Activities calendar

08 October 2015

స్టేషన్ ఘన్ పూర్ లో 35 మంది ఆశా వర్కర్ల అరెస్టు...

వరంగల్ : స్టేషన్ ఘన్ పూర్ లో 35 మంది ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. రేపు చలో అసెంబ్లీ నిమిత్తం హైదరాబాద్ వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేశారు.

 

22:17 - October 8, 2015

అతడు ప్రపంచానికి ఓ రెవల్యూషనరీ ఐకాన్. అతని పేరు వింటూనే సామ్రాజ్యవాదులకు వెన్నులో ఒనుకు పుడుతుంది. అతని బొమ్మ మదిలో కదలాడితే.. నరాల్లో నెత్తురు విద్యుత్ ప్రవాహం అవుతుంది. విప్లవానికి ఎల్లలు లేవని, విప్లవాగ్నికి కులం, భాష, ప్రాంతం, మతం తెలియవని.. విప్లవం సమస్త మానవాళి సమాహిక స్వప్నమని నిరూపించిన మహోన్నత మానవుడు.. నిత్య యువకుడు. ఇప్పుడు ఆ విప్లవస్ఫూర్తి వ్యాపారకేంద్రంగా మారిపోతుంది. ఆ చైనత్య యోధుడు మరెవరో కాదు.. చెగువేరా. బోలీవియా మట్టిపొరల్లో సంహిగర్జన చేస్తోన్న వీరుడు.. అక్టోబర్ 9.. ఆయన వర్ధంతి సందర్భంగా వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం... మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం....

 

21:55 - October 8, 2015

ఢిల్లీ : బెలారస్‌కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి స్వెత్లానా అలెక్సీవిచ్‌కు సాహిత్యంలో 2015 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం దక్కింది. రష్యాలోని చెర్నోబిల్ అణుప్రమాదం బాధితులపై రాసిన కథనానికి ఆమెకు ఈ అవార్డు లభించింది. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ రాయడంలో స్వెత్లానాది అందె వేసిన చేయి. తన రచనల్లో అపార ధైర్య సాహసాలు కనబరిచే 67 ఏళ్ల స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడంపై పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు.

21:52 - October 8, 2015

హైదరాబాద్ : ఆశావర్కర్ల సమ్మెపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 39 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశావర్కర్లు సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు రాకుండా కట్టడి చేస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. ఇప్పటికే వందలాది మందిని పోలీసులు తమ అదపులోకి తీసుకున్నారు.
ఆశావర్కర్ల అలుపెరుగని సమ్మె
తమ సమస్యలను పరిష్కరించాలని ఆశావర్కర్లు 39 రోజులుగా అలుపెరగకుండా సమ్మె చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులందర్నీ వేడుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆశావర్కర్లు 9న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వస్తున్న ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
ఉదయం నుంచే అరెస్ట్‌లు
జిల్లాల్లో ఉదయం నుంచే ఆశావర్కర్లను, సీఐటీయూ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు రాత్రిసమయంలో మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీఐటీయూ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని అనుమతి కోరినా.. ప్రభుత్వం నిరాకరిస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఆశావర్కర్ల సమస్యలు పట్టకపోవడం విచారకరమని ఆశావర్కర్లు విమర్శిస్తున్నారు.

21:46 - October 8, 2015

తూర్పుగోదావరి : ఆ ఇద్దరి ప్రేమ ఏకంగా ఖండాలు దాటేసింది.. కులం, మతం, దేశం అడ్డుగోడలనుదాటి ఒక్కటయ్యేలా చేసింది.. అమెరికా అమ్మాయి, కాకినాడ అబ్బాయికి తెలుగు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది..
కాకినాడ అబ్బాయి, అమెరికా అమ్మాయి
తూర్పుగోదావరి జిల్లా అబ్బాయి, అమెరికా అమ్మాయి వారి పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు.. కాకినాడ రూరల్‌ మండలం వేలంగికిచెందిన సత్య శేఖర్ హైదరాబాద్‌లోని బైబిల్ మ్యూజిక్ కాలేజీలో పనిచేసేవారు.. అక్కడే అతనికి యూఎస్‌కుచెందిన డేనియల్‌ నికోలా పరిచయమయ్యారు.. ఆ తర్వాత ఇది ప్రేమగా మారింది.. ఈ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబపెద్దలకుచెప్పారు.. వారి అంగీకారంతో వేలంగిలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు..
తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి
తెలుగు సంప్రదాయాలప్రకారం ముస్తాబైన పెళ్లికూతురు మెడలో శేఖర్ మంగళసూత్రం కట్టారు.. వివాహం తరువాత వధూవరులిద్దరూ సంతోషంలో మునిగిపోయారు.. భారతీయ సంప్రదాయాలను ప్రశంసలతో డేనియల్ ముంచెత్తారు.
క్రైస్తవ పద్ధతిలో వివాహం 
రెండు కుటుంబాల సమక్షంలో తెలుగు సంప్రదాయాలప్రకారం క్రైస్తవ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమాన్ని మ్యారేజీ రిజిస్ట్రార్ మణికుమార్‌ దగ్గరుండి జరిపించారు. ప్రేమకు కులాలు, మతాలు, దేశాలు అడ్డురావని చాటిన ఈ జంటను అందరూ ఆశీర్వదించారు..

 

21:41 - October 8, 2015

హైదరాబాద్ : సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఇవాళా జరిగిన టీఆర్ ఎస్ ఎల్ పీ సమావేశం విషయాలను వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో సక్రమంగా అమలు అవుతున్నాయా.. లేదా... మంత్రులు పరిశీలించాలని చెప్పారన్నారు. మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించాలని తెలిపినట్లు వివరించారు. రెండో విడత పనులలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొని, విజయంతం చేయలని సీఎం చెప్పినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ నుంచి మంచినీరు పనులను శరవేగంగా చేయాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు నాయిని పేర్కొన్నారు.

 

20:55 - October 8, 2015

హైదరాబాద్ : చాలా రోజుల నుంచి సమ్మెలో ఉన్న ఆశావర్కర్లు చలో అసెంబ్లీకి సిద్ధమయ్యారు. రేపు ఆశావర్కర్ల చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఆశావర్కర్లను కూంబింగ్‌ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆశావర్కర్లు, నేతుల, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల్లో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ బెల్లంపల్లిలో రైలెక్కిన ఆశావర్కర్లను బలవంతంగా కిందికి లాగేశారు. హైదరాబాద్‌కు వెళ్తుండగా 50 మంది ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. ఓ మహిళ అస్వస్థతకు గురైంది. రైల్వేస్టేషన్‌ గేట్‌ ఎదుట ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్‌ సీపీఎం ఆఫీసులో ఉన్న నాయకులను అరెస్ట్‌ చేశారు. సిపిఎం కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి చుక్కారాములుతో పాటు..20 మందిని అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరుగుతున్న సీఐటీయూ సమావేశంలోకి పోలీసులు దూసుకెళ్లి.. దుర్మార్గంగా ఆ పార్టీ నేతలు రాములు, వెంకట్రాములు రెడ్డిలను అరెస్టు చేసి... కోయిల్ కొండ పీఎస్ కు తరలించారు. జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవేపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి... తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలతోపాటుగా 150 మంది అరెస్టు చేశారు. నార్కట్ పల్లి, చిట్యాల వంటి తదితర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. పోలీసులు చిట్యాలలో ఆశావర్కర్‌ లేకపోవడంతో ఇంట్లో ఉన్న 3వ తరగతి అమ్మాయిను పోలీసులు అదుపులోకి తీసుకుని...అనంతరం విడుదల చేశారు. వరంగల్‌లో 200 మందిని అరెస్ట్‌ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లను దిగ్బంధం చేశారు. పోలీసులు జులుం ప్రదర్శించారు. కాగజ్ నగర్ , బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని, అరెస్టు చేస్తున్నారు. సీఐటీయూ నాయకుల ఇళ్ల చుట్టు పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి.. బయటికి వస్తే.. అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
సాయిబాబా... సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
'గత 37 రోజులుగా ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతుంది. తమకు వేతనం కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. గర్బిణీలు, చంటి పిల్లలని చూడకుండా.. పోలీసుల వారిపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ఆపే సత్తా టీసర్కార్ కు లేదు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమం ఆగదు. రేపు చల్ అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన, కార్యక్రమాలు చేపడతామని' చెప్పారు.


 

చైనా ఓపెన్ సెమీస్ కి సానియా-హింగీస్ జోడీ

ఢిల్లీ : చైనా ఓపెన్ సెమీస్ కి సానియా-హింగీస్ జోడీ చేరింది. క్వార్టర్ ఫైనల్లో 7-6, 6-4 వరుస సెట్లతో విజయం సాధించారు. 

నోబెల్ సాహితీ పురస్కారానికి స్వెత్లానా అలెక్స్ విచ్ ఎంపిక

ఢిల్లీ : ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారానికి స్వెత్లానా అలెక్స్ విచ్ ను ఎంపిక చేశారు.

అమరావతిలో 5 ఎకరాలను కోరిన నాబార్డు సీజీఎం​

విజయవాడ : నాబార్డు సీజీఎం హరీష్ జావ.. అమరావతిలో 5 ఎకరాల భూమిని కోరారు. నాబార్డు కార్యాలయాలు, నివాస భవనాలు నిర్మిస్తామని తెలిపారు. 

20:15 - October 8, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో పేదల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చివరిదశకు చేరుకున్నాయి. ఐడిహెచ్ కాలనీలో ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు గదుల ఇళ్ల నిర్మాణాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పేదలకు మంచి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్.. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని విస్తరిస్తామని చెప్పారు.

 

దసరాకు ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం

సికింద్రాబాద్ : ఐడీహెచ్ కాలనీని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, జగదీష్ రెడ్డిలు, ఎమ్మెల్యేలు సందర్శించారు. దసరాకు ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. పాత, కొత్తలను కలుపుకొని పనిచేయాలని సీఎం సూచించారని గుర్తు చేశారు.

 

19:54 - October 8, 2015

కడప : కాలేజీ అద్భుతం.. అందులో లెక్చరర్లు చెప్పే పాఠాలు అమోఘం.. ఇక విద్యార్ధుల చదువులంటారా.. నభూతో నభవిష్యత్‌.. కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్న ఈ ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీ రిజల్ట్స్‌లో రికార్డులు బద్దలు గొడుతుంది. అందుకే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టింది. అంత గొప్ప కాలేజీ చూద్దామని వెళ్లిన టెన్‌ టీవీ బృందం అవాక్కయింది. ఎందుకో చూడండి.
1984లో కాలేజీ స్థాపన
కడప జిల్లా జమ్మలమడుగు లో కాసంశెట్టి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాసంశెట్టి సంజీవయ్య గుప్త జూనియర్ కాలేజి 1984 లో వెలిసింది. కాలక్రమేణా ఈ జూనియర్ కాలేజి ఎయిడెడ్ కాలేజిగా మారింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాల కోసం నిధులు అందుతున్నాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
జమ్మలమడుగు ఉత్తుత్తి కాలేజీ నాటకానికి తెర లేపారు
కొందరు ప్రబుద్ధులు చట్టాన్ని చక్కగా వినియోగించుకున్నారు. కాలేజిని మూసేసి, ప్రభుత్వానికి గాలిలో కాలేజి చూపించి వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజి యాజమాన్యంతో కుమ్మకై ఆ కాలేజి లో చదువుతున్న విద్యార్థులు తమ కాలేజిలో చదువుతున్నట్లుగా రికార్డులు సృష్టించి దోపిడి చేసారు.
గడిచిన 5ఏళ్లుగా నడుస్తున్న తతంగం
ఈ తతంగం అంతా ఐదేళ్లపాటు యదేచ్ఛగా జరిగింది. అధికారులకు మామూళ్లు ఇచ్చుకుంటూ దందా జరిపారు. మూడో కంటికి తెలియకుండా ఈ వ్యవహారం నడుస్తూ వచ్చింది.
అడ్డం తిరిగిన ప్రైవేటు కాలేజీ పార్ట్‌నర్‌
అయితే ఇంతకాలం బినామీ స్టూడెంట్స్ వివరాలు అందించిన ప్రైవేటు జూనియర్ కాలేజి అడ్డం తిరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ ఈ ఉత్తుత్తి కాలేజీకి సహాయం నిరాకరించింది. దీంతో చేసేది లేక కాసంశెట్టి సంజీవయ్య గుప్త ఉత్తుత్తి కాలేజి యాజమాన్యం తమ కాలేజిని ఈ ఏడు నుంచి మూసివేస్తున్నట్లు కమీషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు తెలిపింది.
తీగ లాగితే ఉత్తుత్తి కాలేజీ డొంక కదిలింది
దీనితో 10 టి.వి. తీగ లాగితే డొంకతా కదలినట్లు అసలు విషయం బయటపడింది. ఈ ఉత్తుత్తి కాలేజిలో పనిచేస్తున్న లెక్చరర్ల జీత భత్యాలు పరిశీలిస్తే కళ్లు తిగరగక మానవు.
బి. రవీంద్రనాథరెడ్డి ...... మ్యాథ్స్ లెక్చరర్..... జీతం నెలకు రూ. 83, 656
జి. ఓబులరెడ్డి............ తెలుగు లెక్చరర్...... జీతం నెలకు రూ. 87, 935 రూపాయలు
సి. నాగూర్ ............... కెమిస్ట్రీ లెక్చరర్ ...... జీతం నెలకు రూ. 81, 553 రూపాయలు
ఎన్. గురు రాజశేఖర్ .... టైపిస్ట్ ...... జీతం నెలకు రూ. 43, 718 రూపాయలు
ఎస్. నారాయణరెడ్డి ..... రికార్డు అసిస్టెంట్ ... జీతం నెలకు రూ.38, 044 రూపాయలు
వై శ్రీనివాసరెడ్డి ..............రికార్డు అసిస్టెంట్ ....జీతం నెలకు రూ. 38, 044 రూపాయలు
జి. జయరామిరెడ్డి ........ అటెండర్ ............ జీతం నెలకు రూ. 35, 029 రూపాయలు
విద్యాసాగర్ ........... స్వీపర్ ..... జీతం నెలకు రూ. 25, 723 రూపాయలు
వెరసి మొత్తంగా నెలకు 4 లక్షలకు పైగా రూపాయలు జీత భత్యాలు తీసుకుంటున్నారు. లేని కాలేజిని ఉందని చూపుతూ ప్రభుత్వం నుంచి నిధులు దోచుకు తిన్నారు ఈ ప్రబుద్ధులు.
ప్రభుత్వ జీతం పొందుతూనే బయట వ్యాపారాలు
ఐదేళ్లుగా నిరాటంకంగా వీరు జీతాలు తీసుకుంటున్నారు. ఈ కాలేజిలో లెక్చరర్లుగా చెలామణి అవుతున్న వీరంతా ఒక వైపు ప్రభుత్వ జీతం అప్పనంగా తీసుకుంటూ బయట వేరే ఉద్యోగాలు చేస్తున్నారు.
దందా గురించి తెలియదని చెప్పిన ఆర్‌జెడీ
అయితే ఈ దందా గురించి తమకు తెలియదని ఆర్.జె.డి చెబుతున్నారు. తమ రికార్డుల్లో కాలేజి జరుగుతున్నట్లుగా ఉందని తెలిపారు. తాను ఒక్కసారి కూడా కాలేజికి విజిట్ వెళ్లనందున వాస్తవాలు తమ దృష్టికి రాలేదని ఒప్పుకున్నారు.
సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్‌
కాగితాల్లో కాలేజి నిర్వహించి కోట్ల రూపాయలు జీతం రూపంలో మెక్కేసిన వీరిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

19:44 - October 8, 2015

విజయవాడ : విద్యుత్‌ ఉత్పత్తికి ప్రత్యామ్నాయాల కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో సోలార్‌ వింగ్‌ డెవలపర్స్‌ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించామని చెప్పారు. విద్యుత్‌ లోటు లేకుండా ముందుకెళ్తున్నామన్నారు. పవన, సౌర విద్యుత్‌పై ప్రత్యేక దృష్టసారించినట్లు చెప్పారు.

 

19:38 - October 8, 2015

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నంలో ఈ నెల 3న ఓమహిళపై హత్యాయత్నం చేసి.. బంగారం దోచుకెళ్లిన నిందితుడు అరెస్ట్‌ అయ్యాడు. మచిలీపట్నం హిందూ కాలేజీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పర్సా సునీత అనే మహిళపై అదే కాలేజీలో ఇంటర్ ఫస్టియర్‌ చదువుతున్న అనిల్‌ సునీతపై హత్యాయత్నం చేసి బంగారం దోచుకెళ్లాడు. గతంలోనూ అనిల్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనిల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

19:29 - October 8, 2015

వరంగల్ : ప్రభుత్వం రైతు రుణమాఫీని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని వామపక్షాలు నేతలు హెచ్చరించారు. లేనిపక్షంలో ఈనెల 10న రాష్ర్ట బందు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు రుణాలకు మారిటోరియం ప్రకటించాలని, ప్రభుత్వం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను నియంత్రించాలని నేతలు డిమాండ్‌ చేశారు. వరంగల్‌ నియోజక వర్గం వామపక్షాల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గాలివినోద్‌ కుమార్‌ సన్నాహక సమావేశాలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

 

19:26 - October 8, 2015

వ‌రంగ‌ల్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప‌త్తిరైతు తన పొలంలో పురుగుల‌ మందు తాగి బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడిన ఘ‌ట‌న వెలుగుచూసింది. మృతుడు దేవ‌రుప్పలమండలం చిన్నమాడురుకు చెందిన న‌ర్సయ్యగా గుర్తించారు. మృతుడు నర్సయ్య 4 ఎక‌రాల్లో ప‌త్తి సాగు చేస్తు మ‌రో మూడు ఎక‌రాల‌ను కౌలుకు తీసుకున్నాడు. కాలం క‌లిసి రాకపోవ‌డంతో పంట చేతికి అంద‌క‌ చేసిన అప్పుల‌కు వ‌డ్డీల‌ను చెల్లించడం క‌ష్టంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయం లేక పురుగుల మందు తాగి ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.

 

 

19:18 - October 8, 2015

ఢిల్లీ : కళాకారులను రాజకీయ కోణంలో చూడడం సబబు కాదని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ గజల్‌ కళాకారుడు గులాం అలీ అనాన్నారు. సంగీతం ప్రేమ అనురాగాలను పెంచుతుందే తప్ప ద్వేషాలను రగిలించదని గులాం అలీ పేర్కొన్నారు. ముంబైలో తన ప్రోగ్రాం రద్దు కావడంతో తనతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలిపారు. కాశ్మీర్‌ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ముంబైలో గులాం అలీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని శివసేన హెచ్చిరించింది. పాక్‌ చర్యల వల్ల జమ్ముకాశ్మీర్‌ సరిహద్దులో తమ జవాన్లు అమరులవుతుంటే గులాం అలీ సంగీతాన్ని ఎలా ఆస్వాదిస్తామని శివసేన పేర్కొంది.

18:59 - October 8, 2015

నల్లగొండ : జిల్లాలోని ఇంద్రపాలనగరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థానికులను విషాదంలోకి నెట్టింది. భువనగిరి-నల్లగొండ మార్గంలో దాదాపు ఆయా గ్రామాల ప్రజలే బస్సులో ప్రయాణిస్తుంటారు. దీంతో ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులలో దాదాపు సమీపంలోనే వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మేల్కొన్నారు. ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రమాద స్థలి నుంచి టెన్ టీవీ గ్రౌండ్ రిపోర్టు అందిస్తోంది. బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పలువురు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు ప్రమాదం స్థానిక గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా స్థానిక గ్రామస్తులే. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మేల్కొన్నారు. ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద చెట్లను తొలగిస్తున్నారు. ప్రమాద స్థలి నుంచి టెన్‌ టీవీ గ్రౌండ్ రిపోర్టు అందించింది. ప్రమాదం జరిగిన చోట మూలమలుపు ఉందని.. అక్కడ హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని కోరుతున్నారు.

 

18:48 - October 8, 2015

అనంతపురం : ఏపీలో ప్రత్యేక ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. హోదాతో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సీపీఐ, విద్యార్థి, ప్రజాసంఘాలు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టాయి. ఇవాళ శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో ప్రారంభమైన ఈ యాత్ర.. శ్రీకాకుళం వరకు కొనసాగనుంది. ఈనెల 22న అమరావతికి వస్తున్న ప్రధాని మోదీ.. విభజన సమయంలో ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

ఆశావర్కర్ల ముందుస్తు అరెస్టు..

ఆదిలాబాద్ : జిల్లాలోని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 9న చలో అసెంబ్లీకి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈమేరకు వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఈరోజు హైదరాబాద్ తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తు అరెస్టులు చేశారు. 

18:45 - October 8, 2015

గుంటూరు : కన్నతండ్రి కళ్లను పరువు పిచ్చి కమ్మేసింది. కూతురిని ప్రేమించిన తండ్రి.. ఆమె ప్రేమను మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ప్రతిష్టకు పోయి .. ఆ కంట్లోనే పొడుచుకున్నాడు. కన్న కూతురిని హత్య చేశాడు. గుంటూరు జిల్లా వేమూరు మండలం కాకర్లపాడులో ఈ దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో గొంతు నులిమి చంపేశాడో పరువు పిచ్చి తండ్రి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేమూరు మండలం పరిధిలోని కాకర్లపాడు గ్రామానికి చెందిన లావణ్య.. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురంకు చెందిన నాని అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమించి.. పెద్దలకు తెలియకుండా ఈ నెల రెండో తేదీన ప్రేమ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు ఆమె ఇంటికి వెళ్లి తిరిగి మీకు మళ్లీ పెళ్లి చేస్తామని, రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని లావణ్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే తీసుకొచ్చిన మరుసటిరోజు 5 వ తేదీన తెల్లవారుజామున లావణ్య తండ్రి శ్రీనివాస్ ఆమె గొంతునులిమి, అత్యంత పాశవికంగా, దారుణంగా హత్య చేశారు. లావణ్య ఉరివేసుకుని చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. లావణ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గ్రామంలో ప్రచారం చేశారు. కానీ ఇది ఆత్మహత్య కాదని.. హత్యని ఊపిరాడకుండా చేసి.. గొంతునులిమి ఆమెను హత్య మార్చారాని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా వాస్తవాలు బయటపడ్డాయి. తండ్రి శ్రీనివాస్ పరువు కోసం కూతురు లావణ్యను గొంతునులిమి.... ఊపిరాడకుండా చేసి.. దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

18:33 - October 8, 2015

ఆదిలాబాద్ : జిల్లాలోని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 9న చలో అసెంబ్లీకి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈమేరకు వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఈరోజు హైదరాబాద్ తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్లు హైదరాబాద్ వస్తుండగా 50 మంది ఆశా వర్కర్లను బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ గేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన చేపట్టారు.

 

గృహ నిర్మాణశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : గృహ నిర్మాణశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సింగపూర్, చైనా విధానాలను అనుసరించాలని సీఎం ఆదేశించారు. 

18:05 - October 8, 2015

ప్రజా రక్షణ వారి బాధ్యత. నేరస్థులను పట్టుకోవటం వారి విధి. ప్రతి ప్రత్యేక సందర్భానికి తగిన చర్యలు తీసుకోవటం వారి వృత్తి. వారి సేవలు ఆగిపోతే ప్రజాజీవనం స్థంభిస్తుంది. సాధారణ ప్రజలకు రక్షణ కరువుతుంది. మరి అలాంటి విశిష్ట బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా ఉత్సాహంగా ఉండాలి. మరి ఆ స్థితి ఉందా? లేదని తేల్చింది ఒక సర్వే.
పరిమితి లేని పనిగంటలు
పరిమితి లేని పనిగంటలు. వారాంతపు సెలవు లేని విధి నిర్వహణ, తీవ్ర పని ఒత్తిడి, శారీరక, మానసిక అలసట. ఫలితంగా వెంటాడుతున్న రక్తహీనత, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు. అయితే ఈ సమస్యలన్నీ ఎవరివో కాదు... సాధారణ ప్రజానీకానికి రక్షణ కల్పిస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుల్స్ దుస్థితి. ఇటీవల వెలుగు చూసిన ఈ వాస్తవాలను ఇవాళ్టి ఫోకస్ మీ ముందుకు తెస్తోంది. 
మహిళా కానిస్టేబుల్స్ పాత్ర అంతే కీలకం
సమాజానికి రక్షణ వ్యవస్థ ఎంత కీలకమో డిపార్ట్ మెంట్ లో మహిళా కానిస్టేబుల్స్ పాత్ర అంతే కీలకం. అందుకే వారి సమస్యలను పరిష్కరించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవని స్థితి కల్పించాలని, మహిళా కానిస్టేబుల్స్ కు వారి వారి సమస్యలను బట్టి ఉన్నతాధికారులు వెసులు బాటు కల్పించాలని మానవి కోరుకుంటోంది.

17:27 - October 8, 2015

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

సీపీఎం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు

మహబూబ్ నగర్ : సీపీఎం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఆ పార్టీ నేత చుక్కా రాములు, నేతులు, కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

16:59 - October 8, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని తణుకులో కిడ్నాపైన బాలుడు హేమంత్‌ క్షేమంగా తిరిగొచ్చాడు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఆటోలో తీసుకొచ్చి దింపి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు. వారి కళ్లతో అనందాలు వెల్లివరిసాయి. తమ బాబు తిరిగి రావడంతో మిక్కిలి అనందం వ్యక్తం చేశారు. అయితే నిన్న స్కూల్ నుంచి వస్తుండగా హేమంత్ ను దుండుగులు కిడ్నాప్ చేశారు.

 

16:55 - October 8, 2015

కృష్ణా : జిల్లా నాగాయలంక మండలం బరంకులలో ఒక వ్యక్తి తమ ఇంటి కోడల్ని హత్య చేశారు. కాగా ఈ ఘటన సుమారు 95 రోజుల అనంతరం బయటపడింది. మృతురాలి దేహం దొరకడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

16:47 - October 8, 2015

లక్నో : దాద్రీలో గోవును చంపి మాంసాన్ని తిన్నారన్న పుకార్లతో 55 ఏళ్ల ఇఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటనపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు ములాయంసింగ్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. పథకం ప్రకారమే ముస్లిం కుటుంబంపై దాడి జరిగిందన్నారు. దీని వెనకాల అసలు దోషులైన మాస్టర్‌ మైండ్స్‌ వేరే ఉన్నారన్నారు. ముజఫర్‌ నగర్‌లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టిన వాళ్లే దాద్రీలో దాడికి పాల్పడ్డారని ములాయం పేర్కొన్నారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న వారెవరో తమకు తెలిసిందనీ, ముగ్గురు పేర్లు ముందుకు వచ్చాయని, ఒకవేళ రుజువైతే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ములాయం స్పష్టం చేశారు. 

16:44 - October 8, 2015

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం కమల్‌నాథన్‌ కమిటీ పదవీకాలాన్ని పొడిగించింది. మార్చి 2016 వరకు కమిటీ గడువు పెంచుతూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగినా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి కానుందున కమిటీ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు మాత్రం ఈ పొడిగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల విభజన ఆలస్యం చేసేందుకే ఈ పొడిగింపు అని వారు విమర్శిస్తున్నారు. కమల్ నాథన్ కమిటీ గడువు పెంపును ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత కస్తూరి వెంకట్ అన్నారు. ఉద్యోగుల విభజనను ఆలస్యం చేసేందుకు కమలనాథన్ కమిటీ గడువు పెంచారని విమర్శించారు.

 

16:38 - October 8, 2015

కృష్ణా : విజయవాడ నగరాన్ని దేశంలోనే మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా.. విజయవాడలో 'పోస్టర్ ఫ్రీ కాంపెయిన్‌' నిర్వహించిన ఆయన.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విజయవాడ వీధుల్లో ఎక్కడికక్కడ టాయిలెట్లను నిర్మిస్తామని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నారాయణ పిలుపునిచ్చారు.

15:59 - October 8, 2015

ఢిల్లీ : ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకుంటామని ఎపి వ్యవసాయిమంత్రి పత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో పత్తిపాటి, మంత్రి మాణిక్యాలరావు, రైతులు సమావేశం సమావేశం అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం పత్తిపాటి మీడియాతో మాట్లాడారు. ఎపి రైతుల సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. పంటలకు దిగుమతి సుంకం పెంచుతామని నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నష్టపోయిన రైతులకు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయిల్ ఫాం రైతులతో సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టు రైతుల తోడ్పాటుకు హామీ ఇచ్చారు. సెరీ కల్చర్ రైతులకు గిట్టుబాట ధర వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

కాసేపట్లో ఐడీఎల్ కాలనీని సందర్శించనున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాసేపట్లో ఐడీఎల్ కాలనీని సందర్శించనున్నారు. డబుల్ బెడ్ రూం మోడల్ హౌజ్ ను పరిశీలించనున్నారు. 

సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలలో సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.

 

15:30 - October 8, 2015

విశాఖ : సెల్ ఫోన్ కోసం గొడవ పడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. సెల్ ఫోన్ కోసం పరస్పరం కత్తులతో పొడుచుకున్నారు. జిల్లాలోని పెందుర్తి చైతన్య కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ విషయంలో వివాదం తలెత్తింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో గాయాలపాలైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

15:27 - October 8, 2015

నల్లగొండ : జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను కలెక్టర్‌ సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ పరామర్శించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రోడ్‌ సేఫ్టీపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

కమలనాధన్ కమిటీ పదవీకాలం పొడిగింపు...

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం కమలనాధన్ కమిటీ పదవీకాలం పొడిగించారు. మార్చి 2016 వరకు కమిటీ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 

ముగిసిన టీఆర్ ఎస్ ఎల్ పీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్ ఎస్ ఎల్ పీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దసరాకు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలను పట్టించుకోవద్దన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

15:00 - October 8, 2015

ఖమ్మం : జిల్లాలో నేడు కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలన్నందుకు తమను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీని టీఆర్‌ఎస్‌ భవన్‌లా మార్చారని ఎంపీ మధుయాష్కి విమర్శించారు. రైతులకు రుణమాఫీ ఒకేసారి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలకు సమాధానం చెప్పలేకే తమను సస్పెండ్ చేశారని డీకే అరుణ

పేర్కొన్నారు. 

కొనసాగుతున్న టీఆర్ ఎస్ ఎల్ పీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్ ఎస్ ఎల్ పీ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

 

14:45 - October 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయించింది. రేపు రుద్రమదేవి చిత్రం విడుదలౌతున్న నేపథ్యంలో చిత్ర దర్శకులు గుణశేఖర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కాకతీయుల చరిత్ర నేపథ్యంలో తీసిన చిత్ర విషయాలను కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం గుణశేఖర్ ను అభినందించారు. రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, కాకతీయ రాజల చరిత్ర వివరించే సినిమా తీసినందుకు కేసీఆర్ అభినందించారు. ఇలాంటి సందేశాత్మక, చరిత్రను తెలిపే సినిమాలు మరిన్ని రావాలని కోరారు. 

సీఎం కేసీఆర్ ను కలిసిన దర్శకుడు గుణశేఖర్

హైదరాబాద్ : రుద్రమదేవి సినిమా దర్శకుడు గుణశేఖర్ సీఎం కేసీఆర్ ను కలిశారు. కాకతీయుల చరిత్ర నేపథ్యంలో తీసిన రుద్రమదేవి చిత్ర విషయాలను గుణశేఖర్ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుణశేఖర్ ను అభినందించారు. రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు సీఎం తెలిపారు.

 

13:50 - October 8, 2015

వరంగల్ : దసరా నవరాత్రి ఉత్సవాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మహిళలు అందంగా అలంకరించుకుని బతుకమ్మ పాటలు పాడుతుంటారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న మహిళలు భయపడుతున్నారు. బయటకు ఎలా రావాలి అని బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకు ?  చారిత్రాత్మకమైన త్రినగరి వణికిపోతుంది. వరంగల్‌ మహానగరంలోకి చొరబడ్డ ముఠాలు పంజా విసురుతున్నాయి. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్నా నిర్లక్ష్యం వల్ల దొంగలు చెలరేగుతున్నారు. పట్టపగలే ఓ ఇంట్లోకి వెళ్లి ఇల్లాలి గొంతు కోసి గొలుసులు తెంచుకెళ్లారు. బతుకమ్మతో పండుగలు మొదలయ్యాయి. బయటకు రావాలంటేనే భయంతో వణుకుతున్నారు. పోలీసుల వైఫల్యం ఈసారి వీధుల్లో ఆటాపాటా జరిగేనా..? మహిళలు శుభకార్యాలకు నగలు ధరించడం లేదు. పసుపు కొమ్ములను మెడలో వేసుకుని రోడ్డెక్కుతున్నారు. ద్విచక్ర వాహనాలను చూస్తే హడలి పోతున్నారు. రక్షక భటుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. మహిళలు పుస్తెల తాళ్లు పెట్టెల్లో పెట్టుకుంటున్నారు. చారిత్రక నగరం వరంగల్‌లో నిఘా నిద్ర పోతోంది. మూడో కన్ను మూసుకుపోతోంది. ఇంకా ఎంతకాలం ఈ భయమంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలు.

సిటీలో చోర్‌ కపుల్స్ అరెస్టుతో ఆగలేదు..
నగరంలో చోరీలకు పాల్పడుతున్న దంపతులను ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసిన పోలీసులు చైన్ స్నాచింగ్ ఫ్రీ జోన్‌గా ప్రకటించారు. కపుల్స్‌ అరెస్ట్‌తో పాటు పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పెండింగ్ కేసులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దీంతో ఇక త్రినగరిగా పేరొందిన వరంగల్‌ నగరంలో మహిళలు భయం లేకుండా బయటకు రావచ్చన్నారు. కాని ఏం జరిగింది. ప్రతీ క్షణం భయంతో వణికిపోతున్నారు...అందుకు కారణం పోలీసుల నిర్లక్ష్యం కాదా..?

హడలెత్తిస్తున్న స్నాచర్లు..
సేఫ్టీ సిటీగా...ఫ్రీజోన్‌గా వరంగల్ పోలీసులు ప్రకటించిన పదిహేను రోజులకే నగరంలో చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. గడిచిన ఐదు రోజుల్లో సుమారు పది నేరాలకు పాల్పడ్డారు. చోరీలు జరిగిన ప్రాంతాలన్నీ వీధులు కాదు. సందులు కానేకాదు. అన్నీ ప్రధాన కూడళ్లకు సమీపంలోనివే. అసలేం జరుగుతోంది..??? వరంగల్‌ మహానగరంలో చైన్‌ స్నాచర్లు చెలరేగుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే నగరంలో 10 గొలుసులు తెంచేసి పోలీసులకు సవాలు విసిరారు.

పట్టపగలు కూడా..
రాత్రి సంగతి అటుంచితే మహిళలు పట్టపగలు కూడా రోడ్డుపై ఒంటరిగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యానగరంగా పేరొందిన వరంగల్‌ సిటీలో నిత్యం స్టూడెంట్స్‌ సంచారం ఉంటుంది. వరంగల్‌ మర్రి వెంకటయ్య కాలనీకి చెందిన గ్రుహిణి కోలా వూర్మిళాదేవి, కాజీపేటలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు, ఎంజీఎం వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా చేస్తున్న ఇంద అసుంత, కాజీపేట సిద్ధార్థనగర్‌లోని మహిళ ఇలా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పోచమ్మ మైదాన్‌ పెట్రోలు బంకులో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఏం వద్ద స్కూల్‌ బస్సు కోసం వేచి చూస్తుండగా మహిళ మెడలోంచి గొలుసులాక్కెళ్లారు. అందరూ చూస్తుండగానే అందరూ వెంటాడినా దొరక్కుండా హన్మకొండవైపు రయ్‌మంటూ దూసుకెళ్లారు.

పోలీసులు వెంటాడుతున్నా దొరకని వైనం..
నగరంలోని వరంగల్,హన్మకొండ,ఖాజీపేట ప్రాంతాల్లో నల్ల పల్సర్‌ వాహనాలు కనిపిస్తే చాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది... కేయూ సమీపంలో, సిద్ధార్థనగర్‌లో జరిగిన రెండు గొలుసు చోరీ సంఘటనల్లో కాలా పల్సర్‌ బైక్‌పై వచ్చినట్లు బాధితులు తెలిపారు.
నగరంలోని18జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. ఇదే దోపిడీ దొంగలకు అవకాశంగా మారింది. నగరంలోకి చొరబడిన చైన్‌స్నాచర్లు వారం రోజులుగా బీభత్సం సృష్టించారు. ఐదు రోజుల్లో పది చోరీలకు పాల్పడిన దుండగుల ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి..
కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అ పార్ట్‌మెంట్లు, ప్రధాన కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయి...పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇలాంటి నేరాలకు చెక్ పెట్టవచ్చు.

13:42 - October 8, 2015

అనంతపురం : జిల్లా నంబుల పూలకుంటలో సోలార్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండానే పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీసులను వినియోగించి పాలన చేయాలని అనుకుంటున్నారని, ఏకపక్షమైన వైఖరి తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్పీ కుంటలో నష్టపరిహారం చెల్లించకుండానే భూములు తీసుకున్నారని, వేరే వారికి పరిహారం చెల్లించారని తెలిపారు. తాను అక్కడకు వెళితే పోలీసులు ఆపారని వారిని తోసుకుని వెళ్లడం జరిగిందని, కానీ ఊళ్లలో ఆపారని తెలిపారు. పది లక్షల రూపాయల నస్టం పరిహారం ఇవ్వాలని, బినామీ పేర్లతో చెల్లించారని వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల తరువాత వామపక్షాల నేతల పర్యటన ఉంటుందని మధు తెలిపారు. 

13:38 - October 8, 2015

హైదరాబాద్ : ఈనెల పదో తేదీన జరుగబోయే బంద్ కు సహకరించాలని అన్ని వర్గాలకు విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం శాసనసభ ఆవరణలో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 10న జరగబోయే బంద్‌కు తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించాయి. అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ భవన్‌లా మార్చేశారని నేతలు మండిపడ్డారు నేతలు. ఈ సందర్భంగా సభ్యులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

బంద్ కు అందరూ సహకరించాలి - ఉత్తమ్..
పదో తేదీన తెలంగాణ బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలని టి.కాంగ్రెస్ చీప్ ఉత్తమ్ కోరారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే శాసనసభ నుండి సస్పెండ్ చేశారని, రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే ఒకే దఫా రుణమాపీ చేయవచ్చని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 1400 మంది రైతు కుటుంబాలను ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతన్నలది గొంతెమ్మ కోరికలు కాదు - టి.టిడిపి..
రైతులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, తక్షణం రైతు సమస్యలు పరిష్కరించాలని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు. అధికారపక్ష దగాకోరు నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.

ఏడు రోజుల్లోనే సభను ముగించారు - చింతల..
పది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఏడు రోజుల్లోనే ముగించారని బీజేపీ ఎమ్మెల్యే చింతల పేర్కొన్నారు. ప్రతిపక్షాల సలహాలు పక్కన పెట్టి అహంకారపూరితంగా వ్యవహరించారని, రైతాంగ సమస్యల పట్ల సీఎం కేసీఆర్ ప్రసంగం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు.  

13:34 - October 8, 2015

అనంతపురం : జిల్లా రైతులు కురుస్తున్న వర్షాలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి వర్షం కురిసింది. దీనితో పలు వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత కొద్దికాలంగా కరవుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఈ సమస్య తీరుతుందని పుట్టపర్తి వాసులు భావిస్తున్నారు. అటు చిత్రావతి నదిలోకి భారీగా నీరు చేరుతోంది. నదిలోకి నీరు చేరడంతో పుట్టపర్తిలో నీటి సమస్య కొంత పరిష్కారమౌతుందని స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా రానున్న కాలంలో తాగునీటి సమస్య తీరుతుందని అధికారులు భావిస్తున్నారు. అనంతపురం జిల్లాలో గత నెల, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూ గర్భ జలాలు పెరిగే అవకాశం ఉందనే వార్తలతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు కుంభవృష్టి కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

13:30 - October 8, 2015

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో సుమారు 10 గుడిసెలకు పైగా తగలబడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కూలీ..నాలి పనిచేసకుంటున్న పది కుటుంబాలు ప్రశాంత్ నగర్ లో గుడిసెలు వేసుకుని జీవనం గడుపుతున్నారు. గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ గుడిసెలో వంట చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. దగ్గర దగ్గరగా గుడిసెలు ఉండడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపే గుడసెలన్నీ మంటల్లో కాలిపోయాయి. అందులో ఉన్న నిత్యావసర సరుకులు, సామాగ్రీ అంతా కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

13:27 - October 8, 2015

హైదరాబాద్ : సిమ్లా యాపిల్‌ల ధరలు నేలను తాకుతున్నాయి. ఒకప్పుడు తినాలంటేనే ధరను చూసి భయపడ్డ సామాన్యులు ఇపుడు ధరలు తగ్గడంతో సిమ్లా యాపిల్‌ను ఇష్టంగా కొంటున్నారు. ఒక్కొక్కరు కేజీల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు గతంలో రోజుకి ఒక్క బాక్సు మాత్రమే అమ్మే వ్యాపారులు..ఇప్పుడు నాలుగైదు బాక్సులు అమ్మేస్తూ లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సిమ్లాలో విరివిగా పండే యాపిల్లకు మన దేశంలోనేకాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. సిమ్లాలో లభించే రాయల్ డెలిషియస్, రెడ్ డెలిషియస్, గాల్‌గాలా, రెడ్ గోల్డ్ వంటి పలురకాలను జనం ఇష్టంగా కొంటారు. వీటిలో మంచి పోషకాలు, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్స్, నీటి శాతం ఎక్కువగా ఉండడంతో..పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ, అన్నివర్గాల వాళ్లు ఇష్టంగా తింటారు. కాకపోతే మొన్నటి వరకు యాపిల్‌ల ధరలు ఆకాశాన్నంటడంతో..వీటిని కొనేందుకు సామాన్యులు వెనకడుగు వేసేశారు. కానీ..ప్రస్తుతం సిమ్లా యాపిల్‌లు ధరలు అమాంతం తగ్గడంతో సామాన్యజనం వీటిని కిలోలకొద్ది కొనుక్కెళ్తున్నారు.

డిసెంబర్..జనవరిలో దొరికే యాపిల్స్...
ప్రతీ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ సిమ్లా యాపిల్స్ విరివిగా దొరుకుతాయి. ఒకప్పుడు సిమ్లా యాపిల్ ధరలు కేసు రెండు వేల నుంచి 2,500 వరకు ఉండేది. కేజీ 150, 200 వరకు పలికేది. ఒక్కో యాపిల్ 30 నుంచి 40 రూపాయలు పలికేది. అయితే ప్రస్తుతం యాపిల్‌ ధరలు అమాంతం పడిపోయాయి. దానికితోడు ఈసారి యాపిల్‌ పంట విస్తారంగా పండడం, దిగుబడి ఎక్కువగా రావడంతో..కేసు యాపిల్‌లు వెయ్యిరూపాయలకే దొరుకుతున్నాయి. విడిగా ఒక్క యాపిల్ 10 నుంచి 15 రూపాయలకు దొరుకుతోంది. మొత్తానికి సిమ్లా యాపిల్ ధరలు భారీగా తగ్గిపోవడంతో అన్ని వర్గాల ప్రజలు యాపిల్స్‌ను ఇష్టంగా కొంటున్నారు. గతంలో ధరలను చూసి కోరికను చంపుకుని వెళ్లిపోయేవాళ్లు ఇప్పుడు కిలోల కొద్ది కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు కూడా అమ్మకాలు పెరగడంతో..సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

13:25 - October 8, 2015

హైదరాబాద్ : చార్మినార్‌.. హైద‌రాబాద్‌లో మంచి ప‌ర్యాట‌క కేంద్రం. ఇప్పుడీ చార్మినారే జీహెచ్ఎంసీ అధికారుల‌కు కాసుల వర్షం కురిపిస్తుందా? కోట్లకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నా సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదా? అంటే అవున‌నే అనిపిస్తుంది. చార్మినార్‌ను జాతీయ వార‌స‌త్వ క‌ట్టడంగా గుర్తించిన కేంద్రం ఆ ప్రాంతాన్ని మ‌రింత‌గా అభివృద్ది చేయ్యాల‌ని నిర్ణయించింది. అప్పుడు మొద‌లు పెట్టిన‌ చార్మినార్ పెడ‌స్ట్రియ‌న్ ప్రాజెక్ట్ ఏళ్లు గ‌డుస్తున్నా పూర్తికావ‌డం లేదు. కానీ కోట్ల రూపాయ‌లు మాత్రం ఖ‌ర్చయి పోతున్నాయి.

400 ఏళ్ల చరిత్ర..
400 ఏళ్ళకు పైగా చ‌రిత్ర ఉన్న చార్మినార్... ఇప్పుడు ట్రాఫిక్ పొల్యూష‌న్‌తో క‌ళ‌ తప్పుతోంది. ఈ చారిత్రక క‌ట్టడం దాని ప‌రిస‌రాలు నానాటికీ దిగ‌జారుతున్నాయనే ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది. అయితే చార్మినార్ చుట్టు పక్కల‌ 100 మీట‌ర్ల పరిదిలో ఎలాంటి శ‌బ్ధకాలుష్యం లేకుండా, భారీ వాహ‌నాలు తిర‌గకుండా ఉండేందుకు అధికారులు ప్లాన్ చేశారు. చార్మినార్‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సౌల‌భ్యం కోసం 15 ఏళ్ల క్రితమే పెడ‌స్ట్రియ‌న్ ప్రాజెక్ట్‌కు రూప‌క‌ల్పన జ‌రిగింది. అప్పటి నిబంధ‌న‌ల ప్రకారం చార్మినార్‌ చుట్టుప‌క్కల ఎలాంటి కొత్త క‌ట్టడాలు జ‌రుగ‌కుండా చూడాల‌ని మున్సిప‌ల్ శాఖ‌ను ప్రభుత్వం ఆదేశించింది.

2006లో...
చార్మినార్ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల్లో భాగంగా ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో వాహ‌నాలను నిషేధించాలి. అక్కడ కేవ‌లం పాదాచారులకు ప్రత్యేక ఫుట్‌పాత్‌ను నిర్మించాలి. చార్మినార్ చుట్టూ వాట‌ర్ ఫౌంటేన్‌లు, గ్రీన్ కారిడార్, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాల‌ని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చార్మినార్‌ చుట్టుపక్కల ఇన్నర్‌ అండ్‌ ఔట‌ర్‌ రింగ్‌రోడ్‌ల‌ను అభివృద్ధి చేయాల‌ని 1999లో తొమ్మిదిన్నర కోట్ల రూపాయిల బ‌డ్జెట్‌ను కేటాయించారు. బ‌డ్డెట్ అంతా ఖ‌ర్చయిపోయింది కానీ అనుకున్న ప‌నులు మాత్రం జ‌రగ‌లేదు. మ‌రోసారి 2006లో ఓ క‌న్సల్టెన్సీ ద్వారా చార్మినార్ పెడ‌స్ట్రియ‌న్ ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ త‌యారు చేశారు. అందుకోసం 35 కోట్ల రూపాయిలు ఖ‌ర్చవుతుంద‌ని లెక్కలు వేశారు అధికారులు . ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకున్నప్పటికీ.. ఇప్పటివ‌ర‌కు పెద్దగా ప‌నులు జ‌రగ‌డం లేదు. అయితే నిధులు మాత్రం క‌రిగిపోయాయి. 

కాకి లెక్కలు..
చార్మినార్ చుట్టుప‌క్కల అభివృద్ధి కోసం ఖ‌ర్చుపెట్టిన సొమ్ములు, కాకి లెక్కలుగా ఉన్నాయ‌నే విమర్శలు వస్తున్నాయి. ఇంత వ‌ర‌కు 23 కోట్ల రూపాయిల ప‌నులు జ‌రిగిన‌ట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రోడ్డు వెడ‌ల్పు కోసం ఆస్తుల సేకర‌ణకు 10 కోట్లు న‌ష్టప‌రిహారం చెల్లించారు. 9 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం, 2 కోట్లతో చార్మినార్ చుట్టూ గ్రానైట్ ప‌రిచి చార్మినార్ ప్రాంతాన్నంతా సుంద‌రంగా మార్చామ‌ని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ అక్కడ ప‌రిస్థితి చూస్తే మాత్రం అలాంటి లుక్‌ ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్టు రూప‌క‌ల్పన చేసిన క‌న్సల్టెన్సీకి ఏకంగా 37 ల‌క్షలు ఖ‌ర్చుపెట్టడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఇంకెన్ని కోట్లు ఖ‌ర్చవుతుందో తెలియ‌డం లేదు. చార్మినార్ అభివృద్ధిని అంకెల్లో చూపించిన అధికారులు.. ప‌ర్యాట‌కుల వ‌స‌తుల‌ను మాత్రం గాలికి వ‌దిలేశారు. అక్కడికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి సౌకర్యాలు కనిపించవు. కనీసం ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని.. ఫొటోలు తీసుకోవ‌డానికి కూడా వీలు లేదు. ఇప్పటికైనా అధికారులు వేంట‌నే పెడెస్ట్రియ‌న్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాల‌ని కోరుతున్నారు హైద‌రాబాదీలు.

ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి దీక్ష విరమణ..

తిరుపతి : పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి నిరహార దీక్ష విరమించారు. విద్యార్థులు నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. టిటిడిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని రెండు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు వివిధ వర్గాల నుండి మద్దతు లభించింది. ప్రభుత్వం తీరుకు అసంతృప్తితోనే దీక్షను విరమించినట్లు ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి వెల్లడించారు. శాసనమండలి వేదికగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

 

పాతబస్తీలో సీపీఐ ఆందోళన..

హైదరాబాద్ : పాతబస్తీ ఛత్రినాకలో మెట్రో లైన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. సీపీఐ నేత నారాయణ, అజీజ్ ఫాషాతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ వైపు ప్రదర్శనగా నేతలు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

 

కేసీఆర్ ప్రజల గొంతుకలను అణుస్తున్నారు - తమ్మినేని..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గొంతుకలను అణచి వేస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మగ్ధూం భవన్ లో బంద్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 10న బంద్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. సమ్మెలపై ఉక్కుపాదం మోపుతున్నారని..ఆశా వర్కర్ల సమ్మెను అవహేళన చేస్తున్నారని..ప్రతిపక్ష సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేసి దుష్ట సంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు.

రైతాంగ సమస్యలపై అఖిలపక్షం వేయాలి - సీపీఐ..

హైదరాబాద్ : మగ్ధూం భవన్ లో బంద్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 10న బంద్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రతిపక్షాలపై దాడి ఆపి కరవు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రైతాంగ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

లోహపు బిందెలో వీడిన ఉత్కంఠ..

మహబూబ్ నగర్ : గద్వాల పట్టణంలో బయటపడిన లోహపు బిందె విషయంలో ఉత్కంఠ వీడింది. పురావస్తు, రెవెన్యూ శాఖ అధికారులు గురువారం బిందెను తెరిచారు. బిందె ఖాళీగా ఉండడంతో అధికారులు వెనుదిరిగారు. 

12:34 - October 8, 2015

జమ్మూ కాశ్మీర్ : అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ గురువారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇదంతా నిండు సభలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రషీద్ ను లాగి ఒంగోబెట్టి ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే అప్రమత్తమైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు రషీద్ కు మద్దతుగా వెళ్లి అక్కడి నుండి తీసుకెళ్లారు. ఈ దాడికి కారణం ఏమిటంటే.. శ్రీనగర్ ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికీ 'బీఫ్' పార్టీ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గో మాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రషీద్ పలు వ్యాఖ్యాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి ఆగ్రహానికి గురైన కాషాయ దళం ఆయనపై దాడికి దిగారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

 

ఏడు రోజుల్లోనే సభను ముగించారు - చింతల..

హైదరాబాద్ : పది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఏడు రోజుల్లోనే ముగించారని బీజేపీ ఎమ్మెల్యే చింతల పేర్కొన్నారు. ప్రతిపక్షాల సలహాలు పక్కన పెట్టి అహంకారపూరితంగా వ్యవహరించారని, రైతాంగ సమస్యల పట్ల సీఎం కేసీఆర్ ప్రసంగం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు.  

రైతన్నలది గొంతెమ్మ కోరికలు కాదు - టి.టిడిపి..

హైదరాబాద్ : రైతులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, తక్షణం రైతు సమస్యలు పరిష్కరించాలని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు. అధికారపక్ష దగాకోరు నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. 

బంద్ కు అందరూ సహకరించాలి - ఉత్తమ్..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఆవరణలో నిర్వహించిన అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ చీప్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పదో తేదీన తెలంగాణ బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరితే శాసనసభ నుండి సస్పెండ్ చేశారని, రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే ఒకే దఫా రుణమాపీ చేయవచ్చని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 1400 మంది రైతు కుటుంబాలను ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ ది నిరంకుశ పాలన - గాలి వినోద్ కుమార్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని వామపక్షాల ఎంపీ అభ్యర్థి గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, శృతి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పదో తేదీన బంద్ విజయవంతం చేయాలని గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

 

 

మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎస్ సమావేశం..

హైదరాబాద్ : మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం నిర్వహించారు. ధరల స్థిరీకరణపై చర్చించారు. 

దసరా తరువాత కిసన్ బచావో పేరిట ఉద్యమం - నాగం..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నాగం భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. దసరా తరువాత కిసాన్ బచావో పేరిట ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తున్న 14 మంది అరెస్టు..

హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న 14 మందిని సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

బీహార్ లో మార్పు కోరుకుంటున్నారు - మోడీ..

బీహార్ : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ముంగేర్ లో ఆయన గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, బీహార్ భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. యువత ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. యోగా ద్వారా 190 దేశాలను ముంగేరా ప్రభావితం చేయగలిగిందని తెలిపారు. 

11:50 - October 8, 2015

మహబూబ్ నగర్ : గద్వాల పట్టణంలో బుధవారం పురాతనంగా ఉన్న బిందె బయటపడింది. తేరుమైదానం సమీపంలో పాత మహారాజ కూరగాయల మార్కెట్ కూల్చివేసి నూతన మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. నూతన మార్కెట్ సమీపంలో మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. బుధవారం కాల్వ కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జేసీబీకి భారీ బిందె తగలడంతో బయటకు తీశారు. క్షణాల్లోనే ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో వేల సంఖ్యలో ప్రజలు గుమికూడారు.
బయటపడిన బిందె సుమారు బరువు వంద కిలో లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అంతేగాకుండా మూతను బోల్టులతో బిగించారు. బిందెలో పెద్ద మొత్తంలో బంగారం..వజ్ర వైఢుర్యాలు ఉంటాయని అనుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రాయల్‌ లాడ్జ్ ఉండేదని, అప్పుడు చల్లని, వేడి నీళ్ల కోసం బిందెలు ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుఎకున్న రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ, గద్వాల ఇన్‌చార్జి తహసీల్దార్ చింతామణిపటేల్ వచ్చి బిందెను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి బిందెను తరలించారు. గురువారం పురావస్తుశాఖ అధికారుల సమక్షమంలో మూత తెరిచి చూస్తామని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

11:33 - October 8, 2015

విశాఖపట్టణం : హుదూద్.. తుఫాన్ జిల్లాను ఎంత అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో జిల్లా నష్టపోయింది. ప్రజల ప్రాణాలు పోవడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కలిగింది. ఇదంతా గడిచి సంవత్సరం అయ్యింది. కానీ ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు కాలేదు. హుదూద్ తుఫాన్ విజయవంతంగా ఎదుర్కొన్నామని ఏపీ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకుంటుండడంపై వామపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏం సాధించారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర, ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. తుపాన్ భాధితులు..నేతలు..ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈసందర్భంగా టెన్ టివితో వామపక్ష నేతలు మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన హామీలు ఏమయ్యాయని, బాధితులను ఆదుకోవడం లో విజయంతమయ్యారా ? అని ప్రశ్నించారు. ఐదు వేల కోట్లను 20 శాతం వరకు మాత్రమే ఇచ్చారని, మిగిలిన వారికి ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. హుదూద్ తుపాన్ వల్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వీటిని బాగు చేసుకోవాలంటే యాభై నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన రూ.260 కోట్లకు లెక్క లేదని, ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవాల్సినవసరం ఉందని అభిప్రాయం తెలిపారు. సుమారు లక్షా 50వేల ఇళ్లు ధ్వంసమైతే కేవలం 48వేల ఇళ్లకు మాత్రమే పరిహారం ఇచ్చారని, మిగిలిన ఇళ్లను రకరకాల కారణాలతో తిరస్కరించారని పేర్కొన్నారు. తుపాన్ ను జయించానని చెప్పడం మోసగించడమే అవుతుందని, ప్రజలు ఇచ్చిన విరాళాలు కూడా పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. కరెంటు నీరు వస్తే బాగానే ఉన్నారని అనుకోవడం తప్పని, జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులు, ఏజెన్సీ రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం హుదూద్ బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

గాంధీ భవన్ లో గ్రేటర్, రంగారెడ్డి కాంగ్రెస్ నేతల భేటీ..

హైదరాబాద్ : గ్రేటర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. గ్రేటర్ లో ఓట్ల తొలగింపు, 10వ తేదీన తెలంగాణ బంద్ పై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, దానం నాగేందర్, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. 

ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ సభ్యుల దాడి..

జమ్మూ కాశ్మీర్ : స్వతంత్ర్య శాసనసభ్యుడు రషీద్ పై బీజేపీ సభ్యులు దాడికి చేశారు. పశు మాంసంతో విందు ఇచ్చినందుకు ఎమ్మెల్యే రషీద్ పై దాడి చేశారు. 

ఏకపక్షంగా భూ సేకరణ జరుగుతోంది - సీపీఎం...

అనంతపురం : రాష్ట్రంలో ఏకపక్షంగా భూ సేకరణ జరుగుతోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. సౌర విద్యుత్ వాటిక కోసం పరిహారం చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ఎకరానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, రాజధానిని సింగపూర్ కు, పోలవరాన్ని జర్మనీకి సీఎం చంద్రబాబు అప్పచెప్పారని విమర్శించారు. రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని, హంద్రీనీవా, గాలేరు, నగరి పథకాలకు వెంటనే రూ.2వేల కోట్లు విడుదల చేయాలన్నారు. అనంతలో కుద్రేముఖ్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

10:48 - October 8, 2015

నల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోను కారు ఢీకొనడంతో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. వీరందరీ పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తోంది.
కొంతమంది పత్తి కూలీలు గురువారం ఉదయం ఆటోలో వెళుతున్నారు. నార్కట్ పల్లి ప్రాంతం వద్దకు చేరుకోగానే సడెన్ గా ఆటో డ్రైవర్ బ్రేక్ వేశారు. వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీనితో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలకు గాయాయ్యాయి. వెంటనే వీరిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కానీ ఓ వృద్ధుడు కాలి మాత్రం విరిగింది. 

10:36 - October 8, 2015

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి..తాము రాజధానికి వ్యతిరేకం కాదు..కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి..అంటూ వామపక్షాలు చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం, ఇతర వామపక్ష నేతలను అరెస్టు చేశారు.

29 గ్రామాల్లో పాదయాత్ర..
రాజధాని ప్రాంతంలో నెలకొన్న సమస్యలను శంకుస్థాపన లోపల పరిష్కరించాలని, ఏయే సమస్యలు నెలకొన్నాయో తెలుసుకొనేందుకు సీపీఎం, ఇతర వామపక్షాలు పాదయాత్ర చేపట్టాయి. 29 గ్రామాల్లో 120 కిలో మీటర్ల పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అనంతరం 13వ తేదీన తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించడం జరుగుతుందని రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు పాదయాత్ర ప్రారంభంలో తెలిపారు.

తుళ్లూరులో పాదయాత్ర..
అందులో భాగంగా గురువారం తుళ్లూరులో పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వ్యాన్ లలో పడేశారు. తమ గొంతు ఎందుకు నొక్కుతున్నారని ప్రశ్నించారు. కళా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులను కూడా పోలీసులు వదలలేదు. వారిని కూడా వ్యాన్ లలో పడేశారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వామపక్ష నేతలు తీవ్రంగా ఎండగట్టారు. 

మేం ఏ తప్పు చేశాం - బాబురావు..
పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు. పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, శాంతియుతంగా పాదయాత్ర జరుగుతోందన్నారు. కానీ పోలీసులు అడ్డుతగులుతున్నారని, సమస్యలు పట్టించుకోకుండా ప్రజల భాగస్వామ్యం అంటే ఇదేనా ? మాట్లాడే హక్కు లేదా ? ప్రశాంతంగా రోడ్డుపై పాదయాత్ర చేపట్టే అవకాశం లేదా ? మేం ఏం నేరం చేశాం అని ప్రశ్నించారు. గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తోంది, రాజధాని ప్రాంతంలోనే పేదలకు పని చూపాలని సి.హెచ్.బాబురావు డిమాండ్ చేశారు. 

సీపీఎం నేత బాబురావు అరెస్టు..

గుంటూరు : తుళ్లూరులో వామపక్షాలు చేపట్టిన రాజధాని ప్రజా చైతన్య యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు, ఇతర వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

తుళ్లూరులో ఉద్రిక్తత..

గుంటూరు : వామపక్షాలు చేపట్టిన రాజధాని ప్రజా చైతన్య యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేపడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకున్నా తాము పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. 

10:08 - October 8, 2015

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరవధిక దీక్షపై టిడిపి మంత్రులు, నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిణలు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్రస్థాయిలో జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఒక సైకో..ఫ్యాక్షనిస్టు..పిచ్చివాడంటూ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమౌతుందని, అనంతరం అభివృద్ధి బాటలో ఏపీ రాష్ట్రం పరుగులు పెడుతుందనే భయం జగన్ లో నెలకొందన్నారు. అందుకని జగన్ కు పిచ్చిపట్టి..మతిభ్రమించిందని విమర్శించారు. కపటనాటకాలు..అరాచకవాదిగా..ఫ్యాక్షనిస్టుగా జగన్ ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ దొంగ దీక్షలు చేపడుతున్నారని మంత్రి రావెల తెలిపారు. రావెల చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఏ స్థాయిలో స్పందిస్తుందో వేచి చూడాలి. 

సుకుమా జిల్లాలో కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో గురువారం ఉదయం పోలీసులకు - మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

బీహార్ లో మోడీ పర్యటన..

బీహార్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు, రేపు జరిగే ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. 

నల్గొండ రోడ్డు ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య..

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. 15 మంది గాయాలయ పాలయ్యారు.

పోస్టర్ ప్రీ క్యాంపెయిన్ లో పాల్గొన్న మంత్రి నారాయణ..

విజయవాడ : స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గురువారం పోస్టర్ ప్రీ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 2019 కల్లా రాష్ట్రంలో మరుగుదొడ్లు నిర్మించి తీరుతామని, బెజవాడను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.

 

కాసేపట్లో తెలంగాణ విపక్ష నేతల సమావేశం..

హైదరాబాద్ : కాసేపట్లో శాసనసభ ఆవరణలో తెలంగాణ విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పదో తేదీన బంద్ కార్యాచరణపై చర్చ జరుగనుంది. 

09:24 - October 8, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాకోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. గుంటూరు జిల్లా నల్లపాడులో జగన్‌కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నాయని జగన్‌ ఆరోపించారు.
తొలి రోజు పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ ప్రముఖులు వచ్చి మద్దతు తెలిపారు. స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు దీక్షా ప్రాంగణానికి నేడు రానున్నాయి. ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు పరిశ్రమలు వస్తాయని నమ్ముతామని పలువురు పేర్కొంటున్నారు. పార్టీలతో సంబంధం లేని వారు కూడా జగన్ వద్దకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు జగన్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి స్పష్టమైన హామీనిచ్చే వరకు పోరాటం చేయాలని వైసీపీ భావిస్తోంది.
బుధవారం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న జగన్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులోని దీక్షా వేదికకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.25 నిమిషాలకు దీక్షను ప్రారంభించారు.

09:21 - October 8, 2015

హైదరాబాద్ : తెలంగాణభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ కన్వీనర్ లు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. మార్కెట్ , దేవాలయ కమిటీల నియామకంపై భేటీలో చర్చ జరగనుంది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశ‌పెట్టిన గులాబీ పార్టీ....రిజ‌ర్వేషన్ లకు అనుగుణంగా ప‌ద‌వులు భ‌ర్తీ చేసేందుకు పావులు క‌దుపుతోంది. అయితే నామినేటెడ్ ప‌ద‌వుల‌పై మాత్రం జిల్లాల్లో పార్టీనేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు.

ప్రజల్లోకి..
ప్రాజెక్టుల రీడిజైన్ పై అసెంబ్లీ సమావేశంలోనే సభ్యులందరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినా... విపక్షాలు సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో ఈ సమావేశంలో.. ప్రాజెక్టులపై పార్టీ నేతలందరికి వివరించే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి పర్యటనలు చేయాల‌ని నిర్ణయం తీసుకున్న నేప‌థ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, రైతుల్లో భరోసా నింపేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయ‌నున్నారు.

పార్టీ పటిష్టతపై దృష్టి..
మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యకలాపాల పైనే దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇక పార్టీ పటిష్టత పైనా దృష్టి సారించనున్నారు. పార్టీ క‌మిటీల నియామ‌కాన్ని ఈ నెలాఖ‌రులోపు పూర్తి చేయాల‌ని భావిస్తున్నట్టు స‌మాచారం. ఉద్యమంలో చురుగ్గా ప‌నిచేసిన వారికి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌ల‌కు ప‌ద‌వుల‌తో గుర్తింపు నివ్వాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిపింది. రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో అర్హులైన వారికి పెద్ద పీట వేస్తారని తెలుస్తోంది.

ఉప ఎన్నికపై దృష్టి..
త్వరలో వ‌రంగ‌ల్ పార్లమెంట్, నారాయణ్ ఖేడ్ శాస‌న‌స‌భ‌కు ఉపఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ఈ స్థానాలపై టీఆర్ఎస్ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే విప‌క్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు.. ధీటైన స‌మాధానం ఇచ్చేలా గులాబీ నేతలను సిద్ధం చేసేందుకే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.    

హిమాచల్ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో గురువారం ఉదయం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదైంది. ఎలాంటి ఆస్తి..ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. 

యూపీలో ఘనంగా 83వ ఎయిర్ పోర్స్ వార్షికోత్సవం..

ఉత్తర్ ప్రదేశ్ : 83వ ఎయిర్ పోర్స్ వార్షికోత్సవం సందర్భంగా హిందోన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నేవీ చీఫ్ ఆర్కే ధావన్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ లు పాల్గొన్నారు.

కృష్ణగిరి జలాశయం నుండి నేడు నీరు విడుదల..

కర్నూలు : కృష్ణ గిరి జలాశయం నుండి హంద్రీ నీవా నీరు విడుదల కానుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

నిర్మాలా సీతారామన్ తో భేటీ కానున్న ప్రత్తిపాటి..

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ తో ఏపీ మంత్రి ప్రత్తిపాటి భేటీ కానున్నారు. 

ఖమ్మంలో ఒప్పంద పారిశుధ్య కార్మికుల ఆందోళన..

ఖమ్మం : జిల్లాలో ఒప్పంద పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గుత్తేదారు వేధిస్తున్నారంటూ నగర పాలక సంస్థ భవనంపైకి ఎక్కి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

08:38 - October 8, 2015

ఆర్టీసీకి ఎన్నో లాభదాయక మార్గాలున్నాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిపై సవాల్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదని..ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో రాకుండా ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో తెలంగాణలో రోడ్డు ప్రమాదం..ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ చర్యలేవీ ?
''శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత తుఫాన్ లను ముందే ఊహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రజలకు అవగాహన లేదు. పరీక్షలు అంతంతమాత్రమే ఉంటాయి. పద్ధతి ప్రకారం నేర్చుకుంటే అడ్డగోలు పరీక్షలు పెడుతారు. బ్రోకర్ల ద్వారా వెళితే ఏముండవు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే దగ్గర కఠిన నిబంధనలున్నాయి. అమెరికాలో ట్రాఫిక్ లో రూల్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొన్ని కఠిన చర్యలు ఉంటాయి. ట్రాఫిక్ వయోలిన్స్ కు ఎలాంటి శిక్షలు లేవు. యాక్సిడెంట్ లో ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన సందర్భాలున్నాయా ? రోడ్డు డిజైన్ లో లోపాలుంటున్నాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఇదే కారణం. మూల మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ లేదా ఒక బోర్డు పెడితే బాగుండే కదా ? హైవే దగ్గర ప్రాపర్ డైరెక్షన్స్ ఉండవు. అంబులెన్స్ సర్వీసు ఉండదు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై నిఘా ఉండదు. ప్రమాదాలలో ప్రైవేటు ట్రావెల్స్ అధికంగా ఉంటున్నాయి. అమెరికాలో జాతీయ రహదారి పొడుగునా బై పాస్ రోడ్లు ఉంటాయి. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. జాతీయ రహదారిపై హెలీ అంబులెన్స్ లు ఉంటాయి. ఇక్కడ కూడా పార్కింగ్ ప్లేస్..టాయిలెట్స్..రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలి.

ఆర్టీసీ ఛార్జీలు పెంచక్కర్లేదు..
ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే అంత కన్నా తెలివి తక్కువతనం ఏదీ ఉండదు. ఛార్జీలు పెంచితే ఆక్యుపెన్సీ రేటు పడిపోతుంది. నష్టాలు వచ్చే వాటిపై కూడా పన్నులు విధిస్తున్నారు. అదనంగా వచ్చే మార్గాలున్నాయి. ల్యాండ్, బిల్డింగ్స్ లున్నాయి. కమర్షియల్ గా డెవలప్ మెంట్ చేస్తే ఆదాయాలు సంపాదించవచ్చు. వస్తు ట్రాన్స్ పోర్టుకు వాడండి. మంగళగిరిలో టైర్ల ప్యాక్టరీ కట్టాలని ఎన్టీఆర్ ఉన్న హాయాంలో నిర్ణయించారు. సొంత టైర్ల పరిశ్రమ పెట్టుకుంటే లాభం వస్తుంది కదా ? ప్రైవేటు వారి దగ్గర టైర్లు కొంటే కమిషన్లు వస్తాయి. ఆర్టీసీ ఎందుకు పెట్రోల్ బంక్ లు నిర్వాహణ ఎందుకు చేయడం లేదు. డీలర్ కమిషన్ గుర్తించి కమిషన్ ఎందుకు ఇవ్వరు ? ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు సంస్థలకు అధిపతులుగా అధికార పార్టీకి చెందిన నేతలు ఉంటే ఆర్టీసీకి ఎలా న్యాయం జరుగుతుంది. నిజాయితీ గల రాజకీయతత్వం..చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అవుతుంది'. అని పేర్కొన్నారు. అలాగే నేపాల్ లో నెలకొన్న పరిస్థితిపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. 

08:31 - October 8, 2015

హైదరాబాద్ : సునాయసంగా డబ్బులు సంపాదించాలని కొందరు దొంగలు అనుకున్నారు. ఇందుకు బ్యాంకు ఏటీఎంలో ఉండే డబ్బులను చోరీ చేయాలని యత్నించారు. ఇందుకు నగర శివారు ప్రాంతంలో ఉన్న ఏటీఎంలను ఎంచుకున్నారు. పథకం ప్రకారం వెళ్లారు. కానీ ఏటీఎం మాత్రం తెరుచుకోలేదు.. మరో బ్యాంకు ఏటీఎం ను ట్రై చేశారు. అది కూడా తెర్చుకోలేదు. చివరకు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. ఈఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వనస్థలిపురంరలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంకు ఏటీఎంలున్నాయి. అక్కడ సెక్యూర్టీ లేకపోవడంతో పని సులువు అవుతుందని భావించి బుధవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తెచ్చుకున్న సరాంజామాతో ట్రై చేశారు. కానీ ఆ ఏటీఎంలు తెర్చుకోలేదు. దీని చిర్రెత్తుకొచ్చిన దొంగలు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేశారు. కానీ అవి మాత్రం తెర్చుకోలేదు. లాభం లేదనుకొని ఖాళీ చేతులతో వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.

08:28 - October 8, 2015

ఊహించినట్టే జరిగింది. నిర్దేశిత తేదీ కంటే రెండు రోజుల ముందే తెలంగాణ శాసనసభ, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 23వ తేదీన ప్రారంభమైన శాసనసభా సమావేశాలు ఏడు రోజులు మాత్రమే కొనసాగాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ నిరహార దీక్ష చేపట్టారు. దీనిపై టిడిపి విమర్శల వర్షం కురిపిస్తోంది. దీక్షలు చేయాల్సింది ఏపీలో కాదని..ఢిల్లీలో అని పేర్కొంటోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (ఎడిటర్, నవ తెలంగాణ), సతీష్ మాదిగ (టిడిపి), ఎర్రోళ్ల శ్రీనివాస్ (టీఆర్ఎస్), లక్ష్మీపార్వతి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

07:58 - October 8, 2015

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 22న రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా రాజధాని పేరిట ఒక చిహ్నాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ బాధ్యతను ప్రజలకే అప్పగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చిహ్నానికి సంబంధించిన డిజైన్లకు నమూనాలను ఆర్టిస్టులు, డిజైనర్ల నుంచి సీఆర్‌డీఏ ఆహ్వానించింది. ఎవరైనా వాటిని సీఆర్డీయేకు నేరుగా లేదా www.crda.ap.gov.in పంపించాల్సి ఉంటుంది. ఈ లోగోల సమర్పణకు తుది గడువు ఈనెల 15. గడువులోగా అందిన ఎంట్రీలను 23 మందితో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. వీటిని ప్రజల పరిశీలనకు ఉంచుతారు. ప్రజాభిప్రాయాలను సేకరించి, అత్యధికులు ఎంపిక చేసిన దానిని అమరావతి అధికారిక చిహ్నంగా ప్రకటిస్తారు. ఉత్తమంగా ఉన్న మూడింటిని ఎంపిక చేస్తుంది. అత్యుత్తమ చిహ్నాన్ని రూపొందించిన మొదటి ముగ్గురికి రూ. లక్ష, రూ.50వేలు, రూ.25వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
లోగో రూపకల్పనలో కీలక అంశాలు : అమరావతి సాంస్కృతిక వారసత్వం, కృష్ణానది, ఉదయించే సూర్యుడు, ప్రపంచస్థాయి రాజధాని నగరం, ప్రజా రాజధాని, లివబుల్‌ సిటీ తదితర అంశాలు లోగోల్లో ప్రతిబింబించాలి. రాజధాని ప్రాంతంలో పండే పంటలు..గల గల పారే కృష్ణమ్మ..ప్రజల ప్రపంచస్థాయి రాజధాని,ప్రజల జీవన నగరం తదితర అంశాలతో ఆకర్షణీయ రంగులతో చిహాన్ని తీర్చిదిద్దాలి. 

బీహార్ నాలుగు ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ..

బీహార్ : భారత ప్రధాన మంత్రి నేడు బీహార్ లో పర్యటించనున్నారు. ఏకంగా నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. 

07:37 - October 8, 2015

టి-20 సిరీస్ లో ఫెవరేట్ గా బరిలోకి దగిన టీమ్ ఇండియా ఇప్పుడు సొంతగడ్డపై పరువు పరీక్ష ఎదుర్కొంటోంది.  నేడు చివరి టి20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో 0-2తో సఫారీలకు సిరీస్ ను కోల్పోయిన ధోనిసేన నామమాత్రమైన మూడో మ్యాచ్ లోనైనా విజయం సాధించి ఊరట చెందాలని ఆరాటపడుతోంది. కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన మహేంద్ర సింగ్ ధోని ఈడెన్ లో తనేంటో నిరూపించుకోవాల్సి ఉంది. ఓటమితో ఇప్పటికే అభిమానుల ఆగ్రహానికి గురైన టీమ్ ఇండియా..తక్షణ కర్తవ్యంగా కోల్ కతా టి20లో నెగ్గితే విమర్శలకు చెక్ పట్టవచ్చు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్ లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ సాధించాలని పథకం రచిస్తోంది.

పిచ్‌, వాతావరణం..
ఈడెన్‌ గార్డెన్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమమని క్యాబ్‌ కార్యదర్శి సౌరవ్‌ గంగూలీ (అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నిక కావాల్సి వుంది), క్యూరేటర్‌ ప్రబీర్‌ ముఖర్జీ తెలిపారు. కోల్‌కతలో నేడు అధిక ఉష్ణోగ్రత నమోదు కానుండటంతో పాటు ఉక్కపోత సైతం ఉండనుంది. సాయంత్రం వేళ ఈడెన్‌లో చిరు జల్లులు కురిసే అవకాశం సైతం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్‌ సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌కు ప్రేక్షకుల హాజరు అంతంతమాత్రంగానే ఉండనుంది.

సుదీర్ఘ సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమ్‌ ఇండియా వన్డే సిరీస్‌ నేపథ్యంలోనైనా ఈడెన్‌ గార్డెన్స్‌లో నెగ్గాల్సిందే. టి20 సిరీస్‌లో ఊరట కోసం పరితపిస్తున్న ధోనిసేనకు ఈడెన్‌లో ఉపశమనం లభిస్తుందా? కీలక వన్డే సిరీస్‌కు ముందు స్పూర్తిదాయక విజయం సాధించి పరువైనా నిలుపుకుంటారా. ? లేదా చూడాలి.పరువు కోసం...

07:25 - October 8, 2015

వాషింగ్టన్‌ : అమెరికాలో సగటు జన జీవితాలకు పెనుముప్పుగా తయారైన గుండె జబ్బుల నుంచి కాపాడుకునేందుకు ప్రతి రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలంటూ ఇంత వరకు వైద్యులు చెబుతూ వచ్చిన వైద్యులు ఇకపై మరింత కఠిన వ్యాయామం సిఫార్సు చేయాలేమో! జర్నల్‌ సర్క్యులేషన్‌ తాజా సంచిక ప్రకారం 3లక్షల 70 వేల మందికి పైగా స్త్రీ, పురుషుల వ్యాయామ కాలపరిమితిని ఆధారం చేసుకుని 15 ఏళ్ల వ్యవధిలో 12 అధ్యయనాలలో తేలిన విషయాల ప్రకారం కేవలం అరగంట వ్యాయామం వల్ల గుండెకు పూర్తి భద్రత లభించదని నిర్ధారణ అయింది. 30 నిముషాలపాటు శారీరక శ్రమ చేస్తున్న వారిలో గుండె పోటు ప్రమాదం ఓ మోస్తరు స్థాయి వరకే తగ్గుముఖం పట్టింది. అంతకు రెట్టింపు లేదా నాలుగు రెట్లు అధికంగా వ్యాయామం చేసిన వారిలో గణనీయంగా అంటే 20 శాతం నుంచి 35 శాతం వరకు తగ్గుదలను సూచించింది. వారి అధ్యయనం ప్రకారం ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత ఎక్కువ గుండె భద్రంగా ఉంటుంది. అందువల్ల గుండె పోటు ప్రమాదం అంచుల్లో ఉన్న వాళ్లు, చక్కెర వ్యాధిగ్రస్థులు ఇక నుంచి వైద్యుల సలహా తీసుకుని మరింత ఎక్కువ సేపు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

07:20 - October 8, 2015

సిమ్రాన్‌.. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథనాయకులతో నటించి ఓ ఊపు ఊపేసిన స్టార్‌ హీరోయిన్‌. పెళ్ళి చేసుకున్న తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. తాజాగా విడుదలైన 'త్రిష ఇల్లాన నయనతార' చిత్రంలో మెరిసిన సిమ్రాన్‌ ఇప్పుడు హీరోయిన్‌గా నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అంతేకాదు పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు భర్త సహకారంతో సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ని కూడా స్థాపించింది. తొలి ప్రయత్నంలో భాగంగా ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని ఎంపిక చేసుకుంది. బాలీవుడ్‌లో రాణీముఖర్జీ నటించిన 'మర్దానీ' సినిమా తరహాలో పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుందట. డబుల్‌ రోల్‌లో సిమ్రాన్‌ అలరించనున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు నవంబర్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రానికి గౌరీశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

07:17 - October 8, 2015

మంచు మనోజ్‌, సురభి జంటగా శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ సమర్పణలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'రామ్‌గోపాల్‌ వర్మ' దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎటాక్‌' ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. రామ్‌గోపాల్‌ వర్మ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రక్త చరిత్ర' తర్వాత హైజెనిటిక్‌ యాక్షన్‌ ఉన్న సినిమాలు తీయలేదని, క్రైమ్‌, హర్రర్‌ జోనర్‌లో రెడ్‌ కెమెరా అంటూ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తున్న తనకు ఓ కాపీ షాపులో సి.కళ్యాణ్‌ జ్ఞానోదయం చేశారన్నారు. ఆ జోనర్‌లోంచి మళ్ళీ ట్రాక్‌లో పడేలా చేశారని, ఇదొక పూర్తి స్థాయి రియలిస్టిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పుకొచ్చారు. మనోజ్‌ మొదటి సారి ఒక రియలిస్టిక్‌ పాత్రలో బాగా చేసినట్లు, అలాగే జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌ లాంటి సీనియర్‌ నటుల నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందన్నారు. మొదటిసారి ఒక డిఫరెంట్‌ పాత్రలో నటించానని, చాలా కొత్త అనుభూతినిచ్చిందని మనోజ్ పేర్కొన్నారు. వర్మ నాలోని కొత్త యాంగిల్‌ను బయటికి తీసినట్లు తెలిపారు. నవంబర్‌ మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని నిర్మాత సి.కళ్యాణ్‌ తెలిపారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటలు..నడకదారి భక్తుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. 

వనస్థలిపురం ఎస్ఐబి బ్యాంకు ఏటీఎం చోరీకి యత్నం..

హైదరాబాద్ : వనస్థలిపురం సౌత్ ఇండియన్ బ్యాంకు ఏస్ బీఐ ఏటీఎంల్లో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. 

07:05 - October 8, 2015

ఢిల్లీ : భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై ఐఎంఎఫ్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా కనిపిస్తున్నా.. సంస్కరణలు అమలు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో కీలకమైన ఎనర్జీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో రీఫామ్స్ సరిగా జరగడం లేదని పెదవి విరిచింది.

వృద్ధి రేటు తగ్గింపు..
అంతర్జాతీయ పరిస్థితులతో భారత్ ఆశాజనకంగా కనిపిస్తోందని కితాబిస్తూనే... వృద్ధి రేటును స్వల్పంగా తగ్గించింది. 2015లో గ్రోత్ రేటు 7.5శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. కేంద్రం మాత్రం 7.6 శాతం అంచనా వేయగా... రిజర్వ్ బ్యాంక్ 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2016లో మాత్రం వృద్ధి రేటు అంచనా 7.5 శాతమని అంచనా వేసింది. అయితే చైనా కంటే భారత్ మెరుగైన స్థాయిలో ఉంది. డ్రాగన్ గ్రోత్ రేటు 6.3 శాతం కంటే ఎక్కువ ఉండబోదని తెలిపింది.

అదుపులో ద్రవ్యోల్బణం..
భారత వృద్ధి రేటును స్వల్పంగా తగ్గించినా... ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోందని ఐఎంఎఫ్ సంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురుతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతుండటం భారత్ కు ఆశాజనక సంకేతాలుగా ప్రకటించింది. దీంతో భారత్ లో ద్రవ్యోల్బణం నియంత్రణ ఇంకా సులభతరం కానుందని అంచనావేసింది. మరో వైపు ఎకానమీకి బూస్ట్ నిచ్చేలా ఆర్బీఐ రెపోరేటును అరశాతం తగ్గించడం కూడా సానుకూల ప్రకటనగా పేర్కొంది. ఈ పరిణామం.. పారిశ్రామిక రంగానికి ఊతమివ్వడంతో పాటు... ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని కూడా అంచనావేసింది. మరోవైపు ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు విషయంలో అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. 2015లో ఈ రేటు 3.1 శాతం ఉంటుందని పేర్కొంది.

వృద్ధి రేటు కోతకు పలు కారణాలు..
2015 జూలైలో అంచనా వేసిన 3.3 శాతం రేటు కన్నా 0.2 శాతం తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో రికవరీ నెమ్మదిగా ఉండడం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, క్రూడ్ ధరల తగ్గుదలతో చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. 2016లో మాత్రం గ్రోత్ రేటు స్వల్పంగా పెరిగి 3.6 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 

06:48 - October 8, 2015

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఇవాళ హైదరాబాద్‌ లో మహాగర్జన నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలోనే వున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల మహాగర్జన లక్ష్యం ఏమిటి? ప్రభుత్వం ముందు ఏయే డిమాండ్స్ పెడుతున్నారు? వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ రెగ్యులర్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరికి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత కదరి బలరామ్‌ విశ్లేషించారు.

06:46 - October 8, 2015

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బాధలు వర్ణణాతీతం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గతకొంతకాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న జేఏసీ ఇవాళ ఇందిరాపార్క్‌ దగ్గర మహాగర్జనకు సిద్ధమవుతోంది ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా పాల్గొంటున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలోనూ, సీజన్‌ మారినప్పుడల్లా విరుచుకుపడే భయంకర వ్యాధుల బారి నుంచి గ్రామీణులను కాపాడడంలో పీహెచ్‌సీల పాత్రే కీలకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1978లో చేసిన తీర్మానం ప్రకారం అనేక దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్‌తో పాటు 14 రకాల పేరామెడికల్‌ సిబ్బంది పీహెచ్‌సీలలో తమ సేవలందిస్తారు. ఒక్కొక్క పీహెచ్‌సీ కి అనుబంధంగా నాలుగు నుంచి ఆరు సబ్‌ సెంటర్స్‌ వుంటాయి. ఎన్నో ఉన్నతాశయాలతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను కొన్నేళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నతీరు ఆందోళనకలిగిస్తోంది.


పీహెచ్ సీపై నిర్లక్ష్యం..
నిమ్స్, ఎయిమ్స్ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల గురించి తరచూ స్టేట్‌మెంట్లు ఇచ్చే ప్రభుత్వాలు సామాన్యుడికి అందుబాటులో వుండాల్సిన పీహెచ్‌సీలను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. మౌలిక వసతులు, కనీస సదుపాయాలు, అత్యవసర మందులు లేక అనేక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మంచాన పడుతున్నాయి. ఐరన్‌ ఫోలిక మాత్రలు బీ కాంప్లెక్స్ ఇంజక్షన్‌లు తప్ప మరేమీ దొరకని దీనస్థితి అనేక పీహెచ్‌సీలలో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాటికీ కటకటే. పురుటి నొప్పులతో అవస్థపడుతున్న నిండు గర్భిణీలకైనా బెడ్స్‌ లేని దీనస్థితి అనేక పీహెచ్‌సీలలో కనిపిస్తుంది. శస్త్ర చికిత్స చేయించుకున్నవారిని నేలమీదనే పడుకోబెట్టాల్సిన దయనీయ స్థితి. పీహెచ్‌సీల పరిస్థితి ఇంత ఘోరంగా వున్నా వాటిని చక్కదిద్దేందుకు, నిధుల కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధపెట్టకపోవడం అత్యంత బాధాకరం.

పోస్టుల భర్తీ ఎప్పుడు..
పీహెచ్‌సీల నిర్వహణను అశ్రద్ధ చేస్తున్న ప్రభుత్వాలు సిబ్బంది నియామకాల్లోనూ అంతులేని అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కోటానుకోట్ల మంది ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య కేంద్రాల్లో పర్మినెంట్‌ సిబ్బందిని నియమించడానికి మన ప్రభుత్వాలకు మనసొప్పడం లేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే ప్రాథమిక ఆరోగ్య సేవలను నెట్టుకొస్తున్నారు. పది పదిహేనేళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సేవలందిస్తున్నవారు వైద్య ఆరోగ్యశాఖలో ఎందరో వున్నారు. వీరి ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామంటూ ఎన్నికల సమయంలో అంతా వాగ్ధానం చేసినవారే. బడా కార్పొరేట్‌ సంస్థలకు ఏటా లక్షలాది కోట్ల రూపాయల రాయితీలిచ్చే ప్రభుత్వాలు పీహెచ్‌సీలకు నిధులివ్వాలన్నా, సరిపడ సిబ్బందిని నియమించాలన్నా, వారికి సక్రమంగా జీతాలివ్వాలన్నా బీదమాటలు మాట్లాడుతున్నాయి. తామేదో దయార్ధ్ర హృదయంతో ఉత్తపుణ్యానికి ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు గుండెలు బాదుకుంటున్నాయి. పీహెచ్‌సీలకు అవసరమైన మందులు సరఫరా చేయడానికీ, అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రిగ్యులరైజ్‌ చేయడానికి ఉత్సాహం చూపడం లేదు.

లోప భూయిష్టమైన పద్ధతిని సవరించుకోవాలి..
వైద్య ఆరోగ్య శాఖలో పదివేల మందిని కాంట్రాక్ట్ పద్ధతిని నియమించడం గత ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల ప్రదర్శించిన నిర్లప్తతకు నిదర్శనం. ఎవరైనా ఉద్యోగ భద్రత వున్నప్పుడు, తాము చేస్తున్న పనికి న్యాయమైన వేతనం లభించినప్పుడే మనస్పూర్తిగా పనిచేయగలరు. వైద్య ఆరోగ్య సేవలు అత్యంత ఓర్పుతోనూ, సహనంతోనూ నిర్వర్తించాల్సిన విధి. ఏ విధమైన మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడే ఇలాంటి బృహత్తర బాధ్యత నిర్వర్తించడం సాధ్యమవుతుంది. కానీ కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వం ఏదైనా ఈ స్పృహే లోపిస్తోంది. ఎంతో బాధ్యతగానూ, నిబద్దతతోనూ నిర్వర్తించాల్సిన వైద్య ఆరోగ్య సేవల విషయంలో కాంట్రాక్ట్‌ విధానం ప్రవేశపెట్టి ఇటు సిబ్బందినీ, అటు రోగులనూ అన్యాయం చేస్తున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వాలు ఇప్పటిదాకా అనుసరించిన లోప భూయిష్ట విధానాలను సరిదిద్దుకోవాలి. సిబ్బంది పట్ల తాము బాధ్యతగా వ్యవహరిస్తూ, వారు రోగులకు జవాబుదారీగా వ్యవహరించేలా చూడాలి. ఇలాంటి పవిత్ర కర్తవ్యాన్ని గాలికొదిలేసి, తక్కువ జీతాలతో సిబ్బందిని అవస్థపెట్టడం, రోగులకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన సేవలు అందకుండా ప్రవర్తించడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. 

06:42 - October 8, 2015

ఢిల్లీ : పెచ్చుమీరుతున్న మతతత్వ శక్తుల ఆగడాలపై కలం యోధులు కలత చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన అరుదైన పురస్కారాలను సైతం తిప్పి పంపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నయన తార సెహెగల్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును వెనక్కి పంపగా మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా అదే బాటను ఎంచుకున్నారు. దేశంలో పెచ్చరిల్లుతున్న మత విద్వేష రాజకీయాలపై నిరసనలు హోరెత్తుతున్నాయి. శంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై నయనతార తీవ్రంగా కలత చెందారు. హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసిన నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, కల్బుర్గి హత్యలు జరగడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యుదయ వాదులను హత్య చేస్తున్నా వారిని నిరోధించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆమె మండిపడ్డారు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందువల్లే తానీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు సెహెగల్‌ పేర్కొన్నారు.

నెహ్రూ మేనకోడలు..
అలహాబాద్‌లో జన్మించిన 88 ఏళ్ల నయనతార సెహెగల్ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌ కూతురు. నెహ్రూకు సెహగల్‌ మేనకోడలు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడడం గమనార్హం. పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. ఆంగ్ర నవల 'రిచ్‌ లైక్‌ అజ్' గాను 1986లో సెహెగల్‌కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

దాద్రి ఘటన కలిచి వేసిందన్న వాజ్ పేయి..
దాద్రీ ఘటనపై ప్రధాని మోడీ తీరుకు నిరసనగా మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించారు. మనకి మంచి వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఉన్నారు గానీ... రచయితలు, అమాయక ప్రజలు హత్యకు గురవుతుంటే మౌనంగా ఉండం సబబు కాదన్నారు. తన సహచర మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తుంటే ప్రధాని మోదీ వాళ్ల నోర్లు ఎందుకు మూయించలేకపోతున్నారని ప్రశ్నించారు. దాద్రీ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. లలిత కళా అకాడమి మాజీ చైర్మన్‌గా పనిచేసిన 74 ఏళ్ల అశోక్‌ వాజ్‌పేయికి 1994లో సాహిత్య అకాడమి అవార్డు వరించింది. మోది ప్రభుత్వ తీరుకు నిరసనగా మరో హిందీ రచయిత ఉదయ్‌ ప్రకాశ్ కూడా తనకిచ్చిన అవార్డును వెనక్కి పంపారు. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరిపోవడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

06:36 - October 8, 2015

బీహార్ : ఎన్నికల సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని సూటు బూటు మనిషంటూ ప్రస్తావించారు. తాము 15 లక్షల మోడీ సూటును పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ప్రధాని అమెరికాలో సూటు వేసుకోలేదని, ఇందుకు బదులు ఒకే రోజులో 16 డ్రెస్సులు మార్చారన్నారు. సూటు బూటు వ్యక్తుల వెంట తిరిగే మోడీ కావాలో, ప్రజల మధ్యకు వెళ్లి సీదా సాదాగా ఉండే నితీష్‌కుమార్‌ కావాలో తేల్చుకోవాలన్నారు. మోడీకి హామీలివ్వడం అలవాటుగా మారిందని, గత లోక్‌సభ ఎన్నికల్లో నల్లధనం, యువతకు ఉపాధి హామీలు ప్రధాని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. బీహార్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. ప్రధానికి పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం పట్టదని, కార్పోరేట్ల మేలు కోసమే పనిచేస్తున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. 

06:34 - October 8, 2015

బీహార్ : నితీష్‌-లాలూల పాతికేళ్ల పాలనలో బీహార్‌ ఎలాంటి అభివృద్ధి సాధించలేదని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ఆరోపించారు. గ్రామాల్లో విద్యుత్‌, రోడ్లు, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో బీహార్‌కు ఒరిగిందేమీ లేదన్నారు. 'కాంగ్రెస్‌-లాలూ, నితీష్‌లకు అవకాశమిచ్చారు. బిజెపికి ఐదేళ్ల అవకాశమివ్వండి... దేశంలోనే బీహార్‌ను నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం' అని సూర్యగర్ధ ఎన్నికల సభలో అమిత్‌షా పేర్కొన్నారు.

06:32 - October 8, 2015

విశాఖపట్టణం : ఓ పక్క విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్‌నకు గురైన ప్రజాప్రతినిధులు ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. మరోపక్క ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు రైతులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు విభిన్న ఘటనల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది.

ముగ్గురు రైతులను విడిచిపెట్టిన మావోయిస్టులు..
ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల గ్రామంలో అపహరణకు గురైన ముగ్గురు రైతుల కథ సుఖాంతమైంది. ముత్తయ్య, రాజశేఖర్‌, కన్నారావులను మావోయిస్టులు సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్‌..
ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్‌నకు గురైన టీడీపీ నేతల కుటుంబసభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని మావోయిస్టులు హెచ్చరించిన నేపథ్యంలో.. మహేష్‌, బాలయ్య పడాల్‌, వంగల బాలయ్యల కుటుంబ సభ్యులు ఏ క్షణాన ఏం జరుగుతోందనని భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమవారిని విడిపించేందుకు చర్యలు చేపట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. మరోవైపు గిరిజనసంఘాల నేతలు మావోయిస్టులతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని విశాఖ రూరల్‌ ఎస్పీ ప్రవీణ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఏజెన్సీలోకి 10 కిలోమీటర్ల మేర ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వెళ్లినా మావోయిస్టులు కనిపించకపోవడంతో.. టీడీపీ నేతల కిడ్నాప్‌పై ఆందోళన కొనసాగుతూనే ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌...
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. జగదల్‌పూర్‌ జిల్లా దర్బాఘాట్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఓవైపు ప్రజాప్రతినిధుల కిడ్నాప్‌లు, మరోవైపు ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

06:28 - October 8, 2015

హైదరాబాద్ : వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సమగ్ర జల విధానం సమావేశానికి తెలంగాణ సర్కార్‌ ఎట్టకేలకు మూహుర్తం ఖరారు చేసింది. ఈనెల 15న హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో చేపట్టబోయే నీటి ప్రాజెక్టులు ఎలా ఉండాలి ? ప్రస్తుత ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? తదితర విషయాలపై మీటింగ్‌లో స్పష్టత ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే గవర్నర్‌ సమక్షంలో ఉమ్మడి సభ నిర్వహించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని తొలుత నిర్ణయించింది. అయితే పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మరోవైపు విపక్షాలన్నీ రైతు సమస్యలపై ఆందోళనలు చేపడుతున్న సమయంలో సమగ్ర జలవిధానంపై సమావేశం ఏర్పాటు చేయడం అంత సులువుకాదనుకుంటోంది.

అసెంబ్లీలో సమావేశం సాధ్యం కాదని వెనక్కి తగ్గిన సర్కార్‌..
అసెంబ్లీలో సాధ్యం కాదని తేలిన సందర్భంలో.. జూబ్లీహాల్‌లో సమగ్ర జల విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటింగ్‌కు అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిశ్చయించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల డిజైన్‌ మార్పులతో వస్తున్న సమస్యలు...గతంలో ఉన్న ప్రాజెక్టులను ఎలా వినియోగంలోకి తేవాలనే విషయాలపై చర్చించనుంది. ప్రతిపక్షాలు, సాగునీటి రంగం నిపుణుల అనుమానాలన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నివృత్తి చేయాలని చూస్తోంది. అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడంతో ఇప్పటికే గుర్రుమీదున్న విపక్షాలు... సర్కార్‌ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

06:25 - October 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 23న ప్రారంభమైన శాసనసభ.. బుధవారంతో ముగిసింది. ప్రారంభం రోజు మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్, ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణానికి సంతాపం ప్రకటించిన తర్వాత.. సభ వాయిదా పడి.. 29వ తేదీన పునప్రారంభమైంది. అక్కడి నుంచి వరుసగా బుధవారం వరకు సాగింది.

ఏడు రోజులు..
మొత్తం ఏడు రోజుల పాటు సభ సాగినట్లు అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం వివరించింది. ఏడు రోజుల పాటు నడిచిన సమావేశాల్లో.. 30 గంటల ఆరు నిమిషాలు సభ సాగింది. వివిధ అంశాలకు చెందిన 19 ప్రశ్నలపై చర్చ జరగ్గా.. దానికి అనుబంధంగా 70 సప్లిమెంటరీలు వచ్చాయి. మొత్తం 14 రకాల ప్రశ్నలకు జవాబులు టేబుల్ చేశారు. ఈ ప్రశ్నలపై 26 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇక రైతుల సమస్యలు, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, విద్యుత్, సంక్షేమరంగంతో సహా.. మొత్తం 5రకాల స్వల్ప కాలిక అంశాలపై చర్చ జరిగింది. 

పార్టీల లెక్కలు..
ఇక పార్టీల వారిగా లెక్కిస్తే... అధికార టీఆర్ఎస్ పార్టీ 18గంటల 19నిమిషాలు చర్చలో సమయం తీసకుంది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 3 గంటల 56నిమిషాలు చర్చలో సమయం తీసుకుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 2 గంటల 7 నిమిషాల అవకాశం దక్కింది. మజ్లీస్ పార్టీకి 2 గంటల 30 నిమిషాలు, బిజేపికి 1 గంట 38 నిమిషాల అవకాశం ఇచ్చారు. వైఎస్సాఆర్ సిపి 42 నిమిషాలు, సిపిఐ 33 నిమిషాలు, సిపిఎం 21 నిమిషాలు చర్చలో పాల్గొన్నాయి.

విపక్షాల సస్పెండ్..
ఇది ఇలా ఉంటే ఈనెల 5వ తేదీన అన్ని పార్టీలు రైతు సమస్యలు, రుణమాఫీ సింగిల్ టైమ్ సెటిల్ మెంట్‌పై పట్టుపట్టి.. సభలో గందరగోళం నిర్వహించాయనే నేపంతో.. ప్రతిపక్ష, విపక్షాలను మొత్తం సెషన్స్ జరిగే వరకు సస్పెండ్ చేశారు. అయితే తమ సభ్యుల్ని పంపిన తర్వాత తాము సభకు హాజరయ్యేది లేదన్నారు ఆయా పార్టీల ప్లోర్ లీడర్లు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

06:22 - October 8, 2015

అనంతపురం : వాళ్లేమీ దోపిడీలు చేయలేదు.. అయినా బంధించారు. దౌర్జన్యానికి పాల్పడలేదు.. అయినా అరెస్టులు చేశారు.. వారు చేసిన తప్పల్లా.. న్యాయం చేయాలని నినదించడమే. దీన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం సహించలేకపోయింది. ప్రజా ఉద్యమాన్ని భరించలేకపోయింది. న్యాయం అడిగిన గొంతు నొక్కేసింది. అనంతపురం జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా సర్కారు అవకాశం ఇవ్వలేదు.

మాట్లాడేందుకు వచ్చిన మధు..
అనంతపురం జిల్లా నంబులపూలకుంట గ్రామం రణరంగంగా మారింది. సోలార్‌ హబ్ భూసేకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై రైతులతో మాట్లాడేందుకు వచ్చిన సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు నిరసనగా ఆందోళనకారులు స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా మిగతా పార్టీ నేతలను విడుదల చేశారు.

రణరంగంగా మారిన ఎన్పీకుంట గ్రామం..
ఎన్పీకుంట గ్రామంలో 1500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ సర్కార్‌ చేపట్టింది. భూనిర్వాసితులకు పరిహారం అందించడంలో అన్యాయం చేశారన్నది స్థానిక రైతుల వాదన. ఇక్కడి వారికి కాకుండా కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులకు పరిహారం అందించే జాబితాలో చేర్చి అధికారులు లక్షలు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును నిర్మించడం అన్యాయమని సీపీఎం పార్టీ ఉద్యమించింది. భూములు కోల్పోయిన రైతులకు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు. అర్హులను వదిలేసి అనర్హులకు అధికారులు పెద్దపీట వేశారని.. పరిహార చెల్లింపులో జరిగిన అక్రమాలకు వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  సీపీఎం నేతల అరెస్ట్‌ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాఉద్యమాలను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రజాసంఘాల నేతలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నేడు ఆదాయ పన్ను శాఖ ఉద్యోగుల సమ్మె..

ఢిల్లీ : నేడు ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. సర్వీసు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో ఈ సమ్మె చేయనున్నారు.

 

టెస్టు జట్టులో షోయబ్ మాలిక్..

కరాచి : ఐదేళ్ల విరామం అనంతరం పాకిస్తాన్ టెస్టు జట్టులో ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు 16వ ఆటగాడిగా మాలిక్ ఎంపికయ్యాడు. 

ప్రపంచ బాక్సింగ్ లో ఫ్రీ క్టార్టర్స్ కు చేరిన భారత బాక్సర్లు..

దోహా : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఫ్రీ క్వార్టర్స్ కు భారత బాక్సర్లు వికాస్ కృష్ణన్, శివలు దూసుకెళ్లారు. అల్జీరియాకు చెందిన ఖలీల్ లితిమ్ పై 3-0 తేడాతో శివ విజయం సాధించగా జోల్టన్ హార్క్ సాపై 3-0 తేడాతో వికాస్ విజయం సాధించాడు. 

నేటి నుండి ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పాదయాత్ర..

విజయవాడ : నేటి నుండి ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పాదయాత్ర నిర్వహించనుంది. అనంతపురం నుండి ప్రారంభమయ్యే ఈయాత్రలో ఫోరం ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్, వామపక్ష నేతలు మధు, రామకృష్ణ ఇతర నేతలు పాల్గొనున్నారు.

నేడు మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ చలో హైదరాబాద్..

హైదరాబాద్ : నేడు మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనుంది. పదో పీఆర్సీ అమలు చేయాలని ఈకార్యక్రమం జరుగనుంది. 

కోల్ ఇండియా ఉద్యోగులకు బోనస్..

ఢిల్లీ : దసరా పండుగ సందర్భంగా కోల్ ఇండియా ఉద్యోగులకు, దీపావళిని పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు బోనస్ ను చెల్లించనున్నారు.

Don't Miss