Activities calendar

12 October 2015

ఆందోళనకరంగా జగన్ ఆరోగ్యపరిస్థితి : వైద్యులు

గుంటూరు : డాక్టర్లు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. జగన్ ను ఆస్పత్రికి తరలించాల్సిన అవసరముందన్నారు. మధ్యాహ్నంతో పోలిస్తే బీపీ లెవల్స్, బురు తగ్గాయని.. కీటోన్స్ 3+ ఉన్నాయని పేర్కొన్నారు. రక్త నమూనా సేకరణకు జగన్ అంగీకరించడం లేదని తెలిపారు. దీక్ష విరమించి ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిదని సూచించారు. జగన్ ఆరోగ్యంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వైద్యులు చెప్పారు. 

22:02 - October 12, 2015

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 49 స్థానాలకు జరిగిన తొలిదశ పోలింగ్లో 57 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2010లో ఇక్కడ పోలింగ్ కేవలం 50.85 శాతం నమోదు కాగా... ఇపుడు 7 శాతం పెరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ మూడు గంటలకే ముగియగా, సాధారణ పరిస్థితులు గల ప్రాంతాలలో 5 గంటల వరకు కొనసాగింది. తొలిదశలో 49 స్థానాలలో 583 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

 

22:00 - October 12, 2015

ఢిల్లీ : 2015కు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. బ్రిటన్‌ ఆర్థిక వేత్త ఆంగస్ డేటన్ కు ఈ పురస్కారం దక్కింది. పేదరిక నిర్మూలన, సంక్షేమం అంశాలపై ఆయన చేసిన విశ్లేషణాత్మక కృషికి ఈ బహుమతి లభించింది. స్థూల అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం విభాగాల రూపాంతరానికి డేటన్‌ కృషి చేశారు. యూకేలో జన్మించిన డేటన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికశాస్త్రానికి సంబంధించి 'డేటన్ ది గ్రేట్ ఎస్కేప్, ఎకనామిక్స్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్, ది ఎనాలసిస్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సర్వేస్' వంటి పలు పుస్తకాలను ఆంగస్‌ డేటన్ రచించారు.

 

21:58 - October 12, 2015

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని.. దీని అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో సహకరిస్తోందని అన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. విభజన చట్టంలో ఉన్నవే కాకుండా.. లేని అంశాలపైనా కేంద్రం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖలో సినీ పరిశ్రమ పరిఢవిల్లాలని ఇద్దరు నేతలూ ఆకాంక్షించారు.
చంద్రబాబు, వెంకయ్య విశాఖలో పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి.. సోమవారం విశాఖలో పర్యటించారు. ఉదయం విమానాశ్రయ సుందరీకరణ పనులను ప్రారంభించిన చంద్రబాబు.. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన వెంకయ్య విశాఖకు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా, విద్యాసంస్థల హబ్‌గా, వాణిజ్య కూడలిగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరూ అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు.
సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తోంది : చంద్రబాబు
రాష్ట్ర విభజన అనంతర సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇతోధికంగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభజనలో పెట్టిన అంశాలనే కాకుండా.. అదనపు సహకారాన్నీ అందిస్తోందన్నారు. పోలవరం ముంపు మండలాల అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖపట్టణంలో సినిమా పరిశ్రమ వృద్ధి చెందాలని ఇద్దరు నేతలూ పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌ వీడి రావాలని పిలుపునివ్వడం లేదని.. అయితే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశాఖ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు.
పునర్నిర్మాన పనులపై చంద్రబాబు సమీక్ష
హుద్‌ హుద్‌ తుఫాను సంభవించి ఏడాదైన సందర్భాన్ని పురస్కరించుకొని.. పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అనంతరం సాయంత్రం చంద్రబాబు, వెంకయ్యలు ఆర్‌కే బీచ్‌ వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. హుద్‌హుద్‌ సమయంలో విశాఖ వాసులు అందించిన సహకారం.. స్ఫూర్తి మరచిపోలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు నగరంలో ఐదు లక్షల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు వెల్లడించారు.

 

21:48 - October 12, 2015

దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బతీసే ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి రాజకీయ రంగు పూపి తమ తమ ఎజెండాను పూర్తి చేసుకోవానుకుంటున్న నాయకులు అంగరంగ వైభవంగా రంగప్రవేశం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న దేశ ప్రజాస్వామిక విలువలకు నిజంగా విఘాతం కలుగుతుందన్న అభిప్రాయం మాత్రం ఎవరూ కాదనలేనిది.. అందుకే దేశంలో రచయితలంతా.. ఇప్పుడు ముక్తకంఠంతో తాజా పరిణామాల పట్ల తమ నిరసన గళాలను వినిపిస్తున్నారు. పాలకుల మౌననాన్ని బద్దలు కొట్టడానికి తాము గతంలో పొందిన అకాడమీ పురస్కారాలను తిప్పి కొడుతున్నారు. ఎందుకిలా.. ? అసలు దేశంలో ఏం జరుగుతోంది. దేశంలో సామరస్యవాతావరణాన్ని కాపాడడంలో విఫలమైన ఏలికలపై అక్షరయోధులు సంధిస్తున్న నిరసన బాణాలపై ప్రత్యేక కథనం... ఈరోజు వైడ్ యాంగిల్ లో చూద్దాం... మరిన్ని వివరాలను వీడియోలో చూడండి...

 

రేపు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన

తిరుపతి : ఎపి సీఎం చంద్రబాబు రేపు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. చంద్రబాబు పుట్టమన్ను సేకరించనున్నారు.

 

3 టన్నుల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి : మంగళం, బొమ్మల క్వార్టర్స్, చచ్చినోడుబండ, కల్యాణి డ్యామ్ ప్రాంతాల్లో ఎర్రచందనం కూలీలు అలజడి సృష్టించారు. కల్యాణి డ్యామ్ వద్ద కూలీలు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 3 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

20:54 - October 12, 2015

కరీంనగర్ : జిత్తులమారి నక్కకు ఊహించన పరిణామమే ఎదురైంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడిన నక్కకు నాగుపాము షాక్ ఇచ్చింది. ఫైటింగ్ రమ్మని పడగఎత్తి సవాల్ విసిరింది. దీంతో నక్క, నాగుపాము హోరాహోరీగా పోరాడాయి. కాసేపు వెనుదిరిగిన నాగుపాము మళ్లీ వచ్చి... నక్కతో పోట్లాడింది. ఇలా గంటసేపు నువ్వా..నేనా అన్నట్లుగా ఈ రెండూ పోరాడుకున్నాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో ఈ అరుదైన ఘటన చేటుచేసుకుంది. నక్క, నాగుపాము యుద్ధాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు. అనంతరం ఆ మూగ జీవాలను రక్షించాలని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి శివారెడ్డి అరెస్టు

తూర్పుగోదారి : ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి శివారెడ్డి అలియాస్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నెర్లిపాక మండలం నందిగామలో శివారెడ్డి అరెస్టు చేశారు. శివారెడ్డికి సహకరించిన వైద్యుడినీ అరెస్టు చేశారు. ఎపి, తెలంగాణ చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో శివారెడ్డిపై 70 కేసులున్నాయి. ఆయనపై రూ.20లక్షల రివార్డు ఉంది.

 

విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీకి బెదిరింపు లేఖ...

విశాఖపట్నం : విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీకి బెదిరింపు లేఖ వచ్చింది. నారాయణ సింగ్ అనే వ్యక్తి పేరుతో అథారిటీకి బెదిరింపు లేఖ వచ్చింది. ఐఎస్ ఐఎస్ సంబంధాలున్నాయని అగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. శ్రీహరికోట, విశాఖ ఎయిర్ పోర్టులను పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆదిలాబాద్ నుంచి లేఖ వచ్చినట్లు గుర్తించారు. ఎపి పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

జగన్ దీక్ష శిబిరం వద్దకు అసాంఘిక శక్తులు..?

గుంటూరు : జగన్ దీక్ష శిబిరం వద్దకు అసాంఘిక శక్తులు ప్రవేశించాయని ఎస్పీ త్రిపాఠికి సమాచారం అందింది. ఎస్పీ సూచనతో దీక్షా శిబిరం వేదికపై నుంచి కిందిస్థాయి నేతలను కిందికి పంపించారు.

బీహార్ లో ముగిసిన తొలి విడత ఎన్నికలు...

పాట్నా : బీహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 57 శాతం పోలింగ్ నమోదు అయింది. 10 జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. 54 మంది మహిళలు సహా 583 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

 

ఏయూలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

విశాఖ : ఏయూలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ హరిబాబులు హాజరయ్యారు. ఆహ్వానపత్రంలో తమ పేరు లేదని మంత్రి ఆయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అలకబూనారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి అయ్యన్న గైర్హాజరయ్యారు.

 

19:20 - October 12, 2015

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు అక్టోబర్ 12న హుద్ హుద్ తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఉక్కునగరం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం తల్లడిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధాని లాంటి విశాఖ భారీగా నష్టపోయింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అపార నష్టం వాటిల్లింది. ఆనాటి తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ఎందరెందరో ఆపన్న హస్తాలు అందించారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలవాలన్న మానవతా హృదయంతో వీరంతా స్పందించారు. అనేక స్వచ్చంద, వ్యక్తులు దాదాపు 260 కోట్ల రూపాయల సహాయ నిధిని అందించారు. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు అప్పట్లో ప్రభుత్వమే ప్రకటించింది. మరి అది ఆచరణ రూపం దాల్చిందా? నాటి భయంకర తుపాన్ లో ఇళ్లు కోల్పోయినవారికి నష్టం పరిహారం అందిందా? మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలబడిందా? అనే అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూపూడి ప్రభాకర్ (టిడిపి), విల్సన్ (ఏపీ బిజెపి), కుమార్ (సిఐటియు), శివాజి (పిసిసి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మినిస్టర్స్ క్వార్టర్స్ లో బతుకమ్మ వేడుకలు..

హైదరాబాద్ : మినిస్టర్స్ క్వార్టర్స్ లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు సతీమణులు పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ చేసిన పాక్ మాజీ మంత్రి కసూరి

హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నటుడు నసీరుద్దీన్ షా హాజరయ్యారు. అయితే పుస్తకావిష్కరణను అడ్డుకోవాలని శివసేన చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

18:21 - October 12, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీనితో కుటుంబసభ్యులు..అభిమానులు..కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ తో ఆయన ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్ష విరమించాలని పరీక్షించిన వైద్యులు సూచనలను జగన్ సున్నితంగా తిరస్కరించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరించారు. దీనితో దీక్షను విరమించాలని వైసీపీ ముఖ్యనేతలు జగన్ కు సూచించారు. తాను చేస్తున్నది ప్రజల కోసమని, చివరిదాక పోరాడుతానని జగన్ స్పష్టం చేశారని నేతలు పేర్కొన్నారు. ఆరోగ్యం విషమిస్తుందన్న సమాచారం తెలుసుకున్న తల్లి విజయలక్ష్మి హుటాహుటిన గుంటూరుకు చేరుకున్నారు. జగన్ ను పరామర్శించారు. మరోవైపు జగన్ చేస్తున్న దీక్షపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సాయి అనే యువకుడు దీక్ష ప్రాంగణంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. పక్కనే పార్టీ కార్యకర్తలు..పోలీసులు ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడి నుండి సాయిని తరలించారు.

మంత్రుల వ్యాఖ్యలు బాధాకరం..
జగన్ చేపట్టిన దీక్షపై ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. మంత్రులు ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, విరమించాలని వైద్యులు సూచించడం జరిగిందన్నారు. అలాగే తాము కూడా కోరడం జరిగిందని, కానీ ప్రజల కోసం తాను దీక్ష చేయడం జరుగుతోందని జగన్ పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా చివరి వరకు పోరాటం చేస్తానని జగన్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని, ఉద్యమాన్ని అణిచివేసే విధంగా ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. 

మూడేళ్ల గరిష్టస్థాయికి పారిశ్రామికోత్పత్తి వృద్ధి

ఢిల్లీ : దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మూడేళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. 

నెహ్రూ సెంటర్ కు చేరుకున్న పాక్ మాజీ మంత్రి కసూరి

ముంబై : పుస్తకావిష్కరణ కోసం నెహ్రూ సెంటర్ కు పాకిస్థాన్ మాజీ మంత్రి కసూరి చేరుకున్నారు. 

18:01 - October 12, 2015

ముంబై : బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్, షాహిద్‌ కపూర్‌ క్రికెటర్ల అవతారమెత్తారు. బాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేకస్థానం సొంతంచేసుకున్న ఈ ఇద్దరూ సడెన్‌గా క్రికెటర్లు ఎందుకయ్యారని కన్‌ఫ్యూజ్‌ అయితే పొరపాటే. కాన్పూర్‌ వన్డేకి ముందు స్పెషల్‌ లైవ్‌ షోలో ఆలియా, షాహిద్‌లు సందడి సందడి చేశారు. క్రికెట్‌ గురించి పెద్దగా అవగాహన లేని ఆలియా,షాహిద్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు టక టకా సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జనరల్‌ నాలెడ్జ్ అంతగా లేని ఆలియా భట్‌....తనదైన శైలిలోనే సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది. 

17:58 - October 12, 2015

కాన్పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభంలోనే ప్రపంచ మాజీ చాంపియన్, ఆతిథ్య టీమిండియాకు..డెత్ ఓవర్ల దెబ్బ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందే..కెప్టెన్ ధోనీ భయపడినదంతా జరిగింది. ఆఖరి ఐదుఓవర్ల వైఫల్యంతోనే టీమిండియా విజయం చేజార్చుకొంది. టీమిండియా కమ్ మహేంద్రసింగ్ ధోనీని వరుస వైఫల్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంట్లో పులిలా పేరుతెచ్చుకొన్న ధోనీసేన...స్వదేశీ సిరీస్ ల్లో సైతం గుడ్లు తేలేస్తోంది.

భయపెడుతున్న పరాజయాలు..
ఇప్పటికే మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 0-2తో సఫారీటీమ్ కు అప్పజెప్పి...ర్యాంకింగ్స్ లో 4వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయింది. అంతే కాదు ఐదుమ్యాచ్ ల సిరీస్ లో సైతం...ప్రస్తుతం 2వ ర్యాంక్ లో ఉన్న టీమిండియాను పరాజయాలు భయపెడుతున్నాయి. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన తొలి వన్డే సమరంలో...ధోనీ సేన ఐదు పరుగుల తేడాతో ఓటమి పొందడం చర్చనీయాంశంగా మారింది. సిరీస్ ప్రారంభానికి ముందే...టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ..డెత్‌ఓవర్లే తమ జయాపజయాలలో కీలకమంటూ చెప్పాడు. తొలివన్డే తుదిఫలితాన్ని చూస్తే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో ఆఖరి ఐదు ఓవర్లే...టీమిండియా పాలిట డెత్ ఓవర్లుగా మిగిలాయి.

విఫలమైన టీమిండియా బౌలర్లు...
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆఖరి 10 ఓవర్లలో టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చేతికి ఎముకేలేదన్నట్లుగా పరుగులిచ్చారు. ఏబీ డివిలియర్స్- బెహార్డిన్ జోడీ..ఆఖరి 10 ఓవర్లలో 110 పరుగులు దండుకొన్నారంటే...భారత్ బౌలింగ్ ఎంత చెత్తగా ఉందీ మరి చెప్పాల్సిన పనిలేదు. ఆఖరి మూడు ఓవర్లలో సఫారీ జోడీ 53 పరుగులు జోడించడంతో..సౌతాఫ్రికా 303 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. టీమిండియా మీడియం పేసర్లు స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులిచ్చారు. భారత తురుపుముక్క అశ్విన్ గాయంతో బౌలింగ్ కు దూరం కావడం కూడా సౌతాఫ్రికా భారీస్కోరుకు మార్గం సుగమం చేసింది.

ఆఖరిలో బ్యాటింగ్ లో విఫలం..
ఇక..టీమిండియా విషయానికి వస్తే...ఆఖరి మూడు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన టీమిండియా..2 వికెట్లు నష్టపోయి 25 పరుగులు మాత్రమే చేసి...5 పరుగుల ఓటమి పొందాల్సి వచ్చింది. డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో విఫలమైన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డెత్ ఓవర్లలో పరుగులు సాధించడంలోనూ విఫలమయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిరీస్ లోని మిగిలిన నాలుగు వన్డేల్లో ధోనీ అండ్ కో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఆఖరి పది ఓవర్లలో అత్యుత్తమంగా రాణించక తప్పదు.

బెంగళూరు-నాందెడ్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు..

హైదరాబాద్ : బెంగళూరు-నాందెడ్ ఎక్స్ ప్రెస్ రైలుకు ముప్పు తప్పింది. జహీరాబాద్ వద్ద రైలింజన్ నుంచి బోగీలు విడిపోయాయి. బోగీలు లేకుండానే రైలు కొంత దూరం వెళ్లింది. దీంతో రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టింది.

 

17:54 - October 12, 2015

కాన్పూర్ : కాన్పూర్‌ వన్డే ఓటమి నిరాశపరచిందన్నాడు టీమిండియా వన్డే కెప్టెన్‌ ధోనీ. అశ్విన్‌ గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకోవడం....డెత్‌ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు.రోహిత్‌ శర్మ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ధోనీ అభిప్రాయపడ్డాడు.
తొలి వన్డే విజయంతో సఫారీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ సంబరపడిపోతున్నాడు. భారత జట్టు అద్భుతంగా పోరాడిందని...ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడి విజయం సాధించడం తమ ప్రతిభకు నిదర్శనమని చెప్పాడు. ఐదు వన్డేల సిరీస్‌ను విజయంతో ఆరంభించడం ఆనందంగా ఉందని చెప్పాడు.  

బ్రిటన్ ఆర్థికవేత్త అంగస్ డేటన్ కు నోబెల్ పురస్కారం

హైదరాబాద్ : బ్రిటన్ ఆర్థికవేత్త అంగస్ డేటన్ కు నోబెల్ పురస్కారం దక్కింది. పేదరికం, సంక్షేమం, వినియోగం అంశాలపై అంగస్ డేటన్ చేసిన సేవలకు గాను ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. 

17:48 - October 12, 2015

హైదరాబాద్ : గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా,సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అంటున్న ఐక్య వేదిక నేతలు బతుకమ్మను కొందరు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుయ్య బట్టారు. బడుగుల బతుకమ్మ ఆడాలనే నినాదంతో తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక బతుకమ్మ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి ప్రారంభమైన యాత్ర 20వ తారీఖు వరకు జరుగుతుంది. గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడదామనే నినాదంతో ఐక్య వేదిక చేస్తున్న బతుకమ్మ యాత్ర జరిగే ప్రదేశాలను ఓ సారి చూస్తే అక్టోబర్ 12న వరంగల్ జిల్లా నర్సంపేట, అక్టోబర్‌ 13 కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, అక్టోబర్ 14 నిజామాబాద్‌, అక్టోబర్ 15 మెదక్ జిల్లా సంగారెడ్డి, అక్టోబర్ 16 వికారాబాద్‌ రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 17 గద్వాల మహబూబ్‌నగర్ జిల్లా, అక్టోబర్ 18 ఖమ్మం, అక్టోబర్‌ 19 నల్గొండలో నిర్వహించి అక్టోబర్ 20న ట్యాంక్‌ బండ్‌ పై బతుకమ్మ యాత్ర ముగియనుంది.

యాత్రకు అడ్డంకులు..
ఇక నిజామాబాద్ ఎంపీ కవిత చేపట్టిన బంగారు బతుకమ్మ యాత్రకు 10 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ బడుగుల బతుకమ్మ యాత్రకు మాత్రం అడ్డంకులు కల్పిస్తున్నారని ఐద్వా కార్యదర్శి హైమావతి మండిపడ్డారు. ఇక బతుకమ్మ పండుగ అర్ధాన్నే తెలంగాణ సర్కార్ మార్చివేసే కుటిల యత్నం చేస్తోందని పీవోడబ్ల్యూ నేత సంధ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఆడబిడ్డలపై అత్యాచారాలు చేయిస్తూ ఎన్‌కౌంటర్లు చేయిస్తున్న సర్కార్‌కు బతుకమ్మ పండుగ గురించే మాట్లాడే అర్హత లేదని అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు, పాలకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా బడుగుల బతుకమ్మ యాత్రను నిర్వహిస్తామని ఐక్య వేదిక తేల్చి చెబుతోంది. 

రుణం మంజూరుకు శౌరి అంగీకారం

హైదరాబాద్ : కేసీఆర్ ఇండియన్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసింగ్ సంస్థ చైర్మన్ ప్రదీప్ శౌరీ భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు రుణం మంజూరుకు శౌరి అంగీకారం తెలిపారు. 

హైదరాబాద్ కు రెండు నీటి రిజర్వాయర్లు నిర్మించాలి : కేసీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ కు రెండు నీటి రిజర్వాయర్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో వివిధ నగరాల్లో మంచినీరు, మురుగు, రోడ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్, కరీంనగర్ పట్టణాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థను నిర్మించాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. 

ఈనెల 17న డీఆర్ డీవో లో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ

హైదరాబాద్ : ఈనెల 17న డీఆర్ డీవో లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. 

పాక్ ఆహార ప్రదర్శనపై శివసేన బెదిరింపులు

మహారాష్ట్ర : పాకిస్థాన్ ఆహారపు ప్రదర్శనపై శివసేన బెదిరింపులు చేసింది. పుణెలో తలపెట్టిన ఆహార ప్రదర్శన నిర్వాహకుడికి బెదిరింపులు వచ్చాయి. వ్యాపారవేత్త తెహసీన్ పూనావాలా ఆధ్వర్యంలో పాక్ ఆహార ప్రదర్శన తెలపెట్టారు. ఈనేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా పూనావాలాకు శివసేన పుణె అధ్యక్షుడు భోంస్లే సోదరుడు అమర్ పేరిట బెదిరింపులు వచ్చాయి. 

17:21 - October 12, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసే సన్నబియ్యం కాదని..దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపిస్తున్నారన్న టి.టిడిపి నేత రేవంత్ వ్యాఖ్యలపై మంత్రులు స్పందిస్తున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల దీనిపై సమాధానం చెప్పగా మరో మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించారు. టీఎస్ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు..హాస్టల్స్ కు వెళ్లి అడిగితే తెలుస్తుందని, మితిమీరి పోతే పరిష్కారం అదే విధంగా ఉంటుందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ప్రభుత్వ లోపాలు ఉంటే ఎత్తి చూపే అవకాశాలు ప్రతిపక్షాలకు ఉంటుందన్నారు. కొంతమంది మీడియా వారికి తెలంగాణ రాష్ట్రంలోనే సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తోందన్నారు. నీళ్లు..నిధులు..కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తే ఆత్మహత్యలు అరికట్టవచ్చనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. రైతులకు కరెక్టు టైంలో కరెంటు ఇవ్వడం..టైంకు ఎరువులివ్వడం..గిట్టుబాటు ధర పెంచడం..మండలానికి మార్కెట్ యార్డు కట్టడం..ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

బీహార్ లో ముగిసిన తొలి విడత ఎన్నికలు

పాట్నా : బీహార్ లో అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ముగిశాయి. సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ శాతం 52.12 శాతం నమోదు అయింది. 49 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. 54 మంది మహిళలు సహా 583 మంది సభ్యులు పోటీ చేశారు.

16:57 - October 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్..టిటిడిపి నేత రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దొడ్డు బియ్యం పంపిణీ విషయంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. హాస్టల్స్..మధ్యాహ్నా భోజనం పంపిణీలో దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యం పేర్కొంటున్నారని రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం మంత్రి ఈటెల సమాధానం ఇచ్చారు. అలాంటి టెక్నాలజీ లేదన్నారు. దీనిపై రేవంత్ స్పందించారు. ఉద్యమ సందర్భంలో మాయమాటలు..మడికట్టు మాటలతో అవినీతి..అక్రమాలను తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ ఎలాంటి తప్పు జరుగలేదని భావిస్తే వెంటనే విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నా భోజనం..హాస్టల్స్ కు సరఫరా అయ్యే నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించి విశ్లేషించాలన్నారు. అప్పుడు చిత్తశుద్ధి ఏంటో బయటపడుతుందని రేవంత్ పేర్కొన్నారు.

బీహార్ లో ప్రశాంతంగా తొలి దశ పోలింగ్..

పాట్నా : బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ 49 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయింది. 

16:37 - October 12, 2015

వరంగల్ : ఆశా వర్కర్లు తమ పోరును మరింత ఉధృతం చేశారు. వరంగల్ జిల్లాలో ఆశా వర్కర్లు బతుకమ్మను ఆడారు. 'కేసీఆర్ దొంగ ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఏకశిల పార్కు న ఉండి కాళోజీ సెంటర్ వరకు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాళోజీ సెంటర్ వద్ద బతుకమ్మ ఆడారు. ఎంపీ కవిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవితపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు కాలి సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా బతుకమ్మ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు. తాము ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చామని, ఆలోచిస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ కాలం గడిచిపోతుంది కానీ ఎమీ పట్టించుకోలేదన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు పది కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆశా వర్కర్లు ఇవ్వడానికి బడ్జెట్ లేదా అని ప్రశ్నించారు. 

ఎంఎస్.ధోనికి తండ్రిగా అనుపమ్ ఖేర్...

హైదరాబాద్ : భారత క్రికెట్ వన్డే జట్టు సారధి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించనున్న చిత్రంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్.. ధోనీ తండ్రిపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'బేబి, స్పెషల్ 26, ఎవెడ్ నెస్ డే వంటి వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం స్క్రిప్టు చదివానని.. అద్భుతంగా ఉందని నటుడు అనుపమ్ ఖేర్.. దర్శకుడిని అభినందించారు. నీరజ్ పాండే తన అభిమాన దర్శకుడని, ఆయన స్ర్కిప్టు రూపొందించే విధానం అద్భుతంగా ఉంటుందని ఆయన కితాబిచ్చారు.

16:31 - October 12, 2015

కృష్ణా : జిల్లా నాగాయలంక మండలం ఎదురుమండిలో పేదల భూముల కోసం పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులతో పాటు రైతులను అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘుతో పాటు 60 మంది నేతలను అదుపులోకి తీసుకుని నాగాయలంక పీఎస్ కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:26 - October 12, 2015

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరవధిక నిరహార దీక్షపై ఏపీ మంత్రులు..నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంగ దీక్షలు..అసలు మతలబేంటనీ ప్రశ్నిస్తున్నారు. లక్ష మందితో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ మంత్రులు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్ దీక్షపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అరాచకం సృష్టించేందుకు జగన్ దీక్ష చేస్తున్నారని, పట్టిసీమ కడుతానంటే జగన్ అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టిడిపి, బిజెపి మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ దీక్ష చేస్తున్నారని, ఉదయమే పల్స్ రేట్ తగ్గిపోతోందని, సాయంత్రం మళ్లా పెరుగుతుందని దీక్ష మతలబేంటే చెప్పాలని ప్రశ్నించారు. సముద్రంలో వెళ్లే నీళ్లు తెస్తే ఎందుకు తెస్తారంటూ జగన్ ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాత్రి 11.15 నిమిషాలకు జగన్ ఓ భవనంలోకి వెళ్లారని, అనంతరం 1.15 గంటలకు బయటకు వచ్చారని తెలిపారు. రెండు గంటల పాటు భవనంలో ఏం చేశారని ప్రశ్నించారు. గద్దె కోసం దీక్ష కోసమే చేస్తున్నారని విమర్శించారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

16:20 - October 12, 2015

హైదరాబాద్ : దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేస్తే సన్నగా మారుతాయా ? అలాంటి టెక్నాలజీ ఉందా ? అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల ప్రశ్నించారు. ఇటీవల హాస్టల్ లో, స్కూల్స్ లో దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారని, పాలిష్ చేసి సన్నబియ్యం అంటూ పంపిస్తున్నారని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ భవన్ లో ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారం వడ్డిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. విద్యార్థులు తినే తిండిపై కూడా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అసలు దొడ్డు బియ్యాన్ని ఎంత పాలిష్ చేస్తే సన్నబియ్యంగా మారుతాయి అని ప్రశ్నించారు. అలాంటి టెక్నాలజీ ఉందా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు.

'ప్రజా రాజధాని-అమరావతి నిర్మాణ సంకల్పం' కార్యక్రమం ఖరారు

హైదరాబాద్ : 'ప్రజా రాజధాని-అమరావతి నిర్మాణ సంకల్పం' కార్యక్రమం ఖరారు అయింది. ఎపి సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరిగేలా కార్యక్రమ ప్రణాళికను ఖారరు చేశారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు కొద్ది సేపట్లో వెలువడనున్నాయి. రేపట్నుంచి ఈనెల 22 వరకు అమరావతి నిర్మాణ సంకల్పం పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నారు. 

15:54 - October 12, 2015

దీపక్‌ సరోజ్‌, మాళవిక మీనన్‌ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమళ్ళ మూవీ మేకర్స్‌ పతాకంపై కందిమళ్ళ వెంకట చంద్రశేఖర్‌ నిర్మించిన చిత్రం 'వందనం'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం రాత్రి జరిగింది. అతిథిగా విచ్చేసిన టి.సుబ్బిరామిరెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి.. తొలి సీడీని జయప్రదకు అందజేశారు. అనంతరం జయప్రద థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ,'ట్రైలర్‌ చూశాం. దీపక్‌ అద్భుతంగా నటించాడు. నిర్మాతలు మంచి చిత్రం తీశారు. తప్పకుండా విజయం సాధిస్తుంది' అని అన్నారు. 'ప్రేమ నేపథ్యంలో వచ్చిన మరో చిత్రమిది. చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ కావాలని ఆశిస్తున్నాను' అని జయప్రద అన్నారు. 'ఈ చిత్రానికి కథే హీరో. నా పాత్రకు నటుడిగా న్యాయంగా చేశానని భావిస్తున్నాను. 'లెజెండ్‌' చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందీ చిత్రం' అని హీరో దీపక్‌ అన్నారు.

15:49 - October 12, 2015

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కొత్త ఫ్యాషన్స్ పుట్టుకొచ్చినా హ్యాండ్లూమ్స్ స్పెషాలిటీ ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి హ్యాండ్లూమ్స్ పైన హ్యాండ్ పెయింటింగ్స్ తో ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తోంది ఒక అతివ. 

15:45 - October 12, 2015

సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని అవయవాలు సక్రమమైన పనితీరుతో ఉన్నవారే పోటీ ప్రపంచంలో వత్తిడికి గురవుతూ అనేక మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ అందుకు భిన్నంగా వైకల్యాన్ని జయించి జయకేతనం ఎగురేస్తూ విశ్వదృఖ్ సంస్థ సభ్యులు ముందుకెళుతున్నారు. మధురమైన పాటకు ఏం కావాలి. అద్భుతమైన కంఠం కావాల్సి ఉంటుంది. రాగతాళాలకు అనుగుణంగా పాడే స్వర పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. అంతేకాని పాటకు చూపే అక్కర్లేదని విశ్వదృఖ్ ఫౌండేషన్ సభ్యులు ఎందరికో స్పూర్తినిస్తున్నారు. 
జీవించటానికి అవకాశాలన్నీ అందుబాటులో ఉన్నా, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారు విశ్వదృఖ్ సభ్యులు. వీరి ఆశయం నెరవేరాలని కోరుకుంటూ, వైకల్యం తో బాధపడేవారికి స్పూర్తిగా నిలుస్తున్న విశ్వదృఖ్ ఫౌండేషన్ సభ్యులను మానవి అభినందిస్తోంది.

బీహార్ లో కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 46.37 శాతం పోలింగ్ నమోదు అయింది.

జగన్ ఆరోగ్యపరిస్థితిపై కుటుంబసభ్యుల ఆందోళన

గుంటూరు : జగన్ ఆరోగ్యపరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల హైదరాబాద్ నుంచి గుంటూరు దీక్షాస్థలికి బయల్దేరారు. 

15:20 - October 12, 2015

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం గొల్లపల్లి వాసులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భూమి విషయంలో స్థానిక టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ మోసం చేశాడని గొల్లపల్లి ప్రాంతానికి చెందిన వెంకటయ్య తన ముగ్గురు కుమారులతో నేత ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి మృతదేహాలను గొల్లపల్లికి పోలీసులు తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహాలతో హైవేపై బైఠాయించి రాస్తారోకో చేయడానికి యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

15:16 - October 12, 2015

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరహార దీక్షపై ఆందోళనలు నెలకొంటున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వైద్యులు పేర్కొనడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా అర్బన్ ఎస్పీ త్రిపాఠి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి జగన్ ను ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోసారి వైద్య పరీక్షలు..
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆయన గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మధ్యాహ్నాం కూడా మరోసారి పరీక్షలు జరిపారు. బీపీ, పల్స్ రేటు సాధారణంగానే ఉన్నాయని, బీపీ 130/80, షుగర్ 61, పల్స్ రేట్ 80, కోటోన్స్ 3+ ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. యూరిన్ లో కోటోన్స్ రావడం ప్రమాదకరంగా ఉందన్నారు. ఉదయం పోలిస్తే జగన్ 1200 గ్రాముల బరువు తగ్గారని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని లేనిపక్షంలో శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.

దీక్ష కొనసాగుతుంది - బోత్స..
దీక్షను విరమింప చేయాలని వైసీపీ నేతలు జగన్ కు సూచిస్తున్నారు. కానీ ఆయన మాత్రం దీక్షను కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు. తన స్వార్థం కోసం దీక్ష చేయడం లేదని, రాష్ట్ర ప్రజల కోసం దీక్ష చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారని ఆ పార్టీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీక్ష కొనసాగుతుందని, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది ఎక్కడ రాజీ పడే అవకాశం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. ఉందన్నారు. 

విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం - ఈటెల..

హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారం వడ్డిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

విమానాశ్రయ ఆధునీకరణ పనులకు బాబు శంకుస్థాపన..

విశాఖపట్టణం : విమానాశ్రయ ఆధునీకరణ పనులు..ఫిలింనగర్ కల్చరల్ సొసైటీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 

జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. బీపీ, పల్స్ రేటు సాధారణంగానే ఉన్నాయని, బీపీ 130/80, షుగర్ 61, పల్స్ రేట్ 80, కోటోన్స్ 3+ ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. ఉదయం పోలిస్తే జగన్ 1200 గ్రాముల బరువు తగ్గారని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని లేనిపక్షంలో శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. 

సుధీంద్ర కులకుర్ణి ఆసుపత్రికి తరలింపు...

ముంబై : రచయిత సుధీంద్ర కులకుర్ణిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఉదయం శివసేన కార్యకర్తలు ఆయనకు ఇంక్ పూసిన సంగతి తెలిసిందే.

 

14:34 - October 12, 2015

వరంగల్ : కాకతీయ యూనివర్శిటీ ఎస్ బిఎన్ సి జాఫర్‌ హాలులో వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నిక- విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ వామపక్షాల ఎంపీ అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థి సమస్యలను పట్టించుకోవడం లేదని గాలి వినోద్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధుల నుంచి రాష్ర్ట ప్రభుత్వం గత 16 నెలలుగా 50 కోట్ల నిధులను దారి మళ్లీంచిందన్నారు. తనను వరంగల్‌ ఎంపీగా గెలిపిస్తే.. ప్రజా సమస్యలను పార్లమెంట్‌ స్థాయికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. 

14:30 - October 12, 2015

నిజామాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ నిజామాబాద్‌ ఎంపీ కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలోని రైతు ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు చెప్పవద్దన్నారు. ప్రభుత్వమేమో 739 మంది ఆత్మహత్యలు పేర్కొంటే ఎంపీ కవితనేమో 389 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంటున్నారని తెలిపారు. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని, ఆత్మహత్యలను ఆసరగా తీసుకుని జాగృతి కలెక్షన్ల పరంపర కొనసాగుతోందని ఆరోపించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండ్రి ముఖ్యమంత్రి సానియాకు కోటి రూపాయలు ఇస్తాడని..గుత్తా జ్వాలకు కోటి రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. కోట్ల రూపాయల విలువల భూములు తీసుకుని తండ్రి..బిడ్డలు తమాషా చేస్తున్నారంటూ సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

14:23 - October 12, 2015

హైదరాబాద్ : జగన్‌ దీక్ష కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కీటోన్స్ లెవెల్స్ పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో దీక్ష విరమించాలని పలువురు కోరినా జగన్‌ నిరాకరిస్తున్నారని నేతలు తెలియచేశారు. వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది. కేంద్రప్రభుత్వం జగన్‌ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా విషయమై హామీ ఇవ్వాలని వీహెచ్‌ అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సహాయం చేయాలని కోరారు.

 

అందుకే వారిని తొలగించాం - టీఎంయూ..

హైదరాబాద్ : రాజీనామా చేశామని ఇటీవల ప్రకటించిన వారిని యూనియన్ నుండి బహిష్కరించినట్లు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సంఘ ద్రోహులు, పైరవీకారులయినందునే వారిని తొలగించినట్లు తెలిపారు. 

ఆశాల సమస్యలు పరిష్కరించాలి - గాలి వినోద్ కుమార్...

వరంగల్ : ఆశాల సమస్యలు పరిష్కరించకుండా బతుకమ్మ చేయడం సరికాదని వరంగల్ వామపక్షాల ఎంపీ అభ్యర్థి గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీనులకు బతుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటేనే ఎంపీ కవిత బతుకమ్మ పండుగ చేయాలని సూచించారు.

 

 

నర్సంపేటలో ముందస్తు అరెస్టు..

వరంగల్ : నర్సంపేటలో ముందస్తు అరెస్టులకు తెరలేపారు. ఎంపీ కవితను అడ్డుకుంటారని సీపీఐ, సీపీఎం, ఐద్వా కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను జిల్లా కార్యదర్శి రత్నమాల ఖండించారు. 

సీఎం కేసీఆర్ ను కలిసిన దత్తాత్రేయ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. 23వ తేదీన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.

రుద్రమదేవి సినిమాకు దాసరి ప్రశంస..

హైదరాబాద్ : రుద్రమదేవి సినిమాకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రశంసలు కురిపించారు. దర్శకుడు గుణశేఖర్ ను అభినందించారు. పెద్ద హీరోల సినిమాలకు పండుగలతో పనిలేదని, ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. రుద్రమదేవి ప్రత్యేకమైన సినిమా అని అందరూ సహకరించాలని సూచించారు.

 

 

నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

తూర్పుగోదావరి : నారాయణ కళాశాల విద్యార్థిని స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లెక్చరర్ తిట్టిందని మనస్థాపానికి గురైన స్వాతి ఈ ఘటనకు పూనుకుంది. ఆసుపత్రికి స్వాతిని తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. 

ఆశాల సమ్మె మరింత ఉధృతం..

హైదరాబాద్ : ఆశాల సమ్మె మరింత ఉధృతం కానుంది. 14వ తేదీన నల్లదుస్తులతో బతుకమ్మను ఆడనున్నట్లు, 15న శ్రామిక మహిళ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయని..16న ఆశాల కుటుంబసభ్యుల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.జయలక్ష్మి పేర్కొన్నారు. ఎంపీ కవిత బతుకమ్మ కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి ఆశాల సమస్యలు పరిష్కారం పట్టకపోవడం ఘోరమన్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని తెలిపారు. 

13:32 - October 12, 2015

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పదవి నుంచి రాజీవ్‌ బన్సాల్‌ తప్పుకున్నారు. రాజీవ్‌ స్థానంలో నూతన సీఎఫ్‌ఓగా ఎండీ. రంగనాథ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. గత 15 సంవత్సరాలుగా రంగనాథ్‌ కంపెనీలో వివిధ హోదాల్లో సేవలందించారు. కాగా 2012 అక్టోబర్‌ నుంచి రాజీవ్‌ బన్సాల్‌ ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకపై రాజీవ్‌ బన్సాల్‌ సీఈవో బోర్డులో అడ్వైజర్‌గా కొనసాగనున్నారు. 

13:21 - October 12, 2015

కర్నూలు : ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో సౌకర్యాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీ విద్యార్థుల లేఖలను పిల్‌గా స్వీకరించింది కోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలను జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. 13 వందల మంది విద్యార్థినులకు 12 మరుగుదొడ్లు ఉన్నాయని కలెక్టర్‌ నివేదిక అందించారు. 12 మరుగుదొడ్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. నవంబర్‌ 2న జిల్లాలోని బాలికల పాఠశాలలు, కాలేజీలను సందర్శించిన తర్వాత పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలలు, కాలేజీ తనిఖీలకు రెవెన్యూ సిబ్బందిని వాడుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. 

ఎల్ జేపీ అభ్యర్థిపై కాల్పులు...

బీహార్ : ఎల్ జేపీ అభ్యర్థి విజయ్ కుమార్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. 

 

13:20 - October 12, 2015

వరంగల్ : బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో ఆరంభమయ్యాయి. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఎంపీ కవిత ఉత్సవాలను ప్రారంభించారు. పూలతో కవిత స్వయంగా బతుకమ్మను అలంకరించారు. 

13:18 - October 12, 2015

హైదరాబాద్ : వర్షాకాలంలో ఆకాశంలో కనిపించిన హరివిల్లును చూసి చూసి భూమికి కన్ను కుట్టిందట. తనపైనా రంగురంగుల ఇంధ్రధనస్సు ఎందుకు విరియదంటూ అసూయపడిందట... బాగా ఆలోచించింది. అంతే మరి వర్షాకాలం అయిపోయి శరదృతువు రాగానే.. హరివిల్లును తలదన్నే వేల రంగులు భూమినంతా ఆవరించాయి. హరివిల్లులో ఏడు రంగులుంటే.. అంతకు వంద రెట్ల రంగులతో.. పూల దుప్పటి కప్పుకొని గర్వంగా ఆకాశాన్ని చూసి పరిహసించింది. నేలంతా పరచుకున్న విరిపూలతో భూమి పరవశించిపోయింది. పూల పుప్పొడి సువాసనలు ఆకాశాన్ని తాకుతుంటే.. ఆకాశం ఆనందంతో సన్నటి నీటి తుంపరలు రాల్చింది. అపురూపమైన సమాగమం ఇది. ప్రపంచంలో మరెక్కడా కానరాని అద్భుతమైన సంబరం ఇది. ప్రకృతిలోని సమస్త పూబోణులతో కాంతలు ఆడుకునే పండుగ... ఆటపాటల్లో అంతరాలు తెలియవు.. ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఇబ్బందులు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ధనం లేదు.. చిన్నా.. పెద్దా.. పిల్లా.. పాపా.. అమ్మలు.. అమ్మాయిలు... అంతా కలిసి.. అన్నింటిలో కలగలిసి.. నీటిగట్టున చలువ వెన్నెల తిన్నెలపై పుట్టతేనంత చిక్కగా.. చక్కగా సాగే పూల పుప్పొడుల జాతర బతుకమ్మ.

మగువలు మాత్రమే జరుపుకునే సంబరం.......

మగువలు మాత్రమే జరుపుకునే సంబరం. ప్రకృతితో మమేకమయ్యే పండుగ. బతుకమ్మ పూలతో ప్రాణం పోసుకుంటుంది. బతుకమ్మలో గడ్డిపూలు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. సుగంధాలను వెదజల్లుతాయి. సాయంసంజె వేళ పల్లెల్లో ఉయ్యాల పాటలు ఊసులాడతాయి. సగం వెన్నెల కాస్తున్న చందమామ పులకించి పోతాడు.. ఆడపిల్లల ఆడంబరంలో.. ఆకాశం భూమిని ఆలింగనం చేసుకుంటుంది.

ప్రకృతితో మమేకమయ్యే సంబరం......

పూలు గుసగుసలాడుతున్నాయి.. బతుకమ్మ ఒడిలో ఎప్పుడు ఒదుగుతామా అని..? పల్లెపల్లె పారవశ్యంగా ఎదురుచూసింది.. జానపదాలు ఎప్పుడు ఘల్లుమంటాయా అని..? ఆ తరుణం రానే వచ్చింది. పల్లె పూలపానుపయ్యింది. ప్రకృతే ఆకారం.. ప్రకృతే వరం... ప్రకృతే శరీరం. పువ్వులన్నీ నేలంతా పరుచుకున్న ఆ అందాన్ని ఒక్కసారి చూస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యమవుతుందా? ఆ సౌందర్యాన్ని వర్ణించటం మన వశం అవుతుందా?

అంత అందం చూడాలంటే ఎన్ని కన్నులు కావాలి?..

అంత అందం చూడాలంటే ఎన్ని కన్నులు కావాలి?.. ఎప్పటికి తనివి తీరాలి? అప్పుడే విచ్చుకున్న ఆ పువ్వులు నవ్వుతాయి. ప్రకృతి పరవశించిపోతుంది. పువ్వులన్నీ తొడిమలు తెంచుకుని అమ్మలతో.. అమ్మాయిలతో ఆడుకోవటానికి లోగిళ్లలో చేరిపోతాయి. ఇక్కడ పూలు తమను తెంచినందుకు విలపించవు.. ఎత్తెంచలేని బతుకమ్మలో భాగమైనందుకు సంబరపడిపోతాయి. విరిబోణి నవ్వులతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఆడుకుందాం రమ్మంటూ ఆహ్వానాన్ని పలుకుతాయి.

పువ్వులే రూపం.. పువ్వులే ఆధారం....

ఈ పండుగకు తెలుగు లోగిళ్లన్నీ పువ్వులతో కళకళలాడతాయి. ఒకే దారానికి ఒక్కో పువ్వును గుచ్చినట్టుగా, పువ్వులను అందంగా పేరిస్తే బతుకమ్మ ప్రాణం పోసుకుంటుంది. ఆమెకు పువ్వులే రూపం. పువ్వులే ఆధారం. పూలతో పాటు ప్రకృతిలో జీవం పోసుకునే సమస్త మైన అంశాలు కలిస్తే బతుకమ్మ రూపం సంతరించుకుంటుంది. పళ్లెంలో గుమ్మడి ఆకులు వేసి వాటిపై తంగేడి పువ్వు, గునుగు పువ్వు, కట్టెపువ్వు, బంతి, చామంతి, గులాబి, గడ్డిపువ్వు, చిట్టి చామంతి, పట్టుగుచ్చుల పువ్వు, చివరగా పైన గుమ్మడి పువ్వు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేరుస్తారు. ఐదు రకాలతో గానీ, ఏడు రకాలతో గానీ బేసి సంఖ్యలో పువ్వులు ఉండేలా అంతరాలలో బతుకమ్మను పేర్చుతారు. పసుపుతో చేసిన గౌరమ్మను చిక్కుడాకులో ఉంచి బతుకమ్మకు ప్రాణం పోస్తారు. పసుపు ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మపై చిక్కుడు ఆకులో పెడతారు.

గునుగు పువ్వుకు, గడ్డి పువ్వుకు రంగులు...

గునుగు పువ్వుకు, గడ్డి పువ్వుకు రంగులు అద్దుతారు. ప్రకృతి వర ప్రసాదితాలైన బీరకాయ ఆకుతో తీసిన రసం ఆకుపచ్చ రంగు, కుంకుమ, సున్నం కలిపిన నీళ్లు కాషాయం రంగు వస్తాయి. వీటినే ఆ పువ్వులకు పట్టిస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ కెమికల్స్‌తో కూడిన రంగులు వచ్చాయి గానీ అంతకుముందు ఇలా ప్రకృతి సిద్ధంగా లభించిన రంగులనే పువ్వులకు అద్దేవారు. అలా పేర్చిన బతుకమ్మను ఒక్కచోటకు చేర్చి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఇంతులు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఈ సంబరాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నవమి నాటి వెన్నెల జిలుగుల మధ్య ఈ సంబరం అంబరాన్నంటుతుంది.

ఆశ్వయుజ మాసం ప్రారంభానికి ముందు....

ఆశ్వయుజ మాసం పది రోజలుందనగా బొడ్డెమ్మ పండుగ ప్రారంభమవుతుంది. బొడ్డెమ్మ మట్టితో ముడిపడి ఉన్న పండుగ. కన్నెపిల్లలు పుట్ట మన్నును తీసుకొచ్చి, శ్రీ చక్రాకారంలో బొడ్డెమ్మను ఒక పీట మీద చేస్తారు. అలా చేసిన బొడ్డెమ్మను అర్చిస్తారు. ఈ పూజను కన్నె పిల్లలు ఇష్టంగా చేస్తారు. మట్టిని మాతృమూర్తిగా భావించి కొలుస్తారు. ముఖ్యంగా వ్యవసాయానికి మట్టే మూలాధారం. కాబట్టే మట్టి ముద్దనే బొడ్డెమ్మగా మలిచి, గౌరమ్మగా భావించి మురిసిపోతారు.

మంచి భర్త రావాలని బొడ్డెమ్మకు పూజలు .....

ఈ తొమ్మిది రోజులు కన్నెపిల్లలు మంచి భర్త రావాలని బొడ్డెమ్మకు పూజలు చేస్తారు. సాయం సంధ్యవేళ బొడ్డెమ్మను చక్కగా జాజుతో అలికి, పూలతో అలంకరిస్తారు. పసుపు, కుంకుమలతో బొడ్డెమ్మపై ముగ్గులు వేస్తారు. ఇంటి ముంగిట కల్లాపి జల్లి అందులో బొడ్డెమ్మను కూర్చోబెడతారు. ఆ తరువాత దాని చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడతారు. అప్పుడే తెంపిన పూలతో బొడ్డెమ్మను అలంకరిస్తారు. ఇటు పువ్వుల పరిమళం, అటు అగర్‌బత్తీల పరిమళం వెరసి అంతులేని ఆనందం కలుగుతుంది. సైన్స్‌ పరంగా చూస్తే మట్టి వాసన.. అగరు సువాసన మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

భాద్రపద అమావాస్య రోజు బతుకమ్మ మొదలు.....

ఇక బతుకమ్మ పండుగ సరిగ్గా భాద్రపద అమావాస్యనాడు మొదలవుతుంది. ఈ అమావాస్యనే పెత్తరామాస్యగా పిలుచుకుంటారు. ఆశ్వయుజ మాసం ప్రారంభమైన తరువాత బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తొలిరోజు బతుకమ్మతో పాటు, బొడ్డెమ్మను చెరువుకు తీసుకెళ్లి నీటిలో బతుకమ్మ తొలిరోజున ప్రసాదంగా తమలాపాకును మాత్రమే పంచుతారు. ఆ తరువాత రోజు నుంచి పలహారాలను పంచడం ప్రారంభమవుతుంది.

విద్యుత్‌ జిలుగులు, మరోవైపు కొత్త బట్టల్లో మెరిసిపోయే ఆడపడుచులు......

ఓ వైపు విద్యుత్‌ జిలుగులు, మరోవైపు కొత్త బట్టల్లో మెరిసిపోయే ఆడపడుచులు. మహిళలంతా పట్టు చీరలతో, కన్నెపిల్లలు లంగావోణీల్లో, చిన్నపిల్లలైతే పావడాలు ధరించి అందంగా ముస్తాబై ఒక్కచోటుకు చేరతారు. విజయదశమికి ఒక్కరోజు ముందు సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతుంది. గ్రామం పట్టణం, నగరం ఎక్కడైనా సరే సద్దుల బతుకమ్మ రోజు అందంగా ముస్తామైన మగువలు చెరువు, నది, జలాశయాలు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతుకమ్మ ఆడతారు. గౌరమ్మను కీర్తిస్తూ పాడతారు. స్త్రీలు సద్దుల బతుకమ్మ రోజు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఉన్నంతలో తెలంగాణ ప్రాంతంలో ప్రతీ ఒక్కరు ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. ఒక్కచోటకు చేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ అతివలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. బతుకమ్మ ఆడటం పూర్తయిన తరువాత వాటిని చెదిరిపోకుండా నీటిలో వేస్తారు. పోయిరా మా లక్ష్మి పోయిరావమ్మా అంటూ తాంబాలాలను ఒక్కచోట చేర్చి పాడతారు. బతుకమ్మతో పాటు తీసుకొచ్చిన గౌరమ్మను ముత్తయిదువులు వారి తాళిబొట్టుకు ఒకరికొకరు పెట్టుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలైతే గంధంలా పూసుకుంటారు. ఆ తరువాత తీసుకువచ్చిన ఫలహారాలను పంచిపెడతారు. మొదటిరోజు తమలపాకును మాత్రమే పలహారంగా ఇస్తారు. ఆ తరువాత ఒక్కోరోజు ఒక్కో పప్పు చెక్కరితో, అటుకులు శర్కర, నువ్వుల పొడి ఇలా ఒక్కోరోజు ఒక్కోరకంగా రకరకాల ప్రసాదాలు పంచిపెడతారు. అందరూ కలిసి ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఎలాంటి తేడాలు చూపించుకోకుండా ఆనందంగా కాలం గడుపుతారు. సంవత్సరమంతా ఎన్నో కష్టనష్టాలతో అలసిపోయిన మగువలకు ఇదో ఆటవిడుపు. ప్రశాంతంగా ఆడుకుంటారు. పాడుకుంటారు.

బతుకమ్మ పాటకు పల్లవి అక్కర్లేదు.

చరణాలు అసలే అక్కర్లేదు. మహిళల మనస్సులోని భావాలే పాటలుగా ఆవిష్కారమవుతాయి. జానపదాలు గల్లుమంటాయి. మగువలు తమ కష్ట సుఖాలనే పాటలుగా మలుస్తారు. అప్పటికప్పుడు అనుకొని పాడే ఈ పాటలకు ఆది అంతం ఉండదు. అలా సాగిపోతూనే ఉంటాయి. కన్నెపిల్లలయితే తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ వాళ్ల ఆశలనే ఉయ్యాల పాటలుగా పాడుకుంటారు. ప్రతీ పదంలో అంతర్లీనంగా ఓ అర్థం దాగి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంతులేకుండా సాగే ఉయ్యాల పాటలో ఎన్నో అర్ధాలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఆనందాలు వినిపిస్తాయి. ప్రతీ పల్లెల్లో ఈ పాటలు ఎంతో ఆనందంగా ఆలపిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరిగే ఈ పండుగకు ప్రతీ పల్లె ఉయ్యాల పాటతో ఊగిసలాడుతుంది.

బతుకమ్మ ఆడపడుచులకు అంబరాన్ని తాకే సంబరం....

బతుకమ్మ ఆడపడుచులకు అంబరాన్ని తాకే సంబరం. ఈ పండుగలో పువ్వులకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నీ పూల సువాసనతో పరిమళిస్తాయి. ప్రకృతిని ఆరాధించే సంస్కృతికి ప్రతీకే ఈ బతుకమ్మ. నేలకు, నీళ్లకు, మట్టికి, ప్రకృతిలో ఉన్న ఇదే ఈ పండగకు గొప్పగా కనిపిస్తుంది. చెట్టూ, పుట్టా తిరిగి ఏరి కోరి తీసుకొచ్చిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చడం ఓ వింత అనుభూతి. ఒక్కొక్క పువ్వేసి.. ఒక్కొక్క అంతరం పేర్చుతూ బతుకమ్మను తయారు చేయటం ఒక ఎత్తైతే.. అన్నీ కలిపి ఒక చోట చేర్చి ఆనందంతో ఆడటం మరో అనుభూతి. సైన్స్‌ పరంగా చూస్తే ఈ పండగతో మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరగుతుందని చెప్పొచ్చు. బతుకమ్మకు ఉపయోగించే ప్రతీ పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వర్షాకాలం నీరు చెరువును చేరుతుంది. పాతకాలంలో చెరువు నీటితే తాగేవారు. కాబట్టి చెరువులను శుభ్రం చేసుకోవడానికి సహజ సిద్ధంగా దొరికే పువ్వులను వాడేవాళ్లు. అలా బతుకమ్మ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అమృత మూర్తిగా పేరు పొందింది. ఈ పండుగ వస్తే ఇళ్లల్లో ఒకటే సందడి. పూల వేట పూర్తయి మగాళ్లు ఇంటికి చేరుకోగానే పువ్వును సరిగ్గా తెంపే పని ప్రారంభమవుతుంది. అప్పుడు మిగతా బతుకమ్మల కంటే తమ బతుకమ్మ పెద్దగా ఉండాలంటూ పోటీ పడి మరీ సాయంకాలం వరకు పేరుస్తూనే ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మను పేర్చడం పూర్తయ్యాక, బతుకమ్మకు సద్దులు కడతారు. పూజ చేసి పులిహోర, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మల్లీద ముద్ద, పులిహోర, పెరుగన్నాన్ని బతుకమ్మను చెరువులో వదిలాక వాటిని ప్రసాదంలా పంచుకుంటారు. ఇలా తెలంగాణ పల్లెల్లో అణువణువునా ఆనందం వెల్లివిరిసే రోజులు ఇవే అంటే అతిశయోక్తి కాదేమో. ఉన్నంతలో గొప్పగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగింది. 

రాజధాని కోసం సమాధుల తొలగింపు..

గుంటూరు : ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని శంకుస్థాపన కోసం సమాధులను అధికారులు తొలగిస్తున్నారు. ఎస్సీ కాలనీ వాసులు అధికారులను అడ్డుకున్నారు. 

సుధీంద్రపై దాడిని ఖండించిన నేతలు..

ముంబై : రచయిత సుధీంద్ర కులకుర్ణిపై శివసేన కార్యకర్తలు జరిపిన దాడిని పలువురు నేతలు ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, ఆప్ నేత అశుతోష్ లు ఖండించారు. 

తెలంగాణ లో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు..

హైదరాబాద్‌ : తెలంగాణలో పంటలు వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక, పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం తాటిపాములలో అప్పుల బాధతో రైతు శేఖర్‌రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్‌పాడులో అప్పుల బాధతో మరో రైతు సోమవారం ఆత్మహత్యలు చేసుకున్నారు. వరంగ ల్‌ జిల్లా భూపాలపల్లి మండలం కసింపల్లిలో అప్పుల బాధతో రైతు తిరుపతి ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వేస్టేషను సమీపంలో రైలు కిందపడి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

విజయవాడ : అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు జరిపారు. పలువురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గుర్తు తెలియని వాహనం ఢీ కొని కానిస్టేబుల్ మృతి

విజయనగరం :గజపతినగరం మండలం దత్తరాజుపాళెంలోని పొనలి జంక్షన్‌లో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. చీపురుపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తినాయుడు(30) రహదారిపై విగతజీవుడై పడి ఉండటాన్ని స్థానికులు సోమవారం ఉదయం గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
 

 

పోలవరం నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ..

ఢిల్లీ : పోలవరం నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. పోలవరం నిర్మాణంపై ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపలేదని ఎన్ జీటీని ఆరుగురు పిటిషన్లు ఆశ్రయించారు. ప్రజాభిప్రాయ సేకరణకు గతంలోనే నోటీసులు జారీ చేసినా ఏపీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా వేశారు.

 

సుధీంధ్ర కులకర్ణి పై దాడిని ఖండించిన అద్వాని

హైదరాబాద్ : ముంబైలో సుధీంద్ర కులకర్ణి పై శివసేన కార్యకర్తల దాడిని బిజెపి అగ్ర నేత ఎల్ కె అద్వానీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలని అద్వాని అభిప్రాయపడ్డారు.

వరంగల్ లో నకిలీ విలేకరి అరెస్ట్

వరంగల్ :నకిలీ విలేకరి ఒకరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకుని జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే... ఈ విషయం పోలీసులకు తెలవడంతో అతన్ని సోమవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను ఎక్కడెక్కడ వసూళ్లు చేశాడు, ఎవరెవరిని బెదిరించాడన్న వివరాలను రాబడుతున్నారు.

జగన్ దీక్షకు మాజీ ఎంపి హర్షకుమార్ మద్దతు

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ జి వి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడాలని హర్షకుమార్ అన్ని పార్టీలకు సూచించారు.

ఆకాశవాణి ఆవరణ లో మొక్కలు నాటిన జోగురామన్న

హైదరాబాద్ : ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 29వ వార్షికోత్సవానికి మంత్రి జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ఆవరణలో మంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్‌తోపాటు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లిలో ఉద్రిక్తత...

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఇద్దరు యువకుల మృతదేహాలు వారి స్వగ్రామమైన గొల్లపల్లికి సోమవారం తరలించారు. స్థలం వివాదంలో జడ్చర్లకు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు తమను వేధిస్తున్నాడంటూ గొల్లపల్లికి చెందిన ఓ కుటుంబం టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం విదితమే. తండ్రితో సహ ముగ్గురు కుమారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వారిలో ఇద్దరు మృతిచెందగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే...

రాజమహేంద్రవరంలో రియల్టర్ దారుణ హత్య...

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో రియల్టర్ శేషు (53) గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. స్థానిక నాగదేవి థియేటర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. దుర్మరణం పాలైన శేషును కోర్లంపేటకాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో గొడవల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

12:32 - October 12, 2015

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీఎఫ్వో రాజీవ్ బన్సాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎఫ్ వోగా ఎండి. రంగనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

12:29 - October 12, 2015

హైదరాబాద్ : కింగ్‌ఫిషర్‌ ఫ్యాషన్‌ వీక్‌ చివరి రోజు అట్టహాసంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ వెంట్‌లో 3వ రోజు నగర డిజైనర్‌ ఇషితాసింగ్‌, న్యూయార్క్‌ డిజైనర్‌ నంజానా జాన్‌, డిజైనర్‌ బ్రాండ్‌ రెడ్‌ సిస్టర్‌ బ్లూ, నజియా సయ్యద్‌లు పార్టిసిపేట్‌ చేశారు. కూచిపూడి నాట్య కారిణి సంధ్యారాజు తదితరులు ర్యాంప్‌ వాక్‌ చేయడం హైలెట్‌గా నిలిచింది. మోడళ్ల క్యాట్‌వాక్‌ ర్యాంప్‌పై అదరహో అనిపించింది. ముంబై, కోల్‌కతా నుంచి వచ్చిన మోడల్స్‌ క్యాట్‌వాక్‌లతో కేక పుట్టించారు. సంప్రాదాయ వస్ర్తాలంకరణతో పాటు మోడ్రన్‌ డ్రెస్స్‌లతోనూ మోడళ్లు తళుక్కున మెరిశారు. సినీ నటి, నిర్మాత మంచులక్ష్మి, నటుడు సుమంత్‌, మాజీ మిస్‌ యూనివర్స్‌, మిస్‌ ఇండియాలు షోలో ఆకర్షణగా నిలిచారు.

 

12:27 - October 12, 2015

హైదరాబాద్ : ముంబైలో శివసైనికులు మరోసారి రెచ్చిపోయారు. అబ్జర్వర్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుదీంధ్ర కులకర్ణిపై దాడికి దిగారు. శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్ల రంగు పూశారు. పాకిస్థాన్‌ కు చెందిన విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షీ మహ్మద్‌ కసూరీ రచించిన పుస్తకం ఆవిష్కరణను ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సుదీంధ్ర కులకర్ణి నిర్వహిస్తున్నారు. పాకిస్థానీ రచయిత పుస్తకావిష్కరణ ముంబైలో నిర్వహించ వీల్లేదని శివసేన హుకూం జారీ చేసింది. కాగా ఇదే విషయమై చర్చించేందుకు సుధీంధ్ర శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రేను కలిశారు. వీరిరువురి చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్లరంగు పులిమి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. సుదీంధ్ర కులకర్ణి గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రసంగ రచయితగా పేరొందారు.

కర్నూలు కలెక్టర్ పై హైకోర్టు కన్నెర్ర

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లాలోని బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.‘‘మీ పిల్లలు ప్రభుత్వ బాలికల స్కూళ్లలో చదవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారా ? ’’ అంటూ హైకోర్టు కర్నూలు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరు 2న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు కలెక్టరును ఆదేశించింది.

ఉర్దూ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. హాస్టల్‌లో వసతులు సరిగా లేవని, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆందోళనకు దిగారు. వీసీ అనుకూల, వ్యతిరేక విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.

12:23 - October 12, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ పర్యటన ఖరారైంది. 19 నుంచి మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. 19న హైదరాబాద్‌లో రాజీవ్‌ సద్భావన ర్యాలీలో దిగ్విజయ్‌ పాల్గొనబోతున్నారు. 20న వరంగల్‌, 21న కరీంనగర్‌లో రైతులతో సింగ్‌ భేటీ అవుతారు. గాంధీభవన్‌లో జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు.

12:20 - October 12, 2015

మెదక్ : పాముకాటుతో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం బిజిలిపూర్‌లో జరిగింది. రాత్రిసమయంలో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లను పాము కాటువేసింది. దీంతో వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. తల్లి వినోద, కూతురు అఖిల చనిపోయారు. సరిగ్గా ఏడాది క్రితం కుటుంబానికి పెద్ద దిక్కుఅయిన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు తల్లీకూతుళ్లు ఇద్దరూ పాముకాటుకు గురై చనిపోయారు. ప్రస్తుతం వీరి మృతితో మరో కూతురు నాగలత అనాధగా మారింది. ఈ ఘటన అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

12:19 - October 12, 2015

హైదరాబాద్ : విశాఖలో కిడ్నిప్‌ అయిన టీడీపీ నేతలు ఇంకా మావోయిస్టు చెరలోనే ఉన్నారు. మావోయిస్టులు తాజాగా మరోలేఖను కూడా విడుదల చేశారు. రెండు రోజుల్లో బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని ప్రకటించారు.

 

12:16 - October 12, 2015

గుంటూరు : మంత్రి పత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌ కు చెందిన భూములను అత్యంత చవక రేట్లకు తన భార్య పేరిట రాయించుకున్నారని వైసీపీ నేత మర్రి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కోటప్పకొండ సమీపంలోని అగ్రిగోల్డ్‌ కు చెందిన భూముల్లో గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని వైసీపీ నేత మర్రి తెలిపారు. పత్తిపాటి పుల్లారావు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అత్యంత చవగ్గా భూములను సంపాదించారని విమర్శించారు.

12:14 - October 12, 2015

గుంటూరు : జగన్‌ దీక్ష కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కీటోన్స్‌ లెవెల్స్‌ పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో దీక్ష విరమించాలని పలువురు కోరినా జగన్‌ నిరాకరిస్తున్నారని నేతలు తెలియచేశారు. వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది.

మంత్రి పదవి నుండి పత్తిపాటి ని తొలగించాలి : వైసీపీ

గుంటూరు : అగ్రి గోల్డ్ నుంచి మంత్రి పత్తిపాటి 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని వైసీపీ నేత మర్రి రాజశేఖర్, మోపిదేవి రమణ ఆరోపించారు. కోటప్ప కొండ, గుర్వేపల్లి వద్ద 15 ఎకరాల గ్రానైట్ భూమిని బలవంతంగా కొని వాటిని పత్తిపాటి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. పత్తిపాటిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పత్తిపాటి భూ కొనుగోలు వ్యవహారం పై విచారణ జరిపించాలని... కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు మాదగ్గర వున్నాయని పేర్కొన్నారు.

బాక్సైట్ తవ్వకాలు ఆపుతామని ప్రకటన చేయాలి: మావోయిస్టులు..

విశాఖ: రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టబోమని రెండు రోజుల్లోగా ప్రభుత్వం ప్రకటన చేయాలని మావోయిస్టు ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ సభ్యుడు రమణ డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం మీడియా కార్యాలయాలకు మావోయిస్టులు లేఖ పంపించారు. ఇలా ప్రకటన చేయని పక్షంలో తమ వద్ద బందీలుగా ఉన్న టీడీపీ నేతలపై తీసుకునే చర్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అని రమణ రాసిన లేఖలో హెచ్చరించారు. పోలీసులు కుంబింగ్‌ను నిలిపివేయాలని ఆయన డిమాండు చేశారు.

బీహార్ లో కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్ : బీహార్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 10 గంటల సమయానికి 20.15 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జామూయ్ జిల్లా 23.50 శాతం పోలింగ్ నమోదైంది

11:45 - October 12, 2015

ముంబై: పాక్ మాజీ విదేశాంగ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 5.30గంటలకు జరుగనుంది. అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) నేతృత్వంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. మరోవైపు ఈ కార్యక్రమంపై శివసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు పుస్తకావిష్కరణకు సిద్ధమయ్యారు. ఇందుకు నిరసనగా ఓఆర్‌ఎఫ్ ఛైర్మన్ సుదీంద్ర కులకర్ణి ముఖానికి శివసేన కార్యకర్తలు సిరా పూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన పై రంగు పోశారని అయిప్పటికీ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదని... ఖచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు ఈ వివాదం పై మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ స్పందింస్తూ కసూరి పుస్తకావిష్కరణకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 

2.90 శాతం పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు...

హైదరాబాద్ : భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం, రెండో అతిపెద్ద ఔట్ సోర్సర్ అయిన ఇన్ఫోసిస్ కు ఆ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎం.డి. రంగనాథ్ సీఎఫ్ఓగా వ్యవహరిస్తారని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్ఫీ తన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన రోజే బన్సల్ రాజీనామా చేయడం విశేషం. సెకండ్ క్వార్టర్ లో అమ్మకాలపై రూ. 15,565 కోట్లను ఇన్ఫీ ఆర్జించింది. నికరలాభం 12.1 శాతం వృద్ధితో రూ. 3,400 కోట్లకు చేరింది. గత 16 త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ కు ఇదే అత్యధిక నికరలాభం. అయినప్పటికీ, బన్సల్ రాజీనామా ఇన్ఫోసిస్ పై ప్రభావం చూపింది.

ఆర్కే బీచ్ లో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

విశాఖ : ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ సమీపంలో సాగతీరంలో ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన నాలుగు మృత దేహాలు లభ్యమయ్యాయి. వీరి మూడు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు రాగా... మరొక మృతదేహం గాలింపు చర్యల్లో దొరికినట్లు అధికారులు వెల్లడించారు. 

ఎర్రచందనం స్లగ్లర్ అల్తాఫ్ అరెస్ట్..

హైదరాబాద్ : ఏడాదిగా అల్తాఫ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న అల్తాఫ్ ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం బెంగళూరు లో ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ ఫాంహౌస్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి అదుపులోకి తీసుకున్నారు. అతడి నివాసంలో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ప్రస్తుతం అల్తాఫ్ ను చిత్తూరు తరలించి... కోర్టు ముందు ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించనున్నారు.

'హత్యా రాజకీయాలు నడపడంలో ఆదినారాయణ రెడ్డి దిట్ట '

అనంతపురం : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి వల్ల టీడీపీ అన్ని విధాలా నష్టపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆరోపించారు. హత్యా రాజకీయాలు నడపడంలో ఆదినారాయణ రెడ్డి దిట్ట అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకునే ప్రసక్తి లేదని చంద్రబాబు హామీ ఇచ్చారని రామసుబ్బారెడ్డి వివరించారు. జగన్‌ను కాదని మాజీ సీఎం కిరణ్‌ వెంట వెళ్లి తిరిగి వైసీపీలోకి వచ్చారని ఆయన ఆరోపించారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రద్దు చేసే ప్రసక్తే లేదు: సుదేంద్ర కులకర్ణి...

ముంబై: పాక్ మాజీ విదేశాంగ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 5.30గంటలకు జరుగనుంది. అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) నేతృత్వంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. మరోవైపు ఈ కార్యక్రమంపై శివసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు పుస్తకావిష్కరణకు సిద్ధమయ్యారు. ఇందుకు నిరసనగా ఓఆర్‌ఎఫ్ ఛైర్మన్ సుదీంద్ర కులకర్ణి ముఖానికి శివసేన కార్యకర్తలు సిరా పూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన పై రంగు పోశారని అయిప్పటికీ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదని... ఖచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా తాహసీల్దార్ సస్పెండ్...

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో తహసీల్దార్ అనందకుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ములకలచెరువు మండలంలో ఆన్‌లైన్‌లో భూముల రికార్డులు తారుమారు చేశారన్న ఆరోపణలను తాహసీల్దార్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా అధికారులు, భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు.

మేడిపల్లిలో ఘరానా దొంగ అరెస్ట్....

రంగారెడ్డి : జిల్లాలోని మేడిపల్లిలో ఘరానా దొంగ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న వెంకట్‌రెడ్డి నుంచి రూ.17 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నర్సంపేటలో బతుకమ్మ కార్యక్రమంలో ఉద్రిక్తత

వరంగల్‌ : జిల్లాలోని నర్సంపేటలో బడుగుల బతుకమ్మ కార్యక్రమంలో ఉద్రిక్తత రాజుకుంది. పోలీసులు ఐద్వా మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు. దళితులకు బతుకమ్మ ఆడే హక్కు లేదా? మహిళలను స్వేచ్ఛగా బతుకమ్మ ఆడనివ్వకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఐక్యవేదిక కన్వీనర్‌ పద్మ ఆరోపించారు. ఐద్వా మహిళా కార్యకర్తల అరెస్టును పౌరహక్కుల సంఘం, తెలంగాణ మహిళా సాంస్కృతిక సంఘాల ఐక్యవేదికలు ఖండించాయి.

'రుద్రమదేవి' పైరసీకీ పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో 'రుద్రమదేవి' చిత్రం పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. 

10:50 - October 12, 2015

విజయనంరగం : గూడు చెదిరించి.. గుండె పగిలింది. హుదూద్ రూపంలో వచ్చిన పెనుతుపాను విలయతాండవం సృష్టించింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉద్యానవనాలు నాశనమయ్యాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ విషాదం జరిగి ఏడాది గడుస్తున్నా విజయనగరం వాసులను ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజయనగరం వాసుల గుండెల్లోదడ పుడుతోంది. ఈ విషాదం జరిగి నేటికి ఏడాది పూర్తయినా ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

16,845 ఇళ్లు నేలమట్టం .....

విజయనగరం జిల్లాల్లో హుదుద్‌ తాకిడికి 16,845 ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేక పశువుల పాకలు కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో పశువులు మృత్యువాతపడ్డాయి. వేలాది ఎకరాల్లో ఉద్యానవన పంటలు నేలకొరిగాయి. హుదూద్‌ మిగిల్చిన నష్టం దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.

భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, గంట్యాడ, జామి, డెంకాడలో అధిక శాతం నష్టం......

ఇక ఈ విషాదంలో తీరప్రాంత ప్రాంతాలైన భోగాపురం, పూసపాటిరేగతో పాటు విజయనగరం, గంట్యాడ, జామి, డెంకాడ మండలాల్లో అధిక శాతం నష్టం వాటిల్లింది. జిల్లాలో పర్యటించిన మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ ఏడాది గడుస్తున్నా ఇంతవరకు వాటికి అతీగతి లేకుండాపోయింది. దీంతో రామకృష్ణనగర్‌ కాలనీలో బాధితులు లబోదిబోమంటున్నారు.

1500 ఇళ్లు మంజూరు ......

తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వారి పరిస్థితి దినదినగండంగా మారింది. గూడు కోల్పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో తాత్కాలిక షెడ్లు వేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం 1500 ఇళ్లు మంజూరు చేసినా.. అందులో 1352 ఇళ్లకు మాత్రమే పరిపాలనా అనుమతులిచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

10:43 - October 12, 2015

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలిసారిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఇవాళ ఏయూ కాన్విగేషన్ హల్‌లో భారీ స్థాయిలో నిర్వహించాలని వర్సిటీ అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఏయు.....

ఈ వర్సిటీ ఇటీవలే 89 ఏళ్లు పూర్తి చేసుకొని 90వ ఏట అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచన మేరకు పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలని భావిస్తోంది. అందుకోసం పూర్వ విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందులో ఆర్థికంగా స్థిరపడిన వారి తోడ్పాటు, సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది. దీని కోసం ఏయు పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తోంది.

గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబులతోపాటు......

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ఏయూ పూర్వ విద్యార్థులైన రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబులతో పాటు ఎంపీలు కె.హరిబాబు, ఎం.శ్రీనివాసరావు హాజరవుతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు వి.ఆర్.కె.బాబు, గణేష్ కుమార్, పి.శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, పి.జి.వి.ఆర్.నాయుడుతో పాటు అనేక మంది ఐఎఎస్ ఐపిఎస్ పారిశ్రామిక బిజినెస్ దిగ్గజాలు హాజరు కానున్నారు.

విభాగాల వారిగా ఆతిథ్యం......

పూర్వ విద్యార్థులంతా....ఇవాళ ఉదయం వారివారి విభాగాలకు చేరుకుంటారు. వీరంతా సమావేశమై మధ్యాహ్నం ఆయా విభాగం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. సాయంత్రం వర్సిటీలోని సీఆర్‍ రెడ్డి స్నాతకోత్సవ మందిరంలో జరిగే 'అలుమ్ని-2015' సమావేశానికి హాజరవుతారు. మెుత్తం మూడు వేల మంది విద్యార్థులు హజరైయ్యే అవకాశం ఉందని వీసీ తెలిపారు. అయితే కొంతమంది దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలుమ్ని కోసం ఏర్పాటు చేసిన బ్యానర్స్‌లో పసుపు రంగు ఎందుకు వేసారనే విమర్శలు వస్తున్నాయి.

 

10:39 - October 12, 2015

హైదరాబాద్ : నవమాసాలు మోసిన తల్లి పుట్టిన మూడు నెలలకే బిడ్డను తన పొత్తిళ్లకు దూరం చేసి అనాథగా వదిలేసిన సంఘటన మహబుబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లో చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన గుక్కతిప్పకుండా పసికందు ఏడుస్తుండటంతో స్థానికులు గుర్తించారు. పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసిడిఎస్‌ అధికారులకు అప్పగించారు. 

10:32 - October 12, 2015

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. నిరాహార దీక్ష చేస్తున్న తమ అభిమాన నాయకుడికి మద్దతు తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగన్‌ దీక్ష స్థలికి వస్తున్న కాలేజీ విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్‌తో ఫోటోలు దిగేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ ప్రతిఒక్కరూ జగన్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. ముద్దులొలకుతున్న చిన్నారులు కూడా జగన్‌తో ఫోటోలు దిగుతున్నారు. ఇక కాలేజీ స్టూడెంట్స్‌.. జగన్‌తో సెల్ఫీలు దిగుతూ వేదికపై తెగ సందడి చేస్తున్నారు.

ఇసుమంతైనా విసుక్కోకుండా.....

ఎక్కడా ఇసుమంతైనా విసుక్కోకుండా వృద్ధులను కూడా జగన్‌ అప్యాయంగా దగ్గర తీసుకుంటున్నారు. ఆయనపట్ల అభిమానులు చూపిస్తున్న అప్యాయతతో జగన్‌కూడా ఎక్కడా నిరసించకుండా వారితో ఫొటోలు దిగుతున్నారు. మొత్తంగా జగన్‌ నిరాహారదీక్ష శిబిరం వద్ద సెల్ఫీల సందడి నెలకొంది. 

వైరా వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

ఖమ్మం : వైరా దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  అతివేగంతో వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో లారీ అదుపు తప్పి లోయలో పడింది.  లారీ డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పుతున్నారు.

 

రెండో త్రైమాసిక ఫిలితాలు విడుదల చేసిన ఇన్ఫోసిస్

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ రోజు తన రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ కాలంలో 7.5 వృద్ధితో రూ.6,429 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఆదాయం రూ.29,989 కోట్లుగా నమోదైంది.

ఇన్ఫోసిస్ సీఎఫ్ వో రాజీనామా

హైదరాబాద్ : సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీఎఫ్వో రాజీవ్ బన్సాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎఫ్ వోగా ఎండి. రంగనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

కుప్పకూలిన నాటో హెలికాప్టర్...

హైదరాబాద్ : నాటో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దాంట్లో ప్రయాణిస్తున్న 5గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లో చోటు చేసుకుంది. నాటోకు చెందిన రిసొల్యూట్ సపోర్ట్ మిషన్లో భాగంగా బయలు దేరిన హెలికాప్టర్ సోమవారం ఉదయం కుప్పకూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారని వారు వివరించారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి: మోదీ

హైదరాబాద్ : ఓటు హక్కు ఉన్న ప్రజలందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా మోదీ ఈ కామెంట్స్ చేశారు.

పంజాగుట్టలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం పంజాగుట్టలో ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.

కృష్ణా జిల్లా ఎదురు మొండిలో ఉద్రిక్తత

కృష్ణా : నాగాయలంక మండలం ఎదురు మొండి లో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములను పరిరక్షించబోయిన సీపీఎం నేతలు, గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిరువురు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకోవడంతో పోలీసులు 60 మందిని అరెస్టు చేశారు. పేదల భూములను పేదలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే సహించమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. రఘు హెచ్చరించారు.

09:40 - October 12, 2015

హైదరాబాద్ : విశాఖలో నిన్న ఆర్కేబీచ్‌ దగ్గర గల్లంతైన విద్యార్ధుల్లో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులు గణేష్‌, రోహిత్‌, జబ్బార్‌లుగా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు.

 

09:38 - October 12, 2015

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ దీక్ష ఆరోరోజూ దీక్ష కొనసాగుతోంది. సోమవారం ఉదయాన్నే డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే జగన్‌తో పలుమార్లు సంప్రదించిన వైసీపీ నేతలు దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇప్పటికే జగన్‌ బాగా నీరసించినట్లు కనపడుతోంది. 

09:36 - October 12, 2015

హైదరాబాద్ : తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్‌ రోడ్డులో 14 వ కిలోమీటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డట్టు టీటీడీ సిబ్బంది గుర్తించింది. కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండ చరియలను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది చర్యలు మొదలు పెట్టింది. 

09:34 - October 12, 2015

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు జేడీయూకు పెద్ద షాక్ తగిలింది. నితీశ్‌కుమార్ క్యాబినెట్‌లోని మంత్రి అవధేశ్ ప్రసాద్ కుష్వాహా లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కిన వీడియో సంచలనం సృష్టించింది. దీంతో వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్ ధ్రువీకరించారు. ఎన్నికల్లో కుష్వాహా నామినేషన్ వేసిన నియోజకవర్గంలో ఆయన స్థానంలో నామినీగా ఉన్న వ్యక్తిని తమ పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తామన్నారు. ఓ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకుగాను కుష్వాహా రూ.4 లక్షల లంచం తీసుకుంటున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అయితే తనపై పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.

09:32 - October 12, 2015

హైదరాబాద్ : దాద్రీ ఘటనపై దేశ రాజధానిలోని విద్యార్థిలోకం కదం తొక్కింది. జెఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు మార్చ్‌ నిర్వహించాయి. ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఫిరోజ్‌ షా రోడ్‌ కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాద్రీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఘటన వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

09:30 - October 12, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో నిర్వహిస్తున్న అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరుగుతోంది. డిజైనర్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడానికి.. ప్రపంచానికి చాటడానికి సరైన స్టేజ్ గా భావిస్తున్నారు. తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ట్రెండీగా డ్రెస్సులు డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ డిజైనర్‌ సంచితా అజంపూర్ డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే... ర్యాంప్ కి కొత్త కళ వచ్చింది. అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో సంచితా డిజైన్ చేసిన హ్యాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. 

శంకుస్థాపన పై టిడిపి నేతలతో బాబు సమీక్ష...

విజయవాడ : ఏపీ రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన మహోత్సవం, పార్టీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ నెల 18న మండల కేంద్రాల్లో జరిగే 10 కె, 5కె రన్‌లలో పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొనాలని చంద్రబాబు కోరారు.

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ కొండ చర్యలు

హైదరాబాద్ : తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి కొండ చర్యలు విరిగి పడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో 14వ కి.మీ వద్ద విరిగిపడిన కొండ చర్యలను టిటిడి సిబ్బంది తొలగిస్తున్నారు.

48 గంటలపాటు బంద్‌కు మావోయిస్టులు

హైదరాబాద్ : విశాఖ మన్యంలో 48 గంటలపాటు బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బాక్సైట్‌ తవ్వకాల అనుమతికి వ్యతిరేకంగా ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన విషయం విదితమే. మరో 36 గంటల్లో మావోయిస్టులు విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో గిరిజన టీడీపీ నేతలు, నేతల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్‌కు గురైన నేతల కుటుంబసభ్యులు నేడు సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

08:38 - October 12, 2015

హైదరాబాద్ : బతుకమ్మ పండగకు విశిష్ట మైన వారసత్వం ఉన్నా...ప్రాచుర్యం పొందలేదని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నేటి నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతోంది. బతుకమ్మ అంటే ఆడ శిశులను తిరస్కరించకూడదు. కానీ కాల క్రమేణాలో ప్రకృతికి- మనిషి కి మధ్య వుండే అవినాభావ సంబంధానికి ఒక నిదర్శనం. గ్రామీణ సమాజంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఒకే దగ్గరకు చేరుకుని చేసుకునే పండుగ. తెలంగాణ లో బతుకమ్మ పండగకు విశిష్ట మైన వారసత్వం ఉన్నా...ప్రాచుర్యం పొందలేదు. కారణాలు ఏమిటి? కేరళలో రాజకీయ వ్యవస్థ చీలిపోయిందా? ఆ రాష్ట్రంలో బిజెపి మతరాజకీయాలను వ్యాపింప జేస్తోందా? అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. నాగేశ్వర్ చేసిన పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఆర్కే బీచ్ కు కొట్టుకొచ్చిన 3మృతదేహాలు..

హైదరాబాద్ : విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులు, యూపీకి చెందిన ఓ యువకుడు ఆదివారం సాయంత్రం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయిన విషయం తెలిసిందే. మృతులు గణేష్, రోహిత్, జబ్బార్ గా గుర్తించారు.

08:00 - October 12, 2015

హైదరాబాద్ : హుదూద్ తుపాన్ వచ్చి నేటికి సంవత్సరం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంబరాలు జరుపుకోబోతోంది. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఏడాది గడిచినా బాధితులకు హుదూద్ సాయం అందలేదని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. జగన్ కు సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంలో చంద్రబాబు సర్కార్ వివాదం చేస్తోందా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో టి.కాంగ్రెస్ నేత శాకమలాకర్, కాంగ్రెస్, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, బిజెపి నేత రాకేష్ రెడ్డి, టిడిపి నేత విజయ్ కుమార్, సీపీఎం నేత సీ.మెచ్ నర్శింగరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై ను ప్రస్థావించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

నేడు సెలవు దినంగా ప్రకటించిన తెలంగాణ సర్కార్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండగ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పండగను పురస్కరించుకుని ప్రభుత్వం నేడు తెలంగాణ సెలవు దినంగా ప్రకటించింది. బతుకమ్మ పండగకు ఓ విశిష్ఠమైన ప్రత్యేకత ఉంది. ప్రతి పండగలో దేవున్ని పూలతో పూజించడం సంప్రదాయం. కానీ బతుకమ్మ పండగలో పూలను దేవుడిగా పూజించడం సంప్రదాయం. సంప్రదాయంలో భాగంగా ఆటపాటలతో మహిళలు సందడి చేస్తారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

పాముకాటుతో తల్లీ కూతుళ్లు మృతి

మెదక్ : ఓ ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతుళ్లను పాము కాటు వేసింది. దీంతో వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం బిజిపిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వీరి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా... సర్వ దర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

బీహార్ లో ప్రారంభమై తొలి దశ పోరు

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. బరిలో 583 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,35,72,339 మంది ఓటు హక్కును వినయోగించుకోనున్నారు.

గజ్వేల్ లో ఎడ్యుకేషన్ హబ్ కోసం రూ.104 కోట్లు విడుదల

సంగారెడ్డి: గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.104.83 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం స్పెషల్‌చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పట్టణంలోని విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఎడ్యుకేషనల్ హ బ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణ యం మేరకు గజ్వేల్‌లోని స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లను కలిసి ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.104.83 కోట్ల నిధులు మంజూరు చేశారు.

06:44 - October 12, 2015

హైదరాబాద్ : ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు అక్టోబర్ 12న హుద్ హుద్ తుపాన్ అల్లకల్లోలం స్రుష్టించింది. ఉక్కునగరం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం తల్లడిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధాని లాంటి విశాఖ భారీగా నష్టపోయింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అపార నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాను తుపాన్ తాకింది. ఆనాటి తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ఎందరెందరో ఆపన్న హస్తాలు అందించారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలవాలన్న మానవతా హ్రుదయంతో వీరంతా స్పందించారు. అనేక స్వచ్చంద, వ్యక్తులు దాదాపు 260 కోట్ల రూపాయల సహాయ నిధిని అందించారు. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు అప్పట్లో ప్రభుత్వమే ప్రకటించింది. మరి అది ఆచరణ రూపం దాల్చిందా? నాటి భయంకర తుపాన్ లో ఇళ్లు కోల్పోయినవారికి నష్టం పరిహారం అందిందా? మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలబడిందా? పంటలు, కొబ్బరితోటలు కోల్పోయినవారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించింది? పారిశ్రామికరంగానికి జరిగిన నష్టాన్ని ఎంతవరకు పూడ్చగలిగింది? వీటన్నింటికి సీరియస్ గా రివ్యూ చేసుకోవాల్సిన సందర్భమిది? ప్రక్రుతి వైపరీత్యాలకు దుర్బేధ్యమనుకున్న విశాఖనే గడగడలాడించిన హుద్ హుద్ లాంటి తుపాన్ లు మరోసారి చుట్టుముట్టుకుండా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి? ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలాంటి అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్య్రకమంలో తుపాన్ పీడిత ప్రాంతాల్లో పర్యటించి, విభిన్న అంశాలపై అధ్యయనం చేసిన సీపీఎం నేత నరసింగరావు పాల్గొన్నారు. మరి ఈ చర్చను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

1. ప్రకృతి వైపరీత్యాలకు విశాఖ దుర్బేధ్యమని చాలామంది భావిస్తూ వుంటారు. కానీ, సరిగ్గా ఏడాది క్రితం వచ్చిన హుద్ హుద్ తుపాన్ ఇలాంటి నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇది ప్రక్రుతి వైపరీత్యమా? నగర నిర్మాణంలో జరిగిన తప్పిదమా?

2. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తనను తాను రక్షించుకోవాలంటే విశాఖ పట్టణ నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?

3. హుద్ హుద్ విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు పెద్దగాయమే చేసింది. నాటి గాయం నుంచి ప్రజలంతా కోలుకున్నారని భావించవచ్చా? తుపాన్ ప్రాంతాల్లో తిరిగిన నేతగా మీ అనుభవాలేమిటి?

4. విశాఖలో పారిశ్రామికరంగానికి అపార నష్టం వాటిల్లిందనేది నిజం. మరి నష్టాన్ని భర్తీ చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు ఎలా వుంది?

5. హుద్ హుద్ తుపాన్ కి మత్స్యకారులు, తోపుడుబండ్ల వ్యాపారులు, రైతులు ఇలా విభిన్నవర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు. వారికి ప్రభుత్వం అందించిన సహాయం సంత్రుప్తికరంగా వుందంటారా?

6. హుద్ హుద్ అనే భయంకర తుపాన్ కి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి మీరు ఇస్తున్న సలహాలేమిటి?

కోదండరాంను ఘనంగా సన్మానించిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్ : ఉద్యమానికి ఎత్తిన పిడికిళ్లన్నీ సారధిని సన్మానించుకున్నాయి. వ్యుహాలు, చాతుర్యాలు అమోఘం అంటూ ఘనంగా కీర్తించుకున్నాయి. అపూర్వ విజయాన్ని సాధించుకుని తల ఎత్తుకుని తిరుగుతున్న చోట మరోసారి ఉద్యమ కాలాన్ని స్మరించుకున్నాయి. విరమణ ఉద్యోగానికే కానీ ఉద్యమ స్ఫూర్తికి కాదని ఖచ్చితంగా మీ సహకారం అవసరమని తేల్చి చెప్పాయి.

ఆత్మహత్యలు చేసుకున్నది 379 మంది రైతులే :కవిత

హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కేవలం 397 మందేనట. సాక్షాత్తు ప్రభుత్వమే ఈ సంఖ్యను ప్రకటించింది. తమ జాబితలోని రైతు కుటుంబాలకే పరిహారం దక్కుతుందని స్పష్టం చేసింది. దాదాపు రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు లెక్కలు చెబుతుంటే.. ప్రభుత్వం ఆ సంఖ్యను పాతిక శాతానికి తగ్గించడం విశేషం. 

'వైద్య సేవల్లో ఏపీ దేశానికే నమూనా కావాలి':చంద్రబాబు

విజయవాడ : వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే నమూనా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులో 40% పైగా మెడికల్ టెస్ట్‌లకే అవుతోందన్నారు. వెంటనే ఆ భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఆస్పత్రులకు నిధుల విడుదల చేయడంలో అలసత్వం చేయవద్దంటూ సూచించారు.

06:37 - October 12, 2015

విశాఖ : హుదూద్‌..! ఈ పదం వింటే చాలు.. విశాఖ వాసుల ఒళ్లు జలదరిస్తుంది. సాగరతీర నగరాన్ని కకావికలం చేసిన ఆ ప్రకృతి విలయ తాండవం.. గుర్తుకొస్తే చాలు.. స్థానికులు వణికిపోతారు. గంటల వ్యవధిలోనే విశాఖను ఛిన్నాభిన్నం చేసిన హుదూద్‌ సంభవించి నేటికి ఏడాది పూర్తయింది. 365 రోజులు గడిచినా.. నాటి కాళరాత్రులను విశాఖవాసులు నేటికీ మరచిపోలేక పోతున్నారు.

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ......

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండగాలులు.. గంటల వ్యవధిలోనే విశాఖను కకావికలం చేసిన పెను తుపాను... అవును... 2014 అక్టోబర్‌ 12న విశాఖను కుదిపి పారేసిన హుదూద్‌ తుపాన్‌ సృష్టించిన బీభత్సపు దృశ్యాలివి.

ఏడాది దాటినా....

ఏడాది దాటినా విశాఖ వాసులను ఆ చేదు జ్ఞాపకాలు నేటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. హుదూద్ తుపాను తీవ్రత ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా, సమాచార, విద్యుత్‌ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.

గుక్కెడు నీళ్ల కోసం జనం.....

గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్ల కోసం జనం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. తినడానికి తిండిలేక,.ఉండేందుకు నిలువనీడ లేక జనం అల్లాడిపోయారు. పిల్లలు గుక్కెడు పాలకోసం తహతహలాడారు. హుదూద్‌ తుపాను సృష్టించిన బీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హుదూద్‌ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వారంరోజుల పాటు విశాఖలోనే మకాం వేసి..అన్ని వ్యవస్థలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవడం విశాఖ వాసులకు కొంత ఊరటనిచ్చింది.

తక్షణమే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు..

హుదూద్‌ సమయంలో తక్షణమే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత బాధితులు నిలదొక్కుకునేందుకు చేయూతను అందించలేదు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న సర్కారు హామీ నేటికీ నెరవేరలేదు. 48వేల ఇళ్లకు 5వేల చొప్పున సాయం అందించి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి వాగ్దానానికి సాక్ష్యంగా ఓ పైలాన్‌ మాత్రమే దర్శనమిస్తోంది.

తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులు...

హుదూద్‌ కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. నేటికీ వీరికి నయాపైసా సాయమూ అందలేదు. తమను ఆదుకోవడంలో సర్కారు తాత్సారం చేస్తుండడంతో.. చాలామంది మత్స్యకారులు వలస వెళ్లారు. తుపాను సమయంలో సీఎం చూపిన చొరవ..ఆతర్వాత చూపించకపోవడంతో..విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులను ఆదుకోవడంలో పూర్తి ఉదాసీన ధోరణిని కనబరిచింది. విపత్తు కారణంగా విశాఖకు 70వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు రాష్ట్రప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం కేవలం 670

నేల కూలిన చెట్లు...

హుదూద్‌ విలయతాండవంతో.. విశాఖలోని చెట్లన్నీ నేలకూలాయి. రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూసినా కూలిన వృక్షాలు.. వాటి కొమ్మలతో నిండిపోయింది. వాటిని వేలం ప్రక్రియలో తొలగించేందుకే ప్రభుత్వానికి నెలల సమయం పట్టింది. రోడ్లపై ఎక్కడికక్కడ పడివున్న చెట్ల కుప్పలపై.. నిప్పురవ్వలు పడితే ప్రమాదం అన్న కారణంతో.. విశాఖ వాసులు నిరుడు దీపావళి పండుగనూ జరుపుకోలేదు.

క్రమంగా తేరుకున్న విశాఖ....

హుదూద్‌ విలయం నుంచి విశాఖ క్రమంగా తేరుకుంది. నేడు ఈ సాగర తీర నగరంలో మళ్లీ పచ్చదనం చిగురిస్తోంది. ఏడాది క్రితపు ఆనవాళ్లను చెరిపేసేలా కొండలన్నీ పచ్చదనం పరుచుకున్నాయి. ప్రజలు కూడా సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. అయితే బాధితులకు సాయం అందించడంలో గానీ.. ఇటువంటి ప్రమాదం ఎదురైతే ఎదుర్కొనే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో గానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. హుదూద్‌ బాధితులకు ఇప్పటికైనా సాయం అందించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

హుదూద్‌ తుపానుకు నేటితో ఏడాది

విశాఖ : హుదూద్‌..! ఈ పదం వింటే చాలు.. విశాఖ వాసుల ఒళ్లు జలదరిస్తుంది. సాగరతీర నగరాన్ని కకావికలం చేసిన ఆ ప్రకృతి విలయ తాండవం.. గుర్తుకొస్తే చాలు.. స్థానికులు వణికిపోతారు. గంటల వ్యవధిలోనే విశాఖను ఛిన్నాభిన్నం చేసిన హుదూద్‌ సంభవించి నేటికి ఏడాది పూర్తయింది. 365 రోజులు గడిచినా.. నాటి కాళరాత్రులను విశాఖవాసులు నేటికీ మరచిపోలేక పోతున్నారు. 

6వరోజుకు చేరుకున్న జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష

గుంటూరు : ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో జగన్‌ చేస్తున్నదీక్ష 6వరోజుకు చేరుకుంది. దీక్ష ప్రారంభించి 6రోజులు గడుస్తుండటంతో వైసిపీ అధినేత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. వద్దని వారిస్తున్నా జగన్‌ దీక్ష కొనసాగిస్తున్నారని వైసిపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నిరంకుశ పాలన పై మండిపడుతున్నారు.

06:33 - October 12, 2015

విశాఖ : విశాఖపట్టణం సముద్రం తీరం మృత్యుబీచ్‌గా మారుతోంది. ఇక్కడికి రావాలంటేనే సందర్శకులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సముద్ర తీరానికి చేరుకుంటున్న సందర్శకులు ఇక్కడ జరుగుతున్న గల్లంతులను చూసి గజగజవణికిపోతున్నారు.

బీచ్‌కు వెళ్లిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు.....

ఎప్పుడు ఏ అల లాక్కెళ్తుందో తెలియని దుస్థితి విశాఖ బీచ్‌లో నెలకొంది. తాజాగా ఏయూ ఉమెన్స్ హాస్టల్ బీచ్ వద్ద ప్రియాంక విద్యోదయ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఏడుగురు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఆరుగురు సముద్రంలోకి వెళ్లగా గణేశ్, కె.రోహిత్, అబ్దుల్ జబ్బార్‌ అనే ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వీరి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం.....

ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం కూడా ఈతకని బీచ్‌లోకి దిగింది. ఇందులో ఢిల్లీకి చెందిన షరీఫ్ అనే వ్యక్తి అలల తాకిడికి గల్లంతయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి తల్లిడిల్లిపోయారు. వెంటనే జిల్లా మంత్రి గంటా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బీచ్ వద్ద కనీస ఏర్పాట్లు లేకపోవడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా..ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీచ్ వద్ద హెచ్చరిక బోర్డులు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

06:31 - October 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పండగ విశిష్టతను తెలుపుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బ్రోచర్‌ను విడుదల చేసింది. సోమవారం సెలవు ప్రకటించినందున మహిళలందరూ పండగను ఘనంగా నిర్వహించాలని తెలిపింది. 20న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. 

06:29 - October 12, 2015

హైదరాబాద్ : యూదుల దేశమైన పాలస్తీనాతో సహా అరబ్‌ దేశాలన్నింటితోనూ స్నేహ సంబంధాలను విస్తరించుకోవటంపై భారత్‌ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ అన్నారు. గల్ఫ్‌ దేశాల పర్యటనలో ఉన్న ప్రణబ్‌.. ఆదివారం జోర్దాన్‌ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలు స్వతంత్రమైనవని ఆయన స్పష్టం చేశారు. జోర్దాన్‌ యూనివర్సిటీ ప్రణబ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఈ రెండు దేశాలే కాకుండా అరబ్‌ ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ స్నేహాన్ని విస్తరించుకోవటమే భారత్‌ ఉద్దేశమని ప్రణబ్‌ అన్నారు. ఇక అమ్మన్‌లో గాంధీ పేరిట ఏర్పాటు చేసిన ఒక వీధిని ప్రణబ్‌ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్‌ సిటీ కౌన్సిల్‌ ఆయనకు గోల్డెన్‌ కీ ఆఫ్‌ అమ్మాన్‌ను బహుకరించింది. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ అక్కడి పీస్‌ పార్క్‌లో ఆలివ్‌ మొక్కను నాటారు. 

06:28 - October 12, 2015

హైదరాబాద్ : బీహార్‌ శాసనసభకు నేడు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో మొత్తం 10 జిల్లాల నుంచి 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 583 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 13 వేల 212 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది. ఈ ఎన్నికల్లో దాదాపు కోటీ 35 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ను ముగించనున్నారు. బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి 27 మంది, బీఎస్పీ నుంచి 17 మంది, కాంగ్రెస్‌ నుంచి 8 మంది, సీపీఐ నుంచి 25 మంది, సీపీఎం నుంచి 12 మంది, జెడీయూ నుంచి 24 మంది, ఎల్‌జేపీ నుంచి 13 మంది, ఎన్‌సీపీ నుంచి ఆరుగురు, ఆర్‌జేడీ నుంచి 17 మంది, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నుంచి ఆరుగురు పోటీచేస్తున్నారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన 404 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈదశలో 54 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 8న ఫలితాలను ప్రకటించనున్నారు.

06:26 - October 12, 2015

విజయవాడ : ఏపీలోని ఏ ప్రాంతం వారైనా రాజధానికి నాలుగు గంటల్లో చేరుకునేలా రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ 186 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తామంటూ.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అయితే.. అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని మెలిక పెట్టారు.

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు...

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు, చంద్రబాబు సర్కారు భూసేకరణకు ప్రణాళికలు రచిస్తోంది. ఎనిమిది వరుసల రహదారి.. మధ్యలో డివైడర్‌, రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి 150 మీటర్ల మేర భూమి అవసరం. దీని ప్రకారం కిలోమీటర్‌కు సగటున 37.50 ఎకరాల చొప్పున 186 కిలోమీటర్లకు 6,975 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనికి 7వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. ఓఆర్‌ఆర్‌ కోసం కృష్ణానదిపై ఎనిమిది వరుసల రాదారులు రెండింటిని నిర్మించాల్సి ఉంటుంది. అయితే.. సింగపూర్‌ ప్రభుత్వం అందించిన బృహత్‌ ప్రణాళికలో ప్రతిపాదించిన వంతెనలను.. ఓఆర్‌ఆర్‌తో అనుసంధానిస్తారా లేదా అన్నది ప్రశ్న.

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు....

విజయవాడ పశ్చిమ బైపాస్‌లో భాగంగా గొల్లపూడి-వెంకటపాలెం మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న నాలుగు వరుసల వంతెనకు 450 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదించారు. ఈ లెక్కన కృష్ణానదిపై ఎనిమిది వరుసల వంతెనలు రెండు నిర్మించాలంటే సుమారు 2 వేల కోట్లు అవసరం అవుతాయి. భూసేకరణ, నిధుల లభ్యత విషయాలపై స్పష్టత లేకున్నా.. రహదారుల పటిష్టతకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. రహదారుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అవసరమే. అయితే.. అవసరానికి మించి ప్రజల నుంచి భూములను సేకరించడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండరాదని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. మరి చంద్రబాబు సర్కారు ఈ సూచనను చెవికెక్కించుకుంటుందా..? వేచి చూడాలి. 

సినీ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్ : సీనియర్ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని మైలాపూర్ స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మనోరమను చివరి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సినీ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్ : సీనియర్ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని మైలాపూర్ స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మనోరమను చివరి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

8ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం...

తూ.గో: జిల్లాలోని సీతానగరం మండలంలో 8 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో.. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఆ కామాంధుడిని శిక్షించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

బిహార్లో తొలి దశ ఎన్నికల పోరు నేడే

పట్నా: బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడతలో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 583 మంది అభ్యర్థుల తలరాతను 1,35,72,339 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 10 జిల్లాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. అయితే ఎక్కువ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. 583 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలున్నారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ, సీఎం నితీశ్ నేతృత్వంలో మహాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి.

Don't Miss