఏడిద భౌతికాయం స్వగృహానికి తరలింపు...

హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరగనున్నాయి. పలువరు సినీ ప్రముఖులు ...ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంతో 26వేల 561.15 పాయింట్ల వద్ద ట్రెండ్ అవుతుండగా, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,044.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

సూర్యాపేటలో కుక్కల స్వైర్య విహారం...

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ సీఎల్పీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ప.గో జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని రేపింది. రైతు ఆత్మహత్యతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నేటి వాయిదా తీర్మానాలు ఇవే...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రుణమాఫీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలని... కౌలుదారులకు, ప్రైవేటు రుణాలకు కూడా రుణమాఫీ వర్తింపచేయాలని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

09:27 - October 5, 2015

హైదరాబాద్ : ఏడిద నాగేశ్వరరావుకు ఇవాళ సాయంత్రం మహా ప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నిన్న స్టార్ ఆసుపత్రిలో చనిపోయిన ఏడిద భౌతిక కాయాన్ని ఉదయం.. ఫిల్మ్ నగర్ లోని స్వగృహానికి తరలించారు. ఏడిద మృతికి సినీ ప్రముఖుల నివాళులు అర్పించారు. పలు కళాత్మక చిత్రాలు నిర్మించిన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

09:24 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రుణమాఫీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలని... కౌలుదారులకు, ప్రైవేటు రుణాలకు కూడా రుణమాఫీ వర్తింపచేయాలని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. గత గురువారం నాటి సమావేశాల్లో భాగంగా రైతుల రుణమాఫీని ఒకే దఫాలో అమలు చేయాలని విపక్షాలన్నీ అధికార పక్షంపై దండెత్తాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన అధికార పక్షం సభను కేవలం ఏడంటే ఏడు నిమిషాల్లో వాయిదా వేసి పలాయనం చిత్తగించిందన్న అపప్రథను మూటగట్టుకుంది. తాజాగా నేటి సమావేశాల్లోనూ రుణమాఫీ సింగిల్ సెటిల్ మెంట్ పైనే విపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే విపక్షాలన్నీ ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కార్యాలయానికి అందించాయి. మరి విపక్షాలను అధికార పక్షం ఏ రీతిన అడ్డుకుంటుందోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.  

09:20 - October 5, 2015

హైదరాబాద్‌ : పాతబస్తీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు.. దాదాపు 7 ప్రాంతాల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. బీహార్‌, యూపీకిచెందిన 40మందిని అదుపులోకి తీసుకున్నారు.. సరైన పత్రాలులేని 25 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.. నగరంలో పెరిగిపోతున్న చైన్‌ స్నాచింగ్‌లతో తనిఖీలు పెంచారు పోలీసులు... నగరంలో రెచ్చిపోతున్న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన దొంగలే లక్ష్యంగా పోలీసులు ఈ సోదాలు నిర్వమించారు. ఫలక్ నుమా పరిధి మహమ్మద్ నగర్, మీర్ సాబ్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

09:17 - October 5, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో.. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. పలు విశ్వవిద్యాలయాల ఆచార్యులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. విజయవాడలోని సీఆర్డీఏ ఆఫీస్‌లు జరిగిన సమావేశానికి.. శ్రీవెంకటేశ్వర, నాగార్జునా, ఆంధ్ర, కృష్ణదేవరాయ యూనివర్సిటీల నుంచి దాదాపు 30మంది ప్రొఫెసర్లు హాజరయ్యారు. సింగపూర్‌ ప్రభుత్వం.. అమరావతికి బృహత్తర ప్రణాళికను తయారు చేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా.. అమరావతి రోడ్‌ గ్రిడ్‌ తయారుచేసినట్లు చెప్పారు.

 

09:14 - October 5, 2015

హైదరాబాద్ : చేనేత పరిశ్రమను ఆదుకోవాలనే లక్ష్యంతో బెంగళూరులో జరిగిన డాగ్‌ షో అందరిని అలరించింది. ఖాదీతో తయారు చేసిన అవుట్ ఫిట్స్‌ను ధరించిన పెట్‌ డాగ్స్‌ షోలో సందడి చేసాయి. ఇంచుమించు ర్యాంప్‌ పై క్యాట్‌ వాక్‌ చేసే మోడళ్లను తలదన్నాయి. డాగ్‌ షోను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శునక రాజుల విన్యాసాలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.

ఇద్దరు తీవ్రవాదుల హతం...

హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్ సరిహద్దులో తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటన పుల్వామా జిల్లాలోని ట్రల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో జైష్ ఈ మహ్మద్కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. 

నేడు భోగాపురంలో జగన్ పర్యటన

హైదరాబాద్ : భోగాపురం భూనిర్వాసితుల త‌రపున పోరాటం చేసేందుకు వైసిపి రెఢీ అవుతుంది. నేడు భోగాపురంలో ప‌ర్యటించ‌నున్న జ‌గ‌న్.. అక్కడి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. అవసరం లేకున్నా.. బ‌ల‌వంతంగా రైతుల నుంచి భూముల‌ను ఏవిధంగా సేక‌రిస్తోంది అనే అంశాన్ని ప్రజల్లోకి గ‌ట్టిగా తీసుకువెళ్లాలంటున్నారు జ‌గ‌న్.

కుమారుడుతో కలిసి భర్తను హతమార్చి భార్య

ఖమ్మం : కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన భార్య, కొడుకుల ఉదంతం ఖమ్మం జిల్లాలో జరిగింది. మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త ప్రకాష్‌ను భార్య, కొడుకులు కలిసి రోకలిబండతో కొట్టి చంపారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మధిరలో విషాదాన్ని రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

08:59 - October 5, 2015

హైదరాబాద్ :నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు. అక్టోబర్‌ 5 తన పుట్టినరోజుని పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకుల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టాలని భావించి నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి ఇచ్చిన సలహా మేరకు భద్రాచలం దగ్గరలోని చెరుపల్లి అనే మారు మూల గ్రామాన్ని దత్తత తీసుకొని స్థానికంగా చక్కని కార్యక్రమాల్ని చేపడుతున్న ఆనందం ఫౌండేషన్‌, అమ్మ నాన్న ఫౌండేషన్‌ల సహకారంతో దశలవారీగా 10 సంవత్సరాల ప్రణాళికలో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు.

08:54 - October 5, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పీకూ'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో తెలిసిందే. ఐతే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని దీపిక గురించి ప్రశ్నించినప్పుడు పీకూ సినిమా నిజజీవితంలో దీపిక అంత అందంగా ఉందంటూ ఒక్క మాటలో చెప్పారు. సౌరవ్ సొంత రాష్ట్రమైన కోల్‌కతాలోనే ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అప్పుడు కూడా పీకూ సెట్స్‌కి సౌరవ్ తన భార్య డోనాతో వెళ్లారు. సౌరవ్ కొన్ని నెలల క్రితమే ఈ సినిమా చూసినా అప్పటినుంచి దీపికని పొగడకుండా ఉండలేక పోతున్నారట. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు సమయం పడుతోంది.

ప్లాస్టిక్ మనీతో నల్లధనానికి చెక్ !

హైదరాబాద్ : దేశంలో నల్లధనం చలామణిని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నిర్ణీత స్థాయి దాటి సాగే నగదు లావాదేవీలపై పాన్‌కార్డు వివరాల సమర్పణను త్వరలో తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫేస్‌బుక్ ద్వారా ఆదివారం నెటిజన్లతో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. భారతీయుల నల్లధనంలో అత్యధికం దేశంలోనే ఉందన్న జైట్లీ... ప్లాస్టిక్ కరెన్సీ వాడకాన్ని ప్రామాణికం చేసి అసాధారణ పరిస్థితుల్లోనే నగదు వాడకం జరిగేలా ప్రజల వైఖరిలో మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు.

08:23 - October 5, 2015

హైదరాబాద్ : ఇండియా- సౌతాప్రికాల మధ్య రెండో టీ20 ఇవాళ కటక్‌లో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంతో సఫారీలు జోరు మీదున్నారు. దీంతో ఈ మ్యాచ్ గెలవడం ధోనీ సేనకు కీలకంగా మారింది. సఫారీలకు ధీటైన సమాధానమివ్వాలని టీమిండియా కసితో ఎదురుచూస్తోంది. భారీ స్కోరు చేసినా పసలేని బౌలింగ్, టీ20 స్థాయిలో లేని బ్యాటింగ్ ఫినిషింగ్ వైఫల్యాలతో ధర్మశాలలో ఇండియా ఛాన్స్ పోగొట్టుకుంది. అటు రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటి సీరీస్‌ కైవసం చేసుకోవాలని సఫారీలు భావిస్తున్నారు. అటు భారీ వర్షాలకు కటక్ గ్రౌండ్ తడిసి ముద్దయింది. పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను గ్రౌండ్‌మెన్ కప్పి ఉంచారు. ఐతే.. మళ్లీ వర్షం కురియకపోతే మ్యాచ్ సమయానికల్లా మైదానాన్ని సిద్ధం చేసేందుకు స్టాఫ్ శ్రమిస్తున్నారు. కానీ.. మరో 48 గంటలు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మ్యాచ్ రద్దు కాకున్నా, ఓవర్లలో కోతైనా తప్పదేమోనని గ్రౌండ్ స్టాఫ్ అంచనా వేస్తోంది.

కటక్ చేరిన టీమిండియా- సౌతాఫ్రికా టీ-20 సర్కస్

హైదరాబాద్ : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల తీన్మార్...టీ-20 సిరీస్ సర్కస్ ఉత్తరభారతదేశంలోని ధర్మశాల నుంచి...తూర్పు భారత్ లోని కటక్ నగరానికి చేరింది. బారాబటీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20 సమరం సఫారీలకు చెలగాటం...టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే...కటక్ యుద్ధంలో ..ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. అయితే..ఈమ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

గోదావరి ఖనిలో మహిళపై అత్యాచారయత్నం....

కరీంనగర్‌ : గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

08:11 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణను ఎ కేటగిరి ఆర్ధికశక్తిగా ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ గుర్తించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రేటింగ్‌ మైనస్‌ నుంచి ప్లస్‌కు చేరిందని తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించే స్థోమత తెలంగాణకు ఉందని ఏజెన్సీ నివేదికలో వివరించింది. ఏజెన్సీ తాజా నివేదికతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఇక్రా నివేదిక......

తెలంగాణ రాష్ట్రానికి మరో గుర్తింపు లభించింది. దేశంలోని చాలా రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులను అధ్యయనం చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్‌మేషన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ - ఇక్రా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదిక ఇచ్చింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందేటప్పుడు.. తిరిగి రుణాలను చెల్లించే స్థోమత కలిగిన ఆర్ధిక వ్యవస్థల సామర్ధ్యాన్ని బట్టి ఇక్రా ఈ నివేదికను రూపొందించింది.

మెరుగ్గా పన్నుల ద్వారా ఆదాయం......

తెలంగాణలో పన్నుల ద్వారా సమకూరే ఆదాయం మెరుగ్గా ఉందని ఇక్రా తెలిపింది. దేశ తలసరి ఆదాయం 74,380 రూపాయలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం 95,361 రూపాయలు ఉందని పేర్కొంది. తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ఐపాస్‌ విధానం వల్ల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందని ఇక్రా తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న నిధుల ద్వారా వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశం ఉందని నివేదిక ద్వారా తెలుస్తోంది.

హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు .....

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్రా.. ఏ కేటగిరి ఆర్ధికశక్తిగా గుర్తించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదాయంలో రాష్ట్రం ముందు ఉందని ప్రభుత్వం చెబుతున్న దానికి.. తాజా నివేదికతో అది నిజమైందని అంటున్నారు. ఇక ఇక్రా ఇచ్చిన నివేదికతో రాష్ట్రానికి పెట్టుబడులు పుష్కలంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

08:03 - October 5, 2015

హైదరాబాద్ : బలమైన ప్రాంతాయ పార్టీలు అంత తేలిగ్గా మటుమాయం అవుతాయి అనడం అసాధ్యం అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించినట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాల్ గా మారాయా? తెలంగాణ లో టిఆర్ ఎస్ వల్లే టిడిపి బలపడుతోందా? భవిష్యత్ లో టిఆర్ ఎస్ కనుమరుగు కానుందా? ట్యాంక్ బండ్ పై వెంకటస్వామి విగ్రహాప్రతిష్టాపనను ఎమ్మార్పీఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది... ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రావు, టిడిపి నేత ప్రతాప్ రెడ్డి, టిఆర్ ఎస్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ యాతాకుల భాస్కర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:57 - October 5, 2015

హైదరాబాద్ :చైనా ఓపెన్ కోసం ప్రస్తుతం బీజింగ్ లో ఉన్న సానియా, డబుల్స్ లో తన సహచరి మార్టినా హింగిస్ తో కలిసి నిన్న సరదాగా గడిపింది. హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్లు ఓ ఫొటో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. హింగిస్ కు ‘డే ఆప్’ అయితే తనకు మాత్రం ‘వర్కింగ్ డే’ అంటూ సదరు పోస్ట్ కు ఆమె సరదా కామెంట్ జోడించింది.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీవోపీటీ ప్రోత్సాహం

హైదరాబాద్ :‘‘ప్రత్యేకంగా సెలవులిస్తాం.. రూ.20 వేల నగదూ ఇస్తాం.. అడవులకు వెళ్లండి. సాహస యాత్రలు చేయండి.. ట్రెక్కింగ్‌, పర్వతారోహణ, ఎడారి యాత్ర, పడవ ప్రయాణం.. అలలపై సర్ఫింగ్‌.. ఏదైనా మీ ఇష్టం..’’ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) కల్పిస్తున్న అవకాశమిది. వృత్తిజీవితంలో ఒత్తిడిని జయించి.. సవాళ్లను ఎదుర్కొనేలా ఉద్యోగులను రీచార్జ్‌ చేసేందుకని కార్పొరేట్‌ కంపెనీలు ట్రెక్కింగ్‌, పర్వతారోహణ వంటి సాహస క్రీడలకు పంపుతుండటం.. యోగా, ధ్యానం తరగతులూ నిర్వహిస్తుండటం మనకు తెలిసిందే.

తెలంగాణను 'ఏ' కేటగిరి ఆర్ధికశక్తిగా గుర్తించిన ఇక్రా

హైదరాబాద్ : తెలంగాణను ఏ కేటగిరి ఆర్ధికశక్తిగా ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ గుర్తించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రేటింగ్‌ మైనస్‌ నుంచి ప్లస్‌కు చేరిందని తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించే స్థోమత తెలంగాణకు ఉందని ఏజెన్సీ నివేదికలో వివరించింది. ఏజెన్సీ తాజా నివేదికతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

నగరంలో మొదలైన దసరా నవరాత్రుల సందడి

హైదరాబాద్ : నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. సికింద్రాబాద్‌లోని ఇంపిరీయల్‌ గార్డెన్స్‌లో నియంత్రన్‌ సంస్థ దాండియా ఉత్సవాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సింగర్‌ ఫాల్గుని పాటక్‌ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తన గాన మాధుర్యంతో ఆమె యువతలో జోష్‌ నింపారు. నగరానికి చెందిన దాదాపు 3వేల మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాండియా ఆడారు.

ఆగివున్న లారీన ఢీ కొట్టిన బస్సు : ఇద్దరి మృతి

గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇతర ప్రయాణీకులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలో డెంగ్యూ విజృంభణ

చిత్తూరు : జిల్లాలో డెంగ్యూ మహమ్మారి పడగ విప్పింది. జిల్లాలోని రుయాలోగల చిన్నపిల్లలవార్డు డెంగ్యూ బాధితులతో కిటకిటలాడుతోంది. పడకలు సరిపోక పలువురు చిన్నారులు అవస్థపడుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ మరణాలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఉపశమన చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

07:21 - October 5, 2015

హైదరాబాద్ : ప్రముఖ న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రాంజెఠ్మలానీ నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై అంతెత్తున ఎగిరిపడ్డారు. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ప్రకటించిన మోదీని తాను దైవదూతగానే భావించానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనను మోదీ మోసం చేశారని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. అయితే మీరు మాత్రం మోసపోవద్దని ఆయన బీహార్ ప్రజలకు సూచించారు. బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రత్యర్థులకు ఓటేయాలని ఆయన ఆ రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంలో ఇటు ఎన్టీఏ ప్రభుత్వమే కాక, గత యూపీఏ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు మాజీ మంత్రి చిదంబరంను అరెస్ట్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జెఠ్మలానీ పేర్కొన్నారు.  

07:08 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీలు, స్థానిక సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలలో దాదాపు రెండు లక్షల మంది కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, పార్ట్ టైం, డైలీవేజ్, గెస్ట్ ఇలా వివిధ పేర్లతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరులో చాలామంది పది పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఉద్యోగ సేవలందించినవారూ వున్నారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల వీరి భుజస్కందాల మీదనే ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అయిన్నప్పటికీ ప్రభుత్వాలు జీత భత్యాల విషయంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమను చూడడం లేదన్నది వీరి ఆవేదన. ఆక్రందన. పదో పీఆర్సీని తమకు వర్తింపచేయాలన్నది వీరి డిమాండ్. పదో పీఆర్సీ ప్రకారం క్లాస్ ఫోర్ కేడర్ కి 13 వేల రూపాయలు, క్లాస్ త్రీ కేడర్ కి 18 వేల రూపాయలు, ఇతర అన్ని కేడర్ల వారికి రెగ్యులర్ ఉద్యోగుల మినిమమ్ బేసిక్ ను చెల్లించాలని కోరుతున్నారు. కానీ తీరని కోరికగానే మిగిలిపోయింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, తమకు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, హెల్త్ కార్డు, బస్ పాస్ లాంటి సౌకర్యాలు అమలు చేయాలని కోరుతున్నారు. 

07:07 - October 5, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, పార్ట్ టైం, డైలీవేజ్, గెస్ట్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఎల్లుండి ఏడో తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగుల ఆందోళనకు కారణం ఏమిటి? వీరు కోరుతున్నదేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కె. సతీష్ కుమార్ పాల్గొన్నారు. వీరు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

07:02 - October 5, 2015

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ సమస్యలన్నీ తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వానికి రాజధానిపైన ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడంలో లేదంటూ అనేకమంది ఆందోళన పట్టబోతున్నారు. రాజధాని ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీపీఎం పాదయాత్రకు సిద్ధమైంది.

6 నుంచి 11 వరకు సీపీఎం పాదయాత్ర .....

నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం.. భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఎం ఆరోపిస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆందోళన బాట చేపడుతోంది. ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రాజధాని ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నట్లు సీపీఎం సీఆర్డీఏ ప్రాంత కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు తెలిపారు. రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, విద్యార్ధుల ఇబ్బందులను పరిష్కరించకుండా ప్రభుత్వం కేవలం రాజధానిపైనే దృష్టి సారించడం సరికాదని ఆయన అన్నారు.

కృష్ణానగర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం .....

ఇక సీపీఎం పాదయాత్ర మంగళవారం కృష్ణానగర్‌ నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లిలో కొనసాగనుంది. బుధవారం నపులూరు, బేతపూడి, యర్రబాలెం, నిడమర్రు, నీరుకొండ, కురగల్లు,.. గురువారంనాడు తుళ్లూరు, వైకుంఠాపురం, శాఖమూరు,.. శుక్రవారం ఐనవోలు, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, తాళ్లాయపాలెం,.. శనివారం వెలగపూడి, మోదిలింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి.. ఇక చివరిరోజు ఆదివారం నాడు అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, తుళ్లూరులో పాదయాత్ర కొనసాగనుంది. ఇక పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి 13వ తేదీన సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నారు.

శంకుస్థాపనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సర్కార్‌..

నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సర్కార్‌.. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కార్యక్రమం కొనసాగాలంటే రాజధాని ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సీపీఎం ముందుకు రావడంతో సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకువెళ్తుందో చూడాలి. 

06:58 - October 5, 2015

హైదరాబాద్ : కర్నాటక-ఆంధ్రా రాష్ర్టాల మధ్య జలవివాదం ముదురుతోంది. సువర్ణముఖి నదీ జలాల కోసం ఇరు రాష్ట్రాల రైతుల పోరుబాట పట్టారు. నదిపై నిర్మించిన అడ్డుకట్టను తొలగించాలని కర్నాటక రైతు సంఘం నాయకులు, రైతులు డిమాండ్‌ చేస్తుండడంతో.. అనంతపురం జిల్లా అగళి మండలంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

సువర్ణముఖి నదీ జలాల కోసం రగడ.....

సువర్ణముఖి నదీ జలాల కోసం కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల రైతుల మధ్య గొడవ ముదురుతోంది. సువర్ణముఖి నదీ వివాదం రెండో రోజు కూడా కొనసాగింది. నదిపై నిర్మించిన అడ్డుకట్టను తొలగించాలని కర్ణాటక రైతు సంఘ నాయకులు, రైతులు ప్రయత్నిస్తుడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

సువర్ణముఖి నది ప్రాంతంలో 144 సెక్షన్‌ విధింపు....

ముందస్తు జాగ్రత్తగా రెండు రాష్ర్టాల పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. సువర్ణముఖి నది ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించినా.. కర్నాటక రైతు సంఘం అధ్యక్షుడు కోడిపల్లి చంద్రశేఖర్‌, రాష్ర్ట కార్యదర్శి శివప్ప, తదితర నాయకులు రైతులను వెంటబెట్టుకుని.. ఆనకట్ట వద్దకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని.. పరిస్థితిని శాంతింపజేశారు.

కర్నాటక రైతుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రైతులు....

కర్ణాటక ప్రాంతం నుంచి అగళి మండలం మీదుగా సువర్ణముఖి నది ప్రవహిస్తోంది. అయితే సరిహద్దు ప్రాంతం అగళి సమీపంలో నదికి అడ్డంగా గతంలో అడ్డుకట్ట నిర్మించారు. అక్కడి నుంచి నీటిని అగళి చెరువుకు మళ్లించేలా కాలువను తవ్వారు. అయితే తమ ప్రాంతానికి చెందాల్సిన నీటిని అగళి చెరువు మళ్లిస్తున్నారని, వెంటనే అడ్డుకట్ట తొలగించాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు సువర్ణముఖి నదిపై ఆనకట్టను తొలగింపు ఆంధ్రారైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జలవివాదం రెండు రాష్ర్టాల రైతుల మధ్య ముదరకుండా ప్రభుత్వాలు త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

06:55 - October 5, 2015

హైదరాబాద్ : ఇప్పటివరకు రైతు ఆత్మహత్యలపై హాట్‌హాట్‌గా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసిన విపక్షాలు.. రుణమాఫీని సింగిల్‌ సెటిల్‌మెంట్‌ చేసేదాకా వదిలే ప్రసక్తే లేదంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎలాంటి అంశమైనా చర్చకు సిద్ధమంటూనే రైతుల సమస్యను సైడ్‌ చేసేసి.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సిద్ధవమవుతోంది.

రైతు సమస్యలపై హాట్‌హాట్‌గా చర్చ...........

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూల్‌గా ప్రారంభమైనా.. రైతు సమస్యలపై చర్చ హాట్‌హాట్‌గా కొనసాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. విపక్షాల నుంచి మంచి సూచనలు వస్తాయని భావించినా.. అధి సాధ్యం కాలేదని అధికారపక్షం ప్రతిపక్షాలపై మండిపడింది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వ తీరును వ్యతిరేకించాయి. రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించాయి. రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే రైతు రుణమాఫీని సింగిల్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలని సూచించాయి. మరోవైపు రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు.. సభ వాయిదా పడినా సభలోనే ఉండి ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఎమ్మెల్యేలను బలవంతంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించింది.

విపక్షాలపై ప్రభుత్వం ఎదురుదాడి ...........

ఇక మరుసటి రోజు వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై చలో అసెంబ్లీ ఓ వైపు,.. రైతుల సమస్యలపై సభలో విపక్షాలు మరోవైపు పట్టుబట్టాయి. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం.. విపక్షాలకు రైతులపై ప్రేమ లేదంటూ ఎదురుదాడికి దిగింది. ఇక గురువారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయంటూ స్పీకర్‌ సభను వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్షాలన్నీ రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. ప్రభుత్వం రుణమాఫీపై ప్రకటన చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ .......

ఓవైపు ప్రతిపక్షాలన్నీ రైతు సమస్యల పరిష్కారానికి పట్టుబడుతుండగా.. కేసీఆర్‌ మాత్రం సమగ్ర జల విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక రైతు సమస్యలపై చర్చను ముగించిన సర్కార్‌.. నేడు విద్యుత్‌పై ప్రధానంగా చర్చించాలని భావిస్తోంది. అనంతరం రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఎందుకు రీడిజైన్‌ చేయాల్సి వచ్చిందో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో చర్చించారు. ఇక ఈ సమావేశం రేపు లేదా ఎల్లుండి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు రైతు సమస్యలపై స్పందించని గవర్నర్‌.. ఈ సమావేశానికి వస్తే తన స్థాయి తగ్గించుకున్నట్లేనని పలువురు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఇచ్చే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకుని తీరుతామని ప్రధాన ప్రతిపక్షం హెచ్చరిస్తోంది. ఇక ఇప్పటికై రైతు సమస్యలపై ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రతిపక్షాలు.. వాటర్‌ పాలసీపై చర్చకు సహకరిస్తాయా ? లేదా ? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సమావేశాలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. 

నేడు సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి...

హైదరాబాద్‌ : పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా పార్టీ కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్‌, డివిజన్‌ కార్యాలయాలను సోమవారం ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేదలకు నిత్యావసరాలను చౌకధరలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్: పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.   బీహార్‌, యూపీకి చెందిన 70 మందిని అదుపులోకి తీసుకొని 40 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వరుస చైన్‌స్నాచింగుల నేపధ్యంలో పోలీసులు సోదాలు జరిపారు. 

నేడు హస్తినకు చంద్రబాబు...

హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మరికాసేపట్లో హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భేటీలో భాగంగా ఆయన ప్రదానితో పలు కీలక అంశాలపై చర్చ జరిపే అవకాశాలున్నట్లు సమాచారం. స్వచ్ఛ భారత్ అభియాన్ కు సంబంధించి ఏర్పాటైన నీతి ఆయోగ్ సబ్ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికను కూడా చంద్రబాబు ప్రధానికి అందజేయనున్నారు.  

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం....

విజయవాడ :గవర్నర్ పేటలోని భక్షి ఆటో మొబైల్ షోరూంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో లూబ్రికెంట్లు, గ్రీజు, మండేందుకు సహకరించే పలు వస్తువులు ఉండటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను నిలువరించాయి. కోట్లలో నష్టం చోటుచేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయ్యి ఉంటుందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.

పాతబస్తీలో ఘర్షణ: ఒకరి మృతి

హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పీఎస్ పరిధిలో ఘర్షణజరిగింది. అహ్మద్, అతని తమ్ముళ్లపై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘర్షణకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

తెలంగాణ ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక

కరీంనగర్‌:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన ఎం వేణు, ఉపాధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన వీ రాజు, కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన రావి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆర్‌ఎన్ శంకర్‌తోపాటు 18 మంది కార్యవర్గ సభ్యులు, 47 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో మహాసభ నూతన కమిటీ ఎన్నుకున్నట్లు చెప్పారు.

రేస్ క్లబ్ పై ఈడీ దాడులు

హైదరాబాద్ : మలక్ పేటలోని రేస్ క్లబ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆరుగురు బుకీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి రూ.50 లక్షలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడిద నాగేశ్వరరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని కళాతపస్వి కే విశ్వనాథ్ నివాళులు అర్పించారు. రాజకీయ, చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏడిద నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.

అసోంలో మైనర్ బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..

అసోం: తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో అసోంలో ఓ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బొకొ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు గోపినాథ్ దాస్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అమింగాన్ ప్రాంతంలో దాస్‌ను అరెస్ట్ చేసినట్లు కామృప్ ఎస్పీ ఇంద్రాణి బారువ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే దాస్ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలికను అగస్టు 29న కారులో తీసుకెళ్లి గువహటి ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అక్కడే వదిలి వెళ్లాడు.

Don't Miss