Activities calendar

11 October 2015

సాహిత్య అకాడమీ నుంచి తప్పుకున్న అరవింద్ మలగట్టి

ఢిల్లీ : కన్నడ రచయిత అరవింద్ మలగట్టి సాహిత్య అకాడమీ నుంచి తప్పుకున్నారు. కల్బూరి హత్యకు నిరసనగా నిర్ణయం తీసుకున్నారు. 

22:09 - October 11, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కేవలం 397 మందేనట. సాక్షాత్తు ప్రభుత్వమే ఈ సంఖ్యను ప్రకటించింది. తమ జాబితలోని రైతు కుటుంబాలకే పరిహారం దక్కుతుందని స్పష్టం చేసింది. దాదాపు రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు లెక్కలు చెబుతుంటే.. ప్రభుత్వం ఆ సంఖ్యను పాతిక శాతానికి తగ్గించడం విశేషం.
రోజూ పదుల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు
తెలంగాణలో రోజూ పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకూ 397 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గడచిన ఏడాదిన్నర కాలంలో.. కనీసం రెండువేల మంది వరకూ రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించడం గమనార్హం.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం
జూన్‌ రెండో తేదీ నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ మొత్తాన్ని తమ జాబితాలోని వారందరికీ ఇవ్వలేమని చేతులెత్తేస్తోంది. దీనికి సాంకేతిక కారణాలను సాకుగా చూపుతోంది.
వామపక్షాలపై విరుచుకుపడ్డ కవిత
ప్రభుత్వ జాబితాలోని రైతు కుటుంబాలకు నవంబర్‌ నుంచి ప్రతి నెలా రెండున్నర వేల రూపాయల చొప్పున ఇవ్వాలని తెలంగాణ జాగృతి నిర్ణయించినట్లు కవిత తెలిపారు. ఇదే సందర్భంలో.. ఆశా వర్కర్ల మస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వామపక్షాలపైనా కవిత విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరును.. దసరా ముందు పగటి వేషగాళ్లలా ఉందంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి కవిత ప్రకటనలు.. రాష్ట్రంలో సరికొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి.

 

22:02 - October 11, 2015

ఖాట్మాండు : నేపాల్‌లో ఎర్రజెండా రెపరెపలాడింది. దేశ కొత్త ప్రధానిగా కమ్యూనిస్టు పార్టీ నేత కె.పి.శర్మవోలి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సుశీల్‌ కోయిరాలపై.. శర్మ భారీ ఆధిక్యంతో గెలిచారు. నేపాల్‌ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీ విజయఢంకా మోగించింది. సరికొత్త రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్‌ కొత్త ప్రధానిగా.. కమ్యూనిస్టు పార్టీ నేత ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఘన విజయం సాధించారు. కొత్త రాజ్యాంగాన్ని మాదేసీ సహా కొన్ని మైనారిటీ వర్గాలు వ్యతిరేకిస్తుండడం.. తద్వారా రాజకీయ సంక్షోభం ముదరడంతో.. సుశీల్‌ కోయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
ఎన్ సిపి తరఫున సుశీల్‌ కోయిరాలా పోటీ
రాజీనామా చేసినప్పటికీ సుశీల్‌ కోయిరాలా.. నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మళ్లీ ప్రధాని పదవికి పోటీ చేశారు. యునైటెడ్‌ మార్క్సిస్టు, లెనినిస్టు అభ్యర్థిగా ఖడ్గప్రసాద్‌ శర్మ బరిలోకి దిగారు. నేపాల్‌ పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఎన్నికల్లో.. మొత్తం 598 మంది సభ్యులూ పాల్గొన్నారు. ఖడ్గప్రసాద్‌ శర్మ338 ఓట్లు సాధించి.. భారీ ఆధిక్యంతో ప్రధాని పదవికి ఎన్నికయ్యారు.
కేపీ శర్మకు మోడీ శుభాకాంక్షలు
దేశాధ్యక్షుడు బరన్‌ యాదవ్‌, కొత్త ప్రధానితో ప్రమాణం చేయించనున్నారు. నేపాల్‌ కొత్త ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మకు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 

21:53 - October 11, 2015

విజయవాడ : అమరావతి నిర్మాణానికి ఎవరూ అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడలో 5కే రన్‌ను ఆయన ప్రారంభించారు. కోర్టుకు వెళ్లి ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలంటూ కనకదుర్గమ్మ వారధి నుంచి మంగళగిరి వరకూ ఈ రన్‌ కొనసాగింది. ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

21:39 - October 11, 2015

నెల్లూరు : గుమ్మానికి తోరణం, చెవికి ఇంపుగా సన్నాయి లేనిదే ఏ శుభకార్యమూ పూర్తికాదు. నాదస్వరం లేకపోతే ఏ శుభకార్యం శుభకార్యంలా అనిపించదు. ఒట్టి తూతూ మంత్రంలా అనిపిస్తుంది. అల్లంత దూరాన సన్నాయి స్వరం వినగానే గుండెంతా పచ్చతోరణం కట్టినట్టయి పోతుంది. ఖచ్చితంగా అక్కడేదో శుభకార్యం జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి సన్నాయి ఏ మహానుభావుడి చేతిలో తయారయ్యిందో అనే సందేహం కలగక మానదు. వెదురును కుదురుగా వాద్యంలా మార్చిన వాద్య కార్మికుల గురించి తెలుసుకుందాం.
నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో..అందులోనూ ఒకే కుటుంబం ఒకే రకం సంగీత సాధనాన్ని తరతరాలుగా తయారు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తోంది. అదే సన్నాయి వాయిద్యం. ప్రపంచ ప్రఖ్యాత బిస్మిల్లా ఖాన్ వాడే షెహనాయ్‌ పరికరం కూడా వీరు తయారు చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వెదురు కొయ్యలు సన్నాయిలా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలా నొక్కినా పలికించే చేయి తిరిగిన నిపుణుడే వీటిని తయారు చేయగలడు. అలాంటి నాదవాయిద్య తయారీ నిపుణుడే కుర్చేటి బ్రహ్మయ్య. వీరి స్వగ్రామం సీతారామపురం మండలం అయ్యవారిపల్లె. సన్నాయిల తయారీయే వీరి జీవనాధారం.
సన్నాయి తయారీ అంటే ఆషా మాషీ కాదు. 
సన్నాయి తయారీ అంటే ఆషా మాషీ కాదు. చెక్కతో తయారు చేసే ఈ సరిగమపదల సాధనాన్ని తయారు చేయడంలో వెంట్రుక వాసి పొరపాటు జరిగినా ఆ పరికరాన్ని మూలన పడేయాల్సిందే. అలాంటి ఈ సంగీత పరికరం తయారీయే జీవనాధారంగా బ్రహ్మయ్య కుటుంబం కొనసాగిస్తోంది. ఉదయగిరి కేంద్రంగా బ్రహ్మయ్య, శేఖర్ లు తయారు చేసే ఈ సన్నాయిలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. షెహనాయి వాయిద్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిస్మిల్లా ఖాన్ వాడే సన్నాయి పరికరం సైతం వీరు తయారు చేసిందంటే నమ్మశక్యం కాదు. ఇది వాస్తవం..అందుకే, ఈ కుటుంబం తయారు చేసే సన్నాయి పరికరాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి అనేక రాష్ట్రాల నుంచి వాయిద్యకారులు, సంగీత నిపుణులు ఇక్కడి నుంచే ఈ పరికరాన్ని ఆర్డర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అరుదైన సన్నాయి తయారీ విద్యను ఒడిసి పట్టేందుకు అనేక మంది నిపుణులు ప్రయత్నించారు. ఈ కుటుంబం తయారు చేసే సంగీత పరికరాలను వీడియోల ద్వారా బంధించి వారు తయారు చేసి కొత్త రాగాలను పలికించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ సరిగమల్లో తేడాలొచ్చాయి. తేనెలొలికే..వీనుల విందు చేసే వాయిద్యంలోనూ పదనిసల్లో తప్పులు దొర్లాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈ కుటుంబమే సన్నాయిల తయారీకి కేంద్ర బిందువైంది. ఐదు తరాలుగా సన్నాయి తయారీనే నమ్ముకుని అనేక దేశ విదేశాల్లో కీర్తి పొందినప్పటికీ ప్రభుత్వ పరంగా మాత్రం అందిన ప్రోత్సాహం.. అంతంతమాత్రమేనంటున్నారు. అంతరించిపోతున్న సంగీత సాధనాల స్థానంలో తాము తయారు చేసే సన్నాయి ఉండకూడదని తాపత్రయ పడుతున్న వీరికి చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిదీ.

 

21:27 - October 11, 2015

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఎంపీ కవితి ఇచ్చారు. 2014, జూన్ 2 నుంచి 786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అందులో 397 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. మిగిలిన రైతు కుటుంబాలకు తెలంగాణ జాగృతి సంఘం నుంచి 2500 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

 

21:14 - October 11, 2015

గుంటూరు : ఎపికి ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్షను హేళన చేయొద్దని.. నిందలు వేయడం తగదని వైసిపి నేతలు హితవుపలికారు. జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్నారు. కనీస సానుభూతి లేకుండా మంత్రులు వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. ప్రతిపక్ష నేత దీక్ష చేస్తుంటే.. సీఎం, మంత్రులు దీక్షా స్థలిని సందర్శించకపోవడం దారుణమన్నారు. వైద్య శాఖలో అవినీతి కంపుకొడుతోందని ఎద్దేవా చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దొంగ దీక్షలు చూసిన మంత్రులు అలాగే మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్.. చంద్రబాబు లాగా పిరికివాడు కాదన్నారు. కామినేని ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. కామినేని, పత్తిపాటి పిచ్చిమాటలు మాట్లాడితే... ప్రజలు వారిని ఉరికిచ్చి కొడుతారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం దగ్గరకు వెళ్లి.. ప్రత్యేకహోదా విషయాన్ని ప్రధానితో మాట్లాడాలని తెలిపారు. జగన్ దీక్షను శంకిస్తే.. ప్రజలు ఊరుకోరని... సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

 

20:54 - October 11, 2015

హైదరాబాద్ : విజయం వచ్చినందుకు పొంగిపోకూడదని మరింత బాధ్యతగా వ్యవహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవల హెచ్సీయూ విద్యార్ధి సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎస్ఎఫ్ఐ కూటమి నేతలకు ఎంబి భవన్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎస్ ఎఫ్ ఐ విజయం ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శకం కావాలని సూచించారు. ఈ సంధర్భంగా రాబోయే రోజుల్లో ఎస్ ఎఫ్ ఐ ను మరింతగా బలోపేతం చేస్తామని ఎస్ ఎఫ్ ఐ నేతలు చెబుతున్నారు.

కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్థత

నల్లగొండ : చింతపల్లి మండలం తక్కెళ్లపల్లిలో కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 

20:37 - October 11, 2015

గుంటూరు : అభిమాన నాయకుడి నిరాహార దీక్షకు జనం వెల్లువలావస్తున్నారు. ప్రత్యేక హోదాకోసం ఫైట్‌ చేస్తున్న యువనేతకు మద్దతు తెలిపేందుకు జనం క్యూ కడుతున్నారు. అభిమాన నాయకుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుంచి.. వృద్ధుల వరకూ ప్రతిఒక్కరూ ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. చూశారుగా.. జగన్‌కు దీక్షకు జనం ఎలా పొటెత్తుతున్నారో..! ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. నిరాహార దీక్ష చేస్తున్న తమ అభిమాన నాయకుడికి మద్దతు తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగన్‌ దీక్ష స్థలికి వస్తున్న కాలేజీ విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
జగన్‌తో సెల్ఫీలు
జగన్‌తో ఫోటోలు దిగేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ ప్రతిఒక్కరూ జగన్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. ముద్దులొలకుతున్న చిన్నారులు కూడా జగన్‌తో ఫోటోలు దిగుతున్నారు. ఇక కాలేజీ స్టూడెంట్స్‌.. జగన్‌తో సెల్ఫీలు దిగుతూ వేదికపై తెగ సందడి చేస్తున్నారు. ఎక్కడా ఇసుమంతైనా విసుక్కోకుండా వృద్ధులను కూడా జగన్‌ అప్యాయంగా దగ్గర తీసుకుంటున్నారు. ఆయనపట్ల అభిమానులు చూపిస్తున్న అప్యాయతతో జగన్‌కూడా ఎక్కడా నిరసించకుండా వారితో ఫొటోలు దిగుతున్నారు. మొత్తంగా జగన్‌ నిరాహారదీక్ష శిబిరం వద్ద సెల్ఫీల సందడి నెలకొంది.

 

20:17 - October 11, 2015

విశాఖ : మాజీ మహిళ రంజీ క్రికెటర్ దుర్గాభవాని అనుమానాస్పద మృతి చెందారు. విశాఖ గుణదలలోని ఆమె స్వగృహంలో ఫ్యాన్ కు దుర్గాభవాని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ గుణదలలో దుర్గాభవాని నివాసముంటుంది. గురువుగా ఉన్న సత్యప్రసాద్ ను దుర్గాభవాని పెద్దలకు తెలియకుండానే వివాహం చేసుకుంది. అయితే సత్యప్రసాద్ కు అంతకుముందే పెళ్లి అయింది. ఏడాది తర్వాత కుటుంబాలకు తెలిసింది. వీరికి ఆడ పిల్ల జన్మించింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే కొంతకాలంగా సత్యప్రసాద్ విడిగా ఉంటున్నాడని తెలుస్తోంది. అయితే వీరు చట్ట బద్ధంగా విడి పోలేదు. సత్యప్రసాద్ ఇంటికి రావడం లేదు. కానీ నెల నెలా మెయింటనెన్స్ నిమిత్తం దుర్గాభవానికి డబ్బులు ఇచ్చే వారు. కానీ గత కొంతకాలంగా సత్యప్రసాద్ ఇంటికి రావడం లేదు. ఈక్రమంలో దుర్గాభవాని తల్లి ఇంటికి వెళ్లింది. తిరిగి సాయంత్రం దుర్గాభవాని గుణదలలోని తన ఇంటికి వచ్చింది. అయితే బంధువులు ఇంటికి వెళ్లారు. పిలిస్తే పలకలేదు. తలుపులు తట్టారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దీంతో కిటీల్లోంచి చూడగా దుర్గాభవాని వంట గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్గాభవాని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమ్తితం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేపు ఆమె మృతదేహానికి పోస్టు మార్గం నిర్వహించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దుర్గాభవానిది ఆత్మహత్య, హత్య అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. విచారణ చేపట్టారు. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలావుండగా గతంలో చాముండేశ్వరీనాథ్ తనను లైంగిక వేధిస్తున్నాడంటూ దుర్గా భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులుకు కేసుకు విత్ డ్రా చేసుకుంది. అలాగే తను క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎపి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు గోకరాజుతోపాటు మరి కొంతమంది తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసింది.

 

మాజీ మహిళ రంజీ క్రికెటర్ దుర్గాభవాని అనుమానాస్పద మృతి

విశాఖ : మాజీ మహిళ రంజీ క్రికెటర్ దుర్గాభవాని అనుమానాస్పద మృతి చెందారు. విశాఖ గుణదలలోని ఆమె స్వగృహంలో ఫ్యాన్ కు దుర్గాభావని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

19:43 - October 11, 2015

కర్నూలు : జిల్లాలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు ఆరోపణలు చేశారు. బృందావన్ బ్లాక్ లో సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారంటూ... జూనియర్లు ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. 

కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కళాశాలలో ర్యాగింగ్

కర్నూలు : జిల్లాలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు ఆరోపణలు చేశారు. బృందావన్ బ్లాక్ లో సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారంటూ... జూనియర్లు ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు.

 

క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యం

గుంటూరు : వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. 5రోజులుగా చేస్తున్న దీక్షతో ఆయన రెండు కిలోల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి వైద్యులు ఆయనకు మూడుసార్లు పరీక్షలు నిర్వహించారు. 

గోకుల్ పార్క్ బీచ్ లో నలుగురు విద్యార్థుల గల్లంతు

విశాఖ : గోకుల్ పార్క్ బీచ్ లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లీపురంలోని ప్రియాంక స్కూల్ లో రోహిత్, గణేష్, జబ్బార్, షరీఫ్ లు పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో ఢిల్లీకి చెందిన టూరిస్టు గైడ్ రాజుతో కలిసి నలుగురు విశాఖ గోకుల్ పార్క్ బీచ్ లో స్నానానికి వెళ్లారు. అలల తాకిడికి వీరంతా కొట్టుకుపోగా.. రాజును స్థానికులు, గజ ఈతగాళ్లు రక్షించారు. గల్లైంతన వారిని రక్షించేందుకు మెరైన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

19:36 - October 11, 2015

విశాఖ : గోకుల్ పార్క్ బీచ్ లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లీపురంలోని ప్రియాంక స్కూల్ లో రోహిత్, గణేష్, జబ్బార్, షరీఫ్ లు పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో ఢిల్లీకి చెందిన టూరిస్టు గైడ్ రాజుతో కలిసి నలుగురు విశాఖ గోకుల్ పార్క్ బీచ్ లో స్నానానికి వెళ్లారు. అలల తాకిడికి వీరంతా కొట్టుకుపోగా.. రాజును స్థానికులు, గజ ఈతగాళ్లు రక్షించారు. గల్లైంతన వారిని రక్షించేందుకు మెరైన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

19:06 - October 11, 2015

గుంటూరు : వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. 5రోజులుగా చేస్తున్న దీక్షతో ఆయన రెండు కిలోల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి వైద్యులు ఆయనకు మూడుసార్లు పరీక్షలు నిర్వహించారు. జగన్ బాగా నీరసించారని.. శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని తెలిపారు. తక్షణం దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని... ప్రభుత్వ డాక్టర్ ఉదయ్ శంకర్ సూచించారు. కిటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.

 

18:56 - October 11, 2015

ఆదిలాబాద్‌ : జిల్లాలో అప్పులు మరో రైతు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బిమిని మండలం జజ్జరవెల్లికి చెందిన దేవయ్య పత్తి పంట వేశారు. వర్షాభావంతో పంట ఎదగలేదు. దీంతో మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

 

18:51 - October 11, 2015

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల ఆరోపించారు. రైతులను బ్యాంకర్స్ ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే అయినా... సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నమే చేస్తున్నామన్నారు. దయచేసి ఏ రైతు ఆత్మహత్యకు పాల్పడ వద్దన్నారు.

 

18:44 - October 11, 2015

కరీంనగర్ : జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కోహెడకు చెందిన నవీన్‌, శిరీష గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం తెలిసి వారి పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. ఎంతగా అంగీకరింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి రాలేదు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో మనస్తాపం చెందిన ప్రేమికులు వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మిగిలిపోయాయి.

 

18:35 - October 11, 2015

నిజామాబాద్‌ : జిల్లాలో దారుణం జరిగింది. చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. ఓ మహిళపై వీరంగం సృష్టించాడు. మహిళను చావబాదాడు. మహిళను ఒంటరి చేసి కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా కొట్టారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నాగరాజు, జ్యోతి దంపతులు. జ్యోతి, ఆమె మరిదికి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. అయితే వివాదంలో ఉన్న ఆస్తిని ఏఎస్ ఐ సాయన్న ఇటీవల కొన్నాడు. దీంతో జ్యోతి న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. జ్యోతికి అనుకూలంగా తీర్పు రావడంతో కక్ష పెంచుకున్న ఏఎస్ ఐ అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆమె గాయాలపాలయింది. ఇదిలా ఉంటే ఏఎస్ ఐ సాయన్న ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్ అయినట్లు అతని ట్రాక్‌ రికార్డ్ చెబుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన రక్షకులే ఇలా ప్రవర్తించటంతో స్థానికులు మండిపడుతున్నారు.

 

17:29 - October 11, 2015

కాన్పూర్ : వన్డే సిరీస్‌లో ధోనీ సేన బోణీ కొట్టలేకపోయింది. కాన్పూర్‌ వేదికగా ముగిసిన తొలి వన్డేలో పోరాడి ఓడింది. ఆఖరి ఓవర్‌కు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు...డివిలియర్స్‌ సెంచరీ నమోదు చేయడంతో 50 ఓవర్లలో 303 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రహానే హాఫ్‌ సెంచరీ చేయడంతో పాటు...రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో విజయానికి చేరువగా వచ్చింది. ఆఖర్లో ధోనీ కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌ ఆడినా.....సురేష్‌ రైనా, స్టువార్ట్‌ బిన్నీ విఫలమవ్వడంతో 298 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆఖరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన సఫారీ బౌలర్‌ రబద జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
రోహిత్‌ అదరగొట్టాడు
కాన్పూర్‌ వన్డేలో టీమిండియా చేతులెత్తేసినా....డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం అదరగొట్టాడు. టీ 20 సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్‌...వన్డే సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ సూపర్‌ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా హిట్‌ మ్యాన్‌....రోహిత్ శర్మ కాన్పూర్‌ వన్డేలో అదరగొట్టాడు.ధూమ్‌ ధామ్‌ సెంచరీతో రికార్డ్‌ల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్‌.....తన దైన స్టైల్‌లోనే ధాటిగా ఆడాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ బౌండరీలతో చెలరేగిన రోహిత్‌....భారీ సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసిన హిట్‌ మ్యాన్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు. రెండో వికెట్‌కు రహానేతో కలిసి స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఓ ఎండ్‌లో రహానే ఆచితూచి బ్యాటింగ్‌ చేయగా....రోహిత్‌ మాత్రం దూకుడుగా ఆడాడు. 48 బంతుల్లో హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన రోహిత్‌....ఆ తర్వాత కూడా తడబడలేదు. 98 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి జట్టు విజయానికి పునాది వేశాడు. బెహార్డీన్‌ వేసిన 36వ ఓవర్‌ రెండో బంతిని మిడ్‌వికెట్‌ వైపుగా బౌండరీ కొట్టి....సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటివరకూ 139 వన్డేలు ఆడిన రోహిత్‌ శర్మకు ఇది కెరీర్‌లో 8వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ పూర్తయ్యాక కూడా ఏ మాత్రం చెత్త షాట్లకు ప్రయత్నించకుండా....ధాటిగా ఆడాడు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ మీదుగా రోహిత్‌ కొట్టిన సిక్స్‌ మొత్తం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిపోయింది. 132 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ దాటిన రోహిత్‌...తాహిర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. ఇప్పటికే టీమిండియాలో ఓపెనర్‌గా బెర్త్‌ ఫిక్స్‌ చేసుకున్న రోహిత్‌.... ఈ సెంచరీతో ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో భారీ స్కోర్లు నమోదు చేయాలంటే తన తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించాడు. 

విజయం ముంగిట భారత్ బోల్తా..

కాన్పూర్ : భారత్, సౌతాఫ్రికా మధ్య రసవత్తరంగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం ముందు బొక్కా బోర్లాపడింది. రోహిత్ శర్మ సెంచరీతో అలవోకగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్ ను ఐదు పరుగుల తేడాతో చేజార్చుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా డివీల్లియర్స్ సూపర్ సెంచరీతో 303 పరుగులు చేసింది. దానికి బదులుగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోని సేన గెలిచినంత పనిచేసి మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలో పెట్టింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా, ధోని క్రీజులో ఉన్నాడు.

16:49 - October 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురం రానే వచ్చింది. ఓరుగల్లు మొత్తం శనివారం నుంచే బొడ్డెమ్మ ఆటపాటతో మారుమోగిపోయింది. అష్ట్యఐశ్వర్యాలు, సౌభాగ్యం సిద్ధించాలని మహిళలు, తమకు వివాహం జరగాలని యువతులు బొడ్డెమ్మను కోరుకుంటున్నారు. దీంతో నగరంలో ఎటు చూసినా...సందడే నెలకొంది.
తెలంగాణకే తలమాణికం
బతుకమ్మ సంబరాలు. తెలంగాణకే తలమాణికమైనవి. వరంగల్‌లో బొడ్డెమ్మల జాతర మొదలైంది. ఆనందోత్సాల మధ్య ఓరుగల్లు వాసులు సంబరాలను వైభవంగా జరుపుకున్నారు.
వినాయకుడు తర్వాత విశిష్టంగా పూజించేది బొడ్డెమ్మనే
వినాయకుడు తర్వాత విశిష్టంగా పూజించేది బొడ్డెమ్మనే. సకల సౌభాగ్యాలకు ప్రతీకగా గౌరమ్మకు కూడా విశిష్టత ఉంది. అందుకే బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో...వరంగల్‌, హన్మకొండ, వరంగల్‌, ఖాజీపేట ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
చివరి రోజు నీళ్లలో నిమజ్జనం
బతుకమ్మను మహిళలు, యువతులు మాత్రమే ఆడతారు. కానీ ఈ బొడ్డెమ్మను చిన్న పిల్లలు ఇంటి వద్దనే ఆడుకుంటారు. చివరి రోజు చెరువుగట్టున నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ పూర్తయిన తర్వాతే బతుకమ్మ పండుగ ఆరంభమవుతుంది. తెలంగాణ సంస్కృతి..సాంప్రదాలను బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు నిలుస్తాయని.. వాటిని వారసత్వంగా తర్వాత తరం వారికి అందించాలని యువతులు అంటున్నారు.

 

16:44 - October 11, 2015

విజయవాడ : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వైద్య పరీక్షలన్నీ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుందన్నారు. ఆల్ట్రాసౌండ్, స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని చంద్రబాబు సంకల్పించినట్లు తెలిపారు. 

16:41 - October 11, 2015

ఖమ్మం : జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ అలియాస్ శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో శివారెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. శివారెడ్డిపై పదిలక్షల రివార్డ్ ఉంది. వరంగల్ జిల్లా నార్లాపూర్... శివారెడ్డి స్వస్థలం. ఎపి పోలీసుల అదుపులో శివారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. శివారెడ్డిని పోలీసులు వెంటనే కోర్టులో హాజరపరచాలని వరవరరావు డిమాండ్ చేశారు.
శివారెడ్డిని వెంటనే కోర్టులో హాజరు పరచాలి: విరసం నేత వరవరరావు
శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన మాట వాస్తవం. శివారెడ్డి అరెస్టు విషయాన్ని పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయితే అతని అరెస్టుకు సంబంధించిన సమాచారం తమకు తెలియదంటున్నారు. అది వాస్తవం కాదు. శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నారా లేదా... అనే విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిస్టుల ఏరివేత, అరెస్టుల విషయంలో కేంద్రం, ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయంతోనే ఉన్నాయి. తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి.. ఎపి పోలీసులకు అప్పగించవచ్చు. పోలీసులు శివారెడ్డిని అదుపులోకి తీసుకుంటే అతన్ని ఎక్కడి తీసుకెళ్లారో చెప్పాలి. ఒక వేల అరెస్టు చేస్తే కోర్టులో హాజరు పరచాలి. శివారెడ్డిని అరెస్టు చేసి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని.. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఎపి రాష్ట్ర హోంమంత్రి చినరాజప్పలను కోరాము. తెలంగాణ ఎంపి వివేక్ అన్నట్లు ఇదే అఖరు ఎన్ కౌంటర్ అయితే.. శివారెడ్డిని విడుదల చేయాలి. ఖచ్చితంగా శివారెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఎవరి అదుపులో ఉన్నా.. వెంటనే కోర్టులో హాజరు పర్చాలి. ఎన్ కౌంటర్ పేరుతో ఎపిలో శివారెడ్డిని ఎన్ కౌంటర్ చేసే అవకాశం ఉంది. ఆయన ప్రాణానికి హాని తలపెట్టవద్దు అని వరవరరావు కోరారు.

 

16:26 - October 11, 2015

కర్నూలు :  జలపాతం పేరు చెప్పగానే బాహుబలి సినిమా గుర్తుకువస్తుంది.. ఆకాశంనుంచి దూకుతున్న జలపాతం కన్ను రెప్పవేయకుండా చూసేలా చేస్తుంది.. ఆ స్థాయిలోకాకున్నా అలాంటి ఓ చిన్న జలపాతం ఇప్పుడు కర్నూలు జిల్లాలో సందడిచేస్తోంది.
సవ్వడిచేస్తూ దూకుతున్న జలపాతం
కొండపైనుంచి జల జలా సవ్వడిచేస్తూ దూకుతున్న జలపాతం... కొండలమధ్య రణగొన ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యాటక ప్రదేశం.. నురగలు కక్కుతూ కిందపడుతున్న ఈ ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.. ఈ ప్రకృతి అందాలనుచూస్తూ పరవశించిపోతున్నారు.
పచ్చని కొండలమధ్య అద్భుత దృశ్యం
కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలోని ఈ వాటర్‌ఫాల్‌ పచ్చని కొండలమధ్య అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.. గాలేరు నగరి సొరంగం కొండల్లోనుంచి జాలువారుతున్న ఈ నీటి జల్లుల్లో తడుస్తూ పర్యాటకులు పరవశించిపోతున్నారు. అవుకు నుంచి కేవలం ఆరు కిలోమీటర్లదూరంలో ఉన్న ఈ జలపాతం ఉంది.. వర్షాలతో కొండలపై భారీగా నీరు చేరడంతో ఈ ప్రాంతం నీటితో కళకళలాడుతోంది.. కొండపైనుంచి వేగంగా దూకుతున్న నీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

16:20 - October 11, 2015

హైదరాబాద్ : దేశంలో లౌకిక వ్యవస్థకు బీజేపీ తూట్లు పొడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. దేశంలో లౌకిక శక్తులపై జరుగుతున్న దాడులపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఆర్ టీసీ క్రాస్ రోడ్డులో వామపక్ష ప్రజాసంఘాలు దిష్టిబొమ్మ దగ్ధం చేశాయి. అంతకముందు దాద్రీ ఘటనకు నిరసనగా వామపక్షాలు ప్రదర్శన నిర్వహించాయి. ప్రగతిశీల వాదులను హత్య చేయడం, దాద్రీలో గొడ్డు మాంసం తిన్నారనే నెపంతో వ్యక్తి హత్య లాంటి సంఘటనలు దేశంలోని లౌకిక వాతావరణాన్ని దెబ్బస్తున్నాయని తమ్మినేని విమర్శించారు.

 

దక్షిణాఫ్రికా వన్డే సీరీస్ నుంచి అశ్విన్ ఔట్

కాన్పూర్ : దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ నుంచి అశ్విన్ ఔట్ అయ్యారు. తొలి వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అశ్విన్ గాయపడ్డారు. దీంతో అశ్విన్ ను సీరీస్ నుంచి తొలగించారు. అశ్విన్ స్థానంలో హర్భజన్ సింగ్ కు అవకాశం ఇచ్చారు.

 

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ సెంచరీ...

కాన్పూర్ : దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ శతకం చేశాడు. 98 బంతుల్లో రోహిత్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేలో 8 వ సెంచరీ సాధించాడు.

 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్య పరీక్షలు : కామినేని

విజయవాడ : జనవరి ఒకటి కల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్య పరీక్షలను అందుబాటులోకి తెస్తామని మంత్రి కామినేని ఎపిలో 100 కొత్త హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి శివారెడ్డి అరెస్టు

ఖమ్మం : జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ అలియాస్ శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్ గఢ్ సరిహద్దులో ఎపి పోలీసులు శివారెడ్డిని అరెస్టు చేశారు. శివారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నార్లాపూర్. శివారెడ్డిపై పది లక్షల రూపాయల రివార్డు ఉండడం గమనార్హం. 

తెలంగాణ ఇచ్చింది సోనియానే : బలరాంనాయక్

హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చింది సోనియానే అని కాంగ్రెస్ నేత బలరాంనాయక్ అన్నారు. తెలంగాణ కోసం కేంద్రమంత్రిగా పోరాడానని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో కలపడం వల్లే తాన ఓడియోయానని చెప్పారు. వరంగల్ రైత భరోసా యాత్రలో బాధతోనే ఆ విధంగా మాట్లాడానని తెలిపారు. తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు. 

15:28 - October 11, 2015

హైదరాబాద్‌ : నగరంలోని కర్మన్‌ఘాట్‌లో ప్రొఫెసర్ కోదండరాం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, విద్యావేత్త చుక్కారామయ్యతోపాటు... ఇతర జేఏసీ నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం కోదండరాం సాగించిన ఉద్యమం చాలా గొప్పదని ప్రశంసించారు. 

15:23 - October 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. దొడ్డుబియ్యాన్నే పాలిష్‌ చేసి.. సన్నబియ్యంగా మార్చి.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.

 

15:18 - October 11, 2015

గుంటూరు : పార్టీ నేతలు వారిస్తున్న జగన్‌ దీక్షను కొనసాగిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్‌ దీక్షపై చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని బొత్స పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ వ్యాపార భాగస్వాములని బొత్స ఆరోపించారు. జగన్‌ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని అమరావతి రానున్న నేపథ్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బొత్స తెలిపారు. 

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్ : ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న 600 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఉగాది నాటికి రెండు గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. భూ కమతాల ఏకీకరణకు గ్రామస్తులు సహకరించారని చెప్పారు. 

ధావన్ అవుట్..

కాన్పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 23 పరుగులు చేసిన ధానవ్ అవుట్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 303 పరుగులు చేసింది. 

13:41 - October 11, 2015

ముంబై : బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ 73వ పడిలోకి అడుగుపెట్టారు. అమితాబ్‌కు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్‌ మీడియాతో ముచ్చటించారు. తనకు కుటుంబసభ్యులతోనే జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇష్టమని తెలిపారు. తనను వెన్నంటి ఉన్న అభిమానులకు అమితాబ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

13:39 - October 11, 2015

ఒంగోలు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. అన్ని పార్టీలను కలుపుకోని ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఒక్కటే కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, లోటు బడ్జెట్ 15వేల కోట్లు, విద్య, వైద్య రంగంలో ఇచ్చిన హామీలు, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. 2016 ఫిబ్రవరి నాటికి చలో అసెంబ్లీకి సిద్ధమౌతామన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఎన్నో సమస్యలు పేరుకపోతున్నాయన్నారు. రాజధాని గురించి చుట్టూ తిప్పుతున్నారని, నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపడం లేదన్నారు. పౌర హక్కుల కోసం పోరాడాల్సినవసరం ఉందని, అందుకని 16వతేదీన పౌరహక్కుల కోసం ఓ సెమినార్ ను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా సెమినార్ లో పాల్గొని జయప్రదం చేయాలని మధు కోరారు.

 

13:36 - October 11, 2015

విజయవాడ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను తూళ్లూరులో నిర్వహించడంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు స్పీకర్‌ కోడెల తెలిపారు. హైదరాబాద్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ అంశంపై త్వరలో సమావేశం కాబోతున్నామని తెలిపారు.

13:35 - October 11, 2015

విశాఖపట్టణం : హూదూద్ తుపానుకు ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇళ్ళు కట్టించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడాది తర్వాత కూడా ఇళ్లు అప్పగించలేదు. నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది. డిసెంబర్ కల్లా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. 9 చోట్ల తుపాను బాధుతులకు ఇళ్ళ నిర్మాణం సాగుతోంది. భయంకరమైన తుఫాన్ వచ్చి ఏడాది అవుతోంది. విశాఖ అంతా ప్రళయంగా మారిన సంగతి తెలిసిందే. హుదూద్ తీవ్రానికి చాలా మంది నష్టపోయారు. పేదలు రోడ్డున పడ్డారు. చాలా మందికి నివాసాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. బాలాజీ టెంపుల్ సమీపంలో 324 ఇళ్ల నిర్మాణం చేస్తోంది. అండమాన్ తరహాలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. 5200 మందికి మాత్రమే గుర్తించి ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

13:32 - October 11, 2015

నెల్లూరు : ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. రెయిన్‌ బో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ అనే మహిళ మృతిచెందింది. గోవిందంపల్లికి చెందిన ఓ మహిళ రోగికి అటెండెంట్‌గా వచ్చిన భాగ్యమ్మ పాలు తేవడానికి తెల్లవారుజామున ఐదో ఫ్లోర్‌ నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్‌ బటన్‌ నొక్కింది. అయితే డోర్‌ తెరుచుకున్నా.. లిఫ్ట్‌ మాత్రం పైకి రాలేదు. దీంతో లిఫ్ట్‌ ఉందని భావించి ఎక్కబోయిన భాగ్యమ్మ ఒక్కసారిగా కిందకు పడి తీవ్రగాయాలతో మృతి చెందింది. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

13:18 - October 11, 2015

మహబూబ్ నగర్ : భూ వివాదం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. తమకు న్యాయం చేయడం లేదని టీఆర్ఎస్ నేత ఇంటి ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జడ్చర్ల మండలం గొల్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే గొల్లపల్లి లో ఓ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక సర్పంచ్ ఇతరులు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణం చేసే స్థలం తనదని, తాను గతంలో కొనుగోలు చేయడం జరిగిందని వెంకటయ్య వారికి చెప్పాడు. దీనికి సంబంధించిన కాగితాలు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. ఈ విషయాన్ని పరిష్కరించాలని టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ ను వెంకటయ్య ఆశ్రయించాడు. కానీ రోజులు గడిచిపోయాయి. కానీ సమస్య మాత్రం పరిష్కారం రాలేదు. ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడానికే అందరూ నిర్ణయానికి వచ్చారని, ఇర్ఫాన్ మోసం చేశాడని వెంకటయ్య భావించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య తన ముగ్గురు కుమారులు శ్రీశైలం, మహేష్, చంద్రశేఖర్ లను తీసుకుని ఇర్ఫాన్ ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అందరూ సేవించారు. సృహలో వారు లేకపోవడాన్ని గమనించిన స్థానికులు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ శ్రీశైలం, మహేష్ లు మృతి చెందారు. చంద్రశేఖర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంకటయ్య మాత్రం కొలుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొల్లపల్లి ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, సెటిల్ మెంట్లు చేస్తుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

12:55 - October 11, 2015

ఇవాళ తెలుగు కవిత్వం వస్తు వైవిధ్యంతో అభివ్యక్తి నవ్యతతో వెలువడుతోంది. ప్రజలను ఆలోచింపజేస్తుంది. బాగా స్పందింపజేస్తుంది. అలాంటి కవిత్వాన్ని పండిస్తున్న తెలుగు కవులలో సీనియర్ కవి జూకంటి జగన్నాథం ఒకరు. తెలంగాణాకు చెందిన ఈ కవి అనేక అంశాలను తనదైన దృక్కోణంలో కవిత్వంగా శిల్పీకరిస్తున్నారు. అనేక కవితా సంపుటాలు ఆవిష్కరించారు. ప్రముఖ కవి,కథకుడు జూకంటి జగన్నాథం పై ప్రత్యేక కథనం.. జూకంటి జగన్నాథం కవిత్వంలో సామాజిక స్పృహ ఉంటుంది. అభ్యుదయం ఉంటుంది. వస్తువును కవిత్వంగా శిల్పీకరించే రసవిద్య ఏదో ఆయనకు బాగా తెలుసు. ఆయన కవిత్వం విలక్షణమైనదంటూ విమర్శకులు కొనియాడారు.

12:50 - October 11, 2015

కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో విలియర్స్ సెంచరీ సాధించాడు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 303 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు ఓపెనర్లు కాక్, ఆమ్లాలు శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్ లో కాక్ (29) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన డుప్లెసీస్, ఆమ్లాతో జత కలిశాడు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్ రన్సు తీస్తూ స్కోరు బోర్డును పెంచారు. వీరిద్దరినీ విడదీయడానికి భారత బౌలర్లు శ్రమించారు. అప్పటికే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. చివరకు మిశ్రా బౌలింగ్ లో ఆమ్లా (37) వెనుదిరిగాడు. అనంతరం డుప్లెసిస్ కు విలియర్స్ జత కలిశాడు. వీరిద్దరూ కూడా ఆచూతూచి ఆడారు. అదుపు తప్పిన బంతులను డుప్లెసిస్ బౌండర్లకు తరలించాడు. ఈ మధ్యలో డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారిన డుప్లెసిస్ (62) ను యాదవ్ పెవిలియన్ పంపించాడు. దీనితో భారత జట్టు ఊపిరిపీల్చుకుంది. అప్పటికి జట్టు స్కోరు 152 పరుగులు. కానీ విలియర్స్ ఏ మాత్రం బాల్స్ ను వేస్ట్ చేయకుండా పరుగులు రాబట్టాడు. విలియర్స్ మాత్రం సింగిల్స్ తీస్తూ వికెట్ కాపాడుకొనే ప్రయత్నం చేశాడు. మిల్లర్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 197 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయినట్లైంది. విలియర్స్ అర్ధ సెంచరీ సాధించి సెంచరీ వైపుకు దూసుకెళ్లాడు. డుమిని కొద్దిగా సహకరించాడు. చివరిలో విలియర్స్ చెలరేగిపోయాడు. బంతులను బౌండరీలకు తరలించాడు. విలియర్స్ ను అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించినా ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే జట్టు స్కోరు 238 పరుగులు ఉన్నప్పుడు డుమిని (15) అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బెహార్డిన్ కూడా బ్యాట్ ఝులిపించాడు. చివరిలో విలియర్స్ సెంచరీ సాధించాడు. కేవలం 73 బంతులను ఎదుర్కొన్న విలియర్స్ 104 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరోవైపు 19 బంతులను ఎదుర్కొన్న బెహార్డిన్ 35 పరుగులు తీశాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉండడం విశేషం. భారత బౌలర్లలో మిశ్రా, యాదవ్ లు చెరో రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
సౌతాఫ్రికా స్కోరు కార్డు : కాక్ (29), ఆమ్లా (37), డుప్లెసిస్ (62), విలియర్స్ (104, నాటౌట్), మిల్లర్ (13), డుమిని (15), బెహార్డిన్ (35, నాటౌట్).

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు..?

ఖమ్మం : ఏపీ పోలీసులు మావోయిస్టు జిల్లా కార్యదర్శి కిరణ్ అలియాస్ శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

పాతబస్తీలో సామూహిక అత్యాచారం..

హైదరాబాద్ : పంజాగుట్టలో నలుగురు యువకులు మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మెహిదీపట్నంలో మహిళ టైలర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోంది - సీపీఎం..

ప్రకాశం : రైతులు, ఆర్టీసీ, మున్సిపల్, అంగన్ వాడీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. 16న పౌర హక్కుల కోసం విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు, ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోందన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు.

నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర...

నిజామాబాద్ : కాంగ్రెస్ నేతల పాదయాత్ర ప్రారంభమైంది. నవీపేట (మం) బినోల గ్రామం నుండి పది కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. షబ్బీర్ ఆలీ, మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

సౌతాఫ్రికా 263/5..

కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా 47.6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. విలియర్స్ 80, బెహార్డీన్ 19 పరుగులతో ఆడుతున్నారు. 

12:23 - October 11, 2015

చెన్నై : ప్రముఖ నటి మనోరమ(78) మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. మనోరమ మృతి తీరనిలోటు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషలలో నటించిన మనోరమ గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.

12:18 - October 11, 2015

గుంటూరు : ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన జగన్ దీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ? ఆరోగ్యం క్షీణిస్తుండడంపై భవిష్యత్ కార్యాచరణను ఎలా రూపొందించుకోవాలి ? తదితర విషయాలపై చర్చించేందుకు వైసీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. జగన్ చేపట్టిన దీక్షా ప్రాంగాణానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో వీరు సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి, బోత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబుతో పాటు తదితర నేతలు భేటీ అయ్యారు. ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు దీక్ష ప్రాంగణానికి చేరుకున్నాయి. రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్‌ జగన్‌ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం దీక్షా ప్రాంగణానికి వైద్యులు చేరుకుని పరీక్షలు నిర్వహించారు. బరువు తగ్గడంతో పాటు.. బాగా నీరసించారు. జగన్‌ శరీరంలో షుగర్‌ లెవల్స్ తగ్గుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జగన్‌ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. 

12:15 - October 11, 2015

నెల్లూరు : సంగంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం కుక్కలు జరిపిన దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా 8-10 కుక్కలు దాడులు జరిపాయి. శరీరంపై ఇష్టమొచ్చినట్లు కరిచాయి. దీనితో బాధితులకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీశారు. కానీ అక్కడ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వెంటనే కుక్కలను అరికట్టాలని..వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని బాధితులు కోరుతున్నారు.

డుమిని అవుట్..

కాన్పూర్ : భారత్ తో ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. యాదవ్ బౌలింగ్ లో డుమిని (15) పెవిలియన్ చేరాడు. 45.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. 

ధాటిగా ఆడుతున్న విలియర్స్..

కాన్పూర్ : సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ విలియర్స్ ధాటిగా ఆడుతున్నాడు. 60 బంతులను ఎదుర్కొన్న విలియర్స్ 60 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్ లున్నాయి. ప్రస్తుతం 44.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 

సౌతాఫ్రికా 200/4..

కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు ఓపెనర్లు కాక్, ఆమ్లాలు శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్ లో కాక్ (29) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన డుప్లెసీస్, ఆమ్లాతో జత కలిశాడు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్ రన్సు తీస్తూ స్కోరు బోర్డును పెంచారు. వీరిద్దరినీ విడదీయడానికి భారత బౌలర్లు శ్రమించారు. అప్పటికే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది.

11:53 - October 11, 2015

పాప్ ప్రపంచాన్ని 'వన్ డైరెక్షన్ గ్రూప్' తన సాంగ్స్ తో ఉర్రూతలూగిస్తోంది. యూ ట్యూబ్ లో విడుదలైన 'డ్రాగ్ మీ డౌన్ సాంగ్' ఒక్క నెలలోనే 12 కోట్ల మేర హిట్లు సాధించింది. గ్రూపు సాధించిన ఏడాదిలోపే వన్ డైరెక్షన్ మంచి ఇమేజ్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వన్ డైరెక్షన్ ఆల్బమ్స్ కు యువతరం ఫిదా అయిపోతోంది. మరి సాంగ్ మీరు వినేయండి..

11:48 - October 11, 2015

ఉత్తర్ ప్రదేశ్ : దొంగతనం చేశాడని ఓ 18 ఏళ్ల కుర్రాడిని స్థానికులు గొడ్డును బాదినట్లు బాదారు. చేతులు కట్టేసి ఎక్కడ పడితే అక్కడ చావబాదారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది. వీధుల గుండా తిప్పుతూ..బట్టలు విప్పి వీధుల గొడ్డును బాదినట్లు చావబాదారు. ఇదంతా అక్కడున్న వారు గుడ్లప్పగించి చూశారే తప్ప ఆపలేదు. దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి. కానీ ఇలా చేయడం న్యాయం కాదనే అభిప్రాయాలు వినిపించాయి. తీరా అంత అయిపోయిన తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. గాయపడిన కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

11:32 - October 11, 2015

గుంటూరు : రాజధాని నిర్మాణం కోసం ప్రతొక్కరూ కదిలి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా తాడేపల్లి వద్ద ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'రాజధాని కోసం 5కే రన్' ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగించారు. తెలుగు వారి ఘనచరిత్ర ప్రతిబింబించేలా రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు, అమరావతికి సంఘీభావంగా ప్రతి మున్సిపాల్టీలో 5కే రన్ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం జర్నలిస్టు వాళ్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. కనకదుర్గమ్మ వారధి నుండి మంగళగిరి వరకు రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రతిప్తాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. 

11:29 - October 11, 2015

మహబూబ్ నగర్ : భూ వివాదంలో టీఆర్ఎస్ నేత తమకు న్యాయం చేయడం లేదని ఓ తండ్రితో నలుగురు కుమారులతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. జడ్చర్లలోని గొల్లపల్లిలో వెంకటయ్య 416 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఈ స్థలం తమదని పక్కనున్న వారు అభ్యంతరం చెప్పారు. ఇది తాను కొనడం జరిగిందని వెంకటయ్య పేర్కొన్నా వారు అంగీకరించలేదు. చివరకు అక్కడి సర్పంచ్..టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ ను కలిసి సమస్యను తెలియచేశాడు. ఈ సమస్యను పరిష్కరించాలని వారిని వెంకటయ్య వేడుకున్నాడు. కానీ కాలం గడిచిపోతోంది కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇర్ఫాన్, ఇతరులు తమకు మద్దతివ్వడం లేదని వెంకటయ్య భావించాడు. దీనితో ఆదివారం ఉదయం ఇర్ఫాన్ ఇంటికి వెంకటయ్య తన ముగ్గురు కుమారులతో వెళ్లాడు. అక్కడ పురుగుల మందు సేవించారు. స్థానికులు గమనించి వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమించింది. అందులో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

11:15 - October 11, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ బరువు తగ్గారు. గత ఐదు రోజులుగా ఆయన నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆదివారం ఉదయం దీక్షా ప్రాంగణానికి వైద్యులు చేరుకుని జగన్ కు పరీక్షలు నిర్వహించారు. షుగర్స్, బిపి లెవల్స్ పడిపోయాయని వైద్యులు పేర్కొన్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు దీక్ష ప్రాంగణంలో గోప్యంగా సమాచారం సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ టెన్ టివితో మాట్లాడారు. ఐదు రోజుల నుండి దీక్ష చేయడంలో జగన్ ఆర్యోగ పరిస్థితి క్షీణిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని కనీసం చెప్పడం లేదని, జగన్ చేస్తున్న దీక్షను చులకనగా చూస్తున్నారని విమర్శించారు. 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చిస్తారని తెలిపారు. అలాగే జగన్ చేస్తున్న దీక్షపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై అనుసరించాల్సిన వైఖరిపై ప్రధానంగా చర్చిస్తారని పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. షుగర్స్ లెవల్స్ తగ్గిపోయాయి..పల్స్ రేట్స్ తగ్గిపోయాయని వైద్యులు పేర్కొన్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థికంగా బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని, 22వ తేదీన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని జగన్ పట్టుదలగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చులకనగా మాట్లాడారని, జగన్ పోతే నాకేం..ప్రజలతో నాకేం అనే విధంగా బాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

డుప్లెసిస్ అర్ధ సెంచరీ..

కాన్పూర్ : సౌతాఫ్రికా బ్యాట్ మెన్స్ డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ తో జరుగుతున్న మొదటి వన్డేలో 26.3 ఓవర్లలో సౌతాఫ్రికా 128 పరుగులు చేసింది. డుప్లెసిస్ 51, విలియర్స్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

జేపీ నారాయణ్ కు ప్రధాని నివాళి..

ఢిల్లీ : లోక్ నాయక్ జేపీ నారాయణ్ చిత్రపటానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, బీజేపీ సీనియర్ నేత అద్వాని కూడా నివాళులర్పించారు. 

జమ్మూలో మిలిటెంట్ హతం..

జమ్మూ కాశ్మీర్ : హంద్వారాలో మిలిటెంట్లకు..భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ మృతి చెందాడు. ఇంకా ఇద్దరు మిలిటెంట్లు ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి.

జగన్ దీక్ష ప్రాంగణంలో కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షా ప్రాంగణానికి కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు చేరుకున్నారు. వీరు గోప్యంగా సమాచారం సేకరిస్తున్నారు. 

ఆమ్లా (37) అవుట్..

కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న మొదటి వన్డేలో కట్టుదిట్టంగా ఆడుతున్న ఆమ్లా, ప్లెసిస్ జోడిని భారత బౌలర్లు విడదీశారు. మిశ్రా మౌలింగ్ లో ఆమ్లా (37) పెవిలియన్ చేరాడు. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు ఓపెనర్లు కాక్, ఆమ్లాలు శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్ లో కాక్ (29) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన ప్లెసీస్, ఆమ్లాతో జత కలిశాడు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్ రన్సు తీస్తూ స్కోరు బోర్డును పెంచారు.

సౌతాఫ్రికా 100/1..

కాన్పూర్ : భారత్ తో జరుగుతున్న మొదటి వన్డేలో సౌతాఫ్రికా జట్టు బ్యాట్స్ మెన్స్ కట్టుదిట్టంగా ఆడుతున్నారు. 21.3ఓవర్లలలో 100 పరుగుల మైలురాయిని దాటింది. ఆమ్లా 34, ప్లెసిస్ 32 పరుగులతో ఆడుతున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కౌలాలంపూర్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 500 గ్రామాలు బంగారాన్ని స్శాధీనం చేసుకున్నారు. 

5కే రన్ ను ప్రారంభించిన బాబు..

విజయవాడ : ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారధి నుండి మంగళగిరి వరకు 5కే రన్ నిర్వహించారు. ఈ రన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

జన్మభూమి గ్రామ కమిటీలతో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : అమరావతి శంకుస్థాపనపై జన్మభూమి గ్రామ కమిటీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 500 మంది జన్మభూమి కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 13న జన్మభూమి కమిటీల సభ్యులంతా ప్రజలతో మట్టి, పవిత్ర జలాల సేకరణకు సహకరించాలని సూచించారు. సేకరించిన మట్టి, అక్షింతలు, జలాలను ఈనెల 16వ తేదీన ఊరేగింపుగా తీసుకెళ్లి మండల కేంద్రాలకు తరలించడంలో సహకరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో దసరా ఉత్సవాలు..అమరావతి శంకుస్థాపన శోభ వెల్లివిరియాలని సూచించారు. మన మట్టి, మన నీరు, మన అమరావతి కార్యక్రమంలో జన్మభూమి కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని బాబు తెలిపారు. 

టీఆర్ఎస్ నేత నివాసం వద్ద యువకుల ఆత్మహత్యాయత్నం..

మహబూబ్ నగర్ : జడ్చర్లలో టీఆర్ఎస్ నేత ఇంటి ఎదుట నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుల పరిస్థితి విషమించడంతో షాద్ నగర్ ఆసుపత్రికి తరలించారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. గొల్లపల్లికి చెందిన శ్రీశైలం, కుమార్, మహేష్, చంద్రశేఖర్ లుగా నిర్ధారించారు. 

సౌతాఫ్రికా 79/1..

కాన్పూరు : భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. ఆమ్ల 28, ప్లెసిస్ 20 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక వికెట్ తీశారు. 

10:11 - October 11, 2015

అమరావతి శంకుస్థాపన ఇంత అట్టహాసంగా చేయడం అవసరమా అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. శంకుస్థాపనకు సిద్ధమైన అమరావతి రాజధాని నగర ప్రణాళిక పూర్తిగా సిద్ధంగా ఉందా ? భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందా ? వంటి అంశాలపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో రాఘవులు విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
'శంకుస్థాపన ఇంత అట్టహాసంగా నిర్వహించడం అవసరమా ? ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతూ రాష్ట్ర, దేశ, విదేశీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఆర్భాటంలో అసలు సమస్యలు గుర్తించరని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికివ స్తే రాజధానిలో నిర్మాణ సమస్యలున్నాయి. విధానపరమైన సమస్యలున్నాయి. భూ సేకరణ విషయంలో సమస్యలున్నాయి. 33వేల ఎకరాలకు సంబంధించిన సమస్యలున్నాయి. భూసమీకరణలో కొంతమంది స్వచ్ఛందంగా అంగీకరించి పత్రాలు ఇచ్చారు. కొంతమంది అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లారు. సేకరణ..సమీకరణ ఇంకా వివాదాస్పదంగానే ఉంది. సవరించిన ఆర్డినెన్స్ ప్రకారం తీసుకోవాలా ? అనే మీ మాంసలో ఉన్నారు.

లోకల్ టాలెంట్ ను ఉపయోగించుకోరా ?
భూ సమీకరణ సమస్య అసంపూర్ణంగా..అసంతృప్తిగా ఉంది. పెద్ద పెద్ద అంతస్తులు నిర్మాణాలు చేస్తున్నారు. డబ్బులకే ఇస్తారు. ఉచితంగా ఇవ్వరు. ధనవంతుల ఇళ్లలో పనిచేసే వారు నివాసాలు ఎక్కడుంటాయి. ? సింగపూర్ లో ఉన్న పేద వాడికి ఎక్కువ ఆదాయం ఉంది. వ్యవసాయ పరిరక్షణ జోన్ లు పెద్ద మోసపూరితమైంది. అంతర్జాతీయంగా ఎలా ఉందో ఇక్కడ అలా జరగాలి. వ్యవసాయ పరిరక్షణ ప్రాంతాలు నిలవవు. రైతులు అంగీకరించరు. రైతుల నుండి భూములు సేకరించి గోల్ఫ్ కోర్సులు..విల్లాలు చేస్తారా ? విదేశీ కంపెనీలు తీసుకొస్తున్నారు. లోకల్ టాలెంట్ ను వినియోగించుకోరా ?

పర్యావరణ సమస్యలపై అవగాహన లేదు..
నూజివీడులో రాజధాని అనడంతో భూములు కొన్నారు. ఇక రాజధానికి నీళ్లు అవసరం. పట్టిసీమ ద్వారా నీళ్లు తరలిస్తారని అంటున్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ పెడుతామని పేర్కొంటున్నారు. ఉచితంగా నీళ్లు ఇవ్వాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వీటీపీఎస్ రాజధాని కేంద్రం అవుతుంది. వీటీపీఎస్ నుండి వెలువడే దుమ్ము..ధూళి అంతా రాజధాని ప్రాంతం మీదుగా వెళుతుంది. రాజధానిలో పర్యావరణ సమస్యలపై అవగాహన లేదు. ప్రజల రాజధాని అంటున్నారు. సామాన్య మానవుడు స్వేచ్ఛగా జీవించే విధంగా రాజధాని ఉండాలి'' అని రాఘవులు పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో చూడండి.

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

కాన్పూరు : భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్ లో కాక్ (29) వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆమ్లా 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అన్నాకు బెదిరింపులు..

రాజస్థాన్ : సామాజిక ఉద్యమకర్త అన్నా హాజారే కు మరోమారు బెదిరింపులు ఎదురయ్యాయి. రాజస్థాన్ లోని సికార్ పట్టణంలో నేడు జరిగే ఓ బహిరంగ సభలో అన్నా పాల్గొననున్నారు. శనివారం రాత్రికి సికార్ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ఆయన బస చేసిన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ లేఖను వదిలిపెట్టి వెళ్లాడు. అందులో బెదిరింపు వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు హాజారేకు భద్రతను పెంచారు. 

09:15 - October 11, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది..బిపి..షుగర్స్ లెవల్స్ పడిపోయినట్లు సమాచారం..దీనితో అటు పార్టీ నేతలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది..జగన్ ను దీక్షను పోలీసులు భగ్నం చేస్తారా ? లేక దీక్షను విరమిస్తారా ? అనే అంశం ఉత్కంఠను రేకేత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటలకు దీక్షా స్థలి వద్ద పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. జగన్ చేత దీక్ష విరమింప చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఆరు..నూరైనా దీక్షను విరమింప చేసేది లేదని జగన్ ఖరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఐదో రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం నాడు జగన్‌ బరువు తగ్గడంతో పాటు.. బాగా నీరసించారు. నిన్న రాత్రి జగన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. జగన్‌ శరీరంలో షుగర్‌ లెవల్స్ తగ్గుతున్నట్లుగా తెలిపారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జగన్‌ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. 

బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా...

కాన్పూర్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

మహబూబ్ నగర్ లో బస్సు - డీసీఎం ఢీ..

మహబూబ్ నగర్ : మాడుగుల (మం) అన్నెబోయిన్ పల్లి వద్ద బస్సు - డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.

 

పింక్ రిబ్బన్ వాక్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ ..

హైదరాబాద్ : కేబీఆర్ పార్కు వద్ద పింక్ రిబ్బన్ 2కే వాక్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సినీ నటి మంచు లక్ష్మి, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

14 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

తిరుమల : 14వ తేదీ నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 18న గరుడ సేవ, 21న స్వర్ణరథం, 22న చక్రస్నానం కార్యక్రమాలు జరుగనున్నాయి. 18న గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించరు. 22న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల ముగింపు రోజు తిరుమలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నారు. 

కోల్ కతాకు చేరుకకున్న పీలే..

పశ్చిమ బెంగాల్ : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ పీలే కోల్ కతాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పీలేకు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. 

టాస్ గెలిచిన సౌతాఫ్రికా..

కాన్పూర్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

08:13 - October 11, 2015

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలో డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 400 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఛైన్ స్నాచర్లు, 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 24 బైక్ లు, 4 ఆటోలు, 2 సిలిండర్లు, 62 మద్యం బాటిళ్లు, వంద గ్రాముల గంజాయిలను స్వాధీనం చేసుకున్నారు. 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. 

08:10 - October 11, 2015

నెల్లూరు : మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకపోవడానికి దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఓ మహిళపై కత్తితో దాడి బంగారాన్ని అపహరించుకపోయారు. గూడురులో చేపల వ్యాపారం చేసే సుబ్బమ్మ నివాసం ఉంటోంది. ఆదివారం చేపలను విక్రయించడానికి సమీపంలోనే ఉన్న మార్కెట్ కు వెళ్లింది. త్యాగరాజు వీధి వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చాడు. బంగారు ఆభరాలను తీయాలని కత్తితో బెదిరించాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీనితో దుండగుడు కత్తితో మెడ, కడుపులో పొడిచాడు. దీనితో సుబ్బమ్మ సృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారం గొలుసును తెంపుకుని పరారయ్యాడు. సృహ కోల్పోయిన సుబ్బమ్మను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కాన్పూర్ లో బారులు తీరిన అభిమానులు..

కాన్పూర్ : నేడు భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు కొనుగోలు కోసం స్టేడియం వద్ద అభిమానులు బారులు తీరారు. 

మీర్ పేటలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలో డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు ఛైన్ స్నాచర్లు, 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 24 బైక్ లు, 4 ఆటోలు, 2 సిలిండర్లు, 62 మద్యం బాటిళ్లు, వంద గ్రాముల గంజాయిలను స్వాధీనం చేసుకున్నారు. 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. 

ధర్మవరం వద్ద బస్సు బోల్తా..

విశాఖపట్టణం : ధర్మవరం జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కావడంతో తుని ఆసుపత్రికి తరలించారు. వీరంతా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన ఉపాధ్యాయులుగా తెలుస్తోంది.  

11గంటలకు వైసీపీ ముఖ్యనేతల భేటీ..

గుంటూరు : వైసీపీ ముఖ్యనేతలు ఉదయం 11గంటలకు భేటీ కానున్నారు. జగన్ దీక్ష 5 రోజుకు చేరడం..ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్ కార్యాచరణనపై నేతలు చర్చించనున్నారు. 

పుత్తూరు వద్ద తనిఖీలు..

తిరుపతి : పుత్తూరు (మం) నేండ్రగుంట చెక్ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 89 మంది ఎర్రచందనం నరికే తమిళకూలీలను పోలీసులు అరెస్టు చేశారు. బాకరాపేట పీఎస్ కు తరలించారు. 

07:27 - October 11, 2015

దాదాపు 4దశాబ్దాల కాలం పాటు బాలీవుడ్ తెరమీద నెం1 గా చెలరేగి ... ఇప్పటికీ దర్శక నిర్మాతల్ని తన చుట్టూ తిప్పించుకుంటూ అఖిలాండ కోటి ప్రేక్షకుల్ని తన నటనతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆ 73 ఏళ్ళ యువకుడు, బాలీవుడ్ షహెన్ షా అమితాబ్ బచ్చన్. నేడు ఆయన బర్త్ డే..యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ నుండి మెగాస్టార్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా ఎదగడానికి అమితాబ్‌ హరివంశ్‌ శ్రీవాస్తవ అలియాస్‌ అమితాబ్‌ బచ్చన్‌ చాలా దూరమే ప్రయాణించారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటిదాకా రోజు రోజుకూ ఎదుగుతూ, అందరికీ మార్గదర్శకునిగా మారుతూ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యవస్థగా మారిన అమితాబ్‌ను, భారతీయ సినిమాను వేరువేరుగా చూడలేం. కలకత్తాలో రెండు మూడు ఉద్యోగాలు అయిష్టంగా చేసి, వాటిని వదిలేసి తనకు ఇష్టమైన సినిమాల్లోకి రావాలనే ఆకాంక్షతో సన్నగా, పొడవుగా ఉండే అమితాబ్‌ రైలెక్కి బొంబాయ్‌లో దిగారు. అవకాశాల కోసం తిరిగారు. పీలగా, పొడవుగా, సాధారణం కంటే భిన్నమైన రూపురేఖలతో ఉన్న అమితాబ్‌కు అన్నిచోట్లా తిరస్కారమే.

కెరీర్ ను తిప్పిన 13వ సినిమా..
తొలి సినిమానే జాతీయ అవార్డును తెచ్చినా, ఊహించినట్లు ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రాలేదు. వాటి కోసం ఇబ్బందులు తప్పలేదు. డబ్బింగ్‌లు చెబుతూ, చిన్న చిన్న పాత్రలు చేయడం తప్పితే కెరీర్‌ ఆశాజనకంగా కనిపించడం లేదు. అదిగో అప్పుడు వచ్చింది 'ఆనంద్‌'. సాధారణంగా 13ను దురదృష్ట సంఖ్యగా చాలామంది పరిగణిస్తుంటారు. కానీ పదమూడో సినిమా అమితాబ్‌ కెరీర్‌ను సమూలంగా మార్చేయడం గమనించదగ్గ అంశం. ఆ సినిమా 'జంజీర్‌'. హిందీ సినీ యవనికపై సరికొత్త యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఆ సినిమాతోనే అవతరించాడు.

ఒక పెద్ద అగాధం..
అమితాబ్ కెరీర్ ను అసాధారణమైన మలుపు తిప్పిన సంవత్సరం 1975. ఆ సంవత్సరం రిలీజైన రెండే రెండు చిత్రాలు అమితాబ్ ను అమాంతం సూపర్ స్టార్ ను చేసేసాయి. ఆ రెండు చిత్రాల తరువాత అప్పటివరుకూ కొద్దో గొప్పో స్టార్ హోదాలో ఉన్న హీరోలంతా .. డిఫెన్స్ లో పడకతప్పలేదు. షోలే , దీవార్ చిత్రాల తరవాత అమితాబ్ కెరీర్ అఖండంగా వెలిగింది. ఆయన గొంతు వినడానికే సగం మంది ప్రేక్షకులు సినిమాకు వచ్చేవారంటే ..ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్ధమౌతుంది. అలా.. అమితాబ్ కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లోనే... అప్పుడే ఒక పెద్ద అగాధం ఏర్పడింది.

రాజకీయాల్లో బిగ్ బి..
1984లో అమితాబ్‌ తన నట జీవితానికి కొంతకాలం పుల్‌స్టాప్‌పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమ కుటుంబ మిత్రుడైన రాజీవ్‌ గాంధీకి మద్దతుగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 8వ లోక్‌సభ ఎన్ని ల్లో అమితాబ్‌ ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.ఎన్‌.బహుగు ణపై పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. రాజకీయాలకు స్వస్థి చెప్పిన అమితాబ్ మళ్లీ మేకప్ వేసుకొని .. తిరిగి వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ ను మరోసారి తెరమీద చూసుకున్న ఆయన అభిమానులు ..ఆ సినిమా ఘనవిజయంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ సినిమా షహెన్ షా.

గంభీరమైన వాయిస్..
అమితాబ్ సెకండ్ ఇన్నింగ్స్ .. బాలీవుడ్ లో ఆయనకు విజయాల్ని అందించలేకపోయినా ఆయనను మరో ప్రస్థానానికి మళ్లించేలా చేసింది. ఆ ప్రస్థానమే ఆయన్ను మళ్లీ సినిమాల వైపుకు మళ్లించింది. ఆ ప్రస్థానం పేరు కౌన్ బనేగా కరోర్ పతి. అమితాబ్ గొంతే ఆయనకు పెద్ద అసెట్ . గంభీరమైన ఆ వాయిస్ తోఆయన పలికే డైలాగ్స్ .. ఎలాంటి ఎమోషన్స్ నైనా ఈజీగా కేరీ చేస్తాయి.. అందుకే ఇప్పటికీ ఆ గొంతును వినడానికి నాలుగు దశాబ్దాలు గా ఎన్నో కోట్లమంది ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ఒక పక్క టెలివిజన్,మరో పక్క సినిమా.. రెండు వైపులా పదునైన కత్తిలా.. అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్ బుల్లి తెరమీద , వెండితెరమీద తన హవా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. 73 వ పడిలోకి అడుగుపెట్టినా... ఆయనలో ఆ ఎనర్జీ ,ఉత్సాహం తగ్గలేదు.. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తునే ...బాలీవుడ్ తెరమీద ఇంకా ఆయన సూపర్ స్టార్ గానే కొనసాగుతున్నారు, కౌన్ బనేగా కరోర్ పతి అని మరింత గంభీరంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.. దటీజ్ అమితాబ్ జీ. ఆ షహెన్ షాకి మరోసారి బర్త్ డే విషెస్ తెలియచేస్తోంది 10 టివి. 

నేడు ముంబైలో ప్రధాని పర్యటన..

ముంబై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముంబైలో పర్యటించనున్నారు. చైత్యభూమిలో నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ కు మోడీ నివాళులర్పించనున్నారు. 

నేడు నిజామాబాద్ లో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర..

నిజామాబాద్ : జిల్లాలో నేడు కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ ఆలీలు పాల్గొనున్నారు. 

నేడు మాల్దీవు అధ్యక్షుడితో సుష్మా భేటీ..

ఢిల్లీ : రెండు రోజుల పాటు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. అక్కడి అధ్యక్షుడు అబ్దుల్లాయమీన్ తో భేటీ కానున్నారు. మాల్దీవుల రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు..జాయింట్ కమిషనర్ లతో సుష్మా చర్చించనున్నారు.

 

కడప పారిశ్రామిక వాడలో ఫైర్ ఆక్సిడెంట్..

కడప: చైతన్య ప్లాస్టిక్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో బిల్డింగ్ కుప్పకూలింది. భారీగా ఆస్తి నష్టం కలిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. 

నేడు జయప్రకాష్ నారాయణ్ జయంతి..

హైదరాబాద్ : నేడు జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఎమర్జెన్సీతో జైలుపాలైన 16 మంది నేతలకు సత్కారం చేయనున్నారు. లోక్ తంత్ర కేకే ప్రహారీ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ సత్కరించనున్నారు.

 

ఐదో రోజుకు చేరిన జగన్ దీక్ష..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్‌ జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. 

07:01 - October 11, 2015

మాంచెస్టర్ : భారత బాక్సింగ్‌ దిగ్గజం విజేందర్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో తొలి విజయం నమోదు చేశాడు. శనివారం రాత్రి మాంచెస్టర్‌లో బ్రిటన్‌ బాక్సర్‌ సోని వైటింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందాడు. తొలి రౌండ్‌ నుంచి ప్రత్యర్ధిపై ఆధిపత్యం చలాయించిన విజేందర్‌.. రెండో రౌండ్‌లో మరింత రెచ్చిపోయాడు. ఇక మూడో రౌండ్‌లో టెక్నికల్‌ నాకౌట్‌ సాధించడంతో రెఫరీ మ్యాచ్‌ను నిలిపివేసి.. విజేందర్‌ను విజేతగా ప్రకటించారు. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. ఇది ఆరంభం మాత్రమేనని విజేందర్‌ అన్నారు. 

07:00 - October 11, 2015

ఢిల్లీ : మార్టినా హింగిస్‌-సానియా మిర్జా జోడీ ఈ ఏడాది తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కలయా, నిజమా అన్నట్టు ఈ హైదరాబాద్ అమ్మాయి తన స్విట్జర్లాండ్ భాగస్వామితో కలిసి ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ సీడింగ్‌కు తగ్గట్టుగా రాణించి విజేతగా అవతరించింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ద్వయం 6-7, 6-1, 10-8తోసూపర్ టైబ్రేక్‌లో ఆరో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు ప్రైజ్‌మనీగా 2 కోట్ల 13 లక్షలతోపాటు 1వెయ్యి ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదిలా ఉంటే 2015 సీజన్‌లో సానియాకు ఇది తొమ్మిదో టైటిల్‌ విజయం కాగా, హింగిస్‌ తో జతకట్టి వరుసగా 8 టైటిల్‌ కావడం విశేషం. ఇంతకు వీరి జోడి వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నారు.

 

06:42 - October 11, 2015

టర్కీ : రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన పేలుళ్లలో 86 మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రైల్వేస్టేషన్ సమీపంలో కార్మిక సంఘాలు శాంతి ర్యాలీ జరుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. టర్కీలో కుర్దు మిలిటెంట్లకు ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు పెద్దఎత్తున రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు. కుర్దిష్‌లకు మద్దతుగా అందరు ఒకచోట గుమిగూడి ఉండగా బాంబు పేలుళ్లు సంభవించినట్టు టర్కీ హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడులకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  

 

06:41 - October 11, 2015

నేపాల్ : నేడు నేపాల్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రధాని సుశీల్‌ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌ బరన్‌ యాదవ్‌కు సమర్పించారు. నేపాలీ కాంగ్రెస్‌ తరపున ప్రధాని పదవికి పోటీ పడేందుకు సుశీల్‌ కొయిరాలా మళ్లీ నామినేషన్‌ వేశారు. సిపిఎన్‌-యుఎమ్‌ఎల్‌ అధ్యక్షుడు కెపి ఓలీ ప్రధాని పదవి కోసం తన నామినేషన్‌ ఇదివరకే దాఖలు చేశారు. ప్రధాని పదవికి సుశీల్‌ కోయిరాలా, కెపి ఓలీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుశీల్‌ కొయిరాలా 2014లో ప్రధానిగా ఎంపికయ్యారు. ఆయన నేతృత్వంలోనే నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఎంపిక చేసింది.

06:39 - October 11, 2015

ఢిల్లీ : వేదాలు వల్లిస్తున్న వారే రక్తాన్ని పీలుస్తున్నారు. సాధువు ముసుగు వేసుకున్న వారే తప్పు అని చెబుతున్న పనులు చేస్తున్నారు. నీతులు బొంకుతున్న వారే బూతులు మాట్లాడుతున్నారు. ఇవి నిందారోపణలు కావు. ఎవరినో ఉద్దేశించి చేస్తున్న విమర్శనాస్త్రాలు కానే కావు. సమయం వచ్చినప్పుడు సత్యం బయటపడుతుందనేదానికి సాక్ష్యాలు. రాజ్యాధికారానికి షార్ట్ కట్‌లు, పాస్‌వర్డ్ లు తెలియని వాళ్లే బలవుతారనేందుకు అసలు సిసలైన నిదర్శనాలు. గోవధ మహా పాపం. గో హత్య మహా పాతకం. హిందువులందరూ పవిత్రంగా పూజించే గోమాతను వధించిన వారికి మరణ శిక్ష వేయాల్సిందే. మెజారిటీ వర్గపు మనోభావాలను గాయపరుస్తున్నందుకు సరైన శిక్ష వేయాల్సిందే. ఇవీ...కాషాయవాదులు, కమలనాధులు చెప్తున్న నీతులు. పరోక్షంగా గోమాంసం తినేవారిపై దాడులు చేయండని, హింసను ప్రేరేపించేలా ఇస్తున్న నినాదాలు.

ముజఫర్ అల్లర్లు..
అయితే కమలనాధులు చెప్పేదానికి, ఆచరించేదానికి పొంతనే ఉండదని విపక్షాలు గగ్గోలు పెడుతుంటాయి. మీరట్‌లోని సర్దానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివాదాస్పద బిజెపీ ఎమ్మెల్యే సింగ్‌ సోమ్‌ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు. సింగ్‌ సోమ్‌ ముజఫర్‌నగర్ అల్లర్లలో ప్రధాన నిందితుడు. అంతేకాదు బీఫ్‌ విక్రయాలను నిషేధించాలి. గోవధ చేసే వారిని శిక్షించాలని అని డిమాండ్ చేస్తున్న వారిలో ముందు వరుసలో నిలిచే మోడీ ప్రధాన అనుచరుడు. నాణేనికి మరో వైపు ఉన్నట్లే సింగ్‌ సోమ్‌కు మరో కోణం ఉంది. బీఫ్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సింగ్‌ సోమ్‌ బీఫ్‌ను విదేశాలకు ఎగుమతి చేసే " అల్ దువా " ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్ధాపకుల్లో ఒకరు. మిగతా ఇద్దరు సోమ్‌కు సన్నిహితులైన మహ్మద్‌ ఖురేషి కాగా మరొకరు రావత్. 2005లో ప్రారంభమైన ఈ గోమాంసం ఎగుమతి సంస్ధ మన దేశంలో బీఫ్‌ను ఎక్స్ పోర్టు చేస్తున్న పేరెన్నిక గల సంస్ధల్లో ప్రధానమైనది. అల్ దువా ముఖ్యంగా అరబ్‌ దేశాలకు భారీ స్ధాయిలో గోమాంసాన్ని ఎగుమతి చేస్తోంది.

స్ట్రింగ్ ఆపరేషన్ లో వాస్తవాలు..
ఓ స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైన ఈ వాస్తవం గురించి సింగ్ సోమ్‌ను వివరణ అడిగితే తొలుత బుకాయించారు. అల్‌ దువా సంస్ధ డైరెక్టర్లు తనకు సన్నిహితులు మాత్రమే, ఆర్ధికంగా చేయూత మాత్రమే ఇచ్చానంటూ మాట మార్చే ప్రయత్నం చేసారు. కానీ సింగ్‌ సోమ్ పేరుతో జరిగిన లావాదేవీలను పక్కా ఆధారాలతో చూపించేసరికి "అల్ దువా" కంపెనీ కోసం కొన్న భూమికి మాత్రమే పెట్టుబడి పెట్టానంటూ అంగీకరించారు. అయినా ఇదంతా తమ పార్టీ అధిష్ఠానానికి తెలుసంటూనే ఇందులో కొత్త విషయం ఏమి లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసారు సింగ్‌ సోమ్.

ప్రజలే గుణపాఠం..
ఒక్క సింగ్‌ సోమ్‌ మాత్రమే కాదు చాలా మంది బిజెపీ, విహెచ్‌పీ, సంఘ్‌ పరివార్‌ నేతలు మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న సంస్ధల్లో స్లీపింగ్‌ పార్టనర్స్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా కవరింగ్ ఇచ్చుకుంటూ మత ఘర్షణల్లో అమాయకులను చంపేస్తున్నారంటూ మండిపడుతున్నాయి. వీరి అసలు స్వరూపం బట్టబయలయ్యే రోజు దగ్గర్లోనే ఉందంటున్న విపక్షనేతలు సమీప భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారంటున్నారు.

06:35 - October 11, 2015

హైదరాబాద్ : మరో అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. సమగ్ర జల విధానాన్ని అన్ని పార్టీల ముందుంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సాగునీటి ప్రాజెక్టుల రిడిజైనింగ్‌ నివేదికను సిద్ధం చేస్తోంది. అయితే గురువారం నాటి అఖిలపక్ష సమావేశానికి పార్టీలకు ఆహ్వానాలు అందలేదు. కేసీఆర్‌ అధికారం చేపట్టిన వెంటనే ఏకపక్ష నిర్ణయాలుండవని బహాటంగా ప్రకటించారు. కీలకమైన అంశాలపై విపక్షాలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని.. ముందుకెళ్తామని చెప్పారు. భూముల క్రమబద్దీకరణ అంశంపై తప్ప మరే ఇతర విషయాలపై సొంతంగానే విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అదే హైదరాబాద్‌ అభివృద్ధిపై సైతం విపక్షాల అభిప్రాయాలను కోరారు. మెట్రో అలైన్‌మెంట్‌ మార్పు, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, వినాయక్‌సాగర్‌ వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అఖిలపక్ష సమావేశాలకు రాంరాం చెప్పిన ప్రభుత్వం .. అంతా తానై వ్యవహారిస్తోంది.

నూతన జలవిధానం..
తాజాగా మరో మారు అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతోంది సర్కార్‌. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా.. నూతన జల విధానాన్ని ఆవిష్కరించేందుకు అఖిలపక్షాన్ని పిలవనుంది. జూబ్లిహాల్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా ప్రాజెక్టుల రిడిజైనింగ్‌, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను వినియోగించుకునే విధానాలను పార్టీల ముందుంచాలని కేసీఆర్‌ తలపిస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్‌ ఇరిగేషన్‌, జిల్లా ఉన్నతాధికారులు, సాగునీటి పారుదల రంగనిపుణులతో క్యాంపు కార్యాలయంలో పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. జిల్లాలు, ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, వినియోగం, వృథాగా కిందకు పోతున్న జలాలు, నిర్మాణ, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై చర్చించారు.

విపక్షాలు సహకరిస్తాయా ?
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పును వ్యతిరేకిస్తున్న విపక్ష నాయకులను మెప్పించే విధంగా తన వాదనకు కేసీఆర్‌ పదునుపెడుతున్నారు. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, ఉప నదులు, ప్రాజెక్టులు, కేటాయించిన జలాలు, వినియోగించుకుంటున్న జలాలు, పాత ప్రాజెక్టుల రీడిజైన్లలో మార్పులు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి వివరాలను క్రోడికరించి అఖిలపక్షం ముందుంచనున్నారు. సాగునీటి రంగంలో ఇప్పటివరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అధిగమించే దిశలో నూతన జల విధానం తోడ్పడుతుందని తెలియజేయనున్నారు. మరోవైపు ఇప్పటివరకు అఖిలపక్ష నేతలకు సమాచారం ఇవ్వలేదు. దీంతో అసలు అఖిలపక్ష సమావేశం జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలు కూడా కల్గుతున్నాయి. ఇటు విపక్షాలు సహకరిస్తాయా..? లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. రైతు ఆత్మహత్యలు, వరంగల్‌ ఎన్‌కౌంటర్‌, ప్రభుత్వం ఒంటెద్దు పోకడలపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి నాయకులు వస్తారా..? రారా అన్నది ఆసక్తిగా మారింది.

06:33 - October 11, 2015

హైదరాబాద్ : ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌లో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యవహారశైలిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీకి 12 మంది నాయకులు రాజీనామా చేయడంతో యూనియన్‌లో చీలిక ఏర్పడింది. అన్ని విషయాలు చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు అసంతృప్తి నేతలు.

కార్మికుల ఫిట్ మెంట్...
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌లో లుకలుకలు బయటపడ్డాయి. ఉద్యమానికి ముందు గుర్తింపు సంఘమైన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నుంచి విడిపోయి ఏర్పడ్డ ఈ యూనియన్‌.. ఆ తర్వాత తెలంగాణలో గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడిన నేతల్లో... ఇప్పుడు విభేదాలు పొడచూపాయి. కార్మికుల ఫిట్‌మెంట్‌ కోసం ఎంతో పోరాడిన ఆ నేతలు.. ఇప్పడు అదే విషయంపై కత్తులు దూసుకుంటున్నారు.

అదేవిధంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అవలంబిస్తున్న విధానాలపై పలువురు నేతలు గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ వ్యవహారంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కార్మికుల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేయాలన్న యూనియన్‌ కార్యదర్శి నిర్ణయంతో కొంతమంది నేతలు విభేదించారు. కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదని స్వయానా సీఎం కేసీఆర్‌ చెప్పినప్పటికీ.. నాయకులు కావాలనే ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రధాన కార్యదర్శిపై ఆగ్రహాలు...
ఇక యూనియన్‌ ప్రధాన కార్యదర్శిపై నేతలు అనేక విషయాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులను తీసుకోకుండా చూడాల్సిన ఆయన.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు. అంతేగాక ఆర్టీసీలో నియమించే కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. కార్మికుల సంక్షేమాన్ని గాలికివదిలేసిన నాయకులు.. రాజకీయ పైరవీల కోసం నిత్యం మంత్రుల ఇళ్లు,.. సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికుల నుంచి డబ్బులు చేసే వ్యవహారంలో కొంతమంది బడా నేతలున్నారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

12 మంది రాజీనామాలు..
ఇక యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీలో నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు కార్యదర్శులు, ఇద్దరు జోనల్‌ ఛైర్మన్లతో సహా 12 మంది నేతలు రాజీనామా చేశారు. అన్ని విషయాలు చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని అసంతృప్తి నేతలంటున్నారు. మరి ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి. 

06:30 - October 11, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ దీక్ష కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రం కొత్తగా పుట్టిన శిశువు అని.. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలని బాబు అన్నారు. కేవలం జగన్‌ తన రాజకీయ ప్రాబల్యం కోసం దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పద్ధతి ప్రకారం పని చేస్తున్నానని.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిన అవసరముందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ స్వర్గంగా మారలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో.. కేంద్ర సహకారం కూడా అంతే అవసరమన్నారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో కోటి ఆశలు పెట్టుకున్న ప్రజల్లో ప్రతిపక్ష నేత లేనిపోని అపోహలు సృష్టించడం సరికాదన్నారు చంద్రబాబు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 

06:28 - October 11, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్‌ జగన్‌ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం నాడు జగన్‌ బరువు తగ్గడంతో పాటు.. బాగా నీరసించారు. నిన్న రాత్రి జగన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. జగన్‌ శరీరంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతున్నట్లుగా తెలిపారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జగన్‌ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. 

06:27 - October 11, 2015

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జంటనగరాలను జడివాన ముంచెత్తింది. భారీ వర్షం ధాటికి... భాగ్యనగర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. విద్యానగర్‌, ఉప్పల్‌, తార్నాక, బాగ్‌లింగంపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్‌, అమీర్‌ పేట్‌, నాంపల్లి, బేగం బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రోడ్లను డ్రైనేజీ వ్యవస్థ కప్పేసింది. ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. మెట్రో పనుల కోసం తవ్విన భారీ గుంతల్లో నీరు చేరింది. ఇటు వరద, అటు డ్రైనేజీ నీరు రోడ్ల మీదకు రావటంతో వాహనదారులు, పాదాచారులు నానా కష్టాలు పడ్డారు. ప్రధాన కూడళ్లయిన లిబర్టీ, అబిడ్స్‌, ఖైరతాబాద్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌లో ట్రాఫిక్‌ స్తంభించటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరింత బలపడిన వాయుగుండం..
మరోవైపు బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్‌ వైపు అల్పపీడనం వెళ్లిపోయింది. అలాగే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న... వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయివ్య దిశగా పయణిస్తూ... ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక బీహార్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. దీంతో వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

06:25 - October 11, 2015

చెన్నై : ఓ హాస్యపు జల్లు మూగబోయింది. ఓ మాతృమూర్తి ప్రేమ దూరమైపోయింది. అందర్నీ నవ్వించే హాస్యం అంతర్థానమైంది. సినీజగత్తు నుంచి ఇక సెలవంటూ వెళ్లిపోయింది. దక్షిణాది చిత్రాల్లో అనేక పాత్రల్లో అద్భుతంగా నటించిన సినీనటి మనోరమ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడ్డ ఆమె... చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. "ఆచి" అని అభిమానులు అల్లారుముద్దుగా పిల్చుకునే... మనోరమ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

1937లో జననం..
1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు మనోరమ. ఆమె అసలు పేరు గోపిశాంత. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి. అనేక నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించి అందరి మెప్పుపొందారు. 1950 నుంచి 70 వరకూ... ఆమె హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశారు. ఆ తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ... మంచి గుర్తింపు పొందారు. 1958లో "మాలై ఇట్ట మంగై" అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ... సుమారు 1,500 సినిమాలకు పైగా నటించి గిన్నిస్ రికార్డులో స్థానం సాధించారు.

తెలుగు చిత్రాల్లో నటన..
ఎన్నో మరపురాని పాత్రల్లో నటించారు మనోరమ. తెలుగులో రిక్షావోడు, మనసున్న మారాజు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి, ప్రేమికుడు, 7/G బృందావన్‌ కాలనీ సినిమాల్లో నటించారు. అంతేకాకుండా మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. తన కెరీర్‌లో ఐదుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఘటన ఆమెది. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, ఎన్టీఆర్‌ సరసన నటించారు. ఇక అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1989లో జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్‌మెంట్‌ అవార్డు సాధించారు. 2002లో పద్మశ్రీ లభించింది. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన మనోరమ ఎప్పటికీ చిరస్మరణీయురాలే. ఆమెను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 

సినీ మనోరమ అనారోగ్యంతో కన్నుమూత..

హైదరాబాద్ : సినీ నటి మనోరమ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

 

నేడు భారత్ - సౌతాఫ్రికా వన్డే..

కాన్పూర్ : ఐదు వన్డేల సిరీస్ ల భాగంగా నేడు భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష..

హైదరాబాద్ : నేడు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష జరుగనుంది. 83,225 అభ్యర్థులు హాజరు కానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 

Don't Miss