Activities calendar

07 October 2015

బాలికపై అత్యాచారం.. హత్య

చెన్నై: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం చేసిన ఆగంతకులు అనంతరం ఆమెపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. కోయంబత్తూరు జిల్లా వడవల్లి సమీపంలోని వీవీ నగర్‌లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆగంతకులు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత రాడ్‌తో తలపై మోది, పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి... అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేశారు.

21:37 - October 7, 2015

హైదరాబాద్ : తెలుగు యువ హీరో నాని మణిరత్నం సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన మణిరత్నం 'ఓకే బంగారం' సినిమా తెలుగు వెర్షన్‌కు నాని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. త్వరలో మణిరత్నం తెరకెక్కించబోయే సినిమాలో నాని అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం కార్తి, దుల్కర్ సల్మాన్ లతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. మరి తెలుగు వెర్షన్ కు దుల్కర్ సల్మాన్ స్థానంలో నానిని తీసుకున్నారా? లేక మరేదైనా పాత్రకు తీసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.

21:35 - October 7, 2015

హైదరాబాద్ : రసాయనశాస్త్ర పరిశోధనారంగంలో విశేష సేవలందించిన స్వీడన్‌ శాస్త్రవేత్త తామస్ లిండాల్, అమెరికా శాస్త్రవేత్త పాల్ మోడ్రిచ్, టర్కీ శాస్త్రవేత్త అజిజ్ సాంకర్ లకు 2015కు గాను నోబెల్ బహుమతి ప్రకటించారు. డీఎన్ఏ మరమ్మతులపై పరిశోధనలకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు కలిపి ఈ ఏటి నోబెల్ బహుమతి ప్రకటించారు. తామస్ యూకేలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీ అండ్ క్లేర్ హాల్ ల్యాబరేటరీలో పనిచేస్తున్నారు. పాల్ మోడ్రిచ్ అమెరికాలోని దుర్హామ్‌లో హావర్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో, అజిజ్ సాంకర్‌ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరొలినాలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటివరకు రసాయనశాస్త్రంలో 172 మందికి నోబెల్ బహుమతి వచ్చింది.

21:33 - October 7, 2015

హైదరాబాద్ : ప్రస్తుతానికి ఆధార్‌ కార్డ్‌ను వంటగ్యాస్‌ సరఫరా, ప్రజాపంపిణీ పథకాలకు మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు బదిలీ చేసేందుకు తప్పనిసరిగా ఆధార్‌ కార్డ్‌ను వినియోగించటాన్ని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వ్యక్తిగత సమాచార భద్రత ప్రాథమిక హక్కా కాదా అన్న అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్నందున, దీనిపై తీర్పు వచ్చే వరకూ వంటగ్యాస్‌ సబ్సిడీలు, ప్రజాపంపిణీ వ్యవస్థలకు మాత్రమే ఆధార్‌ను ఉపయోగించుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు రిజర్వ్‌ బ్యాంక్‌, వాణిజ్య బ్యాంకుల వంటి సంస్థలు ఆధార్‌ కార్డును ఆర్థిక, టెలికాం, స్టాక్‌ మార్కెట్‌ సేవలకు గుర్తింపు ఆధారంగా ఉపయోగించుకునేందుకు అనుమతించాలని కోరుతున్నాయి.

21:32 - October 7, 2015

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు అక్బరుద్దీన్‌పై కిషన్‌గంజ్‌ ఎస్పీ అరెస్ట్ వారెంట్‌ జారీ చేశారు. ఆదివారం నాడు కిషన్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదిపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రధాని నరేంద్రమోదిని సైతాన్‌, జాలిమ్‌ అంటూ అక్బరుద్దీన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 2002 గుజరాత్‌ నరమేధాన్ని ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్‌- మోదీపై తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగించారు. గుజరాత్‌లో ముస్లింలను తరిమి తరిమి చంపారని, మహిళలు, పిల్లలను సజీవ దహనం చేశారని ఆరోపించారు. 

21:29 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు పలు అంశాలపై చర్చించిన శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసినందున సభను వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కేసీఆర్‌ సభలో చాలాసేపు మాట్లాడారు....

అసెంబ్లీ నిరవధిక వాయిదా రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో చాలాసేపు మాట్లాడారు. మేనిఫెస్టోలో లేని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు సన్న బియ్యం అన్నం అందిస్తామన్నారు.

మిషన్‌ కాకతీయపై సుదీర్ఘ చర్చ......

ఇటు మిషన్ కాకతీయపై సభలో సుదీర్ఘ చర్చ సాగింది. కాకతీయుల స్ఫూర్తి కొనసాగించేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. వారసత్వ సంపద కాపాడుకునేందుకే ఈ కార్యక్రమం అన్నారు. మిషన్ కాకతీయ చేపట్టిన తర్వాత చెరువుల లెక్క తేలిందన్నారు. రాష్ట్రంలోని చెరువులన్నింటినీ ఐదేళ్లలో బాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కావాలనే సభను సజావాగా నడవనీయని కారణంగా సభను వాయిదావేసినట్లు చెప్పారు.

30 గంటల 6 నిమిషాలపాటు సమావేశమైన శాసనసభ....

ఇక తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఏడు రోజుల పాటు సభ జరిగింది. శాసనసభ 30 గంటల 6 నిమిషాలపాటు సమావేశమైంది. సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే అయిదు అంశాలపై స్వల్ప కాలిక చర్చలు జరిగాయి. మొత్తంగా ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీని నిరవధిక వాయిదా పడింది. 

21:25 - October 7, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పనులు వేగవంతం చేశామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చీర, ధోతీలను పంచిపెడతామని అందుకోసం రైతుల కమిటీ కూడా వేస్తున్నామని తెలిపారు. అమరావతి మన నీరు మన మట్టి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 

21:23 - October 7, 2015

విజయవాడ : జగన్‌ విమర్శలపై మంత్రి దేవినేని కౌంటర్‌ ఇచ్చారు. దీక్షల పేరుతో విద్యార్ధులను రెచ్చగొడితే ప్రభుత్వం ఊరుకోదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేనివారితో కలిసి గ్రీన్ ట్రిబ్యునల్‌లో జగన్ కేసు వేయించారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

20:38 - October 7, 2015

హైదరాబాద్ : అక్టోబర్ 2 మహాత్ముని జయంతి. జాతి పిత గాంధీజీని నోట్ల కట్ల మీద ముద్రించుకున్నాం. కార్యాలయాల్లో... ఇళ్లల్లో పటాలుగా వేళాడదీసుకున్నాం. వీధుల్లో విగ్రహాలను ప్రతిష్టించాం. కానీ మన గుండెల్లో మాత్రం నిలుపుకోలేకపోయాం. అందుకే ఈ సారి గాంధీ జయంతిని దేశం కొత్త తరహాలో జరుపుకుంటోంది. అదే 'జాయ్ ఆఫ్ గిలింగ్ లివింగ్' అదేంటో నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తమిళనాడు సీఎంకు లేఖ రాసిన బాబు

హైదరాబాద్ :తమిళనాడు సీఎం జయలలితకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాశారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషా బోధన రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆమెకు లేఖ రాశారు. తెలుగు భాషను రద్దు చేయడం సరికాదని సూచించారు. తెలుగు భాషను రెండో బోధనా భాషగా ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేశారు. తమిళనాట కొనసాగుతున్న తెలుగు మీడియం పాఠశాలలను అలాగే కొనసాగనివ్వాలని ఆయన సూచించారు. తెలుగు భాష రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన లేఖలో కోరారు. 

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం...

విజయవాడ : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తూ దుర్గగుడి ఈవో సి.హెచ్‌.నరసింగరావు ఆహ్వాన పత్రికను క్యాంపుకార్యాలయంలో బుధవారం అందజేశారు. మూలా నక్షత్రం ముహూర్తంలో 19వ తేదీన ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు శేష వస్త్రం కప్పి, శుభాక్షతలు వేసి ఆశీర్వదించారు. దసరా పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నందున భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎంను ఆదేశించారు.

విద్యుత్ తీగ తెగిపడి కౌలు రైతు మృతి

కృష్ణా : విద్యుత్‌ తీగ తెగి పడటంతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెదపారుపూడి మండలం ఈదులమద్దాలి గ్రామంలో బుధవారం జరిగింది. కొంతమంది కూలీలను మాట్లాడుకుని ఎరువులు వేసేందుకు బుధవారం సీపూడి పొలిమేర దగ్గర చంద్రయ్య డ్రెయిన్‌ పక్కనే ఉన్న పొలానికి వెళ్ళాడు. పొలంలోకి దిగుతండగానే త్రీఫేస్‌ విద్యుత్‌ తీగ తెగి వెంకటేశ్వరరావుపై పడింది. ఈ దుర్ఘటనలో కౌలురైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకు వివాహం చేశాడని గ్రామస్తులు తెలిపారు.

20:00 - October 7, 2015

హైదరాబాద్‌ : నిత్యం వింత వింత విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. నమ్మశక్యంకాని నిజాలు విస్మయం కలిగిస్తుంటాయి. ఈజిప్టులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు వింత శిశువు జన్మించాడు. ఆ శిశువుకు కేవలం ఒక కన్ను మాత్రమే ఉంది. అంతేకాకుండా ఆ బాలుడికి ముక్కు కూడా లేదు. ఈ నేపథ్యంలో ముక్కులేని ఒంటి కన్ను బాలుడు జన్మించడానికి కారణం ఏంటా.. అని డాక్టర్లు ఆరా తీశారు. అప్పుడు విస్మయం కల్గించే ఒక విషయం తెలిసింది. శిశువు తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు అనారోగ్య కారణాల రీత్యా కొన్ని మందులు వాడిందట. అయితే ఈ మందుల ప్రభావంతోనే శిశువులో జన్యుపరమైన లోపాలు తలెత్తినట్లు డాక్టర్లు ఒక అంచనాకు వచ్చారు. వైద్యశాస్త్రంలో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని వారు వెల్లడించారు. కాగా ఆ శిశువు ఎక్కువ రోజులు బతకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే తను వాడిన మందుల వల్లనే చిన్నారికి ఈ స్థితి రావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. 'ఒంటికన్ను చిన్నారి జననం' అనే వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆ చిన్నారి ఫొటో వైరల్ గా వెళ్తోంది. 

బంజారా హిల్స్ లో సైకో దాడి : ఒకరి మృతి

హైదరాబాద్ :  బంజారాహిల్స్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ - 12 ఎన్బీటీ నగర్లో రహదారిపై వెళ్తున్న ఐదుగురు వ్యక్తులను ఓ సైకో అడ్డగించి... కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

టీఎస్ అసెంబ్లీ జరిగిన తీరు ఇలా...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయం 30 గంటల 6 నిమిషాల పాటు జరిగింది. సభలో రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొత్తం 14 ప్రశ్నలు, 70 అనుబంధ ప్రశ్నలకు సమాధానాలతో పాటు సభలో 5 స్వల్ప కాలిక చర్చలు జరిగాయి.

వర్షానికి కూలిన మహాలక్ష్మి ఆలయం...

అనంతపురం : ఈరోజు సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికి స్థానిక పాతవూరు సమీపంలోని బుక్కరాయ సముద్రం చెరువుకట్టపై వెలసిన కొల్లాపూరమ్మ మహాలక్షి దేవాలయం వెనుక భాగం కూలిపోయింది. ఆలయ శకలాలు అక్కడే ఆగి ఉన్న ఒక సుమోపై పడటంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ సమాచారం తెలుసుకున్న అనంతపురం మేయర్ స్వరూప సంఘటనా స్థలానికి వెళ్లారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. కాగా, ఆలయం ఉన్న ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. అమ్మవారి దయ వల్లే ఎటువంటి ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోలేదని ఆలయ పూజారులు తమ విశ్వాసం వ్యక్తం చేశారు. 

19:45 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకై నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 

19:44 - October 7, 2015

చిత్తూరు : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో తరచూ జారిపడుతున్న కొండచరియలు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న లింక్ రోడ్డు సమీపంలో కొండరాళ్లు జారిపడిన ప్రాంతంలోని రాళ్లను టీటీడీ అధికారులు పూర్తిగా తొలగించారు. దానితో పాటు చెన్నై ఐఐటీ ఫ్రొఫెసర్ల సూచన మేరకు జారిపడడానికి సిద్ధంగా ఉన్న వాటిని కూడా ఇంజనీరింగ్ అధికారులు తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మాప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

19:43 - October 7, 2015

హైదరాబాద్ : ఏపీకి ఎయిమ్స్‌ వైద్యశాల కేటాయింపు పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇప్పటికే స్థలాన్ని గుర్తించామని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. కేంద్రం ఏపీకి చేసిన హామీలను అమలు చేసి తీరుతుందని మంత్రి కామినేని అన్నారు. 

19:41 - October 7, 2015

విజయవాడ : రాజధాని శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రకటించారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు రానుండడంతో భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భద్రతా చర్యలలో 14 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తన్నట్లు మంత్రి తెలిపారు. 

19:40 - October 7, 2015

మహబూబ్‌నగర్‌ : గద్వాలలో తవ్వకాలలో ఓ పురాతన పాత్ర బయటపడింది. గద్వాల్‌లోని కూరగాయల మార్కెట్‌ నిర్మాణంలో ఉండగా.. అక్కడి పురాతన భవనానిన జెసీబీతో తవ్వుతుండగా ఒక భారీ పురాతన పాత్ర బయటపడింది. అయితే అందులో బంగారం ఉందనే టాక్‌ రావడంతో.. జనమంతా భారీగా తరలి వచ్చారు. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఆ పాత్రను స్వాధీనపర్చుకున్నారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘోర ప్రమాదం: మంత్రులు..

హైదరాబాద్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘోరరోడ్డు ప్రమాదం జరిగిందని మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని, మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను చేపట్టిన తుమ్మల గూడెం, ఇంద్రపాలనగరం ప్రజలకు మంత్రులంతా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని తెలిపారు. 

19:06 - October 7, 2015

హైదరాబాద్ : చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుందన్నారు వైసీపీ అధినేత జగన్‌. చంద్రబాబు ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చారని ఫైర్‌ అయ్యారు. ప్రతి పనికి లంచాలు తీసుకుని... ఆ డబ్బును తెలంగాణ ఎమ్మెల్సీలను కొనేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారన్నారు. అందుకే ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జగన్‌.. చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

నిరవధిక నిరహార దీక్ష....

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరహార దీక్షను ప్రారంభించారు. దీక్ష వేదికపై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్ష ఆరంభించారు. అంతకుముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న ఆయన... కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులోని దీక్షా వేదికకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.25 నిమిషాలకు దీక్షను ప్రారంభించారు.

చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు....

దీక్ష వేదికగా జగన్‌ టీడీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న జగన్‌.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటు పోగా..10 శాతం మాత్రమే రుణం ఉంటుందన్నారు. చట్ట ప్రకారం మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. హంద్రీ నీవా, గాలేరు-నగరి, వెలిగొండ అన్నీ చట్టంలో పెట్టారు. ఈ ప్రాజెక్టులకు 15 వేల కోట్లు అవుతుందని లెక్క వేసుకున్నారు. ఇవి తేవడానికి జపాన్, సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు మన చట్టంలో ఉన్నందున ఆ డబ్బు విదేశాల నుంచి తెచ్చుకున్నా కేంద్రం తిరిగి చెల్లిస్తుందన్నారు.

ఏపీని బాబు అవినీతి రాష్ట్రంగా మార్చారని ఆరోపణ...

చంద్రబాబు ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. పట్టిసీమ దగ్గర్నుంచి పోలవరం దాకా...బొగ్గు నుంచి ఇసుక, మట్టి వరకు అన్నీ లంచాలే అని దుయ్యబట్టారు. చివరకు మద్యాన్ని తగ్గిస్తామని.. దాన్ని పెంచేందుకు లైసెన్సుల కోసం కూడా లంచాలే తీసుకున్నారని మండిపడ్డారు. ఈ లంచాల డబ్బును ఏం చేయాలో తెలియక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 20 కోట్లతో కొనేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోడానికి కేంద్రం దగ్గర మొరపెట్టుకుని.. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రంతో లాలూచీ పడ్డారని విమర్శించారు.

చంద్రబాబు అల్టిమేటం ఇస్తే ఆరోజే...

కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటం ఇస్తే ఆరోజు ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందన్నారు జగన్‌. ఆ మాట చెప్పిన 24 గంటల్లో జైలుకు పోతానేమోనని బాబు భయపడుతున్నారని... అయినా ఈ పోరాటం ఆపకూడదన్నారు. 

బంజారాహిల్స్లో దారుణం..

హైదరాబాద్ : బంజారాహిల్స్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ - 12 ఎన్బీటీ నగర్లో రహదారిపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను దుండగులు అడ్డగించి... కత్తితో దాడి చేశారు. అనంతరం వారు పరారైయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ఆసుపత్రికి చేరుకున్నారు. దాడి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

పేకాటస్థావరాలపై దాడి : ఏడుగరి అరెస్ట్

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమల మండలం రాళ్లగుంటలో బుధవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 11 వేల నగదు, 7 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గొంతు కోసి బంగారు ఆభరణాల దోపిడి

వరంగల్ : గిర్యాజీపేటలో దారుణం జరిగింది. జ్ఞానేశ్వరి అనే మహిళ గొంతు కోసి దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బస్సు ప్రమాద మృతులకు రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి మహేందర్‌రెడ్డి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటన పట్ల విషాదం వ్యక్తం చేసిన ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. మృతులు కుటుంబాలకు ఆర్టీసీ ఇచ్చే పరిహారానికి అదనంగా రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని నల్లగొండ కలెక్టర్ ను ఆదేశించారు. 

టీఎస్ శాసనసభ నిరవధిక వాయిదా..

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ ప్రసంగాల తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

గద్వాలలో వజ్రాల కలకలం....

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని గద్వాలలో వజ్రాల కలకలం రేగింది. తవ్వకాల్లో ఓ పురాతన పాత్ర లభించినట్లు, ఈ పాత్రలో వజ్రాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గద్వాల పట్టణానికి చెందిన కొందరు ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారికి ఓ పురాతన పాత్ర లభించినట్లు పట్టణంలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ పాత్రలో వజ్రాలు కూడా ఉన్నాయన్న విషయం బయటకు పొక్కడంతో... ఇక రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. అయితే... పాత్రలో వజ్రాలు ఉన్నాయా... లేవా...

బస్సు ప్రమాదం పై పలువురు నేతల విచారం..

నల్గొండ : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

సంక్షేమ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ : కేసీఆర్

హైదరాబాద్ :సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాల పై కేసీఆర్ శాసనసభలో మాట్లాడారు. ప్రజావసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గతంలో సంక్షేమానికి రూ.13,572 కోట్లు ఖర్చు చేస్తే ఇపుడు రూ.33.986 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఫైనాన్షియల్ ట్రెండ్స్ బాగున్నాయని... అందుకే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయిన్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి భృతి, ఆరోగ్య లక్ష్మి కింద గర్భిణులకు పాలు, గుడ్లు ఇస్తున్నామన్నారు.

వామపక్షాల బంద్ కు మద్దతు ప్రకటించిన నాగం...

హైదరాబాద్ :ఈ నెల 10న వామపక్షాలు చేయబోయే తెలంగాణ బంద్ కు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఏకం కావడం సంతోషకరమని చెప్పారు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం చేసిన ప్రభుత్వం, సొంత డబ్బా కొట్టుకుంటుందని నాగం విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

మొయిన్ పేట మండలంలో పులి సంచారం...

రంగారెడ్డి: మొయిన్‌పేట మండలం చక్రంపేట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం మధ్యాహ్నం పులి సంచరిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వారు ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పొలాలను పరిశీలించారు. పులి అడుగు జాడలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు  సూచించారు. మరో వైపు పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తారని తెలియజేశారు.

దాద్రి లాంటి సంఘటనలకు చోటు లేదు: ప్రణబ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో చోటు చేసుకున్న సంఘటనపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. మూల విలువలు ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదన్నారు.సహనంతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ... పురాతన నాగరికతల్లో శతృత్వ ధోరణిలు ప్రబలి అంతరించినా.. విలువలు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయని అందుకు కారణం మూల విలువలేనని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రమాద స్థలికి బయలుదేరిన మంత్రులు, ఆర్టీసీ అధికారులు..

 హైదరాబాద్ నల్గొండ జిల్లా రామన్నగూడెం మండలం తుమ్మలగూడెం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనా స్థలికి రాష్ట్ర ముగ్గురు మంత్రులు, ఆర్టీసీ అధికారులు హుటాహుటిన బయలుదేరారు. తుమ్మలగూడెం వద్ద నార్కెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భువనగిరి నుంచి నల్గొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 15 మంది ప్రమాదంలో మృతిచెందగా... మరో 15 మంది గాయాలపాలయ్యారు. కాగా... ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రులు గుంటకంట్ల జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

నల్గొండ రోడ్డు ప్రమాదం పై సీఎం కేసీఆర్ ఆగ్ర్భాంతి

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద మృతులకు సీఎం సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులు పర్యవేక్షించాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిని సీఎం ఆదేశించారు.

17:01 - October 7, 2015

హైదరాబాద్ : పంజాబ్‌లోని లూథియానాలో షహీద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు చెలరేగాయి. రైల్లోని లగేజ్‌ మొత్తం కాలిబూడిదైంది. అయితే ప్రయాణికులు మాత్రం తృటిలో తప్పించుకున్నారు. వెంటనే తేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేశారు.

17:00 - October 7, 2015

హైదరాబాద్ : భారత్‌లో ఫేస్‌బుక్‌ హవా కొనసాగుతోంది. భారత్‌లోని పాపులర్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఫేస్‌బుక్‌ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సప్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

మళ్లీ ఫేస్‌బుక్‌కే పట్టం కట్టారు యూజర్లు.....

భారత్‌లోని పాపులర్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఫేస్‌బుక్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో మళ్లీ ఫేస్‌బుక్‌కే పట్టం కట్టారు యూజర్లు. 51 శాతం మంది రోజువారీగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవడంతో మళ్లీ ఫేస్‌బుక్‌ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. అదేవిధంగా వాట్సప్‌ను 56 శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారని గ్లోబల్‌ రీసెర్చ్‌ కన్సల్టెన్సీ సంస్థ TNS నివేదిక వెల్లడించింది. అంతేకాదు..అంతర్జాతీయంగా కూడా ఫేస్‌బుక్‌ ఫేవరెట్‌ సోషల్‌ ఫ్లాట్‌ఫామ్‌గా నిలుస్తోందని నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా నిత్యం 30శాతం......

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌ యూజర్లలో 30 శాతం మంది ప్రతి రోజు ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. భారత్‌లో ఫేస్‌బుక్‌ వినియోగం 51 శాతం ఉండగా..ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో 78 శాతం, తైవాన్‌లో 75 శాతం, హాంకాంగ్‌లో 72 శాతం ఉంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 149 కోట్ల మంది యూజర్లున్నారు. ఇందులో 12.5 కోట్ల మంది భారత్‌లోనే ఉండటం విశేషం. ఫేస్‌బుక్‌ వినియోగంలో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే. ఇక ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ విషయానికొస్తే.. ఆసియా పసిఫిక్‌ దేశాల్లోవాట్స ప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, వీచాట్‌ వంటి ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ను మలేషియాలో 77 శాతం మంది, హాంకాంగ్‌లో 73 శాతం, చైనాలో 69 శాతం, భారత్‌లో 38 శాతం మంది రోజూ వాడుతున్నారు. మొత్తానికి సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ తమకెవరూ సాటి రానని నిరూపిస్తున్నాయి.

 

16:57 - October 7, 2015

హైదరాబాద్ : వరకట్న దాహానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలైంది. హైదరాబాద్‌ కేపీహెచ్ బీ కాలనీ పీఎస్‌ పరిధిలో శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. నిజాంపేట రోడ్డు ప్రశాంత్‌ నగర్‌లో నివాసం ఉంటున్న శైలజ, భర్త నవీన్‌కుమార్‌ల మధ్య కొంతకాలంగా గొడవలు జరిగేవి. ఉదయం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలని శైలజను నవీన్‌కుమార్‌ తీవ్రంగా వేధించాడు. దీంతో మనస్తాపం చెందిన శైలజ.. ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. వారికి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

16:56 - October 7, 2015

కర్నూలు : శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కిష్ణానగర్ చెందిన జగదీష్ కుమార్ అనే విద్యార్థి రాత్రి తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ కుమార్ చనిపోవడానికి కారణాలపై పోలీసులు విచారణను సాగిస్తున్నారు. జగదీష్ కుమార్ చనిపోవడంతో కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఆత్మహత్య చేసుకోవాడనికి కారణలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

16:54 - October 7, 2015

హైదరాబాద్ : నితీష్‌-లాలూల పాతికేళ్ల పాలనలో బీహార్‌ ఎలాంటి అభివృద్ధి సాధించలేదని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ఆరోపించారు. గ్రామాల్లో విద్యుత్‌, రోడ్లు, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో బీహార్‌కు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌-లాలూ, నితీష్‌లకు అవకాశమిచ్చారు...బిజెపికి ఐదేళ్ల అవకాశమివ్వండి... దేశంలోనే బీహార్‌ను నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సూర్యగర్ధ ఎన్నికల సభలో అమిత్‌షా పేర్కొన్నారు.

16:52 - October 7, 2015

హైదరాబాబాద్ : బీహార్‌ ఎన్నికల సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదిని సూటు బూటు మనిషంటూ ప్రస్తావించారు. తాము 15 లక్షల మోది సూటును పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ప్రధాని అమెరికాలో సూటు వేసుకోలేదని, ఇందుకు బదులు ఒకే రోజులో 16 డ్రెస్సులు మార్చారన్నారు. సూటు బూటు వ్యక్తుల వెంట తిరిగే మోది కావాలో, ప్రజల మధ్యకు వెళ్లి సీదా సాదాగా ఉండే నితీష్‌కుమార్‌ కావాలో తేల్చుకోవాలన్నారు. మోదికి హామీలివ్వడం అలవాటుగా మారిందని, గత లోక్‌సభ ఎన్నికల్లో నల్లధనం, యువతకు ఉపాధి హామీలు ప్రధాని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. బీహార్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. ప్రధానికి పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం పట్టదని, కార్పోరేట్ల మేలు కోసమే పనిచేస్తున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. 

16:50 - October 7, 2015

హైదరాబాద్ : ఈ నెల 10 న ఇచ్చిన రాష్ర్టబంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వరంగల్‌ ఉప ఎన్నిక ప్రకటన రాకపోయినప్పటికీ వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన తమ్మినేని టెన్ టివి తో మాట్లాడుతూ... రాఊంలో ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రశ్నించేవాళ్లను ప్రభుత్వం అణిచివేస్తూ.. హేళన చేస్తోందని మండి పడ్డారు. వరంగల్ ఎన్ కౌంటర్ వ్యతిరేకంగా, రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఈనెల 10వ తేదీన వామపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి ఏర్పడిన టీడీఎఫ్ ఇచ్చిన పిలుపుకు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

16:46 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణమన్నారు కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ. ఎన్నికల ముందు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ గద్దెనెక్కారని విమర్శించారు. రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం కూడా రైతులు ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్నారు. 

16:44 - October 7, 2015

హైదరాబాద్ : ఈనాటి రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని గత 50 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు రాష్ట్రంలోని చెరువులను పూర్తి నిర్లక్ష్యం చేశాయన్నారు. చెరువులను సంపూర్ణంగా పునరుద్ధరించి ఉంటే.. బోర్లు ఎండిపోయేది కాదని.. తద్వారా రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్దరణే లక్ష్యంగా మిషన్ కాకతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని హరీష్‌రావు అన్నారు.

16:41 - October 7, 2015

హైదరాబాద్‌ : నగర శివార్లలోని బాలాపూర్‌ వద్ద కృష్ణా వాటర్‌ పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో మొత్తం వాటర్‌ చాలా ఫోర్స్‌గా రోడ్డుపైన పొంగింది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

టి.ఎస్ శాసనమండలి నిరవధిక వాయిదా...

హైదరాబాద్ : గత నెల 23న ప్రారంభమైన శానసమండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. మండలి ఉపాధ్యాక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికైన బాధ్యతలు స్వీకరించారు.

రైల్వే ఉద్యోగులకు బోనస్ : కేంద్ర కేబినెట్ నిర్ణయం...

న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 78 రోజుల బోనస్‌తో 12.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఇక మూడు రాష్ర్టాల్లో ఎయిమ్స్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రూ. 4,949 కోట్లతో ఏపీలోని మంగళగిరితో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్‌లను నిర్మించనున్నారు. రూ. 2,142 కోట్లతో నీరాంచల్ పేరుతో జాతీయ నీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

టిడిపి సభ్యులను వదిలేసిన మావోయిస్టులు..

హైదరాబాద్ : విశాఖ ఏజెన్సీలో మంగళవారం కిడ్నాప్ చేసిన టీడీపీ సభ్యులను విడుదల చేసినట్టు మావోయిస్టులు కబురు పంపారు. ఇన్ఫార్లన్న అనుమానంతో వారిని కిడ్నాప్ చేసినట్టు మావోయిస్టులు తెలిపారు. వారిని విచారించిన అనంతరం విడుదల చేసినట్టు మావోలు వెల్లడించారు. విశాఖపట్టణం ఏజెన్సీలోని జీకే వీధి మండలంలోని కొత్తగూడలో మండల టీడీపీ అధ్యక్షుడు బాలయ్య పడాల్ స్థానిక టీడీపీ నేతలు మహేష్, బాలయ్యను వారి నివాసాల నుంచి మంగళవారం అపహరించిన సంగతి తెలిసిందే. 

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు సమాచారం. రామన్న పేట మండలం, ఇద్రపాలనగరం వద్ద ప్రమాదం జరిగింది. నార్కెట్ పల్లి డిపోకు చెందిన బస్సు భువన గురి నుండి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడిన లారీని తప్పించబోయి మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో కూడా చనిపోయారు. మరో 15 మంది కి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

16:13 - October 7, 2015

నల్గొండ : రహదారులు రక్తసిక్తమయ్యాయి. రోడ్డు నెత్తురోడింది. నిర్లక్ష్యం మరోమారు భారీ మూల్యం చెల్లించింది. రవాణా భద్రత డొల్లతనం 10 మంది ప్రాణాల సాక్షిగా బయటపడింది. రోడ్డెక్కితే తిరిగొచ్చే గ్యారంటీ లేదని మరోసారి రుజువైంది. ఈ ప్రయాణం తమ పాలిట మృత్యుప్రయాణం అవుతుందని తెలియని సామాన్యులు నడిరోడ్డు మీదే తమ ప్రాణాలను వదిలేశారు. గమ్యం చేరడానికి బస్సెక్కిన ప్రయాణీకులు.. ప్రమాదం తమ గమ్యాన్ని మార్చేస్తుందని.. అది తమ మరణమేనని వారికి తెలియలేదు. నలిగిపోయిన వాహనాల మధ్య వారి బతుకులే నలిగిపోయాయి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులోని డ్రైవర్‌తో సహా 10 మంది చనిపోయారు. చనిపోయినవారిలో ఓ చిన్నారి, నలుగురు మహిళలు ఉన్నారు. మరో 10మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రలను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌ సభా ముఖంగా మృతులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు వైద్యసేవలు అందుతున్నాయని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.   

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘోర ప్రమాదం: మంత్రులు..

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘోరరోడ్డు ప్రమాదం జరిగిందని మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని, మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను చేపట్టిన తుమ్మల గూడెం, ఇంద్రపాలనగరం ప్రజలకు మంత్రులంతా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని తెలిపారు.

సోమనాథ్ భారతికి బెయిల్ మంజూరు...

హైదరాబాద్ :గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. న్యూఢిల్లీలోని ద్వారకా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కింద రూ.లక్ష వ్యక్తిగత బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో గృహ హింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజుల కిందట లొంగిపోయారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో విచారించారు. ఈ సమయంలో రెండు సార్లు సోమనాథ్ బెయిల్ కోసం సుప్రీంకు వెళ్లగా నిరాశ ఎదురైంది.

ఇంద్రాణిని ప్రశ్నించడానికి సీబీఐకి అనుమతి

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ వ్యామ్ రాయ్ లను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. బుధవారం నుండి అక్టోబర్ 19 లోపల వారిని ప్రశ్నించవచ్చని కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది.

జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు : మంత్రి గంటా..

అనంతపురం: వైసీపీ అధినేత జగన్‌‌పై మంత్రి గంటా శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. భోగాపురంలో తనకు సెంట్‌ భూమి ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే జగన్‌ తప్పుకుంటారా అని గంటా సవాల్ విసిరారు. జగన్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి గంటా ఆరోపించారు. వైఎస్‌ హయాంలో కంపెనీల కోసం వేల ఎకరాల భూములు దోచుకున్నారని, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదని గంటా దుమ్మెత్తిపోశారు.

వరంగల్ కలెక్టరేట్ వద్ద టిడిపి, బిజెపి ధర్నా

వరంగల్ : ఇటీవల రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి, బిజెపి పార్టీలు ధర్నాను నిర్వహించాయి. ఈ ధర్నాలో టీడీపీ, బీజేపీ శాసనసభాపక్ష నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ. రేవంత్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఓపక్క రైతులు పంటలు ఎండిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

సారా పై పోలీసుల అవగాహనా ర్యాలీ..

నల్గొండ : సారా రక్కసిపై నల్గొండ జిల్లా పోలీసులు సమరం ప్రకటించారు. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న సారాతోపాటు గుట్కా ప్యాకెట్లపై అవగాహనకు సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం నల్గొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించగా... బుధవారం కొండమల్లేపల్లి నుంచి హాలియా వరకు సారాపై ముఖ్యంగా యువత అవగాహన కలిగి ఉండాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దేవరకొండ, మిర్యాలగూడెం సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.

తెలంగాణ లో కరువు మండలాల ఎంపికకు కమిటి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర నేతృత్వంలో కరువు మండలాల ఎంపికకు కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది

15:23 - October 7, 2015

గుంటూరు : రాష్ట్రాన్ని విడకొట్ట వద్దని చెప్పిన ఏకైక పార్టీ వైసీపీ ఆపార్టీ అధినేత జగన్ని స్పష్టం చేశారు. ఆయన ప్రత్యేక హోదా పై గుంటూరు జిల్లా నల్లపాడులో జగన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో కుమ్మక్కై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడి చంద్రబాబు నాయుడు తనపై కేసు లు పెట్టారాని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెట్టారని విమర్శించారు. కేసులు అయితే పెడతారు కానీ.. తల రాత రాసేవాడు పైన దేవుడున్నాడని ఆశావహం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపహసంహరించుకుంటే ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. అలా కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే చంద్రబాబు గంటలోనే జైలుకు వెళతారని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంటే మోసం.. మోసం... వెన్నుపోటు అని మండి పడ్డాడు. ప్రత్యేకహోదా కోసం మనం అందరం ఒక్కటౌదాం.. కలిసి గట్టుగా పని చేద్దామని తెలిపారు.

కర్నూలు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కర్నూలు :కోయల్‌ కుంట్ల మండలం సమీపంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి మినీ ఆల్విన్, టెంపో వాహనాలలో రేషన్ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. 95 బస్తాలలోతరలుతున్న47 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

సింగరేణి కార్మికుడు ఆత్మహత్య...

గోదావరిఖని: మండల కేంద్రంలోని విఠల్‌నగర్‌లో చొప్పరి భూమయ్య(57) అనే సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భూమయ్య నడుము నొప్పి, బీపీ, అస్తమాతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన భూమయ్య బుధవారం తెల్లవారుజామున వరండాలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధ ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెరువులో పడి తల్లీ కొడుకు మృతి

వరంగల్ : తొర్రూర్ మండలం చీకటాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో తల్లీకొడుకు చెరువులో పడి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నల్లపాడులో ప్రారంభమైన జగన్ దీక్ష

గుంటూరు :ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లపాడులో వైకాపా అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్న జగన్... తొలుత బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 2 గంటలకు దీక్షా స్థలికి చేరుకున్నారు. జగన్ నిరాహార దీక్ష సందర్భంగా, ఆయనకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. 

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి

హైదరాబాద్: దాల్మియా సిమెంట్ కేసులో  ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరును కొట్టేయాలని ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

భారత్ లో సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ పెదవివిరుపు

హైదరాబాద్ : భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. 

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ప్రభుత్వ నిర్బంధం

శ్రీకాకుళం : జిల్లాలో ప్రజా ఆందోళనలపై అధికారులు నిర్బంధం విధించారు. ముఖ్యంగా కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాంతమైన రణస్థలంలో నిర్బంధకాండను కొనసాగిస్తున్నారు. పోలీసులు, అధికారుల తీరుతో.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణువిద్యుత్‌ ప్రతిపాదిత గ్రామాలు.. గజగజ వణుకుతున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో రకాలుగా పోరాటాలను అణచివేసిన ప్రభుత్వం.. కొత్తగా నిర్బంధ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొవ్వాడ పరిసర గ్రామాలైన కోటపాలెం, మల్లివలస, టెక్కలి తదితర ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది.

ఏపీలో జలరవాణాకు టెండర్లు ఖరారు

విజయవాడ : ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలరవాణా పనులకు టెండర్లు ఖరారయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఐడియల్ కంపెనీ, ఒంగోలుకు చెందిన పిఎస్ ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఈ టెండర్లు దక్కించుకున్నాయి. దీంతో ఈనెల 10 నుంచే జలరవాణా సర్వే పనులు వేగవంతం కానున్నాయి.

14:41 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం ఏర్పాటైంది. డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో... ఈ నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. తొలి అధ్యక్షునిగా డీజీపీ అనురాగ్ శర్మ, కార్యదర్శిగా జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఉంది. విభజన జరిగి ఏడాదిన్నర అవుతున్నా... తెలంగాణ విభాగం ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా సంఘం ఏర్పాటు చేసుకున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. విభజనలో భాగంగా రాష్ట్రానికి 92మంది ఐపీఎస్ లను కేంద్రం కేటాయించింది. వీరంతా ఈ సంఘంలో త్వరలోనే సభ్యత్వం తీసుకోనున్నట్టు డీజీపీ ప్రకటించారు.  మరోవైపు సంఘం ఆవిర్భావం రోజే పోలీస్ ఉన్నతాధికారులు స్ఫూర్తి దాయకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఐపీఎస్ అధికారి తమ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని వదులుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

 

14:39 - October 7, 2015

అనంతపురం : ఎస్పీకుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోలార్‌ హబ్ భూసేకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై రైతులతో మాట్లాడేందుకు వచ్చిన సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన జిల్లా నేతలనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

14:38 - October 7, 2015

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలను నిర్మూలించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్‌ సచివాలయంలో ఇంధ్ర ధనస్సు పథకం రెండో ఫేజ్‌ను ప్రారంభించిన ఆయన.. అన్ని జిల్లాల్లోను ఈ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఇంధ్ర ధనస్సు పథకం కింద 7 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈసారి ప్రధానంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని కామినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

14:35 - October 7, 2015

హైదరాబాద్ : మహిళల భద్రతకు సంబంధించన చట్టాలలో సెక్షన్ 304 బిఆఫ్ ఐపీసీ అంటే ఏమిటి అనే అంశంపై న్యాయపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించే మైరైట్ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. సెక్షన్ 304 బిఆఫ్ ఐపీసీ లో వివాహిత మహిళ 7 సంవత్సరాల లోపు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే దానిని వరకట్న వేధింపులతో మరణించినట్లు భావిస్తారు. పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

గడ్డిపల్లి వద్ద తుపాకీ కలకలం...

నల్లగొండ : గరిడేపల్లి మండలం గడ్డిపల్లి వద్ద తుపాకీ కలకలం రేపుతోంది. ఇద్దరు యువకులు తుపాకీతో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు గడ్డిపల్లికి చేరుకున్నారు. తుపాకీ కలిగి ఉన్న యువకులు మహారాష్ట్రకు చెందిన బైక్‌పై వెళ్తున్నట్లు సమాచారం. వీరిని గొలుసు దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..

హైదరాబాద్ : మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎయిమ్స్‌ నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో రోజులుగా ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలున్నా కేంద్రం ఈ విషయంలో సాగతీత థోరణి అవలంబించింది. ఎట్టకేలకు ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోద ముద్ర లభించడంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అక్బరుద్దీన్ ఒవైసీ అరెస్టుకు ఆదేశాలు...

హైదరాబాద్ : బీహార్ శాసనసభ ఎన్నికల్లో గత ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్‌గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని కిషన్‌గంజ్ ఎస్పీ రాజీవ్ రాజన్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. 

దీక్షలో చిత్తశుద్ధి లేదు - కామినేని..

గుంటూరు : వైసీపీ నేత జగన్ చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు. 

అమరావతి శంకుస్థాపన పనులను పరిశీలించిన నారాయణ..

గుంటూరు : జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులన ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. 

ఏఐసీసీ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం..

హైదరాబాద్ : ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ హాజరు కాగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా గైర్హాజరయ్యారు. ఢిల్లీ అగ్ర నేతలు దిగ్విజయ్, చాకో, అంటోనీ, మోతీలాల్ ఓరా, జనార్ధన్ ద్వివేదీలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల నిర్వాహణపై చర్చించనున్నారు. 

చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి..

నల్గొండ : తుర్కపల్లి (మం) లక్ష్మాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి అశోక్ మృతి చెందాడు. 

ఫెర్టిలైజర్స్ గోదాంలపై దాడులు..

కడప : మైదుకూరులోని వినాయక, న్యూ వినాయక, ఆదిలక్ష్మి ఫెర్టిలైజర్స్ షాపులకు చెందిన గోదాములపై అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన ఎరువులు, పురుగుల మందులను అధికారులు సీజ్ చేశారు. 

ముగ్గురు మావోయిస్టుల అరెస్టు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు అరెస్టయ్యారు. ఎనిమిది కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

13:14 - October 7, 2015

ఢిల్లీ : ప్రఖ్యాత సాహిత్య అకాడమీ అవార్డు విషయంలో ప్రముఖ రచయిత్రి, మాజీ ప్రధాని జవహాల్ నెహ్రూ మేనకోడలు నయనతార బాటలోనే ప్రముఖ కవి వాజ్ పేయి పయనించారు. ఆమె మంగళవారం అవార్డును ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను కూడా అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు అశోక్ వాజ్ పేయి బుధవారం ప్రకటించారు. అశోక్ వాజ్ పేయి గతంలో లలిత కళా అకాడమీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. దేశంలో జరుగుతున్న ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మరో హిందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ కూడా అవార్డును తిరిగి ఇచ్చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..ప్రభుత్వ పనితీరు పట్ల నిరసన తెలుపుతూ వీరు అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. కల్బుర్గి, పన్సారె, దభోల్కర్ వంటి అభ్యుదయవాదుల హత్యలను..దాద్రి తరహా సంఘటనలు నిరసిస్తూ నయనతార ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రులత్లో ఎలుకలు..బొద్దింకలు ఉండడం సహజమే -కామినేని...

హైదరాబాద్ : ఆసుపత్రుల్లో ఎలుకలు..బొద్దింకలు ఉండడం సహజమని ఏపీ మంత్రి కామినేని పేర్కొన్నారు. ఎలుకలను నిర్మూలించడం మానవ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

 

రెండో రోజు సీపీఎం ప్రజా చైతన్య యాత్ర..

గుంటూరు : రెండో రోజు సీపీఎం ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతోంది. పెద్దపూడి, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతోంది. రాజధాని పేరిట చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని, రాజధాని నిర్మిస్తోంది ప్రజల కోసమా ? చంద్రబాబు కోసమా చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపన కంటే ముందే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 

mysecurity.gov.in వెబ్ సైట్ ప్రారంభించిన రాజ్ నాథ్..

ఢిల్లి : మనుషుల అక్రమ రవాణాపై జాతీయ సదస్సును కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం mysecurity.gov.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడారు. మత ఘర్షణలను అంగీకరించబోమన్నారు.

వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు..

విజయవాడ : కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు..ఆరోగ్య శాఖాధికారలుతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటు వ్యాధులు, డెంగీ, విష జ్వరాల నివారణ చర్యలపై సమీక్షించారు. పటిష్టంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

విశాఖ..అఖిలపక్ష సమావేశంపై పోలీసుల కన్ను...

విశాఖపట్టణం : అఖిలపక్ష సమావేశంపై పోలీసులు డేగ కన్ను వేశారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని ఏజెన్సీలోని దారకొండలో అఖిలపక్ష సమావేశం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో చింతపల్లి జీకే వీధి (మం) అంతర్ల వద్ద సీపీఎం, సీపీఐ నేతలు లోకనాథం, స్టాలిన్ లను ముందస్తు అరెస్టు చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి ఆర్టీసీ బస్సులో దారకొండకు సీపీఐ నేత నారాయణ చేరుకున్నారు.

12:47 - October 7, 2015

చిత్తూరు : తిరుపతిలో 'రుద్రమదేవి' చిత్ర యూనిట్ సందడి చేసింది. శ్రీవారిని సినిమా కథానాయిక అనుష్క, దర్శకుడు గుణశేఖర్ లు దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు దర్శనం చేసుకుని 'రుద్రమ దేవి' కాపీని స్వామివారి పాదాల చెంత ఉంచారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా అనుష్క, గుణశేఖర్ లు మీడియాతో మాట్లాడారు. 'రుద్రమదేవి' షూటింగ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, షూటింగ్ జరిగిన మూడు సంవత్సరాల్లో ఎలాంటి కష్టాలు కలుగలేదని గుణశేఖర్ తెలిపారు. స్వామి వారి ఆశీస్సుల వల్ల షూటింగ్ విజయంతంగా పూర్తి చేసుకున్నామని, ఫైనల్ కాపీని స్వామి పాదాల చెంత పెట్టడం జరిగిందన్నారు. 'రుద్రమదేవి' చిత్రం ఈనెల 9న విడుదల కానుంది.

12:42 - October 7, 2015

గుంటూరు : రాజధాని నిర్మిస్తోంది ప్రజల కోసమా ? చంద్రబాబు కోసమా చెప్పాలని సీఆర్డీఏ ప్రాంత కన్వీనర్ బాబురావు ప్రశ్నించారు. 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర' పేరిట రాజధాని ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 11వ తేదీ వరకు జరిగే ఈ యాత్ర మొత్తం 29 గ్రామాల్లో 120 కిలో మీటర్ల మేర జరగనుంది. ఈసందర్భంగా మీడియాతో బాబురావు మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ వాళ్లు బాగు పడుతారని, ఇక్కడ ప్రజులు మట్టి కొట్టుకపోతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని, మమ్మల్ని మోసం చేశారని వెళ్లిన ప్రతిచోట డ్వాక్రా సంఘాలు పేర్కొంటున్నాయని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.30వేలు బ్యాంకులో వేశామని చెప్పి నయా పైసా వాడుకోకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

12:41 - October 7, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగుండాలని..అభివృద్ధి కోరుకోవాలనే ఉద్ధేశ్యంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ పోరాటం చేస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో జగన్ చేపడుతున్న దీక్షకు భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈసందర్భంగా దీక్ష స్థలం వద్ద మేకపాటి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వేర్వేరుగా టెన్ టివితో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సాక్షిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ వాగ్ధానాలు చేసిందని గుర్తు చేశారు. అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పారని, కేంద్రం దిగి రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా రావాలని, అన్ని విధాల లబ్ది పొందాలనే జగన్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జగన్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఢిల్లీలో చేయాలని టిడిపి నేతలు పేర్కొంటున్నారని, కానీ ఢిల్లీలో జగన్ దీక్ష చేయలేదా అని తెలిపారు. చిత్తశుద్ధిగా జగన్..వైసీపీ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు మీద అధిక బాధ్యత ఉందని, రాజకీయాలు ఏం చేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున్న కార్యకర్తలు తరలివస్తున్నట్లు మేకపాటి పేర్కొన్నారు.

నైతిక బాధ్యత వారిదే - ఉమ్మారెడ్డి..

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ , బీజేపీ పలు వాగ్ధానాలు చేశారని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి టిడిపి, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఘర్షణ పడడం లేదన్నారు. టిడిపి, బీజేపీ పార్టీలకు నైతికత బాధ్యత ఉంటే పోరాటం చేయాలని సూచించారు. వారు విఫలం చెందినందుకే తాము పోరాటం చేయడం జరుగుతోందని, హోదా ఇవ్వకతప్పదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని, దీనితో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఉమ్మారెడ్డి నొక్కి చెప్పారు. 

12:28 - October 7, 2015

హైదరాబాద్ : కల్తీ కల్లు సేవించి ఎవరూ చనిపోలేదని విపక్షం లేని శాసనసభలో మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. బుధవారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడారు. చాలా కాలంగా కల్తీ కల్లు దొరుకుతోందని, దీనికి ప్రజలు బానిసైపోయారని పేర్కొన్నారు. గుడుంబాపై ఉక్కు పాదం మోపడంతో కల్తీ కల్లు విక్రయాలు ఆగిపోయాయని, దీనితో కల్తీ కల్లు దొరకడం లేదన్నారు. దీనితో కొంతమది చనిపోయారని, ఈ విషయాన్ని పలు పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడం జరిగిందన్నారు. హెడ్ లైన్స్ లో మాత్రం కల్తీ కల్లుకు మృతి చెబుతున్నారని కానీ లోపల అసలు విషయాన్ని చెబుతున్నట్లు, మీడియా వార్తలన్నీ అభూత కల్పనలేనని కొట్టిపారేశారు. మృతి చెందిన వారి పోస్టుమార్టం రావాల్సి ఉందని, అనంతరం ఈ విషయంపై మంత్రి పద్మారావు పేర్కొన్నారు.

12:00 - October 7, 2015

ఎంతో చాకచక్యంగా ఆలోచించి వేసుకున్న ఓ పన్నాగాన్ని ఒక కుక్క బట్టబయలు చేసేసింది. పథకం ప్రకారమే ముందుకు దూసుకెళ్తుంటే.. వెనక నుంచి వచ్చిన కుక్క తన పని చేసుకుంటూ వచ్చింది. అంతే! వీరి ప్లాన్ బయటపడటంతో అడ్డంగా బుక్కయ్యారు. వారి ప్లాన్ విన్న పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇంతకీ.. వారిద్దరు వేసిన పన్నాగం ఏంటి? వారికి, కుక్కకి సంబంధం ఏంటి? ఆ కుక్క ఆ స్నేహితుల ప్లాన్ ని ఎలా బహిర్గతం చేసింది? అని అనుకుంటున్నారా ? ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి. పెరూ రాజధాని లీమాలోని జార్జ్ ఛావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో వారి దగ్గరున్న స్నిఫర్ డాగ్ ఓ ప్రయాణికుడి లగేజ్ వెంటబడింది. సదరు ప్రయాణికుడు ఆ కుక్క నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయంది. కుక్క వెంటపడడంతో అనుమానించిన పోలీసులు.. వెంటనే లగేజ్ ఓపెన్ చేయాలని అతడ్ని అధికారులు కోరారు. తొలుత సూట్ కేసు తెరిచేందుకు సదరు ప్రయాణికుడు నిరాకరించినా, అధికారుల ఒత్తిడితో తెరవక తప్పలేదు. అతగాడు సూట్ కేసు ఓపెన్ చేయగానే.. అందులోంచి ఓ వ్యక్తి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. దీంతో విమానాశ్రయ భద్రతాధికారులతోపాటు చుట్టుపక్కల వున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సూట్ కేసు నుంచి మనిషి బయటికి రావడమేంటని అవాక్కయ్యారు. అదండి సంగతి..

11:49 - October 7, 2015

చిత్తూరు : టిటిడిలో ఉద్యోగాల భర్తీ కోసం..ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి చేపట్టిన నిరహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. టిటిడి పరిపాలన కార్యాలయం ఎదుట ఆయన చేపట్టిన దీక్షకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. దీక్షకు చక్కటి స్పందన లభిస్తోందని, స్వచ్ఛందంగా దీక్షలు చేయడానికి ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులతో ఆటలాడుకోవడం బాధాకరంగా ఉందన్నారు. వెంటనే టిటిడిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ప్రభుత్వంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 

11:46 - October 7, 2015

ఛత్తీస్ గఢ్ : తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని దర్భా ఘాట్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టులు కదలికలు ఉంటుండడం..వరంగల్ ఎన్ కౌంటర్..టిడిపి నేతల కిడ్నాప్ నేపథ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ ను విస్తృతం చేశాయి. ఈ తరుణంలో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.   

11:32 - October 7, 2015

గుంటూరు : రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగానైనా లేదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో జగన్ చేపట్టదలిచే నిరహార దీక్షకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైసీపీ, ప్రజలు నిరసన తెలియచేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కంటే ముందు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చారని, రెండు సంవత్సరాలు కావడానికి వస్తున్నా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. నోటుకు ఓటు విషయంలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని, ప్యాకేజీ ముద్దు..హోదా వద్దు అని స్వయాన వారి నేతలే చెబుతున్నారన్నారు. చంద్రబాబు మొద్దు నిద్ర పోతున్నారని వెంటనే స్పందించాలని డిమాడ్ చేశారు. 

11:27 - October 7, 2015

విశాఖపట్టణం : ఏజెన్సీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మావోయిస్టులో చెరలో ఉన్న టిడిపి నేతలు ఎలా ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తమ వారిని క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంసభ్యులు కోరుతున్నారు. చింతపల్లిలో ఎస్పీ ప్రవీణ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సోమవారం జీకే వీధిలోని మండల టిడిపి అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్ తో పాటు జన్మభూమి కమటీ మండల అధ్యక్షుడు వందనం బాలయ్యలను మావోయిస్టులు అహరించారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బాక్సైట్ తవ్వకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, తవ్వకాలు జరుపమని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మావోయిస్టులతో చర్చించేందుకు గిరిజన సంఘం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

హైదరాబాద్ : నిజాంపేటలో సాప్ట్ వేర్ ఉద్యోగిని శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.

 

కేసీఆర్ ఫాసిస్టు పాలన -వరవరరావు, విమలక్క..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఫాసిస్టు పాలన సాగిస్తున్నారని వరవరరావు, విమలక్కలు విమర్శించారు. ప్రతిపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభను నడుపుతామన్న కేసీఆర్ మాటలు ఎమయ్యాయని ప్రశ్నించారు. వరంగల్ లాంటి దారుణమైన ఎన్ కౌంటర్ ను చూడలేదని తెలిపారు. 

టుడే బాబు షెడ్యూల్..

విజయవాడ : ఉదయం 11.45గంటలకు పొగాకు రైతులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుపుతారు. మధ్యాహ్నాం 12.45గంటలకు సందర్శకులకు నుండి వినతిపత్రాలు స్వీకరించారు. సాయంత్రం 4గంటలకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖాధికారులతో సమావేశం, సాయంత్రం 6.30గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాక్ కళ్యాణ మండపంలో బాబుకు సన్మానం జరుగనుంది.

 

మెదక్ లో మరో రైతు ఆత్మహత్య..

మెదక్ : సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో మరో రైతు బలవన్మరణం చెందాడు. జగదేవ్ పూర్ (మం) కొత్తపేటకు చెందిన రమేష్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. 

విద్యార్థుల బతుకులు మార్చేందుకే సన్నబియ్యం పథకం - ఈటెల..

హైదరాబాద్ : వసతిగృహాల్లో విద్యార్థుల బతుకులు మార్చాలనే సన్నబియ్యం పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని ఆర్థిక మంత్రి ఈటెల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఉక్కుపాదం మోపుతామని ఈటెల స్పష్టం చేశారు. 

 

తిరుమలలో విరిగిపడిన బండరాళ్లు..

చిత్తూరు : తిరుమలలోని రెండో కనుమ దారిలో అక్కడక్కడ బండరాళ్లు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా టిటిడి అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు.

 

 

బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..

హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్‌పై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

 

10:35 - October 7, 2015

వరంగల్ : రైతు రుణమాఫీపై టి.టిడిపి పోరు కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మ్రితపక్షమైన బీజేపీతో ఆ పార్టీ నేతలు బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము ఎనిమిది వేల కోట్లు కేటాయించాలని సూచించడం జరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అవసరమైతే కొన్ని పద్దులను తగ్గించుకొని చేయాలని సూచించడం జరిగిందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పిన మీరు పేద రాష్ట్రంగా ఎందుకు మార్చారంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్థత బయటకు వస్తుందనే కారణంతో సభను అర్ధాంతరంగా వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వెంటనే తాము డిమాండ్ చేస్తున్నట్లుగా ఈనెల పదో తేదీలోపుగా లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే క్వింటాలు పత్తికి ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

10:31 - October 7, 2015

హైదరాబాద్ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతలు రోజా..మేకపాటిలు పలు విమర్శలు చేశారు. గుంటూరులో పార్టీ అధ్యక్షుడు జగన్ చేపడుతున్న నిరహార దీక్షకు వెళ్లేందుకు రోజా..మేకపాటిలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వేర్వేరుగా వారు మీడియాతో మాట్లాడారు. తన ప్రాణాలు ఫణంగా పెట్టి జగన్ దీక్ష చేస్తుంటే దీనిని డైవర్ట్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం పయనిస్తోందని రోజా విమర్శించారు. తన వ్యాపారాల కోసమే బాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను మరుగున పడే విధంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆనాడు బీజేపీ పలు హామీలు గుప్పించిందని అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయిందని మేకపాటి పేర్కొన్నారు. 

10:19 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీఎఫ్ (తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక) సమర భేరి మోగించనుంది. రైతుల ఆత్మహత్యలు..ఎన్ కౌంటర్..ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎంబీ భవన్ లో పది వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అనంతరం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో విపక్ష సభ్యులను ఒక గంట..లేదా ఒక రోజు సస్పెండ్ చేసిన సంఘటనులున్నాయని తెలిపారు. కానీ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం సీఎం కేసీఆర్ కు చెల్లిందని విమర్శించారు. అందరికంటే నియంతనని తనకు తానే చెప్పుకుంటున్నారన్నారు. ప్రజల తరపున నికరంగా పోరాడటానికి, పాలక వర్గాల మెడలు వంచడానికి తెలంగాణ ప్రజా స్వామ్య వేదిక ఏర్పడిందన్నారు. సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించాలని తక్షణం ముందుకొచ్చిన రైతాంగ సమస్యలు పరిష్కరించాలని..విపక్షాలు డిమాండ్ చేస్తున్న రుణమాఫీని వన్ టైం సెటిల్ మెంట్ వెంటనే చేయాలి..వ్యవసాయక విధానాన్ని సమీక్షించాలని..నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అణిచివేత..హేళన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ ఉండదనే మాట మర్చిపోయి వ్యవహరించారని, అత్యంత దారుణంగా చంపారని తెలిపారు. ఇంతటి దారుణం ఎన్ కౌంటర్ చూడలేదని, వారి సొంతపత్రికలో సైతం వార్తలు రాశారని గుర్తు చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా పదో తేదీన బంద్ నిర్వహిస్తున్నట్లు దీనిని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బంద్ తో తమ పోరాటం ఆగదని

తదుపరి కార్యాచణ ఉంటుందని, డిమాండ్ లు నేరవేరే వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని తమ్మినేని స్పష్టం చేశారు. 

పదిన రాష్ట్ర బంద్ కు వామపక్షాల పిలుపు..

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీన రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఎంబీ భవన్ లో పది వామపక్షాలు సమావేశమయ్యాయి.

09:57 - October 7, 2015

'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌' చిత్రం 2008లో విడుదలైనప్పటికీ ఈ ఏడాది చూసిన తొలి చిత్రమిది. సినిమా అద్భుతంగా ఉంది. షారూఖ్‌ నటన అదిరిపోవడమే కాదు, ఆస్కార్‌ అవార్డ్‌కి కూడా అర్హుడు' అని బ్రెజిల్‌ సాహిత్యవేత్త, 'ఆల్కెమిస్ట్‌' (పరుసవేది) రచయిత పాలో కొయిలో కితాబిచ్చారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేశారు. ఈ మెసేజ్‌ను చూసి షారూఖ్‌ సంబరపడుతూ, 'మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అడ్రస్‌ పంపితే మరికొన్ని ఇండియన్‌ సినిమాలను పంపుతాను' అని రిప్లై ఇచ్చారు. పాలో అడ్రస్‌ పంపడం, షారూక్‌ తను నటించిన 'చక్‌ దే ఇండియా', 'అశోక', 'కభీ అల్విదా నా కెహనా' సినిమాల డి.వి.డిలను పాలోకు పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే, 80కి పైగా సినిమాల్లో నటించడంతోపాటు సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన స్కాట్‌ లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో షారూఖ్‌కు ఈనెల 15న గౌరవ డాక్టరేట్‌ను అందించనున్నారు. షారూఖ్‌ తొలుత బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ని పొందారు.

09:52 - October 7, 2015

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 'అన్‌మోల్‌ స్వామి' కనబరుస్తున్న అద్భుత ప్రతిభ పలువురిని అబ్బుర పరుస్తోంది. 5ఏండ్ల వయస్సు గల అన్‌మోల్‌ ప్రదర్శించిన జ్ఞాపక శక్తికి పలువురు ఆ బాలుడిని అభినందిస్తున్నారు. ఆ బాలుడికి అధికారికంగా 'మీరట్‌ గూగుల్‌ బాయ్' అని పేరు పెట్టారు. ఇథియోపియా నుంచి క్యూబా వరకు ప్రపంచంలోని ఏ దేశ రాజధాని పేరు అడిగిన అన్‌మోల్‌ వెంటనే చెప్పేస్తున్నాడు. భారత ప్రధాని ఎవరు అని అడిగితే ప్రస్తుత ప్రధానే ఎందుకు? మొదటి ప్రధాని నుంచి ఇప్పటి వరకు పని చేసిన ప్రధాన మంత్రుల పేర్లన్నీ గడ గడ చెప్పేస్తున్నాడు. మళ్లీ రివర్స్‌లో వారి పేర్లను తొణకకుండా చదివేస్తున్నాడు. ఒక రోజు అన్‌మోల్‌ తల్లి రచన ఆ బాలుని అక్కకు జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన పాఠాలు చెబుతోంది. ఆ గదిలో అన్‌మోల్‌ కూడా ఉన్నాడు. మరుసటి రోజు రచన ఆ బాలుని అక్కకు ప్రశ్నలు వేయగా ఆమె చెప్పలేక పోయింది. అక్కడే ఉన్న అన్‌మోల్‌ మాత్రం తల్లి అడిగిన ప్రశ్నలకు సమాధాలు చెప్పాడు. అప్పడు రచనకు తన కొడుకు ప్రతిభ అర్థమైంది. ఆయన గురించి తెలుసుకున్న స్థానిక పాఠశాల అన్‌మోల్‌కు ఉచిత విద్య బోధిస్తామని, ఆ బాలుని పుస్తకాలకు, ఇతర ఖర్చులు అన్నీ తామే భరిస్తామని పేర్కొంది. ఆ స్కూలు యాజమాన్యమే ఆ బాలునికి 'మీరట్‌ గూగుల్‌ బాయ్' అని పేరు పెట్టింది. చిన్న వయస్సులోనే ఎంతో ప్రతిభ కనబరుస్తున్న అన్‌మోల్‌కు సిఎం అఖిలేష్‌ ప్రోత్సాహకం ప్రకటించాలని మీరట్‌ ప్రజలు కోరుతున్నారు.

09:49 - October 7, 2015

వాషింగ్టన్‌: అంతరిక్షం నుంచి చూస్తే ఇండియా - పాకిస్థాన్‌ సరిహద్దు ఎలా కనిపిస్తుందో చూడాలని ఎవరికైనా కుతుహలం కలుగక మానదు. భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఈ చిత్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది. అంతరిక్షం నుంచి పరిశీలిస్తే భారత్‌-పాక్‌ సరిహద్దు ఎలా ఉంటుందో తెలిపే ఈ చిత్రాన్ని నాసా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.
రోదసిలో మకాం వేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి ఇటీవల రాత్రి సమయంలో ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించారు. 2011లో కూడా ఇలాంటి చిత్రాన్నే నాసా విడుదల చేసింది. అయితే ప్రస్తుత ఫోటోలో భూమిపై ఉన్న వివిధ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 28 మిల్లి మీటర్ల లెన్స్‌ కలిగిన నికన్‌ డీ4 డిజిటల్‌ కెమెరాతో ఉత్తర పాక్‌లోని ఇండస్‌ వ్యాలీ మీదుగా భారత్‌ సరిహద్దు వరకు పానోరమ ఫోటోను ఆయన తీశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు గీత మాదిరిగా కనిపిస్తోంది. నారింజ రంగులో వెలుగుతున్న భద్రత దీపాలు భారత్‌-పాక్‌ను వేరు చేస్తున్న సరిహద్దును స్పష్టంగా చూపిస్తున్నాయి.

స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 10 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.

బెజవాడకు బయలుదేరిన జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ బెజవాడకు బయలుదేరి వెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరులో జగన్ నిరహార దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా లోటస్ పాండులో తన నివాసం నుండి జగన్ రోడ్డు మార్గం గుండా విజయవాడ బయలుదేరి వెళ్లారు. విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గుంటూరుకు వెళ్లనున్నారు. 

09:33 - October 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వామపక్షాలు సమరభేరీ మోగించనున్నాయి. ప్రజా సమస్యలు..రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంపై ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు వామపక్షాలు నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటించనున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం ఎంబీ భవన్ లో వామపక్షాలు భేటీ అయ్యాయి. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, ఇతర వామపక్ష నేతలు హాజరయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో వన్ టైం సెటిల్ మెంట్ కోరుతూ అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షంతో సహా, ఇతర విపక్ష సభ్యులను సర్కార్ గెంటివేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టమైన హామీనివ్వాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఎలా వత్తిడి తేవాలన్న దానిపై సమావేశంలో కూలంకషంగా చర్చిస్తున్నారు. కార్మిక సమస్యలు..ఇతర ప్రజా సమస్యలపై ఈ సమావేశంంలో చర్చిస్తున్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ విషయంపై ఎలాంటి ఆందోళనలు చేయాలనే దానిపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటించనున్నాయి.

పంజాబ్ లో రైతుల ఆందోళన ఉధృతం..

పంజాబ్ : రాష్ట్రంలో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రెండు రోజులుగా రైళ్లను నిలిపివేశారు. దీనితో నాలుగు రైళ్లు రద్దయ్యాయి. 12 రైళ్లను దారి మళ్లించారు. 

బీహార్ లో పోలీసులు విస్తృత తనిఖీలు..

బీహార్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 16.86 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

09:22 - October 7, 2015

హైదరాబాద్ : విపక్షాలన్నింటినీ అసెంబ్లీ నుండి గెంటేసిన టిఆర్ఎస్ సర్కార్ చివరకు నిర్ధేశిత తేదీకి (ఈనెల 9) ముందే బుధవారం శాసనసభను నిరవధికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ విషయంలో వన్ టైం సెటిల్ మెంట్ కు పట్టుబట్టారనే కారణంతో ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర పక్షాల సభ్యులందరినీ సోమవారం మూకుమ్మడిగా బహిష్కరించిన ప్రభుత్వం.. ఆ తరువాత ఆలోచనలో పడింది. విపక్షాలు లేకుండా సభను ఏకపక్షంగా నడపడం పట్ల జనంలో అప్రతిష్ట పాలవుతుమానే సంశయం ఇప్పుడు సర్కార్ ను వెంటాడుతోంది. బుధవారం ప్రారంభమయ్యే సమావేశాల్లో మిషన్ కాకతీయతో పాటు ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమాలపై చర్చ జరుగనుంది. ఈ చర్చ అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. 

సున్నిపెంటలో నేడు 'చెంచుల కోసం చంద్రన్న' కార్యక్రమం..

కర్నూలు : సున్నిపెంటలో నేడు చెంచుల కోసం చంద్రన్న కార్యక్రమం జరుగనుంది. ఏపీ మంత్రులు కేఈ, రావెలలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

కరీంనగర్ : రామచంద్రాపూర్ గ్రామంలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగు కోసం గతంలో చేసిన అప్పులు పెరగడంతో తీవ్ర మనస్థాపానికి గురై విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

08:39 - October 7, 2015

ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. సమాజాన్ని గణాంకాలతో కాకుండా ప్రజల జీవితాలతో చూడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టబోయే నిరహార దీక్ష..రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు..పేదరికం..తదితర అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..

సవరణ ఎందుకు చూపించలేదు ?
''ఢిల్లీలో..ఏపీలో కాదు..దీక్షలు చేయాల్సింది పార్లమెంట్ లో. రాజ్యాంగపరమైన, చట్టపరమైన, రాజకీయపరమైన హక్కు. ప్రభుత్వాలు విఫలం చేసిన సమయంలో జరిగే ఉద్యమాలను ఆహ్వానించాల్సి ఉంటుంది. జగన్ ఇక్కడ కేంద్రంపై ఒక్క మాట మాట్లాడడం లేదు. బాబును అడగడమే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి లేదు. టిడిపి ఎదుట రెండు పద్ధతులున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగడం ఒక పద్ధతి అయితే బీజేపీతో విడాకులు తీసి రోడ్డున పడడం ఇంకో పద్ధతి. అసలు ప్రశ్నించాల్సింది ఎవరిని ? ఎన్డీయేని. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న రాష్ట్రాలను జగన్ కలుపుకుని ఎన్డీయేపై వత్తిడి తేవాల్సింది. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాలి. బాబును టార్గెట్ చేసి ఏం సాధిస్తారు ? బీజేపీతో సహజీవనం చేయాలని జగన్ ఆలోచన. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చాలని ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు ఈ విషయాన్ని ప్రతిపాదించలేదు. చర్చ జరుగుతున్న సందర్భంలో లోక్ సభ కార్యాదర్శిని కలిసి సవరణ చూసిస్తానంటూ ఓ చిన్న కాగితం ఎందుకు ఇవ్వలేదు ? శాసనసభ ఎప్పుడు తీర్మానం చేసింది ? ప్రతిపక్షం ఎందుకు తీర్మానం చేయలేదు ? తీర్మానాన్ని తిరస్కరిస్తే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. ఈ ప్రశ్నలకు జగన్, వైసీపీ సమాధానం చెబుతారా ? పార్లమెంట్ లో ఎందుకు సవరణ సూచించరు ?

వడ్డీ రేట్లు తగ్గింపు...
రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది. వినియోగదారులకు వచ్చింది 0.5 శాతమే వచ్చింది. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తే డిపాజిట్లపై వడ్డీలు తగ్గుతాయి. పెట్టుబడి వ్యయం తగ్గితే రుణాలు తీసుకుంటుంటారు. వృద్ధి..ఉత్పత్తి రేటు పెరుగుతుంది. రుణాలలో తేడాలున్నాయి. సామాన్యుడికి ప్రయోజనం రుణ పంపిణీ ఉండాలి. వడ్డీరేట్లు ఉండాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది.

వృద్ధి లక్ష్యమా ?..
చైనా వృద్ధి రేటు తగ్గిన మాట వాస్తవమే. వృద్ధి లక్ష్యం కాదు. ప్రజల ఆదాయం పెంచాలి. కొనుగోలు శక్తి పెంచాలి. మెరుగైన వైద్య, విద్య ఇవ్వాలి. పౌష్టికాహారం కల్పించాలి. ఐదేళ్లలో ఉన్న చిన్నపిల్లలు 42 శాతం పౌష్టికాహారం లోపంతో బాధ పడుతున్నారు. ప్రజల ప్రమాణాలు పెంచే విధంగా వృద్ధి ఉండాలి. పేదరికం తగ్గుతోందన్న మాట వాస్తవమే. ఆదాయ పేదరికం కాదు. మానవియ పేదరికం. సమాజాన్ని గణాంకాలతో కాకుండా ప్రజల జీవితాలతో చూడాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలి'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో యువకుడు హల్ చల్..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మద్యం మత్తులు యువకుడు హల్ చల్ చేశాడు. దుబాయి నుండి వచ్చిన యువకుడిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

08:01 - October 7, 2015

విపక్షాలన్నింటినీ అసెంబ్లీ నుండి గెంటేసిన టీఆర్ఎస్ సర్కార్ చివరకు నిర్ధేశిత తేదీ (ఈనెల 9) ముందే బుధవారమే శాసనసభను నిరవధికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ నిరహార దీక్ష ప్రారంభం కానుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నారదాసు లక్ష్మణ రావు (టీఆర్ఎస్), వకుళా భరణం కృష్ణ మోహన్ (కాంగ్రెస్), అనురాధ (టిడిపి), మేరుగ నాగార్జున (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.

07:50 - October 7, 2015

ఆస్ట్రేలియా : వైద్యులు అద్భుతం సృష్టించారు. ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి 16 నెలల బాలుడికి మరో జన్మను ప్రసాదించారు. క్లిష్టతరమైన ఆపరేషన్‌ చేసి తమ కుమారుడిని రక్షించిన వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇంతకీ ఆ చిన్నారికి వైద్యులు చేసిన అరుదైన ఆపరేషన్‌ ఏంటి ?  చెయ్యో, కాలో విరిగిపోతే తిరిగి అతికించి ఆపరేషన్‌ చేయడం సహజం. కానీ మొండెం నుంచి వేరయిన తలను అతికించే ఆపరేషన్‌ అంటే సాధ్యమేనా. అది అసాధ్యం అనే వారికి దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఆస్ట్రేలియా వైద్యులు అది కూడా ఓ 16 నెలల చిన్నారికి ఈ క్లిష్టతర ఆపరేషన్‌ చేసి ప్రాణాలను నిలబెట్టారు.

హెలికాప్టర్‌లో బ్రిస్బేన్‌కు తరలింపు ..
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరానికి చెందిన 16 నెలల చిన్నారి జాక్సన్‌ టేలర్‌ను తీసుకొని అతడి తల్లి, అక్క కారులో బయటకు వెళ్లారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన మరో కారు.. వీరిని ఢీకొట్టింది. జాక్సన్‌ తలను, శరీరాన్ని కలిపే భాగాలు అంతర్గతంగా తెలిగిపోవడంతో జాక్సన్‌ స్పృహ కోల్పోయాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే తమ చిన్నారిని హెలికాప్టర్‌లో బ్రిస్బేన్‌కు తరలించారు.

ఆరు గంటల పాటు శ్రమించిన వైద్యులు ..
చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అద్భుతమైన శస్త్ర చికిత్స చేశారు. దాదాపు ఆరు గంటలపాటు శ్రమించి చిన్నారి తల.. శరీర భాగాలను అతికించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక చిన్నారి కదలకుండా ఉండేందుకు తల, శరీర భాగాలకు గొట్టాలు అమర్చారు. వీటిని 8 వారాల తర్వాత తొలిగిస్తామని వైద్యులు తెలిపారు. అనంతరం జాక్సన్‌ అందరిలాగానే మామూలు జీవితం గడపవచ్చని వైద్యులన్నారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి తమ కుమారుడికి మరో జన్మనిచ్చిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

తుళ్లూరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

గుంటూరు : తుళ్లూరులో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను భూమి పూజ జరిగిన ప్రదేశంలో నిర్వహించాలని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. సమావేశాల ఏర్పాట్ల బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రతిపాదించారు. హ్యాయ్‌ల్యాండ్‌, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ అతిధి గృహాల్లో ఎమ్మెల్యేలకు బసను ఏర్పాటు చేయాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు లేదా తర్వాత రోజున బాబా రాందేవ్‌తో ఎమ్మెల్యేలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి..

మెదక్ : యూటీఎప్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ముట్టడి జరుగనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.

07:19 - October 7, 2015

మణిపూర్ : దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల ధ్వజమెత్తారు. ఎఎఫ్ ఎస్ పిఎ యాక్ట్ పేరుతో అమాయకులను ప్రభుత్వం, మిలిటరీ సైన్యం సంయుక్తంగా పొట్టన పెట్టుకుంటున్నాయని మండిపడ్డ ఆమె ప్రాధమిక హక్కులను హరిస్తున్న రాజ్యం ఇందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి ఇందుకు బాధ్యత వహించాలని ఇరోం షర్మిల డిమాండ్ చేశారు. ఎఎఫ్ ఎస్ పి ఎ యాక్ట్ ఎత్తేయాలంటూ 15 ఏళ్లుగా ఆమరణదీక్ష చేస్తున్న షర్మిల తన పోరాటం ఆగదని మరోసారి స్పష్ఠం చేశారు.

07:18 - October 7, 2015

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో పాక్‌ టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు అంత్యక్రియలు ముగిసాయి. జమ్మూ-కాశ్మీర్‌లో చొరబడిన మిలిటెంట్లను అదుపు చేసే ప్రయత్నంలో పంజాబ్‌కు చెందిన లాన్స్ నాయక్‌, హర్‌దేవ్ సింగ్‌లు మరణించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీరుల భౌతిక కాయాన్ని వారి స్వగ్రామాలకు తరలించిన ఆర్మీ ఉన్నతాధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. అసలు సిసలైన దేశ భక్తులను కడసారిగా చూసుకునేందుకు గ్రామస్ధులతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు సైతం తండోపతండాలుగా వచ్చారు. వీర సైనికులకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు ఘనంగా పలికారు.

07:16 - October 7, 2015

మహారాష్ట్ర : అంతరించిపోతున్న పులులను కాపాడాలి అనే మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవ్‌ టైగర్‌ ప్రాజెక్ట్ ప్రతినిధిగా బిగ్‌ బీ అమితాబ్‌ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని సంజయ్‌గాంధీ నేషనల్‌ జూ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన అమితాబ్‌ రాజసానికి ప్రతీకైన పులులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు. వేటగాళ్ల ఉచ్చు నుంచే కాదు పర్యావరణ పెనుముప్పుల నుంచి కూడా వన్యప్రాణులను కాపాడుకోవాలని బిగ్‌ బీ పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అటవీ సిబ్బందిని అమితాబ్‌ అవార్డులతో సత్కరించారు.

 

07:13 - October 7, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు యాక్టివ్‌ అవుతున్నారు. బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేయాలంటూ విశాఖలో ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోనూ ముగ్గురు రైతులను అపహరించి ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మౌనంగా ఉన్న మావోయిస్టులు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జీకే వీధి మండలంలో టీడీపీ ఏజెన్సీ కార్యదర్శి మహేష్‌, బాలయ్య పడాల్‌, వంగల బాలయ్యలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు.

బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్‌..
ఏజెన్సీలో గిరిజనులకు నష్టం కలిగించే విధంగా నిర్వహిస్తున్న బాక్సైట్‌ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వానికి ఏవోబీ జోనల్‌ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. బాక్సైట్‌ తవ్వకాల కోసం కొనసాగిస్తున్న కూంబింగ్‌లు నిలిపివేయాలని,.. తక్షణమే క్యాంపులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం వారం రోజుల్లోగా ప్రకటన చేయకపోతే.. టీడీపీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునే వరకు కిడ్నాప్‌ చేసినవారిని విడిచిపెట్టేది లేదంటూ మావోయిస్టులు హెచ్చరించారు.

ప్రభుత్వం నిర్ణయంపై తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని లేఖ..
మరోవైపు బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై మా జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ కిడ్నాప్‌నకు గురైన టీడీపీ నేతలు కూడా లేఖ రాశారు. ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయాలంటూ మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. దీంతో విశాఖ ఏజెన్సీలోని టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ కొనసాగుతోంది. మరోవైపు కిడ్నాప్‌నకు గురైన నేతల కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చర్ల మండలం చలమలలో ముగ్గురు రైతులు కిడ్నాప్‌..
ఇక ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల గ్రామంలో ముగ్గురు రైతులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. ఇంకా ముత్తయ్య, రాజశేఖర్‌, కన్నారావులను విడిచిపెట్టకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మావోయిస్టులు ఎందుకు తమ వారిని కిడ్నాప్‌ చేశారో అర్ధం కాక కుటుంబ సభ్యులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

07:08 - October 7, 2015

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పు వ్యవహారం తీవ్ర వివాదస్పదమవుతోంది. అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లక్ష్యాలేమిటి? దీని డిజైన్ మార్పు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న కారణాలేమిటి? డిజైన్ మార్పువల్ల తెలంగాణకు జరిగే లాభనష్టాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ప్రాణహిత చేవెళ్ల పోరాట కమిటీ నేత నైనాల గోవర్ధన్ విశ్లేషించారు.

07:04 - October 7, 2015

ఒకనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించాలంటూ డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ డిజైనే మార్చేస్తోంది. పాత డిజైన్ హైదరాబాద్ కు మంచినీటి సరఫరాను వాగ్ధానం చేస్తే, కొత్త డిజైన్ ఆ అంశాన్నే ప్రస్తావించడం లేదు. పాత డిజైన్ ప్రకారం పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయి. కొత్త డిజైన్ రంగారెడ్డి జిల్లాలోనూ ఆందోళనలకు కారణమవుతోంది. పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలిగించబోతోంది.

అతి పెద్ద ప్రాజెక్టు..
ప్రాణహిత చేవెళ్ల. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలో పెద్దది. అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డిల్లో జిల్లాల్లోని దాదాపు పదహారున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది దీని లక్ష్యం. ఈ ఏడు జిల్లాల్లో మార్గమధ్యంలో వున్న పట్టణాలతో పాటు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీరు అందించాలన్నది మరో లక్ష్యం. ఇంత భారీ లక్ష్యాలతో, వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించి, తన వంతు బాధ్యతగా సహకరించాలంటూ తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీనికి జాతీయ హోదా ఇస్తామని గతంలో కేంద్రం కూడా హామీలిచ్చింది. 2008లో నిర్మాణం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటికే దాదాపు 9300 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి అత్యంత అనుకూలమైన ప్రదేశమంటూ గతంలో వాప్ కోస్ నివేదిక స్పష్టం చేసింది. తుమ్మిడి హెట్టి దగ్గర 270 టీఎంసీల నీరు లభ్యమవుతుందనీ, అందులో 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నది వాప్ కోస్ నివేదిక సారాంశం.

మేడిగట్టపై కేసీఆర్ మనస్సు..
అయితే తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా, కాళేశ్వరం సమీపంలోని మేడిగట్ట దిగువున బ్యారేజీ నిర్మించాలంటూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం వివాదస్పదమైంది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్పుకు వ్యతిరేకంగా అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ఆశించినట్టుగా 160 టీఎంసీలు లభ్యం కావడం లేదనీ, ముంపు సమస్య విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నది ప్రభుత్వవర్గాల వాదన. అయితే ముంపు సమస్య విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడం లేదన్న విమర్శలున్నాయి.

6140 ఎకరాల భూమి ముంపు..
మరోవైపు మహారాష్ట్ర తెలంగాణ, నదీగర్భం మొత్తం కలిపినా 6140 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందన్న అంచనాలున్నాయి. మహారాష్ట్రలో ముంపు బారినపడేది నికరంగా 1852 ఎకరాల భూమి మాత్రమే. ఇంత తక్కువ భూభాగం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరియైన పద్ధతిలో ప్రయత్నిస్తే మహారాష్ట్రను ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు మహారాష్ట్రను ఒప్పిస్తే తుమ్మడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోతలు లేకుండానే, కాలువల ద్వారా నీరు పారించవచ్చనీ, 250 మెగావాట్ల జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని ఆరంగ నిపుణులు చెబుతున్నారు.

నష్టాలే ఎక్కువ..
తుమ్మడిహెట్టి కి బదులుగా మేడిగడ్డను ఎంచుకోవడం వల్ల తెలంగాణకు జరిగే లాభమేమీ ఉండకపోగా, నష్టాలే ఎక్కువగా వుంటాయంటున్నవారి వాదనలనూ కేసీఆర్ ప్రభుత్వం అవలోకించాలి. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ కల నిజమైతే 90శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుంది. జాతీయ హోదా కోసం గట్టిగా ప్రయత్నించాల్సిన సమయంలో డిజైన్ మార్చేస్తే, ఆ హోదా దక్కే అవకాశం వుండదు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఇప్పటికే చాలా వరకు వచ్చాయి. మేడిగడ్డకు మారిస్తే అనుమతుల వ్యవహారం మళ్లీ మొదటికివస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధన కోసం ఏడేళ్లుగా తెలంగాణ ఉద్యమకారులు సాగించిన క్రుషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  

06:39 - October 7, 2015

విశాఖపట్టణం : రౌడీలు పేట్రేగిపోతున్నారు. ఖాళీజాగా కన్పిస్తే చాలు కబ్జా కోరలు చాస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే చోద్యం చూస్తున్నారు. ఈ అరాచకానికి సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇవి ఏ ప్రతిపక్ష నాయకుడో చేసిన ఆరోపణలు కాదు. సాక్షాత్తు ఏపి ప్రభుత్వంలో భాగమైన మంత్రి అయ్యన్న పాత్రుడు పేల్చిన మాటల తూటాలు పేల్చారు. విశాఖలో రౌడీ రాజ్యం కొండలా పెరిగిపోతోందంటూ ఆయన వెలిబుచ్చిన ఆవేదననను. సాగర తీరంలో కడప రౌడీయిజం, విజయవాడ, ప్రకాశం జిల్లాల గూండాల పెత్తనం పెరిగిందంటూ ఓ మంత్రే అంటున్నారే పరిస్ధితి ఎంత దిగజారిపోయి ఉంటుంది. కాపాడాల్సిన పోలీసులే కాసుల వేటకు కక్కుర్తి పడుతున్నారని అమాత్యుడే ఆరోపిస్తుంటే దుస్ధితి ఇంకెలా ఉంటుంది.

సీఎం, సీఎస్‌లకు ఫిర్యాదు చేసా-అయ్యన్నపాత్రుడు..
ప్రెస్ మీట్ పెట్టి మరీ అయ్యన్న పాత్రుడు విశాఖలో జరుగుతున్న అరాచకాలపై మండిపడ్డారు. మధురవాడ తదితర ప్రాంతాల్లో పోలీసులే దగ్గరుండి భూఆక్రమణలు చేయిస్తున్నారని, డీల్ కుదురుస్తున్నారని మంత్రి ఆరోపించారు. మంత్రిగా ఉండి కూడా దౌర్జన్యాలను అడ్డుకోలేకే ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లపై అయ్యన్న అసంతృప్తి వ్యక్తం చేసారు.

గంటా మనిషిగా ఏసిపి రవికి పేరు..
అయితే అయ్యన్నపాత్రుడు మరో మంత్రి గంటా శ్రీనివాసరావునే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మధురవాడ ఏసిపిగా పనిచేస్తున్న దాసరి రవిబాబు గంటాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పలు జిల్లాల్లోని గంటా అనుచరులు విశాఖలో మకాం వేసారని, వీరంతా కబ్జాలు చేస్తోంటే వారికి ఏసిపి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టు భూ సమీకరణ సమయంలో అయ్యన్నకు చెందిన సన్ రే రిసార్ట్ భూములు కూడా ఇరికించాలని మంత్రి గంటా విశ్వప్రయత్నం చేసారట. ప్రతిపక్ష నేత జగన్ అయ్యన్నను టార్గెట్ చేయటానికి కారణం గంటానే కారణమని మంత్రిగారి వర్గం గుర్రుగా ఉంది. ఇందుకే గంటాను అయ్యన్న టార్గెట్ చేసారనే వార్తలు సాగరతీరంలో షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అయ్యన్న కామెంట్లు విశాఖలోనే కాదు అటు ఏపి సర్కార్‌లోనూ కలకలం రేపుతున్నాయి. మరి ఈ పరిణామాలకు సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌.

06:36 - October 7, 2015

రంగారెడ్డి : ఎన్నో ఏళ్లుగా ఉంటున్న గూడు చెదిరింది. పిల్లా పాపలతో ఉంటున్న కలల సౌధం కళ్లముందే కూప్పకూలిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎటు వెళ్లాలో దిక్కుతోచని ఆయోమయ పరిస్థితి. ఇన్నాళ్లు సంపాదించుకున్న ఆస్తి.. రోడ్డున పడింది. జిల్లా జీడిమెట్లలోని సురారం కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న బస్తీవాసులను కోర్టు ఆదేశాలతో అధికారులు ఖాళీ చేయించారు. ఇళ్లను ఖాళీ చేయించడంతో ప్రస్తుతం బాధితులు రోడ్డునపడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారంతా కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న తమకు ఎప్పటికైనా సర్కార్‌ ఇప్పుడుంటున్న 60 గజాల స్థలాన్ని క్రమబద్దీకరిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ, న్యాయస్థానం ఆదేశాలతో అధికారులు ఇన్నాళ్లు కంటికి రెప్పెలా చూసుకున్న ఇళ్లను తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు. సూరారం కాలనీలోకి ఉదయమే వందలాది మంది పోలీసులు రావడంతో బస్తీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోని సామానంతా ఖాళీ చేయించి.. బయటపడేయడంతో బాధితులు బోరుమన్నారు. అధికారులు నిర్దాక్షిణ్యంగా ఇళ్లను ఖాళీ చేయిస్తుంటే.. బాధితులు నిస్సాయంగా చూస్తుండిపోయారు. అధికార పార్టీ నేతలు తమకు భరోసాగా ఉంటూ మనోధైర్యం నింపుతారనుకుంటే.. వారు కూడా అధికారులకు సహకరించాలని ప్రకటనలు చేశారు.

అసలు విషయం..
ఇక అసలు విషయానికొస్తే.. దాదాపు 45ఎక‌రాల్లో 3307మందికి 60 గజాల చొప్పునా ప్లాట్స్‌ కేటాయించారు. 1991లో 2,355 ఇళ్లను నిర్మించి ఇచ్చారు. మిగ‌తా వారు ఖాళీ స్థలాల్లో నివాసముంటున్నారు. 1995లో ఇందులో అన‌ర్హులున్నారంటూ ఫిర్యాదులు అంద‌డంతో విచార‌ణ చేప‌ట్టిన అధికారులు 1613 మంది అర్హుల‌ని, మిగిలిన 1694 మంది అనర్హుల‌ని తేల్చి.. వారి పట్టాలను రద్దు చేశారు. ఇళ్ల పట్టాలు తొలగింపబడ్డ బాధితులు తాము కూడా అర్హులమేఅంటూ కోర్టుకు వెళ్లారు. దీంతో 2002లో కోర్టు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసింది. 132 మంది మాత్రమే అర్హులంటూ కోర్టు నివేదిక ఇచ్చింది. మ‌రికొందరు కూడా అనర్హుల విషయమై కోర్టును ఆశ్రయించడంతో పలు దఫాలుగా విచారణ అనంతరం 2055 మంది అనర్హులంటూ తెల్చిన కోర్టు వారిని ఆగ‌స్ట్ 21వ‌ర‌కు ఖాళీ చేయించాలని అధికారుల‌ను అదేశించింది. ఇందులో భాగంగానే అనర్హుల ఇళ్లను అధికారులు తొలగించారు. 

06:33 - October 7, 2015

హైదరాబాద్ : తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ప్రభుత్వభూమిని రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న తరుణంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలపై రోశయ్యతో సహా మరో 17 మందిపై కేసు నమోదయింది.అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేవన్న ధర్మాసనం కేసును కొట్టివేసింది.

 

06:31 - October 7, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం నల్లపాడు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ స్థలంలో జగన్‌ చేపట్టనున్న దీక్షకు వైసీపీ గుంటూరులో భారీ ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న దీక్షకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. వైసీపీ ముఖ్యనేతలంతా గుంటూరులోనే వారం రోజులుగా మకాం వేసి దీక్షను సక్సెస్‌ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు జగన్‌ సమాయత్తమయారు. ప్రత్యేక హోదా అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుని బాబు సర్కార్‌పై యుద్ధభేరి మోగించాలనుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు దీక్ష వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నేతలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారీ ఏర్పాట్లు..
జగన్ నాలుగు నుంచి ఐదు రోజుల పాటు దీక్ష చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వర్షం వచ్చినా దీక్ష కొనసాగేలా భారీ టెంట్లు సిద్ధం చేశారు. మరోవైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం మూడు వేల మంది కూర్చునేలా దీక్షా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చే ప్రజల కోసం భోజనాలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజలను తరలించేందుకు వాహనాల ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.

మద్దతు పలకాలని పలువురిని కోరిన వైసీపీ..
దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యేలా అధినేత జగన్‌ ఆదేశించారు. వామపక్ష పార్టీలను దీక్షకు మద్దతు పలకాలని ముఖ్యనేతలను కోరారు. వీరితో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు సంఘీభావం ప్రకటించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే దీక్షకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం జగన్‌ దీక్షను లైట్‌ తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి దీక్షలు, ధర్నాలు అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

06:28 - October 7, 2015

గుంటూరు : ఆకాశం దిగివచ్చి మబ్బులతో పందిరి వేయాలి. భూలోకం దిగివచ్చి తివాచీ పరచాలి. దేవతలంతా దిగివచ్చి చప్పట్లు కొట్టాలి. అతిథులంతా అద్భుతహా అంటూ మైమరిచిపోవాలి. ఇదంతా ఏ పెళ్లి కోసమో కనే కల కాదు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వమే కల కంటోంది. కలే కాదు..దాన్ని సాకారం చేయడానికి చంద్రబాబు రోజుల తరబడి కసరత్తు చేస్తున్నారు.

13 నుంచి గ్రామాల్లో అమరావతి సంకల్ప జ్యోతి..
13 నుంచి గ్రామాల్లో అమరావతి సంకల్ప జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలియచేశారు. 20వ తేదీన గుంటూరులో జ్యోతిని చంద్రబాబు అందుకుంటారన్నారు. 15వ తేదీ నుంచి నీరు-మట్టి కార్యక్రమం, 13 నుంచి 21 వరకు అన్ని జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని.. ప్రజలను భాగస్వాములను చేయడమే వీటన్నిటి ఉద్దేశమని నారాయణ వివరించారు. మొత్తం మీద శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపాలనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు భారీ కసరత్తే చేస్తోంది.

06:26 - October 7, 2015

హైదరాబాద్ : ప్రతిపక్షం మాట వినడం లేదంటూ బయటికి నెట్టేశారు. సభను మేమే నడుపుకుంటామన్నారు. రెండు రోజులు జరిగేసరికి అధికారపక్షానికి తత్వం బోధపడింది. సభలో ఏకపాత్రాభినయం చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. తర్వాత ఇదీ పరిస్ధితి. వారే అడగాలి.. వారే సమాధానం చెప్పుకోవాలి. గోడలకు చెప్పుకున్నట్లుగా మంత్రులు ప్రసంగాలు చేసుకున్నారు. మరో వైపు విపక్షాలు జనంలోకి వెళ్లి విరుచుకుపడుతున్నాయి. ఇలా అయితే కష్టం నష్టం తమకేనని అర్ధమైనట్లుంది. అందుకే సభలు ముగించేసి..జనంలోకి వెళ్లాలని కేసీఆర్‌ డిసైడైనట్లు సమాచారం.

ప్రజల్లోకి వెళ్లిన ప్రతిపక్షాలు..
మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేస్తున్నాయి. ధర్నాలు, సభలతో హల్‌చల్‌ చేస్తున్నారు. 10వ తేదీన బంద్‌ పిలుపు కూడా ఇచ్చారు. ఇటు సభలో వన్‌సైడ్‌ చర్చ.. అటు ప్రతిపక్షాల రచ్చ రెండూ చూశాక.. అధికారపక్షం రూటు మార్చేయాలని డిసైడైంది. సభ షెడ్యూల్‌ను ముందుకు జరిపి.. ముగించేసి.. తాము కూడా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

10వ తేదీ బదులు 7వ తేదీనే ముగింపు?..
గత నెల 23వ తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 10 వరకు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు 7వ తేదీతోనే ముగించేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రతిపక్షాలతో తలపడాలని చూస్తోంది.

మిషన్ కాకతీయపై నేడు తెలంగాణలో చర్చ..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మిషన్ కాకతీయపై చర్చ జరుగనుంది. అనంతరం నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉంది. 

అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య...

అనంతపురం : గార్లెదిన్నె (మం) మర్తాడులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాదాసు పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని మనస్థాపంతో రైలు కిందపడి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

పీపుల్స్ ప్లాజాలో 'హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో'..

హైదరాబాద్ : నేటి నుండి పీపుల్స్ ప్లాజాలో 'హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో' జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. 

Don't Miss