Activities calendar

09 October 2015

'బెంగాల్ టైగర్' లో రాశీఖన్నా పోస్టర్ విడుదల

హైదరాబాద్ : మాస్ మహారాజ్ రవితేజ, తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'బెంగాల్ టైగర్' చిత్రంలో రాశీఖన్నా రెండో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె పాత్రను పరియం చేస్తూ సంపత్ ఇవాళా షోషల్ మీడియా ద్వారా రాశీఖన్నా పోస్టర్ ను విడుదల చేశారు.  

22:09 - October 9, 2015

నిరసన తెలిపితే... నిర్బంధిస్తారా..? ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా.. గళమెత్తితే నోరు నొక్కేస్తారా..? హక్కుల కోసం పోరాడితే లాఠీలు ఝుళిపిస్తారా.. న్యాయమేదని ప్రశ్నిస్తే.. అన్యాయంగా మాట్లాడతారా... ప్రజాక్షేమానికి పట్టుబడితే చట్ట సభల నుంచి నెట్టేస్తారా... చలో హైదరాబాద్ కు పిలుపిస్తే.. ఎక్కడికక్కడ చుట్టుముడతారా.. ఉద్యమాలతో ఉద్భవించిన తెలంగాణలో హక్కులకు దిక్కే లేదా..? ఇదేనా బంగారు కలల సాకార సాధన... ? ఇంతేనా ఉద్యమ సారధుల పాలన..?! ప్రజాస్వామ్య నిరసనలపై తెలంగాణ సర్కార్ అణచివేత ప్రయత్నాలను ఇవాల్టి వైడ్ యాంగిల్ లో చూద్దాం.. మరిన్ని వివరాలకు వీడియో చూడండి...

 

22:01 - October 9, 2015

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఘన విజయం సాధించింది. ఎస్ ఎఫ్ ఐ నాయకత్వంలోని సామాజిక కూటమి గెలుపొందింది. ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులను ఈ కూటమి దక్కించుకుంది. అధ్యక్షుడిగా జుహైల్, ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ సాహూ ఎన్నికయ్యారు. కూటమి ఘన విజయం సాధించడంతో ఎస్ ఎఫ్ ఐ, సామాజిక కూటమి శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నేత సంజయ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమం కోసం పని చేస్తామని చెప్పారు. విద్యార్థులు తమ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు.

 

21:54 - October 9, 2015

ఢిల్లీ : అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో మంత్రి ఆసింఖాన్‌పై ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చర్యలు చేపట్టారు. మంత్రివర్గం నుంచి తొలగించి విచారణకు ఆదేశించారు. మంత్రి ఆసింఖాన్‌ ఓ బిల్డర్‌ నుంచి 6 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అసీంఖాన్‌ స్థానంలో మరో మైనారిటీ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్‌కు కేజ్రీవాల్‌ మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అవినీతికి పాల్పడే మంత్రులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

 

21:51 - October 9, 2015

ముంబై : ఐశ్వర్యారాయ్ రీఎంట్రీ మూవీ జజ్బా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. క్రిమినల్‌ లాయర్‌ పాత్రలో ఐశ్వర్యరాయ్‌ ఈ చిత్రంలో నటించింది. కిడ్నాప్‌ నేపథ్యంలో నడిచిన కథాంశం ప్రేక్షకులకు బోర్‌ కొట్టించిందని సినీ ప్రేమికులు నిట్టూరుస్తున్నారు.

 

21:49 - October 9, 2015

బిజెపి, టిడిపిల మధ్య అవిశ్వాసం రాజ్యమేలుతోందని వక్తలు పేర్కొన్నారు. బిజెపి, టిడిపి... విభేదాలు,. పట్టిసీమ, ఉమా భారతి వ్యాఖ్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లిరవి, కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, బిజెపి రఘునాథ్ బాబు, టిడిపి నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:22 - October 9, 2015

రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీ, పరుషులను ఒక్కటి చేసే బంధం వివాహం. అలా భిన్న నేపథ్యాలతో ఒక్కటయ్యే జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మరి ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశాలపై మానవి నిర్వహించిన నిర్భయ కార్యక్రమంలో సైక్రియాటిస్టు.. పూర్ణిమనాగరాజు పాల్గొని, మాట్లాడారు. భార్యాభర్తల రిలేషనషిప్ మధ్య వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి..? దంపతుల మధ్య రాజీపడలేని సందర్భం వస్తే ఎలా పరిష్కరించుకోవాలి..? అనే అంశాలను వివరించారు.  పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో తెలుసుకుందాం.

 

20:52 - October 9, 2015

హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నా ఇంకా బ్రిటీష్‌ కాలం నాటి విధానాలతోనే నెట్టుకొస్తున్న శాఖ తపాలా శాఖ. పేరుకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వెట్టిచాకిరే తప్ప మరొకటి లేదు. రిటైర్మెంట్ దగ్గరపడుతున్నా చాలీచాలని జీతం తో ఉద్యోగులు పడుతున్న వెతలు అంతా ఇంతా కావు. ప్రపంచ పోస్టల్‌ డే సందర్భంగా పోస్టల్‌ ఉద్యోగుల కష్టాలపై ప్రత్యేక కథనం.
పోస్టల్‌ శాఖ ఉద్యోగుల వెతలు
సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌ జాబ్‌ అంటే కాలుమీద కాలు వేసుకొని హాయిగా బతికేయొచ్చు. ఆ జాబ్‌ లో ఉన్నంత ఉద్యోగ భద్రత మరే చోట ఉండదు. జీతానికి జీతం సకల సౌకర్యాలు అని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వెట్టిచాకిరిలో మగ్గుతూ ఎదుగుబొదుగు లేని విభాగం ఒకటుంది అదే పోస్టల్‌ శాఖ. ఏళ్లు గడుస్తూ రిటైర్‌ అయ్యే దాకా చాలీ చాలని జీతంతో నెట్టుకు రావాల్సిందే. పేరుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే అయినా పోస్టల్‌ శాఖ ఉద్యోగుల వెతలు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా తీరడం లేదన్నది వాస్తవం.
రూ.7 వేల జీతం
సుమారు నలభై ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ కేవలం ఏడు వేల రూపాయల జీతం మాత్రమే అందుకుంటూ చిరుఉద్యోగులుగా మిగులి పోతున్నారు. తంతితపాలా శాఖలో దశాబ్దాల పాటు ఉద్యోగం చేస్తున్న ఫలితం శూన్యం. పోనీ ఏమైనా బెనిఫిట్స్‌ ఉంటాయా అంటే అవీ ఉండవు. పెన్షన్ల ఊసే లేదు. అంతే కాదు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా అంతంత మాత్రమే.
ఎలాంటి ప్రయోజనం లేదంటున్న ఉద్యోగులు
చేసినంత కాలం పని చేయడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కనీసం ఉపాధి హామీ కూలీలకు అందుతున్న స్థాయిలో సైతం తమకు జీతాలు అందకపోవడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌ మాన్‌ లకు మాత్రమే కాదు బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌లుగా పనిచేసిన వారి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఉత్తరాల బట్వాడాతో పాటు ఇతర పనులు సైతం ఇటీవలి కాలంలో పోస్టల్‌ శాఖే నిర్వహిస్తోంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, పెన్షన్లు ఇతర పనులు సైతం వీరితోనే కానిచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులుగా సేవలందిస్తూ తమకు సరైన గుర్తింపు, వేతనం లేకపోవడం తమ పాలిట శాపంగా మారిందంటున్నారు.

 

20:42 - October 9, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు తుదితీర్పును వెల్లడించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితోపాటు ఏపీ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలను కమిటీ పర్యవేక్షిస్తుందని..బాధితులకు నగదు చెల్లింపు కమిటీ పర్యవేక్షణలోనే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. లావాదేవీల కోసం రిజిస్ట్రార్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలని తెలిపింది. మొదటి విడతలో 14, రెండో విడతలో 5 ఆస్తులు అమ్మకాలు జరగాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
ఈ ఆక్షన్ ద్వారా ఆస్తుల అమ్మకాలు
ఈ ఆక్షన్ ద్వారా ఆస్తుల అమ్మకాలు జరగాలని కోర్టు వెల్లడించింది. చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఆర్టీజీఎస్ రూపంలో లావాదేవీలు ఉండాలన్న హైకోర్టు... ఆస్తుల అమ్మకానికి అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరించాలంది. ఆస్తులపై కోర్టుకు తప్పుడు సమాచారమిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రిటైర్డ్ న్యాయమూర్తి పేరు సోమవారం ప్రకటిస్తామని తెలిపింది.
పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు వెల్లడి
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో అగ్రిగోల్డ్‌కు ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో 176 ఎకరాల స్థలం, విజయవాడలో 172 ఎకరాల స్థలంతో పాటు బెంగుళూరులో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే అగ్రిగోల్డ్‌ 40 లక్షల మందికి డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే 300 ఆస్తులను హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ముందు ప్రధానంగా ఐదు ఆస్తులు విక్రయం జరగాలని ఈనెల 26లోపు ఇది పూర్తి చేయలని, దానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. బాధితుల కోసం రిజిస్ట్రార్‌ పేరు మీద ఖాతా తెరవాలని ఆదేశించింది. కేసుతో సంబంధమున్న అధికారులు, సంస్థ యాజమాన్యం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మొత్తానికి కోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

 

20:36 - October 9, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం షెడ్యూల్‌ విడుదల చేశారు. 22న ఉదయం 11 గంటల నుంచి 2.30 గంటల వరకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11.45 గంటలకు తెలుగుతల్లి గీతాలాపన చేస్తారు. మధ్యాహ్నం 12.45కు ప్రధాని మోడీ అమరావతికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కు శంకుస్థాపన వేదిక వద్ద పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.50కి ప్రధానికి వేదికపై ప్రముఖులు పుష్పగుచ్చాలు అందిస్తారు. మధ్యాహ్నం 12.55కు అమరావతి లఘు చిత్ర ప్రదర్శన జరుగుతుంది. వేలాదిగా బెలూన్ల ఎగురవేసి, ప్రధానికి జ్ఞాపిక బహుకరిస్తారు. మధ్యాహ్నం 1.00 కు రైతు వందనం నృత్యరూపక కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1.20 కి చంద్రబాబు అధ్యక్షోపన్యాసం చేస్తారు. అనంతరం సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధులు ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు, ప్రధాని మోడీ ఉపన్యసిస్తారు. మధ్యాహ్నం 2.00కి అమరావతి గీతాలాపన చేస్తారు. మధ్యాహ్నం 2.10 కి జాతీయ గీతాలాపన, ఆ తర్వాత విందు భోజనం, మధ్యాహ్నం 2.45కి అమరావతి నుంచి మోడీ బయల్దేరి 4.00 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. 4 గంటల 5 నిముషాలకు తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు. 4.30కి తిరుమలకు బయల్దేరి.. 5 గంటల 25 నిముషాలకు చేరుకుంటారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం 7.30 కి ప్రధాని మోడీ ఢిల్లీకి బయల్దేరతారు.

 

20:31 - October 9, 2015

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఘన విజయం సాధించింది. ఎస్ ఎఫ్ ఐ నాయకత్వంలోని సామాజిక కూటమి గెలుపొందింది. ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులను ఈ కూటమి దక్కించుకుంది. ఈ నెల 8వ తేదిన జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌ఎఫ్‌, డీఎస్‌యూ సామాజిక కూటమికి చెందిన పోటీదారులంతా విజయం సాధించారు. కూటమి తరపున ప్రెసిడెంట్‌ గా పోటీచేసిన కేపీ జూహైల్‌ విజయం సాధించగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా ముదావత్‌ వెంకటేష్‌, జనరల్‌ సెక్రటరీగా రాజ్‌ కుమార్‌ సాహూ విజయం సాధించారు. మొత్తం తొమ్మిది మంది పదవులను ఎస్‌ఎఫ్‌ఐ సామాజిక కూటమి చేజిక్కించుకుంది. కూటమి ఘన విజయం సాధించడంతో ఎస్ ఎఫ్ ఐ, సామాజిక కూటమి శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 

20:11 - October 9, 2015

హైదరాబాద్ : బిజెపి, ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ఇచ్చిన ప్యాకేజీని.. తెలంగాణకు ఎందుకు ఇవ్వరని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం పరిధిలో ఉన్న పంటల బీమా పథకం అతిపెద్ద జోకని కేటీఆర్ అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు భరోసా యాత్ర పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

8800 మంది ఆశావర్కర్లను అరెస్టు చేసి విడుదల చేశాం : అనురాగ్ శర్మ

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 8800 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి, విడుదల చేశామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణో భాగంగానే ఆశావర్కర్లను అరెస్టు చేశామని ఆయన అన్నారు. 

19:28 - October 9, 2015

ఢిల్లీ : ట్యునీషియాలో నేషనల్‌ డైలాగ్‌ క్వార్టెట్‌ సంస్థకు 2015కు గాను నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. ట్యునీషియాలో బహుళ ప్రజాస్వామ్య నిర్మాణానికి గాను ఈ అవార్డు దక్కింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2011లో నేషనల్‌ డైలాగ్‌ క్వార్టెట్‌ సంస్థ ట్యునీషియాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. నేషనల్‌ డైలాగ్‌ క్వార్టెట్‌లో ట్యునీషియన్‌ జనరల్‌ లేబర్‌ యూనియన్, ట్యునీషియన్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ట్యునీషియన్‌ ట్రేడ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్స్, ట్యునీషియన్‌ హ్యూమన్‌ రైట్స్‌ లీగ్‌ అనే నాలుగు ప్రధాన విభాగాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రజా సంక్షేమం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ సంస్ధలు కృషి చేస్తున్నాయి. ఈ శాంతి బహుమతికి మొత్తం 273 మందిని నామినేట్‌ చేశారు.

 

హెచ్ సీయూలో ఎస్ ఎఫ్ ఐ క్లీన్ స్వీప్....

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) క్లీన్ స్వీప్ చేసింది. ఎస్ ఎఫ్ ఐ నాయకత్వంలోని సామాజిక కూటమి ఘన విజయం సాధించింది. యూనివర్సిటీలోని అన్ని పదవులు దక్కించుకుంది.

 

జీఎస్ సీ టోల్ గేట్ వద్ద టెంపో వాహనం దగ్ధం

తిరుమల : జీఎస్ సీ టోల్ గేట్ వద్ద తమిళనాడుకు చెందిన టెంపో వాహనం దగ్ధం అయింది. టెంపోలోని భక్తులు సురక్షితంగా ఉన్నారు. 

19:01 - October 9, 2015

చరిత్రను పుస్తకాల్లో చదవుకోవడం అందరికీ సాధ్యం కాదు. చారిత్రక సంఘటనలను సులభంగా ఎక్కువ మందికి చేరువ చేసే మార్గం సినిమా. చరిత్రను అలాగే చూపిస్తే బోర్ కొడుతుంది. సినిమాటిక్ గా తెరకెక్కిస్తే ఉన్న కథను వక్రీకరించినట్లు అవుతుంది. ఈ రెండింటినీ కలపడం కత్తిమీద సామే. ఈ ఫీట్ ను సాధించేందుకు తన శక్తిమేర ప్రయత్నించాడు గుణశేఖర్. కాకతీయ మహారాణి రుద్రమదేవీ చరిత్రను వెండితెరకు చేర్చి...రాబోయే హిస్టరీలో స్థానం సంపాదించుకున్నాడు.

చరిత్రను సినిమాగా రూపొందించడం ఓ పది మామూలు సినిమాలు చేసినదాని కన్నా ఎక్కువే. ఎంచుకున్న కథలో సినిమాకు సరిపోయేంత ఆసక్తి ఉంటే తప్ప హిస్టారికల్ మూవీస్ నిలబడలేవు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణిగా రుద్రమదేవీ కథలో ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలెన్నో ఉన్నాయి. రాజవంశం నిలబెట్టేందుకు యువరాజులా పెరిగి...ప్రజాక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది రుద్రమదేవి. ఇవన్నీ కథగా అల్లి సినిమా తెరకెక్కించాడు గుణశేఖర్. ఈ సంఘటనలను సినిమాగా అల్లడంలో దర్శకుడు కొన్నిచోట్ల తడబడ్డాడు.
కథ..
పుట్టింది అమ్మాయే అయినా....రాజవంశం నిలబెట్టేందుకు....శత్రురాజుల నుంచి కాపాడుకునేందుకు అబ్బాయి పుట్టాడని..యువరాజు అవుతాడని ప్రచారం చేస్తారు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. తండ్రి మాటతో...యువరాజులా పెరుగుతుంది రుద్రమదేవి. ఓ ధీరుడిలా..యుద్ధవిద్యలు, కత్తిసాములు నేర్చుకుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ నిజం దాచడం కష్టమవుతుంది. రుద్రమదేవీ గురించి ప్రజలకు నిజం తెలిసి తమకు రాణి వద్దు రాజు కావాలంటారు. ఆమెను దేశ భహిష్కారం చేస్తారు. కానీ నమ్మకస్తులైన సామంతుడు గోనగన్నారెడ్డి సాయంతో శత్రువులను తుదముట్టిస్తుంది. నిజం తెల్సుకున్న ప్రజలు రుద్రమదేవిని కీర్తిస్తారు.
విశ్లేషణ..
చరిత్రను వక్రీకరించకుండా నిజాయితీగా తెరకెక్కించడం దర్శకుడిగా గుణశేఖర్ సాధించిన విజయం. అయితే సన్నివేశాల పరంగా తీసుకురావాల్సిన బిల్డప్ తేవడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. చాలా సీన్స్ తేలిపోయేలా ఉన్నాయి. రుద్రమదేవీగా అనుష్క నటన, అప్పీయరెన్స్ సినిమాకు హైలెట్. రానా పోషించిన చాళుక్య వీరభద్ర క్యారెక్టర్ అత్యంత బలహీనమైన పాత్రగా మిగిలిపోయింది. గోనగన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్ సినిమాకు అస్సెట్ గా నిలిచాడు. ఎప్పట్లాగే నిత్యా మీనన్ సహజంగా నటించింది. సినిమాలోని కొన్ని ప్రధాన పాత్రలు పరిపూర్ణంగా లేవు.
సాంకేతిక అంశాలు..
ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే....సెట్టింగ్స్ చాలా బాగున్నా....గ్రాఫిక్స్ వర్క్స్ కుదరలేదు. ఇళయరాజా పాటలు ఆయన లెజెండరీ మ్యూజిక్ ను గుర్తుకుతెచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. నిర్మాతగా వ్యవహరించడం వల్ల బహుశా గుణశేఖర్ అందరి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఔట్ పుట్ తీసుకురాలేకపోయాడేమో. ఏమైనా తమ చరిత్ర ఇది, తమ చరిత్రలోని పాలకుల గొప్పదనం ఇది, తమ వారసత్వం ఇది, ...అని ప్రజలు తెల్సుకోవాల్సిన ఓ గొప్ప ప్రయత్నం చేశాడు గుణశేఖర్.
ఫ్లస్ పాయింట్స్...
చరిత్రను చూపిన కథ
అనుష్క
అల్లు అర్జున్
పాటలు
సెట్టింగ్స్
మైనస్ పాయింట్స్...
బలంలేని సన్నివేశాలు
కొన్ని ప్రధాన పాత్రలు
గ్రాఫిక్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

ఈనెల 14 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్సోత్సవాలు

తిరుమల : ఈనెల 14 నుంచి 22 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్సోత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరిగి రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమాలు జరుగున్నాయి. 

రిలయెన్స్ జియో సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

విశాఖ : రిలయెన్స్ జియో సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ పాల్గొన్నారు.

 

గవర్నర్ నరసింహన్ తో సీఎస్ రాజీవ్ శర్మ భేటీ...

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

18:43 - October 9, 2015

విజయవాడ : రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. సాఫ్ట్ టెక్ అనే కంప్యూటర్ సంస్థ ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కంప్యూటీరికరించామని నవంబర్ ఒకటో తేదీ నుంచి విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో సర్వీసులు ప్రారంభమవుతాయని నారాయణ తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో 110 మున్సిపాల్టీల్లో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో కంప్యూటీరికరిస్తామని అన్నారు. బిల్డింగ్ లేదా ఇళ్ల ప్లాన్లను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే మంజూరు చేస్తామన్నారు. ఇక రాజధాని శంకుస్థాపన పనులను కూడా వేగం పుంజుకున్నాయని, రెండ్రోజుల్లో పూర్తిగా పనులపై క్లారిటీ వస్తుందన్నారు.

 

18:31 - October 9, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వాళ్లిద్దరూ ఉద్ధండ నేతలు. ఎవరి భావాలు వారివి... ఎవరి పరిపాలన వారిది. వాళ్లిద్దరూ.. కలుసుకోవడం చాలా అరుదు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఆ ఇద్దరు నేతలను మరోసారి కలపబోతోందా.? ఈ పాటికే అర్థమయిందనుకుంటా.. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు టీఆర్‌ఎస్‌ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. మరొకరు టీడీపీ అధ్యక్షుడు.. ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ఇద్దరు నేతలు కలవడం చాలా అరుదైన విషయమే. గతంలో ఓ సారి గవర్నర్‌ ఇచ్చిన విందులో ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు. మళ్లీ అలాంటి ఘటన పునరావృతం అయ్యే అవకాశం వచ్చింది.
సీఎం కేసీఆర్‌ కు ఆహ్వానం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. దీనికోసం అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకూ ఆహ్వానం పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కూ ఆహ్వానం అందింది. అయితే ప్రస్తుతం గులాబీ అధినేత కేసీఆర్‌ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు.
ఇద్దరు నేతల మధ్య దూరం 
గురువారం జరిగిన పార్టీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. ఇప్పటికే నీళ్లు, నిధులు, ఉద్యోగ కేటాయింపులపై ఇరు రాష్ట్ర నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఇద్దరు నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేనే కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ వివాదంలో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్నారు. మరోవైపు తమ ఫోన్‌లు ట్యాప్‌ చేశారంటూ చంద్రబాబు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్‌ చంద్రబాబు ఉప్పు నిప్పుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. దశాబ్ద కాలంగా కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో కాలు పెట్టిన సందర్భం లేదు.
శంకుస్థాపనకు 15 వేల ఆహ్వానాలు
అమరావతి శంకుస్థాపనకు ఏపీ సర్కార్ 15 వేల ఆహ్వానాలు పంపుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీతో పాటు, జపాన్‌, సింగపూర్‌ ప్రధానులను.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, కేంద్ర కేబినెట్‌ సభ్యులను, అన్ని రాష్ట్రాల సీఎంలను, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనుంది. మరి చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్‌ ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళ్తారో.. లేదోనన్నది ఆసక్తిగా మారింది.

 

ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత

ముంబై : ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూశారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రామాయాణం సీరియల్ కు సంగీతం అందించారు. చోర్ మచాయే షోర్, గీత్ గాతా చల్, అఖియోం కె ఝరోఖోం సే, చిత్ చోర్ వంటి సినిమాలకు సంగీతం అందించారు.

 

దసరాకు తెలుగు రాష్ట్రాల్లో 3850 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ : దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో 3850 ప్రత్యేక బస్సులను నడపనున్నాయి. ఈనెల 17 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దసరా ప్రత్యేక బస్సులో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్ జామ్ లను దృష్టిలో ఉంచుకుని పండుగ సమయంలో వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులు శివారు ప్రాంతాల నుంచే నడుస్తాయని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ ఎం గంగాధర్ తెలిపారు. వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు.. కాచిగూడ, ఉప్పల్ నుంచి బయల్దేరుతాయన్నారు.

కేంద్రప్రభుత్వానికి మరో రచయిత నిరసన

ఢిల్లీ : కేంద్రప్రభుత్వానికి మరో రచయిత నిరసన తెలిపారు. సాహిత్య అకాడమి పురస్కారాన్ని వెనక్కి ఇవ్వనున్నట్లు ఉర్దూ రచయిత రెహమాన్ అబ్బాస్ ప్రకటించారు. దాద్రిలో అక్లఖ్ ను కొట్టి చంపడంపై అబ్బాస్ నిరసన తెలిపారు. పలువురు రచయితలు తన దారిలో నడవనున్నారని అబ్బాస్ ప్రకటించారు. పశుమాంసంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు ఇప్పటికే ఇద్దరు రచయితలు నిరసన తెలిపారు. తమకు ఇచ్చిన పురస్కారాలను రచయితలు వెనక్కి ఇచ్చేస్తున్నారు.

 

అత్యాచారాలపై నోరు జారిన కర్నాటక హోంమంత్రి

బెంగళూరు : అత్యాచారాలపై కర్నాటక హోంమంత్రి జార్జి నోరు జారారు. కాల్ సెంటర్ ఉద్యోగినిపై వ్యానులో జరిగిన అత్యాచారంపై మీడియా వద్ద మంత్రి నోరు జారి మాట్లాడారు. ఇద్దరు అత్యాచారం చేస్తే దాన్ని గ్యాంగ్ రేప్ అనకూడదని జార్జి అన్నారు. గ్యాంగ్ రేప్ అంటే కనీసం నలుగురయిదుగురు ఉండాలని పేర్కొన్నారు.

 

17:10 - October 9, 2015

చైనా :  బ్రిడ్జి.. అంటే సిమెంట్‌ లేదా ఉక్కుతో నిర్మిస్తారు...కొన్ని చోట్ల చెక్కతో చేసిన వంతెనలూ ఉంటాయి...కానీ చైనాలో మాత్రం గాజుతో నిర్మించిన ఓ అద్భుతమైన వంతెన టూరిస్టులను ఆకర్షిస్తోంది. కొండ లోయల మధ్య నిర్మించిన గ్లాస్‌ బ్రిడ్జిపై నడచి వెళ్లాలంటే గుండె ధైర్యం కావాలి... చెప్పడమెందుకు.. ఆ గ్లాసు వంతెనపై యాత్రికుల అనుభూతులను మీరూ చూడండి. ఇది మామూలు బ్రిడ్జి కాదు... గ్లాస్‌ బ్రిడ్జి. 
చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో
చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో పూర్తిగా గాజుతో తయారుచేసిన ఈ వంతెన సముద్రమట్టానికి 3వేల 5 వందల అడుగుల ఎత్తులో ఉంది. యున్‌టయ్ కొండల మధ్య దాదాపు 3 వందల మీటర్ల పొడుగు వంతెన నిర్మించారు. భూమికి, ఆకాశానికి మధ్యన ఉండే ఈ బ్రిడ్జిపై నిల్చుంటే కింది భాగమంతా స్పష్టంగా కనిపిస్తుంది.
పర్యాటకుల తాకిడి 
ఈ గాజు వంతెనను చూడడానికి పర్యాటకులు ఇక్కడికి బాగా వస్తుంటారు. గ్లాస్‌ బ్రిడ్జిపై నడచి వెళ్లడానికి టూరిస్టులు ఎంతో ఇష్టపడతారు. అయితే గాజు వంతెన కింద లోతైన లోయప్రాంతం స్పష్టంగా పాదాల కింద కన్పిస్తోంటే ఓ రకమైన భయం ఆవహిస్తుంది. ఎందుకంటే గాజు వంతెన ఎక్కడ పగిలిపోతుందోనన్న భయంతో టూరిస్టులు అడుగులో అడుగు వేసుకుంటూ అష్టకష్టాలు పడి వంతెన దాటుతుంటారు.
వంతెనపై అక్కడక్కడా పగుళ్లు 
టూరిస్టుల భయమే నేడు నిజమైంది. వంతెనపై అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. గత వారం ఓ పర్యాటకురాలి చేతిలో నుంచి స్టీల్‌ కప్‌ జారిపోయి వంతెన మీద పడడంతో చిన్నపాటి పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా శబ్దం రావడం, పగుళ్లను చూసి భయంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఇప్పుడు ఈ ఘటన చైనా మీడియా, ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదు : అధికారులు
అవి చిన్నపాటి పగుళ్లేనని, వాటి వల్ల వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. వంతెనను తాత్కాలికంగా మూసివేశామని, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత తిరిగి తెరుస్తామన్నారు. ఒక్కో పొర 27 మిల్లీ మీటర్ల మందంతో, మూడు గాజు పొరలతో ఈ బ్రిడ్జి నిర్మించారు. ప్రత్యేక టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన ఈ వంతెనకు ఎంతటి బరువునైనా ఆపగలిగే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

 

17:04 - October 9, 2015

గ్రీస్‌ : అక్కడి బస్సుల్లో డ్రైవర్‌ ఉండడు. అయినా చక్కగా రోడ్లపై తిరుగుతుంటాయి. బస్టాప్‌ల వద్ద ప్రయాణికులనూ ఎక్కించుకుంటాయి. డ్రైవర్‌ లేకుండా చక్కర్లు కొడుతున్న బస్సులను చూడాలంటే గ్రీస్‌ వెళ్లాల్సిందే.
గ్రీస్‌లో ప్రయోగాత్మకంగా డ్రైవర్‌లెస్‌ బస్సులు
గ్రీస్‌లోని త్రికల నగరంలో డ్రైవర్‌లెస్‌ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. జీపీఎస్‌ ఆధారంగా నడిచే ఈ బస్సుల్లో ఆటోమేటిక్‌ కెమెరాలు ఉంటాయి. కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా బస్సు ఎప్పటికప్పుడు నియంత్రించుకుని నడుస్తుంది. రోడ్డుపైన ఎవరైన అడ్డు వస్తే తనంతట తానుగా ఆగిపోతుంది. రోడ్‌ క్లియర్‌గా ఉంటేనే ముందుకు కదులుతుంది. ఇదంతా జీపీఎస్‌ ఆధారంగానే పని చేస్తుంది.
పది మంది ప్రయాణికుల సామర్థ్యం
పది మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ డ్రైవర్‌లెస్ బస్సులను ప్రస్తుతానికి ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి వరకు వీటిని ఇలా పరీక్షించి వచ్చే నెల ప్రారంభానికి పూర్తి స్థాయిలో నడపనున్నారు.
ట్రయల్‌ రన్‌
డ్రైవర్‌లెస్‌ బస్సులను చైనా సైతం ప్రయోగాత్మకంగా చేపట్టింది. వీటినీ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే పలు దేశాల్లో డ్రైవర్‌లెస్‌ బస్సులు దర్శనమివ్వనున్నాయి.

 

16:56 - October 9, 2015

హైదరాబాద్ : ఆశా వర్కర్ల చలో హైదరాబాద్‌ ఉద్రిక్తంగా మారింది. ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 3500 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వందల మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి... ముషీరాబాద్‌ పీఎస్‌ కు తరలించారు. అరెస్టులు, నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని ఆశా వర్కర్లు అంటున్నారు.
జయలక్ష్మీ.. సీఐటీయూ నాయకురాలు..
ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మావోయిస్టులు, పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా ఆశా వర్కర్లను తనిఖీలు చేస్తున్నారు. ఎంత నిర్బంధం పెట్టిన ఉద్యమాలను అణచలేరు అని పేర్కొంది.
సాయిబాబు... సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
ఆశా వర్కర్ల సభ ద్వారా వారి ఆవేదనను ప్రభుత్వానికి తెలపాలని హైదరాబాద్ వచ్చారు. కానీ వారి బాధలు, గాథలను వినడానికి ప్రభుత్వ సిద్ధంగా లేదు. సభ జరగకుండా అడ్డుకున్నారు. కానీ ఒక్క సభ బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. ఆశా వర్కర్లు విజయం సాధించారు. వారు శాంతించాలంటే.. సమస్యలను పరిష్కరించాలి. జీతాలు పెంచాలి. నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్...తీరు మార్చుకోవాలి. జిల్లాలు తిరుగుతానని సీఎం చెప్పారు... జిల్లాల్లోకి కేసీఆర్ ఎలా వస్తారో.. చూస్తామని ఆయన హెచ్చరించారు. 

16:45 - October 9, 2015

హైదరాబాద్ : విపక్ష పార్టీల తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు మేలు చేయని గత పాలకులు రైతు భరోసా యాత్ర పేరుతో.. మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రేపటి తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడాన్ని మంత్రి ఖండించారు. కాంగ్రెస్‌ తలపెట్టిన రైతు భరోసా యాత్రను కేటీఆర్ తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏనాడు మేలు చేయని గత పాలకులు.. ఇపుడు భరోసా పేరుతో మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించడంతో పాటు.. హైదరబాద్‌ పరిధిలో పాలీ హౌస్‌ కట్టించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

15:58 - October 9, 2015

ఢిల్లీ : దేవతగా కొలిచే చోటే అత్యాచారాలు జరుగుతున్నాయి. వేదాలు ఘోషించిన స్ధలంలోనే మరణమృదంగాలు విన్పిస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాటు వేస్తోంటే, కడుపులో పెట్టుకుని చూసుకోవల్సిన వాళ్లు పచ్చని జీవితాన్ని చిదిమేస్తున్నారు. అందుకే దిక్కులు పిక్కటిల్లే ఆవేదన స్వరాలలోకి ఒదిగిపోయింది. తరతరాల యమ యాతనను, తాను కోరుకుంటున్న నిండైన భవితను రెండు నిమిషాల్లో కళ్లకు కట్టినట్లు చూపింది.
అక్షరాలకే పరిమితం...
యత్ర నార్యంతు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా. ఎక్కడ స్త్రీలు పూజింపడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని దీని అర్థం. వేదాలు పుట్టిన పవిత్ర భూమిగా చెప్పుకునే భారతదేశంలో పురుడు పోసుకున్నదే ఈ సూక్తి కూడా. కానీ ఇది అక్షరాలకే పరిమితం. ఆచరణ కనీస శూన్యం.
ప్రతి చోటా అత్యాచారాలే....
ప్రతి గంట, ప్రతి నిముషం, అంతెందుకు ప్రతి క్షణం.. దేశంలో ఏమూల చూసినా నిస్సహాయురాలైన ఆడవారిపై అత్యాచారాలు, హత్యాయత్నాలే. పటిష్ఠ నిఘా నేత్రాలు, కఠిన చట్టాలు వేటిని ఈ దుశ్శాసన పర్వాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. ఈ అరాచకాన్ని చూస్తూ ఇన్నాళ్లు భరించిన ఓ భారతీయుడు తన ఆవేదనను ఆపుకోలేకపోయాడు. తనను కుదిపేస్తున్న నరకయాతనను యావత్ దేశానికి చూపాలనుకున్నాడు. అసలు భారత్‌లో జరుగుతున్నది ఏంటి..? మెజారిటీ ప్రజానీకం కోరుకుంటున్నది ఏంటి అనే సుదీర్ఘ స్వప్నాన్ని ఓ చిన్న పాటగా కూర్చాడు. అదే వేర్‌ ఈజ్‌ మై ఇండియా...
కన్నీటి పర్యంతం చేస్తున్న వేర్ ఈజ్‌ మై ఇండియా వీడియో
చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశించిటంతో పాటు అందరి నయనాలను కన్నీటి పర్యంతం చేస్తున్న వేర్ ఈజ్‌ మై ఇండియా వీడియో సామాజిక బాధ్యతను గుర్తు చేస్తోంది. వేటగాడే సంరక్షకుడి అవతారమెత్తిన చోట స్వేచ్ఛతో పాటు ఆందోళన, ఆయుధం రెండు కావాలనే కర్తవ్యాన్ని బోధిస్తోంది.

 

15:51 - October 9, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. డిమాండ్ల సాధనకోసం ఒక్కటై కదిలారు.. వీరిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు పోలీసులు.. దాదాపు 15వేలమందిని అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆశ కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్‌ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రెండురోజులముందునుంచే అరెస్టులు మొదలుపెట్టారు పోలీసులు.. ఎక్కడికక్కడ సీఐటీయూ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణవ్యాప్తంగా 15వేలమంది అరెస్ట్
తెలంగాణవ్యాప్తంగా దాదాపు 15వేలమందిని పోలీసులు అరెస్టు చేశారు... రాత్రినుంచే అన్ని జిల్లాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.. చెక్‌పోస్టుల ద్వారా అన్ని వాహనాలను తనిఖీ చేశారు.. ఆదిలాబాద్ జిల్లాలో 350మంద ఆశ వర్కర్లను అరెస్టు చేశారు.. కరీంనగర్‌ జిల్లాలో 2వేల 300మంది... ఖమ్మం జిల్లాలో వెయ్యిమంది.. పాలమూరు జిల్లాలో 600, నల్లగొండ జిల్లాలో 700, వరంగల్‌ జిల్లాలో 17వందల 25మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇక హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌లో 500మంది ఆశ వర్కర్లను అరెస్టు చేశారు.. వీరిని గోషామహల్‌ స్టేడియానికి తరలించారు..
ఆశ వర్కర్లను అడ్డుకున్న పోలీసులు
ఇందిరాపార్క్, సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఎంబీ భవన్‌ సమీపంలో ర్యాలీకి బయలుదేరిన ఆశ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు.. ముందుగానే ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు.. వందలాదిమందిని అరెస్టు చేశారు.. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుపైనే నిరసన తెలిపారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ ముట్టడికి యత్నం
ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా మెదక్ జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ ముట్టడికి ఆశ కార్యకర్తలు, సీఐటీయూ నేతలు ప్రయత్నించారు. వీరిని అదుపులోకితీసుకున్న పోలీసులు గజ్వెల్ పీఎస్‌కు తరలించారు..
అశావర్కర్లపై నిర్బంధం
వరంగల్‌ జిల్లాలో దాదాపు వెయ్యిమందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్బంధించి పాడైపోయిన భోజనం పెట్టారని కార్యకర్తలు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దాదాపు 40రోజులనుంచి ఆశ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. యూటీఎఫ్ కార్యాలయంనుంచి ఇందిరాపార్క్‌కు బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేశారు. 

ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం : తలసాని

హైదరాబాద్ : ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

టౌన్ ప్లానింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేస్తున్నాం : మంత్రి నారాయణ

విజయవాడ : టౌన్ ప్లానింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడలో నవంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఇళ్లు, దుకాణ సముదాయాల ప్లాన్లు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న రోజే ప్లాన్ మంజూరు అవుతుందని తెలిపారు. డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని చెప్పారు. 

15:31 - October 9, 2015

ఖమ్మం : సీఎం రైతు సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలు రైతు భరోసాయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రుణమాపీపై నిర్దిష్ట ప్రకటన అడిగినందుకు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం హానీమూన్ ముగిసిందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డీకే అరుణ అన్నారు. కేసీఆర్‌ పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్ల అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

15:07 - October 9, 2015

విశాఖ : ఈ ప్రగతి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ప్రారంభించారు. ఈ ప్రగతి ద్వారా 33 శాఖలు, 315 సంస్థల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ శాఖల సమాచారమంతా ఒకేచోట లభ్యం కావడంతో పౌరసేవలు మరింత త్వరగా లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : ఫలక్ నుమా పీఎస్ లో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లేడు ఆకులు తిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

జూరాలకు కొనసాగుతున్న వరద

మహబూబ్‌నగర్:జిల్లాలోని జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 14,956 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 12, 271 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తతం రిజర్యాయర్‌లో నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.

హిందూపురం పర్యటనలో ఎమ్మెల్యే బాలయ్య

అనంతపురం : ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, చెరువు పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. హిందూపురం పారిశ్రామిక వాడలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. హిందూపురం మండలం కొటిపిలో రూ.60 లక్షలతో చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఆయన వెంట స్థానిక నేతలు, ముఖ్య అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బైఠాయించిన ఆశాలు..

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆశా కార్యకర్తలు భైఠాయించి ఆందోళన చేపట్టారు. కనసీ వేతనాలు అమలు చేయాలని, ఏఎన్ ఎంలు గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి తరలి వస్తున్న ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళ

13:46 - October 9, 2015

హైదరాబాద్ : బిహార్ లో జంగిల్ రాజ్ కావాలా.. వికాస్ రాజ్ కావాలా... తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు పోటీ చేయడం లేదో అడగాలన్నారు. ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మాత్రమే జరగడం లేదన్న మోడీ... బిహర్ ను నాశనం చేసిన వారికి శిక్ష విధించడం కోసం జరుగుతున్నాయన్నారు. గతంలో జితిన్ రామ్ మాంఝీ బీహార్ లో సమర్థ పాలన నిర్వహించాలని కితాబిచ్చారు.

13:45 - October 9, 2015

కృష్ణా : నాగాయలంక మండలం బర్రంకుల జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వరలక్ష్మి హత్య కేసులో వంశీకృష్ణతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబకలహాలతో వరలక్ష్మిని హత్యచేసిన కుటుంబసభ్యులు ఆమె పూడ్చివేశారు. ఐద్వా ప్రతినిధుల చొరవతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

13:43 - October 9, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో అప్పట్లో చట్టం చేసుంటే..ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావని మంత్రి కామినేని అన్నారు. త్వరలోనే ఏపీకి కేంద్రం స్పెషల్ స్టేటస్‌ను ప్రకటిస్తుందన్న నమ్మకం తమకుందని అన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం నియోజికవర్గాల్లో పలు శంకుస్థాపనలకు హాజరైన మంత్రి కామినేని..గడచిన 10ఏళ్లుగా ప్రాథమిక వైద్యం నిర్లక్ష్యానికి గురైందని..ప్రాధాన్యతా క్రమంలో సరిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ పరం చేయమని మంత్రి స్పష్టం చేశారు.

13:41 - October 9, 2015

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. రాజాపేట మండలం రఘునాథపురం సమీపంలో ఆటో, బైక్‌ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు గాయాలయ్యాయి.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. ప్రమాదసమయంలో ఆటోలో 21మంది ఉన్నట్లు తెలుస్తోంది.. వీరంతా చల్లూరు గ్రామంలో వ్యవసాయం పనులకోసం వెళుతున్నారు.. జిల్లాలో గడచిన మూడురోజుల్లో నాలుగు ప్రమాదాలు జరగడం అందరిలో టెన్షన్ పెంచుతోంది..

13:40 - October 9, 2015

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. కదిరిలోని స్పేస్‌ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు.. ఒకరినొకరు కత్తులతో దాడికి యత్నించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థి దాదాపీర్‌పై.. అదే కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాయి కత్తితో దాడి చేశాడు. దీనిని గమనించిన కళాశాల యాజమాన్యం.. కత్తిని లాక్కొని సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరితో పాటు వీరికి సహకరించిన పది మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. గత కొద్దిరోజులుగా తనను.. దాదాపీర్‌ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని సాయి తెలిపారు.

సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు...

హైదరాబాద్: గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంపై ఓ ఉగ్రవాద సంస్థ బాంబుదాడి చేయబోతోందంటూ తెలిసింది. ఈ మేరకు ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయడంతో హై అలర్ట్ నోటీస్ జారీ చేశారు. ఆలయం వద్ద భద్రతాబలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఆలయ పరిసర ప్రాంతాలన్నిటినీ పరిశీలించారు. ఇంతవరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదని పోలీసులు తెలిపారు. ఆలయానికి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచారు. 

ఈ- ప్రగతి ప్రాజెక్టు ను ప్రారంభించిన ఏపీ సీఎం

విశాఖ : ఈ-ప్రగతి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ విశాఖ లో ప్రారంభించారు. ఈ – ప్రగతి ద్వారా 33 శాఖలు, 315 సంస్థల నుంచి ఈ -సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడిపి, బిజెపి ధర్నా

రంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ, బీజేపీ నేతలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో నేతలు ఎల్‌ రమణ, రావుల, ఎర్రబెల్లి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. రైతుకుటుంబాలను ఆదుకోవాలని నేతలు డిమాండు చేశారు.

12:51 - October 9, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో తొలగించిన మున్సిపల్ కార్మికులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నగరంలో ప‌ర్యటిస్తున్న జాతీయ స‌ఫాయి క‌ర్మ చారి కమిషన్ కూడా సర్కార్ తీరుపై మండిపడింది. వెంటనే కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించింది.

జూలై 6 నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె......

వేత‌నాలు పెంచాల‌ని కోరుతూ జూలై 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేసారు. సమ్మె చేపట్టిన 10 రోజుల త‌రువాత హైద‌రాబాద్‌లో మాత్రమే వేత‌నాలు పెంచుతున్నామని సర్కార్ ప్రక‌టించింది. అయితే సర్కార్ స్పష్టమైన వైఖరి తెలియజేయక పోవడంతో కొందరు విధులకు హాజరుకాలేదు.దీంతో స్పష్ఠమైన హామీ ఇచ్చాక, సమ్మె విరమించామని ప్రకటించిన తరువాత కూడా విధుల‌కు ఎందుకు హాజ‌రుకాలేద‌ని సర్కార్ దాదాపు 13 వందల మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది.

మానవహక్కుల కమిషన్, స‌ఫాయి క‌ర్మచారీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు.....

విధుల్లోంచి తొలగించి మూడు నెలలవుతున్నా..అటు సర్కార్, ఇటు జిహెచ్ఎంసి ప‌ట్టించుకోవ‌డం లేదు. సర్కార్ స్పందించకపోవడంతో కార్మికులు, కార్మిక సంఘాల నేత‌లు మానవహక్కుల కమిషన్, జాతీయ స‌ఫాయి క‌ర్మచారీ క‌మిష‌న్, లేబ‌ర్ క‌మిష‌నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హైద‌రాబాద్ పర్యటనలో ఉన్న జాతీయ స‌ఫాయి క‌ర్మచారి క‌మిష‌న్ చైర్మన్‌ సర్కార్ తీరుపై మండిపడింది. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని ఆదేశించింది. చట్ట ప్రకారం సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లోంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది.

జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ ఆదేశాల మేరకు.....

ఇప్పటికైనా...జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ ఆదేశాల మేరకు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ మున్సిపల్ కార్మికుల జేఏసీ నేతలు కోరుతున్నారు. సర్కార్ స్పందించి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కార్మిక సంఘా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ తీరు మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

12:49 - October 9, 2015

హైదరాబాద్ : అగ్రి గోల్డ్ కేసు పై హైకోర్టు తీర్పు వెలువరించింది. అగ్రి గోల్డ్ ఆస్తుల విక్రయానికి ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఈ ఏర్పాటు కానుంది. ఈ కమిటీకి అగ్రి గోల్డ్ ఛైర్మన్ పూర్తి సహకరించాలని, ఆస్తుల విక్రయాలు కమిటీ పర్యవేక్షణ లో జరగాలని హైకోర్టు ఆదేశించింది.

12:46 - October 9, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నూటికి నూరుపాళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై తెలుసుకునేందుకు ఈనెల 13న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. దసరా నుంచి ప్రారంభం కానున్న డబుల్‌బెడ్‌రూం పథకంతో పాటు..అనేక ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

పరిపాలన అంశాలతో పాటు శాంతి భద్రతలపై ....

రాష్ట్రంలో పరిపాలన అంశాలతో పాటు శాంతి భద్రతలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెల 13న మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇందులో గత సమీక్ష నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్ధాయిలో అమలవుతున్న తీరుపై చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు అత్మహత్యలతో పాటు మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పంపిణి వంటి అంశాలపై విస్త్రతంగా చర్చించనున్నారు. అలాగే ఇటీవల టెండర్లు పూర్తి చేసుకుని గ్రౌండ్ వర్కుకు సిద్దమైన వాటర్ గ్రిడ్‌కు కావాల్సిన భూ సేకరణ, వాటర్ గ్రిడ్ పనుల కోఆర్డినేషన్ పై చర్చించనున్నారు.

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌....

వీటితో పాటు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, మన ఊరు-మన ప్రణాళిక అమలు తీరుతెన్నులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించనున్నారు. ఇక ప్రభుత్వం ఆరంభం నుంచి అమలు చేసిన దళితులకు భూ పంపిణి అమలు ఎంత వరకు వచ్చిందనేదానిపై కూడా చర్చించనున్నారు. అలాగే రుణమాఫి అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించనున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను నివారించినప్పటికి రైతులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో రిపోర్టు ఇవ్వాలని అధికారులను అదేశించినట్లు సమాచారం.

వికారుద్దీన్‌, సాగర్, శృతి ఎన్‌కౌంటర్స్ పై....

వీటితో పాటు వికారుద్దీన్ ఎన్‌కౌంటర్, శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో..ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం అమలుపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఒక్కో ప్రజాప్రతినిధి ఒక్కో గ్రామాన్ని దత్తాత తీసుకోవడంతో పాటు..ఆయా గ్రామాల అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్‌పై ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టనున్న సమగ్ర జల విధానంపై వివరణాత్మకంగా చర్చించనున్నారు. ఇక దసరా నుంచి ప్రారంభం చేయబోతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంపై ఈ సమావేశంలో కలెక్టర్లతో చర్చించి మార్గదర్శకాలను రూపొందించనున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జిల్లా పర్యటనలు చేయనున్న నేపథ్యంలో..అంతకు ముందే చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశం వేదికగా గ్రౌండ్ ప్రిపేర్ చేయనున్నారు .

వేతనాలు అడిగితే దౌర్జన్యం చేస్తారా?

హైదరాబాద్ : ఆశావర్కర్లు హైదరాబాద్‌లో కదం తొక్కారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎక్కడిక్కడ పోలీసుల నిర్బంధకాండ కొనసాగినా ఆశాలు వెనుతిరగలేదు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌, ఎస్వీకే నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఎస్వీకే, ఎంబీ భవన్‌ దగ్గర ఆశా వర్కర్ల అరెస్ట్‌ కొనసాగుతోంది. అటు సీఐటియు నేతలను నిన్న రాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరును ఆశా వర్కర్లు తీవ్రంగా ఖండించారు. అన్ని రకాల పనులు చేయించుకుని ..

12:41 - October 9, 2015

హైదరాబాద్‌ : చార్మినార్‌ దగ్గర దానం నాగేందర్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.. రేపటి బంద్‌ను విజయవంతం చేయాలంటూ వీరంతా ప్రదర్శన జరిపారు.. ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ పోలీసులు ఈ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.. 

12:39 - October 9, 2015

విజయవాడ : ఎగ్‌ఫుడ్‌పై భారీగా ప్రచారం చేయాలన్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నేడు అంతర్జాతీయ ఎగ్ డే సందర్భంగా ఆయన ఎగ్ అవగాహనా ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను కూడా ఎగ్ తింటానని... అందువల్లే ఆరోగ్యంగా ఉన్నాని తెలిపారు. ప్రతిరోజూ అందరూ ఒక గుడ్డు తినాలని సూచించారు.. 

12:38 - October 9, 2015

'అభిమానులే నా దేవుళ్లు.. వారి లేనిదే నేను లేనని స్టేజీల మీద ఢంఖా బజాయించే మెగాస్టార్ చిరంజీవికి కొత్త చిక్కొచ్చి పడింది.' తాజాగా తన తనయుడు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా చిరంజీవి అభిమానులపై నోరుపారేసుకున్నారు. వేడుక ముగిసిన అనంతరం కారెక్కబోతున్న చిరును ఓ అభిమాని నమస్తే సార్ అంటూ పలకరించాడు. 'ఎన్ని సార్లు నమస్తే.. నమస్తే.. ఒక్కసారి చెబితే సరిపోదా స్టేజీ ఎక్కినప్పటినుండి చూస్తున్నాను ప్రతిసారి డిస్ట్రబ్ చేస్తున్నారు.. 'స్టుపిడ్ ఫెల్లోస్'' అంటూ ఘాటుగా స్పందించాడు చిరు. దీంతో ఒక్క క్షణం అభిమానులు ఆవాక్కయ్యారు. అయితే ఈ ఘటన జరిరుగుతున్నప్పుడు ఓ అభిమాని కెమెరాలో బందించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభిమానులే దేవుళ్లంటూ స్టేజీలమీద లెక్చర్లివ్వడం కాదు.. అదే అభిమానులను దూషించిన చిరంజీవి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ అంశంపై చిరంజీవి మళ్లీ స్పందించలేదు. చిరు 150వ చిత్రం చేయబోతున్న తరుణంలో అభిమానులపై నోరుపారేసుకోవడం ఆయన ఇమేజీకి ఒకింత డ్యామేజీ కలిగించే పని జరిగిందంటూ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రేక్షకులపై నోరుపారేసుకున్న విషయం మరిచిపోకముందే ఇది జరగడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

12:17 - October 9, 2015

'శ్రీమంతుడు' విజయం సాధించింది. మరో వైపు 'బ్రహ్మోత్సవం' షూటింగ్ కూడా శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ మరో భారీ ప్రాజెక్టులో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. ప్రముఖ నిర్మాతలు ఎన్‌.వి. ప్రసాద్‌, ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని రూ. 80కోట్లు వెచ్చించి తెరకెక్కించనున్నట్టు తెలిస్తోంది. అయితే ఇంత పెద్దయెత్తున ఖర్చు పెడుతుండటంతో ఆ సినిమాలో విజువల్‌ గ్రాఫిక్స్‌ తప్పకుండా ఉంటాయని సాదారణంగా అందరూ భావిస్తారు. కానీ ఈ సినిమాలో విజువల్‌ గ్రాఫిక్స్‌ అస్సలు లేవంట. ఈ చిత్రం రిచ్‌ లుక్‌ కోసమే ఇంత బడ్జెట్‌ వెచ్చిస్తున్నామని మురుగదాసు చెబుతున్నారు. అయితే ఈ చిత్రం కథా, ఇందులో నటించే నటీ, నటుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడించనున్నారు.

అగ్రి గోల్డ్ కేసు పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : అగ్రి గోల్డ్ కేసు పై హైకోర్టు తీర్పు వెలువరించింది. అగ్రి గోల్డ్ ఆస్తుల విక్రయానికి ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఈ ఏర్పాటు కానుంది. ఈ కమిటీకి అగ్రి గోల్డ్ ఛైర్మన్ పూర్తి సహకరించాలని, ఆస్తుల విక్రయాలు కమిటీ పర్యవేక్షణ లో జరగాలని హైకోర్టు ఆదేశించింది.

సాయంత్రంలోగా రుణమాఫీ పై ప్రకటన చేయాలి:రమణ

హైదరాబాద్‌ : తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రంలోగా రుణమాఫీపై ప్రకటన చేయాలని టీ టీడీపీ నాయకుడు ఎల్‌ రమణ డిమాండు చేశారు. శుక్రవారం కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల కోసం జీవో ఇచ్చారని, కాని రైతుల పట్ల కేసీఆర్‌ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి గెంటేశారని, అసెంబ్లీని మూడు రోజుల ముందే ముగించారని ఆయన విమర్శించారు. 

ప్రధాని మోదీ ప్రసంగాలపై ఈసీ దృష్టి...

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలను సమీక్షించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఆయన ప్రసంగాల్లో ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించారా? అన్న కోణంలో సమీక్ష జరగనున్నట్టు అదనపు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆర్ లక్ష్మణన్ తెలిపారు. ముంగేర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరుగుతుందని తెలిపారు. 'సైతాన్', 'యదువంశీయులు' వంటి పదాలను మోదీ వాడారని ఎన్నికల కమిషన్ కు కొన్ని పార్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు లక్ష్మణన్ వివరించారు.

ఏపీ రాజధాని శంకుస్థానపై కలెక్టర్ సమీక్ష...

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టరు కాంతిలాల్‌ దండే జిల్లా అధికారులతో సమీక్షించారు. పలు విదేశాల నుంచి కార్యక్రమానికి అతిధులు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టరు ఆదేశించారు. దేశ ప్రధానికి ఎలాంటి మర్యాదలు చేస్తారో సామాన్య ప్రజానీకానికి అదేస్థాయిలో మర్యాదలు చేయాలని కోరారు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టరు అధికారులను కోరారు. 

తమ ఉద్యమం ఆగదు : ఆశాలు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తమను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అన్యాయమని... అనేక నిర్బంధాలు ఎదిరించి అయినా తమ సమస్యలు పరిష్కరించుకుంటామని ఆశాలు స్పష్టం చేశారు. నిర్బంధాలు తమకు కొత్త కాదని...సమస్యలు పరిష్కరిచంచక పోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆశాలు హెచ్చరించారు. ఇప్పటికైనా తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

దద్దరిల్లిన హైదరాబాద్..

హైదరాబాద్ :  'కేసీఆర్ డౌన్ డౌన్… వందల జీతాలు మాకా..? వేల జీతాలు మీకా' అనే ఆశా వర్కర్ల నినాదాలతో హైదరాబాద్ దద్దరిల్లింది. ఆశా వర్కర్లను, వారిచ్చిన చలో అసెంబ్లీకి మద్ధతు తెలుపుతున్న సీఐటీయు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు.  తాము ఇండ్లల్లో లేకుంటే తమ భర్తలను, పిల్లలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నారంటూ ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని.. బతుకమ్మ పేరిట అమ్మ అంటూ.. హీనంగా చూస్తూ బలవంతంగా వ్యాన్లల్లోకి ఎక్కించి అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంతొంది: కాంగ్రెస్

ఖమ్మం : కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటుందని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మధుయాష్కీ, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, డీకే అరుణలు ఆరోపించారు. హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందని, కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఓపెన్‌ చేస్తే రైతులు వ్యవసాయం నేర్చుకుంటారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉప ఎన్నికలు, పదవుల పంపకాలపై చర్చలు జరపడం దుర్మార్గమన్నారు. కుటుంబం, అధికారం తప్ప కేసీఆర్‌కు మరోటి కనిపించడం లేదన్నారు. 

కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంతొంది: కాంగ్రెస్

ఖమ్మం : కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటుందని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మధుయాష్కీ, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, డీకే అరుణలు ఆరోపించారు. హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందని, కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఓపెన్‌ చేస్తే రైతులు వ్యవసాయం నేర్చుకుంటారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉప ఎన్నికలు, పదవుల పంపకాలపై చర్చలు జరపడం దుర్మార్గమన్నారు. కుటుంబం, అధికారం తప్ప కేసీఆర్‌కు మరోటి కనిపించడం లేదన్నారు. 

మగ పోలీసులు ఈడ్చి పడేస్తున్నారు: ఆశాల ఆవేదన

హైదరాబాద్ :తమ సమస్య పరిష్కరించమని కోరుతూ ఆశాలు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చిన  తమను  మగ పోలీసులతోఈడ్చిపడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎంను చరిత్రలో ఇంత వరకు చూడలేదని మండి పడుతున్నారు. చేతనైతే తమ సమస్యలను పరిష్కరించాలి తప్ప ఆడవాళ్ల పై తమ ప్రతాపం చూపడం ఎంత వరకు సమంజసం అన్ని ఆశాలు ప్రశ్నిస్తున్నారు.

 

తమ భర్తలు, పిల్లలు అరెస్టు చేశారు

హైదరాబాద్ :తమ సమస్య పరిష్కరించమని కోరుతూ ఆశాలు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చిన తమ భర్తలను, పిల్లలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆశాలు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించను చేతకాని కేసీఆర్ ఇలాంటి దుర్మార్గాలకు పాలుపడుతున్నాడని మండి పుడుతన్నారు. చేతనైతే తమ సమస్యలను పరిష్కరించి కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సిఐటియు నేత సాయిబాబు అరెస్ట్

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీ క్రాస్ వద్ద ఎంబీ భవన్ వద్ద నుండి ర్యాలీగా బయలు దేరిన ఆశాలకు మద్దతు తెలిపిన సిఐటియు నేత సాయిబాబు ను పోలీసులు అరెస్టు చేశారు.

కేసీఆర్ కూతురే ఆడ బిడ్డనా... మేము కాదా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కూతురు కవిత, కేసీఆర్ భార్యనే ఆడవాళ్లా.. మేము ఆడావాళ్లం కాదా అని ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించమంటే మగ పోలీసులను పెట్టి మమ్మల్ని కొట్టిస్తుండు.. అరెస్టు చేయిస్తుండు... మెడకు తాడులు కట్టి తోసేస్తుండు.. ఇదే కేసీఆర్ సంస్కృతి.. అంటూ ఆశాలు కేసీఆర్ ను నిలదీస్తున్నారు. కేసీఆరే కాదు తాగేది... మేము కూడా కేసీఆర్ ఫాం హౌస్ ముందు మందుబాటిళ్లు తీసుకుని చస్తాం అని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేలుకొని తమ సమస్యలు పరిష్కరించాలని హెచ్చరించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తొపులాట

హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీ క్రాస్ వద్ద ఎంబీ భవన్ వద్ద నుండి ర్యాలీగా బయలు దేరిన ఆశాలను మగ పోలీసులు వచ్చి ఆడవాళ్లను తోసి, తొక్కేసి అరెస్టులు చేస్తున్నారు. ఇదే కేసీఆర్ కూతురు, కేసీఆర్ భార్యపై పొగ పోలీసులు చేతులు వేస్తే వూరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కేసీఆర్ పారిపోయాడు: జ్యోతి

హైదరాబాద్ : తమ సమస్య పరిష్కరించమని కోరుతూ ఆశాలు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇస్తే అసెంబ్లీ సమావేశాలను ఆపేసి కేసీఆర్ పారిపోయాడని సీపీఎం నేత జ్యోతి ఆరోపించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆశాలు ఎంబీ భవన్ నుండి బయలు దేరారు. వీరికి మద్దతు తెలుపుతూ జ్యోతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ ఎక్కడున్నా పట్టుకుంటామని... ఇప్పటికైనా మించి పోయింది లేదని ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఎక్కడున్నా పట్టుకుంటాం : సాయిబాబు

హైదరాబాద్ : ఆకలి కోసం... బతుకుదెరువుకోసం పోరాటాన్ని అణచలేరు. ఇది చరిత్ర చెబుతోన్న సత్యం అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు తెలిపారు. ఆశాల పోరాటం బతుకు దెరువు పోరాటం... చలో హైదరాబాద్ చేపట్టిన ఆశాలను నిర్బంధాలకు గురి చేస్తున్నా చలో హైదరాబాద్ కు చేరి కేసీఆర్ ఎక్కడ వున్నా పట్టుకుని తమ సమస్యలు పరిష్కరించుకునే ధైర్యం ఆశా వర్కర్ల కు ఉందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు తెలిపారు.

ఎంబీ భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాని కోరుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న ఎంబీ భవన్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలు దేరిన ఆశాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో వారి మధ్య తోపులాటలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది. 

చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల అరెస్ట్

హైదరాబాద్‌: శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం చార్మినార్‌ నుంచి ర్యాలీ ప్రారంభించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల రుణ మాఫీ ఏకకాలంలో చేయాలని, అలాగే పెంచిన ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని చార్మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి లేదని చెప్పడంతో...

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీగా బయలు దేరిన ఆశాలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆశాలు.. పోలీసుల మధ్య దోపులాటలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపనకు భూమి పూజ...

అనంతపురం : జిల్లాలోని హిందూపురం పారిశ్రామికవాడలో ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ భూమిపూజ చేశారు. పారిశ్రామికవాడలో కొత్తగా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ పై కేసు నమోదు...

హైదరాబాద్ : ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మరాజశేఖర్ పై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తనపై రాజశేఖర్ దాడి చేశారని ఆరోపిస్తూ వెంకటరెడ్డి అనే జిమ్ ట్రైనర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎల్లారెడ్డిగూడలో నివాసముండే రాజశేఖర్ ఫ్లాట్ కింది అంతస్థులో కోటిరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి అద్దెకు ఉంటున్నాడు. టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టారనే విషయంలో పోయిన ఆదివారం వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో వెంకట్ ఇంటిని ఖాళీ చేశాడు. మిగిలిన వస్తువులు తెచ్చుకునేందుకు తన స్నేహితుడుతో కలసి నిన్న(గురువారం) అక్కడికి వెళ్లాడు.

11:01 - October 9, 2015

హైదరాబాద్ : తమ ఇంట్లో దొంగతనం జరిగింది.. తమకు న్యాయం చేయండి అని పీఎస్ కు వెళ్లిన అని ఓ దళిత కుటుంబంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో జరిగింది. సునీల్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్ కుటుంభం ప్రవీణ్ ను నిలదీసింది. అంతే.... పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు. డ్రస్సులో ఉన్న పోలీసులు, డ్రస్సుల్లో లేని పోలీసులు అందరూ కలిసి ఒక్క సారి సునీల్ కుటుంబ సభ్యులు, బంధువుల మీద పడ్డారు. కొట్టుకుంటూ రోడ్డుమీదికి ఈడ్చుకొచ్చారు. సునీల్ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్ బట్టలు కూడా చించి పడేశారు. అడ్డుకున్న బంధువులను చితక్కొట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ ʹఎఫ్ ఐ ఆర్ రాయాల్నా వద్దా అనేది నా ఇష్టం నన్నే ప్రశ్నిస్తారా ʹ అని బూతులు తిట్టుకుంటూ నగ్నంగా ఉన్న సునీల్ ను అతని భార్యను రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టాడు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్యపై, బంధులవులపై క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఈ దుర్మార్గం జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ దాడి సంఘటనపై జర్నలిస్టులు ప్రవీణ్ యాదవ్ ను ప్రశ్నిస్తే అసలు అలాటిదీమీ జరగలేదని. సునీల్ కుటుంబమే పోలీసులపై దాడికి ప్రయత్నించిందని అందుకే వారందరి పై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పాడు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఆటో బోల్తా ..పది మందికిగాయాలు...

నల్గొండ : రాజాపేట మండలం రఘునాథపురం దగ్గర పత్తి కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 21 మంది కూలీలున్నారు.

కేసీఆర్ ఫాం హౌస్ లో నిద్ర పోతున్నాడు.....

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ చలో అసెంబ్లీకి వస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులతో ఎక్కడిక్కడ అరెస్టు చేస్తూ సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ నిద్ర పోతున్నాడా అంటూ ఆశాలు మండి పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాం హౌస్ ను ముట్టడించాలని ఆశా వర్కర్లు, సిఐటియు నేతలు పిలుపు నిచ్చారకు. ఈ మేరకు బయలు దేరిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలను పరిష్కరించక పోతే మిలిటెంట్ పోరాటాలు చేసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆశాలు హెచ్చరిస్తున్నారు.

మురికి కాలువలో పసికందు మృతదేహం

చిత్తూరు : తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రి వద్ద మురికి కాలువలో పసికందు మృదేహం లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికులు కాలువ శుభ్రం చేస్తుండగా పసికందు మృదేహం బయటపడింది.

10:34 - October 9, 2015

హైదరాబాద్ : పోలీసులు రజాకార్ల మాదిరి వ్యహరిస్తున్నారని వరంగల్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి చుక్కయ్య విమర్శించారు. ఆయన వరంగల్ లో టెన్ టివితో మాట్లాడుతూ...తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని... ఈ నేపథ్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని మండి పడ్డారు. అంతే కాక ఆశా కార్యకర్తల ఇళ్ల మీద పడి ఆశా వర్కర్ల భర్తలను, పిల్లలను కూడా చితకొట్టి అరెస్టు చేస్తున్నారని... ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అరెస్టు చేసిన వారిని ఓ ఫంక్షన్ హాల్ నిర్బంధించారని... కనీసం వారికి తినడానికి తిండి కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్, ఆందోళనలు చేపడతామని తెలిపారు.

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి సిఐటియు పిలుపు

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం చేయడాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ నిర్వహిస్తున్న ఆశాలను ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో సీఎం కేసీఆర్ ఉండడంతో... ఫాం హౌస్ ను ముట్టడించాలని సిఐటియు పిలుపునిచ్చింది. దీంతో సిఐటియు కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాం హౌస్ కు బయలు దేరారు.

హజ్ తొక్కిసలాటలో 101కి చేరిన భారతీయ మృతులు

హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 101కి చేరింది. మరో 32 మంది ఆచూకీ ఇంకా తెలియడంలేదు. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతదేహాలను జెడ్డాలోని మొస్సైమ్ మార్చూరీలో ఉంచినట్టు భారత కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు.

బావిలో దూకి రైతు ఆత్మహత్య

కర్నూలు : జిల్లాలోని కొత్తపల్లి మండలం శివపురంలో అప్పుల బాధతో బావిలో దూకి రైతు దేవదానం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనతో మృతుడి బంధువులు రోదించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్లుకు పైగా లాభపడి 27, 000 మార్క్ దాటింది. ఇక నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 8200 వద్ద ప్రారంభమైంది.

10:11 - October 9, 2015

హైదరాబాద్ : తెలంగాణకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలిస్తోంది. పరిశ్రమలకు, ఇతరత్రా అవసరాలకు నీళ్లు కావాలంటే ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మధ్యతరహా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు.. ప్రభుత్వం నడుంబిగించింది. దాదాపు 2వేల 800 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

పాత కాంట్రాక్టలన్నీ రద్దు చేయాలని యోచించిన సర్కార్‌....

ఈనేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయించేందుకు.. అదనపు చెల్లింపులు జరపడానికి ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక దశలో పాత కాంట్రాక్ట్‌లన్నీ రద్దు చేయాలని యోచించిన ప్రభుత్వం... కొత్తగా టెండర్లు పిలవాలని కూడా భావించింది. అయితే.. ఆలోచనను విరమించి.. ప్రాజెక్ట్‌లను పూర్తి చేయించేందుకు.. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించేందుకు... ఉత్తర్వులు జారీ చేసింది.

2014 ఏప్రిల్‌ 1 నుంచి చెల్లింపులు......

ఈ ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే కాంట్రాక్టర్ల తప్పిదాలు లేని పనులకే అంచనా వ్యయం, పెంపు వర్తింస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం నిధులను ఒకేసారి కాకుండా.. మొదట 40శాతం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. బ్యాంక్‌ గ్యారెంటీ ఇచ్చాక మరో 40శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన 20శాతం నిధులను పనులు పూర్తయ్యాక చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎస్‌ నేతృత్వంలోని కమిటీకి ఆమోదముద్ర.....

అన్ని వస్తువుల ధరలు పెరగడంతో.. ఆ విధంగా కూడా ప్రభుత్వం యోచించింది. పెరిగిన ధరలకు కూడా బిల్లులు చేసేలా కాంట్రాక్టర్లకు కొంత వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించాకే.. పెరిగిన ధరలను చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. మొత్తంగా నీటి ప్రాజెక్ట్‌ల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

10:09 - October 9, 2015

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ బస్సుల్లో ఒకటి మణుగూరునుంచి హైదరాబాద్‌కు వస్తుందగా... మరో బస్సు హైదరాబాద్‌నుంచి విజయవాడ వెళుతోంది.. అతి వేగంతో గుద్దుకోవడంతో రెండు బస్సులు నుజ్జు నుజ్జయ్యాయి.. ఇదే జిల్లాలో బుధవారం రామన్నపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పదిమంది మృత్యువాత పడ్డారు.. 

10:07 - October 9, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు. పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు... హస్తినలో నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 10కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అతడిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇందిరాపార్క్ వద్ద ఆశాల అరెస్ట్

హైదరాబాద్ : తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ... చలో హైదరాబాద్‌కు వస్తున్న ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 10 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమకు 15 వేల కనీస వేతనం ఇవ్వాలని ఆశావర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

సికింద్రాబాద్ లో 150 ఆశా కార్యకర్తల అరెస్ట్...

హైదరాబాద్ : వేతనపెంపు కోరుతూ ఆశావర్కర్లు తలపెట్టిన చలో హైదరాబాద్‌కు బయలుదేరిన 150 మంది ఆశా కార్యకర్తలను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేతనాల పెంపు సహా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చలో హైదరాబాద్‌కు పిలుపు నిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. 

ఉద్రిక్తంగా ఆశాల చలో హైదరాబాద్

హైదరాబాద్ : వేతనపెంపు కోరుతూ ఆశావర్కర్లు తలపెట్టిన చలో హైదరాబాద్ ఉద్రిక్తంగా మారుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ 40రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. వారు ఇవాళ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఆశావర్కర్లను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఆశా వర్కర్లను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచే అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు.. మహిళలను అరెస్ట్ చేస్తున్నారు.

రేపు విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ....

హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయం సమీపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఎలాంటి చిన్న లోపాలు లేకుండా నిర్వహించాలని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో రేపు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో అమరావతి శంకుస్థాపనపైనే ప్రధాన చర్చ జరగనుంది.  

65 ఎర్రచందనం దుంగలు పట్టివేత

నెల్లూరు: సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీప్రాంతంలో శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.50లక్షల విలువైన 65ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ-విశాఖ మధ్య శతాబ్ధి రైలు..

హైదరాబాద్ : విశాఖపట్నం.. విజయవాడ మధ్య శతాబ్ది రైలును నడిపేందుకు రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు అనుమతించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు గురువారం సురేశ్‌ ప్రభును రైల్‌భవన్‌లో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఉదయం 6 గంటలకు విశాఖలో బయలుదేరి 3-4 గంటల్లో విజయవాడ చేరేలా.. తిరిగి సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన సురేశ్‌ ప్రభు.. అప్పటికప్పుడు రైల్వే బోర్డు ట్రాఫిక్‌ విభాగం సభ్యుడిని పిలిచి మాట్లాడారు. కొత్త రాజధానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి.. దసరా నాటికి ఈ రైలు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

విజయవాడలో గుడ్డు ప్రేమికుల ర్యాలీ

విజయవాడ : నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి సిద్ధార్ధ కాలేజీ వరకు గుడ్డు ప్రేమికుల ర్యాలీని జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గుడ్డు ప్రేమికులు పాల్గొన్నారు. 

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్ట్...

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. నైజీరియన్‌ నుంచి పది కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

భారీగా పోలీసుల మోహరింపు...

హైదరాబాద్ : ఆశా వర్కర్ల చలో అసెంబ్లీ సందర్భంగా ఎస్ వీకే, ఎంబీ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తున్న వేలాది మంది కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేసిన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అయినప్పటికీ చలో అసెంబ్లీ కార్యక్రమాని చేపడతామని ఆశాలు హెచ్చరిస్తూ పోలీసులకు, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆశాల సమస్యలు పరిష్కరించడం చేతకాని వారిపై నిర్బంధ కాండను ప్రయోగించడం కేసీఆర్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం అని కార్మికులు ఆరోపిస్తున్నారు.

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్ : మందరమర్రి మండలం రామకృష్ణా పూర్ లోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.

08:30 - October 9, 2015

హైదరాబాద్ :యూనివర్శిటీలన్నీ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లు కాదు అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొ. నాగేశ్వర్ అన్నారు. తెలంగాణలో వివిధ యూనివర్శిటీలకు సీయమ్మే ఛాన్సలర్ గా ఉండబోతున్నారా? యూనివర్శిటీలు ప్రభుత్వం కోసం పని చేసినా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు కాదు? బిజెపికి, టిడిపికి దూరం పెరుగుతోందా? టిడిపి సార్కర్ పై బిజెపి ఎంపి సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏ సంకేతాలను సూచిస్తున్నాయి? ప్రత్యేక హోదా పై పురందేశ్వరి కామెంట్స్ కరెక్టేనా? ఇంకా ఈ అంశాలపై నాగేశ్వర్ ఎలాంటి విశ్లేషణ చేశారో మీరూ వినాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

08:23 - October 9, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఓ వైపు ప్రతి పక్షాలు తీవ్ర ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. ప్రత్యేక హోదా గురించి అడిగితే కుక్క కథ చెప్పి విమర్శల పాలయ్యిందో బీజేపీ ఎంపీ. బీజేపీ విశాఖ ఎంపీ పురుందేశ్వరీ మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ప్రత్యేక హోదాకంటే ఎక్కువ లబ్ది చేకూర్చే విధంగా ప్యాకేజీలు ఇస్తుంటే పదేపదే ప్రత్యేక హోదాగురించి మాట్లాడటం సరికాదని ఆమె పురుదేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాల చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ సిద్దంగా ఉన్నారని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఆమె అంతటితో ఆగకుండా మరికొంచెం ముందుకెళ్లి ప్రత్యేక హోదాకు ముడిపెడుతూ పురందేశ్వరి ఓ కుక్క కథ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై విపక్షాలనుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం వెళ్లువెత్తుతున్నాయి. ఇంకా పురందేశ్వరి ఏమన్నారో ఆమె మాటల్లోనే..   

08:06 - October 9, 2015

హైదరాబాద్ : దసరా సందర్భంగా తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలకు అధికారిక ముద్రను కేసీఆర్ ఆమోదించారు. ఓ చెరువు, చెట్లు, పూలు, పచ్చిక నేపథ్యంలో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆటాడుతున్నట్టు రూపొందించిన ఈ ముద్రను కేసీఆర్ ఆదేశాల మేరకు సాంస్కృతిక శాఖ తయారు చేయించింది. తెలంగాణ జీవనానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 12 నుంచి 20 వరకూ సాగనున్నాయి. మహిళా సాధికారత, ప్రకృతి ఆరాధన, చెరువుల పరిరక్షణ అంశాలను ప్రతిబింబించేలా దీన్ని తయారు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.  

08:01 - October 9, 2015

హైదరాబాద్ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా వారిని ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్బంధం చేయడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం అని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు చేపట్టిన వారిని ఎక్కడిక్కడ అరెస్టు చేస్తోంది. ఇది ఎంత వరకు సబబు? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, టిడిపి నేత శ్రీరాములు, బిజెపి ఆచారి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేత మురళీకృష్ణ పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై చర్చించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

కోఠి : ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించిన ఘటన హైదరాబాద్ కోఠీలో చోటు చేసుకుంది. ఐడీఏ బొల్లారానికి చెందిన గర్భిణి లక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతూ... ఆసుపత్రికి చేరుకోక ముందే మార్గ మధ్యంలో పరిటినొప్పులు రావడంతో కోఠి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా వద్ద మహిళ ప్రసవించింది. వెంటనే తల్లీ, బిడ్డ ను కోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : సాయిబాబు

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు కోరుతూ ఆదోళన చేపట్టిన ఆశావర్కర్లు తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని... అడుగడుగునా ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్భంధాలతో కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విమర్శించారు. చెవిటి ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారిపోకుండా సమస్య పరిష్కారం పై దృష్టి సారించాలని మండి పడ్డారు.

 

మూడో రోజుకు చేరిన జగన్ దీక్ష...

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం మూడోరోజుకు చేరుకుంది. వైఎస్‌ జగన్‌ దీక్షకు మద్ధతుగా ఏపీలోని అన్ని మండల కేంద్రాల్లో వైసీపీ కార్యకర్తలు ర్యాలీలు తీస్తున్నారు.

దసరా పండుగ.. ప్రత్యేక రైళ్ల వివరాలు..

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 12, 17వ తేదీల్లో తిరుపతి -సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లుంటాయని, 25వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు స్పెషల్ రైలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. 13, 18 తేదీల్లో సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య, 14, 19 తేదీల్లో విశాఖపట్నం - తిరుపతి మధ్య రైళ్లు తిరుగుతాయని, 26, 27 తేదీల్లో తిరుపతి - విశాఖల మధ్య రైళ్లు నడిపిస్తామని వివరించారు. వీటితో పాటు రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

06:51 - October 9, 2015

హైదరాబాద్ : రైతు రుణ‌మాఫీపై ప్రభుత్వాన్ని ఎండ‌గ‌ట్టడానికి ప్రతిప‌క్షాల‌న్ని ఏకమ‌య్యాయి.ఇప్పటికే అసెంబ్లీలో ఒక్కటిగా స‌ర్కార్ పై ముప్పెట దాడి చేసిన పార్టీలు.. ఇప్పుడు తెలంగాణ బంద్ తో ఊరువాడాను ఏకం చేసి ఒత్తిడి పెంచాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 10న త‌ల‌పెట్టిన తెలంగాణ బంద్‌ ను విజయవంతం చేయ‌డానికి న‌డుంబిగించాయి విప‌క్షాలు.

రైతు భరోసా యాత్రల‌ను పూర్తి చేసిన కాంగ్రెస్....

ఇప్పటికే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , రంగారెడ్డి , ఖ‌మ్మం జిల్లాల్లో రైతు భరోసా యాత్రల‌ను కాంగ్రెస్ పూర్తి చేసింది. మ‌రోవైపు టిడిపి బిజేపీలు ఉమ్మడిగా రైతుల ప‌క్షాన ధర్నాలు, పాద‌యాత్రల‌తో వాయిస్ పెంచాయి. ఇంకోవైపు వామ‌ప‌క్షాలు రాష్ట్ర బంద్‌ ను విజ‌యవంతం చేయాల‌ని ప్రజ‌ల్లోకి వెళ్లింది. అసెంబ్లీ నుంచి సభ్యులు స‌స్పెండ్ కావడంతో అన్ని పార్టీలు అన్నదాత ఆత్మహ‌త్యల‌పై ప్రభుత్వం తీరును ఎండ‌గ‌డుతున్నాయి.

బంద్‌ను విజ‌య‌వంతం చేయ‌డంపై దృష్టి...

ఇక రాష్ట్ర బంద్‌కు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతుండ‌టంతో.. బంద్‌ను విజ‌య‌వంతం చేయ‌డంపై పార్టీలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బంద్‌ స‌క్సెస్ చేసేందుకు ప‌క్కా ప్రణాళిక‌ల‌తో రంగంలోకి దిగింది. ప్రధానంగా హైద‌రాబాద్ మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్... పార్టీ అనుబంధ సంఘాల‌న్నింటినీ రంగంలోకి దించుతోంది. సీనియ‌ర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంజీబీఎస్, జానారెడ్డి జూబ్లీబ‌స్టాండ్‌, భ‌ట్టి రాణిగంజ్, ష‌బ్బీర్ అలీ మెహ‌దీప‌ట్నం, ముషీరాబాద్ దానం నాగేంద‌ర్, బ‌ర్కత్ పురాలో విహెచ్ ల‌తోపాటు మాజీ ఎమ్మెల్యేల‌ను డిపోల వ‌ద్ద బంద్ లో పాల్గొనేవిధంగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించుకుంది. మొత్తానికి రైతుల ఎజెండాగా సిద్దాంతాలు, అజెండాల‌ను ప‌క్కన బెట్టి మ‌రీ ప్రతిప‌క్షాలు ఒక్కటిగా తెలంగాణ బంద్‌ స‌క్సెస్ చేసేందుకు కృషిచేస్తున్నాయి.

06:48 - October 9, 2015

హైదరాబాద్ : ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతల కల త్వరలోనే నెరవేరబోతోంది. నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని గులాబీ బాస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు అనేక సలహాలు, సూచనలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని హితబోధ చేశారు.

నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు.....

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వారంతా ఇప్పుడు పదవుల కోసం ఎంతో ఆశగా.. ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్‌ పదవులను ఎప్పుడో కట్టబెట్టాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు పార్టీశ్రేణులు అసంతృప్తి చెందకుండా.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

దసరాలోపు నామినేటెడ్ పదవుల భర్తీ .....

టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ పార్టీ నాయకులకు కీలక సూచనలు, సలహాలు చేశారు. దసరాలోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. సంక్షేమ పథకాలను నిరంతరం సమీక్షించాలని ప్రజాప్రతినిధులను సీఎం ఆదేశించారు. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ పథకాలను ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఆదేశించారు. దసరాకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇటు రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని మంత్రులను కేసీఆర్‌ ఆదేశించారు.

త్వరలోనే టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు......

త్వరలోనే టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. పాత, కొత్తవారిని కలుపుకొని పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో నాయకుల మధ్య గ్రూప్‌ విభేదాలు వస్తే సహించేదిలేదని నేతలను గులాబీ బాస్‌ హెచ్చరించారు. పరిమిత సభ్యులతో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దసరా తర్వాత జిల్లాల పర్యటనకు కేసీఆర్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పుడు కూడా తగిన గుర్తింపు ఉంటుందని మంత్రులు చెప్పుకొచ్చారు. 

చలో హైదరాబాద్ నిర్వహించి తీరుతాం: ఆశాలు

హైదరాబాద్ :వేతనపెంపు కోరుతూ గత 40 రోజులుగా ఆశావర్కర్లు సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటంతో నేడు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దీంతో చలో హైదరాబాద్‌ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయాలని టీఎస్‌ సర్కార్‌ భావించింది. సర్కార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశా వర్కర్లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచే అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఈ అరాచకానికి సాక్ష్యంగా వేలాది ఆశా వర్కర్లు పోలీసుల అదుపులో ఉన్నారు.

06:45 - October 9, 2015

హైదరాబాద్ : వేతనాల పెంపు కోరుతూ ఆశావర్కర్లు తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. అడుగడుగునా ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్భంధాలతో కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే బస్టాండ్‌,రైల్వే స్టేషన్లలో మోహరించిన పోలీసు బలగాలు ఆశావర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే ఆశావర్కర్ల గొంతు నొక్కేందుకు తెలంగాణ సర్కార్‌ విఫలయత్నం చేస్తోంది.

అడుగడుగునా అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్బంధాలు....

వేతనాలు పెంచమని అడిగినందుకు అడుగడుగునా అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్బంధాలు. గద్దెనెక్కిన నాటి నుంచి ప్రజా ఉద్యమాలను అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆశావర్కర్లపై కూడా అధికార జులుంను ప్రదర్శించింది. 40 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశావర్కర్లు.. తమ సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేశారు. హైదరాబాద్‌కు రాకుండా కట్టడి చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కి.. వేలాది మందిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు.

గురువారం ఉదయం నుంచే అరెస్టుల పర్వం...

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం ఉదయం నుంచే ఆశావర్కర్లను, సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం నుంచి... అర్ధరాత్రి వరకు ఆశావర్కర్లను ఎక్కడికక్కడే నిర్బంధించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ఆశావర్కర్లను పోలీసుల అరెస్ట్‌ చేశారు. ముందస్తు అరెస్ట్‌ల పేరుతో తమను అదుపులోకి తీసుకుని.. తాగేందుకు నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు.

ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా....

ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా దాదాపు 15వందల మంది ఆశావర్కర్లను అరెస్ట్‌ చేశారు. ముఖ్యకేంద్రాలైనా భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, మధిర ప్రాంతాల్లో ఆశావర్కర్లను, సీఐటీయూ నేతలను నిర్బంధించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉదయం నుంచి అరెస్ట్‌లు కొనసాగాయి. ర్యాలీగా వెళ్లినవారిని అరెస్ట్‌ చేసి.. స్టేషన్‌లో నిర్బంధించారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లపై ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శాంతియుతంగా నిర్వహిస్తామని అనుమతి కోరినా..

శాంతియుతంగా చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని అనుమతి కోరినా.. ప్రభుత్వం నిరాకరించిందని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఆశావర్కర్ల సమస్యలు పట్టకపోవడం విచారకరమని ఆశావర్కర్లు మండిపడుతున్నారు.

06:42 - October 9, 2015

హైదరాబాద్ : గుడ్డు శాఖాహారమా? మాంసాహారమా? అనే మీమాంసను పక్కనపెడితే ఇది చక్కటి పోషకాహారమన్నది అందరూ అంగీకరిస్తూ వున్నదే. పిల్లల నుంచి వ్రుద్ధుల వరకు అన్ని వయస్సుల వారు ఆరగించదగ్గ ఆహారమిది. లావు తగ్గాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు, డైటింగ్ చేసేవారు ఇలా ఎవరైనా తినదగ్గ పదార్ధమిది. ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వీటన్నింటిన సమ్మిళిత ఆహారం. అందుకే గర్భిణీలకూ, ఎదిగేపిల్లలకు ఇదెంతో మేలు చేస్తుంది. శుక్లాల బారి నుంచి కంటిని కాపాడే శక్తి దీనికివుందంటారు. రొమ్ము కేన్సర్ రిస్క్ నూ తగ్గిస్తుంది. మెదడుకీ మంచే చేస్తుంది. గుడ్డును ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయన్నది వట్టి అపోహేననీ కూడా పరిశోధనలో తేలిపోయింది. శిరోజాలకూ మేలు చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలుండబట్టే ప్రతి మనిషీ ఏడాదికి కనీసం 180 గుడ్లయినా తినాలంటూ సూచించింది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే కనీసం రెండు రోజులకొక్కసారైనా ఎగ్ తినాలన్నమాట. అయితే, మన దేశంలో ఆ అద్రుష్టం వున్నవారు చాలా కొద్ది మందే. మన దేశంలో గుడ్ల వినియోగానికి సంబంధించిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యంతో కూడిన ఆవేదన కలుగుతుంది. మనదేశంలో సగటు వినియోగం కేవలం 60 గుడ్లు మాత్రమే. లెక్క ప్రకారం రెండు రోజులకో ఎగ్ తినాల్సి వుండగా, వారానికో ఎగ్ తో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. ఈ మాత్రం భాగ్యానికీ నోచుకోలేనివారు మరెందరో. మహానగరాల్లో సగటు వినియోగం ప్రమాణాలకు కాస్త దగ్గరగా వున్నా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం చాలా తక్కువగా వుంది. చిన్న పట్టణాల్లో ఏడాదికి సగటు వినియోగం 40 గుడ్లు కాగా, కాస్త అభివ్రుద్ధి చెందిన గ్రామాల్లో 20కే పరిమితమైంది. ఇక మారుమూల పల్లెల్లో ఏడాదికి సగటున కనీసం అయిదు గుడ్లైనా తినడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. వినియోగం విషయంలో ఎలా వున్నా కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ పొజిషన్ లోనే నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర గుడ్ల ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. మొత్తం దేశంలో ఉత్పత్తిఅవుతున్న కోడిగుడ్లలో దాదాపు 70శాతం ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుండడం విశేషం. ఇక కోడి గుడ్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచంలో మన దేశానిది రెండో స్థానం. మనదేశంలో వేగంగా వ్రుద్ధి చెందుతున్న రంగాలలో పౌల్ట్రీ పరిశ్రమ ఒకటి కావడం విశేషం. చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభుత్వ సహకారం లేకుండానే మన దేశంలో పౌల్ట్రీరంగం విస్తరిస్తోంది. ఇప్పటికే పౌల్ట్రీ ఉత్పత్తుల టర్నోవర్ 90 వేల కోట్లు దాటింది. లక్ష కోట్ల మైలురాయిని దాటేందుకు సమాయత్తమవుతోంది. అయిన్నప్పటికీ, ఈ రంగం అభివ్రుద్ధికీ, విస్తరణకీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సహాలు చాలాచాలా స్వల్పం. దాణా ఖర్చులు, కరెంటు బిల్లులు, కరెంట్ కోతలు, రవాణా ఖర్చులు కోళ్ల పరిశ్రమ అభివ్రుద్ధికి ప్రధాన ఆటంకాలుగా మారుతున్నాయి. కొన్ని చోట్ల కరువు దెబ్బతీస్తుంటే, మరికొన్ని చోట్ల తుఫాన్లు కోళ్ల పెంపకందారుల పొట్టకొడుతున్నాయి.

06:40 - October 9, 2015

హైదరాబాద్ : నేడు అంతర్జాతీయ గుడ్ల దినోత్సవం. ప్రతి ఏటా అక్టోబర్ రెండో శుక్రవారం నాడు గుడ్ల దినోత్సవంగా పాటించడం ఆనవాయితీ. ఎగ్ డే ను కోళ్ల పరిశ్రమ ఓ పర్వదినంలా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా మన దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఈ పరిశ్రమ విస్తరణకు వున్న అవకాశాలేమిటి? కోళ్ల పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలేమిటి? పరిశ్రమాభివ్రుద్ధికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి సహకారం అందించాల్సి వుంది? మార్కెటింగ్ సౌకర్యాలు ఎలా వున్నాయి? తదితర అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో నెక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. మరి ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు లోకాయుక్త సమన్లు...

హైదరాబాద్‌: ఆం ధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మహి ళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు లోకాయుక్త సమన్లు జారీ చే సింది. వివాహాల నమోదు చట్టం- 2002ను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను నవంబర్‌ 4వ తేదీ న లోకాయుక్త ముందు స్వయంగా హాజరు కావాలని లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి రెండు రాష్ట్రాల సీ్త్ర, శి శు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. 

నార్కట్ పల్లి శివారులో 2 ఆర్టీసీ బస్సులు ఢీ

నల్గొండ్ : నర్కట్ పల్లి శివారులోని కామినేని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

ఆశా వర్కర్ల పై ఉక్కుపాదం

హైదరాబాద్ :తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల పై కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నేడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను ఆరెస్టు చేస్తూ భయానకవాతావరణం నెలకొంది. తాము గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా... ప్రభుత్వం తమన పట్టించుకోవడం లేదంటూ ఆశ వర్కర్లు శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. అయితే.... చలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Don't Miss